Activities calendar

20 October 2017

21:28 - October 20, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈసారి దీపావళికి సుప్రీంకోర్టు పటాకులపై నవంబర్‌ 1 వరకు నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల కాలుష్యం స్థాయి పెద్దగా తగ్గలేదు కానీ గతం కంటే కాస్త నయం. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో దీపావళి మరుసటి రోజే దట్టమైన పొగ స్వాగతం పలికింది. కొన్ని ప్రాంతాల్లో కోర్టు నిషేధాన్ని లెక్క చేయకుండా ప్రజలు పటాకులు కాల్చారు. సిపిసిబి డాటా ప్రకారం దీపావళి రోజు గాలిలో ఏక్యూఐ స్థాయి ఉదయం 319 ఉండగా.. మరుసటి రోజు శుక్రవారం పది గంటల కల్లా అది 355 స్థాయికి చేరింది. ఢిల్లీలో అత్యంత కాలుష్యం ఉండే ప్రాంతం ఆనంద్ నగర్‌లో మాత్రం ఇది 405 వరకు ఉండటం గమనార్హం. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఎయిర్‌ క్వాలిటి సూచిక 999గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కాలుష్యం ఈసారి తక్కువగా కనిపించింది.

ఈ నేపథ్యంలో కాలుష్యంపై అంతర్జాతీయ స్థాయిలో జరిపిన ఓ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2015లో కాలుష్యం కారణంగా భారత్‌లో 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆ నివేదిక వెల్లడించింది. కాలుష్య కారక శ్వాసకోశ తదితర వ్యాధులతోనే అధికంగా మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రపంచంలోనే ఇండియా తొలిస్థానాన్ని ఆక్రమించింది.

2015లో ఎయిడ్స్‌, టిబి, మలేరియా రోగాల వల్ల చనిపోయిన వారికంటే కాలుష్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది కాలుష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని స్టడీ పేర్కొంది. వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోగా...నీటి కాలుష్యంతో 18 లక్షల మంది చనిపోయినట్లు 'ది లాన్సెట్ మెడికల్‌ జర్నల్‌' నివేదిక పేర్కొంది. కాలుష్యం వల్ల వచ్చే రోగాలకు ఖర్చు కూడా తడిసి మోపెడవుతోందని లాన్సెట్‌ నివేదిక తెలిపింది. వీటికి ప్రతియేటా 4.6 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చవుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 6.2 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో కాలుష్య మరణాలు 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. 2050లో ఈ మరణాలు 42 లక్షల నుంచి 66 లక్షలకు చేరే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

జనాలపై పటాకులు విసిరిన ఆకతాయిలు..

హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్టలో కొందరు కారులో వెళుతూ పటాకులు కాల్చి రోడ్డుపై వెల్లుతున్న వారిపై విసిరేశారు. భయాందోళనలకు గురైన వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. 

21:23 - October 20, 2017

22న కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు శంకుస్థాపన..

హైదరాబాద్: కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22న వరంగల్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుకు శంకుస్థాపన జరగనున్నట్లు తెలిపారు. 

బీహార్ లో ఉద్రిక్తత..

బీహార్ : సమస్తిపూర్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వైద్యుడు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనితో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. 

21:19 - October 20, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. నవీపేట మండలం అబ్బాపూర్‌లో ఎర్రకుంట్ల రిజర్వాయర్‌ కాల్వ పనులను అడ్డుకున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తేనే పనులు కొనసాగనిస్తామని తేల్చి చెప్పారు. దీంతో కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి రైతులకు వద్దకు వచ్చి మాట్లాడారు. త్వరలో పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ హామీతో రైతులు శాంతించారు. 

21:18 - October 20, 2017

హైదరాబాద్ : ఎవరి అనుమతితో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో మాట్లాడారు..? పొత్తులపై అంతా మీఇష్టమేనా..? చంద్రబాబును మోసం చేస్తారా..? ఇదీ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన హాట్‌హాట్‌ మీటింగ్‌లో తలెత్తిన ప్రశ్నలు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై సీనియర్లు ఫైర్‌ అయ్యారు. దీనికి రేవంత్‌ కూడా ధీటుగానే రియాక్ట్‌ అయినట్టు తెలుస్తోంది. పార్టీలో ఎవరి జాతకాలు ఎంటో అన్ని బయటపెడతా.. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు చర్చిస్తానని రేవంత్‌ తేల్చి చెప్పడంతో టీటీడీపీ రాజకీయం మరోసారి రచ్చకెక్కినట్టైంది.

ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో ఏం మాట్లాడారో చెప్పాలని రేవంత్‌రెడ్డిని నిలదీసినట్టు పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి తెలిపారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించానన్నారు. అసలు రేవంత్‌ రెడ్డివల్లే తెలంగాణ పార్టీ దారుణంగా దెబ్బతిన్నదని మోత్కుపల్లి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో గుసగుసలాడిని విషయాలన్నీ పార్టీకి చెప్పాలని డిమాండ్‌ చేసినట్టు మోత్కుపల్లి తెలిపారు. తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోగా.. తను ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు రేవంత్‌ ప్రవర్తించడంతో.. సమావేశంనుంచి బయటికి వచ్చినట్టు మోత్కుపల్లి చెప్పారు.

రాహుల్‌గాంధీతో గుసగుసలాడిన తర్వాతే ఏపీ టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించడంలో ఆంతర్యం ఏంటని మోత్కుపల్లి ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌లపై ఎందుకు ఆరోపణలు చేశారని నిలదీశానని మోత్కుపల్లి తెలిపారు. సొంతపార్టీ నేతలపై విమర్శలు చేస్తూ.. పార్టీకి, చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని మరో సీనియర్‌ నేత అరవింద్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

అయితే మోత్కుపల్లి నర్సింహులు, ఎల్‌రమణ, అరవింద్‌కుమార్‌ గౌడ్‌లాంటి నేతలు నిలదీయడంతో .. రేవంత్‌రెడ్డికూడా ధీటుగానే బదులిచ్చినట్టు సమాచారం. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తాను అన్ని విషయాలు చంద్రబాబుతో మాట్లాడుతానని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో భేటీ నుంచి తాను వాకౌట్‌ చేసినట్టు మోత్కుపల్లి తెలిపారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీపై పోరాటంలో జిల్లాల వారీగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో మాత్రమే తాము చర్చించామని, సమావేశంలో ఎలాంటి గొడవ జరగలేదని మరో సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అనడం కొసమెరుపు. మొత్తానికి రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌.. టీటీడీపీలో అగ్గి రాజేసినట్టేనని ఇవాళ జరిగిన భేటీ వల్ల తేలిపోయింది. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చాక ..ఎవరిపై ఎలా స్పందిస్తారనే... అంశం ఇపుడు ఆసక్తిగా మారింది. 

బీహార్ లో ఉద్రిక్తత..

బీహార్ : సమస్తిపూర్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వైద్యుడు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనితో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. 

శనివారం వేముల ఘాట్ లో గ్రామ సభ..

సిద్ధిపేట : తెలంగాణలో భూసేకరణకు సంబంధించి.. తొలిసారిగా గ్రామసభ జరగబోతోంది. అదికూడా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలోనే ఈ గ్రామసభ జరగనుంది. హైకోర్టు మొట్టికాయలతో.. ప్రభుత్వం అనివార్యంగా ఈ సభను నిర్వహించనుంది. దీనికి వేములఘాట్‌ వేదిక కానుంది. 

ఉప రాష్ట్రపతి శనివారం డిశ్చార్జ్..

ఢిల్లీ : భారత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఎయిమ్స్‌కు వెళ్లారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆయన ఎయిమ్స్ కు వచ్చారు. శనివారం ఆయన డిశ్చార్జ్ అవుతారని ఉప రాష్ట్రపతి పీఆర్వో ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. 

తేజస్వీ యాదవ్..రబ్రీలకు ఈడీ సమన్లు..

ఢిల్లీ : రైల్వే హోటల్ టెండర్ కేసులో లాలూ కుటుంబానికి చిక్కులు తప్పడం లేదు. తేజస్వీ యాదవ్, రబ్రీదేవీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24వ తేదీన తేజస్వీ యాదవ్, 27న రబ్రీ దేవి హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది. 

అభివృద్ధిని అడ్డుకుంటున్న టి.టిడిపి - ఈటెల..

హైదరాబాద్ : గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇచ్చే వారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినా కొడంగల్ కు నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని టిడిపి అడ్డుకొంటోందని విమర్శించారు.

రేవంత్ కు షాక్..

హైదరాబాద్ : కొడంగల్ లో రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మంత్రులు ఈటెల, లక్ష్మారెడ్డి, జూపల్లిల సమక్షంలో కొడంగల్ నియోజకవర్గ టిడిపి నేతలు..కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.

బీటెక్ ఫస్టియర్ విద్యార్థికి కత్తిపోట్లు..

హైదరాబాద్ : షేట్ బషీరాబాద్ లోని నర్సింహరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. బీటెక్ ఫస్టియర్ విద్యార్థి భువనేశ్వర్ కు కత్తిపోట్లకు గురయ్యాడు. అడ్డుకొనేందుకు వచ్చిన మరో విద్యార్థిపై కూడా దాడి జరిగింది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. 

20:33 - October 20, 2017

ఇది ఆకలి భారతం కథ. స్వతంత్రం వచ్చిఆరు దశాబ్దాలవుతున్నా తీరని వ్యథ.. తినడానికి తిండిలేక నిత్యం నానా అగచాట్లు పడుతున్న కోట్లాది భారతీయుల గాథ.. దేశంలో కుబేరుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కానీ, ఇదే భారత దేశంలో కోట్లాది మంది ఆకలిదప్పులతో అల్లాడుతున్నారంటే నమ్మగలరా? మరి ప్రభుత్వ పథకాలేమవుతున్నాయి? జిడిపి లెక్కలు, సెన్సెక్స్ సూచీల భ్రమల మధ్య కాలాన్ని వెళ్లదీసే ప్రభుత్వాలు హంగర్ ఇండియాగా మార్చేస్తున్నాయా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

పై పై మెరుగుల గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రభుత్వాలకు సరదా.. కానీ, నిజాలు కళ్లెదుట నిలబడి ప్రశ్నిస్తున్నాయి. ఇదీ దేశ అసలు రూపం అని హెచ్చరిస్తున్నాయి.. కోట్లాదిమంది భారతీయులు ఆకలితో అల్లాడుతున్నారని తేల్చి చెప్తున్నాయి.. చిన్నారులు సరైన తిండి లేక ఎదుగుదల లోపాలు పెరుగుతున్నాయని చెప్తున్నాయి. భారతదేశం.. ఇక్కడ మిలియనీర్లు వెలిగిపోతున్నారు. సంతోషం.. కానీ, పక్కనే పేదరికం విలయ తాండవం చేస్తుందని తెలుసా? హంగర్ ఇండెక్స్ ల ఆకలి కేకల లెక్కలు వెక్కిరిస్తున్నాయని తెలుసా? లక్షలాది చిన్నారులు పాలకు గొంతెండి.., పిడికెడు అన్నం లేక కన్నుమూస్తున్నారని తెలుసా?

మనిషి ఎంత పనిచేసినా, ఏం సాధించినా ఐదే వేళ్లూ నోట్లోకి వెళ్లటానికే. జానెడు పొట్ట నిండటానికే. కానీ, ఇంతటి నాగరిక ప్రపంచంలోనూ ఆకలికి సరిపడా తిండి దొరకని వారున్నారు. పౌష్టికాహారం సంగతి తర్వాత ... కడుపు నింపుకునే మార్గం దొరకని వారే ఎందరో ఉన్నారు.. ధనవంతుల జాబితాలో నాలుగో స్థానం … ప్రపంచం బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి 90మంది పైగా, మల్టి మిలియనీర్ల జాబితాలో 15వేల మంది..ఓవరాల్ గా ఇండియా ధనవంతులతో వెలిగిపోతోంది. కానీ అదే సమయంలో సరైన తిండిలేనివాళ్లూ పెరుగుతున్నారు. ఎందుకు?

ఆహార భద్రతా చట్టం వచ్చింది కానీ, పరిస్థితిలో ఇప్పటివరకు పెద్ద మార్పు రాలేదనే చెప్పాలి.. మరో పక్క భూసేకరణ చట్టాలు రైతుల భూములను మింగేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఓ పక్క వ్యవసాయానికి దెబ్బ కొడుతూ మరో పక్క సంక్షేమ పథకాల వెన్ను విరుస్తూ ఉంటే పరిస్థితి ఎప్పటికి మారుతుంది? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మా రిపోతున్నారు. పాలక పక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పుండదు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:31 - October 20, 2017

ఏం పనిలేనోడు ఆఖరికి కథలు జెప్పుకోనన్న బత్కొచ్చు అని ఎన్కట మా నాయినమ్మ అంటుండే.. రేవంత్ రెడ్డి మీ పార్టీల కొస్తున్నడటగదనే అన్మంతన్నా అంటే.. అరే నాయన మీరు ఇప్పుడు జెప్తున్నరుగని..ఇప్పుడున్న పోలీసోళ్ల కంటె ఎన్కటి రజాకార్లే నయ్యమున్నట్టున్నరుగదా..హరే నీయక ఇదెక్కడి ముచ్చటరో మళ్ల.. ఇప్పుడే జెప్పినగాదు.. బోధన్ సీఐ సురేందర్ గాని బాగోతం.. : గొర్ల స్కీం కథ ఉత్తదే అయ్యింది అనెతందుకు మళ్లొక మంద దొర్కింది మనకు.. సర్కారోళ్లు సబ్సిడీ మీద గొర్లిస్తె.. పాములు గూడ దీపావళి జేస్కుందామని వస్తున్నయో ఏమో.. ఒక పెద్ద కొండ చిల్వపాము పోరగాళ్లు ఆడుకుంటున్న కాడికొచ్చి పరేషాన్ జేశింది జెర్రశేపు..మోడీ గారికి ఒక తల్లున్నదిగదా..? అగో ఆమె పండు ముసలామే.. దీవుల పండుగకు పాటలు వెట్టుకోని ఎట్ల డ్యాన్సు జేస్తున్నదో సూడుండ్రి..గిసోంటి గరం..గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నాగపట్నం ఘటనలో ఎక్స్ గ్రేషియా..

తమిళనాడు : నాగపట్నంలోని ఆర్‌టిసి బస్‌ గ్యారేజీ కూలి 9 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులు విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున పైకప్పు కూలింది. శిథిలాల కింద 15 మంది కార్మికులు చిక్కుకోగా... 9 మంది ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు 7 లక్షల 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.

కేంద్ర ఎన్నికల సంఘంపై చిదంబరం ఆగ్రహం..

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఈసీ కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ప్ర

రంజిత్ కుమార్ రాజీనామా..

ఢిల్లీ : సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన... కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు తన రాజీనామా లేఖను పంపించారు. 

మురసోలి కార్యాలయాన్ని సందర్శించిన కరుణా నిధి..

తమిళనాడు : డిఎంకె అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తమ పార్టీ దినపత్రిక మురసోలి కార్యాలయాన్ని సందర్శించారు. మురసోలి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియంను ఆయన తిలకించారు.

20:18 - October 20, 2017

తమిళనాడు : డిఎంకె అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తమ పార్టీ దినపత్రిక మురసోలి కార్యాలయాన్ని సందర్శించారు. మురసోలి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియంను ఆయన తిలకించారు. మురసోలి డాక్యుమెంట్‌ను చూశారు. ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహాన్ని కూడా కరుణానిధి చూసుకున్నారు. సుమారు గంటసేపు అక్కడ గడిపారు. చాలాకాలం తర్వాత కరుణానిధి మురసోలి కార్యాలయానికి రావడంతో డిఎంకె శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కరుణానిధి వెంట ఆయన కుమారుడు, డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్ స్టాలిన్ ఇతర సీనియర్‌ నేతలున్నారు. వయోభారంతో బాధపడుతున్న కరుణానిధి- వైద్యుల సూచన మేరకు గోపాలపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

20:16 - October 20, 2017

బీహార్‌ : ఓ సర్పంచ్, గ్రామ పెద్దలు దళితుడి పట్ల హీనంగా ప్రవర్తించిన ఘటన నలందా జిల్లా అజ్‌నౌరా గ్రామంలో చోటు చేసుకుంది. అనుమతి తీసుకోకుండా సర్పంచ్‌ ఇంట్లోకి ప్రవేశించడమే ఆ దళితుడు చేసిన నేరం. దీనిపై పంచాయితి పెట్టిన గ్రామ పెద్దలు ఓ వ్యక్తితో కింద ఉమ్మించి దళితుడిని నాకమని ఆదేశించారు. గ్రామ పెద్దలకు భయపడ్డ ఆ దళితుడు వారు చెప్పినట్లే చేశాడు. అంతేకాదు...మహిళలతో ఆ దళితుడిని చెప్పుతో కొట్టి దారుణంగా అవమానించారు. చిన్న నేరానికే పెద్ద శిక్ష వేయడం ద్వారా సర్పంచ్‌ తన పదవికే కళంకం తెచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్య సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ ఘటన బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

20:14 - October 20, 2017

ఢిల్లీ : సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన... కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని... నా కుటుంబానికి నేను తగినంత సమయం కేటాయించలేకపోతున్నానని... రంజిత్ ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలున్నాయని, బిజీ షెడ్యూల్‌తో వారికి సమయం కేటాయించలేకపోతున్నానని...అందుకే రాజీనామా చేశానని ఆయన తెలిపారు. ఇప్పటికే అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా వ్యక్తిగత కారణాలు చూపుతూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌ ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న రంజిత్ కుమార్ 2014 జూన్‌లో సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 

20:12 - October 20, 2017

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఈసీ కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ప్రధాని మోది గుజరాత్‌లో తలపెట్టిన మెగా ర్యాలీ కోసమే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఈసీ జాప్యం చేసిందని ఆరోపించారు. ప్రధాని అన్ని రాజకీయ ప్రకటనలు చేసిన తర్వాత... గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. అక్టోబర్‌ 12న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. గుజరాత్ తేదీలను మాత్రం వెల్లడించలేదు. 

20:09 - October 20, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో జయదీపిక దారుణ హత్య సంచలనం సృష్టించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తండ్రి తలపై రాడ్డుతో కొట్టి చంపేశాడు. స్థానిక యువకుడిని ప్రేమించిందనే కోపంతో పరువు హత్యకు పాల్పడ్డాడు. ప్రేమను మరిచిపోవాలని బెదిరించాడు. అయినా ఆమె వినలేదు. దీంతో దీపికకు మేనమామతో పెళ్లి నిర్ణయించారు. త్వరలోనే వివాహం జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి దీపిక నాలుగు రోజుల క్రితం దారుణ హత్యకు గురైంది. క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చివరికి కన్నతండ్రి నందుల రాజే హంతకుడని నిర్ధారించారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు రామచంద్రాపురం టీడీపీ పట్టణ అధ్యక్షుడు. నందుల రాజుతో పాటు ఆయన కుమారుడు కూడా అరెస్ట్‌ అయ్యాడు.

20:06 - October 20, 2017

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నేరాలు పెరిగిపోతున్నాయి..డిపార్ట్‌మెంట్లో ఉంటూ...అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నవారు పెరిగిపోయారు..బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నవారే కీచకులుగా మారుతున్నారు...బాధితురాళ్లు స్టేషన్‌ వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు కోర్కెలు తీర్చాలంటూ వేధిస్తున్నారు..వెంటపడుతున్నారు...కామపిశాచాలుగా మారిన రెండు రాష్ట్రాల్లోని ఓ సీఐ,ఓ ఎస్సైలపై వేటుపడింది...

కామపిశాచిలా మారిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డిపై వేటు పడింది...పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం...బాధితులు ఫిర్యాదు చేస్తే ఫోన్లలో వేధించడం చేస్తుండేవాడు...ఈ క్రమంలో ఓ బాధితురాలు సీఐ సురేందర్‌రెడ్డి వేధింపులను ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీంతో ఇంతకాలంగా అరాచకాలకు పాల్పడుతున్న ఆ సీఐ అసలు బాగోతం బట్టబయలైంది...కులాంతర వివాహం చేసుకున్న భార్యాభర్తలు కుటుంబ కలహాలతో పోలీసు స్టేషన్ చేరారు...దీన్ని ఆసరాగా చేసుకున్న సీఐ ఆ తర్వాత బాధితురాలితో ఫోన్‌లో ఏకాంత సంభాషణలు మొదలుపెట్టాడు. ఆమె భర్తపై నమోదు చేసిన కేసులో సహకారం అందించాలంటే తనతో గడపాలని కోరాడు...బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేయగా నిజమేనని తేలడంతో వేటు వేస్తూ డీఐజీ కార్యాలయానికి వీఆర్‌కు పంపారు...

నెల్లూరులో సైకో సబ్‌ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్...
జిల్లాలోని ఊటుకూరు మహిళా సర్పంచ్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడు...తన దారికి రాలేదని ఏకంగా ఆమెపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది...తనతో ఎస్సై ఫోన్‌లో రోజూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని..ఇంటికొచ్చి అత్యాచారం చేయబోయడని బాధితురాలు ఫిర్యాదు చేసింది...కోరిక తీర్చకపోతే కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. వేధింపులు ఎక్కువవడంతో...ఎస్సై బండారాన్ని బయటపెట్టేందుకు అతని ఫోన్‌కాల్‌ రికార్డ్‌ చేసింది. ఆ తర్వాత పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీనిపై నిర్ధారించుకున్న అధికారులు ఏడుకొండలును సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు... 

20:03 - October 20, 2017

హైదరాబాద్‌ : శివార్లలో ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పోలీసులు విచారణలో పలు విషయాలు వెలుగు చూసాయి. ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మీ, రవీందర్‌రెడ్డిల కుటుంబం 5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 38 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులకు తెలియకుండానే ప్రభాకర్‌రెడ్డి మంచినీళ్లు, కూల్ డ్రింక్స్‌లో విషం కలిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

20:01 - October 20, 2017

హెల్మెట్ లేకుండా బండి నడిపిన సీఎం..

జార్ఖండ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి దీపావళి పండుగ రోజున రాంచీలో రాత్రి వేళ ద్విచక్రవాహనంపై పయనించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

18:44 - October 20, 2017

ప్రకాశం : పొట్టకూటికోసం వెళ్లిన గొర్రెల కాపర్లకు కడగండ్లు మిగిలాయి. ఇప్పటికి నాలుగు వందల గొర్రెలు అంతుపట్టని రీతిలో మృత్యువాత పడ్డాయి. వైద్యులు శ్రమించినా మరణాలు మాత్రం ఆగడంలేదు. మేతకోసం వెళితే ఆహారం రూపంలో దొరికిన వయ్యారిభామ ఆకు ఈ మూగజీవాల ఉసురు తీశాయి. దీంతో గొర్ల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల బారినుంచి గెట్టెక్కించాలంటూ వేడుకుంటున్నారు కాపరులు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉలిచి, చవటవారిపాలెం తదితర గ్రామాల సమీపంలో బీడుభూముల్లోకి గొర్రెలను తోలుకెళ్లారు కాపరులు. కావలసినంత పచ్చిక అక్కడ ఉండటంతో గొర్రెలను అటు వైపు తీసుకెళ్లారు. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. నిమిషాల వ్యవధిలో మూగజీవాల గమనం మందగించింది. గొర్రెలు కిందపడి కొట్టుకుంటూ చనిపోతుండటంతో కాపర్లకు అర్థం కాలేదు. తమ జీవనాధారమైన గొర్రెలు పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు.

12మంది కాపరులకు చెందిన మొత్తం రెండు వేలకు పైగా గొర్రెల్ని మేత కోసం తోలుకుపోయారు. వీటిలో ఇప్పటికే దాదాపు 400గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరువందల గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అస్వస్థతకు గురైన గొర్రెలను ఎనిమిది లారీల్లో అప్పటికప్పుడే వైద్యం కోసం చీరాల మండలం గవినివారిపాలెం తరలించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా మూగజీవాల మరణాలు మాత్రం ఆగడంలేదు. విషపూరితమైన ఈ ఆకు ప్రభావంతో జననావయవాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంటుందని వైద్యులు చెప్పారు. విషపూరిత వయ్యారిభామ మొక్కలను తినకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అయితే అవగాహన లేకపోవడంతో కాపరులు గొర్రెలకు భీమా చేయించుకోలేదు. దీంతో ఇప్పుడు పరిహారం వచ్చేది కష్టమేనని అధికారులు అంటున్నారు. తమను ఏవిధంగానైనా ఆదుకోవాలని రైతులు వేడుకుంటుకున్నారు.

18:41 - October 20, 2017

అనంతపురం : దశాబ్దాలుగా వరుస కరవులతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లాకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండటంతో చెరువులకు నీరు విడుదల చేశారు. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగుచేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాకు ఎంతో మేలు చేశాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కాల్వలు, చెరువులు ఏరుల్లా ప్రవహిస్తున్నాయి.

శ్రీశైలం జలాశయం నిండటంతో రాయలసీమకు నీరు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా నుంచి జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు. అనంతపురం జిల్లాలోని పెద్ద చెరువుల్లో ఒకటైన ధర్మవరం ట్యాంకులో నీరు నింపుతున్నారు. కొద్ది రోజుల్లో చెరువు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ చెరువు పరిధిలోని గొలుసుకట్టు ట్యాంకులకు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రబీలో పంటులు సాగు చేసుకునేందుకు రైతులకు వీలు కలుగుతుంది. భూగర్భ జల నీటిమట్టాలు పేరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు నీటితో నిండటంతో ఈ సారి కార్తీక మాసాన్ని వైభవంగా నిర్వహించేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. తెప్పోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి ధర్మవరం చెరువుకు విడుదల చేసి నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ పరిశీలించారు. స్థానికులతో కలిసి ఈత కొట్టారు. ధర్మవరం చెరువుకు నీరు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని జలవనరుల్లో నీరు చేరడంతో ఈసారి రబీలో ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 

18:38 - October 20, 2017

విజయవాడ : రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అన్నారు ఏపీ ముఖ్యమత్రి చంద్రబాబు. అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్న ఆయన అయోవా రాష్ట్రాలోని ప్రవాసాంధ్రులతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అటు పలు కంపెనీల సీఈఓలతో సమావేశం అయిన చంద్రబాబు.. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. పెట్టుబడులతో తరలిరావాలని కోరారు. మీరిపుడు మంచిస్థాయిలో ఉన్నారు.. జన్మభూమిని మరువకండి.. అమెరికాలోని ప్రవాసాంధ్రులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఐయోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం అక్కడి తెలుగు వారితో మాట్లాడారు. చేస్తున్న ఉద్యోగాలతోనే సంతృప్తి పడకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, అందుకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

అయోవా రాష్ట్రంలోని వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రముఖ రాజకీయవేత్త, ప్రస్తుతం ఐయోవా ప్రభుత్వ కార్యదర్శి విలియం హోవార్డ్‌బిల్‌ నార్డేతో బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న రైతు రుణమాఫీ పథకంపై నార్డే పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అటు వేగనింగ్‌ యూనివర్సిటీ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ ఎల్‌వో ప్రిస్కోతో భేటీ అయిన ముఖ్యమంత్రి.. వ్యవసాయ రంగంలో ఏపీతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ అవసరాల కోసం సంయుక్తంగా గ్లోబల్‌ కన్సార్టియం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

సేంద్రియ వ్యవసాయంలో ఏపీ రైతులకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని ఐయోవాలోని మహర్షి వర్సిటీ అధ్యక్షుడిని చంద్రబాబు కోరారు. సేంద్రియ వ్యవసాయంలో భూటాన్‌కు సహకరిస్తున్నట్టే తమ ప్రభుత్వానికి కూడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ఐయోవా రాజధాని నగరంలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ -2017 పురస్కారాల ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల, సోమిరెడ్డితోపాటు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నారు. 

18:36 - October 20, 2017

అనంతపురం : జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఆరుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. రెండురోజుల క్రితం ముగ్గురికి ఆంత్రాక్స్ సోకి చికిత్స పొందుతుండగా.. ఈరోజు మరో ముగ్గురిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. వీరందరికీ అనంతపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. హిందూపురం గోరంట్ల చుట్టుపక్కల గ్రామాల్లో చనిపోయిన గొర్రెలను 50 మంది తిన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరుగురికి ఆంత్రాక్స్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇంకెంతమంది ఈ వ్యాధి బారిన పడతారోనని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

18:33 - October 20, 2017

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసు విచారణలో కోర్టు హాజరు నుంచి తనకు ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై తీర్పును... సీబీఐ కోర్టు ఈ నెల 23 తేదీకి వాయిదా వేసింది. ఇవాళ అటు సీబీఐ, ఇటు జగన్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 11 కేసుల్లో జగన్ నిందితుడని... విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో జగన్‌‌కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ కోరింది. సహేతుక కారణాలతో ఒకటి, రెండు వారాలు హాజరు నుంచి మినహాయింపు కోరచ్చని.. కానీ రాజకీయ కారణాలతో ఏకంగా ఆరు నెలలు మినహాయింపు సరికాదని సీబీఐ లాయర్ వాదించారు. అయితే జగన్ రాజకీయ నాయకుడని.. ఏపీలో సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తరపు లాయర్ వాదించారు. ఇరువురు వాదనలు విన్న న్యాయమూర్తి... తమ నిర్ణయాన్ని ఈనెల 23కు వాయిదా వేశారు. నవంబర్ 2 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ పాదయాత్ర చేస్తానని గతంలోనే నిర్ణయించుకున్నారు.

 

18:31 - October 20, 2017

సిద్ధిపేట : తెలంగాణలో భూసేకరణకు సంబంధించి.. తొలిసారిగా గ్రామసభ జరగబోతోంది. అదికూడా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలోనే ఈ గ్రామసభ జరగనుంది. హైకోర్టు మొట్టికాయలతో.. ప్రభుత్వం అనివార్యంగా ఈ సభను నిర్వహించనుంది. దీనికి వేములఘాట్‌ వేదిక కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లాలో.. భూసేకరణ కోసం తొలిసారిగా గ్రామసభ జరగబోతోంది. జీవో 123, 124 ల ద్వారా భూములు సేకరించాలనుకుంటున్న ప్రభుత్వం.. హైకోర్టు మొట్టికాయలతో గ్రామసభ నిర్వహణకు సిద్ధపడింది. గజ్వేల్‌ నియోజకవర్గం వేములఘాట్‌ వేదికగా శనివారం ఉదయం.. ఈ గ్రామసభ జరగబోతోంది.

తొగుట, ప్రజ్ఞాపూర్‌ ప్రాంతాల్లో రెండు లక్షల పదిహేను వేల ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో తలపెట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం.. ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఈ క్రమంలో 2013 భూసేకరణ చట్టాన్ని తోసిరాజని, జీవో 123, 124 ల ద్వారా.. భూములు తీసుకోవాలని తలపెట్టింది. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును స్వాగతిస్తోన్న నిర్వాసితులు.. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోతొక్కడాన్ని తప్పుబట్టారు. అందుకే గడచిన ఐదు వందల రోజులుగా.. దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వం 123, 124 జీవోల ద్వారా భూములు సేకరించడాన్ని తప్పుబడుతూ.. ఈ ప్రాంత రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు 2013 చట్టంలోని అంశాల ఆధారంగానే భూసేకరణ ప్రక్రియ సాగాలని విజ్ఞప్తి చేశారు. అటు కోర్టు కూడా.. ప్రజాభిప్రాయసేకరణ, ప్రాజెక్టు సమగ్ర నివేదిక -డిపిఆర్‌, పర్యావరణ సర్వేలు లేకుండా భూసేకరణ ఏంటంటూ కోర్టు కూడా ఆక్షేపణ తెలిపింది. ముందుగా గ్రామసభ నిర్వహించాలని ఆదేశించడంతో... ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో.. వేములఘాట్‌లో గ్రామసభకు సిద్ధపడింది.

తమ న్యాయ పోరాటం ఫలించి గ్రామసభ జరుగుతుండడం పట్ల.. స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామసభను జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో అధికారుల ఓవరాక్షన్‌ కూడా విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ల మెప్పుకోసమే అధికారులు రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం అవసరమా అన్న ప్రశ్నా స్థానికంగా తలెత్తుతోంది. నీటి లభ్యత, పరిహారం చెల్లింపు అంశాలపై స్పష్టత లేకపోవడంపైనా విమర్శలున్నాయి. భూ నిర్వాసితుల రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఒక ఎత్తయితే.. వేములఘాట్‌ రైతుల పోరు మరో ఎత్తన్న భావన వ్యక్తమవుతోంది. శనివారం రోజున వేములఘాట్‌లో జరిగే గ్రామసభపై రాష్ట్ర రైతాంగం యావత్తూ దృష్టి సారించింది. గ్రామసభకు.. ఇతర ప్రాంతాల రైతులూ తరలిరావచ్చనీ భావిస్తున్నారు. మొత్తానికి భూ సేకరణ విషయంలో ప్రభుత్వ దూకుడుకు.. వేములఘాట్‌ రైతు బ్రేకులు వేశాడు. శనివారం నాటి గ్రామసభలో.. తన నిరసనకు కొనసాగింపుగా.. ప్రభుత్వానికి గట్టి సమాధానాన్నే ఇక్కడి రైతులు ఇస్తారని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ గ్రామసభను ఏమేర పారదర్శకంగా నిర్వహిస్తుందో వేచి చూడాలి.

18:28 - October 20, 2017

వరంగల్‌ : ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఈ హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలూ లేవు. రోగులను పట్టించుకునే నాధుడూ లేడు. వైద్యుల కొరత ఆస్పత్రిని వేధిస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్నది వరంగల్‌లోనే. ఇక్కడకి ఆదిలాబాద్‌ ,కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంను జిల్లాల నుంచి వైద్యం కోసం కార్మికులు వస్తుంటారు. వారిని ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకుని వైద్యం అందించాలి.

పేరుకు పోయిన చెత్తాచెదారం..
కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి సమస్యలకు కేరాఫ్‌ అడ్డాగా మారింది. ఆస్పత్రిని చూస్తుంటేనే సమస్యలకు నిలయంగా కనిపిస్తోంది. ఆస్పత్రి భవనమంతా పాతబడి పోయింది. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఆస్పత్రుల్లో దర్శనమిస్తోంది. పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు, వారి వెంటవచ్చిన వారు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

నత్తనడకన సాగుతున్న పనులు
వైద్యం కోసం వచ్చే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు. కనీసం దాహమేస్తే తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఆస్పత్రి భవనం పాతబడిపోవడంతో మరమ్మతులు చేపట్టారు. 8 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాదు మరమ్మతుపనులు అస్తవ్యస్థంగా, ఇష్టారాజ్యంగా, కనీసం వాటర్‌ క్యూరింగ్‌ లేకుండా సాగుతున్నాయి. ఆస్పత్రిలో నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇక్కడి విలువైన వైద్య పరికరాలు స్టోర్‌రూమ్‌లకు పరిమితమయ్యాయి.

నలుగురు వైద్యులతో నడుస్తోన్న ఆస్పత్రి..
వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరిన కార్మికులు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. ఎందుకంటే సరిపోను వైద్యులు ఇక్కడ లేరు. ఉన్నవాళ్లలో కొంతమంది వైద్యులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇంతపెద్ద ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సర్జన్‌, పీడియాట్రిషన్‌ వైద్యులు లేరు. ఉన్న ఒక్క గైనకాలజిస్టు డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌ వెళ్లారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఒకటి ఖాళీగా ఉంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు డాక్టర్‌ ప్రీతి, డాక్టర్‌ వాసివి వారికి నచ్చిన డిస్పెన్సరీలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కేవలం నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ డాక్టర్లతోనే వైద్యసేవలు నెట్టుకొస్తున్నారు. దీంతో వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి సమస్యలకు అడ్డాగా మారింది.

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. ప్రాణాలు పోసేవాడు దేవుడు అయితే... వాటిని కాపాడేవాడు వైద్యుడు. అందుకే మన సమాజంలో వైద్యుడికి అంతటి ప్రాధాన్యత ఉంది. వరంగల్‌ ఆస్పత్రిలో ఉన్నది కొద్దిమంది వైద్యులే. కేవలం నలుగురు అసిస్టెంట్‌ డాక్టర్లతోనే ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు కొనసాగుతున్నాయి. స్పెషలిస్ట్‌ డాక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఉన్న డాక్టర్లైనా సరిగ్గా వైద్యం చేస్తున్నారా అంటే అదీలేదు. అసలు డ్యూటీలే సరిగ్గా చేయడంలేదు. స్పెషలిస్ట్‌ డాక్టర్లు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచే డ్యూటీ చేయాలి. కానీ డాక్టర్లు అలా డ్యూటీలు చేయకుండా షేరింగ్‌ చేసుకుంటున్నారు. వారు వచ్చిందే టైమ్‌. చేసేందే డ్యూటీ. ఇష్టానుసారంగా డ్యూటీలు చేస్తుంటారు. ఇక డిస్పెన్సరీల్లో డ్యూటీలు చేసే డాక్టర్ల గురించి అయితే చెప్పనవసరమే లేదు. నాలుగు డిస్పెన్సరీల డాక్టర్లకు నైట్‌ డ్యూటీస్‌ మెయిన్‌ ఆస్పత్రిలో వేస్తే పట్టించుకోరు. డ్యూటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు రోజు 250 నుంచి 300 వరకు వచ్చే ఔట్‌పేషెంట్లు ఇప్పుడు వంద కూడా దాటడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు డాక్టర్లు ఏ రేంజ్‌లో పనిచేస్తున్నారు.

వైద్య సేవలపై 10టీవీ ఆరా..
రోజురోజుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యసేవలు నిర్లక్ష్యానికి గురవుతుండడంతో టెన్‌ టీవీ వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని విజిట్‌ చేసింది. వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకునే ప్రయత్నం చేసింది. డ్యూటీ చార్ట్‌లో పేర్కొన్న ప్రకారం రాత్రి డ్యూటీ జె.రవికుమార్‌ అనే వైద్యుడు చేయాలి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ డాక్టర్‌ సార్‌ డ్యూటీ చేయాలి. 10టీవీ ఈఎస్‌ఐ ఆస్పత్రికి 7 గంటల ప్రాంతంలో విజిట్‌ చేసింది. కానీ డ్యూటీ డాక్టర్‌ అప్పటికే అక్కడ లేరు. ఎక్కడికి వెళ్లారంటే ఆస్పత్రి సిబ్బంది చాలా తెలివిగా ఏం చెబుతున్నారో వీడియోలో చూడండి. డాక్టర్‌ గారు ఇప్పుడే డిన్నర్‌కు వెళ్లారని.. వెంటనే వస్తారని ఆస్పత్రి నర్సులు, సిబ్బంది ఘంటాపథంగా చెప్తున్నారు. మరి మన డాక్టర్‌ గారు ఎక్కడికి పోయారో తెలుసా. టెన్‌ టీవీ నేరుగా నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ జె. రవికుమార్‌తోనే మాట్లాడింది. ఏం చెబుతున్నారో మీరు వీడియోలో వినండి. ఇదీ మన డాక్టర్‌గారి వరుస. ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే బెదిరింపులు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోండని హెచ్చరికలు. ఇంతకీ సార్‌ ఎక్కడున్నారో వినండి.

గట్టిగా నిలదీస్తేనేగాని సారువారు అసలు నిజం ఒప్పుకోలేదు. నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ రవికుమార్‌ 2 గంటలకు ఆస్పత్రికి రావాల్సి ఉండగా 4.30కు వచ్చారు. ఆ తర్వాత 6.30కు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. తాను ప్రైవేట్‌గా నడుపుతున్న క్లీనిక్‌లో రోగులను చూడడానికి వెళ్లిపోయారు. దీనికి డిన్నర్‌ అనే పేరు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం కేవలం రెండు గంటలు మాత్రమే చేస్తూ మిగతా సమయమంతా తన క్లినిక్‌కు కేటాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టెన్‌టీవీ బృందం వచ్చిందని తెలుసుకున్న డాక్టర్‌ రవికుమార్‌ ఆఘమేఘాలమీద ఆస్పత్రికి వచ్చారు. విధులకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తే..సారు వారు ఏమని సెలవిచ్చారో వీడియోలో వినండి.. రాత్రిపూట వైద్యులు డ్యూటీలేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని రోగులు చెప్తున్నారు. మధ్యాహ్నం వచ్చి చూసి వెళ్తారని.. మళ్లీ మరునాడు మధ్యాహ్నం వైద్యులు వస్తారని అంటున్నారు. అప్పటి వరకు ఏదైనా అత్యవసర వైద్యం అవసరం అయితే నర్సులే చేస్తారని చెబుతున్నారు.
ఇదీ మన వరంగల్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రి పరిస్థితి. ప్రభుత్వం కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ఒకవైపు గొప్పలు పోతోంది. మరోవైపు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు, సరిపడ డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ రోగుల అరణ్య రోదన ప్రభుత్వం ఆలకిస్తుందా లేదో వేచి చూడాలి.

18:12 - October 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి విజయలక్ష్మి (94) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శుక్రవారం విజయలక్ష్మి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. వెంటనే కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి విజయలక్ష్మి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం పంజగుట్టలో అంత్యక్రియలు జరిగాయి. 

18:11 - October 20, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో పరువు హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ (రాజు), ఆయన కుమారుడిపై హత్యారోపణలు పెల్లుబికాయి. దీనితో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కానీ హత్యకు సంబంధించి కన్న కొడుకు పైనే రాజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కొడుకే కుమార్తెను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నట్లు సమాచారం.

నందుల రాజు ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని రెండో వివాహం చేసుకున్నారు. తన కూతురు ఎవరినో ప్రేమించి..సహజీవనానికి సిద్ధంగా ఉంటోందని గ్రహించాడని, ఈ నేపథ్యంలో తండ్రి నందుల రాజు హత్య చేశాడని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఎటువంటి నిజాలు బయటపడుతాయో చూడాలి.

ముత్తింశెట్టిపాలెంలో ఫైర్ ఆక్సిడెంట్..

గుంటూరు : తెనాలి ముత్తింశెట్టిపాలెంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో పూరింట్లో మంటలు చెలరేగాయి. సమీపంలో ప్రైవేటు పాఠశాల ఉండడంతో స్థానికులు..విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 

17:24 - October 20, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ...సర్కార్ నిధుల కోసం వేచి చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన నిధుల కోత పెడుతుండడంతో జీహెచ్ఎంసీ దిక్కుతోచని స్థితిలో పరిస్థితి ఉందని తెలుస్తోంది. సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయకపోవడంపై లోకాయుక్తలో సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి బల్దియాకు రూ. 2వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ఆస్తి పన్ను, స్టాంపు డ్యూటీ, ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకొర నిధులు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందన్నారు. లోకల్ బాడీకి నిధులు విడుదల చేయకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని..నిధులు విడుదల చేయకపోవడంతో సిటీ డెవలప్ మెంట్ పై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. 

17:14 - October 20, 2017

హైదరాబాద్ : టి.టిడిపిలో ఏం జరుగుతోంది ? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా ? అనే దానిప్లై ఇంకా క్లారిటీ రావడం లేదు. టి.టిడిపి సీనియర్ నేతలు జరిపిన సమావేశం హాట్ హాట్ గా సాగింది. సీనియర్ నేత మోత్కుపల్లి..రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. చివరకు మోత్కుపల్లి సమావేశం మధ్యలో నుండి బయటకు వచ్చేశారు.

ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై మోత్కుపల్లితో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు వ్యక్తిగతంగా పంచాయితీ లేదని, బాబును అవమానపరిచే విధంగా..ఆయనకు తెలియకుండానే రాహుల్ ను కలవడం పట్ల తనకు ఆగ్రహం కలిగించిందన్నారు. ఎవరి పర్మిషన్ తో కలిశామని నిలదీయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ తో కలుస్తున్నావా ? లేదా ? అనేది చెప్పాలని..దీనిపై బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. యనమల..పరిటాల సునీతను ఎలా తిడుతారని..ఇతరత్రా ప్రశ్నిస్తే అంతా బాబుకే చెబుతా అని రేవంత్ పేర్కొనడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని..ఆయన దుర్మార్గుడు..బ్లాక్ మెయిలర్ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. రేవంత్ బాధలు భరించలేక ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లారని..ఇతను పోతే పార్టీకి ఏ మాత్రం నష్టం లేదన్నారు. 

రామచంద్రాపురం టిడిపి పట్టణఅధ్యక్షుడు అరెస్ట్

తూ.గో: రామచంద్రాపురం టిడిపి పట్టణఅధ్యక్షుడు నందుల రాజు అరెస్టు అయ్యాడు. నందుల రాజుతో పాటు ఆయన కుమారిడిని కూడా అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం నందుల రాజు కుమార్తె హత్యకు గురైన ఘటనలో వీరి ని అరెస్ట్ చేశారు.

17:10 - October 20, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తారా ? చేయరా ? ఇందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిస్తుందా ? అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టు ఎదుట జగన్ హాజరౌతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. నవంబర్ 2వ తేదీ నుండి ఆరు నెలల వరకు పాదయాత్ర చేయనుందున..తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రకు అనుమతినివ్వవద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. హాజరు మినహాయింపు కేసులో వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. మరి ఆ రోజున ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

17:02 - October 20, 2017

ఎం.ఎఫ్‌ క్రియేషన్స్‌ పతాకంపై అచ్చివర్స్‌ సిగేచర్‌ బ్యానర్‌లో హీరోయిన్‌ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గవర్నర్ తల్లి మృతి పట్ల కేసీఆర్, చంద్రబాబు సంతాపం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి(94) మృతి చెందారు. విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పోన్ ద్వారా గవర్నర్ ను పరామర్శించి సంతాపం తెలిపారు.

తెనాలి ముత్తింశెట్టిపాలెంలో అగ్ని ప్రమాదం

గుంటూరు:తెనాలి ముత్తింశెట్టిపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ లో పూరింట్లో మంటలు చెలరేగాయి. సమీపంలోనే ప్రైవేట్ పాఠశాల ఉండడంతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, చీటర్ :మోత్కుపల్లి

హైదరాబాద్: రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. రేవంత్ వల్లే 12 మంది ఎమ్మెల్యేలు టిడిపిని వీడారని, రేవంత్ ఎవరి అనుమతితో రాహుల్ ను కలిశారు అనిఅడిగితే చంద్రబాబుకు మాత్రమే సమాధానం చెబుతానని మూర్ఖంగా మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. రేవంత్ వెళ్లిపోతే టిడిపి నష్టమేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, చీటర్ అని పేర్కొన్నారు.

16:40 - October 20, 2017

విజయవాడ : అమరావతిలో ప్రజా రాజధాని పేరు చెప్పి ప్రైవేటు రాజధాని నిర్మిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు పేర్కొన్నారు. రైతుల నుండి తీసుకున్న భూమిని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతుల భూముల కేటాయింపుల్లో పారదర్శకత లేదన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరం భూమి రూ. 4కోట్లకు ఇస్తూ ప్రైవేటు సంస్థలకు మాత్రం రూ. 50 లక్షలకు ఇవ్వడం దారుణమన్నారు. ఇలాంటి విధానాలతో రూ. 7 కోట్లు నష్టపోయిందన్నారు. 

జగన్ పిటిషన్ పై 23న తీర్పు

హైదరాబాద్: పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్ విచారణ జరిపిన సీబీఐ కోర్టు తీర్పును 23న వెలువరించనుంది.

16:12 - October 20, 2017

స్ఫూర్తి యాత్ర అనుమతికోసం కోర్టును ఆశ్రయించిన కోదండరాం

నల్గొండ: సూర్యాపేట, భువనగిరిలో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కోదండరాం అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కోదండరాం పిటిషన్ పై సోమరవాం హైకోర్టులో విచారణ జరగనుంది.

అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం

అనంతపురం: జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. చిలపత్తూరులో ఇద్దరికి ఆంత్రాక్స్ నిర్ధారణ అయ్యింది. అనంతపురం ఆసుపత్రిలో బాధితులకు చికిత్స కొనసాగుతుంది.

గవర్నర్ నరసింహన్ కు మాతృవియోగం

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ కు మాతృవియోగం అయ్యింది. గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి (94) కన్నుమూశారు. విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గవర్నర్ ను పలకరించేందుకు ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు.

15:40 - October 20, 2017

దమ్మిపేటలో విద్యుత్‌షాక్‌తో ఎలుగుబంటి మృతి

మంచిర్యాల : నెన్నెల మండలం దమ్మిపేటలో విద్యుత్‌షాక్‌తో ఓ ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయింది. అడవి పందులను నివారించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు ఎలుగుబంటి తగిలింది. దీంతో ఎలుగుబంటి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు మృతి చెందిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులకు అందించారు.

 

15:31 - October 20, 2017

నెల్లూరు : జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు లైంగిక వేధింపులపై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. మహిళా సర్పంచ్ ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలున్నాయి. తనతో అసభ్యకరంగా మాట్లాడాడని..అత్యాచారయత్నం చేశాడని ఊటుకూరు మహిళా సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యులపై కేసులు బనాయిస్తానని ఏడుకొండలు బెదిరిస్తున్నాడని ఆ మహిళా సర్పంచ్ వాపోయింది. దీనితో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన్ను వీఆర్ కు పంపిన సంగతి తెలిసిలందే. 

15:23 - October 20, 2017

నిజామాబాద్ : బోధన్ సీఐ సురేంద్ రెడ్డి వ్యవహార శైలిపై టెన్ టివి ప్రసారం చేసిన వరుస కథనాలపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. ఐజీ ఆఫీసుకు బదిలీ చేశారు. మహిళలతో సీఐ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఓ వివాహిత రావడం జరిగింది. కానీ ఆమెతో సీఐ సురేందర్ అసభ్యకరంగా..అసభ్యపదజాలాన్ని వాడారనే ఆరోపణలున్నాయి. సీఐ మాట్లాడిన మాటలను ఆమె రికార్డు చేయడంతో కలకలం రేగింది. ఈ ఆడియోను టెన్ టివి ప్రసారం చేసింది. కౌన్సిలింగ్ కు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవరిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి సీఐపై చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్లైంది. 

సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు సస్పెండ్

నెల్లూరు: సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు సస్పెనండ్ అయ్యాడు. మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

14:47 - October 20, 2017
14:46 - October 20, 2017

భారతదేశంలో పండుగలు చాలా ప్రాచీనమైనవి. ప్రతి పండుగకు పూజలుంటూ కార్యక్రమాలుంటాయి. కానీ వీటిని గమనిస్తే సామాజిక అంశాలుంటాయి. సామాజిక అంశాలతో పాటు వినోదం కలుగు చేసే పండుగ దీపావళి అని చెప్పుకోవచ్చు. ఐదు రోజుల పాటు దీపావళి పండుగ జరుపుకుంటుంటారు. దీనిపై మానవి ప్రత్యేక కథనం. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

23న టి.టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశం:రావుల

హైదరాబాద్: 23న టి.టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుందని ఆపార్టీ రావుల తెలిపారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టిడిపి నేతల సమావేశం జరిగింది. అనంతరం రావుల మీడియాతో మాట్లాడుతూ...28న పార్టీ అధినేత చంద్రబాబుతో పార్టీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో 3 ప్రత్యే సమావేశాలు ఉంటాయన్నారు. 117 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం జరపాలని, త్వరలో కార్యవర్గాల ఏర్పాటు చేయాలని నిర్ణయంచినట్లు తెలిపారు. 24న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మరోసారి రాష్ట్ర నేతలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

'10టివి'కథనానికి స్పందించి పోలీసు అధికారులు

నిజామాబాద్: వివాహితతో అసభ్యంగా మాట్లాడినందుకు బోధన్ పట్టణ సీఐ సురేందర్ రెడ్డిని ఐజీ ఆఫీసుకు బదిలీ చేశారు. ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ అంశాన్ని '10టివి'లో వచ్చిన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు.

14:24 - October 20, 2017

కొత్తగూడెం : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విధానాలతో దేశం ఆర్థిక సంక్షోభ దిశగా పయనిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. జీఎస్టీ సామాన్యులకు నష్టంగా మారిందని, నీతి ఆయోగ్ నిరుపయోగం అయ్యిందన్నారు. కేంద్ర ఆర్థిక విధానాలు సామాన్యుడికి భారంగా మారిపోయిందని, 265 పబ్లిక్ సెక్టార్ లో పరిశ్రమలను అమ్మేయడానికి..ప్రైవేటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

14:20 - October 20, 2017
14:10 - October 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి సీనియర్ నేతల సమావేశం వాడీ వేడీగా జరిగింది. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి..రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు టాక్. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎలా కలిశారంటూ మోత్కుపల్లి నిలదీసినట్లు..ఇందుకు తగిన విధంగానే రేవంత్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో మోత్కుపల్లి సమావేశం నుండి మధ్యలోనే బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

సమావేశ వివరాలను టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టెన్ టివికి తెలిపారు. 24వ తేదీన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, 26వ తేదీన బీఏసీ భేటీ జరుగుతున్నందున అందరూ రావాలని పలువురు సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై కార్యక్రమం నిర్వహించేందుకు వ్యూహాలు రచించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 120 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం అందరం కలిసే బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.

టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఢిల్లీలో మకాం వేసి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారనే వార్త కలకలం రేపింది. కానీ తాను సుప్రీంలో కేసు వేసేందుకు ఢిల్లీ రావడం జరిగిందని, పార్టీలోనే ఉంటానని రేవంత్ పేర్కొన్నారు. మరి రేవంత్ రెడ్డి అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

బీసీలకు సీఎం కేసీఆర్ దీపావాళి కానుక

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీసీలకు దీపావళి అయిపోయాక కానుకలు ప్రకటించారు. బీసీలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బీసీ రుణాల సబ్సిడీ రూ. 102.8 కోట్లు మంజూరు చేస్తూ సబ్సిడీ నిధుల ఫైలు పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సబ్సిడీ రుణాల వల్ల 12,218 మంది బీసీ వర్గాలకు లబ్ధి చేకూరుతుందని, నిధుల మంజూరు పై మంత్రి జోగురామన్న హర్షం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులకు చెంతకు సాయి ప్రజ్వల

మేడ్చల్: మేడిపల్లి పీఎస్ లో సాయి ప్రజ్వలను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటర్ చదువుతున్న సాయిప్రజ్వల11వ తేదీన అదృశ్యం అయిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డిని నిలదీసిన మోత్కుపల్లి

హైదరాబాద్: టి.టిడిపి ముఖ్య నేతల సమావేశంలో రాహుల్ గాంధీని కలిశావా లేదా అని రేవంత్ రెడ్డిని మోత్కుపల్లి నిలదీసినట్లు సమాచారం. దానికి రేవంత్ రెడ్డి మౌనంవహించారని, అధినేత ఆదేశం లేకుండా ఎలా కలుస్తారని మోత్కుపల్లి అడినట్లు తెలుస్తోంది.

13:33 - October 20, 2017

ఈ నెల 27న చలో అసెంబ్లీ :కోమటిరెడ్డి

హైదరాబాద్: రైతులకు మద్ధతు ధర డిమాండ్ తో ఈ నెల 27న చలో అసెంబ్లీ నిర్వహించతలపెట్టినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కాల్పులకు తెగబడ్డా వెనకడుగు వేసేది లేదని, కేసీఆర్ కు రాజకీయాలు తప్ప రైతు సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడి ప్రజల్లోకి రవాలని హితవు పలికారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఏడాది ఇస్తానన్న రూ.8వల పెట్టుబడిన ఈ ఏడాదే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

13:31 - October 20, 2017

ఢిల్లీ : మధ్యాహ్నం కావస్తున్నా ఢిల్లీలో కాలుష్యం తగ్గలేదు. టపాసుల పొగతో ఢిల్లీ మొత్తం కాలుష్యం నిండిపోయింది. పొగతో చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నగరవాసులెవరూ రోడ్లపైకి రావడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు

అమరావతి: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు జరిగాయి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు అయ్యారు. 66 మంది అధికారులును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

13:27 - October 20, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ధర్నా చేపట్టాయి. రవాణా విభాగంలో ఫోర్జరీ సంతకాలతో బిల్లులు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. నకిలీ బిల్లులతో నిధులు కాజేసిన అధికారులను వెంటనే అరెస్ట్‌ చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

టి.టిడిపి నేతల భేటీలో వాడి వేడి చర్చ

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టిటిడిపి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డితో పాటు ఎల్, రమణ, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో పొత్తు అనే వ్యాఖ్యలపై ఎల్.రమణ వివరణ అడిగారు. అది ఎలా సాధ్యమని రమణ ప్రశ్నించారు. ఇదే ఆఖరి సమావేశం ఫోటోలు బాగా తీసుకోండంటూ ఉమా మాధవరెడ్డి జోక్ చేశారు. మరో వైపు ఇదే రేవంత్ రెడ్డి చివరి సమావేశం అంటూ అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

13:26 - October 20, 2017

గుంటూరు : టీడీపీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీ నేతలు తెలంణాణలో కాంట్రాక్టు పనులు పొందితే తప్పేంటి అని రాయపాటి అన్నారు. కాంట్రాక్టుల కోసం త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుస్తానన్నారు. కేసీఆర్‌ తనకు మంచి మిత్రుడన్నారు రాయపాటి. పోలవరం విషయంలో తీవ్రంగా నష్టపోయామన్నారు. త్వరలో ప్రధాని మోదీ కలుస్తానని...అందుకోసం అపాయింట్‌మెంట్‌ అడిగానన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే.. చంద్రబాబు నిధుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరుగుతున్నారన్నారు రాయపాటి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:25 - October 20, 2017

హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌ సమీపంలోని హోటల్‌ మారియట్‌లో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో సంపన్నవర్గాలకు చెందిన మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

13:24 - October 20, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్తచెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మృతులు శాంతినగర్‌కు చెందిన సాయిరాహుల్‌, సయ్యద్‌సాద్‌గా గుర్తించారు. చెరువులో గాలించి విద్యార్ధుల మృతదేహాలను వెలికితీశారు. 

షోలింగనల్లూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

చెన్నై:షోలింగనల్లూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది ఆంధ్రాకు చెందిన రిటైర్డ్ సైనికాధికారి కుటుంబం అని తెలుస్తోంది.

13:01 - October 20, 2017

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువులో పడి ఇద్దరి మృతి

రాజన్న సిరిసిల్ల: ప్రమాద వశాత్తు ఇద్దరు విద్యార్థులు సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువులో పడి మృతి చెందారు. మృతులు సాయి రాహుల్ (14) ఎనిమిదవ తరగతి, సయ్యద్ తాజ్ (13) ఏడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు శాంతి నగర్ వాసులు. నిన్న ఉదయం ఇద్దరు విద్యార్థులు ఇంటి నుండి బయటకు వెళ్లి విగతజీవులుగా మారారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

12:50 - October 20, 2017

సాధారణంగా మనకు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉండనే ఉంది. మరి ఉల్లి పొట్టు కూడా ఈ సామెతకు సరిగ్గా సరిపోతుందని చెప్తున్నారు మన శాస్తవేత్తలు. అదేంటో చూద్దాం...

ఉల్లిపాయను వాడుకునేటపుడు దానిపై ఉండే పట్టును తీసి పడేస్తుంటాము. కానీ ఉల్లిపట్టును కొన్ని నీళ్లలో వేసి మరగపెట్టి.. వడపోసి ఆ నీటిని తలస్నానం చేసిన తరువాత తలపై పోసుకుంటే జుట్టు పట్టులా మెరుస్తుంది. అంతేకాదు.. బాగా ఒత్తులా తయారువుతుంది.

హైపర్ టెన్షన్, ఒబేసిటీ తగ్గించడంలో...

అంతే కాదండోయ్.. ఉల్లిపాయ పొట్టుతో, హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు మరియు ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ పొట్టు హైపర్ టెన్షన్ మరియు ఓబేసిటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది, దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచిది. ఈ రెమెడీతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్, ఓబేసిటి తగ్గించుకోవచ్చు. రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తుంటే, ఈ హోం రెమెడీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు క్యుర్సిటిన్ అనే ఎంజైమ్ ధమనులను రక్తాన్ని వడపోయడంలో, రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడంతో హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు. ఈ రెండు న్యూట్రీషియన్స్ జీవక్రియల రేటును పెంచుతాయి.దాంతో శరీరంలో కొవ్వు తగ్గి, ఊబకాయన్ని తగ్గిస్తుంది.

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం కార్మికుల ఆందోళన

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. రవాణా విభాగంలో ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

12:28 - October 20, 2017
12:28 - October 20, 2017

హైదరాబాద్ : ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతల సమావేశం కొనసాగుతోంది. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరైయ్యాడు.

18 ఏళ్ల మగ ఏనుగు మృతి

తిరుపతి: ఎర్రవారిపాలెం మండలం కోటకాడపల్లి సమీపంలోని పంట పొలంలో 18 ఏళ్ల మగ ఏనుగు మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు మాత్రం అనారోగ్యంతో ఏనుగు మృతి చెందింది అని స్పష్టం చేశారు.

రాచకొండ కమిషనరేట్ లో గన్స్ కలకలం

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ లో గన్స్ కలకలం రేగింది. మల్కాజ్ గిరి, ఎల్బీనగర్ లో 3 గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఇద్దరి కూడా అరెస్ట్ చేశారు. షాట్ వెపన్, కంట్రీ మేడ్ ఫిస్టల్, రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లకు గన్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

'2022 నాటికి భారత్ ను అభివృద్ధి పథంలో నిలపడమే నాలక్ష్యం'

ఢిల్లీ: కేధార్ నాథ్ ఆయలంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... దీపావళి పర్వదినాన్ని దేశమంతటా ఘనంగా జరుపుకున్నారని, కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేస్తే.. దేవునికి సేవ చేసినట్లు అని అన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నపుడే కేదార్ నాథ్ ఆలయంపై ఆలోచించానని, 2022 నాటికి భారత్ ను అభివృద్ధి పథంలో నిలపడమే నాలక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు.

పోలవరం విషయంలో తీవ్రంగా నష్టపోయాం:ఎంపి రాయపాటి

గుంటూరు : ఎంపి రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. '10టివి'తో మాట్లాడుతూ.. ఆయన మాటల్లోనే 'త్వరలో కేసీఆర్ అపాయింట్ మెంట్ తీసుకొని రూ. 5వేల కోట్ల కాంట్రాక్టు అడుగుదామని అనుకున్నా,కేసీఆర్ నాకు మంచి స్నేహితుడు, కేసీఆర్ నాకు తప్పకుండా కాంట్రాక్ట్ ఇస్తారు. తెలంగాణ లో ఏపీ టీడిపి నేతలు కాంట్రాక్టులు పొందితే తప్పేముంది. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తాం. పోలవరం విషయంలో తీవ్రంగా నష్టపోయాం. త్వరలో ప్రధానిని కలిసేందుకు అపియింట్ మెంట్ అడిగా. సీఎస్ ఆర్ పండ్స్ కోసమే ప్రధానిని కలుస్తున్నా, పోలవరం గురించి ఎక్కడా మాట్లాడొద్దని బాబు సూచించారు.

తీవ్ర వడిదుడుకులతో దేశ ఆర్థిక వ్యవస్థ :రాఘవులు

భద్రాద్ది: మోదీ పాలనకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఢిల్లీలో నవంబర్ 10,11, 12 తేదీల్లో జరిగే దీక్షలకు సీపీఎం మద్ధతు ఇస్తోందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు తెలిపారు. ప్రొ కొదండరాం ప్రజల హక్కుల కోసం మాట్లాడుతుంటే కేసీఆర్ అక్రమ అరెస్టు చేయిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అన్ని కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర వడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిపారు.

ఫిర్జాదిగూడలోని బాలికల సదన్ లో సాయి ప్రజ్వల

మేడ్చల్:మేడిపల్లి పీఎస్ పరిధిలో అదృశ్యమైన బాలిక సాయి ప్రజ్వలను తిరుపతిలో పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఫిర్జాదిగూడలోని బాలికల సదన్ ఉంచారు. కౌన్సిలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

11:44 - October 20, 2017

ఎపుడూ వివాదాల్లో వుంటూ హీరోలను విమర్శిస్తూ తరువాత అభిమానులతో చివాట్లు పెట్టించుకోవడం బాలీవుడ్ సెలబ్రెటీ కమల్ ఖాన్ కు అలవాటు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్‌లో ఫీల్‌ అవుతారు. కానీ ఆ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్‌ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్‌ ట్వట్టర్‌ అకౌంట్‌నే బ్లాక్‌ చేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ రివ్యూ రాశాడు. సినిమా విడుదలకి ముందుగానే క్లైమాక్స్ కి సంబంధించి ఓ సమీక్ష రాసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఫైర్ అయిన అమీర్ అభిమానులు కమల్ ఖాన్ పై ఫిర్యాదు చేసి ట్విట్టర్ ఎకౌంట్ నిలిపివేశేలా చేశారు. దీంతో కమాల్ ఆర్ ఖాన్ మీడియాకి ఓ లేఖ రాశాడు. తాను ఎంతో వెచ్చించి 6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నట్టు చెప్పాడు. నాలుగేళ్ళల్లో దీని కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని కూడా అన్నాడు. దీనిపై కోర్టుకి వెళ్లి నేను ఖర్చు పెట్టిన డబ్బు నాకు తిరిగి వచ్చేలా చేయమని కోరతానని లేఖలో రాశాడు. తాను సినిమాలకు వ్యతిరేఖంగా సినిమా రివ్యూ రాయడం వలనే తన ట్విట్టర్ ఖాతా కోల్పోయానని చెబుతూ .. అమీర్ తనని ట్విట్టర్ లో ఉండనీయాలని అనుకోవడం లేదు అని చెప్పాడు. అమీర్ ఖాన్ రియల్ ట్విట్టర్ ఓనర్ .. జాక్ డోర్సీ కాదు అని అన్నాడు. ఇక తాను మరో ఖాతా తెరవాలని అనుకోవడం లేదని చెబుతూ.. చివరిగా ట్విట్టర్ కి , అమీర్ ఖాన్ కి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపాడు. ఇక నెటిజన్స్ .. కే ఆర్కే ట్విట్టర్ ఎకౌంట్ సస్పెండ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ దీపావళికి మంచి గిఫ్ట్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. అవడానికి బాలీవుడ్ రివ్యూ రైటరే అయినా తెలుగు సినిమాలను కూడా వదలరు. జాతీయ స్థాయిలో ఎందరో మెప్పు పొందిన బాహుబలి సినిమానూ విమర్శించారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌ను కూడా వదల్లేదు.

 

11:28 - October 20, 2017

తాజాగా విడుదలైన విజయ్ మెర్సల్ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. అమెరికాలో తొలిసారిగా 800 థియేటర్స్ లో ఈ మూవీ విడుదల కాగా, తొలి రోజు 3 లక్షల 57 వేల 925 డాలర్లు వసూలు చేసింది. గతంలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'దంగల్' (3లక్షల 28వేల డాలర్లు), షారూఖ్ 'రయీస్' సినిమా (3లక్షల 49వేల డాలర్లు) పై ఉన్న రికార్డులని ఈ చిత్రం చెరిపేసింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ త్రిపాతాభినయం పోషించాడు. అక్టోబర్ 18న దీపావళి శుభాకాంక్షలతో ఈ చిత్రం విడుదైలంది. సమంత, నిత్యామీనన్, కాజల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

11:19 - October 20, 2017

కంట్రోల్‌+ఆల్ట్‌+డై అనేది ఉప శీర్షికతో, సైన్స్‌ ఫిక్షన్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కీ'. దీపావళి సందర్భంగా 'కీ' సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు జీవా ‘కీ’ చిత్రంలో ప్రధాన భూమిక పోసిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘మీ ఫోన్లో ఇంటర్నెట్‌ ఉంటే మీరు మాత్రమే ప్రపంచాన్ని చూస్తున్నట్లు కాదు. ప్రపంచం మిమ్మల్ని కూడా చూస్తున్నట్టే’ అంటున్నారు. ‘మీరు ఎప్పుడు ఏడుస్తారు.. ఎప్పుడు నవ్వుతారు.. ఎప్పుడు ఐ లవ్‌వ్యూ చెబుతారోనని మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు’ అంటూ వినిపించే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఆట బ్లూవేల్‌. ఈ నేపథ్యంతోనే తాజా చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కృష్ణ క్రియేషన్స్‌ బ్యానర్‌లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌ పతాకంపై మైకేల్‌ రాయప్పన్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

11:08 - October 20, 2017
11:07 - October 20, 2017

హైదరాబాద్ : కాసేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. నేడు జగన్ పాదయాత్ర పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. పాదయాత్ర నేపథ్యంలో 6 నెలలపాటు ప్రత్యేక్ష విచారణ నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. తీర్పు ఎలా వస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఎంపి రాయపాటి ఇంటిని ముట్టడించిన ఎమ్మార్పీఎస్

గుంటూరు: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంపి రాయపాటి ఇంటిని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు.

11:01 - October 20, 2017

యంగ్‌హీరో రాజ్‌తరుణ్ లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. దీపావళి సందర్భంగా యూనిట్ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ అమైరా దస్తూర్‌. అమైరా హ్యాండ్‌‌బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను రాజ్ దొంగిలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనారెడ్డి డైరెక్టర్. 

10:55 - October 20, 2017

టాలీవుడ్ పరిశ్రమలో మరో మల్టీస్టారర్‌ చిత్రానికి రంగం సిద్ధమైంది. ఈసారి నాగార్జున, నాని కలిసి నటించబోతున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్న ఆ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వచ్చే యేడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ‘భలేమంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. తనదైన శైలి వినోదంతో సాగే ఓ కథని సిద్ధం చేశారు. అది విన్న కథానాయకులిద్దరూ సినిమా చేయడానికి పచ్చజెండా వూపేశారు. 

హత్య కేసులో ఏసీపీ రవిబాబు లొంగుబాటు

విశాఖ: రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఏసీపీ రవిబాబు లొంగిపోయాడు. చోడవర పీఎస్ లో ఏసీపీ లొంగిపోయాడు. చోడవరం పోలీసులు విశాఖకు తరలించారు. ఆర్టీసీలో విజిలెన్స్ అధికారిగా రవిబాబు పని చేస్తున్నారు.

కేదార్ నాథ్ ఆలయంలో ప్రధాని పూజలు

ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజు కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చలికాలంలో అక్కడకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా శనివారం నుంచి ఆరునెలల వరకు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసి ఉంచుతారు. ‌కేదార్‌నాథ్‌ పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయనున్నారు. 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధి పునర్నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ విమానాశ్రయం, కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

10:47 - October 20, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేతలు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:42 - October 20, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. అనేక టైటిల్స్ వినిపించినప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దీపావళికి వస్తుందని అభిమానులు భావించారు. కాని అభిమానుల ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ యూనిట్ ఓన్లీ శుభాకాంక్షలతో సరిపెడుతున్నట్లుగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది . దీంతో అభిమానులకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే చిత్ర టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. పవన్ 25 చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఇందులో పవన్ స్టార్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

10:36 - October 20, 2017

 

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నాగపట్టణం జిల్లా సోనచేనక తె బస్ బొపో గ్యారేజ్ కుప్పకూలిపోయింది. 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. అధికారులు సహాయకచర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మహిళా సర్పంచ్ పై ఎసై లైంగిక వేధింపులు...

నెల్లూరు: ఓ మహిళా సర్పంచ్‌పై ఎస్సై లైంగింక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే ఫోన్లు చేసి వేధిస్తుండటంతో ఆ సర్పంచ్ ఎస్సై ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేసి సాక్షాలతో ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన ఎస్పీ... ఎస్సై ఏడుకొండలుపై సస్పెన్సన్‌ వేటు పడింది.

నాగార్జున సాగర్ కు తగ్గిన వరద

నల్గొండ: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవహం తగ్గింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 569.50 అడుగుల నీటిమట్టం ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 255.32 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిలువ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 32.04 టీఎంసీలు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 73,683 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

నేడు ఓబులాపురం గనుల కేసు విచారణ

హైదరాబాద్: ఓబులాపురం గనుల కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్థన్ రెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీహోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

మారియట్ హోటల్ లో టాస్క్ ఫోర్సు దాడులు

హైదరాబాద్: మారియట్ హోటల్ లో టాస్క్ ఫోర్సు పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ నతిఖీల్లో పేకాట ఆడుతూ 37 మంది పట్టుపడ్డారు. నిందితుల్లో సంపన్న కుటుంబాల వాళ్లున్నట్లు సమాచారం. హోటల్లో 17 గదులను వారం రోజుల కు సంజయ్ అనే వ్యక్తి బుక్ చేశారు.

బస్ డిపో గ్యారేజ్ కూలి :8మంది మృతి

తమిళనాడు : పొరయార్ లో బస్ డిపో గ్యారేజీ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మెకానిక్ లు, ముగ్గురు డ్రైవర్లు, కండక్టర్ ఉన్నట్లు సమాచారం. పురాతనమైన భవనం కావడం వల్లే బస్ డిపో గ్యారేజీ కూలిపోయిందని అధికారులు తెలిపారు. పురాతన గ్యారేజీ అని తెలిసినా కూడా అధికారులు పట్టించుకో లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

09:58 - October 20, 2017

 

పశ్చిమగోదావరి : కార్తీకమాసం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తొలి రోజు కావడంతో భక్తులు స్వామివారికి దీపారాధన చేసి... భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. 

09:55 - October 20, 2017

హైదరాబాద్ : దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ పలు ప్రాంతాల్లో అనేకమంది గాయపడ్డారు. హైదరాబాద్‌లో సరోజినిదేవి కంటి ఆస్పత్రికి కళ్లకు గాయాలైన బాధితులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 35 కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇందులో 12 కేసులు క్రిటికల్‌గా ఉన్నాయన్నారు. ఆస్పత్రి వచ్చిన పేషెంట్‌లలో ఏడుగురు చిన్నపిల్లలు ఉన్నారన్నారు. నిన్న రాత్రికి ఒకరికి ఆపరేషన్‌ చేశామని... ప్రస్తుతం ఐదుగురు చిన్నారులకు ఆపరేషన్లు చేస్తామంటున్నారు వైద్యులు. 

09:52 - October 20, 2017

తూర్పుగోదావరి : కార్తీకమాసం సందర్బంగా రాజమహేంద్రవరం గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శుద్ద పాడ్యమి అయిన ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తే శుభం జరుగుతుందన్న విశ్వాసంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, గౌతమిఘాట్‌లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కార్తీకమాసంలో నది స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భక్తులంటున్నారు.

తీరం దాటిన వాయుగుండం

విశాఖ : బంగాళఖాతంలో ఏర్పాడిన వాయుగుండం పారాద్వీప్ చాంద్ బాలీ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలో పలుచోట్ల, ఉత్తరకొస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండడంతో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

09:07 - October 20, 2017

విశాఖ : బంగాళఖాతంలో ఏర్పాడిన వాయుగుండం పారాద్వీప్ చాంద్ బాలీ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలో పలుచోట్ల, ఉత్తరకొస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండడంతో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:49 - October 20, 2017

టెన్ టివి సినిమా : ఏకంగా 6 ఏళ్లు ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత . గోవాలో ఇరు సంప్రదాయాల ప్రకారం వారు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అక్కినేని ఇంట నాగర్జున పెద్ద కుమారుడు వివాహం జరిగింది కానీ కొంత మంది మధ్య జరిగింది. రిసెప్షన్ కూడా లేదని అక్కినేని అభిమానుల బాధపడుతున్నారు. వీరి పెళ్లి తర్వాత వెంటనే హైదరాబాద్ లో భారీ ఎంత్తున రిసెప్షన్ ఉంటుందని అనుకున్నారు. కానీ దినిపై నాగర్జున ఎటుబవంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే నాగర్జున మొదటి భార్య నాగతచైతన్య తల్లి లక్ష్మి తన పుట్టింటి వారి సమక్షంలో కొడుకుకి చిన్న రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ వేడుకను చైతన్య పెద్ద మేన మామ దగ్గుబటి సురేష్ ఘనంగా నిర్వహించడానికి రెడీ అవుతునట్లు తెలుస్తోంది. కానీ ఈ రిసెప్షన్ పార్టీలో కేవలం వెంకటేష్, రానా, మరియు దగ్గుబటి బంధువులు మాత్రమే పాల్గొంటాని సమాచారం. నెల్లూరు కారంచేడు, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి దగ్గుబటి దగ్గరి బంధువులు రానున్నట్లు వినిపిస్తోంది. సురేష్ బాబు తన ఇంట్లో ప్రయివేట్ గా కేవలం కుటుంబ సభ్యుల కోసం మాత్రమే రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారట. 

దీపావళి వేడుకల్లో అపశృతి

హైదరాబాద్ : దీపావళి వేడుకల్లో అపసృతి చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల్లో బాణాసంచా కాలుస్తుండగా 18 మందికి గాయాలు వారిని ఆసుపత్రికి తరలించారు.

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ

గుంటూరు : నేడు టీడీపీ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

08:16 - October 20, 2017
08:06 - October 20, 2017
08:05 - October 20, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో దీపావలి పండుగ పర్వదినాన పలువురికి గాయాలు అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో టపాసులు పేల్చుతుండగా 18 మందికి గాయాలు అయ్యాయి. వీరి కళ్లకు గాయాలు కావడంతో చికిత్స కోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారిని పరీక్షించి వైద్యం అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజీనింగ్‌ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి బాణసంచా కాల్చుతూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం బైరాగిమఠం ఆలయ రథం తారాజువ్వపడి పూర్తిగా కాలిపోయింది. రథానికి ఎలాంటి రక్షణ కవటం సరిగా లేకపోవడంతో అగ్నికి ఆహుతైంది. రథాన్ని తాటాకులతో కప్పి ఉంచారు. తారాజువ్వ పడ్డ వెంటనే మంటలు అంటుకుని క్షణాల్లో అగ్నికి ఆహుతైంది. దీంతో ఈ మధ్యే నూతనంగా ఏర్పాటు చేసిన రథం కాలి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో 32 లక్షల ఆస్తినష్టం జరిగింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్‌- 5 సీడబ్ల్యూసీలో ఈ ప్రమాదం జరిగింది. దీపావళి విక్రయాలు జరిపేందుకు మందుగుండును ఓ గోదాంలో నిల్వచేశారు. ఈ గోదాంలో మంటలు అంటుకోవడంతో.. దట్టంగా పొగ అలముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని సబ్బుల తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ యజమాని వెంకటేశన్‌ సజీవదహనమయ్యాడు. కంపెలోకి బాణాసంచా దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది.

08:04 - October 20, 2017

హైదరాబాద్ : శ్మశాన వాటికి చూడు ఎలా విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతోందో.. అరె చనిపోయినోళ్లను వీళ్లు బాగా గుర్తు చేసుకుంటున్నట్టుంది కదూ. తమవారిని గుర్తు యాదిచేసుకుంటూ శ్మశానంలో వారి గోరీల దగ్గర పిండ ప్రదానాలు చేస్తున్నట్టూ ఉంది కదా. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వీరంతా శ్మశాన వాటికల్లో దీపావళి జపుకుంటున్నారు.

సమాధుల దగ్గర దీపావళి
హైదరాబాద్‌లోని పలు శ్మశాన వాటికలు దీపావళి పర్వదినాన కళకళలాడాయి. జనం రాకతో సందడిగా మారాయి. దీపాల వెలుగులు, టపాసుల మోతలతో కోలాహళంగా మారాయి. హైదరాబాద్‌లోని పలు బస్తీల వాసులు దీపావళి వచ్చిందంటే చాలు శ్మశాన వాటికలవైపు పయనం అవుతారు. అందరిలాగా వీరు దివాళిని ఇంట్లో జరుపుకోరు. తమను కనిపెంచి... జీవితానికో దారి చూపించి.. అనంతవాయువుల్లో కలిసిపోయిన వారి సమాధుల దగ్గర దీపావళి జరుపుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకే వారంతా శ్మశాన వాటికల్లో దీపావళి జరుపుకున్నారు. తమవారి సమాధులపై దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు.

శ్మశాన వాటికల్లో ప్రతిఏటా దీపావళి పండుగ
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, రామ్‌నగర్‌, అంబర్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో శ్మశాన వాటికల్లో ప్రతిఏటా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇదొక ఆచారంగా కూడా వస్తోంది. దీపావళి రోజు ఉదయమే తమవారి సమాధులకు రంగులువేసి, విద్యుత్‌ లైట్లు అమర్చారు. పూలు, పండ్లతో సమాధులను అందంగా అలంకరించారు. చనిపోయిన వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలు సమాధులపై ఉంచారు. ఇక సాయంత్రం దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు.పండుగ పర్వదినాన తమ పితృదేవతలను గుర్తు చేసుకున్నారు. . వారికి ఇష్టమైన ఆహాపపదార్ధాలను పెట్టి ఆ తర్వాత ఆరగించారు. ఇందుకోసం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా దీపావళికి ప్రతిఏటా వస్తారు. తమ పితృదేవతల దగ్గర పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని వారు చెబుతున్నారు.

08:03 - October 20, 2017

కరీంనగర్/పెద్దపల్లి : మంథని టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే పుట్ట మధు, టిఆర్ఎస్ యువ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మంథనిలో పార్టీ విస్తృతికి సునీల్‌రెడ్డి కుటుంబం పనిచేసినప్పటికీ గత ఎన్నికల్లో చుక్కెదురైది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం పుట్ట మధుకు టిక్కెట్‌ ఇచ్చింది. ఈవిషయంలో కేసీఆర్‌ కుమార్తె కవిత చక్రం తిప్పారు. పార్టీ కోసం శ్రమించిన సునిల్ రెడ్డి, ఈయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని షాక్ ఇవ్వడంతో మూడేళ్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ క్రియాశీలకంగా మారిన సునీల్‌రెడ్డి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో మంథని టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెడ్డ పేరు
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మధు చేతిలో శ్రీధర్‌బాబు ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోయారు. మధుకు బీసీ మద్దతు ఉండటంతో విజయం సాధించారు. మధు గెలుపుతో మంథని అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని భావించిన నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైంది. కొన్ని వివాదాలు ఇటు మధుతోపాటు, అటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. పద్ధతి మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సందర్భాల్లో మధును హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడం.. పార్టీ అధినాయకత్వం ఇతని విషయాలను నిశితంగా పరిశీలిస్తోంది. మధుకర్‌ అనుమానాస్పద మృతి, అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు, కాంగ్రెస్‌ నేతలపై దాడుల కేసులు, మంథనిలో విగ్రహాల ధ్వంసం కుట్రల వెనుక ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

132 మంది తాత్కాలిక ఉద్యోగులు తొలగింపు
ఎమ్మెల్యే మధు వ్యవహర శైలిపై టీఆర్‌ఎస్‌లో చాలా మందికి నచ్చడంలేదు. మంథని జెఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో 132 మంది తాత్కాలిక ఉద్యోగులు తొలగింపు వివాదం కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పరిణమించింది. కమాన్‌పూర్ మండల టీఆర్‌ఎస్‌ నేతలను పార్టీని నుంచి సస్పెండ్ చేయాడం ప్రస్తుతం వివాదంగా మారింది. సస్పెండ్ అయిన వారంత సెల్ టవర్ ఎక్కి ఆందోళన కోనసాగించి సునీల్ రెడ్డి నేతృత్వంలో మధుకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి పిర్యాదు చేయాలని నిర్ణయించడం ఎమ్మెల్యేకి నష్టం కలించే అంశంగా భావిస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎదురు తిరుగుతున్నారు. కార్మికుల ఫీఎఫ్‌ సోమ్మును కాజేసిన మార్కెట్ కమిటి చైర్మన్ ఆకుల కిరణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే మధు పరువు తీసిన ఎంపీపీ కమల తనయుడు శ్రీధర్ నకిలీ ఎస్ ఐ అవతారం ఎత్తి ...పోలీసులకు దొరికి... ఎమ్మెల్యే పేరును వాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నా ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీస్తున్నారు.

సామాజిక వర్గాల మద్దతు
మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న సునీల్ రెడ్డి వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని క్రియాశీలకంగా మారారు. ఎమ్మెల్యే వ్యతిరేకులను ఏకం చేస్తున్నారు. సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే మధుకు మింగుడు పడటంలేదు. కాటారంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పుట్ట మధు, సునీల్‌రెడ్డి వర్గీయుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అధినాయకత్వం దృష్టికి వెళ్లాయి. మంథని నియోజకవర్గంలో సునీల్‌రెడ్డి దూకుడు వెనుక పార్టీ అధినాకుల ప్రోదల్బం ఉందని భావిస్తున్నారు. సునీల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంథని ఎమ్మెల్యే మధు కూడా టికెట్‌ ఇస్తారా.. అన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నాయకుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంథనిలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతల మధ్య జరుగుతున్న వివాదాన్ని మాజీ మంత్రి శ్రీధర్ బాబు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో చేజార్చుకున్న మంథని స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

08:01 - October 20, 2017

హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలపై చ‌ర్చించేందుకు 23న తెలంగాణ మంత్రి వ‌ర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమై ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యులకు సూచనలు, సలహాలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సభ్యులతో ఓ దఫా భేటీ అయిన సీఎం.. ఏ ఏ అంశాలు స‌భ‌ముందుంచాల‌నే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టి-మాస్ ఫోరం, వామపక్షాల యాత్రలు.. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో.. సమావేశంలో ఆచితూచి మాట్లాడాలని సభ్యులకు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా త‌మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని నిర్ణయించారు.

కీలక బిల్లులు
మ‌రోవైపు పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్పటికే సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు బిల్లులకు సంబంధించి..తిరిగి సభలో చర్చించాలనుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలు ఉంటాయని సమాచారం. సభా సమరంలో పై చేయి అధికార పార్టీదా, లేక విపక్షాలదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

08:00 - October 20, 2017

అమెరికా : అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాలో మెగా సీడ్‌ పార్కు అభివృద్ధిపై అయోవా స్టేట్‌ యూనివర్సిటీలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. అయోవా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రంలోని సేద్యపు పద్ధతులను చంద్రబాబు వివరించారు. వ్యవసాయం రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు సహాయ, సహకారాలు అందించాలని సమావేశంలో పాల్గొన్న వివిధ కంపెనీలు ప్రతినిధులు, శాస్త్రవేత్తను చంద్రబాబు కోరారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి వివరించారు.

పయనీర్‌ ఆవిష్కరణల కేంద్రాన్ని పరిశీలిన
పయనీర్‌ కంపెనీని చంద్రబాబు సందర్శించారు. పయనీర్‌ ఆవిష్కరణల కేంద్రాన్ని పరిశీలించారు. కంపెనీ కార్యక్రమాలను తెలుసుకున్నారు. వ్యవసాయ రంగంలో పయనీర్‌ ఉపయోగిస్తున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని చంద్రబాబు పరిశీలించారు. తమ ప్రాజెక్టులు గురించి పయనీయ్‌ గ్లోబల్‌ ఉపాధ్యక్షుడు బ్రాడ్‌ లాన్స్‌ వివరించారు. గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో అమలవుతున్న పయనీర్‌ కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు. విత్తన సంస్థల సీఈవోలు, శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విత్తన కంపెనీల అధిపతులను కోరారు. మొక్కలు జన్యువుల అభివృద్ధి సరఫదారుగా పయనీర్‌కు మంచి పేరు ఉంది. తొంబైకి పైగా దేశాలయలో పయనీర్‌ కార్యకలాపాలు సాగుతున్నాయి. 

07:40 - October 20, 2017

పెట్రోల్, డిజీల్ ను జీఎస్టీలోకి తీసుకురావాలని, దీని వల్ల ఆర్టీసీ పై భారం తగ్గుతుందని, ఆర్టీసీ బస్సు కొనలంటే సెస్స్ 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని, జీఎస్టీ అంటే దేశం మొత్తం ఒకే పన్ను విధానమని, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పెట్రోల్ ధరను అంతర్జాతీయంగా పెరుగుతున్నాయని దీంతో ధర పెంచాల్సి వస్తోందని చెప్పి తగ్గినప్పుడు మాత్రం తగ్తించడంలేదని స్టాప్ పెడరేషన్ వీఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:35 - October 20, 2017

దేశంలో సంస్కృతిక విధ్యసం జరిగే పరిస్థితి పెరిగిందని, దీంతో ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించి ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారని, తాజ్ మహల్ గురించి మాట్లాడుకొవడం కాదు దేశం అభివృద్ధి చెందడం ముఖ్యమని ప్రముఖ విశ్లేషకులు వీరయ్య అన్నారు. తాజ్ మహల్ మతానికి సంబంధం లేదని, బీజేపీ పార్టీ దాన్ని టూరిజం నుంచి తీసివేయాలేదని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss