Activities calendar

17 October 2017

తాజ్‌ మహల్ తమకు చాలా ముఖ్యం - యోగి..

ఉత్తర్ ప్రదేశ్ : తాజ్‌మహల్‌ను దేశద్రోహులు నిర్మించారని బిజెపి నేత సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం సృష్టించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాజ్‌మహల్‌ను ఎవరు, ఏ కారణం కోసం కట్టించారన్నది ప్రధానం కాదన్నారు. పర్యాటక కోణంలో చూస్తే తాజ్‌ మహల్ తమకు చాలా ముఖ్యమైనదన్నారు.

కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్న నిర్మాలా సీతారామన్..

ఢిల్లీ : అక్రమ ఆయుధాల సరఫరాదారు సంజయ్‌ భండారి , సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రా మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.

కరీంనగర్ లో యాంటీ క్రాకర్స్ ర్యాలీ..

కరీంనగర్ : కాలుష్య రహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుతూ కరీంనగర్‌లో ప్యారడైజ్‌ విద్యాసంస్థలు యాంటీ క్రాకర్స్‌ ర్యాలీ నిర్వహించాయి. టపాసులు కాల్చి పర్యావరణానికి చేటు తేవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. విద్యార్థులు నినాదాలు చేశారు. 

మహిళా జర్నలిస్టు డఫ్నే గలిజియా దారుణ హత్య..

ఢిల్లీ : మాల్టాలో అక్రమాలకు పాల్పడ్డ నేతల గుట్టు రట్టు చేసిన మహిళా జర్నలిస్టు డఫ్నే గలిజియాను దారుణంగా హతమార్చారు. ఆమె వెళ్తున్న కారును బాంబుతో పేల్చేశారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిన కొన్ని క్షణాలకే బాంబు పేల్చి ఆమెను హత్య చేశారు. 

21:30 - October 17, 2017

ఢిల్లీ : మాల్టాలో అక్రమాలకు పాల్పడ్డ నేతల గుట్టు రట్టు చేసిన మహిళా జర్నలిస్టు డఫ్నే గలిజియాను దారుణంగా హతమార్చారు. ఆమె వెళ్తున్న కారును బాంబుతో పేల్చేశారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిన కొన్ని క్షణాలకే బాంబు పేల్చి ఆమెను హత్య చేశారు. ఈ ఘటన మాల్టాలోని మోస్తాలో జరిగింది. మాల్టా నేతలు అక్రమంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని 53 ఏళ్ల డఫ్నీ తన బ్లాగ్‌లో పనామా పత్రాల పేరిట అనేక కథనాలు రాశారు. అజర్‌బైజాన్‌కు చెందిన రాజవంశీకుల నుంచి మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్‌కు భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆమె తన తాజా కథనంలో పేర్కొన్నారు. మాల్టా ప్రధాని భార్యతో పాటు మరికొంత మంది మంత్రులకు పనామాలో కంపెనీలు ఉన్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. తనకు ప్రాణ భయం ఉందని పోలీసులకు డఫ్నే ఫిర్యాదు కూడా చేశారు. 

21:29 - October 17, 2017

కరీంనగర్ : కాలుష్య రహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుతూ కరీంనగర్‌లో ప్యారడైజ్‌ విద్యాసంస్థలు యాంటీ క్రాకర్స్‌ ర్యాలీ నిర్వహించాయి. టపాసులు కాల్చి పర్యావరణానికి చేటు తేవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. విద్యార్థులు నినాదాలు చేశారు. క్రాకర్స్‌ కాల్చడంవల్ల వాయు,శబ్దకాలుష్యం వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించారు. సంప్రదాయబద్ధంగా దీపావళి జరుపుకోవాలని ప్యారడైజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మన్‌ ఫాతిమారెడ్డి ప్రజలను కోరారు. 

21:24 - October 17, 2017

అనంతపురం : చేనేత కార్మికులకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించిన ఆయన.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో చేనేతల బతుకు మరింత దుర్భరంగా మారాయన్నారు. నెల రోజులకు పైగా నిరాహార దీక్షచేస్తున్న చేనేత కార్మికులపై సీఎం చంద్రబాబుకు కనీసం సానుభూతికూడా లేదన్నారు. చేనేత కార్మికుల దీక్షకు జగన్‌ సంఘీభావం ప్రకటించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనలో వైసీపీ అధినేత జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ధర్మవరంలో అరవై ఐదు మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు జగన్‌ సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో తన పర్యటన నేపథ్యంలో 11 మందికి అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మరోసారి చేనేతలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను, వృత్తి పనుల కూలీలను అన్నివిధాల ఆదుకుంటామని జగన్‌ ప్రకటించారు. 45ఏళ్లు దాటిన ప్రతి చేనేత కార్మికునికి ప్రతినెలా 2000 రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నారు.

అంతకు ముందు అకాలవర్షాల వల్ల దెబ్బతిన్న టమాటా పంటలను జగన్‌ పరిశీలించారు. నష్టాలపాలై కుమిలిపోతున్న రైతులను ఓదార్చారు. రాయలసీమలో టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు. మొత్తానికి ధర్మవరంలో జగన్‌ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. 

21:21 - October 17, 2017

విశాఖపట్నం : అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడేళ్ల క్రితం హుదూద్‌ తుపాన్‌ వచ్చినా.. విశాఖ నగరం తట్టుకుని నిలబడిందని.. ప్రజల సహకారంతోనే పునర్‌వైభవం సాధించగలిగామని చెప్పారు. అంతకు ముందు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ బీచ్‌రోడ్‌లో టీయూ-12 యుద్ధ విమాన ప్రదర్శనశాలను సీఎం ప్రారంభించారు.

21:20 - October 17, 2017

విజయవాడ : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. జగన్‌ పార్టీకి రాంరాం అన్నారు. ఉండవల్లిలో.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆయనకు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. తానీ నిర్ణయం తీసుకున్నట్లు రేణుక తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కూడా.. ఇదేరోజు.. అనుచరులతో కలిసి.. టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసానికి అనుచరగణంతో చేరుకున్న బుట్టా రేణుక.. చంద్రబాబుకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆనాటి తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలన స్వర్ణయుగమని అన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తున్నారని, రాజకీయాలకు కొత్త అయినా తాను రాష్ట్ర అభివృద్ధికి బాబుకు తోడుగా నిలుస్తానన్నారు.

పార్టీ ఎంపీగా ఉన్న తనను.. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని బుట్టారేణుక ప్రశ్నించారు. తన భర్త వైసీపీతో కొంత విబేధించినా.. తాను మాత్రం మనస్ఫూర్తిగానే పార్టీ కోసం పని చేశానని, అయితే, తనను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో విశ్లేషించేంత రాజకీయ అనుభవం తనకు లేదని చంద్రబాబు సమక్షంలో అన్నారు. ప్రస్తుతానికి తాను ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్లు ప్రకటించిన బుట్టారేణుక.. పసుపు కండువా కప్పుకునే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సీఎం సమక్షంలో టీడీపీలో చేరతారని భావిస్తున్నారు. 

21:08 - October 17, 2017

హైదరాబాద్ : టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారా ? ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా ? ఇలా ఎన్నో అంశాలపై గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా రేవంత్ ఢిల్లీ పర్యటన చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుండడంతో రేవంత్ స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు వేయడానికి ఇక్కడకు రావడం జరిగిందని..కూలీ పనుల పేరిట లక్షలు సంపాదించారని దీనిపై కేసు వేయడానికి వచ్చినట్లు రేవంత్ చెప్పారు.

కానీ మధ్యాహ్న సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారని విస్తృతంగా పుకార్లు షికారు చేశాయి. త్వరలోనే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ తెలంగాణ రాష్ట్రంలో తొలి పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. దీనితో నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

20:56 - October 17, 2017

మూసీ ప్రాజెక్టుకు రూ. 65 కోట్లు...

హైదరాబాద్ : మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ కుడి, ఎడమ కాల్వల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు. 

ఎమ్మెల్యే ముప్పిడికి నిరసన సెగ..

పశ్చిమగోదావరి : తిరుమల మండలం తిమ్మాపూర్ లో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు నిరసన సెగ తాకింది. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి ఎదుటే పెట్రోల్ పోసుకుని ధర్మారావు అనే వ్యక్ది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 

'బీసీల గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు'..

కర్నూలు : బీసీల గురించి ఏనాడూ పట్టించుకోని జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

సామాజిక న్యాయం కోసం పోరాటం - తమ్మినేని..

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేదాక పట్టుదలతో ముందుకు సాగుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు..సామాజిక తరగతులపై ప్రభావం అంశంపై సదస్సు జరుగుతోంది. తమ్మినేని, గద్దర్, హరగోపాల్, కాకి మాధవరావులు హాజరయ్యారు.

20:41 - October 17, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేదాక పట్టుదలతో ముందుకు సాగుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు..సామాజిక తరగతులపై ప్రభావం అంశంపై సదస్సు జరుగుతోంది. తమ్మినేని, గద్దర్, హరగోపాల్, కాకి మాధవరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. మహాజన పాదయాత్ర ఐదు మాసాల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని గుర్తు చేశారు. ఇచ్చినోడు ఎవరైనా..తెచ్చినోడు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని, అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఆవిష్కరించాలని పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి సాధించడం..అందుకు మార్గాలను అన్వేషించడం లక్ష్యమన్నారు. తమ పాదయాత్ర ప్రారంభమయిన అనంతరం ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. పాదయాత్రలో ఎక్కడా సీపీఎం గురించి ప్రచారం చేయలేదని..రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దోపిడీ..పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే వర్గపోరాటాలు అని తెలిపారు.

మొత్తం ప్రత్యామ్నాయ విధానాలు కోరుకున్న వారంతా ఐక్యతలో భాగం కలవాలని సూచించారు. 4200 సంఘాలు ఒక తాటిపైకి రావడం జరిగిందని, ఇందులో కుల..వర్గ..ప్రజా..యువకులు..విద్యార్థులు..మహిళలున్నారని తెలిపారు. రాబోయే కాలంలో విస్తృతమైన ఐక్యత చేయాల్సినవసరం ఉందని, ఇందుకు కృషి చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన విధంగా పనులు జరగడం లేదని, ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభివృద్ధి అంటే ఏమిటీ.. అనే దానిపై పాదయాత్రలో వివరంగా చెప్పడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విషయాలు చెబుతోందన్నారు. పీడన కూడా పోవాలన్నదే తమ లక్ష్యమని అదే సామాజిక న్యాయమన్నారు. కులం..వర్గం పై చర్చ జరుగుతోందని, కంచె ఐలయ్యపై సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్లు..ప్రాతినిధ్యం..సామయాజిక హోదా..రాజకీయ ప్రాతినిధ్యం హక్కుల కోసం పోరాడే విధం ముఖ్యమైన అంశమన్నారు. సామాజిక న్యాయం సాధించేదాక పట్టుదలతో ముందుకు సాగుతామని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనతో పాదయాత్ర చేసిన వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు..పాదయాత్రకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సీపీఎం మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవ సభ..

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవ సభ జరుగుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలు..సామాజిక తరగతులపై ప్రభావం అంశంపై సదస్సు జరుగుతోంది. తమ్మినేని, గద్దర్, హరగోపాల్, కాకి మాధవరావులు హాజరయ్యారు. 

అవినీతి ఆరోపణలపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందన..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు విభాగంలో అవినీతి ఆరోపణలపై కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పందించారు. పూర్థిస్తాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని జోనల్, అదనపు జోనల్ కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

గొంతు కోసి 40 తులాల బంగారం అపహరణ..

విశాఖపట్టణం : ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతు కోసి 40 తులాల బంగారాన్ని దుండగుడు అపహరించాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వెంకోజిపాలెం జీఆర్కే గ్రాండ్ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

19:56 - October 17, 2017

హైదరాబాద్ : సరళీకృత ఆర్థిక విధానాలు పెను ప్రభావం చూపెడుతున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర'' ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ''సరళీకృత ఆర్థిక విధానాలు - సామాజిక తరగతులపై ప్రభావం'' అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగాన్ని తిరస్కరించడం..ప్రజాస్వామ్యం పనికి రాదనడం..హిందూ రాష్ట్రం కావాలని ప్రతిపాదించడం..పై పదేళ్ల క్రితం పట్టించుకోలేదన్నారు. వామపక్ష పార్టీలు భావజాలాన్ని అంత సీరియస్ గా అనుకోలేదని, కానీ ఈ రోజు అలా అనుకోవడానికి వీలు లేదన్నారు. బీజేపీ పార్టీ వచ్చిన అనంతరం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని సూచించారు. హిందూ మత భావజాలం ఇంత బలంగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. రాజ్యాంగంపై మార్క్స్ కొన్ని అభిప్రాయాలు తెలియచేశారని, రాజ్యాంగంలో ఉన్న స్పూర్తి..ప్రజాస్వామ్య సంస్కృతి..సమభావన..అసమానతలు తగ్గించడం..సమసమాజం వైపు దేశం వెళ్లాలని ఆలోచించడం లేదన్నారు. కానీ దేశం ఎటు వైపు వెళ్లాలో..ఏం చేయాలో రాజ్యాంగంలో అంబేద్కర్ రాసి పెట్టారని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడి మన దేశానికి ఎందుకు అన్న ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు. రాజకీయాల్లో ఆర్థిక సమస్యలు..అసమానతలు..భద్రత..మనిషి ఎలా జీవించాలనే దానిపై చర్చ జరగడం లేదన్నారు. ప్రస్తుతం ఏమి తినాలో అనే దానిపై చర్చ జరుగుతోందన్నారు. అంబేద్కర్ హిందూ జాతీయవాది అని ఓ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారని, కుల నిర్మూలన..ఫాసిజంపై అంబేద్కర్ ఎంతో రాశారని తెలిపారు. ప్రొ.హరగోపాల్ ప్రసంగం పూర్తిగా వినాలంటే వీడియో క్లిక్ చేయండి...

19:40 - October 17, 2017

రిటైర్డ్ అధికారుల అరెస్టు...

విశాఖపట్టణం : భూ కబ్జా కేసులో ఇద్దరు రిటైర్డ్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా రిజిస్ట్రార్ గా వెంకటేశ్వరరావు, సబ్ రిజిస్ట్రార్ లుగా పనిచేసిన సత్యనారాయణ రావులు అరెస్టు అయ్యారు. దశరథ మహారాజు, మరికొందరు ఫిర్యాదుతో అరెస్టులు చేస్తున్నారు. భూ కబ్జాకు సహకరించి రికార్డులు సృష్టించారని, 24 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు రూ. 4.5 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 

ఇండియా గేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ఢిల్లీ : ఇండియా గేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఇతడిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బాబు నివాసం వద్ద మహిళ నిరసన..

విజయవాడ : ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఓ మహిళ నిరసన వ్యక్తం చేస్తోంది. పట్టాదారు పాసుపుస్తకం కోసం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పొన్నూరుకు చెందిన మహిళ నిరసన వ్యక్తం చేస్తోంది. సీఎంను కలిసేందుకు ఎన్నిసార్లు యత్నించినా అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

మంత్రి కేటీఆర్ కు మరో ఆహ్వానం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. ఇండియా - యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 30, 31న సదస్సు జరుగనుంది. 30న మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానంలో పేర్కొన్నారు. 

అయూబ్ కుటుంబానికి ఆర్థిక సాయం..

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న తాండూరు టీఆర్ఎస్ కార్యకర్త అయూబ్ ఖాన్ కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్ లు అందచేశారు. భవిష్యత్ లో అయూబ్ కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.

18:39 - October 17, 2017

అనంతపురం : జిల్లాలో విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఏపీ జర్నలిస్టు ఫోరం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. అంతకంటే ముందు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విలేకరి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఏపీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అభివర్ణించారు. విలేకరి శ్రీనివాస్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

18:33 - October 17, 2017

కడప : జిల్లాలోని పుల్లంపేట మండలం అనంతసముద్రం వీఆర్వో సస్పెన్షన్ కు గురయ్యారు. వీఆర్వో అవినీతిపై టెన్ టివి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై కలెక్టర్ బాబు నాయుడు స్పందించారు. వెంకటయ్య అవినీతిపై టెన్ టివిలో ఏప్రిల్ మూడో తేదీన కథనాలు ప్రసారమయ్యాయి. దీనితో అధికారులు చర్యలు తీసుకున్నారు. 

18:28 - October 17, 2017
18:24 - October 17, 2017

గుంటూరు : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లాలో మరో విద్యార్థి తనువు చాలించాడు. జిల్లాలోని వినుకొండలోని నారాయణ స్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అఖిబ్ జావెద్ అనే విద్యార్థికి..తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణ పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందనే భయంతో రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై తల్లిదండ్రులు..విద్యాసంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. కార్పొరేట్ స్కూళ్లు..కాలేజీలు విద్యార్థులను ఆదాయ వనరుగా చూస్తున్నారని తెలిపారు. ఈ ఆత్మహత్యలపై టెన్ టివి పలువురితో ముచ్చటించింది. విద్యాసంస్థల వేధింపులతోనే స్టూండెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వయస్సుకు మించిన చదువులతోనే విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:13 - October 17, 2017

అనంతపురం : సీమలో టమాట పంటలకు తీరని నష్టం వాటిల్లిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులను పరామర్శించడానికి ఆయన అనంతకు వెళ్లారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో దెబ్బతిన్న టమాట పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులను పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఆవేదన చెందుతున్న రైతులను ఓదార్చారు. సీమలో టమాట పంటలకు తీరని నష్టం వాటిల్లిన్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడని తెలిపారు. రెండు లక్షన్నర ఎకరాలకు తీరని నష్టం వాటిల్లిందని జగన్ చెప్పుకొచ్చారు. 

18:11 - October 17, 2017

అనంతపురం : జగన్ వచ్చినప్పుడే ప్రభుత్వంలో కదలిక..స్పందన వస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలో చేనేత సమస్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. జగన్ వస్తున్నాడు...అనంతకు..అని తెలిసిన సమయంలో ప్రభుత్వం స్పందించిందని..అందులో భాగంగా 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే 11 మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. కానీ ఆ ఆర్థిక సాయం రూ. లక్షన్నరకు మించి లేదన్నారు. మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 

ఏడాదిలో ఒక మంచి ప్రభుత్వం - జగన్..

అనంతపురం : ధర్మవరంలో చేనేత సమస్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రోడ్ షో నిర్వహించారు. చేనేత కార్మికుల కోసం రూ. వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులు..రైతులు..చేనేత కార్మికులను మోసం చేసిందని, చేనేత కార్మికుల ఆరోగ్య బీమా కూడా పోయిందని, ఏడాదిలో ఒక మంచి ప్రభుత్వం రాబోతుందన్నారు. బడుగు..బలహీన వర్గాలకు 45 ఏళ్లకే ఫించన్ ఇస్తామని ప్రకటించారు.

 

అందుకే ఢిల్లీకి వచ్చినా - రేవంత్..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్ పెద్ద‌ల‌తో స‌మావేశం అవుతున్నానంటూ వస్తున్న వార్త‌లపై స్పందించారు. తాను టీఆర్ఎస్ నేత‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లాన‌ని చెప్పారు. 

17:33 - October 17, 2017

సంగారెడ్డి : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేముల ఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కోదండరాంలు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, మల్లన్నల సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఇస్తామంటే అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కోదండరాం విమర్శించారు. వాస్తవానికి నీళ్లు ఎవరూ వద్దనడం లేదని..సరియైన పద్ధతిలో నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

17:28 - October 17, 2017

హైదరాబాద్ : 'సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి' పేరిట సీపీఎం మహాజన పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 17, 2016న ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన.. ఈ యాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వం వహించారు. తొమ్మిది మంది నేతలు యాత్రలో పాల్గొన్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్వీకేలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యుడు నైనాన్ రాజు టెన్ టివితో మాట్లాడారు. ఆదివాసీల తరపున తాను పాల్గొనడం జరిగిందని, కానీ చాలా గ్రామాల్లో రోడ్లు లేవన్నారు. అడవిమార్గంలోనే ప్రసవాలు జరుగుతున్నాయని, విద్య ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. హరితహారం పేరిట పోడు భూములను లాక్కొంటోందని..జయశంకర్ జిల్లాలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

వ్యవసాయ కూలీల పరిస్థితి దుర్భంగా మారిపోయిందని తమ పాదయాత్రలో గమనించామని మరో పాదయాత్ర బృంద సభ్యుడు నగేష్ టెన్ టివికి తెలిపారు. లక్షలాది..కోట్లాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని తెలిపారు. సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:12 - October 17, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అవినీతికి ఇక చెక్ పడదా ? పలు విభాగాల్లో అవినీతి వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల వ్యవహారాల తీరు ఒక్కోటి బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. మొన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి వెలుగు చూడగా తాజాగా ట్రాన్స్ పోర్టు విభాగంలో అవినీతి రాజ్యం ఏలుతోందనే ఆరోపణలు గుప్పుమంటుండడం కలకలం రేపుతోంది. ప్రముఖంగా మలక్ పేటలో ఎక్కువగా అవినీతి జరుగుతోందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు.

నగరంలో చెత్త తరలింపు కోసం జీహెచ్ఎంసీ వందల సంఖ్యలో వాహనాలు వినియోగిస్తుంటారు. గత ఏడాది క్రితం ఈ శాఖను డీ సెంట్రలైజ్ చేశారు. గతంలో వంద కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వినిపించాయి. సీసీఎస్ లో దీనిపై కేసు కూడా నడుస్తోంది. తాజాగా ఈ శాఖలో పర్మినెంట్ ఉద్యోగులతో కాకుండా ఏఈ..డీఈలు సంతకాలు చేస్తూ బిల్లులు నొక్కేస్తున్నారని మెకానిక్ లు ఆరోపిస్తున్నారు.

ట్రాన్స్ పోర్టు విభాగం అధికారులు..కాంట్రాక్టర్లు తమ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారని ట్రాన్స్ పోర్టు మెకానిక్ లు ఆరోపిస్తున్నారు. 20 నెలల నుండి సంతకాలు చేయడం లేదని, ఏఈలు..డీఈలు సంతకాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారి టెన్ టివితో మాట్లాడారు. వాళ్ల పర్యవేక్షణలో పని జరుగుతుందని, తమ వారితో సంతకాలు చేయించుకోవాలని వారే సూచించడం జరిగిందని..అలాంటిదే చేయడం జరుగుతోందన్నారు.

టెన్ టివి గ్రౌండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మెకానిక్ గా నాగేందర్ ఉంటుంది కానీ..సంతకం మాత్రం వేరే వ్యక్తిది ఉండడం గమనార్హం. కార్మిక సంఘాల నేతలు..ఇతరులు టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివారలకు వీడియో క్లిక్ చేయండి. 

విశాఖను టూరిజం హబ్ గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

విశాఖ : స్టీల్ సిటీ ఎయిర్ పోర్టులో వీఐపీ లాంజ్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండేళ్లలో ఫ్లైఓవర్ నిర్మానం పూర్తి చేస్తామన్నారు. విశాఖను టూరిజం హబ్ గా మారుస్తామని తెలిపారు.

17:00 - October 17, 2017

బాలీవుడ్ : ఎప్పుడు వివాదాల్లో ఉంటూ ప్రేక్షకులతో తిట్లు తింటూ, గొప్ప విశ్లేషకుడిగా తనను తాను అభివర్ణించుకునే నటుడు మరియు డైరెక్టర్ అయిన కమల్ రషీద్ ఖాన్ మరోసారి తన నోటి దూరుసును చూపించాడు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఆపై వాళ్ల ఫ్యాన్స్ తో తిట్లు తినటంఈయనగారికి అలవాటే . అయితే ఈసారి ఆయన పెను దుమానికి తెరతీశాడు.

బాలీవుడ్ లో సంచలనంగా మారిన కంగనా రనౌత్ వృతిక్ రోషన్ వ్యవహారంలో రషీద్ వేళు పెట్టాడు. కండల వీరుడికి మద్దతుగా ట్వీట్ చేయగా అది ఇప్పుడు మీడియా సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటి కరీనా కపూర్ తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన రషీద్ దాని కింద ఓ సందేశం ఉంచాడు. అందులో నేను కరీనా నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని రాశాడు. కావాలంటే ఈ ఫోటోను చూడండి ఇదే సాక్ష్యం అంటూ చెప్పాడు. కానీ అతని ఉద్దేశం మాత్రం వేరే ఉంది. కలిసి ఫోటోలు దిగడం దిగినంత మాత్రం ఫోటోలోని వ్యక్తి సంబంధం ఉన్నట్లు ఆరోపించడం సరికాదన్న రీతిలో కంగన, ఆమె చెల్లి రంగోలియా దేయ్యలంటూ వివాదాలకు చురకులు వేశాడు. ఆ ఇద్దరి ఫటో చూసిన ప్రతి ఒక్కరు కామెడీ టైమింగ్ బాగుందని చెబుతున్నారు. ఈ ఫోటోను చూసిన కరీనా సైఫ్ చాలా తెలికగా తీసుకున్నారటా.

16:59 - October 17, 2017

టెన్ టివి సినమా : తాను పుండై మరోకరికి పండై, జీవంచేవములా ఉండేవారు వేశ్యలన్నారు కవులు...డబ్బులకు మానాన్ని అమ్ముకుంటూ ఎవరో ఊరు పేరు తెలియని వారికి పడక సుఖాన్ని ఇచ్చే స్త్రీలందరు ఇష్టంగానే ఆ పని చేస్తున్నారా అనే కథతో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'టార్చ్ లైట్'.

ఈ చిత్రానికి దర్శకుడు అబ్దులు మజిత్. ఇందులో అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్యగా 'జయం ' ఫేమ్ సదా నటిస్తున్నారు. తెలుగులో జయం, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు పాటు పలు చిత్రాల్లో నటించిన సదా తర్వాతా హోమ్లీ పాత్రల్లో నటించారు. కొన్ని టీవీ షోలకు జడ్జిలుగా కూడా వ్యవరిస్తున్నారు. సదా ఇప్పడు మళ్లీ గ్లామర్ పాత్రలో నటిస్తుండడంతో ఎలా ఉంటారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకుడు అబ్దుల్ మజిద్ పలువురు కథానాయకల్ని సంప్రదించగా ఎవరు ఒప్పుకోలేదట చివరిగా సదా ఈ పాత్ర చేయడానకి ఒప్పుకున్నారటా. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

16:37 - October 17, 2017

అంతర్జాతీయం : పోర్న్ స్టార్స్ ఇప్పుడు వెండితెర, బుల్లితెరపైకి వస్తున్నారు. ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తెలుగులో కూడా నటించింది. సన్నీ లియోన్ ఆదర్శంగా తీసుకుందో ఏమో..? అమెరికాకు చెందిన టాప్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా త్వరలో ఓ టాక్ షోకు యాంకర్ గా వ్యవరించబోతోంది. గతంలో ఓ ముస్లిం అయిన మియాకు ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. వరల్డ్ వైడ్ గా ఖలీఫాకు మంచి క్రేజ్ ఉంది, పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు. 2016లో ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేసింది మియా ఖలీఫా గురించే. ప్రస్తుతం ఆమె పోర్న్ సినిమాలో నటించడం మానేసింది.

అమెరికన్ లెబనీస్ అయిన మియా టెక్సాన్ యూనివర్సిటీలో చదువుతోంది. 24ఏళ్ల మియాకు బేస్ బాల్, ఫుట్ బాల్, అంటే ఎంతో ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఉన్న క్రేజ్ చూసిన 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ చానల్ వ్యాఖ్యతగా అవకాశం ఇచ్చింది. దీన్ని బట్టి మనకు ఏ అర్థమైంది అంటే సన్నీ లియో న్ పోర్న్ మానేసి సినిమాలు చేసుకుంటుంది. ఇప్పుడు మియా ఖలీఫా కూడా మానేసి యాంకర్ గా చేస్తోంది. ఎందుకంటే వారు గతంలో చేసింది మంచి పని కాదు కాబట్టి .

16:18 - October 17, 2017
16:16 - October 17, 2017

హైదరాబాద్ : పల్లె... పల్లెకు వెళ్లింది..! ప్రతి వ్యక్తిని కదిలించింది..! కష్టాలను తెలుసుకుంది..! బడుగు, బలహీన వర్గాల గొంతుకై .. ప్రభుత్వాన్ని నిలదీసింది! పాలకుల గుండెల్లో దడ పుట్టించి... సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ప్రజల్లో చైతన్యం నింపింది.. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో... ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. చూస్తుండగానే సీపీఎం మహాజన పాదయాత్ర జరిగి ఏడాది దాటిపోయింది. ఈ సందర్భంగా ఎస్వీకేలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతోంది. సెమినార్ తో పాటు వార్షికోత్సవ సభ కాసేపట్లో జరుగనుంది. పలువురు నాయకులు..కార్యకర్తలతో పాటు పాదయాత్ర బృంద నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యులతో టెన్ టివి ముచ్చటించింది. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

జీహెచ్ ఎంసీ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అవినీతి

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అవినీతి బయటపడింది. ఫోర్జరీ సంతకాలతో అధికారులు బిల్లులు కాజేస్తున్నారు. తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని మెకానిక్ లు ఆరోపిస్తున్నారు.

కమాన్ పూర్ టీఆర్ ఎస్ పార్టీలో వివాదం

పెద్దపల్లి: కమాన్ పూర్ టీఆర్ ఎస్ పార్టీలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే మధు ఆదేశాలతో పార్టీ నుంచి ఐదుగురు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కి ఎంపీపీ భూమయ్య ఆందోళన చేపట్టారు.

అనంత సముద్రం వీఆర్ వో సస్పెన్షన్

అనంతపురం: పుల్లంపేట మండలం అనంత సముద్రం వీఆర్ వో సస్పెన్షన్ కు గురయ్యాడు. వీఆర్ వో వెంకటయ్య అవినీతి ఆరోపణలపై 10టివి కథనానికి స్పందించిన కలెక్టర్ సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు.

'ఇంద్రారెడ్డి కాలనీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది'

హైదరాబాద్: ఇంద్రారెడ్డి కాలనీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ డీసీపీ తెలిపారు.మొత్తం 5 మృతదేహాలు లభ్యం అయ్యాయి. కారులో రెండు మృతదేహాలు, కారుకి కి.మీ దూరంలో చెట్ల పొదల్లో మరో మూడు మృతదేహాలను గుర్తించామని తెలిపారు. ప్రభాకర్, రవీందర్, రవీందర్ భార్య లక్ష్మి డీమ్యాట్ అకౌంట్ లో రూ._.30 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభాకర్ కుటుంబం ప్రయాణించిన కారులో పాయిజన్ లిక్విడ్ దొరికందని పేర్కొన్నారు.

హిమన్షు కంపెనీ ఎవరిదో చెప్పాలి: షబ్బీర్ అలీ..

నిజామాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబం, టీఆర్ ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. హిమన్షు కంపెనీ ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ హిమాన్షు కంపెనీ డైరెక్టర్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం మధుసూదనచారి రూ.40 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం అని పేర్కొన్నారు.

15:35 - October 17, 2017

నెల్లూరు : తనతో అసభ్యంగా ప్రవర్తిస్తావా అంటూ ఓ మహిళ అపరాకాళి అవతారమెత్తింది. ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది. ఎడాపెడా రెండు చెంపలు వాయించింది. ఈ ఘటన ఎస్పీ బంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. కానీ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొనే లోపే ఆకతాయి కాళ్లకు పని చెప్పాడు. ఎలా బుద్ధి చెప్పిందో వీడియో క్లిక్ చేయండి. 

15:32 - October 17, 2017

కడప : జిల్లాలో భూమి కుంగిపోవడంతో రైతులు..గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే మళ్లీ పునరావృతం కావడంతో అక్కడ ఆందోళన నెలకొంది. చింతకొమ్మదిన మండలం గూడవాండ్ల పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొల్లాలో భూమి ఒక్కసారిగా కుండిపోయింది. మామిడి చెట్లు భూమిలోకి కుంగిపోయాయి. తమకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, గతంలో ఇలాంటిదే జరిగితే అధికారులు వచ్చి వెళ్లారని ఓ రైతు పేర్కొన్నారు. 

15:25 - October 17, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సీపీఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. కేరళలో జనరక్షణ్ యాత్ర పేరిట బీజేపీ అరాచకం సృష్టిస్తోందని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీత్ షా కుమారుడి అవినీతిని గురించి దేశ ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ నేతలు సీపీఎంను టార్గెట్ చేశారని సీపీఎం నేత వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా ఆయనతో టెన్ టివి మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:20 - October 17, 2017

అనంతపురం : ప్రముఖ వ్యాపార వేత్త వై.వి.శివారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మీడియాకు తెలియచేశారు. పరిశ్రమలను నెలకొల్పి పరోక్షంగా..ప్రత్యక్షంగా..అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. మూడు వేల మంది కార్యకర్తలు..మూడు వందల వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరుగుతోందని, పదవిని ఆశించి రావడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని..అందర్నీ కలుపుకొని వెళుతానని తెలిపారు.

 

 

14:52 - October 17, 2017

యువతలో అద్భుతమైన ఆలోచనలున్నాయి. వారు సమసమాజ నిర్మాతలు. భవిష్యత్ కు దిశా..నిర్ధేశం చేసే మేధావులు..వినూత్న ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం యువత సొంతం. స్వయంగా ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకటించింది. ప్రపంచ జనాభాలో అత్యధిక యువత శక్తి గల దేశం కూడా భారతదేశం కావడం విశేషం. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యంలో యువత పాత్ర తక్కువగా ఉన్న దేశాల్లో కూడా భారత్ ముందుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతీ, యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. క్షణికావేశాలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు యువతీ, యువకులకు మనోస్థైర్యం విషయంలో ఎందుకు ఇంత జావ కారిపోతున్నారు. నేటి యువతలో ఆత్మవిశ్వాసం లోపిస్తోందా ? ఈ అంశాలపై 'మానవి' వేదికలో ఫోకస్ మల్లవరపు బాలరత్న (మినిస్ట్రీ ఆఫ్ డిప్యూటి డైరెక్టర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:34 - October 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అధికారులు..ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సభ నిర్వాహణపై చర్చించారు. ఈనెల 27నుండి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు.

సభ నిర్వాహణపై 26న బీఏసీ భేటీ జరిపి 27వ తేదీన సమావేశాలు నిర్వహించాలని ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల బిల్లులను పునరావృతం చేసి కేంద్రానికి పంపించి వత్తిడి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో సింగరేణిలో వారసత్వం ఉద్యోగాలు, ఉపాధి హామీకి వ్యవసాయ అనుసంధం తదితర తీర్మానాల బిల్లులున్నట్లు తెలుస్తోంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు జరుపాలనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

కేకులో విషయం కలుపుకుని ఆత్మహత్య...

హైదరాబాద్: కొల్లూరు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతి చెందిన ఐదుగురు.. ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కేక్‌లో విషం కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. అయితే మృతదేహాలకు సమీపంలో కేక్ బాక్స్ కనిపించింది. దీన్ని పరిశీలించిన పోలీసులు.. కేక్‌లో విషం కలుపుకొని తిన్నట్లు నిర్ధారణకు వచ్చారు.

మంత్రి హరీష్ రావుకు కోదండరాం సవాల్

సిద్ధిపేట: న్యాయం కోసం వేములఘాట్ ప్రజలు 500 రోజులుగా పోరాడుతున్నారని ప్రొ.కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడా రైతులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని, రైతులు తమ భూములను ఎలా వదులతారు? మంత్రులు తమ మంత్రి పదవులను వదులుకుంటారా అని ప్రశ్నించారు. వేముల ఘాట్ గ్రామానికి రండి... ప్రజల సమక్షంలోనే చర్చిద్దాం మంత్రి హరీష్ రావుకు కోదండరాం సవాల్ విసురారు. ప్రాజెక్టు పేరుతో వనరుల దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.

14:28 - October 17, 2017

టెన్ టివి సినిమా : జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'జై లవ కుశ' రికార్డును బద్దలుకొట్టబోతుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత కొంత మంది తమ రివ్యూలతో చిత్రానికి రేటింగ్ తక్కువగా ఇచ్చారు. దీనిపై ఎన్టీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ చిత్రం మాత్రం ఎవరు ఎన్ని కామెట్లు చేసిన దూసుకుపోతోంది. 'జై లవ కుశ' ఎన్టీఆర్ కేరీరిలోనే భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికి డిసెంట్ కలెక్షన్లు సాధిస్తున్న జై లవ కుశ త్వరలో మెగా రికార్డ్ ను బ్రేక్ చేయడంఖాయమని తెలుస్తోంది. కలెక్షన్ల విషయంలో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడో స్థానంలో మెగాస్ఠార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఉంది.

ఓవరాల్ గా 164కోట్ల గ్రాస్ సాధించిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150మూడో స్థానంలో కొనసాగుతుండగా ఇప్పుడు 'జై లవ కుశ' దాన్ని బ్రేక్ చేయనునట్టు కనబడుతోంది. ఇప్పటికే 162 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు సాధింస్తుడడంతో బిజినెస్ ముగిసే నాటికి ఖైడీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి మరి...!

14:23 - October 17, 2017

ఉప్పల్ లో చైన్ స్నాచింగ్...

హైదరాబాద్: ఉప్పల్ వద్ద విజయపురి కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఒంటరిగా నడుచుకుంటు వెళుతున్న మహిళ మెడలో నుంచి బైక్ వచ్చిన దుండగులు బంగారం గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు.

నగరానికి మరో4 ఎక్స్ ప్రెస్ హైవేలు..

హైద‌రాబాద్‌ : గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో న‌గ‌ర‌వాసుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకుగాను నాలుగు హైవే కారిడార్ల నిర్మాణాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్టు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్ట్‌ల‌ను త్వ‌రిత‌గ‌తంగా పూర్తిచేయ‌డానికిగాను న్యాక్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో నియ‌మితులైన 125మంది సైట్ ఇంజ‌నీర్ల‌తో మేయ‌ర్ రామ్మోహ‌న్ నేడు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ మెహిదీప‌ట్నం నుండి శంషాబాద్ మార్గంలో ఉన్న పి.వి న‌ర్సింహారావు హైవే మాదిరిగానే మ‌రోనాలుగు హైవేల‌ను నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు.

ఎంపి బుట్టా రాజకీయ నైతిక విలువలను కుంగదీసింది: పార్థసారథి

విజయవాడ: రాజకీయ నైతిక విలువలను ఎంపి బుట్టా రేణుక కుంగదీసిందని వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు. ప్రాణం పోయే వరకూ పార్టీ మారనని చెప్పిన రేణుక ఈ రోజు ప్రాణాలు వదిలి వెళ్లారా అని ప్రశ్నించారు. పార్టీ ఎందుకు మారారో గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

14:03 - October 17, 2017
14:02 - October 17, 2017

జార్ఖండ్‌ : ఓ పాప ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. సిమ్‌డెగాకు 
చెందిన ఓ పేద కుటుంబానికి రేషన్‌ షాపులో నిత్యావసర వస్తువులు నిరాకరించడంతో రెండు రోజులుగా పస్తులున్న 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డును అనుసంధానం చేయలేదన్న కారణంతో నెల రోజుల క్రితం స్థానిక రేషన్‌ డీలర్‌ ఆ కుటుంబం రేషన్‌ కార్డును రద్దు చేశాడు. దీంతో ఆ కుటుంబానికి గోధుమలు తదితర నిత్యావసర వస్తువులు ఇవ్వడం మానేశాడు. 4-5 రోజులుగా తమ కుటుంబం పస్తులుగానే ఉందని చనిపోయిన పాప తల్లి కోయలాదేవి పేర్కొంది. పాప స్కూలుకు వెళ్తుందని, స్కూలుకు సెలవులుండడంతో మిడ్‌ డే మీల్‌ కూడా లభించలేదని తెలిపింది. స్థానిక నేతలెవ్వరూ తమ గోడును వినిపించుకులేదని కోయలా దేవి చెప్పింది. అడవిలో దొరికే ఆకులు అలములు తిని రోజులు వెళ్లదీస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పౌరసరఫరాల శాఖా మంత్రి పేర్కొన్నారు.

 

27 నుంచి తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్: 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు జరగనున్నాయి. 26న బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సచివాలయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ప్రభుత్వ ప్రతిపాదనలను అసెంబ్లీ సెక్రటరీకి ప్రభుత్వం పంపింది.

14:01 - October 17, 2017

గుంటూరు : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక... సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కర్నూలులో భారీ బహింరగ సభ ఏర్పాటు చేసి... పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆమె అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేణుక మద్దతివ్వడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మంచిని ప్రోత్సహించేవారు టీడీపీ మద్దతివ్వాలన్నారు చంద్రబాబు. కొంతమందికి టీడీపీకి మద్దతివ్వాలని లోపల అనుకున్నా.... వాళ్లు బయటపడడం లేదన్నారు. ఈమేరకు బుట్టా రేణుకతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:57 - October 17, 2017

అనంతపురం : విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టాని ఎస్పీకి వినతి పత్రం అందించారు ఏపీ జర్నలిస్టు ఫోరం నేతలు. విలేకరి శ్రీనివాస రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఏపీజేఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. విలేకర్లపై దాడులను నిరసిస్తూ జర్నలిస్టులు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. శ్రీనివాస రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నిందింతులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్‌ చేశారు. 

 

13:55 - October 17, 2017

ఢిల్లీ : కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఢిల్లీలో ర్యాలీ నిర్వహించింది. పినరయి విజయన్‌ ప్రభుత్వంపై బిజెపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కేరళలో సిపిఎం కార్యకర్తలపై జరుగుతున్న దాడులను, హత్యాకాండను తీవ్రంగా ఖండించింది. మతతత్వ శక్తుల దాడులకు బలైపోయిన కార్యకర్తల ఫ్లెక్సీలను సిపిఎం ర్యాలీలో ప్రదర్శించింది. ఆర్ఎస్‌ఎస్‌ గుండాగిరీని సహించేది లేదని  హెచ్చరించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేరళలో హింసాకాండను ఆపాలని కోరుతూ బిజెపికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యులు ఎండి సలీం, సుభాషిణీ అలీ, బివి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

 

13:50 - October 17, 2017

కృష్ణా : విజయవాడ బందర్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేరళ, వైజాగ్‌లో సీపీఎం కార్యకర్తలపై బీజేపీ దాడులను నిరసిస్తూ సీపీఎం నేతలు ర్యాలీ చేపట్టారు. దీనికి పోటీగా బీజేపీ నేతలు కూడా బైక్‌ర్యాలీ చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ వైపు వెళ్తున్న సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు వై.వెంకటేశ్వరరావు
దొంగే దొంగ అన్న చందంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ తీరు ఉంది. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దాడులను తిప్పికొడుతాం. 
ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. దాడులకు బెదరం. బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చకునేందుకు వామపక్షాలపై బీజేపీ దాడులు -సీపీఎం నేతలు 
ఖచ్చ కట్టి కమ్యూనిష్టులపై విష ప్రచారం చేస్తోంది. సిపిఎం కార్యాలయాల ముందు ప్రదర్శనలకు అధికార పార్టీ పిలుపునివ్వడం సిగ్గుచేటు. అన్ని రంగాల్లో బీజేపీ వైఫల్యం చెందింది. జిఎస్ టి పేరుతో కార్పొరేట్లకు మేలు జరుగుతూ అందినకాడ కట్టబెడుతున్నారని పోరాడే వారిపై దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం.
ఆహార నియమాలు, వస్త్రధారన  ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దాడులకు పాల్పడడం దారుణం.
బాబూరావు
మహాత్మగాంధీని చంపిన హంతకలు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు. గుజరాత్ లో మోడీ మారణకాండ సృష్టించారు.
బీజేపీ దాడులను తిప్పికొడుతాం. దాడులు చేస్తుంటే ఎర్రజెండా ఊరుకోదు. విజయవాడలో బీజేపీ పప్పులుడకవు.. హింసా, అరాచక రాజకీయాలను సాగనివ్వబోం. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ దాడులు, అరెస్ట్‌లకు భయపడం. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించే వాళ్ళం  కాదు. శాంతిని కోరుకొనే వాళ్ళం కాబట్టి శాంతియుతంగానే బిజెపి ని ధీటుగా ఎదుర్కొంటాం. బిజెపి, నరేంద్ర మోదీ స్వరూపం బట్టబయలైంది. ధరలు నియంత్రిస్తామని చెప్పి మూడున్నరేళ్ళయినా ధరలు తగ్గకపోగా కార్పొరేట్లకు కట్టబెడుతుండడం దుర్మార్గం 
బిజెపి నేతల అవినీతి చిట్టా బయటకొస్తుంది...అందుకే ప్రజల దారి మళ్ళించడానికి శాంతి యాత్ర. బిజెపి నేతలది శాంతి యాత్ర కాదు హింస యాత్ర. 
బిజెపి దాడులను ధీటుగా ఎదుర్కొంటాం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి నేతల బైక్ ర్యాలీ కి ఎలా అనుమతించారు. బిజెపి వ్యతిరేక విధానాలను ప్రజలు, కమ్యునిష్టులు కలిసి ధీటుగా ఎదుర్కొంటాం. హింసా రాజకీయాలకు పాల్పడితే ఉద్యమాల ద్వారానే అడ్డుకుంటాం.. 
దాడులకు దిగితే ప్రతిఘటిస్తాం అని అన్నారు.

 

ఘనంగా ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాలు: రఘువీరా

విజయవాడ:ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాని ఘనంగా నిర్వహించనున్నామని పీసీసీ చీఫ్ రఘువీరా తెలిపారు. 8 అంశాలపై వివిధ ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్రం చేయాలని, కేంద్రం చేపడితేనే పోలవరానికి ఎలాంటి అడ్డంకులు రావని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రాజెక్టు పూర్తి కాదని, చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా ఏపీకి పరిశ్రమలు రావన్నారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్నారు.

తల్లిదండ్రులు ఎదురు తిరగాల్సిన సమయం:రోజా

హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి బాధ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. తల్లిదండ్రులు ఎదురు తిరగాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్పొరేట్ కాలేజీలపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రులు గంటా, నారాయణపై చర్యలు తీసుకోకపోవడం వల్లే విద్యార్థులు చనిపోతున్నారని, వారికి శిక్ష పడితే ఆత్మహత్యలు ఆగుతాయని రోజా స్పష్టం చేశారు. తన ఫోటోపై చెత్తవేస్తే విచారణ జరిపించిన చంద్రబాబు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.

13:45 - October 17, 2017

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. 

 

13:43 - October 17, 2017

నల్గొండ : తెలుగు రాష్ట్రాల వరప్రదాయినీ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత నీటి మట్టం 556 అడుగులకు చేరింది. ఎగువ నుండి 2 లక్షల 66వేల 288 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. గంటగంటకు సాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొద్ది రోజుల్లో జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు చేరుకునే అవకాశాలున్నాయి. 

13:41 - October 17, 2017

రంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం మండలం కొల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి క్లూస్‌ టీమ్స్‌ చేరుకుని వివరాలు సేకరిస్తోంది. హత్యా ? ఆత్మహత్యా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతులు ప్రభాకర్‌రెడ్డి, మాధవి, లక్ష్మీ, సింధూజ, వర్షిత్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:37 - October 17, 2017
13:36 - October 17, 2017

అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రగతి భవన్ లో అందుబాటు లో ఉన్న మంత్రులు, నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

13:18 - October 17, 2017

వరంగల్‌ : జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో ఉన్న 190 మంది రోగులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

13:12 - October 17, 2017

విజయవాడ : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక... సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కర్నూలులో భారీ బహింరగ సభ ఏర్పాటు చేసి... పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆమె అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేణుక మద్దతివ్వడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మంచిని ప్రోత్సహించేవారు టీడీపీ మద్దతివ్వాలన్నారు చంద్రబాబు. కొంతమందికి టీడీపీకి మద్దతివ్వాలని లోపల అనుకున్నా.... వాళ్లు బయటపడడం లేదన్నారు. 

 

13:09 - October 17, 2017

రంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం మండలం కొల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి క్లూస్‌ టీమ్స్‌ చేరుకుని వివరాలు సేకరిస్తోంది. హత్యా ? ఆత్మహత్యా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతులు ప్రభాకర్‌రెడ్డి, మాధవి, లక్ష్మీ, సింధూజ, వర్షిత్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:02 - October 17, 2017

ఢిల్లీ : ప్రపంచంలోనే ప్రేమికులకు చిహ్నంగా నిలిచిన అద్భుతకట్టడం తాజ్‌మహల్‌కు కమలనాథులు మతం రంగు పులుముతున్నారు. తాజాగా.. తాజ్‌ మహల్‌ని దేశద్రోహులు కట్టారని బిజెపి నేత సంగీత్‌ సోమ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఐఎం ఘాటుగా స్పందించింది.  ఎర్రకోటను కూడా దేశద్రోహులే నిర్మించారని...అక్కడ ప్రధాని జెండా ఎగురవేయకుండా ఉంటారా అని ఎంఐఎం నేత ఒవైసీ బిజెపిని ప్రశ్నించారు. 

మొగల్ చరిత్రకు తార్కాణంగా నిలిచిన అద్భుత కట్టడం తాజమహల్‌ను బిజెపి వివాదాస్పదం చేస్తోంది. ఆగ్రాలో షాజహాన్‌ నిర్మించిన ఈ పాలరాతి సౌధాన్ని చూస్తే...ఎవరైనా మైమరచి పోవాల్సిందే...ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులకు చిహ్నంగా నిలిచిన తాజ్‌మాహల్‌కు కమలనాథులు మతం రంగు పులిమే యత్నం చేస్తున్నారు.

తాజాగా... తాజ్‌మహల్‌ కట్టడం...భారతీయ సంస్కృతికి ఓ మచ్చ లాంటిదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత సంగీత్ సోమ్ అన్నారు.  తాజ్‌మహల్‌ను దేశద్రోహులు కట్టారని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  అసలు మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం... తాజ్‌ను కట్టిన షాజహాన్ తన తండ్రిని చెరశాలలో వేశాడు, హిందువులను ఊచకోత కోయాలని చూశాడు... నిజంగా ఇదే చరిత్ర అయితే... దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. 

తాజ్‌ మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ''ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని,  ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా''.... ''తాజ్‌ మహల్‌ను చూడొద్దని పర్యాటకులకు మోదీ, యోగి చెప్పగలరా'' అని ఓవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ను కూడా దేశద్రోహులే కట్టించారు..ఇందులో విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వరా...అని ఓవైసీ మండిపడ్డారు.

తాజ్‌మహల్‌పై తమ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ చేసిన వ్యాఖ్యలపై యోగి ప్రభుత్వం స్పందించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని యూపీ మంత్రి రీటా బహుగుణ జోషి ప్రకటన చేశారు. తాజ్‌ మహల్‌ వారసత్వ కట్టడాల్లో ఒకటని యోగి ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి నేత సంగీత్‌ సోమ్‌ వివాదస్పద నేతగా పేరొందారు. 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్ల వెనుక సంగీత్‌ సోమ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ హింసలో సుమారు 60 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌  ప్రభుత్వ యూపీ టూరిజం బుక్‌లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తీసివేసిన విషయం తెలిసిందే. పర్యాటకశాఖ ప్రచురణ నుంచి తాజ్‌ను తొలగించడంపై పెద్ద దుమారం రేగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. టూరిజం బుక్‌లెట్ తయారీలో పొరపాటు జరిగినట్లు వివరణ ఇచ్చుకుంది. 

12:59 - October 17, 2017

గుంటూరు : విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఫలితం లేకుండాపోతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో టెన్త్‌ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వినుకొండలోని నారాయణ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న అఖిబ్‌ జావేద్‌... తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనన్న భయంతో జావేద్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

ఢిల్లీ లో సీపీఎం ర్యాలీ

ఢిల్లీ: కేరళ ప్రభుత్వంపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ అసత్య ప్రచారాలను నిరసిస్తూ సీపీఎం ర్యాలీ నిర్వహించింది. వీవీ హౌస్ నుండి బిజెపి కేంద్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. కేరళలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎండీ సలీం, సుభాషిణి అలీ, రాఘువులు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు తదితర నేతలు పాల్గొన్నారు.

12:49 - October 17, 2017

భూపాలపల్లి : జలగలంచ ఘటనపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌ అయ్యింది. ఆదివాసీలపట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. మూడు వారాలపాటు ఆదివాసులను ఆ గ్రామం నుంచి తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  తదుపరి విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.
పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు
భూపాలపల్లి జిల్లా తాండూరు మండలం జలగలంచలో పోలీసుల దాష్టీకంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది.  ఆదివాసీలపై దాడి చేసి వారి ఇళ్లను నేలమట్టం చేయడంపై మండిపడింది.  పాఠశాలనూ పోలీసులు కూల్చివేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.
ఆదివాసీలపై పోలీసుల దాడి
ఆదివాసీలపై పోలీసులు దాడి 
పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న అమాయకులైన ఆదివాసీలపై పోలీసులు దాడి చేశారు. వారు నివాసం ఉంటున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. వద్దని ఆదివాసీలు ప్రాధేయపడినా పోలీసులు ఏమాత్రం కనికరం చూపలేదు. అంతేకాదు మహిళలని కూడా చూడకుండా వారిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆదివాసీల పిల్లలు చదువుకోవడానికి ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక పాఠశాలను కూల్చివేశారు. తాగునీరు కోసం ఏర్పాటు చేసుకున్న బోర్లను సైతం ధ్వంసం చేశారు.  ఆదివాసీలపట్ల పోలీసుల అరాచకంపై పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ కుంటిరవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జలగలంచ ఘటనపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలను సాక్ష్యాలుగా పిటిషనర్‌ హైకోర్టుకు సమర్పించారు.   దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు తెలంగాణ పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  జలగలంచ గ్రామస్తులను అక్కడి నుంచి తరలించవద్దని హైకోర్టు మూడు వారాలపాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  ఆదివాసీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విచారణ మూడు వారాలకు వాయిదా 
షెడ్యూల్‌ ట్రైబల్‌ యాక్ట్‌, ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ఫారెస్ట్‌ అధికారుల తీరుపైనా హైకోర్టు సీరియస్‌ అయ్యింది. పోలీసుల అప్రజాస్వామికంగా వ్యవహరించారని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు  మూడు వారాలకు వాయిదా వేసింది.

ఓఆర్ ఆర్ పై కారుదగ్ధం.

రంగారెడ్డి : కొత్తూరు సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధమైంది. టోలిచౌకి నుంచి బీదర్ వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

12:38 - October 17, 2017

కృష్ణా : విజయవాడ బందరు రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనున్న షోరూమ్‌లకు మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మూడు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:36 - October 17, 2017

రంగారెడ్డి : హైదరాబాద్‌ నగర శివారులో మృతదేహాల కలకలం నెలకొంది. కొల్లూరు సమీపంలో ఐదు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళతో పాటు.. ఇద్దరు యువతుల మృతదేహాలు చెట్ల పొదల్లో గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతులు లక్ష్మీ, మాదవి, సిందూజ, ప్రభాకర్ రెడ్డి, చిన్నారి వర్షితగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

'వేములఘాట్ ప్రజలు పట్టు వదలకుండా పోరాడుతున్నారు'

సిద్ధిపేట: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా వేములఘాట్ లో 500 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేములఘాట్ ప్రజలు పట్టు వదలకుండా పోరాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ నిర్వాసితులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పోరాటం కాదని, చట్టబద్ధమైన పోరాటం అని స్పష్టం చేశారు. వేముల ఘాట్ గ్రామస్తుల పోరాటం గ్రీన్ ట్రిబ్యునల్ కు చేరిందని, అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

12:25 - October 17, 2017

కృష్ణా : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక... విజయవాడలో చంద్రబాబును కలిశారు. టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. త్వరలోనే కర్నూలు భారీ బహిరంగ ఏర్పాటు చేసి.. టీడీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భవిష్యత్ లో జగన్ పార్టీలో ఎవరూ ఉండరు: ఏపీ సీఎం

అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ ఎంపి, ఎమ్మెల్యేలు టిడిపలో చేరుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో భాగం కావడానికి బుట్టారేణుక ముందుకు రావడం అభినందనీయంమన్నారు. భవిష్యత్ లో జగన్ పార్టీలో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి చేయడం వేరు అని స్పష్టం చేశారు.

'టిడిపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా ప్రచారమే'

అమరావతి : టిడిపిలో చేరున్నట్లు వచ్చిన వార్తలు మీడియా ప్రచారమేనని కర్నూలు ఎంపి బుట్టా రేణుక అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు మద్దతు తెలిపానన్నారు. నన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిట్లు ఉదయమే తెలిసిందన్నారు. 2019లో కర్నూలు ఎంపిగా టిడిపి నుంచి పోటీ చేస్తానని, అప్పటి వరకు న్యూట్రల్ గా ఉంటానన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా మాట్లాడుకుంటున్నారని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పోటీ విషయంలో కేవలం చర్చలు మాత్రమే జరిగాయని బుట్టా రేణుక తెలిపారు.

విజయవాడ బందర్ రోడ్డులో ఉద్రిక్తత

విజయవాడ: బందర్ రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. కేరళ, విశాఖలో సీపీఎం కార్యకర్తలపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాడులకు నిరసనగా సీపీఎం ర్యాలీ నిర్వహించింది. మరో వైపు లెనిన్ సెంటర్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు బిజెపి బైక్ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం నేతలపై బిజెపి నేతలు బెదిరింపులకు దిగారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అక్రమాలపై ఉక్కుపాదం

హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు రవాణాశాఖ అధికారులు. వరుస దాడులతో ట్రావెల్స్ మాఫియాకు చెమటలు పట్టిస్తున్నారు. శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఈ తెల్లవారు జామున విస్తృతంగా దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 బస్సులను సీజ్ చేశారు. మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు.

వేములఘాట్ లో దీక్షా శిబిరానికి తమ్మినేని

సిద్ధిపేట: వేములఘాట్ లో దీక్షా శిబిరానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేరుకున్నారు.

11:38 - October 17, 2017

నెదర్లాండ్స్ దేశ రాజు విల్లెమ్ అలెగ్జాండర్ ను కలవడానికి ఆదేశ ప్రధాని మార్క్ రుట్టే సైకిల్ పై ప్యాలెస్ కు వెళ్లారు. ప్యాలెస్ కు సైకిల్ పై వెళ్లడమే కాకుండా సాధారణ వ్యక్తిలా సైకిల్ ను పక్కన పెట్టి, లాక్ కూడా వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ రైరల్ అవుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో మార్క్ ఎలాంటి అధికారిక సమావేశాలకు వెళ్లాలన్నా సైకిల్ పైనే వెళుతుండటం విశేషం.

11:38 - October 17, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని భగత్‌ నగర్‌ ఏరియాలో పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, ఒక కారును సీజ్‌ చేశారు.  లక్ష యాభైవేలు విలువ చేసే దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్‌ విబి కమలాసన్‌ రెడ్డి తెలిపారు. పూర్తి టెక్నాలజీని ఉపయోగించి ఈ సెర్చ్‌ చేపట్టామన్నారు. నిందితులను పట్టుకోవడానికి డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించామన్నారు. 

 

11:15 - October 17, 2017

రంగారెడ్డి : హైదరాబాద్ శివారులో మృతదేహాలు కలకలం రేపాయి. ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు రోడ్డు ప్రక్కన ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శంషాబాద్ సీపీ పద్మజా, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

సీఎం చంద్రబాబును కర్నూలు ఎంపి బుట్టా రేణుక

అమరావతి: సీఎం చంద్రబాబును కర్నూలు ఎంపి బుట్టా రేణుక కలిశారు. త్వరలో కర్నూలులో సభ ఏర్పాటు చేసి బుట్టా రేణుక టిడిపి లో తీర్థం పుచ్చుకోనాన్నారు. మరో వైపు రేణుక అనుచరులు పలువురు టీడీపీ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

నవంబర్ 8 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: నవంబర్ 8 నుండి 13 వరకు ఏపీ అసెంబ్లీసమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వర్షాకాల, శీతాకాల సమావేశాలు కలిపి ప్రభుత్వం నిర్వహిస్తోంది.

వినుకొండలో విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: వినుకొండలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థితో గొడవపడ్డ అఖిబ్ జావెద్ తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారన్న భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిబ్ జావెద్ నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.

ఫ్యామిలీ మిస్సింగ్ కేసుకు సంబంధించిన వారేనా?

మెదక్: ఓఆర్ ఆర్ సమీపంలో ఐదు మృతదేహాలు అమీన్ పూర్ పీఎస్ పరిధిలో ఫ్యామిలీ మిస్సింగ్ కేసుకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమనాం వ్యక్తం చేస్తున్నారు.

ఓఆర్ ఆర్ సమీపంలో ఐదు మృతదేహాలు

హైదరాబాద్: ఓఆర్ ఆర్ సమీపంలో ఐదు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. కారులో ఇద్దరు పురుషుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

10:28 - October 17, 2017

వరంగల్ : రోహిణి ఆస్పత్రి ఘటనపై పోలీస్‌ కేసు నమోదయ్యింది. ప్రమాదంలో మృతి చెందిన కుమారస్వామి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంపై 304(ఎ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిన్న రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో ఆక్సిజన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలుచెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

10:11 - October 17, 2017

మంచి జోష్ మీదున్న యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌ ఎందుకో విషాదంలో మునిగిపోయాడట. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి. రాజ్‌త‌రుణ్‌కు కుక్క‌లంటే చాలా ఇష్ట‌మ‌నే సంగ‌తి తెలిసిందే. ఎంతో ఖ‌రీదుతో కొన్న కుక్క‌ల‌నే కాకుండా కొన్ని వీది కుక్క‌ల‌ను కూడా రాజ్‌త‌రుణ్ పెంచుతున్నాడట. ఇప్పుడు రాజ్‌త‌రుణ్ మూడీగా మారిపోవ‌డానికి కార‌ణం త‌న కుక్క‌పిల్ల‌ల్లో ఒక‌టి చ‌నిపోవ‌డ‌మే. రెండ్రోజుల క్రితం ఆ కుక్క పిల్లకు జ‌బ్బు చేసింద‌ట‌. దాంతో వెంట‌నే ఆ కుక్క‌పిల్ల‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడ‌ట‌. రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖర్చుపెట్టి ఆప‌రేషన్ కూడా చేయించాడ‌ట‌. అయినా ఆ కుక్క పిల్ల బ‌త‌క‌లేదు. దీంతో రాజ్‌త‌రుణ్ విషాదంలో మునిగిపోయాడ‌ట‌.

ఏపీ సీఎం నివాసానికి చేరుకున్న ఎంపి బుట్టా రేణుక

అమరావతి: వైసీపీ ఎంపి బుట్టా రేణుక సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీఎం సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

బందర్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం...

విజయవాడ: బందర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బట్టల షాపులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం...

హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలకు హాజరై ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైన వారు మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హాజరుకావొచ్చునని వివరించింది. అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని స్పష్టంచేసింది.

09:55 - October 17, 2017

విశాఖ : ఇవాళ చంద్రబాబు టూర్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత విశాఖ వెళ్లి... అక్కడినుంచి ఢిల్లీ వెళ్లే విధంగా షెడ్యూల్‌ ఉంది. అయితే... పోలవరంపై పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... కాంట్రాక్టర్‌ను మారుస్తామని హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుందని... కాంట్రాక్టర్‌ మార్చమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు... నితిన్‌గడ్కరీని కలవాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్న చంద్రబాబు... అనంతరం నాగ్‌పూర్‌ వెళ్లి గడ్కరీని కలవనున్నారు. పోలవరం పనులు ఆలస్యంపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి... విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

బైరవాని తిప్పి ప్రాజెక్టు కు గండి...

అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గంలోని బైరవాని తిప్పి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టుకు గండి పడింది. గండిని పూడ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గ్రామస్థులు మాత్రం ఆందోళనకు చెందుతున్నారు.

చంద్రబాబు టూర్‌లో స్వల్ప మార్పులు

విశాఖ : ఇవాళ చంద్రబాబు టూర్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత విశాఖ వెళ్లి... అక్కడినుంచి ఢిల్లీ వెళ్లే విధంగా షెడ్యూల్‌ ఉంది. అయితే... పోలవరంపై పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... కాంట్రాక్టర్‌ను మారుస్తామని హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుందని... కాంట్రాక్టర్‌ మార్చమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు... నితిన్‌గడ్కరీని కలవాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్న చంద్రబాబు... అనంతరం నాగ్‌పూర్‌ వెళ్లి గడ్కరీని కలవనున్నారు. పోలవరం పనులు ఆలస్యంపై చర్చించనున్నారు.

లారీ బోల్తా: డ్రైవర్, క్లీనర్ కు గాయాలు...

వరంగల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

09:52 - October 17, 2017

కర్నూలు : వరుసగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తూ పరుగెడుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2.51, 596 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80, 518 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. దీంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తి... దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయడంతో.... సాగర్‌లోకి భారీగా నీరు చేరుతోంది. సాగర్‌లోకి 2 లక్షల 66 వేల 568 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతానికి నీటిమట్టం 555 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. మొత్తానికి వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:50 - October 17, 2017

కర్నూలు : ఆపదలో వచ్చిన వారికి సరైన వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని ఘటన కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. చేసేదేమీ లేక ఎమ్మిగనూరు నుంచి వచ్చిన గర్భిణిని మహాలక్ష్మి ఆరు బయటే నొప్పులతో అవస్థలు పడింది. అయినా వైద్య సిబ్బందిలో మార్పు రాలేదు. అయితే.. 10టీవీకి సమాచారం అందించడంతో... అక్కడికి చేరుకుంది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహాలక్ష్మిని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యమందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:45 - October 17, 2017

ఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 3.35 గంటలకు... సౌత్ బ్లాక్‌లోని రెండవ అంతస్తు రూమ్ నెం.242లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు.. ఫైర్‌ సిబ్బందికి సమాచారమివ్వగా... మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:44 - October 17, 2017

సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులకు పాల్పడడం అప్రజాస్వామిక చర్య అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం.రాంచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఎన్ వి సుభాష్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ దాడులను వక్తలు తప్పుబట్టారు. ఒక పార్టీ కార్యాలయాలపై మరోపార్టీ నేతలు దాడులు చేయడం సరికాదన్నారు.
దేశంలో బీజేపీ మతోన్మాద పోకడలకు పోతోందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారు జయ్ షా ఆస్తులపై విచారణ జరిపించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:33 - October 17, 2017

ప్రాజెక్టుల పేరుతో భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రాజెక్టు భూ నిర్వాసితుల సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిర్వాహితులకు న్యాయం చేయాలని కోరారు. 'ప్రాంతమేదైనా.. ప్రాజెక్టు ఏదైనా.. అక్కడ కామన్‌గా వినిపించేది భూ నిర్వాసితుల సమస్య. ప్రాజెక్టు అనుకున్నప్పటి నుంచి ప్రాజెక్టు కట్టడం మొదలయ్యే సరికి  దాని వ్యయం రెట్టింపు అవుతుంది. కానీ, నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. గతంలో పార్లమెంటులో చేసిన చట్టాన్ని తుంగలో తొక్కి నిర్వాసితులను నెట్టిపడేసి ప్రాజెక్టు కడుతున్న పరిస్థితి'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రోహిణి ఆస్పత్రి ఘటనపై పోలీసు కేసు నమోదు

వరంగల్ : రోహిణి ఆస్పత్రి ఘటనపై పోలీసు కేసు నమోదు అయింది. అగ్నిప్రమాద ఘటనలో కుమారస్వామి మృతి చెందారు. కుమారస్వామి భార్య బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పద్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై 304 ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పెరుగుతోన్న నీటిమట్టం

నల్గొండ : కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,66,568 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 554.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 

శ్రీశైలం ప్రాజెక్టులో పెరుగుతోన్న నీటి ప్రవాహం

కర్నూలు : కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. ఇన్ ఫ్లో 2.51, 596 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80, 518 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 

కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉధృతి

కర్నూలు : కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. ఇన్ ఫ్లో 2.51, 596 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80, 518 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,66,568 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 554.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 

 

08:45 - October 17, 2017

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండం, ఆ తర్వాత తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు సూచిస్తున్నారు. 
క్రమంగా బలపడుతోన్న అల్పపీడనం      
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వాయుగుండంగా మారి ఈనెల 19 ను ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య తీరందాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా మారే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపాను రూపు సంతరించుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.  దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. అల్పపీడనం తుపానుగా మారితే  ఉత్తర కోస్తాపై తీవ్ర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. పెనుగాలుకు వీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 
రాయలసీమలో ఉపరితల ఆవర్తనం 
అల్పపీడనానికి తోడు రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  వచ్చే ఆదివారం రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్‌ ఉందని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. 

 

08:39 - October 17, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్నాచర్‌ బరితెగించాడు. ఏకంగా ఇంటికి వచ్చి తలుపులు తట్టి మరీ దోచేశాడు...ఆ ఇంటి ఇల్లాలు కంట్లో స్ప్రే కొట్టి తాళి తెంచుకుని పారిపోయాడు. ఇప్పటివరకు స్నాచర్లు రోడ్లమీదే సంచరించేవారు..ఇప్పుడు నేరుగా ఇళ్లలోకి వస్తున్నారు..గతంలో ఘటనలు జరిగినప్పటికీ సరూర్‌నగర్‌లో జరిగిన సంఘటన కలకలం రేపుతుంది...చైన్ స్నాచర్ బరితెగించాడు. హెల్మెట్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు..
4 తులాల పుస్తెలతాడు తెంచుకొని పరారీ
సరూర్‌నగర్‌లో ఉంటున్న మమత అనే వివాహిత ఇంట్లో ఉండగా హెల్మెట్‌ ధరించిన దుండగుడు తలుపులు తట్టాడు..ఎవరని చూసేందుకు ఆమె తలుపు తెరవడంతో వెంట తెచ్చుకున్న స్ప్రే ఆమె ముఖంపై కొట్టడంతో కళ్లు మంటలు పుట్టాయి..వెంటనే దుండగుడు ఆమె మెడలోని 4 తులాల పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యాడు....తేరుకుని అరిచేలోపే మాయమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.

 

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

కర్నూలు : ఆపదలో వచ్చిన వారికి సరైన వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన గర్బిణిని ఆస్పత్రిలో చేర్చుకోని ఘటన కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. చేసేదేమీ లేక ఎమ్మిగనూరు నుంచి వచ్చిన గర్బిణి మహాలక్ష్మి ఆరు బయటే నొప్పులతో అవస్థలు పడింది. అయినా వైద్య సిబ్బందిలో మార్పు రాలేదు. అయితే.. 10టీవీకి సమాచారం అందించడంతో... అక్కడికి చేరుకుంది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహాలక్ష్మిని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యమందించారు. 

ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో మంటలు

ఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 3.35 గంటలకు... సౌత్ బ్లాక్‌లోని రెండవ అంతస్తు రూమ్ నెం.242లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు.. ఫైర్‌ సిబ్బందికి సమాచారమివ్వగా... మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:20 - October 17, 2017

ఖమ్మం : చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి  కష్టకాలం వచ్చింది. కలెక్టరేట్ చుట్టూ రాజకీయ బూచి చక్కర్లు కొడుతుంది. భూముల కోసం పావులు కదుపుతున్నారు. నయా భవన నిర్మాణం పేరుతో... రియల్‌ వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారు. కలెక్టరేట్ తరలింపుపై 10టీవీ ప్రత్యేక కథనం...
కొత్త కలెక్టరేట్‌ను నిర్మించాలని ప్రతిపాదన
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే సముదాయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది తెలంగాణ సర్కారు ఆలోచన. ఈ క్రమంలోనే జిల్లాలో కలక్టరేట్ మార్పిడి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఖమ్మం నడిబొడ్డున  ఉన్న ఎన్ఎస్‌పీ శిథిల భవనాలను కూల్చిన ప్రాంతంలో కొత్త కలెక్టర్‌ కార్యాలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ తాజాగా నగరానికి శివారున ఉన్న వి.వెంకటయాపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్టరేట్‌ భవన సముదాయాలను నిర్మించాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. అది కూడా చిన్న, సన్న కారు రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ భూములకు చెందిన రైతులతో సంప్రదింపులైనా జరపకుండానే జిల్లా అధికార యంత్రాంగం సర్వే ప్రక్రియను ప్రారంభించింది. 
వ్యవసాయ భూముల్లో ప్రభుత్వ కార్యాలయ భవనం 
420, 422, 423, 424, 425, 427 సర్వే నెంబర్లలోని వ్యవసాయ భూముల్లో 26.24 ఎకరాల భూమిని ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు అనువైనవిగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా ఈ ప్రక్రియ అంతా ముగిసిన తరువాత అధికారులు రైతులతో చర్చలు జరిపారు. ఆ భూములకు  చెందిన 14 మంది రైతులతో ఖమ్మం ఆర్డీవో పూర్ణచంద్ర ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు  జరిపారు. తమ భూములు ఎకరాకు కోటి యాభై లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. అయితే ఆర్డీవో మాత్రం ఎకరాకు రూ.25 లక్షల వరకు పరిహారం ఇప్పిస్తామని ముందు చెప్పగా.. రైతులు నిరాకరించడంతో... ఎకరాకు రూ.50 లక్షల వరకూ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. లేనిపక్షంలో భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కొందరి స్వలాభం కోసమే సాగు భూముల్లో కలెక్టరేట్‌ యోచన?
కొందరి స్వలాభం కోసమే సాగు భూముల్లో కలెక్టరేట్‌ ను కట్టేందుకు  అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్‌ను నిర్మించేందుకు తాజాగా ఎంపిక చేసిన భూమి పరిసర ప్రాంతాల్లో ఓ ఇద్దరు ప్రజా ప్రతినిధులకు చెందిన వందలాది ఎకరాల భూములున్నట్టు ప్రచారం జరుగుతుంది.  కలెక్టరేట్ అక్కడికి తరలివెళ్తే చుట్టూ ఉన్న తమ భూముల ధరలు పెరుగుతాయనే రాజకీయ కోణంలోనే కలెక్టరేట్ తరలింపు పన్నాగం పన్నినట్లు వినికిడి. ఈ దెబ్బతో ఖమ్మంలో స్తబ్ధతకు లోనైన రియల్‌ ఎస్టేట్‌ను వ్యాపారులు ఉరుకులు పెట్టిస్తున్నారు. వి.వెంకటయాపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్టరేట్‌ను కట్టడం వల్ల ప్రజలకు దూరం అవుతుందని..ఎటువంటి ప్రయోజనం ఉండదని వామపక్షాల నేతలు అంటున్నారు. ఈ మేరకు గతంలో ఎంపిక చేసిన 14 ఎకరాల ఎన్‌ఎస్‌పీ భూమిలోనే కలెక్టరేట్‌ను నిర్మించాలని సీపీఎం దశలవారీ ఆందోళనలు చేస్తోంది.

07:55 - October 17, 2017

విజయవాడ : రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు మృత్యవాత పడకుండా విజయవాడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి కృషిచేస్తున్నారు. దీనికోసం నెలన్నర క్రితం హెల్మెట్‌ నిబంధన అమలులోకి తెచ్చారు. విజయవాడలో హెల్మెట్‌ నిబంధన అమలులోకి వచ్చి 45రోజులు దాటింది. ఈ సందర్భంగా నిబంధనల అమలులోకి వచ్చిన తరువాత వాహనాదారుల్లో మార్పేంటో ఓసారి చూద్దాం.. 
నిబంధనలను ఉల్లంగించిన వాహనదారులపై చలాన్లు
విజయవాడ నగరంలో హెల్మెట్ నిబంధనలపై పోలీసులు విస్తృత ప్రచారం చేపడుతున్న వాహన చోదకుల్లో మార్పు రావడంలేదు. నిబంధనలు అమలులోకి వచ్చి నెలన్నర గడుస్తోన్న.. వాహనదారుల్లో మార్పులు పూర్తిగా రాలేదు. నగరంలో నిబంధనలను ఉల్లంగించిన వాహనదారులపై ఇబ్బడిముబ్బడిగా చలాన్లు నమోదు చేశారు. పోలీసులు, రవాణా శాఖాధికారులు చలాన్లు విధించే పనిలో నిమగ్నమయ్యారేకాని ప్రజల్లో మార్పు తెచ్చే విషయంలో వెనుకబడిపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పోలీసుల నుంచి తప్పించుకోడానికి రాంగ్‌ రూట్‌లో ప్రయాణాలు
పోలీసులు ట్రాఫిక్‌ చలానాలు, అపరాధ రుసుములు విధిస్తుండటంతో ట్రాఫిక్‌ సిబ్బందిని చూసి వాహనదారులు రాంగ్‌ రూట్లలో ప్రయాణిస్తూ ప్రమాదాలు బారినపడుతున్న ఘటనలు ఎక్కువగా మారాయి. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 10 వతేదీ వరకు పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 59,030 కేసులు నమోదు చేశారు. చలాన్ల రూపంలో రూ.14.14లక్షలు వసూలు చేయగా, 2453 వాహనాలను సీజ్‌ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్‌ 9,10 తేదీల్లో పోలీసులు నగరంలో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి భారీగా కేసులు నమోదు చేశారు. ఈ రెండు రోజుల్లో 5235 మందిపై కేసులు నమోదు చేసి .. రూ 1.28 లక్షలను వసూలు చేశారు. 356 వాహనాలను సీజ్‌ చేశారు.
ప్రజల్లో చలాన్లపై వ్యతిరేకత
ప్రమాదాల నివారణకోసం చర్యలు అంటూ పోలీసులు కేసులు, చలానాలకే పరిమితమవుతున్నారనే అపవాదు ప్రజల్లో ఉంది. ఒక పక్క వాహనదారుల్లో చైతన్యమంటూనే మరోవైపు ట్రాఫిక్‌ సిబ్బంది, రవాణా శాఖ పొంతన లేకుండా కేసులు, వాహానాల సీజ్‌ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. హెల్మెట్‌ పెట్టుకోవడంపై పోలీసులు ప్రజల్లో అవగాహన తేవడంలో విఫలమయ్యారని పలువురు మండిపడుతున్నారు..
60 శాతం హెల్మెట్‌లను ధరిస్తున్న వాహనచోదకులు
ప్రజల్లో వెలువడుతున్న అసహనాన్ని గమనించిన ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వాహనదారులతో మర్యాదగా నడుచుకోవాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో ట్రాఫిక్‌ నియమ, నిబంధనల విషయంలో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. దీంతో  విజయవాడ అదనపు జాయింట్‌ కమిషనర్‌ రమణ కుమార్‌ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. నగరంలో 60శాతం హెల్మట్లు ధరిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్‌ నిబంధనలు, హెల్మెట్‌ వాడకంపై అవగాహన 
అయితే వాహనదారులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు సూచనలు చేసినా కింది స్థాయి సిబ్బంది పాటించకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతొంది. ఇప్పటికైనా పోలీసులు, రవాణాశాఖ అధికారులు ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై, హెల్మెట్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.

07:48 - October 17, 2017

హైదరాబాద్ : పల్లె... పల్లెకు వెళ్లింది..! ప్రతి వ్యక్తిని కదిలించింది..!  కష్టాలను తెలుసుకుంది..! బడుగు, బలహీన వర్గాల గొంతుకై .. ప్రభుత్వాన్ని నిలదీసింది! పాలకుల గుండెల్లో దడ పుట్టించి... సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ప్రజల్లో చైతన్యం నింపింది.. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో... ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. చూస్తుండగానే ఏడాది దాటిన సీపీఎం మహాజన పాదయాత్ర సాఫల్యాలపై 10టీవీ ప్రత్యేక కథనం..
సకల, సబ్బండ వర్గాలను మేల్కొలిపిన పాదయాత్ర
154 రోజులు.. 4,200 కిలోమీటర్లు..చరిత్ర సృష్టించిన సీపీఎం మహాజన పాదయాత్ర..సకల, సబ్బండ వర్గాలను మేల్కొలిపిన పాదయాత్ర, ఏలికల కళ్లు తెరిపించి.. అధికారాన్ని ఉరకలెత్తించిన యాత్ర.. తెలంగాణలో సకల వర్గాలు, సబ్బండ వర్గాలను మేల్కొలిపిన యాత్ర..సీపీఎం ఆధ్వర్యంలో సాగిన మహాజన పాదయాత్ర. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు కదిలింది. అక్టోబర్‌ 17, 2016న ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన.. ఈ యాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వం వహించారు.  తొమ్మిది మంది నేతలు యాత్రలో పాల్గొన్నారు. ప్రారంభ సభకు అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌తో పాటు...ఆయా సామాజిక, వామపక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 
ప్రజల నుంచి అపూర్వ స్పందన
ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన మహాజన పాదయాత్రకు వాడవాడలా  ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  ప్రతి గ్రామంలోనూ రాజకీయాలు, కుల, వర్గాలకు అతీతంగా  స్వాగతం పలికి.. అక్కున చేర్చుకున్నారు. సామాజిక, కుల, విద్యార్థి, మహిళా, కార్మిక సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈ యాత్రకు మద్దతునిచ్చాయి.  దీంతో 154 రోజుల పాటు.. 4 వేల 2 వందల కిలోమీటర్ల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ యాత్ర సాగింది.  
రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగిన యాత్ర
ఎప్పటికప్పుడు... రెట్టింపు ఉత్సాహంతో మహాజన పాదయాత్ర ముందుకు సాగింది. ప్రతి పల్లెకు వెళ్తూ.. పేదల గుండె లోతుల్లోకి తొంగి చూసింది. యాత్ర బృంద సభ్యులు  క్షేత్రస్థాయిలో  దళితులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, కూలీల కష్ట, నష్టాలను తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి.. ఆరా తీశారు.  ఈ మేరకు పాదయాత్ర బృంద సభ్యులకు ... సమస్యలపై వేలాదిపై వినతులు అందాయి.  ప్రజల సమస్యలపై... తమ్మినేని వీరభద్రం పాలకులను నిలదీశారు.. ఆయా వర్గాల సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాశారు. 
పాదయాత్ర ఫలితంగా కదిలిన ప్రభుత్వం
పాదయాత్ర ఫలితంగా... టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మూసుకుపోయిన కళ్లు తెరిచి.. సీపీఎం లేఖాస్త్రాలకు బదులుగా అన్నట్లు.. ఆయా సామాజిక వర్గాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించింది. ఇది కచ్చితంగా మహాజన పాదయాత్ర సాధించిన ఘనతేననడంలో అతిశయోక్తి లేదు. పథకాలు ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆయా వర్గాలకు వాటి ఫలాలు సక్రమంగా అందేలా  చూస్తామని... 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ వర్గాల అభివృద్ధితోనే సామాజిక న్యాయం సాధిస్తామని పాదయాత్ర బృందం చెబుతోంది. సీపీఎం మహాజన పాదయాత్ర  వివిధ వర్గాల ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి.. సమాజం ముందు ఉంచింది..! ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయనే .. చైతన్యాన్ని ప్రజల్లో నింపింది.   

 

07:43 - October 17, 2017

హైదరాబాద్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ ఎక్స్‌పో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మతోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు  ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. పోలీసు అమరవీరులను స్మరించుకోవడంతోపాటు వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ పనిచేస్తోందని చెప్తోన్న ఐజీ అభిలాష్‌ బిస్తాతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:42 - October 17, 2017

వరంగల్ : హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 200 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కమిటీ ఇవాళ ఆస్పత్రిని సందర్శించనుంది. 
సర్జరీ థియేటర్‌లో లీకైన ఆక్సీజన్‌ గ్యాస్‌
హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు సర్జరీ చేస్తుండగా  ఆక్సీజన్‌ గ్యాస్‌ లీకైంది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.  క్షణంలో ఆ ఫ్లోర్‌లో దట్టమైన పొగలు వ్యాపించాయి.  అవి మూడో అంతస్తు వరకు విస్తరించాయి. దట్టమైన పొగలు వ్యాపించడం, మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో  డాక్టర్లు, పేషెంట్లు, అటెండెంట్లు భయంతో కిందకు పరుగెత్తారు.  రెండో అంతస్తులోని న్యూరో వార్డు, ట్రామా సెంటర్‌లో ఉన్న జూనియర్‌ డాక్టర్లు సకాలంలో స్పందించి రోగులను కిందకు తరలించారు. దీంతో ఆ రెండు వార్డుల్లో ఉన్న సుమారు 35 నుంచి 40 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారు. 
మంటలను అదుపుచేసిన ఫైర్‌ సిబ్బంది
రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న హన్మకొండ ఫైర్‌ సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్‌ చల్లుతూ మంటలను 40 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకొచ్చారు.  ఫైర్‌ సిబ్బంది, సుబేదారి, హన్మకొండ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగుల బంధువులు ఇతరలు సకాలంలో స్పందించి చాలామంది రోగుల ప్రాణాలను కాపాడగలిగారు.  198 మంది రోగులను 32 అంబులెన్స్‌ల ద్వారా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ప్రధాన కూడలి ఉండడంతో రోగులను తరలించే క్రమంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో వేగంగా స్పందించారు.  రోగులను కాపాడటంలోనూ, ఇతర ఆస్పత్రులకు తరలించడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 
ఇద్దరు రోగులు మృతి 
రోహిణి ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ చేయించుకుంటున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లికి చెందిన జెట్టి కుమారస్వామి అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఇదే జిల్లాకు చెందిన కాటార మండలం దేవరాంపల్లి వాసి మల్లమ్మ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి చనిపోయింది. 
సమగ్ర విచారణకు ఆదేశించిన కడియం శ్రీహరి
సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,  కలెక్టర్‌ ఆమ్రపాలి, సీపీ సుధీర్‌బాబు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.  అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కడియం తెలిపారు.  రోగులకు అవసరమైన భద్రత కల్పించాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు.  రోగుల బంధువులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కడియం కోరారు. 
విచారణ కమిటీ ఏర్పాటు
రోహిణి ఆస్పత్రి ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇవాళ  ఘటనా స్థలిని సందర్శించనుంది. అనంతరం ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

 

నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖ నగరంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు, కొన్ని కొత్త కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. నగరంలో నాలుగు గంటల పర్యటనలో నాలుగు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. 

07:31 - October 17, 2017

కృష్ణా : ఏపీలోని ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై వామపక్షాలు సమరశంఖం పూరించాయి. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఉద్యమబాట పట్టాయి. 10 వామపక్ష పార్టీలు విజయవాడలో మహాధర్నాకు దిగాయి. 30 గంటలపాటు ఈ ధర్నా కొనసాగనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని లెఫ్ట్‌ నేతలు తేల్చి చెప్పారు.
ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమం 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై వామపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమించాయి. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ  30గంటల మహాధర్నాకు శ్రీకారం చుట్టాయి. సోమవారం విజయవాడలోని ధర్నాచౌక్‌ దగ్గర మహాధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో  వివిధ ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులతో ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీలో పాల్గొన్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం : నారాయణ 
భూ నిర్వాసితుల న్యాయబద్దమైన డిమాండ్ల సాధనకోసం కలసికట్టుగా పోరాడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఏపీలో భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 
భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలి : మిడియం బాబూరావు  
భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు.  నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు. సోమవారం ప్రారంభమైన మహాధర్నా నేడు ముగియనుంది. వామపక్షాల నాయకులు రాత్రి ధర్నా చేపట్టిన స్థలంలోనే నిద్రించారు. 
 

07:30 - October 17, 2017

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖ నగరంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు, కొన్ని కొత్త కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. నగరంలో నాలుగు గంటల పర్యటనలో నాలుగు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు గంటలపాటు జరిగే సుడిగాలి పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. 
అధునాత వీవీఐపీ లాంజ్‌ని ప్రారంభించనున్న బాబు 
విజయవాడ నుంచి విశాఖ చేరుకునే చంద్రబాబు విమానాశ్రయంలో అధునాత వీవీఐపీ లాంజ్‌ని ప్రారంభిస్తారు. ఎన్‌ఏడీ కొత్త రోడ్డు జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. దీనికి 113 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రోటరీ మోడ్‌ సరేటర్‌ తరహాలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు. ఆ తర్వాత బీచ్‌ రోడ్డులో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. బీచ్‌ రోడ్డులో జరిగే ఆనంద దీపావళి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మూగ, బధిర, అంధ, అనాద బాలికలతో కలిసి ఈ కార్యక్రంలో పాల్గొంటారు. 

 

07:20 - October 17, 2017

గుంటూరు : బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌ బీసీ నేతలతో నిర్వహించిన సమావేశంపై బాబు స్పందించారు. మొదటి నుంచి బీసీల సంక్షేమానికి పాటుపడింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. జగన్‌ చెప్పే మాటలను బీసీలు విశ్వసించరని చంద్రబాబు చెబుతున్నారు. 

 

07:17 - October 17, 2017

కర్నూలు : ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్రకు ముందే వైసీపీకి  తెలుగుదేశం పార్టీ గట్టి షాక్ ఇస్తోంది. ఆ పార్టీ నేతలను సైకిల్ ఎక్కించుకునేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుమానం ఉన్న నేతలపై వైసీపీ అధినేత జగన్ ఆరా తీసినట్లు సమాచారం.
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌  
వైసీపీ అధినేత జగన్‌ తలపెట్టిన పాదయాత్రకు దీటుగా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ కు మళ్లీ తెర తీసింది. 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ టికెట్‌ పై గెలిచిన బుట్టా రేణుకను టీడీపీలో చేర్చుకోనున్నారు.  
2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ దక్కదన్న సంకేతాలు 
బుట్టా రేణుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున  మరోసారి కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేసే  అవకాశం దక్కదన్న సంకేతాల రేణుకకు అందాయి. ఈ కారణంతోనే  అధికార పార్టీ గూటికి చేరుతున్నారన్న ప్రచారం పార్టీలో సాగుతోంది. 
ఈసారి సైకిల్‌ ఎక్కనున్న రాయలసీమ వైసీపీ నేతలు 
టీడీపీ మరోసారి మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో  ఎంతమంది  నేతలు అధికార పార్టీ గూటికి చేరతారోనన్న  ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈసారి  రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో ఇలాంటి వారిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు టీడీపీ పావులు కదపడం వైసీపీలో చర్చనీయంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల అంశం ఏపీ రాజకీయాల్లో  ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

 

07:09 - October 17, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని సహించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే ఒక సీజన్‌ను కోల్పోవాల్సి వస్తుందని, అవసరమైతే పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించాలని అధికారులకు సూచించారు. మరోవైపు పోలవరం కాంట్రాక్టర్లను మార్చే ప్రసక్తేలేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం    
పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ స్థలంలో పనులను పర్యవేక్షిస్తున్న చీఫ్‌ ఇంజినీర్‌తో వర్చువల్‌ లైవ్‌లో మాట్లాడి ప్రాజెక్టు పురోగతి తెలుసుకున్నారు. 
పోలవరం పురోగతని చంద్రబాబుకు వివరించిన అధికారులు 
పోలవరం పురోగతని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇప్పటి వరకు 3.43 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తైన విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే 759 లక్షల క్యూబిక్‌ మీటర్లు మట్టిపనిని చేసినట్టు వివరించారువర్షాలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని చీఫ్‌ ఇంజినీర్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు.. పోలవరం పనుల్లో అలసత్వాన్ని సహించేందిలేదని హెచ్చరించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే ఒక సీజన్‌ కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే జాప్యం చేసే కాంట్రాక్టర్లను తొలగించి, కొత్త వారికి పనులు అప్పగించాలని కోరారు. 
కాంట్రాక్టర్లను మార్చితే 35 శాతం అదనపు వ్యయం 
పనులు చేయని పోలవరం కాంట్రాక్టర్లను తొలగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై కేంద్ర జలనవరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లను మార్చితే పోలవరం వ్యయం 35 శాతం పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఖర్చును భరించే స్థితిలో కేంద్రం లేదని స్పష్టం చేశారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సాయం చేస్తామని ఢిల్లీలో హమీ ఇచ్చారు. బిల్లులు సమర్పించే మూడు రోజుల్లో 75 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు నాబార్డు నుంచి నిధులు సేకరిస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... పోలవరంపై నితిన్‌ గడ్కరీతో  భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

నేడు టీడీపీలో చేరనున్న ఎంపీ బుట్టా రేణుక

కర్నూలు : వైసీపీ ఎంపీ బుట్టా రేణుక నేడు టీడీపీలో చేరనున్నారు. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో ఆమె చేరనున్నారు. 

కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రులతో నేడు చర్చించనున్న మంత్రి కడియం

హైదరాబాద్ : విద్యార్థుల ఆత్మహత్యలపై యాజమాన్యాలు, తల్లిదండ్రులతో నేడు మంత్రి కడియం శ్రీహరి చర్చించనున్నారు.

నేడు బాబు విదేశీ టూర్

విశాఖ : మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 7.30 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

 

సీపీఎం మహాజన పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి

హైదరాబాద్ : నేటితో సీపీఎం మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తి కానుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రథమ వార్షికోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు సరళీకృత ఆర్థిక విధానాలు...సామాజిక తరగతులపై ప్రభావం అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. 

ధర్మవరంలో నేడు వైఎస్ జగన్ పర్యట

అనంతపురం : ధర్మవరంలో నేడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. చేనేత కార్మికులకు ముడిసరుకులపై ఇస్తున్న రాయితీ బిల్లులను చెల్లించాలని దీక్ష చేపట్టిన నేతలకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. 

 

Don't Miss