Activities calendar

05 November 2017

21:31 - November 5, 2017

ఢిల్లీ : భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్‌ కైవసం చేసుకొన్నారు. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫైనల్లో చైనాపై 5-4 తేడాతో విజయం సాధించారు. నవ్‌జ్యోత్‌ కౌర్‌ 25వ నిమిషంలో గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్‌లువో 47వ నిమిషంలో గోల్‌ కొట్టడంతో చైనా 1-1 తో స్కోర్‌ను సమం చేసింది. మ్యాచ్‌ ముగిసే సరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్కంఠకరంగా సాగిన షూటౌట్‌లో రెండు జట్లు 4-4తో నిలిచాయి. చివరి అవకాశంలో కెప్టెన్‌ రాణి గోల్‌ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్‌ 5-4తో గెలుపొందింది. గ్రూప్‌ దశలోనూ చైనాను టీమిండియా ఓడించింది. ఈ విజయంతో.. అమ్మాయిలు, అబ్బాయిలు ఆసియాకప్‌ గెలిచినట్టైంది. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది.

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్..

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ సంకల్పం రైతన్నల పాలిట కల్పవృక్షంగా మారబోతోంది. రేపు రాత్రి నుంచి రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కార్యక్రమాన్ని ప్రయోగత్మకంగా చేపట్టనుంది. 

సోమవారం జగన్ పాదయాత్ర షురూ..

కడప : వైసీపీ అధ్యక్షుడు జగన్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. సోమవారం కడప జిల్లాలోని ఇడుపుల పాయ ఉదయం 8.30గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. మొదటి రోజు 2.1 కి.మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ పాదయాత్ర షెడ్యూల్ లో పేర్కొంది. 

కడప చేరుకున్న జగన్..

కడప : వైసీపీ అధ్యక్షుడు జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. సోమవారం నుండి ఆయన ఇడుపులపాయ నుండి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. సీఎస్ఐ చర్చీలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జన్మదిన వేడుకలు వద్దన్న కమల్..

చెన్నై : ఏడో తేదీన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని సినీ నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకొనే పనులు చేపట్టాలని సూచించారు. 

21:28 - November 5, 2017

హైదరాబాద్ : సచివాలయానికి వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ప్రశ్నించారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్...తన మనవడిని తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించడం లేదన్నారు. టీమాస్‌ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్‌పై కంచ ఐలయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. అటు ప్రజాగాయకుడు గద్దర్‌ సైతం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో జరిగిన టీమాస్‌ ఆవిర్భావ సభలో వక్తలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సచివాలయానికి వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ప్రశ్నించారు. కొత్త సచివాలయం నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచనే తప్పని... దానిపై ఖర్చు పెట్టే బదులు, ఆ నిధులను పత్తి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వినియోగిస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... తన మనవడిని మాత్రం తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు చదివించడం లేదని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వరంగల్‌లోని పత్తి మార్కెట్ ను సందర్శించి, అక్కడి వ్యాపారుల ఆగడాలు బయటపెడతామని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి పత్తి రైతు ఇంట్లో టీమాస్ నిద్ర చేస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రజా గాయకుడు గద్దర్ ప్రదర్శించిన కళారూపం ఆహూతులను ఆలోచింప చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకున్నా కొత్త సచివాలయ నిర్మాణం చేస్తోందని గద్దర్‌ అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో నిర్మాణం చేయాలంటే ముందుగా అక్కడి ప్రజల ఆమోదం పొందాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో వీరులు నివాసమున్నారని గుర్తు చేశారు. దళితులు, బహుజనులకు ప్రభుత్వం బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని... స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ జాన్‌ వెస్లీ అన్నారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించకపోతే.. జనవరి నుంచి టీమాస్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా టీమాస్‌ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ చలోక్తులు, విమర్శలు..ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నలతో టీమాస్‌ ఆవిర్భావ సభ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 

21:25 - November 5, 2017

కడప : వైసీపీ అధినేత జగన్‌ తలపెట్టిన ప్రజా సంకల్పం పాదయాత్రపై టీడీపీ నేతలు ముప్పేట దాడి ప్రారంభించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్‌ను ప్రజలు నమ్మరన్నారు. ఆస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూ జగన్‌ చేసే పాదయాత్రకు విలువ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ పాదయాత్ర బూటకమని హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేకే పాదయాత్ర తలపెట్టారని మండిపడ్డారు. జగన్‌ను జనమే కాదు ఆ పార్టీ నేతలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని..... అందుకే ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్‌ పాదయాత్ర చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్నారు. జగన్‌ పాదయాత్ర కృత్రిమైనదని, పదవీకాంక్షతోనే పాదయాత్ర తలపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి విమర్శించారు. జగన్‌ పాదయాత్ర ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ వ్యాఖ్యానించారు. మొత్తంమీద జగన్‌ పాదయాత్రను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయాల్లో చర్చినీయాంశంగా మారాయి. 

21:23 - November 5, 2017

కడప : ఏపీలోని 13 జిల్లాలగుండా 3వేల కిలోమీటర్ల మేర సాగనున్న వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. తొలిగా వైఎస్సార్‌ జిల్లాలో ఏడు రోజులపాటు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది.

 

21:08 - November 5, 2017

2019లోగా పోలవరం పూర్తవడం కష్టమేనా ? ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడమే తప్పయ్యిందా ? పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వ లెక్కలు వాస్తవమేనా ? అసలు ఏం జరుగుతోంది ? తదితర అంశాలపై నీటిపారుదల రంగ నిపుణులు శ్యామ్ ప్రసాద్ రెడ్డితో టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ సతీష్ ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

21:03 - November 5, 2017

ఢిల్లీ : ఆసియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఉత్తర కొరియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరకొరియా గురించి నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని కొరియా పత్రిక హెచ్చరించింది. జపాన్ రాజధాని టోక్యోలో ట్రంప్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ నియంత అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తరకొరియాను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉత్తర కొరియా ఆరోసారి అణుపరీక్ష జరిపినప్పటి నుండి ఉత్తర కొరియ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అణుపరీక్షలు జరుపనీయకుండా ఉత్తరకొరియాను అడ్డుకొనేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ ఉత్తరకొరియా గురించి దక్షిణకొరియాతో చర్చలు జరుపుతున్నారు. 

 

20:29 - November 5, 2017
20:26 - November 5, 2017

హైదరాబాద్ : ప్రొ.కంచ ఐలయ్య నివాసం వద్ద వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆయన రాసిన ఓ పుస్తకం వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా తార్నాకలోని ఆయన్ను నిందించే విధంగా ఉన్న పోస్టులు వెలిశాయి. దీనిపై ప్రొ.కంచ ఐలయ్య తీవ్రంగా స్పందించారు. ఆర్యవైశ్యులు..వారితో ఉన్న ఒక రాజకీయ పార్టీ..దాని చుట్టూ ఉన్న శక్తులు ఈ పోస్టర్లు వేశాయని తెలుస్తోందన్నారు. తనను క్షమించాల్సినవసరం లేదని..ఆర్యవైశ్యులు..రాజకీయ పార్టీ ..ఆకలి చావులతో చనిపోతున్న పత్తి రైతులను పట్టించుకొనే సంస్కృతి వారికి లేదన్నారు. పత్తి రైతుల పట్ల సేవా గుణం ఎందుకు లేదని..వారిని ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. 

20:23 - November 5, 2017
20:20 - November 5, 2017

విజయవాడ : ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంసీఐ అనుమతి లేకపోవడంతో కడప ఫాతిమా 2015-16 విద్యార్థుల బ్యాచ్ రోడ్డున పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు దీక్ష చేపడుతున్నారు. వీరి దీక్షకు ఏపీ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు సంఘీభావం ప్రకటించారు. సోమవారం దీక్షా స్థలికి చేరుకుని వారిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడికి అసెంబ్లీ సీట్ల పెంపుదలపై ఉన్న శ్రద్ధ ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై లేదని విమర్శించారు. 

జగ్గారెడ్డి అరెస్టు..

సంగారెడ్డి : టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఇంటిలో అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

త్వరలో వివరాలు వెల్లడిస్తానన్న కమల్..

చెన్నై : కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయపార్టీ ఏర్పాటు గురించి త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ నటుడు కమలహాసన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. 

ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి..

భద్రాద్రి : ఇల్లందు రాజీవ్ నగర్ తండాలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. 

19:20 - November 5, 2017

తల్లిదండ్రులు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉండడం వల్లే తాను సంగీతంపై మక్కువ పెంచుకోవడం జరిగిందని..తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని షణ్ముఖ ప్రియ పేర్కొంది. పాటలతో దేశాన్ని ఈ తెలుగు అమ్మాయి కిరాక్ చేస్తోంది. లిటిల్ ఛాంప్స్ లో..ఇతర షోల్లో ఆమె పాల్గొని అద్భుత ప్రతిభను కనబర్చింది. ఈ సందర్భంగా టెన్ టివి షణ్ముఖ ప్రియతో ముచ్చటించింది. సంగతం పట్ల మక్కువ..ఇతరత్రా విషయాలను వెల్లడించింది. తల్లిదండ్రులు నిర్వహించే కచేరీని చిన్నప్పటి నుండి చూడడం జరిగిందని, ఈ రంగంలో తనకు పేరెంట్స్ చాలా ప్రోత్సాహం ఇస్తున్నారని పేర్కొంది. ఏ.ఆర్.రెహామాన్ పాడిన పాటను తాను పాడడం జరిగిందని, ఇందుకు ప్రశంసలు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ.ఆర్.రెహామన్ ముందు పాట పాడడం చాలా గొప్పగా భావిస్తున్నట్లు తెలిపింది. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:51 - November 5, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల కేంద్రంగా పనిచేస్తున్న ఇండోఫిల్‌ ఇండస్ట్రీస్‌ వరిని ఆశించే తెగుళ్ల నివారణకు కొత్త పురుగు మందును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంప్రెషన్‌ పేరుతో తయారు చేసిన ఈ మందును కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీ నారాయణరెడ్డి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇండోఫిల్‌ శాస్త్రవేత్తలు ఆరేళ్ల పరిశోధనల ఫలితమే ఇంప్రెషన్‌ అని నారాయణరెడ్డి చెప్పారు. వరి పంటకు సోకే అగ్గి, పొడ తెగుళ్ల నివారణకు ఇంప్రెషన్‌ పని చేస్తుందని చెప్పారు. 

18:50 - November 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ సంకల్పం రైతన్నల పాలిట కల్పవృక్షంగా మారబోతోంది. రేపు రాత్రి నుంచి రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కార్యక్రమాన్ని ప్రయోగత్మకంగా చేపట్టనుంది. ట్రయల్‌ రన్‌లో లోటు పాట్లు అంచనా వేసి..వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందించబోతోంది. ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి ఐదారు రోజులపాటు 24 గంటలు విద్యుత్‌‌ సరఫరాను చేయబోతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థలు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ప్రయోగాత్మకంగా అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల సరఫరాతో కలిగే ప్రభావాన్ని, అన్ని విధాల అంచనా వేసేలా చర్యలు తీసుకుంది. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా చేయాలని సీఎం ఆదేశాలతో విద్యుత్ సంస్థలు ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. ఇప్పుడు రాష్ట్రమంతటా దీన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా తొలి అడుగువేస్తున్నారు. అన్నదాతలకు 24 గంటల కరెంటు సరఫరా చేసే విషయంపై సీఎం కేసీఆర్.... జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో చర్చించారు. వచ్చే మార్చి-ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని వ్యవసాయదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ అందించడానికి పంపిణీ,సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ఐదారు రోజుల పాటు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని సిఎండి ప్రభాకర్ రావు చెప్పారు. 24 గంటలపాటు కరెంటు ఇవ్వడం వల్ల వచ్చే ప్రభావాన్ని అన్ని విధాలా అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రతిపాదించారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.

తెలంగాణతో పాటు దేశంలో కొన్ని రాష్ట్టాల్లో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నప్పటికీ ఎక్కడా 24 గంటల కరెంటు మాత్రం అందడం లేదు. 24 గంటలపాటు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం దేశచరిత్రలో రికార్డుగా నిలవనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యుత్‌ కోతలతో రైతులు అల్లాడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని రోజులకే రైతులకు 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతులందరికీ 24 గంటల విద్యుత్ అందివ్వాలని సీఎం కేసీఆర్ ఏడాదిక్రితం విద్యుత్ శాఖను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తెలంగాణలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. ఏర్పాట్లు చేశాయి. 12వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేశారు. గత జూన్ 17 నుంచి పాత మెదక్ జిల్లా పరిధిలో, జూన్ 18 నుంచి పాత కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో 9.58 లక్షల పంపుసెట్లకు 24 గంటల కరెంటును విజయవంతంగా సరఫరా చేయగలుగుతున్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి మిగతా అన్ని జిల్లాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్ల మరో 1500-2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఇద్దరు విద్యార్థినిల గల్లంతు...

మెదక్ : జిల్లా చిలిపిచేడ్ మండలంలోని మంజీరా నదిలో పడి ఇద్దరు విద్యార్థినిలు గల్లంతయ్యారు. కార్తీక మాసం సందర్భంగా చాముండేశ్వరీ ఆలయానికి రోహిణి..శ్రీవిద్య విద్యార్థినిలు ఇక్కడకు వచ్చి నదిలో స్నానం కోసం దిగి కొట్టుకపోయారు. 

పేరుపాలెం బీచ్ లో విషాదం..

పశ్చిమగోదావరి : మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురి మృతదేహాల లభ్యమయ్యాయి. భీమవరానికి చెందిన కుమార్, అవినాష్, సురేంద్రలుగా గుర్తించారు. 

18:11 - November 5, 2017

మెదక్ : ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులు..నదుల్లోకి దిగొద్దని సూచనలున్నా పలువురు నీటిలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు నీటిలోకి దిగి కొట్టుకపోయారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చిలిపిచేడ్ మండలం మంజీరా నదిలోకి రోహిణి..శ్రీవిద్యలు దిగి కొట్టుకపోయారు. తమ కళ్లెదుటే కొట్టుకపోవడంతో తల్లిదండ్రులు..కుటుంసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాముండేశ్వరీ ఆలయానికి రోహిణి..శ్రీివిద్యలు కుటుంబసభ్యులతో వచ్చారు. కానీ అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతంలోని పటేల్ నగర్ కు చెందిన కొంతమంది కార్తీక మాసం సందర్భంగా చిలిపిచేడ్ ప్రాంతంలో ఉన్న చాముండేశ్వరీ ఆలయానికి వచ్చారు. కానీ వీరి పర్యటన ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. నీటి ప్రవాహానికి కొట్టుకపోయిన రోహిణి..శ్రీవిద్యల గాలింపు కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. కానీ మంజీరా నదిలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల కాలంలో పది మంది మృతి చెందినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

17:53 - November 5, 2017
17:14 - November 5, 2017

తూర్పుగోదావరి : జగన్ అనుమతి కోరడం వల్లే పాదయాత్రకు గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ ఇవ్వడం జరిగిందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. సోమవారం నుండి జగన్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవాలని..చంద్రబాబు నాయుడికి వణుకొచ్చిందని పార్టీ నేత రోజా వ్యాఖ్యానించారని కానీ వాస్తవానికి జగన్..కు వైసీపీకి వణుకు వచ్చిందని విమర్శించారు. కాపుల గురించి పట్టించుకొంది ఒక్క టిడిపినేనని, కాపుల రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జగన్ ను జనమే కాదు...ఆ పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. 

17:06 - November 5, 2017
17:05 - November 5, 2017
16:35 - November 5, 2017

విశాఖపట్టణం : నగర వాసులకు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకొనేందుకు మరో గ్రౌండ్ అందుబాటులోకి వచ్చింది. గ్రౌండ్ కు కోరమండల్ ఫెర్టిలైజర్స్ భూమిని కేటాయించింది. ఎంపీ లాండ్స్ నుండి రూ. 10 లక్షలను ఎంపీ హరిబాబు ఇచ్చారు. ఈ గ్రౌండ్ లో అండర్ 12, అండర్ -14, అండర్ 16 కేటగిరీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కోరమండల్ ఎండీ సమీర్ గోయల్ టెన్ టివితో మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి తాము సహకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

భూముల కబ్జాకు యత్నం - జాన్ వెస్లీ..

హైదరాబాద్ : కంటోన్మెంట్ లో భూముల కబ్జాకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేపడుతున్నారని టీమాస్ నేత జాన్ వెస్లీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీ మాస్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. కేసీఆర్ ప్రయత్నాలను ప్రజలందరూ ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 

కేసీఆర్ కు తమ్మినేని లేఖ...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖ రాశారు. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని లేఖలో కోరారు. ఇటీవలి కాలంలో ఖైదీల విడుదల ప్రక్రియ జరుగలేదని, విడుదల చేస్తామని మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలు మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యాల పాలవుతున్నారని, ఏడేళ్లు శిక్ష పూర్తి చేసుకుని సత్ ప్రవర్తన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. 

16:14 - November 5, 2017

హైదరాబాద్ : సోమవారం నుండి ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో వ్యవసాయానికి ముఖ్యమంత్రి 24గంటల విద్యుత్ సరఫరాకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. విద్యుత్ సరఫరాపై చర్చించారు. ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరాలో లోటు పాట్లను అంచనా వేయనున్నారు. లోటుపాట్ల అంచనాలతో 2018 ఏప్రిల్ నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

16:04 - November 5, 2017

కడప : వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఇడుపులపాయ నుంచి జగన్‌ యాత్ర ప్రారంభంకానుంది. దాదాపు ఏడు నెలల పాటు...మూడు వేల కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. జగన్‌ యాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. వైసీపీ అధినేత జగన్‌ చేయనున్న ప్రజా సంకల్ప యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా కడపకు వెళ్లనున్నారు. సోమవారం ఇడుపులపాయలో దివంగత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. పాదయాత్రను ప్రారంభించనున్నారు. తొలుత కడప జిల్లా పులివెందుల-కమలాపురం-జమ్మలమడుగు-పొద్దుటూరు-మైదుకూరు నియోజకవర్గాల్లో ఏడు రోజులు పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత కర్నూలులోని ఏడు నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగుతుంది.

మొత్తం 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల పాటు జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఐదు వేలకుపైగా సమావేశాలు.. 180 సంఘాలతో సభలు.. 125 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో జగన్‌ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

ప్రతి రోజూ ఎనిమిదన్నర నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పాదయాత్ర సాగుతుంది. 12 గంటల 30 నిమిషాల నుంచి మూడు గంటల వరకు భోజన విరామం... మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి ఓ అరగంట పాటు కార్యకర్తల సమావేశం జరుగుతుంది. తిరిగి మూడున్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకూ పాదయాత్రను కొనసాగిస్తారు. జగన్‌ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. వైసీపీ ముఖ్యనేతలు డీజీపీ సాంబశివరావును కలిసి.. జగన్‌ పాదయాత్రకు సంబంధించి.. రూట్‌ మ్యాప్‌ను, వివరాలను తెలియజేశారు. దీంతో.. డీజీపీ పాదయాత్రకు అనుమతులు మంజూరు చేశారు. జగన్‌ యాత్ర కొనసాగే జిల్లాల్లో రెండు రోజుల ముందు ఆయా జిల్లాల ఎస్పీలకు వైసీపీ నేతలు రూట్ మ్యాప్‌లను అందించనున్నారు. 

15:31 - November 5, 2017
15:23 - November 5, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇటీవలే టి.టిడిపికి రాజీనామా చేసిన టి.కాంగ్రెస్ లో చేరిన రేవంత్ పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం టి.కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు..కార్యకర్తలు టి.కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని, మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. వ్యవసాయంలో పంటకు ఎలా 'గులాబీ' చీడ పట్టుకుంటుందో రాష్ట్రానికి కూడా ఆ చీడ పట్టుకుందని, దీనిని నుండి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. 

15:16 - November 5, 2017

కడప : తన బిడ్డకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలని..చరిత్ర సృష్టించే విధంగా పరిపాలన చేస్తాడని దివంగత వైఎస్ సతీమణి విజయమ్మ పేర్కొన్నారు. రేపటి నుండి జగన్ పాదయాత్ర జరుపుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆరోగ్య శ్రీ ఈ మాత్రమైనా నడుస్తుందా ? అంటే వైసీపీ ఉండడమే అని తెలిపారు. ఆనాడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉండబట్టే రాజన్న కూతురిగా షర్మిల పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. పాదయాత్ర చేయడం వల్లే కొంత ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, షర్మిలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఎన్ని కష్టాలు..ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ ప్రజల పక్షాన పోరాడుతున్నాడని..పాదయాత్ర చాలా కష్టమైందన్నారు. రాజశేఖరరెడ్డికి ఎలాగైతే బ్లూ ప్రింట్ ఎలా ఇచ్చారో జగన్ కు కూడా అలాగే ఇవ్వాలని, తన బిడ్డను అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆదరణ వల్లే వైసీపీ ఇంతకాలం ఉందని..ఇందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి జగన్ కు అధికారం ఇచ్చి చూడాలని..చరిత్ర సృష్టించే పనులు చేస్తాడని పేర్కొన్నారు. 

జగన్ పాదయాత్రను ఆదరించాలన్న విజయమ్మ..

కడప : రేపటి నుండి ప్రారంభమయ్యే జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరించాలని దివంగత వైఎస్ సతీమణి విజయమ్మ పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మూడున్నర ఏళ్లలో ఎలాంటి హామీ నెరవేర్చలేదన్నారు. 

14:42 - November 5, 2017
14:37 - November 5, 2017

విజయవాడ : ఓ వైపు వైసీపీ అధినేత వైఎస్.జగన్ పాదయాత్రకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఆ పార్టీ నేతలు అధికార పార్టీ సైకిల్ ఎక్కేస్తున్నారు. పాదయాత్రకు ధీటుగా అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్‌కు ఆకర్షితులవుతున్నారు. తాజాగా రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొంతమంది ఇదే బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఈనెల 6 నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో 6 నెలలపాటు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. జగన్ పాదయాత్రతో పార్టీలోనూ కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే ఆ ఉత్సాహానికి చెక్‌ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది అధికార టీడీపీ . ఆపరేషన్ ఆకర్ష్‌తో మరోసారి తెరపైకి తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సైకిలెక్కడంతో టీడీపీ వ్యూహం ఫలించింది.

వైసీపీ నుండి టీడీపీకి ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరికతో ఆ సంఖ్య 22కి చేరింది. అయితే ఈ సంఖ్యను టీడీపీ మరింత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో జగన్ పాదయాత్ర మొదలుకానున్న నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆకర్షణ వలలో పడేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుండి ఇద్దరు, రాయలసీమ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ కలగట్ల వీరభద్రస్వామి సైతం సైకిల్ ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఈనెల 6లేదా.. 12న టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది అసంతృప్త వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెత్తానికి అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రభావం మరోసారి వైసీపీ పై పడింది. పాదయాత్రతో యాక్టివ్ మూడ్‌లో ఉన్న పార్టీలో నేతల జంపింగ్ కలవరం సృష్టిస్తోంది. మరికొంతమందిని కోల్పోతే పార్టీ పరిస్థితి ఏంటనే అందోళనలో ఉన్నారు వైసీపీ శ్రేణులు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

14:34 - November 5, 2017

విజయవాడ : బందరురోడ్డులో రైతుబజార్‌ గేటు మూయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావు, ఐద్వా మహిళా నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను చైనా కంపెనీకి దారాదత్తం చేసిన పాలకులు... ఇప్పుడు రైతు బజారును కూడా తొలగించేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు బాబురావు. చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ గేటును తెరిపించాలని పలువురు డిమాండ్‌ చేశారు. 

14:33 - November 5, 2017

రంగారెడ్డి : జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ సమీపంలో ఫామ్‌హౌస్‌లపై పోలీసులు దాడులు చేశారు. సలీం గార్డెన్‌లోని ఫామ్‌హౌస్‌లో 11 మంది పేకాటరాయుళ్లు, హుక్కా సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 24,150 రూపాయలు, 10 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

 

14:17 - November 5, 2017

హైదరాబాద్ : ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని ప్రొ.కంచ ఐలయ్య అకాంక్షించారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన టీమాస్ ఆవిర్భాసభలో ఆయన మాట్లాడారు. కారల్ మార్క్స్ వారసత్వాన్ని ఐక్యంగా తీసుకుని దేశాన్ని మార్చబోతున్నామని.. దీన్ని ఎవరూ అపలేరని అన్నారు. అందరూ ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీస్ మీడియం కోసం మహిళలు పోరాటం చేయాలన్నారు. కవిత, కేటీఆర్ కంటే మీ పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడాలన్నారు. కవిత, కేటీఆర్ లు మంచి ఇంగ్లీష్ మాట్లాడరని చెప్పారు. టీమాస్ అందరకీ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో టీమాస్ సభ్యులు పోటీ చేస్తారనని...తాను పోటీ చేయనని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతానని చెప్పారు. 

14:07 - November 5, 2017

విశాఖ : ఆంధ్రా ఊటీ అరకులో పర్యాటకం ఊపందుకుంది. అరకు అందాలను చూడటానికి పర్యాటకులు క్యూలు కడుతున్నారు. ఓ వైపు అద్దాల ట్రైన్‌ జర్నీని మిస్‌ అవుతున్నామంటూనే.. వలసపూల సోయగం మనసును మైమరపింపజేసిందంటున్నారు. పర్యాటకులు, వలసపూల సోయగాలతో పాటు కొండల్ని తాకే మబ్బులపై మనమూ ఓ లుక్కేద్దాం.
ఊపందుకున్న టూరిజం 
అరకు.. ఈ పేరు వినగానే చుట్టూ కొండలు, మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే పచ్చదనం కళ్లలో మెదలుతుంది. ప్రకృతి కాన్వాస్‌పై సృష్టించిన అద్భుత రమనీయ దృష్యాలు మనసులో ఊపిరి పోసుకుంటాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే హేమంత రుతువులో ఇక్కడ కనిపించే అందాలే వేరు. కొండలను తాకుతున్నట్లుగా కనిపించే మబ్బులు. గళగళ పారే సెలయేర్లు ఇలా ఎన్నో అందాలకు అరకు పెట్టింది పేరు. శీతాకాలంలో తుంపర్లుగా పొగ మంచు కురుస్తూ ఉంటే అదే సమయంలో పసుపు వర్ణంలో ఉండే వలస పూలతో అరకు లోయంతా నిండిపోతుంది. చాపరాయి, ఇతర జలాశయాలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. నవంబర్‌ మొదటి వారం నుండి టూరిజం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, బెంగాల్‌, ఒడిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. 
పూర్తిగా డ్యామేజ్‌ అయిన కేకే లైన్‌
ప్రకృతి ఇంత అందంగా కనిపిస్తున్న సమయంలో ట్రైన్ జర్నీ చేస్తే వచ్చే ఆ మజానే వేరు. కొండల నడుమ వేసిన టన్నెల్స్‌లో నుంచి ట్రైన్‌ వెళ్తోంటే ఆ థ్రిల్‌ను మాటల్లో వర్ణించలేము. కానీ ఆ థ్రిల్‌ను పర్యాటకులు మిస్‌ అవుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కేకే లైన్‌ పూర్తిగా డ్యామేజ్‌ అయ్యింది. దీంతో ట్రైన్ రాకపోకలను నిలిపేశారు. ఈ కేకే లైన్‌ను పునరుద్ధరించడానికి రెండు నెలలకు పైగా సమయం పడుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ సీజన్‌ అంతా యాత్రికులకు ట్రైన్ టూర్‌ అందుబాటులో లేకుండా పోయింది. ట్రైన్ ప్రయాణం లేకపోయినా అరకు వలసపూలను ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్‌ చేశామని యాత్రికులంటున్నారు. మొత్తానికి పర్యాటకుల రాకతో అరకులో మరింత సందడి కనిపిస్తోంది. ప్రకృతి రమనీయత.. సందర్శకుల కోలాహలం ఇక్కడి వాతావరణాన్ని మరింత అందంగా మార్చేసింది. 

 

14:05 - November 5, 2017

సూర్యాపేట : జిల్లాలో నష్టపరిహారం కోసం ఓ రైతు ఆందోళనకు దిగాడు. జిల్లాలోని యండ్లపల్లిలో రైతు కృష్ణయ్య...దోమకాటుతో నష్టపోయిన వరిపంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేయకపోతే దూకుతానని బెదిరిస్తున్నాడు. 

ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో కేసీఆర్ చర్చలు...

హైదరాబాద్ : రేపటి నుండి ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. 2018 ఏప్రిల్ నుండి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశించారు. 

టిడిపికి బంపర్ మెజార్టీ - బుద్ధా వెంకన్న...

విజయవాడ : రాష్ట్రంలో శ్రీరాముడు పాలన సాగుతుంటే ఏం చేయాలో తెలియక రాక్షసుడు పాదయాత్ర చేస్తున్నాడని పరోక్షంగా జగన్ నుద్దేశించి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. పాదయాత్ర చేపడుతున్న జగన్ ను ప్రజలు నిలదీయాలని, అసెంబ్లీకి హాజరు కావద్దనే దురుద్దేశంతోనే యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే వారికదే చివరి అసెంబ్లీ అని, ఓదార్పు యాత్రతో టిడిపి సూపర్ హిట్ మెజార్టీ వచ్చిందని..ప్రజా సంకల్ప పాదయాత్రతో 2019లో టిడిపి బంపర్ హిట్ మెజార్టీ వస్తుందన్నారు. 

మల్కాజ్ గిరి కార్పొరేటర్ తనయుడు అరెస్టు..

మేడ్చల్ : మల్కాజ్ గిరి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అమ్మాయిలను వేధించిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. 

మాంసాహారం పెట్టలేదని కడియం ఆగ్రహం..

వరంగల్ అర్బన్ : ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని కస్తూర్బా పాఠశాలలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఎల్కతుర్తిలో ఆదివారం విద్యార్థులకు మాంసాహారం పెట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను తొలగించాలని ఆదేశిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్ వో, అకౌంటెంట్ కు మెమో జారీ చేశారు. 

14:00 - November 5, 2017

సౌదీ : పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. అవినీతికి పాల్పడ్డ వారినెవరిని వదలొద్దన్న రాజు ఆదేశాల మేరకు ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టులకు ముందు సౌదీ నేషనల్‌ గార్డ్‌ హెడ్‌, నేవీ చీఫ్‌, ఆర్థిక శాఖ మంత్రులను.. రాజు పదవుల నుంచి తొలగించారు. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.

 

13:57 - November 5, 2017

యూపీ : భారత్‌లో మరో విదేశీ పర్యాటకుడిపై దాడి సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని రాబర్ట్స్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. జర్మనీకి చెందిన హాల్గర్‌ ఎరిక్‌.. రాబర్ట్స్‌గంజ్‌ స్టేషన్‌లో ఉన్నప్పుడు.. సహాయం సాకుతో అమన్‌ కుమార్‌ అనే వ్యక్తి వేధింపులు మొదలుపెట్టాడు. ఒక దశలో ఎరిక్‌ను కొట్టి, కిందపడేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇటీవలే ఆగ్రాలో తమతో సెల్ఫీ దిగలేదన్న సాకుతో కొందరు యువకులు స్విట్జర్లాండ్‌కు చెందిన జంటను చితక్కొట్టిన ఉదంతం ఇంకా చల్లారకముందే.... మరో టూరిస్టుపై దాడి జరిగింది.

13:55 - November 5, 2017

సంగారెడ్డి : ఉదయం లేచింది మొదలు వాళ్ల కళ్లు ఖాజీ స్థలాల కోసం వెదుకుతాయి. జాగా కనిపిస్తే చాలు అడ్డంగా కబ్జా చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలే కాదు.. చెరువులు, కాలువలను సైతం వదలరు. అధికారుల అండదండలతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపే లేదు. అయితే... భూకబ్జాదారుల అక్రమాలపై తెర్లాపూర్‌ గ్రామస్తులు స్పందించారు. అందరూ ఏకమై ఎన్జీటీని ఆశ్రయించారు. కబ్జాదారుల చెరలో ఉన్న భూములను విడిపించడమే కాకుండా... అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలకు పట్టుబడుతున్నారు.

భూకబ్జాకోరుల అక్రమాలకు అంతే లేకుండాపోతుంది. ఎక్కడ చిన్న స్థలం కనిపించినా.. అది ప్రభుత్వ భూమైనా... ప్రైవేట్‌ భూమైనా చివరకు చెరువులైనా సరై ఆక్రమించుకొని.. అమ్ముకోవడం నిత్యకృత్యంగా మారింది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, కొల్లూరు ప్రాంతాల్లో అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. 

ఈ ప్రాంతాలన్నీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో భూకబ్జాదారుల కళ్లు ఖాళీ స్థలాలపై పడుతోంది. వీరికి అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో ఆక్రమణలకు అంతేలేకుండాపోతుంది. ఇప్పుడు తాజాగా ఇదే కోవలోకి చేరింది తెల్లాపూర్‌ గ్రామం. ఇక్కడ కూడా అనేక ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి. ముఖ్యంగా చెరువుల భూములను పెద్దపెద్ద సంస్థలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాయి. గత కొంతకాలంగా ఇలాంటి అక్రమాలు జరుగుతుండడంతో గ్రామస్తులు, యువకులు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జీఎన్టీ... సీనియర్‌ అడ్వకేట్‌ ప్రతాపరెడ్డి, తమిళనాడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ కాంతిమతినాధన్‌లతో కమిటీ వేసింది. పరిసర ప్రాంతాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆ కమిటీ తెల్లాపూర్‌ ప్రాంతంలో పర్యటించింది. 

తమ పిటిషన్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్పందించడంపై పిటిషన్‌దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించి.. చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ ఠాకూర్‌ రాజ్‌కుమార్‌సింగ్‌ కోరుతున్నారు. 

చిన్న చిన్న సంస్థలే కాకుండా...ప్రియా సిమెంట్‌, ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్‌, ఏలియన్స్‌ స్పేస్‌ స్టేషన్‌లాంటి పెద్దపెద్ద సంస్థలు కూడా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాయని గ్రామస్తులు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఈ అక్రమాలకు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల అండదండలే కారణమని ఆరోపిస్తున్నారు. 

చెరువులలో నిర్మించిన అనేక నిర్మాణాలను ట్రిబ్యునల్‌ కమిటీ పరిశీలించింది. వాస్తవ పరిస్థితులన్నీ నివేదికలో పొందుపరిచి ట్రిబ్యునల్‌కు అందచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. 

ధ్వంసమై పోతున్న నీటి వనరులను కాపాడాలన్న స్పృహ ప్రజాప్రతినిదులు, అధికారులకు లేకున్నా గ్రామస్తులు స్పందించారు. మరి దీనిపై ఎన్జీటి ఎలా స్పందిస్తుందో చూడాలి ! 

 

13:52 - November 5, 2017

విజయవాడ : కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని.. టీడీపీ టీచర్స్‌ ఎమ్మెల్సీ రామకృష్ణ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయనతో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. విద్యా సంస్థల్లో అమలు చేయాల్సిన విధివిధానాలపై చక్రపాణి కమిటీ ఇచ్చిన సూచనలను పాటించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో దిగజారిపోతున్న ప్రమాణాలు, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ తదితర అంశాల మాట్లాడారు. 

13:50 - November 5, 2017

చిత్తూరు : ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రోజా, జబర్దస్‌ టీమ్‌ మెంబర్స్‌ శ్రీనివాసుడిని దర్శించకున్నారు. అలాగే ఒకనాటి హీరోయిన్‌ రాధిక.. ఆమె భర్త శరత్‌కుమార్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు రోజా, రాధికతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. 

 

13:48 - November 5, 2017

జగిత్యాల : జిల్లాలోని మెట్‌పల్లి మండలం ఆరపేటలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దశరథ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. భూవివాదంలో తన తండ్రి రాజారెడ్డిని పీఎస్‌కు పిలిచారనే అవమానంతో దశరథ్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ... మెట్‌పల్లి మండలం ఆరెపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. 

సెల్ టవరెక్కిన రైతన్న

సూర్యాపేట : జిల్లాలో కృష్ణయ్య అనే రైతు సెల్ టవర్ ఎక్కాడు. దోమపోటు కారణంగా తన వరి పంట నశనమైందని తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. తనకు నష్టపరిహారం చెల్లించకుంటే చవే దిక్కని వాపోయాడు. 

13:45 - November 5, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో చొరబాటుదారులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని సైన్యం అడ్డుకొంది. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. పారిపోయిన మిగతా తీవ్రవాదుల కోసం ఆర్మీ గాలింపు చేపట్టింది. 

13:40 - November 5, 2017

ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా పాదయాత్ర చేసే హక్కు ఉంటుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ పాల్గొని, మాట్లాడారు. పాదయాత్ర చేయొద్దని అధికారం ఎవరికీ లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:35 - November 5, 2017

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్‌లో దళారుల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది. తాము చెప్పిన ధరకే విక్రయించాలని దళారులు డిమాండ్ చేయడంతో.... రైతులు అందుకు ససేమిరా అన్నారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. రైతుల సరుకు కొనేందుకు దళారులు ముందుకు రాకపోవడంతో... మార్కెట్‌  యార్డులో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అటు కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. రాత్రికి రాత్రే ధరలు తగ్గించి.. తాము చెప్పిన రేటుకే సరుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. దళారులపై రైతులు మండిపడ్డారు. 

ఏపీలో శ్రీరాముడి పాలన :బుద్దా

గుంటూరు : ఏపీలో శ్రీరాముడి పాలన సాగుతుంటే ఏ్ం చేయాలో తెలియక రాక్షసుడు పాదయాత్ర చేస్తున్నాడని ఎమ్మెల్సీ బుద్దా వెకన్న అన్నారు. ప్రజాధనాన్ని దోచుకుని పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రజలు నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. జగన్ ఇడుపూలపాయ నుంచి ఇచ్చాపురం వెళ్లేలోపు జైలుకెళ్లడం ఖాయమని బుద్దా ఎద్దేవా చేశారు. 

13:33 - November 5, 2017

కామారెడ్డి : జిల్లాలోని బాన్స్‌వాడలోని సంగమేశ్వర కాలనీలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. సీసీ ఫుటేజి ఆధారంగా పిట్లంకు చెందిన ముగ్గురు మహిళలు... లోకేశ్‌ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లు గంగమణి, గంగవ్వ, అవుసుల గంగమణిలపై పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

13:24 - November 5, 2017

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్‌లో దళారుల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది. తాము చెప్పిన ధరకే విక్రయించాలని దళారులు డిమాండ్ చేయడంతో.... రైతులు అందుకు ససేమిరా అన్నారు. దీంతో మార్కెట్‌  యార్డులో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. 

 

13:17 - November 5, 2017

తమిళనాడు : భారీవర్షాలు చెన్నైని అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
చెన్నైలో స్తంభించింన జనజీవనం 
ఈశాన్య రుతుపవనాల కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నైలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
జలదిగ్బంధంలో చెన్నై శివారు ప్రాంతాలు 
చెన్నై శివారు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని పలు కాలనీల్లో వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాంచిపురం జిల్లాలోని  పళ్లికరణై, నామంగళం, ఊరపాక్కం, కొండగియూర్, మణిమంగళం, మేడవాక్కం, తిరువళ్లూరు జిల్లాలోని ఆవడి, పూందమల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా చెన్నయ్‌లో స్కూళ్లు, కళాశాలలు, ఐటి సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.
ప్రభుత్వం అప్రమత్తం 
2015లో వరద తుఫాను నుండి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రహదారుల్లో... గృహాల్లోకి చేరుకున్న వర్షపునీటిని కార్పోరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించటంతో పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇతర మంత్రులు వరద ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. 
పునరావాస కేంద్రాలకు తరలింపు 
అధికారులు 10 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం 122 ప్రత్యేక శిబిరాలు చేసింది. వారికి ఆహారం, మంచినీరు, దుప్పట్లు, అందజేస్తోంది. పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సిఎం వరదబాధితులకు ఆహారాన్ని అందించారు. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 2015లో చెన్నైలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

13:15 - November 5, 2017

విశాఖ : శ్రీలంక, తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి అల్పపీడనద్రోణిగా మారింది. శనివారం నాటికి ఇది దక్షిణ కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడుతో పాటు రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

కోహ్లికి ప్రముఖుల శుభకాంక్షలు

రాజ్ కోట్ : భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రముఖులు బర్త్ డే విశేష్ తెలిపారు. ఛేజ్ మాస్టర్, మోడ్రస్ మాస్టర్, ది రన్ మెషీన్ కోహ్లి హ్యాపీ బర్త్ డే అని ఆకాశ్ చోప్రా, రివెంజ్ నంబర్ వన్ హ్యాపీ బర్త్ డే స్కిప్పర్ అని హార్దిక్ పాండ్యా, ఈ మోడ్రన్‌ శకంలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన విరాట్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలని శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్‌ ట్వీట్ చేశారు.

 

12:57 - November 5, 2017

హైదరాబాద్ : చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. చిన్నారులను లైంగికంగా వేధించేవారి గురించి సమాచారం ఇస్తే కఠినంగా శిక్షిస్తామని నాయిని చెప్పారు. తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాగో, బద్లో, బోలో ప్రచార కార్యక్రమాన్ని డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరోయిన్‌ రాశీఖన్నా, నటి అమల, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత సురేశ్ బాబు, గాయని సునీత తదితరులు హాజరయ్యారు. లైంగిక వేధింపులపై చిన్నారులు ప్రదర్శించిన నాటికలు ఆలోచింపజేశాయి. 

 

ఎస్ఐ బెదిరించాడని యువకుడి ఆత్మహత్య

కరీంనగర్/జగిత్యాల : జిల్లా మెట్ పల్లి మండలం అరెపేటలో దశరథం రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భూతగాదాల విషయంలో మెట్ పల్లి ఎస్ఐ బెరించడంతోనే దశరథం ఆత్మహత్య చేసుకున్నారని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.

12:52 - November 5, 2017

గుజరాత్ : రెండో టీ20లో న్యూజిలాండ్‌ మెరిసింది. టీమ్‌ ఇండియాపై అద్భుత విజయం సాధించింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్‌ 40 పరుగుల తేడాతో గెలుపొందింది.  దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌జట్టు 196 పరుగులు చేసింది.  కివీస్‌ బ్యాట్‌మెన్‌ కొలిన్‌ మన్రో వీరవిహారం చేశాడు.  58 బంతుల్లోలనే 109 రన్స్‌ చేశాడు. మార్టిన్‌ గప్తిల్‌ 45రన్స్‌ చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా... మొదటి నుంచి తడబడింది.  కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ 65 రన్స్‌, ఎంఎస్‌ ధోని 49 రన్స్‌ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ నాలుగు వికెట్లు తీసి భారత్‌ నడ్డివిరిచాడు. కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మన్రోకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సిరీస్‌ 1-1తో సమం కావడంతో మంగళవారం తిరువనంతపురంలో జరిగే మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక రెండు జట్లు చావోరేవో అక్కడే తేల్చుకోనున్నాయి. 

12:34 - November 5, 2017

హైదరాబాద్ : తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ నియామకంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ ఈనెల 12న పదవీ విరమణ చేయనుండడంతో నూతన డీజీపీ నియామకంపై సర్కార్ దృష్టి సారించింది.  పలువురు సీనియర్‌ అధికారుల పేర్లు తెరమీదకు వచ్చినా... అందరూ ఊహించినట్టే హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డివైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డి!
తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరన్న దానికి ప్రభుత్వం తెరదింపినట్టు తెలుసతోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ ఈనెల 12న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 1986 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. 
యూపీఎస్సీకి పంపే జాబితా కసరత్తు పూర్తి
యూపీఎస్సీకి అర్హులైన ఆరుగురు సీనియర్‌ అధికారుల పేర్లను పంపాల్సి ఉండగా... అందుకు కసరత్తు పూర్తి అయ్యింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆరుగురు అధికారులు డీజీపీ రేసులో నిలిచారు. 1983 నుంచి 86 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌లు డీజీపీ పదవికి పోటీలో ఉన్నారు.  ఇందులో అత్యంత సీనియర్‌గా తేజ్‌దీప్‌కౌర్‌, ఆమె తర్వాతి స్థానంలో 1984 బ్యాచ్‌కు చెందిన సుదీప్‌ లక్టాకియా, డాక్టర్‌ ఈష్‌కుమార్‌, తెలంగాణ హోంసెక్రెటరీ రాజీవ్‌ త్రివేది, నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌ అలోక, కృష్ణ ప్రసాద్‌లు రేస్‌లో ఉన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ తిరిగి రాష్ట్రానికి అందజేస్తుంది. అందులో ఒక్కరిని డీజీపీగా నియమిస్తారు. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి నియమనిబంధనలు ప్రభుత్వాలు పాటించలేదు. ముందుగా సీనియర్‌ అధికారిని ఇంచార్జీ డీజీపీగా నియమించి.. ఆ తర్వాత పదవి విరమణ అయిపోయాక రెగ్యులర్‌ డీజీపీని నియమిస్తారు.  తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదటి పోలీస్‌ బాస్‌ నియామకం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. హైదరాబాద్‌ సీపీగా ఉన్న అనురాగ్‌శర్మను డీజీపీగా నియమించి.. ఆ తర్వాత అతడినే పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగించింది. ఈసారి కూడా అదే పంథాను తెలంగాణ ప్రభుత్వం పాటించనుంది. ప్రస్తుత హైదరాబాద్‌ సీపీగా మహేందర్‌రెడ్డినే ఇంచార్జీ డీజీపీగా నియమించి.. తర్వాత ఆయనే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే యోచనలో ఉంది. ఈనెల 10న ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేయనుంది.
మహేందర్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌!
డీజీపీ రేసులో ప్రధాన పోటీ దారుడిగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి క్రిష్ణప్రసాద్‌ ఎన్నిక ఖరారు అయినట్టు సామాజిక మాధ్యమాల్లో మొదట ప్రచారం సాగింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని క్రిష్టప్రసాద్‌ ట్విట్టర్‌లో ఖండించారు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. దీంతో మహేందర్‌రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది.

 

12:30 - November 5, 2017

నిజామాబాద్‌ : ముంచే ప్రాజెక్టులు మాకొద్దు.. భూములు, నివాసాలు వదిలి ఎక్కడికి పోవాలి..? అరకొర పరిహారంతో బతికేదెలా..? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మంచిప్ప రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. మల్లన్నసాగర్‌ తరహా ఉద్యమానికి మరోసారి సిద్ధమవుతామని తేల్చి చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేస్తున్న చెరువుల అనుసంధానంపై నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఆందోళన బాటపట్టారు. మంచిప్ప- కొండమ్మ చెరువు లింక్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
కొండెం చెరువు సమీపంలో రిజర్వాయర్‌ వద్దు
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు అధికారులను నిలదీశారు.  కొండెం చెరువు సమీపంలో రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ 3.5 టీయంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. 2లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 400 కోట్లతో ప్రభుత్వం ఈ రిజర్వాయరును నిర్మిస్తోంది. దీనివల్ల మంచిప్ప అమ్రాబాద్ బైరాపూర్‌, బాడ్సి గ్రమాలకు చెందిన 800 ఎకరాల అటవీ భూములు ముంపుకు గురైతున్నాయి. దాంతోపాటు 650 నివాసాలు, రెండు వేల ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయి. గతంలో ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు 21 ప్యాకేజీ ప్రకారం ..నిర్మాణ పనులకు తాము ఒప్పుకున్నామని.. అయితే  పాత డిజైన్లను పూర్తిగా మర్చేయడంతో తాము నష్టపోతున్నామని నిర్వాసితులు అంటున్నారు. కొత్త డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకునేది లేదంటున్నారు.  
బతుకుదెరువు పోతోందని ఆవేదన 
తాము అడవిని నమ్ముకొని జీవిస్తున్నామని, మంచిప్ప రిజర్వయర్‌ నిర్మాణంతో తమకు బతుకుదెరువు పోతోందని స్థానిక  గిరిజనప్రజలు అంటున్నారు. తమకు 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. నిర్వాసితులకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరగేవరకు పోరాడతామంటున్నారు. 
భూములు మునిగితే గొర్రెలు,బర్రెలకు మేత ఎక్కడ
ప్రాజెక్టు నిర్మాణతో తమ భూములన్నీ ముంపునకు గురవుతున్నాయని.. ఇక ప్రభుత్వం ఇస్తున్న గొర్రెలు, బర్రెలను ఎక్కడ మేపుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  భూమికి భూమి, ఇల్లుకు బదులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని.. తమ గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. 
మల్లన్నసాగర్‌ తరహాలో మరోసారి ఉద్యమం..!
మొత్తానికి మంచిప్ప రిజర్వాయర్‌ను  ముంపు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. మంచిప్ప రిజర్వాయర్‌ పోరాటం మరో మల్లన్న ప్రాజెక్టు ఉద్యమంగా మారుతుందని స్థానికులు తేల్చి చెబుతున్నారు. 

 

12:18 - November 5, 2017

హైదరాబాద్ : మొన్న సేవాదల్... నిన్న జనసైనికులు... నేడు సమన్వయకర్తలు... ఇలా వరుస ఎంపికలు చేస్తూ జనసేనాని తన వేగం పెంచుతున్నాడు.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పార్టీపైనా ఫోకస్ పెట్టాడు. పక్కా ప్రణాళికతో పార్టీ నిర్మాణ పక్రియ పనులన్నీ కానిచ్చేస్తున్నాడు. అతిత్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా.. ప్రజల్లో తిరుగుతానంటూ ప్రకటించిన పవన్ అందుకు కావాల్సిన గ్రౌండ్ వర్కు పూర్తి చేస్తున్నారు.
త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పవన్‌ పర్యాటన
జనసేన పార్టీ నిర్మాణంలో అధినేత పవన్‌ కల్యాణ్‌ తన వేగాన్ని పెంచారు. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు,  రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు పవన్. అంతేకాదు..  2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ అందుకు కావల్సిన గ్రౌండ్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జనసైనికుల ఎంపికలు పూర్తి చేసిన పవన్.. ఇప్పుడు పార్టీ సమన్వయకర్తల ఎంపికకు శ్రీకారం చుట్టారు. పార్టీ తరపున పనిచేసేందకు సమన్వయకర్తల ఎంపికలు చెయ్యాలని నిర్ణయించారు. దీంతో పార్టీ సమన్వయకర్తల నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది జనసేన టీమ్‌.   
జనసైనికుల డేటా సేకరణ
జనసేన ఔత్సాహక శిబిరాల ద్వారా పార్టీ కోసం పనిచేసే అరవై వేల మంది జనసైనికుల డేటాను ఇప్పటికే సేకరించింది. వీరిలో ఎనిమిది వేలమందితో తొలి జాబితా సిద్ధంగా ఉంది. ఈ ఎనిమిది వేల మందిని ఇకపై జనసేన ఔత్సాహిక శిబిరాలకు వినియోగించనుంది. కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు వీరందరిని ఆయా సందర్బాలు, ప్రాంతాల వారీగా  ఉపయోగించుకోనుంది జనసేన. అయితే ఇప్పుడు వీరినుండి కొంత మందిని పార్టీ సమన్వయకర్తలుగా నియమించాలని భావిస్తున్నారు పవన్‌.  వీరిలో పార్టీకోసం పనిచేందుకు ఎంతమంది సిద్ధంగా వున్నారో తెలుసుకుని వారిలో అర్హలైన వారిని సమన్వయ కర్తలుగా ఎంపిక చెయ్యనున్నారు. ఈ ఎంపిక పక్రియ ఈ నెల 6 నుంచి  ప్రారంభంకానుంది. మొదటి విడతలో భాగంగా   శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకూ  ఎంపిక పక్రియ జరగనుంది. ఇందుకోసం పార్టీ టీమ్‌ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుంది. అయితే 6 వ తేది నుండి ప్రారంభమయ్యే ఈ సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని జనసేన ప్రణాళిక సిద్ధం చేసింది.
సమన్వయకర్తలకు సమగ్రమైన శిక్షణ 
ప్రస్తుతం ఈ సమన్వయకర్తల నియామకాలు పార్లమెంట్ నియోజకర్గాల పరిధికి మాత్రమే పరిమితమై ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 పార్లమెంట్ నియోజకర్గాలకు దాదాపు 840 మంది సమన్వయకర్తల ను ఎంపిక చెయ్యనున్నారు. అంటే ఒక్కో నియోజకర్గానికి 20 మంది సమన్వయకర్తలు ఉంటారు. అయితే  సందర్భానుసారంగా  ఈ సంఖ్య పెరిగే అవకాశం  ఉంది. ఎంపికైన సమన్వయకర్తలకు సమగ్రమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అధినేత పవన్ కళ్యాణ్ వీరితో సమావేశమై దిశానిర్ధేశం చెయ్యనున్నారు. సమన్వయ కర్తలకు శిక్షణ ఇచ్చిన తరువాత స్పీకర్లు, అనలిస్టులు , కంటెంట్ రైటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి పార్టీ నిర్మాణంపై వేగవంతమైన అడుగులు వేస్తుంది జనసేన పార్టీ. 

12:09 - November 5, 2017

సిద్ధిపేట : అసెంబ్లీలో ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు. 14 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ప్రాజెక్టు మీదైనా కేసు వేశామని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. ఈ మూడేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని కేసులు వేసింది ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. జీవో 123 వద్దని వారించిన నాయకుల్ని చూపిస్తానని మీరు రాజీనామాకు సిద్ధమా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు హరీష్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుంటే రైతులను అడ్డుకునే విధంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూంలను ప్రారంభం చేశారు. అనంతరం మినీ స్టేడియంలో తెలంగాణ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ కార్యక్రమంలో పాల్గొని క్రికెట్‌ ఆడారు. 

 

11:29 - November 5, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బొలెరో వాహనంలో 55 మంది కూలీలు వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లి నుంచి పులిజాలకు పత్తి తీసేందుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో సాతాపూర్...పెద్దకొత్తపల్లి మధ్య బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించారు. 

 

11:25 - November 5, 2017

జగిత్యాల : పోలీస్ జులుంకు మరొకరు బలయ్యారు. భూతగాదా విషయంలో మెట్‌పల్లి ఎస్‌ఐ అశోక్‌ బెదిరించాడని మనస్తాపంతో.. ఆరెపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దశరథంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ... మెట్‌పల్లి మండలం ఆరెపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నాగర్ కర్నూలు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాతాపూర్...పెద్దకొత్తపల్లి మధ్య బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించారు. 

 

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

జగిత్యాల : సాఫ్ట్ వేర్ ఉద్యోగి దశరథంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. భూతగాద విషయంలో మెట్ పల్లి అకోశ్ ఎస్ ఐ బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. ఎస్ ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

11:02 - November 5, 2017

జగిత్యాల : జిల్లాలోని నూకపల్లి వరద కాలువ వంతెనపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 

 

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జగిత్యాల : జిల్లాలోని నూకపల్లి వరద కాలువ వంతెనపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 

 

10:56 - November 5, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రక్రియను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు 66 నిష్పత్తి 34 చొప్పున పంచుతూ నిర్ణయించింది. ఈ నిష్పత్తి ప్రకారం  ప్రస్తుత లభ్యత జలాల్లో ఏపీకి 217.8 టీఎంసీలు, తెలంగాణకు 112.2 టీఎంసీలు లభిస్తాయని స్పష్టం చేసింది.  ఈ కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు తమతమ పరిధిలోని ఇతర ప్రాజెక్టులకు, తమకు లభించే వాటాల్లోంచి నీటిని వినియోగించుకోవాలని తేల్చి చెప్పింది.
కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం
నగరంలోని జలసౌధలో శనివారం కృష్ణానదీ యాజమాన్యబోర్డు బోర్డు సమావేశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల  తాగు, సాగు నీటి అవసరాలపై  చర్చించింది.  బోర్డు ఛైర్మన్‌ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమతమ నీటి అవసరాలను బోర్డు ముందుంచాయి. తెలంగాణ 138.5 టీఎంసీలు కోరగా, ఏపీ 270 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది. ఈ సందర్భంగా చిన్న నీటి వనరుల అంశాన్ని ఏపీ లేవనెత్తింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ మేరకు తెలంగాణకు 89.11 టీఎంసీల  కేటాయింపు ఉందని, వాటిని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాలని కోరింది. 70 నిష్పత్తి 30 చొప్పున నీటిని పంచాలని కోరింది. అయితే దీనికి తెలంగాణ అంగీకరించలేదు. చిన్న నీటి వనరుల కింద 13 టీఎంసీలకు మించి వినియోగం లేదని వాదించింది. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి దీనిపై కల్పించుకున్న బోర్డు, ఈ ఏడాది తెలంగాణ చెబుతున్న చిన్న నీటి వనరుల వినియోగ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ....  66:34 నిష్పత్తిన పంచుతామని స్పష్టం చేసింది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. చిన్న నీటి లెక్కల వాస్తవ వినియోగాన్ని తేల్చందుకు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ సహాయాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయం జరిగింది. 
పట్టిసీమ అంశాన్ని చర్చకు తీసుకొచ్చిన తెలంగాణ
గోదావరి నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీ చేపట్టిన పట్టిసీమ అంశాన్ని తెలంగాణ మరోమారు సమావేశంలో ప్రస్తావించింది. గత ఏడాది పట్టిసీమ కింద 53 టీఎంసీల వినియోగం జరిగిందని, ఈ ఏడాది అదే రీతిన వినియోగం జరుగుతోందని బోర్డు దృష్టికి తీసుకొచ్చింది.  ఈ నీటిలో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాపై తేల్చాలని పట్టుబట్టింది. అయితే ఈ అంశంపై తేల్చే అధికారం బోర్డుకు లేదని, కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌-2 మాత్రమే దాన్ని తేల్చగలదని ఛైర్మన్‌ శ్రీవాత్సవ అభిప్రయపడ్డారు. అయితే అప్పటిరవకు తాత్కాలికంగా ఈ అంశాన్ని తేల్చందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
శ్రీశైలం కింద ఏపీ చేస్తున్న నీటి వినియోగంపై తెలంగాణ ఆగ్రహం
శ్రీశైలం కింద ఏపీ చేస్తున్న నీటి వినియోగం, చెబుతున్న లెక్కలకు పొంతన లేదని తెలంగాణ వాదించింది.  శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటికి, సాగర్‌కు చేరుతున్న జలాల మధ్య వ్యత్యాసం భారీగా ఉందని బోర్డు దృష్టికి తీసుకొచ్చింది.  సాధారణంగా నీటి నష్టాలు 7 నుంచి 10శాతం మాత్రమే ఉంటాయని, కానీ ఇక్కడ 30 నుంచి 40శాతం నీటి నష్టాలు కనబడుతున్నాయని తెలిపింది. తెలంగాణ వాదనలు విన్న బోర్డు.. నీటి నష్టాల లెక్కింపుపై ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నీటి నష్టాలపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించింది. ఉపసంఘంలో  ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ధికారులు ఇందులో ఉంటారు.
బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌పై భిన్నాభిప్రాయాలు
కృష్ణానదీ యాజమాన్య బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  తాము సూచిస్తున్న కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది వర్కింగ్‌ మాన్యువల్‌ రూపొందించాలని తెలంగాణ ప్రతిపాదించింది. ముఖ్యంగా ప్రాజెక్టుల వారీ కేటాయింపు లేకుండా ప్రాజెక్టుల నియంత్రణ వద్దని, పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని కోరింది. అయితే  దీనిపై  ఏకాభిప్రాయం కుదరకపోవడంతో  చర్చను బోర్డు వాయిదా వేసింది. ఇక టెలీమెట్రీ అంశాలు చర్చకు రాగా, మొదటి విడత ఇప్పటికే అమల్లో ఉందని, రెండో విడత టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు త్వరితగతిన ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. 
ఆరోపణలపై స్పందించిన బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ 
పోతిరెడ్డిపాడు దగ్గర అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ స్పందించారు.  పోతిరెడ్డిపాడు టెలీమెట్రీలటో ఎలాంటి సమస్యే లేదన్నారు. త్వరలోనే రెండోదశ టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తామన్నారు. తాము పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నామనడం సరికాదని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ , నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకు నేటి నుంచి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా కానుంది. 

 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు హరీష్, జోగు రామన్న పర్యటన

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న పర్యటించనున్నారు. నేడు సూర్యపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించనున్నారు. 

నేడు కడపలో వైసీపీ అధినేత జగన్ పర్యటన

కడప : ఈరోజు కడపలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. పెద్ద దర్గాను దర్శించుకోనున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు. 

నేడు పార్వేటి మండపం వద్ద కార్తీకమాసం వన భోజన మహోత్సవం

చిత్తూరు : తిరుమల నేడు పార్వేటి మండపం వద్ద కార్తీక మాసం వన భోజన మహోత్సవం జరుగనుంది. 

Don't Miss