Activities calendar

06 October 2017

21:42 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేందుకు గవర్నర్‌ నరసింహన్‌ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమైన ఆయన వర్సిటీల పనితీరుపై ఆరా తీశారు. అకాడమిక్‌ క్యాలెండర్‌ని వర్సిటీల్లో అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు చేసిన గవర్నర్‌ వాటిని వర్సిటీల్లో అమలు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తెలంగాణలోని 15 యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ నర్సింహన్ భేటీ అయ్యారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్, జేఎన్‌టీయూ, జేఎన్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ ఆర్ట్స్, ఆర్‌జెయూకేటి, తో పాటు జయశంకర్ అగ్రికల్చర్, కాళోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీ, పివి నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హర్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్శిటీ వీసీలు తమ విశ్వవిద్యాలయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో గవర్నర్‌కు వివరించారు.

అయితే వర్సిటీల్లో అకడమిక్ క్యాలెండర్ అమలుచేయకపోవడం వల్ల గవర్నర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అన్ని విశ్వవిద్యాలయాలు 2018-19 సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సూచించారు. అయితే పది అంశాలను ప్రతిపాదించిన గవర్నర్‌ వాటి అమలుకు అన్ని యూనివర్సిటీలు దృష్టి పెట్టాలని కోరినట్లు మంత్రి కడియం తెలిపారు. వర్సిటీల్లో అవినీతికి తావులేకుండా చూడాలని గవర్నర్‌ సూచించినట్లు చెప్పారు.

పీహెచ్ డీ అడ్మిషన్లలో పారదర్శకత కోల్పోవడం పట్ల గవర్నర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేసి హాజరు శాతాన్ని పెంచాలని గవర్నర్‌ కోరినట్లు సమాచారం. యూనివర్సిటీల అభివృద్ధి కోసం 420 కోట్ల నిధులు కేటాయించినట్లు కడియం తెలిపారు. 1061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని గవర్నర్‌ ఆదేశించినట్లు చెప్పారు. యూనివర్సిటీలతో మొదటిసారి సమావేశమైన గవర్నర్ వర్సిటీల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తానన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వీసీలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు జరపాలని నరసింహన్‌ నిర్ణయించారు. వర్సిటీల పనితీరును ఏకంగా గవర్నరే పర్యవేక్షించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

21:40 - October 6, 2017

మేడ్చల్ : జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు సంతలో మహిళలను వేధించిన యాభై మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాతాయిలతోపాటు వీరి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మహిళలను వేధించిన వారిపై పీటీ కేసు నమోదు చేసిన పోలీసులు, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు మండలం గంగాధరపల్లికి చెందిన మరికొంత మంది యువకులు కూడా కొల్తూరు సంతలో మహిళలను వేధించినట్టు గుర్తించారు. 

21:37 - October 6, 2017

కర్నూలు : రాష్ట్రమేదైనా.. అడవిబిడ్డలపై అధికారుల ఆగడాలు ఆగడం లేదు. మొన్నీమధ్య వరంగల్‌ జిల్లాలో గొత్తికోయలపై దాష్టీకాన్ని మరచిపోకముందే.. ఈరోజు, కర్నూలు జిల్లా నల్లమల అడవిలో.. గిరిపుత్రులపై అటవీ అధికారులు దౌర్జన్యానికి తెగబడ్డారు. అడవిబిడ్డల ఆశ్రయాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి నిరాశ్రయుల్ని చేశారు.. కూడు...గూడు కరువైన గిరిజనులు నిలువనీడలేక నడిరోడ్డున పడ్డారు.
 

కర్నూలు జిల్లా మహానంది మండలంలోని నల్లమల అడవుల్లో మారుమూలన ఉంది.. చెలిమ మజరా గ్రామం. ఇక్కడ 30 ఏళ్లుగా నివసిస్తున్న 30 కుటుంబాలకు మన్యమే ప్రపంచం. వీరికి ఆధార్‌, రేషన్ కార్డు సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం వీరికి అంగన్ వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ అటవీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆడపిల్లలతో ఉన్నాం సమయం ఇవ్వాలంటూ వేడుకున్నా కనికరించలేదు. అకస్మాత్తుగా గ్రామంలోకి వచ్చి గిరిజనుల ఇళ్లను కూల్చేశారు. వద్దు వద్దని కాళ్లపై పడ్డా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫారెస్టు అధికారుల చర్యలతో గిరిపుత్రులు నిరాశ్రయులయ్యారు. అడవి తప్ప అన్యమెరుగని చెంచులు.. ఎటు వెళ్లాలో.. ఏమి చేయాలో పాలుపోక.. తల్లడిల్లిపోతున్నారు. అటవీ అధికారుల దాష్టీకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

21:36 - October 6, 2017

సంగారెడ్డి : ఎమ్మెల్యే బాబుమోహన్..మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రజలపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. అందోల్ ప్రజలపై కోపంతో ఊగిపోయారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు గురించి అడిగితే ఎమ్మెల్యే బాబు మోహన్ బూతులు అందుకున్నారు. దీనితో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి బాబు మోహన్ ఇలాగే వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. 

దగ్గుబాటితో సమంత చిందులు..

హైదరాబాద్ : సమంత..నాగ చైతన్యల వివాహ సందడి నెలకొంది. పెళ్లి వేడుకలో భాగంగా కలిసి సందడి చేసిన ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్ బాబుతో సమంత డ్యాన్స్ చేశారు. 

హీరో జైకు నాన్ బెయిలబుల్..

చెన్నై : తమిళ హీరో జై కు సైదాపేట్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన గురువారం న్యాయమూర్తి హాజరు కావాల్సి ఉంది. కానీ జై రాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

ఓయూకు ఏ+..

హైదరాబాద్ : రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై చర్చించారు. గతంలో ఏ గుర్తింపు ఉన్న ఓయూ ప్రస్తుతం ఏ + సాధించిందని, జేఎన్టీయూ, కేయూలకు ఏ గ్రేడ్ దక్కిందని డిప్యూటి సీఎం కడియం పేర్కొన్నారు. 

లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు - కేటీఆర్..

హైదరాబాద్ : సరకు రవాణ కోసం హైదరాబాద్‌ చుట్టు పక్కల ఆధునిక సౌకర్యాలతో పన్నెండు లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో వీటిని నిర్మిస్తారు. శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర మెగా లాజిస్టిక్‌ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రకటించారు. 

21:23 - October 6, 2017

హైదరాబాద్ : సరకు రవాణ కోసం హైదరాబాద్‌ చుట్టు పక్కల ఆధునిక సౌకర్యాలతో పన్నెండు లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో వీటిని నిర్మిస్తారు. శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర మెగా లాజిస్టిక్‌ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రకటించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో రంగారెడ్డి జిల్లా మంగళంపల్లి, బాటసింగారంలో అభివృద్ధి చేస్తున్న రెండు లాజిస్టిక్‌ పార్కులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వీటిలో గోదాములతోపాటు శీతలగిడ్డంగులు నిర్మిస్తారు. ఒక్కో పార్కులో 700 నుంచి 750 లారీలు నిలుపుకునే విధంగా నిర్మాణం చేపడుతున్నారు.

అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఇలాంటి 12న లాజిస్టిక్‌ పార్క్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి వలన సరకు రవాణా మెరుగుపడటంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జంట నగరాలపై ట్రాఫిక్‌ ఒత్తిడి కొంత తగ్గుతుంది. శంషాబాద్‌ విమానశ్రయం దగ్గర మెగా లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల 340 కి.మీ. పరిధిలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రెండు రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. లాజిస్టిక్‌ పార్క్‌ల అభివృద్ధి ద్వారా హైదరాబాద్‌ను సరకు రవాణకు ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

21:20 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిచిన్న అంశంపైనా విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడమే కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్డులకు కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు బుద్దిరావడం లేదని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ విజయం పట్ల కేసీఆర్‌ హర్షాన్ని, కార్మికులకు కృతజ్ఞతలనూ తెలిపారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో.. పాలక పక్షపు అనుబంధ యూనియన్‌.. టీబీజీకేఎస్ గెలుపొందడంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికల ఫలితం విపక్షాలకు చెంపపెట్టన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఓటమితోనైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల కింద డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైన కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో తనపై చిల్లర గ్యాంగ్‌తో విషపురాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనను దొరంటూ పోస్టులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు అసలు దొర ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలోనే దొరతనపు ఛాయలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్న కేసీఆర్‌.. కాలేశ్వరంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌లో స్టే తీసుకొచ్చింది దామోదర రాజనర్సింహేనని దుయ్యబట్టారు.

టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంపైనా కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోదండరామ్‌ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. కోదండరాం మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ వ్యతిరేకని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఆయనకు ఇష్టంలేదన్నారు. టీబీజీకేఎస్‌కు ఓట్లేస్తే సింగరేణి నాశనం అవుతుందని కోదండరాం ఎలా అంటారని ప్రశ్నించారు. దమ్ముంటే కోదండరాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. ఆయనకు జేఏసీ ముసుగెందుకని విమర్శించారు.

తన మిత్రుడు, పరిటాల రవీంద్ర తనయుడి వివాహానికి వెళ్లినంత మాత్రాన.. టీడీపీతో సాన్నిహిత్యమన్న ఊహాగానాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదని, పోతిరెడ్డిపాడు లాంటి అంశాల్లో ఆ పార్టీ స్థానిక నేతలు రాష్ట్రానికి అనుకూలంగా స్పందించడం లేదని కేసీఆర్‌ అన్నారు. ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ ప్రస్తావనే లేదని, వ్యక్తులు పార్టీ పెడితే నడిచే పరిస్థితి ఉండదని కేసీఆర్‌ అన్నారు.

కాళేశ్వరంపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మూడేళ్లలోనే బంగారు తెలంగాణ సాధ్యంకాదని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే లక్షా 12వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. సింగరేణిని బొగ్గుకే కాకుండా మిగతా రంగాలకు విస్తారిస్తామని చెప్పారు. బయ్యారం గనులను సింగరేణికి అప్పగిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

21:17 - October 6, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వస్త్రాలపై పన్నును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు..ఏసీ హోటల్ బిల్లులపై సర్వీసు చార్జీ 18 నుండి 12 శాతానికి తగ్గింపు...గృహోపకరణాలపై స్వల్పంగా పన్నును తగ్గించారు. గ్యాస్ వస్తువులు..వినియోగ వస్తువులపై 28 శాతం పన్ను నుండి మినహాయించారు. ఎగుమతి దారులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతులపై నామమాత్రంగా జీఎస్టీ విధించనున్నారు. వస్తు సేవల పన్ను గణింపు పరిధి రూ. 75 లక్షల నుండి కోటికి పెంచినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. ఈ నిర్ణయంలో లక్షలాది చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను రేట్లను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 

జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు...

ఢిల్లీ : జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వస్త్రాలపై పన్ను 12 నుండి 5 శాతానికి తగ్గింపు..60 రకాల వస్త్రాలపై పన్ను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. రూ. కోటి టర్నోవర్ ఉన్న చిన్న తరహా పరిశ్రమలకు జీఎస్టీ నుండి మినహాయించారు. జీఎస్టీ రిట్స్ ఫైలింగ్ నెల నుండి మూడు నెలలకు మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. 

20:22 - October 6, 2017

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? టీఆర్ఎస్ పార్టీ.. ఈ మాట ఉత్తంకుమార్ రెడ్డో.. కోదండరాం సారో.. రేవంత్ రెడ్డో చెర్కు సుధాకరో అంటలేడు సుమా..? ఇది విపక్షాల మాటగాదు.. నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు సారే అంటున్నడు.. తెలంగాణ అభివృద్ధికి అడ్డం బడ్తున్నది టీఆర్ఎస్ పార్టేనట.. కావాల్నంటే ఆయన నోటితోనే ఎలా జెప్పిండో వీడియోలో సూనుండ్రి..

20:18 - October 6, 2017

సింగరేణి ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు...ఓ మాగంటి బాబు.. నీకేమన్న శిగ్గుశరం ఉన్నాదయ్య.. అన్ని బట్టెవాయి మాటలు మాట్లాడుతున్నవ్..? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? వర్ల రామయ్య సారు చంద్రాలు కొంప ముంచెతట్టే ఉన్నడుగదా..? కన్న బిడ్డెను అమ్ముకోని తీర్థయాత్రలు తిర్గవోయిండ్రట తల్లిదండ్రులు.. ఇట్లనే ఉంటదా యవ్వారం..? ఇంకో నాల్గొద్దులు ఇట్లనే ఉంటే.. భద్రాచలం రామయ్యకు గుండుగొట్టిచ్చెతట్టే ఉన్నరుగదా..? గొర్లు వంచే స్కీము.. సరే సర్కారు గొల్లకుర్మోళ్లకు ఇంత పని జూపెట్టాలని ఇయ్యాలనుకున్నదో ఏమో గొర్లుగని..? ఈ పిడ్గులు పాడుగాను.. అటెంకాళ్ల అడ్వుల పొంటన్న వడయ్..పోలీసోడు జేయవల్సిన పనేంది..? ఎక్కడనన్న నేరాలైతె.. పంచాదులైతె.. కంప్లెంట్ దీస్కోని.. సక్కగ కోర్టు ముంగట వెట్టాలే.. విజయనగరం జిల్లాల ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ అయితున్నది.. గిసొంటి..గరం..గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

విజయవాడలో వైసీపీ కార్యాలయం...

విజయవాడ : ఈనెల 9వ తేదీన విజయవాడలో వైసీపీ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇకపై విజయవాడ కేంద్రంగా వైసీపీ కార్యకలాపాలు జరుగనున్నాయి. 

19:59 - October 6, 2017

శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఊరించి ఊస్సూరుమనిపించింది. 28 శాతం శ్లాబ్ లోని 68 వస్తువులపై పన్ను తగ్గిస్తారంటూ ప్రచారం జరిగింది. దేశ ప్రజలంతా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను తగ్గిస్తారని ఆశ పడ్డారు. అయితే కౌన్సిల్ సమావేశం కొద్ది నిర్ణయాలు తీసుకుని ముగించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో శశికుమార్ (ఆర్థిక వేత్త), రాకేష్ రెడ్డి (బీజేపీ), జి.వి.రెడ్డి (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఆభరణాలపై జీఎస్టీ నోటిఫికేషన్ తొలగింపు ?

ఢిల్లీ : జీఎస్టీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తొలగించనుంది. సంప్రదింపుల తరువాత కేంద్రం ప్రకటన విడుదల చేయనుంది. రూ. 50 వేలకు పైగా విలువ చేసే నగల కొనుగోలుకు పాన్, ఆధార్ నిబంధన ఎత్తివేయనున్నారు. 

మరోసారి మినహాయింపు కోరాం - ఈటెల..

ఢిల్లీ : తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపును మరోసారి కోరడం జరిగిందని తెలంగాణ మంత్రి ఈటెల పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులను 12 నుండి 5 శాతం శ్లాబ్ లోకి తేవాలని జీఎస్టీ కౌన్సిల్ కు ప్రతిపాదించడం జరిగిందన్నారు. గత సమావేశాల్లో తెలంగాణ లేవనెత్తిన అంశాలనే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు లేవనెత్తుతున్నాయన్నారు. 

19:19 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ ఛాంబర్ ఎదుట శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ వివాహిత ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే..చిలకలగూడ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ కొన్ని కారణాల రీత్యా ఇటీవలే సస్పెండ్ కు గురయ్యాడు. దీనితో అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నాడని..అక్రమంగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని..తనకు న్యాయం చేయాలంటూ సాయి కుమార్ సతీమణి స్వప్న సెక్రటేరియట్ కు చేరుకుంది. రాష్ట్ర హోం మంత్రి నాయినీ ఉండే డి బ్లాక్ చేరుకుంది. 2016లో సాయి కుమార్ తో వివాహం జరిగిందని ఆమె పేర్కొంది. అనంతరం ఆమె స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై హోం మంత్రి నాయినీ స్పందించి తగిన ఆదేశాలు జారీ చేశారు. 

నాయినీ ఛాంబర్ ఎదుట..

హైదరాబాద్ : హోం మంత్రి నాయినీ ఛాంబర్ ఎదుట కలకలం రేగింది. స్వప్న అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కానిస్టేబుల్ సాయి కుమార్ మోసపూరితంగా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని..ఇప్పుడు అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తున్నాడని వాపోయింది. హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి స్వప్న వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

19:12 - October 6, 2017

ఢిల్లీ : సదావర్తి భూములుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగాయి. ఏపీ ల్యాండ్స్ కావంటూ తమిళనాడు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు సదావర్తి భూముల కేసును డిస్పోజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. సదావర్తి భూముల కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. సదావర్తి భూములు ఎవరివి అని తేల్చాలని సూచించింది. ఈ వేలంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాను వేలంలో పాల్గొనడానికి డిపాజిట్‌ చేసి డబ్బుకు 18 శాతం వడ్డీ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆళ్ల రామకృష్ణరెడ్డి కోరారు. 22 కోట్లకు భూములు పొందిన సంజీవ్‌రెడ్డి తనకి 18 శాతం వడ్డీతో వెనక్కు డబ్బులు ఇవ్వమని సుప్రీంకోర్టులో అభ్యర్థించారు.

 

19:08 - October 6, 2017

యాదాద్రికి అతి సమీపంలోని బచ్చన్నపేట మండలం అలింపుర గ్రామంలో 200 ఎకరాల వెంచర్‌లో..26 మలబార్‌, 12 ఎర్రచందనం, 12 శ్రీగంధం చెట్లతో..18 సంవత్సరాల మెయింటెన్స్‌తో గజం కేవలం 500/- లకే అందిస్తున్నారు.ఈ వెంచర్‌ గురించి పూర్తి వివరాలను శ్రీవెన్‌ ఫామ్‌ల్యాండ్స్‌ డైరెక్టర్‌..జైపాల్‌రెడ్డి టెన్ టివికి తెలియచేశారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:04 - October 6, 2017

విజయవాడ : నేనెవరో తెలీదు....నేనేంటో తెలీదు....సంతోషం అంటూ టీడీపీ నేతలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే పవన్‌ చేసిన ట్వీట్‌లో పెద్ద అర్థమే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు పవన్‌ ఇప్పుడు ఈ ట్వీట్‌ ఎందుకు చేశారు.? ఇప్పుడిదే టీడీపీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్‌ జనసేనకు టీడీపీకి మధ్య దూరం పెరిగిందనే చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన ఎన్నికల్లో పవన్‌ పోటీ చేయకుండా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. గెలుపునకు పవన్‌ తనవంతు సహకారం అందించారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో టీడీపీకి అత్యధిక మెజారిటీ రావడానికి పవనే కారణమని అప్పట్లో టీడీపీ ముఖ్యనేతలే అంగీకరించారు. అయితే ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.

టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పవన్‌ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజధాని భూములు, అగ్రిగోల్డ్‌ వ్యవహారం, ఆక్వా మెగా పార్క్‌తో పాటు మరికొన్ని విషయాల్లో పవన్‌ టీడీపీ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా టీడీపీ ఎంపీల వ్యవహార శైలిపై పవన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీల కంటే వైసీపీ ఎంపీలే పార్లమెంట్‌లో గట్టిపోరాటం చేస్తున్నారని పవన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలు, ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ ప్రభుత్వ తీరును పవన్‌ ప్రశ్నించడంపై టీడీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. దీంతో సందర్భం దొరికితే చాలు టీడీపీ నేతలు పవన్‌పై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ ఎవరో తెలీదు అని ఎంపీ అశోక్‌ గజపతిరాజు అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కూడా పవన్‌ అవసరం మాకు లేదు, ఆయన ఎవరు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ టీడీపీ నేతలు పవన్‌పై అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి పితాని పవన్‌పై ఘాటువ్యాఖ్యలే చేశారు.

అయితే టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తన సహయం పొందిన వారే తనపై, తన పార్టీపై చులకనగా వ్యాఖ్యలు చేయడంపై పవన్‌ మండిపడుతున్నట్లు సమాచారం. దీనికి నిదర్శనమే పవన్‌ చేసిన ట్వీట్‌. గజపతిరాజుకి నేనెవరో తెలీదు, పితానికి నేనేంటో తెలీదు.. సంతోషం అని పవన్‌ ట్వీట్‌ చేశారు. అయితే పవన్‌ ట్వీట్‌ వెనుక పెద్ద అర్థమే ఉందంటున్నారు పవన్‌ సన్నిహితులు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మాత్రమే పవన్‌, సీఎం చంద్రబాబును కలవాల్సి వస్తుందని సన్నిహితులు తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసే ఆసక్తి పవన్‌కు లేదని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బంధం తెంచుకోవాలని పవన్‌ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి టీడీపీతో సంబంధాలు నిలిపివేయాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన పవన్‌ త్వరలోనే ప్రజల్లోకి వెల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి టీడీపీ నేతలపై పవన్‌ చేసిన ట్వీట్‌ పై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 

19:00 - October 6, 2017

విశాఖపట్టణం : ఉత్తరాంధ్రుల ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ ఆసుపత్రిని మందుల కొరత పీడిస్తోంది. అత్యవసర మందుల కొరత ఉండటంతో..రోగుల బంధువులు పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రధానంగా చిన్న పిల్లల వార్డులో పరిస్థితి మరి దయనీయంగా మారింది. ఆస్పత్రికొచ్చే పిల్లల సంఖ్య పడకలకు మించి పెరగడంతో...వైద్య సదుపాయాలు అందించడం ఇబ్బందిగా మారుతోంది. రోజు రోజుకు ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నా..అందుకు సరిపడా మౌలికసదుపాయాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కాకుండా ఒడిషా, చతీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి రోగులు వస్తుండటంతో.. కేజీహెచ్‌ నిత్యం కిటకిటలాడుతోంది. కనీస సదుపాయాలు లేకపోవడంతో రోగులతో పాటు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పడకల కొరత ఉండటంతో.. ఒకే దానిపై ఇద్దరు రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అసలే అనారోగ్యంతో ఉన్న రోగులకు ఈ పరిస్థితి ఇబ్బందిగానే ఉన్నా..ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక మౌనంగానే భరిస్తున్నారు.

ఇక చిన్నారుల వార్డులో 90 పడకలకు సరిపడే విధంగా మాత్రమే ఔషధాల కేటాయింపు ఉంటోంది. కానీ ఇక్కడ 200 మంది వరకూ వైద్యం కోసం వస్తున్నారు. కీలకమైన యాంటీబయోటిక్స్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌, సాధారణ జ్వరాలకు ఇచ్చే మందుల కొరత తీవ్రంగా ఉంది. చికిత్స పొందుతున్న చిన్నారుల్లో సగం మందికి కూడా మందులు సరపోని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో మందులు బయటనుంచి తెచ్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు వారాల నుంచి ఆస్పత్రిలో మందుల కొరత మరింత పెరిగింది. కేజీహెచ్‌లో మౌలిక సదుపాయాలతో పాటు పడకలు పెంచుతామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా..కాగితాలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచి, అత్యాధునిక వైద్యసదుపాయాలు కల్పించాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు.

18:56 - October 6, 2017

రాజమండ్రి : టీవీ సీరియల్స్‌పై సెన్సార్‌ పెట్టాలని కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోవడంలేదని ఏపీ మహిళా కమిషనర్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఆదర్శంగా చూపించాల్సిన సీరియల్స్‌ హంతకులను చూపిస్తున్నాయని మండిపడ్డారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. 

18:19 - October 6, 2017

విశాఖపట్టణం : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవరాపల్లి మండలంలోని రైవాడ ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువ కావడంతో ప్రమాదస్థాయికి చేరినట్లైంది. రైవాడ జలాశయంలోకి 3400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో రెండు గేట్లు ఎత్తివేసి 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

విశాఖపట్టణం : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవరాపల్లి మండలంలోని రైవాడ ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువైంది. ప్రమాదస్థాయికి రైవాడ జలాశయం చేరుకుంది. రైవాడ జలాశయంలోకి 3400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. రెండు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డీఏ పెంపు..

కర్నాటక : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 43.25 శాతంగా ఉన్న డీఏను 45.25 శాతం పెంచుతున్నట్లు, జులై 1 తేదీ నుండి వర్తిస్తుందని పేర్కొంది. 

పార్టీ గుర్తు తమకే వస్తుందన్న పన్నీర్ సెల్వం..

చెన్నై : పార్టీ గుర్తు తమకే వస్తుందన్న తమిళనాడు రాష్ట్ర డిప్యూటి సీఎం పన్నీర్ సెల్వం మీడియాకు తెలియచేశారు. తాను ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళుతున్నట్లు తెలిపారు. పార్టీ గుర్తు 'రెండాకుల' కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఈసీ కార్యాలయానికి టిటివి దినకరన్ న్యాయవాదులు..

ఢిల్లీ : టిటివి దినకరన్ కు చెందిన న్యాయవాదులు ఎలక్షన్ కమీషన్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ గుర్తు 'రెండాకుల' కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

బీజేపీ ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన ఇన్ స్పెక్టర్..

ఉత్తర్ ప్రదేశ్ : మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కాళ్లను పోలీస్ ఇన్స్ పెక్టర్ మొక్కాడు. సోషల్ మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసు అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. 

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్..

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 2 నుండి పాదయాత్ర చేపడుతున్నందున ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయిపంఉ ఇవ్వాలని ఆరు నె లల పాటు కోర్టుకు రాకుండా ఉండేందుకు అనుమతినివ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు. వచ్చే శుక్రవారం జగన్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. 

తెలంగాణకు దొర ఉత్తమ్ - కేసీఆర్..

హైదరాబాద్ : తనను దొర అంటూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు పెట్టిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న పోస్టులను ఆయన తప్పుబట్టారు. 

17:19 - October 6, 2017

హైదరాబాద్ : తనను దొర అంటూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు పెట్టిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న పోస్టులను ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు అసలు దొర ఉత్తమ్ కుమార్ అని, దొర తరపు ఛాయలన్నీ ఉత్తమ్ కు ఉన్నాయంటూ మండిపడ్డారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని, కాళేశ్వరంపై ప్రాజెక్టు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే తీసుకొచ్చింది దామోదర్ రెడ్డి అని తెలిపారు. 

17:08 - October 6, 2017

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్, ప్రొ.కోదండరాంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కోదండరం అందాగున్..పాగల్ కామా కర్రే అంటూ ఎద్దేవా చేశారు. సింగరేణి ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కోదండరాంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ‘ఉస్ కే సర్ పై జునూన్ చడావుహై...శత్రువులకు పనిచేస్తున్నాడు'..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏం చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సినవసరం ఉందన్నారు. ఎక్స్ ట్రా ఊహించుకుని పరేషాన్..అయితున్నాడని..సింగరేణి నాశనం అయితదా అని మాట్లాడుతడా ? అని ప్రశ్నించారు. టీజేఏసీకి పేరు పెట్టింది తానేనని తెలిపారు. 

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. రాజీకయ ముసుగు వేసుకుని జైరాం రమేష్..అందరూ కలిసి మేనిఫెస్టో రాశారని, ఈ చరిత్ర అందరికీ తెలుసన్నారు. టీఆర్ఎస్ అంటే వ్యతిరేకమని, టీఆర్ఎస్ అధికారంలోకి రావద్దని ఆకాంక్షించి కాంగ్రెస్ ను పోగు చేశారని తెలిపారు. అసలు ఈయన బాధ ఏంటీ అని ఏం వంకర పోవట్టే..రాజకీయ బిమారందని విమర్శలు గుప్పించారు. ఇంకా ఏమి మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి. 

కోదండరాంపై కేసీఆర్ ఫైర్..

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్, ప్రొ.కోదండరాంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కోదండరం అందాగున్..పాగల్ కామా కర్రే అంటూ ఎద్దేవా చేశారు. సింగరేణి ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 

ఓపెన్ కాస్ట్ మైన్స్ తో లాభమన్న కేసీఆర్...

హైదరాబాద్ : అండర్ గ్రౌండ్ తో నష్టం వస్తుందని..ఓపెన్ కాస్టుతో లాభం ఎక్కువగా వస్తుందన్నారు. ఓపెన్ కాన్స్ట్ మైన్స్ తో వచ్చే లాభంతో సింగరేణి నడుస్తోందని, ఇది కార్మికులు గుర్తించాలన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం - కేసీఆర్..

హైదరాబాద్ : బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్టీసీ..కరెంటు సంస్థలు..సింగరేణి కానీ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని, ఇంకా కంపెనీలను విస్తరిస్తామన్నారు. అరడజను మైన్స్ ను వెంటనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

16:52 - October 6, 2017

హైదరాబాద్ : బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అతి పెద్ద పారిశ్రామిక వేత్త అయిన అదానీ తనతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని, గనుల తవ్వకాల్లో..నిర్వాహణలో కోల్ ఇండియా కంటే ఉత్తమమైనదని సింగరేణి అని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని గ్రూపు తన దగ్గరకు వచ్చాడని..కరెంటు ఎందుకు పెట్టరని...ఆస్ట్రేలియాలో మైన్స్ ఉందని..సింగరేణి గ్రేడ్ ఉద్యోగస్తులు పనిచేస్తారని పేర్కొన్నారని తెలిపారు. కానీ ప్రైవేటుకు ఇవ్వమని స్పష్టంగా చెప్పడం జరిగిందని..ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. ఆర్టీసీ..కరెంటు సంస్థలు..సింగరేణి కానీ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని, ఇంకా కంపెనీలను విస్తరిస్తామన్నారు. అరడజను మైన్స్ ను వెంటనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ తో నష్టం వస్తుందని..ఓపెన్ కాస్టుతో లాభం ఎక్కువగా వస్తుందన్నారు. ఓపెన్ కాన్స్ట్ మైన్స్ తో వచ్చే లాభంతో సింగరేణి నడుస్తోందని, ఇది కార్మికులు గుర్తించాలన్నారు. కానీ అండన్ గ్రౌండ్ మూసివేయడం జరగదని..కొత్త అండర్ గ్రౌండ్స్ ను సృష్టిస్తామన్నారు. ఆర్టీసీలో కార్మికులకు బోర్డులో ఎలా భాగం కల్పిస్తున్నామో అలాగే సింగరేణి బోర్డులో కూడా కార్మికులకు అవకాశం కల్పిస్తామని..ఇందుకు చట్టాలు సవరించాల్సి వచ్చినా చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

16:42 - October 6, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. సింగరేణి ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సింగరేణి కార్మికులు పాత ఆలోచనల నుండి బయటకు రావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయన్నారు. ప్రజాజీవితంలో..రాజకీయాల్లో మాట్లాడిన మాటలు కావన్నారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాలు పూర్తి అబద్దాలు చెప్పారని, 1998-2000లో వారసత్వ ఉద్యోగాలు తొలగించడంలో గతంలో ఉన్న సంఘాలే కారణమన్నారు. వీటిని పునరుద్దరించేందుకు తాము ప్రయత్నించినట్లు, ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తమకు ప్రయత్నామ్నాయమని బీజేపీ నేతలు చంకలు గుద్దుకున్నారని, కానీ సింగరేణిలో ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవాలని ఏద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ఏజెండా ఎత్తుకోవాల్సి వస్తలేదన్నారు. ప్రతిపక్షాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.

తాము చేసిన కార్యక్రమాలు..ఎన్నికల్లో గెలవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జర్నలిస్టులు కూడా ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమానికి మద్దతు తెలియచేయాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని ఎకరానికి రూ. 8వేలు ఇస్తామని, భూముల రికార్డు తీయాలని ప్రభుత్వం ఆదేశిస్తే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాయన్నారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని, ఈ విమర్శలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితి విషయంలో కోర్టుకు వెళ్లాయని..స్థానిక సంస్థలకు ఈ విషయంలో సంబంధం లేదని కొట్టిపారేశారు.

ఇటీవలే గవర్నర్ దగ్గరకు వెళితే ప్రతిపక్షాలు చేసిన విమర్శలు..ఆరోపణలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ ఏదైనా జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని తాను కోరడం జరిగిందన్నారు. వెంటనే రెండు జిల్లాలను ఎంచుకున్న గవర్నర్ పర్యటన అనంతరం ప్రభుత్వాన్ని కొనియాడారన్నారు. కారుణ్య నియామకాల కింద తాము ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని, అంతేగాకుండా వీఆర్ఎస్ తీసుకునే విషయంలో డబ్బులు ఇస్తామని, ఇచ్చిన హామీలు తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. సింగరేణి 45 శాతానికి పైగా మెజార్టీ సాధించి గెలవడం శుభ పరిణామమన్నారు.

కాళేశ్వరం విషయంలో కూడా కోర్టుకు వెళ్లారని, పనులు ఆపాలని ఎన్జీటీ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం జరిగిందని దీని వెనుక మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ ఉన్నారని..ఇది అందరికీ తెలిసిందేన్నారు. రోజుకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి న్యాయవాదిని పెట్టుకొనే స్థోమత రైతుకు ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇక సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్ పెట్టుకున్నారని, ఎక్కువ వర్షం పడితే అవస్థలు రావా ? హైదరాబాద్ డల్లాస్ అయ్యిందంటూ ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. అంతేగాకుండా గొర్రెల పంపకంలో గొర్రె..బర్రె..దొర అంటూ ఇష్టమొచ్చినట్లు..కూతలు కూస్తున్నారని..ఇలానే చేస్తే అందర్నీ బుక్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాటిపాముల ఊరులో గడియ ఉందని.. ఉత్తమ్ దొర అని మండిపడ్డారు. నా ఇల్లు గడియ అంటారా ? ఇంత అసహనమా ? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కులాలు ఉంటాయా ? కులం విషయంలో టిపిసిసి అధ్యక్షుడు మాట్లాడవచ్చా ? అని నిలదీశారు. 

16:28 - October 6, 2017

కర్నూలు : జిల్లాలోని మజరా గ్రామంలో గిరిపుత్రులపై అటవీ అధికారులు దౌర్జన్యం చేశారు. గిరిజనుల ఇళ్లను పోలీసులు కూలగొట్టారు. గత 30 ఏళ్లుగా చెలిమ అడవుల్లో గిరిపుత్రులు జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అడవిని ఖాళీ చేయాల్సిందిగా హుకుం జారీ చేశారు. శుక్రవారం ఫారెస్టు అధికారులు పెద్ద ఎత్తున్న దాడులు చేసి గుడిసెలను తొలగించారు. తమకు సహకరించాలని..కొంత సమయం ఇవ్వాలని కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ పోలీసోళ్లు ఏమాత్రం కనికరం చూపలేదు. తెచ్చుకున్న గొడ్డళ్లు..ఇతర పరికరాలతో గుడిసెలను నేలమట్టం చేసేశారు. తమ కళ్లెదుటే నివాసాలు కూలుతుంటే తీవ్ర ఆవేదన చెందారు. ఇళ్లు కూలగొట్టడంతో గిరిజనులు నిరాశ్రలయ్యారు.

 

16:27 - October 6, 2017

ఢిల్లీ : ఒక దేశం ఒకే పన్ను విధానం తరహాలో ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే జమిలి ఎన్నికల నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేస్తుండగానే ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి లోక్‌ సభతో పాటు అన్నిరాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్ యాప్‌ను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్..పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం నిధులను సమకూర్చిందన్నారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951-52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968,69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది.

అయితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. జమిలి ఎన్నికల విధానాన్ని 2024 నుంచి అమలుచేయాలని, రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల విధానంపై విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. 2018 మార్చి నాటికి ఈసీ తుది నిర్ణయం ప్రకటించాలని తెలిపింది. తాజాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీ ప్రకటించింది.

మరోవైపు లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

16:24 - October 6, 2017

గుంటూరు : రూల్ ఈజ్‌ రూల్.. రూల్‌ ఫర్‌ ఆల్‌ అని గుంటూరు అర్బన్‌ పోలీసులంటున్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రబిందువైన.. గుంటూరు అర్బన్ పరిధిలో రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రధానంగా ట్రాఫిక్‌ వ్యవస్థపై దృష్టి పెట్టారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విషయంలో సొంతశాఖ నుండే కార్యాచరణ చేపట్టారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే హెల్మెట్ ధరించే విషయంలో ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తం కావడంతో.. గతంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత న్యాయస్థానం కూడా శిరస్త్రాణం నిబంధన అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇంతకాలం దానిపై పెద్దగా దృష్టి సారించలేదు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. రాజధాని పరిధిలో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చారు.

గత రెండు రోజులుగా గుంటూరు అర్బన్ పోలీసులు.. నగరంలో హెల్మెట్ లేనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. రూల్‌ను పబ్లిక్‌కు మాత్రమే వర్తింపజేయకుండా.. తమ సొంత శాఖలోని సిబ్బందికి కూడా శిరస్త్రాణాన్ని తప్పని చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఈ హెల్మెట్‌ రూల్ విషయంలో రాజీ పడొద్దంటూ.. క్రిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొందరు వాహనదారులు పోలీసులు ఆపిన సమయంలో ఆగకుండా అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం సెల్‌ఫోన్‌లో వారి నెంబర్‌ను ఫీడ్‌ చేసి ఇంటికి ఫైన్‌లు, చలానాలు పంపుతున్నారు.

ఇదిలా ఉంటే హెల్మెట్ రూల్‌పై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలంటున్నారు. మద్యాన్ని అరికట్టకుండా శిరస్త్రాణం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి గుంటూరు పోలీసులు మాత్రం శిరస్త్రాణం రూల్‌ విషయంలో.. ఈ సారి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. అటు ప్రజల్లో కూడా అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. 

16:21 - October 6, 2017

విజయవాడ : ఎట్టకేలకు మెడ్‌టెక్‌ జోన్‌ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అమాంతం అంచనాలు పెంచి కోట్లు కొట్టేద్దామనుకున్న ఓ ప్రైవేట్‌ కన్సల్‌టెన్సీ, దాని వెనుక ఉన్న పెద్దల వ్యూహానికి గండి పడింది. విశాఖలో 200 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్కీము వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణల నేథ్యంలో టెండర్లు రద్దయ్యాయి. మెడ్‌టెక్‌జోన్‌ పనులను 709.81 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టవచ్చని కేపీఎంజీ సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ అంచనాలను తోసిపుచ్చిన మెడ్‌టెక్‌ పార్క్‌ సీఈఓ 2,432 కోట్లకు అంచనాలు పెంచి ల్యాంకో సంస్థకు పనులు అప్పగించారు. దీనిపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సీబీఐకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది.

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్‌ పరిశ్రమపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం అంచాన వ్యయాన్ని 400 కోట్లరూయలకు తగ్గించి మరోసారి టెండర్లు పిలిచింది. దీనిపై ఈ నెల 3వ తేదీన ఈ మేరకు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈనెల 25న సాంకేతిక, ఆర్థిక బిడ్‌లు ప్రారంభిచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 18 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, అవసరమైతే మరో 3 నెలలు గడువు పెంచాలని నిర్ణయించారు. అయితే.. టెండర్లు దక్కించుకున్న ల్యాంకో సకాలంలో పనులు ప్రారంభించలేదని, అందుకే మళ్లీ టెండర్లకు వెళుతున్నట్టు మెడ్‌టెక్‌ జోన్‌ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ స్కీమ్‌ వెనుక వంద కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో మెడ్‌టెక్‌ టెండర్లు రద్దుచేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడినట్టైందని విపక్షపార్టీలు అంటున్నాయి. 

16:15 - October 6, 2017

హైదరాబాద్ : జలగలంచ దాష్టీకంపై సర్కార్‌ కదిలింది. గొత్తికోయ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుషంపై సీఎం సీరియస్‌ అయ్యారు. భాష, భావం తెలియని గొత్తికోయల అరణ్య రోధన.. అమానుష ఘటనను టెన్‌ టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ప్రజా సంఘాల ఆందోళనలు.. రాజకీయ పార్టీల ర్యాలీలు గిరిజనులకు బాసటగా నిలిచాయి. అభయారణ్యంలో ఆదివాసీలపై దాడులను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. స్వయంగా సీఎం నివేదిక కోరడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. గొత్తికోయ మహిళలను లాఠీలతో బాదడం, చిన్న పిల్లల తల్లులను, వృద్ధులను, గర్భిణులను ఈడ్చి పడేసి.. ఫారెస్ట్‌ అధికారులు పైశాచికంగా ప్రవర్తించిన తీరును 10 టీవీ కళ్లకు కట్టింది. జలగలంచ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని లేపింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ నివేదికలను తెప్పించుకుంది.

ఇదిలా ఉంటే గొత్తికోయల ఘటనపై సీఎం కేసీఆర్‌ భగ్గుమన్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. గొత్తికోయల పట్ల ఈ చర్యలకు పాల్పడిందెవరు? అసలు గొత్తి కోయలపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాడి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశించింది ఎవరు? చర్యలు తీసుకునే ముందు అధికారులు రాష్ట్ర అధికారులు, స్థానిక పోలీసులకు.. ఎవరికైనా సమాచారమిచ్చారా? ఇస్తే ఎవరికిచ్చారు. మొత్తం ఈ విషయాలపై నివేదిక ఇవ్వమని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే కనీస అవగాహన లేని అధికారులున్నారా? అని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అసలేం చేస్తున్నారు? అడవుల సంరక్షణను పక్కన పెట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, వెంటనే పని తీరు మార్చుకోవాలని.. ఐఎఫ్‌ఎస్ అధికారులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం ఆగ్రహించడంతో అటవీ అధికారులు, ఉరుకులు, పరుగులు పెట్టారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సమీక్ష నిర్వహించడంతో పాటు, సచివాలయంలో సమావేశమై లోటుపాట్లను సమీక్షించుకున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, పీసీసీఎఫ్‌ సహా, సీఎంఓ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున కేబీఆర్‌ పార్కు విషయమై అధికారుల తీరును సీఎం తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాగా అడవి లోపల ఉంటే.. గిరిజనుల సమస్యలను పరిష్కరించి, వారికి సౌకర్యాలు కల్పించలేమని కలెక్టర్‌ చెప్పారు. అందుకే వారు బయటికి వస్తే కావాల్సిన సౌకర్యాలు కల్పించేలా.. అటవీశాఖతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మేడారం అడవుల్లో అవస్థలు పడుతున్న విషయాలపై నిజానిజాలను తెలుసుకోవాలని.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలుస్తోంది.

16:12 - October 6, 2017

హైదరాబాద్ : అసలే అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వరుణుడి దెబ్బకు చిధ్రమయ్యాయి. వరదకోతకు రూపురేఖలే మారిపోయాయి. దీంతో విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరం..గోతులమయంగా మారింది. మాన్‌సూన్ ప్రారంభం నుంచే బ‌ల్దియా ప్రత్యేక దృష్టి సారించినా..చిన్నపాటి వ‌ర్షం కురిసినా రోడ్లు ధ్వంసం కావడం పరిపాటిగా మారింది. ఎటు చూసినా గోతులతో అధ్వాన్నంగా మారాయి. దీంతో గ్రేటర్‌ సిటీలో జనం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలంలో రోడ్ల దుస్థితి చెప్పనక్కరలేదు. వాహనదారులు ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. జిహెచ్‌ఎంసి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా రహదారుల దుస్థితి మాత్రం మారడం లేదు. ఏటా రహదారుల అభివృద్ధి కోసం చేస్తున్న వంద‌ల కోట్లు ఖ‌ర్చు...బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం 9,050 కిలో మీట‌ర్ల రోడ్లు ఉన్నాయి. సిటిలో 4,173 కిలో మీట‌ర్లు బిటిరోడ్లు, 3,928 కిలో మీట‌ర్ల సీసీ రోడ్లు ఉండ‌గా.....,కంక‌ర రోడ్లు 81కిలో మీట‌ర్లు, 857 కిలోమీట‌ర్ల మ‌ట్టి రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతలు జిహెచ్ఎంసి చూస్తోంది. బిటిరోడ్డు ఒక‌సారి వేసిన త‌రువాత 5 ఏళ్లు దాని లైఫ్‌ టైం ఉంటుంది. ఒకవేళ రెండేళ్ల‌లోపు రోడ్లు దెబ్బ‌తింటే...మరమ్మతు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దే. ఇక సిసి రోడ్ల జీవితకాలం 30ఏళ్లు. బిటిరోడ్డు నిబంధనలే దీనికి వర్తిస్తాయి. కానీ నగరంలో ఎక్కడా ఐదేళ్ల వ‌ర‌కు బిటి రోడ్లు, 30 ఏళ్ల వ‌ర‌కు సీసీ రోడ్లు మ‌న్నిన దాఖాలాలు క‌నిపించ‌వు. రోడ్డు వేసిన కొంతకాలానికే దెబ్బతింటున్నాయి. వ‌రుస‌గా రెండేళ్ల నుంచి రోడ్ల నిర్వహణ కోసం 400 కోట్లు పైగా జిహెచ్ఎంసి వెచ్చిస్తోంది.

ఇటీవ‌ల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు రోడ్ల రూపురేఖలను మార్చేశాయి. రోడ్లపైకి వరద నీరు పోటెత్తడంతో భారీగా కోతకు గురయ్యాయి. రెండు మూడు రోజులు రోడ్లపై నీరు నిల‌వ‌డంతో ..ఘోరంగా దెబ్బతిన్నాయి. సుమారు 450 ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. అయా ప్రాంతాల్లో 1200 పాత్ హోల్స్, 185 ప్రాంతాల్లో స్టెచ్‌లు దెబ్బతినట్లు బ‌ల్దియా ఇంజ‌నీరింగ్ అధికారులు లెక్కలుగట్టారు. అయితే వీటి మరమ్మతుకు 2కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు కావొచ్చని అంచ‌నా వేస్తున్నారు. ఈ లెక్కలు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయ‌నే వాద‌న‌లున్నాయి.

ఏటా 500 కోట్లు వెచ్చించి 20 శాతం రోడ్లను ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం పునరుద్ధరించాలని బల్దియా ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ రహదారుల రూపురేఖలు మారుస్తామని చెబుతున్నా..ఇవన్నీ ఆర్భాట ప్రకటనలే అని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. 

16:11 - October 6, 2017

నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉంటున్నారని..వారి కోసం ఎంతో చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో తమ సమస్యలు తీర్చాలంటూ రైతులు ఆందోళనలు..నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర నష్టాలపాలైన రైతన్నలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరోక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
జిల్లా చిన కాపర్తిలో కౌలు రైతు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. చిట్యాల మండలం చినకాపర్తికి చెందిన రుద్రవరపు ఇస్తారి..3 ఎకరాల్లో పత్తిసాగు చేశాడు. పత్తి దిగుబడి రాకపోవడం..అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలంలో పురుగుల మందు సేవించి బలవన్మరణం చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

16:08 - October 6, 2017

చిత్తూరు : టీటీడీలో పని చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ చెప్పారు. ఉద్యోగులు, సిబ్బంది వరుసగా మూడు సార్లు తప్పులు చేసి పట్టుబడితే.. విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి.. డబ్బులు డిమాండ్‌ చేసిన క్షరకులపై త్వరలోనే వేటు పడనుందని ఈవో తెలిపారు. 80-90 మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని, నోటీసులు త్వరలో వెళుతాయన్నారు. క్షురకులు డబ్బులు తీసుకుంటున్నారని, లగేజీ ఇతర సామాగ్రీ పెట్టే విషయంలో డబ్బులు అడుగుతున్నారని..మిగతా చిన్న చిన్న ఫిర్యాదులు చేశారని తెలిపారు. 

15:32 - October 6, 2017

చిత్తూరు : టీటీడీలో పని చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ చెప్పారు. ఉద్యోగులు, సిబ్బంది వరుసగా మూడు సార్లు తప్పులు చేసి పట్టుబడితే.. విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి.. డబ్బులు డిమాండ్‌ చేసిన క్షరకులపై త్వరలోనే వేటు పడనుందని ఈవో తెలిపారు. 80-90 మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని, నోటీసులు త్వరలో వెళుతాయన్నారు. క్షురకులు డబ్బులు తీసుకుంటున్నారని, లగేజీ ఇతర సామాగ్రీ పెట్టే విషయంలో డబ్బులు అడుగుతున్నారని..మిగతా చిన్న చిన్న ఫిర్యాదులు చేశారని తెలిపారు. 

15:30 - October 6, 2017

ఏలూరు : ఎంపీ మాగంటి బాబు..ప్రస్తుతం ఈయన వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఎవరైనా మందు తాగండి..పేకాట ఆడండి..పోలీసులు పట్టుకోవద్దంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగంటి బాబు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆర్యవైశ్యుల గురించి తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేతులు విరగొట్టమని పిలుపునిచ్చారు.. ఏదైనా జరిగితే మీ వెంట నేను ఉంటానని హామీ ఇచ్చారు.
ఇటీవలే సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారి తీసింది. దీనిపై ఆర్యవైశ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు. కంచె ఐలయ్యకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

30 గంటల తరువాత చిరుత బంధి..

హర్యానా : మారుతీ సుజుకీ షోరూంలో ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు ఫారెస్టు అధికారులు బంధించారు. గురువారం చిరుత షోరూంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మొత్తంగా అధికారులు 30గంటల పాటు శ్రమించి చిరుతను బంధించారు. 

పాక్ కాల్పులపై సమీక్ష..

జమ్మూ కాశ్మీర్ : పూంచ్ జిల్లాలో జమ్మూ డివిజనల్ కమిషనర్ ఎం.కె.భండారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాజాగా పాక్ జరుపుతున్న కాల్పులపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. 

వరుడు పరార్...

విజయనగరం : గురుగుబల్లి (మం) దలైవలసలో ఆరేళ్లు ప్రేమించి పెళ్లికి వరుడు నిరాకరించాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి యువకుడు పరారీ కావడంతో కలకలం రేగింది.

 

కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్...

హైదరాబాద్ : మధ్యాహ్నం 3గంటలు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సింగరేణిలో టీజీబీకేఎస్ విజయం సాధించడం పట్ల ఆయన ప్రెస్ మీట్ లో మాట్లడనున్నట్లు తెలుస్తోంది. 

సీపీఐ నేత నారాయణ పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : సదావర్తి భూముల్లో అక్రమాలు జరిగాయంటూ సీపీఐ నేత నారాయణ చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు...

ఏలూరు : ఎంపీ మాగంటి బాబు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలోని కాని ఆర్యవైశ్యుల గురించి మాట్లాడితే కాళ్లు, చేతులు విరగ్గొట్టాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏది జరిగిన వైశ్యుల వెంట ఉంటానని పేర్కొన్నారు.

 

నేడు గోవాలో సమంత, నాగచైతన్యల పెళ్లి

గోవా : సమంత, నాగచైతన్యల వివాహం ఇవాళ గోవాలో ఘనంగా జరగబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహం జరిపించనున్నారు. ఈ సందర్భంగా వరుడు నాగచైతన్యను పెళ్లికొడుకుని చేసిన ఫొటోలను అక్కినేని నాగార్జున, వెంకటేశ్‌లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటోలో నాగచైతన్యతో పాటు నాగార్జున, వెంకటేశ్‌ కూడా ఉన్నారు. 

జైలు నుంచి బయటకొచ్చిన శశికళ

చెన్నై : పెరోల్‌పై శశికళ పరప్పన్‌ జైలు నుంచి బయటకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు కర్నాటక జైళ్ల శాఖ అనుమతివ్వడంతో ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు పలువురు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజులు వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని, రాజకీయ కార్యక్రమాలకు  హాజరైతే పెరోల్‌ రద్దు చేస్తామని  జైళ్ల శాఖ హెచ్చరించింది.

 

13:55 - October 6, 2017

గోవా : సమంత, నాగచైతన్యల వివాహం ఇవాళ గోవాలో ఘనంగా జరగబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహం జరిపించనున్నారు. ఈ సందర్భంగా వరుడు నాగచైతన్యను పెళ్లికొడుకుని చేసిన ఫొటోలను అక్కినేని నాగార్జున, వెంకటేశ్‌లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటోలో నాగచైతన్యతో పాటు నాగార్జున, వెంకటేశ్‌ కూడా ఉన్నారు. ఇక పెళ్లికూతురిగా సమంత ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికి నాగచైతన్య, సమంత కుటుంబాలతో కలిపి 100 మంది హాజరుకాబోతున్నారు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించనున్నారు. 

 

13:54 - October 6, 2017

చెన్నై : పెరోల్‌పై శశికళ పరప్పన్‌ జైలు నుంచి బయటకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు కర్నాటక జైళ్ల శాఖ అనుమతివ్వడంతో ఆమె  జైలు నుంచి విడుదలైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు పలువురు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజులు వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని, రాజకీయ కార్యక్రమాలకు  హాజరైతే పెరోల్‌ రద్దు చేస్తామని జైళ్ల శాఖ హెచ్చరించింది.

 

సదావర్తి భూముల కేసు డిస్పోజ్‌

ఢిల్లీ : సదావర్తి భూములుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగాయి. ఏపీ ల్యాండ్స్ కావంటూ తమిళనాడు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వేలంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు సదావర్తి భూముల కేసును డిస్పోజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. సదావర్తి భూముల కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. 

13:50 - October 6, 2017

ఢిల్లీ : సదావర్తి భూములుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగాయి. ఏపీ ల్యాండ్స్ కావంటూ తమిళనాడు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వేలంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు సదావర్తి భూముల కేసును డిస్పోజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. సదావర్తి భూముల కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.  సదావర్తి భూములు ఎవరివి అని తేల్చాలని సూచించింది. తాను వేలంలో పాల్గొనడానికి డిపాజిట్‌ చేసి డబ్బుకు 18 శాతం వడ్డీ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆళ్ల రామకృష్ణరెడ్డి కోరారు. 22 కోట్లకు భూములు పొందిన సంజీవ్‌రెడ్డి తనకి 18 శాతం వడ్డీతో వెనక్కు డబ్బులు ఇవ్వమని సుప్రీంకోర్టులో అభ్యర్థించారు.

 

13:49 - October 6, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి..  తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త చాంబర్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత అని సోమిరెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక విధానాలను తాము అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతున్నామని.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 

 

13:45 - October 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ చిలకలగూడలో కానిస్టేబుల్‌ తాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతి తన ప్రేమను నిరాకరించడంతో తానీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తాని కాల్‌డేటా ఆధారంగా... వాట్సాప్‌లో ఉన్న మెసెజ్‌ల ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో తాని రోడ్డు ప్రమాదానికి గురై... ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవడంతో యువతి.. ప్రేమను నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన తాని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాని 2010 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. ప్రస్తుతం మోండా మార్కెట్‌ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 

 

వరుడు పరారీ.. ఆగిన పెళ్లి

విజయనగరం : పెళ్లి సమయానికి వరుడు పరారైన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలసలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన యువకుడు... ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లికి అంగీకరించాడు. అయితే...కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా... శంకర్‌రావు కనిపించకుండాపోయాడు. దీంతో వధువు బంధువులు లబోదిబోమంటున్నారు. 

 

13:43 - October 6, 2017

విజయనగరం : పెళ్లి సమయానికి వరుడు పరారైన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలసలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన యువకుడు... ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లికి అంగీకరించాడు. అయితే...కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా... శంకర్‌రావు కనిపించకుండాపోయాడు. దీంతో వధువు బంధువులు లబోదిబోమంటున్నారు. 

తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో దారుణం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్లడంలేదని ఆరేళ్ల చిన్నారిపై దాష్టీకం ప్రదర్శించారు తల్లి, మారు తండ్రి. చిత్రహింసలు పెట్టడంతో చిన్నారి వళ్లంతా గాయాలయ్యాయి.  ఇది గమనించిన స్థానికులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

13:40 - October 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్లడంలేదని ఆరేళ్ల చిన్నారిపై దాష్టీకం ప్రదర్శించారు తల్లి, మారు తండ్రి. చిత్రహింసలు పెట్టడంతో చిన్నారి వళ్లంతా గాయాలయ్యాయి.  ఇది గమనించిన స్థానికులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:34 - October 6, 2017
13:33 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. కరీంనగర్‌ జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్‌లో పిడుగు పడడంతో .. చేపల వేటకు వెళ్ళిన లక్ష్మణ్ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. లక్ష్మణ్ చేపలు పట్టడానికి డ్యామ్‌లోకి వెళ్లిన సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చి.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితా జాలర్లు అతి కష్టం మీద మృత దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మరోవైపు కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలం, బస్వన్నపల్లి గుట్టపై పిడుగు పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా, నవీపేట్‌ మండల కేంద్రంలో పిడుగు పడటంతో.. విద్యుత్‌ స్థంభంపై మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు బాగు చేసి మళ్లీ విద్యుత్‌ను పునరుద్ధరించారు.  

 

ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

ఢిల్లీ : 22వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 60 వస్తువులపై పన్నులు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై నిన్న ప్రధాని మోదీ అరుణ్‌జైట్లీతో సమావేశమై చర్చించారు. 

13:30 - October 6, 2017

ఢిల్లీ : 22వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 60 వస్తువులపై పన్నులు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై నిన్న ప్రధాని మోదీ అరుణ్‌జైట్లీతో సమావేశమై చర్చించారు. 

 

శశికళకు ఐదు రోజుల పెరోల్ అంగీకారం

చెన్నై : శశికళకు పెరోల్ లభించింది. అనార్యోంతో ఉన్న తను భర్తను పరామర్శించేందుకు పెరోల్ కు అనుమతిచ్చింది. ఐదు రోజుల పెరోల్ కు కర్నాటక జైళ్ల శాఖ అంగీకరించింది. వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్ల శాఖ అదేశించారు. మరికాసేపట్లో పెరోల్ పై శశికళ జైలు నుంచి బయటకు రానుంది. 

13:23 - October 6, 2017

చెన్నై : శశికళకు పెరోల్ లభించింది. అనార్యోంతో ఉన్న తను భర్తను పరామర్శించేందుకు పెరోల్ కు అనుమతిచ్చింది. ఐదు రోజుల పెరోల్ కు కర్నాటక జైళ్ల శాఖ అంగీకరించింది. వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్ల శాఖ అదేశించారు. మరికాసేపట్లో పెరోల్ పై శశికళ జైలు నుంచి బయటకు రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గౌరీ లంకేష్ హత్య వెనుక ఐదుగురి హస్తం ?

ఢిల్లీ : గౌరీ లంకేష్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సనాతన సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తుల హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత ఐదుగురు అదృశ్యమయ్యారు. ప్రవీణ్ లిమ్కర్, జయప్రకాశ్, సరంగ్ అకోల్కర్, రుద్ర పాటిల్, వినాయ్ పవార్ అదృమయ్యారు. మాడగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురిపైనా ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. 

13:12 - October 6, 2017

హైదరాబాద్ : గౌరీ లంకేష్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సనాతన సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తుల హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత ఐదుగురు అదృశ్యమయ్యారు. ప్రవీణ్ లిమ్కర్, జయప్రకాశ్, సరంగ్ అకోల్కర్, రుద్ర పాటిల్, వినాయ్ పవార్ అదృమయ్యారు. మాడగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురిపైనా ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:57 - October 6, 2017

హైదరాబాద్ : టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పితానికి పవన్ ఏంటో తెలియదు అనడం సంతోషమని పవన్ ట్వీట్ చేశారు. అశోక్ గజపతిరాజుకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని పవన్ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మంత్రి పితాని వ్యాఖ్యలపై పవన్ కౌంటర్

హైదరాబాద్ : టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పితానికి పవన్ ఏంటో తెలియదు అనడం సంతోషమని పవన్ ట్వీట్ చేశారు. అశోక్ గజపతిరాజుకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని పవన్ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:51 - October 6, 2017

జయశంకర్ భూపాలపల్లి : మేడారం అడవులు లవ్వాల కీకారణ్యం జలగలంచ దాష్టీకంపై సర్కార్‌ కదిలింది. గొత్తికోయ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుషంపై సీఎం సీరియస్‌ అయ్యారు. భాష, భావం తెలియని గొత్తికోయల అరణ్య రోధన.. అమానుష ఘటనను టెన్‌ టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ప్రజా సంఘాల ఆందోళనలు.. రాజకీయ పార్టీల ర్యాలీలు గిరిజనులకు బాసటగా నిలిచాయి. అభయారణ్యంలో ఆదివాసీలపై దాడులను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. స్వయంగా సీఎం నివేదిక కోరడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.  

నాగరికత తెలిసిన మనుషులే అనాగరికంగా ప్రవర్తించారు. మానవత్వం మరచి గొత్తికోయల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించారు. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా వారితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. గొత్తికోయ మహిళలను లాఠీలతో బాదడం, చిన్న పిల్లల తల్లులను, వృద్ధులను, గర్భిణులను ఈడ్చి పడేసి.. ఫారెస్ట్‌ అధికారులు పైశాచికంగా ప్రవర్తించిన  తీరును 10 టీవీ కళ్లకు కట్టింది. జలగలంచ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని లేపింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ నివేదికలను తెప్పించుకుంది. 

ఇదిలా ఉంటే గొత్తికోయల ఘటనపై సీఎం కేసీఆర్‌ భగ్గుమన్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. గొత్తికోయల పట్ల ఈ చర్యలకు పాల్పడిందెవరు? అసలు గొత్తి కోయలపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాడి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశించింది ఎవరు? చర్యలు తీసుకునే ముందు అధికారులు రాష్ట్ర అధికారులు, స్థానిక పోలీసులకు.. ఎవరికైనా సమాచారమిచ్చారా? ఇస్తే ఎవరికిచ్చారు. మొత్తం ఈ విషయాలపై నివేదిక ఇవ్వమని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే కనీస అవగాహన లేని అధికారులున్నారా? అని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

అసలేం చేస్తున్నారు? అడవుల సంరక్షణను పక్కన పెట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, వెంటనే పని తీరు మార్చుకోవాలని.. ఐఎఫ్‌ఎస్ అధికారులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం ఆగ్రహించడంతో అటవీ అధికారులు, ఉరుకులు, పరుగులు పెట్టారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సమీక్ష నిర్వహించడంతో పాటు, సచివాలయంలో సమావేశమై లోటుపాట్లను సమీక్షించుకున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, పీసీసీఎఫ్‌ సహా, సీఎంఓ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున కేబీఆర్‌ పార్కు విషయమై అధికారుల తీరును సీఎం తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాగా అడవి లోపల ఉంటే.. గిరిజనుల సమస్యలను పరిష్కరించి, వారికి సౌకర్యాలు కల్పించలేమని కలెక్టర్‌ చెప్పారు. అందుకే వారు బయటికి వస్తే కావాల్సిన సౌకర్యాలు కల్పించేలా.. అటవీశాఖతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మేడారం అడవుల్లో అవస్థలు పడుతున్న విషయాలపై నిజానిజాలను తెలుసుకోవాలని.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలుస్తోంది. 

తన నూతన కార్యాలయాన్ని ప్రాంరంభించిన మంత్రి సోమిరెడ్డి

గుంటూరు : ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి..  తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త చాంబర్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత అని సోమిరెడ్డి తెలిపారు. 

12:38 - October 6, 2017

ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు మృతి చెందారు. అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:36 - October 6, 2017

కర్నూలు : పట్టణంలో ఎస్‌ఐ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లా గుడిబండలో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాహుస్సేన్‌ భార్య కర్నూలులో ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరిరువురికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. కుటుంబ కలహాలే కారణని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:33 - October 6, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ చిలకలగూడలో కానిస్టేబుల్‌ తాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాని మోండా మార్కెట్‌ పీఎస్‌లో పని చేస్తున్నాడు. తాని 2010 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ చిలకలగూడలో కానిస్టేబుల్‌ తాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాని మోండా మార్కెట్‌ పీఎస్‌లో పని చేస్తున్నాడు. తాని 2010 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. 

12:24 - October 6, 2017

ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా....పవర్‌ ప్యాకెడ్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టీ20కి రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. వన్డే సిరీస్‌ విజయంతో జోరు మీదున్న  కొహ్లీ అండ్ కో...20-20 సిరీస్‌లోనూ స్టీవ్‌స్మిత్‌ సారధ్యంలోని కంగారూ టీమ్‌కు చెక్‌ పెట్టాలని పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసి సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా విరాట్‌ ఆర్మీ బరిలోకి దిగబోతోంది. 

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల  ట్వంటీ ట్వంటీ సిరీస్‌కు  రంగం సిద్దమైంది.  రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగనున్న తొలి టీ20లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఫటా ఫట్‌ 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ...స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియా 5వ స్థానంలో ఉండగా...ఆస్ట్రేలియా 7వ స్థానానికి పడిపోయింది. 

ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీ,రాహుల్‌, ధోనీ, మనీష్‌ పాండే,కేదార్‌ జాదవ్‌లతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.హార్దిక్‌ పాండ్య,అక్షర్‌ పటేల్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లతో లోయర్‌ ఆర్డర్‌లోనూ బలంగా ఉంది. రోహిత్‌ శర్మ ,హార్దిక్‌ పాండ్య సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానేమే లేదు. కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ వంటి మ్యాజిక్‌  స్పిన్నర్లతో పాటు  అనుభవజ్ఞుడైన అశిష్‌ నెహ్రా,భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా  వంటి  పేస్‌ బౌలర్లతో బౌలింగ్‌ ఎటాక్‌ మునునెన్నడూ లేనంతలా  పదునుగా ఉంది. 

సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోన్న విరాట్‌ ఆర్మీ...టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ర్యాంక్‌ సాధించాలని తహతహలాడుతోంది.5 వన్డేల సిరీస్‌ను 4-1తో నెగ్గిన భారత్‌ టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌ చేస్తే టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంటుంది.

మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు టీ20 సిరీస్‌లో అయినా స్థాయికి తగ్గట్టుగా రాణించాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ,ఆరోన్‌ ఫించ్‌,  స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌...బౌలింగ్‌లో జేమ్స్‌ ఫాక్నర్‌, కౌల్టర్‌నైల్‌ వంటి అనుభవజ్ఞులు రాణిస్తేనే భారత్‌కు గట్టి పోటీనివ్వగలుగుతుంది.  

ఇక 20-20 ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ ఆస్ట్రేలియాపై ఇండియాకు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 13 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. టీ20ల్లో  తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు...పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పటిష్టంగా ఉన్న భారత జట్టుకే సిరీస్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టును మాత్రం అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం.మరి తొలి టీ20లో నెగ్గి  మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసే జట్టేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

12:20 - October 6, 2017

రాజన్న సిరిసిల్ల : ప్రేమించడం వాళ్లపాలిట శాపమయ్యింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన అమ్మాయి మేనమామలు ఆ జంటను  కిరాతకంగా హతమార్చారు. మరోచోట పెద్దలు పెళ్లికి  ఒప్పుకోక పోవడంతో ఇంట్లోనుంచి పారిపోయి జంట.. చివరకు రైలుపట్టాలపై శవాలై తేలారు. రెండు సంఘటనల్లో బలైంది ప్రేమికులే.. కారణం మాత్రం ఒక్కటే.. పరువు పేరుతో జరిన సంఘటనలే.

పెద్దలను ఎదిరించి ప్రేమించిన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవడమే వారి పాలిట శాపమయ్యింది. మొన్న భువనగిరిలో జరిగిన నరేష్‌- స్వాతిల హత్యలు మరచిపోకముందే నేడు వేములవాడ రాజన్న జిల్లాలో అలాంటి విషాదఘటనే 
పునరావృత మైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం వెంకటంపల్లిలో నవ దంపతులు దారుణ హత్యకు గురైయ్యారు. వెంకటంపల్లి గ్రామానికి చెందిన రజిత.. బాలరాజుపల్లికి చెందిన హరీశ్ నెల రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని రజిత మేనమామలు దంపతులపై కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా అమ్మాయి మేనమామలకి అబ్బాయి నచ్చలేదన్న కారణంతో ఆ అబ్బాయిని తల్లి కళ్లముందే అతి కిరాతకంగా చంపేశారు. అంతే గాక అక్కడే ఉన్న ఆ అమ్మాయిని కూడా గొంతుకోసి హతమార్చారు.

మరో సంఘటనలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో  రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన వీరాంజనేయులు, విద్యాధరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే అమ్మాయి కుటుంబసభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఈనెల 1వ తేదీన ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పర్చూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదైంది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడ్డారు. 

సంఘటనల వెనుక నేపథ్యం ఏదైనా.. బలయింది మాత్రం ప్రేమికులే. పరువు పేరుతో సోంత పిల్లలను చంపుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పురావాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

12:15 - October 6, 2017

విశాఖ : ఎట్టకేలకు మెడ్‌టెక్‌ జోన్‌ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అమాంతం అంచనాలు పెంచి కోట్లు కొట్టేద్దామనుకున్న ఓ ప్రైవేట్‌ కన్సల్‌టెన్సీ, దాని వెనుక ఉన్న పెద్దల వ్యూహానికి గండి పడింది. విశాఖలో 200 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్కీము వెనుక  కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణల నేథ్యంలో టెండర్లు రద్దయ్యాయి. 
టెండర్లపై ఏపీ ప్రభుత్వం యూటర్న్‌ 
విమర్శలు వెల్లువెత్తడంతో మెడ్‌టెక్‌జోన్‌ టెండర్లపై ఏపీ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. వైద్యపరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాచేస్తున్న ఈస్కీమ్‌లో కోట్లు రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 
మెడ్‌టెక్‌జోన్‌  పనులను 709.81 కోట్ల రూపాయల 
అంచనాతో చేపట్టవచ్చని కేపీఎంజీ సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ అంచనాలను తోసిపుచ్చిన మెడ్‌టెక్‌ పార్క్‌ సీఈఓ 2,432 కోట్లకు అంచనాలు పెంచి ల్యాంకో సంస్థకు పనులు అప్పగించారు.  దీనిపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సీబీఐకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది.  
రూ.400 కోట్లతో తాజా టెండర్లు 
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో ఏర్పాటు చేస్తున్న  మెడ్‌టెక్‌ పరిశ్రమపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో  టెండర్లను రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం అంచానవ్యయాన్ని  400 కోట్లరూయలకు తగ్గించి  మరోసారి టెండర్లు పిలిచింది.  దీనిపై ఈ నెల 3వ తేదీన ఈ మేరకు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈనెల 25న సాంకేతిక, ఆర్థిక బిడ్‌లు ప్రారంభిచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 18 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, అవసరమైతే మరో 3 నెలలు గడువు పెంచాలని నిర్ణయించారు. అయితే.. టెండర్లు దక్కించుకున్న ల్యాంకో  సకాలంలో పనులు ప్రారంభించలేదని, అందుకే మళ్లీ టెండర్లకు వెళుతున్నట్టు మెడ్‌టెక్‌ జోన్‌ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ స్కీమ్‌ వెనుక వంద కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో  మెడ్‌టెక్‌ టెండర్లు రద్దుచేసింది చంద్రబాబు ప్రభుత్వం.దీంతో కోట్ల  రూపాయల ప్రజాధనాన్ని కాపాడినట్టైందని విపక్షపార్టీలు అంటున్నాయి. 

12:06 - October 6, 2017

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి... ఇప్పుడు ఈ పేరు కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. రేవంత్‌ హస్తానికి చేరువవుతారనే వార్తలు... కాంగ్రెస్‌ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రావాలని కొందరు, వద్దని... మరికొందరు.. ఇలా ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. ఇంతకు రేవంత్‌ న్యూ జర్నీపై ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది.
రేవంత్‌ పై చర్చ 
తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి... కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఏ ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులు కలిసినా.. రేవంత్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఆయన రాకపై రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. సూటిగా సుత్తి లేకుండా.. విమర్శిస్తూ... యువతలో క్రేజ్‌ సంపాదించుకున్న రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వస్తే... పార్టీకి లాభిస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. మరికొందరు...రేవంత్‌ రాకపై విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో.. రేవంత్‌కు మించిన నేతలు ఉన్నారని.. వీరు ఉండగా.. రేవంత్‌ అవసరం ఏంటని అనుకుంటున్నారు. సీఎల్పీ భేటిలో సైతం .. దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం. 
రేవంత్‌తో టచ్‌లో ఉన్న ఢిల్లీ పెద్దలు
ఇదిలా ఉంటే... రేవంత్‌తో ఢిల్లీ పెద్దలు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పెద్దలు రేవంత్‌తో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తున్నారు. ఆయన రాకకు...ముహూర్తం ఫిక్స్‌ చేస్తారని రేవంత్ రావాలని కోరుకుంటున్న నేతలు చర్చించుకుంటున్నారు.  

 

12:03 - October 6, 2017

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం చౌదరిపల్లి గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలారే వాహనం, కారు, లారీ ఢీకొనడంతో... ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు. మృతులు మైలారం మల్లయ్యతో పాటు డ్రైవర్‌ మర్రిగూడ మండలానికి చెందినవారుగా గుర్తించారు. 

 

11:56 - October 6, 2017

విజయనగరం : జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా జిల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్ నిలిచిపోయింది. గ్రౌండ్ బురదమయంగా మారడంతో రిక్రూట్ మెంట్ నిలిపివేశారు. రెండు నెలల తర్వాత మళ్లీ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు భారీ వర్షంతో ఎస్,కోటలో కాలనీలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

 

విజయనగరం జిల్లాలో భారీ వర్షం

విజయనగరం : జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా జిల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్ నిలిచిపోయింది. గ్రౌండ్ బురదమయంగా మారడంతో రిక్రూట్ మెంట్ నిలిపివేశారు. రెండు నెలల తర్వాత మళ్లీ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు భారీ వర్షంతో ఎస్,కోటలో కాలనీలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

తమిళనాడు గవర్నర్ గా బన్వరీలాల్ ప్రమాణం స్వీకారం

చెన్నై : రాజ్ భవన్ లలో గవర్నర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది. తమిళనాడు గవర్నర్ గా బన్వరీలాల్ ప్రమాణం స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ పాల్గొన్నారు. 

 

ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రమాణస్వీకారం

అమరావతి : భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ చేశారు. బ్రహ్మానందరెడ్డితో స్పీకర్ కోడల శివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ పాల్గొన్నారు.

 

11:20 - October 6, 2017

విజయవాడ : ఏపీలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు నగరాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అయితే, వర్షాలకు తడిసిన మిద్దెల కారణంగా.. అనంతపురంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. 

భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో ఉన్న సాహెబ్ చెరువు నిండి పొంగిపొర్లుతోంది. మూడేళ్లుగా వర్షాభావం వల్ల వెలవెలబోయిన చెరువు జలకళను సంతరించుకుంది. అటు చిత్రావతి నదిలోనూ నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పుట్టపర్తి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కైరెవు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు పురాతన మఠం ఉన్నట్టుండి కూలిపోవడంతో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెస్తరపల్లికి చెందిన ఇబ్రహీంబీ, నాజియాగా గుర్తించారు. మొహరం సందర్భంగా కైరేవుకు వచ్చిన ఇద్దరూ పురాతన మఠంలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. 

విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు కోనం, రైవాడ, పెద్దేరు రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. కోనం రిజర్వాయర్‌ కాలువకు గండి పడటంతో.. 28 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నాటు పడవలపై ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. మరోవైపు వాగులు పొంగిపొర్లుతుండటంతో  వాహనాల రాకపోకలకు జనం ఇబ్బంది పడుతున్నారు. 

చిత్తూరు జిల్లాలో మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు సమీపంలోని చెర్లోపల్లి వద్ద తిరుపతి-బెంగళూరు బైపాస్‌ రోడ్డు కోసుకుపోయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు చేపట్టారు. అటు కలవకుంట వద్ద ఎన్టీఆర్ జలాశయానికీ భారీగా నీరు వచ్చి చేరింది. కలెక్టర్‌ సహా నగర మేయర్ కటారి హేమలతా ప్రవీణ్‌లు జలాశయం వద్దకు వచ్చి ప్రాజెక్టును పరిశీలించారు.  

అరుణాచల్ ప్రదేశ్ లో కూలిన ఎయిర్ ఫోర్స్ చాపర్

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ లో ఎయిర్ ఫోర్స్ చాపర్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఐదుగురు మృతి చెందారు. తవాంగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

 

రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం

రాజస్థాన్ : పాలీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్ ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

 

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు

కడప : నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్‌ హాస్టల్‌లో ఉరేసుకుని పావని ఆత్మహత్య చేసుకుంది. అయితే... పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పావని ఆత్మహత్య చేసుకున్న రూమ్‌ను పరిశీలించేందుకు బంధువులు వెళ్తుండగా బంధువులు అడ్డుకున్నారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

10:34 - October 6, 2017
10:31 - October 6, 2017

కడప : నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్‌ హాస్టల్‌లో ఉరేసుకుని పావని ఆత్మహత్య చేసుకుంది. అయితే... పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పావని ఆత్మహత్య చేసుకున్న రూమ్‌ను పరిశీలించేందుకు బంధువులు వెళ్తుండగా బంధువులు అడ్డుకున్నారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:25 - October 6, 2017

యూపీ : సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో అఖిలేశ్‌ను పార్టీ అధ్యక్షుడి స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రకటించారు. మరో ఐదేళ్ల పాటు అఖిలేశ్‌ ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సమావేశానికి పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేశ్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ హాజరుకాలేదు. నేతాజీ ఫోన్లోనే ఆశీర్వదించారని అఖిలేష్‌ తెలిపారు.

 

10:23 - October 6, 2017

నెల్లూరు : మత సామరస్యానికి ప్రతికగా నిలిచే నెల్లూరు బారాషాహిద్‌ రొట్టెల పండగ ఘనంగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పండుగలో దాదాపు 7 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్‌ అధికారులను మంత్రి నారాయణ సత్కరించారు. ఈ పండగలో ఐదుగురు మంత్రులతో పాటు... పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

 

10:21 - October 6, 2017

పెద్దపల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులు విజయాన్ని అందించారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటున్న మల్లయ్యతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు. 

 

10:13 - October 6, 2017

కడప : పట్టణంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్‌ హాస్టల్‌లో ఉరేసుకుని పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:11 - October 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని బోరబండలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కిరాణషాపులో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎస్ ఐ ఖాజాహుస్సేన్ భార్య ఆత్మహత్య

కర్నూలు : ఎస్ ఐ ఖాజాహుస్సేన్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఎస్ ఐ భార్య ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుడిబండలో ఖాజాహుస్సేన్ ఎస్ ఐగా పనిచేస్తున్నారు.

 

డేరా నిర్వాహకుల కమిటీలో 45 మందికి పోలీసులు నోటీసులు

హర్యానా : డేరా నిర్వాహకుల కమిటీలో 45 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 25న జరిగిన అల్లర్లకు సంబంధి నోటీసులు జారీ చేశారు. గుర్మీత్ సింగ్ ను కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం అల్లర్లు జరిగాయి. 

 

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నెల్లూరు : ఏఎస్ పేట మండలం గుంపర్లపాడు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

09:49 - October 6, 2017

సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బండారు రవికుమార్, టీబీజీకేఎస్ నేత రాంమూర్తి, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మల్లయ్య పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:46 - October 6, 2017

ఎంబీసీల అభవృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఎంబీసీ సంఘం నాయకులు ఆశయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎంబీసీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కడప : జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణ కాలేజీ గర్ల్స్ హాస్టలో పావని అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

 

07:30 - October 6, 2017

హైదరాబాద్ : ఓవైపు సినిమాలు... మరో వైపు రాజకీయాలు.. ఇది జనసేన అధినేత పవన్  కల్యాణ్‌  ప్రస్తుతం వ్యవహరిస్తున్నతీరు. అప్పుడప్పుడు మాత్రమే ప్రజా సమస్యలపై స్పందించే పవన్... ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు..? ప్రజల మధ్య తిరిగేదెప్పుడు..? ప్రజా సమస్యలు తెలుసుకునేదెప్పుడు..? జనంలోకి వస్తానని జనసేనాని చెబుతున్నా... ఆ జాడ మాత్రం కనిపించడంలేదు. ఇంతకీ జనసేనాని నిజంగానే జనంలోకి వస్తారా..? వస్తే ఎలా వస్తారు..? ఏం చేస్తారు..? అన్న అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.  look. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పదే పదే చెబుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు, ఆయన అభిమానులు పవన్‌ రాకకోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్‌ ఎంట్రీ ఎప్పుడో తెలియక అందరూ అయోమయంలో కొట్టుమిట్టాడుత్నారు. 

రాష్ట్రమంతా తిరిగి ప్రజా  సమస్యలు తెలుసుకోవాలనుందని పవన్‌  గతంలో పలుసార్లు ప్రకటించారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం రైతుల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలనిఉందన్నారు. కానీ పవన్‌ ప్రకటనలేవీ కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ విజయవాడలో ప్రకటించిన పవన్‌... ఈ దిశగా ఇంకా కార్యాచారణ ప్రారంభించలేదు.  ఏపీలోనే కాదు... తెలంగాణలో కూడా పర్యటించి  ప్రజా  సమస్యలు తెలుకొని, పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు పవన్‌కళ్యాణ్‌. అక్టోబర్ మొదటివారం గడిచిపోతున్నా...  ఈ దిశగా ఇంకా తొలి అడుగు కూడా పడలేదు. 
ఆశగా ఎదురుచూసిన అభిమానుల్లో నిరాశ 

అక్టోబర్ మెదటి వారంలో ప్రజల్లోకి వస్తానని  ప్రకటించిన పవన్ ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు.  పవన్‌కు ప్రజల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా ? లేదా ? అన్న అంశంపై పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లోనే సందేహాలు వ్య్తక్తమవుతున్నాయి.  నిన్న మొన్నటి వరకూ జనసేనాని  రాక కోసం ఆశగా ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. అప్పుడప్పుడూ మాత్రమే మొక్కుబడి తంతుగా  ఏదో ఒక సమస్యపై ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయం వ్యక్తంచేయడం,  మళ్లీ సైలెంట్ అవ్వడం తమ నేతకు రివాజుగా మారిందని పార్టీ నేతలు, కార్యకర్తలే నిట్టూరుస్తున్నారు.  సామాజిక మాధ్యమం ద్వారా పవన్‌  చేస్తున్న ప్రకటనలతో  అభిమానులు ఖుషీ అవుతున్నా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడంతో అభిమానులు నీరుకారిపోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి, ప్రభుత్వాలను నిలదీస్తానని పవన్‌ చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా కొంతమంది ఏదైనా సమస్యతో తన  దగ్గరకే వస్తే స్పందించడం మినహా, తదుపరి కార్యాచరణ ఉండటంలేదని పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు.  సమస్య ఉన్న చోటుకి పవన్ వెళ్లలేకపోతున్నారనే అసంతృప్తితో  ఉన్నారు.  సీరియస్‌ రాజకీయ నేతకు ఉండాల్సి లక్షణం ఇది కాదని సున్నితంగా సూచిస్తూనే, చురకలు అంటిస్తున్నారు.    

మరోవైపు జనసేనాని  సైలెన్స్‌  వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని పవన్‌  సన్నిహితులు. పార్టీ నేతలు చెబుతున్నారు. పొలిటికల్‌ ఎంట్రీ   లేట్ అవ్వొచ్చేమో కానీ లేటెస్ట్‌గా ఉంటుందని సినిమా డైలాగ్‌లు  చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల బరిలో జనసేన దిగుతుందని  పవన్ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నారు. పార్టీ నిర్మాణంపై పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టారని  చెబుతున్నారు. కాల్‌ షీట్లు ఇచ్చి కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడంలో పవన్‌ బిజీగా ఉన్నారంటున్నారు.  అంతేకాదు... ఇప్పటికే దాదాపు జనసైనికుల ఎంపికలు పూర్తి చేశామని త్వరలోనే వీరితో పవన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈనెల 15 తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

పార్టీ నిర్మాణ దశలో ఉన్నందున ఈనెలలో  చేపట్టాల్సిన పవన్‌ రాష్ట్ర  పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో జనసేనాని పొలిటికల్‌ ఎంట్రీ ఉంటుందంటున్నారు. సినిమాలు, రాజకీయాలు ఇలా... రెండు పడవల మీద రెండు కాళ్లు పెడుతున్నపవన్‌.. నవంబర్‌లో నైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారో... లేదో.. చూడాలి. 

07:27 - October 6, 2017

నెల్లూరు : బారా షాహిద్ దర్గాలను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ చివరిరోజు ఆమె పాల్గొన్నారు. రొట్టెల పండుగకు రావడం ఇదే మొదటిసారన్న అఖిలప్రియ బారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. 

 

07:21 - October 6, 2017

హైదరాబాద్ : ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం నుండి వచ్చిన నిధులను టీడీపీ నేతలు పక్కదారి పట్టించారని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ నిధులకు సంబంధించి 350 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. వైసీపీ ఎప్పుడూ పేదవారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ కింద రావాల్సిన నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

07:18 - October 6, 2017

హైదరాబాద్ : హడావిడికి బ్రేక్‌ పడింది. అడ్డదారులు సరికాదని తెలంగాణ సర్కార్‌కు మరోమారు తెలిసొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అనుమతుల్లేకుండా ప్రాజెక్టు ఎలా కడతారంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సీరియస్‌ అయింది. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంతా ప్రతిపక్షాల తప్పదమే అన్నట్టు మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. 
టీ.సర్కార్‌ దూకుడుకు బ్రేక్‌ 
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ స్టే యిచ్చింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై హడావిడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దూకుడుకు బ్రేక్‌ పడినట్టైంది. అటవీ, పర్యావరణ అనుమతులు లభించే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితుడు  హయ్యత్‌ ఉద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
కాళేశ్వరం పనులను ఆపాలంటూ స్టే 
కాళేశ్వరం పనులను వెంటనే ఆపాలంటూ స్టే ఇచ్చింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాల్సిందేని స్పష్టం చేసింది. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులను 3 రోజుల పాటు నిలపుదల చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సైతం ఎన్ జీటీ తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వుల్లో మార్పులు కోరాలని  తెలంగాణ సర్కార్‌కు సూచించింది.
ఎన్ జీటీ ఆదేశాలపై సుప్రీంకు వెళతామన్న టీ సర్కార్‌
ఎన్ జీటీ ఆదేశాలపై  తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్ జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో  ప్రాజెక్టు పనులు ఆగిపోనున్నాయని.. హస్తంపార్టికి ఇపుడు ఆనందంగా ఉందా అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 
ఎన్‌జీటీ ముందు దెబ్బతిన్న టీ సర్కార్‌ 
పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం .. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ముందు ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం తన తప్పిదాన్ని ప్రతిపక్షాల మీద నెట్టడం సరికాదని విపక్షపార్టీలు అంటున్నాయి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

 

07:11 - October 6, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది.  మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌, 2 ఏరియాల్లో సీఐటీయూ విజయం సాధించాయి. 
ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్‌ ఆధిక్యత 
సింగరేణి ఫలితాల్లో టీబీజీకేఎస్‌ విజయబావుటా ఎగుర వేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్‌ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, మణుగూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కార్మికులు పటాసులు కాలుస్తూ ఆనందం పంచుకున్నారు. 
అత్యధిక స్థానాల్లో టీబీజీకేఎస్ గెలుపు
కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ని విజయం వరించింది. అటు ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.అటు శ్రీరాంపూర్‌ఏరియాలో  టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక రామగుండం 1,2,3 ఏరియాల్లో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయబావుటా ఎగురవేసింది. 
రెండు చోట్ల ఏఐటీయూసీ విజయం
ఇక విపక్ష యూనియన్ల ఉమ్మడి అభ్యర్థులు రెండు చోట్ల విజయదుందుబి మోగించారు. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అటు భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ ఓట్ల మెజారిటీలో విజయం సాధించింది. 
17 కార్మిక సంఘాలు పోటీ 
సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం , సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీల మధ్యే ప్రధాన పోటీ  జరిగింది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్‌ తరఫున టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా కార్మికులకు పలు తాయిలాలు, పథకాలను ప్రకటించడంతోపాటు.. టీబీజీకేఎస్‌లోకి ఇతర సంఘాల నేతల వలసలు భారీగా ప్రోత్సహించారు. దీంతో పరిస్థితి టీబీజీకేఎస్‌ వైపు మొగ్గిందనే విశ్లేషణలు వస్తున్నాయి. 

భూపాలపల్లిలో ఏఐటీయూసీ విజయం

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విపక్ష యూనియన్ల ఉమ్మడి అభ్యర్థులు రెండు చోట్ల విజయదుందుబి మోగించారు. భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ  ఓట్ల మెజారిటీలో విజయం సాధించింది. 

 

మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ గెలుపు

మంచిర్యాల : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విపక్ష యూనియన్ల ఉమ్మడి అభ్యర్థులు రెండు చోట్ల విజయదుందుబి మోగించారు. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ  800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 

 

రామగుండం 1,2,3 ఏరియాల్లో టీబీబీకేఎస్ విజయం

పెద్దపల్లి : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. శ్రీరాంపూర్‌ ఏరియాలో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. రామగుండం 1,2,3 ఏరియాల్లో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయబావుటా ఎగురవేసింది. 

 

శ్రీరాంపూర్‌ ఏరియాలో టీబీజీకేఎస్‌ హవా

పెద్దపల్లి : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. శ్రీరాంపూర్‌ ఏరియాలో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 

బెల్లంపల్లిలో టీబీజీకేఎస్ విజయం

మంచిర్యాల : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. 

మణుగూరులో టీబీజీకేఎస్ గెలుపు

భద్రాద్రికొత్తగూడెం : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. 

 

ఇల్లెందు ఏరియాలో టీబీజీకేఎస్ విజయం

భద్రాద్రికొత్తగూడెం : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. 

కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో టీబీజీకేఎస్ గెలుపు

భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ని విజయం వరించింది.

06:35 - October 6, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించాయి. మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, శ్రీరాంపూర్‌, రామగుండం 1,2,3 , బెల్లంపల్లిలో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. భూపాలపల్లి, మందమర్రిలో ఏఐటీయూసీ విజయం సాధించింది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. సింగరేణిలో మొత్తం ఓట్లు 52,534కు గాను 49,873 ఓట్లు పోల్ అయ్యాయి. 17 కార్మిక సంఘాలు పోటీపడ్డాయి. టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ మధ్యే పోటీ నడిచింది. 

 

సిగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ విజయం

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. 

 

సిగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ విజయం

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. 

 

Don't Miss