Activities calendar

30 October 2017

22:08 - October 30, 2017
22:08 - October 30, 2017
22:07 - October 30, 2017

యాదాద్రి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. యాదగిరిగుట్ట మండలంలోని భువనగిరి..ఆలేరు సమీపంలో బాహుపేట స్టేజి వద్ద ఆర్టీసీ వజ్ర బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆలో డ్రైవర్ సహా ఐదు మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

22:00 - October 30, 2017

ఢిల్లీ : జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారని సిపిఐ ప్రకటించింది. కన్హయ్య సొంత జిల్లా బిహార్‌లోని బెగుసరాయ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సిపిఐ జాతీయ నేత కె ఆర్‌ నారాయణన్‌ తెలిపారు. ఎన్నికలకు 17 నెలల ముందుగానే కన్హయ్య పేరును సిపిఐ ఖరారు చేసింది. పట్నాలో జరిగిన సిపిఐ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. కన్హయ్య కుమార్‌ కేరళ నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేసే ప్రస్తావన ఉందని సిపిఐ పేర్కొంది. బెగుసరాయ్‌ నుంచి గత రెండు దఫాలుగా బిజెపి గెలుపొందింది. ఇక్కడ కన్హయ్య రంగంలోకి దిగితే బిజెపికి గట్టి పోటి ఎదురు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

21:57 - October 30, 2017

ఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ హత్యపై పునర్విచారణను వ్యతిరేకిస్తూ ఆయన మునిమనవడు తుషార్‌గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తుషార్‌ గాంధీ తరపున ప్రముఖ న్యాయవాది ఇందిరా జయసింహ వాదించారు. మహాత్మగాంధీ హత్య జరిగి 70 ఏళ్ల గడచిన తర్వాత పునర్విచారణ జరపడం చట్టవిరుద్ధమని జయసింహ తెలిపారు. గాంధీ హత్య కేసులో జోక్యం చేసుకునే హక్కు తుషార్‌కు ఉందా...అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అమికస్‌ క్యూరీగా ఉన్న అమరేందర్‌ శరణ్‌ నివేదిక వచ్చేంతవరకు తుషార్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. దీంతో కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. గాంధీ హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ ముంబయికి చెందిన పరిశోధకుడు పంకజ్‌ ఫడణవీస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

 

21:56 - October 30, 2017

ఢిల్లీ : ఆధార్‌ కార్డు విషయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమత సర్కార్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పార్లమెంట్‌ ఆదేశాలను ఓ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ధిక్కరిస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్రానికి, మొబైల్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యక్తులు పిటిషన్‌ వేయొచ్చు కానీ... రాష్ట్రాలు వేయకూడదని కోర్టు సూచించింది. మమతాబెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్‌ వేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 

 

21:52 - October 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్‌ 1 తుది ఫలితాలను టీఎస్ పీఎస్సీ నిలిపివేసింది. అభ్యర్థుల పోస్టుల ప్రాధాన్యతలో గందరగోళం ఏర్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీజీజీ నివేదిక వచ్చే వరకు గ్రూప్‌ 1 ఫలితాలను పెండింగ్‌లో పెడుతూ నోట్‌ విడుదల చేసింది.

 

21:50 - October 30, 2017

హైదరాబాద్ : రెండవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్, గ్రూప్‌2 పరీక్ష, హరితహారం అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగానే సమాధానమిచ్చింది. రాష్ట్రంలో మొక్కల పెంపకం కోసం రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని కోరింది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు హాట్‌హాట్‌గా సాగాయి. సభలో పైచేయి సాధించేందుకు అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ హోరెత్తింది. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చకోసం కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం అత్యవసర అంశమని సీఎల్‌పీ నేత జానారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ప్రశోత్తరాలను వాయిదావేసి... వాయిదా తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి నిరాకరించడంతో.. నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. 

ఆ తర్వాత గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పరీక్ష నిర్వహణలో పలు లోపాలు జరిగాయని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. ఆన్సర్‌ షీట్ల కోడిండ్‌, డీకోడింగ్‌, OMR షీట్లను దిద్దడం వంటి తప్పులు చోటు చేసుకున్నాయన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి తుమ్మల.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తోందని.. గ్రూప్-2 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్ -2 పరీక్ష పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించినట్లు వెల్లడించారు. లక్షా 12 వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు.  

దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులకు 20 లక్షల వరకు ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో మార్కులు తక్కువ వచ్చినా మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. 

అనంతరం సభలో హరితహారం కార్యక్రమంపై సుదీర్ఘ చర్చ జరిగింది. భారీ లక్ష్యాలు పెట్టుకున్నంత మాత్రాన పథకాలు విజయవంతం కావని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో స్వయంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కనే రక్షించలేదని.. ఇక రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హరితహారం పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. 


రాష్ట్రంలో అటవీ సంపద తరిగిపోవడానికి కాంగ్రెస్‌ పాలకులే కారణమని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంలో అడవుల విస్తరణకు వెచ్చించింది కేవలం 130 కోట్లే అని విమర్శించారు. మూడున్నరేళ్లలో 2008 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అటవీ భూములన్నీ వెనక్కి రావాలన్నారు సీఎం. వారం లోగా నరేగా, కంపా నిధుల వివరాలు సభ ముందు పెడుతానని సీఎం స్పష్టం చేశారు. 

గిరిజనులు 30, 40 ఏళ్లుగా సాగుచేస్తున్న భూముల్లో.. ఫారెస్ట్‌ అధికారులు పంటను ధ్వంసం చేసి దాడులు చేయడం తగదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. గిరిజనుల భూములను ఖాళీ చేయించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం భావ్యం కాదన్నారు. 

రాష్ట్రంలోని అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవుల విధ్వంసం రాష్ర్టానికి క్షేమమా? అని ప్రశ్నించారు. గుత్తి కోయలను అడవులు నరకనిద్దామా అని సీఎం ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన అడవుల ఆక్రమణపై శాసనసభ్యులు ఓ కమిటీ వేసి నిర్ధారించి సభలో తీర్మానం చేయాలన్నారు. ఇకపై గజం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

వాడివేడిగా జరిగిన సభలో జానారెడ్డి, కేసీఆర్‌ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. గత ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి పోస్టులు భర్తీ చేయని కారణంగా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు ఉన్న మాట వాస్తవమన్నారు సీఎం. ఈ సమయంలో జానారెడ్డి మన ప్రభుత్వాలు అనగా.. మన కాంగ్రెస్, మన తెలుగు దేశం ప్రభుత్వాలు అని సీఎం అనడంతో సభలో నవ్వులు విరబూసాయి. 

21:47 - October 30, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆత్మీయుల మాట-ముచ్చటలో మాట్లాడిన ఆయన..కేసీఆర్‌ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఏపీలో రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. 

టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి..కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా...హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మీయులతో మాట-ముచ్చట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. పలువురు నేతలు రేవంత్‌ వెంట నడుస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి బోడ జనార్దన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు రేవంత్‌కు మద్దతు పలికారు. 

తెలంగాణ సమాజ హితం కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్‌ మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని... కేసీఆర్‌ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. విద్యార్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసేందుకు బీజేపీ తెరవెనక ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. దీనికి పలువురు టీడీపీ నేతలు తోడ్పాటు అందిస్తున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. కేసీఆర్‌ పాలన నుంచి తెలంగాణను ఆదుకోవడానికి, తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి రేవంత్‌తో పాటు ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు, ఎప్పుడూ తాము రేవంత్‌ వెంటే ఉంటామని వేం నరేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ సమక్షంలో రేవంత్‌తో పాటు పలువురు టీడీపీ ముఖ్యులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. 

తెలంగాణ గ్రూప్ 1 తుది ఫలితాలు నిలిపివేత

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 1 తుది ఫలితాలను ప్రభుత్వం నిలిపివేసింది. అభ్యర్థుల పోస్టుల ప్రాధాన్యతలో గందరగళం నెలకొంది. సీజీజీ నివేదిక వచ్చే వరకు గ్రూప్ 1 ఫలితాలు పెండింగ్ లో ఉండనున్నాయి. 

రౌడీ షీటర్ వాసు హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు

గుంటూరు : రౌడీ షీటర్ వాసు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసలు అరెస్టు చేశారు. స్కార్పియో, వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని అస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. 

 

21:13 - October 30, 2017

సీపీఎం శాసనసభా పక్ష నేత సున్నం రాజయ్యతో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. 'టీఆర్ ఎస్ నుంచి సున్నం రాజయ్యకు వచ్చిన ఆఫర్ ఏంటీ?, ఎందుకు అధికార పార్టీ ఆఫర్ ను తిరస్కరించారు?, టీమాస్ ప్రజలు నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది ?, 2019 ఎన్నికల్లో సీపీఎం ఒంటిరిగా పోటీ చేస్తుందా ?, మహాజన పాదయాత్ర తరువాత ప్రభుత్వంలో కదలిక వచ్చిందా ?, అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలను సీపీఎం లేవనెత్తబోతోంది? అసెంబ్లీ గేటు ముందు సున్నం రాజయ్యను ఎందుకు అడ్డుకున్నారు?' అంశాలపై రాజయ్య మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

21:01 - October 30, 2017

పునాదులు కదిలిపోతున్నాయా? అసలు ఉనికిలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందా? ఒకనాటి వెలుగులు అంతమయినట్టేనా? సైకిల్ ఫ్యూచర్ లో ఒక రాష్ట్రానికే పరిమితం కాబోతోందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ  ఫ్యూచరేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అనూహ్య పరిణామాలు.. రేవంత్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో టీడీపీ ఇక నామ మాత్రమే అనే వాదనలు. మిగతా నేతలు, కేడర్ కూడా పార్టీ మారుతున్నారనే వాదనలతో పార్టీ వర్గాల్లో అయోమయం.. గత కొన్నాళ్లుగా జరుగుతున్ పరిణామాలకు ఇప్పుడు ఓ ముగింపు వచ్చినట్టయిందా? రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో టీటీడీపీ గట్టి దెబ్బ తింటోందా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:56 - October 30, 2017

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యం వల్లే పత్తి రైతులకు నష్టాలు వస్తున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత భానుప్రసాద్, ఏపీ రైతు సంఘం నాయకులు రంగారావు పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం పత్తికి మద్దతు   ధర ప్రకటించటం లేదని విమర్శించారు. నకిలీ విత్తనాలు, క్రాప్ ఇన్సూరెన్స్, ప్రకృతి వైపరీత్యాలతో కూడా రైతు నష్టపోతున్నారని తెలిపారు. పత్తి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:52 - October 30, 2017
20:49 - October 30, 2017

ఉద్యోగాలు భర్తీ జేస్తాంటున్న కేసీఆర్, ఆత్మీయ సభకు సడన్గొచ్చిన ఉత్తం, గిరిజన రిజర్వేషన్ గిరెప్పుడు గీశేది?, మారవోతున్న ఓట్ల పర్సెంటేజులు, న్యాయాన్ని పత్తాలలళ్ల ఏరుతున్న ఒకీళ్లు....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:26 - October 30, 2017
20:25 - October 30, 2017

అన్ని సౌకర్యాలు కల్గివుండి, అన్ని అవయవాలు లక్షణంగా ఉండి కూడా ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎందరో..? తినడానికి తిండి లేకపోయినా, శరీరాన్ని దాచుకోవడానికి మూరెడు బట్ట లేకపోయినా నిత్యం సమస్యలతో జీవించేవారు ఎందరో ఉన్నారు. కానీ చిన్న చిన్న కారణాలకు కూడా జీవితాలను అంతం చేసుకునే పరికివారు మరికొందరు. కానీ భవితపై ఆశల లతను అల్లుకుని, కలల్ని నేరవేరే సమయం చేరువలో ఉన్న తరుణంలో ఊహించని ఘోర ప్రమాదానికి లోనై అంగవైకల్యం పాలైతే.. ఇక ఆ జీవితం ముగిసిపోయినట్లేనా..? ఆ ఆశల లతా వాడిపోయినట్లేనా..? కాదు కానేకాదని నిరూపించింది ధీర వనిత. ఒంటికాలితో హిమ శిఖారాగ్రాన్ని అధిరోహించించిది. ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచిన ఓ ధీశాలి అరుణమ సిన్హా  స్ఫూర్తిదాయక కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

పశ్చిమగోదావరి : జిల్లాలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకారు. పెరవలి మండలం తానూరుకు చెందిన నాగరాజు, వరలక్ష్మి, పిల్లలు చంద్రిక, మాణిక్యంగా గుర్తించారు. వీరికోసం పోలీసులు, స్థానికులు గోదావరిలో గాలింపుచేపట్టారు. 

19:37 - October 30, 2017

హైదరాబాద్‌ : మాజీ రంజీ కెప్టెన్‌ ఎంవీ శ్రీధర్‌ గుండె పోటుతో మరణించారు. శ్రీధర్‌ గతంలో హైదరాబాద్‌ రంజీ జట్టుకు ప్రాతనిధ్యం వహించడంతో పాటు..భారత క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా,బీసిసిఐలో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.  దేశవాళీ క్రికెట్‌లో శ్రీధర్‌ 48.91 సగటుతో 21 సెంచరీలతో 6701 పరుగులు చేశారు. 

 

19:35 - October 30, 2017

గుంటూరు : నగర ప్రజలు ఆహ్లాద వాతావరణంలో గడిపేందుకు వీలుగా 520 ఎకరాల్లో నగర ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక పర్యవేక్షణలో సోషల్ ఫారెస్ట్ అధికారులు దీనిని తీర్చిదిద్దారు. చుట్టూ కొండల నడుమ నెలకొల్పిన ఈ ఉద్యానవనాన్ని నవంబర్ 4వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికి సంబందించి గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:33 - October 30, 2017
19:30 - October 30, 2017

విశాఖ : నగరంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా.. మద్దిపాలెం సెంటర్‌లో మహిళలు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. నిరసన తెలుపుతున్న మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని... త్రీటౌన్‌ పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పీఎస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలపై అత్యాచారాలు లాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని సర్కార్‌... మిస్‌ వైజాగ్‌ అందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని ఆరోపించారు. నగరంలో ఇకపై ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని... మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళలు డిమాండ్‌ చేశారు. 

అగ్రిగోల్డ్ లెక్కాపత్రాలు తేల్చుతున్నాం : డీజీపీ

గుంటూరు : అగ్రిగోల్డ్ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామని, కొంత మంది డబ్బు కట్టినట్లు ఆధారాలు లేవని ఏపీ డీజీపీ తెలిపారు.

గోదావరిలో దూకిన కుటుంబం

పశ్చిమగోదావరి : జిల్లాలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దంపతులతో సహా ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారికి పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు.

19:27 - October 30, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేయడానికి పూనుకున్నారన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే దీనిపై సీఎం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. 
 

19:21 - October 30, 2017

ఢిల్లీ : రాయలసీమలో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కేంద్రాన్ని కోరారు. కేంద్ర పర్యాటక ఆర్థిక సహాయ సంస్థ శాఖను విజయవాడలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఢిల్లీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పర్యాటక ప్రాజెక్టులకు నిధుల మంజూరుతోపాటు వచ్చే నెలలో లండన్‌లో జరిగే వరల్డ్‌ ట్రావెల్‌ మార్ట్‌ పొల్గొనే అంశంపై చర్చించారు. 

 

19:20 - October 30, 2017

 నెల్లూరు : విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకునేందుకు ఐఐటీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులోని మున్సిపల్ రెసిడెన్షియల్‌ కళాశాలను మంత్రి సందర్శించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలో ఫౌండేషన్‌ ప్రారంభించినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌ ఐఐటీ హబ్‌గా మారిందని మంత్రి తెలిపారు. పేద విద్యార్థుల్లో స్పూర్తి, పోటీతత్వాన్ని పెంచి వారి జీవితంలో వెలుగు నింపాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు.  

19:17 - October 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకారు. పెరవలి మండలం తానూరుకు చెందిన నాగరాజు, వరలక్ష్మి, పిల్లలు చంద్రిక, మాణిక్యంగా గుర్తించారు. వీరికోసం పోలీసులు, స్థానికులు గోదావరిలో గాలింపుచేపట్టారు. 

19:09 - October 30, 2017
19:08 - October 30, 2017

ప్రకాశం : తెలుగుదేశం పార్టీ భారీ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. 26 వేల రేషన్‌ దుకాణాలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. సాగర్‌ నుండి రైతులకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధి విధానాలపై అవిశ్రాంత పోరాటాలకు సిద్ధమవ్వాలని విపక్షాలకు మధు పిలుపునిచ్చారు. 

 

19:01 - October 30, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. రాష్ట్రప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందన్న కారణంతోనే వైసీపీ శాసనసభ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం రాజధానిలోని రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారిని మభ్యపెట్టేందుకే సింగుపూర్ టూర్‌లకు తీసుకెళ్తున్నారన్నారు. 

18:59 - October 30, 2017

గుంటూరు : తాను అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే, కాంట్రాక్టర్లు అశ్రద్ధతో ఉన్నారని, ఇంత నిర్లక్ష్యాన్ని ఇకపై సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల పనులను సమీక్షించిన ఆయన.. గండికోట ప్రాజెక్టుకు వచ్చేసరికి కాంట్రాక్టర్‌, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనక పోవడం చంద్రబాబుకు కోపాన్ని తెప్పించింది. గండికోట పనులు అనుకున్నట్టుగా సాగడం లేదని, పనుల్లో జాప్యం జరిగితే తాను సహించబోనని హెచ్చరించారు. ఇదే వైఖరి కొనసాగితే, తాను పోలీసు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రాజెక్టు సైట్‌కు పోలీసులను పంపి అక్కడి సామాగ్రిని స్వాధీనం చేసుకుంటానని అన్నారు. ఇరిగేషన్ పనుల విషయంలో జాప్యాన్ని ఎంతమాత్రమూ సహించేది లేదని, ఎలాంటి వారినైనా ఉపేక్షించబోనని చంద్రబాబు అన్నారు. 

 

18:57 - October 30, 2017
18:54 - October 30, 2017

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కృషి చేస్తొందని హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ వివేక్‌ అన్నారు. ఉప్పల్‌లో ద్రోణాచార్య క్రికెట్‌ అకాడమీని జాతీయ జట్టు మహిళా క్రికెటర్‌ గౌహర్‌ సుల్తానాతో ప్రారంభించారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసేందుకు అత్తుత్తమ శిక్షణ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో హెచ్‌సీఏ తరపున శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రైవేట్‌ శిక్షణా కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న క్రీడాభిమానులకు ధన్యవాదాలు తెలియచేశారు.

 

18:52 - October 30, 2017

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అరకొరగా వస్తున్న ఆదాయంతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో మున్సిపాలిటీలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీపై 10టీవీ కథనం..
మున్సిపాలిటీలో తిష్టవేసిన సమస్యలు
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ సమస్యలకు కేరాఫ్‌ అడ్రగా మారుతోంది. మున్సిపాలిటీలో ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. 28 వార్డుల్లోనూ అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. అడుగడుగునా సమస్యలు తిష్టవేశాయి.  గడిచిన ఆరు నెలలుగా మున్సిపాలిటీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయంలేక, అభివృద్ధి జరుగక సతమతమవుతోంది.
వివాదాస్పదమవుతోన్న అధికారుల తీరు
కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ ఆదాయంపై వారు ఏమాత్రం దృష్టిపెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు సొంత పనుల కోసమే పనిచేస్తున్నారని... మున్సిపాలిటీ అభివృద్ధి వారికి పట్టడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాదు.. అధికారులు తమకు నాలుగు రూపాయలు మిగులుతాయన్న పనులపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పలు టెండర్లలో అధికారులు గోల్‌మాల్‌కు పాల్పడారన్న  ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పెండింగ్‌లో విద్యుత్‌ బకాయిలు
మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ద్య, కాంట్రాక్టు కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో 142మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వేతనాల కోసం ప్రతీసారి కార్మికులు ఆందోళనకు దిగడం.. అధికారులు ఎంతోకొంత ఇస్తామని హామీనివ్వడం సర్వసాధారణమైపోయింది. మున్సిపాలిటీకి చెందిన విద్యుత్‌ బకాయిలు కూడా పెండింగ్‌లో పెట్టడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.  టాన్స్‌కోకు కోటి 15 లక్షల రూపాయలు మున్సిపాలిటీ విద్యుత్‌ బిల్లులు బకాయిపడింది. పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులు హెచ్చరించినా మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటికే 5సార్లు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. విద్యుత్‌ నిలిపివేసినప్పుడు తాత్కాలికంగా కొంత చెల్లించి కరెంట్‌ పునరుద్ధరింపచేసుకుంటున్నారు.  లక్షల రూపాయలు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. 
ఆదాయంపై దృష్టి సారించని అధికారులు
మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు ట్రేడ్‌ లైసెన్స్‌.  టౌన్‌ప్లానింగ్‌, పట్టణ అభివృద్ధి పనుల ద్వారా ఆదాయం వస్తోంది. పన్నుల వసూలు, బిల్లుల వసూళ్లు కూడా అధికారులు సరిగా చేయడం లేదు.  దీంతో మున్సిపాలిటికి ఆదాయం లేక అవస్థలు పడుతోంది. ఆదాయంపై అధికారులు దృష్టిపెట్టకపోవడంతోనే మున్సిపాలిటీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని పలువు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆదాయ వనరులపై దృష్టిసారించి.... మున్సిపాలిటీలోని సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

 

18:49 - October 30, 2017

మంచిర్యాల : విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల లంలో అధికారిక సమాచారం కోసం మండల విద్యాశాఖ ఎంఆర్‌సీ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను రన్‌ చేస్తోంది. అయితే ఆ గ్రూప్‌లో దుబ్బపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రూప్‌లో యువతి అశ్లీల ఫోటోను అప్‌లోడ్‌ చేశాడు. ఇది చూసిన మహిళా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆవేదనకి గురైనట్టు డెమోక్రసీ టీచర్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

18:47 - October 30, 2017

హైదరాబాద్ : పోలీసు అంటే భయం పోవాలని.. గౌరవం పెరిగాలని గ్రూప్ 1 రెండో ర్యాంకర్ ఉదయ్ రెడ్డి అన్నారు. తాను ఆ విధంగా కృషి చేస్తానని చెప్పారు. పోలీస్ అవ్వాలనేది తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నానని ఉదయ్‌రెడ్డి చెప్పారు. డీఎస్పీగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని.. అయినా అన్నింటికీ సిద్ధపడి పోలీసు సర్వీసును ఎంచుకున్నానన్నారు. మిర్యాలగూడకు చెందిన ఈ యువ డీఎస్‌పీ ఉదయ్‌రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:44 - October 30, 2017

నిజామాబాద్ : అకారణంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ... నిజామాబాద్ కలక్టరేట్ ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లాలోని ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో దంపతులైన సునీత, రమేష్ మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఇటీవల వీరి ఏజెన్సీ రద్దు చేయడంతో.. తమకు న్యాయం చేయాలంటూ.... ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. అయితే అక్కడ చాలా మంది ఉండటంతో... కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు..  దంపతుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ తమను మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నుంచి అకారణంగా తొలగించి... తమ అనుచరులకు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోయారు. 

18:42 - October 30, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా ముగిసింది. 69వ బ్యాచ్‌లో 136 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయ్యారు. న్యాయం కోసం వచ్చిన బాధితులకు మేలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

18:37 - October 30, 2017

హైదరాబాద్ : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.  స్కూళ్ల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులపై మార్గదర్శకాలు ఇస్తామని చెప్పిన తిరుపతిరావు కమిటీకి ఈ లెక్కలు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు.  గత మూడేళ్ల వివరాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించినా యాజమాన్యాల నుంచి ఏమాత్రం స్పందన లేదు. లెక్కలిచ్చేందుకు గడువులు ఎన్నిసార్లు పెంచినా ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో ఫీజుల నియంత్రణ సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో 12వేలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు
తెలంగాణ రాష్ట్రంలో 12వేలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఫీజుల నియంత్రణ చేయాలంటూ తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు కొన్నేళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీని ఫలితంగా తెలంగాణ సర్కార్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఫీజులపై అధ్యయనం చేసేందుకు  ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  మార్చి 21న విద్యాశాఖ అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.  నెల రోజుల్లో ఫీజుల వసూళ్ల విధివిధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీని కోరింది.  కమిటీ చాలాసార్లు సమావేశమై ఫీజులపై చర్చించింది.  దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే కమిటీ ఇచ్చే మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని అందరూ భావించారు. కానీ కమిటీ ఏర్పడి ఏడు నెలలు అయినా.. ఇప్పటికీ మార్గదర్శకాలే ఇవ్వలేదు.
మూడేళ్ల ఫీజుల వివరాలు ఇవ్వాలన్న తిరుపతిరావు కమిటీ
ప్రైవేట్స్‌ స్కూల్స్‌లో గడిచిన మూడేళ్ల ఆడిట్‌ రిపోర్టు ద్వారా ఫీజులను నిర్ణయించవచ్చని తిరుపతిరావు కమిటీ అభిప్రాయపడింది. దీనికోసం ప్రత్యేకంగా విద్యాశాఖ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు మూడేళ్ల ఫీజుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది.  సెప్టెంబర్‌ 15 వరకే  తుది గడువు ఇచ్చింది. ఈ గడువులోపు కేవలం 2వేల 9వందల స్కూల్స్‌ మాత్రమే మూడేళ్ల ఫీజుల వివరాలు అందించాయి. మిగిలిన 9వేలకుపైగా స్కూల్స్‌ నేటికీ ఫీజుల లెక్కలు ఇవ్వనేలేదు. ఫీజుల వివరాలు ఇచ్చేందుకు ఆ స్కూల్స్‌ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. 
నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలలు
వాస్తవానికి విద్యాహక్కు చట్టం ప్రకారం జీవో నంబర్‌ 1 ప్రకారం యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో కేవలం 5శాతం మాత్రమే లాభాన్ని తీసుకోవాలి. 50శాతం సిబ్బంది వేతనాల కోసం, మిగిలిన మొత్తం సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం వినియోగించాలి.  కానీ వీటిని ప్రైవేట్‌ పాఠశాలలు పాటించడం లేదు. అందుకే అవి ఫీజుల వివరాలను ఇవ్వడానికి ఇష్టంగా లేవు.  మరోవైపు విద్యాశాఖ నుంచి కూడా కచ్చితంగా ఇవ్వాలన్న ఆదేశాలు వెల్లడం లేదు. దీంతో ఫీజుల నియంత్రణ మార్గదర్శకాలు ఆలస్యమవుతున్నాయి. అసలు ఈ ఏడాది ఫీజుల నియంత్రణ మార్గదర్శకాలు అమలు అవుతాయా అన్నది ప్రశ్నార్థకమే.

 

18:31 - October 30, 2017

విశాఖ : ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందరి కోర్కెలు తీర్చే సింహాచలేసుడు ఆ 500 కుటుంబాలను మరిచాడు. దేవస్థానం అధికారులే ఆ గ్రామం పాలిట విలన్స్‌ అయ్యారు. పచ్చని సిరులు పండే భూములు ఉన్నా... వ్యవసాయానికి  ఆమడదూరంలో ఉంది ఆ గ్రామం.  ఇంతకీ ఎక్కడా గ్రామం. ఏమిటా గ్రామం కథ... లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...
విజినిగిరిపాలెం రైతులపై కరుణలేని స్వామి
సింహాచలంలోని వరహాలక్ష్మీ నరసింహస్వామిని భక్తులంతా ఇష్టంగా కొలుస్తారు. ఆ స్వామి దర్శనం చేసుకుని కప్పస్తంభం పట్టుకొని కోరికలు కోరితే.. అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సింహాచల ఆలయం అంటేనే అదో పవిత్రతకు మారుపేరు.  శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి పుష్కరిణిని ఆనుకుని ఉన్న విజినిగిరిపాలెం రైతులపై మాత్రం ఆ స్వామి చల్లని చూపులు కురవడం లేదు. ఆ స్వామి కరుణ రైతులపై లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ స్వామి  పేరుతో రైతులు ఇబ్బందిపడుతున్నారు.
1996 వరకు గ్రామస్తులకు అందిన ప్రభుత్వ పథకాలు
విజినిగిరిపాలెంలో పచ్చదనం తివాచీ పరచినట్లుగా ఉంటుంది. ఈ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివాసముంటున్నాయి. 4వేల మంది ప్రజలు నివసిస్తున్నారు.  గ్రామస్తులంతా వ్యవసాయం, పశుపోషణ చేసుకునే జీవనం సాగిస్తున్నారు.  తాత ముత్తాల నుంచి వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. 1996 వరకు ప్రభుత్వ పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందేవి. ప్రభుత్వమే వారికి విత్తనాలు , ఎరువులు సరఫరా చేసేది. దీంతో రైతులు వ్యవసాయం చేసుకునేవారు. 
సింహాచల దేవస్థానం, గ్రామస్తులకు మధ్య భూవివాదం
కాలం మారింది. తమ బలం అనుకున్న సింహాచల నృసింహస్వామే దేవస్థానం అధికారులు వారి పాలిట శాపంగా మారారు. గ్రామస్తులకు , దేవస్థానం అధికారులకు మధ్య భూముల వివాదం చెలరేగింది. విజినిగిరిపాలెం భూములు అన్ని తమకు చెందుతాయని దేవస్థానం అధికారులు చెప్తున్నారు. తాత ముత్తాల నుంచి సాగుచేసుకుంటున్న భూములు దేవస్థానానికి ఎలా చెందుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం నిర్మించడానికంటే ముందే తమ వారికి ఈ భూములు ఉన్నాయని వాదిస్తున్నారు. 
విజినిగిరిపాలెం రైతులకు అందని ప్రభుత్వ పథకాలు
విజినిగిరిపాలెం రైతుల భూములపై వివాదం ఏర్పడడంతో గ్రామస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలేవీ అందడం లేదు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వారి దరి చేరడం లేదు. దేవస్థానం భూములని చెప్పడంతో రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలన్నీ నిలిచిపోయాయి. రైతు రుణాలు మాఫీ కాలేదు. బోర్డు వేయించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పంపుసెట్లు వీరికి ఇవ్వడం లేదు.  సబ్సిడీ విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు వ్యవసాయానికి కావాల్సినవి ఏవీ ప్రభుత్వం ఇవ్వడంలేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచల దేవస్థానం అధికారులే తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
భూవివాదం సమస్య నేటికీ పరిష్కారం కాలేదు
దాదాపు 20 ఏళ్ల కిందట మొదలైన ఈ భూవివాదం సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. ఎన్నికల ముందు రాజకీయ నేతలు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తారు. ఆ తర్వాత ఆ హామీని మరిచిపోతున్నారు. 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. 20 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే గ్రామం తమకు జీవనోపాధిలేదని.. వలసలు వెల్లాల్సిన దుస్థితి తలెత్తుతుందని వాపోతున్నారు.

18:24 - October 30, 2017

నిజామాబాద్ : జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయ్. ప్యూచర్ ప్లానింగ్ లో భాగంగా ఖద్దర్ లీడర్లు ఇప్పటి నుంచే స్కెచ్ లేస్తున్నారు. అయితే ప్రస్తుతం టాపిక్ అంతా డీఎస్ చిన్న కొడుకు అరవింద్ చుట్టే నడుస్తోంది. మరి అరవింద్ బీజేపీలోకి చేరడానికి రెడీ అయ్యారు. ఎప్పుడూ బిజినెస్ లో బిజీగా ఉండే అరవింద్ ఉన్నట్లుండీ పొలిటికల్ రూట్ లో ఎందుకు వస్తున్నారు? వీరి స్కెచ్ ఎంటీ?
జిల్లాలో డీఎస్ కు రాజకీయంగా మంచి పట్టు
నిజామాబాద్ జిల్లాలో డీఎస్ కు రాజకీయంగా మంచి పట్టుంది. సీనియర్ నేత. కాంగ్రెస్‌లో ఉన్నపుడు పెద్దన్న పాత్ర పోషించారు. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నేత డీఎస్. కాంగ్రెస్ అంటే డీఎస్ డీఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎస్ కారెక్కి కూర్చున్నారు. ఇప్పటికే డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ మేయర్ పదవిని కూడా చేశారు. ఎప్పుడూ బిజినెస్ లోనే బిజీగా ఉండే డీఎస్ చిన్న కొడుకు అరవింద్ కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసారు.
డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో ఉంటే కుమారుడికి టీకెట్‌ రాదా ?
డీఎస్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం లేదు. దీంతో డీఎస్ చిన్న కొడుకు అరవింద్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టటు తెలుస్తోంది. డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగితే అరవింద్ కు టికెట్ వచ్చే అవకాశాలు లేవన్నది ఇంటర్నల్ మ్యాటర్. అందుకే ముందుచూపుతో కుమారుణ్ని బీజేపీలో చేర్చారనే అభిప్రాయంలు వస్తున్నాయి. మొదట అరవింద్‌ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగినా... ఆ విషయాన్ని డీఎస్ ఖండించారు. సీఎం కేసీఆర్ కే మద్దతు ఇవ్వాలంటూ చెప్పుకొస్తున్నారు. 
సెప్టెంబర్‌లోనే బీజేపీలో చేరిన అరవింద్‌ 
సెప్టెంబర్ మొదటి వారంలో డీఎస్ తనయుడు అరవింద్ కమలం పార్టీలో చేరారు. బీజేపీలో చేరి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో వినిపిస్తున్నాయ్. డీఎస్ అనుచరులు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలో 
 డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగుతారా? లేదంటే ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అన్నదానిపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. డీఎస్ మాత్రం కారు పార్టీని వీడేది లేదని చెప్పుకొస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు నిజామాబాద్ జిల్లా నుంచి బడా లీడర్లు త్వరలోనే కమలం పార్టీలోకి వస్తున్నారని చెబుతున్నారు. జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉంటున్నారని కూడా చెప్పుకొచ్చారు.  కమలంపార్టీ లీడర్ల 
మాటలను వింటుంటే డీఎస్ కూడా పార్టీ మారుతారేమోనన్న  ప్రచారం జోరుగా సాగుతోంది. 
ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ అంటున్న డీఎస్‌ పెద్ద కొడుకు 
అటు డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు సంజయ్. ఒక వేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. లేదంటే ఏ పార్టీ నుంచైనా టికెట్ తెచ్చుకుని పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సంజయ్ తండ్రితో పాటే టీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. డీఎస్ ఫ్యామిలీ రాజకీయం ఎలాంటి మలుపుతిరుగుతుందనేది ఇపుడు నిజామాబాద్‌ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

18:03 - October 30, 2017
18:02 - October 30, 2017

తెలంగాణలో 3,897 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు

హైదరాబాద్ : రాష్ట్రంలో 3,897పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో 907 సివిల్ కానిస్టేబుళ్లు, 2,990 ఏఆర్ కానిస్టేబుళ్లు ఉన్నాయి.

జనవరి నుంచి చంద్రన్న పెళ్లికానుక

 

గుంటూరు : ఏపీలోని బీసీ యువతియువకులకు చంద్రన్నన పెళ్లికానుక విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి చంద్రన్న పెళ్లి కానుక అమలు కానుంది.

వేరే పార్టీలో చేరితే పునరేకీకరణ కాదు : పెద్దిరెడ్డి

హైదరాబాద్ : ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరితే రాజకీయ పునరేకీకరణ కాదని టీ.టీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరడం వల్ల టీఆర్ఎస్ కే లాభమని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముహుర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం12.30 ఆయన రాహుల్ తో భేటీ అవుతారు. సాయంత్రం 4గంటలకు కాంగ్రెస్ లో చేరుతారు. 

17:46 - October 30, 2017
17:45 - October 30, 2017
17:43 - October 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో హరితహారంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ట్రీగార్డ్ లు ఇవ్వాలన్నారు. స్టాఫ్ ను పెంచాలని కోరారు. ట్రీగార్డ్ లు ఇచ్చి, స్టాఫ్ ను పెంచితే ఒక్క ఓపెన్ ప్లేస్ లేకుండా చెట్లు పెడతామని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హరితహారంపై హైదరాబాద్ ఎమ్మెల్యేలతో జీహెచ్ ఎంసీ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. చెట్ల పెంపకం కోసం అవసరమైతే గ్రీన్ బడ్జెట్ పెట్టాలన్నారు. స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసింది. 

 

17:37 - October 30, 2017

మాజీ రంజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ రంజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూశారు. స్టార్ ఆసుపత్రిలో గుండె పోటుతో ఆయన మృతి చెందారు. 

మంచిర్యాల సీఐ బాలరాజు సస్పెన్షన్

మంచిర్యాల : సీఐ బాలరాజును జిల్లా ఏస్పీ సస్పెండ్ చేశారు. సీఐ బాలరాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆయన మహిళా పోలీస్ స్టేషన్ లో సీఐగా పని చేస్తున్నారు. 

17:12 - October 30, 2017

హైదరాబాద్ : నగరంలోన హెలికాప్టర్ డోర్ విరిగిపడింది దీంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. లాలాపేటలోని ఓ ఇంటిపై శిక్షణా హెలికాప్టర్ డోర్ విరిగి పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డోర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ డోర్ విరిగిపడడంతో దాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 

ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి

గుంటూరు : రాష్ట్రంలో 10ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 

రేవంత్ ఆరోపణలపై స్పందించిన యనమల

గుంటూరు : రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. తనకు తెలంగాణలో కాంట్రాక్టులు ఉంటే రేవంత్ తీసుకోవచ్చు అని అన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు.

త్వరలో 20వేల పోస్టులు యనమల

గుంటూరు : 20వేల పోస్టులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇప్పటికే 10వేల పోస్టులను భర్తీ చేశామని ఆర్థిక మంత్ర యనమల తెలిపారు.

16:56 - October 30, 2017

ఫైనాన్స్ : దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించేందుకు బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాయి. 2017లో ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు 358 ఏటీఎంలను శాశ్వతంగా మూసివేశాయి. దేశవ్యాప్తంగా ఎస్ బీఐకి 59వేల 291ఏటీఎంలు ఉంటే అందులో 91ఏటీంలను మూసివేసింది. అలాగే హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఐదు చొప్పున ఏటీంలు మూసివేశాయి. మిగతా బ్యాంకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. బ్యాంకుల ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా వంటి మెట్రోపాలిటన్ సిటీలో ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. ఈ నగరాల్లో ఏటీఎంల నిర్వహణకు నెలకు దాదాపు 50వేల వరకు ఖర్చు అవుతున్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. 

16:55 - October 30, 2017

నెల్లూరు : ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చలపతిరావు అనే రోగికి ఆపరేషన్‌ చేసి కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారు వైద్యురాలు పద్మశ్రీ. వారం రోజులుగా కడుపునొప్పితో బాధపడిన చలపతిరావు.. మళ్లీ ఆస్పత్రికి వెళ్తే విషయాన్ని గోప్యంగా ఉంచి రెండవసారి ఆపరేషన్‌ చేశారు. డాక్టర్‌ పద్మశ్రీ గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేయారనే ఆరోపణలు ఉన్నాయి. 

 

16:45 - October 30, 2017

సినిమా : చిన్న స్థాయి హీరోగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో తన రేంజ్ ను అమంతం పెంచుకున్నాడు. ఈ చిత్రం విజయం తర్వాత అర్జున్ రెడ్డికి పెద్ద పెద్ద బ్యానర్ లో ఆవకాశలు వస్తున్నాయి. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్నాడు. ఈ కుర్రా హీరో పెద్ద హీరోలతో పరిచయలు చేసుకోవాడనికి వారికి లావిష్ పార్టీలు ఇస్తున్నాడట. తాజాగా తన తల్లిండ్రులతో హీరో రానా, నాని, సాయిధరం తేజలకు పార్టీలు ఇచ్చాడు. ఇలాంటి సాంప్రదాయాలు బాలీవుడ్ ఎక్కుగా ఉంటాయి. 

16:40 - October 30, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను సింగపూర్‌ ట్రిప్‌కు పంపే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. తొలి దశలో 34 మంది రైతులను సింగపూర్‌కు పంపుతున్నారు. సింగపూర్‌లోని రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అంశాలను రైతులు తెలుసుకోనున్నారు. రైతుల సింగపూర్‌ ట్రిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:37 - October 30, 2017

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం అమల్లో అవకతవకలు జరిగాయని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సభ్యురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆమె పాల్గొన్నారు. 

16:35 - October 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో అటవీ సంపద తరిగిపోవడానికి కాంగ్రెస్‌ పాలకులే కారణమని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంలో అడవుల విస్తరణకు వెచ్చించింది కేవలం రూ.130 కోట్లే అని విమర్శించారు. మూడున్నర సంవత్సరాల్లో 2008 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. 

 

16:29 - October 30, 2017

ఢిల్లీ : ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా శిబిరాలను పోలీసులు, ఎన్ డీఎమ్ సీ అధికారులు తొలగించారు. కాలుష్యం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే కారణాలతో.. జంతర్‌మంతర్‌ ధర్నా చౌక్‌ను రామ్‌ లీలా మైదాన్‌కు మార్చాలని అక్టోబర్‌ 5న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ జీటీ ఆదేశించింది. ఈ మేరకు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా శిబిరాలను తొలగించడం జరిగింది. అయితే ధర్నా శిబిరాలను ఎత్తివేయడాన్ని నిరసనకారులు వ్యతిరేకించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:27 - October 30, 2017

హైదరాబాద్ : విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం నీరు కారుస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంటకరెట్టి ఆరోపించారు. బకాయిలన్నింటినీ విడుదల చేస్తామన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదుని మండిపడ్డారు. 

16:24 - October 30, 2017

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా  ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే క్యాలెండర్‌ విడుదల చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఇంతవరకు ఎన్ని ఖాళీలో భర్తీ చేశారో చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు. 

 

16:20 - October 30, 2017
16:19 - October 30, 2017

స్పోర్ట్స్ : శ్రీలంక ఓ రికార్డు బ్రేక్ చేసింది. అది ఏంటో తెలుసా ఓటముల రికార్డు అవును గత సంవత్సరం నుంచి వైఫల్యాలతో సతమతం అవుతున్న శ్రీలంక తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లోని రెండవ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయింది. ఈ ఓటమితో ఒకే క్యాలండర్ ఇయర్ లో అత్యధిక ఓటములు పొందిన జట్టుగా శ్రీలంక రికార్డు సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు జింబాబ్వే పేరుపై ఉంది. స్వంత ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురుకుంటున్న శ్రీలంక జట్టు 2017లో 33 ఓటములతో ఈ రికార్డు బ్రేక్ చేశారు. 

16:18 - October 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ వంతెనల వద్ద చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 105 చెక్‌ డ్యామ్‌లు వివిధ దశల్లో ఉన్నాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తెచ్చారు. 


 

16:14 - October 30, 2017

హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి టీఎస్ పీఎస్ సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు జరిగాయని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. ఆన్సర్‌ షీట్ల కోడిండ్‌, డీకోడింగ్‌, ఓఎమ్మార్ షీట్లను దిద్దడం వంటి తప్పులు చోటు చేసుకున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గ్రూప్‌-2 కేసులో హైకోర్టులో ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చింది. న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 

 

16:11 - October 30, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయాలన్న అంశంపై  జరిగిన చర్చలో  కేసీఆర్‌ పాల్గొన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో లోపాలుంటే సరిదిద్దుకుంటామని సభ దృష్టికి తెచ్చారు. 

 

ఉపరాష్ట్రపతిని కలిసిన కామినేని

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతసూడన్ ను ఏపీ మంత్రి కామినేని కలిశారు. కడప ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల కేసు సుప్రీం కోర్టు కొట్టేయడంపై వారితో చర్చించారు.

జీఎస్టీ సర్దుబాటుతో రూ.116కోట్లు

గుంటూరు : జీఎస్టీ సర్దుబాటుతో రూ.166కోట్లు వచ్చాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టిన రూ. 1000కోట్లు, ఉపాధి హామీ నిధులు రూ.1200కోట్లు కేంద్రం నుంచి రావాల్సిఉంది.

సదావర్తి భూముల తీర్పు రేపటికి వాయిదా

హైదరాబాద్ : గతంలో తను సదావర్తి భూమముల కోసం చెల్లించిన రూ.27.44కోట్లు తిరిగి చెల్లించాలన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ పై హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది.

 

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటిసులు

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘనపై ఈ నోటీసులు అందించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నోటీసులు ఇవ్వద్దని తెలంగాణ ప్రభుత్వం తరుపు లాయర్ కోరిన ఆయన కోరికను ఏన్జీటీ తోసిపుచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. 

నల్లగొండ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నల్లగొండ : జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.వారు నల్లగొండ నియోజకవర్గ ఇన్ చార్జ్ భూపాల్ రెడ్డి ప్లెక్సీలను దహనం చేశారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది.

12:30 - October 30, 2017

హెల్త్ : మనకు సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, దంపలు, పంటలతో ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒక్కటి నువ్వులు నువ్వులతో శరీరానికి మంచి పోషన లభిస్తుంది. నువ్వుల నూనెలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి వంటలో వాడుకోవడం చాలా మంచిది. అంతేకాదు చాలా మంది స్త్రీలకు నెలసరి సరిగ్గాలేక ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం హర్మోన్లు బ్యాలెన్సింగా లేకపోవడం. హర్మోన్లు సమయానుంగా విడుదల కావలంటే నువ్వులను దొర వేయించి అందులో కొంచెం బెల్లం కలిపి చిన్నపాటి ఉండగా చేసుకుని రోజు తినాలి. నెలసరి వచ్చే మూడోవరాంలో దీన్ని వెసుకుంటే మంచిది. బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల రక్తహీత కూడా తగ్గుతుంది. 

12:28 - October 30, 2017

సినిమా : మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. సరైనోడు, జయ జానకి నాయకా విజయలతో దూసుకుపోత్ను ఈ డైరెక్టర్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా తీయబోతున్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ సినీ నిర్మాణ సంస్థ మహేశ్ తో ఈ చిత్రం చేయనున్నట్టు సమాచారం. మహేశ్ ఇప్పటికే 14రీల్స్ బ్యానర్ లో దూకుడు, ఆగడు, 1నేనొక్కడినే సినిమాలు చేశారు. ఆ సమయంలోనే మహేశ్ 14రీల్స్ సినీ నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తానాని మాట ఇచ్చాడట. దీంతో 14రీల్స్ వారు బోయపాటి శ్రీనును సంప్రదించారట. ఇప్పడైతే వీర మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మహేశ్ తో సినిమా చేయడానికి కొంత కాలంగా ఎదురు చూస్తున్న బోయపాటి ఎలాగైనా మహేశ్ తో సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాడట. చూద్దాం బోయపాటి దర్శకత్వంలో మహేశ్ సినిమా వస్తోందో ...?లేదో....? 

కాసేపట్లో సింగపూర్ బయల్దేరునున్న రైతుల బృందం

గుంటూరు : కాసేపట్లో రాజధాని ప్రాంత రైతుల బృందం సింగపూర్ బయల్దేరునున్నారు. ఏపీ ప్రభుత్వం 34 మందిని సింగపూర్ తీసుకెళ్తుంది. ఇప్పటికి రాజధాని భూములిచ్చిన రైతులు సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం జెండా ఊపి రైతు సింగపూర్ యాత్రను ప్రారంభించనున్నారు. రైతుల బృందం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సింగపూరు వెళ్తుంది. 

11:45 - October 30, 2017

హైదరాబాద్ : ఉప్పల్ బస్ టెర్మినల్ అభివృద్ది ఎప్పుడు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండో రోజు ప్రారంభమైన శాసనసభ లో జీరో అవర్ సమయంలో ఆయన మాట్లాడారు. ఉప్పల్ టెర్మినల్ బస్సు అభివృద్ధి చేయాలని అనేక పర్యాయాలు విన్నవించుకోవడం జరిగిందని, తెలంగాణలోని అనేక జిల్లాల నుండి బస్సులు ఉప్పల్ బస్ టెర్మినల్ గుండా వెళుతుంటాయన్నారు. మూడు సంవత్సరాల అభివృద్ధి చేయాలని కోరుతున్నా ఇంతవరకు చలనం లేదని విమర్శించారు. వెంటనే బస్ టెర్మినల్ అభివృద్ధి కోసం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బస్సులో తాను రావడం జరిగిందని..ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు చూడడం జరిగిందన్నారు. తదితర సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మంత్రి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 

11:42 - October 30, 2017

హైదరాబాద్ : నగరంలో మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు ప్రారంభమైన శాసనసభ లో జీరో అవర్ సమయంలో ఆయన మాట్లాడారు. సైదాబాద్, మాదన్నపేట, యాకత్ పురా ప్రాంతాల్లో చర్చీలు..మసీదు..గుడిలు..స్కూళ్లు..అనేవి చూడకుండా మద్యం దుకాణాలకు అనుమతులిస్తున్నారని తెలిపారు. 100 మీటర్ల పరిధిలోనే ఈ దుకాణాలు ఉంటున్నాయని, చాలా సున్నిత ప్రాంతంలో మద్యం దుకాణాలకు అనుమతినివ్వడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు పేర్కొన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతినించాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. సంబంధిత మంత్రికి విషయం తెలియచేసి సమస్యను పరిష్కారిస్తామన్నారు. 

సభను తప్పుదోవ పట్టిస్తున్న జానా - అక్బరుద్దీన్..

హైదరాబాద్ : శాసనసభాపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తున్నారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల తరువాతే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 

ప్రశ్నోత్తరాలు తరువాతే...

హైదరాబాద్ : ప్రశ్నోత్తరాల తరువాతే ఇతర అంశాలు తీసుకోవాలని స్పష్టంగా బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల తరువాత ఇతర అంశాలపై చర్చ జరగాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

టి.కాంగ్రెస్ వాకౌట్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టడంపై టి.కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చించాలని టి.కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ దీనిపై స్పీకర్ నిర్ణయం తెలుపకుండానే తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీనితో సభ నుండి వాకౌట్ చేస్తున్నట్లు జానారెడ్డి వెల్లడించారు. 

టి.టిడిపిలో కొనసాగుతన్న రాజీనామాలు..

హైదరాబాద్ : తెలంగాణ టిడిపిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర కార్యదర్శి పదవికి వేణుగోపాల్ యాదవ్ రాజీనామా చేశారు. అచ్చంపేట నియోజకవర్గ ఇన్ ఛార్జీ చారుకొండ వెంకటేశ్...

 

శైవాలయాల్లో భక్తుల రద్దీ...

హైదరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా శైవాలయాల్లో భక్తులు రద్దీ నెలకొంది. సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. 

బస్టాండులో పసికందు..

అనంతపురం : కదిరి ఆర్టీసీ బస్టాండు సమీపంలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. కదిరి ఏరియా ఆసుపత్రికి అంగన్ వాడీ కార్యకర్తలు తరలించారు. 

నేతలతో రేవంత్ సమావేశం..

హైదరాబాద్ : టి.టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కదులుతున్నారు. టిడిపికి చెందిన పార్టీ కార్యకర్తలు..అనుచరులు..చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. వారితో వరుస భేటీలు జరుపుతున్నారు. శనివారం ఉదయం కొడంగల్ లో పలు భేటీలు జరిపిన ఆయన సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలో మరోసారి తనకు మద్దతిస్తున్న వారితో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. 

10:53 - October 30, 2017

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో ఎలాంటి అవకతవకలు జరుగలేదా అని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండో రోజు ప్రారంభమైన సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గ్రూప్ 2 పై ఎమ్మెల్యే సంపత్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు వస్తాయని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూశారని తెలిపారు. ఈ తరుణంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందని గుర్తు చేశారు. 2015 డిసెంబర్ నెలలో 439 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని..కానీ ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్నాయన్నారు. అనంతరం 2016 సెప్టెంబర్ లో 1032 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షకు 5 లక్షల 17 వేల మంది హాజరయ్యారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని కానీ మంత్రి ఎలాంటి అవకతవకలు లేవని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. డీ కోడింగ్..వైట్ నర్ ఉపయోగించడం..తప్పులు జరిగాయని అధికారి వాణిప్రసాద్ ప్రెస్ నోట్ ఇచ్చారన్నారు. కోర్టులో ఒక పిటిషన్ దాఖలైందని సంపత్ తెలిపారు. 

10:52 - October 30, 2017

హైదరాబాద్ : మహబూబ్ నగర్ లో చేపట్టనున్న రింగ్ రోడ్డుపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శాసనసభలో పలు ప్రశ్నలు సంధించారు. రెండో రోజు ప్రారంభమైన సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. జిల్లాలోని రింగ్ రోడ్డు..బై పాస్ పై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. మహబూబ్ నగర్ జిల్లాలో 20-30 సంవత్సరాల నుండి రింగ్ రోడ్డు..బైపాస్ వస్తుందని టైం పాస్ చేశారని..సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకరాగానే రెండు..మూడు గంటల్లో జీవో ఇప్పిస్తానని పేర్కొని..వంద కోట్ల నిధులు విడుదల చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. అన్ని నగరాల్లో రింగ్ రోడ్డులు ఏర్పాటు చేస్తున్నారని..రింగ్ రోడ్డుకు ఏరియల్ రోడ్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయా ? అని ప్రశ్నించారు. రింగ్ రోడ్డు..టౌన్ కు మధ్య అభివృద్ధి జరుగుతుందన్నారు. రోడ్ డెవలప్ మెంట్ అథార్టీ హైదరాబాద్ లో అనేక కార్యక్రమాలు చేస్తోందని..ఇవి జిల్లాలకు విస్తరించాలని..ఇందుకు ప్రతిపాదనలున్నాయా ? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కానీ..జనరల్ నిధులు కేటాయిస్తున్నారా ? రింగ్ రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణ అత్యవసరమని..ఇందులో చట్టంలో మార్పులు చేస్తున్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉన్న రింగ్ రోడ్డు చూస్తే వంకర..వంకరగా ఉందని..దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పది సార్లు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల రోడ్డు మార్పులు చేశారని..గత ప్రభుత్వాలు చేసిన వాటిపై విచారణ చేయిస్తారా ? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. 

10:50 - October 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టడంపై టి.కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చించాలని టి.కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ దీనిపై స్పీకర్ నిర్ణయం తెలుపకుండానే తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల సమాధానం చెబుతున్నారు. ఈ సమయంలో సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్య ప్రధానమైందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల తరువాత ఇతర అంశాలు తీసుకోవాలని బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అత్యవసర సమయంలో తీసుకోవాలని తామ పార్టీ డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రశ్నోత్తరాల తరువాతే ఇతర అంశాలు తీసుకోవాలని స్పష్టంగా బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రశ్నోత్తరాల తరువాత ఇతర అంశాలపై చర్చ జరగాలని మంత్రి హరీష్ రావు సభకు తెలిపారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానం అత్యవసరమని..ఈ రోజు తీసుకోకపోవడం బాధాకరమని జానారెడ్డి తెలిపారు. ప్రభుత్వ తీరుకు వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ టి.కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండానే వాకౌట్ చేయడం తగదని హరీష్ రావు పేర్కొన్నారు. 

09:23 - October 30, 2017

హైదరాబాద్ : టి.టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కదులుతున్నారు. టిడిపికి చెందిన పార్టీ కార్యకర్తలు..అనుచరులు..చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. వారితో వరుస భేటీలు జరుపుతున్నారు. శనివారం ఉదయం కొడంగల్ లో పలు భేటీలు జరిపిన ఆయన సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలో మరోసారి తనకు మద్దతిస్తున్న వారితో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. జలవిహార్ లో సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నా పోలీసులు అనుమతినివ్వలేదు.

దీనితో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఆత్మయులు..మాట ముచ్చట' పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థలం తక్కువగా ఉండడం వల్ల కీలకమైన వారిని మాత్రమే రేవంత్ పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రేవంత్ సాయంత్రానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లతో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

09:07 - October 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాడు తెలంగాణ వర్షాకాల, శీతకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల వ్యూహాలకు ధీటుగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలని టి.కాంగ్రెస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజునే ఈ అంశంపై ఆందోళన చేపట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలను కొనసాగించింది. ఇది ముగిసిన అనంతరం సభను సోమవారానికి వాయిదా వేసింది.

నేడు జరిగే సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టే అవకాశం ఉంది. పది రకాల ప్రశ్నలకు చర్చకు రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం..గ్రూప్ 2 పరీక్షల్లో జరిగిన అవకతవకలు..అంబేద్కర్ ఓవర్సీస్...హరితహరం..నామినెటెడ్ పదవులపై చర్చ..ఇతర అంశాలపై చర్చ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగాలని టి.కాంగ్రెస్ పట్టుబడుతోంది. మరి రెండో రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

టి.అసెంబ్లీ..నేటి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ప్రతిపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

08:47 - October 30, 2017

టి.టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పలు విమర్శలు గుప్పించారు. ఇదొక కుట్రగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్), బెల్లయ్య నాయక్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

గుర్ గావ్ లో ఫైరింగ్..

హర్యానా : గుర్ గావ్ లోనో ఓ బార్ లో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

08:35 - October 30, 2017

వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ యూత్‌ 19వ యూత్‌ ఫెస్టివల్‌ రష్యాలోని సోచి నగరంలో ఘనంగా జరిగింది. ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం, అమెరికా సామ్రాజ్యవాద విధానాలు, యువత పోకడ ఇలాంటి పలు అంశాలపై అక్కడ చర్చలు నడిచాయి. ఆ యూత్‌ ఫెస్టివల్‌కి డెలిగెట్స్‌గా వెళ్లిన డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విప్లవ్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ లు టెన్ టివి జనపథంలో యూత్‌ ఫెస్టివల్‌లో జరిగిన చర్చలు, చేసిన తీర్మానాలను విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మెరిసిన తెలుగు తేజం..

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తెలుగు తేజం మెరిసింది. బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కిదాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో 21-14,21-13 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కెంటా నిషిమోటోపై శ్రీకాంత్‌ విజయం సాధించాడు. ఇటీవలే డెన్మార్క్‌ ఓపెన్‌ గెలుచుకున్న శ్రీకాంత్‌ తాజాగా ఫ్రెంచ్‌ ఓపెన టైటిల్‌ గెలుచుకుని.. సత్తా చాటాడు.

 

ఇంద్రకీలాద్రిపై కోటీ దీపోత్సవం..

విజయవాడ : కార్తీక పౌర్ణమి సందర్భంగా 3వ తేదీన ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. రేపటి నుంచి వచ్చే నెల 4 వరకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెజవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

08:26 - October 30, 2017

హైదరాబాద్ : ఏపీలోని 13 జిల్లాల్లో బహుజన ప్రతిఘటన వేదిక కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య. చంద్రబాబు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించిందన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఐలయ్య డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యులకు.. బహుజనులకు మధ్య ఒప్పందం జరిగిందంటూ వచ్చిన వార్తలను టీ మాస్ ఫోరం నేత సాంబశివరావు ఖండించారు. అక్కడ జరిగిన ఒప్పందానికి కంచె ఐలయ్య సంఘీభావ సమాజానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. 

08:21 - October 30, 2017

విశాఖపట్టణం : మహిళా సంఘాల నేతలు రోడ్డెక్కారు. సేవ్‌ గర్ల్స్‌ పేరుతో జరుగుతోన్న మిస్ విశాఖ అందాల పోటీలు నిలిపేయాలని ఆందోళనకు దిగారు. ఆడిషన్స్‌ జరుగుతున్న హోటల్ ఎదుట బైఠాయించారు. సేవ్‌ గర్ల్స్‌ అంటే మహిళలపై అత్యాచారాలు జరగకుండా చూడాలన్నారు. ఇదిలా ఉంటే అందాలపోటీలు నిర్వహించి తీరతామని నిర్వహకులంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. 

08:19 - October 30, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంటమాలజీ విభాగంలో వెలుగుచూసిన అక్రమాలు మరువక ముందే.. మరో స్కామ్ వెలుగుచూసింది. ఎంటమాలజీ విభాగంలోని అధికారుల అవినీతి, వారి నిర్లక్ష్యం...తెలుసుకోవాలంటే చదవండి..హైదరాబాద్‌ నగరంలో ఓ వైపు మూసీనది, వందలాది చెరువులు.. మరోవైపు నాళాలు భరించలేనంత మురికిగా మారిపోయాయి. ఇవి దోమల పెరుగుదలకు ప్రధాన కేంద్రంగా మారాయి. సిటీలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీలో ఎంటమాలజీ విభాగం పని చేస్తోంది. ఉన్నతాధికారులతో పాటు రెండు వేల మందికి పైగా సిబ్బంది దోమల ఉత్పత్తిని నివారించడానికి పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ యేటా బల్దియా కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా కొంతమంది అధికారుల అవినీతి వల్ల దోమల నివారణ జరగడం లేదు. దీంతో నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీలాంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. అయితే దోమల నివారణ విభాగాన్ని సక్రమంగా నడిపించాల్సిన సీనియర్ ఎంటమాలజిస్టులు... ఇంతవరకు ఉద్యోగాలను అమ్ముకోవటం మొదలు అందివచ్చిన అన్ని అక్రమాలు చేస్తున్నారు. నార్త్‌ జోన్‌లో ఉద్యోగాలను అమ్ముకుంటూ సీనియర్ విజయ్‌కుమార్‌ అడ్డంగా దొరికిపోయారు.

ఇక సౌత్ జోన్‌లో మలేరియా విభాగంలో ఒక్కొక్కరి పనులు ఒక్కోలా ఉన్నాయి. దోమల నివారణకు చేసే ఫాగింగ్ చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో చూపుతున్నారు. పార్కింగ్ చేసిన తరువాత స్థానికుల నుండి సంతకాలు, ఫోన్‌నంబర్లు సేకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుక్‌లో సంతకాలు కానీ ఫోన్‌ నంబర్లు కానీ కనిపించవు. వర్షాకాలంలో కూడా ఫాగింగ్ జరిగినట్లు ఎలా బిల్లులు పెట్టారంటే తెల్ల మొహమేస్తున్నారు.


ఇక ఫాగింగ్ మిషన్లకు ఉపయోగించే డీజిల్ విషయంలో అధికారుల చేతివాటం మామూలుగా లేదు. ప్రతీ రోజు వందలాది లీటర్ల డీజిల్ తీసుకుంటూ ఫాగింగ్ చేయడంలో అలసత్వం చూపిస్తున్నారు. సెలవులు, వర్షం పడుతున్న రోజుల్లో కూడా పని చేసినట్లుగా డీజిల్, మందులు నొక్కేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే రోజూ రిజిస్టర్‌లో చేయాల్సిన సంతకాలు కూడా చేయడం లేదు. రెండు నెలలుగా సంతకం చేయని అధికారిని మీరే సంతకం చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తే సౌత్ జోన్‌ సీనియర్‌ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్‌ ఏం మాట్లాడుతున్నాడో వీడియోలో చూడండి. బల్దియాలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా... ఉన్నతాధికారులు మాత్రం ఇంతవరకు వీటిపై దృష్టిపెట్టక పోవడం విశేషం. 

08:15 - October 30, 2017

హైదరాబాద్ : పత్తిని బీ, సీ గ్రేడులుగా విభజించి కొనుగోలు చేయాలని కేంద్రానికి పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని హరీష్‌రావు అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి మంచి ధర ఇచ్చి పత్తి కొనుగోలు చేయాల్సిందిగా జిన్నింగ్ మిల్ యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణ జిన్నింగ్ మిల్ అసోయేషన్‌తో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. హరీష్‌రావు ఆదేశాల మేరకు పత్తి కొనుగోలు చేస్తామని జిన్నింగ్ మిల్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. 

08:14 - October 30, 2017

తూ.గో : జిల్లా రామచంద్రపురంలో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దౌర్జన్యానికి తెగబడ్డారు. రోడ్డుపై ఉన్న కారును తీయాలంటూ దాడి చేశారు. పోలీసుల తీరును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.  

08:11 - October 30, 2017

గుంటూరు : ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్‌ బసవల వాసు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రత్యర్థులు అతడిని కారుతో ఢీకొట్టారు. అనంతరం కిందపడిన వాసుపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికివేశారు. ఈ దాడిలో వాసు అక్కడికక్కడే చనిపోయాడు. పలు హత్యకేసుల్లో వాసు నిందితుడిగా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుకు బసవల వాసు అనుచరుడు. వాసును హత్యచేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

08:09 - October 30, 2017

వరంగల్ : మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిపై కార్యకర్తలు తిరుగుబాటుకు దిగారు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంపై వరంగల్ పశ్చిమ టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికింది. హన్మకొండలో ప్రత్యేకంగా సమావేశమైన కార్యకర్తలు నరేంద్రరెడ్డి వెంట వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. 

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామ లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. తాను చంద్రబాబుకు రాసిన లేఖలో అనేక విషయాలు ప్రస్తావించారు. తాను రాజకీయంగా ఎదగడానికి టీడీపీ ఎంతో సహకరించిందన్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీని వీడాల్సి వస్తుందని వేం నరేందర్‌రెడ్డి... లేఖలో పేర్కొన్నారు.

 

 

 

08:07 - October 30, 2017

కరీంనగర్ : టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తోడుదొంగలే అని విమర్శించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేది లేదన్నారు తమ్మినేని. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీలేనని.. వామపక్షాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని తమ్మినేని స్పష్టం చేశారు.

08:05 - October 30, 2017

మహబూబ్ నగర్ : తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఆట మొదలైందన్న రేవంత్‌ రెడ్డి...బైపోల్‌ వార్‌కు సిద్ధమంటూ సిగ్నల్‌ ఇచ్చారు. అధికారపార్టీ అభివృద్ధి మంత్రం జపించినా...సిట్టింగ్‌ స్థానం తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూనే...నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో అండగా ఉండాలంటూ సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించేందుకు అధికారపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కొడంగల్‌లో బైపోల్‌ సమరం జరిగితే బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? ఎన్నిక జరిగితే ఫలితం ఎలా ఉండనుంది? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి. రేవంత్‌ రెడ్డి రాజీనామాను స్పీకర్‌ మధుసూదనాచారి ఆమోదిస్తే..కొడంగల్‌కు ఉపఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలవడం రేవంత్‌కు అగ్ని పరీక్షేనని పొలిటికల్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు తిరుగుండదంటున్నారు.

టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌ రెడ్డి..అధికార పార్టీతో ఉప పోరుకు సై అంటున్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఆట మొదలైందంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు అధికారం అడ్డం పెట్టుకొని అమాయకులపై దాడులు చేస్తున్నారని..తెలంగాణ బిడ్డల కోసమే పార్టీ మారాల్సి వస్తుందని వివరించారు. టీడీపీలో తన వెంట నడిచిన కార్యకర్తలు చేజారిపోకుండా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీ చేయూత వల్లే ఈ స్థాయికి ఎదిగానని చెబుతూ..ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలోనూ అండగా ఉండాలని కోరుతున్నారు.

అటు రేవంత్‌ను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. మంత్రి మహేందర్‌ రెడ్డి అక్కడే మకాం వేసి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మహేందర్‌ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రేవంత్‌ను ఓడించి ఆయన్ని జీరో చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐదుగురు మంత్రులు..రేవంత్‌ అనుచరులను ఆకర్షిస్తూ వారికి గులాబీ కండువా కప్పుతున్నారు. నంద్యాల తరహా ఫలితాన్ని...కొడంగల్‌లో రిపిట్‌ చేసేందుకు కారు పార్టీ ఊవిళ్లూరుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి కారు పార్టీని ఢీకొట్టి రికార్డు క్రియేట్‌ చేస్తారా? లేక అధికార పార్టీ అభివృద్ధి మంత్రంతో రేవంత్‌ ఆశలపై నీళ్లు చల్లుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

టీడీపీ విచ్చిన్నానికి రాహుల్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి కుట్ర పన్నారని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు సేకరించి ప్రశ్నిస్తే రేవంత్‌ సమాధానం ఇవ్వలేదన్నారు. అందుకోసమే రేవంత్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించకుండా ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేశారన్నారు. స్వంత ప్రయోజనం కోసమే రేవంత్‌ పార్టీ మారుతున్నారని ఎల్‌.రమణ ఆరోపించారు. 

08:03 - October 30, 2017

మహబూబ్ నగర్ : రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. రేవంత్‌ రాకను కాంగ్రెస్‌ పార్టీలో ఎవరూ వ్యతిరేకించడం లేదని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డిని డైనమిక్‌ లీడర్‌గా పేర్కొన్న ఆయన.. పార్టీలో ఉన్నత పదవి ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. హైదరాబాద్‌ గోల్కొండ హోటల్‌లో టీకాంగ్రెస్‌ నేతలతో కుంతియా భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, రేవంత్‌ రాక అంశాలపై చర్చించారు. రేవంత్‌రెడ్డి డైనమిక్‌ లీడర్‌గా పేర్కొన్నారు. అయితే రేవంత్‌ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని..డీకే అరుణ సైతం ఆయన రాకను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో షరతులతో చేరికలుండవని... పని తీరుతోనే బాధ్యతలు, పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్నత పదవి ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి ఇంకొన్ని రోజుల్లో చాలామంది చేరుతున్నారని టీపీసీసీ చీఫ్‌ చెప్పారు. పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టాన నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ. రేవంతే కాదు రేపు టీఆర్‌నుంచి హరీశ్‌రావు మా పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు.

మహబూబాబాద్‌లో నవంబర్‌ 9న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ సభకు 'కాంగ్రెస్‌ గిరిజన గర్జన' పేరును ఖరారుచేసినట్లు తెలిపాయి. ముఖ్యఅతిథిగా రాహుల్‌ గాంధీ హాజరు కానున్నట్లు స్పష్టం చేశాయి. మరోవైపు రేవంత్‌ రెడ్డి..తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఆర్‌ఐ క్రాంతి కుమార్‌కు గన్‌మెన్ల సరెండర్ లేఖను అందించి, వారిని అప్పగించారు. సోమవారం జలవిహార్‌లో మద్దతుదారులు, అభిమానులతో సమావేశం కావాలని రేవంత్‌ నిర్ణయించారు. అయితే జలవిహార్‌లో రేవంత్‌ మీటింగ్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

యాదాద్రికి కేంద్ర మంత్రి సుజనా..

యాదాద్రి : జిల్లాలో నేడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి పర్యటించనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. 

రేవంత్ సమావేశానికి నిరాకరణ..

హైదరాబాద్ : నేడు జలవిహార్ లో రేవంత్ రెడ్డి సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యం..144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనుమతిని నిరాకరించారు. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద మీటింగ్ కు రేవంత్ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలంతా తన ఇంటి వద్దకే రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. 

బాబుతో ఫాతిమా కాలేజీ స్టూడెంట్స్..

విజయవాడ : నేడు సీఎం చంద్రబాబు నాయుడిని ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు..తల్లిదండ్రులు కలువనున్నారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. 

నేడు హస్తినకు రేవంత్..

హైదరాబాద్ : నేడు రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనున్నారు. మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. 

సిరీస్ భారత్ కైవసం..

కాన్పూర్ : మూడు వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో కివీస్ పై భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరిత పోరులో 6 పరుగుల తేడాతో కివీస్ ఓటమి చెందింది. 

Don't Miss