Activities calendar

10 October 2017

22:03 - October 10, 2017

శ్రీకాకుళం : ఛలో వంశధార ఉద్రిక్తంగా మారింది. వంశధార నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను శ్రీకాకుళం నగర పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు వైసీపీ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వంశ‌ధార నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తాము చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అరెస్టులకు నిరసనగా బుధవారం శ్రీకాకుళం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. 
పోలీసులు ముందస్తు అరెస్టులు 
వంశధార నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టడానికి విపక్షాలన్నీ ఛలో వంశధారకు పిలుపునిచ్చాయి. దీన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరతీశారు. స్థానిక సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలను సోమవారం ఉదయమే ముందస్తుగా అరెస్టు చేశారు.  
మధు, బాబురావు, రామకృష్ణ అరెస్టు 
వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని.. వారిని పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నిర్వాసిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 
ప్రభుత్వంపై వామపక్షనేతలు ఆగ్రహం 
ముంపు గ్రామాల ప్రజలగోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వామపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాఉద్యమాలను అణచివేయాలనుకుంటే అవివేకమే అవుతుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం శ్రీకాకుళంజిల్లా బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. 
ఇళ్లు నేలమట్టం చేసిన అధికారులు 
మూడ్రోజుల క్రితమే చిన్నకొల్లువలస గ్రామంలో ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఈనెలాఖరుకు గార్లపాడును లక్ష్యంగా చేసుకున్నారు. తర్వాత పాడలి, దుగ్గుపురం, తులగాం గ్రామాల నుంచి నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో వరిపొలాల ధ్వంసానికి అడ్డుకట్ట పడినా కనీసం ఆ పంట చేతికొచ్చేవరకైనా గ్రామాల్లో ఉండనిచ్చేలా లేరని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. 
భారీగా పోలీసు బలగాలు మోహరింపు 
మరోవైపు హిరమండల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిర్వాసిత గ్రామాల్లో గట్టి నిఘా పెట్టారు. మరోవైపు జిల్లాకు వచ్చే రోడ్డు మార్గాల్లో వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులెవ్వరూ హిరమండలం చేరకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

21:59 - October 10, 2017

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణకు వచ్చింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన జీఎస్ ఎల్ గ్రూప్‌ సంస్థ కోర్టుకు రూ.10 కోట్ల రూపాయలు చెల్లించింది. అగ్రిగోల్డ్‌ కేసు వేగవంతం కోసం.... తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన సీఐడీ అధికారులు, జీఎస్ ఎల్ గ్రూప్‌ నుండి ఒకరు, అగ్రిగోల్డ్‌ యాజమాన్యంలో ఒకరితో పాటు... ఒక న్యాయవాదితో మూడు టీమ్‌లను ఫామ్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ టీమ్‌లు అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలు, బాధితుల సర్టిఫికెట్ల పరిశీలన, ఆస్తుల విలువలను పరిశీలించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను 23న అందించాలని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. 

 

21:56 - October 10, 2017

ఢిల్లీ : వ‌చ్చే నెల మొదటివారంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న కోడెల ఈ విషయాన్ని తెలిపారు. వర్షాకాల, శీతాకాల సమావేశాలను కలిపి సుమారు 10 రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశముందని కోడెల తెలిపారు.   

 

21:54 - October 10, 2017

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటుంది. మరోవైపు అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటి మునగడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 
ఉపరితల ద్రోణి..
ఉపరితల ద్రోణి ప్రభావంతో... తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 
కర్నూలులో
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. సోమప్పనగర్‌, శివన్ననగర్‌, ఎన్టీఆర్‌ కాలనీలోని లోతట్టు ప్రాంతాలలో నీళ్లు ఇళ్లలోకి చేరాయి. మరమగ్గాలు నీటిలో తడవడంతో చేనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు తడిసిపోవడంతో ప్రజలంతా దిక్కుదోచని స్థితిలో పడ్డారు. ఇక మంత్రాలయం నియోజకవర్గంలోనూ భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
అనంతపురంలో 
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు  గుత్తి గుంతకల్‌, పామిడి, తాడిపత్రి, పుట్టపర్తి, హిందూపురం, గోరంట్ల, కదిరి, శింగనమల ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. వర్షపు నీటితో పాటు పాములు, పురుగులు ఇళ్లల్లోకి వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  సహాయక చర్యలు కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు గుత్తి మండలం పాతకొత్త చెరువులో రైల్వే ట్రాక్‌పైకి వర్షపు నీరు  చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కడపలో 
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కురిసిన వర్షానికి.. చిత్రవాతి, పెన్నానదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గండికోట ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో తిమ్మాపూర్‌ సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోసినేపల్లి గ్రామం వద్ద ఓ వ్యక్తి వాగు దాటుతూ గల్లంతయ్యాడు. 
నిజామాబాద్‌ లో 
భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంట చేతికి అందకుండా పోతుందని నిజామాబాద్‌ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీపేట, రెంజల్‌, ఎడపల్లిలో భారీ వర్షంతో వందల ఎకరాల్లో పంట నేలరాలింది. పంట నష్టపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే... వర్షాలు తమ కొంపలు ముంచాయని రైతులు వాపోతున్నారు. 
కామారెడ్డిలో
ఇక కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు... ఎండిన సోయా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కోతకు సిద్దంగా ఉన్న వరి పంట నేలకొరిగి రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 
వికారాబాద్‌ లో 
భారీ వర్షాలతో వికారాబాద్‌ జిల్లా తడిసిముద్దయ్యింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. 
నిండుకుండలా ప్రాజెక్టులు  
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి... నీటిని కిందకు వదులుతున్నారు. ఇక కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 2009 తర్వాత కోయిల్‌ సాగర్ జలాశయం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. 
శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం 
ఇక భారీగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జూరాల, హంద్రీ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది. మొత్తానికి భారీ వర్షాలతో ఓ వైపు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండగా... మరోవైపు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

21:46 - October 10, 2017

గుంటూరు : అమరావతి సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వర్షాలు, సీజనల్‌ వ్యాధులు, రుణమాఫీ అమలు అంశాలపై చర్చించారు. బీసీ సామాజికవర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు ఆర్థికసాయంపై చర్చించారు. చంద్రన్న పెళ్లి కానుక పేరుతో రూ.30వేల సాయం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపారు. 2018 జనవరి ఒకటి నుంచి దీనిని అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీ రాకతో విశాఖకు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆరేళ్లలో 10 వేల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. మరిన్ని వివరాలన వీడియోలో చూద్దాం...

 

 

 

 

సిరిసిల్ల డిప్యూటీ ఈఈ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు

సిరిసిల్ల : డిప్యూటీ ఈఈ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్యోగులు సెలవుల్లో ఉన్నారు. విధుల్లో చేరాలని ఆదేశించినా ఈఈ సుధాకర్ పట్టించుకోలేదు. ఈఈ సుధాకర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. 

 

నవంబర్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం : స్పీకర్ కోడెల

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ లో జరిగే అవకాశముందని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వర్షాకాలం, శీతాకాల సమావేశాలను కలిపి నిర్వహిస్తామని చెప్పారు. 10 రోజులపాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు.

 

21:29 - October 10, 2017
21:27 - October 10, 2017

కోటికి పైగా జనాభా..హైటెక్ రంగులు..ఎత్తైన భవంతులు..గొప్ప గొప్ప రోడ్లు.. ఇది నగరానికి ఒక కోణం. గట్టిగా వర్షం పడితే మన నగరంలో రెండో కోణం కనబడుతుంది. ప్రస్తుతం నగరవాసులు మహానరకంలా ఫీలవుతున్న మన మహానగరం పరిస్థితిపై ఈరోజు వైడ్ యాంగిల్ కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ రాంబాబు

కామారెడ్డి : ఎస్ ఐ రాంబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మిస్సింగ్ కేసులో బాధితుని వద్ద రూ.30 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

20:58 - October 10, 2017

ఈనెల ముప్పై ఒక్కటి నాడు కొల్వుల కొట్లాట, చంద్రబాబు వల్లనే వానలు వడ్తున్నయ్, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్ బాగోతం, ట్రంపు ఇంట్ల పెరిగిపోయిన సముతుల పోరు, పవన్ కళ్యాణ్ కు కొడ్కు వుట్టిండట.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:44 - October 10, 2017

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జైషా ఆస్తులపై విచారణ జరిపించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ పాల్గొని, మాట్లాడారు. జైషా ఆస్తులపై విచారణ జరిపించి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:23 - October 10, 2017

ఢిల్లీ : బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జై షా ఆస్తులు భారీగా పెరిగాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోది ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్‌ చేశారు. మోది సర్కార్‌ 'బేటి బచావో'పథకం నుంచి 'బేటా బచావో'కు మారిపోయిందని ఎద్దేవా చేశారు. అమిత్‌ షా కుమారుడు జై షాకి అండగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌ గోయెల్‌ ప్రకటన చేసిన తరుణంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'బేటి బచావో' నుంచి 'బేటా బచావో' రూపంలో ఆశ్చర్యకరమైన రీతిలో మార్పు వచ్చిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో మీరు మౌనంగా ఉంటారా...లేక ఇందులో మీకేమైనా వాటా ఉందా? అని కూడా రాహుల్‌ ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన కమిటీతో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మూడేళ్లలో అమిత్‌ షా పుత్రుడు  జై షా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ వెల్లడించింది. దీనిపై జై షా వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

20:18 - October 10, 2017

ఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి విచారణ జరపలేదని... సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం, బీహార్‌లో ల్యాండ్‌ స్కాం, లలిత్‌ మోదీ ఇష్యూ, బిర్లా సహారా డైరీపై ఎలాంటి విచారణ జరపలేదన్నారు. పనామా పేపర్ల కుంభకోణంలో ప్రధాని మోదీ పేరు కూడా ఉందని.. దీనిపై ఎలాంటి విచారణ జరపలేదన్నారు. ఇదే పనామా పేపర్ల కుంభకోణంలో పాకిస్తాన్‌ ప్రధాని తన పదవినే కోల్పోయారని ఏచూరి గుర్తు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జైషా ఆస్తులు ఈ మూడేళ్లలో 16 వేల రెట్లు పెరిగాయని.. దీనిపైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కుంభకోణాలపై విచారణ జరపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని ఏచూరి హెచ్చరించారు.

 

20:10 - October 10, 2017

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చిక్కుల్లో పడ్డారు. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షా కు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయ్‌షా వ్యాపారం మూడేళ్ల వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతే కాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని వైర్‌ పోర్టల్‌ వార్తను ప్రచురించింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు  ప్రధాని మోదీని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేయబోతున్నారని తెలిపారు. వైర్‌ ప్రచురించిన వార్త అవాస్తవమని తోసిపుచ్చారు. మొత్తానికి ఈ కథనం పాలక బీజేపీని ఇరకాటంలో పడేసింది.

 

 

19:43 - October 10, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త. డీఎస్సీ నోటిఫికేషన్‌కు మార్గదర్శకాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎస్సీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నేడు జీవో విడుదల చేసింది. దీంతో అతి త్వరలోనే డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన డీఎస్సీ ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సంతకం చేశారు. ఏపీటెట్, టీఎస్‌టెట్, సీ టెట్, క్వాలిఫై అయినవారిని అర్హులుగా ప్రకటించింది. జిల్లా స్థానికత ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రభుత్వం డీఎస్సీ మార్గదర్శకాలను టీఎస్‌పీఎస్సీకి అందించిన నేపథ్యంలో 10రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

గౌహతి : భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (2) ఔట్ అయ్యారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ.20 మ్యాచ్ జరుగుతోంది. 

 

కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

గుంటూరు : అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బీసీ సమాజిక వర్గంలో పెళ్లి చేసుకునే వధూవరులకు ఆర్థికసాయంపై చర్చిస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుక పేరుతో రూ.30 వేల సాయం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 జనవరి ఒకటి నుంచి దీనిని అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీ రాకతో విశాఖకు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు రానున్నాయి. 

19:24 - October 10, 2017

కడప : కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ విమర్శించారు. కడప నగరంలో మూడు రోజుల పాటు జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర సమావేశాలకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని గఫూర్‌ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

 

పాండే ఔట్

గౌహతి : భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగుల వద్ద పాండే(6) ఔట్ అయ్యారు. 

 

19:15 - October 10, 2017

అనంతపురం : ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తానని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడతానని...చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న అక్రమాలను ఎండగడతానన్నారు వైఎస్‌ జగన్‌. 

అనంతపురం ఎమ్ వైఆర్ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పదో యువభేరి సదస్సుకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి, యువతకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో జగన్‌ వివరించారు. 

పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించి కేంద్రం మాటతప్పినా.. చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి వుంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేవని.. యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవన్నారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు... ఇప్పుడు మాట మార్చి... ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయని ప్రశ్నించడం దారుణమన్నారు. 

ప్రత్యేక హోదా కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని జగన్‌ స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. 

ఇక రాష్ట్ర ప్రజల సమస్యలపై నవంబర్‌ 2 నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు జగన్‌ తెలిపారు. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలై... ఆరు మాసాల పాటు కొనసాగి ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి సమస్యలను తెలుసుకుంటానని... చంద్రబాబు సర్కార్‌ చేసిన అక్రమాలను ఎండగడతానని జగన్‌ స్పష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఇకపై ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలకు అప్పగిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. 

19:04 - October 10, 2017

విశాఖ : భూ కుంభకోణంలో ఆధారాలుంటే నిరూపించాలని ప్రతిపక్షానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సవాల్‌ విసిరారు. ప్రతిపక్షానికి ఆరోపణలు చేయడం అలవాటైపోయిందన్నారు. నీరు ప్రగతి, నీరు చెట్టుకు తేడా తెలియని వారు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న లోకేశ్.. ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం... ఎకో సిస్టంను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్‌ కాన్ఫరెన్స్ విజయవంతం అయిందని తెలిపారు. 

 

18:59 - October 10, 2017

గుంటూరు : రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న వైఎస్‌ జగన్‌కు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్‌...  ఎందుకు వెనక్కి తగ్గాడని ఆయన ప్రశ్నించారు. ఇన్ని రోజులు మౌనం వహించిన జగన్‌... మళ్లీ యువభేరి అంటూ కొత్త రాజకీయ కుట్ర పన్నుతున్నారన్నారు. జగన్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

 

అరకు రైలు మార్గం పునరుద్ధరణకు 60 రోజుల సమయం : ముకుల్ శరణ్

విశాఖ : అరకు రైలు మార్గాన్ని ఇప్పట్లో పునరుద్ధరించలేమని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలిస్తే... మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని వాల్తేరు డివిజన్ డీఆర్ ఎమ్ ముకుల్ శరణ్ మాథుర్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం మరమ్మత్తులు చేపట్టేందుకు అనుకూలంగా లేదని అధికారులు తెలిపారు. మరోవైపు రైలు సేవలు నిలిపిపోవడంతో.. కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:54 - October 10, 2017

విశాఖ : అరకు రైలు మార్గాన్ని ఇప్పట్లో పునరుద్ధరించలేమని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలిస్తే... మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని వాల్తేరు డివిజన్ డీఆర్ ఎమ్ ముకుల్ శరణ్ మాథుర్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం మరమ్మత్తులు చేపట్టేందుకు అనుకూలంగా లేదని అధికారులు తెలిపారు. మరోవైపు రైలు సేవలు నిలిపిపోవడంతో.. కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:48 - October 10, 2017

చిత్తూరు : తిరుపతిలో కిడ్నాపైన సిరిచందన కథ సుఖాంతం అయింది. తల్లిదండ్రులే ఆమెను కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల నుంచి సిరిచందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త నవీన్ కుమార్ కు సిరిచందనను అప్పగించారు. కిడ్నాప్ కు సహకరించిన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:43 - October 10, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బీసీ సమాజిక వర్గంలో పెళ్లి చేసుకునే వధూవరులకు ఆర్థికసాయంపై చర్చిస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుక పేరుతో రూ.30 వేల సాయం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 జనవరి ఒకటి నుంచి దీనిని అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మధురవాడ ఐటీ సెజ్ లో ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీకి 10 ఎకరాల భూమిని కేటాయించారు. ఏఎన్ ఎస్ ఆర్ కంపెనీ రాకతో విశాఖకు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు రానున్నాయి. మరిన్ని వివరాలన వీడియోలో చూద్దాం..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

గౌహతి : భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ.20 మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. 

భర్త నవీన్ కు సిరిచందన అప్పగింత

చిత్తూరు : తిరుపతిలో కిడ్నాపైన సిరిచందన కథ సుఖాంతం అయింది. ఆమె తల్లిదండ్రుల నుంచి సిరిచందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త నవీన్ కు సిరిచందనను అప్పగించారు. 

కొనసాగుతోన్న ఏపీ మంత్రివర్గ సమావేశం

గుంటూరు : అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బీసీ సమాజిక వర్గంలో పెళ్లి చేసుకునే వధూవరులకు ఆర్థికసాయంపై చర్చిస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుక పేరుతో రూ.30 వేల సాయం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 

తెలంగాణలో డీఎస్సీ..2017 నిబంధనలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ..2017 నిబంధనలు విడుదలయ్యాయి. అర్హతలు, టెట్ వెయిటేట్ నిబంధనలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల ప్రాతిపదికన డీఎస్సీ వేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీ స్థానంలో జిల్లా ఒక యూనిట్ గా డైరెక్టర్ రిక్రూట్ మెంట్ చేయనున్నారు. పాత నియామక నిబంధనలే వర్తిస్తాయి. 

 

18:06 - October 10, 2017

జగిత్యాల : ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు... సమన్లు జారీ చేసింది. 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకం... తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ కొందరు కోరుట్ల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఐలయ్యకు సమన్లు జారీ చేసింది. ఈ పుస్తకం విడుదల తర్వాత.. ఐలయ్యకు బెదిరింపులు రావడంతో... నిన్న ఆయన డీజీపీని కలిసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

 

18:04 - October 10, 2017

హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమవుతోంది. జంక్షన్ల వద్ద యూటర్న్స్‌, పాయింట్ల విధానం అమలు ఉన్నా సమస్య అలాగే ఉందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ట్రాఫిక్‌ సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా అడుగుల వేస్తున్నామంటున్న హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:59 - October 10, 2017

సంగారెడ్డి : తెలంగాణలో జిల్లాల విభజన జరిగి ఏడాది అవుతోంది. పరిపాలన అందరికీ అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తోంది.. జీరో ఎర్రర్‌ రెవిన్యూ విలేజెస్‌, విద్య, వైద్యం అంశాలపై సంగారెడ్డి కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌ కణ్ణన్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న జిల్లాలతో పరిపాలన సులువుగా మారిందన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. వలసలను నిరోధించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. చెరువుల్లో కాలుష్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:24 - October 10, 2017

హైదరాబాద్ : ఉప్పల్ లోని గణేష్ నగర్ లో విషాదం నెలకొంది. ఆప్టార్ మెంట్ యజమాని, గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అపార్ట్ మెంట్ కోసం తవ్విన సెల్లార్ గుంతలో పడి 14ఏళ్ల విద్యార్థి ప్రబాస్ మృతి చెందాడు. అపార్ట్ మెంట్ నిర్మాణం కోసం సెల్లార్ గుంత తవ్వారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సెల్లార్ గుంతలోకి వర్షపు నీరు చేరింది. అటుగా వెళ్తున్న విద్యార్థి ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం గ్రేటర్ అధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని...ఆధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపార్ట్ మెంట్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

రెండు గ్యాస్ సిలిండర్లు పేలి 15 పూరిళ్లు దగ్ధం...

శ్రీకాకుళం: రాజాం నగర పంచాయతీ మెంతిపేట ఎస్టీ కాలనీలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 15 ఇళ్లు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

16:49 - October 10, 2017
16:46 - October 10, 2017

హైదరాబాద్ : నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం అంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.  రామాంతపూర్ చెరువు నీరు కాలనీల్లోకి చేరుతోంది. పలు కాలనీలు వర్ష పునీటితో నిలిచిపోయాయి. పదిరోజులుగా జనం నానా అవస్థలు పడుతున్నారు. రవీంద్రనగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:32 - October 10, 2017
16:29 - October 10, 2017

ఉన్నత విద్య అభ్యసించినా, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉన్నా..వాటిని కాదనుకుని మట్టిపరిమళాల కోసం, అది పిల్లలకు చేరువకావాలనే సంకల్పం కోసం మహిళలకు తోడుగా ఉండాలనే లక్ష్యంతో తపిస్తూ సాగుతున్న ఓ అతివ అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

ప్రైమరీ స్కూల్లో పేలిన గ్యాస్ సిలిండర్:ఇద్దరికి గాయాలు

విశాఖ: గొలుగొండ మండలం పప్పుశెట్టి పాలెం ప్రైమరీ స్కూల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడికి, విద్యార్థికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికలి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకి ప్రకటన

హైదరాబాద్: వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.వ్యవసాయ, సహకార శాఖలో 851 ఏఈవో, గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్పీ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, వచ్చే నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని తెలిపింది.

బాంబు దాడి కేసులో ప్రొద్దుటూరు కోర్టు తీర్పు

కడప: మద్దనూరు తహశీల్దార్ కార్యాలయంపై బాంబు దాడి కేసులో ప్రొద్దుటూరు కోర్టు తీర్పు ఇచ్చింది. 11 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది. 2010లో ముద్దనూరు తహశీల్దార్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.

16:16 - October 10, 2017

సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ తీస్తున్న " లక్ష్మీస్ ఎన్టీఆర్ " మూవీలో కీలకమైన ఎన్టీఆర్ పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అయితే సరిపోతాడని వర్మ భావిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడని వర్మ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను రిలీజ్ చేసిన వర్మ.. సినీ నటీనటులపై దృష్టి పెట్టాడు. వర్మ ఈ విషయంపై ప్రకాష్ రాజ్ తో మాట్లాడడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా వివాదాస్పదమైన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించడానికి అంగీకరిస్తాడా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇద్దరు సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గా నటించి మెప్పించిన సంగతి విధితమే.. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తే.. సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

కంచ ఐలయ్యకు కోరుట్ల కోర్టు సమన్లు

జగిత్యాల: కంచ ఐలయ్యకు కోరుట్ల కోర్టు సమన్లు జారీ చేసింది. 'సామాజిక స్మగ్లర్లు- కోమటోళ్లు' పుస్తకం తమ మనోబావాలను దెబ్బతీసిందంటూ పిటిషన్ దాఖలైంది.

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. భారీ వర్షాలు, చక్రపాణి కమిటీ సూచనలు, అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మరణాలు, సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన, రాజధాని డిజైన్లు, పలు సంస్థలకు భూ పంపినీ వంటి తదితర అంశాలపై కేబినెట్ భేటీ లో చర్చించనున్నట్లు సమాచారం.

15:56 - October 10, 2017

పరుచూరి మురళి దర్శకత్వం నారా రోహిత్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పరుచూరి మురళి 'నీ స్నేహం' .. 'ఆంధ్రుడు' .. 'అధినాయకుడు' సినిమాలను తెరకెక్కించాడు. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, తదుపరి సినిమాను నారా రోహిత్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రేపే ప్రారంభం కానుంది. ప్రస్తుతం నారా రోహిత్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బాలకృష్ణుడు' రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరికొన్ని ప్రాజెక్టులను నారా రోహిత్ లైన్లో పెట్టాడట.

ఒకటి, రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా... మంగళవారం టీఎస్‌పీఎస్‌సీకి నోటిఫికేషన్ వెలువరించేందుకు అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అలాగే డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై సంబంధిత మంత్రి కడియం శ్రీహరి సంతకం కూడా చేసినట్లు సమాచారం.

15:44 - October 10, 2017

ఎల్బీనగర్ కూడలి మూసివేత...

హైదరాబాద్ : నగరంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూ టర్న్ పద్ధతి అమలు చేస్తున్న విషయం విదితమే. ఇదే యూ టర్న్ పద్ధతి ఎల్బీ నగర్ కూడలిలో అమల్లోకి మంగళవారం నుంచి వచ్చింది. దీంతో ఎల్బీనగర్ కూడలిని ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని పోలీసులు సూచించారు. ఉప్పల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్, సాగర్ రింగ్‌రోడ్డు వెళ్లే వాహనాలు పీవీటీ మార్కెట్ వద్ద యూటర్న్ తీసుకోవాలి.సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు డీమార్ట్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. హయత్‌నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు యథాతథంగా వెళ్లనున్నాయి.

15:42 - October 10, 2017
15:41 - October 10, 2017

కృష్ణా : జిల్లాలోని నూజివీడు ఎస్ఐ వెంకటకుమార్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై  జిల్లా ఎస్పీ యాక్షన్‌లోకి దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైపై చర్యలకు ఆదేశించారు. కేసులో స్వయంగా విచారణ చేపట్టారు. నిందితుడు ఎస్సైను సెలవులపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అంతకు ముందు తమ ఆఫీసులోని ఓ ఫైలు కనిపించడం లేదని భార్యా, భర్తలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా కలిసిన మహిళపై ఎస్ ఐ వెంకటకుమార్‌ కన్ను పడింది. లాడ్జికి రావాలంటూ ఫోన్‌లో తనను లైంగికంగా వేధించారని ఎస్ ఐపై మహిళ ఫిర్యాదు చేసింది.  

కంచె ఐలయ్యకు మావోయిస్టుల మద్ధతు

హైదరాబాద్: ప్రొ. కంచె ఐలయ్యపై బెదిరింపు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. సంఘపరివార్, బిజెపి హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని, సంఘపరివార్ నేతృత్వంలోని బిజెపి బ్రహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తోందన్నారు. అక్షరాన్ని నిషేధించాలనుకుకోవడం అత్యంత ప్రమాదకరమని, గౌరిలంకేష్ హత్య, ఐలయ్య పై దాడి అందులో భాగమేనన్నారు.

15:38 - October 10, 2017

శ్రీకాకుళం : సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి పి.మధును పోలీసులు అరెస్టు చేశారు. వంశధార నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను శ్రీకాకుళం నగరంలో పోలీసులు అడ్డుకున్నారు. మధుతోపాటు , నిర్వాసిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు మరో ఇరవై మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వంశ‌ధార గ్రామాల్లోని ప్రత్యేక ప‌రిస్ధితుల దృష్ట్యా నేత‌ల‌ను నిర్వాసిత గ్రామాల‌కు వెళ్లకుండా పోలీసులు నిలువ‌రిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచే క‌మ్యూనిస్టు పార్టీ నేత‌ల‌తో పాటు వైకాపా నేత‌ల‌ను ముంద‌స్తు అరెస్టులు చేసి వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. వంశ‌ధార నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తాము చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోందని వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అరెస్టులకు నిరసనగా రేపు శ్రీకాకుళం జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. 

 

15:28 - October 10, 2017

హైదరాబాద్‌ : భాగ్యనగరాన్ని భారీవర్షాలు వదలడం లేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో సీటీజనం నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిపడింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చీబౌలీ, కొండాపూర్‌ ఏరియాల్లో గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. నాలాలు పొంగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రామాంతపూర్‌ చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మోకాటిలోతు నీటిలో జనం రాత్రంతా భయంగుప్పిట్లోనే గడుపేశారు. ఆల్వీన్‌కాలనీ, లెనిన్‌నగర్‌, మిథిలానగర్‌లలో వరదనీటి ఉధృతితో జనం భయపడుతున్నారు. వర్షం ఉన్నా లేకున్నా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం వదలడంలేదు. ఉదయం నుంచే ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

త్వరలో టిడిపి రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన

అమరావతి: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం టిడిపి రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కన టిడిపి రాష్ట్ర కార్యాలయం నిర్మాణం జరగనుంది.

15:24 - October 10, 2017

హైదరాబాద్ : ప్రంపచంలోనే అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మన ఫార్మా ఇండస్ట్రీ చైనా కంపెనీలతో పోటీపడబోతోందని మంత్రి అన్నారు. చౌకధరలకే ఔషదాలు తయారవుతాయన్నారు. దశలవారీగా హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ వివరాలు వెల్లడించారు. పొల్యూషన్‌కు అవకాశం లేదని రీతిలో ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశీయంగానే ఔషదాలు తయారు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మనం చైనా ఫార్మాపై ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. కాలుష్యం వెదజల్లనీ విధంగా హైదరాబాద్‌ ఫార్మా యూనిట్స్‌ రాబోతున్నాయని తెలిపారు. చైనా, ఇతర దేశాల ఫార్మా కంపెనీలతో మనం పోటీపడాలన్నారు. 

అస్సాం గరవ్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన జగదీశ్ ముఖి

గువాహటి : అస్సాం గవర్నర్‌గా ప్రొఫెసర్ జగదీశ్ ముఖి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీమంత శంకరదేవ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

15:19 - October 10, 2017

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై  సీఎం చంద్రబాబు కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. అనంతపురంలో పదవ యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షకు దిగితే అర్ధరాత్రి పోలీసులను పంపి దీక్షను భగ్నం చేయించారని బాబు పై మండిపడ్డారు. ప్రధాని మోదీతో సన్నీహితంగా ఉండే చంద్రబాబు కనీసం మాటమాత్రంగానైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని జగన్‌ విమర్శించారు. 

 

'నేరెళ్ల ఘటనలో ఎస్పీ పై చర్యలు తీసుకోవాలి'

హైదరాబాద్: నేరెళ్ల ఘటనలో ఎస్పీ విశ్వజిత్ పై చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే కౌంటర్ టి. సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. బాఙతుల మెడికల్ రిపోర్టును కోర్టు ప్రభుత్వం సమర్పించింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్సై ని సస్పెండ్ చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 24కి వాయిదా పడింది.

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

అనంతపురం: పుత్తూరు మండలం కమ్మనమల వద్ద వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ట్రాక్టర్ సహాయంతో బస్సును స్థానికులు బయటకు తీశారు. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

ముత్తంగిలోని ఆర్ ఆర్ ఎస్ ఇంజనీరింగ్ వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ముత్తంగిలోని ఆర్ ఆర్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట బోధన సిబ్బంది ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. తరగతులు బహిష్కరించి ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థులు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

మోదీ పాలన అవినీతిమయం : రఘువీరా

విజయవాడ: సూర్యారావుపేటలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. అమిత్ షా కుమారుడు అవినీతిపై విచారణ జరిపించాలని, అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ పాలన అవినీతిమయం అయ్యిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. అమిత్ షా కుమారుడు జైషాకు చెందిన కంపెనీ 2013-14లో 50వేలు టర్నోవర్ ఉంటే 2015 లో రూ.80 కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయకుండా మోదీ ప్రభుత్వం ఎదురు దాడి చేయడం దుర్మార్గం అన్నారు. అమిత్ షా రాజీనామా చేసి విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి బయటపడుతున్నా ఎక్కడా విచారణలు లేవన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల డాక్యుమెంట్లను పరిశీలన: ఎస్పీ రాజకుమారి

తూ.గో: 12 మంది అగ్రిగోల్డ్ బాధితుల డాక్యుమెంట్లను పరిశీలించారు. ఒక్కో పీఎస్ లో మొదటి 2 రోజుల్లో 50 డాక్యుమెంట్ల చొప్పున 3,4 రోజుల్లో 75 డాక్యుమెంట్ల చొప్పున పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. 5,6 రోజుల్లో 100 డాక్యుమెంట్ల చొప్పున పరిశీలిస్తామని, రిజిస్టర్ చేయించుకున్న వారి డాక్యుమెంట్లు ముందుగా, రాజమహేంద్రవరంలో 8638 మంది రిజిస్టర్ చేయించుకున్నారని ఎస్పీ రాజకుమారి తెలిపారు.

నూజీవీడు పోలీసుల తీరుపై ఎస్పీ సీరియస్

కృష్ణా :నూజీవీడు పోలీసుల తీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఎస్ఐ కు అనుకూలంగా వ్యవహరించేలా పోలీసుల తీరు, ఉందని వేధింపులకు గురైన మహిళను పట్టణంలో లేకుండా పోలీసులు బయటకు పంపారు. అంతే కాకుండా ఇంతవరకు కేసు సంబంధించిన వివరాలు బయటపెట్టలేదు.

'ప్రత్యేక హోదాపై యువభేరి పెట్టే అర్హత జగన్ కు లేదు'

అమరావతి: జగన్ ఉనికిని కాపాడుకోవడానికి యువభేరి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రత్యేక హోదాపై యువభేరి పెట్టే అర్హత జగన్ కు లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత జగన్ ను ప్రజలు మర్చిపోయారన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

13:54 - October 10, 2017

హైదరాబాద్ : హీరో పవన్‌ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం కలిగింది. పవన్‌ భార్య అన్నాలెజ్నెవా ఇవాళ కుమారుడికి జన్మనిచ్చింది. తన సంతోషాన్ని పవన్‌ అభిమానులతో పంచుకున్నారు. కుమారుడిని చేతుల్తో అపురూపంగా పట్టుకున్న ఫోటోను పవన్‌ ట్వీటర్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  

13:53 - October 10, 2017

 

నల్లగొండ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో శిశువు మృతి చెందింది. డాక్టర్ శోభారాణి వల్లే తన శిశువు చనిపోయిందని బాధితులరాలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

తణుకులో రాంప్రసాద్ రావు ఇంటిపై ఏసీబీ దాడులు

ప.గో: తణుకులో రాంప్రసాద్ రావు ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. మీరట్ లో ఫారెస్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ గా రాం ప్రసాద్ పనిచేస్తున్నారు. అక్రమాస్తులు కలిగిఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు చేపట్టింది.

'ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి ప్రజాస్పందన బాగుంది'

అమరావతి: ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి ప్రజాస్పందన బాగుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని, ప్రజల సానుకూలతతో పాటు నేతల ప్రవర్తన ముఖ్యమన్నారు. ఈ రెండు సమన్వయం చేసుకుంటే శాశ్వతంగా అధికారం మనదేనన్నారు. పవన్ కల్యాణ్ పై పితాని మామూలుగా మాట్లాడేశారని, సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చినపుడు గౌరవంగా ఆయన్ని పంపాలని, అనంతపురంలో వరదలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు.

13:44 - October 10, 2017

కృష్ణా : జిల్లా నూజివీడు ఎస్సై వెంకటకుమార్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళ జిల్లా SPకి ఫిర్యాదు చేశారు. తమ ఆఫీసులోని ఫైలు కనిపించడంలేదని భార్యా, భర్తలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా కలిసిన మహిళపై ఎస్సై వెంకటకుమార్‌ కన్ను పడింది. లాడ్జికి రావాలంటూ ఫోన్‌లో తనను లైంగికంగా తనకు ఎస్సై వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్‌ టేపులను జిల్లా ఎస్పీకి అందచేశారు. మరింత సమాచారం కసం వీడియో చూడండి.

13:42 - October 10, 2017

చిత్తూరు : జిల్లాలో రాంగోపాల్ వర్మ హల్ చల్ చేశారు. ఆయన ఎన్టీఆర్ మూవీ నిర్మాత రాకేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. రాకేశ్ రెడ్డి పలమనేరు వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. వీరి భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్

విశాఖ: వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. విశాఖ భూ కుంభకోణాల్లో నా పాత్ర ఉందని నిరూపించాలని డిమాండ్ చేశారు. భూ స్కామ్ కు సంబంధించి ఆధారాలుంటే సిట్ కు ఇవ్వాలని, ఆరోపణలు చేయడం ప్రతిపక్షానికి అలవాటైందని లోకేష్ విమర్శించారు. లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తైంది, గృహప్రవేశాలు కూడా చేయించామన్నారు. అనుమానం ఉంటే ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమన్నారు. తిరుపతిలో జోహో సంస్థ సాయంతో మేజర్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ విజయవంమైందన్నారు. 2019 నాటికి ఐటీలో లక్ష, ఎలక్ర్టానిక్స్ లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

13:30 - October 10, 2017

 

హైదరాబాద్ : భారీవర్షాలకు హైదరాబాద్‌లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నాచారంలో నాల ఉప్పొంగి రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటకం ఎదురైంది. ఎగుప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదల ఇంకా ఉధృతంగానే వస్తోంది. దీంతో నాచారంలో నాల ఉప్పొంగి రోడ్లను నింపెస్తోంది. 

13:28 - October 10, 2017

మహబుబ్ నగర్ : జిల్లాలో జలాశయాలు కళకళ్లాడుతున్నాయి. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. జలాశయం పూర్తిగా నిండటంతో ఆయకట్టురైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

ఫార్మ సిటీపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్: హెచ్ఐసీసీలో ఫార్మ సిటీపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సిటీలో ఫార్మా సిటీపై అనుమానాలున్నాయని, పొల్యూషన్ తో తీవ్ర ఇబ్బందులున్నాయన్నారు.

నవంబర్ 2 నుంచి పాదయాత్ర: జగన్

అనంతపురం: నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనంతపురంలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఆరు నెలల్లో 3 వేల కి.మీ పైగా పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇడుపుల పాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.

13:20 - October 10, 2017

సెన్షేనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపుదిద్దుకోబోతుంది. ఈ సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యహరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ మరో ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూట్ మొదలుపెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి ఈ చిత్రం గురించి డీటేల్స్ వెల్లడించాడు వర్మ.

13:20 - October 10, 2017

హైదరాబాద్ : అమిత్‌షా కుమారుడు కంపెనీకి పై చర్యలు తీసుకోవాలని తెలంణ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌చేశారు. ట్యాంక్‌బండ్‌ అంబెద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అమిషా కుమారుడి కంపెనీపై సీబీఐచేత దర్యాప్తు చేయించాలన్నారు. అవినీతిని సహించనని చెబుతున్న ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధక్షుడు అమిత్‌షా తనయుడి విషయంలో స్పందించాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేశారు. 

13:16 - October 10, 2017

 

ప్రముఖ రచయత ఎంవీఎస్ హరరినాథరావు మృతి పట్ల హీరో గోపీచంద్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిదన్నారు. ఒక రచయతగా, డైలాగ్ రైటర్ గా తెలుగు సినిమాకి ఎంవీఎస్ హరినిథరావు అందించిన విశేషమైన సేవల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాననగారికి కాకా నాకు కూడా హరినాథరావు మంచి సన్నిహిత్యం ఉందేది. నేనే 'బాబాయ్' అని పిలుచుకునే వ్యక్తి నేడు మా మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నామని గోపిచంద్ తెలిపారు.  

13:10 - October 10, 2017

కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో సంక్రాతికి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ 102వ సినిమా పేరు 'కర్ణ' అనే టైటిల్ దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఆ చిత్ర యూనిట్ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు కుంభకోణం‌లో ఇటీవల మేజర్ షెడ్యూల్ జరగ్గా.. ఇపుడు హైదరాబాద్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్‌ చేస్తున్నారట.ఈ ప్రాజెక్టుకి ‘కర్ణ’ అనే తొలుత జయసింహ, రెడ్డిగారు లాంటి టైటిల్స్ అనుకున్నా స్టోరీకి తగ్గట్టుగా కర్ణ అయితే బాగుంటుందని యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్‌కు ఆకట్టుకునేలా స్టోరీ వుంటుందని యూనిట్ టాక్ మాట. నయనతార, నటాషా, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, మురళీ‌మోహన్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 

ఏపీ, కర్ణాటక రైతుల మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత

అనంతపురం: మడకశిరలో స్వర్ణముఖి నది కట్ట తెగింది. కర్ణాటకకు వెళ్తున్న ఆగళి చెరువుకు రావాల్సిన నీరు నది కట్టను సరి చేసేందుకు ఏపీ రైతులు ప్రయత్నించారు. ఏపీ రైతులను కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ, కర్ణాటక రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురంలో వైసీపీ యువభేరీ

అనంతపురం: అనంతపురంలో వైసీపీ యువభేరీ జరిగింది. ఈకార్యక్రమంలో ఆపార్టీ అధినేత జగన్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని పాలకులు పక్కన పెట్టారని, ప్రత్యేక హోదా కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. వైసీపీ ప్లీనరీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేశామన్నారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు నిరాహార దీక్షలు జరిగాయని, మేం చేస్తున్న నిరవధిక దీక్షలను భగ్నం చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తుంటే బంద్ ను విఫలం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. రూ.1.30 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు.

నల్గొండ జిల్లాలో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి పర్యటన

నల్గొండ: జిల్లాలో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం ఆస్పతిలో 150 పడకల అదనపు భవనం, మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు.

బిజెపి నేతలు అవినీతిలో కూరుకుపోయారు: ఉత్తమ్

హైదరాబాద్: అమిత్ షా కుమారుడి అవినీతిపై జుడీషియల్ విచారణ జరిపించాలని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ట్యాంక్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉతమ్ మాట్లాడుతూ.. బిజెపి నేతలు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. అవినీతిపై రోజూ నీతులు చెప్పే మోదీకి బిజెపి నేతల అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

 

12:11 - October 10, 2017

కడప : జిల్లా కొండాపురం మండలంలో పెన్నానది పోటెత్తిడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట ప్రాజెక్టు 4టీఎంసీల నీరు చేరుకుంది. ముద్దనూరు మండలం కోసినేపల్లి వాగలో పడిన వ్యక్తి పోలీసులు రక్షించారు. పూర్తి వివరాలకు వీడయో క్లిక్ చేయండి.

12:10 - October 10, 2017

 

మేడ్చల్ : జిల్లాలో దారుణం జరిగింది. గుంటూరు చందిన ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. గట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరు తరలించాలని కుటుంబ సభ్యులకు నిందితులు వార్నింగ్ ఇచ్చాని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:03 - October 10, 2017

 

నిజామాబాద్ : ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుంటే.. తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ప్రాజెక్టులో ఇంతవరకు భారీగా నీరు చేరుకోలేదు. ప్రస్తుతం 1094 అడుగులు మాత్రమే ఉంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:02 - October 10, 2017

 

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడలో కోచింగ్ సెంటర్ హాస్టల్ లో విషాదం నెలకొంది. సురేశ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేశ్ శ్రీకాకుళం చెందిన వాడిగా తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:02 - October 10, 2017

 

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్‌నుంచి విదర్బ,తెలంగాణ, కర్నాకట వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతారణ కేంద్ర అధికారులు తెలిపారు. 

12:01 - October 10, 2017

హైదరాబాద్: కట్నం తీసుకుంటున్న వారి పెండ్లిళ్లకు హాజరుకావద్దని ప్రజలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం నిర్వహించే లోక్‌సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనను పెండ్లికి పిలిచేవారు వరకట్నం తీసుకోలేదని అందరిముందు ప్రకటించాలని నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రచారానికి మద్దతుగా వచ్చే జనవరి 21న మానవహారం నిర్మించనున్నట్టు తెలిపారు. తన పెండ్లి 1973లో జరిగిందని, తాను కట్నం తీసుకోలేదని ఒక ప్రశ్నకు బదులు గా చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో బీహార్ 26వ స్థానంలో ఉన్నదని, వరకట్న వేధింపులు, మరణాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత రెండోస్థానంలో ఉన్నదని వివరించారు. 2016 లో దేశవ్యాప్తంగా వరకట్న కేసులు 4,852 నమోదుకాగా.. బీహార్‌లో 987 నమోదయ్యాయని తెలిపారు.

12:01 - October 10, 2017

అనంతపురం : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గుత్తి గుంతకల్‌, పామిడి, తాడిపత్రి, పుట్టపర్తి, హిందూపురం, గోరంట్ల, కదిరి, శింగనమల ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. వర్షపు నీటితో పాటు పాములు, పురుగులు ఇళ్లల్లోకి వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సహాయక చర్యలు కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరో వైపు గుత్తి మండలం పాతకొత్త చెరువులో రైల్వే ట్రాక్‌పైకి వర్షపు నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

12:00 - October 10, 2017

 

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ భేటీ ప్రారంభమైంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై పార్టీ నేతలు చర్చించనున్నారు. అటు ఈ మధ్యాహ్నం 3గంటలకు కేబినెట్‌ సమావేశం కూడా జరగనుంది. వివిధసంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. దాంతోపాటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలతోపాటు చక్రపాణి కమిటీ నివేదికపై కూడా కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. 

11:58 - October 10, 2017

 

హైదరాబాద్ : నగరాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రామాంతరపూర్ చెరువు నీరు కాలనీల్లోకి చేరుతోంది. పలు కాలనీలు వర్షపునీటితో నిలిచిపోయా. పదిరోజులుగా జనం నానా అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:57 - October 10, 2017

 

హైదరాబాద్ : అమిత్‌షా కుమారుడు కంపెనీకి పై చర్యలు తీసుకోవాలని తెలంణ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌చేశారు. ట్యాంక్‌బండ్‌ అంబెద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అమిషా కుమారుడి కంపెనీపై సీబీఐచేత దర్యాప్తు చేయించాలన్నారు. అవినీతిని సహించనని చెబుతున్న ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధక్షుడు అమిత్‌షా తనయుడి విషయంలో స్పందించాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేశారు. 

11:56 - October 10, 2017

చిత్తూరు : జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ సిరిచందన కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. సిరిచందనను చంద్రగిరి పీఎస్‌కు తీసుకొచ్చారు. అయితే తన భార్యను కిడ్నాప్‌ చేశారని సిరిచందన భర్త నవీన్‌కుమార్‌ అంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నామన్న కోపంతోనే సిరిచందన తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని నవీన్‌కుమార్‌ ఆరోపిస్తున్నారు. వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:56 - October 10, 2017

తాలింపు దినుసుల్లో ముఖ్యమైంది జీలకర్ర. జీలకర్ర దినుసు మాత్రమే కాదు.. దివ్యౌషధం. ఆహారానికి మంచి రుచిని, సువాసనను ఇచ్చే జీలకర్రను చాలా మంది ఇష్టపడతారు. దాని వల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడయినా ఆలోచించారా.. లేదంటే మాత్రం ఇది చదవాల్సిందే.

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి శరరీంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ కాలంలో చిన్నారులకు తినిపించే ఆహారంలో జీకర్ర ఉండేలా చూసుకోవడం మంచిది. రకరకాల ఇన్ ఫెక్షన్లూ తగ్గుముఖంపడతాయి. కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి కాసేపయ్యాక వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

లోబీపీ ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని. మధుమేహం ఉన్న వారికీ ఇది మేలు చేస్తుంది. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది.

జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్రతో చేసిన టీని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

11:55 - October 10, 2017

 

గుంటూరు : జిల్లా తెనాలి బుర్రిపాలెంలో రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. నెహ్రూ నికేతన్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని సెయింట్‌ మేరీస్‌ మహిళా కాలేజీ బస్సు ఢీకొట్టింది. బాలిక స్కూలుకు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

11:54 - October 10, 2017

హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనం అస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కుషాయిగూడ నాగార్జున కాలనీ వద్ద స్కూల్‌బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. రోడ్డుమీద వర్షపునీరు నిలవడంతో బస్సు అదుపుతప్పి మురుగుకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. 

11:53 - October 10, 2017

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో కాలుష్యం ప్రజలను భయపెడుతోంది. ఆల్వీన్‌కాలనీ ధరణీనగర్‌లో కెమికల్‌ నురగ కలకలంగా మారింది. వర్షాలు పడుతుంటంతో.. పలు ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రసాయన పరిశ్రమల నుంచి వ్యర్థాలు చెరువుల్లో, నాలాల్లో కలవడం వల్ల వర్షాలు వచ్చినపుడు నురగలు పెద్ద ఎత్తున లేస్తున్నాయి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:52 - October 10, 2017

అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గుత్తి గుంతకల్‌, పామిడి, తాడిపత్రి, పుట్టపర్తి, హిందూపురం, గోరంట్ల, కదిరి, శింగనమల ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. వర్షపు నీటితో పాటు పాములు, పురుగులు ఇళ్లల్లోకి వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సహాయక చర్యలు కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరో వైపు గుత్తి మండలం పాతకొత్త చెరువులో రైల్వే ట్రాక్‌పైకి వర్షపు నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జైషా అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలి:టి.కాంగ్రెస్

హైదరాబాద్: ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టి.కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ సా కుమారుడు జైషా అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నాల, దానం, అంజన్,అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాద్: ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. రాష్ట్రంలో నిర్మించబోయే ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు, రహదారులపై చర్చించినట్లు సమాచారం.

గుంటూరు యువకుడు నగరంలో దారుణ హత్య

హైదరాబాద్: గుంటూరు యువకుడు నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణం అని అనుమానం వ్యక్తం అవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరుకు తరలించాలని దుండగులు కుటుంబ సభ్యులను బెదరించారు. యువకుడి మృతదేహాన్ని గుంటూరుకు మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

టిడిపి సమన్వయ కమిటీ ప్రారంభం

అమరావతి: టిడిపి సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న తీరు, సమస్యల పరిస్కారం, జిల్లా పార్టీ స్థితిగతులపై ఈ సమావేశం చర్చించనున్నట్లు సమాచారం.

ఓయూలో జనవరి 3 నుంచి సైన్స్ కాంగ్రెస్ సభలు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే జనవరి 3 నుంచి 105వ సైన్స్ కాంగ్రెస్ సభలు జరుగుతాయి. ఐదురోజులపాటు జరిగే ఈ సమావేశాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సభలలో పాల్గొంటారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య తదితర రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను సూచిస్తారని భారతీయ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్‌కుమార్ చక్రబర్తి కోయంబత్తూరులో మీడియాకు తెలిపారు.

 

జమ్మలమడుగులో భారీవర్షం

కడప: జమ్మలమడుగులో భారీవర్షం కురుస్తోంది. ముద్దనూరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు కాలనీలు నీటమునిగాయి. కొండాపురంలో పెన్నానది పోటెత్తింది. గండికోట ప్రాజెక్టులో 4 టీఎంసీల నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

గుంటూరు: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి మంత్రి మాణిక్యాలరావు, పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కంభంపాటి తదితరులు హాజరయ్యారు.

11:00 - October 10, 2017

 పవన్ రాసిన ఆ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ..ఇజం పుస్తకం కంటే పవనిజమే నచ్చిందని, ప్రస్తుతం సొసైటీకి కావాల్సింది వంద శాతం పవనిజమే నని రాసుకొచ్చాడు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. పవన్ పార్టీ పెట్టిన మొదలు ఆయన ప్రసంగం వరకు ఇలా అనేక అంశాలను అందులో ప్రస్తావించాడు. మీరు పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైందని, పుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ జ్ఞానం మీలోవుందని గుర్తుచేశాడు. కంక్లూజన్‌లో ‘ఇజం’ పుస్తకం తనను నిరాశపరిచిందని, కానీ తనకు పవనిజంపై నమ్మకం ఉందని వర్మ ఓపెన్ లెటర్ ఒకటి పోస్ట్‌ చేశాడు.

ప్రకాశం జిల్లాలో డెంగ్యూతో నలుగురు మృతి

ఒంగోలు: ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో లోకిరెడ్డి హేమలత, మేడగం బ్రహ్మారెడ్డి అనే నలుగురు డెంగ్యూతో మృతిచెందారు. అలాగే ఆ గ్రామానికి చెందిన పలువురికి డెంగ్యూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే... దర్శిలో డెంగ్యూ జ్వరంతో 9 నెలల చిన్నారి మృతిచెందింది. అంతేగాక కనిగిరి మండలం చింతలపాలెంలో డెంగ్యూతో బాలుడు మృతిచెందాడు. కాగా... జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తుండడంతో ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వైద్యఆరోగ్య శాఖాధికారులు స్పందించి ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.

గుత్తి రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు..

అనంతపురం: జిల్లాలో భారీ వర్షం పడుతోంది. గుత్తి మండలం పాతకొత్తచెరువులో రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు చేరింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మురికి కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

మేడ్చల్ : కుషాయిగూడ నాగార్జున నగర్ లో స్కూల్ బస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి మురికి కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. బస్సులోని 11 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

నూజివీడు ఎస్ఐ పై లేంగిక వేధింపులు ఆరోపణలు

కృష్ణా: నూజివీడు ఎస్ఐ పై లేంగిక వేధింపులు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పీఎస్ కు మహిళ వెళితే ఎస్ఐ వెంకటకుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోస్టు చేసి ప్రైవేటు ప్రాంతానికి రావాలని బెదిరించాడని, ఎస్ఐ వెంకట కుమార్ పై జిల్లా ఎస్పీకి మహిళ ఫిర్యాదు చేసింది. విచారణకు అదేసించిన ఎస్పీ, ఎస్ ఐను లీవ్ లో పంపించారు.

కర్నూలు జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం

కర్నూలు: ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఎమ్మిగనూరులో కాలనీలు జలమయమైయ్యాయి. సోమప్పనగర్ లో ఇళ్లలోకి నీరు చేరడంతో చేనేత మగ్గాలు తడిసిపోయాయి. జలవాడి, కంభందింనే దగ్గర రెండు బైకులు గల్లంతయ్యాయి. చిన్నకొత్తపల్లి, పెద్దకొత్తపల్లిలో పంటలు నీట మునిగాయి. మంత్రాలయం, నాగలదిన్నెలో రాకపోకలు నిలిచిపోయాయి. గోనగొండల, అ్రగహారం దగ్గర వర్షానికి వంతెన కుంగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

నగరంలో భారీగా ట్రాఫిక్

హైదరాబాద్ : హైదరాబాద్‌ను భారీవర్షాలు వదలడం లేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో సీటీజనం నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిపడింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చీబౌలీ, కొండాపూర్‌ ఏరియాల్లో గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. నాలాలు పొంగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలు పొంగిపోర్లుతున్న వాగులు

 

కర్నూలు : పట్టణంలో వరదభయం నెలకొంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వక్కెరవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో కొత్తబస్టాండ్‌ ఏరియాలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతిసారి వర్షాలు వర్షాలు రావడం వరదనీరు పోటెత్తడం పరిపాటిగా మారిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

వీడిన కిడ్నాప్ మిస్టరీ

చిత్తూరు : జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ సిరిచందన కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. సిరిచందనను చంద్రగిరి పీఎస్‌కు పోలీసులు తీసుకొస్తున్నారు. అయితే తన భార్యను కిడ్నాప్‌ చేశారని సిరిచందన భర్త నవీన్‌కుమార్‌ అంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నామన్న కోపంతోనే సిరిచందన తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని నవీన్‌కుమార్‌ ఆరోపిస్తున్నారు. 

09:31 - October 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. స్వైన్‌ మహమ్మరి హడలెత్తిస్తోంది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రబలడం జనాల్లో దడ పుట్టిస్తోంది. కొంత కాలంగా వర్షాలు తీవ్రమవడంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో 15 మంది చికిత్స పొందుతున్నారు. వారికి నలుగురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గాంధీ ఆస్పత్రిలో ఈ యేడాది మొత్తం 186 మంది స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరగా.. వారిలో 143 మందికి వ్యాధి నయమవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంవత్సరం 38 మంది చనిపోయినట్లు సమాచారం.

రోగ‌నిరోద‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి
వాతావరణంలో మార్పులకు తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో... స్వైన్‌ప్లూ వైర‌స్ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోగ‌నిరోద‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి ఈ వైరస్‌ సోకుతుంద‌ంటున్నారు. ఇమ్యూనిటీ పవర్‌ తక్కువ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి పాటు ప్రైవేటు ఆస్పత్రులు విష జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నా..క్షేత్రస్థాయిలో వ్యాధిని అరికట్టేందుకు ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వైన్‌ఫ్లూ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. అప్రమత్తంగా లేకపోతే స్వైన్‌ఫ్లూ వైరస్‌ను అరికట్టడం చాలా కష్టమంటున్నారు. 

09:29 - October 10, 2017

 

చిత్తూరు : జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ సిరిచందన కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. సిరిచందనను చంద్రగిరి పీఎస్‌కు పోలీసులు తీసుకొస్తున్నారు. అయితే తన భార్యను కిడ్నాప్‌ చేశారని సిరిచందన భర్త నవీన్‌కుమార్‌ అంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నామన్న కోపంతోనే సిరిచందన తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని నవీన్‌కుమార్‌ ఆరోపిస్తున్నారు. వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:28 - October 10, 2017

 

కర్నూలు : పట్టణంలో వరదభయం నెలకొంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వక్కెరవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో కొత్తబస్టాండ్‌ ఏరియాలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతిసారి వర్షాలు వర్షాలు రావడం వరదనీరు పోటెత్తడం పరిపాటిగా మారిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:27 - October 10, 2017

 

హైదరాబాద్ : హైదరాబాద్‌ను భారీవర్షాలు వదలడం లేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో సీటీజనం నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిపడింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చీబౌలీ, కొండాపూర్‌ ఏరియాల్లో గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. నాలాలు పొంగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రామాంతపూర్‌ చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మోకాటిలోతు నీటిలో జనం రాత్రంతా భయంగుప్పిట్లోనే గడుపేశారు. ఆల్వీన్‌కాలనీ, లెనిన్‌నగర్‌, మిథిలానగర్‌లలో వరదనీటి ఉధృతితో జనం భయపడుతున్నారు. వర్షం ఉన్నా లేకున్నా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం వదలడంలేదు. ఉదయం నుంచే ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:26 - October 10, 2017

గుంటూరు : మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న తరుణంలో రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాల ప్రారంభం సహా వివిధ అంశాలుపై చర్చించేందుకు AP మంత్రివర్గం ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. కొత్తగా సామాజిక పెన్షన్ల మంజూరు, చేతివృత్తుల వారికి చేయూతనిచ్చే ఆదరణ పథకం పునరుద్ధరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్పొరేట్‌ కాలేజీల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై చక్రపాణి కమిటీ సిఫారసుల అమలుపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో CRDAతోపాటు APIIC ద్వారా వివిధ సంస్థలకు భూములు కేటాయించడంపై నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు మూడు దేశాల విదేశీ పర్యటనకు వెళ్లే ముందు జరుగనున్న మంత్రివర్గ భేటీలో రాజధాని అమరావతి డిజైన్లపై కూడా చర్చించే అవకాశం ఉంది. 

09:26 - October 10, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ను భారీవర్షాలు వదలడం లేదు. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో సీటీజనం నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టిపడింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చీబౌలీ, కొండాపూర్‌ ఏరియాల్లో గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. నాలాలు పొంగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రామాంతపూర్‌ చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మోకాటిలోతు నీటిలో జనం రాత్రంతా భయంగుప్పిట్లోనే గడుపేశారు. ఆల్వీన్‌కాలనీ, లెనిన్‌నగర్‌, మిథిలానగర్‌లలో వరదనీటి ఉధృతితో జనం భయపడుతున్నారు. వర్షం ఉన్నా లేకున్నా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం వదలడంలేదు. ఉదయం నుంచే ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:32 - October 10, 2017

కేరళలో రాగులుతున్న అందరు ఖండిస్తున్నామని, అక్కడ బీజేపీ హత్య రాజకీయాలు ప్రొత్సహిస్తోందని, గవర్నర్ ద్వారా విచారణ చేయించాలి తప్ప ఇలా గొడవ దిగడం సమాంజసం కాదని, పార్టీ కార్యాలయాల ముందు వెళ్లడం మంచి పద్దతి కాదని కాంగ్రెస్ నేత రామచంద్ర రెడ్డి అన్నారు. బీజేపీ జనరక్షక్ యాత్ర బీజేపీ కార్యకర్తల కోసం చేస్తోందని, బీజేపీ ఎప్పుడు శాంతియుతంగా యాత్ర చేస్తోందని, రక్తపాతం ప్రజాస్వామ్యాంలో పనిరాదని, చాలా స్పష్టంగా నిరసన తెలియజేసే హక్కు ఉందని బీజేపీ నేత నరేష్ అన్నారు. వారి ఉద్దేశం శాంతయుతమైతే పినరమ్ గెలిచిన విజయోత్సవ ర్యాలీ పై ఎందుకు దాడి చేశారని, ఈ రోజు 120 రేపు 200 కావచ్చు ఇవన్నీ బుటకపు మాటలని, మధ్యప్రదేశ్ పర్యటనకు పినరయ్ విజయన్ వెళ్తామంటే ఆ రాష్ట్ర సీఎం అడ్డుకున్నారు. హత్య రాజకీయాలు ఆర్ఎస్ఎస్ అలవాటని ఐద్వా నాయకురాలు రమాదేవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:31 - October 10, 2017

 

నాలుగు చక్రాల బండికి రెండు రోజులు బ్రేక్‌ పడింది. సరకు రవాణా స్తంభించిపోయింది. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులు లారీల సమ్మె జరుగుతోంది. కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు చేసినాటి నుంచి రవాణాపై తీవ్ర ప్రభావం పడిందని, అలా రెండు మూడు నెలల అష్టకష్టాలు పడి నెట్టుకొచ్చామని, తర్వాత జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటిని నుంచి మళ్లీ కథ మొదటికొచ్చిందని, ఒక్కొసారి ఈవే బిల్లు రావాలంటే రెండు మూడు రోజులు పడుతోందని, అలాగే వాహనాలు కొనెటప్పుడు ట్యాక్స్ లు విధిస్తున్నారని ఏపీ లారీ ఓనర్ అసోషియెసన్ అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

07:30 - October 10, 2017

గౌహతి : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 3 మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ సిరీస్‌లోని కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.గువహటీ బర్సాపరా స్టేడియం వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌కు, 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ...డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది. తొలి టీ20లో శుభారంభం చేసిన భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో సిరీస్‌ ఆధిక్యంలో ఉంది.రాంచీ టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో సులువుగా నెగ్గిన విరాట్‌ ఆర్మీ..సెకండ్‌ టీ 20తోనే సిరీస్‌ దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌
ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీ,రాహుల్‌, ధోనీ, మనీష్‌ పాండే,కేదార్‌ జాదవ్‌లతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.హార్దిక్‌ పాండ్య,అక్షర్‌ పటేల్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లతో లోయర్‌ ఆర్డర్‌లోనూ బలంగా ఉంది.ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానేమే లేదు. భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి పేస్‌ బౌలర్లతో బౌలింగ్‌ ఎటాక్‌ మునునెన్నడూ లేనంతలా పదునుగా ఉంది.నయా సెన్సేషన్స్‌ కుల్దీప్‌ యాదవ్‌,యజ్వేంద్రచహాల్‌ వంటి లెగ్‌ స్పిన్‌తో ఎంతలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తొలి టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే భారత్‌ రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టాప్‌ ర్యాంకర్‌గా ఉన్న టీమిండియా...3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌ చేస్తే టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంటుంది.

డైలమాలో కంగారూ టీమ్‌
మరోవైపు తొలి టీ20లో తేలిపోవడంతో పాటు ...కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ సిరీస్‌ మొత్తానికి దూరమవ్వడంతో కంగారూ టీమ్‌ డైలమాలో పడింది.డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలో మరోసారి బరిలోకి దిగబోతోన్న ఆస్ట్రేలియా జట్టు..కొహ్లీ సేన జోరుకు ఎలా అయినా చెక్‌ పెట్టాలని పట్టుదలతో ఉంది.బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తోన్నా...బ్యాటింగ్‌లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది. ఆరోన్‌ ఫించ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా..మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో కంగారూ టీమ్‌ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది.అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించలేకపోతే ఆస్ట్రేలియా జట్టు టీ20 సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.ఇక 20-20 ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ ఆస్ట్రేలియాపై ఇండియాకు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 14 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్‌ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. టీ20ల్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు...పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో దుర్భేధ్యంగా ఉన్న భారత జట్టుకు కంగారూ టీమ్‌ కనీస పోటీ అయినా ఇవ్వగలదో లేదో చూడాలి. 

07:29 - October 10, 2017

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో ఇసుక విషయంలో తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎంపీ గల్లా జయదేవ్‌ వర్గం పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. తుళ్లూరు మండలంలోని అన్ని క్వారీలను ఎమ్మెల్యే తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. మొన్నటి వరకు అంతర్గతంగానే ప్రత్యారోపణలు , కుమ్ములాడుకున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు బాహాబాహీకి దిగాయి. రాయపూడి ఇసుక రీచ్‌లో ఇరువర్గాలు గొడవకు దిగాయి. సీఎం నివాసం, ఏపీ పరిపాలన కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఇది జరిగింది.

ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ ఇష్టారాజ్యంగా
ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎంపీ జయదేవ్‌ వర్గం ఆరోపిస్తోంది. రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉంటూకూడా తమ ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుకను తీసుకెళ్లనివ్వకుండా ఎమ్మెల్యేవర్గం అడ్డుకుంటోందని మండిపడ్డారు. వాస్తవానికి ఏపీ రాజధాని ప్రాంతంలో మొత్తంగా 6 ఇసుక క్వారీలు ఉన్నాయి. భవిష్యత్‌ రాజధాని అవసరాలకు ఇక్కడి ఇసుకను ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాజధాని అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన ఇసుక కాస్తా బయటి ప్రాంతాలకు తరలిపోతోంది. 5 క్వారీలను ఎమ్మెల్యే అనుచరులే నడుపుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు.

తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత ఇసుకలోనూ తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. రీచ్‌లపై ఆధిపత్యం కోసం ఒకవర్గంపై మరోవర్గం గొడవకు దిగుతోంది. ఇలా బహిరంగంగానే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను వేల రూపాయలకు విక్రయిస్తున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. దీంతో సర్కార్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

07:28 - October 10, 2017

నెల్లూరు : న్యూటాక్స్‌ హాలు దగ్గర చెత్త ఏరుకునే వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఓ గ్రూప్‌కు చెందినవారు... మరో గ్రూప్‌కు చెందిన ముగ్గురి గొంతులను కత్తితో కోశారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

07:27 - October 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎట్టకేలకు పార్కింగ్‌ పాలసీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మున్సిపాలిటీల్లో, నగరాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీతో పార్కింగ్‌ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. దీనినే అదునుగా తీసుకుని ప్రైవేట్‌ వ్యాపారులు తమ భవనాల్లో పార్కింగ్‌ స్థలంలో ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. ప్రతి షాపు,షాపింగ్ మాల్‌, రెస్టారెంట్లు, బహుల అంతస్థుల భవనాలు అన్ని తప్పనిసరిగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలి. తమ దగ్గరికి వచ్చే వినియోగదారులకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉండాలి. కానీ హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ప్రైవేట్‌ పార్కింగ్‌ ఒక మాఫియాగా తయారైంది. గంటల చొప్పున ధరలు నిర్ణయించి మరీ దోపిడీ చేస్తున్నారు. దీంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది. దీంతో ఇష్టారీతిగా వసూలు చేస్తోన్న పార్కింగ్‌ ఫీజులపై వాహనదారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు పాలసీకి ఆమోదముద్ర వేసింది.

అమలుచేసేలా కఠిన చర్యలు
ప్రభుత్వం రూపొందించిన పార్కింగ్‌ విధానం ప్రకారం ఆన్‌ స్ట్రీట్‌పార్కింగ్‌, షార్ట్‌ స్టేపార్కింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్థలాలు, బస్సు, రైల్వేస్టేషన్లు, ప్రైవేటు ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక కొత్తగా నిర్మించే భవనాల్లో పార్కింగ్‌ సౌకర్యాన్ని అమలుచేసేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా నిర్మించే భవనాల్లో అదనపు అంతస్తులను కేవలం పార్కింగ్‌ కోసం మాత్రమే నిర్మించే వారికి పలు రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు వారికి ఆస్తిపన్నులో వందశాతం రాయితీ ఇవ్వనున్నారు.

ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు
పార్కింగ్‌ సమస్య పరిష్కారం కోసం ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌ భవనాలు నిర్మించేలా ప్లాన్‌ చేస్తున్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వాటిని నిర్వహించనున్నారు. ఇప్పటికే సిటీలో ఖాళీగా ఉన్న భూముల్లో పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు లోకల్‌ బాడీలు లైసెన్సులు మంజూరు చేయనున్నాయి.

07:26 - October 10, 2017

హైదరాబాద్ : గులాబి పార్టీ నేతలను ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న పార్టీ కీలక పదవుల నియామకం పూర్తయింది. రాష్ట్ర కమిటీ నియామకంలో నాయకులకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. 67 మంది సభ్యులతో కమిటీని ఎంపిక చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కెసిఆర్, పార్టీ సెక్రటరీ జనరల్‌గా కె.కేశవరావ్ కు మరోసారి అవకాశం కల్పించారు. దీంతో పాటు రాష్ట్ర స్థాయి పదవుల్లో పార్టీ ప్రధానకార్యదర్శి, కార్యదర్శులను నియమించారు. వీరందరికీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నారు.

ప్రధానకార్యదర్శులగా 20 మంది
రాష్ట్ర ప్రధానకార్యదర్శులగా 20 మందికి అవకాశం దక్కగా.... కార్యదర్శులుగా 33 మందికి, సహాయ కార్యదర్శులుగా 12 మందిని నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు పార్టీ నేతలు అంటున్నారు. కార్యవర్గంలో 40 మందికి ఒక్కొక్కరికి 3 నియోజకవర్గాల బాధ్యతను కేటాయించనున్నారు. ఎవరికి ఏ నియోజకవర్గాలు కేటాయించే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 12 మంది ప్రధానకార్యదర్శులకు ఒక్కొక్కరికి 10 నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వాహణతో పాటు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలను, పార్టీ శిక్షణా శిబిరాల, ఇతర కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను మిగతా ప్రధాన కార్యదర్శులకు అప్పగించనున్నారు.

సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు
ప్రధాన కార్యదర్శులుగా...ఎమ్మెల్సీ ప్రొ. శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీలు యండీ ఫరీదుద్దీన్, డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, వి. గంగాధర్ గౌడ్, నారదాసు లక్ష్మణ్ రావు, మైనంపల్లి హనుమంతరావు , బి. వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరితోపాటు డాక్టర్‌ బండా ప్రకాశ్ ముదిరాజ్, జె. సంతోష్ కుమార్, మాజీ మంత్రి డా. పి రాములు, ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డిచాగళ్ల నరేంద్రనాథ్, నూకల నరేష్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, సోమ భరత్ కుమార్ గుప్తా, బండి రమేష్, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కార్యవర్గం ఎంపిక ద్వారా అధినేత కేసీఆర్‌ తన టీమ్‌ను సిద్ధం చేసినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

నేడు ఏపీ కేబినెట్ భేటీ

 

గుంటూరు : నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై చక్రపాణి కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చినున్నారు.

నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్

గౌహతి : నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

 

నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్

గౌహతి : నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

కరీంనగర్ రోడ్డు ప్రమాదం

 

కరీంనగర్ : జిల్లా చొప్పదండి మండలం అర్నకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపూరి పోలీస్ జీపును బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

శ్యామ్ ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థి ఆత్మహత్య

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ శ్యామ్ ఇన్ స్టిడ్యూట్ లో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందని సురేష్ గా గుర్తింపు.

Don't Miss