Activities calendar

05 October 2017

21:31 - October 5, 2017

 

నార్వే : 2017కుగాను సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నవలా రచయిత కజువో ఇషిగురోను నోబెల్‌ బహుమతి వరించింది. 1989లో ఆయన రాసిన నవల 'ద రిమేన్స్ ఆఫ్ ద డే'తో ఇషిగురోకు మంచి పేరు వచ్చింది. భావోద్వేగాలతో కూడిన తన నవలలతో ఇషిగురో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించారని నోబెల్ కమిటీ కొనియాడింది. 63 ఏళ్ల ఇషిగురో.. నవంబర్ 8, 1954లో జపాన్‌లోని నాగసాకిలో జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసున్నపుడే కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లింది. ఇషిగురో ఇప్పటి వరకు 8 నవలలు రాశారు.

 

21:26 - October 5, 2017

గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు ఎస్సై గుడిపూడి సందీప్‌...ఆమె విజయవాడ భవానీపురం చెందిన పద్మావతి... ఇద్దరి పరిచయం ఎన్నో ఏళ్ల క్రితమే జరిగింది...అప్పటికే ఆమె వివాహిత...తన కుటుంబాన్ని వదిలేసి సందీప్‌తో కలిసి బయటకు వచ్చింది...కష్టాల్లో తోడుంటానని నమ్మించిన సందీప్ ఆమెను పెళ్లి చేసుకుని ఏడడుగులు నడుస్తానని చెప్పాడు..దీంతో అతన్నే పూర్తిగా నమ్మిన పద్మావతి సందీప్ ఎస్సై కావాడానికి సాయం చేసింది..ఆర్థికంగా తోడుగా ఉన్నంతకాలం ఆమెతో సహజీవనం చేశాడు..ప్రేమ ముసుగులో ఏడేళ్ల పాటు కలిసి ఉన్న సందీప్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం రావడంతో మొహం చాటేశాడు.

సందీప్ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది...
ఇదిలా ఉంటే సందీప్ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది...అతనే సర్వమనుకున్న పద్మావతికి కోలుకోకుండా అయింది.. ఒకవైపు కుటుంబాన్ని..భర్త,పిల్లలను వదిలేసుకున్న పద్మావతి సందీప్‌ సర్వమనుకుని వచ్చింది..సందీప్ ఇచ్చిన షాక్‌తో కోలుకోని పద్మావతి చివరకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది..ఎస్సై కావడంతో సందీప్‌లో మరింత అహంకారం పెరగడంతో ఆమెను పట్టించుకోలేదు..దీంతో న్యాయపోరాటం మొదలుపెట్టిన పద్మావతి ఫిర్యాదులు చేసింది.మొత్తం మీద పద్మావతి మొర ఆలకించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు... అధికారుల విచారణలో సందీప్ చేసిన మోసం బయటపడింది...వెంటనే తుళ్లూరులో పనిచేస్తున్న సందీప్‌ను సస్పెండ్ చేస్తూ రేంజ్ డీఐజీ గోపాల్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

 

 

 

 

 

 

 

21:23 - October 5, 2017

ఢిల్లీ : జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలు, నిరసనల్ని వెంటనే నిలిపివేయాలని జాతీయ హరిత న్యాయస్థానం న్యూఢిల్లీ నగరపాలక సంస్థను ఆదేశించింది. జంతర్‌ మంతర్‌కు బదులు అజ్మీరీ గేటు సమీపంలోని రామ్‌ లీలా మైదానం దగ్గర ధర్నాలు, నిరసనలను తెలిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. జంతర్‌ మంతర్‌ వద్ద ఉన్న తాత్కాలిక నిర్మాణాలు, లౌడ్‌ స్పీకర్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్జీటీ స్పష్టం చేసింది. నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలతో జంతర్‌ మంతర్‌ వద్ద శబ్ద కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

21:22 - October 5, 2017

నల్లగొండ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పర్యటించిన ఆయన కాళేశ్వరానికి స్టే ఇవ్వడం కాంగ్రెస్‌కు ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

21:20 - October 5, 2017

పెద్దపల్లి/మంచిర్యాల/భూపాలపల్లి/కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. సింగరేణి కాలరీస్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల కోసం 92 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగరేణలో ఓటు హక్కు ఉన్న 52,534 మంది కార్మికులకు గాను 49,873 మంది ఓటు వేశారు. మొత్తం 94.93 శాతం పోలింగ్‌ నమోదైంది.

బరిలో 15 కార్మిక సంఘాలు
మొత్తం 15 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ ఏఐటీయూసే మధ్య ఉంది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ అనుంబంధ ఐఎన్‌టీయూసీ, తెలంగాణ టీడీపీ అనుంబంధ టీఎన్‌టీయూసీ కలిసి ఐక్య కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిపెట్టారని, కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. అటు చివరి దశలో ఒక నిమిషం ఆలస్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన కొంతమంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించేలేకపోయారు. ఇలాంటివారు నిరుత్సాహంతో వెనుతిరిగారు. 

కాంగ్రెస్ పై హరీష్ ఫైర్

 

యాదాద్రి : కాళేశ్వరంపై ఎన్జీటీ స్టే విధిండంతో కాంగ్రెస్ పైశాచిక ఆనందం పొందుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సుప్రీం కోర్టు వెళ్లి న్యాయం సాధిస్తామని ఆయన తెలపారు. 

మెడ్ టెక్ జోన్ టెండర్లు రద్దు

గుంటూరు : వివాదాస్పద విశాఖ మెడ్ టెక్ జోన్ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో రూ.500కోట్ల పనులకు టెండర్లు పిలవగా రూ.2,400కోట్ల కోట్ చేసిన నిర్మాణ సంస్థ టెండరల్లలో అక్రమాలు సీఈవీ జితేంద్ర శర్మ పాత్రపై ఫిర్యాదులు రావడంతో సీఎంతో స్థాయి విచారణ జరిపి టెండర్లను రద్దు చేశారు.

20:36 - October 5, 2017

అరే నాయన ఇవ్వి సింగరేణి సంఘం ఎలచ్చన్లా లేకపోతె ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలా..? చిన్న హడావుడా చిన్న కథనా..? ఓ ఎన్నికల నిబంధనలు లేవు.. ఏం లేవు.. పోలింగ్ బూతు కాడ గూడ ప్రచారాలు జేసుడే..? పైకం బంచుడే.. ఎద్గ ఆ సర్కారు సంఘపోళ్లనే పట్టవశమైతలేదు.. వాళ్ల ఏశాలు జూస్తుంటే.. ఎన్నికలను ఎన్నికలెక్క గాకుంట... అద్రగానం లెక్కనే జేశిండ్రుగదా..?

అరే ఎక్కడి వాస్తు పిచ్చోళ్లు దొర్కిండ్రు రా నాయనా..? తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. వీళ్లు పయ్యకాండ్లకు వొయ్యెతప్పుడు గూడ తిధి నక్షత్రం జూశిపోతున్నరా ఎట్ల..? మొన్ననే గాదుల్లా.. అంత యాడాది గూడ గాలే అమరావతి కాడ అసెంబ్లీ గట్టి.. అప్పుడే దిడ్లు వొడుస్తున్నరు మళ్ల.. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టు.. జనం సొమ్ము వాస్తుపాలు జేస్తున్నరు ఈ సీఎంలు ఇద్దరు..

వచ్చెసారి ఎన్నికలళ్ల సర్పంజుల గెల్వాలె అని ఆశతోని ఉన్న అన్నలు.. అక్కలు చెల్లెండ్లు తమ్ముండ్లు.. మీ ఆశల మీద పిడ్గువడెంత ముచ్చటనే ఇది.. బాగ సద్వినోళ్లకేం బాధలేదుగని..? పదో తర్గతి కంటె తక్వ సద్వినోళ్లకు ఇగ వచ్చెసారి సంది సర్పంజి గిరి చేశే అవకాశం ఇయ్యరట.. కేంద్రమోళ్లు రాష్ట్ర ప్రభుత్వాలకు కాయిదం బంపిండ్రట.. మరి ఆ కాయిదంల ఏమున్నదో సూడుండ్రి..

రెండువందల యాభై రోజుల సంది లొల్లి వెడ్తుంటే.. కనీసం కణికరం లేదేమయ్యా ఈ తెలంగాణ ప్రభుత్వానికి... మేము అధికారంలకు రాంగనే.. మూతవడ్డ కంపిండ్లు అన్ని తెరిపిస్తమని మన బాతాల పోశెట్టు ఎన్నిమాటలు జెప్పిండు.. ఇగ జేస్తడేమో అగ జేస్తడేమో అని.. సూశి సూశి ఆఖరికి దీక్షలు జేస్తె గూడ కనీసం కదలిక లేకపాయే ప్రభుత్వం తాన..

ఇంతా అన్నాలమానుల్లా..? పాపం.. రైతులు మా ప్రాంతమంత కర్వొచ్చింది సారూ.. జర్రంత కర్వు ప్రాంతంగ ప్రకటించి.. ఆదుకోండ్రి అని నిరసన వ్యక్తం జేస్తె.. వాళ్లను కొట్టి తన్ని తరిమి.. దొర్కినోళ్లను దీస్కపోయి బట్టలిప్పిచ్చి బరివాతల నిలవెడ్తారు..? రైతులను గొట్టె సంస్కృతి మంచిదేనా..? తలమాశినోళ్లు ముఖ్యమంత్రులుగుంటే ఇట్లగాకుంటె ఇంకెట్లైతదిగని..

ఆంధ్ర మంత్రి అఖిల ప్రియమ్మతాన లలిత కళలు శాననే ఉన్నట్టున్నయ్ గదా..? అదేంది..? గీటారో వాయ్ లీనో అంటరు సూడుండ్రి అగో అదాన్ని వట్కోని అద్భుతంగ వాయిస్తున్నది.. బుజ్జి ఏడనేర్సుకున్నదోగని..? సంగీత విభావరి వెడ్తె.. ఫస్టు ప్రైజ్ గొట్కొచ్చెతట్టే ఉన్నది.. ఇంకేంది చంద్రాలు బృందంల ఒక కళాకారిణి ఉన్నది.. ఇగ తబ్ల మద్దెల గొట్టెటోళ్లు దొర్కితె మస్తుంటది..

వరంగల్ పట్నంల ఇయ్యాళ మబ్బుల సాఫ్ సపాయోళ్లు రోడ్లు ఊడుస్తున్నరు.. ఒకామె నడి రోడ్ల నిలవడి శీపురు గట్ట సరి జేస్కుంటున్నది.. అంతలనే ఒక లారొస్తున్నది ఎన్కకెళ్లి అటు ఆ డ్రైవర్ ఈమెను జూడలే.. ఈమె ఆ లారిని జూడలే.. మొత్తానికి లారి దిబుక్కున గుద్దింది ఆమెను.. తర్వాత ఏమైంది..? అనేది సూడుండ్రి..

కులాలు మతాలు.. పర్వులు ప్రతీకారాలు.. హత్యలు అనే లోకంల వడి కొట్టుకుంటున్న కుల ప్రజలారా... గీ ముచ్చట మీరు బాగ జూడాలే.. అక్కినేని నాగార్జున ఎవ్వలు..? ఒక కమ్మాయిన.. సమంత ఎవ్వలు..? ఒక ఏసుక్రీస్తు మతమామే.. ఆమెను కోడల్గ జేస్కుంటున్నడు నాగార్జున.. మరి ఈ పెద్దోళ్లకు కులాలు మతాలు ఎందుకు లేవు..? మన ఊర్లపొంటి ఇంకా నా కులపోడు నీ కులపోడని ఎందుకున్నయ్ అనేది ఆలోచన

జేస్కోండ్రి.. అట్లనే నాగ చైతన్య సమంతల పెండ్లీ కార్యంఉన్నది చెప్త ఇనుండ్రి..

20:18 - October 5, 2017

 

విశాఖ : విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు.. జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. కోనం రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో బ్రిడ్జికి గండి పడి.. 28 గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. విశాఖలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో మూడు ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయి. అతి పెద్దదైన పెద్దేరు రిజర్వాయర్, కోనం రిజర్వాయర్‌తో పాటు రైవాడ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ మూడు రిజర్వాయర్లు మాడుగుల నియోజకవర్గ పరిధిలోఉండడమే కాకుండా.. విశాఖ ఏజెన్సీకి ఆనుకొని ఉంటాయి. కొద్ది రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనం రిజర్వాయర్‌తో పాటు, పెద్దేరు రిజర్వాయర్‌లు పూర్తిగా నిండిపోయాయి. కోనం పాలవెల్లి జలాశయం నిల్వ సామర్థ్యం 101.25 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 100.50 మీటర్లకు చేరుకుంది. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. కోనం కాలువకు గండి పడటంతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రిజర్వాయర్‌కు అవతలి వైపు ఉన్న గిరిజనులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.

నిండు కుండలా పెద్దేరు రిజర్వాయర్
విశాఖ జిల్లాలో అతి పెద్ద రిజర్వాయర్ అయిన పెద్దేరు రిజర్వాయర్ నిండు కుండలా ఉంది. భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దేరు రిజర్వాయర్‌లో 137 మీటర్ల నీటి మట్టానికి.. 136 మీటర్లకు నీరు చేరుకుంది. దీంతో వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇంతేకాకుండా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంతేకాకుండా భారీగా కురుస్తున్న వర్షానికి ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 

20:16 - October 5, 2017

కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. తమపట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. కేజీ టు పీజీ.. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ జేఏసీగా ఏర్పడి.. ప్రభుత్వ వివక్షను ఎండగడుతున్నాయి. ఈదిశగా.. కరీంనగర్‌లోని సర్కస్‌ గ్రౌండ్‌లో.. ఈరోజు, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ.. ఆత్మగౌరవ సభ పేరిట భారీ సభను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తలు.. ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ అణచివేత ధోరణిని ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు తీవ్ర వివక్షకు గురవుతున్నాయని.. వారు విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసి విన్నవిద్దామని ప్రయత్నించినా.. ఆయన కరుణా కటాక్షాలు మూడేళ్లుగా లభించడం లేదని ఆరోపించారు.

విద్యాసంస్థలన్నీ జేఏసీగా...
తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. తమపట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. కేజీ టు పీజీ.. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ జేఏసీగా ఏర్పడి.. ప్రభుత్వ వివక్షను ఎండగడుతున్నాయి. ఈదిశగా.. కరీంనగర్‌లోని సర్కస్‌ గ్రౌండ్‌లో.. ఈరోజు, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ.. ఆత్మగౌరవ సభ పేరిట భారీ సభను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తలు.. ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ అణచివేత ధోరణిని ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు తీవ్ర వివక్షకు గురవుతున్నాయని.. వారు విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసి విన్నవిద్దామని ప్రయత్నించినా.. ఆయన కరుణా కటాక్షాలు మూడేళ్లుగా లభించడం లేదని ఆరోపించారు.

శాశ్వత గుర్తింపును ఇవ్వాలని...
పది సంవత్సరాలుగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలకు శాశ్వత గుర్తింపును ఇవ్వాలని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆత్మగౌరవ సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కుటుంబ సభ్యులకు... ఉచిత ఆరోగ్య కార్డులు అందించడంతో పాటుగా...మార్కెట్ ధరలకు అనుకూలంగా జూనియర్ కళాశాలల ట్యూషన్ ఫీజులను పెంచాలని సభ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు ప్రభుత్వ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని వక్తలు కోరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు ప్రభుత్వ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని వక్తలు కోరారు. 

20:07 - October 5, 2017

 

ముంబై : భారత్‌లో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యంత ధనికుల జాబితాలో ముకేష్‌ అంబానీ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 2.5 లక్షల కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. గత పదేళ్లుగా ముకేష్‌ అంబానీయే టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అంబానీ తర్వాత ఆయన సంపదలో సగం 1.25 లక్షల కోట్లతో రెండో స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. హిందూజా బ్రదర్స్‌ 1.20 లక్షల కోట్లతో మూడో స్థానం, 1.7 లక్షల కోట్లతో లక్ష్మి మిట్టల్ నాలుగవ స్థానం, 1.4 లక్షల కోట్లతో పల్లోంజి మిస్త్రీ ఐదో స్థానంలో నిలిచారు. వందమంది మంది కుబేరులతో కూడిన ఇండియా రిచ్‌ లిస్ట్‌-2017ను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని...వంద మంది కుబేరుల సంపద 26 శాతం పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గత ఏడాది రెండోస్థానంలో ఉన్న సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ ఈసారి 9వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పతంజలి చీఫ్ బాలకృష్ణ 43 వేల కోట్లతో 19 వ స్థానానికి చేరుకున్నారు. పతంజలి గత ఏడాది 48వ స్థానంలో నిలిచింది. ముకేష్ తమ్ముడు అనిల్‌ అంబానీ 20 వేల 5 వందల కోట్లతో 45వ స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణలు సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి గానీ.. కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగినట్లు ఫోర్బ్స్ తెలిపింది. 

20:06 - October 5, 2017

బెంగళూరు : బెంగళూరులో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. వరద నీటితో రోడ్లు నదులను తలపించాయి. వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాళాలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీవర్షాలకు 4 భారీ వృక్షాలు కూలిపోయినట్లు 'బృహత్ బెంగళూరు మహానగర పాలికె' తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పలు సూచనలు చేసింది. మరోవైపు కర్ణాటకలో మాండ్య జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి చెరకు తదితర పంటలు నీటిలో కొట్టుకుపోయాయి.

 

20:05 - October 5, 2017

 

ఖమ్మం : పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మండిపడ్డారు. పోలవరం విలీన మండలాల్లో పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు వీఆర్‌ పురం మండలంలో పర్యటించారు. పలు గ్రామాల్లో నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో తీరని అన్యాయం జరుగుతోందని మధు విమర్శించారు.  

20:04 - October 5, 2017

గుంటూరు : ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు వినయకుమారి. స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న ఈమెకు బ్రెయిన్‌లో కుడికాలు, చెయ్యి, మాటలు వచ్చే ప్రదేశంలో ట్యూమర్‌ వచ్చింది. ట్యూమర్‌ పగిలి రక్తం కారడంతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే అవేక్‌ పద్దతిలో ఆపరేషన్‌ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం తక్కువని డాక్టర్‌ హనుమ శ్రీనివాస రెడ్డి వైద్య బృందం నిర్దారించింది.

బాహుబలి సినిమాను చూపించారు
వైద్యబృందం నిర్దారించినట్లే గుంటూరులోని తులసి ఆస్పత్రిలో వినయకుమారికి చికిత్స నిర్వహించారు. ట్యూమర్‌ తొలగించే సమయంలో ఆమెకు ఇష్టమైన బాహుబలి సినిమాను చూపించారు వైద్యులు. ఆపరేషన్ జరిగినంత సేపు ఆమె మెలకువగానే ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే పద్దతిలో ఆపరేషన్‌ నిర్వహించామని వైద్యులు చెప్పారు. పేషెంట్‌ అనుమతితోనే స్కాల్‌ బ్లాక్‌ పద్దతిలో మత్తు ఇచ్చామని ఆపరేషన్‌ నిర్వహించినంత సేపు రోగి పూర్తి స్పృహలోనే ఉందన్నారు.

వైద్యబృందం సంతోషం
అయితే చికిత్స చేయించుకున్న రోగి వినయకుమారి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జి కూడా అయిందన్నారు. వైద్య శాస్త్రంలో వచ్చిన ఆధునిక పద్దతులను వినియోగిస్తూ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతం అవడంతో వైద్యబృందం సంతోషం వ్యక్తం చేశారు. 

 

20:03 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం సహా 16 సంఘాలు బరిలో ఉన్నాయి. టీబీజీకేఎస్‌తో పాటు.. ఏఐటీయూసీ, ఎన్‌ఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీలు కూటమి బరిలో ఉన్నాయి. 

19:44 - October 5, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. నవ దంపతులు హరీష్, రచన దారుణ హత్య గురైయ్యారు. నెల క్రితమే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కరీంనగర్ లో దారుణం

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. నవ దంపతులు హరీష్, రచన దారుణ హత్య గురైయ్యారు. నెల క్రితమే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 

ఆర్. నారాయణమూర్తికి కొమరం భీమ్ జాతీయ పురస్కారం

 

హైదరాబాద్ : సినీనటుడు ఆర్. నారాయణమూర్తికి కొమరం భీమ్ జాతీయ పురస్కారం లభించింది. ఈ నెల 3న వారంలో అవార్డు ప్రధానోత్సవం జరగనుంది.

ధర్నాచౌక్ పై ఎన్ జీటీ సంచలన తీర్పు

ఢిల్లీ : ధర్నా చౌక్ పై ఎన్ జీటీ సంచలన తీర్పు వెలువరించింది. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను తక్షణమే నిలివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

గంజాయి పంట ధ్వసం చేసిని ఎక్సైజ్ అధికారులు

 

విశాఖ : జిల్లా పాడేరు మండలం సరయుపల్లిలో ఎక్సైజ్ సిబ్బంది గంజాయి పంటను ధ్వసం చేశారు. ఎక్సైజ్ అధికారుల దాడికి గంజాయి సాగుదారులు యత్నించారు.

ముగిసిన జైట్లీ, అమిత్ షా, మోడీ భేటి

ఢిల్లీ : ప్రధానితో అమిత్ షా, జైట్లీ భేటి ముగిసింది. వారి మధ్య జీఎస్టీ అమలు తీరు, దేశ ఆర్థిక పరిస్థితలపై, గుజరాత్ ఎన్నికలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

 

అనంతపురం : జిల్లా బొమ్మనహళ్ లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెండు పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ వచ్చారు. వారి మద్య మాటమాట పెరిగి టీడీపీ, వైసీపీ నేతలు పోలీస్ ష్టేషన్ ముందు రాళ్లు రువ్వుకున్నారు.

18:14 - October 5, 2017

అనంతపురం : జిల్లా బొమ్మనహళ్ లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెండు పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ వచ్చారు. వారి మద్య మాటమాట పెరిగి టీడీపీ, వైసీపీ నేతలు పోలీస్ ష్టేషన్ ముందు రాళ్లు రువ్వుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

17:43 - October 5, 2017

అనంతపురం : పుట్టపర్తి నియోజక వర్గంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి. నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ గృహాలు, చెక్‌ డ్యామ్‌లు నిర్వహించామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అయితే ఇంకా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామంటున్న మాజీ మంత్రి రఘునాథ రెడ్డి అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

17:41 - October 5, 2017

భదాద్రికొత్తగూడెం : సింగరేణి ఎన్నికల్లో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు. సింగరేణి ఎన్నికల్లో ఎఐటీయూసీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మద్యం, డబ్బు ఎరచూపి కార్మికులను లోబరుచుకోవాలని చూస్తున్న టిబిజికేఎస్‌కు కార్మికులు బుద్ధి చెబుతారని నేతలు అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:39 - October 5, 2017

భూపాలపల్లి : భాష తెలియదు..భావం అర్ధం కాదు...నాగరిక ప్రపంచంలో అనాగరికులు...పొట్టకూటి కోసం తరలివచ్చిన వలసజీవులు.. అధికారుల దాష్టీకంతో కుదేలైన అడవిబిడ్డలు..అలాంటి వారిపై కీచత్వం ప్రదర్శించారు. మహిళలపై ఫారెస్ట్ అధికారులు పైశాచికత్వాన్నిప్రదర్శించారు. తల్లులను లాఠీలతో అటవీ అధికారులు చావ బాదడంతో గొత్తికోయ పిల్లలు భీతిల్లారు. మహిళలు, పిల్లల ఏడుపులతో మేడారం అడవి దద్దరిల్లింది. అయినా ఫారెస్టు అధికారులు శాంతించలేదు. నేలమట్టం చేసిన ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లలో తరలించారు. జలగలంచ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. గొత్తికోయలపై అమానవీయంగా ప్రవర్తించిన తీరుపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. పాలకులతో తాడోపేడో తేల్చుకునేందుకు పోరాటబాట పట్టాయి. 

17:38 - October 5, 2017

భూపాలపల్లి : సొంత రాష్ట్రంలో ఆధిపత్య పోరును భరించలేక అటవి బాట పట్టి కాలం గడుపుదామని కొండ కోనల నడుమ గూడెం కట్టుకున్నారు. అడవి ఆదరిస్తే నాగరికులైన అధికారులు ఈ బక్క జీవులను తన్ని తరిమేస్తున్నారు. పదే పదే గొత్తికోయలను టార్గెట్ గా చేస్తూ నిర్దాక్షిణ్యంగా గూడేలపై బడి దాడులకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలు,వృద్ధులు, మహిళలు, గర్భిణులనే తేడా లేకుండా నిర్దయతో లాఠీలు ఝళిపిస్తూ బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే వారం రోజుల క్రితం అటవీ అధికారులు మేడారం అడవుల్లోని లవ్వాల కీకారణ్యాన్ని టార్గెట్ చేశారు. అమాయకపు గొత్తికోయ గూడెం జలగలంచను రణరంగంగా మార్చేశారు.

ఏటూరునాగారం ఏజెన్సీ బాట పట్టారు....
ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికోయలు సరిహద్దులు దాటి గత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీ బాట పట్టారు. పదిహేనేళ్లుగా అడవిలో నివాసం ఉంటున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు. ఒక్క వరంగలే కాదు.. ఖమ్మం, కరీంనగర్ ఏజన్సీల్లోకి కూడా వచ్చారు. గోదావరి నది పరివాహక ప్రాంతం పొడవునా వీరి పాకలే దర్శనమిస్తాయి. తెలంగాణకు వచ్చిన గొత్తికోయల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో 40 గ్రామాల్లో గొత్తికోయలు గుడిసెలు వేసుకొన్నారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి బతుకు బండిని లాగుతున్నారు. ఇదే కోవలో ఏర్పాటైందే జలగలంచ. తాడ్వాయి మండలం మేడారం అడవుల్లోని లవ్వాల సమీపంలో జలగలంచ ఉంది. ఇక్కడ 36 కుటుంబాలు ఉంటున్నాయి. పిల్లా, పాపలతో కలిపి 200 మంది దాకా ఉన్నారు. వీరంతా ఆకులు, అలములు తింటూ జీవనం సాగిస్తున్నారు. పనులు దొరికిన చోటకు కూలీలుగా వెళ్తున్నారు. ప్రభుత్వం వీళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా జారీ చేసింది. 87 మందికి ఓటు హక్కును కూడా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు, సహాయం అందక పోవడంతో జీవనోపాథి కోసం ఫారెస్ట్ లో నీటి వసతి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేస్తున్నారు. ఇదంతా అధికారులకు కంటగింపుగా మారింది. తరచూ గూడెంలోకి వెళ్లి బెదిరించడం మొదలుపెట్టారు.

200 మంది అటవీ సిబ్బంది జలగలంచపై విరుచుకుపడ్డారు...
గోదావరి పరీవాహక ప్రాంతంలో గొత్తికోయలు ఏర్పరచుకున్న గూడెంల్లో జలగలంచ పటిష్టంగా ఉంది. దీనిని నేలమట్టం చేసి గొత్తికోయలను నిరాశ్రయులను చేయడమే లక్యంగా మెరుపు దాడులకు పాల్పడ్డారు అటవీశాఖ అధికారులు. ఒక్కసారిగా 200 మంది అటవీ సిబ్బంది జలగలంచపై విరుచుకుపడ్డారు. నానాబీభత్సం సృష్టించారు. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా ఇళ్లు నేలమట్టం చేశారు. ఇళ్లు కూల్చవద్దని ప్రాధేయపడ్డ గొత్తికోయల మహిళలపై దాడి చేశారు. గూడెంలోని పది మంది మహిళలను సమీపంలోని ఇప్ప చెట్టుకు కట్టేసి నిర్భంధించారు. గొత్తికోయ మహిళలను లాఠీలతో బాదారు. చిన్న పిల్లల తల్లులను, వృద్ధులను ,గర్భిణులను ఈడ్చి పడేశారు. మహిళల దుస్తులు చిరిగిపోయాయి. 

17:36 - October 5, 2017

భూపాలపల్లి : మేడారం అడవుల్లో అధికారుల దాష్టీకంతో గొత్తికోయలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆదివాసీలు ఆర్తనాదాలు చేస్తున్నారు.. రెక్కల కష్టాన్ని నేలకూల్చారని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.. గూడు చెదిరిన గిరిజనులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు... ఆరుబయటే అష్ట కష్టాలతో అవస్థలు పడుతున్నారు.. మేడారం పరిధిలోని లవ్వాల కీకారణ్యంలో జలగలంచ గూడెంపై ఫారెస్ట్ అధికారుల దాష్టీకం తర్వాత ఆగూడెంలో ఎలా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:28 - October 5, 2017

ఢిల్లీ : నేషనల్ గ్రీన్ టీబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ, అటవీశాఖల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన విచారణలో ఎన్జీటీ ఈ తీర్పు జారీ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సాహిత్య రంగంలో బ్రిటన్ రచయితకు నోబెల్ పురస్కారం

ఢిల్లీ: సాహిత్య రంగంలో బ్రిటన్ రచయితకు నోబెల్ పురస్కారం లభించింది. కజువో ఇషిగురోకు నోబెల్ పురస్కారం అందనుంది.

టిడిపిలోకి ఎంపి బుట్టా రేణుక, గుర్నాథరెడ్డి!?

అమరావతి: వైసీపీ ఎంపి బుట్టా రేణుక, గుర్నాథరెడ్డి లు టిడిపిలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నారు. వీరితో పాటు గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డిలతో టిడిపి నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

రాళ్లు రువ్వుకున్న వైసీపీ,టిడిపి కార్యకర్తలు...

అనంతపురం: బొమ్మన హాళ్ లో వైసీపీ-టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి

17:10 - October 5, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. అన్ని డివిజన్లలో భారీగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలలో 15 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. పోలింగ్ పూర్తవడంతో ఓట్ల లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు నుంచి కౌటింగ్ ప్రారంభం కానుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ముగిసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు

కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. 11 డివిజన్లలో సింగరేణి కార్మికుటు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

ఆర్.నారాయణ మూర్తికి కొమరం భీమ్ జాతీయ పురస్కారం

హైదరాబాద్: నటుడు ఆర్. నారాయణ మూర్తికి కొమరం భీమ్ జాతీయ పురస్కారం అందుకోనున్నారు. ఈనెల 3వ వారంలో అవార్డు ప్రదానోత్సవం చేయనున్నారు.

16:53 - October 5, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య', 'సమంత' పెళ్లి గంటలు దగ్గర పడుతున్నాయి. శుక్రవారం గోవాలో వీరి వివాహం జరుగనుంది. వివాహానికి సంబంధించి మొన్న 'నాగ్' విశేషాలను తెలియచేసిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ శుభలేఖ సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ ట్విట్టర్ లో అభిమానులతో ట్వీట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

వివాహం హిందూ..క్రైస్తవ సంప్రదాయంలో జరుగుతుందని ఇదివరకే నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు మెహందీ వేడుక..రాత్రి 8.30గంటలకు విందు..రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరుగనుంది. శనివారం సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య క్రైస్తవ పద్ధతిలో వివాహం జరుగనుంది. అనంతరం విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నట్టు శుభలేఖ ద్వార తెలుస్తోంది. 

కర్ణాటక జైల్లో ఉన్న శశికళకు ఊరట

చెన్నై: కర్ణాటక జైల్లో ఉన్న శశికళకు ఊరట లభించింది. శశికళకు 15 రోజుల పెరోల్ ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎన్వోసీ ఇచ్చింది. పెరోల్ పై శశికళ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు

ఢిల్లీ:కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం పై ఎలాంటి కట్టడాలను చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని అత్యవసర సమావేశం...

ఢిల్లీ: ప్రధాని మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తున్నట్లు సమాచారం.

16:09 - October 5, 2017
16:08 - October 5, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని తిరుమలగిరి రెవెన్యూ కార్యాలయం ముందు ఓ కూతురు తండ్రి మృతదేహాంతో ధర్నా దిగారు. బల్లెం కృష్ణ తనకున్న 427 గజాల స్థలానికి ఎన్ఓసీ ఇవ్వలని 18 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగిన అధికారులు ఎన్ఓసీ ఇవ్వలేదు. దీంతో తన తండ్రి చావుకు అధికారుల వేధింపులే కారణమంటూ కూతురు ఆందోళనకు చేశారు. తహశీల్దార్, కలెక్టర్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

తండ్రి మృతదేహంతో కూతురు ధర్నా

సికింద్రాబాద్: తిరుమలగిరిలో తండ్రి మృతదేహంతో కూతురు ధర్నా చేపట్టింది. 427 గజాల స్థలానికి ఎన్ ఓసీ ఇవ్వమని 18 ఏళ్లుగా అధికారుల చుట్టూ బల్లెం కృష్ణ తిరిగినా అధికారులు తహశీల్దాఆర్, కలెక్టర్లు పట్టించుకోలేదని మండిపడుతోంది. తన తండ్రికి చావుకి అధికారుల వేధింపులే కారణం అంటూ కూతురు ఆందోళన చేపట్టింది.

15:56 - October 5, 2017

ప్రముఖ సినీ నటుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ పై మరోసారి చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఫ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు..ఇతరత్రా రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానిస్తుంటారు. తమ అభిమాన నటుడిని ఎవరైనా అంటే ఘాటుగా స్పందిస్తుంటారు. మొన్న 'అల్లు అర్జున్' ఏదో అన్నందుకు కూడా వాళ్లు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ పై సినిమా క్రిటిక్ 'మహేష్ కత్తి' చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ ఫ్యాన్స్ మాటల దాడి చేశారు. దొరికితే ఇరగదీస్తామని కూడా హెచ్చరికలు కూడా చేసేశారు.

మరోసారి 'పవన్ ఫ్యాన్స్' వార్తల్లోకి ఎక్కుతున్నారు. 'పవన్' మాజీ భార్య రేణు దేశాయ్ మీద అగ్గిలంమీద గుగ్గిలమవుతున్నారు. ఆమె మనస్సులో పెట్టుకున్న విషయాన్ని బయట పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. పవన్ తో విడాకులయిన అనంతరం ఇద్దరు పిల్లలతో రేణు ఒంటిరిగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పెళ్లి చేసుకొంటే తప్పా అని ఆమె వ్యాఖ్యానించినట్లు టాక్. దీనిని ఏమాత్రం సహించలేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేస్తున్నారు. పవన్ ని మాజీ భర్త అని సంబోధిస్తారా ? ఫ్యాన్స్ తక్కువ చేసి మాట్లాడుతారా ? అంటూ గరంగరమవుతున్నారు.

తాను అలా అనలేదని...ఫ్యాన్స్ ని తక్కువ చేసి మాట్లాడ లేదని రేణు చెబుతున్నా వాళ్లు మాత్రం సోషల్ మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. మరికొంత మంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. మహిళలకు స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి. మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. వాళ్ల కోసం చేయండి. వారికి చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు రక్షణ ఉందన్న భావన కలిగించండి. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించండి. మీడియా చానల్స్ తమ పవర్ చూపిస్తూ, టీవీల్లో డ్రామాలు, అపార్థాలు కలిగించే కథనాలను ప్రస్తావించవద్దు. అందరూ తమతమ కుటుంబాలు, ఇళ్లల్లోని మహిళల కోసం ఒకటిగా కదలాలన్నదే నా అభిమతం. కృతజ్ఞతలు" అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మరి ఫ్యాన్స్ ఇంతటితో ఆపుతారా ? లేదా ? అనేది చూడాలి. 

4 గంటల వరకు 85.30 శాతం పోలింగ్

కొత్తగూడెం: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4గంటల వరకు 44,810 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా... ఈ ఎన్నికల్లో మొత్తం 52,534 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. రంగంలో 15 సంఘాలు ఉన్నా ప్రధానంగా టీబీజీకేఎస్-ఏఐటీయూసీ కూటమిల మధ్య పోటీ నెలకొంది.

రేవంత్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ వైపు: ఎర్రబెల్లి

హైదరాబాద్: మీడియా చిట్ చాట్ లో ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఏపీలో చాలా క్రేజ్ ఉందని, అనంతపురంలో కేసీఆర్ కు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. టీడీపీలో రేవంత్ మినహా మోత్కుపల్లి, రావుల, ఎల్.రమణ అందరూ టీఆర్ ఎస్ వైపే అని, రేవంత్ రెడ్డి క్కొరే కాంగ్రెస్ వైపు అని జోశ్యం చెప్పారు.

 

15:30 - October 5, 2017

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తే యాంటీ మోడీ అయిపోతామా ? విమర్శిస్తే ఇక కేసులను ఎదుర్కొవాల్సిందేనా ? ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రధాని మోడీని తప్పు పట్టిన ప్రకాష్ రాజ్ పై ఓ న్యాయవాది ఏకంగా కేసు వేసేశారు. దీనికి ప్రకాష్ రాజ్ కూడా ధీటుగానే స్పందించారంట.

ఇటీవలే ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆందోళనలు..నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీనిపై సినీ నటుడు 'ప్రకాష్ రాజ్' స్పందించారు. గౌరీ లంకేశ్ హత్య విషయంలో మోడీ తీరును ఆయన తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ లాయర్ కేసు పెట్టేశారు. దీనిపై 'ప్రకాష్ రాజ్' స్పందించారు.

తనకు అబద్ధం మాట్లాడడం అలవాటు లేదని...తాను అన్న మాటల మీద నిలబడుతానని స్పష్టం చేశారు. తనకు మోడీ మీద గౌరవ ఉందని..కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఆయన తీరుతో ఏకీభవించడం లేదంటూ కుండబద్దలు కొట్టారు. విమర్శించిన మాత్రానా యాంటీ మోడీ అయినట్లు కాదని..తనపై విమర్శలు చేస్తున్న వారంతా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదన్నారు. మరి ఈ అంశం ఎంత దాక వెళుతుందో వేచి చూడాలి. 

15:30 - October 5, 2017

హైదరాబాద్ : నిన్న మణికొండలో అదృశ్యమైన బాలిక అనుక్ష ఆచూకీని పోలీసులు గుర్తించారు. అనుశ్రీని ముంబై చర్చిగేట్ రల్వేస్టేషన్ లో అక్కడి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుశ్రీ ఓ ప్రైవేట్ స్కూల్ లో టెన్త్ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్ వెళ్లిన అనుశ్రీ ఇంటికి తిరిగిరకపోవడంతో ఆమె తంగ్రి విక్రమ్ సింగ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి సీసీ ఫుటెజీ అధారంగా బాలిక మహారాష్ట వెళ్లినట్లు గుర్తించి అక్కడి పోలీసులు సమాచారం అందిడంతో బాలిక ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అనూశ్రీ ఆచూకీ లభ్యం...

హైదరాబాద్: మణికొండలో అదృశ్యమైన బాలిక అనుశ్రీని ముంబైలో పోలీసులు గుర్తించారు. నిన్న స్కూల్ కు వెళ్లి అదృశ్యమైన టెన్త్ విద్యార్థిని ఆచూకీ లభ్యం అయ్యింది.ముంబై చర్చిగేట్ రైల్వే స్టేషన్ లో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులకు ముంబై పోలీసులు సమాచారం ఇచ్చారు. ముంబై వెళ్లి అనుశ్రీని సైబరాబాద్ పోలీసులు తీసుకురానున్నారు.

15:22 - October 5, 2017

విజయనగరం : రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. స్థానిక రాజీవ్‌ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 17 వరకు.. ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి, కృష్ణా, యానాం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. మొత్తం ఐదు కేటగిరీల్లో జరిగే నియామక ప్రక్రియకు.. సుమారు 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:18 - October 5, 2017

చిత్తూరు : జిల్లా రామకుప్పం మండలం చెలిమిచేను జలపాతంలో ఓ యువకుడు గల్లంతైయ్యాడు. గల్లంతైన యువకుడు తమిళనాడు వాసిగా గుర్తించారు. జలపాతం వద్ద గాలింపు కొనసాగుతోంది. పర్యటకులు అత్యుత్సాహం ప్రదర్శించి మృత్యువాత పడుతుండడంతో జలపాతం వద్ద నిషేధజ్ఞాలు విధించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:12 - October 5, 2017

నిజామాబాద్ : ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో.. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కానీ సరిపడా సిబ్బందిని అధికారులు నియమించలేదు. దీంతో కొత్త జిల్లాల్లో పాలన కుంటుపడుతోంది. ప్రభుత్వ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. మూడేళ్లుగా సాధారణ బదిలీలతో పాటు ఇతర బదిలీలు లేక పలువురు ఉద్యోగులు సతమతమైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా.. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ ప్రభుత్వంలో బదిలీలపై కదలిక రాలేదు. భార్యాభర్తల విషయంలో తప్పించి ఇతర బదిలీలు జరగటం లేదు. దీంతో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది.

ఆర్డర్‌ టూ సర్వ్‌ బదిలీలకు మాత్రమే అవకాశం
పోలీసు శాఖ నుంచి రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ పంచాయితీ రాజ్‌ అన్ని ప్రభుత్వ శాఖలలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పదోన్నతులు లేక కామారెడ్డి, నిజామాబాద్ ఉభయ జిల్లాల పరిధిలోనూ ఇంచార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్డర్‌ టూ సర్వ్‌ బదిలీలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరగటం లేదు. పాలన ప్రజల వద్దకు చేరాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో కొత్త జిల్లాలు ఏర్పడగానే నిజామాబాద్ జిల్లాలోని వివిధ శాఖల వారిలో.. 42 శాతం మందిని కామారెడ్డికి బదిలీ చేసింది. ఉత్వర్వులు ఇచ్చేటప్పుడు కొన్ని రోజుల పాటే పని చేస్తే తరువాత మారుస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు ఒప్పుకున్నారు. బదిలీపై కొత్త జిల్లా కామారెడ్డికి వెళ్లారు. ప్రభుత్వం నుంచి సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

పదోన్నతుల కోసం ఎదురు చూపు
కామారెడ్డి, నిజాబాబాద్ ఉభయ జిల్లాలలో కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా శాఖలలో పదోన్నతులు రాకుండానే పదవీ విరమణ పొందుతున్నారు. పంచాయితీ రాజ్‌ శాఖలో డివిజనల్ పంచాయితీ అధికారి పోస్టులు తీసేశారు. జడ్పీ పరిధిలో పని చేస్తున్న ఎంపీడీవోలకు ఇప్పటివరకు పదోన్నతులు రావడం లేదు. ఇంజనీరింగ్ శాఖలో డీఈ నుంచి ఈఈగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి బదిలీలు జరిగితే చాలా మందికి మేలు జరుగుతుందని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. 

15:10 - October 5, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి నిర్మాణంలో మాస్టర్‌ ప్లాన్స్‌ రూపొందిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లలో అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్‌లను ఖరారు చేయనుంది. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్‌ పోస్టర్ కొన్ని వారాల క్రితం ఇచ్చిన డిజైన్లపై అంసతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాజమౌళిని సీఆర్ డీఎ ఉన్నతాధికారులతో కలసి లండన్‌కు తీసుకెళ్లి, నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ మేరకు 24, 25వ తేదీల్లో సీఎం చంద్రబాబు లండన్‌కు పయనమవుతారు. అనంతరం నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చర్చలు జరిపి అసెంబ్లీ, హైకోర్టు, ఇతర భవంతుల తుది ఆకృతులను ఓ కొలిక్కి తేనున్నారు. అలాగే వంద మంది రైతులను మూడు బృందాలుగా సింగపూర్‌ టూర్‌కు పంపించి ఆ దేశ అభివృద్ధి.. క్యాపిటల్‌ సిటీలోని విధివిధానాలను రైతులకు సీఆర్ డీఎ అధికారులు వివరించనున్నారు.

టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది....
అమరావతి రూపకల్పనలో కీలకమైన రహదారులకు సంబంధించి టెండర్లను ఖరారు చేయనున్నారు. రాజధానిలో సుమారు 365 కిలోమీటర్ల పొడవైన రహదారులకు టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. అలాగే రిటర్నబుల్ ప్లాట్‌లున్న ఎల్పీఎస్ లే-అవుట్ల అభివృద్ధికి సంబంధించిన టెండర్లన్నీ అక్టోబర్ 15కల్లా ఖరారవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెగ్ మార్కింగ్ పనులు జరుగుతున్న వివిధ లే-అవుట్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు సుమారు 14 వేల కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లు త్వరితగతిన ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.

ఐకానిక్ బ్రిడ్జితోపాటు సీడ్ యాక్సెస్ రహదారి
భారీ ఉద్యాన వనాలు, కృష్ణానదిపై గవర్నమెంట్ కాంప్లెక్స్-పవిత్ర సంగమం ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించదలచిన ఐకానిక్ బ్రిడ్జితోపాటు సీడ్ యాక్సెస్ రహదారి, గ్రీనరీ పనుల విషయంలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుప్రసిద్ధ హోటల్ గ్రూపులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సీఆర్డీఏ చర్చలు జరిపి ఓ కొలిక్కి తేనున్నారు. అలాగే రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా... అమరావతి అంటూ .. చంద్రబాబునాయుడు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు తప్ప.. పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఏదిఏమైనా... అమరావతి నిర్మాణం ఇప్పటికైనా..ఓ కొలిక్కి వస్తుందో...లేదో వేచి చూడాలి.  

15:09 - October 5, 2017

కృష్ణా : విజయవాడ మెట్రో పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రానికి రివైజ్డ్‌ డీపీఆర్‌ సమర్పించే విషయంలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి కానీ, ఏఏంఆర్సీ నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. దీంతో విజయవాడ మెట్రోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డీఎంఆర్సీ అధికారులు అసహనంతో
లైట్ మెట్రో ప్రాజెక్ట్‌ డీపీఆర్ కు టెండర్లు పిలిచారు. దీంతో డీఎంఆర్సీ అధికారులు అసహనంతో ఉన్నారు. దీనిపై తాడోపేడు తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మీడియం మెట్రోలో తాము కొనసాగాలో వద్దో అక్టోబర్ 15వ తేదీలోగా స్పష్టత ఇవ్వాలని ఏఎంఆర్సీకి డీఎంఆర్సీ డెడ్ లైన్ విధించినట్టు సమాచారం. ఏఎంఆర్సీ నుంచి సమాధానం రాకపోతే డీఎంఆర్సీ ఇక్కడి నుంచి వైదొలిగే అవకాశముంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం మీడియం మెట్రో మౌఖికంగా అనుమతులు ఇచ్చింది. అయితే తుది అనుమతులు ఇవ్వడానికి మాత్రం మూడేళ్ల సమయం పట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చుక్కలు చూపించింది. ఇప్పుడు లైట్‌రైల్‌ ప్రాజెక్టు కోసం ఏపీ డీపీఆర్‌ సిద్ధం చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అంత సానుకూలంగా అనుమతులు ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

టెండర్లలో కాంట్రాక్ట్‌ సంస్థలు భారీ రేట్లకు కోట్‌
మీడియం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం పిలిచిన టెండర్లలో కాంట్రాక్ట్‌ సంస్థలు భారీ రేట్లకు కోట్‌ చేశాయి. దీంతో 2015 మే 25వ తేదీన డీఎంఆర్సీ రెండు కారిడార్ల టెండర్లను రద్దు చేసింది. హైరేట్ కోట్ చేసిన సంస్థలకు అప్పగించాలన్న ఒత్తిడి మున్సిపల్ మంత్రిత్వ శాఖ నుంచి డీఎంఆర్సీకి వచ్చినా.. ఇలాంటి టెండర్లు ఖరారు చేస్తే భవిష్యత్తులో కేసులను ఎదుర్కొవాల్సి వస్తుందన్న కారణంగా ఆ టెండర్లను రద్దు చేసింది. దీనిపై డీఎంఆర్సీ ప్రభుత్వానికి అనేక దఫాలుగా లేఖలు రాసింది. దీంతో మెట్రో అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా డీఎంఆర్సీతో తలెత్తిన విభేదాలు సైతం మెట్రోకు అడ్డంకిగా మారాయి. మొత్తానికి విజయవాడ నగరంలో మెట్రో నిర్మాణంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండానే ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు మెట్రో ప్రాజెక్ట్‌ త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

అమరావతి: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా ఎం పద్మ, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా గంధం చంద్రుడు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా కె.విజయ, దివ్యాంగుల కార్పొరేషన్ ఎండీగా చక్రవర్తి బదిలీ అయ్యారు.

చెలిమిచేను జలపాతం లో పడి యువకుడి మృతి

చిత్తూరు: రామకుప్పం మండలం చెలిమిచేను జలపాతం వద్ద ప్రమాదవశాత్తు లోయలో పడి తమిళ యువకుడు మృతి చెందాడు. చెలిమినేడు జలపాతం వద్ద నెల రోజుల్లో ముగ్గురు మృతి చెందారు.

వాల్మీకి జయంతి మనకు పండుగ రోజు:మంత్రి కడియం

హైదరాబాద్: వాల్మీకి జయంతి మనకు పండుగ రోజు అని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మూడుళ్లుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక ఆర్థికాభివృద్ధికే సీఎం ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాల్మీకీలకు ఎస్టీలో కలపాలనే చెల్లప్ప కమిషన్ వేశామన్నారు. ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించామని కడియం పేర్కొన్నారు.

జగన్ స్వామీజీలను కలవడం మంచిదే: మంత్రి అయ్యన్న

విశాఖ: ప్రతి ఒక్కరికి దైవబలం అవసరం అని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ స్వామీజీలను కలవడం మంచిదేనని, అపుడైనా జగన్ కు మంచి బుద్ధి వస్తుందని తెలిపారు.

జమిలీ ఎన్నికలకు సిద్ధం :ఈసీ

భోపాల్: దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సిద్ధం అని ఈసీ ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వమించేందుకు సిద్ధం అని ఈసీ రావత్ తెలిపారు. జమిలీ ఎన్నికలతో రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందన్నారు.

14:20 - October 5, 2017

కర్నూలు : జిల్లా ప్యాపిలిలో కీచక ఉద్యోగికి స్థానికుల దేహశుద్ధి చేశారు. మహిళా పంచాయితీ కార్యదర్శికి సహా ఉద్యోగి జనార్ధన్ అసభ్య మెసేజ్ లు చేస్తూ 2 నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు గ్రామస్తులకు విషయాని చెప్పింది. అదే టైమ్ లో జనర్ధన్ నుంచి మరోమ మెసెజ్ రావడంతో ఆగ్రహించిన స్థానికులు జనార్థన్ పంచాయితీ కార్యాలయం నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:19 - October 5, 2017

భూపాలపల్లి : జిల్లా గణపురం మండలపరిధిలోని కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8 ఇంక్లైన్ మైన్ మీద టీజీబీకేఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సింగరేణి కార్మికులకు డబ్బుల పంపిణీ..

కరీంనగర్ : జయశంకర్ భూపాల జిల్లా గణపురం మండల పరిధిలోని కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8 ఇంక్లైన్ మైన్ మీద సింగరేణి కార్మికులకు బహిరంగంగా టీబీజీకేఎస్ నాయకులు డబ్బులు పంచారు. 

ఇన్ కం ట్యాక్స్ ఆఫీసుకు మంత్రి..

బెంగళూరు : కర్నాటక మినిస్టర్ డీకే శివకుమార్ ఇన్ కం ట్యాక్స్ ఆఫీసుకు చేరుకున్నారు. ఇన్ కం ట్యాక్స్ శాఖ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హాజరయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రశాంతంగా సింగరేణి పోలింగ్..

కరీంనగర్ : సింగరేణి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మందమర్రిలో మధ్యాహ్నం 12 గంటల వరకు 59 శాతం, బెల్లంపల్లిలో 72 శాతం, శ్రీరాంపూర్ లో 60 శాతం పోలింగ్ నమోదైంది. 

బట్టలు ఉతకడానికి వెళ్లి...

శ్రీకాకుళం : లావేరు (మం) గుర్రాలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు మృతి చెందారు. పతివాడ నాగమ్మ (45), పతివాడ శిరీష (13), బండారి దుర్గ (16)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

13:47 - October 5, 2017

సూర్యాపేట : జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న జాల వేణు అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన వేణును.. సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. కాగా వేణు మెల్లచెర్వు మండలం..వేపలమదపురం గ్రామానికి చెందిన వ్యక్తి. దసరా సెలవులకు ఇంటికి వెళ్లేటప్పుడే తాను మళ్లీ హాస్టల్ కు రానని ... హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని తోటి విద్యార్థుతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై ఇంటి దగ్గర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వచ్చినప్పుడే వేణు పరుగుల మందు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

తుళ్లూరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు..

గుంటూరు : జిల్లా తుళ్లూరు ఎస్సై గుడిపూడి సందీప్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో సస్పెండ్‌ చేస్తూ రేంజ్‌ డీఐజీ కేవీవీ గోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై ఉద్యోగం రాకముందు విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువతితో సందీప్‌ ఏడేళ్లు ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

పురుగుల మందు తాగిన విద్యార్థి...

సూర్యాపేట : జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న జాల వేణు అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పురుగుల మందు తాగిన వేణును సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. కాగా వేణు మెల్లచెర్వు మండలం..వేపలమదపురం గ్రామానికి చెందిన వ్యక్తి.

 

సింగరేణి ఎన్నికలు..పోలింగ్ శాతం...

కరీంనగర్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్‌లో 52%, మందమర్రిలో 38%, బెల్లంపల్లిలో 42% పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో 28%, మణుగూరులో 56%, ఇల్లెందులో 63%, సత్తుపల్లిలో 50% పోలింగ్‌ రికార్డయింది. భూపాలపల్లిలో 30% పోలింగ్‌ నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లా ఆర్‌జి1, ఆర్‌జి2, ఆర్‌జి3లో సుమారు 50% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. 

13:42 - October 5, 2017

పెద్దపల్లి : జిల్లాలోని సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు రామగుండం పరిధిలోని 3  డివిజన్ల లో ఇప్పటి వరకు 56 %నమోదు ఐనది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ సంబందించిన ఏర్పాట్లు కొనసాగుతుంది..కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

13:40 - October 5, 2017

ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు

ఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార వ్యవస్థ మెరుగుపై సీఎం చంద్రబాబు సూచలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాస్టర్ కార్డ్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం

ఢిల్లీ: మాస్టర్ కార్డ్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు, మాస్టర్ కార్డు ఛైర్మన్ మార్చుకున్నారు.

జనగామలో అమెజాన్ షోరూం ప్రారంభం...

జనగామ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ జనగామలో తన షోరూంను ఏర్పాటు చేసింది. ఈ షోరూంను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. దీంతో జనగామ వాసులు అమెజాన్ సంస్థ ద్వారా తీసుకున్న ప్రాడక్ట్స్ వివరాలు, డెలివరీ ఇష్యూలు, అడ్రస్ చేంజ్ ఇష్యూలు, ప్రాడక్ట్ ఇష్యూలు లాంటి వాటిని షోరూంకు వెళ్లి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

విజయవాడలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

విజయవాడ: ఆర్టీసీ భవన్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు.

13:03 - October 5, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పాలన ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులను అధిగమించిన ఏపీ ప్రభుత్వం.. పాలన యంత్రాంగం మొత్తాన్ని హైదరాబాద్‌ నుంచి అమరావతికి మార్చగలిగింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే కొనసాగే -అవకాశం ఉన్నా.. రెండేళ్లలోపే.. సొంత గడ్డపై నుంచి పాలనను ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. గడచిన ఏడాది కాలంలో.. అమరావతి కేంద్రంగా సాగిన పాలన ఎలా ఉంది..? ప్రభుత్వం ప్రజలకు చేరువైందా..?  అమరావతి భవనాల నాణ్యత ఎంత..? మొదలైన అంశాలపై 10టీవీ స్పెషల్‌ ఫోకస్‌.. 

అక్టోబర్‌ 3, 2016... నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పాలన యంత్రాంగం తరలి వచ్చిన రోజు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక.. 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది. విభజన చట్టం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచే పదేళ్ల పాటు.. నవ్యాంధ్రను పరిపాలించే వీలుంది. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల లోపే.. సొంతగడ్డ నుంచి పాలనను ప్రారంభించింది. 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పాలన ప్రారంభించడానికి, ఓటుకు నోటు కేసే కారణమంటూ ఏపీలోని విపక్షం.. తెలంగాణ ప్రాంత రాజకీయ పక్షాలు ఆరోపించాయి. కారణాలేవైనా.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లకే.. ఏపీలో పాలన అమరావతి నుంచి ప్రారంభమైంది. శాశ్వత రాజధాని నిర్మాణం అంత తేలిక కాదన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాత్కాలిక భవనాలు నిర్మించి.. పాలన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉద్యోగుల్లో స్పూర్తిని నింపి.. అందరూ.. అమరావతికి తరలి వచ్చేలా చర్యలు తీసుకుంది. 

నవ్యాంధ్ర రాజధాని కోసం తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో దాదాపు 33వేల ఎకరాల భూమిని సమీకరించుకున్న ప్రభుత్వం.. వెలగపూడి ప్రాంతంలో.. తాత్కాలిక రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది.  మొదట్లో పాలన కోసం తాత్కాలిక భవనాలు నిర్మించాలా? లేక ఉన్న భవనాలను వాడుకొని పాలన సాగించాలా? అని ప్రభుత్వం డైలామాలో పడింది. అప్పట్లో గన్నవరం మేధా టవర్స్‌ తాత్కాలిక పాలనకు అనువైన ప్రాంతంగా భావించింది. మొత్తం సచివాలయ ఉద్యోగులకు సరిపడా స్థలం ఉండటం, రవాణా సదుపాయాలు బాగుండటంతో మేధా టవర్స్‌ని తాత్కాలిక పాలనకు అనువైన ప్రాంతంగా నిర్ణయించుకుంది. అయితే అమరావతి టౌన్‌ షిప్‌ వాస్తు అంతగా బాగోలేదని ఏపీ ప్రభుత్వం.. చివరకు తాత్కాలిక పాలన కేంద్రాన్ని వెలగపూడికి మార్చింది. వెలగపూడిలోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించాలని భావించి.. 2016 ఫిబ్రవరి 17న ఆ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

12:43 - October 5, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో ఉన్న సాహెబ్ చెరువు నిండి పొంగిపొర్లుతోంది. మూడేళ్లుగా సరిగా వర్షాలు లేకపోవడంతో వెలవెలబోయిన చెరువు జలకళను సంతరించుకుంది. చిత్రావతి నదిలోకి నీరు రావడంతో పుట్టపర్తి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో.. వర్షాలు కురవడంతో ప్రజల ఆనందానిక అవధులు లేకుండాపోయాయి. 

 

12:40 - October 5, 2017

హైదరాబాద్ : మణికొండలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం ఘటన తీవ్ర కలకలం రేపింది. సెక్రటేరియట్‌ కాలనీకి చెందిన విక్రంసింగ్‌ కూతురు అనుశ్రీ స్థానిక శ్రీచైతన్య స్కూల్ లో టెన్త్‌ చదువుతోంది. నిన్న ఉదయం స్కూల్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే తమ కూతురును కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:32 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్‌లో 52%, మందమర్రిలో 38%, బెల్లంపల్లిలో 42% పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో 28%, మణుగూరులో 56%, ఇల్లెందులో 63%, సత్తుపల్లిలో 50% పోలింగ్‌ రికార్డయింది. భూపాలపల్లిలో 30% పోలింగ్‌ నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లా ఆర్‌జి1, ఆర్‌జి2, ఆర్‌జి3లో సుమారు 50% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:28 - October 5, 2017

ప్రస్తుతం టీవీలేని ఇల్లు ఉండదు. రోజు రోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా పలు రకాలైన టీవీలు మార్కెట్ లో విడుదలవుతున్నాయి. వేల నుండి మొదలు కొంటే లక్షల రూపాయల ఖరీదైన టీవీలు మనకు కనబడుతుంటాయి. కానీ టీవీ కొనుక్కొని చూస్తే సరిపోదని..దానిని శుభ్రం చేసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

టీవీని శుభ్రం చేయాలని ఎలాపడితే అలా తుడిచేస్తుంటారు. దీనివల్ల టీవీపై ఉన్న దుమ్ము..మరకలు అలాగే ఉండిపోతాయి. ఎక్కువ వత్తిడితో టీవీని తుడిస్తే టీవీ గ్యాస్ పై గీరలు పడే అవకాశం ఉంది. అందుకని మెత్తటి బట్ట తీసుకుని ముందు దుమ్ము పోయేలా తుడవాలి. అంతకంటే ముందుగా టీవీ మానిటర్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. నీళ్లు..వెనిగర్ లు సమానంగా తీసుకుని అందులో మెత్తటి క్లాత్ ముంచి టీవీపై మెల్లిగా తుడవాలి. అనంతరం పొడి క్లాత్‌తో కూడా తుడవాలి.
అమ్మెనియా..ఎసిటోన్..ఇథైల్ అల్కహాల్ లాంటి రసాయనలతో తుడిస్తే టీవీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. స్ప్రే మానిటర్‌ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్‌ పాడైపోయే అవకాశం ఉంది. 

12:25 - October 5, 2017

జనగాం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వరంగల్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు వనపర్తి వెళ్తోంది. మార్గంమధ్యలో ఘన్ పూర్ మండలం చాగల్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ టీఎస్ రెడ్డి, ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హన్మకొండ డిపో మేనేజర్ గాయపడిన వారిని సందర్శించారు. తర్వాత కండెక్టర్ ను అడిగి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నూతన ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలోకి వర్షపు నీరు

విజయవాడ: ఆర్టీసీ భవన్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించనున్నారు. ప్రారంభించముందే కార్యాలయంలోకి వర్షంపు నీరు చేరింది. అప్పమత్తమైన సిబ్బంది హుటాహుటిన నీటిని తొలగిస్తున్నారు.

12:18 - October 5, 2017

రెడ్‌ కలర్‌ డిజైనర్‌ డ్రెస్‌...ముఖంపై మందంగా మేకప్‌..మెడలో ధగధగమెరిసే నగలు.. చేతికి ఖరీదైన ఉంగరాలు..చేతిలో త్రిశూలం...మరో చేతిలో ఎర్ర గులాబీలు...చూడ్డానికి అమాయకురాలిగా కనిపిస్తుంది..తనను తాను దుర్గామాత అవతారమని చెప్పుకుంటుంది....ఆమె ఎవరో కాదు...'రాధే మా'...వేల కోట్ల సంపాదన..లగ్జరీ కార్లు..విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటుందని ఆరోపణలు వినిస్తుండడం తెలిసిందే. వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్న ఈమెపై తాజాగా మరోకటి తెరపైకి వచ్చింది.

దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' కు భక్తులు కూడా ఉన్నారు. ఆమె ఎక్కడకు వెళ్లినా దండాలు..ఘన స్వాగతాలు పలుకుతుంటారు. ఆమె భక్తులంతా సంపన్న వర్గాలకు చెందిన వారేనని తెలుస్తోంది. ఈమెను అనుసరించే వారిలో ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. తాజాగా ఈమె దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ పీఎస్ ను సందర్శించింది. దీనితో అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ స్వాగతం పలికారు. ఏకంగా ఆమె అధికారి కుర్చీలో కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిలుచుని ఉండడం..దండం పెడుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. దైవాంశసంభూతురాలిగా చెప్పుకొనే 'రాధా' అధికారి కుర్చీలో కూర్చొవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను డిస్ట్రిక్ లైన్స్ కు పంపించినట్లు, సీపీ ఈస్ట్రన్ రేంజ్ కు జాయింట్ చేసినట్లు సమాచారం. 

మహబూబ్ నగర్ -దేవరకద్ర వద్ద రైలు పట్టాల మార్పిడి...

మహబూబాబాద్: మహబూబ్ నగర్ -దేవరకద్ర వద్ద రైలు పట్టాలను రైల్వే సిబ్బంది మారుస్తున్నారు. మ. 2 గంటల వరకు రైల్వే పనులు జరగనున్నాయి. దీంతో పలు రైళ్లను నిలిపివేశారు. కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లే రైళ్లను సమీప స్టేషన్ ల అధికారులు నిలిపి వేస్తున్నారు.

12:08 - October 5, 2017
12:03 - October 5, 2017

పలు చిత్రాల్లో స్పెషల్ పాటలు కామన్ అయిపోయాయి. అగ్ర హీరోలు..పేరొందిన నటుల సిన్మాలో ఈ పాటలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పాటల్లో నర్చించేందుకు హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే పలు అగ్రహీరోల సినిమాలు..యంగ్ హీరోల సిన్మాల్లో హీరోయిన్లు ఆడి..పాడిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్' హీరోగా 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో 'చెర్రీ' సరసన 'సమంత' నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమా కథ ఉండనుంది. ఇటీవలే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం 'పూజా హెగ్డే' చిత్ర బృందం సమర్పించినట్లు టాక్. పూజా హెగ్డే 'డీజే' సినిమాలో 'అల్లు అర్జున్' తో కలిసి ఆడిపాడింది. అంతేగాకుండా బెల్లంకొండతో కొత్త సినిమాలో కూడా నటిస్తోంది. మరి 'రామ్‌ చరణ్‌'తో ఆడి పాడేందుకు సిద్ధమౌతుందా ? లేదా ?అనేది చూడాలి. 

12:00 - October 5, 2017
11:59 - October 5, 2017
11:57 - October 5, 2017

చెన్నై : చిత్తూరు జిల్లా, కుప్పం సరిహద్దులోని.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సమీపంలోని తండేకుప్పం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో రాధ (65) ఆమె కుమార్తె పుష్ప (35), పుష్ప ముగ్గురు పిల్లలు వసంతకుమార్‌ (15), భగవతి (13), ముల్లా(8) ఉన్నారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

 

11:56 - October 5, 2017

తాజ్ మహల్...ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం ఇంకోటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చరిత్ర చెబుతోంది. ఈ అత్యంత అద్భుతమైన కట్టడాన్ని చూడటానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. ఈ కట్టడాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు.

తాజ్ మహల్ ను చూడటానికి గురువారం చాలా మంది విచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోజు శరద్ పూర్ణిమ కావడం..చంద్రుడు నిండుగా వెండి వెలుగులను విరజిమ్మనుంది. తాజ్ మహల్ పాలరాళ్లపై పడే చంద్రుని వెలుగులను చూడటానికి చాలా మంది వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆగ్రాకు దేశ..విదేశీ పర్యాటకులు క్యూ కట్టారంట. నేటి రాత్రి 8.30 నుండి పున్నమి చంద్రుడి కాంతులను చూడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

అయితే ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ తాజ్ మహల్ పై యూపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 'యోగి సర్కార్' వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటోంది. పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌మహల్‌ పేరు పేర్కొనలేదు. తాజ్‌ మహల్‌ను తొలగించి ఆ స్థానంలో యోగి ఆదిత్యనాథ్‌ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని చేర్చిన విషయం తెలిసిందే. దీంతో యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తాజ్ మహల్ పై పలు కామెంట్స్ చేశారు. ఈ కట్టడాన్ని కూల్చివేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడం వల్ల మరింత ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద నీరు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద నీరు పెరిగింది. ప్రస్తుతం నీటిమట్టం 10.6 అడుగులకు చేరింది. పట్టిసీమ నుంచి 9,598 క్యూసెక్కుల వరద వస్తుంది. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి 6,081 క్యూసెక్కుల వరద చేరుతుంది. తూర్పు డెల్టాకు 6,165 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.

పోలవరం విలీన గ్రామాల్లో సీపీఎం నేత మధు పర్యటన

ప.గో: పోలవరం విలీన గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటిస్తున్నారు. వీర్ పురం మండలం జీడిగుప్పలో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరం డిప్యూటీ కలెక్టర్ అవినీతిపై మధు ఎదుట బాధితులు వాపోయారు. నిర్వాసితుల నష్టపరిహారం పంపిణీలో అవకతవకలపై విచారణ జరపించాలని మధు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని మధు హెచ్చరించారు.

వివాహిత అదృశ్యం ....ఏలూరులో బంధువులు ఆందోళన

ప.గో: పెంటపాడులో 5 నెలలుగా వివాహిత అదృశ్యం అయ్యింది. గణపవరం మండలం అప్పన్న పేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పిన్నెంటి స్నేహలత పనిచేస్తోంది. పెంటపాడు పీఎస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసుల తీరుకు నిరసనగా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు.

11:34 - October 5, 2017

గుంటూరు : తాత్కాలిక సచివాలయంలో పాలన సజావుగా సాగుతుందన్న భావనలో ఉన్న ప్రభుత్వానికి.. ఆ మధ్య కురిసిన వర్షం.. దిగ్భ్రాంతికి గురిచేసింది. భవన నిర్మాణపు నాణ్యతపై అనుమానాలను పెంచింది. కొద్దిపాటి వర్షానికే విపక్ష నేత గదిలో.. వర్షపు నీరు ధారగా కురవడంతో.. భవనం నాసిరకంగా నిర్మించారన్న అనుమానాలు వచ్చాయి. దీంతోపాటే.. భవన నిర్మాణ అంచనాలు అంతకంతకూ పెరిగిపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. 

సచివాలయం నిర్మాణం విషయంలో ప్రశంసలు, విమర్శలు సమపాళ్లలో వినిపించాయి. ఈ ఏడాది జూన్‌, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షానికి సచివాలయంలోని బ్లాక్‌లోకి వర్షపు నీరు చేరింది. మంత్రుల కార్యాలయాల్లోకి, క్యాంటీన్‌లోకి నీరు రావడం వివాదాస్పదమైంది. అదే రోజు అసెంబ్లీలోని జగన్‌ చాంబర్‌లోకి నీరు రావడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాణ్యతా ప్రమాణాలు లేకుండా హడావిడిగా నిర్మాణాలు చేశారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణ లోపాలను సరి చేసింది. 

210 కోట్లతో ప్రారంభించిన తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తయ్యే సరికి 800 కోట్లకు చేరింది. ఈ విషయంలో విమర్శలు బాగానే వచ్చాయి. తాత్కాలిక భవనాలను, భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చనే భావనతో.. తాత్కాలిక సచివాలయాన్ని ఎక్కువ ఖర్చు చేసి నిర్మించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 

సచివాలయానికి వచ్చిన కొత్తలో రవాణా సదుపాయాలు లేకపోవడం, రోడ్లు సరిగా లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. మొత్తం పొలాల మధ్యలో సచివాలయం నిర్మించడంతో సరైన వసతులు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే తర్వాత కాలంలో ఆర్టీసీ సర్వీసులు పెంచడంతో పాటు ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా బస్సులు నడుపుతుండడం, కొత్తగా సచివాలయానికి రోడ్లు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులకు హాజరవుతున్నారు. సచివాలయం వద్ద అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయడం, రెస్టారెంట్స్‌ ఏర్పాటు కావడంతో ఉద్యోగులు మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు. 

ఏడాది క్రితం ఏపీ సచివాలయం.. ఏడాది తర్వాత ఏపీ సచివాలయం.. ఈ మాట అటు ఉద్యోగులు, ఇటు అధికారులు, సామాన్య ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలా పనులు చేయాలని భయపడిన ఉద్యోగులు.. ప్రస్తుత వాతావరణాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో పాలన చేసుకుంటున్న ప్రభుత్వం, త్వరలోనే శాశ్వత భవనాల నిర్మాణాలను కూడా ప్రారంభించబోతోంది. విభజన వల్ల నష్టపోయి, కసిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. 

అమరావతిలో ఏడాది పాలన పట్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లకుండా ప్రజలు అమరావతికి వస్తున్నారు. అయితే వారికి అమాత్యులే అంతగా అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఈ ప్రాంతంలో భద్రత వలయం కూడా సామాన్యులను మంత్రుల వద్దకు చేరుకోనీయకుండా అడ్డుపడుతోందన్న భావన వ్యక్తమవుతోంది. 

సింగరేణి ఎన్నికల్లో 52 శాతం పోలింగ్ నమోదు

భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.

విజయవాడలో భారీ వర్షం

విజయవాడ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పటమట, ఆటోనగర్, మొగట్రాజపురం, గుణదల, బెంజిసర్కిల్, కాన్వెంట్ రోడ్డు, వాంబే కాలనీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

11:28 - October 5, 2017

గుంటూరు : తాత్కాలిక సచివాలయం పనులకు ఎక్కువ సమయం పడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేసి.. పాలన ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీతో.. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా సచివాలయాన్ని నిర్మించింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన 120 రోజుల్లోనే.. భవనాలను పూర్తి చేసి పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు రావడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక సచివాలయం అంటే కనీసం సంవత్సరం పైనే పడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన సమయానికి.. 4 నెలలు ఆలస్యంగా పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించారు.  

మొత్తం సచివాలయాన్ని 5 బ్లాక్‌లుగా.. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొదట 5వ బ్లాక్‌ను జూన్‌ 29న తాత్కాలికంగా ప్రారంభించారు. కానీ మొత్తం 5 బ్లాక్‌ల పనులు పూర్తి చేసి అందులోఅధికారికంగా ఉద్యోగుల పాలన ప్రారంభించింది మాత్రం అక్టోబర్‌ 3, 2016న. సచివాలయ ఉద్యోగులతో పాటు విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేసిన కమీషనరేట్స్‌, హెచ్‌వోడి కార్యాలయాలకు కూడా అదే రోజు ఉద్యోగులు తరలివచ్చారు. 

హైదరాబాద్‌లో ఉండే సచివాలయానికి.. అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి చాలా తేడా ఉంది. తాత్కాలిక భవనాలు అంటే సాదా సీదాగా  నిర్మిస్తారని అందరూ భావించారు. హైదరాబాద్‌లోని సచివాలయంతో ఏమాత్రం పోల్చలేని విధంగా.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని.. అమరావతి తాత్కాలిక సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించింది. సచివాలయం భవనాల్లో సర్వత్రా సెంట్రల్ ఏసీని ఏర్పాటు చేసింది. సచివాలయం మొత్తం వైఫై ఏర్పాటు చేసింది. మహిళా ఉద్యోగులకు వసతి సౌకర్యం, ఉచిత బస్‌పాస్‌ సౌకర్యాలను కల్పించింది ఏపీ ప్రభుత్వం. 

సచివాలయంలో పని చేసే ఉద్యోగుల కోసం అత్యాధునిక భద్రతా ప్రమాణాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైనా బ్లాక్‌లో అగ్నిప్రమాదం జరిగితే ఉద్యోగులను అలర్ట్‌ చేయడానికి.. సెంట్రల్‌ ఫైర్‌ అలారం సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయం లోపల ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతీ బ్లాక్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

మరోసారి పార్టీ అధ్యక్షుడుగా అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్: సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్ల పాటు పార్టీ అధ్యక్ష హోదాలో అఖిలేష్ కొనసాగనున్నారు.

11:23 - October 5, 2017

విశాఖ : ఏజెన్సీలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు కోనం, రైవాడ, పెద్దేరు రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. కోనం రిజర్వాయర్‌ కాలువకు గండి పడటంతో.. 28 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నాటు పడవలపై ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కోనం రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 101.25  మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 100.50 మీటర్లుగా ఉంది. 

11:22 - October 5, 2017

హైదరాబాద్‌ : నగరంలో విషాదం చోటు చేసుకుంది. నాగోల్‌ శుభం కన్వెన్షన్‌ హాల్‌లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆడుకుంటూ వెళ్లి నీటి కొలనులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. చిన్నారుల మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:19 - October 5, 2017

శేషాచలం అటవీప్రాంతంలో కూంబింగ్

తిరుపతి:శేషాచలం అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సమయంలో పెరుమాళ్లపల్లి వద్ద అటవీ ప్రాంతంలో 8 మంది తమిళ కూలీలు వారికి తారసపడ్డారు. వారి వద్ద నుంచి 7 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

11:15 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల బరిలో 16 కార్మిక సంఘాలు ఉండగా... టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 52 వేల 534 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మరోవైపు ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో టీబీజీకేఎస్ నాయకుల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం, ఇల్లందు, మంథనిలో ఓటు తమకే వేయాలంటూ నాయకులు అభ్యర్థిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

కొనసాగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు

భద్రాద్రి: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలుకొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

సీబీఐ ఎదుట విచారణకు లాలూ ప్రసాద్

ఢిల్లీ: సీబీఐ ఎదుట విచారణకు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ఐఆర్ సీటీసీ హోటల్స్ స్కాంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

10:46 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. రామగుండంలో 12 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్త ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ఎన్నికలు ఉండటంతో గనులపై 144 సెక్షన్ విధించారు. ఓటు వేయడానికి వచ్చే కార్మికుడి సంస్థ గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. పోటీల్లో 8 సంఘాలు పాల్గొంటున్నాయి. అన్ని సంఘాలు ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. 
టీబీజీకేఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన 
పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఓసీపీ రెండో ఉపరితల గనిలో టీబీజీకేఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘంచి ప్రచారం నిర్వహిస్తోంది. ఇవాళ ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు టీబీజీకేఎస్ జెండాలు కట్టి కార్మికులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెండాలను తోరణాలుగా కట్టి టీబీజీకేఎస్ బాణం గుర్తు ఉన్న టీషర్ట్స్ ధరించారు. తమకు ఓటు వేయాలని నేతలు ప్రచారం చేస్తున్నారు. 
సీఐటీయూ నేత 
'సర్పంచ్ నుంచి సీఎం కేసీఆర్ వరకు దిగజారి ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు వేల కోట్లు పంచిపెట్టారు. ఇది దగుల్బాది ప్రభుత్వం. టీబీజీకేఎస్ ఓటమి ఖాయం.. సీఐటీయు విజయం సాధిస్తుంది. టీబీజీకేఎస్ లో కార్మికులు లేరు. కిరాయి గుండాలు, లంచగొండులు ఉన్నారు. జంపింగ్ మాస్టర్లు ఉన్నారు' అని ఎద్దేవా చేశారు. 
హెచ్ ఎంఎస్ నేత
'హెచ్ ఎంఎస్ గెలుస్తుంది. అధికార పార్టీ, అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ పై నిప్పులు చెరిగారు. కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే, ఎంపీలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర సంఘాల నాయకులను భయపెట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రతి కార్మికునికి మూడు వేల రూపాయలు ఇచ్చి ఓటు వేయమని అడుగుతున్నారు' అని ఆరోపించారు. 
టీఆర్ ఎస్ నేత వేణుగోపాలాచారి.. 
'సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధిస్తుంది. 11 డివిజన్లలో బాణం గుర్తు గెలుస్తుంది' అని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

తుళ్లూరు ఎస్ఐ గుడిపూడి సందీప్ సస్పెండ్

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్లూరు ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. ఓ వివాహిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఎస్ ఐ గుడిపూడి సందీప్ ను సస్పెండ్ చేస్తూ రేంజ్ డీఐజీ కేవీవీ గోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

మంగళగిరిలో భారీ వర్షం...

గుంటూరు : జిల్లాలో గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తోంది. మంగళగిరిలో కుండపోతగా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భరత్ సింగ్ నగర్, ఎస్టీ కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. దీనితో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

10:26 - October 5, 2017

'బాలకృష్ణుడు' చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమాలో 'నారా రోహిత్, 'రెజీనా కసండ్ర'లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ మల్లెల దర్వకుడిగా పరిచయం కాబోతున్నారు. ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరిలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో 'నారా రోహిత్’. సొసైటీ కి యూజ్ అయ్యే కథతో 'ప్రతినిధి' సినిమాలో నటించి వైవిధ్యాన్ని చూపించాడు. తాను ఎన్నుకున్న కధల్లో బలం ఉందా లేదా అనేది మాత్రమే చూసే హీరో 'నారా రోహిత్'..అందుకే ఇంత తక్కువ టైం లో అన్ని సినిమాలు చేయగలిగాడు.

తాజాగా 'బాలకృష్ణుడు' చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రోహిత్ సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. ఇటీవలే చిత్ర పోస్టర్ ను విడుదలయిన సంగతి తెలిసిందే. లవ్ సబ్జెక్ట్ విత్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో 'రమ్య కృష్ణ' ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ట్రైలర్‌, పాటలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. 

10:17 - October 5, 2017

భారత ఆర్థికవ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. డీమానిటరైజేషన్ వలన భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రేషన్ షాపులలో కిరోసిన్ పూర్తిగా లేదన్నారు. 70 లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులగా మారారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సీబీఐ ఆఫీసుకు లాలూ..

ఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదవ్ యాదవ్ సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. రైల్వే హోటల్ టెండర్ కేసులో ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

10:10 - October 5, 2017

మొన్న అమెరికాలో ఉన్నాది కాల్పుల్లో 59మంది చనిపోవడం తెలిసిందే. ఇక చర్చించాల్సింది ఉన్మాది ఘాతుకాన్నే కాదు. ఆ ఉన్మాది చేతిలో తుపాకి పెట్టిన గన్‌ కల్చర్‌ను కూడా. ఈ గన్‌ కల్చర్‌ కారణంగానే మన తెలుగువారైన శ్రీనివాస్‌ కాశీబొట్ల  చనిపోయిన ఘటన మన మెదళ్ల నుంచి ఇంకా తొలగిపోలేదు. అసలు అమెరికాలో ఈ గన్‌ కల్చర్‌కు ఉన్న కారణాలేంటి. దీన్ని అక్కడి పాలకులు ఎందుకు కట్టడి చేయడం లేదు. ఇదే అంశంపై చర్చించేందుకు అమెరికా నుంచి ప్రముఖ ఎనలిస్ట్‌ ఎన్నారై నారాయణస్వామి స్కైప్‌లో లైవ్‌లో పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

విజయవాడలో వర్షం..

విజయవాడ : నగరంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పాఠశాలలు..కళాశాలలు..ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

10:04 - October 5, 2017

విశాఖ : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా? ఈ  ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ సిద్ధమవుతోందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోందా? జీవీఎంసీ ఎన్నికలను ఊహించే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందా? విశాఖలో టీడీపీ జోష్‌పై 10టీవీ కథనం..

విశాఖ తెలుగుదేశం పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. జీవీఎంసీకి ఎన్నికలు ఎప్పుడైన రానున్న నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. నంద్యాల, కాకినాడలో గెలిచిన సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుంచే నేతలు సిద్ధం చేస్తున్నారు.

జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నేతలు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీడీపీ నేతలు ప్రతి ఇల్లును తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందులో భారీగా టీడీపీ క్యాడర్‌ పాల్గొంటోంది. 

ఒక టీడీపీనేకాదు... దాని మిత్రపక్షమైన బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది.  ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక నెరవేర్చిన హామీలపైనే నేతలే ఫోకస్‌ పెట్టారు.  విశాఖలోని అన్ని డివిజన్స్‌లోనూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను కొన్ని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. 

ఈ ఏడాది డిసెంబర్‌లోకానీ... వచ్చే ఏడాది ప్రారంభంలోకానీ జీవీఎంసీకి ఎన్నికలు జరుగుతాయని టీడీపీ క్యాడర్‌ అంచనా వేసింది. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలపై దృష్టిసారించారు. మొత్తానికి టీడీపీ జీవీఎంసీ పీఠంపై కన్నేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఇల్లుందు..మనుగూరులో పోలింగ్ శాతం..

భద్రాద్రి : ఇల్లందులో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు 39 శాతం, మనుగూరు ఏరియాలో 28.75 శాతం పోలింగ్ నమోదైంది. 

వాల్మీకి మహర్షి ధన్యజీవి - బాబు..

విజయవాడ : రాష్ట్రస్థాయి వేడుకగా వాల్మీకి జయంతి నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రామాయణం నిత్య జీవిత పారాయణం..మన ఆధ్యాత్మిక సంపద అని తెలిపారు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ధన్యజీవి అని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను రామాయణం చాటి చెబుతోందని, ప్రభుత్వ పాలనకు రామాయణంలో విలువైన సూచనలున్నాయన్నారు. వాల్మీకి సామాజిక వర్గాని ఎస్టీ జాబితాలో చేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రతో వాల్మీకుల కష్టాలు చూశానన్నారు. 

09:53 - October 5, 2017

కామారెడ్డి : జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నాయి. దసరాకు నామినేటెడ్‌ పదవులు వరిస్తాయని ఆశించిన నేతల ఆశలు అడియాసలయ్యాయి.  టీఆర్‌ఎస్‌ అధిష్టానం క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు దసరా పండుగకు నామినేటెడ్‌ పదవుల కోసం కసరత్తు చేసినా చివరి నిముషంలో వాయిదా పడింది. దీంతో పదవులు ఆశించిన నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలను నైరాశ్యం ఆవహించింది. దసరా పండుగకు నామినేటెడ్‌ పదవుల బొనాంజా తగులుతుందని క్యాడర్‌ ఆశించారు. జిల్లాలో 90 నామినేటెడ్‌ పదవులు భర్తీ అవుతాయని తెలిసిన నాయకులు వాటిపై భారీగా ఆశలు పెంచుకున్నారు.  దసరా పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా... అధిష్టానం ఎప్పుడు తమపేర్లు ప్రకటిస్తుందా అని ఆశగా ఎదురు చూశారు. దసరా వచ్చింది. కానీ టీఆర్‌ఎస్‌ అధిష్టానం నామినేటెడ్‌ పోస్టులను మాత్రం ప్రకటించలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఒకింత అసహనానికి గురైంది.

నామినేటెడ్‌ పదవులు భర్తీకాకపోవడానికి జిల్లా ఇంచార్జ్‌ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డే కారణంగా తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపించే ప్రక్రియ ఆయన పూర్తి చేయలేదు.  దీంతో ఆశావహులకు నిరాశే మిగిలింది. 

ఇటీవలే జిల్లాలోని ఒకరిద్దరు నేతలకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి. వీరిని మినహాయిస్తే జిల్లాలో ఒకరికి కూడా నామినేటెడ్‌ పదవి దక్కలేదు.  తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అండగా నిలిచింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గులాబీ బాస్‌ హామీనివ్వడంతో ఆశల పల్లకిలో విహరించారు. కానీ టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంతరకు ఆయనకు ఏపదవి ఇవ్వలేదు.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి, జనార్దన్‌గౌడ్‌కు మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. దీంతో జనార్దన్‌గౌడ్‌ పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీకి చెందిన నిట్టు వేణుగోపాల్‌ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇతనికి కూడా టీఆర్‌ఎస్‌ అధిస్టానం నామినేటెడ్‌ పోస్టు ఇస్తానని హామీనిచ్చింది.  కానీ ఇప్పటి వరకు హామీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  విషయం తెలుసుకున్న మంత్రి పోచారం... నామినేటెడ్‌ పదవి వచ్చేలా కృషిచేస్తానని హామీనివ్వడంతో వేణుగోపాల్‌ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు, ముందునుంచి పార్టీలోనే ఉన్న నేతలకు ఎవరికీ నామినేటెడ్‌ పోస్టులు వరించలేదు. దసరాకు నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంటూ అధిష్టానం ఊదరగొట్టడంతో నాయకులంతా ఆశలు పెట్టుకున్నారు. జోరుగా లాబీయింగ్‌ కూడా నడిపారు. అయితే చివరికి అధిష్టానం నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వాయిదా వేయడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. మరి వీరి ఆశలను పార్టీ అధిష్టానం ఎప్పుడు నెరవేరుస్తుందో వేచి చూడాలి.
 

09:51 - October 5, 2017

విజయవాడ : పర్యావరణాన్ని కాపాడే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ అడుగులు వేస్తుంది. వచ్చే ఏడాది నుండి నగరంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 

ప్లాస్టిక్ వినియోగం, క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించేందుకు విజయవాడ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 2018 జనవరి ఒకటో తేదీ నుండి నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఇప్పటివరకు విఫలమైన అధికారులు మున్ముందు అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలువరించేలా కౌన్సిల్‌ సభ్యులు తీర్మానించారు. 

విజయవాడలో మొత్తం జనాభా 10 లక్షల 97 వేల మంది ఉండగా, 15 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ ను వినియోగిస్తున్నారు. రోజువారి వచ్చే వ్యర్థాలు 9 నుండి 20 శాతంగా ఉంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిబంధనలు 2011 ఆధారంగా 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. 2013లో జారీ చేసిన నెంబర్‌ 46 ఉత్తర్వుల ప్రకారం 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, నిల్వచేయడం, పంపిణీ చేయడం, వినియోగించడం, చివరకు కొనుగోలు చేయడం కూడా నిషేధించారు. 

ప్లాస్టిక్‌ విక్రయించే, తయారు చేసే వ్యాపారులపై అపరాధ రుసుము విధించే అధికారం  ఉంది. అయితే కొందరు క్షేత్ర స్థాయి సిబ్బంది వ్యాపారుల నుండి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో రోజుకు 15 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, సంచులు, గ్లాసులు, ప్లేట్లు, సీసాలు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిషేధం విధిస్తే ఉపయోగం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ముందుగా ప్రభుత్వం తయారీ దారులపై చర్యలు తీసుకుని ఉంటే ప్లాస్టిక్‌ను అరికట్టే అవకాశం ఉండేదని పలువురు నేతలంటున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్‌పై రెండు సార్లు నిషేధం విధించినా అవి అమలు కాలేదు. అయితే మూడో సారి విజయవాడ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం ఏమేరకు సఫలమవుతుందో వేచి చూడాలి. 

తోటపల్లి ఎడమ కాలువకు గండి

శ్రీకాకుళం : బూర్జ మండలం మర్రిపాడు వద్ద తోటపల్లి ఎడమ కాలువకు గండి పడింది. 600 ఎకకాల పంట నీటి మునిగింది. మడ్డువలసలో ఆరుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

 

09:41 - October 5, 2017

సంగారెడ్డి : ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 63 ఎకరాల ప్రభుత్వ భూమి. 150 కోట్ల విలువైన స్థలం. అక్రమార్కులు కబ్జా చేసి రికార్డులు తారుమారు చేశారు. ప్రభుత్వ భూమి తమవశమైపోయిందని సంబరపడ్డారు. కానీ అక్రమార్కుల ఎత్తులను ఓ తహసీల్దార్‌ తుత్తునియలు చేశారు. తన విస్తృత అధికారాలు ఉపయోగించి ప్రభుత్వ భూమిని రక్షించారు. ఇంతకీ ఎక్కడా భూమి. ఎవరా తహసీల్దార్‌. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...

చూడండి ఈ భూములు ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయో. ఈ భూముల పక్కనే చెరువు. ఈ చెరువులోని నీళ్లతోనే ఈ భూములు సాగవుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు పండే ఈ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.

సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌, శివనాపూర్ తండాలో మధ్యలో ధర్మసాగర్‌ చెరువు ఉంది.  ఈ చెరువు కిందనే 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములు ఎంతో విలువైనవని, అవి ప్రభుత్వ భూములని తేలడంతో అక్రమార్కుల కళ్లు వీటిపై పడ్డాయి. ఎలాగైనా ఈ భూములను కాజేయాలనుకున్నారు. అందుకోసం పక్కా స్కెచ్‌ వేశారు. 63 ఎకరాల ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడు కాకుండా తమపేర్ల మీద ఓ నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారంతా హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగులేకావడం ఇక్కడ  ఆసక్తికర విషయం. వీరికి కొంతమంది రెవెన్యూ అధికారులు సహకారం అందించడంతో విలువైన ప్రభుత్వ భూములను తమపేర రిజిస్ట్రేషన్‌ చేయించుకోగలిగారు. 

కంది మండలం తహసీల్దార్‌గా గోవర్దన్‌ పనిచేస్తున్నారు.  భూ రికార్డులన్నిటిపైనా ఆయన ఈ మధ్య దృష్టి సారించారు. ధర్మసాగర్‌ చెరువు కింద 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డుల్లో తేలింది. అయితే దాన్ని కొంతమంది ఆక్రమించుకుని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు కూడా తెలిసింది. దీంతో ప్రభుత్వ భూమిని రక్షించేందుకు తహసీల్దార్‌ గోవర్దన్‌ నడుం బిగించారు.  తన విస్తృత అధికారాలన్నిటినీ ఉపయోగించారు. 1960 చట్టంలోని 26(1) కె(1) ప్రకారం అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు.  దీనిపైనా ప్రభుత్వ భూమిని కాజేసిన అక్రమార్కులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల మధ్య హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలువిన్న న్యాయస్థానం తహసీల్దార్‌ చర్యలను సమర్ధించింది. ప్రభుత్వ భూమిని కాపాడినందుకు ప్రశంసించింది.  అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే సివిల్‌ కోర్టులు మాత్రమేకాదు... వాటిని రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు ఉందని గోవర్దన్‌ నిరూపించారు. ఇతర తహసీల్దార్‌లకు ఆయన ఆదర్శంగా నిలిచారు.

తహసీల్దార్‌ తీసుకున్న నిర్ణయం సుమారుగా 150 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని రక్షించింది. దీంతో గోవర్దన్‌పై రైతులు, గ్రామస్తుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.  గోవర్దన్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గోవర్దన్‌లా ప్రతి తహసీల్దార్‌ ఆలోచిస్తే ప్రభుత్వ భూములు కబ్జాకు గురికానేకావు. అంతేకాదు.. ఇప్పటి వరకు కబ్జాకు గురైన భూములు, అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రభుత్వ భూములను కాపాడవచ్చు.  కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రక్షించవచ్చు.  దీనికి కావాల్సిందల్లా అధికారుల చిత్తశుద్ది మాత్రమే. అధికారులకు చిత్తశుద్ది, చట్టాలను అమలు పర్చాలన్న ఆలోచన ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇందుకు గోవర్దనే పెద్ద ఉదాహరణ.

09:37 - October 5, 2017

నెల్లూరు : జిల్లా కేంద్రంలో జరుగుతున్న రొట్టెల పండుగకి ప్రముఖ సినీ నటుడు అలీ సందర్శించాడు. బారాషహీద్‌ దర్గాని సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రొట్టెను పట్టుకున్నారు. తన సినీ కెరీర్ మొదలై 40 సంవత్సరాలు పూర్తయ్యిందని..  తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పదేళ్లయిందని పేద నటులకు, పేద విద్యార్థులకు తన వంతు సాయం చేస్తున్నానని తెలిపారు.

 

09:34 - October 5, 2017

హైదరాబాద్ : ఉప్పల్ కరాచీ బేకరీలో యాజమాన్యం, సిబ్బంది తినుభండారాలపై నిర్లక్ష్యం వహించారు... 5వ తేదీతో ప్యాకింగ్ డేట్ తో ఉన్న మిల్క్  బ్రెడ్ ఐటెమ్ 3వ తేదీ రోజే అమ్మకం చేశారు. 5వ తేదీతో బ్రెడ్‌ ప్యాకెట్లు మార్కెట్‌లో దర్శనం ఇవ్వడంతో కస్టమర్లు కంగుతిన్నారు. వీటి ఫొటోలు తీసి కరాచీ బేకరీ పనితనం గురించి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో నెటిజన్లు కరాచీ బేకరీపై వ్యంగాస్త్రాలు గుప్పించారు. అయితే బేకరీ మేనేజర్‌ని విషయంపై ఆరా తీయగా కొత్తగా చేరిన సిబ్బంది తప్పిదంతోనే  5వ తేదీ ప్యాకింగ్ తో ఉన్న స్టిక్కరింగ్ ఉన్న ప్యాక్‌లు బయటికి వచ్చాయన్నారు. సరుకు మాత్రం తాజాదేననీ, స్టిక్కరింగ్ మాత్రం పొరపాటున పడిందన్నారు.

 

09:31 - October 5, 2017

నెల్లూరు : దేశానికి వెన్నుముకగాఉన్న రైతు అభివృద్ధికి, పురోగతికి అవసరం అయిన పరిశోధనలు జరగాలని, వాటి ఫలితాలు రైతులకు చేరాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులోని కస్తూర్భా కళాక్షేత్రంలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయంలో డిగ్రీలు పొందిన విద్యార్థులు రైతులకు సేవలు అందించాలని సూచించారు. దేశం వ్యవసాయంతో ముడిపడివుందని, దేశ అభివృద్ధి సూచికలో 17.3 శాతం వ్యవసాయ వాటానే అని అన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలే నేడు ఎక్కువమందికి జీవనాధారమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు  అన్నారు.

 

పోలింగ్ ప్రారంభం..మంథనిలో టీబీజీకేఎస్ నాయకుల ప్రచారం

పెద్దపల్లి : జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పొలింగ్ ప్రారంభమైనా టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎఎస్ ప్రచారం కొనసాగిస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ టీబీజీకేఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బాణం గుర్తుతో కూడిన టీషర్ట్స్ ధరించి ప్రచారం కొనసాగిస్తున్నారు. 

పొలింగ్ ప్రారంభమైనా.. ఖమ్మం, ఇల్లందులో టీబీజీకేఎస్ ప్రచారం

ఖమ్మం : జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పొలింగ్ ప్రారంభమైనా టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎఎస్ ప్రచారం కొనసాగిస్తోంది. ఖమ్మం, ఇల్లందులో టీబీజీకేఎస్ ప్రచారం సాగుతోంది. తమకే ఓటు వేయాలంటూ వినతులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను టీబీజీకేఎస్ నాయకులు బేఖాతర్ చేస్తున్నారు.

09:20 - October 5, 2017

ఖమ్మం : జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పొలింగ్ ప్రారంభమైనా టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎఎస్ ప్రచారం కొనసాగిస్తోంది. ఖమ్మం, ఇల్లందులో టీబీజీకేఎస్ ప్రచారం సాగుతోంది. తమకే ఓటు వేయాలంటూ వినతులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను టీబీజీకేఎస్ నాయకులు బేఖాతర్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ టీబీజీకేఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బాణం గుర్తుతో కూడిన టీషర్ట్స్ ధరించి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పీర్లచావిడి మండపం కూలి..ఇద్దరి మృతి

అనంతపురం : శెట్టూరు మండంలం కైరేవులో విషాదం నెలకొంది. పీర్లచావిడి మండపం కూలి నజీరినా (20), ఇబ్రహీంబీ (71) మృతి చెందారు. మృతులు కుందర్పి మండలం బెస్తర్లపల్లికి చెందిన వారిగా గుర్తించారు.

 

ట్రాక్టర్, కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీ..ఒకరు మృతి

చిత్తూరు : వేదాంతపురం అగ్రహారం రహదారిపై ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

 

08:56 - October 5, 2017

హైదరాబాద్ : సివిల్స్‌ శిక్షణ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజన విద్యార్థులను నిలువునా మోసం చేసింది. సివిల్‌లో రాణించేందుకు  
శిక్షణ ఇచ్చి వసతులు కల్పిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం....  ఇప్పుడు మాటతప్పింది.  దీంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. తమకు  శిక్షణ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్యాయం చేస్తొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గిరిజన విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సివిల్స్‌కు  ఎంట్రెన్స్‌ పరీక్షలను ప్రభుత్వం ప్రతిఏటా నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇస్తుంది.  ఈ ఏడాది  మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు  ప్రభుత్వం సివిల్స్‌ పోటీ పరీక్షలు నిర్వహించింది.  రాష్ట్రవ్యాప్తంగా 143 మంది విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ట్రైబల్‌ వెల్ఫేర్‌  కాల్‌ లెటర్‌లను పంపింది. జీవో ప్రకారం నగరంలో విద్యార్థులు కోరుకున్న కేంద్రంలో ప్రభుత్వం శిక్షణ ఇప్పించాలి.  ఒక్కో విద్యార్థి కోసం ప్రభుత్వం లక్షా ఇరవై ఐదు వేల రూపాయలను చెల్లిస్తుంది.  గిరిజన విద్యార్థుల సివిల్స్‌ ట్రైనింగ్‌ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 5కోట్ల రూపాయల  కూడా కేటాయించింది.

కాల్‌ లెటర్స్‌ అందుకున్న విద్యార్థులంతా ఆశగా హైదరాబాద్‌కు వచ్చారు. వివిధ కోచింగ్‌ సెంటర్లలో సివిల్స్‌ ట్రైనింగ్‌ తీసుకుందామని భావించారు. అయితే ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు మాత్రం ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా వారిని రాజేంద్రనగర్‌ సమీపంలోని  ట్రైబర్‌ వెల్ఫేర్‌ శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడే అందరికీ సివిల్స్‌ ట్రైనింగ్‌ ఇస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తామని తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థులకు ఏం చేయాలో తెలియలేదు. 

ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రంలో  వసతి కల్పిస్తే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌ షిప్‌ కూడా ఇవ్వాలి. అయితే అధికార్లు మాత్రం ట్రైబల్‌ వెల్ఫేర్‌ శిక్షణ శిబిరంలో  ట్రైనింగ్‌ ఇస్తామని... స్కాలర్‌షిప్‌లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. పైగా ప్రభుత్వ ట్రైనింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌ అభ్యర్థులకు ఉండాల్సిన ఒక్క సదుపాయం కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. నగర శివారు ప్రాంతం కావడంతో మహిళా అభ్యర్థులకు కనీస రక్షణ లేకుండా ఉందని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన జీ.వో 459 ని ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు  తుంగలో తొక్కలాని చూస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. బడ్జెట్‌లో తమకోసం సర్కార్‌ కేటాయించిన 5కోట్ల బడ్జెట్‌నూ కాజేయాలని చూస్తున్నట్టు  ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం జీ.వొ ప్రకారం నగరంలో ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

08:52 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ఎన్నికలు ఉండటంతో గనులపై 144 సెక్షన్ విధించారు. ఓటు వేయడానికి వచ్చే కార్మికుడి సంస్థ గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. పోటీల్లో 8 సంఘాలు పాల్గొంటున్నాయి. అన్ని సంఘాలు ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కొనసాగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 

 

వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరించారని మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హెచ్ ఐవీ వ్యాధితో బాధపడుతున్న మహిళలకు వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపంతో చెందిన తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త ఆరోపించారు.

08:41 - October 5, 2017

గుంటూరు : రాజధాని అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం వేగాన్ని పెంచింది. అమరావతికి కావాల్సిన సకల సదుపాయాలపై వ్యూహరచనతో ముందుకెళ్తోంది. హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల రూపకల్పన, రహదారులు, మౌలిక సదుపాయాలు, లే అవుట్ల టెండర్ల ఖరారు వంటి కీలకాంశాలపై కసరత్తు చేస్తోంది.
లండన్‌కు దర్శకుడు రాజమౌళి
ఏపీ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి నిర్మాణంలో మాస్టర్‌ ప్లాన్స్‌ రూపొందిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లలో అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్‌లను ఖరారు చేయనుంది. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్‌ పోస్టర్ కొన్ని వారాల క్రితం ఇచ్చిన డిజైన్లపై  అంసతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాజమౌళిని సీఆర్ డీఏ ఉన్నతాధికారులతో కలసి లండన్‌కు తీసుకెళ్లి, నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ మేరకు 24, 25వ తేదీల్లో సీఎం చంద్రబాబు లండన్‌కు పయనమవుతారు. అనంతరం నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చర్చలు జరిపి అసెంబ్లీ, హైకోర్టు, ఇతర భవంతుల తుది  ఆకృతులను ఓ కొలిక్కి తేనున్నారు. అలాగే వంద మంది రైతులను మూడు బృందాలుగా సింగపూర్‌ టూర్‌కు పంపించి ఆ దేశ అభివృద్ధి.. క్యాపిటల్‌ సిటీలోని విధివిధానాలను రైతులకు సీఆర్ డీఏ అధికారులు వివరించనున్నారు. 
అమరావతి రహదారులకు ఖరారు చేయనున్న టెండర్లు 
అమరావతి రూపకల్పనలో కీలకమైన రహదారులకు సంబంధించి టెండర్లను ఖరారు చేయనున్నారు. రాజధానిలో సుమారు 365 కిలోమీటర్ల పొడవైన రహదారులకు టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. అలాగే  రిటర్నబుల్ ప్లాట్‌లున్న ఎల్పీఎస్ లే-అవుట్ల అభివృద్ధికి సంబంధించిన టెండర్లన్నీ అక్టోబర్ 15కల్లా ఖరారవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెగ్ మార్కింగ్ పనులు జరుగుతున్న వివిధ లే-అవుట్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు సుమారు 14 వేల కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లు త్వరితగతిన ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. 
గ్రీనరీ పనులపై అధికారుల దృష్టి
భారీ ఉద్యాన వనాలు, కృష్ణానదిపై గవర్నమెంట్ కాంప్లెక్స్-పవిత్ర సంగమం ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించదలచిన ఐకానిక్ బ్రిడ్జితోపాటు సీడ్ యాక్సెస్ రహదారి, గ్రీనరీ పనుల విషయంలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుప్రసిద్ధ హోటల్ గ్రూపులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సీఆర్డీఏ చర్చలు జరిపి ఓ కొలిక్కి తేనున్నారు.  అలాగే రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించనున్నారు. 
పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు 
ఇదిలా ఉండగా... అమరావతి అంటూ .. చంద్రబాబునాయుడు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు తప్ప.. పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా... అమరావతి నిర్మాణం ఇప్పటికైనా..ఓ కొలిక్కి వస్తుందో...లేదో వేచి చూడాలి.  

08:37 - October 5, 2017

ఖమ్మం : కాసేపట్లో సింగరేణి ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మికసంఘమైన   టీబీజీకేఎస్‌ నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. తమను గెలిపించాలంటూ ఖమ్మం జిల్లాలోని కార్మికులకు రాత్రి వెండి గ్లాసులు పంచారు.  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. పేరుతో కార్మికుల కుటుంబాలకు ఈ గ్లాసులు పంచిపెట్టారు. దీంతో టీబీజీకేఎస్‌ నేతలపై ఇతర కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఓడిపోతామన్న భయంతోనే కార్మికులకు గ్లాసులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వెండి గ్లాసులు పంచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

08:31 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కాలరీస్‌ గుర్తింపు యూనియన్‌కు సర్వం సిద్ధమైంది. మరో గంటలో ప్రారంభమయ్యే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7 గంటలకు మొదలయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 
పోలింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి 
సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 15 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి.  కాలరీస్‌ వ్యాప్తంగా మొత్తం 52,534 మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది. పన్నెండు డివిజన్లలో జరిగే ఎన్నికలకు 92 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లకు వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులు...  కంపెనీ ఇచ్చిన గుర్తింపు కార్డు చూపించాలన్న నిబంధనను తప్పనిసరి చేశారు. 
1998లో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు 
సింగరేణి కార్మికుల సమస్యలపై ఒకే సంఘంతో చర్చించి, పరిష్కరించేందుకు 1998లో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి గుర్తింపు యూనియన్‌కు ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్‌ 9న మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచింది. 2001 ఏఐటీయూసీ, 2003 ఐఎన్‌టీయూసీ, 2007 ఏఐటీయూసీ  విజయం సాధించించాయి. 2012లో ఐదోసారి జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. ఇప్పుడు కూడా గెలుపుపై టీబీజేకేఎస్‌ నేతలు ధీమాతో ఉన్నారు. 
ట్రైకార్‌ చైర్మన్‌ పదవికి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామా 
మరోవైపు సింగరేణి ఎన్నికలకు ఒకరోజు ముందు మంత్రి తుమ్మల శిష్యుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు  ట్రైకార్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుమ్మలతో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ప్రచారం జరుగుతోంది.  ఈ నిర్ణయం... సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంపై  ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
టీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి ఎన్నికల కోడ్ ఉల్లంఘన 
మరోవైపు పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రచార గడువు ముగిసినా..  ప్రచారం చేశారు. పెద్దపల్లిలోని జీడేకే 5 ఇంక్లైన్, 11 ఇంక్లైన్ గనుల వద్ద టీబీజీకేఎస్ కు ఓటు వేయాలని....  ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. 
సింగరేణి జీఎం సాయిప్రసాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌తో ప్రచారం 
అటు టీబీజీకేఎస్ ను గెలిపించాలని కోరుతూ..ఇల్లందు సింగరేణి జీఎం సాయిప్రసాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌తో ప్రచారం చేశారు.  టీబీజీకేఎస్ కు ఓటు వేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది.  సాయిప్రసాద్‌  తీరును నిరసిస్తూ  ఏఐటీయూసీ సభ్యులు జీఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్మిక సంఘాలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. మొత్తం మీద రాజీనామాలు, వివాదాల మధ్య జరుగుతున్న సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వరంగల్ : స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ప్రయాణికురాలు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. 

ప్రారంభమైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 

ప్రారంభమైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 

 

ప్రారంభమైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఎన్నికల బరిలో 16 సంఘాలు ఉన్నాయి. 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 

 

Don't Miss