Activities calendar

03 November 2017

21:37 - November 3, 2017

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా....మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టీ20కి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది.ఢిల్లీ టీ20 విజయంతో జోరు మీదున్న విరాట్‌ కొహ్లీ అండ్‌ కో సెకండ్‌ ర్యాంకర్‌ కివీస్‌ టీమ్‌సై సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతోన్న ట్వంటీ ట్వంటీ సిరీస్‌లో కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టీ20కి రంగం సిద్ధమైంది. ఫటా ఫట్‌ 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ... కేన్‌విలియమ్‌సన్‌ సారధ్యంలోని కివీస్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది. ఇంటర్నేషనల్‌ టీ20ల్లో ఇప్పటివరకూ న్యూజిలాండ్‌పై ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన భారత్‌...రెండో విజయం కోసం తహతహలాడుతోంది. ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కొహ్లీ,ధోనీ,హార్దిక్‌ పాండ్యలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే దుర్భేధ్యంగా ఉంది. విరాట్‌ కొహ్లీ ,రోహిత్‌ శర్మ , ధావన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానేమే లేదు.

యజ్వేంద్రచహాల్‌, అక్షర్‌ పటేల్‌ వంటి మ్యాజిక్‌ లెగ్‌ స్పిన్నర్లతో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి పేస్‌ బౌలర్లతో బౌలింగ్‌ ఎటాక్‌ మునునెన్నడూ లేనంతలా పదునుగా ఉంది. తొలి టీ20తో రిటైర్‌ అయిన అశిష్‌ నెహ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కేన్‌ విలియమ్‌సన్ సారధ్యంలోని న్యూజిలాండ్‌ జట్టు ఢిల్లీ టీ20 ఓటమికి బదులు తీర్చుకోవాలని ప్లాన్‌లో ఉంది.టీ20ల్లో భారత్‌పై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన కివీస్‌ టీమ్‌...సెకండ్‌ టీ20లో నెగ్గి సిరీస్‌ నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది.టిమ్‌ లాథమ్‌,విలియమ్‌సన్‌ సూపర్‌ఫామ్‌లో ఉన్నా...నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌తో న్యూజిలాండ్‌ జట్టు అంతగా ప్రభావం చూపలేకపోతోంది. తొలి టీ20లో భారీగా పరుగులిచ్చిన ట్రెంట్‌ బౌల్ట్‌,టిమ్‌ సౌథీ....అంతగా ప్రభావం చూపలేకపోయిన మిషెల్‌ శాంట్నర్‌లపై కివీస్‌ టీమ్‌ భారీ అంచనాలే పెట్టుకుంది.

ఢిల్లీ టీ20లో నెగ్గి సిరీస్‌కు అదిరిపోయె ఆరంభాన్నిచ్చిన విరాట్‌ కొహ్లీ అండ్‌ కో ...సెకండ్‌ టీ20లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.తొలి టీ20లో తేలిపోయిన న్యూజిలాండ్‌ జట్టును తక్కువ అంచనా వేస్తేం మాత్రం ఫలితం తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి సెకండ్‌ టీ20లో నెగ్గి కివీస్‌ టీమ్ సిరీస్‌ సమం చేస్తుందో.. లేక టీమిండియానే సిరీస్‌ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

21:33 - November 3, 2017

ఢిల్లీ : మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇవాళ నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా పలు దేశాల్లో సుమారు 2గంటల పాటు సేవలు నిలిచిపోవడంతో.. కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంతో కోట్లాది మంది యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గంటన్నర తరువాత వాట్సప్ యాజమాన్యం సమస్యను పరిష్కరించింది. సాంకేతిక సమస్య వల్ల సర్వర్ డౌన్ అయిందని తెలిపింది.

21:31 - November 3, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోకుంటే అకౌంట్లు నిలిపివేస్తామని బ్యాంకులు, మొబైల్‌ కంపెనీలు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ ఒత్తిడి పెంచడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్ లింకింగ్ సందేశాలు పంపితే అందులో కచ్చితంగా చివరి తేదీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నెంబర్లతో ఆధార్‌ అనుసంధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై బదులివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ కోసం డిసెంబర్‌ 31, మొబైల్‌ నెంబర్‌కు ఆధార్‌తో లింకేజీ కోసం ఫిబ్రవరి 6 గడువు విధించినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.

21:30 - November 3, 2017

ఢిల్లీ : 2017కు గాను సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్‌ అవార్డు ప్రకటించారు. ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణా సోబతిని అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్ఞానపీఠ్‌ డైరెక్టర్ లీలాధర్‌ మండలోయి తెలిపారు. హిందీ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను కృష్ణా సోబతిని 53వ జ్ఞానపీఠ పురస్కారం వరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు కింద పురస్కార గ్రహీతకు 11 లక్షల రూపాయలు, ప్రశంసా పత్రాన్ని ఇవ్వనున్నారు. కృష్ణా సోబతి రచించిన 'జిందగీ నామా'కు గాను1996లో సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

21:28 - November 3, 2017

మధ్యప్రదేశ్‌ : రాజధాని భోపాల్‌లో ఐఏఎస్‌ కోచింగ్‌కు వెళ్తున్న ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ ఘటన సంచలనం సృష్టించింది. గురువారం సాయంత్రం కోచింగ్‌ సెంటర్‌ నుంచి హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌కు షార్ట్‌కట్‌ రూట్‌లో వెళ్తున్న ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి ఆమెపై 3 గంటలపాటు అత్యాచారం జరిపారు. నిందితుల్లో ఒకడు మరో ఇద్దరు స్నేహితులను తీసుకొచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి దగ్గర ఉన్న ఫోను, వాచి, పర్స్‌ను లాక్కుని రాత్రి 10 గంటల తర్వాత విడిచిపెట్టారు. ఈ కేసులో పోలీసుల నుంచి సహకారం లభించకపోగా... బాధితురాలే కీచకులను గుర్తించడంతో కేసు నమోదైంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు బిజెపి సర్కార్‌ను ఎండగట్టాయి. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేసింది.  

21:27 - November 3, 2017

తమిళనాడు : చెన్నయ్‌కు మళ్లీ వరద ముప్పు పొంచి వుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై జలదిగ్బంధమైంది. మరో 48 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాక హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడులో స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు తల్లిడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం రాత్రి ఏకధాటిగా ఐదు గంటల పాటు వర్షం కురవడంతో చెన్నైలోని వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. మెరీనా బీచ్‌ సహా ప్రధాన రహరారులను మూసివేశారు. కొరట్టూరు, చెన్నై ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఎటు చూసినా మోకాళ్ల లోతు నీరు ఉండటంతో ప్రజలకు అడుగు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. పలుచోట్ల వర్షాలకు విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. నంగంబక్కం ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరో రెండు రోజులు పడే భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో కాంచీపురం. తిరువళ్లూరు జిల్లాల్లో కుంభవృష్టి కురియనుందని ఐఎండి పేర్కొంది. దీంతో పళని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కోస్తా జిల్లాల్లో ఇప్పటికే 115 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. సహాయక చర్యలను సమీక్షించేందుకు జిల్లాల్లో అధికారులను నియమించింది. వర్షాల కారణంగా గత నాలుగు రోజులుగా చెన్నై, శివారు ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలలు మూతపడ్డాయి. పలు విశ్వవిద్యాలయాలు సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేశాయి. వర్షాల వల్ల చెన్నై సబ్‌ అర్బన్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విమాన రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. 2015లో చెన్నైలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

21:25 - November 3, 2017
21:24 - November 3, 2017

ఢిల్లీ : ఓఎంసీ కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తన కుమార్తె బ్రహ్మణి మ్యారేజ్ యానివర్సరీకి గాను లండన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పెట్టుకున్న షిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 5 నుంచి 20 వరకు లండన్‌ వెళ్లేందుకు తనను అనుమతించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. సీబీఐ జప్తు చేసిన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరారు. గాలి జనార్దన్‌రెడ్డి లండన్‌ వెళితే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉందని... ఆయన రాకపోతే కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. బ్యాంకులను మోసగించి లండన్‌ వెళ్లిన విజయమాల్యా తిరిగి రాలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు లండన్‌ వెళ్లేందుకు గాలి జనార్దన్‌రెడ్డికి అనుమతి నిరాకరించింది.

21:22 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతి లభించింది. ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం... అంతరాష్ట్ర క్లియరెన్స్‌ జారీ చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఫలించింది. అంతరాష్ట్ర క్లియరెన్స్‌ జారీపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 

21:21 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పంచాయితీ రాజ్ చట్టం రాబోతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీలైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కొత్త చట్టం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని అభిప్రాయపడ్డ కేసీఆర్... ఇప్పుడున్న విధానం కొనసాగితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఈ పరిస్థితిలో సమూలంగా మార్పు రావాలన్న కేసీఆర్ అందుకోసం కొత్త చట్టం రావాలన్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో..మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీలు, స్ధానిక సంస్థలు రాను రాను రాజకీయమైపోతున్నాయన్న కేసీఆర్ ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. గ్రామ సంచాయతీలు మరింత శక్తివంతం కావాలన్నారు. ప్రతీ కార్యక్రమంలోనూ గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామ పంచాయతీల విధులు.. వాటికున్న బాధ్యతల విషయంలో పూర్తి స్ధాయిలో స్పష్టతనిస్తూ కొత్త చట్టం తయారు కావాలన్నారు కేసీఆర్. కేవలం విధులు, బాధ్యతలు అప్పగించడమే కాకుండా వచ్చే బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తామన్నారు. నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ ఉంటే గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పనిచేస్తాయన్న కేసీఆర్.. విధుల నిర్వహణలో వైఫల్యం చెందిన చోట క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలన్నారు. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయితీ రాజ్ చట్టం తయారు కావాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. వీలైతే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

21:19 - November 3, 2017

ఢిల్లీ : భారత్‌లో ఫుడ్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ 10 లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో భోజనం చేస్తుంటారని..... ఆహార పరిశ్రమకు వాళ్లే ప్రధాన కస్టమర్లు అని మోదీ తెలిపారు. ఆహార తయారీ ప్రక్రియలో రైతులే కీలకమన్నారు. ప్రపంచ స్థాయి ఆహార పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనా' పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఆహార పరిశ్రమల కోసం సుమారు 5 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని చెప్పారు. దీని వల్ల సుమారు 20 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందన్నారు. మరో 5 లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఫుడ్‌ ఫెస్టివల్‌లో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

21:17 - November 3, 2017

ఢిల్లీ : 20 ఏళ్ల క్రిందటే ఐటీ మీద దృష్టి పెట్టిన తాము ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నెంబర్ వన్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధికి అవసరమైన పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో... రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్...
తెలంగాణకు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా సమావేశంలో కేటీఆర్‌ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తొలిరోజు 2 ఒప్పందాలు చేసుకుందని.. శనివారం మరో 10 ఒప్పందాలను చేసుకోబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 7వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రానున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం వారం జరిగే సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్‌ పాలసీని విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

21:15 - November 3, 2017

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం నిధుల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు రాష్ట్రానికి రావల్సిన ఇతర నిధుల అంశాన్ని జైట్లీ ముందు ప్రస్తావించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను చంద్రబాబు కలిశారు. విభజనచట్టం వేగవంతం చేయమని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. విభజన చట్టం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అమిత్‌షాతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు. 

21:14 - November 3, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగాయి. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ పథకంపై కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాలు కల్పించకుండా..పథకాన్ని ఎలా విజయవంతం చేస్తారని నిలదీశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా... ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిషన్‌ ఏర్పాటులో కేంద్ర సహకారం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్‌, BJP సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నిరసనపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. 2010 నుంచి ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ లేదని.. ఇప్పుడు వాకౌట్‌ చేసిన వాళ్లే ఆరోజు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. నకిలీ, నాసిరకం, కల్తీ విత్తనాల బెడద నివారణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. అయితే నకిలీల వ్యవహారంలో.. గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు తీసుకువస్తామని... ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

అనంతరం కేసీఆర్ కిట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే అధికారిక లెక్కలు గొప్పగా ఉన్నా.. వాస్తవ పరిస్థితి అలా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి విమర్శించారు. ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలతో ఈ పథకాన్ని ఎలా సక్సెస్ చేస్తారని ప్రశ్నించారు. వరండాల్లో పడుకోబెట్టి ప్రసవాలు చేస్తున్నారన్నారు.

కేసీఆర్‌ కిట్‌ పథకంపై మాట్లాడిన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య... పుట్టే పిల్లల లింగ భేదం లేకుండా నగదు పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కిట్ల పంపిణీలో రద్దీ పెరగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని ఆ సమస్య రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్‌ పథకాన్ని విపక్షాలు విమర్శించడం తగదని.. వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 94 వేల ప్రసవాలు జరిగితే.. 92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. పథకం అమల్లో అవకతవకలకు తావు లేకుండా.. ఆన్‌లైన్‌లో నమోదు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. సభలో కేసీఆర్ కిట్లపై లఘు చర్చ అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. 

జైట్లీ..రాజ్ నాథ్ తో బాబు భేటీలు..

ఢిల్లీ : దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పోలవరం నిధులపై జైట్లీతో, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయమై రాజ్ నాథ్ తో చర్చలు జరిపారు. 

20:23 - November 3, 2017

పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? లేక సవ్యంగా సాగి... ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్పం కోసం జగన్ ప్రయత్నిస్తారా? దీనిపై ప్రత్యేక కథనం.. ఎన్ని మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్ష లాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు విపక్షనేత. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. ఓ వైపు ఇడుపుల‌పాయ‌లో ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతుండ‌గా మ‌రోవైపు రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేత‌లు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది? ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యమేమిటి? అధికారపక్షాన్ని ఎండగడుతూ, వచ్చే ఎన్నికలే టార్గెట్ జగన్ ముందుకు సాగనున్నారా? పాదయాత్ర షెడ్యూల్ దగ్గరకొచ్చేకొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. జగన్ యాత్రను ఆపే ప్రయత్నంలో ఏపీ సర్కారు ఉందా? తెలుగు నేల ఇప్పటికే పలు పాదయాత్రలను చూసింది. అధికారంలోకి తెచ్చిన అడుగులను, తమ అభిమాన్ని కొల్లగొట్టిన యాత్రలను అనేకం చూశారు ఏపీ ప్రజలు. మరి జగన్ పాదయాత్ర తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? గత పాదయాత్రల అనుభవాలు ఏం చెప్తున్నాయి?

రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు..అధికారపక్షం మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు పై ఎత్తులు, అరచేతిలో వైకుంఠం చూపటం తప్ప వాస్తవంగా జరుగుతున్నది శూన్యం అనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశం, రైతుల సమస్యలు, ఇలా ఏపీని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రాజకీయ రంగంలో విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతిసవాళ్లూ మామూలే. అదే సమయంలో అధికారం కోసం నేతలు చేసే ప్రయత్నాలూ సాధారణమే. ఇవేవీ ప్రజల దృష్టి నుండి దూరంగా పోయేవి కాదు. కానీ, ఏం మాట్లాడుతున్నా, ఏ యాత్రలు చేస్తున్నా, అడ్డుకున్నా ప్రజలకు అందాల్సిన సంకేతాలు అందుతూనే ఉంటాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:09 - November 3, 2017

తెలంగాణ రాష్ట్రంల ఎక్వ తెర్లు తెర్లైనోళ్లు ఎవ్వలంటే రైతులే.. పత్తి వంచిండిన రైతు పస్తులు వంటున్నడు.. మిర్చి వండించిన రైతు పుర్గుల మందు మింగుతున్నడు.. మక్కలు వండించిన రైతు మట్టిల గల్చిపోతున్నడు.. దుక్కిదున్నెకాడికెళ్లి.. కాంటకేశెదాక అడ్గుగడ్గున దగాపడుతున్నడు.. లీడర్లు మారుతున్నరుగని.. రైతుల బత్కుమాత్రం మార్తలేదు.. తెలంగాణ రాష్ట్రంల తెర్లైన ఎవుసం కథ ఇది..గీ విషాద ముచ్చట కోసం వీడియో సూడుండి.

కాళేశ్వరం పనులకు అంతరాష్ట్ర క్లియరెన్స్..

హైదరాబాద్ : కాళేశ్వరం పనులకు అంతరాష్ట్ర క్లియరెన్స్ ను కేంద్ర జలసంఘం జారీ చేసింది. మహారాష్ట్రతో ఒప్పందం ఫలించడంతో మంత్రి హరీష్ సంతోషం వ్యక్తం చేశారు.

 

19:16 - November 3, 2017

ఏ ఎవ్వలో అంటిరేమయ్యా..? తుమ్మలనాగేశ్వర్ రావుగారు సుద్దపూస ఆయనకు అవినీతి అంటె ఎట్ల జేయాల్నో తెల్వది.. తెలంగాణ రాష్ట్రంల ఎక్వ తెర్లు తెర్లైనోళ్లు ఎవ్వలంటే రైతులే.. పత్తి వంచిండిన రైతు పస్తులు వంటున్నడు.. బీమండి కెళ్లొచ్చిన కార్మికుడు గ్యాస్ నూనే మీద వోస్కున్నడు సచ్చిపోయెతందుకు.. రాజకీయ నాయకుల ర్యాలీల కాడ.. వాళ్లు వెట్టుకునె సభల కాడ.. వాళ్లను గెల్పిచ్చెకాడనే ఉపయోగపడ్తదా..?కేసీఆర్ జెప్తున్న మాటలన్ని ప్రజలతోనే అవద్దాలు అని చెప్పిపిస్తాని తిర్గుతున్నడు సంగారెడ్డి పిలగాడు జగ్గారెడ్డి.. పాలకులు ఎవ్వలైనా ప్రభుత్వం ఏ పార్టీదైనా..? ప్రజల హక్కులకు మాత్రం పాతర వెడ్తనే ఉన్నయ్.. పొమ్మనలేక పొగవెట్టినట్టు.. హైద్రావాదుల ఆంధ్రోళ్లకు ముల్లుగుచ్చుకుంటె పంటితోని వీకుతాంటివిగదా..? ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ..త్తి శేనేస్తె పంట బాగరాలేదని.. ఏకంగ గంజాయి శేనేశిండు.. గిసొంటి గరం..గరం ముచ్చట్లు కోసం వీడియో క్లిక్ చేయండి...

కమల్ పై కేసు..

చెన్నై : హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు కమల్ పై పరువు నష్టం కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో కేసు బుక్ చేశారు. 

పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : కొత్త పంచాయతీ రాజ్ చట్టం రూప కల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన మాజీ అధికారులు కూడా పాల్గొన్నారు. 

19:08 - November 3, 2017

ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఉన్నత విద్యాశాఖ మొత్తం ఆరు యూనివర్సిటీలకు 651 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన ప్రత్యేక చర్చలో బాబురెడ్డి (యూటీఎఫ్), రామకృష్ణ (టిడిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ), నూర్ అహ్మద్ (ఎస్ఎఫ్ఐ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:58 - November 3, 2017

గరుడవేగ.. గత వారం రోజులుగా ఈ సినిమా టీం చేస్తున్న ప్రమోషన్స్ తో రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ అని చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ కూడా స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో 30 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన భారీ చిత్రానికి.. అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు ని నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెడితే.. రాజశేఖర్ కూడా కష్టానికి వెనుకాడకుండా ఫుల్ హార్డ్ వర్క్ తో ఈ సినిమాని చేశాడు. సో.. ఇన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన గరుడవేగ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ..
కథ విషయానికొస్తే..ఫోక్రాన్ అను పరీక్షల తర్వాత జరిగిన ఒక భారీ ఫ్లూటోనియం స్కామ్ కి సంబంధించిన ఇంట్రస్టింగ్ ప్లాట్ తో తెరకెక్కింది పిఎస్ వి గరుడవేగ. కథగా చెప్పుకోడానికి చిన్న పాయింట్ అయినప్పటికీ.. దాన్ని తనమార్క్ స్క్రీన్ ప్లే తో, ప్రజెంట్ జనరేషన్ కి లింక్ చేస్తూ.. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ అయిన చంద్రశేఖర్ దాన్ని ఎలా ఛేధించాడు అన్నదే సినిమా టోటల్ స్కీమ్. దీనికి మరోపక్క ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా యాడ్ చేసి ..ఈ థ్రిల్లర్ పాయింట్ కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చారు.

నటీనటుల ప్రతిభ..
నటీనటుల విషయానికొస్తే.. చాలాకాలంగా..తనకు కనిపించే తనను నడిపించే పాత్ర కోసం ఎదురుచూసే రాజశేఖర్ కి అలాంటి పాత్రే దక్కింది. ఎన్ ఐఏ అసిస్టెంట్ కమీషనర్ గెటప్ లో జీవించాడు రాజశేఖర్. ఎమోషన్స్ పండించడంలో అక్కడక్కడా తడబడ్డప్పటికీ.. ఓవరాల్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎక్కడా కథను డామేజ్ చెయ్యకుండా,.. డీవియేట్ చెయ్యకుండా దర్శకుడు అనుకున్న కథని అలాగే స్క్రీన్ పై ప్రజెంట్ చెయ్యడంలో పూర్తిగా కోఆపరేట్ చేశాడు. అక్కడక్కడా..తన ఏజ్ తాలూకు ఛాయలు కనిపించినప్పటికీ..హార్డ్ వర్క్ తో ఓవరాల్ తన పాత్రకి, సినిమాకి న్యాయం చేశాడు. ఇక విశ్వరూపం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకుమారికి..మళ్లీ అదేరేంజ్ ప్రాజెక్ట్ దక్కింది. లిమిటెడ్ రోల్ అయినప్పటికీ.. కథతో కనెక్ట్ అయి ఉండడంతో ఆడియన్స్ కిబాగానే రిజిస్టర్ అయ్యింది. హోమ్ లీ లుక్స్ తో, గుడ్ పర్ ఫామెన్స్ తో పరవాలేదనిపించింది. చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అదిత్.. కు గరుడవేగ మంచి గుర్తింపు తెచ్చింది. తన కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. పోసాని కృష్ణ మురళి, నాజర్ ,పృథ్వి, చరణ్ దీప్, రవివర్మ లకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కాయి. శ్రధ్దాదాస్ క్యారెక్టర్ ని గెస్ట్ అప్పియరెన్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తానికి డియ్యో డియ్యో అంటూ మంచి క్రేజ్ తెచ్చిన సన్నీలియోన్ సాంగ్ సినిమాకి ప్లస్ అయ్యింది. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు దర్శకుడి విజన్ లో నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాకి ఇనీషియేటర్ అండ్ బ్యాక్ బోన్ అయిన ప్రవీణ్ సత్తారు.. స్క్రిప్ట్ గురించి చాలా రీసెర్చ్ చేసి దాన్ని సినిమాగా మలచడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాడనే చెప్పాలి. చిన్న పాయింట్ ని ఫుల్ లెన్త్ థ్రిల్లర్ సినిమాగా తియ్యడం మామూలు విషయం కాదు. ఫస్ట్ హాఫ్ వరకూ డైరెక్టర్ గా రోమాలు నిక్కబొడుచుకునే స్క్రీన్ ప్లేతో , హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు..సెకండాఫ్ లో మాత్రం కొంచెం తడబడ్డాడు. ఇంటర్వెల్ వరకూ పీక్ లో ఉన్న సినిమా గ్రాఫ్ సెకండాఫ్ కొచ్చేసరికి తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకూ తాను తీసిన సినిమాలకు .. పూర్తి భిన్నంగా ఉండే పాయింట్ తో రాజశేఖర్ లాంటి హీరోతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చెయ్యగలిగాడు.

సినిమాటోగ్రఫీ..
సినిమాటోగ్రఫీ విషయానికొస్తే.. డైరెక్టర్ విజన్ ని పూర్తిగా అర్దం చేస్కుని సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో.. అలాంటి విజువల్స్ ని అందించాడు. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ లో వాళ్ల పనితనం కనిపిస్తుంది. 30 కోట్ల బడ్జెట్ లో ఆరేంజ్ అవుట్ పుట్ ఇవ్వడంలోనే వాళ్ల టాలెంట్ అర్దమవుతుంది. ఇక సంగీతం విషయానికొస్తే..భీమ్స్ చేసిన రెండు పాటలు కూడా మాస్ జనాలకి కిక్ ఇస్తాయి. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. సీన్ సీన్ కి మారిపోయే సినిమా థీమ్ ని తన ఆర్.ఆర్ తో సక్సెస్ ఫుల్ గా ఎలివేట్ చేశాడు శ్రీచరణ్. టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా హై స్టాండర్డ్స్ లో ఉందీ సినిమా. ఎడిటింగ్ ఇంకాస్త్ షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. డైరెక్టర్ చెప్పిన కథని, రాజశేఖర్ కాన్ఫిడెన్స్ ని చూసి కథకు తగిన విథంగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఓవరాల్ గా చెప్పాలంటే క్లాసీ టైటిల్ తో తెరకెక్కిన గరుడవేగ.. టేకింగ్ పరంగా క్లాస్ కి, విజువల్ పరంగా మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చింది. అయితే థ్రిల్లర్ సినిమా కావడంతో ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే..మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

ప్లస్ లు..
స్టోరీ, స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
యాక్షన్ సీన్స్..

మైనస్
సెకాండాఫ్ లో కొన్ని సీన్స్
కామెడీ లేకపోవడం
టెక్నికల్ లాంగ్వేజ్
రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:42 - November 3, 2017

ఢిల్లీ : ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఎగ్జిబిషన్‌లో ఏపీ ప్రత్యేక స్టాల్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబుతో పాటు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో 18 రాష్ట్రాల పెవిలియన్లు ఏర్పాటు చేయగా.. ఏపీ స్టాల్‌లో 40 సంస్థల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఆహార ఉత్పత్తి రంగంలో ఏపీలో ఉన్న వనరులు, వ్యాపార అవకాశాలు వివరించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. 

మచిలీపట్నంలో ఏసీబీ దాడులు..

కృష్ణా  : జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా పనులు చేసేందుకు సిహెచ్‌ లోకేష్ అనే వ్యక్తి నుండి 2 లక్షలు తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ వరప్రసాద్‌ ఏసీబీకి పట్టుపడ్డారు. ఏఈ వరప్రసాద్‌తో పాటు షిఫ్ట్‌ ఆపరేటర్‌ సిహెచ్‌ వెంకటేష్‌లపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 

18:38 - November 3, 2017

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని ఏపీ అధికారులు లెక్క తేల్చారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో చంద్రబాబు పలు దఫాలుగా పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలు, వీటి అమలుకు కావాల్సిన నిధులపై అధికారులు లెక్క తేల్చారు. మొత్తం 48,857 ఖర్చు అవుతుందని నివేదిక రూపొందించారు. అందుబాటులో ఉన్న నిధులు మాత్రం 8,286 కోట్ల రూపాయలు మాత్రమేనని లెక్క తేల్చారు. హామీల అమలుకయ్యే ఖర్చు, అందుబాటులో ఉన్న నిధులకు మధ్య 40,286 వేల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థంకాక అధికారులు తలలు బాదుకుంటున్నారు.


ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా చంద్రబాబు ఏదో ఒక కొత్త హామీ ఇస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఇచ్చిన హామీలు 1359కి చేరాయి. వీటిలో 737 వాగ్దానాలను అధికారులు అమలు చేశారు. మరో 567 అమలుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయల నిధుల అవసరమరైన హామీలను అధికారులు పక్కన పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగం నీటిపారుదల శాఖలోనే ఉన్నాయి. ఈ అంశంపై ఇంతవరకు 125 హామీలు ఇస్తే... వీటికి 38,952 కోట్ల రూపాయల నిధులు కావాల్సి వస్తుందని అంచనా వేశారు. అందుబాటులో ఉన్న నిధులు 7,897 కోట్ల రూపాయలు మాత్రమే. ఎన్నికలకు మరో ఏడాదిన్నర వ్యవధి మాత్రమే ఉంది. దీంతో నిధులు లేకపోయినా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అధికారులపై మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమి చేయాలోపాలుపోక అధికారులు తలబాదుకుంటున్నారు.

టీడీపీ ఎన్నికల్లో ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో ఇంకా కొన్ని అమలుకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాల పర్యటనలో చంద్రబాబు చేసిన వాగ్దానాల ఏ విధంగా అమలు చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చుకుంటూ పోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆచరణ సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే బదులు, బడ్జెట్‌ నిధులను దృష్టిలో పెట్టుకుని అమలుకు యోగ్యమైన వాగ్డానాలు చేస్తే మంచిదని విపక్ష నేతలు సూచిస్తున్నారు. 

18:34 - November 3, 2017

చిత్తూరు : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 15న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14, 21వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. 19వ తేదీన గజవాహనం, 20న స్వర్ణరథం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. 

18:33 - November 3, 2017

విశాఖపట్టణం : జిల్లా పాడేరులో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్ లోయలోకి దూసుకుపోయిన ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరంతా శనివారం జరిగే కార్తీక పౌర్ణమి కోసం.. పాడేరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా అదుపుతప్పి పాడేరు-వంట్లమామిడి మధ్య లోయలోకి దూసుకుపోయింది. గాయపడ్డ ప్రయాణికులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

18:31 - November 3, 2017

విజయవాడ : ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో అమెటీ యూనివర్సిటీకి 90 ఎకరాలు, సవితా యూనివర్సిటీకి 166 ఎకరాలు, విజయనగరంలో సెంచూరియన్ యూనివర్సిటీకి 125 ఎకరాలు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో వెల్‌ టెక్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, విశాఖపట్నంలో ప్రపంచ శాంతి యూనివర్సిటీకి 70 ఎకరాలు, అకార్డ్ యూనివర్సిటీకి 150 ఎకరాల చొప్పున భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఉన్నత విద్యాశాఖ మొత్తం ఆరు యూనివర్సిటీలకు 651 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

18:29 - November 3, 2017

కడప : వైఎస్‌ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సర్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇడుపులపాయలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను విజయవాడలో ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. ఆరో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అనంతరం ప్రజలను ఉద్దేశించి.. ప్రసంగిస్తారని .. అనంతరం పాదయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ నేత రఘురామ్‌ చెప్పారు. ఏడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారన్నారు. 

18:27 - November 3, 2017

ఢిల్లీ : 20 ఏళ్ల క్రిందటే ఐటీ మీద దృష్టి పెట్టిన తాము ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నెంబర్ వన్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధికి అవసరమైన పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో... రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

18:22 - November 3, 2017

కృష్ణా : ఏపీ రాష్ట్రంలో అవినీతి అధికారులు పెచ్చరిల్లిపోతున్నారు. ఇబ్బడిముబ్బడిగా సంపాదించేస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడుల్లో లంచగొండి అవినీతి అధికారుల బండారం బట్టబయలవుతోంది. గుడివాడ మున్సిపల్ అధికారిపై ఏసీబీ అధికారులు దాడులు మరిచిపోకముందే మచిలీపట్నంలో ఏసీబీ జరిపిన దాడుల్లో విద్యుత్ శాఖ అధికారులు పట్టుబడ్డారు.

జిల్లాలోని మచిలీపట్నంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసేందుకు లోకేష్ వద్దనుండి విద్యుత్ శాఖ ఏఈ వరప్రసాద్ లంచం డిమాండ్ చేశాడు. దీనితో లోకేష్ రూ. 2లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఏఈతో పాటు షిప్ట్ ఆపరేటర్ సీహెచ్.వెంకటేష్ లపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 

బీజేపీలో ముకుల్ రాయ్..

ఢిల్లీ : మాజీ టీఎంసీ లీడర్ ముకుల్ రాయ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఢిల్లీకి వచ్చిన ముకుల్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షాతో భేటీ అయ్యారు. రైల్వే మంత్రి పీయుష్ గోయాల్ తో కూడా భేటీ అయ్యారు. 

18:14 - November 3, 2017

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెస్టివల్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో ఆయన భేటీ అయ్యారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన విషయంలో కేంద్రం నుండి అందాల్సిన సహకారంపై చర్చ జరిగింది. పోలవరం నిర్మాణంపై ఇటీవలే సంబంధిత మంత్రి గడ్కరి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పెండింగ్ నిధులు..కాంట్రాక్టర్ మార్పు..ఇతర అంశాలపై తాజాగా జైట్లీతో బాబు చర్చించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయింపు వేగవంతం చేయాలని కోరారు. విభజన అంశాల్లో పేర్కొన్న వాటిని అమలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 

కాంకేర్ జిల్లాలో ఎదురు కాల్పులు..

ఛత్తీస్ గడ్ : కాంకేర్ జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు - మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఓ పోలీసు మృతి చెందగా మావోయిస్టులు పరారయ్యారు. 

18:01 - November 3, 2017
17:33 - November 3, 2017

మేడ్చల్ : నగరంలో నకిలీ నోట్ల ముఠాలు ఇంకా చలామణి అవుతూనే ఉన్నాయి. అక్కడక్కడ పలు ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 42 లక్షల 82 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి నకిలీ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి ? ఎవరి ద్వారా చలామణి చేస్తున్నారు ? వీరి వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

మహిళ ఆసియా హాకీ కప్ ఫైనల్ చేరిన ఇండియా

ఢిల్లీ : ఆసియా మహిళ హాకీ కప్ ఫైనల్ కు భారత్ చేరుకుంది. సేమీ ఫైనల్ లో జపాన్ పై 4-2తేడాతో గెలుపొందింది. ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. 

మేడిపల్లిలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

మేడ్చల్ :  జిల్లా మేడిపల్లిలో నకిలీ నోట్ల చలామణి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మయ్య, యాదయ్య, జంగయ్య, అనంద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

17:27 - November 3, 2017

హైదరాబాద్ : నగర మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి భారీ ఉపశమనం లభించింది. ఏళ్ల తరబడి బకాయిపడిన ఇన్‌కమ్‌ ట్యాక్స్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభించింది. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం కోకాపేట్‌ భూములపై కోర్టులో తమకు అనుకూలంగా తీర్పురావడంతో వేలాది కోట్ల రూపాయలు హెచ్‌ఎండీఏ ఖజానాకు చేరనున్నాయి. దీంతో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఎండీఏ కొత్త ప్రాజెక్టులపై ఫోకస్‌ చేసేందుకు వీలు కలుగుతుందని ఆ సంస్థ కమిషనర్ చిరంజీవులు పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:26 - November 3, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడిచినా ఎస్సీ కమీషన్‌ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 15 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలున్నారని..వారికి కమీషన్లు లేకపోవడం దారుణమన్నారు. ఆ వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి కమీషన్లకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. 

17:25 - November 3, 2017

హైదరాబాద్ : నకిలీ, నాసిరకం, కల్తీ విత్తనాల బెడద నివారణకు జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ ప్రస్తుత సమావేశాల్లోనే దీనిపై బిల్లు ప్రవేశపెడతామని ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 

17:07 - November 3, 2017

కామారెడ్డి : బాన్సువాడలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. బతుకు దెరువు నిమిత్తం ఓ కుటుంబం బాన్సువాడలోని సంగమేశ్వర్ కు వచ్చింది. దంపతులు కూలీ పని చేసుకుంటున్నారు. వీరికి లోకేష్ అనే నాలుగేళ్ల బాలుడున్నాడు. లోకేష్ అంగన్ వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి ఎదుట లోకేష్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లో పని చేసుకొంటోంది. కొద్దిసేపటి అనంతరం బయటకు వచ్చిన తల్లికి కుమారుడు లోకేష్ కనిపించలేదు. దీనితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా లోకేష్ ఆచూకీ లభించలేదు. దీనితో తల్లిదండ్రులు శుక్రవారం పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా నలుగురు మహిళలు బాలుడిని తీసుకెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ కనుక్కొనేందుకు గాలింపులు చేపడుతున్నట్లు తెలిపారు. 

బాన్సువాడలో కిడ్నాప్ కలకలం

కామారెడ్డి : జిల్లా బాన్సువాడలో కిడ్నాప్ కలకలం రేగింది. నాలుగేళ్ల లోకేశ్ ను ముగ్గురు గుర్తుతెలియని మహిళాలు కిడ్నాప్ చేశారు. పల్లాడు కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా నింధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

17:03 - November 3, 2017

హైదరాబాద్ : లక్ష్మణ్ అనే వ్యక్తి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్ ట్రాఫిక్ విభాగంలో ఆర్ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను అక్టోబర్ 31వ తేదీన విధులు ముగించుకుని రాత్రి 9 గంటలకు కాప్రాలోని తన ఇంటికి బయల్దేరాడు. రాత్రి 10గంటల సమయంలో ఈసీఐఎల్ వద్ద వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియన వాహనం లక్ష్మన్ బైక్ ను ఢీకొట్టింది. బండిపై నుంచి క్రింద లక్ష్మణ్ తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఢీకొన్న కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్మణ్ అవయవాలు దానం చేశారు. అతని కిడ్ని, లివర్, ఉస్మానియా ఆసుపత్రికి అందించారు. లక్ష్మణ్ తను చనిపోయిన తన అవయవా దానంతో మరోకరికి ప్రాణ దానం చేశాడు.

 

ఎక్సైజ్ శాఖ అసెస్టెంట్ కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు

శ్రీకాకుళం : ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఇంటిపై ఏసీబీ ఆకస్మిక దాడులు జరిపింది. లెక్క చూపని రూ.4.5లక్షలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మద్యం వ్యాపారుల నుంచి నగదు తీసుకున్నట్లు కమిషనర్ పై ఆరోపణాలు ఉన్నాయి. 

అనంతపురంలో రోడ్డు ప్రమాదం

అరంతపురం : జిల్లా ఆత్మకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, దివాకర్ ట్రావెల్స్ బసు ఢీకొని అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రమణ మృతి చెందారు. 

16:19 - November 3, 2017
16:05 - November 3, 2017

 

హైదరాబాద్ : మరోసారి నారాయణ కాలేజీ వార్తల్లోకి ఎక్కింది. కళాశాలలో జరుగుతున్న ఆగడాలు..ఇతరత్రా విషయాలపై ఓ ఫోన్ సంభాషణ ఆడియో టేప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే వనస్థలిపురంలో నారాయణ కాలేజీ విద్యార్థిపై తోటి విద్యార్థులు..బయటి వ్యక్తులు దాడి చేయడం కలకలం రేగింది. కామెంట్ చేసినందుకు గాను కాలేజీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు..బయటి వారిని తీసుకొచ్చి తనపై దాడి చేశారని మల్లిఖార్జున్ అనే విద్యార్థి పేర్కొన్నారు. పనామా బస్టాపు వద్దనున్న ఓ జిమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఐదుగురిపై వనస్థలిపురం పీఎస్ లో బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు. 

 

రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారు : షబ్బీర్

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మండలి పక్షనేత షబ్బీర్ ఆలీ అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని షబ్బీర్ ప్రశ్నించారు. 

మొరాకో బృందంతో మంత్రి ప్రతిపాటి భేటీ

గుంటూరు : ఏపీ మంత్రి ప్రతిపాటి తో మొరాకో బృందం భేటీ అయింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్ అనుసంధానం, ఈ ప్రగతి, ఆర్జీజీఎస్ అంశాలపై మొరాకో బృందానికి మంత్ర ప్రతిపాటి వివరించారు. అధార్ అనుసంధానం వల్ల నిజమైన అబ్ధిదారులకు సరైన తూకంతో సరకులు అందుతున్నాయని ఆయన తెలిపారు. 

నారాయణ కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ

హైదరాబాద్ : వనస్థలిపురం నారాయణ కాలేజీలో విద్యార్థుల మధ్ గొడవ జరిగింది. క్లాస్ రూమ్ లో నిక్ నేమ్ లతో పిలిచినందుకు మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. 

15:33 - November 3, 2017

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైని మరోసారి వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాత్రి ఏకధాటిగా ఐదు గంటల పాటు వర్షం కురవడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. కొరట్టూరు, చెన్నై ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఎటు చూసినా మోకాళ్ల లోతు నీరు ఉండటంతో అడుగు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చెన్నై, శివారు ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలలు మూసివేశారు. నంగంబక్కం ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

15:31 - November 3, 2017

హైదరాబాద్ : ఉన్న ఊరును వదిలారు. కన్నవారికి దూరమయ్యారు. నిద్రహారాలు మరిచారు. ఆర్థికంగా చితికిపోయారు. పూటపూట పస్తులతో జీవితం నెట్టుకొస్తున్నారు. పుస్తకాలే ప్రాణంగా బతుకున్నారు. వాళ్లే తెలంగాణలోని నిరుద్యోగులు. కొలువుల కోసం అన్నిటికి దూరమయ్యరు. చిన్న ఉద్యోగమైనా సాధించి కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నారు. మరి వారు కన్న కలలు నెరవేరుతున్నాయా? లేక కల్లలే అవుతున్నాయా? నిరుద్యోగుల కష్టాలపై 10టీవీ కథనం... నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ మూడు అంశాల ప్రాతిపదికనే సాగింది. తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది కూడా ఈ నినాదాలే. ఆంధ్రాపాలకుల చేతిలో తెలంగాణకు అన్యాయంపై తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ప్రధానంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ప్రధానపాత్ర పోషించారు. నాడు విపక్షంలో ఉన్న కేసీఆర్‌ ఉద్యోగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రతిసభలోనూ వివరించారు. ఏపీపీఎస్సీపై నాడు ఎన్నో ఆరోపణలు చేశారు.

మొత్తానికి తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్పీని ఏర్పాటు చేశారు. ఎంతో పారదర్శకంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పనిచేస్తుందని, నిఖార్సైన వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తున్నామంటూ ఢంకా బజాయించి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడి మూడేళ్లైంది. నాటి నుంచి నేటి వరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌ వివాదాస్పదమవుతోంది. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడం... అందులో ఏవో చిక్కులు ఉండడం.. వాటిపై నిరుద్యోగులు కోర్టుమెట్లెక్కడం.. అది తేలకపోవడం సర్వసాధారణమైపోయింది.

లక్షల మంది అభ్యర్థులు ఎన్నో ఆశలతో ఎదురు చూసిన గ్రూప్‌-2 ఎటూ తేలని సమస్యలా... హైకోర్టు మెట్లపై కొట్టుమిట్టాడుతోంది. మొన్నటికి మొన్న గ్రూప్‌ -1 ఫలితాలు ఇచ్చినట్టు ఇచ్చి వాటిని ఉపసంహరించుకున్న చరిత్ర తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కే దక్కింది. లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోసం వేచి చూస్తోంది వారి ఆశలపై ప్రభుత్వం మూడేళ్లుగా నీళ్లు చల్లుతూనే ఉంది. మొన్నటికి మొన్న విడుదల చేసిన టీఆర్‌టి నోటిఫికేషన్‌ సైతం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నోటిఫికేషన్‌ అయితే విడుదలైంది కానీ... నేటికి దరఖాస్తుల స్వీకరణకు దిక్కేలేదు. వాస్తవానికి అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయంటూ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియనే ప్రారంభించలేదు. టీఎస్‌పీఎస్సీ దగ్గర పది జిల్లాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉండగా... ప్రభుత్వం 31 జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ వేయబోతున్నామంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక కమిషన్‌ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్న తపన అంతాఇంతాకాదు. ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై పట్నంబాట పట్టారు. నిద్రహారాలు మాని దీక్షగా ప్రిపేర్‌ అవుతున్నారు. ఒకపూట తిని, మరో పూట పస్తులుంటూ చదువుకుంటున్నారు. కన్నవాళ్ల ఆశలు నెరవేర్చేందుకు కొలువుల యజ్ఞం చేస్తున్నారు. అద్దెరూమ్‌లు, కోచింగ్‌ల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మొండిచేయే మిగిలింది. వేస్తున్న నోటిఫికేషన్లు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిరుద్యోగులు సైలెంట్‌గా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయాలని వారు కోరుతున్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. 

15:27 - November 3, 2017

నిజామాబాద్ : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌ ఉద్యోగులు 5రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో టెన్ టివి ముచ్చటించింది. సమైక్యాంధ్రలో దగా పడడం జరిగిందని..రెగ్యులరైజ్ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. 

15:25 - November 3, 2017

హైదరాబాద్ : కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీ-మాస్‌ ఈ నెల ఐదున లీ ప్యాలెస్‌ గార్డెన్‌లో ఆవిర్భావం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తమ్మినేని వీరభద్రం, జాన్‌ వెస్లీ, ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, విమలక్కలు హాజరవుతారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. కంటోన్మెంట్ మైదానంలో టీ-మాస్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. బైసన్‌పోలో మైదానంలో సచివాలయ నిర్మాణ ప్రకటనకు వ్యతిరేకంగా పోరాడతామని టీ-మాస్‌ ప్రతినిధి రాజన్న చెప్పారు. కంటోన్మెంట్‌ ప్రజల సమస్యలు పాలకుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. 

15:24 - November 3, 2017

రాజమండ్రి : అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయం తప్పని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. జగన్‌ పాదయాత్ర సక్సెస్‌ అవ్వాలని తానూ కోరుకుంటున్నానన్నారు. అయితే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత నుండి ప్రతపక్షం తప్పుకుంటే ఎలా అని ఉండవల్లి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం లేని సింగపూర్‌కు అమరావతి రైతులను తీసుకెళ్లి ఏం చూపించారని ఉండవల్లి ఎద్దేవా చేశారు

15:20 - November 3, 2017

కర్నూలు : జీవో నంబరు 465 కి వ్యతిరేకంగా జూనియర్‌ డాక్టర్లు కర్నూలులో ఆందోళన చేపట్టారు. కర్నూల్ ప్రభుత్వాస్పత్రి నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యసేవలను ఆర్‌ఎంపీలకు అప్పజెప్పడమంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. వారు ఎలాంటి సమస్యలు పేర్కొంటున్నారు..వారి డిమాండ్స్ ఏంటో వీడియెలో చూడండి

15:19 - November 3, 2017

సినిమా : అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత మధ్య ప్రేమ నాలుగు ఐదు సంవత్సరాలు కొనసాగింది. ఎట్టకేలకు వీరి ప్రేమ పెళ్లి పీఠలు ఎక్కింది. నాగ చైతన్య, సమంత పెళ్లి గోవాలో హిందు, క్రైస్తవ పద్దతలో జరిగింది. అయితే ఈ పెళ్లి తంతు అభిమానులకు దూరంగా జరిగింది. దీని పై నాగర్జున మాట్లాడుతూ పెళ్లి గోవాలో జరిగిన రిసెప్షన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో చైతు సమంత రిసెప్షన్ జరుగుతుందా లేదా అభిమానుల్లో గందరగోళం మొదలైంది. పెళ్లి తర్వాత నాగచైతన్య సమంత రిసెప్షన్ నాగచైతన్య అమ్మ లక్ష్మీ గారి ఇంట్లో దగ్గుబాటి కుంటుం సమక్షంలో ప్రైవేట్ గా జరిగింది.నాగచైతన్య, సమంతల రిసెప్షన్ నవంబర్ 12న ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ కు ప్రముఖులనే ఆహ్వానిస్తారా లేక అభిమానులను కూడా పిలుస్తార తెలియరాలేదు. 

15:16 - November 3, 2017

హైదరాబాద్ : వైద్యారోగ్య, వైద్యవిద్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న మెడికల్‌, పారా మెడికల్‌, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కిట్‌పై అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్న గీతారెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖాళీలు భర్తీ చేయకుండా కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమం ఏవిధంగా సమర్థవంతంగా అమలు జరుగుతుందని గీతారెడ్డి ప్రశ్నించారు. చర్చను ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సభ్యురాలు కొండా సురేఖ కూడా ఖాళీల అంశాన్ని ప్రస్తావించారు. 

ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం

గుంటూరు : ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 6గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమిటీ, సెంచూరియన్, వెల్ టెక్, వరల్డ్ పీస్, నవీత, అకార్డ్ యూనివర్సిటీలకు విజయనగరం, విశాఖ, చిత్తూరు, అమరావతిలో భూములు కేటాయించారు. 

రైతు సంక్షేమంపై మండలిలో కొనసాగుతున్న చర్చ

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో రైతు రుణా మాఫి, రైతు సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. రైతుల సమస్యల పై చర్చకు మండలి చైర్మన్ ఆంగీకరించడంతో చర్చ మొదలైంది. 

టీఎస్ శాసన సభ సోమవారానికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాకినాడ సెజ్ పరిధిలో ఉద్రిక్తత

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ సెజ్ పరిధి రమణక్కపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు నాట్లు వేసే కార్యక్రమానికి రైతులు సన్నాహాలు చేస్తుండడంతో ముందస్తుగా 15మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జీని గృహనిర్బంధం చేశారు.

14:50 - November 3, 2017

ఏ కారణమైతనే భర్త చనిపోతే..భార్య పట్ల సమాజం ఎందుకు దోషిగా చూస్తుంది..సమాజంలో చిన్న చూపు..వివక్ష ఎందుకు వేధిస్తాయి ? వితంతవుగా బతకాల్సిందేనా ? మహిళలకు రక్షణ కల్పించే విషయంలో గోవా మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ సంగీత కళాకారిణి గిరిజా దేవి తుదిశ్వాస విడిచారు. బెనారస్ సమీపంలో జమీందారి కుటుంబంలో జన్మించారు. సంగీతాన్ని తన జీవితంగా భావించారు. చిన్న వయస్సులోనే కిక్ బాక్సింగ్ లో పూజా హర్ష రాణిస్తోంది. వివాహమై ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఈ క్రీడలో రాణిస్తోంది. ఇటీవలే మహిళా కిక్ బాక్సర్ గురువుగా మారి చరిత్ర సృష్టించింది. సౌదీ అరేబియాలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మహిళలపై నిర్భందం విధించిన ఈ ఏడారి దేశంలో వారి జీవితాల్లో వెలుగుల రేఖలు విచ్చుకుంటున్నాయి. గర్భిణీగా ఉన్న విషయంలో తన గురించే కాకుండా పుట్టబోయే బిడ్డ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కాలుష్యం పెరుగుతున్న వాతావరణంలో పుట్టబోయే బిడ్డలకు ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ? శక్తివంతమైన మహిళల్లో పలువురు మహిళలు చోటు దక్కించుకున్నారు. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్ కూడా స్థానం సంపాదించారు. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని..రిజర్వేషన్లు కొనసాగించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తల విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:38 - November 3, 2017

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా 'ఏంజిల్' సినిమా రూపొందింది. 'బాహుబలి' పళని దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమన్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి నాగ అన్వేష్..హెబ్బా పటేల్ సినిమాను వీక్షించారు. అనంతరం టెన్ టివితో వారు ముచ్చటించారు. చిత్రానికి సంబంధించిన విశేషాలు వారు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:15 - November 3, 2017

హైదరాబాద్ : ఇటీవలే నారాయణ కాలేజీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నారాయణ కళాశాలలో ఎలాంటి ఆగడాలు జరుగుతున్నాయో..జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు వ్యక్తులు సంభాషణ జరిపారు. వీరిద్దరూ కళాశాలకు సంబంధించిన వ్యక్తులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫోన్ లో మాట్లాడిన నారాయణ కాలేజీ ప్రిన్స్ పల్ సరిత అగర్వాల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తనను మానసికంగా హింసించారని..తనపై వత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. టేపుల్లోని తనవే వ్యాఖ్యలని..కానీ స్ర్కిప్ట్ వేరే వారిదని చెప్పుకొచ్చారు. తనకు రూ. 2 లక్షలు ఇచ్చి అలా మాట్లాడించారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన విషయంపై ఉప్పల్ పీఎస్ లో మూడు కేసులు నమోదయ్యాయి. నారాయణ కళాశాలలో జరుగుతున్న ఆగడాలపై ఒక కేసు..సరితా అగర్వాల్ కూడా ఓ కేసు నమోదు చేశారు. మరి నారాయణ కాలేజీలో జరుగుతున్న వాటిపై ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. 

హైకోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి చుక్కెదురు

హైదరాబాద్ : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కి చుక్కెదురైంది. గాలికి లండన్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ నెల 5నుంచి 20 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ హైకోర్ట కొట్టివేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసు సీబీఐ కోర్టులో ఉన్నందున అనుమతి ఇవ్వాలేమని కోర్టు స్పష్టం చేసింది. 

13:49 - November 3, 2017

కృష్ణా : విజయవాడలో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధుల నిరాహార దీక్షలు నాలుగోరోజుకు చేరాయి.. విద్యార్ధులకు సంఘీభావంగా ధర్నా చౌక్‌ నుంచి  లెనిన్‌ సెంటర్‌ వరకు విద్యార్ధి సంఘాల నేతలు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మంత్రి కామినేని వైఫల్యం కారణంగానే విద్యార్ధులు రోడ్డున పడ్డారని విద్యార్ధుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి కేంద్రం సహకారంతో ఎంసిఐతో మాట్లాడి తమను ఆదుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

13:45 - November 3, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ప్రేయసి మోసం చేసిందని సాయి చైతన్య ఇంటి నుండి వెళ్లిపోయాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు. పోలీసులు తనను వేధిస్తున్నారని వీడియోలో చెప్పాడు. చనిపోయాకైనా తనకు న్యాయం జరగాలన్నాడు. వీడియో చూసిన సాయి చైతన్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు సాయి చైతన్య ప్రాణాలతో ఉన్నాడో లేడో ఎక్కడున్నాడో తెలియక గుండె పగిలేలా రోధిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:30 - November 3, 2017

యాదాద్రి భువనగిరి : నయీం మృతి చెందినా జిల్లాలో నయీం ముఠా దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్‌ జైల్లో ఉంటూనే నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీను ఈ దందాలకు పాల్పడుతున్నాడు. పాశం శ్రీనుకు సహకరిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడో వార్డు కౌన్సిలర్‌ పాశం అమర్‌, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్‌, పులి శ్రీనివాస్‌, అందె సాయికృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే నయీం గ్యాంగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా....

 

13:27 - November 3, 2017

సినిమా : నందమూరి కల్యాణ్ రామ్ పార్టీ గుర్తు ఏంటీ అని ఆలోచిస్తున్నార కల్యాణ్ రామ్ తాజా నటిస్తున్న చిత్రం ఎంఎల్ ఏ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి ట్యాగ్ లైన్ ఈ సినిమాకి సంబంధంచిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ మూవీలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్న కల్యాణ్ రామ్ తన పార్టీ ప్రచారానికి ఉపయోగించే వాల్ పోస్టర్ ఒకటి ఫెస్ బుక్, వాట్సప్ ల్లో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో కల్యాణ్ రామ్ తన పార్టీ గుర్తుగా ట్యాప్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోస్టర్ లో వీరభద్రాపురం గ్రామ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపంచ ప్రార్థన అని ఉంది. ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఏపీకి జగన్ పాదయాత్ర అవసరం లేదు : వర్ల

కృష్ణా : ఏపీకి జగన్ పాదయాత్ర అవసరం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయని, ఏం లోటు వచ్చిందని జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయి జగన్ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తాడు అని వర్ల అన్నారు. 

13:24 - November 3, 2017

తూర్పుగోదావరి : కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే నదీ తీరాల్లో స్నానాలు ఆచరిస్తున్నారు. దర్శనాల కోసం ఆలయాల్లో క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పంచారామ క్షేత్రాలు, అన్నవరం, పీఠాపురంలోని పాదగయ సహా అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరంలో కార్తీక పౌర్ణమి శోభకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 
కాకినాడలో కార్తీక శోభ 
కాకినాడలో కార్తీక శోభ వెల్లివిరుస్తోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కాకినాడ బీచ్‌లో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సూర్యారావు పేట బీచ్‌లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. శివుని రూపాన్ని తీర్చి దిద్దిన కళాకారులను పలువురు అభినందించారు. మరోవైపు ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 

 

చంద్రబాబుపై ముద్రగడ ఫైర్

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబుపై కాపు నేత ముద్రగడ పధ్మనాభం ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో తన్ని తరిమేస్తే చంద్రబాబు అమరావతికి వచ్చారని, హామీలు అమలు చేయమంటే నిగ్రహం కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. పోరాటం చేస్తే సంఘవిద్రోహులంటూ నిందలేస్తున్నారని ముద్రగడ అన్నారు. 

13:20 - November 3, 2017
13:19 - November 3, 2017

చిత్తూరు : శేషాచలం అటవీప్రాంతం...దాదాపు 12 లక్షల ఎకరాల్లో ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు...ఎన్నో ఏళ్ల తరబడి పెరిగిన సంపద.. లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ సంపదపై చాలా మంది కన్ను పడింది...అరుదైన సంపదను విదేశాలకు తరలిస్తే కోట్లు కురుస్తాయి...ఇలా దాదాపు 40 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది...నాలుగు దశాబ్దాలుగా ఎందరో అధికారులు జేబులు నింపుతున్నారు...అవినీతికి పాల్పడే ఇంటి దొంగలవల్ల అరుదైన సంపద తరలిపోతుంది...దీన్ని నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. పోలీసు...ఫారెస్ట్...వీటితో పాటు మూడో ప్రత్యామ్నాయంగా టాస్క్‌ఫోర్స్... ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు ఈ మూడు విభాగాలు యుద్దం చేయాల్సిందే...ఎందుకంటే అంతగా ఎదిగిపోయారు స్మగ్లర్లు...కాని ఎవరికి వారే ..యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో స్మగ్లర్లకు వరంగా మారింది... సమన్వయలోపాన్ని అవకాశంగా తీసుకుంటున్న అక్రమార్కులు అరుదైన సంపదను విదేశాలకు తరలిస్తున్నారు..
ఎర్రచందనం...అరుదైన సంపద 
ఎర్రచందనం...అరుదైన సంపద ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉంది...తమిళనాడు బోర్డర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నదెవరు..? వీటి వెనకాల ఉన్న శక్తులు ఎక్కడివి...? వారిని నడిపిస్తున్న పెద్దోళ్లెవరు..? ఇవన్నీ విషయాల్లో లోతుగా చూస్తే ఎక్కడా సమాధానం మాత్రం దొరకడం లేదు..ఎందుకంటే తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు దోచేస్తున్నారు.. ఖద్దరు ముసుగులో ఎందరో దుంగల దొంగలున్నారన్నది పచ్చినిజం..అయితే అరుదైన సంపదను కాపాడుకునేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఎంత అంటే... ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు...ఎప్పటికప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు స్మగ్లర్లకే వరంగా మారుతున్నాయనడంలో సందేహం లేదు...
పోలీసుల నిఘాలో అటవీప్రాంతం...
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించేందుకు చాలా కాలం క్రితం టాస్క్‌ఫోర్స్‌ టీమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం... రెడ్‌సాండిల్ కాపాడుకునే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నం అభినందనీయమే కాని... ఎంతవరకు నిరోధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్న... దీనికి సమాధానం దొరకాలంటే అన్ని శాఖలను ప్రక్షాళన చేయాల్సి ఉంది...అయితే ప్రధానంగా మూడో ప్రత్నామ్నాయంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్ ఎంతవరకు నిరోధించగలదన్నది ఇక్కడ ప్రశ్న....
అవసరానికి తగినంత లేని స్టాఫ్...
ఇక్కడ ప్రధానంగా టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను మూడో ప్రత్నామ్నాయంగా ఏర్పాటు చేశారుగాని కావాల్సినంత సిబ్బందిని మాత్రం ఇవ్వలేదు..దీంతో ఉన్న సిబ్బందితో చాలా వరకు కష్టపడుతున్నా ఎర్రచందనం వెళ్లాల్సిన అడ్డదారిలో వెళ్తూనే ఉంది..దీనికి కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం లేదు...అందుకు కారణం ఎవరి పనుల్లో వారు ఉన్నారు....
పోలీసుల నిఘా లోపమా...
కొందరి కక్కుర్తి వల్ల దాటిపోతుందా...
ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి... ప్రధానంగా పోలీసు నిఘా..చెక్‌పోస్టులు ఉన్నా దుంగలు మాత్రం తరలిపోతున్నాయి.. దీంట్లో చాలా వరకు జరుగుతున్న అవినీతే కారణమనేది బహిరంగ రహస్యం...ఇక ఫారెస్ట్ అధికారులు..సిబ్బంది ఉన్నా చెట్లు నరికేస్తున్నారు..దీనికి కారణం ఇంటి దొంగలే... ఇలా ఎవరికి వారు ఆయా సమయంలో పడుతున్న కక్కుర్తి వల్లే ఎర్రచందనం అడవి దాటి ఎల్లలు దాటి విదేశాలకు చేరుతుంది.... 
శాఖల మధ్య సమన్వయలోపం...
ఎర్రదొంగలు చెలరేగడానికి ..అక్రమ రవాణా అరికట్టలేకపోవడానికి ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమేనా..? అవుననే అంటున్నారు ఉన్నతాధికారులు...చెప్పకనే చెబుతున్నారు కొందరు ఆఫీసర్లు... శాఖల సహకారం లేకపోవడంతో ఎర్రదొంగలకు వరంగా మారింది..దీంతోనే అరుదైన సంపదను అడవి దాటిస్తున్నారు... ఎర్రచందనం అరికట్టాలంటే ప్రధానంగా కావాల్సింది పోలీసులు..ఫారెస్టు అధికారులు.. మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ బృందాల మధ్య సమన్వయం...కాని ఇది కొరవడిందనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి..ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నా ప్రతీనిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం.. మూడు శాఖల మధ్య సహకారం..సమన్వయం లేకపోవడంతోనే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు... 
స్మగ్లర్లకు అవకాశం ఇస్తున్నది ఆఫీసర్లు కాదా...
ఇక ఎర్రచందనం తరలిపోవాలంటే రకరకాల చెక్‌పాయింట్స్‌ దాటి వెళ్లాలి..అప్పుడే అటవీప్రాంతం నుంచి బయట పడతారు.. అయితే ఈ లింకులన్నీ తెలిసిన స్మగ్లర్లు అవలీలగా బయటకు వెళ్తున్నారంటే శాఖల మధ్య సమన్వయలోపమే...ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు సరిపడా సిబ్బంది లేరు...దీంతోనే ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినప్పుడు జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది....టాస్క్‌ఫోర్స్‌ టీంలకు సహకరించాల్సి ఉంటుందని ఉన్నా కలిసి రాకపోవడంతోనే స్మగ్లర్లు అరుదైన సంపదను కొల్లగొడుతున్నారని స్పష్టమవుతుంది...
సంచలన వ్యాఖ్యలు..
టాస్క్‌ఫోర్స్‌ టీమ్ బాస్...కాంతారావు...చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నవారిని భారీ ఎన్‌కౌంటర్‌ చేసి సంచలనం సృష్టించారు...ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువయ్యారు...ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నవారికి నిద్రలేకుండా చేశారు..కాని ...తాజాగా కొన్ని గంటల క్రితం దుంగలను ఎత్తుకెళ్లే క్రమంలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ దాడులు చేసింది ..కాని శేషాచలం అడవుల్లోంచి దాదాపు 30 మంది దుంగల దొంగలు ఈజీగా తప్పించుకున్నారు..పాయింట్స్‌ వద్ద వాహనాలు వదిలివెళ్లిపోయారు... ఇది ఎలా సాధ్యం...సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటివెన్నో జరుగుతున్నాయన్నది టాస్క్‌ఫోర్స్‌ బాస్‌ బాధ....అయితే మొదట్లో ఉన్నట్లుగా సహకారం రాను రాను క్రమంగా తగ్గిపోతుందా..? టాస్క్‌ఫోర్స్‌ బాస్‌ మాటలను బట్టి చూస్తే సమన్వయం లేదని తేలిపోయిందా...దీంతోనే ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగుతున్నారన్నది వాస్తవమేనా... ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి..? అరుదైన సంపదను కాపాడ్డం ఎలా..? ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు..? బాద్యత తీసుకునేదెవరు..??? 
ఎర్రచందనం స్మగ్లింగ్ ఈనాటిది కాదు..
ఎర్రచందనం స్మగ్లింగ్ ఈనాటిది కాదు..దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది..దీన్ని నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమేగాని ఇప్పటికీ సఫలం కాలేదు..అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి...పాలకులు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ..లొసుగులను అవకాశంగా మల్చుకుంటున్న స్మగ్లర్లు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు..వారికి సహకరిస్తున్న ఆఫీసర్లు కూడా కోట్లు కూడబెట్టారు...
శేషాచలం అడవిలో 12 లక్షల ఎకరాల్లో...
ఎర్రచందనం కొల్లగొట్టడం ఇది కొత్తేంకాదు...దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుంది..అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఎందరో ఆఫీసర్లు...సిబ్బంది ప్రాణత్యాగం కూడా చేశారు..కాని స్మగ్లింగ్‌ను మాత్రం నిరోధించలేక పోయారు...దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి..అందులో ప్రధానమైంది సమన్వయలోపం కూడా...
12 లక్షల ఎకరాల్లో 165 లోడింగ్ పాయింట్స్
లోడింగ్‌ పాయింట్స్‌ కీలకం... ఇక్కడే అసలు లావాదేవీలు కొనసాగుతుంటాయి...ఈ పాయింట్ దాటితే చాలు అరుదైన సంపదకు రెక్కలొచ్చినట్లే....ఇలా పాయింట్స్‌ నుంచి దాటేందుకు స్మగ్లర్లు కనకవర్షం కురిపిస్తారు...ఈ డబ్బు కోసం కక్కుర్తి పడుతున్న ఇంటి దొంగల వల్లే అరుదైన సంపద ఎల్లలు దాటి వెళ్లిపోతుంది...పాయింట్ దాటేందుకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు ఎరవేస్తారు స్మగ్లర్లు...దీంతోనే ఆ పాయింట్ దాటుకుని విదేశాలకు చేరేవరకు ఎన్నో లక్షల రూపాయలు చేతులు మారి స్మగ్లర్లకు మాత్రం కోట్లు తెచ్చిపెడుతున్నాయి....
40 ఏళ్లుగా జరిగిన అవినీతి ఎంత...
ఇక స్మగ్లర్లదే రాజ్యం... తమిళనాడు నుంచి వాహనాలు..ఆ వాహనాల్లో తమిళ కూలీలు...వీరంతా ఆ చుట్టూ ఉన్న ఐదు జిల్లాల్లోని వారే..దాదాపు 80 వేల కుటుంబాలు చెట్లు నరకడంపైనే ఆధారపడ్డాయంటే ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పొచ్చు...ఇలా మొత్తం మీద స్మగ్లర్లు అన్ని వర్గాలను కలుపుకుని ఎర్రచందనాన్ని విదేశాలకు చేరవేస్తుంటారు..డబ్బు వెదజల్లుతూ.. అన్ని వర్గాల వారిని సమన్వయం చేస్తూ తరలించుకుపోతున్నారు..ఈ మాత్రం సమన్వయం మూడు శాఖల మధ్య లేకపోవడమే వరంగా మారుతుందనేది స్పష్టమవుతుంది...
వాహనం డ్రైవర్లకు సమాచారం..
తాజాగా టాస్క్‌ఫోర్స్‌ టీం దాడులు చేసిన సమయంలో తప్పించుకున్న 30 మంది వరకు ఎర్రచందనం స్మగ్లర్లు వెంటనే సెల్‌ఫోన్‌ ద్వారా వాహనాల డ్రైవర్లకు కూడా సమాచారం అందించారు..దీంతో వారంతా వాహనాలు వదిలేసి పారిపోయారు...అయితే ఇది ఫస్ట్‌ టైం మాత్రం కాదు...గడిచిన నెల రోజుల్లో ఇది ఏడోసారి...ఇలా ఆరుసార్లు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు మస్కా కొట్టారంటే ఇంకా ఎన్ని గ్యాంగ్‌లు అటవీప్రాంతంలో ఉన్నాయన్నది తెలియడం లేదు...అయితే ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు మాత్రం టీఎన్‌ పాలెం ప్రాంతంలో సెర్చ్ మొదలుపెట్టారు...ఇక్కడే ఉన్న స్లమ్ ఏరియాలో చాలా కుటుంబాలున్నాయి..వీరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

 

13:07 - November 3, 2017

తూర్పుగోదావరి : కళ కళకోసం కాదు ప్రజల కోసం. ఈ నినాదమే వారికి జీవిత లక్ష్యం అయ్యింది. కళారూపాలతో ప్రజాచైతన్యానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజాసమస్యలపై గళం విప్పుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ప్రజానాట్యమండలి కళాకారులపై 10టీవీ ప్రత్యేక కథనం..
ప్రజాకళలే ప్రాణమనుకున్నారు.. 
ప్రజాకళలే ప్రాణమనుకున్నారు. సాధారణ జీవితాలే అయినప్పటికీ అసాధారణ ప్రతిభ చాటారు. కళారూపాల ప్రదర్శనతో అందరినీ అలరించారు. ప్రజాచైతన్యం కోసం అహర్నిశలు పరిశ్రమించారు. పల్లెసుద్దులంటూ సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో సమస్యలు విడమర్చిచెబుతూ సమాజంలో మార్పులో భాగమవుతున్నారు.  
పల్లెసుద్దులు..
పల్లెసుద్దులు..వాస్తవానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన కళారూపం. అయినప్పటికీ దానిని ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శించి అనేకమంది మెప్పు పొందారు.  ఈ కళాకారుల బృందం  ప్రజానాట్యమండలి అందించిన సామాజిక స్ఫృహతో వివిధ అంశాల మీద పల్లెసుద్దులు ప్రదర్శించి  ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. 1990లలో భారతజ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో అక్షర కళాయాత్రల సందర్భంగా.. నాటి ప్రజానాట్యమండలి నేత టీజే రామనాధం సారధ్యంలో పల్లెసుద్దుల ప్రదర్శనలో  శిక్షణ తీసుకున్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల తోడ్పాడుతో పల్లెపల్లెనా పర్యటించారు. అప్పట్లో ప్రభుత్వం చేపట్టిన అక్షరగోదావరి కార్యక్రమానికి తోడ్పాటు నందించారు. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమానికి తోడుగా నిలిచారు. ఆ తర్వాత సారా ఉద్యమంలో చేదోడుగా సాగారు. మూఢనమ్మకాలపై  గళం విప్పారు. అంతేకాదు.. ఈ కళాబృందంలో రొంగల వీర్రాజు ఈలపాటతో పలువురి ప్రశంశలు పొందారు. 
పెద్దాపురంలో ఉండే కళాకారులు 
పెద్దాపురంలో ఉండే కళాకారులు దారపురెడ్డి క్రుష్ణ, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అప్పన్న, దారపురెడ్డి సత్యన్నారాయణ, రాంబాబులతో కూడిన ఈ కళాకారుల బృందం దశాబ్దాలుగా ఆటపాటలే  ఆయుధంగా  ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.   సామాన్య ప్రజలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. 
వెనకడుగు వేయని కళాకారులు 
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోయినా ఈ కళాకారులు వెనకడుగు వేయలేదు. ముప్పై ఏళ్లకు పైగా కళారూపాల ప్రదర్శనలో ముందుకు సాగుతున్నారు. తమ కళద్వారా పేదప్రజల్లో చదువుల పట్ల స్ఫృహ పెరిగిందని ఈ కళాకారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు మూఢనమ్మకాలపై ఈ కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు పలువురిని ఆలోచింపజేశాయి.  ప్రజా అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఈ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా..  అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుతున్నందుకు ఆనందంగా ఉందని ఈ కళాకారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రజా కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

 

12:59 - November 3, 2017

హైదరాబాద్‌ : నాలుగు చక్రాలు రోడ్డెక్కితే కానీ పూట గడవని పరిస్థితి క్యాబ్ డ్రైవర్లది . అలాంటి వారి జీవితాల్లో  ఓ ఇంటర్‌ నేషనల్ కంపెనీ తలుపు తట్టింది. ఎక్కువ సంపాదన వస్తుందనుకుని ఆశపడ్డారు. చివరికి భంగపాటు ఎదురవడంతో రోడ్డున పడ్డారు. న్యాయం చేయమంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకీ జటిలమవుతున్న క్యాబ్ డ్రైవర్ల ఆందోళనపై 10టీవీ ప్రత్యేక కథనం. 
నాలుగేళ్ల క్రితం మొదలైన ఓలా, ఉబర్ సర్వీసులు
గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగేళ్ల క్రితం ఓలా, ఉబర్  క్యాబ్ డ్రైవర్లకు మంచి ఆదాయం లభించింది. ప్రోత్సాహకాలు, కమిషనర్ల రూపంలో నెలకు రూ.60 వేలకు పైగానే ఆర్జించారు. అప్పట్లో ఊబర్‌లో 10వేలు, ఓలాలో 5వేల వాహనాలు ఉండేవి. ఇప్పడు వాటిసంఖ్య లక్షన్నరకు చేరింది. ఈ సంస్థలు స్వయంగా కొన్ని వాహనాల్ని లీజుకు తీసుకోవడంతో డ్రైవర్లంతా అప్పు చేసి మరీ సొంతవాహనాలను కొనుగోలు చేసారు. 
కమీషన్లు, రాయితీలలో కోత విధించిన ఓలా, ఉబర్ 
కొంతకాలం ఓలా, ఉబర్  సర్వీసులు బాగానే నడిచినా.. రాను రాను ఆ కంపెనీలు కమీషన్లు, రాయితీలలో కోత విధించాయి. అటుపై 60 వేల వరకూ వాహనాలకు  ఓలా, ఉబర్ సంస్థలు తమ సర్వీసులు నిలిపివేశాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ క్యాబ్‌ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళలు చేశారు. ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసినా వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. గడిచిన 2 నెలల్లో నలుగురు డ్రైవర్లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో 'ఓలా, ఉబర్‌ హఠావో, క్యాబ్‌ డ్రైవర్‌ బచావో' నినాదంతో క్యాబ్‌ డ్రైవర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు..
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్లు
ఈ నేపథ్యంలోనే తమ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓలా, ఉబర్  సంస్థల స్థానంలో డ్రైవర్ల అసోసియేషన్‌ను గుర్తించి వారే స్వయంగా నిర్వహించుకునేలా ఒక యాప్‌ను రూపొందించి ఇవ్వాలని డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్యాబ్‌ సంస్థలు ప్రభుత్వానికి 5% కమీషన్‌ చెల్లిస్తుండగా తాము 10% చెల్లించేందుకు అనుమతివ్వాలని, ఫైనాన్షియర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కూడా క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. ప్రభుత్వం వీరి ఆందోళనపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

 

12:57 - November 3, 2017

హైదరాబాద్ : ఉన్న ఊరును వదిలారు. కన్నవారికి దూరమయ్యారు. నిద్రహారాలు మరిచారు. ఆర్థికంగా చితికిపోయారు. పూటపూట పస్తులతో జీవితం నెట్టుకొస్తున్నారు. పుస్తకాలే ప్రాణంగా బతుకున్నారు. వాళ్లే తెలంగాణలోని నిరుద్యోగులు. కొలువుల కోసం అన్నిటికి దూరమయ్యరు. చిన్న ఉద్యోగమైనా సాధించి కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నారు.  మరి వారు కన్న కలలు నెరవేరుతున్నాయా? లేక కల్లలే అవుతున్నాయా? నిరుద్యోగుల కష్టాలపై 10టీవీ కథనం...
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ మూడు అంశాల ప్రాతిపదికనే సాగింది. తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది కూడా ఈ నినాదాలే. ఆంధ్రాపాలకుల చేతిలో తెలంగాణకు అన్యాయంపై  తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ప్రధానంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో  విద్యార్థులు ప్రధానపాత్ర పోషించారు. నాడు విపక్షంలో ఉన్న కేసీఆర్‌ ఉద్యోగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రతిసభలోనూ వివరించారు.  ఏపీపీఎస్సీపై నాడు ఎన్నో ఆరోపణలు చేశారు. 
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌
మొత్తానికి తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు.  అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్పీని ఏర్పాటు చేశారు. ఎంతో పారదర్శకంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పనిచేస్తుందని, నిఖార్సైన వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తున్నామంటూ ఢంకా బజాయించి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడి మూడేళ్లైంది. నాటి నుంచి నేటి వరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.  టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌ వివాదాస్పదమవుతోంది. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడం... అందులో ఏవో చిక్కులు ఉండడం.. వాటిపై నిరుద్యోగులు కోర్టుమెట్లెక్కడం.. అది తేలకపోవడం సర్వసాధారణమైపోయింది. 
కోర్టు మెట్లపై కొట్టుమిట్టాడుతున్న గ్రూప్‌-2 సమస్య
లక్షల మంది అభ్యర్థులు ఎన్నో ఆశలతో ఎదురు చూసిన గ్రూప్‌-2 ఎటూ తేలని సమస్యలా... హైకోర్టు మెట్లపై కొట్టుమిట్టాడుతోంది. మొన్నటికి మొన్న గ్రూప్‌ -1 ఫలితాలు ఇచ్చినట్టు ఇచ్చి వాటిని ఉపసంహరించుకున్న చరిత్ర  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కే దక్కింది.  లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోసం వేచి చూస్తోంది వారి ఆశలపై ప్రభుత్వం మూడేళ్లుగా నీళ్లు చల్లుతూనే ఉంది.  మొన్నటికి మొన్న విడుదల చేసిన టీఆర్‌టి నోటిఫికేషన్‌ సైతం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది.  నోటిఫికేషన్‌ అయితే విడుదలైంది కానీ... నేటికి దరఖాస్తుల స్వీకరణకు దిక్కేలేదు.  వాస్తవానికి అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 30 వరకు దరఖాస్తులు  స్వీకరించబడతాయంటూ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియనే ప్రారంభించలేదు. టీఎస్‌పీఎస్సీ దగ్గర పది జిల్లాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉండగా... ప్రభుత్వం 31 జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ వేయబోతున్నామంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక కమిషన్‌ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.  
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ప్రిపరేషన్‌ 
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్న తపన అంతాఇంతాకాదు. ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై పట్నంబాట పట్టారు.  నిద్రహారాలు మాని దీక్షగా ప్రిపేర్‌ అవుతున్నారు. ఒకపూట తిని, మరో పూట పస్తులుంటూ చదువుకుంటున్నారు. కన్నవాళ్ల ఆశలు నెరవేర్చేందుకు కొలువుల యజ్ఞం చేస్తున్నారు. అద్దెరూమ్‌లు, కోచింగ్‌ల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.  అయినా ప్రభుత్వం మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మొండిచేయే మిగిలింది. వేస్తున్న నోటిఫికేషన్లు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిరుద్యోగులు సైలెంట్‌గా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేయాలని వారు కోరుతున్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. 
 

12:55 - November 3, 2017

 హైదరాబాద్ : రాష్ట్రంలోని గిరిజన గూడేలు, తండాలను  పంచాయతీలు మార్చిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల గడువు  వచ్చే ఏడాది ఆగస్టు 1వ తేదీ వరకు ఉందని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు  సభ దృష్టికి తెచ్చారు. ఎన్నికలు నిర్వహించేలోగానే కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. 

12:53 - November 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడంపై అసెంబ్లీలో తీవ్ర రగడ జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయినా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వ చర్యలను వివిధ పక్షాల సభ్యులు తప్పు పట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు రెండు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు ప్రతిపాదలను కేంద్రానికి పంపామని, అనుమతి రాగానే నియమిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. 

మల్కాజ్ గిరిలో యువకుడు అదృశ్యం

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో ఓ యువకుడు అదృశ్యమైయ్యాడు. ప్రియురాలు మోసం చేసిందన్న మనస్తాపంతో 20రోజుల క్రితం ఇంట్లో నుంచి సాయి చైతన్య అనే యువకుడు వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో ప్రియురాలు మోసం చేసిందని ఆరిపిస్తూ, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని , పోలీసులు, ప్రియురాలు వేధింపులు భరించలేక చనిపోతున్నానని సెల్ఫీ తీసి తల్లిదండ్రులకు పంపాడు. 

12:45 - November 3, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపచేసే అంశం పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో  ఈ అంశంపై వివిధ పక్షాల సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. 
 

టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తా : పోట్ల నాగేశ్వరరావు

ఖమ్మం  :  రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని టీఆర్ఎస్ నేత పొట్లా నాగేశ్వరరావు తెలిపారు. 

12:44 - November 3, 2017

మేడ్చల్‌ : జిల్లాలోని కాప్రాలో దారుణం జరిగింది. మొన్న అర్ధరాత్రి మియాపూర్‌లో డ్యూటీ ముగించుకున్న ఇంటికివెళ్తున్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ బైక్‌ను.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే... బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తులు కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మణ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ ఇవాళ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని... విచారణ కొనసాగిస్తున్నారు. 

12:38 - November 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పొల్చితే రహదారుల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అధిక నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత మూడేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్ లో జిల్లాకు అధిక నిధుల కేటాయించినట్లు పేర్కొన్నారు. టీఅసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఇవ్వని విధంగా ఆర్ ఆండ్ బీ బడ్జెట్ లో జిల్లాకు రూ.1914 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మల్లేపల్లి, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల, రాయిచూర్ రహదారికి ఎన్ హెచ్ కింద రూ.800 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. టెండర్లు పూర్తి అయి.. పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేంద్రం మంజూరు చేస్తే.. సీఆర్ ఎఫ్ కింద జిల్లాకు రూ.160 కోట్లు ఇచ్చామని తెలిపారు. మండల్ వైడనింగ్ కోసం రూ.445 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. సింగిల్ లైన్ టు డబుల్ లైన్ కోసం 525 కోట్లు, బ్రిడ్జీల కోసం రూ.319 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ప్లాన్ వర్క్స్ కోసం రూ.310 కోట్లు, నాన్ ప్లాన్ కింద రూ.115 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్డీఎఫ్ కింద రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ హెచ్ కింద కేంద్రం నిధులు రూ.800 కోట్లు కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆర్ ఆండ్ బీ బడ్జెట్ లో రూ.1914 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే మహబూబ్ నగర్ ప్రధాన రహదారిలో సమస్యలున్నాయని తెలిపారు. 

 

నాల్గోరోజుకు చేరిన ఫాతిమా విద్యార్థుల దీక్ష

కృష్ణా : ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల నిరహారదీక్షలు నాల్గోరోజుకు చేరుకున్నాయి. విద్యార్థులుకు సంఘీభావంగా లెనిన్ సెంటర్ లో విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా నిర్వహించారు. 

ఆహార పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం కృష : బాదల్

ఢిల్లీ : కేంద్రం ఆహార పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని, రిటైల్ మార్కెట్ లో 100శాతం ఎఫ్ డీఐలను అనుమతించడం ద్వారా ఆహార పరిశ్రమ అభివృద్ధి వేగంతం అయ్యిందని కేంద్ర మంత్రి బాదల్ అన్నారు. 

వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సును ప్రారంభించిన మోడీ

ఢిల్లీ : దేశరాజధానిలోని విజ్ఞాన్ భవన్ ప్రధాని మోడీ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సును ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద 3రోజులపాటు వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు జరుగుతుతంది. ఈ కార్యక్రమంలో ఏసీ సీఎం చంద్రబాబు, ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్, కేంద్రమంత్రులు, ఆశోకగజపతిరాజు, రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. 

11:54 - November 3, 2017


హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీఅసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజలు ఇబ్బందులను పోగొట్టేందుకే కొత్త గ్రామాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా 1000 జనాభా కలిగి ఉన్న వాటిని గ్రామ పంచాతీయలుగా చేసే విధానం ఉందన్నారు. కానీ 500 జనభా, 500 కంటే అదనంగా జనాభా ఉన్నవాటిని కలిపి గ్రామాలుగా తీసుకోవచ్చన్నారు. 2018 ఆగస్టు 1 వరకు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గడువు ఉందని తెలిపారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 8600 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. 540 ఎస్టీ ఆవాలున్నాయని గుర్తు చేశారు. వచ్చే గ్రామ పంచాతీయతకు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకముందు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తండాలు, గూడేలన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. 

11:37 - November 3, 2017

తూర్పుగోదావరి : భూసేకరణ సమస్యతో ఆలస్యమైన పురుషోత్తపట్నం రెండో దశ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు మెగాఇంజనీరింగ్‌ కంపెనీ యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. మరోవైపు పురుషోత్తపట్నం నుంచి పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌కు 3500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఎడమ కాలువ నుంచి నీటిని రెండోదశ ప్రాజెక్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి రెండు పైప్‌లైన్ల ద్వారా 4 మోటార్లు ఉపయోగించి 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని టెన్ టివి గ్రౌండ్‌ రిపోర్ట్ లో వివరించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

11:15 - November 3, 2017

తూర్పుగోదావరి : గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల కల సాకారమవుతోంది. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత మెట్ట రైతులు పెట్టుకున్న ఆశలు.. త్వరలోనే నెరవేరబోతున్నాయి. తొలిదశను పూర్తి చేసుకున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం... ఇప్పుడు రెండో దశ పరిపూర్ణానికి దగ్గరైంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లూ సాగునీరు లేక అల్లాడిన రైతులకు మరికొన్ని రోజుల్లో ఊరట కలగబోతోంది. 
నవ్యాంధ్ర ప్రగతి పథంలో మరో మైలురాయి 
నవ్యాంధ్ర ప్రగతి పథంలో మరో మైలురాయి ఆవిష్కారం కాబోతోంది. మరికొన్ని రోజుల్లో పురుషోత్తపట్నం నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు గోదారమ్మ పరవళ్లు తొక్కనుంది. ఆయకట్టు రైతుల మోములో చిరునవ్వులు చిందించనుంది. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో.. చేపడుతున్న ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకున్నాయి. 
ఏటా 250, 350 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి 
ఏటా 250 350 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. దీన్ని ఒడిసిపట్టేందుకు ఉద్దేశించిన పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు కాస్త మందగమనంలో సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందన్న భావన ఉంది. పోలవరం పూర్తయ్యేలోపే పట్టిసీమ నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి ఏలేరు ఆయకట్టుకు తరలించనున్నారు. 
1638 కోట్ల రూపాయలతో ప్రతిపాదన 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 1638 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. దీని నిర్మాణానికి అవసరమైన పరిపాలన అనుమతిని.. ప్రభుత్వం గత ఏడాది.. అక్టోబరు 14న..  జీవో 100 ద్వారా మంజూరు చేసింది. తొలిదశ పనులు వేగంగా పూర్తి చేసిన మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ... ఇప్పుడు రెండో దశ పనుల పూర్తికి శరవేగంతో ముందుకు సాగుతోంది. 
నీటి ఎద్దడిని, పారిశ్రామిక అవసరాలు పథకం ప్రధాన లక్ష్యం 
పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్‌ ద్వారా జిల్లాలో 31 లక్షల 2వేల 852 ఎకరాలు వుండగా.. వ్యవసాయ యోగ్యమైన భూమి 13 లక్షల 66వేల 362 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. రెండు లక్షల 15వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నంలో నీటి ఎద్దడిని, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నదీ పథకం ప్రధాన లక్ష్యం. 
పురుషోత్తపట్నం పనుల పూర్తికీ వడివడిగా అడుగులు 
పట్టిసీమ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోపే పూర్తిచేసి రైతుల కలలు సాకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. అదే ఊపుతో.. పురుషోత్తపట్నం పనుల పూర్తికీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇంజనీర్లను, అధికారులను పరుగులు పెట్టిస్తోంది. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల కలలు సాకారం చేసేందుకు కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. 
ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం 
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 1638 కోట్లతో పనులు చేపట్టింది. పురుషోత్తపట్నం వద్ద గోదావరి తీరంలో 10 పంపులతో 3,500 క్యూసెక్కుల నీటిని తరలించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. 
పురుషోత్తపట్నం నుంచి నీరు లిఫ్ట్ 
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పైపులైన్ ద్వారా గోదావరి జలాలను 10 కిలోమీటర్ల దూరంలోని నాగంపల్లి సమీపంలో పోలవరం ఎడమ కాలువలోకి తరలించడం ఈ స్కీమ్ తొలిదశలో భాగం. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటిని జగ్గంపేట మండలం రామవరం వరకూ తరలిస్తారు. 42 కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడ మరోసారి నాలుగు పంపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి రెండు పైపులైన్ల సహాయంతో నేరుగా ఏలేరు జలాశయంలోకి 1400 క్యూసెక్కుల నీటిని తరలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 
ఈపీసీ పద్ధతిలో ఈ ఏడాది జనవరి 30న పనులు మొదలు
ఈపీసీ పద్ధతిలో మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ఏడాది జనవరి 30న పనులు మొదలెట్టింది. వాస్తవానికి అక్టోబరు 29 తేదీకల్లా ప్రాజెక్టును పూర్తిస్థాయి వినియోగంలోకి తేవాలని నిర్ణయంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం.. మెగా సంస్థ 1550 కోట్ల రూపాయలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
రెండు దశల్లో పూర్తిచేయాలని ప్రతిపాదన
పురుషోత్తపట్నం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేయాలని ప్రతిపాదించారు. నదుల అనుసంధానంలో భాగంగా 700 క్యూసెక్కుల నీటిని 58వ కిలోమీటరు వద్ద ఏలేరు కాలువకు మళ్లించి 67,614 ఎకరాలను పూర్తిస్థాయిలో స్థిరీకరించడం తొలి లక్ష్యం.. మిగిలిన 1400 క్యూసెక్కుల నీటిని విశాఖ జిల్లా పరిధిలోని ఆయకట్టుకు మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మళ్లించాలన్నది మలి లక్ష్యం. ఈ ప్రాజెక్టు వల్ల ఏలేరు రిజర్వాయరు కింద ఆయకట్టు భూములకు, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ చివరి ఆయకట్టు పరిధిలోని మొత్తం 2.15 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఆగస్ట్‌ 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనుకున్న సమయానికి రెండు మోటార్లను ఆన్‌ చేశారు. జనవరిలో పిఠాపురం వద్ద పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం..9 నెలల వ్యవధిలోపే దీన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్టోబరు 29 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది.  అయితే భూసేకరణలో తలెత్తిన సమస్యలతో రెండో దశ పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏలేరు ఆయకట్టుకు నీటిని తరలించే ప్రక్రియ ఆలస్యమైంది. 
భూసేకరణ సమస్యలన్నీ పరిష్కారం 
ప్రభుత్వ చొరవతో.. భూసేకరణ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. దీంతో, మెగా ఇంజనీరింగ్‌ సంస్థ పనుల్లో వేగం పెంచింది. మొదట్లో పుష్కర ఎత్తిపోతల కాలువల ద్వారా నీటిని తరలించిన ప్రభుత్వం ప్రస్తుతం పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌ అందుబాటులోకి రావడంతో.. దీని ద్వారా గోదావరి నీటిని తరలిస్తోంది. జగ్గంపేట మండలం రామవరం వద్ద రెండో దశ ఎత్తిపోతల పనులు కూడా పూర్తికావచ్చాయి. దాంతో అక్కడ నుంచి మరోసారి నీటిని లిఫ్ట్ చేసి 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు తరలించనున్నారు. మరో 100 రోజుల్లో పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులు పూర్తవుతున్న దశలో పైప్ లైన్ నిర్మాణం మీద కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు దృష్టిపెట్టారు. త్వరలో అన్ని పూర్తిస్తామంటున్నారు. పురుషోత్తపట్నం రెండో దశ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ కష్టాలు తీరనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
ఏళ్ల నాటి నీటి కష్టాలకు పరిష్కారం 
కష్టాలు, కడగళ్లతో బతుకులీడ్చిన తూర్పు గోదావరి జిల్లా మెట్ట రైతుల మోములో త్వరలోనే ఆనందం వెల్లివిరియనుంది. తమ పంటలు దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డ అన్నదాతలు..సిరుల పంటలు పండించే శుభతరుణం మరికొన్ని రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకంతో ఏళ్ల నాటి నీటి కష్టాలకు పరిష్కారం దొరకనుంది. గోదావరి జిల్లాల్లోని భూములను సాగులోకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కుంటోంది. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో..ఆలోగానే ఫలితాలు రైతన్నలకు అందించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరందించి కర్షకుల కష్టాలు కొంతవరకూ తీర్చింది. ఇప్పుడు అదే రీతిలో తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతాలను డెల్టాగా మార్చడానికి తగ్గట్టుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ప్రారంభంలో వచ్చిన సమస్యలను అధిగమించి ప్రస్తుతం సాగునీరందించడానికి పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ సిద్ధమవుతోంది. 
ముగింపు దశకు ప్రాజెక్ట్‌ పనులు  
మొత్తం 1638 కోట్ల వ్యయంతో చేపట్టిన పురుషోత్తపట్నం ప్రాజెక్ట్‌ పనులు ముగింపు దశకు చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ఏలేరు ఆయకట్టు రైతులకు 2వేల క్యూసెక్కుల నీటిని కేటాయించడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేయాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఏలేరు ప్రాజెక్ట్‌లో ఇన్ ఫ్లో రానురాను తగ్గిపోతోంది. దాంతో ప్రతీఏటా ఏలేరు ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా రబీలో శివారు భూములు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్‌తో గోదావరి జలాలను మళ్లించడం ద్వారా అన్నదాతల సాగునీటి కష్టాలను తీర్చనుంది. 
విశాఖ నగరానికి తాగునీటి సమస్య తీర్చడానికి కూడా  
అదే సమయంలో విశాఖ నగరానికి తాగునీటి సమస్య తీర్చడానికి కూడా పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఉద్దేశంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏలేరు జలాశయం నుంచి ప్రతీ ఏటా విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటి కోసం నీటిని తరలిస్తున్నారు. అయినా నీటి ఎద్దడి తీరకపోవడంతో.. పురుషోత్తపట్నం నుంచి 1400 క్యూసెక్కుల నీటిని.. విశాఖకు తరలించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. అదే సమయంలో 43వేల ఎకరాల ఏలేరు ఆయకట్టు రైతాంగానికి సుదీర్ఘకాలంగా ఉన్న సాగునీటి సమస్య తీరే అవకాశం దక్కబోతోంది. వచ్చే ఖరీఫ్ నాటికి సంపూర్ణంగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు రైతులకు లబ్ది చేకూరనుంది. ఏలేరు ఆయకట్టు రైతాంగం పురుషోత్తపట్నం జలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగితే గోదావరి జిల్లాల్లోని మెట్ట మండలాలు సైతం కోనసీమను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

టీఎస్ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గౌవర సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానలు చెబుతున్నారు. 

శాసన సభ నుంచి టీడీపీ, బీజేపీ వాకౌట్

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ శాసన సభ నుంచి టీడీపీ, బీజేపీ వాకౌట్ చేశాయి.

10:56 - November 3, 2017

హైదరాబాద్‌ : మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి భారీ ఉపశమనం లభించింది. ఏళ్ల తరబడి బకాయిపడిన ఇన్‌కమ్‌ ట్యాక్స్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభించింది. అంతేకాదు..  కొద్దిరోజుల క్రితం కోకాపేట్‌ భూములపై కోర్టులో తమకు అనుకూలంగా తీర్పురావడంతో వేలాది కోట్ల రూపాయలు హెచ్‌ఎండీఏ ఖజానాకు చేరనున్నాయి. దీంతో నిధుల లేమితొ కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఎండీఏ కొత్త ప్రాజెక్టులపై ఫోకస్‌ చేసేందుకు వీలుకలిగింది.
రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌తో వెలుగు వెలిగిన హెచ్‌ఎండీఏ
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ బాగా ఉన్న సమయంలో హెచ్‌ఎండీఏ ఓ వెలుగు వెలిగింది. వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో... పదుల సంఖ్యలో ప్రాజెక్టులతో నిత్యం కళకళలాడింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు, బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు, మురుగుశుద్ధి నివారణ, పెద్ద పార్కుల అభివృద్ధి వంటి పలు డెవలప్‌మెంట్‌ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టింది.  అయితే రియల్‌ బూమ్‌ తగ్గిపోవడంతో హెచ్‌ఎండీఏకు ఆదాయ మార్గాలు తగ్గాయి.  ఎల్‌ఆర్‌ఎస్‌ , బీఆర్‌ఎస్‌ పథకాల్లో కొద్దోగొప్పో వచ్చిన ఆదాయం మినహాయిస్తే.... స్థిరంగా వచ్చే ఆదాయం లేకుండా పోయింది. దీంతో ఆర్థిక కష్టాలతో హెచ్‌ఎండీఏ కొట్టుమిట్టాడుతోంది.
హెచ్‌ఎండీఏకు కలిసొచ్చిన రెండు అంశాలు
గడిచిన కొద్దిరోజుల్లో హెచ్‌ఎండీఏకు రెండు అంశాలు అదృష్టంగా కలిసొచ్చాయి. ఏళ్లతరబడి కోర్టులో మూలుగుతున్న కోకాపేట భూముల విషయంలో హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పువచ్చింది.  దీంతో ఆ భూములకు సంబంధించి వేలాది కో ట్ల రూపాయల ఆస్తి హెచ్‌ఎండీఏ ఖాతాలో జమ అయ్యింది. ఇన్నేళ్లపాటు పెండింగ్‌లో ఉన్న భూములను అమ్మడం ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నాయి హెచ్‌ఎండీఏ వర్గాలు.  అంతేకాదు..  గతంలో భూములు అమ్మిన కాలంలో భారీగా వచ్చిన ఆదాయంపై తమకు ట్యాక్స్‌ చెల్లించాలని కొన్ని సంవత్సరాలుగా ఆదాయపన్నుశాఖ కోరుతోంది. 2002 నుంచి 2014 వరకు పెండింగ్‌లో ఉన్న 983 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. పన్ను చెల్లింపుల్లో ఆలస్యంపై గుర్రుగా ఉన్న ఆదాయపన్నుశాఖ .. గత రెండేళ్లలో 3సార్లు హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను 278 కోట్ల రూపాయలను హెచ్‌ఎండీఏ ఆదాయపన్నుశాఖకు చెల్లించింది.
ఐటీ సెక్షన్‌ 12ఏఏ ప్రకారం హెచ్‌ఎండీఏకు ఆదాయపన్ను మినహాయింపు
మిగిలిన వందల కోట్ల ఆదాయపన్నును తాము చెల్లించలేమంటూ హెచ్‌ఎండీఏ అధికారులు వివిధ రూపాల్లో ప్రభుత్వం, ఆదాయపన్నుశాఖ అధికారులతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. పన్నునుంచి తమను మినహాయించాలని అభ్యర్థించారు. ఎట్టకేలకు హెచ్‌ఎండీఏ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి.  ఐటీ సెక్షన్‌ 12 ఏఏ  ప్రకారం 2002 నుంచి 2014 వరకు పెండింగ్‌లో ఉన్న 983 కోట్ల రూపాయలను చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చింది ఆదాయపన్నుశాఖ.  దీంతో హెచ్‌ఎండీఏకు ఆదాయపన్ను చెల్లింపునుంచి భారీ ఉపశమనమే లభించినట్టైంది.  నిన్నటి వరకు ఆదాయ లేమితో కొట్టుమిట్టాడుతోన్న హెచ్‌ఎండీఏకు కొత్త జవసత్వాలు వచ్చినట్టైంది. కోకాపేట భూములకు సంబంధించిన పెద్దమొత్తంతోపాటు ఆదాయపన్నుశాఖ నుంచి పన్ను మినహాయింపు లభించడంతో హెచ్‌ఎండీఏ అధికారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

 

10:52 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పోలీస్‌ ఉన్నతాధికారుల పదోన్నతుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో భారీ మార్పులు జరిగాయి. ఏసీపీలకు అడిషనల్ డీసీపీలుగా.. అడిషనల్‌ డీసీపీపీలు... డీసీపీలు పదోన్నతి పొందారు. ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పోలీసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ మార్పులు
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో భారీ మార్పులు చేటుచేసుకున్నాయి. పలువురు అదనపు డీసీపీలకు, డీసీపీలుగా పదోన్నతులు లభించాయి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఈస్ట్‌జోన్‌లో శశిధర్‌రాజుకు డీసీపీగా పదోన్నతి లభించగా.. అదనపు  ఎస్పీగా మెదక్‌లో విధులు నిర్వహిస్తున్న రాంచంద్రారెడ్డి యాదాద్రి భువనగిరి డీసీపీగా నియమితులయ్యారు. సైబరాబాద్‌, రాచకొండ మినహా హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ పదోన్నతులు అధికారులను వరించలేదు.
14 మందికి అదనపు డీసీపీలుగా పదోన్నతి
నిఘా విభాగంలో అదనపు ఎస్పీగా ఉన్న రాధాకిషన్‌రావుకు పదోన్నతి లభించింది.  ఆయన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమితులయ్యారు. మొత్తం 14 మంది  అదనపు డీసీపీలుగా పదోన్నతులు పొందారు. రాష్ట్ర పోలీస్‌శాఖ  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనూహ్యంగా పలు శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
28 మంది ఏసీపీలకు పదోన్నతి
ఇక వివిధ విభాగాల్లో ఏసీపీలుగా విధులు నిర్వహిస్తున్న మొత్తం 28 మందికి పదోన్నతులు లభించాయి. వీరందరు అదనపు డీసీపీలుగా పదోన్నతులు పొందారు.  దీంతో వీరంతా అదనపు డీసీపీ హోదాలో విధులు నిర్వహించనున్నారు.  మేరకు డీజీపీ కార్యాలయం నుంచి పదోన్నతుల ఉత్తర్వులు జారీ అయ్యాయి.

10:48 - November 3, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలపై స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సునీల్‌రెడ్డితో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణుడు లక్కరాజు శ్రీచరణ్‌, పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా విద్యార్ధులు కోరుకున్న అంశాల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ట్రస్ట్‌ చైర్మన్ సునీల్‌రెడ్డి తెలిపారు. 

10:46 - November 3, 2017

గుంటూరు : జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  చేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో వీటిని ప్రారంభిస్తున్నారు. మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దళారుల చేతుల్లో  రైతులు నష్టపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరలు అమలు చేస్తున్నారు. క్వింటాలు పత్తికి 4,320 రూపాయల ఎమ్ ఎస్ పీ నిర్ణయించారు. పత్తి అమ్మిన రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతారు. 

 

10:43 - November 3, 2017

యాదాద్రి భువనగిరి : నయీం మృతి చెందినా జిల్లాలో నయీం ముఠా దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్‌ జైల్లో ఉంటూనే నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీను ఈ దందాలకు పాల్పడుతున్నాడు. పాశం శ్రీనుకు సహకరిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడో వార్డు కౌన్సిలర్‌ పాశం అమర్‌, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్‌, పులి శ్రీనివాస్‌, అందె సాయికృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే నయీం గ్యాంగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా....

 

కొనసాగుతున్న నయీం ముఠా దందాలు

యాదాద్రి భువనగిరి : జిల్లాలో నయీం ముఠా దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్‌ జైల్లో ఉంటూనే నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీను ఈ దందాలకు పాల్పడుతున్నాడు. పాశం శ్రీనుకు సహకరిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడో వార్డు కౌన్సిలర్‌ పాశం అమర్‌, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్‌, పులి శ్రీనివాస్‌, అందె సాయికృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే నయీం గ్యాంగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. 

 

10:39 - November 3, 2017

హైదరాబాద్ : కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ దూరం చేయలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన టీటీడీపీ విస్తృత స్ధాయి సమావేశంలో బాబు పాల్గొన్నారు.  పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినప్పుడు కార్యకర్తలే అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ స్ఫూర్తిగా పనిచేయాలని పార్టీ నాయ‌కులకు   నడుచుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో కార్యకర్తల్లో స్థైర్యం నింపేందుకు బాబు  ప్రయత్నించారు. అంత‌ర్గత విభేదాల వ‌ల్ల పార్టీ విచ్చిన్నం అవుతుందని పార్టీ బలోపేతం కావాలంటే నేతలందరు ఐక్యంగా పనిచేయాలన్నారు.  

అంతకు మందు ఎన్టీఆర్ ట్రస్టు భ‌వ‌న్ లో నిర్వహించిన విస్తృత స్ధాయి స‌మావేశంలో తెలంగాణా లీడర్లు, కార్యకర్తలు  అధినేత‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. గ‌త రెండేళ్లుగా ఏపీ రాజధాని  అమ‌రావ‌తిలో బాబు తీరిక‌లేని కార్యక్రమాల‌తో బిజీగా ఉండ‌డంతో.. టీటీడీపీ వ్యవహరంలో  అంత‌గా దృష్టి పెట్టలేకపోయారు. దీంతో పార్టీ నాయకుల మధ్య స‌మ‌న్వయం కొర‌వ‌డిందనే అభిప్రాయాలు వస్తున్నాయి.  కొందరు సీనియ‌ర్‌ నేత‌ల‌ అసంద‌ర్భ ప్రక‌ట‌న‌ల వ‌ల్ల  2019 సార్వత్రిక ఎన్నిక‌ల పొత్తు అంశం అనూహ్యంగా తెర‌పైకి వచ్చింది. దీంతో  నేత‌ల మ‌ద్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి లాంటి చురుకైన నాయ‌కుడు పార్టీకి దూరం అయ్యారనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. 

రేవంత్‌రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు.  స్వప్రయోజ‌నాల కోసం పార్టీలు మారుతున్న నేత‌ల వ‌ల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని బాబు ఉద్భోదించారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో  టీడీపీ  ముఖ్య భూమిక పోషిస్తుంద‌న్న బాబు  2019 ఎన్నికల్లో ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలో త‌రువాత నిర్ణయిస్తామ‌న్నారు. 

మరోవైపు పార్టీలో క్రమశిక్షణ తప్పిన నేతలపై చర్యలు తప్పవని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. కొంద‌రు సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారినంత మాత్రనా ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌న్నారు.  సంస్ధాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేస్తూనే ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం సాగిస్తామన్నారు. వ‌చ్చే ఏఆది  పార్టీ మ‌హానాడును తెలంగాణ‌లో నిర్వహిస్తామన్నారు.  

మొత్తానికి చంద్రబాబు దిశానిర్దేశంతో టీటీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో బాబు ఎలాంటి సంచనల ప్రకటనలు చేయనప్పటికీ భవిష్యత్‌ కార్యాచరణను ఎలా రూపొందించుకోవాలో సూచించారని టీటీడీపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో బాబు సూచనలు ఏమేరకు పార్టీని నిలబెడతాయో అంటున్నారు చూడాలి అని కార్యకర్తలు అంటున్నారు. 

10:36 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు ఆరో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీపీఎం, నేరెళ్ల ఘటనపై టీడీపీ, ముస్లీంకు బీసీ.. ఈ కింద ఇస్తున్న 4 శాతం మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 

 

10:24 - November 3, 2017

పార్టీ పిరాయింపులపై భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత మల్లయ్య,  టీఆర్ ఎస్ నేత రాజమోహన్, వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియో చూద్దాం...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీపీఎం, నేరెళ్ల ఘటనపై టీడీపీ, ముస్లీంకు బీసీ.. ఈ కింద ఇస్తున్న 4 శాతం మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 

09:51 - November 3, 2017

కర్నూలు : జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం సింగవరంలో బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్నారంటూ దంపతులపై పోలీసులు దాడి చేశారు. తల్లిదండ్రులను కళ్ల ముందే కొట్టడాన్ని చూసి తట్టుకోలేని బాలుడు పురుగులమందు తాగాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సింగవరానికి చెందిన ధనుంజయ గౌడ్, లక్ష్మీదేవి దంపతులు బెల్టుషాపు నిర్వహిస్తున్నారన్న నెపంతో..  పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో.. బండిఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ విష్ణునారాయణ.. ధనుంజయ గౌడ్‌, లక్ష్మీదేవిని అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఈడ్చుకొచ్చి బూట్‌ కాలుతో తన్ని.. లాఠీలతో కొట్టి గాయపరిచారు. ఈ ఘటనను చూసిన ధనుంజయ గౌడ్ కుమారుడు వెంకటేశ్వర గౌడ్‌ మనస్థాపానికి గురై ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన బంధువులు బాలుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఆరో రోజు సమావేశాలు జరుగనున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీపీఎం, నేరెళ్ల ఘటనపై టీడీపీ, ముస్లీంకు బీసీ.. ఈ కింద ఇస్తున్న 4 శాతం మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 

టీఅసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఆరో రోజు సమావేశాలు జరుగనున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీపీఎం, నేరెళ్ల ఘటనపై టీడీపీ, ముస్లీంకు బీసీ.. ఈ కింద ఇస్తున్న 4 శాతం మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 

09:47 - November 3, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఆరో రోజు సమావేశాలు జరుగనున్నాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని సీపీఎం, నేరెళ్ల ఘటనపై టీడీపీ, ముస్లీంకు బీసీ.. ఈ కింద ఇస్తున్న 4 శాతం మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:45 - November 3, 2017

కృష్ణా : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది...ఏకంగా తన చాంబర్‌లోనే లక్షా పదివేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ దొరికాడు...అంతకు ముందు ఒప్పందం చేసుకున్న ఆడియో క్లిప్పులు కూడా బాధితుడు ఏసీబీకి అందించాడు...
ఏసీబీకి చిక్కిన గుడివాడ మున్సిపల్‌ కమిషనర్ 
కృష్ణాజిల్లా, గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తన చాంబర్‌లోనే ఏకంగా లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఎన్‌. ప్రమోద్‌కుమార్‌ పట్టుబడ్డారు...ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తన బృందంతో కలిసి దాడులు చేయగా అధికారి చిక్కారు...కాంట్రాక్టర్‌ అక్కరావ్‌ కు 37 లక్షల బిల్లుల చెల్లింపులో 3 శాతం లంచం ఇవ్వాలని ప్రమోద్‌ కుమార్‌ డిమాండ్ చేశారు.... దీంతో అక్కరావు ఏసీబీని ఆశ్రయించి విషయాన్ని వివరించారు...ఒప్పందం ప్రకారం డిమాండ్ చేసిన మొత్తంలో లక్ష 10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు...
అవినీతి ఒప్పందంపై ఫోన్‌లో మాటలు..
అంతకు ముందు బిల్లుల విషయంలో అధికారి డిమాండ్ చేస్తుండడంతో కాంట్రాక్టర్‌ అక్కరావు ఫోన్‌లో సంభాషణను రికార్డ్‌ చేశారు..అయితే దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పులను ఏసీబీకి అప్పగించారు. గతంలో కూడా భారీగా అవినీతి జరిగినట్లు సంభాషణను బట్టి తెలుస్తోంది..ఆడియో క్లిప్పుల్లో మాటలతీరును బట్టి చూస్తే గుడివాడ పురపాలక సంఘం కార్యాలయం అవినీతి మయమైనట్లు తేలిపోయింది...

 

09:38 - November 3, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఉద్యోగుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. సచివాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్‌ చేశారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీంతో ఉద్యోగుల మధ్య విభేదాలు బయట పడ్డాయి.
ఆందోళనకు గురి చేస్తున్న సచివాలయ పరిణామాలు
అమరావతి సచివాలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు నెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి కుదిస్తున్నారని వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన సీఎం అలాంటిదేమీ లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పైన ఉద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఉద్యోగుల వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 
సర్కార్‌పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు
మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాది ఉద్యోగుల పక్షమని, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌కు నష్టం కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకోదన్నారు. కావాలనే సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే కొందరు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేశారని ముఖ్యమంత్రి అనుమానించారు. దీంతో విజిలెన్స్‌ ఎంక్వైరీని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు సీఎం. విజిలెన్స్‌ రిపోర్ట్‌లో ఇద్దరు ఉద్యోగులు, ఉద్యోగుల వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీని బయటకు విడుదల చేశారని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. 
వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీ లీక్‌ చేశారని ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్‌
వయోపరిమితి డ్రాఫ్ట్‌ కాపీ లీక్‌ చేశారంటూ ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్‌లను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. న్యాయ శాఖలో పని చేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పతో పాటు, జలవనరుల శాఖ ఎస్వో వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే  ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆందోళనకు దిగారు ఉద్యోగులు. ఎట్టకేలకు మురళీ కృష్ణ రావడంతో ఆయనతో చర్చించారు. తనపై ప్రభుత్వం కుట్ర చేసిందని సస్పెండ్‌ అయిన వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ శాఖలో పనిచేసే తిమ్మప్పకు ఇరిగేషన్‌ శాఖలో పనిచేసే నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్యోగులు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామంటున్నారు అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీకృష్ణ. ఈ విషయమై ప్రభుత్వాన్ని విన్నవిస్తామన్నారు. 
సస్పెండ్‌ చేయడంపై ఆగ్రహం
అయితే సచివాలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఉద్యోగుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇద్దరు ఎస్‌.ఓలను సస్పెండ్‌ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఉద్యోగులు ప్రభుత్వానికి కీలకమైన సమాచారాన్ని బయటకు పంపితే ఆ కారణాలు ముందే చెప్పాల్సిందంటున్నారు. 
డాక్యుమెంట్‌ లీకేజీతో భయాందోళనలో ఉద్యోగులు
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల వయోపరిమితి డాక్యుమెంట్ లీకేజీతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో ఉద్యోగుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడింది. ఒక వర్గం ప్రభుత్వం చర్యలను తప్పుపడుతుంటే, మరో వర్గం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అంటున్నారు. మరి ఈ వివాదానికి ఫులిస్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి. 

09:32 - November 3, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టులో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కాంక్రీట్‌ పనులు కొత్త కాంట్రాక్టర్‌కు ఇచ్చే నష్టంపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఒకవేళ అంచనా వ్యయం కంటే ఖర్చు ఎక్కువైతే... ఈ మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ నిర్ణయం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2013..14 ధరల ప్రకారం ఎస్టిమేషన్స్‌ రూపొందించాలని ఆదేశం 
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తన పంథా నెగ్గించుకుంది. 2005లో చేపట్టిన ప్రాజెక్టు అంచనా వ్యయం 10వేల 151 కోట్లు. అయితే 2010-11లో అంచనాలు 16 కోట్ల 151 కోట్లకు చేరుకున్నాయి. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌ 8న 2010-11 అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే నిధులను కేంద్రమే పూర్తిగా భరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. 2014 ఎప్రిల్‌ 1వ తేదీ తర్వాత ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం భరిస్తుందని, అంతకు ముందు చేసిన వ్యయాన్ని రీఎంబర్స్‌ చేసేది లేదని తేల్చి చెప్పారు. 2013-14 ధరల ప్రకారం అంచనాల ఎస్టిమేషన్స్‌ రూపొందించాలని ఏపీ జలవనరుల శాఖను కేంద్రం ఆదేశించింది. 
పోలవరంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ
నవంబర్‌ 1న పోలవరంపై గంటన్నర పాటు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌ని కొనసాగించి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగం సుమారు వెయ్యికోట్ల విలువైన కాంక్రీట్‌ పనులకు ప్రత్యేకంగా ఈ టెండర్స్‌ను పిలవాలని ప్రభుత్వం తీర్మాణించింది. దీంతో అదనంగా 200 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేబినేట్‌లో తీర్మానించారు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలని, దాని కోసమే కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు కొత్తగా మరో కాంట్రాక్టర్‌ను నియమించాలని నిర్ణయించారు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జలవనరుల శాఖ కాంట్రాక్టర్‌ మధ్య చెల్లింపులు, వివాదాలను పరిష్కరించుకునేందుకు వివాదాల పరిష్కార బోర్డు ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలనే రాజకీయ దృష్టి కనబడుందని ఆరోపిస్తున్నారు. 
విచారణ చేయిస్తామన్న జాతీయ గ్రీన్‌ ట్రెబ్యునల్‌
మరోవైపు పోలవరానికి పర్యావరణ అనుమతులు నిబంధనలకు అనుగుణంగా లేవంటూ రేలా సంస్థ పిటిషన్‌ దాఖలుపై విచారణ చేయిస్తామని జాతీయ గ్రీన్‌ ట్రెబ్యునల్‌ తెలిపింది. దీనిపై పర్యావరణ అనుమతులను నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అప్పిలేట్‌ అథారిటీ రద్దు చేసింది. పోలవరంపై సుప్రీంకోర్టులో 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్జీటీ కేసు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ తరపు న్యాయవాది గుంటూరు ప్రమోద్. దీనిని ఎన్జీటీ తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందరేశ్వరి లేఖ రాసింది. వీలైనంత వరకు ప్రాజెక్టు విలువ పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు ఇప్పట్లో తొలగేలా లేవు.  

 

09:25 - November 3, 2017

హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు మార్కెట్‌లోగిట్టుబాటు ధర రాకుండా వ్యాపారులు అడ్డుపడుతున్నారని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆదేవన వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌ ఎస్వీకేలో టీ-మాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.  తూకాల్లో మోసాలు, పంట నాణ్యతను నిర్ణయించే విధానం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. దళారులు, వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రెండు రాష్ట్రాల పాలకులు చోద్యం చూస్తున్నారని ప్రొఫెసర్‌ ఐలయ్య మండిపడ్డారు.  పంట కొనుగోలులో మార్పులు రాకుంటే టీ-మాస్‌ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరాటం చేస్తానమని  కంచ ఐలయ్య స్పష్టంచేశారు. 

 

09:22 - November 3, 2017

నిజామాబాద్ : ఊరు ఏదైనా... గ్రామం ఏదైనా.. దళితులపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని పోరాటాలు జరిగినా... అగ్రవర్ణాల దాష్టికం కొనసాగుతూనే ఉంది. దళితుల అభిప్రాయాలపై.. ఆకాంక్షలపై...అణచివేత సాగుతూనే ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టకు అనుమతి నిరాకరణ
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని బోర్గాం గ్రామంలో.. కొంతమంది పెత్తందారులు... దళితుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో వారిపై దాడికి పాల్పడుతున్నారు.  గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వకుండా.. దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  
సాంఘికంగా బహిష్కరిస్తామని బెదిరింపు
ఏడు వేల జనాభా కలిగిన బోర్గాం గ్రామంలో 130 దళిత కుటుంబాలు ఉన్నాయి. వారంతా అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టుకునేందుకు .. గ్రామసభలో తీర్మానం చేసుకున్నారు. అయితే గాంధీ విగ్రహం వద్ద.. అంబేద్కర్‌ విగ్రహం పెట్టొద్దని గ్రామ కమిటీ హుకుం జారీ చేసింది. గ్రామ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం పెడితే.. అరిష్టమని గ్రామ కమిటీ ముసుగులో కొంతమంది పెత్తందారులు భూమి పూజను అడ్డుకున్నారు. విగ్రహాన్ని పెడితే.. సాంఘిక బహిష్కరణ చేస్తామని బెదిరించారు. దీంతో..దళితులు ఇంచార్జ్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డిని ఆశ్రయించారు. అయినా ఏ ఒక్క అధికారి.. గ్రామానికి రాలేదని.. తమ  సమస్యను పట్టించుకోలేదని దళితులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. గాంధీ విగ్రహం సమీపంలోనే.. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

08:56 - November 3, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగే మహాసభల్లో పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌లో  ఇవాళ ఆహ్వానసంఘాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు... ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. 
ఆహ్వాన సంఘం కమిటీ ఏర్పాటు 
హైదరాబాద్‌లో జరగబోయే సీపీఎం 22వ జాతీయ మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన సంఘం కమిటీ చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని, కోశాధికారిగా బి.వెంకట్‌తో పాటు పలువురు నేతలు సభ్యులుగా ఉన్నారు. 
మోదీ సర్కార్‌పై ఏచూరి ఫైర్ 
సమావేశంలో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ వలన అన్ని రంగాలు కుదేలయ్యాయని ధ్వజమెత్తారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఏమో గానీ ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ఆరోపించారు.  గుజరాత్ ఎన్నికల కోసమే పటేల్‌ కులస్థులను పొగుడుతున్నారని విమర్శించారు. 
కేంద్రం, రాష్ట్రంలో నియంతృత్వ పాలన : తమ్మినేని ఫైర్‌
అటు కేంద్రంలో ఇటు రాష్టంలో నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సీపీఎం జాతీయ మహాసభల్లో చర్చిస్తామన్నారు. ప్రజా పోరాటాలు, సమ్మెలపై అణచివేత, నిర్భందం సాగుతోందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విదానంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. 
కార్పొరేట్లకు ప్రభుత్వ భూములు దారాధత్తం : మధు 
పేదలకు ఇళ్ల స్థలాలకు భూములు లేవని, కార్పొరేట్లకు చౌకగా వందల ఎకరాల భూములు ప్రభుత్వం కట్ట బెడుతోందన్నారు ఏపీ సీపీఎం కార్యదర్శి మధు. చారిత్రక హైదరాబాద్‌లో మహాసభలు జరగడం సంతోషదాయకమన్నారు. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ. .తెలంగాణ అభివృద్ది కోసం, స్పష్ట మైన ప్రణాళిక , ప్రత్యామ్నాయ విదానంతో సీపీఎం ముందుకు వెళుతుందన్నారు. జాతీయ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టేందుకు సీపీఎం పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

బెంగళూరులో రెండో రోజు పర్యటించనున్న మంత్రి నారా లోకేష్

కర్నాటక : బెంగళూరులో రెండో రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఐటీ ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నారు.

07:26 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీస్‌ బాస్‌ నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్నారు. యూపీఎస్సీకి పంపించాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కొత్త డీజీపీ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ నెక్ట్స్‌ డీజీపీ ఎవరనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి అని ఫిక్స్‌ అయిపోయినా.. అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరెవరు డీజీపీ రేసులో ముందున్నారు. సీఎం కేసీఆర్ ఎత్తుగడలు ఏంటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ మహేందర్‌ రెడ్డి కాబోయే డీజీపీ అని అంతా అనుకుంటున్నారు. గతంలో సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రెండవ డీజీపీగా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆరుగురు అధికారులు డీజీపీ రేసులో ఉన్నారు. ఇందులో 6 పేర్లను అధికారులు యూపీపీఎస్సీకి పంపించారు. అందులో ముగ్గురి పేర్లను యూపీపీఎస్సీ రాష్ట్రానికి అందజేస్తుంది. అందులో ఒకరిని డీజీపీగా నియమిస్తారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి నియమ నిబంధనలు ప్రభుత్వాలు పాటించలేదు. ముందుగా ఇంచార్జ్‌ డీజీపీని నియమించి ఆ తర్వాత సీనియర్స్ పదవీ విరమణ అయిపోయాక.. రెగ్యులర్‌ డీజీపీగా నియమించేవారు. 

1983 నుండి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు. సీనియర్‌ అయిన తేజ్‌దీప్‌ కౌర్‌కి రెండున్నరేళ్ల సర్వీస్‌ ఉంది. స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె తర్వాత 1984 బ్యాచ్‌కి చెందిన సుదీప్ లక్టాకియా రెండో సీనియర్‌ అధికారి.. ఈయన కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. ఈయనకు 20 నెలల సర్వీస్‌ మాత్రమే ఉంది. ఈయన తర్వాత 1985 బ్యాచ్‌కి చెందిన డాక్టర్‌ ఈష్‌ కుమార్‌ ఉన్నారు. ఈయన కేంద్ర సర్వీస్‌లోనే ఉన్నారు. ఇంకా 13 నెలల సర్వీస్ ఉంది. 1986 బ్యాచ్‌కి చెందిన తెలంగాణ హోం సెక్రటరీ రాజీవ్‌ త్రివేదికి నాలుగేళ్ల సర్వీస్‌, మహేందర్‌ రెడ్డికి ఐదేళ్ల సర్వీస్‌, ప్రభాకర్ అలోకాకు రెండున్నరేళ్లు ఉంది. దీంతో మొదట ఆరుగురి పేర్లను పంపించినట్టు తెలుస్తోంది. తేజ్‌దీప్‌ కౌర్‌పై అభియోగాలు ఉండటంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర సర్వీస్‌లో ఉన్న లక్టాకియా, ఈష్‌కుమార్‌లకు నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీస్‌ లేదు. 

ఇక ప్రధాన పోటీదారులు కృష్ణప్రసాద్, రాజీవ్‌ త్రివేది, నగర కమిషనర్ మహేందర్‌ రెడ్డి. రాజీవ్‌ త్రివేదిని డీజీపీగా చేయాలని ఓ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అందుకు మాజీ సీఎస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ అయితేనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని నివేదికలు, వారి అభిప్రాయాలు సీఎంకు అందజేసినట్లు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహేందర్‌ రెడ్డిని డీజీపీగా చేస్తే రాబోయే ఎలక్షన్‌ రోజుల్లో ఎలా ఉండబోతోంది. మహేందర్‌ రెడ్డికి డీజీపీ పదవి అంత ఈజీగా లభించకూడదనే పోటీతత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

డీజీపీగా కృష్ణప్రసాద్‌ ఎన్నిక ఖరారైనట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కృష్ణప్రసాద్‌ తన ట్విట్టర్‌లో ఖండించారు. తనకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. మరి డీజీపీ ఎవరనే ఉత్కంఠకు తెరపడాలంటే నవంబర్‌ 12 వరకు ఆగాల్సిందే. 

07:23 - November 3, 2017

హైదరాబాద్ : కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ దూరం చేయలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన టీటీడీపీ విస్తృత స్ధాయి సమావేశానికి బాబు హాజరయ్యారు.  పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చినప్పుడు కార్యకర్తలే అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

సీపీఎస్ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు

విజయవాడ : సీపీఎస్ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు, రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. 

 

Don't Miss