Activities calendar

08 October 2017

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

మహబూబ్ నగర్ : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 882.40అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు ఉంది.

21:37 - October 8, 2017

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చిక్కుల్లో పడ్డారు. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షా కు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయ్‌షా వ్యాపారం మూడేళ్ల వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతే కాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని వైర్‌ పోర్టల్‌ వార్తను ప్రచురించింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు ప్రధాని మోదీని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేయబోతున్నారని తెలిపారు. వైర్‌ ప్రచురించిన వార్త అవాస్తవమని తోసిపుచ్చారు. మొత్తానికి ఈ కథనం పాలక బీజేపీని ఇరకాటంలో పడేసింది.

21:36 - October 8, 2017

హైదరాబాద్ : దేశంలో స్వాముల రాజ్యం నడుస్తుందని ఐద్వా నేత పుణ్యవతి అన్నారు. ప్రగతి నగర్‌లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర రెండవ ఐద్వా మహాసభల్లో ఆమె ప్రసంగించారు. మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగుతాయని తెలిపారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పుణ్యవతి పిలుపు నిచ్చారు. దేశ భవిశ్యత్తు కోసం ఐద్వా ఉద్యమాన్ని బలపరచుకోవాలన్నారు. 

21:35 - October 8, 2017

 

హైదరాబాద్ : భారీవర్షానికి హైదరాబాద్‌ మరోసారి తడిసి ముద్దైంది. హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, ఘట్‌కేసర్‌, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, చార్మినార్‌, యాకుత్‌ పురా, అప్ఝల్‌ గంజ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ బాగానే ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పాతబస్తీలో ప్రారంభమైన వర్షం నగరమంతా వ్యాపించింది. పలుచోట్ల వాన దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులతో నగరాన్ని వణికించింది. భారీ వర్షానికి భయపడి జనం బయటకు రావడం లేదు. వాహనదారులు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరింది. పలు కాలనీల్లో వరదనీరు వచ్చి చేరింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను చేపట్టారు.

లేటుగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
సాధారణంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ రెండోవారంలోనే నిష్క్రమించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది దాదాపు 12 రోజులు ఆలస్యంగా వాటి నిష్క్రమణ మొదలైంది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. 

21:34 - October 8, 2017

హైదరాబాద్ : కార్మికులు గెలిచినపుడే అది నిజమైన గెలుపు అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలి ..జ్వరం వచ్చినా లంచం ఇవ్వాలి.. కార్మికులు ఎందుకు లంచం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. లంచం అడిగిన వారిని.. తీసుకునేవారిని చెప్పుతో కొట్టాలని సీఎం సూచించారు.

రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణం
సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణానికి రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని కేసీఆర్ కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి రూ.50 కోట్లు తగ్గించుకునైనా, రూ.10 లక్షల రుణం ఇస్తామని ఆయన తెలిపారు. సింగరేణి ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామన్నారు కేసీఆర్. గతంలో టీబీజీకేఎస్‌ గెలుపొందినప్పటికీ పనులు ఆశించినంతగా జరగలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటికీ పెద్దగా సింగరేణిపై దృష్టి పెట్టలేకపోయానని అంగీకరించారు. రాబోయే 20 రోజుల్లో సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తానని తెలిపారు. బయ్యారం ఇనుప గనులను సింగరేణికే అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి యాత్రకు వచ్చినప్పుడు కొత్తగా ఆరు గనులను ప్రారంభిస్తాననితెలిపారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కొన్ని కార్మిక సంఘాలు మోసం చేశాయని కేసీఆర్ చెప్పారు. 

20:47 - October 8, 2017

ముంబై : మహారాష్ట్రలోని యావత్మాల్‌ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలో 20 మంది రైతులు మృతిచెందారు. 700 మంది ఆస్పత్రిపాలయ్యారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన క్రిమిసంహారక మందులు చల్లే యంత్రాల వినియోగం రైతులకు అర్థంకాలేదు. దీంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని వినియోగించారు. దీంతో వందలాది రైతులు క్రిమిసంహారకాల ప్రభావానికి గురయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు చనిపోయారు. 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 25మంది కంటిచూపు కోల్పోయారు. క్రిమిసంహారక ముందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మందులు చల్లే పరికరాల్లో కొత్త మోడళ్లు రావడం.. వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

20:46 - October 8, 2017

ఢిల్లీ : కేరళలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ కొనసాగిస్తున్న రాజకీయ హింస వెనుక అసలు ఎజెండాను ఎండగట్టేందుకు సోమవారం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతో తాము బీజేపీతో ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతామన్నారు. బెంగాల్‌ తరహాలోనే కేరళలో కూడా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్ని స్తున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తన మతోన్మాద రాజకీయాలను విస్తరించేందుకు ఈవారంలో కేరళలో యాత్ర చేపట్టారని, అయితే బీజేపీ కుయుక్తులను ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ని ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఏచూరి విమర్శించారు.

 

20:45 - October 8, 2017

హైదరాబాద్ : భారీ వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం నీరు నిలువ ఉండటంతో నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఉప్పల్‌ సర్కిల్‌లోని చాలా కాలనీలు ఎనమిది రోజులుగా నీటిలోనే మగ్గుతున్నాయి. రామంతాపూర్‌ చెరువు సమీపంలో ఉన్న కాలనీలో సుమారు 500 కుటుంబాలు ఈ వర్షం నీటిలో ఇబ్బందులు పడుతున్నాయి. కాలనీలో నిలిచిపోయిన మురుగునీరు తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఇళ్లనుంచి బయటకు రావడానికి ప్రత్యేకంగా తెప్పలను ఏర్పాటు చేసుకోవలసి వస్తుందని వాపోతున్నారు. మురుగునీటి వల్ల వచ్చే వాసనతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులంటున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల తాగునీరు కూడా కలుషితమైపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే కొందరు కాలనీవాసులు ఇళ్లను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

కాలనీల్లోకి నీరు
రామంతాపూర్‌ చెరువుకు ఉన్న తూము పని చేయకపోవడం, అలుగు కూడా లేకపోవడంతో చెరువు నిండిపోయి కాలనీల్లోకి నీరు చేరుతోంది. అయితే ఆ చెరువుకట్టపై రోడ్డు విస్తరణ చేసిన సందర్భంలో నీటిని బయటకు పంపే పైపులు ఎత్తుగా వేసినందుకే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని స్థానికులంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలు గ్రేటర్‌ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారులు చర్యలు అంతంతమాత్రమే ఉండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

 

20:44 - October 8, 2017

హైదరాబాద్ : లంచం అడిగే వాడిని చెప్పుతో కొట్టాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో సింగరేణి కార్మికులతో ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. కార్మికులు గెలిచినపుడే నిజమైన గెలుపని అన్నారు. క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలి. జ్వరం వచ్చినా లంచం ఇవ్వాలి. కార్మికులు ఎందుకు లంచం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. రేపటి నుంచి లంచం అడిగినోన్ని..తీసుకున్నోన్ని చెప్పుతో కొట్టాలని అన్నారు. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి 50 కోట్ల రూపాయలు తగ్గించుకోనైనా, వడ్డీ లేకుండా 10 లక్షల రుణం ఇస్తామని చెప్పారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా రిఫరల్ హాస్పిటల్ కల్పిస్తామన్నారు. బయ్యారం ఉక్కుగనిని కూడా సింగరేణికే అప్పగిస్తమని సీఎం స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో సీనియర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. సింగరేణిలో పరిస్థితులను తెలుసుకునేందుకు తాను కోల్‌మైన్‌ ప్రాంతాల్లో పర్యటిస్తానని కేసీఆర్‌ చెప్పారు.

హుస్నాబాద్ లో విషాదం

కరీంనగర్ : జిల్లా హుస్నాబాద్ లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. కోహెడ మండలం తీగలగుట్టపల్లిలో పిడుగుపాటుకు దంపతులు ఎల్లయ్య, భారతవ్వ మృతి చెందారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ట కలకలం రేగింది. హెడ్ కానిస్టేబుల్ పాషా దగ్గర బుల్లెట్లు లభించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

18:18 - October 8, 2017

కామారెడ్డి : జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. సమాచారం అందుకునుకన టెన్ టివి అక్కడి చేరుకుని గంజాయి విక్రయదారులను కెమెరాలో బంధించి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు 40కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:11 - October 8, 2017

కార్మికులు గెలిచినపుడే నిజమైన విజయం:కేసీఆర్

హైదరాబాద్: ఇంతవరకు సింగరేణి కార్మికులపై నేనంత శ్రద్ధ పెట్టలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ...ఈసారి టీజీబీకేఎస్ విజయం కార్మికుల గెలుపు కావాలన్నారు. కార్మికులు గెలిచినపుడే నిజమైన విజయం అన్నారు. సింగరేణిలో అవినీతిని రూపుమాపాలన్నారు. క్వార్టర్లు మారినా, జ్వరం వచ్చినా సెక్రటరీకి లంచం ఇవ్వాలని, ఇక నుంచి సింగరేనిలో లంచం వచ్చిన వాళ్లను తీసుకున్న వాళ్లను చెప్పుతో కొట్టాలన్నారు. త్వరలో సింగరేని యాత్ర చేపడతనన్నారు.ఆరు భూగర్భ గనులను ప్రారంభిమస్తామన్నారు.

17:07 - October 8, 2017

గతంలో టీజీబీకేఎస్ గెలిచినా సరిగా పనిచేయలేదు: కేసీఆర్

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. గతంలో టీజీబీకేఎస్ గెలిపించినా సరిగా పనిచేయలేదని ఇపుడు అలా జరగకూడదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

17:00 - October 8, 2017
16:45 - October 8, 2017

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కాపు వర్గ ప్రతినిధులను కలవడానికి వెళ్లడమే నేరమా అని లేఖలో ప్రశ్నించారు. గ్రామాల్లో తిరగకుండా తననెందుకు అడ్డుకుంటున్నారని.. ఈ రాష్ట్రం మీ ఎస్టేట్‌ కాదని, మీరు ట్రస్టీ మాత్రమేనని లేఖలో తెలిపారు. సీబీసీఐడీల పేరుతో తనను బెదిరించడం తగదన్నారు.

 

16:44 - October 8, 2017

ఢిల్లీ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పాదయాత్రలు చేపట్టి వారి ద్వంద్వ సభావాన్నిబయట పెట్టుకుంటున్నాయని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయం వద్ద బీజేపీ నేత అమిత్‌ షా ర్యాలీ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. సీపీఎం ఆఫీసులపై దాడులకు పాల్పడుతూ బిజేపి ఈరోజు దేశాన్ని పాలించే అర్హత కోల్పోయిందని రాఘవులు అన్నారు. 

16:44 - October 8, 2017

విశాఖ : జిల్లా సీపీఎం ఆఫీసుపై.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింగరావుపై బిజేపి , ఆర్ఎస్ఎస్ నేతలు జరిపిన దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాలు, ఇతర ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ తీశారు. సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసి గాంధీ విగ్రహం వరకూ జరిగిన భారీ ర్యాలీ జరిగింది. దీనిపై మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

16:35 - October 8, 2017

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత

కర్నూలు : కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకులను ఎస్టీ జీబితాలో చేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద వీఆర్ పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. అంతే కాకుండా 2 వాహనాల అద్దాలు పగలగొట్టి.. కలెక్టరేట్ లోకి దూసుకెల్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వీఆర్ పీఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

16:08 - October 8, 2017

నిర్మల్ : జిల్లా ఖానాపూర్ మార్కెట్లోని సుజాత జ్యువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. దొంగలు షెట్టర్ తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పోలీసులపై దౌర్జన్యం చేసిన మంత్రి దేవినేని అనుచరులు

విజయవాడ: మంత్రి దేవినినేని అనుచరులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులపై దౌర్జన్యం చేశారు. రోడ్డుపైనే పోలీసులపై మంత్రి అనుచరులు దుర్బాషలాడారు. మనస్థాపానికి గురైన పోలీసులు ఇబ్రహీంపట్నం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు గోప్యంగా ఉంచారు.

నిర్మల్ లో జ్యుయెలరీ షాపులో భారీ దోపిడి

నిర్మల్: ఖానాపూర్ మార్కెట్లోని సుజాత జ్యుయెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. షెట్టర్ తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టారు.

కంగ్టీ సీఐ నారాయణ దాష్టీకం

సంగారెడ్డి: కంగ్టీ సీఐ నారాయణ దాష్టీకానికి పాల్పడ్డాడు. పాటిల్ కన్ స్ట్రక్షన్స్ కు వ్యతిరేకంగా భూపోరాటం చేస్తున్న అబ్రహంతో పాటు ఇద్దరని సీఐ అదుపులోకి తీసుకున్నారు. వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ సీఐ నారాయణ చేయిచేసుకున్నాడు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో వారిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జోరుగా గంజాయి విక్రయాలు

కామారెడ్డి: కలెక్టరేట్ వద్ద జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. '10టివి' నిఘాకు గంజాయి విక్రయదారులు చిక్కారు. ఐదుగురిని అరెస్్ట చేసిన పోలీసులు వారి వద్ద నుండి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

15:42 - October 8, 2017

కృష్ణా : కమ్యూనిస్టు ఉద్యమాలన్ని దశల్లోనూ హనుమంతరావు కీలకంగా వ్యవహరించారని.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఆయన ఉద్యమాల్లో ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారన్నారు. దేశంలో కమ్యూనిస్టులు ఓ బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల స్వతంత్ర బలం పెరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని మధు తెలిపారు. ఉద్యమాలు ఉధృతం చేసి.. దేశంలో బీజేపీ మతోన్మాద శక్తిని బలహీనపరచాలన్నారు. 

15:41 - October 8, 2017
15:38 - October 8, 2017

కృష్ణా : ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఐక్య ఉద్యమానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో ప్రకాశ్‌ కరత్‌ పిలుపు ఇచ్చారు. హిందుత్వవాదంతోపాటు సరళీకరణ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లోజరిగిన కమ్యూనిస్టు ఉద్యమం నేత మోటూరి హనుమంతరావు శతజయంతి సభకు కరత్‌ హాజరయ్యారు. ఉదారవాద, నియంతృత్వ, మతతత్వ విధానాలు-ప్రత్యామ్నాయం అన్న అంశంపై కరత్‌ ప్రసంగించారు. 

15:37 - October 8, 2017

అనంతపురం : జిల్లా, నల్లచెరువు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంజీవపల్లి వద్ద కారు-లారీ ఢీ కొనడంతో.. ముగ్గురు మృతి చెందారు.  

15:36 - October 8, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ వెళ్లారు. మీడియా ప్రతినిధులు పలకరించగానే.. దారిలో వెళ్తూ ఇటువైపు వచ్చానని మాట మార్చారు. తరువాత అల్టిమేట్‌గా ప్రజలే న్యాయ నిర్ణేతలని తలసాని అన్నారు. ఎవరి స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డికి చురకలంటించారు. తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. ప్రతిపక్షాల నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

15:35 - October 8, 2017

ప్రగతి నగర్ లో ఐద్వా రాష్ట్ర మహాసభలు..

హైదరాబాద్ : ప్రగతి నగర్ లో ఐద్వా రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా నేత హైమావతి పేర్కొన్నారు. సభకు మందు భార్యీ ర్యాలీ నిర్వహించారు. 

15:16 - October 8, 2017

దేశానికి వెన్నెముకగా నిలబడాల్సిన 'యూత్' కి ఏమైంది ? యువతే భవిత...ఒక దేశ నిర్మాణానికీ...పురోగమనానికీ...అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావినేతలూ యువతరం నుండే రావాల్సి ఉంటుంది. కదా..కానీ ప్రస్తుతం సమాజంలో యువత ఏమి చేస్తోంది. ఎటువైపు వెళుతున్నారు ? వారిలో విషపు బీజాలు నడుతోంది ఎవరు ? సమాజమా ? పెంపకానిదా ?

ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనల వెనుక యువతే ఉండడం విషాదకరం. ప్రేమను నిరాకరించిందంటూ ఓ యువకుడు యువతిని దారుణంగా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఓ యువకుడు..తన ప్రియురాలిపై అత్యాచారయత్నం చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. లైంగిక వాంఛ కోసం ఓ ముక్కుపచ్చలారని బాలుడిని అతిదారుణంగా హత్య చేశాడు. ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్కువగా మైనర్లు ఉండడం పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పవచ్చు.

ప్రస్తుతం యూత్ ఆలోచనల్లో స్పష్టంగా మార్పు వచ్చిందనే చెప్పవచ్చు. ఏది మంచి..ఏది చెడు అనే విషయాలపై క్లారిటీ ఉంది. కానీ యువత దారుణాలకు ఎందుకు ఒడిగడుతున్నారు ? క్షణికావేశంలో హత్యలు చేస్తూ..ఆత్మహత్యలకు పాల్పడుతూ రెండు కుటుంబాలకు తీరని వ్యథను కలిగించేస్తున్నారు. మైనార్టీ తీరని వారు ఎక్కువగా ఉన్నారని జాతీయ నేరాల నమోదు సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఎంతో నమ్మకంతో ఉన్న తల్లిదండ్రులు కుమారులు చేస్తున్న దారుణాలకు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వారు కాటికి..లేదా కటకటాల్లోకి వెళుతుండడం వారిని కలిచివేస్తోంది...

టీనేజ్‌లో పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని పలువురు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్‌, నెట్‌లను పరిమితికి మించి వాడుతున్నా.. డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నా వారి ప్రవర్తన మీద ఓ కన్నేసి ఉంచాలని, అప్పుడప్పుడే ప్రపంచం గురించి తెలుసుకునే వయస్సులో.. పిల్లలకు అన్నీ కొత్తగానే కనిపిస్తాయంటున్నారు. ప్రతీది అందంగానే కనిపించడం..కానీ పక్కనే ప్రమాదం పొంచి ఉంటుందని వాళ్ల చిన్న బుర్రలకు తట్టదు. టీనేజ్‌లో పిల్లలు మంచికైనా, చెడుకైనా త్వరగా ఆకర్షితులవుతారు. మంచి దారిని ఎంచుకుంటే పర్లేదు కానీ చెడు వైపు ఆకర్షితులైతే పిల్లల భవిష్యత్తు ఇలా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి. 

15:09 - October 8, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. వానతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 4సెం.మీ, మరికొన్ని ప్రాంతాల్లో 2సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సిలిగురిలో ప్రబలుతున్న డెంగ్యూ..

వెస్ట్ బెంగాల్ : సిలిగురిలో డెంగ్యూ ప్రబలుతోంది. జిల్లా ఆసుపత్రిలో 250 మంది ఆసుపత్రిలో చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హరీష్..

సంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో 9వ తేదీన పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జిల్లాల పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

పొంగిపొర్లుతున్న మీరాలం చెరువు..

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాల కారణంగా మీరాల చెరువు పొంగిపొర్లుతోంది. సమీపంలోనే ఉన్న నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోకి నీరు వచ్చి చేరుతోంది. దీనితో సఫారీ పార్క్, రైలు, బ్యాటరీ వాహనాలను మూసివేసినట్టు తెలుస్తోంది. 

14:47 - October 8, 2017

టైం అయ్యిందంటే చాలు..టివిల ఎదుట వాలిపోతుంటాం. ఇంట్లో ఏం జరిగినా కొందరు పట్టించుకోరు..ఆ సమయంలో ఎవరైనా వచ్చినా..కరెంటు పోయినా తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. సీరియల్స్ కి ఆడవారికి..మధ్య విడదీయరాని బంధంగా మారిపోయిందని చెప్పవచ్చు. సీరియల్స్ వచ్చే సమయంలో ఇంట్లో వాళ్లని పట్టించుకోవడం మానేస్తున్నారు కొందరు. కానీ ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ ఎంతో ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు వివిధ ఛానెల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో హింస..అశ్లీలత..ఇతరత్రా పెచ్చరిల్లుతున్నాయి. ఈ అంశంపై టిడిపి సీనియర్ నేత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. ఏకంగా సెన్సార్ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. దీనితో సీరియల్స్ పై చర్చ జరుగుతోంది. సీరియల్స్ ఒక వ్యసనంలా మారిపోయిందని, ఆదర్శంగా చూపించాల్సిన సీరియల్స్ ప్రస్తుతం లేవనే చెప్పవచ్చని పలువురు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలను క్రూరంగా చూపిస్తున్నారని, ఏకంగా మహిళలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్త ఆడపడుచుల వేధింపులు..కోడలికి కష్టాలతో సీరియల్స్ ఏకధాటిగా ప్రసారమౌతున్నాయి. చిన్న పిల్లలతో పగలు ప్రతీకారాలు సీరియల్స్ అవసరమా ? వీటిని బట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు ? ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక సీరియల్ హిట్ కాగానే అదే కోవలో ఎన్నో సీరియల్స్ ప్రసారమౌతున్నాయి. జనం చూస్తున్నారని సమర్థించుకోవడం కరెక్టేనా ? కాలక్షేపం కోసం సీరియల్స్ చేసే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు. సీరియల్స్ వల్ల సమాజంపై పెను ప్రభావం చూపిస్తున్నాయని, సీరియల్స్ వల్ల పలు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని టాక్. ఇదిలా ఉంటే సీరియల్స్ క్రియేటివిటీ రాను రాను తగ్గుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం సినిమాకు పేరడీ పరిశ్రమగా మారిపోయింది. అత్తా కోడళ్ల గొడవలు..వయోలెన్స్ ని చూపిస్తున్నారు. ఒక విధంగా ఆడవాళ్లలో మానిసక అశాంతిని రేపుతున్నారనే చెప్పవచ్చు. పలు సీరియల్స్ లో సినిమా పాటలను వాడేస్తున్నారు. హిట్టైన సినిమాల్లోని పాటలను వీళ్లు మరోసారి వాడుకుంటూ ఆ రోజుకు సీరియల్ ను మమ అనిపిస్తున్నారు. నాణ్యత..నవ్యత లేని సీరియళ్లకు విలువ లేకుండా పోయింది. 

14:29 - October 8, 2017

జనరక్షణ యాత్ర కేరళ, ఢిల్లీలో విఫలం :ఏచూరి

ఢిల్లీ : కేరళలో రాజకీయ హింసను ప్రారంభించింది బిజెపి,ఆర్ ఎస్ ఎస్ లేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. బిజెపి తలపెట్టిన జనరక్షణ యాత్ర కేరళ, ఢిల్లీలో విఫలం అయ్యిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం 3 ఏళ్ల పాలన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ హింసను తగ్గించడానికి సీపీఎం అన్ని విధాలా కృషి చేస్తోందని ఏచూరి పేర్కొన్నారు.

 

పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు

హైదరాబాద్: చంద్రబాబుతో టి.టిడిపి నేతల భేటీ ముగిసింది. పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఇపుడు పొత్తుల గురించి మాట్లాడితే క్యాడర్ గందరగోళంలో పడతారని, పార్టీ బలోపేత పై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించనట్లు సమాచారం.ఈ నెల 12న పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు టిడిపి నేత రావుల పేర్కొన్నారు. త్వరలో కొత్త కమిటీలతో చంద్రబాబు సమావేశం అవుతారని, రాష్ట్ర కేంద్ర కమిటీలో అవకాశం రానివారికి అవకాశం ఇస్తామని రావుల పేర్కొన్నారు.

త్వరలో సింగపూర్ పర్యటనకు రాజధాని రైతులు

అమరావతి: త్వరలో సింగపూర్ పర్యటనకు రాజధాని రైతులు వెళ్లనున్నారు. లాటరీ ద్వారా 123 మందిని ప్రభుత్వం ఎపిక చేసింది. 4 బృందాలుగా సింగపూర్ పర్యటనకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

13:58 - October 8, 2017

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెవింగ్ కమెడియన్ భద్రంతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. తన సిని అనుభవాలను తెలిపారు. ఆయన నటించిన పలు సినిమాల గురించి వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:43 - October 8, 2017

విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ వర్ల రామయ్య  అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మొత్తం పన్నెండున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయల వ్యయం చేస్తున్నారని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 2న లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించామని తెలిపారు. క్రిస్మస్‌, సంక్రాంతికి మరికొన్ని వేల గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే జూన్‌ 8న మరో దఫా సమూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. గృహ నిర్మాణ పథకంలో అవినీతికి అస్కారం లేకుండా జియో ట్యాగింగ్‌ ఉంటుందని చెప్పారు. 

పశువుల పాక కూలి రైతు మృతి

రంగారెడ్డి: వరుసగా కురుస్తున్న వర్షానికి పశువుల పాక కూలటంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాలో చోటుచేసుకుంది. రైతు మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

13:37 - October 8, 2017

విజయవాడ : కమ్యూనిస్టు ఉద్యమాలన్ని దశల్లోనూ హనుమంతరావు కీలకంగా వ్యవహరించారని.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఆయన ఉద్యమాల్లో ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారన్నారు. దేశంలో కమ్యూనిస్టులు ఓ బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల స్వతంత్ర బలం పెరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని మధు తెలిపారు. ఉద్యమాలు ఉధృతం చేసి.. దేశంలో బీజేపీ మతోన్మాద శక్తిని బలహీనపరచాలన్నారు. వామపక్షాల స్వతంత్ర బలం పెరగకుండా బీజేపీ అడ్డుకుంటోందన్నారు. 

తార్నాకలో కంచ ఐలయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: తార్నాకలో కంచ ఐలయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చల కోసం ఐలయ్య ఇంటికి ఆర్యవైశ్య సంఘం నేత శ్రీను బలయలుదేరారు. దీంతో ఐలయ్య ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం భారీ పడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, నారాయణగూడ, ఉప్పల్, తార్నాక, నాచారంలో వర్షం కురుస్తోంది.

కొత్త సంస్కరణలతో దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి: ప్రకాశ్ కరత్

విజయవాడ :మోదీ ప్రభుత్వంలో కొత్త సంస్కరణలు దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయని సీపీఎం నేత ప్రకాశ్ కరత్ అన్నారు. విజయవాడలో సీపీఎం నేత మోటూరు హనుమంతరావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో మోటూరు హనుమంతరావు కృషి మరువలేనిదని కరత్ పేర్కొన్నారు. నయా సరళీకరణదేశంలో ఆర్ ఎస్ ఎస్, హిందుత్వ వాద శక్తులు కలిసి నియంతృత్వ విధానాలను ప్రజలపై రుద్దుతున్నాయని విమర్శించారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిందని, రాజకీయాల్లో వ్యాపారాలు కలిసిపోయాయని పేర్కొన్నారు. ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలను పార్లమెంట్లో చర్చించడం లేదని ప్రకాశ్ కరత్ ఆవేదన వ్యక్తం చేశారు.

13:24 - October 8, 2017

హైదరాబాద్ : తార్నాకలోని కంచ ఐలయ్య నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చలకు వస్తానని ఐలయ్య ఇంటికి బయల్దేరిన ఆర్యవైశ్య కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్యవైశ్య కార్యకర్తలను అరెస్టు చేసి అంబర్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అంబర్ పేట పోలీసు స్టేషన్ వద్ద ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. ఐలయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:09 - October 8, 2017
13:08 - October 8, 2017
13:05 - October 8, 2017

ఢిల్లీ : బీజేపీ ర్యాలీని సీపీఎం జాతీయ నేత వి.శ్రీనివాసరావు ఖండించారు. జనరక్షణ యాత్ర పేరుతో సీపీఎం కార్యాలయం వరకు బీజేపీ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీపీఎం కార్యాలయం వరకు బీజేపీ ర్యాలీకి అనుమతి ఇవ్వడం తప్పు అన్నారు. వాస్తవాలను దాచి పెట్టి కేరళ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విమర్శించారు. కేరళలో బీజేపీ అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బిజెపి హింసోన్మాదంతో కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కేరళలో గత ఏడాది కాలంగా 13 మంది సీపీఎం కార్యకర్తలు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల చేతుల్లో చనిపోయారని పేర్కొన్నారు. 2001 నుంచి ఇప్పటి 94 మంది సీపీఎం కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు బీజేపీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ... మరోవైపు వారిపై దాడులకు పాల్పడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని, ఉద్యమాన్ని దెబ్బతీయాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. 

 

 

12:56 - October 8, 2017

విశాఖ : సీపీఎం కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా విశాఖలో విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న సీపీఎం విశాఖపట్నం కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ, సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దాడికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. మాధవ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు కోరారు. వామపక్షాలు, లౌకికవాదులు, అభ్యుదయవాదులను, రచయితలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ, సంఘ్ పరివార్ చేస్తున్న దాడులను విపక్షాలు ఖండిస్తున్నాయి. బీజేపీ, సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

చంద్రబాబు ఇంటికి మంత్రి తలసాని

హైదరాబాద్: చంద్రబాబు ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. దారిలో వెళ్తూ ఇటువైపు వచ్చానని తలసాని తెలిపారు.

కర్నూలు టిడిపి ఆఫీసు వద్ద కార్యకర్తల ఆందోళన

కర్నూలు: టిడిపి జిల్లా కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నామినేటెడ్ పదవులు సీనియర్ కార్యకర్తలకు ఇవ్వాలని వలస నేతలకు పదవులు కట్టబెడితే సహించం అని నిరసనకు దిగారు. కోడుమూరు, కర్నూలు, పాణ్యం టిడిపి కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు.

వాస్తవాలను దాచి పెట్టి కేరళ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు: సీపీఎం

ఢిల్లీ: జన్ రక్షా యాత్ర పేరుతో సీపీఎం కార్యాలయం వరకు బిజెపి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇచ్చారని సీపీఎం ప్రశ్నించింది. సీపీఎం కార్యాలయం వరకు బిజెపి ర్యాలీకి అనుమతి ఇవ్వడం తప్పు సీపీఎం నేత శ్రీనివాసరావు అని తెలిపారు. వాస్తవాలను దాచి పెట్టి కేరళ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని సీపీఎం నేత శ్రీనివాసరావు విమర్శించారు. ఆర్. ఎస్. ఎస్., బిజెపి హింసోన్మాదంతో కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కేరళలో గత ఏడాది కాలంగా 13 మంది సీపీఎం కార్యకర్తలు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల చేతుల్లో చనిపోయారని పేర్కొన్నారు.

12:37 - October 8, 2017

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుకు కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కాపు వర్గ ప్రతినిధులను కలవడానికి వెళ్లడమే నేరామా అని ముద్రగడ ప్రశ్నించారు. గ్రామాల్లో తిరగకుండా తననెందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. 'ఈ రాష్ట్రం మీ ఎస్టేట్ కాదు, మీరు ట్రస్టీ మాత్రమే' అని ముద్రగడ అన్నారు. సీబీసీఐడీ కేసుల పేరుతో బెదిరించడం తగదని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:28 - October 8, 2017

మెగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' న్యూ ఫిల్మ్ టైటిల్ ఏంటీ ? టీజర్ ఎప్పుడు రిలీజ్ చూస్తారు ? పవన్ న్యూ లుక్ ఎలా ఉండబోతోంది ? తదితర విషయాలపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కానీ 'పవన్' నటిస్తున్న తాజా చిత్రంపై మాత్రం ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. సోషల్ మాద్యమాల్లో మాత్రం తెగ వార్తలు వస్తున్నాయి.

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'...మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. కానీ సినిమాకు సంబంధించిన లుక్స్..టీజర్స్..ఏవీ విడుదల చేయడం లేదు. దీనితో అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారని భావించిన చిత్ర బృందం ఇటీవలే ఓ మ్యూజిక్ సాంగ్ కంపోజింగ్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ను మాత్రం ఎనౌన్స్ చేయలేదు. సినిమా టైటిల్స్ విషయంలో చిత్ర బృందం తర్జన భర్జన పడుతున్నట్లు టాక్. మొదటగా 'ఇంజినీర్ బాబు' అని...తరువాత 'దేవుడే దిగి వచ్చినా'..'గోకుల కృష్ణుడు' తదితర పేర్లు వినిపించాయి. చివరగా ఈ సినిమా టైటిల్ 'అజ్ఞాత వాసి' అన్న ప్రచారం జరిగింది. అయితే వీటిలో ఏ టైటిల్ ను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ చిత్ర యూనిట్ ఏదీ నిర్ణయించకపోయినా సినిమా టైటిల్ మాత్రం 'అజ్ఞాత వాసి' అని ఫిక్స్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారంట. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోను రివీల్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2018 జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

12:27 - October 8, 2017
12:25 - October 8, 2017

హైదరాబాద్‌ : నగరంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌ రిబ్బన్‌ వాక్‌ నిర్వహించారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పింక్‌ రిబ్బన్‌ వాక్‌ను నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్ వద్ద సినీ నటి తమన్నా వాక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్‌ రఘురామ్‌, యాస్కీ చైర్మన్‌ పద్మనాభయ్య పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ కోల్డ్‌ కాఫీలా మారిందని సినీ నటి తమన్నా అన్నారు. తొలిదశలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మమ్మో గ్రాం చేయించుకోవాలని సూచించారు.

 

12:21 - October 8, 2017

హైదరాబాద్ : వర్షాలతో  హైదరాబాద్‌ రామంతాపూర్‌ పెద్ద చెరువు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీరు బయటకుపోయే మార్గం లేకపోవడంతో ఇళ్లలోకి చేరుతోంది. ఈ సమస్యను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. రామంతాపూర్‌ పెద్ద చెరువు కాలనీ వాసుల ఆందోళనకు ఉప్పల్‌ బీజేపీ ఎమ్మెల్యే... ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్‌ మద్దతు తెలిపారు. 

 

12:19 - October 8, 2017

హైదరాబాద్ : మరో గంటలో పరీక్ష రాయాల్సిన ఓ వెటర్నరీ స్టూడెంట్‌ డ్రగ్స్‌ మత్తులో.. చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదటిసారి వెటర్నరీ హాస్టల్‌లో మత్తు మందు వాడకం బయటపడటంతో.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లోని, రాజేంద్రనగర్‌ పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్శిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఆ స్టూడెంట్‌ తోటి విద్యార్థులకు దూరంగా ఉంటూ.. హాస్టల్‌లో తనకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో ఉంటున్నాడు. గది లోపలి నుంచి గడియ వేసుకొని.. చేతి మణికట్టును బ్లేడ్‌తో కోసుకున్నాడు. పరీక్షకు సమయమైనా తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు తలుపు తెరిచారు. రక్తపు మడుగులో ఉన్న ఆ విద్యార్థిని వెంటనే.. నిమ్స్‌కు తరలించారు. ప్రేమలో విఫలం కావడంతో.. అనస్థీషియాకు ఇచ్చే జైలాజిన్‌ అనే డ్రగ్స్‌కు బానిసైనట్లు విద్యార్థులు తెలిపారు. 

 

బిజెపి ర్యాలి ని ఖండించిన సీపీఎం

ఢిల్లీ: జన్ రక్షా యాత్ర పేరుతో సీపీఎం కార్యాలయం వరకు బిజెపి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇచ్చారని సీపీఎం ప్రశ్నించింది. సీపీఎం కార్యాలయం వరకు బిజెపి ర్యాలీకి అనుమతి ఇవ్వడం తప్పు సీపీఎం నేత శ్రీనివాసరావు అని తెలిపారు. కేరళలో బిజెపి అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.

12:14 - October 8, 2017

హైదరాబాద్‌ : నగరంలోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,  సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ జిల్లా కమిటీల ఏర్పాటు, తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:10 - October 8, 2017

హైదరాబాద్‌ : నగరంలోని తార్కాకలోని కంచ ఐలయ్య ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్చల కోసం ఆర్యవైశ్య సంఘం నేత శ్రీను ఐలయ్య వంటికి వస్తానని చెప్పడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఐలయ్య నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మద్దతుదారులు ఐలయ్య ఇంటికి చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భద్రతా వలయంలో ఢిల్లీ సీపీఎం కార్యాలయం

ఢిల్లీ: బిజెపి నిర్వహిస్తున్న జనరక్షణ యాత్ర కారణంగా ఢిల్లీలో సీపీఎం కార్యాలయం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరో వైపు బిజెపి జనరక్షణ యాత్ర ప్రారంభం అయ్యింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో యాత్ర సీపీఎం కార్యాలయం వరకు కొనసాగుతుంది. కేరళలో దాడులు చేస్తున్నారంటూ బిజెపి ఆరోపింస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు సీపీఎం కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.

12:03 - October 8, 2017

ఢిల్లీ : నేడు ఢిల్లీలో బీజేపీ జనరక్షణ యాత్ర చేయనుంది. సీపీఎం కార్యాలయం వద్దకు కొనసాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్యర్యంలో యాత్ర జరుగనుంది. కేరళలో దాడులకు నిరసనగా యాత్ర చేపట్టనున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఘర్షణలు రెచ్చగొట్టేందుకు, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ.. సీపీఎం ఆఫీస్ వరకు జనరక్షణ యాత్ర చేపట్టిందని పలువురు అంటున్నారు. ఒకపార్టీ...మరో పార్టీ ఆఫీస్ ముందు ర్యాలీ, బహిరంగసభలు నిర్వహించడం సరికాదంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉద్యమాలతో బిజెపి మతోన్మాద శక్తిని బలహీన పరచాలి: పి.మధు

విజయవాడ: కమ్యూనిస్టు ఉద్యమాల అన్నీ దశల్లోనూయ హనుమంతరావు ఉద్యమాల్లో ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారని మధు తెలిపారు. కమ్యూనిస్టు కార్యకర్తలు హన్మంతరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారని, దేశంలో కమ్యూనిస్టులు ఓ వలమైన శక్తిగా ఎదగాలని, వామపక్షాలలు స్వతంత్ర బలం పెరగకుండా బిజెపి అడ్డుకుంటోందని మధు ఆరోపించారు. ఉద్యమాలతో బిజెపి మతోన్మాద శక్తిని బలహీన పరచాలని కార్యకర్తలకు మధు పిలుపునిచ్చారు.

11:57 - October 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు అకాడమీలో విషాదం నెలకొంది. ట్రైనింగ్ లో ఉన్న మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లాకు చెందిన మాధవి, నవీన స్నేహితులు. మాధవి నల్లగొండ జిల్లాలోని వేములపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ లోని రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో నవీన ట్రైనీ కానిస్టేబుల్ గా ఉంది. అయితే ప్రేమ విఫలం కావడంతో నిన్న మాధవి ఆత్మహత్య చేసుకుంది. ఈనేపథ్యంలో మాధవి మృతితో మనస్తాపం చెందిన నవీన నిన్న 11.30 గంటల ప్రాంతంలో తన రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవీన, మాధవి ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సీఎంచంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ

తూ.గో: సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో'గ్రామాల్లో తిరగకుండా నన్నెందుకు అడ్డుకుంటున్నారు, కాపు వర్గ ప్రతినిధులను కలవడానికి వెళ్లడమే నేరమా?, రాష్ట్రం మీ ఎస్టేట్ కాదు.. మీరు ట్రస్టీ మాత్రమే, సీబీసీఐడీ కేసుల పేరుతో బెదిరించడం తగదు' అని పేర్కొన్నారు.

11:18 - October 8, 2017

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కి సమంత మరదలవుతుందా ? అని అనుకొనేరు. నిజ జీవితంలో కాదండోయ్..రీల్ లైఫ్ లో. అవును. రామ్ చరణ్ తాజా చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉండనుంది.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. కానీ టీజర్..ఇతర పోస్టర్స్ మాత్రం విడుదల కాకపోవడంతో చెర్రీ అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారంట. దసరా రోజున టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి మరదలిగా సమంత నటిస్తోందని తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా ఉండబోతున్నాయని టాక్. జగపతి బాబు, అనసూయ, ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు..ఈ సాంగ్ లో పూజా హెగ్డే అలరించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక్ష అధ్యక్షుడు

తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా ఆదివారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు ఆయన దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తితిదే అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ఆ వార్తలను ఖండించిన వరంగల్ డీఎఫ్ వో

వరంగల్: ఫైర్ కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వహించారన్న వార్తలను ఫైర్ డీఎఫ్ వో ఖండించారు. వరంగల్ లో జరగని దృశ్యాలను ఇక్కడి సిబ్బందికి ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యకత్ం చేవారు. సోషల్ మీడియాలోని నిరాధార వార్తలతో జిల్లా ఫైర్ సిబ్బందిని బదనాం చేస్తున్నారని ఫైర్ డీఎఫ్ వో కేశవ్ మండిపడ్డాడు.

11:13 - October 8, 2017

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కరుస్తున్న వర్షాలకు కూకట్ పల్లిలో రోడ్డు కుంగిపోయింది. ఉషా ముళ్లపూడి రోడ్డులో గుంత ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షంతో రోడ్డు కుంగిపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 
  

11:06 - October 8, 2017

ఢిల్లీ : నేడు ఢిల్లీలో బీజేపీ జనరక్షణ యాత్ర చేయనుంది. సీపీఎం కార్యాలయం వద్దకు కొనసాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్యర్యంలో యాత్ర జరుగనుంది. కేరళలో దాడులకు నిరసనగా యాత్ర చేపట్టనున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:03 - October 8, 2017

ఓ చిన్నారి..పోలీసులను ఫిదా చేసేశాడు..ఓ పోలీసు అధికారి ఎత్తుకోగా బోసి నవ్వులు నవ్వుతుంటే పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ చిన్నారికి తెలియదు..తనను వాళ్లే రక్షించారని. పసివాడు..నవ్వుతుంటే..పోలీసుల ఆనందానికి సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

నగరంలో నాలుగు నెలల చిన్నారని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన తల్లి పక్కన నిద్రిస్తున్న ఈ బాలుడిని ఇద్దరు కిడ్నాపర్లు అపహరించుకెళ్లారు. ఇది గుర్తించిన ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దగిన పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. 15గంటల్లోనే ఈ కిడ్నాప్ మిస్టరీని చేధించారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న బాలుడిని రక్షించారు. దీనికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. ఈసందర్భంగా ఆ అధికారిని చూస్తూ చిన్నారి ముసిముసి నవ్వులు నవ్వాడు. ఈ ప‌సివాడి న‌వ్వుకి పోలీసులు ఫిదా అయిపోయారు. హైద‌రాబాద్ పోలీస్ అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో అంద‌రినీ అల‌రిస్తోంది. 

10:59 - October 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు అకాడమీలో విషాదం నెలకొంది. ట్రైనింగ్ లో ఉన్న ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారు రాజేంద్రనగర్ లోని రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో  నవీన అనే మహిళ ట్రైనీ కానిస్టేబుల్ గా ఉంది. ఈనేపథ్యంలో నిన్న 11.30 గంటల ప్రాంతంలో తన రూమ్ లో నవీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవీన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:54 - October 8, 2017

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా హీరో..హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులుంటారు. వారి చిత్రాలు విడుదలయ్యిందంటే చాలు ఎంతో సంబరపడిపోతుంటారు. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది అభిమానులున్నారు. అందులో వీరాభిమానులు కూడా ఉన్నారు. చిరంజీవి పుట్టిన రోజు..సినిమాలు విడుదలయితే హల్ చల్ చేస్తుంటారు. తాజాగా నటుడు చిరంజీవిపై అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లాలోని కడియపులంకలో ఆకుల భాస్కర్ రావు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఇతనికి పెళ్లి కుదిరింది. తన వివాహానికి అంత పెద్ద స్టార్ రాలేడని తెలుసుకున్న భాస్కర్ వివాహ మండపంలో చిరంజీవి ఫొటోతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. దాని సాక్షిగా అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. తన అభిమాన నటుడు చిరంజీవి పెళ్లికి వచ్చాడని అనుకుంటూ ఆనందం పొందాడు. 

డ్రగ్స్ మత్తులో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. తరుణ్ అనే ఓ విద్యార్థి డ్రగ్స్ మత్తులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ విద్యార్థి ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.

చంద్రబాబు నివాసంలో టి.టిడిపి నేతలు భేటీ

హైదరాబాద్: చంద్రబాబు నివాసంలో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. జిల్లా కమిటీల నిర్మాణం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకి ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ హాజరయ్యారు.

కంచ ఐలయ్య ఇంటి వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్: తార్నాకలో కంచ ఐలయ్య ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం నేత శ్రీను చర్చలకు ఐలయ్య ఇంటికి వస్తానని చెప్పడంతో భారీగా పోలీసులుమోహరించారు. ఐలయ్య ఇంటికి మద్ధతు దారులు భారీగా చేరుకున్నారు.

కుంగిన రోడ్డు..

హైదరాబాద్ : కూకట్ పల్లిలో రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి రోడ్డులో గుంత ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో రోడ్డు కుంగిపోవడంతో జనాలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. 

ఏడుగురు మృతి..

తమిళనాడు : ఉలుందూరు పేటై సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందారు. 

ఢిల్లీలో బీజేపీ జనరక్షణ యాత్ర..

ఢిల్లీ : బీజేపీ జనరక్షణ యాత్ర చేపడుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర సీపీఎం కార్యాలయం వరకు జరుగనుంది. 

08:44 - October 8, 2017

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుంటుబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఉలుందూరుపేట సమీపంలో రోడ్డుకు ఎడవైపు ఆపి ఉన్న లారీని కారు అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

08:37 - October 8, 2017

పశ్చిమగోదావరి : ఆకివీడులో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. భీమవరం నుండి ఏలూరుకు ఆటోలో బాణాసంచా తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆకివీడు వద్ద ఆటోలో మంటలు చెలరేగాయి. బాణాసంచా పేలడంతో ఆటో డ్రైవర్ నాగరాజు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం 
ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:30 - October 8, 2017

ఏపీ ప్రభుత్వం రైతు రుణమాఫీని నీరుగార్చిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, టీడీపీ నేత వర్ల రామయ్య పాల్గొఇన, మాట్లాడారు. రుణమాఫీని ఓట్ల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులతో చర్చ జరుపునున్నారు. అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

ఆకివీడులో అగ్నిప్రమాదం

ప.గో : ఆకివీడులో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా తరలిస్తున్న ఆటోలో మంటలు చెలరేగాయి. బాణాసంచా పేలడంతో ఆటో డ్రైవర్ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

కొలిక్కివచ్చిన అగ్రిగోల్డు బాధితుల వ్యవహారం

విజయవాడ : అగ్రిగోల్డు బాధితుల వ్యవహారం కొలిక్కివచ్చింది. 9.52 లక్షల మందికి రూ.6వేల కోట్ల చెల్లింపునకు లైన్ క్లియర్ అయింది. బాధితుల జాబితా రేపటి కల్లా సిద్ధం కానుంది. ఈ నెల 11 నుంచి మండలాల వారీగా బాండ్ల పరిశీలన చేయనున్నారు. పోలీసులు, సీఐడీకి అధికారులు శిక్షణ ఇచ్చారు. నెల రోజుల్లో కసరత్తు పూర్తి కానుంది. 

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు

చిత్తూరు : తిరుమల శ్రీవారిని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నేడు టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాదబు సమావేశం

హైదరాబాద్ : నేడు టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాదబు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

07:49 - October 8, 2017

జార్ఖండ్ : తొలి టీ ట్వంటీలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. వర్షం అడ్డంకిగా మారినా విరాట్‌ ఆర్మీ ఆసిస్‌ను కంగారెత్తించింది. రాంచీ మ్యాచ్‌ విజయంలో బౌలర్లు అదరగొట్టారు. ఏకంగా ఐదుగురు ఆసిస్‌ బ్యాట్స్‌మెన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి సత్తా చాటారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1...0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
అదరగొట్టిన కోహ్లీ బ్యాచ్‌ 
రాంచీ టీ ట్వంటీ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాచ్‌ అదరగొట్టింది. పొట్టిఫార్మాట్‌లో బాయ్స్‌  మరోసారి సత్తా చాటారు. 9వికెట్ల తేడాతో కంగారులను చిత్తుచేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వర్షం కారణంగా గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌  పద్దతి అనుసరించి భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన భారత్‌ 5.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను  ఛేదించింది.భారత్‌ బ్యాట్స్‌మెన్లలో రోహిత్‌ శర్మ11, శిఖర్‌ ధావన్‌ 15, విరాట్‌ కోహ్లీ 22 పరుగులు చేశారు.  
భారత్‌ 1-0 ఆధిక్యం
అంతకు ముందు టాస్‌ గెలిచిన కెప్టెన్‌కోహ్లీ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని భారత బౌలర్లు వమ్ము కానివ్వలేదు. వరుసగా రెండు ఫోర్లు బాది వూపు మీదున్న కెప్టెన్‌ వార్నర్‌ ను భువనేశ్వర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి వికెట్ల కూల్చేపని మొదలు పెట్టాడు. మరోవైపు ఓపెనర్‌ ఫించ్‌ 42 పరుగులు చేసినా.. మాక్స్‌వెల్‌ 17, హెడ్‌ 9, హెన్రిక్స్‌8 , క్రిస్టియన్‌ 9లకే పెవిలియన్‌ చేరారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పెయిన్‌17, నైల్‌ 1 స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు క్లీన్‌బౌల్డ్‌ అయ్యారు. భారత్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, భువనేశ్వర్‌, పాండ్య, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

07:40 - October 8, 2017

గోవా : ఆహ్లాద గోవాతీరం ఆనందానికి వేదికైంది. నాలుగేళ్లుగా ప్రేమలో విహరించిన లవ్‌బర్డ్స్‌ ఇపుడు ఒకేగూటికి చేరాయి. పెళ్లి వేడుకతో చైతు, సమంత మురిసిపోతున్నారు. బంధుమిత్రుల కేరింతల మధ్య చై, సామ్‌ల పెళ్లి అదుర్స్ అనిపించింది. పెళ్లి డ్రెస్స్‌ల్లో  చై, శామ్‌ చమక్‌మన్నారు. వేదమంత్రాలు, కుటుంబ పెద్దలు, సన్నిహితుల మధ్య నాగచైతన్య, సమంత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఏడడుగులతో పంచభూతాలు, నాలుగుదిక్కుల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. శుక్రవారం హిందూ సంప్రదయంలో ప్రేమపక్షులు ఏడడుగులు నడిచాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. 
 
'ఏ మాయచేశావే'లో ఎవరికి ఎవర్ని జంటగా అనుకుంటారో.. ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు అంటూ తొలి సినిమా పాడుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయింది. అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలతో పాటు వధువరుల సన్నిహితులు, మిత్రుల సమక్షంలో వివాహం  అట్టహాసంగా  జరిగింది. రెండు మతాల సంప్రదాయాల్లో చైతు, సమంత పెళ్లి జరిగింది. మొదటిరోజు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లివేడుక బంధుమిత్రులకు కన్నుల పండుగే అయింది. శనివారం ఉదయాన్నే నాగచైతన్యను పెళ్లి కొడుకుని చేసి కళ్యాణ తిలకం దిద్దారు. మెహందీ ఫంక్షన్ తరువాత సమంతతో నాగచైతన్య ఫోటో సెషన్ జరిగింది. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మెహందీ కార్యక్రమం తరువాత.. సంగీత్ నిర్వహించారు. ఆట పాటలతో వేడుక ఘనంగా జరిగింది. సమంత, దగ్గుపాటి సురేష్ బాబులతో పాటు కుటుంబ సభ్యులంతా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత  పండితులు నిర్ణయించిన సుభ ముహూర్తాన సమంత మెడలో చైతూ మూడుముళ్లు వేశాడు. వధువరులిద్దరు కళ్యాణ దుస్తుల్లో తళుక్కుమన్నారు. 

ఇక ముందుగా అనుకున్న ప్రకారం ముదుగా హిందూ సంప్రదాయం ప్రకారం మూడుముళ్లతో ఒక్కటైన చైతు-సామ్‌ ..శనివారం క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వధువరుల కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.

టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంతది మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్. ఈ ఇద్దరి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు చైతూ, సామ్ పెళ్లి వేడుకను చూసి తెగ మురిసిపోతున్నారు. రెండు మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ వధువరులు రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం తెగ నచ్చిందని వధువరుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పడు ఐదురోజుల పాటు జరిగే పెళ్లి సంబరాలు  జరిగేవి. తర్వాత మూడు రోజులు, ప్రస్తుతం ఒక్కరోజు.. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల్లోపే కానిచ్చేస్తున్నారు. కాని.. చైతుసామ్‌ మ్యారేజి మాత్రం స్పెషల్‌గా నిలిచింది. రెండు మతాల సంప్రదాయంలో అదిరిపోయే లెవల్లో పెళ్లిచేసుకోవడం బంధు-మిత్రులు, అభిమానుల ఆనంద పడుతున్నారు. 

07:36 - October 8, 2017

రంగారెడ్డి : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కాలుష్యభూతం మరింత విస్తరిస్తోంది. రంగారెడ్డిజిల్లాలోని పలు చెరువులు కాలుష్యం భారిన పడ్డాయి. చుట్టుపట్టు ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్థాలు చెరువుల్లో కలుస్తున్నాయి. అమీన్‌పూర్‌ మండలం గండిచెరువలో కెమికల్‌ జలాలు కలవడంతో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:30 - October 8, 2017

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. మరదలు వేరే వ్యక్తితో చనువుగా ఉండడంతో జీర్ణించుకోలేని బావ... ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన కృష్ణయ్య... తానే సౌమ్యను హత్య చేసి ఐడీఎల్‌ చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కృష్ణయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు చెరువులో నుంచి సౌమ్య మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో గాంధీ ఆస్పత్రి దగ్గర మృతురాలి బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  నిందితుడు కృష్ణయ్యపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

 

07:25 - October 8, 2017

హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోంది. పాతబస్తీలో ఇళ్లలోకి డ్రైనేజి వాటర్‌ చేరుతున్నారు. ప్రజలు రాత్రంతా మోకాటిలోతు నీళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా తిండికి కూడా కష్టం అవుతుందని ప్రజలు అంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:17 - October 8, 2017

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచింది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ భారీగా జామ్‌ అవుతోంది.  పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. 
నగరప్రజలు నానా ఇబ్బందులు 
భాగ్యనగరాన్ని వరుణుడు వదలడంలేదు. ఎడతెరిపిలేకుండా ప్రతిరోజు వర్షం పడుతుండటంతో..నగరప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాటినీరు నిలిచిపోవడంతో..భారీగా ట్రాఫిక్‌జామ్‌లు అవుతున్నాయి. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 
రోడ్లన్నీ జలమయం
భాగ్యనగరం వర్షంతో తడిముద్దైంది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, మెహిదీపట్నం, ట్యాంక్ బండ్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్, చైతన్యపురి, సరూర్‌నగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్‌లింగంపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, పాతబస్తీ, మలక్‌పేట, అబిడ్స్, ముసారాంబాగ్ల‌లో ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.  రోడ్లపై నీరు వచ్చిచేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది.  భారీ వర్షానికి భయపడిన ప్రజలు  బయటకి రావాలంటేనే భయపడుతున్నారు.  వాహనదారులు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంటుంది. 
పలు కాలనీలు జలదిగ్బంధం 
హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్‌, యాకుత్‌ పురా, అప్జల్ గంజ్‌ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.  
ప్రజలను వణికిస్తోన్న భారీ వర్షం  
పాతబస్తీ ప్రాంతాల్లో భారీవర్షం ప్రజలను వణికిస్తోంది. చార్మినార్, యాకుత్‌పురా, డబీర్‌పురా, ఉప్పుగూడ, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, పురానాపూల్, జియగూడ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, ఈసీఐఎల్‌లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షాలతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 

 

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

తమిళనాడు : వలుందూరుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. 

తిరుమల చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

చిత్తూరు : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమలకు చేరుకున్నారు. నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

 

నేటి నుంచి ఐద్వా తెలంగాణ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్ : నేటి నుంచి ప్రగతి నగర్ లో 3 రోజులపాటు ఐద్వా తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతినగర్ లో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ప్రొ కబడ్డీలో భాగంగా నేడు పలు మ్యాచ్ జరుగనున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు గుజరాత్, పాట్నా మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9 గంటలకు జైపూర్ తో పూణె తలపడనుంది. 

Don't Miss