Activities calendar

14 October 2017

21:58 - October 14, 2017

ఢిల్లీ : ఈనెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ... భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కొత్తగా యువ పేసర్ శార్థూల్ ఠాకూర్,  వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్కసారి కూడా బ్యాటింగ్‌ అవకాశం రాని కేఎల్‌.రాహుల్‌ను ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌ వన్డే సిరీస్‌కు దూరమైన శిఖర్‌ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌-జడేజాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్‌ పర్యటనలో రాణించిన యువ స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను కొనసాగించారు. సిరీస్‌ తొలి వన్డే అక్టోబర్‌ 22న ముంబైలో జరగనుంది.

 

21:54 - October 14, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఆరో దశ అమరుల స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామన్నారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న కోదండరామ్‌ను ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వాలని కోదండరామ్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. 

 

21:50 - October 14, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ఏడుగేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరి... జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. నాలాలో పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కురుస్తునే ఉన్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమవడంతో శ్రీశైలంలో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి .. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.

భారీ వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కట్టలకు గండ్లు పడి... ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

కడప జిల్లా బద్వేల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బద్వేల్ డిపోలోకి నీరు చేరడంతో.. డిపోలో పనులకు ఆటంకం ఏర్పడింది. బస్టాండ్‌కు బయట రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగడంతో డిపో నుంచి నీరు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై నీళ్లు నిలవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పోరుమామిళ్లలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. పోరుమామిళ్ల బస్టాండులోకి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకున్నారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపకు సమీపంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీటితో ప్రాజెక్ట్‌ నిండిపోయింది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... ఒక గేటు ఓపెన్‌ చేసి 150 క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. 

భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రధాన కాలువకు పత్తికొండ మండలం దూదూకొండ దగ్గర గండిపడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన కాలువకట్ట.. బలహీనపడింది. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉంటంతో గండిపడినట్టు తెలుస్తోంది. మరో మూడు చోట్ల కూడా భారీగా గండిపడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.

ఇక తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిలోమీటర్‌ దూరంలో గణేష్‌ మృతదేహం లభించింది. 

21:47 - October 14, 2017

వరంగల్‌ : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈనెల 22న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో... వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలోనే అగ్రగామికి నిలిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు జిల్లాలో పెండింగ్‌ పనులపై అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులకు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వరంగల్‌లో ఈనెల 22న సీఎం కేసీఆర్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో... ప్రారంభ ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణపై వరంగల్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్క్‌ స్థలాన్ని పరిశీలించి... టెక్స్‌టైల్‌ పార్క్‌ లోగోను ఆవిష్కరించారు. 

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలుస్తుందన్నారు కేటీఆర్‌. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అన్ని రకాల వస్త్రాలన్నీ ఇక్కడే తయారవుతాయన్నారు. టెక్స్‌టైల్‌ రంగం కార్మికులకు రెండింతల పనితో పాటు.. ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సూరత్‌ లాంటి ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న స్కిల్డ్‌ లేబర్‌ను స్వరాష్ట్రానికి రప్పిస్తామన్నారు. పార్క్‌ ఏర్పాటుతో లక్షా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

అనంతరం నిట్‌ ప్రాంగణంలో టాస్క్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌... విద్యార్థులతో సమావేశమయ్యారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని ఎదుర్కొని... మరింత కసితో పని చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు కేటీఆర్‌. జీవితలంలో రాణించాలంటే మానసికంగా, దృఢంగా ఉండాలన్నారు. అలా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. యువత సమస్యలను తట్టుకునే విధంగా టాస్క్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు కేటీఆర్‌.

టాస్క్‌ ఏర్పాటు కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ హాజరయ్యారు. ఇక సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. కేటీఆర్‌ కూడా చాలామందికి సెల్ఫీలు తీసేందుకు అవకాశం కల్పించారు.

వరంగల్‌ పర్యటనలో అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన కేటీఆర్‌... ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో... అధికారులు, ఎమ్మెల్యే పని తీరు ఆశాజనకంగా లేదన్నారు మంత్రి. ఈసారి సమీక్ష నిర్వహించే సమయానికి పెండింగ్‌ పనులకు టెండర్లు పిలిచి.. పూర్తి చేయాలన్నారు కేటీఆర్‌. 

21:43 - October 14, 2017

విజయవాడ : రాజధానిలో రౌడీయిజం చేయాలనుకునేవారికి రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు విజయవాడలో సుడిగాలి పర్యటన చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరిన సీఎం సుమారు 5 గంటల పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, కాల్వలతో పాటు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. ఎప్పుడూ ప్రయాణించే కాన్వాయ్‌లో కాకుండా స్పెషల్ బస్సులో చంద్రబాబు పర్యటించారు. సీఎం వెంట మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీందర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. 

ముందుగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కెనాల్‌, పార్క్‌ను పరిశీలించిన చంద్రబాబు వెంటనే వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న పాత బస్టాండ్‌ను పరిశీలించారు.

పలు చోట్ల అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం 9 అవుతున్నా చెత్త ఎందుకు తొలగించలేదని అధికారులను నిలదీశారు. రోడ్లపై ఉన్న గుంతలను 24 గంటల్లో పూడ్చాలని ఆదేశించారు. నగరంలోని ప్రతి కాల్వ వద్ద పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా పాత ప్రభుత్వ ఆసుపత్రిని సైతం పరిశీలించారు చంద్రబాబు. అన్ని వార్డులు తిరిగి రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. వాంబేకాలనీలో ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతిలో రౌడీయిజం చేయాలనుకునేవారు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఆకస్మిక తనిఖీలతో అధికారులు, పోలీసులు పరుగులు తీశారు. ఓవైపు ట్రాఫిక్‌.. మరోవైపు పబ్లిక్‌ను కంట్రోల్ చేయడానికి సతమతయ్యారు. 

విద్యార్థిని మృతి ఘటనపై మంత్రి గంటా ఆరా

విజయవాడ : నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆరా తీశారు. ఘటనపై ప్రాథమిక వివరాలు గంటా తెలుసుకున్నారు. విద్యార్థిని మృతిపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ను మంత్రి వివరణ కోరారు. 

 

16న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ కు వైసీపీ విద్యార్థి విభాగం పిలుపు

విజయవాడ : ఈనెల 16న రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ కు వైసీపీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యా సంస్థలను బంద్ చేయనున్నారు. 

సీఎం చంద్రబాబు్కు జగన్ భహిరంగ లేఖ

అమరావతి : సీఎం చంద్రబాబుకు జగన్ భహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని జగన్ అన్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయిని తెలిపారు. రైతు మునుగుతున్నా పట్టించుకునే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడి మాదిరి సీఎం, మంత్రులు నిద్రపోతున్నారని విమర్శించారు. నీరో పాలన కంటే నారా పాలన ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా మేల్కొని రైతులకు పరిహారం ఇవ్వండని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

 

ఇంజనీర్లతో జీహెచ్ ఎంసీ కమిషనర్ సమీక్ష

హైదరాబాద్ : వర్షాలకు సంభవించిన నష్టంపై ఇంజనీర్లతో జీహెచ్ ఎంసీ కమిషనర్ సమీక్ష జరిపించారు. నగరంలో 7,89, 214 చ.మీ విస్తీర్ణంలో రోడ్లు దెబ్బతిన్నాయి. సెంట్రల్ జోన్ లో అత్యధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపడతామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు. 

20:54 - October 14, 2017
20:49 - October 14, 2017

తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాలాచారితో టెన్ టివి వన్ టూ వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బీజేపీతో ఎలా ఉన్నామో..భవిష్యత్ లో కూడా అలాగే ఉంటామని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 'ఎంతమంది టీఆర్ ఎస్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారు ?, కోదండరాం ఎవరెవరితో కలిసి సోనియాతో సమావేశమయ్యారు?, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందా ?, 2019లో బీజేపీతో పొత్తు ఉండే అవకాశముందా?, కోదండరాంకు టీఆర్ ఎస్ భయపడుతోందా ?, కేంద్రమంత్రులకు గిఫ్టులు అవసరమా ?' అనే అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కోదండరామ్ అరెస్టుకు నిరసనగా విద్యార్థి సంఘాల నిరసన

వరంగల్ : ప్రొ.కోదండరామ్ అరెస్టుకు నిరసనగా కేయూలో విద్యార్థి సంఘాల నిరసన తెలిపారు. పోతన హాస్టల్ నుంచి ఫస్ట్ గేట్ వరకు సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు.

20:31 - October 14, 2017

జేఏసీని జూశి దడ్సుకుంటున్న కేసీఆర్, సర్కారు దావఖాండ్లకొచ్చిన చంద్రాబాబు, ముఖ్యమంత్రి మాటతోటి రగులుతున్న మంట, బాధితురాలిని అరెస్టు జేశ్న పోలీసోళ్లు, వరంగల్ జిల్లాల మీడియాతోని పంచాది....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

జీడిమెట్లలో విషాదం

హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ నాలాలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. 

20:21 - October 14, 2017

తమిళనాడు : దైవజ్ఞులమంటారు.. నీతి సూత్రాలు బోధిస్తారు.. ప్రకృతిని కాపాడుకుందామంటూ.. యాత్రలే చేస్తారు. ఇది నాణేనికి ఓ కోణమే. రెండోవైపు.. వారు చేసిన భూ ఆక్రమణలుంటాయి... తమ జాగా కోసం పేదలు చేపట్టిన ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణిచే దుష్కార్యాలూ ఉంటాయి. నదుల పరిరక్షణ కోసం యాత్ర చేస్తోన్న జగ్గీవాసుదేవ్‌ కూడా ఇదే కోవకే చెందుతాడు. ఆశ్రమం కోసం ఈయన స్థాపించిన ఈషా ఫౌండేషన్‌ ఆక్రమించిన తమ భూమిని పొందేందుకు, ఓ గిరిజన మహిళ.. అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఆ ధీరమహిళ ముత్తమ్మపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
గిరిజన మహిళ పోరాటం
ముత్తమ్మ...! జగ్గీ వాసుదేవ్‌ స్థాపించిన ఈషా ఫౌండేషన్‌తో తలపడుతోన్న సాధారణ గిరిజన మహిళ. తమిళనాడు రాష్ట్రం.. కోయంబత్తూరు జిల్లాకు చెందిన ముత్తమ్మ... తనతోటి వారి మేలు కోసం.. జగ్గీ వాసుదేవతోనే.. ఢీ అంటోంది. ఈషా ఫౌండేషన్ నెలకొల్పిన ప్రదేశంలోని ఓ 44 ఎకరాలు.. ఒకప్పుడు స్థానిక జమీందారు,  13 గిరిజన కుటుంబాలకు ఇచ్చారు. అయితే, ఈ ప్రాంతంలో విరివిగా సంచరించే ఏనుగుల వంటి వనజీవులకు ఆటంకం కలగరాదన్న కారణంగా.. ఈ 44 ఎకరాలను గిరిజనులు తమ స్వాధీనంలోకి తీసుకోలేదు. 
ఆశ్రమం కోసం స్థలం కబ్జా
గిరిజనులు ప్రకృతికి, వన్యప్రాణాలకు ఇబ్బంది కలగరాదంటూ మౌనంగా ఉండడమే.. ఈషా ఫౌండేషన్‌కు అనుకూలాంశంగా మారింది. ఆశ్రమం కోసం నిర్వాహకులు ఈ స్థలాన్ని కబ్జా చేసేశారు. అంతేనా, ఏనుగులు సహజంగా సంచరించే మార్గానికి అడ్డుగా కొన్ని నిర్మాణాలూ చేపట్టారు. దీనిపై స్థానిక అధికార యంత్రాంగం, గతంలోనే ఈషా ఫౌండేషన్‌కు నోటీసులు కూడా జారీచేసింది. ముత్తమ్మ పోరాటానికి ఈషా ఫౌండేషన్‌ అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది.  ఆవాసాలకు వెళ్లే దారే లేకుండా చేసింది. అయినా.. సీపీఎం, ఇతర ప్రజాస్వామిక పక్షాల మద్దతుతో ముత్తమ్మ సాగిస్తోన్న పోరాటం ఉధృతం కావడంతో.. ఈషా ఫౌండేషన్‌ కాస్త మెత్తబడింది. 
దళిత, గిరిజన పోరాటానికి సీపీఎం మద్దతు
ఈషా ఫౌండేషన్ నుంచి తమ భూములు స్వాధీనం చేసుకోవడం కోసం దళిత, గిరిజనులు చేస్తున్న పోరాటానికి సీపీఎం సహా, స్థానిక వామపక్ష, ప్రజాస్వామిక పక్షాలు మద్దతునిస్తున్నాయి. తమ స్థలాలు తిరిగి సాధించేవరకూ పోరాటం ఆపబోనని ముత్తమ్మ స్పష్టం చేస్తోంది.  
సాటివారికి న్యాయం జరగడమే ముఖ్యమంటున్న మహిళ
ఈషా ఫౌండేషన్‌తో తలపడుతున్న ముత్తమ్మను కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టారు. అంతటి పెద్దవాళ్లతో గొడవ ఎందుకంటూ భయపెట్టారు. అయినా.. ముత్తమ్మ కుటుంబం కన్నా.. సాటివారికి న్యాయం జరగడమే ముఖ్యమంటూ.. పోరుబాటను వీడలేదు.  
ముత్తమ్మ పోరాటం ఫలించాలి..
ఆశ్రమంలో.. ఈషా ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన 112 అడుగుల ఆదియోగి శివుడి విగ్రహాన్ని.. గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇది పర్యావరణానికి చేటు తెస్తుందన్న భావనతో.. స్థానిక వెల్లింగిరి హిల్ ట్రైబల్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్నీ వేసింది. అడుగడుగునా అతిక్రమణలతో సాగుతోన్న ఈ సంస్థకు వ్యతిరేకంగా ముత్తమ్మ చేస్తున్న పోరాటం ఫలించాలని కోరుకుందాం. 

 

20:14 - October 14, 2017

ఢిల్లీ : ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో... దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తున్నారు. 2018లో జరిగే సీపీఎం అఖిల భారత మహాసభలలో చర్చించే అంశాల ఎజెండా, పార్టీ సంస్థాగత అంశాలపై కేంద్ర కమిటీ చర్చించనుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సీపీఎం కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై బీజేపీ దాడులు, అసత్య ప్రచారాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు.. భవిష్యత్‌ ప్రజా పోరాటాలపై కార్యాచరణను కేంద్ర కమిటీ రూపొందించనుంది. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, మధుతో పాటు.. కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

20:09 - October 14, 2017

గుంటూరు : జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేషన్‌ షాపులో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. దుకాణాదారులు సమయపాలన పాటించాలన్నారు. త్వరలో సెమి, అర్బన్‌, మాల్స్‌ను రిలయన్స్‌ సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న రేషన్‌ షాపులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. 

 

19:54 - October 14, 2017

హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ నాలాలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకెళితే.. ఓ యువకుడు ఓపెన్‌ నాలాలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు... యువకుడిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఓ తాడు సహాయంతో అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాడు తెగిపోవడంతో ఆ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోయిన యువకుడు.. కిలోమీటర్ దూరంలోని గణేష్‌నగర్‌లో మృతదేహమై కనిపించాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ నాలా గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో నాలాలో పడిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:52 - October 14, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. లండన్‌ వెళ్లిన దర్శకుడు రాజమౌళి.. అమరావతి డిజైన్స్ పరిశీలిస్తున్నారు. 
సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌తో కలిసి రాజమౌళి లండన్‌ వెళ్లారు. అమరావతి డిజైన్స్ రూపొందిస్తున్న నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై... వారు  రూపొందించిన ఆకృతుల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు... పలు మార్పులు సూచించారు. మరోవైపు ఈనెల 23 నుంచి చంద్రబాబు నాయుడు లండన్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను చంద్రబాబు ఫైనల్ చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:48 - October 14, 2017
19:47 - October 14, 2017

విశాఖ : అసలు రౌడీ గేదెల రాజుకు, డీఎస్పీకి సంబంధాలేంటి..? డీఎస్పీని రాజు ఎందుకు బ్లాక్‌మెయిల్ చేశాడు...? వారిద్దరి మధ్య గతంలో ఏం డీల్ నడిచింది...హత్య చేయించేవరకు వెళ్లిందంటే కారణం బలమైనదే ఉంటుంది...అసలు కథేంటి...? ఓ పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న రవిబాబు హత్య కేసులో నిందితుడు ఎలా అయ్యాడని ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి...
మాజీ ఎమ్మెల్యే కూతురితో లవ్...
పోలీసు అధికారి రవిబాబు గతంలో విశాఖ యలమంచిలిలో పనిచేస్తున్న సమయంలో పాయకరావు పేట మాజీ శాసన సభ్యుడు కుమర్తే పద్మలత తో పరిచయం అయింది.,.ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది...అప్పటికే పద్మలతకు, రవిబాబు ఇద్దరికి పెళ్లీల్లు అయ్యాయి..పద్మలతను పెళ్లీ చెసుకుంటానని చెప్పిన రవిబాబు అమేతో వివాహేతర సంభందాన్ని కొనసాగించాడు.
ఏసీపీగా ప్రమోషన్‌ పొందిన రవిబాబు..
ఇక రవిబాబు డీఎస్పీగా ప్రమోషన్ వచ్చింది..విశాఖ నగరంలోనే ఏసీపీగా పనిచేస్తున్నాడు...ఉన్నత స్థానంలో ఉంటూ భారీగా సంపాదించాడు...ఆస్తులు పెరగడంతో తన ప్రేయసి పద్మలతపై మోజు తీరింది...దీంతో ఆమెను దూరం పెట్టాడు...
పర్మినెంట్‌గా తప్పించేందుకు కుట్ర...
పద్మలత నుంచి ఏసీపీకి ఒత్తిడి పెరగడం..రాజీ కుదుర్చుకోవడం జరిగిపోయింది..ఆ తర్వాత క్రిమినల్‌ బ్రెయిన్‌కు పదును పెట్టాడు..పద్మను తప్పిస్తేనే తనకు మనశ్శాంతిఉంటుందని బావించిన ఏసీపీ రవిబాబు గాజువాక ట్రాన్స్‌ఫర్ కావడంతోనే రౌడీషీటర్ గేదెల రాజు సాయం తీసుకున్నాడు..
సుపారీ ఇచ్చి పద్మలత మర్డర్‌కు స్కెచ్...
పద్మలత మర్డర్‌కు స్కెచ్ వేసిన రవిబాబు నమ్మించి రౌడీ రాజుకు అప్పగించాడు..నర్సీపట్నంలో పసరు మందు వేయిస్తానంటూ తీసుకువెళ్లి విషాహారం తినిపించి చంపేశాడు..ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయేలా చేశారు...అంతటితో కేసు ఖతమైంది...
రాజును తప్పించుకునేందుకు ప్లాన్ చేసిన రవిబాబు..
చాలా కాలంగా రౌడీరాజు,రవిబాబుల మధ్య సుపారీ డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయి..దీంతో రాజు బహిరంగంగా బ్లాక్ మెయిల్ చేయడంతో పద్మలత మర్డర్ బయటకు వస్తుందని ...రౌడీ రాజు హత్యకు ప్లాన్ చేసి దొరికిపోయాడు డీఎస్పీ రవిబాబు.

 

19:41 - October 14, 2017

విశాఖ : ఓ పోలీసు అధికారి...మరో పత్రికాధిపతి...ఈ ఇద్దరు కలిశారు..ఎన్నో చేశారు...ఇదంతా పక్కన పెడితే ఆ పోలీసు అధికారి తన పోలీసు బ్రెయిన్‌ను క్రిమినల్‌ యాక్టివిటీస్‌ కోసం వాడారు..అంతే లింకులు తెలిసిన పోలీసు అధికారి మర్డర్లు చేయించాడు..ఇది నిజం...జరిగిన వాస్తవం..విశాఖలో హత్యలకు ఓ డీఎస్పీకి లింకు ఉంది....ఇప్పుడా పోలీసు అధికారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు...
విశాఖలో రెండు హత్యలు 
విశాఖ నగరంలో రెండు హత్యలు జరిగాయి...ఈ రెండు హత్యలకు చాలా గ్యాప్‌ ఉన్నా...ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు.. అందుకు కారణం ఆ హత్యలకు ప్లాన్ చేసింది ఓ పోలీస్‌ బ్రెయిన్...అతనే గాజువాక మాజీ ఏసీపీ...ప్రస్తుతం ఆర్టీసీ విజిలెన్స్‌లో అధికారిగా ఉన్న డీఎస్పీ రవిబాబు...
రౌడీషీటర్‌ హత్యలో కదిలిన డొంక...
విశాఖ నగరంలో వారం రోజుల క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియస్ గేదెల రాజు హత్య కేసును పోలీసులు చేధించారు..గతంలో గాజువాక ఏసీపీ గా పనిచెసి ప్రస్తుతం ఆర్టిసి విజిలెన్స్ అధికారిగా ఉన్న రవిబాబు ప్రొద్బలంతోనే ఈ హత్య జరిగినట్లు తేల్చారు పోలీసులు..రవిబాబుతో పాటుగా విశాఖలో వెలువడే క్షత్రియ భేరీ పత్రిక ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు శ్రీనివాస రాజు కూడా ఈ హత్యలో భాగస్వామినే....వీరిద్దరూ ప్రధాన నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేయడంతో కలకలం రేపింది....
పత్రికా కార్యాలయంలోనే హత్య...
రౌడీషీటర్ గేదెల రాజుకు, డీఎస్పీలకు మధ్య సంబంధాలున్నాయి..ఈ క్రమంలో రాజు డీఎస్పీని బ్లాక్‌మెయిల్ చేయడంతో ఎప్పటికైనా ఇబ్బందేనని ప్లాన్ చేశాడు రవిబాబు...ఇందుకు గెదెల రాజుకు బాగా తెలిసిన క్షత్రియ భేరీ పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజు సహాయం తీసుకున్నాడు..
రౌడీ రాజును చంపేందుకు ఒప్పందం...
ఇక యాక్షన్‌లోకి దిగారు డీఎస్పీ రవిబాబు...ఆలస్యం చేయకుండా రౌడీ గేదెల రాజును చంపేయాలని డిసైడ్ అయ్యాడు...
భూపతిరాజు శ్రీనివాసరాజు తనకు పరిచయం ఉన్న పాత నేరస్థులు సువ్వాడ మహేష్ ,అతని మిత్రులు రవి, శ్రీనివాసరావు, గోపి, విజయకుమార్, మురళి, ఆనంధకుమార్, త్రినాధ్, కనకరాజు లతో డీల్‌ మాట్లాడుకున్న వీరు ఐదులక్షలకు ఒప్పందం చేసుకున్నారు... అనుకున్నట్లుగానే గెదెల రాజును ఈ నెల 6వ తేదీన సీతమ్మధారలో ఉన్న క్షత్రియ భేరీ పత్రిక ఆఫీసుకు పిలిపించుకున్నారు.. అక్కడే దారుణంగా కొట్టి చంపిన వారంతా డెడ్‌బాడీని కారులో వేసుకుని వెళ్లి కాల్చేశారు...
పరారీలో ఉన్నవారి కోసం గాలింపు
కేసు నమోదు చేసిన పోలీసులకు లోతుగా శోధించగా క్షత్రియ భేరీ పత్రికలో పనిచేసే వ్యక్తి రౌడీ రాజు బైక్ వాడినట్లు తేలింది..దీంతో తీగలాగిన పోలీసులు డొంకను కదిలించారు..రాజును చంపిన పాతనేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తే విషయం బయటకు వచ్చింది...కేసులో ఏ1గా డీఎస్పీ రవిబాబు, ఏ2గా పత్రికాధిపతి శ్రీనివాసరాజులున్నారు..పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.

 

లండన్ లో రాజమౌళి పర్యటన

గుంటూరు : ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి లండన్ లో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిర్మించే పరిపాలన భవనాల డిజైన్ లను రాజమౌళి, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఎంపీ గల్లా పరిశీలించారు. నార్మన్ పోస్టర్ రూపొందించిన ఆకృతుల్లో పలు మార్పులను రాజమౌళి సూచించారు. ఈనెల 23 నుంచి సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటించనున్నారు. 

 

న్యూజిలాండ్ తో 3వన్డేలకు భారత్ జట్టు ప్రకటన

హైదరాబాద్ : న్యూజిలాండ్ తో మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటించారు. ఈనెల 22 నుంచి భారత్, కీవీస్ వన్డే సీరిస్ ప్రారంభం కానుంది. 

జీడబ్ల్యుఎంసీ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ గరంగరం

వరంగల్ : జీడబ్ల్యుఎంసీ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ గరంగరం అయ్యారు. మేయర్ నరేందర్, కలెక్టర్ ఆమ్రపాలి, కమిషనర్ శృతిల పని తీరుపై తీవ్ర అసంతృప్తి చెందారు. పొంతలేని సమాధానాలుచెప్పడంతో కలెక్టర్ ఆమ్రపాలిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేయర్ నరేందర్ ను మందలించారు.

 

19:02 - October 14, 2017

ఢిల్లీ : చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మళ్లీ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు దుయ్యబట్టారు. వంశధార నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మధు స్పష్టం చేశారు. 

18:55 - October 14, 2017

చిత్తూరు : తిరుపతి నగరంలో రౌడీషీటర్‌ మోహన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ట్యాక్సీ స్టాండ్‌లో గొడవలతోనే మోహన్‌ను కత్తులతో ప్రత్యర్థులు నరికినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ మోహన్‌ను రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

 

18:53 - October 14, 2017

అనంతపురం : అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు కనబడటం లేదు. బాండ్ల పరిశీలన కోసం బాధితులు పోలీస్‌స్టేషన్ల ఎదుట బారులు తీరారు. కొంత మంది బాధితుల వద్ద రశీదులు లేకపోవడంతో.. ఆధారాలు లేవని పోలీసులు వెనక్కిపంపుతున్నారు. మరోవైపు రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాపాపలతో వచ్చి ఎండలో అవస్థలు పడుతున్నామని... రద్దీ తగ్గించేందుకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. 

 

18:51 - October 14, 2017

నెల్లూరు : తెలుగుదేశంకు మంచిరోజులు నడుస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బాబు పాలనలో కరవు రావాలని కోరుకున్న ప్రతిపక్ష పార్టీ ఆశలపై నీళ్లు కురిసాయని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వర్షాలు పడొద్దని విపక్షం కోరుతుందన్నారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి...కరవు సీమలో సైతం జలాల గలగలలు పారుతున్నాయన్నారు. రాయలసీమతో సహా అన్ని చోట్ల కరువు తీరా వర్షాలు పడ్డాయని తెలిపారు.

 

18:48 - October 14, 2017

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో భాగంగా విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న స్క్రాప్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాత బస్టాండ్‌ను కూడా  స్వయంగా పరిశీలించారు. అటు రైవస్‌కాల్వ సుందరీకరణ పనులను కూడా సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ప్రసాదంపాడు వద్ద కాల్వగట్లపై చెత్తను గమనించిన చంద్రబాబు అధికారులపై సీరియస్‌ అయ్యారు. చెత్తను ఎప్పటికపుడుతొలగించాలని ఆదేశించారు. విజయవాడనగర శివారులోని 29 గ్రామాలను వీఎంసీ పరిధిలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు రౌడీయిజం చేసే వాళ్లకు విజయవాడలో చోటు లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 

 

18:42 - October 14, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా  పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పాదయాత్ర ఫలితంగానే 270కి పైగా సంఘాలతో టీమాస్ ఫోరం ఏర్పాటైందని తెలిపారు. జనవరిలో ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. టీప్రభుత్వం హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పలు అంశాలను ఆయన మాటల్లోనే...
'మహాజన పాదయాత్ర లక్ష్యాలు ఒకటి, రెండు సంవత్సరాల్లో నెరవేరే లక్ష్యలు కాదు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దీర్ఘకాలిక లక్ష్యాలు. పాదయాత్రకు స్పందంచిన ప్రభుత్వం ప్రజలపై కొన్ని వరాలు ప్రకటించింది. కానీ అవన్నీ అమలు కాలేదు. రాష్ట్రంలో గొర్రెలు, చేపల పంపణీ జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళిక జరగలేదు. పాదయాత్ర తర్వాత సాధించిన పెద్ద ముందడుగు.... టీమాస్ ఏర్పాటు. టీమాస్ లో అన్ని వామపక్షాలు ఇంకా కలిసి రాలేదు. త్వరలో సీపీఐకి సంబంధించిన సంఘాలు టీమాస్ లోకి వస్తాయి. నేరెళ్ల ఘటనపై ముందుగా స్పందించింది టీమాస్. దీని వెనుక ఉన్న కోణాన్ని వెలికితీసింది టీమాస్. ఇసుక దందాను బయటికి తీసింది. ప్రజల్లోకి వెళ్లకుండా టీమాస్ విజయవంతం కాలేదు. భవిష్యత్ లో ప్రజల్లోకి వెళ్తాం. టీమాస్ నిర్మాణ దశల్లో ఉంది. మండలాలు, గ్రామాల్లో టీమాస్ కమిటీలు ఏర్పాటు కావాల్సివుంది. టీమాస్ ఆమోదించిన ప్రణాళికపై పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయాల్సి ఉంది. సీఎంకు రాసిన లేఖల విషయంలో ప్రతి సమస్యపై సీఎం స్పందించారు. ప్రభుత్వం పెద్ద పెద్ద మోసాలకు పాల్పడుతోంది. ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం అనుసరిస్తలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం, ఉద్యోగాల భర్తీ నెరవేర లేదు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ఇచ్చేనోటిఫికేషన్ల అన్నింటిని కోర్టులు కొట్టివేస్తున్నాయి. ఆ విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దీంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. ప్రజా సమస్యలపై పని చేస్తాం. సమస్యలపై ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తాం. జనవరిలో రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమాలు చేపడతామని' హెచ్చరించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:15 - October 14, 2017

కామారెడ్డి : రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు కావాలనే అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి చూపిస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 195 సెంటర్లను ప్రారంభిస్తున్నామని.. రైతులు దళారులను నమ్మవద్దని పోచారం సూచించారు. 

 

17:59 - October 14, 2017

హైదరాబాద్ : ఫార్మాసీటీ పేరుతో ప్రభుత్వం పేద‌ల భూముల‌ను లాక్కుంటోంద‌ని కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వపు బ‌ల‌వంత భూసేక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు. త్వరలో రాహుల్‌ గాంధీని ఫార్మాసిటీకి తీసుకొస్తామన్నారు. ఫార్మాసిటీతో కాలుష్యం ఉండ‌ద‌ని చెబుతున్న కేటీఆర్... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఫార్మా కంపెనీని ఏర్పాటు అనుమ‌తిస్తారా అని వీహెచ్ ప్రశ్నించారు. 

 

17:53 - October 14, 2017

వరంగల్ : జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి...అధికారులు, ఎమ్మెల్యే పనితీరు చాలా డిసప్పాయింట్ గా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపోజల్ తెచ్చి ప్రతి పనికి టెంటర్లు పిలవాలని ఆదేశించారు. నెక్ట్స్ రివ్యూ వరకు అన్ని పనుల్లో క్లారిటీ ఉండాలని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలని షరతు విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆదిభట్ల పీఎస్ వద్ద వీహెచ్ ధర్నా.. అరెస్ట్

రంగారెడ్డి: ఆదిభట్ల పీఎస్ వద్ద వీహెచ్ ధర్నా చేస్తుండడంతో అనుమతి లేదని పోలీసులు అరెస్ట్ చేశారు. కోదండరాంను కలిసేందుకు వీహెచ్ పీఎస్ కు వెళ్లారు. అనుమతి ఇవ్వకపోవడంతో వీహెచ్ ధర్నా చేశారు. దీంతో పోలీసులు వీహెచ్ ను అరెస్ట్ చేశారు.

16:31 - October 14, 2017

అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

వరంగల్: కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, అధికారులు, ఎమ్మెల్యే పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు. అదుపరి సమీక్ష కల్లా అన్ని పనుల్లో క్లారిటీ ఉండాలని అధిరాలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగో ఆవిష్కరణ

వరంగల్ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగోను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆవిష్కరించారు. గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మెగా టెక్స్‌టైల్ స్థలంలో డీపీఆర్ మ్యాప్‌ను పరిశీలించారు.

16:24 - October 14, 2017

హైదరాబాద్ : విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి..తెలుగు రాష్ట్రాల్లో కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నాయి... గడిచిన 36 గంటల్లో ఎంతో మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు...రెండో రోజు కూడా నలుగురు స్టూడెంట్స్ మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది...
వనపర్తి జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య 
వనపర్తి జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని జాగృతి జూనియర్‌కాలేజీలో  ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న శివశాంతి రాత్రి హాస్టల్‌గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది... శివశాంతి స్వస్థలం  పానుగల్‌ మండలం చిన్నచింత గ్రామం. విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు కాలేజీపై దాడికి దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు...
శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిడమనూరు శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవరెడ్డి.. రాత్రి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవరెడ్డి స్వస్థలం కడపజిల్లా రాయచోటిగా తెలుస్తోంది...అయితే భార్గవ్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావడం లేదు...దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... 
హెచ్‌సీయూలో విద్యార్థి అనుమానాస్పద మృతి 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరో విద్యార్థి అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు.  సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఆకాశ్‌ గుప్తా తన స్నేహితులతో కలిసి యూనివర్శిటీలో ఉన్న ఓ చెరువు వద్ద పార్టీ చేసుకున్నాడు. తరువాత ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఆకాశ్‌ గుప్తా నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే అతన్ని పైకి తీసుకువచ్చి కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆకాశ్‌ గుప్తా ప్రమాదవశాత్తూ చనిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది...అనుమానాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు...
ఉత్తరాఖండ్‌ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి
ఉత్తరాఖండ్‌లోని గంగోత్రిలో  తెలంగాణ విద్యార్థి  మృతిచెందాడు.  నల్లగొండజిల్లా మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన నరహరి  డెహ్రడూన్‌ డీఎస్‌బీ యూనివర్సిటీలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ చదువుతున్నాడు. కాగా ఉత్తరాకాశీలో దైవదర్శనానికి  ఐదుగురు విద్యార్థులతో  కలసి నరహరికూడా వెళ్లాడు. స్నానంకోసం గంగోత్రివద్ద నదిలో దిగిన నరహరి ప్రవాహానికి కొట్టుకుని పోయాడు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గల్లంతయిన విద్యార్థికోసం గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదు. నీటిలో మునిగిన నరహరి మృతిచెందాడు. కొడుకు చనిపోయాడన్న సమాచరంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.  

 

కోఠి ఆంధ్రాబ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం

హైదరాబాద్ : కోఠి ఆంధ్రాబ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. అగ్నిప్రమాదం కారణంగా పలు దస్ర్తాలు దగ్ధమయ్యాయి.

16:15 - October 14, 2017

హైదరాబాద్ : ఫార్మలా వన్‌ పేరుతో హైదరాబాద్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నగరానికి చెందిన మచ్దర్‌ మోటారు సంస్థ రేసులు నిర్వహిస్తామని ఓ వ్యాపారవేత్త నుంచి 12కోట్ల 50లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రేసులు నిర్వహించకపోవడంతో... బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో...మచ్దర్‌ మోటారు సంస్థ  నిర్వాహకురాలు అంజనారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు ప్రముఖులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:12 - October 14, 2017

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమవడంతో శ్రీశైలంలో ఏడు గేట్లు  పది అడుగుల మేర ఎత్తి .. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్‌కు 73వేల 921 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతోంది. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.

 

16:09 - October 14, 2017

కరీంనగర్ : జ్యోతినగర్‌ లోని సెయింట్ ఆల్పోన్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిచే యాజమాన్యం కట్టలు కొట్టించారు. అయితే ప్రమాద వశాత్తు కాలికి గొడ్డలి తగలడంతో ఎడమకాలి వేళ్లు తెగిపోయాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ఆందోళనకు దిగి, పాఠశాల ఫర్నీచర్‌ ను ధ్వంసం చేశారు. దీంతో ఉపాధ్యాయులు పరారైయ్యారు. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

16:03 - October 14, 2017

చిత్తూరు : తిరుపతి నగరంలో రౌడీషీటర్‌ మోహన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మోహన్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ట్యాక్సీ స్టాండ్‌లో గొడవలతో మోహన్‌ను కత్తులతో ప్రత్యర్థులు నరికి చంపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకే ఒక మర్డర్ కేసులో, మరో గొడవలో అతనిపై కేసు నమోదు అయింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మోహన్ పై రౌడీ షీట్ తెరిచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:42 - October 14, 2017

కృష్ణా : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో భాగంగా విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న స్క్రాప్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాత బస్టాండ్‌ను కూడా  స్వయంగా పరిశీలించారు. అటు రైవస్‌కాల్వ సుందరీకరణ పనులను కూడా సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ప్రసాదంపాడు వద్ద కాల్వగట్లపై చెత్తను గమనించిన చంద్రబాబు అధికారులపై సీరియస్‌ అయ్యారు. చెత్తను ఎప్పటికపుడుతొలగించాలని ఆదేశించారు. విజయవాడనగర శివారులోని 29 గ్రామాలను వీఎంసీ పరిధిలోకి తీసుకోవాలని  ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సీఎంతో పాటు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, కృష్ణా కలెక్టర్‌, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

 

టెక్స్ టైల్స్ పార్క్ సందర్శనలో కేటీఆర్ కు నిరసన సెగ

వరంగల్ రూరల్: గీసుకొండ మండలం శాయంపేటలో మెగా టెక్స్ టైల్స్ పార్క్ సందర్శనలో కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. టెక్స్ టైల్స్ పార్క్ వద్ద నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించాకే ప్రాజెక్టులు కట్టాలని డిమాండ్ చేశారు. రైతులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.

15:37 - October 14, 2017

హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని.. తెలంగాణ రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన.. పోలీస్‌ ఎక్స్‌ఫో కార్యక్రమాన్ని నాయిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌, తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ, కమీషనర్లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న విద్యార్థులు

వరంగల్: మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసలు తలెత్తాయి. హన్మకొండ కాళోజీ సెంటర్ వద్ద మంత్రి కేటార్ కాన్వయ్ ను విద్యార్థులు అడ్డుకున్నారు.

15:26 - October 14, 2017

కృష్ణా : జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల మరణమృదంగం ఆగడంలేదు. గురువారం లక్ష్మీనర్సింహమూర్తి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. ఇవాళ మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వందలపేటకు చెందిన రమాదేవి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ హాస్టల్‌బిల్డింగ్‌ పై నుంచి దూకి రమాదేవి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని ఆత్మహత్య వివరాలను హాస్టల్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నగరంలో ఫార్ములా వన్ పేరిట భారీ మోసం

హైదరాబాద్ : ఫార్ములా వన్ పేరిట నగరంలో భారీ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు నిర్వాహకురాలు అంజనా రెడ్డి. బాధితుడు రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజనారెడ్డి మోసం వెలుగు చూసింది. అంజనారెడ్డి దక్కన్ క్రానికల్ ఎండీ వినాయక రవిరెడ్డి కుమార్తె.

తిరుపతి లో రౌడీషీటర్ మోహన్ హత్య

తిరుపతి: నగరంలో మోహన్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ట్యాక్సీ స్టాండ్ లో గొడవలతో మోహన్ ను కత్తులతో ప్రత్యర్థులు నరికి చంపారు.

విద్యార్థితో కట్టెలు కొట్టించిన యాజమాన్యం..

కరీంనగర్ : సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో విద్యార్థితో యాజమాన్యం. కట్టెలు కొట్టించారు. గొడ్డలి తగిలి విద్యార్థి ఎడమ కాలి వేళ్లకు దెబ్బలు తగిలాయి. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది.

కంచ ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీం:రామకృష్ణ

విజయవాడ:కంచ ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హెచ్ సీఏ పై అజహర్ అసహనం

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దు అయిన తీరు పట్ల అజహర్ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ అసమర్థంగా వ్యవహరించిందని మాజీ కెప్టెన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్షం పడినా.. గువాహటిలో రెండవ టీ20 నిర్వహించారు, కానీ హైదరాబాద్‌లో మ్యాచ్‌ను నిర్వహించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. ఇది హెచ్‌సీఏకు సిగ్గుచేటు అని అజహర్ అన్నారు. మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ వ్యవహారశైలి ప్రొఫెషనల్‌గా లేదని, ఉప్పల్‌లో వర్షం లేకున్నా.. మ్యాచ్‌ను నిర్వహించలేకపోవడం శోచనీయమన్నారు.

 

13:33 - October 14, 2017

రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసును ఛేదించిన పోలీసులు

విశాఖ: గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజు హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. హత్య కేసులో ఏ1గా గాజువాక మాజీ ఎపీపీ రవిబాబు, ఏ2గా భూపతిరాజు శ్రీనివాసరాజు వున్నారు. మరో 9 మంది నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

13:30 - October 14, 2017

పాట్నా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీ

బీహార్ : పాట్నా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..20 యూనివర్సిటీలకు రూ. 10 వేల కోట్లు కేటాయించి.. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలుగా తీర్చిదిద్దుతామని మోదీ అన్నారు. బీహార్ అభివృద్ధికి సీఎం నితీష్‌కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని రమాదేవి సూసైడ్ చేసుకుంది. రమాదేవి పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రమాదేవి శ్రీకాకుళం జిల్లా వందలపేట వాసి, విద్యార్థి ఆత్మహత్య వివరాలను యాజమాన్యం గోప్యంగా వుంచేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

13:12 - October 14, 2017

 

చిత్తూరు : ఎట్టకేలకు తిరుపతి మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో కదలికవచ్చింది. తుడా భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ అమలుచేసేందుకు టిటిడి కసరత్తు చేస్తోంది. వాస్తవానికి తిరుపతిలో మాస్టర్ ప్లాన్ అమలుకు 2005లో అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే 30 ఏళ్ల వరకు యాత్రికుల రద్దీని అంచనా వేసి, తదనుగుణంగా బృహత్ ప్రణాళిక సిద్దం చేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకు టిటిడి సహకారం తీసుకోవాలంటూ మాస్టర్ ప్లాన్ జీవో కూడా విడుదలైంది. అయితే దీని అమలుపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. తిరుమల కొండపై ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అమలు దశల వారీగా సాగుతోంది. తిరుమల తరహాలో తిరుపతి నగర అభివృద్ధికి తుడా టిటిడి ఉమ్మడి భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు కార్యాచరణకు పచ్చజెండా ఊపారు.

మొత్తం 160 గ్రామాలను కలుపుతూ
తుడా పరిధిలో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, వడమాల పేట, కాళహస్తి, రామచంద్రాపురం, పుత్తూరు మండలాల్లో గల మొత్తం 160 గ్రామాలను కలుపుతూ తయారుచేసిన మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఇందులో భాగంగా ఆయా మండలాల పరిధిలోని ముఖ్య టిటిడి అనుబంధ ఆలయాలను అనుసంధానం చేస్తారు. తిరుపతిలోని గోవింద రాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంతో పాటు మరికొన్ని గుళ్లను అనుసంధానం చేస్తారు. ఇందుకు అనుగుణంగా రహదారుల నిర్మాణం, రోడ్లు విస్తరించి ఓ కారిడార్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తద్వారా భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు ఆలయాలకు ఆదాయం, టూరిజం అభివృద్దికి ఆస్కారం ఉంటుందని యోచిస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఆలయాల చుట్టూ కట్టడాల కూల్చివేత, మల్టీ స్టోర్డ్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, బస్టాండ్ విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. వచ్చే నెల కల్లా దీనిని పూర్తి చేసి, డిసెంబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని టిటిడి, తుడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా 2018 నుంచి తిరుపతి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ఇటు తుడా, అటు టీటీడీ అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

 

 

13:01 - October 14, 2017

 

జనగామ : ఇవాళ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జేఏసీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. లింగాలఘణపురం పోలీస్టేషన్‌లో పలువురు జేఏసీ నాయకులను నిర్బంధించారు. మరోవైపు ఇవాళ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఇతర టీజేఏసీ నాయకులు జనగామజిల్లాకు వస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. జేసేసీ నాయకులను నిర్బంధించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కోదండరాంను చూసి కేసీఆర్‌ సర్కార్‌ భయపడుతోందని విపక్షపార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

13:00 - October 14, 2017

 

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయం దాదాపు 3,100 చదరపు గజాల స్థలంలో ఉంది. 1898లో ప్రారంభమైన కందుకూరి వీరేశలింగం పంతులు గ్రంథాలయం, వాసురయ గ్రంథాలయం కలిపి 1979లో ఇది ఏర్పడింది. లక్షా 30 వేల పుస్తకాలున్న ఈ గ్రంథాలయంలో.. 30 వేల పుస్తకాలు చాలా అరుదైనవి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడా లభించని అపురూపమైన పుస్తకాలు గౌతమీ గ్రంథాలయంలో ఉన్నాయి. వాల్మీకి, పోతన, తిక్కనతో పాటు మరెంతో మంది కవులు రాసిన 411 తాళపత్ర గ్రంథాలు.. వెండి, రాగిప్లేట్ల గ్రంథాలు.. 1771 నాటి బ్రిటానికా ఎన్‌ సైక్లోపీడియా మొదటి ప్రతులు.. 1900కి ముందు ముద్రితమైన 15 వందల పుస్తకాలతో పాటు, 1923కి ముందు ప్రచురితమైన 8,115 పుస్తకాలున్నాయి. 100 వాల్యూమ్‌ల గాంధీ చేతివ్రాత ప్రతులు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు చేతి వ్రాత ప్రతులు, సంస్కృతంలో ఉన్న హోలీ బైబిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలువైన పుస్తకాలకు గౌతమి గ్రంథాలయం చిరునామా. ప్రతీ రోజూ వెయ్యి మందికి పైగా ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతారంటే.. ఇక్కడ ఉన్న విలువైన పుస్తకాలే కారణం.

స్కాన్‌ చేసి సాఫ్ట్ కాపీ రూపం
గౌతమీ గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ స్కాన్‌ చేసి సాఫ్ట్ కాపీ రూపంలో తయారు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన స్కానర్‌ను కొనుగోలు చేస్తున్నారు. వీటన్నింటినీ భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. తాళపత్ర గ్రంధాల సమాచారం అందించేందుకు చల్లా శ్రీ రామచంద్రమూర్తి ఒక పుస్తకాన్నే రాశారంటే.. గౌతమి గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఎంత విలువైనవో ఊహించొచ్చు. వాల్మీకీ మహర్షి రాసిన శ్రీమద్రామాయణము, బాలరామాయణము, కవి భాస్కరాదులు రాసిన రామాయణము సప్తకాండలు, తిక్కన భారతము, కవి పోతన రాసిన భాగవతం, కాళిదాసు రాసిన కుమార సంభవము, నన్నయ, ఎర్రన రాసిన భారతము ఇలా అనేక మంది కవులు రాసిన తాళపత్ర గ్రంథాలు గౌతమి గ్రంథాలయంలో ఉన్నాయి.

గుర్తింపు దక్కడం లేదు...
అరుదైన పుస్తక సంపదకు నెలవైన ఈ గ్రంథాలయానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే గౌతమి గ్రంథాలయాన్ని జాతీయ గ్రంథాలయంగా గుర్తించాలని డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదు. ఆ అర్హత కేవలం గౌతమి గ్రంథాలయానికే ఉందని పలువురు ప్రముఖులు చెప్పారు. ఇన్నేళ్ల తరువాతయినా పాలకులు గౌతమి గ్రంథాలయంపై ప్రేమ చూపిస్తున్నారు. ఎలాంటి నిధులు ఇవ్వకుండానే ఇంతకాలం గడిపేసిన పాలకులు.. ఇప్పటికైనా విలువైన పుస్తక సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

12:59 - October 14, 2017

 

కృష్ణా : ఏపీలో జల రవాణ మార్గాల పనులు ఊపందుకోనున్నాయి. సరకుల చేరవేతకు రైలు, రోడ్డు రవాణ కంటే జల రవాణ చౌకైనది కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జల రవాణ మార్గాల అభివృద్ధితో పర్యాటక రంగం విస్తృతమవుతునందని భావిస్తున్నారు. దేశంలోని ప్రధాన నదులు, కాల్వల్లో 111 జాతీయ జల రవాణ మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గోదావరి, కృష్ణా నదులను కలుపుతూ జల రవాణ మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టంది. తొలిదశలో ముక్త్యాల నుంచి విజయవాడ వరకు 90 కి.మీ. కృష్ణానదిలో నౌకాయానికి అనుగుణంగా కాల్వ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఈనెల 3న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి-కృష్ణా నదుల్లో 315 కి.మీ. మేర అభివృద్ధి చేసే జల రవాణ మార్గానికి 7,015 కోట్ల రూపాయాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా తొలి విడత వంద కోట్ల రూపాలయ నిధులు విడుదల చేసింది. ఇలా దశలవారీగా నిధులు విడుదల చేయనుంది.

ట్రాఫిక్‌, పర్యావరణ సమస్యల పరిష్కారానికి
రోడ్డు, రైలు రవాణకు జల రవాణ పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా... ట్రాఫిక్‌, పర్యావరణ సమస్యల పరిష్కారానికి కొంతవరకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అయితే దీని లాభనష్టాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని ప్రజా సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే సరకు రవాణ యజమానులకు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. పర్యాటక రంగం అభివృద్ధితో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

 

12:56 - October 14, 2017

వరంగల్ : జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి అంటే విద్య ఎంతో అవసరం. అందుకోసమే కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ఉత్కర్ష 2017 వేడుకలు ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రైజాన్‌ ట్రాంజ్‌ బ్యాచ్‌ మెడికోలు. వారం పాటు సాగే ఈ వేడుకల్లో వైద్య విద్యార్థులు అనేక కార్యక్రమాలను చేపట్టారు. నేటితరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను తిలకించేందుకు ఓరుగల్లులోని వివిధ పాఠశాలలోని విద్యార్థులు కేఎమ్‌సీ వైపు అడుగులు వేస్తున్నారు. జూనియర్‌ వైద్యులు ఈ విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తికి ఇవ్వవలసిన ప్రాథమిక చికిత్స దగ్గరి నుండి అత్యవసర పరిస్థితుల్లో దేహాన్ని ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు వివరిస్తున్నారు.

అవయవాలకు సంక్రమించే వ్యాధుల గురించి
విద్యార్థుల్లో వైద్య విద్యపై ఉన్న అపోహను తొలగించి, వైద్య విద్య ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేయడం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మెడికల్‌ విద్యార్థులు తెలిపారు. శరీరంలోని వివిధ భాగాల పనితీరును గోడ పత్రికల రూపంలో ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. ఫోరెన్సిక్‌ వైద్యుల పనితీరుతో పాటు వివిధ విభాగాల వైద్యుల పనితీరును తెలియజేశారు. ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ఎలా సేకరించాలనే విషయాన్ని సూక్ష్మంగా వివరిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలతో మానవ శరీరంలోని అవయవాలకు సంక్రమించే వ్యాధుల నుండి ఎలా రక్షించుకోవాలో నిపుణులచే చక్కగా వివరిస్తున్నారని ప్రదర్శనను వీక్షించిన ఉపాధ్యాయురాలు తెలిపారు. వైద్య విద్య అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం సంతోషంగా ఉందని మెడికల్‌ విద్యార్థులు తెలిపారు. ఉన్నత విద్యలో ఎలా రాణించాలో వివరించిన జూనియర్‌ వైద్యుల ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు. 

12:55 - October 14, 2017

 

హైదరాబాద్ : గ్రేటర్‌ రోడ్లు నరక యాతన మిగులుస్తున్నాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది. గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా తయారైనా అధికారుల తీరు కొంచెం కూడా మారలేదు. ఉదయం, సాయంత్రం రోడ్లపైకి రావాలంటే వాహనదారులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే వారి బాధలు వర్ణనాతీతం. తప్పనిసరై రోడ్లపైకి వస్తే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్థితి.

ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలు
రోడ్లు, వీధులు, బస్తీలు, కాలనీలు.. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలుంటున్నాయి. కంకర తేలిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. సిటీలో ఇదేదో ఒక్క ప్రాంతానికే చెందిన సమస్య కాదు. హైదరాబాద్‌లోని 150 డివిజన్లలోని రోడ్ల దుస్థితి ఇది. ఇక సీసీ రోడ్లన్నీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో కొన్ని కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. ఇక అంబులెన్స్‌లలో వెళ్తోన్న పేషెంట్‌ల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే నరకయాతన అనుభవించాల్సిందే. ఉప్పల్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఎన్‌ఎఫ్‌సీ మార్గాల్లో గంటల తరబడి రోడ్లలో ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ చక్రవ్యూహాన్ని చేధించాలంటే కత్తిమీద సాములా మారింది. అధికారుల సమన్వయలోపం కూడా రోడ్ల దుస్థితికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

30 నిమిషాలు ప్రయాణానికి 3గంటలు
ఇక రోడ్ల స్వరూపం ఇలా ఉంటే, మెట్రో రైలు మార్గాల్లో జరుగుతున్న పనుల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నిమిషాలు సాగాల్సిన ప్రయాణం గంటలు గడుస్తున్నా సాగుతూనే ఉంటుంది. ఈ సమస్యలకు రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండి.. రోడ్లు అధ్వాన్నంగా మారడమే ప్రధాన కారణం. 30 నిమిషాలు సాగాల్సిన ప్రయాణం.. 3 గంటలు పడుతోంది. రోడ్లపై దుమ్ము, ధూళి, కంకర తేలిన రోడ్లు, గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

12:54 - October 14, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట మండలం బారువలో ఉన్న బాలజీ గోశాలలో మూగజీవాలకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. ఆరేళ్ల క్రితం కబేళాకు తరలిపోతున్న ఆవులను సంరక్షించి.. వాటి ఆలనపాలన కోసం ఈ గోశాలను ఏర్పాటు చేశారు. సౌరబ్‌ గౌర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ గోశాలకు భారీగానే నిధులు ఇచ్చారు. అంతేకాదు.. బయట నుంచీ విరాళాలు విరివిగా అందాయి. అయితే ప్రస్తుతం ఈ గోశాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

అత్యంత దుర్భరంగా పరిస్థితి
గోశాలలో పశువుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రారంభంలో 18 వందల గోవులుండే ఈ గోశాలలో.. ప్రస్తుతం నాలుగు వందలు కూడా లేవు. వందలాది గోవులు మాయమైపోయాయి. చాలా వరకూ చనిపోయాయి. ఉన్నవి బక్కచిక్కి..రోగాల బారిన పడి నిలబడేందుకు సత్తువ లేక కుంగి కృశించిపోయాయి. వాటి ఆలనా పాలనా చూసే వారు కరువయ్యారు. ఆవులు ఆకలితో అలమటిస్తూ.. పక్కనున్న తోటలు పంటపొలాలపై పడి మేస్తున్నాయి. దాతల విరాళాలు తగ్గడం.. నిర్వహణ భారం అధికమవడంతో.. నిర్వాహకులు చేతులెత్తేశారు.

నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే
తిండి.. తిప్పలు లేక.. వందలాది సంఖ్యలో గోవులు మృత్యువాత పడుతున్నాయని...స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని.. బాలాజీ గోశాలపై విచారణ జరిపించి..వాస్తవాలు వెలికితీయాలని కోరుతున్నారు. గోవుల సంరక్షణ కోసం ఆందోళనలు కూడా చేపట్టారు. చనిపోయిన గోవుల కలేబరాలను తమ తోటలో పడేస్తున్నారని.. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోశాల పరిసరాల వారు ఆరోపిస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యానికి బాలాజీ గోశాల నిదర్శనంగా మారిందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని.. ఆవులను రక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

12:53 - October 14, 2017

మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజీగూడలో లారీ బీభత్సం సృష్టించింది. రాంగ్‌సైడ్‌ నుంచి దూసుకొచ్చిన లారీ.. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి, లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

12:52 - October 14, 2017

వరంగల్ : జిల్లాలో ఆరవదశ అమరుల స్ఫూర్తియాత్రకు కోదండరాం బృందం సిద్ధం అవుతోంది. దీనికోసం ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవడానికి తార్నాక నుంచి కోదండరాం బయలు దేరారు. యాత్ర సందర్భంగా అధికారులు, పోలీసుల ప్రవర్తిస్తున్న తీరుపై హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నారు కోదండరామ్‌. ఈ సందర్భంగా అడుగడుగునా ఇంటిజెన్స్‌పోలీసులు మోహరించడాన్ని కోదండరాం తప్పుబట్టారు. 

నాంపల్లి వద్ద కోదండరాం అరెస్ట్

హైదరాబాద్: అమరవీరుల స్పూర్తి యాత్ర కోసం జనగామ వెళ్తున్న తెలంగాణ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. నాంపల్లి వద్ద కోదండరాం సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

12:51 - October 14, 2017

 

విశాఖ : కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. నగరంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీ హస్టళ్లలో పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంటర్‌బోర్డ్‌ నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టంచేశారు. కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో మంత్రి తనిఖీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తాం: సీఎం

అమరావతి: రహదారులు, మురుగు కాల్వలను పరిశీలించానని సీఎం చంద్రబాబు అన్నారు. సమస్యలు గుర్తించా, పరిష్కారానికి ఆదేశాలిచ్చాఅని సీఎం తెలిపారు. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా మారుస్తానని, ఇంటి స్థలాలు, ఇళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు. విశాఖ తరహాలో 50 వేళ ఇళ్లను క్రమబద్దీకరిస్తామన్నారు. కాల్వగట్టు పై ఉండేవారికి ఇళ్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని, కొత్తగా 20 వేల ఇళ్లిస్తామని, ఇంటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ పెరుగుతుందని, అన్ని ఆసుపత్రులు, పాఠశాలలనుఅభివృద్ధి చేస్తామన్నారు.

 

12:17 - October 14, 2017

బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో కర్ణాటక పోలీసులు కీలక ముందడుగు వేశారు. లంకేష్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. సిట్ నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేసింది. నిందితలను పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని సిట్ అధికారులు కోరారు. సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్ ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలకువ వీడియో చూడండి.

12:15 - October 14, 2017

 

కర్నూలు : జిల్లా హంద్రినీవా ప్రధాన కాలువకు గండి పడింది. పత్తికొండ మండలం దూదేకొండ వద్ద గండి పడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీవర్షాలకు మట్టి కొట్టుకుపోయి కాలువ కట్ట బలహీనపడడంతోనే గండి పడ్డట్టు తెలుస్తోంది. మరో మూడు చోట్ల గండిపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకువ వీడియో చూడండి.

రోడ్డు డివైడర్ల మధ్యలో ఆడ శిశువు మృతదేహం

హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. రోడ్డు డివైడర్ల మధ్యలో ఆడ శిశువు మృతదేహం లభ్యం అయ్యింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

మురుగు కాల్వలో పసికందు మృతదేహం...

విశాఖ: గాజువాక ఎర్రగడ్డ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అపుడే పుట్టిన పసికందు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మురుగు కాలువలో వదిలిపెట్టి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పసికందు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

12:05 - October 14, 2017

వరంగల్ లో అక్రమ అరెస్ట్ లు ఆపాలి: కోదండరాం

హైదరాబాద్: అక్రమ అరెస్ట్ లపై హో మంత్రి నాయిని కోదండరాం కలిశారు. హోంమంత్రి సమాధానం సంతృప్తిగా లేదని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ లో అక్రమ అరెస్ట్ లు ఆపాలని డిమాండ్ చేశారు. యాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అమరవీరుల స్ఫూర్తి యాత్ర అనుమతి కోరినా మా దరఖాస్తును పెండింగ్ లో పెట్టి అరెస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ లు కొనసాగితే చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు.

12:00 - October 14, 2017

విటమిన్ డి. దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సహజంగా సూర్యకాంతి ద్వారా ఈ విటమిన్ మనకు లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం.

విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు..

చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. డి-విటమిన్ లోపించిన వారిలో తరచుగా ఒళ్లు విరుచుకోవడం, బాడీ పెయిన్స్, నిస్సత్తువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్ తీసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. అయితే, ఎండ బారిన పడకుండా, హాయిగా నీడపట్టున ఉంటున్నామనో, ఏసీలో కూర్చుని ఎంచక్కా పనిచేసుకుంటున్నామనో సంతోషించే వారు లేకపోలేదు. ముఖ్యంగా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసు గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిష్ట్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు డి-విటమిన్ లోపించే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం.

11:46 - October 14, 2017

గురు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేశ్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్, ఎకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రానాతో నేనే రాజు నేనే మంత్రి అంటూ ఓ పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించి తేజ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. వెంకీ-తేజ కాంబోలో సురేశ్ ప్రొడక్షన్స్ ఓ సినిమాను సెట్ చేసింది. ఇక ఈసినిమాలో వెంకీ లెక్చరర్ క్యారెక్టర్ చెయ్యబోతున్నాడు. ఈసినిమాలోనే అనుష్క హీరోయిన్ గా చేస్తోందని టాలీవుడ్ టాక్.

గౌరీ లంకేష్ హత్య కేసులో ఊహా చిత్రాల విడుదల

బెంగళూరు: జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఊహాచిత్రాలను విడుదల చేశారు.

11:34 - October 14, 2017

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాజశేఖర్ నటిస్తున్న సినిమా ‘ఎస్వీ గరుడవేగ’ పనులు దాదాపు క్లైమాక్స్‌కి చేరుకున్నాయి. ఇందులో సన్నీలియోన్ రూరల్ అమ్మాయిగానే కాకుండా స్పెషల్‌గా ఓ సాంగ్ చేస్తోంది. ఇందుకోసం ముంబైలో స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్స్‌లో సాంగ్‌ని చిత్రీకరించారు. ‘డియ్యో డియ్యో’ అంటూ సాగే ఈ పాట యూత్‌ని ఆకట్టుకోవడం ఖాయమని అంటోంది యూనిట్. దీనికి సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ పాట‌ను గీతామాధురి, ర‌ఘు పాడారు. రాజశేఖర్ పక్కన హీరోయిన్ పూజాకుమార్ కాగా, ఇందులో శ్రద్ధా‌దాస్, అదితి అరుణ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో 349 గ్రా.ల బంగారం స్వాధీనం...

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రాయాణీకుడి నుంచి 349 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ సీఎం కారు దొరికింది...

న్యూఢిల్లీ: చోరీకి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు దొరికింది. నేటి ఉదయం ఘజియాబాద్‌లో ఆ కారును గుర్తించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం నుంచి కేజ్రీకి చెందిన బ్లూ వాగన్ ఆర్ కారు చోరీకి గురైంది. ఆ కారును ముద్దుగా ఆప్ మొబైల్ అని పిలుస్తారు. సీఎం కారు చోరీకి గురికావడంతో అదో సంచలనంగా మారింది. కేజ్రీ కారును ఢిల్లీ పోలీసులకు అందించనున్నట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. కారు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన.. తన లేఖలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

11:18 - October 14, 2017

చెన్నై: ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు సంతా నంకు షరతులతో కూడిన మందస్తు బెయిలును హైకోర్టు మంజూరు చేసింది. నటుడు సంతానం కుండ్రత్తూరు సమీపంలో ఓ కళ్యాణ మం డపం నిర్మించేందుకు వలసరవాక్కం లోని ఇన్నోవేటివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని భారీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాడు. అయితే ఆ కంపెనీ మూడేళ్లుగా కళ్యాణమండపాన్ని నిర్మించక పోవడంతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఆ కంపెనీ తీసుకున్న అడ్వాన్స్‌లో కొంత మేరకే చెల్లించింది. ఇటీవల ఆ కంపెనీ ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం కోసం సంతానం వెళ్లగా కంపెనీ యజమాని షణ్ముగసుందరం, ఆయన స్నేహితుడైన న్యాయవాది ప్రేమ్‌ ఆనంద్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సంఘటనలో న్యాయ వాది ప్రేమ్‌ ఆనంద్‌, సంతానం కూడా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న ప్రేమ్‌ఆనంద్‌ వలసరవాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో సంతానం ఆ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టులో ముంద స్తు బెయిలు కోరారు. న్యాయమూర్తి ఆది నాధన్‌ పిటీషన్‌పై విచారణ జరిపి రెండువారాలపాటు వలసరవాక్కం పోలీసు స్టేషన్‌లో సంతకం చేయాలన్న షరతుతో బెయిలు మంజూరు చేశారు.

నిలోఫర్ దవాఖానలో ఓపీ సమయం పెంపు

హైదరాబాద్ : రోగుల సౌకర్యార్ధం నిలోఫర్ ఆసుపత్రిలో ఓపీ సేవల సమయాన్ని గంటన్నర పొడిగించినట్లు ఓపీ బ్లాక్ ఆర్‌ఎంఓ డా.రమేష్ దాంపురి తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండేవని, 11గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసేవారని తెలిపారు. ఈనెల 10నుంచి ఓపీ సేవలను గంటన్నర పాటు పొడిగించినడంతో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం 1.30గంటల వరకు ఓపీ సేవలు అందుబాటు ఉంటున్నట్లు ఆయన వివరించారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ ఉంటుందని, 1.30గంటల వరకు ఓపీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

'కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు దేశంలోనే అగ్రగామి'

వరంగల్:కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు దేశంలోనే అగ్రగామి గా నిలవబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. బడ్జెట్ లో నేరుగా కార్పొరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫాంటూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ అని తెలిపారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు చేస్తున్నామని, రూ.667 కోట్లతో టెక్స్ టైల్స్ మొదటి దశ పనులు చేపట్టామని చెప్పారు. దీంతో 1.2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్స్ టైల్స్ కాలేజ్ స్థాపనకు కొయంబత్తూరుతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు.

ఇండోర్ స్టేడియంలో పోలీస్ ఎక్స్ పో ఏర్పాటు

హైదరాబాద్: పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పోలీస్ ఎక్స్ పో ఏర్పాటు చేశారు. అమరవీరులకు నివాళులర్పించిన హోంమంత్రి నాయిన పోలీస్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటిస్తున్నారు. హరిత హోటల్‌లో సీఎం వరంగల్ పర్యటనపై నాయకులతో చర్చిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి టాస్క్ రీజినల్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

ముత్యాలంపాడులో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ: ముత్యాలంపాడులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 9 గంటలకైనా చెత్త ఎందుకు తొలగించలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

10:35 - October 14, 2017

 

కర్నూలు : శ్రీశైలం జలశయానికి వరద ఉధృతి పెరుగుతుండంతో అధికారలు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2,04276 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,00209 క్యూసెక్కులుగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:34 - October 14, 2017

 

గుంటూరు : అమరావతిలో పోలీస్ వ్యాన్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఓ స్కూటీ అదుపు తప్పడంతో స్కూటీపై ఉన్నవారు కింద పడ్డారు. ఉండవల్లి కరకట్ట వద్ద సీఎం నివాసానికి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వన్ వేలో అతి వేగంతో డ్రైవింగ్ చేయడం తప్పని వారు వాదిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మొదలైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక వేడి

చెన్నై: డాక్టర్‌ రాధాకృష్ణ నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డిసెంబరు 31లోపు నిర్వహిస్తామని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అప్పుడే దీనిపై రాష్ట్రంలో వేడి మొదలైంది.

ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఆర్మీ బలగాలు మట్టుబెట్టాయి. లష్కరే టాప్ కమాండర్ వసీమ్ షాతో పాటు మరో మిలిటెంట్ నిసార్ అహ్మాద్ మీర్ కాల్పుల్లో హతమయ్యారు. పుల్వామాలో మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం రావడంతో ఇవాళ ఉదయం భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. కాల్పులు జరిపిన మిలిటెంట్లపై.. భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఉగ్రవాదుల నుంచి ఏకే47, ఏకే56, ఏకే6 మ్యాగ్జిన్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

విజయవాడలో సీఎంచంద్రబాబు ఆకస్మిక తనిఖీలు

విజయవాడ: సీఎం చంద్రబాబు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పాత బస్టాండ్ లోని పార్క్ ను చంద్రబాబు సందర్శించారు. ఆ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కంట్రోల్ రూం కూడలి వద్ద వ్యర్థాలతో రూపొందించిన పార్కును సీఎం పరిశీలించారు. బందర్ కాల్వ వద్ద పచ్చదనాన్ని కూడా పరిశీలించారు.

త్వరలో రాహుల్ కు పగ్గాలు: సోనియా

న్యూఢిల్లీ: త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు ఆమెను రాహుల్ గురించి అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తారని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా కూడా ఆ ప్రశ్నలకు స్పందించారు. పార్టీ చీఫ్‌గా రాహుల్‌కు పదోన్నతి త్వరలోనే జరుగుతుందని సోనియా తెలిపారు.

09:32 - October 14, 2017

 

ఖమ్మం : భద్రాద్రి రామయ్య ను చినజీయర్‌స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. భగవంతుడికి జరగాల్సిన సేవలు సవ్యంగా జరిగితే.. అందరూ సుభిక్షంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్స్‌ సరిగ్గా కట్టాలన్నారు. సమాజంలో పాలకుడు సమర్థుడు కావాలని.. సీఎంకేసీఆర్‌ సమర్థుడని చినజీయర్‌స్వామి అన్నారు.  

09:31 - October 14, 2017

కడప : నగరానికి సమీపంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీటితో ప్రాజెక్ట్‌ నిండిపోయింది. భారీ వర్షాలు పడిన ప్రతీసారీ బుగ్గవంక నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం నీటితో నిండిపోవడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నీటిని బయటకు వదిలేస్తున్నారు. ఒక గేటు ద్వారా 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే ప్రాజెక్ట్‌లోకి 200 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. 

09:30 - October 14, 2017

కడప : బద్వేల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బద్వేల్ డిపోలోకి నీరు చేరడంతో.. డిపోలో పనులకు ఆటంకం ఏర్పడింది. బస్టాండ్‌కు బయట రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగడంతో డిపో నుంచి నీరు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే రోడ్డులో కూడా ఎక్కువ నీరు చేరడంతో పాదచారులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. అలాగే పోరుమామిళ్లలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. పోరుమామిళ్ల బస్టాండులోకి కూడా నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదురుకున్నారు. 

08:08 - October 14, 2017
08:07 - October 14, 2017

ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ మ్యాచ్ లు

ఢిల్లీ : ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ లో సాయంత్రం 5గంటలకు గినియా వర్సెస్ జర్మనీ, కోస్టరికా వర్సెస్ ఇరాన్, రాత్రి 8 గంటలకు స్పెయిన్ వర్సెస్ కొరియా, నైగర్ వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

నేడు తెలంగాణలో రేషన్ షాపులు బంద్

 

హైదరాబాద్ : నేడు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్ జరగనుంది. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని వీరు డీలర్లు బంద్ కు పిలుపునిచ్చారు.

ఆసిఫాబాద్ లో టీమాస్ అవిర్బావ సభ

 

కొమరంభీం ఆసిఫాబాద్ : నేడు జిల్లాలో టీమాస్ అవిర్భావ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి గద్దర్, విమలక్క, జాన్ వెస్లీ, సాయిబాబు పాల్గొననున్నారు.

అనంతపురం జిల్లాలో దారుణం

 

అనంతపురం : జిల్లాలో ఓ విద్యార్థినిపై సీనియర్లు వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోన్న ఓ విద్యార్థినిని సీనియర్లైన హననీయ, బాలజీలు కొన్నాళ్లుగా వేధిస్తున్నారు. మూడు రోజులుగా తమను ప్రేమించాలని కొడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

పెద్దపల్లి జిల్లాలో విషాదం

 

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మైదుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ..3 రోజులుగా ప్రియుడి ఇంటి ప్రియురాలు ధర్నా చేస్తోంది. అయితే మనస్తాపంతో ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు.. యువతిపై దాడి చేశారు.

నేడు వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

 

వరంగల్ : నేడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి వరంగల్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

07:27 - October 14, 2017

జిల్లాల విభజనను సీపీఎం పార్టీ స్వాగతించిందని, కొత్త జిల్లాలను కేంద్ర నోటిఫై చేసిందా లేదా అన్నది ప్రశ్న అని, సెట్రల్ సర్వీస్ క్యాడర్ ఆయ రాష్ట్రాల జనాబా బట్టి కేటాయిస్తారని, ముఖ్యమంత్రి జిల్లాల ఏర్పాటు చేసినప్పుడు మళ్లీ సంవత్సరం తర్వాత మాట్లాడారని, కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలని, ఆదిలాబాద్ నాలుగు జిల్లాలు చేసి తప్ప అభివృద్ధి పై దృష్టి పెట్టాలని, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవరించడం లేదని, ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారని సీపీఎం సీనియర్ నేత వెంకట్ అన్నారు. సీఎం ఎప్పుడు అసహనంగా లేరని, అది ఆయన మాట్లాడే తీరు అదే విధంగా ఉంటుందని టీఆర్ఎస్ నేత రాజామోహన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:17 - October 14, 2017

2010 రాబిట్ ఫామ్ ప్రారంభించమని, దానికోసం రకరకాల ప్రయోగాలు చేశామని దానిలో భాగంగా హెడ్జ్ లోస్ వచ్చిందని, ఇందులో మంచి మాంస కృత్తులు ఉంటాయని, దానలో పోషక విలువలు తక్కువగా ఉంటాయని,  హెడ్జ్ లోస్ లాంగ్ పంట ఇది ఎకరానికి 5 నుంచి పది టన్నులు వస్తోందని షాద్ నగర్ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:16 - October 14, 2017

ఢిల్లీ : బాణసంచాపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్‌ 1వ తేదీవరకు ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్‌ పరిధిలో పటాకులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై నిషేధానికి మతం రంగు పులమడం తమను బాధ కలిగించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యానికి సంబంధించిన ఈ అంశంపై కొందరు మతం రంగు పులమడానికి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధానికి ముందు అక్టోబర్‌ 9కి ముందు పటాకులు కొనుగోలుచేసిన వారికి కాల్చడానికి కోర్టు అనుమతించింది. బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బాబా రాందేవ్‌ తప్పుపట్టారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పటాకులపై బ్యాన్‌ వల్ల కాలుష్యం ఎంతవరకు తగ్గిందన్నది... దీపావళి తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

07:15 - October 14, 2017

 

అహ్మదాబాద్ : తన కుమారుడు జయ్ షా కంపెనీపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మౌనం వీడారు. జయ్‌ షా కంపెనీ ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం నుంచి సెంటు భూమి కూడా తీసుకోలేదని...జయ్ షా వ్యాపార లావాదేవీల్లో అవినీతి ప్రసక్తే లేదన్నారు. టర్నోవర్‌కు లాభాలకు తేడా ఉంటుందని తెలిపారు. తన కుమారుడు స్వయంగా విచారణకు ముందుకు వచ్చారని, 100 కోట్ల పరువు నష్టం దావా వేశారని అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ వద్ద ఏవైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చని ఆయన సూచించారు. కాంగ్రెస్‌లోనే అవినీతి నేతలున్నారని వారిపై విచారణ జరపకుండా బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. జయ్‌ షా కంపెనీ టర్నోవర్ 50 వేల నుంచి 80 కోట్లకు చేరుకుందని 'ది వైర్‌' వెబ్‌సైట్‌ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. 

07:14 - October 14, 2017

ఢిలీ : దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆగష్టు మాసపు గణాంకం వెలువడింది. అది జూలై మాసం తాలూకు అతి తక్కువ స్థాయి అయిన 0.9% కంటే గణనీయంగా మెరుగుపడి 4.3% పెరుగుదలను నమోదు చేసింది. సొంతపార్టీకే చెందిన యశ్వంత్‌ సిన్హా.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల అమలు పర్యవసానాలపై మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పెరగడం మోదీకి కాస్తంత ఊరటనిచ్చేదే.

నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం
కింద పడ్డా గెలుపు తనదేననే స్వభావం వున్న ప్రధాని మోదీ.. తాజాగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధినీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల.. సామాన్య ప్రజలు నానా అవస్థలూ పడుతుంటే, 2016-17 సంవత్సరపు 3వ త్రైమాసికపు గణాంకం 7 శాతాన్ని చూపి.. జీడీపీపై విపక్షాలను దులిపేశారు. అంతేనా, నోట్ల రద్దును గొప్పచర్యగా సమర్థించుకున్నారు. ఆ తర్వాత, అదే సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం, అనంతరం 5.7 శాతం జీడీపీ నమోదయ్యాక గానీ, మోదీ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

జి.డి.పి తగ్గుదల తాత్కాలికమే
జి.డి.పి తగ్గుదల కేవలం తాత్కాలికమేనని, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయనీ వితండ వాదనలు చేస్తూనే, గతంలో రద్దు చేసిన ఆర్థిక సలహా మండలి పునరుద్ధరణ లాంటి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు మోదీ. అయితే, ఈ చర్యలన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉన్నయన్నది విశ్లేషకుల భావన. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆగస్టు మాసపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.3 శాతం నమోదు కావడం, మోదీకి, మునిగేవాడికి గడ్డిపోచ దొరికన చందమేనన్న భావన వ్యక్తమవుతోంది. ఆగస్టుమాసంలో పారిశ్రామిక సూచీ పెరుగుదల పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్‌ కారణంగానే అన్నది విశ్లేషకుల అంచనా. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా ఉత్పత్తి పెరుగుదల నమోదవుతుందన్న నమ్మకం ఎవ్వరిలోనూ వ్యక్తం కావడం లేదు. పైగా పండుగ సీజన్‌ వెళ్లగానే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్న భావనా వ్యక్తమవుతోంది. గతంలో, నోట్ల రద్దు వేళ.. ప్రజల దగ్గర కరెన్సీ అందుబాటులో లేకున్నా, పారిశ్రామిక సరకుల డిమాండ్‌ నిలదొక్కుకోవడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మోదీ బృందం తాత్కాలిక విపత్తుల నుంచి గట్టెక్కే అడ్డదారులను వెతకడాన్ని ఇకనుంచైనా మానుకుని, ప్రజలను గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

 

07:12 - October 14, 2017

అనంతపురం : జిల్లాలో ఓ విద్యార్థినిపై సీనియర్లు వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోన్న ఓ విద్యార్థినిని సీనియర్లైన హననీయ, బాలజీలు కొన్నాళ్లుగా వేధిస్తున్నారు. మూడు రోజులుగా తమను ప్రేమించాలని కొడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హననీయ, బాలాజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:06 - October 14, 2017

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మైదుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ..3 రోజులుగా ప్రియుడి ఇంటి ప్రియురాలు ధర్నా చేస్తోంది. అయితే మనస్తాపంతో ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు.. యువతిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Don't Miss