Activities calendar

23 October 2017

21:30 - October 23, 2017

ఢిల్లీ : రాజకీయ నేతలు, అధికారులు, జడ్జిలకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న రాజస్థాన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వసుంధర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ అధికారులు, ప్రజాప్రతినిధులను నేరాలకు పాల్పడమని లైసెన్సు ఇచ్చినట్లుగా ఉందని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ ఆర్డినెన్స్‌ వల్ల అవినీతిపరులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం అంత సుళువు కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ జరిపేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ వసుంధరా రాజే సర్కార్‌ ఈ ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీని ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. దీనికి సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తే మీడియాపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. 

రాజస్థాన్ సర్కార్ బిల్లుపై హైకోర్టులో పిటిషన్..

ఢిల్లీ : రాజకీయ నేతలు, అధికారులు, జడ్జిలకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న రాజస్థాన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

21:27 - October 23, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి అడ్డదారులను ఆశ్రయిస్తోందా? పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ అనుచరులకు డబ్బును ఎరగా చూపి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తోందా? అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. బిజెపి తనకు కోటి రూపాయలు ఆఫర్‌ చేసిందని ఓ పటేల్‌ నేత ఆరోపించడం రాజకీయంగా గుజరాత్‌లో కలకలం సృష్టించింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాటీదార్‌ సామాజికవర్గం నుంచి బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపిలో చేరిన ఇటీవల చేరిన నిఖిల్‌ సవానీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పాటీదార్లను కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని బిజెపితో పాటు మోది భావిస్తున్నారని...ఇది నచ్చకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. బిజెపి పాటీదార్లను కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకోవాలని చూస్తోందని నిఖిల్‌ సవానీ ఆరోపించారు. పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితికి చెందిన మరో నేత నరేంద్రపటేల్ బిజెపిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే తనకు కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్‌ చేసిందని ఆరోపించారు. ఇటీవల బిజెపిలో చేరిన వరుణ్‌ పటేల్‌ తనకు అడ్వాన్సుగా ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఇచ్చారని మీడియా ముందు చూపించారు.

నరేంద్ర పటేల్‌ ఆదివారం వరుణ్‌ పటేల్‌ సమక్షంలో బిజెపిలో చేరారు. కొన్నిగంటలు గడవక ముందే ఆయన కమలానికి గుడ్‌బై చెప్పడం గమనార్హం. కోటి రూపాయలు కాదు....తనను రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా కొనలేదని నరేంద్ర పటేల్‌ అన్నారు. బిజెపిలో తాను చేరడం ఓ డ్రామా అని...పటేల్‌ ఆందోళన నేతలను డబ్బుతో కొనలేరని నరేంద్రపటేల్‌ తేల్చిచెప్పారు.

తనపై నరేంద్ర పటేల్‌ చేసిన ఆరోపణలను వరుణ్‌ పటేల్‌ ఖండించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ డబ్బు బీజేపీ ఇచ్చిందనడానికి ఆధారాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో బిజెపిలో టెన్షన్‌ మొదలైంది. గుజరాత్‌లో ప్రధాన ఓటుబ్యాంక్‌గా ఉన్న పటేల్‌ సామాజికవర్గంపై కన్నేసింది. తమ ఆందోళనలతో గుజరాత్‌ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితికి చెందిన నేతలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి ముప్పు తిప్పలు పడుతోంది.

21:27 - October 23, 2017

ఢిల్లీ : రానున్న 10 రోజుల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ సమావేశంలో... పార్టీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. షెడ్యూల్‌ విడుదలైన 15 రోజుల్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఈసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు.. ఢిల్లీ లేదా కర్ణాటకలో నిర్వహించాలని అధిష్టానం భావిస్తోంది. ఎన్నికలు లేకుండానే రాహుల్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలలో రాహుల్‌గాంధీ అధికారికంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీకి వెళ్లనున్న హరీష్..

హైదరాబాద్ : సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రజలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో హరీష్‌రావు పాల్గొంటారు. 

జమ్మూ కాశ్మీర్ లో శాంతి కోసం చర్చలు...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. కేంద్రం తరపున ప్రతినిధిగా ఇంటిలిజెన్స్‌ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్‌ శర్మను నియమిస్తున్నట్లు తెలిపారు.

మోడీపై రాహుల్ ఫైర్..

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదిపై మళ్లీ విరుచుకుపడ్డారు. బిజెపి ఎన్ని డబ్బులు ఇచ్చినా గుజరాత్‌లోని కోట్లాది మంది యువత అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేరని...వారి నినాదాన్ని నొక్కి పెట్టలేరని రాహుల్‌ అన్నారు.

21:24 - October 23, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదిపై మళ్లీ విరుచుకుపడ్డారు. బిజెపి ఎన్ని డబ్బులు ఇచ్చినా గుజరాత్‌లోని కోట్లాది మంది యువత అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేరని...వారి నినాదాన్ని నొక్కి పెట్టలేరని రాహుల్‌ అన్నారు. యువ నేతలు హార్దిక్‌, జిగ్నేష్‌లను గుజరాతీలు గుండెల్లో దాచుకున్నరాని తెలిపారు. నోట్ల రద్దు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని దిగజార్చారని ధ్వజమెత్తారు. జిఎస్‌టి ద్వారా లక్షలాది మంది చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని రాహుల్ ఆరోపించారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు ఉద్యోగం, విద్య, ఆరోగ్యం కావాలని అడుగుతున్న ప్రభుత్వం ఏమి చేయడం లేదన్నారు.

21:23 - October 23, 2017

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. కేంద్రం తరపున ప్రతినిధిగా ఇంటిలిజెన్స్‌ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్‌ శర్మను నియమిస్తున్నట్లు తెలిపారు. దినేశ్వర్ శర్మ అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతారని హోంమంత్రి పేర్కొన్నారు. చర్చలు జరిపేందుకు దినేశ్వర్ శర్మకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు. దినేశ్వర్‌ శర్మ కేబినెట్‌ సెక్రెటరీ హోదాలో పనిచేస్తారని రాజ్‌నాథ్ వెల్లడించారు. వేర్పాటు వాదులతో చర్చలు జరిపేది లేనిది దినేశ్వర్‌ శర్మనే నిర్ణయిస్తారని హోంమంత్రి తెలిపారు.

 

21:19 - October 23, 2017

హైదరాబాద్ : సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రజలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో హరీష్‌రావు పాల్గొంటారు. ఇందుకోసం ఉన్నతాధికారులతో హరీష్‌రావు సమీక్షించారు. ఈ ప్రాజెక్టులకు పీఎంఎస్‌కేవైలో చోటు లభించేలా చేయడానికి హరీష్‌రావు కేంద్రజలవనరుల శాఖపై ఒత్తిడి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు గ్రాంటు, రుణాలు ఈ పథకం ద్వారానే లభించనున్నాయి.

 

21:16 - October 23, 2017

విజయవాడ : అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసేందుకు వైసీపీ యోచిస్తోంది. ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సినప్పటికీ... పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ ఇలాంటి కుట్ర పన్నుతుందని వైసీపీ నేతలంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగూ ప్రతిపక్షానికి మాట్లాడే సమయం ఇవ్వరు కాబట్టి.. అధికారపక్ష అక్రమాలను పాదయాత్ర చేస్తూ ఎండగంటాలనుకుంటోంది వైసీపీ. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టులోనే నిర్వహించాల్సినప్పటికీ ప్రభుత్వం దిగజారుడుతనంతో... పాదయాత్ర తేదీలు ప్రకటించిన తర్వాత నిర్వహిస్తుందని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను మొదటినుండి అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ... కనీసం అసెంబ్లీ సమావేశాలతోనైనా వాయిదా వేసేలా చూడాలనుకుంటుందని వైసీపీ అంటోంది. దీంతో... అధికార పార్టీ కుట్రను తిప్పికొట్టేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర వాయిదా వేసే ప్రసక్తే లేదని వైసీపీ సంకేతాలిస్తోంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేయాలని వైసీపీ యోచిస్తోంది.

ఇక ఈ సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చ జరిగింది. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా ప్రభుత్వం, స్పీకర్‌ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు వైసీపీ నేతలు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై వైసీపీ సీరియస్‌గా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసి, మంత్రులను బర్తరఫ్‌ చేసి.. ప్రజాసమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్దామని నేతలు జగన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగనీయకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సభకు వెళ్లడం కంటే... పాదయాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజాక్షేతంలోనే నిలదీయాలని నేతలు జగన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో... వైసీపీ సభకు హాజరవుతుందా ? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

21:07 - October 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల నుండి ఈ భేటీ జరుగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. సభలో ప్రవేశ పెట్టే బిల్లులపై ప్రధానంగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం..కొత్త పంచాయతీ రాజ్ చట్టం..వివిధ పోస్టుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో 60-62 అంశాలు చర్చకు వచ్చినట్లు, కొన్ని బిల్లులకు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. గతానికంటే భిన్నంగా సమావేశాలు ఉండాలని.. ప్రభుత్వం నిర్వహించిన..నిర్వహించబోయే పథకాలు..తదితర వివరాలను ప్రజలకు చెప్పే విధంగా అసెంబ్లీని వేదిక చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బిల్లులపై ప్రధానంగా చర్చ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం..ప్రవేశ పెట్టే బిల్లులపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. 

ఒంగోలులో భారీ చోరీ..

ప్రకాశం : ఒంగోలులో భారీ చోరీ జరిగింది. రూ. 3 కోట్ల విలువైన బంగారం..వెండి..వజ్రాలు..రూ. 50వేల నగదులను అపహరించారు. రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లిన కోటయ్య ఇంట్లో ఈ చోరీ జరిగింది. 

20:21 - October 23, 2017

ఈ భూమిపై మానవ జాతి అడుగులకి ఎన్నేళ్ల వయసుంటుంది? దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకె చెప్పగలరు సైంటిస్టులు.. మరి మానవజాతి ఈ భూమ్మీద ఇంకా ఎంత కాలం బతుకుతుంది? చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును మరి... పక్కలో బాంబును పెట్టుకుని, పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని, తాకితే నాశనమయ్యే రసాయనాల్ని పోగేసుకుని, భూమిని వేలసార్లు భస్మీపటలం చేయగల అణ్వాయుధాలతో దేశాన్ని నింపుకుంటుంటే వెయ్యేళ్లదాకా ఎందుకు ...ఇంకా ముందే సర్వనాశనం జరగొచ్చు.. ఇదే మాట చెప్తున్నారు.. సైంటిస్టులు.. బతకాలనే ఆలోచన ఉంటే ఇంకో గ్రహాన్ని వెతుక్కోమని సలహా కూడా ఇస్తున్నారు.. కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అనే మాట చాలా సార్లు వినే ఉంటారు.. ఇప్పుడు అనేక ప్రపంచ దేశాలు అదే పని చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకర విష రసాయనాలు అణ్వాయుధాలు, జీవాయుధాలు పోగేసుకుని తమదే పై చేయి అని మూర్ఖంగా నవ్వుకుంటున్నాయి. కానీ, తాము కూడా ఈ పోటీలో అంతమౌతామనే నిజాల్ని విస్మరిస్తున్నాయి.

జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవ జీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికే హెచ్చరించాడు. సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్‌ యుద్ధాలు తప్పవని చెప్పాడు.

విషరసాయనాలు, బయో ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? పనికొచ్చే పరిశోధనలు చేస్తున్నట్టుగా చెప్తూ అండర్ గ్రౌండ్ లో వినాశన కారకాలను తయారు చేస్తున్నారా? అగ్రరాజ్యాల శాస్త్ర సాంకేతిక పరిశోధనలు వినాశనకారకాలుగా మారుతున్నాయా? ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు అమెరికా ల్యాబుల్లో తయారయ్యాయా? భవిష్యత్‌లో అణు యుద్ధాలు, జీవరసాయనిక దాడులు తప్పేలా లేవని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నాడు. సాంకేతిక రంగంలో అనేక దేశాలు అవలంభిస్తున్న చర్యల వల్ల ఈ తరహా యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదంటున్నాడు. మరోపక్క అనూహ్యంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ , భూమిపైన అనేక జాతులు అంతరించిపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్ వెరసి మనిషి తన తోకకు తానే నిప్పంటికుంటున్నాడన్నది ఇక్కడ సారాంశం..

ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవటం అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఇది మానవుడి అభివృద్ధి పరిణామానికి సరిగ్గా వర్తిస్తుంది. పనికొచ్చే ఆవిష్కరణల మాట తర్వాత.. నిండా ముంచే అనేక ప్రమాదాలను మాత్రం తయారు చేసిపెట్టుకున్నాడు. తన వినాశనానికి తానే కారకుడౌతున్నాడు. ఈ లోగా ఏ గురుగ్రహానికో మనుషులు కొందరు షిఫ్టవకపోతే... ఈ భూమిపై మనిషి అనేవాడు త్వరలో చరిత్ర అవ్వకతప్పదు...ఇదీ సైంటిస్టుల మాట. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:14 - October 23, 2017

ఇంక కొన్ని రోజులు ఇట్లనే భూమ్మీద ఉండెనాంటే... శ్రీక్రిష్ణ పరమాత్మున్ని మరిపిచ్చెతట్టే ఉన్నడు ఒకాయిన.. ముప్పై తొమ్మిది మందిని పెండ్లి జేస్కోని తొంబై నాల్గు మంది పిల్లలను గన్నడంటే.. చెప్పుండ్రి వాడు పోరగాళ్ల కంపిని వెట్టునట్టే లేదు ముచ్చట.. ఇప్పటికి మళ్ల సంబంధాలు జూస్కుంటనే ఉన్నట్టుండు.. బైటిదేశాలపొంటే ఉంటరేమో అనుకున్నగని.. మనదేశంల గూడ మోపైండుగదా ఒకాయిన మరి ఆయన కథ సూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

రాహుల్ తో శ్రీధర్ బాబు..

ఢిల్లీ : రాహుల్ గాంధీని మాజీ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. తెలంగాణలో తాజ రాజకీయ పరిణామాలు..తనపై ప్రభుత్వ వేధింపులను రాహుల్ కు శ్రీధర్ వివరించారు.

20:01 - October 23, 2017

తమిళ హీరో విజయ్‌ నటించిన 'మెర్సల్‌' చిత్రం రాజకీయ వివాదానికి తెరలేపింది. ఈ సినిమాలో జిఎస్‌టి, నోట్లరద్దు, భారత వైద్య విధానంలోని లొసుగులను ఎత్తి చూపేలా కొన్ని సంభాషణలుండడంపై బిజెపి అభ్యంతరం చెబుతోంది. సింగపూర్‌లో జీఎస్టీ 7 శాతమే... అక్కడ ప్రజలకు వైద్య సదుపాయాలు ఉచితంగా లభిస్తున్నాయి. భారత్‌లో 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా వైద్యసేవలు ఉచితంగా లభించడంలేదని ఓ సన్నివేశంలో హీరో విజయ్‌ చెబుతాడు. ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (తెలుగు ఫిలిం ఛాంబర్ కోశాధికారి), బొమ్మాక్ మురళి (సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు), బెల్లయ్య నాయక్ (టి.కాంగ్రెస్), , శ్రీధర్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:58 - October 23, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ తీసిన తమిళ చిత్రం 'మెర్సల్' ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సినిమాలో జిఎస్‌టి, నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కొన్ని సన్నివేశాలున్నాయి. దీనిపై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జిఎస్‌టిని వ్యతిరేకించేలా ఉన్న డైలాగులను తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. మెర్సల్‌ చిత్రానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు తమిళ సూపర్‌ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్, విశాల్‌ తదితరులు తమ మద్దతు తెలిపారు.

తమిళ హీరో విజయ్‌ నటించిన 'మెర్సల్‌' చిత్రం రాజకీయ వివాదానికి తెరలేపింది. ఈ సినిమాలో జిఎస్‌టి, నోట్లరద్దు, భారత వైద్య విధానంలోని లొసుగులను ఎత్తిచూపేలా కొన్ని సంభాషణలుండడంపై బిజెపి అభ్యంతరం చెబుతోంది. సింగపూర్‌లో జీఎస్టీ 7 శాతమే... అక్కడ ప్రజలకు వైద్య సదుపాయాలు ఉచితంగా లభిస్తున్నాయి. భారత్‌లో 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా వైద్యసేవలు ఉచితంగా లభించడంలేదని ఓ సన్నివేశంలో హీరో విజయ్‌ చెబుతాడు.

ఔషధాలపై 12 శాతం జిఎస్‌టి విధించిన ప్రభుత్వం... ఆడపడచుల కాపురాలు కూల్చే మద్యంపై మాత్రం జిఎస్‌టి విధించలేదని విజయ్‌ మారన్‌ పాత్రలో మండిపడ్డాడు. జిఎస్‌టి, నోట్లరద్దుపై చిత్రీకరించిన కొన్ని అభ్యంతరకర డైలాగులపై బిజెపిలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెంటనే ఈ సన్నివేశాలను తొలగించాలని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు హెచ్‌.రాజా డిమాండ్‌ చేశారు. కాగా...'మెర్సల్‌' డైలాగుల్లో తప్పేముందని తమిళనాడుకు చెందిన మరో బిజెపి నేత సిధార్త్‌ మణి అన్నారు. దీన్ని అనవసరంగా పార్టీకి ఆపాదించి కొందరు సమస్యను పెద్దది చేశారని ఆయన మండిపడ్డారు. మరోవైపు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి 'మెర్సల్‌' చిత్రానికి మద్దతు పెరుగుతోంది. సినిమాలో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. వెల్ డన్. మెర్సల్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేశారు.

'మెర్సల్‌'కు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిందని...దాన్ని మళ్లీ సెన్సార్‌ చేయాల్సిన అవసరం లేదని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. విమర్శలను లాజికల్‌గా ఎదుర్కోవాలని కమల్‌ సూచించారు. చిత్రంలోని దృశ్యాలను తొలగించవద్దని కోరారు. 'మెర్సల్‌' సినిమాను పైరసీ కాపీ చూశానని తమిళ బిజెపి చీఫ్ రాజా చెప్పడాన్ని మరో తమిళ నటుడు విశాల్‌ తప్పు పట్టారు. బాధ్యత గల పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన పైరసీని ఎలా చూస్తారని చురకలంటించారు. 'మెర్సల్' వివాదంపై ప్రధాని మోదిని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తమ సంస్కృతిని, భాషను సినిమా ద్వారా వ్యక్తిపరిచేందుకు తమిళులు ఇష్టపడుతారని రాహుల్‌ తెలిపారు. ఈ సినిమా వివాదంలో తలదూర్చి.. తమిళుల ప్రతిష్టను డిమానీటైజ్ చేయరాదంటూ రాహుల్ ట్వీట్‌ చేశారు. 'మెర్సల్' వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ స్పందించింది. భారతదేశంలోని వైద్య విధానంలో ఉన్న నాణ్యతా లోపాలు.. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రాన్ని నిర్మించామని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని సంస్థ పేర్కొంది. అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

పది రోజుల్లో సీడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ ..

ఢిల్లీ : పది రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సీడబ్ల్యూసీ షెడ్యూల్ ఖరారు చేయనుంది. 15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పూర్తి కానుంది. ప్లీనరీలో అధికారికంగా రాహుల్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికలు లేకుండా రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఢిల్లీ లేదా కర్నాటకలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

 

18:37 - October 23, 2017
18:35 - October 23, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరుపుతున్న విదేశీ పర్యటనలపై వైసీపీ అసత్యప్రచారం చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. సీఎం బాబు ఏ దేశం వెళ్లినా పెట్టుబడులు తెస్తున్నారని, బాబు సక్సెస్ ను ఓర్చుకోలేక ఆయనపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. విహార యాత్రకు వెళ్లరని..నిమిషం వృధా చేయరని..రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి..రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనే దానిపై బాబు దృష్టి సారిస్తున్నారని తెలిపారు. 

18:34 - October 23, 2017

విజయవాడ : ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ తీరు మార్చుకోవాలని ఏపీ మంత్రి సోమిరెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ వెంటనే ప్రతిపక్ష నేతగా తప్పుకోవాలని..పార్టీ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. జగన్ వైఖరితో రాజకీయ నేతలంటే సమాజంలో చిన్న చూపు ఏర్పడుతోందని తెలిపారు. 

18:28 - October 23, 2017

ఢిల్లీ : యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథార్టీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టే బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో అధిక శాతం ఏపీలో పెట్టాలని బాబు కోరారు. ఇందుకు ఏడీఐఏ సంసిద్ధత వ్యక్తం చేసింది. అత్యంత క్లిష్ట సమయంలో నవ్యాంధ్రలో సీఎంగా బాధ్యతలు స్వీకరించాననని, సంస్కరణలు చేపట్టి సంక్షోభాన్ని అధిగమించడం జరిగిందని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న సహజ వనరులు, సుదీర్ఘ సముద్ర తీరం..రైలు..అంతర్గత జల రవాణా..మార్గాలు మరే ఏ రాష్ట్రానికి లేవని తెలిపారు. 15 శాతం వృద్ధిని 15 ఏళ్ల పాటు స్థిరంగా కొనసాగించడమే తమ లక్ష్యమని బాబు పేర్కొన్నారు. 

18:17 - October 23, 2017

విశాఖపట్టణం : నగరాభివృద్ధి సంస్థలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో సోమవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. ఎక్కువగా పేపర్ తో కూడిన మెటిరీయల్ ఉండడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. 

18:16 - October 23, 2017

విజయవాడ : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వైసీపీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మాసంలో నిర్వహించాల్సిన వర్షాకాల సమావేశాలు..నవంబర్ నెలలో నిర్వహించడం..జగన్ పాదయాత్ర చేయతలపెట్టిన సమయంలో ఈ సమావేశాలు నిర్వహించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్ర నిమిత్తం హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనితో వైసీపీ అధినేత జగన్ కీలక నేతలు..అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం..పాదయాత్ర అంశాలపై చర్చించారు.

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ సమావేశం కొనసాగింది. అసెంబ్లీకి హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై కూలంకుశంగా చర్చించారు. ఆగస్టు మాసంలో జరగాల్సిన సమావేశాలు నవంబర్ లో నిర్వహించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని జగన్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు. దీనితో సమావేశాలకు వెళ్లేందుకు పార్టీ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సమావేశాలకు వెళ్లాలా ? వద్దా ? అనే దానిపై జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 26వ తేదీన జరిగే పార్టీ సమావేశంలో జగన్ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. 

ముగిసిన జగన్ సమావేశం..

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమావేశం కాసపటి క్రితం ముగిసింది. అందుబాటులో ఉన్న కీలక నేతలు..ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ జరిపారు. అసెంబ్లీ సమావేశాలు..పాదయాత్రకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 

వుడాలో అగ్నిప్రమాదం..

విశాఖపట్టణం : వుడా రెండో అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

కొనసాగుతున్న టి.కేబినెట్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

17:56 - October 23, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి శ్రీధర్‌ బాబుపై కేసు పెట్టడాన్ని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్‌ సర్కార్‌ శ్రీధర్‌ బాబుపై తప్పుడు కేసు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల కోసం పోరాడుతున్నందుకే శ్రీధర్‌ను టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై టీఆర్‌ఎస్‌ ఉక్కుపాదం మోపాలని చూస్తోందని ఉత్తం ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన తమ పోరాటాలు ఆగవని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. --

17:55 - October 23, 2017

హైదరాబాద్ : మైనారిటీ యువకుల స్వయం ఉపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వంద శాతం సబ్సిడీపై లక్షల నుంచి రెండు లక్షల రూపాయల విలువైన యూనిట్లకు దీనిని వర్తింప చేస్తారు. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లలో మైనారిటీలకు పది శాతం వాటా ఖరారు చేశారు. మైనారిటీల సంక్షేమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీఆర్‌ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉర్దూ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించి భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలను తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఉర్దూలో కూడా నిర్వహించే ఏర్పాటు చేశారు. కోకాపేటలో పది ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ ఇస్లామిక్‌ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని నిర్ణయించారు. మూడు వారాల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

17:53 - October 23, 2017

నల్గొండ : సీపీఎం తెలంగాణ రెండో మహాసభలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నల్గొండలో జరుగనున్నాయి. మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం పట్టణంలో జరిగింది. ఈ భేటీకి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. మూడేళ్లుగా పార్టీ నిర్వహించిన పోరాటాలతో పాటు వచ్చే ఎన్నికలు గురించి నల్గొండ మహాసభల్లో చర్చించున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, సామాజిక న్యాయ సాధనతోనే బంగారు తెలంగాణ వస్తుందని తెలిపారు. సమావేశాల సందర్భంగా తమ్మినేనితో టెన్ టివి ముచ్చటించింది. గత మూడు సంవత్సరాలుగా జరిగిన చర్యలు..2018లో ఎన్నికలు జరుపుతామని మోడీ సంకేతాలు ఇస్తున్నారని...ఇవన్నీ అవకాశవాద రాజకీయాలన్నారు. వీటిపై చర్చిస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:50 - October 23, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సినీ ఫక్కీ తరహాలో ఓ ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం కన్న తండ్రే కూతురిని విక్రయించిన ఘటన తాజాగా బయటపడింది. భార్య ప్రసవ సమయంలో.. కన్న తండ్రి చిన్నారిని 25 వేల రూపాయలకు విక్రయించాడు. పాప విషయం అడిగితే... చనిపోయిందని భార్యను నమ్మించాడు. కానీ... తాజాగా ఆ కూతురు బతికే ఉందని బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. పాపను ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. ఇదిలావుంటే ఇన్నాళ్లు పెంచుకున్న తల్లి దగ్గర నుంచి వచ్చేందుకు పాప నిరాకరించింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్ఎంబీ కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది.

 

17:47 - October 23, 2017

కాగజ్ నగర్ : తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ తన భర్త ఇంటిముందు బైఠాయించింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అదనపు కట్నం కోసం అత్తమామలు వేదింపులకు గురిచేశారని ఆరోపిస్తూ స్రవంతి అనే మహిళ... ధర్నాకు దిగింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కి చెందిన స్రవంతికి కరీంనగర్‌కి చెందిన కృష్ణతో 2012లో వివాహం జరిగింది. తరచూ గోడవలు జరుగుతుండటంతో కృష్ణపై స్రవంతి బంధువులు కేసు నమోదు చేశారు. కేసు కోర్ట్‌లో ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు స్రవంతి తెలుసుకుంది. దీంతో తన భర్త ఇంటికి చేరుకుని కృష్ణతో స్రవంతి వాగ్వాదానికి దిగగా స్రవంతిపై భర్త కృష్ణ దాడికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని తన భర్త తనకు కావాలంటూ స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది. 

17:31 - October 23, 2017

నిజామాబాద్ : వివాహిత మహిళలతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతున్న సీఐపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. టెన్ టివి వరుస కథనాలతో ఉన్నతాధికారులు స్పందించారు. సంబంధిత సీఐను సస్పెండ్ చేశారు. ఈసందర్భంగా టెన్ టివికి భాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

బోధన్ పట్టణ సీఐ సురేందర్ రెడ్డి వ్యవహార శైలి ఎలాంటిదో టెన్ టివి బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం...బాధితులు ఫిర్యాదు చేస్తే ఫోన్లలో వేధించడం చేస్తుండేవాడు...ఈ క్రమంలో ఓ బాధితురాలు సీఐ సురేందర్‌రెడ్డి వేధింపులను ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీంతో ఇంతకాలంగా అరాచకాలకు పాల్పడుతున్న ఆ సీఐ అసలు బాగోతం బట్టబయలైంది...కులాంతర వివాహం చేసుకున్న భార్యాభర్తలు కుటుంబ కలహాలతో పోలీసు స్టేషన్ చేరారు...దీన్ని ఆసరాగా చేసుకున్న సీఐ ఆ తర్వాత బాధితురాలితో ఫోన్‌లో ఏకాంత సంభాషణలు మొదలుపెట్టాడు. ఆమె భర్తపై నమోదు చేసిన కేసులో సహకారం అందించాలంటే తనతో గడపాలని కోరాడు...బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేయగా నిజమేనని తేలడంతో వేటు వేస్తూ డీఐజీ కార్యాలయానికి వీఆర్‌కు పంపారు. అనంతరం ఆరోపణలు రుజువు కావడంతో సీఐ సురేందర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. 

బోధన్ పట్టణ సీఐ సస్పెండ్..

నిజామాబాద్ : టెన్ టివి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. బోధన్ పట్టణ సీఐ సురేందర్ రెడ్డి వివాహిత మహిళలతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన ఘటనలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు రుజువు కావడంతో సీఐ సురేందర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. 

17:25 - October 23, 2017

హైదరాబాద్ : ప్రేమ పేరిట వేధింపులు..తనను ప్రేమించాలని..వివాహం చేసుకోవాలని..యువకులు బరి తెగిస్తున్నారు. దీనిని తిరస్కరించిన పాపానికి ఏ మాత్రం ఆలోచించకుండా మహిళల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇటీవలే పలు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎర్రగడ్డలో ఒళ్లుగగొర్పుడిచే ఘటన చోటు చేసుకుంది.

కొంతకాలంగా వివాహితను ఓ యువకుడు ప్రేమ పేరిట బెదిరంపులకు దిగిగుతున్నాడు. ఈ వేధింపులు తాళలేని ఆ వివాహిత రెండుసార్లు ఎస్సార్ నగర్ లో ఫిర్యాదు చేసింది. కానీ వేధింపులు మాత్రం ఆగలేదు. సోమవారం ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద వివాహితను అడ్డుకున్న యువకుడు కత్తితో గొంతను కోశాడు. విచాక్షణారహితంగా దాడి చేయడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

17:15 - October 23, 2017

ఎర్రగడ్డలో దారుణం...

హైదరాబాద్ : ఎర్రగడ్డ రైతు బజార్ సమీపంలో వివాహితను ఓ యువకుడు నడిరోడ్డుపై నరికాడు. ప్రేమ పేరిట వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎస్ఆర్ నగర్ లో ఇదివరకే యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తీవ్రగాయాలపాలైన మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

16:07 - October 23, 2017
16:05 - October 23, 2017

ఢిల్లీ : ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ ఉత్సవాల్లో రాహుల్ ను ఎలా ఎలివేట్ చేయాలి..ఎలాంటి పంథాను అనుసరించాలనే దానిపై చర్చింస్తున్నట్లు టాక్. సీడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు నిర్వహించాలి..ఏజెండా ఏమి ఉండాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 30వ తేదీతో సంస్థాగత ఎన్నికల గడువు ముగియనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ను నియమించాలని అధిష్టానానికి వినతలు అందాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 

సీనియర్ నేతలతో సోనియా భేటీ..

ఢిల్లీ : హస్తినలో పార్టీ సీనియర్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ కానున్నారు. ఈ కీలక సమావేశంలో సోనియా పలు నిర్ణయాలు తీసుకొననున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్..కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశ తేదీలను ఖరారు చేయనున్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

విజయవాడ : నవంబర్ 10వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ కోడెల వెల్లడించారు. 

మైనార్టీ...కేసీఆర్ కీలక నిర్ణయాలు..

హైదరాబాద్ : మైనార్టీల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పేద మైనార్టీ యువకుల స్వయం ఉపాధికి..బ్యాంకులతో సంబంధం లేక ఉండా 100 శాతం సబ్సిడీతో రూ. లక్ష నుండి రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో 10 శాతం మైనార్టీలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ఉర్దూ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని..మైనార్టీ డెవలప్ మ ఎంట్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ..వక్ఫ్ బోర్డులు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు.

15:30 - October 23, 2017
15:24 - October 23, 2017
15:18 - October 23, 2017

అనారోగ్యం మనిషిని ఓడిస్తుందా ? అంగవైకల్యం మనిషి ఎదుగుదలను ప్రశ్నిస్తుందా ? గెలుపును శాసిస్తుందా ? ఆశయానికి అడ్డుగా నిలుస్తుందా ? ఇవన్నీ కానీ కాదని ఎంతో మంది నిరూపించారు. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదని అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఈవిషయాన్ని నమ్మి పట్టుదలే తన కవచమని..ఆత్మ విశ్వాసమే తన ఊపిరంటూ ఓ అతివ నిరూపించింది. ఈ అతివ కథనంతో మానవి 'స్పూర్తి'. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:14 - October 23, 2017
15:12 - October 23, 2017

ఢిల్లీ : బీజేపీలో చేరితే తనకు రూ. కోటి ఇస్తామని ఆ పార్టీ ఆఫర్ చేసిందని పటీదార్ అనామత్ ఆందోళన సమితి కన్వీనర్ నరేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్థిక్ పటేల్ కు సన్నిహితుడైన వరుణ్ పటేల్, రేష్మ పటేల్ లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే తనకు బీజేపీలో చేరాలంటూ రూ. కోటి ఇవ్వ జూపారని..అడ్వాన్స్ గా రూ. 10 లక్షలు ఇచ్చారని మీడియాకు తెలిపారు. ఇచ్చిన డబ్బు ఇదేనంటూ పేర్కొన్నారు. పటేల్ కు డబ్బులు ఎరచూపడంపై బీజేపీ పటేల్ సామాజిక వర్గ నేత నిఖిల్ సావాని రాజీనామా చేశారు. పటేళ్ల ఆందోళనలను డబ్బుతో కొనలేరని..నరేంద్ర పటేల్ తేల్చిచెప్పారు. పటేళ్ల ఆందోళనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ. పది లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ పటేల్ ఖండించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

15:08 - October 23, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తారా ? గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. పాదయాత్ర చేయాలని సంకల్పించిన దృష్ట్యా తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆయన పాదయాత్రపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.

నవంబర్ 2 నుండి మే 2 వరకు పాదయాత్ర చేయాలని జగన్ యోచించారు. తాను అక్టోబర్ లోనే పాదయాత్ర చేస్తానని ఇటీవలే జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది.

మంగళవారం కూడా విచారించింది. జగన్...సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అక్రమాస్తులు..పెట్టుబడులకు సంబంధించి 11 ఛార్జీ షీట్లు జగన్ పై నమోదయ్యాయని..ఏ 1 నిందితుడిగా ఆయన ఉన్నారని సీబీఐ ప్రత్యేక తరపు న్యాయవాదులు వాదించారు. బయట తిరిగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై జగన్ న్యాయవాదులు తిరస్కరించారు. కానీ చివరకు సీబీఐ తరపు న్యాయవాదుల వాదనకు కోర్టు మొగ్గు చూపింది. ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పింది. దీనిపై జగన్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

జగన్ కు చుక్కెదురు..

హైదరాబాద్ : సీబీఐ ప్రత్యేక కోర్టులో వైసీపీ అధినేత జగన్ కు చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనకు హాజరు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

14:56 - October 23, 2017
14:55 - October 23, 2017

ఖమ్మం : జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించవద్దంటూ జరుగుతున్న ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. వెంకటాయపాలెంకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని నిరిసిస్తూ వామపక్షాలు..ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ధర్నా..సంతకాల సేకరణ..రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతో అనుకూలంగా ఉన్న ఈ కలెక్టరేట్ ను తరలించవద్దని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:50 - October 23, 2017
14:49 - October 23, 2017

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో ఓ పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అస్వస్థతకు గురైన పసికందును తల్లి నిర్మల నీలోఫర్ కు తీసుకొచ్చింది. ఆసుపత్రిలో ఓ మహిళ ఆయాగా పనిచేస్తానని చెప్పి పసికందును ఎత్తుకెళ్లిందని నిర్మల పేర్కొంది. గత శుక్రవారం ప్లేట్ల బురుజు ఆసుపత్రిలో నిర్మల మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శిశువు కిడ్నాప్ కావడంతో కుటుంబసభ్యులు నాంపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

14:44 - October 23, 2017

సంగారెడ్డి : జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రతినిధులు సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలకొకసారి సమావేశం జరగాల్సి ఉంది. ముగ్గురు కలెక్టరేట్లు, ఎమ్మెల్యేలు, ఇతరులు గైర్హాజరయ్యారు. ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని...ఏ అంశాలు లేవనెత్తారో దీనికి సమాధానం చెప్పాల్సిన అధికారులు లేరని సభ్యులు నిలదీశారు. 49 అంశాల ఎజెండా ఉండగా జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను చిత్తశుద్ధితో నడపడం లేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా గంట ఆలస్యంగా ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14:38 - October 23, 2017

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సెక్యూర్టీ గార్డు, ఆయమ్మ, రైటర్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని కేటుగాళ్లు మోసగానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో పనిచేసే హెల్త్ ఇన్స్ పెక్టర్ రవికి మధ్యవర్తుల ద్వారా లక్షల రూపాయలు చెల్లించామని బాధితులు పేర్కొంటున్నారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో వారంతా గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధ్యవర్తులు లావణ్య..కరుణాకర్ దంపతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

న్యూజిలాండ్ తో టీ -20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక..

ఢిల్లీ : న్యూజిలాండ్ తో టీ -20 సిరీస్ కు భారత జట్టు ఎంపికైంది. మూడు టీ 20 మ్యాచ్ లు భారత్ ఆడనుంది. తొలి టీ -20 మ్యాచ్ కు మాత్రమే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. నవంబర్ 1న జరిగే టీ -20 తరువాత క్రికెట్ కు నెహ్రా వీడ్కోలు పలుకనున్నాడు. కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, ధోనీ, కేఎల్ రహాఉల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, నెహ్రా, మహ్మద్ సిరాజ్ లున్నారు. 

మెట్ పల్లి మున్సిపాల్టీలో ఉద్రిక్తత..

జగిత్యాల : మెట్ పల్లి మున్సిపాల్టీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛైర్మన్..వైస్ ఛైర్మన్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫర్నీచర్ ను ఇరువర్గాలు ధ్వంసం చేశాయి. 

'శ్రీధర్ బాబును అడ్డుకోవాలని చూస్తున్నారు'

హైదరాబాద్ : కాళేశ్వరం అక్రమాలపై శ్రీధర్ బాబు పోరాడుతున్నారని టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు రావనే భయంతో శ్రీధర్ బాబును అడ్డుకోవాలని చూస్తున్నారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామిక పోరాటాలు చేస్తున్న కోదండరాం, వామపక్ష ప్రజా సంఘాల నాయకులపై అణిచితే ధోరణులు టీఆర్ఎస్ పాలనలో సహజంగా మారాయన్నారు. 

కుటుంబం ఆత్మహత్యాయత్నం..

చెన్నై : తిరునెల్వేలి కలెక్టరేట్ ఎదుట కలకలం రేగింది. కలెక్టర్ తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దంపతులు..ఇద్దరు కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. 

13:54 - October 23, 2017
టోక్యో : జపాన్‌ పార్లమెంటుకు ఆదివారం మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని షింజో అబే నేతృత్వంలోని లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఘన విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ప్రతినిధుల సభలోని 465 సీట్లకు జరిగిన ఎన్నికల్లో LDPకి 311 సీట్లు దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోడంతో జపాన్‌ ప్రజలు ప్రధాని షింజోకే మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారని పోలింగ్‌ అనంతర సర్వేలు చెబుతున్నాయి. జపాన్‌ మీదుగా ఉత్తరకొరియా క్షిపణులు ప్రయోగించింది. పైగా జపాన్‌ను సముద్రంలో ముంచుతామని ఆదేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ లీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏడాది గడువు ఉండగానే జపాన్‌ ప్రధాని షింజో అబే గత నెల్లో పార్లమెంటును మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే షింజో అబే నాల్గోసారి జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. 

కుర్చీలతో కొట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు

 

కరీంనగర్/జగిత్యాల : జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఛైర్ పర్సన్ మర్రి ఉమారాణి అవినీతికి పాల్పడిందంటూ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. 

అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత

అనంతపురం : జిల్లా ముదిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేళాపురంలో వైసీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమీపంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు... నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.

తమిళనాడులో ఘోరం

చెన్నై : తరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం చేసింది. కలెక్టర్ తమ విన్నపాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆత్మహత్యాయత్నం చేశారు. 

రేవంత్ పై పయ్యావుల ఫైర్

గుంటూరు : ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే నేను, రేవంత్ రెడ్డి ఈస్థాయికి ఎదిగామని, 6 నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై పూర్తి వివరాలున్నాయని ఆయన అన్నారు. రేవంత్ చంద్రబాబును కలిశాఖ ఆ వివరాలపై స్పందస్తానాని, రేవంత్ రెడ్డి కి వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆయన ఆరోపించారు.

13:36 - October 23, 2017

 

కరీంనగర్/జగిత్యాల : జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఛైర్ పర్సన్ మర్రి ఉమారాణి అవినీతికి పాల్పడిందంటూ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. మరింత సమాచారం కసం వీడియో చూడండి.

13:31 - October 23, 2017

అనంతపురం : జిల్లా ముదిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేళాపురంలో వైసీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమీపంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు... నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే శివాలెత్తిపోయారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:29 - October 23, 2017

కృష్ణా : వైసీపీ నుండి వలస వెళ్లే వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదని వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వార్థంతోనే కొందరు నేతలు వైసీపీని వీడుతున్నారని వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. తాను బేషరతుగా వైసీపీలోకి వచ్చానని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:27 - October 23, 2017

హైదరాబాద్ : ఎంఆర్ వాక్సిన్‌ వేయడంలో తెలంగాణ రాష్ట్రం వంద శాతం సక్సెస్‌ అయిందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. హైదరాబాద్‌లో క్షయ వ్యాధి నిర్మూలనకు రోజు వారి మందులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యం విషయంలో కేంద్రం ఇస్తున్న సూచనలను అమలు పరిచే భాద్యత మనందరిపైన ఉందని మంత్రి అన్నారు. 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో క్షయను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయాలన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. చెస్ట్‌ హాస్పిటల్‌లో రెండు మెడిసన్‌, రెండు సర్జన్‌ విభాగాలను త్వరలో తీసుకువస్తామని తెలిపారు.

13:16 - October 23, 2017

చెన్నై : తరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం చేసింది. కలెక్టర్ తమ విన్నపాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటికి నిప్పంటించకున్న భర్త ఇసక్కి ముత్తు, భార్య సుబ్బలక్ష్మీ నలుగురు కూతుళ్లు పూర్తి వివరాలకు వీడియోడ చూడండి.

13:16 - October 23, 2017

గుంటూరు : ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే నేను, రేవంత్ రెడ్డి ఈస్థాయికి ఎదిగామని, 6 నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై పూర్తి వివరాలున్నాయని ఆయన అన్నారు. రేవంత్ చంద్రబాబును కలిశాఖ ఆ వివరాలపై స్పందస్తానాని, రేవంత్ రెడ్డి కి వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆయన ఆరోపించారు. రేవంత్ జైలుకు వెళ్తే మొదట స్పందించిన వ్యక్తిని నేనే అని పయ్యావుల తెలిపారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

శ్రీనగర్ కాలనీలో దారుణం

హైదరాబాద్ : నగరంలోని శ్రీనగర్ కాలనీలో దారుణం జరిగింది. ఫీజ్ కట్టలేదని విద్యార్థులపై ఎంజీఎం స్కూల్ యాజమాన్యం కాఠినత్వం ప్రదర్శించింది. విద్యార్థులను పరీక్షకు అనుమతించకుండా ఎండలో నిలబెట్టారు. వేడిమికి తలలేక నలుగురు విద్యార్థినులు స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం తీరు పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

12:23 - October 23, 2017

హైదరాబాద్ : నగరంలోని శ్రీనగర్ కాలనీలో దారుణం జరిగింది. ఫీజ్ కట్టలేదని విద్యార్థులపై ఎంజీఎం స్కూల్ యాజమాన్యం కాఠినత్వం ప్రదర్శించింది. విద్యార్థులను పరీక్షకు అనుమతించకుండా ఎండలో నిలబెట్టారు. వేడిమికి తలలేక నలుగురు విద్యార్థినులు స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం తీరు పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:07 - October 23, 2017
11:58 - October 23, 2017

సినిమా : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సాహో' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో ప్రభాస్‌ బ్లాక్‌ కోట్‌ ధరించి ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్‌ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ముఖం మాత్రం కన్పించకుండా కేవలం కళ్లు కనిపించేలా ముసుగు వేసుకున్నారు. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

11:55 - October 23, 2017

అనంతపురం : జిల్లా కరవుకు శాశ్వత చిరునామా. ఈ జిల్లాలో ఎప్పుడూ కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది. వర్షాలు పడక, సాగునీరు అందక పంటలు పండవు. తాగడానికి నీరు దొరకక అనేక పల్లెలు అలమటిస్తుంటాయి. కానీ వీటన్నిటికి మొన్న కురిసిన కుండపోత వర్షం చెక్‌పెట్టింది. సాగు,తాగునీటి కష్టాలకు పరిష్కారం చూపింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. కొండలు, గుట్టలు, వ్యవసాయ పొలాలు, బీడు భూముల్లో పచ్చదనం పరుచుకుంది. జలాశయాలు, కుంటలు, వాగులు, కాలువలు, చెరువులు వర్షపునీటితో నిండుకుండలా కళకళలాడుతున్నాయి.

ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది
పది రోజులపాటు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గుక్కెడు నీటికోసం కిలోమీటర్లు నడిచిపోయే బాధ తప్పింది. ఆరుతడి పంటలసాగుకు సైతం నీరివ్వలేమని క్రాఫ్‌ హాలిడే ప్రకటించిన అధికారుల ప్రకటనలకు కాలం చెల్లిపోయింది. గత కొన్నేళ్లుగా తమ ప్రాంతానికి తాగునీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం జరుగుతోందని, ఈసారి తమ ప్రాంతానికి తొలిదశలోనే నీటిని విడుదల చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆ వెనువెంటనే తమ ప్రాంతం నుంచే నీటిని విడుదల చేస్తూ తమకు నీరివ్వకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ ప్రభుత్వవిఫ్‌ యామినిబాల ప్రత్యక్ష ఆందోళనకుదిగారు. తమ నియోజకవర్గానికి నీటిని తేలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని గ్రహించిన సింగనమల ఎమ్మెల్యే యామినిబాల అధికారుపై యుద్ధమే ప్రకటించారు. మరోవైపు వారం రోజుల్లో నీరు విడుదల చేయకపోతే మూడు నియోజకవర్గాలకు తాగునీరు లేకుండాపోతుందని వెంటనే నీటిని విడుదల చేయాలని ధర్మవరం, కదిరి ఎమ్మెల్యేలు గోనుగుంట్ల సూర్యనారాయణ, అత్తార్‌ చాంద్‌ బాషా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.

నేతల రాజకీయాలు
తామేమి తక్కువకాదన్నట్టు సమాచారాశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు సైతం రాయదుర్గం నియోజకవర్గానికి నీటిని విడుదల చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. నీటికోసం పరిస్థితి పూర్తిగా అదుపుతప్పేలా కనిపించింది. ఈ సమయంలోనే వరుణుడు కరుణించాడు. కుండపోతగా వర్షం కురిపించాడు. తాగునీటి కష్టాలకు , వాటిపై నేతలు చేస్తున్న రాజకీయాలకు చెక్‌ పెట్టాడు. కుండపోతగా కురిసిన వర్షాలతో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా పంటలను సాగు చేసుకుంటున్నారు. మరోవైపు నీటికోసం పాట్లు పడనవసరం లేదని తెలుసుకున్న నేతలు.. నీటి విడుదల అంశాన్ని పూర్తిగా అధికారులకే అప్పగించారు. ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో సమతుల్యత పాటించి నీటిని విడుదల చేయాలని నేతలు కోరుతున్నారు.

11:47 - October 23, 2017

కరీంనగర్ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చిక్కుల్లో పడ్డారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ కింది శ్రీధర్‌బాబుపై కేసు నమోదైంది. కరీంనగర్‌ జిల్లా ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు ఎన్డీపీఎస్‌ యాక్టు కింద కేసు పెట్టారు. శ్రీధర్‌బాబుపై ఆరోపణలకు సంబంధించి.. కిషన్ రెడ్డి కొన్ని ఆడియో టేపులు రిలీజ్ చేశారు. ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడుగా ఉన్న కిషన్‌రెడ్డిని గంజాయి కేసులో ఇరికించేందుకు మాజీ సర్పంచ్‌ భర్త సుదర్శన్‌, మరో వ్యక్తి భార్గవ్‌తో కలిసి శ్రీధర్‌బాబు కుట్ర చేసినట్టు ఫోన్‌ సంభాషణల్లో బయటపడింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలతో... కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్టులోని 28 రెడ్‌ విత్‌ 99 సెక్షన్‌ కింది కేసు నమోదైంది.

తన నీడను కూడా నమ్మని శ్రీధర్‌బాబు మాజీ సర్పంచ్‌ భర్త సుదర్శన్‌
తన నీడను కూడా నమ్మని శ్రీధర్‌బాబు మాజీ సర్పంచ్‌ భర్త సుదర్శన్‌తో ఫోన్‌లో ఎలా మాట్లాడారన్న అంశం ఈయన అనుచరులకు అంతుపట్టడంలేదు. శ్రీధర్‌బాబును తప్పుడు కేసుల్లో ఇరికించి, లొంగతీసుకుని పార్టీలో చేరే విధంగా చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ఆడియో టేపులను విడుదల చేశారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో చేరాలంటూ గతంలోనే ప్రభుత్వ పెద్దల నుంచి శ్రీధరబాబుకు రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నేతల కుట్రలు మొదలయ్యాయంటున్నారు. శ్రీధర్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడిన సుదర్శన్‌ కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తేనని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. కిషన్‌రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టడానికి సుదర్శన్‌తోపాటు టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అశోక్‌ తనయుడు భార్గవ్‌ అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి పరిశీలిస్తే ఇందతా టీఆర్‌ఎస్‌ కుట్ర అని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఈ కేసులో శ్రీధర్‌బాబు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో అధికార పార్టీ నేతలు శ్రీధర్‌బాబును ఇరికించారా ? లేక శ్రీధర్‌బాబు స్కెచ్‌వేసి ఇరుకున్నారా ? అన్నది తేలాల్సి ఉంది.

ఎమ్మెల్యే పుట్ట మధు..., శ్రీధర్‌బాబు మధ్య మూడున్నరేళ్లుగా వార్‌
మంథని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పుట్ట మధు..., శ్రీధర్‌బాబు మధ్య మూడున్నరేళ్లుగా వార్‌ సాగుతోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలతో మంథని రాజకీయం ఎప్పుడూ హాట్‌ హాట్‌గానే ఉంటోంది. శ్రీధర్‌బాబును రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలపై టీఆర్‌ఎస్‌ దాడులకు దిగడం నుంచి ఇప్పుడు గంజాయి కేసు వరకు వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు తనపై నమోదైన కుట్ర కేసుపై మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలకు బెదిరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడుతున్న రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఒత్తిడితోనే తనపై కేసు నమోదు చేశారని, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపిస్తున్నందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేసిందన్న వాదాన్ని విపిస్తున్నారు. శ్రీధర్‌ బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రస్తుతం ఆయన అనుచరులను విచారిస్తున్నారు. అటు శ్రీధర్‌ బాబు దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఖమ్మం మార్కెట్ పత్తి రైతుల అందోళన

ఖమ్మం : జిల్లా పత్తి మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పత్తికి మద్దతు ధర కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతు సంఘాలు ధర్నాకు దిగాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

కడప జిల్లాలో దారుణం

కడప : జిల్లా బి.కోడూరు మండలం పాయకుంట్లలో దారణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను, భార్యను నరికి చంపాడు. భార్య లక్ష్మీదేవి పై అనుమానంతోనే భర్త రమణారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది

జడ్చర్లలో విషాదం

మహబుబ్ నగర్ : జిల్లా జడ్చర్లలో విషాదం జరిగింది. పదోవ తరగతి చవువుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పండింది. చదువు ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకుందంటున్న పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ స్పెషల్ క్లాసులు పెట్టడంతో మనస్తాపం చెందిందిని వారు ఆరోపిస్తున్నారు. 

కాసేపట్లో జగన్ పిటిషన్ పై విచారణ

హైదరాబాద్ : పాదయాత్ర నేపథ్యంలో సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు రావడం కష్టమవుతుందని జగన్‌ పిటిషన్‌లో కోరారు. మరోవైపు జగన్‌కు ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది.   

నగరంలో పసికందు కిడ్నాప్

హైదరాబాద్ : నగరంలో మూడు రోజుల పసికందు కిడ్నాప్ కలకలం సృష్టించింది. గత శుక్రవారం పేట్ల బురుజు ఆసుపత్రిలో నిర్మల అనే ఓ మహిళ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. నీలోఫర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందకు సాయపాడతానని ఓ మహిళ నమ్మించి, పిల్లాడిని ఎత్తుకెళ్లింది. బాదితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆఫీస్ లో మందు పార్టీ

తూర్పుగోదావరి : జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ సర్వసభ్యహాలులో ఉపాధి హామీ సిబ్బంది తాగుతూ మీడియాకు చిక్కారు. ఉన్నతాధికారులు కూర్చోవల్సిన సీట్లలో ఫీల్డ్ అసిస్టెంట్లు అర్థనగ్నంగా కూర్చుని మందు, సిగరెట్లు తాగుతూయ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేశారు.

నంద్యాలలో కూలిన భవనం

కర్నూలు: జిల్లా నంద్యాలలో ఓ భవనం ఒకేసారి కుప్పకూలింది. రోడ్డు విస్తరణలో ఆ భవనం కొంత కూల్చేశారు. మిగతా భాగం ఈ రోజు కూలింది. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పింది.

11:39 - October 23, 2017

ఖమ్మం : జిల్లా పత్తి మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పత్తికి మద్దతు ధర కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతు సంఘాలు ధర్నాకు దిగాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. పత్తి కి రూ.7వేల మద్దతు ధర కల్పించాలని వారు కోరారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:38 - October 23, 2017

కడప : జిల్లా బి.కోడూరు మండలం పాయకుంట్లలో దారణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను, భార్యను నరికి చంపాడు. భార్య లక్ష్మీదేవి పై అనుమానంతోనే భర్త రమణారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

11:37 - October 23, 2017

మహబుబ్ నగర్ : జిల్లా జడ్చర్లలో విషాదం జరిగింది. పదోవ తరగతి చవువుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పండింది. చదువు ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకుందంటున్న పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ స్పెషల్ క్లాసులు పెట్టడంతో మనస్తాపం చెందిందిని వారు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:27 - October 23, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైళ్లో రిమాండ్‌లో ఉన్న రవి అనే ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటనందూరుకు చెందిన రవి గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టవ్వడంతో సెంట్రల్‌ జైలులో ఉంచారు. తనతో పాటు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన వారు జైల్లో చాలామందే ఉన్నారు. ఏళ్లు గడిచినా.. బయటికి రాని పరిస్థితి ఉండటంతో.. మనస్థాపానికి గురైన రవి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమిధలవుతున్న యువకులు
రవిలాంటి వారెందరో గంజాయి అక్రమ రవాణాలో సమిధలవుతున్నారు. పైనుండి అక్రమ రవాణా చేస్తున్న వారు కోట్లు సంపాదిస్తుంటే.. వాటిని తరలిస్తూ పట్టుబడ్డ గిరిజన యువకులు జైళ్లలో మగ్గుతున్నారు. విశాఖ ఏజెన్సీతో పాటు ఒరిస్సా, చత్తీస్‌ ఘడ్‌ అటవీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయి... విశాఖ జిల్లా నర్సీపట్నం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అమాయక గిరిజనులు ఈ గంజాయిను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతూ.. జైళ్లలోనే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వారు ముప్పై మంది ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా అందరూ యువకులే. ఏళ్లు గడుస్తున్నా బెయిల్ రాకపోవడంతో.. గంజాయి కేసులో ఇరుక్కున్నవారిలో అసంతృప్తి పెరుగుతోంది. పెళ్లి కావాల్సిన వారు కొందరైతే.. చదువుకుంటున్న వారు మరికొందరు. మరికొందరు పెళ్లై పిల్లలున్న వారు. అందరూ డబ్బులకు ఆశపడి.. జైలుకొచ్చిన వారే. జైల్లో ఉన్న వారిలో ఒక్కో యువకుడిది ఒక్కోకథ.

ప్రధానమంత్రి కౌశక్ యోజన పథకం
గంజాయి కారణంగా బాధితులుగా మారుతున్న గిరిజనులను సంస్కరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ గిరిజన యువకులు ముప్పై మందికి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైళ్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కౌశక్ యోజన పథకం ద్వారా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా స్వశక్తితో బతికేలా వృత్తి పనులలో శిక్షణ ఇస్తున్నారు. వెల్డింగ్‌, ప్లంబింగ్‌లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గంజాయి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కుటుంబాల సంక్షేమార్థం కూడా తాము పనిచేస్తానని ఐటీడీఏ పీవో దినేష్‌ అంటున్నారు. జైళ్లలో ఉంటున్న గంజాయి కేసు నిందితులను ప్రభుత్వం సంస్కరిస్తున్నా.. గంజాయిని సమూలంగా ఏరిపారేయడంలో.. అధికారుల ప్రయత్నం పూర్తిగా ఫలించాలని కోరుకుందాం.

11:26 - October 23, 2017

రంగారెడ్డి : జిల్లా హయత్‌నగర్‌ మండలం తొర్రూరులో కుక్కలు స్వైర విహారం చేశాయి. గొర్రెలమందపై దాడిచేయడంతో 24 గొర్రెలు చనిపోయాయి. దీంతో గొర్రెల కాపారులు ఆందోళన చెందుతున్నారు. 

11:25 - October 23, 2017

హైదరాబాద్ : పాదయాత్ర నేపథ్యంలో సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు రావడం కష్టమవుతుందని జగన్‌ పిటిషన్‌లో కోరారు. మరోవైపు జగన్‌కు ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది.  పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:24 - October 23, 2017

గుంటూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కార్తీక సోమవారం, నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మొదటి కార్తీక సోమవారం కావడంతో.. క్షీరా రామ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని గోదావరి ఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడాయి. దీనికి తోడు నాగుల చవితి పర్వదినం కూడా కలిసి రావడంతో భక్త జనం నదీ తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి.. దీపాలను వెలిగించి నదిలో వదిలారు. శివాలయాలన్నీ భక్తుల అభిషేకాలతో కిటకిటలాడాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఒంగోలు, మార్కాపురం, వైపాలెం, త్రిపురాంతకం, పాపులపాడు, చీరాల, యర్రగొండ పాలెంలోని శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాగుల చవితి కూడా ఇవాళే కావడంతో పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. 

11:22 - October 23, 2017

హైదరాబాద్ : నగరంలో మూడు రోజుల పసికందు కిడ్నాప్ కలకలం సృష్టించింది. గత శుక్రవారం పేట్ల బురుజు ఆసుపత్రిలో నిర్మల అనే ఓ మహిళ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. నీలోఫర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందకు సాయపాడతానని ఓ మహిళ నమ్మించి, పిల్లాడిని ఎత్తుకెళ్లింది. బాదితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:22 - October 23, 2017

తూర్పుగోదావరి : జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ సర్వసభ్యహాలులో ఉపాధి హామీ సిబ్బంది తాగుతూ మీడియాకు చిక్కారు. ఉన్నతాధికారులు కూర్చోవల్సిన సీట్లలో ఫీల్డ్ అసిస్టెంట్లు అర్థనగ్నంగా కూర్చుని మందు, సిగరెట్లు తాగుతూయ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూద్దాం....

11:21 - October 23, 2017

కర్నూలు: జిల్లా నంద్యాలలో ఓ భవనం ఒకేసారి కుప్పకూలింది. రోడ్డు విస్తరణలో ఆ భవనం కొంత కూల్చేశారు. మిగతా భాగం ఈ రోజు కూలింది. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:46 - October 23, 2017

చెన్నై : తమిళ హీరో విజయ్‌ నటించిన 'మెర్సల్‌' చిత్రంలోని జిఎస్‌టి, డిజిటల్‌ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న వివాదస్పద డైలాగులపై ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ స్పందించారు. 'మెర్సల్‌'కు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిందని...దాన్ని మళ్లీ సెన్సార్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలను లాజికల్‌గా ఎదుర్కోవాలని కమల్‌ అన్నారు. 'మెర్సల్‌' చిత్రంలో డిజిటల్‌ ఇండియా, జిఎస్టీలకు వ్యతిరేకంగా పలు సన్నివేశాలున్నాయి. సింగపూర్‌లో జీఎస్టీ 7 శాతమే. అక్కడ ప్రజలకు వైద్య సదుపాయాలు ఉచితంగా లభిస్తున్నాయి. భారత్‌లో 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా వైద్యసేవలు ఉచితంగా లభించడంలేదని ఓ సన్నివేశంలో విజయ్ డైలాగ్ చెబుతారు. బిజెపి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెంటనే ఈ సన్నివేశాలను తొలగించాలని తమిళ బిజెపి అధ్యక్షుడు సౌందరరాజన్‌ డిమాండ్‌ చేశారు. హీరో విజయ్‌ మాత్రం దీనిపై స్పందించలేదు. 

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో నర్సింగ్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మత్తు ఇంజక్షన్ చేసుకుని యప్సిబా ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యం స్పృహకోల్పోయిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిస్తుండగా యప్సిబా మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు.

08:16 - October 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో నర్సింగ్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మత్తు ఇంజక్షన్ చేసుకుని యప్సిబా ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యం స్పృహకోల్పోయిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిస్తుండగా యప్సిబా మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. అందులో అంజి అనే వ్యక్తి ప్రేమించి మోసం చేయడం వల్లే తాను చనిపోతునట్లు రాసింది. తనలా ఎవరు మోసం చేయొద్దన్న యప్సిబా అభ్యర్థించింది. అయితే అప్సిబా మృతి పై ఆమెను పెంచిన పస్టర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నేటీ నుంచి ఎస్ఏ 1 పరీక్షలు

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో ఎస్ఏ1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు సమ్మెటీస్ అసెస్ మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

వైసీపీ శాసనసభా పక్ష సమావేశం వాయిదా

హైదరాబాద్ : నేడు జరిగే వైసీపీ శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడింది. ఈ రోజు జగన్ పిటిషన్ పై కోర్టు తీర్పు నేపథ్యంలో భేటీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

07:54 - October 23, 2017

ప్రధాని సమర్ధించుకోవడం తప్ప ఏమి చేయలేరని, జీఎస్టీ సవరించాలని గుజరాత్ లో అన్నారని, జీఎస్టీ ఒక్కడిని తీసుకున్న నిర్ణయం కదని తెలిపారని, గుజరాత్ ఎన్నికలకు తేదీని ప్రకటించకుండా ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని, ఈ రోజు మూడు నాలుగు నెలలకు ఫలితం రాదని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చి 38నెలలు అయిందని, సీఎం గురించి మనకు తెలియంది ఏమి లేదని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. 2019 వరకు ఇంటింటి నీరు ఇవ్వకపోతే ఎన్నికలకు వెళ్లమని చెప్పిన దమ్మున్న పార్టీ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టిన మేం సిద్ధమని, ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీలకు ఎలా జరుగుతయే అదేవిధంగా గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:53 - October 23, 2017

తొమ్మిది మంది సభ్యులు, 154 రోజులు, 4200 కిలో మీటర్లు, 31 జిల్లాలు, 1520 గ్రామాలు....మహా జన పాదయాత్ర సాగిన క్రమమిది. సామాజిక న్యాయం -సమగ్రాభివృద్ధి అజెండాతో సాగిన మహాజన పాదయాత్ర కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిందని చెప్పకతప్పదు. ఆ పాదయత్ర ముగిసి ఏడాది గడిచిన సందర్భంగా నాటి పాదయాత్ర విశేషాలు.. అది తెర మీదకి తీసుకువచ్చిన సమస్యలు, సాధించిన విజయాలపై జనపథం.మహాజనపాదయాత్ర సామాజిక న్యాయం కోసం, భారత దేశంలో స్వాతంత్రం వచ్చిన కూడా మనువాదం కొనసాగుతోందని, వీటి పట్ల అనేక సంఘాలు పోరాటలు చేస్తున్న సమస్యల పరిష్కారం దిశగా పోరాటలు చయలేకపోయాయని కేబీపీఎస్ నాయకులు జాన్ వెస్లీ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:51 - October 23, 2017

ఢిల్లీ : ఆసియాకప్‌ హాకీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో మలేసియాపై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ మూడోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. సూపర్‌ 4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 4-0 తేడాతో చిత్తు చేసిన భారత్‌.. ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. ఆది నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడో నిమిషంలోనే రమణ్‌దీప్‌సింగ్‌ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. 29వ నిమిషంలో లలిత్‌ ఉపాధ్యయ్‌ మరో గోల్‌ను సాధించి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. చివరి క్వార్టర్‌లో మలేసియా పుంజుకున్నప్పటికీ.. భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. భారత్‌ ఆసియాకప్‌ ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి. ఆసియా కప్‌ గెలుచుకోవడం మూడోసారి.

 

07:50 - October 23, 2017

ముంబై : టీమ్‌ ఇండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. మొదటి వన్డేలో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లాథమ్‌, రాస్‌ టేలర్‌ భారీ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీరోల్‌ ప్లేచేశారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆథిత్య టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆదిలోనే కోహ్లీసేన వికెట్లు జారవిడ్చుకుంది. 16 పరుగుల దగ్గర శిఖర్‌ ధవన్‌, 29 పరుగుల దగ్గర రోహిత్‌శర్మ, 71 పరుగుల దగ్గర కేదార్‌జాదవ్‌ వికెట్లను కోల్పోయింది.

సెంచరీతో రాణించిన కోహ్లి
200వ వన్డే ఆడుతున్న టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో రాణించాడు. 125 బాల్స్‌ ఆడిన కోహ్లీ 2 సిక్స్‌లు, 9 బౌండరీలతో 121 రన్స్‌ సాధించాడు. తన కెరీర్‌లో 31వ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో సచిన్‌ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. దినేష్‌కార్తీర్‌, ధోనితో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ కోహ్లీ జట్టుకు రన్స్‌ జోడించాడు. ధోని 25, హార్తిక్‌ పాండ్యా 16 పరుగులు చేశారు. చివరల్లో భువనేశ్వర్‌ కుమార్‌ 26 పరుగులు చేశాడు. దీంతో నిర్దేశిత 50 ఓవర్లలో భారత్‌ 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు సాధించింది. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌బౌల్డ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా... టీమ్‌సౌథీ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక సాంట్నర్‌ ఓ వికెట్‌ తీసుకున్నాడు.

ఆచితూచి ఆడుతూ
281 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన కివీస్‌...ఆచితూచి ఆడుతూ రన్స్‌ రాబట్టింది. రాస్‌ టేలర్‌ 95 రన్స్‌తో, లాథమ్‌ సెంచరీతో రాణించారు. దీంతో కివీస్‌ సునాయాసంగా విజయం సాధించింది. మరో 6 బాల్స్‌ మిగిలిఉండగానే 281 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. టీమ్‌ ఇండియా బౌలర్లు తేలిపోవడం కూడా వారికి కలిసొచ్చింది. వారి విజయం నల్లేరుపై నడకే అయ్యింది. భారత్‌ బౌలర్లలో పాండ్యా, బుమ్రా, కుల్దీప్‌, భువనేశ్వర్‌ తలో వికెట్‌ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే 25న జరగనుంది.

07:49 - October 23, 2017

డెన్మార్క్ : ప్రతిష్టాత్మక డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సాధించాడు. ఫైనల్స్‌లో దక్షిణ కొరియా ఆటగాడు లీహున్‌ ఇల్‌పై విజయం సాధించాడు. వరుస సెట్లతో లీహున్‌ ఇల్‌ను ఖంగుతినిపించి విజేతగా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో 21-10, 21-5 తేడాతో లీహున్‌ను మట్టి కరిపించాడు. 1980లో ప్రకాశ్‌ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరపున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ గుర్తింపు సాధించాడు. దీంతో 37 ఏళ్ల నిరీక్షణకు తెలుగుతేజం శ్రీకాంత్‌ తెరదించాడు.

07:48 - October 23, 2017

టోక్యో : జపాన్‌ పార్లమెంటుకు ఆదివారం మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని షింజో అబే నేతృత్వంలోని లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఘన విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ప్రతినిధుల సభలోని 465 సీట్లకు జరిగిన ఎన్నికల్లో LDPకి 311 సీట్లు దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోడంతో జపాన్‌ ప్రజలు ప్రధాని షింజోకే మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారని పోలింగ్‌ అనంతర సర్వేలు చెబుతున్నాయి. జపాన్‌ మీదుగా ఉత్తరకొరియా క్షిపణులు ప్రయోగించింది. పైగా జపాన్‌ను సముద్రంలో ముంచుతామని ఆదేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ లీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏడాది గడువు ఉండగానే జపాన్‌ ప్రధాని షింజో అబే గత నెల్లో పార్లమెంటును మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే షింజో అబే నాల్గోసారి జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. 

07:47 - October 23, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నీరు కార్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని సీఐటీయూ సెంట్రల్ కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాయింట్, నేషనల్ వర్క్ షాప్ ఆఫ్ వర్కర్స్ పేరుతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్రీయ, స్వతంత్ర సంఘాల నేతలు పాల్గొన్నారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చించారు. మోదీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను సవరించిందని.. వాటిపై కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేకుండా పోయిందని నేతలు విమర్శించారు.

07:46 - October 23, 2017

హైదరాబాద్ : రేపు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి విడుదలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వరంగల్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన కేసీఆర్‌... కరీంనగర్‌ జిల్లా నాయకులతో దీనిపై చర్చించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి విడుదల కోసం కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి తద్వారా రెండు పంటలకు అవకాశం కల్పించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. రాత్రి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి విడుదలపై చర్చించారు. రేపు ప్రగతిభవన్ SRSP పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

07:46 - October 23, 2017

అనంతపురం : పెట్టుబడిదారులు దోపిడీని ఎలా చేస్తారో పెట్టుబడి గ్రంథం విశదీకరిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు అన్నారు. పెట్టుబడి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. ముఖ్యంగా నిత్యం దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు వెంటనే క్యాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అనంతపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఏర్పాటు చేసిన కారల్‌మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం - సమకాలీనత సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

07:45 - October 23, 2017

మహబూబ్ నగర్ : చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్‌ కొడంగల్‌ నియోజక వర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌ నుండి పోటీ చేస్తానన్నారు. చంద్రబాబుతో భేటీలో తీసుకునే నిర్ణయం మేరకు నడుచుంటానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. 

07:44 - October 23, 2017

హైదరాబాద్ : టీటీడీపీలో తాజా పరిణామాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని వారికి స్పష్టం చేశారు. బాబు ఫోన్ కాల్ అనంతరం... టీటీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ తదితర నేతలు హాజరయ్యారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై తీసుకునే చర్యలపై చర్చించారు.

07:43 - October 23, 2017

దుబాయి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఐదోరోజూ పలువురు ప్రముఖులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యి.. రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించింది. చంద్రబాబు మొదట బిజినెన్‌ లీడర్స్‌ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. ఆ వెంటనే డీపీ వరల్డ్‌ గ్రూపు చైర్మన్‌ , సీఈవో సుల్తాన్‌ అహ్మద్‌ బీన్‌ సులేయమ్‌తో భేటీ అయ్యారు. పరస్పరం పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చించారు. రానున్నకాలంలో ఓడరేవు సరుకు రవాణా యావత్తూ తూర్పుతీరం నుంచే జరుగుతుందని, వాయువ్య ప్రాంతాల సరుకు రవాణాను తూర్పు నౌకాశ్రయాలకు అనుసంధించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీలో నౌకాశ్రయాలకు విస్తృత సేవలందించగల సామర్థ్యం, సత్తా ఉన్నాయన్నారు. దీనికి సుల్తాన్‌ స్పందిస్తూ చంద్రబాబు ప్రతిపాదనలకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

చెన్నై పారిశ్రామిక నడవా ద్వారా ఓడరేవు కార్యకలాపాలు
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని, ఇప్పటికే జాతీయ మౌలిక సదుపాయాల నిధిపై భారత్‌తో సన్నిహితంగా ఉన్నవిషయాన్ని గుర్తు చేశారు. తాము వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని, సమయాన్ని విలువైనదిగా భావిస్తామని తెలిపారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.... నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక నడవా ద్వారా ఓడరేవు కార్యకలాపాలు విస్తృతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇరువురు కలిసి పనిచేసేందుకు ఏపీ, డీపీ వరల్డ్‌ జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.దుబాయ్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న వారంతా అమరావతి నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు... డీపీ వరల్డ్‌ దృష్టికి తెచ్చారు.

ఐటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీస్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో కలిసి
ఐటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీస్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో కలిసి పని చేయనున్న ఏపీ, యూఏఈఫార్మా,ఆటోమొబైల్‌ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం బాబు దుబాయ్‌ ఆర్థిక మంత్రి సుల్తాన్‌ బీన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలను వివరించారు. ఐటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీస్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు మన్సూరీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫార్మా, ఆటోమొబైల్‌ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న విషయాన్ని దుబాయ్‌ పాలకుల దృష్టికి చంద్రబాబు తీసుకొచ్చారు. విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ ప్రణాళికా విభాగాధిపతి అద్నాన్‌ ఖాసీం, ఫ్లై దుబాయ్‌ సీఈవో ఘయిత్‌ అల్‌ ఘయిత్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఒక విమానాశ్రయం నిర్మించాలని కోరారు. UAE నుంచి గన్నవరంకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ఎమిరేట్స్ సంస్థ అంగీకరించింది. 

07:42 - October 23, 2017

హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలపై చ‌ర్చించేందుకు ఇవాళ తెలంగాణ మంత్రి వ‌ర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమై ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యులకు సూచనలు, సలహాలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సభ్యులతో ఓ దఫా భేటీ అయిన సీఎం.. ఏ ఏ అంశాలు స‌భ‌ముందుంచాల‌నే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టి-మాస్ ఫోరం, వామపక్షాల యాత్రలు.. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో.. సమావేశంలో ఆచితూచి మాట్లాడాలని సభ్యులకు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా త‌మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని నిర్ణయించారు.

వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం
పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాల‌ని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఇప్పటికే సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు బిల్లులకు సంబంధించి..తిరిగి సభలో చర్చించాలనుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపనతోపాటు ఇతర అంశాలు ఉన్నాయి. సభా సమరంలో పై చేయి అధికార పార్టీదా, లేక విపక్షాలదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

Don't Miss