Activities calendar

02 November 2017

వలస విధాన చట్టాలు మరింత కఠినతరం...

ఢిల్లీ : న్యూయార్క్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. 

సత్తా చాటిన ప్రియాంక చోప్రా...

ఢిల్లీ : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరోసారి తన సత్తా చాటింది. ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా-2017లో టాప్‌-100లో చోటు దక్కించుకుంది. 

21:30 - November 2, 2017

ఢిల్లీ : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరోసారి తన సత్తా చాటింది. ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా-2017లో టాప్‌-100లో చోటు దక్కించుకుంది. ప్రియాంక చేస్తున్న అంతర్జాతీయ సినిమాలకు తోడు స్వచ్ఛంద కార్యక్రమాల వల్ల ఆమెకు ఆదరణ పెరిగిందని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అగ్రస్థానంలో నిలిచారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, వ్యాపారవేత్త, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత్‌ నుంచి చందా కొచ్చర్‌, రోషిణీ నడార్‌ మల్హోత్రా, కిరణ్‌ మజుందార్‌ షా, శోభనా భార్టియా జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా 97వ స్థానంలో నిలిచింది. 

21:29 - November 2, 2017

 

ఢిల్లీ : న్యూయార్క్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ట్రంప్‌ ప్రతిపాదించారు. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లోగా గుర్తించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. లాటరీ విధానానికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు లాటరీ పథకం రద్దు కోసం సత్వరమే కార్యాచరణ మొదలుపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరనున్నట్టు చెప్పారు.

 

21:27 - November 2, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు జీఎస్టీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రైతులపై భారం పడిందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి. ఢిల్లీలోని భగత్‌ సింగ్‌ పార్కు వద్ద రెండో రోజు కొనసాగుతున్న రైతుల మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. దేశంలో రైతులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలపై అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. 

21:26 - November 2, 2017

ఉత్తరప్రదేశ్‌ : రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన బాయిలర్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. 66 మంది గాయాలయ్యాయని అధికారులు లెక్కలు తేల్చారు. క్షతగాత్రులను ఉన్నావ్‌, బలరామ్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకంగా ఉంది. ప్రమాదం జరిగిన పవర్ ప్లాంట్ ను కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి రాజ్ కుమార్ సింగ్ సందర్శించారు. పేలుడులో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు 20 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఘటనకు కారణాలపై కమిటీ వేశామని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాజ్‌ కుమార్ సింగ్ తెలిపారు.

 

21:21 - November 2, 2017

హైదరాబాద్ : కేపీహెచ్‌బీలో దారుణం చోటుచేసుకుంది. అద్దెకు ఉంటున్నవారిపై ఇంటి ఓనర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రౌడీల సాయంతో ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని బంధించి.. ఇంటిని కూలగొట్టారు. కుక్కంటి మోహన్‌రెడ్డి.. 2015లో ప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర పది సంవత్సరాల ఎగ్రిమెంట్‌ చేసుకుని కూకట్‌పల్లి ఐదో రోడ్డులోని HIG -77లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి కోసం ఆరు లక్షలు కూడా ఖర్చు చేశారు. అయితే.. ప్రసాద్‌ వాళ్లకు తెలియకుండా.. ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి అమ్మివేశాడు. కొత్త ఇంటి ఓనరైనా శ్రీహరి.. ఆ ఇంటిని ఖాళీ చేయమని మోహన్‌రెడ్డి కుటుంబంపై ఒత్తిడి చేశాడు.. అయితే ఇల్లు ఖాళీ చేయడానికి వారు నిరాకరించారు. దీంతో గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో.. రౌడీల సాయంతో... ఇల్లును కూలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా .. వారు పట్టించుకోలేదని.. బాధితులు వాపోతున్నారు. 

జీహెచ్ంఎసీ అధికారులకు మేయర్ ఆదేశాలు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోని నాలాలపై తీవ్ర అడ్డంకిగా ఉన్న 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషన ర్ జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

నగరంలో ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ ఫ్లై ఓవర్, ఫీవర్ ఆసుపత్రి తదితర మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు బారులు తీరాయి. దీనితో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. 

21:03 - November 2, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం వేదిక కానుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగే మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆహ్వానసంఘాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు... ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరగబోయే సీపీఎం 22వ జాతీయ మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన సంఘం కమిటీ చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని, కోశాధికారిగా బి.వెంకట్‌తో పాటు పలువురు నేతలు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న ఏపీ సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ...పేదలకు ఇళ్ల స్థలాలకు భూములు లేవని, కార్పొరేట్లకు చౌకగా వందల ఎకరాల భూములు ప్రభుత్వం కట్ట బెడుతోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, విద్యుత్‌ పోరాటం వరకు ఎన్నో పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ అన్నారు. చారిత్రక హైదరాబాద్‌లో మహాసభలు జరగడం హర్షణీయమన్నారు. 

21:01 - November 2, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం వేదిక కానుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగే మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆహ్వానసంఘాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు... ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరగబోయే సీపీఎం 22వ జాతీయ మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన సంఘం కమిటీ చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని, కోశాధికారిగా బి.వెంకట్‌తో పాటు పలువురు నేతలు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..కేంద్రం, రాష్టంలో నియంతృత్వ పాలన సాగుతోందని పేర్కొన్నారు. దేశ, రాష్ట రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సీపీఎం జాతీయ మహాసభల్లో చర్చిస్తామన్నారు. ప్రజా పోరాటాలు, సమ్మెలపై అణచివేత,నిర్భందం సాగుతోందని..ప్రత్యామ్నాయ రాజకీయ విదానంతో ప్రజల్లోకి వెళతామన్నారు. హైదరాబాద్లో ఇంటింటికీ సీపీఎం నిర్వహిస్తామని, ప్రతి గడపకు వెళ్లి ప్రజల్ని కలుస్తామన్నారు.

20:59 - November 2, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం వేదిక కానుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగే మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆహ్వానసంఘాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు... ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరగబోయే సీపీఎం 22వ జాతీయ మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన సంఘం కమిటీ చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని, కోశాధికారిగా బి.వెంకట్‌తో పాటు పలువురు నేతలు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ...తెలంగాణ అభివృద్ది కోసం, స్పష్ట మైన ప్రణాళిక , ప్రత్యామ్నాయ విదానంతో సీపీఎం ముందుకు వెళుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రలో నడుస్తున్నది పాతకాలపు పెట్టుబడిదారి విధానం కాదని.. క్రోనీ క్యాపిటలిజమ్‌ నడుస్తుందని ఆరోపించారు. క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సీపీఎం పోరాడుతుందన్నారు. సాంస్కృతిక రంగాన్ని మతోన్మాదం వైపు నడిపించేందుకు సంఘ్‌ పరివార్‌ శక్తులు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. 

20:56 - November 2, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం వేదిక కానుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగే మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆహ్వానసంఘాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు... ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరగబోయే సీపీఎం 22వ జాతీయ మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన సంఘం కమిటీ చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని, కోశాధికారిగా బి.వెంకట్‌తో పాటు పలువురు నేతలు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ వలన అన్ని రంగాలు కుదేలయ్యాయని ధ్వజమెత్తారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఏమో గానీ ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల కోసమే పటేల్‌ కులస్థులను పొగుడుతున్నారని విమర్శించారు. గోరక్షక దళాల పేరుతో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. 

పుల్వామాలో జవాన్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందాడు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

20:38 - November 2, 2017

తెలంగాణల రైతులందరికి రుణమాఫీ అయ్యిందా..? రైతన్నలు అయ్యిందానే మీకు..?బాప్ ఏక్ నంబర్ బేటా దస్ నంబర్.. ఇప్పటికే అర్థంగావొచ్చు ముచ్చట ఎవ్వలి గురించి అనేది.. అదే కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ అజయ్..ఓ కల్వకుంట్ల తారక రామారావుగారూ.. నీకు ముందు ముందు ముసల్ల పండుగనే ఉన్నదట.. చేతులు గాలినంక ఆకులు వట్కున్నట్టే ఉన్నది.. చంద్రబాబు పరిస్థితి జూస్తుంటే.. పంట చేతికి రాకపోయినా సరే.. ప్రభుత్వం ఆదుకుంటదన్న భరోసా తెలంగాణల ఏ రైతుకన్న ఉన్నదా..? ఓ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారూ... ఏడున్నవో..? ఇగో నీ కోసం చేనేత కార్మికులు ఎదురు సూస్తున్నడు..నాయిని నర్సన్నా మన తెలంగాణల లా అండ్ ఆర్డర్ ఎట్లున్నదే అంటే.. పాపం ఆయనకు ఏమెర్కా.? కోర్టు తీర్పుల మీద పోలీసోళ్లకే నమ్మకం లేకపోతె ఇగ సామన్యా జనానికి ఏడ నమ్మబుద్దైతది చెప్పుండ్రి.. కొత్తగూడెం కాడ ఒక దొంగ సంఘం నాయకుని కథ..గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:45 - November 2, 2017

విశాఖపట్టణం : వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైసిపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ వన్‌ టౌన్‌ నుంచి సంపత్‌ వినాయక దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొండ రాజీవ్‌ గాంధీ పాల్గోన్నారు. ఈ నెల 6 నుంచి ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. 

19:43 - November 2, 2017

హైదరాబాద్ : దక్షిణ కొరియా గౌరవ హైదరాబాద్‌ కాన్సులేట్‌ జనరల్‌గా ఎంపికైన చుక్కపల్లి సురేష్‌... పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. సురేష్‌కి దక్కిన గౌరవానికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం-కోరియా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల అభివృద్ధి కోసం పూర్తి సహాయసహకారాలు అందిస్తామని సురేష్‌... మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. 

19:34 - November 2, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థలు మరోసారి వివాదాల్లోకి ఎక్కాయి. నారాయణ కాలేజీల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ బయటకి వచ్చిన ఆడియో టేప్‌ హల్‌చల్‌ చేస్తోంది. సహచర లెక్చరర్‌తో కళాశాల ప్రిన్సిపాల్‌ జరిపిన సంభాషణలు ఇప్పుడు బయటపడ్డాయి. కళాశాలలో విచ్చలవిడి వివాహేతర సంబంధాలు.. కళాశాల మహిళా ప్రిన్సిపాల్‌ ఆత్మహత్య విషయాలతో పాటు.. పెద్దనోట్ల రద్దు సమయంలో నోట్ల మార్పిడి అంశాలు ఆడియో టేపుల్లో ఉన్నాయి. 'శ్రమయేవ జయతే' క్యాప్షన్‌తో వచ్చిన నారాయణ విద్యాసంస్థలు అక్రమాలకు అడ్డాలుగా మారాయా? అనైతిక కార్యకలాపాలు, మహిళా సిబ్బందికి వేధింపులు ఈ సంస్థల్లో కామనా అంటే అవుననే సమాధానం వస్తోంది... అందులో పనిచేసే ఉద్యోగుల మాటలు వింటుంటే. నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలపై బయటపడ్డ ఆడియో టేపులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
 

ఆడియో టేపు సంభాషణలో లెక్చరర్‌ నవీన్‌ గౌడ్‌తో నారాయణ ప్రిన్సిపాల్‌ అనితా అగర్వాల్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో భారీగా నగదు మార్పించినట్లు ప్రిన్సిపాల్‌ టేపుల్లో వెల్లడించారు. సంస్థలో విచ్చలవిడి వివాహేతర సంబంధాలను ఈ టేపుల్లో ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే ఓ మహిళా ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆమె పోస్టుమార్టం రిపోర్టునూ మార్చేశారన్నారు. దీనంతటికీ సంస్థలోని రెండో ర్యాంక్‌ ప్రముఖుడే కారణమని తెలిపారు. సంస్థలో ఏదో జరగబోతోందంటూ ఆ మహిళా ప్రిన్సిపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు టేప్‌ వెల్లడికి బాధ్యుడంటూ లెక్చరర్‌ నవీన్‌గౌడ్‌పై నారాయణ సిబ్బంది దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈమేరకు నవీన్‌గౌడ్‌ ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. నారాయణ లాంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు.. ప్రాణాంతక బోధనతో విద్యార్థులను బలిగొంటున్నాయన్న ఆరోపణలు ఈ మధ్య బాగా ఎక్కువగా వెలువడుతున్నాయి. తాజాగా.. ఈ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా.. మానసిక ఒత్తడికి గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసి.. పైవారి ఒత్తిళ్ల కారణంగా కొలువులు మానేసిన వారూ ఎందరో ఉన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో తాము చాలా ఒత్తిడికి వేధింపులకు గురయ్యామని ఓ మాజీ ప్రిన్సిపాల్‌ తెలిపారు.

నారాయణ విద్యాసంస్థల్లోని అక్రమాలు, అనైతిక వ్యవహారాల గురించి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఆడియో.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. దీంతో.. ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ.. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, సోషల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం, రంగారెడ్డి బీసీ మహిళాసంఘం.. హైదరాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నారాయణ విద్యాసంస్థల్లోని ఆత్మహత్యలు, అక్రమాలు, చట్టవ్యతిరేక విషయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయా సంఘాల నేతలు వినతి పత్రంలో అభ్యర్థించారు. నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలపై రెండు తెలుగు రాష్ట్రాలు విచారణ జరుపుతాయో.. లేక ఇలాంటివి కామనే అంటూ వదిలేస్తారో చూడాలి. 

19:30 - November 2, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాల వైఖరి విడ్డూరంగా ఉందని.. మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీలో ఆక్షేపించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నీటిని ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా.. సాగునీటి ప్రాజెక్టులతోపాటు.. అద్దెగర్భం, విద్యుత్‌, పాడిపరిశ్రమ తదితర అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఐదవ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో.. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగింది. సభ ప్రారంభంలోనే మిడ్‌మానేరు ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. మిడ్‌ మానేరుకు నీటికొరతను ఎలా అధిగమిస్తారన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నకు.. మంత్రి హరీశ్‌రావ్‌ బదులిచ్చారు.

అద్దెగర్భాల అంశమూ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చట్టం తెచ్చే దిశగా ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రశ్నకు, వైద్యఆరోగ్య మంత్రి డాక్టర్ కె. లక్ష్మారెడ్డి బదులిస్తూ.. దీనిపై రిటైర్డ్‌ న్యాయమూర్తి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. అనుమతి లేని సంతాన సాఫల్య కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీజేపీ, 1998 డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని టీడీపీ.. విద్యా, వైద్య రంగాల్లో కార్పొరేట్‌ దోపిడిపై సీపీఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

తల్లికి విషమిచ్చి..

జగిత్యాల : కోరుట్ల మండలం గుమ్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక తల్లికి విషమిచ్చిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పరిస్తితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

'నారాయణ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలి'..

హైదరాబాద్ : అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం నేతలు నారాయణ, ప్రకాశ్ లు డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని, నారాయణ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. 

తలనీలాలపై రూ. 7.5 కోట్ల ఆదాయం -టిటిడి జేఈవో..

చిత్తూరు : తిరుమలలో తలనీలాలపైపై టిటిడికి రూ. 7.5 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి జేఈవో శ్రీనివాస రాజు తెలిపారు. ప్రతి నెల తొలి గురువారం ఈ వేలం ద్వారావ తలనీలాల విక్రయం జరుగుతుందన్నారు. 

19:10 - November 2, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు గోదవరిలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో అక్కా..తమ్ముడు ఉండడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏటపాక వద్దనున్న గోదావరి నదికి మేడువాయికి చెందిన ఎనిమిది మంది బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఇందులో అరుణ కుమారి, రాం ప్రసాద్ లు మడకం రాణిలున్నారు. తొలుత మడకం రాణి నీటిలోకి దిగింది. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో రాణిలో కొటుకపోయింది. ఇది చూసిన అరుణ కుమారి రక్షించేందుకు ప్రయత్నం చేయగా ఆమె కూడా కొట్టుకపోవడం..ఈమెను రక్షించేందుకు రాం ప్రసాద్ దిగడం..మొత్తంగా ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతైన వారి ఆచూకి కనుగొనేందుకు గజఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపులు చేపట్టారు. ఇంతవరకు ఎవరి ఆచూకీ లభించలేదు. 

టెర్రరిస్టులు..భారత బలగాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పుల్వామాలోని సాంబూర గ్రామంలో ఈ కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

18:45 - November 2, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిలో అమ్మవారి లడ్డూ ప్రసాదం ధరలు దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా అధికారుల అనాలోచిత నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో ఆలయానికి ఆదాయం తగ్గడం, భక్తుల రాకపోకలపై ప్రభావం చూపింది. ఈ విషయంపై 10 TV ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికారులు స్పందించారు. ఇంద్రకీలాద్రిలో లడ్డూ ప్రసాదం ధరలు తగ్గాయి. ఆలయ అధికారులు ఏడాది వ్యవధిలో భక్తులపై రెట్టింపు కంటే భారం మోపారు. ఆలయంలో అందించే అన్ని సేవల ధరలను అమాంతం రెట్టింపు చేశారు. భక్తుల మనోభావాలు, ఆలయ ప్రతిష్ట ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారులు వ్యవహరించిన తీరు కొంతకాలంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే అంతరాలయ దర్శనం టికెట్‌ ధరలతో భక్తులు బెంబేలెత్తిపోతుంటే లడ్డూ ప్రసాదాల రూపంలో అధికారులు మరింత భారం మోపారు. ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలున్నా భక్తులపై భారం వేస్తూ వస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఉపయోగపడే ప్రణాళిక చేయకపోగా, ధరలు పెంచేందుకు పాలక మండలి, ఆలయ అధికారులు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారని సాక్షాత్తు ఆలయ ఈవో సూర్యకుమారి చెప్పడం అనేక విమర్శలకు తావిస్తోంది.

2017 అక్టోబర్‌ 24న దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ గౌరంగబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలయ అధికారులు, ఈవో సూర్యకుమారి చేసిన పలు ప్రతిపాదనలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో లడ్డూ ధర 20, శ్రీ చక్ర లడ్డు ధర 100కు పెంచారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అధికారులు ఇష్టానుసారంగా పెంచడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ అధికారులు, పాలక మండలి, ఈవో అనుసరిస్తున్న విధానాలు భక్తులకు శాపంగా మారుతున్నాయి.

గతంలో దుర్గమ్మ దర్శనం టికెట్‌ ధరను 300ల నుండి 150 వరకు తగ్గించాలని భక్తులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఆలయ అధికారులు తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దేవస్థానం బస్‌ టికెట్‌, కేశకండన, లడ్డూ ప్రసాదం, శ్రీచక్రలడ్డూ, పార్కింగ్‌ ఫీజు ధరలను అమాంతం పెంచేందుకు మొగ్గు చూపారు. ఆలయ అధికారుల తీరుపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. ద్విచక్రవాహనానికి పార్కింగ్‌ ఫీజును 25 నుండి 10కి తగ్గించారు. లడ్డూ ప్రసాదం ధరను 20 నుండి 15కు తగ్గించారు. మిగితా ధరల విషయంలో మార్పు చేయలేదు. అయితే అంతరాలయ దర్శనం టికెట్ల ధరలను 300 నుండి 150 కి తగ్గించాలని భక్తులు కోరుతున్నారు.

18:42 - November 2, 2017

తూర్పుగోదావరి : ఆలయ వ్యవహారాలు వీధికెక్కుతున్నాయి. పాలకమండలి, అధికారుల్లో విభేదాలు పెరుగుతున్నాయి. ప్రసిద్ధ శనీశ్వరాలయంగా చెప్పుకునే తూర్పుగోదావరి జిల్లా, మందపల్లి దేవస్థానంలో పరిణామాలు చర్చనీయాంశాలవుతున్నాయి. అధికారులు విచారించి ఈవో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంతో పేరున్న ప్రముఖ శనీశ్వరాలయం. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని ఈ శనీశ్వరాలయానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రతీ శని త్రయోదశి రోజు ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల్లో సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈవో పని తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శనిత్రయోదశి సందర్భంగా శివునికి నూనెతో అభిషేకాలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు విశ్వాసంతో చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలను కొందరు ఆలయ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయిల్‌తో అభిషేకాలు కొందరు ఆన్‌లైన్‌ డబ్బులు చెల్లించి ఆలయ సిబ్బంది చేతుల మీదగా చేయించాలని కోరుతుంటారు. అలాంటి వారందరి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వాడేసిన నూనెను వినియోగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొబ్బరి తోట ఆదాయం విషయంలో కూడా ఈవో సహా మరి కొందరు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కమిటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఇటీవల చేసిన నిర్మాణాల విషయంలో కూడా భారీగా అక్రమాలకు తెరలేపినట్టు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాల మీద పలువురు అధికారులకు ఫిర్యాదు చేశామంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

పాలకమండలి సభ్యుల ఫిర్యాదులో ఇప్పటికే హుండీ లెక్కింపులో ఆలయ సొమ్ము పక్కదారి పట్టిందన్న దానిపై విచారణ జరిపారు. కానీ ఆధారాలు లభించలేదంటూ అధికారులు వ్యవహారాన్ని మసి పూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారని అంటున్నారు. కొందరి అక్రమాల వల్ల ఇప్పుడు ఆలయ ప్రతిష్టకే భంగం కలుగుతున్నట్టు పలువురు వాపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయడానికి తగినట్టుగా పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.

18:37 - November 2, 2017

ఢిల్లీ : ఇండియాగేట్ ప్రాంగణంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ, సీఐఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలు సంస్థల పెట్టుబడి దారులు, ఉత్పత్తిదారులు, విధాన రూపకర్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. ఏపీలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ప్రతినిధులకు చంద్రబాబు వివరించనున్నారు. ఏపీ స్టాల్‌లో 40 సంస్థల ఉత్పత్తులు ప్రదర్శనలో పెట్టనున్నారు. 

18:35 - November 2, 2017

రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలపై శాసన సభకు వెళ్లడం కంటే ప్రజా సభకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. అందుకోసమే అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు తెలిపారు. గతంలో చంద్రబాబు ఏవిధంగా అయితే ప్రజల్లోకి వెళ్లారో అదేవిధంగా జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తారని అంబటి స్పష్టం చేశారు. జక్కంపూడి రాజాపై దాడికి పాల్పడ్డ రామచంద్రాపురం ఎస్సైని వెంటనే సస్పెండ్‌ చేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

18:33 - November 2, 2017

గుంటూరు : పత్తికి పడుతున్న గులాబీ రంగు పురుగు తో రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కోరారు. ప్రభుత్వం నష్టనివారణకు చర్యలు చేపడతున్నట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్స్‌ ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగు ఎక్కువగా ఉందని.. మిల్లుల నుండి పురుగు బయటకు రాకుండా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు 1900 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్రం హెక్టార్‌కి కేవలం రూ.6800 రూపాయలు మాత్రమే ఇచ్చిందని.. సీఎం రైతుల కష్టాన్ని గుర్తించి రూ. పదిహేను వేల రూపాయలను ఇచ్చారని గుర్తుచేశారు. 

18:31 - November 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమైంది.ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10వ తేదీన జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే స్పష్టత వస్తుంది. దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.45 గం.కు శాసనసభ ప్రారంభం కానుంది. 10.30గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు పలు పెండింగ్ బిల్లులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. విశ్వ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి అదనపు అధికారం కల్పించే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. జల వనరుల శాఖ బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు పొందేందుకు ఉన్న రుణపరిమితిని తొలగించేందుకు కూడా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

నాలా పన్ను మినహాయింపు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు చేసేందుకు కట్టే నాలా పన్నును గణనీయంగా తగ్గించే దిశగా ఈ బిల్లు రూపొందనుంది. నిరుద్యోగ భృతి అమలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పోలవరం నిర్మాణం, రైతు రుణాల మాఫీ, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై కీలక చర్చలు చేపట్టాలని సర్కారు యోచిస్తొంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్షం వైసీపీ ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా సభను మలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

ఆశా వర్కర్లతో రాహుల్..

గుజరాత్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ధర్మాపూర్ లో పర్యటించిన ఆయన ఆశా వర్కర్లతో ముఖాముఖి నిర్వహించారు. 

ఒకటిన్నర ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..

ఢిల్లీ : రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒకటిన్నర ఏళ్ల బాలికపై 33 సంవత్సరాల కామాంధుడు లైంగిక దాడి చేసినట్లు ఓ జాతీయ ఛానెల్ వెల్లడించింది. అమన్ విహార్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కేసును రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీపీసీలో పేలుడుపై యూపీకి హెచ్చార్సీ నోటీసులు..

రాయ్ బరేలి : ఎన్టీపీసీ పేలుడు ఘటనలో ఎన్ హెచ్చార్సీ స్పందించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని సూచించింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు..క్షతగాత్రులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇందులో ఎలాంటి వైఫల్యం ఉండదని సూచించింది. 

గోదావరిలో ముగ్గురు గల్లంతు

ఖమ్మం : జిల్లా ఎటపాక వద్ద గోదావరి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. బట్టలు ఉతకదానికి వెళ్లిన 8 మందిలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బి.అరుణ కుమారి, బి.రాంప్రసాద్, మడకం రాణీ ఉన్నారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

డీజీపీకి వైసీపీ లేఖ..

విజయవాడ : ఏపీ డీజీపీ సాంబశివరావుకు వైసీపీ లేఖ రాసింది. నవంబర్ నెలలో జగన్ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారని..పాదయాత్రకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీపీసీలో రాజ్ కుమార్ సింగ్..

రాయబరేలి : ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ సందర్శించారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు..స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్టీపీసీలో పేలుడు ఘటనపై కమిటీ వేయడం జరిగిందని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

రాయబరేలీ ఎన్టీపీసీ సందర్శించిన రాజ్ కుమార్ సింగ్

లక్నో : రాయబరేలీ ఎన్టీపీసీ ప్లాంట్ ను కేంద్ర విద్యత్ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ సందర్శించారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

'తనవల్లే హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ'..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించలేదని, ప్రజలను చైతన్యవంతం చేయాలనే కారణంతో పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. కార్యకర్తలతో తన అనుబంధాన్ని ఎవరూ దూరం చేయలేరన్నారు. టిడిపి కుటుంబాన్నే ఎక్కువగా గౌరవిస్తానని, తనవల్లే హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ అయ్యిందన్నారు. రంగారెడ్డిలో 150 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయంటే ఆనాడు తాను చేసిన పునాదే కారణమన్నారు.

గోదావరిలో ముగ్గురు గల్లంతు..

ఖమ్మం : ఏటపాక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన 8మంది వెళ్లారు. బి.అరుణకుమారి, బి.రాం ప్రసాద్, మడకం రాణిలు గల్లంతైన వారిగా గుర్తించారు.

 

టీ.టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయధ్యక్షుడు చంద్రబాబు హాజరైయ్యారు. అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించలేదని, ప్రజలను చైతన్యం చేయాలనే లక్ష్యంతో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబు అన్నారు. 

17:40 - November 2, 2017

సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పై నెటిజన్లు తిట్ల వర్షం కురిపించారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రియాంక తన ఇన్ స్ట్రాగ్రామ్ ఓ ఫోటో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు దుమెత్తిపోశారు. ప్రియాంక తన కుటుంబ సభ్యులు ఇందిరా గాంధీతో కలిసి దిగిన ఫోటోను ఆమె పోస్టు చేయడం ఈ తిట్లకు కారణం. సిక్కులను ఉచకోత కోయించిన ఇందిరా గాంధీ ఫోటో పెడతావా అంటూ బుతులను కామెంట్ గా పెట్టారు నెటిజన్లు. ప్రియాంక ఈ తిట్లను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.  

17:24 - November 2, 2017

ఎల్ ఈడీ బల్బులు వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందని, చాల మంది ఎల్ ఈడీ బల్బులు వాడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎల్ ఈడీ బల్బులు వాడే ముందు మార్కెట్ పరిశోధన సంస్థ నీల్సన్ చేపట్టిన సర్వే గురించి తెలుకోవాల్సిందే. ఎల్ ఈడీ బల్బుల్లో 75శాతం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఎల్ ఈడీ లైట్లు లేవని ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైయింది. ముంబై, హైదరాబాద్, ఆహ్మదబాద్, న్యూఢిల్లీలోని 200రిటైలర్ అవుట్ లెట్లలో నిర్వహించిన ఈ సర్వేలో ఎల్ ఈడీ ఉత్పత్తులు ప్రమాదకరమని తేలింది. నాన్ బ్రాండెడ్ ఎల్ ఈడీ ఉత్పత్తులు మరింత ప్రమాదకరమని సర్వేలో పేర్కొంది. 48 శాతం ఎల్ ఈడీ కంపెనీలు తమ అడ్రస్ ను కూడా తేలపడంలేదని, మరో 31శాతం కంపెనీలు తయారీదారు ప్రస్తావించడంలేదని సర్వేలో వెల్లడైయింది.

17:21 - November 2, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి రైతు విలవిలలాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక..గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్తి రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని..ప్రత్తిని కొనుగోలు చేస్తామని మంత్రులు స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ ప్రత్తి రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామంలో ఐలయ్య అనే రైతు రెండెకరాల పొలం ఉంది. పొలంలో పత్తి పంట వేశాడు. చేతికి వచ్చిన పంట పంటను అమ్మడానికి ఎనుమాముల మార్కెట్ కు తీసుకెళ్లాడు. కానీ గిట్టుబాటు ధర రాకపోవడం..కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిలో ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ అందకపోవడం..పంట చేతికి వస్తుందన్న సమయంలో సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని నేతలు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో ధర రావడం లేదని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు..వామపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వం..అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

17:15 - November 2, 2017

హైదరాబాద్ : ఇల్లును ఖాళీ చేయరా...? అంటూ ఓ యజమాని ఏకంగా ఇల్లునే కూల్చివేశాడు. ఇంట్లో ఉన్న సామానును బయటకు విసిరేసి ఇంటిని కూల్చేయడంతో నిడువనీడ లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటన కేపీహెచ్ బి కాలనీలో చోటు చేసుకుంది. కేపీ హెచ్ బీ కాలనీలో ఓ ఇంటిని ప్రసాద్ దగ్గర నుండి మోహన్ రెడ్డి కిరాయి కోసం అగ్రిమెంట్ చేసుకున్నాడు. పది సంవత్సరాల క్రితం ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ ఈ ఇంటిని శ్రీహరికి ప్రసాద్ విక్రయించాడు. తాను ఇంటిని కొనడం జరిగిందని..ఇళ్లు ఖాళీ చేయాలని శ్రీహరి..మోహన్ రెడ్డికి ఆదేశించాడు. కానీ తమకు ఈ విషయం తెలియదని..పది సంవత్సరాల వరకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లడం జరిగిందని బాధితులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొంతమంది రౌడీషీటర్లతో ఇంటికి వచ్చిన శ్రీహరి ఇంటిలో ఉన్న సామానును బయటకు విసిరేసి ఇంటిని కూల్చివేయించాడు. ఎవరూ స్పందించలేదని, పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఇంటిని కూల్చివేసిన అనంతరం వారు వచ్చారని వాపోయారు. 

వరంగల్ లో రైతు ఆత్మహత్య

వరంగల్ అర్బన్ : జిల్లా హసన్ పర్తిలో మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంటనష్టం, గిట్టుబాటు ధర అందక కౌలురైతు ఐలయ్య్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐలయ్య పురుగుల మందు తాగడంతో ఆసుపత్రికి తరలించారు కానీ దారిలోనే అతని ప్రాణాలు పోయాయి. పత్తికి గిట్టుబాటు ధర రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

అమిత్ షాను కలిసిన సీకే బాబు

బెంగళూరు : బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షాను సీకే దంపతులు కలిశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. సీకే బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 

శ్రీధర్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్

హైదరాబాద్ : మాజీ మంత్రి శ్రీధర్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన గంజాయి కేసులో శ్రీధర్ బాబు బెయిల్ పిటిషన్ వేశారు.

ఉద్దవ్ ఠాక్రేతో మమతాబెనర్జీ భేటీ

ముంబై : శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో మమతాబెనర్జీ భేటీ అయింది. వారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. 

తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్ల పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్ : టీఆర్టీ నోటిఫికేషన్లపై దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కొంత మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. 

డీజీపీకి వైసీపీ లేఖ

గుంటూరు : డీజీపీ సాంబశివరావుకు వైసీపీ లేఖ రాసింది. ఈ నెల 6నుంచి జగన్ పాదయాత్ర వివరాలను వైసీపీ డీజీపీ తెలియజేసింది. మొత్తం 13 జిల్లాల్లో 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు వైసీపీ డీజీపీకి తెలియజేసింది. పాదయాత్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున తగిన భద్రత కల్పించాలని డీజీపీని వైసీపీ కోరింది.

కిడ్నాపైన టీడీపీ కౌన్సిలర్లు క్షేమం

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేటలో కిడ్నాపైన ఇద్దర్ మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు క్షేమంగా బయటపడ్డారు. కౌన్సిలర్లు శౌరి, ఏడుకొండలు ఇళ్లకు చేరుకున్నారు. చైర్మన్ అభ్యర్థి అనుచరులు తమను కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశంలో బంధించారని వారు పోలీసులుకు వాంగ్మూలం ఇచ్చారు.

15:55 - November 2, 2017

సినిమా : హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాహుబలి1,2 సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. బాహుబటి సినిమాలతో తర్వాత ప్రభాస్ మరో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రమే ''సాహో'’ ఈ సినిమాను దాదాపు రూ.150కోట్లతో తెరకెక్కిస్తున్నారు. చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో చేస్తున్నారు. సాహో ఫస్ట్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ యూఏఈకి షిప్ట్ అవుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది. 

15:38 - November 2, 2017

హైదరాబాద్ : సామాజిక దౌర్జన్యం.. ఆర్థిక దోపిడీపై ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక రంగాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ అనాలోచిత నిర్ణయాలైన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్ధుతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.  

15:34 - November 2, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థలు మరోసారి వివాదాల్లోకి ఎక్కాయి. నారాయణలో అనైతిక కార్యకలాపాలపై ఆడియో టేప్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర లెక్చరర్‌తో కళాశాల ప్రిన్సిపాల్‌ సంభాషణలు బయటపడ్డాయి. సంభాషణలో లెక్చరర్‌ నవీన్‌ గౌడ్‌తో నారాయణ ప్రిన్సిపాల్‌ అనితా అగర్వాల్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో భారీగా నగదు మార్పించినట్లు ప్రిన్సిపాల్‌ టేపుల్లో వెల్లడించారు. సంస్థలో విచ్చలవిడి వివాహేతర సంబంధాలనూ తెలిపారు. ఈ క్రమంలోనే ఓ మహిళా ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆమె పోస్టుమార్టం రిపోర్టునూ మార్చేశారని తెలిపారు. దీనంతటికీ సంస్థలోని రెండో ర్యాంక్‌ ప్రముఖుడేనని తెలిపారు. సంస్థలో ఏదో జరగబోతోందంటూ ఆ మహిళా ప్రిన్సిపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు టేప్‌ వెల్లడికి బాధ్యుడంటూ లెక్చరర్‌ నవీన్‌గౌడ్‌పై నారాయణ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో నవీన్‌గౌడ్‌ ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. నారాయణ కాలేజీ అనైతికతపై విచారణకు ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రజాసంఘాల నేతలు నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు పత్రం అందించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. 

నారాయణ విద్యాసంస్థలు మరోమారు వార్తల్లోకి ఎక్కాయి. ఈసారి సోషల్‌ మీడియాలో సంస్థలకు చెందిన ఓ ఆడియో టేప్‌.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ కళాశాల ప్రిన్సిపాల్‌.. సహచర వైస్‌ ప్రిన్సిపాల్‌తో జరిపిన ముచ్చట్లు.. అందులో సంస్థలో జరుగుతున్న అక్రమాలు, అనైతిక వ్యవహారాలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సంస్థకు చెందిన సెకెండ్‌ ర్యాంక్‌ ప్రముఖుడు.. తమ వద్దనున్న మహిళా ఉద్యోగినులతో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఓ మహిళా లెక్చరర్‌ ఆత్మహత్య చేసుకుందనీ ఈ ఫోన్‌ సంభాషణల్లో వెల్లడవుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఆడియో టేప్‌లోని ముఖ్యాంశాలు విందాం. 

15:32 - November 2, 2017

చిత్తూరు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ హీరో కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని.. ఉత్తరాదిన ఈ టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. హిందూ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అరికట్టడంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా విఫలమైందని కమల్ వ్యాఖ్యానించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:23 - November 2, 2017

మహిళగా రూపొందే కీలక దశ..కౌమార దశ..కిశోర దశలోని బాలికలను సాధికారిత దిశలో నడిపించడానికి సామాజిక అవగాహన చాలా అవసరం. ప్రస్తుతం సమాజంల నెలకొన్న పరిస్థితుల రీత్యా అది అత్యంత అవసరం కూడా. దేశ వ్యాపితంగా బాలికల పట్ల వివక్ష..అసమానత..చిన్న చూపు..లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ధోరణి సమాజ అభివృద్ధికి..మహిళా సాధికారితకు అవరోధం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 'కిశోర బాలిక'ల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు..వారి హక్కులను వారికి తెలియచేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలపై 'మానవి' స్పెషల్ ఫోకస్..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

15:15 - November 2, 2017

స్పోర్ట్స్ : భికరమైన ఫామ్ ఉన్న భారత్ జట్టు డాషింగ్ బ్యాట్స్ మెన్ కోహ్లి భారత్ తరుపు ఓ ఘనత సాధించాడు. కోహ్లి ఐసీసీ వన్డే ర్యాకింగ్ లో మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతని కెరీర్ లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి సచిన్ టెంటూల్కర్ ను అధిగమించాడు. దక్షణాఫ్రికా టాప్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్ కు అగ్రస్థానాన్ని కోల్పోయిన కోహ్లి పది రోజుల్లోనే తిరిగి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరిస్ లో మూడు వన్డేల్లో కోహ్లి 263 పరుగులు సాధించి 889పాయింట్లకు చేరుకున్నాడు. భారత్ తరుపు అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన క్రికెటర్ గా కోహ్లి రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు భారత్ తరుపు అత్యధిక పాయింట్లు సచిన్(887) పేరిట ఉంది. 

15:12 - November 2, 2017

సినిమా : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే తండ్రైన సంగతి అందరికి తెలిసిందే. తన కుమారుడికి తన అన్న పేరు కలిసి వచ్చే విధాంగా తన కుమారుడికి నామకరణం చేశాడు పవన్. పవన్ అన్నా లెనిజోవా దంపతులు పుట్టిన కుమారునికి పవన్ ''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల' అని నామకరణం చేశాడు. పేరు వినడానికి కొత్తగా ఉన్న ఈ పేరు గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

రష్యన్ అర్థోడక్స్ మత సాంప్రదాయలు పటించే పవన్ భార్య లెజీనోవా క్రైస్తవంలో మార్కస్ అనే దేవుడికి సంక్షిప్త రూపంగా మొదట మార్క్ అని అన్న చిరంజీవి అసలు పేరులో శంకర్ ని, పవన్ కళ్యాణ్ పేరు నుంచి పవన్ తీసి మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల అని పేరు పెట్టారు. 

15:01 - November 2, 2017

సినిమా : బాలీవుడ్ నటి టబు మళ్లీ తెలుగులో బిజీ కానున్నారు. ఒక్కప్పుడు తెలుగులో నటించిన ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం టబు నాగర్జున చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ, నాగ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ బ్యానర్ లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎంపిక అక్కినేకి వదిలేయడంతో ఆయన టబును ఒకే చేసినట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. టబు ఈ చిత్రంలోనే కాకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చ్రితంలో ముఖ్య పాత్ర కోసం టబును అనుకుంటున్నారట. చూద్దాం మరి టబు రెండు చిత్రల్లో నటిస్తారో లేదో...?

విశాఖలో స్మార్ట్ ఫార్మింగ్ పార్ట్ నర్ షిప్ సదస్సు

విశాఖ : ఈనెల 15నుంచి 3రోజుల పాటు విశాఖలో స్మార్ట్ ఫార్మింగ్ పర్ట్ నర్ షిప్ సదస్సు జరుగుతుందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయంలో సాంకేతిక బెక్నాలజీ వినియోగంపై చర్చ జరుగుతుందని, ఇందులో బిల్ గేట్స్ పాల్గొంటారని సోమిరెడ్డి అన్నారు. బిల్ గేట్స్ సదస్సుకు హాజరుకావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలండరికీ గర్వకారణమని సోమిరెడ్డి తెలిపారు.

ఈ నెల 10నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : ఈ నెల 10నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10న బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ పని దినాలు ఖరారు చేస్తారు. 10 రోజులు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 10న ఉదయం9.45లకు శాసన సభ, 10.30లకు మండలి సమావేశం ప్రారంభం కానున్నాయి.

చెన్నమనేని పౌరత్వంపై కేంద్రహోంశాఖ విచారణ

ఢిల్లీ : వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై కేంద్రహోంశాఖ విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆది శ్రీనివాస్, చెన్నమనేని తరుపు న్యాయవాది హాజరరైయ్యారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని కేంద్రహోంశాఖ ఇప్పటికే తేల్చిందని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు.

దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయింది : కమల్

చెన్నై : దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని నటుడు కమల్ హాసన్ అన్నారు. హిందూ టెర్రరిజం పదాన్ని హిందూమత సంస్థలు ఇకపై సవాల్ చేయలేవని ఆయన తెలిపారు. గతంలో చర్చలకు ప్రాధాన్యమిచ్చే రైట్ వింగ్ గ్రూపులు ఇప్పుడు హింసలో భాగస్వామ్యం అవుతున్నాయని కమల్ చెప్పుకొచ్చారు. 

14:32 - November 2, 2017

విజయవాడ : కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్‌ పరం చేసే కుట్రకు తెర లేచింది. స్థలాలు, భవంతులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు టీడీపీ సర్కార్ సమాయత్తమైంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో ప్రభుత్వ జాగాలను, కార్యాలయాలను అన్యాక్రాంతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతంపై టెన్‌టీవీ ఫోకస్‌..

కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా ధారాదత్తం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ పశ్చిమ శివారులోని ఇబ్రహీంపట్నం నుంచి తూర్పు శివారులోని గుణదల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు పందేరానికి ప్రభుత్వం తెరలేపింది. బందరు రోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్, స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ పాత కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ట్రాన్స్ కో సబ్ స్టేషన్, గుణదలలోని ట్రాన్స్ కో భూములు ఇలా మొత్తం 49 ఎకరాల ప్రభుత్వ భూములను పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేట్ సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. సీఆర్డీఏ పర్యవేక్షణలో నగరపాలక సంస్థ ఇందుకు మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. సుమారు 5వేల కోట్ల రూపాయల విలువైన 49 ఎకరాల భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు పందేరం చేస్తున్నారు.

పర్యాటక ప్రాజెక్టులు, సిటీ స్క్వేర్, స్టార్ హోటళ్ల పేరిట నగరం నడిబొడ్డున, కృష్ణానది తీరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఈ భూములను ప్రైవేట్ పరం చేయడానిక అధికారులు పథకాలు రచిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కన్నేసిన భూములు కూడా మాస్టర్ ప్లాన్ లో పబ్లిక్, సెమీ పబ్లిక్ అనే కేటగిరీల కిందే ఉన్నాయి. వాటిని ప్రభుత్వ, ప్రజోపయోగ పనుల నిమిత్తమే ఉపయోగించాలి. కాని.. నిబంధనలకు టీడీపీ ప్రభుత్వం నీళ్లొదిలిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గత ఆగస్టు 30న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న భూములను వినియోగ మార్పిడి చేయాలని సూచించారు. పబ్లిక్, సెమీ పబ్లిక్ కేటగిరీల కింద పేర్కొన్న భూములను 'మిక్స్ డ్' కేటగిరీలోకి మార్చాలని ఆదేశించారు. నిజానికి పంచాయతీరాజ్, నగరపాలక సంస్థల చట్టం ప్రకారం.. స్థానిక సంస్థలు, పాలకమండళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా ఉన్నతస్థాయిలో భూ వినియోగ మార్పిడి చేయాలని ఆదేశాలు జారీ చేయడం విపక్షాలు మండిపతున్నాయి.

సిటీ స్క్వేర్ నిర్మాణం కోసం స్వరాజ్ మైదానాన్ని చైనాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థలో పబ్లిక్ షేర్స్ పేరిట పలువురు వాటాదారులు ఉన్నారని, వారంతా ప్రభుత్వ పెద్దల బినామీలేనని చర్చనీయాంశంగా మారింది. 49 ఎకరాలతోపాటు త్వరలో మరో 12.34 ఎకరాలు, విజయవాడలోని బృందావన్ కాలనీ మున్సిపల్ క్వార్టర్స్, హనుమాన్ పేట లోని మున్సిపల్ పాఠశాల, కబేళా సమీపంలోని మున్సిపల్ స్థలాలను ప్రైవేట్ కు అప్పగించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థల ముసుగులో బినామీలకే ప్రయోజనం చేకూరుస్తున్నారని సీపీఎం, సీపీఐ పార్టీలు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రవైట్‌ వ్యక్తులకు అప్పగించే పనిని ఆపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని లెఫ్ట్‌పార్టీలు తేల్చి బుతున్నాయి. 

14:25 - November 2, 2017

కావల్సిన పదార్థలు 
ఆలుగడ్డలు పాపుకేజీ, పెరుగు రెండు కప్పులు, ఎండుమిర్చి అయిదు, అల్లం ముద్ద టీస్పూన్, నూనె కావల్సినంత, ఇంగువ చిటికెడు, పసుపు పావు చెంచా, కారం చెంచా, మెంతిపోడి పావుచెంచా, ధనియాలపోడి, జీలకరపోడి పావుచెంచా, గరమ్ మసాలా చెంచా, లవంగాలు రెండు, ఉప్పు తగినంత, కొత్తిమీర తరుగు రెండు చెంచాలు.

తయారీ విధానం
ఎండు మిర్చిలో గింజలను తీసివేసి వేడినీళ్లలో ఆరగంటసేపు నానబెట్టిన తర్వాత పెరుగు వేసి ముద్దలా చేసుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి తొడుక తీసెసి దానిపై అక్కడక్క గాట్లు చేసి, నూనెలో వేయించి పెట్టుకోవాలి. పొయ్యి మీద ముగుడు పెట్టుకుని మూడు చెంచాల నూనె పోయాలి పసుపు, కారం, ఇంగువ, ఆరకప్పు నీళ్లు పోయాలి. తర్వాత అందులో ధనియాలపోడి వేసి బాగా కలపాలి. అందులో మెంతిపోడి, లవంగాలు, యాలకులపోడి, దాల్చినచెక్క, జీలకర వేసి బాగా కలపాలి. ఇందులో ఎండు మిర్చి ముద్ద వేయాలి. ఉడికించిన ఆలుగడ్డలను అందులో వేసి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేయాలి.

14:24 - November 2, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పెరిగిపోతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పెట్టుబడిదారీ విధానంలో పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా పాలకపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో పాలకపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై రాఘవులు పలు విమర్శలు గుప్పించారు.

పాతకాలపు పెట్టుబడులు కాదని..క్రోడీ క్యాపిటలిజం పెట్టుబడి దారి విధానం నడుస్తోందన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయని, ప్రజల పట్ల..రైతుల పట్ల సంఘీభావంగా ఉండాలన్నారు. సాంస్కృతిక రంగాన్ని మతోన్మాదం వైపు నడిపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మహిళలు సమాజంలో ఒక భాగం అనే సృహ లేకుండా వ్యవహరిస్తోందన్నారు. 

14:21 - November 2, 2017

విజయవాడ : ఫాతిమా మెడికల్‌ కాలేజి విద్యార్థుల సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఫాతిమా కాలేజి విద్యార్థులు చేపట్టిన శాంతియుత ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని మానవీయకోణంలో పరిష్కరించాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. నంద్యాల ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులను రీ లొకేట్‌ చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తీర్చాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు వైసీపీ పోరాడుతుందన్నారు. 

14:19 - November 2, 2017

కృష్ణా : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తన చాంబర్‌లో లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఎన్‌. ప్రమోద్‌కుమార్‌ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తన బృందంతో కలిసి దాడులు చేశారు. కాంట్రాక్టర్‌ అక్కరావ్‌ బిల్లుల చెల్లింపు విషయంలో 1 లక్ష 10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 37 లక్షల బిల్లుల చెల్లింపులో 3 శాతం లంచం ఇవ్వాలని ప్రమోద్‌ కుమార్‌ డిమాండ్ చేశాడు. దీంతో అక్కరావు ఏసీబీని ఆశ్రయించడంతో దాడులు చేసి ప్రమోద్‌కుమార్‌ను పట్టుకున్నారు. దర్యాప్తు చేస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. 

13:54 - November 2, 2017

తూర్పుగోదావరి : పేరుకు పెద్ద యునివర్సిటీ...అయినా అభివృద్ధి మాత్రం శూన్యం. ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆఖరికి సొంత నిధులతో క్యాంపస్‌ స్థలం సమకూర్చుకున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. కొన్ని కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసమే ఆ యూనివర్సిటీకీ అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. 
నిధులు లేక నోచుకోని అభివృద్ధి
ఇది రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్సిటీ. ఈ వర్సిటీ కోసం జిల్లాలో ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగాయి. చివరకు వైఎస్‌ హయాంలో వర్సిటీకి అనుమతులిచ్చారు. కానీ నిధులు లేకపోవడంతో తొమ్మిదేళ్లపాటు అద్దె భవనాల్లోనే కొనసాగింది. అయితే చివరకు సొంత నిధులతో భవనాలు ఏర్పాటు చేసుకుని ..యూనివర్సిటీ ఒక స్థాయికి చేరుకొంటుంది. 
నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
యూనివర్సిటీ నిర్మాణ స్థలం గానీ, ప్రస్తుతం ఉన్న భవనాలు గానీ పూర్తిగా సొంత నిధులతోనే సమకూర్చుకున్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ నిధుల విడుదలలో నిర్లక్ష్యం చూపడంతో యూనివర్సిటీ అభివృద్ధి ఆలస్యమవుతోందన్నది పలువురి అభిప్రాయం. క్యాంపస్‌ నిర్మాణానికి  అవసరమైన 110 ఎకరాల స్థలం కోసం సర్కారుకి యూనివర్సిటీ తరపున పూర్తిగా నిధులు చెల్లించారు. 
స్థల కేటాయింపులో జాప్యం
ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ఇప్పుడు యూనివర్సిటీ చెల్లించిన మొత్తానికి తగ్గట్టుగా 110 ఎకరాల స్థలం కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు 95 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీకి అధికారికంగా అందించగా మరో 15 ఎకరాల వ్యవహారంలో కాలయాపన చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. 
సీఎం స్పందించడంతో అధికారుల్లో ఆశాభావం
యూనివర్సిటీ అధికారులు మాత్రం సమస్య పరిష్కారమవుతొందన్న ఆశాభావంతో ఉన్నారు. క్యాంపస్‌ అభివృద్ధి కోసం ఇటీవల తొలిసారిగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో యూనివర్సిటీ అధికారులు ధీమాతో ఉన్నారు.. నిధుల విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో స్థలం సమస్య కూడా పరిష్కారమవుతొందని ఆశాభావంతో ఉన్నారు. 
సొంతంగా నిధులు సమకూర్చుంటున్న అధికారాలు
ప్రభుత్వం నడపాల్సిన యూనివర్సిటీని.. సొంతంగా నిధులు సమకూర్చుకుని యూనివర్సిటీ అధికారులే అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నారు. యూనివర్సిటీ చెల్లించిన సొమ్ముకు తగ్గట్టుగా స్థలం అప్పగించకపోవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధిపై దృష్టిపెడితే భావితరాలకు ప్రయోజనం ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

 

13:50 - November 2, 2017

హైదరాబాద్ : ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాదాన్ని ముందుకు తెచ్చారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మోదీ పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాని ఆందోళన వ్యక్తం చేశారు.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం 22 జాతీయ మహాభసలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి.  దీనిలో భాగంగా జరిగిన  ఆహ్వాన సంఘం సన్నాహక కమిటీ సమావేశానికి ఏచూరి  హాజరయ్యారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సీతారాం ఏచూరి చెప్పారు. 

 

13:48 - November 2, 2017

హైదరాబాద్‌ : నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాచారం పీఎస్‌ పరిధి.. మల్లాపూర్‌ భవానీనగర్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌  విద్యార్థి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  హబ్సిగూడ శ్రీ మేధావి కళాశాలలో చదువుతున్న సత్య.. జీవితం పట్ల నిరాశతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన జీవితంలో సంతోషం లేదని.. తన మిత్రులకు శాశ్వత సెలవని సూసైడ్‌ నోట్‌లో మృతుడు సత్య వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:47 - November 2, 2017

కృష్ణా : జిల్లాలోని గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తన చాంబర్‌లో లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఎన్‌. ప్రమోద్‌కుమార్‌ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తన బృందంతో కలిసి దాడులు చేశారు. కాంట్రాక్టర్‌ అక్కరావ్‌ బిల్లుల చెల్లింపు విషయంలో 1 లక్ష 10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 37 లక్షల బిల్లుల చెల్లింపులో 3 శాతం లంచం ఇవ్వాలని ప్రమోద్‌ కుమార్‌ డిమాండ్ చేశాడు. దీంతో అక్కరావు ఏసీబీని ఆశ్రయించడంతో దాడులు చేసి ప్రమోద్‌కుమార్‌ను పట్టుకున్నారు. దర్యాప్తు చేస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. 

 

13:44 - November 2, 2017

హైదరాబాద్ : పేదోడు గుడిసి వేసుకునేందుకు జాగా ఇవ్వని ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములను దారాధత్తం చేస్తున్నాయని పి.మధు విమర్శించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సీపీఎం జాతీయ మహాసభల ఆహ్వానం సంఘం సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 వ అఖిల భారత మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సీపీఎం పార్టీ బలోపేతం, వామపక్ష శక్తుల ప్రత్యామ్నాయంపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కోవాలన్నారు. సరళీకరణ ఆర్ధిక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

13:41 - November 2, 2017
13:40 - November 2, 2017

మంచిర్యాల : సింగరేణి ఎన్నికల్లో హామీల వర్షం కురిపించారు..! మరెన్నో వాగ్దానాలు చేశారు..! ఓటు వేస్తే... ఏ లోటు లేకుండా చేస్తామన్నారు..! తీరా అంతా అయ్యాక... మొహం చాటేశారు...! ఓట్లు వేశాక... చెప్పిన మాటలను మరిచారు..! చివరకు కార్మికుల గోస పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇచ్చిన మాటలను మరిచిన టీజీబీకేఎఎస్ నాయకులు 
సార్వత్రిక ఎన్నికలను తలపించిన సింగరేణి ఎన్నికల్లో... టీఆర్ ఎస్ నేతల హామీలు ఆకాశానంటాయి. దసరా కానుకగా మీరు ఓటెయ్యండి... దీపావళి కానుకగా  మేం మీ పిల్లలకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. ఎన్నికల్లో గెలుపొందాక.. ఇచ్చిన హామీలను మరిచి... కార్మికులకు మొండి చేయి చూపిస్తున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మాట ఇచ్చి... ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  
వారసత్వ ఉద్యోగాలపై  ప్రభుత్వం సైలెంట్‌ 
తీరా ఎన్నికల్లో గెలుపొందాక... వారసత్వ ఉద్యోగ సమస్యపై ప్రభుత్వం సైలెంట్‌ అయిపోయింది. వారసత్వ ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. దీంతో అక్టోబర్‌ 31న రిటైర్‌ అయిన 900 మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న ఉద్యోగం పోయి... తమ వారసులకు ఉద్యోగాలు రాక.. ఇల్లు గడవడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. తమ వారసులకు ఉద్యోగాల కోసం  దరఖాస్తు చేసుకున్న వారంతా... పదవి విరమణ పొందారు. ఇంకా ఆ వారసత్వ ఉద్యోగాలపై సీఎం ఎటు తేల్చకపోవడంతో... వారంతా ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రిటైర్డ్‌ కార్మికులకు 25 లక్షలు ఇస్తామంటూ హామీ
అదేవిధంగా ముందస్తు పదవివిరమణ పొందే కార్మికులకు 25 లక్షల రూపాయలు ఇస్తామనే కొత్త పథకాన్ని ప్రకటించింది. కానీ ఆ నగదును కూడా అందించడం లేదని కార్మికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు సింగరేణి కార్మికులు. 

 

13:37 - November 2, 2017

నోకియాలో ఇప్పటివరకు వచ్చిన అన్ రైడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ధర శ్రేణి చెందినవిగా ఉన్నాయి. ఒక్కప్పుడు ఇండియాలో ఒక ఊపుఉపిన నోకియా ఇండియా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని చౌవక ధరలో స్మార్ట్ ఫోను తీసుకొచ్చింది. ఇండియా వేదికగా తన చౌవకైన నోకియా స్మార్ట్ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా నోకియా స్మార్ట ఫోన్ నిన్న విడుదలైంది. దేశీయ కారెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర రూ.7,500ఉంటుంది.

నోకియా ఫోన్ ఫీచర్లు
5ఇంచులా డీస్ ప్లే వీత్ గోరిల్లా గ్లాస్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 8ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా.

13:35 - November 2, 2017

హైదరాబాద్‌ : మహానగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అవుతోంది. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చిన భాగ్యనగరం.. ఇప్పుడు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు సిద్ధమవుతోంది.  అయితే ఇందుకుకోసం కావాల్సిన నిధుల భారాన్ని ప్రభుత్వం బల్దియా వేసింది.  ప్రపంచస్థాయి సదస్సులకు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చగా.. ఈసారి బల్దియాపై ఆ భారాన్ని మోపడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. 
అనేక కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్‌
హైదరాబాద్‌ వేదికగా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో మంచి ట్రావెల్‌ కనెక్టివీ, వాతావరణంలాంటి అంశాలు అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ను  అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలపుతున్నాయి.  ఐటీ కారిడార్‌కు అంతర్జాతీయ విమానాశ్రయంతో క్లోజ్‌ కనెక్టివీ ఉండడం, వేలాది మందితో సమ్మిట్‌ నిర్వహించేందుకు అవకాశాలు ఉండడంతో భాగ్యనగరం ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌కు వేదికౌతోంది.
నవంబర్‌ 28 నుంచి ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు
నవంబర్‌ 28 నుంచి హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తల అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు దాదాపు 60కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఖర్చును వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కానీ విచిత్రంగా ఈ భారాన్ని సర్కార్‌ బల్దియా వేసింది. 
పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్న బల్దియా
హైదరాబాద్‌లో బిగ్‌ ఈవెంట్స్‌ జరిగినప్పుడల్లా జీహెచ్‌ఎంసీపై భారీగా ఆర్థికభారం పడుతుంది. ఈవెంట్‌ జరిగే మార్గాల్లోని గ్రీనరీతోపాటు సుందరీకరణ వరకు అన్ని పనులు బల్దియానే చేస్తుంది. ఇందుకోసం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుంది. కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చినా... మరికొన్ని కార్యక్రమాలకు మాత్రం బల్దియానే సొంత నిధులను పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుంది. 
పారిశ్రామిక వేత్తల సదస్సుకు పనులు ప్రారంభించిన అధికారులు
ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కోసం బల్దియా అధికారులు అప్పుడే పనులు ప్రారంభించారు. సదస్సు జరిగే ప్రాంతాల్లో రోడ్డుసైడ్స్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అర్బన్‌ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన మొక్కలను.. డివైడర్స్‌పై పూలమొక్కలను నాటడానికి సిద్ధమవుతోంది జీహెచ్‌ఎంసీ. స్ట్రీట్‌ సీటింగ్‌ కోసం ప్రత్యేకమైన బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నచిన్న అందమైన మొక్కలతో వర్టికల్‌ గార్డెన్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.  స్ట్రీట్‌ లైటింగ్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ పనులన్నిటి కోసం భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. అయితే ప్రస్తుతం బల్దియా ఖజానా కూడా ఖాళీగా ఉంది. గతంలో జరిగిన కాప్‌11 మెట్రోపోలిస్‌ సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చాయి. కానీ ఈ సదస్సు ఏర్పాటుకు ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో ఈ భారాన్ని ఎలా భరించాలో అర్థంకాక బల్దియా అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ నిధులను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి స్పందన లేదంటున్నాయి బల్దియా వర్గాలు. మరి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును బల్దియా ఎలా నెట్టుకువస్తుందో వేచి చూడాలి.

 

13:31 - November 2, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన బ్రాయిల్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. 66 మంది గాయాలయ్యాయని అధికారులు లెక్కలు తేల్చారు. క్షతగాత్రులను ఉన్నావ్‌, బలరామ్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకంగా ఉంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకుని.. రాయ్‌ బరేలీలో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

13:29 - November 2, 2017

సూర్యపేట : ధనబలం, అధికారబలం చేతులు కలిపాయి. అక్రమాలకు అడ్డేలేకుండా చెలరేగిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూముల ఆక్రమణకు తెరతీశారు. పట్టాభూములు, అసైండ్‌ భూములు అనే తేడాలేకుండా కబ్జా చేశారు. వ్యవసాయ భూమూలతోపాటు చివరికి పంచాయతీరాజ్‌ రోడ్లను కూడా ఆక్రమించారు. తెలంగాణ ప్రభుత్వాధినేతతో  సాన్నిహిత్యం.. పైగా ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు.. ఇంకేం.. ప్రశ్నించేవారే లేరన్నట్టుగా వందల ఎకరాల భూమును కైంకర్యం చేసింది ఓ బడా సింమెంట్‌ పరిశ్రమ యాజమాన్యం. 

వందల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ఆక్రమించిన మైహోం సిమెంట్స్‌ కంపెనీ.. ప్రశ్నించిన వారిని రాజకీయ నాయకులతో బెదిరించడం.. అక్రమ కేసులు పెట్టివేధిస్తోంది. మాటవినని రైతులపైకి  ఖాకీలను ఉసిగొల్పడమే పనిగా పెట్టుకుంది. ఇలా తన కబ్జాల బాగోతం బయటపడకుండా దండనీతిని ప్రయోగిస్తోంది. సూర్యాపేటజిల్లాలో మైహోం సిమెంట్ పరిశ్రమ భూ బాగోతంపై టెన్‌టీవీ స్పెషల్‌ ఫోకస్‌.. 
1990లో దేవీ సిమెంట్స్‌ పేరుతో ప్రారంభమైన సంస్థ 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే  అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా పేరొందిన మై హోం సిమెంట్స్‌ .. పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఈ పరిశ్రమ ఏర్పటయింది.1990లో దేవీ సిమెంట్స్‌ పేరుతో ప్రారంభమై పరిశ్రమ..అనంతరం యాజమాన్య మార్పిడితో మైహోం సిమెంట్‌ కంపెనీ లిమిటెడ్‌గా పేరుమార్చుకుంది. మొత్తం మూడు యూనిట్లుగా నిర్మాణం జరిగిన పరిశ్రమతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాయి. అంతవరకు బాగానే ఉన్నా.. పరిశ్రమ భూకబ్జాల బాగోతం ఒక్కొక్కటిగా బటపడుతున్నాయి. అసలు ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలోనే అక్రమాలకు తెరలేపారని స్థానిక రైతులు అంటున్నారు. 
మైహోం కంపెనీకి  506.32 ఎకరాల భూమి 
మైహోం కంపెనీ కింద 506.32 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదయింది. వీటిలో అసైండ్‌,  భూదాన, సీలింగ్‌ ల్యాండ్సే ఎక్కువగా ఉన్నాయి. సర్వేనంబర్‌ 1023లో ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుపేరుతో  మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూమి, రైతుల పట్టాభూమి, కుంటలు, రోడ్లను కబ్జా చేసి మరో వంద ఎకరాలను ఆక్రమించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు పక్కాగా ఆధారాలు ఉన్నా.. రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం  మైహోం యాజమాన్యానికి దాసోహం అంటున్నారని మేళ్లచెర్వు గ్రామస్తులు అంటున్నారు. 

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మట్టిరోడ్డు.. మేళ్లచెర్వు - మఠంపల్లి మధ్య ఉన్న మార్గము. 24 అడుగుల వెడల్పయిన రోడ్డుకు అడ్డంగా సిమెంట్‌ పరిశ్రమను కట్టేసింది మైహోం కంపెనీ. ఇక్కడ మొత్తం 30 ఎకరాల వరకు ఆక్రమించినట్టు రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే వెల్లడవుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంది. అంటే ఈ ఒక్క రోడ్‌లోనే సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం దాదాపు 6కోట్ల రూపాయల విలువైన ల్యాండ్‌ను కబ్జా చేసిందని స్థానికులు అంటున్నారు. తాతల కాలం నుంచి ఉన్న డొంకదారిని ఆక్రమించి గోడ నిర్మించడంతో.. పొలాలకు వెళ్లే రైతులు, మేతకు వెళ్లే పశువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

దారి బంద్‌పెట్టడంపై  విచారణ చేసేందుకు వచ్చిన స్థానిక తహశీల్దార్‌, సర్వేయర్లలతోపాటు చివరికి ఆర్డీవో లాంటి ఉన్నతాధికారిన కూడా గేటుబయటే ఆపేశారంటే.. మైహోమ్స్‌ యాజమాన్యం.. అక్రమాలకు పెద్దల సపోర్టు ఉందనేది తేటతెల్లం అవుతోందంటున్నారు స్థానిక ప్రజలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకే మైహోం పరిశ్రమ ఆగడాలు పరెగాయని మేళ్లచెర్వు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
పవర్‌ప్లాంట్‌లో కూడా కబ్జాల బాగోతమే..!
మైహోం సిమెంట్‌ పరిశ్రమకు అనుబంధంగా నిర్మించిన పవర్‌ప్లాంట్‌లో కూడా కబ్జాల బాగోతమే నడిచింది. భూదాన, సీలింగ్‌ ల్యాండ్స్‌ను కూడా తాము కొన్నట్టు డాక్యుమెంట్లు సృష్టించింది  పరిశ్రమ యాజమాన్యం. మాజీ సర్పంచ్‌ హయాంలో తమకు పవర్‌ప్లాంట్ నిర్మాణం కోసం  ఎన్‌వోసీ ఇచ్చారని కంపెనీ పత్రాలు చూపిస్తోంది.  భూదాన, సీలింగ్‌ భూములపై నిరభ్యంతర పత్రం ఇచ్చే అధికారం గ్రామపంచాయతీకి ఉండదని సిమెంట్‌ పరిశ్రమ యాజాన్యానికి తెలియదా..? చట్టం ఏం చెబుతుందో  స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియదా..? అయినా పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అభ్యంతరం లేదని ఎలా రాసిచ్చారు..?   
డబ్బుతో మేనేజ్‌ చేసి ఎన్‌వోసీ..! 
తన అవసరాల కోసం పవర్‌ ప్లాంట్‌ను నిర్మించుకుంది మైహోం సిమెంట్‌ యాజమాన్యం. తేజపవర్‌ ప్లాంట్‌పేరుతో నిర్మించిన ఈ పరిశ్రమలో కూడా  అనేక అక్రమాలు జరిగినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి.  భూదాన్‌, సీలింగ్‌ భూమలను ఆక్రమించి పవర్‌ ప్లాంట్‌ను కట్టేశారు. స్థానిక గ్రామపంచాయతీ  సర్పంచ్‌, అధికారులను మేనేజ్‌ చేసి..  పంచాయతీ నుంచి నిరభ్యంతర  పత్రాన్నికూడా పొందింది మైహోం సిమెంట్‌ కంపెనీ. నిజానికి  భూదాన్‌, సీలింగ్‌ భూములకు ఎన్‌వోసీ ఇచ్చే అధికారం గ్రామపంచాయతీకి ఉండదు.. అయినా.. తమకు  గ్రామపంచాయతీ నుంచి అనుమతి ఇచ్చినట్టు పత్రాలు సృష్టించారంటే.. ఈ భూ బాగోతాల వెనుక ఏస్థాయిలో మేనేజ్‌ చేశారో అర్థమవుతోందని .. స్థానికులు అంటున్నారు. 
దళారుల ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు 
నేరుగా భూములను కబ్జా చేయడమే కాదు.. పలువురు దళారుల ద్వారా రైతుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక రైతు సోదరులు  గజ్జెల శంభిరెడ్డికి, గజ్జెల గుర్వారెడ్డిలకు  సర్వేనంబర్‌ 186/ఇ1, 186/ఇ2లో  14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరిలో గజ్జెల గుర్వారెడ్డి తన వాటా 7ఎకరాలను మైహోం పరిశ్రమకు అమ్ముకున్నాడు. కాని  రిజిస్ట్రేషన్‌లో మాత్రం గజ్జెల శంభిరెడ్డికి చెందిన భూమిని పేర్కొని గోల్‌మాల్‌ చేశారు. దీనిపై బాధిత రైతులు, స్థానికులు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు వరుసగా ఫిర్యాదులు చేయడంతో.. విచారణ కోసం ఆర్డీవోను ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామనక్షాను పరిశీలించారు. దీంతో మైహోం ఆక్రమణల బాగోతం అధికారికంగా బయటపడింది. మైహో పరిశ్రమ ఆక్రమించిన రోడ్డు, డొంకబాట, రైతుల భూములకు సంబంధించిన వివరాలు సచిత్రంగా బయటపడ్డాయంటున్నారు ఆర్డీవో  భిక్షూనాయక్‌. ఇలా ఎక్కడికక్కడ అధికారులను, స్థానిక రాజకీయ నాయకులకు లంచాలు అందిస్తూ.. కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన విషయం బయటపడ్డం.. స్థానికంగా కలకలంగా మారింది.  
నిబంధనలు పట్టని మైహోం పరిశ్రమ
భూ కబ్జాలు సంగతి అలావుంటే.. పరిశ్రమ నిర్వహిస్తున్న మైనింగ్‌లో  అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. అనుమతికి మించిన లోతుకు క్వారీలు తవ్వేస్తున్నారు. గాలి, నీరు కలుషితం అయి జనం  ప్రాణాలు కోల్పోతున్నారు. జలవనరులలో విషరసాయనాలు కలిసిపోతున్నాయి. అటవీ, పర్యావరణ నిబంధలన్నీ బేఖాతరు అవుతున్నాయి.  
అనుమతి 30 మీ. తవ్వేది 250 మీ.
మైనింగ్‌ విషయంలో కూడా మైహోం యాజమాన్యం అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతోంది.    ప్రభుత్వ అనుమతి ప్రకారం 30 నుంచి 40 మీటర్ల లోతు వరకు మాత్రమే సున్నపురాయిన తవ్వాలి. కాని..అనుమతికి మించి ఏకంగా 250 మీటర్ల  లోతువరకు సున్నపురాయిని తవ్వేస్తున్నారు. అంతేకాదు.. తవ్విపోసిన గోతులను ఎప్పటికపుడు, మట్టి, ఇసుకతో పూడ్చాల్సి ఉన్నా.. అవేవి జరగడంలేదు. దీంతో క్వారీ గుంతలు  పశువులకు ప్రమాదకరంగా మారాయి. విష రసాయనాలు కలిసిన నీటిని తాగిన మూగజీవులు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయని స్థానికులు ఆదేవన వ్యక్యం చేస్తున్నారు. పైగా క్వారీలు తవ్వుతున్న ప్రాంతంలో నశిస్తున్న పచ్చదనాన్ని మళ్లీ పెంచాలని పర్యావరణ నిబంధనలు ఉన్నాయి. కాని.. ఫ్యాక్టరీ యాజమాన్యం చెట్లను పెంచడమే మర్చిపోయింది. 
మేళ్లచెర్వులో భయంకరంగా కాలుష్యం 
ఇటు పవర్‌ప్లాంట్‌ వల్ల మేళ్లచెర్వు చుట్టుపట్టు ప్రాంతాల్లో భయంకరంగా కాలుష్యం విస్తరిస్తోంది. రాత్రివేళలో విద్యుత్‌ పరిశ్రమ నుంచి విషరసాయనాలు విడుదలవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.  పరిశ్రమ నుంచి నిత్యం వెలువడే దుమ్ముధూళితోపాటు భయకరమైన శబ్దకాలుష్యం వెలువడుతోంది. స్థానికులు చెవి,కన్ను, శ్వాససోశవ్యాధులతో బాధలు పడుతున్నారు. అంతేకాదు.. కాలుష్య ప్రభావంతో బంగారు పంటలు పండే భూములు వట్టిపోతున్నాయంన్నారు. పంటలను జరగుతున్న నటష్టాన్ని వ్యవసాయ అధికారులు కూడా గుర్తించినా.. మైహోం యాజమాన్యానికి హైలెవల్లో ఉన్న పలుకుబడి కారణంగా ఎవరూ నోరుమెదపని పరిస్థితి వచ్చింది. 
నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు : యాజమాన్యం 
మరోవైపు తాము ఎలాంటి అంశాల్లోనూ అతిక్రమణలకు పాల్పడలేదని.. నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు చేశామని మైహోమ్‌ పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది. ఒక వేళ తమ దృష్టికి రాని అంశాలు ఏవైనా ఉంటే రైతులు తమను నేరుగా కలవొచ్చని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. మైహోం సిమెంట్‌ కంపెనీ అక్రమాలకు అడ్డకట్టవేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు మేళ్లచెర్వు మండల ప్రజలు. 

సీపీఎం మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చైర్మన్ గా రాఘవులు, ప్రధాన కార్యర్శిగా తమ్మినేని, ట్రెజరర్ గా బి.వెంకట్, వైస్ చైర్మన్లుగా మల్లు స్వరాజ్యం, మధు, పాటూరు రామయ్య, వి.శ్రీనివాసరావు, హేమలత, చెరుపల్లి సీతారాములు, చుక్కారాములు, సున్నం రాజయ్య, నంద్యాల నరసింహారెడ్డి ని నియమించారు.

సీఎంను కలిసిన డెల్టా షుగర్ ఫ్యాక్టరి రైతులు

గుంటూరు : సీఎం చంద్రబాబును బాలవడపు డెల్టా షుగర్ ఫ్యాక్టరీ రైతులు కలిశారు. రైతులను సీఎం వద్దకు ఎమ్మెల్యే వల్లభనేని తీసుకెళ్లారు. నష్టాల్లో ఉండటం వల్ల షుగర్ ఫ్యాక్టరీని యాజమాన్యం నడపలేకపోతున్నారని, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను అదుకునేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను అధికారులకు సీఎం సూచన చేశారు.

రాష్ట్రపతికి లేఖ రాసిన కత్తి పద్మారావు

విజయవాడ : దేశ రాష్ట్రపతికి  కత్తి పద్మారావు లేఖ రాశారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలపై వివక్షను లేఖలో కత్తి పద్మారావు పేర్కొన్నారు. ఏపీలో ఎస్పీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సీఎంను ఆదేశించాలని, ఏపీలో సీఎం కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

13:09 - November 2, 2017

హైదరాబాద్ : మిడ్‌ మానేరు ప్రాజెక్టులో నిల్వ చేసిన జలాల్లో తొలి ప్రాధాన్యత మంచినీటి అవసరాలకేనని ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. మిడ్‌ మానేరు నుంచి రబీకి నీరు ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో జీవన్ రెడ్డి లేవెనెత్తిన ఈ అంశంపై మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. మిడ్‌ మానేరు డ్యామ్‌లో ఐదు టీఎంసీల నీరు నిల్వచేశామని తెలిపారు. మిడ్‌ మానేరు జలాల్లో తొలి ప్రాధాన్యత మంచినీటికే అన్నారు. వచ్చే నెల నుంచి మిడ్‌ మానేరు పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. 

 

హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ భవానీ నగర్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 

దేశంలో సంక్షోభ పరిస్థితి : సీతారాం ఏచూరి

హైదరాబాద్ : దేశంలో సంక్షోభ పరిస్థితి నెలకొందని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందడించాయని సీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని, కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తేవాలి అని ఏచూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

13:02 - November 2, 2017

భద్రాద్రి : కొత్తగూడెం కోల్‌ ట్రాన్స్‌పోర్ట్ లారీ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. అధ్యక్ష, కార్యదర్శుల తీరుకు నిరసనగా ముగ్గురు లారీ యజమానులు టవర్‌ ఎక్కారు. అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, కార్యదర్శి అనిల్‌ అసోసియేషన్‌ సొమ్ము కాజేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరేళ్లుగా రెండు, మూడు కోట్ల పైగా లెక్కలు తేలలేదని ఆరోపణలు వస్తున్నాయి. అసోసియేషన్ సొమ్ము సొంత అవసరాలకు వాడుకున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. 

 

12:48 - November 2, 2017
12:44 - November 2, 2017
12:42 - November 2, 2017
12:42 - November 2, 2017
12:34 - November 2, 2017

హైదరాబాద్ : దేశంలో వర్గపోరాటం రెండు కాళ్లమీద ఉందని..ఒకటి ఆర్థిక దోపిడీ, రెండోది సామాజిక దౌర్జన్యం అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం.. ఈ రెండింటిపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సీపీఎం 22వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు.  దేశం అన్ని రంగాల్లో సంక్షోభంలోకి నెట్టివేయపడిందని ఏచూరి పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకూ దిగజారుతోందని ఆందోలన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రజలపై త్రీవ ప్రభావం చూపాయన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు ఏటాట తగ్గుతున్నాయని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరలు లంభిచడం లేదని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పత్తిపంటలను కాల్చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు పత్తిని కొనుగోలు చేయలేదని చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయిని పేర్కొన్నారు. 

 

సీపీఎం ఆహ్వన సంఘం సన్నాహక సమావేశం

హైదరాబాద్ : సీఎం 22వ మహాసభల సందర్బంగా ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏచూరి, రాఘవులు, తమ్మినేని, మధు హాజరైయ్యారు.

12:25 - November 2, 2017

హైదరాబాద్ : 2018 ఏప్రిల్ 18 నుంచి 22వరకు జరుగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా నేడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యలు హాజరు అయ్యారు. ఈ సండర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేది కీలక ఎజెండాగా మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంశాలన్నింటినీ ప్రభుత్వం ముందుంచడానికి మహాసభలు ఉపయోగపడతాయన్నారు. మహాసభల విజయవంతానికి అందరూ సహాయసహకారాలు అందించాలని కోరారు.

 

గుడివాడ మున్సిపాలిటీపై ఏసీబీ దాడులు

కృష్ణా : గుడివాడ మున్సిపాలిటీపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. కాంట్రాక్టర్ నుంచి రూ.10లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఏసీబీకి చిక్కాడు.

11:42 - November 2, 2017

హెల్త్ : పట్టణాల్లో జీవించే కొందరికి ఎండ పొడ కూడ తగలదు ఎందుకంటే నగరాలల్లో ఎత్తైన భవనలు ఉండడం వలన సూర్యకాంతి అందిరి ఇళ్లకు ఉండదు. అంతేకాక కొంత మంది ఏసీల్లో రూమ్ ల్లో పని చేసి, ఏసీ కారులో ఇంటికి చేరడంతో వారికి ఎండ కరువు అవుతోంది. సూర్యకాంతి శరీరంపై పడకపోవడంతో చాల మందిలో డీ విటమిన్ లోపం ఏర్పడుతుంది. వ్యాధి నరోధక శక్తి పెంచే వాటిలో డీ విటమిన్ ఒకటి. దీన్ని పొందలంటే సూర్యోదయం వేళలో 10నుంచి 15నిమిషాలు ఎండలో ఉంటే డీ విటమిన్ లభిస్తుంది. పాలు, చేపలు, మాంసం, ఛీజ్, గుడ్లలో కూడా డీ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. 

టాస్క్ ఫోర్స్ ఐజీ సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు : ఏపీ టాస్క్ ఫోర్స్ ఐజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడం టాస్క్ ఫోర్స్ తో మాత్రమే  సాధ్యం కాదని, పోలీస్, అటవీ శాఖలు టాస్క్ ఫోర్స్ కు ఏ మాత్రం సహకరించడలేదని ఐజీ కాంతారావు అన్నారు.

టీఎస్ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 50 రోజులు అసెంబ్లీ నడిపిస్తామని చెప్పిన ప్రభుత్వం రోజు రెండు మూడ గంటలు జరిపి వాయిదా వేయడం పై విక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాయబరేలీ ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

లక్నో : యూపీలోని రాయబరేలీ ఎన్టీపీసీ ప్లాంట్ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో 66 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు.

11:30 - November 2, 2017

హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణ అరికట్టడం టాస్క్‌ఫోర్స్‌తో మాత్రమే సాధ్యం కాదన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో పోలీసులు, అటవీశాఖ అధికారుల నుంచి ఏ మాత్రం సహకరం అందడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అకమ్ర వారణ అరిట్టేందుకు ఉద్దేశించిన జీవోలు అమలుకావడంలేదని కాంతారావు చెప్పారు. 

 

11:29 - November 2, 2017

స్పోర్ట్స్ : క్రికిట్ మ్యాచ్ లో ఫిల్డ్ ఎంఫైర్, లెగ్ ఎంఫైర్ తడబడడం చూశాము కానీ థర్డ్ ఎంఫైర్ తడబడడమ చూడలేదు కాదా. కానీ భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్వీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఔట్ విషయంలో థర్డ్ ఎంఫైర్ కనిప్యూజన్ గురైయ్యాడు. బోల్ట మ్యాచ్ 19 ఓవర్ చివిరి బంతిని వేశాడు అప్పడు స్ట్రైకింగ్ ఉన్న రోహిత్ దాన్ని షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ తకితకినట్లుగా వెళ్లింది. అయితే ఇక్కడ కీపర్ రోంచి అయోమయంలో ఉండడంతో కెప్టెన్ విలియంసన్ బోల్ట్ సూచన మేరకు రీవ్యూ కోరాడు. దీంతో థర్డ్ ఎంఫైర్ మొదట బ్యాట్ గ్రౌండ్ కి తాగిందని నాట్ అవుట్ గా తేల్చారు దీంతో విలియంసన్ మళ్లీ రివ్యూ కోరాడంతో అల్ట్రా ఎడ్జ్ బ్యాట్ తాగిందని గుర్తించి అవుట్ గా ప్రకటించారు.

11:17 - November 2, 2017

హైదరాబాద్ : 2018 ఏప్రిల్ 18 నుంచి 22వరకు జరుగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా నేడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం జరుగనుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరు కానున్నారు. ఈ అంశాలపై రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ సీపీఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరుగనున్నాయని తెలిపారు. 21 వ మహాసభలో విశాఖలో జరిగాయని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు జరుగనున్న 22 వ మహాభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల బలోపేతానికి, ఆ ప్రత్యామ్నాయానికి అనుసరించాలని నిర్మాణ పద్ధతులను మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సీపీఎం స్వతంత్ర బలోపేతానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చ జరుగనుందని చెప్పారు. ఈ మహాసభలకు ప్రత్యేకత ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:54 - November 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఐదో రోజు సమావేశాలు కొనసాగతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్ సీ బకాయిల చెల్లింపుపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

 

10:53 - November 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి క్యాబ్ డ్రైవర్ల యత్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు. రామ్ గోపాల్ పేట పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అసెంబ్లీ ముట్టడికి క్యాబ్ డ్రైవర్ల యత్నం

హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి క్యాబ్ డైవర్లు యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కంపెనీలు తమను వేధింస్తున్నాయని, వారి నుంచి తమని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాసేపట్లో టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్ సీ బకాయిల చెల్లింపుపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఉద్యోగుల సాధారణ బదిలీపై నిషేధంపై ఎత్తివేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. 

 

09:52 - November 2, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్ సీ బకాయిల చెల్లింపుపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఉద్యోగుల సాధారణ బదిలీపై నిషేధంపై ఎత్తివేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. 

 

09:44 - November 2, 2017

వాషింగ్టన్ : అమెరికాలోని కొలరాడోలో కాల్పులు కలకలం రేపాయి. వాల్ మార్ట్ లో దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఉద్యోగులు, ఖాతాదారులు బయటికి పరుగులు తీశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

కొలరాడోలో కాల్పులు..ఒకరి మృతి

వాషింగ్టన్ : అమెరికాలోని కొలరాడోలో కాల్పులు కలకలం రేపాయి. వాల్ మార్ట్ లో దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఉద్యోగులు, ఖాతాదారులు బయటికి పరుగులు తీశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

08:54 - November 2, 2017

కర్నూలు : పాములపాడులో విషాదం నెలకొంది. ఐదుగురు యువతులు కేసీ కెనాల్ లో కార్తీక స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. స్థానికులు..నలుగురిని స్థానికులు కాపాడారు. మరో యువతి గల్లంతైంది. గల్లంతైన యువతి లావణ్యగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:49 - November 2, 2017

గుంటూరు : చందన బ్రదర్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులోని రెడీమేడ్ దస్తుల విభాగంలో మంటలు చెలరేగాయి. భారీగా అస్తి సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఏసీ నుంచి వచ్చిన షార్ట్ సర్కూట్య వల్లే మంటలు చేలరాగాయన్న అనుమానాలు కల్గుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

బండరాయితో మోది వ్యక్తి హత్య

హైదరాబాద్‌ : పాతబస్తీలోని షాహినాజ్‌గంజ్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. బండరాయితో తలపై మోది హత్య చేశారు. నడిరోడ్డుపై ఇంతటి దారుణం జరుగుతుంటే ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పక్కనే పోలీసు ఔట్‌పోస్టు ఉన్నా కాపాడే ప్రయత్నాలు చేయలేదు. పైగా తమకు తెలియదని చెప్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

08:45 - November 2, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలోని షాహినాజ్‌గంజ్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. బండరాయితో తలపై మోది హత్య చేశారు. నడిరోడ్డుపై ఇంతటి దారుణం జరుగుతుంటే ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పక్కనే పోలీసు ఔట్‌పోస్టు ఉన్నా కాపాడే ప్రయత్నాలు చేయలేదు. పైగా తమకు తెలియదని చెప్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

08:43 - November 2, 2017

హైదరాబాద్ : టీసర్కార్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని వక్తలు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత రామచంద్రారెడ్డి, నవ తెలంగాణ వీరయ్య, టీఆర్ ఎస్ నేత కాశం నారాయణ గుప్తా పాల్గొని, మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. డబ్బుల్లేవు అంటున్న ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకుంటుందని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజా ధనాన్ని వృధా చేయొద్దని హితవు పలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:38 - November 2, 2017

వరి, పత్తి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సమయంలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికి వచ్చే ముందు అకాల వర్షాలు ముంచెత్తాయి. మొత్తంగా దిగుబడి తగ్గింది. ఇవన్నీ దాటాక పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకవైపు పండిన పంటను కొనడానికి సీసీఐ ఏవో కారణాలు చెబుతూ కొనకుండా జాప్యం చేస్తోంది. మరోవైపు అతి తక్కువ ధరను చెల్లిస్తూ ప్రైవేట్‌ వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడారాని పరిస్థితి. ఇది ప్రస్తుతం పత్తిరైతుల దీనస్థితి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.... 

గుంటూరు చందన బ్రదర్స్ లో చెలరేగిన మంటలు

గుంటూరు : చందన బ్రదర్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులోని రెడీమేడ్ దస్తుల విభాగంలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. 

కేసీ కెనాల్ లో యువతి గల్లంతు

కర్నూలు : కేసీ కెనాల్ లో కార్తీక స్నానానికి వెళ్లి ఐదుగురు యువతులు ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. స్థానికులు నలుగురిని కాపాడారు. మరో యువతి గల్లంతైంది. గల్లంతైన యువతి లావణ్యగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు. 

08:15 - November 2, 2017

ఢిల్లీ : కివీస్‌తో జరిగిన మొదటి టీ20లో టీమ్‌ఇండియా సత్తా చాటింది. అన్ని విభాగాల్లో రాణించి సమష్టి కృషితో విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌ విజయంలో కీలకభూమిక పోషించిన ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
కోహ్లీసేన విక్టరీ
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన విక్టరీ కొట్టింది. పర్యాటక న్యూజిలాండ్‌ను 53 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ గట్టి పునాది వేశారు.  అర్థసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 158 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. న్యూజిలాండ్‌ ఫీల్డర్లు ధావన్‌ వ్యక్తిగత స్కోర్‌ 8 వద్ద క్యాచ్‌ వదిలేశారు. ఆ తర్వాత అతడు వారికి చుక్కలు చూపించాడు. మరోవైపు రోహిత్‌ వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లు బాదేశాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి భారీ టార్గెట్‌ను కివీస్‌ ముందుంచింది. 
లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 
203 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ లక్ష్య ఛేదనలో తడబడింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ 4 రన్స్‌కే ఔటయ్యాడు. కొలిన్‌ మన్రో సైతం 7 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన కేన్‌ విలియమ్సన్‌, టామ్‌ లేథమ్‌ కాస్త పోరాడారు. చివర్లో మిచెల్‌ శాంట్నర్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించలేదు. 
53రన్స్‌ తేడాతో భారత్‌ విజయం 
బ్యాట్‌మెన్స్‌ వరుసగా పెవిలియన్‌ బాటపట్టడంతో కివీస్‌ 8 వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులే చేయగలిగింది. దీంతో భారత్‌ 53రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్‌ ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
ఆశిష్‌ నెహ్రాకు టీమ్‌ ఇండియా ఘన వీడ్కోలు 
టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు ఘన టీమ్‌ ఇండియా ఘన వీడ్కోలు పలికింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అభిమానుల హర్షధ్వానాల మధ్య నెహ్రాతోపాటు జట్టంతా మైదానం మొత్తం తిరిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ నెహ్రాను భూజాలపై ఎత్తుకుని మైదానం తిప్పి ఘనంగా వీడ్కోలు పలికారు. 
 

07:56 - November 2, 2017

కర్నూలు : జిల్లాలోని దేవనకొండలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఆరేళ్ల జాస్మిన్ అనే చిన్నారి నీటి కుంటలో పడి చనిపోయింది. నీటికుంటలో పడ్డ చిన్నారిని చివరిక్షణంలో గుర్తించిన కుటుంబసభ్యులు.. హుటాహుటిన స్ధానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. అనంతరం చిన్నారిని పత్తికొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి కన్నుమూసింది.

 

07:55 - November 2, 2017

ప్రకాశం : వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణాలను తీసిందంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆసుపత్రి ముందు తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఒంగోలు ప్రకాశ్ నగర్ కి చెందిన సుల్తాన్ భాషా, షకీలా దంపతులకు అనారోగ్యంతో బిడ్డ జన్మించడంతో స్థానిక అమ్మ ఆసుపత్రిలో శిశువును చేర్పించారు. శిశువుకు ఎలాంటి ఇబ్బంది లేదని రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపుతామని చెప్పిన వైద్యులు.. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలోనే ఉంచారు. ఈ రెండు నెలల్లో 3లక్షల రూపాయలను బిల్లుల రూపంలో తీసుకున్నారని శిశువు తల్లిదండ్రులు అంటున్నారు. ఇక డబ్బులు చెల్లించలేక  ఇంటికి వెళ్లిపోయామన్నారు. అయితే ఆస్పత్రినుంచి తీసుకొచ్చిన రెండు రోజులకే బిడ్డ మృతిచెందడంతో.. ఆగ్రహించిన బంధువులు ఒంగోలులోని అమ్మఆసుపత్రి ముందు  ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

07:51 - November 2, 2017

మేడ్చల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాప్రా మండలం జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని బీజేఆర్‌నగర్‌లో గీత అనే నిండు గర్భిణి అగ్నికి ఆహుతైంది. అత్తింటివారు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతుంటే .. మృతురాలి కుటుంబసభ్యులు అత్తింటివారే హతమార్చారని ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

07:48 - November 2, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలోని షాహినాజ్‌గంజ్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. బండరాయితో తలపై మోది హత్య చేశారు. నడిరోడ్డుపై ఇంతటి దారుణం జరుగుతుంటే ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పక్కనే పోలీసు ఔట్‌పోస్టు ఉన్నా కాపాడే ప్రయత్నాలు చేయలేదు. పైగా తమకు తెలియదని చెప్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. 

 

07:45 - November 2, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో చిన్నారులకు సురక్షితమైన బాల్యాన్ని అందించేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ విశిష్ట సేవలందిస్తోందని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. 50 శాతం మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అబ్యూజింగ్‌ చైల్డ్‌ క్యాంపెయిన్‌ లోగోను, ఓ గేయాన్ని డీజీపీ ఆవిష్కరించారు.  చైల్డ్ అబ్యూజింగ్‌ క్యాంపెయిన్‌ ఏడాది పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో 3వ తేదీన ప్రారంభిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. 

07:42 - November 2, 2017

ఢిల్లీ : విశాఖ పోర్టు నుంచి జల రవాణా ద్వారా తొలిసారి ముంబై, అహ్మదాబాద్‌లకు స్టీల్‌ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఎగుమతులు ప్రారంభించారు. జలరవాణాతో వ్యాపార ఖర్చులు భారీగా తగ్గుతాయని.. అన్ని రాష్ట్రాలు జలరవాణాను ప్రోత్సహించాలని గడ్కరీ అన్నారు. ఏపీలో బకింగ్‌హామ్ కాలువను జలరవాణాకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

 

07:39 - November 2, 2017

నిజామాబాద్ : ప్రభుత్వ పథకాలపైనా, సీఎం కేసీఆర్‌ మీద వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు నిజామాబాద్‌కు చెందిన కండక్టర్‌ సంజీవ్‌ను ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్‌ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డందుకే సంజీవ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అయితే సంజీవ్‌ సస్పెండ్‌ పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
కండక్టర్‌ సంజీవ్‌ను సస్పెండ్‌ చేస్తూ నోటీసులు జారీ 
నిజామాబాద్‌కు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ సంజీవ్‌ను సస్పెండ్‌ చేస్తూ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దాదాపు నెల రోజుల పాటు విజిలెన్స్‌ విచారణ జరిపిన అనంతరం అక్టోబర్ 30న సంజీవ్‌కు సస్పెన్షన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. సస్పెన్షన్‌పై స్పందించిన సంజీవ్‌ ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని తుంగలో తొక్కే చర్య అన్నారు. తాను కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు, ఇబ్బందుల గురించి పోస్ట్ చేశానే తప్ప ఎవరినీ విమర్శించి పోస్టులు పెట్టలేదన్నారు. 
సంజీవ్‌ ను సస్పెండ్‌ చేయడం సబబు కాదు : కార్మికం సంఘాలు 
అయితే సంజీవ్‌ను సస్పెండ్‌ చేయడం ఏమాత్రం సబబు కాదంటున్నారు కార్మిక సంఘాలు నాయకులు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం నేరమని భావిస్తే అది వాక్‌ స్వాతంత్ర్యాన్ని తుంగలో తొక్కడమే అని ఆరోపిస్తున్నారు. కార్మికులను ఉన్నపళంగా సస్పెండ్‌ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు కార్మిక నేతలు. సస్పెన్షన్‌ను ఆర్టీసీ యాజమాన్యం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 
నివేదిక ఆధారంగానే సస్పెండ్‌ : డీఎం 
సంజీవ్‌ సస్పెన్షన్‌పై స్పందించిన డీఎం ఆర్టీసీ యాజమాన్యానికి హాని కలిగేలా, ప్రభుత్వ పథకాలు, కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ పోస్టులు చేసినందుకే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక ఆధారంగానే సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. 
ఇది కక్ష సాధింపు చర్య : సంజీవ్ 
సస్పెన్షన్‌కు ముందు ఛార్జ్‌ షీట్‌ ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత వివరణ తీసుకొని సస్పెన్షన్‌ ఆర్డర్‌ ఇస్తారన్నారు సంజీవ్‌. అలా కాకుండా రెండు ఒకే రోజు ఇవ్వడంపై తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపిస్తున్నాడు. అన్యాయంగా తనను సస్పెండ్‌ చేశారని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మొత్తానికి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై ఉద్యోగిని సస్పెండ్ చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఆందోళనలు తప్పేలా లేవు.

 

07:32 - November 2, 2017

హైదరాబాద్ : టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ 24 గంటలపాటు చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ  మంగళవారం హైదరాబాద్ తార్నాకలోని తన నివాసం వద్ద దీక్ష చేపట్టారు. కొలువుల కొట్లాట కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని కోదండరామ్ తేల్చి చెప్పారు. 
దీక్షకు పలువురు మద్దతు 
నిరుద్యోగ సమస్యలపై టీజాక్ తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ప్రొ.కోదండరామ్ చేపట్టిన 24 గంటల నిరసన దీక్ష ముగిసింది. హైదరాబాద్‌ తార్నాకలోని తన నివాసంలో చేపట్టిన దీక్షకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొ.హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ హాజరై... కోదండరామ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. కోదండరామ్ చేపట్టిన దీక్షకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, విద్యార్ది ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. 
దీక్షకు తమ్మినేని వీరభద్రం మద్దతు 
అంతకు ముందు... కోదండరాం చేపట్టిన దీక్షకు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే వరకు ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరామ్ చేపట్టిన దీక్ష సమస్య పరిష్కారం కోసం కాదన్నారు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య. సమస్యను ఎత్తి చూపి పరిష్కరించుకోవాల్సిందిగా కోదండరామ్ హెచ్చరిక చేశారన్నారాయన. 
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలి : కోదండరామ్
టీజేఎసీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రొ.కోదండరామ్ తప్పుపట్టారు. తెలంగాణ మార్పు జరగాలంటే సామాజిక మార్పు.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలన్నారు కోదండరామ్. అందుకోసం నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 3న అన్ని జిల్లా కేంద్రాల్లో జేఎసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై, జేఎసీపై ప్రభుత్వ నిర్బంధంపై  కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు కోదండరామ్. నవంబర్ 5న భవిష్యత్ కార్యాచరణపై టీజేఎసీ విస్త్రత సమావేశం నిర్వహిస్తామని కోదండరామ్ చెప్పారు. 

 

07:27 - November 2, 2017

హైదరాబాద్ : బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  పలు అభివృద్ది పనులకు ఆమోదం తెలిపారు. మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు  మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  రాష్ట్రంలో మాంస పరిశ్రమ అభివృద్ధి  చెందడానికి తగిన కార్యాచరణను రూపొందించాలని  నిర్ణయించారు.  ఈ సమావేశంలో అత్యంత కీలకమైన "ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2017"కు ఆమోదం లభించింది. అంతర్గత జలరవాణా చట్టం-1917 కింద.. 'ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' 2013లోనే  మోడల్ 'ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్‌ను రూపొందించింది. దాని ఆధారంగానే తాజాగా ఏపీ ఇన్‌ల్యాండ్‌ వెస్సల్స్‌ రూల్స్‌ను రూపొందించారు. కాకినాడ పోర్టుల డైరెక్టర్ చేసిన  ప్రతిపాదనను పరిశీలించిన మంత్రిమండలి  తన ఆమోదాన్ని  తెలిపింది. 
సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఆమోదం   
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న   సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు మంత్రివర్గ భేటీలో ఆమోదం లభించింది.  ఈ  సైన్స్ సిటీలో మ్యూజియం, పరిశోధనశాల, అవుట్‌డోర్ సైన్స్ పార్క్, కన్వెన్షన్ సెంటర్ ఉండనున్నాయి. అటు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌ 500 కోట్లు రుణం  పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.  ఈ నిధులతో స్వచ్ఛభారత్ మిషన్ కింద 12.5 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నరేగా కింద మరో 2.5 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేట్టాలని నిర్ణయించారు.  
కైక‌లూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టులు 
కైక‌లూరులోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దాంతోపాటు 
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ నియామకాలను చేపట్టేందుకు APPSCకి అదనపు అధికారం కల్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బిల్లును రానున్న  అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి  నిర్ణయిం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కోల్డ్‌ చైన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రుల బృందాన్ని నియమించింది. వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో 15 రోజులకోసారి పంట ధరలపై సమీక్షించాలని నిర్ణయించింది. అటు పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇప్పటికే  50.48 శాతం  పూర్తయ్యాయని .. దీనికి సంబంధించిన  వివరాలు మంత్రిమండలికి సమర్పించామని మంత్రి  దేవినేని ఉమ తెలిపారు. 
కిదాంబి శ్రీకాంత్‌కు రూ. 2కోట్ల నజరానా
ఇక ఇటీవల డెన్మార్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గిన బ్యాడ్మింట్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను అభినందిస్తూ మంత్రివర్గ తీర్మానం చేసింది. శ్రీకాంత్‌కు 2 కోట్ల నజరానా, అమరావతిలో వెయ్యి గజాల స్థలంతోపాటు  డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అటు బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ సహా మరో ఇద్దరు కోచ్‌లకు రూ. 15 లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని కూడా ఏపీ కేబినెట్‌ భేటీలో నిర్ణయంచారు.   

 

నేడు సీపీఎం జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం

హైదరాబాద్ : 2018 ఏప్రిల్ 18 నుంచి 22వరకు జరగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా నేడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం జరుగనుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరు కానున్నారు.

 

నేడు హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నేడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలవనున్నారు. మ. ఒంటి గంటకు టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 

 

Don't Miss