Activities calendar

28 October 2017

ఎమ్మెల్యే పదవి రేవంత్ రెడ్డి రాజీనామా

హైదరాబాద్ : టీడీపీ ప్రాథమిక పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. స్పీకర్ ఫార్మాట్ రేవంత్ రెడ్తి తన రాజీనామా లేఖను స్పీకర్ పంపారు. 

16:05 - October 28, 2017

గుంటూరు : తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రాజీనామా  ఇంకా తన దృష్టికి రాలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించాతరు. కొంత మంది వ్యక్తిగత భవిష్యత్‌ కోసం తీసుకునే నిర్ణయాలతో టీడీపీకి నష్టంలేదన్నారు. టీడీపీ మాజీ ఎంపీ నామానాగేశ్వరరావుపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు వ్యక్తిగత విషయమన్నారు. 

16:03 - October 28, 2017

హైదరాబాద్ : కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రేవంత్‌ రెడ్డి వ్యవహారాన్ని సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్‌ వ్యవహారంపై పార్టీ అధినేత  చంద్రబాబునాయుడుతో చర్చించేందుకు టీటీడీపీ  నేతలు ఇవాళ విజయవాడకు చేరుకున్నారు. వారితోపాటు రేవంత్‌ కూడా విజయవాడ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చారు. అయితే రేవంత్ రాజీనామా లేఖ తనకు అందలేదని చంద్రబాబునాయుడు తెలిపారు. వ్యక్తిగత భవిష్యత్ కోసం కొందరు పార్టీ వీడుతున్నారని.. అలాంటి వారివల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. రాజీనామా అనంతరం.. రేవంత్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అనంతరం చంద్రబాబు... తాజా పరిణామాలపై టీటీడీపీ నేతలతో భేటీ  అయ్యారు.

 

టీజీ వెంకటేష్ పై పీఎస్ లో ఫిర్యాదు

హైదరాబాద్ : కంచె ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్ పై అంబర్ పేట పీఎస్ లో టీమాస్ ఫోరం నేతలు ఫిర్యాదు చేశారు. 

సిరిసిల్లలో ఇద్దరు వశువైద్యుల సస్పెన్షన్

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లాలో ఇద్దరు పశువైద్యులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొండగట్టు జేఏన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్/జగిత్యాల : జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి కొండగట్టు జేఎన్టీయూలో ఐటీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని శ్రీలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతరాలు ఖమ్మం జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది.

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

కృష్ణా : టీటీడీపీ నేతలతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహరంపై వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

రేవంత్ రాజీనామా గురించి తెలియదు

కృష్ణా : రేవంత్ రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని టీడీపీ జాతీయధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు వారితోనే మాట్లాడే వచ్చా అని రేవంత్ రాజీనామా లేఖ తను అందలేదని బాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుందని, తమ భవిష్యత్ కోసం కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.

15:39 - October 28, 2017

విశాఖ : ఆధునిక జీవన శైలితో యువత కాన్సర్‌ను కొని తెచ్చుకుంటుందని అభిప్రాయ పడ్డారు సినీహీరో బాలకృష్ణ. విశాఖ బీచ్‌ రోడ్డులో క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో నటులు బాలకృష్ణ, గౌతమి పాల్గొన్నారు. కాన్సర్‌ జయించినవారిని బాలకృష్ణ సత్కరించారు. తక్కువ ఖర్చుతో నిరుపేదలకు వైద్యం అందించేందుకు ఎన్ టీఆర్ బసవతారక కాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు బాలకృష్ణ. అత్యాధునిక సౌకర్యాలతో కాన్సర్ ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 

 

15:36 - October 28, 2017

చిత్తూరు : శ్రీ వెంకటేశ్వరస్వామివారి వార్షిక పుష్పయాగాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతీ యేటా శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది మొత్తం తెలిసో తెలియకో శ్రీవారి ఆలయంలో జరిగే పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం చేస్తారు. తమిళనాడు, కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తం 9 టన్నుల పూలతో ఈ పుష్పయాగం అత్యంత వేడుకగా జరిగింది. తిరుమలలోని ఉద్యానవన విభాగం వద్ద నుండి ఈ పుష్పాలను అధికారులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఉద్యానవన విభాగం అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

15:32 - October 28, 2017

హైదరాబాద్ : ఈనెల 31న కొలువులకై కొట్లాట సభను యథాతథంగా నిర్వహిస్తామని టీజాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఈవిషయంలో హైకోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని కోరడం లేదని.. ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. 

 

15:22 - October 28, 2017

హైదరాబాద్ : టీడీపీకి రేవంత్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. రేవంత్‌రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు పంపించారు. పార్టీలో పరిణామాలు తనను ఇబ్బంది పెట్టాయని రేవంత్‌రెడ్డి అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:15 - October 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. వచ్చే కొనుగొళ్ల నాటికి మార్కెట్లను మార్చాలని డిమాండ్‌ చేశారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ కంపెనీలు ముందుకు రావాలన్నారు. వారి ఆదాయంలో ఒకశాతం ఇచ్చినా 30 వేల కోట్లు అవుతుందని.. ఆ డబ్బుతో రైతులను ఆదుకోవచ్చన్నారు. 

 

15:13 - October 28, 2017

హైదరాబాద్‌ : తార్నాకలోని కంచ ఐలయ్య నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా బయల్దేరిన టీమాస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై.....

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ పార్టీ జాతీయధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. పార్టీలో పరిణామలు తనను బాధ పెట్టయని రేవంత్ పెర్కొన్నారు. 

13:35 - October 28, 2017

విజయవాడ : నవంబర్ నెలలో ఏపీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విదేశీ పర్యటన విశేషాలను ఆయన మీడియాకు తెలియచేశారు. ఎక్కువ ప్రాధాన్యత వాటర్ కి ఇవ్వడం జరుగుతోందని, భూగర్భ జలాలు పెంపొందించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. వాటర్ మెనేజ్ మెంట్ కృషి వల్ల ఎంతో మార్పు వస్తోందని, డ్రిప్ ఇరిగేషన్..అక్వాకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. విత్తన కేంద్రంగా ఏపీ తయారు కావాలని, మెగా సీడ్ పార్క్ కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

అమెరికాలో పేరు గాంచిన యూనివర్సిటీతో ఎంవోయూ ఒప్పందం చేసుకున్నట్లు, అగ్రికల్చర్ లో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించిన వారితో సమావేశమయ్యామన్నారు. నెదర్లాండ్స్ లో బెటర్ యూనివర్సిటీతో ఒక అవగాహన చేసుకోవడం జరిగిందన్నారు. వ్యవసాయం..అనుబంధ రంగాల్లో ఉత్తమమైన యూనివర్సిటీ..ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకోవడం జరుగుతోందన్నారు. ప్రపంచంలో అగ్రికల్చర్ లో ఉండే టెక్నాలజీని ఇక్కడకు తీసుకొచ్చి పరిశీలించడం జరుగుతోందని అందులో భాగంగా నవంబర్ నెలలో నిర్వహించే ఓ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రావడం జరుగుతోందన్నారు. 

13:24 - October 28, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార నిర్వాసితుల గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకొనేందుకు వామపక్ష పార్లమెంటరీ బృందం నడుం బిగించింది. శనివారం తులగాం గ్రామంలో బృందం పర్యటించింది. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసింది.

తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని నిర్వాసితులు కోరుతున్నారు. బృందానికి వినతిపత్రం సమర్పించింది. ఇదిలా ఉంటే పర్యటనను అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రైతులు గ్రామాలు వదిలిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఐ ఎంపీ రాజా పేర్కొన్నారు. బృందంలో సీపీఎం ఎంపీ సంపత్, సీపీఐ ఎంపీ డి.రాజాలున్నారు. 

13:13 - October 28, 2017

హైదరాబాద్ : రెచ్చగొడుతున్న వారిని వదిలేస్తున్నారని...శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని లాక్కొని వెళుతున్నారని విమలక్క పేర్కొన్నారు. కంచె ఐలయ్య సభకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనితో ఐలయ్య నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఆయన్ను గృహ నిర్భందం చేశారు. బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

గృహ నిర్భందం నుండి ఐలయ్యను విడుదల చేయాలని కోరుతూ ఆయన నివాసం నుండి టీమాస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీనితో పోలీసులతో టీ మాస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో పలువురు నేతలు కిందపడిపోయారు. వీరిని లాక్కొంటూ ఆటోలు..వ్యాన్ లలో పడేశారు. విమలక్క, ప్రొ.విశేశ్వరరావు, జాన్ వెస్లీ, తదితర ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేసి అంబర్ పేట పీఎస్ కు తరలించారు.

ఈ సందర్భంగా కంచ ఐలయ్య మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నికల రంగంలో నిలవనని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండాలన్నారు. అందరీ సమానంతో ఉన్న వ్యవస్థ కావాలని కోరుకుంటున్నట్లు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. 

జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. నగర అభివృద్ది కార్యక్రమాలపై కేటీఆర్ వివరించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ పై ప్రత్యే దృష్టి పెడుతున్నామని కేటీఆర్ తెలిపారు. 

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా రాజగోపాల్

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. టీడీపీ వాకౌట్ తో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12:32 - October 28, 2017

హైదరాబాద్ : తార్నాకలోని కంచ ఐలయ్య నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా బయల్దేరిన టీమాస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో, టీమాస్‌ నేతల వాగ్వాదానికి దిగారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఐలయ్యను గృహ నిర్భందం నుండి విడుదల చేయాలని కోరుతూ శనివారం ఉదయం టీమాస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. కానీ ఈ ర్యాలీని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసులతో టీమాస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీనితో నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. పోలీసుల చర్యపై టీమాస్ నేతలు..ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జాన్ వెస్లీ, ప్రొ.విశ్వేశ్వరరావు, విమలక్క ఇతర నేతలు అరెస్టయిన వారిలో ఉన్నారు. శాంతియుతంగా నిర్వహిస్తామని పేర్కొంటున్నా శాంతిభద్రతల పేరిట సభకు అనుమతిని నిరాకరించడం దారుణమని నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:31 - October 28, 2017

సినిమా : హీరో రాజశేఖర్ తాజా నటిస్తున్న చిత్రం ''గరుడవేగ''. ఈ సినిమా వచ్చే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఇటివల చినిపోయిన ఆయన తల్లిని తలుచుకుని ఎమోషన్ ఫీలయ్యారు.

చిత్ర ట్రైలర్ కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసిన తన తల్లి ఎంతో సంతోషించారని కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని ఆ మరుసటి రోజు తన తల్లి చనిపోయిందని రాజశేఖర్ కన్నీటి పర్యంతమైయ్యారు. రాంగ్ టైమ్ లో సినిమాలు చేయడం వలన చాల నష్టపోయానని, సుమారు రూ.200కోట్ల ఆస్తులను అమ్ముకున్నాని దాంతో అమ్మ చాల బాధ పడేదని రాజశేఖర్ ఆవేదనగా చెప్పారు. సినిమాల్లో చాలా మంది ఇలా నష్టపోయి చివరి దశలో ఏమీ లేకుండా చేసుకుంటారని అలాగే నేను అవుతానేమోనని అమ్మ చాలా బాదపడేది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆ సమయంలో విలన్ పాత్రలు చేయడానికి సిద్దపడ్డాను కానీ పాత్రలు నచ్చలేదని తెలిపారు. ''ఢిల్లీ రాజైన తల్లికి కొడుకే'' అన్న విధంగా రాజశేఖర్ తన తల్లిని తలుచుకుని ఎడవడం తల్లి పట్ల కొడుకు ఉన్న ప్రేమను గుర్తు చేసింది. 

12:27 - October 28, 2017

విజయవాడ : కంచ ఐలయ్య సభ నిర్వహిస్తారన్న వార్తల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కంచ ఐలయ్య సామాజిక నేతలు, ఆర్యవైశ్య బ్రాహ్మణ సంఘాల సభలకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కంచ ఐలయ్య సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరువర్గాలకు చెందిన 290 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. నగరంలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. సభ జరిగే ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచ ఐలెయ్య సంఘీభావ సభ నిర్వహిస్తే అడ్డుకుంటామని ఆర్యవైశ్య బ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:25 - October 28, 2017

మంచిర్యాల : జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. గోదావరి కట్టలను పూర్తిగా తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎప్పటి మాదిరిగానే సైలెంట్‌ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక వ్యారాం పది ట్రాక్టర్లు, నలబై ట్రక్కులు అన్నట్టు సాగుతోంది. రాత్రి పగలు జోరుగా ఇసుకను తవ్వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును అక్రమార్కులు స్వార్థానికి వాడుకుంటున్నారు. వ్యక్తిగత ఇళ్లు, పరిశ్రమల నిర్మాణాలకు రాయల్టి చెల్లించి ఇసుక తీసుకోవచ్చన్న సర్కార్‌ ప్రకటన అక్రమ రవాణాకు ఊతంగా మారింది.

మందమర్రి మండలం అందుగులపేట శివారులో పెదవాగు, చినవాగు ప్రాంతంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. శంకర్‌పల్లి గ్రామంలోని పాలవాగు, లోతుఒర్రె, చిర్రకుంట, దుడ్డమయ్యకుంటతోపాటు బొక్కలగుట్ట గ్రామంలోని రాళ్లవాగు నుంచి రోజు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. పొన్నారంలోని కొండెంగెలవాగు, వెంకటాపూర్‌లోని ఎర్రవాగు, మందమర్రి శివారులోని గుండాల మలువుపువద్ద ఇసుక అక్రమ రావాణా సాగుతోంది. రోజుకు 100 ట్రాక్కుల వరకు ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుకకు 7 వందల నుంచి 15 వందల వరకు వసూలు చేస్తున్నారు.

అటు చెన్నూరు మండలంలోని కత్తెర వాగు, సుద్దాలవాగు, బతుకమ్మవాగు,అక్కెపల్లె వాగుతోపాటు గోదావరి తీరం నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. బెల్లంపల్లి, నెన్నల, సర్వాయిపేట, కన్నెపల్లి, కాసిపేట మండలాలతోపాటు జైపూర్‌ మండలాల్లో ఇసుకాసురులకు అడ్డేలేకుండా పోయింది. పర్యావరణానికి చేటు తెచ్చేలెవల్లో ఇసును తరలిస్తున్నారు. ఈ ఇసుక దందా వెనుక టీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన స్థానిక నాయకులు, అధికారుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, అటవీశాఖలతో పాటు, పంచాయతీరాజ్‌, భూ గర్భగనుల శాఖల అధికారులకు క్రమం తప్పకుండా మామూళ్లు అందుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రజలు కోరుతున్నారు. పర్యవారణానికి తూట్లుపొడుస్తూ..చట్టాలను తుంగలో తొక్కుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

12:23 - October 28, 2017

శ్రీకాకుళం : జిల్లా నేతల్లో జనసేన పార్టీ ఆశలు రేకెత్తిస్తోంది. కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొందరు.. ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలు లేక ఇంకొందరు.. మాజీలు, వలస నేతలు.. ఇలా చాలామంది జనసేన పై ఆశలు పెట్టుకొంటున్నారు. అయితే పవనిజం ఎంతవరకు హిట్ అవుతుందన్న డైలమా జిల్లాలో కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజికవర్గం, పది అసెంబ్లీ నియోజికవర్గాలున్నాయి. రాజకీయంగా ఎంతో చరిత్ర కల్గిన సిక్కోలు జిల్లాలో నేతలకు కొదవలేదు.. ప్రజాభిమానం పొందితే నాలుగైదుసార్లు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశాలు ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు. ఇదే అవకాశం జనసేన రూపంలో వస్తే తాము ఎందుకు రంగంలోకి దిగకూడదని చాలామంది అప్‌కమింగ్‌ లీడర్లు ఆలోచిస్తున్నారు. వీరితోపాటు రాజకీయ అనిశ్చితి కారణంగా టిడిపి, వైసీపీ నుండి జంప్ జిలానీలుగా ముద్రపడిన మాజీలు జనసేనపై చాలనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇచ్చాపురం నియోజికవర్గంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ ఎమ్మెల్యే తనయుడు జనసేన వైపు చూస్తున్నారు. అటు పలాసలో టిడిపి, వైసీపీ నుంచి ఇద్దరు నాయకులు, టెక్కలిలో ఒక ఎన్.ఆర్.ఐ.. నరసన్నపేట లో ఇద్దరు యువనాయకులు..ఇలా శ్రీకాకుళం నియోజికవర్గంలో డజను మందికి పైగా ఆశావాదులు జనసేనవైపు చూస్తున్నట్టు పవన్‌ అభిమానులు చెప్పుకుంటున్నారు. త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశాలకు సిద్ధమవుతున్న జనసేనాని కొత్త తరం నేతలకే ప్రాధాన్యత ఇస్తారని పవన్‌ అభిమానులు అంటున్నారు.

ఇక కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న వారిలో యువపారిశ్రామికవేత్తలు, పవన్ అభిమాన సంఘాల నాయకులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఆమదాలవలస, ఎచ్చెర్ల, రాజాం, పాతపట్నం, పాలకొండ నియోజికవర్గాల నుంచి కూడా చాలా మంది ఆశావాహులు జనసేన జపం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరూ ఇంతవరకు బయటపడలేదు. అవకాశం వచ్చినపుడు పవన్‌పార్టీకి జైకొట్టాడనికి రెడీ అంటున్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానంపై ఆశలుపెట్టుకున్న ఇతర పార్టీల నాయకులు.. జనసేన జెండా పట్టుకునేందుకు సిద్ధం అంటున్నట్టు సమాచారం. 

12:19 - October 28, 2017

విజయవాడ : 48గంటల పాటు ఉత్కంఠగా కొనసాగిన ఛైర్మన్ పదవి ఎట్టకేలకు వైసీపీకి దక్కింది. టిడిపి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎన్నికలో వైసీపీ నుంచి ఇంటూరి రాజగోపాల్‌ బరిలో ఉండగా, టీడీపీ నుంచి చైర్మన్‌గా యలమంచిలి రాఘవేంద్ర బరిలో ఉన్నారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు.

ఎన్నిక శుక్రవారమే జరగాల్సి ఉంది. అధికార, ప్రతిపక్ష వ్యూహాలతో శనివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. తమ సభ్యులను కిడ్నాప్‌ చేసారని టీడీపీ ఆరోపించడమే గాక ఎన్నికల అధికారి మైక్‌ లాగేసి ఎన్నికను అడ్డుకుంది. టీడీపీ ఆరోపణలను వైసీపీ కొట్టిపారేసింది. బలం ఉన్న తమకు ఆ అవసరం లేదని వైసీపీ తేల్చి చెప్పింది. చివరకు శనివారం ఉదయం ఎన్నిక జరిగింది. ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని టిడిపి ఒత్తిడి తెచ్చింది. కానీ ఎన్నికకు అధికారులు మొగ్గు చూపారు. దీనితో టిడిపి వాకౌట్ చేసింది. కోరం ఉండడంతో ఇంటూరి రాజగోపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికే : టీజీ వెంకటేష్

కర్నూలు : ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికే కంచె ఐలయ్యకు సన్మాన సభ పెట్టారని దీని వ్ల ఒరిగేది ఏది లేదని టీజీ వెంకటేష్ అన్నారు.

12:03 - October 28, 2017

సినిమా : త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషనల్ లో తాజా ఒక చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ రావడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కలుసిపోవడం. ఇదంతా ప్రముఖ్యత సంతరించుకుంది. కానీ ఇక్కడ ఓ వార్త లేట్ గా బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కోసం రాశారట. కథను పవణ్ కళ్యాణ్ వినింపిచారట దీనికి పవన్ ఒకే చెప్పి ఈ కథ తనకంటే ఎన్టీఆర్ బాగుంటుందని తెలపటంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఆ కథ వినిపించాడని కథ విన్న ఎన్టీఆర్ వెంటనే ఒకే సమాచారం.

12:00 - October 28, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎట్టకేలకు మేల్కొంది. నగరంలో నాలాల విస్తరణకు శ్రీకారం చుట్టింది. నాలాల అక్రమ కట్టడాలపై దృష్టి సారించి వాటిని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసింది. శనివారం అక్రమ కట్టడాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ నాలాలపై కీలకంగా ఉన్న క్రిటికల్ బాటిల్ నెక్ లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:56 - October 28, 2017

హైదరాబాద్ : టి.సర్కార్..పోలీసులపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొలువులకై కొట్లాట' పేరిట పలు జిల్లాల్లో యాత్రలు..సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సభలకు పోలీసులు అనుమతిని నిరాకరిస్తుండంతో కోదండరాం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరుల స్ఫూర్తియాత్రకు కోర్టు అనుమతించడం సంతోషదాయకమైన విషయమన్నారు. నల్లగొండ, భువనగిరి ఎస్పీలు యాత్రకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసిందన్నారు. యాత్రలు చేపట్టేహక్కు ఎవరికైనా ఉందని.. ప్రభుత్వం పోలీసుల నిర్బంధంతో యాత్రలను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.   
నల్గొండ, సూర్యాపేట యాత్రకు కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని, దీనిపై సానుకూలంగా స్పందించాల్సి ఉంటుందన్నారు. తమ ఆర్డర్ ను సమర్థించుకుంటూ కోర్టుకు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నల్గొండలో తమకు అనుమతి దొరికిందనేది స్పష్టంగా అర్థమౌతుందన్నారు. కొలువులపై కొట్లాటపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, అనుమతి నిరాకరించే అధికారం పోలీసులకు లేదన్నారు. దీనిని నియంత్రించే అధికారం పోలీసులకు మాత్రమే ఉంటుందని, ఆఖరి వరకు కాలయాపన చేస్తూ అరెస్టుల పర్వానికి తెరలేపారని,

వరంగల్ యాత్ర సందర్భంగా 400 మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. నల్గొండలో అదే విధంగా చేయాలని చూశారని కానీ తాము కోర్టుకు వెళ్లడంతో వారు ఆగిపోయారన్నారు. సభ జరగకుండా ఉండాలనే కారణంతో పర్మిషన్ నిరాకరిస్తూ రావడం..ఎక్కడికక్కడ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఉప్పల్ బస్టాపు..ఎల్ బినగర్ ప్రాంతాల్లో ఉన్న గ్రౌండ్స్..ఫంక్షన్ హాళ్లకు సంబంధించిన యజమానులను పోలీసులు బెదిరించారని ఆరోపించారు. 

11:39 - October 28, 2017

విజయవాడ : ఏపీలో దేవాలయాలన్నీ తమ ఆదాయాలు గణనీయంగా పెంచుకుంటూ పోతుంటే ఆ ఆలయ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఓ వైపు అడ్డగోలుగా ధరల పెంపు, మరోవైపు భక్తులకు స్వాగతం పలుకుతున్న అసౌకర్యాలు.. వీటి మధ్య రోజురోజుకూ ఆ ఆలయ ప్రతిష్ట తగ్గిపోతోంది. ధరలు ఎక్కువ ..రాబడి తక్కువ అన్న చందంగా తయారైన దుర్గగుడి ఆలయ పరిస్థితిపై 10టీవీ రిపోర్ట్. ఒకప్పుడు టీటీడీ తరువాత ప్రసిద్ధి చెందింది బెజవాడ దుర్గమ్మ ఆలయం. ఇప్పుడు ఆదాయం పరంగా నాలుగో స్ధానానికి పడిపోయింది. కొందరు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు దూరమవుతున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఆలయానికి వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో దుర్గగుడి అధికారులు విఫలమయ్యారన్నది భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదు. దీనికి తోడు ధరల బాదుడుతో దుర్గగుడి పాలన నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయానికి సైతం గండిపడుతోంది. 2015-2016లో రూ. 213.59 కోట్ల రూపాయలు ఆదాయం రాగా.. 2016-2017లో రూ.178.30 కోట్లకు పడిపోయింది. అమ్మవారికి గతంలో బ్యాంక్ డిపాజిట్లు రూ.120 కోట్లు వరకుగా ఉండగా, ఇప్పుడు రూ.80 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక అమ్మవారి దేవాలయంలో పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలంటే హుండీలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఆలయ అధికారులు, ఈవో, పాలకమండలి కలసి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచడం వివాదాస్పదమవుతోంది. దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న లడ్డూ ధర రూ.20, పెద్ద లడ్డూ ధర రూ.100 కు పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ప్రారంభవుతాయి. ఐదు రోజుల పాటు జరిగే భవానీ దీక్షల విరమణను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే అనుకున్నదే తడవుగా అమ్మవారి లడ్డూ ప్రసాదాలను పెంచడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఈవో సూర్యకుమారి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండలి వచ్చినప్పటి నుంచి దుర్గగుడిలో ధరలు మోత మోగడానికి కారణంగా కన్పిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కమిటీ సభ్యులు అందరి నిర్ణయంపైనే లడ్డూ ధరలు పెంచామని సూర్యకుమారి చెప్పడం విశేషం.

గతంలో దుర్గమ్మ దర్శనం టికెట్ ధరను రూ.300ల నుంచి రూ.150లకు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఆలయ అధికారులు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే టికెట్ల ధరలను తగ్గించే విషయంలో ప్రభుత్వం నేటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం అమ్మదర్శనం కోసం వెళ్తే రూ.1500ల వరకు ఖర్చవుతుంటే ..లడ్డూ ప్రసాదాలకు, ఇతర ఖర్చులకు మరింత అదనపు భారం పడుతుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం రాబట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం అటుంచి ఆలయానికి వచ్చే భక్తులు గణనీయంగా తగ్గిపోతున్నారు. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయాన్ని చేజేతులారా పోగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల సౌకర్యాల పట్ల కూడా ఆలయ అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దర్శనం టిక్కెట్ల ధరలను రూ.300ల నుంచి రూ.150 కి తగ్గించాలని.. లడ్డూ ప్రసాదాలు.. ఇతరత్రా ధరలను తగ్గించి భారం మోపకుండా చూస్తేనే.. ఇంద్రకీలాద్రికి పునర్ వైభవం వస్తుందంటున్నారు భక్తులు.

31న కొలువుల కొట్లాట సభ జరుగుతుంది : కోదండరాం

హైదరాబాద్ : ఈనెల 31న కొలువుల కొట్లాట సభ జరుగుతుందని ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 వరకు సభ జరుగుతుందని ఆయన తెలిపారు.

11:27 - October 28, 2017

కర్నూలు : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..ఆపై బాధ్యాతయుతమైన విధుల్లో ఉన్న అధికారులు అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. ఏసీబీ జరుపుతున్న దాడుల్లో రూ. కోట్ల అక్రమాస్తులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఏపీ సీఐడీ డీఎస్పీ హరనాథ్ రెడ్డి నివాసంపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.

శనివారం నిర్వహించిన ఈ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. 9 ప్రాంతాల్లో ఏకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కర్నూలు, కడప, తుగ్గలి, డబూరువారిపల్లె, బెంగళూరులో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో రెండు భవనాలు, కడపలో ఒక భవనం, తుగ్గలిలో 10 ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. గతంలో నంద్యాల డీఎస్పీగా హరనాథ్ రెడ్డి పనిచేశారు. కృష్ణానగర్ లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి ఇళ్లలో ఉన్న కీలకమైన డాక్యుమెంట్లు..నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మామ ఉంటున్న తుగ్గలిలో..నంద్యాలలో గెస్ట్ హౌస్ పై కూడా తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ. 15 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తోంది. దాడులు ముగిసిన అనంతరం ఎంత మేర కూడబెట్టారో తెలియనుంది. 

ఏపీ సీఐడీ డీఎస్పీ ఇంటిపై ఏసీబీ దాడి..

కర్నూలు : ఏపీ సీఐడీ డీఎస్పీ హరనాథ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీనితో శనివారం 9 ప్రాంతాల్లో ఏకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

10:31 - October 28, 2017

ఢిల్లీ : స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉన్న కాటలోనియా స్వతంత్రం ప్రకటించుకుంది. స్పెయిన్‌ నుంచి వేరుపడేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్‌ అనుకూలంగా ఓటువేసింది. మొత్తం 135 మంది ఉన్న ఛాంబర్‌లో 70 మంది స్వతంత్రానికి మద్దతుగా ఓటేశారు. ఇప్పటి వరకు స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా ఉన్న కాటలోనియాలో ప్రత్యక్ష పాలన ప్రవేశపెట్టేందుకు స్పెయిన్‌ సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. కాటలోనియా స్వతంత్రం ప్రకటించుకున్న వెంటనే స్పెయిన్‌ ప్రధాని మరియానో రజోయ్‌ స్పందించారు. కాటలోనియాలో త్వరలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామన్నారు.

 

10:29 - October 28, 2017

మహారాష్ట్ర : రాష్ట్రంలో బిజెపి, శివసేన పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. తరచూ బిజెపిపై విమర్శలు చేసే శివసేన ఈసారి ఏకంగా ప్రధాని మోదినే టార్గెట్‌ చేసింది. జిఎస్‌టి, నోట్లరద్దు నిర్ణయాలతో మోది పనైపోయిందని.... ఈ దేశానికి రాహులే దిక్కని పేర్కొంది. శివసేన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ సీరియస్‌గా స్పందించారు. బిజెపి ప్రభుత్వంలో కొనసాగుతారా...లేదా... అన్నది తేల్చుకోవాలని శివసేనకు సవాల్‌ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి శివసేన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వంద మంది రాహుల్‌గాంధీలు కూడా మోదీని ఏమీ చేయలేరని రెండేళ్ల క్రితం పొగడ్తలతో ముంచెత్తిన శివసేన ఇపుడు మాట మార్చింది. మోదీ ప్రతిష్ట మసకబారుతోందని... కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది.

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపట్ల దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఒక టీవీ షోలో అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు.. ప్రజలను ఆలోచనలో పడేశాయని ఆయన చెప్పారు. జిఎస్‌టి కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం తప్పదని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీపై సంజయ్‌రౌతే ప్రశంసలు కురిపించారు. ఆయనను పప్పు అనడం సరికాదన్నారు. ఈ దేశంలో అతిపెద్ద రాజకీయ శక్తి ప్రజలే. ఎవరినైనా పప్పును చేసే శక్తి ప్రజలకు ఉందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి రౌత్ అన్నారు. శివసేన ఎంపీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీవ్రంగా స్పందించారు. బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో కొనాసాగాలా...లేదా అన్నది ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. తాము చేసే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది...కానీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం సరికాదన్నారు.

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల శివసేన- ప్రధాని మోదిని, బిజెపిని టార్గెట్‌ చేస్తూ చురకలు అంటిస్తోంది. సంజయ్‌ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగితే ఫడ్నవిస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. శరద్‌ పవార్‌ మద్దతుపైనే బిజెపి ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.

10:26 - October 28, 2017

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై ఖాకీలు రెచ్చిపోయారు. సోలార్ ప్లాంట్ వల్ల నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ఆందోళన చేపట్టారు. వీరు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వీరిపై ఎస్ఐ చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించారు. రైతులను కొడుతూ పరుషంగా మాట్లాడారు. పోలీసులకు..ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై దాడి చేయడం సబబు కాదని రైతులు పేర్కొన్నారు. సోలార్ లో ఎవరైతే భూములు కోల్పోయారో..నష్టపరిహారం ఇవ్వాలంటూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారని, వీరి ఆందోళనకు సీపీఎం మద్దతిస్తోందన్నారు. 

10:20 - October 28, 2017

కర్నూలు : జిల్లాలో ఏసీబీ దాడులు నిర్వహించడం అవినీతిపరుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏపీ సీఐడీ డీఎస్పీ హరనాథ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీనితో శనివారం 9 ప్రాంతాల్లో ఏకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

కర్నూలు, కడప, తుగ్గలి, డబూరువారిపల్లె, బెంగళూరులో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో రెండు భవనాలు, కడపలో ఒక భవనం, తుగ్గలిలో 10 ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. గతంలో నంద్యాల డీఎస్పీగా హరనాథ్ రెడ్డి పనిచేశారు. సంవత్సరాల నుండి అవినీతి చేస్తున్నా బయటపడకపోవడం గమనార్హం. 

10:14 - October 28, 2017
10:12 - October 28, 2017

విజయవాడ : తెలంగాణ టిడిపిలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. గత పది రోజులుగా టి.టిడిపి నేతల మధ్య కోల్డ్ వార్ నెలకొనడం..రేవంత్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం..విమర్శలు..ప్రతి విమర్శలు చేసుకుంటుండడంతో పార్టీలో రాజకీయం వేడెక్కింది. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబుతో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ..ఇతర తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కానీ సమయాభావం వల్ల పూర్తిగా సమావేశం జరగలేదు. దీనితో చర్చించేందుకు విజయవాడకు రావాలని బాబు నేతలకు సూచించారు.

శనివారం ఉదయం అమరావతి సీఎం క్యాంపు ఆఫీసుకు ఎల్.రమణ ఇతర నేతలు చేరుకున్నారు. అక్కడ బాబుతో భేటీ కానున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ టిడిపి నేతలతో ఒక్కొక్కరితో బాబు భేటీ కానున్నారని తెలుస్తోంది. అనంతరం అందరితో బాబు మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ రోజు జరిగే భేటీలో బాబు ఒక పరిష్కారం చూపెడుతారని నేతలు అనుకుంటున్నారు. మరి రేవంత్ వ్యవహారానికి బాబు ఎలా ఫుల్ స్టాప్ పెడుతారో చూడాలి. 

10:08 - October 28, 2017
09:22 - October 28, 2017

తూర్పుగోదావరి : ఏపీ రాష్ట్రంలో ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోటు ప్రమాదాలు జరుగుతూ నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మహిళలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందచేయాలని సూచించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ ఇందుకు కారణమని..వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చస్తున్నాయి.

అల్లవరానికి చెందిన సుమారు 13 మంది ఆత్రేయపల్లి మండలంలోని వాడేపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. కొత్తపేట మండలం మోడేకుర్రు వద్ద వేగంగా వచ్చిన ఇసుక లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. దీనితో అక్కడికక్కడనే ఐదుగురు మహిళలు అక్కడికక్కడనే మృతి చెందగా మరొక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన వారిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ పరాయ్యాడని తెలుస్తోంది.

మృతులు : చీకట్ల నాగమణి (46), పిల్ల భవానీ (25), పిల్ల పార్వతి (48), పేరాబత్తుల అనంతలక్ష్మీ (40), దుర్గ (60), పులిమి అనంతలక్ష్మీ (40)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

09:09 - October 28, 2017

విజయవాడ : టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారా ? ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా ? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేవంత్ పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన పదవులను నుండి తాత్కాలికంగా తప్పించారు. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్న బాబుతో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నేతలు భేటీ అయి పార్టీలో నెలకొన్న పరిస్థితి..రేవంత్ వ్యవహారంపై చర్చించారు. కానీ సమయం తక్కువగా ఉండడంతో పూర్తిస్థాయిలో భేటీ జరుగలేదు. దీనితో అమరావతి కేంద్రంగా మరోసారి సమావేశం కావాలని బాబు నిర్ణయించారు. నేతలను విజయవాడకు రావాలని బాబు సూచించడంతో వారు శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. మరికాసేపట్లో క్యాంపు ఆఫీసుకు బాబు వచ్చిన తరువాత ఈ సమావేశం జరుగనుంది. ఎల్.రమణ, మోత్కుపల్లి వర్గాలకు చెందిన కొందరు రేవంత్ రెడ్డిపై మండిపడుతుంటే రేవంత్ వర్గం కూడా ఇతర వర్గాలపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సుదీర్ఘంగా జరిగే భేటీలో బాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వేచి చూడాలి. 

అమరావతిలో టి.టిడిపి నేతలు..

విజయవాడ : టి.టిడిపి నేతలు విజయవాడకు చేరుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో వారు భేటీ కానున్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

రైలులో మంటలు..

ఢిల్లీ : మచిలీపట్నం - సికింద్రాబాద్ రైలులో ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. వెంటనే రైలును ఆపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 

క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ..

విశాఖపట్టణం : ఆర్కే బీచ్ రోడ్డులో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నటి గౌతమి, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో క్యాన్సర్ వ్యాధిని జయించిన 200 మంది పాల్గొన్నారు. 

08:55 - October 28, 2017

భద్రాద్రి : ర్యాగింగ్ తట్టుకోలేక..ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. సాయి కిరణ్ అనే విద్యార్థి ధన్వంతరీ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తున్నాడు. కానీ సీనియర్లు ర్యాగింగ్ చేయడాన్ని సాయి కిరణ్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీనితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం..

భద్రాద్రి : బీ ఫార్మసీ విద్యార్థి సాయి కిరణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. సీనియర్ల ర్యాంగింగ్..ప్రిన్స్ పాల్ వేధింపులు తట్టుకోలేక సాయి కిరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. సుజాతనగర్ లో ధన్వంతరి ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తున్నాడు. 

08:31 - October 28, 2017
08:20 - October 28, 2017

హైదరాబాద్ : ప్రొ.కంచ ఐలయ్య బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. కంచ ఐలయ్య సన్మాన సభ..ఆర్యవైశ్య సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కంచ ఐలయ్య టెన్ టివితో మాట్లాడారు. ఇద్దరు పోలీసు ఆఫీసర్లు తన ఇంటి ఎదుట ఉండడంతో తనకు రాత్రి నిద్ర పట్టలేదన్నారు. ప్రైవేటు రంగం రిజర్వేషన్లపై చర్చ పెట్టుకోవడం జరిగిందని...కానీ ఈ సభపై దుష్ర్పచారం చేసిందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు పెట్టవద్దా ? అని ప్రశ్నించారు. ఆయన పుస్తకాన్ని కనబడనీయకుండా చేయాలని అనుకున్నారని..ప్రస్తుతం ఆయన గొంతు విననీయకుండా చేయాలని అనుకుంటున్నారని..ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని, బహుజన శక్తి వీధుల్లోకి వస్తే వైశ్యులు..బ్రాహ్మణులకు..ఏపీ సీఎం చంద్రబాబుకు భయం ఉందన్నారు.

విజయవాడలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కంచ ఐలయ్య సన్మాన సభ, ఆర్యవైశ్య సంఘాల సభ నేపథ్యంలో జింఖానా నగర్‌ ఏరియాలో పోలీసులు ఆంక్షలు విధించారు. 144, 30 సెక్షన్లు విధించారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని .. చట్టాన్ని అతిక్రమిస్తే అరెస్టుల తప్పవని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను గృహనిర్బంధలో ఉంచారు. తార్నాకలోని ఐలయ్య ఇంటి ముందు ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై కంచ ఐలయ్య ఫైర్‌ అయ్యారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య హౌస్‌ అరెస్టును వామపక్షాలు, టీమాస్‌ ఖండించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శించారు. 

మృతి చెందిన వివరాలు..

తూర్పుగోదావరి : కొత్తపేట (మం) మోడేకుర్రు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చీకట్ల నాగమణి..పిల్ల భవానీ..పిల్ల పార్వతి..పేరాబత్తుల అనంతలక్ష్మీ..దుర్గ, పులిమె అనంతలక్ష్మీ..లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

స్మగ్లర్ల అరెస్టు..

చిత్తూరు: తిరుపతిలోని కరకంబాడి వద్ద శేషాచలం అటవీ ప్రాంతంలో జవాది మలైకి చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్ల నుండి గొడ్డళ్లు..వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

07:41 - October 28, 2017

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. తెలంగాణ టీడీపీ నేతల పంచాయితీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరోతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలతో ఇవాళ విజయవాడలో భేటీ కానున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజ మోహన్ రావు (టీఆర్ఎస్), రాజరాం యాదవ్ (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

లండన్ కు వెళ్లనున్న జగన్..

హైదరాబాద్ : లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు అనుమతివ్వాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మ్మోహన్‌రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో జగన్ వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు. 

06:46 - October 28, 2017
06:42 - October 28, 2017

విజయవాడ : ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే వరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని ప్రకటించిన వైసీపీ.. ఇదే అంశాన్ని జాతీయ స్ధాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్.జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు.. అరాచకాలకు పాల్పడుతోందంటూ లేఖలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు జగన్. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వైసీపీ.. మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్‌ కాట్ చేసిన వైసీపీ పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీకి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓసారి ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసిన పార్టీ అధినేత జగన్ ఈ అంశాన్ని మరోసారి జాతీయ స్ధాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జగన్ లేఖ రాశారు.

శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో లేఖలో రాష్ట్రపతికి వివరించారు వైఎస్.జగన్. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని లేఖలో ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే రెండేళ్ల నుండి అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుండి స్పందన రాలేదని తెలిపారు. తమ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేశారని.. అంతేకాకుండా వారిలో నలుగురికి రాజ్యంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారని జగన్ లేఖలో వివరించారు. చంద్రబాబు, స్పీకర్ రాజ్యాంగ విలువలు కాపాడకుండా ఫిరాయింపుదారులతో సభ నడుపుతున్నారని జగన్ లేఖలో ఆరోపించారు. షెడ్యూల్ 10 ప్రకారం ఈ అంశంపై... చర్యలు తీసుకునే విధంగా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని జగన్ కోరారు.

ఏపీలో పరిపాలన అన్నది లేకుండా పోయిందని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో లక్షా 9 వేల 422 కోట్ల రూపాయలు అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తూ సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు జగన్. మొత్తానికి ఫిరాయింపుల అంశాన్ని మరోసారి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు వైఎస్.జగన్. దీని ద్వారా చంద్రబాబు సర్కార్‌పై మరింత ఒత్తిడి తేవాలన్న వైసీపీ ఉద్దేశ్యం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. 

06:40 - October 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల పంచాయితీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరోతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలతో ఇవాళ విజయవాడలో భేటీ కానున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పొలిట్‌ బ్యూరోతో పాటు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న రేవంత్‌రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఈనెలలో భేటీ కావడం ఇది రెండోసారి. ఈనెల 8న కూడా భేటీ అయిన చంద్రబాబు సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. ఆ తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్టు ప్రచారం జరిగింది.

టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో రేవంత్‌రెడ్డి.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లు తెలంగాణలో కాంట్రాక్టులు పొందుతున్నారని చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. తాజా భేటీలో ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రేవంత్‌ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలన్న మోత్కుపల్లి నర్సింహులుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారే వరకు టీడీపీని వాడుకోజూస్తున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. టీడీఎల్‌పీ నేత పదవి నుంచి తప్పించిన విషయాన్ని పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు.

ఈ విధంగా చేస్తే రాజకీయంగా రేవంత్‌కు అనుకూలంగా మారుతుందని వాదాన్ని మరికొందరు వినిపించారు. రేవంత్‌ విషయంలో వేచిచూడడం మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే మాట్లాడొద్దని ఈనెల 8న జరిగిన భేటీలోనే ఆదేశించినా.. మళ్లీ ఇదే ప్రస్తావన తీసుకొచ్చిన నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. సమయభావంతో ఎక్కువ అంశాలు చర్చించలేకపోయిన చంద్రబాబు.. శనివారం విజయవాడ రావాలని తెలంగాణ టీడీపీ నేతలను ఆదేశించారు. శనివారం విజయవాడలో జరిగే సమావేశంలో తెలంగాణ టీడీపీ నేతలను విడివిడిగా కలిసి చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రేవంత్‌ విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

06:37 - October 28, 2017

విజయవాడ : రాజధాని నిర్మాణం ఇక వేగవంతంగా కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లండన్‌లో అమరావతి డిజైన్లు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఆకృతుల రూపకల్పనలో సినీదర్శకుడు రాజమౌళి కీలకంగా వ్యవహరించారని బాబు చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు ఏపీ సీఎం.

లండన్‌ పర్యటన సందర్భంగా రాజధాని అమరావతి డిజైన్లపై విస్తృతంగా చర్చించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నార్మన్‌పోస్టర్‌ సంస్థ రూపొందించిన పలు డిజైన్లు ఎంపిక చివరిదశకు చేరుకుందన్నారు. అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్లు ఖరారు అయినట్టేనని బాబు అన్నారు. సంక్రాంతికి అటూ ఇటూగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. మరో 40 రోజుల్లో అసెంబ్లీ భవన ఆకృతులు కూడా ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అమవరావతి డిజైన్ల ఖరారులో సినీ దర్శకుడు రాజమౌళి కీలకంగా వ్యవహరించారని బాబు కితాబిచ్చారు. మొత్తానికి తన విదేశీ పర్యటన విజయవంతం అయిందని చెప్పిన చంద్రబాబు .. ప్రధానంగా తన పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడంతోపాటు అమవరావతి నిర్మాణ డిజైన్లపై దృష్టిపెట్టాన్నారు. అటు పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత ఉందన్న చంద్రబాబు .. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మరింతగా చర్చించాల్సిన అవరం ఉందన్నారు. 

06:35 - October 28, 2017

హైదరాబాద్ : రైతు సమస్యలపై కాంగ్రెస్‌ నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాసనసభ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అరెస్టులకు దారితీసింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయదేరిన పార్టీ నేతలు, కార్యకర్తలను నాంపల్లి చౌరాస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గాంధీభవన్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.

మరోవైపు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అసెంబ్లీ గేటు ముందుకు దూసుకెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోకి చొచ్చకుపోయేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అసెంబ్లీ సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక గ్రూపును పోలీసులు అరెస్టు చేసిన వెంటనే మరో బృందం రోడ్డుపైకి రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. శాసనసభ వాయిదా పడిన తర్వాత సభ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించడంతో పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అరెస్టు చేసిన నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. కేసులు నమోదు చేసిన తర్వాత పంపించేశారు. మొత్తంమీద చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా రైతు సమస్యలను ప్రభుత్వంతోపాటు, ప్రజల దృష్టికి తేగలిగామన్న భావంతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

06:33 - October 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. రైతుల సమస్యపై చర్చించేందుకు పాలకులు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్‌ పాలన నాటి నిజాం పాలనను మించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే గందరగోళంగా కొనసాగాయి. సభలో రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు వాయిదా తీర్మానాలిచ్చాయి. అయితే విపక్ష వాయిదా తీర్మానాలను పట్టించుకోని డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కనీసం వాయిదా తీర్మానాలపై ప్రొటెస్ట్‌ చేసేందుకు కూడా అనుమతివ్వలేదని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. సభను తమ ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటామన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు జానారెడ్డి. ఇక డిప్యూటీ స్పీకర్‌ తీరు అభ్యంతరకరంగా ఉందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాలు, రైతుల సమస్యలను పట్టించుకోని సర్కార్‌... ఎన్ని రోజలు సభ జరిగితే ఏంటని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

తాను చెప్పిందే వినాలన్న ధోరణిలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ. రైతులపక్షాన నిరసనలు చేస్తే ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. మరోవైపు డ్రగ్స్‌ మాఫియాపై తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండానే వాయిదా వేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే పబ్బులు నిర్వహిస్తూ... డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు రేవంత్‌.

సభ జరిగిన తీరు సరిగా లేదన్నారు బీజేపీ నేతలు. ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే సభను ఎలా కొనసాగిస్తారని... ప్రజాస్వామ్య పద్దతిలో సభ నిర్వహించాలన్నారు కిషన్‌రెడ్డి. మొత్తానికి తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిచాయి. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో సభ నడిపినా, నడపకపోయినా ఒక్కటేనని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

06:30 - October 28, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపేట మండలం మోడేకుర్రువద్ద లారీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మహిళలు అక్కక్కడిక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 8 మంది గాయపడ్డారు. వారిలో 2ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను అమలాపురంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అల్లవరం నుంచి వాడపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

06:29 - October 28, 2017

విజయవాడ : నగర పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కంచ ఐలయ్య సభతోపాటు ఆర్యవైశ్య సభకు కూడా పర్మిషన్‌ నిరాకరించారు. ఈమేరకు రెండు వర్గాలకు నోటీసులు అందించారు. హైదరాబాద్‌లో కంచ ఐలయ్యను హౌస్‌ అరెస్టు చేశారు. విజయవాడలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేది లేదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు సభ జరిపి తీరుతామని దళిత-బహుజన సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బెజవాడలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. సభలు , సమావేశాలు జరిపితే అరెస్టు చేస్తామంటున్నారు.

విజయవాడలో సామాజిక జేఏసీ సభకు అనుమతి లేదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు. అటు ఆర్యవైశ్య -బ్రాహ్మణ ఐక్యవేదిక సభకు కూడా పర్మిషన్‌ నిరాకరించారు. నగరంలో 144, 30 సెక్షన్లు అమల్లో ఉంటాయని.. సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. ఈమేరకు హైదరాబాద్‌లో కంచైలయ్యకు నోటీసులు అందించారు. తార్నాకలోని ఐలయ్య ఇంటిముందు ఏపీ తెలింగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐలయ్య బయటికి వస్తే అరెస్టు చేస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మండిపడ్డారు. తనని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. శాంతియుతంగా సభ జరుగుతుందని చెప్పినా ప్రభుత్వం అడ్డుకోవడం వాక్‌ స్వాతంత్ర్యంను కాలరాయడమే అన్నారు. సభను అడ్డుకుంటే టీ మాస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. మరోవైపు విజయవాడలోని జింఖాన గ్రౌండ్‌లో సభ జరిపితీరుతామని దళిత-బహుజన సంఘాల సామాజిక జేఏసీ తేల్చి చెబుతోంది. టీడీపీ ప్రభుత్వం దళిత- బహుజనుల పక్షమో, ఉన్నతవర్గాల పక్షమో తేల్చుకోవాలని సామాజిక జేఏసీ నేతలు అంటున్నారు.

కంచ ఐలయ్య సన్మాసభకు అనుమతి నిరాకరించడాన్ని సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు తప్పుపడుతున్నాయి. అడుగడుగునా నిర్బంధాలతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజ్యాంగం ప్రకారం భావ స్వేచ్ఛను వెల్లడించే హక్కు ప్రతి పౌరునికీ ఉందన్నారు సీపీఎం

తెలంగాణ రాష్ట్ర కార్యదర్వి తమ్మినేని వీరభద్రం. కేంద్రంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజాకంఠకంగా తయారయ్యాని విమర్శించారు. దళిత-బహుజనులు, మైనార్టీలపై నిర్బంధాలు ప్రయోగిస్తూ.. అణచివేతకు పాల్పడుతున్నారని వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై పోలీసుల ఆంక్షలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని దళిత, వామపక్షాల నాయకులు పిపలుపునిచ్చారు. మొత్తానికి కంచ ఐలయ్యను సన్మానిస్తామని ఇటు సామాజిక జేఏసీ.. అడ్డుకుంటామని ఆర్యవైశ్య-బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించిన నేపథ్యంలో .. విజయవాడలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  

06:26 - October 28, 2017

హైదరాబాద్ : విజయవాడలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కంచ ఐలయ్య సన్మాన సభ, ఆర్యవైశ్య సంఘాల సభ నేపథ్యంలో జింఖానా నగర్‌ ఏరియాలో పోలీసులు ఆంక్షలు విధించారు. 144, 30 సెక్షన్లు విధించారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని .. చట్టాన్ని అతిక్రమిస్తే అరెస్టుల తప్పవని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను గృహనిర్బంధలో ఉంచారు. తార్నాకలోని ఐలయ్య ఇంటి ముందు ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై కంచ ఐలయ్య ఫైర్‌ అయ్యారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య హౌస్‌ అరెస్టును వామపక్షాలు, టీమాస్‌ ఖండించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శించారు.

ఈ సభకు 20 రోజుల ముందుగా అనుమతి కోసం ఐలయ్య దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు రోజుల ముందు సభకు అనుమతి లేదని ప్రకటించారు. ఆర్యవైశ్యులు ప్రతి ఘటన సభ ఏర్పాటు చేస్తున్నందున..శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అందుకే సభలకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ప్రజా సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీ మాస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు భారీగా కంచ ఐలయ్య నివాసానికి చేరుకుంటున్నారు. ఉదయం 8గంటలకు విజయవాడకు ఒక బస్సు బయలుదేరనుంది. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడే నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు..గిరిజనులు ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు..ఇతరత్రా వాటిపై చర్చిస్తామని..తాను రచించిన పుస్తకంపై ఎలాంటి చర్చ చేపట్టమని కంచ ఐలయ్య పేర్కొన్నారు. ఓపెన్ గ్రౌండ్ లో కాకుండా ఒక ఫంక్షన్ హాల్ లో సభ ఏర్పాటు చేసుకుంటామని..ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సభ నిర్వహించుకుంటామని తెలిపారు. మరి ఐలయ్యను అరెస్టు చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

నేడు తేలనున్న రేవంత్ భవితవ్యం..

హైదరాబాద్ : టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భవితవ్యం నేడు తేలనుంది. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం అమరావతిలో మరోసారి టి.టిడిపి నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రేవంత్ భవితవ్యం తేలనుందని తెలుస్తోంది. 

3న కృష్ణా బోర్డు భేటీ ?

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు పంపిణీ..పలు ఇతర అంశాలపై చర్చించేందుకు వచ్చే నెల 3వ తేదీన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది. 

లాసెట్ వెబ్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో లా కాలేజీల్లో సీట్ల భర్తీకి శనివారం నుండి మూడు రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పేర్కొన్నారు. 

బెంగుళూరులో తెలుగు కార్టూనోత్సవం..

హైదరాబాద్ : ఇండియన్ కార్టూన్ గేలరీ-బెంగళూరు వేదికగా ఉదయం 10.30 గంటలకు తెలుగు కార్టూనోత్సవం ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్(ఐఐసీ)-బెంగళూరు, హార్టూనిస్ట్స్ అనే తెలుగు కార్టూనిస్టులు సంయుక్తంగా తెలుగు కార్టూనోత్సం నిర్వహిస్తున్నారు. 

సెమీ ఫైనల్లో పీవీ సింధు..

ఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీపై సింధు ఘన విజయం సాధించింది. చెన్ యూఫీపై 21-14, 21-14 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

బెంగళూరుకు ఆర్థిక మంత్రి..

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ బెంగళూరు బయల్దేరనున్నారు. జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల బెంగళూరు వెళ్తున్నారు.

 

ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు..

తూర్పుగోదావరి : కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ముగ్గురిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. 

కంచ ఐలయ్య ఇంటి వద్ద పోలీసులు..

హైదరాబాద్ : విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన ప్రొ.కంచ ఐల‌య్య స‌న్మాన‌స‌భ‌కు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనితో హైద‌రాబాద్ తార్నాకలోని కంచ‌ ఐల‌య్య ఇంటి వ‌ద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మోహ‌రించారు.

 

అమ్మకు ఫర్వాలేదు - రాహుల్..

ఢిల్లీ : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గురయ్యారు. వెంట‌నే ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి తరలించారు. ఈ విష‌యంపై ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అమ్మ‌కు ఫ‌ర్వాలేద‌ని చెప్పారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సోనియా గాంధీని ఢిల్లీకి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీలేద‌ని చెప్పారు.  

కంచ ఐలయ్యకు నోటీసులు...

హైదరాబాద్ : తార్నాకాలోని కంచ ఐలయ్య నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఆయనకు నోటీసులు అందచేశారు. విజయవాడ డీసీపీ క్రాంతి రాణా పేరిట నోటీసులు వచ్చాయి. ఆర్య వైశ్య సంఘాల ప్రతిఘటన సభ ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా విజయవాడ సామాజిక సంఘాల జేఏసీ సభకు అనుమతినివ్వలేమని పోలీసులు ప్రకటించారు. 

కృష్ణా జిల్లా సరిహద్దులో భారీగా పోలీసులు..

విజయవాడ : నగరంలో సభలకు అనుమతి నిరాకరించడంతో కృష్ణా జిల్లా సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు. విజయవాడకు 15 ప్లటూన్ల ఏపీఎస్పీ పోలీసు బలగాలను మోహరించారు. విజయవాడ నగరంతో పాటు ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

 

నగరంలో సెక్షన్ 144..

విజయవాడ : నగరంలో సెక్షన్ 144, 30 అమల్లో ఉన్నాయని సీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. సభల కోసం ఇతర ప్రాంతాల నుండి ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Don't Miss