Activities calendar

27 October 2017

రేపటి సభకు వెళ్లకుండా ఐలయ్యను అడ్డుకోవడం సరికాదు : జాన్ వెస్లీ

హైదరాబాద్ : విజయవాడలో రేపటి సభకు వెళ్లకుండా ఐలయ్యను అడ్డుకోవడం సరికాదని టీమాస్ ఫోరం నేత జాన్ వెస్లీ అన్నారు. ప్రభుత్వం సభకు అనుమతి ఇవ్వకపోతే టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. 

నన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికం : కంచ ఐలయ్య

హైదరాబాద్ : తనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని కంచ ఐలయ్య అన్నారు. పోలీసుల చర్య వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవమే అవుతుందని తెలిపారు. 

21:56 - October 27, 2017

చెన్నై : తమ గ్రామస్తుడిని కొట్టి చంపారన్న కారణంతో స్థానికులు ఓ అటవిశాఖ అధికారిని చితకబాదిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన తిరుమలై ఇసుక కోసం ఎడ్లబండిపై వాగుకు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ వాగులో ఇసుక తోడుతుండగా అటవీశాఖ సిబ్బంది తిరుమలైని అడ్డుకుని దాడి చేసింది. ఈ దాడిలో తిరుమలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనాస్థలానికి వెళ్లి అటవీశాఖ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది కాలికి బుద్ధి చెప్పగా... ఓ అధికారి గ్రామస్తుల చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా వారిపై కూడా ప్రజలు దాడి చేశారు. పోలీసులు గ్రామస్థుల నుంచి ఆ అధికారిని కాపాడి చెంగం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.

21:53 - October 27, 2017

ఛత్తీస్‌గడ్‌ : బిబిసి మాజీ జర్నలిస్ట్‌ వినోద్‌వర్మను ఛత్తీస్‌గడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెక్స్‌ వీడియోకు సంబంధించి ఛత్తీస్‌గడ్‌ మంత్రిని బ్లాక్‌ మెయిల్‌ చేశారన్న ఆరోపణలతో సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌ను ఇవాళ ఉదయం పోలీసులు గజియాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.  సెక్స్ స్కాండల్‌తో సంబంధం ఉన్న ఆ మంత్రి పేరు రాజేష్‌ మునత్‌గా ఓ మీడియా సంస్థకు వినోద్‌ వెల్లడించారు. మంత్రికి చెందిన స్కాండల్‌ కావడంతో కావాలనే తనని ఇరికించినట్లు వినోద్‌ పేర్కొన్నారు. అరెస్ట్‌కు ముందు ఢిల్లీలోని ఓ వీడియో పార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. వినోద్‌ 1000 సీడీలను తయారు చేయాలని కోరినట్లు ఆ వీడియో నిర్వాహకుల నుంచి సమాచారం రాబట్టారు. వినోద్‌ ఇంటి నుంచి 5 వందల సీడీలు, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద కేవలం ఓ పెన్ డ్రైవ్ ఉందని, సీడీలతో తనకు సంబంధం లేదని, నన్ను ఈ కేసులో ఇరికించారని వినోద్ తెలిపాడు. పోలీసులు ఆరు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత వినోద్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనను ప్రెస్‌పై దాడిగా ఆప్ నేత ఆశుతోష్ ట్వీట్ చేశారు.

 

21:49 - October 27, 2017

కర్నాటక : డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనలో కర్ణాటక మంత్రి కేజే జార్జ్‌పై కేసు నమోదైంది. గణపతి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలతో జార్జ్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొడగు జిల్లా డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గణపతి గత ఏడాది జూలైలో ఆత్మహత్య చేసుకున్నారు. తనను మంత్రి, ఇద్దరు సీనియర్‌ అధికారులు వేధిస్తున్నారని గణపతి చెప్పారు. ఈ ఘటనపై మంత్రితో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నమోదు చేశారు. గణపతి హత్యతో వీరికి సంబంధం లేదని పోలీసులు కేసు మూసివేశారు. దీంతో గణపతి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సిబిఐకి అప్పగించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన సిబిఐ అధికారులు జార్జిపై చార్జిషీటు దాఖలు చేశారు.

 

21:48 - October 27, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లా పర్యటనలో ఉన్న సోనియా హుటాహుటిన అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకొని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.  ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల సోనియా గాంధీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది సోనియాగాంధీ అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని త్వరలోనే పార్టీ పగ్గాలను స్వీకరిస్తారని సోనియా ఇదివరకే ప్రకటించారు.

 

21:46 - October 27, 2017

విజయవాడ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సభలు, సమావేశాలకు అనుమతిచ్చేది లేదన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఒకేసారి, ఒకే సమయంలో ఇరు వర్గాలకు చెందినవారు సభకు అనుమతి కోరారని... ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు రెండు సభలకు అనుమతి నిరాకరించామన్నారు. అందరూ పోలీసులకు సహకరించాలన్నారు సాంబశివరావు. 

21:43 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. రైతుల సమస్యపై చర్చించేందుకు పాలకులు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్‌ పాలన నాటి నిజాం పాలనను మించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే గందరగోళంగా కొనసాగాయి. సభలో రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు వాయిదా తీర్మానాలిచ్చాయి. అయితే విపక్ష వాయిదా తీర్మానాలను పట్టించుకోని డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కనీసం వాయిదా తీర్మానాలపై ప్రొటెస్ట్‌ చేసేందుకు కూడా అనుమతివ్వలేదని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. సభను తమ ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటామన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు జానారెడ్డి. 

ఇక డిప్యూటీ స్పీకర్‌ తీరు అభ్యంతరకరంగా ఉందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాలు, రైతుల సమస్యలను పట్టించుకోని సర్కార్‌... ఎన్ని రోజలు సభ జరిగితే ఏంటని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 

తాను చెప్పిందే వినాలన్న ధోరణిలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ. రైతులపక్షాన నిరసనలు చేస్తే ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. మరోవైపు డ్రగ్స్‌ మాఫియాపై తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండానే వాయిదా వేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే పబ్బులు నిర్వహిస్తూ... డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు రేవంత్‌. 

సభ జరిగిన తీరు సరిగా లేదన్నారు బీజేపీ నేతలు. ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే సభను ఎలా కొనసాగిస్తారని... ప్రజాస్వామ్య పద్దతిలో సభ నిర్వహించాలన్నారు కిషన్‌రెడ్డి. 

మొత్తానికి తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిచాయి. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని..  ఇలాంటి పరిస్థితుల్లో సభ నడిపినా, నడపకపోయినా ఒక్కటేనని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

21:40 - October 27, 2017

వస్తుందా? నిజమేనా? మనకు అంత అవసరమా? ఎప్పటికవ్వాలి? వచ్చాక చూద్దాం లే..!! ఇలా అనేక కామెంట్స్ ...కొన్నేళ్లుగా నగరవాసి వింటూ ఉన్నాడు. ఫైనల్ గా అన్ని విమర్శలకు, అవాంతరాలకు, ఆలస్యాలకు సమాధానంగా మెట్రో పట్టాలెక్కబోతోంది. తొలివిడత ఓ 30 కిలోమీటర్లు పరుగులు తీయబోతోంది. మరి మెట్రో నగర ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందా? నగర ప్రజారవాణా వ్యవస్థను సమూలంగా మారుస్తుందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. నగరంలో మెట్రో పరుగులు తీయనుంది. మరో నెలరోజుల్లో భాగ్యనగరానికి మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. ప్రధాని పచ్చజెండా ఊపబోతున్నారు. మూడు కారిడార్ల మెట్రోలో... ఒక మార్గంలో ప్రస్తుతానికి కోచ్ లు నడవనున్నాయి. ఈ సౌకర్యం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:29 - October 27, 2017

చండీయాగంతోనే వానలు వడ్తున్నయట, సిట్టింగులకే సీట్లంటున్న సీఎం సారు, కన్నతల్లి, పెంచిన తల్లి ఇద్దరి అరెస్టు, గుప్తనిధుల కేసుల జేసీబీ బండి అరెస్టు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:22 - October 27, 2017

ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ, స్త్రీ చైతన్యం ముఖ్యమని చెప్పడానికి తీసిన సినిమా ‘అనగనగా ఒక దుర్గ’దర్శకుడు ప్రకాష్ పులిజాల,నిర్మాత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి నూతన నటినటులతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చుద్దాం.
కధ విషయానికొస్తే...
ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చెరువులో పడేస్తాడు దుర్గ (ప్రియాంక నాయుడు) తండ్రి. మృత్యుంజయురాలై తిరిగొస్తుంది దుర్గ. పాప పెద్దయ్య (మేకా రామకృష్ణ) బాలికను కాపాడి ఇంటికి చేరుస్తాడు. తండ్రి నుంచే వివక్ష ఎదుర్కొన్న దుర్గ పెరిగి పెద్దదువుతుంది. ఆమె యవ్వనంలో అడుగుపెట్టేప్పటికి ఆంక్షలు మొదలవుతాయి. బయటకు వెళ్లడం, సరదాగా స్నేహితులతో ఆటలాడటం వద్దంటాడు తండ్రి. ఇంతతో ఊరి పెద్ద రావూజీ (కాళీచరణ్ సంజయ్) కన్నుదుర్గపై పడుతుంది. రావూజీ స్త్రీ లోలుడు. ఊరిలో కనిపించిన ప్రతి అమ్మాయినీ బలవంతంగా అనుభవిస్తుంటాడు. తమను పరుగు పందెంలో ఓడించిందన్న కోపంతో రావూజీ మనుషులు దుర్గను గ్యాంగ్ రేప్ చేస్తారు. పంచాయితీ పెద్దలే రావుజీ తొత్తులే కాబట్టి దుర్గదే తప్పని తీర్పిస్తారు. ఇలాంటి దుర్మార్గుల్ని దుర్గ ఎలా ఎదుర్కొందన్నది మిగిలిన కథాంశం
నటినటుల విషయానికొస్తే ....
దుర్గ పాత్రలో ప్రియాంక పెర్ఫార్మెన్స్ బాగుంది. మొదట్లో సరదాగా ఉండే యువతిగా, తర్వాత తిరగబడే శక్తిలా తన అభినయంతో ఆకట్టుకుంది. దుర్గ పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసింది. క్రాంతి పాత్రలో క్రాంతి కుమార్, రావూజీ క్యారెక్టర్ లో కాళీచరణ్ సంజయ్ మంచి నటన కనబరిచారు. గెటప్ శ్రీను, సత్య కృష్ణ పాత్రలకు ప్రాధాన్యత కనిపించింది..
టెక్నీషియన్స్ విషయానికొస్తే....
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కళ్యాణ్ సమీ..సినిమాటోగ్రఫీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు.స్వరాలు కూర్చిన విజయ్ బాలాజీ సంగీతం అక్కడక్కడా మెప్పించింది ఆడబిడ్డ రుధిరంతో అనే పాట హృద్యంగా సాగుతుంది. దర్శకుడు ప్రకాష్ పులిజాల కథనానికి తీసుకున్న స్ఫూర్తి బాగున్నా దాన్ని రాసుకున్న తీరు చాలా పేలవంగా ఉంది. కొద్దిగా కమర్షియల్ అంశాలని జోడించి, మంచి కథనాన్ని రాసుకుని, కొంత అనుభవం కలిగిన నటీనటుల్ని ఎంచుకుని ఉంటే బాగుండేది.
చివరగా...
‘అనగనగా ఒక దుర్గ’ సినిమా నైపథ్యం పరంగా మెచ్చుకోదగ్గదిగా ఉన్నా తీసిన విధానం, హీరోయిన్ మినహా మిగతా నటీనటుల నటన సరిగా లేకపోవడంతో ఔట్ ఫుట్ గొప్ప స్థాయిలో రాలేదు. సామాజికచైతన్యాన్ని ప్రస్తావించే సినిమాల్ని ఇష్టపడే వారికి పర్వాలేదనిపించవచ్చు.కానీ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్సుకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.

ఫ్లస్ పాయింట్స్
ప్రియాంక నటన
సంగీతం

మైనస్ పాయింట్స్
పాత కథ
సినిమాటోగ్రఫీ

21:15 - October 27, 2017

కమర్షియల్ సినిమాలు అంటూ పక్కదారి పట్టిన రామ్.. నేను శైలజాతో హిట్ ట్రాక్ లోకి తెచ్చాడు, డైరక్టర్ కిషోర్ తిరుమల. అందుకే అదే  నమ్మకంతో అతనికి ఫ్రీడమ్ ఇచ్చి, ప్రొడ్యూసర్ గా కూడా మారి. కిషోర్ తిరుమల డైరక్షన్ లో ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేశాడు రామ్.. ఆడియో ఆల్బాం సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..  పైగా హిట్ కాంబినేషన్ కావడంతో, ఆ అంచనాలు మరింత పెరిగాయి..  అలా విడుదలకు ముందే మంచి బస్ క్రియేట్ చేసుకున్న ఉన్నది ఒక్కటే జిందగీ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది..  ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ 
కథ విషయానికి వస్తే... చిన్న తనంలోనే కొన్ని సంఘటనల వల్ల, అభి, వాసు ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఫ్రెండ్ షిప్ తరువాతే ఏదైన అనేంత రేంజ్ లో వాళ్ళ ఫ్రెండ్ షింప్ ఉంటుంది.... అయితే అలా ఉన్న వాళ్ల లైఫ్ లోకి, అనుకోకుండా మహా ఎంట్రీ ఇస్తుంది.. ఇద్దరూ ఆమెను ఇష్టపడతారు.. ఇద్దరూ కలిసి ఆమెకు ప్రపోజ్ చేస్తారు... అయితే మహా మాత్రం వాసుని ఇష్టపడుతుంది.. దాంతో వాసు బిహేవియర్ లో ఛేంజ్ రావడంతో.. వాసు అభి విడిపోతారు.. అయితే వాళ్లిద్దరూ తిరిగి కలిసారా లేదా.. వాళ్ల మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయాయా లేదా..;ః? ఫ్రెండ్ షిప్ కి వీళ్ళిచ్చిన కొత్త నిర్వచనం ఏమిటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...
నటీ నటులు
నటీ నటుల విషయానికి వస్తే.. ఈ సినమా కథను, డైరెక్టర్ ను పూర్తిగా నమ్మిన రామ్ అభి క్యారక్టర్ లో ఓదిగిపోయి నటించాడు. హీరోయిజం చూపించాలి అన్న తపన లేకుండా, సెటిల్ యాక్టింగ్ తో అలరించాడు. రామ్ తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ లో కూడా చాలా మెచ్యూరిటీ చూపించాడు.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కొంచెం పెద్ద తరహా క్యారక్టర్ ఇది. స్వతహాగా మంచి పెర్ఫామర్ కావడంతో, చాలా ఈజీగా మహాపాత్రను ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది.. ఈ మధ్య పెద్దగా హిట్స్ లేని లావణ్య త్రిపాఠి. తనలోని గ్లామరస్ యాంగిల్ పైన ఫోకస్ పెట్టింది. సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి వాసు క్యారక్టర్ చేసిన శ్రీవిష్ణు, ఆ పాత్రలో చాలా నాచ్యూరల్ గా కనిపించాడు.. ఈ సినిమా అంతా ఒకే మూడ్ ను కారీ చేసాడు.. ప్రియదర్శ అక్కడక్కడా తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించాడు.. ఇక మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిది మేరకు నటించారు.. 
టెక్నీషియన్స్  
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు రచయితా దర్శకుడైన కిషోర్ తిరుమల, కథ గ్రాఫ్ లో సినిమా టేకాఫ్ లో చాలా వరకు నేను శైలజాను ఫాలో అయ్యాడు అనిపిస్తుంది..  ఎమోషన్స్ ను పండించడంలో సక్సెస్ అయ్యాడు కాని, వాటిని బ్యాలన్స్ చేయడంలో కొంచెం తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ చాలా డీసెంట్ గా, క్యూట్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా మలచిన డైరక్టర్, సెకండ్ ఆఫ్ లో కిచ్చే సరికి రొటీన్ పాట్రన్ ఫాలో అవ్వడం కాస్త నిరుత్సహ పరుస్తుంది.. డైలాగ్స్ బాగున్నాయి.. కెమేరా విషయానికి వస్తే.. సీనియర్ సినమాటోగ్రాఫర్ అయిన సమీర్ రెడ్డి పూర్తి న్యాయం చేశాడు.. సీన్ లో మూడ్ ను ఎక్కడా.. డీబియేట్ కాకుండా కాపాడాడు..  ఇక ఈ సిమాకు హిట్ ఆల్బమ్ ను అందించిన దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా తన మార్క్ చూపించాడు.. సీన్స్ లో ఫీల్ ను ఎలివేట్ చేయడంలో ప్రధాన్ పాత్ర వహించాడు దేశిశ్రీ.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే ప్రెండ్ షిప్ మూవీల లిస్ట్ లో.వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలవాల్సిన ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లేలో  కొన్ని లోపాల వల్ల పర్వాలేదు అనిపిస్తుంది.. సినిమాకు ఎమోషనల్ కంటెంట్ మల్టీప్లెక్స్ జనాలకు కనెక్ట్ అవుతుంది.. బిసీ సెంటర్స్ లో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.. 

ప్లస్ పాయింట్స్
మెయిన్ లీడ్స్ నటన
ఎమోషనల్ కంటెంట్ 
మ్యూజిక్
సినిమాటోగ్రాఫీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
రొటీన్ క్లైమాక్స్
బాలెన్స్ లేని స్క్రీన్ ప్లే
స్లో నేరేషన్

రేటింగ్ 2.25/5

కంచ ఐలయ్యకు ఏపీ పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌ : తార్నాకలో కంచ ఐలయ్యకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విజయవాడ సభకు అనుమతి లేదని ఏపీ పోలీసులు తెలిపారు. సభతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమతి ఇవ్వలేమన్నారు. ఐలయ్య నివాసం వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐలయ్య బయటకు వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. 

20:38 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజునే గందరగోళం మధ్య సాగాయి. సభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అర్చకుల జీతాలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ స్పందించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... కొంతమంది కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు సీఎం.

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని గంట నుంచి గంటన్నరకు పెంచారు. అయితే.. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు సభ్యుల నినాదాల మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది.

ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అర్చకులు, ఇమామ్‌ల వేతనాల అంశంపై మాట్లాడారు. అర్చకులకు ఏ విధంగా గౌరవ వేతనం చెల్లిస్తున్నారో అదే పద్ధతిలో మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కోరారు. రాష్ట్రంలో కొంతమంది అర్చకులకే ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తున్నారని.. అన్ని దేవాలయాల సిబ్బందికి ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాలను త్వరలోనే తీసుకుంటామన్నారు. వారికి గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. 

అనంతరం ఆశావర్కర్లపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లకు ప్రభుత్వం 6 వేల రూపాయలు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఇక కాంగ్రెస్‌ ఆందోళనపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ స్పందించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా... కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. 

ఇక కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి ఈటల సమాధానమిచ్చారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే 579 మందిని క్రమబద్దీకరించామని... మిగతావారిని క్రమబద్దీకరించే విషయంలో కోర్టులో కేసు నడుస్తుందన్నారు. తుది ఉత్తర్వులు రాగానే సమస్య పరిష్కరిస్తామన్నారు ఈటల. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య కోరారు. సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. అర్ధాకలితో ఎవరూ పని చేయకూదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నాడు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ప్రవేశపెట్టినవారే.. క్రమబద్దీకరణ ఆపాలంటూ కోర్టుకెక్కారన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తామని... త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

ఇక హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ చలాన్ల అంశాన్ని అక్బరుద్దీన్‌ లేవనెత్తారు. చలాన్ల పేరుతో పోలీసులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై హోంమంత్రి నాయిని.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. అయితే... తాను ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను అక్బరుద్దీన్‌ సభ దృష్టికి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 9 వేల నుంచి 10 వేల చలాన్లు వేస్తున్నారని దీని ద్వారా.... 9 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. 

ఇక రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రైతు వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. ఇక ప్రశ్నోత్తరాల అనంతరం... విపక్షాల వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. 

 

20:25 - October 27, 2017

హైదరాబాద్ : ఏపీ పోలీసుల తీరుపై కంచ ఐలయ్య మండిపడుతున్నారు. విజయవాడ సభకు వెళ్లవద్దని తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. రేపటి సభలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్, ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శాంతియుతంగా జరుపుకునే సభకు అనుమతి ఇవ్వాలంటున్న కంచ ఐలయ్యతో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:17 - October 27, 2017

హైదరాబాద్‌ : తార్నాకలో కంచ ఐలయ్యకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విజయవాడ సభకు అనుమతి లేదని ఏపీ పోలీసులు తెలిపారు. సభతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమతి ఇవ్వలేమన్నారు. ఐలయ్య నివాసం వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐలయ్య బయటకు వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. అయితే తనని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని ఐలయ్య అన్నారు. శాంతియుతంగా సభ జరుగుతుందని చెప్పినా ప్రభుత్వం అడ్డుకోవడం వాక్‌ స్వాతంత్ర్యంను అడ్డుకోవడమేనన్నారు. సభను అడ్డుకుంటే టీ మాస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. 

 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోన్న టీడీపీ ప్రభుత్వం : మధు

విజయవాడ : పుస్తకాల రాసుకునే స్వేచ్ఛ..విమర్శించే హక్కు ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. సభలు, సమావేశాలకు అనుమతివ్వాలని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. 

 

సోనియా గాంధీకి అస్వస్థత

ఢిల్లీ : సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లా నుంచి హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. గంగారామ్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

20:03 - October 27, 2017

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంత ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వేలల్లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు అరకొరగానే జరిగాయి. రైతులు తమకున్న సందేహాలు, సమస్యలతో రిజిస్ట్రేషన్లపై ఆసక్తి చూపడం లేదు. ఇంతకీ రిజిస్ట్రేషన్ విషయంలో ఉన్న సమస్యలేంటి? 
రైతుల్లో అంతంతమాత్రంగా స్పందన 
ఏపీ రాజధాని ప్రాంతంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో.. 27 గ్రామాల రైతులకు ప్రభుత్వం 60 వేలకు పైగా ప్లాట్లు కేటాయించింది. భూ సమీకరణ పథకం ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అన్నీ ఏర్పాటు చేశామని, కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సీఆర్డీఏ కమిషనర్ రైతులకు మొబైల్స్‌లో మెసేజ్‌లు చేశారు. అయినా రైతుల్లో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ సందేశాలతో పాటు కరపత్రాలను రైతుల ఇళ్లకు పంపారు. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌, సీలింగ్, ప్రభుత్వ భూములను మినహాయించి పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు రావాలంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. 
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు
అసైన్డ్‌, సీలింగ్ ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేదు. దీంతో వాటిపై క్లారిటీ వచ్చాక రిజిస్ట్రేన్లంటూ కరపత్రాల్లో తెలిపారు. ఎలాగోలా రిజిస్ట్రేషన్లను సిద్ధం చేయాలని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్లాట్‌ల రిజిస్ట్రేషన్ల కోసమంటూ ప్రభుత్వం రాజధాని ప్రాంత గ్రామాలైన తుళ్లూరు, అనంతవరం, మందడం గ్రామాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. 
ముందుకు రాని రైతులు 
కార్యాలయాల్లో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్ సహాయ కేంద్రాలను నెలకొల్పింది. అయినా రైతులు ముందుకు రావడం లేదు. రాజధాని ప్రాంతంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు అరకొరగానే సాగాయని, ఫ్లాట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ లైన్లు, మురుగునీటి పారుదల లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం టెండర్లు పిలిచే ఏర్పాట్లకు సిద్ధమైంది. ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు సందేహాలను నివృత్తి చేశాకే రిజిస్ట్రేషన్లకు సిద్ధం కావాలన్న యోచనలో రైతులున్నారు. 
రైతుల నుంచి వసూలు చేస్తుందన్న సందేహం 
ఇదిలా ఉంటే ఫ్లాట్ల అభివృద్ధి పనుల్లో చేసే ఖర్చులో కొంత యూజర్ చార్జీల పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి వసూలు చేస్తుందన్న సందేహం రైతుల్లో ఉంది.  . ఫ్లాట్ల అభివృద్ధికి సీఆర్డీఏ చట్టం ప్రకారం మూడేళ్ల వ్యవధి ఉందని చెప్పడంతో కూడా రైతుల్లో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లాట్ల అభివృద్ధితో అటు తమ డిమాండ్‌లను పరిష్కరించేంతవరకు వేచి చూడాలన్న ధోరణిలో రైతులు ఉన్నారు.

 

19:58 - October 27, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని ఉద్దాన ప్రాంతవాసుల దశాబ్దాల నాటి కల ఫలించబోతోంది. వంశధార నది జలాలను ఇచ్చాపురం వరకు తరలించి బహుదా నదితో అనుసంధానం చేయాలని సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి డీపీఆర్‌ తయారీకి 2 లక్షల 80 కోట్లు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
నదుల అనుసంధానానికి సర్కారు సన్నాహాలు
ప్రభుత్వం ఉద్దాన రైతులకు తీపికబురు అందించింది. వంశధార, బహుదా నదుల అనుసంధానంతో బృహత్తర ప్రయత్నానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. హిర మండలంలోని గొట్టాబ్యారేజి వద్ద గల వంశదార నదీ జలాలను 80 కిలోమీటర్ల దూరంలో గల ఉద్దానం ప్రాంతానికి తరలించాలని ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను సిద్ధం చేస్తోంది. వంశధారను బహుదా నదితో అనుసంధానం చేయడం ద్వారా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలతో పాటు పలాస నియోజకవర్గ పరిధిలోని మందస మండలాల్లోని రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. 
పంట పొలాల వైపు మళ్లించేవిధంగా మాస్టర్ ప్లాన్‌ 
హిర మండలంలోని గొట్టా బ్యారేజి నుండి హైలెవల్‌ కాలువ తవ్వి ఉద్దానం పంట పొలాల వైపు మళ్లించేవిధంగా మాస్టర్ ప్లాన్‌ సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే అంశాలన్నీ క్రోడీకరించి డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 2 కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేస్తూ సర్కారు జివో విడుదల చేసింది. ఈ జీవోతో ఉద్దానం ప్రాంత నాలుగు మండలాల రైతులకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. 
రైతులు హర్షం 
ఉద్దానంలో ఇప్పటివరకు వర్షాభావం, బోరుబావులు, విద్యుత్‌ మోటార్ల ద్వారా మాత్రమే సాగునీరందేది. వంశధార, బహుద నదుల అనుసంధానం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వంశధార నదీ జలాలను ఉద్దానం వైపు మళ్లించడం ద్వారా వేలాది రైతులకు తోడ్పాటు అందనుంది. అయితే ప్రాజెక్టు పూర్తికి ఎంత సమయం పడుతుందోనని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

19:56 - October 27, 2017

విజయవాడ : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెజవాడ ఒకటి.. అయినా నగరాభివృద్ధి మాత్రం ఆశించిన మేర కన్పించట్లేదు. రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నా.. విజయవాడ రైల్వే జంక్షన్ అభివృద్ధి పట్టాలెక్కడంలేదు. ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో, సకాలంలో సమాచారాన్ని చేరవేయడంలో వైఫల్యం చెందుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బెజవాడ రైల్వే స్థితిగతులపై 10టీవీ ప్రత్యేక కథనం..
అభివృద్ధికి అందుకోని బెజవాడ జంక్షన్‌
దేశంలో పెద్ద రైల్వే జంక్షన్‌లలో విజయవాడ ఒకటి. ఏడాదికి రూ.175 కోట్లకుపైగా ఆదాయం, 70 ప్యాసింజర్ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మొత్తం 370కు పైగా రైళ్లలో నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు బెజవాడ రైల్వేజంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న బెజవాడ రైల్వే జంక్షన్‌ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. 
పార్సిల్స్‌ ద్వారా రూ.30లక్షల ఆదాయం
నిత్యం వేలాది మంది ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. దాదాపు రూ.30 లక్షల ఆదాయం పార్సిల్స్‌, రిజర్వేషన్లు, టికెట్ల రూపంలో ఆదాయం వస్తోంది. ఈ స్థాయిలో ఆదాయం ఉన్న బెజవాడ స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు ఉన్నాయా.. అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. 
స్టేషన్‌లో సరిగ్గా పనిచేయని ఎస్కలేటర్లు
స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు ఎప్పుడు పనిచేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మొరాయించడం, విద్యుత్ పొదుపు పేరుతో ఆఫ్ చేయడం జరుగుతోంది. ఈ జంక్షన్‌లో పేరుకి 10 ప్లాట్‌ ఫామ్‌లు ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో ఉన్నవి మాత్రం ఏడే. మిగిలిన 8, 9,10 ప్లాట్‌ ఫామ్‌లకు కనెక్టవిటీ లేకపోవడంతో ఆ ప్లాట్‌ ఫామ్‌లు నిరుపయోగంగా ఉన్నాయి.
అన్ని ప్రాంతాలకు జంక్షన్‌ నుంచి కనెక్టవిటీ కల్పించాలి
అన్ని ప్రాంతాలకు జంక్షన్‌ నుంచి కనెక్టవిటీ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాజధాని ప్రాంతం దృష్ట్యా పెరిగిన  వాహనాలకి అనుగుణంగా పార్కింగ్‌ వ్యవస్థని కూడా విస్తరించాలని.. స్టేషన్‌లో మౌళిక వసతుల ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

 

19:52 - October 27, 2017

విజయవాడ : కంచ ఐలయ్య ఆత్మీయసభపై విజయవాడలో వివాదం రాజుకుంటోంది. ఐలయ్యకు సంఘీభావంగా సామాజిక జేఏసీ సభ పెడతామంటుంటే.. ఆర్యవైశ్య సంఘాలు తామూ సభపెడతామంటూ ముందుకొచ్చారు. ఈ హడావిడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలకు సభ అనుమతిని నిరాకరించారు. నగరంలో  144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో  రేపటి సామాజిక జేఏసీ సభపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.   
విజయవాడ కార్పొరేషన్‌ నుంచి సామాజిక జేఏసీకి అనుమతి 
విజయవాడ  జింఖానా గ్రౌండ్ లో  రేపు సామాజిక ఏజేఏసీ తలపెట్టిన సభ వివాదంగా మారింది.  ఛలో విజయవాడ కార్యక్రమంతోపాటు  అంబేద్కర్ విగ్రహం నుంచి జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, తర్వాత సభ  నిర్వహించాలని నిర్ణయించింది సామాజిక జేఏసీ.  ఈ సభకు  కంచె ఐలయ్య , గద్దర్, విమలక్క, సిపిఐ రామకృష్ణ, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. సభ నిర్వహణకోసం  జింఖాన గ్రౌండ్స్‌ను బుక్‌ చేసుకున్నట్టు సామాజిక జేసీఏ చెబుతోంది. విజయవాడ కార్పొరేషన్‌ నుంచి తమకు అనుమతి పొందిన సామాజిక జేఏసీ నేతలు.. సభ నిర్వహణకోసం పోలీసులను అనుమతి కోరామంటున్నారు. 
సామాజిక జేఏసీపై ఆర్యవైశ్య సంఘాల ఆగ్రహం 
అయితే.. తామూ అదే రోజు, జింఖానా గ్రౌండ్స్‌లో సభ పెడతామంటూ ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు అనుమతి కోరడంతో వివాదం మరింత రాజుకుంది. సామాజిక జేఏసీ తీరుపై   ఆర్యవైశ్య -బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక స్మగ్లర్లు -కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడకు కంచ ఐలయ్య వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారు.
సభను జరిపి తీరుతామంటున్న సామాజిక జేఏసీ 
సభను అడ్డుకుంటామని ఆర్యవైశ్యసంఘాలు ప్రకటించడాన్ని సామాజిక జేఏసీ నేతలు తప్పపడుతున్నారు.  తాము తలపెట్టిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య సంఘీభావసభను ఈ నెల 28 న జరిపి తీరుతామంటున్నారు. దీనిపై ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు.  టీడీపీ ప్రభుత్వం దళిత,బహుజనుల పక్షమో.. కాదో..   అనేది ఇపుడు  తేలిపోతుందంటున్నారు.  
విజయవాడలో 144, 30 సెక్షన్లు విధింపు 
అయితే ఇరువర్గాలకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు అంటున్నారు. నగరంలో 144, 30 సెక్షన్‌లు అమల్లోకి తెచ్చామంటున్నారు. దీంతో బెజవాడలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయోచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని..రెండు వర్గాలకు సభలు పెట్టుకునే  అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. 

 

19:48 - October 27, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై లొక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చడానికి రోజుకి 11వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని.. కానీ ప్రజల కనీస అవసరాలు తీరడం లేదని ఆరోపించారు. అదంతా ప్రజలు కట్టే డబ్బేనని ప్రజల డబ్బులతో వృథా ఖర్చులు చేస్తున్నారని అన్నారు.  యువతలో అవగాహన రావడం కోసం స్వరాజ్య యాత్ర చేపట్టామని అన్నారు. యువతని ఒక వేదికపై చేర్చడానికి యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా.కామ్‌ ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

 

19:47 - October 27, 2017

విశాఖ : శనివారం విశాఖపట్నంలో జరిగే కేన్సర్‌ అవగాహన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు సినీనటులు బాలకృష్ణ, గౌతమి. కేన్సర్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా రేపు విశాఖ బీచ్‌ రోడ్డులో విన్నర్స్‌ వాక్‌  చేపట్టనున్నారు. గౌతమీకి చెందిన లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 

19:44 - October 27, 2017

విశాఖ : టూరిజంతో రాష్ట్రాభివృద్ధి మరింత పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియ అన్నారు. విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుల సదస్సును అమె ప్రారంభించారు. ఆసియా ఖండంలో పర్యాటక పెట్టుబడులకు విశాఖ అత్యంత కీలకమైదని.. విశాఖలో హోటల్స్‌, రిసార్ట్స్‌తో పాటు అనేక ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందని అఖిలప్రియ అన్నారు.

 

19:40 - October 27, 2017

హైదరాబాద్ : ఏపీలో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతొందని వైసీపీ అధికార ప్రతినిధి ఎంఎల్‌ఏ శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని.. పార్టీలో చేర్చుకున్న వారిని రాజీనామా చేయించకుండా ఏలా టీడీపీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అందుకే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయికాట్‌ చేసేందుకు నిర్ణయించామన్నారు.

19:36 - October 27, 2017

హైదరాబాద్ : మూడేళ్ల కాలంలో చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి.. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు రప్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తనపై ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు వచ్చే వార్తల్లో వాస్తవం లేదని.. జాతీయ పత్రికల్లో తనపేరు లేదని వార్తా కథనాలు వస్తుంటే ప్రాంతీయ పత్రికలు మాత్రం అందుకు భిన్నంగా కథనాలు రాస్తూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బొత్స ఆరోపించారు.

19:16 - October 27, 2017

అనంతపురం : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న వైసీపీ అధినేత జగన్‌ నిర్ణయాన్ని అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తప్పు పట్టారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న జగన్‌ నిర్ణయం బాధ్యరాహిత్యమని రఘునాథరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కొనే దమ్ములేక పలాయనవాదం ప్రతిపక్షం పలాయనవాదం అందుకుందని దుయ్యబట్టారు. 

 

19:09 - October 27, 2017

హైదరాబాద్ : ప్రసూతి ఆసుపత్రులు.. అపహరణకు నిలయాలుగా మారుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో పసి కందులు కిడ్నాప్‌నకు గురి అవుతున్నా.. అధికార్లు మాత్రం పట్టించుకోవట్లేదు. భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, పసి కందులు భద్రత నీటిమీద రాతల్లాగే మిగిలిపోతొంది.. నీలోఫర్‌లో మరోసారి బయటపడ్డ సిబ్బంది నిర్లక్ష్యంపై 10టీవీ ప్రత్యేక కథనం.
ఆస్పత్రుల్లో భద్రత కరువు
ప్రసూతి ఆస్పత్రుల్లో పసి పిల్లలకు భద్రత కరువైంది. ప్రసూతి ఆస్పత్రులు తల్లులకు తీరని బాధను మిగిలిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పసిబిడ్డల అపహరణలు పెరిగిపోతున్నాయి. రెప్పపాటు ఆదమరిస్తే చాలు శిశువులు కనిపించడం లేదు.
భద్రత విషయంలో విఫలమవుతున్న ఆస్పత్రులు
ఒక వైపు పసిపిల్లలు మాయమవుతున్నప్పటికీ భద్రతను పెంచడంలో ఆస్పత్రి వర్గాలు విఫలమవుతున్నాయి. పిల్లల అదృశ్యం తమ తప్పిదం కాదని.. ఆస్పత్రి వర్గాలు తల్లిదండ్రుల మీదవేసి తప్పించుకుంటున్నాయి.. మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసినా.. దర్యాప్తు పేరుతో పోలీసులు రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు, కొన్ని నర్సింగ్‌ హోముల్లో కూడా పసిపిల్లలు అపహరణకు గురయ్యారు. ఆస్పత్రుల్లో ఎత్తుకు పోయే ఆగంతకులు తిరుగుతున్నా ఆస్పత్రి వర్గాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో నిలోఫర్‌ ఆస్పత్రిలో నెలరోజుల శిశువు అదృశ్యమైంది. ఇంత వరకు ఆ పాప ఆచూకీ దొరకలేదు. జంటనగరాల్లో పేట్లబుర్జు, గాంధీ, నీలోఫర్‌, సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రుల్లో అపహరణలు జరిగాయి. 
ప్రసూతి ఆస్పత్రులే టార్గెట్‌
పసిపిల్లలను అపహరించేందుకు ఆగంతకులు ప్రసూతి ఆస్పత్రులనే ఎంచుకుంటున్నారు. అమాయక మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ.. గ్రామాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి పుట్టిన శిశువులను ఎత్తుకోవడం, బయటకు తీసుకెళ్లి తిరిగి రావడం చేస్తూ నమ్మకంగా ఉంటున్నారు. శిశువు కుటుంబ సభ్యులు ఆదమరిచిన సమయంలో పిల్లలతో ఉడాయిస్తున్నారు. ఇటీవల నీలోఫర్‌ ఆస్పత్రి వద్ద అపహరణకు గురైన పసికందు వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయా నని చెప్పుకుని నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మంజుల పసికందును అపహరించిన ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రజలు దీనిపై ఆస్పత్రి అధికారుల వైఫల్యమని మండిపడుతున్నారు.
సీసీ కెమెరాలు బిగించాలని ప్రభుత్వం ఆదేశం
పసిపిల్లల అపహరణలను నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో నిఘా పెంచాలని ఆదేశించింది. దీని కోసం అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో పూర్తిగా సీసీ కెమెరాలను బిగించలేదు. ఉన్న చోట్ల కనీసం సీసీ కెమెరాల పరిశీలన లేకపోవడంతో ఆగంతకులకు అవకాశంగా మారుతోంది. నగరంలో గాంధీ, నీలోఫర్‌, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రుల్లో ప్రసూతి సదుపాయం ఉంది.  
సీసీ కెమెరాలతో అపహరణలు నియంత్రించే అవకాశం 
ప్రభుత్వాసుపత్రుల్లో నిరంతరం నిఘా పెట్టి సీసీ కెమెరాల సహాయంతో పరిశీలిస్తే అపహరణలు నియంత్రించే అవకాశం ఉంది. ప్రతి విభాగంలో సీసీ కెమెరాల నిఘా పెంచి.. లోపలికి ప్రవేశించే వారి పూర్తి వివరాల సేకరించి పంపిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ, నిఘాని పెంచి అపహరణలకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

19:04 - October 27, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంట మండలం నాగంపేటలో జరిగిన ఔషధ ప్రయోగాలపై 10 టీవీలో ప్రసారమైన వరుస కథనాలకు పోలీసులు స్పందిచారు. క్లినికల్‌ ట్రయల్స్‌తో మృతి చెందిన వంగర నాగరాజు మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి, శరీరభాగాలను సేకరించి, పరీక్షలకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు జరుగుతుందని హుజూరాబాద్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి చెబుతున్నారు. 

 

19:00 - October 27, 2017

ఖమ్మం : నాలుగు రోజులుగా ఇద్దరు తల్లులకు దూరమై చిన్నారి తన్విత బాలల సదన్‌కు చేరుకుంది. చిన్నారి మానసిక పరిస్థితిని పరీక్షించేందుకు చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పిడి విజయలక్ష్మి బాలసదన్‌కు వచ్చారు. చిన్నారి తన్వితతో ముచ్చటించారు. చట్టం ప్రకారమే తన్వితను ఎవరికి అప్పగించాలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

18:58 - October 27, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం ఎంవోయూపై సంతకాలు చేశారు. 800 కోట్ల రూపాయలతో సంగారెడ్డి ద‌గ్గర కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. టీఎస్ ఐఐసీ ద్వారా కోచ్ ఫ్యాక్టరీకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించిననట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందన్నారు.

 

18:55 - October 27, 2017

హైదరాబాద్ : నిరుద్యోగమే ఆసరాగా బల్దియాలో కొలువుల అమ్మకాలు జరుగుతున్నాయి. సూరారం, గాజులరామారం డివిజన్లలో ఇద్దరి కార్మికుల నుంచి...డబ్బులు తీసుకొని ఎంటమాలజీ అధికారులు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే మొత్తం డబ్బులు ఇవ్వని కారణంగానే ఇప్పటికీ.. వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేయలేదు. కొత్త నియామకాలు చేయవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా... ఆ ఆదేశాలను పక్కన పెట్టి సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ విజయ్‌ కుమార్‌ కొత్త నియామకాలను చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:52 - October 27, 2017

హైదరాబాద్ : ప్రశ్నోత్తరాల తర్వాత రైతు సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేయడం సబబు కాదని అక్బరుద్దీన్‌ అన్నారు. ఆందోళన విరమించి సభా సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. 

 

కాళేశ్వరం పై హైకోర్టు టీఎస్ ప్రభుత్వం

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే పై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.

18:46 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆశావర్కర్లకు 6 వేల రూపాయల ప్రోత్సాహకం ఇస్తుందని ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రోత్సహాకాలు దేశంలో ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. ఎక్కువ కేసులు నమోదు చేస్తే మరింత ప్రోత్సహకం లభిస్తుందన్నారు. 

 

మార్చ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : ఆంధ్రా ఒడిశా మధ్య ఉన్న మార్చ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. 

ఏపీ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిన నాబార్డ్

గుంటూరు : ఏపీలో రహదారి, వంతెనల నిర్మాణాల కోసం నాబార్డ్ నిధులు విడుదల చేసింది. నాబార్డ్ రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింది ఈ నిధులు మంజూరు చేసింది.

వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమే

హైదరాబాద్ : పోలీసుల చర్య వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమే అని శాంతియుతంగా సభ జరుగుతుందని అని చెప్పినా ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదని కంచె ఐలయ్య అన్నారు.

కంచె ఐలయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : కంచె ఐలయ్య ఇంటి వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల బందోస్తు నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తాన్నారు. 

18:40 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాలను త్వరలోనే తీసుకుంటామన్నారు. వారికి గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. 

 

18:29 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి హరీష్‌రావు, ఈటల, కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ హాజరయ్యారు. కాంగ్రెస్ ఈ సమావేశానికి గైర్హాజరైంది. ప్రతి రోజు ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి స్వల్పకాలిక అంశాలు ఖరారు చేయనున్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నిర్వహిస్తామన్న అధికార పార్టీ ప్రకటించింది. 

తెలంగాణలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

హైదరాబాద్ : రాష్ట్రంలో మెట్రో రైల్వే మెట్రో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేధ పర్యో డ్రైవ్స్ సంస్థ రూ.600కోట్లతో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారు. 

కాకినాడలో ఉద్రిక్తత

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ డీఈవో ఆఫీస్ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు ఆఫీస్ గేట్ ను తోసేసి దూసుకెళ్లారు. డీఈవో చాంబర్ లో యూటీఎఫ్ నేతలు, టీచర్లు బైఠాయించారు. 

18:02 - October 27, 2017

శ్రీనగర్ : జమ్మూ..కశ్మీర్‌లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఆందోళనకారులపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ధర్నాలు, సమ్మెలు, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చి, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారికి  ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను విధ్వంసం చేసే వ్యక్తులు, సంస్థలను  నిరోధించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఆ నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో ప్రభుత్వం జరిమానా విధించనుంది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సిఫారసు మేరకు గవర్నర్‌ వోహ్రా ఈ ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

 

17:56 - October 27, 2017

చెన్నై : వివాదానికి దారితీసిన తమిళ చిత్రం 'మెర్సల్‌'కు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. జిఎస్‌టి, నోట్లరద్దును వ్యతిరేకించేలా సినిమాలో కొన్ని డైలాగులున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని నిషేధించాలని ఓ లాయర్‌ వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. కల్పిత కథ ఆధారంగా మెర్సల్‌ చిత్రాన్ని తీశారని... వాస్తవ జీవిత కథ కాదంటూ కోర్టు కేసును కొట్టివేసింది. ఈ సినిమా సమాజంపై ప్రభావం చూపుతుందన్నది అవాస్తవమని కోర్టు పేర్కొంది. ధూమపానం, మద్యపానాన్ని ఎంకరేజ్‌ చేసే ప్రకటనల కంటే ఇది అంత ప్రమాదకరం కాదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్‌తో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని పిటిషనర్‌కు మొట్టికాయలు వేసింది. మెర్సల్‌ చిత్రాన్ని నిషేధించాలంటూ లాయర్‌ అశ్వత్థామన్‌ కోర్టులో పిటిషన్ వేశారు. మెర్సల్ చిత్రం ఈ రోజు తెలుగులో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నప్పటికి, చిత్రంలో జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ ఉన్నందున సెన్సార్ అనుమ‌తి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఈ సినిమాలో జిఎస్‌టి, నోట్లరద్దు, భారత వైద్య విధానంలోని లొసుగులను ఎత్తిచూపేలా కొన్ని సంభాషణలుండడంపై బిజెపి అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే.
 

 

17:45 - October 27, 2017

కృష్ణా : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుడమేరు వంతెన వద్ద గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు బ్రేకులు ఫెయిలై జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

17:42 - October 27, 2017

విజయవాడ : నవంబర్ 6 నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం చేశారు వైసీపీ అధినేత జగన్. 6 నెలలపాటు 3వేల కిలోమీటర్ల మేర జరపనున్న పాదయాత్రలో దాదాపు రెండుకోట్ల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు జగన్ ప్రణాళికలు రచించారు. మరోవైపు అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు నాలుగు నెలలపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వైఎస్.జగన్ కార్యాచరణ ప్రకటించారు. పాదయాత్ర రూట్ మ్యాప్, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు జగన్

17:37 - October 27, 2017

కడప : సుప్రీంకోర్టులో కడప ఫాతిమా‌ మెడికల్ కాలేజీ విద్యార్థులకు చుక్కెదురైంది. మెడికల్ సీట్ల రీఅలకేషన్‌పై వారు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం, ఎంసీఐ ప్రతిపాదనలను తిరస్కరించింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం విన్నవించింది. ఈ విద్యాసంవత్సరంలో అదనపు సీట్లను కేటాయించాలని...మెరిట్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు న్యాయం చేయొచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యధావిధిగా అడ్మిషన్లు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో భర్తీకాని సీట్లకు ఎంసీఐ మాత్రమే అవకాశం కల్పించగలదని చెప్పింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఎంసిఐ,కేంద్రం తోసిపుచ్చడంతో సుప్రీం కేసును కొట్టివేసింది. 

 

17:34 - October 27, 2017

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం శాసనసభా పక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. సభలో రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షాలు కోరగా ప్రభుత్వం అంగీకరించలేదు. విపక్షాల ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

 

16:50 - October 27, 2017

హైదరాబాద్ : రైతులకు అందుబాటులో వ్యవసాయ అధికారులను పెడుతుంటే కాంగ్రెస్ నాయకులు భరించలేకపోతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో 16  లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మించామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లల్లో మీరు 40 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కడితే... ఒకే సంవత్సరంలో 16 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని తెలిపారు. మీరు ఏనాడు చెరువులను పట్టించుకోకపోతే మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేశామని చెప్పారు. గత యాసంగిలో చెరువుల కింద 16 లక్షల ఎకరాల్లో పంట పండితే కాంగ్రెస్ నేతలకు కంటడింపుగా, అసూయగా ఉందన్నారు. ఎందుకు ఈర్శ్య పడుతున్నారని ప్రశ్నించారు. రైతులు సంతోషపడుతుంటే...మీకు కంటగింపుగా ఉందని కాంగ్రెస్ నాయకులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టీసర్కార్ ది అని తెలిపారు. ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులను బాధ కల్గుతుందా అని నిలదీశారు. వారు చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమైందన్నారు. వారి దగ్గర మాట్లాడే సబ్జెక్టు లేదని ఎద్దేవా చేశారు. ఏం అంశంపై, ఎంత సేపైనా.. ఎన్ని రోజులైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. కానీ ఇలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ఈ విధంగా చేస్తుంటే సభలో ఉండటం మీకు ఇష్టం లేదని అర్ధం అవుతుందని వారిని ఉద్ధేశించి మాట్లాడారు. సభ అంటే మీరు ఒక్కరే కాదని... 120 మంది సభ్యులు అని తెలిపారు. అన్ని అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై చర్చ జరగాలని..అందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తద్వారా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 

 

16:44 - October 27, 2017

జియో వినియోగదారులకు కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. అంతకు ముందు జియో 399 ఆఫర్ ఉండేది దాని వ్యాలిడిటీ 84 రోజులు ఇప్పుడు దాన్ని 399 నుంచి 459 పెంచారు. దీంతో వినియోగదారులు జియో పట్ల విముఖ చూపించారు. దీంతో కంపెనీ వెంటనే 499 ప్లాన్ ప్రవేశపెట్టింది. ఫ్లాన్ లో 91 రోజులు రోజు 1జీబీ డాటా అంటే 91జీబీ డాటా వస్తుంది. ఈ ప్లాన్ కావాలనుకుంటే మై జియో యాప్ లేదా వెబ్ సైట్ రీచార్జ్ సెక్షన్ లోకి వెళ్లి పొందవచ్చు. ఈ ప్లాన్ లో ఫ్రీ ఎస్ఎంఎస్ ఆఫర్ కూడా ఉంది. 

ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోంది : షబ్బీర్

హైదరాబాద్: రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సుముఖంగాలేదని రైతుల పట్ల టీఆర్ఎస్ చిన్నచూపు ఇదే నిదర్శనమని మండలి కాంగ్రెప్ పక్షనేత షబ్బీర్ ఆలీ అన్నారు.

సభా మర్యాదలు మంటగలుపుతున్నారు : జానా

హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభా మర్యాదలు మంటగలుపుతున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ చేపట్టినప్పుడు కాంగ్రెస్ ఎన్నో సార్లు సహకరించింది ఆయన గుర్తు చేశారు.

ముగిసిన బీఏసీ సమావేశం

హైదరాబాద్ : అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి హరీష్ రావు, ఈటెల, కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్ హాజరైయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజరైంది.

16:27 - October 27, 2017

హెల్త్ : ప్రస్తుతం సీజన్ ఉసిరి బాగా దొరుగుతాయి. ఉరిసి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక్క ఉసరి అనే కాదు సీజన్ పండ్లు ఎవి తిన్న మన ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతం ఉసిరి సీజన్ కాబట్టి దీని గురించి తెలసుకుద్దాం. ఉసరిలో యాంటియాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మకణాలను కాంతివంతంగా ఉంచుతాయి. దానితో పాటు రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్రకర్తకణాలను శుద్ధి చేస్తాయి. ఎముకలు గట్టిగా ఉండడానికి ఉసరిలోని కాల్షియం ఎంతో ఉపయోగపడుతుంది. 

16:14 - October 27, 2017


హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఉత్తమ్ మీడియతో మాట్లాడారు. శాసనసభ జరిగే తీరు సక్రమంగా లేదని తెలిపారు.  ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేవిధంగా సభ నడుస్తోందన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో, ఇష్టానుసారంగా శాసనసభ నడుస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలు, రైతుల గొంతు వినడానికి ప్రభుత్వానికి సమయం లేదన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు 10 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారా లేదో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతులపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపంటకు గిట్టుబాట ధర లేకుంటే సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరని నిలదీశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు నేటికి అమల కాలేదన్నారు. చెప్పినమాట నిలబెట్టుకోలేనప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంలో అర్థమేముందని అసహనం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:05 - October 27, 2017

ఢిల్లీ : 2016 డోపింగ్ టెస్టు నివేదిక విడుదల చేసిన వాడా ఒక భారత క్రికెటర్ డోపిగా తేలినట్లు నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ క్రికెటర్ పేరు మాత్రం తెలపలేదు. 2016 ప్రీమియర్ లీగ్ సందర్బంగా మొత్తం 138 ఆటగాళ్లకు డోప్ టెస్టు నిర్వహించగా అందులో ఒకరు దోషిగా తెలినట్టు ఆ నివేదక పేర్కొంది. 2013ఐపీఎల్ సమయంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు ప్రదీప్ సంగ్వాన్ డోప్ టెస్టులో దొరిపోయిన విషయం తెలిసిందే.

16:02 - October 27, 2017

హైదరాబాద్ : టీసర్కార్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరముందన్నారు. చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అమరావతి చేరుకున్న చంద్రబాబు

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశి పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి అమరావతి చేరుకున్నారు. 9 రోజుల తర్వాత సీఎం సచివాలయానికి వెళ్లారు. కాసేపట్లో సీఎం మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు.

15:52 - October 27, 2017

స్పోర్ట్స్ : వచ్చే నెల 23న ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టన్ స్టీవ్ స్మిత్ కు ఆ దేశ మాజీ ఆటగాడు స్టీవ్ వా కొన్ని కీలక సూచనలు చేశాడు. స్మిత్ తన శరీరక భాషలో కానీ, మాటల ద్వారా కానీ ఎటువంటి పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా హుందాగా ఉండాల్సి అవసరం ఉందని గుర్తు చేశాడు. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఎప్పుడు ప్రత్యేమని ఇది హై ఓల్టెజీ సిరిస్ అని ఆసీస్ ఆటగాళ్లు వారి వారి భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలని అన్నారు. కెప్టెన్ స్మిత్ ఎమ్మోషన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని, ఎందుకంటే కెమెరాలన్ని కెప్టెన్ వైపు ఉంటాయని స్టీవ్ వా తెలిపారు.

15:51 - October 27, 2017

మహిళా వార్తల సమాహారంతో ఇవాళ్లి మానవి న్యూస్ మీ ముందుకు వచ్చింది. జైపూర్ మహిళలు గుంత్లో కూర్చుని దీపావళి పండుగను జరుపుకున్నారు. కారాణాలు ఏంటీ, బడా మహిళను కొట్టిన భర్త, అందుకు ఏం చేసింది.., కిడ్నాప్ గురైన పాక్ మహిళా జర్నలిస్టు జీనత్ ఆచూకీ లభ్యం, ప్రముఖ మహిళా జర్నలిస్టు రోహిణి సింగ్, ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ కన్నుమూత, హైదరాబాద్ మహిళ న్యాయవాది అరుదైన ఘనత.. వంటి పలు మహిళా వార్తలను వీడియోలో చూద్దాం...

15:46 - October 27, 2017

వరంగల్ : కొండా దంపతుల బెదిరింపులకు భయపడేది లేదని టీఆర్ఎస్‌ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ కొండా దంపతులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వరంగల్ తూర్పు నుంచి బరిలో ఉంటానని.. కేసీఆర్‌ను టికెట్‌ అడిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:43 - October 27, 2017

హైదరాబాద్ : చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. రేపు మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. టీ టీడీపీ నేతలంతా ఈ భేటీకి హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే ఎవరూ మాట్లాడొద్దన్నారు. రేవంత్‌రెడ్డి పరిణామాలను రమణ చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రేవంత్‌ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని మోత్కుపల్లి నర్సింహులు పట్టుబట్టారు. మోత్కుపల్లి నర్సింహులను బాబు వారించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

15:28 - October 27, 2017

హైదరాబాద్ : కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంపై మాట్లాడిన సీఎం కేసీఆర్‌...అర్ధకాలితో ఎవరూ పనిచేయకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశమన్నారు. నాడు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ప్రవేశపెట్టినవారే..క్రమబద్దీకరణ ఆపాలంటూ నేడు కోర్టులకెక్కడం విడ్డూరంగా ఉందన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ హోంగార్డుల క్రమబద్దీకరణ సమస్యను పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

 

15:22 - October 27, 2017

విజయవాడ : రాష్ట్రంలో రేషన్‌ షాపులను రిలయన్స్‌ మాల్స్‌గా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రపన్నుతొందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కుప్పకులిపోయే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామాల్లో రిలయన్స్‌ మాల్స్‌గా మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేస్తొందని అన్నారు.

 

15:18 - October 27, 2017

కర్నూలు : కర్నూలు, తుంగభద్రలో 2 రాష్ట్రాల సరిహద్దు వివాదం నెలకొంది. పుల్లూరు, మునగలపాడు మధ్య ఇసుక వివాదం చోటు చేసుకుంది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

15:10 - October 27, 2017

ఢిల్లీ : సదావర్తి భూములపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూములు ఏపీవని తేలితే రెండో బిడ్డర్‌గా తమకే కేటాయించాలని పిటీషనర్‌ కోరారు. అప్పటివరకు తాము చెల్లించిన 60 కోట్లు ప్రభుత్వం వద్దే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. భూములు ఏపీవా లేక తమిళనాడువా తేల్చాల్సింది హైకోర్టేనని... ఇప్పటికే జరిగిన వేలం రద్దయినట్లేనని స్పష్టం చేసింది. డిపాజిట్‌గా చెల్లించిన డబ్బులు వెనక్కి తీసుకోవాలని వెల్లడించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చంద్రబాబుతో టీడీపీ నేతల సమావేశం ముగిసింది

హైదరాబాద్ : టీడీపీ జాతీయధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. రేపు ఉదయం 10 గంటలకు మరోసారి సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. 

మెర్సల్ సినిమా చెన్నై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై : మెర్సల్ సినిమాపై చెన్నై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు బీజేపీ చర్యలను తప్పుబట్టింది. నటుడు విజయ్ సినిమాల్లో మాత్రమే హారో అని నిజ జీవితంలో ఆయన ఓ సాధారణ పౌరుడని, విజయ్ ని వేధించిడం మంచి పద్దతి కాదని కోర్టు వ్యాఖ్యనించింది. 

ప్రతిపక్షాల ఆవేదనను అర్ధం చేసుకోవాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : సభలో ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్నా సభ నడపడం మంచి సాంప్రదాయం కాదని బీజీపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

 

సీబీఐ కోర్టు హాజరైన జగన్

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరరైయ్యారు. జగన్ తో పాటు విజయసాయ్ రెడ్డి కూడా కోర్టుకు హాజరైయ్యాడు. విజయసాయి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. 

13:40 - October 27, 2017

టెన్ టివి : అసలేటి వానల్లో ముసలెడ్లను కట్టి మోకాలి దిగవట్లో మడికట్టు దున్నితే సెలకలెడవాయరన్న ఎవని కడుపు నిండనురన్న ఓ కవి అన్నట్టుగానే ఈనాటి రైతు పరిస్థితి ఉంది. ఎండానక, వానానక, రాత్రానక, పగలనక, సగం కడుపుకే తిని పంట పండిస్తున్నాడు రైతు కానీ ఆ రైతు కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుందా అంటే రావట్లేదు . దేశంలో పత్తి పండించే రాష్ట్రాలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో మహారాష్ట్ర , మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. కానీ పత్రి ధరల్లో వత్యాసం కనిసిస్తోంది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పత్తికి తక్కువ ధర దక్కుతుందని ఇండస్ట్రీ బాడీ కాటన్ అసోసియేషణ్ ఆప్ ఇండియా (సీఏఐ)నివేదిక స్పష్టం చేసింది. పంజాబ్ లో క్వింటాల్ కు రూ.5000ధర వస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలోనూ ధరలు బాగానే ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వం రూ.1200కోట్లు భారం పడుతున్న మద్దతు ధరపై రూ.500 బోనస్ ప్రకటించింది.ఇక తెలంగాణ ప్రభుత్వ విషయనికొస్తే పత్తికి క్వింటాల్ కు రూ.4,320ప్రకటించింది. కానీ మార్కెట్ వచ్చేసరికి ఆ ధర ఎక్కడ పలకడం లేదు. ఈ ఏదాది ఇప్పటివరకు ఒక్క కిలో పత్తి కూడా సీసీఐ కొనలేదు. ఇక ప్రైవేట్ వ్యాపారులు పత్తి ధరను రోజురోజుకు తగ్గిస్తూ రూ.1500 నుంచి రూ.4000 చెల్లిస్తున్నారు. మార్కెట్ వచ్చిన మొదటి రెండు,మూడు వాహనాల్లో తెచ్చిన పత్తికి రూ.4000 చెల్లిస్తూ తర్వాత రూ.1500 నుంచి రూ.27, 50 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతు కు పెట్టబడి రాక ఆత్మహత్యే శరణ్యం అవుతోంది. పత్తి కొనుగోళు సంస్థ సీసీఐ ప్రకారం తేమ శాతం 9 ఉంటే రూ.4,227, తేమ శాతం10 ఉంటే రూ.4,200, తేమ శాతం 11ఉంటే 4,180, 12శాతం ఉంటే 4,140 చెల్లించాలి కానీ వ్యాపారులు ఎక్కడ ఆ కూడా రూల్స్ పటించడం లేదు.

రైతన్న పై ప్రకృతి దెబ్బ...
పంట చేతికొచ్చే సమయన వర్షం రావడంతో పత్తి మొత్తం తడిసి రంగు మారింది. దీంతో ఆ పత్తిని రైతు మార్కెట్ కు తీసుఎకెళ్తే కొనేవాడు లేడు. కొన్న క్వింటాల్ రూ.1000పెట్టడంతో రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రైతు రావట్లే దు. గ్రామలల్లో పత్తి కూలీకి వచ్చేవారికి రోజుకు రూ.200నుంచి రూ.300చెల్లిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ చెందిన రైతు రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు . రూ.లక్ష వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఇటివల పత్తి ఏరగా 10క్వింటాళ్లు అయింది. దానిని సీసీఐ మద్దతు ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం పత్తి రైతు కార్డు , ఇతర అన్ని కాగితాలు పట్టుకుని మార్కెట్ వచ్చాడు తీర క్వింటాల్ కు రూ.3500ధర నిర్ణయించారు. దీంతో పత్తి ఇంటికి తిరిగి తీసుకెళ్లలెని రైతు ఆ ధరకే అమ్ముకుని వెళ్లిపోయాడు.

పత్తికి తెగుళ్లు...
సాధారణంగా ఒక ఎరాకు పత్తి దిగుబడి 6 నుంచి 9క్వింటాళ్లు రావాలి అందుకోసం రైతు పత్తి ఎటుంటి తెగుళ్లు రాకుండా చూసుకోవాలి అంటే పత్తి ఎటుంటి రోగం వచ్చిన పురుగుల మందు పిచికారి చేయాలి. ఇలా పిచికారి చేసున్తన్న సమయంలో రైతు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రైతు సింజెట పోలో మందు పిచికారి చేసి దాని ప్రభావం వల్ల మరణించాడు. ఇదే పోలో మందు కొట్టి మహారాష్ట్రలో 40 మంది రైతులు ప్రాణాలో కోల్పోయారు.

పత్తిపై పెట్టబడి...
ప్రతి రైతు పంట పై ఆశతో పెట్టుబడి పెడతాడు. మొదటగా ఎకర దున్నడానికి ట్రాక్టర్ రూ.5వేలు, అచ్చు కొట్టేందుకు రూ.800, విత్తనానికి, కూలీకి రూ.2వేలు, కలుపు తీత, దైరకు రూ.3వేలు, ఎరువులకు రూ.8వేలు, పురుగు మందులకు రూ.10వేలు, పత్తి ఏరుటకు రూ.10వేలు మొత్తంగా పత్తికి రూ.38,800 పెట్టుబడి అవుతోంది. ఎకరాకు పత్తి దిగుబడి సుమారుగా 6క్వింటాళ్లు అనుకుంటే దానికి ధర రూ.4వేలు అనుకుంటే మొత్తంగా వచ్చేది 24వేలు అంటే రైతు కు 14వేలు నష్టం వచ్చింటే ఇలాంటి పరిస్థితుల్లో రైతు బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.

 

13:22 - October 27, 2017

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కడప ఫాతిమా‌ మెడికల్ కాలేజీ విద్యార్థులకు చుక్కెదురైంది. మెడికల్ సీట్ల రీఅలకేషన్‌పై వారు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం, ఎంసీఐ ప్రతిపాదనలను తిరస్కరించింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం విన్నవించింది. ఈ విద్యాసంవత్సరంలో అదనపు సీట్లను కేటాయించాలని... మెరిట్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు న్యాయం చేయొచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యధావిధిగా అడ్మిషన్లు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో భర్తీకాని సీట్లకు MCI మాత్రమే అవకాశం కల్పించగలదని చెప్పింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఎంసిఐ,కేంద్రం తోసిపుచ్చడంతో సుప్రీం కేసును కొట్టివేసింది.

ఎంసీఐ పర్మిషన్ లేకుండానే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చింది. కాగా, త్వరలో పరీక్షలు నిర్వహించనున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రం ఈ కాలేజీ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతివ్వమని తేల్చి చెప్పింది. దీంతో కాలేజీలో చేరిన వందమంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది.

మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల వివరాలు ప్రైవేటుకు సంబంధం లేకుండా విద్యార్థులను ఎలా సర్దుబాటు చేయోచ్చో తెలిపే ప్రతిపాదనలతో ఎంసీఏను సంప్రదించారు. అప్పుడు అనుకూలంగా స్పందించినా తర్వాత నిబంధనల మేరకు కుదరదంటూ ఎంసీఏ వ్యతిరేకించడం ఆందోళనకు గురి చేస్తోంది.

దీనిపై టెన్ టివితో ఫాతిమా కళాశాలకు చెందిన విద్యార్థి విష్ణు మాట్లాడారు. వంద సార్లు ఏపీ ప్రభుత్వం హామీనిచ్చిందని..సీఎం చంద్రబాబు నాయుడిని తాము కలవడం జరిగిందని..ఇందులో వాస్తవాలను చెప్పడం జరిగిందన్నారు. వీరికి సీట్లు ఇప్పించాలని..సంబంధిత మంత్రి కామినేనికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కింద ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. 

12:35 - October 27, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ గేటు వద్దనున్న రోడ్డుపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. రైతు సమస్యలపై ప్రభుత్ విధానాన్ని నిరసిస్తూ నేడు టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర అసెంబీలో ప్రభుత్వం అనురిస్తునన్న విధానాన్ని ఎండగడుతూ నేతలు అసెంబ్లీ గేటు వద్దనున్న రోడపై బైఠాయించారు.

ఉత్తమ్, గీతారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్, కోమటిరెడ్డిలు రోడ్డుపై బైఠాయించిన వారిలో ఉన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నేతలను పక్కకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనితో నేతలు..పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను అదుపులోకి తీసుకుని గోషా మహల్ పీఎస్ కు తరలించారు. 

12:31 - October 27, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమైన సభా సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇది ముగిసిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి స్పీకర్ వెల్లడించారు. దీనిపై సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య మీడియా పాయింట్ తో మాట్లాడాఃకారు. దళితుల మూడెకరల భూమి..అటవీ హక్కులు..ఇతరత్రా సమస్యలు నెలకొన్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం వన్ సైడ్ గా వెళుతోందన్నారు. ప్రతిపక్షాల సూచనలు..సలహాలను ప్రభుత్వం తీసుకొనే ప్రసక్తి లేదన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు..ప్రతి క్వింటాలు పత్తికి రూ. 8వేలు ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. దళారుల దోచుకుంటున్నారని..వరి మద్దతు ధర రూ. 4-5వేలు ఉంటేనే రైతుకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. 

12:24 - October 27, 2017

హైదరాబాద్ : 579 ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఈ విషయంలో కోర్టులో కేసు ఉందని..అది రాగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. శుక్రవారం నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. న్యాయ సంబంధ చిక్కుల వల్ల మిగతా వారిని క్రమబద్ధీకరించ లేకపోయామని మంత్రి ఈటెల తెలిపారు. కోర్టు ఉత్తర్వులు రాగానే సమస్య పరిష్కరిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉందన్నారు. 

12:22 - October 27, 2017

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. గత కొన్ని రోజులుగా టి.టిడిపి నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. గత పది రోజుల నుండి టి.టిడిపిలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ కావడం..ఆయన కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనితో రేవంత్ రెడ్డిపై పలు చర్యలు తీసుకున్నారు. ఇదిలా జరుగుతున్న సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. అనంతరం ఉదయం 12 గంటల సమయంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు భేటీ అయ్యారు. రేవంత్ ఎపిసోడ్ ను పరిష్కరించే విధంగా బాబు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. 

12:19 - October 27, 2017

విజయవాడ : జిల్లాలోని జగ్గయ్యపేటలో తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికకు సంబంధించి 144 సెక్షన్‌ విధించిన పోలీసులు భారీ పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు కిడ్నాప్‌నకు గురైనట్లు టిడిపి పేర్కొంటోంది. పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో.. ఎన్నిక వాయిదా పడుతందా ? అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

శుక్రవారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడ సబ్ కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎన్నిక విషయంలో 15 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. టిడిపి..వైసిపి నేతల మధ్య వాదోపవాదాలు జరిగాయి. టిడిపి ఎంపీ కేశినేని..జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు కిడ్నాప్ అయ్యారని..ఎన్నిక వాయిదా వేయాలని టిడిపి పేర్కొంటోంది. కోరం ఉన్నందున ఎన్నిక వాయిదా వేయవద్దని వైసీపీ పేర్కొంటోంది. 

12:12 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నమూనాలు ఇస్తావా ? అంటూ టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలపై ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను డిప్యూటి స్పీకర్ చేపట్టారు. తన ప్రశ్న వచ్చే వరకు సభను వాయిదా వేసుకుని ప్రభుత్వం వెళ్లిపోయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మాదక ద్రవ్యాల వాడకం..నివారణపై 8వ ప్రశ్న ఉందని..ఈ ప్రశ్న తన పేరిట ఉందన్నారు. జంట నగరాలను..తెలంగాణ సమాజాన్ని..కళాశాలలు..పాఠశాలను మాదక్రవ్యాలు పట్టిపీడిస్తోందన్నారు. విద్యార్థులు కేసీఆర్ మనవడు ఎక్కడ చదువుతున్నాడో ఆ పాఠశాలకు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మాదక ద్రవ్యాలపై సిట్ విచారణ ఏర్పాటు చేసిందో..వాటి వివరాలను ప్రభుత్వం ఎప్పుడు చెబుతుందా ? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రశ్న వచ్చే సమయానికి సభ వాయిదా వేసుకుని వెళ్లిపోయారని తెలిపారు. సభలోకి వెళ్లిన అనంతరం రాతపూర్వకంగా సభ్యులకు సమాధానం ఇస్తారని..ఇలాంటి సంప్రదాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి తాను ఫిర్యాదు చేయడం జరిగిందని..సభ సంప్రదాయాలను పట్టించుకోవాలని..హరీష్..కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోవద్దని కోరడం జరిగిందన్నారు. కానీ పై నుండి అలాంటి ఆదేశాలు ఉన్నాయి కనుకే అలా వ్యవహరించాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి తనకు చెప్పారని తెలిపారు. తమకు సమాధానం చెప్పకపోయినా..ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.

మాదక ద్రవ్యాల ఘటన వెలుగు చూసిన సమయంలో మంత్రి నాయినీ తనపై పలు ఆరోపణలు గుప్పించారని..విచారణ అధికారి ఎదుట తన నమూనాలు ఇస్తానని తాను సవాల్ విసరడం జరిగిందన్నారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్ నమూనాలను ఇవ్వాలని మొత్తం వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని బహిరంగంగా సవాల్ విసరడం జరిగిందన్నారు. దీనిని మంత్రి కేటీఆర్ స్పందించలేదన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాతాలా హస్తం కూడా ఉందన్నారు. మ్యూజికల్ నైట్ నిర్వాహకుడు డేవిడ్ జూటా ప్రదర్శనలపై గోవా ప్రభుత్వం నిషేధం విధించిందని..అంతేగాకుండా బెంగళూరులో అనుమతి తీసుకోవడం జరిగిందని..అక్కడ మాదకద్రవ్యాలే కాకుండా మహిళలపై లైంగిక దాడులు జరుగుతాయనే ఉద్ధేశ్యంతో అక్కడ కూడా అక్కడి మ్యూజికల్ నైట్ లను రద్దు చేసిందన్నారు. ముంబైలో కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేసుకుందన్నారు.

ఇక్కడ డేవిడ్ జూటాతో కేటీఆర్ బావమరిది రాజ్ పాతాలా మాట్లాడారని..ఈ మ్యూజికల్ నైట్ నిర్వాహకుడు జుటాకు సైబరాబాద్ పోలీసులు స్వాగతం పలుకుతున్నట్లు ట్వీట్ చేశారని..అలాగే హైదరాబాద్ కు స్వాగతం పలుకుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిషేధం ఉంటే ఇక్కడ ఎలా అనుమతినిస్తారు ? అని సూటిగా ప్రశ్నించారు. పక్కా ఆరోపణలు చేస్తున్నారని కేసు పెట్టి బొక్కలొయి...అని సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్..మాదపూర్ లలో 59 పబ్బులకు పర్మిషన్ ఇచ్చారని..తలసాని..పరిటాల సునీత బంధువులకు వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్..ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సుప్రీంకోర్టులో ఫాతిమా విద్యార్థులకు చుక్కెదురు

ఢిల్లీ : ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మెడికల్ సీట్ల రీ అలకేషన్ పై విద్యార్థులు దాఖలు చేసిని పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం, ఎంసీఐ ప్రతిపాదనలను కోర్టు తిరస్కరించింది. 

12:06 - October 27, 2017

హైదరాబాద్ : నగర కమిషనరేట్ పరిధిలో 9000-10000 చలాన్లు విధించారని..వీటికి రూ. 9-10 లక్షల రూపాయలను ట్రాఫిక్ పోలీసులు కలెక్షన్ చేయడం జరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శాసనసభలో పేర్కొన్నారు. శుకవారం శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ చలాన్లపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వేసిన ప్రశ్నకు మంత్రి నాయినీ సమాధానం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ అధికంగా ఉందని మంత్రి పేర్కొనడం జరిగిందని...ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమాన వసూలు చేస్తున్నారా అనే ప్రశ్నలకు లేదు అని మంత్రి చెప్పారని తెలిపారు. కానీ దీనిపై తాను ఆర్టీఐ చట్టం కింద కొంత సమాచారం సేకరించడం జరిగిందన్నారు. నగరంలో కమిషనరేట్ పరిధిలో 9000-10000 చలాన్లు విధించారని..వీటికి రూ. 9-10 లక్షల రూపాయలను కలెక్షన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తం ఎన్ని వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ లున్నాయో మంత్రి చెప్పాలని..ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం..ఎలాంటి సమస్య రాకుండా చూడడం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. 

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రక్తత చోటుచేసుకుంది. కిడ్నాప్ అయిన టీడీపీ కౌన్సిలర్లు వచ్చాకే ఎన్నికలు నిర్వహించలని ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.  

టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ టీడీపీ నేతలతో టీడీపీ జాతీయధ్యక్షుడు చంద్రబాబు సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, రావుల, రేవూరి, మోత్కపల్లి, పెద్దిరెడ్డి హాజరైయ్యారు.  

11:55 - October 27, 2017

హైదరాబాద్ : ఆధునీకరణ పనుల కోసం గత ప్రభుత్వం రూ. 579 కోట్లు ఖర్చు చేసిందని..ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల్లో రూ. 1258 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుల విషయంలో సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు.

సండ్ర...
2008లో ఎన్ ఎస్ పీ ఆయుకట్టు ఖమ్మంలో ఎక్కువగా ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరల్డ్ బ్యాంకు ద్వారా కుడి..ఎడమ కాల్వలకు ప్రాతినిధ్యం చేశారని ఎమ్మెల్యే సండ్ర సండ్ర తెలిపారు. పాలేరు రిజర్వాయకర్ కింద ఉన్న కెనాల్స్ లను...ఖమ్మం జిల్లా సరిహద్దులకు రెండు..మూడు జోన్లలో ఉన్న కెనాల్స్ ను ఆధునీకరించాలని కోరారు. వరల్డ్ బ్యాంకు ఇచ్చిన టైం అయిపోయిందని తెలుస్తోందని..ఎడమ కాల్వ కింద ఖమ్మం..నల్గొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

మంత్రి హరీష్ సమాధానం...
నాగార్జున సాగర్ ఆయుకట్టు ప్రాజెక్టు పనులు 2008లో ప్రారంభమైనా..అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పనులు చేయలేదని మంత్రి హరీష్ రావు సభకు తెలిపారు. 2014 వరకు 33 శాతం పనులు పూర్తయ్యాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అనంతరం ఖమ్మం..నల్గొండ జిల్లాలకు నీరు పోవాల్సినవసరం ఉందని కేసీఆర్ నిర్ణయించడం జరిగిందన్నారు. కాల్వలపై గతంలో ఉన్న మంత్రులు ఎవరూ పోలేదని, కాల్వల మీద వెళ్లి పనులను పరిశీలించామన్నారు. 90-95 శాతం పనులు పూర్తయ్యాయని, 2018 లోగా వంద శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. అప్పటి ప్రభుత్వం ఆరు సంవత్సరాల కాలంలో ఆధునీకరణ పనుల కోసం 579 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల్లో 1258 కోట్ల రూపాయలు ఆధునీకరణ కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. వరల్డ్ బ్యాంకు నుండి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యిందని..నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 

టీఎస్ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టింది. దీంతో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య సభ కొనసాగుతోంది. 

11:43 - October 27, 2017

టెన్ టివి : ఏం కొనేతట్టులేదు...ఏం తినెతట్టులేదు... రాజులో రాజన్న ఈ లుచ్చగాల్ల పాలనాలో బుచ్చగాళ్ల బ్రతుకులయే అన్నడో ఓ సినీ కవి ఆ మాట నిజమైంది. ఎందుకంటే ప్రస్తుతం పెదవాడు కూరగాయలు కొనేవిధంగా లేడు. రాష్ట్రంలో కూరగాయల రెట్లు మండిపోతున్నాయి. ప్రతి కూరలో వాడే టమాట రేటు భారీగా పెరిగింది. 15 రోజుల క్రితం కేజీ టమాట రూ.30 ప్రస్తుతం 60 నుంచి రూ.80 పలుకుతుంది. కాకరకాయ రూ.50 కేజీ, కార్యేట్ రూ.60కేజీ, గోపి పూవ్వు రూ.40కేజీ, గోడు చిక్కుడు రూ.40కేజీ, ఉల్లిగడ్డ రూ.30కేజీ, బిర్నిస్ రూ.100కేజీ, పచ్చిమిర్చి రూ.40కేజీ, బెండకాయ రూ.45కేజీగా ఉన్నాయి.  

11:30 - October 27, 2017

టెన్ టివి సినిమా : ఇదేంటి సీఎం క్యాంప్ ఆఫీస్ లో మహేశ్ బాబు షూటింగ్ అనుకుంటున్నారా అవును ఇది నిజమే కాని అది నిజమైన క్యాంప్ ఆఫీష్ కాదు మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ''భరత్ అనే నేను'' ఈ మూవీకోసం ప్రత్యేకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్ వేశారు. ప్రస్తుతం అందులో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే 7తేది వరకు ఈ సెట్ లో షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి డీవీవి దానయ్య నిర్మాతగా ఉన్నారు.

నవంబర్ 22నుంచి ఔట్ డోర్ షూటింగ్ మొదలౌతుందని, సినిమా షూటింగ్ నిరంతరయంగా కొనసాగుతుందని, మా బ్యానర్ లో ఇది మరో మంచి చిత్రం అవుతుందని దానయ్య అన్నారు.  

11:18 - October 27, 2017

టెన్ టివి సినిమా : మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'సైరా నరసింహరెడ్డి' ఈ సినిమాలో ఒక పాత్రకు విజయశాంతిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై దర్శకుడు సురేందర్ రెడ్డి విజయశాంతిని సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. చిరంజీవి, విజయశాంతి కలసి నటించిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. చిరంజీవితో రాములమ్మ జతకడుతుందో లేదో చూడాలి మరి......!  

11:14 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టి.టిడిపి..టి.బిజెపి నేతలు గరం గరమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎండిపోయిన పత్తి మొక్కలను టిడిపి..బిజెపి ఎమ్మెల్యేలు సభ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి..టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మీడియాతో మాట్లాడారు. రైతుల విషయంలో ప్రభుత్వం బాధ్యాతరహితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్తాయిలో అధికారులు పర్యటించలేదని, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 3200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. విత్తన భండాగారం తెస్తామన్న ప్రభుత్వం నాసిరకం..కల్తీ వితనాలతో రైతులు నష్టపోతున్నారని, అన్ని రకాల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని..నష్టపోయిన..నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

11:10 - October 27, 2017

హైదరాబాద్ : దేశంలో ఉన్న వారందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యకు కాంగ్రెస్..టిడిపి ప్రభుత్వాలే కారణమని, అర్థాకలితో ఉద్యోగులు అలమటించే పరిస్థితి గతంలో ఉండేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ విషయంలో ధర్నాలు చేయడం జరిగిందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దానిపై జీతాలు పెంచినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రూల్ ఆఫ్ రిజర్వేన్ పాటిస్తామని..ఎస్సీ, బీసీ..మైనార్టీ..ఎస్టీలకు న్యాయం కలుగ చేస్తామన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగులను తీసుకోవడం జరుగుతుందని..భూ రికార్డుల ప్రక్షాళన చేయడం జరుగుతోందని..మూడు నెలల కాలానికి ఔట్ సోర్సింగ్ విధానం కింద ఉద్యోగులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్ లో ఏ రిక్రూట్ మెంట్ చేసినా పర్మినెంట్ గా చేసే విధంగా చూడాలని పోలీసు శాఖకు సూచించడం జరిగిందన్నారు. హోం గార్డుల సమస్య పరిష్కారం చేస్తామన్నారు. దేశంలో ఉన్న వారందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు..ఉపాధి కల్పించలేరని..ప్రభుత్వ రంగంలో ఇచ్చే ఉద్యోగుల విషయంలో ఒక కమిటీ వేసి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

ప్రకాశం జిల్లాలో భారీ చోరీ

ప్రకాశం : జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో భారీ దొంగతనం జరిగింది. ఎమ్మెల్యే ఆమంది సోదరుడు సీతయ్య ఇంట్లో 200 తులాల బంగారం, ప్రకాశం జిల్లాలో భారీ చోరీరూ.16లక్షలు అపహరణ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను పరమర్శించారు. వారం రోజుల క్రితం గవర్నర్ తల్లి చనిపోయింది.

10:57 - October 27, 2017

హైదరాబాద్ : కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రూల్ ఆఫ్ రిజర్వేన్ పాటిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ అంశానికి సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ఆర్.కృష్ణయ్య...అక్బరుద్దీన్..చింతల..
కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గత మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారని, 22వేల మందిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా ఆలోచించాలని, చాలా మంది ముసలివారు అవుతున్నారని తెలిపారు. సమైక్య పాలనలో ఉన్న సమయంలో ముస్లింల విషయంలో చాలా అన్యాయం జరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంట్ చేస్తామనడం ప్రభుత్వం అభినందిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కాంట్రాక్టు వర్కింగ్ ను తీసుకుంటారా ? రెగ్యులర్ అపాయింట్ మెంట్ విషయంలో ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తుందా అని ప్రశ్నించారు. 

10:41 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆశా వర్కర్లపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. ప్రారంభం అనంతరం డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎన్ హెచ్ఆర్ఎం స్కీం కింద వారిని తీసుకోవడం జరిగిందని, 6వేల రూపాయలు వేతనం ఇస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు. ఈ వేతనం వారి ఖాతాల్లో వేస్తున్నారా ? ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా ? రూరల్ ప్రాంతాల్లో అవగాహన లోపం ఉండడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయని..ఇంకా వారికి ఇతర బాధ్యతలు అప్పచెప్పుతున్నారా ? ప్రశ్నించారు. ఆశా వర్కర్లు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం పలు మంచి నిర్ణయాలు తీసుకొంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తెలిపారు.

తగిన చర్యలు..
కేసీఆర్ కిట్ కొత్త పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆశ వర్కర్లపై పని భారం పెరుగుతోందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే రిక్రూట్ మెంట్ చేసుకుంటామన్నారు.

అక్బరుద్దీన్ సూచనలు..
అసెంబ్లీ ప్రారంభమౌతున్న సందర్భం..బీఏసీలో జరిగిన ఒప్పందం మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సూచించారు. రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని..ప్రశ్నోత్తరాలను కొనసాగించేలా చూడాలన్నారు. లీడర్ ఆఫ్ హౌస్ కు గౌరవం ఇవ్వాల్సినవసరం ఉందని, మొదటి అంశంగా చర్చకు తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. తాము లేవనెత్తిన ప్రశ్నలను వాయిదా వేయవద్దని..సభకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలన్నారు. 

ఎమ్మెల్యే ఆకుల లలిత విషయంలో...

హైదరాబాద్ : ఎమ్మెల్యే ఆకుల లలిత విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును మండలి ఛైర్మన్ దృష్టికి టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. 

తెలంగాణ శాసనసమండలిలో గందరగోళం..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసమండలిలో గందరగోళం చోటు చేసుకుంది. రైతు సమస్యలపై చర్చించాలని టి.కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

బాబును కలిసిన ఎల్.రమణ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం బాబుతో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితులను బాబు దృష్టికి తీసుకెళ్లారు. 

గాంధీభవన్ వద్ద టెన్షన్..టెన్షన్..

హైదరాబాద్ : గాంధీ భవన్ వద్ద టెన్షన్..టెన్షన్ వాతావరణం నెలకొంది. టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో గాంధీ భవన్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. 

10:18 - October 27, 2017

హైదరాబాద్ : చండియాగం తరువాతే వర్షాలు పడ్డాయని..చెరువులు..ప్రాజెక్టులు నిండాయని మంత్రి ఇంద్రకిరణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరిందని..బంగారు తెలంగాణ వైపు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం అనంతరం డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం తీరుస్తోందని, బ్రాహ్మణులు..అర్చకుల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడడం జరిగిందని, అందరూ బాగుపడాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు. బ్రాహ్మణ పరిషత్ నుండి ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలోని ఆడబిడ్డకు రూ. 20లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని గుళ్లను ధార్మిక పరిషత్ కిందకు తీసుకరావడం జరిగిందని తెలిపారు. ఏ సంవత్సరం పీఆర్సీ అమలు చేస్తున్నారు ? భద్రాచలం, యాదాద్రి, బాసర ఇతర గుళ్లలో అర్చకులకు ఎలాంటి జీతాలు ఇస్తున్నారు ? గుళ్లలో పనిచేసే స్టాఫ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. 1805 గుళ్లను దూప నైవేద్యం కిందకు తీసుకున్నారని ఇంకా మరిన్ని గుళ్లు తీసుకోవాల్సినవసరం ఉందన్నారు.

మంత్రి ఇంద్రకిరణ్ సమాధానం..
12, 302 గుళ్లు దేవాదాయ శాఖలో నమోదయ్యాయని, దూప నైవైద్యం కింద 1805 గుళ్లు లబ్దిపొందుతున్నాయని మంత్రి ఇంద్రకిరణ్ తెలిపారు. ఇటీవలి కాలంలో శాఖ కింద అర్చకులు..ఉద్యోగుల డిమాండ్ల మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఉపసంఘం పలు చర్చలు జరిపిందన్నారు. అనంతరం నివేదికను అందచేసినట్లు, అనంతరం అర్చకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారని, 2016 ప్రకారం పీఆర్సీ ప్రకటించడం జరిగిందన్నారు. యాదాద్రిని ఎంతో ఘనంగా తీర్చిదిద్దడం జరుగుతోందని, బాసర..వేముల వాడ తదితర దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.

ప్రభుత్వాన్ని అభినందించిన అక్బరుద్దీన్..
గుళ్లలో పనిచేస్తున్న అర్చకుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అభినందిస్తున్నట్లు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. 

టి.కాంగ్రెస్ నినాదాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రైతు సమస్యలపై చర్చించాలంటూ టి.కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.

 

టి.అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. స్పీకర్ మధుసూధనచారి అనారోగ్యంతో ఉన్నందున డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి స్పీకర్ ఛైర్ లో కూర్చొన్నారు. 

నల్లదుస్తుల్లో కోమటిరెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలింబిస్తోందని పేర్కొంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు.

సంక్షోభంలో వ్యవసాయం - లక్ష్మణ్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దృష్ట్యా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అం

09:59 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దృష్ట్యా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేయబడిందని, ప్రకృతి వైపరీత్యం..అకాల వర్షాలు..రెండు లక్షల ఎకరాల పంట నష్టపోయినా ప్రభుత్వానికి సోయి లేదని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పత్తికి బోనస్ ఇస్తోందని..కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులను అరెస్టు చేస్తూ బేడీలు వస్తోందని, రైతుల వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నట్లు తెలిపారు. 

09:58 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలింబిస్తోందని పేర్కొంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. తాము చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగిందని కానీ పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారని తెలిపారు. విజయవాడ, నల్గొండ, మహబూబ్ నగర్ పీఎస్ లను చూడాలని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులని చూడకుండా అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వం మెడలు వంచైనా సరే తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితే సీట్ల కోసం మాట్లాడుతున్నారే కానీ రైతు సమస్యలపై మాట్లాడడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ..దళితులకు మూడెకరాలు..డబుల్ బెడ్ రూం...ఇలాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

షబ్బీర్ ఆలీ ఘాటు వ్యాఖ్యలు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలకు సిగ్గుందా..దమ్ముందా అంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దృష్ట్యా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో టెన్ టివితో మాట్లాడారు.

09:53 - October 27, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలకు సిగ్గుందా..దమ్ముందా అంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దృష్ట్యా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో 70 శాతం జనాభా రైతులు ఉంటారని..పత్తి కొనుగోలు చేశారా ? ఎక్కడైనా అయితుందా..దుమ్ముందా..సిగ్గుందా..ఎక్కడ సెంటర్ ఓపెన్ చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్రానికి అప్పీలు చేసినం..వస్తది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోందని, ఈ రోజు నుండి కొనుగోలు చేస్తామని సీఎం చెబితే తాము చలో అసెంబ్లీ పిలుపును విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి..వానికి ఏం జవాబివ్వాలి ? అని ఘాటు విమర్శలు చేశారు. 

09:47 - October 27, 2017

హైదరాబాద్ : అధికారంలో ఉన్న సమయంలో రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద టెన్ టివితో ఆయన ముచ్చటించారు. చలో అంసెబ్లీకి టి.కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం దురదృష్టకరని, చర్చ జరగాల్సిన సమయంలో ఇలా చేయడం కరెక్టు కాదన్నారు. వారి దివాళుకోరుతనానికి నిదర్శనమని, పది సంవత్సరాల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఎలాంటి భరోస ఇవ్వలేదని విమర్శించారు. ఓట్ల రాజకీయం చేస్తోందని, ఎన్నికల్లో 106 సీట్లు వస్తాయని తమ సర్వేల్లో తేలిందని..ఈ విషయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పడం సర్వసాధారణమేనన్నారు. 

09:44 - October 27, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. అనంతరం సభ ఆమోదానికి ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వ్యాట్ చట్ట సవరణ, పీడీ యాక్ట్ సవరణ, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లు, గేమీ ఆర్డినెన్సుకు ఆమోదం, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్సులకు ఆమోదం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎక్సైజ్ చట్టాలకు సవరణల బిల్లులను ఆమోదం కోసం సభ లో ప్రవేశపెడుతారు. మూడున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధి సాధింలేదని టి.కాంగ్రెస్ పేర్కొంటోంది. టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. 

కాంగ్రెస్ ది దివాళుకోరుతనం - కర్నె...

హైదరాబాద్ : చలో అసెంబ్లీకి టి.కాంగ్రెస్ పిలుపునివ్వడం దురదృష్టకరని, చర్చ జరగాల్సిన సమయంలో ఇలా చేయడం కరెక్టు కాదని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. వారి దివాళుకోరుతనానికి నిదర్శనమని, పది సంవత్సరాల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఎలాంటి భరోస ఇవ్వలేదని విమర్శించారు. 

09:23 - October 27, 2017

హైదరాబాద్ : ప్రభుత్వానికి కళ్లు..చెవులు లేవని..రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు పేర్కొన్నారు. రైతు సమస్యలపై టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని నేతలు పేర్కొన్నారు. గాంధీభవన్ వద్ద టి.కాంగ్రెస్ నేతలు భారీగా మోహరించారు. వివిధ జిల్లాల నుండి పార్టీ శ్రేణులకు ఇక్కడకు చేరుకున్నారు.

ప్రభుత్వానికి చెవులు..కళ్లు లేవని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. రైతు గర్జన పేరిట టి.కాంగ్రెస్ ర్యాలీలు..సభలు పెట్టిందని, మూడు సంవత్సర కాలంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎవరి ఖాతాలో కూడా డబ్బులు పడలేదన్నారు. వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక్కపైసా ఖాతాల్లో జమ చేయలేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేశారని తెలిపారు. 

పోలీసుల తీపై నేతల మండిపాటు..

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీ పిలుపు మేరకు అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడుతున్నారు. 

09:10 - October 27, 2017

హైదరాబాద్ : రైతు సమస్యలు పరిష్కరించాలంటూ టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. కాసేపటి క్రితం గాంధీ భవన్ నుండి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేసీఆర్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని టి.కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జిల్లాల నుండి పార్టీ శ్రేణులను నేతలు తరలిస్తున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. పలువురిని గృహనిర్భందం చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మూడు వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అసెంబ్లీకి వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతినిస్తున్నారు. 

అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రత..

హైదరాబాద్ : అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నేటి నుండి అసెంబ్లీ ప్రారంభమౌతున్న సంగతి తెలిసిందే. రైతు సమస్యలపై నేడు టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. 

కాసేపట్లో టి.అసెంబ్లీ..

 

హైదరాబాద్ : కాసేపట్లో టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం గంట నుండి గంటన్నరకు పెంచారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

 

మార్చిలో ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి మొదటివారంలో ప్రారంభంకానున్నాయి. ఇందుకు ఇంటర్‌బోర్డు పనులను వేగవంతం చేసింది. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. 

అసెంబ్లీ ఎదుట 9 బిల్లులు..

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. అనంతరం సభ ఆమోదానికి ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వ్యాట్ చట్ట సవరణ, పీడీ యాక్ట్ సవరణ, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లు, గేమీ ఆర్డినెన్సుకు ఆమోదం, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్సులకు ఆమోదం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎక్సైజ్ చట్టాలకు సవరణల బిల్లులను ఆమోదం కోసం సభ లో ప్రవేశపెడుతారు. 

టి.కాంగ్రెస్ నేతల అరెస్టులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టి.కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. నేడు టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

చట్ పూజ..

ముంబై : దేశ వ్యాప్తంగా చట్ పూజ ఘనంగా జరుగుతోంది. జుహూ బీచ్ లో చట్ పూజను మహిళలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో కూడా మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. 

07:23 - October 27, 2017

టి.కాంగ్రెస్ నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనితో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి. రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మన్నె గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్), వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), ఇందిర (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:04 - October 27, 2017

వరుసగా ఒకరి తర్వాత మరొకరు.. కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు.. బంగారు భవిష్యత్తును కాదనుకుని వెళ్లిపోతున్నారు. ఏ ఒత్తిడి ఆ చిన్నారులను చిదిమేస్తోంది? ఏ భారం వారిని ఆత్మహత్య దిశగా నెడుతోంది? మార్కుల వేటలో, ర్యాంకుల గోలలో కార్పొరేట్ విద్యా సంస్కృతి చిన్నారుల చావులకు కారణమౌతోందా? ప్రభుత్వాన్నా, తల్లిదండ్రుల్నా, కార్పొరేట్ విద్యావ్యవస్థనా ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త లక్ష్మణరావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

షరీఫ్ కు ఎదురుదెబ్బ...

ఢిల్లీ : అవినీతి కేసుల్లో చిక్కుకున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పాకిస్తాన్‌ కోర్టు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. 

47 మంది మృతి...

ఢిల్లీ : ఇండోనేషియాలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. 

స్విట్జర్లాండ్ జంటపై దాడి..సుష్మా స్పందన..

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన జంటపై జరిగిన దాడిపై విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించారు

అబ్దుల్‌ కరీం తెల్గీ మృతి...

ఢిల్లీ : ఫేక్‌ స్టాంపు రాకెట్‌ ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ మృతి చెందాడు. విక్టోరియా ఆసుపత్రిలోని ట్రౌమా కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 3-55 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎ

జకీర్‌నాయక్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌..

ఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సం‍స్థ 58 పేజీలతో కూడిన ఛార్జ్‌-షీట్‌ను దాఖలు చేసింది. జకీర్‌ నాయక్‌పై మనీలాండరింగ్, టెర్రరిస్టు ఫండింగ్‌ ఆరోపణలున్నాయి. నవంబర్‌ 18, 2016లో జకీర్‌నాయక్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. 

ఐసియూకు జిఎస్‌టి ఆర్థికవ్యవస్థ - రాహుల్..

ఢిల్లీ : సంస్కరణలు ఆర్థికవ్యవస్థకు ఔషదం లాంటివని ప్రధాని మోది చేసిన ప్రకటనలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. నోట్లరద్దు, జిఎస్‌టి ఆర్థికవ్యవస్థను ఐసియూకు చేర్చాయని ఎద్దేవా చేశారు. తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు రాహుల్‌. 

06:48 - October 27, 2017

విజయవాడ : కంచ ఐలయ్య ఆత్మీయసభపై విజయవాడలో వివాదం రాజుకుంటోంది. ఐలయ్యకు సంఘీభావంగా సామాజిక జేఏసీ సభ నిర్వహిస్తామంటోంది. దీనికి కౌంటర్‌గా ఆర్యవైశ్య సంఘాలు తాము కూడా సభపెడతామంటూ ముందుకొచ్చారు. అంతేకాదు ఐలయ్య విజయవాడకు వస్తే అడ్డుకుంటామంటున్నారు. ఈ హడావిడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలకు సభ అనుమతిని నిరాకరించారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో సామాజిక జేఏసీ సభపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

విజయవాడ జింఖానా గ్రౌండ్ లో సామాజిక ఏజేఏసీ తలపెట్టిన సభ వివాదంగా మారింది. ఛలో విజయవాడ కార్యక్రమంతోపాటు అంబేద్కర్ విగ్రహం నుంచి జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, తర్వాత సభ నిర్వహించాలని నిర్ణయించింది సామాజిక జేఏసీ. ఈ సభకు కంచె ఐలయ్య , గద్దర్, విమలక్క, సిపిఐ రామకృష్ణ, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. సభ నిర్వహణకోసం జింఖాన గ్రౌండ్స్‌ను బుక్‌ చేసుకున్నట్టు సామాజిక జేసీఏ చెబుతోంది. విజయవాడ కార్పొరేషన్‌ నుంచి తమకు అనుమతి పొందిన సామాజిక జేఏసీ నేతలు.. సభ నిర్వహణకోసం పోలీసులను అనుమతి కోరామంటున్నారు.

అయితే.. తామూ అదే రోజు, జింఖానా గ్రౌండ్స్‌లో సభ పెడతామంటూ ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు అనుమతి కోరడంతో వివాదం మరింత రాజుకుంది. సామాజిక జేఏసీ తీరుపై ఆర్యవైశ్య -బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడకు కంచ ఐలయ్య వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారు.

సభను అడ్డుకుంటామని ఆర్యవైశ్యసంఘాలు ప్రకటించడాన్ని సామాజిక జేఏసీ నేతలు తప్పపడుతున్నారు. తాము తలపెట్టిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య సంఘీభావసభను ఈ నెల 28 న జరిపి తీరుతామంటున్నారు. దీనిపై ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వం దళిత,బహుజనుల పక్షమో.. కాదో.. అనేది ఇపుడు తేలిపోతుందంటున్నారు. అయితే ఇరువర్గాలకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు అంటున్నారు. నగరంలో 144, 30 సెక్షన్‌లు అమల్లోకి తెచ్చామంటున్నారు. దీంతో బెజవాడలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయోచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని..రెండు వర్గాలకు సభలు పెట్టుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. 

06:45 - October 27, 2017

విజయవాడ : నవంబర్ 6 నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం చేశారు వైసీపీ అధినేత జగన్. 6 నెలలపాటు 3వేల కిలోమీటర్ల మేర జరపనున్న పాదయాత్రలో దాదాపు రెండుకోట్ల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు జగన్ ప్రణాళికలు రచించారు. మరోవైపు అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు నాలుగు నెలలపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వైఎస్.జగన్ కార్యాచరణ ప్రకటించారు. పాదయాత్ర రూట్ మ్యాప్, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు జగన్.

జగన్ పాదయాత్ర 125 నియోజకవర్గాల్లో జరగనుంది. పాదయాత్రలో 5వేలకు పైగా సమావేశాలు.. 180 ప్రభావిత సంఘాల సమావేశాలు.. 125 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో జగన్ ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకూ కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకూ పాదయాత్ర నిర్వహిస్తారు. 12:30 గంటల నుంచి 3గంటల వరకూ భోజన విరామ సమయం ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3గంటల నుంచి 3:30 గంటల వరకూ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. 3:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. జగన్ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌కు సంబంధించిన వివరాలను పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు.

ఓవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర కొనసాగుతుంటే.. మరోవైపు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అసెంబ్లీ కో-ఆర్డినేట‌ర్లు, ఎమ్మెల్యేలు, నాలుగు నెల‌ల పాటు చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ కార్యాచరణ ప్రకటించారు. ప్రధానంగా రచ్చబండ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ సూచించారు. ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించడంతోపాటు పార్టీని అన్ని వర్గాల ప్రజల్లోని తీసుకెళ్లాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు సంతకాల సేకరణతోపాటు..కళాశాల విద్యార్ధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ నేతలకు జగన్ అప్పగించిన కార్యాచరణపై సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రతో జగన్.. పాదయాత్ర సిద్ధం చేసుకున్నారు. జగన్ చేపట్టబోయే పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. 

06:43 - October 27, 2017

విజయవాడ : వచ్చే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు వేయాలని డిమాండ్ చేశారు. నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే సభకు హాజరయ్యే అంశంపై ఆలోచిస్తామని వైసీపీ నేత పెద్దిరెడ్డి వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న వైసీపీ..నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. సమస్యలను చర్చించే దమ్ములేక ప్రతిపక్షం పలాయన వాదాన్ని అందుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ విషయాన్ని తేల్చేందుకు స్పీకర్‌, కోర్టులు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు ఆపివేయాలని వైసీపీ కేంద్రానికి రాసిన లేఖపై అసెంబ్లీలో సమాధానం చెప్పే ధైర్యం లేక సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రత్తిపాటి మండిపడ్డారు. 

06:39 - October 27, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో సమన్వయంతో వ్యవహరించాలని తెలంగాణ టిడిపి, బీజేపీ నిర్ణయించాయి. కలిసి పనిచేస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చన్న అభిప్రాయానికి రెండు పార్టీల నేతలు వచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గళం విప్పాలని నిర్ణయించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరైన ఈ భేటీలో అసెంబ్లీలో సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి.

అసెంబ్లీలో రెండు పార్టీ సంఖ్యాబలం తక్కువగా ఉన్న నేపథ్యంలో కలిసి పనిచేస్తేనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చన్న నిర్ణయానికి టీడీపీ, బీజేపీ నేతలు వచ్చారు. ఉభయసభల్లో ప్రస్తావించే 25 అంశాలను గుర్తించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటనష్టం, కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్‌బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం వంటి విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. సభలో ప్రస్తావించే ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ జరిగే రోజుల్లో కూడా రెండు పార్టీల ప్రజా ప్రతినిధుల వీలునుబట్టి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ భేటీకి రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు.

06:35 - October 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో పోరు తార స్థాయికి చేరింది. టీడీఎల్పీ నేతగా రేవంత్‌ను తొలగించడంతో.. కార్యాలయంలోని ఫైళ్లను, కంప్యూటర్‌ను రేవంత్‌ అనుచరులు చెప్పాపెట్టకుండా తీసుకెళ్లారు. ఆ వస్తువులతో టీడీపీకి సంబంధం లేదని.. అవి తమ వ్యక్తిగతమని రేవంత్‌ అనుచరులు చెప్తున్నారు. టీ టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరే అదనుగా ప్రభుత్వం టీడీఎల్పీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. రేవంత్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీడీఎల్పీనేత బాధ్యతల నుంచి తొలగించడంతో ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఎల్‌. రమణ, మోత్కుపల్లిలాంటి సీనియర్లపై మండిపడుతున్నారు. కేవలం రాహుల్‌ గాంధీని కలిశారన్న సాకుతో రేవంత్‌ను టీ టీడీపీకి దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన ఎల్‌.రమణ వర్గం ఎల్పీ కార్యాలయ స్వాధీనానికి ప్లాన్‌ వేసింది. ఇది ముందుగానే ఊహించిన రేవంత్‌ వర్గీయులు... ఎల్పీ కార్యాలయంలోని విలువైన వస్తువులను రాత్రికి రాత్రే మాయం చేశారు. సమాచారంతో కూడుకున్న ఫైల్స్‌, కంప్యూటర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. తమ అవసరాల కోసం అవన్ని తాము సమకూర్చుకున్నామని... వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే స్థానాలను టీ టీడీపీ గెల్చుకోవడంతో ప్రభుత్వం ఎల్పీ కార్యాలయాన్ని కేటాయించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 15 మందిలో 12మంది ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ప్రభుత్వం ఎల్పీ కార్యాలయాన్ని గతంలోనే స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. సంఖ్యబలం లేనందున, కార్యాలయం కొనసాగించడం కుదరదని స్పీకర్‌ లేఖ రాశారు. అయితే పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున టీడీఎల్పీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇప్పుడు టీడీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని తప్పించడంతో ప్రభుత్వం ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కార్యాలయాన్ని అసెంబ్లీ కమిటీ సమావేశాల కోసం వినియోగించనున్నట్టు అసెంబ్లీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీడీఎల్పీ కార్యలయాన్ని సర్కార్ స్వాధీనం చేసుకోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఆయన.. స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రేవంత్‌ను తప్పించడం తమ అంతర్గత అంశమని... దీనిని అదనుగా చేసుకొని తమ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం తగదన్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను అధికార పార్టీ తమను అనుకూలంగా మార్చుకుంటోంది. భవిష్యత్‌తో ఇలాంటి కార్యక్రమాలు మరెన్ని చూడాల్సి వస్తుందో మరి.

06:31 - October 27, 2017

హైదరాబాద్ : చలోఅసెంబ్లీ పిలుపు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకులతో పీఎస్ లు నిండిపోయాయి. రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.

'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని హస్తంపార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.

ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని సీఎల్పీ అధ్యక్షుడు జానారెడ్డి స్పష్టం చేశారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించబోమని తెలిపారు. రైతులను కాపాడమంటూ ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జానా చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా.. పోలీసు జులుంతో అణచివేయాలని చూస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జానా హెచ్చరించారు. 'ఛలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

చలో అసెంబ్లీకి సిద్ధమైన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం మండలాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. అటు యాదాద్రిజిల్లాలోనూ ముందుస్తు అరెస్టులతో రాజకీయం వేడెక్కింది. సంగారెడ్డిజిల్లా జిన్నారంలో కాంగ్రెస్‌నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటజిల్లాలో చలోఅసెంబ్లీకి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్‌నేతలను పోలీసులు ముందస్తుగా రెస్టుచేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కాంగ్రెస్‌లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను ఖండిస్తూ నాయకులు ఆందోళనకు దిగారు. రైతుల కష్ట నష్టాలపై ప్రభుత్వం స్పందించక పోవడంతోనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 

టి.కాంగ్రెస్..చలో అసెంబ్లీ..

హైదరాబాద్ : నేడు టి. కాంగ్రెస్ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. 

నేటి నుండి టి..అసెంబ్లీ..

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 50 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు మరోసారి బీఏసీ సమావేశం భేటీ కానుంది. ఏజెండా..పని దినాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ లో కోరారు. 

టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వేయాలని పిటిషన్ లో కోరారు. 

చెన్నైలో ‘మెర్సల్’ సినిమా విడుదల..

చెన్నై : నేడు విజయ్ నటించిన 'మెర్సిల్' సినిమా విడుదల కానుంది. సినిమాలో జీఎస్టీపై డైలాగ్ లను నిర్మాత మ్యూట్ చేశారు. తెలుగులో 'అదిరింది' పేరిట సినిమా విడుదల కానుంది. 

ముంబైలో మంత్రి నారా లోకేష్..

హైదరాబాద్ : నేడు రెండో రోజు ముంబైలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఫుడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో లోకేష్ పాల్గొననున్నారు. 

Don't Miss