Activities calendar

07 October 2017

21:28 - October 7, 2017

హైదరాబాద్ : నిజాం కాలం నాటి నియంతృత్వ థోరణులు మళ్లీ పునరావృతమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. . హైదరాబాద్‌ ఎస్వీకేలో మఖ్దూమ్‌ మోహినుద్దీన్‌ జీవితం-కవిత్వం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన.. పాలకులను ప్రశ్నించేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

21:27 - October 7, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. జేఏసీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సీఎం... తనపై వ్యక్తిగత దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని.. యావత్‌ తెలంగాణ సమాజంతోనే అది సాధ్యమైందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసి.... ఉద్యమ ద్రోహులను దగ్గరికి చేర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో తమపై ఆంధ్రపాలకులు మాటలతో దాడి చేశారని... ఇప్పుడు స్వరాష్ట్రంలో పాలకులు తమపై దాడిచేయం బాధాకరంగా ఉందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని..నిరంకుశ పాలన అంతమై... ప్రజాస్వామిక పాలన రావాలని కోరుకుంటున్నామన్నారు. తన ఇష్టపూర్వకంగానే ఉద్యమ పంథా ఎంచుకున్నానని... అవసరమైతే రాజకీయంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాగ్రహానికి గురికాకతప్పదని
కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా, జుగుప్సాకరంగా ఉందని సీఎల్పీనేత జానారెడ్డి మండిపడ్డారు. తనపై వాడిన దొంగ అనే పదానికి కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. గెలిచినంత మాత్రాన ఇతరులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్‌కు తగదన్నారు. సీఎం తన తీరు మార్చుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలను అగౌరవపరుస్తూ మాట్లాడారని, కేసీఆర్‌ వాడిన భాషను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం... దిగజారి మాట్లాడారని విమర్శించారు. సభానాయకుడిగా ఒక ప్రతిపక్ష నేతను గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు.

ఓయూలో జలదీక్ష
తెలంగాణకు ఉత్తమే అసలైన దొరంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు తప్పుపట్టారు. దేశం కోసం బార్డర్‌లో ప్రాణాలకు తెగించిన పనిచేసిన చరిత్ర ఉత్తమ్‌కు ఉందని గుర్తు చేశారు. కేసీఆర్‌ మాట్లాడే భాష సరిగాలేదన్న వీహెచ్‌.. సీఎంకు మైండ్‌ దారి తప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌పై టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మయసభలో దుర్యోధనుడిలా కేసీఆర్‌ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్‌ కోసం తన కొడుకు పేరు మార్చిన నీచ చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు అమరుల కుటుంబాలపట్ల గౌరవం ఉంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నల్లగొండ బరిలో నిలపాలని, శంకరమ్మ ఏకగ్రీవానికి తాము సహకరిస్తామన్నారు. డీఎస్సీకి తొందరెందుకు, డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునుగుతుందా అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూలోని ల్యాండ్‌స్కేప్‌ చెరువులో జలదీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని... ఉద్యమ సమయంలో వాటిని పదేపదే వినిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మాటమార్చారంటూ మండిపడ్డారు. డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునగదుకానీ.... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ నిండా మునుగుతారని వారు హెచ్చరించారు.

21:26 - October 7, 2017

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నిమాయకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు- 371 డి ని సవరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త ఉద్యోగాల నియామకం ఏ ప్రాతిపదికన జరగాలి.. జోనల్ వ్యవస్థ ఉండాలా ..రద్దు చేయాలా.. జోన్లు ఉంటే ఎన్ని ఉండాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎలా అన్వయించుకోవాలి.. డీఎస్సీ కొత్త జిల్లాల ప్రాతిపదికన చేయాలా.. పాత జిల్లాల ప్రాతిపదికనా.. తదితర అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది.

కేంద్రహోంశాఖతో స్వయంగా మాట్లాడతా..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని ఇందుకోసం తగు ప్రతిపాదనలు పంపుతామని సీఎం వెల్లడించారు. అందుకోసం స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి కేంద్రహోంశాఖతో మాట్లాడి వీలైనంత తొందరలోనే కొత్త ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తానని సీఎం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు జోన్లు మాత్రమే ఉన్నాయన్న కేసీఆర్ ఏ జోన్‌లోకి ఏ జిల్లాలు వస్తాయో నిర్ధారించాలన్నారు. ఇందుకోసం మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నామని సీఎం ప్రకటించారు. వారు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని సీఎం తెలిపారు. ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ నియామకం కచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త ఉత్తర్వుల కోసం ఉన్నతమైన విధానాన్ని ప్రతిపాదించాలన్న సీఎం.. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల వారీగా జారీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా జారీ చేయాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదా రూపొందించడానికి, అధ్యయనం చేయడానికి మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని సీఎం కేసీఆర్ నియమించారు.

విజయవాడలో దారుణం

కృష్ణా : కృష్ణలంక రాణీగారి తోటలో దారుణం జరిగింది. 8ఏళ్ల శివచరణ్ అనే బాలుడిని మస్తాన్ అలిసాన్ బిల్లు, కిషోర్‌లు దారుణంగా హతమార్చారు. హత్య ఉదంతాన్ని దాచిపెట్టి కిడ్నాప్ డ్రామాకు తెరలేపారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో బాలుడి తండ్రి కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఒకరు ఇంటర్ విద్యార్ధి కాగా.. మరొకరు ఆటోడ్రైవర్. దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరూ దారుణానికి తెగబడినట్లు విచారణలో తేలింది.

మిషన్ భగీరథ పనుల్లో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా జగన్నాథపురం మిషన్ భగీరథ పనుల్లో విషాదం నెలకొంది. మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల్లో మట్టి కూలడంతో మట్టి పెళ్లల కిందపడి ముగ్గరు కూలీలు మృతి చెందారు. మృతులు గోగుల శ్రీను, గండికోట కోటేష్, మేకల ప్రవీణ్ గా గుర్తించారు. 

20:49 - October 7, 2017

ఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను నోబెల్ బహుమతి వరించనుందా? అర్థశాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ బహుమతి లిస్టులో రఘురామ్‌ రాజన్‌ పేరు కూడా ఉంది. ఎకనామిక్స్‌లో నోబెల్‌ను సోమవారం ప్రకటించనున్నారు. క్లారివెట్ అనలిస్టిక్ అకడమిక్‌ అండ్ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ సంస్థ నోబెల్‌ పురస్కారలకు సంబంధించిన విజేతల జాబితాను తయారు చేస్తుంది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ రిపోర్టు ప్రకారం ఆరుగురు అర్థశాస్త్రవేత్తల్లో రాజన్‌ పేరు కూడా ఉంది. రాజన్‌ పేరును క్లారివెట్ అనలిస్టిక్ అకడమిక్‌ అండ్ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ తమ లిస్టులో చేర్చింది. కార్పోరేట్‌ ఫైనాన్స్‌ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను రాజన్‌ పేరు నోబెల్‌ లిస్టులో చేరింది. 

20:48 - October 7, 2017

ముంబై : తీరానికి సమీపంలోని బచర్‌ ద్వీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బచర్‌ ద్వీపంలో ముంబై పోర్టు ట్రస్ట్‌కు చెందిన ఇంధన నిల్వలున్నాయి. నిల్వ చేసిన ఓ ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ద్వీపమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఫ్యూయెల్‌ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శనివారం తెల్లవారుజామున 5 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ట్యాంకులో వేడి పెరిగిపోయి తెల్లవారుజామున మళ్లీ మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. బచర్‌ ద్వీపంలో చాలా ట్యాంకులు దగ్గర దగ్గరగా ఉండడంతో మంటలు వేరే ట్యాంకులకు వ్యాపించకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

20:47 - October 7, 2017

హైదరాబాద్ : అరబ్‌షేక్‌లు, హైదరాబాద్‌ చీఫ్‌ ఓల్టా ఖాజీతోపాటు పాతబస్తీ లోకల్‌ బ్రోకర్ల జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ అనంతరం చంద్రాయణగుట్ట పోలీసులు వారిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. విచారణలో వారి నుంచి అనేక కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్‌ మ్యారేజెస్‌ విషయంలో కీలక అంశాలు రాబట్టామని చంద్రాయణగుట్ట పీఎస్‌ విచారణ అధికారి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:46 - October 7, 2017

సంగారెడ్డి : మనిషి రోగాన్ని నయంచేసే ఔషధ కంపెనీ... మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. చెరువుల్లో, కుంటల్లో ఫ్యాక్టరీ వ్యర్థ జలాలను యధేచ్చగా వదులుతోంది. దీంతో మొత్తం భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీనిపై పలుమార్లు స్థానికులు అధికారులకు, పీసీబీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. సంగారెడ్డి జిల్లా బోర్బట్ల గ్రామంలో అరబిందో ఫార్మా కంపెనీ సృష్టిస్తోన్న విధ్వంసంపై మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:44 - October 7, 2017

కృష్ణా : కృష్ణలంక రాణీగారి తోటలో దారుణం జరిగింది. 8ఏళ్ల శివచరణ్ అనే బాలుడిని మస్తాన్ అలిసాన్ బిల్లు, కిషోర్‌లు దారుణంగా హతమార్చారు. హత్య ఉదంతాన్ని దాచిపెట్టి కిడ్నాప్ డ్రామాకు తెరలేపారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో బాలుడి తండ్రి కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఒకరు ఇంటర్ విద్యార్ధి కాగా.. మరొకరు ఆటోడ్రైవర్. దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరూ దారుణానికి తెగబడినట్లు విచారణలో తేలింది. 

20:44 - October 7, 2017
20:43 - October 7, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా జగన్నాథపురం మిషన్ భగీరథ పనుల్లో విషాదం నెలకొంది. మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల్లో మట్టి కూలడంతో మట్టి పెళ్లల కిందపడి ముగ్గరు కూలీలు మృతి చెందారు. మృతులు గోగుల శ్రీను, గండికోట కోటేష్, మేకల ప్రవీణ్ గా గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:42 - October 7, 2017

హైదరాబాద్ : నగరంలోని హైకోర్టు వద్ద హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి 7 లక్షలు డ్రా చేసిన ఓ వ్యక్తి నుంచి దొంగలు బైక్ పై వచ్చిన డబ్బులున్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. స్థానికంగా ఉన్న యువకులు దొంగలను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:41 - October 7, 2017

హిమచల్ ప్రదేశ్ : జిఎస్‌టిని కేంద్రం హడావిడిగా అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. జిఎస్‌టి, నోట్ల రద్దు కారణంగా ఒక్క గుజరాత్‌లోనే 30 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని మోదిపై ధ్వజమెత్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో జరిగిన 'వికాస్ సే విజయ్ కీ ఔర్' ర్యాలీలో ప్రసంగించిన రాహుల్-మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోది గుజరాత్‌ మోడల్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని రాహుల్‌ అన్నారు. నిరుద్యోగమే దేశం ముందున్న అతిపెద్ద సమస్యని ఆయన తెలిపారు. చైనా ప్రతియేటా 50 వేల మందికి ఉపాధి చూపుతోందని, భారత్ కేవలం 450 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. వీరభద్రసింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు ఏడోసారి సిఎం అవుతారని రాహుల్‌ పేర్కొన్నారు.

9నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన

 

హైదరాబాద్ : ఈ నెల9నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 9వ తేదీన నారాయణఖేడ్, 11వ తేదీన సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, 12న సూర్యాపేట, 20న వరంగల్ లో పర్యటించనున్నారు.

దొంగలకు దేహశుద్ది

రంగారెడ్డి : జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఇద్దరు దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఓ వ్యక్తి వద్ద రూ.7లక్షలు దొంగిలించి పారిపోతుండగా ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులుకు అప్పగించారు.

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, కూకట్ పల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, బాగ్ లింగంపల్లిలో మోస్తరు వర్షం కురిసింది.

20 ఏళ్ల జైల్ శిక్షపై హైకోర్టు వెళ్లిన డేరా బాబా

హర్యానా : డేరా బాబా తనకు విధంచిన 20 ఏళ్ల జైలు శిక్షపై హైకోర్టు వెళ్లాడు. గుర్మీత్ పిటిషన్ పై హైకోర్టు వచ్చేవారం విచారించనుంది.

20 ఏళ్ల జైల్ శిక్షపై హైకోర్టు వెళ్లిన డేరా బాబా

హర్యానా : డేరా బాబా తనకు విధంచిన 20 ఏళ్ల జైలు శిక్షపై హైకోర్టు వెళ్లాడు. గుర్మీత్ పిటిషన్ పై హైకోర్టు వచ్చేవారం విచారించనుంది.

19:38 - October 7, 2017

విశాఖ : విశాఖలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో మూడు ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయి. అతి పెద్దదైన పెద్దేరు రిజర్వాయర్, కోనం రిజర్వాయర్‌తో పాటు రైవాడ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ మూడు రిజర్వాయర్లు మాడుగుల నియోజకవర్గ పరిధిలోఉండడమే కాకుండా.. విశాఖ ఏజెన్సీకి ఆనుకొని ఉంటాయి. కొద్ది రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనం రిజర్వాయర్‌తో పాటు, పెద్దేరు రిజర్వాయర్‌లు పూర్తిగా నిండిపోయాయి. కోనం పాలవెల్లి జలాశయం నిల్వ సామర్థ్యం 101.25 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 100.50 మీటర్లకు చేరుకుంది. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. కోనం కాలువకు గండి పడటంతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రిజర్వాయర్‌కు అవతలి వైపు ఉన్న గిరిజనులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.

నిండు కుండలా పెద్దేరు రిజర్వాయర్
విశాఖ జిల్లాలో అతి పెద్ద రిజర్వాయర్ అయిన పెద్దేరు రిజర్వాయర్ నిండు కుండలా ఉంది. భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దేరు రిజర్వాయర్‌లో 137 మీటర్ల నీటి మట్టానికి.. 136 మీటర్లకు నీరు చేరుకుంది. దీంతో వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇంతేకాకుండా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంతేకాకుండా భారీగా కురుస్తున్న వర్షానికి ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

19:36 - October 7, 2017

గుంటూరు : రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే హెల్మెట్ ధరించే విషయంలో ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తం కావడంతో.. గతంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత న్యాయస్థానం కూడా శిరస్త్రాణం నిబంధన అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇంతకాలం దానిపై పెద్దగా దృష్టి సారించలేదు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. రాజధాని పరిధిలో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చారు.

హెల్మెట్ లేనివారిపై జరిమానాలు
గత రెండు రోజులుగా గుంటూరు అర్బన్ పోలీసులు.. నగరంలో హెల్మెట్ లేనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. రూల్‌ను పబ్లిక్‌కు మాత్రమే వర్తింపజేయకుండా.. తమ సొంత శాఖలోని సిబ్బందికి కూడా శిరస్త్రాణాన్ని తప్పని చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఈ హెల్మెట్‌ రూల్ విషయంలో రాజీ పడొద్దంటూ.. క్రిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొందరు వాహనదారులు పోలీసులు ఆపిన సమయంలో ఆగకుండా అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం సెల్‌ఫోన్‌లో వారి నెంబర్‌ను ఫీడ్‌ చేసి ఇంటికి ఫైన్‌లు, చలానాలు పంపుతున్నారు.

హెల్మెట్ రూల్‌పై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు
ఇదిలా ఉంటే హెల్మెట్ రూల్‌పై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలంటున్నారు. మద్యాన్ని అరికట్టకుండా శిరస్త్రాణం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి గుంటూరు పోలీసులు మాత్రం శిరస్త్రాణం రూల్‌ విషయంలో.. ఈ సారి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. అటు ప్రజల్లో కూడా అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. 

19:34 - October 7, 2017

తూర్పుగోదావరి : జిల్లా విలీన మండలాల్లో వింత వ్యాధులు గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చింతూరు మండలంలోని వలస గ్రామాలైన వెంకటాపురంలో ఈ సమస్య భారినపడి 15 రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడగా, మరో పది మంది మంచాన పడ్డారు. గతేడాది నుంచి వేధిస్తున్న కాళ్లవాపు వ్యాధికి తోడు కొత్తగా అంతుచిక్కని మరో రోగం గిరిజనులను వణికిస్తొంది. ఒళ్లునోప్పులతో జ్వరం మొదలై దగ్గుతో ప్రాణంతకంగా మారుతోంది. ఉన్నట్టుండి నోటి నుంచి రక్తం పడుతుండటంతో గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి వైద్యులు రాకపోవడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వింతవ్యాధులను అరికట్టే చర్యలు చేపట్టాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.

 

19:32 - October 7, 2017

కర్నూలు : చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఏం వస్తుందిలే అనుకున్నాడు ఓ దొంగ. అందుకే ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు బస్సు డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.... 10 కిలోమీటర్లు వెంబడించి దొంగ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ రమణకు గాయాలయ్యాయి. 

19:31 - October 7, 2017

విశాఖ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త గుట్టును.. ఓ భార్య బయటపెట్టింది. విశాఖ జిల్లా, ప్రహల్లాదపురంలో మరొకరితో సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్.. తన భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రసాద్ గాజువాక పోలీస్‌ స్టేషన్లో.. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రసాద్ మరో మహిళతో ఉండగా అతని భార్య.. ఇంటికి తాళం వేసింది. 

19:24 - October 7, 2017

కృష్ణా : జిల్లా తిరువూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని కుమారి ఆత్మహత్య చేసుకుంది. కుమారి కాలేజ్‌లోనే పురుగుల మందు తాగింది. అయితే ఆత్మహత్యకు ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ విద్యార్థి వెంకటేశ్వరరావు వేధింపులే కారణమని తెలుస్తోంది. వెంకటేశ్వరరావుని లెక్చరర్లు హెచ్చరించినా.. వేధింపులు ఆగలేదని సమాచారం. 

19:23 - October 7, 2017

గుంటూరు : పార్టీని పట్టాలెక్కించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.... టీడీపీ మైండ్‌ గేమ్‌కు తెరతీసింది. రాయలసీమ నేతలే టార్గెట్‌గా ముందుకు కదులుతోంది. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందో? వైసీపీ ఎక్కడ బలంగా ఉందో..? చూసుకుని మరీ ఆ ప్రాంతంపైనే టీడీపీ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను ... పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

పార్టీలో చేర్చేందుకు కసరత్తు
ఈ క్రమంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి... కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గుర్నాథ్‌రెడ్డితో.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.... బుట్టా రేణుకతో.. ఎంపీ సీఎం రమేశ్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి శైలజానాథ్‌, కర్నూలు జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
వీరితో పాటు.. మాజీ సీఎం కోట్ల కుటుంబ సభ్యులతో కూడా సీనియర్‌ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. అలాగే మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి... చిత్తూరు జిల్లాలో . మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా.. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికలకు సంబంధించి ఇప్పుడే బయటపెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం సుముఖంగా లేదనేది సమాచారం. జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టాక... వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఆపరేషన్‌ రాయలసీమ బాధ్యతలను మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డిలతో పాటు ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేశ్‌లకు పార్టీ అధినాయకత్వం అప్పజెప్పినట్టు సమాచారం.

 

19:19 - October 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం, తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలని తెలపడంతో.. తుందుర్రు గ్రామానికి వెళ్ళడానికి రామాంజనేయులు ఏర్పాట్లు చేశారు. పనిలో పనిగా అధికారులు కూడా గ్రామంలో నిర్మించిన రోడ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసి.. శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కానీ తెల్లవారే సరికి గ్రామస్తులు శిలాఫలకాన్ని కూల్చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 

19:17 - October 7, 2017

తూర్పుగోదావరి : జిల్లా కిర్లంపుడిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేపటి నుంచి కోనసీమలో ఆత్మీయ పలకరింపు పేరుతో ముద్రగడ పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కిర్లంపుడిలో మరోసారి పోలీసులు భారీగా మోహరించారు.

19:15 - October 7, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీపైకానీ, తనపై కానీ ఇతర పార్టీల నేతలు చేసే విమర్శలపై కార్యకర్తలెవరూ స్పందించవద్దని పవన్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన దృష్టి మరల్చడానికో, లేక ప్రచారం కోసమో కొంతమంది విమర్శలు చేస్తుంటారని అన్నారు. తనకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగా ప్రవర్తిద్దాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు ఉన్నాయన్న విషయాన్ని పవన్‌ తన ప్రకటనలో గుర్తు చేశారు. భావి తరాల భవిష్యత్‌, దేశ శ్రేయస్సు కోసం విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు అవసరమనేది జనసేన ప్రాథమిక సూత్రమని గుర్తు చేశారు. అందుకే కార్యకర్తలెవరూ ఆవేశపడవద్దని సూచించారు. కార్యకర్తలంతా ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్లాలని లేఖలో పవన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుత రాజకీయాలు పరిఢవిల్లేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు.

18:12 - October 7, 2017
18:11 - October 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ప్రొ.కోదండరామ్ విమర్శించారు. బంగారు తెలంగాణ అవుతుందని అందరూ ఆశించామని .. కానీ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. విపక్షాల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. 

18:09 - October 7, 2017

నార్వే : మానవాళి ఎదుర్కొంటోన్న తీవ్రమైన సమస్యపై ఐకెన్ పని చేస్తోంది. ఐకెన్ అంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్ వెపన్స్‌ సంస్థ. అణ్వస్త్ర ప్రయోగంతో ఎదురయ్యే విధ్వంసకర పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, అణ్వస్త్ర నిర్మూలనకు కృషి చేస్తోంది. ఒప్పంద ఆధారిత అణ్వస్త్ర నిషేధం కోసం ఆ సంస్థ చేస్తోన్న ప్రయత్నాలకు గుర్తింపు, ప్రోత్సాహం ఉండాలన్నది తమ ఉద్దేశమని.. నోబెల్ కమిటీ అధ్యక్షురాలు బెరిట్‌ రీస్‌ అండర్సన్ చెప్పారు. ఉత్తర కొరియాలాంటి దేశాలు అణ్వస్త్ర సంపదను పెంచుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఐకెన్ కృషి ప్రశంసనీయమని రీస్ అండర్సన్‌ వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశాలు వాటి నిర్మూలనకు చిత్తశుద్ధితో చర్చలు జరపాలని.. నోబెల్ కమిటీ పిలుపునిచ్చింది. తమకు నెబెల్ పురస్కారం లభించడంతో అణ్వస్త్ర దేశాలకు బలమైన సందేశం పంపినట్లయ్యిందని ఐకెన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ బియాట్రైస్ ఫిన్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో శాంతి పురస్కారాన్ని, ప్రైజ్ మనీగా సుమారు 7 కోట్లు ఐకెన్‌కు అందజేస్తారు.

జూలై 7న అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం
ఈ ఏడాది జూలై 7న అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం వెనక ఐకెన్ కృషి ఎంతో ఉంది. ఈ తీర్మానానికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేశాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్తాన్‌, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండిపోయాయి. ఐకెన్‌కు నోబెల్ దక్కడం శుభ సంకేతమని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి అలెస్సాండ్రా పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రయోగించిన అణుబాంబుతో ప్రాణాలతో బయటపడ్డ జపాన్ ప్రజలు.. ఐకెన్‌కు శాంతి నోబెల్ దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతిపురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా 318 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 215 వ్యక్తుల నుంచి రాగా, 103 వివిధ సంస్థల నుంచి వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిజీషియన్స్ ఫర్‌ ద ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్ సంస్థ.. 2006 సెప్టెంబర్‌లో ఐకెన్ ఏర్పాటును ప్రతిపాదించింది. 2007 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా.. వియన్నాల్లో ఐకెన్ పురుడు పోసుకుంది. ప్రస్తుతం జెనీవాలోని వరల్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చర్చెస్‌లో ఈ కార్యాలయం పని చేస్తోంది. 

18:08 - October 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పోలవరం నిర్వాసితులను పునరావాస గ్రామాలకు తరలించడంలో ఆర్డీఓ, తహశీల్దార్‌.. దొంగ బిల్లలు పెట్టి 80 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులను తనిఖీలు చేశారు. వారం రోజుల క్రితమే... పోలవరం తహశీల్దార్‌ కార్యాలయంలో చేసిన ఏసీబీ అధికారులు... తాజాగా ఆర్డీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. 

17:53 - October 7, 2017
17:51 - October 7, 2017
17:46 - October 7, 2017

విశాఖ : సీపీఎం ఆఫీసుపై బిజెపి, ఆర్ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు. హిట్లర్ జాతి అహంకారాన్ని రెచ్చగొట్టే ఏ విధంగా దాడులు చేశాడో.. అదే తరహాలో బిజేపి, ఆర్‌ఎస్ఎస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వారి రౌడీయిజాన్ని ఎదుర్కునేది వామపక్షాలు మాత్రమేనని అందుకే మాపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:45 - October 7, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై... టీడీపీ నేత రేవంత్‌రెడ్డి... మండిపడ్డారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఊడిపోతే.. సురభి నాటకాల్లో నటించడానికి అన్ని రకాల అర్హతలున్నాయని.. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. తెలంగాణలో టీడీపీనే లేదంటూ... కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీటు కోసం కొడుకు పేరునే మార్చుకున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

17:43 - October 7, 2017

హైదరాబాద్ : సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టిందన్నారు. నాయకుడు అనేవాడు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు.

17:42 - October 7, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమని... గెలిచినంత మాత్రాన ఇతరులను కించపరిచినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఇతరులకు... ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు.  

17:37 - October 7, 2017

కరీంనగర్ : జిల్లా బోయిన్‌పల్లి మండలం మానువాడలోని మిడ్‌మానేరు డ్యామ్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. స్పిల్‌వేపై గేట్లు బిగిస్తుండగా ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని కరీంనగర్‌లోని మహావీర్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:32 - October 7, 2017

 

సంగారెడ్డి : జిల్లా పుల్కాల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో ప్రేమ జంట గల్లంతైంది. గల్లంతైనవారు హైదరాబాద్ బోరబండకు చెందిన నాజిరుద్దీన్, శారీంబేగంలుగా గుర్తించారు. నీటిలోకి దిగిన ఈ ఇద్దరు కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన వారిని కాపాడలేకపోయారు. వారి కోసం గజీతగాళ్లతో గాలింపు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:26 - October 7, 2017

హైరదాబాద్ : ఓయూలోని ల్యాండ్ స్కేప్ చెరువులో నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జలదీక్ష దిగారు. మెగా డీఎస్సీ కోసం జలదీక్ష చెపట్టినట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగులను కేసీఆర్ నిండా ముంచుతున్నారంటూ వారు నినాదాలు చేశారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:18 - October 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈనెల 26న రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:16 - October 7, 2017

మహబుబ్ నగర్ : మంత్రి లక్ష్మారెడ్డికి స్వంత పార్టీనేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిన్న జెడ్పీ సమావేశంలో మంత్రి జూపల్లితో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వాగ్వాదం మరిచిపోకముందే మరో మంత్రితో స్థానికనేత గొడవ దిగారు. దామరగిద్ద మండలం క్యాతాన్ పల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్ నేత శివకుమార్ తనను వేదికపైకి పిలువలేదని మంత్రితో వాగ్వాదాని దిగాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:30 - October 7, 2017

ఈనెల26న రాష్ట్రానికి రాహుల్

హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈనెల 26న రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

2018మార్చినాటి జనసేన పార్టీ సిద్ధం

 

కృష్ణా : జనసైనికుల ఎంపికకు విశేష స్పందన వచ్చిందని జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ఎంపికలు పూర్తైయ్యాని, ఎంపికైన వారికి వర్క్ షాప్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 2018మార్చినాటికి జనసేన పార్టీ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో విషాదం

సంగారెడ్డి : జిల్లా సింగూరు జలాయశంలో పిడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైయ్యారు. గల్లంతైనవారు హైదరాబాద్ బోరుబండ వాసులుగా గుర్తించారు.

ఆత్మీయ పలకరింపు పేరుతో పర్యటనకు ముద్రగడ ఏర్పాట్లు

తూ.గో : రేపటి నుంచి కోనసీమలో ఆత్మీయ పలకరింపు పేరుతో పర్యటనకు ముద్రగడ ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కిర్లంపూడిలో మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. 

 

విశాఖ జిల్లాలో విరిగిపడ్డ కొండచరియలు

విశాఖ : చిముడుపల్లి...బొర్రా రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరకు రైల్వే స్టేషన్ లో కిరండుల్ ప్యాసింజర్ నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

09:47 - October 7, 2017

నల్లగొండ : జిల్లాలోని చండూరు బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ లింగస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. బస్టాండ్‌ ఆవరణలో లింగస్వామి చెట్టుకు ఉరేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది. లింగస్వామి స్వగ్రామం గుండ్లపల్లి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:45 - October 7, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. మరదలు వేరే వ్యక్తితో చనువుగా ఉండడంతో జీర్ణించుకోలేని బావ... ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన కృష్ణయ్య... తానే సౌమ్యను హత్య చేసి ఐడీఎల్‌ చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. చెరువులో సౌమ్య మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

గల్లంతైన ముగ్గురు మృతదేహాలు గుర్తింపు

చిత్తూరు : పాలసముద్రం మండలం నరసింహాపురం వాగులో 3 రోజుల క్రితం గల్లంతైన ముగ్గురు మృతదేహాలు గుర్తించారు. మూడు రోజల క్రితం వాగు దాటుతుండగా గల్లంతయ్యారు. మృతులు తమిళనాడు వాసులు. 

డైరక్టర్ రఘు కేవిట్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు

విజయవాడ : టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ డైరక్టర్ రఘు కేవిట్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 25న ఏసీబీకి రఘు పట్టుబడ్డారు. ఏసీబీ దాడుల్లో రూ.500 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ప్రస్తుతం రఘు రిమాండ్ లో ఉన్నారు. 

08:51 - October 7, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లిలో దారుణం జరిగింది. సౌమ్య అనే యువతిని కృష్ణయ్య హత్య చేసి చెరువులో పడేశాడు.
అనంతరం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. 

చండూరులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

నల్గొండ : చండూరులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బస్టాండ్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని డ్రైవర్ లింగస్వామి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలే కారమని అతని బంధువులు అంటున్నారు. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లింగస్వామి స్వగ్రామం నల్గొండ జిల్లా గుండ్లపల్లి.

హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం

హైదరాబాద్ : కూకట్ పల్లిలో దారుణం జరిగింది. సౌమ్య అనే యువతిని కృష్ణయ్య హత్య  చేసి చెరువులో పడేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. 

08:18 - October 7, 2017

కోదండరాం, ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత రాకేష్, టీకాంగ్రెస్ నేత బెల్లనాయక్ పాల్గొని, మాట్లాడారు. సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని..పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా అన్నారు. కేసీఆర్ తన తీరును మార్చుకోవాలని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

08:01 - October 7, 2017
07:57 - October 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకి ఇద్దరు మరణించారు. నిజామాబాద్ జిల్లాలో కోతకు సిద్ధమవుతున్న వరి పంట నేలకొరగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 
కామారెడ్డిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి 
కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాజంపేట మండలం బస్వన్నపల్లి గుట్టపై పిడుగు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన రాజారెడ్డి, భిక్షపతి అనే ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డు, గాంధీనగర్, బతుకమ్మ కుంట, శ్రీరాంనగర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు నీట మునిగాయి. 
నిజామాబాద్ లో నీట మునిగిన 200 ఎకరాల వరి పంట  
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో అకాల వర్షంతో 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో చేతికి వచ్చిన పంట నేలకొరిగింది. దాంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కరీంనగర్ జిల్లాలో కుండపోత వాన 
కరీంనగర్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. వేములవాడలో కురిసిన భారీ వర్షానికి ఆలయ ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆలయానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

 

07:42 - October 7, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడం సిగ్గుచేటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. 90శాతం మంది వంశధార నిర్వాసితులకు ఇళ్లులేవన్నారు.  నిర్వాసితులను కలవడానికి వెళ్లిన వారిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తక్షణమే వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరారు.  నిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మధు డిమాండ్‌ చేశారు. లేకుంటే వంశధార నిర్వాసితుల సమస్యలపై అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని ఈనెల 10న ఛలో వంశధార కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

 

07:39 - October 7, 2017

గోవా : ప్రేమజంట ఒక్కటయింది. పేమతో మొదలయిన బంధం పెళ్లితో మరింత బలపడింది. టాలీవుడ్‌ ప్రేమికులు నాగచైతన్య, సమంత వివాహం గోవాలో ఘనంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు సమంత కుటుంబసభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  గోవాలోని ఓ స్టార్‌హోటల్లో ఏర్పాటు చేసిన పెళ్లివేదికపై  చైతు-సమ్మి ఏడడుగులు నడిచారు. శుక్రవారం రాత్రి 11.45 కు హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ- సమంత ఒక్కటయ్యారు..కాగా ఇవాళ క్రిష్టియన్‌ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరగనుంది. పెళ్లి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగినా.. ఈనెల 10 హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తోంది.     

 

07:36 - October 7, 2017

ఢిల్లీ : జీఎస్టీ మండలి సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ధరలు పెరగాయన్నారు. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గకపోగా... పెరిగాయన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు మంత్రి ఈటల జీఎస్టీ మండలి దృష్టికి తీసుకొచ్చారు.  

07:33 - October 7, 2017

ఢిల్లీ : జీఎస్టీ మండలి భేటీలో నష్టపరిహారం చెల్లింపుపై ఏపీ ఆర్థిక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ అమలు తర్వాత ఏపీకి 175 కోట్ల రూపాయల నష్టం వస్తే... కేంద్రం 116 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడాన్ని తప్పుపట్టారు. జీఎస్టీ నష్టాన్ని లెక్కిండంలో కేంద్ర  విధానం సరిగాలేదున్నారు.  సెస్‌ రూపంలో 43 కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించిన విషయాన్ని మంత్రి యనమల గుర్తు చేశారు. 
 

07:30 - October 7, 2017

జనగామ : బడుగులు పిడుగులు కావాలి.. సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలి. ఎర్రజెండాలతో కలిసిరావాలి.. శుక్రవారం సీపీఐ పోరుయాత్రలో ఘనంగా ప్రారంభమైంది. జనగామ జిల్లాలో జరిగిన ప్రారంభ సభలో పలువురు నేతలు మాట్లాడారు. సామాజిక తెలంగాణ..సమగ్రాభివృద్ధి నినాదంతో ప్రారంభమైన ఈ యాత్ర మూడు నెలల పాటు కొనసాగనుంది. 31 జిల్లాల్లో 60 రోజుల పాటు పోరుబాట యాత్ర జరగనుది. సీపీఎం, జేఏసీ, టీమాస్‌, టీడీపీ బస్సుయాత్రకు సంఘీభావం ప్రకటించాయి. సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రం జనగామ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిగా పోరుయాత్ర సాగునుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు.

 

నేడు టీపీసీసీ సీనియర్ నేతల భేటీ

హైదరాబాద్ : మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ సీనియర్ నేతల భేటీ జరుగనుంది. ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్ల నియామక అధికారాన్ని అధిష్టానానికి ఇస్తూ పీసీసీ ఏకవ్యాఖ్య తీర్మానం చేయనుంది. 

 

నేడు చంద్రబాబుతో టీటీడీపీ నేతలతో భేటీ

హైదరాబాద్ : ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం జరుగనుంది. 

 

నేడు అన్ లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ ప్రారంభం

హైదరాబాద్ : నేడు అన్ లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ ప్రారంభం కానుంది. టికెటింగ్ పోర్టల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. పోర్టల్, సింగిల్ విందో పద్ధతిలో షూటింగ్ లకు అనుమతి లభించింది. 

నేడు రెండో రోజు స్కల్ 78 వ అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ : నేడు రెండో రోజు స్కల్ 78 వ అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సదస్సు నిన్న ప్రారంభం అయింది. 

నేడు, రేపు గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన

గుజరాత్ : నేడు, రేపు గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మోడీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

 

నేడు ముఖ్దూ మొహియుద్దీన్ జీవితం...గ్రంథ ఆవిష్కరణ సభ

హైదరాబాద్ : సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షాయరె తెలంగాణ ముఖ్దూ మొహియుద్దీన్ జీవితం...గ్రంథ ఆవిష్కరణ సభ జరుగనుంది. ఈ పుస్తకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించనున్నారు. 
 

Don't Miss