Activities calendar

31 October 2017

21:31 - October 31, 2017

ముంబై : ఎల్ఫిన్‌స్టన్‌ రైల్వేస్టేషన్‌ను కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, నిర్మలా సీతారామన్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సెప్టెంబర్‌ 29న పాదాచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటన జరిగిన నెల రోజులకు కేంద్ర మంత్రులు బ్రిడ్జిని సందర్శించారు. వీరివెంట మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ఉన్నారు. ఈ వంతెన పునర్నిర్మాణం చేపడుతున్నట్లు సిఎం ప్రకటించారు. ఇందుకోసం సైన్యం సాయం తీసుకుంటున్నట్లు ఫడ్నవిస్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని సిఎం చెప్పారు. సివిల్‌ పనులను ఆర్మీ చేపట్టడం ఇదే తొలిసారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ పాత్ర సరిహద్దులోనే ఉంటుంది కానీ ఈ ఘటన పెను విషాదమని.. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి చెప్పారు. బ్రిడ్జి పనుల్లో కూడా ఆర్మీని వినియోగించడంపై పంజాబ్‌ సిఎం అమరిందర్‌సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

21:28 - October 31, 2017

బెంగళూరు : కర్ణాటక తొలి మహిళా పోలీస్‌ చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి నీలమణి ఎన్‌ రాజు నియమితులయ్యారు. డీజీ,ఐజీపీ ఆర్‌కే దత్తా పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో నూతన డీజీపీగా నీలమణిరాజును సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది. సీఐడీ చీఫ్‌ కిషోర్‌ చంద్ర, ఏసీబీ హెడ్‌ ఎంఎన్‌ రెడ్డిలు ఈ పదవికి పోటీపడ్డప్పటికీ సీనియర్‌ అధికారి కావడంతో నీలమణి వైపు సర్కార్‌ మొగ్గుచూపింది. నీలమణి1983 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌కు చెందినవారు. కర్ణాటకలో తొలిసారిగా మహిళా పోలీస్‌ చీఫ్‌ నియమితులయ్యారని ఐపిఎస్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

21:25 - October 31, 2017

కడప : జిల్లా పరిషత్‌ సమావేశం రసాభాసగా ముగిసింది. జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. జడ్పీ ఛైర్మన్‌ గూడూరి రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. గృహనిర్మాణ లబ్దిదారులకు ఇళ్లు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. దీనిపై సమావేశంలో తీర్మానం చేయాలంటూ వైసీపీ పట్టుబట్టింది. టీడీపీ నేతలు వినిపించుకోకపోవడంతో.. నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగా.. మంత్రి ఆదినారాయణరెడ్డికి.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో మంత్రికావడం సిగ్గుచేటని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దీంతో టీడీపీ- వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. 

21:23 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. తేమశాతం, దళారుల మాయాజాలం మధ్య నష్టపోతున్న రైతన్నను ఆదుకునేందుకు... మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో సచివాలయంలో సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జిన్నింగ్ మిల్స్‌ పరిశ్రమకు అవసరమైన సాయం
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ రైతన్నకు జిన్నింగ్ మిల్లుల యజమానులు సైతం తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇందుకోసం జిన్నింగ్ మిల్స్‌ పరిశ్రమకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ప్రభుత్వం తరపున అందాల్సిన ప్రోత్సాహకాలను సత్వరం విడుదల చేయాలని కోరారు. అదే విధంగా జిన్నింగ్ పరిశ్రమ అభివృద్ధికి మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. జిన్నింగ్ మిల్స్ ప్రతినిధుల సూచనలకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.వంద కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యజమానులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే త్వరలోనే రాష్ట్రంలో సకల హంగులతో కూడిన డిలింట్, సాల్వెంట్ పరిశ్రమ పార్కును నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్‌ ఉన్నాయని.. వాటిని తెరిపిస్తే ఇంకొంత పత్తిని కొనుగోలు చేయవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. వాటిని తెరిపించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జిన్నింగ్ పరిశ్రమ ప్రతినిధులు బుధవారం నుండే మార్కెట్లో పత్తి రైతుల నుండి కొనుగోళ్లు పెంచాలని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలను మంత్రులు కోరారు. 

21:22 - October 31, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు NTR, PMAY పథకాల ప్రగతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎంతమందికి ఇళ్లు లేవో సమగ్ర సర్వే చేయాలని.. NTR గ్రామీణ గృహ నిర్మాణం కింద దశలవారీగా నిర్మించే 13 లక్షల గృహాలకు జియో ట్యాగింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అనుమతులు లేకుండా నిర్మించిన గృహ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ల సమాచారం కోసం... లబ్దిదారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు.. కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

750 చదరపు అడుగులు
NTR గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇచ్చే ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని, 750 చదరపు అడుగులకు పెంచుతున్నట్టు సీఎం చెప్పారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో జీ+3 తరహాలో రెండు వేల గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారులు.... అధికారులకు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని సీఎం సూచించారు. ఈ సందర్భంగా జూన్‌ నాటికి 5 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేస్తామన్న లక్ష్యాన్ని స్వీకరించిన ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాంతిలాల్‌ దండేను సీఎం అభినందించారు. 

21:21 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ ఖతం అయినందున గత్యంతరం లేక స్వలాభం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌-టీడీపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్‌ స్పష్టంగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారని జూపల్లి కృష్ణారావు అన్నారు. 

21:20 - October 31, 2017

ఢిల్లీ : టీడీపీని వీడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ సహా 18 మంది నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రేవంత్‌ను పార్టీలోకి రాహుల్‌ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్‌తో పాటు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్‌, మేడిపల్లి సత్యం తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరముందని అన్నారు. ఇది తుది పోరాటం కావాలన్నారు. కేసీఆర్‌ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పక్కకు పోయాయని.. గొర్రెలు, బర్రెలు, చేపలు, చీరలు వచ్చాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని
తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా లెక్క చేయలేదన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఎవర్నీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని, కుటుంబంలోని నలుగురికి పదవులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మూడున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఆశలు అడియాసలు కావడమే కాకుండా.. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం టీ-కాంగ్రెస్‌కు బూస్టింగ్‌ ఇచ్చినట్లైంది.

20:17 - October 31, 2017

అ మొత్తం మీద ఓ కార్యం అయిపోయింది.. రేవంత్ కాంగ్రెస్ తొవ్వ దొక్కిండన్న అనుమానాల కాడికెళ్లి నిన్నటి ఆత్మీయుల సదస్సుదాక ఓ బాహుబలి సీన్మల సీన్ల లెక్క అల్లిచెప్పిండ్రు అందరు మీడియావోళ్లు..ఇగ ఇప్పుడు ఏక్ దం కాంగ్రెస్ పార్టీ కండువా మెడలేస్కోని బైటికొచ్చిండు రేవంతం సారు.. రాహుల్ గాంధీ అమ్మటాళ్ల యాళ్లకు కండువా గప్పిండు..

రే నీయక ఇదెక్కడి లేకి సర్కారురా నాయన..? పాపం జేఏసోళ్లు ఏ పనిజేశినా ముంగటవడనిస్తలేదు ప్రభుత్వం.. అమరవీరుల స్పూర్తి యాత్ర అంటే..అది అడ్డుకుంటరు.. ఇందిరాపార్కు రక్షణ అంటే అది అడ్డుకుంటరు.. కొల్వులకై కొట్లాట అంటే అది అడ్డుకుంటరు... ఇంతకు సర్కారు ఎందుకు గింత దిగజారుడు పనిజేస్తున్నదో అర్థమైతలేదు ఎవ్వలికి.. ఇగ ఆఖరికి కోదండరాం సారే నిరాహార దీక్షకు గూసున్నడంటె సూడుండ్రి..

తెలంగాణల టీఆర్ఎస్ ప్రభుత్వమొచ్చినంక రైతులు పెరుగన్నం దిని అర్గుమీద వంటున్నరని గప్పాలు గొట్టె నాయకులారా..? రాండ్రి మిర్యాల గూడ కాడ రైతులు అర్గుమీద వంటున్నరా రోడ్ల మీద వంటున్నరా అనేది వచ్చి సూస్తె తెలుస్తది..? చేతికి అందవల్సిన పంటను జూశి రోజు ఏడ్సుడు ఎందుకని నిప్పువెట్టిండంటే రైతన్న గుండె వల్గుతలేడా..?

తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ అంత శిపాయి సంస్థ లోకంలనే లేదు.. ఎక్కడెక్కడోళ్లొచ్చి నోరు పెద్దగ దెర్సి పరేషాన్ అయితున్నరు..అబ్బా ఏం సంస్థ ఏం సంస్థ..? ఇసొంటి సంస్థ మాతానలేకపాయే.. ఈ సంస్థను వెట్టిన తురుంఖాన్ ముఖ్యమంత్రి మా రాష్ట్రంల లేకపాయే అని గుడ్లు తెర్సి సూస్తున్నరట.. కొయ్యర కొయ్యరా పొలిగా అంటే.. చింతమడ్క చింతకాయలు అందేం కాయంత దొడ్డు అన్నడట..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీరు ప్రగతి భవన్ అని ఒకటి గట్టుకున్నరు తొమ్మిది ఎక్రాలళ్ల.. ఆ ఇంట్ల కరెంటి ఫిట్టింగు నల్లాల ఫిట్టింగు గాకముందుకే గృహ ప్రవేశం జేశిండ్రా మీ ఇంటిల్లాదులతోని..? అన్ని సౌకర్యాలు జేశ్నంకనేగదా అండ్లకు సొచ్చింది.. మరి మీ ఇంటికేమో గట్ల.. పదోని కోసం ఏడనో ఒకతాన గట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కరెంటొద్దు నీళ్లొద్దు.. అంటే.. ఏంది తమాషనా..?

ఎన్కట బావులకాడికి వొయ్యెటోళ్లకు గొర్లకాడికి వొయ్యెటోళ్లకు ఏం లేకున్నా సరేగని.. బుజాన గొంగడుంటే అదో ధైర్యముంటుండే.. ఎండొచ్చినా..? వానగొట్టినా.. సలివెట్టినా అన్నిటికి పనిజేసు జిందా తిలిస్మాత్ లెక్క సర్వానికి ఉపయోగపడ్తుండే.. కని ఇప్పుడు గొంగళ్లు గనిపిస్తున్నయా..? నా గొంగడి తప్ప ఏడగనవడ్తలేవు.. అవ్వినేశెటోళ్లు గనిపిస్తె అగ్గో గొంగళ్లు అని సూపెట్టవల్సొస్తున్నది పిల్లలకు..

అమ్మ నయ్యమైంది నాయనో.. పుసుక్కున అది మంది మీదవడ్తె ఎంత పెద్ద పర్శానైతుండే.. సికింద్రావాదుకాడున్న లాలాగూడ దిక్కు.. ట్రైనింగ్ విమానాలు తిర్గుతుంటయ్ గదా..? ఒక విమానం పోతుంటె పోతుంటెనే దాని దర్వాజ ఊశిపోయి ఒక ఇంటి మీదవడ్డదట.. పడ్తె జర్రంత సప్పుడే వస్తదా..? దిబేల్ మనంగనే జనమంత బైటికి ఉర్కొచ్చిర్రు..

కంచె శేను మేశినట్టే ఉన్నదిగదా కథ.. వాడు ఐపీఎస్ అధికారి అయ్యుండి.. ఇంకో పరీక్షల నక్కల చిట్టీలు గొట్టుకుంట పరీక్ష రాస్తున్నడంటే..? వాడు ఐపీఎస్ అధికారా..? లేకపోతె మాస్ కాపి మహనీయుడా..? కలెక్టర్ నౌకరి సంపాయించెతందుకు ఎంత ఇకమాతులు వడ్డడో సూడుండ్రి ఒకడు.. ఆఖరికి దొర్కిపోయి ఉన్నది వొయ్యింది ఉంచుకున్నది వొయ్యింది..

20:00 - October 31, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో యువనేతలు హల్‌చల్ చేస్తున్నారు. పటేల్‌ సామాజిక నేత హార్దిక్‌ పటేల్‌ బాటనే దళిత సామాజిక వర్గానికి చెందిన యువనేత జిగ్నేష్‌ మేవాని కూడా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశానికి ముందు ఆయన కొన్ని షరతులు విధించారు. రాహుల్‌గాంధీతో దొంగచాటుగా సమావేశం జరిపే ప్రసక్తే లేదని జిగ్నేష్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. దళితుల అంశంపై కాంగ్రెస్‌ తమ వైఖరిని తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 7 శాతం ఉండడంతో రాహుల్‌-జిగ్నేష్‌ల మధ్య భేటి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. హార్దిక్‌ పటేల్, జిగ్నేష్‌ మేవానీల షరతులతో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 

19:59 - October 31, 2017

ఆహ్మదబాద్ : పాటీదార్‌ సామాజికవర్గ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీకి తామిచ్చిన గడువును మరోసారి గుర్తు చేశారు. పటేల్ రిజర్వేషన్లపై రోడ్‌ మ్యాప్‌ వేసేందుకు ఎంతో సమయం లేదు...ఈలోగా నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్‌ సభలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం రాహుల్‌ గాంధీ సూరత్‌లో జరిపే సభను అడ్డుకుంటామని హార్దిక్‌ పటేల్‌ హెచ్చరించారు. పటేల్‌ రిజర్వేషన్లపై నవంబర్ 3వ తేదీలోగా స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌కు ఆయన గడువు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన హార్దిక్‌ పటేల్‌ ఇపుడు రిజర్వేషన్లపై మెలిక పెట్టారు. హార్దిక్‌ పటేల్‌ డెడ్‌లైన్‌పై కాంగ్రెస్‌ ఇంతవరకు స్పందించలేదు.

19:58 - October 31, 2017

ఢిల్లీ : హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ సిఎం ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ను సిఎం అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. ధూమల్‌ సుజాన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి సీనియర్‌ నేత 72 ఏళ్ల ప్రేమ్‌ కుమార్‌ ధూమల్ 1998-2003, 2007-2012లో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ తరపున ప్రస్తుత సిఎం వీరభద్రసింగ్‌నే తమ సిఎం అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించింది. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 9న ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌ ఎన్నికల తర్వాత డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.

19:56 - October 31, 2017

నెల్లూరు : పేషంట్‌ కడుపులో కత్తెర ఉంచి కుట్లేసిన నెల్లూరు ప్రభుత్వాసపత్రి వైద్యుల నిర్వాకంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్‌ రాధాకృష్ణరాజు వెల్లడించారు. మరోపక్క ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమంటూ వెంటనే తన భర్తకు సర్జరీ చేశారని బాధుతుని భార్య వాపోయింది. 

19:55 - October 31, 2017

కృష్ణా : కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నారు. 2015-16 విద్యా సంవత్సరంలో వీరంతా అడ్మిషన్లు పొందారు. అయితే ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. సర్కారు తీరును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:54 - October 31, 2017

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తోన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు.. టీఎస్పీఎస్సీ చుక్కలు చూపిస్తోంది. రోజుకో తప్పిదం చేస్తూ అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. పారదర్శకతకి టీఎస్పీఎస్సీ చిరునామా అని గొప్పలు చెప్పుకునే నేతల వ్యాఖ్యలకు భిన్నంగా.. కమిషన్‌ పనితీరుందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. 2016లో నిర్వహించిన గ్రూప్‌ వన్‌ ఫలితాలు.. మొన్నీమధ్య విడుదల చేసినట్టే చేసి ఉపసంహరించుకుంది టీఎస్పీఎస్సీ.

జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
మలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కొలువుల కొట్లాట కార్యక్రమానికి అనుమతుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తార్నాకలోని సొంతింట్లో 24 గంటల నిరసన దీక్షకూ కూర్చున్నారు. మరోవైపు, ఉద్యోగాల కల్పన డిమాండ్‌తో విపక్షాలూ ఉద్యమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... టీపీఎస్సీ వరుస తప్పిదాలతో పరువు కోల్పోతుండడం.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. టీపీఎస్సీ వైఖరి వల్ల.. నిరుద్యోగ యువత నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవడమన్న ఆలోచనలోప్రభుత్వం పడింది.

గ్రూప్‌2 పరీక్షల్లో వైటెనర్‌ విషయంలో
గ్రూప్‌2 పరీక్షల్లో వైటెనర్‌ విషయంలో తెలివితక్కువగా వ్యవహరించిందన్న ఆరోపణలున్న టీఎస్పీఎస్సీ, ఇటు గ్రూప్‌1 ఫలితాల వెల్లడిలోనూ ఏకంగా టాప్‌ ర్యాంకర్‌ల పోస్టింగ్‌లనే సరిచూసుకోలేక పోయిందంటే కమిషన్‌ ఆదినుంచీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందంటున్నారు విద్యార్థులు. అయితే, ఇప్పుడు కమిషన్‌ నెపాన్ని సీజీజీ పైకి నెడుతోంది. నిజానికి కమిషన్‌కు సమర్ధులైన సభ్యులను నియమించినప్పటికీ లోపాలు జరుగుతుండడం గమనార్హం. పైగా టీఎస్పీఎస్సీ కూడా అక్రమాలు అవకతవకల కమిషన్ అన్న ముద్ర వేసుకుంటోందనే ఆందోళన అప్పుడే మొదలైంది. ఇన్నేళ్లలో సక్సెస్‌ఫుల్ గా నిర్వహించిన పరీక్ష గాని ఫలితాలు గాని లేకపోవడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే ఉమ్మడి రాష్ట్రంలో ఏపిపిఎస్‌సికి పట్టిన గతే టీఎస్పీఎస్సీకీ పడుతుందని అభ్యర్ధులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా పైకి కమిషన్‌ను మెచ్చుకుంటున్నా.. అంతర్గతంగా, వారి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

19:53 - October 31, 2017

హైదరాబాద్ : మూడోరోజు శాసన సభ సమావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గ్రూప్‌-1 ఫలితాలను TSPSC ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ ఇదే అంశంపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాత ప్రతిపాదించాలని స్పీకర్ తెలిపారు. కానీ అత్యవసర అంశాలపై ప్రశ్నోత్తరాలకు ముందే వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి పట్టుబట్టారు. దీనికి సభాపతి అంగీకరించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారు. జానారెడ్డి వైఖరిని మంత్రి హరీష్‌రావు తప్పు పట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు హరీష్‌రావు. సీనియర్ సభ్యుడై ఉండి ఈ విధంగా చేయడం సరికాదన్నారు హరీష్‌రావు. ఇదే అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలపై చర్చకు డిమాండ్ చేయని కాంగ్రెస్.. ఇప్పుడెందుకు చేస్తుందని ప్రశ్నించారు.

98 శాతం గుడుంబా నిర్మూన
ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే జీరో అవర్ ప్రారంభించారు స్పీకర్. అనంతరం సభలో గుడుంబా నిర్మూలన - పునరావాసంపై లఘు చర్చ జరిగింది. రాష్ట్రంలో 98 శాతం గుడుంబా నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.గుడుంబాపై మంత్రి పద్మారావు వివరణ అనంతరం హోంమంత్రి నాయిని మాట్లాడారు. అన్ని శాఖలకు సహకరించే విధంగా కమాండెంట్ కంట్రోల్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం..బుధవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

19:47 - October 31, 2017
19:44 - October 31, 2017
19:43 - October 31, 2017

చనిపోయిన చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం

నిజామాబాద్ : జిల్లా నవివేట మండలంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. నవీపేటకు చనిపోయిన చేప పిల్లలను పంపిన మత్స్యశాఖ దీంతో మత్స్యకారులు చేప పిల్లలను తిరిగి మత్స్యశాఖకు పంపారు. 

నీట మునిగిన గుడిగాన్ పల్లి గ్రామం

నాగర్ కర్నూలు : జిల్లా ఊర్కోండ మండలం గుడిగాన్ పల్లి నీటిలో మునిగింది. కేఎల్పై కాల్వ పనులు పూర్తి కాకుండానే అధికారులు నీరు వదిలారు. ఆ గ్రామంలో రోడ్లు, పంట పొలాలు జలమయమైంది. 

19:41 - October 31, 2017

నిజామాబాద్ : జిల్లా నవివేట మండలంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. నవీపేటకు చనిపోయిన చేప పిల్లలను పంపిన మత్స్యశాఖ దీంతో మత్స్యకారులు చేప పిల్లలను తిరిగి మత్స్యశాఖకు పంపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పేరుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:40 - October 31, 2017

నాగర్ కర్నూలు : జిల్లా ఊర్కోండ మండలం గుడిగాన్ పల్లి నీటిలో మునిగింది. కేఎల్పై కాల్వ పనులు పూర్తి కాకుండానే అధికారులు నీరు వదిలారు. ఆ గ్రామంలో రోడ్లు, పంట పొలాలు జలమయమైంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

19:39 - October 31, 2017

కృష్ణా : బరువు తగ్గాలంటే ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని.. కేవలం మూడు నెలల్లో బరువు తగ్గే టెక్నాలజీ విజయవాడలో అందుబాటులో తెచ్చామని 'లైఫ్' స్లిమ్మింగ్ అండ్ కాస్మోటిక్ క్లినిక్ మేనేజర్ డాక్టర్ శిరీష చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ వర్సిటీ సమీపంలో 'లైఫ్' స్లిమ్మింగ్ అండ్ కాస్మోటిక్ క్లినిక్ ఆధ్వర్యంలో యాంటీ ఒబెసిటీ అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. నగరవాసులకు రెండురోజుల పాటు బరువు తగ్గడంపై అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్ శిరీష చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

19:38 - October 31, 2017

శ్రీకాకుళం : ఈమె పేరు కావలి గ్రీష్మ ప్రసాద్‌. ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి, 1999-2004 మధ్య స్పీకర్‌గా పనిచేసిన కావలి ప్రతిభా భారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలపై గ్రీష్మ ప్రసాద్‌ ప్రత్యేక దృష్టి పెట్టడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. లండన్‌లో బయోటెక్నాలజీలో డిగ్రీ చదివి, ప్రైవేటు కంపెనీలలో మంచి ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు కావలి గ్రీష్మ ప్రసాద్‌. శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు గ్రీష్మ ప్రసాద్‌. ప్రతిభా భారతి కూడా తన కుమార్తెను వెంటపెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు పరిచయం చేస్తున్నారు. తనను ఆదరించిన తరహాలోనే తన బిడ్డను కూడా ఆశీర్వదించాలని కోతున్నారు. కావలి గ్రీష్మ ప్రసాద్‌ రాజీం పట్టణ టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

తల్లి ప్రతిభా భారతి తరుపున ప్రచార బాధ్యతలు
2004 మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తల్లి ప్రతిభా భారతి తరుపున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఓటర్లతో ఎలా వ్యవహరించాలో, రాజకీయాల్లో ఎలా రాణించాలో, నలుగురితో ఎలా నెగ్గుకురావాలో తల్లి నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నారు. రాజకీయాల్లో చొరవ, చతురత వంటి లక్షణాలను తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎలా స్పందించాలో అనుభపూర్వకంగా నేర్చుకున్నారు. రాజాం నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల్లో గ్రీష్మ ప్రసాద్‌ క్రియాశీలకంగా మారడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రజా సమస్యల పరిష్కారంపై గ్రీష్మ ప్రసాద్‌ దృష్టి పెట్టారు.

గ్రీష్మ ప్రసాద్‌ పోటీ...
కావలి ప్రతిభా భారతి ఎమ్మెల్యే పదవీకాలం 2020 వరకు ఉంది. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిభా భారతి పోటీ చేసే అవకాశంలేదని భావిస్తున్నారు. గ్రీష్మ ప్రసాద్‌ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2004 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తల్లిని తిరిగి ఎమ్మెల్యేగా చేయడమే తన లక్ష్యమని గ్రీష్ర ప్రసాద్‌ పైకి చెబుతున్నా... ఈమే పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.అందుకే ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకునేందుకు గ్రీష్మ ప్రసాద్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కమిడి కళా వెంకట్రావుతో ప్రతిభా భారతికి ఉన్న అభిప్రాయబేధాలు సమచిపోవడంతో కావలి గ్రీష్మ ప్రసాద్‌కు ఎంట్రీకి ఎటువంటి అవరోధాలు ఉండవని భావిస్తున్నారు. 

19:35 - October 31, 2017

విశాఖ : తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైస్‌ అడ్మిరల్‌ HCS బిస్త్‌ పదవీకాలం ముగియడంతో కరంబీర్ సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. భారత నౌకాదళంలోకి 1980లో చేరిన కరంబీర్ సింగ్ అంతకు ముందు హెలీకాప్టర్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించారు. తీర ప్రాంత భద్రతలో కోస్ట్ గార్డ్‌లోనూ కీలక విధుల్లో పాలు పంచుకున్నారు. క్లీన్ నావల్‌ బేస్‌గా తూర్పు నౌకాదళాన్ని తీర్చిదిద్దడంలో విశాఖ వాసుల సహకారం మరవలేదనిదన్నారు వైస్ అడ్మిరల్ బిస్త్. 

19:34 - October 31, 2017

విశాఖ : విశాఖ నగరంలో మిస్ వైజాగ్ పేరుతో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో ను వెంటనే రద్దు చెయ్యాలంటూ మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలపై జరిగిన దాడులను నిరసిస్తూ విశాఖ ప్రెస్ క్లబ్‌లో విద్యార్ధి, మహిళ వామపక్ష పక్ష ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శరీరాలతో వ్యాపారాలు చేసే సంస్కృతిని విశాఖలో తీసుకు వస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని మహిళ సంఘాలు హెచ్చరించారు. వెంటనే మిస్‌ వైజాగ్‌ పోటీలను నిలిపి వేయాలని డిమాండ్‌ చేశారు.

19:33 - October 31, 2017

గుంటూరు : సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో.. కార్యదర్శులు, సిబ్బందితో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు అంకితం అవుతాననే సందేశాన్ని దేశంలోని తోటి సహోదరులందరికీ తెలియజేయడానికి కృషి చేస్తానని ప్రమాణం చేశారు. సీఎం చదివి వినిపించగా అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. 

19:32 - October 31, 2017

కడప : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన స్మగ్లర్లలో దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్‌ సాజీ ప్రధాన అనుచరుడు ఆర్కట్‌ భాయ్‌ ఉన్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 1.2 టన్నుల 85 దుంగలతో పాటు.. ఒక కంటైనర్‌, రెండు లారీలు, మూడు కార్లు, రెండు మోటర్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు.

19:31 - October 31, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఎల్ కేజీ విద్యార్థి శ్యామ్ ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పిల్లడిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

17:42 - October 31, 2017

సిరిసిల్ల : జిల్లా తాడూరులోని మానేరు నది ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడూర్ గ్రామస్తులకు, స్థానిక ఇసుక రీచ్ వద్ద విధులు నిర్వర్తించే VROకు మధ్య తోపులాట జరిగింది. స్థానిక అవసరాల కోసం సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు నది నుండి ఇసుక తీసుకొనేందుకు.... ట్రాక్టర్ యజమానులకు అనుమతినిచ్చారు. అయితే ట్రాక్టర్లతో గ్రామంలో త్రాగు, సాగు నీటి పైపులైన్లు పగిలిపోతున్నాయని గ్రామస్థులు సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో ఇసుక రీచ్ వద్ద ఆందోళనకు దిగారు. వి.ఆర్.ఓ.తో వాగ్వాదానికి దిగారు. దీంతో VRO పోలీసులను ఆశ్రయించాడు. విధుల్లో ఉన్న VROతో గొడవకు దిగిన సర్పంచ్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

17:40 - October 31, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం జేఏసీపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. అందరికీ యాత్రలకు అవకాశం ఇచ్చి జేఏసీకి ఇవ్వకపోవడం రాజ్యాంగ సమానత్వపు హక్కుకు విరుద్ధమన్నారాయన. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ కోదండరామ్ హైదరాబాద్ తార్నాకలోని తన నివాసం వద్ద 24 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. టీజాక్ నేత రఘు దీక్షను ప్రారంభించారు. కోదండరామ్ దీక్షకు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు పలికారు. కొలువుల కొట్లాటకు కోదండరామ్ ఉద్యమిస్తుంటే ప్రభుత్వం నిర్బంధించడం దుర్మార్గపు చర్యగా కృష్ణయ్య ఆరోపించారు. 

17:39 - October 31, 2017

ఢిల్లీ : రాజకీయ పునరేకీకరణలో భాగంగానే తాము టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరామని వేం నరేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని ఆయన అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో తమను ఎవరూ ఓడించలేరని టీఆర్‌ఎస్‌ అనుకుంటోందని.... వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని వేం నరేందర్‌ రెడ్డి అన్నారు.

17:37 - October 31, 2017

ఢిల్లీ : తెలంగాణలో ప్రజలు ఆశించిన పాలన సాగడం లేదని... కుటుంబ పాలన కొనసాగుతోందని ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేసీఆర్‌ పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాని ఆమె తెలిపారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీతక్క అన్నారు.

17:36 - October 31, 2017

ఢిల్లీ : కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరముందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తుది పోరాటం కావాలన్నారు. కేసీఆర్‌ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పక్కకు పోయాయని.. గొర్రెలు, బర్రెలు, చేపలు, చీరలు వచ్చాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

17:32 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.

17:15 - October 31, 2017

హైదరాబాద్ : ఐసీఎస్ కరీం కాపీయింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీం భార్యను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

జేఏసీ సభ హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : జేఏసీ కొలువుల కోట్లాటపై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు. దీంతో జేఏసీ కార్యక్రమాలకే ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని కోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసెంబ్లీ సమావేశాల వల్లే అనుమతించలేదని ఆయన తెలిపారు. 

16:44 - October 31, 2017

ఢిల్లీ : టీడీపీని వీడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ సహా 18 మంది కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రేవంత్‌ను రాహుల్‌ గాంధీ నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా తీసుకెళ్లారు. అనంతరం రేవంత్‌ను పార్టీలోకి రాహుల్‌గాంధీ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్‌, మేడిపల్లి సత్యం, సోయం బాపురావు, కవ్వంపల్లి సత్యనారాయణ, జంగయ్య, హరిప్రియానాయక్‌, బిల్యా నాయక్‌, శశికళ, రాజారాం యాదవ్‌, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నుంచి దొమ్మాటి, విద్యార్థి, యువజన ఉద్యమనాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, మధుసూదన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉందని... పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తానని రాహుల్‌ అన్నట్లు కుంతియా, ఉత్తమ్‌ వివరించారు.

16:43 - October 31, 2017

కరీంనగర్ : ఇదిగో ఈ గ్రామమే వెలిచాల. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండంలంలో ఉందీ గ్రామం. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం మొన్నటి వరకు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. గ్రామంలో సరైన రోడ్లులేక, వీధి దీపాలులేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు... తాగడానికి గుక్కెడునీరు లేక అవస్థలు పడ్డారు. పంటలు సాగు చేసుకునేందుకు తాగునీరు లేని దుస్థితి. ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం... గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ నేతలు హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం సర్వసాధారణమైపోయింది. దీంతో వెలిచాల అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది.

రహదారులపై ఫోకస్‌
గత ఎన్నికల్లో ప్రజలు వీర్ల నర్సింగరావును రెండోసారి సర్పంచ్‌గా గెలిపించుకున్నారు. మీరైనా గ్రామ సమస్యలను తీర్చాలని వేడుకున్నారు. దీంతో నర్సింగరావు.. ఎలాగైనా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కంకణం కట్టుకున్నారు. సమస్యలులేని గ్రామంగా తీర్చిదిద్దడానికి సిద్దపడ్డారు. మొదట నర్సింగరావు రహదారులపై ఫోకస్‌ పెట్టారు. గ్రామం అంతటా సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. మురుగునీరు రోడ్లపైకి రాకుండా డ్రైనేజీలను నిర్మించి శాశ్వతపరిష్కారం చూపారు. ఆ తర్వాత సాగు, తాగునీరుపై దృష్టి సారించారు. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా గ్రామంలోని రెండు చెరువులతోపాటు 5 కుంటల్లో పూడిక తీయించారు. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య పూర్తిగా తీరిపో్యింది. అంతేకాదు... గ్రామమంతా తాగునీరు అందేలా 5 వాటర్‌ ట్యాంక్‌లను నిర్మించారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో గ్రామస్తులకు నీటికష్టాలు తప్పాయి. మరో కోటి రూపాయల నిధులతో గ్రామస్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు.

గ్రామంలో నిఘా...
ఇక గ్రామంలో నిఘా పెంచారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ఎదురుచూడకుండా దాతల సహకారంతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి ప్రతిబింబించేలా 50 లక్షల రూపాయలతో అన్ని హంగులతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వ పథకాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకుగాను.. నర్సింగరావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొనే అవకాశం లభించింది. ప్రతి గ్రామానికి నర్సింగరావులాంటి సర్పంచ్‌ ఉంటే అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయి. కమిషన్ల కోసం పాకులాడే ప్రజా ప్రతినిధులున్న ఈ రోజుల్లో పైస ఆశించకుండా గ్రామస్తుల కోసం పనిచేస్తున్న సర్పంచ్‌ నర్సింగరావు సర్పంచ్‌లందరికీ ఆదర్శమేమరి.

16:37 - October 31, 2017

హైదరాబాద్ : జేఏసీ కొలువుల కోట్లాటపై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు. దీంతో జేఏసీ కార్యక్రమాలకే ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని కోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసెంబ్లీ సమావేశాల వల్లే అనుమతించలేదని ఆయన తెలిపారు. కేసు ను వచ్చేనెల 6కు వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విశాఖలో అగ్నిప్రమాదం

విశాఖ : నగరంలోని కోటివీధిలోని పోర్ట్ కన్వేయర్ బెల్ట్ టెర్మినల్ లో అగ్నిప్రమాదం జరుతోంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

16:33 - October 31, 2017

విశాఖ : నగరంలోని కోటివీధిలోని పోర్ట్ కన్వేయర్ బెల్ట్ టెర్మినల్ లో అగ్నిప్రమాదం జరుతోంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయిన మంటలు ఆదుపులోకి రావడంలేదు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

టెన్ టివి ఎఫెక్ట్

హైదరాబాద్ : టెన్ టివి కథనానికి జీహెచ్ఎంసీ స్పందించింది. మలేరియా విభాగంలో కొలువులు అమ్ముకున్ అధికారులపై చర్యలు తీసుకుంది. బల్దియా సీనియర్ ఎంటమాలజిస్ట్ విజయ్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ వెంకటేష్ సస్పెన్షన్ వేటు వేసింది. 

16:28 - October 31, 2017

హైదరాబాద్ : టెన్ టివి కథనానికి జీహెచ్ఎంసీ స్పందించింది. మలేరియా విభాగంలో కొలువులు అమ్ముకున్ అధికారులపై చర్యలు తీసుకుంది. బల్దియా సీనియర్ ఎంటమాలజిస్ట్ విజయ్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ వెంకటేష్ సస్పెన్షన్ వేటు వేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

భీమవరంలో కిడ్నాప్ కలకలం

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఎల్ కేజీ విద్యార్థి శ్యామ్ ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 

16:06 - October 31, 2017

దీక్షకు దిగిన కోదండరాం

హైదరాబాద్ : తార్నాకలోని తన నివాసంలో టీజేఏసీ నేత కోదండరాం 24 గంటల నిరసన దీక్షకు దిగారు. దీక్షను జేఏసీ నేత రఘు ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బందన్ని నిరసిస్తూ కోదండరాం దీక్షకు పునుకున్నారు. 

16:05 - October 31, 2017

హైదరాబాద్ : తార్నాకలోని తన నివాసంలో టీజేఏసీ నేత కోదండరాం 24 గంటల నిరసన దీక్షకు దిగారు. దీక్షను జేఏసీ నేత రఘు ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బందన్ని నిరసిస్తూ కోదండరాం దీక్షకు పునుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:06 - October 31, 2017
14:48 - October 31, 2017

మంచిర్యాల : ఇది మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌. ఇక్కడ జూనియర్‌ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారు. గదికి పిలిపించుకొని జోక్స్‌ చెప్పించుకుంటున్నారు. సీనియర్స్‌ కనిపించగానే జూనియర్ విద్యార్థులు నమస్తే చెప్పాలని, కాలర్ సర్దుకోవాలని లేదంటే.. రాత్రి ఒంటి గంట వరకూ నిల్చోబెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జూనియర్స్‌ని తమ రికార్డులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది.

జూనియర్స్ ఆవేదన...
సీనియర్స్‌ వస్తువులేమైనా పోతే వాటిని జూనియర్ విద్యార్థులు కొనివ్వాల్సిందిగా ఆదేశిస్తున్నారు. రాత్రి సమయంలో బజార్‌ ఏరియాకు పంపించి తమకు కావాల్సినవి తెప్పించుకుంటున్నారు. రాత్రిపూట టీ షర్ట్‌, షార్ట్స్‌ వేసుకోవద్దని నిబంధనలు పెడుతున్నారని జూనియర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ర్యాగింగ్‌కు జూనియర్లు బలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ర్యాగింగ్ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ని వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ వద్దకు వచ్చిందని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూస్తామంటున్నారు. విద్యార్థులు తాము గతంలోనే ప్రిన్సిపాల్‌కి కంప్లయింట్ చేశామని కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్‌ వార్డెన్, అధికారులు తమను ర్యాగింగ్ బారి నుండి కాపాడాలని జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. 

14:46 - October 31, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పార్కింగ్ సమస్యలు నానాటికీ జఠిలంగా మారుతున్నాయి. ఘాట్‌ పరిసరాల్లో భక్తులు తమ వాహనాలను నిలిపేందుకు ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. దుర్గగుడి, కార్పొరేషన్, పోలీస్ అధికారులు వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దుర్గగుడిని తిరుమల తరహాలో తీర్చిదిద్దుతామని, ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆలయ ఈవో సూర్యకుమారి చెబుతున్నారు. కాని ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని భక్తులు మండిపడుతున్నారు.

కార్తీక మాసం కావడంతో
కార్తీక మాసం కావడంతో దుర్గగుడికి భక్తుల తాకిడి పెరిగింది. అధికారులు పార్కింగ్‌ స్థలాన్ని నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. సీతమ్మ పాదాల ఘాట్ నుంచి యాత్రికులు కాలి నడకన ఆలయానికి రావాల్సి ఉంది. ఈ మార్గంలో ఫ్లై ఓవర్ నిర్మాణంతో వాహనాల అనుమతికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆలయానికి వచ్చే యాత్రికులు కూడా కార్పొరేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ చేసుకుని నడక ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు.

నిరుపయోగంగా అర్జున వీధిని 100 అడుగుల రోడ్డు
ఆలయ అభివృద్ధిలో భాగంగా 8 కోట్లు వెచ్చించి అర్జున వీధిని 100 అడుగుల రోడ్డుగా ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది. దీనికి అధికారుల అనాలోచిత నిర్ణయమే కారణమని తెలుస్తుంది. అర్జునవీధిని 100 అడుగులు ఏర్పాటు చేసిన తర్వాత రెండు వైపులా 20 అడుగుల పెర్గొలాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇరువైపులా స్థలం వృధాగా మారింది. దుర్గగుడి నుండి మహామండపం వరకు పార్కింగ్ చేసేందుకు ఎక్కడా స్థలం లేకపోవడంతో యాత్రికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా పార్కింగ్ సమస్యపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

14:45 - October 31, 2017

కృష్ణా : పెద్ద నోట్లు రద్దు చేసి వచ్చే నెల 8వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఆ రోజు దేశవ్యాప్తగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఏపీలో ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమచారం కోసం వీడియో చూడండి.

14:44 - October 31, 2017

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురంలో ఓ రైతు ఆవేదనకు గురయ్యాడు. దోమకాటుకు గురైన తన 10 ఎకరాల వరి పంటను తగలబెట్టాడు. పంట ఎందుకూ పనికిరాకుండాపోవడంతో నార్షనాయక్‌ అనే రైతు పంటను కాల్చేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

టీసర్కార్ పై మధుయాష్కీ ఫైర్

ఢిల్లీ : కేంద్రంలో పెద్ద మోడీ, రాష్ట్రంలో చిన్న మోడీ పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శించారు. టీఆర్ ఆర్ పాలనకు అంతం పాడుతామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశల పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో టీసర్కార్ పట్ల తీవ్ర ఉందని అర్థం అవుతుందని చెప్పారు. 

రేవంత్ కాంగ్రెస్ లో చేరారు : ఉత్తమ్

ఢిల్లీ : 2019 లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నామని తెలిపారు. రేవంత్ పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. రేవంత్ ను తమలో ఒక సభ్యుడిగా భావిస్తున్నాన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు లేవని స్పష్టం చేశారు. 

 

రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డితోపాటు 18 మంది టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 350 మంది టీడీపీ నేతలు ఢిల్లీ వచ్చారు. ఈ సమావేశాలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

13:57 - October 31, 2017
13:56 - October 31, 2017

ఢిల్లీ : కేంద్రంలో పెద్ద మోడీ, రాష్ట్రంలో చిన్న మోడీ పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శించారు. టీఆర్ ఆర్ పాలనకు అంతం పాడుతామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశల పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో టీసర్కార్ పట్ల తీవ్ర ఉందని అర్థం అవుతుందని చెప్పారు. 

13:52 - October 31, 2017

ఢిల్లీ : 2019 లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నామని తెలిపారు. రేవంత్ పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. రేవంత్ ను తమలో ఒక సభ్యుడిగా భావిస్తున్నాన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు లేవని స్పష్టం చేశారు.

13:46 - October 31, 2017

ఢిల్లీ : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డితోపాటు 18 మంది టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 350 మంది టీడీపీ నేతలు ఢిల్లీ వచ్చారు. ఈ సమావేశాలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

13:28 - October 31, 2017
13:26 - October 31, 2017

హైదరాబాద్ : టీఅసెంబ్లీలో అధికార పక్షం టీఆర్ ఎస్ ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. 

13:24 - October 31, 2017

ఖమ్మం : జిల్లాలోని కలెక్టరేట్‌ తరలింపు వ్యవహారంపై అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి క్యాంప్‌ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. గొల్లపూడెం రోడ్డులో పలువురు సీపీఎం, సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

హైకోర్టుకు తన్విత వివాదం

ఖమ్మం : తన్విత వ్యవహారంలో కన్నతల్లి, పెంచిన తల్లి మధ్య జరిగిన వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఇల్లందు పీఎస్‌లో నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేసింది. అదేవిధంగా సీడబ్ల్యుసీ అధికారుల తదుపరి చర్యలు నిలిపివేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తన్వితను తనకే ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది స్వరూపం. అయితే.. ఈ పిటిషన్లు గురువారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

 

13:18 - October 31, 2017

ఖమ్మం : తన్విత వ్యవహారంలో కన్నతల్లి, పెంచిన తల్లి మధ్య జరిగిన వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఇల్లందు పీఎస్‌లో నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేసింది. అదేవిధంగా సీడబ్ల్యుసీ అధికారుల తదుపరి చర్యలు నిలిపివేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తన్వితను తనకే ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది స్వరూపం. అయితే.. ఈ పిటిషన్లు గురువారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

 

13:11 - October 31, 2017

హైదరాబాద్ : ఐఏఎస్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కరీంను చెన్నై పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. చెన్నై డీసీపీ లా ఎక్సలెన్సీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ అకాడమీకి చేరుకున్నారు. ఐపీఎస్‌ అధికారి కరీం, భార్య జాయిస్‌, అకాడమీ డైరెక్టర్‌ రాంబాబును చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలి : హైకోర్టు

హైదరాబాద్ : వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. సదావర్తి భూమలు కొనుగోలుకు సంబంధించి... ఆర్కే హైకోర్టుకు రూ.27.44 కోట్లు చెల్లించాడు. అయితే... తాజాగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆర్కై హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు... రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఎండోమెంట్‌ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

13:09 - October 31, 2017

సినిమా : రవితేజ హీరోగా తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ మూవీ మొత్తం రాష్ట్రమంతట 25కోట్ల షేర్ సాధించింది. ఒక్ నైజమ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రవితేజకు నైజంలో ఇంత పెద్ద మొత్తంలో షేర్ రావడం ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. రవితేజ తర్వాతి సినిమా టచ్ చేసి చూడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలి : హైకోర్టు

హైదరాబాద్ : వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. సదావర్తి భూమలు కొనుగోలుకు సంబంధించి... ఆర్కే హైకోర్టుకు రూ.27.44 కోట్లు చెల్లించాడు. అయితే... తాజాగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆర్కై హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు... రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఎండోమెంట్‌ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

13:02 - October 31, 2017

సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం మహేశ్ కోరటాల శివ దర్శకత్వంలో '’భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27ను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం 2018 చివర్లో విడుదల అవుతుంది. ఆ మధ్య కాలంలోనే మహేశ్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ 2019 అర్ధసంవత్సరంలో విడుదల చేయనున్నాట్టు తెలుస్తోంది.  

13:01 - October 31, 2017

హైదరాబాద్ : వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలని హైకోర్టు సూచించింది. సదావర్తి భూమలు కొనుగోలుకు సంబంధించి... ఆర్కే హైకోర్టుకు రూ.27.44 కోట్లు చెల్లించాడు. అయితే... తాజాగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆర్కై హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు... రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఎండోమెంట్‌ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

 

12:58 - October 31, 2017

ఢిల్లీ : రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్‌రెడ్డి అనుచరులు ఢిల్లీ  చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

12:57 - October 31, 2017

ఢిల్లీ : తెలంగాణ టిడిపి‌ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు పెరిగాయి. తెలంగాణా వ్యాప్తంగా అన్ని‌ జిల్లాల నుంచి ఢిల్లీకి దాదాపు 350 మంది‌ మాజీ‌ టిడిపి నేతలు వచ్చారు. ఇందులో మాజీ  మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు,కార్పొరేటర్లు,వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. కాసేపట్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:53 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. భారతదేశంలో మనుషులకే డాక్టర్లు లేరు.. కానీ రాష్ట్రంలో జీవాలకు కూడా డాక్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గర్వంగా చెప్పారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను తెలంగాణకు అందించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. కాకతీయ మరియు గోదావరి మధ్య గ్రామాలకు నీరు అందిచాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు అధికంగా పెరుగుతున్నాయని ఎంఐఎం అక్బరుద్దీన్ చెప్పారు. టమాట, వంకాయ, ఉల్లి మొదలైన కూరగాయల ధరలు సామాన్యులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఒకే పాఠశాల, కళాశాల పేరుతో పాఠశాలలు, కళాశాలలున్నాయని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, వికాలాంగులు, ఎంబీసీ, మైనారిటీలకు 40 శాతం మార్కులతో డీఎస్సీలో అవకాశం కల్పించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. సర్దాల్ వల్లభాయ్ పటేల్ జయంతి అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహిస్తుంటే టీసర్కార్ నిర్వహించడం లేదని విమర్శించారు.  

 

గ్రామ పంచాయతీల పరిపుష్టతకు కొత్త చట్టం : కడియం

హైదరాబాద్ : స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీశాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తండాలను, ఆమ్లేట్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేసేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందరూ సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నామని తెలిపారు.

12:14 - October 31, 2017

హైదరాబాద్ : స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీశాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తండాలను, ఆమ్లేట్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేసేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందరూ సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నామని తెలిపారు.

12:08 - October 31, 2017

వడ్డీ వ్యాపారి అకృత్యాలు

నిజామాబాద్ : వడ్డీ వ్యాపారి అకృత్యాలకు నిరు పేదలు బలవుతూనే ఉన్నారు. వడ్డీ వ్యాపారి నారాయణ అప్పు కింద అప్పు తీసుకున్న వ్యక్తి కుమారుడిని తీసుకెళ్లాడు. 

సీకే బాబుతో పురందేశ్వరి సమావేశం

చిత్తూరు : మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సమావేశం అయ్యారు. సీకే బాబు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. 

12:02 - October 31, 2017

నిజామాబాద్ : వడ్డీ వ్యాపారి అకృత్యాలకు నిరు పేదలు బలవుతూనే ఉన్నారు. వడ్డీ వ్యాపారి నారాయణ అప్పు కింద అప్పు తీసుకున్న వ్యక్తి కుమారుడిని తీసుకెళ్లాడు. నిజామాబాద్ జిల్లా, బోధన్‌ సర్బతికేనల్‌లో నివాసముంటోన్న మోతి, భారతి దంపతులు బట్టల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలున్నారు. వ్యాపారం కోసం వడ్డీ వ్యాపారి దగ్గర 80 వేల అప్పు తీసుకున్నారు. అప్పు, వడ్డీ కలిపి 2 లక్షల వరకు అయ్యింది. దశల వారీగా కట్టాలని చెప్పి ఇప్పుడు ఒకేసారి కట్టాలని బెదిరింపులకు దిగాడని భారతి తెలిపారు. తన కుమారుడు పవన్‌ను వడ్డీ వ్యాపారి ఎత్తుకెళ్లాడని.. 15 రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో భారతి కలెక్టర్‌ను ఆశ్రయించారు. 

 

11:54 - October 31, 2017

చిత్తూరు : మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సమావేశం అయ్యారు. సీకే బాబు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:52 - October 31, 2017

హైదరాబాద్ : ఐపీఎస్‌ మాస్‌ కాపీయింగ్‌పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఉన్నతమైన పదవిలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండాపోతున్నాయంటున్నారు. మాస్‌ కాపీయింగ్‌ తతంగమంతా నడిపించిన అశోక్‌నగర్‌లోని ఇనిస్టిట్యూట్‌ వద్దకు భారీగా విద్యార్థి సంఘాల నేతలు చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:49 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కిడ్ని పేషెంట్లకు ముందుగానే అవగాహన పెంచాలన్నారు. గతంలో జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూ సెంటర్లు లేవని చెప్పారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ఐసీయూ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెటర్నల్ ఐసియూలను ప్రారంభించామని చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను పెంచుతున్నామని చెప్పారు. అన్ని రకాల ఆస్పత్రుల్లో సీటీ స్కానింగ్, ఎమ్మార్ ఐ లు పెడుతున్నామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో పరికాలను కల్పించామని చెప్పారు. రోటీన్ ట్రీట్ మెంట్ కాకుండా అధునాతన ట్రీట్ మెంట్లు అందిస్తున్నామని తెలిపారు.

 

11:21 - October 31, 2017

హైదరాబాద్ : ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో ఓ ఐపీఎస్‌ అధికారి వక్రమార్గం పట్టాడు. యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని అతని భార్య బ్లూటూత్‌ డివైజ్‌తో అతనికి సమాధానాలు చేరవేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎస్‌ అధికారి షఫీర్‌ కరీంపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అతని భార్య జియాతో పాటు... ఓ కోచింగ్‌ సెంటర్‌ను నిర్వాహకుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:59 - October 31, 2017

హైదరాబాద్‌ : నగరంలో రోజురోజుకీ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 228మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ మాసానికి 308 మంది చనిపోయారు. ఈ లెక్కలు చూస్తే.. రోడ్డు ప్రమాదాల తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాహన ప్రమాదాలపై నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సివిల్‌, ట్రాఫిక్‌ పోలీసులతో విశ్లేషణ చేపట్టారు.
ప్రమాదాలపై విశ్లేషిస్తున్న పోలీస్‌ అధికారులు
హైదరాబాద్‌లో నిత్యం జరిగే ప్రమాదాలపై అధికారులు విశ్లేషణ చేపట్టారు. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి.. వాటిని నివారించే విధంగా అడుగులు వేస్తున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేపట్టిన ట్రాఫిక్ అధికారులు 18 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 85చోట్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని నిర్ధారణకి వచ్చారు. వీటిని బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి ప్రమాదాలు నివారించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకే చోట రెండు ప్రమాదాల కంటే ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ లిస్టులో చేర్చి స్థానిక సివిల్‌ పోలీసుల సమన్వయంతో ప్రమాదాలు నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.  
ఇంజినీరింగ్ లోపాల వల్ల జరిగే ప్రమాదాలు 
వాస్తవానికి నగర రోడ్లు ఇంజినీరింగ్ లోపాల వల్ల జరిగే ప్రమాదాలకు ప్రాధాన్యమిస్తూ అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. 
చౌరస్తాల్లోనే ఎక్కువ ప్రమాదాలు 
ప్రమాదాలు ఎక్కువగా చౌరస్తాల్లోనే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సిగ్నల్స్ ఉన్న సమయం కంటే, సిగ్నల్స్ పనిచేయని సమయంలోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల అధ్యయనంలో బయట పడింది. దీనికి తోడు పగటి వేళల్లో సిగ్నల్స్ యాక్టివ్‌గా ఉండడం, రాత్రి వేళల్లో సిగ్నల్స్ యాక్టివ్‌లో ఉండక పోవడంతో ప్రమాదాలకు మరో కారణంగా నిలుస్తోంది. ఈసమయంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు తేలింది. 85 బ్లాక్ స్పాట్స్‌లలో, 75 శాతం వరకు చౌరస్తాల సమీపంలోనే ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.
పెరుగుతున్న కారు ప్రమాదాలు
ద్విచక్రవాహనాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరగడం, అందులో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వీరితో పాటు పాదాచారులు కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. 80 శాతం మంది పాదాచారులు, ద్విచక్రవాహన దారులే ప్రమాదాల బారిన పడుతున్నవారుండగా.. కారు ప్రమాదాలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి.
నివారణ చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు 
అధికారులు విశ్లేషించినా నామమాత్రపు చర్యలు కాకుండా నిరంతరం విశ్లేషిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించిన ప్రదేశాల్లో వాహన చోదకులకు అవగాహన కల్పించి సూచికలను ఏర్పాటు చేస్తే ప్రమాదాల్ని నివారించవచ్చు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను కూడా ఆధునీకరించి.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. రాత్రి వేళల్లో జంక్షన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

 

10:54 - October 31, 2017

హైదరాబాద్ : సౌతాఫ్రికన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ టీ20ల్లో హిస్టరీ క్రియేట్‌ చేశాడు. బంగ్లాదేశ్‌పై మిల్లర్‌ కిల్లర్‌ ఇన్నింగ్స్‌తో రికార్డ్‌ల మోత మోగించాడు. ఇంటర్నేషనల్‌ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో హాట్‌ టాపిక్‌గా మారాడు. పోచెఫ్‌స్ట్రూమ్‌ టీ20లో డేవిడ్‌ మిల్లర్‌ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌.....
హాట్‌ టాపిక్‌గా డేవిడ్ మిల్లర్ 
సౌతాఫ్రికన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో హాట్‌ టాపిక్‌గా మారాడు. పోచెఫ్‌స్ట్రూమ్‌ టీ20లో బంగ్లాదేశ్‌పై కిల్లర్‌ ఇన్నింగ్స్‌తో మిల్లర్‌  రికార్డ్‌ల మోత మోగించాడు. ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన డేవిడ్‌ మిల్లర్‌ ...ఇంటర్నేషనల్‌ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో హిస్టరీ క్రియేట్‌ చేశాడు. తొలి బంతి నుంచే బంగ్లా బౌలింగ్‌ ఎటాక్‌పై ఎదురుదాడికి దిగిన మిల్లర్‌...స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన మిల్లర్‌...ఆ తర్వాత విశ్వరూపమే ప్రదర్శించాడు. సైఫుద్దీన్‌ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 5 సిక్స్‌లు కొట్టి ఉర్రూతలూగించాడు.
35 బంతుల్లోనే సెంచరీ పూర్తి 
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్‌ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌ మిల్లర్‌ రికార్డ్‌లకెక్కాడు. హార్డ్‌ హిట్టర్‌గా పేరున్న డేవిడ్‌ మిల్లర్‌....ఇదే స్థాయిలో రాణిస్తే, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో మరిన్ని రికార్డ్‌లు బద్దలవ్వడం ఖాయం.

 

సభా సమయం వృథా అవుతుంది : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాలు తీసుకుంటే సభా సమయం వృథా అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని బీఏసీలో నిర్ణయించినట్లు గుర్తు చేశారు. ఇది జానారెడ్డికి తగదన్నారు.

 

విపక్షాల వాదనలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్న జనారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో విపక్షాల వాదనలను వినడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు జనారెడ్డి విమర్శించారు. సభలో సమస్యలను లేవనెత్తడం తమ ధర్మం అని అన్నారు.

పశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలు : స్పీకర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బీఏసీ నిర్ణయానికి సభ్యులు కట్టుబడి ఉండాలని స్పీకర్ సూచించారు. పశ్నోత్తరాల సమయం అనంతరం వాయిదా తీర్మానాలను తీసుకుంటామని చెప్పారు. 

 

10:36 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజి సమస్యలపై బీజేపీ, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 2011 గ్రూప్ 1 ఫలితాల ఉపసంహరణపై కాంగ్రెస్, ఉద్యోగ నియామాకాల్లో టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యంపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రశ్నోత్తరాలను స్పీకర్ మధుసూదనాచారి చేపట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. సభలో కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. బీఏసీ నిర్ణయానికి సభ్యులు కట్టుబడి ఉండాలని స్పీకర్ సూచించారు. పశ్నోత్తరాల సమయం అనంతరం వాయిదా తీర్మానాలను తీసుకుంటామని చెప్పారు. సభలో విపక్షాల వాదనలను వినడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు జనారెడ్డి విమర్శించారు. సభలో సమస్యలను లేవనెత్తడం తమ ధర్మం అని అన్నారు. ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాలు తీసుకుంటే సభా సమయం వృథా అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని బీఏసీలో నిర్ణయించినట్లు గుర్తు చేశారు. ఇది జానారెడ్డికి తగదన్నారు. 

 

ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ మధుసూదనచారి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజి సమస్యలపై బీజేపీ,.. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 2011 గ్రూప్ 1 ఫలితాల ఉపసంహరణపై కాంగ్రెస్, ఉద్యోగ నియామాకాల్లో టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యంపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్ మధుసూదనచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

 

టీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజి సమస్యలపై బీజేపీ,.. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 2011 గ్రూప్ 1 ఫలితాల ఉపసంహరణపై కాంగ్రెస్, ఉద్యోగ నియామాకాల్లో టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యంపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

10:13 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజి సమస్యలపై బీజేపీ,.. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 2011 గ్రూప్ 1 ఫలితాల ఉపసంహరణపై కాంగ్రెస్, ఉద్యోగ నియామాకాల్లో టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యంపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. 

 

10:08 - October 31, 2017

గుంటూరు : నగరంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ వాసు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలే వాసు హత్యకు కారణంగా పోలీసులు నిర్దారించారు.
కత్తులతో విచక్షణా రహితంగా నరికి హత్య
గుంటూరులో సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ వాసు హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.  ఆదివారం రాత్రి జరిగిన వాసు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  నిందితులను గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పాతకక్షలతోనే ప్రత్యర్థులు వాసును హత్య చేసినట్టు  తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు.
ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకుంటున్న వాసు
గుంటూరు నగరంలోని పాత గుంటూరుకు చెందిన బసవల భారతి వాసు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నాడు. వాసు తన  సోదరుడిని చంపిన వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన హత్య కేసులో కూడా వాసు నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వాసు కొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాడు.  ఎమ్మెల్యే వెంట తిరిగే క్రమంలో కొంతమందితో వాసు గొడవలు పడ్డాడు.  అయితే ప్రస్తుతం తన మకాం పాత గుంటూరు నుంచి విద్యానగర్‌కు మార్చాడు. కొంత కాలంగా రౌడీ కార్యకలాపాలు మానుకొని ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకుంటున్నాడు. 
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసు విచారణ
ఆదివారం రాత్రి వాసు  అరండల్‌పేట 12వ లైన్‌లోని అన్వర్‌ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తుండగా ప్రత్యర్థులు కాపుకాసి స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. కిందపడిపోయిన వాసును కత్తులతో విచక్షణారహితంగా నరికారు. సెకన్ల వ్యవధిలోనే 40కిపైగా కత్తిపోట్లు పొడిచి అంతమొందించారు. మర్డర్‌ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగానే పోలీసులు విచారణ చేపట్టారు. వాసు ఫోన్‌ లిస్ట్‌, అతని శత్రువుల ఫోన్‌ లిస్ట్‌లపై ఫోకస్‌పెట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.  
వాసుతో చెగోడీల సతీష్‌కు పాతకక్షలు
సింగంశెట్టి సతీస్‌ అలియాస్‌ చెగోడిల సతీష్‌కు... వాసుతో పాతకక్షలు ఉన్నాయి.  దీంతో సతీష్‌ తన స్నేహితులతో కలిసి వాసు హత్యకు పథకం రూపొందించాడు. రెండు నెలలుగా వాసు కదలికలపై సతీష్‌ బృందం నిఘాపెట్టింది.  ఆదివారం వాసుపై మూకుమ్మడిగా కత్తులతో దాడిచేసి మట్టుబెట్టింది. ఈ హత్యలో సతీష్‌తోపాటు కావటి రాజేష్‌, చక్రకోటి సాయి, ఆదాం, సులేమాన్‌, గుంటుపల్లి శివరామకృష్ణ ఉన్నారు. వీరంతా యువకులే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి స్కార్పియో వాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

 

10:03 - October 31, 2017

హైదరాబాద్ : పత్తి రైతులు మరోసారి చిత్తయ్యారు. విత్తు నుంచి కొనుగోలు వరకు మరోసారి దగాపడ్డాడు. నకిలీ విత్తనాలు, అకాల వర్షాలు, గులాబీ పరుగు, దళారుల దౌర్జన్యం మధ్య నష్టాల సాగుతో నలిగిపోయాడు. పంట చేతికి రాలేదని నిప్పుపెట్టుకున్న రైతులు కొందరైతే.. దళారులకు అయిన కాడికి అమ్ముకున్న రైతులు మరికొందరు. మొత్తానికి పత్తిరైతుకు అందరి శత్రువుగా మారి నిండా ముంచేశారు. 
నిండా మునిగిన పత్తి రైతులు
రాష్ట్రంలో పత్తి రైతులను నిండా మునిగిపోయారు. అకాల వర్షాలు, నకలీ విత్తనాలు, గులాబీ పురుగు బీభత్సం, మార్కెట్లో దళారుల మాయాజాలం మధ్య.. చితికిపోయారు. పంట ఏపుగా పండిందనుకున్నా... కాయ దశలో దాడి చేసిన గులాబీ పురుగు దాడికి.. పచ్చని పంటకు నిప్పుపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈసారి పంట బాగా వస్తుందని.. అప్పులు తీరుతాయన్న రైతుల ఆశలు నీరిగారిపోయాయి. రాష్ట్రంలో పత్తి రైతులందరిదీ దాదాపు ఒకే పరిస్థితి. 
విత్తనాల నుంచి పత్తిరైతులకు మోసం 
విత్తనాల నుంచి పత్తిరైతులకు మోసం మొదలైంది. అదిలాబాద్ జిల్లాలో పంట బాగా వస్తుందని మాయమాటలు చెప్పిన ప్రైవైట్‌ కంపెనీల ఏజెంట్లు.. నకిలీ విత్తనాలు అంటగట్టారు. ఎరువుల, పురుగు మందులు అన్నీ సక్రమంగానే వాడినా.. కాతపూత లేకపోవడంతో రైతులు బిత్తర పోతున్నారు. లక్షా 25వేల ఎకరాల్లో సాగు చేసిన పంట పూత దశలోనే నష్టాలపాలు జేసింది. 
అకాల వర్షం.. ఆశలు అడియాసలు 
ఇక కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక మండలాల్లో పెద్ద మొత్తంలో రైతులు పత్తిని సాగు చేశారు. విత్తు నాటిన దగ్గరనుండి కాయచేతికి వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న రైతులను అకాల వర్షం రైతు ఆశలను అడియాసలు చేశాయి. ఏపుగా పెరిగిన పత్తి పూత మోడుబారి పోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పంటకు నిప్పు పెట్టారు. నల్లగొండ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పత్తి పంటకు పూత తప్ప కాత లేకపోవడంతో పంటను నరికేశారు రైతులు.  
దిక్కుతోచని స్థితిలో రైతులు  
అంతాబాగానే ఉండి.. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే.. సీసీఐ వారు కొనడం లేదు. తేమ 12 శాతం కంటే ఎక్కువగా ఉందన్న సాకుతో... కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. దీంతో దళారులే పత్తిధరను శాసిస్తున్నారు. సాధారణంగా పత్తిరైతుకు పంట, హమాలీ ఖర్చు, రవాణా ఛార్జీలు, దళారి కమిషన్‌కు మొత్తం క్వింటాకు 1100రూపాయల ఖర్చవుతుంది. తేమ సాకుతో సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో.. దళారులు తమకు నచ్చిన ధర ఇస్తామంటున్నారు. రైతులు కూడా గత్యంతరం లేక అయినకాడికి పంటను అమ్ముకొని నష్టపోక తప్పడం లేదు. పత్తి రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనలు నీటిరాతలు గానే మారుతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

 

09:56 - October 31, 2017

హైదరాబాద్ : ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో ఓ ఐపీఎస్‌ అధికారి వక్రమార్గం పట్టాడు. యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని అతని భార్య బ్లూటూత్‌ డివైజ్‌తో అతనికి సమాధానాలు చేరవేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎస్‌ అధికారి షఫీర్‌ కరీంపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అతని భార్య జియాతో పాటు... ఓ కోచింగ్‌ సెంటర్‌ను నిర్వాహకుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:54 - October 31, 2017

హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టోమ్ వడక్కన్, కుంతియా, కొప్పుల రాజు, మధుయాష్కి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. రేవంత్ తో పాటు టిటిడిపి మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,టిడిపి మాజీ జిల్లా కార్యదర్శులు, కీలక నేతలు ఢిల్లీ చేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు రాహుల్ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ అవుతున్నారు. అనంతరం మూడు గంటలకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

09:50 - October 31, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజి సమస్యలపై బీజేపీ,.. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:41 - October 31, 2017

చెన్నై : శ్రీ ఫౌండేషన్‌ సంయుక్తంగా సినారే సాహితీ రాజసం పేరుతో జాతీయ సదస్సును చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సావనీరును నటి కాంచన దేవి ఆవిష్కరించి గీత రచయిత భువన చంద్రకు అందజేశారు. అలాగే భువన చంద్ర రాసిన మనస్సు పొరల్లో పుస్తకాన్ని విడుదల చేశారు. మంగళవారం సదస్సులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని సినారె సాహిత్యపు విలువలు, సినీ గేయాలపై ప్రసంగించనున్నారు. 

 

కాసేపట్లో టీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంపై సీపీఎం వాయిదా తీర్మానం, జీహెచ్ ఎంసీ పరిధిలో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయి. 

నంద్యాలలో దారుణం

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. చాబోలు రోడ్డు ఆర్కేనగర్ లో ఆదాం అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. 

09:16 - October 31, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. ఆదాం అనే వ్యక్తి ఓ హోటలో పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం చాబోలు రోడ్డు ఆర్కేనగర్ లో ఆదాంను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అతని మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన నంద్యాలలో కలకలం రేపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:31 - October 31, 2017

సహజంగా పేపర్ అంటే చెట్లను నరికి మాత్రమే తయారు చేస్తారు అనుకుంటాం. కాని పేపర్ల తయారి అలా మాత్రమే కాదని ఇంకా చాలా రకాలుగా పేపర్ తయారవుతుందని పేపర్‌ వాడకం పర్యావరణానికి నష్టం కలిగించేది కాదని వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తుంది. దీనిపై జనపథం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేపర్‌ ఫౌండేషన్ ఇండియా ఎన్జీవో బిఆర్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:28 - October 31, 2017
08:22 - October 31, 2017

హైదరాబాద్ : టీడీపీకి నేతల రాజీనామా పరంపర కొనసాగుతోంది. వరుసగా నేతలు ఒకరితర్వాత మరొకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే సీతక్క టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ సమక్షంలో రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ బాటలోనే మరికొంత మంది నేతలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:02 - October 31, 2017

గుత్తికోయలపై దాడి సరైందికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, టీడీపీ నేత బీఎన్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. గుత్తికోయలు ఇక్కడి వారు కాదు అనేది సరైన వాదన కాదన్నారు. సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు, రాష్ట్ర రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలపసై వక్తలు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:56 - October 31, 2017

గుంటూరు : తాను అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే, కాంట్రాక్టర్లు అశ్రద్ధతో ఉన్నారని, ఇకపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల పనులను సమీక్షించిన ఆయన.. గండికోట ప్రాజెక్టు కాంట్రాక్టర్‌, సీఎం రమేష్ సోదరుడు రాజేష్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనక పోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. గండికోట పనులు అనుకున్నట్టుగా సాగడం లేదని, పనుల్లో జాప్యం జరిగితే తాను సహించబోనని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో చట్టప్రకారం నడుచుకుంటామన్న చంద్రబాబు పోలవరం పనులలో 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రాజెక్టుల పనులలో పురోగతిపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనులను 2019లోగా పూర్తి చేయాలంటే 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిపై ఒకటో తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎం తన కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిపై సమీక్షించారు. 
చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయం
పోలవరం ప్రధాన పనులు పూర్తి చేయడంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించామని, ప్రధాన కాంట్రాక్టు సంస్థ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై పలు మార్గాలను పరిశీలించామని సీఎం ఈ సమావేశంలో చెప్పారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, కాఫర్‌ డ్యామ్‌ పనులు ఈ సీజన్‌లోనే చేపట్టాల్సి ఉన్నందున ప్రధాన నిర్మాణ సంస్థను కొనసాగిస్తూనే, కొన్ని పనులకు 60సీ నిబంధన వర్తింపజేసి ముందుకు వెళ్లాలని జల వనరుల నిపుణులు సూచించడంతో ఆ ప్రకారం నడుచుకోవాలని ప్రాధమికంగా నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. 
10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధం 
డిసెంబరులోగా పూర్తిచేయాల్సిన 28 సాగునీటి ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయని ఈ సమావేశంలో జల వనరులశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోగుళ్లు, ఎర్ర కాల్వ, కండలేరు లిఫ్టు, మారాల, చెర్లోపల్లి, సిద్ధాపురం, నర్సింహరాయ సాగర్, గోరకల్లు, అవుకు టన్నెల్, పెదపాలెం, చిన్నసాన ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తయిన 10 ప్రాజెక్టులకు మూడురోజుల పాటు వరుస ప్రారంభోత్సవాలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం 
గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేవిధంగా ఏ నిర్మాణ సంస్థయినా నిర్ధేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొండవీటివాగు డిసెంబరులోగా పూర్తిచేయాలని నిర్దేశించారు.

 

టీఅసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు. పారిశుద్ధ్య కార్మికులకు జీవో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళులు

ఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పటేల్ విగ్రహం వద్ద రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోడీ, హోంమంత్రి నివాళులర్పించారు. పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించనున్నారు. రన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

07:40 - October 31, 2017

హైదరాబాద్ : కొలువుల కొట్లాట సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఆరోపించారు. కోర్టు కేసులను సైతం పరిష్కారం కాకుండా బలహీనపర్చడం దుర్మార్గమన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదన్నారు. మంగళవారం కోర్టు తీర్పు తర్వాత కొలువుల కొట్లాట సమావేశ తేదీని ప్రకటిస్తామన్నారు. 

 

07:36 - October 31, 2017

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. పక్షం రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్‌రెడ్డి రాజీనామాపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌పై సెటైర్లు వేస్తోంటే... కాంగ్రెస్‌ నేతలు కొత్త జోష్‌ వచ్చిందని చెబుతున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం రేవంత్‌ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు.
అసెంబ్లీ లాబీల్లోకి చేరిన రేవంత్‌ చర్చ
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా రేవంత్‌రెడ్డి పార్టీ మార్పుపైనే చర్చ. ఏనలుగురు కలిసినా వారి మధ్య దీనిపైనే చర్చనడుస్తోంది. పక్షం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి పార్టీమార్పు వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇదే చర్చ చివరికి అసెంబ్లీ లాబీల్లోకీ చేరింది. ఈ అసెంబ్లీ సెషన్‌లో మొదటిరోజు అసెంబ్లీకి హాజరైన రేవంత్‌.. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ... లేఖను చంద్రబాబుకు అందించారు. అసెంబ్లీ వ్యవహారంపై అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌అని... కాంగ్రెస్‌కు కొత్తజోష్‌ వచ్చిందన్న చర్చ నడుస్తోంది. టీ టీడీపీ నేతలు రేవంత్‌ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రేవంత్‌ పార్టీని వీడినా తమకు నష్టమేమీలేదని కొందరంటుంటే... మరికొందరు.... పార్టీ వెంటిలేటర్‌పై ఉందని అభిప్రాయపడుతున్నారు. 
రేవంత్‌పై ఫైర్‌ అయిన మాధవరం కృష్ణారావు
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా కొనసాగిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌ది ఐరన్‌లెగ్‌ అని అభిప్రాయపడ్డారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా తాము ఉన్నా.... రేవంత్‌రెడ్డి ఎంట్రీతోనే దరిద్రం పట్టుకుందని విమర్శించారు. మరో సీనియర్‌నేత రేవంత్‌ తన రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారడం ఆనవాయితీగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్‌ రాజీనామాపై డిఫరెంట్‌గా స్పందిస్తోన్న గులాబీనేతలు
శాసనసభ సభ్యత్వానికి రేవంత్‌రెడ్డి రాజీనామాపై గులాబీనేతలు మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు.  రేవంత్‌ రాజీనామానే ఓ పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. రాజీనామా కచ్చితంగా చేయాలని రేవంత్‌ తలిస్తే... తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు ఎందుకు ఇవ్వలేని ప్రశ్నిస్తున్నారు. ఇందులో పెద్ద కిటుకు దాగుందని దుయ్యబడుతున్నారు. ఒకవేళ కొడంగల్‌కు ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసుని స్పష్టం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు తమ విజయం కొడంగల్‌ నుంచే ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

07:28 - October 31, 2017

హైదరాబాద్ : 2011 గ్రూప్‌ 1 ఫలితాలను టీఎస్‌పీఎస్సీ నిలిపివేసింది. ప్రాధాన్యతలు తారుమారయ్యాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  సాంకేతిక లోపంతో పొరపాట్లు జరిగినట్లు  గుర్తించిన టీఎస్‌పీఎస్సీ.... పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది.
తారుమారు అయిన ప్రాధాన్యతలు
2011 గ్రూప్‌ 1 ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ప్రాధాన్యతలు తారుమారు అయ్యాయి. దీంతో ప్రకటించిన ఫలితాలను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ప్రాధాన్యతల్లో గందరగోళం ఏర్పడడంతో 2011 గ్రూప్‌ వన్‌ ఫలితాలను నిలిపివేస్తున్నట్టు టీఎస్‌పీఎస్పీ ప్రకటించింది.  అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలు తారుమారు అయ్యాయని ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకొంది.  దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు వెంటనే సీజీజీ అధికారులతో భేటీ అయ్యారు. సాంకేతిక లోపం కారణంగా పొరపాట్లు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.  పూర్తి స్థాయి పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఫలితాలు  ఇచ్చిన వారం రోజులకు మార్కులు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. 
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన గ్రూప్‌ 1 పరీక్షలు
2011 గ్రూప్‌ వన్‌ ఫలితాలను శనివారం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 121 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌ -1 పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ పరీక్ష తుది కీలో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్నకోర్టు మూడు నెలల్లో తుది కీ ని సవరించి, ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఏపీ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను  గతేడాది జూన్‌ 29న ఆదేశించింది.  న్యాయస్థానం ఆదేశాలతో టీఎస్‌పీఎస్సీ 2016 సెప్టెంబర్‌ 14 నుంచి 24 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించింది. 1792 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు కమిషన్‌ ఎంపిక చేసింది. మౌఖిక పరీక్షలు ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 10 వరకు జరిగాయి. ఇన్ని వివాదాల నేపథ్యంలో కోర్టు సమ్మతి మేరకు ఎట్టకేలకు శనివారం ఫలితాలను విడుదల చేసింది. దీంతో  అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. అంతలోనే తమ ప్రాధాన్యాలు మారిపోయాయని గుర్తించారు. దీంతో టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదులు చేశారు.  దీంతో ఈ ఫలితాలను నిలిపివేస్తున్నట్టు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. 

 

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే సీతక్క రాజీనామా

హైదరాబాద్ : టీడీపీకి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క రాజీనామా చేశారు. ఢిల్లీకి సీతక్క చేరుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కాంగ్రెస్ లో చేరనున్నారు. 

 

నేడు మాజీ రంజీ క్రికెటర్ ఎమ్ వి శ్రీధర్ అంత్యక్రియలు

హైదరాబాద్ : నేడు మాజీ రంజీ క్రికెటర్ ఎమ్ వి శ్రీధర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. అనారోగ్యంతో నిన్న ఎమ్ వి శ్రీధర్ కన్నుమూశారు. 

నేడు తూర్పుగోదావరి జిల్లాలో స్పీకర్ మీరాకుమార్ పర్యటన

తూర్పు గోదావరి : నేడు జిల్లాలో లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పర్యటించనున్నారు. తునిలో కాంగ్రెస్ మహిళా సాధికార సదస్సులో ఆమె పాల్గొననున్నారు. 

 

నేడు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ తో మంత్రి అఖిలప్రియ భేటీ

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ తో మంత్రి అఖిలప్రియ భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించనున్నారు. 

07:06 - October 31, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్‌ వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. మేడిగడ్డ దగ్గర 75శాతం విశ్వసనీయతతో 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్దారణ చేసింది. సాగు, తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులకు ప్రణాళిక తయారు చేసుకోవచ్చని కూడా సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.
కాళేశ్వరంకు హైడ్రాలజీ క్లియరెన్స్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్‌ లభించింది. హైడ్రాలజీ అనుమతినిస్తూ.. మేడిగడ్డ దగ్గర 75శాతం విశ్వసనీయతతో 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు  కేంద్ర జలవనరుల సంఘం  నిర్దారించింది. తాగు, సాగునీటి అవసరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులకుగాను ప్రణాళిక తయారుచేసుకోవచ్చని సీడబ్ల్యూసీ అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే కాళేశ్వరం స్టేజ్‌-1 అటవీ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టు కోసం 7825 ఎకరాల అటవీ భూములను వినియోగించుకోవడానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతించింది.  మూడు రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగింపేనని కేంద్ర  ప్రభుత్వం ప్రకటించింది. 
కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు
కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ ఇటీవలే నిర్ణయం చేసింది. దీంతో 3,168.13 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకునేందుకు నీటి పారుదల శాఖకు లైన్‌క్లియర్‌ అయ్యింది. 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం  ప్రణాళిక  రచించింది.   ఈ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణానికి భూసేకరణ, అటవీ అవసరాలు భారీగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణతో పాటు 7,920.72 ఎకరాల అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్ల భూమి పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అటవీ అనుమతులు కీలకంగా మారాయి. ప్రస్తుతం కోర్టు కేసులు, గ్రీన్‌ ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ప్రాజెక్టులో అటవీ అనుమతుల అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది. హెక్టారుకు 1,600 మొక్కలు పెంచేందుకు వీలుగా అవసరమైన నిధులను ఇచ్చేందుకు సానుకూలత తెలిపింది. అటవీ జంతువుల సంచారానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చూసుకోవడంతోపాటు, జంతు పరిరక్షణ చట్టం1972ను పక్కాగా అమలు చేసే బాధ్యతలను తామే తీసుకుంటామని తెలిపింది. ఇదే సమయంలో ఎకో సెన్సిటివ్‌ జోన్‌ల నుంచి అటవీ భూములను మినహాయించాలని రాష్ట్రం కోరిన వినతికి సైతం ఎఫ్‌ఏసీ సానుకూలంగా సమ్మతించింది. 
మంత్రి హరీష్ రావు హర్షం 
కాళేశ్వరం కు హైడ్రాలజీఅనుమతి లభించడం పట్ల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తి తో మిగతా డైరెక్టరేట్ల నుంచి అనుమతులు త్వరితగతిన సాధించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను మంత్రి కోరారు. 

 

06:59 - October 31, 2017

చెన్నై : ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో ఓ ఐపీఎస్‌ అధికారి వక్రమార్గం పట్టాడు. యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని అతని భార్య బ్లూటూత్‌ డివైజ్‌తో అతనికి సమాధానాలు చేరవేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎస్‌ అధికారి షఫీర్‌ కరీంపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అతని భార్య జియాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఓ ఐపీఎస్‌ అధికారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలోనే కాపీయింగ్‌కు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటన యూపీఎస్సీ అధికారులనేథ షాక్‌కు గురిచేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

యూపీఎస్సీ మెయిన్స్‌లో కాపీయింగ్‌కు పాల్పడ్డ యువ ఐపీఎస్‌

చెన్నై : ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో ఓ ఐపీఎస్‌ అధికారి వక్రమార్గం పట్టాడు. యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని అతని భార్య బ్లూటూత్‌ డివైజ్‌తో అతనికి సమాధానాలు చేరవేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎస్‌ అధికారి షఫీర్‌ కరీంపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అతని భార్య జియాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఓ ఐపీఎస్‌ అధికారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలోనే కాపీయింగ్‌కు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటన యూపీఎస్సీ అధికారులనేథ షాక్‌కు గురిచేస్తోంది.

 

మ.12.30 గం.లకు రాహుల్ తో రేవంత్ రెడ్డి సమావేశం

ఢిలీ : మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ లో రేవంత్ చేరనున్నారు. 

మ.12.30 గం.లకు రాహుల్ తో రేవంత్ రెడ్డి సమావేశం

ఢిలీ : మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ లో రేవంత్ చేరనున్నారు. 

Don't Miss