Activities calendar

06 November 2017

ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు..షెడ్యూల్..

కడప : ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్‌ను ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగియనుంది.

 

టీఆర్ఎస్ లో కంచర్ల భూపాల్ రెడ్డి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో కంచర్ల భూపాల్ రెడ్డి చేరారు. మంత్రులు ఈటెల...కేటీఆర్..సమీక్షంలో ఆయన చేరారు. భూపాల రెడ్డిని నల్గొండ ఇన్ ఛార్జీగీ నియమిస్తున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణలో టిడిపి ఖాళీ - కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణలో టిడిపి పని అయిపోయిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టిడిపి నేతలు టీఆర్ ఎస్ లోకి క్యూ కడుతున్నారని, నల్గొండ జిల్లాలో బడా నేతలున్నా ఫ్లోరైడ్ సమస్యపై దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. 

నిర్ణయాత్మక మ్యాచ్‌...

ఢిల్లీ : టీ20ల్లో తిరుగులేని టీమిండియా... పవర్‌ ప్యాకెడ్‌ న్యూజిలాండ్‌ జట్లు అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి. 3మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి టీ20లో కివీస్‌ టీమ్‌తో కొహ్లీ అండ్‌ కో అమీతుమీ తేల్చుకోనుంది. 

21:32 - November 6, 2017

ఢిల్లీ : టీ20ల్లో తిరుగులేని టీమిండియా... పవర్‌ ప్యాకెడ్‌ న్యూజిలాండ్‌ జట్లు అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి. 3మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి టీ20లో కివీస్‌ టీమ్‌తో కొహ్లీ అండ్‌ కో అమీతుమీ తేల్చుకోనుంది. భారత జట్టు జోరుకు మరో సారి చెక్‌ పెట్టాలని కేన్‌విలియమ్‌సన్‌ నాయకత్వంలోని కివీస్‌ టీమ్‌ పట్టుదలతో ఉండగా....న్యూజిలాండ్‌పై తొలి టీ20 సిరీస్‌ నెగ్గాలని టీమిండియా తహతహలాడుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విరాట్‌ కొహ్లీ అండ్‌ కో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఆఖరి మ్యాచ్‌కు 20-20 ఫార్మాట్‌లో తొలి వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియాకు ...కేన్‌ విలియమ్‌సన్‌ సారధ్యంలోని కివీస్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది.3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమాన ఆధిక్యంలో నిలిచాయి. తొలి టీ20లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.ఢిల్లీ మ్యాచ్‌లో సునాయాసంగా నెగ్గిన భారత్‌ న్యూజిలాండ్‌పై ఎట్టకేలకు టీ20ల్లో తొలి విజయం నమోదు చేసింది. కానీ సెకండ్‌ టీ20లో మాత్రం టీమిండియా తేలిపోయింది.మున్రో సూపర్‌ సెంచరీ సాధించడంతో పాటు బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో న్యూజిలాండ్‌ జట్టు సెకండ్‌ టీ20లో టీమిండియాకు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది.

అత్యంత పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌....పవర్‌ఫుల్‌ బౌలింగ్‌ లైనప్‌ కలిగిన న్యూజిలాండ్‌ జట్టు ముందు చేతులెత్తేసింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమైతే టీమిండియా ఓటమి ఖాయమని రెండో టీ20తో మరోసారి రుజువైంది. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతేనే విరాట్ ఆర్మీ పనైపోయిందనుకుంటే పొరపాటే. రోహిత్‌, ధావన్‌ తిరిగి గాడిలో పడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు.కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో అనుమానమే లేదు. నిలకడగా రాణిస్తోన్న భువనేశ్వర్‌,బుమ్రాలపై భారత జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. ఆడిన తొలి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను తప్పించి....దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండేలలో ఒకరిని అదనంగా బ్యాట్స్‌మెన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. రెండో టీ20 విజయంతో సిరీస్‌ను సమం చేసిన కివీస్‌ టీమ్‌... ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గి తీరాలని తహతహలాడుతోంది. తొలి రెండు టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే నెగ్గడంతో....ఆఖరి మ్యాచ్‌లోనూ టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పవర్‌ ప్యాకెడ్‌ న్యూజిలాండ్‌పై తొలి టీ20 సిరీస్‌ నెగ్గాలంటే కొహ్లీ అండ్‌ కో....ఆఖరి మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించాల్సిందే. మరి ఈ క్లైమ్యాక్స్‌ ఫైట్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ సొంతం చేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

21:31 - November 6, 2017

చెన్నై : తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లిన మోది ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు పది నిమిషాలపాటు కరుణానిధితో ప్రధాని మాట్లాడారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కూతురు కనిమొజి ప్రధానిని రిసీవ్‌ చేసుకున్నారు. అధికార ఏఐఏడీఎంకేలో అంతర్గత పోరు, త్వరలోనే కమల్‌హాసన్ పొలిటికల్ ఎంట్రీ వార్తల నేపథ్యంలో మోదీ.. కరుణానిధిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి కొత్త సమీకరణకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన కరుణానిధి.. ఈ మధ్యే ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగొచ్చారు. ఆయన బాగోగులు తెలుసుకునేందుకే ప్రధాని వెళ్లారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ప్రధాని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

21:30 - November 6, 2017

ఢిల్లీ : ఉత్తరకొరియా విషయంలో సహనం నశించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహాలకు జపాన్ మద్దతు పలికిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉత్తరకొరియా అణు పరీక్షలు.. యావత్‌ ప్రపంచానికి, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతకు పెను ముప్పుగా పరిణమించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సైనిక పరంగా కూడా అమెరికాకు మద్దతిస్తామని జపాన్‌ స్పష్టం చేసింది. జపాన్‌లో పర్యటిస్తున్న ట్రంప్‌ ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చలు జరిపారు.

 

21:29 - November 6, 2017

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన పనామా పేపర్స్‌, బోఫోర్స్‌ స్కాంలో తన పేరు రావడంపై బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. ఈ వయసులో నాకు ప్రశాంతత కావాలి... నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు హాయిగా గడపాలనుకుంటున్నానని తన బ్లాగ్‌లో వివరణ ఇచ్చారు. నా పేరు హెడ్‌లైన్స్‌లో వచ్చినా నేను పట్టించుకోనని తెలిపారు. ఇప్పటివరకు అక్రమ కట్టడాలు, ఆస్తుల విషయాల్లో నాకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొన్నేళ్లుగా స్కాంలలో ఇరుక్కున్నామంటూ నా గురించి నా కుటుంబం గురించి వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డామని... ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని అమితాబ్‌ అన్నారు. బాధ్యతగల పౌరులుగా ఈ విషయంలో మేము అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తాజాగా ప్యారడైజ్‌ పత్రాల జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌ పేరు వచ్చిన విషయం తెలిసిందే. 

గుజరాత్ కు రానున్న మన్మోహన్ సింగ్...

గుజరాత్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రచారం చేయనున్నారు. నోట్లరద్దు, జిఎస్‌టి లక్ష్యంగా ఆయన ఒకరోజు ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో కూడా పాల్గోనున్నారు.

కరుణతో మోడీ పది నిమిషాలు..

చెన్నై : తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లిన మోది ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు పది నిమిషాలపాటు కరుణానిధితో ప్రధాని మాట్లాడారు. 

21:27 - November 6, 2017

ఢిల్లీ : పనామా పత్రాల వ్యవహారం ఇంకా మరవకముందే ఇపుడు ప్యారడైజ్‌ పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రహస్య కంపెనీల ద్వారా బడాబాబులు చేస్తున్న ఘరానా మోసాన్ని ప్యారడైజ్‌ పత్రాలు బట్టబయలు చేశాయి. 180 దేశాలకు సంబంధించిన నల్లకుబేరులతో పాటు 714 మంది భారతీయుల పేర్లు కూడా ఈ పత్రాల్లో వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పనామా పత్రాల వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే మరో అవినీతి బండారం వెలుగులోకి వచ్చింది. 'ప్యారడైజ్‌ పత్రాల' పేరుతో ఐసిఐజె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్లకుబేరుల జాబితాను విడుదల చేసింది. ప్యారడైజ్‌ పేపర్‌ స్కాంలో కోటి 34 లక్షల పత్రాలను బహిర్గతం చేశారు. పనామా పత్రాలు మాదిరిగానే జర్మనీ వార్తాపత్రిక సుడేషీ జుటంగ్‌ వీటిని సంపాదించింది. దాదాపు 19 దేశాల కంపెనీ రిజిస్ట్రీలు, రెండు న్యాయవ్యవహారాల కంపెనీల నుంచి పత్రాలను సేకరించింది. ఈ పత్రాలను పరిశీలన జరపాల్సిందిగా ' ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌'-ICIJను కోరింది. పన్ను ఎగవేత ద్వారా కూడబెట్టుకున్న సొమ్మును దాచుకునేందుకు స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ICIJ బయటపెట్టింది.

ఈ పత్రాల్లో 180 దేశాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌ 19వ స్థానంలో ఉంది. ప్యారడైజ్‌ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ భార్య మాన్యతా దత్‌ తదితరుల పేర్లు ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నట్లు సమాచారం.

'ఒమిడ్‌యార్‌ నెట్‌వర్క్‌' కంపెనీకి జయంత్‌సిన్హా ఎండీగా ఉన్న సమయంలో అమెరికాకు చెందిన డి.లైట్‌ డిజైన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. దీనిపై జయంత్‌ సిన్హా వివరణ ఇచ్చారు. ఆ సంస్థ వివరాలన్నీ చట్టబద్దమైనవేనని, తాను గతంలో భాగస్వామిగా ఉన్నానని, ప్రస్తుతం వీటితో తనకు సంబంధం లేదని ట్వీట్‌ చేశారు. బిజెపికి చెందిన మరో ఎంపి రవీంద్ర కిశోర్‌ సిన్హా పేరు కూడా వెలుగు చూసింది. దీనిపై స్పందించడానికి ఆర్‌కె సిన్హా నిరాకరించారు. అక్రమాస్తుల కేసులో విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా పేరు కూడా పారడైజ్‌ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

సహనం నశించిందన్న ట్రంప్..

ఢిల్లీ : ఉత్తరకొరియా విషయంలో సహనం నశించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహాలకు జపాన్ మద్దతు పలికిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 

ప్రశాంతత కావాలన్న బిగ్ బి...

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన పనామా పేపర్స్‌, బోఫోర్స్‌ స్కాంలో తన పేరు రావడంపై బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. ఈ వయసులో నాకు ప్రశాంతత కావాలి... నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు హాయిగా గడపాలనుకుంటున్నానని తన బ్లాగ్‌లో వివరణ ఇచ్చారు. నా పేరు హెడ్‌లైన్స్‌లో వచ్చినా నేను పట్టించుకోనని తెలిపారు.

ప్యారడైజ్ పత్రాల్లో 714 భారతీయుల పేర్లు..

ఢిల్లీ : పనామా పత్రాల వ్యవహారం ఇంకా మరవకముందే ఇపుడు ప్యారడైజ్‌ పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రహస్య కంపెనీల ద్వారా బడాబాబులు చేస్తున్న ఘరానా మోసాన్ని ప్యారడైజ్‌ పత్రాలు బట్టబయలు చేశాయి. 180 దేశాలకు సంబంధించిన నల్లకుబేరులతో పాటు 714 మంది భారతీయుల పేర్లు కూడా ఈ పత్రాల్లో వెలుగు చూశాయి. 

21:19 - November 6, 2017

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం .. ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ఆందోళన విషాదాన్ని మిగిల్చింది. ధర్నాలో తోపులాట జరిగి ఎమ్మార్పీఎస్‌ మహిళ కార్యకర్త మృతి చెందింది. దీంతో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వంపై మండిపడ్డారు. .. కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు భారతి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో కలెక్టరేట్‌ ముట్టడిలో మహిళా కార్యకర్త ప్రాణాలు కోల్పోయింది. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. ఎమ్మార్పీఎస్‌ నాయకులు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. ధర్నా ఉద్రిక్తంగా మారడంతో..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి భారతి సృహతప్పి పడిపోయింది. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది.

భారతి మృతి చెందడంతో .. తోటి కార్యకర్తలు ప్రభుత్వంపై, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహంతో ధర్నా చేశారు. పోలీసుల వల్లే.... భారతి చనిపోయిందని.. ఇది ప్రభుత్వ హత్యనేనని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే అసెంబ్లీలోనూ ఈ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎం నేతలు ఈ ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. దీంతో భారతి మృతికి సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. భారతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సభలో కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే మంత్రి కడియం శ్రీహరి ఉస్మానియా ఆస్పత్రిలో భారతి మృత దేహాన్ని.. సందర్శిచేందుకు వెళ్లడంతో.. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. కాగా విపక్ష నేతలు జానారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కూడా ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించారు. కాగా ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణకు తెలంగాణలోని అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని .. ప్రధాని అపాయింట్‌మెంట్‌ లభించగానే ఢిల్లీ వెళ్లి వర్గీకరణ అంశాన్ని వివరిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అప్పటి వరకు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. 

21:18 - November 6, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో కొత్తగా చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే దీనిపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. మంచి పని చేస్తుంటే.. విమర్శించడం సరికాదన్నారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడిలో ఎమ్మార్పీఎస్‌ మహిళా కార్యకర్త భారతి మృతిచెందడంపై అసెంబ్లీ విచారం వ్యక్తం చేసింది. భారతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం.. సభను రేపటికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ సూచించడంతో సభ రేపటికి వాయిదా పడింది.

భూరికార్డుల ప్రక్షాళనపై అసెంబ్లీలో వాడీవేడి చర్చజరిగింది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో కొత్తగా చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం కూడా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఈ మూడున్నరేళ్లలో .. దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కి లాక్కుంటుందని భట్టి ఆరోపించారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు.

మియాపూర్‌లోని 815 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని భట్టివిక్రమార్క సభలో కోరారు. అలాగే నయీం భూములు, మియాపూర్‌ భూముల రికార్డులను సభ ముందు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల్లో భాగంగా మిషన్ కాకతీయ, కుప్తి ప్రాజెక్టు, ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్, మేడారం జాతర ఏర్పాట్లపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించడంతో కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడిలో ఎమ్మార్పీఎస్‌ మహిళా కార్యకర్త భారతి మృతిచెందడం దురదృష్టకరమనన్నారు సీఎం కేసీఆర్‌. ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం శాసనసభలో ప్రకటన చేశారు. కలెక్టరేట్‌ వద్ద భారతి అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతిచెందారని సీఎం చెప్పారు. భారతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సభలో ప్రకటించారు. ఆమె కుటుంబంలో ఉద్యోగానికి అర్హులైన వారు ఉంటే.. తప్పకుండా ఉద్యోగం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల నేతల సంతకాలను సేకరించి.. ఎస్సీ వర్గీకరణపై లేఖను ప్రధాని మోదీకి పంపుతామన్నారు. మోదీ సమయాన్ని కోరి.. త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని సీఎం చెప్పారు. ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

21:17 - November 6, 2017

విజయవాడ : అక్రమాస్తులు, కేసులపై ప్రజలకు చెప్పిన తర్వాత జగన్‌ పాదయాత్ర చేయాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జగన్‌ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్‌ ఉపయోగించే భాష సరిగా లేదని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. జగన్‌ భాషపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

21:15 - November 6, 2017

కడప : చంద్రబాబు మాదిరి కేసులంటే తనకు భయం లేదన్నారు వైసీపీ అధినేత జగన్. చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి ఉందన్నారు. సొంత నియోజకవర్గం కడపజిల్లా ఇడుపుల పాయలో వైఎస్.జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళి అర్పించిన జగన్ తొలిరోజు పాదయాత్రను ప్రారంభించారు. పలువురు వైఎస్ఆర్‌ సీపీ నేతలు కూడా జగన్ వెంటన కలిసి నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 180 రోజులు 3 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకోనున్నారు జగన్.

పాదయాత్రకు ముందు జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర స్ధాయి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని జగన్ ప్రశ్నించారు. . కేబినేట్‌ను పరిశీలిస్తే ఎవరూ ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని పరిస్థితి ఏపీలో నెలకొందన్న జగన్.. ఎమ్మెల్యేలను సంతలో కొర్రలు కొన్నట్లు కొనుగోలు చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని.. దానిని కూకటి వేళ్లతో పెకిలించాలని జగన్ వ్యాఖ్యానించారు. తనకు చంద్రబాబులా కేసులంటే భయం లేదని చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్న కసి మాత్రమే ఉందన్నారు జగన్. రాష్ట్రంలోని సమస్యలపై పోరాడేందుకు అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు జగన్. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర వెంపల్లి రోడ్డు మారుతి నగర్ , కుమ్మరి పల్లి గ్రామాల మీదుగా సాగి వెంపల్లి క్రాస్‌ రోడ్ వద్ద ముగిసింది. ఇక మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో జగన్ పాదయాత్ర సాగనుంది. 

20:27 - November 6, 2017

తెలంగాణ రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది ? కోదండరాం ఎప్పుడు పార్టీ పెడుతడు..గిసొంటి ఎన్నో సందేహాలున్నయి. రాజన్న రాజ్యం తేవడానికి బుడి బుడి అడుగులు వేస్తున్నడు జగన్..మందిని వేసుకుంటూ పాదయాత్ర చేపట్టిండు..తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల పేరిట 'ఇమేజ్ టవర్' నిర్మిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది..తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అబద్దాలు..ప్రత్తి రైతులకు 85 శాతం మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నరు..పోలీసులు లేకపోతే మంత్రి జూపల్లిని జనాలు కొట్టేటట్టు ఉన్నరు..జనం కూడా అవద్దాలు ఎన్నిసార్లు వింటరు..2019లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడంట..అంటూ ఓ జ్యోతిష్యుడు పేర్కొన్నడు..ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిపోతోంది...24గంటల పాటు కరెంటు ఇస్తమని ప్రభుత్వం పేర్కొంది..తమకు 24గంటల కరెంటు వద్దని..12గంటల పాటు ఇస్తే చాలని రైతులు మొత్తుకుంటున్నరు..జై తెలంగాణ అన్నందుకు సలేందర్ అనే పిల్లగాడికి నౌకర్ పోయింది..గీ ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి..

చిత్తూరు : ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గోవింద్ నగర్ సమీపంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందారు.

 

ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. తెలుగు మహాసభల నిర్వాహణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. పనులు ప్రారంభించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మహాసభల ఏర్పాట్లపై ప్రతి వారం సమీక్షించాలని సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. 

నకిలీ కరెన్సీ స్వాధీనం..

అస్సాం : గౌహతిలోని ఓ ప్రాంతంలోని నివాసంపై పోలీసులు దాడి చేశారు. నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ఉపయోగిస్తున్న సామాగ్రీని సీజ్ చేశారు. 

18:42 - November 6, 2017

కాకినాడ : అప్రకటిత విద్యుత్ కోతలతో జీజీహెచ్ ఆసుపత్రి రోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానమైన ఎక్స్ రే సేవలు నిలిచిపోతున్నాయి. దీనితో దూర ప్రాంతాల నుండి వచ్చే ఔట్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్ కో అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వ్యవహరించడమే కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్ర పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తొలగించాలని రోగులు కోరుతున్నారు. 

18:39 - November 6, 2017

పశ్చిమగోదావరి : ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటే లంచం అడిగిన అధికారిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నర్సాపురం పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. భీమవరం మండలానికి చెందిన 30 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడానికి శ్రీనివాస రావు లంచం అడిగాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీనితో నర్సింహరాజు ఉద్యోగి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఒక్కో వ్యక్తి నుండి రూ. 1500 డిమాండ్ చేయడంతో..కార్మికులు రూ. 1300 ఒప్పుకున్నారని ఏసీబీ అధికారి పేర్కొన్నారు. ఇలా మొత్తంగా వసూలు చేసిన రూ. 45, 500 తీసుకుంటుండగా తాము దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 

18:29 - November 6, 2017

ఢిల్లీ : మళ్లీ ఓటుకు కేసు తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. కానీ అప్పటి నుండి ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదనే విమర్శలున్నాయి.

తాజాగా ఈ కేసుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇందులో ఎలాంటి పురోగ‌తి లేద‌ని,..విచారణలో జాప్యం చోటు చేసుకొంటోందని..పేర్కొంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. తెలంగాణ ఏసీబీపై నమ్మకం లేదని..నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీం స్వీకరించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. రెండున్నరేళ్లు అయ్యిందని..తదుపరి నేపథ్యంలో విచారణలో జాప్యం చోటు చేసుకుందన్నారు. మొదటి ఛార్జీషీటుకు..రెండో ఛార్జీషీటుకు వ్యత్యాసం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారికి సీఎం చంద్రబాబు నాయుడు ముద్దాయి అని అర్థమైందన్నారు. కేసీఆర్ ను బాబు బెదిరించడం..బాబును కేసీఆర్ బెదిరించడం చూశామన్నారు. సర్వవ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అని..వచ్చే మార్చిలో బాబును ముద్దాయిగా నిలబెట్టడంలో కృషి చేస్తామన్నారు. అనంతరం లాయర్ కూడా టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:10 - November 6, 2017

విశాఖపట్టణం : మరో ప్రేమోన్మాది ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ప్రేమించ లేదని..వివాహానికి నిరాకరించిందని..అనుమానం..ఇలా కొన్ని కారణాలతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మహిళల ప్రాణాలు తీస్తూ..బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా వుడా పార్కులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కృష్ణా జిల్లా నందివాడకు చెందిన నాగలక్ష్మణ్..శ్రీకాకుళం జిల్లాకు రమ్యలు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కానీ రమ్యపై నాగలక్ష్మణ్ అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనే మాట్లాడుతోందని అనుమానించాడు. మాట్లాడుకుందామని రమ్యను వుడా పార్కుకు పిలిపించాడు. మాట్లాడుతుండగానే తనతో ముందస్తుగా తీసుకొచ్చిన కత్తితో రమ్యపై అతను దాడి చేశాడు. దీనితో రమ్యకు మెడ ముందు..వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అదే కత్తితో నాగలక్ష్మణ్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడనే ఉన్న ఇతరులు వీరిని గమనించి కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. వీరిద్దరూ సన్ రైజ్ యూనివర్సిటీలో సెకండియర్ బీఎస్సీ చదువుతున్నట్లు సమాచారం. 

జగన్ యాత్రపై బాబు స్పందన..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపడుతున్న యాత్రపై స్ట్రాటజీ కమిటీలో బాబు చర్చించారు. పాదయాత్రను పట్టించుకోవాల్సినవసరం లేదని, ఇడుపుల పాయలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి జగన్ కు కనిపించడం లేదా ? బాబు ప్రశ్నించారు. సమావేశాలను బహిష్కరించడం జగన్ విజ్ఞతకే వదిలేద్దామన్నారు. 

ముగిసిన అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ భేటీ..

విజయవాడ : అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీని పదిరోజుల పాటు సమావేశ పర్చాలని నిర్ణయం తీసుకుంది. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. టిడిపి ఎల్పీ తరపున 28 అంశాలు చర్చించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి..సంక్షేమంపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సభలో సభ్యులు హుందాగా నడుచుకోవాలని సూచించారు. 

వుడా పార్కులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం...

విశాఖపట్టణం : వుడా పార్కులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రమ్య, నాగలక్ష్మణ్ లు గొంతు కోసుకున్నారు. 

మూడు భవనాలుగా టిడిపి రాష్ట్ర కార్యాలయంజ...

విజయవాడ : టిడిపి రాష్ట్ర కార్యాలయ ఆకృతులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మొత్తం మూడు భవనాలుగా టిడిపి రాష్ట్ర కార్యాలయం ఉండనుంది. ఒక్కో భవనం నాలుగు అంతస్తులతో నిర్మాణం కానుంది. 

17:30 - November 6, 2017

మెదక్ : సింగూరు డ్యామ్ 15 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ కు విడుదల చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అందులో కొన్ని టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేసింది. సింగూర్ ప్రాజెక్టు స్టోరేజ్ 29 టీఎంసీలగా ఉందనే విషయం తెలిసిందే. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టి.కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి..కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టెన్ టివితో సునీతా మాట్లాడారు. మెదక్ జిల్లాపై ఎందుకంత నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించింది. జీవో లేకుండానే నీటి విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

17:29 - November 6, 2017

సంగారెడ్డి : అమీన్ పూర్ వందనపురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అరవింద క్లాసిక్ అపార్ట్ మెంట్ లో పక్క ప్లాట్ లో ఉన్న వారిపై ఓ వ్యక్తి కెమికల్ ప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు..ఒక బాబుకు గాయాలయ్యాయి.

అపార్ట్ మెంట్ లో నరసింహరావు సోసైటీ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఇటీవలే ఓ వివాదంలో నరసింహరావు ప్రెసిడెంట్ నుండి తొలగించారు. దీనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. దీనితో ప్రతికారం తీర్చుకోవాలని నరసింహరావు పథకం వేశాడు. కెమికల్ రంగంలో పనిచేస్తుండడంతో కెమికల్ బుద్ధి చూపెట్టాడు. అపార్ట్ మెంట్ లో బయట ఆరేసిన బట్టలపై మెర్క్యూరీ క్లోరైడ్ ను చల్లాడు. వీటిని ధరించిన వారికి గాయాలయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. 

17:28 - November 6, 2017

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ నేత భారతి మృతిపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ సోమవారం ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది. పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో కార్యకర్త భారతి మృతి చెందింది. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు అసెంబ్లీలో పట్టుబట్టాయి. అనంతరం దీనిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. భారతి అస్వస్థతకు గురై చనిపోయిందని..సుజాత..రేణుక..కుప్పకూలిపోయారని, ఏదైనా ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన భారతి కుటుంబాన్ని ఆదుకొనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించడం జరుగుతుందన్నారు. పిల్లలుంటే చదువయయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని, ఎస్సీ వర్గీకరణకు ఇది వరకే మద్దతిస్తామన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళుతామని సభా సాక్షిగా కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సపోర్టు చేయడం జరిగిందని, గతంలో ఉన్న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖలు ఇచ్చామని..ప్రస్తుతం ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా తెలియచేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే మంచి ముగింపు ఇద్దామని..ఆందోళనలు విరమించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. 

17:09 - November 6, 2017

హైదరాబాద్ : కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ కార్యకర్త మృతి చెందడం కలకలం రేగింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ సోమవారం ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేస్తున్న సమయంలో వాగ్వాదం..తొక్కిసలాట జరిగింది. అరెస్టు చేస్తుండగా ఎమ్మార్పీఎస్ నేత భారతి ప్రతిఘటించింది. అనంతరం సృహతప్పి పడిపోయింది. ఉస్మానియాకు తరలిస్తుండగా మృతి చెందింది. ఘటనకు పోలీసులే కారణమని ఎమ్మార్పీఎస్ నేతలు పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ రాజీనామా చేయడంతో పాటు భారతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో పోలీసులతో లాఠీఛార్జీ చేయించారని..మహిళలకు చాలా దెబ్బలు తగిలాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నలుగురి సజీవదహనం కేసును ఛేదించిన పోలీసులు

ప.గో: కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెంలో నలుగురి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఏలూరుకు చెందిన ఐదుగురు కిరాయి హంతకులతో కలిసి తండ్రి నాగేశ్వరరావు ఇంటికి నిప్పు పెట్టాడు. నాగేశ్వరరావుకు ఆయన కొడుకు సహకరించాడు. పోలీసుల అదుపులో మరో ఏడుగురు నిందితులు ఉన్నారు. గత 26న పెట్రోల్ పోసి ఇంటికి నాగేశ్వరరావు నిప్పంటించాడు. రెండున్న ఏళ్లలో క్రిమినల్ కేసులున్న వారిపై రౌడీ షీట్ లు ఓపెన్ చేయాలని ఎస్పీ రవిప్రకాష్ ఆదేశించారు.

సీఎం కడియంను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతదేహానికి నివాళులర్పించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెళ్లారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కడియంను అడ్డుకున్నారు. భారతికి నివాళులర్పించకుండానే కడియం వెనుదిరిగారు.

భారతికి నివాళులర్పించిన జానారెడ్డి

హైదరాబాద్:ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతికి కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.

జగన్ పాదయాత్రలో గుండెపోటుతో వ్యక్తి మృతి

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సీకెదిన్నెకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన జగన్ వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.

అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో సీఎం భేటీ

అమరావతి: సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వీరి భేటీలో జగన్ పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

16:07 - November 6, 2017
16:05 - November 6, 2017

విశాఖపట్టణం : అనకాపల్లి (మం) కొత్తూరు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ తో లాకర్ ను తెరిచి ఈ చోరీకి పాల్పడ్డారు. భారీగా నగదు..బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులు లాకర్ ను తెరిచి ఉండడం గమనించారు. వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం..నగదు ఎంత మొత్తంలో అపహరణకు గురైందనేది తెలియ రావడం లేదు. ఈ చోరీని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్లూస్ టీం...డాగ్ స్క్వాడ్ నిందితుల ఆధారాల కోసం ప్రయత్నించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

ఓటుకు నోటు కేసులో మందకొడి విచారణ : ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి: ఓటుకు నోటు కేసులో విచారణ మందకొడిగా సాగుతోందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. కేసీఆర్ దగ్గర చంద్రబాబు సాగిలపడ్డాక కేసు విచారణ ప్రభావితమైందని ఆర్కే అన్నారు. నిష్పక్షపాత విచారణ కోసం సీబీఐకీ అప్పగించాలని ఆర్కే డిమాండ్ చేశారు.

 

ఎస్సీ వర్గీకరణకు ఇదివరకే మద్దతు తెలిపా: సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు ఇది వరకే మద్దతు తెలిపానని సీఎం కేసీఆర్ తెలిపారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని, ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని పేర్కొఆన్నారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో మంచి ముగింపు ఇద్దమని, ఆందోళనలు విరమించాలని కోరుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

భారతి మృతి దురదృష్టకరం:కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి దురదృష్టకరం అని బిజెపి నేత కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇంలాంటి ఘటన జరగటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

15:49 - November 6, 2017

నేటి యువత సృజానాత్మకత వైపు పయనిస్తున్నారు. దానినే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ క్రాంక్రీట్ జంగిల్ లో ఒక పచ్చని మొక్క కనిపిస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా.... మరి ఆ పచ్చదనానికి సృజనాత్మకత జోడించి..వ్యాపారంగా మలచుకొంటే...మంచి గుర్తింపుతో పాటు మనస్సుకు ఆనందంతో పాటు ఆర్థిక భరోసా కూడా కలిగిస్తుంది. మరి అలాంటి సృజనాత్మకతతో వాణిజ్య రంగంలో రాణిస్తున్న ఇద్దరి యువతులపై 'మానవి' స్పూర్తి ప్రత్యేక కార్యక్రమం..మరి వారు ఎలాంటి సృజనాత్మకత చేశారు ? తదితర విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: జానారెడ్డి

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నాయకురాలు మృతి దురదృష్టకరం అని, ఎస్సీ వర్గీకరణ పై అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మా వంతు సహకారం అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. భారతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించినా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.

భారతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా:కేసీఆర్

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి దురదృష్టకరం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. భారతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నాలో భారతి అస్వస్థతకు గురై చనిపోయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కేసీఆర్ తెలిపారు.

15:33 - November 6, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో నుండి రూ. 2లక్షలను అపహరించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవి మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గత పదేళ్లుగా పనిచేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

15:29 - November 6, 2017

వరంగల్ : ప్రతి రైతు దగా పడుతున్నాడు..ఈ రైతుకు ధైర్యం చెప్పేందుకు టీమాస్ నడుం బిగించింది. అందులో భాగంగా సోమవారం వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి మాట్లాడింది. ఈసందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న బాధలు తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావడం లేదని..దారుణమైన నిర్లక్ష్యం వ్యహించడం బాధాకరమన్నారు. గిట్టుబాటు ధర రూ. 8000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు చేయడం లేదని, తేమ అనేది ఒక సాకు మాత్రమేనని, అడ్డగోలుగా రైతులను దోపిడి చేసుకోవడానికి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ రేటు కోసం పడిపోలేదని..రైతు దగ్గర పత్తి ఉన్నప్పుడు అనేక మాటలు మాట్లాడుతారని..కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు. 

మెగాస్టర్ చిరంజీవి ఇంట్లో చోరీ

హైదరాబాద్: మెగాస్టర్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2లక్షలతో సర్వర్ చెన్నయ్య ఉండాయించాడు. జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవి మేనేజర్ ఫిర్యాదు చేశారు.

15:28 - November 6, 2017

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేయాలని విపక్షాలు ముక్త కంఠంతో అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సృహతప్పి పడిపోయింది. ఉస్మానియాకు తరలించే లోపు ఆమె మృతి చెందింది. ఈ సమయంలో అసెంబ్లీ జరుగుతోంది.

సమాచారం తెలుసుకున్న విపక్ష సభ్యులు అసెంబ్లీలో మాట్లాడారు. ఎమ్మార్సీఎస్ కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో చనిపోయిందని సమాచారం వచ్చిందని టి.కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి వచ్చిందా ? లేదా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి చెందడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సమస్య తీవ్రంగా ఉందని..భారతి మృతి చెందడం బాధాకరమని టిడిపి సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఈ వార్త దురదృష్టకరమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటన వచ్చిన తరువాతే ఇతర ఏజెండాలోకి వెళ్లాలని సూచించారు. 

15:27 - November 6, 2017
15:18 - November 6, 2017

హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ జరిపిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కార్యకర్త మృతి చెందడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులే ఆమెను చంపేశారని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆమె మృతదేహంతో నేతలు..కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పోలీసులు..కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మార్పీఎస్ నేతలు..కార్యకర్తలు భారీగా హైదరాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనితో అక్కడనే ఉన్న కార్యకర్త భారతి సృహ తప్పిపడిపోయింది. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.

దీనిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద చేరుకున్న నేతలతో టెన్ టివి మాట్లాడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి జరుగుతోందని..అందులో భాగంగా రంగారెడ్డి..హైదరాబాద్ కలెక్టరేట్ల ముట్టడి జరిగిందన్నారు. కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యకర్త భారతిని నెట్టివేయడంతో ఆమె మృతి చెందిందని ఆరోపించారు. సంవత్సరం నుండి అఖిలపక్షాన్ని తీసుకెళుతామంటూ మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ చోరీ..

విశాఖపట్టణం : అనకాపల్లి (మం) కొత్తూరు గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ జరిగింది. భారీగా నగదు..బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఏపీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సమావేశం..

విజయవాడ : అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో ఆయన చర్చిస్తున్నారు. 

14:49 - November 6, 2017
14:47 - November 6, 2017

అనంతపురం : సినీహీరో శ్రీకాంత్‌ సందడిచేశారు. పట్టణంలో డాక్టర్‌కేర్ హోమియోపతి సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యంలో చక్కని పరిష్కారం ఉందన్నారు శ్రీకాంత్‌. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా వైద్యం అందించడం హోమియో మందుల ప్రత్యేకత అన్నారు. హోమియో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే తాము తెలుగు రాష్ట్రాల్లో పలు క్లినిక్‌లు ప్రారంభించినట్టు డాక్టర్‌కేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏఎం రెడ్డి అన్నారు. 

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదన్న నాయినీ..

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని మంత్రి నాయినీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినట్లు, కేంద్రం చేయకపోతే తమల్ని విమర్శించడం ఏంటీ అని పేర్కొన్నారు. 

మహిళా కార్యకర్త మృతిపై అసెంబ్లీలో ఆందోళన..

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ మహిళా కార్యకర్త మృతిపై విపక్షాల ఆందోళన చేపట్టారు. మహిళ మృతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ఎమ్మార్పీఎస్ మహిళా కార్యకర్త మృతిపై సీఎం సమాచారం తెప్పించుకుంటున్నట్లు మంత్రి ఈటెల పేర్కొన్నారు. ఫిట్స్ తో చనిపోయినట్లు తమకు సమాచారం వచ్చిందని, అనవసరంగా విమర్శించడం తగదన్నారు. 

తెలంగాణ అసెంబ్లీకి బ్రేక్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడింది. విపక్షాలు చేస్తున్న ఆందోళనతో స్పీకర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

14:37 - November 6, 2017

వరంగల్ : మద్దతు ధర పేరుతో సిసిఐ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప రైతుల కష్టాలు గట్టెక్కవంటున్నారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో సిసిఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటుని వ్యాపారులు టెన్ టివికి తెలిపారు. వారు పడుతున్న బాధలు..అవస్థలు..గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:30 - November 6, 2017

కడప : చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరారు. నంద్యాలలో టీడీపీ 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిందన్నారు. 20 చోట్ల ఎన్నికలు ఒకేసారి పెడితే బాబు పునాదులు కదిలిపోతాయని విమర్శించారు. ఒకే చోట ఎన్నిక పెడితే డబ్బులు..బెదిరింపులు చేయవచ్చనే ధీమా వారిలో ఉందన్నారు. ఇది బలమా..వాపా..అని ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేస్తారని నమ్మకం ఉంటే 20 చోట్ల ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వానికి జగన్ సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ పై టిడిపి ప్రభుత్వం..మంత్రులు..ఎలా స్పందిస్తారో చూడాలి. 

14:27 - November 6, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో కొత్తగా చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రకటనల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని... గతంలో ఉన్న తమ ప్రభుత్వం కూడా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసిందన్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. మంచి పని చేస్తుంటే.. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రతిపక్ష సభ్యులు అనడం సరికాదన్నారు. రైతులకు మేలు చేసేందుకు ఈ ప్రక్రియను పూనుకున్నామన్నారు కేసీఆర్‌.

రైతుల హక్కుల వారి ఆత్మాభిమానంపై కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదని టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి పేర్కొన్నారు. దున్నే వాడిదే భూమి స్పూర్తితో అనేక చట్టాలు తీసుకొచ్చడం జరిగిందన్నారు. సూర్యాపేట తిరుమలగిరి మండలంలో భూ ప్రక్షాళణ కోసం వెళితే..ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి కి చెందిన ఎకరం 30 గంటల భూమి 15 సంవత్సరాల క్రితం సాదా బైనామీ కింద అమ్మితే ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదన్నారు. దీనిపై జానారెడ్డి స్పందించారు. దరఖాస్తు చేసుకుంటే కొన్ని మిగిలిపోయిన మాటలు వాస్తవమేనన్నారు. 

14:24 - November 6, 2017

విశాఖపట్టణం : విద్యాభోదనలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తమను వేధిస్తున్నాడని విశాఖలో ఏయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంస్కృతం విభాగాధిపతి ఏడుకొండలు రూమ్‌ వద్దకు వెళ్లి దేహశుద్ధి చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలిని సస్పెండ్ చేస్తేనే వర్సిటీకి వస్తామని విద్యార్థులు అంటున్నారు. అయితే విద్యార్థులకు హాజరు శాతం లేదని, పరీక్షలు రాసేందుకు అర్హత లేదన్నందుకే తనపై కక్షతో ఇలా చేస్తున్నారని ఏడుకొండలు అంటున్నాడు. 

డీజీపీ రేసులో తేజ్ దీప్ కౌర్ మీన్ ?

హైదరాబాద్ : డీజీపీ రేసులో తేజ్ దీప్ కౌర్ మీన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇన్ చార్జీ డీజీపీనే నియమిస్తోందని..పూర్తిస్థాయి డీజీపీ కోసం కేంద్రం నుండి తుది జాబితా వచ్చే వరకు వేచి చూద్దామన్నారు. అసెంబ్లీ లాబీలో సీనియర్ ఐపీఎస్ తేజ్ దీప్ కౌర్ మాట్లాడారు. 

స్వతంత్ర్య అభ్యర్థి మృతి...

హిమాచల్ ప్రదేశ్ : త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బర్సార్ ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో స్వతంత్ర్యంగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. 

14:15 - November 6, 2017
14:14 - November 6, 2017

విశాఖ : ఏయూ సంస్కృతం విభాగాధిపతి ఏడు కొండలుకు విద్యార్థులు దేహశుద్ధి చేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఏడు కొండలను సస్పెండ్ చేస్తేనే కళాశాలకు వస్తామని విద్యార్థినులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎమ్మార్పీఎస్ ముట్టడి..కార్యకర్త మృతి..

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ కార్యకర్తల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతికి తీవ్రగాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. 

14:04 - November 6, 2017

హైదరాబాద్ : ప్రచార ఆర్భాటాలకు టీప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. టీఅసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేశారని చెప్పారు. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమి లేదనే తామే మొత్తం చేశామని చెప్పుకుంటున్న టీసర్కార్ వాదనతో ఏకీభవించడం లేదన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర అభివీద్ధికి పాటుపడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా భూముల కోసం పోరాటాలు జరిగాయన్నారు. భూసర్వే టీసర్కార్ మొదటి సారిగా తీసుకోలేదని గతంలో కూడా చేశారని గుర్తు చేశారు. 

 

చిరంజీవి ఇంట్లో చోరీ..

హైదరాబాద్ : చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 2 లక్షలతో సర్వర్ చెన్నయ్య ఉడాయించాడు. జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవి మేనేజర్ ఫిర్యాదు చేశారు. 

13:58 - November 6, 2017

తూ.గో : జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు. ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి.. బొటానికల్ గార్డెన్‌కు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో ఎమనిటీస్ సెంటర్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 45 కోట్ల 25లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని .. రాష్ట్రానికే తలమానికంగా నన్నయ్య యూనివర్సిటీ ఉండబోతుందన్నారు చంద్రబాబు. 

 

ప్రైవేటు సెక్టార్ లో రిజర్వేషన్ లు ఉండాలి - నితీష్..

పాట్నా : ప్రైవేటు సెక్టార్ లో రిజర్వేషన్ లు తప్పనిసరిగా ఉండాలనేది తన అభిప్రాయమని బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

13:48 - November 6, 2017

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ అర్బన్‌లోని ఎనుమాముల మార్కెట్‌ను  టీ మాస్ బృందం సభ్యులు  తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కంచ ఐలయ్య సందర్శించారు. అక్కడి పత్తి రైతుల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.

13:46 - November 6, 2017

కడప : రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆ పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇడుపుపాయలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేవుడు ఆశీర్వదించి, ప్రజల ఆశీస్సులు ఉంటే ఒక సం.లో వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. చంద్రబాబు లాగా మోసం చేయమని చెప్పారు. ప్రజల మేనిఫోస్టోనే తమ మేనిఫెస్టో అని అన్నారు. పూర్తిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు. చదువుల విప్లవాన్ని తీసుకురావాన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో గుండెల్లో ఉండాలన్నదే తన కోరిక అన్నారు. నాన్న పక్కల తన ఫోటో కూడా ఉండాలన్నారు. ఏపీని అభివృద్ధి అంధ్రప్రదేశ్ గా చేయాలని, అవినీతిపై పోరాటం చేసి అవినీతిపరులను జైలు పెట్టాలని కసి ఉందన్నారు. చంద్రబాబు కంటే మంచిపాలన అందిచాలని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే కసి ఉందన్నారు. 

13:38 - November 6, 2017

కడప : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. జాబు రావాలంటే.. బాబు పోవాలన్నారు. జగన్ మహా సంకల్పయాత్ర సందర్భంగా ఇడుపుపాయలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాలుగు సం.లో రైతుల నుంచి టీడీపీ బలవంతంగా భూములు లాక్కున్నారని తెలిపారు. చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. చంద్రబాబు బినామీ భూములను వదిలేసీ మిగిలినవారి భూములు లాక్కొంటున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయిన నిర్మించారని ప్రశ్నించారు. గేట్లు ఎత్తిన వాడు గొప్పవాడా.. ప్రాజెక్టు కట్టిన వాడు గొప్ప వాడా అని అన్నారు. సంతలో గొర్రెలను కొన్న విధంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఎద్దేవా చేశారు. 21 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. మంత్రివర్గంలో ఉన్నవారు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. నంద్యాలలో మీ గెలుపు బలమా, వాపో తెలపాలని చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడారు. 20 చోట్ల ఒకే సారి ఎన్నికలు పెట్టి గెలవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మహిళా ఎమ్మార్వోను ఇసుక మాఫీయా జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్తే చర్యలు తీసుకోలేదన్నారు. కాలేజీల్లో రిషితేశ్వరి చనిపోతే కేసు లేదన్నారు. విజయవాడలో సీఎం కళ్లముందే సెక్స్ రాకెట్ నడుస్తుంటే ఛోద్యం చూస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే..జాబు వస్తుందన్న నినాదం ఏమైందని నిలదీశారు. జాబు రావాలంటే బాబు పోవాలి.. అనే నినాదం రావాలన్నారు. 

 

13:26 - November 6, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో పత్తి రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారు. సిసిఐ కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. మార్కెట్‌ ధర చూసి తెల్లబోతున్నారు పత్తి రైతులు. రైతుల ఆవేదనపై ప్రభుత్వం స్పందించడం లేదంటున్న పత్తి రైతులు టెన్ టివితో మాట్లాడారు. 

 

కౌలు రైతులకు రూ.4వేలు డైరెక్టుగా ఇవ్వడం కుదరదు: పోచారం

హైదరాబాద్: వ్యవసాయ రంగం రోజు రోజుకు దిగజారిపోతుందని మంత్రి పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండేందుకు రూ. 4 వేలు ఇస్తున్నామని, తెలంగాణ లో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి భూమి ఉన్నట్లు భూ సర్వేలో తేలిందని,2,631 ఏఈవోలను భర్తీ చేస్తామన్నారు. రైతు సమన్వయ కమిటీలతో అసంఘటిత శక్తులను సంఘటిత పరచడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు రూ.4వేలు డైరెక్టుగా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. పట్టాదారునికి కౌలు ఇచ్చే సమయంలో వాల్లు మాట్లాడుకోవాలని సూచించారు.

13:14 - November 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్  తిరస్కరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సబంధించిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్ప లేదన్నారు. వాకౌట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమలు చేస్తారో.. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తారో చెప్పాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు పంటను కాల్చుకునే దుస్థితి దాపురించిందన్నారు. మొత్తం 3లక్షల 50 వేల ఎకరాల్లో పంట నష్ట జరిగిందన్నారు. ఆత్మకూర్ ఎస్ మండలంలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. 

 

గ్రేటర్ సిటీ రోడ్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు:కేటీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు గ్రేటర్ సిటీ రోడ్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన మోరీల నిర్మాణాలు సరిగాలేవని, గ్రేటర్ సిటీలో ప్రభుత్వం తరపున రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.3వేల కోట్లతో సిటీలో రోడ్స్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తొందరపడితే ఏ పని కాదని, ప్రతిపక్షాలకు వినే ఓపిక కూడా లేకుండా పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

13:02 - November 6, 2017

' ప్రైవేటు కళాశాలల్లో ప్రతి టీచర్ శిక్షణ పొందివుండాలి'

హైదరాబాద్: ప్రైవేటు కళాశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణ పొంది ఉండాలని శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల్లో శిక్షణ పొందని ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టామని కడియం తెలిపారు.

13:00 - November 6, 2017

రైతులకు రూ.4వేలు ఇవ్వడం లో క్లారిటీ లేదు: షబ్బీర్ అలీ

హైదరాబాద్: తెలంగాణ లో రైతులకు రూ.4 వేలు ఇవ్వడం క్లారిటీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనమండలిలో మాట్లాడుతూ..ప్రతి 4 మరణాల్లో ఇద్దరు కౌలు రైతులు ఉంటున్నారని, పథకంలో కొంత మార్పు చేసి కౌలు రైతులు లబ్ధి పొందేలా చూడాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

సాగునీరు అందక భద్రాచలం రైతుల ఇబ్బంది: సున్నం రాజయ్య

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. భద్రాచలం సిగ్మెంట్ లో మిషన్ కాకతీయ పనులు చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చాం అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. భద్రాచలం నియోజకవర్గానికి సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చెక్ డ్యాంలు లేక నీరు వృధాగా పోతుందని పేర్కొన్నారు. తాలిపేరు, చల్లవాగు దగ్గర చెక్ డ్యాంలు నిర్మిస్తే రైతులు, ఆదివాసీలకు ఎంతో లాభం కలుగుతుందని తెలిపారు.

12:41 - November 6, 2017
12:39 - November 6, 2017

తూ. గో : నన్నయ యూనివర్సిటీకి చాలా భవిష్యత్ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో ఎన్ టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1857లో ఆర్ట్స్ కాలేజీ ఏర్పాటు చేశారని... ఆ తర్వాతే ఏయూ యూనివర్సీటీ స్థాపించారని చెప్పారు. ఈ యూనివర్సీటీ నుంచే అడవి బాపిరాజు వచ్చారని, సర్వేపల్లి రాధకృష్ణన్ అధ్యాపకులుగా పని చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 17 జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ప్రతిభకు మారుపేరని..క్రియేటివ్ తో ముందుకుపోతున్నారని అభినందించారు.  

 

విద్యార్థులంతా రక్తదానం చేయాలి: గవర్నర్

తూ.గో: విద్యార్థులంతా రక్తదానం చేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. నెలకు ఒక ఆదివారం స్వచ్ఛత కోసం ప్రయత్నించాలన్నారు. యూనివర్శిటీని టాప్ -10లో నిలపాలని పేర్కొన్నారు.

విద్యార్ధి దశ ఎంతో క్లిష్టమైనదశ: ఉపరాష్ట్రపతి

తూ.గో: కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను మరవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మార్కుల కోసం కాదు.. వ్యక్తిత్వంలో మార్పు కోసం చదవాలన్నారు. కాన్వెంట్ చదువుతో నేను ఉపరాష్ట్రపతి కాలేదన్నారు. విద్య అనేది వ్యక్తిత్వంలో మార్పు తీసుకొస్తుందన్నారు. విద్యార్ధి దశ ఎంతో క్లిష్టమైనదశ అని, కష్టపడి, ఇష్టపడి చదవాలని వెంకయ్య పిలుపునిచ్చారు.

కరుణానిధి ని పరామర్శించిన ప్రధాని మోదీ

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ప్రధాని మోదీ పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

12:20 - November 6, 2017

కడప : జగన్ మహా సంకల్పయాత్ర ప్రారంభం అయింది. ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ సమాధి వద్ద నివాళులు అనంతరం జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయకు నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. 125 నియోజకవర్గాల్లో ప్రజలను జగన్ ప్రత్యక్షంగా కలవనున్నారు. 

 

12:10 - November 6, 2017

సాధారణంగా జలుబు, దగ్గు చలికాలం, వర్షాకాలం, చలికాలం ప్రారంభం తో కొన్ని వ్యాధులు కూడా మన ఉంటే వస్తుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడక తప్పదు. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరాలే దర్శనమిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల రకరకాల వైరస్ లు విజృంభిస్తూ ఇంటిల్లిపాది వ్యాపిస్తున్నాయి. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. అందుకే జలుబు ‘మందులు వాడితే వారం, లేకపోతే 7 రోజులు ఉంటుందన్న’ నానుడి కూడా ఉంది. ఈ సీజన్లో ఎప్పుడూ ఉండే జలుబు, ఫ్లూ జ్వరాలకు తోడు గత కొద్ది సంవత్సరాలుగా మన ప్రాంతంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి సమస్యలూ ప్రబలుతుండటంతో.. జ్వరం పేరు వింటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.

సాధారణంగా జ్వరముతో కలిగే ముక్కు కారడాన్ని జలబు అని పిలుస్తారు. సర్వసాధారణంగా మామూలు జలుబు లేదా పడిసం రైనో వైరస్ అనే వైరస్ క్రిమి వల్ల , లేదా కొరోనా అనే వైరస్ ల వల్ల కలుగుతుంది. వాతావరణంలో ఉండే ఈ వైరస్ లుదేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ) దీని ముఖ్యమైన లక్షణాలు.

వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. జలుబు అంటుకోగానే ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం... ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.

జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జ్వరం దారికి వచ్చాక వాటి అవసరం కూడా ఉండదు.

జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం మరచిపోవద్దు.

ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ దాకా కాచి, వడపోసిన నీళ్లు మాత్రమే తాగాలి. నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు.

మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.

మన ఇంట్లో దొరికే వస్తువులతో మొదట జలుబు, దగ్గు నివారణ పొందె ప్రయత్నం చేసుకోవాలి. కుదరని పక్షంలో వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ప్రత్యేక హోదాను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్

కపడ: చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం లేదని జగన్ ఆరోపించారు. కడపలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు రైతులకు రూ.10వేల కోట్లు ఎగ్గొట్టారని, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పని జరిగినా చంద్రబాబు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చినపుడే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు గాలికొదిలేశారని పేర్కొన్నారు.

11:34 - November 6, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ మండలం పాలమాకులలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. మ్యాథ్స్ టీచర్‌ భారతి వేధింపులు తాళలేక మనస్థాపంతో... రెండు అంతస్థుల హాస్టల్‌ భవనంపై నుండి దూకింది. దీంతో విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపోయాయి. అయితే... యాజమాన్యం విద్యార్థినిని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని విద్యార్థులపై స్కూలు యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

విద్యుత్ సమస్య తలెత్తదు: మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్: విద్యుత్ సమస్య తలెత్తదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అసెబ్లీలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ నేత విద్యుత్ స్తంబాలు, తీగల సమస్యల పై మాట్లాడారు. ఈ సమస్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక, సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 300 కి.మీ మేర భూగర్భ విద్యుత్ తీగలు వేస్తారని పేర్కొన్నారు.

11:26 - November 6, 2017

'వన్ మేన్ షో టు మేన్ ఆర్మీ' పద్ధతులకు బీజేపీ స్వస్తి పలకాలని బిజెపి ఎంపి, నటుడు శత్రఘ్న సిన్హా ఘాటు విమర్శలు చేశారు. తమ సొంతపార్టీ పైనే విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ తమ పార్టీలోని లోపాలను నిష్పక్షపాతంగా ఎత్తిచూపే నేతలలో బీజేపీ ఎంపీ నటుడు శత్రుఘ్న సిన్హా ఒకరు. నోట్ల రద్దు సమయంలో కూడా మోదీని విమర్శించారు. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీలో దురహంకారం పెరుగుతోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాలంటే అధినాయకత్వం ఒంటెత్తుపోకడను విడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల యువకులు రైతులు వ్యాపారులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఆ ప్రభావం త్వరలో జరగనున్న గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై పడుతుందన్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాదని శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికలు అధికార పార్టీకి సవాలు వంటిదన్నారు. ప్రత్యర్థి పార్టీలను తక్కువగా అంచనా వేయడం పొరపాటన్నారు. తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. బీజేపీని వదిలిపెట్టే ఉద్దేశం తనకు లేదని అలా అయితే తాను ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాలను కేవలం ఒకరో ఇద్దరో వ్యక్తులు తీసుకోవడం సరికాదని మోదీ అమిత్ షాలనుద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే విధానం కొనసాగితే రాబోయే సవాళ్లను ఎదుర్కోలేమని సొంతపార్టీ పై సద్విమర్శలు చేసేందుకు తాను వెనుకాడబోనని స్పష్టం చేశారు. పటేళ్ల ఉద్యమాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని అందుకే హార్దిక్ పటేల్ కు బీజేపీ దగ్గరకాలేకపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల చార్టర్డ్ అకౌంటెంట్లకు చేతినిండా పని దొరికిందని సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అధికారులు న్యాయమూర్తులపై ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు జరపకూడదని వారిపై వచ్చే ఆరోపణలపై మీడియా కూడా అనుమతి లేకుండా వార్తలు రాయకూడదంటూ రాజస్థాన్ సర్కార్ బిల్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుపై సిన్హా మండిపడ్డారు. ఆ బిల్లు...రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

11:04 - November 6, 2017

క్రియేటివ్ డైరెక్టర్ మారుతి 'ఇ..ఈ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇటీవలే 'ఇ..ఈ' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మారుతి, ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన ఫ్రెండ్ డెబ్యూ మూవీ 'ఇ..ఈ' సినిమా అని ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనను ఏరా అని సంబోధించేవాళ్లు చాలా తక్కువ అని.. అలాంటి వాళ్లలో ఈ సినిమాకు డైరెక్టర్ అయిన రామ్ గణపతి ఒకడని చెప్పాడు. ఇదో మిరాకిల్ అంటూ గణపతితో తనకున్న సాన్నిహిత్యాన్ని వెల్లడించాడు.

నీరు-ప్రగతి, వ్యవసాయ పురోగతిపై సీఎం టెలీకాన్ఫరెన్స్

అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయ పురోగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నరేగాతో సహా అన్ని రంగాల్లో లక్ష్యాలను చేరుకోవాలని సీఎం సూచించారు. ఢిల్లీ ఆగ్రో ప్రాసెసింగ్ సెమినార్ లో ఏపీకి ప్రశంసలు వచ్చాయని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అధికారులను సీఎం అభినందించారు. రబీ పంటలకు నీటి కొరత లేదని, సాగర్ ఆయుకట్టు, కృష్ణా, గోదావరి డెల్టా రబీకి ఇబ్బంది లేదని తెలిపారు. రిజర్వాయర్ల నీటిని ఖరీఫ్ అవసరాలకు వాడుకునేలా చూడాలని సీఎం సూచించారు.

10:58 - November 6, 2017

హైదరాబాద్ : రెండు రోజుల అనంతరం తిరిగి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్, బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చాయి.  ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పలు ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రతిపాదనలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ టీసర్కార్ పాలనలో రైతుల కళ నిజమైందన్నారు. సదర్ మట్టి ప్రాజెక్టు పూర్తి అయిందని తెలిపారు.  

ఏయూ సాంస్కృతిక విభాగం వద్ద విద్యార్థులు ధర్నా

విశాఖ: ఏయూ సాంస్కృతిక విభాగం వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రొ.ఏడుకొండలు లైంగికంగా వేధిస్తున్నారంటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

10:56 - November 6, 2017

కడప : ఇడుపులపాయలో వైఎస్ ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు. బహిరంగ సభ అనంతరం ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. 125 నియోజకవర్గాల్లో ప్రజలను జగన్ ప్రత్యక్షంగా కలవనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలే రాష్ట్ర ప్రజలు అనే స్థాయిలో ప్రభుత్వం పరిపాలన నడిపిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందినప్పుడే వాటికి సార్ధకత దక్కుతుందని చెప్పారు. టీడీపీ పాలనను అంతమొందించాలని పలుపిచ్చారు. 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలు ధీవించాలని కోరారు. 

నీరు -ప్రగతి 'పనుల నిర్వహణపై గవర్నర్ ప్రశంసలు

అమరావతి: ఏపీ నీరు -ప్రగతి 'పనుల నిర్వహణపై గవర్నర్ నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం టెలీకాన్ఫర్స్ లో పాల్గొన్న ఆయన అధికారుల్లో స్ఫూర్తి నింపారు. పంట మార్పిడి పై శ్రద్ద చూపాలని, వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని, అపుడే రైతులకు మరింత ఆదాయం పెరుగుతుందని గవర్నర్ సూచించారు. వ్యవసాయంలో సుస్థిర ఆదాయం ఉంటే రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ జలరక్షణ పనుల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జలసంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాలలో నరేగాని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు.

10:46 - November 6, 2017

కడప : ఇడుపులపాయలో వైఎస్ ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు. బహిరంగ సభ అనంతరం ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. 125 నియోజకవర్గాల్లో ప్రజలను జగన్ ప్రత్యక్షంగా కలవనున్నారు. 

 

10:42 - November 6, 2017

ప్రపంచ దేశాల నల్ల కుబేరులతో పాటు ఇండియాలో పన్ను ఎగ్గొట్టి ఆస్తులు పోగేసుకున్న 714 మంది పేర్లని పారడైజ్ పేపర్స్ బయట పెట్టింది. దీనితో నల్ల కుబేరుల గుండెల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. పనామా పేపర్స్ సృష్టించిన సునామీని మర్చిపోకముందే పారడైజ్ పేపర్స్ వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్ లోని లనల్లకుబేరుల గుండెల్లో పారడైజ్ పేపర్స్ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలకు న్యాయ సేవలు అందించే ‘అప్లెబీ’ నుంచి లీకైన సమాచారం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించి పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీక్ కాగా అందులో 180 దేశాలకు చెందిన కుబేరులు ఉన్నారు. వీరిలో 174 మంది భారత మిలియనీర్లు కూడా ఉండడం గమనార్హం.

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కూడా పది మిలియన్ పౌండ్లను తరలించినట్టు ఆరోపణలు వస్తుండగా, ఈ జాబితాలో కెనడా ప్రధాని పేరు కూడా కనిపించింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ సీనియర్ సలహాదారు అయిన స్టీఫెన్ బ్రాన్ఫ్‌మాన్ పెద్ద ఎత్తున విదేశాలకు నిధులు తరలించినట్టు పారడైజ్ పేపర్స్ వెల్లడించాయి. పన్నులకు స్వర్గధామమైన దేశాలకు కుటుంబ వ్యాపారం ద్వారా ఆ సొమ్మును తరలించినట్టు పేపర్ల ద్వారా వెల్లడైంది.

నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది పూర్తి...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది కాలం పూర్తి కానుంది. ఆ రోజుని యాంటీ బ్లాక్ మని డే గా ప్రభుత్వం జరపనుంది. దీనికి రెండు రోజుల ముందు ఈ వ్యవహారం బట్ట బయలు కావడంతో పారడైజ్ పేపర్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

10:19 - November 6, 2017

రామ్ చరణ్ - సుకుమార్ కాంబో లో " రంగస్థలం 1985 " దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన ఈ మూవీ సాంగ్స్ విన్న మంచు మనోజ్ అధికారికంగా ఆడియో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. ‘‘నా సోదరుడు రామ్ చరణ్ నాకు ‘రంగస్థలం’ పాటలు వినిపించాడు. అప్పట్నుంచి ఆ పాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆడియో.. సినిమా కోసం ఆగలేకపోతున్నా. త్వరగా రిలీజ్ చేయండి’’ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక అంతే.. మెగా అభిమానుల నుంచి మనోజ్ కు సందేశాలు వెల్లువెత్తాయి. పాటల గురించి వివరాలు అడుగుతూ ట్వీట్లు గుప్పించేశారు. ఓ అభిమాని రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని మనోజ్ ను అడిగితే.. ‘బంగారం’ అని బదులిచ్చాడు మంచు వారబ్బాయి.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’కు అతడి ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. ‘రంగస్థలం’ 80ల నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విభిన్నమైన సినిమా కావడంతో దీని ఆడియో కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి 29న ‘రంగస్థలం’ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఆడియో విడుదల కావచ్చని సమాచారం.

ప్రారంభమైన టీఎస్ అసెంబ్లీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

పాదయాత్రను ప్రారంభించిన జగన్

కడప: ఇడుపులపాయ వైఎస్ సమాధి వద్ద జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లి షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

 

వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు...

కడప: ఇడుపులపాయ వైఎస్ సమాధి వద్ద జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లి షర్మిల నివాళులర్పించారు. కాసేపట్లో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుండడంతో ఇడుపులపాయకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

09:52 - November 6, 2017

హైదరాబాద్: హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢీ కొంది.. శనివారం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే తన కారు పూర్తిగా డ్యామేజీ కావడంతో బాధితుడు తనకు 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. శివానీ తల్లి జీవిత వచ్చి బాధితునితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కారు డ్యామేజ్‌కి సంబంధించి ఎస్‌పీవీఎస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సీనియర్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ అశోక్‌‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి కన్నుమూత

నల్గొండ: కాంగ్రెస్ మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి (82) సోమవారం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోమటిరెడ్డి సోదరులకు సమీప బంధువు, రాజకీయ గురువు బీఎన్ రెడ్డి మిర్యాలగూడ ఎంపీగా పని చేశారు. బీఎన్ రెడ్డి మృతి పట్ల కోమటిరెడ్డి సోదరులు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు సంతాపం తెలిపారు.

కస్తూర్బాగాంధీ బాలికల స్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకింది. టీచర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మ్యాథ్స్ టీచర్ భారతి వేధింపులు తాళ లేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. 

 

టీఎస్ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేటి వాయిదా తీర్మానాలు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్, బిజెపి, వర్గీకరణ పై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని తీర్మానాన్ని ఇచ్చాయి.

మందుపాతరను గుర్తించిన పోలీసులు..

ఖమ్మం: వెంకటాపూర్ (మాగూరు) మొద్రివాని గూడెం వద్ద రహదారిపై పోలీసులు మందుపాతరను గుర్తించారు. గుర్తించిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రోడ్డు పై రాకపోకలు నిలిచిపోయాయి.

09:37 - November 6, 2017

హైదరాబాద్ : రెండు రోజుల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్, బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి.  ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూసర్వేపై సభలో చర్చ జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాసేపట్లో టీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : రెండు రోజుల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్, బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నాయి.

టీఅసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : రెండు రోజుల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్, బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నాయి. 

నేడు తూ.గో జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

తూ. గో : నేడు జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో రూ.10 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

 

కాసేపట్లో జగన్ పాదయాత్ర ప్రారంభం

కడప : కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి జగన్ సంకల్పయాత్ర జరుగనుంది. ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

 

08:46 - November 6, 2017

అనంతపురం : సినీతారల క్రికెట్‌ సందడికి వేదికైంది అనంతపురంలోని పిటిసి మైదానం. క్రిసెంట్‌ క్రికెట్‌ కప్‌ పేరుతో నిర్వహించిన ఈ పోటీలో సినీ నటులు, శ్రీకాంత్‌, తరుణ్‌ టీంలు పాల్గొన్నారు. క్రికెట్‌ పోటీలను మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతలో ఇలాంటి క్రికెట్‌ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని సినీ తారలు అన్నారు.

 

08:44 - November 6, 2017

కడప : అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ రాష్ట్రమంతా పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర నేటినుంచి ప్రారంభం కానుంది. కాసేపట్లో ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం జగన్‌ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు.. 180 రోజులపాటు..  3 వేల కిలోమీటర్లు మేర కొనసాగనుంది. 
125 నియోజకవర్గాల్లో అనేకమంది ప్రజలను జగన్‌  ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 

 

వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పించనున్న జగన్‌

కడప : నేటి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర జరుగనుంది. ఇడుపులపాయల నుంచి జగన్ సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. 125 నియోజకవర్గాల్లో 3 వేల కిమీ.పాటు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. కాసేపట్లో ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

 

 

మిర్యాలగూడ మాజీ ఎంపీ బద్దం నర్సింహ్మారెడ్డి కన్నుమూత

నల్గొండ : మిర్యాలగూడ మాజీ ఎంపీ, వాస్తు శిల్పి బద్దం నర్సింహ్మారెడ్డి (85) కన్నుమూశారు. రెండు సార్లు ఆయన ఎంపీగా పని చేశారు. రేపు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 

 

08:24 - November 6, 2017

జగన్ పాదయాత్రపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ, ఎవరైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉందన్నారు. 
ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి, ఏపీసీసీ నేత గౌతమ్, టీడీపీ నేత దుర్గప్రసాద్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:20 - November 6, 2017

గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఐద్వా ఏపీ రాష్ట్ర నాయకురాలు గాదె ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేత ఆలోచన విరమించుకోవాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'కేంద్రం మరోసారి సామాన్యుని వీపుపై గ్యాస్‌ బండ ను మోపింది. గ్యాస్‌ మీద ఉన్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేయాలని గత సంవత్సరం జూలైలో కేంద్రం తీసుకున్న విషయం తెలిసిందే.. అప్పటినుండి తాజాగా పెరుగుదల వరకూ గ్యాస్‌ సిలిండర్‌ ధర 19సార్లు పెరిగింది. తాజాగా పెంచిన రూ.4.50తో నాన్‌ సబ్సిడీ సిలిండరు ధర రూ.742 గానూ, సబ్సిడీ సిలిండరు ధర రూ.495కు గానూ చేరింది. పెరిగిన ధరలు సామాన్యుని గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి'. ఈ అంశాలపై ఆదిలక్ష్మి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:15 - November 6, 2017

భద్రాద్రి కొత్తగూడెం : పత్తి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తికి కనీస మద్దతు ధర ఎక్కడా అమలుకావడం లేదన్నారు. వ్యాపారులు వివిధ సాకులు చూపెడుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారన్నారు. సీసీఐ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. టీ.మాస్‌ ఆధ్వర్యంలో ఇవాళ వరంగల్‌ మార్కెట్‌ను సందర్శించనున్నట్టు తమ్మినేని తెలిపారు. 

08:12 - November 6, 2017

వరంగల్ : భూమి పుత్రులు దగా పడుతున్నారు. కష్టాల కాలం అన్నదాతను వెంటాడుతోంది. అన్నదాతకు మార్కెట్‌లో దోపిడీ తప్పడం లేదు. నాణ్యత పేరుతో అరాచకం రాజ్యమేలుతోంది. సీసీఐ కేంద్రాల్లో దళారుల చేతిలో రైతులు నిలువునా మోసపోతున్నారు. వారికి మద్దతు మచ్చుకైనా కనిపించడం లేదు.  తెల్ల బంగారమంటూ మురిసిపోతున్న రైతును కదిలిస్తే కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.  మార్కెట్లోకొచ్చి తెల్లబోతున్న కాటన్‌ రైతుపై 10టీవీ ప్రత్యే కథనం..
పత్తికి దక్కని మద్దతు ధర
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  తెల్ల బంగారాన్ని పండించిన రైతన్నల ముఖాలు ధరలు లేక తెల్లబోతున్నాయి. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నా.. అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన వందలాది మంది కర్షకులకు క్వింటాకు కేవలం  3000 లోపే ధర దక్కుతోంది. మరికొందరి పరిస్థితి మరీ అధ్వానం. పత్తి నాసిరకంగా ఉందని చెప్పి కేవలం  1800 మాత్రమే చెల్లిస్తున్నారు. 4320 మద్దతు ధర దక్కుతుందనే ఆశతో వచ్చిన అన్నదాతలకు మార్కెట్‌లో నిరాశే మిగులుతోంది.  నాణ్యతను సాకుగా చూపి సరకును తిరస్కరిస్తుండడంతో హలధారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పత్తికొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న దళారులు
వరంగల్ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నా ఇప్పటి వరకు ఎక్కడా పత్తి కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో దళారుల రాజ్యం నడుస్తోంది.  రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారులు ఇష్టారాజ్యంగా తూకంలోనూ, ధర చెల్లింపులోనూ, తేమ శాతం కోతలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి, శ్రమ లేకుండా రైతులను  నిలువునా దోచుకుంటున్నారు.
ఎనుమాముల మార్కెట్‌కు లక్ష క్వింటాళ్ల పత్తి
వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, జయశంకర్‌, మహబూబాబాద్‌... జిల్లాల్లోని ప్రధాన పత్తి మార్కెట్లలోనూ 'మద్దతు' జాడ లేదు. కేసముద్రం లాంటి ప్రధాన మార్కెట్ లో కేవలం 3000లోపే ధర పలికింది. మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎనుమాములకు ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లకు పైగానే పత్తి వచ్చింది. ఇందులో సీసీఐ కేవలం 23,000 క్వింటాళ్లే కొనుగోలు చేసింది. అంటే వచ్చిన దాంట్లో పావు శాతం కూడా కొనడం లేదనేది స్పష్టమవుతోంది. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేంద్రం ప్రారంభమైనా కొన్నది కేవలం 30 క్వింటాళ్లే.
ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలో తక్కువగా మద్దతు ధర
దేశంలో పత్తి ధరలతో పోలిస్తే... తెలంగాణలోనే మద్దతు ధర అతి తక్కువగా రైతులుకు దక్కుతోందని ఇండస్ట్రీ బాడీ కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. పంజాబ్‌లో క్వింటాకు 5000  మద్దతు ధర లభిస్తుండగా... కర్ణాటక, మహారాష్ట్ర లో 4500 పైబడి కొనుగోలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో పత్తికొనుగోళ్లలో దళారులదే రాజ్యం. రైతులను అందినకాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. తేమ, నాసిరకమనే సాకులు చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 
స్వరాష్ట్రంలోనూ మాకు న్యాయం : అన్నదాతలు  
స్వరాష్ట్రంలోనూ తమకు న్యాయం జరుగడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు రావడంలేదని వాపోతున్నారు. చేసిన అప్పులు తీర్చే దారి తెలియడం లేదని విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం పత్తికొనుగోలు చేయాలని కోరుతున్నారు.
 

07:51 - November 6, 2017

హైదరాబాద్ : వివిధ రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌ సమాజ బాగుకోసం పనిచేయాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. ప్రొఫెషనల్స్‌ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలపై కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెషనల్‌ కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్‌ సమావేశం ఘనంగా జరిగింది.
దూకుడు పెంచిన కాంగ్రెస్‌ 
తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అన్ని వర్గాలను తమవైపు ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. వివిధ రంగాల్లోన్ని ప్రొఫెషనల్స్‌పై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. వారందరితో ఆదివారం హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించింది.  డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ గీతారెడ్డి అధ్యక్షతన ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రశ్నించడం లేకుంటే పాలకులు నియంత పాలన చేస్తారన్న కుంతియా 
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది లేకుంటే పాలకులు నియంత పాలన చేస్తారని కుంతియా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇదే ధోరణితో ఉన్నాయని విమర్శించారు.  కేసీఆర్‌ పాలనపై మేధావులు పెదవి విరుస్తున్నారని అన్నారు. ప్రొఫెషనల్స్‌ సైతం పాలకుల వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ జీడీపీ రేటు పూర్తిగా పడిపోయిందని విమర్శించారు కుంతియా.
సమాజంపై దృష్టి పెట్టాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
ప్రొఫెషనల్స్‌ వారి పనులకే పరిమితం కాకుండా సమాజంపై దృష్టి పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రొఫెషనల్స్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.  తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. సమావేశంలో ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ వేదిక పనితీరుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు.  ప్రొఫెషనల్‌ టీమ్‌కు  శ్రావణ్ అధ్యక్షుడిగా.. మరో ఐదుగురు సభ్యులుగా ఉండబోతున్నారు. 

 

07:47 - November 6, 2017

హైదరాబాద్ : ప్రభుత్వంపై పోరాడేందుకు టీ జేఏసీ  కార్యాచరణ సిద్ధం చేసింది.  ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.  మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలు చర్చించారు. జేఏసీని  రాజకీయ పార్టీగా మార్చాలన్న డిమాండ్ కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. 
దూకుడు పెంచనున్న  టీ-జేఏసీ 
తెలంగాణా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై  పోరాటం చేస్తున్న టీజేఏసీ ..ఇక నుంచి  మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయంచింది. మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన టీజాక్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పలు అంశాలపై  జేఏసీ నేతలు చర్చించారు. 
కేసీఆర్‌ ప్రభుత్వ నిర్బంధకాండపై జేఏసీ ఆగ్రహం 
కేసీఆర్‌ ప్రభుత్వం కొన్ని రోజులుగా జేఏసీ కార్యక్రమాల పట్ల  వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్వరాష్ట్రంలో పరాయి నేతల పాలనను తలపిస్తోందని  ఆందోళన వ్యక్తం చేశారు.  ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జేఏసీ భేటీలో సమీక్ష జరిగింది. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి  పలు తీర్మానాలను ఆమోదించింది. 
భర్తీకి నోచుకోని ఉద్యోగ ఖాళీలు 
తెలంగాణా రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా  ఉద్యోగాలు భర్తీకి నోచుకోవడం లేదని, దాదాపు 2 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయాలని టీజాక్ డిమాండ్ చేసింది.రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు సరైందని కాదని పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు. రైతు సమస్యలపై  క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచుతామని, కలిసివచ్చే రాజకీయపార్టీలతో ఐక్యంగా ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్‌ 
కోదండరాం అన్నారు. 
జేఏసీని రాజకీయపార్టీగా మలచాలన్న అభిప్రాయం
గ్రామ, మండల స్థాయిలో టీజాక్  కార్యక్రమాలను ముమ్మరం చేసి బలపడాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల్లోకి దూసుకెళ్లాలని భావిస్తున్నట్టు జేఏసీ నేతలు చెబుతున్నారు. అసలు జేఏసీని రాజకీయపార్టీగా మారిస్తే ఎలావుంటుందన్న దానిపై కూడా ఈ మీటింగ్‌లో నేతలు చర్చించడం ఆసక్తిగా మారింది. 

 

07:43 - November 6, 2017

హైదరాబాద్ : పాదయాత్ర సందర్భంగా "జగన్‌ స్పీక్స్‌" పేరుతో జగన్‌ వీడియో సందేశమిచ్చారు. 3 వేల కిలోమీటర్లు సాగే పాదయాత్రలో ప్రజలకు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజల కష్టాలు, నష్టాలు పరిష్కరించే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేస్తానని తెలిపారు. నవరత్నాలపై ఏదైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తానన్నారు. ప్రజలు దిద్దిన మేనిఫెస్టోనే బయటకురావాలన్నారు.

07:40 - November 6, 2017

అమెరికా : అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం ఓ చర్చిలో నెత్తురు చిందింది. సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో 50 మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆగంతకుడు లోపలికి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారి సహా 27మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 20మందికిపైగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన ఆగంతకుడు సైనిక దుస్తుల్లో వచ్చినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. 

 

నేటి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం

కడప : నేటి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర జరుగనుంది. ఇడుపులపాయల నుంచి జగన్ సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. 125 నియోజకవర్గాల్లో 3 వేల కిమీ.పాటు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

 

నేటి నుంచి అంతర్జాతీయ వాతావారణ సదస్సు

ఢిల్లీ : నేటి నుంచి అంతర్జాతీయ వాతావారణ సదస్సు జరుగనుంది. జర్మనీ బాన్ లో కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. 

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

మెదక్ : నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేయనున్నారు. సింగూరు జలాల విడుదలను నిరసిస్తూ ముట్టడికి పిలుపునిచ్చారు. 

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ లోని ఓ చర్చి వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడు మృతి చెందారు.

 

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ లోని ఓ చర్చి వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడు మృతి చెందారు.

 

Don't Miss