Activities calendar

01 November 2017

21:27 - November 1, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భరూచ్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. మోది ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలున్న భారతీయులు ఎందరు జైలుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన విజయ్‌ మాల్యా లండన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. జిఎస్‌టితో చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిఎస్‌టి మంచి నిర్ణయమని...దీన్ని అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. జిఎస్‌టి 18 శాతం మించకూడదని రాహుల్‌ చెప్పారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని మోది సర్కార్‌ చేసిన హామీ ఏమైందని నిలదీశారు. మోది ప్రభుత్వం కార్పోరేట్ల కోసమే పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

21:25 - November 1, 2017

లక్నో : బాలీవుడ్‌ క్వీన్‌, రాజ్యసభ సభ్యురాలు రేఖ రాయబరేలీలో అభివృద్ధి పనుల కోసం తన ఎంపీ ఫండ్‌ నుంచి రెండున్నర కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో సోలార్‌ లైట్లు, ఇంటర్‌ లింకింగ్‌ రోడ్లు, హ్యాండ్‌ పంప్‌లు, సిసిరోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. రాయబరేలీకి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అనంతరం రేఖ ఈ ఏడాది జనవరిలో కోటి 44 లక్షల నిధులు కేటాయించారు. అక్టోబర్‌ 2017 మరో కోటి 42 లక్షలు రెండో విడతగా నిధులు మంజూరు చేశారు. రాయబరేలీలో ఇప్పటికే కోటి రూపాయల పనులు పూర్తయ్యాయి.

21:19 - November 1, 2017

హైదరాబాద్ : రేవంత్‌ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఓటుకు నోటుతో దేశం ముందు కొడంగల్‌ నియోజకవర్గ ప్రజల పరువును తీసిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని ఆరోపించారు. కుంభకోణాలకు పర్యాయపదం కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. ఏ.. ఫర్‌ ఆదర్శ్‌, బి... ఫర్‌ భోపోర్స్‌, సి...ఫర్‌ క్యాష్‌ ఫర్‌ ఓట్ అంటూ ఎద్దేవా చేశారు. 

21:11 - November 1, 2017
20:40 - November 1, 2017

గత మూడు సవంత్సరాలు ప్రభుత్వం కాలయపన చేస్తోందని, విద్యార్థుల జీవితలతోని ప్రభుత్వం ఆడుకుంటుందని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నూన్ ఆహ్మద్ అన్నారు. 2015,2016 సెప్టెంబర్ 15 న పర్మిషన్ వచ్చిందని దాన్నీ వారు పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చారని విద్యార్థి మజీద్ అన్నారు. మా సమస్య అంత వైద్యశాఖ మంత్రి కామినేని అని వారు మా విద్యార్థుల భవిష్యత్ తోని ఆడుకుంటున్నారని విద్యార్థి తంగ్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:23 - November 1, 2017

అమ్మయ్య సర్కారు మీద కోపంతోనున్న కోదండరాం సారు.. నిన్న దీక్షల గూసునెగదా... ఇర్వైనాల్గు గంటల దీక్ష.. అగో ఇయ్యాళ విరమించిండు.. ఇగ కొల్వులకై కొట్లాటనే అనుకున్నంగని.. ఇగ సర్కారు మీదనే కొట్లాటనే అంటున్నడు.. తమ్మినేని వీరభద్రం సారు గూడ వొయ్యి నువ్వు ముంగటికి వో మేమున్నం అని భరోసా ఇచ్చొచ్చిండు..

తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎట్ల జయమైతదో..? ఎట్ల న్యాయమైతదో గని... అన్ని సౌట ముచ్చట్లే మాట్లాడుతున్నడు.. పాపం గుత్తి కోయలోళ్లు అడ్విల బత్కుతుంటే.. వాళ్లను చెట్లకు గట్టేశి బట్టలూడ దీశిన ముచ్చట జూపెడ్తిగదా గాయాళ్ల.. అదే నేనే జెప్పిన పోలీసోళ్ల తోని అని అసెంబ్లీ సాక్షిగ జెప్పిండు.. ఇంత దుర్మార్ఘమా..? ఇంకేమన్నడో అదిగూడ జూడుండ్రి..

తెలంగాణ సచివాలయమంత చెడ్డ సచివాలయంల అసలు భారతదేశంలనే లేదట.. ఇసొంటి దరిద్రమైన సచివాలాయన్ని జూస్తుంటె ముఖ్యమంత్రిగారికి గుండె చెర్వైతున్నదట.. అందుకే ఈ సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది గట్టాలనుకుంటున్నం అని నిండు సభల సభ్యులకు జెప్తున్నడు.. మరి మనది ఏడంగ గబ్బు సచివాలయం అయ్యింది ఏం కథ అనేది ప్రజలకు తెల్వాలే..

చేతులు గాలినంక ఆకులు వట్టుకున్నట్టే అయ్యింది మా పని..? మేము నిజంగనే కేసీఆర్ మాటమీదుండె మన్షి అనుకోని ఓట్లేశి మోసపోయినం..? మాలెక్క ఎవ్వలు అన్నాయం గాకుండ్రి అడ్డమైన మాటలిని అని సింగరేణి కార్మికులు జెప్తున్నరంటె వాళ్లకు ఎంత పెద్ద దెబ్బదాకిండో సూడుండ్రిగ.. మరి ఆ దెబ్బేందో మళ్లొక పారి జూడుండ్రి..

ప్రభుత్వం ప్రజలను మోసం జేస్తున్నది.. పథకాలళ్ల అవినీతి అయితున్నదని నిజామాబాద్ జిల్లాల సంజీవ్ అనే కండక్టర్ ఫేస్ బుక్కుల పోస్టు వెట్టిండుగదా..? అగో శిపాయి ముఖ్యమంత్రిని వట్కోని గంత విమర్శిస్తవా అని మొన్న నోటీసు ఇచ్చిండ్రు ఇయ్యాళ సస్పెండే జేశిండ్రు.. అంటె ముఖ్యమంత్రి గారిని ఏమన్న చర్యలు దీస్కుంటరట.. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలనంటే ప్రజలేం జేయాలే..?

ఏ కాంగ్రెసోళ్లు ఏం పరిపాలన జేశిండ్రు అర్వై ఏండ్లు.. రూపాయి ఖర్చువెడ్తున్నమని.. పావుల వెట్టిండ్రు బారాణ జేవులేస్కున్నరు.. దేవాదుల పైపులు పటాకులు వేలినట్టు వేలుతున్నయ్.. గదేనా తరీఖ పనులు జేశే తరీఖ అని ప్రజలకు ముచ్చట్లు జెప్పిన గద్దెమీదికెక్కిండు మన బాతాల పోశెట్టిగారూ.. ఇగమరి ఈన పనితనం ఎంత సక్కగున్నదో గూడ మనం జూడాలే గదా..? పాండ్రి..

దండుగ మన తానికి ఓట్ల కోసం ఒచ్చెతప్పుడు ఒకటి జెప్తరు.. గెల్చి అవుతల వడ్డంక ఒకపనిజేస్తరు.. అరే జిల్లా పరిషత్ సమావేశంల చర్చించవల్సిన ముచ్చట ఏంది నిన్నియాళ్ల చర్చిస్తున్నదేంది..? ఎమ్మెల్యేలు తిట్టుకునెతందుకు సమావేశాలు వెట్టుకుంటున్నట్టున్నదిగని.. ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రం గానట్టే అనిపిస్తున్నది.. కడప జెడ్పీ సమావేశం జూడుండ్రి.. అంగడే..

ఈడికే సర్కారు దావఖాండ్ల పొంటి సమాను సక్కగలేదురా నాయనా అంటే ఆప్రేషన్ థియేటర్లున్న కత్తెరను పేషెంట్ కడ్పుల ఏశి కుట్టేశిండు ఒక డాక్టరు.. కత్తెర ఏడవాయేరా అని ఎంకులాడితె దొర్కది.. పేషెంటు కడ్పులున్నది ఇగ ఏడ దొర్కుతది.. నెల్లూరు జిల్లా సర్కారు దావఖాండ్ల డాక్టర్లు ఇట్ల కత్తెర్లను గూడ మాయం జేస్తున్నరంటే ఇగ ఏమంటం..?

 

19:59 - November 1, 2017
19:57 - November 1, 2017

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు, వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తే ప్రజలు వైసీపీని బహిష్కరిస్తారని, చట్టసభలపై జగన్ గౌవరం లేదని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:51 - November 1, 2017
19:49 - November 1, 2017

న్యూయార్క్ : అమెరికాను ఉగ్రవాదం వణికిస్తోంది. న్యూయార్క్‌లోని లోయర్‌ మాన్‌హటన్‌లో ఓ దుండగుడు ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు.డబ్ల్యూటీసీ స్మారక చిహ్నం ప్రాంతంలో ట్రక్కును వేగంగా నడుపుతూ ఒక్కసారిగా పాదాచారులు, సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. పాదాచారులను, సైకిల్‌పై వెళ్లేవారిని ట్రక్కుతో ఢీకొని బీభత్సం సృష్టించాడు.

ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భ‌ద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనాకు చెందినవారు కాగా...మరొకరిని బెల్జియం దేశస్థుడిగా గుర్తించారు. ఇది ఉగ్రవాద దాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లసియో తెలిపారు. ట్రక్కులో ఐసిస్‌కు సంబంధించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సైపోవ్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ప్రమాదమేమి లేదన్నారు.

ట్రక్కుతో ఉగ్రదాడి
ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డ వ్యక్తిని 29 ఏళ్ల సైఫులో సైపోవ్‌గా పోలీసులు గుర్తించారు. సైఫులో ఐసిస్‌ సభ్యుడై ఉంటారని భావిస్తున్నారు. సైపోవ్‌ ఘటనకు ముందురోజు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అతను జనాలపైకి ట్రక్కును తోలుతూ 'అల్లా హు అక్బర్‌' అంటూ నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సైఫులో సైపోవ్‌ 2010లో అమెరికాకు వలస వచ్చాడు. అతడికి గ్రీన్‌కార్డు కూడా ఉంది. సైపోవ్‌ ఉబర్‌ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించాకే ఉద్యోగంలోకి తీసుకున్నట్లు ఉబర్‌ సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై ఎఫ్‌బిఐ దర్యాప్తు చేపట్టింది. 

19:48 - November 1, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది చివరినాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి లేవనెత్తిన ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. 

19:47 - November 1, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రైతు సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన నోటీసుపై చర్చను జీవన్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయరంగం కుదేలైందని మండిపడ్డారు. అకాలవర్షాల వల్ల వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల 30 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం కల్గిందన్నారు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య. పంటలకు గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. భద్రచలం నియోజకవర్గంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.

35.30లక్షల మంది రైతులకు రుణవిముక్తి
రాష్ట్రంలో 16,124.45 కోట్ల రుణాలను మాఫీ చేయడం ద్వారా 35.30లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్గిందని మంత్రి పోచారం తెలిపారు. పాత, కొత్త తేడా లేకుండా అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పూర్తయిందని స్పష్టం చేశారు. రైతులకు వడ్డీ రాయితీ వెంటనే ప్రకటించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో 10 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నారని.. ఇక్కడ ఎంత చెల్లిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతుల సమస్యపై సభలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు అసహనం ప్రదర్శించడం తగదని సీఎం అన్నారు. రైతులపై కాంగ్రెస్‌కన్నా తమకే ఎక్కువ శ్రద్ధ ఉందన్నారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి చెప్పింది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలను సీఎం ప్రశ్నించారు. రూ. 5000 కోట్లు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని సీఎం అన్నారు. ఫ్రీ కరెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది నిజమేనని.. అయితే.. ఫ్రీ కరెంట్‌తో కోతలు పెట్టి కాంగ్రెస్ రైతులను చంపిందని.. తమ ప్రభుత్వం కోతలు లేకుండా చేసిందన్నారు.వడ్డీ రాయితీ రాని రైతుల జాబితాను పది రోజుల్లో ప్రభుత్వానికి అందిస్తామన్నారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై స్పందించిన కేసీఆర్ లిస్టును అందిస్తే ఇదే స‌భ‌లో వ‌డ్డీ రాయితీని ప్రక‌టిద్దామ‌ని తెలిపారు.ఆ తర్వాత సభను డిప్యూటీ స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. 

19:46 - November 1, 2017

ఢిల్లీ : నకిలీ పత్రాలతో బ్యాంకులకు బురిడీ కొట్టించి వేలాది కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఢిల్లీకి చెందిన వ్యాపారి గగన్‌ ధవన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. గగన్ ధవన్‌ 5 వేల కోట్ల మనీ లాండరింగ్‌ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. గగన్‌ ధవన్‌కు పలువురు రాజకీయ నేతలు, అధికారులతో సంబంధాలున్నాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దర్యాప్తు సంస్థలకు, అధికారులు ముడుపులు చెల్లించినట్లుగా ఉన్న పత్రాలు లభించాయి. ఐఅర్‌ఎస్‌ సుభాష్‌ చంద్రకు 30 లక్షలు, ఐఏఎస్‌ మానస్‌ శంకర్‌కు 40 లక్షలు ఇచ్చిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన పోలీస్‌ అధికారుల పాత్రపై ఈడీ ఆరా తీస్తోంది.

19:45 - November 1, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం సోషల్‌ మీడియాలో అభిమానులను పెంచుకుంటున్నారు. మొన్న తన పెంపుడు కుక్క వీడియోను పోస్ట్‌ చేసిన రాహుల్‌ ఇవాళ.. జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఐకిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. కోచ్‌తో కలిసి ఐకిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోలను రాహుల్‌ ట్విటర్‌లో పెట్టారు. రాహుల్‌కు ఐకిడోలో బ్లాక్‌బెల్ట్‌ ఉంది. కానీ దీని గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

యూపీలో ఘోర ప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది.బాయిలర్‌ పైపు పేలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. 

19:40 - November 1, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది.బాయిలర్‌ పైపు పేలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:37 - November 1, 2017
19:13 - November 1, 2017

గుంటూరు : అమరావతి సచివాలయం గేటు వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో...వెంకటరమణ అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణది కర్నూలు జిల్లా ఆదోనిగా గుర్తించారు. 

19:12 - November 1, 2017

తూర్పగోదావరి : వైసీపీ యువజన నేత జక్కంపూడి రాజాపై ఎస్సై దాడికి నిరసనగా కాకినాడ ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల తీరును ఖండిస్తూ.. రాజాపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. రేపటిలోగా స్పందించకపోతే పోలీసు స్టేషన్‌ ముందుకు దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

19:11 - November 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లా.. ఏలూరు కుమ్మరి రేవు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బొమ్మను మింగి ఓ బాలుడు మృతి చెందాడు. మీసాల నిరిక్షణ్‌ అనే నాలుగేళ్ల బాలుడు తినుబండారాల ప్యాక్‌ కొని తింటుండగా.. అందులోని బొమ్మ గొంతుకు అడ్డంపడి ఊపిరి ఆడలేదు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నిరిక్షణ్‌ను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నిరిక్షణ్‌ మృతి చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు తీవ్ర శోకంలోకి వెళ్లిపోయారు. 

19:10 - November 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... బెదిరింపు కాల్‌ నెంబర్‌గా నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై.. డబ్బు కోసం ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

19:08 - November 1, 2017

విజయనగరం : జిల్లా, చీపురుపల్లి బీసీ సమీకృత గృహంలో దారుణం జరిగింది. సిబ్బంది 2 రోజుల క్రితం శీతల పానియాల్లో మద్యం కలిపి విద్యార్థులకు బలవంతంగా తాపించారు. ఈ విషయంపై బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి పైడిరాజు విచారణ చేశారు. విద్యార్థులతో బలవంతంగా మద్యం తాగించడం నిజమేనని విచారణాధికారి తేల్చారు.

 

19:07 - November 1, 2017

కర్నూలు: జిల్లా దేవనకొండ మండలం బేతపల్లిలో 46 ఎకరాల వేరుశెనగ వాములకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. గ్రామంలోని 7గురు రైతులకు చెందిన 7 గడ్డి వాములను పెట్రోల్ పోసి తగులబెట్టారు. దాదాపు 22 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. కష్టపడి పండించిన పంట బూడిదపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

19:06 - November 1, 2017

తూర్పుగోదావరి : ఇది కోరంగి అభయారణ్యము. సహజ సిద్ధంగా సముద్ర తీరంలో ఏర్పడే ఈ అడవులు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో మడ అడవులు ఏర్పడతాయి. సాధారణ అడవులకు భిన్నంగా కనిపించే చెట్లు, ప్రత్యేక జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. ఇలాంటి మడ ఫారెస్టుల్లో విహరించి, ప్రత్యేకతలను తెలుసుకోవడం పిల్లలు, పెద్దలు అందరికీ ఆనందమే. అందుకే తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి మడ అడవులకు టూరిస్టుల తాకిడి కనిపిస్తోంది. యానాం రోడ్డులో ఉన్న మడ అడవుల్లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బోటింగ్ సదుపాయం ఉండడంతో చాలా మంది ఉత్సాహంగా గడపగలుగుతున్నారు. పిల్లాపాపలతో రోజంతా సందడిగా గడపడానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లున్నాయి.

మడ అడవుల ద్వారా ఎన్నో విషయాలు
ఈ మడ అడవుల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందుకే అవన్నీ సామాన్యులకు కూడా తెలియజేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి ఉపయోగకరంగా ఉన్నాయని పర్యాటకులు కూడా చెబుతున్నారు. కార్తీక మాసం కావడంతో చాలా మంది ఇప్పుడు మడ అడవుల్లో సందడి చేస్తున్నారు. చిన్నారులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మడ అడవులకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.గుబురుగా కనిపించే మడ అడవులు కాకినాడ నగరవాసులతో పాటు సుదూర ప్రాంతవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా కొందరు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు మడ అడవులను తీర్చి దిద్దే పనిలో ఉన్న అధికారులు దానికి తగినట్టుగా చర్యలు తీసుకుంటే మడ టూరిజం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

19:04 - November 1, 2017

అనంతపురం : కంబళి నేటి తరం వారికి తెలియని వస్తువు. తెలియని పదం. ఒకప్పుడు జ్వరం వస్తే కంబళి కప్పుకొని నిద్రపోతే జ్వరం పోయేదని పెద్దలు చెబుతుంటారు. ఆ కాలంలో ఒక వెలుగు వెలిగిన వస్తువులు ఆధునిక యుగంలో ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. విడమరచి చెప్పాల్సిన పెద్దలు వాటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఒక్క కంబళి నేయడానికి మూడు రోజులు పడుతుంది. చీరనెలా నేస్తారో కంబళిని కూడా అలాగే నేస్తారు. ఒక్కొక్కదానికి అయ్యే ఖర్చు చిన్నదానికి ఐదు వందలైదే, పెద్దదానికి దాదాపు వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతోంది. దీని మీద వచ్చే రెండు, మూడు వందల లాభంతోనే జీవనం సాగిస్తుంటారు. వీటిని నేసేవారు కూడా అప్పట్లో అనుభవం ఉన్న వృద్ధులు తప్పితే ఈ తరంవాళ్లెవ్వరూ కంబళ్లు నేయడానికి ముందుకు రావడం లేదు.

వృత్తినే నమ్ముకొని జీవనం
రాయదుర్గం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇప్పటికీ ఈ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. చాలా చోట్ల కంబళ్ళకు ఆదరణ తగ్గుతుండటంతో వాటిని నేసేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వృత్తిని మానేశారు. ఇప్పటికైనా ఇలాంటి పాత వృత్తులు ముఖ్యంగా అందిరికీ ఉపయోగపడే కంబళ్ళ వృత్తిని ప్రోత్సహించాలని కంబళి తయారీదారులు కోరుతున్నారు. 

19:03 - November 1, 2017

తూర్పుగోదావరి : జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో బొంగులో చికెన్‌ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలోకి వెళ్లగానే బ్యాంబూ చికెన్‌ రారమ్మని పిలుస్తుంది. తన రుచి చూడమని ఆహ్వానిస్తుంది. ఒకసారి రుచిచూస్తే... పదేపదే దానికోసం ఎగబడేలా చేస్తుంది. దశాబ్దంన్నర నుంచి బ్యాంబూ చికెన్‌ వంటకం బాగా ప్రచారం సాధించింది. ఆయిల్‌ వినియోగం లేకుండా వెదురు బొంగులో చికెన్‌ వేసి మంటపై కాల్చి తినడంతో వచ్చే ప్రత్యేక రుచి భోజన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు గిరిజనుల ప్రయోగాలతో వచ్చిన బొంగులో చికెన్‌.. ఇప్పుడు చాలా మందికి అది వ్యాపారంగా మారింది. ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్‌ అమ్మకాలను గిరిజనేతరులు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. బాగా లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. బొంగు చికెన్‌ తయారీ కోసం అవసరమైన వెదురు బొంగులను అడవుల నుంచి నరికి తీసుకురావడం ఈ మధ్య బాగా పెరిగింది. ఒకసారి కాల్చేస్తే బొంగు ఇక పనికిరాదు. మరోసారి వండాలంటే మరో వెదురు బొంగు అనివార్యం అవుతుంది. దీంతో అడవుల్లో వెదురు బొంగులను నరికి తీసుకొచ్చి మరీ బ్యాంబూ చికెన్‌ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వెదురు చెట్ల నరికివేతతో అటవీ సంపదకు సమస్యలు వస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వెదురు బొంగుల నరికివేతపై ఆంక్షలు విధించారు.

వెదురు బొంగుమీద ఆంక్షాలు
వెదురు బొంగుమీద ఆంక్షలతో బ్యాంబూ చికెన్‌ తయారీ నిలిపోయింది. దీంతో పర్యాటకులు నిరాశచెందాల్సి వస్తోంది. దీంతో బొంగు చికెన్‌పై ఆంక్షలు విధించడం సరికాదని టూరిస్టులు అంటున్నారు. గిరిజనులకు వెదురు బొంగులు తీసుకొచ్చుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోందని గిరిజన నాయకులు మండిపడుతున్నారు. వెదురు బొంగులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు. తద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించినట్టవుతుందని చెప్తున్నారు. ఫారెస్ట్‌ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెదురు బొంగులపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ ఉపాధిగా మారిన బ్యాంబూ చికెన్‌కు బ్రేక్‌ వేసేలా చర్యలు తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెదురు చెట్ల నరికివేతపై ఆంక్షలు తొలగించి తమ ఉపాధికి సహకరించాలని కోరుతున్నారు.

18:59 - November 1, 2017

ఢిల్లీ : నారయణ, శ్రీ చైతన్య కాలేజీలలో విద్యార్ధుల ఆత్మహత్యలపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషనర్‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిసారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల యజమానులే మంత్రులుగా ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. స్పల్ప వ్యవధిలోనే 40మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తొందని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

18:58 - November 1, 2017

కృష్ణా : కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉద్యమ బాట పట్టారు. 2016-16 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొంది లక్షల ఫీజులు చెల్లించిన వీరంతా కాలేజ్‌కి ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగకపోవడంతో విజయవాడలో నిరాహారదీక్ష చేపట్టారు. విద్యార్ధుల దీక్షలపై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్ధులను, వారి తల్లిదండ్రులకు చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి కామినేనితో కలిసి విద్యార్ధులు చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడాలని ముఖ్యమంత్రి.. మంత్రి కామినేనిని ఆదేశించారు. ఈ అంశంపై MCI తోపాటు కేంద్రంతో కూడా మాట్లాడి ఆ తరువాత సుప్రీంలో పిటిషన్ వేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కామినేని చెప్పారు.

మరణమే శరణ్యమంటున్న విద్యార్థులు
అయితే తమకు న్యాయం చేయండంటూ మూడేళ్లుగా మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కోరుతున్నారు విద్యార్ధులు. ఇప్పటికే సీఎం చంద్రబాబును మూడుసార్లు కలిసారు. అయినా వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. అటు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురవడంతో విద్యార్ధులు రోడ్డున పడ్డారు. చేసేది లేక ఉద్యమమే శరణ్యమంటూ విద్యార్ధులంతా విజయవాడలో రిలే నిరాహారదీక్షలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమంటున్నారు. ఫాతిమా కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫాతిమా కాలేజి విద్యార్ధుల ఆందోళనకు కాంగ్రెస్, సీపీఎం నేతలు మద్దతు పలికారు. మూడేళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించకపోవడంపై వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలని.. కేంద్రం సహకారంతో ఎంసీఐతో చర్చలు జరిపి విద్యార్ధులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకూ దీక్షలు ఆపేది లేదని విద్యార్ధులు తేల్చి చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. 

కొనసాగతున్న ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : అమరావతిలో ఏపీ క్యాబినేట్‌ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. ఈ భేటీలో పోలవరం నిర్మాణం, అసెంబ్లీ సమావేశాలు, కొత్త పోస్టుల మంజూరు, బాబు విదేశీ పర్యటన వివరాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరుగుతోంది.

18:56 - November 1, 2017

గగుంటూరు : అమరావతిలో ఏపీ క్యాబినేట్‌ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. ఈ భేటీలో పోలవరం నిర్మాణం, అసెంబ్లీ సమావేశాలు, కొత్త పోస్టుల మంజూరు, బాబు విదేశీ పర్యటన వివరాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలపై ఈ మీటింగ్‌లో క్లారిటీ రానుంది.

కర్నూలు రోడ్డు ప్రమాదం

కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోసుప్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, కారు ఢీకొనడంతో22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

18:55 - November 1, 2017

కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోసుప్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, కారు ఢీకొనడంతో22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

18:54 - November 1, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలుగుదేశం నేతలు రేవంత్‌రెడ్డి బాటలో నడుస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్‌ బై చెప్పి.. కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొంటున్నారు. ఈ పరిస్థితి కొత్త కుమ్ములాటలకు దారి తీస్తోంది. టీడీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరికతో మొదటిగా చిక్కుల్లో పడిన నేత మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌. 2009లో ఈ స్థానం నుంచి గెలుపొందిన ఆరెపల్లి మోహన్‌... 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ చేతిలో ఓడిపోయారు. మానకొండూర్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి రెండుసార్లు ఓడిపోయిన కవ్వంపల్లి సత్యనారాయణ.. ఇప్పుడు పార్టీ మారే యత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఇప్పటి వరకు కవ్వంపల్లి, ఆరెపల్లి ఇప్పటి వరకు ప్రత్యర్థుగానే ప్రచారం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తానని కాంగ్రెస్‌ అధిష్టానం హామీ ఇవ్వడంతో టీడీపీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు కవ్వంపల్లి ప్రకటించారు.

కవ్వంపల్లి కాంగ్రెస్‌ గూటికి
కవ్వంపల్లి కాంగ్రెస్‌ గూటికి చేరునుండటంతో మానకొండూర్‌ అసెంబ్లీ స్థానం టికెట్ ఆశిస్తున్న ఆరెపల్లి మోహన్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశించి కవ్వంపల్లి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనుండటంలో ఆరేపల్లి మోహన్‌ పరిస్థితి అయోమంగా మారింది. సురక్షితమైన మరో సీటు చూసుకోవాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆరేపల్లి మోహన్‌కు సూచిస్తున్నా... ఇందుకు ఒప్పుకోవడంలేదని ఈయన అనుచరులు చెబుతున్నారు. నియోజవర్గం మారితే అక్కడ సీటు ఆసిస్తున్న నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే.. మళ్లీ ఓటమిని మూటకట్టుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు.

ఆరెపల్లి మోహన్‌ను పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి
ఆరెపల్లి మోహన్‌ను పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసి ఓడిపోయిన వివేక్‌... ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బలమైన దళిత నేతగా ముద్రపడ్డ ఆరెపల్లి మోహన్‌ పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయిస్తేనే మంచిదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని రామగుండం, పెద్దపల్లి, మంథని, ధర్మపురి, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ స్థానాల్లో గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆరెపల్లి వంటి బలమైన నేతను నిలబెట్టి కొద్దిగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ సీటును కైవసం చేసుకోవచ్చన్న అభిప్రాయం పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. అయితే ఆరెపల్లి మోహన్‌ మాత్రం అసెంబ్లీ సీటు... అది కూడా మానకొండూరే కావాలని పట్టుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరడమా లేక స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగి సత్తా సాటడమా.. అన్న ప్రత్యామ్నాయాలపై ఆరెపల్లి వర్గీలయు తర్జనభర్జన పడుతున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్లంతా తమ రాజకీయ భవిష్యత్‌పై
ఈ పరిస్థితి ఒక్క ఆరెపల్లి మోహన్‌కే పరిమితం కాలేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్లు ఆశిస్తున్న నాయకుంతా ఇలాంటి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. కొత్త నీరు వస్తే పాతనీరు కొట్టుకుపోతుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వస్తున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న అధిష్టానం హామీతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ సీనియర్లంతా తమ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. 

18:52 - November 1, 2017

హైదరాబాద్ : టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ 24 గంటలపాటు చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ తార్నాకలోని తన నివాసం వద్ద కోదండరామ్ దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్షకు పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యం కావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. అనేక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న హైదరాబాద్‌లో జేఏసీ విస్తృత స్ధాయి సమావేశం నిర్వహిస్తామని .. ఆ తరువాత కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.

18:08 - November 1, 2017
18:07 - November 1, 2017
18:06 - November 1, 2017
18:05 - November 1, 2017
18:04 - November 1, 2017
18:02 - November 1, 2017
16:20 - November 1, 2017
16:13 - November 1, 2017

గుంటూరు : కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడాలని ముఖ్యమంత్రి.. మంత్రి కామినేనిని ఆదేశించారు. ఈ అంశంపై MCI తోపాటు కేంద్రంతో కూడా మాట్లాడి ఆ తరువాత సుప్రీంలో పిటిషన్ వేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కామినేని చెప్పారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందంటున్నారు కడప ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్ధులు. 

16:10 - November 1, 2017

ఢిల్లీ : దేశంలో రైతుల్లో సంక్షోభం నెలకొందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌. అఖిల భారత కిసాన్‌ సభ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మహాసభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఇందులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందన్నారు. 2014 భూ సేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు రవుల వెంకయ్య. ప్రజా ప్రతినిధులకు పించన్లు ఉన్నట్లే వ్యవసాయ కూలీలకు కూడా ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నేటి నుండి 5వ తేదీ వరకు మహాధర్నా కొనసాగుతుందన్నారు. ఈ ధర్నాలో దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

16:09 - November 1, 2017

చెన్నై : భారీ వర్షాలు తమిళనాడు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నై నగర శివార్లైన కాంచిపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో జనం భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నాయి. వర్షం కారణంగా నగరంలోని పలు రహదారులు, కాలనీలు చెరువుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు.. ఆలయాల్లోకీ వరద నీరు వచ్చి చేరింది. రవాణా వ్యవస్థ తీవ్రస్థాయిలో దెబ్బతింది. ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలతో కుంభవృష్టి కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు. మరోవైపు శ్రీలంక-గల్ఫ్ ఆఫ్‌ మన్నారు నడుమ కేంద్రీకృతమైన అల్పపీడనం తూర్పు బంగాళాఖాతం దిశగా కదులుతుండటం రుతుపవనాలు వేగంగా మారి భారీ వర్షాలకు దారీతీస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తీరప్రాంతాల్లోని చెన్నై, కాంచిపురం, తిరువళ్లూరు, కడలూరు, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కడలూరులో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

దీక్ష విరమించిన కోదండరాం

హైదరాబాద్ : టీజేఏసీ నేత కోదండరాం 24గంటల నిరసన దీక్షను విరమించారు. కోదండరాంచే చుక్కా రామయ్య, హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ దీక్ష విరమింపజేశారు.

రావిచర్లలో ఉద్రిక్తత

కృష్ణా : జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆధిపత్య పోరుతో కాప శ్రీనివాసరావు, ముద్రబోయిన వర్గాల మధ్య వివాదం నెలకొని ఉద్రిక్తతకు దారి తీశాయి.

స్మగ్లర్ నసీముద్దీన్ ఖాన్ అరెస్ట్

చిత్తూరు : తిరుపతిలో అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ నసీముద్దీన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం, 3వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీని బహిష్కరించాలన్న వైసీపీ నిర్ణయంపై ఈ భేటీలో చర్చించారు. ఎవరో సభకు రావటం లేదని మనకు ఆందోళన అవసరం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు.

విశాఖలో మావోయిస్టుల లొంగుబాటు

విశాఖ : జిల్లా ఎస్పీ ఎదుట నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కొర్రా బలరామ్, కొర్రా సత్తి, సాంగి గణేష్, డప్పుల వెంకటరావు ఉన్నారు. లొంగిపోయిన నలుగురిపై రూ.లక్ష రివార్డు ఉంది.

పశ్చిమగోదావరిలో విషాదం

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు కుమ్మరిరేవు కాలనీలో విషాదం జరిగింది. చిప్స్ ప్యాకెట్లో రబ్బరు బొమ్మ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు నిరీక్షణ్ మృతి చెందాడు.

15:15 - November 1, 2017
15:15 - November 1, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కేబినేట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. పోలవరం, అసెంబ్లీ సమావేశాలు, కొత్త పోస్టుల మంజూరుతో పాటు.. ఐదు అర్బన్‌ అథారిటీలు..., బాబు విదేశీ పర్యటన విశేషాలతో పాటు.. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:13 - November 1, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. తాత్కాలిక పాలక మండలి ఏర్పాటైంది. కలెక్టర్‌ చైర్మన్‌గా, మున్సిపల్‌ కమిషనర్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించే నుడాలో ఐదుగురు సభ్యులు ఉంటారు. నిజామాబాద్‌ నగరం నలుదిశలా వ్యాపించింది. ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నిజామాబాద్‌లో కలిసిపోయాయి. నగరం విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు పెరిగిపోయాయి. దీంతో అభివృద్ధి అస్తవ్యస్తంగా జరుగుతోంది. నియంత్రణ లేకపోవడంతో రియల్టర్లు, బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ రకమైన అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్నారు. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌ సౌకర్యం లేకుండానే ప్లాట్లు అమ్ముతున్నారు. వీటన్నింటినీ నియంత్రించి క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంలో నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం నగరలో 3,10,153 మంది జనాభా
నిజామాబాద్‌ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం నగరలో 3,10,153 మంది జనాభా ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలో ఏడు మండలాల్లోని 61 గ్రామాలను కలపడంతో జనాభా 4,96,209 మందికి చేరింది. నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పంచాయతీ సర్పంచ్‌లు కొంత అధికారం లోప్పోయినా.. శివారు ప్రాంతాల్లో సత్వరం మౌలికసదుపాయాల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో శివారు ప్రాంతాల్లో అస్తవ్యస్త అభివృద్ధికి చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. క్రమపద్ధతిలో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. 

15:11 - November 1, 2017

హైదరాబాద్ : మాజీ ఎంపీ వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సెక్రటరియేట్ నిర్మాణానికి పునాది వేస్తే ఆ రోజునే ప్రాణ త్యాగానికి సిద్ధమవుతానని వీహెచ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త సచివాలయాన్ని కట్టనివ్వమన్నారు. సీఎం సచివాలయాన్ని చెత్త అనడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ది కాదని.. ప్రజల డబ్బుతో ఇష్టానుసారంగా భవనాలు నిర్మిస్తామంటే జనం ఒప్పుకోరన్నారు. 

15:10 - November 1, 2017

హైదరాబాద్ : రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. గతంలో ఎన్నడూలేని విధంగా సాగుకు సకాలంలో విత్తనాలు, ఎవులు సరఫరా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ సభ దృష్టికి తెచ్చారు. రైతు సమస్యలై అసెంబ్లీలో జరిగిన చర్చలో కిషోర్‌ పాల్గొన్నారు. 

14:37 - November 1, 2017

కేసీఆర్... ప్రజల మనోభావాలను గౌరవించాలి : లక్ష్మణ్

హైదరాబాద్ : సీఎం బుల్డోజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. గతంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. గొప్పగా ఏషియన్ గేమ్స్ జరిగాయిని తెలిపారు. మీరు వచ్చిన తర్వాత జరగలేదంటే అది మీ నిర్వాకమని టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఉద్ధేంచి వ్యాఖ్యానించారు. తాము ప్రజల వైపు మాట్లాడుతున్నామని, ప్రజల స్థాయిలో మాట్లాడుతున్నామని చెప్పారు. 'మీరు మేధావులు కావచ్చు.. మీకే తెలివి ఉండొచ్చు' అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు.

కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆగ్రహం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్..తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. వాస్తు దోషం పేరుతో సచివాలయాన్ని కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర, హైదరాబాద్ నగర ప్రజలను సీఎం అవమాన పరిచారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కోట్లు ఖర్చు పెడతానంటున్న సీఎంకు పత్తిరైతు గోడు కనిపించడం లేదా అని అన్నారు. పత్తి పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చేయొచ్చు కదా అన్ని సూచించారు. రైతులు ముఖ్యమా, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం ముఖ్యమా అంటే సచివాలయమే ముఖ్యమని సీఎం అంటున్నారని తెలిపారు. సచివాలయానికి రాని సీఎంకు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. 

కొత్త సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకం : సున్నం రాజయ్య

హైదరాబాద్ : నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేస్తున్నామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. కావాలనే ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి పూనుకుంటుందని తెలిపారు. కొత్త సచివాలయం కోసం రూ.500 కోట్లు వృధా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలను జీవనం వెల్లదీస్తున్నారని వారిని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని యధాతధంగా ఉంచాలన్నారు. ఇప్పుడున్న సచివాలయం నుంచే పరిపాలన కొనసాగించాలని పేర్కొన్నారు. 

ఏపీ సచివాలయంలో ఉద్యోగి సస్పెండ్

గుంటూరు : ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.. జలవనరుల శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్‌ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డి  సస్పెండ్‌ చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయంలో న్యాయశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను కూడా అధికారులు సస్పెండ్‌ చేశారు. సచివాలయంలో జరుగుతున్న పరిణామాలపై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. 

ఏలూరులో విషాదం

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు కుమ్మరి రేవు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బొమ్మను మింగి ఓ బాలుడు మృతి చెందాడు. మీసాల నిరిక్షణ్‌ అనే నాలుగేళ్ల బాలుడు తినుబండారాల ప్యాక్‌ కొని తింటుండగా.. అందులోని బొమ్మ గొంతుకు అడ్డంపడి ఊపిరి ఆడలేదు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నిరిక్షణ్‌ను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నిరిక్షణ్‌ మృతి  చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు తీవ్ర శోకంలోకి వెళ్లిపోయారు. 

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో  రోగి మృతి చెందాడు. అనంతపురానికి చెందిన వడ్డె ములగప్ప కడుపునొప్పితో 18వ తేదీ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు శుక్రవారం రోజున ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ తరువాత డాక్టర్లు పట్టించుకోలేదని మృతుడి బంధువులు అంటున్నారు.  రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని.. డాక్టర్లు నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.  

 

14:07 - November 1, 2017

ఢిల్లీ : లా లీగాలో పవర్‌ ప్యాకెడ్‌ రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టుకు 10వ లీగ్‌ మ్యాచ్‌లో గిరోనా క్లబ్‌ దిమ్మతిరిగే షాకిచ్చింది.  క్రిస్టియానో రొనాల్డో , గెరాత్‌ బేల్‌, ఎసెన్సియో, సెర్జియో రామోస్‌, కరీమ్‌ బెంజమా  వంటి స్టార్ స్ట్రైకర్లున్నా రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టుకు ఓటమి తప్పలేదు.ఆట 12వ నిమిషంలో ప్రాన్సిస్కో ఇస్కో గోల్‌తో శుభారంభం చేసిన రియల్‌ మ్యాడ్రిడ్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. సెకండ్‌ హాఫ్‌ గిరోనా క్లబ్‌ ఆటగాళ్ల జోరు ముందు రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టు తేలిపోయింది. 54వ నిమిషంలో ఫార్వర్డ్‌ స్టువానీ ఈక్వలైజర్‌ గోల్‌తో పోటీలో నిలిచిన  గిరోనా ...ఆ తర్వాత 58వ నిమిషంలో పోర్చుగ్వెస్‌ మంజానెరా గోల్‌తో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఈక్వలైజర్‌ గోల్‌ కోసం రియల్‌ మ్యాడ్రిడ్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఎంతగా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది.ఈ ఓటమితో రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టు  లా లీగా పాయింట్స్‌ టేబుల్లో 3వ స్థానానికే పరిమితమైంది. 

 

14:04 - November 1, 2017

హైదరాబాద్ : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.  రేట్లు వింటుంటే... కళ్లు బైర్లు కమ్ముకుంటున్నాయి. కారణమేదైనా అన్ని వెజిటేబుల్స్‌ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. పండ్ల ధరలు వాటితో పోటీ పడుతున్నాయి. దీంతో నగర వాసుల జేబులకు చిల్లుపడుతుంటే... కర్రీ పాయింట్‌ నిర్వాహకులు  కుదేలవుతున్నారు. భాగ్య నగరంలో పెరిగిన కూరగాయల ధరలపై ప్రత్యేక కథనం. 

హైదరాబాద్‌ నగరంలో సామాన్యుల కూరగాయల బడ్జెట్‌ తలకిందలవుతోంది.  ఆకాశాన్ని అంటిన కూరగాయల ధరలు మధ్య తరగతి, సామాన్య ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. పెరిగిన ధరలతో... కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియక నగరవాసులు  సతమతం అవుతున్నారు.  

నెలరోజుల వ్యవధిలోనే  కూరగాయల ధరలు ఒకటి, రెండు రెట్లు పెరిగాయి. టమోట ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. వంకాయ, ఉల్లి ధరలు కిలో 50 రూపాయలు దాటింది.  దీంతో కొనాలంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నగరవాసులు అంటున్నారు.

కూరగాయల ధరల సెగ... నగరంలోని కర్రీ పాయింట్లకు తాకింది. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో... కర్రీ పాయింట్లలోనూ ధరలు పెంచేస్తున్నారు. దీంతో కొనుగోలు తగ్గి... కర్రీ పాయింట్స్‌ నడకపలేకపోతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. తమ వ్యాపారం బాగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇలా అయితే బతకడం కష్టమని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి.. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకోవడంతో ధరలు విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది.

14:02 - November 1, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న దీక్షకు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని తమ్మినేని తెలిపారు.  

14:00 - November 1, 2017

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో  రోగి మృతి చెందాడు. అనంతపురానికి చెందిన వడ్డె ములగప్ప కడుపునొప్పితో 18వ తేదీ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు శుక్రవారం రోజున ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ తరువాత డాక్టర్లు పట్టించుకోలేదని మృతుడి బంధువులు అంటున్నారు.  రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని.. డాక్టర్లు నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.  

13:58 - November 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు కుమ్మరి రేవు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బొమ్మను మింగి ఓ బాలుడు మృతి చెందాడు. మీసాల నిరిక్షణ్‌ అనే నాలుగేళ్ల బాలుడు తినుబండారాల ప్యాక్‌ కొని తింటుండగా.. అందులోని బొమ్మ గొంతుకు అడ్డంపడి ఊపిరి ఆడలేదు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నిరిక్షణ్‌ను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నిరిక్షణ్‌ మృతి  చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు తీవ్ర శోకంలోకి వెళ్లిపోయారు. 

13:56 - November 1, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.. జలవనరుల శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్‌ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డి  సస్పెండ్‌ చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయంలో న్యాయశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను కూడా అధికారులు సస్పెండ్‌ చేశారు. సచివాలయంలో జరుగుతున్న పరిణామాలపై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. 

13:55 - November 1, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. దీని వలన వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. దీనికి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ సమాధానమిస్తూ... బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయం నిర్మించి తీరతామని స్పష్టం చేశారు. దీనిని నిరసిస్తూ బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. 

 

13:52 - November 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాయలం అంత చెత్త సెక్రటేరియట్‌ దేశంలో ఎక్కడాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంపై కొత్త సచివాలయం నిర్మాణంపై జరిగిన చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాయలం నిర్మించి తీరతామని చేశారు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌, కళాభారతి, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు అవుతుందని అసెంబ్లీలో చెప్పారు. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాలయం నిర్మాణం మంచిదో.. కాదో... ప్రజలే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అనుమతులు రాగానే ప్రధాని మోదీ చేతులు మీదుగా పునాదిరాయి వేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానంలో  అద్భుతమైన కొత్త భవనం  నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో  మైదనాంలో కొత్త సచివాలయం నిర్మాణంపై చర్చ సందర్భ ఏపీ ప్రణాళికలు, కర్నాటక విధానసౌధ విషయాలను ప్రస్తావించారు. 

 

13:49 - November 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాయలం అంత చెత్త సెక్రటేరియట్‌ దేశంలో ఎక్కడాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంపై కొత్త సచివాలయం నిర్మాణంపై జరిగిన చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాయలం నిర్మించి తీరతామని చేశారు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌, కళాభారతి, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు అవుతుందని అసెంబ్లీలో చెప్పారు. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాలయం నిర్మాణం మంచిదో.. కాదో... ప్రజలే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అనుమతులు రాగానే ప్రధాని మోదీ చేతులు మీదుగా పునాదిరాయి వేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 

అకాల వర్షాలతో రైతులకు నష్టం : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులకు నష్టం కలిగిస్తున్నాయిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలసిన భాద్యత ప్రభుత్వానిదని అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. రైతులకు ప్రభుత్వం తోడుగా నిలవాలన్నారు. రైతులకు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు పంటలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలలో రైతులకు బోనస్ లను ఇస్తున్నారని, మన ప్రభుత్వం రైతులకు బేడిలు వేస్తుందన్నారు. విత్తన రాయితీపై ప్రభుత్వం ఎంత వెచ్చించింది తెలపాలని పేర్కొన్నారు.
కల్తీ విత్తనాల వల్ల రైతులు మోసపోతున్నారని తెలిపారు. 

13:42 - November 1, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాల రైతులకు నష్టం కలిగిస్తున్నాయిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలసిన భాద్యత ప్రభుత్వానిదని అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలన్నారు.  రైతులకు ప్రభుత్వం తోడుగా నిలవాలన్నారు. రైతులకు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు పంటలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలలో రైతులకు బోనస్ లను ఇస్తున్నారని, మన ప్రభుత్వం రైతులకు బేడిలు వేస్తుందన్నారు. విత్తన రాయితీపై ప్రభుత్వం ఎంత వెచ్చించింది తెలపాలని పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు మోసపోతున్నారని తెలిపారు. 

ఐపీఎస్ కరీం కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ : ఐపీఎస్ సఫీర్ కరీం కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. నిన్న కరీం భార్య జాయిస్, లా ఎక్స్ లెన్సీ నిర్వాహకుడు రాంబాబును ఆరు గంటలపాటు పోలీసులు విచారించారు. రాంబాబు కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. 

13:24 - November 1, 2017

హైదరాబాద్ : ఐపీఎస్ సఫీర్ కరీం కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. నిన్న కరీం భార్య జాయిస్, లా ఎక్స్ లెన్సీ నిర్వాహకుడు రాంబాబును ఆరు గంటలపాటు పోలీసులు విచారించారు. రాంబాబు కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:14 - November 1, 2017

హైదరాబాద్ : నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేస్తున్నామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. కావాలనే ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి పూనుకుంటుందని తెలిపారు. కొత్త సచివాలయం కోసం రూ.500 కోట్లు వృధా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలను జీవనం వెల్లదీస్తున్నారని వారిని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని యధాతధంగా ఉంచాలన్నారు. ఇప్పుడున్న సచివాలయం నుంచే పరిపాలన కొనసాగించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:03 - November 1, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్..తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. వాస్తు దోషం పేరుతో సచివాలయాన్ని కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర, హైదరాబాద్ నగర ప్రజలను సీఎం అవమాన పరిచారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కోట్లు ఖర్చు పెడతానంటున్న సీఎంకు పత్తిరైతు గోడు కనిపించడం లేదా అని అన్నారు. పత్తి పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చేయొచ్చు కదా అన్ని సూచించారు. రైతులు ముఖ్యమా, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం ముఖ్యమా అంటే సచివాలయమే ముఖ్యమని సీఎం అంటున్నారని తెలిపారు. సచివాలయానికి రాని సీఎంకు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. బైసన్ పోలో గ్రౌండ్ ను కాపాడేందుకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం తప్పుదొవపట్టిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ కు ఓటు వేసింది 34 శాతం ప్రజలు మాత్రమే అన్న విషయం గుర్తించాలన్నారు. 

 

12:55 - November 1, 2017

హైదరాబాద్ : ఇప్పుడున్న సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలయం అవసరామా అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం, అసెంబ్లీని కూలగొడుతానని సీఎం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. శాసనసభను, శాసన సభ్యులను అగౌరవపరిచే విధంగా సీఎం మాట్లాడారని చెప్పారు. ప్రగతి భవన్ పేరుతో కొత్త భవనం కట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాచరికపు ఆలోచన చేస్తూ.. వితండ వాదన చేస్తున్నారని చెప్పారు. 'మీకు తెలివిలేదని సభ్యులను ఉద్ధేంచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు లేవని..
వాటికి సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. కనీస వసతులు లేవని...వాటిని కల్పించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు.

 

సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ : ఇప్పుడున్న సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలయం అవసరామా అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం, అసెంబ్లీని కూలగొడుతానని సీఎం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. శాసనసభను, శాసన సభ్యులను అగౌరవపరిచే విధంగా సీఎం మాట్లాడారని చెప్పారు. ప్రగతి భవన్ పేరుతో కొత్త భవనం కట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాచరికపు ఆలోచన చేస్తూ.. వితండ వాదన చేస్తున్నారని చెప్పారు. 'మీకు తెలివిలేదని సభ్యులను ఉద్ధేంచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు లేవని.. వాటికి సొంత భవనాలు నిర్మించాలని అన్నారు.

12:43 - November 1, 2017

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లి బీసీ సమీకృత గృహంలో దారుణం జరిగింది. సిబ్బంది 2 రోజుల క్రితం శీతల పానియాల్లో మద్యం కలిపి విద్యార్థులకు పట్టించారు. ఈ విషయంపై బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి పైడిరాజు విచారణ చేశారు. విద్యార్థులతో బలవంతంగా మద్యం తాగించడం నిజమేనని విచారణాధికారి తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:40 - November 1, 2017

హైదరాబాద్ : సీఎం బుల్డోజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. గతంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. గొప్పగా ఏషియన్ గేమ్స్ జరిగాయిని తెలిపారు. మీరు వచ్చిన తర్వాత జరగలేదంటే అది మీ నిర్వాకమని టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఉద్ధేంచి వ్యాఖ్యానించారు. తాము ప్రజల వైపు మాట్లాడుతున్నామని, ప్రజల స్థాయిలో మాట్లాడుతున్నామని చెప్పారు. 'మీరు మేధావులు కావచ్చు.. మీకే తెలివి ఉండొచ్చు' అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు. రాజీవ్ రహదారి విస్తరణకు తమకు అభ్యంతరం లేదన్నారు. కొత్త సచివాలయం నిర్మాణం అయ్యే వరకు సెక్రటేరియట్ కు రానంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:25 - November 1, 2017


హైదరాబాద్ : తెలంగాణ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో తెలంగాణ సచివాలయమే చెత్తది అన్నారు. సచివాలయం నిర్మాణంలో నిబంధనలు పాటించలేదన్నారు. సెక్రటేరియట్ లోని ఏ భవనానికి కూడా అనుమతులు లేవన్నారు. అగ్నిమాపక నిబంధనలకు అనుగుణంగా సచివాలయం లేదని చెప్పారు. వాస్తుదోషం పేరుతో కొత్త సచివాలయం నిర్మిస్తున్నామనడం సరికాదని తెలిపారు. క్రీడల పేరుతో బైసన్ పోలోమ గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. హైదరాబాద్ లో ఉన్న క్రీడా మైదానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నామా అని అన్నారు. యాసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియాన్ని వాడుకుంటున్నామా అని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. కొత్త సచివాలయానికి రూ.180 కోట్లు ఖర్చ అవుతుందని తెలిపారు. ఇప్పుడున్న సచివాలయాన్ని ప్రజా అవసరాల కోసం వాడుతామని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాలో 151 ఎకరాలు కావాలని రక్షణ శాఖను అడిగామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. సచివాలయం, అసెంబ్లీ, కళా భారతి, హెచ్ వోడీ కార్యాలయాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. 

 

11:58 - November 1, 2017

ఢిల్లీ : లా లీగాలో స్టార్‌ స్టడ్డెడ్‌ క్లబ్‌ బార్సిలోనా జట్టు జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.10వ లీగ్‌ మ్యాచ్‌లో స్టార్‌ స్ట్రైకర్‌ లయనెల్‌ మెస్సీ  మ్యాజిక్‌తో పాటు  బ్రెజిల్‌ సెన్సేషన్‌ పౌలిన్హో  గోల్‌తో అథ్లెటిక్‌ బాల్బావో క్లబ్‌పై బార్సిలోనా సునాయాస విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన బార్సిలోనా ...36వ నిమిషంలో స్టార్‌ స్ట్రైకర్‌ లయనెల్‌ మెస్సీ గోల్‌తో శుభారంభం చేసింది. సెకండ్‌ హాఫ్‌లోనూ బార్సిలోనాకు పోటీనే లేకుండా పోయింది.అథ్లెటిక్‌ బాల్బావో క్లబ్‌ ఆటగాళ్లకు అసలేమాత్రం అవకాశమివ్వకుండా బార్సిలోనా ప్లేయర్స్‌ డామినేట్‌ చేశారు.92వ నిమిషంలో పౌలిన్హో   కళ్లు చెదిరే గోల్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి 2-1 గోల్స్‌తో  నెగ్గిన బార్సిలోనా జట్టు బిల్బావో క్లబ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో బార్సిలోనా జట్టు లా లీగా పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకుంది. 

 

11:30 - November 1, 2017

అమెరికా : న్యూయార్క్‌ లో ఉగ్ర దాడి జరిగింది. ముష్కురుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. డబ్ల్యుటీసీ వద్ద ట్రక్కు జనంపైకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని సేపుల్లో సైపోవ్‌గా గుర్తించారు. 2010లో అమెరికా వచ్చి, ఫ్లోరిడాలో నివసిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  ప్రమాదం ఉగ్రవాద దాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో  ప్రకటించారు. ఈ ఘటన తర్వాత న్యూయార్క్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు హ్యాండ్‌ గన్లు, పెల్లెట్‌ గన్‌, బాల్‌ గన్‌  స్వాధీనం చేసుకున్నారు. బీభత్సం సృష్టించిన ట్రక్కు నుంచి  ఐసీస్‌ లేఖ స్వాధీనం చేసుకున్నారు.  న్యూయార్క్‌ ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశం మీ వెంటే ఉంటుందని ట్రంప్‌ ట్వీట్ చేశారు. ఉగ్రవాది దాడిన ప్రధాని మోదీ ఖండించారు. 

నిరాహారదీక్ష కొనసాగిస్తున్న కోదండరామ్‌

హైదరాబాద్ : కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం మొదలైన దీక్ష... ఇవాళ మధ్యాహ్నం వరకుకొనసాగనుంది. ఇక కోదండరామ్‌కు దీక్షకు పలువురు నేతలు మద్దతు తెలిపారు. దీక్షాస్థలం వద్దకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. 

11:24 - November 1, 2017

హైదరాబాద్ : కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం మొదలైన దీక్ష... ఇవాళ మధ్యాహ్నం వరకుకొనసాగనుంది. ఇక కోదండరామ్‌కు దీక్షకు పలువురు నేతలు మద్దతు తెలిపారు. దీక్షాస్థలం వద్దకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:22 - November 1, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని భీమవరంలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... బెదిరింపు కాల్‌ నెంబర్‌గా నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నరు. చెడు వ్యసనాలకు బానిసై.. డబ్బు కోసం ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

 

11:17 - November 1, 2017

గుంటూరు : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఎల్‌ఎన్‌జీ ఆపరేటరుగా ఉన్న ఉడ్‌సైడ్‌ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది.  కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌లో పాలుపంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.  నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్‌ బృందం... ఇందుకు ఆసక్తిని తెలియపర్చింది. 
ఉడ్‌సైడ్‌ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు భేటీ
ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఉడ్‌సైడ్‌ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఉడ్‌సైడ్‌ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  కాకినాడలోని ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌ నిర్మాణంలోపాలు పంచుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.  ఏపీలో వృద్ధిరేటు ప్రోత్సాహకరంగా ఉండడం.. పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టడాన్ని గమనంలో ఉంచుకుని ఈ రంగంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ రెయిన్‌హార్డ్‌ మ్యాటిసన్‌ ముఖ్యమంత్రికి తెలియజేశారు.  ఏపీలోని గోదావరి ప్రాంతానికి చెందిన మూర్తి ఎర్రంకి... ఈ సంస్థకు సాంకేతిక విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు ఆయనను అభినందించారు. టెర్మినల్‌ ఏర్పాటుకు ఆస్ట్రేలియన్‌ ఎల్‌ఎన్‌జీ దిగ్గజం ముందకురావడం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు  అన్నారు.  రానున్న కాలంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు, రాష్ట్రానికి విరివిగా రానున్నందను కోల్డ్‌ ఎనర్జీ అవసరాలు విస్తృతం కానున్నాయని చెప్పారు.
చమురు, సహజవాయు రంగంలో ఉడ్‌సైడ్‌కు 60ఏళ్ల అనుభవం
చమురు, సహజవాయు రంగంలో 60ఏళ్ల అనుభవం ఉన్న అతిపెద్ద ఆస్ట్రేలియన్‌ స్వతంత్ర సంస్థ ఉడ్‌సైడ్‌ ఎనర్జీ లిమిటెడ్‌. ఈ సంస్థ ఇప్పుడు ఏపీలో దాదాపు 8వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశమున్నట్టు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్‌ చెప్పారు. 1200 మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వివరించారు.
ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ
ఏపీలో చేపట్టిన ఐదు ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించడానికి ఏసియన్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ఇన్వెస్టుమెంట్‌ బ్యాంకు ముందుకొచ్చింది.  కేంద్రం సూచనల మేరకు ఏపీకి 2బిలియన్‌ యూఎస్‌ డాలర్లమేర ఆర్థికసాయం అందించేందుకు బ్యాంక్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.  బ్యాంక్‌ అధికారుల బృందం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమై చర్చించింది.

 

11:15 - November 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న జేఏసీ పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. నిరుద్యోగ సమస్యలపై జేఏసీ తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ కోదండరాం దీక్షకు దిగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ ఆందోళన కొనసాగించి తీరతామంటోన్న కోదండరాంతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:09 - November 1, 2017

కృష్ణా : విజయవాడలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరాహార దీక్షపై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను చర్చలకు పిలిచారు. ధర్నా చౌక్ నుంచి సీఎం వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు బయల్దేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:06 - November 1, 2017

హైదరాబాద్ : నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాయి. రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాను చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:47 - November 1, 2017

గుంటూరు : కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగనుంది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలుపై సమీక్ష చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, జగన్ పాదయాత్రపై చర్చించే అవకాశం ఉంది. 

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగనుంది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలుపై సమీక్ష చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, జగన్ పాదయాత్రపై చర్చించే అవకాశం ఉంది. 

 

10:18 - November 1, 2017

హైదరాబాద్ : నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అయ్యాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాయి. రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇవాళ రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలపై స్వల్ప చర్చ జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రారంభమైన టీ.అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాయి. 
రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

కాసేపట్లో నాలుగో రోజు టీ.అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : కాసేపట్లో నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలపై స్వల్ప చర్చ జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

టీ.అసెంబ్లీలో పలు అంశాలపై విపక్షాలు వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : కాసేపట్లో నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలపై స్వల్ప చర్చ జరుగనుంది. 

09:52 - November 1, 2017

హైదరాబాద్ : కాసేపట్లో నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. రేషన్ రద్దు ప్రతిపాదన, పంటలకు మద్దతు ధర కోసం టీడీపీ, దళితులకు సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, మూడు ఎకరాల భూ పంపిణీపై బీజేపీ, 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలపై స్వల్ప చర్చ జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:43 - November 1, 2017

హైదరాబాద్ : నగరంలోని వీఎస్ టీ దగ్గర బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రిన్స్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

 

09:35 - November 1, 2017

టీసర్కార్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్  పాల్గొని, మాట్లాడారు. టీఅసెంబ్లీలో బలహీన పార్టీలపై అధికార పక్షం దాడి చేస్తోందన్నారు. కొలువుల కొట్లాట సభ, ఉద్యోగాలు భర్తీ తదితర అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేటి నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

కరీంనగర్ : అంబేద్కర్ స్టేడియంలో నేటి నుంచి ఈనెల 10 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. 31 జిల్లాల నుంచి 49 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు : నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. పోలవరం,ఏపీఐసీసీకి భూకేటాయింపులు, సీఆర్డీఏకు భూములు కేటాయింపులపై చర్చించనున్నారు. 

న్యూయార్క్ లో ట్రక్కుతో ముష్కరుడు బీభత్సం

అమెరికా : న్యూయార్క్ లో ఉగ్రదాడి జరిగింది. ట్రక్కుతో ముష్కరుడు బీభత్సం సృష్టించాడు. డబ్ల్యూటీసీ వద్ద జనంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

09:17 - November 1, 2017

అమెరికా : న్యూయార్క్ లో ఉగ్రదాడి జరిగింది. ట్రక్కుతో ముష్కరుడు బీభత్సం సృష్టించాడు. డబ్ల్యూటీసీ వద్ద జనంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పెల్లెట్ గన్, రెండు హ్యాండ్ గన్లు, బాల్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీభత్సం సృష్టించిన ట్రక్ నుంచి ఐసీస్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని సేపుల్లో సైపోవ్ గా పోలీసులు గుర్తించారు. సేపుల్లో సైపోవ్ 2010లో అమెరికా వచ్చి ఫ్లోరిడాలో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది ఉగ్రవాద దాడే అని న్యూయార్క్ బిల్ డీ బ్లాసియో వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ ఉగ్రదాడిని ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ.20 మ్యాచ్

ఢిల్లీ : నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ.20 మ్యాచ్ జరుగనుంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి నాగార్జున సాగర్..శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం

నల్లగొండ : నేటి నుంచి నాగార్జున సాగర్..శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు సాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ వెళ్లనుంది. 

సికింద్రాబాద్ లో నేడు, రేపు ప్రత్యేక పాస్ పోర్టు అదాలత్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో నేడు, రేపు ప్రత్యేక పాస్ పోర్టు అదాలత్ జరుగనుంది. పాస్ పోర్టు పొందడంలో ఎదురైన సమస్యలను ఆర్పీవో ఆఫీస్ లో అధికారులు పరిష్కరించనున్నారు. ఉదయం 9.30 గం.ల నుంచి మ.12.30 గం.ల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 

 

07:25 - November 1, 2017

స్థానిక సంస్థలలో ఉన్న బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఎంబీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. స్థానిక సంస్థలలో ఉన్న బీసీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే డిమాండ్‌ ఇప్పుడు చాలా బీసీ కులాల నుండి విన్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో అమలులోకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా, మొత్తం 113 బీసీ కులాల్లో దాదాపు 100 కులాలకు పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లభించలేదన్నది వారి వాదన. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు వర్గీకరణ జరిగితేనే తమకు సరైన న్యాయం జరుగుతుందని వారు చెప్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:21 - November 1, 2017

హైదరాబాద్ : ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ... సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. భన్వర్‌లాల్ ప్రభుత్వానికి 4 లక్షల 37వేల 500 రూపాయలు బకాయి పడ్డారు. ప్రభుత్వ బంగ్లాను దుర్వినియోగం చేశారని గతంలో భన్వర్‌లాల్‌కు 17 లక్షల మేర జరిమానా విధించారు. ఈ జరిమానాను ప్రభుత్వం కుదించింది. కుదించిన మొత్తాన్ని కూడా భన్వర్‌లాల్ ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

07:18 - November 1, 2017

తూ.గో : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట మార్చిన బీజేపీ, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన మహిళా కాంగ్రెస్ సదస్సులో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో రాక్షసరాజ్యం నడుస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు పేరును పోలవరంగా మార్చాలనుకోవడం సరికాదన్నారు. 

 

07:15 - November 1, 2017

హైదరాబాద్ : ఐఏఎస్‌...అతని లక్ష్యం..ఆ లక్ష్యమే అడ్డదారులు తొక్కించింది...చివరకు నేరస్థుడిని చేసింది....అతను ఓ ఐపీఎస్...సివిల్ టాపర్ కూడా...అయినా అతని సంకల్పం నెరవేర్చుకునేందుకు చేసిన తప్పు నడివీధిలో నిలబెట్టింది. ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యం పెట్టుకుని అడ్డదారులు తొక్కిన ఐపీఎస్‌ షఫీర్‌ కరీంను చెన్నైలో అరెస్టు చేయగా...ఆయనకు పరీక్షల్లో సహకరించిన భార్య జోయస్ ఏంజియాను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు...పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్ చేస్తూ చిక్కడంతో వెంటనే హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు..దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కరీం భార్యను అదుపులోకి తీసుకున్నారు..అయితే అప్పటికే చెన్నై నుంచి ప్రత్యేక పోలీసు బృందం కూడా చేరింది...ఆమెను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో హాజరుపర్చారు...
సివిల్‌ టాపర్‌ అయినా సంతృప్తి లేక...
ఇతని పేరు షఫీర్‌ కరీం. కేరళ రాష్ట్రానికి చెందిన ఇతను 2014లో ఐపీఎస్‌ సాధించాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలిలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  షఫీర్‌ కరీంకు ఐఏఎస్‌ అవ్వాలన్నది లక్ష్యం.  ఐపీఎస్‌ అయినా ఆయన సంతృప్తి చెందలేదు. ఐఏఎస్‌ సాధించాల్సిందేనని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. 
పరీక్షలో కాపీయింగ్‌కు  పాల్పడిన యువ ఐపీఎస్‌ ఆఫీసర్‌
ప్రస్తుతం దేశంలోని 24 నగరాల్లో యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలు జరుగుతున్నాయి..నవంబర్‌ 3 వరకు జరిగే ఈ పరీక్షల్లో 763 మంది పాల్గొంటున్నారు. అయితే చెన్నై ఎగ్మోర్‌ గవర్నమెంట్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో షఫీర్‌ కరీం మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యాడు. ఈ పరీక్షలో ఈ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన యూపీఎస్సీ అధికారులే షాక్‌కు గురయ్యాడు.
బ్లూటూత్‌ ద్వారా సమాధానాలు చేరవేసిన కరీం భార్య జియా
హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్‌ ఐఏఎస్‌ అకాడమీ నుంచి షఫీర్‌ కరీం భార్య జోఎసి ఎన్‌ జియా బ్లూటూత్‌ డివైస్‌ ద్వారా సమాధాలు చేరవేసింది...పక్కా ప్లాన్‌తో పాటు ముందుగానే అత్యాధునీక టెక్నాలజీతో కరీం ఏర్పాటు చేసుకున్నాడు..ఇది గమనించిన ఇన్విజిలెటర్‌ కరీంను పరీక్ష హాల్‌ నుంచి బయటకు పంపారు... ఉన్నతాధికారులు కరీంను ఎగ్జామ్‌ను నుంచి డిటెండ్‌ చేశారు. అంతేకాదు.. అతనిపై ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కరీం భార్యను హైదరాబాద్ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు...

 

న్యూయార్క్ లో దూసుకెళ్లిన జనంపైకి బస్సు

అమెరికా : న్యూయార్క్ లో జనంపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. 

న్యూయార్క్ లో దూసుకెళ్లిన జనంపైకి బస్సు

అమెరికా : న్యూయార్క్ లో జనంపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. 

Don't Miss