Activities calendar

04 November 2017

21:31 - November 4, 2017

ఢిల్లీ : దేశంలో 'హిందూ ఉగ్రవాదం'ఉందంటూ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్‌ను చంపేస్తామని హిందూ మహాసభ బెదిరించింది. హిందువులకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే సహించేది లేదని ఆ సంస్థ హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఈ దేశంలో జీవించే హక్కు లేదని పేర్కొంది. హిందూ అతివాద సంస్థల 'పాత ఎత్తుగడలు' పనిచేయకపోవడంతో అవి హింసామార్గంలో వెళ్తున్నాయని కమల్‌హాసన్‌ తమిళ వారపత్రిక 'ఆనంద వికటన్‌'లో వ్యాసం రాశారు. ఈ విషయంలో బిజెపి కూడా కమల్‌ మానసిక పరిస్థితి బాగా లేదని, దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. కమల్‌హాసన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కేసు నమోదైంది. హిందూ సంస్థలు తనను దేశద్రోహిగా చిత్రీకరించి చంపేందుకు ప్రయత్నిస్తున్నాయని చెన్నైలో జరిగిన ఓ రైతు సంఘాల సమావేశంలో కమల్‌హసన్‌ అన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతానని తెలిపారు. వ్యవసాయాన్ని పరిశ్రమగా ఎందుకు గుర్తించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.

ఘనంగా కార్తీక పౌర్ణమి...

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. 

హిమాచల్ ప్రదేశ్..చివరి దశకు ప్రచారం...

ఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు సీనియర్‌ నేతలపైనే భారం వేశాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా 83 ఏళ్ల వీరభద్రసింగ్‌...బిజెపి సిఎం అభ్యర్థిగా 73 ఏళ్ల ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌లు ఢీ అంటే ఢీ అంటున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరడంతో ప్రచారం ఊపందుకుంది. 

చెన్నైకి వాతావరణ హెచ్చరిక...

తమిళనాడు : రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

కమల్ కు బెదిరింపులు...

ముంబై : దేశంలో 'హిందూ ఉగ్రవాదం'ఉందంటూ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్‌ను చంపేస్తామని హిందూ మహాసభ బెదిరించింది. హిందువులకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే సహించేది లేదని ఆ సంస్థ హెచ్చరించింది. 

21:20 - November 4, 2017

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల నుండే భక్తులు శివునికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. నాచారంలోని మహంకాళీ సహిత మహా కాళేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించారు.

మేడ్చల్‌ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నగర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

నల్లగొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కార్తీక పూజలు నిర్వహించారు. జిల్లాలోని వాడపల్లిలో ఉదయం నుండే భక్తుల కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. పౌర్ణమికి ఒకరోజు ముందుగానే కొండకు చేరుకున్న భక్తులు ఉదయాన్నే విష్ణుపుష్కరినిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో నారసింహుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయంలో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో గోదావరి నదికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం నరసింహ స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించి దీపదానాలు చేసి దీపాలు నదిలో వదలడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. పట్టణంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ కొనసాగింది. మహిళలు గోదుమ పిండితో తయారు చేసిన ప్రమిదలతో దీపాలను వెలిగించి స్వామివారిని కొలిచారు.

కృష్ణా జిల్లా, మచిలీపట్నం మంగినపూడి బీచ్ కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రుడికి హారతి ఇచ్చి సముద్ర స్నానాలను న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. విజయవాడ పవిత్ర కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఉభయ గోదావరి జిల్లాలో కార్తీక శోభ సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ చక్రసహిత జగన్మాత కనకదుర్గాదేవి ఆలయంలో లక్ష దీపోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు కార్తీక దామోదరుడిని స్మరిస్తూ దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. పాలకొల్లులోని రామలింగేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం కోటిపల్లిలో శ్రీఛాయ సోమేశ్వర స్వామి ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించారు. గోదావరి తీరాన సంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

గుంటూరు జిల్లా నరసరావు పేటలోని కోటప్పకొండ ఆలయంలో శివనామస్మరణతో మారుమ్రోగింది. త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై కోటి దీపోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో సముద్ర స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సముద్రతీరంలో ఇసుకతో శివలింగ ప్రతిమలు చేసి కార్తీక జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆయా ప్రాంతాలన్నీ భక్త జనంతో కిక్కిరిసి పోయాయి. కార్తీక పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శివనామస్మరణతో భక్తి పారవశ్యన్ని చాటుకున్నారు. 

21:16 - November 4, 2017

గుంటూరు : ధృఢ సంకల్పంతో పనిచేసి మూడున్నర సంవత్సరాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ ప్రగతి సాధించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. చదువుల పేరుతో విద్యార్ధులను ఒత్తిడికి గురి చేయవద్దని కార్పొరేట్ స్కూళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని పేరేచర్ల అడవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన నగర వనాన్ని జిల్లా ప్రజలకు చంద్రబాబు అంకితం చేశారు.

ధృఢ సంకల్పంతో పనిచేసి మూడున్నర సంవత్సరాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ ప్రగతి సాధించామన్నారు ఏపీసీఎం చంద్రబాబు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రక‌టించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఏటా 25 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మలచుకోవాలన్నారు.

చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్తీక వనభోజనాలు కులాలకే పరిమితం చేయొద్దని, అన్ని కులాలు, మతాలు కలిసి సంయుక్తంగా కార్తీక వనభోజనాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నగర వనాన్ని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు సరదాగా సైకిల్ తొక్కారు. మంత్రులతో కలిసి నగర వనంలోనే కార్తీక వన భోజనం చేశారు. 

21:15 - November 4, 2017

హైదరాబాద్ : ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. సుమారు 1,250 కోట్ల రూపాయల విలువైన 11 ఒప్పందాలపై మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ సంతకాలు చేశారు. రెండు రోజుల్లో కుదిరిన 13 ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి 7,250 కోట్లు పెట్టుబడులు రానున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో 11 ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరుపున పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రముఖ స్నాక్స్ కంపెనీలు, ఫుడ్ కంపెనీలు.. బికనీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ ప్రొడక్ట్స్, కనోరియా గ్రూప్‌కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బేకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీంలైన్‌డెయిరీ, పుష్ప ఫుడ్స్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో జరిగిన ఒప్పందాల ద్వారా 3800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని మంత్రి కేటీఆర్‌ సంస్థలకు వివరించారు. రెండు రోజుల్లో కుదిరిన 13 ఒప్పందాల ద్వారా సుమారు రూ.7250 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆహార పరిశ్రమలతో జరిగిన ఒప్పందాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వస్తాయని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థికంగా రైతుల మీద ఆధారపడుతుందని, ఇలాంటి దేశంలో ఆహార పరిశ్రమల వల్ల రైతులు లాభపడేలా చూడాలన్నారు. తెలంగాణలో రైతుల ఏడాది సగటు ఆదాయం లక్షా 28 వేలు ఉన్నదని, మరో ఐదేళ్లలో దాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. జహీరాబాద్‌లో 6,000 కోట్ల పెట్టుబడులతో సమీకృత ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుచేసేందుకు దక్షిణ్ ఆగ్రోపొలిస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. దీనిద్వారా 5,000 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండటం పట్ల అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న కారును అదుపుతప్పిన కారు ఢీకొంది. ఓ కారును సినీ నటుడు రాజశేఖర్ కూతురు నడుపుతున్నట్లు తెలుస్తోంది. 

20:58 - November 4, 2017

ఆరోగ్యం వేరు..రోగం వేరు..కానీ దేశంలో ప్రజారోగ్యం ఎలా ఉందంటే రోగం రాకుండా చేసుకునే చర్యలు లేవని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డా.వి.బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య రంగం ఎలా ఉంది ? వైద్యుల పరిస్థితి..ఇతరత్రా అంశాలపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఉచిత వైద్యం సాధ్యం కాదనే మాట కరెక్టు కాదని, పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉచిత వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పన్నులు కట్టించుకుంటున్నారు కదా ? అని ప్రశ్నించారు. ఎవడికి రోగం వస్తే వాడే బాగు చేసుకోవాలనే పరిస్థితి ఏర్పరిచారని, చూడటానికి అందంగా ఉంటుంది..కానీ చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రైవేటుపై ప్రభుత్వాలకు ప్రేమగా ఉంటుందని..కార్పొరేట్ శక్తులకు లక్షలు..కోట్ల రాయితీలు ఇస్తారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు శిక్షణ ఇచ్చింది గాంధీ..ఉస్మానియాలేనన్నారు.

వైద్యులు ఉంటే సరిపోదని..సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగా పనిచేస్తారని, గాంధీ..ఉస్మానియాలో నైపుణ్యమైన వైద్యులున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో జీఎస్టీ ద్వారా డబ్బులు తీసుకుంటే ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు ఉత్నన్నమౌతాయన్నారు. కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ఆ డబ్బులు ఎలా వస్తుందనే ఆలోచన వస్తుందని, ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రజలదే కదా అన్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన తరువాత 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలని, కానీ వాస్తవానికి పరీక్షలు చేస్తే ఒక వైద్యుడికి ఇంజక్షన్ ఇవ్వడం తప్ప తప్ప ఇంకేమీ రాదన్నారు. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు ప్రజలతో ఎలా మెలగాలనే దానిపై శిక్షణ ఉండాలని సూచించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

రుణమాఫీలో వడ్డీమాఫీ జరుగలేదు - వీహెచ్..

హైదరాబాద్ : సిద్ధిపేట, గజ్వేల్ రైతులతో కలిసి మీడియాతో టి.కాంగ్రెస్ నేత వీహెచ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా రుణమాఫీలో వడ్డీమాఫీ జరుగలేదని పేర్కొన్నారు. 

తహశీల్దార్ ఆఫీసుపై ఏసీబీ దాడి..

కర్నూలు : తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి జరిపింది. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ. 5వేలు తీసుకుంటున్న పూడూరు వీఆర్వో వెంకటేశర్లును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

20:09 - November 4, 2017

అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారూ..రైతులు ఎందుకు అగ్వకు అమ్ముకోవాలె పంట..? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటే..? అయ్యో మా దొర ఎందుకు సావాలె అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటె..మూడున్నరేండ్లు జోల గుర్కవెట్టిన పెద్దమన్షి.. నిమ్మలంగ నిద్రలేశి ఏమాయేరా గంత గలీజు జేశిండ్రు పంచాయతీరాజ్ వ్యవస్థను అన్నడట..కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు.. కోటి దర్శనాలు.. అధికారం కోసమే అనిపిస్తున్నది జగనాలును జూస్తుంటే..తెలంగాణల కాంగ్రెస్ పార్టీ బలమైతున్నదా..? నిన్నియాళ్ల యవ్వారం జూస్తుంటె అనిపిస్తున్నది..తెలంగాణల పనిజేస్తున్న సర్కారు బడి సార్లు జర మీరు ఒళ్లు దగ్గర వెట్టుకోని పనిజేయుండ్రి టీఆర్ఎస్ పార్టోళ్లు ఎవ్వలన్న వచ్చి గీ పనిజేయిమని అడ్గంగనే చేశి పెట్టుండి లేకపోతె చెంపలు వలగొడ్తరు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలు తీరుస్తున్నదిగని.. పోలీసోళ్ల కష్టాలు తీర్సుడు మర్శిపోయినట్టుంది.. గీ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:07 - November 4, 2017

తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటే..? అయ్యో మా దొర ఎందుకు సావాలె అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటె మా మీదనే బైలుకు వోతున్నడు మా దొర.. అందుకే ఇగ బత్కి దండుగ అని సెల్ టవర్ మీదికి ఎక్కిండు మానకొండూరు నియోజకవర్గంల ఒక రైతు.. మాదిగోళ్ల పిలగాడు మంచోడని రసమయిని గెలిపిస్తె.. దొరకు ఊడిగం జేస్తున్నడు గని మమ్ములను వట్టిచ్చుకుంటలేడంటున్నడు..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

19:31 - November 4, 2017
19:30 - November 4, 2017

జగిత్యాల : జిల్లాలో ఓ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఓ బాలుడిని కాపాడబోయిన ఓ వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. తనకళ్లెదుటే తన భర్త నీట మునిగిపోతుండడంతో నీటిలోకి దిగిన ఈమెను మరో వ్యక్తి కాపాడాడు. ఈ విషాద ఘటన కోరుట్లలో చోటు చేసుకుంది. ఐలాపూర్ గ్రామం నుండి వీరకుమార్..జ్యోతి దంపతులు కోరుట్లకు వెళుతున్నారు. కోరుట్ల రైల్వే ట్రాక్ వద్ద ఏర్పడిన నీటి కుంటలో ఓ బాలుడు పడిపోయి ఉండడం వీర కుమార్ గమనించాడు. వెంటనే బైక్ ఆపి ఆ బాలుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ నీటి కుంట లోతుగా ఉండడంతో అందులో వీర కుమార్ పడిపోయాడు. భర్తను రక్షించే ప్రయత్నంలో జ్యోతి కూడా నీటి కుంటలో పడిపోయింది. ఆ సమయంలో అటువైపు వెళుతున్న మరో వ్యక్తి బాలుడిని..జ్యోతిని కాపాడాడు. రోడ్డుపై వెళుతున్న మరో వ్యక్తి జ్యోతి..కుమారుడిని కాపాడాడు. కానీ వీరకుమార్ మాత్రం ఆచూకీ కనుగోలేక పోయారు. సమాచారం తెలుసుకున్న గజఈతగాళ్లు వీరకుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. భర్త మృతదేహాన్ని చూసి జ్యోతి కన్నీళ్లపర్యంతమవుతోంది. సమీపంలో ఉన్న నివాసాల నుండి మురుగునీటితో ఇక్కడ కుంటగా ఏర్పడిందని తెలుస్తోంది. ఇటీవలే ఇక్కడ పనులు నిర్వహించిన ఓ కాంట్రాక్టర్ ఇందులో నుండి మట్టిని తీయడంతో లోతు ఎక్కువైందని సమాచారం.

జనసేన..పార్టీ సమన్వయకర్తల నియామకం..

విజయవాడ : పార్టీ సమన్వయకర్తల నియామకానికి జనసేన సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 43 పార్లమెంట్ నియోజకవర్గాలకు 840 మందిని పవన్ నియమించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 20 మంది సమన్వయకర్తలు ఉండనున్నారు. ఈనెల 6 నుండి సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియ జరుగనుంది. డిసెంబర్ 7వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

18:31 - November 4, 2017

కర్నూలు : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు నవంబర్‌ 9 నుండి 11 వరకు ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తుందంటున్న కార్మిక సంఘాల నాయకులతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:30 - November 4, 2017

విజయవాడ : ఏపీ పర్యాటక రంగానికి పెట్టుబడుల కోసం రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆ శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ లండన్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. లండన్‌లో వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో ఎపీ తరపున స్టాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు అఖిలప్రియ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అదే విధంగా విదేశాల్లో పర్యటించే తెలుగు వారికి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

లండన్ పర్యటనలో టూరిజం, హోటల్..ఈవెంట్ మేనేజ్ మెంట్..అడ్వర్ టైజ్ మెంట్స్ కు సంబంధించిన వారితో చర్చలు జరుపడం జరుగుతుందన్నారు. విదేశీ పర్యటకులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో పర్యటించే తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి..అక్కడున్న అధికారికి విషయం తెలియచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

18:27 - November 4, 2017

నెల్లూరు : జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆదేశించారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరాలు, సీజనల్ వ్యాధులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు తగ్గేవరకు డాక్టర్లు సెలవును రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్యూటీ సమయంలో చాలా చోట్ల డాక్టర్లు ఆస్పత్రుల్లో ఉండటం లేదన్న ఆరోపణలు ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ అటెన్డెన్స్‌ వేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్‌ వేయకపోతే సూపరింటెండ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

18:26 - November 4, 2017

గుంటూరు : అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని పేరేచర్ల అడవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన నగర వనాన్ని జిల్లా ప్రజలకు చంద్రబాబు అంకితం చేశారు. చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. కార్తీక వనభోజనాలు కులాలకే పరిమితం చేయొద్దని, అన్ని కులాలు, మతాలు కలిసి సంయుక్తంగా కార్తీక వనభోజనాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

18:24 - November 4, 2017

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో.. ఏపీ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్‌ పాదయాత్రపై అధికారపార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పనిలో పనిగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాయ్‌కాట్‌ చేయడం వల్లే వైసీపీ నేతలు చేజారిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో...ఏపీలో పొలిటికల్‌ టెంపరేచర్‌ పీక్‌ స్టేజికి చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరుపార్టీల నేతలు మాటలతోనే మంటపుట్టిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రను సక్సెస్‌ చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతుంటే..అధికార పార్టీ నేతలు ఫ్యాన్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. జగన్‌ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

జగన్‌ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఇంకా మరికొందరు ఉన్నారని చెబుతున్నారు. రాజమండ్రిలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. పాదయాత్ర ఎవరు చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం ఇష్టం లేకనే ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి తీసుకోవడం లేదన్నారు.

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వర్లరామయ్య... జగన్‌మోహన్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్‌ ఎంతమంది దేవుళ్లకి మొక్కినా.. జైలు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమదంలో ఇంటిఇంటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చెలమలశెట్టి రామాంజనేయులు.. జగన్‌పై ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని..రాష్ట్రానికి ఓ శనిగ్రహంలా తయారయ్యారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం జగన్‌ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మరోవైపు అధికార పార్టీ విమర్శలను ప్రతిపక్ష నేతలు తిప్పికొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ పాదయాత్రపై కుట్రలు చేయడం మానుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్‌కు ఉందన్నారు. ప్రజా సమస్యలు తెలుకోవడానికి చేపడుతున్న పాదయాత్ర కోసం పోలీసుల అనుమతి ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేసినప్పుడు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి ముందే..టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

18:22 - November 4, 2017

విజయవాడ :జగన్ పాదయాత్రకు ముందే వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాజేశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వరి వైసీపీ వీడటంతో ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య 22కి చేరింది. ఓవైపు వైసీపీ అధినేత వైస్.జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తలిగింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆమెను టీడీపీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరినట్లు రాజేశ్వరి చెప్పారు. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గమని.. అభివృద్ధిలో వెనుకబడిందని అధికారపార్టీలో ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే వైసీపీని వీడినట్లు రాజేశ్వరి చెప్పారు. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించడం సరైన నిర్ణయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి అనేకమంది పార్టీలో చేరుతున్నారన్నారు ఆ పార్టీ నేత వర్ల రామయ్య. తాము ఎవరినీ పార్టీలోకి రావాలని ఒత్తిడి చేయడం లేదని ఆయన చెప్పారు. ఎవరు వచ్చినా కాదనబోమన్నారు వర్ల రామయ్య. రాజేశ్వరితో పాటు మరికొంత మంది నేతలు పార్టీ వీడుతారన్న వార్తలపై జోరుగా చర్చజరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 

918 కిలోల కిచిడీ..

ఢిల్లీ : ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఆధ్వర్యంలో 918 కిలోల కిచిడీ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. దేశ రాజధానిలోని వరల్డ్ ఫుడ్ ఇండియ ఎగ్జిబీషన్ లో దీనిని ప్రదర్శించారు. ఈ కిచిడీని అనాథ పిల్లలకు పంచారు. 

నవీన్ గౌడ్ ను విచారిస్తున్నాం - ఏసీపీ..

హైదరాబాద్ : నవీన్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, పలు విషయాలపై నవీన్ గౌడ్ ను విచారిస్తున్నట్లు మల్కాజ్ గిరి ఏసీపీ సందీప్ రావు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెల్లడించారని, మరికొన్ని టెక్నికల్ అంశాలపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. 

నవీన్ గౌడ్ అరెస్టు...

హైదరాబాద్ : నారాయణ కాలేజీ వైస్ ప్రిన్స్ పాల్ నవీన్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రామంతాపూర్ బ్రాంచ్ నారాయణ కాలేజీ ప్రిన్స్ పాల్ సరితా అగర్వాల్ ఫిర్యాదుతో నవీన్ గౌడ్ ను అరెస్టు చేశారు. బ్లాక్ మెయిల్..అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. 

పీఎస్ పై ఉగ్ర దాడి..

జమ్మూ కాశ్మీర్ : రాజ్ పౌరా పీఎస్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. 

ఏపీ డీజీపీగా...

విజయవాడ : ఏపీ డీజీపీగా సాంబశివరావునే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఎస్పీ, డీజీపీ ప్యానెల్ లిస్ట్ వెనక్కి పంపడంతో మరోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది. ఏడాది లోపు రిటైర్ అవుతున్న వారికి అవకాశం ఇవ్వొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదని ప్రభుత్వం పేర్కొంటోంది. 15 నెలలుగా ఇన్ చార్జీ డీజీపీగా సాంబశివరావు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇన్ ఛార్జీ డీజీపీగా సాంబశివరావుకు రిటైర్ మెంట్ ఇవ్వడం సరైన విధానం కాదని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. 

17:36 - November 4, 2017
17:33 - November 4, 2017

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం...ఈ పేరు ఒకప్పుడు విన్పించేది కాదు...కాని ఎన్నో అరాచకాలు జరిగేవి...ఎన్‌కౌంటర్‌లో నయీం హతమైనా అనుచరులు మాత్రం గ్యాంగ్‌ను కొనసాగిస్తున్నారా..?? నయీం అనుచరులు జైళ్లో ఉన్నా వారి అనుచరులతో సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి...అయితే ఈ దందాలో కొందరు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైనా...అనుచరుల అరాచకాలకు మాత్రం కళ్లెం పడలేదు..కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అనుచరులు మళ్లీ చెలరేగుతున్నారు...నయీం కేసులో పీడీ యాక్ట్‌లో అరెస్టు అయి ప్రస్తుతం వరంగల్‌ జైళ్లో ఉన్న ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ నాలుగు గోడల మధ్య నుంచే సెటిల్మెంట్‌లకు పాల్పడుతున్నాడు..ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గ్యాంగ్‌స్టర్ నయీం పేరు మళ్లీ వినబడింది... పాశం శ్రీనుకు పోలీసుల నుంచి కూడా సహకారం అందుతోందని బాధితులు చెప్పడంతో ఉన్నతాధికారులు ఆదిశగా విచారణ చేశారు.

జైలు నుంచి కోర్టుకు తరలించే దారిలో దాబా హోటళ్ల వద్ద భోజనాలకని ఆపి భూ సెటిల్మెంట్‌లకు పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు...అయితే దీన్ని నిరోధించాల్సిన పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని...ఇదంతా అతని వెంట ఉన్న పోలీసుల ముందే జరుగుతుందని బాధితులు చెప్పారు...ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు యాక్షన్‌లోకి దిగారు. నయీం అనుచరుల బెదిరింపుల ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన అధికారులకు వాస్తవాలు తెలియడంతో భువనగిరి మూడో వార్డు కౌన్సిలర్ పాశం అమర్‌తో పాటు మరో నలుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు సహకరించిన ఇద్దరు ఏఎస్‌ఐలతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై ఉన్నతాదికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

17:27 - November 4, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై వైరల్‌ అవుతున్న ఆడియో అంతా అబద్దమన్నారు రామాంతాపూర్‌ ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌. ఆడియోలో ఉన్న వాయిస్‌ తనేదనన్నారు. అయితే... తనను కొంతమంది బెదిరించి... వారి రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదివించారని టెన్ టివికి తెలిపారు. ఇంకా మరెన్నో విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:25 - November 4, 2017

ఖమ్మం : చెమట చుక్క చిందించకుండా డబ్బులు సంపాదించాలి. ఖద్దర్‌ చొక్కా ఇస్త్రీ నలగకుండా కోట్లు కూడబెట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోనే..ఓ మంత్రి అనుచరులు ఆదివాసి భూములపై కన్నేశారు. అసైన్డ్‌ భూములను అప్పనంగా దోచేశారు. అంగబలం, అర్థబలంతో భూములను హస్తగతం చేసుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో జోగడంతో తమకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిన అక్రమార్కులపై 10టీవీ స్పెషల్ రిపోర్ట్. పవర్‌లో మనపార్టే ఉందన్న తెగింపుతో రెచ్చిపోయారు. మమ్మల్ని కదిలించేదెవరన్న ధైర్యంతో విజృంభించారు. మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారపార్టీ నేతలు భూదోపిడికి పాల్పడ్డారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని చెలరేగిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3500 ఎకరాల భూమిని కొట్టేశారు. నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూడటంతో..వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీల భూమిని గద్దల్లా తన్నుకుపోయిన అధికార పార్టీ నేతల భూభాగోతం బయటపడింది. దమ్మపేట మండలం నల్లకుంట గ్రామంలో సర్వే నంబర్‌ 273-1, జేఎం బంజర గ్రామంలో సర్వే నంబర్ 884-1, లింగాల పల్లిలో 148-1 అనుబంధ సర్వే నంబర్లలో 3 వేల 500 ఎకరాల భూమిని స్వాహా చేసిన తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అసైన్డ్‌ భూముల్ని మాయంచేయడంలో వారు చూపించిన చాతుర్యం చూస్తే ఔరా అనిపించక తప్పదు.

3500 ఎకరాల భూములను...800 ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలివ్వడంతో..1976 నుండి 1998 వరకు సాగుచేస్తూ జీవనం సాగించారు. పెట్టుబడులు లేక వ్యవసాయం చేయలేని దుర్భర పరిస్థితిల్లో ఆదివాసీలు తమ భూములను ఆదివాసేతరులకు కౌలుకిచ్చారు. మనుగడకోసం వారు వేసిన అడుగులే..వారి పాలిటశాపంగా మారాయి. మొదట్లో నామ మాత్రపు కౌలును చెల్లించిన ఆదివాసేతరులు..అడవిబిడ్డల అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వేలిముద్రలు తీసుకొని తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ మూడు గ్రామాలకు చెందిన భూములను అక్రమార్కులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా పేర్కొంటూ దమ్మపేట మండల రెవెన్యూ అధికారులు 167 ఎన్‌ఓసీ జారీ చేయడంతో...సత్తుపల్లి రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. 1998 నుంచి 2014 వరకు రిజిస్ట్రేషన్ల తంతు యద్ధేచ్ఛగా కొనసాగింది. సుమారు 350 కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసిన వైనం...ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ఆదివాసీలు.. కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా..వారికి చుక్కెదురైంది. ఇదేంటని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

వాస్తవానికి అసైన్డ్‌ భూములు కొనడం, అమ్మడం నేరమని అసైన్డ్‌మెంట్‌ చట్టం స్పష్టం చేస్తోంది. దళితులు, ఆదివాసీల వద్ద ఈ భూములు కొన్నా అవి చెల్లవు. ఒకవేళ కొనుగోళ్లు జరిగినా వాటిని రద్దు చేసి తిరిగి బాధితులకు అప్పగించే అధికారం రెవెన్యూ చట్టం కల్పించింది. అయినప్పటికీ దమ్మపేట మండల అసైన్డ్‌ భూముల విషయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు నీళ్లు నములుతున్నారు. మరోవైపు తమ భూములు అప్పగించాలని కోరుతూ కొందరు బాధితులు జాతీయ ST కమిషన్‌ను ఆశ్రయించారు.

ఇవేకాదు గతంలో తెలంగాణలో పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు ఇప్పుడు పేదల చేతుల్లో లేవు. అయితే జిల్లాల వారీగా అసైన్డ్‌ భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలని సీఎం కేసీఆర్ ఇటీవల కలెక్టర్లను ఆదేశించారు. దీంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన భూదోపిడిని అధికారులు బయటపెడతారో, లేక ఆదివాసీలే అనుభవిస్తున్నారని నివేదిక ఇస్తారో చూడాలి. 

17:22 - November 4, 2017

హైదరాబాద్ : కొత్త సెక్రటేరియెట్‌ నిర్మాణంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేసీఆర్‌లో మార్పు రావడంలేదన్నారు. మూడున్నర సంవత్సరాలలో కేసీఆర్‌ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ విధానాలపై తిరగబడే సమయం ఆసన్నమైందని వీహెచ్‌ అన్నారు. 

17:20 - November 4, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో 13 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి సుమారు 7250 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆహార పరిశ్రమలతో జరిగిన ఒప్పందాల పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థికంగా రైతుల మీద ఆధారపడుతుందని, ఇలాంటి దేశంలో ఆహార పరిశ్రమల వల్ల రైతులు లాభపడేలా చూడాలన్నారు. తెలంగాణలో రైతుల ఏడాది సగటు ఆదాయం లక్షా 28 వేలు ఉన్నదని, మరో ఐదేళ్లలో దాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. 

సీఐ లింగయ్యను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్: సరూర్ నగర్ సీఐ లింగయ్య హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారన్న ఆరోపణలపై విచారణాధికారి డీసీపీ ప్రకాశ్ రెడ్డి ని నియమించారు. సీఐ లింగయ్యనుసీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.

16:09 - November 4, 2017

కర్నూలు తహశీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి

కర్నూలు: తహశీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ పూడూరు వీఆర్వో వెంకటేశ్వర్లు పట్టుబడ్డాడు.

15:36 - November 4, 2017
15:35 - November 4, 2017

ముంబై : ప్రముఖ బ్యాడ్మింటెన్ పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తనతో ఓ విమానాశ్రయం గ్రౌండ్ స్టాప్ లోని ఓ వ్యక్తి తనతో అనాగరికంగా ప్రవర్తించాడని సింధు తన ఆవేదన వ్యక్తం చేసింది. సింధు చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. సింధు పేరు తెలియని వారుండరు. రియో ఓలింపిక్ విజేత..హైదరాబాద్ స్టార్ షట్లర్ అయిన పీవీ సింధు ఎన్నో విజయాలు..అవార్డులను సొంతం చేసుకుంది. శనివారం ముంబైకి ఆమె బయలుదేరింది. 6ఈ 608 విమానంలో ప్రయాణిస్తోంది. విమాన సిబ్బందిలోని అజితేశ్ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. గ్రౌండ్‌ స్టాఫ్‌ మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో కానీ నాతో సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఖ్యాతి దెబ్బతింటుంది' అని ఆమె పేర్కొంది. 
''చెప్పడానికి చాలా బాధకరంగా ఉంది. ఇవాళ 6ఈ 608 విమానంలో ముంబైకి బయలుదేరడానికి వెళ్లిన తనకు.. గ్రౌండ్‌ స్టాఫ్‌ అజితేష్‌ నుంచి చేదు అనుభవం ఎదురైంది'' అని మొదటి ట్వీట్‌లో చెప్పారు. మరో పోస్టులో '' అజితేష్‌ చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్‌ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించినా...ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్‌ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి'' అని తెలిపారు. అషిమాతో మాట్లాడితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. 

సింధు ట్వీట్ పై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్..
పీవీ సింధు చేసిన ట్వీట్స్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం స్పందించింది. ఏదైనా ఉంటే తమతో తెలియచేయాలని..అమర్యాదగా ప్రవర్తిసే అతడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరి సింధు చేసిన ట్వీట్స్ ఎలాంటి దుమారం రేపుతుందో చూడాలి. 

సింధు ఆరోపణలపై స్పందించిన ఇండిగో యాజమాన్యం

హైదరాబాద్: పీవీ సింధు చేసిన ఆరోపణలపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. సింధు పట్ల తమ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. అధిక లగేజీతో సింధు ప్రయాణానికి సిద్దమయ్యారని, అధిక లగేజీని కార్గోలోకి మారుస్తామని చెప్పాని, అందుకు ఆమె అంగీకరిలచలేదని, చాలాసార్లు కోరిన తర్వాత లగేజీని కోర్గోలోకి మార్చేందుకు అంగీకరించారని ఇండిగో యాజమాన్యం తెలిపింది.

15:33 - November 4, 2017
  1. అవును ఇది నిజం వేయ్యి కోట్లతో ఓ పౌరాణిక చిత్రన్ని తెరకెక్కబోతుందట. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండమూళం'', ఎప్పుడు తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసే మల్లూవుడ్ ప్రస్తుతం వారి పద్దతికి భిన్నంగా నడుస్తోంది. తమిళ ప్రమఖ హీరో మోహన్ లాల్ హీరోగా రండామూళం అనే రూ.1000కోట్ల బడ్జెట్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షో టైమ్ ఐదు గంటల 20 నిమిషాలట అందుకే బాహుబలి తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రన్ని తెరకెక్కించనున్నారు. యమ్.టి వాసుదేవ నాయర్ రచించిన రండామూళం అనే నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించబోతున్నారట. చూద్దాం ఇంత బడ్జెట్ సినిమా పట్టలెక్కుతుందో....? లేదో...?

జలసౌధలో కృష్ణా నదీ యాజమన్యా బోర్డు సమావేశం

హైదరాబాద్: జలసౌధలో కృష్ణా నదీ యాజమన్యా బోర్డు సమావేశం జరుగుతోంది. ఛైర్మన్ శ్రీవాస్తవ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది.

ఇండిగో విమానంలో పీవీ సింధుకు చేదు అనుభవం

హైదరాబాద్: ఇండిగో విమానంలో ముంబైకు వెళ్తున్న పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైదని ట్విట్టర్ ద్వారా తెలిపింది. గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది అజితేష్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని సింధు ఆరోపిస్తోంది. ఈ విషయంలో వారించిన ఎయిర్ హెస్టెస్ పట్ల కూడా అజితేష్ దురుసుగా ప్రవర్శించాడని తెలిపింది. ఇలాంటి సిబ్బంది వల్ల ఇండిగోకు చెడ్డపేరు వస్తుందని సింధు ఆవేదన వ్యక్తం చేసింది.

15:23 - November 4, 2017

రష్యా : పోర్న్ స్టార్ అధ్యక్ష పదవికి పోటీ చేయడమేంటి అని అనుకుంటున్నారా అవును ఇది నిజం. రష్యన్ పోర్న్ స్టార్ ఎలెనా డెర్కొవా రష్య అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రచారం కోసం ఆమె సోషల్ నెటవర్క్ ఇన్ స్టాగ్రామ్ ను వేదిగా చేసుకున్నారు.ఎలెనా రష్యలోని ముర్ మనుస్క్ పట్టణానికి చెందినవారు. తాను అధ్యక్ష పదవి చేపడితే సెక్స్ వల్ హరాస్ మెంట్ కు ఉరిశిక్ష విధించేలా చట్టం తీసుకుస్తానని ఆమె పేర్కొన్నారు. మొన్న ఈ మధ్యే అమెరికా పోర్న్ స్టార్ మియామి కలీఫా కూడా పోర్న్ వీడియోలు వదిలేసి యాంకర్ గా మారింది. సన్నీ లియోన్ యాక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.....ఎవరైనా తప్పు తెలుసుకుని ఓప్పువైపు రావాల్సిందే.... 

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వనంమనం కార్యక్రమం

ప.గో: కార్తీక వన మహోత్సవాల్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వనంమనం కార్యక్రమం జరిగింది. సామర్లకోట మండలం తడికలపూడిలో వనంమనం కార్యక్రమంలో మంత్రి పితాని, ఎమ్మెల్యే పీతల సుజాత పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాట్ల పై మంత్రి పితాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరు పై మండిపడ్డారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేట్ కార్యక్రమం చేసుకుంటామని వెల్లడించారు.

సీఎం చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

తిరుపతి: సీఎం చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాబు జాబ్ ఎక్కడా అంటూ సీఎంను నిలదీసేందుకు ఎస్ ఎఫ్ఐ. డీవైఎఫ్ ఐ నేతలు బయలుదేరారు. లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

14:47 - November 4, 2017
14:25 - November 4, 2017

తూర్పుగోదావరి : మరోసారి సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను అమలు చేయాలని కోరుతున్న వారిపై మరోసారి పోలీసులు విరుచకపడ్డారు. కాకినాడ సెజ్ లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులు..సీపీఎం నేతలను ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలను అమలు చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. మరోవైపు జీఎంఆర్ యాజమాన్య సంస్థ పొలాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకొంటోంది. రెండు రోజులుగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలంటూ పలువురు రహదారిపై బైఠాయించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

14:22 - November 4, 2017

తాజాగా విడుదలైన ఎన్టీఆర్ సినిమా జై లవ కుశ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయం తర్వాత ఎన్టీఆర్ వెంటనే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పారు. వెంటనే ఆ చిత్రనిక కొబ్బరికాయ కూడా కొట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ఇంక రెండు నెలల సమయంలో ఉండడంతో ఎన్టీఆర్ కొన్ని కథలు విట్టున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయనను ఓ హిట్ డైరెక్టర్ తో సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ ఓ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. 

14:08 - November 4, 2017

 

చెన్నై : నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూకు శుక్రవారం ఆపరేషన్ అయింది. ఆమె గత కొంత కాలంగా కడుపులో కణతిదో బాధపడుతున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో ఖుష్బూకు జరిగిన శస్త్రచికిత్సలో ఆమె కడుపులో ఉన్న కణతిని తొలగించినట్టు డాక్టర్లు తెలిపారు. ఇది సాధారణ అందరి ఉండే సమస్య అని కణతి తొలగించిన తర్వాత ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాదని. ఆమె త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు ప్రకటించారు.   

13:49 - November 4, 2017

నల్గొండ : టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్ట్ స్టోరేజీ వాటర్‌తో ముంపునకు గురవుతోన్న నిర్వాసితులు నానాయాతన పడుతున్నారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందక.. పునరావాసం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, చిట్యాల, నడిగడ్డ గ్రామస్థులు తమ ఇళ్ల కప్పులపై వంట చేసి నిరసన తెలిపారు. 
నిరసనలో పాల్గొన్న 400 మంది గ్రామస్తులు 
టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ నిర్వాసితుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. చట్టూ నీరు నిండుతున్నా పునరావాస పరిహారానికి నోచుకోక నల్లగొండ జిల్లా, అడవిదేవుల పల్లి మండలం, చిట్యాల, నడిగడ్డ ప్రజలు నానాయాతన పడుతున్నారు. దీంతో తమ ఇళ్ల కప్పులపై వంట చేసి నిరసన తెలిపారు. సుమారు 400 మంది గ్రామస్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న జూలకంటి రంగారెడ్డి గ్రామానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి వారు కిందకి దిగేలా ఒప్పించారు. 
ఆవేదనను చెప్పుకున్న గ్రామస్తులు 
చుట్టూ చేరిన నదీ నీటి నుంచి ఎప్పుడు మొసళ్లొస్తాయో.. పాములు వస్తాయో అని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గతంలో పలుసార్లు మొసళ్లు గ్రామం మధ్యలో ప్రత్యక్షమవడం గ్రామస్థులు మరచిపోలేకపోతున్నారు. చిట్యాల గ్రామంలోకి టెయిల్ పాండ్ స్టోరేజీ వాటర్‌ వచ్చింది. దీంతో ఇళ్లలో ఉండలేక.. వేరే గత్యంతరం లేక గ్రామస్తులు ఇంటి పై కప్పులపై వంట చేస్తున్నారు. ఇకపై ఇళ్ల మీదే నివాసముంటామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి తమ ఆవేదనను చెప్పుకున్నారు. 
పాములు, విష పురుగులతో ప్రాణాపాయం 
గ్రామం చుట్టూ నీళ్లు చేరడంతో విష పురుగులు వస్తున్నాయి. పొలాల్లో పత్తి, మిర్చి, కంది పండించినా వాటిని ఇంటికి తెచ్చుకోలేని దుస్థితి ఉందని చెబుతున్నారు. గ్రామాల్లోని కొన్ని ఇళ్లల్లో నీరు చేరడం వల్ల ఎక్కడ నివసించాలో తెలియక ఇంటి కప్పుపైనే జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం చిన్నారి దేవరకొండ జశ్వంత్‌ పాముకాటుకు గురి కావడంతో.. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తమకు వేరే ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేయాలని.. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జూలకంటి రంగారెడ్డిని కోరారు. 
నిర్వాసితుల తరపున సీపీఎం పోరాటాలు : జూలకంటి
జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చిట్యాల, నడిగడ్డ గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్‌ ప్యాకేజీ కింద కొంతమందికే పరిహారం చెల్లించారని చెప్పారు. జెన్‌ కో సర్వేలో భూములు కోల్పోయిన కొంతమందికి ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతులకు నష్ట పరిహారం, ఇంటికో ఉద్యోగం వచ్చేలా అందరం కలిసి పోరాడదామని గ్రామస్థులకు హామీనిచ్చారు. నిర్వాసితుల తరపున సీపీఎం ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఏదేమైనా వీళ్లు ఎన్నో కష్టాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:43 - November 4, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థలలో అక్రమాలపై ఆడియో టేప్‌ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఆడియో టేపు ఆధారంగా ఉప్పల్‌ పీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రామంతాపూర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్‌గౌడ్‌ తనను బెదిరించి వాయిస్‌ రికార్డ్‌ చేయించాడని.. ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. సిరిసిల్లలో పోలీసులు నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కోర్టులో నవీన్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నారాయణ కాలేజీ అక్రమాలపై సిట్ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. నారాయణ కాలేజీ అక్రమాలపై ఆడియో టేప్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలన్నారు.

13:36 - November 4, 2017

హైదరాబాద్ : న్యూస్ చానల్స్‌లో వస్తున్న వీడియో తనది కాదని.. సరూర్‌నగర్‌ సీఐ లింగయ్య వివరణ ఇచ్చారు. అంత పర్సనాలిటీ తనకు లేదని, పైగా మద్యం తీసుకోనని చెప్పాడు. సిబ్బందిని ఎప్పుడూ తన వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకోనని.. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీడియాలో వస్తోన్న కథనాలను సీఐ లింగయ్య ఖండించారు. అంతేకాకుండా హోంగార్డు సైదానాయక్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు నెలలు విశ్రాంతిలో ఉన్నారని తెలిపారు. 

అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: అర్బన్ మొబిలిటీ ఇండియా -2017 కాన్ఫరెన్స్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హెచ్ ఎస్ పూరి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు.

టిడిపిలో చిగురిస్తున్న నియోజకవర్గాల పెంపు ఆశలు

అమరావతి: టిడిపిలో నియోజకవర్గాల పెంపు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతోభేటీ అయ్యారు. ఈ భేటీలో ఢిల్లీ పర్యన విశేషాలను చంద్రబాబు వివరించారు. పోలవరం సహా తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలను నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. నియోజకవర్గాల పెంపు అంశంలో కేంద్రం గతానికంటే సానుకూలంగా స్పందించిందని నేతలకు చంద్రబాబు తెలిపినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

12:59 - November 4, 2017

ముంబై : వరుస నష్టాలతో సతమతమవుతున్న ఆర్ కామ్ తప కమ్యూనికేషన్ తన వాయిస్ కాల్ సర్వీసులను మూసివేస్తోంది. డిసెంబర్ 1నుంచి తమ సర్వీసులు క్లోజ్ చేస్తున్నట్టు ఆర్ కామ్ కాంపెనీ ప్రకటించింది. తమ కస్టమర్లను ఈ ఏడాది నుంచి మరో నెట్ వర్క్ తలిస్తున్నట్టు కూడా ఆ కంపెనీ వెల్లడించింది. టెలికామ్ రెగ్యూలెటర్ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు కేవలం 4జీ సేవలను మాత్రమే తమ కస్టమర్లకు అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్‌, వెస్ట్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్‌కామ్‌, ట్రాయ్‌కు తెలిపింది. 

12:57 - November 4, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పాలన ప్రజావ్యతిరేకంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన పట్ల అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను స్వచ్ఛ రాజకీయాలుగా మార్చేందుకు... ప్రత్యామ్నాయ రాజకీయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ దీనిని ఆదరించాలని కోరారు.  

 

12:54 - November 4, 2017

విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్స్‌ స్కీం విధానాన్ని రద్దు చేయాలని.. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సీపీఎస్‌ రాష్ట్రంలో లక్షా 84 వేల మంది ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందన్నారు. దానిని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 

12:50 - November 4, 2017

గుంటూరు : మంగళగిరిలో ఏపీ డీజీపీని వైసీపీ నేతలు కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించిన వివరాలను డీజీపీ సాంబవివరావుకు నేతలు అందజేశారు. పాదయాత్ర సందర్భంగా నిర్వహించే సభలు, ర్యాలీలు వాటికి సంబంధించిన టైమింగ్ ల వివరాలను అందజేశారు. డీజీపీని కలిసిన వారిలో నేతలు బొత్స సత్యానారాయణ, ఉమ్మారెడ్డి, పార్థసారధి ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

12:43 - November 4, 2017

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎల్లుండి నుంచి పాదయాత్ర నేపథ్యంలో జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. 

 

'జగన్ ఎన్ని దేవుళ్లకు మొక్కినా జైలు శిక్ష తప్పించుకోలేడు'

అమరావతి:స్టువర్ట్ పురం దొంగలతో వైసీపీ అధినేత జగన్ ను టిడిపి నేత వర్ల రామయ్య పోల్చారు. స్టువర్ట్ పురం దొంగలు సింహాచలం దొంగతనానికి వెళ్తూ...దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని వెళ్లారని అయినా వారు పోలీసులకు దొరికిపోయారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రేపు జగన్ పరిస్థితి కూడా అంతే అని, జగన్ ఎంత మంది దేవుళ్లకు మొక్కినా జైలు శిక్ష తప్పించుకోలేడని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాననే భ్రమలో జగన్ ఉన్నారని తెలిపారు.

ప్రజల ఆశలు నీరుగారిపోతున్నాయ్: తమ్మినేని

హైదరాబాద్ : ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు టీఆర్ ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పాలిస్తోందని, ప్రజల ఆశలు నీరుగారిపోతున్నాయని, అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాల ఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, జీఎస్టీకి పరిహారం వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలు అవాస్తవం అని తేలిపోయిందన్నారు. 18 శాతం అభివృద్ధి ఉన్న రాష్ట్రాలకు ఆ పరిహారం లభించే అవకాశం లేదన్నారు.

కాకినాడ సెజ్ లో మరోసారి ఉద్రిక్తత

తూ.గో: కాకినాడ సెజ్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తమ పొలాల్లో నాట్లు వేసేందుకు రైతాంగం కదిలారు. పోలీసులను ఛేదించుకున్న రైతులు పొలాల్లోకి వెళ్లారు. రైతులను, సీపీఎం నేతలను పోలీసులు ఈడ్చిపారేశారు. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

12:34 - November 4, 2017

తూర్పుగోదావరి : పాదయాత్రకు ముందే వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే వైపీపీకి గుడ్ బై చెప్పారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీలో చేరుతున్నట్లు రాజేశ్వరి తెలిపారు. తన నియోకవర్గం అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:27 - November 4, 2017

పాట్నా : బీహార్‌లో కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెగుసరయ్‌ ప్రాంతంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బెగుసరయ్‌లోని సిమారియా ఘాట్‌ వద్ద గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో ఘాట్‌ వద్ద ఏదో జరిగిందని వదంతులు రావడంతో.. కంగారుపడిన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందారు. మరో 10 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. 

 

 

12:20 - November 4, 2017

స్పోర్ట్స్ : ఓ అపరిచిత వ్యక్తి రంజీ క్రికెట్ మ్యాచ్ జరుతుండగా గౌండ్ లోకి కారుతో వచ్చి పిచ్ పై అటు ఇటు తిప్పుతుంటే కొంత సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో ఆటగాళ్ల తెలియలేదు. యూపీలోని పాలెం ఎయిర్ ఫోర్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఢిల్లీ, యూపీ మధ్య జట్ల రంజీ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ మూడవ రోజు ఇంక 20 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తోందనగా గిరిశ్ శర్మ అనే యువకుడు వెగనర్ కారుతో గ్రౌండ్ లోకి వచ్చాడు. అలా రావడమే కాకుండా ఏకంగా పిచ్ పై కారును నడిపాడు. అతికష్టం మీద కారును ఆపిన భద్రత సిబ్బంది ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మ్యాచ్ లో భారత్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్ ఉన్నారు.

11:54 - November 4, 2017

పెద్దపల్లి : ఓవైపు గురువుగా విద్యాబుద్ధులు నేర్పుతూనే ... మరోవైపు నిరుపేదలకు నేనున్నానని ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25 కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆలనా.. పాలనా చూస్తున్నాడు. ఆయన ఆశయాలకు ప్రభావితులైన మరెందరో మేము సైతం అంటూ చేతులు కలిపారు. ఒక గ్రామంలో మొదలైన వారి సేవలు 70 గ్రామాల్లో విస్తరించాయి. ఇంతకీ ఎవరాయన? ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలేంటి? ఓసారి పెద్దపల్లి జిల్లాకు వెళ్దాం.. రండి. 
ఇంతకీ ఆయన వారికేం సాయం చేశాడు
జీవితంలో ఎవరినైనా మర్చిపోవచ్చు.. కానీ కష్టాల్లో అండగా నిలిచిన వారిని ఎన్నటికీ మర్చిపోలేం. ఇప్పుడు ఇద్దరు మహిళలు కృతజ్ఞతలు చెప్పింది ఒకరికే.. ఆయనే తిరుపతిరావు.. ఇంతకీ ఆయన వారికేం సాయం చేశాడు? సాదాసీదాగా కనిపిస్తున్న ఈయనే తిరుపతిరావు. పెద్దపల్లి జిల్లా నిట్టూర్ జడ్పీ హైస్కూలులో ఉపాధ్యాయుడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కానీ.. ఆయన  ప్రవృత్తి మాత్రం సమాజ సేవ. కాలికి ముళ్లు గుచ్చుకుని శరీరం అంతా పాయిజన్ అవడంతో మంచానికే పరిమితం అయ్యింది శిరీష. వారి ఆర్ధిక స్థోమత అంతంత మాత్రంగా ఉండటంతో తను స్ధాపించిన టీటీఆర్ ఫౌండేషన్ ద్వారా తిరుపతిరావు ఆమెకు వైద్యానికి ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 
ఆర్ధిక సాయం 
ఇక ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కుమార్‌కు పక్షవాతం వచ్చి జీవితం చిన్నాభిన్నం అయితే ఆదుకున్న తిరుపతిరావు నెల నెలా రెండువేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సుల్తానాబాద్‌కు చెందిన స్ఫూర్తి, నవ్య అనే చిన్నారుల తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించడంతో తన ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్న తిరుపతిరావు వారికి ఆర్ధిక సాయం అందిస్తున్నారు. వారంతా తిరుపతిరావుకు తమ కృతజ్ఞతలు చెబుతున్నారు. 
టీటీఆర్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్ధ స్థాపన 
తను పనిచేసే స్కూలుకు వచ్చే పేద విద్యార్ధులు పడుతున్న అవస్థలు చూసి చలించిన పోయిన తిరుపతిరావు ఎలాగైనా వారిని ఆదుకోవాలనుకున్నాడు. టీటీఆర్ ఫౌండేషన్ పేరుతో 2017లో ఓ స్వచ్చంద సంస్ధను స్ధాపించాడు. సంస్ధ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా  సమాజ సేవ పట్ల అంకిత భావం ఉన్న యువత టీటీఆర్ ఫౌండేషన్ సేవలను గుర్తించి ముందుకు వచ్చారు. తిరుపతిరావు ఒక్కరితో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు 5వేల మంది యువతతో ముందుకు నడుస్తోంది. తిరుపతిరావు ఫౌండేషన్ సేవలు ఇప్పుడు 70 గ్రామాలకు విస్తరించాయి.  
వేతనంలో రూ.30 వేలు ప్రజా సేవకు 
మాటసాయం అయితే అందరూ చేస్తారు.. కానీ ఆర్ధికంగా సాయం చేయడానికి ఆయనకు అంత డబ్బు ఎలా వస్తుందనే అనుమానం అందరిలో కలగవచ్చు. తిరుపతిరావు తన వేతనంలో రూ.30 వేలు ప్రజా సేవకు వినియోగిస్తున్నారు. ఇక టీటీఆర్ సేవలపట్ల ఔదార్యంతో  చాలామంది విరాళాల రూపంలో ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. టీటీర్ సేవలు విస్తరిస్తున్న క్రమంలో స్ధానిక రాజకీయ నేతలు తమ ఉనికికే ప్రమాదం వస్తుందనే ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేశారు. అయినా తిరుపతిరావు ఏ మాత్రం బెదరకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజాసేవే పరమార్ధంగా ముందుకు సాగుతున్న తిరుపతిరావును మనం మనసారా అభినందిద్దాం. 

 

11:47 - November 4, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగినులంతా వేధింపులకు గురవుతున్నారంటూ శిరీష అనే ఉద్యోగిని చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆ సంస్థలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు అన్నారు. ఈమేరకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉద్యోగినులు వెల్లడించారు. ఇద్దరి సంభాషణల వల్ల నారాయణ సంస్థల్లో పనిచేసే.. 55 శాతం మంది మహిళలు సందిగ్ధంలో పడ్డారని తెలిపారు. ఒకరిద్దరికి కలిగిన ఇబ్బందిని అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. తమకు నారాయణ విద్యా సంస్థల్లో పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మాకు ఎలాంటి వేధింపులు లేవని స్పష్టం చేశారు.

 

11:28 - November 4, 2017

ఇప్పుడు ఏ బ్యాంకులో అకౌంట్ తీయలన్న ఆధార్ తప్పనిసరి మరి ఇదివరకు బ్యాంకు అకౌంట్ ఉన్నవారు ఆధార్ ను లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ చేసుకోవాలని బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. అయితే ప్రతి వ్యక్తి వ్యక్తిగతవగా బ్యాంకు కు వెళ్లి తన ఆధార్ లింక్ చేసుకోడం సాధ్యం కాదు ఎందుకంటే అకౌంట్ హోల్డర్లలో వృద్ధులు, వికలాంగులు ఉంటారు. వీరు బ్యాంకు వచ్చి ఆధార్ లింక్ చేసుకోవడమంటే కష్టంగా ఉంటుంది. ఈ అంశంపై ఏస్ బీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, డిప్యూటీ మేనెజింగ్ డైరెక్టర్ నీరజ్ వ్యాస్ మాట్లాడుతూ ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్ ను బ్యాంకు అధికారులకు ఫోన్ ద్వారా అందిస్తే చాలని స్పష్టం చేశారు. బ్యాంకు బ్రాంచ్ వారు ఓ ఫోన్ నెంబర్ ఇస్తారు అదే ఫోన్ నెంబర్ కు ఖాతాదారులు ఫోన్ చేసి ఆధార్ నెంబర్ చెప్పాలని సూచించాడు. బ్యాంకు అకౌంట్ నెంబర్ తో ఆధార్ లోని పేరు, లింగం, వయస్సు సరిపోలకుంటే ఖాతాదారు బ్యాంకు రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 31, 2017వరకు అకౌంట్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం చేయాలి లేకుంటే ఆధార్ లింక్ చేసేవరకు అకౌంట్ ను నిద్రవస్థలో(హోల్డ్) లో ఉంచుతారు.

11:23 - November 4, 2017

హైదరాబాద్ : పోలీస్‌శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. హోంగార్డుతో ఓ సీఐ మసాజ్ చేయించుకున్నారు. సరూర్ నగర్ సీఐగా పని చేస్తున్న సుందరి లింగయ్య.. హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. డ్రెస్ లో ఉన్న హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. సీఐ మసాజ్‌ చేయించుకుంటున్న దృశ్యాలన్నీ బయటకు లీక్‌ అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

డీజీపీ ని కలిసిన వైసీపీ నేతలు

అమరావతి: డీజీపీ సాంబశివరావును వైసీపీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన వివరాలను డీజీపీకి వైసీపీ నేతలు అందజేశారు. డీజీపీని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారధి, జోగిరమేష్ తదితరులు ఉన్నారు.

11:04 - November 4, 2017

బాలీవుడ్ : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చరిత్రత్మక చిత్రం ''పద్మావతి'' ఈ మూవీ కోసం బాలీవుడ్ సిని ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రం ఇప్పట్లో విడుదలైయ్యే ఛాన్స్ మాత్రం కనబడడంలేదు. ఇప్పటికే రాణి రుద్రమదేవి చరిత్రను వక్రీకరించేలా చిత్రం తీశారంటూ రాజ్ పుత్ల్ పద్మావతి చిత్ర యూనిట్ పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఈ వివాదంలోకి బీజేపీ కూడా ఎంటరైంది. ఈ మూవీకి వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసేందుకు బీజేపీ సిద్దమవుతన్నట్టు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఐకే జడ్డేజా తెలపారు.

 

 

10:55 - November 4, 2017
10:54 - November 4, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రి కోటి లింగాల ఘాట్‌లో కార్తీకపౌర్ణమి లక్ష దీపోత్సవం అంగరంగవైభవంగా సాగింది. కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, పంతం చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ చైర్మన్‌ పంతం కొండలరావు లక్షదీపోత్సవం నిర్వహించారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి కెఎస్‌. జవహర్, ఇతర ప్రజా ప్రతినిధులు, సీసీసీ చానల్ చైర్మన్‌ భాస్కరరామ్‌ దంపతులు, పంతం చారిటబుల్ ట్రస్ట్‌ చైర్మన్‌ పంతం కొండలరావు గోదావరి హారతితో కార్తీక లక్ష దీపోత్సవం ప్రారంభించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కోటిలింగాల ఘాట్ భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. బాణాసంచా కాల్పులు మిరిమిట్లు గొలిపాయి.

హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న సరూర్ నగర్ సీఐ

హైదరాబాద్: హోంగార్డుతో సరూర్ నగర్ సీఐ లింగయ్య మసాజ్ చేయించుకున్నాడు. యూనిఫాంలో ఉన్న హోంగార్డు సైదా నాయక్ తో సీఐ మసాజ్ చేయించుకున్నాడు.

 

10:35 - November 4, 2017

తూర్పుగోదావరి : పాదయాత్రకు ముందే వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే వైపీపీకి గుడ్ బై చెప్పారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:25 - November 4, 2017

విజయవాడ : కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. పవిత్ర కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి శోభ, భక్తుల పుణ్య స్నానాలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

10:22 - November 4, 2017

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం మంగినపూడి బీచ్ కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రుడికి హారతి ఇచ్చి సముద్ర స్నానాలను న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. సముద్ర స్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అధికార యంత్రాంగం భక్తులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, తగిన జాగ్రత్తలు చేపట్టారు. 

 

10:21 - November 4, 2017

హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించారు. పరమశివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. గచ్చిబౌలిలోని జీపీఆర్ ఏ క్వాటర్స్‌లోని రాజరాజేశ్వరి దేవాలయంలో, మణికొండలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. 

బీహార్ లో తొక్కిసలాట: నలుగురి మృతి

పాట్నా : బీహార్ లో కార్తీకపౌర్ణమి వేడుకల్లో విషాదం నెలకొంది. బెగుసరాయ్ లో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారు.

09:52 - November 4, 2017

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థలలో అక్రమాలపై ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆడియో టేప్‌ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఆడియో టేపు ఆధారంగా ఉప్పల్‌ పీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రామంతాపూర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్‌గౌడ్‌ తనను బెదిరించి వాయిస్‌ రికార్డ్‌ చేయించాడని.. ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. సిరిసిల్లలో పోలీసులు నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక.. పోలీసుల విచారణలో అనేక వాస్తవాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

వైసీపీని వీడనున్న మరో ఎమ్మెల్యే

అమరావతి: జగన్ పాదయాత్ర నేపథ్యంలో వైసీపీకి షాక్ తగిలింది. కాసేపట్లో సీఎం చంద్రబాబు సమక్షంలో రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరీ టిడిపిలో చేరనున్నారు.

గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు

ప.గో: పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామి, భీమవరం వీరశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పట్టిసీమ శైవక్షేత్రం, కొవ్వూరు, గోపాద క్షేత్రాల్లో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

సంచలనంగా మారిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్

హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆడియో టేప్ ఆధారంగా ఉప్పల్ పీఎస్ లో పలు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రామాంతపూర్ నారాయణ కేలేజీ ప్రిన్సిపల్ సరితా అగర్వాల్, వైస్ ప్రిన్సిపల్ నవీన్ గౌడ్ సంభాషణ ఆధారంగా విచారణ చేపట్టారు. తనను నవీన్ గౌడ్ బెదిరించి వాయిస్ రికార్డు చేయించాడని సరితా అగర్వాల్ ఆరోపిస్తున్నారు. సిరిసిల్లలో నవీన్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాకినాడ సెజ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత

తూ.గో : కాకినాడ సెజ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెజ్ భూముల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నాహాలు చేశారు. అడ్డుకునేందుకు రంగంలోకి పోలీసులు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. రమనక్కపేటలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి రైతులు నిరసన తెలుపుతున్నారు. 

 

నేటి నుంచి రవాణా రంగంపై సదస్సు

హైదరాబాద్ : నేటి నుంచి రవాణా రంగంపై సదస్సు జరుగనుంది. పట్టణ రవాణా రంగం సవాళ్లు, పరిష్కారాలు అంశంపై మూడు రోజులపాటు సదస్సు కొనసాగనుంది. సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పాల్గొననున్నారు. 

గుంటూరులో ఉద్యానవనాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : నగర శివారులోని నల్లపాడు వద్ద 520 ఎకరాల్లో కొండల నడుమ ఏర్పాటు చేసిన నగర ఉద్యానవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కార్తీక వనభోజనాల్లో సీఎం పాల్గొన్నారు.

 

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటిచంనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

పుణ్యస్నానమాచరించిన ఎమ్మెల్సీ సతీష్ కుమార్

గుంటూరు : కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదకాకాని, అమరావతి, కోటప్పకొండ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలతో సూర్యలంక సముద్రతీరం పోటెత్తింది. ఎమ్మెల్సీ సతీష్ కుమార్ సముద్ర హారతి ఇచ్చి పుణ్యస్నానాలను ప్రాంభించారు. 

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

గుంటూరు : కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదకాకాని, అమరావతి, కోటప్పకొండ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి.
 

నేడు మంత్రి మహేందర్ రెడ్డితో ఫ్రాన్స్ రాయబారి సమావేశం

హైదరాబాద్ : నేడు మంత్రి మహేందర్ రెడ్డితో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ సమావేశం కానున్నారు. ప్రజా రవాణాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే పలు అంశాలపై చర్చ జరుపనున్నారు. 

 

కార్తీక పౌర్ణమి.. గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు

జగిత్యాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురిలో గోదావరి నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.

 

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్నసిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. సాయంత్రం జ్వాలా తోరణం, రాత్రి మహా పూజ జరుగనుంది. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి యనమల

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. టీటీడీని జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీలో కౌన్సిల్ లో కోరుతామని మంత్రి చెప్పారు.

 

07:50 - November 4, 2017

ఇచ్చిన హామీలను అమలు చేడయంలో టీసర్కార్ విఫలమైందని వక్తలు విమర్శించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బెల్యానాయక్, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ నేత సీతారాం నాయక్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.  దళితులకు 3 ఎకరాల భూమి ఇంత వరకు ఇవ్వలేదన్నారు. గిరిజలను ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

07:43 - November 4, 2017
07:41 - November 4, 2017

విజయవాడ : ఏపీలో  జలరవాణాకు ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి కేంద్రం రూ.7015 కోట్లు కేటాయించింది.
మొదటి విడతలో ముక్త్యాల...విజయవాడ మార్గం అభివృద్ధి 
జలరవాణాలో మొదటివిడతగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల నుంచి విజయవాడ వరకు 82 కిలోమీటర్లలో ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముక్త్యాల-విజయవాడ మార్గంలో మొత్తం 7 టెర్మినల్ నిర్మిస్తారు. దీనికోసం నదిలో 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంది. ఇక రెండో విడతలో చేపట్టనున్న విజయవాడ-కాకినాడ మార్గంలో  233 కిలోమీటర్ల టెర్మినల్స్ నిర్మిస్తారు. 
ఏడాదిపొడవునా జలరవాణా
ఏడాది పొడవున జలరవాణాకు ఆటంకం లేకుండా ఉండాలంటే నదిలో కనీస 7అడుగుల  నీటిమట్టం ఉండాలి. రెండు దశల్లో అభివృద్ధి చేయనున్న జలరవాణా మార్గాన్ని రెండు కంపెనీలకు అప్పగించారు. 18 నెలల కాలవ్యవధిలో సదరు కంపెనీలు తమ పనిని పూర్తి చేయాల్సి ఉంది. జలరవాణాలో సరకు సరఫరాతోపాటు ప్రయాణికుల రాకపోకలకు  అనువుగా ఉండేలా ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ముక్త్యాల, హరిశ్చంద్రపురం, ఇబ్రహీంపట్నం, ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటయ్యే టెర్మినల్ పాయింట్లను సరకు లోడింగ్, అన్ లోడింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇక  పాసింజర్లు ఎక్కి దిగేందుకు వీలుగా వేదాద్రి, అమరావతి, భవానీపురం, దుర్గాఘాట్ వద్ద టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు.  
2018 డిసెంబర్ నాటికి తొలిదశ  పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు అంటున్నారు. 
వెయ్యి టన్నుల నౌకలు ప్రయాణించేలా ఏర్పాట్లు 
ప్రకాశం బ్యారేజీ నుంచి పెదగంజాం వరకు నిర్మించే కాలువల్లో 1000 టన్నుల సామర్థ్యం కల్గిన నౌకలు ప్రయాణించేలా ప్రాథమిక నివేదికను  సిద్ధం చేశారు. రోడ్డు, రైలు మార్గాల కంటే తక్కువకే జలరవాణా ద్వారా సామాగ్రి, సరుకులు సరఫరా చేసే అవకాశం ఉండటంతోపాటు పర్యావరణహితం కావడంతో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచి తీర ప్రాంతానికి సరుకుల రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం కానుంది. అయితే ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళితేనే జలరవాణా వల్ల ప్రయోజనాలు వస్తాయంటున్నారు విపక్షనేతలు. ఆడంబరాలకు పోకుండా నిబంద్ధతతో జలరవాణా ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. 

 

07:37 - November 4, 2017

చిత్తూరు : తిరుమల హోటళ్లలో అధిక ధరలపై  హైకోర్టు ఆగ్రహంతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. వ్యాపారుల నిలువు దోపిడీలో ఆలయ అధికారుల భాగస్వామ్యం ఉందంటూ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తిరుమలలోని హోటళ్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల హోటళ్లలో అధిక ధరలపై హైకోర్టు సీరియస్‌
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలకు ఆహారం విక్రయించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తిరుమలలో 11 వరకు పెద్ద రెస్టారెంట్లు, మరో ఆరు వరకు చిన్న జనతా క్యాంటీన్లు, లెక్కకు మించి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఒక రెస్టారెంటునకు నిర్వహకులు అత్యధికంగా నెలకు 46 లక్షల అద్దెను చెల్లిస్తుండగా, మరో రెస్టారెంట్‌ 32 లక్షలు అద్దె చెల్లిస్తున్నాయి. మిగిలిన రెస్టారెంట్లు కాస్త తక్కువ అద్దెను చెల్లిస్తున్నాయి. ఇక ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్లు లెక్కకు మించి ఉన్నాయి. 
తిరుమల హోటళ్లలో నిత్యం లక్షల్లో వ్యాపారం
తిరుమలకు వచ్చే భక్తులు ఈ హోటళ్లనే ఆశ్రయించడంతో నిత్యం లక్షల వ్యాపారం జరుగుతుంది. దీంతో తిరుమలలోని హోటళ్లను సొంతం చేసుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ హోటళ్ల కేటాయింపునకు టీటీడీ షీల్డ్‌ టెండర్లను నిర్వహించి అధికంగా కోట్‌ చేసినవారికి 3 సంవత్సరాల కాలపరిమితితో హోటల్‌ లైసెన్సును జారీ చేస్తుంది. అయితే హోటల్‌ కేటాయింపు సమయంలోనే టీటీడీ నిబంధనల మేరకే విక్రయించాలని చెబుతుంది. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హోటళ్ల యజమానులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి భక్తులను భారీగా దోచుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవాసమితి గత సంవత్సరం హైకోర్టులో పిల్‌ వేసింది. ఈ విషయమై అప్పట్లోనే కోర్టు వివరణ కోరగా టీటీడీ స్పందించలేదు. టీటీడీ తీరును సీరియస్‌గా తీసుకున్న కోర్టు గత 10 రోజుల క్రితం టీటీడీ ఈవో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
న్యాయస్థానం ముందు హాజరైన టీటీడీ అధికారులు
కోర్టు ఆదేశాల మేరకు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు గత నెల 31న న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అయితే టీటీడీ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని కోర్టు హోటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది. దీంతో టీటీడీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రెస్టారెంట్ల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను టీటీడీ నిర్ణయించిన ధరకే అమ్మకాలు జరపాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. 
రెస్టారెంట్లపై నిఘా ఉండేలా ప్రత్యేక టీంలు
అలాగే రెస్టారెంట్లపై నిరంతరం నిఘా ఉండేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నష్టాల కారణంగా అద్దె చెల్లించలేని పరిస్థితిలో హోటళ్లు మూసివేస్తున్నామంటూ కొందరు యజమానులు టీటీడీకి రాతపూర్వకంగా తెలిపారు. కొందరు వ్యాపారుల.. అద్దె బకాయిలు భారీగా పేరుకుపోయి, చెల్లించిన డిపాజిట్‌కు సమానమయ్యాయి. ఇంకొందరు బకాయిలు ఎగ్గొట్టి హోటళ్లు మూసేని పరారీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీటీడీ కారణంగానే పోటీలు పడి భారీ అద్దెతో హోటళ్లు, జనతా క్యాంటీన్లు చేజిక్కించుకున్నామని, మొదటే నిబంధనలు పాటించాలని షరతులు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని యాజమానులు అంటున్నారు. తిరుమలలో ఏర్పడిన ఈ తాజా పరిణామాలతో తమకు భారీ నష్టాలు తప్పవని వాపోతున్నారు. 

 

07:34 - November 4, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అధికారపార్టీ నిర్వాకం.. రైతులకు , హమాలీకకు కష్టాలు తెచ్చిపెట్టింది. అధికారుల అలసత్వం హమాలీల మధ్య చిచ్చుపెట్టింది. గులాబీపార్టీ యూనిన్‌ నేతల తీరుతో  భద్రాద్రి జిల్లా ఇల్లందులో కూలీలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిగా ఇక్కడ జరుగుతున్న గొడవకు అధికాపార్టీనేతల రాజకీయమే కారణం.. తమ యూనియన్లో చేరితేనే.. మార్కెట్లో పనిచేయడానికి లైసెన్స్‌ ఇవ్వాలంటూ అధికారులోపై ఒత్తడి తెచ్చారు. దీంతో హమాలీలు మూడు గ్రూపులుగా విడిపోయారు. గులాబీపార్టీ రాజకీయంతో ఎపుడు కలిసి మెలిసి పనిచేసుకునే కూలీలు ఇలా తమలో తాము దాడులకు దిగుతున్నారు. 
హమాలీల గొడవతో ఆగిన కొనుగోళ్లు 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో .. హమాలీల మధ్య గొడవలతో కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయాయి. ఇక్కడ 180 మంది వరకు హమాలీలు ఉన్నారు.  వీరిలో 66 మంది లైసెన్స్‌ కలిగిన వారు మార్కెట్‌ యార్డులో పనిచేస్తుంటారు.  దాంతోపాటు గిరిజన సంక్షేమశాఖ్  ఆధ్వర్యంలోని జీసీసీలో మరో 80 మంది లైసెన్స్‌ కలిగిన హమాలీలు ఉన్నారు.  మిగతావాళ్లు బటయ మార్కెట్ల పనిచేస్తుంటారు. అందరూ ఒకరికి ఒకరుగా కలిసి మెలిసి పనిచేసుకునే వీరి అధికాపార్టీ నేతలు చిచ్చుపెట్టారు. గులాబీపార్టీ అనుబంధ యూనియన్లో చేరితేనే లైసెన్స్‌లు ఇస్తుండటంతో  ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల హమాలీలు కొంతకాలంగా నిరసన తెలుపుతున్నారు. ఇలా కూలీల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇటీవల మార్కెట్‌యార్డులో మొక్కొజొన్న కొలుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా హమాలీలు పరస్పరం దాడికి దిగారు. జాయింట్‌కలెక్టర్‌ సమక్షంలోనే ఈ గొడవ మరింత ముదిరింది. 
మార్కెట్లో మొక్కజొన్న రైతుల విలవిల 
హమాలీల గొడవతో మార్కెట్లో కొనుగోళ్లు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో అంతకు మందే మొక్కజొన్న పంటను తీసుకొచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. గత 15రోజులుగా రాత్రిపగలు మొక్కజొన్న రాసులకు కాపలా కాయలేక అవస్థలు పడుతున్నారు. హమాలీల గొడవతో  మార్కెట్‌ యార్డుకు రైతులు పంటను తీసుకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. 
తమ యూనిన్‌లో చేరితేనే లైసెన్స్‌లు అంటూ బెదిరింపులు 
అయితే ఇప్పట్లో వివాదం సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా .. తమ యూనిన్‌లో చేరితేనే లైసెన్సులు వస్తాయంటూ.. అధికాపార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని హమాలీలు అంటున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు.. మార్కెట్‌యార్డులో రాజకీయాలకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని.. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసే వారందరికీ లైసెన్స్‌లు ఇవ్వాలని హమాలీలు కోరుతున్నారు. 

 

07:30 - November 4, 2017

శ్రీకాకుళం : త్వరలోనే శ్రీకాకుళంలో నీటిపారుదల సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని  మంత్రులు అచ్చెనాయుడు, కిమిడి కళా వెంకట్రావు చెప్పారు. జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని దీనికి సంబంధించి స్థలం కూడా సిద్ధంగా ఉందన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా తయారు చేస్తామని మంత్రులు అన్నారు. శాసన సభ సమావేశాలు ముగిసిన అనంతరం కార్యాలయం ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు.

 

07:28 - November 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈమేరకు  ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాహేందర్‌రెడ్డి నియామకానికి సీఎం కేసీర్‌కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 1986 బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డికి 2022 వరకు పదవీకాలం ఉంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ  ఈనెల 11న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,  గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సేవలందించిన మహేందర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. 

 

07:25 - November 4, 2017

విజయవాడ : వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇడుపులపాయలో యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల ఆరో తేదీ నుంచి జరిగే పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను విజయవాడలో విడుదల చేశారు.
ప్రజా సంకల్ప యాత్ర రూట్‌మ్యాప్‌ విడుదల
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ మేరకు ఆరో తేదీన పాదయాత్ర మొదలుకానుంది. ఉదయం తొమ్మిది గంటలకు జగన్‌ ఇడుపులపాయలోని  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారని... ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక పాదయాత్ర మొదలవుతుంది. ఏపీలోని 13 జిల్లాలో జగన్‌ పాదయాత్ర సాగుతుంది. 
వైఎస్సార్‌ జిల్లాలో ఏడు రోజుల పాటు యాత్ర
ముందుగా వైఎస్సార్‌ జిల్లాలో ఏడు రోజుల పాటు జగన్ యాత్ర సాగనుంది. అనంతరం కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 18 రోజుల పాటు యాత్ర సాగనుంది. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు... నియోజకవర్గాల్లో సాగే జగన్‌ యాత్ర... కర్నూలు, అనంతపురం, చిత్తూరు నెల్లూరు మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్చాపురంతో ముగుస్తుంది. అయితే ప్రభుత్వం జగన్‌ యాత్రకు అవరోధాలు  కలిగించాలని చూస్తోందని.. ఆ పార్టీ నేతలు అంటున్నారు. యాత్రను  భగ్నం చేయడానికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని... ఆరోపిస్తున్నారు. 

 

07:23 - November 4, 2017

ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. పోలవరం నిధులపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ, అసెంబ్లీ స్థానాల పెంపుపై హోం మంత్రి రాజ్‌నాత్‌సింగ్‌తో చర్చించారు. అనంతరం ఇండియాగేట్‌ సమీపంలో జరుగుతున్న 'వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్స్‌ను బాబు  పరిశీలించారు. 
అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశం 
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం నిధుల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు రాష్ట్రానికి రావల్సిన ఇతర నిధుల అంశాన్ని జైట్లీ ముందు ప్రస్తావించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను చంద్రబాబు కలిశారు. విభజనచట్టం వేగవంతం చేయమని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు.  
'వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు  
అటు ఢిల్లీలోని ఇండియాగేట్‌ సమీపంలో జరిగిన 'వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా' కార్యక్రమంలో చంద్రబాబు  పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ ఫుడ్‌స్టాల్స్‌ను సందర్శించారు. 20 ఏళ్ల క్రిందటే ఐటీ మీద దృష్టి పెట్టిన తాము ప్రస్తుతం  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నెంబర్ వన్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధికి అవసరమైన విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. కేంద్ర హోం మంత్రితో   భేటీ సందర్భంగా విభజన చట్టాన్ని వేగంగా అమలు చేయాలని చంద్రబాబు కోరారు. ఏపీ అభివృద్ధికి మరింతగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  

 

నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్

హైదరాబాద్ : నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. గోదావరి నది తీరాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.   

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్

తిరుమల : వైసీపీ అధినేత జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరానని తెలిపారు. 

 

Don't Miss