Activities calendar

04 October 2017

22:11 - October 4, 2017

హర్యానా : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌కు కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా హనీప్రీత్‌ కోర్టులో  కంట తడిపెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... నిర్దోషినని చేతులు జోడించి కోర్టును వేడుకున్నారు. గుర్మీత్‌కు కోర్టు శిక్ష విధించిన తర్వాత హింసను ప్రేరేపించారని హనీప్రీత్‌పై ఆరోపణలున్నాయి.

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు పంచకుల కోర్టులో ప్రవేశపెట్టారు. భారీ భద్రత నడుమ హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకెళ్లారు. హనీప్రీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించాలని పోలీసులు కోర్టును కోరగా....6 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం పంచకులలో అల్లర్లు జరిగిన సమయంలో హనీప్రీత్ వాడిన మొబైల్‌ ఫోను కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హనీప్రీత్‌ కోర్టులో కంట తడి పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.... నిర్దోషినని కోర్టును వేడుకున్నారు. 

38 రోజులుగా కనిపించకుండా పోయిన హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరక్‌పూర్‌ - పటియాలా రోడ్డులో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం పంచకులలోని చండీమందిర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సుమారు 5 గంటలపాటు పోలీసులు ఆమెను విచారించారు. 

పంచకుల హింసాత్మక ఘటనల వెనక ప్రధాన సూత్రధారులెవరని ఆరా తీశారు. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావని పోలీసులు ప్రశ్నించారు. తాను నేపాల్‌కు పారిపోలేదని, పంజాబ్‌లోని బఠిండాలో డేరా భక్తురాలు సుఖ్‌దీప్‌ ఇంట్లో దాక్కున్నట్లు హనీప్రీత్‌ పోలీసుల ముందు వెల్లడించారు.

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో ఆగస్టు 25న గుర్మీత్‌కు పంచకుల సిబిఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు శిక్ష  ప్రకటించగానే పంచకులలో హింస చెలరేగింది.ఈ హింసాత్మక ఘటనల్లో 31 మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. హింసాత్మక ఘటనల వెనక హనీప్రీత్‌, డేరా అనుచరుల హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.


 

22:07 - October 4, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల నవంబర్ 7న తన 63వ పుట్టిన రోజును పురస్కరించుకుని రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్‌హసన్‌ ఇవాళ చెన్నైలో అభిమానులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీపై చర్చించారు. ఈ సందర్భంగా  ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కమల్‌ అభిమానులకు సంకేతలిచ్చినట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ ప్రవేశం చేస్తానని గతంలో కమల్ చెప్పారు. అభిమానులతో సమావేశం అనంతరం కొత్త పార్టీని త్వరగా పెట్టాలని కమల్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని... రాష్ర్టాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్‌హసన్‌ ఇదివరకే ప్రకటించారు.

 

22:05 - October 4, 2017

ఢిల్లీ : కేరళ, ఢిల్లీలలో ఆర్ ఎస్ ఎస్, బీజేపి కార్యకర్తలు సీపీఎం కార్యాలయాలపై దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. దీనిపై ఈనెల 9న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. చరిత్రలో ఎప్పుడు మత ఘర్షణలు జరిగినా దాని వెనుక ఆర్ ఎస్ ఎస్, బీజేపీ హస్తం ఉన్నట్లు న్యాయ విచారణలో తేలిందని ఏచూరి చెప్పారు. కేరళలో వామపక్షాల పార్టీని అధికారం నుంచి కూలగొట్టేందుకు జనరక్షణ యాత్ర పేరుతో బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. 

 

22:01 - October 4, 2017

గుంటూరు : 2018..19 వార్షిక బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ తయారీపై చర్చించారు. 2017-18 బడ్జెట్‌లో ఆయా శాఖలకు జరిపిన కేటాయింపులు, చేసిన ఖర్చులపై సమీక్షించారు. ఇప్పటి వరకు చేసిన వ్యయంపై వివరాలు సేకరించాలని అధికారులను  ఆదేశించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా శాఖలు చేసిన ఖర్చుల ఆధారంగానే వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందని యనమల సూచన ప్రాయంగా తెలియచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిపే అంశంపై అధికారులతో చర్చించారు. ఎన్ టీఆర్ గృహ నిర్మాణ పథకం, కొత్త పెన్షన్‌ మంజూరుకు నిధులు, జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకోవాలని యనమల అధికారులకు సూచించారు. 

 

21:58 - October 4, 2017

గుంటూరు : అన్ని మూహూర్తాలు చూశారు.. పండితుల సలహాలు పాటించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కళ్లు మిరుమిట్లుగొలిపేలా భవనాలు తీర్చిదిద్దారు. అయినా ఆ ఒక్కటి మాత్రం కుదరలేదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే దానికి భయపడి రూటు మార్చేశారు.. ఇంతకీ ఎంటది..?   ప్రభుత్వం, అధికారులు ఎందుకు అంతగా వణికిపోతున్నారు..? వాచ్‌ దిస్‌స్టోరీ..

ఇదిగో వెలగపూడి సచివాలయంలో సీఎం, అధికారులను తెగ భయపెడుతున్నది ఈ గోడలోనే ఉంది.. ఎన్నిసార్లు సరిచేసినా చక్కబడలేదు. ఇపుడు మరోసారి సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సచివాలయానికి పట్టుకున్న వాస్తు దోషం ..కోట్ల రూపాయలు ఖర్చు చేపిన తొలగిపోలేదు. 

ఇప్పటికే కొత్తగా నిర్మించిన పలు కట్టడాలు కూల్చివేసిన అధికారులు ఇపుడు వెలగపూడి సెక్రెటేరియట్‌కు ఉన్న దోషాలను సవరించే పనిని పెట్టుకున్నారు. సచివాలయంలో వాస్తుదోషాలు ఉన్నాయంటూ రెండు నెలల కిందటనే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ రూట్‌ మార్చారు.  సీఎం కోసం ప్రత్యేకంగా ఓ గేటునే ఏర్పాటు చేశారు సీఆర్‌డీఏ అధికారులు. కాని.. ప్రాబ్లం మాత్రం సాల్వ్‌కాలేదు. దీంతో మరోసారి కూలగొట్టే పనిలో అధికారులు బిజీ అయ్యారు. సీఎం బ్లాక్‌కు సమీపంలోకి  గోడను తొలగించి మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు. 

ఇప్పటికే సచివాలయానికి 5గేట్లు ఉండగా తాజాగా 6వ గేటును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కార్యాలయానికి సమీపంలో ఇలా గేటు ఏర్పాటు చేయడం భద్రతా కారణాల కోణంలో కరెక్ట్‌ కాకున్నా.. వాస్తు కోసం తప్పడంలేదని అధికారులు అంటున్నారు. వాస్తవానికి తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం పూర్తయిన తర్వాత  బడ్జెట్‌ సమావేశాల సమయంలో సీఎంతో పాటు, స్పీకర్‌, ప్రతిపక్షనేత, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చేందుకు వేరువేరుగా గేట్లు నిర్మించారు. ఇలా ఇన్ని విధాలుగా ప్రవేశమార్గాలు ఉన్నా..  వాస్తు కుదరలేదంటూ మరో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

అయితే భవనాల నిర్మాణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, పండితులు, ఇంజినీరింగ్‌ నిపుణుల సలహాలతో నిర్మించిన  సచివాలయానికి వాస్తుదోషాలు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాటమాటకీ నిర్మాణాలు పగులగొడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఈ ఆరోగేటు ఏర్పాటుతో అయినా సచివాలయానికి ఉన్న వాస్తుదోషాలు సరి అవుతాయా..! అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. 

 

21:56 - October 4, 2017

ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిపై కొందరు నిరాశను వ్యాపింపజేయడం ద్వారా ఆనందపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. ఐసీఎస్ ఐ గోల్డెన్‌ జుబ్లీ సమావేశంలో మోది ప్రసంగిస్తూ...దేశ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. నోట్ల రద్దు తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయమని మోది తెలిపారు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇపుడు 'నిజాయితీ' శకం ఆరంభమైందని... బ్లాక్‌మనీతో లావాదేవీలు జరిపేందుకు ప్రజలు  ఒకటికి 50 సార్లు ఆలోచిస్తున్నారని మోది చెప్పారు. జిడిపి తగ్గడం ఇపుడు కొత్తేమి కాదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించామని ప్రధాని పేర్కొన్నారు.

 

సీఎం చంద్రబాబుకు బోయపాటి శ్రీను ప్రజెంటేషన్

గుంటూరు : అమరావతి సీఆర్ డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబుకు బోయపాటి శ్రీను ప్రజెంటేషన్ ఇచ్చారు. పవిత్ర సంగమం వద్ద తిరుమలేశుని 3 నామాలు, ఆలయ గోపురం కింది నుంచి గోదావరి నది ప్రవాహం సాగేలా నిర్మాణం. దశావతారం థీమ్ లో ఆలయ శిఖర ఆకృతికి దర్శకుడు బోపాటి రూపకల్పన చేశారు. 

బాధిత విద్యార్థినికి సీఎం చంద్రబాబు అండ

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో అత్యాచారయత్నానికి గురైన విద్యార్థినిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లింది. బాధిత విద్యార్థినికి సీఎం చంద్రబాబు అండ ఇచ్చారు. విద్యార్థిని భవిష్యత్ కోసం బ్యాంకులో రూ.10 లక్షల డిపాజిట్ తోపాటు పక్కా ఇల్లు మంంజూరు చేశారు. బాధితురాలితోపాటు అమె తమ్ముడి చదువుకు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చెప్పారు. 

 

21:34 - October 4, 2017

స్కూల్లో కాల్పులు..థియేటర్ లో కాల్పులు..యూనివర్సిటీ క్యాంపస్ లో కాల్పులు.. మ్యూజిక్ కాన్సర్ట్ లో కాల్పులు ..నడిరోడ్డుపై కాల్పులు..ఎవడు ఎప్పుడు ఎందుకు ఎలా చెలరేగిపోతాడో, ఏ తుపాకీ ఎప్పుడు పేలుతుందో, ఏ వేలు ట్రిగ్గర్ నొక్కుతుందో ఊహించలేరు.. ఫలితం.. తుపాకీ గుళ్లు అమాయకుల దేహాలనుంచి దూసుకెళ్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అమెరికాలో నానాటికి పెరుగుతున్న గన్ కల్చర్ ఆ దేశానికి పులిమీద స్వారీలా తయారవుతోందా? సగటు అమెరికన్ ని అభద్రతలోకి నెడుతోందా? నాగరిక దేశంలో కనిపిస్తున్న ఈ అనాగరిక ఛాయలకు కారణాలేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టో్రీ.. 

మారణాయుధాలనే నమ్ముకున్న అమెరికా చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటోంది. అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు.. ఇప్పుడు జరిగిన లాస్ వెగాస్ ఘటన అమెరికా గన్ కల్చర్ ఫలితాల్ని స్పష్టం చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:28 - October 4, 2017
21:23 - October 4, 2017

సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఈనేపథ్యంలో మల్లన్న బొగ్గుబావిలో పర్యటించారు. గోదావరిఖని ఓపెన్ కాస్ట్ 1 నుంచి బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం..

21:14 - October 4, 2017

ఆకస్మిక వర్షాల వల్ల వచ్చే నష్టాలను అంచనా వేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్త, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్ స్టిట్యూషన్ చైర్మన్ డా.డబ్ల్యుజీ ప్రసన్నకుమార్ అన్నారు. ఆకస్మిక వర్షాలపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్, మేఘాలు కేంద్రీకృతం అవ్వడంతో వర్షలు పడుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం..

 

21:07 - October 4, 2017

ఢిల్లీ : రసాయన శాస్త్రంలో నోబెల్ కమిటీ విజేతలను ప్రకటించింది. జాక్స్ డూబోచెట్, జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ దక్కించుకున్నారు. సొల్యూషన్‌లోని బయోమాలిక్యూల్స్ హై రిజల్యూషన్ స్ట్రక్చర్ నిర్ధారణ కోసం క్రియో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ డెవలప్ చేశారు. ఆటమిక్ త్రీడీ రూపంలో క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా బయోమాలిక్యూల్స్‌ను చూడవచ్చు అని కెమిస్ట్రీ శాస్త్రవేత్త రిచర్డ్ హెండర్సన్ 1990లోనే నిరూపించారు. అయితే ఆ కణాలు అటామిక్ స్థాయిలో కనిపించే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. 

 

21:05 - October 4, 2017

పంజాబ్‌ : పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రైతుల పట్ల తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రాజాసాంసీ ప్రాంత రైతులకు తనవంతు సహాయంగా 17 లక్షల రూపాయలు అందించారు. గత ఏప్రిల్‌ నెలలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా 202 ఎకరాల్లో పంట బుగ్గిపాలైంది. ప్రభుత్వం రైతులకు ఎంత నష్ట పరిహారం చెల్లిస్తుందో అంత పరిహారాన్ని తన జేబు నుంచి ఇస్తానని సిద్ధు ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నష్టపోయిన రైతులకు ఇవాళ చెక్కులను అందజేశారు.

 

21:03 - October 4, 2017

ఉత్తరప్రదేశ్ : కాన్పూర్‌లోని ఓ ఇంట్లో భారీ విస్ఫోటనం సంభవించింది. మహారాజ్‌పుర్‌ సర్‌సౌల్‌లోని రఘునాథ్‌సింగ్‌ ఇంట్లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. భారీ పేలుడుకు చుట్టుపక్కల ఉన్న ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇంటి యజమాని కొడుకు నీరజ్‌తో పాటు మరో మృతదేహాన్ని వెలికి తీశారు.   ప్రమాదస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

20:59 - October 4, 2017

రాజస్థాన్ : భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైతులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమాధిలో కూర్చుని నిరసన తెలిపారు. హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రైతుల నుంచి భూముల సేకరించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందని రైతులు ఆరోపించారు. తమకు తిండిపెట్టే భూములను వదులుకోమని రైతులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రైతుల గోడును అధికారులు పట్టించుకోవడం లేదు. 

 

 

20:57 - October 4, 2017

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో ఆందోళన చేపట్టిన అన్నదాతల పట్ల పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. రైతులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లో వారి దుస్తులు విప్పి దారుణంగా అవమానించారు. ఈ ఘటనపై  బాధిత రైతులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించారు. టీకమ్‌గఢ్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ రైతులు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయాన్ని దిగ్బంధనం చేశారు.  రైతులు ఆందోళన తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీచార్జీ జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. అనంతరం రైతులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  రైతుల దుస్తులు విప్పి చితకబాదారు. పోలీసుల లాఠీచార్జీ కారణంగా 30 మంది రైతులు గాయపడ్డారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విచారణకు ఆదేశించారు.

 

20:54 - October 4, 2017

సిద్దిపేట : గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను తాకాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా 20 గ్రామాలకు మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు హరీశ్. 

సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా గోదావరి జలాలు ప్రవేశించాయి. తపాస్‌ పల్లి రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు గోదావరి జలాలను మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు. 

సిద్దిపేట జిల్లాను గోదావరి జలాలు ముద్దాడటం చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు మంత్రి హరీష్‌రావు. 2001లోనే ఈనీరు రావాల్సి ఉన్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం అడ్డుపడి రానివ్వకుండా చేసిందని ఆరోపించారు. కొండపాక ప్రజలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే.. కెనాల్‌ను కూడా తెచ్చుకున్నారని హరీష్‌రావు అన్నారు. 

అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సైతం సింగూర్ నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చే భాగ్యం కలిగిందన్నారాయన. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు నీరిచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగూరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు హరీష్‌రావు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టు విడుదల పనులు ప్రారంభించే అవకాశం తనకు సీఎం కేసీఆర్ ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. 

ప్రైవేటు వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై కేసు నమోదు

హైదరాబాద్ : ప్రైవేటు వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై అశ్లీల కథనాలు రాస్తున్నారంటూ ఫిర్యాదులో 'మా' సభ్యులు పేర్కొన్నారు. 250 సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై దర్యాప్తు చేపట్టారు. 

 

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు

లక్నో : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు అయింది. జర్నలిస్టు గౌరీలంకేష్ హత్య ఘటనలో ప్రధాని మోదీ తీరును ప్రకాష్ రాజ్ విమర్శించారు. మోదీ తన కంటే గొప్ప నటుడని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. గౌరీలంకేష్ హత్యపై మోదీ స్పందించకుంటే... తన అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ఇటీవలే ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు.

 

20:38 - October 4, 2017

హైదరాబాద్ : ప్రైవేటు వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై అశ్లీల కథనాలు రాస్తున్నారంటూ ఫిర్యాదులో 'మా' సభ్యులు పేర్కొన్నారు. 250 సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్లపై దర్యాప్తు చేపట్టారు. 

 

20:36 - October 4, 2017

ఖమ్మం : సెల్ఫీ సరదా ఇద్దరి యువకుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టింది. ఖమ్మంలోని మున్నేరువాగు దగ్గర సెల్ఫీలు దిగుతుండగా ముగ్గురు నీటిలో పడిపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిలో ఒకరిని స్థానికులు కాపాడారు. ఇద్దరు మాత్రం కనిపించకుండా పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో ఓ బాలిక ఉంది. గల్లంతైనవారు 13 సంవత్సరాల ప్రమోద్‌, 11 సంవత్సరాల పల్లవిగా గుర్తించారు. గల్లంతయిన వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మున్నేరువాగులో పడిపోయిన ముగ్గురు పిల్లలు

ఖమ్మం : సెల్ఫీ సరదా ప్రాణం మీదికి తెచ్చింది. మున్నేరువాగులో ముగ్గురు పిల్లలు పడిపోయారు. నీటిలో పడి ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు కాపాడారు. గల్లంతైనవారికలో ఓ బాలిక ఉంది. గల్లంతైన వారు ప్రమోద్ (13), పల్లవి (11)గా గుర్తించారు. గల్లంతైన వారికోం గాలింపు చర్యలు చేపట్టారు.

 

20:15 - October 4, 2017
20:14 - October 4, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి అశ్వీయిజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. స్వామి వారి ఆలయం తూర్పు రాజగోపురం ఎదురుగా అలివేటి మండపంలో ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు, వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ్‌ రావు తెలిపారు. 

 

20:13 - October 4, 2017

అనంతపురం : గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వాలి...అప్పుడే పుట్టిన చిన్నారులకు మంచి ఆహారం అందాలి..ఈ ఉద్దేశ్యంతో ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటే...వాటిలో కూడా నాణ్యతను పక్కనపెట్టి...పసిపిల్లల నోటికాడి ముద్దను కూడా లాక్కుని కక్కుర్తి పడేవారున్నారు..అందులో ఒకరు అనంత ఆఫీసర్ ....ఆయనే వెంకటనారాయణరెడ్డి...ఐసీడీఎస్‌లో పనిచేస్తూ దొరికింది దండుకున్న ఆయన ఆస్తుల విలువ 50 కోట్లు పై మాటే..
అనంతలో కొనసాగుతున్న ఏసీబీ రైడ్స్...
అవినీతి నిరోధక శాఖ వలకు అనంతపురం జిల్లాలో ఓ అవినీతి తిమింగలం చిక్కింది. పెనుకొండ ఐసీడీఎస్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి ఆస్తులు కూడబెట్టాడని...అవినీతికి పాల్పడ్డాడన్న ఫిర్యాదులున్నాయి..దీంతో నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై దాడులు నిర్వహించారు...అనంతపురం కొవ్వూరు నగర్‌లో ఉన్న నారాయణరెడ్డి ఇంటితో మొదలయిన రైడ్స్‌ ఏకకాలంలో చాలా చోట్ల సోదాలు చేశారు...
బృందాలుగా తనిఖీలు 
ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు...అనంతపురంతో పాటు పెనుకొండ, నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు..అనంతపురం, ధర్మవరంతోపాటు పలు ప్రాంతాల్లో ఏడు భవంతులు, 10 చోట్ల స్థలాలు ఉన్నట్లు తేల్చారు...బంగారు, వెండి వస్తువులు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి పనిచేసే పెనుకొండలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో కూడా సోదాలు చేపట్టారు...
కోడిగుడ్లు, పౌష్టికాహారం టెండర్లలో భారీగా అవినీతి 
ఇక ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న వెంకటనారాయణరెడ్డి తన చేతిలో ఉన్నంత అధికారాన్ని ఉపయోగించుకున్నాడు..దాన్ని అడ్డం పెట్టుకుని చిన్నపిల్లలకు, గర్భిణీలకు అందించాల్సిన కోడిగుడ్లు, పౌష్టికాహారం టెండర్లలో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.. అవినీతి సొమ్మును స్థిరాస్థుల కింద పెట్టుబడి పెట్టాడు...ఇలా కుటుంబీకులతో పాటు దగ్గరి బంధువుల పేరున భారీగా ఆస్తులు కూడబెట్టాడు. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ ఆస్తుల విలువ 50 కోట్లకుపైనే ఉంటుందని అంచనా... బినామీలు ఇంకా ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సి ఉంది..దీన్ని బట్టి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

 

20:11 - October 4, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికై సీపీఐ పోరుబాట చేపట్టింది. అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర తలపెట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ఉధృతంగా పాల్గొందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరత పేరుతో వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేస్తున్నారని మండిపడ్డారు. దళితుల 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూంలు అమలు లేదన్నారు. యువతకు లక్ష ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఊసులోనే లేదన్నారు. సింగరేణిలో ఓట్ల కోసం కేసీఆర్ కోట్లాది రూపాయలు పంచుతున్నారు. పోరుబాట బస్సుయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఎండగడతామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం ప్రజల పక్షమే అని స్పష్టం చేశారు. 

18:56 - October 4, 2017

నెల్లూరు : నాల్గవ రోజు రొట్టెల పండుగలో భాగంగా ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అమర్నాథ్‌, మంత్రి నారాయణ నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాను సందర్శించారు. కులమతాలకు అతీతంగా కోరికలు పంచుకునే రొట్టెల పండుగ చాలా ప్రశస్తమైందని మంత్రి అమర్నాథ్‌ రెడ్డి అన్నారు. ఏపీలో యువకులకు ఉద్యోగాలు రావాలని రొట్టె తీసుకోవడం జరిగిందిన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని రొట్టెను తీసుకున్నానని మంత్రి సోమిరెడ్డి అన్నారు. వైసీపీలో జగన్‌ పక్కన ఉండే మహిళ కోరికలు తీరడంలేదని.. ఆమె రొట్టె వదిలితే బాగుంటుందని ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి మాట్లాడారు. 

 

18:54 - October 4, 2017

కర్నూలు : అమరావతి తరహాలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే పనిగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో కార్పొరేషన్ పార్కులు, వీధి దీపాలు, రోడ్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కేఈ.కృష్ణమూర్తి తెలిపారు. 

18:50 - October 4, 2017

గుంటూరు : ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలవుతోన్న తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో చర్చించారు. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యక్రమం అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై సీఎం ప్రధానంగా చర్చించారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి ఫిర్యాదులపై చర్చించారు. 60 ఏళ్లు దాటిన వికలాంగులకు ఒకే పించన్‌ ఇవ్వడంపై ఫిర్యాదులు వచ్చాయన్న చంద్రబాబు... అర్హులైన వారికి రెండు పించన్లు అందేలా చూస్తామన్నారు. ఎన్ టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్మించిన ఇళ్లకు లక్ష రూపాయల వరకు మంజూరు చేయడంపై సీఎం సానుకూలంగా స్పందించారు. 

 

18:47 - October 4, 2017

విజయనగరం : పైడితల్లి అమ్మవారి ఆలయ ఈవోపై కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి సిరిమాను ఉత్సవంలో సిరిమాను రథం వైసిపి నేత బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు కూర్చున్న డీసీసీబీ వద్ద ఆగడంపై మండిపడ్డారు. ఉత్సవ రథం ఎవరి ప్రోద్భలంతో ఆగిందో ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఈవోను ఆదేశించారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. 

 

18:45 - October 4, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీని వాస్తుదోషాలు వదలడం లేదు. వెలగపూడి సచివాలయం వాస్తుదోషాన్ని సరిచేసేందుకు అధికారులు మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు గేట్లకు అదనంగా 5వ ప్రవేశమార్గాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తుదోషం ఉందంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే రూటు మార్చుకుని సచివాలయంలోకి ప్రవేశిపస్తున్నారు. దీంతో వాస్తుదోషాన్ని సరిచేసేందుకు అధికారులు పనులు మొదలు పెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సిరిమాను రథం ఆగడంపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం

విజయనగరం : పైడి తల్లి అమ్మవారి ఆలయ ఈవోపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు కూర్చున్న డీసీసీబీ వద్ద పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో సిరిమాను రథం ఆగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రథం ఎవరి ప్రోద్భలంతో ఆగిందో నివేదిక ఇవ్వాలని ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై అశోక్ గజపతిరాజు కేసు నమోదు చేయనున్నారు. 

 

వాస్తు సరిచేసేందుకు సచివాలయానికి మరో గేటు ఏర్పాటు

గుంటూరు : వెలగపూడి అసెంబ్లీకి వాస్తు దోషాలు తొలగలేదు. వాస్తును సరిచేసేందుకు సచివాలయానికి మరో గేటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4 గేట్లు ఏర్పాటు చేసినా వాస్తు దోషం తొలగడం లేదు. 5 వ గేటు ఏర్పాటుతో వాస్తు దోషం సరిచేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 

18:02 - October 4, 2017

హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీము రద్దు కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపాదించింది. లక్షా ఇరవై వేల మంది ఉద్యోగులు, ఉపాధాయుల భవిష్యత్‌లో ముడిపడి ఉన్న ఈ అంశంపై అన్ని వైపుల నుంచి సర్కారుపై పోరాటం చేయాలని టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో  తీర్మానించారు.
టీజేఏసీ...రౌండ్‌ టేబుల్‌ సమాశం 
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీముకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమంపై చర్చించేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమాశం జరిగింది. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదికతో పాటు వివిధ సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీము రద్దు, పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణకు చేపట్టాల్సిన  ఐక్య ఉద్యమంపై చర్చించారు. 
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ 
సీపీఎస్‌ రద్దు కోసం అన్ని సంఘాలను కలుపుకుని చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి టీ జేఏసీ ముందుకొచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తలచుకుంటే సీపీఎస్‌ను రద్దు చేయడం పెద్ద సమస్య కాదని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ సంఘాల నేతలు తెలిపారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన పెన్షన్‌ ఫండ్‌ను మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే విధానం వలన కలిగే దుష్పరిణామాలపై చర్చించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు భవిష్యత్‌తో చెలగాటమాడే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని  టీ జేఏసీ డిమాండ్‌ చేసింది. 
అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమించాలి 
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఫండ్‌ను మార్కెట్‌ శక్తులకు దోసిపెట్టే విధానానానికి వ్యతిరేకంగా కలిసివచ్చే అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమించాలని సమావేశంలో తీర్మానించారు. సీపీఎస్‌ రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందచేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. 


 

17:57 - October 4, 2017

వరంగల్‌ అర్బన్‌ : రామన్న పేటలోని బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉద్రిక్తతకు దారి తీసింది. రామన్నపేటలోని కాలనీవాసులు రెండు వర్గాలుగా చీలిపోయి బొడ్రాయి ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఒక వర్గం రాజీవ్‌ చౌక్‌ వద్ద ప్రతిష్టించాలని డిమాండ్‌ చేయగా, యధావిధిగా ప్రతిష్టించాలని మరోవర్గం డిమాండ్‌ చేసింది. ఈ ఉద్రిక్తతలో ఎమ్మెల్సీ కొండా మురళీ జోక్యం చేసుకొని ఇరువర్గాలకు నచ్చ జెప్పారు. 

 

17:53 - October 4, 2017


హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నేతలు విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌, డీజిల్‌పై 2రూపాయల ఎక్సైజ్‌ పన్నును తగ్గించిన కేంద్రం ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు గొప్పలు చెప్పుకుంటోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీరాఘవులు ఎద్దేవా చేశారు. ఇది కంటితుడుపు చర్య మాత్రమే అన్నారు. మోదీ ప్రభుత్వం ఎక్సైజ్‌డ్యూటీని ప్రజలను దోపిడీ చేయడానికి ఓ సాధనంగా ఉపయోగించుకుంటోందని రాఘవులు ఆరోపించారు. వాస్తవానికి  2014 మేలో పెట్రోల్‌పై తొమ్మిదన్నర రూపాయలున్న ఎక్సైజ్‌సుంకం ప్రస్తుతం 21 రూపాయలకు చేరిందన్నారు.  ఇటు రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ తీరును కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సబ్‌ప్లాన్‌లంటూ తెగ ఊరిస్తున్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు సంఘాలు దేశవ్యప్త ఆందోళనకు సిద్ధమవుతున్నాయని రాఘవులు తెలిపారు. వీరి పోరాటానికి సీపీఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. 

 

17:51 - October 4, 2017

సిద్దిపేట : గోదావరి నీళ్లు మొదటిసారి సిద్దిపేట జిల్లాను ముద్దాడాయని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు మంత్రి హరీష్‌రావు . సిద్దిపేట జిల్లా తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమకాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు ఈరోజు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. 2001లోనే కొండపాక మండలానికి 9 వేల ఎకరాలకు నీరు రావాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని హరీష్‌ రావు అన్నారు. ఈరోజు ఆ నీరు కొండపాక మండలాల్లో ప్రవహిస్తోందని తెలిపారు. 

 

17:46 - October 4, 2017

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి గుర్తింపు యూనియన్‌కు గురువారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ శాంతియుతగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొనే కార్మికులు... సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారి సందీప్‌ అన్నారు. పోలింగ్‌ భద్రతా విధుల్లో 70 మంది పోలీసులు ఉన్నారని తెలిపారు.

 

17:36 - October 4, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలకు ఒకరోజు ముందు మంత్రి తుమ్మలకు శిష్యుడు షాక్ ఇచ్చాడు. ట్రైకార్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తాను ట్రైకార్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఉన్న విభేదాల కారణంగా ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రాజీనామాతో.. రేపు ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏపీ సీఎం కోసం సచివాలయంలో మరో కొత్త గేటు

అమరావతి: వెలగపూడి అసెంబ్లీకి తాకిన వాస్తుదోషాలు. వాస్తు కోసం సచివాలయం వైపు మరో గేటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అసెంబ్లీకి 5 గేట్లు వుండగా.. వాస్తు కారణంగా మరో గేటును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం వాస్తు దోషాల కారణంగా సీఎం చంద్రబాబు రూటు మార్చుకుని వస్తున్నారు. దీంతో సీఎం కోసం సచివాలయంలో కొత్తగా గేటు నిర్మాణం చేపట్టారు.

17:10 - October 4, 2017

బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు:ఇద్దరి మృతి

యూపీ: బాణా సంచాతయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి 5 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

పోలవరం నిర్వాసితులతో సీపీఎం నేత మధు భేటీ

తూ.గో: పోలవరం నిర్వాసితులతో సీపీఎం నేత మధు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ...నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మించాలని, లేకుంటే అడ్డుకుంటామని మధు హెచ్చరించారు. నిర్వాసితులకు న్యాయం చేసి ముందుకెళ్తే సహకరిస్తామని తెలిపారు.

16:41 - October 4, 2017

హర్యానా : డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ పై దేశద్రోహం కేసు నమోదు అయింది. డేరా బాబాకు శిక్ష విధించిన రోజు హనీప్రీత్ హింసను ప్రేరేపించారని ఆమెపై కేసు నమోదు చేశారు. నిన్న హనీప్రీత్ ను పోలీసులు అరెస్టు చేశారు. డేరా అల్లర్ల కేసులో హనీప్రీత్ కు 6 రోజుల పోలీస్ కస్టడీకి హర్యానా కోర్టు అనుమతిచ్చింది. పోలీసులు ఆమెను 6 రోజులు కస్టడీకి తీసుకున్నారు. గుర్మీత్ బాబాకు శిక్ష ఖరారు తర్వాత జరిగిన అల్లర్లలో హనీప్రీత్ కు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టులో హనీప్రీత్ కన్నీరు పెట్టుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎస్ బీఐ నూతన ఛైర్మన్ గా రజనీశ్ కుమార్

ఢిల్లీ : ఎస్ బీఐ నూతన ఛైర్మన్ గా రజనీశ్ కుమార్ ఎంపికయ్యారు. మూడేళ్ల పాటు రజనీశ్ కుమార్ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎస్ బీఐలో రజనీశ్ కుమార్ ఎండీగా ఉన్నారు.

 

పెట్రోల్ ధరల తగ్గింపు కంటి తుడుపు చర్యే :రాఘవులు

హైదరాబాద్: పెట్రోల్ ధరల తగ్గింపు కంటి తుడుపు చర్యే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.విరాఘవులు అన్నారు. ఆయన తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనడం తప్పు అని, అలా రాసి ఉండకూదని రాఘవులు తెలిపారు. అంత మాత్రాన చంపుతామనడం సరికాదని, అవసరమైతే ఐలయ్యకు రక్షణ కల్పిస్తామని రాఘవులు స్పష్టం చేశారు.

ట్రైకార్ ఛైర్మన్ పదవికి తాటి రాజీనామా?

ఖమ్మం: ట్రైకార్ ఛైర్మన్ పదవికి తాటి వెంకటేశ్వర్లు రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది. రాజీనామానకు మంత్రి తుమ్మలతో విభేదాలే కారణం అని తెలుస్తోంది.

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

హైదరాబాద్ :రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబుల్ పురస్కారం లభించింది. క్రయో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అభివృద్ధికి కృషి చేసిన జాక్సెస్ డుబోషెట్ (స్విట్జర్లాండ్), జోషిమ్ ఫ్రాంక్ (అమెరికా), రిచర్డ్ హెండర్సన్ (బ్రిటన్) లకు నోబెల్ పురస్కారం లభించింది.

6 రోజుల కస్టడీకి హనీప్రీత్

హర్యానా: డేరా అల్లర్ల కేసులో హనీ ప్రీత్ కు 6 రోజుల పోలీస్ కస్టడీకీ హర్యానా కోర్టు అనుమతిచ్చింది. గుర్మీత్ బాబాకు శిక్ష ఖరారు తర్వాత జరిగిన అల్లర్లలో హనీప్రీత్ కు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలో అల్లర్లకు సంబంధించిన విషయాలతో పాటు, గుర్మీత్ తో సంబంధాలపై హనీప్రీత్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 174 పాయింట్లు లాభపడి 31,671 వద్ద సెన్సెక్స్ ముగియగా, 55 పాయింట్లు లాభపడి 9,914 వద్ద నిప్టీ ముగిసింది.

16:04 - October 4, 2017
15:55 - October 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏకపక్షంగా అప్రజాస్వామికంగా కుటుంబ పరిపాలన జరుగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కొత్త కొత్త వాగ్ధానాలు చేయడం మినహా ఉన్న వాగ్ధానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. మాటలు ఎక్కువ..చేతలు తక్కువ ప్రభుత్వంగా ఉందని..చేతలపైన దృష్టి పెట్టాలని..మాటలు తగ్గించి కొంతైనా మేలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సూచిస్తోందన్నారు. సామాజికంగా అణిచివేయబడిన ఎస్సీ, ఎస్టీల గురించి చెప్పిన మాట ఇంతవరకు అమలు కాలేదన్నారు. ప్రధానంగా మూడెకరాల భూ పంపిణీ జరుగలేదని..చివరకు భూ పంపిణీ జరగలేదని దళిత యువకులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం పంచామని చెబుతోందని కానీ లెక్కలు ఏం చెబుతున్నాయని ప్రశ్నించారు. మొత్తం పది లక్షల కుటుంబాలకు పంచాలని ఉంటే కేవలం రెండు..మూడెకరాలు మాత్రమే ప్రభుత్వం పంచిందని తెలిపారు. ఇందుకు భూమి దొరకడం లేదని ప్రభుత్వం పేర్కొంటోందన్నారు. 

అనుమతి లేని ఆక్వాఫుడ్ కంపెనీలపై చర్యలకు 2 కమిటీలు

అమరావతి: కోస్తా జిల్లాల్లో అనుమతి లేని ఆక్వాఫుడ్ కంపెనీలపై చర్యలకు 2 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి కామినేని ఛైర్మన్ గా 8 మంది అపెక్స్ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఫిసరీస్ కమిషనర్ ఛైర్మన్ గా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటయ్యింది. 20 రోజుల్లోగా కోస్తాలోని 9 జిల్లాల్లో ఆక్వాసాగులో వాడుతున్న రసాయనాలు, యాంటి బయోటెక్స్ పై టాస్క్ ఫోర్స్ కమిటీ సర్వే చేయనుంది. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి అపెక్స్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనుంది.

సుజనా షాపింగ్ మాల్ పై కేసు నమోదు

హైదరాబాద్:  కేంద్ర మంత్రి సుజనా చౌదరి షాపింగ్ మాల్ పై కూకట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. సుజనా మాల్ లో పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని విజయ్ మోహన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 420,188 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

15:49 - October 4, 2017

హైదరాబాద్ : అమెరికా వత్తిడితో ఆర్థిక సంస్కరణల వేగాన్ని మోడీ సర్కార్ పెంచుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను తీవ్ర దుర్భర దుస్థితిలోకి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్..డీజిల్ రేట్లను తగ్గించామని గొప్పలు చెప్పుకోంటోందని...వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదని కొట్టిపారేశారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన అనంతరం పెట్రోల్ 9.30 రూపాయలు మాత్రమే ఎక్జైజ్ డ్యూటీ ఉండేదని అది రూ. 21.50కి పెరిగిందన్నారు. అంటే దాదాపు రూ. 12 ఎక్జైజ్ డ్యూటీ ఈ కాలంలో పెరిగితే దానిని రెండు రూ. 2 తగ్గించి రూ. 10 గుంజుతున్నారని విమర్శించారు. డీజీల్ పై రూ. 3.50 2014లో ఉండేదని..అది ఇప్పటికి రూ. 17.50 పెగిందని వివరించారు. అంటే దాదాపు రూ. 14 ఎక్జైజ్ డ్యూటీ పెరిగితే రూ. 2 మాత్రమే తగ్గించి బాగా తగ్గించామని చెబుతోందన్నారు. ఇదంతా కంటి తుడుపు చర్య అని..ప్రభుత్వం దోపిడి చేస్తూ కేంద్రం జేబుల్లో వేసుకొంటుందో..పాత బకాయితో చెల్లించకపోయినా మూడు నెలల క్రితం ఉన్న ధర రూ. 63 ఉంటుందని ఆశించారని తెలిపారు. కానీ అలాంటిది జరగలేదన్నారు.

భారతదేశానికి అమెరికా కొత్త అంబాసిడర్ ను నామినేట్ చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా కొన్ని లక్ష్యాలు ప్రకటించారని..అందులో భాగంగా మోడీ ప్రభుత్వం సంస్కరణలు చేస్తున్న దానిలో వేగం పెంచాలని...భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామనే లక్ష్యంతో ఆ అంబాసిడర్ ఉన్నారని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయిందన్న ఆందోళనలో ఉంటే..ఈ వేగం ఇంకా పెరగాలని..భారతదేశం పూర్తిగా అథోగతి పాలు కావాలని అమెరికా చూస్తోందన్నారు.

ఇటీవలే కేంద్రం మూడు సంవత్సరాల కార్యాచరణ నివేదికను ప్రవేశపెట్టిందని..అందులో కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టిందన్నారు. 5.7 శాతం ఆర్థికాభివృద్ధి పడిపోయింది కాబట్టి సంస్కరణలు చేయాల్సిన అవశ్యకత ఉందని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పడం ప్రమాదకరమన్నారు. పెద్ద నోట్లు రద్దు..జీఎస్టీ సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఒడిదొడుకులు వచ్చాయని..త్వరలో కొలుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఈ తరుగుదల దీర్ఘాకాలికమైందని ఎస్ బీఐ నివేదిక పేర్కొందన్నారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన దుస్థితిలోకి నెట్టివేస్తోందని, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అందులో భాగంగా బీజేపీ..కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నవంబర్ 9-11 మూడు రోజుల పాటు ఢిల్లీలో పది కార్మిక సంఘాలు కలిసి జరిపే ఆందోళనకు సీపీఎం కేంద్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందన్నారు. 12 డిమాండ్లతో ఈ ఆందోళన జరుగనుందన్నారు. 

15:37 - October 4, 2017

పెద్దపల్లి : సింగరేణి ఎన్నికలను ప్రభుత్వం..టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీబీజీకేఎస్ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పలు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నది తామేనని..ఎవరు ఏమీ అనరు అనుకున్నారో ఏమో గాని ఎన్నికల కోడ్ ను యదేచ్చగా ఉల్లంఘస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగిసిపోయింది.

కానీ అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం ఇంకా ప్రచారం నిర్వహిస్తున్నారని ఇతర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం ఏకంగా జీడీకే 5 ఇంక్లెన్, 11 ఇంక్లెన్ గనుల వద్ద ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించడం గమనార్హం. అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీజీబీకేఎస్ గెలిపించాలంటూ వారు ప్రచారం నిర్వహిస్తున్నారని, వివిధ సంఘాల నేతలు..కార్మికులను టీజీబీకేఎస్ లోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొంటున్నారుర. కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొంటున్నారు. 

బోగస్ అగ్రికల్చర్ కళాశాలపై కొరడా...

అమరావతి: బోగస్ అగ్రికల్చర్ కళాశాలపై చర్యలకు సర్కార్ సిద్ధమైంది. సరైన అనుమతులు, మౌలిక వసతులు లేని అగ్రి కల్చర్ కళాశాలల గుర్తింపునకు ఐదుగురితో కమిటీ వేసినట్లు తెలిపారు. ఆ కమిటీలో సభ్యులుగా ఎన్జీరంగా వర్శిటీ డీన్, ఎంపి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలనే కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

15:34 - October 4, 2017

కేసీఆర్ మాటలు తగ్గించి చేతల్లో చూపించు: తమ్మినేని

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజల సమస్యల పై తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అప్రజాసామవికంగా పాలిస్తున్నారని, కొత్త కొత్త వాగ్ధానాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలు తగ్గించి చేతల్లో చూపించాలని, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని తమ్మినేని విమర్శించారు.

15:32 - October 4, 2017

ముంబై : ప్రస్తుత త్రైమాసినికి క్వార్టర్లీ క్రెడిట్ పాలసీని ఆర్బీఐ ప్రకటించింది. బుధవారం నాడు సమావేశం జరిగింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణ భయాలు..వృద్ధి రేటు మందగించడంతో వడ్డీ రేట్లు తగ్గించడం లేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ప్రస్తుతం రెపో రేటు 6 శాతం రివర్స్ రెపో రేటు 5.7 శాతంగా ఉన్నాయి. ఇండస్ట్రీయల్ గ్రోత్ తగ్గడం వృద్ధి రేటు అంచనాలు కూడా ఆర్బీఐ తగ్గించింది. గత అంచనా వృద్ధి రేటు 7.3 శాతం నుండి 6.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. 

సిరిమాను రథం ఆగటంపై అశోక్ గజపతి ఆగ్రహం..

విజయనగరం: సిరిమాను రథం ఆగటంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను ఆగడంపై దేవస్థానం అధికారులను వివరణ కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని, దేవస్థానం అధికారులకు అశోక్ గజపతిరాజు ఆదేశించారు.

ఆయిల్ ట్యాంకర్ లో గంజాయి పట్టివేత

విజయవాడ: ఆయిల్ ట్యాంకర్ లో గంజాయిని రామవరప్పాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 800 కిలో ల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్నాట్లు డీసీపీ గజారావు భూపాల్ తెలిపారు.

రైతు సమన్వ సమితులను వ్యతిరేకిస్తూ సీఎల్పీ తీర్మానం

హైదరాబాద్: రైతు సమన్వ సమితులను వ్యతిరేకిస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది. సమన్వయ సమితులపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని, టీఆర్ ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్మే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి కడియం భేటీ

హైదరాబాద్: ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ అంశంపై టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి కడియం శ్రీహరి హేటీ అయ్యారు.

15:09 - October 4, 2017

వరంగల్ : జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ పారిశుధ్య కార్మికురాలికి తీవ్రగాయాలయ్యాయి. పరకాల నగర పంచాయతీ ముందు మహిళా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. కమలాపూర్ - హుజురాబాద్ వైపు వెళుతున్న బొగ్గు లారీ ఈమెను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె రోడ్డుపై ఎగిరిపడింది. అక్కడనే పనిచేస్తున్న మరో కార్మికురాలు వెంటనే స్పందించింది. స్థానికుల సహకారంతో తీవ్రగాయాలపాలైన పారిశుధ్య కార్మికురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా నడిపిన లారీ డ్రైవర్ అక్కడనే ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు గాలింపు చేపట్టారు. కమలాపూర్ ఉప్పల్ రైల్వే సిగ్నల్ వద్ద లారీని పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ టీవీ ఫుటేజ్ లో లభ్యమయ్యాయి. 

పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పై సీఎం పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం, ద్వంద్వ పింఛన్లుపై, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి ఫిర్యాదులపై చర్చ జరుగుతోంది. 60 ఏళ్లు దాటిని వికలాంగులకు ఒకే ఫించన్ ఇవ్వడంపై ఫిర్యాదు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అర్హులైన వారికి రెండు పింఛన్లు అందేలా చూద్దామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మించిన ఇళ్లకు పాత పద్ధతిన రూ.లక్షల వరకు మంజూరుకు చంద్రబాబుసానుకూలంగా స్పందించారు.

ఇంటింటికి తెలుగుదేశం.. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పలు నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్రమంగా అమలు కాకపోవడం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగా లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. ఇంటింటికి తెలుగుదేశం పని తీరుపై గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. పనితీరు మెరుగుపడకపోతే కొత్త నాయకత్వం వస్తుందంటూ చంద్రబాబు హెచ్చరించారు.

రెపో రేటు యథాతధం గా ఉంచిన ఆర్బీఐ

ముంబై: ఆర్బీఐ రెపో రేటు యథాతధం గా ఉంచింది. అంతే కాకుండా కీలక వడ్డీ రేట్లను కూడా యథాతథంగా ఉంచింది. వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

14:38 - October 4, 2017

భార్య..భర్తలు విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఎలా ఉండవచ్చు ? విడాకులకు ప్రత్యామ్నాయం ఉందా ? అంటే ఉన్నదని అంటున్నారు లాయర్ పార్వతి. 'మానవి' 'మై రైట్' కార్యక్రమంలో 'జ్యుడిషియల్ సపరేషన్' అంశంపై విశ్లేషించారు. అభిప్రాయబేధాలు వచ్చిన అనంతరం కోర్టులో విడాకులకు అప్లై చేసుకోవడం..విడాకులు రాకుండా ఉండడం..కాలయాపన జరుగుతుండడంతో వీరు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. ఇందులో ఇంకొక మార్గం కూడా ఉంది. వేరే వేరేగా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించవచ్చన్నారు. వేరే ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినా వివాహ బంధం విచ్చిన్నం కాదని పేర్కొన్నారు. వేరే ఉన్న సమయంలో ఆత్మవిమర్శ చేసుకొనే వీలు ఉంటుందని..ఈ సమయంలో కలిసి ఉండాలని..అనేక రకాల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కోర్టును ఆశ్రయించాల్సినవసరం లేదన్నారు. కాలర్స్ అడిగిన సమస్యలకు లాయర్ పార్వతి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చివరి దశకు చేరిన జనసైనికుల ఎంపిక ప్రక్రియ

హైదరాబాద్: జనసైనికుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కృష్ణా జిల్లా మినహా ఏపీలోనూ జనసైనికుల ఎంపిక పూర్తయ్యింది. ఈ నెల 7,8న విజయవాడ లో కృష్ణా జిల్లా జనసైనికుల ఎంపిక జరగనుంది. ఇప్పటికే తెలంగాణలో జనసైనికుల ఎంపిక పూర్తయ్యింది.

జోగులాంబ్ గద్వాల్ జిల్లా కేంద్రంలో విషాదం

జోగులాంబ్ గద్వాల్ : జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. నిన్న జూరాల కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి (గర్భిణీ), ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు (28), అమృత(5), వైష్ణవి(2).

14:16 - October 4, 2017

తూర్పుగోదావరి : కాకినాడ డీఎస్పీ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్న సమయంలో మహిళ కార్యాలయం వద్దకు వచ్చి రావడంతోనే తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో 80 శాతం మేర కాలిపోయింది. స్పందించిన పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలోనే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ఈమె 35 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. కిరోసిన్ పోసుకుని ఎందుకు నిప్పంటించుకుంది ? ఈమె ఎవరు ? డీఎస్పీ కార్యాలయానికి ఎందుకు వచ్చింది ? ఇక్కడే ఎందుకు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ? ఇతర వివరాలు తెలియ రావడం లేదు. 

ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన మావోలు..

ఛత్తీస్‌గఢ్ : రాజ్‌నంద్గావ్ జిల్లాలోని అంధి ప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

కాకినాడ, రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయం

తూ.గో: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కాకినాడ, రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

13:31 - October 4, 2017

గుంటూరు : ఏపీలో పెట్రో ధరలు మంటపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్‌పై 31శాతం వ్యాట్‌ ని వసూలు చేస్తున్నారు. అంతేకాదు లీటర్‌పై నాలుగు రూపాయలను అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో మొత్తం పన్ను 34శాతం వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక డీజిల్‌పై కూడా 22.50శాతం వ్యాట్‌తో పాటుగా అదనంగా నాలుగు రూపాయలను వసూలు చేస్తున్నారు.

జీఎస్టీలోకి పెట్రోల్‌ ఉత్పత్తులను
వాస్తవానికి జూలై ఒకటి నుంచి ప్రారంభమైన జీఎస్టీలోకి పెట్రోల్‌ ఉత్పత్తులను కలిపినప్పటికీ.. నిర్ధిష్టంగా పన్నును ఖరారు చేయలేదు. జీఎస్టీ అమలు ఎప్పటినుంచి అన్నది కూడా స్పష్టం చేయలేదు. దీంతో అన్ని రాష్ట్రాల్లో వ్యాట్‌, స్థానిక పన్ను విధానాలు మాత్రమే అమలవుతున్నాయి. ఏపీ పక్క రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ ధరకు లభిస్తోంది. పక్క రాష్ట్రాలైన ఒడిషాలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఏపీకంటే 8 రూపాయలు తక్కువగా ఉంది. అటు కర్నాటకలోనూ 6 రూపాయలు తక్కువకే లభిస్తోంది. తమిళనాడులో 4 రూపాయలు, తెలంగాణలో 3 రూపాయలు తక్కువ ధరకే పెట్రోల్‌ లభిస్తోంది. అలాగే డీజిల్‌ ధర కూడా లీటర్‌కి రెండు నుంచి ఏడు రూపాయల వరకు పొరుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ల బాటపడుతున్నారు. అటు పెద్ద పెద్ద వాహనాలు సైతం ఇదే పద్దతి పాటిస్తుండడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపుతోంది.

వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలి
ఒకవైపు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలని కేంద్రం తేల్చి చెబుతోంది. అయితే ఏపీ మాత్రం కేంద్రం మాటలను పెడచెవిన పెడుతోంది. వ్యాట్‌ను తగ్గించుకోవడం అటుంచి మరింతగా పెంచుతోంది. దీంతో పెట్రో ధరలు మోతమోగుతున్నాయి. ప్రభుత్వం ప్రజలపై అనవసర భారాన్ని వేస్తుందని వాహనదారులు లబోదిబో మంటున్నారు. వెంటనే వ్యాట్‌ను తగ్గించాలని వారు కోరుతున్నారు. పెట్రోల్‌పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా వినియోగదారుల జేబుకి చిల్లుపడుతోంది. మరోవైపు రాష్ట్ర ఖజానాపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాట్‌ శాతంతోపాటు అదనపు రుసుమును తగ్గించాలని విపక్షాలు కోరుతున్నాయి.

13:30 - October 4, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడలో భారీవర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరిన్ని వివరాలు వీడియో క్లిక్ చేయండి.

13:28 - October 4, 2017

 

కృష్ణా : జిల్లా తేలప్రోలు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

డీఎస్పీ కార్యాలయంవద్ద మహిళ ఆత్మహత్యాయత్నం...

తూ.గో: కాకినాడ డీఎస్పీ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

13:26 - October 4, 2017

హైదరాబాద్ : రేణు దేశాయ్‌ రెండో పెళ్లి కామెంట్లపై వివాదం నెలకొంది. రెండో పెళ్లి చేసుకోవద్దంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో రేణుదేశాయ్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. ఈ దేశంలో మగాడు ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చా...అదే ఓ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం తప్పా అని ట్వీట్‌ చేసింది. అంటే తప్పు చేశానన్న భావనతో జీవితాంతం ఒంటరిగా బతకలా అని ప్రశ్నించింది.   

13:21 - October 4, 2017

చిత్తూరు : జిల్లా వి.కోట కుప్పం జాతీయ రహదారిలో ఘోర ప్రమాదం జరిగింది. రాజుపేట వద్ద ఇటుకల బట్టీ షెడ్ కూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో వృద్ద దంపతులు, వారి మనవడు ఉన్నాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:20 - October 4, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థి రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ అడ్డగుట్ట శబరీనాథ్ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ యాజమాన్యం, రమేష్ మధ్య చిన్న పాటి గొడవ జరిగిందని, యాజమాని రమేష్ ను దూషించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని రమేష్ తండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు రమేష్ మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్జీటీలో రెండో రోజు విచారణ

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్జీటీలో రెండో రోజు విచారణ జరిగింది. పదే పదే వాయిదాలు కోరడంపై టీఎస్ ప్రభుత్వం ఎన్జీటీ మండిపడింది. తాగునీటి పైప్ లైన్ నిర్మానానికి అవసరమైన అటవీ భూమిపై వివరాలు సమర్పించడంలో తడబాటు ఎందుకుని ప్రశ్నించింది. 2007 నుంచి నిర్మిస్తుంటే ప్రాథమిక సమాచారం లేకపోవడం ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. పూర్తి వివరాలతో హాజరు కావాలని టీఎస్ ప్రభుత్వాని ఆదేశించింది.

పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, ఎర్రగడ్డ, నిజాంపేటలో వర్షం పడుతోంది. వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది.

13:09 - October 4, 2017

పశ్చిమగోదావరి : జిల్లా వట్లూరులో ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త, భార్యను వదిలేశాడు. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి రావాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసి భర్త శ్రీకాంత్ ను భార్య తరుపు బంధువుల నిలదీశారు. ఎంతచెప్పినా వినకపోవడంతో శ్రీకాంత్ మహిళలు దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ

హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో జానా అధ్యక్షతన సీఎల్పీ భేటీ అయ్యింది. ఈ భేటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జీవో నెం.39 భూ సర్వే, డబుల్ బెడ్ రూం ఇళ్లు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినున్నట్లు సమాచారం.

మెన్స్ హాస్టల్ లో బీటెక్ విద్యార్థి రమేష్ ఆత్మహత్య

హైదరాబాద్: కూకట్ పల్లి అడ్డగుట్ట శబరీనాథ్ మెన్స్ హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని రమేష్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ యాజమాన్యం దూషించడంతో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని మృతిడి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటుకల బట్టీ షెడ్ కూలి ముగ్గురు మృతి

చిత్తూరు: వి.కోట – కుప్పం జాతీయ రహదారిలో ప్రమాదం జరిగింది. రాజుపేట వద్ద ఇటుకల బట్టీ షెడ్ కూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో వృద్ధ దంపతులు, మనవడు ఉన్నారు.

పోలవరానికి సీఎం చంద్రబాబే దుష్ట శక్తి :రఘువీరా

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 32 శాతం పనులు కాంగ్రెస్సే పూర్తి చేసిందని.. జాతీయ హోదా కల్పించింది కూడా కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని, పోలవరానికి సీఎం చంద్రబాబే దుష్ట శక్తి అని విమర్శించారు. చంద్రబాబు సీఎం అవడంతోనే ప్రాజెక్టు గ్రహణం పట్టిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టును చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం 2018 కి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందేనని రఘువీరా డిమాండ్ చేశారు.

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో నోటీసులు జారీ అయ్యాయి. పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలదని హైకోర్టు ప్రశ్నించింది.

12:09 - October 4, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు లో దారుణం జరిగింది. స్థానిక అనుపమ ఆసుపత్రిలో వైద్యం వికటించి స్వప్న అనే మహిళ మృతి చెందింది. స్వప్న మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆందోళన దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సుప్రీంను ఆశ్రమించిన కార్తి చిదంబరం

ఢిల్లీ :సీబీఐ సమన్లపై కార్తి చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో కార్తి చిదంబరానికి సమన్లు జారీ అయ్యాయి.

12:08 - October 4, 2017

భద్రాద్రి కొత్తగూడెం : రాజ్యంగ పదవిలో ఉండి టీబీజీకెఎస్ గెలిపించాలంటూ ఇల్లందు సింగరేణి జీఎం సాయిప్రసాద్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏకంగా పోస్టల్ బ్యాలెట్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీబీజీకెఎస్ ను గెలిపించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్టు కార్మికులు చెబుతున్నారు. జీఎం తీరుపై ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు కార్మికులు ధర్నా దిగారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో దారుణం

హైదరాబాద్: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం జరిగింది. ఆనుపమ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే స్వప్న చనిపోయిందని బంధులువు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆస్పతి ఎదుట ఆందోళనకు దిగారు.

రేపు ఉదయం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

అమరావతి: రేపు ఉదయం ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు చంద్రబాబు పాల్గొననున్నారు.

సింగరేణి..ఇల్లందు జీఎం ప్రచారం..

కరీంనగర్ : టీబీజీకేఎస్ ను గెలిపించాలంటూ ఇల్లందు సింగరేణి జీఎం సాయి ప్రసాద్ ప్రచారం నిర్వహించడం చర్చానీయాంశమైంది. పోస్టల్ బ్యాలెట్ తో ప్రచారం నిర్వహించారు. టీబీజీకేఎస్ ను గెలిపించాలని..లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంపై ఏఐటీయూసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు నేతలు ధర్నాకు దిగారు. 

శుక్రవారం నుండి థియేటర్ల బంద్...

చెన్నై : తమిళనాడులో మళ్లీ సినీ నిర్మాతల సంఘం నిరసనలు వ్యక్తం చేస్తోంది. శుక్రవారం నుండి థియేటర్లు మూసివేయాలని పిలుపునిచ్చింది. అదనపు పది శాతం పన్ను ఎత్తివేయకపోతే మున్ముందు ఎలాంటి తమిళ సినిమాలు విడుదల కానివ్వని సంఘం హెచ్చరిస్తోంది. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక సినిమాలపై 28 శాతం జీఎస్టీ విధించడంతో తమిళనాడులో గతంలో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

11:44 - October 4, 2017

భువనగిరి యాదాద్రి : క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి అలుగుపోస్తోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

11:43 - October 4, 2017

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థకు అప్పుల బెడద తప్పేట్టులేదు. గత అప్పుల నుంచి గట్టెక్కకముందే మరోసారి అప్పులకోసం ప్రయత్నాలు చేస్తోంది.జేఎన్ఎన్ యూ ఆర్ ఎం ఇళ్ల నిర్మాణానికి వంద కోట్ల మేరా హడ్కో నుంచి అప్పు తీసుకునేందుకు కార్పొరేషన్‌ సిద్ధమైంది. వాస్తవానికి హడ్కో నుంచి 100కోట్లు అప్పు తీసుకొని గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని ఏడాది కిందటే ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో అప్పుతీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు హడ్కో నుంచి అప్పు తీసుకునే అంశం తెరపైకి వచ్చింది.

4,256 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది...
జేఎన్ఎన్ యూ ఆర్ ఎం పథకం కింద బెజవాడలో ఇంకా 4,256 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని హౌసింగ్‌ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పదిసార్లు టెండర్లు కూడా పిలిచారు. అయితే కార్పొరేషన్‌ ఆర్థిక పరిస్థితి గమనించిన కాంట్రాక్టర్లు.. టెండర్‌లో పాల్గొనేందుకు సాహసించడంలేదు. దీంతో ఇళ్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.

ప్రభుత్వమే నిధులిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్‌ గ్రాంట్ సాధించడంలోనూ పాలకులు విఫలయ్యారు.. కృష్ణా పుష్కరాల సందర్భంగా కరకట్ట వాసులకు కేటాయించిన ఇళ్ల కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన 17.63 కోట్ల రూపాయలను రాబట్టలేకపొయ్యారు. ప్రభుత్వం తక్షణం కార్పొరేషన్‌ గ్రాంట్‌తోపాటు కరకట్ట వాసులకు చెల్లించాల్సిన నిధులనూ విడుదల చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వమే నిధులిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

11:42 - October 4, 2017

అనంతపురం : మరో అవినీతి అనకొండ భాగోతం బయపడింది. ఐసీడీఎస్‌ అధికారి వెంకటనారాయణరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. 8 ప్రాంతాల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 50 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

11:37 - October 4, 2017

లాస్‌వెగాస్‌: అమెరికా లాస్‌వెగాస్‌లోని ఓ మ్యూజిక్‌ కాన్సర్ట్‌లో కాల్పులు జరిపిన 64 ఏళ్ల స్టీఫెన్‌ ఫెడాక్ సాధారణ వ్యక్తి కాదు....ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. నేవాడా రాష్ట్రానికి చెందిన స్టీఫేన్‌ రాజభోగాలు అనుభవించాడు. స్టీఫెన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కోట్లాది రూపాయలు గడించాడు. ఆయనకు రెండు విమానాలతో పాటు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. జూద ప్రియుడైన స్టీఫెన్‌ పెద్దఎత్తున పందెం కాసేవాడు. ఇంతటి సంపన్నుడైన స్టీఫెన్‌ ఎందుకు కాల్పులు జరిపాడన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. స్టీఫెన్‌కు ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు. కుటుంబ సభ్యులు, పోలీసులకు కూడా స్టీఫెన్‌ ఎందుకు కాల్పులు జరిపాడో అర్థం కావడం లేదు. మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సమీపంలో ఉన్న మాన్‌ డ్లే బే హోటల్‌ లోని 32 వ అంతస్తు నుంచి స్టీఫెన్‌ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అతను 23 ఆధునిక తుపాకులను ఎందుకు వెంటబెట్టుకెళ్లాడో తెలియడం లేదు. స్టీఫెన్‌ జరిపిన కాల్పుల్లో 59 మంది మృతి చెందగా... మరో 513 మంది గాయపడ్డారు. అనంతరం తనని తాను కాల్చుకుని స్టీఫెన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

11:35 - October 4, 2017

నార్వే : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం దక్కింది. 2017 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన రైనర్‌ వేస్‌, బ్యారీ సి.బ్యారిష్‌, కిప్‌ ఎస్‌ థోర్న్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను వీరికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నోబెల్‌ అసెంబ్లీ వెల్లడించింది. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్‌ వేస్‌ మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్‌ థోర్న్‌, బ్యారీ బ్యారిష్‌ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

11:33 - October 4, 2017

హైదరాబాద్ : ఏపీలో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను తన పాదయాత్ర ద్వారా ఎత్తిచూపాలని భావించిన జగన్‌కు.. కోర్టు కేసులు బ్రేక్‌ వేసేలా కనిపిస్తున్నాయి. పార్టీ ప్లీనరీలో జగన్‌ నవరత్నాలు పేరుతో తొమ్మిది అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇదే వేదిక నుంచి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. పాదయాత్రకు ముహూర్తం కూడా ప్రకటించేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు.

ప్రతి శుక్రవారం కోర్టుకు
వైఎస్‌ జగన్‌ తనపైనున్న కేసుల విచారణ కోసం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. దీంతో జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి నోచుకోలేదు. అందుకే పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని తాను కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని జగన్‌ కోరుతూనే ఉన్నారు. అయితే జగన్‌ అభ్యర్థనపై కోర్టు నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో పాదయాత్రపై పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.

అధికారపార్టీకి అస్త్రంగా..
జగన్‌ కోర్టుకు హారుకావడం నుంచి మినహాయింపు దొరికినా తద్వారా ఎదురయ్యే పరిణామాలను పార్టీ నేతలు బేరీజు వేసుకుంటున్నారు. కోర్టు నుంచి అనుమతి పొంది పాదయాత్ర చేస్తే అది అధికారపార్టీకి అస్త్రంగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రకు ప్రత్యామ్నాయంపైనా దృష్టి సారించారు. పాదయాత్రను కాదని ఏం చేస్తే బావుటుందన్న తర్జన భర్జనలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి. పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా జిల్లాల పర్యటనలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలోకి జగన్‌ వెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్నదానిపై నేతలు దృష్టి సారించారు. మరి జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాదయాత్ర చేస్తారా.. లేక జిల్లాల పర్యటనలు చేస్తారా అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.

11:32 - October 4, 2017

కరీంనగర్ : ప్రభుత్వ తీరుపై ...ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు కన్నెర్ర చేశాయి. ప్రైవేట్‌గా విద్యా సంస్థలను నడుపుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తుందని... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన దేశంలో ఇతర రాష్ట్రాల వారు తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రశంసిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలను చిన్నచూపు చూడడం బాధాకరమని విద్యా సంస్థల జేఏసీ సభ్యులు అంటున్నారు.

తీవ్ర మనోవేదనకు....
ప్రభుత్వ నిబంధనల పేరుతో అధికారులతో తనిఖీలు నిర్వహించడం తమను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పాఠశాల నిర్వహకులు చెబుతున్నారు. అధికారుల వేధింపులు భరించలేక పోతున్నామని ... వాపోతున్నారు. ఈ మేరకు కొన్ని డిమాండ్‌లతో అక్టోబర్ 5న సర్కస్ గ్రౌండ్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సభకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఉచిత ఆరోగ్య కార్డులు...
పది సంవత్సరాలుగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని...ఇక విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధన, భోదనేతర సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య కార్డులు అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు ఉచిత ప్రభుత్వ పుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇస్రో గొప్ప విజయాలు సాధిస్తోంది: ఉపరాష్ట్రతి వెంకయ్య

నెల్లూరు: శ్రీహరికోట షార్ కేంద్రంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు. ప్రయోగ వాహన నౌక తయరాఈ భవనాన్ని వెంకయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇస్రో గొప్ప విజయాలు సాధింస్తోందని, చంద్రమండలంలో నీటి జాడను కనుగొన్న ఘనత ఇస్రోదని తెలిపారు. మానవరహిత ప్రయోగాలకు సన్నద్దమవుతున్నామని పేర్కొన్నారు.

అదనపు కట్నం కోసం వేధింపులకు.. చితకబాదిన బంధువులు

ప.గో: వట్లూరులో అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. పుట్టిందని అదనపు కట్నం తీసుకురావాలని భర్త శ్రీకాంత్ వేధించ సాగాడు. అల్లుడిని అత్తమామలు, బంధువులు, గ్రామస్తులు చితకాబాదారు.

పగిలిన నారాయణ స్కూల్ బస్సు రేడియేటర్

నెల్లూరు: చిల్లకూరు మండలం శేడిమాల వద్ద నారాయణ స్కూల్ బస్సు రేడియేటర్ పగిలింది. రేడియేటర్ లోని వేడినీళ్లు పడి చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులులు అజయ్, గౌతమ్, అమహ్మద్ భాషా.

అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

నెల్లూరు: శ్రీహరికోట షార్ కేంద్రంలో అంతరిక్ష వారోత్సవాలను ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

 

10:55 - October 4, 2017

టాలీవుడ్ సత్తా ఏంటో..చూపెట్టిన చిత్రాల్లో 'బాహుబలి', 'బాహుబలి-2' ఒకటి. ఈ సినిమాల్లో నటించిన 'ప్రభాస్' పేరు అంతర్జాతీయస్థాయిలో మారుమోగింది. కొన్ని సంవత్సరాల పాటు ఈ సినిమాలకే 'ప్రభాస్' అంకితమయ్యాడు. 'బాహుబలి 2' రిలీజైన అనంతరం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కూడా మొదలెట్టేశారు. కానీ చిత్రానికి సంబంధించిన ఏ విషయాలు బయటకు పొక్కడం లేదు.

ఇదిలా ఉంటే 'ప్రభాస్', 'అనుష్క' మధ్య ప్రేమ ఉందని టాలీవుడ్ లో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని వారిద్దరూ ఖండించినా అభిమానులు మాత్రం వారివురూ వివాహం చేసుకుంటారని అనుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సింధు ట్విట్టర్ లో చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. 'ప్రభాస్' ఫ్యాన్స్ కి బ్రేకింగ్ న్యూస్ అని ట్వీట్ చేశారు. డిసెంబర్ లో 'ప్రభాస్', 'అనుష్క'లు ఎంగేజ్ మెంట్ చేసుకుంటారని...వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్త నిజమని పేర్కొన్నాడు.

ప్రస్తుతం 'ప్రభాస్' సాహో చిత్రంలో...'అనుష్క'...'భాగమతి' చిత్రాల్లో నటిస్తున్నారు. 'అనుష్క' కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది. మిగతా చిత్రాలేవీ ఒప్పుకోవడం లేదని టాక్. పెళ్లి నేపథ్యంలోనే చిత్రాలు ఒప్పుకోవడం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఉమైర్ సింధు చెప్పిన విషయాల్లో నిజం ఉందా ? లేదా ? అనేది తెలుసుకోవాంటే వెయిట్ చేయాల్సిందే. 

10:51 - October 4, 2017

సంగారెడ్డి : అక్కడ మద్యం షాపు వివాదం చినికి చినికి ఉగ్రరూపం దాల్చుతోంది. జనావాసాల్లో మద్యం షాపు పెట్టవద్దని స్థానికులు అంటుండగా.. పెట్టి తీరతామంటున్నారు మద్యం షాపు టెండర్లు దక్కించుకున్న యజమానులు. సంగారెడ్డిలో ఓ వైన్ షాపు ఏర్పాటులో నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం షాపు టెండర్‌ దక్కించుకోవటమే ఆలస్యం.. లాభాలు దండుకోవాలనే ఆరాటంలో షాపు యజమానులు అనుమతులు లేకుండానే నిర్మాణాలకు పూనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణం కూడా మద్యం షాపు కోసమే.

కలెక్టరేట్ దగ్గర్లోనే...
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అదీ కలెక్టరేట్ దగ్గర్లోనే ఈ మద్యం షాపు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. 10టీవీ ఇచ్చిన సమాచారంతో మున్సిపల్ కమిషనర్ స్పందించినా రెండు రాళ్లు తీయించి పక్కన పెట్టించారు. కానీ ఇక్కడి గణేశ్ నగర్ యువకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపు పెట్టనీయమని ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు, షాపు యజమానులు కుమ్మక్కై జనావాసాల మధ్య షాపులు పెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. 

10:49 - October 4, 2017

హైదరాబాద్ : సామ్రాజ్యవాదం వల్లే వలస కార్మికులు పెరిగిపోతున్నారని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు సుధా భాస్కర్‌ అన్నారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు వలస కార్మికుల హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు. దయనీయ స్థితిలో ఉన్న వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు బాద్యత వహించాలని కార్మిక నేతలు డిమాండ్‌ చేశారు.

10:47 - October 4, 2017

కృష్ణా : జల రవాణా ప్రాజెక్టు ప్రాథమిక దశ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడలో అట్టహాసంగా జరిగింది. ఏపీలో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్త 2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు 1,614.03 కోట్ల వ్యయంతో 381.9 కిలోమీటర్ల మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ మైదానం ఇందుకు వేదికైంది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి తన మనస్సు ఉవ్విళ్లూరుతోందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. అభివృద్ధికి అడ్డుపడేవారిని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని చెప్పారు.

80శాతం రవాణా జాతీయ రహదారులపైనే
దేశంలో 80శాతం రవాణా జాతీయ రహదారులపైనే జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. ప్రస్తుతం రోజు 28 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జాతీయ రహదారుల నిర్మాణానికి లక్షకోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీ ప్రజల కళలు సాకారం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తానని గడ్కరీ హామీనిచ్చారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న ఆయన.. 2022లోగా వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు.అనంతరం గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. గవర్నర్‌, కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు శాలువాకప్పి సన్మానించారు.

10:45 - October 4, 2017

హైదరాబాద్ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టలకు జలకళ సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల నిండుకుండలా తొణికసలాడుతోంది. కృష్ణానది నీటిపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. ఆలమట్టి, సుంకేశుల నుంచి వస్తున్న నీటితోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లక్షా ఇరవై వేల క్యూసెక్కులకు పైగా నీరు శ్రీశైలంలోకి ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్టనీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. శ్రీశైలం గరిష్టనీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 181 టీఎంసీల నీరు ఉంది. మరో 34 టీఎంసీల నీరు చేరితే జలాశయం నిండుతుంది. శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్న నీరు అంతకంతకు పెరుగుతోంది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

 ఆలమట్టి నుంచి 38 వేల క్యూసెక్కులు
జూరాల ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో నీరు నిల్వవుంది. ఆలమట్టి నుంచి 38 వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌ నుంచి 48 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 94 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. 93 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. జూరాలకు వస్తున్న నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీనది ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. జంట నగరాల్లోని రెండు జలాశయాలు.. గండిపేట, హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగుల కాగా, ప్రస్తుతం 1777.50 అడుగుల మేర నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌ గరిష్టనీటి మట్టం 1763.05 అడుగులు కాగా, ప్రస్తుతం 1747.70 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే వేసవిలో జంటనగరాల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది ఉండబోందని జల మండలి అధికారులు భావిస్తున్నారు. 

10:44 - October 4, 2017

హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి అధికారులు కేటీఆర్‌కు వివరించారు. నగరంలో జీహెచ్‌ఎంసీకి చెందిన 140 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, 50స్టాస్టిక్‌ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో , కాలువలు, నాలాలను క్లియర్‌ చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ ద్వారా నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీసీ టీవీలు, డయల్‌ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే తిరిగి మరమ్మతులు చేయాలన్నారు. రాబోయే రెండు రోజులపాటు మరిన్ని వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విరిగిపడిన భారీ వృక్షాలను తొలగించాలని, విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందిపడ్డ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

10:39 - October 4, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'శర్వానంద్' ఒకరు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న నటుల్లో ఒకరు. ఆయన నటించిన చిత్రాలు వేటికవే భిన్నంగా ఉంటూ వస్తున్నాయి. తాజాగా ఆయన 'మహానుభావుడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దసరా బరిలో పెద్ద చిత్రాలు ఉన్నా...ఈ చిత్రం విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే 'శర్వా నంద్' ఏ ఫోన్ వాడుతారో సంగీత దర్శకుడు 'థమన్' బయటపెట్టాడు. సెలబ్రెటీలు అనగానే ఖరీదైన ఫోన్లు వాడుతారని అందరం అనుకుంటుంటాం. కానీ 'శర్వానంద్' ఏ ఫోన్ వాడుతారో తెలుసా అని థమన్ చెప్పిన విషయంతో అభిమానులు షాక్ తిన్నారంట. ఇప్పటికీ సాధారణ నోకియా ఫోను వాడుతున్నారంట. ఇందులో ఎలాంటి యాప్స్ లు లేవు..శర్వా నిజంగా 'మహానుభావుడు' అని ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ క్ష్మియ్యారు. ఓ స్టార్ అయ్యి ఉండి..ఇంత సాధారణ ఫోన్ వాడుతున్నారా ? అని ఆశ్చర్యపోతున్నారంట. ఏదేమైనా 'శర్వానంద్' మహానుభావుడే..అని అనుకుంటున్నారంట...

అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి

నెల్లూరు: శ్రీహరికోట షార్ కేంద్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. కాసేపట్లో శాస్త్రవేత్తలతో ఉపరాష్ట్రపతి సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు అంతరిక్ష వారోత్సవాలను ఉపరాష్ట్రపతి ప్రారంబించనున్నారు.

10:31 - October 4, 2017

~అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య' వివాహం కొద్ది రోజుల్లోనే జరుగగబోతోంది. నటి 'సమంత' మెడలో మూడు ముళ్లు కట్టనున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమను ఇరువురు కుటుంబసభ్యులు ఆమోదం తెలిపారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి విశేషాలను నాగార్జున తెలిపారు.

'నాగార్జున' లెటెస్ట్ మూవీ 'రాజు గారి గది-2' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో 'నాగ్' ఓ మెంటలిస్టుగా కనిపించనున్నాడు. ఎదుటివాళ్ల మనుషులని చదివేస్తుంటాడు. ఇంటిల్లిపాది చూసేలా సినిమా ఉంటుందని 'నాగ్' పేర్కొన్నారు. డిసెంబర్ 22న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని..అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

ఇక 'నాగ చైతన్య' 'సమంత' వివాహంపై 'నాగార్జున' స్పందించారు. వీరిద్దరి వివాహం గోవాలో 6, 7వ తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. 6న హిందూ సాంప్రదాయం..7న క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరుగుతుందన్నారు. ఈ వివాహ వేడుక నిరాడంబరంగా సాగుతుందని, కేవలం తమ కుటుంబానికి చెందిన వంద మంది సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, తేదీ ఇంకా ఫైనల్ చేయలేదన్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

యూపీ:  మథురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అచ్నేరా-మథుర మార్గంలో గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా కాస్‌గంజ్-అచ్నేరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొడుతున్న భారత్ సైన్యం

జమ్మూ కశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ సైన్యం తిప్పికొడుతోంది.

10:16 - October 4, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. గతనెల 28న అదృశ్యమైన దంపుతులను దారుణ హత్యకు గురైయ్యారు. వారిని హత్యచేసి మృతదేహాలను బుల్లెట్ షో రూం సమీపంలో పూడ్చిపెట్టారు. మృతులు శ్రీనివాసరావు, ప్రమీలగా గుర్తించారు. వీరి హత్యకు ఆర్థిక లావాదేవిలే కారమణని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:14 - October 4, 2017

అనంతపురం : జిల్లా ఐసీడీఎస్ అధికారి వెంకటనారాయణరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. కొవ్వూరునగర్ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటనారాయణరెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆయనపై ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తేలప్రోలు వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా

కృష్ణా: తేలప్రోలు వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ బస్సు విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తోంది.

తమిళనాడులో సినీ నిర్మాతల ఆందోళన

చెన్నై: తమిళనాడులో సినీ నిర్మాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం విధించిన 10 శాతం ట్యాక్స్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శుక్రవారం సినిమాలు విడుదల చేయొద్దని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

ఒంగోలులో గత నెలలో అదృశ్యమైన దంపతులు హత్య

ప్రకాశం: ఒంగోలు బుల్లెట్ షోరూమ్ సమీంపలో దంపతల శవాలు లభ్యం అయ్యాయి. ఒంగోలులో గత నెల 28న అదృశ్యమైన దంపతులు హత్యకు గురయ్యారు. అదే రోజు శ్రీనివాసరావు, ప్రమీలారాణీని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణలో తేలింది. దంపతుల వద్ద నుంచి రూ. 15 లక్షల అప్పు తీసుకున్న వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఐసీడీఎస్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు...

అనంతపురం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఐసీడీఎస్ అధికారి వెంకటనారాయణరెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కొవ్వూరు నగర్ లోని వెంకటనారాయణ రెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీ లు చేపట్టింది. మొత్తం 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

09:03 - October 4, 2017

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ కుమారుడు వంశీకృష్ణ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వంశీకృష్ణ రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

జగ్గయ్యపేటలో అగ్నిప్రమాదం

కృష్ణా : జిల్లా జగ్గయ్య పేట మండలం అనుమంచుపల్లిలోని లక్ష్మీ గణేష్ రైస్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయందోళనకు గురైయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలతో రైస్ మిల్లులో ఉన్న 2500 బియ్యం బస్తాలు అగ్నికి కాలిపోయాయి.

రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ కుమారుడు వంశీకృష్ణ మృతి చెందాడు. వంశీకృష్ణ రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాడు.

08:17 - October 4, 2017

కృష్ణా : జిల్లా జగ్గయ్య పేట మండలం అనుమంచుపల్లిలోని లక్ష్మీ గణేష్ రైస్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయందోళనకు గురైయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలతో రైస్ మిల్లులో ఉన్న 2500 బియ్యం బస్తాలు అగ్నికి కాలిపోయాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:14 - October 4, 2017

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ కుమారుడు వంశీకృష్ణ మృతి చెందాడు. వంశీకృష్ణ రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:23 - October 4, 2017

వాస్తవానికి పోలవరం 2019 పూర్తి చేయడమనేది కష్టమైన పని అని, ప్రస్తుతానికి అయితే పని మాత్రం వేగంగా జరుగుతుందని, పోలవరంతో నీరు కాకుండా విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతోందని, చంద్రబాబు సీఎం కాకముందే ఢిల్లీ వెళ్లి పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని టీడీపీ నేత మన్నె సుబ్బరావు అన్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, ప్రభుత్వం 2019కి పూర్తి చేస్తామని చెప్పిందని కానీ నిర్వాసితులకు ఇంతవరకు సౌకర్యాలు కల్పించలేదని, కాంట్రాక్టరు పనులు చేయడంలేదని వారిపై చర్యలు తీసుకున్నారని పోలవరం 2019కి పూర్తి కాదని సీపీఎం నేత ఉమామహేశ్వర్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:22 - October 4, 2017

 

చెప్పుకోటానికి గొప్పలు చాలా ఉంటాయి.. నగరం నెత్తిపై కీర్తికిరీటాలు చాలా ఉంటాయి. కానీ, కాస్త తేడా వచ్చినా... అల్లకల్లోలం కావల్సిందే. నగర వాసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిందే. చినుకుపడితే అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ పరిస్థితి ఇది. ఈ సమస్యకు కారణాలను, ప్రభుత్వాల విధానాలను చర్చించటానికి  వర్షాలకు వచ్చిన సమస్యం అంత నాలాలు, డ్రైనేజీలను నిర్లక్ష్యం చేయడమే అని, రెండు గంటలు వర్షం కురిసిస్తే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, గత మూడేళ్లుగా నగరంలో మార్పు మాత్రం రావడం లేదని, నగరవాసులకు కనీస సౌకర్యలు కల్పించకుండా స్కైవేలు, ఫ్లైఓవర్ లు అని ఊదరగొడుతున్నారని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు

 

ఢిల్లీ : నేటి నుంచి మూడు రోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సదస్సు అరంభం కానున్నాయి. ఈ సదస్సులో పారిశ్రామిక, వాణిజ్య రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.

కృష్ణా జిల్లాలో అగ్నిప్రమాదం

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచుపల్లిలోని లక్ష్మీగణేష్ రైసు మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు.

Don't Miss