Activities calendar

09 October 2017

21:53 - October 9, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ఓ నైజీరియన్‌ దేశస్థుడిని దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడన్న కారణంతో ఢిల్లీలోని మాలవ్యనగర్‌కు చెందిన స్థానికులు నైజీరియన్‌ను విచక్షణారహితంగా దాడి చేశారు. కొట్టొద్దని అతను బతిమాలుతున్నా వినకుండా స్తంభానికి కట్టేసి కర్రలతో చావ బాదారు. సెప్టెంబర్‌ 24న జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కొట్టినవారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 

21:51 - October 9, 2017

 

ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోవడం, వృద్ధిరేటు మందగింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు భయాలతో... ఆర్థిక వ్యవస్థ.. ఇబ్బందుల్లో ఉందని ప్రజలు భావిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పలు అంశాలపై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సర్వేలో పలు కఠిన వాస్తవాలు వెలువడ్డాయి. ఇటీవల మధ్యంతర పరపతి సమీక్షలో గ్రోత్‌రేట్‌ను 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గించిన రిజర్వ్ బ్యాంక్.. ఆ తరువాత.. తమ సర్వేల నివేదికను బయటపెట్టింది. ఈ సర్వేతో ఆర్థిక వ్యవస్థ భవితవ్యంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. 

21:50 - October 9, 2017

నిజామాబాద్ : తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ పోస్ట్‌ చేయలేదన్నాడు ఆర్‌డబ్ల్యూఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్‌. సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ పోస్ట్‌ చేశాడని కండక్టర్‌ అయిన సంజీవ్‌పై ఆర్టీసీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అయితే... కార్మికుల సమస్యపై స్పందించిన తనపై అకారణంగా విజిలెన్స్‌ విచారణ చేపట్టారన్నారు.

21:49 - October 9, 2017

అనంతపురం : అనంతపురంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 9 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామకృష్ణా కాలనీ, సూర్యానగర్‌, ఉమానగర్‌తో పాటు పలు కాలనీలు నీటమునిగాయి. టీవీ టవర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అయితే వర్షం కారణంగా పలు కాలనీలలో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. అక్రమకట్టడాలు, నాలాల ఆక్రమణలతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరుతోందని ప్రజలు అంటున్నారు. రాత్రంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చినపుడు అధికారులు హడావిడి చేస్తున్నారని.. తర్వాత యథాతథంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయిని అనంతపురం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అనంతపురంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌ కుమార్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించామని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. బాధితులకు అండగా ఉంటామని, వర్షాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని మండల స్థాయి ప్రభుత్వ అధికారులకు ఆదేశించామన్నారు.

చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి....
భారీ వర్షాలతో జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. ఏడు సంవత్సరాలుగా నిండని చెరువులు ఇప్పుడు నిండుకుండలను తలపించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలో సాహెబ్‌ చెరువు నిండి చిత్రావతి నదిలోకి ఉదృతంగా నీరు వస్తుండటంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందంటున్నారు రైతులు. సీమలో కురుస్తున్న వర్షాలతో తమకు నీటి సమస్య తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

21:48 - October 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకుపరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 జిల్లాల్లోని 457 కుటుంబాలకు 27.42 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి 6 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనుంది. 

21:46 - October 9, 2017

హైదరాబాద్ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరగడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుందని సీపీఎం నేతలు అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ వైఖరిని ఎండగడుతున్నందుకే... సీపీఎం కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తెలంగాణ సీపీఎం కార్యాలయానికి ర్యాలీగా బీజేపీ నేతలను ఇందిరాపార్క్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సీపీఎం కార్యకర్తలు కూడా ప్రతిఘటన ర్యాలీ చేసేందుకు యత్నించారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పోలీసులు భారీగా మోహరించి... పలువురు సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు. 

21:45 - October 9, 2017

కర్నూలు : ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలు పెరిగిపోయాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచలో మెగాసీడ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు... చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సీడ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చేవారన్నారు. కష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ హామీ ఇచ్చానన్నారు చంద్రబాబు. కొందరు రుణమాఫీ ద్వారా లబ్ధి పొంది తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రైతులకు మూడో విడత రుణమాఫీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రుణమాఫీ కింద 36.72 లక్షల మంది రైతులకు 3,600 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ సదస్సు...
అంతకుముందు విశాఖలో పర్యటించిన చంద్రబాబు... అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ సదస్సును ప్రారంభించారు. 25 దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు... బ్లాక్‌చైన్‌ నిపుణులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో భవిష్యత్‌లో అద్భుతాలు సృష్టించవచ్చాన్నారు చంద్రబాబు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుంటుందన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు... కోర్‌ డాష్‌ బోర్డును పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇక అంతకుముందు విశాఖ పాండురంగాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద భూగర్భ విద్యుత్‌ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. 675 కిలోమీటర్లు భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

20:53 - October 9, 2017

వాహనాల పార్కింగ్ కు తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలసీ

హైదరాబాద్ : తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాహనాల పార్కింగ్ కు టీఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

సంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షంతో బీహెచ్ఈఎల్, పటాన్ చెరు, రామచంద్రాపురంలో రహదారులన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ భారీగా స్తభించింది.

హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ లీగ్ వేలంపాట

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ లీగ్ వేలంపాట నగరంలో జరగనుంది. హోటల్ ట్రైడెంట్ లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంపాట నిర్వహించనున్నారు. పీబీఎల్ 3 వేలంలో 8 జట్లు పాల్గొననున్నాయి.

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు పరిహారం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరికి రూ.6లక్షల చొప్పున మొత్తం రూ.27.42 కోట్లు విడుదల చేశారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సందీప్ జా

ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సందీప్ జా నియమితులయ్యారు. కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ రామగుండంకు బదిలీ అయ్యారు. 

20:10 - October 9, 2017

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారంట.. ఒక వేస్టు ఫెల్లోనట.. ఇది నేనంటున్న ముచ్చటగాదు సుమా..? కోపానికొచ్చేరు చంద్రన్న దండు.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సారు మాట.. మరి ఆయనకు ఏడగనిపిచ్చిందో ఈన వేస్టు అన్న ముచ్చట జర్ర అర్సుకుందాం పాండ్రి.. రఘువీరా సారుగూడ అప్పుడప్పుడు ఎటో మాట్లాడుతుంటడు..

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఎంత పెద్ద పనిజేశిండో సూస్తిరా..? ఒకలింట్ల కిరాయికి ఉన్నడు.. ఆ ఇంటి ఓనర్కు కిరాయిస్తలేడు.. ఖాళీ జేయిమంటే.. అమ్మని అక్కనని తిట్టుకుంట చెప్పులు లేవడ్తున్నడు.. నీకు దిక్కొచ్చిన కాడ జెప్పుకో.. జైలుకు వంపిస్త..? నక్రాలు జేస్తె అని..? వాని పైశ్చం..? మరి ముఖ్యమంత్రిగారూ.. మీ పార్టీ ఎమ్మెల్సీ బాగోతం మీరు గూడ జూడాలే..

కూట్లె రాయితీయలేనోడు.. ఏట్లె రాయిదీస్తందుకు వొయ్యిండట.. అగో అట్లనే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి ముచ్చట గూడ.. ప్రభుత్వం పథ్కాలళ్ల.. అడ్గుగడ్గుకు అవినీతి..? ప్రగతి భవనం సౌజన్యంతోని నడుస్తుంటే.. దీన్ని కంట్రోల్ జేయలేని సారు.. సింగరేణి బొగ్గుల అవినీతి గుట్టను గడ్డపార ఏశి తొవ్వుతాంటున్నడు.. ఇనెటోడు అమాయకుడైతె.. చెప్పెటోనికేం బాధ.. అంతేనా..?

రింజుం రింజుం హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరిగిర తిర్గితె.. మోటరు కారూ బలాదూర్ అని ఒక సీన్మ పాటుండేగదా... ఇప్పుడు గడ్క ఆ సీన్మ దీశేదుంటే.. ఈ పాటగూడ వాడకపోతుండే.. హైద్రావాద్ ఆలత్ అట్ల మారిపోయింది.. మొత్తం ముర్కి పట్నాలళ్ల జాబితా దీస్తు మనదే ఫస్టుంటుండొచ్చు.. ఏం పట్నం పాడైంది.. వానలకు సూడుండ్రి..

వారెవ్వ ఇదొక అద్భుతమైన ముచ్చటనే సుమా.? ట్రావన్‌కోరోళ్ల గుడులున్నయ్ గదా..? అదే కేరళ.. అండ్ల కొన్ని వేల సంవత్సరాల సంది.. బాపణోళ్లే పూజలు జేశేది.. వాళ్లే మంత్రాలు సద్వేదిగదా.? కని కేరళ ప్రభుత్వం దీస్కున్న నిర్ణయంతోని నాల్గువేల ఏండ్ల నాగరికథకు ఫుల్ స్టాప్ బడ్డది.. పెద్దపెద్ద గుడులళ్ల పూజారులుగ ఎవ్వలిని వెట్టిండ్రో తెల్సా..? బీసీ,ఎస్సీలను వెట్టేశిండ్రు..

మొత్తం మీద సింహాన్ని దొర్కవట్టేశ్న..? పిల్లిని వట్కుంటెనే కొంతమంది భయపడ్తరుగదా..? మల్లన్నా ముచ్చట్లకు ఏకంగ సింహాన్నే వట్కొచ్చిన ఎందుకు ఇంత సాహసం అంటే.. మీకోసం మీకు జూపెట్టెతందుకు వట్కొచ్చిన అన్నట్టు.. అన్ని సింహాలు.. కరుస్తయ్ గదా.? ఈ సింహం కనీసం గాండ్రించగూడ గాండ్రించది.. అంత మంచి సింహం సూడుండ్రి మీరుగూడ..

వారెవ్వ పెండ్లంటే గిట్లుండాలే.. గీ నమూన జేయాలే..? విష్ణుమూర్తి, లచ్చిమిది దేవి పెండ్లి జూశిండ్రా... అంటే పౌరాణిక సీన్మలళ్ల జూడొచ్చుగని.. మనం ఒర్జినల్గ సూశింది లేదు.. పశ్చిమగోదావరి జిల్లాకు మొగులు మీదికెళ్లి దేవుండ్లంత దిగొచ్చి.. లచ్చిమి దేవికి విష్ణుమూర్తికి పెండ్లి జేస్తున్నరు.. ఇగ దేవుండ్లను సూడాలె అన్న కాయిసున్నోళ్లు మిస్సుగాకుండ్రి సుర్వు జేస్తున్న..

గో గిది అవినీతి మీద యుద్దం అంటే..? చైనా దేశమోడు ఎంత గొప్పపనిజేశిండో సూడుండ్రి.. ఆడ లంచాలు దీస్కునుడుకు అల్వాటు వడ్డ.. 13 లక్షల మంది ప్రభుత్వ అధికార్లకు శిక్షలు విధించిండ్రట.. మనతాన ఉన్నదా ఇట్ల..? ముఖ్యమంత్రి కాడికెళ్లి వార్డు మెంబర్ దాక.. తెల్లారి మొఖమే అవినీతిల గడ్గుతరు.. టిఫీన్ అవినీతితోనే.. లంచు డిన్నర్ గూడ అవినీతితోనే జేస్తరు.. వాళ్లకు మనకు తేడా గది..

20:00 - October 9, 2017

 

దేశంలో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పుటి నుంచి రవాణా రంగం కుంటుపడిందని, లారీ తిరిగే పరిస్థితి కనబడడం లేదని, వాహానాలు కొనుగోలు చేసినప్పుడు 48 శాతం సెస్ ఉందని, ఫైనాన్స్ తీసుకుంటే 5 శాతం వ్యాట్ విధిస్తున్నారని, సెకండ్ హ్యాండ్ వాహానాలపై కూడా జీఎస్టీ అమలు చేస్తున్నారని లారీ ఓనర్ సంఘం అధ్యక్షుడు కోనేరు రమేష్ అన్నారు. 2011 నుంచి కేంద్ర ప్రభుత్వానికి డీలర్ కమిషన్ పెంచాలని కోరమని, అందుకు కేంద్రం ఓ కమిటీ వేసిందని, ఆ కమిటీ డీలర్లకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని, అయిల్ ఇండస్ట్రీస్ కు కమిషన్ పెంచాలని కేంద్రం సూచిందని, కాని ఇంతవరకు అచరణలోకి రాలేదని పెట్రోల్ యాజమానుల సంఘం అధ్యక్షుడు చుంచు నరసింహరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:46 - October 9, 2017

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ నియంత్రణను బల్దియా మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అనుకున్న వెంటనే ఉత్పత్తి కేంద్రాలపై.. షాపులపై దాడులు చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు హడావిడి చేసి.. తరువాత తమకు పట్టనట్లుగా జీహెచ్‌ఎంసీ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి దానికి ప్లాస్టిక్...
భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ చిన్న వస్తువు కొన్నా.. దానిని తీసుకెళ్లేందుకు కవర్‌ కావాల్సిందే. అది కూరగాయలు, రేషన్‌ సరుకులు, మటన్‌, చికెన్‌లే కాదు, టిఫిన్‌, టీ,కాఫీ లాంటి ద్రవపరార్థాలకూ పాలిథిన్‌ కవర్లను వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు లేకుండా మనుషులు కొన్ని గంటలు కూడా ఉండలేనంతగా వాటి వినియోగం పెరిగింది. అయితే ఇది హైదరాబాద్‌లాంటి నగరాల్లో మరీ ఎక్కువైంది. 2016 సాలీడ్ వేస్ట్‌ రూల్స్‌ ప్రకారం 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న కవర్లు మాత్రమే ఉపయోగించాలి.

రోజుకు 15, 342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి
సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు లెక్కల ప్రకారం.. ప్రతీ రోజు మన దేశంలో 15, 342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో సగం మాత్రమే రీసైకిల్ అవుతోంటే.. మిగిలినదంతా అలానే వదిలేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. అయితే ఏడాదికి ఒక వ్యక్తి పాలిథిన్‌ కవర్ల వినియోగం 8 నుంచి 10 కిలోలు ఉంటుందని.. ఈ ఏడాదికి చివరి నాటికి 12 కేజీలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం పాలిథిన్‌ కవర్లేనని అధికారులంటున్నారు. దాదాపు 2,000 దుకాణాలను తనిఖీలు చేసిన అధికారులు.. 14 లక్షల ఫైన్ విధించారు. 

19:44 - October 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పాలక పక్షం ప్రజాప్రతినిధుల్లో కొందరి ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. కార్పొరేటర్‌ మొదలు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వరకూ.. ఈ జాబితాలో ఉన్నారు. వీరు, దౌర్జన్యమే తమ లక్షణం.. లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ ఫారుక్‌, ఓ ఎన్‌ఆర్ఐ మహిళతో వ్యవహరించిన గూండాగిరీ వెలుగులోకి వచ్చింది.

చెప్పుతో దాడి
నాంపల్లిలోని స్కీల్ స్పెండుల లో ఎన్‌ఆర్‌ఐ అంతులే వాసేకు ఓ ప్లాట్‌ ఉంది. నాలుగేళ్లుగా ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌ అందులో అద్దెకు ఉంటున్నాడు. రెండేళ్లుగా అద్దె చెల్లించక, ఇల్లు ఖాళీ చేయక అంతులేవాసెను ఎమ్మెల్సీ వేధిస్తున్నాడు. ప్లాట్‌ ఖాళీ చేయమని గట్టిగా నిలదీసిన పాపానికి, ఎమ్మెల్సీ ఫారుక్‌ ఆమెపై చెప్పుతో దాడికి యత్నించాడు. తనపై జరిగిన దాడికి సంబంధించిన విడియో ఫుటేజీతో.. అంతుల్‌వాసే.. ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ ఫరూఖ్‌పై IPC 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఫరూఖ్‌హుస్సేన్‌ వెంటనే తన ఫ్లాట్‌ను ఖాళీ చేసేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అంతుల్‌వాసె డిమాండ్‌ చేస్తోంది.

19:43 - October 9, 2017

 

నల్లగొండ : నాగార్జునసాగర్ లో ఎన్ఎస్పీ క్వార్టర్ కోసం గులాబీ తమ్ముళ్లు బాహబాహీకి దిగారు. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కేటాయించిన క్వార్టర్ లో మరో నేత బ్రహ్మరెడ్డి నివాసముంటున్నారు. క్వార్టర్ ను ఖాళీ చేయాలని బ్రహ్మారెడ్డి క్వార్టర్ కు కోటిరెడ్డి అనుచరులు వెళ్లారు. బ్రహ్మారెడ్డి ఖాళీ చేయబోమని ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:28 - October 9, 2017

శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యదేవుడి ఆభరణాలు సురక్షితమేనా..? భక్తుల కానుకలు అన్నీ కలిపినా దేవుడి బంగారం 13 కిలోలేనా..? దేవుడి ఆభరణాలు ఎవరి దగ్గరుండాలి..? సంరక్షణ బాధ్యత ఎవరిది..? ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లిలోని సూర్యదేవుడి ఆలయం.. మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దేవుడి ఆభరణాల లెక్కలే ఈ వార్తలకు మూలమయ్యాయి. దాతలు ఇచ్చిన విరాళాల ఆధారంగా స్వామివారికి 13 కిలోల బంగారం, 425 కేజీల వెండి ఆభరణాలున్నట్లు ఇటీవలే అధికారులు తేల్చారు. వీటిలో కొన్ని ఖజానా విభాగం లాకర్లలో ఉండగా.. కొన్ని అర్చకులు, అధికారుల ఆధీనంలో ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రకటనే సూర్యదేవుడి భక్తుల్లో అనంత అనుమానాలను రేకెత్తిస్తోంది.

ప్రతి సంవత్సరమూ సమీక్ష జరగాలి...
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆభరణాల లెక్కలు సరైనవేనా అన్నది భక్తుల సందేహం. స్వామివారి విలువైన ఆభరణాలు, వస్తువులు, వాటి భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రతి సంవత్సరమూ సమీక్ష జరగాలి.ఈ భేటీకి అవసరమైన వివరాలను.. దేవాదాయ శాఖ అధికారులు తనిఖీ చేసి నిర్ధరించాలి. ఆమేరకు ప్రతి సంవత్సరం ఆడిట్‌ నివేదిక సిద్ధం కావాలి. అయితే అరసవెల్లి సూర్యదేవుడి ఆలయంలో.. 2009 నుంచి ఇప్పటివరకూ ఆభరణాల లెక్కింపు జరగలేదు. అంటే, 2009 నుంచి భక్తులు ఇచ్చిన ఆభరణాలన్నింటినీ ఈ జాబితాలోకి చేర్చారా..? లేక కొన్నింటిని నొక్కేశారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి అనుమానానికి ఆధారం లేకపోలేదు. మొన్నీమధ్య, కృష్ణాజిల్లా, మచిలీపట్నం రుస్తుంబాద్‌లోని భద్రాద్రి రామాలయంలో.. వంశపారంపర్య ధర్మకర్త తన ఆధీనంలో ఉన్న బంగారు ఆభరణాలను తాక్టటు పెట్టిన ఉదంతం వెలుగు చూసింది. అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆభరణాల విషయంలోనూ ఇదే తరహా జరిగి ఉండదన్న నమ్మకం ఏంటి అన్నది భక్తుల ప్రశ్న.

ట్రెజరీలో ఉన్న వాటిని మాత్రమే లెక్కించారు...
2013లో ఒకసారి తనిఖీలు చేసినప్పటికీ ట్రెజరీలో ఉన్న వాటిని మాత్రమే లెక్కించారు. దేవాలయంలో నిత్యపూజలకు సంబందించి అర్చకుల ఆధీనంలో ఉండే బంగారు, వెండి ఆభరణాల జోలికి విచారణ, తనిఖీ అధికారులు వెళ్లలేదన్న విమర్శలున్నాయి. ఆలయ ఆస్తులు, ఆభరణాలు, విరాళాలపై పారదర్శక సమీక్ష నిర్వహించి.. తాజా నివేదిక తయారు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి బలంగా వ్యక్తమవుతోన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉంది. 

19:26 - October 9, 2017

గుంటూరు : జిల్లాలో హెల్మెట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హెల్మెట్‌ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ శశిధర్‌, ఎస్పీ విజయరావులు హెల్మెట్‌ ధరించి నగరంలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులకు ఈ నిబంధన తప్పనిసరి చేస్తామని, హెల్మెట్‌ లేకపోతే ఒకరోజు విధులకు గైర్హాజరైనట్లు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:24 - October 9, 2017

 

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ను సీడ్ బౌల్‌ కేంద్రంగా మారుస్తామన్నారు ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచలో మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. అలాగే మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా మెగాసీడ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకే రుణమాఫీ హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. కొందరు రుణమాఫీలో లబ్ధి పొంది తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో విడత కింద 36 లక్షల 72వేల మంది రైతులకు 3వేల 600 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఖాతాలు సరిగా లేకుంటే రైతు సాధికార సంస్థకు ఫోన్‌ చేయాలని సూచించారు. నంద్యాల ప్రాంతం విత్తన ఉత్పత్తికి ఎంతో అనువైన ప్రాంతమని, అక్కడ 100 కంపెనీలు తీసుకురావాలని యోచిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. 

19:23 - October 9, 2017

ఢిల్లీ : తమ కార్యకర్తలపై బీజేపీ చేస్తున్న దాడులను నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో సీపీఎం ప్రజా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి నిప్పులు చెరిగారు. కేరళలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే హింసను రగిలిస్తూ.. తిరిగి వామపక్ష ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని...'ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే' అన్నట్టుగా బీజీపీ నేతల తీరు ఉందన్నారు ఏచూరి మండిపడ్డారు. వాస్తవానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాడులతోనే వందల సంఖ్యలో కామ్రేడ్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఏచూరి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ 191 మంది సిపిఎం కార్యకర్తలను హత్య చేసిందని ఆరోపించారు. 2016-2017లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం సిపిఎం కార్యకర్తలు 85 మంది హత్యకు గురైతే... ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు 65 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న కుట్రతోనే బీజేపీ దుష్ప్రచారాన్ని చేస్తోందని దాన్ని దీటుగా ఎదుర్కొంటామని సీతారాం ఏచూరి తేల్చి చెప్పారు.

మతతత్వ రాజకీయాలను రెచ్చగెడుతూ
ఆర్‌ఎస్‌ఎస్‌ గత 50 ఏళ్లుగా కేరళలో మతతత్వ రాజకీయాలను రెచ్చగెడుతూ వస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌కరత్‌ అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో హిందుత్వ వాదాన్ని బలవంతంగా రుద్దుతూ రైతులు, కార్మికులు, మైనారిటీలకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కేరళలో బలమైన వామపక్ష ప్రభుత్వం ఉన్నందున వారి పప్పులు ఉడకడం లేదని కరత్‌ అన్నారు. బిజెపి యాత్రకు కేరళ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, బిజెపి వామపక్షాలపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ప్రజాక్షేత్రం లోనే తేల్చుకుంటామన్నారు.

నరేంద్రమోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షాలు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు
ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షాలు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్‌లో నిర్దోషులను పొట్టనబెట్టుకున్నారని...గోరక్ష, లవ్‌ జిహాద్‌ల పేరిట దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా దళితులు, కమ్యూనిస్ట్‌లపై దాడులకు పాల్పడుతున్న బీజేపీ కుయుక్తులను తిప్పికొడతామన్నారు. బిజెపి వ్యతిరేక ర్యాలీలో CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌, ప్రకాశ్‌ కరత్‌, బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. 

19:21 - October 9, 2017

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో భూగర్భ విద్యుత్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:19 - October 9, 2017

హైదరాబాద్ : నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్మూర్‌ సభలో మాట ఇచ్చి... దాని నెరవేర్చినందుకు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను... ఎంపీ కవిత కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ హబ్‌లో 50కిపైగా కంపెనీలు రానున్నాయని ఆమె తెలిపారు. కలెక్టరేట్‌ సమీపంలో స్థలం కేటాయించి... అమ్మాయిలు నిర్భయంగా పని చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

19:17 - October 9, 2017

హైదరాబాద్ : నగర్ మేయర్ ఉప్పల్ లో పర్యటించారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:15 - October 9, 2017

హైదరాబాద్ : ప్రొ కంచె ఐలయ్య రాష్ట్ర డీజీపీ అనురాగు శర్మను కలిశారు. తన భద్రత కల్పించాలని డీజీపీ కోరినట్టు దానికి డీజీపీ సానుకూలంగా స్పందిచాని ఐలయ్య తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అమలాపురంలో దారుణం

తూర్పుగోదావరి : జిల్లా అమలాపురంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి ఓ మహిళపై కొంత మంది ఒత్తిడికి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

ఏపీకి అవమానం

కృష్ణా : గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ ఏపీని అవమానించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన అమరావతి శిల్పాలను అధికారులు తొలగించారు. 

వామపక్ష నేతల అరెస్ట్

శ్రీకాకుళం : రేపు హిరమండలంలోని వంశధార నిర్వాసిత గ్రామాల్లో అఖిలపక్షం పర్యటన ముందస్తుగా 10 మంది వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. వారిని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

భైంసా వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత

నిర్మల్ : జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మినుములు కొనుగోలు చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డు అధికారులపై తిరగపడ్డారు.

18:22 - October 9, 2017

నిర్మల్ : జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మినుములు కొనుగోలు చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డు అధికారులపై తిరగపడ్డారు. మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

రఘు కేసులో ఏసీబీ కీలక సమాచారం సేకరణ

విశాఖ: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు కేసులో ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. 3 రోజుల విచారణలో రఘు భారీ అక్రమాలు బయటపడ్డాయి.

ఏపీ ని అవమానించింన గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ

అమరావతి: గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏపీ ని అవమానించింది. గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసి అమరావతి శిల్పాలను అధికారులు తొలగించారు. సీఎం ఆదేశాల మేరకు ఆంధ్రుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమరావతి శిల్పాలు ఏర్పాటు చేశారు.

రైల్వే జీఎం ను కలిసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు

సికింద్రాబాద్: తెలంగాణ మంత్రులు కడియం, ఎంపీలు సీతారామ్ నాయక్, పసునూరి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్ రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను కలిశారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో రైల్వే సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

10 నుంచి మంత్రి నారాయణ లండన్ పర్యటన...

అమరావతి: ఈ నెల 10 నుంచి 13 వరకు మంత్రి నారాయణ లండన్ పర్యటనకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల డిజైన్లపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ కానున్నారు.

టివి ఛానళ్లలో నాపై వస్తున్న వార్తలు అబ్ధం: ఎమ్మెల్సీ ఫారూక్

హైదరాబాద్: టివి ఛానళ్లలో నాపై వస్తున్న వార్తలు అబ్ధం ఎమ్మెల్సీ ఫారూక్ అన్నారు. ఇల్లు ఖాళీ చేయడం లేదని యూసఫ్ అనే వ్యక్తితో వచ్చిన మహిళ నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఆరేళ్ల క్రితం మహ్మద్ సమద్ అనే వ్యక్తితో నెలకు రూ.11,500 అద్దె ఒప్పందం కుదుర్చుకున్నాని, నెల పూర్తికాకముందే అద్దె చెల్లిస్తున్నాని పేర్కొన్నారు. నా ఇంటికి వచ్చిన ఆమె ఎవరో నాకు తెలియదన్నారు. వీడియోలో ఉన్నది నేనే కానీ ఆ మాటలు నావి కాదన్నారు. ఈ వివాదాన్ని న్యాయపరంగా పరిష్కరించకుంటానని ఫారుక్ తెలిపారు. ఇందులో ఏదో కుట్ర ఉందని పేర్కొన్నారు.

సింగరేణిలో 2718 మంది బదిలీ వర్కర్లకు రెగ్యులరైజేషన్

హైదరాబాద్: సింగరేణిలో 2718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులర్ చేస్తూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

3వ విడత రుణ విముక్తి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుదే :సోమిరెడ్డి

కర్నూలు: రూ. 3600 కోట్ల నిధులతో 14 లక్షల మంది రైతులకు 3వ విడత రుణ విముక్తి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుదేనని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణ రూ.లక్ష రుణమాపీ చేస్తే అప్పుల్లో ఉన్న ఏపీ రూ.లక్షన్నర రుణమాఫీ చేసిందని తెలిపారు. మైక్రో ఇరిగేషన్, ఇరిగేషన్ వంటి పద్ధతులతో వ్యవసాయరంగం ముందంజలో నడుస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పల్లె ప్రాంతంలో పెట్టడం గర్వకారణమన్నారు. అంతర్జాతీయ సీడ్ హడ్ గా తంగడంచ మారబోతుందని తెలిపారు.

17:25 - October 9, 2017

 

స్పోర్ట్స్ : ఎప్పుడు చెత్త రికార్డులో ముందుండే పాక్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. అది ఎంటో తెలిస్తే అందరు అవాక్కు అవుతారు. ఓ వైపు వరుస వైఫల్యాలు...మరోవైపు ఆర్థిక కష్టాలతో పాకిస్థాన్ జట్టు కుదేలవుతుంటే ఆ జట్టు దుబాయిలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తోంది. ఇది ఇలాఉంటే శ్రీలంకతో జరగుతున్న రెండవ టెస్ట్ లో పాక్ బౌలర్ వాహెబ్ రియాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వెసుకున్నాడు. ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించి చరిత్ర కెక్కాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ శనివారం ఆటలో రియాజ్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ 111వ ఓవర్ నాలుగో బంతని వేసేందుకు రియాజ్ ఐదుసార్లు యత్నించాడు. బౌలిగ్ చేయడానికి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క సారిగా ఆగిపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఐదునిమిషాలపాటు ప్రయత్నించిన బంతిని వేయలేకపోయాడు. అవతల ఉన్న బ్యాట్స్ మెన్ కరుణరత్నేతో పాటు పాక్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ సర్ఫాజ్ అహ్మద్, అంపైర్ కూడా విసుగు చెందారు.

 

అదే సమయంలో కోచ్ మైక్ మిక్కీ అర్థర్ హవాభావాలను చూడాలి. చివరకు చిర్రెత్తుకొచ్చిన ఆయన మరో ఆటగాడితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటి సారి అని స్పోర్ట్స్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ వీడియోతో ''వాహెబ్ రియాజ్ బౌలింగ్ బరిచిపోయాడేమో'' అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.

సీడ్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం: కేఈ

కర్నూలు : ఐఓవా విశ్వవిద్యాలయం అనుసంధానంతో సీడ్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. జిల్లా నాణ్యమైన విత్తనోత్పత్తికి అనువైందన్నారు. నాణ్యమైన విత్తనాలు అతి తక్కువ ధరకు ఇవ్వడమే లక్ష్యం అని, విదేశీ టెక్నాలజీతో రైతులు అధిక దిగుబడి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

18 నుండి సీఎం చంద్రబాబు విదేశాల పర్యటన :పరకాల

అమరావతి: ఈనెల 18 నుంచి 26 వరకు 3 దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని పరకాల ప్రభాకర్ తెలిపారు. అమెరికా, యూఏఈ, ఇంగ్లడ్ లో సీఎం పర్యటిస్తారని, పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని పరిపాలన నగరం, ఆకృతల ఖరారు లక్ష్యంగా సీఎం పర్యటన ఉంటుదని పేర్కొన్నారు.

సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బదిలీ

హైదరాబాద్: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న సిన్హాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రసన్న సిన్హా స్థానంలో మంత శ్రీనివాస్ ను నియమించారు. ప్రసన్న సిన్హా వేధిస్తున్నారని సీఎ కేసీఆర్ కు కార్మికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

16:41 - October 9, 2017
16:40 - October 9, 2017

సినిమా : బుల్లితెర, వెండితెర నటి కమ్ యాంకర్ మల్లిక కన్నుమూశారు. మల్లిక ప్రస్తుత వయస్సు 39 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితం టివి వ్యాఖ్యతగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడులో ఆమె కృష్ణకు భార్యగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రలోనుఊ కనిపంచారు. ఎక్కువగా టివి సిరియల్స్ నటించి ఇంటింటికి దగ్గరయ్యారు ఆమె. మల్లిక ప్రముఖ యాంకర్ సుమకు స్నేహితురాలు ఆమె సమకాలీకురాలు.

ప్రస్తుతం ఆమె భర్త విజయ్ బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవలే ఆమె భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడకి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. 20 రోజులుగా కోమాలో ఉన్న మల్లిక సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈమె అసలు పేరు అభినవ. యాంకర్ గా టివి రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు.

16:22 - October 9, 2017

కరీంనగర్/సిరిసిల్ల : నేరెళ్ల ఘటనలో ఎస్పై రవీందర్ పై తంగాళ్లపల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. నేరెళ్ల ఇసుక లారీల దహనం తరువాత అకారణంగా తమను అదుపులోకి తీసుకొని కొట్టారని బాధితుడు గణేష్ ఫిర్యాదు చేశారు. ఎస్సైపై ఐపీసీ సెక్షన్ 324 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నేరెళ్ల ఘటనలో ఇప్పటికే ఎస్సై రవీందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మెగాసీడ్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం

కర్నూలు : తంగడంచ కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కాసేపట్లో మెగాసీడ్ పార్క్ కు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

రక్షణ కల్పించాని కోరుతూ డీజీపీకి ఐలయ్య వినతిపత్రం

హైదరాబాద్: తనకు రక్షణ కల్పించాలని డీజీపీ కి ప్రొ. కంచ ఐలయ్య వినతిపత్రం సమర్పించారు. ఆర్యవైశ్యులతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాని డీజీపీని ఐలయ్య కోరారు.

16:04 - October 9, 2017
15:55 - October 9, 2017

రోజురోజుకి చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. 98 శాతం తెలిసిన వాళ్లే ఈ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు సర్వేలే చెబుతున్నాయి. లైగింక వేధింపులు జరగడానకి కారణలు ఏమిటి..? ఈ అంశం గురించి మానవి వేదికలో చర్చించనున్నారు. ఈ చర్చకు ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మీనారాయణ గారు, సామాజిక విశ్లేషుకులు సజీవర్మ గారు వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:48 - October 9, 2017

సినిమా : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పద్మావతి ట్రైలర్‌ వచ్చేసింది. ట్రైలర్‌ మొత్తంలో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ క్రూరత్వాన్ని, మహారావల్‌ రతన్‌ సింగ్‌, రాణి పద్మావతి అనుబంధాన్ని, ఖిల్జీ-రతన్‌ సింగ్‌ల మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌, మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, పద్మావతి పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్నారు. రాజ్‌పుత్‌ల ఖడ్గంలో ఎంత శక్తి ఉంటుందో వారి కంకణంలోనూ అంతే శక్తి ఉంటుందని దీపిక...రాజ్‌పుత్‌ల గురించి గొప్పగా చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 

15:47 - October 9, 2017

పశ్చిమగోదావరి : తమకు కనీస వేతనం 6 వేల రూపాయలు ఇవ్వాలంటూ ఏలూరులో ఆశావర్కర్లు ఆందోళనబాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము చేస్తున్న పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియో చూడండి.

నిజామాబాద్ కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ. 100 కోట్లు..

హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున, నిజామాబాద్ కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ. 100 కోట్ల చొప్పున మొత్తం రూ. 350 కోట్లు మంజూరయ్యాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత తెలిపారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌లో ఐటీ టవర్స్ కోసం రూ. 50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కృషితో 60 ఐటీ కంపెనీలు నిజామాబాద్ ఐటీ హబ్‌లో ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. ఐటీ ఇంక్యూబేటర్‌ను నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ విషయంలో ఉత్తర తెలంగాణకు నిజామాబాద్ మంచి కూడలిగా తయారు కాబోతుందన్నారు.

15:47 - October 9, 2017

కడప : వర్షాలు సమృద్దిగా కురవడంతో రాయలసీమలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సారి కురిసిన వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. 

15:46 - October 9, 2017

అనంతపురం : అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. బోర్లలోకి నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడు సంవత్సరాలుగా నిండని చెరువులు ఇప్పుడు నిండుకుండలను తలపిస్తున్నాయి. పుట్టపర్తిలో సాహెబ్‌ చెరువు నిండి చిత్రావతి నదిలోకి ఉదృతంగా నీరు వస్తుండటంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అయితే పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. 

ఆదర్శ గ్రామాల పనులపై కలెక్టర్లు ప్రత్యేక సమీక్ష: సీఎస్ ఎస్పీ సింగ్

హైదరాబాద్: ఎంపీలు ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాల పనులపై కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించారని టీఎస్ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను, సంబంధిత శాఖల అధికారులకు ఇవ్వాలని సీఎప్ ఎస్పీ సింగ్ తెలిపారు. తొలిదశలో ఎంపికైన 22 గ్రామాల్లో 1094 ప్రాజెక్టులు, వాటిలో 431 ప్రాజెక్టుల పూర్తి, పురోగతిలో 216 ప్రాజెక్టులు,447 ప్రాజెక్టులు ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన 2,3 వ విడత గ్రామాల ఎంపికపై ఎంపీలకు లేఖలు రాయాలని ఎస్పీ సింగ్ పేర్కొన్నారు.

ఎస్సై రవీందర్ పై తంగెళ్ల పల్లి పీఎస్ లో కేసు

రాజన్న సిరిసిల్ల: నేరెళ్ల ఘటనలో సస్పెన్ కు గురైన సీసీఎస్ ఎస్సై రవీందర్ పై తంగెళ్ల పల్లి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. బాధితుడు గణేష్ ఫిర్యాదు మేరకు 324, 34 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

ప్రముఖ యాంకర్ మల్లిక మృతి

హైదరాబాద్: ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇవాళ ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. రేపు మల్లిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతితో బుల్లితెర శోకసంద్రంలో మునిగిపోయింది.

దొంగ నుండి అరకిలో బంగారం స్వాధీనం...

యాదాద్రి భువనగిరి : పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ యాదగిరి మీడియాతో మాట్లాడారు. దొంగ నుంచి అర కిలో బంగారం, 2 కేజీల వెండి, రూ. 4 వేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట బస్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండగా దొంగను పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగను వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను విచారిస్తున్నారు.

15:08 - October 9, 2017

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన ఓ ఆర్టీసీ కండక్టర్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. కేసీఆర్ పై ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన కండక్టర్ సంజీవ్ పై ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సంజీవ్ ప్రస్తుతం నిజామాబాద్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:01 - October 9, 2017

హిమచల్ ప్రదేశ్ : ఆర్మీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోలోని తవాంగ్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ప్రమాదంలో నిన్న 7గురు సైనికులు మృతి చెందారు. అయితే వారి మృతదేహాల తరలింపు ఇపుడు వివాదాస్పదంగా మారింది. సైనికుల మృత దేహాలు ప్లాస్టికవర్లలో మూటలుగా కట్టేసి తరలించారు. దీనిపై మాజీ సైనికులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల పట్ల కనీసం మర్యాద పాటించరా అని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు.. సైనికుల మృతదేహాలు తరలించడానికి ఇక నుంచి పెట్టెలు వాడాలని నిర్ణయించామన్నారు. 

14:57 - October 9, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు దీపావళి పండగను నిశ్శబ్దంగా, కాలుష్యరహితంగా జరుపుకోనున్నారు. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధించమే ఇందుకు కారణం. పటాకుల కారణంగా వెలువడే కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్‌1 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో బాణసంచా భారీగా ఉపయోగిస్తుండడంతో గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ ప్రాంతాల్లో కోర్టు నిషేధం విధించింది. పటాకుల అమ్మకాలపై ఈ ఏడాది సెప్టెంబర్‌ 12న షరతులతో కూడిన సడలింపునిచ్చింది. తాజాగా ఈ నిషేధాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో బ్యాన్‌ను తిరిగి పునరుద్ధరించింది. బాణసంచాను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసింది.

14:56 - October 9, 2017

నిజామాబాద్/ కరీంనగర్ : జిల్లాలో పొట్టకూటికోసం ఉపాధి వెదుక్కుంటూ విదేశాలబాట పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఏజెంట్లు అడ్డంగా దోచుకుంటున్నారు. మలేషియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల పాస్‌పోర్టులను ఏజెంట్లు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.నిజామాబాద్‌, కరీంనగర్‌ , ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన దాదాపు రెండువేల మంది ఉపాధి కోసమంటూ మలేషియాకు వెళ్లారు. వీరంతా ఏజెంట్ల ద్వారా వెళ్లారు. అయితే వీరికి వర్క్‌ వీసాలు ఇస్తామని నమ్మించిన ఏజెంట్లు .... ఒక్కొక్కరి నుంచి లక్షన్నర చొప్పున వసూలు చేశారు. ఆ తర్వాత వర్క్‌వీసాలకు బదులు విజిట్‌ వీసాలు చేతిలోపెట్టి నట్టేట ముంచారు. ఎయిర్‌పోర్టు నుంచి వారు బయటకు రాగానే పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వర్క్‌ వీసా కోసమంటూ వారిని బురిడీ కొట్టించారు.

ముందు జాగ్రత్తగా పాస్‌పోర్టు జీరాక్స్‌ లు
కొంతమంది కార్మికులు మాత్రం ముందు జాగ్రత్తగా పాస్‌పోర్టు జీరాక్స్‌లను తమ దగ్గర ఉంచుకున్నారు. వాటి ఆధారంగానే మలేషియాలో సెల్‌ సిమ్‌ కార్డులను పొందారు. చెన్నైలోని ఏజెంట్‌కు ఫోన్‌ చేస్తే మరో 30వేలు చెల్లిస్తే పాస్‌పోర్టు ఇప్పిస్తామంటున్నారని కార్మికులు బోరుమన్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తాము మళ్లీ అంత డబ్బు ఎలా చెల్లించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పాస్‌పోర్టు లేకపోవడంతో దొరికిన పనిని దొంగచాటుగా చేస్తూ కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. మలేషియా పోలీసులకు చిక్కకుండా ఎక్కడో ఓచోట తలదాచుకుంటున్నారు. అయితే మలేషియా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను పట్టుకుని జైళ్లో పెడుతున్నారు. జరిమానా చెల్లించిన వారికి ఔట్‌పాస్‌ పోర్టును ఇప్పించి పంపిస్తున్నారు. జరిమానాతోపాటు విమాన టికెట్‌కు అయ్యే ఖర్చులనూ కార్మికులే సొంతంగా భరిస్తున్నారు. పని డబ్బులు ఇంటికి పంపుతాడని ఆశించిన కార్మికులు కుటుంబ సభ్యులు రివర్స్‌గా వారికే సొమ్ములు పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్క్‌వీసాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబాలు కోరుతున్నాయి. ప్రభుత్వం ఎలాగైనా తమవారిని ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

14:55 - October 9, 2017

ప్రకాశం : ప్రముఖ తెలుగు సినీ రచయిత హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రిలో మరణించారు. 150 పైగా సినిమాలకు డైలాగ్‌లు రాశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు ఆయన రాసిన సంభాషణలకు గాను నంది అవార్డులు పొందారు. ప్రముఖ డైరెక్టర్‌ టీ కృష్ణ ద్వారా సినీ పరిశ్రమకు పరిచమైన హరనాథరావు... స్వయంకృషి, సూత్రధారులు, ప్రతిఘటన సినిమాల కథలతోపాటు సంభాషణలు రాశారు. రాక్షసుడు, స్వయంకృషి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గుంటూరులో చదివిన హరనాథరావు, చిన్నతనంలోనే నాటకాల్లో బాల నటుడి పాత్రలు పోషించారు. 

మంత్రి కేటీఆర్ తో ఎంపి కవిత భేటీ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తో ఎంపి కవిత భేటీ అయ్యారు.నిజామాబాద్ లో చేపట్టనున్న ఐటీ హబ్ లపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

14:53 - October 9, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా దళితులు, కమ్యూనిస్ట్‌లపై దాడులకు పాల్పడుతున్న బీజేపీ కుయుక్తులను తిప్పికొడతామన్నారు.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌. అబద్దాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన నిజం మరుగున పడదన్నారు. కేరళలో హింసను రెచ్చగొట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయిని బృందాకరత్‌ విమర్శించారు. 

ప్రస్తుతం మూడో పారిశ్రామిక విప్లవం:సీఎంచంద్రబాబు

విశాఖ: ప్రస్తుతం మూడో పారిశ్రామిక విప్లవం అని సీఎం చంద్రబాబు అన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం కోసం ఎదురుచూపు అని, టెక్నాలజీ రంగంలో సెక్యూరిటీ, సేప్టీ, ట్రస్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే సాధ్యమవుతోందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సైబర్ నేరాలను ఛేదించవచ్చు అని చంద్రబాబు సూచించారు. ఏపీ ఇండియన్ పింటెక్ ఛాలెంజ్ అవార్డును ఇవ్వబోతున్నామని, మరో 16 ఐటీ గ్లోబల్ కంపెనీలు త్వరలో వైజాగ్ కు రానున్నాయన్నారు. నా కృషి వల్లే నేడు హైదరాబాద్ సైబర్ హబ్ గా మారిందని చంద్రబాబు తెలిపారు.

కేసీఆర్ పై వ్యాఖ్యలు..కండక్టర్ పై విచారణ..

హైదరాబాద్ : వాట్సప్, ఫేస్ బుక్ లో సీఎం కేసీఆర్ ను ఉద్ధేశించి పెట్టిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తమౌతోంది. కామెంట్స్ పెట్టిన నిజామాబాద్ కండక్టర్ సంజీవ్ పై విజిలెన్స్ విచారణకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. 

11న కేసీఆర్ జిల్లాల పర్యటన..

హైదరాబాద్ : ఈనెల 11 నుండి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన ఉంటుందని, ఒకే రోజున సిద్ధిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. నిర్మల్ లో కలెక్టరేట్ భనవ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 13న సూర్యాపేటలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 13న నారాయణ ఖేడ్..20న వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 

14:12 - October 9, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫరూక్ పై నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు నమోదయింది. ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లిచడంలేదని ఎన్‌ఆర్‌ఐ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దె ఇవ్వాలని అడిగినందుకే తనపై చెప్పుతో దాడి చేశారని నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

మతోన్మాదం..దౌర్జన్యం తిప్పికొడుతాం - మధు..

విజయవాడ : బీజేపీ మతోన్మాదం..దౌర్జన్యం నిరంకుశత్వాన్ని తిప్పికొడుతామని సీపీఎం నేత మధు హెచ్చరించారు. కమ్యూనిస్టులపై బీజేపీది కక్ష సాధింపు చర్య అని, బీజేపీ బెదిరింపు చర్యలను సహించేది లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు మరో పార్టీ ప్రద్శనలు చేపట్టిన సంఘటనలు గతంలో లేవన్నారు. 

14:09 - October 9, 2017

కృష్ణా : సీపీఎం కార్యాలయాలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం భారీ మహా ప్రదర్శన నిర్వహించింది. విజయవాడ పాత బస్తాండ్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకూ మహా ప్రదర్శన సాగింది. బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మహా ప్రదర్శనకు నాయకత్వం వహించారు. బీజేపీ మతతత్వ విధానాలకు స్వస్తి చెప్పాలని మధు డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యాలయాలపై దాడులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గడ్కరికి హరీష్ లేఖ..

హైదరాబాద్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. బోర్డు సమర్థవంతంగా పనిచేయకపోగా పక్షపాత ధోరణి అవలింబిస్తోందని, ఏపీకి బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తోందని లేఖలో వెల్లడించారు. భవిష్యత్ ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని, పోతి రెడ్డి వద్ద వివరాలు తారుమారు చేస్తున్నారని పేర్కొన్నారు. 

14:05 - October 9, 2017

చిత్తూరు : మూఢనమ్మకాలే వారికి పెట్టుబడి. గుప్త నిధుల తవ్వకాల కోసం ఎంతటి దారుణానికైనా  వెనుకాడరు. భూమిలో బంగారం ఉందన్న  మూఢ నమ్మకంతో  ఓ వ్యక్తిని బలి ఇచ్చేందుకు క్షుద్రమాంత్రికులు చేసిన ప్రయత్నం... చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రామకుప్పం మండలం రామాపురం తండాలో వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో... ఆగ్రహానికి గురైన క్షుద్రమాంత్రికులు బాధితుడి ఇంటిని దహనం చేశారు.  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు మురుగా నాయక్‌. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాకు చెందిన ఇతను వ్యవసాయం, పశుపోషణతో బతుకు వెళ్లదీస్తున్నాడు. రామాపురం అడవుల్లో బంగారం గుప్త నిధులు ఉన్నాయన్న మూఢ నమ్మకంతో కొందరు క్షుద్రమాంత్రికులు కొంత కాలంగా పూజలు చేస్తున్నారు. నరబలి ఇస్తే  గుప్త నిధులు దొరుకుతాయని నమ్మిన క్షుద్రమాంత్రికుల దృష్టి మురుగా నాయక్‌పై పడింది. 
 
రోజూ ఉదయం పశువులను మేతకు అడవుకి తోలుకెళ్లేవాడు మురుగా నాయక్‌. ఇది గమనించిన క్షుద్రమాంత్రికులు అతన్ని పట్టుకుని విషప్రయోగం చేశారు. అడవిలోకి వెళ్లిన మురుగానాయక్‌ రాత్రి పది గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అడవుల్లో వెతకడం ప్రారంభించారు. రామాపురం తండాకు అరకిలోమీటరు దూరంలోని అడవుల్లో దివిటీల వెళుతురు కనిపించింది. ఒక చెట్టుకింది పెద్ద గొయ్యి తవ్వి క్షుద్రపూజలు చేస్తున్న మాంత్రికులను గమనించిన మురుగానాయక్‌ కుటుంబ సభ్యులు... భయాందోళనతో గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలిసి క్షుద్రపూజలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. గుప్త నిధుల కోసం తవ్విన గోతిలో మురుగానాయక్‌ను కూర్చోబెట్టి, పసువు, కుంకుమ వేసి, నిమ్మకాయలు కోసి  పూజలు చేస్తుండడాన్ని గమనించి, బిగ్గరగా కేకలు వేశారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న క్షుద్రమాంత్రికులతోపాటు, వీరి వెంటున్న మరికొందరు పరాయయ్యారు. అచేతనావస్థలో ఉన్న మురుగానాయక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. నరబలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో తాము  క్షుద్రపూజలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లడంతో తమ కుమారుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడని బాధితుడి తండ్రి గోపాల్‌ నాయక్‌ చెప్పాడు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలో ఉన్న పాముల పుట్టకు కూడా క్షుద్రమాంత్రికులు పూజలు చేశారు. నరబలి ముందు  నాగదేవతకు పూజలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవన్న ఉద్దేశంలో ఇలా చేసి ఉంటారని బాధితుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. క్షుద్రమాంత్రికుల నరబలి వ్యవహారంలో మరో ట్విస్టు కూడా ఉంది. ఒక కుంటుంబలో  మొదటి పుట్టిన వ్యక్తిని నరబలి ఇస్తేనే గుప్త నిధులు  దొరుకుతాయన్న మూఢనమ్మకంతో గోపాల్‌నాయక్‌ పెద్ద కుమారుడు మురుగానాయక్‌ను క్షుద్రమాంత్రికులు ఎంచుకున్నారని చెబుతున్నారు. క్షుద్రపూజలు, నరబలి యత్నంతో భయపడ్డ గోపాల్‌నాయక్‌ కుటుంబం రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న క్షుద్రమాంత్రికుల ముఠా రాత్రికి రాత్రే మురుగానాయక్‌ ఇంటికి నిప్పుపెట్టి దహనం చేశారు. 

క్షుద్రపూజలతో అచేతనావస్థలో ఉన్న  మురుగానాయక్‌ను కుటుంబ సభ్యులు కుప్పం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న రాములునాయక్‌ శరీంలో ఎలాంటి కదలికలు లేకపోవడం డాక్టర్లకు కూడా అంతుచిక్కడంలేదు. ఆస్పత్రిలో చేర్చినా ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రామకుప్పం పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజలు  చేసిన ముఠా కోసం గాలిస్తున్నారు. 


 

14:03 - October 9, 2017

నెల్లూరు : సింహపురి వర్సిటీలో బిల్డింగ్‌పైకి ఎక్కిన విద్యార్థి గంగిరెడ్డి హల్‌చల్‌ చేస్తున్నాడు. తనకు వర్సిటీలో చదువుకునే అవకాశం కల్పించకుంటే కిందికి దూకేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు.  దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందోనని మిగతా విద్యార్థులు అంతా ఆందోళన పడుతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణానికి విద్యార్థి సంఘాలు చేరుకుంటున్నాయి. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

14:02 - October 9, 2017

హైదరాబాద్ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తానికి ఆదర్శ పరిపాలనందిస్తోన్న కేరళకు వెళ్లి.. ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. మొదటిసారిగా దేవాలయాల్లో మిగతా కులాల వాళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించి.. వాళ్లను పూజారులుగా చేసిన ప్రభుత్వం సీపీఎందని అన్నారు. నిజంగా బీజేపీ నాయకులు తాము గొప్పవాళ్లమనుకుంటే సీపీఎం తీసుకొస్తోన్న సంస్కరణల కంటే.. గొప్ప సంస్కరణలు తీసుకురండని సలహా ఇచ్చారు. ఏ బీజేపీ సంస్థకైనా కుల వ్యవస్థకు తాము వ్యతిరేకమని ప్రకటించే దమ్ముందా అని సవాల్‌ విసిరారు.
 

 

13:54 - October 9, 2017

ఢిల్లీ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి నిప్పులు చెరిగారు. కేరళలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే హింసను రగిలిస్తూ.. తిరిగి వామపక్ష ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఉల్టార్‌చోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుగా బీజీపీ నేతల తీరుఉందన్నారు ఏచూరి. వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న కుట్రతోనే బీజేపీ దుష్ప్రచారాన్ని చేస్తోందని.. వాస్తవానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దాడులతోనే వందల సంఖ్యలో కామ్రేడ్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఏచూరి అన్నారు. లెఫ్ట్‌పార్టీ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తే సమర్థంగా ఎదుర్కొంటామని సీతారాం ఏచూరి తేల్చి చెప్పారు. 

 

13:51 - October 9, 2017

ఢిల్లీ : సీపీఎం నాయకులు, కార్యకర్తలపై బీజేపీ చేస్తున్న దాడులను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఢిల్లీలో సీపీఎం ప్రజా ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌, ప్రకాశ్‌ కరత్‌, బీవీ రాఘవులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  ఢిల్లీ సీపీఎం కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జై భారత్ మారుతీ గ్రూప్ పై ఐటీ దాడులు..

ఢిల్లీ : జై భారత్ మారుతీ గ్రూప్ పై ఐటీ దాడులు నిర్వహించింది. రూ. 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఉగ్రవాది హతం..?

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. లడోదర ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. 

బీపీసీఎల్ లో గ్యాస్ లీక్..

ముంబై : మహూల్ ప్రాంతంలో ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లి. లో గ్యాస్ లీకేజ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని..పరిస్థితి అదులో ఉందని సమాచారం. 

13:27 - October 9, 2017

మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు సంస్థలు..దుకాణ యజమానులు ఎన్నో దారులు తొక్కుతుంటారు. ఆఫర్స్ ప్రకటించేస్తుంటారు. పండుగ సమయంలో ఈ ఆఫర్స్ మరింత ప్రకటించేస్తారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ కస్టమర్స్ ను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని చూసిన కస్టమర్స్ లలో కొందరు ఆయా దుకాణాల వైపు పరుగెడుతుంటారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఓ దుకాణ యజమాని ఇలాగే ఆఫర్ ప్రకటించాడు. కానీ కొద్ది గంటల్లోనే దానిని వెనక్కి తీసుకున్నాడు.

తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లా ఇల్యంగుడి హోరో మోటోకార్స్ డీలర్ గాయత్రి మోటార్స్..ఉంది. దీనికి యజమాని వెంకట స్వామి. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ వినూత్న ఆఫర్ ప్రకటించేసింది. టూ వీలర్ కొంటే మేక ఉచితం అని ప్రకటించింది. ఈనెల 11 నుండి ఈ ఆఫర్ అమల్లోకి రానుందని..బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది. ఒక్కసారిగా భారీగా రెస్పాన్స్ వచ్చేసిందంట. దీనితో గంటల వ్యవధిలోనే ఆఫర్ ను యజమాని వెంకట స్వామి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతమందికి మేకలు ఇవ్వడం సాధ్యం కాదని,న అమ్మకాలు ఈ స్థాయిలో ఉంటే ఆఫర్ ప్రకారం అలా చేయలేమని అర్థమైందని యజమాని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

13:26 - October 9, 2017

హైదరాబాద్ : బీజేపీ దాడులపై సీపీఎం ఆందోళన చేపట్టింది. ఎంబీ భవన్ నుంచి సీపీఎం శ్రేణులు ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కార్యర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:19 - October 9, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫరూక్ పై నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు నమోదయింది. ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లిచడంలేదని ఎన్‌ఆర్‌ఐ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దె ఇవ్వాలని అడిగినందుకే తనపై చెప్పుతో దాడి చేశారని నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:14 - October 9, 2017

హైదరాబాద్ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సీపీఎం కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సీపీఎంపై బీజేపీ ఆరోపణలు అవాస్తవమని.. తమ్మినేని తెలిపారు. యూపీతో పోలిస్తే కేరళ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. బీజేపీ ఢిల్లీలో సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేయడానికి.. ప్రదర్శన పేరుతో రావడాన్ని ఖండించారు. దేశంలో తనపై వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో బీజేపీ ఫాస్టిస్టు పోకడలకు పోతోందని చెప్పారు. దేశంలో బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

తల్లి నిర్బంధంలో కూతురు..విడిపించిన సీడీపీవో అధికారులు

సిద్ధిపేట: 12 ఏళ్ల కూతురిని 30 రోజులుగా తల్లి నిర్బంధించింది. విషయం తెలుసుకున్న సీడీపీవో అధికారులు బాలికకు విముక్తి కల్పించారు.

 

13:06 - October 9, 2017

గుజరాత్‌ : గోద్రాలో రైలు దహనం కేసులో  దోషులకు ఊరట లభించింది. 11 మంది దోషులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షను గుజరాత్‌ హైకోర్టు జీవితఖైదుగా మార్పు చేసింది. ఈకేసులో మొత్తం 31 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం 20 మందికి జీవితఖైదు, 11 మందికి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష రద్దుచేయాలని దాఖలైన పిటిషన్‌పై దాదాపు 29 నెలల పాటు విచారణ కొనసాగింది. సమగ్ర విచారణ అనంతరం మరణదండన పడిన వారికి శిక్షను తగ్గిస్తూ కోర్టు తాజాగా తీర్పు నిచ్చింది. మరోవైపు గోద్రా రైలు దహనంలో బాధితులకు పదిలక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

13:03 - October 9, 2017

వికారాబాద్‌ : జిల్లాలో విషాదం నెలకొంది. మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలో నిలిపి ఉంచిన లారీకి విద్యుత్‌ షాక్‌ తగిలింది. లారీకి టార్పాలిన్‌ షీట్‌ కట్టేందుకు పైకి ఎక్కన యువకుడు.. విద్యుత్‌ వైర్లను గమనించకుండా చేతులు పైకి ఎత్తడంతో  షాక్‌ గిలింది. ఈ ప్రమాదంలో లారీకింద మరమ్మతు చేస్తున్న డ్రైవర్‌కు కూడా షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కేబిన్‌లో ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇద్దరుమహరాష్ట్రకు చెందిన ఉస్మాన్‌, రాజుగా గుర్తించారు. 

 

12:55 - October 9, 2017

హైదరాబాద్ : బీజేపీ దాడులను నిరసిస్తూ నగరం సీపీఎం ర్యాలీ నిర్వహించింది. ఎంబీ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరనున్నారు. సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులను ఖండిస్తున్నారు. ఈమేరకు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీజేపీ, ఆర్ ఎస్ దాడులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:42 - October 9, 2017

హైదరాబాద్ : వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. నగరంలోని పలు కాలనీలు నీటమునిగిపోయాయి. దీంతో ఇంట్లోంచి బయటికి వెళ్లాలన్నా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. రామంతపూర్‌ సమీపంలో ఉండే రవీంద్రనగర్‌, సాయి చిత్ర నగర్‌, లక్ష్మీ నగర్‌ కాలనీతో పాటు సమీప కాలనీల్లో మురుగు నీరు భారీగా నిలిచిపోయింది.

భారీ వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం నీరు నిలువ ఉండటంతో నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఉప్పల్‌ సర్కిల్‌లోని చాలా కాలనీలు ఎనమిది రోజులుగా నీటిలోనే మగ్గుతున్నాయి. రామంతాపూర్‌ చెరువు సమీపంలో ఉన్న కాలనీలో సుమారు 500 కుటుంబాలు ఈ వర్షం నీటిలో ఇబ్బందులు పడుతున్నాయి.  

కాలనీలో నిలిచిపోయిన మురుగునీరు తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఇళ్లనుంచి బయటకు రావడానికి ప్రత్యేకంగా తెప్పలను ఏర్పాటు చేసుకోవలసి వస్తుందని వాపోతున్నారు. మురుగునీటి వల్ల వచ్చే వాసనతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులంటున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల తాగునీరు కూడా కలుషితమైపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే కొందరు కాలనీవాసులు ఇళ్లను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 

రామంతాపూర్‌ చెరువుకు ఉన్న తూము పని చేయకపోవడం, అలుగు కూడా లేకపోవడంతో చెరువు నిండిపోయి కాలనీల్లోకి నీరు చేరుతోంది. అయితే ఆ చెరువుకట్టపై రోడ్డు విస్తరణ చేసిన సందర్భంలో నీటిని బయటకు పంపే పైపులు ఎత్తుగా వేసినందుకే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని స్థానికులంటున్నారు. 

భారీగా కురుస్తున్న వర్షాలు గ్రేటర్‌ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారులు చర్యలు అంతంతమాత్రమే ఉండటంతో   నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. 

ఎంబీ భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్:ఎంబీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా సీపీఎం శ్రేణులు బయలుదేరారు. సీపీఎం ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఇరువురు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

12:27 - October 9, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్ఆర్ ఐ మహిళపై చెప్పుతో దాడి చేశారు. ఇంటి అద్దె అడిగినందుకు తనపై దాడి చేశారని బాధితురాలు హంతుల్ చెప్పారు. ఆరు నెలలుగా ఇంటి అద్దె ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రెండు ఏళ్లుగా ఇల్లు ఖాళీ చేయకుండా ఎమ్మెల్సీ ఇబ్బంది పెడుతున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు ఎమ్మెల్సీ చెప్పుతో కొట్టాడని మహిళ పేర్కొన్నారు. ఎమ్మెల్సీపై నాంపల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని ఎమ్మెల్సీ ఇంటి ఎదుట మహిళ ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సినీ రచయిత ఎంవీఎస్ హరనాథరావు కన్నుమూత..

ప్రకాశం : ప్రముఖ సినీ రచయిత ఎంవీఎస్ హరనాథరావు సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో హరనాథరావు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 150 సినిమాలకు మాటల రచయితగా ఎంవీఎస్ పని చేశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం వంటి చిత్రాలకు మాటలు రాశారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు చిత్రాలకు ఉత్తమ రచయితగా నంది అవార్డు ఎంవీఎస్‌ను వరించింది. రాక్షసుడు, స్వయంకృషి సహా పలు చిత్రాల్లో హరనాథరావు సహాయ నటుడిగా నటించారు. సినీ మాటల రచయితగా హరనాథరావును టి. కృష్ణ ప్రోత్సహించారు.

పాలనచేయ చేతకాక సీపీఎంపై దాడులు: తమ్మినేని

హైదరాబాద్: కేరళళో సీపీఎం శాంతియుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక రాజకీయంగా కక్షసాధింపులకు పాల్పడుతుందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేరళలో సీపీఎం అధికారంలో ఉన్నా 13 మంది కార్యకర్తలు ఆర్ ఎస్ ఎస్ గూండాల చేతిలో హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 650 కుటుంబాలు రోడ్డునపడ్డాయని, 65 పార్టీ అనుబంధ కార్యాలయాలపై దాడులు చేశారని ఆరోపించారు.

బిజెపి ర్యాలీకి వ్యతిరేకంగా సీపీఎం ర్యాలీ

హైదరాబాద్: బిజెపి ర్యాలీకి వ్యతిరేకంగా సీపీఎం ర్యాలీ చేపట్టనుంది. ఎంబీ భవన్ నుంచి సీపీఎం శ్రేణులు ర్యాలీకి సిద్ధమౌతున్నారు.

సచివాలయంలోని సర్వహిత బిల్డింగ్ లో కూలిన స్లాబ్

హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు సచివాలయంలోని సర్వహిత బిల్డింగ్ మొదటి అంతస్థులో స్లాబ్ కూలింది.

 

11:56 - October 9, 2017

దీపావళి..కాంతుల పండుగ..నరకాసరుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు 'దీపావళి' పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతుంటాయి. చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా..విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తుంటారు. గతంలో అంతగా శబ్ధం లేని..కాలుష్యం వెదజల్లని పటాసులు వస్తుండేవి. ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా వల్ల వాయు కాలుష్యం..శబ్ధ కాలుష్యం అధికమౌతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆ రాష్ట్రంలో దీపావళి పండుగ జరుపుకోరంట.

దీపావళి అనంతరం పొగ..వాయు కాలుష్యాలతో నిండిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. అందుకని ఈసారి దీపావళిని 'నో ఫైర్ క్రాకర్స్' డేగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలాగైనా ఒప్పించాలని..అందుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి పిల్లలకు లేఖలు వేళ్లినట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు స్కూళ్ల‌తో పాటు ఢిల్లీ యూనివ‌ర్శిటీ కాలేజీల‌కు సైతం సిసోడియా లేఖ‌లు రాశారు. ఇదిలా ఉంటే దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో టపాసుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది. హోల్‌సేల్‌గా..రిటైల్‌గా..టపాసులు అమ్మకుండా లైసెన్స్ లపై నిషేధం విధిస్తూ గతే ఏడాది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

11:44 - October 9, 2017

ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే పని జరగదనే పరిస్థితి వస్తోంది. కంప్యూటర్ ద్వారా పనులు జరుగుతున్నాయి. చాలా మంది కంప్యూటర్స్ ను ఉపయోగిస్తూ పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కంప్యూటర్ వాడే చాలా మంది కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి కంప్యూటర్ వాడుతున్న వారు కొన్ని సూచనలు..సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు పేర్కొంటున్నారు.

గంటల తరబడి కంప్యూటర్ ఎదుట పనిచేయడం వల్ల ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందట కూర్చొకుండ గంటకు ఒక్కసారైనా అటూ..ఇటూ లేచి తిరుగుతుండాలి. కంటిపై రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కళ్లకి సరైన ఎత్తులో మానిటర్ ఉంచుకోవాలి. అలాగే కీ బోర్డు లేదా మౌస్ తో పనిచేసేటప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్టు ఉంచుకుంటే బెటర్. కంటి రెప్పలను అదే పనిగా తెరువకుండా ఎక్కువసార్లు మూయడం..తెరవడం చేయాలి. కంప్యూటర్ పై కూర్చొన్న వారికి ఎదురుగా లైట్ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉండడం వల్ల కాంతి కిరణాలు కళ్లపై పడడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. 

బ్లాక్ చైన్ సదస్సు ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖ: బ్లాక్ చైన్ సదస్సు ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మంత్రి లోకేష్ తో పాటు 25 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

11:35 - October 9, 2017

రియల్ వర్షంలో 'ఎం ఎల్ ఎ' ఫైటింగ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు అనుకొనేరు. కాదు..'మంచి లక్షణాలున్న అబ్బాయి'. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'నందమూరి కళ్యాణ్ రామ్' హీరోగా 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఎం. ఎల్.ఏ' టైటిల్ పెట్టగా 'మంచి లక్షణాలున్న అబ్బాయి' ఉప శీర్షిక పెట్టారు. ఎం.ఎల్‌.ఏ అనే పేరు ఉన్నా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాదని చిత్ర బృందం పేర్కొంటున్నట్లు టాక్.

ప్రస్తుతం ఈ సినిమా ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతోంది. ఓ భారీ ఫైట్ ను చిత్రీకరించనున్నారు. రెయిన్ ఎఫెక్ట్ తో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. షూట్ ప్రారంభం కాగానే భారీ వర్షాలు కురుస్తుండడంతో అందులోనే షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఒరిజనల్ వర్షంలో చిత్రీకరించిన ఈ ఫైటింగ్ సీన్ బాగా వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న 'కాజల్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. షూటింగ్ స్పాట్ లోని ఈ ఫోటోను ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ ఫోటోలో 'కాజ‌ల్' చాలా క్యూట్ గా కనిపిస్తోంది. 

గోద్రా రైలు దహనం కేసులో నిందితులకు శిక్ష మార్పు

గుజరాత్ : గోద్రా రైలు దహనం కేసులో నిందితులకు శిక్ష మార్చారు. 11 మంది కి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా కోర్టు మార్చింది.

రామాంతపూర్ లో జీహెచ్ ఎంసీ కమిషనర్, మేయర్ పర్యటన

హైదరాబాద్: రామాంతపూర్ లో వర్షానికి నీటమునిగిన కాలనీలను జీహెచ్ ఎంసీ కమిషనర్, మేయర్ పరిశీలించారు. కాలనీ వాసులు తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

11:27 - October 9, 2017

సంగారెడ్డి : హరితహారం అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. సంగారెడ్డిజిల్లాలో యథేచ్ఛగా హరిత హననం చేస్తున్నారు. సిర్గాపూర్‌ మండలం నల్లవాగు ప్రాజెక్టు సమీపంలో పెద్ద సంఖ్యలో పచ్చని చెట్లను నేలకూల్చారు. సీఎం పర్యటన సందర్భంగా బహిరంగసభ ఏర్పాట్లో భాగంగా చెట్లను కూల్చివేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలకు నీతులు చెప్పడం కాదు.. ప్రభుత్వం కూడా పాటించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

ఢిల్లీలో బాణాసంచా అమ్మకాల పై నిషేధం

ఢిల్లీ: ఢిల్లీలో బాణాసంచా అమ్మకాల పై నిషేధం విధించారు. నవంబర్ 1 వరకు నిషేధం విధించినట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం పెరిగినందున నిషేధం విధించినట్లు కోర్టు పేర్కొంది.

11:18 - October 9, 2017

హైదరాబాద్‌ : రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ గోతులమయం అవుతున్నాయి. ఇక అకస్మాత్తుగా కుంగిపోతున్న రోడ్లు హైదరాబాదీలను భయపెడుతున్నాయి. వరుసగా నగర రోడ్లు కుంగిపోతుండటంతో నగర ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
ప్రజలకు తప్పని రోడ్ల కష్టాలు 
హైదరాబాద్‌ ప్రజలకు రోడ్ల కష్టాలు తప్పడంలేదు. గతపాలకుల నిర్లక్ష్యం అంటూ మూడేళ్లుగా చెబుతున్న ప్రస్తుత పాలకులు కష్టాలు తీరే దారి చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొద్దిపాటి వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. రెండు మూడు గంటలు వర్షం పడిందంటే చాలు సిటీ రోడ్లు గుంతలతో పాటు.. గోతులు పడుతున్నాయి. ఐదు రోజుల క్రితం పడ్డ వర్షాలకు సిటీలో దాదాపు పదివేలకు పైగా గుంతలు ఏర్పడగా..చాలా ప్రాంతాల్లో బీటీ రోడ్లు పాడయ్యాయి.
వర్షాలకు కుంగుతున్న రోడ్లు 
నగరంలో వర్షాలకు చాలాచోట్ల అకస్మాత్తుగా రోడ్లు కుంగుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ల కారణంగా కుంగిపోతున్నాయి. గతంలో హుస్సేన్‌సాగర్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. కొద్ది రోజుల క్రితం అమీర్‌పేట్‌లో కూడా ఇలాగే జరగ్గా.. ప్రస్తుతం కూకట్‌ పల్లి నుంచి ఉషాముల్లపూడికి వెల్లే మార్గంలో గోదావరి పైప్‌లైన్‌ పై ఉన్న రోడ్డు కుంగిపోయింది.నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెలవు దినం కావడం రద్దీ ఎక్కువ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. 
రోడ్ల మెరుగుపై అధికారులు దృష్టిసారించాలి.. 
హైదరాబాద్‌లో రోడ్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం వర్షం నీటి కాలువలు, మురుగు నీటి పైపులైన్లు సరిగ్గా లేకపోవడమే. వాటి నుంచి లీకేజులు ఏర్పడటం తద్వారా రోడ్లు  కుంగిపోతున్నాయి. ఇప్పటికైనా బల్దియా అధికారులు రోడ్ల మెరుగుపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాడులను నిరసిస్తూ సీపీఎం మహా ప్రదర్శన

విజయవాడ: సీపీఎం కార్యాలయాలపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాడులను నిరసిస్తూ సీపీఎం మహా ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమై లెనిన్ సెంటర్ వరకు కొనసాగనుంది. ఈకార్యక్రమంలో సీపీఎం నేత పి. మధు, వామపక్ష ప్రజా నాయకులు, తదితరులు పాల్గొననున్నారు.

10:58 - October 9, 2017

అంబరీష్..కన్నడ సినిమా నటుడు. అంతేగాకుండా రాజకీయ నాయకుడు కూడా. ఇతను కన్నడ భాషా చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆయన నటించిన పలు సినిమాలకు అవార్డులు సైతం వచ్చాయి. కన్నడలో అంబరీష్ టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. ఇప్పుడు సినిమాల వైపు దృష్టి మళ్లింది. ఆయన హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తెలుగులో 'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన 'కిచ్చ సుదీప్' ఈ సినిమాకు నిర్మాతగా, నంద కిషోర్ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. 'అంబి నింగే మయసాయ్తే' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా 'సుహాసిని'ని ఎంపిక చేసినట్లు టాక్. ఇటీవలె అంబరీష్‌ తన కుమారుడు అభిషేక్‌గౌడ్‌ను కన్నడ చిత్రరంగానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'అంబరీష్‌' 'కురుక్షేత్రం'లో నటిస్తున్నారు. భీష్ముడు పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

సీపీఎం కార్యాలయాలపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాడులు సిగ్గు చేటు:తమ్మినేని

హైదరాబాద్: ర్యాలీల పేరుతో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడడం సిగ్గు చేటు అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కేరళలో సీపీఎం అభివృద్ధి చూడలేక కక్షపూరితంగా బిజెపి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర పథకాలను ఎండగడుతున్నందుకే దాడులకు తెగబడుతోందని, సీపీఎం పై ఆర్ ఎస్ ఎస్, బిజెపి అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. బిజెపి నిర్వహిస్తున్న ర్యాలీని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ అమల్లోనూ కేంద్రం విఫలమైందని ఎద్దేవా చేశారు.

10:42 - October 9, 2017

బాలీవుడ్ లో బయోపిక్ ల హావా కొనసాగుతోంది. గతంలో..ఇటీవలే ప్రముఖ రాజకీయ, క్రీడా..ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు నిర్మితమైన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల్లో హీరోలు..హీరోయిన్లు నటించి అభిమానుల మెప్పు పొందారు. పలు చిత్రాలైతే కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ గా వెలిగిన 'సంజయ్ దత్' జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'రణబీర్ కపూర్' నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అచ్చు సంజయ్ దత్ గా 'రణ బీర్' కనిపిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఎలా తెరకెక్కిస్తారనేది ఉత్కంఠను కలుగ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే చిత్ర బృందం సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫిల్మ్ కు 'సంజూ' అని టైటిల్‌ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 'సంజయ్‌ దత్‌'ను ముద్దుగా 'సంజూ బాబా' అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. పరేశ్ రావల్..మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు టాక్. 

ఎన్ ఆర్ఐ మహిళను చెప్పుతో కొట్టిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్

హైదరాబాద్: ఎన్ఆర్ ఐలపై ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ దాడి చేశారు. 2 ఏళ్లుగా ఇల్లు ఖాళీ చేయకుండా ఎమ్మెల్సీ ఇబ్బంది పెడుతున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు ఎమ్మెల్సీ చెప్పుతో కొట్టాడని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పై నాంపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని ఎమ్మెల్సీ ఇంటి ఎదుట మహిళ ఆందోళనకు దిగింది.

తెలంగాణ ఐద్వా రాష్ట్ర మహాసభలు ప్రారంభం

హైదరాబాద్: ప్రగతినగర్ లో ఐద్వా రాష్ట్ర మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఐద్వా జెండాను రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత ప్రారంభించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా ఐద్వా జాతీయ కార్యదర్శి మరియన్ దావలే, ఐద్వా సీనియర్ నేతలు మల్లు స్వరాజ్యం, పుణ్యవతి, తదితరులు హాజరయ్యారు. ఏపీ ఐద్వా నేత స్వరూప రాణి, జ్యోతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

10:29 - October 9, 2017

మహారాష్ట్ర : యావత్మాల్‌ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలో 20 మంది రైతులు మృతిచెందారు. 700 మంది ఆస్పత్రిపాలయ్యారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన క్రిమిసంహారక మందులు చల్లే యంత్రాల వినియోగం రైతులకు అర్థంకాలేదు. దీంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని వినియోగించారు. దీంతో వందలాది రైతులు క్రిమిసంహారకాల ప్రభావానికి గురయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు చనిపోయారు. 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 25మంది కంటిచూపు కోల్పోయారు. క్రిమిసంహారక ముందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మందులు చల్లే పరికరాల్లో కొత్త మోడళ్లు రావడం.. వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

 

ఢిల్లీలో సీపీఎం కాసేపట్లో ప్రజార్యాలీ

ఢిల్లీ: తమ కార్యాలయాలపై బిజెపి దాడులకు నిరసనగా సీపీఎం కాసేపట్లో ప్రజార్యాలీ నిర్వహించనన్నది. పీవీ హౌస్ నుంచి అశోక్ రోడ్ లోని బిజెపి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బృందాకారత్, బీవీ రాఘవులు పాల్గొననున్నారు.

10:23 - October 9, 2017

అరుణాచల్‌ ప్రదేశ్‌ : ఆర్మీ  అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోలోని తవాంగ్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ప్రమాదంలో నిన్న 7గురు సైనికులు మృతి చెందారు. అయితే వారి మృతదేహాల తరలింపు ఇపుడు వివాదాస్పదంగా మారింది. సైనికుల మృత దేహాలు ప్లాస్టికవర్లలో మూటలుగా కట్టేసి తరలించారు. దీనిపై మాజీ సైనికులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల పట్ల కనీసం మర్యాద పాటించరా అని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు.. సైనికుల మృతదేహాలు తరలించడానికి ఇక నుంచి పెట్టెలు వాడాలని నిర్ణయించామన్నారు. 

 

10:18 - October 9, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామకృష్ణా కాలనీ, సూర్యానగర్‌, ఉమానగర్‌ నీటమునిగింది. టీవీ టవర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:16 - October 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో లారీ యజమానులు సమ్మెబాటపట్టారు. ఇవాళ,రేపు రాష్ట్ర వ్యాప్తంగా లారీలను బంద్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లారీ యజమానులు బంద్‌కు పిలుపునిచ్చారు. జీఎస్టీ, రోజువారీ డీజిల్‌ధరల విధానంతోపాటు టోల్‌ట్యాక్స్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెండు రోజుల పాటు లారీలు నిలిచిపోనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాల సరఫరాతోపాటు వివిధ సరుకు రవాణాపై ప్రభావం పడనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:13 - October 9, 2017

సంగారెడ్డి : రెవెన్యూ అధికారుల వేధింపులతో సంగారెడ్డి జిల్లా న్యాలక్కల్‌ మండలం  మామిడ్గి  విలేజ్‌లో ఓ మహిళారైతు మృతి చెందింది. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం భూములను సేకరిస్తున్న అధికారులు న్యాల్‌కల్‌ గ్రామంలో భూములను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా  రెవెన్యూ అధికారులు మామిడ్గి విలేజ్‌లో పర్యటించారు. నిమ్జ్‌ కోసం భూములు తీసుకున్నామని.. మీరు అభ్యంతర పెట్టిన భూముల సేకరణ ఆగదని రైతులను భయపెట్టారు. దీంతో తమ భూములు దక్కవన్న ఆందోళనతో మహిళారైతు పార్వతమ్మ గుండెపోటుకు గురై మృతి చెందిందని గ్రామస్థులు అంటున్నారు. భూములను బలవంతంగా సేకరించవద్దని హైకోర్టు ఆదేశించినా.. అధికారులు, పోలీసులు రైతులను బెదిరిస్తున్నారని నిమ్జ్‌ భూపోరాటకమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 

10:08 - October 9, 2017

మేడ్చల్ : జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో డిజిటల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. రూ.10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:07 - October 9, 2017

ఒక వుడ్ నుండి వచ్చిన హీరోలు..హీరోయిన్లు..ఇతర వుడ్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతుంటుంటారు. విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. కానీ కొంతమంది ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి అంతగా ఇష్టపడరు. ఈ జాబితాలో ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కూతురు 'శృతి హాసన్' చేరింది.

టాలీవుడ్..బాలీవుడ్..ఇలా పలు భాషా చిత్రాల్లో 'శృతి హాసన్' నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. ఆమె తెలుగులో నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి కూడా. మెగా స్టార్ 'పవన్ కళ్యాణ్' నటించిన 'కాటమరాయుడు' సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. అనంతరం ఎలాంటి తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. ప్రస్తుతం 'శ్రుతి' తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి 'శభాష్‌ నాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

అయితే ఇదిలా ఉంటే కన్నడ చిత్రంలో నటించాలని దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు కోరినట్లు టాక్. 'ధృవ సర్జ' హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'శృతి' హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరిగింది. దీనిపై 'శృతి' స్పందించారు. ట్విటర్‌ వేదికగా ఖండించారు. ఇప్పుడు, భవిష్యత్తులో కన్నడ చిత్రంలో నటించే ఉద్దేశం లేదని, కన్నడ చిత్రంలో నటించమని ఎవరూ తనను సంప్రదించలేదని కుండబద్ధలు కొట్లారు. దీనికి సంబంధించిన విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్‌లలో, సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు పోటెత్తిన వరదనీరు

హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉస్మాన్‌సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1779 అడుగులకి చేరినట్లు అధికారులు వెల్లడించారు. హిమాయత్‌సాగర్ జలాశయంలోకి ఈ రోజు మరో రెండు అడుగుల నీరు వచ్చిచేరే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్ జలాశయం గరిష్ట నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1749 అడుగులకు నీరు చేరినట్లు తెలిపారు.

అంకిరెడ్డిపల్లిలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్:కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపల్లిలోని డిజిటల్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈప్రమాదంలో సుమారు రూ.10 కోట్లు నష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

09:58 - October 9, 2017

బాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులపై హాట్ హాట్ చర్చ జరుగుతోందంట. 'హృతిక్ రోషన్..కంగనా రనౌత్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వీరిద్దరు ప్రేమికులని..ప్రస్తుతం శత్రువులుగా మారిపోయారని అనుకుంటున్నారంట. వీరిద్దరూ ఒకరిపై వ్యాఖ్యలు చేసుకుంటుండడంతో రచ్చ రచ్చ అవుతోంది.

తాజాగా 'హృతిక్' మరోసారి చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడాడు. ఓ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం జోర్డాన్ లో పార్టీ చేసుకోవడం జరిగిందని..పార్టీ అనంతరం రూంలోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో 'కంగనా' తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరడం జరిగిందని..కానీ తాను ఉదయం మాట్లాడుతానని చెప్పి రూంకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కానీ అదే పనిగా తన రూం డోర్ కొడుతూనే ఉన్నారని, తలుపు తీసి చూస్తే 'కంగనా' బాగా తాగి ఉందన్నారు. వెంటనే తన మేనేజర్ కు ఈ విషయం తెలియచేసి..ఆమె సోదరి రంగోలికి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. మరి హృతిక్ చేసిన వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు..

జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఈ కాల్పులు గత రెండుగంటలుగా కొనసాగుతున్నాయి.

విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు చేరుకున్నారు. బ్లాక్ చైన్ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఈ సదస్సుల 2 రోజుల పాటు జరగనుంది. సదస్సులో 25 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

09:55 - October 9, 2017

సీఎం కేసీఆర్...ప్రతిపక్షాలు, కోదండరాం చేసిన వ్యాఖ్యలు సరికావని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, టీఆర్ ఎస్ నేత వేణుగోపాలచారి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్థన్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం మానుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితలావర్తన ద్రోణి

హైదరాబాద్ : కర్ణాటక, ఒడిశావైపు నుంచి తెలంగాణమీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతున్నదని, దీని ప్రభావంతో మరో ఐదురోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వివరించారు. అదే సమయంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతుండడంతో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని చెప్పారు.

09:51 - October 9, 2017

రాజ్ తరుణ్...'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమాల్లోకి రాకముందు ఇతను లఘు చిత్రాలకు పనిచేశాడు. ఉయ్యాల జంపాల..కుమారి 21 ఎఫ్..సినిమా చూపిస్తా మావ..తదితర చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వెరైటీ యాసతో పలికే డైలాగ్స్..అభిమానులను అలరిస్తుంటాయి. ఇతను తాజాగా 'రాజు గాడు' సినిమా చిత్రంలో నటిస్తున్నారు. ఎ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై 'ఈడోరకం-ఆడో రకం'..'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'..'అంధగాడు'... చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే నిర్మాణ సంస్థలో 'రాజు గాడు' చిత్రం వస్తోంది. ఇందులో 'రాజ్ తరుణ్' సరసన 'అమైరా దస్తుర్' హీరోయిన్ గా నటిస్తోంది.

కామెడీ..లవ్..యాక్షన్ అంశాలతో చిత్రం ఉంటుందని..ఇందులో 'రాజ్ తరుణ్' ను కొత్త పాత్రలో చూస్తారని నిర్మాతలు పేర్కొంటున్నారు. ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. గత చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విధంగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో 'రాజ్ తరుణ్' కు తనకు తెలియకుండానే దొంగతనం చేసే జబ్బు ఉంటుందంట. దాంతో అతగాడు తరచు చేతి వాటం ప్రదర్శిస్తుంటాడు. మరి ఇలాంటి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఏం జరిగిందన్నది సినిమా చూస్తే గాని తెలియదంట. 

అనంతపురంలో భారీ వర్షం

అనంతపురం: జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ముంచెత్తుడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు విద్యుత్ కూడా నిలిచిపోయినా అధికారులు ఎవరూ స్పందిచడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

09:45 - October 9, 2017

ఆకలితో ఉన్నవాన్ని అన్నం పెడతామని పిలిచి తీరా కూర్చున్నాక వడ్డించే ప్లేట్‌ లేదు, వడ్డించడానికి అన్నమూ లేదంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థుల ఫ్రీ సివిల్స్‌ కోచింగ్‌ సెంటరుకు సెలెక్ట్‌ అయి వచ్చిన వారి పరిస్థితి అలా ఉంది. ఇదే అంశంపై నిర్వహించిన జనపథంలో కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శోభన్‌ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:43 - October 9, 2017

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈసారి బర్త్ డే వేడుకలు జరుకోవడం లేదంట. అలాగే దీపావళి పండుగకు కూడా దూరంగా ఉండనున్నారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బిగ్ బి బర్త్ డే అనగానే ఎంతో మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడానికి ఆయన ఇంటికి క్యూ కడుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియచేస్తారు. బిగ్ బి..బాలీవుడ్ లో యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీన ఆయన పుట్టిన రోజు. 75వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఆయన ఇంటిలో సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాదిగా విచ్చేసిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలియచేస్తారు.

కానీ ఈసారి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేశారు. 'ఈ సారి బర్త్ డేతో పాటు దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నా. ఆ టైంలో నేను ముంబైలో కూడా ఉండకపోవచ్చు'. అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'అమీర్ ఖాన్' హీరోగా నటిస్తున్నారు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా నటిస్తారని తెలుస్తోంది. 

09:42 - October 9, 2017

హైదరాబాద్‌ : పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న కారును రాజశేఖర్‌ ఢీకొట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే కారు యజమాని ఫిర్యాదు మేరకు.. హీరో రాజశేఖర్‌కు పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించారు. పరీక్షలో మద్యం సేవించలేదని తేలింది. తల్లి చనిపోయిన డ్రిపెషన్‌తో కారు నడిపినట్లు రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు. 

 

జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ సైన్యం తిప్పికొడుతున్నారు. రెండు గంటలుగా కాల్పులు కొనసాగుతున్నాయి. 

 

09:31 - October 9, 2017

విజయనగరం : జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూట్‌ మార్చుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందో తెలుసుకుంటున్నారు. పక్కాగా ప్లాన్‌ చేసుకుని గంజాయిని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.   

విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఒక్కోసారి ఒక్కో తరహాలో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఎస్ కోట  మీదుగా  గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది.  ఇటీవల ఎస్ కోటలో పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో.. గంజాయి స్మగ్లర్లు సాలూరు వైపు రూట్‌ మార్చారు. ఇక్కడ కూడా దాడులు పెరగడంతో...మరోసారి రూట్‌మార్చారు. గంట్యాడ మీదుగా గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు. అరకు, ఎస్ కోట ప్రాంతాల మీదుగా గంజాయి తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటున్నారు. 

తాజాగా గంట్యాడ మార్గంలో కొబ్బరి బోండాల లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా నుంచి అనంతగిరి, అరకు మీదుగా విజయనగరం జిల్లాలోకి వాహనాలు వస్తున్నాయి. అయితే ఈ మార్గంలో పోలీసులు తనిఖీలు జరపడం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఎస్ కోట ప్రాంతంలో గంజాయి పట్టుబడ్డ సందర్భాలు కోకోల్లలు. ఇటీవల జామి వద్ద రెండు వేల కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ కోట వద్ద నిఘా పెంచడంతో..జామి మీదుగా తరలించేందుకు యత్నించి.. అడ్డంగా బుక్కయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మీదుగా గంజాయి స్మగ్లింగ్‌ సాగేది. ఇక్కడ పోలీసులు సోదాలు పెరగడంతో.. ఎస్ కోట మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. మొత్తంగా ఒడిషా నుంచి ఏపీలోకి గంజాయి స్మగ్లింగ్‌ అవుతుందనేది బహిరంగ రహస్యం. ఒడిషా కోరాపుట్ నుంచి ఇచ్చాపురం అక్కడ నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్నారు. 

ఏదీ ఏమైనా గంజాయి రవాణాకు మాఫియా అనేక మార్గాలు అన్వేషిస్తోంది. పోలీసులకు పట్టుబడుతున్నప్పుడల్లా కొత్త మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి స్మగ్లర్లకు మించి పోలీసులు కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టి వారి ఎత్తులను చిత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

09:22 - October 9, 2017

హైదరాబాద్ : కట్టుకోబోయే వాడే కాలయముడయ్యాడు. పెళ్లికి ముందే సూటిపోటి మాటలతో అనుమాన పిశాచిగా తయారయ్యాడు. నువ్వు తప్ప నా జీవితానికి మరో ఆప్షన్‌ లేదని ఆ యువతి ఎంతచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ తన నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. తన స్నేహితురాలు ఇక లేదని తెలియడంతో మరో ట్రెయినీ కానిస్టేబుల్‌ బలవంతంగా తనువు చాలించింది. రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకొంది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజపేటకి చెందిన పార్వతమ్మ పర్వతాలు దంపతుల కూతురు మాధవి. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. అప్పటినుంచి వేములపల్లి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. గత మూడు నెలల క్రితం మాధవికి మునుగోడు మండలానికి చెందిన రామచంద్రం అనే వ్యక్తితో వివాహంనిశ్చయమైంది. దీపావళి తర్వాత ఇరువురికి వివాహం జరపించాలని.. రెండు కుటుంబాలు నిర్ణయించాయి. అప్పటి నుంచి మాధవి, రామచంద్రంతో కాస్త చనువుగా ఉండేది. అయితే ఆ చనువును రామచంద్రం అపార్థం చేసుకున్నాడు. మాధవి పట్ల అనుమానం పెంచుకొని చీటికిమాటికి సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నిత్యం ఫోన్‌ చేయాలని వేధించేవాడని.. తాను ఫోన్‌ చేసినప్పుడు తీయకపోతే ఎవరితో మాట్లాడుతున్నావ్‌ అంటూ అనుమానించడం మొదలుపెట్టాడని మాధవి తల్లిదండ్రులు చెబుతున్నారు.

కేవలం మాటలతో ఆగలేదు రామచంద్రం. తనతో కలిసి దిగిన ఫోటోలను బంధువులకు పంపుతూ సూటిపోటి మాటలతో మానసిన హింసకు దిగాడు. దీంతో కుంగిపోయిన మాధవి తన గోడును కన్నవారికి చెప్పుకోలేక వేములపల్లిలో అద్దెకు ఉంటున్న గదిలో ఫ్యాన్స్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నేను మరెవరినీ ప్రేమించడంలేదని .. నన్నేందుకు మోసం చేశావంటూ డైరీలో రాసిన సూసైడ్‌ నోట్‌ ఆమె గదిలో లభించింది. తమ కూతురి మృతికి రామచంద్రం వేదింపులే కారణమని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

మాధవి ఆత్మహత్యను తట్టుకోలేక పోయిన ఆమె స్నేహితురాలు నవీన అర్ధాంతరంగా తనువుచాలించింది. నవీన హైదరాబాద్‌ లోని  రాజబహుద్దూర్‌ పోలీసు అకాడమీలో కానిస్టేబుల్‌ శిక్షణలో ఉంది. డిసెంబర్‌లో శిక్షణ ముగియనుంది. నవీన, మాధవి ఇద్దరు ప్రాణస్నేహితులు. గత ఏనిమిదేళ్లుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.  మాధవి విషయం నవీనకు తెలిసే లోపు ఆమెను తీసుకురావాలనుకున్నామని.. కానీ ఆ లోపు ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వివాహానికి ముందే జీవితం పంచుకోవాల్సిన యువతిపై రామచంద్రం పెంచుకున్న అనుమానం రెండు నిండు జీవితాలను బలితీసుకుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

విశాఖ : సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. విశాఖలో భూగర్భ విద్యుత్ వ్యవస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో బ్లాక్ చైన్ సదస్సును చంద్రబాబు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు బ్లాక్ చైన్ సదస్సు కొనసాగనుంది. సదస్సులో 25 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. 

 

నేటి నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె

హైదరాబాద్ : నేటి నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె చేయనున్నారు. డీజిల్ ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. 13న పెట్రోల్ బంక్ లు బంద్ కానున్నాయి.

నేటి నుంచి ఏపీలో రైతులకు మూడో విడత రుణమాఫీ జమ

విజయవాడ : ఏపీలో నేటి నుంచి రైతులకు మూడో విడత రుణమాఫీ జమ కానుంది. 36 లక్షల 72 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం 10 శాతం వడ్డీతో రూ.3600 కోట్లు చెల్లించనుంది.

నేడు విజయవాడలో వైసీపీ కొత్త కార్యాలయం ప్రారంభం

కృష్ణా : నేడు విజయవాడలో వైసీపీ కొత్త కార్యాలయం ప్రారంభం కానుంది. వైవీ సుబ్బారెడ్డి సాయంత్రం ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. 

 

ఎర్రవాగు పొంగి వంతెన పై నుంచి ప్రవహిస్తోన్న నీరు

కర్నూలు : కొలిమిగుండ్ల...కల్వటాల మధ్య ఎర్రవాగు పొంగి వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. నెల్లూరు...బళ్లారి హైవేపై 4 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి. 

 

08:45 - October 9, 2017

మేడ్చల్‌  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ మరో నిజాం నవాబులా మారారని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం విమర్శించారు. కేబినెట్‌లో ఒక్క మహిళలకు చోటు ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఐద్వా తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు మేడ్చల్‌ జిల్లాలోని ప్రగతినగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌లో ఐద్వా మహాసభలు జరుగుతున్నాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐద్వా నాయకులతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

మహాసభల ప్రారంభం రోజున బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో మంచిరోజులు వస్తాయని ఎన్నికల్లో హామీఇచ్చారని... మూడేళ్లు దాటినా ప్రజలకు అచ్చేదిన్‌ రాలేదని విమర్శించారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో మోదీ సర్కార్‌ విఫలమైందన్నారు.  దేశంలో మతతత్వ భావాలున్న బీజేపీ ప్రభుత్వం మనుస్మృతి సిద్దాంతాలను అమలు చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో నిజాం రాజుగా మారిపోయారని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం అన్నారు.  కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని, దీంతో మహిళలు తమ సమస్యలు ఎవరికి  చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.  మహిళలకు హక్కులు లేకుండా పోయాయని, ఆడవాళ్లు ఆటబొమ్మలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను తాగుబోతుల రాజ్యంగా మార్చేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు పుణ్యవతి ఎద్దేవా చేశారు.  ఇద్దరు సీఎంలు మహిళా సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. 

రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలకు  అర్హత మేర వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ బార్లకు అనుమతిస్తూ డబ్బుల సంపాదనపై దృష్టి పెట్టారని విమర్శించారు.  మద్యంతో కుటుంబాలు విచ్చిన్నం అవుతూ, మహిళలపై దాడులు, హింస పెరిగిపోతోంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆమె ప్రశ్నించారు. 

 

08:35 - October 9, 2017

ఢిల్లీ : కేరళలో బీజేపీ కార్యకర్తల హత్యలు పెరిగిపోయాయంటూ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జన రక్షణ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మందికి పైగా కార్యకర్తలు హత్యకు గురయ్యారని, దీనికి కేరళ సీఎం నైతిక బాధ్యత వహించాలన్నారు. మరోవైపు కేరళలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ కొనసాగిస్తున్న రాజకీయ హింస వెనుక అసలు ఎజెండాను ఎండగట్టేందుకు సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
ఢిల్లీలో బీజేపీ జనరక్షణ ర్యాలీ 
కేరళలో బీజేపీ కార్యర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జనరక్షణ ర్యాలీ జరిగింది. కన్నాట్‌ ప్లేస్‌లోని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం  నుంచి సీపీఎం ఆఫీసుకు ర్యాలీ బయల్దేరింది. ర్యాలీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్లొన్నారు. కేరళలో హింసకు ముగింపు పలకాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళలో బీజేపీ కార్యకర్తల హత్యలు పెరిగిపోయాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మందికి పైగా కార్యకర్తలు హత్యకు గురయ్యారని, దీనికి కేరళ సీఎం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. 
అమిత్‌షా మతోన్మాద రాజకీయాలు చేస్తున్నారు- ఏచూరి
కేరళలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ కొనసాగిస్తున్న రాజకీయ హింస వెనుక అసలు ఎజెండాను ఎండగట్టేందుకు సోమవారం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతో తాము బీజేపీతో ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్నారు. బీజేపీ కుయుక్తులను ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా పోరాడాలి : కరత్
బిజెపి, ఆర్ఎస్ఎస్‌లు హిందుత్వ సంస్థల విధానాలను ప్రజలపై రుద్దుతున్నారని సీపీఎం నేత ప్రకాష్‌ కారత్ ఆరోపించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నాయని దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్‌తో చొరబాట్లు పెరిగాయని ప్రకాష్‌ కారత్ అన్నారు. 
బీజేపీ నేతల అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయి : వి.శ్రీనివాసరావు
కేరళలో బీజేపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ నాయకుడు వీ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు  ర్యాలీ తలపెట్టడాన్ని శ్రీనివాసరావు ఖండించారు. సీపీఎం కార్యాలయం వద్ద బీజేపీ ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసుల చర్యను ఖండించారు. 
బిజెపి, ఆర్ఎస్ఎస్ ద్వంద్వ స్వభావం : బివి.రాఘవులు
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పాదయాత్రలు చేపట్టి వారి ద్వంద్వ సభావాన్ని బయటపెట్టుకుంటున్నాయని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయం వద్ద బీజేపీ నేత అమిత్‌ షా ర్యాలీ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. సీపీఎం ఆఫీసులపై దాడులకు పాల్పడుతూ బిజేపి ఈరోజు దేశాన్ని పాలించే అర్హత కోల్పోయిందని రాఘవులు అన్నారు.
విశాఖలో వామపక్షాలు, ప్రతిపక్షాల భారీ ర్యాలీ
నిన్న విశాఖ‌లో సిపియం కార్యా‌ల‌యంపై దాడుల‌కు తెగ‌బ‌డ్డ బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయ‌కుల‌ను, బిజెపి ఎంఎల్‌సి పివిఎన్ మాధవ్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని సిపియం నాయ‌కులు, కార్యక‌ర్తలు ర్యా‌లీ నిర్వహించారు. విశాఖ సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసి గాంధీ విగ్రహం వరకూ జరిగిన భారీ ర్యాలీ జరిగింది. 

 

08:16 - October 9, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు ఈ నెల 17 నుంచి 26 వరకు 9 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని నిర్మాణాల ఆకృతులకు తుదిరూపు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. 18 నుంచి 21 వరకు అమెరికాలో పర్యటించి పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రులను కలుస్తారు. 22,23 తేదీల్లో దుబాయ్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం అమరావతిలో నిర్మించే ఐకానిక్‌ భవనాల నిర్మాణ డిజైన్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు లండన్‌ వెళ్తారు. 
మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు సీఎం ఫారీన్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. అమెరికా, అరబ్‌, లండన్‌లో 10 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 17న ముందుగా అమెరికా వెళ్లనున్నారు. అక్కడి పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రులను కలుస్తారు. 18-20 తేదీల మధ్య అయోవా అంతర్జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న అంతర్జాతీయ ఆహార ధరల సదస్సులో చంద్రబాబు  పాల్గొననున్నారు. అనంతరం అయోవా యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అయోవా యూనివర్సిటీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న మెగాసీడ్‌ పార్క్‌కు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.  
అమెరికా నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లనున్న బాబు 
అమెరికా టూర్‌ ముగించుకుని..చంద్రబాబు అరబ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 22,23 తేదీల్లో దుబాయ్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొంటారు. యూఏఈలోని పలువురు వాణిజ్యవేత్తలు, సంస్థల ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలతో సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయనున్నారు. ఇప్పటికే ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ ఆర్ టీ అనేక సేవలందిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. 
అరబ్ దేశాల నుంచి లండన్‌ వెళ్లనున్న చంద్రబాబు  
ఇక అరబ్ దేశాల నుంచి చంద్రబాబు లండన్‌ వెళ్లనున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్‌ భవనాల నిర్మాణ డిజైన్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. లండన్‌ పర్యటనకు పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులతో పాటు సినీ దర్శకుడు రాజమౌళి కూడా వెళ్తున్నారని సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు తిరిగి ఈ నెల 27న ఏపీకి రానున్నారు.     

 

ప్రమాదానికి గురైన హీరో రాజశేఖర్ కారు

హైదరాబాద్ : పీవీ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును హీరో రాజశేఖర్ కారు ఢీకొట్టింది. పోలీసులు రాజశేఖర్ కి డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించలేదని పోలీసులు నిర్ధారించారు.

 

అనంతపురంలో భారీ వర్షం

అనంతపురం : జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పందిచడం లేదు.  

నేడు కర్నూలు, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : నేడు కర్నూలు, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కర్నూలు తంగెడంచలో మోగాసీడ్ పార్కును సీఎం శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో భూగర్భ విద్యుత్ వ్యవస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో బ్లాక్ చైన్ సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. 2 రోజుల పాటు బ్లాక్ చైన్ సదస్సు కొనసాగనుంది. సదస్సులో 25 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. 

 

కీసర డిజిటల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

మేడ్చల్ : కీసర డిజిటల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 

 

Don't Miss