Activities calendar

29 October 2017

న్యూజిలాండ్ విజయలక్ష్యం 338 పరుగులు

కాన్పూర్ : భారత్ నిర్ణీత 50 వోవర్లలో 337 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయలక్ష్యం 338 పరుగులుగా ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 

 

విరాట్ కోహ్లీ సెంచరీ

కాన్పూర్ : భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 96 బంతుల్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. 32 వ  సెంచరీ చేశాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 

ఢిల్లీకి బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ కుమార్తె వివాహ విందులో ఆయన పాల్గొననున్నారు. 

కొడంగల్ లో రేవంత్..

మహబూబ్ నగర్ : టిడిపి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి శనివారం రాత్రి కొడంగల్ కు చేరుకున్నారు. ఆదివారం కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. 

తప్ప తాగిన యువతి..

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 46 మందిపై కేసు నమోదు చేసి 46 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఓ యువతి తప్పతాగి పోలీసులకు చెప్పు చూపించింది.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

కృష్ణా : నూజివీడు సిద్దార్థ బీ ఫార్మసీ కాలేజీలో కత్తితో మణికట్టు కోసుకుని ఫస్టియర్ విద్యార్థిని యతీషా (18) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. యతీష నివాసం చీరాల (మం) ఈపురుపాలెం. 

బాబ్లీ గేట్ల మూసివేత...

హైదరాబాద్ : నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేయనున్నారు. సుప్రీం ఆదేశానుసారంతో ఉదయం 11గంటలకు గేట్లు మూసివేయనున్నారు. ప్రతి ఏడాది జులై 1 నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు తెరవాలని గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష..

హైదరాబాద్ : నేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు రాత పరీక్ష జరుగనుంది. 24 జిల్లాల్లో 1285 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరుగనుంది. 

Don't Miss