Activities calendar

11 October 2017

21:57 - October 11, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ ...తాను చేపట్టబోయే పాదయాత్ర విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. పాదయాత్రపై పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే... స్థానిక సమస్యలపై ఫోక్‌స్‌ చేయాలని జగన్‌ నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత పాదయాత్ర ప్రారంభం  
నవంబర్‌ రెండో తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేయబోతున్నారు.. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 125  నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ మేరకు జగన్‌.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇతర జిల్లాల్లో ప్రజా సమస్యలపై సభలు-ధర్నాలు నిర్వహించాలని జగన్‌ నేతలకు చెప్పారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నం 
ఈ పాదయాత్ర ద్వారా వైసీపీ శ్రేణుల్లో జోష్‌ నింపడంతో పాటు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు- నిరుద్యోగుల సమస్యల విషయంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిసైడ్‌ అయ్యారు. 
మినహాయింపు వచ్చినా.. రాకున్న పాదయాత్ర
అయితే ఆస్తు కేసులో జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. పాదయాత్ర సందర్భంగా దీనిపై మినహాయింపు ఇవ్వాలని కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు నుంచి మినహాయింపు వచ్చినా.. రాకపోయినా.. పాదయాత్ర చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఉండేందుకు మరోసారి జగన్‌ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. 

21:54 - October 11, 2017

హైదరాబాద్ : వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమలోనూ వర్షాలు భారీగా కురవడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి... పంటలు నీట మునిగాయి. ఇన్‌ ఫ్లో పెరగడంతో... శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటంతో.. గురువారం ఉదయం నీటిని విడుదల చేయనున్నారు.  

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం బెంబేలెత్తుతుంది. నాలాలు, డ్రైనేజిలు పొంగిపొర్లతుండడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి మళ్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు రామాంతపూర్‌ చెరువు పొంగిపొర్లడంతో 10 రోజులుగా కాలనీలు నీటమునిగాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదేవిధంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని ఇసుక వాగు పొంగిపొర్లింది. గ్రామంలోకి ఒక్కసారిగా నీళ్లు రావడంతో.. పలు ఇళ్లలోని సామాగ్రితో పాటు.. పశువులు కొట్టుకుపోయాయి. ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. ఇక కొత్తూరు కాజ్‌వై పై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో 19 పోలవరం ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎన్నో ఏళ్లుగా నిండని ప్రాజెక్టులు ఈసారి జలకళను సంతరించుకుంటున్నాయి. 

అనంతపురం జిల్లాలో యోగి వేమన రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. పెదపప్పూరు మండలంలోని చాగల్లు-పెండెకల్లు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు రావడంతో గండి పడింది. దిగువ ప్రాంతాలకు నీళ్లు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. ఇక తాడిపత్రిలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ వీరపాండ్యన్‌ పర్యటించారు. కాలువలు, చెరువలకు పడిన గండ్లను పరిశీలించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి.. తాత్కాలిక నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. 

కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఆలయంలోకి వర్షపునీరు చేరింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

అనంతపురం జిల్లాలో స్వర్ణముఖీ నదీ జలాల విషయంలో.. మరోసారి ఆంధ్రా, కర్ణాటక రైతుల మధ్య వివాదం చెలరేగింది. కోతకు గురైన వంకకు ఏపీకి చెందిన రైతులు మరమ్మతులు చేసేందుకు వెళ్లగా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో అరటి, వేరుశనగ, పత్తి, ఉల్లి పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరతున్నారు. 

వరుస వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్‌ మొత్తం నీటి సామర్ధ్యం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌లోకి లక్షా 50 వేల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా... 88 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా... అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. 

21:52 - October 11, 2017

సిరిసిల్ల : సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్న కేసీఆర్‌... రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తనను అన్ని విధాలుగా తీర్చిదిద్దిన సిద్దిపేటను... జిల్లా చేయడమే కాకుండా... తన చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రైవేట్‌ వైద్యుల తీరుపై  సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌.. అవసరం లేకున్నా మహిళలకు గర్బసంచులు తొలగించడం దారుణమన్నారు. 
కొత్త కలెక్టరేట్‌కు భూమి పూజ 
రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త కలెక్టరేట్‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. బైపాస్ రోడ్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయం, అపెరల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. సీఎం అనంతరం నూతన కలెక్టరేట్ నమూనాలను పరిశీలించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. 
సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారడం ఆనందం : సీఎం
అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్‌... వెనకబడిన ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల నేడు.. జిల్లా కేంద్రంగా మారడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోతీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. రంగులు, రసాయనాలు, నూలుపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఇక ప్రైవేట్‌ వైద్యుల తీరుపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా మహిళలకు గర్బసంచులు తీసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిని రూపుమాపేందుకు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించి... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చూస్తున్నామన్నారు.
సీఎం మాట్లాడుతుండగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా   
అయితే... కేసీఆర్‌ ప్రసంగిస్తుండగానే ఐదు నిమిషాల పాటు... విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో సిరిసిల్లలో తప్ప మరెక్కడా కరెంట్‌ లేదు.. ఇక్కడంతా సన్నాసులున్నట్లున్నారే అంటూ కేసీఆర్‌ చమత్కరించారు. 
పలు నిర్మాణాలకు కేసీఆర్ శంకుస్థాపన 
ఇక అంతకుముందు కొండపాక మండలం దుద్దెడలో సిద్దిపేట జిల్లా కార్యాలయ కాంప్లెక్స్‌, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సిద్దిపేట తనకు జన్మతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలా అవకాశమిచ్చిందన్నారు కేసీఆర్‌. తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట అని... అది తనకు అనర్గళ గళమివ్వడంతో పాటు.... పోరాట బలమిచ్చిందన్నారు కేసీఆర్‌. సిద్దిపేట జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలు తీసుకురావడంతో పాటు... అద్బుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
కటౌట్‌ కూలి... కార్యకర్త మృతి 
సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు కేసీఆర్‌. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇక సీఎం పర్యటన సందర్బంగా సిద్దిపేట జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం పర్యటన నేపథ్యలో ఏర్పాటు చేసిన కటౌట్‌ కూలి... ఓ కార్యకర్త మృతి చెందాడు. 

21:45 - October 11, 2017

జనగామ : జనగామ జిల్లాను ప్రజలు పోరాడి సాధించుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జనగామ జిల్లా అవతరణ దినోత్సవ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలో జనగామ పేరు లేదన్నారు. జనగామను జిల్లా చేయాలని ముందుగా ప్రతిపాదించింది సీపీఎం అన్నారు. పోరాట గడ్డను ముక్కలు చేద్దామనుకున్నా కేసీఆర్ కుట్రలను భగ్నం చేస్తూ జిల్లా ఏర్పాటుకు సీపీఎం ముందుకు కదిలిందన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం మాట్లాడిన ఏకైక పార్టీ తమ పార్టీ అని తెలిపారు. జిల్లా ఏర్పాటుకు ప్రజలు ఎలా పోరాటం చేశారో... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. 
 

 

21:36 - October 11, 2017

జగిత్యాల : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటను కుల పెద్దలు బహిష్కరించారు. 2015లో గణేష్.. దళితురాలైన శ్రీలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఉపాధి కోసం గణేష్‌ దుబాయ్‌ వెళ్లాడు. అయితే ఆ సమయంలో శ్రీలత తల్లిదండ్రుల వద్దే ఉంది. ఈ మధ్య గణేష్‌ దుబాయ్‌ నుంచి రావడంతో.. మళ్లీ కాపురం పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కుల పెద్దలు దంపతులను కుల బహిష్కరణ చేశారు. దీనిపై దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోకుండా... కులపెద్దలకే మద్దతు నిలిచారు. ఈ విషయం తెలియడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

 

ప్రేమికులను బహిష్కరిస్తూ కుల పెద్దలు తీర్మానం

జగిత్యాల : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ప్రేమజంటను కుల బహిష్కణ చేశారు. నూకపల్లి గ్రామంలో ప్రేమజంటను కుల బహిష్కరించారు. ప్రేమికులను బహిష్కరిస్తూ కుల పెద్దలు తీర్మానం చేశారు. యువతి శ్రీలత దళితురాలు కావడంతో బహిష్కరించారు. 2015 లో గణేష్, శ్రీలత ప్రేమ వివాహం చేసుకున్నారు. 9 మంది కుల పెద్దలపై యువతి శ్రీలత పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కుల పెద్దలకు మద్దతుగా పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

జమ్మలమడుగు కోఆపరేటివ్ బ్యాంకులో రూ.2 కోట్లు గోల్ మాల్

కడప : జమ్మలమడుగులో కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.2 కోట్ల గోల్ మాల్ జరిగింది. పీఎస్ లో చైర్మన్ హృసికేశవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. 

 

ఆధోని పత్తి మార్కెట్ వద్ద ఉద్రిక్తత

కర్నూలు : ఆధోని పత్తి మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

20:56 - October 11, 2017

పురుగులను చంపుతాయనుకున్నారు..  కానీ, వాళ్ల ప్రాణాలనే బలితీసుకున్నాయి..పొలాన్ని బాగు చేద్దామనుకున్నారు... వారి కుటుంబాల్లోనే చీకటి నిండింది.. పంటకు ఆరోగ్యాన్నిస్తుందని నమ్మారు.. కానీ, వారి జీవితాలను ఊహించని పెను ప్రమాదంలోకి నడిపించాయి. రైతన్నలకు అవగాహన లేదు. ప్రభుత్వాలను చిత్తశుద్ధిలేదు. పురుగుమందుల కంపెనీలకు లాభాలు తప్పమరేం అక్కర్లేదు. ఫలితం పత్తిచేనులో రైతన్న కూలిపోతున్నారు. మహారాష్ట్ర లోని విదర్భ, యావత్మల్ ప్రాంతంలో జరుగుతున్న దారుణంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ
శ్రమకు గుర్తింపు లేదు...
శ్రమకు గుర్తింపు లేదు... కష్టాలకు పరిష్కారం చూపరు.. ఇప్పుడు ప్రాణానికి కూడా విలువలేదని తెలుస్తోంది. ఎవరు వీళ్లు... ఎవరిదీ పాపం...విధివంచితులా? ప్రకృతి ప్రకోపానికి బలవుతున్న అమాయకులా? లేక సర్కారు నిర్లక్ష్యానికి బలైన అభాగ్యులా? ఓవరాల్ గా దేశమంతటా రైతన్నది ఒకే కష్టం. ఒకే కన్నీటి గీతం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

20:53 - October 11, 2017

కొత్త జిల్లాల యాడాది మాష్కం, డీఎస్సీ ప్రకటన ఎన్క అసలైన కుట్ర, యోగిని సీఎం జేశింది పాలమూరు బిడ్డే, ఎన్టీఆర్ సీన్మకు జగన్ పెట్టుబడి... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:50 - October 11, 2017

కేరళలో దళిత పూజారుల నియమాకం హర్షణీయమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్సింహ్మారెడ్డి, సామాజిక విశ్లేషకులు డా.శ్రీపతి రాముడు, బ్రాహ్మణ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్, హిందూ దేవాలయ అర్చకుల పీఠం...కమలానంద భారతి పాల్గొని, మాట్లాడారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 'కేరళలోని వామపక్ష ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా దళితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. దేవాలయంలోనికే ప్రవేశం లేని పరిస్థితుల నుంచి.. దళితులు ఇపుడు పూజారులుగా అడుగుపెడుతున్నారు. దళితులకు పూజార్లుగా నియమిస్తూ టీడీబీ నిర్ణయం తీసుకుంది'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

20:42 - October 11, 2017

కేరళ : ఒట్టిమాటలు కట్టిపెట్టో..గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ అన్నారు మహాకవి గురజాడ. నీతులు వల్లించడమే కాదు మంచిపనిని చేసి చూపెట్టాలి. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తోంది.. కేరళలోని వామపక్ష  సర్కార్‌. సామాజిక న్యాయానికి పట్టంకడుతూ దళితులను దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తోంది. ఇప్పటికే 150 ఏళ్ల చరిత్ర ఉన్న తిరువళ్ల మణప్పురం శివాలయానికి ప్రధాన అర్చకుడిగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ చరిత్రలో తొలి దళిత అర్చకుడిగా 22 ఏళ్ల యదు కృష్ణను నియమించారు.
పూజారులుగా దళితులు, బ్రాహ్మణేతరులు  
కేరళలోని వామపక్ష ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా దళితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. దేవాలయంలోనికే ప్రవేశం లేని పరిస్థితుల నుంచి.. దళితులు ఇపుడు పూజారులుగా అడుగుపెడుతున్నారు. 
దళితులకు పూజార్లుగా టీడీబీ నిర్ణయం 
కేరళలోని ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు తీసుకున్న నిర్ణయం దళితులకు పూజారులుగా అవకాశాన్ని కల్పిస్తోంది. కేరళ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఎగ్జామ్స్‌ ద్వారా ఈ పూజారుల ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం చేపడుతున్న నియామకాల్లో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఆరుగురుతో సహా మొత్తం  36 మంది బ్రాహ్మణేతరులు నియామకం అవుతున్నట్టు  ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేవసం బోర్డు పరిధిలోని మొత్తం 1248 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంకూడా ఉంది. దేవసం బోర్డు పరిధిలోని ఖాళీలు ఉన్నచోట వీరిని   పూజారులుగా నియమించనున్నారు. పూజారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా, రిజర్వేషన్ల అనుసారం ఉండాలని కేరళ దేవసం మంత్రి కడకంపల్లి రామచంద్రన్‌ అన్నారు. 
సామాజిక న్యాయానికి కేరళ ప్రభుత్వం దన్ను 
సామాజిక న్యాయం అంటూ నిత్యం ఎన్నో స్పీచ్‌లు దంచేసే నేతలకు కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలుస్తోంది. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మరోసారి సీఎం పినరయి విజయన్‌ నిరూపిస్తున్నారు. దళితులను దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం ..ఇపుడు దేశవ్యాప్తంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి.   

 

20:39 - October 11, 2017

సిరిసిల్ల : బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేసాయన్నారు సీఎం కేసీఆర్. అలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని చెంప ఛెళ్లుమనిపించాలని సూచించారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రైవేటు డాక్టర్లు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసి గర్భసంచులు తీసి ఇబ్బంది పాలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఓవైపు కేసీఆర్ ప్రసంగం సాగుతుండగా.. మధ్యలో 5 నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్లలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోత లేదు.. ఇక్కడంతా సన్నాసులున్నట్లున్నారే.. అంటూ కేసీఆర్ చమత్కరించారు. 

 

కృష్ణా నది యాజమాన్య బోర్డు నూతన సభ్య కార్యదర్శిగా పరమేశం

హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు నూతన సభ్య కార్యదర్శిగా పరమేశం నియామకం అయ్యారు.

 

వాచ్యా తండాలో విషాదం

నల్లగొండ : దామచర్ల మండలం వాచ్యా తండాలో విషాదం నెలకొంది. నీటికుంటలో జారిపడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. గేదెలు కాసేందుకు వెళ్లి మంచినీళ్ల కోసం నీటి కుంటలోకి చిన్నారులు దిగారు.

గోకవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

తూర్పుగోదావరి : గోకవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడితోపాటు మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారయ్యారు. 

 

ఆత్మహత్యల సిరిసిల్లలో ఆనందం నింపిన ఘనత సీఎం కేసీఆర్ దే : మంత్రి కేటీఆర్

సిరిసిల్ల : ఆత్మహత్యల సిరిసిల్లలో ఆనందం నింపిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ నగర పంచాయతీల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. 

సిరిసిల్ల జిల్లా ఏర్పడటం సంతోషం : సీఎం కేసీఆర్

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల రాజన్న జిల్లా ఏర్పడటం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల కరువుతో ఇబ్బందిపడ్డ ప్రాంతమని చెప్పారు. వెనకబడ్డ సిరిసిల్ల రాజన్న జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు చనిపోతే..మేం భిక్షమెత్తి మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేశామని చెప్పారు. 

 

విద్యార్థిని చితకబాదిన టీచర్

కర్నూలు : మదర్ థెరిస్సా విద్యానికేతన్ లో రెండో తరగతి విద్యార్థిని టీచర్ శాంతిరాజు చితకబాదారు. శాంతిరాజుపై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేశారు. 

19:51 - October 11, 2017
19:47 - October 11, 2017

చిత్తూరు : సమస్యల సాధన కోసం.. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 45రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా.. వర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో..  విధులు బహిష్కరించి ఉద్యమ బాట పట్టారు. ఐదేళ్లు సర్వీస్ కలిగిన ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయడంతో పాటు... పాటు తక్కిన వారిని వర్సిటీ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. వర్సిటీ స్థాపించి 20 ఏళ్లు అవుతున్నా.... ఇంతవరకు టైమ్ స్కేల్ వర్తింప జేయలేదని వాపోయారు. సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సమస్యను ... ముఖ్యమంత్రి వెంటనే గుర్తించి తమను ఆదుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

19:46 - October 11, 2017

ప్రకాశం : ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ, జర్నలిస్ట్‌ కాలనీ, మదర్‌థెరిస్సా కాలనీలతో పాటు పలు నగర శివారు ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్యలో పెరిగిపోతోంది. డెంగ్యూ, మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:43 - October 11, 2017

విజయవాడ : హైకోర్టు ఆదేశాల మేరకు... రేపటి నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల పత్రాలను పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి 25 రోజుల పాటు అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్లు, పత్రాలను పోలీస్‌ అధికారులు పరిశీలిస్తారు. విజయవాడలో పోలీస్‌ కమాండ్‌ సెంటర్ వద్ద ప్రత్యేకంగా 17 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బాధితుల బాండ్లు, పత్రాల పరిశీలనలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజయవాడ సిపి గౌతం సవాంగ్‌ పోలీసులను ఆదేశించారు. 

 

రెండోరోజూ వామపక్ష నేతల అరెస్ట్‌

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితులకు మద్దతుగా వారిని కలిసేందుకు వెళ్తున్న వామపక్ష నేతలను వరుసగా రెండోరోజూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను అరెస్ట్ చేసి ఆముదాలవలస పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. 

 

19:39 - October 11, 2017

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితులకు మద్దతుగా వారిని కలిసేందుకు వెళ్తున్న వామపక్ష నేతలను వరుసగా రెండోరోజూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను అరెస్ట్ చేసి ఆముదాలవలస పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:35 - October 11, 2017

అనంతపురం : జిల్లాలోని తాడ్రిపత్రిలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ పర్యటించారు. భారీ వర్షాలతో నిండిన చాగల్లు, పెండేకల్లు జలాశయాలన్ని పరిశీలించారు. వర్షాలతో రోడ్లు, కాల్వలు, చెరువులకు పడిన గండ్లను చూశారు. పండ్లతోటలు, పంటల నష్టాలపై  తాత్కాలిక నివేదికలు తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 

 

19:33 - October 11, 2017

కర్నూలు : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఆలయంలోకి వర్షపునీరు చేరింది. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో ఆలయంలోకి భారీగా నీరు చేరుకుంది. భక్తుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. 

19:31 - October 11, 2017

గుంటూరు : సేంద్రీయ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రకృతి వ్యయసాయం కోసం 12 వేల 9 వందల పంచాయితీలో 700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఐదేళ్లలో ఐదు హెక్టార్లలో ఐదులక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం కోసం అజీమ్‌ ప్రేమ్‌ జీ సంస్థ 100 కోట్లు ఇచ్చేందుకు ముందుకువచ్చిందన్నారు. 

 

ఏపీ సచివాలయం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయం వద్ద ఓ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులు ఆమెను తుళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయనగరంకు చెందిన యువకుడు శ్రవణ్ ప్రేమించి మోసం చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... సీఎంకు చేప్పేందుకు యువతి వచ్చినట్లు తెలుస్తోంది.

19:20 - October 11, 2017

కాకినాడ : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీరుపై డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. తలకిందలుగా తపస్సు చేసినా సీఎం కాలేరని... జగన్‌ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పాదయాత్రలు మాని ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. మరో డిప్యూటి సీఎం చినరాజప్ప.. ముద్రగడ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో యాత్రలకు తాము అడ్డంకి కాదని అనుమతి కోరితే తప్పకుండా ఇస్తామన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్గించినా సహించేదిలేదన్నారు.

19:17 - October 11, 2017

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో... ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పంచాయతీ వాళ్లు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారని... కానీ నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. దాని వల్ల కోట్లలో అప్పు పెరిగిందని అన్నారు. పరిపాలన అనుభవం లేని వాళ్ల నిర్ణయాలు ఇలానే ఉంటాయని ఎద్దేవా చేశారు. అలాగే.. రామ్‌గోపాల్‌వర్మ తీస్తున్న ఎన్‌టీఆర్‌ జీవితంపై సినిమా గురించి చర్చ అనవసరం అని లోకేశ్‌ అన్నారు. 

 

ఈనెల 13న బంద్ ను విరిమించుకున్న పెట్రోల్ బంక్ డీలర్లు

హైదరాబాద్ : ఈనెల 13న తలపెట్టిన బంద్ ను పెట్రోల్ బంక్ డీలర్లు విరిమించుకున్నారు. 

జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి

వనపర్తి : జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టుపూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీ. ప్రస్తుత నీటిమట్టం 318.36 మీటర్లు. జూరాల ఇన్ ఫ్లో లక్ష 7 వేలు ఉండగా, ఔటో ఫ్లో 1,12,200 క్యూసెక్కులుగా ఉంది.  

 

18:55 - October 11, 2017

రాజన్నసిరిసిల్ల : వెనుకబడిన సిరిసిల్ల అభివృద్ధికి కృష్టి చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల సభలో ఆయన ప్రసంగించారు. సిరిసిల్ల...వెనుబడ్డ ప్రాంతమని...కరువుతో అల్లాడిన ప్రాంతమన్నారు. అనేక అవస్తలు ఎదుర్కొన్న ప్రాంతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. అప్పటి సీఎంను నష్టపరిహారం అడిగితే ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ లో భిక్షమెత్తి ఇంటికో యాబై వేలు ఇచ్చామని తెలిపారు. వెయ్యి రూపాయల పెన్షన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదని..తాము ఇచ్చామని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. గతి లేక బీడీలు చుట్టే వృత్తి చేస్తున్నారని.. ఇష్టం ఉండి చేసే పని కాదన్నారు. 

 

18:48 - October 11, 2017

గ్రీస్‌ : శాంటోరినీలో రెడ్‌బుల్‌ నిర్వహించిన ఫ్రీ రన్నింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి.200 మంది ఫ్రీ రన్నర్లు పోటీకి దిగిన ఈ కాంపిటీషన్‌ వీక్షకులను అలరించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రీ రన్నింగ్‌ స్పెషలిస్ట్‌లు టైటిల్‌ కోసం...హోరాహోరీగా పోటీపడ్డారు. రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా డేర్‌డెవిల్‌ జంప్స్‌తో అదరగొట్టారు. ఈ టోర్నీలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టిటారెండో....టాప్‌ ప్లేస్‌లో నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. టిటారెంకో ప్రదర్శించిన డెడ్లీ స్టంట్స్‌ టోటల్‌ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచిపోయాయి.

 

18:44 - October 11, 2017

మాంటెయిన్‌ బైకింగ్‌ స్పెషలిస్ట్‌ డారెన్‌ బేర్‌క్లాత్‌ ట్రయల్‌ రన్‌లో మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. మాంటెయిన్‌ బైక్‌తో పాటు 450సీసీ స్నో బైక్‌తో డబుల్ ట్రయల్‌ రన్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయిన డారెన్‌ ప్రపంచ రికార్డ్‌ నమోదు చేశాడు. మంచు పర్వతం కరుగుతున్న సమయంలో డౌన్‌హిల్‌ రేసింగ్‌ చేసి డారెన్‌ బేర్‌క్లాత్‌ ..తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. 

 

18:40 - October 11, 2017

హైదరాబాద్ : మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐద్వా మహాసభలు ముగిసాయి. ఈ సందర్భంగా 81 మందితో ఏర్పాటు చేసిన నూతన కమిటీతో పాటు నూతన అధ్యక్షురాలిగా బుగ్గవీటి సరళ, ప్రధాన కార్యదర్శులుగా మల్లు లక్ష్మి ఎన్నికయ్యారు. మహాసభల్లో ఆరు తీర్మానాలు చేశామని ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళలపై హింస, అత్యాచారాలను అరికట్టేలా కఠిన చట్టం తేవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను సంప్రదాయాల పేరిట ఇంటికే పరిమితం చేస్తోందని ఐద్వా అధ్యక్షురాలు బి.సరళ ఆరోపించారు. 

 

18:25 - October 11, 2017

హైదరాబాద్ : వనస్థలిపురం చింతలకుంటలోని జాతీయరహదారి పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భవన నిర్మాణ దారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా ఆర్డర్ కాపీపై ఎటువంటి స్టాంపు లేదని అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత భవన యజమానులు స్టే ఆర్డర్‌పై స్టాంపు వేయించుకుని తేవడంతో కూల్చివేతల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిపివేశారు. 

 

18:21 - October 11, 2017

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్మా సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. సభకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలు, ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు అరెస్ట్ చేసిన స్థానికులు, నిర్వాసితులను బస్సులో తరలిస్తుండగా.. బస్ అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. పక్కనే ఉన్న గుంటలోకి బస్ ఒరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆందోళనకారులు, పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. 

 

18:00 - October 11, 2017
17:58 - October 11, 2017

ఖమ్మం : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తప్పతాగి దారి తప్పాడు. వికృతచేష్టలు చేశాడు. విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లాలోని కామేపల్లి హైస్కూల్‌లో వేణుగోపాల్‌ సోషల్‌ టీచర్‌ గా పని చేస్తున్నాడు. తొమ్మిదో విద్యార్థినిని గదిలో తీసుకువెళ్లి.. వేణుగోపాల్ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇదే విషయం విద్యార్థిని బంధువులకు తెలియడంతో అడిగేందుకు స్కూల్‌కు వచ్చారు. ఈ సమయంలో స్కూల్‌లో ఉన్న వేణుగోపాల్‌ మద్యం మత్తులో ఉన్నాడు. అయితే.. విషయం అడగగా మద్యం మత్తులో తలాతోక లేని సమాధానాలు చెబుతున్నాడు. మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాను సెలవులో ఉన్నానని బుకాయిస్తున్నారు. ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
 

 

17:49 - October 11, 2017

కొమురం భీం అసిఫాబాద్ : జిల్లాలో లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పర్మిట్ లేకున్నా కొందరు అధికార పార్టీ నేతలు... లారీలు నడుపుతూ తమ పొట్ట కొడుతున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలంటూ... రెబ్బెన పీఎస్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. ఈ సందర్భంగా... పోలీసులు లారీ డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సంక్షేమ పథకాల్లో దేశంలో రాష్ట్రం నంబర్ వన్:సీఎం కేసీఆర్

సిరిసిల్ల: సిరిసిల్ల కరువుతో ఇబ్బందిపడ్డ ప్రాంతం అని సీఎం కేసీఆర్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు చనిపోతే మేం బిక్షమెత్తి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. సంక్షేమ పథకాల్లో దేశంలో రాష్ట్రం నంబర్ వన్ అని, కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఖమ్మం: కామేపల్లి హైస్కూల్ లో దారుణం జరిగింది. 9వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు వేణుగోపాల్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. మద్యం సేవించి పాఠశాలకు రావడమేకాకుండా తాను సెలవులో ఉన్నాని బాకయిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

ఉపాధి నిధులు ఇవ్వద్దంటూ వైసీపీ లేఖలు:లోకేష్

అమరావతి: ఉపాధి నిధులు ఇవ్వద్దంటూ వైసీపీ లేఖలు రాసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి నిధులు వాడుతున్నారంటూ వైవీ సుబ్బారెడ్డి లేఖలు రాశారని, ఆయన నియోజకవర్గంలో 200 కి.మీ సీసీరోడ్లు వేశామన్నారు. ఉపాధి వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. రాంగోపాల్ వర్మ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

16:36 - October 11, 2017
16:26 - October 11, 2017

అంతర్జాతీయ బాలిక దినోత్సవంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం, ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏమిటీ అనే అంశాలపై ఆమె మాట్లాడారు. బాలికల అభ్యున్నతి కోసం అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. బాలికలు వెనుకబడి ఉన్నారని చెప్పారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేయడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరపాలని 2011సం.లో తీర్మానం చేశారని చెప్పారు. 2012 అక్టోబర్ 11 నుంచి బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్యసభకు ముఖుల్ రాయ్ రాజీనామా

కోల్ కతా: రాజ్యసభ సభత్తానికి ముఖుల్ రాయ్ రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి కి రాజీనామా లేఖ సమర్పించారు. బిజెపితో సత్సంబంధాల ఆరోపణ పై ముకుల్ ను టీఎంసీ నుండి మమతాబెనర్జీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే

16:12 - October 11, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజ్ స్కానింగ్ సెంటర్‌ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్ రావడంతో... భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో బాలికకు స్వల్పగాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:08 - October 11, 2017

తూర్పుగోదావరి : అది ఐదు జిల్లాలను కలిపే జాతీయ రహదారి. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు చేతులు కలిపి చక్రం తిప్పారు. రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. పెద్దల భూములు, ఇళ్ల జోలికి వెళ్లకుండా, చిన్నోళ్లను  బలిపశువులను చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిహారం చెల్లింపులో కూడా అయినవారికి ఆకులు, కానివారికి కంచాలు... అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 216 వ నంబర్‌ జాతీయ రహదారి నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై 10 టీవీ ప్రత్యేక కథనం...
అడుగడుగునా అక్రమాలే..
నిర్మాణంలో ఎన్‌హెచ్‌ 216.... అడుగడుగునా అక్రమాలేనంటూ ఆరోపణలు.. ప్రమాణాలకు తిలోదకాలిచ్చారన్న అభియోగాలు.. నేతాజీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి దోచుకుంటున్నారన్న విమర్శలు.. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లా వరకు చేపట్టిన 216 జాతీయ రహదారి నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలే జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో జాతీయ రహదారుల నిర్మాణ ప్రమాణాలను పాటించడంలేదన్న విమర్శలు వినిపిన్నాయి. పైగా రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై గెజిట్‌ లోనే మార్పులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 
నిబంధనలను తుంగలో తొక్కుతున్న నిర్మాణ సంస్థ 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ఒక సంస్థ ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. రాజకీయ అండ చూసుకుని నిర్మాణ సంస్థ అడ్డుగోలుగా నిబంధనలను తుంగలో తొక్కుతోందన్న అభియోగాలున్నాయి. హైవే అథారిటీ అధికారులు కూడా  కాంట్రాక్టర్లకు  వంతపాడుతున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. రోడ్డు నిర్మాణం పేరుతో చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ, చెరువులను ఊడ్చివేస్తూ పర్యావరాణ చట్టాలను ఉల్లంఘిస్తున్నా... ఎవరూ పట్టించుకోవడంలేదని నిర్వాసితులు ఆందోళన  చెందుతున్నారు.  కాంట్రాక్టు సంస్థ, తాను ఆడిందే ఆట, పాడిందే పాట.. .అన్న విధంగా  వ్యవహరిస్తోందని ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే భూములు, స్థలాలు తీసుకోవడాన్ని నిర్వాసితులు తప్పు పడుతున్నారు. 
రెవెన్యూ అధికారులపై విమర్శలు 
ఎన్‌హెచ్‌ 216 భూసేకరణలో కాకులను కొట్టి గద్దలకు పెట్టిన విధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దల భూములు పోకుండా చూసేందుకు అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేశారన్న ఫిర్యాదులున్నాయి. 
పరిహారం చెల్లింపులో వివక్ష 
నిర్మించేది ఆర్‌ అండ్‌ బీ రోడ్డైనా.. హైవే ముసుగులో సామాన్య, మధ్య తరగతి ప్రజలను ముంచుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములను గృహావసరాల కోసం భూవినియోగ మార్పిడి ఫీజు చెల్లించి ప్లాట్లను కొనుగోలు చేసినా... ల్యాండ్‌ కన్వర్షన్‌ జరగలేదని పరిహారం చెల్లింపులో కూడా అధికారులు వివక్షచూపుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. 
ప్రమాణాలు పాటించడలేదన్న విమర్శలు 
ఇక రోడ్డు నిర్మాణంలో ప్రమాణాలు కూడా పాటించడలేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం గంటకు 80 నుంచి 130 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించే విధంగా రోడ్డు నిర్మించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. 216 హైవే నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

 

15:57 - October 11, 2017

అనంతపురం : జిల్లాలోని అగలి మండలంలో ప్రవహించే స్వర్ణముఖీ నదీ జలాల విషయంలో.. మరోసారి ఆంధ్రా, కర్ణాటక రైతుల మధ్య వివాదం చెలరేగింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా నీరు ప్రవహించడంతో ఆంధ్రా చెరువులకు వచ్చే వంక కోతకు గురైంది. దీంతో అగలి మండల రైతులు వంకకు మరమ్మతులు చేప్టట్టడానికి కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న కర్ణాటక రైతులు అక్కడికి చేరుకొని.. మరమ్మతులు చేపట్టకూడదని ఆంధ్రా రైతులతో వాగ్వాదానికి దిగారు. కర్ణాటక రాష్ట్ర పోలీసులు అక్కడికి  చేరుకొని ఇరు రాష్ట్రాల రైతులను వారించారు. గతంలోనూ ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగాయి.

 

15:55 - October 11, 2017

ఢిల్లీ : సుప్రీం కోర్టులో ఫాతిమా కాలేజి విద్యార్థుల కేసు విచారణ జరిగింది. విద్యార్థులను రీలొకేట్‌ చేస్తామన్న ఏపీ సర్కార్‌ ప్రతిపాదనలను ఎంసీఐ తిరస్కరించింది. అయితే కొత్త ప్రతిపాదనలకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరగా,   నూతన ప్రతిపాదనలను చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

 

15:53 - October 11, 2017

గుంటూరు : నవంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు వారం నుంచి 10రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం చంద్రబాబు కార్యాలయంలో ఉంది. దీనిపై చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమలతో చర్చించనున్నారు. మరో 2, 3రోజుల్లో తేదీలపై క్లారిటీ రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:51 - October 11, 2017

సిద్దిపేట : తనకు రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువేనని..తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌, మెడికల్‌ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. సిద్దిపేట ప్రజలు ఏది కోరినా కాదనని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్దిపేటకు జైలును మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. త్వరలో రంగనాయక్ సాగర్ లోకి గోదావరి నీళ్లు వస్తాయని తెలిపారు. రంగనాయక్ సాగర్ కట్ట 9 కిలో మీటర్లు ఉంటుందని....ఉత్తర తెలంగాణలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తెలంగాణలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజన చేశామని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

పాత చీరాలలో హోంగార్డు హల్ చల్

ప్రకాశం: పాత చీరాలలో హోంగార్డు హల్ చల్ చేశాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ట్రాక్టర్ హోంగార్డు బైక్ ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ ను హోంగార్డు చితకబాదడంతో అతని చెవికి తీవ్రగాయం అయ్యింది. స్థానికులు తిరగబడటంతో హోంగార్డు పరారయ్యాడు. డ్రైవర్ వద్ద ఉన్న రూ.5వేలు, ట్రాక్టర్ పత్రాలు, లైసెన్స్ ను హోంగార్డు ఎత్తుకెళ్లాడు. పైగా డ్రైవర్ పై పీఎస్ లో కేసు నమోదు చేశాడు. ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు.

జగన్ నిర్మతగా, లక్ష్మీపార్వతి హీరోయిన్ గా ఉంటే మంచిది: సోమిరెడ్డి

అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మపై మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. వర్మ ఎపుడూ వివాదాలతో వార్తలో ఉండాలనుకుంటారని, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చాక జరిగిన పరిణామాలు అందరికీ తెలుసునని సోమిరెడ్డి తెలిపారు. పనీ పాట లేని వాళ్లే ఇలాంటి సినిమాలు చేస్తారని, ఎన్టీఆర్ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఎన్టీఆర్ అభిమానులే వర్మకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు జగన్ నిర్మతగా, లక్ష్మీపార్వతి హీరోయిన్ గా, జబర్థస్త్ నటులను కో ఆర్టిస్టులుగా పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇచ్చారు.

గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేఱ్

ఢిల్లీ : భారత ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ నూతన ఛైర్మన్ గా గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్ నియమితులయ్యారు.

15:34 - October 11, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్‌లో భాగంగా ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. బందిపోరా హాజిన్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో బలగాలు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారని సిఆర్‌పిఎఫ్‌ అధికారి శంభుకుమార్‌ తెలిపారు. ఆపరేషన్‌ కొనసాగుతోంది.

 

తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద విద్యుత్ షాక్

తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద విద్యుత్ షాక్ కొట్టింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజీ స్కానింగ్ సెంటర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి భక్తులు పరుగులు తీశారు.

15:32 - October 11, 2017

సిరిసిల్ల : సీఎం కేసీఆర్‌ టూర్‌ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సీఎం పర్యటన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు బస్టాండ్లలో నోటీసులు అంటించారు. బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 

 

15:30 - October 11, 2017

వనపర్తి : జిల్లా నూతన కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు ఉపముఖ్యమంత్రి మహముద్‌ అలీ భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి మండలంలోని పెద్దగూడెం, అప్పాయిపల్లి గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానికి ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

 

15:28 - October 11, 2017

జగిత్యాల : జిల్లాలోని ధరూర్‌లో ఆర్‌ అండ్‌బీ, కలెక్టర్‌ ఆఫీస్‌లకు మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. కొత్తజిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతోపాటు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

15:21 - October 11, 2017
15:18 - October 11, 2017

ఢిల్లీ : బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా మోది ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్‌ చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా కంపెనీ టర్నోవర్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆయన స్పందించారు. అవినీతి విషయంలో జీరో టాలరెన్స్‌ చెప్పుకునే బిజెపి నైతిక అర్హత కోల్పోయినట్లయిందని యశ్వంత్‌ సిన్హా  అన్నారు. పార్టీకి ఇది ఎంతో నష్టమన్నారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ జయ్‌షాకు రుణాన్ని మంజూరు చేసిన విధానం, ఆయనను వెనకేసుకు రావడం చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  బిజెపి అధికారంలోకి వచ్చాక జై షా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని 'ది వైర్‌' అనే వెబ్‌ సంస్థ కథనం వెలువరించింది. దీనిపై జయ్‌ షా వంద కోట్ల పరువునష్టం దావా వేశారు. వెబ్‌సైట్‌పై విచారణ జరిపించడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వమే పూర్తి దర్యాప్తు జరిపించాలని తెలిపారు. ఈ కేసును వాదించడానికి ప్రభుత్వ న్యాయవాది తుషార్‌ మెహతాను బిజెపి రంగంలోకి దింపడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. 

 

15:12 - October 11, 2017

గుంటూరు : ఏపీని దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్ వాహనాలను వెలగపూడిలో సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అన్ని మున్సిపాల్టీలలో చెత్త లేకుండా చేస్తామని, రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చి దిద్దుతామని అన్నారు. ఇండియాలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో చేస్తున్నామని.. రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడకుండా కత్తిరించే మిషన్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 

 

 

నిండు కుండను తలపిస్తోన్న శ్రీశైలం జలాశయం

కర్నూలు: శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.2 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ఇన్ ప్లో 1,13,991, ఔట్ ఫ్లో 88.344 క్యూసెక్కులు గా ఉంది. 2 విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయిలో నిర్వహించడంతో పాటు పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి 72.814 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.

రేణిగుంట ఎయిర్ పోర్టు బులెట్ల కలకలం

చిత్తూరు: రేణిగుంట ఎయిర్ పోర్టు బులెట్ల కలకలం రేగింది. హైదరాబాద్ వెళ్తున్న మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 17.9ఎంఎం బుల్లెట్ల ను అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది విచారిస్తున్నారు.

15:00 - October 11, 2017

సిద్దిపేట : సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దుద్దెడలో కలెక్టరేట్‌ నిర్మాణం, మెడికల్‌ కాలేజీ, పోలీస్‌ కమిషనరేట్‌లకు శంకుస్థాపన చేశారు. భవన నమూనాలను పరిశీలించిన అనంతరం.. శిలాఫలకాలను ఆవిష్కరించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఏర్పాటు చేశారు. 

 

సిద్ధిపేట నాకు రాజకీయ జన్మఇచ్చింది:సీఎం కేసీఆర్

సిద్ధిపేట : ఎన్సాన్ పల్లిలో మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట నాకు రాజకీయ జన్మఇచ్చిందని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా కావాలంటూ ఎన్టీఆర్ కు నేనే స్వయంగా దరఖాస్తు ఇచ్చా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చాక 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశానన్నారు. సిద్ధిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృధ్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

2016 ఎస్సై నియామకాలపై హైకోర్టు స్టే

హైదరాబాద్: 2016 ఎస్సై నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఎన్ సీసీ, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నియామకాలను వారం పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

నవంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

అమరావతి: నవంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎంవోకు ఫైలు చేరింది. 2,3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశాలు వారం నుంచి 10 రోజుల పాటు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 2 తో ఇంటింటికి టిడిపి కార్యక్రమం ముగియనుంది.

పేదల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కాల్వ సమీక్ష

అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కాల్వ సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మానం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, ఏపీలో 20 లక్షల మందికి ఇళ్లు అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి అనుకుంతగా ఇళ్లు మంజూరు కావడం లేదని.. కేంద్ర మంతిని కలిసి అదనంగా ఇళ్లు ఇవ్వాలని కోరతామని స్పష్టం చేశారు.

కేతేపల్లి వద్ద మూసీ 4గేట్లు ఎత్తివేత

నల్గొండ: కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు చెందిన 4గేట్లను అధికారులు బుధవారం ఎత్తివేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5000 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో కూడా 5000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 644.70 అడుగులుగా ఉంది.

13:53 - October 11, 2017
13:47 - October 11, 2017

ఏ వుడ్ లోనైనా తమ తనయులను హీరోలుగా స్థిరపరచాలని హీరోలు..దర్శక..నిర్మాతలు అనుకుంటుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొందరు ఇంకా ప్రయత్నాలు సాగిస్తుంటుంటారు. అలాంటి వారిలో 'పూరి జగన్నాథ్' ఒకరు. తనయుడు 'ఆకాష్ పూరీ'ని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు నిరాశపరుస్తున్నా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. పూరీ - బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ ప్రస్తుతం సినిమా సినిమాకి 'పూరీ' ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే, ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. ఆకాష్ పూరీ హీరోగా పూరీ దర్శకత్వంలో 'వైష్ణో అకాడమీ సంస్థ' ఓ చిత్రం నిర్మిస్తోంది. గతంలో వచ్చిన సినిమాలకంటే ఇది భిన్నంగా ఉంటుందని టాక్. 1971 నాటి ఇండియా - పాక్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని పూరీ పేర్కొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఛార్మీ క్లాప్ కొట్టగా షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. పంజాబ్, రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగనుంది. యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నట్లు పూరీ పేర్కొన్నారు. మంగుళూరు మగువ నేహా శెట్టి నాయికగా పరిచయమవుతోంది. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

నేటితో ముగియనున్న శశికళ పెరోల్...

చెన్నై: అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ పెరోల్ గడువు నేటితో ముగియనుంది. భర్త నటరాజన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు ఐదు రోజుల పెరోల్ వచ్చింది. గత శుక్రవారం విడుదలైన శశికళ…ప్రతి రోజు ఆస్పత్రికి వెళ్లి భర్తను పరామర్శిస్తున్నారు. పెరోల్ పై వచ్చినప్పటి నుంచి చెన్నైలోని ఆమె నివాసానికి, ఆస్పత్రికి మాత్రమే శశికళ పరిమితమయ్యారు. అంతేకాదు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే నిబంధన కారణంగా…సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కానీ చివరి రోజు ఆమెను కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు…శశికళ నివాసానికి చేరుకున్నారు. దాంతో వారికి అభివాదం చేస్తూ…ఆస్పత్రికి బయల్దేరారు శశికళ.

సిద్ధిపేట కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్తాపన చేసిన కేసీఆర్

సిద్ధిపేట: కలెక్టరేట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దుద్దెడ శివారులో కలెక్టర్ భవన నిర్మాణం, మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలకూ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

13:28 - October 11, 2017

మాకు న్యాయం చేయాలి: ఫాతిమా కాలేజీ విద్యార్థులు

ఢిల్లీ: తమకు న్యాయం చేయాలని ఫాతిమా కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదనపు సీట్లకు పట్టుబట్టకుండా సీట్లు సర్దుబాటు చేయాలని ఎంసీఐని ఒప్పించామని గతంలో మంత్రి కామినేని చెప్పారని.. సీఎం చొర తీసుకుని ఎంసీఐతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

13:26 - October 11, 2017

 

మేడ్చల్ : జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై తలసాని కారుకు ప్రమాదం జరిగింది. తలసాని కారును గుడ్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి తలసాని క్షేమంగా బయటపడ్డారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కలెక్టరేట్ భవనం శంకుస్థాపనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

సుప్రీంలో ఫాతిమా కళాశాల విద్యార్థుల కేసు విచారణ

ఢిల్లీ : ఫాతిమా కళాశాల విద్యార్థుల కేసు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విద్యార్థుల రీలొకేట్ పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఎంసీఐ తిరస్కరించింది. తొలుత 100 సీట్లు తగ్గించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని తరువాత మాట మార్చిందని ఎంసీఐ ఆరోపించింది. కొత్త ప్రతిపాదనలకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

13:22 - October 11, 2017

రంగారెడ్డి : జిల్లా యాచారం మండలం మేడిపల్లిఓ ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా సిటీ ఏర్పాటుపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళంగా మారింది. మరోవైపు సభకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను, ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కళ్యాణ కట్టలో 170 మంది క్షురకుల తొలగింపు

తిరుమల: కళ్యాణ కట్టలో 170 మంది క్షురకులను తొలగించారు. భక్తులనుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే.. భక్తులు ఇస్తేనే తీసుకున్నామని క్షురకులు తెలిపారు. జేఈవో కార్యాలయం వద్ద క్షురకుల ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని జేఈవోకు వినతిపత్రం సమర్పించారు.

13:09 - October 11, 2017

ఖమ్మం : జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో సంతలో విద్యుత్ షాక్ తో 12 పశువులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

జగన్ పాదయాత్రకు అనుమతి ఇస్తాం:చినరాజప్ప

తూ.గో: జగన్ పాదయాత్రకు అనుమతి ఇస్తామని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ముందు అనుమతి తీసుకోవాలని సూచించారు. ముద్రగడ అనుమతి తీసుకోకుండా యాత్ర చేస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఫార్మాసిటీ ఏర్పాటు పై ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాస

రంగారెడ్డి: ఫార్మాసిటీ ఏర్పాటు పై మేడిపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాస అయ్యింది. పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్ఠానిక సర్పంచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్

శ్రీకాకుళం: వంశధార నిర్వాసితులను కలిసేందుకు వెళ్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం మధు, సిపిఐ రామకృష్ణ తో పాటు 10మంది ఉన్నారు. వీరందరనీ ఆముదాల వలస పీఎస్ కు తరలించారు.

మంత్రి తలసానికి తృటిలో తప్పిన ప్రమాదం...

మేడ్చల్: కీసర వద్ద ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రి తలసాని ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తలసాని బయటపడగా, మేడ్చల్ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

12:47 - October 11, 2017

ఢిల్లీ : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లైన 18 ఏళ్ల భార్యతో కాపురం చేసినా అది రేప్ గానే పరిగణించాలని నిర్ణయించింది. భార్య మైనర్ అయితే  ఆమె అంగీకారం ఉన్న అత్యాచారంగానే భావించాలని కోర్టు అభ్రియపడింది. బాల్యవివాహాల నేపథ్యంలో సుప్రీం ఈ కీలక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. బారత శిక్షాస్మృతి సెక్షన్ 375పై సుప్రీం వివరణతో తీర్పు వెలువరించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ

విశాఖ: మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని రెండు రేషన్ షాపులను సీజ్ చేశారు. ఉదయం 11 గంటలు దాటినా రేషన్ షాపులు తెరవకపోవడంతో వాటి తలుపులు పగలకొట్టారు.

12:23 - October 11, 2017

ముంబై : మహారాష్ట్రలో రైతుల మృత్యుఘోష కొనసాగుతోంది. అమాయక రైతుల ప్రాణాలతో వ్యాపారులు చలగటం అడుతున్నారు. పంట కోసం పిచికారి చేస్తున్న పురుగుల మందు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. పంటలపై రైతులు పిచికారి చేసేటప్పుడు వారి ఊపిరితిత్తుల్లోకి పురుగులమందు వెళ్తోంది. దీంతో వారు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. అనివార్య పరిస్థితుల్లో రైతులు పురుగు మందు పిచికారి చేయాల్సి వస్తోంది. పోలో సిన్ జెంట్ అనే పురుగు మందు పిచికారి చేసిన 20రోజుల్లోపే రైతులు మృతి చెందారు. మరో 300 మంది రైతులు కంటి చూపు కోల్పోయారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో అపోలో సిన్ జెంట్ పిచికారి చేసి ఇరువై నుంచి ముప్పై మంది అస్వస్థతకు గురౌతున్నారు. క్రిమిసంహారకాల వినియోగంలో జాగ్రత్తలు పాటించకుండా ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. చైనా స్పెయర్స్ వల్ల వచ్చే హ్యూమిడిటీ కూడా ప్రమాదేమనని వైద్యులు తెలిపారు. 

తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ : ఇద్దరు మృతి

సంగారెడ్డి: జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న తుఫాన్ వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో తుఫాన్ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ దగ్గరగల హైవే రహదారిపై జరిగింది.

హైదరాబాద్ లో చెరువులకు జలకళ

హైదరాబాద్: నగరంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులు ఉండగా 119 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 26 చెరువులు పూర్తిగా నిండగా, 75% నిండిన 23 చెరువులు, 50శాతం నిండి 17 చెరువులు. రామాంతపూర్ పెద్ద చెరువు నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

12:18 - October 11, 2017

మహిళలు అవాంఛిత రోమాలతో బాధ పడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా డబ్బును కూడా ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో అవాంఛిత రోమాల నుండి బయటపడవచ్చని పలువురు సూచిస్తున్నారు. తిరిగి పెరుగుతున్న జుట్టు నుండి సహజ రెమెడీలున్నాయి. బొప్పాయి..శనగపిండి..పసుపు మూడు పదార్థాలను కలుపుకోవాలి. అవాంఛిత రోమాలున్న చోట రాసి స్నానం చేయాలి. అలోవెరా..శనగపిండి కూడా సహాయ పడుతుంది. ఎందుకంటే వీటిని వాడడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మం మెరుపు దనం వచ్చే అకాశం ఉంది. పచ్చి బొప్పాయిలో ఒక శక్తివంతమైన ఎంజైమ్ ఉంది. నిరంతరం ఉపయోగించడం వల్ల అవాంఛిత రోమాలను అరికట్టవచ్చు. ట్రై చేసి చూడండి. 

సుప్రీం కోర్టును ఆశ్రయించిన బాణా సంచా వ్యాపారులు

ఢిల్లీ: బాణాసంచా వ్యాపారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నిల్వ ఉన్న స్టాక్ ను అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని బాణా సంచా వ్యాపారులు కోరారు. బాణా సంచా వ్యాపారుల పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.

12:11 - October 11, 2017
12:10 - October 11, 2017

 

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. బోర్డు అధికారులు అసంబద్ద నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఇంటర్‌ బోర్డు ప్రతిష్ట దిగజారుతోంది. ప్రధానంగా కాలేజీలకు గుర్తింపునిచ్చే అంశం వివాదాస్పదమవుతోంది. అఫ్లియేషన్‌ గడువు ముగిసే వరకు అనుమతి ఇవ్వకపోవడం, రాత్రికి రాత్రే వందలాది కాలేజీలకు గుర్తింపు ఇవ్వడంతో ఇంటర్‌బోర్డు పనితీరు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జూనియర్‌ కాలేజీకి ఇంటర్‌ బోర్డు గుర్తింపు తప్పని సరి. జూనియర్‌ కాలేజీ నడపాలంటే దానికి అఫ్లియేషన్‌ ఉండాలి. దాన్ని ఇంటర్‌ బోర్డు నుంచి తీసుకోవాలి. కళాశాలల అఫ్లియేషన్ల కోసం ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది మే నెలలోనే ప్రక్రియను ప్రారంభించింది. కాలేజీలన్నీ ఇంటర్‌ బోర్డు సూచించిన ప్రకారం నిర్ణీత గడువులోగా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకున్న కాలేజీలను బోర్డు అధికారులు విజిట్‌ చేసి అన్ని వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలి. అప్పుడే గుర్తింపు ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా ఇంటర్‌ తరగతులు ప్రారంభం అయ్యేలోపు ముగించాలి.

ముడుపులు ముట్టజెప్పిన కాలేజీలకు పర్మిషన్లు
ప్రతి ఏడాది గుర్తింపు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకునేలా నిర్ణీత గడువు ఇంటర్‌ బోర్డు ఇస్తుంది. దీంతో కాలేజీలు కూడా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఈలోగా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. మరోవైపు ఇంటర్‌ బోర్డు అధికారులు మాత్రం జూన్‌లోగా ముగించాల్సిన ప్రక్రియను నాన్చుతున్నారు. వివిధ కారణాలు చూపెడుతూ అఫ్లియేషన్‌ ఇవ్వడం లేదు. ఇది ఎందుకోసమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోర్డు అధికారులకు ముడుపులు ముట్టజెప్పిన కాలేజీలకు పర్మిషన్లు వెంటనే వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల చేయి తడపని కాలేజీల గుర్తింపులు పెండింగ్‌లో పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అమ్యామ్యాలకు అలవాటుపడిన ఇంటర్‌ బోర్డు అధికారులు కాలేజీల్లో ఎలాంటి వసతులు లేకపోయినా గుర్తింపులు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్‌
ఇంటర్‌ కాలేజీల గుర్తింపు జూన్‌లోగా ఇంటర్‌ బోర్డు తేల్చకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతోంది. కాలేజీలు గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకుంటూనే.. మరోవైపు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఇలాంటి కాలేజీలకు గుర్తింపురాకపోవడంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతోంది. గతేడాది వనస్థలిపురంలోని శ్రీవాసవి విద్యార్థులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. బోర్డు అధికారులు కాసుల కక్కుర్తి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌బోర్డు అఫ్లియేషన్‌ డెడ్‌లైన్‌ ముగిసే వరకు జూనియర్‌, ఒకేషనల్‌ కాలేజీలతో కలిపి మొత్తం 327 కాలేజీలకు గుర్తింపు నిరాకరించినట్టు ప్రకటించింది. గుర్తింపు నిరాకరించిన కాలేజీల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే బయటకు మాత్రం ఈ లక్ష మంది విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా గుర్తింపు నిరాకరించిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించింది. అంతేకాదు... ఆయా కాలేజీల లిస్ట్‌ను సిబ్బంది ద్వారా లీకు చేసింది. ఇంటర్‌బోర్డు అలా ప్రకటించి 48 గంటల గడవక ముందే గుర్తింపులేని కళాశాలలపై మరో ప్రకటన చేసింది. ఈ కాలేజీలకు షరతులతో కూడిన గుర్తింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. వారికి రాత్రికి రాత్రే అఫ్లియేషన్‌ ఇచ్చింది. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు గుర్తింపు ఇవ్వకుండా తొక్కిపెట్టిన అధికారులు రాత్రికి రాత్రే ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ నాణ్యత ప్రమాణాలని బోర్డు అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. రాత్రికి రాత్రే ఆయా కళాశాలల్లో కనీస సౌకర్యాలు, సదుపాయాలు ఎలా మెరుగయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముడుపులకు ఆశపడే గుర్తింపులు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు, విమర్శలకు ఇంటర్‌బోర్డు అధికారులే సమాధానం చెప్పాలి.

చివరి నిమిషం వరకు కాలేజీలపై ఒత్తిడి
ఇంటర్మీడియట్‌ కాలేజీలకు గుర్తింపు ఎప్పుడు ఇవ్వాలనేదానిపై బోర్డుకు స్పష్టత ఉండడంలేదు. వాస్తవానికి కాలేజీలు ప్రారంభానికి ముందే అనుమతులపై బోర్డు దృష్టిసారించాలి. కానీ ఇంటర్‌ బోర్డు నిర్ణయం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. పరీక్ష ఫీజు గడువు సమీపిస్తున్న సమయంలో గుర్తింపు అంశాన్ని ఇంటర్‌బోర్డు తెరమీదకు తీసుకువస్తోంది. పరీక్ష ఫీజు గడువు సమయమంటే విద్యార్థులను , యాజమాన్యాలను ఒత్తిడి చేయడానికి రైట్‌టైమ్‌గా బోర్డు అధికారులు భావిస్తున్నారు. అందుకే గుర్తింపు విషయంలో చివరి నిమిషం వరకు కాలేజీలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా చివరి నిముషంలో ఒత్తిడి తీసుకొస్తేనే కాలేజీ యాజమాన్యాలు ఏమి చేసేందుకైనా సిద్ధంగా ఉంటాయన్నది బోర్డు అధికారుల అంచనా. అందుకే విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన గుర్తింపును బోర్డు అధికారులు చివరి వరకు నాన్చుతున్నారు. దీని వెనుక అధికారుల కాసుల కక్కుర్తి స్పష్టంగా కనిపిస్తుందడనంలో ఎలాంటి సందేహం లేదు. అధికారులకు ముడుపులు ముట్టజెపితే చాలు ఎప్పుడైనా పర్మిషన్‌ తీసుకోవచ్చన్న నానుడి బహిరంగానే వినిపిస్తోంది. చివరి నిముషం వరకు అమ్యామ్యాలు ఇవ్వని కాలేజీలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా హాల్‌టికెట్‌ తీసుకునే సమయంలో ఆయా కాలేజీలపై బోర్డు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ బెదిరింపులకు తలొగ్గి కాలేజీల యాజమాన్యాలు అధికారులు చేతులు తడుపుతున్నాయి. అప్పుడే ఆ కాలేజీలకు ఇంటర్‌బోర్డు గుర్తింపును ఇస్తోందనేది బహిరంగ రహస్యమే.

ఇంటర్‌ బోర్డులో తిష్టవేసిన కొంతమంది అధికారులు
ఇంటర్‌ బోర్డులో తిష్టవేసిన కొంతమంది అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏళ్లుగా తిష్టవేసిన సిబ్బంది అధికారులతో కలిసి గుర్తింపుల విషయంలో మైండ్‌గేమ్‌ ఆడుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే మొదటి నుంచి అఫ్లియేషన్‌ ఇవ్వకుండా హోల్డ్‌లో పెడుతున్నారు. చివరి నిముషంలో ముడుపులు పుచ్చుకుని గుర్తింపు ఇస్తున్నారు. ప్రమాణాలు ఉన్నా లేకున్నా అఫ్లియేషన్‌ వస్తుంది. ఇది గత కొన్నేళ్లుగా ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న దందా. ఇదంతా ఉన్నతాధికారులు, ఆ శాఖ మంత్రులకూ తెలుసు. అయినా అధికారులపై ఎలాంటి చర్యలు ఉండవు. విద్యార్థి సంఘాలు, లెక్చరర్స్‌ సంఘాలు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం ఉండదు. వారి మొరను ఆలకించే వారే ఉండరు. వారి వేదన అరణ్య రోదనగానే ఉంటోంది. ఇంటర్‌బోర్డ్‌ అధికారుల దందాకు స్వరాష్ట్రంలోనైనా అడ్డుకట్టపడుతుందని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఇంటర్‌బోర్డు అధికారుల తీరుమారడం లేదు. జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలను జలగల్లా పీల్చడం ఆగలేదు. ఇంటర్‌ బోర్డు అఫ్లియేషన్‌ దందాకు ఎప్పుడు చరమగీతం పాడతారో వేచి చూడాలి. 

12:07 - October 11, 2017

 

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంటర్‌ కమిషనరేట్‌లో.. ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న అన్యాయాలకు అమాయకులు బలవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు, నియామకాలు మొదలు.. ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేంతవరకు అన్నింట్లో అవినీతి అక్రమాలే తారసపడుతున్నాయి. ఇంటర్‌ బోర్డు అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంటర్‌ విద్యలో తామే టాపర్స్‌ అని చెప్పుకుంటోన్న ప్రభుత్వానికి.. ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న అక్రమాలేవి కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లెక్చరర్ల సంఘం అధ్యక్షుడే కారణమటా..
ఇంటర్ విద్య గాడి తప్పడానికి బోర్డు కార్యదర్శి, ఆయన వెనక ఉండే లెక్చరర్ల సంఘం అధ్యక్షుడే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా చూసీ చూడనట్టుగా వ్యవహరించి.. కేసులను మూసేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న అక్రమాలకు.. పేరున్న ఒక సంఘ నాయకుడు అండగా ఉన్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కమీషనర్ వెనకాలే ఉండి సుడో కమీషనర్‌గా వ్యవహరిస్తున్నాడని జాక్ అభిప్రాయపడుతోంది. అతని వల్లే రాష్ట్రంలోని ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కేవలం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి పదోన్నతులను అడ్డుకోవడం.. ప్రిన్సిపాల్స్‌ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సస్పెన్షన్‌లు చేయిస్తున్నారంటున్నారు. ఎంక్వైరీకి వచ్చిన అధికారులను కూడా తమ వైపుకు తిప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.

నల్లగొండ జిల్లాలో రికార్డు అసిస్టెంట్‌
మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న లింగస్వామి అనే ఉద్యోగిని.. అక్రమంగా స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో ఇరికించారు.ఇదంతా పథకం ప్రకారం జరిగిందని విచారణలో బయటపడింది. కాలేజ్‌లో విద్యార్థుల ఏటీఎం కార్డుల పిన్‌ నెంబర్లు మొత్తం ప్రిన్సిపాల్ దగ్గర మాత్రమే ఉంటే.. రికార్డు అసిస్టెంట్‌ ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేశాడని విచారణాధికారి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. దీంతో రికార్డు అసిస్టెంట్‌తో పాటు ప్రిన్సిపాల్‌ను కూడా సస్పెండ్ చేశారు. కానీ ఏ తప్పు చేయని చిన్న స్థాయి ఉద్యోగి ఇప్పటికీ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేస్తోన్న ప్రవీణ్‌.. అశ్వరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఎస్సీ ఉద్యోగికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడానికి వెళ్లారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర సెక్రటరీ హోదాలో వెళ్తే తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు నివేదికలు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా 11 నెలల పాటు సస్పెండ్ చేయించారు. ఇటువంటి సంఘటనలు ఇంటర్‌ బోర్డులో మచ్చుకి కొన్ని మాత్రమేనని జాక్‌ నేతలంటున్నారు. వీటన్నింటిపై వెంటనే విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని వారు కోరుతున్నారు.

11:41 - October 11, 2017

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. అధికారులు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, జ్యువెల్లరీని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:40 - October 11, 2017

గుంటూరు : ఏపీ పోలీసు శాఖలో డీఎస్పీల బదిలీల వ్యవహరం వివాదాస్పదండా మారింది. ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం 32 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీలను విధుల్లో చేరకుండా కొందరు ప్రజా ప్రతినిధులు అడ్డుపడుతున్నారు. తాము చెప్పినవారికి కాకుండా వేరేవారికి పోస్టింగ్ ఇచ్చారని వారు పంచాయతీకి దిగారు. సీఎం చంద్రబాబు నాయుడు బదిలీల విషయంలో ఎలాంటి ఇత్తిళ్లకు తలొగ్గద్దని సూచించారు. బదిలీల వ్యవహారంలో తమ అభ్యంతరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చెప్పినట్లు చేయడమే తప్ప మరో మార్గం లేదని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్:కడియం..

హైదరాబాద్: 8792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ అతి త్వరలోనే వ్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్‌లో నిర్మించే కాకతీయ టెక్స్‌ టైల్‌ పార్క్‌ కు ఈనెల 20న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. 2వేల ఎకరాల్లో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్ నిర్మాణం చేయనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

భూమి నుండి ఎగిసిపడుతున్న పొగలు..

కర్నూలు: హాలహర్వి మండలం, యంకె పల్లిలో భూమి నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. భారీ శబ్ధాలతో ఆకాశం ఎత్తుకు పొగలు ఎగిసి పడ్డాయి. ఊహించని పరిణామంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకు టెన్షన్ పడుతున్నారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అధికారులు వచ్చేలోపే ఈ దృశ్యం కనుమరుగైంది. పచ్చని పంట పొలాల్లో రేగిన అగ్గిపై అధికారులు విచారణ చేపట్టారు.

11:21 - October 11, 2017

మణిరత్నం...ప్రముఖ దర్శకులు. ఆయన నుండి ఎన్నో విజయంతమైన చిత్రాలు వచ్చాయి. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారిలో ఈయన ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందంటే ఎంతో మంది ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చివరి మూవీ 'చెలియా' ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు.

తాజాగా ఓ మూవీ ప్రాజెక్టును 'మణిరత్నం' ప్రకటించేశారు. టైటిల్ ను ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమాలోని ప్రధాన తారగణం..టెక్నీషియన్స్ వివరాలను రిలీజ్ చేశారు. తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పైనే ఈ చిత్రం రూపొందించనున్నారు. ప్రొడక్షన్ నెం17 అంటూ 'మణిరత్నం' కొత్త సినిమా ప్రకటన చేశారు.
ఒక్కో పాత్రకు సంబంధించిన స్కెచ్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అయపోతున్నాయి. తమిళ స్టార్లు శింబు.. విజయ్ సేతుపతి.. అరవింద్ స్వామి.. మలళయాళం నుంచి ఫదా ఫాజిల్.. ఇంకా సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. అందాల భామ ఐశ్వర్యా రాజేష్ లు ఈ మూవీ ప్రధాన పాత్రధారులు. ఇక్కడ ఐశ్వర్య రాజేష్ ఎవరికి జోడీ అనేది ఇంకా తెలియరాలేదు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు. 'మణిరత్నం' సినిమాలకు సంగీతం అందించే రెహమాన్ ఈసారి కూడా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

11:19 - October 11, 2017

ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతున్న న్యూ ఇండియా-2022 సదస్సుల్లో పాల్గొననున్నారు. ఈ సదస్సు మూడురోజుల పాటు జరగనుంది.

మైనర్ బాలికలపై అత్యాచారాలపై సుప్రీం కీలక తీర్పు

ఢిల్లీ: మైనర్ బాలికలపై అత్యాచారాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 18 ఏళ్లు నిండని భార్యతో శృంగారం అత్యాచారమేనే అని స్పష్టం చేసింది. దీనిపై ఫిర్యాదు చేసే హక్కు ఉందని, అయితే ఒక సంవత్సరం లోపు ఫిర్యాదు చేయాలని సూచించింది.

11:12 - October 11, 2017

'గోల్ మాల్'..బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా నవ్వులు కురిపించింది. 'గోల్ మాల్' సిరీస్ లో ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో సినిమాలు విజయవంతమయ్యాయి. 'గోల్ మాల్ ఏగైన్' తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రచార కార్యక్రమాల్లో ఆయా హీరోలు పాల్గొంటున్నారు.

ప్రచార కార్యక్రమలో భాగంగా నటుడు 'అర్షద్ వార్సి' పాల్గొన్నారు. ఈయన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. సినిమా పరాజయం చెందినా రూ. 200 కోట్లు రాబడుతుందని జోస్యం చెప్పాడు. చిత్రాలు రిలీజ్ అయిన సమయంలో విజయం సాధిస్తుందా ? లేదా ? అనే భయం ఉంటుంది..కానీ 'గోల్ మాల్' విషయంలో అలాంటేది ఏమీ లేదన్నారు. సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని తెలిపారు.

బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండబగా టబు రుక్మిణిగా, ప్రకాశ్‌ రాజ్‌ షేరు భాయ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పటికే మూడుసార్లు మురిపించిన 'గోల్‌మాల్' సిరీస్ నాలుగో సారి కూడా నవ్వులు కురిపిస్తారేమో చూడాలి. 

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ ఆదేశాలు..

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 2018 జూన్ 30వ తేదీలోగా భర్తీ చేయాలని మంగళవారం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు.

11:03 - October 11, 2017

'శంకర్' దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్ తో 'శంకర్' సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో 'అమీ జాక్సన్' ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా అమీ జాక్సన్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో 'రోబో రజనీ'తో జరిగే షూటింగ్ లో 'అమీ' పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 'శంకర్' కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'రోబో రజినీ' తో 'అమీ జాక్సన్' ఫొటో దిగింది. రేపటి నుంచి 'రోబో రజినీ'తో షూటింగ్ అంటూ క్యాప్సన్ పెట్టి..'అమీ జాక్సన్' ఫొటోను షేర్ చేసింది.

తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మూడు భాషల్లో ఒకేసారి డబ్బింగ్ పనులు నిర్వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సూప‌ర్ స్టార్ రజనీ కాంత్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ .. అమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

11:02 - October 11, 2017

హైదరాబాద్ : నగరాన్ని వాన వదలడంలేదు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రామంతపూర్ పెవచెరవు నీటితో 10 రోజులుగా కాలనీలు నీటితో మునిగింది. 500 కుటుంబాలు నీటి ముంపుతో అవస్థలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు గత 5రోజులుగా మోటార్ లతో నీటిని తోడుతున్నారు. ఇవాళ ఉదయం 125 హెచ్ పీ మోటార్ తో నీటిని తోడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:57 - October 11, 2017

చిత్ర సీమలోకి వచ్చిన వారు హీరో..హీరోయిన్లుగా చలామణి కావాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ వారికి వయస్సు మీద పడడంతో ఆఫర్స్ వెనక్కి పోతుంటాయి. దీనితో వయస్సు కనబడనీయకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అతి జాగ్రత్త వహిస్తుంటారు. అందులో భాగంగా ఎక్సర్ సైజులు, డైట్స్ ఇతరత్రా పాటిస్తుంటారు. యువ హీరోయిన్లకు ధీటుగా వీరు పోటీనిస్తుంటారు. అందులో 'త్రిష' ఒకరు.

త్రిష...అలనాటి అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటించారు. థర్టీ ప్లస్ దాటినా యువ హీరోయిన్లకు పోటీనిస్తోంది. స్లిమ్ గా ఉండేందుకు చాలా శ్రమిస్తోందంట. స్లిమ్ గా..గ్లామర్ గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయని భావించి నిత్యం కష్టపడుతోందంట. ఒక్క జిమ్‌తోనే సరిపెట్టకుండా డాన్స్, ఎరోబిక్స్, స్టెప్‌ ఎరోబిక్స్, ఫుడ్‌బాల్‌ ఎరోబిక్స్ వంటివి చేస్తూ స్లిమ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా ఓ ఫొటోను 'త్రిష' తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. తాను ఏరోబిక్స్ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా కనిపిస్తున్నారంటూ పోస్టు చేసింది. మరి ఈ లుక్ తో ఎలాంటి ఛాన్స్ లు దక్కించుకుంటుందో వేచి చూడాలి. 

10:48 - October 11, 2017

తమిళ నటుడు 'సంతానం' ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనపై హత్యా బెదిరింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. 'సంతానం'ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కోలీవుడ్ లో కలకలం రేగుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా 'సంతానం' ఎదిగారు. హీరోగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. నగర శివారులోని కోపూర్ మూండ్రాం కట్టళైలో కళ్యాణ మండపం నిర్మించాలని కాంట్రాక్టర్ షణ్ముగ సుందరంతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కొంత డబ్బును షణ్ముగ సుందరం కు 'సంతానం' ఇచ్చినట్లు టాక్. కానీ మండపం నిర్ణయాన్ని ఇద్దరూ విరమించకోవడంతో తన డబ్బులను వెనక్కి ఇవ్వాలని 'సంతానం' కోరారు. కొంత ఇచ్చినా మిగతా డబ్బు ఇవ్వడానికి కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలో తన మేనేజర్ తో కలిసి వలసరవాక్కంలోని షణ్ముగ కార్యాలయానికి 'సంతానం' వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం..ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఘర్షణకు దారి తీసింది. ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది ప్రేమ్ ఆనంద్ పై కూడా దాడి జరిగిందని తెలుస్తోంది. ఈయన బీజేపీ నేత కావడంతో రాజకీయ రంగు పులుముకుంది.

తనపై నటుడు 'సంతానం' దాడి చేసి గాయపరిచినట్లు గుత్తేదారుడు షణ్ముగ సుందరం వళసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే 'సంతానం'పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి వళసరవాక్కం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఉదయం 'సంతానం'పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన తమిళ చిత్రపరిశ్రమలో అలజడి సృష్టించింది. 

కొత్తజిల్లాలకు నేటితో ఏడాది పూర్తి...

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి నేటికి ఏడాది పూర్తి కావడంతో.. తొలి వసంత వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పది జిల్లాలతో ఆవిర్భవించిన తెలంగాణలో.. మరో 21 కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్ గతేడాది దసరా పర్వదినంన ప్రారంభించిన విషయం విదితమే. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా.. జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. రూ. 1032 కోట్లతో 18 ప్రాంతాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలకు సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు, మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్ : బందిపోరా జిల్లా హాజిన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హాజిన్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో బలగాలు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు తెలుస్తుంది.

ఉపాధి హామీ పథకం అనుసంధానంపై మంత్రి లోకేష్ సమీక్ష

అమరావతి: వివిధ శాఖలతో ఉపాధి హామీ పథకం అనుసంధానంపై లోకేష్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత రంగాల అనుసంధానంతో చేపడుతున్న కార్యక్రమాలు, పనుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో మంత్రులు శిద్ధా, ఆదినిరాయణ రెడ్డి పాల్గొన్నారు.

10:28 - October 11, 2017

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఏబీసీ దాడులు

హైదరాబాద్: ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. హైదరాబాద్లో మొత్తం 7 చోట్ల, కరీంనగర్ లో సోదాలు చేస్తోంది.

యాగంటి ఆలయంలోకి వర్షపు నీరు

కర్నూలు: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో భక్తుల రకాపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది.

పోలవరంలో వర్షం... కొట్టుకుపోయిన 15 ఇళ్ళు...

ప.గో: పోలవరంలో రాత్రి కుసిరిసన వర్షానికి ఇటుకలకోట గ్రామంలో 15 ఇళ్లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొత్తూరు, కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అభివృద్ధి గురించి సింగపూర్ బృందానికి వివరించిన లోకేష్

విజయవాడ: సింగపూర్ కాన్సులేట్ జనరల్ మంత్రి ప్రాన్సిస్, వైస్ కాన్సులేట్ ను లోకేష్ కలిశారు. ఏపీలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి సింగపూర్ బృందానికి మంత్రి లోకేష్ వివరించారు. విశాఖలో అంతర్జాతీయ బ్లాక్ చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్ విజయవంతంపై బృందం లోకేష్ ను అభినందించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి ట్యాపంర్ ప్రూఫ్ ల్యాండ్ రికార్డులను రూపొందిస్తున్నామని లోకేష్ తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తామని సింగపూర్ బృందం తెలిపింది.

10:10 - October 11, 2017

 

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:09 - October 11, 2017

హైదరాబాద్ : నగరాన్ని వాన వదలడంలేదు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రామంతపూర్ పెవచెరవు నీటితో 10 రోజులుగా కాలనీలు నీటితో మునిగింది. 500 కుటుంబాలు నీటి ముంపుతో అవస్థలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు గత 5రోజులుగా మోటార్ లతో నీటిని తోడుతున్నారు. ఇవాళ ఉదయం 125 హెచ్ పీ మోటార్ తో నీటిని తోడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:27 - October 11, 2017

అవినీతికి అడ్డాగా ఎమ్మార్వో ఆఫీస్

 

కడప : జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మార్వో కార్యాలయం అవినీతి అడ్డాగా మారింది. ఓ రాజకీయ నేత కుమారుడు ప్రధాన రహదారి పక్కన ఉన్న రైతుల భూమిని కబ్జా చేశాడు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై 35 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు.

09:26 - October 11, 2017

కడప : జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మార్వో కార్యాలయం అవినీతి అడ్డాగా మారింది. ఓ రాజకీయ నేత కుమారుడు ప్రధాన రహదారి పక్కన ఉన్న రైతుల భూమిని కబ్జా చేశాడు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై 35 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. దీంతో రైతులు కబ్జా దారుడి నుంచి తమ భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:19 - October 11, 2017

 

ప్రకాశం : జిల్లా గౌనివారిపాలెం, ఉలిచి గ్రామాల్లో గొర్రెలకు వింత వ్యాధి సోకి మరణిస్తున్నాయి. నవరత్నాల ఆకులుతిని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయిని కాపరులు చెబుతున్నారు. రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు 200 గొర్రెలు మృతి చెందాయి. మరో 500 గొర్రెలకు తీవ్ర ఆస్వస్థత గురైయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:16 - October 11, 2017

 

అనంతుపురం : జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాగు నీటి ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు చేరడంతో ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:15 - October 11, 2017

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరంలో భారీ వర్షం కురవడంతో ఇసుక వాగు 10 అడుగుల ఎత్తు నీటితో పొంగిపొర్లింది. ఇటుకలకోట గ్రామంలో నీటి ప్రవాహానికి 15 ఇళ్లు కొట్టుపోయాయి. రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. కొత్తూరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

అనంతపురం ప్రాజెక్టులకు జలకళ

 

అనంతుపురం : జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాగు నీటి ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు చేరడంతో ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 

పోలవరంలో భారీ వర్షం

 

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరంలో భారీ వర్షం కురవడంతో ఇసుక వాగు 10 అడుగుల ఎత్తు నీటితో పొంగిపొర్లింది. ఇటుకలకోట గ్రామంలో నీటి ప్రవాహానికి 15 ఇళ్లు కొట్టుపోయాయి. రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. కొత్తూరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం

కరీంనగర్/సిరిసిల్ల/సిద్దిపేట : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు సీపీఎం నేతలను ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ధరాత్రి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పంతం రవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, సీపీఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

08:12 - October 11, 2017

 

కరీంనగర్/సిరిసిల్ల/సిద్దిపేట : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు సీపీఎం నేతలను ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ధరాత్రి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పంతం రవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, సీపీఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చయండి.

నేడు ఏపీ సీఎం వీడియోకాన్ఫరెన్స్

 

గుంటూరు : అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి మంత్రులు, వివిధ శాఖల హెచ్ వోడీలు హాజరుకానున్నారు. 

నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో సీఎం పర్యటన

 

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట, సిరిసిల్లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నాం 12.30 సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో కలెక్టరేట్, కమిషనరేట్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3.25లకు సిరిసిల్ల కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

07:47 - October 11, 2017

సంక్షేమ పథకాలు మంచివే కానీ ఎన్నికలప్పుడు ఇవి గుర్తోస్తాయని, డ్వాక్రా రుణామఫీ అందరికి అందలేదని, ఎన్నికలు ఆరు నెలల్లో ఉందనగాన నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతున్నారని, రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను సేకరించి ఇంత వరకు అసెంబ్లీ డిజైన్ల కూడా ఆమోదం పొందలేదని, తమిళనాడు చెందిన వివాదాస్పద విద్యాసంస్థలకు తక్కువ ధరకు భూములు కట్టబెట్టారని సీపీఎం నేత బాబురావు అన్నారు. 2014లో రైతు రుణామాఫీ చేయాలని డ్వాక్రా రుణామాఫీ చేయాలని, అప్పుడు రాష్ట్ర విభజన చేయడం వల్ల ప్రభుత్వం అత్యవసరమైన వాటిని అమలు చేసిందని దాని కోసం పించన్లు వెంటనే అమలు చేశామని, మన రాష్ట్రానికి వచ్చే రూ.16 వేల కోట్లు రాలేదని, రాజధాని భూములు అవసరమని టీడీపీ నేత చాంద్ సాంబశివరావు అన్నారు. సాంబశివరావు మాట్లాడప్పుడు కొన్ని వాస్తవాలు మరిచిపోయారని, అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుందని తెలుసని, కానీ వారు అధికారం కసమే హామీలు ఇచ్చారని వైసీపీ నేత మధుసుదన్ అన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:45 - October 11, 2017

మద్యాన్ని ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి. కులదురంహకార హత్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాలి. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే ఆమోదించాలి. ఇవి రెండు రోజులు జరిగినా ఐద్వా మహాసభలు ఇచ్చిన డిమాండ్ల పై చర్చ. ఇప్పటికి ఆడపిల్లలంటే చులకనగా చూస్తున్నారని, ఆడవారిని వంటింటికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని, బీజేపీ మనువాదంతో మహిళలను అణగదొక్కుతున్నారని, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఐద్వా గట్టి పోరాటలు చేశాయని, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మద్యన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయని, దీంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, దీని వల్ల కుటుంబాలు విచ్చిన్న అవుతున్నాయిని, దశలవారిగా మద్యన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందిని, ప్రభుత్వాలు ఆదాయం కోసం ఇతర మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉందని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మీ అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:43 - October 11, 2017

 

హైదరాబాద్ : హైదరాబాద్ ప్రగతినగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐద్వా మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా ఐద్వా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఐద్వా విస్తరణ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐద్వా నూతన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐద్వా పోరాడాలన్నారు. తెలంగాణాలో మహిళలు ఎక్కువగా నిరక్షరాస్యులుగా ఉన్నారని ఐద్వా నూతన అధ్యక్షురాలు బుగ్గవీటి సరళ ఆన్నారు.

ప్రభుత్వం విఫలమైంది..
నిరక్షరాస్యతను పోగొట్టే క్రమంలో బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారన్నారు. మహిళలపై హింస, అత్యాచారాలు పెరగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా జాతీయ కార్యదర్శి మరియన్‌ దావలె అన్నారు. ఉపాధి హామీ పథకంలో మహిళలు ఎక్కువగా పని చేస్తున్నారని, దానిని పటిష్టంగా అమలు చేయాలని ఆమె కోరారు. తెలంగాణలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని వారిక అండగా నిలబడి పోరటం చేయాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో అశ్లీలతను నియంత్రించేలా సెన్సార్‌ బోర్డు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాలన్నింటిలో పాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై హింసకు సంబంధించిన కేసులను వెంటనే పరిష్కరించి, దోషులను శిక్షించాలన్నారు. మహిళా సమస్యలపై ఏకకాలంలో ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని మహాసభ పిలుపునిచ్చింది. మహిళలపై బాధ్యతగా ఉంటూ భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా నూతన కమిటీ తెలిపింది. 

07:42 - October 11, 2017

కరీంనగర్/పెద్దపల్లి : వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సీతనగర్‌కు చెందిన జంగపెల్లి మౌనిక గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ఆదివారం పండంటిపాపకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి పాప పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి సీరియస్‌గా ఉందని.. మళ్లీ గోదావరిఖని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిన్నారి చనిపోయింది. తన బిడ్డ మృతికి వైద్యులే కారణమంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

07:40 - October 11, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రీగోల్డ్‌ ఆస్తుల విక్రయాలకు సంబంధించి మూడు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని సీఐడీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో చర్చించేందుకు , కార్పొరేట్‌ కార్యాలయాల నిర్వహణ, డాక్యుమెంట్ల పరిశీలనకుగాను మూడు టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ టీమ్‌లలో ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులు, జీఎస్సెల్‌ నుంచి ఒకరు, అగ్రీగోల్డ్‌ యాజమాన్యం తరపున ఒకరు, కోర్టు తరపున ఒక న్యాయవాది ఉండాలని దిశానిర్దేశం చేసింది. మూడు టీమ్‌లలో ఒక టీమ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలు సేకరించాలని సూచించింది. మరోటీమ్‌ బాధితుల సర్టిఫికెట్లను పరిశీలించాలంంది. ఇక మూడోటీమ్‌ ఆస్తుల విలువలను అంచనావేసి ఈనెల 23న వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

జీఎస్సెల్‌ గ్రూప్‌ హైకోర్టుకు పదికోట్ల రూపాయలు
అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీఎస్సెల్‌ గ్రూప్‌ ఇంతకుముందే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ సందర్భంగా జీఎస్సెల్‌ గ్రూప్‌ హైకోర్టుకు పదికోట్ల రూపాయలు చెల్లించింది. ఈనెల 24లోపు ఆస్తుల మదింపు పూర్తిచేసి ఎంతశాతం డబ్బు చెల్లిస్తారో చెప్పాలని జీఎస్సెల్‌ కంపెనీకి ధర్మాసనం ఆదేశించింది. అయితే సీఐడీ ఏపీలోని బాధితుల వివరాలు మాత్రమే సేకరిస్తోందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అన్ని రాష్ట్రాల బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో సేకరించాలని తదుపరి విచారణలో ఆదేశాలిస్తామని పిటిషనర్‌కు తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.

డిపాజిట్ల సేకరణకు ఏపీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు
హైకోర్టు ఆదేశాలతో అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు , డిపాజిట్ల సేకరణకు ఏపీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12 వెబ్‌సైట్‌లో బాధితులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్టు ఆయా జిల్లాల ఎస్పీలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు ఉంటే ఇప్పటి వరకు 9.9 లక్షల మంది ఖాతాదారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వారి వెరిఫికేషన్‌ ఇప్పుడు జరుగుతుంది. బాధితులంతా తమ దగ్గరనున్న ఆధారాలు తీసుకురావాలని సూచించారు. ఒరిజినల్‌ పత్రాలతో రావాలని కోరారు. ప్రతి ఖాతాదారుడు ఆధార్‌కార్డుతోపాటు బ్యాంకు పాస్‌బుక్‌ కూడా తీసుకురావాలన్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభించి పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడలో 17 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ సిటీలో11 కేంద్రాలను, జిల్లాలని అన్ని మండల కేంద్రాల్లోని పీఎస్‌ల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరులోనూ అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

07:39 - October 11, 2017

గుంటూరు : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, గ్రూప్‌-4 అధికారులకు ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌లో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణ సంస్థ 10 డిజైన్లు అందించిందని.... మరోసారి సమావేశమై డిజైన్లను ఫైనలైజ్‌ చేస్తామన్నారు. టెండర్లు ఖరారు అయ్యాక... 18 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు నారాయణ.

07:38 - October 11, 2017

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో సుదీర్ఘంగా భేటీ అయిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థికసాయం అందించే కొత్త పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చంద్రన్న పెళ్లికానుక పేరుతో ఈ పథకం అమలుకానుంది. నూతన సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. ఈ పథకానికి తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న బీసీ కులాలకు చెందిన వారు అర్హులు. ఈ పథకం కింద పెళ్లి సమయంలో ఒక్కో జంటకు 30వేల రూపాయలు ఆర్థికసాయంగా అందజేయనున్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో క్లౌడ్‌ ఆధారిత వర్చువల్‌ క్లాసురూమ్స్‌ ఏర్పాటు కోసం చేపట్టే ప్రాజెక్టును అమలు చేయడానికి, ట్రీజిన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ అనే సంస్థ ఎంపికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రాజెక్టు వీలుకల్పిస్తుంది. డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రవాసుల సంక్షేమానికి ఉద్దేశించి 40 కోట్లతో ఏపీ మైగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీకి చెందిన దాదాపు 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు దీనిద్వారా ప్రయోజనం పొందనున్నారు.

పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలల
పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మానవ వనరుల నియామకాలపై మంత్రిమండలిలో చర్చించారు. ఎంత మంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్లాంటేషన్‌, శాండ్‌, భారీ వర్షాలు, జల సంరక్షణ, గిరిజన ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధులతోపాటు ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్‌ -2017 డ్రాఫ్టుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు స్థలం కేటాయించారు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి, బ్రహ్మకుమారీ సంస్థ, గోపీచంద్‌ అకాడమీకి అమరావతిలో స్థలాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక మధురవాడ సెజ్‌లో ఏఎన్‌ఎస్‌ఆర్‌ కంపెనీకి 10 ఎకరాలు కేటాయించారు. దీని ద్వారా రాబోయే ఆరేళ్లలో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో మోడ్రన్‌ అండ్‌ స్టేట్‌ ఆఫ్ ఆర్ట్‌ టైర్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఏర్పాటు కోసం భూకేటాయింపు పొందిన అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ కోరిన మినహాయింపులకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు కోసం 4 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకకు అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

07:29 - October 11, 2017

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్‌ 11 దసరా పండుగ రోజున నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదేరోజున కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పొన్నాల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్‌ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండపాక మండలం దుద్దెడ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించే కలెక్టర్‌ , పోలీస్‌ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సిద్దిపేట మండలం ఎన్నాన్‌పల్లిలో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లనూ సీఎం పరిశీలించనున్నారు.

ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష..
సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జనసమీకరణ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిద్దిపేట పట్టణం గులాబీమయం అయ్యింది. టీఆర్‌ఎస్‌ నేతల ఫ్లెక్సీలతో హోర్డింగ్‌లు నిండిపోయాయి. సిద్దిపేట నుంచి మధ్యాహ్నం 3.15కు కేసీఆర్‌ సిరిసిల్లాకు వెళ్తారు. జిల్లా కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు తరలివచ్చే వాహనాలను నిలుపుదల చేయడానికి పట్టణంలోకి ప్రవేశించే మూడు రహదారుల ప్రక్కన మూడువైపులా మూడు పార్కింగ్‌ ప్లేస్‌లను సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ విశ్వజిత్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Don't Miss