Activities calendar

03 October 2017

21:33 - October 3, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని బిఎస్‌ఎఫ్‌ క్యాంపుపై మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉదయం 3.45 గంటలకు BSF 182వ బెటాలియన్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించారు. ఇద్దరు ఉగ్రవాదులు చీకటిని ఆసరాగా చేసుకుని కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసరగా... మరో ఉగ్రవాది అడ్మిన్‌ భవనంలో దాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఉగ్రదాడిని దీటుగా ఎదుర్కొన్నారు. ఇరువర్గాల మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. సుమారు 10 గంటలపాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ మృతి
ఉగ్రవాదుల కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ అమరుడు కాగా.... మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతాదళాలు ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఆపరేషన్‌ త్వరితగతిన ముగిసిందని వారు పేర్కొన్నారు. శ్రీనగర్‌ విమానాశ్రయంపై దాడి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు సమీపంలో కాల్పులు జరగడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ మహ్మద్‌లోని 'అఫ్జల్‌ గురు స్క్వాడ్‌' ఈ దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాల సమాచారం. శ్రీనగర్‌ బిఎస్‌ఎఫ్‌ క్యాంపు నలువైపులా భద్రత కలిగి ఉంటుంది. ఓవైపు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో నిరంతరం వాయుసేన అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంతటి చక్రవ్యూహాన్ని ఛేదించి ఉగ్రవాదులు క్యాంపులోకి ఎలా చొరబడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

21:32 - October 3, 2017

 

ఢిల్లీ : వాహనదారులకు శుభవార్త. పెట్రో ధరల పెంపునకు చెక్‌ పెడుతూ... పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం బేసిక్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని రెండు రూపాయల మేర తగ్గించింది. ఈ అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. సెప్టెంబర్‌లో ముడిచమురు ధరలు ఏకంగా 12 శాతం మేర పెరిగాయి. ఇప్పుడు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో వాహనాదారులకు ఉపశమనం లభించనుంది.

21:27 - October 3, 2017

హర్యానా : దాదాపు 38 రోజులు...ఎన్నో ప్రత్యేక బృందాలు...అందరూ ఆమె కోసమే వేట....అన్ని కోణాల్లో దర్యాప్తు...ఎక్కడిక్కడ కట్టడి చేసినా తప్పించుకుంది...ఒకే ఒక్క మహిళను పట్టుకునేందుకు పోలీసులకు 38 రోజులు పట్టింది...ఈ మధ్యకాలంలోనే ఆరుసార్లు తప్పించుకున్న హనీప్రీత్ ను పట్టుకోవాలన్న కసి పోలీసుల్లో పెరిగింది..కాని చిక్కలేదు...పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం కన్నా తనకున్న నెట్‌వర్క్‌తో హనీప్రీత్‌ వారి కదలికలను పసిగట్టేది...ఇలా వస్తున్నారని తెలియడంతో మకాం మార్చేది..ఇలా ఒకటి కాదు..రెండు కాదు.. ఆరుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్న హనీప్రీత్ ఎట్టకేలకు చిక్కింది.

పోలీసుల కదలికలను గుర్తించిన హనీప్రీత్‌
ఇలా ఎన్నో సార్లు..పోలీసుల కదలికలను గుర్తించిన హనీప్రీత్‌ తప్పించుకోగలిగింది...పోలీసులు మాత్రం ఈ సారి ఖచ్చితంగా దొరికిపోయిందనుకుని వెనుదిరిగిన సందర్భాలు ఆరుసార్లున్నాయి...ఆగస్టు 25న డేరా క్యాంపస్‌లోనే ఉన్న హనీప్రీత్ ఆ తెల్లారే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది...నేరుగా హనుమాన్‌గఢ్‌లోని తన బావ ఇంటికి వెళ్లి రెండ్రోజులున్న హనీప్రీత్‌ పోలీసులు వస్తున్నారని తెలిసి జంపయ్యింది...రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లలో మకాం మార్చింది...పోలీసుల నుంచి తప్పించుకుంటున్న హనీప్రీత్ తన వేషదారణ మార్చేందుకు షాపింగ్ మాల్ వెళ్లింది..అక్కడే ఉన్న సమయంలో పోలీసులు వస్తున్నారని తెలుసుకుని మాయమైంది...ఇక డేరాబాబా సొంత గ్రామానికి వెళ్లినా అక్కడా పోలీసుల నిఘా ఉందని తెలిసి క్షణాల్లో మకాం మార్చేసింది...చివరగా గత నెల 25న ఢిల్లీలోని తన లాయర్‌ను కలుసుకుంది...లజపత్‌నగర్‌లో రెండు గంటలపాటు గడిపినట్లు రెండ్రోజుల తర్వాత సీసీ కెమెరా ఫుటేజీ చూస్తేగాని పోలీసులు గుర్తించలేదు... ఇలా ఢిల్లీలోని గుర్గాన్ సహా ఇతర ప్రదేశాల్లో గాలించినా పోలీసులకు హనీ దొరకలేదు. ఒక్కఅడుగు దూరంలో పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది.

మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది గంటల్లోనే
నెల రోజులకు పైగా పోలీసుల కళ్లుగప్పి తిరిగిన హనీప్రీత్ సింగ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పంచకుల పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. డేరాబాబా అరెస్టయిన రోజు పంచకుల, సిర్సా పట్టణాల్లో అల్లర్లు చెలరేగి 38 మంది చనిపోయారు. ఈ అల్లర్లలో హనీప్రీత్ హస్తమున్నట్టు...అదే సమయంలో డేరాబాబాను తప్పించేందుకు కుట్ర చేసిందన్న ఆరోపణలపై హనీప్రీత్‌పై కేసులు నమోదయ్యాయి.

21:20 - October 3, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి పరిశీలీంచారు. నిర్మాణ పనుల ప్రగతిని జలవనరుల శాఖ అధికారులు గడ్కరీకి వివరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి కూడా జీవనాడి ప్రాజెక్టని, దీని నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం నీరు ఎంతో అవసరమని.. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్రధాని మోదీ సహకారంతో పూర్తిచేస్తామని అన్నారు.

మొత్తంగా 50 శాతం పనులు పూర్తయ్యాయన్నారు...
పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసి గ్రావిటీతో నీరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి కాలువ పనులు 91శాతం.. ఎడమ కాలువ పనులు 57 శాతం పూర్తయినట్లు చెప్పారు. మొత్తంగా 50 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని... 21వ సారి మంత్రి గడ్కరీతో కలిసి రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అంతకు ముందు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, సుజనాచౌదరితో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్ సందర్శించారు. పట్టిసీమ ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని గోదావరి నీటికి పూజలు నిర్వహించారు.

21:18 - October 3, 2017

అనంతపురం : నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలో అసహనం ఈ మధ్య కట్టలు తెంచుకుంటోంది. ఇరుకున పెట్టే ప్రతిపక్షం అంటే అసహనమా అంటే.. అదేమీ కాదు.. గుండెల్లో గుడికట్టి తనను ప్రతిష్ఠించుకున్న అభిమానులపైనే ఆయన అసహనం..! తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండం పెట్టడానికొచ్చినా... అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. తమ అభిమాన నటుడే కదా అని సెల్ ఫోన్ లో ఓ సెల్ఫీ తీసుకోవాలనుకుంటే.. ఫోన్ నేలకేసి కొడతారు.

గూబ గుయ్ మనిపిస్తారు...
సినిమా సెట్లో అసిస్టెంట్ వచ్చి కాళ్లకు చెప్పులు తొడగటం ఆలస్యమైనా అంతే! గూబ గుయ్ మనిపిస్తారు. మొన్నామధ్య నంద్యాల ప్రచారంలోనూ బాలకృష్ణ తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. గజమాల వేసిన ఆనందం అరక్షణంలో ఆవిరయ్యేలా చేసిన బాలయ్య ప్రతాపానికి ఆ అభిమాని బిక్కచచ్చి పోయాడు. తనకి తెలిసిన వారైతేనే బాలకృష్ణ ఫోటోకి ఫోజిస్తారు. లేదంటే.. అభిమానికి అవమానం తథ్యం. ఇదే ఒరవడిలో.. మంగళవారం మరో అభిమాని చెంప పగలగొట్టారు బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై తన ఆవేశాన్ని ప్రదర్శించారు. ఆగ్రహంతో ఆ అభిమాని చెంప ఛెళ్లుమనిపించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌, తమను గుండెల్లో గుడికట్టుకుని పూజించే అభిమానులనే దేవుళ్లుగా అభివర్ణించేవారు. అయితే ఆయన నట, రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య.. ఇలా అభిమానులపై పదేపదే చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

21:17 - October 3, 2017

హైదరాబాద్ : యుద్దప్రాతిపదికన హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై అయన అధికారులతో సమావేశం అయ్యారు. వర్షం కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్తితులను అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులకు, GHMC అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థను ఏర్పాటు చేశామని, దీని ద్వారా 300 కిలోమీటర్ల మేర మెయిన్‌ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. 

21:16 - October 3, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లను వరుణుడు హడలెత్తిస్తున్నాడు. సోమవారం సాయంత్రం నుంచి విపరీతంగా కురుస్తోన్న వర్షానికి జంటనగరాలు తడిసి ముద్దయ్యాయి. ప‌లు కాల‌నీలు, బ‌స్తిలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి కాస్తంత తెరిపినిచ్చిన వాన.. మంగళవారం సాయంత్రం మళ్లీ విరుచుకు పడింది. ఇప్పటికే జలదిగ్బంధంలో కూరుకున్న కాలనీల ప్రజలు.. మరింత అవస్థలు ఎదుర్కొంటున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో.. నగరంలో కరెంట్‌షాక్‌తో ఓ వ్యక్తి చనిపోగా గోడకూలి ఇద్దరు మరణించారు.

2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
జంటనగరాలను అతలాకుతలం చేసిన వర్షం.. తదనంతర పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌.. మంగళవారం సమీక్షించారు. సహాయక చర్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి నుంచి వివరాలు తీసుకున్నారు. కరెంట్‌ షాక్‌తో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షలు, గోడకూలి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరిలకతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సౌకర్యార్థం.. ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటు చేశారు. 140 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్‌ బృందాలను సహాయక చర్యలకు సమాయత్తం చేశారు. వీటితో పాటే.. శిథిలావస్థకు చేరిన భవనాలపై ఫోకస్‌ చేయాలని నిర్ణయించారు. వర్షాల కారణంగా డ్యామేజైన రోడ్లపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు.

అన్ని విధాలా సమాయత్తమైన జలమండలి
వర్షాల వల్ల తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అటు జలమండలి కూడా అన్ని విధాలా సమాయత్తమైంది. వర్షాలు అధికంగా పడిన ప్రాంతాల్లో జలమండలి ఎండీయే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీరు నిండిన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలతో పాటు, జల మండలి తరపున తాగునీటి ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలు.. ఓవైపు జనజీవనాన్ని అతలాకుతలం చేసినా.. గ్రేటర్‌ పరిధిలోని పలు చెరువులకు జలకళను సంతరించి పెట్టాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిన చెరువుల‌కు ఎలాంటి గండ్లు ప‌డ‌కుండా చ‌ర్యలు తీసుకోవాలని GHMC లేక్స్‌ ఈఈ శేఖర్‌ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. హుస్సేన్‌ సాగర్‌కు వరద ఉధృతి ఎక్కువగానే ఉన్నా ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదమూ లేదని ఆయన తెలిపారు. అయితే, చెరువుల సమీపంలోను, లోతట్టు ప్రాంతాల్లోనూ నివసించే వారు.. కాస్తంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న సూచనలతో అధికారులు నగరవాసులకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇద్దరు కూతుళ్లతో కలిసి కాల్వలో దూకిన గర్భిణీ

గద్వాల : ఓ గర్భిణీ ఇద్దరు కూతుళ్లతో జూరాల కాల్వలో దూకి ఆత్మాహత్యయత్నం చేసింది. ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మరో చిన్నారి గర్భిణీ మహిళ కోసం గాలింపు చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. లీటర్ కు రూ.2 చొప్పున పెట్రోల్, డీజిల్ పై ధర తగ్గనుంది. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

20:18 - October 3, 2017

ఓ అయ్యా సారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారూ.. మీరు హైద్రావాదును డల్లాస్ జేయలేరుగని.. ఈ పట్నం వాసులకు ఇంటికో పడ్వనన్న గొనియ్యి.. వాళ్ల మానాన వాళ్లు ఉంటె ఉంటరు పోతె వోతరుగని..? కనీసం గా ఏర్పాటన్న జేయ్ నాయన.. నాలాల సర్వే.. స్కైవేలు.. మోరీల వెడల్పు.. ఈ మొతెవరి మాటలన్ని బంజేశి కనీసం గా పనన్న జేయుండ్రి.. ఓట్లేశి గెలిపిచ్చినందుకు..

ఊర్లపొంటి రైతు సమన్వయ సంఘాలు వెట్టి ఓట్ల సంఘాలు గట్టాలే అని సూస్తున్న సర్కారు కుట్రమీద జేఏసీ వెట్టిన దీక్ష జోరుగైంది ఇయ్యాళ.. జీవో నెంబర్ 39ని.. నల్పై రెండును రద్దు జేశెదాక యుద్దం జేశితీర్తమని మొదలు వెట్టిన లడాయికి ఇయ్యాళ ముందడ్గు వడ్డది.. అన్ని పార్టీల కార్యకర్తలు.. రైతులు.. టీఆర్ఎస్ తప్ప.. పాల్గొన్నరు ఈ పంచాదిల..

అన్యాయం.. దుర్మార్ఘం.. అధికారం.. ఆర్థికం అన్ని గల్పితె సింగరేణి ఎన్నికలళ్ల.. అధికార పార్టీ సంఘం జేస్తున్న ఆట ఇది.. ఎన్ని ఉపాయాలుంటే అన్ని ఉపాయాలు జేస్తున్నరు.. ఓదిక్కు ఎన్నికల నిబంధనలు ఉన్నా..? అవ్విటిని ఏం బట్టిచ్చుకుంటలేరు మీటింగులు వెడ్తనే ఉన్నరు.. మాయమాటలు జెప్తనే ఉన్నరు.. ఇగ ప్రతిపక్షాలోళ్లు మీటింగు వెట్టుకుందామంటే పోలీసోళ్లను వెట్టి ఎల్లగొట్టుడు.. ఇంత దుర్మార్ఘమా..?

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంత పెద్ద శిపాయిని నేను ఎన్నడు సూడలే..? అంత నిబద్దత ఉన్న మన్షి ఆయన.. ఆయన పట్టువడ్తె ఏ పనిగూడ ఆగదని బ్రహ్మంగారిని సిద్దప్ప పొగిడినట్టు.. శ్రీవారిని అన్నమయ్య పొగిడినట్టు.. రాములవారిని కంచర్లగోపన్న పొగిడినట్టు.. మొగులు మీదికి లేవట్టి సూపెడ్తున్నడు సహచర మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు సారు.. మరి తుమ్మల కీర్తేందో మనగూడ అర్సుకోవాలెగదా పాండ్రిగ..

తెలంగాణ సంస్థానానికి ఎన్మిదో నిజం కేసీఆరేనట.. మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ వొయ్యినంక ఆయన వారసత్వాన్ని కేసీఆరే కొనసాగిస్తున్నడట.. ఈమాట నేనన్నది గాదు సుమా.? శాంతి దూత కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి గారి మాట.. నిజాం సర్కార్ పాలనకు కేసీఆర్ పరిపాలనుకు పెద్దగ తేడా ఏం గనిపిస్తలేదట.. నిన్న బోనగిరికాడ మీటింగు వెట్టి చెప్పిండు..

ఠాగూర్ సీన్మల సచ్చిపోయిన శవానికి ట్రీట్ మెంట్ జేశే సీను ఉంటది సూడుండ్రి.. అగో అది జూశి నేర్చుకుంటున్నరో ఏమో కార్పొరేట్ దావఖాండ్లోళ్లు.. సచ్చిపోయిన మన్షికి ట్రీట్ మెంట్ జేశి లచ్చరూపాలు గుంజిండ్రట.. ఒంగోలు కాడున్న సంఘమిత్ర దావఖానోళ్లు.. సచ్చిపోయినోని బంధువులే సచ్చిపోయిండుగదా..? మళ్ల మందులు ఎందుకు రాస్తున్నరంటే.. డాక్టర్లు ఇనలేదంటే సూడుండ్రి దోపిడి ఎట్లున్నదో..

అమ్మరె బాప్ రే.. కుక్కతోకకు గుండ్రాయి గట్టినా బాలికాకయ్యను మారుమని చెప్పినా రెండు ఒక్కతీర్గనే ఉండెతట్టున్నయ్ గదా..? మళ్ల ఇయ్యాళ ఒక అభిమాని దౌడవలగొట్టిండు..? ఈన మన్షా జంతువా..? ఇంతకు భూలోకంలనే ఉన్నడన్నఫీలింగులో ఉన్నడా లేదా అనేది డౌటొస్తున్నది.. ఏంది ఇది పైత్యంగాకపోతె.. మళ్ల ఆ అభిమాని తిర్గి ఒక్కటేస్తె ఎట్లుంటది..?

మనం ఏదన్న హోటల్కు వొయ్యి కడ్పునిండ తిన్నంక.. బిల్లు గట్టెతప్పుడు జేవుల పర్సులేదనుకో ఏం జేస్తం..? అయ్యో పర్సు మర్శిపోయిన.. మళ్ల తెచ్చిస్తాంటం.. లేకపోతె ఎవ్వలన్న తెల్సినోళ్లుంటే.. అడ్గిస్తం.. అట్లగూడ ఛాన్సులేకుంటే.. ఇంటికి ఫోన్ జేశి పైసలు తెచ్చిప్పికడ్తంగదా..? కని చైనాల ఒకడు ఏం జేశిండో సూడుండ్రి..

హైదరాబాద్ ను వదలని వర్షం

హైదరాబాద్ : నగరాన్ని వర్షం వదలడం లేదు. ఈ సాయంత్రం గంట పాటు నగరంలోని పలు చోట్ల భారీవర్షం కురిసింది. హయత్ నగర్, సరూర్ నగర్, చాంద్రాయణ గుట్ట, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, హిమయత్ నగర్, చిక్కడపల్లి, చార్మినార్ లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

అగ్రిగోల్డ్ చైర్మన్ కు మూడేళ్ల జైలు శిక్ష

కడప : అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావుకు బద్వేల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 6వేల జరిమానా కూడా విధించింది. పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూముల వ్యవహారంలో కోర్టు పై తీర్పును వెలురించింది.

19:23 - October 3, 2017

దేశంలో విమార్శలు సహించలేని శక్తులు ఇలా చేస్తున్నాయని, దేశంలో అసహన వాతావరణం పెరిగిపోయిందని, ప్రకాష్ రాజు అన్నారని, ప్రతిదానికి ట్వీట్టర్ ద్వారా స్పందించే మోడీ ఇప్పుడు గౌరీ లంకేష్ హత్య కేసులో స్పందికపోవడం దారుణమని, లంకేస్ కేవలం పాత్రికేయురాలు కాదని, అన్యాయన్ని ఎదురించే వ్యక్తి అని, పవన్ కన్నా ప్రకాష్ రాజ్ బాగా స్పందించారని, ఈ హత్య సంస్కృతి పోవాలని ప్రముఖ విశ్వేషకులు తెలకపల్లి రవి అన్నారు. పచ్చ కామెర్ల వారికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ప్రకాష్ రాజ్ కు ఉందని, ఈయన నటుడు కాబట్టి అందరికి నటులుగా కనబడతారని బీజేపీ నేత ఆచార్య అన్నారు. గౌరీలంకేష్ దేని కోసం పోరాడారు అసమానత్వపై, మహిళ వివక్షపై పోరాడారని, వేముల రోహిత్ ఆత్మహత్య, కంచె ఐలయ్ విషయంలో అదే జరుగుతుందని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:18 - October 3, 2017

 

హైదరాబాద్ : నగరాన్ని వర్షం వదలడం లేదు. ఈ సాయంత్రం గంట పాటు నగరంలోని పలు చోట్ల భారీవర్షం కురిసింది. హయత్ నగర్, సరూర్ నగర్, చాంద్రాయణ గుట్ట, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, హిమయత్ నగర్, చిక్కడపల్లి, చార్మినార్ లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:10 - October 3, 2017

 

కడప : అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావుకు బద్వేల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 6వేల జరిమానా కూడా విధించింది. పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూముల వ్యవహారంలో కోర్టు పై తీర్పును వెలురించింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

18:47 - October 3, 2017

అనంతపురం : జిల్లా నార్పల మండలం గూగూడు కుల్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత కుల్లాయిస్వామి దర్శనం చేసుకున్నారు. కుల్లాయిస్వామిని దర్శించుకుంటే కోరిక కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

18:46 - October 3, 2017

నెల్లూరు : నెల్లూరులో రొట్టెల పండుగ మూడో రోజుకు చేరింది. బారాషాహీద్ దర్గాలో రాత్రి గంధ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కోటమిట్టలోని అమినీయా మసీదులో 12 మంది మత పెద్దలు 12 బిందెల్లో గంధాన్ని కలిపారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య గంధం బిందెలను బారాషాహీద్‌ దర్గాకు తెచ్చారు. కడప పీఠాధిపతి మొదటి బిందె గంధాన్ని 12 సమాధులకు లేపనం చేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గంధమహోత్సవంలో మంత్రి నారాయణ, నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొన్నారు. 

18:45 - October 3, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రి లక్ష్మివారపుపేట ఏవీఆర్ చక్రవర్తి ఫోర్ట్‌లో లిఫ్టులో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుణ్ని మర్రంశెట్టి గంగరాజుగా గుర్తించారు. బాధితుడుది పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామం. నెయ్యి విక్రయించడానికి రాజమండ్రి వచ్చి ప్రమాదవశాత్తు లిఫ్టులో పడి మరణించాడు. విషయం తెలుసుకున్న గంగరాజు కుమారులు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రి దేహాన్ని చూపి బోరన విలపించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

18:44 - October 3, 2017

అనంతపురం : రాజీనామా చేసేందుకు కూడా ధైర్యముండాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు పడితే వాళ్లు రాజీనామా చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. ఇది ఊతపదంగా మారిందన్నారు. తాను మాత్రం అనంతపురం అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తానన్నారు. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ జరిగి తీరుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తానని చెప్పారు.

18:43 - October 3, 2017

గుంటూరు : వితన్తాభివృద్ధి పరిశోధనల కోసం కర్నూలు జిల్లాలో మెగా సీడ్‌ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 650 ఎకరాల్లో 670 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో మెగా సీడ్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. మొదటి విడతగా ఏపీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విత్తనాభివృద్ధి పరిశోధనలకు అవసరమరైన ఆధునిక టెక్నాలజీ కోసం అమెరికాలోని అయోవా యూనివర్సిటీలో ఒప్పందం చేసుకోనుంది. 

18:42 - October 3, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు అన్నివిధాలా సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 2019 వరకు ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. 2019 వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసితీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి

సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిసామార్ధ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటిసామార్ధ్యం 29.380 టీఎంసీలుగా ఉంది. దీంతో ప్రాజెక్టు 13వ గేటు ఎత్తి దిగువకు 8,180 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

18:15 - October 3, 2017

లండన్ : బ్రిటన్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆయనకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మాల్యా అరెస్ట్ చేశారు. 5నెలల్లో మాల్యా అరెస్ట్ అవ్వడం ఇది రెండోసారి. ఇండియలో బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల అప్పును ఎగవేసి మార్చి 2016 లో మాల్యా లండన్ పరిపోయాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

18:06 - October 3, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీవర్షం ప్రభావం ఇంకా తగ్గలేదు. లోతట్టు ప్రాంతాలు ఇంకా వర్షపు నీటిలోనే ఉన్నాయి. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియోక్లిక్ చేయండి.

17:53 - October 3, 2017

ఖమ్మం : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హోరాహోరీ జరిగిన ప్రచారంలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీల నేతలు పాల్గొన్నారు. గేటు మీటింగులతో ప్రచారాన్ని హోరెత్తించి సింగరేణి కార్మికులను ప్రసన్నం చేసుకున్నారు.

నాలుగు శాసనసభ స్థానాల్లో
తెలంగాణలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు శాసనసభ స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక స్థానాల్లో సింగరేణి కాలరీస్‌ విస్తరించి ఉన్నాయి. ఈ నాలుగు స్థానాల్లో సత్తుపల్లి మినహా మిగిలన మూడు చోట్ల అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. సత్తుపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున జలగం వెంకట్రావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎలక్షన్లను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుడుతోంది. టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం ప్రజా ప్రతినిధులందరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

విజయం కోసం అహర్నిశలు
టీబీజీకేఎస్‌ గెలిపించుకున్న వారికే పార్టీ పదవులతో పాటు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుతో ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరోక్షంగా చెప్పడంతో... విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేల పనినీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే మూడు సార్లు సర్వేచేయించారు. ఈ సర్వేల్లో అత్తెసరు మార్కులు వచ్చిన శాసనసభ్యులు సింగరేణి ఎన్నికల్లో తమ సత్తాచాటి ముఖ్యమంత్రి వద్ద మంచి మార్కులు కొట్టేయాలన్న తలంపుతో సింగరేణి ఎన్నికల్లో బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు భూదందాలు, సెటిల్‌మెంట్లలో నిమగ్నమై జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించే సింగరేణి ఎలక్షన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. 

17:52 - October 3, 2017

కరీంనగర్ : సింగరేణి సంస్థ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. టీబిజీకేఎస్ గెలుపుకోసం అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు, ఎంపిలకు సీఎం కేసీఆర్ ప్రచార బాధ్యతలు అప్పగించడంతో అధికార పార్టీ నేతలంతా కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో శక్తియుక్తులు ధారపోస్తున్నారు. అయితే టీబిజీకేఎస్‌పై కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది.

టిఆర్ఎస్‌కి చెందిన 10 ఎమ్మెల్యేలు
సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో టిఆర్ఎస్‌కి చెందిన 10 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూధనాచారి స్పీకర్ కావడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలోని ఎమ్మెల్యేలతో పాటు.. ఎంపీలు బాల్క సుమన్, సీతారాం నాయక్, పసునూటి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు టిబిజికెఎస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి ఎంపి సుమన్‌ శ్రీరాంపూర్‌ డివిజన్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొత్తగూడెం డివిజన్, వరంగల్ ఎంపి దయాకర్‌ భూపాలపల్లి డివిజన్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ మణుగూరు డివిజన్ల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రచారంపై ప్రగతి భవన్ లోని సీఎం కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరుతోంది. ప్రస్తుతం రామగుండం, శ్రీరాంపూర్ డివిజన్ లు పెద్ద డివిజన్లు కావడం...ఇక్కడ కార్మికులు చైతన్యవంతులు కావడంతో అధికార పార్టీ నేతల ఎత్తుగడలు ఇక్కడ ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం 1వ గని ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను కార్మికులు అడ్డుకొని...యూనియన్ నాయకులు గని పైకి రావద్దంటు తిప్పి పంపారు. ఇలాంటి అనుభవమే ఆర్టీసి చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఎదురైంది. కేసిఆర్ కారుణ్య నియమాకాలు చేపడుతామని హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే సోమారపు సత్యనారాయణను గని నుంచి వెళ్లాలంటు కార్మికులు డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు హమీ నేరవేర్చని వారు కారుణ్య నియామాకాలు ఎలా భర్తీ చేస్తారంటూ కార్మికులు నిలదీసారు.

రంగంలోకి సింగరేణి అధికారులు
ఇలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను యూనియన్‌ నేతలను కార్మికులు విశ్వసించకపోవడంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో సింగరేణి అధికారులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. సింగరేణి సీఎండి శ్రీధర్‌తో కార్మికులంతా టిబిజికేఎస్‌కే ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్మికులకు అధికారులంటే భయం ఉండటంతో వారితో ఒత్తిడి చేయించడం ద్వారా తాము ఓటమి నుంచి బయటపడాలని అధికారపార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికులు ఎన్నికలు జరిగిన ప్రతిసారి విలక్షణమైన తీర్పును ఇస్తూనే ఉన్నారు. ఈసారి అదే పంథాలో టిబిజికేఎస్‌ను ఓడించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా టిబిజికేఎస్‌ భవితవ్యం తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి. 

17:49 - October 3, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసపూరిత వాగ్దానాలను సింగరేణి కార్మికులు నమ్మవద్దన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ గెలవాలన్న ఆలోచనతో ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేని వారు మళ్లీ వాగ్దానాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలను వీడియోతో సహా చూపించారు. సింగరేణి కార్మికులకిచ్చిన హామీలు 2019 ఎన్నికల నాటికి అమలు చేయకపోతే.. సింగరేణి ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ పోటీచేయవద్దని పొన్నం సవాల్‌ విసిరారు. 

17:48 - October 3, 2017

నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి సోదరులు అవాకులు, చవాకలు మాట్లాడుతున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించిన తనపై వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నారని సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:47 - October 3, 2017

కరీంనగర్ : ఈనెల 5న తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థల బంద్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల జేఏసీ పిలుపు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను చిన్నచూపు చూస్తోందని JAC నాయకులు ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 5న కరీంనగర్‌లో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 

17:46 - October 3, 2017

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 39ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఇంద్రకిరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

17:45 - October 3, 2017

యాదాద్రి భువనగిరి : లిగొండ మండలంలో రెండురోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని వెలువర్తి చెరువు నిండిపోయి అలుగుపోస్తోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

17:44 - October 3, 2017

హైదరాబాద్ : సోమవారం కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్‌ను కుదిపేశాయి. నాలుగు గంటల పాటు కురిసిన జోరు వానలు.. నగరాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించిపోయేలా చేశాయి. భారీ వర్షాలు మొజాంజాహీ మార్కెట్‌ను ముంచెత్తడంతో.. పలు దుకాణాలు నీటమునిగాయి. షాపుల్లోని సరుకులు, కూరగాయలు తడిసిపోయాయి. దీంతో వ్యాపారులకు భారీగా నష్టం వాటిల్లింది.

ఇక్కట్లు తప్పడం లేదు...
రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్‌, అన్నపూర్ణ కాలనీ, రామంతాపూర్‌, చిలుకానగర్‌లోని బీరప్పగడ్డ, ఆదర్శ్‌నగర్‌ జలమయమయ్యాయి.రాత్రి నుంచి విద్యుత్‌ నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి హబ్సిగూడలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో.. వాహనదారులు, స్థానికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఫలక్‌నుమాలో లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో.. ఇళ్లలో చేరిన వర్షపు నీటిని స్థానికులు ఎత్తిపోస్తున్నారు. మలక్‌పేట, సోమాజిగూడలో ఇళ్లు కూలిపోయాయి. ఉండేందుకు గూడులేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు
మాదాపూర్‌, శేరిలింగంపల్లిలో నిన్న కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌, శిల్పారామం, మైండ్‌ స్పేస్‌ కూడలి, మియాపూర్‌ దీప్తిశ్రీనగర్‌లో రహదారులపై నీరు చేరడంతో..వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఖాజాగూడచెరువు నిండి అలుగుపారడంతో..గచ్చిబౌలి, మెహిదిపట్నం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మాదాపూర్‌ దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్‌ గార్డెన్‌ వద్ద పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వర్షం నీరు చేరడంతో..వాహనాలు నీటమునిగాయి. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లపై విరిగిపడ్డ చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.    

17:42 - October 3, 2017

హైదరాబాద్ : అక్రమ కట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తామన్నారు రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌. పది, పదిహేనేళ్ల క్రితం నుంచి నాలాలపై అక్రమంగా బిల్డింగ్‌లు నిర్మించారని అందువల్లే హైదరాబాద్‌లో వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తుందన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రితో చర్చించి నాయకుల సలహాలు తీసుకుని అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని తలసాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేయలేకపోయినా తాము చేసి తీరుతామన్నారు. 

17:41 - October 3, 2017

 

విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు దంపతులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిరిమాను సంబరాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. 

కర్నూలు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

కర్నూలు : జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గత నెల 25న ఐదేళ్ల బాలుడు రాజు కిడ్నాప్ గురరైయ్యాడు. కిడ్నాపర్ రాజుని ఎత్తుకెళ్లి ముంబైలో బిక్షాటన పెట్టడాడు. ఈ కేసును సవాల్ తీసుకున్న పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

16:10 - October 3, 2017

కర్నూల్ : జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గత నెల 25న ఐదేళ్ల బాలుడు రాజు కిడ్నాప్ గురరైయ్యాడు. కిడ్నాపర్ రాజుని ఎత్తుకెళ్లి ముంబైలో బిక్షాటన పెట్టడాడు. ఈ కేసును సవాల్ తీసుకున్న పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:09 - October 3, 2017

కుందునదిలో గల్లంతైన మహిళలు మృతి

కర్నూలు : జిల్లాలోని కుందు నదిలో నిన్న గల్లంతైన ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. గంగిరేవుల గ్రామానికి చెందిన 20 మంది కూలీలు కుందు నది దాటుతుండగా నది ప్రహాం పెరిగి వారు అందులో కొట్టుపోయారు. అందులో 17 మందిని గ్రామస్తులు కాపాడారు.

పోలీసుల ముందు లొంగిపోయిన హనీప్రీత్ సింగ్

హర్యానా : డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కౌర్ పోలీసులకు లొంగిపోయింది. డేరాబాబాను తప్పించేందుకు అల్లర్లుకు కుట్ర పన్నారని ఆమె పై ఆరోరపణలు ఉన్నాయి. డేరాబాబాకు శిక్ష పడినప్పటి నుంచి హనీప్రీత్ తప్పించుకు తిరుగుతున్నారు. ఆమె పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 

15:40 - October 3, 2017
15:38 - October 3, 2017

హర్యానా : డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కౌర్ పోలీసులకు లొంగిపోయింది. డేరాబాబాను తప్పించేందుకు అల్లర్లుకు కుట్ర పన్నారని ఆమె పై ఆరోరపణలు ఉన్నాయి. డేరాబాబాకు శిక్ష పడినప్పటి నుంచి హనీప్రీత్ తప్పించుకు తిరుగుతున్నారు. ఆమె పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:37 - October 3, 2017

కర్నూలు : జిల్లాలోని కుందు నదిలో నిన్న గల్లంతైన ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. గంగిరేవుల గ్రామానికి చెందిన 20 మంది కూలీలు కుందు నది దాటుతుండగా నది ప్రహాం పెరిగి వారు అందులో కొట్టుపోయారు. అందులో 17 మందిని గ్రామస్తులు కాపాడారు. మిగతా ముగ్గురు మహిళలు గల్లంతైయ్యారు. వారి మృతిదేహాలు ఈ రోజు లభించాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:36 - October 3, 2017

దేశవ్యాప్తంగా అమ్మాయిలపైన, మహిళలపైన వేధింపులు, దాడులు కొనసాగుతునే ఉన్నాయి. వీటిపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇటువంటివి వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నా ఇటివలకాలంలో యూపిలోని బెనారస్ యూనివర్శిటీ ఇటు ఏపీ లోని ప్రకాశంలోను మహిళలపై వేధింపులు వెలుగులోకి వచ్చాయి. కాగా బెనరస్ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయగా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. విషయం పెద్దది అవ్వడంతో ఆందోళనను అణిచివేయడానికి యూనివర్శిటీ అధికారులు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ అంశ చర్చను చెపట్టింది వేదిక దీని గురించి చర్చించేందుకు ఓయూ జేఏసీ ప్రతినిధి బాలలక్ష్మి మానవికి వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

తీరు మార్చుకొని బాలయ్య

అనంతపురం : నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన తీరు మార్చుకోలేదు. టీడీపీ కార్యకర్తపై మరోసారి చేయి చేసుకున్నారు బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురంలో ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో ఈ ఘటన జరిగింది. తనను దాటుకొని ముందుకెళ్తున్న కార్యకర్త చెంపను బాలయ్య చెళ్లుమనిపించారు.

15:28 - October 3, 2017

భూపాలపల్లి : దుమ్ము, ధూళి మధ్యే సహవాసం. దట్టమైన దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరిఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశవ్యాధులు. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌తో దుబ్బపల్లి వాసుల నరకయాతన. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌ దుమ్ముతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుబ్బపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళి మధ్య సహవాసం చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. యాష్‌ప్లాంట్‌ దుమ్ము ప్రజారోగ్యానికి పొగపెడుతోంది. ఒకప్పుడు పచ్చని చెట్లు, పాడి పంటలతో కళకళలాడిన గ్రామం...ఫ్యాక్టరీ దుమ్ముతో ఇప్పుడు అందవిహీనంగా మారిపోయింది. గ్రామానికి సమీపంలో మొదట కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేటీపీపీ ప్లాంట్‌కు అనుసంధానంగా 2009లో యాష్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అప్పటినుంచే దుబ్బపల్లి వాసుల కష్టాలు మొదలయ్యాయి.

శ్వాసకోశ వ్యాధులతో
పొగమంచుకమ్మేసినట్లుగా...దుమ్ము ఊరిని కమ్మేస్తోంది. ఇళ్లు, వాకిలి, గొడ్డు, గోద, పంటపొలాలు ఇలా ప్రతిఒక్కటి దుమ్ముతో నిండిపోతోంది. దీంతో దుమ్ముతో నిండిన గడ్డిని మేసేందుకు పశువులు కూడా ముందుకురావడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతోంది. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌ దుమ్ముతో స్థానికులు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంట్లో కన్నా దుబ్బపల్లివాసులు ఆస్పత్రుల్లోనే ఎక్కువ సమయం ఉండాల్సి వస్తోంది. శ్వాసకోశ వ్యాధులతో ఇప్పటివరకు ఐదు మంది చనిపోయారని గ్రామస్తులు వాపోతున్నారు. వైద్యం, మందుల కన్నా ముందు ఊరు మారాలని డాక్టర్లు సూచిస్తున్నారని చెబుతున్నారు.

8 ఏళ్లుగా హామీలు
కేటీపీపీ యాష్ ప్లాంటు నిర్మించే ముందే పునరావసం కల్పిస్తామని.. కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు చెప్పారు. అయితే 8 ఏళ్లుగా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలున్నాయి. తమను ఆదుకుకోవాలని స్థానికులు కలెక్టర్‌, ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నారు. ఎట్టకేలకు పునరావాసం నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు సర్వేలు ప్రారంభించారు. అయితే సర్వేల పేరుతో ఎన్నాళ్లు కాలం వెళ్లదిస్తారోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని దుబ్బపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు.   

15:27 - October 3, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మికులు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలని, మోసపూరిత మాటలను నమ్మరాదని కార్మికుల హక్కులను కాపాడి, వారి సంక్షేమం గురించి పాటుపడే ఏఐటీయూసీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ఓసీపీ-2 ఉపరితల గనిలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంగళవారం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలను కోర్ట్ కెక్కించిన ఘనత జాగృతికి సంబంధించిన వ్యక్తులుదేనని, కారుణ్య నియామకాలు ఇప్పుడు కొత్తగా లేవని ప్రతి సంస్థ లో కారుణ్య నియామకాలు జరుగుతాయని అన్నారు.  

15:25 - October 3, 2017

 

హైదరాబాద్ : నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువులు తెగిపోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. అయితే... ఎలాంటి ప్రమాదం లేదని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ లేక్స్‌ ఈఈ శేఖర్‌రెడ్డి అన్నారు పూర్తి వివరాలకు వీడియో చూచండి. 

15:22 - October 3, 2017

అనంతపురం : నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన తీరు మార్చుకోలేదు. టీడీపీ కార్యకర్తపై మరోసారి చేయి చేసుకున్నారు బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురంలో ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో ఈ ఘటన జరిగింది. తనను దాటుకొని ముందుకెళ్తున్న కార్యకర్త చెంపను బాలయ్య చెళ్లుమనిపించారు.

13:34 - October 3, 2017

శ్రీకాకుళం : ఆ గ్రామంలో యాబై గడపలు, నూటా యాబైకి పైగా జనాభా. కానీ ఇదంతా గతం. ఇప్పుడు గ్రామం అంతా ఖాళీ అయ్యింది. ఒకే కుటుంబం మిగిలిపోయింది. సిక్కోలు జిల్లాలో కనుమరుగవుతున్న కరణాలపేటపై 10టీవీ కథనం. చుట్టూ పచ్చని పోలాలు, కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయత కల్గి ఆహ్లాదకరమైన వాతవరణం ఉన్న ఈ గ్రామం పేరు కరణాల పేట. ఇది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది.ఈ గ్రామంలో ఒకప్పుడు 50 కుటుంబాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం నివాసముంటోంది. కుటుంబమంటే నలుగురో ఐదుగురో అనుకునేరు. కేవలం ఇద్దరే. ఆ ఇద్దరే ఈ గ్రామంలో నివాసముంటున్నది.

అయితే కొన్ని దశాబ్దాల కిందట గ్రామం ప్రజలతో కళకళలాడేది. ఊరినిండా ప్రజలు ఉండేవారు. అంతా కలిసి మెలిసి ఉంటూ తమ తమ పనులు చేసుకునేవారు. ఆ తర్వాతే పరిస్థితి తారుమరయ్యింది. గ్రామంలో వర్షాలు కురవక పంటలు పండక ఉపాధి దొరకడం కష్టమైపోయింది. దీంతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా వలసబాట పట్టారు. ఉపాధి వెతుక్కుంటూ గ్రామస్తులంతా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండడంతో ఊరంతా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం గ్రామంలో ప్రసాదరావు, లక్ష్మీ దంపతులు మాత్రమే నివాసముంటున్నారు. వీరు వ్యవసాయం వదులుకోలేక గ్రామన్ని వీడలేక అలాగే ఉండిపోయారు.

సంవత్సరంలో ఒకసారి జరిగే గ్రామ దేవత ఉత్సవాలకి మాత్రం ప్రజలంతా వస్తారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఆరోజు ఊరికి వస్తారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటారు. గ్రామస్తులతో రాకతో గ్రామమంతా సందడిగా మారిపోతుంది. ఆ తర్వాత మళ్లీ వారంతా గ్రామాన్ని వదిలి వెళ్తారు. గ్రామంలో కొన్ని మౌలిక వసతులతోపాటు రోడ్లు, మంచినీటి వసతి కల్పిస్తే కొన్ని కుటుంబాలు తిరిగివచ్చే అవకాశముంది. వలసల జిల్లాగా పేరున్న సిక్కోలు జిల్లాలో ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ కరణాల పేటలో ఏకంగా 99శాతం కుటుంబాలు గ్రామన్ని విడిచి వెళ్లడం గ్రామం కనుమరుగయ్యే అవకాశం ఉంది.. కావున ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని గ్రామం కనుమరుగు కాకుండా కాపాడలని కోరుతున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

హైదరాబాద్ : నగరంలో జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీనితో రహదారులు చెరువులను తలపించాయి. కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని బయటకు తోడివేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

13:17 - October 3, 2017
13:16 - October 3, 2017

కొత్తగూడెం : సింగరేణి ఉద్యోగులకు ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఏరియా ఓపెన్‌కాస్ట్‌లో జరిగిన కార్మికుల సభలో కవిత పాల్గొన్నారు. సింగరేణి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని... కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కవిత.

13:14 - October 3, 2017

హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు..కాలనీల్లో నిలిచిన నీరు వెళ్లడానికి మ్యాన్ హోల్స్ తెరవద్దని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. కంట్రోల్ రూం, సాధారణ కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలని, వెంటనే తమ సిబ్బంది వచ్చి చర్యలు తీసుకుంటారన్నారు. రోడ్లను తవ్వడం..పైపుల కోసం తవ్వడం తదితర వాటిని ఆపివేయడం జరిగిందన్నారు. నిన్న కురిసిన వర్షానికి ఇబ్బందులు తెలుసుకొనేందుకు..తొలగించేందుకు తమ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారని తెలిపారు. ఓపెన్ చేసిన మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 400 బస్తీల్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేయడం జరిగిందని, నీటిని పంపిణీ చేసే వెహికల్స్ ఉపయోగించడం జరుగుతోందని, ఎక్కడ ఓవర్ ఫ్లో జరిగితే అక్కడ వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కొత్తగూడెంలో ఎంపీ కవిత ప్రచారం...

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని నిజామాబాద్‌ ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత వెల్లడించారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కార్మికులపై వరాలు కురిపించారు.

'జాతీయ రహదారుల కోసం లక్ష కోట్లు'..

విజయవాడ : ఏపీలో జాతీయ రహదారుల, జల రవాణా ప్రాజెక్టులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల ఖర్చు చేస్తామని నితిన్ గడ్కరి పేర్కొన్నారు.

భారత రాయబారికి పాక్ సమన్లు..

ఢిల్లీ : ఏకపక్షంగా భారత్ కాల్పులకు తెగబడుతోందని పాకిస్థాన్ లోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 2 తేదీల్లో భారత బలగాలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద కాల్పులకు తెగబడ్డారని ఆరోపించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.

12:57 - October 3, 2017

అనంతపురం : జిల్లాలో డాక్టర్‌ వైఎస్సార్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పెరుమళ్ల జీవానందరెడ్డి లక్షమొక్కల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత చెట్ల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఇంటికో బిడ్డ ఎంత ముద్దో అలాగే ఇంటికో చెట్టు కూడా అంతే అవసరమన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

12:55 - October 3, 2017

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా... పరిపాలనలో దుబారా వ్యయాలు మాత్రం తగ్గడంలేదు. ఆర్థిక పొదుపు చర్యలపై పాలకులు చెబుతున్న మాటలకు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికార కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలను స్టార్ హోటళ్లు, ఆధునిక ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజాధనం వృధా అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు ఎదుర్కొంటోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు సరిపోవడంలేదు. పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కార్యక్రమాలన్నీ ఎక్కువగా స్టార్ హోటళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది.

ప్రభుత్వం నిర్వహించే అధికార సమావేశాలు, సదస్సులు, పరీక్షా ఫలితాల విడుదల.. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా స్టార్‌ హోటళ్లు, ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో అద్దెలకు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు 13 స్లారు జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. వీటిలో పది సదస్సులను విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లోనే జరిపారు. ఒక్కరోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు పదిసార్లు నిర్వమించిన కలెక్టర్ల సదస్సుకు 80 లక్షల రూపాయల అద్దె చెల్లించారు. ఈ డబ్బుతో సొంతగానే నిర్మాణాలు చేసుకోవచ్చని విపక్షాలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలను స్టార్‌ హోటళ్లలో నిర్వహించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. మరోవైపు అధికార కార్యక్రమాలను స్టార్‌ హోటళ్లు, ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించడాన్ని అధికార టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. అధికార కార్యక్రమాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే దుబారా వ్యయాలను తగ్గించుకునే అవకాశం ఉందని ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు.

12:52 - October 3, 2017

తూర్పు గోదావరి : ఆధిపత్య రాజకీయం ఆసక్తిగా మారింది. అధికార కూటమిలో ఆధిపత్య పోరు సెగలు పుట్టిస్తోంది. తెలుగు తమ్ముళ్లు తలోదారి అన్నట్టు సాగుతుండగా బీజేపీ నేతలు సొంత నాయకులపైనే చదరంగం మొదలు పెట్టారు. నేతల తీరు చూసి రాజమహేంద్రవరం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తమకే అవకాశం ఉంటుందని సిటీఎమ్మెల్యే ఆశిస్తుండగా, ఈసారి సిటీ సీటు తమదే అని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు సొంతపార్టీలోని కీలక నేత సోము వీర్రాజుతో సఖ్యత చెడింది. గత ఎన్నికల్లో అండగా నిలిచిన సోము ఇప్పుడు ఆకుల సత్యన్నారాయణ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆకులకు పోటీగా నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో గోదావరిలో మత్స్యసంపద పెంచడంపై నేతల మధ్య చిటపటలు బయటపడ్డాయి. చేపపిల్లను వదిలే కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆకుల శ్రీకారం చుట్టారు. దాంతో ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ సోమువీర్రాజు కూడా అదే రీతిలో చేపపిల్లను వదిలే పనిని చేపట్టారు.

బీజేపీతో పాటు టీడీపీలోనూ ఇంటిపోరు వేడిపుట్టిస్తోంది. తాజాగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నేతలు తలోదారి అన్నట్టుగా సాగుతున్నారు. గుడా చైర్మన్ ఒకవైపు.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరోవైపు, మధ్యలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ..ఇలా సైకిల్‌పార్టీలో మూడు ముక్కలాట కనిపిస్తోంది. మరోవైపు ఎంపీ మురళీమోహన్ మాత్రం ఇవేవి పట్టించుకోవడంలేదు. ఎదుటిపార్టీ నేతలతోపాటు స్వంతపార్టీలోనూ నాయకులు కుంపట్లు రాజేయడంతో రాజమహేంద్రవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే .. వచ్చే ఎన్నికల నాటికి పరిణామాలు మరింతగా మారిపోతాయన్న అంచనాలు వస్తున్నాయి. ఈసారి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అవకాశం కోరబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తానే రూరల్‌ నుంచి పోటీలో దిగాలని సోమువీర్రాజు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో స్వపక్షంలోని ప్రత్యర్థి ఆకులకు సత్యనారాయణకు చెక్ పెట్టాలని తమ నేత గట్టిగా నిర్ణయించున్నారని సోము వర్గం అంటోంది. అటు తమ పార్టీకూడా అదే ఆశిస్తున్నట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మిత్రపక్షం బీజేపీకి రూరల్‌ కేటాయించి సిటీ నియోజకవర్గంలో గోరంట్లను బరిలో దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. కాని .. బచ్చయ్యచౌదరికి ఈసారి అవకాశం దక్కదని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడాచైర్మన్‌ గన్నికృష్ణ తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ఎవరి ఆశలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆధిపత్య పోరుతో రెండు పార్టీలలోనూ ఐక్యత కానరాని పరిస్థితి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మరింత ముదిరిపోయే ప్రమాదం ఉందని రాజమహేంద్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

12:50 - October 3, 2017

విజయవాడ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న అఖిల భారత డ్వాక్రా బజార్‌కు అనూహ్య స్పందన లభిస్తొంది. దేశ నలుమూలల నుంచి 300 మందికి పైగా మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు కూడా నామమాత్రంగా ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్‌లో 20రాష్ట్రాల నుంచి దాదాపు మూడు వందల మంది మహిళలు తమ ఉత్పత్తులను 356 స్టాల్స్‌లో ప్రదర్శిస్తూ విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వీటి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటంతో ప్రజలు కొనగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. గత నెల 27వ తేదీన ప్రారంభమైన డ్వాక్రా బజార్‌ ఈ నెల 8 వరకు కొనసాగనుంది. రోజురోజుకు ఈ ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, బీహార్‌, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీ కి చెందిన జిల్లాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంది.

ప్రధానంగా స్టాళ్లలో హ్యాండ్లూమ్స్‌, బంజార బ్యాగ్స్‌, ఉడెన్‌ ఐటమ్స్‌, హెర్బల్‌ ఐటమ్స్‌, జెనరిక్‌ ఐటమ్స్‌ తో పాటుగా మహిళలకు సంబంధించిన సారీస్‌, బ్రాస్‌ మెటల్స్‌ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. ఇక పురుషులకు కోసం ప్రదర్శనలో ఉంచిన ప్యాంట్స్‌, డ్రస్‌ మెటిరియల్‌ కట్టిపడేస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన తిను బండారాలు సందర్శకుల నోరూరిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూత రేకులు స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలుస్తున్నాయి.

12:22 - October 3, 2017

కర్నూలు : జిల్లాలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా పోటెత్తింది. చాగలమర్రిలో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెలంపాడులోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకులు..ఇతర సామాగ్రీ తడిసిపోయింది. దీనితో తాగేందుకు నీరు లేక..భోజనం లేక అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 1500 ఎకరాల్లోని పంట నీట మునిగిపోయింది. ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో కొట్టాలపల్లి తదితర గ్రామాల నుండి భోజనాలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలులో భారీ వర్షం..

కర్నూలు : జిల్లాలో రెండు రోజుల నుండి భారీ వర్షం కురిసింది. చాగలమర్రిలో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెలంపాడులోకి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. 1500 ఎకరాల పంటలు నీటమునిగిపోయాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

12:19 - October 3, 2017

హైదరాబాద్ : నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో కుండపోతగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 4 గంటలపాటు కుంభవృష్టిపడింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో రహదారులు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. పాతబస్తిలోని మురిగిచౌక్‌ ప్రాంతంలో రిక్షాకార్మికుడి ఆటోపై కరెంట్‌ వైరు తెగిపడటంతో అఫ్సర్‌ అనే వ్యక్తి చనిపోయాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో మట్టిగోడ కూలి యాదుల్లా, అతని నాలుగు నెలల కుమారుడు మృతిచెందారు. మోకాలి లోతునీటిలో వాహనాలు ముందుకు కదలనంటూ మొరాయించాయి. ద్విచక్ర వాహన దారులు పలుచోట్ల కిందపడి ప్రమాదాలకు గురయ్యారు. మీరాలంలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.6, అంబర్‌పేట 12.03, గోల్కొండ 10.4, మోండా మార్కెట్‌లో 10.4 సెం.మీ. వర్షం కురిసింది.మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో గ్రేటర్‌ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కర్మన్ ఘాట్ లో నెలకొన్న పరిస్థితి కోసం వీడియో క్లిక్ చేయండి.

12:15 - October 3, 2017

ఖమ్మం : మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది పెసర రైతుల పరిస్థితి. అసలే పంట దిగుబడి అంతంత మాత్రంగా ఉంటే మార్కెట్ కు తీసుకొచ్చిన అరకొర పంటకు రంగుమారిందంటూ వ్యాపారులు వారిని నిలువునా ముంచుతున్నారు. దళారులతో కుమ్మక్కై రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వకుండా దోపిడికి పాల్పడుతున్నారు. పాత ఖమ్మం జిల్లాలో పెసర రైతులకు దక్కని మద్దతు ధర పై 10టీవీ ప్రత్యేక కథనం.

ఖమ్మం జిల్లాలో పెసర రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల చేతిలో చిక్కి నిలువు దోపిడీకి గురవుతున్నారు. గత ఏడాది పెసరకు మంచి ధర లభించడంలో ఖమ్మం జిల్లాలో రైతులు పెసరను భారీగా సాగుచేశారు. గతేడాది క్వింటాల్‌కు 8వేలకు పైగా ధర పలికింది. దీంతో రైతులు అప్పు చేసి మరీ పంటసాగు చేశారు. ఈసారి మద్దతు ధర పెరుగుతుందని ఆశించి పండించిన పంటను మార్కెట్‌కు తరలించారు. తీరా మార్కెట్‌కు వెళ్లాక రైతులకు షాక్‌ తగిలింది. మద్దతు ధర అమాంతం పడిపోయింది. 5570 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

ఖమ్మం జిల్లాలో 22,280 ఎకరాల్లో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1210 హెక్టార్లులో పెసర పంట సాగైంది. గతేడాది కంటే పెసర సాగు పెరిగిందనే చెప్పాలి. అయితే మద్దతు ధర మాత్రం తగ్గింది. క్వింటా పెసరకు ప్రభుత్వం రూ. 5570 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. కానీ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో ఎక్కడా ఈ ధరకు పంట కొనుగోలు చేయలేదు. మార్కెట్లలో జెండా పాట ఒకవైపు క్వింటాకు 4500 లుగా చూపుతూ .. మరోవైపు రెండు వేలకే కొనుగోలు చేస్తున్నారు. రంగు మారిందని, తడిసిందంటూ అనేక సాకులు చూపుతూ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తలేవంటూ వాపోతున్నారు. గతేడాది మార్కెట్ లో మిర్చి రైతులు మద్ధతు ధర లేక ఏ విధంగా మోసపోయారో అదే తరహా ఈ ఏడాది పెసర రైతులు నిలువునా మోసపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వమే పెసరను కొనుగోలుచేసి తమను ఆదుకోవాలని పెసర రైతులు వేడుకుంటున్నారు.

12:12 - October 3, 2017

మహబూబ్ నగర్ : అభివృద్ధిలో వెనకబడిన జిల్లా ఇప్పుడు ముందంజలో నిలువనుంది. కరువు జిల్లా కాస్త వరాల ఖిల్లాగా మారబోతోంది. పాలమూరు జిల్లాలో ఐటీ కారిడార్, ఇండస్ట్రీయల్ ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. దీంతో తమ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయని.. ఇటు రైతులు, అటు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వలసల జిల్లా అంటే మొదటగా గుర్తొచ్చేది పాలమూరు జిల్లా. వరుస కరవులు, ఉపాధి లేక రైతులు, నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసవెళ్తుంటారు. ఉపాధివేటలో వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అయితే త్వరలో పాలమూరు రూపురేఖలు మారబోతున్నాయి. కరువు జిల్లా కాస్త వరాల ఖిల్లాగా మారబోతోంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కొలువుల జాతర షురు కాబోతోంది. ఇప్పటి వరకు కరువు జిల్లాగా మాత్రమే పరిచయమున్న పాలమూరు.. ఇక ఐటీ కారిడార్‌కు వేదికగా మారనుంది. పాలమూరు మల్టీపర్పస్ ఐటీ కారిడార్‌కు అడుగులు పడుతున్నాయి. ఇటు ఎయిర్‌పోర్ట్, అటు బెంగళూర్ హైవే ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం పరిశ్రమలకు కేంద్రం కానుంది.

ఎన్‌హెచ్-44 బెంగళూర్ హైవేను ఆనుకుని దివిటిపల్లి ప్రాంతంలో 400 ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు కానుంది. ఒకే ప్రాంతంలో ఐటీ, పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1954 ప్రాంతంలో భూమి లేని పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. దాదాపు 320 ఎకరాల భూమి పంచిపెట్టారు. ప్రస్తుతం 320 ఎకరాలతో పాటు మరో 80 ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. దీని కోసం ఇప్పటికే స్థల పరిశీలన సైతం పూర్తి అయింది. గత వారం ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రాజన్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ స్థల పరిశీలన చేసి, ఐటీ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

మరోవైపు 400 ఎకరాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు కూడా ఐటీ కారిడార్‌కు మద్దతు పలికారు. ఐటీ కారిడార్‌ ఏర్పాటుతో జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అంటున్నారు. వలసవెళ్లిన వారు తిరిగి జిల్లాకు రావాన్నలదే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలకు మొదటి అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే దాదాపు 14 సంస్థలు తమ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇక్కడకు వస్తే చాలా మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీనిపై ఇప్పటికే నివేదిక రూపొందించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ప్లాస్టిక్ వస్తువుల పరిశ్రమలు నెలకొల్పనున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు పరిశ్రమలు మొదలైతే... ఉద్యోగాలు లభిస్తాయని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

12:08 - October 3, 2017

మెదక్ : తల్లీ తన ఐదుగురు ఆడపిల్లలు...ఆ ఇంట్లో అంతా ఆడవాళ్లే...ఎప్పుడూ పిల్లల కేరింతలు...ఆటపాటలతో సందడిగా ఉండేది..నిండు కుటుంబంలో ఒక్కసారి విషాదం...ఇప్పుడా ఇంట్లో ఎవరూ లేరు...బతుకమ్మ పండగ కోసం అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన వారంతా బలయ్యారు..బతుకమ్మ...పూల పండగే కాదు...మహిళల పండగ...ఎక్కడెక్కడో ఉన్నా తన సొంతింటికి..లేదంటే పుట్టింటికి చేరుకుంటారు.. చిన్ననాటి జ్ఞాపకాలు...బాల్య స్నేహితులను ..బంధువులను కలుసుకుంటారు...పది రోజుల పాటు పండగలో మునిగితేలిపోయేందుకు ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. అందరిలానే ఈ రాజమణి కూడా...తన పుట్టింటి నుంచి అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమణి ప్రతీ ఏడాది పూల పండగకు మాత్రం పుట్టింటికి వస్తుంది...సంబరాలు చేసుకుంటుంది. ఎప్పటిలానే ప్రతీ ఏడాది వస్తున్న రాజమణి... ఈ సారి తన కూతుళ్లతో కలిసి బయల్దేరింది...రాజమణికి ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..ఐదుగురు కూతుళ్లు...ఆ ఇంట్లో ఎప్పుడూ బతుకమ్మ పండుగే.

తన ఐదుగురు కూతుళ్లతో ఈ సారి బతుకమ్మ పండుగను పుట్టింట్లో ఎంతో సంబరంగా జరుపుకోవాలనుకుంది..కాని...బతుకమ్మ పండుగ ముందు రోజే రాజమణి చిన్న కూతురు 18 నెలల దీపాంక్షపై వేడి టీ పడింది..కడుపు భాగంలో కాలిపోవడంతో గాయమైంది. ఆ చిన్నారికి ఆస్పత్రిలో చూపించి..అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి బతుకమ్మ పండుగ జరుపుకోవాలని బయల్దేరింది. మెదక్ జిల్లా కంగ్డి మండలం తడ్కల్‌ గ్రామానికి చెందిన రాజు,రాజమణి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలే. వారింట్లో ఏ చిన్న పండగ వచ్చినా...చిన్నారుల పుట్టినరోజు వచ్చినా సంబరాలే. ఎప్పుడూ ఇల్లంతా హడావుడిగానే ఉంటుంది..చిన్నారుల ఆటపాటలతో కేరింతలతో సందడిగా ఉంటుంది.ఇక బతుకమ్మ పండగ రావడంతో పుట్టింటికి తన బిడ్డలతో వెళ్లి ఆడుకోవాలని రాజమణి బయల్దేరింది. భర్త రాజు తన కారు ఇచ్చి బావమరిది నవీన్, డ్రైవర్ ఇస్మాయిల్‌ను పంపాడు.

ఊహించని ఘటనే జరిగింది...క్షణంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో దారి మధ్యలోని పిల్లివాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది.. వెంటనే నవీన్, డ్రైవర్‌లు దూకి కారును కొట్టుకుపోకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వాగులో కొట్టుకుపోయిన కారులో రాజమణితో పాటు ఐదుగురు కూతుళ్లు ప్రియ, జ్యోతి, కవల పిల్లలైన జ్ఞాన అస్మిత, జ్ఞాన సంహితతో పాటు 18 నెలల దీపాంక్షలు అందులో ఉన్నారు. వారి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి ఆ కుటుంబానికి అప్పగించారు. అంతా అయిపోయింది..నిండు కుటుంబం వర్షానికి బలయింది...బతుకమ్మ పండుగలో ఎంతో సంబరాలు చేసుకోవాల్సిన పసిబిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జరిగిన ఘటన ప్రతీ ఒక్కరి హృదయాలను కలిచివేసింది.

12:00 - October 3, 2017

కరీంనగర్ : భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్‌ఆఫీస్‌లోకి వెళ్లేందుకు సీఐటీయూ నేతలకు అనుమతి నిరాకరించడంతో గొడవ మొదలైంది. సభకు అనుమతి ఇవ్వాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేసినా స్పందించలేదు. అయితే టిబిజికెఎస్ నేతలతో పాటు ఎంపి కవిత,పొంగులేటి, పల్లా, జలగం వెంకట్రావ్‌ను అనుమతించడంపై సీఐటీయూ నేతలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎన్ఐఏ కార్యాలయానికి జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే రషీద్ ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్నారు. టెర్రర్ ఫండ్ కేసులో ఆయనకు ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కేరళకు చేరుకున్న అమీత్ షా..

కేరళ : కన్నూరు ఆలయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేరుకున్నారు. ఈసందర్భంగా రాజరాజేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ 182 బీఎస్ఎఫ్ బెటాలియన్స్ పై ఉగ్రవాదులు ఆత్మహతి దాడికి పాల్పడ్డారు. భారత బలగాలు..ఉగ్రవాదులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

11:51 - October 3, 2017

హర్యానా : పటిష్టమైన భద్రత...ఎటు చూసినా పోలీసులే..ప్రతీ కదలికను గుర్తించే నిఘా బృందాలు...ఇదంతా ఎక్కడో కాదు...డేరాలో.. డేరా చుట్టూ శత్రుదుర్భేద్యంగా మారింది... ఇలాంటి డేరాలో దొంగలు ఎలా పడ్డారు... రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్‌ బాబా మాత్రమే వాడే ఆ ఇంట్లోకి ఎలా వెళ్లారు..ఇది నిజమేనా..? లేక ఇంటి దొంగల పనా..??? హర్యానాలోని డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్‌ సింగ్‌ అరెస్టు తర్వాత డేరా శత్రుదుర్భేద్యంగా మారింది... పోలీసుల పహారాలో నిత్యం నిఘా కళ్లతో డేరా ఉంది..ఈ క్రమంలో డేరాలో దొంగలు పడ్డారు...దొరికిన విలువైన వస్తులును చేజిక్కించుకుని పారిపోయారు...హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లాలోని దొబాడలో ఉన్న డేరాలో దొంగలు పడ్డట్లు వచ్చిన ఫిర్యాదు కలకలం రేపుతుంది... గుర్మీత్‌ విలువైన దుస్తులు, బూట్లును కూడా వదల్లేదు...వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు డేరా అధికారులు చెబుతున్నారు.

గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అరెస్ట్ తరువాత.. డేరా కార్యాలయాల దగ్గర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాక డేరాకు కూడా సొంత సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఇటువంటి భద్రత మధ్య దొంగలు డేరాలోకి ఎలా ప్రవేశించారన్న అనుమానాలు పెరిగాయి...జరిగిన ఘటనపై పోలీసులు, అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు రోహ్‌తక్‌ పోలీసులు చెబుతున్నారు.

డేరాలో చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానిక భక్తుడు జైపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది...అత్యంత ఆధునిక పద్ధతిలో లగ్జరీగా నిర్మించిన ఈ భవంతిని డేరాబాబా గుర్మీత్ సింగ్‌తో పాటు, ఇతర వీవీఐపీల కోసం వినియోగించేవారు. అయితే గుర్మిత్ అరెస్టు తర్వాత పూర్తిగా పోలీసుల,నిఘా వర్గాల స్వాధీనంలోకి తీసుకుని స్థానికులెవరూ డేరా క్యాంపస్‌ను వినియోగించకుండా కట్టడి చేశారు. అప్పటి నుంచి నామ్ చర్చా భవనంలో ఎలాంటి సత్సంగాలు జరగడం లేదు. దీన్ని శుభ్రం చేసేందుకు, తాత్కాలికంగా ఇంటి బాధ్యతలను జయపాల్‌కి అప్పగించారు. ఇంత భద్రత ఉన్నప్పటికీ చోరీ ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

11:39 - October 3, 2017

కరీంనగర్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలుగా ఉపయోగపడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. సింగరేణి కాలరీస్‌ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్‌ఎస్‌ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. కార్మికుల్లో పట్టు సాధించేందుకు గులాబీ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్మికులతో కలిసి భోజనాలు చేస్తూ.. గేటు మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ముందు నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టు ఉండడంతో....సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను అధికార పార్టీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే పార్టీలో పదవుల భర్తీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ కవిత ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అన్నీ విషయాల్లో ముందుంటూ కార్మిక సంఘాన్ని నడిపిస్తున్నారు. కార్మిక సంఘాల మద్దతు కూడ గడుతూ....తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత కనిపిస్తున్నా.... ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలో దిగి హామీలు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోందన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలు, గృహ రుణాలు, కార్మికుల కుటుంబ సభ్యులకు వైద్యం వంటి అంశాల్లో సీఎం ఇచ్చిన హామీలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ... కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో విపక్షాల నుంచి కూడా గట్టి పోటీ వస్తుండటంతో... విజయం కోసం అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది.

11:35 - October 3, 2017

విజయవాడ : ఏపీలో రాజధాని కోసం సమీకరించిన భూములకు ప్రతిగా రైతులకు కేటాయించిన ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు రైతులు విముఖత చూపుతున్నారు. ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సీఆర్డీఏ అధికారులు కోరినప్పటికీ రైతులు ముందుకు రావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి భూ సమీకరణ చేపట్టింది. ఇందుకోసం రైతులకు 33వేల 576 ఎకారల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మూడు నెలల్లో రెండు శాతం రైతులు మాత్రమే తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో ఉండవల్లి, పెనుమాక మినహా 27 గ్రామాల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లు కేటాయించారు. నేలపాడు, అనంతవరం, శాకమూరు, పిచ్చుకలపాలెం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల్లో పెగ్‌ మార్కింగ్‌ పూర్తయినప్పటికీ నెంబరింగ్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మిగిలిన గ్రామాల్లో ఇంకా పెగ్‌ మార్కింగ్‌ పూర్తి కాలేదు.

ఓ వైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేలపాడులో మూడు నెలల క్రితం లాంఛనంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం తుళ్లూరు, అనంతవరం, మందడం గ్రామాల్లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని కూడా రాజధాని రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. కాని ఏ కార్యాలయంలోనూ సగటున రోజుకు 7,8 రిజిస్ట్రేషన్‌లు కూడా జరగడంలేదని తెలుస్తోంది. అయితే ప్లాటు ఎక్కడ ఉందో తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్లు ఏలా చేయించుకుంటామని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు పూర్తైనా అపోహలు, అనుమానాలతో రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలేదు. ఇప్పటివరకు 1వేయి 360 మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

త్వరలోనే ప్లాట్లు కేటాయిస్తాం అని చంద్రబాబు చెబుతున్నప్పటికీ రైతులు విముఖత చూపుతున్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లనే సీఆర్డీఏ రైతులకు అప్పగించాల్సి ఉండగా ఏ గ్రామంలోనూ కనీసం రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూమి ఇచ్చిన రైతు తనకు వచ్చిన ప్లాట్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ముందుగా ఆ రైతు సీఆర్డీఏ నుండి రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండానే ఆ ప్లాట్లను తన వారసులకు బదిలీ చేయవచ్చు. అయితే ఇందుకు కనీసం ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొంత మంది రైతులు తమ భూములకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించుకోలేక సీఆర్డీఏతో అగ్రిమెంటు చేయలేదు. దీంతో ఆ భూములు పెండింగ్‌లో ఉన్నాయి. సీలింగ్‌ భూముల విషయం, గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలకు ప్రభుత్వం ఇంకా పరిష్కారం చూపలేదు. ఈ భూములలో రైతులకు ప్లాట్లు కేటాయించడం, రిజిస్ట్రేషన్లు కల్పించడం జరగలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు పరిష్కారాలు అడుగుతున్నారు. దీంతో కోర్టుకెళ్లమని అధికారులు సూచించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు అభివృద్ధి చెందిన భూములను కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

మూసీ గేట్టు ఎత్తివేత...

హైదరాబాద్ : వరదనీరు భారీగా రావడంతో మూసీలో నీటి మట్టం 644.8 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645గా అడుగులుగా ఉంది. గరిష్టస్థాయికి నీరు చేరడంతో మూడు ఫీట్ల మేర ఐదు గేట్లను ఎత్తివేశారు.

11:13 - October 3, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో పెద్దపెద్ద శబ్దాల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక రోడ్లైతే చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పలుకాలనీల్లో అంధకారం ఏర్పడింది. చైతన్యపురి కాలనీ చెరువును తలపిస్తోంది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. చైతన్యపురిలో వివేకానందనగర్ లో కాలనీల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సరూర్ నగర్ చెరువు నుండి నీరు ఇక్కడకు చేరుకుందని, ఇక్కడ నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది పర్కొన్నారు. గుడి మల్కాపూర్ లోని ఓ ప్రాంతంలో కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:04 - October 3, 2017

నల్గొండ : యాదాద్రి జిల్లాలో మూసీ నదికి వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున్న వస్తున్న వరదనీటితో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. వరదనీరు భారీగా రావడంతో మూసీలో నీటి మట్టం 644.8 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645గా అడుగులుగా ఉంది. గరిష్టస్థాయికి నీరు చేరడంతో మూడు ఫీట్ల మేర ఐదు గేట్లను ఎత్తివేశారు. దీనితో పోచంపల్లి, భీమనపల్లి తదితర గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి.

 

10:56 - October 3, 2017

తెలుగు ఆడియన్స్ కి మాస్ సినిమాలను ఇచ్చిన కమర్షియల్ డైరెక్టర్ మరో సినిమా తో రాబోతున్నాడు. మెగా ఫామిలీ హీరోతో పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్ మరో చిత్రంతో ముందుకు రాబోతున్నారు. పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చెయ్యడం లో వి వి వినాయక్ స్పెసలిస్ట్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ ట్రెండ్ లో ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోల తాకిడి తట్టుకోవాలి అంటే డిఫెరెంట్ స్టోరీ లను ఎంచుకోవాలనుకున్న థాట్ తో ప్లానింగ్ తో వెళ్తున్నారు సీనియర్స్. మరి సేనియర్స్ ని డైరెక్ట్ చేసి హిట్ ఇచ్చేది మాత్రం సీనియర్ డైరెక్టర్స్ ఏ అనడంలో సందేహం లేదు అంటున్నారు ఫిలిం వర్గాలు. తమిళ్ సినిమా 'కత్తి'కి రీమేక్ గా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150’ కి చిరు ఫాన్స్ కలక్షన్స్ తో వెల్కమ్ చెప్పారు.

ఆఫ్టర్ లాంగ్ టైం అయినా 'చిరు'లో గ్రేస్ తగ్గలేదని అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఇంతకు ముందులా సంవత్సరానికి ఒక సినిమా తియ్యకుండా ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు మెగాస్టార్. ది బెస్ట్ కలెక్షన్ ఇచ్చిన ఈ సినిమా కి డైరెక్షన్ చేసింది వి వి వినాయక్. మాస్ కి నచ్చే అంశాలను బాగా ప్రెజెంట్ చేసే ఈ డైరెక్టర్ టాలీవుడ్ కి మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. ఈ ఇయర్ వి వి వినాయక్ 'ఖైదీ నంబర్ 150'తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.

కెరీర్ మొదట్లోనే కొంచెం తడబడ్డ మెగాహీరో 'సాయి ధరమ్ తేజ్' ఆ తర్వాత వరుస విజయాలతో మెగా ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యడు. 'విన్నర్' సినిమా ఫ్లాప్ అవ్వడంతో 'కృష్ణ వంశి' సినిమా 'నక్షత్రం' మీద హోప్స్ పెట్టుకొని అది కూడా ఆడియన్స్ ని రీచ్ అవ్వకపోవడం తో సెలెక్టెడ్ గాసినిమాలు చేస్తున్నాడు 'సాయి ధరమ్ తేజ్'. అయితే ప్రెజెంట్ సాయి ధరమ్ తేజ్ సినిమా 'జవాన్' విడుదల అవ్వకముందే వి వి వినాయక్ సినిమాని ఒకే చేశాడు.

రీసెంట్ గా వి వి వినాయక్ డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా రెడీ అవుతుంది. ఆ చిత్రం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. మొన్నటి వరకు సినిమాకి సంబందించిన టైటిల్ విషయంలో తడబడ్డా చిత్ర యూనిట్ మొత్తానికి 'ఇంటిలిజెంట్' అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. అలాగే హీరోయిన్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. దీంతో దానికి కూడా చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. 'ఇంటిలిజెంట్' బాబుకు జోడీగా అందాల రాక్షసి 'లావణ్య త్రిపాఠి'ని ఫైనల్ చేశారు.

10:47 - October 3, 2017

హైదరాబాద్‌ : నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి బంజారాహిల్స్‌లో ఇద్దరు చనిపోయారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని నాయుడునగర్‌లో గుడిసె భూమిలోకి కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గుడిసెలో ఉన్న తండ్రీ కొడుకు చనిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఇక పాతబస్తీలో విద్యుత్‌ తీగలు తెగిపడి ఓ యువకుడు చనిపోయాడు. గుడి మల్కాపూర్ లో రోడ్లపై ఉన్న నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ లోకి నీరు చేరింది. వర్షపు నీరు రావడంతో చాలా ఇబ్బందులు పడ్డామని అపార్ట్ మెంట్ వాసి పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ టెన్ టివితో మాట్లాడారు.
అలాగే చైతన్యపురిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:40 - October 3, 2017

వర్షానికి ఐదుగురు మృతి...

హైదరాబాద్ : దారుస్సలాలంలో వర్షానికి పురాతన ఇళ్లు కూలింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో మట్టిగోడ కూలి ఇద్దరు మృతి చెందారు. నాయుడు నగర్ లో దోభిఘాట్ లో మట్టి గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. హుస్సేనిఆలం మురిగి చౌక్ లో విద్యుత్ తెగలు తెగిపడి ఒకరు మృతి చెందారు.

శ్రీశైలం రిజర్వాయర్ కు వరద..

కర్నూలు : శ్రీశైలం రిజర్వాయర్ కు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఇన్ ప్లో 76,754గా ఉండగా ఔట్ ఫ్లో 14,825 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్తాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.

నీట మునిగిన కోదండరాం నగర్ కాలనీ..

హైదరాబాద్ : సరూర్ నగర్ లో కోదండరాంనగర్ కాలనీ నీట మునిగింది. కాలనీల్లోకి భారీగా నురగ చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

గచ్చిబౌలిలో స్తంభించిన ట్రాఫిక్...

హైదరాబాద్ : గచ్చిబౌలిలో ఇంకా ట్రాఫిక్ కుదుటపడలేదు. బయోడైవర్సిటీ జంక్షన్, మాదాపూర్ శిల్పారామం ముందు మైండ్ స్పేస్ చౌరస్తా, మియాపూర్ దీప్తీశ్రీనగర్, లింగంపల్లి రైల్వే బ్రిడ్జీ ప్రధాన రహదారులపైకి నీరు చేరింది. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

అల్లంతోట బావిలో ఇళ్లల్లో వర్షపు నీరు..

హైదరాబాద్ : బేగంపేట మయూర్ మార్గ్ అల్లంతోట బావిలో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బేగంపేట రసూల్ పురంలో వర్షానికి చెట్టు నేల కూలింది.

ఓయూలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు..

హైదరాబాద్ : ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోయింది. దీనితో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.

రెండు ఆర్టీసీ బస్సుల ఢీ..

చిత్తూరు : చంద్రగిరి (మం) కొంగరవారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.

10:27 - October 3, 2017

ఖమ్మం : సింగరేణి ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. టీజీబీకేఎస్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరి రోజున గనుల్లో ప్రచారం నిర్వహించేందుకు పోటీ చేస్తున్న సంఘాలు సిద్ధమయ్యాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రచారం నిర్వహించేందుకు సీఐటీయూ నేతలకు సింగరేణి అధికారులు అనుమతిని నిరాకరించారు. మరో వైపు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ కవిత ప్రచారం నిమిత్తం కొత్తగూడెంకు చేరుకున్నారు. ఎంపీ కవిత, పొంగులేటి, పల్లా, జలగంలను అనుమతించారు. దీనిపై సీఐటీయూ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

10:19 - October 3, 2017

కూలిన నాలా ప్రహారీగోడ..

హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వరద ఉధృతికి గుడి మల్కాపూర్ నాలా ప్రహారీగోడ కూలిపోయింది.

09:32 - October 3, 2017

హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వరద ఉధృతికి గుడి మల్కాపూర్ నాలా ప్రహారీగోడ కూలిపోయింది. దీనితో సమీప కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడకు చేరుకుని చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితి ఇక్కడ భయానకంగా ఉందని జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. నాలా ప్రహారీగోడ వెనుక వైపున పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, నాలా ప్రహారీగోడ కూలిపోవడంతో వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మార్కెట్ మొత్తం జలమయమయ్యాయని, వ్యాపారులు..కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:30 - October 3, 2017

నెల్లూరు : జిల్లాలో రోట్టెల పండుగ మూడో రోజుకు చేరుకుంది. బారా షాహీద్ దర్గాలో సోమవారం రాత్రి గంధమహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కోటమిట్టలోని అమీనియా మసీదులో 12 మంది మత పెద్దలు 12 బిందెల్లో గంధం కలిపారు. అనంతరం మేళతాళాల మధ్య ఆ బిందెలను దర్గాకు తీసుకొచ్చారు. కడప పీఠాధిపతి 12 సమాధులకు గంధాన్ని లేపనం చేసి ప్రార్థనలు చేశారు. ఈ గంధ మహోత్సవంలో మంత్రి నారాయణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

09:23 - October 3, 2017

విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం..విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పైడి తల్లి జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్ల సంబరం ముగిసింది. నేడు ప్రధాన ఘట్టానికి తెరలేచింది. పైడి తల్లి సిరిమాను ఉత్సవం జరుగుబోతోంది. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమానోత్సవం జరుగనుంది. అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సిరిమానోత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భానురాజ టెన్ టివికి తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

09:14 - October 3, 2017

టాలీవుడ్ లో సీన్ మారుతుంది. ఇంతకుముందు హీరోని చూసి సినిమాకి వచ్చే ఆడియన్సు ఇప్పుడు డైరెక్టర్ నేమ్ చూసి వస్తున్నారు. సినిమా అంటే హీరో మాత్రమే కాదు కదా ..డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ నేమ్ చూసి చెప్పేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ఎప్పుడు హిట్ టాక్ తో దూసుకెళ్తాయి. అలానే ఇప్పుడు ఒక టాప్ డైరెక్టర్ ఒక టాప్ హీరో కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఇంటరెస్ట్ మొత్తం వాళ్ళమీదనే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పేరుతో ఇండస్ట్రీ హిట్ రికార్డుకి మంచి పరిచయం ఉంది. తన సినిమాల్లో ప్రతి సీన్ లో పంచ్ డైలాగ్స్ ఉండాలి అని ఏర్చి కూర్చి పంచ్ డైలాగ్స్ పెట్టె ఈ స్టార్ డైరెక్టర్ 'అత్తారింటికి దారేది' సినిమాతో మెగా హీరో 'పవన్ కళ్యాణ్' కి హిట్ ఇచ్చాడు. ఒక నార్మల్ స్టోరీ 'అత్తారింటికి దారేది' సినిమా గా మారి హిట్ టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ కురిపించింది.

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో 'ఎన్ టి ఆర్' ఒకడు. ఎన్ టి ఆర్ రీసెంట్ సినిమా 'జై లవ కుశ’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాబీ డైరెక్షన్ లో కొంత గాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ జై లవ కుశ సినిమా. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసే ఎన్ టి ఆర్ నటించిన జై లవ కుశ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఎన్ టి ఆర్ నటనే మేజర్ ఎసెట్ అని డైరెక్టర్ బాబీ చాల సంధర్భాల్లో చెప్పాడు కూడా. ఈ జై లవ కుశ సినిమాలో ఉన్న మూడు హీరో పాత్రలను ఎన్ టి ఆర్ పోషించడం సినిమాకి ఇంటరెస్టింగ్ పాయింట్ అయింది. నటుడిగా ఎన్ టి ఆర్ వేరియేషన్స్ చూపించడం లో ఎప్పుడు ముందే ఉంటాడు.

'
కాటం రాయుడు' సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'పవన్ కళ్యాణ్' 25వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో తండ్రి – కొడుకులు సెంటిమెంట్ మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో పవన్ – త్రివిక్రమ్ లు కలిసి చేసిన 'అత్తారింటికి దారేది' అత్తా – మేనల్లుళ్ళ అనుబంధం ప్రధాన అంశంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 'కాటం రాయుడు' సినిమా కూడా అన్న తమ్ముల సెంటిమెంట్ తో అల్లుకున్న కధే. అలానే ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్ టి ఆర్ సినిమా చెయ్యబోతున్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. 'నాన్నకు ప్రేమతో' వంటి క్లాస్ సినిమాల్లో నటించిన ఎన్ టి ఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాకి న్యాయం చేస్తాడు అనే టాక్ కూడా ఉంది.

09:08 - October 3, 2017

హైదరాబాద్ : సోమవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. డ్రైనేజీల్లో ఉన్న మురికి అంతా రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. బేగంబజార్ పీఎస్ పక్కనే ఉన్న రోడ్డు బురదతో నిండిపోయింది. అధికారులు చేరుకుని బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

వర్కర్స్ తో బురద అంతా తీయించడం జరుగుతోందని, ఈ రోడ్డు పక్కనే ఉన్న దుకాణ యజమానులు చేసిన నిర్వాకంతో ఈ పరిస్థితి నెలకొందని జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్ హేమలత పేర్కొన్నారు. ప్రతి మ్యాన్ హోల్ దగ్గర వర్కర్స్ ని పెట్టి సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తామని, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చూస్తామన్నారు.

09:01 - October 3, 2017

కొత్త హీరోలు చాల జాగర్తగా స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. హిట్ ఆర్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరైన నటుడు తన రీసెంట్ సినిమా టైటిల్ తో టీజర్ తో అదరగొట్టాడు. కథ ఏదైనా తన పాత్రకి న్యాయం చేశామా లేదా అని ఆలోచించే ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్నాడు. హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో 'నారా రోహిత్’. సొసైటీ కి యూజ్ అయ్యే కథతో 'ప్రతినిధి' సినిమాలో నటించి వైవిధ్యాన్ని చూపించాడు. తాను ఎన్నుకున్న కధల్లో బలం ఉందా లేదా అనేది మాత్రమే చూసే హీరో 'నారా రోహిత్'..అందుకే ఇంత తక్కువ టైం లో అన్ని సినిమాలు చేయగలిగాడు. ప్రజా సమష్యలను ఎదుర్కొంటు ప్రశ్నించే ఒక కామన్ మాన్ రోల్ లో నటించి 'ప్రతినిధి' సినిమాతో మెప్పించాడు రోహిత్. ఆ తరువాత కూడా వైవిధ్యం ఉన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు రోహిత్.

'సోలో' లాంటి లవ్ స్టోరీ లో నటించి తాను అన్ని రకాల పాత్రలను చెయ్యగలను అని ప్రూవ్ చేసాడు 'నారా రోహిత్'. లవ్ స్టోరీ లో సెంటిమెంట్ స్టోరీ ని మిక్స్ చేసి తీసిన 'సోలో' సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది. మల్టి స్టారర్ సినిమాలు చేస్తూనే 'నారా రోహిత్' మరో సినిమా అనౌన్స్ చేసాడు. 'నాగశౌర్య' కాంబినేషన్ లో 'నారా రోహిత్' నటించిన 'కథలో రాజకుమారి' సినిమా ఆశించినంతగా ఆడియన్స్ ని రీచ్ అవ్వలేదు. అలానే ఇంతకు ముందు ఇంకో ముగ్గురు హీరోలతో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ 'శమంతకమణి'ని కూడా నారా రోహిత్ కి పర్ఫెక్ట్ హిట్ ఇవ్వలేకపోయింది.

'రోహిత్' తన కొత్త సినిమా 'బాలకృష్ణుడు’ పోస్టర్ తో షాకిచ్చాడు. ఈ సినిమా పోస్టర్ ను చూడగానే అసలు మనం 'రోహిత్' నే చూస్తున్నామా అనేంత కొత్తగా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేసాడు. టీజర్ చూస్తుంటే మాత్రం కొత్తగా ఏమి ట్రై చెయ్యలేదు అనే డౌట్ కామన్ ఆడియన్స్ కి వస్తుంది అట. ఆల్రెడీ లవ్ సబ్జెక్టు విత్ ఎంటర్టైన్మెంట్ అని స్పష్టంగా కనిపిస్తున్న ఈ సినిమాలో 'రమ్యకృష్ణ' ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. కొత్త దర్శకుడు పవన్ మల్లెల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

08:54 - October 3, 2017

డిజిటల్ యుగం పెరిగింది. సినిమాలు థియేటర్స్ నుండి ఇంటర్నెట్ కి పయనం కట్టాయి. డిజిటల్ రెవెల్యూషన్ పెరుగుతున్న ఈ ట్రెండ్ లో యూ ట్యూబ్ హావా నడుస్తుంది. రీసెంట్ గా సినిమా నటులు కూడా వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టారు. సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ కూడా రీసెంట్ గా వెబ్ సీరీస్ మీద ఫోకస్ పెడుతున్నారు. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు 'తేజ’, తాజాగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పొలిటికల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమా మంచి కలక్షన్స్ తో హిట్ ట్రాక్ తెచ్చుకుంది. 'రానా' హీరోగా పవర్ఫుల్ పొలిటిషన్ రోల్ లో నటించిన ఈ సినిమాలో 'తేజ' స్కూల్ హీరోయిన్ 'కాజల్ అగర్వాల్' నటించింది. డైరెక్టర్ గా మల్లి తన సత్త చాటాడు డైరెక్టర్ తేజ.ఈ సినిమా హిట్ అవ్వడానికి డైలాగ్స్ కూడా మెయిన్ రీజన్ అని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో జోగేంద్ర పాత్రలో నటించి మెప్పించాడు రానా. ప్రస్తుతం సోషల్ అనే ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

'రఘువరన్ బీటెక్' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైన 'ధనుష్' వెబ్ సీరీస్ కి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో ఓ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ధనుష్ చెప్పేశాడు. అలానే 'ఆలా మొదలయింది' సినిమాతో క్లాస్ డైరెక్టర్ బ్రాండ్ తో వచ్చిన నందిని రెడ్డి రీసెంట్ గా వెబ్ సిరీస్ పోస్టర్ విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ కి 'నేనే రాజు నేనే మంత్రి' మాటల రచయిత లక్ష్మి భూపాల డైలాగ్ రైటర్ గా ఉన్నాడు.

08:49 - October 3, 2017

తెలుగు ఇండస్ట్రీకి ఈ పండగ సీజన్ కలిసి రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. పండగ హాలిడేస్ అన్ని టివి ప్రోగ్రామ్స్ తో నిండిపోతే కొత్తగా వచ్చిన సినిమాలు మిక్స్డ్ టాక్ తో ఆడుతున్నాయి. ఇది ఇలా ఉంటె రీసెంట్ గా రైన్ అటెక్ మరో కోణం చూపించింది ..సినిమాల మీద నేచర్ కూడా పగపట్టింది అనుకుంట. పండగ సీజేన్ ని క్యాష్ చేసుకోవడానికి వచ్చిన యాక్షన్ సినిమా 'స్పైడర్' . .మురుగదాస్ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ 'స్పైడర్' సినిమా మహేష్ బాబు ని 'స్పై' గా చూపించింది. ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేసే 'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి 'మహేష్' నటనతో పాటు టెక్నికల్ వాల్యూస్ కూడా ఆడ్ అయ్యాయి. డైరెక్టర్ మురుగదాస్ 'స్పైడర్' సినిమాను యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇంటరెస్టింగ్ వే లో స్టోరీ నేరేషన్ ప్లాన్ చేసాడు. ఓపెనింగ్స్ బాగున్నా ఈ సినిమా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఈ పండక్కి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి 'ఎన్ టి ఆర్' కూడా వచ్చాడు. మాస్ ని ఆకట్టుకోవడం లో 'ఎన్ టి ఆర్' ఎప్పుడు ముందే ఉంటాడు. టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో 'ఎన్ టి ఆర్' ఒకడు. రీసెంట్ సినిమా 'జై లవ కుశ’. బాబీ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ 'జై లవ కుశ' సినిమా. ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేసే 'ఎన్ టి ఆర్' నటించిన 'జై లవ కుశ' సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాకి ఎన్ టి ఆర్ నటనే మేజర్ ఎసెట్ అని డైరెక్టర్ బాబీ చాల సంధర్భాల్లో చెప్పాడు కూడా. ఈ జై లవ కుశ సినిమా లో ఉన్న మూడు హీరో పాత్రలను ఎన్ టి ఆర్ పోషించడం సినిమాకి ఇంటరెస్టింగ్ పాయింట్ అయింది. నటుడిగా ఎన్ టి ఆర్ వేరియేషన్స్ చూపించడంలో ఎప్పుడు ముందే ఉంటాడు.

ఈ పండగ సీజేన్ లో కామెడీ టచ్ తో వచ్చిన 'శర్వానంద్' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. శుభ్రంగా ఉండటం తప్పు లేదు..ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం కూడా..కానీ శుభ్రత మించి అతి శుభ్రంగా తయారైతే ఎలా ఉంటుంది అనే కథతో వచ్చిన సినిమా 'మహానుభావుడు’. మారుతీ డైరెక్షన్ లో కొంత గ్యాప్ తరువాత వచ్చిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ 'మహానుభావుడు' సినిమా. అతి శుభ్రం అనే డిస్ ఆర్డర్ ని కథలో చేర్చి చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఈ 'మహానుభావుడు’. ఇది ఒక మలయాళ సినిమాకి కాపీ అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారట.

మొత్తానికి దసరా సీజన్ గ్రాండ్ గా మొదలై.. గ్రాండ్ గానే ముగుస్తోంది. గాంధీ జయంతి సెలవు కలసి రావడంతో అక్టోబర్ 2ను కూడా కలుపుకుని వరుస సెలవలు రావడంతో పెద్ద సినిమాలు అన్ని మంచి కలక్షన్స్ రాబట్టుతున్నాయి. ఇప్పుడు సెలవలన్నీ అయిపోయాయ్ కాబట్టి..వర్కింగ్ డేస్ లో వసూళ్ళు రాబట్టడం అంత ఈజీ కాదు. కలక్షన్స్ రాబట్టడం లో మరి ఈ పెద్ద హీరోలు ఎం చేస్తారో చూడాలి.

రాజ్ నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11.30గంటలకు జరిగే ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు.

 

ఎయిర్ పోర్టు రోడ్డు మూసివేత..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ ఎయిర్ పోర్టు రోడ్డును భద్రతా అధికారులు మూసివేశారు. కాసేపటి క్రితం శ్రీనగర్ 182 బీఎస్ఎఫ్ బెటాలియన్స్ పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు, భారత బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

రాజస్థాన్ లో నలుగురు మృతి..

రాజస్థాన్ : అల్వార్ శివాజీ పార్కు వద్దనున్న ఓ ఇంటిలో నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక వ్యక్తి, నలుగురు పిల్లలున్నారు.

08:27 - October 3, 2017

ఎన్కట రామాయణంల రాముడు శివధనస్సును ఇశిండంటే.. మళ్ల ఇప్పుడే ఇశిరేశిండు నరేంద్రమోడీ..? ఆయననేమో భార్యకోసం ఇరగొడ్తె.. ఈన విల్లును ఎక్వతక్వ గుంజి ఇరగొట్టిండు... ఒక్క ముచ్చట జెప్పాల్నంటే మోడీ ఇజ్జత్ కచరా అయ్యింది సోషల్ మీడియాల.. పాపం దసర పండుగ వేడుకల స్టేజీమీద యాభై రెండించుల చాతి ఖ్యాతి గంగల గల్చింది..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

08:24 - October 3, 2017

వారెవ్వ భళే ఉన్నవ్ కోదండరాం సారూ నువ్వు..? జనగామా ఎమ్మెల్యే మీద ముఖ్యమంత్రి గారు చర్యలు దీస్కోవాల్నా..? సింగరేణి ఎన్నికలళ్ల టీఆర్ఎస్ పార్టీ సంఘం పరిస్థితి ఆగానికొచ్చినట్టేనా..? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా..? డిపాజిట్ రాదని తెల్సినా..? పబ్లీకుల మాత్రం.. గెల్పు నాదే.. ఎంతైనా మన దత్తన్న అలయ్ బలాయ్ లేకపోతె దస్రపండుగ పూర్తైనట్టుండదిగదా..? అయ్యో పాపం మోత్కుపల్లి నర్సింహులు సారును జూస్తుంటె అభిమానులకు గుండె తరుక్కపోతుండొచ్చు..ఎన్కట రామాయణంల రాముడు శివధనస్సును ఇశిండంటే.. మళ్ల ఇప్పుడే ఇశిరేశిండు నరేంద్రమోడీ.. ప్రాంతేతరుడు మోసం జేస్తె ప్రాంతం పొలిమేర్లు దాటెదాక తర్ముండ్రి.. మేరా నాం తేడా..? తేడా సింగ్.. ధిమాక్ తోడా..? అని మన నందమూరి బాలికాకయ్య డైలాగులున్నయ్ గదా..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

హిమాచల్ కు మోడీ...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్నారు. బిలాస్ పూర్ లో ఏఐఐఎంఎస్ మరియు ఐఐటీలకు శంకుస్థాపన చేయనున్నారు. సేల్ ప్రాసెసింగ్ యూనిట్ ను మోడీ ప్రారంభించనున్నారు.

08:12 - October 3, 2017
08:10 - October 3, 2017

హైదరాబాద్ : నగరంలో ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. నగరంలో రోడ్లు చెరువులను తలపించాయి. భారీగా వదర నీరు రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక మొజంజాహి మార్కెట్ లో వర్షం బీభత్సం సృష్టించింది. హోల్ సేల్ మార్కెట్ కు ప్రసిద్ధి గాంచిన ఈ మార్కెట్ లోని దుకాణాల్లోకి వరదనీరు పోటెత్తింది. నడుంలోతు నీళ్లు రావడంతో దుకాణంలో ఉన్న సామాగ్రీ నీటితో తడిసిపోయాయి. నీట మునగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

స్కూళ్లకు..కాలేజీలకు సెలవులు..

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కారణంగా నేడు స్కూళ్లు..కాలేజీలు మూతపడనున్నాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.

07:30 - October 3, 2017

పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), దిలీప్ భైరవ (సామాజిక విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:26 - October 3, 2017

కవితకేదీ కాదు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు ప్రైవేటీకరణకేదీ కాదు అనర్హం అంటారు మన ఏపీ సీమ్‌ చంద్రబాబుగారు. ప్రస్తుతం ఏపీ సర్కారు 19 ప్రాజెక్టులతో 31 వేల ఎకరాల పరిధిలో కంపెనీ వ్యవసాయానికి ప్లాన్‌ చేస్తుంది. దీనికి 24 వేల 500 మంది రైతులను సమీకరించబోతుంది. మరి కంపెనీ వ్యవసాయం రైతులకు మేలు చేస్తుందా, లేక కీడు చేస్తుందా? ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేశవ్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:23 - October 3, 2017

లాస్ వెగాస్ : అమెరికాలో కాల్పులు మరోసారి బీభత్సం సృష్టించాయి. లాస్‌వెగాస్‌లోని మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 58 మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండగుడు అమెరికన్‌ పౌరుడు స్టీఫెన్‌ ఫెడాక్‌గా గుర్తించారు. స్టీఫెన్ ఉన్మాదంతో కాల్పులు జరిపాడా...? లేక ఉగ్రవాద సంబంధాలేమైన ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకు సంగీత సాగరంలో ఓలలాడుతున్న అభిమానులు కాల్పులతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మరికొందరు కాల్పుల నుంచి తప్పించుకోవడానికి నేలపైన వాలిపోయారు. సాయుధుడైన దుండగుడు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 58 మందికి పైగా మృతి చెందారు. మరో ఐదు వందలమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలపైకి కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని 64 ఏళ్ల స్టీఫెన్‌ ఫెడాక్‌గా గుర్తించారు. స్టీఫెన్‌ అమెరికన్‌ పౌరుడేనని పోలీసులు నిర్ధారించారు. దుండగుడు మాన్‌ డ్లే బే హోటల్‌ లోని 32 వ అంతస్తు నుంచి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. స్టీఫెన్‌కు సహకరించిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇది తమ పనే అంటూ ఐఎస్‌ ప్రకటించడంతో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు ట్రంప్‌ తెలిపారు. అమెరికాలో తుపాకి సంస్కృతి ఇప్పటివరకు ఎంతోమందిని బలి తీసుకుంది. లైసెన్స్‌డ్ తుపాకులపై నియంత్రణ లేకపోవడం వల్ల అక్కడ కాల్పుల ఘటనలు జరగడం సర్వసాధారణంగా మారింది. తాజాగా లాస్‌ వేగాస్‌ ఘటన అమెరికాలో మరింత విషాదాన్ని నింపింది.

07:19 - October 3, 2017

ఢిల్లీ : పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యల సదస్సులో ఆయన మాట్లాడారు. గౌరీ హత్యను సమర్ధిస్తూ సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

గౌరీని ఎవరు చంపారో.. వారి ఐడియాలజీ ఏంటో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కవులు, పాత్రికేయులపై వరుసగా దాడులు జరుగుతున్నా.. ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. అచ్చేదిన్‌ అంటూ పదేపదే చెప్పడం కాదు.. దేశవ్యాప్తంగా లౌకికత్వంపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడి గౌరీలంకేశ్‌ హత్యపై స్పందించాలని, లేదంటే తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ హెచ్చరించారు.

07:16 - October 3, 2017

భూపాలపల్లి : గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలకులు మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూపాలపల్లిజిల్లా వెంకటాపూర్‌ మండలంలో పాలెం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఇరిగేషన్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

07:13 - October 3, 2017

ఖమ్మం : జిల్లాలో పాలేరు పాత కాల్వ... కొత్త కాలువగా జీవం పోసుకుంది.. రికార్డ్‌ స్థాయిలో నాలుగు నెలల్లోనే ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు నీటిని విడుదల చేశారు. పాలేరు పాత కాల్వ ప్రాజెక్ట్‌తో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కూసుమంచి మండలంలోని ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 16న పాలేరు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 64 కోట్ల నిధులను మంజూరు చేసింది. 20 నెలల్లో కావాల్సిన ప్రాజెక్ట్‌... నాలుగు నెలల్లోనే ప్రాజెక్ట్‌ సిద్ధమైంది. దీంతో... సోమవారం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాజెక్ట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను, కాంట్రాక్టర్‌ను మంత్రులు అభినందించారు.

పాలేరు పాత కాలువను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని.. మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేవలం నాలుగు నెలలకే ఆధునికీకరణ పనులు పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. ఇక్కడ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌ ఆధునికీకరణ పూర్తి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాలుగు మాసాల్లోనే పనులు పూర్తి చేయడం కొత్త రికార్డ్‌ అని ఆయన అన్నారు. పాత కాలువ ప్రాజెక్ట్‌ నిర్మించి 95 సంవత్సరాలు కావడంతో... ప్రాజెక్ట్ శిథిలాస్థకు చేరుకుంది. కాలువ సామర్థ్యం 250 క్యూసెక్కులైతే, శిథిలావస్థకు చేరడంతో కేవలం రెండు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గండి పడే పరిస్థితి ఉండేది. ఇంజనీరింగ్ అధికారులు, అటు సిబ్బంది, కార్మికులు రేయింబవళ్లు పని చేసి...నాలుగు నెలల్లోనే ప్రాజెక్ట్‌కు జీవం పోశారు. ఈ ఆధునికీకరణతో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు అంది.. రైతుల కష్టాలు తీరనున్నాయి.

07:11 - October 3, 2017

హైదరాబాద్ : మనసులో సంకల్పం ఉంటే.. అసాధ్యం కానిదంటూ లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గొర్రెల పంపిణీ పథకం కింద టార్గెట్‌గా పెట్టుకున్న 84 లక్షల గొర్రెలను ఎక్కడ నుంచి తెచ్చి పంపిణీ చేస్తారని తమను ఎద్దేవా చేశారని...ఇప్పటికే..ఇంత పెద్ద ఎత్తున పంపిణీ జరగడం వారికి ఒక సమాధానమని సీఎం అన్నారు. ప్రగతి భవన్‌లో గొల్ల-కురుమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కురుమల సమావేశానికి వచ్చిన అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ప్రగతి భవన్‌లో... సీఎం కేసీఆర్‌ను కలిశారు. గొల్ల-కురుమలకు ప్రభుత్వం చేపట్టిన పథకం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. తమ కమ్యూనిటీకి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మద్దతు ఇస్తున్నట్టు ... ఇది చాలా గొప్ప విషయంగా తాము భావిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాల గురించి కేసీఆర్ వివరించారు. గొర్రెల కాపరుల కమ్యూనిటీనే తమ అసలు సిసలైన మానవ నవరులనీ అందుకే వారి అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని .. వారితో అన్నారు. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అఖిల భారత షఫర్డ్‌ కమ్యూనిటీ సభలు జరుపుతామని... అప్పటికి ప్రపంచంలోనే అతి ధనవంతమైన కమ్యూనిటీగా తెలంగాణ షఫర్డ్‌ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటుందనీ సీఎం అన్నారు. అలాగే తెలంగాణ రైతులను సంఘటితపరిచే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గొల్ల-కురుమల సంఘం వసతి గృహానికి పది ఎకరాల స్థలం, పది కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేని వెనుకబడిన తరగతుల వారికి శాసన మండలిలో ప్రాతినిథ్యం కలిగించే ఆలోచన ఉందని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కర్నాటక, మహారాష్ట్ర మంత్రులు ఉన్నారు. వారితో పాటు... మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

07:09 - October 3, 2017

గుంటూరు : పోలీసులు నూతన రాజధానిలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఒకటవ పట్టణ మోడల్‌ పోలీసు స్టేషన్‌న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, డీజీపీ నండూరి సాంబశివరావు ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని కేసులను తగ్గించాలన్నారు. మహిళలపై జరిగే చిన్న పాటి నేరాలను సైతం అరికట్టాలని పోలీసులకు సూచించారు. నరసరావుపేటలో రూ. రెండు కోట్ల వ్యయంతో మోడల్‌ పోలీసు స్టేషన్‌ నిర్మించుకోవడం సంతోషంగా ఉందని.. త్వరలో మహిళా పోలీసు స్టేషన్‌తో పాటుగా ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ని ప్రారంభిస్తామని డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు.

07:07 - October 3, 2017

విజయవాడ : 2019 ఎన్నికల్లోగా రాష్ట్రంలోని పేదలందరికీ సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 17.40 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్‌ 2 ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా లక్ష గృహ ప్రవేశాలు చేయించి చరిత్ర సృస్టించింది. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, ప్రపంచ ఆవాస్‌ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో స్వచ్ఛతే సేవ ప్రమాణం చేయించారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించారు. ప్రధాన మంత్రి జవన్‌ జ్యోతి బీమా యోజన పథకం కింద అమలు చేస్తున్న చంద్ర బీమా పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు 47 సామాజిక పెన్షన్లు ఇస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 9,837 గ్రామాల్లో లక్షకు పైగా ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించి చరిత్ర సృష్టించారు. క్రిస్మస్‌, సంక్రాంతికి మరికొన్ని గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించారు. ఈ పథకంలో అవినీతిని సహించబోమని హెచ్చరించిన చంద్రబాబు, ఎవరైనా లంచాలు అడిగితే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసిన ఫిర్యాదు చేయాలని కోరారు. ఇల్లు తరతరాలకు తరగని ఆస్తిగా ఉంటుందని చెప్పారు. పీఎం జేజేబీవై చంద్రన్న బీమా పథకంలో సభ్యులుగా చేరే గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్టు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా... సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలించారు.

07:03 - October 3, 2017

విజయవాడ : ఏపీలో జల మార్గానికి దారి సుగమం అయ్యింది. కృష్ణా, గోదావరి నదులు జలమార్గం అవసరాలకు ప్రయోజనకరంగా మారనున్నాయి. ఈ నదులకు అనుసంధానంగా ఉన్న కాలువలు ఇప్పుడు జలమార్గాలుగా మారబోతున్నాయి. ఇవాళ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జలమార్గాల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో జలరవాణా ప్రాజెక్ట్‌ మొదటి విడతకు నేడు డిజిటల్‌ శిలాఫలకం ఆవిష్కరణ జరుగనుంది. బెజవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 13 జాతీయ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నారు. కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి కేంద్రం 7015 కోట్లు కేటాయించింది.

జల రవాణా మొదటి విడతగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల నుంచి విజయవాడ వరకు అభివృద్ధి చేస్తారు. సుమారు 82 కిలోమీటర్ల మేర డెవలప్‌ చేయనున్నారు. ఏడు టెర్మినల్స్‌ను నిర్మించనున్నారు. సరకు రవాణాతోపాటు ప్రయాణికులను చేరవేసేందుకు జలమార్గం సుగమం కానుంది. వేదాద్రి, అమరావతి, భవానీ ఐలాండ్‌, విజయవాడలోని దుర్గాఘాట్‌లో నిర్మించే టెర్మినల్స్‌ పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయనున్నారు. ఈ నాలుగు టెర్మినల్స్‌ను ప్రయాణీకుల కోసం డెవలప్‌చేస్తారు.

ఇక రెండో విడతలో విజయవాడ నుంచి కాకినాడ వరకు జలమార్గాన్ని అభివృద్ధి చేస్తారు. మొత్తం 233 కిలోమీటర్ల మేర డెవలప్‌ చేయనున్నారు. ఇది విజయవాడ నుంచి మొదలై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గోదావరి కాలువ వరకు వెళ్తుంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మించే ప్రాంతం నుంచి మరోమార్గం ఏలూరు కాలువ వరకు వస్తుంది. ఈ రెండూ కలిపి కాకినాడ పోర్టు వరకు వెళ్తాయి. ఈ మార్గాల్లో ఉన్న కాలువను పూర్తిగా విస్తరించాల్సి ఉంది. ఇందుకోసం 1730 ఎకరాల భూమి అవసరమవుతుందని ఇన్‌ ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అధికారులు గుర్తించారు. రెండో విడతలో భారీగా భూసేకరణ అవసరమవుతున్నప్పటికీ మొదటి విడత మొత్తం నదిలోనే సాగుతుండటంతో ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా పోయింది.

జల రవాణాను అభివృద్ధి చేసే మార్గాల్లో 30లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కోస్టల్‌ కన్సల్టెంట్స్‌ కార్గోరైట్స్‌, ఐఎంఎస్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పనులను దక్కించుకున్నాయి. ఈ మార్గంలో బోట్లు రాకపోకలు సాగించడానికి నదిలోతు కనీసం 2.2 మీటర్లు ఉండాలి. ముక్త్యాల నుంచి విజయవాడ దుర్గాఘాట్‌ వరకు నదిలోని కొన్ని ప్రదేశాల్లో ఇసుక మేటలు వేసి ఉన్నందున వాటిని తొలగించనున్నారు. 82 కిలోమీటర్ల దూరంలో ఎక్కడెక్కడ డ్రెడ్జింగ్‌ చేయాలన్న దానిపై ఈ రెండు కంపెనీలు సర్వే చేస్తాయి. ఆ తర్వాత పనులు ప్రారంభించనున్నాయి.

07:00 - October 3, 2017

విజయవాడ : భారీవర్షం ముంచెత్తింది. చిరుజల్లులుగా మొదలైన వాన భారీవర్షంగా మారడంతో... ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గంటకు పైగా ఏకదాటిగా వర్షం కురవడంతో.. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బీసెంట్ రోడ్, వన్ టౌన్, సింగ్ నగర్, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు కాలువలను తలపించాయి. జోరు వర్షానికి చలిగాలి కూడా తోడవడంతో... ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

06:59 - October 3, 2017

హైదరాబాద్ : వర్షాలు దంచి కొడుతుండడంతో అధికారయంత్రాంగం అలర్ట్‌ అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మాన్‌సూన్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపింది. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్‌ పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. భారీ వర్షం కురుస్తుండడం, రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంటనగరాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండి ఎమర్జెన్సీ టీమ్‌కు సహకరించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

నగరంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీపీతో మాట్లాడారు. అధికారయంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేయాలన్నారు. కూలిన విద్యుత్‌ స్తంభాలను, చెట్లను తొలగిస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందని తెలిపారు.

సీఎం ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మాన్‌ సూన్‌ టీమ్స్‌ ఇప్పటికే రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు. వర్షం కారణంగా ఎవరు ఇబ్బంది పడ్డా జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చని అధికారులు సూచించారు. అత్యవసర సహాయక చర్యలకు జీహెచ్‌ఎంసీ బృందాలను రెడీగా ఉంచినట్టు తెలిపారు.

06:56 - October 3, 2017

హైదరాబాద్ : నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగర ప్రజలు నరకం చూశారు. రోడ్లపై వరదనీరు ఏరులై ప్రవహించింది. ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. బస్తీ, కాలనీ అని తేడాలేకుండా పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు.

భాగ్యనగరంలో పెద్దపెద్ద శబ్దాల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక రోడ్లైతే చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పలుకాలనీల్లో అంధకారం ఏర్పడింది. కొన్నిచోట్ల పార్క్‌ చేసిన వాహనాలు వర్షపునీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్నిచోట్ల వర్షపునీరు బ్రిడ్జిలపై నుంచి ప్రవహించింది.

ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. పలుచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇళ్లలోకి వచ్చిన నీరు రాత్రంతా ఎత్తిపోస్తూనే ఉన్నారు. ఇళ్లలోకే కాదు.. విద్యుత్‌ స్టేషన్లలోకి, పలు షాపింగ్‌ మాల్స్‌లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. మలక్‌పేట్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లోకి వర్షపునీరు వచ్చింది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి బంజారాహిల్స్‌లో ఇద్దరు చనిపోయారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని నాయుడునగర్‌లో గుడిసె భూమిలోకి కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గుడిసెలో ఉన్న తండ్రీ కొడుకు చనిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఇక పాతబస్తీలో విద్యుత్‌ తీగలు తెగిపడి ఓ యువకుడు చనిపోయాడు. హైదరాబాద్‌ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండు రోజుల పాటు నగరంలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారు తెలిపారు.

వర్షానికి ముగ్గురు మృతి..

హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షానికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, ఆపద్బాందు పథకం కింద రూ. 50 వేలు అందిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ ప్రకటించారు.

నలుగురు జవాన్ల వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ 182 బీఎస్ఎఫ్ బెటాలియన్స్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

నేటి నుండి సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నేటి నుండి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

అమరావతికి రానున్న ఉప రాష్ట్రపతి, గడ్కరి..

విజయవాడ : అమరావతిలో నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిలు పర్యటించనున్నారు. గన్నవరంలో ఉదయం 10.10 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్ హెచ్ ప్రాజెక్టు నేషనల్ వాటర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

పోలవరంలో బాబు పర్యటన...

పశ్చిమగోదావరి : పోలవరంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా పట్టిసీమ డెలివరీ పాయింట్ పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.

హైదరాబాద్ లో కుండపోత..

హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. మీరాలంలో అత్యధికంగా 121.8 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్ లో 111.8 మి.మీ., అంబర్ పేటలో 94.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

 

Don't Miss