Activities calendar

25 October 2017

21:56 - October 25, 2017

ఢిల్లీ : వచ్చే నవంబర్‌ 8 నాటికి మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతున్నందున రాజకీయాలు వేడెక్కాయి. నోట్లరద్దును సమర్థిస్తూ అధికార బిజెపి, నోట్లరద్దు వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. నవంబర్‌ 8వ తేదీని విపక్షాలు బ్లాక్‌ డేగా ప్రకటించగా... ఆ రోజును బ్లాక్‌మనీ వ్యతిరేకదినంగా పాటించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
నవంబర్‌ 8...దేశవ్యాప్తంగా ఆందోళనలు...
నవంబర్‌ 8...దేశవ్యాప్తంగా ఆందోళనలు...నిరసన ప్రదర్శనలు హోరెత్తనున్నాయి. మోది ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తవుతున్నందున రాజకీయాలు వేడెక్కాయి. నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ అధికార బిజెపి, నోట్లరద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యాయి.
నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహణ : కేంద్రం 
నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నల్లధనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పాల్గొంటారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తారని ఆయన చెప్పారు. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు జైట్లీ తమ చర్యను సమర్థించుకున్నారు. 
దేశవ్యాప్తంగా ఆందోళనలకు వామపక్షాలు పిలుపు 
కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్‌ 8న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. 6 వామపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. మోది ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. నోట్లరద్దుతో ప్రజలు ఉపాధి కోల్పోయారని, సామాన్య, పేదల ప్రజల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆయన పేర్కొన్నారు.  
నవంబర్‌ 8న బ్లాక్‌డేగా 18 ప్రతిపక్ష పార్టీలు ప్రటకన 
నవంబర్‌ 8న బ్లాక్‌డేగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతృత్వంలోని 18 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోజు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు విపక్షాలు పేర్కొన్నాయి. మోది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ గుర్తు చేశారు. నోట్లరద్దుతో నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్‌ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోది ఆకాంక్ష నెరవేరకపోగా....అది మరింత పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్లరద్దు నిర్ణయంపై అధికార, విపక్షాల ఆందోళన ప్రజలపై ఎంత ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.

 

21:47 - October 25, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 31న కొలువుల కోసం కోట్లాట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య-పరిష్కారాలు అన్న అంశంపై జరిగిన సదస్సుకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌  హాజరయ్యారు. ఉద్యోగల భర్తీపై ప్రభుత్వం, మంత్రులు చెబుతున్న లెక్కలకు పొంతనలేకుండా పోయిందని విమర్శించారు. కొలువుల కోసం కొట్లాట నిరసన కార్యక్రమానికి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఇంకా పర్మిషన్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. 

 

21:45 - October 25, 2017

హైదరాబాద్ : టీటీడీపీలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన రేవంత్‌రెడ్డిని పార్టీ కీలక పదవులనుంచి తాత్కాలికంగా తప్పించింది. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌ పదవితో పాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తొలగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఎట్టి పరిస్థితుల్లో టీడీఎల్పీ సమావేశం జరిపి తీరతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు గోల్కొండ హోటల్‌లో తమ సమావేశం జరుగుతుందని టీడీపీ సీనియర్లు తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌లో గురువారం ఏం జరగబోతోంది? 
రేవంత్‌రెడ్డిని కీలక బాధ్యతలనుంచి తప్పించిన ఎల్.రమణ
టీటీడీపీలో రసవత్తరంగా సాగుతున్న రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్ ఫైనల్‌కి చేరింది. కొద్దిరోజులుగా ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారతారంటూ వస్తున్న వార్తలపై దుమారం చెలరేగింది. ఆ వార్తలను ఆయన ఖండించినా.. పార్టీ సీనియర్లు శాంతించలేదు. రేవంత్ సరైన స్పష్టత ఇవ్వలేదంటూ రేవంత్‌ తీరును తప్పుపట్టారు. పార్టీ నియమావళిని ధిక్కరించిన ఎవర్నైనా తప్పిస్తామని తేల్చి చెప్పిన రమణ అన్నంత పనీ చేశారు. రేవంత్‌రెడ్డిని కీలక బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఫ్లోర్ లీడ‌ర్‌గా ఆయ‌న్ను త‌ప్పించ‌డంతో   పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి తొల‌గించారు.
చంద్రబాబుతో మంతనాలు సాగించిన రమణ
అంత‌కు ముందు టీటీడీపీ అధ్యక్షుడు ర‌మ‌ణ..జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు సాగించారు. విదేశాల్లో ఉన్న బాబు ఆదేశానుసారం రేవంత్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. రేవంత్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని..ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేసారు. ఇదే సంద‌ర్భంలో రేవంత్ నిర్వహించతలపెట్టిన టీడీపీఎల్పీ సమావేశానికి ఎవరూ హాజరు కావొద్దంటూ రమణ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్లకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పాటు బీజేపీతో కలిసి ఓ ప్రైవేటు హోటల్లో పోటీ సమావేశాలకు పిలుపునిచ్చారు. శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించేందుకు బీజేపీతో కలిసి గురువారం నాడు సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రమణ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు.
చంద్రబాబుని కలిశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న రేవంత్‌
అటు రేవంత్ కూడా వెనక్కు  తగ్గడం లేదు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తనను తప్పించే అధికారం చంద్రబాబుకి తప్ప మరెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. గురువారం నాడు శాసన సభా పక్ష సమావేశాన్ని ఎల్పీ కార్యాలయంలో నిర్వహిస్తానన్నారు. రమణ వర్గం నిర్వహిస్తున్న ఎల్పీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. చంద్రబాబు నాయుడితో కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాన్నారు రేవంత్‌రెడ్డి. మరోవైపు రేవంత్‌ను ఒంటరి చేసేందుకు రమణ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ క్రిష్ణయ్యతో చ‌ర్చించిన ర‌మ‌ణ పార్టీ లైన్ లో న‌డ‌వాల‌ని సూచించారు. బీఏసీలో లేవ‌నెత్తాల్సిన అంశాల‌పై సండ్ర వెంకట వీరయ్యతో రమణ గురువారం ఉదయం సమావేశం కానున్నారు. చంద్రబాబు విదేశాల నుంచి శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో రమణ, రేవంత్‌ వర్గాలు తమ వాదనలు వినిపించేందుకు రెడీ అవుతున్నాయి. గురువారం తెలంగాణ టీడీపీలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. 

 

21:40 - October 25, 2017

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం ముగిసింది. పోలవరంపై పూర్తి స్ధాయిలో సమీక్షించామని గడ్కరీ తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో పనులు, సమస్యలపై చర్చించామన్నారు. కాంట్రాక్టరు మార్పు అనేది పరిపాలనపరమైన అంశమన్నగడ్కరీ.. కాంట్రాక్టరు మార్పు అంశాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. 2019 లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తమ సంకల్పంమని గడ్కరీ చెప్పారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముగిసిన సమీక్ష సమావేశం

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 'పోలవరం'పై పూర్తిస్థాయిలో సమీక్షిస్తమని గడ్కరీ తెలిపారు.  

 

21:18 - October 25, 2017

మహారాష్ట్ర : పుణే వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కీలక పోరులో కోహ్లి సేన గెలిచింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మూడు వన్డేల సీరిస్ 1..1 తో సమం చేశారు. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 వోవర్లలో 230 పరుగులు చేసింది. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ లు హాఫ్ సెంచరీ చేశారు.

 

కీలక పోరులో గెలిచిన కోహ్లి సేన

మహారాష్ట్ర : పుణే వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కీలక పోరులో కోహ్లి సేన గెలిచింది. 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలుపొందింది. భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. 

20:23 - October 25, 2017

వైసీపీ ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం చేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. పోలవరంను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:17 - October 25, 2017
20:13 - October 25, 2017

బెంగళూరు : కర్ణాటలో టిప్పు సుల్తాన్‌ జయంతిపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ గొప్ప యుద్ధ వీరుడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బ్రిటిష్‌ వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్‌ అసువులు బాసారని...యుద్ధంలో మైసూరు రాకెట్లకు ఆయనే నాంది పలికారని కొనియాడారు. విధాన సౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు టిప్పు సుల్తాన్‌ను నిరంకుశుడిగా పేర్కొన్న నేపథ్యంలో కోవింద్‌ ఆయనను గొప్ప యోధుడిగా కీర్తించడం గమనార్హం. నవంబర్‌ 10న జరిగే టిప్పు సుల్తాన్‌ జయంతోత్సవాలకు కర్నాటక ప్రభుత్వ ఆహ్వానాన్ని బీజేపీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. టిప్పు సుల్తాన్‌ జయంతిని బిజెపి తిరస్కరిస్తోంది. ఘనమైన ఆధ్యాత్మిక చరిత్రతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు, వ్యవసాయానికి కర్ణాటక ప్రసిద్ధి చెందిందని రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కొనసాగుతున్న సమీక్షా సమావేశం

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో సమీక్షా సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యంపై ఇప్పటికే సీరియస్‌ అయిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్‌  తీరుపై గుర్రుగా ఉన్న కేంద్రం.. ప్రాజెక్ట్‌ పనులపై అధ్యయనానికి మసూద్‌ హుస్సేన్‌ కమిటీని నియమించింది. 

20:08 - October 25, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో సమీక్షా సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యంపై ఇప్పటికే సీరియస్‌ అయిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్‌  తీరుపై గుర్రుగా ఉన్న కేంద్రం.. ప్రాజెక్ట్‌ పనులపై అధ్యయనానికి మసూద్‌ హుస్సేన్‌ కమిటీని నియమించింది. నిర్మాణంలోని సమస్యలను కొలిక్కితేవడంతోపాటు 2019 లోపు ప్రాజెక్టు పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తత సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ బిల్లులు, ప్రాజెక్టుకు అవసరమైన అటవీ పర్యావరణ సహా అన్ని అనుమతుల అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కొత్త కాంట్రాక్ట్‌ను నియమిస్తారా అంటూ జూలై 12న  కేంద్రానికి లేఖ రాశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఎన్ డబ్ల్యుడీఏ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:55 - October 25, 2017

హైదరాబాద్ : టీటీడీపీలో సంక్షోభం ముదురుతోంది. టీటీడీపీలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కీలక పదవుల నుంచి తాత్కాలికంగా తప్పించింది. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌ పదవితో పాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తొలగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఎట్టి పరిస్థితుల్లో టీడీఎల్పీ సమావేశం జరిపి తీరతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు గోల్కొండ హోటల్‌లో తమ సమావేశం జరుగుతుందని టీడీపీ సీనియర్లు తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌లో గురువారం ఏం జరగబోతోందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ

లండన్ : నార్మన్ రాబర్ట్ పోస్టర్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో అమారావతి డిజైన్ లపై చర్చినట్టు తెలుస్తోంది. 

మూడో వికెట్ కోల్పయిన భారత్

హైదరాబాద్ : భారత్ మూడో వికెట్ కోల్పయింది. 145 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (88) ఔట్ అయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది.

టీటీడీపీలో ముదురుతున్న సంక్షోభం

హైదరాబాద్ : టీటీడీపీలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కీలక పదవుల నుంచి తాత్కాలికంగా తప్పించింది. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌ పదవితో పాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తొలగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. 

గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ

గాంధీనగర్ : గుజరాత్‌ ఎన్నికల నగారా మోగింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్‌  ప్రకటించింది. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుందని ఈసీ వెల్లడించింది. డిసెంబర్‌ 18న కౌంటింగ్‌ జరగనుంది. మొదటి దశలో 89, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 

19:43 - October 25, 2017

గాంధీనగర్ : గుజరాత్‌ ఎన్నికల నగారా మోగింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్‌  ప్రకటించింది. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుందని ఈసీ వెల్లడించింది. డిసెంబర్‌ 18న కౌంటింగ్‌ జరగనుంది. మొదటి దశలో 89, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. గుజరాత్‌లో మొత్తం 4.33 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 50 వేల 128 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. ఈసీ ప్రకటనతో గుజరాత్‌లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. 2018 జనవరి 22తో గుజరాత్‌ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో
వీవీపీఏటీ యంత్రాలను వినియోగించనున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థుల ఖర్చు 28లక్షలకు మించరాదని ఎన్నికల ప్రధాన అధికారి అచల్‌ కుమార్‌ జోతి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

పోలవరంపై కేంద్రమంత్రి గడ్కరీ సమీక్ష

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మణంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీతిన్ డగ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దేవినేని ఉమా, జలవనరులశాఖ కార్యదర్శి, ఈఎన్ సీ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరైయ్యారు. 

18:54 - October 25, 2017

వరంగల్ : ఎర్రబెల్లి ప్రదీప్ రావును కొండ దంపతులు తీవ్రంగా హెచ్చరించారు. ఎర్రబెల్లి కుటుంబంపై కొండ దంపతులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి కుటుంబంతో తమది 30 ఏళ్ల వైరమని కొండ సురేఖ అన్నారు. ఎర్రబెల్లి తమను అణగదొక్కుతున్నా ఎదుగుతూనే ఉన్నామని చెప్పారు. ప్రదీప్ రావు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రదీప్ రావు తమపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:47 - October 25, 2017

స్పోర్ట్స్ : టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ విరాట్ కోహ్లి పెళ్లికి ముహూర్తం ఖరారైట్టు తెలుస్తోంది. గత కొద్ది సంత్సరాలుగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ, కోహ్లి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ జోడి వచ్చే డిసెంబర్ లో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం. దీనిపై ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారత్ జట్టు డిసెంబర్ చివరి వారంలో దక్షణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందుగానే కోహ్లి వివాహం చేసుకోవాలని భావిస్తున్నడట. అందుకోసమే వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న టోర్నమెంట్ కు కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నరట. ఒకవేళ శ్రీలంక పర్యటనలో కోహ్లికి విశ్రాంతి దొరికితే డిసెంబర్ తొలి వారంలోనే కోహ్లి పెళ్లిచేసుకుంటాడని తెలుస్తోంది. చూద్దాం మరి కోహ్లి పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందో లేక వాయిదా పడుతుందో...?

18:45 - October 25, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట మండలం, లక్కవరం గ్రామంలో చిరుత మృతి చెందింది. బాతుపురం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుండి రహదారి పైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢి కొనడంతో చిరుత అక్కడికక్కడే చనిపోయింది. 

 

18:42 - October 25, 2017

హైదరాబాద్ : మరికొద్దిసేపట్లో ఢిల్లీలో పోలవరం నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొంటున్నారు. పోలవరం నిర్మాణంలోని సమస్యలను కొలిక్కితేవడంతోపాటు 2019 లోపు ప్రాజెక్టు పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరగనుంది. పెండింగ్ బిల్లులు, ప్రాజెక్టుకు అవసరమైన అటవీ పర్యావరణ సహా అన్ని అనుమతుల అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. 

 

18:39 - October 25, 2017

గుంటూరు : జగన్ బీసీల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి విమర్శించారు. తన పాదయాత్రలో బీసీలపైనే దృష్టి సారిస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారాయన...బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని కేఈ.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీలో ఒక్కనాడు బీసీల సంక్షేమం కోసం మాట్లాడింది లేదని కేఈ.కృష్ణమూర్తి  అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడలేదని మరో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ ఏం మాట్లాడినా రాజకీయ లబ్ధి కోసమేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

 

18:36 - October 25, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం లండన్‌ పర్యటన రెండవరోజు కొనసాగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణ ఆకృతుల నమూనాపై నార్మన్‌ పోస్టర్‌ బృందం రూపకర్తలతో సమాలోచనలు, వరుస ముఖాముఖిలతో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం యూకే మినిస్టర్‌ ప్రీతి పటేల్‌ చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. యూకే ఏపికి ఏయే అంశాల్లో సహకారం అందించగలదన్న విషయంపై చంద్రబాబు చర్చించారు. ఐరోపా, యూకేలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలతను అందించి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు కోరారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

 

యువతి వేధిస్తున్న కీచకుడు అరెస్ట్

రంగారెడ్డి : జిల్లా రాచకొండ పీఎస్ పరిధిలో యువతిపై మహ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. యువతి ఫొటో మార్ఫింగ్ చేసి ఫోర్న్ సైట్ పెట్టి ఫోన్ నంబర్ కూడా పెట్టాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు మహ్మద్ యూసుఫ్ అరెస్ట్ చేశారు. 

18:20 - October 25, 2017

టెన్ టివి సినిమా : తమిళ హీరో విజయ్ తన చిత్ర మెర్సల్ కు మద్దతు పలికిన వారికి కృతజ్ఞత తెలుపుతూ బహిరంగా లేఖ రాశారు. రాజకీయాలకు అతితంగా సినిమా విజయం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని, మీ అందరి సహకారం మరింత ముందుకు నడిపిస్తోందని అన్నారు. మెర్సల్ చిత్రంలో జీఎస్టీ వ్యతిరేకంగా కొన్ని మాటలు ఉన్నాయని ఈ చిత్రన్ని బీజేపీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదమే సినిమా మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా రజనీకాంత్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది.

18:14 - October 25, 2017

హైదరాబాద్ : 10 టివి కథనాలకు జీహెచ్ ఎంసీ స్పందించింది. అక్రమాలకు పాల్పడుతున్న మలక్‌పేట డిప్యూటి ఇంజనీర్‌ శ్రీనివాస చారిపై బదిలీవేటు వేసింది. ఈ మేరకు విజిలెన్సు ప్రాథమిక నివేదికతో చర్యలకు జీహెచ్ ఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. మలక్‌పేట ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ నుండి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు నిర్ణయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:09 - October 25, 2017

సంగారెడ్డి : ఆందోల్‌ ఎమ్మెల్యే బాబు మోహన్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేనిఎడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని ఉద్యోగులు హెచ్చరించారు. బాబు మోహన్‌ ఎమ్మార్వోపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ఈమేరకు ఉద్యోగులతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఉద్యోగుల పట్ల పదే పదే నోరు పారేసుకోవడంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. బాబు మోహన్‌పై వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

17:59 - October 25, 2017

హైదరాబాద్ : ఈనెల 31న శాంతియుతంగానే కొలువులపై కొట్లాట సభ నిర్వహిస్తామని టీజాక్  చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం, పోలీసులు కావాలనే అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. దాదాపు 2 లక్షలకు పైగా ఖాళీల నియామకం చేపట్టాల్సి ఉన్నా.. ప్రభుత్వం, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా కొట్లాట సభ నిర్వహించి తీరతామని తేల్చి చెప్పారు. 
 

17:55 - October 25, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి ప్రతిపక్ష బాధ్యత వహించాలని తుమ్మల సూచించారు. 

 

17:54 - October 25, 2017

టెన్ టివి సినిమా : పవన్ కళ్యాణ్ తో మల్టీస్టార్ మూవీ చేయడానికి సిద్ధమని ప్రముఖ హీరో రవితేజ హింట్ ఇచ్చారు. బుల్లితెర పై ప్రసారమౌతున్న ఓ షోలో పాల్గొన్న ఆయన ఈ విషయం తెలిపారు. రాజ ది గ్రేట్ ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవి తేజను యాంకర్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో మీరు మల్టీస్టార్ సినిమా చేస్తారు అని అడగగా ప్రతి హీరోతో చేస్తానని రవితేజ చెప్పాడు.

ఇప్పటికిప్పుడు ఏ హీరోతో చేలంటే ఎవరితో చేస్తారు అని యాంకర్ మళ్లీ అడిగింది. పవన్ కళ్యాణ్ అని ఒక సెకన్ కూడా అగకుండా రవితేజ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ షోకు వచ్చిన అడియన్స్ చప్పట్లతో మ్రోగిపోయాయి.

 

17:52 - October 25, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీలో అసహనం పెరిగిపోయిందని.. ఆ పార్టీకి వ్యూహ రచన లేదన్న విషయాన్ని నిన్నటి చలో అసెంబ్లీ ప్రకటనతో  బయటపెట్టుకుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ లేవనెత్తే ఏ అంశంపైనైనా మేము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్‌ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర సబ్జెక్ట్ లేక.. మాట్లాడే సత్తా లేక వీధి పోరాటాలకు దిగుతోందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. 

17:49 - October 25, 2017

నాగర్ కర్నూలు : నీలోఫర్‌ ఆస్పత్రి వద్ద మూడురోజుల క్రితం కిడ్నాపైన మగశిశువు కథ విషాదాంతంగా ముగిసింది. నాగర్‌కర్నూలు వెల్డండ మండలం బండోనిపల్లి వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారిని పాతిపెట్టిన చోటుకు తల్లిదండ్రులు చేరుకున్నారు. పసికందును ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన రోజు మరణించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తమ బిడ్డ ఇక లేడన్న వార్త విని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోసముద్రంలో ముగినిపోయారు. మంజుల అనే మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తనకు పిల్లలు లేరని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిందని, అయితే చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు సమాచారం. పిల్లలు లేరని కిడ్నాప్ చేశారా.. లేదా కావాలనే కిడ్నాప్ చేశారా...అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండోనిపల్లి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:39 - October 25, 2017
17:37 - October 25, 2017
17:36 - October 25, 2017

చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణ హత్య గావించబడ్డారు. కడప జిల్లా పులివెందులకు చెందిన ముణికుమార్ (25) రోడ్డు పనుల్లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో మదనపల్లిలో యువకుడిని దుండగలు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుపై మృతదేహాన్ని దుండగులు కప్పి పెట్టారు. మృతుడి కాలు కనబడటంతో కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందారా..? పాత కక్షల కారణంగా ఎవరైనా హత్య చేశారా.... లేదా ఏమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

కడప : జిల్లా జమ్మలమడుగు కమమ్మలవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 

మొబైల్ కు ఆధార్ లింక్ మండిపడ్డ మమతా బెనర్జీ

కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ పై మండ్డిపడ్డారు. తన ఫోన్ కనెక్షన్ తొలగించినా ఆధార్ లింక్ చేయను అన్ని స్పష్టం చేశారు.

కోచింగ్ సెంటర్ లో ఫుడ్ పాయిజన్

తూర్పుగోదావరి : జిల్లా రాజమండ్రిలో గోదావరి డిఫెన్స్ అకాడమీలో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరం

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. చైర్మన్ గా ఇంటూరి చిన్నా అభ్యర్థిత్వాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ జగన్ వద్దకు చేరుకుంది. 

ఏపీ అసెంబ్లీ కమిటీల నియామకం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ కమిటీల నియామకం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా బాల వీరాంజనేయస్వామి, సౌకర్యాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కమిటీల చైర్మన్ గా స్పీకర్ కోడెల, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీసీ కమిటీ చైర్మన్ గా తిప్పేస్వామి, ఎస్పీ కమిటీ చైర్మన్ గా శ్రావణ్ కుమార్, ఎస్టీ కమిటీ చైర్మన్ గా మొండియం శ్రీనుని నియామించారు.

17:00 - October 25, 2017

విశాఖ : జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. కబ్జాకు పాల్పడటమే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారు. బుచ్చయ్యపేట మండలం శివార్లలో కబ్జారాయుళ్లు.. మహిళలపై దాడి చేసి ఆపై తాళ్లతో కట్టేశారు. అనకాపల్లి నుంచి వచ్చిన 20 మంది దాడి చేశారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. బాధితులు బోరున విలపించారు. మహిళను గ్రామస్తులు కాపాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:59 - October 25, 2017

టెన్ టివి : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అకట్టుకున్న భామ సాయి పల్లవి ప్రస్తుతం ఆమె నాని ఎంసీఏ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వీరి ఇద్దరికి గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎంసీఏ చిత్రం తర్వాత తెలుగు తను నటించను అని అన్నట్టు కూడా వినిపించింది. సాయి పల్లవి అన్నింటికి పులిస్టాప్ పెట్టింది. అయితే తాజా గా ఓ విషయం కొపం తెప్పించిదట అదేంటంటే ఆమె ఎక్కడి వెళ్లిన మలయాళి అమ్మాయిగానే ట్రిట్ చేస్తున్నట్టు తెలిపింది. ఓ విలేకరి మలయాళి అని సంభోదిండం ఆమెను ఆగ్రహానికి గురి చేసిందట. సాయి పిల్లవి నిజనికి మలయాళి అమ్మాయి కాదు ఆమెది తమిళనాడు. సాయి పల్లవి జన్మస్థలం కోయంబత్తూరుకు సమీపంలోని కోటగిరి. మొత్తం విలేకరికి వివరించి ఇక నుంచి మలయాళి అనొద్దని తెలిపిందట.

యువకుడి దారుణ హత్య

చిత్తూరు : జిల్లా మదనపల్లెలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పై పూడ్చిపెట్టారు. కూలీలు పనిచేస్తున్నప్పుడు కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్: జిల్లా నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చేలరేగింది. సీనియర్ల దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

16:29 - October 25, 2017

టోక్యో : రెడ్‌బుల్‌ జపాన్‌లో నిర్వహించిన డౌన్‌హిల్‌ లాంగ్‌బోర్డింగ్‌ రేస్‌ టాప్‌ క్లాస్‌ స్కేట్‌బోర్డింగ్‌ స్పెషలిస్ట్‌ల సత్తాకు సవాల్‌గా నిలిచింది. నార్తరన్‌ టోహోకులోని సుగారూ ఇవాకీ పర్వత ప్రాంతంలోని నిర్వహించిన ఈ పోటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్కేట్‌ బోర్డర్లు పోటీకి దిగారు. ఈ డేర్‌ డెవిల్‌ కాంపిటీషన్‌ టైటిల్‌ను మతియా బోస్‌ సొంతం చేసుకున్నాడు.

16:28 - October 25, 2017

ముంబై : ముంబై వన్డేలో అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీ ...సూపర్‌ సెంచరీతో భారత్‌ను పోటీలో నిలిపాడు. తొలి వన్డేలో మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా..విరాట్‌ మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించాడు. వన్డేల్లో 31వ సెంచరీ నమోదు చేసిన కొహ్లీ......200వ వన్డేలో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్‌ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో 31 సెంచరీలతో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఈ లిస్ట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 49 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

16:27 - October 25, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఏడాది డిసెంబర్‌ 9,14 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంలో జాప్యం జరిగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియో క్లిక్ చేయండి. 

16:26 - October 25, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులు.. ఫీజుల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు , ఎస్ఎఫ్ఐ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. విద్యార్ధులు తమ సమస్యలపై పోరాటం చేస్తుంటే కేసీఆర్ ఇలా నిర్బంధపు అరెస్టులు చేయించడం సరికాదని ఎస్‌ఎప్‌ఐ నేతలు ఆరోపించారు. ఈనెల 27 నుంచి తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

16:25 - October 25, 2017

నిజామాబాద్ : ఈనెల 31న హైదరాబాద్‌లో చేపట్టే కొలువల కోసం కొట్లాట ఆందోళన కార్యక్రమానికి విద్యార్థులను సమీకరించేందుకు ఓయూ జేఏసీ చేపట్టిన బస్సు యాత్ర నిజామాబాద్‌ చేరుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొవుల కోసం కొట్లాట చేపట్టామని ఓయూ జేఏసీ చైర్మన్‌ రమేశ్‌ చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:23 - October 25, 2017

సూర్యాపేట : జిల్లా నూతనకల్‌ మండలం వెంకెపల్లిలో అర్ధరాత్రి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామ అభివృద్ధి జరగలేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేపట్టిన పల్లె నిద్రను గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే.. నిరసనకారులపై పోలీసులతో ఉక్కుపాదం మోపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిశోర్ కాన్వాయిని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. పలువురిని అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి బందోబస్తు మధ్య ఎమ్మెల్యే కిశోర్ పల్లె నిద్రను కొనసాగించారు. నిరసన తెలిపిన తమపై అకారణంగా పోలీసులతో దాడి చేయించి, అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో బంధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరుతున్నారు. 

16:22 - October 25, 2017

ఢిల్లీ : నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి 500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. ప్రధాన మంత్రి కృషి సింఛాయ్‌ యోజనలో భాగంగా ఏఐబీపీ స్కీంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశం జరిగింది. నీటీ పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి చెందిన 11 ప్రాజెక్ట్‌లు ఉన్నాయని.. ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై భారం పడుతొందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు హరీష్‌ రావు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

16:21 - October 25, 2017

హైదరాబాద్ : రైతు సమస్యలపై ఈనెల 27న చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీపీసీసీ పిలుపు ఇచ్చింది. అన్నదాతల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీనికి నిరసనగానే చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చామన్నారు. 

16:20 - October 25, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌నేత,శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ మెడకు ఈడీ కేసు చుట్టుకుంది. షబ్బీర్‌ అలీకి హవాలా డబ్బులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ... ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన పేరును చార్జిషీట్‌లో చేర్చింది. 2012 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన... మినరల్‌ మైన్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 195 కోట్ల రూపాయల బంగారం... తప్పుడు ధ్రువపత్రాలుతో కొనుగోలు చేశారు. తమ సంస్థలో పనిచేసే ఐదుగురు సభ్యులతో సుఖేష్‌గుప్తా కుమ్మక్కై తమకు 100 కోట్ల నష్టం చేశారని ఎంఎంటీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించింది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సుఖేష్‌గుప్తా బంగారం కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీబీఐ.. అతడిని 2013లో అరెస్ట్‌ చేసింది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపింది.

సీబీఐ చీఫ్‌కు లంచంగా 1.75 కోట్ల రూపాయలు
జైల్లో ఉన్న ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా బెయిల్‌ కోసం వివిధ మార్గాలను వెతికాడు. తాన్‌పూర్‌కు చెందిన మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీతో సంప్రదింపులు జరిపాడు. ఖురేషీకి బొగ్గు కుంభకోణం నిందితులతోపాటు సీబీఐ అధికారులతో సంబంధాలు ఉన్నాయి. దీంతో సీబీఐ చీఫ్‌కు లంచంగా 1.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి డీల్‌ కుదిరింది. విచారణలో ఇదంతా తెలుసుకున్న సీబీఐ... ఖురేషీని అరెస్ట్‌ చేసింది. అతడి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఢీకోడ్‌ చేయగా అందులో షబ్బీర్‌ అలీ పేరు బయటపడింది. హవాలా వ్యాపారితో షబ్బీర్‌ అలీకి సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఆధారాలు సేకరించింది. సీబీఐ చీఫ్‌కు 1.75 కోట్ల లంచాన్ని మొయిన్‌ ఖురేషీ ద్వారా షబ్బీర్‌ అలీ హవాలా చేయించినట్టు సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో షబ్బీర్‌ అలీ పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు.

తనకెలాంటి సంబంధంలేదు షబ్బీర్
ఈ కేసుతో తనకెలాంటి సంబంధంలేదని షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. తనను సీబీఐ, ఈడీ ఎవరు పిలిచినా తప్పకుండా వెళ్తానని.. వారికి పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఖురేషీ మాత్రం ఎవరో తనకు తెలియదన్న షబ్బీర్‌... సుఖేష్‌గుప్తా మాత్రం తనకు స్నేహితుడని చెప్పారు. హవాలా కేసులో షబ్బీర్‌ అలీ పాత్ర వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌ ఒకింత షాక్‌కు గురైంది. ఈ కేసులో సీబీఐ అధికారులు తదుపరి ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఈ కేసుతో షబ్బీర్‌అలీకి సంబంధం ఉందని తేలితే ఆయపై చర్యలు తీసుకునే అవకాశముంది. అవసరమైతే షబ్బీర్‌ను అరెస్ట్‌ చేసే అవకాశమూలేకపోలేదు. ఇదే జరిగితే షబ్బీర్‌అలీ రాజకీయ భవిష్యత్‌ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

16:19 - October 25, 2017

విశాఖ : ప్రజా సంఘాలు- పోలీసుల మధ్య పోస్టర్స్‌ వార్‌ జరుగుతోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళ, గిరిజన సమస్యలపై చైతన్య మహిళా సంఘం ధర్నా చేపట్టింది. సీఎంఎస్‌ ధర్నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అమాయక గిరిజనులను ఉద్యమాల వైపు నడిపిస్తున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లను చైతన్య మహిళా సంఘం సభ్యులు తగలబెట్టారు. తమకు వ్యతిరేకంగా పోలీసులే పోస్టర్లను.. గిరిజనులతో ర్యాలీలను చేయిస్తున్నారంటూ రోడ్డు పై బైటాయించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతగా మారింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మతిస్థిమితంలేని వ్యక్తి రాళ్ల దాడి

విశాఖ : నగరంలో మతిస్థిమితంలేని వ్యక్తి వీరంగ సృష్టించాడు. అరిలోవ పెదగదిలి హైవేపై రాళ్లతో పలువురిపై దాడి చేయడంతో అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 

15:16 - October 25, 2017

విశాఖ : నగరంలో మతిస్థిమితంలేని వ్యక్తి వీరంగ సృష్టించాడు. అరిలోవ పెదగదిలి హైవేపై రాళ్లతో పలువురిపై దాడి చేయడంతో అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:35 - October 25, 2017
14:34 - October 25, 2017

సంగారెడ్డి : జిల్లా జోగిపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బీఈడీ విద్యార్థులు అడ్డుకున్నారు. టీఆర్ టీ తమకు అవకాశమివ్వాలని వారు డిమాండ్ చేశారు. వినతపత్రం ఇచ్చేందుకు విచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:21 - October 25, 2017

హైదరాబాద్ : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ లేఖ రాశారు. దీంతో రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. పార్టీ అధినేత చంద్రబాబు రమణతో ఫోన్లో మాట్లాడారు. మీ నివేదిక అందింది అని చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందని చంద్రబాబు తెలిపినట్టు రమణ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:04 - October 25, 2017

టెన్ టివి : ఎప్పటకప్పుడు కొత్త ఫీచర్స్ ని అందిస్తున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ లేటేస్ట్ వర్షన్ లోమ గ్రూప్ వాయిస్ కాల్స్ ఫీచర్ తీసుకువస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. వాట్సప్ 2.17.70 బీటా అప్ డేట్ గ్రూప్ కాల్స్ టెక్నాలజీని అండుబాటులోకి తేనుంది. గ్రూప్ వీడియో కాల్స్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదు. వచ్చే ఏడాది గ్రూప్ వాయిస్ కాల్స్ ను తీసుకురానున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఫేస్ బుక్ మెసెంజర్ లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఉంది.

13:33 - October 25, 2017

నాగర్ కర్నూలు : నీలోఫర్ పసికందు కిడ్నాప్ ఘటన తీవ్ర విషాదంతం నింపింది. పసికిందు చనిపోయిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఆదివారం నాగర్ కర్నూలు..వెల్దండ ప్రాంతానికి చెందిన మంజుల..ఆమె భర్త కుమార్ గౌడ్ పసికందును కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు 15 బృందాలుగా గాలింపులు చేపట్టారు. కిడ్నాప్ చేసిన మంజుల నాగర్ కర్నూలుకు వెళ్లిందని గుర్తించారు. అనంతరం జరిపిన దర్యాప్తులో పసికందు చనిపోయినట్లు..పసికందును మంజుల పూడ్చిపెట్టడం జరిగిందని తేలింది. కిడ్నాప్ చేసిన మంజుల..ఆమె భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే పసికందు మృతి కారణం నీలోఫర్ యాజమాన్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.

పసికందును కిడ్నాప్ చేసి వెల్దండ ప్రాంతానికి మంజుల వచ్చిందని వెల్దండ ఎస్ఐ టెన్ టివికి తెలిపారు. ఈ కేసు నాంపల్లిలో నమోదైందని అక్కడి పోలీసుల సమాచారం మేరకు తాము గాలింపులు చేపట్టడం జరిగిందన్నారు. తమ దర్యాప్తులో మంజుల పసికందును ఖననం చేసినట్లు తేలిందన్నారు. మంజుల భర్త కుమార్ కు పలు కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు. 

కడియంను అడ్డుకున్న బీఈడీ విద్యార్థులు

సంగారెడ్డి : జిల్లా జోగిపేటలో బీఈడీ విద్యార్థులు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని అడ్డుకున్నారు. డీఎస్సీలో తమకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.  

సచివాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హైదరాబాద్ : స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలంటూ తెంలగాణ సచివాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం యత్నించింది. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.

13:28 - October 25, 2017

ఢిల్లీ : ఎట్టకేలకు ఈసీ గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 9 ,14 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయని, డిసెంబర్ 18న కౌంటింగ్ జరుగనుందని వెల్లడించింది. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఈవీంఎలను సిద్ధం చేయడం జరిగిందని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వీడియో గ్రాఫ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గుజరాత్ లో 4.43 కోట్ల మంది ఓటర్లున్నారని పేర్కొన్నారు.

ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఈసీ గుజరాత్ రాష్ట్రానికి ప్రకటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ప్రకటించలేదనే విమర్శలు వినిపించాయి. గుజరాత్ లో మోడీ పర్యటన ఇటీవలే ముగిసిన సంగతి తెలిసలిందే. అనంతరం బుధవారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం గమనార్హం. 

2012 ఫలితాల బల బలాలు..
గుజరాత్ అసెంబ్లీ 2012 ఫలితాలు ఒక్కసారి చూస్తే బీజేపీ ఓట్ల శాతం 64.29 శాతం ఉండగా కాంగ్రెస్ ఓట్ల శాతం 32.42గా ఉంది. మొత్తం 182 సీట్లున్న రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ 120 సీట్లు..కాంగ్రెస్ 43..ఎన్సీపీ 2...జేడీయూ 1..ఇండిపెండెంట్ 1 బలంగా ఉంది. 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

13:28 - October 25, 2017

టెన్ టివి సినిమా : హీరోయిస్ అసిన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలపారు. ఏంజిల్ లాంటి బిడ్డ పుట్టినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని, ప్రతి మహిళ తన జీవితంలో తల్లి కావడం గొప్ప అనుభూతి అని అన్నారు. గత తొమ్మిది నెలలు నాకు నా భర్తకు ఎంతో ప్రత్యేకమని, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అని పోస్టులో పేర్కొన్నారు.

అసిన్ స్నేహితుడు, బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ తన కూతురిని ఎత్తుకున్న ఫోటోను ఆమె షెర్ చేశారు. అసిన్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించారు. ఆమె 2016లో మ్రైక్రో మాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమ వివాహాం చేసుకున్నారు.  

జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు : డీప్యూటీ సీఎం

గుంటూరు : బీసీలపై జగన్ మొసలి కన్నీరను కారుస్తున్నారని, బీసీల సమస్యలపై జగన్ అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి విమర్శించారు.  

కాళేశ్వరం తొలి దశకు కేంద్ర అనుమతి

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుతులు ఇచ్చింది. 3,169 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపునకు అనుమతినిచ్చింది. అలాగే అటవీ డివిజన్ల పరిధిలోని మహదేవ్ పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్ లో భూముల బదలాయింపునకు కూడా అనుమతులు మంజూరు చేసింది.

13:23 - October 25, 2017

హైదరాబాద్ : టి.టిడిపిలో రేవంత్ రెడ్డి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడలేదు. కాంగ్రెస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారన్న వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాహాటంగానే రేవంత్ పై పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మీడియాతో రమణ చిట్ చాట్ నిర్వహించారు. పార్టీ లైన్ కు భిన్నంగా వెళుతున్నారని పేర్కొన్నారు. టి.టిడిఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి రేవంత్ ఎవరని సూటిగా ప్రశ్నించారు. వస్తున్న ఆరోపణపై రేవంత్ సరిగ్గా స్పందించడం లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసిన విషయంలో రేవంత్ స్పందించాలన్నారు. ఒకవేళ ఆరోపణలు తప్పయితే కాంగ్రెస్ పార్టీ నేతలపై పరువు నష్టం దావాలు వేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. రేవంత్ వివరణ ఇచ్చేంత వరకు సమావేశాలు పిలవడం జరిగదని, నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు.

పొత్తులపై ఎవరూ స్పందించవద్దని తన అనుమతి లేనిదే ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. పోరాటాలు వేరు..పొత్తులు వేరని వ్యాఖ్యానించారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పలువురు నేతలు కోరగా అందుకు తనకు అధికారాలు లేవని పేర్కొన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై రేవంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నకల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గుజరాత్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ పేర్కొంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు, 18 ఎన్నికల కౌటింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోందని ఈసీ ప్రకటించింది.

12:51 - October 25, 2017

టెన్ టివి బిజినెస్ : అవును ఇది నిజం ఇప్పుడు రూ.999కే 4జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. భారత్ టెలికామ్ రంగంలో నూతన పోటీతత్వాన్ని తీసుకొచ్చన జియో తక్కువ ధరకే 4జీ మొబైల్ తీసుకొచ్చింది. ఈ పోటీ తట్టుకునేందుకు ఇప్పటికే ఎయిటెల్, బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే ఫోన్లను తీసుకొచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం దేశీ మొబైల్ హ్యాండ్ సెట్స్ తయారీ సంస్థ ''మైక్రోమాక్స్'' 'భారత్ 2 అల్ట్రా' పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో అవిష్కరించింది. దీని ధర రూ.2.899 పెట్టి ఫోన్ కొన్న వినియోగదారులకు వొడాఫోన్ సిమ్ ను కొత్త తీసుకున్న లేక పాత వాడిన రెండు విడతల్లో రూ.1990 రిఫండ్ పొందవచ్చు.

అయితే ఇక్కడ ఓ కండిష్ విధించింద మైక్రొమాక్స్ అదేంటంటే వొడాఫోన్ సిమ్ ను మూడేళ్ల పాటు ప్రతి నెలా కనీసం రూ.150తో రీచార్జ్ చేసుకుంటే రిఫండ్ అర్హులవుతారు. ఇలా చేసే కస్టమర్లకు తొలి 18 నెలల తర్వాత రూ.900 రీఫండ్ చేస్తోంది. మిగతా రూ.1000 మరో 18 నెలల తర్వాత రీఫండ్ చేస్తోంది.

భారత్ 2 అల్ట్రా ఫీచర్లు

512 ఎంబీ ర్యామ్

4 ఇంచెస్ స్క్రీన్

0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా

2 ఎంపీ బ్యాక్ కెమెరా 

రేవంత్ ను తొలగించాలి..చంద్రబాబుకు రమణ లేఖ

హైదరాబాద్ : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవుల నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్లీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. 

టీఎస్ పీఎస్సీ ముట్టడి

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీని బీఈడ్, డీఈడ్ అభ్యర్తులు ముట్టడించారు. జీవో నెం.25ను సవరించి 45 శాతంతో సంబంధం ఏకుండా 2017 టీఆర్టీలో అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

అత్తింటి ముందు వివాహిత పోరాటం

సిద్దిపేట : నగరంలోని శ్రీనివాస కాలనీలో అత్తింటి ముందు ఇద్దరు కూతుళ్లతో మాధురి అనే వివాహిత ఆందోళనకు దిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టారని మాధవనిని అత్త, మామ ఇంట్లోకి రానివ్వలేదు దీంతో తనకు న్యాయం చేయలని ఆమె కోరుకుంటుంది.

కాసేపట్లో శిశువు మృతదేహానికి పోస్టుమార్టం

నాగర్ కర్నూలు : జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో కాసేపట్లో నీలోఫర్ కిడ్నాప్ శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. పోలీసులు చిన్నారి తల్లిదండ్రులను ప్రత్యేక వాహనంలో బండోనిపల్లి తీసుకెళ్లారు.

12:20 - October 25, 2017

టెన్ టివి సినిమా :  వివాదల మధ్య విడుదలైన తమిళ చిత్రం మెర్సల్ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో జీఎస్టీపై ఘటన డైలాగ్ లు ఉండడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ చిత్ర విడుదలను వ్యతిరేకించాయి. దీనిపై కమల్ హాసన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి చిత్ర బృందానికి మద్దతు తెలిపారు. దీంతో ఈ చిత్రంపై జాతీయస్థాయిలో చర్చ జరిగి ఫ్రీ పబ్లిసిటీ దొరికింది.

ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లోనే తమిళనాడులో 84 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఉన్న 75.2కోట్ల రజనీకాంత్ కబాలి రికార్డు ఈ సినిమా బ్రేక్ చేసింది. మెర్సల్ మూవీ విజయ్ నటజీవితంలో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మెర్సల్ 155 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయ్యాలని భావించిన సెన్సార్ కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయారు. 

12:08 - October 25, 2017

హైదరాబాద్ : నీలోఫర్ లో కిడ్నాప్ కు గురైన పసికందు ఘటన విషాదంతో ముగిసింది. పసికందు చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నీలోఫర్ నుండి మంజుల పసికందును కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ చేసిన మంజుల...ఆమె భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం ఇందుకు కారణమంటూ దుమ్మెత్తిపోశారు.
ప్లేట్ల బురుజు ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం వల్లే పసికందు చనిపోయిందని, ఎలాంటి భద్రత లేదన్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన పసికందు తల్లిదండ్రులను నాగర్ కర్నూలు కు పోలీసులు తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:01 - October 25, 2017

విజయవాడ : భక్తులపై మరోసారి వడ్డనకు బెజవాడ దుర్గగుడి అధికారులు, పాలకమండలి సిద్ధమైంది. ఇప్పటికే పూజల టికెట్లను పెంచిన అధికారులు... తాజాగా లడ్డూ, వాహనాల రాకపోకలపై భారాలు మోపేందుకు సిద్ధమయ్యారు. అధికారుల తలాతోకలేని నిర్ణయాలకు పాలక మండలి కూడా తోడు కావడంతో భక్తులపై పెను భారం పడనుంది. రాను రాను బెజవాడ దుర్గమ్మ దర్శనం కొందరికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పూజల టిక్కెట్ల ధరలు పెంచిన అధికారులు... ఇప్పుడు ప్రసాదాలు, తలనీలాల ధరలు పెంచారు. అంతేకాకుండా వాహనాల రాకపోకలపై కూడా భారీగా రేట్లను పెంచారు.

సూర్యకుమారి ఆలయానికి ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులపై వడ్డన పడుతోంది. దుర్గమ్మ దర్శనం చేసుకోవడమంటే.. ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దర్శనం టికెట్‌ను 300 రూపాయలు చేయడంతో వివాదం తలెత్తింది. దీంతో టికెట్‌ను 150కు తగ్గించాలని పాలకమండలి పట్టుబడింది. దీంతో ఫైల్‌ను ప్రభుత్వానికి పంపించారు. ఆయితే ఆ ఫైల్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయని కొందరు పాలకమండలి సభ్యులంటున్నారు.

తాజాగా దుర్గ గుడి ఘాట్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలపై భారీగా పెంచారు. కారుకి 50 రూపాయలు, టూ వీలర్‌కు 25 రూపాయలు, బస్సులో ప్రయాణిస్తే 10 రూపాయలుగా నిర్ణయించారు. దీనిపై పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 15 రూపాయలుగా ఉన్న కేశ ఖండన శాల టికెట్టును 20 రూపాయలకు పెంచారు. ఇక 100 గ్రాముల లడ్డూను 20 రూపాయలకు పెంచాలని ఆమోదించారు. అదేవిధంగా 50 రూపాయలు ఉన్న శ్రీ చక్రార్చన లడ్డూను 100 రూపాయలకు పెంచాలని ఆమోదించారు.

మొత్తానికి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు పాలక మండలి ఆమోదంతో దుర్గమ్మ ప్రసాదాలను, మొక్కులను సామాన్య జనానికి దూరం చేసేలా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భక్తులపై భారం పడకుండా టికెట్టు ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

11:58 - October 25, 2017

 

మహబూబాబాద్ : పేగుబంధం ఒకవైపు.. పెంచిన మమకారం మరోవైపు. పుట్టగానే సొంత బిడ్డను అమ్ముకున్నాడు కసాయి తండ్రి. మూడేళ్ల తర్వాత నిజం తెలుసుకున్న కన్నతల్లి బిడ్డ కోసం అధికారులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పెంచిన తల్లి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. పెంచినతల్లి బిడ్డ దూరం కావడంతో తల్లడిల్లుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కృష్ణాపురం గ్రామానికి చెందిన మాలోతు ఉమ- బావ్‌సింగ్‌ దంపతులకు మూడేళ్ల క్రితం ఇల్లందులో నివాసం ఉండేవారు. బావ్‌సింగ్‌ స్థానికంగా ట్రాలీ డ్రైవర్‌ గా జీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దిరికి ఒ పాప ఉంది. అయితే రెండో సారి కూడా గర్భం దాల్చడంతో పుట్టే పాప ఆడపిల్లొ, మగపిల్లాడో తెల్సుకునేందుకు ఆ దంపతులు స్కానింగ్‌ కి సిద్ధమయ్యారు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్‌ చేయించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే ఏడవ నెల కావడంతో ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించడంతో వెనుదిరిగారు.

పాప పుడితే తమకు భారమవుతుందని బావించి ఎవరికైనా దత్తత ఇద్దామని దంపతులు నిర్ణయించుకున్నారు. స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్‌ని సంప్రదించారు. ఆడపిల్లలంటే ఇష్టపడే ఇల్లందుకి చెందిన వేముల స్వరూప- రాజేందర్‌లకు ఆర్‌ఎంపీ విషయం చెప్పాడు. వీరికి ఉమకు పుట్టబోయే ఆడపిల్లను అప్పగిచేలా రెండు పార్టీల మధ్య బాండ్‌ పేపరు రాయించి దత్తత అగ్రిమెంట్‌ చేయించాడు ఆర్‌ఎంపీ వైద్యుడు.

ఈ క్రమంలో 2015 జనవరి 28న మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బావ్‌సింగ్‌ భార్య ఉమ ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త బావ్‌సింగ్ భార్యకు తెలియకుండా బిడ్డను ఇల్లందుకు చెందిన స్వరూప దంపతులకు ఆర్‌ఎంపీ సహాయంతో విక్రయించాడు. ఇందుకు గాను వారి నుంచి రూ.25వేలు తీసుకున్నాడు. పురిట్లోనే బిడ్డ చనిపోయిందని భార్యను నమ్మించాడు.

2015 జనవరిలో జరిగిన ఈ అక్రమదత్తత ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన బిడ్డ బ్రతికే ఉందన్న నిజం తెలుసుకున్న ఉమ పాపకోసం తల్లడిల్లిపోతోంది. తన బిడ్డను తనకు ఇప్పించాలని పోలీసులను, అధికారులను ఆశ్రయించింది. అయితే ఇంతకాలం పాపను కంటికి రెప్పలా పెంచుకున్న స్వరూప ఈ పరిణామంతో తీవ్ర ఆవేదన చెందుతోంది. బిడ్డను తన నుంచి దూరం చేయవద్దని కన్నీరుపెట్టుకుంటోంది. దీంతో పాపను ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫిసర్‌ దయామణి, బాలల సంరక్షణ అధికారిణి శివకుమారిలకు అప్పజెప్పారు. ఇద్దరు తల్లులకు ఐసీడీఎస్‌ కార్యాలయంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇది చట్టవిరుద్ధంగా జరిగిన దత్తత కనుక అది చెల్లదని అధికారులు అంటున్నారు.

మొత్తానికి పోలీసులు నిందితులైన బావ్‌సింగ్‌, స్వరూపలతో పాటు మధ్యవర్తిగా ఉన్న ఆర్‌ఎంపీ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చైల్డ్‌ వెల్ఫేర్‌ సంరక్షణలో ఉన్న చిన్నారిని కన్నతల్లికి అప్పగించాలా.. లేక పెంచిన తల్లికే ఇవ్వాల అనేది ఇపుడు సందిగ్ధంగా మారింది.  

11:42 - October 25, 2017

తూర్పుగోదావరి : పోలవరం నిర్మాణం ఇప్పట్లో జరుగుతుందా ? లేదా ? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రాజెక్టు పనుల నిర్మాణ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల పలు గ్రామాలు ముంపునకు గురవుతున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో కూడా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీనితో నిర్వాసితుల కోసం ఏపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఎకరానికి రూ. 10 లక్షలు చెల్లించనుంది. 40 గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది.

కానీ పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గిరిజనుల నుండి నిర్వాసిత ప్యాకేజీ కోసం ముందుగా రూ. లక్ష వసూలు చేస్తున్నారు. చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ పేరిట వసూళ్లు నడుస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధ పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 2013 భూ సేకరణ చట్టం అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై నిర్వాసితుల పక్షాన సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చింతూరు డివిజన్ లో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ వసూళ్ల ప్రక్రియను వీడియో చిత్రీకరించారని తెలుస్తోంది. 

పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం..

తూర్పుగోదావరి : పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. 40 గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. గిరిజనుల నుండి నిర్వాసిత ప్యాకేజీ కోసం ముందుగా రూ. లక్ష వసూలు చేస్తున్నారు. చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ పేరిట వసూళ్లు నడుస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధ పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 2013 భూ సేకరణ చట్టం అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై నిర్వాసితుల పక్షాన సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

11:31 - October 25, 2017

విజయవాడ : తాము అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తామో మెనిఫెస్టో లో చెప్పిన పనులన్నీ చేయడం జరిగిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలో త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. బుధవారం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మేనిఫెస్టో పెట్టిన అనంతరం 99 శాతం అమలు చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది టిడిపి పార్టీయేనని..ఒకటే ఒకటి పరిష్కారం కాలేదని..అదే నిరుద్యోగ భృతి అని తెలిపారు. చంద్రన్న బీమా పథకం..తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జగన్ కు చెందిన రూ. 55వేల కోట్ల ఆస్తులను అటాచ్ మెంట్ చేశాయని తెలిపారు. బాబు..అచ్చెన్నాయుడు ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు. టిడిపి ఎప్పటికీ భయపడిపోదని..రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని..రాష్ట్ర భవిష్యత్ గురించి తాము ఆలోచిస్తామన్నారు. 

పుణె పిచ్ ట్యాంపర్ ?

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ముందు కలకలం రేగింది. పుణె పిచ్ ట్యాంపరింగ్ కు గురైందని వార్తలు వెలువడుతున్నాయి. బుకీ నుండి డబ్బులు తీసుకుని క్యూరెటర్ పిచ్ ను ట్యాంపర్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని బీసీసీఐ వెల్లడించింది.

 

ఆసిన్ కు పండంటి ఆడపిల్ల..

ముంబై : ప్రముఖ నటి ఆసిన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో వెల్లండించారు. 2016 జనవరి 19న ఆసిన్, మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

11:12 - October 25, 2017
11:11 - October 25, 2017

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం వల్లే పసికందు చనిపోయాడని కిడ్నాప్ కు గురై మృతి చెందిన పసికందు కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం నీలోఫర్ నుండి మంజుల పసికందును కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ చేసిన మంజుల...ఆమె భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పసికందు చనిపోవడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేట్ల బురుజు ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. నీలోఫర్ ఆసుపత్రి యాజమాన్యం వల్లే పసికందు చనిపోయిందని, ఎలాంటి భద్రత లేదన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఇక్కడున్న వారు పట్టించుకోలేదని, ఇక్కడి వారు లంచాలకు మరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం మంజుల సమచారం లభించింది. రాత్రి పది గంటల సమయంలో రాజేంద్రనగర్ పరిసరాల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బందొడ్డిపల్లి గ్రామంలో పొలంలో ఖననం చేసినట్లు మంజుల పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

గురువారం టీడీఎల్పీ భేటీ..

 

హైదరాబాద్ : గురువారం ఉదయం 11గంటలకు టీడీఎల్పీ సమావేశం జరుగనుంది. టీటీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌ రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఎల్‌.రమణతో సహా ముఖ్య నేతలను రేవంత్ సమావేశానికి ఆహ్వానించారు. 

 

షోపియాన్ లో ఆపరేషన్ సెర్చ్...

జమ్మూ కాశ్మీర్ : భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. షోపియాన్ జిల్లాలోని 13 గ్రామాల్లో ఈ సెర్చ్ కొనసాగుతోంది. 

10:46 - October 25, 2017

విజయవాడ : రోడ్డు ప్రమాదం చిన్నారిని చిదిమేసింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన గన్నవరం విమానాశ్రయ గేటు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కంకిపాడు (మం) ఉప్పలూరు గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు బైక్ పై వెళుతున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద లారీని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో చిన్నారి వశిష్ట మృతి చెందగా తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో లారీ వీరిని బైక్ ఢీకొట్టిందా ? లేక బైక్ అతివేగంతో ప్రయాణిస్తూ లారీని ఢీకొట్టిందా ? అనేది తెలియరావడం లేదు. 

10:38 - October 25, 2017

హైదరాబాద్ : నీలోఫర్ లో మగ శిశువును ఎత్తుకెళ్లిన ఘటనలో కిడ్నాపర్ మంజుల, భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నీలోఫర్ నుండి మంజుల పసికందును కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన డీసీపీ జోయల్ డేవిస్ పలు బృందాలను రంగంలోకి దిగించారు. కల్వకుర్తి, ఆమన్ గల్, వెల్దండ ప్రాంతాల్లోకి పంపించారు. మంగళవారం సాయంత్రం మంజుల సమచారం లభించింది. రాత్రి పది గంటల సమయంలో రాజేంద్రనగర్ పరిసరాల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బందొడ్డిపల్లి గ్రామంలో పొలంలో ఖననం చేసినట్లు మంజుల పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు జరిపిన దర్యాప్తులో పలు అంశాలు అంశాలు వెలుగు చూసినట్లు సమాచారం. కిడ్నాపర్ భర్త కుమార్ పాత నేరస్తుడని, గతంలో నయీం ముఠాలో పనిచేశాడని పోలీసులు పేర్కొన్నారు. మాజీ మావోయిస్టుగా పలువురిని బెదిరించినట్లు, గ్రామంలో అందరితోనూ కుమార్ గౌడ్ కు విబేధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఛైన్ స్నాచింగ్..కిడ్నాప్ కేసులో నిందితుడని పేర్కొన్నారు. 

10:34 - October 25, 2017

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించడంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ టిటిడి ఈవోను కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు గతంలోనే భక్తులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై టిటిడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి పిటిషన్ దాఖలు చేసింది. 2016లో ఈ పిటతిషన్ దాఖలు చేసింది. అప్పటి నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. అప్పటిలోనే హైకోర్టు టిటిడిని వివరణ కోరింది. కానీ టిటిడి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు ధరలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిటిడి ఈవోపై కోర్టు సీరియస్ అయ్యింది. అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయిస్తూ భక్తులను అధిక ధరలకు దోచుకుంటుంటే కళ్లు మూసుకున్నారా ? అని కోర్టు ప్రశ్నించింది. 2016 నవంబర్ లో ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటి వరకు వివరాలు సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఈవోకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా టిటిడి స్పందిస్తుందా ? అధిక ధరలకు చెక్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

గన్నవరం విమనాశ్రయం వద్ద రోడ్డు ప్రమాదం..

విజయవాడ : గన్నవరం విమనాశ్రయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతున్న వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. జిల్లా గన్నవరం విమానాశ్రయం గేటు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

తిరుమలలో అధిక ధరలపై హైకోర్టు గుస్సా..

చిత్తూరు : తిరుమలలో ఉన్న హోటళ్లలో అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిటిడి ఈవోపై సీరియస్ అయ్యింది. అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయిస్తూ భక్తులను అధిక ధరలకు దోచుకుంటుంటే కళ్లు మూసుకున్నారా ? అని కోర్టు ప్రశ్నించింది. 2016 నవంబర్ లో ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటి వరకు వివరాలు సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఈవోకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధిక ధరలకు ఆహారా పదార్థాల విక్రయంప హైకోర్టులో చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి పిటిషన్ దాఖలు చేసింది. 

కిడ్నాప్ ఘటనలో దంపతులు అరెస్టు..

హైదరాబాద్ : నీలోఫర్ లో మగ శిశువును ఎత్తుకెళ్లిన ఘటనలో కిడ్నాపర్ మంజుల, భర్త కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ భర్త కుమార్ పాత నేరస్తుడని, గతంలో నయీం ముఠాలో పనిచేశాడని పోలీసులు పేర్కొన్నారు. మాజీ మావోయిస్టుగా పలువురిని బెదిరించినట్లు, గ్రామంలో అందరితోనూ కుమార్ గౌడ్ కు విబేధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఛైన్ స్నాచింగ్..కిడ్నాప్ కేసులో నిందితుడని పేర్కొన్నారు. 

ఆపరేషన్ ఛబుత్రా..

హైదరాబాద్ : పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. రాత్రి వేళల్లో తిరుగుతూ రోడ్లపై న్యూసెన్స్ చేస్తున్న 274 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

09:32 - October 25, 2017

బుల్లెట్ రైడర్ సనా అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : ప్రముఖ బుల్లెట్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నార్సింగి శివారులో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సనా చనిపోయింది. 

09:13 - October 25, 2017

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన పసికందు ఘటన విషాదంగా ముగిసింది. అనారోగ్యంతో శిశువు మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కిడ్నాప్ చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లై మూడేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో పెంచుకోవాలని కిడ్నాప్ చేసినట్లు నిందితురాలు మంజుల పేర్కొన్నట్లు సమాచారం. చిన్నారి పుట్టినప్పుడే న్యూమోనియాతో బాధ పడటం మరణానికి కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది. ఆదివారం నీలోఫర్ నుండి పసికందును కిడ్నాప్ చేసిన మంజుల ఆటోలో వెళ్లింది. ఆటో వెనుక 'టీవీఎస్' అనే ప్రకటన ఉండడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తుచేపట్టారు. శిశువుతో పాటు నిందితురాలు లకడీకపూల్ వద్దనున్న ఓ హోటల్ వద్ద దిగింది. అక్కడి నుండి ప్లేట్ల బురుజుకు చేరుకుంది. అక్కడనే ఉన్న ఆమె భర్త కనకరాజుతో మహబూబ్ నగర్ జిల్లా అమంగల్ ప్రాంతానికి బస్సులో వెళ్లారు. సీసీ కెమెరాలను పరిశీలించిన డీసీపీ జోయల్ డేవిస్ పలు బృందాలను రంగంలోకి దిగించారు. కల్వకుర్తి, ఆమన్ గల్, వెల్దండ ప్రాంతాల్లోకి పంపించారు. మంగళవారం సాయంత్రం మంజుల సమచారం లభించింది. రాత్రి పది గంటల సమయంలో రాజేంద్రనగర్ పరిసరాల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బందొడ్డిపల్లి గ్రామంలో పొలంలో ఖననం చేసినట్లు మంజుల పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

సిరిసిల్లలో పాస్ పోర్టు మేళా..

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో బుధ, గురువారాల్లో ప్రత్యేక పాస్‌పోర్ట్ సేవా మేళా జరుగనుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఈ మేళా నిర్వహిస్తున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

08:15 - October 25, 2017
08:12 - October 25, 2017

నల్గొండ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ 'పల్లె నిద్ర' తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో నిన్న సాయంత్రం నుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గాద కిశోర్ 'పల్లె నిద్ర' పేరిట పలు గ్రామాల్లో నిద్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నూతనల్ కల్ (మం) వెంకెపల్లి గ్రామానికి చేరుకన్న సమయంలో చాలా మంది గ్రామస్తులు..ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి ఎన్నడూ రాని ఎమ్మెల్యే పల్లె నిద్రతో రావద్దూ అంటూ నినదించారు. ఈ ఘటనతో అధికార పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే..ఇతరుల మధ్య విబేధాలు పొడచూపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు గ్రామానికి చేరుకుని పల్లె నిద్రను వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. 12 మందిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. చివరకు ఎమ్మెల్యే గాద కిశోర్ పల్లె నిద్ర భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. గ్రామాభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదని..వారి వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంటనే దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరుతున్నారు. 

ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను అడ్డుకున్న గులాబీ నేతలు..

సూర్యాపేట : జిల్లాలో నూతనకల్ (మం) వెంకెపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను గ్రామస్తులు..టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు..మహిళలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పలువురిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. పూర్తి బందోబస్తు మధ్య ఎమ్మెల్యే పల్లె నిద్ర కొనసాగించారు. 

నీలోఫర్ కిడ్నాప ఘటన విషాదం..

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. కిడ్నాప్ కు గురైన శిశువు మృతి చెందింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ (మం) బండోనిపల్లికి చెందిన మహిళ పసికందును కిడ్నాప్ చేసినట్లు డీసీపీ రోయల్ పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించడం జరిగిందన్నారు. అపహరించిన రోజు రాత్రి అస్వస్థతకు గురైందని, మృతి చెందిన అనంతరం అదే రోజు రాత్రి కిడ్నాపర్లు దహనం చేశారని తెలిపారు. 

రాజస్థాన్ లో భారీ అగ్నిప్రమాదం..

రాజస్థాన్ : రాష్ట్రంలోని అల్వర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

07:42 - October 25, 2017

సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని.. రైతుల జీవితాలు నాశనమయ్యాయని టీకాంగ్ పేర్కొంటోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో 3వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసినందుకు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనందుకు కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తూ ఈనెల 27న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు టి. కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో రాకేష్ (టీఆర్ఎస్), నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), రమేష్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:59 - October 25, 2017

సహజంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏడుకొండలవాడికి చెప్పుకోమంటారు. కానీ, ఆ తిరుమల శ్రీవారి సేవలో ఉన్నవారికే కష్టం వస్తే...? అవును.. తిరుపతి కొండమీద పనిచేస్తున్న క్షురకులు తమకు ఉద్యోగ గండంతో సమస్యల్లో పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల కొండపై గుండు గీస్తూ జీవిస్తున్న వారిని టీటీడీ ఉద్యోగాల నుంచి తొలగించాలని అనుకోవడంతో సమస్య వచ్చింది. ఈ సమస్యపై టెన్ టివి జనపథం ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు వందాటి వెంకటేష్‌ విశ్లేషించారు. మరి వారి సమస్యలు ఏంటీ ? తదితర విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:56 - October 25, 2017

పూణె : 2 సార్లు వన్డే వరల్డ్‌ చాంపియన్‌ ఇండియా...న్యూజిలాండ్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌కు సన్నద్ధమైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి వన్డేలో విఫలమైన విరాట్‌ ఆర్మీ....కేన్‌ విలియమ్‌సన్‌ సారధ్యంలోని న్యూజిలాండ్‌ జట్టుకు సవాల్‌ విసురుతోంది.సిరీస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా విరాట్‌ కొహ్లీ అండ్‌ కో బరిలోకి దిగబోతోంది. ముంబై వన్డేలో ఎదురైన పరాభవానికి పూణె వన్డేతో బదులు తీర్చుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో సెకండ్‌ వన్డేకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.తొలి వన్డేలో తేలిపోయిన భారత్‌...రెండో వన్డేలో నెగ్గి సిరీస్‌ సమం చేయాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది.

గత 19 వన్డేల్లో భారత్‌ సిరీస్‌ ఓటమంటూ లేకుండా 14 విజయాలు సాధించింది. కానీ 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి వన్డేలో మాత్రం కివీస్‌ టీమ్‌ను అధిగమించడంతో విఫలమైంది. శిఖర్‌ దావన్‌, రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌,ధోనీ, హార్దిక్‌ పాండ్యలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే కనిపించినా...కివీ స్పీడ్‌ గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి తేలిపోయింది.వరుసగా విఫలమవుతోన్న కేదార్‌ జాదవ్‌ స్థానంలో మనీష్‌ పాండేను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్‌ సూపర్‌ సెంచరీ సాధించినా ....పసలేని బౌలింగ్‌ ఎటాక్‌తో భారత్‌ ముంబై వన్డేలో బోల్తా పడింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌ స్థాయికి తగ్గటుగా రాణిస్తేనే సిరీస్‌ నిలబెట్టుకోగలుగుతుంది. విరాట్‌ కొహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో సందేహమే లేదు.

బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధిస్తే మ్యాజిక్‌ స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్రచహాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ వంటి మేటి పేస్‌ బౌలర్లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాలే. మరోవైపు కేన్‌ విలియమ్‌సన్ సారధ్యంలోని న్యూజిలాండ్‌ జట్టు జోరు మీదుంది. అన్ని విభాగాల్లో భారత్‌కు ధీటుగా ఉన్న కివీస్‌ టీమ్‌ రెండో వన్డేలోనూ అంచనాలకు మించి రాణించాలని తహతహలాడుతోంది. స్పీడ్‌ గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ చెలరేగుతుండటంతో పాటు టిమ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో కివీస్‌ టీమ్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది.కేన్‌ విలియమ్‌సన్‌,కొలిన్‌ మున్రో, మార్టిన్‌ గప్తిల్‌ సైతం చెలరేగితే రెండో వన్డేలోనూ భారత్‌కు కష్టాలు తప్పవు.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగనున్న రెండో వన్డేలో విరాట్‌ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. గత సీజన్‌ నుంచి సిరీస్‌ ఓటమంటూ లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోన్న కొహ్లీ అండ్‌ కో ఈ కీలక వన్డేలో నెగ్గి సిరీస్‌ను నిలబెట్టుకుంటుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

06:53 - October 25, 2017

లక్నో : లక్నో-ఆగ్రా హైవేపై భారత వాయుసేన విమానాలు సందడి చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అయ్యాయి. రోడ్డుపై విమానాలు ల్యాండ్‌ అవ్వడం చూసి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారత వాయుసేనకు చెందిన 16 యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

విన్యాసాల్లో పాల్గొన్న వాటిలో 35టన్నుల సి-130 సూపర్‌ హెర్క్యులెస్‌ విమానం కూడా ఉంది. ఈ విమానం సుమారు 2 వందల మంది కమాండోలను మోసుకెళ్లగలదు. 2010లో భారత వైమానిక దళంలో చేరిన ఈ యుద్ధ విమానం ఖరీదు 9 వందల కోట్లు.

భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఎన్‌-32, ఆరు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, మూడు సుఖోయ్, 30-ఎంకేఐ యుద్ధ విమానాలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైనట్లు ఎయిర్‌ మార్షల్‌ వైస్‌ చీఫ్‌ ఎస్‌బి డియో ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే స్ఫూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్‌వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. యుద్ధం లాంటి అత్యవసర సేవల సమయంలో రోడ్డు రన్‌ వేలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై విన్యాసాలు జరపడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఢిల్లీ సమీపంలో యమున ఎక్స్‌ప్రెస్‌ హైవే, 2016 నవంబర్‌లో ఆగ్రా హైవే పై యుద్ధ విమానాలను సురక్షితంగా రోడ్డుపైకి దింపారు.

కోదండరాం పిటిషన్..విచారణ..

హైదరాబాద్ : టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతిపై విచారణను హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. గతంలో స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో... అనుమతి కావాలంటూ... కోదండరాం తరపున పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... ఇవాళ విచారణ చేపట్టనుంది. కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్రను నవంబర్ 10 నుంచి 12 వరకు చేపట్టనున్నారు.

 

కోదండరాం పిటిషన్..విచారణ..

హైదరాబాద్ : టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతిపై విచారణను హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. గతంలో స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో... అనుమతి కావాలంటూ... కోదండరాం తరపున పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... ఇవాళ విచారణ చేపట్టనుంది. కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్రను నవంబర్ 10 నుంచి 12 వరకు చేపట్టనున్నారు.

 

06:47 - October 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ పేరు... హవాలా కేసు చార్జిషీట్‌లో చేరింది. ఆయనకు హవాలా డబ్బులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈడీ చార్జిషీట్‌లో ఆయన పేరును చేర్చింది. ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తాకు బెయిల్‌ ఇవ్వడం కోసం షబ్బీర్‌ అలీ ప్రయత్నాలు చేశారని తేల్చింది. మాంసపు వ్యాపారి ఖురేషీతో కలిసి సీబీఐ చీఫ్‌కు 1.75 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్టు ఆధారాలు సేకరించింది. మరోవైపు షబ్బీర్‌ మాత్రం ఈ కేసుతో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్తున్నారు. 2012 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మినరల్‌ మైన్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 195 కోట్ల రూపాయల బంగారం తప్పుడు ధ్రువపత్రాలుతో కొనుగోలు చేశారు. తమ సంస్థలో పనిచేసే ఐదుగురు సభ్యులతో సుఖేష్‌గుప్తా కుమ్మక్కై తమకు 100 కోట్ల నష్టం చేశారని ఎంఎంటీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించింది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సుఖేష్‌గుప్తా బంగారం కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీబీఐ.. అతడిని 2013లో అరెస్ట్‌ చేసింది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపింది.

జైల్లో ఉన్న ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా బెయిల్‌ కోసం వివిధ మార్గాలను వెతికాడు. తాన్‌పూర్‌కు చెందిన మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీతో సంప్రదింపులు జరిపాడు. ఖురేషీకి బొగ్గు కుంభకోణం నిందితులతోపాటు సీబీఐ అధికారులతో సంబంధాలు ఉన్నాయి. దీంతో సీబీఐ చీఫ్‌కు లంచంగా 1.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి డీల్‌ కుదిరింది. విచారణలో ఇదంతా తెలుసుకున్న సీబీఐ... ఖురేషీని అరెస్ట్‌ చేసింది. అతడి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఢీకోడ్‌ చేయగా అందులో షబ్బీర్‌ అలీ పేరు బయటపడింది. హవాలా వ్యాపారితో షబ్బీర్‌ అలీకి సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఆధారాలు సేకరించింది. సీబీఐ చీఫ్‌కు 1.75 కోట్ల లంచాన్ని మొయిన్‌ ఖురేషీ ద్వారా షబ్బీర్‌ అలీ హవాలా చేయించినట్టు సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో షబ్బీర్‌ అలీ పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధంలేదని షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. తనను సీబీఐ, ఈడీ ఎవరు పిలిచినా తప్పకుండా వెళ్తానని.. వారికి పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఖురేషీ మాత్రం ఎవరో తనకు తెలియదన్న షబ్బీర్‌... సుఖేష్‌గుప్తా మాత్రం తనకు స్నేహితుడని చెప్పారు.

హవాలా కేసులో షబ్బీర్‌ అలీ పాత్ర వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌ ఒకింత షాక్‌కు గురైంది. ఈ కేసులో సీబీఐ అధికారులు తదుపరి ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఈ కేసుతో షబ్బీర్‌అలీకి సంబంధం ఉందని తేలితే ఆయపై చర్యలు తీసుకునే అవకాశముంది. అవసరమైతే షబ్బీర్‌ను అరెస్ట్‌ చేసే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే షబ్బీర్‌అలీ రాజకీయ భవిష్యత్‌ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

06:43 - October 25, 2017

హైదరాబాద్ : గాడి తప్పిన వారెవరినీ పార్టీ ఉపేక్షేంచబోదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హెచ్చరించారు. పార్టీ కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ పార్టీ విధానానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలపై రేవంత్‌రెడ్డి ఇచ్చిన వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్న ఆయన.. పార్టీ అధినేత వచ్చిన తర్వాత చర్చిస్తామన్నారు. పొత్తుల అంశంపై ఎన్నికలవరకూ ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు రమణ సూచించారు.

టీటీడీపీలో జరుగుతున్న తాజా పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కొద్దిరోజులుగా ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. దీనిపై టీటీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఇదే అంశంపై సీరియస్‌ అయ్యారు. పార్టీ నియమావళిని ధిక్కరించిన ఎవర్నైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పక్కకు తప్పిస్తామని తేల్చి చెప్పేశారు.

కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం జరిగినా దీనిపై రేవంత్‌రెడ్డి సరైన వివరణ ఇవ్వకపోవడాన్ని రమణ తప్పుపట్టారు. మీడియా ముఖంగా ఖండించమంటూ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా.. ఆయన స్పష్టత ఇవ్వలేదని రమణ అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలలో తీవ్ర ఆందోళన నెలకొందని రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మోత్కుపల్లి రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు రమణ. ఇక పార్టీ నేతలు పొత్తలపై మాట్లాడవద్దని రమణ సూచించారు. మహానాడులోనే పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై స్పష్టత ఇచ్చారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామ‌న్న త‌న వ్యాఖ్యలపై మోత్కుప‌ల్లి ..పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి స్వయంగా వివరణ ఇచ్చారని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రమణ తీవ్రంగా ఖండించారు. 

06:40 - October 25, 2017

ప్రకాశం : ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. 16వేల లోటు బడ్జెట్‌ ఉన్నా... అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌... ప్రకాశం జిల్లా మొదటిరోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. మార్టూరు మండలం కోనంకి గ్రామంలో 80.92 లక్షలతో చేపట్టిన సిమెంటురోడ్డు పనులకు లోకేష్‌ శంకుస్థాపన చేశారు. అక్కడే 88.35 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన ట్రైసైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 372 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ట్రైసైకిళ్లతోపాటు నిరుద్యోగ యువకులకు కార్లను పంపిణీ చేశారు.

మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేష్‌... ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తోంటే ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్‌లో ఉంటూ తమకు నీతులు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని... ఆయనకు అందరూ సహకరించాలని కోరారు.

మార్టూరులో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్‌ అకాడమీని లోకేష్‌ ప్రారంభించారు. కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించారు. సరదాగా కాసేపు జిమ్‌ చేస్తూ అలరించారు. అనంతరం అకాడమీలో చిన్నారులతో ముచ్చటించారు. ఇవాళ కూడా ప్రకాశం జిల్లాలోనే లోకేష్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్థి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు.

ప్రకాశంలో మంత్రి లోకేష్ పర్యటన..

ప్రకాశం : ఏపీ మంత్రి నారా లోకేష్ రెందో రోజు కూడా ప్రకాశం జిల్లాలోనే లోకేష్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్థి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు.

06:36 - October 25, 2017

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని.. రైతుల జీవితాలు నాశనమయ్యాయని టీకాంగ్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో 3వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసినందుకు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనందుకు కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తూ ఈనెల 27న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఎక్సైజ్‌ మీద వేల కోట్లు ఆదాయాన్ని గడిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తప్పుడు ఆలోచనలు తప్ప.. రైతుల గురించి ఆలోచించని ప్రభుత్వాన్ని నిలదీయడానికే చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

 

06:34 - October 25, 2017

హైదరాబాద్ : వీలైనంత ఎక్కువగా పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు సూచించారు. అవసరాలు ఎక్కువగా ఉండడంతో...నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతో పాటు, భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలకు నీరందించి.. పంటలు పండించే వరకు అధికారులతో పనులు చేయించుకోవాలని సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునే విధంగా కాల్వలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం SRSP, నిజాంసాగర్, ఎల్‌ఎండీ, సింగూరులో మిషన్ భగీరథ అవసరాలకు పోను మిగతా నీటిని పంట పొలాలకు మళ్లించాలని ఆదేశించారు. నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కెనాల్, SRSP ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. అదేవిధంగా రామగుండం, ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్లు నిర్మించాలని... వీటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. అలాగే SRSP సామర్థ్యం పెంచాలని, అన్ని రకాల కాల్వలకు మరమ్మతులు చేయాలని అన్నారు. 

06:31 - October 25, 2017

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు లండన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు జరుపుతున్నారు. UAEలో మూడు రోజుల పర్యటనను ముగించుకుని లండన్‌ చేరుకున్న ఆయన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో భేటీ అయ్యి... అమరావతి ఆకృతులపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం లండన్‌ చేరుకుంది. యూఏఈలో మూడు రోజుల పర్యటన ముగించుకొన్న చంద్రబాబు.. దుబాయ్‌ నుంచి నేరుగా లండన్‌ చేరుకున్నారు. లండన్‌లో చంద్రబాబు బృందానికి ఏపీఎన్‌ఆర్‌టీ యూరప్ హెడ్ జయకుమార్ నేతృత్వంలోని టీడీపీ ఎన్‌ఆర్ఐ యూరప్ వింగ్ ఘన స్వాగతం పలికింది. లండన్‌ చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి రవాణా వ్యవస్థను పరిశీలించింది.

చంద్రబాబు బృందం నార్మన్‌ ఫోస్టర్స్‌ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులు చంద్రబాబు బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఆ సంస్థ ప్రతినిధులు అమరావతి నిర్మాణ ఆకృతులను చంద్రబాబు బృందానికి వివరించారు. శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా... సీఆర్‌డీఏ అధికారులను సమన్వయం చేస్తూ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబును... భారత డిప్యూటీ హైకమిషనర్‌ దినేష్‌ కె. పట్నాయక్‌ కలిశారు. యూరప్‌, ఇంగ్లండ్‌ నుంచి అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టే సంస్థలకు.. మార్గదర్శనం చేయాలని దినేష్‌ కె. పట్నాయక్‌ను చంద్రబాబు కోరారు. ఓడరేవులు, అంతర్గత జలరవాణా మర్గాల గురించి.. చంద్రబాబు దినేష్‌కు వివరించారు. తొమ్మిది నగరాలు, 27 టౌన్‌షిప్పులతో రాజధాని అమరావతి అభివృద్ధి గురించి తెలియజేశారు. లండన్‌లో చంద్రబాబు పర్యటన గురువారం ముగియనుంది. గురువారం అక్కడి లండన్‌ నుంచి చంద్రబాబు బృందం బయలుదేరనుంది. గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటుంది.

గురువారం ముగియనున్న బాబు పర్యటన...

ఢిల్లీ :్ లండన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన గురువారం ముగియనుంది. గురువారం లండన్‌ నుంచి చంద్రబాబు బృందం బయలుదేరనుంది. అదే రోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటుంది.

06:26 - October 25, 2017

ఖమ్మం : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెట్టాయి. హైదరాబాద్‌ నుంచి ఖమ్మంకు వస్తున్న ఆర్టీసీ బస్సు నాయకన్‌గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్‌ అలుగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా మాజీ ఎమ్మెల్యే కట్టా నర్సయ్యకు తీవ్ర గాయలయ్యాయి. గాయపడ్డవారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఖమ్మం పట్టణానికి సమీపంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌ వద్ద బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు స్వల్వగాయాలు అయ్యాయి. రెండు ప్రమాదాల్లోనూ ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

లండన్ లో బాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లండన్ లో పర్యటిస్తున్నారు. డన్‌లో బాబు పర్యటన కొనసాగుతోంది. నార్మన్‌పోస్టర్‌ సంస్థ రూపొందించిన అమరావతి డిజైన్ల పరిశీలన 

మాజీ ఎమ్మెల్యేకు గాయాలు..

ఖమ్మం : నాయకన్ గూడెం వద్ద వాగులోకి రాజధాని బస్సు దూసుకెళ్లింది. 15 మందికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

పిఫా ప్రపంచ కప్ లో...

ఢిల్లీ : పిఫా ప్రపంచ కప్ లో నేడు కోల్ కత వేదికగా సాయంత్రం 5గంటలకు బ్రెజిల్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వేదికగా రాత్రి 8 గంటలకు మాలి వర్సెస్ స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. 

నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష..

విజయవాడ : కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష జరుగనుంది. 

Don't Miss