Activities calendar
22 October 2017

ఢిల్లీ : రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైల్లో ప్రయాణించారు. ఢిల్లీ-కోటా జనశాతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బోగీలో ప్రయాణికులను కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. రైళ్లలో సదుపాయాలు సరిగాలేవంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో పియూష్ గోయల్ ఈ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఢిల్లీ-కోటా జనశతాబ్ది నెలకొన్న సౌకర్యాలపై ప్రయాణికులు మంత్రికి ఫిర్యాదు చేశారు.
26న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం..
సోమవారం ఎఫ్ఏ 1 పరీక్షలు...
సోమవారం టి.కేబినెట్ మీటింగ్..
విజయవాడ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాలను పరిశీలించేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం, డీపీ వరల్డ్ గ్రూపు నిర్ణయించాయి. ఓడ రేవులు, విమానయాన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు DP వరల్డ్ ఆసక్తి వ్యక్తం చేసింది. UAE పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బీన్ సయీద్ అల్ మన్సూరీ సహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బిజినెన్ లీడర్స్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. దుబాయ్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బీన్ సయీద్ అల్ మన్సూరీ, డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బీన్‌తో భేటీ అయ్యారు. పరస్పరం పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవన్ బుర్జ్ ఖలీఫాను సందర్శించారు. అక్కడ ఉన్న స్టార్ హోటళ్లు, వాణిజ్య కార్యాలయాలు, నివాసాలను పరిశీలించారు.
దుబాయ్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బీన్ సయీద్ అల్ మన్సూరీతో సమావేశమైన చంద్రబాబు.. ఏపీ పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలను వివరించారు. ఐటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఫిన్‌టెక్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు మన్సూరీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫార్మా, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న విషయాన్ని దుబాయ్ పాలకుల దృష్టికి తెచ్చారు.
ఎమిరేట్స్ బిజినెన్ టవర్స్‌లో డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బీన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఏపీ, డీపీ వరల్డ్ జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఓడరేవుల అభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డీపీ వరల్డ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దుబాయ్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారంతా అమరావతి నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు... డీపీ వరల్డ్ దృష్టికి తెచ్చారు.
విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రణాళికా విభాగాధిపతి అద్నాన్ ఖాసీం, ఫ్లై దుబాయ్ సీఈవో ఘయిత్ అల్ ఘయిత్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఒక విమానాశ్రయం నిర్మించాలని కోరారు. UAE నుంచి గన్నవరంకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ఎమిరేట్స్ సంస్థ అంగీకరించింది. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా ఏర్పాటు చేసుకోవాలని దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారికి చంద్రబాబు... విజ్ఞప్తి చేశారు.
వైసీపీ శాసనసభా పక్ష సమావేశం వాయిదా..

గుజరాత్ : పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఘోఘో నుండి దక్షిణ గుజరాత్‌లోని దహేజ్‌ల మధ్య తొలిదశ జలయాన ప్రాజెక్ట్ అయిన రోరో జలయాన ప్రాజెక్టు ప్రారంభం చేశారు. దీంతో పాటు పశు గ్రాస ప్లాంట్, తదితర ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ నెలలో ప్రధాని మోది స్వరాష్ట్రంలో పర్యటించడం ఇది మూడోసారి. మరికొద్ది రోజుల్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మోదీ పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టాలెక్కడానికి సిద్ధమవుతోన్న మెట్రో రైలు టికెట్ ధరలపై చిక్కుముడి వీడలేదు. చార్జీలు ఎల్అండ్టీని సంప్రదించిన తరువాతే నిర్ణయిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నా.. ఎల్అండ్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. మెట్రో హెచ్ఎంఆర్, ఎల్ అండ్ టీ మధ్య టికెట్ ధరల నిర్ణయంపై కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
మియాపూర్ టూ అమీర్‌పేట్.. నాగోల్ టూ అమీర్ పేట్ వరకు మెట్రో రైలు ప్రయాణం 30 కిలోమీటర్ల మేర సిద్ధమవుతోంది. కానీ మెట్రో రైలు టికెట్ ధరలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మొదట కనిష్టంగా 10 రూపాయలు.. గరిష్టంగా 50 రూపాయలు టికెట్ ధర ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అట్టహాసంగా ప్రకటించింది. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం సమయంతో పాటు ఖర్చు కూడా భారీగా పెరగడంతో మెట్రో రైలు టికెట్ ధరలపై హెచ్ఎంఆర్ కొన్ని నెలలుగా మౌనం పాటిస్తోంది. నవంబర్ 28, 29 తేదీల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు.. అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, కోల్కత్తా, ముంబాయి, బెంగళూరు, గుర్గావ్, జైపూర్, చెన్నై, కొచ్చి తాజాగా లక్నోలో మెట్రో రైలు సర్వీసులు నడుస్తున్నాయి. అత్యల్పంగా చార్జీలు వసూలు చేస్తోంది మాత్రం ఢిల్లీలోనే. డీఎంఆర్ కిలోమీటర్‌కు యాభై పైసలు వసూలు చేస్తోంది. అత్యధికంగా చెన్నైలో కిలోమీటర్‌కు నాలుగు రూపాయలు చొప్పున చార్జీలున్నాయి.
మెట్రో రైల్వే యాక్ట్ 2002, సెక్షన్ 33 ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ శాఖ మెట్రో టికెట్ ధరలు నిర్ణయిస్తుంది. ఒక వేళ టికెట్ ధరలు పెంచాలనుకుంటే ఫేర్ ఫిక్షేషన్ కమిటీ రివ్యూ చేసి నిర్ణయిస్తుంది. రివ్యూ సమయంలో ప్రధానంగా 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. విద్యుత్ చార్జీల ప్రకారం 22 శాతం, మెయింటెనెన్స్ ఇతర ఖర్చులు 21 శాతం, వినియోగదారులు ధరల సూచీ 57 శాతం ప్రకారం టికెట్ ధరలు నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం పెరిగితే పదిశాతం అదనంగా పెంచుకునే వెసులుబాటును ఎంఆర్ఏ చట్టం ఇస్తుంది.
ప్రపంచంలోనే 72 కిలోమీటర్లు నిర్మాణమవుతోన్న అతిపెద్ద ప్రైవేట్, పబ్లిక్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో రైలు. తాజా పరిణామాల ప్రకారం మినిమమ్ చార్జ్ 10 రూపాయల నుంచి మాగ్జిమమ్ చార్జ్ 70 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. లాభాలు రాకపోయినా ఫరవాలేదు కానీ మరిన్ని నష్టాలు రాకుండా ఉండటానికి టికెట్ ధరలపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని ఎల్ అండ్ టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్మల్ : జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్ శివారులోని సర్వే నంబరు 140లో గల అటవీ భూమిని సాగు కోసం ప్రయత్నిస్తున్న దళితులను అటవీ శాఖా అధికారులు అడ్డుకున్నారు. గత పదేళ్లుగా అదే సర్వే నెంబరులో సాగు చేస్తున్న కొందరి వ్యక్తులను అధికారులు పట్టించుకోవడం లేదని దళితులు ఆరోపించారు. తక్షణమే అటవీ భూమి సాగుచేస్తున్న వారి నుండి భూమిని తీసుకోవాలని లేకుంటే మేము కూడా సాగుచేస్తామని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ భూమిని ఎవరు కబ్జా చేసినా వారికి నోటీసులు ఇచ్చి తిరిగి భూమిని తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
రాజమండ్రి : చట్టసభల్లో బీసీలకు పూర్తి స్థాయి రిజర్వేన్లు పొందినప్పుడే నిజమైన రిజర్వేషన్లు సాధించినట్టని బిసి సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. రాజమహేంద్రవరంలో బీసీ గర్జన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వివిధ బీసీ కులాల నేతలు గర్జన సభలో తీర్మానాలు చేశారు. బీసీ గర్జన ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు కృష్ణయ్య.
హైదరాబాద్ : విపక్షాలను ఎండగట్టాలి. ఫ్యూచర్‌ను కాపాడుకోవాలి. ఇదే గులాబీ లీడర్ల టార్గెట్. ఈ గేమ్ప్లాన్తోనే టీఆర్ఎస్ లీడర్లు ముందుకెళ్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న సభా సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. సభను అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు 23న తెలంగాణ మంత్రి వర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమై ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యులకు సూచనలు, సలహాలు చేయనున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యులతో ఓ దఫా భేటీ అయిన సీఎం.. ఏ ఏ అంశాలు సభముందుంచాలనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టి-మాస్ ఫోరం, వామపక్షాల యాత్రలు.. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. సమావేశంలో ఆచితూచి మాట్లాడాలని సభ్యులకు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని నిర్ణయించారు.
మరోవైపు పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు బిల్లులకు సంబంధించి..తిరిగి సభలో చర్చించాలనుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలు ఉంటాయని సమాచారం. సభా సమరంలో పై చేయి అధికార పార్టీదా, లేక విపక్షాలదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
భువనగిరి : సామాజిక తరగతులకు ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీ-మాస్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక వర్గాలకు అందాల్సిన నిధులను దారి మళ్లించిందని జాన్ వెస్లీ విమర్శించారు.
హైదరాబాద్ : కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన 'జనసేన' పార్టీపై ఫోకస్ సారించారు. శనివారం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలో వచ్చే 6నెలల్లో పార్టీ పరంగా చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాలపై జనసేన నేతలతో పవన్ చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలు, పవన్ జిల్లాల పర్యటనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై పవన్‌కు పార్టీ నేతలు.. పలు ప్రతిపాదనలు చేశారు.
మొదటిసారి జనసేన పార్టీకి సంబంధించి పవన్ ఈ కీలక సమావేశం నిర్వహించినట్లు చెప్పవచ్చు. త్వరలోనే తాను తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని పవన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ చివరి వారంలో విధి విధానాలు ఖరారు చేస్తామని.. అనంతరం ప్రజల ముందుకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని పవన్ పేర్కొన్నారు. అనంతరం ఒక్కోక్కటిగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మూడు విభాగాలుగా జనసేన సైనికులను ఎంపిక చేశారు. మరి రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం పవర్‌లూమ్స్ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్ టైల్స్ ప్రారంభించడంపై కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజును సిరిసిల్ల చీకటి రోజుగా అభివర్ణించారు. వరంగల్‌లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. సిరిసిల్లకు కొత్తగా వచ్చింది ఏమీ రాలేదని..మూడున్నర సంవత్సరాలైన తరువాత ఏదైనా వాగ్ధానాలు చేస్తే ఏడాదిన్నర తరువాత చేసే అవకాశం లేదన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయలేని కేసీఆర్ ఏడాదన్నరలో అభివృద్ధి చేసే అవకాశం లేదన్నారు పొన్నం.
వరంగల్ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో మొదటి రోజే 14 దేశ, విదేశీయ సంస్థలు రూ. 3వేల 900 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. తద్వారా 65 వేల మందికి మొదటి రోజే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం 12 వందల ఎకరాల భూములు కోల్పోయిన రైతన్నలకు కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. భూమి కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి టెక్స్టైల్ పార్క్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడారు.
వరంగల్ : అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకోబోతోందన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయస్ధాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడ తయారవుతాయని కేసీఆర్ చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం వలన ఇదంతా సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్.
కాళేశ్వరం నీళ్లు..
రాబోయే రోజుల్లో వరంగల్ బంగారు వరంగల్ కావాలని.. తెలంగాణ రైతన్నలు భారతదేశంలోనే ధనికులైన రైతులు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వచ్చే జూన్ నాటికి వరంగల్ జిల్లా వాసులు ఇక చాలనేంతగా కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ఆదేశాలిస్తామన్నారు కేసీఆర్.
మహబూబ్ నగర్ : చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ కొడంగల్ నియోజక వర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేస్తానన్నారు. చంద్రబాబుతో భేటీలో తీసుకునే నిర్ణయం మేరకు నడుచుంటానన్నారు రేవంత్ రెడ్డి.
జనసేన నేతలతో పవన్ భేటీ..
భారత్ గెలుపు..
ప్రకాశం : జిల్లా ఒంగోలులో సత్య కేబుల్ ఆధ్వర్యంలో ఆటోమొబైల్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పోను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఎక్స్‌పోలో లేటెస్ట్ వెహికిల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. కార్లు, మోటార్ సైకిళ్లు రుణ సదుపాయంతో అందించేలా ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సత్య కేబుల్ తరపున ఆటో మొబైల్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పోను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని సత్య కేబుల్ ఎండి మంత్రి శీను తెలిపారు.
చిత్తూరు : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద క్షురకుల ధర్నా కొనసాగుతుంది. తమను విధుల నుంచి టీటీడీ అకారణంగా తొలగించిందంటూ గత కొన్ని రోజులుగా క్షురకులు ఆందోళన బాట పట్టారు. నిరసనలో భాగంగా టీటీడీ తీరును ఎండగడుతూ.. ఇవాళ వారు గుండు గీయించుకున్నారు. టీటీడీ అధికారులు తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర పూరితంగానే తమను రోడ్డున పడేశారని వాపోయారు.
గుంటూరు : 2020 నాటికి ఏషియన్ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖపట్నంలో నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. గుంటూరులోని జరిగిన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో జయదేవ్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం రాజధాని అమరావతిలో వంద ఎకరాల భూమిని కేటాయించాలని సీఎంని కోరతామని జయదేవ్ అన్నారు. 2018లో గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ : అట్టహాసంగా.. ఆడంబరంగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేశారు. కానీ రాజధాని నిర్మాణాన్ని మాత్రం మరచారు. ఏపీ రాజధాని నిర్మాణ పనులు ముందుకు కదలకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా 10టీవీ స్పెషల్ స్టోరీ. అక్టోబర్ 22, 2015.. నవ్యాంధ్ర చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన రోజు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం నమ్మకాన్ని తెచ్చిన రోజు.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజు.
ఏపీలోని 13 జిల్లాల నుండి మట్టి, నీరు..
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్రమోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ ప్రతినిధులు వందల మంది అతిరధమహారధుల సమక్షంలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చి.. ఈ ప్రాంతంలో కలిపారు. ఏపీలోని 13 జిల్లాల నుండి మట్టి, నీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ మట్టిలో కలిపారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా పార్లమెంట్ నుండి మట్టిని, గంగా నది నీటిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. కానీ రెండేళ్ల క్రితం ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది.
రైతుల్లో పోతున్న నమ్మకం..
ఏళ్లు గడుస్తున్నా కొద్దీ అటు ప్రజల్లో ఇటు భూములిచ్చిన రైతుల్లో నమ్మకం పోతోంది. రాజధాని నిర్మాణం కోసం 33,500 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులు ఎప్పుడెప్పుడు నిర్మాణాలు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ డిజైన్స్‌లో కల్పిత కట్టడాలను మాత్రమే ప్రభుత్వం చూపిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.
అమరావతి నిర్మాణానానికి సంబంధించి ప్రభుత్వం గత రెండేళ్లుగా కసరత్తులు చేస్తూనే ఉంది. మాస్టర్ ప్లాన్, స్టార్టప్ ఏరియా, సీడ్ క్యాపిటల్, ప్రభుత్వ భవనాలు ఇలా రకరకాల పేర్లతో డిజైన్స్ ఖరారు చేసే పనిలో ఉంది. ప్రపంచదేశాల్లో మించిన కట్టడాలను నిర్మించాలనే భావనతో సమయం ఎక్కువ తీసుకున్నా ఫర్వాలేదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో అమరావతి డిజైన్స్ ఖరారు చేసే అవకాశం ఉంది.
ఏపీని నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం నుండి అంతగా సహకారం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదురుకుంటోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుండి ఇప్పటికే 3 వేల కోట్లు రుణం పొందగా.. మరో 3 వేల కోట్లు త్వరలోనే పొందబోతోంది. 2018 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రభుత్వం ఏ మేరకు రాజధాని నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమండలానికి వెళ్లినా ఎలాంటి పరిశ్రమలు రావని ఏపీసీసీ అధ్యక్షుడు రాఘువీరారెడ్డి విమర్శించారు. సిఎం, ప్రధాని చేసే విదేశీ పర్యటనలు వినోదయాత్రలే గాని వాటివల్ల ఎలాంటి లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు తోనే పరిశ్రమలు వస్తాయన్నారు. రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌లో ఉండే చేస్తానని ఇతర పార్టీలో చేరేదిలేదన్నారు రఘువీరా. మూడున్నర ఏండ్లలో ఒక్క రూపాయి తీసుకరాలేదని..ఇక ఒక్క సంవత్సరంన్నరలో ఏమి వస్తాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయన్నారు.
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బిజినెన్ లీడర్స్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. దుబాయ్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బీన్ సయీద్ అల్ మన్సూరీ, డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బీన్‌తో భేటీ అయ్యారు. పరస్పరం పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాలను అధ్యయనం చేసేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం, డీపీ వరల్డ్ గ్రూపు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు యూఏఈ పాలకులను కోరారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్ట్ ఖలీఫాను చంద్రబాబు సందర్శించారు. అక్కడ ఉన్న స్టార్ హోటళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, నివాసాలను పరిశీలించారు.
రేవంత్ స్పందన..
ఈసీని విమర్శించే హక్కు వారికి లేదన్న మోడీ..
కివీస్ టార్గెట్ 281 పరుగులు..
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ వర్షం..
నల్గొండ : రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలు లేవని టి.టిడిపి నేత రేవంత్ పేర్కొనడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి పార్టీలు తప్పా వేరే కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. కామెర్ల జబ్బున్నడోకి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను దోపిడి చేసిన పార్టీలని..ఈ పార్టీలు ప్రజలను బాగు చేసిన పార్టీలు కాదన్నారు. టీఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలుగా మారి రాష్ట్రానికి నష్టం కలిగించాయని ఆయన అభివర్ణించారు. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వెనుకబాటు తనానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.
వరంగల్ : త్వరలోనే వరంగల్ బంగారు వరంగల్ గా మారుతుందని..తరువాతే బంగారు తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ శంకుస్థాపన రోజే రూ. 3,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి..50వేల మందిక పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
సూరత్, షోలాపూర్, బివండిలో పనిచేస్తున్న వారందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధమైన పాలసీ తమదేనని, 50 కార్యక్రమాలు చేస్తున్నట్లు, రైతులకు రూ. 8వేల కోట్ల పెట్టుబడి సమకూర్చిన ప్రభుత్వం తమదేనన్నారు. తమ ప్రభుత్వం హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్న కేసీఆర్ పథకాల వివరాలను మరోసారి వివరించారు.
దేశంలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఆజంజాహి మిల్లు మూతపడడంతో నేతన్నలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారని తెలితపారు. సూరత్ లో మహిళలు ధరించే వస్త్రాలు..షోలాపూర్ లో దుప్పట్లు..రగ్గులు..తమిళనాడులో అండర్ గార్మెంట్స్ తయరావుతాయన్నారు. సూరత్, తమిళనాడు, షోలాపూర్ కలయికే వరంగల్ టెక్స్ టైల్ పార్కు అని తెలిపారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో విప్లవత్మాకమైన చట్టాన్ని శాసనసభలో ప్రవేశ పెడుతామని, గిరిజనగూడెలు, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమయంలోపే నిర్వహిస్తామన్నారు. పరకాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరకాల నియోజకవర్గానికి రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కష్టాలు చూసి కేసీఆర్ చలించారు - కడియం..
65వేల మందికి ఉపాధి : కేటీఆర్..
టెక్స్ టైల్ పార్కు గొప్ప విషయం - కేసీఆర్..
మాజీ ఎమ్మెల్యే ఇంటిపై గ్రనైడ్ దాడి..
హైదరాబాద్ : రేషన్ షాపులను రద్దు చేసిన నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనను టి.టిడిపి నేత రావుల తప్పుబట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సబ్సిడీ పెరుగుతున్న రోజుల్లో రాష్ట్రంలో దీనిని తొలగించాలనడం సరికాదన్నారు. పౌరసరఫరాలో లోపాలున్నాయని పేర్కొంటూ రేషన్ షాపులను రద్దు చేయడం కరెక్టు కాదన్నారు. లోపాలుంటే సరిచేయాలి కానీ వ్యవస్థనే రద్దు చేస్తారా ? అని ప్రశ్నించారు.
జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్టైల్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగసంస్థలను నీరు గార్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని సీఐటీయూ సెంట్రల్ కార్యదర్శి తపన్ సేన్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్వీకేలో నేషనల్ వర్క్ షాప్ ఆఫ్ వర్కర్ పేరిట సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్రీయ, స్వతంత్ర్య సంఘాలు పాల్గొన్నాయి. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగస్థలపై అనుసరిస్తు విధానాలపై నేతలు చర్చించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కార్మిక చట్టాలను సవరించిందని..వాటిపై కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేకుండా పోయిందని నేతలు పేర్కొన్నారు.
టెక్స్ టైల్ కు శంకుస్థాపన..
జీహెచ్ఎంసీ డిప్యూటి ఇంజినీర్ మరో భాగోతం..
కరీంనగర్ : పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలవబడే వేములవాడలో ఓ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఓ పైవేటు హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం నామాపూర్ కు చెందిన సుజాత..రఘుపతిలు వేములవాడకు వచ్చారు. తాము దర్శనం నిమిత్తం వచ్చామని పేర్కొంటూ సిద్ధార్థ లాడ్జ్ లో బస చేశారు. గది తెలుపులు ఎంతకు తెరకపోవడంతో లాడ్జ్ సిబ్బంది తలుపులు తీయగా సుజాత విగతజీవిగా పడి ఉండడం..రఘుపతి ప్రాణాపాయ స్థితిలో ఉండడం గమనించారు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘుపతి మృతి చెందాడు. వారు బస చేసిన గదిలో కూల్ డ్రింక్..మద్యం సీసాలు లభించినట్లు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన కేసులో రఘుపతి నిందితుడని..ఇటీవలే జైలు నుండి విడుదలయ్యాడని తెలుస్తోంది. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ : టి.టిడిపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దుబాయిలో పర్యటిస్తున్న ఆయన ఇక్కడి నేతలతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఎల్.రమణతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బాబు దృష్టికి రమణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం..బాబు ఫోన్ తో టి.టిడిపి సీనియర్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎల్. రమణ అత్యవసరంగా సమావేశమయ్యారు. బాబుతో జరిపిన సంభాషణలు..చర్చల సారాంశాన్ని ఇతర నేతలతో తెలిపేందుకు ఎల్.రమణ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 24వ తేదీన జరిగే రాష్ట్ర సమావేశంలో బాబు దిశా..దశ నిర్ధేశం చేస్తారని..అందరూ ధైర్యంగా ఉండాలని రమణ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
వేములవాడలో జంట ఆత్మహత్య...
కేసులకు భయపడేది లేదు - కిషన్ రెడ్డి...
మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.
అవకాశవాద రాజకీయాలు - తమ్మినేని..

ప్రముఖ నవలా రచయిత యండమూరి రచించిన 'తులసిదళం’ లో ఏమీ లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా యండమూరి రచించిన ‘తులసిదళం’ నవలపై స్పందించారు. సీరియల్ గా వస్తున్న సమయంలో తనకు కొంతమంది చెప్పారని..గొప్ప నవల అని చెప్పడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకపోవడంతో అంతగా దృష్టి సారించలేదన్నారు. కానీ జ్యోతి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది..ఎందుకిలా జరిగిందనే ఆసక్తి తనలో నెలకొందన్నారు. పెళ్లి సాధ్యం కాదు..ఎంజాయ్ చేద్దాం అనే ఉత్తరంలో ఉందని..అమ్మాయి షాక్ అయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం పుస్తకం చదివానని..కానీ అందులో ఏమీ లేదన్నారు. ఎంత తుక్కు కథ..అంటే అంత తుక్కు కథ అని విమర్శించారు. ఓ డాక్టర్ ముందుమాటలో నవలను మెచ్చుకోవడం జరిగిందన్నారు. దీనిపై తాను ‘గంజాయి దమ్ము’ అని పుస్తకం రాసి..డాక్టర్ పై కూడా తాను విమర్శ చేయడం జరిగిందన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ తనపై కేసు పెట్టలేదని..ముందుమాట రాసిన వ్యక్తి కేసు పెట్టడం జరిగిందని..క్షమాపణ చెప్పాలని ఉత్తరంలో ఆ వ్యక్తి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జైల్లో పెట్టాలి..లేదా రూ. వెయ్యి జరిమాన కట్టాలని జడ్జి పేర్కొనడంతో జరిమాన కట్టేసి వచ్చామన్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
దేవుడనేది అబద్ధమని ప్రముఖ రచయిత్రి రంగానాయకమ్మ పేర్కొన్నారు. టెన్ టివి రంగనాయకమ్మతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విశేషాలు తెలియచేశారు. అందులో నాస్తికత్వంపై స్పందించారు. 20 ఏళ్ల వరకు నమ్మకాలు..ఉండేవన్నారు. కానీ కందుకూరి వీరేశిలింగం గారి పుస్తకం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కందుకూరి నాస్తికుడు కారని, కానీ ఆ బుక్ లో కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు తాను అప్పటి వరకు గ్రహించలేదని..ఎవరూ తనకూ చెప్పలేదన్నారు. తనకు..కుటుంబసభ్యులకు -14 కంటి సైట్ ఉందని..సూర్య నమస్కారం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని పలువురు చెప్పారని పేర్కొన్నారు. కానీ చేసినా మార్పు రాలేదన్నారు. తరువాత నాస్తికత్వం అలవాటై పోయిందని..అలా నాస్తికత్వం పుస్తకాలు చదువుతూ చివరకు దేవుడు అబద్ధమనే అభిప్రాయం వచ్చిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
సోమవారం ఎఫ్ఏ 1 పరీక్షలు...
సోమవారం టి.కేబినెట్ మీటింగ్..
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..
భారత్ బ్యాటింగ్...
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న బాబు..
గుజరాత్ లో మోడీ...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అవినీతి భాగోతాన్ని 10 టీవీ వెలుగులోకి తేవడంతో.. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నిజానిజాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ట్రాన్స్పోర్ట్ విభాగంలో అవినీతి వ్యవహారం బల్దియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బల్దియాలో సెంట్రలైజ్డ్గా ఉన్న ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను రెండెళ్ల క్రితం డీసెంట్రలైజ్ చేశారు. దీంతో బల్దియా వాహనాలను ఎక్కడికక్కడ మరమ్మతులు చేయించడం..డిజిల్ అందించడం చేస్తున్నారు. ఇదే అవినీతి అధికారులకు వరంలా మారింది. మరమ్మతుల పేరుతో ఇష్టారాజ్యంగా బిల్లులు కొట్టేస్తున్నారు. వాహనాలకు ఏదైనా పార్ట్ మార్చాలంటే..మెకానిక్‌ల ధ్రువీకరణ తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా..మెకానిక్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి మరి దండుకుంటున్నారు.
ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారణ
ట్రాన్స్పోర్ట్ విభాగంలో జరుగుతున్న అవినీతి తంతును 10టీవీ బయటపెట్టడంతో.. ఈ వ్యవహారాన్ని బల్దియా సీరియస్‌గా పరిగణించింది. విజిలెన్స్ విభాగం అధికారులు మలక్‌పేట్ పార్కింగ్ యార్డు అసిస్టెంట్ ఇంజనీర్లు, డిఈ శ్రీనివాస చారిని ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారించారు. మెకానిక్‌ల సంతకాలు ఎందుకు తీసుకోవడం లేదు? వారు ధ్రువీకరించకున్న బిల్లుల చెల్లింపులు ఎందుకు చేశారు? నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ప్రవర్తించారు? అన్న విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ దఫా మెకానిక్‌లను విచారించిన విజిలెన్స్ అధికారులు.. ఏఈ, డీఈల నుంచి మరిన్న వివరాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు 22నెలలుగా ఎలాంటి పనులు చేయించకుండా... వేతనాలు చెల్లించడంపై విజిలెన్స్ టీమ్ ఆరాతీస్తోంది.
విజిలెన్స్ రిపోర్ట్ ఉండటం వల్లే వారి సంతకాలు తీసుకోవడంమరోవైపు డిఈ శ్రీనివాస చారి మలక్‌పేట్ పార్కింగ్ యార్డ్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పుకొస్తున్నారు. మెకానిక్లపై విజిలెన్స్ రిపోర్ట్ ఉండటం వల్లే వారి సంతకాలు తీసుకోవడం లేదని సెలవిస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నందున మెకానిక్‌ల సంతకాలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. విచారణ స్పీడ్ పెంచిన విజిలెన్స్ అధికారులు పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈ, డీఈలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఉమ్మడి వరంగల్ లో అరెస్టుల పర్వం
కృష్ణా : విజయవాడ పాతబస్తీలో ప్రజాసంఘాల కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. భవన నిర్మాణానికి సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన..ఏపీలో కార్మిక రంగం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుందని.. కార్మికులకు అండగా ప్రజా సంఘాల కార్యాలయం భరోసాగా ఉంటుందన్నారు. మరోవైపు మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మూడేన్నరేళ్ల పాలనలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోందని మండిపడ్డారు.
వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులతో వాతావరణ వేడెక్కింది. ఈ సాయంత్రం మెగా టెక్స్టైల్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం, సీపీఐ, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సంగంలో మెగా టైక్స్‌టైల్ పార్క్ నిర్వాసితులు, రైతులు, రైతుసంఘం నేతలను నిర్బంధించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 20 మంది కాంగ్రెస్ నేతల అరెస్ట్ చేశారు. అటు జనగామ మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం పట్టణ కార్యదర్శి గోపి, బొట్ట శ్రీనివాస్, జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలను మట్టెవాడ పీఎస్‌లో నిర్బంధించారు. దీంతో ఉమ్మడి వరంగల్జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వరంగంల్ : తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసమే వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 11 వేల కోట్లతో మెగా టెక్స్ టైల్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం భూములు కేటాయించిన రైతులు ప్రభుత్వం తమకిచ్చిన హామిలను నెరవేర్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
కృష్ణా : అమరావతి రాజధాని నిర్మాణం అనుకున్న సమయంలోనే పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. రాజధాని డిజైన్ల పరిశీలన తుదిదశకు చేరుకుందని.. త్వరలోనే డిజైన్లు ఖరారవుతాయని తెలిపారు. రాజధాని ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
లిప్ట్ తగిలి బాలుడు మృతి
హైదరాబాద్ : కర్మాన్ ఘాట్ దుర్గానగర్ లో విషాదం జరిగింది. సత్యసాయి అపార్ట్ మెంట్ లో లిప్ట్ లో తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి చేందాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
వరంగల్ లో ముందస్తు అరెస్ట్ లు
ఖమ్మం : జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పాము హల్చల్ ఆపరేషన్ థియేటర్లో నాగుపాము కనిపించడంతో.. సిబ్బంది పరుగులు తీశారు. దీంతో స్థానికులు...పాముల సాయిబుకు సమాచారం ఇవ్వగా...ఆసుపత్రికి చేరుకున్న అతడు పామును పట్టుకున్నాడు. ఒకడబ్బాలో బంధించి ఊరు బయట వదిలేశాడు.
సిద్దిపేట : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా 500 రోజులకుపైగా రీలే దీక్షలతో వేములఘాట్ వాసులు పోరాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేములఘాట్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడంతో.. అధికారులు గ్రామసభ నిర్వహించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
ప్రకాశం : ఒంగోలులో టి. కృష్ణ వర్ధంతి సభలు జరిగాయి. గత 31 ఏళ్లుగా ప్రతీ యేటా అక్టోబర్ 20, 21 తేదీల్లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్లూరు వెంకటేశ్వర్లు సారధ్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పేద విద్యార్థుల చదువు నిర్విఘ్నంగా సాగాలని టి. కృష్ణ కుమారుడు సినీ హీరో గోపీచంద్.. ప్రతీ యేటా 20 మంది విద్యార్థులకు తన తండ్రి పేరుతో ఉపకార వేతనాలు అందిస్తున్నారు. టి. కృష్ణ అభ్యుదయానికి ప్రతిరూపం. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ సంచలనం. తన చిత్రాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రజానాట్యమండలి గర్వించదగిన గొప్ప కళాకారుల్లో టి. కృష్ణ ఒకరు.
వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 20 కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. జనగామ మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు కేసు
హైదరాబాద్ : మంథని మాజీ ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబుపై చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. శ్రీధర్ బాబు పై కరీంనగర్ జిల్లా ముత్తరం మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి అన్నారు.
నేడు గుజరాత్ లో మోడీ పర్యటన
ఆహ్మదబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఆయన భావ్ నగర్, వడోదర జిల్లాలో రూ.1140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
నిరుద్యోగి ఆత్మహత్య
ఆసిఫాబాద్ : జిల్లాలో సందీప్ అనే నిరుద్యోగి ఉద్యోగం రాదనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ ఎంఎస్సీ, బీఈడీ చేశాడు. డీఎస్సీ నోటిఫికేషన్ లో తన సబ్జెక్టులో తక్కువ పోస్టులు ఉన్నాయని ఆవేదన చేందిన సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
విజయనగరం : జిల్లా కొవ్వాడమండలం అగ్రహారం వద్ద గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాకంపెనీ భూములకు ఫెన్సింగ్ వేస్తున్నారు. మరింత సమాచారం వీడియో చూడండి.
విజయనగరంలో దారుణం
హెరిటేజ్ సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం
నేడు వరంగల్ కు కేసీఆర్
రుణామాఫీ విడుదల చేసిన మాట వాస్తమే అని టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. రుణామాఫీ అనేది మంచి పథకం అని సీపీఎం నేత గఫుర్ అన్నారు. రుణామాఫీలో ప్రభుత్వం విఫలం చెందిందని కాంగ్రెస్ నేత విష్ణు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
హైదరాబాద్ : యాదవులంతా కలిసి చేసుకునే పండుగ సదర్ ఉత్సవాలు. నారాయణగూడలో జరిగిన సదర్ ఉత్సవాల్లో వివిధ జాతులకు చెందిన దున్నలు పోటీల్లో పాల్గొన్నాయి. పెద్దపెద్ద దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో విన్యాసాలు చేస్తూ యాదవులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తలపాగా ధరించి డప్పుకొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఇక హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి యాదవులతో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు. సదర్ ఉత్సవాలు యాదవుల ఐక్యమత్యానికి నిదర్శమని నాయిని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నారాయణగూడలో సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. పశు సంపదను వృద్ది చేసుకోవడం, వృద్ది చేసిన పశుసంపదను ప్రదర్శించడానికే సదర్ సమ్మేళనమని చెప్పారు. అనంతరం ఆయన కళాకారులతో ఆడిపాడారు. డప్పుకొట్టి ఉత్సాహపరిచారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నారాయణగూడలో జరిగిన సదర్ సమ్మేళనంలో హర్యానాకు చెందిన 25కోట్ల విలువైన దున్నపోతు షాహెన్షా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 20 కోట్ల విలువైన చేవెళ్లకు చెందిన మహారాజ్, 12సార్లు నేషనల్ ఛాంపియన్ అయిన రాజా, ధారా దున్నపోతులు ప్రదర్శనలో పాల్గొన్నాయి. యాదవులు దున్నలతో చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాలనపై ఎటువంటి అవగాహన లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తుంటే ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళిక రూపొందించట్లేదని ఆరోపించారు. GHMCలో వేలకోట్ల ఆదాయం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారాయన. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో చింతల రామచంద్రారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 35 లక్షల రైతులకు 17వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ డబ్బును నాలుగు విడతల్లో బ్యాంకులకు చెల్లించింది. దీంతో రైతులందరికీ రుణమాఫీ నిధులు అందాయని ప్రభుత్వం భావించింది. అయితే 17వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసినా ఇంకా రుణాలు మాఫీకాని రైతులు మిగిలే ఉన్నారు. బ్యాంకులు చేసిన తప్పులతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. బ్యాంకుల తప్పు రైతుల పాలిట శాపంగా మారింది.
లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను
టీఆర్ఎస్ ఎన్నికల హామీలో భాగంగా లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 4 విడతలుగా మొత్తంగా 17వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. అర్హులైన రైతుల జాబితాను తయారు చేయాలని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. ప్రభుత్వం, బ్యాంకులు తయారు చేసిన జాబితా మేరకే ప్రభుత్వం నాలుగు విడతలుగా నిధులు మంజూరు చేసింది. అయితే ఈ లిస్టును తయారు చేయడంలో బ్యాంకర్లు కొన్ని తప్పులు చేశారు. చాలాచోట్ల అర్హులైన రైతులను జాబితాలో చేర్చలేదు. ఇలా జాబితాలో చేర్చని రైతుల రుణాలు 150 కోట్లకుపైగానే ఉంటాయని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు.
లెక్కలు వేయడంలోనూ బ్యాంకులు తప్పులు
రైతుల రుణం ఎంత ఉందన్న దానిపై లెక్కలు వేయడంలోనూ బ్యాంకులు తప్పులు చేశాయి. తొందరలో రైతుల రుణాలను తప్పుగా లెక్కగట్టాయి. దీంతో రైతులకు వచ్చిన డబ్బులు వారి వడ్డీలకే సరిపోయింది. ఇలా రైతులు 100 కోట్ల రూపాయలకుపైగానే నష్టపోయారు. కొన్ని మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. ఆ ప్రాంతాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసింది. పంట రుణాలు టర్మ్లోన్లుగా మార్చబడ్డాయి. ప్రభుత్వం ఈ రుణాలు కూడా మాఫీకిందకు వస్తాయని చెప్పింది. అయితే బ్యాంకులు మాత్రం ఆ రైతుల రుణాలను జాబితాలో చేర్చలేదు. దీంతో 150 కోట్లకుపైగా రైతులు నష్టోపోయారు. రైతురుణమాఫీ స్కీమ్ తెలంగాణలో ముగిసిపోయింది. అయితే బ్యాంకులు చేసిన తప్పులతో రుణాలు మాఫీకాని రైతులు ఎక్కువమందే ఉన్నారు. అయితే వారికి స్కీమ్ ముగిసినందున ప్రభుత్వం చేసేదేమీలేదని అధికారులు చెప్తున్నారు. రైతులకు రుణాలు మాఫీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకులే ఆని రుణాలను భరిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బ్యాంకులు చేసిన తప్పులకు రైతులు బలికావాల్సి వస్తోంది. ఇన్నాళ్లు ఆశగా ఎదురు చూసిన రైతులు అవి అందక అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
హైదరాబాద్ : టీ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ తీర్ధంపుచ్చుకోవడం దాదాపు ఖాయమని అందరూ అనుకుంటుండగా... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వివాదాస్పదమైంది. హస్తినలో రేవంత్‌రెడ్డి రాహుల్‌ను కలిశారన్న అన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ఇదే అంశాన్ని టీ టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ను ఎందుకు కలిశావంటూ ఆ పార్టీ నేతలు రేవంత్‌ను కాస్త గట్టిగానే నిలదీశారు. పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండా రాహుల్‌ను ఎందుకు కలిశావంటూ మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు తెలియకుండా పొత్తుల గురించి చర్చలు జరిపేహక్కు ఎవరిచ్చారని నిలదీశారు. అంతేకాదు... ఏపీ మంత్రులు పరిటాల సునీత, యనమలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్లు ఖండిస్తున్నారు. అయితే రేవంత్మాత్రం... తనను జైల్లో పెట్టిన వ్యక్తులతో ఏపీ టీడీపీ నేతలు ఎలా సన్నిహితంగా మెలుగుతారని ప్రశ్నిస్తున్నారు. అన్ని విషయాలు చంద్రబాబుకు వివరిస్తారన్ని సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు. ఇక చేసేదేమీ లేక మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్ సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దీంతో అక్కడే ఉన్న సీనియర్లు రేవంత్‌రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తాము కూడా పార్టీ మారుతున్నట్టు ఎందుకు లీకులిస్తున్నారని రేవంత్‌ను నిలదీశారు. అసలు తమ గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేతలంతా మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒంటరైన రేవంత్... మౌనం వహించడంతప్ప ఏమీ చేయలేకపోయారు.
వాదపలపే లైట్ తీసుకున్న రేవంత్ రెడ్డి
పార్టీ సీనియర్ల వాదనలను రేవంత్‌రెడ్డి లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారికి తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే సమష్టిగా పోరాడాలని ముందునుంచి బలంగా వాదిస్తోన్న ఆయన... కేసీఆరే తన టార్గెట్ అంటూ తేల్చి చెబుతున్నారు. టీడీపీని వీడుతున్నట్టు తానెక్కడా చెప్పలేదని, పొత్తుల గురించి మాట్లాడేందుకే రాహుల్‌తో సమావేశం అయినట్టు రేవంత్ స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకే తాను ప్రయత్నిస్తున్నానని సీనియర్లకు వివరించారు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కలుస్తానని... జరిగిన విషయాలన్నీ ఆయన దృష్టికే తీసుకెళ్లనున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు
సీరియర్లు మాత్రం రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారని.. ఇందుకు లిస్ట్కూడా రెడీ అయ్యిందని ప్రచారం జరుగుతుందని, ఇది పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని కాదని ఎవరైనా హద్దుమీరితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే క్రమశిక్షణా చర్యలకు వెనుకాడేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. టీడీపీలో రేవంత్‌రెడ్డి పార్టీ మారే విషయం పెద్ద దుమారాన్నే సృష్టిస్తోంది. రేవంత్ కాంగ్రెస్‌లో చేరేది తథ్యంగా కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు దీన్నే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇక అధిష్టానం రేవంత్‌రెడ్డి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండడంతో ఇతర నాయకులెవరూ దీనిపై స్పందించడం లేదు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్ పడే చాన్స్ ఉంది. మరోవైపు టీ టీడీపీలో నెలకొన్న అస్థిరతతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండలం చింతలపల్లి, గీసుగొండ మండలం శాయంపేట గ్రామాల సరిహద్దులో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
20 వేలమందికి ఉపాధి
వరంగల్ జిల్లాలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు ఒకప్పుడు వెలుగువెలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమందికి ఉపాధి కల్పించింది. ఐదు దశాబ్దాల ఆజంజాహి చరిత్ర ఏలికల నిర్లక్ష్యం ఫలితంగా కాలగర్భంలో కలిసింది. అయితే, ఇప్పుడు వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెగా టెక్స్టైల్ నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికారులు ప్రాజెక్టును ఆచరణలోకి తెచ్చారు. స్పిన్నింగ్, టెక్స్టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్‌డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్స్, రెడీమేడ్ వస్ర్త పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. టెక్స్టైల్ పార్కువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 87వేల 539 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రాంకీ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుగా నామకరణం చేసినట్లుగా గత ఆర్థిక సర్వేలో సర్కార్ పేర్కొంది. టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల భూమి సేకరించింది. గీసుగొండలోని శాయం పేట, రాయినికుంట, వెంకటాపూర్, ఊకల్, సంగెం మండలంలోని చింతలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో 2800 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. ఎకరాకు రూ.9.95లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం 110కోట్లు చెల్లించారు. బహిరంగ మార్కెట్ విలువకు.. ఇచ్చే పరిహారానికి పొంతన లేదని అన్నదాతలు పెదవివిరుస్తున్నారు.
కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని
పత్తి ఉత్పత్తిలో రాష్టంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో స్థానంలో వుంది. జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. వరంగల్ తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్ కే పత్తిని తీసుకొస్తున్నారు. ఇక్కడ తయారైన పత్తి బేళ్ళను కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మెగాటెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహం లభించనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సేకరించిన భూ వివరాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలపై ఆరా తీశారు. మొత్తంగా మెగాటెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.