Activities calendar

13 October 2017

వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

విజయవాడ : ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుమారులు పొషించడం లేదని బందరు కాలువలో వృద్ధుడు దూకబోయిండు. వృద్ధున్ని అడ్డుకున్న యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన పేరిట ఉన్న ఆస్తులన్నీ రాయించుకుని ఇంట్లోంచి గెంటేశారని వృద్ధుడు ఆవేదన చెందాడు. వృద్ధుడి కమారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
 

గోరటి వెంకన్నకు సుద్దాల హనుమంతు..జానకమ్మ జాతీయ పురస్కారం

హైదరాబాద్ : ప్రముఖ కవి గోరటి వెంకన్నకు సుద్దాల హనుమంతు..జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్ లో వెంకన్నకు ఈ పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీ నటుడు, డైరెక్టర్ ఆర్.నారాయణమూర్తి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:59 - October 13, 2017

బీహార్ : ఆర్జేడి అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ యాదవ్ కుటుంబం అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. లాలు మరో తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను మట్టి స్కాం వెంటాడుతోంది. బిహార్‌లో వెలుగు చూసిన మట్టి కుంభకోణంపై వచ్చే 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని పట్నా హైకోర్టు నితీష్ ప్రభుత్వాన్ని ఇవాళ ఆదేశించింది. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మట్టి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అవసరం లేకున్నా మట్టిరోడ్లు వేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ. ఈ స్కాం వెలుగు చూడడంతో ఆదర బాదరాగా విచారణ జరిపించి అటవీశాఖ అధికారులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. బిజెపి- నితీష్‌ ప్రభుత్వంలో చేరడంతో అటవీశాఖను చూస్తున్న-డిప్యూటి సిఎం సుశీల్‌ మోది ఈ స్కామ్‌ను తిరగదోడుతున్నారు. 

 

21:58 - October 13, 2017

అమెరికా : ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి 9 బిలియన్ల డాలర్లు మిగిలాయని ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. లబ్ధిదారుల జాబితా నుంచి మోసకారులను తొలగించడం వల్ల ఈ సొమ్ము అనవసరంగా ఖర్చుకాకుండా మిగిలిందని చెప్పారు. భారత్‌లో దాదాపు వందకోట్ల మంది ప్రజలు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆధార్‌ను అమలు చేశారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ విధానాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంకు గురువారం నిర్వహించిన 'అభివృద్ధి కోసం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ' అనే అంశంపై చర్చా కార్యక్రమంలో నీలేకని మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

21:56 - October 13, 2017

ఢిల్లీ : రోహింగ్యా ముస్లిం శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమను దేశం నుంచి పంపించొద్దన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... రోహింగ్యాల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రానికి సూచించింది. ఈ కేసు విషయంలో దేశ భద్రతను రెండో ప్రాధాన్యత కింద తీసుకోలేమని... అలాగని రోహింగ్యాలలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేమని కోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది. అప్పటివరకు రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారని, శరణార్థుల్లో కొందరికి ఐసిస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున..వాళ్లని దేశం నుంచి పంపించి వేస్తున్నట్లు కేంద్రం గతంలో కోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవసరమైతే ఇక్కడే చనిపోతాం కానీ దేశం నుంచి వెళ్లబోమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

21:43 - October 13, 2017

గుంటూరు : ఏపీలో చౌక ధరల దుకాణాలను విలేజ్‌ మాల్స్‌గా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 వేల చౌక దుకాణాలలో తొలి విడతగా 6వేల 500ల విలేజ్‌ మాల్స్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించడమే విలేజ్‌ మాల్స్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశంగా చంద్రబాబు చెప్పారు. ఖాళీగా ఉన్న 4 వేల 599 చౌక ధరల దుకాణాల డీలర్లను వెంటనే నియమించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

 

21:41 - October 13, 2017

గుంటూరు : వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాంత్రీకరణను ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన పంటలను ఎక్కువగా సాగు చేయాలని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 

వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ అనుబంధరంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఖరీఫ్‌లో పంట రుణాలు, పంటల భీమాపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నీరు లేకపోవడంతో పూర్తి స్ధాయిలో సాగు జరగలేదని.. రబీ సీజన్‌లో అన్ని ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందించి.. రబీ లక్ష్యాలను సాధించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదు అయిన వర్షపాత వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం నాలుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. ఇక ఖరీఫ్‌లో సాగైన పంట విస్తీర్ణం, పంటల బీమాలో మంజూరైన సొమ్ము వివరాలు..  రైతాంగానికి క్లెయిమ్స్‌ కింద విడుదల చేసిన మొత్తం... ఇవ్వాల్సిన బకాయిలు తదితర అంశాలపై సీఎంకు అధికారులు వివరించారు. క్లెయిమ్‌లు సకాలంలో చెల్లించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

మరోవైపు పంటల సాగులో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వినియోగం తగ్గించాలని,  వ్యవసాయ యాంత్రీకరణతో  మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇక  ఉద్యానపంటల సాగు విస్తీర్ణ లక్ష్యం కోటి ఎకరాలుగా పెట్టుకున్నామని, బొప్పాయి, టమాటాల్లో  ఇంకా అధిక దిగుబడులు తేవాలని చంద్రబాబు అధికారులకు చెప్పారు. 

21:38 - October 13, 2017

హైదరాబాద్ : ఉప్పల్ టీ-20 మ్యాచ్‌ వర్షార్పణమైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఔట్‌ ఫీల్డ్‌ తడిసిపోవడంతో... అనేకసార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు... ఆడేందుకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌-ఆసీస్‌ చెరొక టీ-20 మ్యాచ్‌ గెలిచి సమానంగా నిలిచాయి. అయితే... హైదరాబాద్‌లో టీ-20 మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులకు వర్షం దెబ్బతో నిరాశే మిగిలింది. 

 

21:26 - October 13, 2017

యాదాద్రి జిల్లాకు ముఖ్యమంత్రి ఢోకా, సీఎం వస్తున్నడంటే విపక్షాలోళ్ల అరెస్టు, భారతదేశం అగ్రగామి ఆకలి రాజ్యం, నెత్తి గొర్గి లంచం దీస్కున్నరని సస్పెండ్, కొండలళ్ల తిర్గుతున్న కలెక్టర్ అమ్రాపాలి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:23 - October 13, 2017

యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి.. టెలీషోస్ ప్రొడ్యూస్ చేస్తూ.. సినిమా డైరెక్టర్ గా ఎదిగాడు ఓంకార్. మొదటి సినిమా పరాజయం పాలైనా.. రెండో సినిమాతో నవ్విస్తూనే భయపెట్టి చివరిలో మంచి మెసేజ్ కూడా ఇచ్చి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. దాంతో అతను తాజాగా రూపొందించిన రాజుగారి గది 2 పై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందులో స్టార్ హీరో నాగార్జున ఈ సినిమాను యాక్సెప్ట్ చెయ్యడంతో అంచనాలు ఏర్పాడ్డాయి. ఇక నాగ్ కోడలు .. స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ సినిమాలో నటిస్తుంది అనడంతో అంచనాలు పదింతలు పెరిగాయి. సో..రిలీజ్ కే ముందే తారాస్తాయిలో అంచనాలు రేకెత్తించిన రాజుగారి గది ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ...
ఈ సినిమా కథ విషయానికొస్తే..ఇంట్లోంచి డబ్బులు తెచ్చి.. రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని ..రిసార్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అశ్విన్, ప్రవీణ్, కిషోర్ లు.  అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి. అక్కడకు టూరిస్ట్ గా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న.. వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ ని రంగంలోకి దిగుతాడు.  అలా ఎంట్రీ  ఇచ్చిన మెంటలిస్ట్ రుద్ర ..ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు..? ఆత్మ వెనుకున్న కథేంటి.? చివరికి ఆ ఆత్మ తన పగతీర్చుకుందా...లేదా..సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే.. మెంటలిస్ట్ రుద్ర పాత్రలో నాగార్జున .. తండ్రి చాటు కూతురిగా . పగతో రగిలిపోతున్న ఆత్మ గా ..2 షేడెడ్ క్యారెక్టర్ లో నటించిన సమంత..ఈ ఇద్దరూ కూడా తమ ది బెస్ట్  పెర్ ఫామెన్స్ ఇచ్చారు. వీరిద్దరూ  ఈ సినిమాలోకి రావడంతో... ఒక మెచ్యూర్డ్ ఎమోషనల్ డ్రామా గా రూపుదిద్దుకుంది. ఇక రావురమేష్.. సమంత ఫాదర్ క్యారెక్టర్ లో  మెప్పించాడు. కమెడియన్స్ ప్రవీణ్, వెన్నెల కిషోర్, షకలకశంకర్, నరేష్.. తలో చెయ్యి వేసి రాజుగారి గది 2 కి కామెడీ కలరింగ్ అద్దారు.  కధతో సంబందం లేనప్పటికీ.. కధలో కనెక్ట్ చేసే డ్రైవ్ కి బాగా ఉపయోగపడ్డారు. వీరి ప్రజెన్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా సరదా..సరదాగా సాగిపోతుంది. సీరత్ కపూర్ పోషించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేనప్పటికీ.. ఆమె గ్లామర్ షో మాత్రం యూత్ ని, మాస్ ని మెప్పిస్తుంది. 
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే..  డైరెక్టర్ గా తన విజన్ ని రాజుగారి గదితో ప్రూవ్ చేసుకున్న ఓంకార్ .. ఈసినిమాతో మరింత మెచ్యూరిటీని చూపించాడు. కామెడీ కంటెంట్, కష్టమైన ఎమోషన్ ని పండించడంలో, దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు.  నాగార్జున, పి.వి.పి ,ఆడియన్స్.. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని చాలా వరకూ నిలబెట్టుకున్నాడు. ఇక టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ రైటర్  అయిన అబ్బూరి రవి కలం నుంచి చాలా రోజుల తర్వాత అత్యంత బలమైన డైలాగ్స్ జాలువారాయి.  సినిమా సోల్ ని నిలబెట్టి.. ఆడియన్స్ కళ్లు చెమర్చేలా చెయ్యడంలో అబ్బూరి రవి పాత్ర చాలా ఉంది.  ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్.. తన ఫామ్ ని కొనసాగిస్తూ.. సినిమాను కాపాడాడు. సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది.. తమన్ మ్యూజిక్. కెమెరా మెన్ దివాకర్.. ఓంకార్ విజన్ కి తగ్గట్టుగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ సినిమాను తీర్చి దిద్దాడు. సినిమా అంతా అతని ప్రతిభ కనిపిస్తుంది. సీ.జీ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్,.. హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. హార్రర్ ,కామెడీ , ఎమోషన్ మిక్స్ చేసి వచ్చిన రాజుగారి గది 2  ఒక సగటు సినిమాగా కాకుండా హార్ట్ టచింగ్ మెసేజ్ తో ఆకట్టుకుంటుంది. 
ప్లస్ పాయింట్స్ 
సమంత, నాగార్జున
కెమెరా వర్క్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
డైలాగ్స్ 
ఎమోషనల్ క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్ 
ఫస్ట్ హాఫ్
రొటీన్ ఫార్మాట్

రేటింగ్..
2.75

21:16 - October 13, 2017

హైదరాబాద్ : ప్రముఖ కవి గోరటి వెంకన్నకు సుద్దాల హనుమంతు..జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్ లో వెంకన్నకు ఈ పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీ నటుడు, డైరెక్టర్ ఆర్.నారాయణమూర్తి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:10 - October 13, 2017

ఢిల్లీ : దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ.. అనూహ్యంగా పెరిగిపోయింది. జులైలో అతి తక్కువ స్థాయి.. అంటే 0.9 శాతం నమోదైన సూచీ.. ఆగస్టుకు వచ్చేసరికి.. అమాంతంగా 4.3 శాతానికి పెరిగిపోయింది. అడ్డగోలు నిర్ణయాలతో ఆర్థిక రంగాన్ని కుదేలు చేసి.. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటోన్న ప్రధాని మోదీ... ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా మళ్లీ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 
వెలువడ్డ దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆగస్టు గణాంకాలు
దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆగష్టు మాసపు గణాంకం వెలువడింది. అది జూలై మాసం తాలూకు అతి తక్కువ స్థాయి అయిన 0.9% కంటే గణనీయంగా మెరుగుపడి 4.3% పెరుగుదలను నమోదు చేసింది. సొంతపార్టీకే చెందిన యశ్వంత్‌ సిన్హా.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల అమలు పర్యవసానాలపై మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పెరగడం మోదీకి కాస్తంత ఊరటనిచ్చేదే. 
అనుకూలంగా మలచుకునే యత్నం 
కింద పడ్డా గెలుపు తనదేననే స్వభావం వున్న ప్రధాని మోదీ.. తాజాగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధినీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల..  సామాన్య ప్రజలు నానా అవస్థలూ పడుతుంటే, 2016-17 సంవత్సరపు 3వ త్రైమాసికపు గణాంకం 7 శాతాన్ని చూపి.. జీడీపీపై విపక్షాలను దులిపేశారు. అంతేనా, నోట్ల రద్దును గొప్పచర్యగా సమర్థించుకున్నారు. ఆ తర్వాత, అదే సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం, అనంతరం 5.7 శాతం జీడీపీ నమోదయ్యాక గానీ, మోదీ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 
దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన మోదీ 
జి.డి.పి తగ్గుదల కేవలం తాత్కాలికమేనని, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయనీ వితండ వాదనలు చేస్తూనే, గతంలో రద్దు చేసిన ఆర్థిక సలహా మండలి పునరుద్ధరణ లాంటి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు మోదీ. అయితే, ఈ చర్యలన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉన్నయన్నది విశ్లేషకుల భావన. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆగస్టు మాసపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.3 శాతం నమోదు కావడం, మోదీకి, మునిగేవాడికి గడ్డిపోచ దొరికన చందమేనన్న భావన వ్యక్తమవుతోంది. 
మళ్లీ మొదటికి వచ్చే అవకాశం 
ఆగస్టుమాసంలో పారిశ్రామిక సూచీ పెరుగుదల పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్‌ కారణంగానే అన్నది విశ్లేషకుల అంచనా. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా ఉత్పత్తి పెరుగుదల నమోదవుతుందన్న నమ్మకం ఎవ్వరిలోనూ వ్యక్తం కావడం లేదు. పైగా పండుగ సీజన్‌ వెళ్లగానే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్న భావనా వ్యక్తమవుతోంది. గతంలో, నోట్ల రద్దు వేళ.. ప్రజల దగ్గర కరెన్సీ అందుబాటులో లేకున్నా, పారిశ్రామిక సరకుల డిమాండ్‌ నిలదొక్కుకోవడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మోదీ బృందం తాత్కాలిక విపత్తుల నుంచి గట్టెక్కే అడ్డదారులను వెతకడాన్ని ఇకనుంచైనా మానుకుని, ప్రజలను గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. 

 

21:01 - October 13, 2017

శ్రీకాకుళం : కొన్ని మాయమవుతున్నాయి..! కొన్ని ప్రాణాలు విడుస్తున్నాయి...! మరికొన్ని... బక్కచిక్కి... చావుకు దగ్గరగా ఉన్నాయి.! బాధ చెప్పుకోవడానికి నోరులేక... ఆకలి తీర్చే నాథుడు లేక అలమటిస్తున్నాయి.! అడిగే వారు.. ఆదుకునేవారు లేక...రోధిస్తున్నాయి.. ఇదీ.. శ్రీకాకుళం జిల్లాలోని గోశాలలోని మూగజీవాల వ్యథ. 
బాలాజీ గోశాలలో దీనావస్థలో గోవులు
ఈ దృశ్యాలు.. శ్మశానంలోనివి కావు... జంతు సంరక్షణ కేంద్రం గోశాలలోనివి.! రక్షణాలయంలోనే మృత్యువాత పడుతోన్న గోవులు..శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువలో ఉన్న బాలజీ గోశాలలో మూగజీవాలకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. ఆరేళ్ల క్రితం కబేళాకు తరలిపోతున్న ఆవులను సంరక్షించి.. వాటి ఆలనపాలన కోసం ఈ గోశాలను ఏర్పాటు చేశారు. సౌరబ్‌ గౌర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ గోశాలకు  భారీగానే  నిధులు ఇచ్చారు. అంతేకాదు.. బయట నుంచీ విరాళాలు విరివిగా అందాయి. అయితే ప్రస్తుతం ఈ గోశాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
రక్షణ కరవైన గోశాల పశువులు 
గోశాలలో పశువుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రారంభంలో 18 వందల గోవులుండే ఈ గోశాలలో.. ప్రస్తుతం నాలుగు వందలు కూడా లేవు. వందలాది గోవులు మాయమైపోయాయి. చాలా వరకూ చనిపోయాయి. ఉన్నవి బక్కచిక్కి..రోగాల బారిన పడి నిలబడేందుకు సత్తువ లేక కుంగి కృశించిపోయాయి.  వాటి ఆలనా పాలనా చూసే వారు కరువయ్యారు. ఆవులు ఆకలితో అలమటిస్తూ.. పక్కనున్న తోటలు పంటపొలాలపై పడి మేస్తున్నాయి. దాతల విరాళాలు తగ్గడం.. నిర్వహణ భారం అధికమవడంతో.. నిర్వాహకులు చేతులెత్తేశారు. 
గోవులు మృత్యువాత 
తిండి.. తిప్పలు లేక.. వందలాది సంఖ్యలో గోవులు మృత్యువాత పడుతున్నాయని...స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని.. బాలాజీ గోశాలపై విచారణ జరిపించి..వాస్తవాలు వెలికితీయాలని కోరుతున్నారు.  గోవుల సంరక్షణ కోసం ఆందోళనలు కూడా చేపట్టారు. చనిపోయిన గోవుల కలేబరాలను తమ తోటలో పడేస్తున్నారని.. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోశాల పరిసరాల వారు ఆరోపిస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యానికి బాలాజీ గోశాల నిదర్శనంగా మారిందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని.. ఆవులను రక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

20:55 - October 13, 2017

హైదరాబాద్ : బ‌ల్దియాలో  కార్మిక సంఘాల గుర్తింపు సంఘం ఎన్నిక‌లకు సిద్ధమవుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో విజయం తమదేనని ఆ సంఘం నాయకుడు గోపాల్‌ అంటున్నారు. జీహెచ్ఎంసీలో రెండు సార్లు కార్మికుల‌కు వేత‌నాలు పెంచి ప్రభుత్వం అమ‌లు చేసింద‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేశామని... ఇప్పుడు రాష్ట్రం సిద్ధించాక కార్మికులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుందని అన్నారు. సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఇళ్లు గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని గోపాల్‌ కార్మికులను కోరారు. 

 

20:54 - October 13, 2017

హైదరాబాద్ : దీపావళి పండగ సందర్భంగా బీఎస్ ఎన్ ఎల్  సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దివాళి లక్ష్మి పేరుతో పలు టారీఫ్‌లకు 50 శాతం ఎక్స్‌ ట్రా టాక్‌ టైమ్ ప్రవేశపెడుతున్నట్లు బీఎస్ ఎన్ ఎల్ తెలంగాణ సర్కిల్ మేనేజర్ అనంతరామ్ చెప్పారు. ఈ ఆఫర్లు ఈనెల 16 నుండి 6 రోజులు వరకు ఉంటుందని కస్టమర్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అనంతరామ్ చెప్పారు. 

 

20:51 - October 13, 2017

హైదరాబాద్ : సిటీలో రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి మెళకువలు అవసరమన్నారు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ నిఖిల. హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహించిన పబ్లిక్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీఆర్ ఎఫ్, జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్ధులు పాల్గొన్నారు. వరదలు, ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన మెళకువలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది విద్యార్ధులకు వివరించారు. 

20:49 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ వచ్చి మూడేళ్లవుతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, సమగ్ర గ్రామీణాభివృద్ధి ఆచరణలో నోచుకోవట్లేదని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సీపీఐ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చాడ మాట్లాడారు. రాజేంద్రనగర్‌కు చెందిన టీడీపీ నేతలు పోరుబాటకు సంఘీభావం తెలిపారు. 

 

20:47 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో పత్తి రైతును మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు రైతు సంఘం నేతలు. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం నేతలు రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. పత్తి పంటకు 7 వేల రూపాయల మద్దతు ధర లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నామని రైతు సంఘం నేతలు తెలిపారు. 

 

20:45 - October 13, 2017

నెల్లూరు : హైకోర్టు ఆదేశాలతో అధికారులు అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో బాధితులు తరలివచ్చారు. అయితే... గతంలో వివరాలన్నీ ఆన్‌లైన్‌ చేసినా... మళ్లీ డాక్యుమెంట్స్‌ అడగడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్‌ మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:42 - October 13, 2017

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్ వరకు, ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. 

 

20:40 - October 13, 2017

గుంటూరు : కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. వీటిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని గంటా చెప్పారు. ఈనెల 16న ఏపీలోని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డు గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం లేదని.. అలాంటి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గంటా చెప్పారు. 

 

 

20:38 - October 13, 2017

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్‌తో పాటు ఇతర పనుల పురోగతిపై హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

 

20:34 - October 13, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి కల్యాణకట్టలో పనిచేస్తున్న 240 మంది క్షురకులను విధుల నుంచి తొలగిస్తూ టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది. తలనీలాలు సమర్పించే భక్తులు నుంచి నిర్బంధంగా డబ్బులు  తీసుకుంటున్నారన్న  ఫిర్యాదులతో వీరిపై చర్యలు తీసుకున్నారు. దీంతో కల్యాణకట్టలోని సీసీటీవీల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించిన టీటీడీ అధికారులు భక్తుల నుంచి డబ్బులు గుంజిన క్షురకులను గుర్తించి, విధుల నుంచి తొలగించారు. 

తిరుమల శ్రీవారి కల్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులపై అనేక ఫిర్యాదు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే భక్తుల నిర్బంధంగా డబ్బులు వసూలు చేస్తూన్నారంటూ డయల్‌ యువర్‌ ఈవో చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో మచ్చపడ్డ క్షురకులను విధుల నుంచి తప్పించారు. ఈ నిర్ణయంపై క్షురకులు ఆందోళన బాట పట్టారు. 

శ్రీవారి కల్యాణకట్టలో పనిచేస్తున్న 1400 క్షురకుల్లో శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు. పర్మినెంట్‌ క్షురకులకు టీటీడీ జీతభత్యాలు చెల్లిస్తోంది. తాత్కాలిక కార్మికులకు.. ఒక్కో గుండుకు 7 రూపాయల వంతున ఇస్తున్నారు. అయినా.. క్షురకులు భక్తుల నుంచి అదనపు రుసుము వసూలు చేస్తున్నారని, కొన్ని సార్లు విపరీతంగా వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో చాలామంది భక్తులు టీటీడీ కార్యనిర్వహణాధికారికి ఈ అంశంపై ఫిర్యాదులు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కల్యాణకట్టలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, భక్తుల నుంచి డబ్బులు తీసున్న 240 మంది క్షురకులను విధుల నుంచి తొలగించారు. ఈ చర్యను క్షరకులు తప్పుపడుతున్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా... సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విధుల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

తలనీలాలు తీసినప్పుడు భక్తులు సంతోషంగా ఇచ్చే  పది, ఇరవై రూపాయలను తీసుకుంటున్నామని, దీనిలో నిర్బంధం లేకపోయినా టీటీడీ చర్యలు తీసుకోవడం సరికాదన్నది మరికొందరి వాదన. విధుల నుంచి తొలిగించిన క్షురకులను తిరిగి తీసుకోపోతే న్యాయపోరాటం తప్పదని నాయీ బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

మరోవైపు మచ్చపడ్డ క్షురకులపై చర్యను టీటీడీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ఫిర్యాదులున్న క్షురకులకు తిరుమల జేఈవో, ముఖ్య నిఘా, భద్రతాధికారి ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించినా.. మార్పు రాకపోడంతో చర్యలు తప్పలేదని అధికారులు చెబుతున్నారు. కల్యాణకట్టలో క్షురకులను తొలగించడం వలన తలనీలాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తుండగా... ప్రస్తుతంలో తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేనందున కొత్త క్షురకులను నియమించే ఆలోచనలేదని అధికారులు చెబుతున్నారు. 

ఉప్పల్ టీ20 మ్యాచ్ రద్దు

హైదరాబాద్ : ఉప్పల్ టీ20 మ్యాచ్ రద్దు అయింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వ టీ.20 మ్యాచ్ జరగాల్సివున్నది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. మూడు మ్యాచ్ ల టీ20 సీరిస్ 1..1 తో సమం అయింది. 

 

20:27 - October 13, 2017

ప్రకాశం : యాజమాన్యం వేధిస్తొందంటూ ప్రకాశం జిల్లా శింగరాయకొండ పెరల్‌ డిస్టిలరీస్‌ ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. రికార్డుల్లో అధికమొత్తం చూపిస్తూ తమకు సగం వేతనమే ఇస్తున్నారని.. దశాబ్ధకాలంగా పనిచేస్తున్న వేతనాలు పెంచడంలేదని మండిపడ్డారు. ఓవర్‌టైమ్‌ పనికి వేతనం ఇవ్వకుండా ప్రశ్నిస్తే విధుల్లోంచి తీసేస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  యాజమాన్యాన్ని కలవడానికి వచ్చిన మహిళలను ఫ్యాక్టరీలోనికి పోనివ్వకుండా సెక్యూరిటీ అడ్డుకొంది. దీంతో ఫ్యాక్టరీ గేటు వద్ద పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించారు.

20:08 - October 13, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తి మండలంలోని మంగళకర ట్రస్ట్‌పై ట్రాన్స్‌కో విజిలెన్స్‌ కేసు నమోదైంది. ట్రస్ట్ అనుబంధ విభాగాలు, కళాశాలకు... వ్యవసాయ సర్వీసుల మాటున విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు ట్రాన్స్‌కో అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు సంస్థపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. ట్రస్ట్‌పై నమోదు చేసిన కేసులన్నీ కొట్టివేయాలని.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ట్రాన్స్‌కో అధికారులు మాత్రం ఈ విషయంలో పెదవివిప్పడం లేదు.

20:07 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది.  వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి కన్నుమూసింది. అయితే బిడ్డ ప్రాణాలతో బయటపడింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి చనిపోయిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. 

20:05 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో.. మరో గేటు ఎత్తి నీటిని వదిలారు. 6, 7, 8 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.  ప్రాజెక్ట్‌ నీటి మట్టం ప్రస్తుతం 884.4 అడుగులకు చేరుకుంది. ఇన్‌ ఫ్లో ఒక లక్ష  76 వేల 909 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో లక్షా 44 వేల 9 వందల 48 క్యూసెక్కులు ఉంది.  

 

20:03 - October 13, 2017

కృష్ణా : విజయవాడ బందరు రోడ్‌లోని స్వరాజ్య మైదానాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ పిల్‌ దాఖలు చేశారు. పీడబ్లూడీ గ్రౌండ్‌ను విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సర్వత్రా ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారసత్వ సంపదగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని అభివృద్ధి ముసుగులో కొట్లాది రూపాయల విలువైన స్థలాన్ని విదేశీ కంపెనీలకు కట్టబట్టే ప్రయత్నాలను విపక్షాలు గతంలోనే ఖండించాయి. ఇప్పుడు ప్రభుత్వ తీరుపై హైకోర్ట్‌లో పిల్‌ దాఖలైంది. 

 

20:01 - October 13, 2017

కృష్ణా : విజయవాడలో జనసేనా పార్టీ కార్యలయం ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. పార్టీ కార్యాలయం ఏర్పాటు పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. పార్టీ ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా... ఇప్పటివరకు పార్టీ కార్యాలయం లేదు. పవన్‌ త్వరలో పూర్తి సమయం రాజకీయాలకు సమయం కేటాయించేందుకు సిద్ధమవుతుండటంతో పార్టీ ఆఫీస్‌ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లోని సినిమా కార్యాలయంలోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

19:58 - October 13, 2017

విజయవాడ : రాష్ట్రంలో మత్స్యకారులందరినీ సంఘటిత పరిచేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ మేరకు మత్య్సకార కులాల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పోస్టర్‌, జెండాను ఆవిష్కరించారు. మత్యస్యకారుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలు 13 జిల్లాలలో అవగాహన కల్పిస్తారని మంత్రి తెలిపారు. 14 ఉపకులాలు కలిసి ఒక సమైక్యగా ఏర్పడి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతాయన్నారు. 

 

యువతిని కిడ్నాప్‌ చేసిన ముగ్గురు యువకులు

గుంటూరు : జిల్లాలో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తాడికొండ మండలం పొన్నెకల్లులో ముగ్గురు యువకులు యువతిని కిడ్నాప్‌ చేశారు. ఎర్ర రంగు మారుతి కారులో వచ్చిన యువకులు యువతిని కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

19:52 - October 13, 2017

గుంటూరు : జిల్లాలో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తాడికొండ మండలం పొన్నెకల్లులో ముగ్గురు యువకులు యువతిని కిడ్నాప్‌ చేశారు. ఎర్ర రంగు మారుతి కారులో వచ్చిన యువకులు యువతిని కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:48 - October 13, 2017

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

 

19:42 - October 13, 2017

విశాఖ : జిల్లాలో బోరు నుంచి వేడినీరు రావడం స్థానికంగా కలకలంగా మారింది. పరవాడ మండలం తిక్కవానిపాలెంలో ఓ బోరు నుంచి హాట్‌వాటర్‌ వస్తోంది. గ్రామానికి చెందిన  అమ్మోరు అనే మత్స్యకారుడు 6 సంవత్సరాల క్రితం ఇంట్లో బోరు వేయించుకున్నాడు. గత నాలుగు రోజులుగా బోరు నుంచి వేడినీరు వస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్టీపీసీ సంస్థ వ్యర్థజలాలు సముద్రంలో కలిసేలా వేసిన పైప్‌లైన్లు తిక్కవానిపాలెం మీదుగానే ఉంది. దాంతోపాటు గ్రామ చుట్టు పలు కెమికల్‌ పరిశ్రమలు ఉన్నాయి భూగర్భంలోకి వెళుతున్న  కెమికల్స్‌ ఏమైనా బోరు నీటిలో కలుస్తాన్నాయేమో అనే అనుమానం గ్రామస్తుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

19:40 - October 13, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లడం సాధారణ విషయం.  ఇలా వెళ్లే ఉద్యోగులు తమ మాతృసంస్థలో చేస్తున్న పనితో పాటు పొందుతున్న సౌకర్యాలు కూడా దాదాపు ఒకేలా ఉండేలా చూసుకుంటారు. కానీ ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు  డిప్యూటేషన్‌పై వెళ్లిన కార్మికుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అగ్ని మాపక శాఖలో ఆర్టీసీ డ్రైవర్లు పడుతున్న అష్టకష్టాలపై 10 టివి ప్రత్యేక కథనం... 
అగ్ని మాపక శాఖలో డ్రైవర్ల కొరత 
అగ్ని మాపక శాఖలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఈ శాఖ అధికారుల రాత పూర్వక విన్నపం మేరకు ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన డ్రైవర్లు ఇక్కడ ఇమడలేకపోతున్నారు. ఫైర్‌ సర్వీసెస్‌లో పరిస్థితులు  దారుణంగా ఉన్నాయని బాధపడుతున్నారు. 
డిప్యుటేషన్‌పై వెళ్లిన 76 మంది ఆర్టీసీ డ్రైవర్లు 
ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన   95 మంది డ్రైవర్లలో  76 మంది గత ఏడాది మే నుంచి అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే  అగ్నిమాపక శాఖ తమను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి సొంత శాఖలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.  ఆర్టీసీలో ప్రతినెల 5వ తేదీకల్లా జీతాలు పొందిన డ్రైవర్లకు అగ్నిమాపక శాఖలో మాత్రం అవస్థలు తప్పడంలేదు.
భత్యాల చెల్లింపులో కూడా వ్యత్యాసం 
ఆర్టీసీ నుంచి అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన డ్రైవర్లకు జీతాల సమస్యే కాదు.. భత్యాల చెల్లింపులో  కూడా వ్యత్యాసం, వివక్ష చూపుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీతో డిప్యుటేషన్‌ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. సౌకర్యాలు కల్పించడంలేదని సొంత సంస్థకు మొరపెట్టుకుంటున్నారు. 
బస్సులు నడపలేక అధికారులు సతమతం 
డ్రైవర్ల కొరతతో  బస్సులు నడపలేక సంస్థ అధికారులు  సతమతమవుతున్నారు. నిత్యం సర్వీసులు రద్దు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖకు డిప్యుటేషన్‌పై  ఆర్టీసీ డ్రైవర్లను పంపిన సంస్థ ఉన్నతాధికారుల చర్యను కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. అగ్నిమాపక శాఖకు పంపిన  ఆర్టీసీ  డ్రైవర్లను వెంటనే వెనక్కి రపించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

మహిళా న్యాయవాదిపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు

విజయవాడ : మహిళా న్యాయవాది రమణిపై దాడి కేసులో ముగ్గురు నిందితులు బంకా గణేష్, శివ, శ్రీనివాస్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో మహిళా న్యాయవాదిపై దాడి చేశారు. మహిళా న్యాయవాది హత్యకు రూ.లక్షకు ముగ్గురూ డీల్ కుదుర్చుకున్నారు. 

19:18 - October 13, 2017

హైదరాబాద్ : ఉప్పల్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాసేపట్లో అంపైర్లు ఔట్ ఫీల్డ్ ను పరిశీలించనున్నారు. ఉప్పల్ స్టేడియం సిరీస్ విజేతను తేల్చనుంది.

ఆలస్యం కానున్న ఉప్పల్ టీ20 మ్యాచ్

హైదరాబాద్ : ఉప్పల్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాసేపట్లో అంపైర్లు ఔట్ ఫీల్డ్ ను పరిశీలించనున్నారు. ఉప్పల్ స్టేడియం సిరీస్ విజేతను తేల్చనుంది.

నవదంపతులు హత్య కేసులో ముగ్గుర్ని అరెస్టు

రాజన్నసిరిసిల్ల : వేములవాడ మండలం వెంకటాంపల్లిలో నవదంపతులు రచన, హరీష్ హత్య కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. హంతకులు మృతురాలి బంధువులుగా పోలీసులు తేల్చారు. 

 

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల వర్షం పడింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షం కురిసింది. 

ఈనెల 23 లేదా 25 నుంచి టీ.అసెంబ్లీ సమావేశాలు ?

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు టీప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 లేదా 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సమయం కోరితే సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పేకాటపై పీడీ యాక్టు చట్టం తీసుకొస్తామని చెప్పారు. 

18:59 - October 13, 2017

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ మరోసారి అల్లర్లతో అట్టుడుకింది. ఇవాళ ఉదయం జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్‌ అధికారితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. గూర్ఖాల్యాండ్‌ జనముక్తి మోర్చా ప్రెసిడెంట్ బీమల్ గురంగ్ లెప్పా బస్తీలో దాగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసేందుకు పోలీసులు ఉదయం ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిజెఎం కార్యకర్తలు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఉదయం కొన్నిగంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎస్‌ఐ అమితాబ్‌ ముల్లిక్‌ మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఆటోమెటిక్‌ రైఫిళ్లతో పాటు కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డార్జిలింగ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ ఇటీవల భారీ ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న కారణంతో జిజెఎం నేత బిమల్‌ గురంగ్‌పై ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

 

18:48 - October 13, 2017

కరీంనగర్‌ : జననీ జన్మభూమిశ్చ అన్నారు. పుట్టిన ఊరిపై మమకారం అంత తేలిగ్గా వదిలేది కాదు. అందుకే కొంతమంది.. తాము ఎదిగిన కొద్దీ.. కన్నతల్లిలాంటి సొంతూరికి కాస్తో కూస్తో సేవ చేసి రుణం తీర్చుకుంటుంటారు. ఈ కోవకే చెందుతారు.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రభాకరరావు. సొంతూరికే కాదు.. చుట్టుపక్కలున్న పల్లెల అవసరాలూ తీరుస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోన్న ప్రభాకరరరావుపై 10 టీవీ ప్రత్యేక కథనం.

ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు వీర్ల ప్రభాకర్‌రావు. ఉండేది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచెల గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామానికి వెళ్లాలంటే సరైన రోడ్డు కూడా ఉండేది. సాయంత్రం గ్రామంలో కనీసం వీధి దీపాలు కూడా లేకుండా అంతా అంధకారమే. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధి కుంటుపడిపోయింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది చూసిన ప్రభాకర్‌ రావు గ్రామాభివృద్ధిక కంకణం కట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులను ఈ పెద్దాయన చేస్తూ నేటి యువతకి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రామస్తులకు ఏమి కావాలో ముందుగానే గుర్తించి వాటిని తీర్చడంలోనే తృప్తి చెందుతుంటారు ప్రభాకర్ రావు. 2014లో  నెల రోజుల పాటు నిపుణులైన వైద్యులతో హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత కోసం సిసి కెమెరాల ఏర్పాటు కోసం తన వంతు కృషిచేశారు. మంచి నీటి కోసం గ్రామస్థులు పడుతున్న బాధలను చూడలేక స్వంత నిధులతో బోర్లువేయించి శుద్ధ జలం కోసం ప్లాంట్‌ లను వేయించారు. రైతుల కోసం మండలంలో 50 లక్షల నిధులతో రామడుగు సహకార సంఘం భవన నిర్మాణం చేసి రైతులకు అంకితం చేశారు. అలాగే పొరుగు గ్రామాలైన షా నగర్‌, కుక్కెరకుంట, గోపాల్‌ రావు పేట, వెదిరతో పాటు మొత్తం 22గ్రామాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తరించారు.

గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం చేయడంతో పాటు నూతన దేవాలయాలను కట్టించారు ప్రభాకరరావు. అంతే కాకుండా చిన్నజీయర్‌ స్వామి సూచనలతో కరీంనగర్ పట్టణంలో కూడా వేద భవనాన్ని నిర్మంపజేశారు. 

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రతి యేటా పుస్తకాలను పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకుంటారు ప్రభాకరరావు. విద్యే అభివృద్ధికి ఏకైక మార్గం అని భావించడం వల్లే.. పేద విద్యార్థులకు తనవంతు సహయసహకారాలు అందిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. ప్రతిపలం ఆశించకుండా గ్రామలను తనవంతుగా తీర్చిదిద్దుతు ప్రజా సేవకుడిగా ప్రజల మన్ననలను పొందుతున్నారు. తండ్రి ఆశయాల బాటలోనే తను కూడా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ప్రభాకరరావు. 

18:44 - October 13, 2017

సిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్‌ పట్టణం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు.  ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. మూడు కళాశాలల్లోని 500 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులకు ఆహారాన్నందించే ఈ పథకాన్ని  కరీంనగర్‌ ఎంపి వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీ కోరారు. పేద విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ చేపట్టిన మధ్యాహ్న భోజన పథకంను విద్యార్థులతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు.  

 

18:42 - October 13, 2017

కరీంనగర్‌ : జిల్లాలో కాషాయదళం దాష్టీకానికి తెగబడింది. జిల్లా కేంద్రంలోని సీపీఎం, సీఐటీయూ కార్యాలయాలపైకి దాడికి తరలివచ్చింది. వామపక్ష కార్యాలయాల ముట్టడికి సంఘ్‌ శ్రేణులు యత్నించడం ఉద్రిక్తానికి దారి తీసింది. పరివార్‌ దుర్మార్గ చర్యకు నిరసనగా.. సీపీఎం, సీఐటీయూ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యల నేపథ్యంలో.. పోలీసులు, వామపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరివార్‌ చర్యల కారణంగా.. కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో వామపక్ష కార్యకర్తలపైనే దాడులు చేస్తూ.. కాషాయదళం.. దానికి భిన్నంగా ప్రచారం చేస్తూ.. సీపీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వామపక్ష పార్టీల నేతలు వివరించారు. బీజేపీ శ్రేణుల చర్యను సీపీఎం నేతలు ఖండించారు. బీజేపీ శ్రేణుల దాడులను ఎదుర్కొంటామని సీపీఎం, సీఐటీయూ నేతలు తెలిపారు.  

 

18:27 - October 13, 2017

ఆదిలాబాద్ : గిరిజనుల హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని ఆదివాసి నేత సోయం బాబూరావు అన్నారు. తమ సంస్కృతిపై, హక్కులపై అధికారులు దాడి చేసే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం జరిగితే ఎన్నిపోరాటాలకైనా సిద్ధమంటున్న సోయం బాబూరావుతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. అధికారులు గిరిజనేతరులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. 

 

18:24 - October 13, 2017

హైదరాబాద్ : లక్ష మంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డొచ్చినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టి తీరుతామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్లో అభద్రత కనిపిస్తుందన్నారు కాంగ్రెస్‌ నేత మల్లు రవి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే కేసీఆర్‌కు... లక్ష మందిలా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 80 నుంచి 90 శాతం కట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.
 

18:21 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 లేదా 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సమావేశ తేదీలను రేపటిలోగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. వివిధ అంశాలపై చర్చతో పాటు వివిధ బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. 8కిపైగా బిల్లులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పీడీ చట్ట సవరణ, గేమింగ్‌ చట్ట సవరణ తదితర బిల్లులు ఇందులో ఉండనున్నాయి. ముస్లిం బాలికలతో అరబ్‌ షేక్‌ల వివాహాలు, ఖాజీల కట్టడి కోసం చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు విపక్షాలు సమయం కోరితే గడువు పెంచేందుకు కూడా సిద్ధమని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 

 

18:14 - October 13, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులకు మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. అందులో భాగంగా మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. రైల్వేశాఖకు చెందిన ఆర్ డీఎస్ వో ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ టెస్ట్‌ రన్‌ కొనసాగుతోంది. సేఫ్టీ అధికారులు పరిశీలించి... సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత మెట్రో పట్టాలెక్కనుంది. 

 

18:13 - October 13, 2017

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ కేసు విచారణ ముగిసింది. నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో... ఆరు నెలలపాటు... ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయించాలని జగన్‌ కోరారు. దీనిపై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్టు సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 10 అడుగుల మేర 3 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు.

17:19 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు టీప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 లేదా 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సమయం కోరితే సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పేకాటపై పీడీ యాక్టు చట్టం తీసుకొస్తామని చెప్పారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16 నుంచి పత్తి, 20 నుంచి సోయాబీన్ కొనుగోలు :హరీష్

హైదరాబాద్: మినుములు, పెసలు, సోయాబీన్ అమ్మకాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈనెల 16 నుంచి పత్తి, 20 నుంచి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచాలని హరీష్ రావు ఆదేశించారు.

'కలాం జయంతి సందర్భంగా విద్యార్థులకు ప్రతిభ అవార్డులు'

అమరావతి: 15న కలాం జయంతి సందర్భంగా విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. మొత్తం 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డు ఇవ్వనున్నామని, విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం సీరియస్ గా ఉన్నారని పేర్కొన్నారు. 16న అన్ని ప్రైవేటు కాలేజీలతో సమావేశం కానున్నామని, నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇంటర్ బోర్డ్ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదే అని గంటా స్పష్టం చేశారు.

ప్రధానితో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : ప్రధాని మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగురాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

లారీ- జీపు ఢీ:నలుగురి మృతి

తిరుపతి: శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ- జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు తమిళనాడు వాసులుగా అని సమాచారం.

జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు.. జగన్ పాదయాత్ర నేపథ్యంలో 6 నెలల పాటు కొర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ పిటిషన్ పై 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

16:41 - October 13, 2017

నాగాలాండ్ లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

హైదరాబాద్: నాగాలాండ్ లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్ ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

16:30 - October 13, 2017

విజయవాడ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీ వర్కర్లు విజయవాడ అలంకార్ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు పాల్గొన్నారు.  ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామంటున్న హమాలీ కార్మికులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:27 - October 13, 2017

హైదరాబాద్ : కొమ్రంభీం జిల్లా స్మారక మ్యూజియంలో గిరిజన తెగల మధ్య వచ్చిన తగాదాను సామరస్యంగా పరిష్కరించకుండా ప్రభుత్వం ఘర్షణను పెంచే విధంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆదివాసీలపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే ప్రభుత్వం రెండు తెగల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించి ఆదివాసీ గిరిజనుల మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

 

పీఎస్ ఎదుట నిందితుడు ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ : ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ ఎదుట ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన నిందితుడిని పోలీసులు గమనించి.. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిమాండ్‌కు తరలించే విషయంలో నిందితుడు రామచంద్రారెడ్డి.. పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. అంకుషాపూర్‌కు చెందిన రామచంద్రారెడ్డిపై చెల్లని చెక్ కేసు నమోదైంది.

16:23 - October 13, 2017

కరీంనగర్‌ : జిల్లాలో కాషాయదళం దాష్టీకానికి తెగబడింది. జిల్లా కేంద్రంలోని సీపీఎం, సీఐటీయూ కార్యాలయాలపైకి దాడికి తరలివచ్చింది. వామపక్ష కార్యాలయాల ముట్టడికి సంఘ్‌ శ్రేణులు యత్నించడం ఉద్రిక్తానికి దారి తీసింది. పరివార్‌ దుర్మార్గ చర్యకు నిరసనగా.. సీపీఎం, సీఐటీయూ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యల నేపథ్యంలో.. పోలీసులు, వామపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పరివార్‌ చర్యల కారణంగా.. కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో వామపక్ష కార్యకర్తలపైనే దాడులు చేస్తూ.. కాషాయదళం.. దానికి భిన్నంగా ప్రచారం చేస్తూ.. సీపీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వామపక్ష పార్టీల నేతలు వివరించారు. బీజేపీ శ్రేణుల చర్యను సీపీఎం నేతలు ఖండించారు.

 

16:21 - October 13, 2017

నల్గొండ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. శ్రీశైలం నుంచి నీరు వదలడంతో.. సాగర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలంప్రాజెక్టు నుంచి లక్షా ముప్పైవేల క్యూసెక్కుల నీరు వస్తోంది.  సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం  532.60 అడుగులకు చేరుకుంది.  జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 173 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ  ప్రాంతాల నుంచి ప్రవాహం కొనసాగితో మరికొద్ది రోజుల్లో సాగర్‌ నిండుకుండలా మారుతుందని ఇరిగేషన్‌ అధికారులు  అంటున్నారు. ప్రాజెక్టుకు జలకళ వస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

 

16:18 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని హంద్రీవాగులో యువకుడు గల్లంతయ్యాడు. కర్నూలు బుధవారపేటకు చెందిన తిమ్మప్ప వాగులో పడి కనిపించకుండా పోయాడు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:13 - October 13, 2017

ఢిల్లీ : కేరళలోని ప్రముఖ క్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు బదిలీ చేసింది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం మహిళల ప్రవేశానికి సంబంధించి పలు సందేహాలను లేవనెత్తింది. 'మహిళలు ప్రవేశించకుండా ఆలయం అడ్డుకోగలదా?' 'ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకుంటే వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా?' తదితర అంశాలపై రాజ్యాంగ ధర్మాసనం చర్చించాలని ముగ్గురు జడ్జిల బెంచ్‌ నిర్ణయించింది. శబరిమల అంశంపై ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే తీర్పును ఇవ్వగలదని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

 

16:10 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోకల్‌ క్యాండిడేట్లకు న్యాయం జరిగేలా మార్పులు, చేర్పులు చేసే విషయమై.. సీఎం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎన్ని జోన్లు, క్యాడర్‌లు ఉండాలనే విషయమై.. చర్చించినట్లు చెప్పారు. అక్టోబర్‌ 21న ఈ విషయమై పూర్తి సమాచారంతో సమావేశమవుతామని స్పష్టం చేశారు. 

 

పెద్దమొత్తంలో కల్తీ వంటనూనె స్వాధీనం...

హైదరాబాద్ : పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పురానాపుల్‌లో పెద్దమొత్తంలో కల్తీ వంటనూనెను పోలీసులు సీజ్ చేశారు. నిర్వాహకులు శ్యాంసుందర్ లోయతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాతబస్తీలో మరోచోట.. చక్కెర, బెల్లంతో తేనే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 50 కిలోల కల్తీ తేనేను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఒకరిని అరెస్టు చేశారు. ఈ రెండు కేంద్రాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకే జగన్‌ పాదయాత్ర'

కడప: కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, జగన్‌ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్లు నడిచినా వైసీపీ ఉండదని జోస్యం చెప్పారు. జనవరి 1నుంచి జన్మభూమి కమిటీల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

చిత్తూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న చెరువులు

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా వాగులూ, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. తవనంపల్లి వద్ద ఉధృతంగా బహుదా నది ప్రవహిస్తోంది. బోయపల్లి వద్ద డ్యామ్ కొట్టుకుపోయింది. కుప్పం వద్ద పాలారు నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో వాణియుంబాడి బ్రిడ్జ్ దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

16:04 - October 13, 2017
16:01 - October 13, 2017

మహిళా వార్తల సమాహారం మావని న్యూస్. స్త్రీవాదాన్ని ఎక్కువగా నమ్ముతున్న కెనడా ప్రధాని, తమిళనాడులో ఆదివాసీల విచిత్ర సాంప్రదాయం, చైనా సైనికులకు నిర్మలా సీతారామన్ పాఠాలు, అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణ, మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే అన్న సుప్రీంకోర్టు, సౌదీలో మహిళ దారుణ పరిస్థితి, చదువుకుంటే ఏదైనా సాధించవచ్చంటున్న రకుల్ ప్రీత్ సింగ్, అభంశుభం తెలియని ఆడపిల్లలతో అరబ్ షేక్ ల వివాహాలు.. వంటి పలు అంశాలను మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం..

 

ఈనెల 23 లేదా 25 నుంచి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు..!

హైదరాబాద్: ఈనెల 23 లేదా 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజా సమస్యల చర్చలకు ప్రతిపక్షాలు సమయం కోరితే సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేకాటపై పీడీయాక్టు చట్టం తీసుకువస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 250 పాయింట్లు లాభపడి 32,432 వద్ద సెన్సెక్స్, 71 పాయింట్లు లాభపడి10,167 వద్ద నిఫ్టీ ముగిసింది.

15:52 - October 13, 2017

విశాఖ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు దీపావళిని  ఆనందంగా జరుపుకోవాలని విశాఖ స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణారెడ్డి అన్నారు. టపాసులు లేకుండా కేవలం దీపాలతో దీపావళి జరుపుకోవాలన్నారు. బాణసంచా కాలుష్యంతో ప్రజలు ఆనారోగ్యానికి గురౌతున్నారని అన్నారు. పూర్వం దీపారాధనతో దీపావళి జరిగేదని.. ఇప్పుడు పోటా పోటీగా టపాసులు కాల్చుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని అన్నారు. ప్రజల్లో చైత్యనం తీసుకొచ్చేందుకు 16వ తేదీన విశాఖ ఆర్కేబీచ్ వద్ద ఆనంద దీపావళి ఆకాశ దీపారాధన పేరుతో స్కై దీపాలు వదలతామని చెప్పారు. 

15:50 - October 13, 2017

హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాన్న ఆరోపణలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఖండించారు. డిగ్రీ అడ్మిషన్‌ల ప్రాసెస్‌లో ఎక్కడా తప్పులు జరగలేదన్నారు. అందరికీ అవకాశం కల్పించాలన్ని ఉద్దేశంతోనే  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం మూడుసార్లు అవకాశం ఇచ్చామన్నారు. ఎవరైన విద్యార్థులకు సీట్లు రాలేదంటే అది వారి పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌తోనే అయి ఉంటుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు.  

కూంబింగ్‌లో భాగంగా నక్సల్స్ డంప్‌ను స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్ జిల్లాలో పోలీసు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో భాగంగా నక్సల్స్ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, భారీ మొత్తంలో మెడిసిన్స్, తెల్ల కాగితాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

15:48 - October 13, 2017

గుంటూరు : వరల్డ్‌ ఎగ్‌ డే సందర్భంగా వెంకటరమణ పౌల్ట్రీస్‌ ఆధ్వర్యంలో గుంటూరులో కోడిగుడ్ల పంపిణీ జరిగింది. సంస్ధ డైరెక్టర్‌ మాధవీలతతోపాటు పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడిగుడ్లలో ఉండే పోషక విలువలను వైద్యులు వివరించారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం...

 

15:45 - October 13, 2017

అసిఫాబాద్ : జోడేఘాట్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఆదివాసీల పోరు మరింత ముదురుతోంది. తమ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు నిరసనకు దిగారు. తమ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోడేఘాట్‌లో విగ్రహాల ధ్వంసంపై ఆదివాసీలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులకు నిరసనగా ఆసిఫాబాద్‌లో వందలాది మంది ఆదివాసీలు   సమావేశం అయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నాసాకు ఎంపికైన వరంగల్ విద్యార్థులు...

హైదరాబాద్: నాసా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్‌కు తెలంగాణ విద్యార్థి బృందం ఎంపికైంది. చంద్రుని ఉపరితలంపై ప్రయాణించే రోవర్‌ను తయారుచేసే ఈ పోటీకి వరంగల్‌లోని ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థుల బృందం ఎంపికైంది.

15:40 - October 13, 2017

తూర్పుగోదావరి : జగన్‌ ప్రతిపక్ష నాయుకుడిగా ఉండటం మా అదృష్టమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జగన్‌ తలకిందులుగా తపస్సుచేసినా జగన్‌ను ప్రజలను నమ్మరని చెప్పారు. జగన్‌.. తన వికృత ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. 

 

15:36 - October 13, 2017

ఢిల్లీ : హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్ డీఏ ప్రభుత్వం నిర్లక్ష వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారు తీరును వినోద్‌ ఖండించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  ఈ రెండు అంశాలపై ఎన్ డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.  ఖమ్మం జిల్లాలోని ఏడు మండలను ఏపీలో కలుపుతూ రాజకీయ నిర్ణయం తీనున్న మోదీ సర్కారు... హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎందుకు తీసుకోవడంలేదని వినోద్‌ ప్రశ్నించారు. 

15:22 - October 13, 2017

కరీంనగర్‌ : బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల ఆకృత్యాలు, ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. విచక్షణారాహిత్యంగా సీపీఎం పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు సీపీఎం, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలపై దాడులకు చేస్తున్నారు. విశాఖ సీపీఎం ఆఫీస్, ఢిల్లీలోని సీపీఎం జాతీయ కార్యాలయం, హైదరాబాద్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ లపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు డాడికి యత్నించారు. తాజాగా కరీంనగర్ లో కాషాయదళం దాష్టీకానికి తెగబడింది. జిల్లా కేంద్రంలోని సీపీఎం, సీఐటీయూ కార్యాలయాలపైకి దాడికి తరలివచ్చింది. వామపక్ష కార్యాలయాల ముట్టడికి సంఘ్‌ శ్రేణులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పరివార్‌ దుర్మార్గ చర్యకు నిరసనగా.. సీపీఎం, సీఐటీయూ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యల నేపథ్యంలో.. పోలీసులు, వామపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరివార్‌ చర్యల కారణంగా.. కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో వామపక్ష కార్యకర్తలపైనే దాడులు చేస్తూ.. కాషాయదళం.. దానికి భిన్నంగా ప్రచారం చేస్తూ.. సీపీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వామపక్ష పార్టీల నేతలు వివరించారు. కేరళలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని నేతలు పేర్కొన్నారు. బీజేపీ శ్రేణుల చర్యను సీపీఎం నేతలు ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

పరిపూర్ణానందస్వామి వ్యాఖ్యలపై క్రిస్టియన్ జేఏసీ ఆగ్రహం

విశాఖ: పరిపూర్ణానందస్వామి వ్యాఖ్యలపై క్రిస్టియన్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వామిజీ క్రైస్తవుల మనోభావాలను కించపర్చడం సరికాదన్నారు. పెద్దమనసుతో పరిపూర్ణానందస్వామిజీని క్షమిస్తున్నామని చెప్పారు. సమాజానికి ఉపయోగకరమైన పనులు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ నెల 17న భారీ ర్యాలీ నిర్వహిస్తాని క్రిస్టియన్‌ జేఏసీ తెలిపింది.

సమతుల్య విధానాన్ని అనుసరించాలి: సుప్రీం

ఢిల్లీ:మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రొహింగ్యాలను తిరిగి పంపించేయవద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. రొహింగ్యాలలో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, వారిపట్ల మానవతావాదంతో వ్యవహరించాలని చెప్పింది. సమతుల్య విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెల 21న జరుగుతుందని తెలిపింది.

'మతం రంగు పులమడం బాధాకరం'

ఢిల్లీ: బాణసంచా నిషేధానికి మతం రంగు పులమడం బాధాకరంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని నివారించేందుకు దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు కావాలనే హిందువుల పండగలను లక్ష్యంగా చేసుకొని ఈ నిషేధం విధించినట్లు వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. నిషేధం విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే యోచన లేదని స్పష్టం చేసింది.

జోనల్ వ్యవస్థపై ప్రాథమికంగా సమావేశం: కడియం..

హైదరాబాద్: జోనల్ వ్యవస్థపై ప్రాథమికంగా సమావేశం అయ్యామని డిప్యూటీ సీఎం కడియం అన్నారు. ఏపీ రీ ఆర్గనైజింగ్ చట్ట ప్రకారం ఆర్టికల్ 371(డి) అమల్లో ఉందని రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వర్తిస్థాయని పేర్కొన్నారు. ఈ రెండు అమలు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామన్నారు. స్థానికత అభ్యర్థుల హక్కులు రక్షించేలా దృష్టి సారించామన్నారు. రాష్ట్ర విభజన కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త జోన్లు ఉండాలన్న ఆలోచన ఉందన్నారు. వీలైనంత త్వరంగా జోనల్ వ్యవస్థ సవరణకు కసరత్తు పూర్తి చేస్తామన్నారు.

ఎస్ కేవీ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అనంతపురం: గుంతకల్లులో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులు తాళలేక ఎస్ కేవీ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తరగతి గదిలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

13:37 - October 13, 2017

వరంగల్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి అడవిలో  ట్రైక్కింగ్ లో పాల్గొన్నారు. ఆమెతో పాటు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు.

రాంవిలాస్ ను కలిసిన ఈటెల రాజేందర్, వినోద్

ఢిల్లీ : కేంద్రమంత్రి రాంవిలాస్ ను తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వినోద్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేంద్ర పౌరసరఫరా శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1660 కోట్లు త్వరగా కేటాయించాలని కోరినట్లు ఈటెల తెలిపారు.

13:32 - October 13, 2017

నిడమానూరు చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత

కృష్ణా: నిడమానూరు చైతన్య కళాశాల వద్ద ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకు తల్తిదండ్రులను, ఓవిద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేశారు.

13:29 - October 13, 2017
13:26 - October 13, 2017

ఢిల్లీ : తెలగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకంపై సుప్రీం తన వ్యాఖ్యలను వెలువరించింది. ఈ పుస్తకాన్ని నిషేధించడం సాధ్యం కాదని, పుస్తకాన్ని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకున్నట్టే అని సుప్రీం అభిప్రాయపడింది. రచయతకు చట్టపరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పషం చేసింది. కంచె ఐలయ్య రాసిన పుస్తకంలోని అంశాలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:18 - October 13, 2017

ప్రకాశం : మరో జవాన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పిచి భారతమాత నెత్తుటిపై నెత్తుటి తిలకం దిద్దాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబుళాపురానికి చెందిన రామకృష్ణా రెడ్డి దుండగల్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తుండగా పాక్ సైన్యం కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు విషాదంలో మునిపోయారు. తన కొడుకు 120 కోట్ల మంది కోసం ప్రాణాలర్పించిన అమరుడుని రామకృష్ణారెడ్డి తండ్రి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:16 - October 13, 2017

కర్నూలు : జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి వీరు మృతి చెందారు. మృతుల్లో సుధాకర్, మద్దమ్మ, ప్రవల్లిక, షుకూర్ మియా ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానకి చెందిన వారు ముగ్గురున్నారు. గాయపడ్డవారిని కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడయో చూడండి.

సుప్రీం కోర్టు నా పుస్తకాన్ని సమర్ధించినట్లే :ఐలయ్య

ఢిల్లీ: కంచ ఐలయ్య పుస్తక వివాదం సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఐలయ్య పుస్తక శీర్షి, అందులోని అంశాలు ఒక వర్గాన్ని కించపరిచేలా, సమాజంలో అలజడి సృష్టించే ఉన్నాయని వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీం ను ఆశ్రయించారు. పుస్తకాన్ని నిషేధించడం, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్లేనని సుప్రీం వ్యాఖ్యానించింది. రచయితకు చట్టపరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

13:11 - October 13, 2017

గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఈసీ వైఖరి ఏంటీ ? డిసెంబర్ 18 లోగా ఎన్నికలుంటాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటీ ? దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టంగా ఎన్నిక తేదీలను ప్రకటించింది. కానీ గుజరాత్ రాష్ట్ర విషయానికి వచ్చే సరికి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనితో ఈసీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పీఎం మోడీ పర్యటన ఉండడం..అక్కడ వరాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, ఇప్పుడు తేదీలు ప్రకటిస్తే వరాలు కురిపించే అవకాశం ఉండదని..ఇది అందరకీ అర్థమయ్యే విషయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ విషయంలో ఎన్నికలను దృష్టి పెట్టుకుని వరాలు ప్రకటించడం..జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరి అందులో భాగమేనని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంపై ప్రభావం చూపే వాటిపై తగ్గించారనే విమర్శలున్నాయి. పేరుకు స్వతంత్ర సంస్థలుగా ఉంచడం...ఆచరణకు వచ్చే వరకు ప్రభుత్వం పావులుగా వాడుకోవడం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం ఉండడం దురదృష్టకరమని ఆరోపిస్తున్నారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో 150 ఎమ్మెల్యేల బలం పెంచుకోవాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ప్రస్తుతం నోట్ల రద్దు..జీఎస్టీ..తదితర అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ స్వస్థలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం...2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు వస్తుండడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆ రాష్ట్రంలో పార్టీకి పలు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

మరి గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? అక్కడ మోడీ వరాలు కురిపిస్తారా ? లేదా? అనేది వేచి చూడాలి. 

21న నారాయణ గూడలో సదర్ ఉత్సవాలు: మంత్రి తలసాని

హైదరాబాద్: సదర్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. 21వ తేదీన నారాయణ గూడలో ప్రభుత్వం తరపున సదర్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీపీఎం కార్యాలయ ముట్టడికి యత్నించిన ఆర్ ఎస్ ఎస్, బిజెపి

కరీంనగర్ : సీపీఎం, సిఐటీయూ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం కార్యాలయం ముట్టడికి బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నేతలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు.

కర్నూలు జిల్లాలో విషాదం...

కర్నూలు :సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు తమ పంట పొలానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు రాకుండా పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్తు సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను సుకూర్‌ భాషా(35), ఉప్పరి సుధాకర్‌(20), ప్రవల్లిక(11), మద్దమ్మ(70)లుగా గుర్తించారు. గాయాలపాలైన మద్దమ్మ మనవరాలు రజితను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.

'అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో బిజెపి రాజకీయం చేస్తోంది'

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరని ఎంపి వినోద్ ఖండించారు. రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపును బిజెపి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో బిజెపి రాజకీయం చేస్తోందని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో హైకోర్టు ఏర్పాటు, అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెబితేనే హైకోర్టు పెడతాననడం తగదని వినోద్ అన్నారు.

12:24 - October 13, 2017

 

కర్నూలు : నగరంలో ఆనంద్ సినీ కాంప్లెక్స్ దగ్గర వక్కెర వాగు ప్రహిస్తుండడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పాటి రాకపోకలకు ఇబ్బంది ఎదురౌతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయం

12:11 - October 13, 2017

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ముట్టడించారు. డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల జీవితలతో అడుకోవద్దంటూ వెంటనే విద్యార్థులకు అడ్మిసన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:06 - October 13, 2017

 

విశాఖ : జిల్లా పాతపెందుర్తిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టిచంపాడు. భార్యతో గొడవపడి ఆవేశంతో క్రికెట్ బ్యాట్ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ ఎఫ్ఐ

హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఎస్ ఎఫ్ఐ కార్యకర్తలుముట్టడించారు. డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేపట్టారు.

మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు

వరంగల్: నర్సంపేట మండలం జీడయ్యపల్లిలో మద్యం సేవించిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో సహ ఉపాధ్యాయులపై అనుచితంగా ప్రవర్తించండంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12:00 - October 13, 2017

రకూల్ ప్రీత్ సింగ్..ఓ సామాజిక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూన్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన మంత్రి తలపెట్టిన 'భేటీ బచావో..భేటీ పడావో' కార్యక్రమానికి తెలంగాణ తరపు నుండి కేసీఆర్ ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించింది.

సామాజిక అభివృద్ధి పట్ల...స్త్రీల పురోగతి అంశంలో ఎక్కువగా 'రకూల్ ప్రీత్ సింగ్' శ్రద్ధ చూపుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల సంతోషంగా ఉందని 'రకూల్' పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో తాను కూడా ఒక భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

రకూల్ ప్రీత్ సింగ్ తమిళ..కన్నడ..హిందీ..తెలుగు భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. జయ జానకి నాయక..రారండోయ్ వేడుక చూద్దాం..విన్నర్..ధృవ..సరైనోడు..నాన్నకు ప్రేమతో...బ్రూస్ లీ..కిక్-2..పండుగ చేసుకో..రన్..కరెంటు తీగ..లౌక్యం..వెంకటాద్రి ఎక్స్ ప్రెస్..తదితర చిత్రాల్లో 'రకూల్ ప్రీత్ సింగ్' నటించింది. ఇటీవలే వచ్చిన 'స్పైడర్' సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. 'కార్తీ' సరసన 'ఖాకీ'లో..తీరన్..అదిగరం ఒంద్రు..జయత్ జంత్రి సినిమాలో 'రకూల్' నటిస్తోంది.

బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చితే కఠినచర్యలు:సీపీ

హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా నగర కమిషన రేట్‌ పరిధిలో మూడు రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మహేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు.

బాలల హక్కుల కమిషన్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైయ్యింది. బాలల హక్కుల కమిషన్ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ సభ్యుల నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. నియామక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరగిందన్న పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

'కార్పొరేట్ కళాశాలల్లో తరచూ ఆత్మహత్యలు దురదృష్టకరం'

విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్న గంటా ఘటనపై ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మీడియట్ కమిషనర్ ను విచారణకు ఆదేశించామని, కార్పొరేట్ కళాశాలల్లో తరచూ ఆత్మహత్యలు దురదృష్టకరమన్నారు. 16న జరిగే సమావేశంలో కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని, ఆదేశాలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రిగంటా హెచ్చరించారు.

11:35 - October 13, 2017

 

హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్‌ మరోసారి తడిసి ముద్దైంది. గురువారం సాయంత్రం వరకు ప్రశాంతంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకుని.. ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. జోరు వానకు సిటీ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గంటసేపు కురిసిన కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి.

గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం
పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీలో అత్యధికంగా గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మౌలాలిలో 4.9 సెం.మీ., అంబర్‌పేటలో 3.9 సెం.మీ., కాప్రాలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అటు మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ సహా ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆగిపోయి వాహనదారులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగినా పరిస్థితిని చక్కదిద్దలేక చేతులెత్తేశారు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్న వాహనదారులు నానా అవస్థలు పడి ఇళ్లకు చేరుకున్నారు.

మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
నాంపల్లి తాజ్‌ ఐల్యాండ్‌, అఫ్జల్‌గంజ్‌ నుంచి కేంద్ర గ్రంథాలయం వరకూ 3 అడుగల మేర నీళ్లు నిండిపోవడంతో ఆర్టీసీ బస్సులు, సిటీబస్సులు రెండువైపులా భారీగా నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌లోని బాంబే హోటల్‌, లక్కీ టర్నింగ్‌ వద్ద ద్విచక్రవాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గంటవ్యవధిలోనే కుండపోత వర్షానికి సిటీలో దాదాపు 200లకు పైగా కాలనీలను వర్షపునీరు ముంచెత్తింది. మలక్‌పేట, సంతోష్‌నగర్‌, సైదాబాద్‌ ప్రాంతాల్లో వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చేరింది. పాతబస్తీలో కొన్నిచోట్ల మూడడుగుల ఎత్తు నీరు ప్రవహించింది. మీరాలం మండిని వరద ముంచెత్తింది. సోమాజీగూడ యశోద ఆస్పత్రి ఏరియా, నారాయణగూడ, సికింద్రాబాద్‌లలో నాలాలకు సమీపంలోని ఇళ్లల్లోకి నీరు వెళ్లడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇదిలావుంటే మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనానికి తోడు విదర్భ, కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, మరాట్వాడా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.

ప్రకాశం జిల్లా ఎరజెర్లలో విషాదం

ప్రకాశం: టంగుటూరు మండలం ఎరజెర్లలో విషాదం నెలకొంది. ఎన్ ఎస్ పీ కెనాల్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

11:31 - October 13, 2017

 

వరంగల్ : జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. బాలసముద్రంలోని డ్రైనేజీలో.. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును పడేశారు. కాళోజీ కళాక్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న సుబేదారి పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

11:29 - October 13, 2017

 

వరంగల్ : జిల్లా వర్దన్నపేట మండలం డీసీ తండాలో క్షుద్రపూజల కలకలం రేగింది. పెళ్లై నాలుగేళ్లయినా పిల్లలు పుట్టలేదని ఓ మహిళ మంత్రగాళ్లను ఆశ్రయించింది. ఇల్లంద గ్రామానికి చెందిన మంత్రగాడు జనార్ధన్ మహిళ అమాయకత్వన్ని ఆసరాగా చేసుకుని క్షుద్రపూజలు చేస్తే పిల్లలు పుడతారంటూ వర్దన్న పేట ఆకేరువాడు దగ్గర పూజలు ప్రారంభించాడు. అది చూసిన గామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మంత్రగాడిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

హెచ్ సీయూ లో ఈతకు దిగి విద్యార్థి మృతి

హైదరాబాద్‌ : హెచ్ సీయూ (హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయం)లో ఓ విద్యార్థి నీటి కుంటలో ఈతకు దిగి మృతి చెందాడు. బంగాల్‌కు చెందిన ఆకాశ్‌ సేన్‌ గుప్త హెచ్‌సీయూలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తోటి స్నేహితులతో కలిసి యూనివర్సిటీలో ఉన్న నీటికుంటలో నిన్న రాత్రి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు, హెచ్‌సీయూ సిబ్బంది అతన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

11:16 - October 13, 2017

 

హైదరాబాద్ : నగరంలోని మైత్రీవనంలో మృతదేహం కలకలం సృష్టించింది. మైత్రీవనంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచాం కోసం వీడియో చూడండి.

జగన్ పిటిషన్ సీబీఐ కౌంటర్ దాఖలు

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు అందుకుంటున్న వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్నందున ప్రతి శుక్రవారం విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపివ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

బాణసంచా తయారీలో పేలుడు.. ఇద్దరి మృతి

యూపీ:రాష్ట్రంలోని హర్డువాగంజ్‌లోని ఓ ఇంట్లో బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో బాణసంచా తయారు చేస్తున్న ఓ మహిళ, ఆమె కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

నేడు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ట్రేడవుతున్నాయి. 211 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 32,393 పాయింట్ల వద్ద, 43 పాయింట్ల వద్ద లాభపడిన నిఫ్టీ 10,139 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మహిళలతో అర్ధనగ్న పూజలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

వరంగల్:వర్ధన్న పేటలో దారుణం జరిగింది. ఎన్ ఆర్ ఎస్పీ కెనాల్ వద్ద మహిళలతో క్షుద్రపూజలు చేయిస్తున్నారు. పిల్లలు పుట్టనివారితో అర్ధనగ్న పూజలు చేస్తున్న వ్యక్తి, మహిళను మోసం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రెక్కింగ్ క్యాంప్ లో కలెక్టర్ ఆమ్రపాలి

వరంగల్ రూరల్ : ధర్మసాగర్ మండలం దేవనూర్ గ్రామంలో నిర్వహించిన ట్రెక్కింగ్ క్యాంప్ లో కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఇనుపరాతి గుట్టలపై ఏర్పాటు చేసిన వాక్ లో వరంగల్ నిట్ విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10:47 - October 13, 2017

 

హైదరాబాద్ : కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విన్నవించనున్నాడు. 6నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరునట్టు తెలుస్తోంది. సీబీఐ కోర్టు కాసేపట్లో ఈ పిటిషన్ విచారించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:46 - October 13, 2017

 

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యమయ్యాడు. గత మూడు రోజులుగా సాత్విక్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదు. సాత్విక్ ఘట్ కేసర్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగుడకు చెందినవారు. పిల్లల చదవు కోసం 5ఏళ్ల క్రితం వారు హైదరాబాద్ వచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఎల్బీనగర్ లో బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యం

హైదరాబాద్: ఎల్బీనగర్ లో బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యం అయ్యాడు. రెండు రోజుల క్రితం సాత్విక్ రెడ్డి అదృశ్యం అయ్యాడు. సాత్విక్ తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో సాత్విక్ రెడ్డిచదువుతున్నాడు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.

పాలారు నదిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు

చిత్తూరు: పాలారు నదిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. నది దాటుతుండగా ముగ్గురు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. వెంకటప్ప అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

డ్రైనేజీలో పసికందు మృతదేహం

వరంగల్ అర్బన్: బాలసముద్రంలో దారుణం జరిగింది. పసికందును గుర్తు తెలియని వ్యక్తులు డ్రైనేజీలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

09:21 - October 13, 2017

 

వనపర్తి : జిల్లా జాగృతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న శివశాంతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివశాంతి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వనపర్తిలో విద్యార్థిని ఆత్మహత్య

 

వనపర్తి : జిల్లా జాగృతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న శివశాంతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివశాంతి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

09:19 - October 13, 2017

 

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆకాశ్ గుప్తా అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన స్నేహితలతో కలిసి యూనివర్శిటీలో చెరువు వద్ద పార్టీ చేసుకున్న ఆకాశ్ గుప్తా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి నీళ్లలో మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు గచ్చిబౌలిలోని కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే ఆకాశ్ చనిపోయినట్లు ధృవీకరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:13 - October 13, 2017

వనపర్తి/ కృష్ణా : రోజు రోజుకు విద్యార్థుల బలన్మరణాలు పెరగుతున్నాయి. వీరి మరణానికి కాలేజీల వేధింపులేనా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నో అశలతో తల్లిండ్రులు తమ పిల్లలను చదుకొమ్మని పంపిస్తున్నారు. కానీ వారు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నిడమానూరు చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతన్న భార్గవరెడ్డి అనే విద్యార్థి కాలేజీ హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు తెలంగాణలోని వనపర్తి జిల్లా జాగృతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న శివశాంతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివశాంతి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

గుంటూరులో రోడ్డు ప్రమాదం

గుంటూరు : నగర శివారు అంకిరెడ్డిపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఆటోను ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:30 - October 13, 2017

గుంటూరు : నగర శివారు అంకిరెడ్డిపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఆటోను ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

హెచ్ సీయూలో విద్యార్థి ఆత్మహత్యయత్నం

 

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన తోటి విద్యార్థులు విద్యార్థిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి బ్రేయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు.

గంగోత్రిలో నల్లగొండ విద్యార్థి గల్లంతు

 

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని గంగోత్రిలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థి నరహరి గల్లంతయ్యాడు. నరహరి మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ చెందినవాడు. నరహరి డెహ్రాడూన్ డీఎస్ బీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్ సీ చదువుతున్నాడు. విహారయాత్ర కోసం తోటి విద్యార్థులతో గంగోత్రికి వెళ్లిన నరహరి స్నానం చేయడానికి నదిలోకి దిగి గల్లంతయ్యాడు.

తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

 

చిత్తూరు : తిరుమల రెండవ ఘాట్ రోడ్డు లోని అక్కదేవతల ఆలయ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నడకదారి భక్తులకు ప్రమాదం తప్పింది. దీంతో ట్రాఫిక్ స్థంభించింది. 

హంద్రినీవాలో కూలీల గల్లంతు

కర్నూలు : జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో కూలిపనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగి వరద పెరగడంతో 20 మంది కూలీలు హంద్రినీవా నదిలో గల్లంతైయ్యారు. అందులో 18 మందిని స్థానికులు, అధికారులు కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

08:22 - October 13, 2017

కర్నూలు : జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లిలో కూలిపనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగి వరద పెరగడంతో 20 మంది కూలీలు హంద్రినీవా నదిలో గల్లంతైయ్యారు. అందులో 18 మందిని స్థానికులు, అధికారులు కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:17 - October 13, 2017

చిత్తూరు : తిరుమల రెండవ ఘాట్ రోడ్డు లోని అక్కదేవతల ఆలయ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నడకదారి భక్తులకు ప్రమాదం తప్పింది. దీంతో ట్రాఫిక్ స్థంభించింది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

08:16 - October 13, 2017

 

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని గంగోత్రిలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థి నరహరి గల్లంతయ్యాడు. నరహరి మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ చెందినవాడు. నరహరి డెహ్రాడూన్ డీఎస్ బీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్ సీ చదువుతున్నాడు. విహారయాత్ర కోసం తోటి విద్యార్థులతో గంగోత్రికి వెళ్లిన నరహరి స్నానం చేయడానికి నదిలోకి దిగి గల్లంతయ్యాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ట్వీ20 మ్యాచ్ కు భారీ భద్రత

 

హైదరాబాద్ : నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో ట్వీ20 మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలను నుంచి మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు. గ్రౌండ్ చుట్టూ 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడవ ట్వీ20

 

హైదరాబాద్ : నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో ట్వీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్ ప్రారంభం. 

నేడు రాంవిలాస్ తో ఈటెల భేటీ

 

ఢిల్లీ : నేడు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రావాల్సిన నిధులుపై చర్చించనున్నారు.

07:21 - October 13, 2017

 

ప్రజాస్వామ్యాన్ని అపహస్యపాలు చేయడం చాలా దారుణమని, దేశవ్యాప్తంగా జీఎస్టీ సమస్య ఉంటే కేవలం గుజరాత్ కు సంబంధించిన కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారని, రాజకీయా పార్టీలు తమ స్వర్థం కోసం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ను వాడుకుంటున్నారని, ఎన్నికల సంఘం అధికారులు నైతిక బాధ్యతలతో ఉండాలని ప్రముఖ విశ్లేషకులు వీరయ్య అన్నారు. ఏ రాజకీయా పార్టీ అయిన ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉంటాయని, ఎన్నికల కమిషన్ హిమచల్ ప్రదేశ్ కు తేదీ ప్రకటించిందని, కానీ దాని ఫలితం రాకముందే గుజరాత్ ఎన్నికలు జరుపుతుందాని, ఎన్నికల కమిషన్ ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు మాధవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:20 - October 13, 2017

 

పెట్రోల్‌, డిజీల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలో చేర్చాలి. నిన్నటి వరకూ ఇది వినియోగదారుల డిమాండ్‌. ఇప్పుడు ఇదే డిమాండ్‌ ను పెట్రోల్‌, డిజిల్‌ డీలర్స్‌ కూడా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్‌లో తమకి ఇబ్బందిగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం వారు ఆందోళన బాట పట్టారు. నిజంగా చెప్పలంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కఠినంగా ఉందని, ఇక్కడ ప్రజాస్వామ్యాం కనబడడంలేదని, పెట్రోల్ బంక్ లను నోట్ల రద్దు చేసినప్పుడు బ్యాంకుల మాదిరిగా మారిందని, ప్రస్తుతం మేము బత్ రూమ్ లు కడిగే స్థితికి వచ్చామని, పెట్రోబంక్ లు సులభు కాప్లెక్స్ గా వాడుతున్నారని తెలంగాణ పెట్రోల్, డిజిల్ బంక్ ల సంఘం నాయకులు రాజీవ్ అమరం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:19 - October 13, 2017

హైదరాబాద్ : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 3 మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ సిరీస్‌లోని క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సిరీస్‌ నిర్ణయాత్మక సమరంలో ఇండియా-ఆస్ట్రేలియా అమీతుమీకి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఆఖరి మ్యాచ్‌కు 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ...డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది.3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమాన ఆధిక్యంలో నిలిచాయి.

సెకండ్‌ టీ20లో తేలిపోయిన టీం ఇండియా
తొలి టీ20లో తిరుగులేని టీమిండియా ...సెకండ్‌ టీ20లో మాత్రం తేలిపోయింది. అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా జట్టు సెకండ్‌ టీ20లో టీమిండియాకు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. అత్యంత పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌....అసలే మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని బౌలర్‌ ముందు తేలిపోయింది. కంగారూ స్పీడ్‌ గన్‌ జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ ధాటికి ధావన్‌, రోహిత్‌ , విరాట్‌ , మనీష్‌ పాండే క్యూ కట్టడంతో భారత జట్టు భారీ స్కోర్‌ చేయలేకపోయింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమైతే టీమిండియా ఓటమి ఖాయమని రెండో టీ20తో మరోసారి రుజువైంది.

రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
బ్యాటింగ్‌లో తేలిపోవడంతో బౌలింగ్‌లోనూ భారత్‌ ప్రభావం చూపలేకపోయింది. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతేనే విరాట్ ఆర్మీ పనైపోయిందనుకుంటే పొరపాటే. ఆఖరి టీ20లో బెహ్రెన్‌డార్ఫ్‌తో పాటు ఆడమ్‌ జంపాకు చెక్‌ పెట్టగలిగితే భారత జట్టుకు విజయ అవకాశాలుంటాయనడంలో సందేహమే లేదు. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. రెండో టీ20 విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్‌లోనూ అంచనాలకు మించి రాణించాలని ప్లాన్‌లో ఉంది.గువహటీ టీ20లో టాస్‌ నెగ్గి, పక్కా గేమ్‌ ప్లాన్‌తోనే ..కొహ్లీ సేనకు చెక్‌ పెట్టిన డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా 3వ టీ20లోనూ సంచలనం సృష్టించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాపై టీ20ల్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో పాటు...పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పటిష్టంగా ఉన్న ఇండియా ఆఖరి మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించగలదో లేదో చూడాలి. మరి ఈ క్లైమ్యాక్స్‌ ఫైట్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ సొంతం చేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

07:18 - October 13, 2017

అలహాబాద్ : 9 ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, నుపూర్‌ తల్వార్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఎలాంటి ఆధారాలు లేని కారణంగా అనుమానం కింద శిక్షలు విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది.

బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్య...
2008 మే 16వ తేదీన నోయిడా జలవాయువిహార్‌లోని సొంత ఇంట్లోనే బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్యకు గురైంది. ఆమెను గొంతుకోసి చంపేశారు. ఈ ఘటన తర్వాత పనిమనిషి హేమరాజ్‌ కనిపించకుండా పోయాడు. అతడే ప్రధాన నిందితుడైన ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. ఆ మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై కనిపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. బెడ్‌రూమ్‌లో ఆరుషి, హేమరాజ్‌లు సన్నిహితంగా ఉండడం చూసిన ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారన్న అనుమానంతో పోలీసులు రాజేష్‌ తల్వార్, నుపుర్‌ తల్వార్‌లను అరెస్ట్‌ చేశారు. పరువుహత్యకు సంబంధించిన ఈ కేసును అప్పటి యూపీ ప్రభుత్వం 2008 మేలో సిబిఐకి అప్పగించింది. ఏడాదిపాటు విచారణ అనంతరం డాక్టర్‌ రాజేష్ సహాయకుడు కృష్ణ, పనిమనుషులు రాజ్‌కుమార్‌, విజయ్‌లను నిందితులుగా పేర్కొన్న సిబిఐ- వారిపై ఆరోపణలను నిరూపించలేకపోయింది. దీంతో ఈ కేసును 2009లో సిబిఐలోని మరో బృందానికి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన సిబిఐ- రాజేష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ కేసును విచారించిన గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013న ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది.

నిర్దోషులుగా రాజేశ్‌ దంపతులు
సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద రాజేశ్‌ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అంటే.. కేసులో ఆధారాలు సరిగా లేనప్పుడు నిందితులకు అనుకూలంగా తీర్పిచ్చేందుకు న్యాయవ్యవస్థలో వెసులుబాటు ఉంటుంది. ఈ కేసులో తమకు న్యాయం జరిగిందని హైకోర్టు తీర్పుపై ఆరుషి తల్లి నుపుర్‌ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సిబిఐ స్పందించింది. కోర్టు కాపి అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాకే ఈ కేసులో ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. 

07:10 - October 13, 2017

 

హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 8792 టీచర్‌ కొలువుల భర్తీకి తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటి భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. దీంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. టీచర్‌ కొలువుల కోసం రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా అన్ని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుందని అంతా భావించారు. కానీ మూడేళ్లైనా సర్కార్‌ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది.

30కి మించి ప్రకటనలు..
మూడేళ్లలో డీఎస్సీ అదిగో ... ఇదిగో.. అంటూ ప్రభుత్వం 30కి మించి ప్రకటనలు గుప్పించింది. కానీ నేటి వరకు నోటిఫికేషన్‌ విడుదలే కాలేదు. విద్యాశాఖ మంత్రిగానీ, సీఎం కేసీఆర్‌గానీ కొత్త జిల్లాలతో టీచర్‌ కొలువులకు ఇబ్బంది తలెత్తుతోందని చెప్తూ వచ్చారు. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. దీంతో మొత్తానికి నిరుద్యోగుల ఆందోళనకు దిగివచ్చింది. ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పది రోజుల్లోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్వయంగా ప్రకటించారు. దీంతో టీఎస్‌పీఎస్సీ కూడా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ విధివిధానాలపై కమిషన్‌ సభ్యులు సమావేశమై చర్చించారు. అంతేకాదు.. సిలబస్‌పైనా చర్చ జరిగింది. అయితే దాదాపుగా పాత సిలబస్‌నే కొనసాగించేందుకు పబ్లిక్‌ కమిషన్‌ సభ్యులు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల
ప్రభుత్వం చెబుతున్నట్టు పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో 10 జిల్లాలకు సంబంధించిన డేటానే సేకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 31 జిల్లాలకు సంబంధించిన డేటా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇందుకు మరో 15 నుంచి 20 రోజుల సమయం పట్టేలా కనిపిస్తోంది. 

07:09 - October 13, 2017

హైదరాబాద్ : లిక్కర్‌ షాపులతో కుమ్మక్కై తెలంగాణాలో ఎక్కడిక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత కిషన్‌ రెడ్డి. ప్రతి గ్రామంలో బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలను పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీం కోర్టు నియమాలకు వ్యతిరేకంగా వైన్స్ షాపులకు అనుమతివ్వడంపై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం టెండర్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 

07:08 - October 13, 2017

 

నల్లగొండ : 2019లో జరిగే సాధారణ ఎన్నికలకు కొత్త జోష్‌తో వెళ్లాలని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే గుత్తా ఎంపీ పదవి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గుత్తా చేరితో నల్లగొండలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి గండికొట్టాలని కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతలు ఉండడంతో ఆ జిల్లానే గులాబీ దళపతి టార్గెట్‌ చేశారు. నల్లగొండ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి... సాధారణ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడమే కేసీఆర్‌ టార్గెట్‌.

గులాబీబాస్‌ వ్యూహాలు.....
నల్లగొండ ఎంపీ స్థానానికి గుత్తా రాజీనామాపై స్పష్టత వచ్చిన వెంటనే ఇతర పార్టీ నేతలను కారెక్కించుకునేందుకు గులాబీబాస్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పునాదులపై దెబ్బకొట్టడమే కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే సెకండరీ నాయకత్వంపై దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారినందరినీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు గండికొట్టవచ్చని టీఆర్‌ఎస్‌ సారథి వ్యూహం.

దామోదర రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డితో
నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కాంగ్రెస్‌కు బలమైన నేతలు దామోదర రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డితో టీఆర్ఎస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దామోదర మాత్రం టీఆర్‌ఎస్‌కు కొన్ని డిమాండ్స్‌ వినిపిస్తున్నట్టు సమాచారం. తన వర్గానికి చెందిన కొంతమందికి ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలనేది దామోదర వినిపిస్తోన్న డిమాండ్‌. ఇక మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌తోనూ టీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు కూడా అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బలమైన నేతలను కారు ఎక్కించుకునేందుకు గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు.

07:07 - October 13, 2017

హైదరాబాద్ : నగరం మరోసారి తడిసి ముద్దయింది. అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌, రామాంతపూర్‌, ఉప్పల్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగడంతో వాననీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో జనం అష్టకష్టాలు పడ్డారు. వాన దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చిన్నపాటి చెరువులను తలపించాయి.  

07:01 - October 13, 2017

 

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ మాస్‌ ఫోరమ్‌ రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై... ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించారు. టీ మాస్‌ ఫోరమ్‌ ఆవిర్భవించిన మూడు నెలల కాలంలో ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు
ప్రభుత్వ హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శ తమ్మినేని వీరభద్రం అన్నారు. జనవరిలో జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు, ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే అక్టోబర్‌ 17న జిల్లా.. మండల కేంద్రాల్లో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతులు ఇవ్వాలన్నారు. దేశంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. కుల వివక్షతను పెంచిపోషించడంలో.. పెట్టుబడిదారుల పాత్ర చాలా ఉందన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
ప్రభుత్వాన్ని కదిలించేలా జనవరిలో పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని టీ మాస్‌ ఫోరమ్‌ నిర్ణయించింది. అలాగే కంచె ఐలయ్యపై దాడిని ఖండిస్తూ.. తీర్మానం చేసింది. సమావేశంలో గద్దర్‌, కంచె ఐలయ్య, పీఎల్‌ విశ్వేశ్వరరావు, జేబీ రాజు, అన్ని సంఘాల నేతలు పాల్గొన్నారు.  

Don't Miss