Activities calendar
18 October 2017
బీజింగ్ : చైనా కొత్త శకంలోకి అడుగుపెట్టనుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ సమావేశాలు నేడు బీజింగ్‌లో మొదలయ్యాయి. సమావేశంలో చైనా ఆర్థిక ప్రగతి, భవిష్యత్ లక్ష్యాల గురించి... అధ్యక్షుడు జిన్ పింగ్ మూడున్నర గంటల పాటు సుదీర్ఘ ఉపన్యాసంలో వివరించారు. రాజకీయ, ఆర్థిక, సైనిక, పర్యావరణ విషయాల్లో ప్రపంచాన్ని నడిపించే బలమైన శక్తిగా చైనా మారేందుకు ఇదే సరైన సమయమని జిన్ పింగ్ అన్నారు. చైనా అభివృద్ధిలో ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. ప్రపంచంలో చైనా... నిర్ణయాత్మక పాత్రను పోషించే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీకి, దేశానికి ముప్పుగా మారిన అవినీతిని ఏమాత్రం సహించబోమని జిన్ పింగ్ హెచ్చరించారు. 2035 నాటికి చైనా బలగాల ఆధునికీకరణను పూర్తి చేస్తామని తెలిపారు. 2020 నాటికి యాంత్రీకరణ పనులు ఓ కొలిక్కి వస్తాయని... వీటితోపాటు వ్యూహాత్మక సామర్థ్యాల అభివృద్ధి, సాఫ్ట్వేర్ల తయారీపై దృష్టిపెడతామని పేర్కొన్నారు.
వాషిగ్టంన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతకి చెందిన విజిటర్స్‌తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ, సీమా వర్మ, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలను జరుపుకునే సంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు.
చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ క్షమాపణలు ప్రజలకు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనని క్షమించాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కి రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో కమల్ హాసన్ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న సమస్యలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు క్షమించండి అని ఆర్టికల్‌లో పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం తొలగిపోతుందని అనుకున్నాను కానీ ధనవంతుల కోసమే ఈ నిర్ణయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో రాజకీయ నేతలే లబ్ధిపొందారని... సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. ఈ విషయంలో తప్పు జరిగిందని మోదీ ఒప్పుకుంటే మరోసారి సలాం కొడతానని పేర్కొన్నారు. కమల్ కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నవంబర్‌లో తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని ఆయన గతంలో వెల్లడించారు.
గుంటూరు : అగ్నిప్రమాదం స్థానికులను భయపెట్టింది. శ్రీనగర్‌కాలనీలోని 3వలైన్లో ఉన్న పాతపేపర్ల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పశ్చిమగోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా తుందుర్రు, కంసాల బేతపూడి గ్రామస్తులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడురోజులుగా కంసాల బేతపూడిలో భారీగా మోహరించిన పోలీసులు నిద్రపోతున్న వారిని రెండు సార్లు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో రావడంతో వెనుతిరిగారు. చివరికి తెల్లవారు ఝామున నిద్రిస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేశారు. దీక్ష చేస్తున్న 8 మందితో పాటు 40 మందిని అరెస్టు చేసిన పోలీసులు పాలకొల్లు, నరసాపురం పీఎస్‌లకు తరలించారు. దీక్ష చేస్తున్న నలుగురు మహిళలు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి ముందు బైఠాయించి దీక్ష కొనసాగించారు. మరో ముగ్గురు నరసాపురం ఆసుపత్రిలో దీక్ష కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా కనిపించట్లేదని గ్రామస్తులు వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ కట్టనివ్వమని హెచ్చరించారు.
నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిరవధిక దీక్ష చేస్తున్న మహిళకు సుగర్ లెవెల్స్ క్షీణిస్తుండటంతో పోలీసులు అందర్నీ బలవంతంగా ఆసుపత్రి లోనికి తీసుకెళ్లి చికిత్స చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, సీపీఎం నేత మంతెన సీతారం, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ తదితరులు దీక్ష చేస్తున్న వారిని పరామర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టులు చేయిస్తున్న ప్రభుత్వం దిగి వచ్చేంతవరకూ పోరాటంలో తమ మద్దతు ఉంటుందని సీపీఎం, వైసీపీ నేతలు చెప్పారు. ఆక్వా ఫుడ్ పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించే వరకూ తమ పోరాటం ఆపేది లేదని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు.
విశాఖ : పశ్చిమధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన తర్వాత ఒడిశా తీరంవైపు పయనించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున... మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం పొంచి ఉండటంతో.. ఉత్తర, దక్షిణకోస్తా జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. విశాఖ జీవీఎంసీతో పాటు కలెక్టరేట్లోలోనూ టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
జూరాల ప్రాజెక్ట్ 26 గేట్లను ఎత్తివేశారు.
మరోవైపు కృష్ణనదిలో వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్ట్ 26 గేట్లను ఎత్తివేశారు. శ్రీశైలం జలాశయంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 2,38,036 క్యూసెక్యుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం రాత్రి వరకు 559 అడుగులవద్ద ఉన్న సాగర్ నీటిమట్టం మధ్యాహ్నానికి 561 అడుగులకు చేరింది. ఈ విధంగానే మరో వారం రోజులు ఇన్‌ఫ్లో కొనసాగితే డ్యాం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 2500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు రెండుగేట్లను ఎత్తి 2220 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
చికాగో : అమెరికా పర్యటనకు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు చికాగో చేరుకున్నారు. అమెరికాలోని తెలుగువారు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమెరికాలోని 5 నగరాల్లో 5కే రన్ నిర్వహిస్తామని ... వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో... ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతిలో 2 మిలియన్ డాలర్లతో తానా భవన్ నిర్మించేందుకు సిద్ధమని.. అందుకు స్థలం కేటాయించాలని కోరారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ : తనపై మీడియాలో జరుగుతున్న ప్రజారాన్ని టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్పార్టీలోకి వెళ్లుతున్నట్టు జరుగుతున్న ప్రజారం అవాస్తమన్నారు. కూలిపనుల పేరుతో టీఆర్ఎస్నేతలు లంచాలు మింగుతున్నారని దీనిపై సుప్రీంకోర్టులో కేసువేసేందు ఢిల్లీవెళ్లాన్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగిన ప్రచారం అని రేవంత్ ఫైర్ అయ్యారు. మీడియాలో వస్తున్న కథనాల వల్ల తనకు గాని, టీడీపీకి గాని ఎలాంటి నష్టం ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకానికి విరుద్ధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ నడుచుకోనని తెలిపారు.
కాంగ్రెస్‌తో జతకడితే తప్పేంటని
ఏపీ టీడీపీ నేతలు, మంత్రులపై రేవంత్ ఫైర్ అయ్యారు. పయ్యావుల కేశవ్‌ను ప్రజలు తిరస్కరించినా.. తామే చంద్రబాబుకు చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇప్పించాం అన్నారు. అటు యనమల ఫ్యామిలీకీ తెలంగాణలో రెండువేల కోట్లరూపాయల కాంట్రాక్టు ఎలా లభించిందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పరిటాల శ్రీరాం, యనమల మేనల్లుడి బీర్ల కంపెనీకి హైదరాబాద్‌లో లైసెన్స్ ఎలా వచ్చిందిన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టించిన కేసీఆర్‌కు.. పరిటాల శ్రీరాంపెళ్లిలో అతిథిమర్యాదలు చేశారంటూ రేవంత్ ఎద్దేవాచేశారు. పొత్తుల విషయంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఏపీలోలాగా తెలంగాణ బీజేపీతో వెళ్లేందుకు తాము సిద్ధంగా లేం అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోడానికి కాంగ్రెస్‌తో జతకడితే తప్పేంటని రేవంత్ ప్రశ్నించారు. పాలేరు ఉప ఎన్నిక, సింగరేణి ఎన్నికల సందర్భంలో కాంగ్రేస్ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఈ అనుభంతోనే భవిష్యత్తులో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సిద్దాంతానికి కట్టుబడి ఉంటామని చెప్పుకునే బీజేపీ ఏపీలో ఒకరీతిగా తెలంగాణాలో మరోరీతిగా ముందుకు వెళుతోందని రేవంత్ అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నందున తాను ఇప్పటికేం మాట్లాడనని ఆయన వచ్చాక అన్ని విషయాలపై చర్చిస్తాన్నారు. ఇదిలావుంటే.. ఏపీ టీడీపీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటికి వెళ్లడం ఆసక్తిగా మారింది. రేవంత్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో రేవంత్‌ను కూల్చేసేందుకు టీడీపీ అధినాయకత్వం రాయబారాలు మొదలు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ల కొస్తున్నడు..? వచ్చశిండు.. రాహుల్ గాంధీని కల్చిండు.. అయిపోయింది మాట ముచ్చట ఒడ్సింది.. ప్రచార కమిటీకి ఆయననే చైర్మన్‌ను జేస్తున్నరు.. ఏ పేపర్ల జూశినా ఈ ముచ్చటనే.. మరి నిజంగ వస్తున్నడా..? కాంగ్రెస్ పార్టీల శెరీకైతున్నడా రేవంత్ రెడ్డి అంటే.. మల్లన్న ముచ్చట్లకు అందిని సమాచారం ప్రకారం.. సూడుండ్రి..
వరంగల్ రోహిణి సూపర్ స్పెషాలిటీ దావఖాండ్ల ఒక ఫ్లోర్ల మంటలు లేశినయ్.. రోగులంత భయపడ్తున్నరు.. ఆస్పత్రి సిబ్బందికి గూడ ఏమైందో తెల్వలే.. లోపటంత పొగ సూర్కపోయింది.. వందల మంది పేషెంట్లను పొగ గమ్మేశింది.. ఆ క్షణంల..? ఆయాళ్లకే ఒక డాక్టర్ లోపట జేశ్న పాపం ఏందో తెల్సా..? బాధితుడే మల్లన్న ముచ్చట్లకు ఫోన్ జేశి చెప్పిన ఆ ఘోరం ఇనుండ్రి మీరు గూడ..
తెలంగాణ అనే రాష్ట్రంల గిరిజనులు.. దళితులు సస్తె సావాలేగని.. ఎవుసాయం జేస్కోని మాత్రం బత్కొద్దు.. ఆత్మ గౌరవం తోని అస్సలే బత్కొద్దు.. వాళ్లు ఎన్నిరోజులు ఉన్నా.. ఈ భూమికి భారమేగని..? లాభం లేదన్నట్టు సూస్తుంటది మన ప్రభుత్వాలు.. వాళ్ల రక్షణ కోసం చట్టాలుంటయ్ గని.. అమలుగావు.. వాళ్లకు భూములిస్తరు గని.. అవ్వి వాళ్లయ్ గావు.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మామిడి తండా గిరిజనుల గోస జూడుండ్రి.
విలేకరి అయితే.. ఎంత లంగ పనిజేశినా..? ఎంత బట్టెవాయి పనిజేశినా నడుస్తదా..? ఎటుగుడ్క పెన్ను చేతులున్నది గదా అని..? ఆడోళ్ల ఎంటవడుడు.. ఇననోళ్ల మీద అడ్డమైన వార్తలు రాశి కేసులు వెట్టిచ్చుడు ఇది కరక్టేనా..? విలేకరైతేంది..? ఒకీలైతేంది..? అందరు సమానమే చట్టం ముంగట.. ఒక పేపర్ల పనిజేశే విలేకరి గాడు ఏం జేశిండో సూడుండ్రి మీరే..
ఒక రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగం తోని వోతున్నది.. ఆ రైళ్ల ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది.. ఆమెకు డెలివరీ టైం దగ్గరికొచ్చింది.. రైలు వోతుండంగనే నొప్పులు సుర్వైనయ్.. రైలు ఆపుదామంటే ముంగట ఊర్లు లేవు.. ఉన్నా ఆ రైలు ఆపెతందుకు లేదు.. ఆడ స్టాప్ లేదన్నట్టు.. ఇంక జర్రంత నొప్పులు ఎక్వైనయ్.. పాపం ఆ తల్లి తల్లడిల్లుతున్నది.. తర్వాత ఏమైందో సూడుండ్రిగ..
కడ్పుల సర్కారు వోశిన మందు ఉండే.. కండ్లు రిమ్మున తిర్గుతుండే.. మంచి నిసలకు వడిపాయే పెయ్యి.. ఇగ వానికి ఏలోకంలున్న సంగతి ఎట్ల తెలుస్తది..? వానికి ఏది గనిపిస్తె.. ఏది అనిపిస్తె అది జేస్కుంటవోతడు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కాడ.. ఒకడు కడ్పునిండ దాగి కరెంటి తంభం ఎక్కిండు.. దిగురో సచ్చిపోవతని పబ్లీకు.. సూడుండ్రి తర్వాతేమైందో..
ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీపీల గెల్చి టీఆర్ఎస్ పార్టీల ఎందుకు జేరిండో తెల్సిందా..? ఇయ్యాళ ఒక చెర్వుకట్ట కాడ నిలవడి అస్సలు ముచ్చట జెప్పేశిండు..? నన్ను చాల మాట్ల టీఆర్ఎస్ పార్టీల జేరుమని ముఖ్యమంత్రిగారు జెప్పిండు.. కని నేను ఎప్పుడైనా ఒక్కటే కండీషన్ వెట్టినా..? దాని విల్వ మూడువందల కోట్ల రూపాలనుకొచ్చిండు.. సూడుండ్రి మీరు గూడ..
నరేంద్రమోడీ గారిని.. ఎవ్వలు పల్లెత్తు మాటనొద్దట.. ఒకవేళ పొరపాటున గూడ అంటే.. అరెస్టులు జేస్తరట కేసులు వెడ్తరట.. మొన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన మీద ఒక కండక్టర్ ఫేస్ బుక్కుల పోస్టు వెడ్తె ఎట్ల సుడివెట్టిండ్రు ఆయనను.. అగో అట్లనే సుడివెడ్తరట.. మరి ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యం లేరుగావట్టి పోస్టులు వెట్టెకాడ జాగ్రత్త..
మన నందమూరి బాలికాకయ్య కారు ఆడంగొస్తుంటే.. అడ్డంబడి.. సారు సారూ దండం బెడ్త జర్ర ఆపు నేను నీ అభిమానిని.. అని కారు ఆపితె ఊకుంటడా..? దిగి ఒక్క తన్ను తంతడు.. అంత మూర్ఖుడు బాలికాక.. ఇద్వరకు ఎంతమందిన గొట్టింది మన సూడలేదా..? అయితే బాలికాకయ్యకు బైటి నటులకు ఎంత తేడా ఉంటదో సూపెట్టే ముచ్చట ఇది.. మమ్ముట్టి ఎర్కేగదా నటుడు.. సూడుండ్రి ఎంత మంచోడో..
రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు : జగ్గారెడ్డి
చికాగో చేరుకున్న సీఎం చంద్రబాబు
తూర్పుగోదావరి : దీపావళి.. వెలుగులు నింపి చీకట్లను పారద్రోలే పండగ. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి. కానీ ఈ ఏడాది దీపావళి సంబరాలు అంతంతమాత్రంగానే ఉండేలా ఉన్నాయి. కేంద్రం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం ఇప్పటికే పలు రంగాల మీద పడింది. చివరకు ప్రధాని కూడా జీఎస్టీ దోషం తనది కాదన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండగ పూట నాలుగు టపాసులు కాలుద్దామనుకున్నవారికి..జీఎస్టీ మోత మోగిస్తోంది. జేబు నిండా డబ్బులతో వెళ్లినా సంచినిండా సరుకులు తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ భారమేనన్నది మార్కెట్ వర్గాల వాదన. ఏకంగా 28 శాతం జీఎస్టీ విధించడంతో దీపావళి బాణసంచా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
మతాబుల కట్ట ప్రస్తుతం 200 రూపాయలు
గతేడాది 100 రూపాయలున్న మతాబుల కట్ట ప్రస్తుతం 200 రూపాయలకు చేరుకుంది. కాకరపువ్వుల బాక్స్ 80 నుంచి 150కి చేరింది. తారాజువ్వల వంటివాటి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇలా అన్ని రకాల బాణసంచా సామాగ్రి ధరలు అమాంతంగా పెరిగాయి. అన్ని వస్తువుల మీద పన్నుల భారం పెరగడంతో హోల్‌సేల్ మార్కెట్లోనూ ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. బాణసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బాణసంచా కాల్చాలంటే సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి దాపురించింది. అయినా పిల్లల కోసం ఎంతో కొంత కొనక తప్పని పరిస్థితి ఉండడంతో చేతి చమురు ఎక్కువగానే వదిలించుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. పండగను కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వకుండా.. జీఎస్టీ భారం సామాన్యుడిని సతమతమయ్యేలా చేస్తోంది. పెరుగుతున్న భారం ప్రజలను పండగకు దూరం చేస్తోంది.
హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగల సందర్భంగా బిగ్ సీ లక్కీ విజేతలను ప్రకటించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని బిగ్‌సీ 176వ శాఖలో ఈ లక్కీడ్రాను నిర్వహించారు. ఏడుగురు విజేతలకు హోండా ఇయాన్ కార్లను అందజేయనున్నారు. దసరావళి పేరుతో నిర్వహించిన ఆఫర్లో 36రోజుల్లో 36 లక్కీడ్రాలు తీస్తున్నామని బిగ్‌సీ సీఎండి బాలుచౌదరి తెలిపారు. అంతేకాదు సోని ఎక్స్‌పీరియా -A1 మొబైల్ కొనుగోలుపై 5వేల రూపాయల ట్రాలీ సూట్‌కేస్ కూడా ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్ : దీపావళి రోజు ప్రతి ఇల్లు దీపాలతో కళకళలాడుతుంది. ముఖ్యంగా దీపాలను వెలిగించడానికి రంగురంగుల ప్రమిదలకు ప్రాముఖ్యతనిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి హైదరాబాద్‌లో వ్యాపారులు వెరైటీ ప్రమిదలను తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. వివిధ దేవతల ఆకృతులలో.. లక్ష్మీ దేవి రూపాల్లో తయారు చేసిన ప్రమిదలు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రమిదలు కొనడానికి విదేశీయులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక దీపావళి రోజు లక్ష్మీపూజ చేసేందుకు పలు డిజైన్లలో తయారు చేసిన ప్రమిదలను కొనడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గతంలో కంటే ధరలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు మహిళలు. మొత్తానికి రేటు సంగతి పక్కన పెడితే మార్కెట్లోకి వచ్చిన వెరైటీ ప్రమిదలను మాత్రం కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు.
తూర్పుగోదావరి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తోంది. అనేక చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
కృష్ణా : విజయవాడ వన్‌టౌన్‌లో బట్టల షాపులో పనిచేస్తున్న బాలిక బుజ్జి సెప్టెంబర్ 1నుంచి కన్పించడం లేదు..దీంతో కన్నవారు కూతురి కోసం గాలించి చివరకు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు...అయితే పోలీసులు బుజ్జి కన్పించకపోవడంతో ఆరా తీయగా తమకు వంశీ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు పేరెంట్స్ తెలిపారు...దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నవారు మాత్రం 45 రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు..అయితే బుజ్జి విషయంలో పోలీసులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో అనుమానాలు కలిగాయి...ఇక ఈ మధ్యకాలంలో పోలీసులకు కృష్ణానదిలో గుర్తుతెలియని డెడ్‌బాడీలు దొరికాయి...అయితే అవి అనాథ శవాలుగానే భావిస్తూ పోలీసులు వెంటనే అంత్యక్రియలు జరిపారు.
అంత్యక్రియలు జరిపిన పోలీసులు
ఇక మిస్సింగ్ కేసు పెడితే పోలీసులకు దొరికిన గుర్తుతెలియని డెడ్‌బాడీలను సదరు ఫిర్యాదు దారులకు చూపించిన తర్వాత పోలీసులు అనాథశవంగా గుర్తించాలి..ఆ తర్వాత అంత్యక్రియలు జరిపించాలి...కాని బుజ్జి పేరెంట్స్‌కు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వని పోలీసులు అంత్యక్రియలు జరిపించారు...అయితే తమ కూతురు మృతదేహాన్ని పోల్చకుండా...తమకు చూపించకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని బాలిక పేరెంట్స్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక ముందు నుంచి బుజ్జి అదృశ్యం వెనక వంశీ అనే యువకుడు ఉన్నాడంటూ పేరెంట్స్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు..మృతదేహాన్ని వైర్లతో కట్టేసినట్లు ఫొటోలో ఉందని చెబుతున్నారు...దీన్ని బట్టి వంశీనే బుజ్జిని హత్య చేశాడా..? ఈ విషయం పోలీసులు గుర్తించలేదా..? డెడ్‌బాడీని చూసైనా అనుమానించలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ మల్లిఖార్జున పేట చెందిన బుజ్జి వస్త్రలత లోని దుకాణంలో పనిచేస్తుండగా, కార్పొరేషన్ లో పనిచేస్తున్న వంశీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. బుజ్జి ని పెళ్ళి చేసుకోవాలంటే పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు...ఈ క్రమంలోనే ఆగస్టు 29 వ తేదీన వంశీ బుజ్జి ని ఆటోలో తీసుకెళ్ళి చిత్ర హింసలకు గురి చేశాడని, ఆ రోజు నుంచే ఆమె కన్పించడం లేదంటున్నారు.
కృష్ణానదిలో బాలిక మృతదేహం
బుజ్జి ఫిర్యాదు చేసిన ఐదు రోజుల తర్వాత కృష్ణానదిలో బాలిక మృతదేహం లభ్యమైంది. అది ఎవరిదన్న గుర్తించలేక పోవడంతో పోలీసులే దహన సంస్కారాలు చేశారు...రెండు రోజుల క్రితం బుజ్జి తల్లి, కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహం ఫొటోలు చూపించడంతో ఆమె బుజ్జీనేనని గుర్తించారు...దీంతో బుజ్జి హత్యకు గురయిందన్న విషయం వెలుగులోకి రావడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం ఆందోళనలు చేస్తుంది.
హైదరాబాద్ : నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మేధావులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి ఘటనలకు పూనుకోవద్దని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నాణ్యమైన విద్య లభించడం లేదని సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని హరగోపాల్ అన్నారు.
బోధన్ లో కీచక సీఐ
త్వరలో గ్రంథాలయాల్లో వైఫై సేవలు
టీడీపీ పార్లమెంటరీ భేటీ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
కడప : జిల్లా చింత కొమ్మదిన్నె మండలంలో మళ్లీ భూమి కుంగడం మొదలైంది. రెండేళ్ల క్రితం కూడా ఇలానే పంట పొలాల్లో భూమి కుంగిపోయింది. అప్పట్లో గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేంద్ర, రాష్ట్ర భూగర్భశాఖ అధికారులు.. గ్రామంలో పర్యటించారు. కొందరు శాస్త్ర వేత్తలు ప్రత్యేక బృందాలుగా పర్యటించి సర్వేలు నిర్వహించారు. అయినా భూమి ఎందుకు కుంగిపోయిందో సరైన కారణాలను కనుగొనలేకపోయారు. మొదట్లో భూమి పొరల కింద సున్నపురాయి ఉందని.. వర్షాలు భాగా కురిసినప్పుడు భూమిలో ఉన్న సున్నపురాయి పేలిపోయి ఇలా కుంగిపోయి ఉంటుందని తేల్చారు. మరి కొందరు భూమి కింద సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
రెండేళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రాంతంలో
రెండేళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రాంతంలో మళ్లీ భూమి కుంగిపోయి పెద్ద గుంతలు పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్ల పల్లె పొలాల్లోని మామిడి తోటలో దాదాపు 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతుతో రెండు పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న మామిడి చెట్లు భూమిలోకి కుంగిపోయాయి. భూమి కుంగిపోతుండటంతో ఈ గ్రామ ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు . గతంలో అధికారులు పర్యటించారు కానీ సరైన కారణాలను కనిపెట్టలేక పోయారని అంటున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయం, గూడవాండ్ల పల్లెతో పాటుగా చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతిసారి ఇలా పెద్దపెద్ద గుంతలు పడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యటించి గుంతలు ఎందుకు పడుతున్నాయో కనుగొనాలని ప్రజలు వేడుకుంటున్నారు.
విశాఖ : నగరంలో దీపావళి సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఏయూ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల వద్ద రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. అటు జీఎస్టీ పోటుకు తోడు... అల్పపీడన ప్రభావంతో... వర్షాల భయం తోడైంది. దీంతో ఈసారి అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కృష్ణా : న్టౌన్లో బట్టల షాపులో పనిచేస్తున్న బాలిక బుజ్జి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. బుజ్జి అదృశ్యమైనట్లు సెప్టెంబర్ 1న వన్‌టౌన్ పీఎస్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. వంశీ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. తమ కూతురు ఆచూకీ కనిపెట్టాలని 45 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే పోలీసుల సమాధానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం కృష్ణానదిలో బాలిక డెడ్‌బాడి దొరికిందని.. అనాధ శవంగా భావించి అంత్యక్రియలు నిర్వహించామంటున్నారు. అయితే మిస్సింగ్ కేసు పెడితే తమ కూతురు మృతదేహాన్ని అప్పగించకుండా...అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని బాలిక బంధువులు నిలదీస్తున్నారు. వంశీయే హత్య చేసి కృష్ణానదిలో పడేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలకు వీడియో చూడండి.
పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రు ఆక్వాఫుడ్ ప్యాక్టరీ బాధితులను సీపీఎం నేతలు పరామర్శించారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్యసహాయంపై ఆరాతీశారు. ఆక్వాఫుడ్ పరిశ్రమకు వ్యతిరేకంగా మూడురోజులుగా నిర్వాసితులు దీక్ష చేస్తున్నారు. కాగా బుధవారం తెల్లవారుజామున గ్రామంపై దాడిచేసిన పోలీసులు.. 40 మందిని అరెస్టు చేశారు. వీరిలో నలుగురు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాలకొల్లు ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా నిర్వాసితులు దీక్షను కొనసాగిస్తుండంతో సీపీఎం, వైసీపీ జిల్లానేతలు వారిని పరామర్శించారు.
టూడే అవర్ రిసెంట్ రిలీజ్ సినిమా 'రాజ ది గ్రేట్' డైలాగ్ రైటర్ గా తన సత్తాచాటి, కమర్షియల్ డైరరెక్టర్ గా పేరు తెచ్చుకొని, మొదటి సినిమానే హిట్ ఇచ్చిన డైరెక్టర్ కమ్ రైటర్ అనిల్ రాగపూడి డైరెక్ట్ చేసిన మూవీ 'రాజ ది గ్రేట్' కిక్ 2, బెంగాల్ టైగర్ వంటి సినిమాల తర్వాత రవితేజ కొత్తగా కనిపించిన సినిమా రాజ ది గ్రేట్. రెగ్యులర్ స్టోరీ లైన్ తో వస్వే క్లాస్, మాస్ అడియాన్స్ రిజెక్టు చేస్తున్నారని తెలుసుకున్న రవితేజ తన రూట్ మార్చి కామెడీతో పాటు యాక్షన్ కలిపి రాజ ది గ్రేట్ అంటూ ప్రేక్షకుల ముదుకు వచ్చాడు. ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించాడు. హీరోయిన్ మెహరిన్ నటిచింది. దీన్ని దిల్ రాజు నిర్మించాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
ఢిల్లీ : పోలవరం పై కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బరెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం 2019లోగా పూర్తి చేస్తామని చెప్పియ మళ్లీ దాన్ని పొడిగిస్తున్నారని అన్నారు. పోలవరం అంచనా వ్యయం భారీగా పెంచరాని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
విశాఖ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయిని, అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
మేడ్చల్ : జిల్లాలోని ఎల్లంపేటలో విషాదం చోటు చేసుకుంది. పోచమ్మ ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయాడు. బాలుడు సంపులో పడిన విషయం కుటుంబసభ్యులు గమనించేసరికి బాలుడు కన్నుమూశాడు.
ఖమ్మం : జిల్లాలో దీపావళికి ఈసారి బాణాసంచా వెలుగులు అంతంతమాత్రంగానే ఉండే అవకాశముంది. ధరలు పెరగటం, అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభం కావడం, జిల్లాలో అకాల వర్షాలు, డెంగ్యూ పంజాతో.. ఈసారి అమ్మకాలు భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
నిజామాబాద్ : దీపావళికి వారం ముందు నుంచే టపాకాయల అమ్మకాలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ టపాకాయల దుకాణాలు వెలిశాయి. ఇక్కడ వెలసిన చాలా దుకాణాలకు అనుమతులు లేవు. ఇవే కాకుండా ప్రధాన కూడళ్లలో, జనావాసాల్లో దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు కోట్ల రూపాయల్లో జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తమిళనాడులోని శివకాశి నుంచి భారీగా టపాకాయలను తెప్పించి జనావాసాల మధ్య నిలువ చేస్తున్నారు వ్యాపారులు. దుకాణాలు ఏర్పాటు చేయాలంటే అగ్ని మాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే కొంతమంది వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే దుకాణాలను నడిపిస్తున్నారు. నడి వీధిలో ఏర్పాటు చేసిన దుకాణాల వల్ల ప్రమాదం జరిగితే తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్రమంగా వెలుస్తున్న ఇలాంటి దుకాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అగ్నిమాపక, పోలీసు శాఖలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విక్రయానికి తాత్కాలిక లైసెన్సు
నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయానికి తాత్కాలిక లైసెన్సు తీసుకున్న వారు వంద కిలోలకు మించి టపాసులు నిల్వచేయరాదు. హోల్‌సేల్ వ్యాపారులైతే వారికి అనుమతించిన 1200 నుండి 1500 కిలోలకు మించి నిల్వచేయరాదు. కాని నగరంలో అనుమతించిన దానికంటే ఎక్కువగా టపాసుల నిల్వలు ఉంచారు. జనావాసాల మధ్య దుకాణాలు వెలవడంతో ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ ఉన్న ప్రాంతాల్లో టపాకాయల వ్యాపారానికి అనుమతులు ఇవ్వవద్దని ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి : బాణాసంచా దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో శబ్ద, వాయు కాలుష్యాలకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
హైదరాబాద్ : టపాసుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మండిపోతున్న క్రాకర్స్ ధరలతో సామాన్యుడు గుండెలు చిక్కబట్టుకుంటున్నాడు. వెలుగుల పండుగకు నిగారింపు తగ్గిందని సామాన్యుడితో పాటు, సగటు వ్యాపారి వాపోతున్నాడు. దీపావళి పర్వదినానికి పదిరోజుల ముందు నుంచే కళకళ్లాడాల్సిన దుకాణాలు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్‌లో టపాకాయల సేల్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బేగంబజార్ సైతం జీఎస్టీమోతతో కుదేలయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీపావళి బాణాసంచా ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీ విధించడంతో క్రాకర్స్ ధరలు ఏకంగా 30 నుంచి 40శాతానికి పెరిగిపోయాయి. దీంతో తమ బిజినెస్ లాస్లోకి వెళ్లిందని వ్యాపారులు అంటున్నారు. గత 152ఏళ్లుగా బేగంబజార్‌లో క్రాకర్స్ బిజెనెస్ కొనసాగిస్తున్న వ్యాపారులు కూడా ఇలాంటి పరిస్థితి తాము ఎప్పుడూ చూడలేదంటున్నారు. జీఎస్టీ దెబ్బతో సేల్స్ అమాంతం పడిపోయాయంటున్నారు.
చైనాక్రాకర్స్పై నిషేధం
మరోవైపు చౌకగా లభించే చైనాక్రాకర్స్పై ఈసారి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో.. దేశీయ టాపాసులు ధరలు ఆకాశాన్నంటాయని సామాన్య ప్రజలు అంటున్నారు. పైగా హైదరాబాద్‌లో వర్షాల కారణంగా టపాసులు కొంటే అవి పేల్తాయో లేదో అని వినియోగదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమావాస్య చీకటికి చురకలుపెట్టాల్సిన క్రాకర్స్... వినియోగదారుల జేబుల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వెలుగుల దీపావళి సరదాగా గుడపుదామనుకుంటే టపాకాయలు ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయని సగటు వినియోగదారుడు వాపోతున్నాడు.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకూ 3వేల 602 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రొ.పిఎల్.విశ్వేశ్వరరావు అన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతుల ఆత్మహత్యలు, చేతి వృత్తుల వారి ఆకలి చావులపై సమెనార్ జస్టిస్ బి.చంద్రకుమార్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నోజు శ్రీనివాసులు రూపొందించిన బ్రోచర్‌ను జస్టిస్ చంద్రకుమార్ ఆవిష్కరించారు.
హైదరాబాద్ : పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా అన్నారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో పార్టీలోకి వచ్చేవారికి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామన్న కేసీఆర్... ఆ హామీలను అమలు చేయలేదని కుంతియా ఆరోపించారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్ఎస్ నేతలపై కేసువేసేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏపీ టీడీపీ నేతలు, మంత్రులపై రేవంత్ ఫైర్ అయ్యారు. పయ్యావుల కేశవ్‌ను ప్రజలు తిరస్కరించినా.. తామే చంద్రబాబుకు చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇప్పించాం అన్నారు. అటు యనమల ఫ్యామిలీకీ తెలంగాణలో రెండువేల కోట్లరూపాయల కాంట్రాక్టు ఎలా లభించిందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పరిటాల శ్రీరాం, యనమల మేనల్లుడి బీర్ల కంపెనీకి హైదరాబాద్‌లో లైసెన్స్ ఎలా వచ్చిందిన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టించిన కేసీఆర్‌కు.. పరిటాల శ్రీరాంపెళ్లిలో అతిథిమర్యాదలు చేశారంటూ రేవంత్ ఎద్దేవాచేశారు. పొత్తుల విషయంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఏపీలోలాగా తెలంగాణ బీజేపీతో వెళ్లేందుకు తాము సిద్ధంగా లేం అన్నారు.
కొల్లూరు ఆత్మహత్యల కేసులో విచారణ ప్రారంభం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్మికులకు హెల్త్ కార్డు జారీ చేసే ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.
రంగారెడ్డి : జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఐదుగురి మృతి ఘటనలో విచారణ ప్రారంభమైంది. నార్సింగ్ పోలీసులు రామచంద్రాపురంలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్ టాప్, సెల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు డీమార్ట్ షేర్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చినిపోయిన ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి ఫోన్లు ఇంతవరకు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ల సిగ్నల్ లోకేషన్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వీరు ప్రయాణించిన కారు రూట్లో సీసీటీవీ ఫుటెజ్ లను పోలీసులు పరిశీలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
10tv.jpg)
హైదరాబాద్ : ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పయ్యావలు కేశవ్ ను ప్రజలు తిరస్కరించారని, పయ్యావుల కేశవ్ విశ్వనీయత కోల్పోయారని, పయ్యావులకు ఎమ్మెల్సీ పదవి మేమే ఇప్పించామని రేవంత్ అన్నారు. తెలంగాణలో ఏపీ మంత్రులకు ఏం పని అని, యనమల కుటుంబానికి కేసీఆర్ కాంట్రాక్టు ఇచ్చారని, మమ్మల్ని జైల్లో పెట్టించిన కేసీఆర్ కు దండం పెడతారా అని రేవంత్ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాం పెళ్లిలో కేసీఆర్ కు అతి మర్యాదుల చేశారని, చంద్రబాబు ఇక్కడికి వస్తే టీఆర్ఎస్ నేతలు పట్టించుకుంటారా అని అన్నారు. ఏపీ టీడీపీ నేతలు అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతున్నారని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
ఏపీ టీడీపి నేతలపై రేవంత్ ఫైర్
కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ పై కేసు వేసేందుకే ఢిల్లీ వెళ్లా : రేవంత్
మోడీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ పార్టీ మారేది ఊహాగానాలే : లోకేష్
ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల్లో రెండు కార్పొరేట్ విద్యాసంస్థల్లో మాత్రమే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ప్రొ. నీరజరెడ్డి సుమార్ 200 కాలేజీలో తిరిగి తమ నివేదికను తయారు చేశారని, దీనికి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యలే కారణమని, ఇంటర్ బోర్డు నియమాల ప్రకారం సాయంత్రం 4.30 తర్వాత భోధించకుడాదని, కానీ కొన్ని కాలేజీల్లో సిలబస్ ఇప్పటికే పూర్తి చేయడమంటే వారు పిల్లలకు ఎంతసేపు భోధిస్తున్నారో అర్ధమైంతుందని, శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో తనిఖీలు చేసేవారు కారువైయ్యారని ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపక సంఘం అధ్యక్షుడు మధసుధన్ అన్నారు. తొమ్మిది నెలల నుంచి ఐది నెలలు చదువాల్సిన విద్యార్థి రెండు, మూడు నెలల్లో చదివితే వారి ఒత్తిడి పెరుగుతుందని, తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని, ఉదయం 4.00 గంటల నుంచి 11.00వరకు క్లాసులు నడవడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళన గురౌతున్నారని బ్రిలియంట్ ఇన్ ట్యూషన్స్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పిల్లలపై ఒత్తిడి తేవడం తప్పని తల్లిదండ్రులు కోరిక ఉండవచ్చు కానీ కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి చేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ తల్లిదండ్రులు సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ అన్నారు. ఇంటర్ ఏజ్ గ్రూప్ అడల్స్ అంటారు ఈ సమయంలో హర్మోన్స్ విడుదల అవుతున్నాయని, టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న విధానం ఇంటర్ ఉండకపోవడం, తల్లిదండ్రులు పెద్ద కాలేజీ బాగా చదువుకుంటారని అనుకుంటారని, కానీ తల్లిదండ్రులు చిన్నప్పుటి నుంచి వారి పిల్లలు టాలెంట్ గుర్తించి దానికి తగ్గంటుగా నిర్ణయం తీసుకోవాలని క్లినికల్ సైకాలజిస్ట్ అనిత అన్నారు. బేసిక్ విషయం ఏమిటంటే ప్రభుత్వం విద్య నుంచి తప్పుకుందని, తల్లిదండ్రులకు వేరే గచ్చత్రం లేక ప్రైవేట్ కాలేజీ వైవు వెళ్తున్నారని ప్రముఖ ఆడ్వకేట్ సురేష్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. జ్వరానికి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో రోహిత్ అనే విద్యార్థి నల్లగా కమిలిపోయి ఒళ్లంతా బొబ్బలు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
రంగారెడ్డి : కొల్లూరు ఆత్మహత్యలపై మిస్టరీ కొనసాగుతోంది. ఐదుగురు మృతిపై అనేక అనుమానాలున్నాయి. మాదాపూర్ డీసీపీ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇంతవరకు ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీల సెల్ ఫోన్లు లభించలేదు. డిండి ప్రాజెక్టులో సెల్ ఫోన్లు పడేశారని అనుమానం కలుగుతుంది. ప్రభాకర్ రెడ్డి కాల్ లిస్టు పరిశీలిస్తున్నారు. కారు వెళ్లిన మార్గాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ పుటేజీ పరిశీలిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
తమిళనాడు : దీపావళి అంటేనే వెలుగుల పండుగ. వెలుగులతో అందరికీ ఆనందాన్ని పంచే పండుగ. మరి మన ఆనందాల వెనుక లక్షల కుటుంబాలు చీకటి కథలున్నాయి. సంతోషంతో వెలిగించే ప్రతి టపాసుల మాటున వేల వ్యథలున్నాయి. దీపావళి పండుగొస్తుందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది శివకాశి బాణసంచా తయారీనే. ఈ కేంద్రంలో లక్షలాదిమంది నిత్యం బాణసంచా తయారు చేస్తూ మనకు ఆనందాన్ని పంచుతున్నారు. దీపావళి సందర్భంగా... శివకాశిలో బాణసంచా తయారీపై 10టీవీ ప్రత్యేక కథనం..
టపాసులకు అడ్డా శివకాశి పట్టణం
దీపావళి రోజున మన ఇష్టంగా కాల్చే టపాసుల్లో 70శాతం దాదాపు తమిళనాడులోని శివకాశిలోనే తయారవుతాయి. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు ఏడాదంతా కష్టపడుతారు. బాణసంచా తయారే వారి జీవనాధారం. అదే వారి జీవితం. తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివకాశి పట్టణం. విరుద్ నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో వందేళ్ల కిందటే బాణాసంచా తయారీ ప్రారంభమైంది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారు చేసే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలోనే 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. అనంతరం కాలక్రమేణా ఇదే వ్యాపారం వేలాది కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటుతో దినదినాభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో అతిపెద్ద కేంద్రంగా శివకాశి నిలిచింది. ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి నిస్తోంది.
బాణాసంచా తయారీ కేంద్రాల్లోనే ఉపాధి
శివకాశి... దాని చుట్టూరా ఉన్న ప్రాంతాల ప్రజలంతా బాణాసంచా తయారీ కేంద్రాల్లోనే ఉపాధి పొందుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు బాణాసంచా తయారీలో పాలుపంచుకుంటారు. ఇక్కడి ప్రజలకు మరో పని తెలియదు. వారికి తెలిసిందల్లా బాణాసంచా తయారీనే. ఏళ్లుగా చేస్తున్న పనికాబట్టి అందులో వారు నైపుణ్యం సాధించారు. తక్కువ సమయంలో ఎక్కువ బాణాసంచా తయారు చేస్తున్నారు.
నష్టాలను చవిచూస్తోన్న బాణాసంచా వ్యాపారం
ఏళ్ల తరబడి బాణసంచా వ్యాపారం లాభదాయకంగా సాగింది. కానీ ప్రస్తుతం ఈ పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. కార్మికుల జీవితాల్లో కన్నీళ్లను తెప్పిస్తోంది. ఏదైనా వస్తువును తయారు చేయడం ఎంత ముఖ్యమో.. దానికి మార్కెట్ కల్పించడం అంతకంటే ముఖ్యం. మార్కెటింగ్ సరిగా లేకపోతే నష్టాలు వస్తాయి. ఇప్పుడు శివకాశి బాణసంచా వ్యాపారం కూడా భారీ నష్టాల బారిన పడుతోంది. శివకాశి పట్టణంలో మొత్తంగా 4700 ఏజెన్సీల ద్వారా ఈ దీపావళి సీజన్లో 100 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు జరిపినట్టు వ్యాపారులు చెబుతుననారు. గతేడాది కంటే ఈసారి కొనుగోళ్లు భారీగా తగ్గాయి. డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా 40శాతానికి పడిపోయాయి. దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పర్యావరణ పరిరక్షణ పేరుతో టపాసులను పేల్చవద్దంటూ ఆదేశాలు వస్తుండడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కార్మికులకు జీవనోపాధి దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమైన బాణసంచా తయారీ నష్టాలను చవిచూస్తోంది. దీంతో ఇందులో పనిచేస్తోన్న కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. బాణసంచా తయారీని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడే ప్రమాదముంది.
కాకినాడ : పండగంటే ఉత్సాహం.. పండగంటే సంబరం.. పండగంటే ఆనందం. అందులోనూ దీపావళి పండగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి.. ప్రతీ ఇంటిలో కొత్త కాంతులు నింపుతుంది. కానీ ఈ ఏడాది ఆ ఆనందానికి అడ్డుకట్ట పడుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కలవరపడుతున్నారు. దీపావళి సామాగ్రి మీద పడిన జీఎస్టీ భారంతో నిరాశ ఆవహించింది.
దీపావళి.. వెలుగులు నింపి చీకట్లను పారద్రోలే పండగ. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి. కానీ ఈ ఏడాది దీపావళి సంబరాలు అంతంతమాత్రంగానే ఉండేలా ఉన్నాయి.
కేంద్రం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం ఇప్పటికే పలు రంగాల మీద పడింది. చివరకు ప్రధాని కూడా జీఎస్టీ దోషం తనది కాదన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండగ పూట నాలుగు టపాసులు కాలుద్దామనుకున్నవారికి..జీఎస్టీ మోత మోగిస్తోంది. జేబు నిండా డబ్బులతో వెళ్లినా సంచినిండా సరుకులు తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ భారమేనన్నది మార్కెట్ వర్గాల వాదన. ఏకంగా 28 శాతం జీఎస్టీ విధించడంతో దీపావళి బాణసంచా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
గతేడాది 100 రూపాయలున్న మతాబుల కట్ట ప్రస్తుతం 200 రూపాయలకు చేరుకుంది. కాకరపువ్వుల బాక్స్ 80 నుంచి 150కి చేరింది. తారాజువ్వల వంటివాటి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇలా అన్ని రకాల బాణసంచా సామాగ్రి ధరలు అమాంతంగా పెరిగాయి. అన్ని వస్తువుల మీద పన్నుల భారం పెరగడంతో హోల్‌సేల్ మార్కెట్లోనూ ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
బాణసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బాణసంచా కాల్చాలంటే సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి దాపురించింది. అయినా పిల్లల కోసం ఎంతో కొంత కొనక తప్పని పరిస్థితి ఉండడంతో చేతి చమురు ఎక్కువగానే వదిలించుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
పండగను కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వకుండా.. జీఎస్టీ భారం సామాన్యుడిని సతమతమయ్యేలా చేస్తోంది. పెరుగుతున్న భారం ప్రజలను పండగకు దూరం చేస్తోంది.
హైదరాబాద్ : సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకానికి.. పిల్లలు రోడ్డు మీదపడాల్సి వచ్చింది. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకురాలేదని ఆక్సిలియం స్కూల్ యాజమాన్యం విద్యార్థులను గెంటివేసింది. దీంతో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ విద్యార్థులు రోడ్డుపై చేరారు. స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ కాంట్రాక్టర్ వద్ద స్పోర్ట్స్ డ్రస్‌లు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
ప్రైవేట్ స్కూల్ నిర్వాకం
పసుపు తీర్థం బుచ్చుకున్న ప్యాన్ ఎంపీ...కర్నూలు జిల్లాల కలర్ మారిన రాజకీయం, నారాయఖేడ్ ఎమ్మెల్యే లంచం తీసుకుండు...మరి ఇచ్చిన సోడిగా నీది తప్పుకాదా..? ఉద్యోగాల కోసం నిరుద్యోగుల భిక్షాటన...ఇన్ని జేసిన మన సర్కారొళ్లకు పడ్తెన, డబుల్ బెడ్ రూం ఇండ్లళ్ల మోసం అయింది....దళారులే లబ్ధిదారులైండ్రని ఆడొళ్ల కోపం, హైదరాబాద్ ల బిచ్చగాళ్ల అరెస్టుకు రంగం సిద్ధం...చర్లపల్లి, చంచల్ గూడ జైల పెట్టి సాతరట, జీఎస్టీ పాపంల నేనొక్కనే లేనంటున్న మోడీ...అది పాపంకాకపోయినుంటే ఈ మాట చెప్పుదువా ? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
ఢిల్లీ : పోలవరం నేషనల్ ప్రాజెక్టా....నేషనల్ స్కాం అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని అన్నారు. కాంట్రాక్టర్ ఒకరైతే పనుల చేసేది మరొకరని పేర్కొన్నారు. రెండు, మూడేళ్లైన పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
పశ్చిమగోదావరి : పోలవరంలోని కడెమ్మ వంతెన దగ్గర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తోన్న నలుగురిని పోలవరం చెక్‌పోస్టు పోలీసులు రక్షించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.
రేవంత్‌రెడ్డితో కంభంపాటి భేటీ
హైదరాబాద్ : నగరంలో రేవంత్‌రెడ్డిని కంభంపాటి రామ్మోహన్ కలిశారు. రేవంత్ పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధినేతతో చర్చించాలని రేవంత్‌కు సూచించారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని... రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు. సమస్య ఎలాంటిదైనా చర్చించుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
విజయవాడలో బాలిక మృతి కలకలం
కృష్ణా : విజయవాడ వన్‌టౌన్‌లో బట్టల షాపులో పనిచేస్తున్న బాలిక బుజ్జి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. బుజ్జి అదృశ్యమైనట్లు సెప్టెంబర్ 1న వన్‌టౌన్ పీఎస్‌లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. వంశీ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. తమ కూతురు ఆచూకీ కనిపెట్టాలని 45 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే పోలీసుల సమాధానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం కృష్ణానదిలో బాలిక డెడ్‌బాడి దొరికిందని.. అనాధ శవంగా భావించి అంత్యక్రియలు నిర్వహించామంటున్నారు. అయితే మిస్సింగ్ కేసు పెడితే తమ కూతురు మృతదేహాన్ని అప్పగించకుండా...అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని బాలిక పేరెంట్స్ నిలదీస్తున్నారు. వంశీయే హత్య చేసి కృష్ణానదిలో పడేశారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వైర్లతో కట్టేసినట్లు ఫొటోలో ఉందని చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
దుర్గగుడి ఈవో సూర్యకుమారితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. విజయవాడ దుర్గగుడికి సంబంధించిన పలు విషయాలు తెలిపారు. పలు అసక్తిరమైన విషయాలు వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బదర్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను మూసివేశారు. దీంతో పాటు డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించారు. మెట్రో, ఆసుపత్రుల్లో మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ చైర్మన్ భూరేలాల్ ప్రస్తుత పరిస్తితులపై సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఢిల్లీ ఐఎస్‌బీటీలో బస్సుల డ్రైవర్లు హారన్ ఉపయోగించరాదని, బస్టాండుల్లో డ్రైవర్లు, కండక్టర్లు బిగ్గరగా అరిస్తే జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ : పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 2 గంటలకు అమెరికా బయలుదేరారు....మొత్తం 9 రోజుల పాటు మూడు దేశాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. చివరి రెండు రోజులు లండన్‌లో పర్యటించి అమరావతి డిజైన్స్‌ను సీఎం చంద్రబాబు ఖరారు చేయనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరారు. పెట్టుబడులు ఆకర్షించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఫారిన్ టూర్ చేపట్టారు. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు విదేశాల్లో పర్యటించనున్నారు. ఆయన 18 నుంచి 20వరకు అమెరికా పర్యటనలో ఉంటారు. 21నుంచి 23వరకు యూఏఈలో పర్యటిస్తారు. యూకేలో 24నుంచి 26 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మూడు దేశాల పర్యటనలో రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమెరికాలో ఐయోవా గవర్నర్, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ నార్తీలను కలుస్తారు. చికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ సభ్యులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం ఐయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి, రీసెర్చ్ పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐయోవా గవర్నర్ ఇచ్చే విందులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు గురించి వివరించనున్నారు. అమెరికా పర్యటనలో చివరి రోజు వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొంటారు.
అమెరికా పర్యటన అనంతరం ఈనెల 21 నుంచి 23 వరకు యునైటెడ్ అరబ్ దేశాలను చంద్రబాబు విజిట్ చేస్తారు. ముందుగా నాన్ రెసిడెంట్స్ కమ్యూనిటీతో భేటీ కానున్నారు. బిజినెస్ లీడర్స్ ఫోరమ్, ఎమిరేట్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, రాయల్ ఫ్యామిలీ వెల్త్ మేనేజర్, ఎమిరేట్స్ గ్రూపు-దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఒమన్ ఎండోమెంట్ మినిస్టర్‌తో సమావేశమై... ఏపీలో ఎయిర్‌పోర్టు ఎకోసిస్టమ్ గురించి చర్చించనున్నారు. ఆ తర్వాత యూఏఈ ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు, అబుదాబీలోని రాజకీయ, వర్తక, వాణిజ్య ప్రముఖులతో డిన్నర్ సమావేశంలో పాల్గొంటారు.
యూఏఇ నుంచి చంద్రబాబు నేరుగా యూకే వెళ్లనున్నారు. ఈనెల 24 నుంచి 26 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమరాతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ, హైకోర్ట్, పరిపాలన నగరం డిజైన్స్‌ను పరిశీలించనున్నారు. పర్యటనలో చివరి రోజు డిజైన్స్ ఖరారు చేయనున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రి బృందం తిరుగు ప్రయాణం కానుంది.
గుంటూరు : జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌కు చెందిన రేఖ అనే గర్భిణి రైల్లో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె రైల్లోనే శిశువుకు జన్మనిచ్చింది. తెనాలిలో స్టాప్ లేకపోయినప్పటికీ రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి రేఖను 108లో ఆస్పత్రికి తరలించారు. రప్తి సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.
నల్గొండ : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 561 అడుగుల మార్కును దాటింది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పై నుంచి ఇలానే వరద ఉధృతి కొనసాగితే గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు చేరనుంది. సాగర్‌కు వరద ఉధృతిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
చిత్రావతి నది వంతెనకు బీటలు
కడప : జిల్లాలోని చౌటిపల్లి సమీపంలోని చిత్రావతి నదిపై నిర్మించిన వంతెన ప్రమాదపు అంచుకు చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బ్రిడ్జి బీటలు వారింది. దీంతో వంతెన కుంగిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు....బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒంగోలులో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు
ప్రకాశం : జిల్లాలో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 4 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రోగులకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం జిల్లా వైద్యారోగ్యశాఖకు సమాచారం పంపారు. అప్రమత్తమైన డిఎం అండ్‌హెచ్‌ఓ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
అనంతపురం : జిల్లాలోని గోరంట్ల మండలం చేట్ల మొర్రంపల్లిలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50కి పైగా గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు.. పశు వైద్యాధికారి తెలిపారు. గత వారం రోజులుగా అనారోగ్యానికి గురైన గొర్రెలు ఉన్న ఫలంగా మృతి చెందడం పట్ల మేకల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 5 వేలకు పైగా గొర్రెలు, మేకలున్నాయి. వ్యాధి గురించి అవగాహన లేక చనిపోయినవాటిని ఊరి చివరన పడేయడం.. లేదంటే వాటి మాంసాన్ని అమ్ముతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. కొందరు గ్రామస్తులు పశు వైద్యాధికారులుకు విషయం చేరవేయడంతో వారు ఆ గ్రామాన్ని సందర్శించి.. చనిపోయిన గొర్రెల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా ఆంత్రాక్స్‌గా నిర్ధారణయ్యింది.
హైదరాబాద్ : టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్....తనయుడు కేటీఆర్ ది ఒక రూటు అయితే...... ఆ పార్టీ శాసనసభ్యులది మాత్రం మరో రూటుగా మారుతోంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని తరచూ ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నా.....అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొకోవడం చర్చనీయంశంగా మారుతోంది.
పనిచేసి పెట్టేందుకు ఎవరైనా లంచం అడిగితే...... చెప్పుతో కొట్టాలని మంత్రి కేటీఆర్ ఎన్నో బహిరంగ సభల్లో పిలుపు ఇచ్చారు. కానీ సొంత పార్టీ నేతలకు మాత్రం ఈ మాటలు చెవికెక్కినట్లు కనిపించడం లేదు.
బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రం అవినీతి రహితంగా ఉండాలని టీఆర్ఎస్ లోని కీలక నేతలు కలలు కంటున్నారు.. అయితే.....అధికార పార్టీ నేతలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నా ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఘటనలతో గులాబీ నేతల్లో అయోమయం మొదలైంది.
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధుసూధనా చారి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతితో మధుసూదనాచారి తనయులు టీఆర్ఎస్ను భ్రష్టుపట్టిస్తున్నారని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఆరోపణలు పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అభివృద్ధి పనులు, రాయితీ ట్రాక్టర్ల పంపిణీలో కమీషన్లు కొడుతున్నారన్న ఆరోపణలు చర్చకు దారి తీశాయి. పార్టీ బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు. దీన్ని ఆసరగా చేసుకుని.....ఎమ్మెల్యేలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గతంలోనే వచ్చాయి. అవి నిజమేనని ఈ పరిణామాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఇవే పరిస్థితులు ఉన్నా..... అవి బహిర్గతం కావడం లేదన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేతల జాబితా పెద్దగానే ఉంది. గతంలో ఎమ్మెల్యే బోడిగ శోభ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి గురికాక తప్పలేదు. శంకర్ నాయక్ పై ముఖ్యమంత్రికి ఆ పార్టీ ఎంపీ సీతారం నాయక్ ఫిర్యాదు కూడా చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ ల వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మొత్తం మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల వ్యవహారం అధికార పార్టీకి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలు వెనుక రాజకీయ కోణాలు కూడా ఉంటాయన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో లేకపోలేదు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై వస్తున్న అవినీతి ఆరోపణల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
కామారెడ్డి : జిల్లాలోని ఎండిర్యాలలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురును హత మార్చాడు. కూతురును కన్నతండ్రి హత్య చేశాడు. పదో తరగతి చదవుతున్న శ్రీజ అనే విద్యార్థినిని తండ్రి బాలయ్య హత మార్చారు. బాలయ్య కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
కామారెడ్డి జిల్లాలో దారుణం
అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం
అనంతపురం : జిల్లాలోని గోరంట్ల మండలం చేట్ల మొర్రంపల్లిలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50కి పైగా గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు.. పశు వైద్యాధికారి తెలిపారు. గత వారం రోజులుగా అనారోగ్యానికి గురైన గొర్రెలు ఉన్న ఫలంగా మృతి చెందడం పట్ల మేకల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 5 వేలకు పైగా గొర్రెలు, మేకలున్నాయి. వ్యాధి గురించి అవగాహన లేక చనిపోయినవాటిని ఊరి చివరన పడేయడం.. లేదంటే వాటి మాంసాన్ని అమ్ముతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. కొందరు గ్రామస్తులు పశు వైద్యాధికారులుకు విషయం చేరవేయడంతో వారు ఆ గ్రామాన్ని సందర్శించి.. చనిపోయిన గొర్రెల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా ఆంత్రాక్స్‌గా నిర్ధారణయ్యింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ దాడులు
హైదరాబాద్ : ఓ మహిళను లైంగికంగా వేధిస్తోన్న దొంగబాబాను హైదరాబాద్ హుమాయూన్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోలీచౌకిలోని నదీంకాలనీకి చెందిన ఓ దొంగబాబా అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కన్నేశాడు. దుష్టశక్తులు నిన్ను ఆవహించాయని... వాటిని తొలగిస్తానంటూ ఆ మహిళకు చెప్పాడు. ఇదే విషయమై ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకుని పదేపదే ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు దొంగబాబాను అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం కిషన్‌గూడాలో ఆర్టీఏ దాడులు చేపట్టింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సులను తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
పశ్చిమ గోదావరి : తుందుర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి... ఆక్వా ఫుడ్ పార్క్ ను వేరే ప్రాంతానికి తరలించాలంటూ మూడు రోజులుగా కంసాల బేతపూడి లో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు తెల్లవారుజామున భగ్నం చేశారు... అర్ధరాత్రి నుండి భారీగా మోహరించిన పోలీసులు రెండు సార్లు నిద్రిస్తున్న వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో రావడంతో గమనించిన పోలీసులు తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్ చేశారు... నిద్రిస్తున్న వారిని ఈడ్చుకుంటూ దీక్ష చేస్తున్న ఎనిమిది మంది సహా 40మందిని అరెస్ట్ చేసి పాలకొల్లు, నరసాపురం పీఎస్ లకు తరలించారు. దీక్ష చేస్తున్న వారిలో నలుగురు మహిళలు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి బయట బైఠాయించి దీక్ష కొనసాగిస్తున్నారు. నరసాపురం ఆసుపత్రిలో బెడ్ లు కూడా లేకపోవడంతో ముగ్గురిని ఒకే బెడ్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు... ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా నిరంకుశత్వంగా వ్యవహరించి బలవంతపు అరెస్టులు చేస్తున్నారని కన్నీరు పెడుతున్నారు. అరెస్టు చేసిన ఎనిమిది మంది ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వాఫుడ్ పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని మూడురోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న 8 మందితోపాటు మరో 40 మంది అరెస్టు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత

ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకునే అవకాశం లేకుండా పోయిందని వక్తలు వాపోయారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్సింహ్మారెడ్డి, టీకాంగ్రెస్ నేత మహేష్ గౌడ్, టీఆర్ ఎస్ నేత కాటం సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. సీపీఎం మహాజన పాదయాత్రపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
వైరల్ ఫీవర్స్...తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ రమాదేవి పాల్గొని, మాట్లాడారు. 'జ్వరాలు బాబోయ్.. జ్వరాలు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వైరల్ ఫీవర్స్‌తో వణికి పోతున్నాయి. ఎజెన్సీ ప్రాంతాల పరిస్థితి చెప్పన్కరలేదు. అంత మాత్రాన నగరాలు, పట్టణాలు మినహాయింపు కాదు. జ్వరమే కదా అని లైట్ తీసుకుంటే ప్రాణాపాయమే సంభవిస్తున్న పరిస్థితి. ప్రాణాలు తోడేస్తున్న విషజర్వాలు, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలను ఆమె వివరించారు. మరిన్ని వీడియోలో చూద్దాం...
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో అవినీతి బాగోతం బట్టబయలైంది. మొన్నటికి మొన్న చనిపోయిన వ్యక్తి పేరుతో వైన్‌షాపుకు అనుమతులిచ్చిన బల్దియా అధికారులు. ఇప్పుడు ఏకంగా వాహనాల రిపేర్స్‌కు ఫోర్జరీ బిల్లులు పెడుతూ అడ్డంగా బుక్కయ్యారు. 22 నెలలుగా ఫోర్జరీ బిల్లులతో బల్దియా ఖజానాకు గండి కొట్టారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఉన్నతాధికారులు ఎన్ని సంస్కరణలు చేసినా అవినీతికి అడ్డుకట్టవేయలేకపోతున్నారు. మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో పర్మిషన్ ఇచ్చిన బల్దియా ఘనులు.. ఇప్పుడు ఏకంగా ఫోర్జరీ బిల్లులతో ఖజానా లూటీ చేస్తున్నారు.
అసలు మ్యాటర్‌లోకి వస్తే బల్దియా ట్రాన్స్‌పోర్టును సమూలంగా మార్చుతూ బల్దియా బాస్ జనార్దన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాహనాల రిపేర్లు, డీజిల్ వాడకంలో భారీగా మార్పులు కనిపించాయి. ఖర్చులు కూడా పెద్దమొత్తంలో తగ్గాయి. అయితే మలక్‌పేట్ పార్కింగ్ యార్డులో మాత్రం భారీ అవినీతి బాగోతం బయటపడింది. ఫోర్జరీ బిల్లులతో అందినకాడికి దండుకుంటున్నారు. మలక్‌పేట్ పార్కింగ్ యార్డులో మెకానిక్ నుంచి ఇండెంట్ తీసుకోకుండానే రిపేర్లు చేస్తూ.... వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. గత 22 నెలలుగా ఎవరినీ సంప్రదించకుండా కొంతమంది అధికారులు వాహనాలకు రిపేర్లు చేయిస్తున్నట్టు , వాటికి భారీగా ఖర్చు అయినట్టు లెక్కలు చూపుతూ ఫోర్జరీ సంతకాలతో బిల్లులు పెడుతన్నారు. దీనికి అధికారులు కూడా వెనుకాముందు ఆలోచింకుండా వాటిని మంజూరు చేస్తున్నారు. మెకానిక్ సంతకం పెట్టకపోయినా...ఉన్నతాధికారులు బిల్లులు మంజూరు చేస్తున్నారు.
ఫోర్జరీ బిల్లుల వ్యవహారంపై టీన్టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో బల్దియా అధికారుల్లో చలనం వచ్చింది. ఫోర్జరీ సంతకాలపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్‌ను బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. తప్పుచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియాలో వరుసగా అవినీతి బయటపడుతుండడంతో ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అవినీతికి చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
హైదరాబాద్ : లాల్... నీల్ జెండాల ఐక్యత దేశానికి అవసరమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఐక్యంగా ఉద్యమించి సాధించాలని పిలుపునిచ్చారు. హిందమతోన్మాదం, సామ్రాజ్యవాదం కలయితో ఉద్భవించిన సరళీకరణ విధానాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలని ఆకాంక్షించారు. సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నేతలు... సామాజిక న్యాయం, పాదయాత్ర లక్ష్యాల సాధనకు అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
సామాజిక న్యాయం - రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తయ్యింది. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న పౌరహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్... హిందూమతోన్మాదం, సామ్రాజ్యవాదమనేవి ఇప్పుడు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలని అన్నారు. ఈ రెండింటి కలయిక వల్ల ఉద్భవించిన సరళీకరణ విధానాలనేవి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయన్నారు. వీటి ఫలితంగా వ్యక్తిగత జీవితం, వ్యవస్థ చిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను తిప్పికొట్టకుండా దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. వీటిని సాధించాలంటే ముందు దేశంలోని వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలని నొక్కి చెప్పారు.
ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై జమిలీ పోరాటాలు నిర్వహించాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు పిలుపునిచ్చారు. కుల వివక్ష అనేది మన దేశంలో ఒక క్రూర జంతువులాంటిదని.. దాన్ని అడ్రస్ చేయకుండా సామాజిన న్యాయాన్ని సాధించలేమన్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలన్నారు.
తెలంగాణలో సామాజిక న్యాయం సాధించేదాకా పోరాటంలో వెనుదిరగబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. ఇందుకోసం ఎన్నాళ్లైనా, ఎన్నేండ్లయినా ఉద్యమిస్తామన్నారు. సామాజిక న్యాయం సాధించేందుకు రాబోయే రోజుల్లో విస్తృత ఐక్య కార్యాచరణ అవసరమన్న తమ్మినేని.. ఈ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న ప్రజాయుద్దనౌక గద్దర్.. సామాజిక న్యాయమనేది ఒక రాజకీయ సమస్యని అన్నారు. పాదయాత్ర ద్వారా సీపీఎం మాస్‌లైన్‌కు దారి వేసిందన్నారు. దానికి మరో ముందడుగే టీమాస్ ఫోరం ఏర్పాటన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. వెంకట్ అధ్యక్షత వహించారు. పాదయాత్రలో పాల్గొన్న బృంద సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య లడాయి తారస్థాయికి చేరింది. గత పాలకులు ఏమీ చేయలేదని అధికార పక్షం విమర్శిస్తుంటే... జరిగిన అభివృద్ది అంతా తమ వల్లేనని ప్రధాన ప్రతిపక్షం వాదిస్తోంది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్ట్ విషయంలో హీట్ మరింతగా రాజుకుంది. ఈ అంశంపై ఇరు పార్టీల నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తెలంగాణలో అధికార టిఆర్ఎస్ .. ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్య సాగునీటి ప్రాజెక్ట్‌ల లొల్లి నడుస్తోంది. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. ఇరు పక్షాల మధ్య పొలిటికల్ హీట్ రాజేస్తొంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి కాంగ్రెస్సే కారణమంటూ సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ దాడి చేస్తోంది. అధికార పార్టీ ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు హస్తం నేతలు.
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలన్నీ గాలిమాటలేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తమ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటికింద సాగవుతోన్న విస్తీర్ణం ఎంత అనే వివరాలను ప్రజలకి ప్రచారం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ లో సాగు విస్తీర్ణం ముప్పై లక్షల ఎకరాలు ఉందని.. నాటి కాంగ్రెస్ సర్కారు చేపట్టిన జలయజ్ఞంలో ప్రాజెక్ట్ ల కింద మరో యాబై లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోనికి వచ్చిందంటున్నారు.. గులాబీ సర్కారు చెబుతున్నట్లుగా కొత్తగా కోటి ఎకరాల విస్తీర్ణం ఎక్కడ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని సవాల్ విసురుతున్నారు హస్తం నేతలు.
రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌ల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినా కేసీఆర్, హరీశ్‌రావు లు కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తుండటం హస్తం నేతలకు మింగుడు పడటం లేదు. తాజాగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం థర్డ్ ఫేస్ ప్రారంభం సందర్బంగా మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. హరీశ్ వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ది గోబెల్స్ ప్రచారమంటూ జైపాల్‌రెడ్డి లాంటి సీనియర్లు కూడా విరుచుకుపడుతున్నారు. అసలు కల్వకుర్తి ప్రాజెక్ట్ పురుడు పోసుకున్నది అంజయ్య హయాంలోనేనని వివరిస్తున్నారు.
కల్వకుర్తి పై ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలని కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ హయాంలోనే దాదాపు తొంబైశాతం పనులు ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయన్నారు.. మిగిలిన పనులకు సరైన నిధులు కేటాయించని కేసీఆర్ సర్కారు తమపై అసత్య ఆరోపణలు చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కల్వకుర్తి ఆయకట్టు తగ్గించలేదని చెప్పిన సర్కారు పెద్దలు జీవో.764 ను ఎందుకు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. మొత్తానికి ప్రాజెక్టుల కోసం సాగుతోన్న క్రెడిట్ లొల్లి కాంగ్రెస్-టీఆర్ఎస్ల మధ్య రాజకీయ వేడిని రాజేస్తోంది.
విశాఖ : సాగర నగరం విశాఖను పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐటీలో ప్రపచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని విశాఖ పర్యటనలో చంద్రబాబు చెప్పారు.
విశాఖలో పర్యటించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ నగరంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన బాబు, మరికొన్ని పథకాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా విశాఖ విమానాశ్రయంలో వీవీఐపీ లాంజ్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్ఏడీ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో రెండంస్తుల్లో చేపడుతున్న ఫ్లైఓవర్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం 113 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు.అనంతరం బీచ్ రోడ్డులో యుద్ధ విమాన మ్యూజియం నిర్మాణానికి శంకుస్థానప చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని నిర్ణయించారు. యువతకు ఉద్యోగు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా విశాఖను పర్యటాక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆతర్వాత బాలబాలికలతో కలిసి ఆనంద దీపావళి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
విశాఖ పర్యటన ముగించుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. హస్తినలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కాంట్రాక్టు సంస్థలతో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గడ్కరీతో చంద్రబాబు గంటకుపైగా చర్చించారు. ఈనెల 24,25 తేదీల్లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై పోలవరం నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తాని గడ్కరీ హామీ ఇచ్చారు. నిధుల కొరత రాకుండా చూస్తానని గడ్కరీ వివరించారు. గడ్కరీతో భేటీ తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 వరకు అమెరికా, యూఏఈ, బ్రిటన్‌లో పర్యటిస్తారు. ముందుగా అమెరికా వెళ్లిన చంద్రబాబు... ఏపీలో విత్తన క్షేత్రాల అభివృద్ధిపై అయోవా స్టేట్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. యూఏఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆదేశ పాలకులతో చంద్రబాబు చర్చిస్తారు. ఈనెల 24, 25 తేదీల్లో బ్రిటన్‌లో పర్యటించే చంద్రబాబు... అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చర్చిస్తారు. ఈనెల 26న అమరావతికి తిరిగి వస్తారు.
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించింది. 26న బీఏసీ సమావేశం నిర్వహించి... ఎన్ని రోజుల సభ నిర్వహించాలనే విషయంపై చర్చించనున్నారు. నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం కోరనుంది.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వ్యూహ కమిటీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రగతి భవన్లో మంగళవారం వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ మేరకు 27వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించారు.15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేయాలని అధికార పక్షం నుంచి కోరాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రతి పక్షం ఏ ప్రశ్నలు వేసినా.. ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చ జరగాలని, శాసన సభ ఎన్ని రోజులు జరిగితే... శాసన మండలి కూడా అన్ని రోజులు జరపాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రపంచ తెలుగు మహాసభలపై చర్చ
అదే విధంగా మాతృభాష పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై, హైదరాబాద్‌లో జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలపై కూడా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ పంపిన తీర్మానాలపై కేంద్రం నుంచి స్పందన రాలేదని.. ఆ అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మళ్లీ తీర్మానాలను పంపి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి..కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అనుచరులతో కలసి పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్ కాంగ్రెస్ వైపు ఎందుకు అకర్షితులయ్యారు..? రేవంత్ తో పాటు పార్టీ వీడనున్న నేతలెవరు..? రాజకీయాల్లో ఈ విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి.
కాంగ్రెస్ గూటికి రేవంత్ ?
ఏపీలో ప్రతిపక్షాల నుంచి వలసలు సాగుతున్న వేళ..తెలంగాణలో టీడీపీకి వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
వచ్చే నెల 9న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం
రెండురోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్... కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీకి కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు సమాచారం. ఈనెల 9న హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ టీడీపీకి చెందిన మరికొందరు కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం ఊపందుకుంది.
పార్టీ మారేందుకు మొదట విముఖత
రేవంత్ రెడ్డి టీడీపీని వీడే అవకాశం ఉందన్న అంశంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే చెప్పుకొవాలి. పార్టీ అధినేత చంద్రబాబు ఆజ్ణానుసారం ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కోసం కష్టపడుతూనే వచ్చారు. పార్టీని తన భుజాలపై వేసుకొని..కష్టకాలంలో కూడా ఉనికిని చాటారు. సీనియర్లు సహకారం లేకపోయినా... తనకంటూ ఓ యువ వర్గాన్ని తయారు చేసుకొని ముందుకు సాగిపోయారు. మై హోం భూముల వ్యవహారం, రైతు ఆత్మహత్యలు..నకిలీ విత్తనాలకు వ్యతిరేకంగా యాత్రలు, సాగునీటి ప్రాజెక్టుల బలవంతపు భూ సేకరణ విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పొరాటం చేశారు.
చంద్రబాబు చర్యల పట్ల అసంతృప్తి
తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడేందుకు ఇంతకష్టపడుతున్నా... తెలుగుదేశం అధినాయకత్వం తీసుకుంటున్న చర్యల పట్ల రేవంత్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పట్టు నిలుపుకొవాలంటే..ప్రతిపక్షాలను కలుపుకుపోవాలని రేవంత్ బావిస్తున్నారు. అందుకు అనుగుణంగా 2019 ఎన్నికల్లో పొత్తులపై రేవంత్ స్పష్టత కోరారు. కాగా తెలుగుదేశం అదిష్టానం పొత్తులపై స్పష్టత ఇవ్వకపోవడంతో..రేవంత్ తీవ్ర నిరాశకు గురైనట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పొత్తులపై స్పష్టతతో పాటు..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పై టీడీపీ చేస్తోన్న పొరాటంలో భాగస్వామ్యం కావాలనీ రేవంత్... తమ పార్టీ అధినేతను కోరినట్టు సమాచారం. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించాలని అధినేతను కోరగా.... దీనిపై చంద్రబాబు స్పందించకపోవడం తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కలవరం మరింతగా పెరిగింది. పైగా ఎంతకష్టించినా ప్రస్తుత పరిస్తితుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపుమేరలో కనిపించడంలేదని రేవంత్ భావిస్తున్నారు. టీడీపీలోని సీనియర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారితే మంచిదనే అభిప్రాయానికి రేవంత్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ ఉందని రేవంత్ నమ్ముతున్నారు. స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత వచ్చి, ఇబ్బందులు ఎదురైనా..కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక అధిష్టానం సహకారంతో ఏదోరకంగా ఇమిడిపొవచ్చని రేవంత్ భావిస్తున్నారు.
వ్యతిరేకించిన పార్టీతో పొత్తా ?
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుంటుందనీ చంద్రబాబు సంకేతాలివ్వడం కూడా రేవంత్‌కు ఇబ్బంది కలిగించింది. ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేశామో అదే నాయకత్వంతో పొత్తేంటనీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితితుల్లో పార్టీ మారితేనే మంచిదని, తనతో పాటు తన వారందరికీ సముచిత న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమేరకు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్టు తెలుస్తోంది. తనతో పాటు పార్టీలోకి వచ్చే తన అనుచరులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి ప్రధాన డిమాండ్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం సైతం సానుకూలంగానే స్పందించిందని రేవంత్ అనుచరుల్లో ప్రచారం జరగుతోంది.
రేవంత్ తోపాటు పలువురు నేతులు జంప్
ప్రస్తుతం రేవంత్ తో పాటు తెలంగాణ టీడీపీలోని కీలక నేతలంతా పార్టీ మారనున్నట్టు సమాచారం. సీనియర్లైన.. వేం నరేదర్ రెడ్డి. సీతక్క, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, విజయరమణారావు, మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, భూపాల్‌రెడ్డి, అలాగే సూర్యాపేట జిల్లాకు చెందిన పటేల్ రమేశ్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, సందీప్ రెడ్డి... తదితరులు రేవంత్ తో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారం. వీరితో పాటు కొన్ని మినహా..మిగిలిన అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.. హైదరాబాద్‌లో ఉన్న మాజీ కార్పొరేటర్లలో సింహభాగం కూడా టీడీపీని వీడే అవాకాశం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు.నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలతో మాట్లాడుతూ పరిస్థితులు వాకబుచేస్తున్నట్లు సమాచారం.