Activities calendar

24 October 2017

21:48 - October 24, 2017

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పదవిని మరో ఐదేళ్లు పొడిగిస్తూ అధికార కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. 2022 వరకు ఆయన చైనా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. 64 ఏళ్ల జిన్‌పింగ్‌ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నారు. దేశంలో తిరుగులేని నేతగా ఎదిగిన జిన్‌పింగ్‌ పేరును చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగంలో చేర్చింది. దీంతో మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎదిగినట్లు పార్టీ గుర్తించింది. చైనాలో వారం రోజుల పాటు జరుగుతున్న కమ్యూనిస్ట్‌ పార్టీ 19వ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఐదేళ్లకోసారి ఈ సమావేశం జరుగుతుంది. చివరిరోజు సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తూ జిన్‌పింగ్‌ పేరును చేర్చారు. ఈ సవరణకు పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. మావో తర్వాత జిన్‌పింగ్‌ కొత్త సిద్ధాంతాలను పార్టీలో చేర్చారు. జిన్‌పింగ్ రాజనీతి సిద్ధాంతాలను స్కూలు పాఠ్యంశాలలో చేర్చనున్నారు. దీంతో పిల్లల్లో జాతీయవాదం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

21:46 - October 24, 2017

న్యూఢిల్లీ : సిబిఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. బిజెపి తన రాజకీయ అవసరాల కోసం  ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కేరళలో క్రైం రికార్డ్ అతి తక్కువగా ఉన్నప్పటికీ...కేరళలో హత్యలపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడి అక్రమ ఆస్తులు, వ్యాపం, బీహార్‌ ల్యాండ్‌ స్కాం, లలిత్‌ మోది, సహారా, బిర్లా, పనామా పేపర్స్‌పై కేంద్రం ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ఏచూరి ప్రశ్నించారు. పనామా పేపర్స్‌లో మోది పేరు కూడా ఉందన్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా బిజెపియేతర పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏచూరి పిలుపునిచ్చారు. నోట్లరద్దుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నవంబర్‌8న వామపక్షాలు బ్లాక్‌ డే పాటిస్తాయని ఆయన తెలిపారు.

21:43 - October 24, 2017

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన వెలుగుచూసింది. ఉప్పరపల్లి ఎఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌లో... డబ్బు కోసం సలీమ్‌ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని తబస్సుం ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇదే విషయాన్ని గతంలో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే... సలీం రాజకీయ నేత కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సలీమ్‌ మరింత రెచ్చిపోయి.. ఫేస్‌బుక్‌లో ఆమె గురించి అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం తెలుసుకుని పలువురు ఇంటికి చేరుకునే సరికి ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

 

21:40 - October 24, 2017
21:38 - October 24, 2017
21:38 - October 24, 2017
21:36 - October 24, 2017
21:30 - October 24, 2017
21:28 - October 24, 2017

ముస్లీంలకు టీ ప్రభుత్వం క్రీం బిస్కెట్ వేస్తోందంటూ మల్లన్న చెబుతున్న ముచ్చట్లు చూడాలంటే వీడియో చూడండి.. 

21:25 - October 24, 2017
18:45 - October 24, 2017

మెదక్‌ : జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ అవుతుందనుకున్న తమకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా నోటీసులు పంపి డబ్బు కట్టమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయని రీషెడ్యూల్‌ చేశామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు మాట మార్చి గత రుణాలు చెల్లించాలని నోటీసులు పంపారన్నారు. రుణమాఫీ లిస్టులో తమ పేర్లున్నాయని రైతులు తెలిపారు. రామాయం పేట మండలంలో 123 మంది రైతులకు టీ.ఎస్.జీ.వీ.బీ బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులపై రైతులు ఆందోళన చెందవద్దనీ రుణమాఫీ జరుగుతుందని ఏవో అన్నారు.

18:43 - October 24, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్ సన్‌ షైన్ హాస్పిటల్ దాష్టికం వెలుగుచూసింది. డెంగ్యూ వచ్చిన పేషెంట్‌కు మూడు రోజుల్లో మూడున్నర లక్షల బిల్ వేయడంతో.. బంధువులు అవాక్కయ్యారు. బిల్ కడితే తప్ప.. పేషెంట్‌ను డిశ్చార్జ్ చేయబోమని డిమాండ్ చేయడంతో.. బంధువులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల పాటు ట్రీట్ మెంట్ ఏం చేశారో చెప్పలేదని.. పేషెంట్‌ ను కనీసం చూపించకుండా... ఇప్పుడు మూడున్నర లక్షల బిల్ వేశారని బంధువులు వాపోయారు. అసలు ట్రీట్‌మెంట్ ఏం చేశారో చెప్పాలని మీడియా డిమాండ్ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది వెనక్కి తగ్గారు. చివరకు 50వేలు కట్టించుకొని పేషెంట్‌ను డిశ్చార్జ్ చేశారు.

18:40 - October 24, 2017

జగిత్యాల : ఒకప్పుడు ఆ పట్టణం రాత్రైతే చిమ్మ చీకట్లతో నిండిపోయేది. విద్యుత్ స్థంబాలున్నా ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పట్టణం నిత్యం పున్నమి వెలుగుల్లా ప్రకాశిస్తూ వెలుగు అందిస్తూ.. విద్యుత్‌ బిల్లుల్ని కూడా ఆదాచేస్తొంది. ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించి వెలుగులే కాకుండా ఖర్చులు తగ్గించుకొని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ పురపాలక నగరంపై 10టీవీ ప్రత్యే కథనం.

విద్యుత్‌ ఆదా..
విద్యుత్‌ను ఆదా చేసేందుకు రాష్ర్ట పురపాలక మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక అధికారులు నడుంబిగించారు. మంత్రి చూపిన దారిలో నడుస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. నిత్యం నెలనెల లక్షల్లో చెల్లిస్తున్న బిల్లులో సగం వరకు తగ్గించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకెళ్తున్నారు.

24 వార్డులు.. 2400 లైట్లు.. 
జగిత్యాల జిల్లా.. మెట్‌పల్లి పురపాలక ఫరిధిలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 2400 లైట్లు ఉండగా.. జాతీయ రహదారిపై 140 హైమాస్ట్‌ లైట్లు ఉన్నాయి. వీటి విద్యుత్‌ వాడకంతో నెలనెల పురపాలక సంస్థకు రూ.5లక్షల వరకు విద్యుత్‌ బిల్లులను మెట్‌ పల్లి పురపాలక అధికారులు చెల్లిస్తూ ఇబ్బందులకు గురయ్యారు. దీంతో విద్యుత్‌ బిల్లులు తగ్గించడంతో పాటు వెలుగులు నింపడానికి.. పట్టణంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు నడుంబిగించారు. దీని కోసం 2500 ఎల్‌ఈడీ లైట్లను తెప్పించి పట్టణంలోని అన్ని వీధుల్లో 18 వాట్స్‌ బల్బులను, ప్రధాన రహదారిపై 110 వాట్స్‌ లైట్లను బిగించారు.

విద్యుత్ కాంతులతో..
ఎల్‌ఈడీ లైట్లతో రాత్రి అయితే చాలు మెట్‌పల్లి పట్టణం విద్యుత్‌ కాంతులతో పున్నమి వెలుగులా దర్శనిమస్తుంది. పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఏకలవ్య నగర్‌ వరకు సుమారు 70 విద్యుత్‌ స్థంభాలు ఉండడంతో వాటికి ఇరువైపుల 140 లైట్లను బిగించారు. విద్యుత్‌ వెలుగులే కాకుండా బిల్లులు కూడా తగ్గడంతో... పురపాలక సంఘం అధికారులు ఎంతో  సంతోషిస్తున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అందరికంటే ముందుగా వంద శాతం ఎల్‌ఈడీ లైట్లను బిగించి మెట్‌పల్లి పురపాలక జిల్లా ముందు వరుసలో నిలిచింది. మంత్రి చూపిన దారిలో నడిచిన మున్సిపల్ అధికారులు ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

18:35 - October 24, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రమాదం తప్పింది. బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద 'నిమ్స్‌ ఆస్పత్రి' కోసం బీజేపీ నేతలు సభ నిర్వహిస్తుండగా.. సభావేదిక కుప్పకూలింది. లక్ష్మణ్‌ మాట్లాడుతుండా ఒక్కసారిగా గాలి, వాన రావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్యకర్తకు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. 

18:23 - October 24, 2017

తెనాలి : మెడికల్ విద్యార్థిని అనీల ఆత్మహత్య కలకలం రేపింది. స్థానిక వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనీల గుంటూరు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. కాగా విద్యార్థిని మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఒక సంవత్సరం పాటు స్టడీ డిస్కంటిన్యూ చేసింది. నిన్ననే కాలేజీకి వెళ్లి చదువులు కొనసాగించేందుకు యాజమాన్యం వద్ద పర్మీషన్ తీసుకుంది. సూసైడ్ నోట్ లాంటివి ఘటనా స్థలంలో లభించలేదు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. 

18:19 - October 24, 2017

హైదరాబాద్ :  ప్రతిఏటా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. కొత్తరోడ్లు వేయడం, కొత్తభవనాలు నిర్మించడం, కొత్త ప్రాజెక్టులు సిద్దం చేయడం ... ఇదీ జీహెచ్‌ఎంసీ ప్రణాళిక.  అన్ని పనులు చేస్తున్నా... అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా... పనుల నాణ్యత విషయంలో మాత్రం బల్దియా విమర్శలు ఎదుర్కొంటోంది.  క్వాలిటీలో కంట్రోల్‌ తప్పి... ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలౌతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో క్వాలిటీ కంట్రోల్‌లో ఇమేజ్‌ డ్యామేజ్‌ కాకుండా భారీ సంస్కరణలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.

ప్రతి పనిలోనూ లోపిస్తున్న నాణ్యత
రోడ్డు రిపేరు నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు, కమ్యూనిటీ హాల్‌ నుంచి అధునాతన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వరకు... పలు నిర్మాణాలు చేపడుతుంది జీహెచ్‌ఎంసీ.  ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇంత భారీ మొత్తం వెచ్చించి చేపట్టిన పనుల్లో నాణ్యతను మాత్రం బల్దియా పట్టించుకోవడం లేదు.  కొత్తగా వేసిన రోడ్డు... నాలుగు రోజులు వర్షంపడితే చాలు.. పూర్తిగా కొట్టుకుపోతుంది. రెండేళ్ల క్రితం నిర్మించిన  నిర్మాణాల గోడలు పెచ్చులూడుతున్నాయి. చిన్నచిన్న పనుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు బల్దియా చేస్తున్న పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలు నిత్యం వినిస్తున్నాయి.

కాంట్రాక్టర్లకు అనుకూలంగా..!

జీహెచ్‌ఎంసీ చేపట్టే ప్రతిపని సక్రమంగా జరుగుతుందా... అందులో వినియోగించే మెటీరియల్‌ నాణ్యత కలిగినదేనా అనే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ సెల్ ఉంది. ఇది సక్రమంగా పనిచేయకపోవడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు రావడంతో థర్డ్‌పార్టీ చెకింగ్‌ కోసం స్వతంత్ర సంస్థలను నియమించారు. అయినా పనులు క్వాలిటీగా చేయించడంలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు.

సరికొత్త ప్రణాళిక..

పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు , పనుల్లో క్వాలిటీ పెంచేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. క్వాలిటీ రెస్పాన్స్‌బుల్‌ పర్సన్స్‌గా జోన్‌స్థాయిలో ఉండే సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల ఇక నుంచి దీనికి బాధ్యులుగా ఉంటారు.  వీరు చెప్పినచోటే  శాంఫిల్స్‌ సేకరించి... దాని నాణ్యతను పరిశీలించి థర్డ్‌పార్టీ ఏజెన్సీ రిపోర్టు   ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యతలో ఏమైనా తేడా ఉంటే ఎవరో ఒకరైనా ఆ పనులకు చెక్‌పెట్టేందుకు వీలవుతుందని ఈ మార్పులు చేసినట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. చట్టాల్లో ఎన్ని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చెయ్యాల్సిన వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే మాత్రమే అది సత్ఫలితాలను ఇస్తుంది. మరి ఈసారైన బల్దియా చేపట్టే పనుల్లో మార్పు వస్తుందా... లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.

ట్యాంక్ పై నుండి దూకి..

తెనాలి : మెడికల్ విద్యార్థిని అనీల ఆత్మహత్య కలకలం రేపింది. స్థానిక వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనీల గుంటూరు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది.  

18:04 - October 24, 2017

సంగారెడ్డి : జిల్లాలోని నానల్‌కల్ మండలంలోని మామిడ్గి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. నిమ్జ్‌ కోసం రైతుల వద్ద నుండి భూములు సేకరించేందుకు నిర్వహించిన గ్రామసభకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ పరశురాం, ఆర్డీవో అబ్దుల్లా హాజరయ్యారు. తాము నిమ్జ్‌ కోసం భూములు ఇచ్చేది లేదని.. రెండు రకాల పంటలు పండిస్తామని రైతులు చెప్పారు. తాము అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో రైతులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. 

17:49 - October 24, 2017

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వ్యవహారంపై టీ-టీడీపీ అధ్యక్షుడు మీడియాతో ఎల్‌.రమణ చిట్‌చాట్‌ నిర్వహించారు. రేవంత్‌రెడ్డి పార్టీ లైన్‌కు భిన్నంగా వెళ్తున్నారన్నారు రమణ. టీడీఎల్పీ మీటింగ్‌ ఏర్పాటు చేయడానికి రేవంత్‌ ఎవరన్నారు. వస్తున్న ఆరోపణలపై రేవంత్‌ సరిగా స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలను కలిసిన విషయంపై రేవంత్‌ స్పందిచాలన్నారు. ఒకవేళ ఆరోపణలు తప్పయితే కాంగ్రెస్‌ నేతలపై పరువు నష్టం కేసులు వేయాలని సూచించామన్నారు. రేవంత్‌ వివరణ ఇచ్చేవరకు సమావేశాలకు పిలిచేది లేదని రమణ స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పొత్తులపై ఎవరూ స్పందించవద్దని.. తన అనుమతి లేకుండా ఎవరూ... ఏ పార్టీతో సంప్రదింపులు జరపవద్దన్నారు. పోరాటాలు వేరు, పొత్తులు వేరన్నారు. త్వరలో బీజేపీ నేతలతో సమావేశమవుతామన్నారు ఎల్‌.రమణ.

కేసీఆర్ రివ్యూ..

హైదరాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోని నీటి విడుదల, వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై పూర్వ కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వీలైనంత వరకు పంటలకు సాగునీరు అందేలా చూడాలని... నీటిని పొదుపుగా వాడుకోవాలని కేసీఆర్‌ సూచించారు. 

17:43 - October 24, 2017

హైదరాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోని నీటి విడుదల, వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై పూర్వ కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వీలైనంత వరకు పంటలకు సాగునీరు అందేలా చూడాలని... నీటిని పొదుపుగా వాడుకోవాలని కేసీఆర్‌ సూచించారు. పొలాలకు నీరు అందించడంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునే విధంగా కాల్వలను సిద్ధం చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున.. ఆలోగానే పనులు పూర్తి చేయాలని కేసీఆర్ అన్నారు. 

17:08 - October 24, 2017
17:02 - October 24, 2017

నిఆజామాబాద్ : మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామన్నారు. నగరంలో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కోట్లు మంజూరు చేయించుకున్నారు. కానీ పనులు పక్కన పడేశారు. నిజాబాబాద్‌ నగరానికి తాగునీరందించే చెరువులో.. సుందరీకరణ పేరుతో నీరు లేకుండా చేశారు. వచ్చే వేసవిలో గొంతు తడుపుకోవడానికి నీళ్లుండని పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇంత చేసి పనులు చేపట్టకపోవడంతో.... మినీ ట్యాంక్‌బండ్‌ కోసం విడుదలైన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్న తలెత్తుతోంది. 
చెరువులో నీరుంటే పనులకు ఆటంకమంటూ..

ఇది నిజామాబాద్‌ నగరంలోని రఘునాథ చెరువు. దీన్నే బొడ్డెమ్మ చెరువు అని కూడా అంటారు. ఈ చెరువును నిజాం కాలంలో నిర్మించారు. ఇక్కడి నుంచే సగం నగరానికి నీరందుతుంది. అయితే గత మూడేళ్లుగా ఈ చెరువులో నీరు నిల్వ చేయడం లేదు. ఎందుకంటే మినీ ట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. చెరువులో నీరుంటే పనులకు ఆటంకం కలుగుతుందని కాంట్రాక్టర్‌ చెబుతున్నాడు.  

ఆ ఫీలింగేది?
ఈ చెరువుపై మినీ ట్యాంక్‌ బండ్ నిర్మించేందుకు మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించగా నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం ప్రభుత్వం 6 కోట్ల 25 లక్షల నిధులు విడుదల చేసింది. అయితే చెరువు వద్దకు వెళ్లి చూస్తే ట్యాంక్‌బండ్‌ అనే ఫీలింగ్‌ ఏ మాత్రం కలగదు. ట్యాంక్‌బండ్ అంటే కలర్‌ఫుల్‌ లైటింగ్‌తో జిగేల్‌మనాలి. కూర్చోవడానికి బెంచ్‌లుండాలి. కానీ అలాంటివేమీ ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పటివరకు నగరంలో సరైన పర్యాటక ప్రదేశమే లేదు. కనీసం ట్యాంక్‌బండ్‌ పూర్తవుతుందేమో అనుకుంటే అసలు ఆ ఊసే లేదని స్థానికులంటున్నారు. ఇది మినీ ట్యాంక్‌బండ్‌ కాదని కమీషన్‌ల కోసం సృష్టించుకున్న స్కామ్‌ అని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

నిజ నిర్థారణ కమిటీ వేయాలి..

సిద్ధిపేట జిల్లాలో ఇప్పటికే మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ నగరంలో మాత్రం మూడేళ్లు గడుస్తున్నా.. అసలు మినీ ట్యాంక్‌ బండ్‌ ఊసే లేకుండాపోయింది. మరి మంజూరైన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్న సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులపై నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపించాలన్న నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

16:31 - October 24, 2017
16:28 - October 24, 2017
16:26 - October 24, 2017

సిద్ధిపేట : జిల్లాలో రాఘవపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 15 రోజులైనా గడవక ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. మౌనిక అనే వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ నెల 6న మెట్‌పల్లికి చెందిన సాయికృష్ణతో మౌనిక వివాహం జరిగింది. అత్తగారింటి నుండి పుట్టింటికి రాగానే బాత్‌రూమ్‌లోకి వెళ్లి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. అత్తగారి వేధింపులే కారణమా.. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

15:58 - October 24, 2017

'సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి'కోసం 'మహాజన పాదయాత్ర'గా తెలంగాణ మొత్తం 4200 కి.మీ నడిచిన ఉక్కు మహిళ ఎస్ రమ. మహిళా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ. కార్మిక సమస్యలపై ప్రజలకోసం కొట్లాడే ధీర వనిత 'రమ'. మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ 'స్ఫూర్తి' ఆమెను పలకరించింది. మహాజన పాదయాత్ర ముచ్చట్లు.. వాటి ఫలితాలు ప్రజా పోరాటాలపై 'రమ' గారు వెళ్లడించిన ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోలో చూడండి.

15:22 - October 24, 2017

పోలీసులు నిరాకరిస్తే మళ్లీ రండి..

హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన 'కొలువుల కొట్లాటకు' హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఒకవేళ పోలీసులు కూడా అనుమతి నిరాకరిస్తే మళ్లీ హైకోర్టుకు రావాలని హైకోర్టు టీ జాక్ కు సూచించింది. 

15:06 - October 24, 2017

విజయవాడ :  రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలే బ్రతకాలా?.. సామాన్యులు జీవించడానికి అర్హులు కాదా అని... సీపీఎం ఏపీ కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌. బాబురావు ధ్వజమెత్తారు. హాకర్ల ఉపాధిని దెబ్బతీసే జోన్‌ల ప్రతిపాదనను విరమించాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం విజయవాడలోని కార్పోరేషన్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హాకర్లపై వేధింపులు పెరిగాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హాకర్లకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

15:01 - October 24, 2017

తూర్పుగోదావరి :  కలుషిత ఆహారం తిని 48మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బీసీ బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఉదయం తిన్న అల్పాహారం వికటించి బాలికలు అస్వస్థకి గురైనారు.  వీరిలో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరందరిని మెరుగైన వైద్యం కోసం పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను ఆర్డీవో, జిల్లా వైద్య శాఖాధికారి పరామర్శించారు. 

14:57 - October 24, 2017

హైదరాబాద్ : టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గతంలో స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో... అనుమతి కావాలంటూ కోదండరాం తరపున పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అనంతరం విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్రను నవంబర్ 10 నుంచి 12 వరకు చేపట్టనున్నారు. 

13:42 - October 24, 2017
13:41 - October 24, 2017
13:40 - October 24, 2017

హైదరాబాద్ : రోడ్డు రిపేరు నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు, కమ్యూనిటీ హాల్‌ నుంచి అధునాతన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వరకు... పలు నిర్మాణాలు చేపడుతుంది జీహెచ్‌ఎంసీ. ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇంత భారీ మొత్తం వెచ్చించి చేపట్టిన పనుల్లో నాణ్యతను మాత్రం బల్దియా పట్టించుకోవడం లేదు. కొత్తగా వేసిన రోడ్డు... నాలుగు రోజులు వర్షంపడితే చాలు.. పూర్తిగా కొట్టుకుపోతుంది. రెండేళ్ల క్రితం నిర్మించిన నిర్మాణాల గోడలు పెచ్చులూడుతున్నాయి. చిన్నచిన్న పనుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు బల్దియా చేస్తున్న పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలు నిత్యం వినిస్తున్నాయి.

క్వాలిటీ కంట్రోల్‌ సెల్
జీహెచ్‌ఎంసీ చేపట్టే ప్రతిపని సక్రమంగా జరుగుతుందా... అందులో వినియోగించే మెటీరియల్‌ నాణ్యత కలిగినదేనా అనే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ సెల్ ఉంది. ఇది సక్రమంగా పనిచేయకపోవడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు రావడంతో థర్డ్‌పార్టీ చెకింగ్‌ కోసం స్వతంత్ర సంస్థలను నియమించారు. అయినా పనులు క్వాలిటీగా చేయించడంలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు.ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. క్వాలిటీ రెస్పాన్స్‌బుల్‌ పర్సన్స్‌గా జోన్‌స్థాయిలో ఉండే సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల ఇక నుంచి దీనికి బాధ్యులుగా ఉంటారు. వీరు చెప్పినచోటే శాంఫిల్స్‌ సేకరించి... దాని నాణ్యతను పరిశీలించి థర్డ్‌పార్టీ ఏజెన్సీ రిపోర్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యతలో ఏమైనా తేడా ఉంటే ఎవరో ఒకరైనా ఆ పనులకు చెక్‌పెట్టేందుకు వీలవుతుందని ఈ మార్పులు చేసినట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు.చట్టాల్లో ఎన్ని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చెయ్యాల్సిన వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే మాత్రమే అది సత్ఫలితాలను ఇస్తుంది. మరి ఈసారైన బల్దియా చేపట్టే పనుల్లో మార్పు వస్తుందా... లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.

13:39 - October 24, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ముంపుగ్రామం పైడిపాక నిర్వాసితులు పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో మొదటి నిర్వాసిత గ్రామం అయిన పైడిపాక గ్రామంలోని 13 కుటుంబాలు తాగునీరు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...రెండేళ్లుగా నష్టపరిహారం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అధికారుల అవినీతి వల్లే కష్టాలు అనుభవస్తున్నామని చెబుతున్నారు. పైడిపాక నిర్వాసితుల కష్టాలపై మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

13:31 - October 24, 2017

హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తును తెలంగాణ బీసీ కమిషన్‌ వేగవంతం చేసింది. రాష్ట్రంలోని అన్నికులాల సమగ్ర లెక్కలను తేల్చేందుకు సర్వే చేస్తామని ప్రభుత్వానికి తెలిపింది. సంక్రాంతి పండుగ లోపు సర్వేపూర్తి చేసేందుకు తాము సిద్ధమని ప్రభుత్వం అనుమతికోసం విజ్ఞప్తి చేసింది బీసీ కమిషన్‌. ఇటివల కర్నాటక రాష్ట్రంలో పర్యటించిన వచ్చిన బీసీకమిషన్‌ వర్గాలు.. అక్క నిర్వహించిన సర్వే ను అధ్యయనం చేసింది. 2015లో జరిపిన ఆ సర్వేలో కర్నాటకలోని 98శాతం జనాభాకు సంబంధించిన అన్ని వివరాలను రికార్డు చేసింది. అదే విధంగా తెలంగాణలోనూ సమగ్రంగా సర్వే చేయాలనుకుంటున్నట్టు బీసీకమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. అయితే.. 2014లో నిర్వహించిన సమగ్రకుటుంబ సర్వే ద్వారా అన్ని వివరాలు నమోదు అయినా.. నాటి సర్వేకు అధికారిక ముద్ర లేకుండాపోయిది. ఈనేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ముందుకెళ్లితె న్యాయపరమైన చిక్కులు ఎదురువుతాయిని బీసీకమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. ఏ లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచారని కోర్టులు అడిగితే .. అధికారిక గుర్తింపులేని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను చూపించడం కుదరదని బీసీ కమిషన్‌ స్పష్టం చేసింది. అందుకే.. బీసీకమిషన్‌ ద్వారా మరోసారి లెక్కలు తీస్తే.. బీసీ రిజర్వేషన్లతోపాటు అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలకు ప్రతిపబంధకాలు రావని కమిషన్‌ వర్గాలు అంటున్నాయి. దీనికోసం మరోసారి రాష్ట్రంలోని అన్నికులాల జనాభా, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్రంగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని బీసీకమిషన్‌ భావిస్తోంది.

ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టబోం
మాదిరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టబోం అంటోంది. స్కూల్లో బొధనకు ఆటంకం కలగకుండా.. సంక్రాంతి సెలవుల్లో సర్వేను పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇంతకు మందు సమగ్ర కుటుంబ సర్వేలో ఉపయోగించుకున్న యువకుల సహాయం కూడా తీసుకోవాలని భావిస్తోంది. మొత్తం 55 కాలమ్స్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో ఒక్క బీసీ జనాభానే కాకుండా.. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ జనాభా వివరాలను కూడా రికార్డు చేస్తామంటోంది. అన్నికులాల వివరాలను తెలుసుకుంటేనే.. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో..తెలుస్తుందని బీసీ కమిషన్‌ అంటోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి. 

13:29 - October 24, 2017

కృష్ణా : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేతలు జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే టీడీపీకి వచ్చే బాధేంటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు వస్తే టీడీపీ వాళ్లు తట్టుకోలేరన్నారు. 

13:02 - October 24, 2017
13:00 - October 24, 2017

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకొంది. SRKTకాలనీలో మాతంగి కన్నా అనే పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. మారణాయుధాలతో వచ్చిన దుండగులు... కన్నాను నరికి చంపారని స్థానికులు అంటున్నారు. హత్యకు గురైన కన్నాకి స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్‌కి మధ్య గొడవలున్నట్లు.. తన భర్తని హతమారుస్తానని బెదిరించాడని మృతుడి భార్య తెలిపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

12:59 - October 24, 2017

మహబుబ్ నగర్ : జిల్లా, జడ్చర్లలో విషాదం చోటు చేసుకుంది. BRR కళాశాలలో బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సంపంగి పవన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నవాబ్‌పేట మండలం, దొడ్డిపల్లి గ్రామంలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

12:57 - October 24, 2017

పశ్చిమగోదావరి : లవరం ప్రాజెక్ట్ స్పీల్‌వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశల వారీగా 48 పిల్లర్ల నిర్మించనున్నారు. కొన్ని స్తంభాలు 25 మీటర్ల వరకు పూర్తి కాగా...మరికొన్ని మైనస్ 18 మీటర్ల స్థాయిలోనే ఉన్నాయి. మందకొడిగా పనులు కొనసాగుతున్నాయి..ప్రస్తుతం స్పీల్‌వే వద్ద పనుల తాజా పరిస్థితి కోసం వీడియో క్లిక్ చేయండి.

నేటి నుంచి చంద్రబాబు లండన్ పర్యటన

గుంటూరు : ఏపీ సీఎం యూఏఈ పర్యటన ముగించుకొని లండన్ పర్యటనకు బయలుదేరారు. లండన్ చేరిన తర్వాత ముందుగా లండన్ ట్రాన్స్ పోర్ట్ అధికారులతో భేటీ కానున్నారు. ఆ తరువాత నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది.

విశాఖలో విషాదం

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం పెద తీనార్ల గ్రామంలో ప్రెవేట్ స్కూల్ బస్ ఢీకొని మహిమ అనే మూడేళ్ల పాప మృతిచెందింది. యస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో గల ఆదర్శ స్కూలుకు చెందిన బస్... పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడక్కడే మృతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విశాఖలో దారుణం

విశాఖ : జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది నేషనల్ టాలెంట్ స్కూల్ లో దారుణం జరిగింది. యూకేజీ విద్యార్థిని పూజను హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో విద్యార్థిని చేయ్యికి ఫ్యాక్చర్ అయింది.

నీలోఫర్ కిడ్నాప్ ఘటనపై సాగుతున్న విచారణ

హైదరాబాద్ : నిన్న నీలోఫర్ కిడ్నాప్ గురైన పసికందు కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. శిశువును తీసుకొచ్చేవరకు ఆసుపత్రి నుంచి కదిలేదిలేదని శిశువు బంధువులు అంటున్నారు. 

12:17 - October 24, 2017
12:15 - October 24, 2017

విశాఖ : జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది నేషనల్ టాలెంట్ స్కూల్ లో దారుణం జరిగింది. యూకేజీ విద్యార్థిని పూజను హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో విద్యార్థిని చేయ్యికి ఫ్యాక్చర్ అయింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.  

12:13 - October 24, 2017

 

హైదరాబాద్ : నిన్న నీలోఫర్ కిడ్నాప్ గురైన పసికందు కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. శిశువును తీసుకొచ్చేవరకు ఆసుపత్రి నుంచి కదిలేదిలేదని శిశువు బంధువులు అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:07 - October 24, 2017
12:06 - October 24, 2017

హైదరాబాద్ : పచ్చగా పంటలతో కళకళలాడుతూ కనిపిస్తోన్న ఈ పొలాలు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాలకు చెందినవి. రైతులు ఈభూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూముల్లో ప్రతిఏటా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. పచ్చని పంట భూములపై సర్కార్‌ కన్నుపడింది. ఈ భూములను ఫార్మాసిటీ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజుతలచుకుంటే కానిదేముంది అన్న చందంగా.. ప్రభుత్వం అనుకున్నదే ఆలస్యం... ఫార్మాసిటీ కోసం ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. కుర్మిద్ద, మేడిపల్లితోపాటు... కడ్తాల్‌ , కందుకూరు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 19,333 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించాలని నిర్ణయించారు.

ఫార్మాసిటీ కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ
ముచ్చెర్ల కేంద్రంగా ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. కానీ ఫార్మాసిటీ కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వచ్చిన స్థానికులను, స్థానిక ప్రజాప్రతినిధులను రానివ్వలేదు. కేవలం అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలమంటూ నివేదికలు రాసుకున్నారు. అధికారబలంతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన సర్కార్‌...రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరిస్తోంది. వాస్తవానికి పరిశ్రమలు నిర్మించాలంటే ముందుగా ల్యాండ్‌ గ్యావింగ్‌ నోటీస్‌ జారీ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. చట్టాలను చెత్తబుట్టలో వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిహారం ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా భూములు లాక్కొంటున్నారని రైతులు వాపోతున్నారు.

నష్టాలే అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మేడిపల్లి ప్రాంతం ఫార్మాసిటీ ఏర్పాటుకు అనువైనది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాంతం అందుకు పనికిరాదని తెలిసినా... పీసీబీ, రెవెన్యూ అధికారులు అనువైన ప్రాంతమంటూ రిపోర్ట్‌లు తయారు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫార్మాసిటీతో లాభాల కంటే నష్టాలే అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫార్మాసిటీతో స్థానికంగా కాలుష్యముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలతో భూగర్భజలాలు పూర్తిగా కలుషితం అవుతాయని... అది స్థానిక ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు.అత్యుత్తమ ప్రమాణాలతో కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని... దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగబోదని చెప్తున్నారు. ఈ ఫార్మాసిటీతో 1.73 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని... ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్తున్నారు. ఫార్మాసిటీపై ప్రభుత్వం హడావుడి చేయడాన్ని ప్రజాసంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి నగర శివారుల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ ప్రాణాలకు ముప్పుగా మారే ఫార్మాకంపెనీలను అడ్డుకొని తీరుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

12:04 - October 24, 2017

సంగారెడ్డి : జిల్లా నానల్‌కల్ మండలంలోని మామిడ్గి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. నిమ్జ్‌ కోసం రైతుల వద్ద నుండి భూములు సేకరించేందుకు నిర్వహించిన గ్రామసభకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ పరశురాం, ఆర్డీవో అబ్దుల్లా హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన 2017, 90 ప్రకారం భూములను సేకరిస్తామని అధికారులు చెప్పారు. తాము నిమ్జ్‌ కోసం భూములు ఇచ్చేది లేదని.. రెండు రకాల పంటలు పండిస్తామని రైతులు చెప్పారు. తాము అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో రైతులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు.

12:03 - October 24, 2017

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో కిడ్నాపైన చంద్రశేఖర్‌ హత్యకు గురయ్యాడు. చంద్రశేఖర్‌ను హత్య చేసి పూడ్చిపెట్టారు. ఘట్‌కేసర్‌ మండలం, కొర్రెములలో చంద్రశేఖర్‌ మృతదేహం లభ్యమైంది. డ్రగ్స్‌ మాఫియానే చంద్రశేఖర్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన డ్రగ్స్‌ మాఫియాతో చంద్రశేఖర్‌కు లింకులున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ముఠా సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడి మృతదేహాన్ని పాతిపెట్టారు. కాల్‌ లిస్ట్‌ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు. 

12:02 - October 24, 2017

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం పెద తీనార్ల గ్రామంలో ప్రెవేట్ స్కూల్ బస్ ఢీకొని మహిమ అనే మూడేళ్ల పాప మృతిచెందింది. యస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో గల ఆదర్శ స్కూలుకు చెందిన బస్... పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడక్కడే మృతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

12:01 - October 24, 2017

రంగారెడ్డి : జిల్లా, శంషాబాద్‌ మండలంలో దొంగ హల్‌చల్‌ చేశాడు. తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోలో వస్తున్న భార్యాభర్తల వద్ద నుంచి.. బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్యాగ్‌ ఎత్తుకెళ్లాడు. దీంతో బ్యాగులో ఉన్న రెండు లక్షల నగదు, నాలుగు తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. శంషాబాద్ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు అబ్దుల్‌ జలీల్, అతని భార్య పర్వానా ఫిర్యాదు చేశారు. వీరు మహబూబ్‌నగర్‌ నుండి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

11:59 - October 24, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్‌ నిర్మాణాలకు అడ్డంకులు తొలిగిపోలేదు. గోదావరి ప్రవాహానికి అడ్డంగా డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నారు...గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనుల్లో వేగం నెమ్మదించింది. 1427 మీటర్ల పని చేయాల్సి ఉండగా...ఇప్పటికి 590 మీటర్ల వర్క్ మాత్రమే జరిగింది. జులై 2018 నాటికి డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేయాల్సిఉన్నా అప్పటిలోగా పూర్తయ్యే అవకాశం లేదు.

నేటి నుంచి చంద్రబాబు లండన్ పర్యటన

గుంటూరు : ఏపీ సీఎం యూఏఈ పర్యటన ముగించుకొని లండన్ పర్యటనకు బయలుదేరారు. లండన్ చేరిన తర్వాత ముందుగా లండన్ ట్రాన్స్ పోర్ట్ అధికారులతో భేటీ కానున్నారు. ఆ తరువాత నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది

11:10 - October 24, 2017

గుంటూరు : ఏపీ సీఎం యూఏఈ పర్యటన ముగించుకొని లండన్ పర్యటనకు బయలుదేరారు. లండన్ చేరిన తర్వాత ముందుగా లండన్ ట్రాన్స్ పోర్ట్ అధికారులతో భేటీ కానున్నారు. ఆ తరువాత నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:18 - October 24, 2017
10:17 - October 24, 2017
10:12 - October 24, 2017

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. కూకట్ పల్లివాసి చంద్రశేఖర్ దారుణ హత్య గురైయ్యారు. డ్రగ్స్ వ్యాపార లావాదేవీలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. నిందితులు మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జగన్ పాదయాత్ర వాయిదా

కృష్ణా : నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర వాయిదా పడింది. నవంబర్ 2 గురువారం కావడం ఆ వెంటనే శుక్రవారం కోర్టు హాజరుకావాల్సి ఉండడంతో జగన్ పాదయాత్ర నవంబర్ 6కు వాయిదా వేశారు. 

09:50 - October 24, 2017

కృష్ణా : నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర వాయిదా పడింది. నవంబర్ 2 గురువారం కావడం ఆ వెంటనే శుక్రవారం కోర్టు హాజరుకావాల్సి ఉండడంతో జగన్ పాదయాత్ర నవంబర్ 6కు వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

శంషాబాద్ లో ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలు పాటించని 5 బస్సుల సీజ్ చేయడంతో పాటు... 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. సీజ్‌ చేసిన బస్సుల్లోనే ప్రయాణికులనుగమ్యస్థానాలకు చేర్చి తరువాత సమీపంలోని ఆర్టీసీ డిపోలకు తరలించారు.

అనంతపురంలో నకిలీ నోట్ల కలకలం

అనంతపురం : జిల్లాలో నకిలీ నోట్ల బాగోతం వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి చెందిన పీవీకేకే ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

09:46 - October 24, 2017

మెదక్ : జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ అవుతుందనుకున్న తమకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా నోటీసులు పంపి డబ్బు కట్టమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయని రీషెడ్యూల్‌ చేశామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు మాట మార్చి గత రుణాలు చెల్లించాలని నోటీసులు పంపారన్నారు. రుణమాఫీ లిస్టులో తమ పేర్లున్నాయని రైతులు తెలిపారు. రామాయం పేట మండలంలో 123 మంది రైతులకు TSGVB బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులపై రైతులు ఆందోళన చెందవద్దనీ రుణమాఫీ జరుగుతుందని ఏవో అన్నారు. 

09:44 - October 24, 2017

రంగారెడ్డి : శంషాబాద్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలు పాటించని 5 బస్సుల సీజ్ చేయడంతో పాటు... 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. సీజ్‌ చేసిన బస్సుల్లోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తరువాత సమీపంలోని ఆర్టీసీ డిపోలకు తరలించారు.

09:43 - October 24, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండగులు.. 5 వందల సవర్ల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, లక్ష రూపాయల నగదు అపహరించుకెళ్లారు. వాటి విలువ సుమారు 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ ఘటన స్థానిక ఏనుగుచెట్టు వీధిలో చోటు చేసుకుంది. ఒంగోలులో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తున్న ఎ.కోటేశ్వరరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తీసి ఉంది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదరుగా పడటంతో..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

09:42 - October 24, 2017

అనంతపురం : జిల్లాలో నకిలీ నోట్ల బాగోతం వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి చెందిన పీవీకేకే ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:41 - October 24, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌... 2018 జూలై నాటికి పూర్తవుతుందని నాయకులు చెబుతున్నా... వాస్తవం మాత్రం అలా లేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులన్నీ అరకొరగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ.. సబ్ కాంట్రాక్ట్ కంపెనీలకు బకాయిలను చెల్లించకపోవడంతో పనులన్నీ నిలిచిపోయాయి.

త్రివేణి కంపెనీ కాంట్రాక్ట్‌ను రద్దు ముఖ్యంగా మట్టి పనులు చేస్తున్న త్రివేణి కంపెనీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. కొండలను తొలిచి రాళ్లను తొలగించే పనులను నిర్వహించే త్రివేణి కంపెనీకి.. ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ 94 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ ఆ బకాయిలను ఇవ్వకపోవడం... డీజిల్‌కి కూడా డబ్బులు లేకపోవడంతో త్రివేణీ కంపెనీ రాక్ తొలగింపు పనులను నెల రోజుల నుంచి నిలిపివేసింది. స్పిల్‌ వే పనులు కూడా నత్త నడకన జరుగుతున్నాయి. అదే విధంగా గేట్ల తయారీ 80శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే డయాఫ్రాం వాల్‌ నిర్మాణం 1427 మీటర్ల నిర్మాణం జరగాల్సి ఉండగా.. 590 మీటర్లు మాత్రమే జరిగింది. ఈ డయాఫ్రాం వాల్ నిర్మాణం ఒక కొలిక్కి వస్తేనే ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పనులను ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పిల్ వే నిర్మాణం, మట్టి, రాక్ తొలగింపు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్‌ ఛానల్‌కి సంబంధించి... 4.5 కోట్ల క్యూబిక్ మీటర్ల రాక్, మట్టిని తీయాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల రాక్‌ని, కోటి క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించారు. ఇంకా 80 లక్షల క్యూబిక్ మీటర్ల రాక్‌ని, 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది.

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటం.
కానీ గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటం.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని ప్రతిపాదనలు తీసుకురావడం, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో పోలవరం పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం పనులు జరగలాంటే జూన్ నుంచి ఆగస్టు వరకు గల బకాయిలను ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ చెల్లించాల్సి ఉంది. 

09:40 - October 24, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో సన్‌ షైన్ హాస్పిటల్ దాష్టికం వెలుగుచూసింది. డెంగ్యూ వచ్చిన పేషెంట్‌కు 3రోజుల్లో మూడున్నర లక్షల బిల్ వేయడంతో.. బంధువులు అవాక్కయ్యారు. బిల్ కడితే తప్ప.. పేషెంట్‌ను డిశ్చార్జ్ చేయబోమని డిమాండ్ చేయడంతో.. బంధువులు ఆందోళనకు దిగారు. 3రోజుల పాటు ట్రీట్ మెంట్ ఏం చేశారో చెప్పలేదని.. పేషెంట్‌ ను కనీసం చూపించకుండా... ఇప్పుడు మూడున్నర లక్షల బిల్ వేశారని బంధువులు వాపోయారు. అసలు ట్రీట్‌మెంట్ ఏం చేశారో చెప్పాలని మీడియా డిమాండ్ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది వెనక్కి తగ్గారు. చివరకు 50వేలు కట్టించుకొని పేషెంట్‌ను డిశ్చార్జ్ చేశారు. 

08:31 - October 24, 2017

ప్రకాశం : నేడు ప్రకాశం జిల్లా అద్దంకిలో నారా లోకేష్ టూర్ నేపథ్యంలో కరణం, గొట్టిపాటి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

లోకేష్ టూర్ తో బయటపడ్డ టీడీపీ విభేదాలు

ప్రకాశం : నేడు ప్రకాశం జిల్లా అద్దంకిలో నారా లోకేష్ టూర్ నేపథ్యంలో కరణం, గొట్టిపాటి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

08:25 - October 24, 2017

కృష్ణా : జిల్లా అవుటపల్లిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ డబ్బులు ఇవ్వపోవడంతో అతని పై ఆర్టీఏ అధికారి ప్రైవేట్ సబ్బంది దాడి చేశారు. టార్చ్ లైట్ తో లారీ డ్రైవర్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైన అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో రోడ్డు భారీగా ట్రాఫిక్ నిలచిపోయింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:24 - October 24, 2017

నల్గొండ : జిల్లా నార్కట్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరో 6గురికి స్వల్ప గాయలయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఆర్టీఏ సిబ్బంది దుర్మార్గం

 

కృష్ణా : జిల్లా అవుటపల్లిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ డబ్బులు ఇవ్వపోవడంతో అతని పై ఆర్టీఏ అధికారి ప్రైవేట్ సబ్బంది దాడి చేశారు. టార్చ్ లైట్ తో లారీ డ్రైవర్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైన అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో రోడ్డు భారీగా ట్రాఫిక్ నిలచిపోయింది.

నల్గొండలో రోడ్డు ప్రమాదం

నల్గొండ : జిల్లా నార్కట్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. 

08:12 - October 24, 2017

భారతదేశంలో ఏ వ్యక్తి అయిన చట్టానికి లోబడి నడుచుకోవల్సిన అవసరం ఉందని, జగన్ ప్రజా సమస్యలపై పోరాడానికి పాదయాత్ర చేస్తామని అనుకుంటున్నారని, దానికి విరామం లేకుండాఉంటే యాత్ర బాగా ఉంటుందని, కేసు పెట్టిన మొదటి నుంచి సీబీఐ ఎలా వ్యవరిస్తోందని వైసీపీ రాజశేఖర్ అన్నారు. ఒక బ్యాదతగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత అలా వ్యవరించడంలేదని, ఆరునెలలు పాటు మినహాయింపు అడగడం అనేది వైసీపీ వారే స్పష్టత ఇవ్వాలని, టీడీపీ నేత రామకృష్ణా ప్రసాద్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:11 - October 24, 2017

ప్రస్తుతం ప్రైవేట్‌ క్యాబ్‌లు ఈజీ జర్నీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. కానీ ఆ ప్రవేట్‌ క్యాబ్‌లు నడిపే డ్రైవర్ల జీవితాలు మాత్రం చాలా క్రిటికల్‌ పోజిషన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం వారంతా ఆందోళన బాట పడుతున్నారు. తెలంగాణలో లక్షకు పై ఓలా, ఉబెర్ లో పని చేస్తున్నారని, వారిని కంపెనీలు మోసం చేస్తున్నాయని, కేవలం బాండ్లపై సంతకాలు చేయించుకుని, యాక్సిడెంట్ చేశారని వారిని తీసివేస్తున్నారని ఆల్ ఇండియా రోడ్డుట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ పెడరేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ అన్నారు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:09 - October 24, 2017

ఢిల్లీ : సినిమాహాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరని వ్యాఖ్యానించింది. థీయేటర్‌లో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.

08:08 - October 24, 2017

గుంటూరు : గూంటూరు జిల్లా, నకరికల్లు మండలం నర్సింగపాడు ఎన్నెన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఈ ప్రదేశాన్ని శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణదేవరాయలు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు లాంటి మహనీయులు ఎందరో సందర్శించినట్లు ఆనవాళ్లున్నాయి. మునులు, సిద్ధులకు ఆలవాలమైన ఇక్కడి కాశీవిశ్వేశ్వరాలయంలో చారిత్రక ప్రముఖులు ఎందరో విశిష్ట పూజలు నిర్వహించారనీ చెబుతారు. నర్సింగపాడుని పూర్వం 500 ఏళ్ల క్రితం సాంబశివ పురంగా పిలిచేవారు. ఈ గ్రామంలో పాతాళగంగ వలె నీరు ఉద్భవిస్తుంది. దీంతో... గ్రామం అంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉందని గ్రామస్థులు చెబుతారు. వర్షాలు లేకపోయినప్పటికీ సాగునీటికి ఇక్కడి గ్రామస్థులకు ఎలాంటి లోటు ఉండదు.

1260 ఎకరాల్లో మూడు పంటలు
ఈ గ్రామంలో పాడి పరిశ్రమ కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఈ గ్రామం నుండి రోజుకు 15వేల లీటర్ల పాలు చుట్టుప్రక్కల ప్రాంతాలకు తరలిస్తారు. ఈ గ్రామంలో 1260 ఎకరాల్లో మూడు పంటలు పండిస్తారు. మోటరు సాయంలేకుండా గ్రామంలో 50 వరకు బోర్లు ఉన్నాయి. 500 అడుగుల నుండి మోటారు సాయం లేకుండా నీరు ఉబికి వస్తాయని, ఇదే తమ గ్రామ విశిష్టత అని గ్రామస్థులు చెబుతుంటారు. గ్రామంలో వెలిసిన కాశీవిశ్వేశ్వరుడి దయ వల్లే తామంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్న గ్రామస్థుల నమ్మకం ఎలా ఉన్నా.. నర్సింగపాడు మాత్రం.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 

08:07 - October 24, 2017

కృష్ణా : విజయవాడ నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందేందుకు రంగం సిద్ధమైంది. పాలనా పరంగా, కార్పొరేట్ హంగులతో రూపుదిద్దుకుంటున్న విజయవాడను గ్రేటర్‌సిటీగా చేయాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల 45 గ్రామాలను దశలవారీగా నగరపాలక సంస్థలో విలీనం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ.. 15 లక్షల జనాభాతో 61.9 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి ఉంది. ఇపుడు 45 గ్రామాలను విలీనం చేయడం ద్వారా జనాభా 20 లక్షలకుపైగా పెరిగి 403.70 కిలోమీటర్లకు పైగా నగరం విస్తరించనుంది. అయితే.. గ్రామాలు విలీనం చేసేముందు నగరంలో సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నేతలు అంటున్నారు.

జనాభాను సమాన ప్రాతిపదికన విభజించాలి
బెజవాడలో తాజాగా విలీనం కానున్న గ్రామాలు ..పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు, గన్నవరం, కంకిపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నున్న, పాతపాడు, రాయనపాడు, పెడూరిపాడు, గొల్లపూడి, నల్లకుంట, కొత్తూరు తాడేపల్లి, షాబాదా, జక్కంపూడి, మంగలాపురం, అంబాపురం, ఫిర్యాదినైనవరం, నిడమానూరు, గూడవల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, డోన్ ఆత్కూరు, కేసవపల్లి, బుద్ధవరం, ఉప్పులూరు, కూనవరం, గుంటుపల్లి, సూరాయపాలెం, పునాదిపాడు, ఎదురుపావులూరు గ్రామాలు కార్పొరేషన్ లో విలీనమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోపాలిటన్ ప్రాంతంగా విజయవాడను ఎంపిక చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ ను కూడా తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడలోని 59 డివిజన్లలో జనాభాను సమాన ప్రాతిపదికన విభజించాలని, తర్వాత డివిజన్ల సంఖ్య పెంచాలని నాయకులు గతంలో ప్రతిపాదించారు.

డివిజన్ కు దాదాపు 12 వేల మంది ఓటర్లు
గణాంకాల ప్రకారం డివిజన్ కు దాదాపు 12 వేల మంది ఓటర్లు ఉండే విధంగా అధికారులు విభజన గణాంకాలు పూర్తిచేశారు. ఈ లెక్కల ప్రకారం 59 డివిజన్లు కాస్తా 80కిపైగా పెరిగే అవకాశం ఉంది. ఇలా పెరిగే డివిజన్లతోపాటు 45 గ్రామాల విలీనం అనంతరం డివిజన్ల సంఖ్య 135కుపైగా చేరుకోనుంది. అంతా సవ్యంగా సాగితే .. వచ్చే ఆరు నెలల్లో విజయవాడ మహానగరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖ నగరాలకే పరిమితమైన మహానగరాల జాబితాలో విజయవాడకు కూడా ప్లేస్ దక్కనుందని నగర ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

08:05 - October 24, 2017

ఢిల్లీ : పోలవరం పనుల నత్తనడపై కేంద్రం సీరియస్‌ అవుంతోంది. గడువు సమీపిస్తున్నా ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగడంపై ఏపీ సర్కార్‌ను ప్రోశ్నిస్తోంది. పనుల జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంపై అసంతృప్తిగా ఉన్న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ.. జూలై 12న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్ట్‌ కొనసాగించాలా లేదా మీరే కొత్త కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖరాయడంతో కేంద్రం రంగంలోకి దిగింది. పోలవరం ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని NWDA డైరెక్టర్‌ జనరల్‌ మసూద్‌ హుస్సేన్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్స్‌ను పరిశీలించడానికి కమిటీ సిద్ధం అయింది. 

కాంట్రాక్టర్‌ను తొలగించే ప్రసక్తే లేదు
ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపై నిర్మాణ బాధ్యతను అప్పగించినా.. పనుల్లో పురోగతి లేకపోవడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ ఇంతకు ముందే తేల్చి చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వే, స్పిల్‌చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌ పనుల నుంచి ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామని, కాని ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి సబ్‌కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మొత్తానికి పోలవరం అంశంలో కేంద్రం కలుగ చేసుకోవడం.. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలోపడినట్టైందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణ అంశంలో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం నడుచుకుని .. అనుకున్న టైంకు ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 

08:04 - October 24, 2017

మెదక్ : ఎమ్మెల్యే బాబుమోహన్‌ మళ్లీ బూతు పురాణం మొదలుపెట్టాడు. రెండు రోజుల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎల్లుండి ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించనున్నాడు. అయితే... కొన్ని రోడ్ల పనులు పెండింగ్‌లో ఉండడంతో పుల్కల్‌ తహశీల్దార్‌పై.. బాబుమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు... తాను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పనులు చేయడం లేదని ఫోన్‌లో తిట్టాడు. నోటికొచ్చినట్లు... ఇచ్చిమొచ్చినట్లు తిట్ల దండకం మొదలుపెట్టాడు. నీవెంత..? నీ ఉద్యోగమెంత అంటూ నోరు పారేసుకున్నాడు. అయితే... అధికారులపై బాబూమోహన్‌ నోరు పారేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. 

08:03 - October 24, 2017

వరంగల్ : కాంగ్రెస్‌ కుట్రతో రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వానికి, రాజకీయ భవిష్యత్‌కు నష్టం జరిగిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందోనన్న కన్‌ఫ్యూజన్‌ కేడర్‌లో నెలకొందన్నారు. కాంగ్రెస్‌ ప్రచారంపై రేవంత్‌ పరువు నష్టం దావా వేసి క్లారిటీ ఇవ్వాలన్నారు. అలాగే కొంతమంది టీడీపీ నేతలు.. మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆవేశంతో మాట్లాడుతున్నారన్నారు. 

07:53 - October 24, 2017

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. పయ్యావుల కేశవ్‌ ఏపీ టీడీపీ MLC. వీరిద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్న మాటల యుద్ధం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు రేవంత్-పయ్యావుల మధ్య దూరం పెంచాయి. ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ పెళ్లి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనంతపురం జిల్లా వెంకటాపురం వెళ్లారు. కేసీఆర్‌కి పయ్యావుల కేశవ్‌ అతి మర్యాద చేశారని ప్రచారం జరిగింది. హెలిపాడ్‌లో ఇద్దరూ కలిసి ఐదు నిమిషాలు ఏకాంతగా చర్చలు జరిపిన విషయం చర్చోపర్చలకు దారితీసింది. దీనిపై రేవంత్‌రెడ్డి... టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ... తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు... పయ్యావుల కేశవ్‌ను మందలించారు. ఈ ఎపిసోడ్‌ ముగియక ముందే ఇప్పుడు మరో ఇష్యూపై ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

పయ్యావుల కేశవ్‌ను టార్గెట్‌
రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్టు ప్రచారం జరిగింది. టీడీపీని వీడే ఉద్దేశంతోనే రేవంత్‌ ఈ విధంగా చేశారన్న వాదనలు ఉన్నాయి. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చిన రేవంత్‌రెడ్డి... పనిలో పనిగా పయ్యావుల కేశవ్‌ను టార్గెట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పయ్యావుల కేశవ్‌ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేశవ్‌కు తెలంగాణలో పనేంటని, తెలంగాణ మంత్రులతో కలిసి తిరగాల్సిన అవసరం ఏముందని రేవంత్‌ ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పయ్యావుల కేశవ్‌... తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. గత ఆరు నెలల్లో రేవంత్‌ ఎన్నిసార్లు, ఢిల్లీ వెళ్లారో, ఎవరెవరిని కలిశారో తన వద్ద సమాచారం ఉందని కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో రేవంత్‌ ఎవరెవరితో వ్యాపారాలు చేస్తున్నారో ఆధారాలున్నాయన్న వాదాన్ని లేవనెత్తారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అన్నీ బయటపెడతానని చెప్పి.... రేవంత్‌రెడ్డిని ఒకింత ఆత్మరక్షణలో పడేవిధంగా చేశారు.

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న రేవంత్‌, కేశవ్‌.... ఇప్పుడు పరస్పరం విమర్శించుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల వ్యక్తిగత విమర్శలతో పార్టీకి నష్టం జరుగుతోందని సీనియర్లు బాధపడుతున్నారు. వీరిద్దిరి విమర్శలు, ఆరోపణలు టీడీపీని టార్గెట్‌ చేసేందుకు ఇతర పార్టీలకు అస్త్రాలు అందించినట్టు అయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటికి ఇప్పటికైనా ముగింపు పలకపోతే అసలుకే మోసం వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రేవంత్‌, కేశవ్‌ల ఎపిసోడ్‌కు ముగింపు కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి. 

07:52 - October 24, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ సుదీర్ఘంగా సాగింది. మధ్యాహ్నం మూడుగంటలకు సమావేశమైన కేబినెట్‌ భేటీ రాత్రి 11 గంటల వరకు జరిగింది. ఈ భేటీలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించింది. మొదటి రెండు గంటలు బిల్లులతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించారు.

పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్టం
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనే కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామ పంచాయతీ ఎన్నికలపై చర్చ జరిగింది. గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా కొత్త రూపొందించాలని మంత్రివర్గం తీర్మానించింది. పరిపాలనా రంగంలో విశేష అనుభవం గడించిన అధికారులు, న్యాయకోవిదులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని కేబినెట్‌ సీఎంకు అప్పగించింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా నిర్ణీత గడువులోపే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలతోపాటు చెంచుపల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన గ్రామానికి దూరంగా ఉండి గ్రామ పంచాయతీగాలేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. ఇక నుంచి రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీలకు నిధులు కేటాయించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిధులు గ్రామ జనాభాను బట్టి ఏ గ్రామానికి ఎంత అనేది నిర్దారిస్తారు. నరేగా లాంటి కేంద్ర పథకాల ద్వారా కూడా గ్రామాలకు నిధులు సమకూర్చనున్నారు. వివిధ రకాలుగా గ్రామానికి సమకూరిన నిధులతో పూర్తిస్థాయిలో గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయతీలపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చాలని ప్రతిపాదించారు. దీనికి మంత్రివర్గ సభ్యులు ఆమోదం తెలిపారు.

తుమ్మల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి మంత్రి తుమ్మల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయాధికారులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతు సమన్వయ సమితులను రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం వినియోగించే పద్దతులను అధ్యయనం చేసి సిఫారసు చేయడానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించారు. 

Don't Miss