Activities calendar

26 October 2017

22:11 - October 26, 2017

జకార్తా : ఇండోనేషియాలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని 47 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి భవనం చాలా వరకూ కుప్పకూలింది. పక్కనే ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మృతులను గుర్తుపట్టరాని విధంగా అగ్నికి ఆహుతైపోయారని అధికారులు చెప్పారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

22:09 - October 26, 2017

ఢిల్లీ : ఆర్థిక సంస్కరణలు ఆర్థికవ్యవస్థకు మందులాంటిదని ప్రధాని మోది చేసిన ప్రకటనలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. నోట్లరద్దు, జిఎస్‌టిలు ఆర్థికవ్యవస్థను ఐసియూకు చేర్చాయని ఎద్దేవా చేశారు. తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు. డాక్టర్‌ జైట్లీ...నోట్ల రద్దు, జిఎస్‌టి కారణంగా ఆర్థికవ్యవస్థ ఐసియుకు చేరిందని ఆర్థికమంత్రిని ఉద్దేశించి రాహుల్ పేర్కొన్నారు. 'ఆప్‌ కిసీసే కమ్‌ నహీ...మగర్ ఆప్‌కి దవామే దమ్‌ నహీ' అంటూ ట్వీట్‌ చేశారు. మీరు ఎవరికీ తీసిపోరు...కానీ మీ మందుల్లో సత్తా లేదని అన్నారు. ఇంతకుముందు జిఎస్‌టిని గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌గా రాహుల్‌ పేర్కొన్నారు.

 

22:06 - October 26, 2017

ఢిల్లీ : ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలావుద్దీన్‌ కుమారుడు  సయ్యద్‌ షాహిద్‌ యూసఫ్‌ ఇంట్లో ఎన్ ఐఏ సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై గత మంగళవారం యూసఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు ఉదయం బుద్గాం జిల్లాలోని సోయ్‌బుగ్‌ గ్రామంలోని యూసఫ్‌ నివాసానికి చేరుకుని తనిఖీ చేశారు. షాహిద్‌ యూసఫ్‌ ఇంటి నుంచి 5 మొబైల్‌ ఫోన్లు, 2 హార్డు డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. షాహిద్‌ యూసఫ్ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు.


 

22:04 - October 26, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించిన ఓ ఇల్లాలి హత్య  కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భర్తే హంతకుడని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం రాత్రి షాలిమార్‌బాగ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రియామెహ్రా, ఆమె భర్త పంకజ్‌ మెహ్రా, రెండేళ్ల కుమారుడుతో కలిసి గురుద్వారా నుంచి కారులో వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ప్రియా మెహ్రా అక్కడికక్కడే మృతిచెందగా...ఆమె భర్త పంకజ్‌, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పుల ఘటనలో ప్రియామెహ్రాకే ఎక్కువ బుల్లెట్లు తగలడం...పంకజ్‌కు స్వల్ప గాయాలు కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగు చూసింది.  అప్పు ఇచ్చిన వ్యక్తిని కేసులో ఇరికించడానికి కొందరు వ్యక్తులకు సుపారి ఇచ్చి భార్యను హత్య చేయించినట్లు... వ్యాపారి పంకజ్ మెహ్రా-పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మరోవైపు బుల్లెట్లు తన మీదకి దూసుకొస్తున్నా ప్రియా తన కుమారుడిని కారు సీటు వెనకాల దాచి బిడ్డ ప్రాణాలు కాపాడిందని పోలీసులు చెప్పారు.

 

22:02 - October 26, 2017

ఢిల్లీ : ఆగ్రా ఫతేపూర్‌ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన జంటపై దాడిని ఐద్వా ఖండించింది. దాడిలో గాయపడ్డ స్విస్‌ జంటను ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ఐద్వా కార్యకర్తలు పరామర్శించారు. యూపీలో పెరుగుతున్న అసహనపూరిత.. మతపరమైన దాడులను ఖండిస్తున్నట్లు ఐద్వా నేతలు తెలిపారు. 

21:59 - October 26, 2017

ఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సం‍స్థ 58 పేజీలతో కూడిన ఛార్జ్‌-షీట్‌ను దాఖలు చేసింది. జకీర్‌ నాయక్‌పై మనీలాండరింగ్, టెర్రరిస్టు ఫండింగ్‌ ఆరోపణలున్నాయి. నవంబర్‌ 18, 2016లో జకీర్‌నాయక్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. వైద్యవృత్తి నుంచి మత బోధకుడిగా మారిన డాక్టర్‌ జకీర్ తన విద్వేష పూరిత ప్రసంగాలతో జనాలను రెచ్చగొట్టడం.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంతో పాటు పరారీలో ఉన్నట్లు ఎన్‌ఐఏ ఛార్జ్‌ షీట్ లో పేర్కొన్నట్లు సమాచారం.  జకీర్‌నాయక్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. పరారీలో ఉన్న జకీర్‌నాయక్‌ను అరెస్ట్‌ చేసేందుకు భారత్‌ ఇంటర్‌పోల్‌ సహకారాన్ని కోరింది. ప్రస్తుతం అతను సౌదీ అరేబియా పౌరసత్వం కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

21:55 - October 26, 2017

బెంగళూరు : ఫేక్‌ స్టాంపు రాకెట్‌ ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ మృతి చెందాడు. విక్టోరియా ఆసుపత్రిలోని ట్రౌమా కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 3-55 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.  ఎయిడ్స్‌, బిపి, షుగర్‌ తదితర వ్యాధులతో తెల్గీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 10 రోజుల క్రితం విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2006లో స్టాంపుల కుంభకోణానికి సంబంధించి కోర్టు తెల్గీకి 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తెల్గీ బెంగళూరులోని పరప్పణ జైలులో శిక్ష అనుభవించాడు.

 

21:51 - October 26, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే మళ్లీ గెలుపన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 96 నుంచి 104 స్థానాలు గెలుస్తామన్నారు. 99శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గుజరాత్ ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేది లేదన్న... అసెంబ్లీలో విప్‌లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. 

 

21:47 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సభా సమరానికి సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. విపక్షం లేవనెత్తే అన్ని అంశాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు అధికార టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అసెంబ్లీ, మండలి సమావేశాలకు మూడు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

శుక్రవారం నుంచి జరిగే  తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు అంతా సిద్ధమైంది. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు, అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ శాసనసభా పక్షాలు వేర్వేరుగా సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని తయారు చేసుకున్నాయి. 

ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కార్యకలాపాల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రతిపక్షనేత జానారెడ్డి, వివిధ పార్టీల నేతలు హాజరైన ఈ సమావేశంలో అసెంబ్లీని 50 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల  నుంచి మధ్యాహ్నం 1.30 సభ నిర్వహిస్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని గంట నుంచి గంటన్నరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు పూర్తైన తర్వాత సభను వాయిదావేసి, మరోసారి బీఏసీ భేటీ నిర్వహించాలని నిర్ణించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సభ నిర్వహిస్తారు. వచ్చే నెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సమయంలో మూడు రోజులు సెలవు ప్రకటిస్తారు. ఆయా పార్టీ నేతలు తాము సభలో చర్చించాల్సి అంశాలపై జాబితాలను ప్రభుత్వానికి అందజేశాయి. రైతులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, నిరుద్యోగం, జంట నగరాల్లో రోడ్ల దుస్థితి వంటి  18 అంశాలపై చర్చించాలని కోరింది. 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్‌పీ భేటీ జరిగింది. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రైతు సమస్యలపై శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీపై చర్చించారు. విపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను సభలో లేవనెత్తాలని బీజేఎల్‌పీ నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన  టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  ప్రతిపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా దీటుగా సమాధానం చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభంనాడే కాంగ్రెస్‌ పార్టీ చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టడాన్ని టీఆర్‌ఎల్‌పీ తప్పుపట్టింది. 

మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. శాసనసభ పరిసరాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిషేధించారు. అధికార, విపక్ష వ్యూహ, ప్రతివ్యూహాలు చూస్తుంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 
 

రేపు మెర్సల్ సినిమా విడుదల

చెన్నై : రేపు మెర్సల్ సినిమా విడుదల కానుంది. సినిమాలో జీఎస్టీపై డైలాగ్ లను నిర్మాత మ్యూట్ చేశాడు. తెలుగులో అదిరింది పేరుతో మెర్సల్ సినిమా వస్తుంది. 

సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 96 నుంచి 104 స్థానాలు గెలుస్తామని చెప్పారు.

21:37 - October 26, 2017

ఇప్పుడున్న రాజ్యాంగాన్ని వద్దనుకుంటున్నారా..? ప్రజా స్వామ్యానికి అర్ధాన్ని మార్చాలనుకుంటున్నారా..? హిందూరాష్ట్ర సాధనే ధ్వేయంగానే పని చేస్తున్నారా..? మతతత్వ శక్తుల మాస్టర్ ప్లాన్ లో ఆసక్తికరమైన అంశాలపై ప్రొ.హరగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు

హైదరాబాద్ : రేపు కాంగ్రెస్ చలో అసెంబ్లీ సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. 

21:20 - October 26, 2017

పోలవరానికి పీటముడి ఎందుకు పడింది? కాంట్రాక్టర్ ను మార్చాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఎందుకు ఆగిపోయాయి. పనులు ఆగిపోతే ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకు చూస్తోంది. కొత్త టెండర్ల అవసరమేంటి? అంచనా వ్యవయం పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవన్నీ పోలవరం చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలేమిటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. పోలవారం పోలవారం అంటూ సోమవారాన్ని పిలుస్తున్న సర్కారు ఎంతో శ్రద్ధతో సనులు చేయిస్తుందనుకున్నారు. కానీ, అంతిమంగా దాన్ని పోలభారంగా మారుస్తున్నారన్న సంగతి ఇప్పుడు తేలుతోంది. మరి ఈ పరిస్థితుల మధ్య 2019కల్లా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయా? 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:16 - October 26, 2017

సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ఫస్ట్ దోకా, నవంబర్ ఆరు సంది జగనాలు పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడికి ముందస్తు అరెస్టులు, కాంగ్రెసోళ్లతో భుజం గల్పిన రేవంతం, సీన్మ తమాషల చిక్కిన లక్ష్మీ పార్వతి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:09 - October 26, 2017

హైదరాబాద్‌ : మీడియా ప్రతినిధుల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహించే మీడియా ప్రీమియర్‌ లీగ్‌ ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు లీగ్‌ నిర్వహకులు ఇఫ్తాకర్‌ తెలిపారు. అబిడ్స్‌లోని మీడియా ప్లస్‌ ఆడిటోరియంలో ఆయన సమావేశం నిర్వహిచారు. ఎంపిఎల్‌ లీగ్‌ బ్రోచర్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 11 నుండి 22 వరకు మ్యాచ్‌ షెడ్యూలును విడుదల చేశారు. 9న ప్రీమియర్‌ లీగ్‌ కప్‌ సెనిమరీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 32 టీమ్‌లు లీగ్‌లో పాల్గొంటున్నాయన్నారు. 

20:54 - October 26, 2017

హైదరాబాద్‌ : మహిళలకు భద్రత కల్పించడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అన్నారు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.  హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ మూడో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత మూడు సంవత్సరాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, లా అండ్‌ ఆర్డర్‌ బాగుందని కితాబిచ్చారు మంత్రి.  

2014 అక్టోబర్‌ 24న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన షీటీమ్స్‌ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో మూడవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి, షీటీమ్స్‌ చీఫ్ స్వాతి లక్రా, సినీ తార లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. 

సమాజంలో 50 శాతం మహిళలు ఉన్నారని, వీరి రక్షణ కోసమే షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి ఈవ్‌ టీజింగ్‌, నేరాలు అదుపు చేశామని హోం మంత్రి నాయిని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 షీ టీమ్స్‌ పని చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ బేసిడ్‌, ఈ లెర్నింగ్‌ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, రెడ్‌ హాండెడ్‌ కాట్‌ ఎన్‌ రోల్డ్‌ అప్లికేషన్‌ ప్రూఫ్‌ సిస్టమ్‌ పథకాన్ని, యాప్‌ను మంత్రి ప్రారంభించారు. 

ఆపదలో ఉన్న ప్రతి మహిళకు తాము తోడుంటామని షీటీమ్స్‌ చీఫ్ స్వాతి లక్రా అన్నారు. మహిళలు ఏ మాత్రం భయపడవద్దని భరోసా ఇచ్చారు. మహిళల రక్షణ విషయంలో షీటీమ్స్‌ 24/7 సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

ప్రజలకు భద్రత కల్పిస్తూ ప్రతి ఒక్కరి మేలు కోరుతోన్న తెలంగాణ పోలీస్‌ షీటీమ్స్‌ కృషి అభినందనీయమన్నారు సినీతార లావణ్య త్రిపాఠి. నేరాలు నివారించడంలో పోలీసు శాఖ ముందుందని ప్రశంసించారు. 

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో షీ టీమ్స్‌ విధులు నిర్వహిస్తున్నాయి. షీ టీమ్స్‌ సాధించిన ఫలితాలు చూసి ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశాతో పాటు ఉత్తర ప్రదేశ్‌ సైతం వేర్వేరు పేర్లతో ప్రారంభించారు. రోడ్లపై వేధింపులు తగ్గడమే కాకుండా మహిళలను చైతన్యవంతంగా మార్చేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి షీటీమ్స్‌..

20:49 - October 26, 2017

వరంగల్‌ : ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రకటిస్తే సరిపోదని.. సామాజిక న్యాయం కల్పించాలన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వరంగల్‌లో కొప్పుల ఎల్లయ్య సంస్మరణ సభలో తమ్మినేని పాల్గొన్నారు. ఎల్లయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎర్రజెండా కోసం ఎల్లయ్య చేసిన కృషి.. పడ్డ తపన ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తెలంగాణ సామాజిక న్యాయం జరిగినప్పుడే... తెలంగాణ రాష్ట్రం బాగున్నట్లని తమ్మినేని వ్యాఖ్యానించారు. 

 

20:45 - October 26, 2017

హైదరాబాద్ : ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న మాస్‌ లీడర్‌ రేవంత్‌ రెడ్డి. గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అన్ని ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సన్నివేశం అసెంబ్లీ ఆవరణలో యాదృచ్చికంగా జరిగినా.. పొలిటికల్‌ సర్కిల్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌ హల్‌చల్‌
టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం ఇప్పుడు స్టేట్‌ పాలిటిక్స్‌లో సెగలు రేపుతోంది. ఇప్పటికే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీని రేవంత్‌ కలిసారని.. ఇక త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఇక ముహూర్తం మాత్రమే మిగిలిందంటూ చర్చ జరుగుతుందన్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది.. 
రేవంత్‌ను ఆలింగనం చేసుకున్న షబ్బీర్‌ ఆలి
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో  సీఎల్పీ సమావేశం ముగించుకొని కాంగ్రెస్‌ నేతలు బయటికి వస్తున్న సమయంలో.. అసెంబ్లీకి వస్తూ రేవంత్‌ వారికి ఎదురయ్యాడు. అంతే ఒక్కసారిగా సీన్‌ ఆసక్తికరంగా మారింది. రేవంత్‌కి ఎదురుపడ్డ కాంగ్రెస్‌ నేతలు అతన్ని నవ్వుతూ పలకరించారు. మండలి డిప్యూటి లీడర్‌ షబ్బీర్‌ ఆలీ ఏకంగా రేవంత్‌ని ఆలింగనం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి రేవంత్‌తో చేతులు కలిపారు. ఈ హడావుడంతా ఏంటని రేవంత్‌ని ప్రశ్నించారు. అంతే కాకుండా అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ రేవంత్‌ని పలకరిస్తూ స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ నేతలను పలకరించిన అనంతరం రేవంత్‌ టీడీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు
తన సీటులో కాకుండా పక్కసీట్లో కూర్చున్న రేవంత్  
టీడీఎల్పీ కార్యాలయంలోనూ తన సీటులో కాకుండా పక్కసీట్లో కూర్చున్నారు. కాంగ్రెస్‌ నేతలతో రేవంత్‌ కలవడం యాదృచ్చికంగా జరిగినా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ రేవంత్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేత పదవుల నుంచి తప్పించారు. ఇక నేడో రేపో.. కాంగ్రెస్‌లోకి చేరడానికి ముహూర్తం ఖరారు కానున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా చోటు చేసుకుంటున్న సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి.

 

పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని అభిప్రాయం చేస్తామన్న తెలిపింది. మరో 4 రోజుల్లో టీఆర్ టీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

20:41 - October 26, 2017

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాల వారిగా నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని అభిప్రాయం చేస్తామన్న తెలిపింది. మరో 4 రోజుల్లో టీఆర్ టీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:26 - October 26, 2017

విజయనగరం : జిల్లాలో విషాదం నెలకొంది. మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళలు... ప్రమాదవశాత్తు నాగావళి నదిలో మునిగిపోయిన చనిపోయారు. మృతులు విశాఖకు చెందిన జ్యోతి, దేవిలుగా గుర్తించారు. వీరిద్దరు విశాఖపట్నంలోని వైభవ్‌ షోరూంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

19:23 - October 26, 2017

కర్నూలు : మార్కెట్‌ యార్డులో ఉల్లి పంటను కొనే దిక్కులేక రైతులు అల్లాడుతున్నారు. ఆరు రోజుగా మార్కెట్‌ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. క్వింటాలు ఉల్లికి 200 రూపాయలు ఇవ్వడంలేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల దయనీయ పరిస్థితిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:20 - October 26, 2017

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే  భక్తులు...అక్కడి ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే దర్శనం టికెట్ల వ్యవహారం దుమారం రేపుతుంటే...మళ్లీ ధరలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో పాలకమండలి, అధికారులు అనుసరిస్తున్న విధానాలు... భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. టికెట్ల వివాదం సద్దుమణగకముందే...మళ్లీ భక్తులపై ధరల భారం మోపడం చర్చనీయాంశమైంది. 

ఇటీవల భేటీ అయిన ఆలయ పాలకమండలి..ధరల మోత మోగించింది. లడ్డూ ప్రసాదం, పార్కింగ్‌, తలనీలాల టికెట్ల ధరలు అమాంతం పెంచేసింది. వీటితో పాటు శ్రీచ్రకలడ్డూ, శివార్చన, స్వర్ణ పుష్పార్చన అనఘాదేవి, సత్యనారాయణ స్వామి వ్రతాల ధరలు భారీగా పెంచారు. లడ్డూ ప్రసాదం 10 నుంచి 20కి, శ్రీ చక్రలడ్డూ 50 నుంచి 100కి పెంచారు. తలనీలాల టికెట్‌ 15  నుంచి 20కి పెంచారు. టోల్‌ఫీజు కారుకు 25 నుంచి 50కి..బైక్‌కు 5 నుంచి 25కి పెంచారు. దేవస్థానం బస్సు టికెట్‌ 8 నుంచి 10కి పెంచారు. దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. విపక్ష నేతలు భగ్గుమంటున్నారు.  

గతంలో దర్శనం టికెట్‌ ఏకంగా 300కి పెంచడంపై భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. పాలకమండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో.. 150కి తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంతో... భక్తుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా పెంచిన ధరల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దుర్గమ్మ భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అటు విపక్షాలు కూడా కారాలు మిరియాలు నూరుతున్నాయి. దుర్గగుడి పాలకమండలి పెంచిన ధరలు తగ్గించకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నాయి.  

19:17 - October 26, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, మల్లిఖార్జుననగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతలక్ష్మీ, అరుణకుమారిలిద్దరూ ఇంట్లోనే కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్క అనంతలక్ష్మీకి వివాహమైంది. ఆమె తన భర్తతో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితులే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అనంతలక్ష్మీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణకుమారిని ఒక యువకుడు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. 

19:11 - October 26, 2017

విశాఖపట్నం : ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి సినీనటులు ఎక్కువగా వస్తున్నారని,  కానీ పాలిటిక్స్‌లో రాణించిన నటులు చాలా తక్కువ మంది ఉన్నారన్నారు సినీనటి గౌతమి. ఈనెల 28న విశాఖ బీచ్‌ రోడ్డులో జరిగే  కేన్సర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌతమి విశాఖ వచ్చారు. లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విన్నర్స్‌ వాక్‌  జరుగునుంది. టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.  ఈ సందర్భంగా గౌతమి సినీ నటుల రాజకీయ రంగప్రవేశంపై తనదైన శైలిలో స్పందించారు. తమిళనాడులో ఎంజీఆర్‌, జయలలిత లాంటి నేతలు ప్రత్యేక నాయకత్వం లక్షణాలతో ఉన్నత స్థానానికి చేరుకున్నరని చెప్పారు. 

 

19:08 - October 26, 2017

కృష్ణా : పాత దస్తావేజులను విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని పలు దుకాణాల్లో దాడులు చేశారు. దాడుల్లో నాలుగు నెలల క్రితం తేదీలతో అమ్ముతున్న స్టాంప్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. పది రూపాయల స్టాంప్‌ పేపర్లతో పాటుగా.. ఇరవై , యాబై, వంద రూపాయల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. పాత తేదీలతో కూడిన స్టాంప్‌ పేపర్లు విక్రయించడం చట్టవ్యతిరేకమని... నిందితులపై పోలీసులకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తామని అధికారులు తెలిపారు.

 

19:02 - October 26, 2017

కర్నూలు : కంచ ఐలయ్యపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఫైర్‌ అయ్యారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఐలయ్య తన పుస్తకాలను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని ఆరోపించడం సరికాదన్నారు. దీనిపై డీఎన్‌ఏ పరీక్షలకి సిద్ధమని.. నువ్వూ సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు. 

 

18:58 - October 26, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ వచ్చే నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 180 రోజుల పాటు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. దీనికి ప్రజాసంకల్పం పాదయాత్రగా పేరు పెట్టారు. మొత్తం మూడు వేల కిలో మీటర్ల పొడవున పాదయాత్ర సాగుతుంది. 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. మార్గమధ్యంలో 125 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు.  180 ప్రజా సంఘాలతో భేటీ అవుతారు. రైతులు, ప్రజలకు కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. టీడీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. పాదయాత్ర  కవర్‌ కాని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ తర్వాత జగన్‌ బస్సు యాత్ర చేస్తారు. త

18:46 - October 26, 2017

సంగారెడ్డి : ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ తీరుపై సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మూడురోజుల క్రితం పుల్కల్ ఎమ్మెర్వోపై బాబుమోహన్ నోరు పారేసుకోవడాన్ని వారు తప్పుపట్టారు. అందుకు నిరసనగా జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాబుమోహన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

18:43 - October 26, 2017

ఖమ్మం : చిన్నారి తన్విత కోసం ఇద్దరు తల్లులు బాలసదన్‌కు వచ్చారు. తన్వితను తనకే అప్పగించాలంటూ వారు డిమాండ్‌ చేశారు. బాలసదన్‌ ఎదుట ఇద్దరు తల్లులు ధర్నాకు దిగి... సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఇద్దరు తల్లులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

 

18:41 - October 26, 2017

హైదరాబాద్ : టీకాంగ్ నేతలు పబ్లిసిటీ కోసమే చలో అసెంబ్లీ చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రైతులను అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపణలు చేస్తూ చీప్ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఏదన్నా సమస్య ఉంటే అసెంబ్లీ వేదికగా చర్చించుకోవాలి తప్ప.. మొదటిరోజే చలో అసెంబ్లీ చేపట్టడమేంటని తలసాని ప్రశ్నించారు. 

18:39 - October 26, 2017

సూర్యాపేట : జిల్లాలో సెక్షన్ 30 అమలు చేశారు. ఈనెల 30 వరకు సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ తెలిపారు. కాంగ్రెస్ చలో అసెంబ్లీ, నూతన కలెక్టరేట్‌ స్థల ఎంపికపై..విపక్షాలు, ప్రజా సంఘాల నిరసన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే... చలో అసెంబ్లీకి సిద్ధమైన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 30 అమలుపై ప్రజాసంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

18:37 - October 26, 2017

సూర్యాపేట : జిల్లాలో చలో అసెంబ్లీకి సిద్ధమైన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం మండలాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.  ఉదయం నుండే నాయకులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రైతుల కష్ట నష్టాలపై ప్రభుత్వం స్పందించక పోవడంతోనే ముట్టడికి పిలుపునిచ్చామని కాంగ్రెస్‌ నాయకులన్నారు. 

 

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై : నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రా సమీపంలోని బెహ్రంపాడ మురికివాడలో మంటలు చెలరేగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

18:27 - October 26, 2017

హైదరాబాద్ : ఈనెల 27న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని సీఎల్పీ అధ్యక్షుడు జానారెడ్డి స్పష్టం చేశారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించబోమని తెలిపారు. రైతులను కాపాడమంటూ ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జానా చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా.. పోలీసు జులుంతో అణచివేయాలని చూస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జానా హెచ్చరించారు. 

బిడ్డకోసం తల్లుల పోరాటం

ఖమ్మం : చిన్నారి తన్విత కోసం బాలసదన్ కు కన్న తల్లి ఉమ, పెంచిన తల్లి స్వరూప వచ్చారు. తన్వితను అప్పగించాలంటూ ఇద్దరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. బాలసదన్ ఎదుట ఇద్దరు తల్లులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిద్దరిని అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు.

ముగిసిన టీడీపీ, బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్ : గోల్కొండ హోటళ్లో టీడీపీ, బీజేపీ నేతల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విషయం టీడీపీ అంతర్గతమని తెలిపారు. టీడీపీ, కలిసి పనిచేస్తాయిని ఆయన తెలిపారు.

17:04 - October 26, 2017

టెన్ టివి బిజినెస్ : విమానం ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు అనుకోకుండా సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ బహుమతిగా లభిచింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలోని లిబేరియా ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది. లిబేరియా ఎయిర్ లైన్స్ విమానంలో 162 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు బయల్దేరారు. అయితే వారు ఫ్లైట్ లోకి అడుగుపెట్టగానే సామ్ సంగ్ కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 8 వారికి బహుమతి ఇచ్చింది. అనుకోని బహుమతికి అందరు ఆనందించారు. ప్రయాణికులతో పాటు ఫైలెట్ కు, ఎయర్ హోస్టర్స్ కు సామ్ సంగ్ ఫోన్లను బహుకరించింది. సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 ప్రచారం కోసమే ప్రయాణికులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇచ్చినట్టు కంపెనీ తెలిపింది. అయితే ఎంతో మంది కస్టమర్లు ఉన్న ఇండియాలో మాత్రం ఒక్కసారి కూడా ఫ్రీగా ఫోన్లను ఇవ్వలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 

16:44 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:41 - October 26, 2017

వరంగల్ : కొండా దంపతుల వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ప్రదీప్ అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. నిన్న ఎర్రబెల్లి వర్గంపై కొండా దంపతులు తీవ్ర వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. వరంగల్‌లోని పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి ప్రదీప్ నేతృత్వంలో... కార్యకర్తలు, అనుచరులు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కొండా మురళి, కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను కొండా దంపతులు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అనుచరులతో ఎర్రబెల్లి ప్రదీప్ సమావేశం
కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:33 - October 26, 2017

హైదరాబాద్ : హామీల అమలులో టీసర్కార్ విఫలం చెందిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. టీసర్కార్ శాసన సభను బుల్డోజ్ చేస్తూ...ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందన్నారు. టీఆర్ ఎస్ సొంత డబ్బా కొట్టుకుంటుందని తెలిపారు. ఎన్నికల హామీలు ఏవీ అమలు కాలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, తెల్ల రేషన్ కార్డులు..ఇలా అన్ని వైపుల నుంచి టీఆర్ ఎస్ వైఫల్యం చెందిందని విమర్శించారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ దొందు దొందే అని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ పాలననే టీఆర్ ఎస్ కొనసాగిస్తుందన్నారు. కాంగ్రెస్ అడుగు జాడల్లోనే కేసీఆర్ ముందుకు నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ, టీడీపీ సమన్వయంతో పని చేయాలని ఆలోచన చేయడం జరిగిందని చెప్పారు. 

 

16:33 - October 26, 2017

బాలీవుడ్ : విడాకులు తీసుకున్న భార్యలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు. మొన్న అమీర్ ఖాన్ మాజీ భార్య పుట్టిన రోజుకి అమీర్ ఖాన్ హాజరై అశ్చర్యం సృష్టించాడు. తాజాగా హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుజాన ఖాన్ పుట్టిన రోజు హాజరైయ్యాడు.

సుజాన ఖాన్ 'నన్ను నా జీవితానికి ప్రత్యేకంగా మార్చిన వారికి కృతజ్ఞలు' అంటూ ఇన్ స్టాగ్రామ్ లోఫొటోను పోస్టు చేసింది. ఈ కార్యక్రమానికి సుజాన సోదరుడు జాయోద్ ఖాన్, అతని భార్య మలైకాలతో పాటు సుజాన స్నేహితులు ట్వింకిల్ ఖన్నా, కూడా హాజరైనట్లు తెలుస్తోంది.  

16:31 - October 26, 2017

హైదరాబాద్ : టీటీడీపీలో సంక్షోభం కొనసాగుతోంది. రమణ, రేవంత్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీటీడీపీ నేతలపై రేవంత్‌రెడ్డి ధ్వజ మెత్తారు. టీటీడీపీ నేతలు గోల్కొండ హోటల్‌లో మీటింగ్‌ పెట్టడాన్ని రేవంత్‌ తప్పు పట్టారు. ప్రజా సమస్యలపై స్టార్‌ హోటళ్లలో చర్చలేంటని రేవంత్ ప్రశ్నించారు. తనపై పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటే ఆపాల్సిన బాధ్యత రమణపై లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు దేశంలో లేని సమయంలో తనను పదవుల నుంచి తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. గోల్కొండ సమావేశం కేసీఆర్ పెట్టించారేమో తనకు తెలియదన్నారు. తనను పదవుల నుంచి తొలగించాల్సిన అవసరం కేసీఆర్‌కు తప్ప ఎవరికీ లేదని చెప్పారు. టీటీడీపీతో కలిసే సమస్యే లేదంటూ అమిత్ షా, లక్ష్మణ్ లాంటి నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అకస్మాత్తుగా బీజేపీతో కలయిక ఎలా జరిగిందో తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. హోటల్లో దావత్‌కు కొందరు టీటీడీపీ నేతలు ఎందుకు వెళ్లలేదో తెలుసుకోండని తెలిపారు. తాజా పరిణామాలపై చంద్రబాబుకు తాను ఫిర్యాదు చేస్తానని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:24 - October 26, 2017

హైదరాబాద్ : బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎల్‌.రమణ, సండ్ర వెంకట వీరయ్య, ఆర్‌.కృష్ణయ్య, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డితో పాటు ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి రేవంత్‌రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:23 - October 26, 2017

హైదరాబాద్ : బేగంపేటలో వేగంగా కారు నడుపుతూ మహిళ హల్ చల్ చేసింది. అందరినీ ఢీకొంటూ రెక్లెస్‌గా కారు నడపడంతో వాహనదారులు ఆమెను అడ్డుకున్నారు. కారు దిగిన ఆమె వారిపై వాగ్వాదానికి దిగింది. 

 

16:14 - October 26, 2017

బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను భయపెడుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ కు ఇప్పటివరకు కారణాలు తెలియరాలేదు. అయితే తొలి దశలో గుర్తిస్తే ప్రణాపాయం నుంచి బయటపడొచ్చు. అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనగా  జరుపుకుంటారు.  ఇదే అంశంపై ఇవాళ్టి మానవి ఫోకస్. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:13 - October 26, 2017

టెన్ టివి : స్టార్ మా లో ప్రసారమయ్యే నీతోనే డ్యాన్స్ షోకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో పై ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అందులో 'నీతోనే డ్యాన్స్ షో' లో డ్యాన్స్ చేసేవారు సీరియళ్లు తీసుకుంటే మంచిదని, షో పాల్గొనేవారికి అసలు డ్యాన్స్ రాదని ట్వీట్ చేశాడు. దీనికి రేణుదేశాయ్ కూల్ గా రీప్లే ఇచ్చింది. ఈ పోటీ డ్యాన్సర్లకు పెడుతున్న పోటీకి సంబంధించి కాదని చెప్పింది, ఇది కేవలం వినోదం కోసమే అని, నిజ జీవిత సెలబ్రిటీ జంటలతో కలిసి చేస్తున్న షో అని తెలిపారు. 

16:09 - October 26, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను టీడీపీలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రజలందరి హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రజల ప్రేమాభిమానాలు, మన్నలను పొందాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. వైసీపీ చేపట్టే రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రచ్చబండ కార్యక్రమం రెండో భాగంలో కళాశాలలో సమావేశాలు నిర్వహించాలని.. కళాశాలలో ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : జిల్లా షాద్ నగర్ లో ఎన్ హెచ్ 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాద్ నగర్ సింగిల్ విండో చైర్మన్ మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. 

కంచె ఐలయ్య సన్మాన సభకు అనుమతి నిరాకరణ

కృష్ణా : విజయవాడలో కంచె ఐలయ్య సన్మాన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్య వైశ్య, బ్రాహ్మాణుల ఐక్య వేదిక ఆత్మీయ సభకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు.

15:51 - October 26, 2017

పాకిస్తాన్ : అవినీతి కేసుల్లో చిక్కుకున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పాకిస్తాన్‌ కోర్టు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. నవంబర్‌3వ తేదీన కోర్టులో హాజరుకావాలని నవాజ్‌ను ఆదేశించింది. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌ లండన్‌లో ఉన్నారు. ఆయన భార్య కుల్సుం లండన్‌లో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గత ఏడాది పనామా పత్రాల్లో నవాజ్‌ షరీఫ్‌ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. లండన్‌లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది.

 

బేగంపేటలో మహిళ హల్ చల్

హైదరాబాద్ : నగరంలోని బేగంపేటలో ఓ మహిళ హల్ చల్ సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో కారు డ్రైవింగ్ చేసిన ఆ మహిళ టూ వీలర్ ను ఢీకొంది. మిగతా టూవీలర్ వారు ఆ మహిళ కారు వెంబడించి అపారు. మహిళ వారిపై దాడి చేసింది. 

టీడీపీ, బీజేపీ నేతల సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : గోల్కొండ హోటల్ లో టీడీపీ, బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి టీడీపీ తరుపున ఎల్. రమణ, సండ్ర, ఆర్. కృష్ణయ్య బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి హాజరైయ్యారు.

15:49 - October 26, 2017

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన జంటపై జరిగిన దాడిపై విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ దాడి గురించి తనకు ఇపుడే తెలిసిందని... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జంటను తన కార్యాలయానికి చెందిన అధికారులు కలుస్తారని సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన క్వెంటిన్‌ జెరెమీ క్లెర్క్‌ తన ప్రేయసి మ్యారీ డ్రోజ్‌తో కలిసి సెప్టెంబర్‌ 30న భారత పర్యటనకు వచ్చారు. గత ఆదివారం వారు  ఫతేపూర్‌ సిక్రీ రైల్వే స్టేషన్‌ సమీపంలో నడుస్తుండగా.. కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. వారిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో క్వెంటిన్‌, మ్యారీ గాయపడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. విదేశీ జంటపై దాడి ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

 

15:47 - October 26, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. క్లీన్‌ ఇండియా ప్రచారంలో భాగంగా తాజ్‌మహల్‌ వెస్ట్రన్‌ గేటు వద్ద రోడ్డు ఊడ్చారు. యూపీలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి తాజ్‌మహల్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. తాజ్‌మహల్‌ ఆవరణలోని అన్ని ప్రాంతాలను సీఎం యోగి సందర్శించారు. ఆగ్రాలో టూరిజం అభివృద్ధి కోసం ప్రభుత్వం 370 కోట్లు మంజూరు చేసింది. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధుల వద్ద సీఎం యోగి సుమారు అరగంట పాటు గడిపారు..తాజ్‌మహల్ నుంచి ఆగ్రా వరకు వేయనున్న టూరిస్టు రోడ్డు కోసం యోగి శంకుస్థాపన చేయనున్నారు.  

 

15:37 - October 26, 2017

విజయనగరం : జిల్లా, కోమటిపల్లి సమీపంలో ఆటోడ్రైవర్‌ ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బొబ్బిలి నుంచి కోమటిపల్లికి వెళ్లేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆటో ఎక్కారు. కోమటిపల్లి సమీపిస్తున్న సమయంలో డ్రైవర్‌ ఆటోను వెనక్కి తిప్పాడు. అనుమానం వచ్చిన ఇద్దరమ్మాయిలు ఆటో నుంచి కిందకు దూకారు. జరిగిన విషయం ఫోన్‌లో ఇంట్లోవారికి చెప్పే ప్రయత్నం చేయడంతో ఆటోడ్రైవర్‌ నరేశ్‌ వారిని ఇనుపరాడ్‌తో కొట్టి గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైనవారిని స్థానికులు బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తరువాత వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో విజయనగరంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి పావని తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

 

15:34 - October 26, 2017

కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేటలో తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. రేపటి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికకు సంబంధించి 144 సెక్షన్‌ విధించిన పోలీసులు భారీ పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో.. రేపటి ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:18 - October 26, 2017

హైదరాబాద్ : నగరంలోని లోటస్‌పాండ్‌లో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు వేయాలని నేతలు డిమాండ్ చేశారు. నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే సభకు హాజరయ్యే అంశంపై ఆలోచిస్తామని పెద్దిరెడ్డి వెల్లడించారు. 

 

15:16 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్‌ రెడ్డి తలపెట్టిన టీడీఎల్పీ సమావేశాన్ని ఎల్‌. రమణ వాయిదా వేశారు. నియమాలను ఉల్లంఘిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. ఈమేరకు ఎల్‌. రమణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా రేవంత్‌ను బాధ్యతల నుండి పక్కన పెట్టామన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు జరపాల్సిన అవసరం తన మీద ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:58 - October 26, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డికి ఆలింగనాలతో టీ కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలికారు. మరోవైపు అసెంబ్లీకి వచ్చినా బీఏసీ భేటీకి రేవంత్‌రెడ్డి హాజరు కాలేదు. అటు టీడీఎల్పీ కార్యాలయంలోనూ తన సీటులో కాకుండా పక్కసీట్లో కూర్చున్నారు. ఈ పరిణామాలతో రేవంత్‌ రెడ్డి దాదాపు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:56 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించేందుకు సమావేశమైన బీఏసీ భేటీ ముగిసింది. 50 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని...శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించింది. రేపు మరోసారి బీఏసీ సమావేశమై..అజెండా, పనిదినాలపై స్పష్టత ఇవ్వనుంది. అయితే 50 రోజులపాటు సమావేశాలు నడుపుదామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయగా.. మరో నెలరోజులు పొడిగిస్తే బడ్జెట్‌ సమావేశాలూ పూర్తవుతాయని జానారెడ్డి ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

అసెంబ్లీ సమావేశాలక భారీ భద్రత

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత ఏర్పాట్లు చేయన్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ చుట్టు మూడంచె భద్రత ఏర్పాటు చేస్తామని, శాసనసభ, మండలి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు.

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం

జకార్తా : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 43 మందికి గాయాలయ్యాయి.

కొలువులకై కొట్లాట అనుమతిపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : ఈనె 31 కోదండరాం తలపెట్టిన కొలువుకై కొట్లాట బహిరంగ సభ అనుమతి పిటిషిన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సరూర్ నగర్, ఇండోర్ స్టేడియం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, ఎల్బీనగర్ ప్రైవేట్ స్థలం, ఎన్టీఆర్ గ్రౌండ్ ప్రాంతంలో సభకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

వైసీపీ విస్తృతస్థియి సమావేశం

హైదరాబాద్ : వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై ఎమ్మెల్యే అనిల్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటెషన్ ఇచ్చాడు. జగన్ రోజు రెండు విడుతలుగా పాదయాత్ర చేస్తారని, ఉదయం6నుంచి7 కిలోమీటర్లు, సాయంత్రం 6నుంచి 7 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్రకు 'ప్రజా సంకల్పం' గా నామకరణం చేశారు.

ముగిసిన టీఎస్ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. 50 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు దినంగా ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సమావేశాలు జరగుతాయని తెలుస్తోంది.

 

 

14:01 - October 26, 2017

స్పోర్ట్స్ : టీంఇండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లికి అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో కోహ్లి అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు. ప్రపంచంలోనే అంత్యంత విలువైన అథ్లెట్ల టాప్ 10 జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో కోహ్లి 14.5 మిలియన్ డాలర్లతో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రచారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఫోర్బ్స్ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ వివరాల ప్రకారమే ఫోర్బ్స్ జాబితాను విడుదల కచేసింది. అటకు సంబంధించిన జీతాలు, బోనస్, పెట్టుబడులు ద్వారా వచ్చే డబ్బును ఈ ఆదాయంలో కలపలేదు. క్రికెటర్లలో టాప్ 10 చోటు దక్కించుకున్ ఏకైక క్రికటర్ గా కోహ్లి రికార్డు సృష్టించాడు.

ఫోర్బ్స టాప్ 10 అథ్లెట్ల జాబితా

1. రోజర్ ఫెదర్ (టెన్నిస్, 37.2 మిలియన్ డాలర్లు), స్వీజర్లాండ్

2. లిబ్రాన్ జేమ్స్ (బాస్కెట్ బాల్, 33.4 మిలియన్ డాలర్లు),అమెరికా

3. ఉసేన్ బోల్ట్ (రన్నర్,27 మిలియన్ డాలర్లు),జమైకా

4. క్రిస్టీనొ రోనాల్డో (ఫుట్ బాల్,21.5మిలియన్ డాలర్లు),పోర్చుగీస్

5. ఫిల్ మెక్లిసన్ (19.6మిలియన్ డాలర్లు),

6. టైగర్ వుడ్స్ (గోల్ప్,16.6 మిలియన్ డాలర్లు),అమెరికా

7. విరాట్ కోహ్లి (క్రికెటర్,14.5మిలియన్ డాలర్లు),ఇండియా

8. రోరీ మెక్లోరీ (గోల్ఫ్, 13.6మిలియన్ డాలర్లు), బ్రిటన్

9. మెస్సి (ఫుట్ బాల్,13.5మిలియన్ డాలర్లు),అంటిగ్వా

10. స్టీఫ్ కర్రీ (బాస్కెట్ బాల్,13.4మిలియన్ డాలర్లు),అమెరికా

13:23 - October 26, 2017

టెన్ టివి : ప్రతి మొబైల్ ఆ నెట్ వర్క్ కంపెనీ నుంచి మీ ఫోన్ నంబర్ కు ఆధార్ లింక్ చేయండి అని మెసేజ్ వస్తోంది. అయితే ఆధార్ లింక్ చేయలంటే నెట్ వర్క్ స్టోర్ లోకి వెళ్లి లింక్ చేయాలి కానీ చలా మందికి ఈ పద్దతి ఇబ్బందిగా మారింది. దీని పై ఆలోచించిన కేంద్రప్రభుత్వం ఆధార్ లింక్ ను సులభతరం చేసింది. టెలికామ్ కంపెనీలు వినియోగదారుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆధార్ ధృవికరణ తీసుకోవడం, వన్ టైం పాస్ వర్డ్ (ఓటిపీ) ఆధారిత వెరిఫికేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం కంపెనీల సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉండే అవకాశం ఉండడంతో వినియోగదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అనుసంధాన ప్రకియ పూర్తి చేయాలని టెలికాం కంపెనీలకు కేంద్రం సూచించింది. దీనితో పాటు ప్రజల విజ్ఞప్తి మేరకు ఆన్ లైన్ విధాలనాలను కూడా రూపొందించాలని ఆపరేటర్లకు స్ఫష్టం చేసింది. అయితే కంపెనీ వారు ప్రత్యేక్షంగా వస్తే వివరాలు ఇవ్వాలని, ఫోన్ లో వివరాలు అడిగితే చెప్పకండి అని స్పష్టం చేశారు. దీని వల్ల భద్రత సమస్యలు తలేత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

13:14 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు శాసనసభా పక్ష సమావేశాలు జరిపాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగనుందని తెలుస్తోంది. సమావేశంలో పాల్గొనేందుకు ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు..ఇతరులు హాజరవుతున్నారు.

ఈ సమావేశంలో టి.కాంగ్రెస్ పలు డిమాండ్లను ప్రస్తావించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానాలకు విలువ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. వీటిపై సమగ్రంగా చర్చ జరగాలని టి.కాంగ్రెస్ కోరనుంది. మొట్టమొదట వాయిదా తీర్మానాలు తీసుకోవాలని అనంతరం కొశ్చన్ అవర్..తరువాత షార్ట్ డిస్కషన్ తీసుకోవాలని పేర్కొంటోంది. మరి ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీ అంశం కూడా బీఏసీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక టిడిఎల్పీ నుండి సండ్ర వెంకట వీరయ్య హాజరు కానున్నారు. టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ను తాత్కాలికంగా బాధ్యతల నుండి తప్పించిన సంగతి తెలిసిందే.

ప్రారంభమైన టీఎస్ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ప్రభుత్వం తరుపున కేసీఆర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ తరుపున సండ్ర, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ హాజరైయ్యారు. 

అసెంబ్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : టీడీపీ నేత రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. రేవంత్ కు షబ్బీర్ ఆలీ, సంపత్, పొంగులేటి షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి టీడీఎల్పీ ఆఫీస్ లో తన సీట్లో కాకుండా పక్క సీట్లో కూర్చున్నాడు.

12:55 - October 26, 2017

టెన్ టివి హెల్త్ : ఇంటి భోజనం చేసేవారికి ఇది ఒక శుభవార్త ఎందుకంటే ప్రతిరోజు ఇంటి భోజనం చేసేవారికి టైప్ 2 మధుమేహం దూరంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలో టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మరికొన్ని సంస్థలు టైప్ 2 మధుమేహంపై ఒక అధ్యయంనం నిర్వహించారు. ఈ పరిశోధనాలక కోసం 1986 2012 మధ్య కాలంలో 58,051 మంది మహిళలతో పాటు, 1986 2010 మధ్య కాలంలో 41,676 పురుషుల ఆహారపు అలవాట్లను పరిశీలించారు.

వారిలో మొత్తం 9,325 మంది టైప్ 2 మధుమేహం బారిన పడినట్టు గుర్తించారు. వారిలో చాలా మంది వివిధ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే వారుగా గుర్తించారు. అదే సమయంలో ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తినన్న వారిలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు.

12:55 - October 26, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు అధికార టీఆర్‌ఎస్‌ రెడీ అవుతోంది. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేలా గులాబీ బాస్‌ వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ కేసీఆర్‌.... నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ నాయకత్వంతోపాటు రాష్ట్ర కమిటీకి సూచనలు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇవాళ టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం సమావేశంకానుంది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, విపక్షాలు లేవనెత్తే అంశాలపై గులాబీ నేతలు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు, ఇతర మంత్రులు, విప్‌లతో భేటీ అయ్యారు. విపక్షాలు ఏయే అంశాలు లేవనెత్తే అవకాశముందో చర్చించారు. దీనికి ఎలా సమాధానం ఇవ్వాలో కూడా చర్చించుకున్నారు. ప్రతి అంశంపైనా నేతలంతా పూర్తి అవగాహన పెంచుకుని ధీటుగా సమాధానం ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్‌ నేతలకు సూచించారు. ఇవాళ జరిగే సమావేశంలోనూ దీనిపైనే ఫోకస్‌ చేయనున్నారు. అంతేకాదు... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అభివృద్ధిని ఈ సమావేశాల్లోనే వివరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న అంశాన్ని సభకు వివరించే యోచనలో ఉంది.

విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హమీలపైనా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. ఆ హామీల అమలుకు తాము చేసిన ప్రయత్నాన్ని, కేంద్ర వైఖరిని సభదృష్టికి తీసుకురావాలని యోచిస్తోంది. ఎయిమ్స్‌ ఏర్పాటు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై కేసీఆర్‌ కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీటిపై వివరణ ఇస్తూనే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, విపక్షాలు సృష్టిస్తున్న అడ్డంకులను సభా వేదికగా ప్రజలకు వివరించాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. అవసరమైతే సభను నెల రోజులపాటు జరిపేందుకు కూడా సిద్ధమేనని అధికార పార్టీ చెబుతోంది.

12:53 - October 26, 2017

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చేరుకున్నారు. అక్కడ మౌనదీక్ష చేపట్టారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రపై 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా తీయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. తన అనుమతి లేక ఉండా సినిమా నిర్మిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా రూపొందనుంది. తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం చట్ట విరుద్ధమని, దీనిపై పోరాటం చేస్తానన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని, జీవిత చరిత్రను తీయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. బురదచల్లే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. వైసీపీకి చెందిన పార్టీ నాయకులు ఆమె వెంట రాలేదు. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే లక్ష్మీ పార్వతి వెంట ఉన్నారు. 

12:47 - October 26, 2017

హైదరాబాద్ : వైసీపీ శాసనసభా పక్ష సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. లోటస్ పాండ్ లో జగన్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. నవంబర్ 10వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనితో వైసీఎల్పీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. చివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలని డిమాండ్ చేసింది. నలుగురు మంత్రుల బర్తరఫ్ కు పట్టు పట్టాలని నిర్ణయం తీసుకుంది. 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే సభకు హాజరయ్యే అంశంపై ఆలోచిస్తామని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ పేర్కొననుంది. సమావేశాలను బహిష్కరించి జగన్ పాదయాత్రపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. పాదయాత్ర జరిగినన్నీ రోజులు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

12:45 - October 26, 2017

టెన్ టివి : తెలంగాణ పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ''నా తెలంగాణ కోటి రతనాల వీణ''అంటూ దారశరథి గీతంతో సాగుతోంది. ఈ పాటలో దృశ్యాలన్ని తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఇందులో తెలంగాన సంస్కృతి, ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్బుతంగా తెరపై చూపించారు.

12:40 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ టిడిపిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి తలపెట్టిన టిడిఎల్పీ సమావేశాన్ని పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వాయిదా వేశారు. పార్టీ నియావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి హోదాలో రేవంత్ ను బాధ్యతలను పక్కన పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఎల్.రమణ టెన్ టివితో మాట్లాడారు. 17వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ను రేవంత్ కలిసినట్లు వార్తలు వెలువడ్డాయని, కుంతియా వచ్చినప్పుడు ఓ ప్రకటన చేయడం..డీకే అరుణ వ్యాఖ్యలు చేయడం పట్ల రేవంత్ ను సమగ్ర వివరణ కోరడం జరిగిందన్నారు. రేవంత్ వల్ల పార్టీ పరువు బజారున పడుతుందని..పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీని నడిపించాలన్నారు. అనేక సందర్భాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని..అందులో తాత్కాలికంగా రేవంత్ ను బాధ్యతల నుండి తప్పించడం జరిగిందన్నారు. కానీ టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారని, తనకు అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోందని దీనిపై వివరాలు అడుగుతున్నట్లు తెలిపారు. అధికారం ఉందా ? లేదా ? అనేది నియావళిలో ఉంటుందని..పార్టీ లైన్ ఉల్లంఘిస్తే ఊరుకోరని పేర్కొన్నారు. టిడిఎల్పీ సమావేశం కొనసాగిస్తానని..రేవంత్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. 

12:34 - October 26, 2017

టెన్ టివి సినిమా : టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో నితిన్ ఒకరు. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించికున్నాడు. ఆ తర్వాత దిల్ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచ్చుకున్నాడు. రాజమౌళి సై సినిమాతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చి సినిమాలన్ని ప్లాప్ కావడంతో అతని ఇమేజ్ తగ్గుకుంటూ వచ్చింది. అయితే చాలా గ్యాబ్ తర్వాత వచ్చి ఇష్క్, గుండెజారి ఘల్లంతయ్యిందే తో తో నితిన్ మళ్లీ గాడిలో పడ్డాడు. తివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా అఆ తో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ హీరోల్లో చోటు దక్కించుకున్నాడు.

అయితే నితిన్ అభిమానులు తమ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు. వీరి ఎదురు చూపులకు తెరదించేందుకు నితిన్ కూడా ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘ ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ గతంలో లై సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ పెళ్లిచేసుకోవలనుకుంటున్నారని అందుకు నితిన్ తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్టు సమాచారం సాగుతోంది. పెళ్లి ఆలోచన కారణంగాణే మేఘ ఆకాశ్ వేరే సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలను ఇద్దరు ఖండించపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకురుస్తున్నాయి. 

12:34 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అనారోగ్య కారణాల రీత్యా బీఏసీ సమావేశానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. మరి కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేయనుంది. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బీఏసీ సమావేశానికి స్పీకర్ మధుసూధానచారి అనారోగ్య కారణాల రీత్యా హాజరు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనితో డిప్యూటి స్పీకర్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగనుంది. టిడిఎల్పీలో హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి నుండి

సండ్ర వెంకట వీరయ్య హాజరు కానున్నారు. ఇక సీఎల్పీ నుండి జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు..ఎంఐఎం, బీజేపీ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. ఇక ఈ బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న దానిపై చర్చ జరుగనుంది. మూడు నుండి నాలుగు వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశంలో ఏ ఏజెండాను ఖరారు చేయనున్నంది కాసేపట్లో తేలనుంది.

టీడీపీ గొడవలు సృష్టిస్తున్నారు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : టీడీపీలో కొందరు కావాలనే అంతర్గత గొడవలు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోరాటం సీఎం కేసీఆర్ పైనే అని టీడీపీ కేడర్ ను చూస్తే బాధగా ఉందని అన్నారు. చంద్రబాబు వచ్చాక అన్ని వివరాలు వివరిస్తానని చెప్పినా కొందరు పరుషపదజాలంతో విమర్శిస్తున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

రమణతో ముగిసిన సండ్ర భేటీ

హైదరాబాద్ : టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య భేటీ ముగిసింది. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను రమణ సండ్రకు వివరించారు. అసెంబ్లీ రూమ్ వ్యవహారం స్పీకర్ తో మాట్లాడుతనాని సండ్ర రమణకు తెలిపారు. 

కాసేపట్లో టీఎస్ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ జరగవల్సిన తీరుపై చర్చించనున్నారు.

ముగిసిన వైసీపీ ఎల్సీ సమావేశం

హైదరాబాద్ : లోటస్ పండ్ లో వైసీపీఎల్పీ భేటీ ముగిసింది. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావద్దని ఈ సమావేశంలో నిర్ణయించారు. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన చర్యలు తీసుకోలేదని, పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

12:00 - October 26, 2017

టెన్ టివి వంట : పానీ పూరీ అనగానే ప్రతి ఒక్కరికి ఇష్టముండే చిరుతిండి. అయితే పానీ పూరీ తినేముందు ఒక నిమిషాం ఆలోచించండి. ఎందుకంటే పానీ పూరీ చేసే విధనం జుగుప్స కల్గించే విధంగా ఉంటుంది. పానీ పూరీ కోసం మైదా పిండి కలిపి కాళ్లతో తొక్కుతుంటారు. అది కూడా అపరిశుభ్ర ప్రదేశాల్లో చేస్తుంటారు. కానీ పానీ పూరీ చూస్తే తినకుండా ఉండలేము ఇకా చిన్న పిల్లల గురించి చెప్పనక్కర్లేదు. పానీ పూరీ బయట తినే బదులు ఇంట్లో ఎంచక్క చేసుకోవచ్చు.

పూరీ కోసం కావాల్సిన పదార్థలు
ఒక కప్పు గోధుమ రవ్వ, మూడు టేబుల్ స్పూన్ల మైదా, పాపు టీ స్పూను బేకింగ్ సోడా, అర టీ స్పూను ఉప్పు, బాగా వేయించేందుకు సరిపడా వంట నూనె.

పానీ కోసం కావాల్సిన పదార్థలు
అర కప్పు చింతపండు గుజ్జు, రెండు కప్పుల నీరు, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర కప్పు కొత్తిమీర ఆకులు, మూడు పచ్చి మిరపకాయలు, ఒక కప్పుడ పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కాలా నమక్ (ఉప్పులో ఒక రకం).

పూరీలో పెట్టేందుకు స్టఫ్
రెండు బంగాళాదుంపలు, రెండు తరిగిన పచ్చి మిరిపకాయలు, ఉల్లిపాయ, వెల్లుళ్లి రుచి కోసం కాస్తంత ఉప్ప, కరం, కొత్తిమీర అవసరం.

పూరీ తయారీ విధానం
ఒక పాత్ర తీసుకుని అందులో మైదా పిండి, రవ్వ, ఉప్పు వేసి వేడి నీరు పోసి బాగా కలిపి 40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, ఆ తరావ్త పిండిని చిన్న పరిమాణంలో ఉండలుగా చేసి వాటిని పూరీల్లానే వత్తి. బనాలిలో వేడెక్కిన నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వెయించాలి.

పానీ తయారీ
మిక్సర్ లో కొత్తి మీర, పుదీనా, పచ్చి మిరపకాలయలు వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనికి నీటిని కలుపుకోవాలి. తర్వాత పానీకి సంబంధించిన ఇతర పదార్థాలను కూడా కలపాలి. 

11:36 - October 26, 2017

టెన్ టివి హెల్త్ : ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో 2సంవత్సరాల చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా సింపులుగా తాగేది ఎనర్జీ డ్రింక్స్ అవి తమ్స్ ప్, కోకకోలా, స్ప్రైట్, సెవెనప్ కావోచ్చు. ఎనర్జీ డ్రింక్ అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెమరెజ్ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా రక్తనాళాలుల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

శితాల పనీయాల్లో ఉండే కెఫైన్ శరీరంలో ముఖ్యమైన భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. దీని వల్ల గుండె లయా తప్పడం, రక్త ప్రసరంలో అవరోధాలు ఏర్పడడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే బీపీ, షుగర్ సమస్యలు ఉన్నవారు ఎనర్జీ డ్రింక్ లకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. 

11:34 - October 26, 2017

హైదరాబాద్ : వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పదో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందు అంటే నవంబర్ 6వ తేదీన పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేయాలని యోచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై వైసీపీ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సభకు హాజరవుతే రెండు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు..ప్రత్యేక హోదా అంశాలను ప్రధానంగా అసెంబ్లీలో లేవనెత్తాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగే భేటీలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

11:24 - October 26, 2017

టెన్ టివి సినిమా : తెలగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై మొదట వివాదాలు నడిచిన ఆ తర్వాత అన్ని సమసిపోయాయి. ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ కావడంతో చిత్రం పరభాష రైట్స్ కోసం నిర్మాతలు పోటీపడ్డారు.

తమిళ్, కన్నడ, తెలుగులో సుపరిచితులైన హీరో విక్రమ్ ఆయన ఎప్పడు ప్రయోగత్మకమైన చిత్రాలు తీస్తుంటారు. విక్రం తనయుడు 'ధృవ' వెండితెరకు పరిచయం చేయలని చూస్తున్నాడట దాని కోసం కథలు కూడా వింటున్నాడట అయితే తెలుగు హిట్టైన అర్జున్ రెడ్డి స్టోరి అయితే తన కొడుక్కి బాగుంటుందని విక్రమ్ అనుకున్నారు. దీంతో అర్జున్ రెడ్డి తమిళ్ రైట్స్ ని తీసుకున్నాడని సమాచారం. విక్రమ్ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడు వస్తోందని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి బాల దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభమౌతుందని సమాచారం. చూద్దాం తెలుగులో హిట్టైనట్టే తమిళ్ లో కూడా అర్జున్ రెడ్డి హిట్టవుతుందా....

11:12 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభం కాబోతున్నాయి. దీనితో ఆయా పార్టీ శాసనసభా పక్ష సమావేశాలు గురువారం జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో నెట్టాలి ? ఏ అంశాలపై నిలదీయాలనే దానిపై ఆయా పార్టీల నేతలు చర్చిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జానారెడ్డి అధ్యక్షతనలో కొనసాగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం..అసెంబ్లీ ముట్టడి తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరడం లేదని..రైతు రుణమాఫీ అమలు కావడం లేదు..రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..ఈ నేపథ్యంలోనే తాము చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని టి.కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. మరి టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీ విజయవంతమౌతుందా ? సభలో ప్రభుత్వాన్ని టి.కాంగ్రెస్ ఇరకాటంలో పెడుతుందా ? లేదా అనేది చూడాలి. 

జగ్గయ్యపేట ఛైర్మన్ వైసీపీ అభ్యర్థిపై పలు కేసులు..

కృష్ణా : జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక రసకందాయంలో పడిపోయింది. ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన రాజగోపాల్ (చిన్నా)పై కిడ్నాప్, భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. తనకు మద్దతివ్వాలని 15వ వార్డు టిడిపి కౌన్సిలర్ శౌరికి రూ. 15 లక్షలు ఇస్తానని చిన్నా ఆశ చూపినట్లు...ఒప్పుకోనందుకు శౌరితో సహా కుటుంబసభ్యులను చిన్నా కిడ్నాప్ చేసినట్లు శౌరి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నా తన స్థలాన్ని కబ్జా చేసి బెదిరించారని మరో వ్యక్తి ఫిర్యాదు చేయడం కలకలం రేగింది. దీనితో ఈ పంచాయతీ జగన్ వద్దకు చేరింది. నానిపై ఉన్న కేసుల సమగ్ర నివేదికను జగన్ కు నియోజకవర్గ ఇన్ ఛార్జీ ఉదయ భాను అందచేశారు.

ఐఎస్ తో సంబంధాలున్నాయని..

కేరళ : ఐఎస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ తో సంబంధాలున్నాయని నిన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు

10:09 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి రేపిన వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారతారంటూ వస్తున్న వార్తలపై దుమారం చెలరేగింది. ఆ వార్తలను ఆయన ఖండించినా.. పార్టీ సీనియర్లు శాంతించలేదు. రేవంత్ సరైన స్పష్టత ఇవ్వలేదంటూ రేవంత్‌ తీరును తప్పుపట్టారు. టిడిపిలో జరుగుతున్న పరిణామాలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ సమావేశానికి ఎవరూ హాజరు కావొద్దని రమణ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్లకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పాటు బీజేపీతో కలిసి ఓ ప్రైవేటు హోటల్లో పోటీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రంగ ప్రవేశం చేసి టిడిఎల్పీ సమావేశం రద్దు చేసే విధంగా పావులు కదిపారు. గొల్కోండ హోటల్ లో బీజేపీ నేతలతో జరిగే భేటీ కంటే ముందు ఎల్.రమణతో సండ్ర భేటీ కానున్నారు. బీఏసీలో సమావేశంపై వీరు చర్చించనున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజ్ నాథ్ తో భేటీ కానున్న మెహబూబా..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ ఢిల్లీకి రానున్నారు. నార్త్ బ్లాక్ లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి..తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

09:23 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ టిడిపిలో రాజకీయాలు రసకందకాయంలో పడిపోయాయి. నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలతో రేవంత్ భేటీ కావడంతో ఈ చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. దీనితో టిడిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ సమావేశానికి ఎవరూ వెళ్లవద్దని..సమావేశానికి అనుమతి లేదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొనడంతో పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి.

ఇదిలా ఉంటే గురువారం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రంగంలోకి దిగారు. రేవంతో మాట్లాడి టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు పరిచే విధంగా పావులు కదిపారు. పొత్తులో భాగంగా బీజేపితో కలిసి నడవాల్సి ఉందని పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు పార్టీ అధ్యక్షడు ఎల్.రమణతో ఎమ్మెల్యే వెంకట వీరయ్య భేటీ కానున్నారు. బీఏసీలో ప్రస్తావించాల్సిన అంశాలపై భేటీలో చర్చించనున్నారు. శంషాబాద్ ఏయిర్ పోర్టులో శుక్రవారం ఉదయం 5గంటలకు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగనున్నారు. హైదరాబాద్ లోనే ఉంటారా ? లేక విజయవాడకు వెళుతారా ? అనేది తెలియరావడం లేదు. 

ఎల్.రమణతో భేటీ కానున్న సండ్ర..

హైదరాబాద్ : కాసేపట్లో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణతో ఎమ్మెల్యే వెంకట వీరయ్య సమావేశం కానున్నారు. బీఏసీలో జరిగే సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే టిడిఎల్పీ సమావేశాన్ని రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నారు. 

09:11 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఆందోళన కార్యక్రమాలకు పిలుపినిస్తే పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపుతున్నారు. రైతు సమస్యలు.. ఇతర సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టి.కాంగ్రెస్ శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. కోదాడలో 15 మందిని అదుపులోకి తీసుకోగా నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గృహ నిర్భందం చేశారు. గరిడేపల్లి, హుజూర్ నగర్, సూర్యాపేట, మేళ్ల చెరువులో పలువురు నేతలను ముందస్తు అరెస్టు చేశారు. మేళచెరువులో పలువురు నేతలకు పోలీసులు ఫోన్ చేసినట్లు సమాచారం. ఎటూ వెళ్లవెద్దని పోలీసులు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని నేతలు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ నేతల అరెస్టులు..

నల్గొండ : శుక్రవారం కాంగ్రెస్ నేతల చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు అరెస్టులు చేపడుతున్నారు. కోదాడలో 15 మందిని అదుపులోకి తీసుకోగా నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గృహ నిర్భందం చేశారు. గరిడేపల్లి, హుజూర్ నగర్, సూర్యాపేట, మేళ్ల చెరువులో పలువురు నేతలను ముందస్తు అరెస్టు చేశారు. 

ముగ్గురు మావోల మృతి..?

ఛత్తీస్ గఢ్ : రాజ్ నంద్ గావ్ జిల్లా పల్లెమూడి అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

08:21 - October 26, 2017

వరంగల్ : జిల్లాలోని నర్సంపేట మండలం జయముఖి కాలేజీలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ తీవ్ర సంచలనమైంది. జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడ్డారు. బీటెక్ మెకానికల్ నాలుగో సంవత్సరం చదువుతున్న వారు మూడో సంవత్సరం విద్యార్థులపై దాడి చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి మరీ ఈ ఘటనకు పూనుకోవడం గమనార్హం. ఇద్దరిని చితకబాది అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ ఆ ఇద్దరిని నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి ఎందుకు చేశారనేది తెలియరావడం లేదు. పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెలుగు చూడనున్నాయి. 

08:16 - October 26, 2017

అనంతపురం : తాడిపత్రిలోని హీరో హోండా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఉండడంతో మరొక అగ్నిమాపక యంత్ర సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. రూ. 80 లక్షల వరకు నష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూంలో వంద వాహనాలు..స్పేర్ పార్ట్స్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని యజమాని పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

08:12 - October 26, 2017

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో నేరాలు..ఘోరాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆత్మహత్యలు..హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కావడం కలకలం రేపుతోంది. ఇది ఆత్మహత్య ? హత్యా ? అనేది తెలియరావడం లేదు.

నాగేశ్వరరావు అనే వ్యక్తి లక్ష్మీ అనే మహిళను ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. కామవరపు కోట (మం) వీధిశెట్టి వారి గూడెంలో నివాసం ఉంటున్నారు. ఇది అతనికి రెండో వివాహం. మొదటి భార్య కూతురు అన్నపూర్ణ (11) ఉంది. లక్ష్మీకి లావణ్య (5) కూతురుంది. ఇంట్లో ఆడపడుచు రంగమ్మ, మేనల్లుడు మణికంఠ (12)లున్నారు. గత కొంతకాలంగా లక్ష్మీ..నాగేశ్వరరావు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు..ఈ విషయంలో లక్ష్మీ ఇటీవలే పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజామున వీరు ఉంటున్న నివాసంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీ (30), అన్నపూర్ణ (11), లావణ్య (5), మణికంఠ(12)లు సజీవదహనమయ్యారు. రంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. కూతుళ్లపై కిరోసిన్ పోసి లక్ష్మీ బలవన్మరణానికి పాల్పడిందా ? లేక ఎవరైనా కిరోసిన్ చల్లి..నిప్పు పెట్టారా ? అనేది తెలియరావడం లేదు. నాగేశ్వరరావు సంఘటనాస్థలానికి మాత్రం రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

వీధిశెట్టి వారి గూడెంలో అగ్నిప్రమాదం...

పశ్చిమగోదావరి : కామవరపు కోట (మం) వీధిశెట్టి వారి గూడెంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో లక్ష్మీ (30), అన్నపూర్ణ (11), లావణ్య (5), మణికంఠ(12)లున్నారు. 

వీధిశెట్టి వారి గూడెంలో అగ్నిప్రమాదం...

పశ్చిమగోదావరి : కామవరపు కోట (మం) వీధిశెట్టి వారి గూడెంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో లక్ష్మీ (30), అన్నపూర్ణ (11), లావణ్య (5), మణికంఠ(12)లున్నారు. 

06:42 - October 26, 2017

ఢిల్లీ : కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. తప్పక గెలవాల్సిన పోరులో ఒత్తిడిని చిత్తుచేసింది. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. కాన్పూర్‌లో ఆదివారం జరిగే అంతిమ సమరంలో రెండు జట్లు చావోరేవో తేల్చుకుంటాయి. న్యూజిలాండ్‌తో ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది.

స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కొద్దిసేపటికే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో జట్లుస్కోరు 79 పరుగులు ఉండగా 29 పరుగులు చేసిన కోహ్లీ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శిఖర్ ధవన్.. దినేశ్ కార్తీక్‌తో కలిసి స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో వన్డేల్లో తన 22వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ధవన్‌. మొత్తం 84 బంతులు ఎదుర్కొన్న ధవన్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా 30 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు దినేశ్‌ కార్తీక్ తన దూకుడును కంటిన్యూ చేశాడు. 92 బంతుల్లో 4 ఫోర్లుబాదిన దినేశ్‌ కార్తీక్‌ 64 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా ఔటైన త్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ 18 పరుగులతో మిగతాపని పూర్తిచేశాడు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరువికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది కోహ్లీ సేన.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ 11 పరుగులు, కోలిన్ 10, కానె విలిమ్సన్ 3, ఆడం మిల్నె సున్నా పరుగులతో విఫలమయ్యారు. రాస్ టేలర్ 21 పరుగులు టామ్ లాథమ్ 38, హెన్రీ నిఖోల్స్ 42 గ్రంథోమ్ 41 రన్స్‌ చేయగా.. సాంట్నెర్ 29, టిమ్ సౌథీ 25 పరుగులతో నాటౌట్ నిలిచి పరవాలేదనిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా జస్ప్రిత్ బుమ్రా , చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. 3వికెట్లు తీసిన భువనేశ్వర్‌ కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. తొలి వన్డేలో ఓటమికి కాన్పూర్‌లో ప్రతీకారం తీర్చుకున్న విరాట్‌ ఆర్మీ.. 1-1తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ఆదివారం కాన్పూర్‌లో జరిగే అంతిమ సమరంలో రెండు జట్లు చావోరేవో తేల్చు కోనున్నాయి. 

06:40 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ విద్యార్థుల ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం ఏర్పాటు చేసిన దోస్త్‌ వ్యవస్థపై గందరగళం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు విద్యార్థులు దోస్త్‌ విధానంతో అడ్మిషన్లు కోల్పోయామని చెబుతోంటే.... దోస్త్‌లో ఎలాంటి లోపాలు లేవని.... సమస్యలుంటే తాము పరిష్కరిస్తామని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ఆది నుంచి ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. నిత్యం విద్యార్థుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దోస్త్‌ విధానంలోని లోపాలతో చాలా మంది విద్యార్థులు అడ్మిషన్లు కోల్పోయారు. మరికొంత మందికి వచ్చిన అడ్మిషన్‌ కూడా రద్దవుతోంది. ఇదీ దోస్త్‌ విధానంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి.

హైదరాబాద్ చంచల్‌గూడలోని ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థికి అడ్మిషన్‌ వచ్చింది. దీంతో అతడు ధ్రువపత్రాలు తీసుకుని కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిశాడు. అయితే ఆన్‌లైన్‌లో అతని అడ్మిషన్‌ మాత్రం రద్దు అయ్యింది. దీంతో ఆ ప్రిన్సిపాల్‌ చేసేదేమీలేక తమ కాలేజీలో సీటు క్యాన్సిల్‌ అయ్యిందంటూ ఆ విద్యార్థిని తిరిగి పంపించేశారు. ఇది ఒక్క చంచల్‌గూడ కాలేజీ పరిస్థితేకాదు.. యావత్‌ తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొంతమందికి ఆన్‌లైన్‌లో పొరపాట్ల కారణంగా అడ్మిషన్స్‌ కోల్పోయారు. వారు పదేపదే మొరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో తమ విద్యాసంవత్సరం వృధా అవుంతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దోస్త్‌తో విద్యావ్యవస్థ అంతా అస్తవ్యస్తమైందని... తాము చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అయితే దోస్త్‌లో చిన్నచిన్న లోపాలు తలెత్తిన మాట వాస్తవమేనని అధికారులు చెబుతున్నారు. చిన్న తప్పిదాలతో విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికావొద్దని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి చెబుతున్నారు. ఒకచోట సీటు వచ్చిన విద్యార్థి అక్కడ రిపోర్టు చేయకుండా ఉంటేనే సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు. ఒకచోట సీటు వచ్చిన విద్యార్థి అక్కడ నచ్చక వేరేచోట మళ్లీ దరఖాస్తు పెట్టుకోవడంతో రెండుచోట్ల సీటు రద్దు అయిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వెంటనే ఈ లోపాలను సరిచేస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం తీసుకొచ్చిన దోస్త్‌ విధానం విద్యార్థులను కలవరపెడుతోంది. లోపాలను సరిచేయకుంటే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

06:37 - October 26, 2017

ఒంగోలు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో దీనిని నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఒంగోలులో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో సమావేశమైన లోకేశ్‌.. ప్రతి ఇంటికి విద్యుత్‌తో పాటు వంటగ్యాస్‌, నీటి కనెక్షన్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్న విషయాన్ని సర్పంచ్‌ల దృష్టికి తెచ్చారు. 

06:35 - October 26, 2017

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ రెడీ అవుతోంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. జగన్ పాదయాత్రతోపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలనే అంశంపై అధినేత దిశా నిర్దేశం చేయనున్నారు.

మరోవైపు నవంబర్ 6వ తేదీ నుంచి మొదలయ్యే పాదయాత్ర ప్రారంభం అవుతోంది. పాదయాత్రకు ప్రాధాన్యత తగ్గించడానికే .. టీడీపీ వ్యూహం పన్నినట్టు వైసీపీ భావిస్తోంది. జగన్‌ పాదయాత్రకు కౌంటర్‌గానే టీడీపీ ప్రభుత్వం ఇపుడు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయిందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని వైసీపీ అధినాయకత్వం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

పాదయాత్ర మొదలైతే శాసనసభా సమావేశాలకు హాజరు కావాలా, వద్దా అన్న అంశం కూడా పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే అధికార పార్టీ నుంచి మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విషయంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జగన్‌ పాదయాత్రనే ప్రాధాన్యతగా భావిస్తే అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభా ఉపనేతలుగా ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సభలో ప్రభుత్వ వైఖరిని మాత్రం ఎండగట్టేందుకు కూడా వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందు పరిచిన పలు అంశాలను సభలో లేవనెత్తడానికి తమ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి పాదయాత్రతో అటు ప్రజాక్షేత్రంలో దూసుకుపోవడంతో పాటు ఇటు చట్టసభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ద్విముఖ వ్యూహానికి వైసీపీ సిద్ధం అవుతోంది.  

బీజేపీ ఎమ్మెల్యేలతో టి.టిడిపి సమావేశం..

హైదరాబాద్ : టి.శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీతో కలిసి గురువారం నాడు టి.టిడిపి అధ్యక్షుడు రమణ ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రమణ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు.

06:29 - October 26, 2017

హైదరాబాద్ : శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హీటెక్కిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజాసమస్యలపై ఇరుపక్షాలు ఏమేరకు చర్చ జరుపుతారో తెలియదుకానీ.... పోటీపడి మరీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇరు వర్గాల వాలకం చూస్తోంటే వింటర్‌ సెషన్‌.. సమ్మర్‌ను మించిపోయేయలా ఉంటుందని చెప్పకనే చెబుతోంది.

తెలంగాణ సర్కార్‌ సకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అధికార ప్రక్రియ ప్రారంభించింది. ఈ అంశమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. దీనికి తోడు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇంకేముంది.. ఎవరికి వారే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే అధికారపార్టీయే ఒక అడుగు ముందువరుసలో ఉంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోలేదు. సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

కాంగ్రెస్‌ పిలుపు అధికారపార్టీలో సెగలు రేపుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలంతా ఛలో అసెంబ్లీకి రైతులు రావొద్దని మంత్రులు చెబుతున్నారు. తాము చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తోంటే... ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఇలాంటి పిలుపులు ఇస్తున్నాయని మండిపడ్డారు.

ఇక వామపక్షాలు కూడా టీ-మాస్‌ పేరుతో తీసుకున్న సామాజిక అంశాలపై...ఈ సెషన్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. గుత్తికోయలపై దాడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, గొర్రెలు, మేకల పంపిణీలో అవకతవకలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టుల తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీపీఎం సిద్ధమైంది. బీజేపీ కూడా సర్కార్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం రచిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. 

06:27 - October 26, 2017

ఢిల్లీ : రాజధాని అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ స్థూపాకారంలో రూపొందించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ భవనం ఆకృతిపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తాజాగా రూపొందించిన డిజైన్‌పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వీటితో పాటు సచివాలయం, వివిధ శాఖల అధికారుల కార్యాలయాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అన్న అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. దీనిపై మరింతగా చర్చించి తుది నిర్ణయం తీకుంటామని చంద్రబాబు తెలిపారు.

లండన్‌ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం యూకే మినిష్టర్‌ ప్రీతి పటేల్‌తో భేటి అయ్యారు. అమరావతి నిర్మాణం, పాలనా సంస్కరణలు, టెక్నాలజీ వినియోగాలపై చర్చించారు. ఐరోపా, యూకేలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను అందించి ఏపీ అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు కోరారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నట్టు చంద్రబాబునాయుడు ఆయనకు తెలియజేశారు.

అదేవిధంగా యూకేలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ శాంటండర్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ ఉత్పత్తుల విక్రయాల్లో అక్కడి ఎగుమతిదారులకు, యూకేలో దిగుమతిదారులకు సాయం అందించడానికి బ్యాంక్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఆహారోత్పత్తుల తయారీ, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించాలని చంద్రబాబు కోరారు. కాగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపై కూడా చంద్రబాబునాయుడు లండన్‌ నుంచే స్పందించినట్టు తెలుస్తోంది. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్‌రెడ్డికి ఉన్న అధికారాలన్నిటినీ తొలగిస్తున్నట్టు చెప్పినట్లు సమాచారం. 

06:24 - October 26, 2017

ఢిల్లీ : పోలవరం సమస్యలపై కేంద్ర జలవనరుల శాఖ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుపై మసూద్‌ హుస్సేన్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష జరిపిన కేంద్ర మంత్రి నిత్‌న్‌గడ్కరీ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్‌ను మార్చేదిలేదని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్‌ నుంచి ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జలవనరుల శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2019లోపు పూర్తి చేయాలనేది తమ సంకల్పం అని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దీనికోసం రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్నివిధాల సహాయం అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖల మంత్రులు, అధికారులు హాజరైన ఈ భేటీలో పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్‌ నుంచి ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రధాన కాంట్రాక్టర్‌ బిల్లులు చెల్లించకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్లు పనుల్లో జాప్యం చేస్తున్న అంశంపై కూడా చర్చ జరిగింది. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ నుంచి సరిగా చెల్లింపులు జరగటంలేదని నితిన్‌ గడ్కరీకి.. పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. ప్రత్యేక అకౌంట్‌ ద్వారా సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర జలవనరులు శాఖల నుంచి ఒక్కో అధికారితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక కాంట్రాక్టు సంస్థ మార్పుపై స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. కాంట్రాక్టర్ మారితే ప్రాజెక్ట్ అంచనావ్యయం పెరుగుతుందని గడ్గరీ మరోసారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ జలవనరుల శాఖా మత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టుకు సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, హెడ్ వర్క్స్ కు ఇప్పటికే 12వేల 729 కోట్లు ఖర్చు అయినట్టు మంత్రి తెలిపారు. అటు ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి 7429 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం 4వేల 329 కోట్లు కేంద్రం చెల్లించిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీలో నిర్వాసితుల పరిహారంపై మాత్రం క్లారిటీ రాలేదు. చర్చ ఆసాంతం.. కాంట్రాక్టర్లు, వారి సమస్యల పైనే మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ .. నిర్వాసితుల సమస్యకు అరుణ్‌జైట్లీ, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దాంతో పాటు నిర్వాసితులకు పరిహారం, భూసేకరణ, పునరావాస వ్యయాన్ని ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో కలపొద్దన్న కేంద్ర మంత్రి.. సమస్యకు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాలని రాష్ట్ర అధికారులకు సూచించడం కొసమెరుపు. అంటే నిర్వాసితులకు పరిహారం బాధ్యత ఇక రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పినట్టైందనే విమర్శలు వస్తున్నాయి. 

06:20 - October 26, 2017

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసుద్దీన్‌ ఓవైసీ సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. టోలీచౌకిలోని అక్తర్‌, శాస్త్రీపురంలోని షానవాజ్‌ హుస్సేన్‌, చార్మినార్‌లోని ఉబెద్‌తోపాటు మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓ భారీ భూకొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు కొరడా ఝలిపించారు. 

వైసీపీ శాసనసభా పక్ష సమావేశం..

హైదరాబాద్ : నేడు ఉదయం 11.30గంటలకు వైసీపీ శాసనాసభా పక్ష సమావేశం జరుగనుంది. ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం..సభకు హాజరు కావాలా ? వద్దా ? జగన్ పాదయాత్ర అంశంపై నేతలు చర్చించనున్నారు. 

టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం..

హైదరాబాద్ : మధ్యాహ్నం 3గంటలకు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై చర్చ జరుగనుంది. 

టి. బీఏసీ సమావేశం..

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 12గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. శుక్రవారం నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. శాసనసభాపతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. 

నగరంలో ఐటీ అధికారుల సోదాలు..

హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులుసోదాలు నిర్వహించారు. ఇటీవలే భారీ భూ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. టౌలిచౌకీలో అక్తర్, శాస్త్రీపురంలో షానవాజ్ హుస్సేన్, చార్మినార్ లోని ఉబెద్ తో పాటు మరికొందరు ఇళ్లలో సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. 

Don't Miss