Activities calendar

19 October 2017

21:35 - October 19, 2017

అప్ఘానిస్తాన్ : ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ మారణహోమం సృష్టించారు. కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడికి దిగారు. రెండు కారు బాంబులను పేల్చిన ఆత్మాహుతి దాడిలో 43 మంది సైనికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. తాలిబన్లను వ్యతిరేకిస్తూ ఆఫ్గాన్‌ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు పేర్కొంది. గత వారం రోజుల్లో ఇది మూడో పేలుడు ఘటన.

21:34 - October 19, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కూతురు మర్యామ్, అల్లుడు మహమ్మద్‌ సఫ్దర్‌లపై పాకిస్తాన్ అవినీతి వ్యతిరేక కోర్టు నేర అభియోగాలు నమోదు చేసింది. నేషనల్ ఎకౌంటబులిటీ బ్యూరో చేసిన అవినీతి ఆరోపణల మేరకు.. వీరిపై అభియోగాలు దాఖలు చేసింది. నవాజ్‌ షరీఫ్, అతని కుటుంబ సభ్యులు, ఆర్థిక మంత్రి ఈశాక్‌ డార్‌లకు వ్యతిరేకంగా మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఎన్ఏబి తనపై విడివిడిగా అవినీతి కేసులు నమోదు చేయడంపై నవాజ్‌ షరీఫ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పనామా పత్రాల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌ జూలై 28న ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. 

21:33 - October 19, 2017

శ్రీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది దీపావళి పండగను సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న గురెజ్ ప్రాంతానికి మోది వెళ్లారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇతర సీనియర్‌ ఆర్మీ అధికారులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఆర్మీ, బిఎస్‌ఎఫ్‌ జవానులతో కలిసి దీపావళిని జరుపుకోవడం ఆనందంగా ఉందని మోది పేర్కొన్నారు. జవాన్లతో సమయాన్ని గడపడం వల్ల తనకు ఎంతో ఎనర్జీ వస్తుందని మోదీ చెప్పారు. జవాన్లు ప్రతి రోజు యోగ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు. దేశాన్ని కాపాడడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని మోది కొనియాడారు.

21:28 - October 19, 2017

ఢిల్లీ : ఇప్పటి వరకు మనకు తెలిసిన దీపావళి అంటే దీపాలు.. టపాకాయల హోరు. 1,000 వాలా,10,000 వాలా లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, తారాజువ్వలు..ఈ సంస్కృతి దేశరాజధానిలో తొలిసారిగా మారింది.కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో.. నవంబర్ 1 వరకు టపాసుల అమ్మకాలు, కొనుగోళ్ళను నిషేధించారు. దీంతో ఢిల్లీ వాసులు కాలుష్య రహిత దీపావళి జరుపుకుంటున్నారు. వ్యాపారులు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారు. వింత వింత విద్యుత్ దీపాలు, గిఫ్ట్ ప్యాక్‌లు, మిఠాయిలు, అలంకరణ వస్తువులతో.. దీపావళి సందడిని మార్చేశారు. టపాకాయలు లేకపోవడం జీఎస్టీ భారంతో వ్యాపారం తగ్గినా కాలుష్యాన్ని తగ్గించడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వ్యాపారులు స్వాగతిస్తున్నారు. అయితే ఒకేసారి టపాకాయలపై నిషేధం విధించకుండా కొంచెం వెసులుబాటు ఇచ్చి ఉంటే బాగుండేదని ఢిల్లీవాసులంటున్నారు.

కాలుష్యంలో దేశంలో టాప్ ఢిల్లీ
ప్రపంచంలో‌ని కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి పది నగరాల్లో ఉంది. మన దేశంలో టాప్ వన్‌గా ఉంది. గాలిలో దుమ్ము కణాల నిష్పత్తి అధికమవడం నైట్రిక్ ఆక్సైడ్, వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, టపాకాయల వల్ల సల్పర్ డయాక్సైడ్, వ్యర్ధాలు, పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం ఢిల్లీని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శీతాకాలం మంచు వల్ల దుమ్ముకణాలు గాలిలో కలవకపోవడంతో.. ఢిల్లీ వాసులు శ్వాస కోస వ్యాధులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలం రాకముందే ఆనంద్ విహార్, పంజాబి భాగ్, ఆర్కే పురం, సెంట్రల్ ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం విపరీతంగా పెరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు టపాకాయలు, డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించింది. ఢిల్లీ బదర్ పూర్ విద్యుత్ ప్లాంట్ సైతం మూతపడింది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న వందలాది ఇటుకల బట్టీల పనులు నిలిచిపోయాయి. జాతీయ హరిత ధర్మాసనం 5 రాష్ట్రాలలో పర్యావరణ అత్యవసర పరిస్థితి విధించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో కాలుష్యం పై అప్రమత్తంగా ఉండాలని కాలుష్య నియంత్రణ మండళ్ళను ఆదేశించింది. అక్రమంగా అమ్ముతున్న 1200 కిలోల టపాకాయలను పోలీసులు సీజ్ చేశారు. 30 మందికి పైగా టపాకాయల అమ్మకం దారులను అరెస్టు చేశారు.

నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
మరోపక్క ఢిల్లీలో టపాకాయల నిషేధం పై సామాజిక మాధ్యమాల్లో హిందూవాదులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. హిందూ సంస్కృతిపై ఈ తరహా నిషేధాలు తగవని ఇది వివక్షాపూరిత చర్య అంటున్నారు. సుప్రీంకోర్టు చర్యను కొందరు తప్పుబడుతుంటే చిన్నారులు, పర్యావరణ పరిరక్షకులు వాస్తవాలు తెలిసిన ప్రజానీకం మాత్రం పర్యావరణ హితంగా దీపావళి జరుపుకుంటున్నారు. పండగంటే ఆనందం.. ఆ ఆనందం అందరికీ పంచేలా కాలుష్య రహితంగా పండగ జరుపుకుంటారని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ వాసులు సుప్రీం ఆదేశాలు పాటిస్తూ.. పర్యావరణ ప్రియులుగా మారి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

21:27 - October 19, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని అకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో దీపావళి వెలుగులు ప్రసాదించాలన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన దీపావళి సంబరాల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి వీకే సింగ్, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, పలువురు ఉన్నాతాధికారులు ప్రజలు గవర్నర్ ను కలిసి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

21:26 - October 19, 2017

హైదరాబాద్ : టీ-టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌తార‌న్న వార్త ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వార్తల‌పై హ‌స్తం పార్టీలో రొటీన్‌కు భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎవరికివారే య‌మునాతీరే అనేలా ఉండే నేత‌లు .. రేవంత్ విష‌యంలో అందుకు భిన్నమైన వైఖ‌రిని క‌న‌బ‌రుస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ గూటికి చేర‌తార‌న్న వార్తల‌పై నేత‌లు పోటీప‌డి మ‌రి త‌మ వెల్‌కం చెబుతున్నారు. పార్టీలో మెజారిటీ నేత‌లు రేవంత్ రెడ్డి రాక‌ను స్వాగ‌తిస్తున్నారు. సీనియ‌ర్ నేత‌లు కూడా రేవంత్ రెడ్డిని అక్కున చేర్చుకునేందుకు త‌హత‌హా లాడుతున్నట్టే వ్యవహరిస్తున్నారు. రేవంత్ చేరిక పార్టీకి ముమ్మాటికీ లాభ‌మే త‌ప్పా న‌ష్టం లేద‌ని కుండ‌బ‌ద్దలు కొడుతున్నారు. టీఆర్‌ఎస్‌ను గ‌ద్దె దించేందుకు రేవంత్ లాంటి కేసీఆర్ వ్యతిరేక శ‌క్తులు కాంగ్రెస్ లోకి రావ‌డం అత్యవసరం అంటున్నారు.

రేవంత్ రాక‌ను ఓపెన్ గా స్వాగ‌తిస్తున్నారు...
మ‌రోవైపు రేవంత్ సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో చిన్నారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లు సైతం రేవంత్ రాక‌ను ఓపెన్ గా స్వాగ‌తిస్తున్నారు. డికే అరుణ మిన‌హా మిగిలిన‌కాంగ్రెస్ ఎమ్మెల్యే .. ఎమ్మెల్సీలు రేవంత్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు స‌న్నద్దమై ఉన్నారు. రేవంత్ రాక‌పై కొంద‌రు అబ‌ద్రత‌తో ఉన్నార‌ని అలాంటి వారే వ్యతిరేకిస్తున్నార‌ని చిన్నారెడ్డి ప‌రోక్షంగా డికేఅరుణ‌పై విమ‌ర్శలు చేస్తున్నారు.ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాద్యత‌లు చేప‌ట్టడం.. రేవంత్ రెడ్డి పార్టీలోకి రావ‌డం జరిగితే ఆ త‌రువాత రాష్ట్ర కాంగ్రెస్‌లో స్వల్పమార్పులు జ‌రిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పిసిసి చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొన‌సాగిస్తునే .. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న భ‌ట్టి విక్రమార్క కు తోడుగా మ‌రో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన పొన్నం ప్రభాక‌ర్ ను నియ‌మించే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే... పార్టీ ప్రచార‌ క‌మిటీ చైర్మెన్ బాధ్యత‌లు అప్పగించే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. అయితే రేవంత్ రాక వార్తల‌పై మీడియా అడిగిన ప్రశ్నల‌కు పిసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి మాత్రం స‌మాధానాన్ని దాట‌వేస్తున్నారు.మొత్తానికి భిన్నాభిప్రాయాలు మెజారిటీగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి విష‌యంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తాజా ప‌రిణామాలు రాబోయే 2019 ఎన్నిక‌ల్లో తమకు లాభిస్తుందని హస్తంపార్టీ నేత‌లు విశ్లేషించుకుంటున్నారు.

21:23 - October 19, 2017

వాషింగ్టన్ : ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండోరోజు పయనీర్‌ కంపెనీని సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన, వ్యవసాయ, సంతస్థలకు చెందిన సీఈవోలు, శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విత్తన, వ్యవసాయ కంపెనీలను కోరారు. రాష్ట్రంలో సీడ్‌పార్క్‌ను ఏర్పాటు చేసి భారత్‌ తో పాటు ప్రపంచ విత్తన అవసరాలు తీర్చే విధంగా సీడ్‌ ఇండస్ట్రీని డెవలప్‌ చేస్తామన్నారు. హబ్‌ అండ్‌ స్పోక్స్‌ విధానంలో సీడ్‌పార్క్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కల్పించే సౌకర్యాలు, రాయితీలను ఆయన వివరించారు. 

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు అస్వస్థత

హైదరాబాద్ : రాంజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అస్వస్థకు గురైయ్యారు. శంషాబాద్ లో హోటల్ ప్రారంభోత్సవంలో ప్రకాష్ గౌడ్ ఒక్కసారిగా కుప్పకూలరు. దీంతో ఆయన్ను వెంటనే శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరు నిమ్స్ కు తరలించారు.

విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రి కక్కుర్తి

విశాఖ : ప్రైవేట్‌ ఆస్పత్రి డబ్బుకక్కుర్తి.. యువకుడి ప్రాణామీదకు తెచ్చింది. ఆపరేషన్‌ థీయేటర్‌లోకి రోగిని తీసుకెళ్లిన డాక్టర్లు పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే ఆపరేషన్‌ చేస్తామంటూ పేచీ పెట్టారు. దీంతో యువకుడి బంధువులు లబోదిబోమంటున్నారు. అస్వస్థతతో స్థానికంగా ఉన్న ప్రథమ ఆస్పత్రిలో చేరిన యువకుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడున్నర లక్షలు మంజూరైయ్యాయి. పైగా ఇప్పటికే లక్షరూపాయల నగదును రోగి బంధువులు ఆస్పత్రికి చెల్లించారు. అయినా .. పూర్తి నగదును చెల్లిస్తేనే ఆపరేషన్‌ చేస్తామంటూ పేచీ పెట్టడంతో రోగి బంధువులు స్థానిక ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు.

20:12 - October 19, 2017

కోటికోట్ల దీప కాంతుల సందడి.. చీకటిని వెళ్లగొట్టి వెలుతురును పూయించే సందర్భం. కొత్త బట్టలు, పిండివంటలు, ఇంకా దీపాల వరుస.. ఇదేనా దీపావళి.. ?ఎన్నో ఏళ్లుగా చూస్తున్న పండుగ.. దీని గురించి కొత్తగా చెప్పుకునేది... మాట్లాడుకునేది ఏం ఉంటుంది అనుకుంటున్నారా? కాలంగడిచే కొద్దీ కొత్త నిర్వచనాలు పుడతాయి. వేడుకలకు కొత్త అర్థాలు మొదలవుతాయి. అనర్థాలూ జతకూడుతాయి.. వెలుగునిచ్చే బదులు మరింత చీకటిని, మరింత సమస్యలను నింపుతున్న దీపావళి చుట్టూ అల్లుకున్న అంశాలేంటి? ఈ రోజు వైడాంగిల్ లో ఆ వివరాలు చూద్దాం.. చీకటినుంచి వెలుగు లోకి పయనం … కోటి కాంతుల వెలుగే దీపావళి.ప్రపంచాన్ని వెలిగించే ప్రయత్నం మంచిదే. కానీ, ఆ క్రమంలో మరింత చీకటిని నింపుకుంటున్నామా? పర్యావరణాన్ని అనారోగ్యకరంగా మార్చుకుంటున్నామా?కాదంటారా? వెలుగు నింపాల్సిన చోట కాలుష్యం పంచుతున్నామా? శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో వేడుక స్ఫూర్తిని దెబ్బస్తున్నామా? వెలుగురేఖల వేడుకలో ఈ అపశృతులు ఆపలేమా?దీపావళి పండుగ అసలు ఉద్ధేశ్యం ఏంటి? మనం ఎలా మారుస్తున్నాం? అదంతా సౌండ్ పొల్యూషన్ దానికి సంబంధించిన వివరాలు. మరి, క్రాకర్స్ కాలిస్తే వచ్చే పొగ వాతావరణానికి మంచిదా? దానివల్ల దోమలు చస్తాయా? వాతావరణం బాగుపడుతుందా? వచ్చే చలికాలంలో ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుందా?

దీపావళి అంటే దీపాల పండుగ కదా.. మరి దీంట్లోకి బాణాసంచా ఎక్కడి నుంచి వచ్చింది? తీర్చిన దీపాల వరుస ఆహ్లాదాన్నిస్తుంది. అంతకు మించి చీకటిని ప్రారద్రోలుతూ ప్రమిదలు వెలుగును నింపుతాయి. కానీ, పోటీపడి కాల్చే బాణాసంచా గాలిని, వాతావరణాన్ని పాడు చేస్తోంది. కాదంటారా? దీపావళి పండుగ ఎందుకు జరుపుకొంటారు? మనదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ వేడుకను ఎలా జరుపుకుంటున్నారు? ఇతర దేశాల్లో ఇలాంటి పండుగలున్నాయా? వెలుగుకా లేక శబ్దానికా దేనికి ప్రాధాన్యం? అటు బాణాసంచాతయారీలోనే కాదు.. అమ్మకంలోనూ జాగ్రత్తలు లోపిస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కాసేపు హడావుడి చేయటం తప్ప సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు తక్కువే. దీంతో ప్రతిఏటా ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి.

దీపావళి అంటే దీపాల వరుస... ఈ మాట ఇప్పటికే చెప్పుకున్నాం. వేడుక ఏదయినా అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాంటపుడు ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకోలేమా? వాతావరణానికి హాని కలిగించని హరిత దివాళీ ఎందుకు సాధ్యం కాదు?ప్రతి ఇల్లూ వెలుగుతో నిండాలి... ప్రతి జీవితం వెలుగుతో ప్రకాశించాలి. ఈ ప్రపంచమంతా వేయిరేకుల వెలుగు పూలతో పరిమళించాలి. బడుగుల బతుకుల్లో వెలుగు నిండాలి. నిరుపేదల కళ్లలో మతాబులు పూయాలి. ముప్పూటలా తినటానికి నోచుకోని బతుకుల్లో వెన్నెల వెలుగులు పరుచుకోవాలి.. అదే నిజమైన దీపావళి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:11 - October 19, 2017

తెలంగాణల మళ్ల అధ్యక్షా..? మాకు గూడ అవకాశం ఇయ్యాలే అధ్యాక్షా.. విపక్షాల గొంతునొక్కుతున్నరు అధ్యక్షా.. అన్న మాటలు మళ్ల ఇనవోతున్నం మనం..అదే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుర్వు జేస్తరట ఈనెలలనే.. ఈనెల ఇర్వై ఏడుసంది.. ఇగ మన అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటయో .. ఎట్ల ఉండబోతున్నయో గీ ముచ్చటతోని చెప్త ఇనుండ్రి..

దీపావళి ఎల్లిందంటే ఇగ హైద్రావాదుల ఆడాడ సదరు పండుగ సుర్వైతది.. దున్నపోతును కాళ్ల మీద నిలవెట్టుడు.. ఆ దున్నపోతు మీదికి ఎక్కి హకీ కట్టెలు వట్టుకోని డ్యాన్సులు జేసుడు.. ఓ అదో పెద్ద పండుగనే అయ్యింది రాను రాను.. ఈసారి గూడ సర్కారు ఏలువెట్టింది అండ్ల సర్కారు తర్పున జేయవోతున్నదట.. సరే అదెట్లున్నాగని.. ఆ దున్నపోతులు సల్లగుండ..? కోట్ల రూపాల విలువైన దున్నలను తెచ్చి ఆడిస్తరు..

డబుల్ బెడ్రూం ఇండ్లియ్యిమంటె ఇయ్యరు.. మూడెక్రాల భూమి జూపెట్టుండ్రి అంటె సూపెట్టరు.. ఇస్తమన్నయ్ ఇయ్యరు.. వద్దన్నయ్ ఏర్పాటు జేయరు.. తెలంగాణల వాడవాడకు వైన్సు దుక్నాలు వెట్టాలని ఏ మహిళా సంఘాలోళ్లు ఆందోళన జేశిండ్రని పెడ్తున్నరు ముఖ్యమంత్రిగారూ..? చెర్లున్నోళ్లను బాయిలేశినట్టు.. రోడ్ల మీదున్న వైన్సులు ఇండ్ల నడ్మిట్లకు తెస్తివి..? ఇగో ఆడోళ్లు దీపావళే వైన్సుల ముంగట జేస్కునె కాలం దెస్తివి..?

ఊరంత ఒకదిక్కుంటే.. ఊసుగండ్లోడు ఇంకో దిక్కున్నట్టు.. ఇప్పటికే తెల్గు భూమ్మీద కన్నమ్మ బాధలు వడ్తున్నరు ఆడోళ్లకు.. ఇగ ఆ ఆడోళ్ల నడ్మకు ఈ దొంగపాస్టర్ గాళ్లు జొర్రి వాళ్లో ఏగిలం మోపు జేశిండ్రు... ఏసు క్రీస్తును సూపెడ్తదా నీకు అని..? అందమైన ఆడోళ్లను ఇంటికి తోల్కపోయిండట ఒక పాస్టర్ గాడు.. వాని చెరల జిక్కినోళ్లు తక్వ ఏడుస్తలేరు..

కాకులు పగవట్టంగ జూశ్నంగని.. ఈ పాములు పగవట్టుడేందో నాకు గూడ అర్థమైతలేదు.. ఒక పోరన్ని మూడు మాట్ల గర్శిందట నాగుంబాము.. మూడు మాట్ల వైద్యం జేపిచ్చుకోని బత్కిబట్టగట్టిండు.. నాల్గో పారి గూడ రానే వచ్చిందట మళ్ల కర్శెతందుకు.. అమ్మా నువ్వు మళ్లొచ్చినా అని ఆయింత కట్టెదీస్కోని సంపేశిండట.. నిజంగ పాములు పగవడ్తయా..? ఏడైంది ఈ ముచ్చట అనేది సూడుండ్రిగ..

ఈ తెల్గు భూమ్మీద గానీ.. ప్రపంచంల ఏడనన్నగానీ.. ఎవ్వనికన్న మంత్రాలోస్తె నేను ఈడనే గూసుంట నా మీద మంత్రం జేయమనుండ్రి సూద్దాం.. అరే మంత్రాలు లేవు లొట్టపీసు లేవు.. అదంత ఉత్తకథనేరా నాయనా..? ఇవ్వి మూడనమ్మకాలు అని ఎన్నిమాట్ల జెప్పినా ఇనరాయే పబ్లీకు.. మంత్రాలు మంత్రాలని అవ్విటి ఎంటవడి పాణాలు తీస్కుంటరు..

19:49 - October 19, 2017

ప్రకాశం : జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉలిచి, చవటవారిపాలెం తదితర గ్రామాల సమీపంలో బీడుభూముల్లోకి గొర్రెలను తోలుకెళ్లారు కాపరులు. కావలసినంత పచ్చిక అక్కడ ఉండటంతో గొర్రెలను అటు వైపు తీసుకెళ్లారు. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. నిమిషాల వ్యవధిలో మూగజీవాల గమనం మందగించింది. గొర్రెలు కిందపడి కొట్టుకుంటూ చనిపోతుండటంతో కాపర్లకు అర్థం కాలేదు. తమ జీవనాధారమైన గొర్రెలు పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు.

400గొర్రెలు మృత్యువాత
12మంది కాపరులకు చెందిన మొత్తం రెండు వేలకు పైగా గొర్రెల్ని మేత కోసం తోలుకుపోయారు. వీటిలో ఇప్పటికే దాదాపు 400గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరువందల గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అస్వస్థతకు గురైన గొర్రెలను ఎనిమిది లారీల్లో అప్పటికప్పుడే వైద్యం కోసం చీరాల మండలం గవినివారిపాలెం తరలించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా మూగజీవాల మరణాలు మాత్రం ఆగడంలేదు. విషపూరితమైన ఈ ఆకు ప్రభావంతో జననావయవాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంటుందని వైద్యులు చెప్పారు. విషపూరిత వయ్యారిభామ మొక్కలను తినకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.అయితే అవగాహన లేకపోవడంతో కాపరులు గొర్రెలకు భీమా చేయించుకోలేదు. దీంతో ఇప్పుడు పరిహారం వచ్చేది కష్టమేనని అధికారులు అంటున్నారు. తమను ఏవిధంగానైనా ఆదుకోవాలని రైతులు వేడుకుంటుకున్నారు.

19:48 - October 19, 2017

కర్నూలు : పట్టణంలో దీపావళిశోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. టపాకాయలు కొనేందుకు చిన్నారులు, పెద్దలు బారులు తీరారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

19:46 - October 19, 2017

విశాఖ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని.. స్థానికులు కొందరు... డిప్యూటీ సీఎం చినరాజప్పకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి మైనింగ్ శాఖ, పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి... పలు వాహనాలను సీజ్ చేశారు. 

19:45 - October 19, 2017

ప్రకాశం : జిల్లా కలెక్టరేట్ ముందు ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంగోలు నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఆదాము అతని భార్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇద్దరిని విధుల నుంచి తొలగించడంతో... కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఇవాళ కలెక్టరేట్ వద్దకు వచ్చి కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో అదామును పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించడంతో... ప్రాణాపాయం తప్పింది.

19:43 - October 19, 2017

విశాఖ : ప్రైవేట్‌ ఆస్పత్రి డబ్బుకక్కుర్తి.. యువకుడి ప్రాణామీదకు తెచ్చింది. ఆపరేషన్‌ థీయేటర్‌లోకి రోగిని తీసుకెళ్లిన డాక్టర్లు పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే ఆపరేషన్‌ చేస్తామంటూ పేచీ పెట్టారు. దీంతో యువకుడి బంధువులు లబోదిబోమంటున్నారు. అస్వస్థతతో స్థానికంగా ఉన్న ప్రథమ ఆస్పత్రిలో చేరిన యువకుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడున్నర లక్షలు మంజూరైయ్యాయి. పైగా ఇప్పటికే లక్షరూపాయల నగదును రోగి బంధువులు ఆస్పత్రికి చెల్లించారు. అయినా .. పూర్తి నగదును చెల్లిస్తేనే ఆపరేషన్‌ చేస్తామంటూ పేచీ పెట్టడంతో రోగి బంధువులు స్థానిక ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పీలా గోవింద్‌.. విషయం కలెక్టర్‌కు చేరవేశారు. తమ కుమారుణ్ని కాపాడాలని.. డబ్బు తర్వాత చెల్లిస్తామని కాళ్లా వేళ్లా పడినా ఆస్పత్రి యాజమాన్యం కనికరించడంలేదని రోగి బంధువులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. 

19:18 - October 19, 2017
18:04 - October 19, 2017

హైదరాబాద్ : ఎన్నికలు ఏవైనా ఓట‌ర్ల జాబితా రూపొందించడమంటే అధికారులకు కత్తిమీద సామే. ఏటా మార్పులు చేర్పుల ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఓట్లు గల్లంతయితే వివాదస్పదమవుతోంది. విపక్షాలు విరుచుకుపడతాయి. దీంతో ఓటర్ల జాబితా తయారుచేయడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. దీంతో ఈ సమస్యలకు ఆధునిక సాంకేతికతో చెక్‌పెట్టేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్లకు చేయాల్సిన స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా తొలిసారి గ్రేట‌ర్ ప‌రిదిలో ఆన్‌లైన్‌లో రూపొందిస్తున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన వారికి ఓటు హక్కు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నారు. హైద‌రాబాద్ మహానగరంలో 41.32 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు. 3879 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓట‌ర్ల సంఖ్య ఆధారంగా ముందుగానే ప్రాంతాలను విభజించారు.

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశం
ప్రతి బిఎల్‌ఒకు ప్రత్యేక ట్యాబ్‌ను స‌మ‌కుర్చారు. ఇప్పటి వర‌కు హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలో 40 లక్షల 17 వేల 951 ఓట‌ర్లు ఎన్యూమ‌రేట్ చేశారు. వీటిలో కొత్తగా 20 లక్షల 4 వేల 90 మంది ఓటర్లు నమోదు కాగా.. చిరునామా మారిన వారు 14 లక్షల 95 వేల 808 మంది ఉన్నారు. అదే అడ్రస్‌లో ఉన్న వారు 17 వేల 64 వేల 77 మంది ఓట‌ర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌కవ‌ర్గంలో అత్యధికంగా 81 వేలు..,గోషామ‌హ‌ల్‌లో 79వేలు..., ఖైర‌తాబాద్‌లో 58వేలు, కంటొన్మెంట్‌లో 55వేలు, అంబ‌ర్ పేట్‌లో 54వేలు, స‌న‌త్ న‌గ‌ర్‌లో 51వేల ఓట్లును తొలగించనున్నారు. బల్దియా చర్యలపై పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాల‌యంలో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్న ఎన్నికల జాబితా ప‌నితీరును వివ‌రించారు. త్వరలోనే స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితాను ప్రక‌టిస్తామ‌న్నారు. గ్రేటర్‌లో ఎన్నికల జాబితాను ఆన్‌లైన్‌లో రూపొందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

18:02 - October 19, 2017

హైదరాబాద్ : నగరంలోని స్వీట్‌హౌస్‌ల్లో దీపావళి పండుగ కళ కనిపిస్తోంది. దీపావళి పండుగను మరింత తీపిగా జరుపుకునేందుకు నగర జనం స్వీట్స్‌ కొనుగోలు చేస్తున్నారు. దీపావళి పండుగంటేనే తీపి వంటకాలతో ముడిపడి ఉన్న పండుగ. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని జరుపుకుంటారు. విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు స్వీట్స్‌పంచి వారు తీపి చేస్తారు. దీపావళి రోజున బాణాసంచా కాల్చడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో... తీపి వస్తువులకు అంతే ప్రాధాన్యత ఇస్తారు.

హైదరాబాద్‌ ఓ మినీ భారత్‌
హైదరాబాద్‌ ఓ మినీ భారత్‌ అని అందరూ అంటుంటారు. అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉంటారని దానర్థం. హైదరాబాద్‌లో గుజరాతీలు, మహారాష్ట్రీయులు ఎక్కువగా ఉండడంతో వారు దీపావళి పండుగలో పటాసుల కంటే స్వీట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీపాల వెలుగుల్లో బంధువులు, మిత్రులతో కలిసి ఒక్కొక్కరు స్వీట్స్‌ పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు స్వీట్స్‌ను బహుమతిగా ఇస్తారు. దీంతో దీపావళి పండుగలో స్వీట్స్‌ ప్రాధాన్యత పెరిగింది. కేవలం హైదరాబాద్‌లో ఉండేవారే స్వీట్స్‌ కొనుగోలు చేస్తారంటే పొరపాటే. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉండే వారు కూడా వచ్చి స్వీట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో మిఠాయి దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. అతిథులు, బంధువుల నోళ్లను తీపిచేస్తూ పండుగను జనం సంతోషంగా జరపుకుంటారు. నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌లోని స్వీట్స్‌ హౌస్‌లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అంతేకాదు.. స్వీట్‌హౌస్‌ను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించాయి. దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా స్వీట్స్‌ను తయారు చేయిస్తున్నాయి. వివిధ ఆపర్స్‌తో కొనుగోలు దార్లను ఆకర్షిస్తున్నారు స్వీట్‌హౌస్‌ నిర్వాహకులు. దీపావళి రోజున తీపివంటలతోపాటు స్వీట్స్‌ నోరూరిస్తున్నాయి. సో మీరూ స్వీట్స్‌ తెచ్చుకుని లెట్స్‌ సెలబ్రేట్‌ అండ్‌ ఎంజాయ్‌ ది దివాళి.-

18:01 - October 19, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా రాజ్‌భవన్‌లో పలువురు ప్రముఖులు గవర్నర్‌ను కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నరసింహన్‌ ఆకాంక్షించారు. 

17:59 - October 19, 2017

హైదరాబాద్ : నగరంలో మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం వందకోట్ల విలువైన పనులకు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. భారీవర్షాల నగరంలో దెబ్బతిన్న రోడ్లకు తర్వలో మరమ్మతులు చేస్తామన్నారు. అమీర్‌పేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. 3కోట్ల 28లక్షల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం పనులు చేపట్టనున్నామని మంత్రి మంత్రులు తెలిపారు. దాంతో పాటు అమీర్‌పేట కనకదుర్గ ఆలయం వద్ద రహదారి నిర్మాణం పనులకు కూడా మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. అమీర్‌పేటలో 25 కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

బస్తీ ప్రజల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది
బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద మూడు కోట్లరూపాయలతో చేపట్టిన పార్కింగ్ పనులతో పాటు పటేల్‌ నగర్ శ్మశాన వాటికలో 2 కోట్లతో చేపట్టనున్న పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలపై మంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 55 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా నగర అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు.. టీఆర్‌ఎస్ పాలనను తప్పుపడుతున్నారని విమర్శించారు. మొత్తానికి భారీవర్షాలతో అతలాకుబస్తీ ప్రజల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందబస్తీ ప్రజల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ మరోసారి ప్రజలకు హామీలు గుప్పించారు. మా బాస్‌లు ఢిల్లీలోకాదు గల్లీల్లోనే ఉన్నారని బస్తీజనంలో జోష్‌నింపే ప్రయత్నం చేశారు. 

కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆదాము అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ కూలీగా పని చేసిన ఆదామును ఇటీవలే విధుల నుంచి తొలగించడంతో మనోవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు.

17:45 - October 19, 2017
17:04 - October 19, 2017
16:10 - October 19, 2017

వికారాబాద్ లో దారుణం

వికారాబాద్ : పట్టణంలో దారుణం జరిగింది. పాత ఇనుప సామాన్ల దుకాణంలో దొంగతనం నెపంతో అశోక్ అనే యువకుడిని యజమానులు చితకబాదారు. కాళ్ల మధ్య కర్ర పెట్టి కాళ్లు చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. మీడియా రావడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు.

నెల్లూరులో కీచక ఎస్సై

నెల్లూరు : నిన్న నిజామాబాద్ జిల్లా భోదన్ సీఐ సురేందర్ రెడ్డి కీచక పర్వం మరవక ముందే ఈ రోజు నెల్లూరు జిల్లా మరో ఎస్సై కీచక పర్వం బయటపడింది. ఎస్సై ఎడుకొండలు ఓ మహిళా సర్పంచ్ ను లైగింకంగా వేధిస్తున్నాడు. మహిళతో ఎస్సై అసభ్యంగా మాట్లాడుతుండడంతో పాటు కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరింపులు గురిచేయండంతో ఆ మహిళ పోలీస్ ఉన్నధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం ఊటుకూరులోమ జరిగింది. 

16:08 - October 19, 2017

నెల్లూరు : నిన్న నిజామాబాద్ జిల్లా భోదన్ సీఐ సురేందర్ రెడ్డి కీచక పర్వం మరవక ముందే ఈ రోజు నెల్లూరు జిల్లా మరో ఎస్సై కీచక పర్వం బయటపడింది. ఎస్సై ఎడుకొండలు ఓ మహిళా సర్పంచ్ ను లైగింకంగా వేధిస్తున్నాడు. మహిళతో ఎస్సై అసభ్యంగా మాట్లాడుతుండడంతో పాటు కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరింపులు గురిచేయండంతో ఆ మహిళ పోలీస్ ఉన్నధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం ఊటుకూరులోమ జరిగింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

గోదావరిఖనిలో అగ్నిప్రమాదం

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా గోదావరిఖని మార్కేండేయ కాలనీలోని సాయికృప ఎలక్ట్రానిక్ గోడౌన్ లో మంటలు చేలరేగాయి. మంటలార్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రూ. కోటి విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్ధమైయ్యాయి. గోడౌన్ చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు.

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖ: స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5 సీడబ్ల్యూసీలో అగ్నిప్రమాదం జరిగింది. మందుగుంగు గోదాంలో మంటలు చేలరేగాయి. దీంతో జనం పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

15:24 - October 19, 2017

కుమ్మరి పని చేసేవారి స్థితిగతులు చాలఘోరంగా ఉన్నాయని కుమ్మరి సంఘం నాయకురాలు లక్ష్మి అన్నారు. పూర్వ కాలంలో మట్టి ప్రమిదలు వాడే వారకు కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ రావడంతో వృత్తులు దెబ్బతింటున్నాయని ఐద్వా నాయకురాలు మీనా అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:16 - October 19, 2017
15:15 - October 19, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ ఇవాళ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని.. త్వరలోనే మంచి రోడ్లు వేస్తామన్నారు కేటీఆర్‌. గత కాంగ్రెస్‌ పాలన వల్లే రాష్ట్రంలో ఇబ్బందులున్నాయని... తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు

15:13 - October 19, 2017

హైదరాబాద్ : మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణకు రాజీవ్‌ సద్భావన అవార్డును ప్రదానం చేశారు. చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావనా యాత్ర సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ యాత్రను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి ప్రారంభించారు. దేశానికి ఎంతో సేవ చేసిన మహానేత రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలు బలపరచడానికి 72వ సవరణ తీసుకొచ్చింది ఆయనే అన్నారు.  

14:48 - October 19, 2017

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా గోదావరిఖని మార్కేండేయ కాలనీలోని సాయికృప ఎలక్ట్రానిక్ గోడౌన్ లో మంటలు చేలరేగాయి. మంటలార్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రూ. కోటి విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్ధమైయ్యాయి. గోడౌన్ చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదం..

పెద్దపల్లి : గోదావరి ఖని మార్కెండేయ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయికృప ఎలక్ట్రానిక్స్ గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

కోల్ కతా ఎల్ ఐసీ భవన్ లో అగ్ని ప్రమాదం

కోల్ కతా: నెహ్రూ రోడ్డులోని ఎల్ ఐ సీ భవన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.

12:31 - October 19, 2017
12:29 - October 19, 2017

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 370 కి.మీ, చంద్బలికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 18 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పూరి- చంద్ బలీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాకు భారీ వర్షం సూచన వుందని తెలిపింది.

ఘనంగా రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం

హైదరాబాద్: చార్మిన్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవ వేడుక జరిగింది. పీసీసీ చీఫ్ ఉతమ కుమార్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అజారుద్దీన్ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ కు అందజేశారు.

11:38 - October 19, 2017
11:35 - October 19, 2017

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ ఇవాళ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అమీర్‌పేటలో 50 పడకల ఆస్పత్రి భవనానికి మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలో పర్యటించనున్న కేటీఆర్‌.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

 

11:34 - October 19, 2017

అమరావతి: గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి విధివిధానాల రూపనకల్పనపై మంత్రి నారాలోకేష్‌ సమీక్ష నిర్వహించారు.

వివిధశాఖల సమాచారంతో నివేదిక....

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య తేల్చేందుకు వివిధశాఖల నుంచి సమాచారం తీసుకుని.. సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి సూచించారు. నిరుద్యోగి విద్యార్హత, వయస్సు, ఆర్థిక పరిస్థితి లాంటి అంశాలపై ఇప్పటికే సిద్ధం చేసిన సమాచారంపై మంత్రి చర్చించారు. అయితే పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయడానికి గతంలో పశ్చిమబెంగాల్లో అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అర్హత గల ప్రతి నిరుద్యోగి అధార్‌కార్డ్‌ లాంటి గుర్తింపుకలిగిన అంశాలతో దరఖాస్తు చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించాలని మంత్రి సూచించారు. అయితే నిరుద్యోగ భృతి తీసుకునే వారు ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే నిబంధన కూడా పెట్టనున్నట్టు తెలుస్తోంది. ( దీనిపై సీపీఎం నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తున్నందునే మరోసారి నిరుద్యోగ భృతి అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ) అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపైనే ప్రభుత్వానికి క్లారిటీ లేదని సీపీఎం నేతలు విమర్శించారు.

అన్ని విషయాలు ఆన్‌లైన్లో..!

ఒకవేళ ఎవరికైనా నిరుద్యోగ భృతి రాలేదంటే..దానికి కారణాలు కూడా ఆన్‌లైన్‌ద్వారా తెలుసుకునే వీలు కల్పించాలని మంత్రి అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల హామీని నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేయడం.. నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది.

11:23 - October 19, 2017

కృష్ణా: చందర్లపాడు మండలంలోని బొబ్బెళ్లపాడువిష జ్వరాలతో విలవిలలాడుతోంది. బొబ్బిళ్లపాడు గ్రామంలో లో 200 మందికి పైగా మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాల పాలయ్యారు. కొంత మంది విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నందిగామ ఆస్పత్రిలో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వర పీడితులు ఉన్నారని, ఇంత జరుగుతున్నా గ్రామం వైపు ఆరోగ్య శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: 23న మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

10:53 - October 19, 2017

పులిమెట్లలో కొండచిలువ కలకలం

ప్రకాశం: ముండ్లమూరు మండలం పులిమెట్లలో కొండచిలువ కలకలం రేగింది. కొండచిలువను పట్టుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

అమీర్ పేట్లో రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్: అమీర్ పేటలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. అమీర్ పేటలో రూ.25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.

విష జ్వరాలతో అల్లాడుతోన్న బొజ్జెళ్లపాడు

కృష్ణా: విష జ్వరాలతో బొజ్జెళ్లపాడు విలవిలలాడుతోంది. చందర్లపాడు మండలం బొబ్బిళ్లపాడులో 200 మందికి పైగా మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాల పాలయ్యారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వర పీడుతులు వున్నారు. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నందిగామ ఆస్పత్రిలో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వర పీడితులు ఉన్నారని, ఇంత జరుగుతున్నా గ్రామం వైపు ఆరోగ్య శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

10:30 - October 19, 2017

వాయుగుండగంగా మారిన అల్పపీడనం

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 370 కి.మీ, చంద్బలికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 18 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పూరి- చంద్బలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.

10:15 - October 19, 2017
09:55 - October 19, 2017

నెల్లూరు: శెట్టిగుంట రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు నుంచి ఊటికూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

09:52 - October 19, 2017

చేతిలో పాల పాకెట్ ప‌ట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో 'ఎంసిఎస‌ అలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' పోస్టర్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావ‌డంతో ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం. హీరో నాని ప్ర‌స్తుతం ఎంసీఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఎంసీఏ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుండ‌గా, దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. లుంగీలో మ‌న నేచుర‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు.

జంపన్న వాగు కల్వర్టు వద్ద పసికందు మృతదేహం

జయశంకర్ భూపాలపల్లి: ఏటూర్ నాగారంలో దారుణం జరిగింది. జంపన్న వాగు కల్వర్టు వద్ద పసికందు మృతదేహం లభ్యం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

శని, ఆదివారాల్లో ఓటర్ల నమోదు: జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : ప్రతి పోలింగ్ స్టేషన్ లో శని, ఆదివారాల్లో ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా హైదరాబాద్ లో జరుగుతున్న ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమంపై నగరంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీల నాయకులు ఇచ్చిన సూచనలు తీసుకొని ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం చేపడతామని తెలిపారు. బోగస్, మార్చుకున్న ఓట్లతో పాటు చనిపోయిన వారి ఓట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.

ముంబైలో అగ్నిప్రమాదం...

ముంబై: ముంబైలోని దాదర్‌ ప్రాంతంలోని వస్త్ర దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా అగ్నికీలలు వ్యాపిస్తుండటంతో 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ప్రయాణీకులతో కిక్కిరిసిపోయిన సికింద్రాబాద్

హైదరాబాద్ : దీపావళి నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. సొంత గ్రామాలకు వెళ్లే వారితో రైల్వేస్టేషన్ కోలాహలంగా మారింది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా రైళ్లను నడప కపోవడంతో రైల్వే స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వైపు వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, కాగజ్‌నగర్‌ వైపు వెళ్లే భాగ్యనగర్‌, ఏపీ వైపు వెళ్లే సింహపురి, మచిలీపట్నం, గౌతమి, దురంతో, హౌరా, చార్మినార్‌, ఇంటర్‌ సిటీ రైళ్లలో ప్రయాణికుల రద్దీ చాలా ఉంది.

నాగార్జునసాగర్‌ కు భారీగా వరద నీరు

నల్లగొండ :నాగార్జునసాగర్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 565 అడుగులుగా ఉందని తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 244 టీఎంసీలుగా ఉందని అధికారులు చెప్పారు. సాగర్ కు ఇన్‌ఫ్లో 1.82 లక్షలు క్యూసెక్కులుగా, ఔట్‌ఫ్లో 1800 క్యూసెక్కులుగా ఉందని వివరించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ లో కంపించిన భూమి

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో గురువారం ఉదయం 6.40 నిమిషాలకు స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప లేఖనిపై 4.7గా దీని తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

 

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న తుపాను వాహనం..

హైదరాబాద్: హయత్‌నగర్‌ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. తుపాను వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు.

07:23 - October 19, 2017

హైదరాబాద్:తనపై మీడియాలో జరుగుతున్న ప్రజారాన్ని టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్లుతున్నట్టు జరుగుతున్న ప్రజారం అవాస్తమన్నారు. కూలిపనుల పేరుతో టీఆర్‌ఎస్‌నేతలు లంచాలు మింగుతున్నారని దీనిపై సుప్రీంకోర్టులో కేసువేసేందు ఢిల్లీవెళ్లాన్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగిన ప్రచారం అని రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల వ‌ల్ల త‌న‌కు గాని, టీడీపీకి గాని ఎలాంటి నష్టం ఉండ‌దని రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకానికి విరుద్ధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ నడుచుకోనని తెలిపారు. న్యూస్ మార్నింగ్ లో ఇదే అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో కున్న కైలాస్ (కాంగ్రెస్), మల్లయ్య యాదవ్(టిడిపి), గోవర్థన్ రెడ్డి (టీఆర్ ఎస్) పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఆర్టీసీ బస్సు -లారీ ఢీ: 15 మందికి గాయాలు

నెల్లూరు: శెట్టిగుంట రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదలో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బయోవా స్టేట్ వర్శిటీని సందర్శించిన సీఎం చంద్రబాబు

అమెరికా : బయోవా స్టేట్ వర్శిటీని సీఎం చంద్రబాబు సందర్శించారు. బయోవా వర్శిటీలో మెగా సీడ ప్రాజెక్టు పై రౌండ్ టేబుల్ భేటీ అయ్యింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, సోమిరెడ్డి పాల్గొన్నారు. సీడ్ ప్రాజెక్టు పై బయోవా ప్రతినిధి దిలీప్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన రేవంత్

హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలపై కేసువేసేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏపీ టీడీపీ నేతలు, మంత్రులపై రేవంత్‌ ఫైర్‌ అయ్యారు.

ఏపీ అసెంబ్లీ కొత్త డిజైన్లు సిద్ధం

అమరావతి: ఏపీ అసెంబ్లీ కొత్త డిజైన్లు సిద్ధమయ్యాయి. టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి, నార్మన్‌ ఫోస్టర్స్‌ బృందం కలిసి ఏడు నూతన డిజైన్లను రూపొందించాయి. ప్రజల సూచనలు, సలహాల తీసుకునేందుకు వీటిని సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈనెల 25 లండన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది డిజైన్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

07:01 - October 19, 2017

పశ్చిమగోదావరి : నిడదవోలు-తాడేపల్లిగూడెం స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైల్లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి 13 బోగీలకు మంటలు వ్యాపించాయి. గార్డు అప్రమత్తతో సిబ్బంది మంటలు అదుపు చేశారు.విశాఖపట్నం పోర్టు నుంచి మహారాష్ట్రలోని అదానీ పవర్‌ కంపెనీకి బొగ్గు తీసుకెళ్తున్న గూడ్స్ రైల్లో ఈ ప్రమాదం జరిగింది.

06:59 - October 19, 2017

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతుల కసరత్తు వేగవంతమైంది. డిజైన్ల రూపకల్పన, ఖరారులో ఆలస్యం కావడంతో రాజధాని నిర్మాణంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం... వీలైనంత త్వరగా అమరావతి ఆకృతులను ఖరారు చేయాలని నిర్ణయించింది.

11న లండన్‌ వెళ్లిన టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి....

ప్రభుత్వ సలహా మేరకు ఈనెల 11న లండన్‌ వెళ్లిన టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి.... నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి పలురకాల నమూనా ఆకృతులను రూపొందించారు. గతంలో కంటే భిన్నంగా ఉండే విధంగా ఏడు రకాల ఆకృతులను తయారు చేశారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వీటిని సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎక్కువ మంది ప్రజలు బాగుందని సూచించిన డిజైన్‌కు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... అక్కడ నుంచి యూఏఈ వెళ్లి, అటునుంచి ఈ నెల 24న లండన్‌ చేరుకుంటారు. 25న రాజధాని ఆకృతులు రూపొందిస్తున్న నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అవుతారు. అసెంబ్లీ కోసం రూపొందించిన ఏడు డిజైన్లపై చర్చించి, ఒకదానిని ఖరారు చేస్తారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారు. లండన్‌ నుంచి చంద్రబాబు తుది డిజైన్‌తో తిరిగివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీ భవనంపై పొడవైన టవర్‌ వచ్చే విధంగా రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

06:57 - October 19, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలను సమాయత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది.సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన పార్టీ కీలక నేతలు ఇవాళ భేటీ కానున్నారు.

మూడున్నరేళ్ల కార్యక్రమాలను వివరించేందుకు రెడీ

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించలేకపోతున్నామన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. మూడున్నరేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు శాసనసభ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు, మంత్రులను సిద్ధం చేస్తున్నారు.

ప్రగతి నివేదికలు వెల్లడించేందుకు రెడీ

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 86 రంగాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని అధికార పార్టీ గణాంకాలను సిద్ధం చేసింది. గతంలో ఆయా రంగాల్లో ఉన్న అభివృద్ధిని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన ప్రగతిని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. శాసనసభ, శాసనమండలిలో మంత్రులు, విప్ లు మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే వ్యూహ కమిటీ సమావేశంలో సూచనలు చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్‌ అప్పగించారున. అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహిస్తామన్న సంకేతాలను అధికార పక్షం ఇస్తోంది. ప్రతిపక్ష నేతల ఆరోపణలకు... ప్రభుత్వ ప్రగతి నివేదికలతో సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

నేడు టీఆర్‌ఎస్‌ కీలక నేతల భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలను సమాయత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది.సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన పార్టీ కీలక నేతలు ఇవాళ భేటీ కానున్నారు.

06:54 - October 19, 2017

అమరావతి:అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షికాగోలో ఐటీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దాదాపు 80కిపైగా ఐటీ కంపెనీల నిర్వాహకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతిలో ఐటీ సంస్థల ఏర్పాటుపై చర్చించారు. ఐటీ, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సర్వేసెస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వంటి విభాగాల్లో కంపెనీల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.ఏడాది కాలంలో ఐదు వందల కంపెనీలు ఏపీలో తమ కార్యక్రమాలకు ప్రారంభించేలాన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. షికాగో స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధి రోహన్‌ అత్తెలె కూడా చంద్రబాబును కలిశారు. వచ్చే ఏడాది మేలో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. డైనమిక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రాంలో తమకున్న ప్రావీణ్యాన్ని ఏపీలోని యూనివర్సిటీలకు అందించేందుకు షికాగో స్టేట్‌ యూనివర్సిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం.... తానా ప్రతినిధులు కూడా చంద్రబాబును కలిశారు. అమెరికాలోని 20 నగరాల్లో నిర్వహిస్తున్న 5 కే రన్‌ ద్వారా వచ్చే సొమ్ముతో అమరావతిలో తానా భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు స్థలం కేటాయించాలని తానా ప్రతినిధులు కోరగా.. ప్రతిపాదనలను పంపితే పరిశీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

06:52 - October 19, 2017

హైదరాబాద్: ఉద్యోగాలు ఇస్తున్నట్టు కాల్‌ లెటర్లు పంపారు.. వచ్చిన వారికి నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగులు ఇవ్వడం మరిచారు. ఘనత వహించిన తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు . టీఎస్‌ ఆర్టీసీలో సంవత్సరాలుగా సాగుతున్న రిక్రూట్ మెంట్ పై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ.

డ్రైవర్ పోస్టులకు 9 వేల మంది దరఖాస్తు

హైదరాబాద్‌ జోన్ పరిధిలోని జిల్లాల్లో ఉన్న ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు 9 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 387 మందిని సెలక్ట్‌ చేశారు. ఎంపికైన వారిలో 170 మందికి వెంటనే పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన 217 మందికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మరో సారి డ్రైవర్ కమ్‌ కండక్టర్‌ ట్రైనింగ్‌ కూడా ఇప్పించారు. శిక్షణ పూర్తై దాదాపు నాలుగేళ్లు గడిచిపోయినా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి నియామక పత్రాలు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వీరంతా ఎన్నోసార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసినా... ఖాళీలు ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ ఇస్తామన్న హామీతోనే సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు ఎంపికైన వారు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమకు ఇంకా ఉద్యోగాలే రాలేదని ఆందోళన చెందుతున్నారు.ఖాళీలు లేకుండా డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసి, ఎలా ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఆర్టీసీ అధికారుల అనాలోచిత విధానానికి ఎంపికై, పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లే నిదర్శనమని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు.

06:50 - October 19, 2017
06:49 - October 19, 2017

హైదరాబాద్‌ : నగరంలోని స్వీట్‌హౌస్‌ల్లో దీపావళి పండుగ కళ కనిపిస్తోంది. దీపావళి పండుగను మరింత తీపిగా జరుపుకునేందుకు నగర జనం స్వీట్స్‌ కొనుగోలు చేస్తున్నారు. దీపావళి పండుగంటేనే తీపి వంటకాలతో ముడిపడి ఉన్న పండుగ. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని జరుపుకుంటారు. విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు స్వీట్స్‌పంచి వారు తీపి చేస్తారు. దీపావళి రోజున బాణాసంచా కాల్చడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో... తీపి వస్తువులకు అంతే ప్రాధాన్యత ఇస్తారు.

మినీ భారత్‌గా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌

హైదరాబాద్‌ ఓ మినీ భారత్‌ అని అందరూ అంటుంటారు. అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉంటారని దానర్థం. హైదరాబాద్‌లో గుజరాతీలు, మహారాష్ట్రీయులు ఎక్కువగా ఉండడంతో వారు దీపావళి పండుగలో పటాసుల కంటే స్వీట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీపాల వెలుగుల్లో బంధువులు, మిత్రులతో కలిసి ఒక్కొక్కరు స్వీట్స్‌ పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు స్వీట్స్‌ను బహుమతిగా ఇస్తారు. దీంతో దీపావళి పండుగలో స్వీట్స్‌ ప్రాధాన్యత పెరిగింది.

కేవలం హైదరాబాద్‌లో ఉండేవారే స్వీట్స్‌ కొనుగోలు చేస్తారంటే పొరపాటే.

కేవలం హైదరాబాద్‌లో ఉండేవారే స్వీట్స్‌ కొనుగోలు చేస్తారంటే పొరపాటే. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉండే వారు కూడా వచ్చి స్వీట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో మిఠాయి దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. అతిథులు, బంధువుల నోళ్లను తీపిచేస్తూ పండుగను జనం సంతోషంగా జరపుకుంటారు.

కస్టమర్లతో కిటకిటలాడుతోన్న స్వీట్‌షాప్స్‌

నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌లోని స్వీట్స్‌ హౌస్‌లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అంతేకాదు.. స్వీట్‌హౌస్‌ను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించాయి. దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా స్వీట్స్‌ను తయారు చేయిస్తున్నాయి. వివిధ ఆపర్స్‌తో కొనుగోలు దార్లను ఆకర్షిస్తున్నారు స్వీట్‌హౌస్‌ నిర్వాహకులు. దీపావళి రోజున తీపివంటలతోపాటు స్వీట్స్‌ నోరూరిస్తున్నాయి. సో మీరూ స్వీట్స్‌ తెచ్చుకుని లెట్స్‌ సెలబ్రేట్‌ అండ్‌ ఎంజాయ్‌ ది దివాళి.--

06:46 - October 19, 2017

హైదరాబాద్: వెలుగులు విరజిమ్మే దీపావళి క్రాకర్స్‌ మన జీవితాలను చీకట్ల పాలు చేస్తున్నాయా? పండుగ మాటున మన ప్రాణాలకు మనమే హాని కొనితెచ్చుకుంటున్నామా? దీపావళి రోజున మనం ఎంతో సంబురంగా కాల్చే పటాకులే మనకు మరణశాసనం రాస్తున్నాయా? మన ఆరోగ్యంపై అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయా? ఒక్క రోజు సంబురం... 356 రోజులు వెంటాడుతుందా? మన ప్రాణాలకు హాని తలపెడుతున్న కిల్లర్ క్రాకర్స్‌పై 10టీవీ ప్రత్యేక కథనం.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే దీపావళి

వెలుగు మొలకల పట్టుక. పిండివంటల ఘుమఘుమలు. కొత్తబట్టల కోలాహలం. రాత్రయితే చాలు అసలు సిసలైన పటాకుల చప్పుళ్లు. ఇవన్నీ దివ్య దీపావళి సోయగాలు. ఏ పండుగకూ లేని గ్లామర్‌ దీపావళికి ఉన్నది. పిల్లలకు దీపావళి పండుగపై ఉన్న ఆసక్తి మరేపండుగపైనా ఉండదు. నరకాసురుడనే రాక్షసుడిని హతమార్చి, లోకంలో చీకట్లను పారదోలినందుకు దీపావళి జరుపుకుంటామని పూర్వీకులు చెప్తుంటారు. జీవితంలో చెడును పారదోలి వెలుగును ఆహ్వానించడమే దీపావళి పండుగ సీక్రెట్‌. జీవితంలో ప్రతికూల ప్రభావం చూపించే చెడును దూరం చేయడమే దీపావళి.

జీవితానికి కీడు చేస్తోన్న కాలుష్యం

వాతావరణంలో ఏర్పడుతున్న అసాధారణ కాలుష్యం చెడులాంటిదే. కానీ మనం ఆ కాలుష్యాన్ని పాటాకుల రూపంలో కొనితెచ్చుకుంటున్నాం. ఏ చెడును నాశనం చేయడం దీపావళి ఉద్దేశమో... అదే చెడును ఆహ్వానిస్తూ పండుగ చేసుకుంటున్నాం. శబ్ద కాలుష్యం, వాయు, ధూళికాలుష్యం అన్ని కలగలిసి ఇవాళ దీపావళి పండుగ అవుతున్నది. దీపావళి రోజున కాల్చే పటాకులు పరిమితికి మించి ధ్వని కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. విషరసాయనాలను గాల్లో కలుపుతున్నాయి. అతిసూక్ష్మ ధూళికణాలను మట్టిలో కలిపేస్తున్నాయి. పండుగ ఒకరోజే . కానీ అది పర్యావరణంపై చూపిస్తున్న ప్రభావం మాత్రం 365 రోజులు ఉంటోంది.

బాణసంచా తయారీలో విషరసాయనాల వినియోగం

బాణాసంచా తయారీలో ఉపయోగించే సల్ఫర్‌, కార్బన్‌, ఆర్సెనిక్‌, మ్యాంగనీస్‌, సోడియం ఆక్సలేట్‌, అల్యూమినియం, పొటాషియం, ఐరన్‌ మొదలైన రసాయనాలు పెద్దమొత్తంలో వాతావరణంలో కలుస్తున్నాయి. అవి ఆరోగ్యానికి హాని తెచ్చిపెడుతున్నాయి. దీపావళి రోజున క్రాకర్స్‌ నుంచి వెలువడే వాయు కాలుష్యంలో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంది. వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్‌లో మొత్తం 17ప్రాంతాల్లో క్రాకర్స్‌తో అత్యధికంగా కాలుష్యం ఏర్పడుతోందని గుర్తించింది.

జీరో పొల్యూషన్‌ పటాసులతో పండుగ జరుపుకుంటున్న విదేశీయులు

అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ పండుగనైనా జీరో పొల్యూషన్‌ పటాకులతో జరుపుకుంటారు. విదేశాల్లో నైట్రోజన్‌ సంబంధిత పదార్థాలతో బాణసంచా తయారు చేస్తోంటే... మనదేశంలో కర్బన పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఆంటిమొని, లిథియం, మెర్క్యూరీ, ఆర్సెనిక్‌, లెడ్‌ రసాయనాలను పటాసుల తయారీలో సుప్రీంకోర్టు నిషేధించినా వాడుతూనే ఉన్నారు. దీపావళి రోజున న్యూఢిల్లీలో క్రాకర్స్‌ అమ్మకాలను నిషేధించారు. ముంబై, చత్తీస్‌గఢ్‌లో నివాస ప్రాంతాల మధ్య అమ్మకాలపై పరిమితులు విధించారు. కానీ మన దగ్గర మాత్రం యథేచ్చగా విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో కాలుష్యం శబ్ద, వాయు కాలుష్యం పెరిగిపోతోంది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

హైదరాబాద్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మేరిల్యాండ్‌లోని ఆఫీస్‌ పార్క్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పార్క్‌లో నడుస్తున్న వారిపై హఠాత్తుగా కాల్పులకు దిగడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నేపథ్యంలో మేరీలాండ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాల్పులకు తెగబడిన దుండగులకోసం పోలీసులు గాలిపంపు చేపట్టారు.

06:39 - October 19, 2017

హైదరాబాద్: దీపావళి అంటే దీపాల పండుగ. ప్రతీ జీవితంలో చీకట్లు తొలిగి వెలుగులు నిండాలని కోరుతూ..చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణసంచా, టపాసులు ప్రకృతి కాలుష్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతున్నాయనే చర్చ ఇప్పుడు తన పరిధిని పెంచుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బాణసంచాపై నిషేధం విధించటంతో దీనిపై ఈసారి చర్చ పెరిగింది. ఇదే అంశంపై ఈ రోజు జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జనవిజ్ఞానవేదిక నాయకులు రమేష్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.....

తాడేపల్లిగూడెంలో గూడ్స్ రైల్లో మంటలు

ప.గో: తాడేపల్లిగూడెంలో గూడ్స్ రైల్లో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి 13 బోగీలకు మంటలు వ్యాపించాయి. రైల్వే గార్డ్ అప్రమత్తతతో అధికారులు మంటలార్పారు.

Don't Miss