Activities calendar

21 October 2017

21:31 - October 21, 2017

ముంబై : నెహ్రూనగర్‌కు చెందిన ఓ యువకుడు ఓ మైనర్ బాలికను చెంపలు వాచేలా కొట్టాడు. ఆ యువకుడు స్నేహితులతో కలిసి గట్టిగా మాట్లాడుతుండడంతో ఆ అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేసింది. గట్టిగా మాట్లాడవద్దన్నందుకు ఆ బాలికను చితక్కొట్టాడు. మైనర్‌ బాలికను కొడుతున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా కనిపించింది. ఆ అమ్మాయిపై చేయిచేసుకున్న వ్యక్తిని ఇమ్రాన్ షాహిద్ షేక్‌గా గుర్తించారు. స్టిచ్చింగ్ క్లాస్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్తున్న అమ్మాయిపై ఇమ్రాన్ దాడి చేశాడు. గట్టిగా పంచ్‌లు విసరడంతో ఆ అమ్మాయి అక్కడే నేలకూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. దాడి చేసిన ఇమ్రాన్‌తో పాటు అమ్మాయి కూడా ఒకే బిల్డింగ్‌లో ఉండడం గమనార్హం. నాలుగురోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత రోజున అతడిని బెయిల్‌పై వదిలిపెట్టారు. 

21:31 - October 21, 2017

ఢిల్లీ : ఈనెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ... భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కొత్తగా యువ పేసర్ శార్థూల్ ఠాకూర్,  వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్కసారి కూడా బ్యాటింగ్‌ అవకాశం రాని కేఎల్‌.రాహుల్‌ను ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌ వన్డే సిరీస్‌కు దూరమైన శిఖర్‌ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌-జడేజాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్‌ పర్యటనలో రాణించిన యువ స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను కొనసాగించారు. సిరీస్‌ తొలి వన్డే అక్టోబర్‌ 22న ముంబైలో జరగనుంది.

21:30 - October 21, 2017

జమ్మూ కాశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో పాకిస్తాన్‌ ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. ఉదయం 11-30 ప్రాంతంలో జరిపిన ఈ కాల్పుల్లో ఓ పోర్టర్‌ మృతి చెందాడు. మృతుడిని కమల్‌కోట్‌కు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌గా అధికారులు గుర్తించారు. పాక్‌ కాల్పులను భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.

21:29 - October 21, 2017

ఢిల్లీ : తమిళ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంలో ప్రధాని మోదిని టార్గెట్‌ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. తమ సంస్కృతిని, భాషను సినిమా ద్వారా వ్యక్తిపరిచేందుకు తమిళులు ఇష్టపడుతారని రాహుల్‌ తెలిపారు. ఈ సినిమా వివాదంలో తలదూర్చి.. తమిళుల ప్రతిష్టను డిమానీటైజ్ చేయరాదంటూ మోదీని కోరుతూ రాహుల్ ట్వీట్‌ చేశారు. మెర్సల్‌ సినిమాలో జిఎస్‌టి, నోట్లరద్దుకు వ్యతిరేకంగా ఉన్న దృశ్యాలను తొలగించాలని బిజెపి కోరుతోంది.

 

మెర్సల్ సినిమాపై రాహుల్ ట్వీట్...

ఢిల్లీ : తమిళ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంలో ప్రధాని మోదిని టార్గెట్‌ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.

విశ్రాంతి తీసుకోనున్న ఉప రాష్ట్రపతి...

ఢిల్లీ : స్వల్ప అస్వస్థతతో నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు స్టంట్ ఏర్పాటు చేశారు. నిన్న ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన గుండె రక్తనాళంలో వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ గుర్తించారు. దీంతో స్టంట్‌ అమర్చారు. మూడు రోజులపాటు పూర్తిగా విశ్రాంత్రి తీసుకోవాలని ఎయిమ్స్‌ వైద్యబృందం సూచించింది. 

పవన్ కు గాయం ?

హైదరాబాద్ : సినీ నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్ కు స్వల్ప గాయమైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవన్ నటిస్తున్న షూటింగ్‌ కర్ణాటకలోని మంగుళూరు ఏరియాలో జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో 'పవర్‌' స్టార్‌ ఎడమ చేతికి గాయమైందని తెలుస్తోంది. పవన్‌ చేతికి గాయమైన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వరంగలో కేసీఆర్ సభ..

వరంగల్ : జిల్లాలో శనివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభకు దాదాపు 2 లక్షల మంది హాజరౌతారని మంత్రి తెలిపారు. 

ఆదివారం కేసీఆర్ వరంగల్ పర్యటన..

వరంగల్ : సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ రూరల్ జిల్లాలో పర్యటించనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం ద్వారా హెలికాప్టర్ వరంగల్ రూరల్ జిల్లాకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుని కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు. 

21:21 - October 21, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, కమిషనర్లతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అమరవీరులకు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఘన నివాళులు అర్పించారు. వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు బహుమతులు అందించారు. సరూర్‌నగర్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. నల్లగొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వికారాబాద్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆయుధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్‌ స్టేషన్ సర్కిల్‌లో అమరవీరుల దినోత్సవంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో సాయుధ బలగాలు ప్రత్యేక కవాతు నిర్వహించాయి. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్‌ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ప్రకాష్‌రావ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఏపీలో..
అటు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను డిప్యూటీ సీఎం ప్రశంసించారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసుల కుటుంబాలకు బట్టల పంపిణీ చేశారు. విద్యార్ధులకు బహుమతులు అందజేసారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్ధులతో కలిసి పోలీసులు మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు స్ధానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. వారంరోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. విశాఖ సాగరతీరంలో పోలీసు సంస్మరణ దినోత్సవం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌, పోలీస్ కమిషనర్ యోగానంద్‌తో పాటు విశాఖ ఎంపీ హరిబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకల్లో మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌లతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకూ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వారంరోజులుగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. అమరవీరుల కుటుంబసభ్యులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

21:18 - October 21, 2017

సిద్ధిపేట : మావూరు మాగ్గావాలె.. మా బతుకుల మీద దెబ్బకొట్టొద్దు.. ఇదీ మల్లన్నసాగర్‌పై తొలిసారిగా నిర్వహించిన గ్రామసభలో నిర్వాసితులు అభిప్రాయం. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో గ్రామసభ జరిగింది. గ్రామసభలో పాల్గొన్న ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలన్నీ జిల్లా అధికారులు రికార్డు చేసుకున్నారు. ఈ వివరాలను కోర్టుకు అందించనున్నారు.

ఐదువందల రోజులకుపైగా నిరాహార దీక్షలు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ అనుమతి నిరాకరణ, న్యాయస్థానం అక్షింతలు.. ఈ పరిణామాలతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించండన్న హైకోర్టు ఆదేశాలతో నిర్వాసిత గ్రామం వేములఘాట్‌లో ప్రభుత్వం గ్రామసభ నిర్వహించింది. ఆర్డీవో, భూ సేకరణ అధికారి నేతృత్వంలో ఈ గ్రామసభ జరిగింది.

ఒకటి కాదు రెండు కాదు 504 రోజుల దీక్షల ఫలితంగా ఎట్టకేలకు అధికారులు నిర్వాసితుల దగ్గరకు వచ్చారు. మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామం వేములఘాట్‌లో గ్రామసభ నిర్వహించారు. అయితే అంతా పోలీసులు, ప్రభుత్వ అధికారుల హడావిడే తప్ప.. పునరావాసం, పరిహారంపై క్లారిటీ ఇవ్వలేదని గ్రామస్తులు అంటున్నారు.

మొదటి నుంచి మల్లన్నసార్‌ నిర్వాసిత గ్రామాల్లో బలవంతపు భూసేకరణకే పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోలేదు. అధికారులు గ్రామంలోకి రావడం.. ఇచ్చినంత తీసుకుని.. కిక్కరుమనకుండా ఊరును ఖాళీ చేయాల్సిందే అని .. నానా హంగామా చేశారు. అంతేకాదు.. ముంపు గ్రామాలు ఎప్పటికైనా ఖాళీ చేసేవే అంటూ.. ప్రభుత్వ పథకాలు ఏవీ అమలు కాకుండా అధికారులు అడ్డకున్నారు. చివరికి గ్రామాలకు బస్సులు కూడా రాకుండా నిలిపేసి ఇబ్బందుల పాలు చేశారని కేసీఆర్‌ సర్కార్‌పై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై ముంపుగ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని.. వేములఘాట్‌ వాసులు అంటున్నారు. ఉన్నట్టుండి పొమ్మంటే ఎక్కడికి పోవాలి.. మా బతుకుల మీద దెబ్బకొడుతున్నారని అధికారులను నిలదీశారు. మాకు చదువులు ఆగిపోతున్నాయని విద్యార్థులు అంటే.. ఉన్న ఎకరం భూమిని మీరు తీసుకుంటే... మా జీవనం ఎలా సాగుతుందని రైతు కుటుంబాలు ప్రశ్నించాయి.

మొత్తానికి గ్రామస్తుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన అధికారులు.. పునరావాసం, పరిహారంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సభను ముగించారు. గ్రామస్తుల అభిప్రాయాలు రికార్డు చేసుకున్న అధికారులు.. సమాచారాన్ని హైకోర్టుకు అందించనున్నారు. ఎప్పటిలాగనే మాయమాటలు చెప్పారని వేములఘాట్‌ ప్రజలు అంటున్నారు. ఈనెల 25న న్యాయస్థానం ముందు విచారణ జరగనుండటంతో... తమకు కచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందని మల్లన్నసాగర్‌ నిర్వాసితులు అంటున్నారు.  

21:16 - October 21, 2017

హైదరాబాద్ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి వైద్య ఆరోగ్యశాఖ మరింత క్రియాశీలంగా పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ కిట్‌ పథకంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. పనిభారం పెరిగినా ఓపికతో, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి లక్ష్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

21:15 - October 21, 2017

హైదరాబాద్ : రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై సరైన విధానం అమలు చేయాలన్నారు సీఎం కేసీఆర్. బియ్యం, నిత్యావసరాలకు బదులు అంతే మొత్తం నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమచేసే విధానంపై సీఎంకు అధికారులు వివరించారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏటా 6వేల 500 కోట్లు ఖర్చుపెట్టి పేదల కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తోంది. అయితే లబ్దిదారులకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పేదలకు అందాల్సిన పథకం దొడ్డిదారి పడుతుంటే ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ సివిల్ సప్లై అధికారులతో... ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పేదల కోసం ఖర్చుపెట్టే మొత్తం నూటికి నూరు శాతం ఉపయోగపడేలా ఓ మంచి విధానం అమలు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

సీఎం సూచన మేరకు అధికారులు స్పందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో వచ్చిన మార్పులను వివరించారు. ముఖ్యంగా రేషన్ షాపుల ద్వారా సరుకులు అందించే బదులు నగదునే నేరుగా లబ్దిదారులకు అందించే విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలులో ఉందని చెప్పారు. సరుకుకు బదులుగా నగదునే లబ్దిదారులకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఈ అంశంపై మరోసారి పునరాలోచన అధికారులను కోరారు. మరోవైపు రేషన్ డీలర్లు సమ్మెకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టినట్లు అధికారుల సీఎంకు తెలిపారు.

21:13 - October 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 8వేల 792 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి రెండవవారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది.

మొత్తం పోస్టులలో స్కూల్ అసిస్టెంట్లు 1,941 ఉండగా.. SGTలు 5వేల 415 పోస్టులున్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 416 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. లాంగ్వేజ్‌ పండిట్స్‌ 1,011 పోస్టులండగా.. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 9 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీల వారీగా ఐదు నోటిపికేషన్లు జారీచేశారు. పాత డీఎస్సీ తరహాలో పరీక్ష నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి.

ఇక అభ్యర్థి స్ధానికతను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయించారు. అంటే అభ్యర్ధి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువును పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్ధానికత వర్తిస్తుంది. జిల్లాల పునర్విభజన మేరకు ఆ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో.. ఆ జిల్లాను అభ్యర్ధి స్ధానిక జిల్లాగా పరిగణిస్తారు. 8,9,10 తరగతులు ఎక్కడ చదివితే ఆ జిల్లాన్ని స్ధానిక జిల్లాగా తీసుకుంటామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

కొత్త జిల్లాల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుండి నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్ణయించారు. 2018 , ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు TSPSC వెల్లడించింది. 

21:02 - October 21, 2017

భూమన కరుణాకర్ రెడ్డి..వైసీపీ సీనియర్ నేత. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ పలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ అవినీతి అక్రమాల కేసు ఎదుర్కొంటున్నందున ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిపై హాజరు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు పెండింగ్ లో ఉంది. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకొనే అంశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ వ్యూహ రచనలు రచించేందుకు ప్రశాంత్ కిషోర్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఎన్నో అంశాలను తెలుసుకొనేందుకు భూమన కరుణాకర్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:24 - October 21, 2017

ఈ నడ్మ ఆన్ లైన్ మోసాలు ఎక్వైపోయినయ్ గదా..? ఇర్వైవేల రూపాల ఫోను నాల్గువేలకే ఇస్తున్నం అని చెప్పంగనే అబ్బా అగ్వకొస్తున్నదని ఎగవడి పైసలు గడ్తున్నరు పార్సల్ ఇప్పిసూశి ఎడ్డిమొఖం ఏస్తున్నరు.. మాజీ నల్లగొండ జిల్లాల ఇద్దరు మోసపోయిండ్రు.. ఒకాయినకు సెల్ ఫోన్ వచ్చేదుంటే రాళ్లొచ్చినయ్.. ఇంకొకాయినకు ఇర్వైవేల ఫోనుకు బదులు ధనలక్ష్మీ యంత్రమొచ్చింది..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ప్రపంచ తెలుగు మహాసభల వెబ్ సైట్ ప్రారంభం..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల వెబ్ సైట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నగరంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న సంగతి తెలిసిందే.
 

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు..

హైదరాబాద్ : వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 4500 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ల వేతనాలు పెంచుతూ జీవో జారీ చేశారు. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు రూ. 25వేలు, స్పెషల్ గ్రేడ్ ఛైర్మన్ కు రూ. 20వేలు, ఇతర గ్రేడ్ ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ లకు రూ. 15వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

19:55 - October 21, 2017

'రాజు గారి గది -2' సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉందని హీరో అశ్విన్ బాబు పేర్కొన్నారు. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' ప్రధాన పాత్రలో..టాలీవుడ్ నటి 'సమంత' కీలక పాత్రలో నటించిన 'రాజు గారి గది -2' సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ తో టెన్ టివి ముచ్చటించింది. ఇది హర్రర్ సినిమా కాదని, తొలుత 'రాజు గారి గది -2' సినిమాను వెంకటేష్ తో చేయాలని అనుకోవడం జరిగిందన్నారు. తమకు సినిమాలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఒక ముఖ్యమైన పాత్రలో నటించేందుకు నాగార్జునను అప్రోచ్ కావడం..ఆయనతో నటించడం అదృష్టమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..... 

19:53 - October 21, 2017

తెలంగాణలున్న బీసీ ప్రజలారా..? మీరు ఒక్కటి బాగ ఆలోచన జేస్కోండ్రి.. ఈ రాష్ట్రంల మీ జనాభా ఎంత..? : ఆలేరు ప్రాంత రైతాంగం సొంటెండ వెట్టి.. సిద్దిపేటకు నీళ్లు ఎత్కపోతున్న హరీష్ రావు మీద ఇగ లడాయే అంటున్నరు ఆలేరు ప్రాంత రైతులు.. ఏ ప్రజలైనా ప్రాజెక్టులకు ఎందుకు అడ్డంబడ్తరు.. వాళ్లకేదో నష్టమైతెనేగదా..? గుప్తనిధులను జూశిండ్రా మీరు ఎన్నడన్న.? భూమిలోపట పెట్టెలళ్ల కుండలళ్ల వెట్టి దాశిపెడ్తరుగదా..? శాత బాయిలకెళ్లి బొక్కెనేతి తోడితె ఏమొస్తది..? నీళ్లొస్తయ్ గదా..? కని జగిత్యాల జిల్లా మల్యాల ఊర్లె ఉన్న ఒక శాతబాయిలకెళ్లి నూనె బైటికొస్తున్నది..ఈ నడ్మ ఆన్ లైన్ మోసాలు ఎక్వైపోయినయ్ గదా..? తాగినోందే పాట – సాగినోందే ఆట.. ఒకడు కర్నూలు జిల్లా డోన్ కాడ..ఇలాంటి ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష...

 

హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ మరింత కృషి చేయాలన్నారు. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పని భారాన్ని మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం సంతకం చేశారు. కేసీఆర్ కిట్స్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు రద్దీ పెరిగిందని, వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. 

 

బాబుకు సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడుకు సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. టిటిడిలో క్షురకుల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కనీసం విచారణ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా క్షురకులను తొలగించడం అప్రజాస్వామికమని రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. టిటిడిలో అవినీతికి పాల్పడుతున్న పెద్దలను వదిలేసి క్షురకులను తొలగించడం సరికాదని, తక్షణమే క్షురకులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. 

పౌరసరఫరాల శాఖపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏటా రూ. 6500 కోట్ల ఖర్చుతో పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు, అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఎంతో మంది అధికారులు..సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా ఎంతో మంది శ్రమించినా రేషన్ బియ్యం..సరుకులు పక్కదారి పడుతున్నాయని, బియ్యం అక్రమ రవాణా మాఫియానే ఏర్పడిందన్నారు. లబ్దిదారులు పూర్తి ప్రయోజనం పొందేందుకు అనువైన విధానం అమలు చేయాలని సూచించారు. 

బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి..

ఢిల్లీ : బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది. అనుసంధానం చేయడం తప్పనిసరి కాదంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. డిసెంబర్ 31లోగా ఖాతాదారులు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని సూచించింది. 

18:36 - October 21, 2017

ఏపీవోపై ఎంపీపీ కుమారుడు దాడి..

నెల్లూరు : గూడూరు ఎంపీపీ కార్యాలయంలో ఎపీవోపై దాడి జరిగింది. ఏపీవో సుబ్బరాయుడిపై ఎంపీపీ రామమ్మ కుమారుడు నాగరాజు..అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం..ఏపీవోపై జరిగిన దాడిని నిరసిస్తూ సహోద్యోగులు..కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. 

మీడియాతో మోత్కుపల్లి చిట్ చాట్..

హైదరాబాద్ : మీడియాతో టి. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ వల్ల టిడిపికి నష్టమే తప్ప లాభం లేదని, రేవంత్ వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. టీఆర్ఎస్ తో టిడిపి పొత్తు పెట్టుకొనే అవకాశం ఉందని.. యాంటీ కాంగ్రెస్ విధానంలో భాగంగా టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్నారు. కేసీఆర్..తాను మంచి స్నేహితులమని, చివరి వరకు టిడిపిలోనే కొనసాగుతానన్నారు. 

18:23 - October 21, 2017

అనంతపురం : ఎన్ని సంఘటనలు జరుగుతున్నా పోలీసుల వైఖరి మాత్రం మారడం లేదు. నేరస్తులను గాలికొదిలేసి అమాయకులను చితకబాదుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో బయటపడింది. దీపావళి సందర్బంగా బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అయితే... పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరారయ్యారు. దీంతో పోలీసులు కేసుతో సంబంధం లేని ఇద్దరిని పీఎస్‌కు పిలిపించారు. పేకాటరాయుళ్లు మీకు తెలుసు కదా... పేకాట ఆడవద్దని మీరేందుకు చెప్పలేదని చిన్న లక్ష్మన్న, సాకే శ్రీనివాసులును చితకబాదారు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు పోలీసులు మరింత రెచ్చిపోయారు. ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కొట్టడంతో శ్రీనివాసులు కాలు విరిగిపోయింది. పోలీసుల గాయాలతో స్పహ తప్పిపోగా వారిద్దని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ తమను అకారణంగా కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. 

పుచ్చలపల్లిలో దారుణం..

నెల్లూరు : కోటలోని పుచ్చలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు..కోడలు పనేనని పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసమే హత్యకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. 

18:15 - October 21, 2017

కడప : నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. దీనిపై ప్రభుత్వం స్పందించలంటూ నిరవధిక దీక్షలు దిగారు. కడప జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థి సంఘాలు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న పావని తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. వీరికి జిల్లా సీపీఎం నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పావని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కూతురి మృతికి నారాయణ కాలేజే కారణమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. మంత్రి నారాయణ వత్తిడితోనే నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు జంకుతున్నారని సీపీఎం నేతలు పేర్కొన్నారు.

 

18:11 - October 21, 2017

శ్రీకాకుళం : ఒడిషా అధికారుల అకస్మిక చర్యతో జిల్లాకు భారీగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో వంశాధర ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తింది. దీనితో నీటిని విడుదల చేయడంతో శ్రీకాకుళం జిల్లాకు వరద పోటెత్తింది. జిల్లాలోని వేలాది ఎకరాల పంట నీట మునిగాయి. ఏపీ అధికారులకు ఒడిశా అధికారులు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నదీతీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గొట్టా బ్యారేజీకి నోరు పోటెత్తడంతో 22 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. 

17:56 - October 21, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎంపీ టీజీ వెంకటేష్ ను బర్తరఫ్ చేయాలని ప్రొ.కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎస్వీకేలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన అనంతరం దేశంలో భావ స్వాతంత్ర్యానికి ప్రమాదం లేదని ప్రధాన మంత్రి మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. తనలాంటి రచయితలు ఎందరో ప్రమాదంలో ఉన్నారని, టీమాస్ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. టీమాస్ లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే మద్దతిస్తామని వెల్లడించారు. 

17:38 - October 21, 2017

ఖమ్మంలో ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్..

ఖమ్మం : నగరంలో ఇంటర్ స్టూడెంట్ అదృశ్యం కలకలం రేపుతోంది. న్యూ విజన్ కాలేజీలో బైసీపీ ఫస్టియర్ చదువుతున్న హర్షిత కనిపించడం లేదు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. 

17:35 - October 21, 2017

ఆదిలాబాద్ : ప్రేమించలేదని దాడులు చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది. అక్కడక్కడ ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రాణాలు తీస్తూ వారి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలో ఓ ప్రేమోన్మాది కలకలం సృష్టించాడు. జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో గోవర్ధన్ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని (మైనర్) వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ వేధింపులు ప్రారంభించాడు. ఇటీవలే కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న గోవర్ధన్ ఫోన్లు చేస్తూ తన ప్రేమను అంగీకరించాలని వేధించాడు. వీటన్నింటినీ విద్యార్థిని నిరాకరిస్తూ వస్తోంది. శనివారం ఉదయం కళాశాలకు వచ్చిన గోవర్దన్ ఆ విద్యార్థినితో వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి గురయిన గోవర్ధన్ పక్కనే ఉన్న బీరు బాటిల్ తో ఆమెపై దాడికి దిగాడు. దీనితో ఆమె తలకి..చేయికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. 

17:30 - October 21, 2017

సిద్ధిపేట : తమకు పూర్తి న్యాయం జరిగేంత వరకు గ్రామాన్ని వదిలివెళ్లే ప్రసక్తే లేదని వేముల ఘాట్ ప్రజలు పేర్కొంటున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన వేముల ఘాట్ లో గ్రామ సభ జరిగింది. ఇల్లుకు ఇల్లు..పొలానికి పొలం..ఇవ్వాల్సిందేనని, అంతవరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. డీపీఆర్ లేకుండా..అటవీ శాఖ అనుమతులు లేకుండా 500 రోజులకు పైగా దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రజలందరూ ముక్తకంఠంతో తమ డిమాండ్లను వినిపించే ప్రయత్నం చేశౄరు. ఇల్లుకు ఇల్లు..పొలానికి పొలం..ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామమని పేర్కొంటూ ఏవీ ఇవ్వడం లేదని ఓ మహిళ వాపోయింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:27 - October 21, 2017

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ చేరుతారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ పదవుల కోసం ఎప్పుడూ ఆరాట పడలేదని..ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా..బాబు ఆదేశాల ప్రకారం పనిచేస్తామన్నారు. భవిష్యత్ లో తమ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న పార్టీలతో కలిసి వెళుతామని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించాలని సూచించారు. ప్రజలను గందరగోళ పరిచేలా కామెంట్లు చేయవద్దని పార్టీ నేతలకు ఎల్.రమణ హితవు పలికారు. చంద్రబాబు నాయకత్వంలోనే కొనసాగుతామని, పార్టీ నేతలు ఎవరూ అధైర్యపడవద్దని నేతలు సూచించారు. 

విద్యార్థినిపై బీరు బాటిలో దాడి..

ఆదిలాబాద్ : జిల్లాలో ప్రేమోన్మాది కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థిని తన ప్రేమను నిరాకరించిందని బీరు బాటిల్ తో దాడి చేసి పరారయ్యాడు. 

17:15 - October 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేండ్ల దాటిన అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. తొలిసారి టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష జరుగనుంది. 31 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. 8792 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 30వ తేదీ నిర్ణయించారు. గతంలో అనేక సార్లు వాయిదా వేయడంతో టి.సర్కార్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే.

గురుకులాల్లో టీచర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల మాదిరిగానే ఈ టీచర్ల భర్తీ పరీక్షలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు : 1,950

సెకండరీ గ్రేడ్ టీచర్లు : 5,415

భాషా పండితులు : 416

పీఈటీలు : 416

మొత్తం పోస్టులు : 8,792.

ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం : జిల్లా ఇచ్చాపురం మండలంలోని లొద్దపుట్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 

16:58 - October 21, 2017
16:41 - October 21, 2017
16:28 - October 21, 2017

ఓ టీవీ చానల్ లో యాంకర్ గా పనిచేసే 'ప్రేమమాలిని' దర్శకురాలిగా మారిపోయారు. ఆమె దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ 'అర్చన', 'శివకుమార్ రామచంద్రవరపు' లీడ్ రోల్స్ లో నటించిన 'ఐ లైక్ ఇట్ దిస్ వే' ఇండిపెండెంట్ ఫిలిం యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఆడపిల్ల వంట చేయాలి..అబ్బాయి సంపాదించాలి..ఆడపిల్ల గట్టిగా నవ్వకూడదు..మగాడు ఏడవకూడదు..ఎన్నో ఆంక్షలు కదా ..వాటన్నింటి సమ్మిళితమే 'ఐ లైక్ ఇట్ దిస్ వే'..ఈ సందర్భంగా వారితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలు తెలియచేశారు. జర్నలిస్టుగా ఉన్న సమయంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వీటిపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయానికి వచ్చి తాను తీయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని నటి 'అర్చన'కు తెలియచేయడం..వెంటనే ఆమె ఒకే చేయడం జరిగిపోయాయన్నారు. తన క్యారెక్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని నటి 'అర్చన' పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

16:24 - October 21, 2017

పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి..

హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారి సేవలను జాతి ఎన్నటికీ మరవదని సీఎం కేసీఆర్ ఈసందర్భంగా అన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.

ఐలయ్య సన్మానసభను అడ్డుకుంటాం: శ్రీధర్

గుంటూరు: 28న విజయవాడలో జరిగే కంచె ఐలయ్య సన్మానసభను అడ్డుకుంటామని బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరిపురపు శ్రీధర్‌ పేర్కొన్నారు. అభినందన సభకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపడతామని పేర్కొన్నారు.

 

 

15:40 - October 21, 2017

మేడ్చల్ : జిల్లాలోని ఘట్ కేసర్ మండలంలోని ఎన్ఎఫ్ సి నగర్ లో సర్పంచ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా పదవిలో ఉన్నా ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు పాడై గ్రామమంతా మురుగుమయంగా మారిపోయిందని తెలిపారు. ఆయా సమస్యలపై వారు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించలేకపోతే పదవి నుండి తప్పుకోవాలని డిమాంండ్ చేశారు. ఎన్నికల సమయంలో 11 ప్రధాన అంశాలతో సర్పంచ్ ముందుకొచ్చారని అందులో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందన్నారు. కానీ డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. 

15:35 - October 21, 2017

చిత్తూరు : తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంది. రెండు క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్ మెంట్ లలో భక్తులతో కిటకిటలాడుతోంది. బయట కూడా భారీగా క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం 16గంటల సమయం పడుతోంది. ఒక్కసారిగా పెరిగిన రద్దీతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసందర్భంగా టిటిడి జేఈవో శ్రీనివాసరాజుతో టెన్ టివి ముచ్చటించింది. డిసెంబర్ 15వ తేదీ వరకు అత్యంత సాధారణ స్థాయిలో రద్దీ ఉండేదని..కానీ అనూహ్యంగా భక్తులు తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. నడక దారి, రూ. 300 దర్శన టికెట్ల విషయంలో కోతలు విధించలేదని, 20వేలకు పైబడి నడకదారి గుండా భక్తులు వస్తున్నారని తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లో 16 గంటలకు పైబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి కడియం

వరంగల్ : జిల్లాలో రేపు జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభకు దాదాపు 2 లక్షల మంది హాజరైతరని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు రేపటి కార్యక్రమాలతో అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. రేపటి సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్తరని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

15:32 - October 21, 2017

హైదరాబాద్ : ఓ పత్రికలో ఓ వార్త వచ్చిందని...కమ్యూనల్ ట్రెండ్ ను కొన్ని పత్రికలు పోషిస్తూ వారికి అండగా ఉంటున్నాయని సామాజిక కార్యకర్త..రచయిత..ప్రొ.కంచె ఐలయ్య పేర్కొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణించాల్సినవసరం ఉందని తెలిపారు. కొన్ని పత్రికలు కొంతమందికి అండగా ఉండి..తనలాంటి వారిని హింసించే విధంగా చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం చాలా ప్రమాదంలో ఉందని..గౌరీ లంకేష్ ను ఇంటి ఎదుటే చంపేశారని..ఇతరత్రా విషయాలను అమెరికాలో ట్రెండ్ ఫ్రాన్స్ ఓ ప్రకటన చేశారని తెలిపారు. ఇతను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారని..అమెరికాలో తుపాకి సంస్కృతిని ఆపివేయాలని.. అన్ని మతాలకు సమానత్వం లేదని..కానీ తమ దేశంలో ఉందని, మతాన్ని టార్గెట్ చేస్తే అమెరికన్లు ఊరుకుంటారా ? అని టీజీ వెంకటేష్ పేర్కొన్నారని తెలిపారు. అమెరికా తుపాకుల దేశమని..ఇతర మతాలను అంగీకరించదని..అమెరికాలో సెక్యూర్టీ లేదని చెప్పారని తెలిపారు. 

మజ్లిస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది: లక్ష్మణ్

హైదరాబాద్: అభివృధ్ధిని ప్రభుత్వం విస్మరించింది అని బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. సేవ్ హైదరాబాద్ పేరుతో బిజెపి ధర్నా చేపట్టింది. మజ్లిస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్న ప్రభుత్వం ప్రజలకు నరకం చూపుతున్నారని మండిపడ్డారు. జీహెచ్ ఎంసీలో అవినీతి పెరిగిపోయిందన్నారు.

23న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్: 23వ తేదీన లోటస్ పాండ్ లో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం.

వికారాబాద్ జిల్లా అభివృద్ధి పై సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో వికారాబాద్ జిల్లా అభివృద్ధి పై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ దివ్య పాల్గొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.

రేవంత్ రెడ్డి రాకను ఎవరూ వ్యతిరేకించొద్దు: వీహెచ్

హైదరాబాద్: కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి రాకను ఎవరూ వ్యతిరేకించొద్దని మాజీ ఎంపి వీహెచ్ తెలిపారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే నేతలంగా సర్దుకుపోవాలని కేసుల పేరుతో ప్రతిపక్ష నేతలను భయపెడుతున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎయిమ్స్ నుండి ఉపరాష్ట్రపతి వెంకయ్య డిశ్చార్జ్

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యకు స్టంట్ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. 3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

15:10 - October 21, 2017

ఢిల్లీ : రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 24న జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలోనే.. రాహుల్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఓటింగ్ పద్ధతిలోకాకుండా ఏకగ్రీవంగా రాహుల్‌ని ఎన్నుకోవాలని సీనియర్లు అంటున్నారు. ఇప్పటికే రాహుల్‌ని అధ్యక్షున్ని చేయాలని పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ లేఖలు పంపించాయి. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయంపై సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. సీడబ్యూసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈనెల 30తో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల గడువు ముగియనుంది. 19ఏళ్ళుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనియా గాంధీ రాహుల్‌ ఎన్నికతో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

15:07 - October 21, 2017

ఢిల్లీ : 2015లో కిడ్నాప్‌కు గురైన పాకిస్తాన్‌ జర్నలిస్టు జీనత్‌ షెహజాదీ ఆచూకి లభించింది. పాకిస్తాన్‌-ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దులో ఆమెను రెస్క్యూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న జీనత్‌ను పాకిస్తాన్‌ నిఘావర్గాలే కిడ్నాప్‌ చేశాయని ఆమె కుటుంబం సభ్యులు, మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. 25 ఏళ్ల జీనత్‌ ఫ్రీలాన్స్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. తప్పిపోయిన మనుషుల ఆచూకి కోసం తన కలాన్ని సంధించారు. అడ్రస్‌ లేకుండా పోయిన భారత్‌కు చెందిన ఇంజనీర్ హమీద్‌ అన్సారీ కోసం ఆమె పత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు రాశారు. సోషల్‌ మీడియా ద్వారా హమీద్‌ అన్సారీ తల్లి ఫౌజియా అన్సారీని సంప్రదించారు. హమీద్‌ అన్సారీ మిస్సింగ్‌ కేసును రిపోర్టు చేస్తున్న జీనత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. జీనత్‌ కిడ్నాప్‌కు ముందు పాక్‌ భద్రతా బలగాలు ఆమెను 4 గంటలు అదుపులోకి తీసుకుని హమీద్‌ విషయంలో విచారణ జరిపినట్లు సమాచారం. 2015లో గూఢచర్యం కేసు కింద హమీద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్తాన్‌ సైనిక కోర్టు ఆయనకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015లోనే జీనత్‌ కిడ్నాప్‌కు గురైంది. 

రూ.8లక్షల విలువైన కలప పట్టివేత...

జయశంకర్ భూపాలపల్లి:సర్వాయిపేట గ్రామం వద్ద అక్రమంగా టేకు కలపను రవాణా చేస్తున్న లారీని ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. లారీలో ఉన్న 80 టేకు దుంగలను ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న టేకు కలప దాదాపు రూ. 8 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలపను మహదేవ్‌పూర్ కలప డిపోకు తరలించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

14:57 - October 21, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌, చాదర్‌ఘాట్‌లోని సౌత్‌ జోన్‌ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో.. డీసీటీవో శ్రీనివాస్‌ మీడియా సమావేశం రసాబాసగా మారింది. తనపై అవినీతి ఆరోపణలు వాస్తవం కాదని శ్రీనివాస్‌ అన్నారు. తాను ఎటువంటి ఫోర్జరీకి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని తెలిపారు. శ్రీనివాస్‌ ఫోర్జరీ సంతకాలు చేస్తూ.. 6 నుండి 8 కోట్ల వరకు జీహెచ్‌ఎంసీ సంపదను కొల్లగొట్టాడని జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్‌ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ఆరోపించారు. 

14:56 - October 21, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే బలహీనపడ్డ తెలుగుదేశం టిడిపిని కొలుకోకుండా దెబ్బతీసేందుకు గులాబీ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గాన్ని అధికార పార్టీ టార్గెట్ చేసింది. కొడంగల్లో రాజకీయంగా బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష నేతలకు అధికార పార్టీ గాలం వేస్తోంది. బలమైన నాయకులను కారేక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా టీడీపీ కి రాజీనామా చేసిన పలువురు నాయకులకు అధికార పార్టీ గులాబీ కండువా కప్పింది. పార్టీకి బలమైన నేత కొడంగల్‌ నియోజకవర్గంలో వున్నా.. కింది స్థాయి నేతల నుంచి ఆయనకు పెద్దగా సహకారం అండలేదన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉంది. దీంతో జిల్లా మంత్రులు రంగంలోకి దిగి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మండల స్థాయి నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్పించే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ నాయకత్వం ముమ్మరం చేసింది.

రేవంత్ కు పట్టు ఉన్న మండలాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను గులాబీ పార్టీ మొదలు పెట్టింది. రేవంత్ టీడీపీని వీడితే ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ బలోపేతం చేస్తే....ఉప ఎన్నికలు వచ్చినా...రాకపోయినా నియోజకవర్గంలో బలపడాలని గులాబీ నేతలు కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్‌ గురునాథ్ రెడ్డి కి వ్యతిరేకంగా పని చేస్తున్నవారిని ఇప్పుడు అధికార పార్టీ కారేక్కించుకుంది. నియోజకవర్గం లో రేవంత్ అనుచరులుగా ముద్ర పడ్డ నేతలు... రాష్ట్ర మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ కు కొడంగల్‌ నియోజక వర్గంలోనే చెక్ పెట్టాలని అధికార పార్టీ రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది టీడీడీపీ నేతలు గులాబీ గూటికి చేరతారన్న ఆశాభావంతో టీఆర్‌ఎస్‌ నేతలు ముందుకు సాగుతున్నారు. 

రైలు మార్గాన్ని నిరసిస్తూ మావోయిస్టుల బ్యానర్లు...

ఛత్తీస్ గఢ్: కాంఖేర్ లో రైలు మార్గాన్ని నిరసిస్తూ మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. రైలు మార్గం కోసం అడవిని నాశనం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

23న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం..

హైదరాబాద్ : ఈనెల 23వ తేదీన లోటస్ పాండ్ లో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

సేవ్ హైదరాబాద్ అంటున్న బీజేపీ..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సేవ్ హైదరాబాద్ పేరిట ఎమ్మెల్యే రామచంద్రరావు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. 

ఎన్జీవో కాలనీలో యువతి సూసైడ్..

కర్నూలు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సాయిరూప అఘాయిత్యానికి పాల్పడింది. 

బుక్కపట్నం ఎస్ఐ కర్కశం..

అనంతపురం : దీపావళి సందర్భంగా కృష్ణాపురంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిని గమచించిన పేకాటరాయుళ్లు పారిపోయారు. కానీ కేసుకు సంబంధం లేని ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. చిన్న లక్ష్మన్న, సాకే శ్రీనివాసులను బుక్కపట్నం ఎస్ఐ వెంకటేశ్వర్లు చితకబాదారు. ఇదేమని ప్రశ్నించిన పాపానికి ఎస్ఐ మరింత రెచ్చిపోయి విచక్షణారహితంగా బాదాడని బాధితుడు పేర్కొంటున్నాడు.

13:14 - October 21, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో జడ్డా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 612గ్రాముల బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి అండర్ వేర్ కు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకుని బంగారం తీసుకొచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గత పదిరోజుల్లో 3కిలోల 40గ్రాముల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:13 - October 21, 2017

ఢిల్లీ : రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఓటింగ్ పద్ధతిలో కాకుండా ఏకగ్రీవంగా రాహుల్ ను ఎన్నుకోవాలని సీనియర్లు అంటున్నారు. ఇప్పటికే రాహుల్ ని అధ్యక్షుడిగా చేయాలని కొన్ని పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ లేఖలు పంపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:26 - October 21, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సుందిళ్ల ప్రాజెక్టు వద్ద సిరిపురం గ్రాస్తులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఒగ్గు కథ చెబుతూ నిర్వాసితులు నిరసన తెలుపుతున్నారు. మరంత సమాచారం కోసం వీడియో చూడండి.

12:16 - October 21, 2017

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల నిలిచి ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:30 - October 21, 2017
11:10 - October 21, 2017

సిద్దిపేట : జిల్లా వేములఘాట్‌లో పోలీసుల పహారా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే భూ సేకరణ కోసం తొలిసారిగా వేములఘాట్‌లో గ్రామసభ జరుగుతోంది. నిన్న రాత్రి నుండే గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ఆపివేయాలని వేములఘాట్‌ గ్రామస్థులు ఏడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ రోజు గ్రామసభ ఎలా కొనసాగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

11:08 - October 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరించేందుకు పీఆర్‌సీని నియమించాల్సి ఉంది. పదవ వేతన సవరణ సంఘం సిఫారసులు ప్రకారం కుదుర్చుకున్న వేతన ఒప్పందం కాలపరిమితి వచ్చే ఏడాది జూన్‌తో ముగియనుంది. దీంతో 11వ పీఆర్‌సీ నియామకం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఈ ఏడాది చివరి నాటికి పీఆర్‌సీని నియమించే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ డిమాండ్లను పీఆర్‌ఎసీ ముందు ఉంచేందుకు ఉద్యోగ సంఘాలు నివేదికలు తయారు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఫిట్‌మెంట్‌ ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. పదవ పీఆర్‌సీలో ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఈసారి 60 నుంచి 65 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను పీఆర్‌ఎసీ ముందు ఉంచనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యోగ సంఘాల నేతల కరసత్తు చేస్తున్నారు.

తనాలు పెంచక తప్పదన్న భావంతో
2019లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఉద్యోగులు, వీరి కుటుంబాలను తమవైపు తిప్పుకోవాలంటే వేతనాలు పెంచక తప్పదన్న భావంతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉంది. పీఆర్‌సీని నియమించి, నివేదిక ఇచ్చిన తర్వాత పరిశీలించి.. ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జులై 1 నుంచి 11వ పీఆర్‌సీని అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షల మంది పెన్షర్లు ఉన్నారు. వీరి కుటుంబాల్లో 15 లక్షల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పీకే అగర్వాల్‌ నేతృత్వంలో 10వ పీఆర్‌సీని 2013లో నియమించారు. ఈ కమిటీ సిఫారసులను 2014 జూన్‌ 2 నుంచి అమల్లోకి తెచ్చారు. పీకే అగర్వాల్‌ నేతృత్వంలోని 10వ పీఆర్‌సీ 29 శాతం వేతనాలు పెంచడానికి సిఫారసు చేసింది. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాత్రను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో ఉద్యోగులు సంతోషించారు. ఈసారి దీనికి అదనంగా మరో 22 శాతం ఫిట్‌మెంట్‌ కోరాలన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మొత్తమీద ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం కూడా తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. సర్కారు కూడా ఉద్యోగులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

11:06 - October 21, 2017

శ్రీకాకుళం : జిల్లా హిరామండలంలోని గొట్టా బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. దీంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 62 వేల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. మరోవైపు..గేట్లు ఎత్తివేయడంతో కొత్తూరు మండలంలోని మాతలనివగం, మాధనాపురం, ఆకుల తంపర, అంగూరు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. వరద ఉధృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. 

11:05 - October 21, 2017

ఖమ్మం : పార్లమెంటుతోపాటు దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని CPM పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాఘవులు.. ప్రధాని మోదీ నేత్రుత్వంలోని ఎన్డీయే విధానాలపై మండిప్డడారు. జమిలి ఎన్నికలతో బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

11:04 - October 21, 2017

పశ్చిమగోదావరి : ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లక్ష్యానికి అనుగుణంగా కొనసాగడంలేదు. నిధుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది. కాంట్రాక్టర్లు లక్ష్యాల మేరకు పనులు చేయకపోవడంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే అకాశం కనిపించడంలేదు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 నుంచి సాగునీరు అందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నా.. సవాలక్ష కారణాలతో కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సమీక్షించే సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ప్రాజెక్టు పనులు చేయడంలేదున్న ఆరోపణలు ఉన్నాయి. పనుల జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వెళ్లగక్కడం, కాంట్రాక్టర్లను మారుస్తామని చెప్పడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. కాంట్రాక్టు సంస్థలను మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. దీనివలన ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరుగుతుందని, దీనిని భరించే స్థితిలో కేంద్రం లేదని జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్దేశిత గడవులోగా పూర్తి చేస్తామని చెబుతూవస్తోంది.

9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల
పోలవరంకు ప్రధాన సమస్యల నిధులు. దీర్ఘకాల నీటిపారుదల నిధి కింది 2016-17లో నాబార్డు దేశంలోని సాగునీటి ప్రాజెక్టులకు 9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే, పోలవరంకు మంజూరు చేసిన నిధులు మాత్రం 2,414.16 కోట్లు మాత్రమే. నాబార్డు ఈ ఏడాది దేశంలోని ప్రాజెక్టులకు 9వేల 20 కోట్ల రూపాయలు విదుడల చేయాలని నిర్ణయిస్తే, దీనిలో 979.36 కోట్లు మాత్రమే కేటాయించింది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం తక్కువ నిధులు కేటాయించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీకుని, కేంద్రంతో చర్చించాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. 

చెత్తకుప్పలో మగశిశువు

విజయనగరం: పట్టణంలోని హుకుంపేటలో అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశారు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి శిశువు మృతదేహాన్ని బయటకి తీశారు. శిశువు మెడపై కత్తిగాట్లను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

 

10:52 - October 21, 2017

హైదరాబాద్ : పోలీసు అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తితో విధులకు పునరంకింతం కావాలన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. హైదరాబాద్‌ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రితో పాటు డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి నాయిని అన్నారు. 

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. నగరంలోని గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమలరవీరుల సంస్మరణ దినోత్సవానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు. వీరంతా పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హోంమంత్రి నాయిని తపాలా బిల్ల, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.

10:45 - October 21, 2017

సిద్దిపేట : జిల్లా వేములఘాట్‌లో పోలీసుల పహారా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే భూ సేకరణ కోసం తొలిసారిగా వేములఘాట్‌లో గ్రామసభ జరుగుతోంది. నిన్న రాత్రి నుండే గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ఆపివేయాలని వేములఘాట్‌ గ్రామస్థులు ఏడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ రోజు గ్రామసభ ఎలా కొనసాగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

10:44 - October 21, 2017

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచిఉండగా, సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. 

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు

యూపీ : సెల్‌ఫోన్ దొంగను కాపాడేందుకు అతని తల్లి నుంచి యాభైవేల రూపాయలు లంచం తీసుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నగరంలో వెలుగుచూసింది. అవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్షిత్‌పాండే అనే యువకుడిని సెల్‌ఫోన్ చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడు చోరీ కేసులో జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు వీలుగా హర్షిత్ పాండే తల్లి రీటాపాండే మాగానగర్ లోని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సరితా సింగ్ కు యాభైవేల రూపాయలు లంచంగా ఇచ్చారు.

10:33 - October 21, 2017

చెన్నై : తమిళ హీరో విజయ్‌ నటించిన 'మెర్సల్‌' చిత్రంలోని జిఎస్‌టి, డిజిటల్‌ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న వివాదస్పద డైలాగులపై ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ స్పందించారు. 'మెర్సల్‌'కు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిందని...దాన్ని మళ్లీ సెన్సార్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలను లాజికల్‌గా ఎదుర్కోవాలని కమల్‌ అన్నారు. 'మెర్సల్‌' చిత్రంలో డిజిటల్‌ ఇండియా, జిఎస్టీలకు వ్యతిరేకంగా పలు సన్నివేశాలున్నాయి. సింగపూర్‌లో జీఎస్టీ 7 శాతమే. అక్కడ ప్రజలకు వైద్య సదుపాయాలు ఉచితంగా లభిస్తున్నాయి. భారత్‌లో 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా వైద్యసేవలు ఉచితంగా లభించడంలేదని ఓ సన్నివేశంలో విజయ్ డైలాగ్ చెబుతారు. బిజెపి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెంటనే ఈ సన్నివేశాలను తొలగించాలని తమిళ బిజెపి అధ్యక్షుడు సౌందరరాజన్‌ డిమాండ్‌ చేశారు. హీరో విజయ్‌ మాత్రం దీనిపై స్పందించలేదు. 

10:32 - October 21, 2017

విశాఖ : సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు...తనకు తాను వచ్చి అక్కడి పోలీసులతో తాను డీఎస్పీ రవిబాబునని...లొంగిపోయేందుకు వచ్చానంటూ చెప్పడంతో వారు లోపలికి తీసుకుపోయారు..అయితే అప్పటికే మీడియాకు సమాచారం ఉండడంతో ముందే చేరింది...డీఎస్పీ లొంగిపోవడంతో ఇప్పటివరకు ఉన్న పోలీసు టెన్షన్‌కు తెరపడింది...పరారీలో ఉన్న డీఎస్పీ రవిబాబును చోడవరం పోలీసులు... పెదగంట్యాడ న్యూపోర్ట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

నేరుగా చోడవరం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ
ఉదయం జాగింగ్‌ చేసుకుంటూ నేరుగా చోడవరం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ రవిబాబు చోడవరం ఎస్సై మల్లేశ్వరరావు, సీఐ శ్రీనివాసురావు ఎదుట లొంగిపోయారు...ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు..విశాఖ పోలీసులకు అప్పగించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు...అయితే రవిబాబు మాట్లాడుతూ తాను నిర్దోషినని.. న్యాయస్థానంలోనే ఆ విషయాన్ని నిరూపించుకుంటానంటున్నారు.సంచలనం సృష్టించిన రెండు హత్య కేసుల్లో ఆర్టీసీలో విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు ఇప్పటికే ప్రకటించారు...రౌడీషీటర్‌ గేదెల రాజుతో గతేడాది సెప్టెంబర్‌లో తన ప్రియురాలు కాకర్ల పద్మను హత్య చేయించాడని తేలింది...ఈ హత్య చేసినందుకు డీఎస్పీ ఇస్తానన్న సుపారీ కోటిలో 50 లక్షలు ఇవ్వకపోవడంతో రాజు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు..దీంతో క్షత్రియ పత్రికాధిపతి శ్రీనివాసరాజుతో కలిసి పాతనేరగాళ్లతో రాజును హత్య చేయించాడు.

కాసేపట్లో వేములఘాట్ లో గ్రామసభ

సిద్ధిపేట: మల్లన్న సాగర్ రిజర్వాయ్ భూ సేకరణపై వేములఘాట్ లో కాసేపట్లో గ్రామసభ జరగనుంది. ఈ సభకు గ్రామంలోకి బయటవారిని ఎవ్వరినీ రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అంతే కాకుండా మీడియాను పోలీసులు, అధికారులు అనుమతించడంలేదు.

10:08 - October 21, 2017

కర్నూలు : జిల్లా డోన్ పట్టణంలో దారుణం జరిగింది. అర్థరాత్రి సమయం రోడ్డు పై వెళ్లుతున్న తాగుబోతులు లో ఓ మొబైల్ షాప్ వద్ద నిద్రిస్తున్న వృద్ధుడిపై దాడి చేసి చితగొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కెళ్లారు. రాత్రిపూట పోలీసుల పెట్రోలింగ్ లేకపోవాడమే కారణమని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

09:10 - October 21, 2017
09:09 - October 21, 2017

కరీంనగర్/జగిత్యాల : ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ లో కాల్పుల కలకలం రేగింది. రాజన్న అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. రాజన్న పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సమయంలో తాము మావోయిస్టులని చెప్పినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

గొట్టా బ్యారేజీ గేట్లు ఎత్తివేత

శ్రీకాకుళం : గొట్టా బ్యారేజీకి వరద పోటెత్తడంతో 22 గేట్లు ఎత్తిన అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో 67వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 62వేల క్యూసెక్కులుగా ఉంది.

మధ్యాహ్నం 12గంటలకు డీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 31 జిల్లాల్లో 8,792 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. 

సంగారెడ్డిలో మంత్రుల పర్యటన

సంగారెడ్డి : నేడు జిల్లాలో మంత్రులు హారీష్ రావు, లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేయనున్నారు.

07:31 - October 21, 2017

తాజ్ మహల్ పై దాడి అనేది ఐసోలెటెడెడ్ అని, బీజేపీ డ్యామేజ్ కవర్ చేయడానికి కొన్ని ప్రకటనలు చేశారని, అయితే ఈ విషయాన్ని లెవనెత్తింది బీజేపీ అని వారు ప్రచురించిన పుస్తకంలో తాజ్ మహల్ పెట్టపోవడం వల్లే ఈ చర్చంత మొదలైందని, బీజేపీ ఎమ్మెల్యేలకు చరిత్ర కూడా తెలియదని, బీజేపీ వారు ఎందుకు చేస్తున్నారంటే దేశంలో భీన్నత్వంలో ఏకత్వం అని కానీ దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వల్ల నష్టపోయేది భారతదేశమే అని, చరిత్రలో ఎన్నో కానీ మతం రంగు పులమడం మంచి పద్దతి కాదని, ఓ బీజేపీ రాష్ట్ర మంత్రి భారత్ స్మశానం అంటున్నారని, మన దేశాన్ని మనమే తులనానడం దేనికి దారి తీస్తాయిని, ప్రముఖ జర్నలిస్టు, దా హన్స్ ఎడిటర్ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:22 - October 21, 2017

చుడి పశువుల పోషన రైతుకు చాల లాభంగా ఉటుందని, పశువును జాగ్రత్తగా చూసుకుంటే మంచి లాభం వస్తోందని అందుకోసం రైతు కొంత పెట్టుబడిపెట్టల్సిన అవసరం ఉందని వెటర్నరీ డాక్టర్ జంభులింగం అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:20 - October 21, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఫోర్జరీ బాగోతం బయటపడింది. ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఫోర్జరీ సంతకాలతో బిల్లుల మింగిన వైనంపై కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంతో పాతబిల్లులను సరిచూసేపనిలో అధికారులు బిజీఅయ్యారు. మలక్‌పేట పార్కింగ్ యార్డుదగ్గర కార్మిక సంఘాల నేతలు అధికారులను నిలదీశారు.

07:19 - October 21, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో సదర్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదవ సోదరులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దున్ను పోతులు విన్యాసాలు అరలరించాయి. వీటిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో జరిగిన సదర్‌ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీసమేతంగా హాజరయ్యారు. వచ్చే ఏడాది సదర్‌ ఉత్సవాలను అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

07:18 - October 21, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి వస్తున్నారన్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. తడిసిన పత్తి, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోతే ఈనెల 27న చలో అసెంబ్లీ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు. 

07:16 - October 21, 2017

వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, గీసుగొండ మండ‌లం శాయంపేట గ్రామాల స‌రిహ‌ద్దులో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు
వరంగల్‌ జిల్లాలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు ఒకప్పుడు వెలుగువెలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమందికి ఉపాధి కల్పించింది. ఐదు దశాబ్దాల ఆజంజాహి చరిత్ర ఏలికల నిర్లక్ష్యం ఫలితంగా కాలగర్భంలో కలిసింది. అయితే, ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెగా టెక్స్‌టైల్‌ నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికారులు ప్రాజెక్టును ఆచరణలోకి తెచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్‌డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్స్, రెడీమేడ్ వస్ర్త పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. టెక్స్‌టైల్ పార్కువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 87వేల 539 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రాంకీ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుగా నామకరణం చేసినట్లుగా గత ఆర్థిక సర్వేలో సర్కార్‌ పేర్కొంది. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల భూమి సేకరించింది. గీసుగొండలోని శాయం పేట, రాయినికుంట, వెంకటాపూర్‌, ఊకల్‌, సంగెం మండలంలోని చింతలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లో 2800 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. ఎకరాకు రూ.9.95లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం 110కోట్లు చెల్లించారు. బహిరంగ మార్కెట్‌ విలువకు.. ఇచ్చే పరిహారానికి పొంతన లేదని అన్నదాతలు పెదవివిరుస్తున్నారు.

6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు
పత్తి ఉత్పత్తిలో రాష్టంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో స్థానంలో వుంది. జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. వరంగల్ తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్ కే పత్తిని తీసుకొస్తున్నారు. ఇక్కడ తయారైన పత్తి బేళ్ళను కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహం లభించనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సేకరించిన భూ వివరాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలపై ఆరా తీశారు. మొత్తంగా మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. 

07:13 - October 21, 2017

హైదరాబాద్ : ఎప్పటి నుంచో నాన్చుతూ వస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వారం రోజుల్లో సిలబస్‌ని SCERT కమిషన్‌కి అందజేయడంతో ఇక నోటిఫికేషన్‌కి సర్వం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే గతంలో అనేకసార్లు వాయిదాలు వేయడంతో సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. సుప్రీం ఇచ్చిన గడువు ఈనెల 23తో గడువు ముగుస్తుండటంతో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో కమిషన్‌ అధికారులు స్పీడ్ పెంచినట్లు సమాచారం.

20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు
రాష్ట్రంలో దాదాపుగా 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 8వేల 792 పోస్టులకు ఆర్ధిక శాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పీడ్ పెంచింది. సుప్రీం ఇచ్చిన గడువు 23న ముగుస్తుండటంతో.. శనివారం టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఉదయాన్ని విడుదల చేసి సాయంత్రానికి అఫిడవిట్ సమర్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

అభ్యర్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత
మరోవైపు ఈ నోటిఫికేషన్ శనివారం ఇవ్వని పక్షంలో సుప్రీంలో సోమవారం నాడు వాదనలు పూర్తి చేసాక కోర్టు అనుమతి తీసుకుని ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ శనివారం నోటిఫికేషన్ విడుదల కాకపోతే అభ్యర్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. 

Don't Miss