Activities calendar

16 October 2017

21:59 - October 16, 2017

ఢిల్లీ : ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే బీజేపీ శక్తులు తమపై దాడులకు పాల్పడుతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన సీపీఎం  కేంద్రకమిటీ సమావేశాల అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. రెండువారాలుగా సీపీఎం కార్యాలయాలపై బీజేపీ చేస్తున్న దాడిని సీతారం ఏచూరి ఖండించారు. ప్రజాస్వామ్య విలువలు హరించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారాయన. కేరళ, ఢిల్లీలలో బీజేపీ చేస్తున్న ఆందోళనలు విఫలమయ్యాయని విమర్శించారు. బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ రేపు ఢిల్లీలో ప్రజా ర్యాలీ నిర్వహించనున్నట్లు సీతారాం ఏచూరి తెలిపారు. 

 

21:55 - October 16, 2017

వరంగల్ : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. అదే ఆసుపత్రిలో మృత్యువు ప్రమాదం రూపంలో మింగేసింది. వరంగల్ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదం రోగులను వణికించింది. ప్రమాద సమయంలో పేలిన సిలెండర్ ధాటికి రోగులు భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. అప్పటికే పరిస్థితి విషమించిన ఇద్దరు రోగులు కన్నుమూశారు. రోహిణీ ఆసుపత్రి నుంచి టెన్ టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:51 - October 16, 2017
21:49 - October 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతునే ఉన్నాయి. ఈరోజూ ఏపీలో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల మరణాలకు యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీరిని నియంత్రించకుండా చేష్టలుడిగిన ప్రభుత్వ తీరుకు నిరసనగా.. రాష్ట్రాల్లో ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలను బంద్‌ చేయించాయి. ఒత్తిడి పెరుగుతుండడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. 
వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. కన్నవారికి తీరని కడుపుకోతను మిగులుస్తున్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో.. ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ విద్యార్థుల సూసైడ్స్‌ జరుగుతూనే ఉన్నాయి. ర్యాంకుల వేటలో బలవంతపు చదువులు రుద్దడమే దీనికి కారణమన్న భావన వ్యక్తమవుతోంది. ప్రైవేటు యాజమాన్యాల తీరుకు.. వారిని నియంత్రించలేని ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు.. సోమవారం, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థలను బంద్‌ చేయించాయి. స్వేచ్ఛావాతవరణంలో చదువులు సాగేలా.. కార్పొరేట్‌ కాలేజీలను ఆదేశించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. 
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం 
విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగింది. కృష్ణాజిల్లాలో 10 రోజుల్లో 7 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రులు  నారాయణ, గంటా శ్రీనివాసరావులను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోనూ విద్యార్థి సంఘాలు ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల బంద్‌ పాటించాయి. అటు విశాఖలోనూ విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నాకు దిగాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నా... సర్కార్‌ స్పందించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి గంటా తన వియ్యంకుడి కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో కదలిక
విద్యార్థి సంఘాల ఆందోళనతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో కదలికవచ్చింది. అమరావతిలో విద్యాశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందులో భాగంగా, 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధానాన్ని ఇంటర్‌లోనూ ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టాలని  నిర్ణయించారు. వీటితో పాటు..విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2012 నుంచి ఇప్పటివరకు 35 మంది విద్యార్థులు చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ఆత్మహత్యలు కూడా అత్యధికంగా నారాయణ, చైతన్య కాలేజీల్లోనే జరిగాయన్న వాస్తవాన్నీ ప్రభుత్వం అంగీకరించింది. 

 

రోహిణి ఆస్పత్రికి చేరిన కడియం శ్రీహరి, కలెక్టర్ అమ్రపాలి

వరంగల్ : హన్మకొండలో రోహిణి ఆస్పత్రికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కలెక్టర్ అమ్రపాలి, సీపీ సుధీర్ బాబు చేరుకున్నారు. ఆస్పత్రిలో 200 మంది రోగులకు గాను 198 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని కడియం శ్రీహరి తెలిపారు. 

హన్మకొండలో రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...ఇద్దరు రోగులు మృతి

వరంగల్ : హన్మకొండలో రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులు మృతి చెందారు. 

21:26 - October 16, 2017

సిద్దిపేట, యాద్రాదికి నడుమ నీళ్ల పంజాది....తపాస్ పల్లి నీళ్ల కోసం ఆలేరొళ్ల తండ్లాట, ఇంత పెద్దమియా..డేడ్ పైసా దియా..దారిదప్పిన డబుల్ బెడ్ ఇళ్ల స్కీం, కోదండరాం ఎనుక నక్సలైట్లున్నరంట గదా..ఎడ్డి మాటలు మాట్లాడుతున్న ఇంటి మంత్రి, యాదాద్రి నర్సన్న గుడికి క్యాన్సర్ ముప్పు..ఉద్యమానికి రడీ అయితున్న బాధితులు, సర్కారు గొర్లముకున్న సంఘపొళ్లు...దొర్కిచ్చుకున్న ఆర్మూరు పోలీసొళ్లు, దొంగలకు సందిగడుతున్న గుంటూరు ఖాకీలు.. ఏడుగుర్ని సస్పెండ్ జేసిన జిల్లా ఎస్పీసారు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:11 - October 16, 2017

వరుసగా ఒకరి తర్వాత మరొకరు.. కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు.. బంగారు భవిష్యత్తును కాదనుకుని వెళ్లిపోతున్నారు.. ఏ ఒత్తిడి ఆ చిన్నారులను చిదిమేస్తోంది? ఏ భారం వారిని ఆత్మహత్య దిశగా నెడుతోంది? మార్కుల వేటలో,  ర్యాంకుల గోలలో కార్పొరేట్ విద్యా సంస్కృతి చిన్నారుల చావులకు కారణమౌతోందా? ప్రభుత్వాన్నా, తల్లిదండ్రుల్నా, కార్పొరేట్ విద్యావ్యవస్థనా ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ...
చిన్నారుల ఉసురు తీస్తున్న చదువుల నిలయాలు  
చదువంటే ఉత్సాహం.. చదువంటే ఉత్తేజం..చదువంటే భవిష్యత్తు కోసం ఈ రోజు చేసే తపస్సు...కానీ, ఈ చదువుల నిలయాలు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. అనేక కారణాలతో విద్యార్థులు నలిగిపోతున్నారు..  ప్రాణాలు తీసుకుంటున్నారు..  ఇల్లు వదిలిపోతున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:03 - October 16, 2017

కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు పెట్టే ఒత్తిడి, వేధింపుల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ జీవీఆర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బాబురెడ్డి, మానసిక నిపుణులు పీఎస్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:57 - October 16, 2017
19:47 - October 16, 2017

ఢిల్లీ : తమ పార్టీ కార్యాలయాలపై బీజేపీ, ఆర్ ఎస్ కార్యకర్తలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ రేపు బీజేపీ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరిగాయి. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ దేశంలో పాలక పార్టీ బీజేపీ..ఢిల్లీలోని జాతీయ పార్టీ అయిన సీపీఎం కేంద్ర కార్యాలయంపై రెండు వారాలుగా దాడులకు పాల్పడుతోందని చెప్పారు. కేంద్రమంత్రి నాయకత్వంలో ప్రతి రోజు దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రోజు కేంద్రమంత్రులు మారుతూ ప్రదర్శనలు, ధర్నాలు చేశారని తెలిపారు. ఈ విధంగా ఒక పార్టీ.. మరోపార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, కార్యాలయాల ముందు ప్రదర్శనలు, ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదని, ఎవ్వరూ చేయలేదని చెప్పారు. తమపై పార్టీ కార్యాలయాలపై బీజేపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను జీజేపీ తుంగలో తొక్కుతోందన్నారు. కేరళ, ఢిల్లీల్లో సీపీఎం కార్యాలయాల వద్ద బీజేపీ ప్రదర్శనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ రేపు బీజేపీ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. కేరళలో హింసకు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కారణమని తెలిపారు. కేరళలో హింసను ప్రారంభించింది, పాల్పడుతున్నది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లని పేర్కొన్నారు. తిరిగి తమపై ఆరోపణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేరళలో చనిపోయిన వారిలో అధికమంది తమ పార్టీ వారున్నారని తెలిపారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న కుంభకోణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యాపం, పనామా, ల్యాండ్ స్కాంపై విచారణ జరగలేదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారాలు పడ్డాయన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నిరుద్యోగం పెరిగిందని, దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ లో కూడా నిరుద్యోగం పెరుగుతుందన్నారు. అమిత్ షా కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్ లో 2018 ఏప్రిల్ 18 నుంచి 22 వరకు తమ పార్టీ జాతీయ మహాసభలు జరుగుతాయని చెప్పారు. మహాసభలకు 765 ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మహాసభల్లో చర్చించి, రాజకీయ తీర్మాణాలు చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

బీజేపీ ప్రదర్శనలు అట్టర్ ఫ్లాప్ : ఏచూరి

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను జీజేపీ తుంగలో తొక్కుతోందన్నారు. సీపీఎం కార్యాలయాల వద్ద బీజేపీ ప్రదర్శనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ రేపు బీజేపీ కార్యాలయం వద్ద సీపీఎం ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. అమిత్ షా కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 
నిరుద్యోగులు, రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించామని తెలిపారు.

 

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులపై చర్చించినట్లు సమాచారం. 

19:28 - October 16, 2017

గుంటూరు : విద్యార్థులను రోబోలుగా మార్చే కార్పోరేట్‌ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలకు స్వీయ నియంత్రణ ఉండాలని, విద్యార్థులను వేధించే పద్ధతులను తక్షణం వదిలిపెట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కళాశాల యాజమాన్యాలతో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులను రోజులో 18 గంటలు చదువుకే పరిమితం చేయడాన్ని మార్చాలని సూచించారు. ఇంటర్‌లో ర్యాంకులు ఎత్తివేసి గ్రేడింగ్‌ విధానం తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులను ర్యాంకుల కోసం వేధించొద్దని సూచించారు. నెలకోసారి కమిటీతో, మూడు నెలలకోసారి కళాశాలల ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించే దిశగా కళాశాలకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

19:22 - October 16, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో చైన్ స్నాచర్ బరితెగించాడు. హెల్మెట్ ధరించి ఇంట్లోకి చొరబడ్డ దొంగ... మమత అనే మహిళ కంట్లో స్ప్రే కొట్టి 4 తులాల పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు... నిందితుని కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

వరంగల్‌ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

వరంగల్‌ : రోహిణి ఆస్పత్రిలో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మంటలు భారీగా విస్తరించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రులో ఉన్న పేషెంట్లను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

19:19 - October 16, 2017

వరంగల్‌ : రోహిణి ఆస్పత్రిలో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మంటలు భారీగా విస్తరించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రులో ఉన్న పేషెంట్లను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నకిలీ పెన్షన్లపై విజిలెన్స్ అధికారులు తనిఖీ

కృష్ణా : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఉయ్యూరులో వెలుగు చూసిన నకిలీ పెన్షన్ల అంశంపై విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలకు వచ్చింది. అయితే విచారణకు సహకరించని ఏ.డి.రత్నకుమారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

19:11 - October 16, 2017

కృష్ణా : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఉయ్యూరులో వెలుగు చూసిన నకిలీ పెన్షన్ల అంశంపై విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలకు వచ్చింది. అయితే విచారణకు సహకరించని ఏ.డి.రత్నకుమారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:09 - October 16, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మంత్రి హరీశ్‌రావు గోబెల్స్‌ ప్రచారకర్తగా మారారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరిదశ పనులు పూర్తిచేసి.. ప్రాజెక్టు మొత్తం తమ ప్రభుత్వమే నిర్మించిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. భూనిర్వాసితులు న్యాయం కోసం కోర్టులకు వెళితే అదో పెద్ద నేరంగా పరిగణించడం దుర్మార్గమన్నారు. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టిన విషయం ప్రజలకు తెలుసన్నారు. 

 

19:05 - October 16, 2017

గుంటూరు : అమరావతిలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గంటా తెలిపారు. 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధాన్ని ఇంటర్‌లో ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటితో పాటు..  విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

 

19:01 - October 16, 2017

సోమాలియా : సోమాలియా రాజధాని మోగదిశులో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 276కు చేరింది. మరో 250 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు ఓ ట్రక్కు ద్వారా భారీ విస్ఫోటానికి పాల్పడ్డారు. బాంబు పేలుడు ధాటికి ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మృతులను గుర్తించలేని విధంగా ఘటనా స్థలంలో శవాలు తునక తునకలుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మొగదిశులోని విదేశీ మంత్రిత్వ శాఖ సమీపంలో సఫారి హోటల్‌ గేటును ట్రక్కు ఢీకొనడం ద్వారా ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు. ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదాకు చెందిన అల్‌-శబాబ్‌ పేలుళ్లకు పాల్పడిందని ప్రభుత్వం తెలిపింది. సోమాలియా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉగ్రవాద దాడి. గాయపడ్డవారికి రక్తం దానం చేసేందుకు ప్రజలు ఆసుపత్రుల ముందు బారులు తీరారు. సోమాలియా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లాహీ దేశంలో 3 రోజుల సంతాపాన్ని ప్రకటించారు.

 

18:58 - October 16, 2017

ఉత్తరప్రదేశ్ : ఆరుషి-హేమ్‌రాజ్‌ హత్యకేసులో ఆరుషి తల్లిదండ్రులను అహ్మదాబాద్‌ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో వారు ఈ రోజు డాస్‌నా జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ  కేసుకు సంబంధించి 2013 నుంచి డాస్‌నా జైలులో వారు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షా కాలంలో వైద్యులైన రాజేష్‌, నుపుర్‌ తల్వార్ దంపతులు ఖైదీలకు వైద్య సేవలందించారు. ఈ సేవల ద్వారా గడించిన డబ్బు తీసుకోవడానికి వారు నిరాకరించారు. రాజేష్‌, నుపుర్‌లు ఖైదీలకు వైద్యం చేసినందుకుగాను 49 వేల 5 వందల రూపాయలు గడించినట్లు జైలు అధికారి మౌర్య తెలిపారు. తాము విడుదలైనప్పటికీ ప్రతి 15 రోజులకోసారి జైలుకు వచ్చి ఖైదీలకు ఉచితంగా వైద్య సేవలందిస్తామని వారు హామీ ఇచ్చినట్లు జైలు డాక్టర్‌ సునీల్‌ త్యాగి పేర్కొన్నారు. 

18:55 - October 16, 2017

కర్నూలు : భారీ వర్షాలతో కర్నూలు జిల్లా వణుకుతోంది. జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనావాసాల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 17 సంవత్సరాలనాటి చరిత్రను తిరగరాస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లా భారీ వర్షాలు  
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల, పడకండ్ల, కందుకూరు,... దోర్నిపాడు మండంలంలోని నందింపల్లె, చాగలమారిలోని కలుగొట్ల పల్లె గ్రామాలు జలమయ్యాయి. అనేక ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి. వర్షాలు కురిస్తే గ్రామమంతా నీటమునుగుతుందని నల్లగట్ల సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. దాదాపు 1500ఏకరాల్లో వరి, కంది, జొన్న నీటమునిగాయి. నేలంపాడు గ్రామంలో నీరు చేరడంవల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కో ఎకరాకు దాదాపు 25 వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. 
నల్లగట్ల గ్రామం జలమయం 
అంతేగాక ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామం మొత్తం జలమయమయ్యింది. గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలలోకి నీరు చేరడంతో పిల్లలు చదువుకోలేక పోతున్నారు. పాఠశాల మొత్తం నీట మునిగిపోవడంతో చదువు చెప్పలేక పోతున్నామని ప్రధానోపాధ్యాయులంటున్నారు.
పొంగిపోర్లుతున్న కాలువలు, రహదారులు 
ఉయ్యాలవాడ మండలం రూపనగుడి, ఇంజేడు, గ్రామాల్లో దోర్నిపాడు మండలం నందింపల్లె తదితర గ్రామాల్లో కాలువలు, రహదారులు పొంగిపోర్లుతున్నారు. నంద్యాల, మహానంది మండలాల్లో కూడా వరుణుడి ప్రతాపానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్లమల్ల అడవిలో పడిన వానకు పాలేరు వాగు పొంగిపొర్లుతుంది. పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో మహానంది గాజులపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరుస వర్షాలతో గ్రామాల్లోని ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని గ్రామాల్లోని ప్రజలు  కోరుతున్నారు 

 

18:52 - October 16, 2017

గుంటూరు : రక్షకులే భక్షకులవుతున్నారు. సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టాల్సిన వాళ్లే.. వక్ర మార్గంలో వెళ్తున్నారు. పేకాట, వ్యభిచారం, బెట్టింగ్, గంజాయి రవాణా ఇలా ఒకటేమిటి.. ప్రతీ దాంట్లో వారి పాత్ర ఉంటోంది. కారణాలేవైనా ఉన్నతాధికారులు కూడా చూసీ చూడనట్లు మిన్నకుండిపోతున్నారు.
రాజకీయ నాయకుల అండతో తప్పులు 
గుంటూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా కొందరు పోలీసు అధికారులు బరితెగించారు. రాజకీయ అండదండలతో జిల్లాలో ఎక్కువ మంది ఉన్నతాధికారులను కూడా లెక్క చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఫ్యామిలీ పంచాయితీల నుంచి సివిల్ పంచాయితీల వరకు అన్నీ తమ కనుసన్నల్లోనే జరిపిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసులు బాధితుల నుండి డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. 
బెట్టింగ్ మాఫియాపై దృష్టి పెట్టిన ఎస్పీ 
ఇక పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా, సింగిల్ నంబర్‌ లాటరీలు ఇలా అన్ని అసాంఘిక వ్యాపారాలు పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గుంటూరులో ఇద్దరు దంపతులు క్రికెట్‌ బెట్టింగ్‌లో కోటి రూపాయల వరకు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతోనే జిల్లా ఎస్పీ బెట్టింగ్ మాఫియాపై దృష్టి పెట్టారు. పోలీసు అధికారుల పాత్రలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒక్క నరసరావుపేటలోనే గడచిన 10 రోజుల్లో క్రికెట్‌ బెట్టింగ్ మూడు నిండు ప్రాణాలను బలిగొంది. నరసరావుపేట మండలం, పెద్దరెడ్డి పాలెంకు చెందిన కొమ్మసాని గురవారెడ్డి అనే బీటెక్ విద్యార్థి బెట్టింగ్‌లో 68 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒక్కసారిగా అంత డబ్బు పోగొట్టుకోవడంతో మనస్థాపం చెందిన గురవారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
బెట్టింగ్ వ్యవహారంలో భాగమైన పోలీసులు 
జిల్లాలోని కొందరు అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ బెట్టింగ్ దందాలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ జాడ్యాన్ని అంతమొందించవలసిన పోలీసులే బెట్టింగ్ వ్యవహారంలో భాగం కావడం కలకలం రేపుతోంది. ఇది నరసారావుపేట వన్‌ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఒక SI ఏకంగా బెట్టింగ్ రాయుళ్లతోనే మందు విందు పార్టీలు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఎవరి స్థాయికి తగినట్టు వారు వసూలు చేస్తున్నారనేది కాదనలేని సత్యం.
డబ్బులు వసూలు చేస్తున్న పోలీసులు 
కొందరు పోలీసు అధికారులు పలు లాడ్జీలలో బెట్టింగ్ ముఠాల కోసం రూములు బుక్ చేస్తున్నారు. మరి కొందరు ఓడిపోయినవాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గుంటూరు సీసీఎస్‌ పోలీసులు రంగప్రవేశం చేసి తీగ లాగితే ఈ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. ఇదే క్రికెట్‌ బెట్టింగ్ కేసులో నరసరావుపేట వన్‌ టౌన్‌కి చెందిన మరో ఎస్ఐ పాత్రపై కూడా ఎస్పీ కార్యాలయం విచారణ జరుపుతోంది. గడిచిన రెండు, మూడు నెలల్లో నరసరావుపేట సబ్‌ డివిజన్ పరిధిలోనే ముగ్గురు అధికారులపై వేటు పడింది. బెట్టింగ్‌లో 34 మంది పోలీసు అధికారుల పాత్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

కృష్ణా జిల్లా కోడూరులో విషాదం

కృష్ణా : జిల్లాలోని కోడూరులో విషాదం చోటు చేసుకుంది. లెక్కలు రావడం లేదని మనస్థానంతో విద్యార్థిని గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. సరితను అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. కోడూరులోని స్వతంత్ర్యపురం హైస్కూల్‌లో పాలంకి సరిత తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

అనంతపురం : వైసీపీలో విభేదాలు భగ్గుమన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత  చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందంటూ ఆయన వర్గం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిని మిథున్‌ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కొన్ని నిర్ణయాలు : మంత్రి గంటా

గుంటూరు : అమరావతిలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గంటా తెలిపారు. 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధాన్ని ఇంటర్‌లో ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటితో పాటు..  విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 

విద్యాశాఖ అధికారులతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం

గుంటూరు : అమరావతిలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గంటా తెలిపారు. 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధాన్ని ఇంటర్‌లో ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 

 

17:29 - October 16, 2017

గుంటూరు : అమరావతిలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గంటా తెలిపారు. 10వ తరగతి, సీబీఎస్‌ఈలో ఉన్న గ్రేడింగ్‌ విధాన్ని ఇంటర్‌లో ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటితో పాటు..  విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అధికారులు, ప్రైవేటు కాలేజీ అసోసియేషన్‌ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 2012..17 వరకు 35 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. ఎక్కువగా నారాయణ, చైతన్య కాలేజీల్లోనే ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు. ఇంటర్‌లో గ్రేడింగ్‌ అమలు వల్ల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

17:14 - October 16, 2017

విశాఖ : కార్పొరేట్ కాలేజీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా...విశాఖలో జనసేన విద్యార్థి విభాగం కదం తొక్కింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నా... సర్కార్‌ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి గంటా తన వియ్యంకుడి కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:13 - October 16, 2017

కర్నూలు : పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పోలీస్ కానిస్టేబుల్ వినూత్న నిరసన

మధ్యప్రదేశ్‌: ఓ పోలీస్ కానిస్టేబుల్ వినూత్నంగా నిరసన చేపట్టాడు. సీనియర్ ఆఫీసర్ల వేధింపులు భరించలేక.. అతను ఓ మొబైల్ టవర్ ఎక్కాడు. 55 ఏళ్ల కానిస్టేబుల్ మందసౌర్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక.. తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో చోటుచేసుకున్నది.

 

విద్యార్థుల ఆత్మహత్యల విచారణకు కమిటీ:మంత్రి గంటా

అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యల విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా తెలిపారు. అధికారులు, ప్రైవేటు కాలేజీల అసోసియేషన్, విద్యార్థి సంఘాలతో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టెన్త్, సీబీఎస్ఈ మాదిరి ఇంటర్ లో గ్రేడింగ్ విధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామన్నారు. 18 గంటల చదవును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం అని స్పష్టం చేశారు. రోజూ క్రీడలు, వ్యాయామ క్లాసులు నిర్వహించాలని సూచించారు. 2012-17 మధ్య 35 మంది విద్యార్థులు చనిపోయారని, అది కూడా నారాయణ, చైతన్య కాలేజీల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌పీ సంజీవ్ గోయంక గ్రూపుతో టీ.సర్కార్ ఒప్పందం..

కోల్‌కతా:టీఎస్ సర్కార్ ఆర్‌పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు అసహనం

అమరావతి:ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం భేటీ ముగిసింది. చదువు పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సమావేశానికి మంత్రి గంటా, చక్రపాణి కమిటీ సభ్యులు హాజరయ్యారు. వీరి భేటీ ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించారు.

16:39 - October 16, 2017

అనంతపురం : వైసీపీలో విభేదాలు భగ్గుమన్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత  చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డికి పార్టీలో అన్యాయం జరిగిందంటూ ఆయన వర్గం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిని మిథున్‌ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:37 - October 16, 2017

హైదరాబాద్ : చనిపోయిన ఓ వ్యక్తి పేరుతో బల్దియాలో టౌన్‌ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఘటనపై 10టీవీలో ప్రసారమైన కథనాలకు జీహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. నిర్మాణం అనుమతులపై పూర్తి వివరాలు ఇవ్వాలని జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని బయటపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌ శ్రీనివాస్‌నగర్‌లో 2014లో చనిపోయిన యాదగిరిగౌడ్‌ పేరుతో అతని బంధువులు వైన్‌ షాపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును వెరిఫై చేయకుండానే అధికారులు మూడురోజుల్లో అనుమతులు ఇచ్చేసారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో టెన్‌టీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి.

16:27 - October 16, 2017

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద బీజేపి ధర్నాను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపి ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయం వద్ద బీజేపి కార్యకర్తలకు పోలీసులు అనుమతి ఇవ్వడాన్ని పక్షపాత చర్యగా తమ్మినేని వ్యాఖ్యానించారు. బీజేపి ఆగడాలను ఆపడానికి అన్ని వర్గాల వారిని ఏకం చేస్తూ పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని తమ్మినేని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై సీపీఎం పోరాడుతుందన్నారు. 

 

16:22 - October 16, 2017

కృష్ణా : విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలో 10 రోజుల్లో 7 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులు  నారాయణ, గంటాను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...
 

16:20 - October 16, 2017

కృష్ణా : జిల్లాలోని కోడూరులో విషాదం చోటు చేసుకుంది. లెక్కలు రావడం లేదని మనస్థానంతో విద్యార్థిని గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. సరితను అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. కోడూరులోని స్వతంత్ర్యపురం హైస్కూల్‌లో పాలంకి సరిత తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 

 

16:16 - October 16, 2017

అంతర్జాతీయ గ్రామీణ మహిళాదినోత్సవం సందర్భంగా మానవి ఫోకస్ స్పెషల్ కార్యక్రమం నిర్వహించింది. మహిళలకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. మహిళల ప్రగతి, వారు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సామానం పోటీ పడి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:12 - October 16, 2017

కర్నాటక : బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ రెండస్తుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎజిపురా ప్రాంతంలో ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగిందని, పెద్దగా పేలుడు శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో 20 ఏళ్ల క్రితం నాటి ఈ భవనం కుప్పకులింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి ఇద్దరు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డవారికి 50 వేలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించింది. కూలిపోయిన భవనం గునేష్‌కు చెందినదని అందులో 4 కుటుంబాలు అద్దెకు నివసించేవని హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. 

 

రికార్డు స్థాయి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై :నేడు రికార్డు స్థాయి లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 200 పాయింట్ల లాభంతో 32,633 వద్ద సెన్సెక్స్, 63 పాయింట్ల లాభంతో 10,230 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది.

16:09 - October 16, 2017

విజయనగరం : పేద దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పెత్తందారులు స్వాహా చేస్తున్నారు. వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్మేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి తెగబడుతున్నారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలపై 10 టీవీ ప్రత్యేక కథనం.
నర్సిపురంలో వెలుగు చూసిన కబ్జా పర్వం
విజయనగరం జిల్లా పార్వతీపురం గ్రామీణ ప్రాంతాల్లో భూ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పేద, దళిత, గిరిజనులకు ఇచ్చిన భూములను కబ్జారాయుళ్లు యథేచ్చగా కబ్జా చేసేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా, పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో ఇటువంటి కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది. 
దళితుల భూములపై కన్నేసిన అధికారపార్టీ నేతలు
నాలుగేళ్ల క్రితం అప్పటి పార్వతీపురం ఐటీడీఏ పీవో శ్వేతా మహంతి గ్రామ పంచాయతీ పరిధిలోని 486 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో 5.29 ఎకరాల భూమిని 13 దళిత కుటుంబాలకు సాగు కోసం ఇచ్చారు. తమకిచ్చిన భూములను దళితులు బాగు చేసుకుని దానిలో మామిడి, జీడి, మొక్కల పెంపకం చేపట్టారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన నేతలు ఆ భూములపై కన్నేశారు. అధికారపార్టీకి చెందిన దొగ్గ నరిసింహనాయుడు మరికొంతమంది సహకారంతో పాస్ పుస్తకాల్లో ఉన్న సర్వే నెంబర్లను మార్చేసి వేరొకరికి అమ్మేశాడు. వారి పేర్లపై రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసేసాడు. ఆ భూముల్లో వేసిన మొక్కలను సైతం పీకి పారేశారు. 
అధికార పార్టీ నేతను నిలదీసిన భూ యజమానులు 
ఇక ఆలస్యంగా విషయం తెలుసుకున్న భూ యజమానులు అధికార పార్టీ నేతను నిలదీశాడు. అక్కడితో ఆగకుండా అధికార పార్టీ నేత దౌర్జన్యంపై స్థానిక తహసీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన తహశీల్దార్ ఇంతవరకు భూములను చూసేందుకైనా వెళ్లకపోవడంతో దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. 
దళితులకు అండగా నిలిచిన సీపీఎం నేతలు
మరోవైపు దళితులకు సీపీఎం నేతలు అండగా నిలిచారు. వారికి కేటాయించిన భూములను చట్ట ప్రకారం తిరిగి వారికి అప్పగించాలంటూ ఆందోళన బాట పట్టారు. దళితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని సీపీఎం నేతలు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, దళితుల భూములను వారికి తిరిగి ఇప్పించాలని.. కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

16:04 - October 16, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్కార్‌ కదిలింది. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. రేపు కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులను కలిసేందుకు పిల్లలకు అవకాశం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:59 - October 16, 2017

హైదరాబాద్ : మాదన్నపేటలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమయింది. కేవీ.రంగారెడ్డి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భవాని కాలేజికి వెళ్లి సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు మాదన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

 

15:54 - October 16, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జలగలంచలో ఆదివాసీలపై ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇండ్లతో పాటు... స్కూల్‌ను ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరహక్కుల సంఘం నేతలు వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు... ఆదివాసీలను ఎక్కడకు తరలించకుండా.. ఉంటున్న ప్రాంతంలోనే మంచినీటితో పాటు... అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు మూడు వారాల సమయమిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. 

 

15:51 - October 16, 2017

ఢిల్లీ : సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సీపీఎం కేంద్ర కార్యాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే బీజేపీ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. 
 

 

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న తల్వార్ దంపతులు

యూపీ: ఆరుషి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. గత నాలుగేళ్లుగా వారు దాస్నా జైల్లో ఉన్నారు. నాలుగురోజుల కిందట తల్వార్ దంపతులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. అయితే ఆర్డర్ కాఫీ ఆలస్యం కావడంతో వారి విడుదలకు జాప్యం జరిగింది. 

సీఎం చంద్రబాబుతో భేటీ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు

అమరావతి: సీఎం చంద్రబాబుతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి మంత్రిగంటా శ్రీనివాస్, చక్రపాణి కమిటీ సభ్యులు హాజరయ్యారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించనున్నారు.

15:20 - October 16, 2017

నటి సన్నీలియోన్ ఓ సాంగ్‌లో స్పెషల్‌గా నటిస్తున్న సినిమా 'గరుడవేగ' హీరో బాలకృష్ణ చేతుల మీదుగా దీని ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు .హీరో రాజశేఖర్‌- పూజాకుమార్‌- శ్రద్ధాదాస్‌ కాంబినేషన్‌లో రానున్న మూవీ అన్నిపనులు పూర్తికావడంతో రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ కార్యక్రమానికి బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ కాంప్లెక్స్‌ వేదిక కానుంది. ఇటీవల రిలీజైన టీజర్‌ హాలీవుడ్‌ స్థాయిలో పలువురు ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. ఆర్కే ఫిల్మ్స్‌ సంస్థ రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

'ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బిజెపి ధర్నాలు'

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద బిజెపి ధర్నాను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బిజెపి ధర్నాలు అని విమర్శించారు. మతపరమైన చీలికలు, దాడులతో బిజెపి లబ్ధి పొందుతోందన్నారు. కేరళ సీఎం పై బిజెపి విమర్శలకు అర్థం లేదన్నారు. రైతుల సమస్యలపై పోరాడాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందన్నారు. వివిద రాష్ట్రాల్లోని సమస్యలపై సీపీఎం పోరాడుతోందన్నారు. బిజెపి ఆగడాలను ఆపడానికి అన్ని వర్గాల వారిని ఏకం చేసి పోరాడాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని తమ్మినేని తెలిపారు.

ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనడం సరికాదు:జీవన్ రెడ్డి

హైదరాబాద్: ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనడం సరికాదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులకు వెళ్తున్నది నిర్వాసుతలని టిఆర్ ఎస్ నేతలు గుర్తించుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. సిద్ధిపేట నేతల చేతిలో శ్రీరాంసాగర్ రైతులు బలవుతున్నారని మండిపడ్డారు. సర్కార్ వైఫల్యంతో ఎల్లంపల్లి నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. కోర్టులను తప్పుపట్టేలా సీఎంకేసీఆర్ మాట్లాడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు

14:04 - October 16, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో నిర్మిస్తోన్న.. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కును నిలిపివేయాలని స్థానికులు ఉద్యమబాట పట్టారు. నర్సాపురం మండలం, కంసాల బేతపూడిలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో.. నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను సీపీఎం నాయకుడు ఆచంట మాజీ ఎమ్మెల్యే రాజగోపాలం ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేసి వేరే చోటకు తరలించాలని స్థానికులు ఉద్యమం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రజా ఉద్యమాలను అణిచివేసి పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. 

ఖరీఫ్ లో వరిధాన్యం సేకరణకు టీ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్: 2017-18 ఖరీఫ్ లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు వరిధాన్యం సేకరించేందుకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

14:03 - October 16, 2017

హైదరాబాద్ : భూపాలపల్లి జలగంచ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు అధికారలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జలగలంచ ఆదివాసీలను ఎక్కడికి తరలించకుండా మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాంది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు దేశించింది. ఈ ఘటనపై హైకోర్టులో పౌరసంఘాల నేతలు పిటిషన్ వేశారు. ఆదివాసీల ఇళ్లతో పాటు స్కూల్ ను ధ్వంస చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం : కడియం

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం అని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రేపు తల్లిదండ్రులు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానున్నట్లు కడియం తెలిపారు.

13:55 - October 16, 2017

యాదాద్రి : ఇది యాదాద్రి జిల్లా చొల్లేరు గ్రామంలోని తోళ్ల పరిశ్రమ. యాదాద్రి దేవస్థానానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. ఈ తోళ్ల శుద్ధి కర్మాగారంతో ఇక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిశ్రమను మూసివేయాలని అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమ నుండి వచ్చే దుర్వాసనతో చుట్టూ ఉన్న 5 గ్రామాలలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. వ్యర్థ రసాయనాలు చెరువులలో, వాగులలో కలవడం వల్ల ఆ నీటిని తాగిన పశువులు గర్భం కోల్పోతున్నాయని, పంటపొలాలు కూడా నాశనమవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తోళ్ల పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు
అయితే తమ సమస్యను తీర్చాలని ఎన్ని ఉద్యమాలు చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి సమష్టిపోరాటానికి సిద్ధమయ్యారు. గ్రామసభను ఏర్పాటు చేసుకొని 21 మందితో కలిసి తోళ్ల పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిశ్రమ వల్ల ఎదురయ్యే సమస్యల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ ఈ పరిశ్రమను మూసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తోళ్ల పరిశ్రమను తొలగించాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. 

13:53 - October 16, 2017

కృష్ణా : బీసీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. బీసీల కోసం జగన్‌ ఆరు నెలల కార్యాచరణ ప్రకటించారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని.. నిధులు కూడా అరకొరగానే విడుదల చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. బీసీలకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు స్వీకరించాలన్నారు. పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేయనున్న బీసీ గర్జనలో... బీసీ డిక్లరేషన్‌ ప్రవేశపెడతామని తెలిపారు. బీసీలకు చేపట్టే అభివృద్ధిని మేనిఫెస్టోలో పెట్టి... వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూశారని ఆరోపించారు జగన్‌. సమావేశానికి ముందు జగన్‌.. పలు కుల వృత్తులకు చెందినవారిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

13:51 - October 16, 2017

సంగారెడ్డి : జిల్లా, రామచంద్రపురం మండలంలోని భీరంగుడా కమాన్‌ వద్ద.. స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మల్లికార్జుననగర్‌ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన మంజీరా వైన్స్‌ను.. వెంటనే తొలగించాలని ధర్నాకు దిగారు. వైన్స్‌ షాపు ముందు బైటాయించారు. కాలనీ ఎంట్రెన్స్‌లో వైన్స్‌ షాపు ఉండటంతో మహిళలు, విద్యార్థినులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

అనంతపురం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

అనంతపురం: జిల్లా వైసీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశాలు రసాభాసగా మారాయి. పార్టీలో గురునాథ్ రెడ్డి అన్యాయం జరిగిందంటూ ఆయన వర్గీయులు కుర్చీలను ధ్వసం చేశారు.

13:50 - October 16, 2017

కృష్ణా : కార్పోరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్మలను నివారించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు విజయవాడలో కాలేజీలు బంద్‌ చేయించాయి. విద్యార్థులను యాజమాన్యాలు ర్యాంకుల కోసం మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. వరుసగా విద్యార్థుల బలవన్మరణాలు పునరావృతమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసి తగు చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

బిజెపి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దాడులు: సీపీఎం

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో మూడో రోజు కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేరళ ప్రభుత్వంపై అవాస్తవాలను కేంద్ర కమిటి ఖండించింది. బిజెపి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించింది. ప్రధాని ఆర్థిక వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్నందుకే కేరళను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది.

ఢిల్లీ సీపీఎం ఆఫీసు ముట్టడికి బిజెపి మహిళా మోర్చా యత్నం...

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయ ముట్టడికి బిజెపి మహిళా మోర్చా కార్యకర్తలు యత్నించారు. బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

13:29 - October 16, 2017

అక్టోబర్ 20 నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలవుతుందని తేజ వెల్లడించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఇతర పాత్రల కోసం నటీనటుల అన్వేషణలో ఉన్నట్లు తేజ తెలిపాడు. నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామాతో హిట్ కొట్టిన తేజ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో తేజ బిజీగా ఉన్నాడు. 2018లో ఈ సినిమా విడుదలకు తేజ సన్నాహాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు తేజ చెప్పాడు. 

13:20 - October 16, 2017

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జలసిరికి హారతి కార్యక్రమం తర్వాత చెరువులు, కుంటలలో పెరిగిన నీటి మట్టంపై జలవనరుల శాఖ అధికారులు ప్రజెంటేషన్ చేశారు.

మాదన్న పేటల్ లో డిగ్రీ విద్యార్థిని భవానీ అదృశ్యం

హైదరాబాద్: మాదన్న పేటల్ లో డిగ్రీ విద్యార్థిని భవానీ అదృశ్యం అయ్యింది. కేవీ రంగారెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో భవానీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

జలగలంచ ఆదివాసీలపై దాడి..హైకోర్టు విచారణ

హైదరాబాద్: భూపాలపల్లి జలగలంచ ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడిపి హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఆదివాసీల 34 ఇళ్లు, స్కూల్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల నేత కుంటి రవి పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను ఉల్లంఘించారని హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. 3 వారాల్లో కౌంటర్ దాకలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు తెలిపింది. ఆదివాసీలను ఎక్కడికీ తరలించొద్దని, మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.

13:07 - October 16, 2017

పాదయాత్ర అనంతరం బీసీ గర్జన: జగన్

విజయవాడ: 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను కలిసి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో సలహాలు తీసుకోవాలని, బీసీల్లో మనో ధైర్యం నింపేలా సమస్యలు తెలుసుకోవాలని వైసీపీ నేత జగన్ అన్నారు. నేడు బీసీ నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాదయాత్ర అనంతరం బీసీ గర్జన కార్యక్రమం ఉంటుందని, బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రవేశ పడతామన్నారు. బీసీ మేనిఫెస్టోలో పెట్టేవన్నీ అమలు చేస్తామన్నారు. బీసీలకు చంద్రబాబు చేసిన మోసాని ప్రజలకు తెలపాలన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని ఆరోపించారు.

శాంతి పరిరక్షణకు ఐఎన్ ఎస్ కిల్టన్ దోహదం: నిర్మలా సీతారామన్

విశాఖ: ఐఎన్ ఎస్ కిల్డన్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి పరిరక్షణకు ఐఎన్ ఎస్ కిల్టన్ దోహదం చేస్తుందన్నారు.

ఖమ్మంలో హిదూ మేధావుల సదస్సు

హైదరాబాద్: ఖమ్మంలో హిదూ మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వీహెచ్ పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా హాజరయ్యారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులను చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వారిని పరిగణనలోకి తీసుకోరాదన్నారు.

'ప్రభుత్వ పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు '

అమరావతి: స్వచ్ఛభారత్ లో భాగంగా పాఠశాలలను మంత్రి గంటా శ్రీనివాస్, డీజీపీ సాంబశివరావు పరిశీలించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు, పెద్దవడ్డపూడిలో జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. మంగళగిరి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అధికారులు, టీచర్లపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత పీఎస్ అధికారి దీనిక బాధ్యత వహించాలని సూచించారు.

12:26 - October 16, 2017


మేడ్చల్ : రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని జశ్వాని అదృశ్యమైంది. శనివారం జశ్వాని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ ఎదుట ఆమె తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

2013 భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాలి: మిడియం బాబూరావు

విజయవాడ: పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాలని సీపీఎం మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో 30 గంటల ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పునరావాసం కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని, తాత్కాలిక వలసలు పోతున్న నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ఇవ్వాలని మిడియం డిమాండ్ చేశారు.

పునరావాసం తర్వాతే ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీపీఐ నారాయణ

విజయవాడ: నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సీపీఐ నారాయణ హెచ్చరించారు. పునరావాసం తర్వాతే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అండగా ఉన్న వామపక్షాలపై నిర్బంధం తగదన్నారు. నిర్వాసితులపై కేసులు బనాయించడం మానుకోవాలన్నారు.

12:08 - October 16, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట వద్ద బోరు వేస్తుండగా గ్యాస్ బయటకు ఎగజిమ్ముతోంది. 70 అడుగుల మేర గ్యాస్ ఎగజిమ్ముతుండడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. రొయ్యల చెరువు కోసం బోరు వేయడంతో గ్యాస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కరీమాబాద్ లో కౌటిల్యా స్కూల్లో ప్రమాదం

వరంగల్ :కరీమాబాద్ లో కౌటిల్యా స్కూల్లో ప్రమాద వశాత్తు మెట్ల పై నుంచి పడి ఓ విద్యార్థిని మృతి చెందింది.

హెన్నా కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం:ఒకరి మృతి

గుంటూరు : తాడేపల్లి మండలం కొలను కొండలో హెన్నా కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంగల చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మధుసూదనరావు అనే కార్మికుడు మృతి చెందారు.

11:40 - October 16, 2017

అనంతపురం : జిల్లా పెనుకొండలో నిర్మిస్తున్న కియా కార్ల తయారీ పరిశ్రమ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన మౌలికసదుపాయాలను కల్పిస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌కు పెనుకొండ మండలంలో భూమి కేటాయించారు. యర్రమంచి, అమ్మవారుపల్లి, గుట్టూరు గ్రామాల్లో సేకరించి ఇచ్చిన 599 ఎకరాల భూమిని చదును చేశారు. షెడ్ల నిర్మాణం చేపట్టారు. కియా మోటార్స్‌ కోసం ప్రత్యేకంగా 220 కే.వీ. విద్యుత్‌ సబ్ స్టేషన్‌ నిర్మిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా లైన్లు నిర్మిస్తున్నారు. సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి ఈ పరిశ్రమకు అవసరమైన నీరు తీసుకొచ్చేందుకు ఆరున్నర కి.మీ. పొడువుల కాల్వ తవ్వుతున్నారు. రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పరిశ్రమ కోసం కియా మోటార్స్‌ 13,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇది భారీ ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం కూడా కియా యూనిట్‌కు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి కియా మోటార్స్‌ పెనుకొండ యూనిట్‌లో ప్రయోగాత్మక ప్రాతిపదికపై కార్ల తయారీ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 సెప్టెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పతి చేపట్టాలని నిర్దేశించుకున్నారు. కియా ప్రతినిధులు పెనుకొండలోనే మకాంవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.

కియా మోటార్స్‌లో స్థానికులకు ఉపాధి
కియా మోటార్స్‌లో స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా యువతకు తర్ఫీదు ఇచ్చేందుకు పెనుకొండలో నైపుణ్యం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెనుకొండలో పాలిటెక్నికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మరోవైపు ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంలో కియా మోటార్స్‌ కోసం భూములిచ్చిన రైతులు పరిశ్రమ త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. భూములిచ్చిన రైతులకు చెల్లించిన పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. వచ్చే నెలాఖరు నాటికి సివిల్‌ పనులు పూర్తి చేసి, నిర్మాణానాలను చేపట్టే విధంగా కియా మోటార్స్‌ ఏర్పాటు చేసుకుంటోంది. 

11:39 - October 16, 2017

కృష్ణా : నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో వామపక్షాలు 30 గంటల మహాధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐతో పాటు పలు వామపక్ష పార్టీల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి నిర్వాసితులు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:38 - October 16, 2017

గుంటూరు : కాలేజీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశాన్ని ఏపీ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ఆత్మహత్యల నివారణకు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో కాసేపట్లో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు హాజరుకానున్నాయి. చక్రపాణి కమిటీ సూచనలు, విద్యాశాఖ నివేదికలపై చర్చించనున్నారు. 

11:37 - October 16, 2017

విశాఖ : నేడు ఐఎన్ఎస్ కిల్టన్‌ను జాతికి అంకితం చేయనున్నారు రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌.భారత నౌకాదళంలో ప్రవేశానికి ముందుగానే నౌకా సామర్థ్యాలను పరిశీలించిన మొట్టమొదటి నౌకగా ఐఎన్ఎస్ కిల్టన్‌ రికార్డ్‌ పొందింది. కమోర్ట్‌ తరగతి యుద్ధ నౌకలలో ప్రాజెక్టు 28 కింద ఈ నౌకను రూపకల్పన చేశారు. అణు, జీవ రసాయన ఆయుధాలతో పోరాడే సత్తా ఈ నౌకకు ఉంది. విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబ, తూర్పు నౌకా దళాధిపతి హెచ్ సీఎస్ బిస్త్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.  

11:31 - October 16, 2017

సూర్యాపేట : జిల్లా తాళ్లగడ్డలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆరు నెలల క్రితం కిరణ్‌తో భవానికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. నిన్న సాయంత్రం భవాని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఎస్పీ ఆఫీస్‌లో కిరణ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

బోరు బావి నుంచి భారీగా ఎగిసిపడుతున్న గ్యాస్, ఉప్పు నీరు

తూ.గో: కాట్రేని కోన మండలం అడవి పేట వద్ద బోరు బావి నుంచి భారీగా గ్యాస్, ఉప్పు నీరు ఎగిసిపడుతోంది. 70 అడుగుల ఎత్తులో గ్యాస్, ఉప్పునీరు ఎగిసిపడుతోంది. రొయ్యల చెరువు కోసం బోరు వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

జగన్ అధ్యక్షతన రాష్ట్ర బీసీ సెల్ సమావేశం

విజయవాడ: వైసీపీ నూతన కార్యాలయం ప్రాంగణంలో ఆ పార్టీ జెండాను అధినేత జగన్ ఆవిష్కరించారు. జగన్ అధ్యక్షతన రాష్ట్ర బీసీ సెల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి 13 జిల్లాల పార్టీ బీసీ నేతలు హాజరయ్యారు. బీసీల సంక్షేమం కోసం పార్టీ కార్యాచరణ పై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో బీసీ సంక్షేమం కోసం నేతల నుండి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. సమావేశం అనంతరం డిక్లరేషన్ ను జగన్ ప్రకటించనున్నట్లు సమాచారం.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

తూ.గో: రాజమహేంద్రవరం సెట్రల్ జైల్లో చింతకాయల రవి అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. రవి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

కర్నూలు : రాత్రి కురిసిన వర్షానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఆరు మండలాల్లోని 20 గ్రామాలు జలదిగ్బధం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు వరద కొనసాగుతున్నది. నాగార్జున సాగర్ ప్రస్తుతం 550 అడుగుల నీటిమట్టం ఉంది. సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. సాగర్ ఇన్ ఫ్లో1,47,692, కాగా ఓట్ ఫ్లో 1,999 క్యూసెక్కులు.

చీరాల ఓడరేవు తీరప్రాంతంలో గుడిసెలు తొలగింపు...

ప్రకాశం: చీరాల ఓడరేవు తీరప్రాంతంలో గుడిసెలను తొలగిస్తున్నారు. మత్స్యకారుల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మొత్తం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. 

తాళ్లగడ్డలో వివాహిత అనుమానాస్పద మృతి

సూర్యాపేట: తాళ్లగడ్డలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన నిన్న సాయంకాలం చోటు చేసుకుంది.ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. మృతురాలి బంధువులు మాత్రం హత్యఅనే ఆరోపిస్తున్నారు. భర్త కిరణ్ ఎస్పీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.

సిలిండర్ పేలి నాలుగు ఇళ్లు ధ్వంసం: ముగ్గురి మృతి

బెంగళూరు: ఎజిపురా ప్రాంతంలో నాలుగు ఇళ్లు కూలిపోయాయి. సిలిండర్ పేలుడు ధాటికి ఇళ్లు కూలి, ముగ్గురు మృతి చెందారు. శిధిలాల్లో మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అగ్రిగోల్డ్ బాధితుల ఆవస్థలు

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల ఆవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా సీఐడీ వెబ్ సైట్ పని చేయడంలేదు. 17 కౌంటర్లలో పేర్ల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. పేర్ల నమోదుకు కంప్యూటర్ సెంటర్ల వద్ద బాధితులు పడిగాపులు పడుతున్నారు. సిఐడీ యంత్రాంగం ఇంత వరకు స్పందించలేదు.

అనంతసాగరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి పై వేటు

నెల్లూరు: అనంతసాగరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి పై వేటు పడింది. కార్ణాకర్ అనే వైద్యుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. డాక్టర్ కర్ణాకర్ విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్ లో సంతకాలు చేసినట్లు నిర్థారణ అయ్యింది.

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 883.90 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇన్ ఫ్లో 1,31,945, ఓట్ ఫ్లో 1,44,427 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

నిబంధనలు పాటించని 6 బస్సులు సీజ్

రంగారెడ్డి: శంషాబాద్ మండలం కిషన్ గూడ వద్ద హైదరాబాద్ _ బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసు నమోదు చేసి, 6 బస్సులను సీజ్ చేశారు.

అమీర్ పేటలో గల్లీ లీడర్ వీరేశం వీరంగం

హైదరాబాద్: అమీర్ పేటలో గల్లీ లీడర్ వీరేశం వీరంగం సృష్టించాడు. ఓ హాస్టల్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులను గదిలో నిర్బంధించి వీరశం చితకబాదాడు. ఈఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు.

09:29 - October 16, 2017

కర్నూలు : జగన్‌ పాదయాత్రకు ముందే వైసీపీకి గట్టి షాక్‌ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుకను టీడీపీలో చేర్చుకోవాలని డిసైడ్‌ అయ్యింది. బుట్టా రేణుక మంగళవారం టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె భర్త నీలకంఠం టీడీపీలో చేరగా... బుట్టా రేణుక వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే... వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకకు కర్నూలు ఎంపీ సీటుపై వైసీపీ స్పష్టత ఇవ్వకపోవడం... ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ ప్రతిపాదించడంతో ఆమె టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. 

09:28 - October 16, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ బీసీ డిక్లరేషన్‌ను రూపొందించబోతున్నది. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి... పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నారు. ఇందుకోసం ఈరోజు వైఎస్‌ జగన్‌.. విజయవాడలో బీసీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జిల్లాలవారీగా నేతల నుంచి సమాచారం సేకరించనున్నారు. అలాగే బీసీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు... వైసీపీ ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అనేక దఫాల చర్చల అనంతరం వైసీపీ 'బీసీ డిక్లరేషన్‌' ప్రకటించే అవకాశం ఉంది. 

09:25 - October 16, 2017

ఇస్లామాబాద్ : జమాతుద్దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉన్న ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుంది పాకిస్థాన్. ఉగ్రవాద ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో ఇన్నాళ్లూ హౌజ్ అరెస్ట్‌లో ఉన్న సయీద్‌ను ఇక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాంటీ టెర్రరిజం యాక్ట్ కిందే గతంలో సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారు పాక్ అధికారులు. అయితే ఇప్పుడు సయీద్‌తోపాటు అతని నలుగురు అనుచరులు ఈ చట్టం కిందికి రాకపోవడంతో వాళ్లను రిలీజ్ చేయాలని సయీద్ తరఫు లాయర్ ఏకే డోగార్ వాదించారు. అయితే సయీద్‌తోపాటు జేయూడీపై అన్ని ఆధారాలను తాము సమర్పిస్తామని లాహోర్ హైకోర్టుకు పాక్ ప్రభుత్వం తెలిపింది. సయీద్‌పై ఇప్పటికే యూఎన్, యూఎస్ నిషేధం విధించారు. అతన్ని అరెస్ట్ చేస్తే కోటి డాలర్లు కూడా ఇస్తామని ప్రకటించాయి. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ అతను గృహ నిర్బంధంలోనే ఉన్నాడు.

విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ సీరియస్

గుంటూరు : కార్పొరేట్ విద్యాసంస్థలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఏసీ సర్కార్ సీరియస్ గా స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో కాసేపట్లో చంద్రబాబు సమావేశం కాననున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లాసుల నిర్వహణను, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

శంషాబాద్ లో ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆరు బస్సులను సీజ్ చేశారు. 

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విశాఖ : జిల్లా పాయకరావుపేట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి డిపో చెందిన బుస్సు ఓ లారీని వెనకు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు విశాఖ నుండి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

09:20 - October 16, 2017

గుంటూరు : కార్పొరేట్ విద్యాసంస్థలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఏసీ సర్కార్ సీరియస్ గా స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో కాసేపట్లో చంద్రబాబు సమావేశం కాననున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లాసుల నిర్వహణను, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

 

 

 

09:19 - October 16, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆరు బస్సులను సీజ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:18 - October 16, 2017

 

విశాఖ : జిల్లా పాయకరావుపేట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి డిపో చెందిన బుస్సు ఓ లారీని వెనకు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు విశాఖ నుండి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

08:07 - October 16, 2017

కోదండరాం వ్యవహిరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, జేఏసీ నుంచి ఇప్పుడు ఎవరులేరని, రాజకీయంలోకి కోదండరాం రావాలని కోరుకుంటున్నామని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. కోదండరాం సూర్ఫియాత్రపై పదేపదే దాడి చేయడం మంచిది కాదని, ఎవరు విమర్శించిన వారిపై ముఖ్యమంత్రి దాడి చేస్తున్నారని, కోర్టులు తమ విచక్షణంగా తీర్పులు ఇస్తాయని, నరేంద్ర మోడీపై కూడా కోర్టులు అక్షంతలు వేసిన సందర్భలు ఉన్నాయని ప్రముఖ విశ్లేషుకులు తెలకపల్లి రవి అన్నారు. ప్రాజెక్టులపై కోర్టులకు వెళ్లడం సహజమని, ప్రాజెక్టులను సరిచేసుకుని ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని, కేసీఆర్ కోదండరాం ను సర్పంచ్ పోటీ చేసే పరిస్థితి లేదని అన్నారని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. ఈ రోజు బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొస్తోందని, బుచ్చయ్య చౌదరి వ్యక్తిగతమని, బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:06 - October 16, 2017

అక్కడ చదువులేమోకాని ఫీజులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ప్రస్తుతం పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రైవేటు స్కూళ్లదోపిడి దారుణంగా ఉన్నా.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తడం లేదు. వేసిన కమిటీలు వేసినట్టే ఉంటాయి, ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. తిరుపతి రావు కమిటీ వేసి 7నెలలు గడిచిన ఇంత వరకు రిపోర్ట్ ఇవ్వలేదని, దాని వెనుక ప్రైవేట్ విద్యాసంస్థల ఉన్నాయని, ఫిజ్ ల పై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని, పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు అన్ని అమ్ముకొనే పరిస్థితి వస్తోందని, విద్య వ్యాపారం అయిందని తెలంగాణ టీపీఏ జనరల్ సెక్రరెటరీ ప్రకాష్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

08:04 - October 16, 2017

కరీంనగర్/పెద్దపల్లి : ఓ వైపు నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించాలి.. మరో వైపు కార్మికుల ప్రయోజనం కోసం కోట్ల రూపాయలను వెచ్చించాలి.. ఇంకో వైపు వినియోగదారుల వద్ద పేరుకు పోయిన కోట్ల రూపాయల బకాయిలు వసూళ్లు చేయాలి.. ఇలాంటి సమస్యలతో సింగరేణి యాజమాన్యం సతమతమవుతోంది. అయితే గతంలో లేనంతగా ఈ సంవత్సరం సింగరేణి సంస్థ ఆర్థిక భారం పడటం.. దీనికితోడు ఖజానా ఖాళీ అవడంతో సంస్థను ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

సంస్థపై రూ.762 కోట్లు భారం
దసరా పండగ అడ్వాన్స్‌తో సింగరేణి సంస్థ కార్మికుల చెల్లింపులు ప్రారంభం కాగా.. దీపావళి బోనస్‌, లాభాల వాటా, తాజాగా వేతన బకాయిల చెల్లింపులతో సంస్థపై రూ.762 కోట్లు భారం పడింది. ఇప్పటి వరకు కార్మికులకు పలు దఫాలుగా రూ.554 కోట్లు చెల్లించగా 10వ వేతన ఒప్పందం కుదరడంతో ముందుగానే కార్మికునికి రూ.40వేల చొప్పున వేతనాలు చెల్లించాలి. దీంతో కనీసం 202 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సిన పరిస్థితి. దసరా పండుగకు ముందు కార్మికులకు అడ్వాన్స్ కింద రూ.25 వేలు చెల్లించడంతో సింగరేణి సంస్థపై రూ.120 కోట్ల రూపాయల భారం పడింది. ఆ తరువాత దీపావళి బోనస్‌ కింద రూ.57 వేల కార్మికులకు పంపిణీ చేసింది. ఆ తరువాత లాభాల వాటా 25శాతం కింద రూ.98 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఇదంతా కలిసి ఇప్పటి వరకు రూ.554 కోట్ల రూపాయల మొత్తాన్ని కార్మికుల ఖాతాలో జమ చేసింది. ఈ రెండు నెలల్లో సుమారు రూ.600 కోట్ల రూపాయాలను కార్మికులకు చెల్లింపులు చేసింది.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.1362 కోట్ల రూపాయలను పంపిణీ చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడింది.

రూ.5000 కోట్ల వరకు సింగరేణి సంస్థకు బకాయిలు
కార్మికులకు కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నా.. సింగరేణి యాజమాన్యానికి వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు బకాయిలు పేరుకు పోతున్నాయి. సంస్థ నుంచి బొగ్గును కొనుగోలు చేసిన విద్యుత్‌ సంస్థలు భారీగా బిల్లులను చెల్లించాల్సి ఉంది. తెలంగాణ, ఎపీ జెన్‌కోలు ఇప్పటి వరకు సుమారుగా రూ.5000 కోట్ల వరకు సింగరేణి సంస్థకు బకాయిలు ఉండటంతో సంస్థ ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. గడిచిన నెల రోజుల్లో సింగరేణి కార్మికుడు వేతనాలు కాకుండా సగటున రూ.1.40 లక్షలు లబ్ధి పొందారు. వేతనాలతో కలిసి సుమారు రూ.2.40 లక్షల వరకు కార్మికుడు లబ్ధి పొందే అవకాశం కల్గింది. సింగరేణి యాజమాన్యానికి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయడం.. వచ్చే బకాయిలు వసూలు కాక పోవడం పెను భారంగా మారింది.. ఇప్పటికైనా వచ్చే బకాయిలను రాబట్టి సింగరేణిని ఆర్థిక భారంనుంచి గట్టెక్కిస్తారో లేదో చూడాలి.

08:03 - October 16, 2017

 

హైదరాబాద్ : బ‌ల్దియాలో టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మరోసారి వివాదంగా మారింది. చనిపోయిన ఓ వ్యక్తి పేరుతో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేసారు అధికారులు. అదీ వైన్ షాపు నిర్మాణానికి కావడంతో ఫైల్ ఆగమేఘాలపై కదిలిపోయింది. మూడంటే మూడు రోజుల్లోనే నిర్మాణ అనుమ‌తి ప‌త్రం జారీ చేశారు అధికారులు.

10వ తేదీకల్లా గ్రీన్ సిగ్నల్
స‌రూర్ న‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో యాదగిరి గౌడ్ అనే చనిపోయిన వ్యక్తిపేరుతో అతని బంధువులు క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణానికి ఈ నెల 7వ‌తేదీన దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుకు 10వ తేదీకల్లా గ్రీన్ సిగ్నల్ల్ లభించింది. ఆ దరఖాస్తు ఆన్‌లైన్‌లో వచ్చిందని అధికారులు చెబుతున్నా.. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా అనుమతులు ఎలా ఇచ్చారనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే ఆ స్థలంలో ఓ వైన్ షాపు ఉంది.. దానిని స్ధానికులు అడ్డుకుంటుండటంతో గుట్టు చప్పుడుకాకుండా అనుమతుల వ్యవహారం సాగించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

యాదగిరి గౌడ్ 2014లో చనిపోయాడు..
నిజానికి యాదగిరి గౌడ్ 2014లో చనిపోయాడు. ఆయన పేరుతో బంధువులు వైన్ షాపుకు దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తు పరిశీలించడంలో కనీస నియమ నిబంధనలు పాటించకపోవడంపై హైదరాబాద్ పౌర సంస్థలు మండిపడుతున్నాయి. 2015 అక్టోబర్ 28 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి అలాంటి వాటిని కూల్చి వెయ్యాలని చెప్పినా బల్దియా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో అవి పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాసనగర్‌లోని ప్లాట్‌కు లే అవుట్ ప్రకారం రెసిడెన్షియల్ అనుమతులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ కమర్షియల్ అనుమతులు ఇచ్చేశారు. దీనిపై ఇప్పుడు అధికారులు ఏం సమాధానం చెబుతారో? వేచి చూడాలి.  

08:01 - October 16, 2017

హైదరాబాద్ : ... సారీ మమ్మీ.. సారీ డాడీ.... ఐ మిస్‌ యూ సోమచ్‌. బైసన్నీ... బై అక్కా.. నా కోసం వెతకొద్దు... క్లోజ్‌ ది నారాయణ కాలేజీ.. నారాయణ కాలేజీ కిల్లింగ్‌ ద స్టూడెంట్స్‌ టు రీడ్‌. సో ప్లీజ్‌ హెల్ప్‌ ద స్టూడెంట్స్‌ ఫ్రం నారాయణ. ఇదీ హైదరాబాద్‌ నారాయణ కాలేజీలో చదువుతూ అదృశ్యమైన విద్యార్థిని సాయి ప్రజ్వల వేదన. కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థులు ఎలా రాలిపోతున్నారో ప్రత్యక్ష నిదర్శనం సాయి ప్రజ్వల రాసిన లేఖ.

కార్పొరేట్‌ కాలేజీల ధనదాహం
కార్పొరేట్‌ కాలేజీల ధనదాహానికి, చదువుల ఒత్తిడికి అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారు. బంగారులాంటి భవిష్యత్‌ను మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో భరించలేనంత ఒత్తిడికిగురై నిండు నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో... నిన్న విజయవాడలో ....నేడు హైదరాబాద్‌లో... కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థినులు అదృశ్యమవుతున్నారు. సూసైడ్స్‌ చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రజ్వలను తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నాగోల్‌లోని నారాయణ కాలేజీలో చేర్పించారు. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ప్రజ్వల ట్రైనింగ్‌ తీసుకుంటోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి కాలేజీకి వచ్చింది. ఈనెల 10న బోడుప్పల్‌ వెంకటసాయి నగర్‌లోని మామయ్య ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు ఓ లేఖరాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రజ్వల ఇంటి నుంచి వెళ్లే సమయంలో కాలనీలోని ఓ ఇంట్లో అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీటీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులను రక్షించేందుకు చర్యలు
ఒక్క సాయి ప్రజ్వలేకాదు.. మరో ఇద్దరు విద్యార్థినులు కూడా అదృశ్యమయ్యారు. ఏఎస్‌రావు నగర్‌లోని ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతోన్న విద్యార్థిని జశ్వాని కనిపించకుండా పోయింది. ఇక అంబర్‌పేటకు చెందిన రమ్యశ్రీ అనే మరో యువతి కూడా అదృశ్యమైంది. వీరు ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు వెళ్లారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడితో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తట్టుకోలేని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొంతమంది ఆ నరకకూపం నుంచి బయటపడేందుకు పారిపోతున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడి నుంచి విద్యార్థులను రక్షించేందుకు చర్యలు చేపడుతాయో లేదో... వేచి చూడాలి.

08:00 - October 16, 2017

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌ హాల్లో జరిగిన జిల్లా టీమాస్‌ ఆవిర్భావసభకు సింగరేణి కార్మికులు , ప్రజలు పెద్దఎత్తున తరిలి వచ్చారు. సింగరేణి కార్మికులకు టీమాస్‌ అండగా ఉంటుందని ఫోరం నేతలు అన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ..పేద ప్రజలజీవితాల్లో వెలుగులు కనిపించడంలేదని.. టీమాస్‌ ఫోరం నేతలు అన్నారు. సామాజిక న్యాయం సాధన కోసమే టీమాస్‌ ఆవివర్భవించిందని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఎండగడతామని ఫోరం నేతలు అన్నారు. టీమాస్‌ ఆవిర్భావ సభకు జిల్లావ్యాప్తంగా సింగరేణి కార్మికులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. 

07:59 - October 16, 2017

పశ్చిమగోదావరి : జిల్లా రాజకీయాల్లోకి జనసేన పార్టీ ఎంటరైంది. మెల్లమెల్లగా జనసేన తన సైన్యాన్ని పెంచుకుంటోంది. ఈ మధ్య జరిగిన జనసైనికుల ఎంపికకు రెట్టింపు సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీలోని ఇతర జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా..... పవన్‌ సొంత జిల్లా.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాపై మాత్రం పట్టుబిగించబోతోందనేది రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇప్పటికే రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీపై వ్యతిరేకత బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీన్ని అదనుగా భావించి జనసేన పార్టీ విస్తరణకు పావులు కదుపుతోంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రజా సమస్యలపై స్పందించే తీరుతో ప్రజల్లో కొంతమేర సానుకూలత వ్యక్తమవుతోంది. యువతీయువకులు పవన్‌ ఆలోచనలకు ఆకర్షితులవుతున్నారు.

చాపకింద నీరులా జనసేన పార్టీ
జనసేన పార్టీ చాపకింద నీరులా వేగంగా జిల్లాలో విస్తరిస్తుండడం అధికారపార్టీకి మింగుడుపడడం లేదు. దీంతో టీడీపీ నేతలు జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ... పవన్‌ కల్యాణ్‌ పార్టీకి అసలు జెండా, అజెండా కూడా లేదని ఘాటుగా విమర్శించారు. గతంలో ఈ జిల్లాలోనే కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పర్యటన సందర్భంగా పవన్‌ అంటే తనకు ఎవరో తెలియదంటూ వ్యాఖ్యనించారు. దీంతో అధికారపార్టీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు ఫైర్‌ అయ్యారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే పవన్‌పైనా.. తమపైనా విమర్శలకు దిగుతున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రభుత్వంతో స్నేహంగా ఉంటూవస్తోన్న పవన్‌... 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో జనసేన మిత్రపక్షంకాదు... శత్రుపక్షం అని భావించి పవన్‌పై విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పశ్చిమలో జనసేన హోరు మొదలవ్వడంతో అధికారపార్టీ విమర్శలదాడికి దిగుతోంది.

07:50 - October 16, 2017

 

హైదరాబాద్ : అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి తీసుకున్నా పోలీసులు అరెస్టు చేయడాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ తప్పు పట్టారు. అభద్రతా భావంతోనే ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అందరూ సంఘటితం కావాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పాలన నియంతృత్వాన్ని తలిపిస్తోంది
వరంగల్‌ జిల్లాలో కోదండరామ్‌ అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ సీనియర్‌ నేవీ వీహెచ్‌ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన నియంతృత్వాన్ని తలిపిస్తోందని, పోలీజు రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎన్నడూలేని విధంగా భూ ఆక్రమణలు కొసాగుతున్నాయని సీసీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం పలు అనుమానాలను తావిస్తోందని, కబ్జాల్లో కేసీఆర్‌కు కూడా వాటాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలపై కేసీఆర్‌ చేస్తున్న విమర్శలను తమ్మినేని తిప్పికొట్టారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి పోకడలు నిజాం నవాబులను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ పోకడలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

07:49 - October 16, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌, టీ జేఏసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్న టీ జాక్‌ చైర్మన్‌ కోదండరామ్‌పై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన టీజాక్.. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను అదే స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేదపట్టిన రెండేళ్ల వరకు సైలెంటాగానే ఉన్న టీజాక్ అండ్‌ టీమ్‌.... ఆ తర్వాత నుంచి తమ ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టింది. ఇటీవలే తమ కార్యక్రమాలకు మరింత పదును పెట్టడం ప్రారంభించింది. ప్రతిపక్షాల దీటుగా టీజాక్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది

కోదండరాంకు అడుగడుగునా ఆటంకాలు
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చేస్తున్న అమరలు స్ఫూర్తి యాత్ర మరోసారి వివాదాస్పదమవుతోంది. గతంలో మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలె అమరలు స్ఫూర్తి యాత్రలో వివాదం చోటు చేసుకోగా... తాజాగా వరంగల్ జిల్లా యాత్రలో అంతకంటే ఎక్కువగానే దూమారం రేపుతోంది. వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన రోజే టీజాక్ చైర్మన్ కోదండరామ్‌ కూడా అమరులు స్ఫూర్తి యాత్ర తలపెట్టడంతో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించి బ్రేకులు వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై టీజాక్ నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం బలహీన పడుతోండటం వల్లే అరెస్టులతో అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని కోదండరామ్‌ కన్నెర్ర చేశారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటున్న గులాబీ పార్టీ నేతలు టీజాక్ వ్యూహాలకు చెక్‌ పెట్టడంపై దృష్టి కేంద్రీకరించారు. 

నేడు విజయవాడలో జగన్ పర్యటన

కృష్ణా : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన నూతనంగా ప్రారంభించిన వైసీపీ కార్యాలయంలో బీసీ నాయకులతో సమీక్ష జరుపుతారు.

నేడు ఎస్ఎల్ బీసీ పనులు పరిశీలించనున్న బీజేపీ

 

మహబుబ్ నగర్ : నేడు బీజేపీ నేత కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఎల్ బీసీ పనులను పరిశీలించనున్నారు.

 

నేడు అమరావతిలో ఆహారశుద్ధి మేళా

గుంటూరు : నేడు అమరావతిలో ఆహారశుద్ధి మేళా జరగనుంది. దీనిలో భాగంగా వివిధ సంస్థలు, పెట్టుబడిదాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొనుంది.

ఆరుషి తల్లిదండ్రుల విడుదల

 

అలహాబాద్ : నేడు జైలు నుంచి ఆరుషి తల్లిదండ్రులు విడుదల కాబోతున్నారు. ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులను కోర్టు నిర్దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 

నేడు విద్యాశాఖపై చంద్రబాబు సమీక్ష

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నేడు విద్యాశాఖపై అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కాలేజీ యాజమాన్యాలు హాజరుకానున్నాయి. కార్పొరేట్ కాలేజ్లీలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

నేడు విద్యాసంస్థల బంద్

 

హైదరాబాద్ : నేడు కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ కాలేజ్లీ విద్యార్థుల మరణలకు వ్యతిరేకంగా ఈ బంద్ చెపడుతున్నట్టు ఏబీవీపీ తెలిపింది.

Don't Miss