Activities calendar

12 October 2017

భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లు జలమయం

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

21:54 - October 12, 2017

హైదరాబాద్ : ఉప్పల్‌లో జరిగే భారత్‌, ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 18 వందల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 56 అధునాతన సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని విజిలెన్స్, అక్టోపస్‌, షీ టీమ్స్‌, మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో ప్రేక్షకులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్‌సీఎ కార్యదర్శి శంకర్‌ నారాయణ తెలిపారు. 

 

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

21:47 - October 12, 2017

కొమ్రంభీం అసిఫాబాద్ : జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గోండు తెగకు చెందిన వేలాది మంది కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లి పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని బయటకు పంపించారు. పరిస్థితిని జిల్లా కలెకర్ట్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 

 

21:45 - October 12, 2017
21:43 - October 12, 2017

సూర్యపేట : సమైక్య పాలనలో, కాంగ్రెస్ నేతల హయాంలో దక్షిణ తెలంగాణ దగాపడిందన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఆనాడు కాంగ్రెస్ నేతలే దగా చేశారని కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సూర్యాపేటలో పర్యటింటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈరోజు నష్టపరిహారం గురించి మాట్లాడుతున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన నియోజకవర్గంలో భూములు మునిగితే ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష ఉత్తమ్ కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి సమైక్యవాదులైన కాంగ్రెస్ నేతలు దగా చేశారని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో నీరు పారేదని అన్నారు. అప్పుడు, ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. 

21:36 - October 12, 2017

గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. మృతులు భువనిగిరికి చెందిన రాములమ్మ, చంచల్ గూడకు చెందిన చిన్నారి హస్సన్ కరీమ్. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 45 స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి.

 

 

ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించిన వర్మ

హైదరాబాద్ : ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. లక్ష్మీస్ ఎన్ టీఆర్ బయోపిక్ కాదని ట్వీట్ చేశారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి చివరి వరకు జరిగిన విషయాలపై రూపొందే సినిమా అని ట్వీట్ చశారు. అసలు చరిత్ర చూపడమే తన అసలు సిసలు ఉద్దేశమని తెలిపారు. తనకు వార్నింగ్ లు టీడీపీ పుట్టక ముందు నుంచీ వింటున్నా..వార్నింగ్ లు వినీ వినీ విసుగెత్తిపోయానని చెప్పారు. 

 

హిందూపురంలో భారీ వర్షం

అనంతపురం : హిందూపురంలో భారీ వర్షం కురిసింది. మారుతీనగర్, త్యాగరాజనగర్, ఆర్టీసీకాలనీ, గాజులవీధి కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఆదేశించారు. 

 

21:18 - October 12, 2017

అవినీతి రహిత పాలన అంటారు.. విపక్షాలను ఇరుకున పెట్టడానికి అన్ని అధికారాలను ఉపయోగిస్తారు. కానీ, కమల దళం చేస్తున్న ఘనకార్యాలను మాత్రం పట్టించుకోరు. దేనిపైనా సరైన దర్యాప్తు జరగదు. ఓ పక్క బీజెపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి పుత్ర రత్నంపైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ సంగతేమో కానీ, రివర్స్ కేసులు మాత్రం పెడుతున్నారు. కమలం దళం అవినీతి బురదలో కూరుకుపోతోందా? మోడీ పాలనలో ఏం జరుగుతోంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
16వేల రెట్లు పెరిగిన ఆ కంపెనీ ఆస్తులు  
ఏడాదిలోనే 16వేల రెట్లు ఆ కంపెనీ ఆస్తులు పెరిగాయి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక.. పెరిగిన అమిత్‌ షా కొడుకు సంపద అడ్డూ అదుపు లేకుండా పెరిగింది. చెప్పేదొకటి..చేసేదొకటిగా సర్కారు తీరు మారింది. ఓవరాల్ గా  పారదర్శకతలేని వ్యాపార లావాదేవీలు కనిపిస్తున్నాయి. అసలు స్థిరాస్తులేమీ లేని కంపెనీలకు కోట్లల్లో రుణాలెలా వచ్చాయి.. ఏం జరుగుతోంది?..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:13 - October 12, 2017

కేంద్రమంత్రులకు తెలంగాణ కానుకలు, కొడ్కు అల్లుడిని పొగిడె తందుకే సభల?, పేదలకు బియ్యమిస్తమంటే అడ్డుకుంటున్నరు, ఏసీబోళ్లకు దొర్కిపోయిన పోలీసు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:50 - October 12, 2017

కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి, క్లినికల్ సైకాలజిస్టు శైలజ, ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలన్నారు. సామాజిక చైతన్య రావాలని తెలిపారు. విద్యా వ్యవస్థ మారాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నల్గొండ జిల్లాలో అల్ట్రామెగా పవర్ ప్లాంట్ : సీఎం కేసీఆర్

సూర్యపేట : నల్గొండ జిల్లాలో రూ.24,900 కోట్లతో అల్ట్రామెగా పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పారు. దీంతో నల్గొండ స్వరూపం మారుతుందన్నారు. సూర్యపేటలో నిర్వహించిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు బాగా దగా పడ్డ జిల్లాలు అని తెలిపారు. 

నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు : సీఎం కేసీఆర్

సూర్యపేట : నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో నిర్వహించిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. 19 కిలో మీటర్ల పైనా ఆనకట్ట కట్టాల్సివుండేదని చెప్పారు. ఆనాడు దగా, మోసం జరిగిందన్నారు. బూర్గుల రామకృష్ణరావు ఎందుకు మౌనంగా ఉన్నారో ఆయనకే తెలుసు అన్నారు. సమైక్య వాదులు ఆనాడు మోసం చేశారని పేర్కొన్నారు.

సూర్యపేటలో సీఎం కేసీఆర్ పర్యటన

సూర్యపేట : లక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడ్డం వచ్చినా..కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యపేటలో నిర్వహించిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. ' ప్రాజెక్టులు నిర్మించినప్పుడు మీ హయాంలో ఎంత నష్టం పరిహారం ఇచ్చారో చెప్పాలని' ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్ధేశించి సీఎం మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండ, సూర్యపేట జిల్లాలతోపాటు పలు ప్రాంతాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. 

20:23 - October 12, 2017

హైదరాబాద్ : ఇష్టంలేని చదువుతో కొందరు...హాస్టల్‌లో చిన్న సమస్య...చదువుకున్నా ర్యాంకు రాలేదని మరికొందరు...ఇలా ఎందరో స్టూడెంట్స్‌ మనస్తాపంతో..ధైర్యంగా ముందుకు వెళ్లలేక ఒక్క క్షణంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు..తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరాన్ని రేపుతున్నాయి...కొన్ని గంటల్లోనే ముగ్గురు స్టూడెంట్స్‌ బలవన్మరణం చెందడం ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించివేసింది...
చిన్న కారణాలతోనే జీవితాలు ముగింపు..
పెద్ద చదువులు చదువుతున్నా..వారిలో మాత్రం ఆత్మనూన్యతాభావం పోవడం లేదు...పరిసరాలు వారికి గుణపాఠాలు నేర్పడం లేదు...తాము ఎంచుకున్న మార్గమే సరైనదనుకుంటున్న విద్యార్థులు ఆ ఒక్క క్షణంలో తీసుకుంటున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగుల్చుతుంది..తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజులో కొన్ని గంటల్లోనే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం చెందారు...
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విషాదం 
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన సాగిరెడ్డి సూర్యనారాయణ కుమారుడు పూర్ణ లక్ష్మీనరసింహమూర్తి బుధవారం అర్ధరాత్రి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు..అయితే పూర్ణకు చదువుపై ఆసక్తి లేకపోవడంతోపాటు...కొందరి ఒత్తిడి వల్లే ఇలాంటి అఘాయిత్యం చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు...
మాదాపూర్‌ హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్..
హైదరాబాద్‌- మాదాపూర్‌ శ్రీచైతన్య కళాశాల ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో లాంగ్‌ టర్మ్‌ శిక్షణ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంయుక్త సూసైడ్‌ నోట్‌ రాసింది. విద్యార్థినిని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్‌ కుమార్తెగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలి...
హైదరాబాద్‌ దుండిగల్‌ సూరారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి మందలించిందని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న మౌనిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మౌనికను స్థానిక నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. మౌనిక తల్లిదండ్రులు రేణుకు, చంద్రం పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చి సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు..మౌనిక కూడా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది...తాను సంతోషంగా ఉండటాన్ని చుట్టుపక్కలవారు చూడలేకపోతున్నా రని, జీవితం దుర్భరంగా మారిందని మెసేజ్‌ పెట్టి...ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి మౌనిక తన తమ్ముడికి మధ్య జరిగిన వాగ్వాదంతో మస్తాపానికి గురైనట్లు తల్లి రేణుక పోలీసుల దృష్టికి తెచ్చారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది....కారణాలు చిన్నవే..కాని...విద్యార్థులు తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది.

 

20:20 - October 12, 2017

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వాగన్ ఆర్ కారు దొంగతనానికి గురైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ సచివాలయం వద్ద ఆగంతకులు దొంగిలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీస్తున్నారు. ఢిల్లీలో ఈ ఏడాది 30వేల 449 కార్లు దొంగిలించారు. వీఐపీ కల్చర్ కు నిరసనగా వాగన్ ఆర్ కారులోనే కేజ్రివాల్ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:15 - October 12, 2017
20:14 - October 12, 2017
20:09 - October 12, 2017

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితుల పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీలపై ప్రభుత్వం వెంటనే సంప్రదింపులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అంతకంటే ముందు గ్రామాలు ఖాళీ చేయించేందుకు కలెక్టర్ ప్రకటించిన షెడ్యూల్‌ను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వాసితులను పరామర్శించడానికి వచ్చిన తమను ప్రభుత్వం పోలీసుల ద్వారా అణగదొక్కించే ప్రయత్నం చేస్తోందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈనెల 16, 17 తేదీల్లో చలో విజయవాడ కార్యక్రమం ద్వారా 30 గంటల పాటు ధర్నా చేపడతామంటున్న వామపక్ష నేతలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:02 - October 12, 2017

విశాఖ : వేదికగా ఈనెల 28న ప్రముఖ నటి గౌతమి క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లైఫ్ ఎగైన్ పేరుతో ఆమె స్ధాపించిన ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన ర్యాలీలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,  అరకు ఎంపీ కొత్తపల్లి గీత పాల్గొంటున్నారు. వైజాగ్ కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ వరకు ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా క్యాన్సర్ వాక్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 

19:57 - October 12, 2017
19:55 - October 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం కె సెజ్‌ కాలనీ రణరంగంగా మారింది. కె సెజ్‌ భూ సేకరణలో పొలాలు, ఇళ్లు కోల్పోయిన రైతు కుటుంబాలకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో సెజ్‌ బాధితులు ఆందోళన నిర్వహించారు. కాలనీలో ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన సీపీఎం, ఐద్వా నేతలను  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాటలు జరిగాయి. ఉద్యమకారులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించడానికి ప్రయత్నించడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. రాష్ట్రంలో సెక్షన్‌ 30,144 పేరిట పోలీసు రాజ్యం అమలవుతొందని.. సెజ్‌ బాధితులకు న్యాయం చేసేంతవరకు ఉద్యమిస్తామని సీపీఎం నేత శేషు బాబ్జీ అన్నారు.

19:53 - October 12, 2017

అనంతపురం : భారీ వర్షాలతో రాయలసీమ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలుజిల్లాలో   'చిన్నకుహుంతి వంక' పొంగడంతో పత్తికొండ ఆస్పరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు అనంతపురం జిల్లా గుత్తిలో రాత్రి కురిసిన వర్షంతో పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. 

 

19:51 - October 12, 2017

అనంతపురం : జిల్లాలో కురుస్తున్న వర్షాల దాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పామిడి మండలంలోని అనుంపల్లి చెరువు పొంగిపొర్లు తుండటంతో పట్టణంలోకి  నీరు చేరుకుంది. దీంతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో నిత్యవసర సరుకులు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. సంఘటనా స్థలానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రమణీమణి చేరుకుని బాధితులకు సహాయ చర్యలు పర్యవేక్షించారు. పామిడి పోలీసు సిబ్బంది సహాయ చర్యలకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వటంతో పామిడి పట్టణంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

19:49 - October 12, 2017

విశాఖ : అగ్రిగోల్డ్‌ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా లక్షా 20 వేల మంది అగ్రగోల్డ్‌ బాధితులు ఉన్నారు. డిపాజిట్ల బాండ్ల పరిశీలన జిల్లాలోని 34 మండలాల్లో పాటుగా నగరంలోని 11 చోట్ల సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌ నుండి 50 మంది డిపాజిటర్ల నుండి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున ఈ సంఖ్యను 100కు పెంచుతామంటున్నారు పోలీసు అధికారులు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

19:48 - October 12, 2017

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఏపీలో  అగ్రిగోల్డ్‌  బాండ్ల పరిశీలన మొదలయింది.  రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో స్టేషన్లవారీగా బాండ్ల పరిశీలన కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్క విజయవాడలోనే 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో  32లక్షల 20వేల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉండగా.. ఏపీలో లోనే 19లక్షల 43 వేల మంది బాధితులు ఉన్నారు. బాధితుల అందరికీ న్యాయం చేయడానికే అన్ని బాండ్లను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

 

19:20 - October 12, 2017

గుంటూరు : జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హెన్నా కంపెనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. కెమికల్స్ కలుపుతుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు యజమాని జి.మధుసూదనరావు కాలి దుర్మరణం చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం

గుంటూరు : జిల్లాలోని హెన్నా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. యజమాని మృతి చెందారు. 

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, నేరెడ్ మెట్, దిల్ సుఖ్ నగర్  తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. 

18:56 - October 12, 2017

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ నియంత్రణను బల్దియా మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అనుకున్న వెంటనే ఉత్పత్తి కేంద్రాలపై.. షాపులపై దాడులు చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు హడావిడి చేసి.. తరువాత తమకు పట్టనట్లుగా జీహెచ్‌ఎంసీ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వినియోగం 
భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ చిన్న వస్తువు కొన్నా.. దానిని తీసుకెళ్లేందుకు కవర్‌ కావాల్సిందే. అది కూరగాయలు, రేషన్‌ సరుకులు, మటన్‌, చికెన్‌లే కాదు, టిఫిన్‌, టీ,కాఫీ లాంటి ద్రవపరార్థాలకూ పాలిథిన్‌ కవర్లను వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు లేకుండా మనుషులు కొన్ని గంటలు కూడా ఉండలేనంతగా వాటి వినియోగం పెరిగింది. అయితే ఇది హైదరాబాద్‌లాంటి నగరాల్లో మరీ ఎక్కువైంది. 2016 సాలీడ్ వేస్ట్‌ రూల్స్‌ ప్రకారం 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న కవర్లు మాత్రమే ఉపయోగించాలి. 
దేశంలో రోజుకి 15,342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి 
సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు లెక్కల ప్రకారం.. ప్రతీ రోజు మన దేశంలో 15, 342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో సగం మాత్రమే రీసైకిల్ అవుతోంటే.. మిగిలినదంతా అలానే వదిలేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. అయితే ఏడాదికి ఒక వ్యక్తి పాలిథిన్‌ కవర్ల వినియోగం 8 నుంచి 10 కిలోలు ఉంటుందని.. ఈ ఏడాదికి చివరి నాటికి 12 కేజీలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం పాలిథిన్‌ కవర్లేనని అధికారులంటున్నారు. దాదాపు 2,000 దుకాణాలను తనిఖీలు చేసిన అధికారులు.. 14 లక్షల ఫైన్ విధించారు. 
చిత్తశుద్ధితో పని చేయడం లేదనే ఆరోపణలు 
కార్పొరేషన్‌ ఈ సమస్యపై చిత్తశుద్ధితో పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. 2009 నుండి వచ్చిన కమిషనర్లు, మేయర్లు సిటీలో ప్లాస్టిక్‌ను నిరోధించడం తమ మొదటి లక్ష్యమని ప్రకటించారు. కానీ దానిని పూర్తి స్థాయిలో అరికట్టడం, ప్రమాణాలకు అనుగుణంగా వాడేలా చూడటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అప్పుడప్పుడు సామాన్యులపై పడి ఫైన్‌లు వసూలు చేస్తున్నారు. అసలు కవర్లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలను పట్టించుకోకుండా వాటిని ఉపయోగిస్తున్న చిరు వ్యాపారులపై అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  
ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేయాలని రిపోర్టు 
గతంలో ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్లాస్టిక్‌ ముఖ్యమైన సమస్యగా గుర్తించిన స్వచ్ఛ కమిటీ.. దానిని బ్యాన్‌ చేయాలని రిపోర్టు ఇచ్చింది. అప్పుడే నగరం, నాలాలు, డ్రైన్లు శుభ్రంగా ఉంటాయని చెప్పింది. అయినా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. 

 

రాంగోపాల్ వర్మపై ఎమ్మెల్యే అనిత విమర్శలు

అమరావతి : వ్యక్తిగత ఇమేజ్ కోసం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్ టీఆర్ సినిమాను తీయాలనుకోవడం సరికాదని
టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా జగన్ సినిమా తీస్తే జగన్ పైనా సినిమాలు తీయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

17:46 - October 12, 2017

హైదరాబాద్ : పోలవరం రీ డిజైన్‌పై అఖిలపక్షం కమిటీ వేసి ప్రధాని వద్దకు వెళ్దామన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో చెప్పాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుతో రాజకీయ లబ్ధి కోసం ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారా? అని పొంగులేటి ప్రశ్నించారు. తెలంగాణలో 100 ప్రాంతాలు ముంపుకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా.. ఎందుకు అడ్వకేట్‌ను పెట్టలేదో.. కేసీఆర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుతో జరిగిన లోపాయకారి ఒప్పందం ఏంటో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

 

17:44 - October 12, 2017

సూర్యాపేట : జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు.

17:30 - October 12, 2017

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని ఆనందంతో పండుగ వాతారణం నెలకొనేది. తర్వాత కాలంలో ఆడపిల్ల పుట్టిందంటే మనుసులో ఏదో తెలియని బాధ. అయ్యో ఆడపిల్ల పుట్టిందా.. అనే నిట్టూర్పు, ఇరుగుపోరుగువారి జాలి మాటలు. ప్రస్తుతం కాలంలో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు...పుట్టకముందే అంతమొందిస్తున్నారు. పుట్టినా.. అడుగడుగునా అంతులేని వివక్ష. అడుగడుగునా ఆంక్షలు. ఆడ పిండాల ఉసురు తీసేందుకు చిట్టితల్లులపై హింస అనేక కోణాల్లో పెచ్చరిల్లుతోంది. ఈనేపథ్యంలో అక్టోబర్ 11న అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

మూసీ నదిలో కొట్టుకుపోయిన యువకుడు

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని పెద్దరావులపల్లి వద్ద ఉన్న మూసీ నదిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. పెద్దరావులపల్లికి చెందిన చుక్క వెంకటేశ్ మూసీ నదిలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

17:05 - October 12, 2017

విశాఖ : వామపక్ష నేతల అరెస్టును ఖండిస్తూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడమే ప్రభుత్వ ధ్వేయమన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని నేతలు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

400కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సూర్యాపేట: జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌, పోలీస్‌ కార్యాలయ భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం చివ్వేంల మండలం వీకే పహాడ్‌లో రూ. 1600కోట్లతో నిర్మించిన... 400కేవీ సబ్ స్టేషన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

16:56 - October 12, 2017
16:42 - October 12, 2017

కృష్ణా : జిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్‌, ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, చిన్నఅవుటపల్లిలో భూమి కంపించింది. అటు గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. గన్నవరంలో మూడురోజుల్లో భూమి కంపించండం ఇది రెండోసారి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:38 - October 12, 2017

హైదరాబాద్ : సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం. అవినీతి జలగల పాలిట అదో పాశుపతాస్త్రం. గోప్యత లేని సమాజం కోసం రూపుదిద్దుకున్న ఆ చట్టానికి నేటితో పన్నేండేళ్లు నిండాయి.   ఎన్నెన్నో విజయాలతో   మరెన్నో ఒడిదుడుకలతో... ముందుకెళుతన్న సమాచార హక్కు చట్టంపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
అవినీతి, కుంభకోణాలను బయటకు తీసిన ఆర్టీఐ
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం... ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టంతోపాటు సమాచారహక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించికున్నవే.  సమాచార హక్కు చట్టం ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి కారణంగా 2005లో అది చట్టరూపం దాల్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 12న సమాచార హక్కుచట్టం కార్యరూపం దాల్చింది. ఈ చట్టం వచ్చి నేటికి సరిగ్గా 12ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ 12ఏళ్లలో ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చట్టం తనదైన ముద్రవేసింది. అంతేకాదు అనేక అవినీతి చర్యలను, కుంభకోణాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
104 దేశాల్లో అమల్లో ఉన్న సమాచార హక్కుచట్టం
సమాచార హక్కుచట్టం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో అమల్లో ఉంది. అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలు, వాటి అంగాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, తద్వారా అవినీతి అరికట్టబడాలన్నా ఆయా అంశాలపై ప్రజలకు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రభుత్వాంగాలు ఎలాంటి గోప్యత లేకుండా తాము చేస్తున్న  పనులు, వాటి వివరాలు, ఆయా సంస్థల విధులు, వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ చట్టం లక్ష్యం. 
సమాచార హక్కుచట్టంతో బయటపడ్డ పాలకుల అవినీతి
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి అనేక అవినీతి విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ కుంభకోణాలు వెలుగుచూశాయి. అంతేకాదు.. సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు పారదర్శకంగా నడుచుకోవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సమాచారాన్ని తెలుసుకోవడం, దానిని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వాలను , అధికారులను ప్రశ్నించే గొంతుకగా సమాచార హక్కుచట్టం నిలుస్తోంది. అప్పటికీ స్పందనరాకుంటే కోర్టులను ఆశ్రయించి , ఫలితాలు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు సమాచార హక్కు కార్యకర్తలు. ఈ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్న చాలామంది పలు కీలక అంశాలను వెలికితీసి ... పాలకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. అక్కడక్కడ సమాచార హక్కు చట్టాన్ని పాలకులు, అధికారులు తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా,  లేదా తప్పుడు సమాచారాన్ని లేదా పాక్షిక సమాచారాన్ని ఇస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ నిత్యం ప్రజలకు అందించాల్సిన సమాచారంలో అలసత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఆర్టీఐ వినియోగిస్తున్న జర్నలిస్టులపై దాడులు
సమాచార హక్కుచట్టంలో అతిముఖ్యమైనది 4(1)(బి). ఈ సెక్షన్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, తమకు వస్తున్న నిధులు, వారు చేస్తోన్న ఖర్చులు, పథకాల అమలు , వాటి లబ్దిదారులవంటి వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలి. మొత్తంగా ఓ 17 అంశాలను ఎవరు అడిగినా, అడగకపోయినా స్వచ్చందంగా వెల్లడించాలి. అలా చేస్తే ప్రభుత్వ  కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో దరఖాస్తులు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చెయ్యడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడానికి ఉపయోగపడుతుంది. సమాచార హక్కుచట్టం పలు అవినీతి అక్రమాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సమాచార హక్కు కార్యకర్తలపైన, ఈ హక్కును బాగా వినియోగిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు పెరుగుతున్నాయి.  దీనిని నిలువరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐపై అవగాహన కల్పించాలి..
సమాచార హక్కుచట్టం వచ్చి 12ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహనలే లేదు. ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడే అధికారుల్లో బాధ్యత, అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది.

 

నవంబర్ 9 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఈసీ

ఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. నవంబర్ 9 హిమాచల్ ప్రదేవ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 7521 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేయనున్నారని తెలిపింది. ఎన్నికల కోడ్ నేటి నుండి అమల్లోకి వస్తుందని, ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. 28 లక్షల అని తెలిపింది.

16:32 - October 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్లు, డాక్యుమెంట్లను పరిశీలన జరుగుతోంది. 13 కౌంటర్లలో  ఈ ప్రక్రియను పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువమంది డిపాజిటర్లు ఉన్నారు. డిపాజిటర్లు ఏ రోజు రావాలనే షెడ్యూల్‌ను ప్రత్యేక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. 

16:28 - October 12, 2017

పశ్చిమగోదావరి : ఏపీలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో అగ్రిగోల్డ్ బాండ్లు, సర్టిఫికేట్ల పరిశీలనకు బాధితులు  భారీగా హాజరయ్యారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2వేల 707 మంది బాధితులు ఉన్నారు. మరికొంతమంది ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. బాధితులకు పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం వీడియోలో చూడండి.

 

16:21 - October 12, 2017
16:18 - October 12, 2017

ఢిల్లీ : ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. తల్లిదండ్రులిద్దరు నిర్దోషులేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా కోర్టు తేల్చింది. సంశయలాభం కింద నిర్దోషులుగా కోర్టు తేల్చింది. 2013 లో రాజేశ్ తల్వార్ దంపతులకు జీవిత ఖైదు విధించింది. తీర్పుపై తల్లిదండ్రులు అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఆరుషి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
2008 లో ఆరుషి తల్వార్‌ హత్య 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 లో ఆరుషి తల్వార్‌ హత్య గావించబడింది. ఈకేసులో గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013 ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. 2008 మే 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్‌లో సెక్టార్ 25లోని ఇంట్లోనే ఆరుషి హత్యకు గురైంది. మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం టెర్రస్‌పై కనిపించింది. ఆరుషి, హేమరాజ్‌లను అభ్యంతరకరమైన దృశ్యంలో చూసిన రాజేష్‌ తల్వార్‌ వారిద్దరి హత్య చేశారు. రాజేష్‌ భార్య నుపూర్‌ ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలతో ఆరుషి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు గజియాబాద్‌లోని డాస్‌నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

జగన్ పాదయాత్ర పొలిటికల్ స్టంట్ : కొత్తపల్లి గీత

అమరావతి:పాదయాత్ర చేస్తే సీఎం అవుతారంటే మూర్ఖత్వమే ఎంపి కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర పొలిటికల్ స్టంట్ అని గీత పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రదాని నాయకులందరికీ తెలుసు అని, వైసీపీ ఎంపీల రాజీనామా అంటూ మూడేళ్లుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం కర్కపల్లి గ్రామంలో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో ఓ మహిళపై పిడుగు పడింది. ఈ ఘటనలో జాల్ల స్వరూప(45) అక్కడికక్కడే మృతి చెందింది.

రియల్టర్ అరుణా రెడ్డి పై పీడీయాక్ట్ నమోదు

హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి వైట్ కాలర్ నేరస్థురాలిపై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది. రియల్టర్ అరుణా రెడ్డి పై పీడీయాక్ట్ నమోదు అయ్యింది. ప్రజల నుంచి రూ. కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా అరుణారెడ్డి భయభ్రాంతులకు గురిచేసింది.

సూర్యాపేట నూతన కలెక్టరేట్ కు కేసీఆర్ శంకుస్థాపన

సూర్యాపేట: నూతన కలెక్టరేట్ సమీకృత భవనం, ఎస్పీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల పాల్గొన్నారు.

గన్నవరం మండలంలో భూ ప్రకంపనలు

కృష్ణా: గన్నవరం మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గన్నవరం ఎయిర్ పోర్టు స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో భయంతో అధికారులు, ఇళ్లనుండి జనం బయటకు పరుగులు తీశారు.

టీ-20 మ్యాచ్ కు పటిష్ట బందోబస్తు: సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: రేపు భారత్- ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. షీటీమ్స్ తో పాటు 1800 మందిని పోలీసులను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని, గ్రౌండ్ చుట్టూ 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, టిఫిన్ బాక్సులు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తే సమాచారం ఇవ్వమని సీపీ పిలుపునిచ్చారు.

సీఎం పర్యటన..సీపీఎం నేతల అరెస్ట్

సూర్యాపేట: సీఎం పర్యటన దృష్టా ముందస్తు అరెస్టులు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాముడు సహా 50 మందినిపోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిని మేళ్ల చెర్వు పీఎస్ కు తరలించారు.

15:27 - October 12, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన సాయంత్రం 4 గంటలకు వెలువడనుంది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇప్పటికే వేడెక్కెంది. కాంగ్రెస్‌, బిజెపిల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36, బిజెపి 26 స్థానాలు గెలుచుకున్నాయి. హిమాచల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్ నేత వీరభద్రసింగ్‌ ఆరుసార్లు పనిచేశారు. హిమాచల్‌ అసెంబ్లీకి నవంబర్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశముంది. గుజరాత్‌లో 1998 నుంచి వరుసగా బిజెపి అధికారంలో ఉంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరిగనున్నట్లు సంకేతాలున్నాయి.

 

భద్రాద్రిలో ముగ్గురు విద్యుత్ అధికారులు సస్పెన్షన్

భద్రాద్రి : ముగ్గురు విద్యుత్ అధికారులు సస్పెండ్ అయ్యారు. టేకులపల్లిలో విద్యుత్ కనెక్షన్లలో అవకతవకలు జరిగాయని రైతుల ఫిర్యాదుతో ఏఈ రవీంద్రబాబుతో పాటు లైన్ ఇన్ స్పెక్టర్ శ్యాం, జేఎల్ ఎం రవికుమార్ సెస్పెండ్ అయ్యారు.

పాక్ కాల్పుల్లో భారత జవాన్, పౌరుడు మృతి

జమ్ము కశ్మీర్: పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. ఫూంచ్ సెక్టార్ కృష్ణఘాటిలో పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో భారత జవాన్, పౌరుడు మృతి చెందాడు.

15:22 - October 12, 2017

కడప : భారీ వర్షాలతో కడపజిల్లా వణుకుతోంది. జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయచోటి సమీపంలోని మాండవ్య నదిపై వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు ఆగిపోవడంతో అధికారులు యుద్ధప్రాతిపథికన వంతెనకు తాత్కాలిక పనులు చేపట్టారు. అటు సుండుపల్లి మండలంలో బహుదానది ఉధృతంగా ప్రవహిస్తోంది. సొంఠంవారిపల్లి నుంచి రాయచోటికి వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు బెస్తపల్లి దగ్గర బహుదానది కాజ్‌వేపై చిక్కుకు పోయింది. దాదాపు గంటపాటు శ్రమించిన జేసీబీల సహాయంతో బస్పసును సురక్షితంగా బయటికి లాగేశారు. 

 

15:15 - October 12, 2017

కడప : జిల్లాలోని బద్వేలులో సీపీఐ నాయకులు సంకెళ్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా, వంశధార భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. నిరసన తెలుపుతోన్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధుని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బద్వేలు సీపీఐ నాయకులు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

 

15:12 - October 12, 2017

పశ్చిమగోదావరి : ఏలూరులో అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్‌లను ఏర్పాటు చేశారు. డబ్బులు తిరిగొస్తాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాళ్ల పేర్లను బోర్డుల్లో చూసుకునే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. ఏలూరు 1 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

15:09 - October 12, 2017

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013 ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి  తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 2008 మే 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్‌లో సెక్టార్ 25లోని ఇంట్లోనే ఆరుషి హత్యకు గురైంది. మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం టెర్రస్‌పై కనిపించింది. ఆరుషి, హేమరాజ్‌లను అభ్యంతరకరమైన దృశ్యంలో చూసిన రాజేష్‌ తల్వార్‌ వారిద్దరి హత్య చేశారు. రాజేష్‌ భార్య నుపూర్‌ ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలతో ఆరుషి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు గజియాబాద్‌లోని డాస్‌నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

 

15:07 - October 12, 2017

హైదరాబాద్ : టీమాస్‌ రాజకీయ సంస్థ కాదని.. ప్రజా సంఘాల సంస్థ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర క్యార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీమాస్‌లో అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో టీ.మాస్‌ని ఏర్పాటు చేయాలన్నారు. 

 

ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు

యూపి: సంచలనం సృష్టించిన ఆరుషి తర్వాల్ హత్య కేసులో కాసేపట్లో అలహాబాద్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది. రాజేష్, నూపుర్ తల్వార్ లకు హత్య కేసు నుంచి విముక్తి లభించింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపినట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఈ ఘటన 2008 మే 16న నోయిడాలో చోటు చేసుకుంది.

15:00 - October 12, 2017

 కొమురంభీం అసిఫాబాద్ : జిల్లాలోని జోడేఘాట్‌లో విగ్రహం వివాదాన్ని రాజేసింది. ఆదివాసీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన జంగుబాయి విగ్రహంపై గోండు ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లంబాడా మహిళ రూపంలో జంగూబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటు గోండులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ సంస్కృతిలో జంగూబాయికి రూపం లేదంటున్నారు. జంగూబాయిని  ప్రకృతి రూపంగానే కొలుస్తామని.. ఇపుడు మ్యూజియంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివాసీల మ్యూజియం అని పెట్టిన తమ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని గోండు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్యామమాత విగ్రహం ధ్వంసం కావడంతో ఆదివాసి, గిరిజన వర్గాల మధ్య వివాదాలు రేగుతున్నాయి. శ్యామమాత విగ్రహన్ని మ్యూజియంనుంచి తీసుకెళ్లిన దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. 

 

14:56 - October 12, 2017

హైదరాబాద్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. మౌనిక నరసింహారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీ.టెక్‌., ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. మౌనిక తల్లిదండ్రులు రేణుక, చంద్రం పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చి సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు. తాను సంతోషంగా ఉండటాన్ని చుట్టుపక్కలవారు చూడలేకపోతున్నారని, జీవితం దుర్భరంగా మారిందని వాటాప్స్‌ మెసేజ్‌  పెట్టిన మౌనిక  ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు మౌనిక తన తమ్ముడికి మధ్య వాగ్వాదం జరిగిందని తల్లి రేణుక పోలీసులకు తెలిపారు. కుటుంబ కలహాలు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న దుండిగల్‌ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

14:53 - October 12, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీఐక్యంగా పోరాడాలన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోడానికి రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. యువతకు ఉద్యోగాలు, రైతురుణభారం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, తదితర అంశాలపై ఉమ్మడిగా ఉద్యమించాలని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కాసేపట్లో ఆరుషి హత్య కేసులో తుది తీర్పు...

యూపి: సంచలనం సృష్టించిన ఆరుషి తర్వాల్ హత్య కేసులో కాసేపట్లో అలహాబాద్ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఆరుషిని చంపింది ఆమె తల్లిదండ్రులేని అనే దానిపై తీర్పు వెలువరించనుంది.

సికింద్రాబాద్- గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడి

హైదరాబాద్: సికింద్రాబాద్- గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడి జరిగింది. భారీగా నగలు, నగదు దోపిడికి గురైనట్లు వాణి అనే మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన వాణి 1.24 కిలోల బంగారాన్ని అపహరించారని ఫిర్యాదు చేసింది.

టపాసుల కాల్చడంపై నిషేధం రాందేవ్ బాబా మండిపాటు

ఢిల్లీ :-ఎన్‌సీఆర్‌ పరధిలో దీపావళి రోజున టపాసుల కాల్చడంపై నిషేధం నిర్ణయాన్ని పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురు రాందేవ్‌ బాబా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఓ ప్రత్యేక సమాజాన్ని మాత్రమే టార్గెట్‌ చేశారంటూ మండిపడ్డారు. ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కేవలం హిందూవులను మాత్రమే టార్గెట్‌ చేశారని ఆరోపించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడంతో లక్ష ముప్పై ఒక్క వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. అవుట్ ఫ్లో 1350 క్యూసెక్కులు ఉంది. అటు స్థానికంగా కృష్ణానదికి వస్తున్న వరదలతో సాగర్ కు మరింత ఇన్ ఫ్లో పెరిగింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 528.70 అడుగులకు చేరుకుంది. సాగర్ కు భారీగా వరదనీరు వస్తుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో వచ్చే డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి?

విజయవాడ: వచ్చే డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ స్థాయి వారికి ఎంత భృతి ఇవ్వాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

విశాఖలో 15 నుండి అగ్ని హాక్ థాన్ సదస్సు

అమరావతి: విశాఖలో నవంబర్ 15,16,17 తేదీల్లో అగ్ని హాక్ థాన్ సదస్సు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 15న సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 16న ముగింపు సదస్సుకు బిట్ గేట్స్ హాజరు కానున్నారు.

 

కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ఎన్నికల షెడ్యూల్..

ఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు తేదీలను ఖరారు కానున్నాయి. గురువారం సాయంత్రం 4గంటలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించనుంది. 

రిటైర్ మెంట్ పై నెహ్రా వ్యాఖ్యలు..

గౌహతి : రిటైర్ మెంట్ తన సొంత నిర్ణయమని, ఎదైనా నిర్ణయం తీసుకొంటే వెనక్కి వెళ్లనని టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రా పేర్కొన్నారు. 

టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి నేతలు భేటీ అయ్యారు. ఎల్ .రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, రావుల సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, పొత్తులు, తదితర అంశాలపై చర్చించనున్నారు. 

13:32 - October 12, 2017

139 క్షురకుల తొలగింపు..

చిత్తూరు : తిరుమల కళ్యాణ కట్టలో 139 మంది క్షురకులను తొలగించినట్లు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. భక్తుల ఫిర్యాదుల ఆధారంగానే వారిని తొలగించినట్లు, విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

'ఆసీస్ టీం బస్సుపై దాడి బాధాకరం'...

గౌహతి : ఆసీస్ టీం బస్సుపై దాడి బాధాకరమని ఇండియా క్రికెటర్ రైనా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసీస్ టీం ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలని సూచించారు. 

ఆసీస్ టీంకు క్షమాపణలు..

గౌహతి : ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో కొందరు ఆసీస్ క్రీడాకారులకు..టీంకు క్షమాపణలు చెప్పారు. ఆసీస్ క్రీడాకారులు బస చేసిన హోటల్ ఎదుట పలువురు టీం ఇండియా అభిమానులు ప్లకార్డులు పట్టుకుని తమ క్షమాపణలు తెలియచేశారు. ఇటీవలే ఆసీస్ టీం ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. 

'గుంతల వల్ల రోడ్డు ప్రమాదాలు కాదు'..

కర్నాటక : బెంగళూరులో రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరగడం లేదని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇటీవలే గుంతల వల్ల నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

13:10 - October 12, 2017

కొడవలితో దాడిచేసిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ఇద్దరికి గాయాలు..

అనంతపురం: పరిగి మండలం బీచ్ గాన్ పల్లిలో భార్య, మామపై మతిస్థిమితం లేని వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

13:08 - October 12, 2017

కోమరంభీం అసిఫాబాద్ : జిల్లా జోడేఘాట్ ఆదివాసీ మ్యూజియంలో విగ్రహంపై వివాదం చెలరేగింది. జంగూబాయి ప్రతిమ ఏర్పాటుపై గోండులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లంబాడా మహిళ ప్రతిమను తమపై రుద్దుతున్నారంటూ ఆందోళనకు దిగారు. ఆదివాసీ సంస్కృతిలో జంగూబాయికి రూపం లేదని ప్రకృతే జంగూబాయి అని గోండులు చెబుతున్నారు. వారు ఆదివాసీ మ్యూజియంలోని శ్యామమాత విగ్రహం ధ్వసం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నూజివీడు ఎస్‌.ఐ. వెంకట కుమార్‌పై సస్పెన్షన్

కృష్ణా: లైంగిక వేధిపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా నూజివీడు ఎస్‌.ఐ. వెంకట కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. నూజివీడు పట్టణానికి చెందిన ఓ వివాహితను.. కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు వెంకట కుమార్‌. ఇతని వేధింపులకు తట్టుకోలేక.. ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఎస్‌.ఐను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ త్రిపాఠి. ఎస్ఐ పై కేసు నమోదు చేయడంతో పాటు.. దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

సంక్షేమ భవనాన్ని బీసీ విద్యార్థులు

హైదరాబాద్:జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ భవనాన్ని బీసీ విద్యార్థులు ముట్టడించారు. గతేడాది చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు రూ.1400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

12:40 - October 12, 2017

 

హైదరాబాద్ : ప్రతీ ఏడాది చలికాలంలో వచ్చే సీతాఫలాల కోసం నగరవాసులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ అమృతఫలానికున్న ప్రత్యేకతలు అనేకం. వీటి మధురమైన రుచి, కమ్మదనం మరే పండులోనూ దొరకదు కాబట్టి.. సీజనల్ ఫ్రూట్స్‌లో ది బెస్ట్‌ ఫ్రూట్ కస్టడ్‌ ఆపిల్. సీతాఫలం పండ్లల్లో రారాజు. దీనికున్న ఔషధ గుణాలు మరే పండుకు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఉండే పొటాషియం కండర బలహీనతను పోగొడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. సీతాఫలాలలోని విటమిన్‌ ఎ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పళ్లు తినడం వల్ల కళ్లకూ ఎంతో మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. అజీర్ణ సమస్య తొలగించడంతో పాటు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీంతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు
ప్రస్తుతం సీతాఫలాలు హైదరాబాద్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వర ప్రసాదిత సీతాఫలాలు ఊళ్లు, పల్లెలు దాటి పట్నానికి చేరుకున్నాయి. రాజధాని నగరంలోని అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీతాఫలాలు త్వరగా వచ్చాయి. సాధారణమైన పళ్లు డజన్‌ 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్ పండ్లు డజన్‌కు 100 నుంచి 350 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సారి వర్షాలు భారీగా కురవడంతో గతేడాది కంటే.. ఫలాలు కాస్త తక్కువ సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నాయి. వర్షాలు పడుతుండటంతో పండ్లల్లో నాణ్యత తక్కువగా ఉంది. దీంతో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని అమ్మకందారులు అంటున్నారు.

దీపావళికి ముందే నగరానికి
పల్లెవాసులు, గిరిజనులు సీతాఫలాలను దీపావళికి ముందే నగరానికి తరలించి అమ్ముతుంటారు. కొందరికి ఇది జీవనోసాధిగా కూడా మారింది. ముఖ్యంగా కరీంనగర్‌, మెదక్‌, శామీర్‌పేట్‌, గజ్వేల్, శంషాబాద్‌, కర్తాల్‌, సిద్ధిపేట జిల్లాలకు చెందిన..100 గ్రామాల నుంచి నగరానికి సీతాఫలాలు దిగుమతవుతుంటాయి. నగరంలోని పికెట్, ఎంజీబీఎస్, కొత్తపేట్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రధాన మార్కెట్లలో ఏడు దశాబ్దాలకు పైగా నగరవాసులు ఈ పండ్లను కొంటున్నారు. ప్రకృతిలో పుట్టి ఏ రసాయనం ఉపయోగించకుండా పండే ఫ్రూట్‌ సీతాఫలం ఒక్కటే మరి.

 

12:35 - October 12, 2017

 

కృష్ణా : బాపులపాడు మండలం రేమల్లిలో పెళ్లికి ఒప్పుకోలేదంటూ ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. రేమల్లి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కమల్ కాంత్, రింకీరాణి ఇద్దరు ప్రేమించుకున్నారు. కామల్ కాంత్ పెళ్లికి ఒప్పుకోవాలంటూ రికీరాణిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. రాణి కేకలు వేయడంతో కమల్ కాంత్ పారిపపోయాడు. తీవ్రంగా గాయపడిన రికీరాణిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:19 - October 12, 2017

కృష్ణా : జిల్లా విజయవాడలోని లెనిన్ సెంటర్ లో వామపక్షాల అరెస్ట్ కు నిరసిస్తూ సీపీఎం ఆందోళనకు దిగింది వంశధార నిర్వాసితులను కలవడానికి వెళ్లిన మధు, రామకృష్ణను అరెస్ట్ చేయడాన్ని వామపక్షాల నేతలు ఖండించారు. అరెస్ట్ లతో ఉద్యమాలను అపలేరని నినాదాలు చేస్తూ పోలీసుల చర్యలపట్ల తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

12:11 - October 12, 2017

 

నాగపూర్ : భారతీయులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఎక్కువ శాతం మందికి ప్రజలకు వ్యవసాయరంగమే జీవనోపాధి కల్పిస్తోంది. జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి రంగంలో సహజ ఎరువుల వినియోగం తగ్గిపోయి పెస్టిసైడ్స్‌ వాడకం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను ఆశించిన స్ధాయిలో పొందేందుకు క్రిమి సంహారక మందులు, కలుపు మందులు విరివిగా వాడుతున్నారు. పంటను కాపాడుకోవాలనే తాపత్రయంతో.. అవసరానికి మించి క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. అవే వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

బలవంతంగా అంటగడుతున్నారు....పెస్టిసైడ్స్‌ వినియోగం పెరగడంతో.. వ్యాపారులు దీన్నీ తమ లాభార్జనకు.. వంచనకు మార్గంగా ఎంచుకుంటున్నారు. నకిలీ పురుగు మందులు.. నాణ్యత లేని, ప్రమాదకర పెస్టిసైడ్స్‌ను.. రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. వీటిని వినియోగించే క్రమంలో రైతులు రకరకాల రుగ్మతలకు లోనవుతున్నారు. పెస్టిసైడ్‌ వల్ల రోగాల పాలై చనిపోయిన రైతులు చాలా మందే ఉన్నారు. వాటిపై వారికి పూర్తిగా అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఏదో జబ్బు చేసిందని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. స్లో పాయిజన్‌లా పని చేసే పురుగుల మందు ప్రభావంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నా కారణమిదని గ్రహించుకోలేకపోతున్నారు. మందుల మోతాదు ఎక్కువై గాలి, నేల కలుషితమవుతున్నాయి. వీటివల్ల మనుషులకు క్యాన్సర్‌, గుండె జబ్బులు వస్తున్నాయి. శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి...
మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి. మందు చల్లినప్పుడు మొక్క పత్ర రంధ్రాల ద్వారా ఎలా లోపలికి వెళ్తుందో.. అలాగే మనిషి చర్మంపై పడి పురుగుల మందులు శరీరంలోకి వెళ్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని చెబుతున్నారు. తలపై కూడా క్యాప్‌ పెట్టుకోవాలి. చేతులతో మందు కలపకుండా కర్రతో కలపాలి. మందు చల్లడం పూర్తయిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా, స్నానం చేయకుండా భోజనం చేయకూడదు. ఇలాంటి సూచనలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. దీంతో రైతాంగం మొత్తాన్ని పురుగుల మందులు స్లో పాయిజన్‌లా చంపేస్తున్నాయి. 

12:10 - October 12, 2017

 

నాగపూర్ : మహారాష్ట్రలో రైతుల మృత్యుఘోష. నెల్లాళ్ల వ్యవధిలో 50 మంది రైతుల మృతి. చూపు కోల్పోయిన 300 మంది రైతులు. పిచ్చివాళ్లవుతోన్న యావత్మాల్‌ రైతాంగం ఎందుకీ దుస్థితి..?దేశంలో దాదాపు 6 కోట్ల కుటుంబాల జీవితాలు.. పత్తితో ముడిపడి ఉన్నాయి. 60 లక్షల మంది నేరుగా పత్తి పండిస్తుంటే.. 5 కోట్ల మందికి పైగా టెక్స్‌టైల్‌ సంబంధ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వరి తరువాత ఎక్కువ మంది సాగు చేస్తోన్న పంట పత్తి మాత్రమే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి ఎక్కువగా సాగవుతోంది. ఈ రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ విదర్భలో జరుగుతున్నవి రైతుల ఆత్మహత్యలు కావు. కానీ రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వ్యాపారుల లాభాపేక్ష..
మహారాష్ట్రలోని విదర్భలో.. రైతులు పురుగుమందుల వ్యాపారుల లాభాపేక్ష.. వంచనలకు గురై అసువులు బాస్తున్నారు. పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఇప్పటివరకూ 20 మంది రైతులు చనిపోయారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. రాష్ట్ర రాజధాని ముంబయికి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్‌ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో నెల రోజుల్లో 20 మంది చనిపోయారు. ఇప్పటివరకూ మొత్తం 800 మంది రైతులు పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పిజ్‌గావ్‌ గ్రామాన్ని సందర్శించిన 10టీవీ
యావత్మాల్‌ జిల్లా, మారేగావ్‌ తాలుకా పిజ్‌గావ్‌ గ్రామాన్ని 10టీవీ సందర్శించింది. ఇక్కడ పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేయడంతో.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. శంకర్‌ నాగోజి అగ్లావే అనే రైతు నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. అతని నాలుగెకరాల పొలంలో పత్తి, సోయా వేశాడు. పోలో సింటెంజా అనే పెస్టిసైడ్‌ని పిచికారీ చేయడంతో అదే రోజు సాయంత్రం సొమ్మసిల్లిపడిపోయాడు. అతని కుటుంబ సభ్యులు 4 రోజులు ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం దక్కలేదు. అతని భార్యాపిల్లలు ఇప్పుడు దిక్కు లేకుండాపోయారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతోంది. అశోక్‌ గెడెం అనే వ్యక్తి పత్తి చేనుకు పురుగుల మందు స్ప్రే చేయడానికి పనికి వెళ్లిన పాపానికి కంటి చూపును కోల్పోయాడు. అంధకారంలో మగ్గిపోతున్నాడు. రాథోడ్ అనే రైతు తన కుటుంబాన్ని పోషించే దిక్కు లేక.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బ్రహ్మానంద్‌ ఆదిక్‌ అనే వ్యక్తి కూడా చూపు కోల్పోయాడు.

ప్రాణాలు తీస్తున్న పోలో సిజెంటా
పోలో సిజెంటా అనే మందును గతంలో ఇచ్చిన దానికన్నా తక్కువ ఇచ్చి తమతో వాడించారని రైతులు అంటున్నారు. ఆ పెస్టిసైడ్‌ స్ప్రే చేసిన వారంతా అస్వస్థతకు గురయ్యారని, తమ గ్రామంలో అయిదుగురు చనిపోగా.. ఇంకొందరు కంటి చూపు కోల్పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వానికి సరైన నివేదికను పంపడంలో.. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమస్యకు పరిష్కారం అన్వేషించక పోగా.. రైతులు పిట్టల్లా రాలుతున్నా.. పట్టనట్లే వ్యవహరించింది. మీడియా ద్వారా విషయం తెలియడంతో.. సీఎం ఫడ్నవీస్‌ స్పందించి.. యావత్మాల్‌ రైతుల మరణాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటికి గానీ అసలు విషయం ఆయన దృష్టికి చేరలేదు. దీంతో.. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ఫడ్నవిస్‌ హామీ ఇచ్చారు. కిందిస్థాయి అధికారుల ఉదాసీనత ఫలితంగా.. 50 మంది దాకా రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

12:09 - October 12, 2017

 

చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెరోల్‌పై విడుదలైన శశికళ తిరిగి బెంగళూరు జైలుకు బయల్దేరారు. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు జైళ్లశాఖ మంజూరు చేసిన ఐదు రోజుల పెరోల్‌ బుధవారంతో ముగిసింది. దీంతో నేడు ఆమె తిరిగి బెంగళూరు జైలుకు తిరిగి వెళుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన ఆమె బెంగళూరులోని పరప్పణ ఆగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల శశికళ భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నటరాజన్‌కు కిడ్నీ, కాలేయ మార్పిడి ఆపరేషన్‌ చేశారు. దీంతో భర్తను చూసేందుకు అనుమతినివ్వాలంటూ శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన జైళ్ల శాఖ గత శుక్రవారం ఐదు రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. అయితే పెరోల్‌కు కొన్ని షరతులు విధించింది. ఆమె తన బంధువుల నివాసంలో మాత్రమే ఉండాలని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియా ప్రకటనలు చేయరాదని నిబంధనలు విధించింది.

12:08 - October 12, 2017

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులోవచ్చే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా అందించేందుకు ప్రభుత్వం ముందడుగేసింది. సూర్యారావు పేట శివారు చివ్వెంల వద్ద 16 వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

 

12:07 - October 12, 2017

హైదరాబాద్ : మేడ్చల్ నుండి సికింద్రాబాద్‌కు.. లోకల్‌ రైలులో వస్తోన్న ఓ ప్రయాణీకుడిపై నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. రైలులో ఒంటరిగా ఉన్న అమీనుద్దీన్‌ నుంచి డబ్బులు, సెల్‌ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారు. అమీనుద్దీన్‌ ఎదురు తిరగడంతో తమ దగ్గర ఉన్న కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తంతో తడిసిన బట్టలతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా దొరికిన ఆధారాలతో విచారణ చేపట్టారు.

 

సొంత ఊరిని ఆదర్శగ్రామంగా మార్చిన రామినేని :సీఎం చంద్రబాబు

విజయవాడ: రామినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రామినేని ఫౌండేషన్ 18వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... సొంత ఊరిని ఆదర్శగ్రామంగా రామినేని మార్చారని పేర్కొన్నారు. జన్మభూమికి సేవ చేసిన వారి జీవితం సార్థకమవుతుందని,కుటుంబ వ్యవస్థే మనకున్న గొప్ప సందప అన్నారు. మానవ సంబంధాలే అత్యంత ముఖ్యం అన్నారు. అందరూ నీతి నిజాయితీగా జీవిచాలని, యువత వాడే టెక్నాలజీపై పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

11:56 - October 12, 2017

తామర గింజలు...చాలా మందికి తామర గింజలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బోలెడన్నీ పోషక పదార్థాలు ఉంటాయంట. ఆగస్టు..సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా తామర పూలొస్తాయనే సంగతి తెలిసిందే.

తామరపువ్వు నుండి తామర గింజలు వస్తాయి. వీటిని పచ్చిగానే ఉపయోగిస్తుంటారు. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు. ఉత్తర భారతదేశంలో పండుగల సమయాల్లో వీటితో స్వీట్స్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇవి తినడం వల్ల మలబద్దకం పొగొడుతుంది. గర్భిణీలు..బాలింతలకు నీరసం ఉండదు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది. సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బిపి రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బిపి నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి..కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ఆహారంలో కొంత తీసుకుంటే బెటర్. ఇవి తినడం వల్ల ఆకలి పెంచడమే కాకుండా డయేరియాను నివారిస్తుంది.  ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్థులు జాగ్రత్త వహించాలి.

కొనసాగుతున్న 48వ గవర్నర్ల సదస్సు

ఢిల్లీ: రాష్ట్రపతి అధ్యక్షతన 48వ గవర్నర్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు 27 రాష్ట్రాల గవర్నర్లు, ముగ్గురు లెప్టినెంట్ గవర్నర్లు సదస్సులో పాల్గొన్నారు. న్యూ ఇండియా 2022 పేరుతో సదస్సు జరుగుతోంది. దేశంలో విద్యార వృత్తి నైపుణ్యం, అభివృద్ధి, ఆరోగ్యం, ఓడీఎఫ్, కాలుష్య రహిత పర్యావరణ, భద్రతా రక్షణ విషయాలపై అంశాల వారీగా సదస్సు సాగుతోంది. 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కానున్న నేపథ్యంలో ప్రత్యేక సదస్సులో చర్చిస్తున్నారు.

11:30 - October 12, 2017

హైదరాబాద్ : నగరంలోని మదాపూర్ శ్రీచైతన్య హాస్టల్ లో విద్యార్థిని సంయుక్త ఆత్మహత్య చేసుకుంది. సంయుక్త నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామానికి చెందింది. విద్యార్థిని సూసైడ్ నోట్ పోలీసుల వద్ద ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. సంయుక్త మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:19 - October 12, 2017

ఎఫ్‌టీఐఐ (ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) నూతన ఛైర్మన్‌గా బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ రాజీనామా చేశారు. గజేంద్ర చౌహాన్ ను నియమించడం పట్ల ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ పదవికి గజేంద్ర అర్హుడు కాదని..ఎఫ్ టీఐఐ విద్యార్థులు తీవ్ర నిరసనలు..ఆందోళనలు వ్యక్తపరిచారు. కానీ రాజీనామా చేయడానికి మాత్రం గజేంద్ర ఒప్పుకోలేదు. దీనితో విద్యార్థులు కొన్ని నెలల పాటు తరగతులకు వెళ్లడానికి నిరాకరించారు. తాజాగా ఈ పదవిలో అనుపమ్ ఖేర్ నియమితులయ్యారు.

ఇక అనుపమ్ ఖేర్ విషయానికి వస్తే ఆయన దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్న అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. 

నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు మంత్రి గంటా ఫోన్

కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు మంత్రి గంటా ఫోన్ చేశారు. హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆరా తీశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని డైరెక్టర్ తెలిపారు. 16న విద్యార్థుల ఆత్మహత్యల నివారణ - చర్యలపై సదస్సు జరుగుతుందని, సదస్సుకు హాజరు కావాలని ట్రిపుల్ ఐటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ పై వేటు

కృష్ణా: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ పై వేటు పడింది. పమిడిముక్కల తహశీల్దార్ విక్టర్ బాబు బదిలీ అయ్యారు. ఎమ్మఆర్వో విక్టర్ బాబుపై టిడిపి యంత్రాంగం బదిలీ వేటు వేసింది. గంపలగూడెం మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గంపలగూడెంలో పోస్టు ఖాలీ లేకపోయినా బదిలీ చేశారు.

11:14 - October 12, 2017

టాలీవుడ్ లో రీమెక్ ల హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలపై వెంకీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తెలుగులో తీసినా మంచి విజయాన్నే నమోదు చేస్తుంటాయి. ఇటీవలే వచ్చిన 'గురు' కూడా ఆ కోవకి చెందిందే. ఈ చిత్రం అనంతరం 'వెంకటేష్' ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. తాజాగా 'తేజ' దర్శకత్వంలో 'వెంకీ' నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

వెంకీ – తేజ‌ కాంబినేషన్ ఓకే అయిపోయింద‌ని, ఈ సినిమా కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఉంటుంద‌ని టాక్‌. ఇదివరకే వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాల్సింది. కానీ తేజ ఫామ్ లో లేకపోవడంతో వెంకీ ధైర్యం చేయలేదని తెలుస్తోంది. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది. దీనితో మళ్లీ ఫాంలోకి వచ్చిన 'తేజ'తో సినిమా చేయాలని వెంకటేష్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నాడని, రెండు భిన్న భావాలున్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సికింద్రాబాద్- నిజాముద్దీన్ వెళ్తున్న ట్రైన్ లో దొంగలు బీభత్సం

హైదరాబాద్: సికింద్రాబాద్- నిజాముద్దీన్ వెళ్తున్న ట్రైన్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. అమీనుద్దీన్ అనే వ్యక్తి పై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. సెల్ ఫోన్, డబ్బులు దొంగలించేందుకు యత్నించారు. అమీనుద్దీన్ కు స్వల్ప గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

11:05 - October 12, 2017

నల్లగొండ : కొత్తజిల్లాలతో తెలంగాణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని విద్యత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయిని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:02 - October 12, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రారంభమైంది. ఏపీలోని 13 జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల వారీగా బాండ్ల పరిశీలన జరగనుంది. పోలీసు శాఖ విజయవాడలో 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాల్లో 32.2 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఏపీలోనే 19.43 లక్షల మంది ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఘనంగా రామినేని ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం

విజయవాడ: ఏ కన్వెన్షన్ సెంటర్ లో రామినేని ఫౌండేషన్ 18వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంగా ముఖ్య అతిధులుగా సీఎం చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్ పారికర్ పాల్గొన్నారు.

సీఐడీ వెబ్ సైట్ లో నమోదు చేసిన బాండ్ల పరిశీలిన

విజయవాడ: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన జరుగుతోంది. 17 కౌంటర్లలో బాండ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సీఐడీ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నవారి బాండ్లను మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ నమోదు లేదని అధికారులు వెనక్కి పంపుతున్నారు.ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని తమకు ఎవరూ చెప్పలేదని బాధితులు వాదనకు దిగారు.

సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు

నెల్లూరు: సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 32,135 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి మట్టం 78 టీఎంసీలు, ప్రస్తుతం 32798 గా ఉంది.

రానున్న 48 గంటల్లో భారీ వర్ష సూచన

హైదరాబాద్: అల్పపీడన ప్రభావం, ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నట్లు చెప్పారు. మరికొన్ని చోట్ల సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతోన్న వరద

నిజామాబాద్:శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 38,739 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 09 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1074.6 క్యూసెక్కుల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ 91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 38.7 టీఎంసీలుగా ఉంది.

గండికోట రిజర్వాయర్ కు నీరు విడుదల

కర్నూలు: అవుకు రిజర్వాయ్ నుండి నీరు విడుదల చేశారు.గండికోట రిజర్వాయర్ కు 1400 క్యూసెక్కుల నీటిని మంత్రి ఆదినారాయణరెడ్డి,ఎమ్మెల్సీ బీటెక్ రవి విడుదల చేశారు.

10:23 - October 12, 2017

టీమిండియా వెటరన్ పేసర్ 'ఆశీష్ నెహ్రా' అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నారా ? దీనిపై ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. నవంబర్ నెలలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. ముంబై మిర్రర్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని తెలుస్తోంది.

సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత నెహ్రా ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరిస్‌లో బీసీసీఐ ఎంపిక చేసిన 15మంది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే రాంచీలో జరిగిన తొలి టీ -20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం నెహ్రాకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.

నవంబర్ 1న ఢిల్లీలోని ఫిరోషా కోట్లా మైదానంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగనుంది. దీనితో సొంత స్టేడియం కావడంతో ఇక్కడే రిటైర్ మెంట్ ప్రకటించాలని నెహ్రా యోచిస్తున్నట్లు టాక్. సొంత మైదానంలో అభిమానుల మధ్య వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ 20 ప్రపంచకప్ జరిగే అవకాశం లేకపోవడంతో నెహ్రా రిటైర్ మెంట్ కు కారణమని తెలుస్తోంది.

1999లో అంతర్జాతీయ క్రికెట్ లో నెహ్రా ఆరంగ్రేటం చేశాడు. భారత్ తరపున 17 టెస్టులు..120 వన్డేలు..26 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. నెహ్రా చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటి వరకు 26 టీ20లు ఆడిన నెహ్రా 34 వికెట్లు తీశాడు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

ముగిసిన శశికళ పెరోల్...

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెరోల్‌పై విడుదలైన చిన్నమ్మ శశికళ నేడు తిరిగి బెంగళూరు జైలుకు బయల్దేరారు. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు శశికళకు ఐదు రోజుల పెరోల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బుధవారంతో ఆ గడువు ముగిసింది. దీంతో నేడు ఆమె తిరిగి బెంగళూరు జైలుకు వెళ్తున్నారు.

 

10:10 - October 12, 2017

హైదరాబాద్ : నగరంలోని మదాపూర్ శ్రీచైతన్య హాస్టల్ లో విద్యార్థిని సంయుక్త ఆత్మహత్య చేసుకుంది. సంయుక్త నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామానికి చెందింది. విద్యార్థిని సూసైడ్ నోట్ పోలీసుల వద్ద ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. సంయుక్త మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

శ్రీశైలం గేట్లు ఎత్తివేత...

శ్రీశైలం: కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి దేవినేని ఉమ శ్రీశైలం జలాశయం ఆనకట్ట గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో 884.60 అడుగులకు నీరు చేరుకోవడం, 215 టీఎంసీలకు గాను 213 టీఎంసీల నీరుండటంతో రెండు గేట్లను ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాలని అధికారులు అంతకుముందే నిర్ణయించారు.

10:07 - October 12, 2017

కృష్ణా : అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రారంభమైంది. ఏపీలోని 13 జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల వారీగా బాండ్ల పరిశీలన జరగనుంది. పోలీసు శాఖ విజయవాడలో 17 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాల్లో 32.2 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఏపీలోనే 19.43 లక్షల మంది ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన ప్రారంభం

విజయవాడ: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన ప్రారంభం అయ్యింది. 17 కౌంటర్లలో బాండ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : సూరారం కాలనీలో బీటెక్ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది. ఆత్మహత్యకు ముందు ఇనిస్టాగ్రామ్ స్టేటస్ అప్ డేట్ చేసింది. అందులో ప్రతి నిమిషం తన జీవితం దుర్భంగా మారిందంటూ స్టేటస్ లో పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

09:40 - October 12, 2017

 

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిస్తాయిలో నిండటం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 884.40 అడుగులతో 212 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మూడున్నర టీఎంసీలు మాత్రమే తక్కువ ఉంది. మరోవైపు జూరాల, సుంకేశుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అటు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 88,559 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. శ్రీశైలంగేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో మరికొద్దిరోజుల్లో జలకళ రానుంది. 

09:39 - October 12, 2017

హైదరాబాద్ :వంశధార నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్షాల నేతలను అరెస్టు చేయడాన్ని వైసీపీ అధినేత జగన్‌ ఖండించారు. కాంట్రాక్టులు, కమీషన్లమీదే దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రాబాబు.. వంశధార నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వామపక్షాలతోపాటు వైసీపీ కూడా ఉద్యమిస్తుందన్నారు వైఎస్‌ జగన్‌. 

09:37 - October 12, 2017

 

హైదరాబాద్ :పాతబస్తీలో వడ్డీవ్యాపారుల ఆగడాలు శ్రుతిమించాయి. వ్యాపారుల వేధింపులకు హుస్సేన్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వడ్డీవ్యాపారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బాధితుడి సెల్ఫీ సోషల్‌ మీడియాలో ఇపుడు వైరల్‌ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

09:08 - October 12, 2017

 

కృష్ణా : జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటి విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థి లక్ష్మీనర్సింహమూర్తి ఆత్మహత్య చేసున్నాడు. మూర్తి తూర్పుగోదావరి మల్కీపురం మండలం శంకరగుప్తం గామానికి చెందినవాడు. బుధవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో మూర్తి ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:30 - October 12, 2017

జైపూర్ : దేశంలో చోటు చేసుకుంటున్న హిందుత్వ దాడులు పల్లెలకు సైతం విస్తరిస్తున్నాయి. చిన్నపాటి కారణాలకే మైనారిటీలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా పోకరన్‌లో దేవిస్తోత్రాన్ని సరిగా పాడనందుకు ఓ ముస్లిం యువకుడిని కొట్టి చంపారు. సెప్టెంబర్‌ 27న దాంతల్‌ గ్రామంలో జాగరణ కోసం వచ్చిన జానపద గాయకుడు ఆదమ్‌ఖాన్‌ హత్యకు గురయ్యాడు. దేవీ స్తోత్రాన్ని సరిగా ఆలపించలేదన్న కారణంతో ఓ ఆలయ పూజారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్తోత్రాన్ని పఠించేటప్పుడు తమ శరీరంలో దేవి శక్తి వస్తుందని భోపా సామాజిక వర్గం నమ్మకం. ఆదమ్‌ఖాన్‌ స్తోత్రాన్ని సరిగా పఠించకపోవడం వల్ల తమకు శక్తి ఆవహించలేదన్న కారణంతో భోపా సామాజికవర్గానికి చెందిన పూజారి రమేష్‌ కుమార్ తన సోదరులతో కలిసి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. రమేష్‌ కుమార్‌ అతని సోదరులను ఆదమ్‌ఖాన్‌ కుటుంబం దోషులుగా పేర్కొంది. దీంతో బాధిత కుటుంబాన్ని చంపేస్తామని రమేష్‌ అతడి సోదరులు బెదిరించడంతో 25 మంది సభ్యుల ముస్లిం కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయి. జిల్లా అధికారులు వారికి ఓ పట్టణంలో ఆశ్రయమిచ్చారు.

08:16 - October 12, 2017

 

హైదరాబాద్ : 15 రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోజూ పలు ప్రాంతాల్లో 6 నుంచి 13 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో సిటీలో ఉన్న చెరువులు నిండకుండలా మారాయి. సిటీలో 185 చెరువులు ఉండగా.. వాటిలో 119 చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. 26 చెరువులు పూర్తి స్ధాయిలో ఎఫ్టీఎల్‌కు చేరుకున్నాయి. 23 చెరువుల్లో 75 శాతం నీరు రాగా.. 17 చెరువుల్లో 50 శాతం వరకూ వరద నీరు వచ్చి చేరింది.

నాలా వ్యవస్థ సక్రమంగా ఉండకపోవడమే...
ఇక అన్ని చెరువులు నీటితో నిండి పోవ‌డంతో చిన్న పాటి వ‌ర్షం వ‌చ్చినా చెరువుల చుట్టుపక్కల ఉండే కాలనీలు, బస్తీల్లోకి వేగంగా నీరు వచ్చి చేరుతోంది. అందుకు ప్రధాన సమస్య నాలా వ్యవస్థ సక్రమంగా ఉండకపోవడమే. సిటీలోని చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఉండేవారు రోజుల తరబడి నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్ పెద్ద చెరువు, మ‌ల్కాజ్ గిరి బండ‌చెరువు, మీరాలం ట్యాంక్, బోర‌బండ సున్నం చెరువు, మీయాపూర్ దీప్తి శ్రీనగర్ ప‌టేల్ చెరువుతో పాటు ప‌లు చెరువులు నిండిపోయి కాలనీల్లోకి పడ్డాయి. దాంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు.

ఎఫ్టీఎల్ ప‌రిథిలోకి నిర్మాణాలు..
ఇక కొన్ని చోట్ల ఎఫ్టీఎల్ ప‌రిథిలోకి నిర్మాణాలు రావ‌డంతో కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు భారీగా వచ్చి చేరింది. నాలాలు, చెరువుల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రామాంతపూర్ బండ చెరువు వద్ద ఎఫ్టీఎల్ నిర్ధారణపై అధికారులు అలసత్వం వహించిన కారణంగా అక్కడి ప్రజలంతా 10 రోజులపాటు మురుగునీటిలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు కబ్జాలు.. మరోవైపు సివరేజ్ సిస్టమ్ సరిగా లేక చెరువులు సిటీని ముంచెత్తాయి. చెరువులను రక్షించకపోతే ఎలాంటి దుస్థితి ఏర్పడుతుందో ఈ ఏడాది కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఇప్పటికైనా పాలకులు చెరువులు, కాల్వలపై దృష్టి సారించకపోతే.. ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని జనం పెదవి విరుస్తున్నారు. 

08:07 - October 12, 2017

అనంతపురం : రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో నిన్న రాత్రి కురిసిన కుండుపోత వర్షానికి రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. దీంతో గుత్తి ప్రజలు రాత్రంగా జాగారం చేశారు. కర్నూలును కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గుత్తిలో భారీ వర్షం

 

అనంతపురం : జిల్లా గుత్తిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్పందిచిన అధికారులు నీటిని తొలగిస్తున్నారు. 

నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్టు

 

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. నేడు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ 2గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

నేడు శ్రీకాకుళంలో జయప్రకాశ్ నారాయణ్ పర్యటన

శ్రీకాకుళం : జిల్లాలో జయప్రకాశ్ నారాయణ్ 2వ రోజు జనం కోసం జేపీ సురాజ్య యాత్ర జరగనుంది. ఆయన నేడు విద్యాసంస్థల్లో విద్యార్థులతో మాట్లాడుతారు.

07:36 - October 12, 2017

రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలని అందరం కోరుకుట్టున్నామని, దేశవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి వెనకబడిందని, నోట్ల రద్దు తర్వాత చాలా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి జరిగితే సంతోషిస్తారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, డీఎస్సీ వెకయపోతే మునిగిపోపయేది లేదని కేసీఆర్ అన్నారని, రైతులకు రూ.17వేల కోట్లు నాలుగు ధపాలుగా చేయడం వల్ల రైతులు వడ్డీ కట్టవాల్సివచ్చిందని సీపీఎం నేత సాగర్ అన్నారు. జిల్లా ఏర్పాటు పునర్ విభజన ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనా గ్రామస్థాయి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ది అని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ చేస్తోందని టీఆర్ఎస్వీ నేత శ్రీనివాస్ అన్నారు. అవినీతిలో టీఆర్ఎస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఉద్యోగలు ఇస్తామని చెప్పి మోసం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయకర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:35 - October 12, 2017

సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం, గోప్యత లేని సమాజం దాని లక్ష్యం, అవినీతిపరులకు అదంటే భయం, అదే సమాచార హక్కు చట్టం, 2005లో వచ్చినా ఈ చట్టానికి 12 ఏళ్లు..ప్రస్తుతం ఈ చట్టం అమలు ఎలా వుంది? సాధించిన విజయాలు, రావాల్సిన మార్పులు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ రోజు జనపథం...ప్రధానంగా సమాచార చట్టాన్ని సమాచారం సేకరించటంలో చాలా ఇబ్బంది ఉంటుందని, జీహెచ్ఎంసీ ఆఫీస్ కు ఒక అప్లికేషన్ పెట్టామని కానీ ఎన్నో కారణాలు చెబుతూ తిరస్కరిస్తున్నారని, సమాచార హక్కు చట్టంతో 2జీ స్కామ్, కామన్ వెల్త్ స్కామ్ బయపడిందని, సమాచారం చట్టం వెబ్ సైట్ చూస్తే ఒక్క శాఖ కూడా సమాచారన్ని అప్ డేట్ చేయడంలేదని, సమాచారం చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని, సమాచార హక్కు కార్యకర్త సాంబరెడ్డి అన్నారు.

07:34 - October 12, 2017

విజయనగరం : ఫైనాన్స్‌ కార్యాలయంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం విజయనగరం పోలీసులకు కాసుల వర్షం కురిపించింది...వెంటనే రైడ్ చేసి రాఘవరెడ్డితో పాటు ఇతరులను పట్టుకున్నారు...ఆ సమయంలో దండు కోవాల్సింది దండుకున్నారు. విజయనగరం టూటౌన్‌ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ నరసింహమూర్తి తాను అనుకున్నట్లుగానే ఫైనాన్స్‌ ఆఫీస్‌పై దాడులు చేసి కేసులు పెట్టారు...ఇక ఆ కేసులో భాగంగా రాఘవరరెడ్డి వాహనాలు సీజ్ చేయడం...ఫైనాన్స్‌ ఆఫీస్‌ క్లోజ్ చేయడం లాంటి పనులకు తన సిబ్బందిని పురమాయించాడు..దీంతో రాఘవరెడ్డి దారికి రావడంతో బేరం పెట్టాడు...50 వేల రూపాయలు ఇస్తే అన్నీ మాఫీ చేస్తానంటూ ఒప్పందం చేసుకున్నారు...సీఐ వేధింపులు భరించలేక రాఘవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో నిఘా వేశారు..సీఐ చెప్పినట్లు 50వేల రూపాయలు తీసుకుపోయాడు రాఘవరెడ్డి...ఆ డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా సీఐ,హెడ్‌కానిస్టేబుల్‌లను పట్టుకున్నారు. ఈ మధ్యకాలంలోనే విజయనగరం వన్‌టౌన్‌ సీఐ కూడా ఏసీబీకి చిక్కాడు..ఇప్పుడు మరో సీఐ దొరకడంతో పోలీసుల అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతుంది.

07:32 - October 12, 2017

 

జగిత్యాల/కరీంనగర్ : ఇదిగో వీరి పేర్లు చిర్ర శ్రీలత, బిణవేని గణేష్‌. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బలవంతపూర్‌కు చెందిన శ్రీలతకు, నూకపల్లికి చెందిన గణేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీలత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినదికాగా... గణేష్‌ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. కులాలు వేరైనా మనసులు కలవడంతో కలిసి జీవిద్దామంటూ 2015 జూన్‌ 2న కొండగట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి శ్రీలత కుటుంబ సభ్యులు, గణేష్ కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో ఈ జంట నూకపల్లిలో కాపురం పెట్టింది. పెళ్లైన కొన్నాళ్లలకే శ్రీలత భర్త గణేష్‌ బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. దీంతో శ్రీలత తన పుట్టింటిలోనే ఉండిపోయింది. రెండు సంవత్సరాల తర్వాత ఈ మధ్యే గణేష్‌ తిరిగి వచ్చాడు. దీంతో శ్రీలత మెట్టినింటికి వచ్చింది.

సర్పంచ్‌ గంగాధర్‌ హుకుం..
ప్రేమజంట హాయిగా కాపురం చేసుకుంటుండడంతో గణేష్ కులపెద్దలు రగిలిపోయారు. తమ కులపు వాడితో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి కాపురం చేస్తుండడం బీసీ కులపెద్దలు జీర్ణించుకోలేకపోయారు. కుల పరువు తీస్తున్నారంటూ గణేష్‌ కుటుంబంపై మండిపడ్డారు. సర్పంచ్‌ గంగాధర్‌ను వారిపైకి ఉసిగొల్పారు. కులకట్టుబాట్ల కోసం ఓ మూడు నెలలు దంపతులిద్దరూ జగిత్యాలలో ఉండాలని సర్పంచ్‌ గంగాధర్‌ హుకుం వేశాడు. ఆ తర్వాత గ్రామంలో హాయిగా ఉండొచ్చని నమ్మబలికాడు. ఇది నమ్మిన శ్రీలత, గణేష్‌ జగిత్యాలలో రూము తీసుకుని మూడునెలలు ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికి వస్తామంటే కులపెద్దలు అందుకు అంగీకరించలేదు. శ్రీలతను ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరిలోకి తీసుకురావొద్దని హెచ్చరించారు. ఆమెను వదిలి వస్తేనే గణేష్‌ను ఊరిలోకి రానిస్తామని కండీషన్‌ పెట్టారు. శ్రీలతే కావాలంటే గణేష్‌ను కూడా ఊరిలోరి రానివ్వబోమని తెగేసి చెప్పారు. గణేష్‌ కుటుంబాన్ని కులపెద్దలు కులం నుంచి బహిష్కరించారు.

ఎస్పీకి వినతిపత్రం...
ఆధునిక రాజ్యంలోనూ ఆటవిక న్యాయమేంటంటూ నవజంట మాల్యాల పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎస్సై నీలం రవి.. అదిగో ఇదిగో అంటూ కాలమెల్లదీశాడుతప్ప తమకు ఎలాంటి న్యాయం చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. తమను కులం నుంచి బహిష్కరించిన కులపెద్దలకే మద్దతు పలుకుతున్నారని వాపోయారు. స్థానిక పోలీసులు న్యాయం చేయకపోవడంతో ఈ జంట జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తమకు జరిగిన అన్యాయంపై ఎస్పీకి వినతిపత్రం అందజేసింది. న్యాయం చేయాలని వేడుకుంది. తమను కులం నుంచి బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఎస్పీ వీరికి ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి.

07:31 - October 12, 2017

అనంతపురం : వెంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అనే సామెత టీ టీడీపీకి సరిగ్గా సరిపోతుంది. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ వివాహం టీ టీడీపీని డైలమాలో పడేసింది. ఈనెల 1న పరిటాల శ్రీరామ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి తనయుడు, మరీ ముఖ్యంగా పరిటాల రవి కుమారుడు వివాహం కావడంతో చాలామంది వీవీఐపీలు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవ్వడంతో టీడీపీని షేక్‌ చేస్తోంది.

కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు స్వాగతం
ఏపీ సీఎం చంద్రబాబుతోసహా తెలంగాణ సీఎం కేసీఆర్‌ శ్రీరామ్‌ వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ను దగ్గరుండి రిసీవ్‌ చేసుకోవడంతోపాటు అన్నితామై ఆయన తిరిగి వెళ్లేవరకు వెన్నంటే ఉన్నారు. ఆయనకు ఏంకావాలన్నా దగ్గరుండి చూసుకున్నారు. దీంతో ఏపీ టీడీపీ నేతలపై టీ టీడీపీనేతలు మండిపడుతుననారు. ఏపీ టీడీపీ నేతలు కేసీఆర్‌ వచ్చినప్పుడు ఓవరాక్షన్‌ చేశారని అధినేతకు కంప్లైంట్‌ చేయడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌ మారింది. పక్కరాష్ట్రం సీఎం వచ్చినప్పుడు గౌరవించాలికానీ.. మరీ అంత ఓవరాక్షన్‌ అవసరమా అంటూ చంద్రబాబు ముందు పంచాయతీ పెట్టారు. తెలంగాణలో పార్టీని తిరిగి ట్రాక్‌ ఎక్కించేందుకు కేసీఆర్‌ తాము పోరాటం చేస్తోంటే.. ఏపీ టీడీపీనేతలు కేసీఆర్‌తో రాసిపూసుకుని తిరిగి పార్టీ మైలేజ్‌ను దెబ్బతీశారన్నది టీ టీడీపీ నేతల వాదన. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కేసీఆర్‌తో రహస్యంగా మంతనాలు జరపడం, తదనంతర పరిణామాలు అన్నీ తమకు తెలంగాణలో ఇబ్బందిగా మారాయని చంద్రబాబుకు కంప్లైంట్‌ చేశారు. ఏపీ టీడీపీ నేతల పనితో తాము తలెత్తుకోలేకపోతున్నామని... అందుకే రాజీనామాలు చేస్తామని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

టీడీపీని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టింది
టీ టీడీపీ నేతల కంప్లైంట్‌తో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏపీ నేతలకు ఫుల్‌ క్లాస్‌ తీసుకున్నారు. పార్టీలో సీనియర్‌ అయిన పయ్యావుల కేశవ్‌ ఇలా చేయడమేంటని మండిపడ్డారు. చంద్రబాబు చీవాట్లతో పయ్యావుల మనస్తాపానికి గురయ్యారు. కేసీఆర్‌ తనను రమ్మని పిలిస్తేనే వెళ్లాలనని, అందులో తన తప్పేమీ లేదని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. మొత్తానికి కేసీఆర్‌ అనంత పర్యటన టీడీపీని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్న కేసీఆర్‌ టూర్‌పై చివరిరి చంద్రబాబు ఒకరికి సర్దిచెప్పడంతోపాటు మరొకరికి వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇకనైనా టీడీపీ నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తారో లేదో వేచి చూడాలి.

07:30 - October 12, 2017

 

గుంటూరు : జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతులు, మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్వచ్ఛత, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్‌ నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలనీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే వివిధ సమస్యలను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక , ఆర్థికేతర అంశాలుగా స్పష్టంగా వర్గీకరించుకోవాలన్నారు. వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మీదట స్వచ్ఛత, ప్రజాసమస్యల విషయంలో ప్రతి 15 రోజులకోసారి తాను వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా
వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ రూపొందాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులంతా కష్టపడాలన్నారు. జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు వందశాతం ఓడీఎఫ్‌ సాధించాయని.. మిగతా 10 జిల్లాలు కూడా మరో 6నెలలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. మొత్తం 12, 854 గ్రామ పంచాయతీలకుగాను.. ఇప్పటికి 4,600 గ్రామపంచాయతీలు పూర్తి ఓడీఎఫ్‌ను ప్రకటించాయని గుర్తుచేశారు. అధికారులు, మంత్రులు జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు టాయిలెట్లు, ఆయా పరిసరాలు పరిశీలించి స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 4గంటలపాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్‌ చివరి వరకు ఉత్సాహంగా సాగింది. అయితే కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

07:29 - October 12, 2017

మహబుబ్ నగర్ : ప్రస్తుత సీజన్‌ చివరిలో భారీ వర్షాలు పాలమూరు జిల్లాను ముంచెత్తాయి. వర్షాలపై కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే, పంట నష్టపోయిన మరికొందరు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో 33.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కోయిలకొండ మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీంతో జూరాల, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి, నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాలు రైతులకు చేటు తెచ్చాయి. వరి పంటనీట మునిగింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుగా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

23,486 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 23,486 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పత్తికి అధిక నష్టం వాటిల్లింది. పంటదెబ్బతిన పత్తి చేలను గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పరిశీలించారు. ఎకరం పత్తిసాగుకు 28 వేల రూపాయాలు ఖర్చు చేశామని, వర్షాలతో పంట దెబ్బతినడంతో చేసిన వ్యయం తిరిగివచ్చే అవకాశంలేదని ఎమ్మెల్యే ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టులు నిండటంతో రబీ సాగుకు నీరు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఖరీఫ్‌ నష్టాన్ని రబీతో పూడ్చుకుంటామని అంటున్నారు. 

నేడు ఆసిఫాబాద్ లో లక్ష్మారెడ్డి పర్యటన

కొమరంభీం ఆసిఫబాద్ :  నేడు జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. ఆయన అక్కడ నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. 

నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

 

కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ నర్సింహ అనే విద్యార్థి హాస్టల్ రూమ్ లో ఉరివేసుకున్నాడు.

నేడు సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్ : నేడు సూర్యాపేట జిల్లాలో  సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయన జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 4.30లకు ప్రభుత్వ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Don't Miss