Activities calendar

07 November 2017

22:18 - November 7, 2017

ఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ దిగజారిందని మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. యూపీఏ పాలనలో ధరల పెరుగుదల సూచికలో రెండింతలు పెరిగిందని గుర్తు చేశారు. ఓ దశలో జిడిపి గ్రోత్‌రేట్‌ కన్నా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని రాజ్‌నాథ్‌సింగ్ ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థ దృఢంగా లేకుంటే విదేశీ పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు.

 

22:16 - November 7, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్‌ 9న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌, బిజెపి మొత్తం 68 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. సిపిఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187 అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌-బిజెపి పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోది ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జిఎస్‌టిలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్‌ అయిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే కాంగ్రెస్‌ నమ్ముకుంది. ఎన్నికలకు వారం రోజుల ముందు బిజెపి సిఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ పేరును ప్రకటించింది. 

 

22:14 - November 7, 2017

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ఉదయమే మార్కెట్‌కు వేరుశనగలు తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం అయినా... అధికారులు పట్టీలు ఇవ్వక పోవడంతో రైతులు ఆగ్రహించారు. కార్యాలయంలోని కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మార్కెట్‌ యార్డులో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.     

 

22:12 - November 7, 2017

హైదరాబాద్‌ : అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో నేటి పాలనపై పోరాటం చేయాలని, తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు నాగయ్య, జ్యోతి పిలుపునిచ్చారు. అక్టోబర్‌ విప్లవ శతజయంతి వేడుకల సందర్భంగా ఎంబీ భవన్‌లో ఎర్రజెండా ఎగురవేశారు. అక్టోబర్‌ విప్లవం సమాజంలో అసమానలతలను దూరం చేయడంలో చాలా ప్రభావం చూపిందన్నారు. సోషలిజం ద్వారానే అందరికి సమాన హక్కులు అందుతాయని వారు అభిప్రాయపడ్డారు.  

 

22:10 - November 7, 2017

ఖమ్మం : పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని CPM తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణజర్ల మండలం లాలాపురంలో జరిగిన పార్టీ సభకు తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా  కేంద్ర, ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ఇవ్వకుండా వ్యాపారులు దోచుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. 

 

22:05 - November 7, 2017

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో.. మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తానని విజయశాంతి రాహుల్‌కు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఓటమి.. కాంగ్రెస్‌ గెలుపు కోసం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని రాహుల్‌కు చెప్పినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ కుంతియా తెలిపారు. ఈ సమావేశంలో విజయశాంతితో పాటు.. కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 

 

22:02 - November 7, 2017

హైదరాబాద్ : భూరికార్డుల ప్రక్షాళన పూర్తైన తర్వాత తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలు కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే నెలాఖరు నాటికి భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సభ దృష్టికి తెచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిప్ఠాత్మకంగా చేపట్టిన  భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై అసెంబ్లీలో జరిగిన స్వల్వవ్యవధి చర్చలో వివిధ పక్షాలు సభ్యులు పాల్గొన్నారు.  సాదాబైనామాల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు, పహానీల్లో నెలకొన్న గందరగోళ అంశాలను,  ఏజెన్సీల్లో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూముల వరకు అన్ని విషయాలపై విలువైన సూచనలు చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. 

చర్చలో పాల్గొన్న సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య.. ఏజెన్సీల్లో సేద్యం చేస్తున్న గిరిజనుల పేరిట భూములులేని విషయాన్ని ప్రస్తావించారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కొనసాగిస్తూ.. కొత్తగా ఎమ్మార్వోలకు భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

భూరికార్డుల్లోని లోపాల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన నాలుగువేల రూపాయల ప్రోత్సాహకం అందుకునే అవకాశం లేకుండా పోతోందని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కేసీఆర్‌ సమాధానమిస్తూ.. ఏ రైతుకూ నష్టం జరుగకుండా రికార్డులను ప్రక్షాళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే నెలాఖరులోగా దీనిని పూర్తి చేసి, జనవరి 26 నుంచి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తామని సభ దృష్టికి తెచ్చారు. 

మరోవైపు సభ ప్రారంభమైన వెంటనే నిరుద్యోగ సమస్యపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ  బీజేపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చలో అసెంబ్లీ తలపెట్టిన ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై చర్చ కోసం బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాలని బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా బీజేపీ సభ్యులు వ్యవహరించడంపై అధికార పక్షం ఆక్షేపించింది. దీంతో బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేయడంతో 45 నిమిషాలకు పైగా సభా కార్యక్రమాలు స్తంభించాయి. సమావేశం ముగిసిన తర్వాత బీఏసీ భేటీ జరిగింది. ఈనెల 17 వరకు సమావేశాలను కొనసాగించాలని తీర్మానించారు. డిసెంబర్‌ 17న మరోసారి సమావేశం కావాలని  బీఏసీలో నిర్ణయించారు. 

21:56 - November 7, 2017

తమిళనాడు : ప్రముఖ తమిళ నటుడు కమల్‌హసన్‌ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖరారైంది. పార్టీ పేరును ఇంకా ప్రకటించలేదు కానీ... దానిపై ఓ స్పష్టత ఇచ్చారు....జనవరి తర్వాత మరో వంద రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని కమల్‌హసన్ చెప్పారు. 'మయ్యం విజిల్‌ ' పేరిట యాప్‌ను ప్రారంభించడం ద్వారా ప్రజా ఉద్యమ వేదికకు శ్రీకారం చుట్టారు. 

తన 63వ పుట్టినరోజు సందర్భంగా కమల్‌హసన్‌ చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో తన అభిమానులతో సమావేశమయ్యారు. తన పుట్టిన రోజున కమల్‌హసన్‌ రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అభిమానులు ఊహించారు. కానీ...కమల్‌ పార్టీని ప్రకటించకున్నా... దానిపై ఓ స్పష్టత నిచ్చారు. ఇప్పటికిప్పుడు పార్టీ ప్రకటించడం సాధ్యం కాదని...అందుకే ముందస్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నామని కమల్‌ చెప్పారు. 2018 జనవరి తర్వాత పార్టీ పేరు...విధి విధానాలు, ప్రణాళికలు, సిద్ధాంతాలను ప్రకటిస్తానని కమల్‌ హసన్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను కమల్‌హసన్ ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించినట్లు కమల్‌ చెప్పారు. ప్రజా సమస్యలేవైనా ఉంటే యాప్‌ ద్వారా తెలియజేయాలని అభిమానులకు సూచించారు. ప్రజలకు దగ్గరయ్యేందుకే ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు  పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేసినట్లేనని...పార్టీని ప్రకటించడమే మిగిలిందని... కమల్‌ వెల్లడించారు.
బైట్‌ కమల్‌హసన్, ప్రముఖ నటుడు

తనపై వస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేశారు. తాను కూడా హిందువునేనని, హిందువుల మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్ అన్నారు. తాను 'అతివాదం'  పదాన్నే వాడానని, 'ఉగ్రవాదం' అని వాడలేదని వివరణ ఇచ్చారు.  హింస ఏ రూపంలో ఉన్న తాను సహించబోనని కమల్‌ తెలిపారు.

తమిళనాడు ప్రజలు రాజకీయాల్లో బలమైన మార్పును కోరుకుంటున్నారని కమల్‌ చెప్పారు. అందుకే వాళ్లు తన ఆరంగ్రేటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ పెట్టేందుకు ప్రజలు తనకు పూర్తిగా సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మూడో వికెట్ కోల్పోయిన భారత్

తిరువనంతపురం : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగల వద్ద విరాట్ కోహ్లీ ఔట్ అయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. 

21:45 - November 7, 2017

హైదరాబాద్ : మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతోంది. గడచిన సంవత్సర కాలంలో.. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ లేదు అన్న సమాధానమే వస్తోంది. ఈ కఠోర వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు.. రేపు అనుకూల ర్యాలీ చేపడుతున్నాయి. అదే సమయంలో విపక్షాలు.. నవంబర్‌ 8ని బ్లాక్‌డేగా వర్ణిస్తూ.. దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నాయి.  
మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం 
నవంబర్‌ 8, 2016న 500, 1000 నోట్లను రద్దు చేస్తూ మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆదరా బాదరాగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుని వందకు పైగా మంది మృతి చెందారు. నోట్లరద్దుతో  రైతులు, పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. మోది సర్కార్‌ తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఎన్నో సర్వేలు నిరూపించాయి. 90 శాతం నల్లధనం విదేశాల్లోనే మూలుగుతోందని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న ప్రధాని ఇచ్చిన హామీ పూర్తిగా విఫలమైంది.
అనాలోచిత నిర్ణయం 
పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్‌ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోది ఆకాంక్ష నెరవేరకపోగా....అది మరింత పెరిగిందని విపక్షాలతో పాటు.. పలు సర్వేలూ ఘోషిస్తున్నాయి. మోది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏదోరకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినం 
విపక్షాలు నిరసనలకు దిగుతున్న వేళ..  అధికార బిజెపి, పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది.  నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు తమ చర్యను సమర్థించుకుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్లరద్దు నిర్ణయంపై అధికార, విపక్షాల ఆందోళన ప్రజలపై ఎంత ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.

 

21:39 - November 7, 2017

గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి వేదిక చర్చా కార్యక్రమంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, గృహణి స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో ప్రజలపై అధికారం పడిందన్నారు. ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:25 - November 7, 2017

సరిగ్గా వందేళ్ల క్రితం.. ఓ కొత్త ఉదయం వెల్లివిరిసింది. మరో ప్రపంచం దిశగా ప్రపంచాన్ని తీసుకెళ్లే బాటకు పునాదులు వేసింది. చరిత్రకు కొత్త పాఠాలు నేర్పింది. నిరంకుశ పాలకుల పీఠాలను కూకటి వేళ్లతో కబళించింది. ప్రజలంతా అత్యున్నత నాగరిక విలువలతో, సమున్నత వికాసంతో జీవించాలంటే సరైన మార్గాన్ని చూపింది. చిన్న ఒడిదుడుకులతో తాత్కాలిక వైఫల్యం ఎదురైనా  ఎర్రజెండా రెపరెపలే మానవాళికి అంతిమ గమ్యమని తేల్చింది. అక్టోబర్ విప్లవానికి శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం 
అక్టోబర్ విప్లవం..
అక్టోబర్ విప్లవం.. ప్రపంచం ఆ రోజు కొత్తగా తెల్లారింది. ఎర్రెర్రని కాంతులు లోకమంతా పరురుకున్నాయి. కార్మిక కర్షకులదే అధికారమంటూ చాటింది. సమున్నత స్వప్నాన్ని సాకారం చేసింది. నేటికీ ఆ స్ఫూర్తి కాంతులు ప్రసరిస్తూనే ఉన్నాయి. సమసమాజ కోసం కలలుకనే వారికి దారి చూపుతూనే ఉన్నాయి. 

 

21:21 - November 7, 2017

కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్ టీ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని వక్తలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐబీఈఏ నేషనల్ సెక్రటరీ బీఎస్.రాంబాబు పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. జీఎస్ టీ వల్ల సామాన్యులపై అధిక భారం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. అన్ని రంగాలు కుదేలయ్యాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:00 - November 7, 2017

మిర్చీరైతు బేడీల మీద కట్టు కథలు, బహిరంగ సభల బహిరంగ నిద్ర, అద్భుత ఏర్పాట్లళ్ల వంటున్న జగనాలు, భారత రాజ్యాంగం బోధిస్తున్నమహారాజ్, విడిపోయి అడుక్కుంటున్న బీసీలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

గుడివాడ మానికొండ రోడ్డులో ట్రాఫిక్ జామ్

విజయవాడ : గుడివాడ మానికొండ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. రూట్ సర్వే పేరుతో సీఆర్ డీఏ ప్రైవేట్ సిబ్బందిని నియమించింది. వాహనదారులను ప్రైవేట్ సిబ్బంది బలవంతంగా ఆపుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. పోలీసులు పట్టించుకోవడం లేదు. 

 

20:45 - November 7, 2017

హైదరాబాద్ : అంతర్జాతీయ నగరం అన్నారు.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ అన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా... జంక్షన్లను మారుస్తామన్నారు. సర్వేలు చేసి టైం ఫ్రేమ్‌ ఫిక్స్‌ చేశారు. కానీ హైదరాబాద్‌ నగరంలో ఏ ఒక్క జంక్షన్‌ కూడా ఇంప్రూవ్‌మెంట్‌ కాలేదు. హైదరాబాద్‌ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కొంతవరకైనా సమస్యలు తగ్గుతాయని ఆశించినా... అది పెద్దగా ఉపయోగపడటం లేదనే విమర్శలొస్తున్నాయి.
సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేక ఇబ్బందులు 
ట్రాఫిక్ జాం.. ఈ పదం వింటేనే హైదరాబాద్ నగరవాసుల వెన్నులో వణకు పుడుతుంది. ఒక్కసారి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం చూడాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 221 జంక్షన్లు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండి ఎక్కువగా ట్రాఫిక్ జాం అయ్యే 111 జంక్షన్లను బల్దియా, ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఇలాంటి చోట్ల కాసేపు సిగ్నల్ పడితే చాలు భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేక మరింత ట్రాఫిక్ జాం అవుతుంది. 
ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 
గ్రేటర్‌లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల నుండి తప్పించుకునేందుకు జంక్షన్లను ఇంప్రూవ్‌మెంట్ చేయాలని బల్దియా డిసైడ్ అయ్యింది. హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ప్రతీ జంక్షన్‌ను మోడ్రన్ ట్రాఫిక్ వ్యవస్థతో డెవలప్‌ చేయాలని డిసైడ్ చేశారు. నగరంలో 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా ప్రధాన రోడ్లు 1500 కిలోమీటర్లు ఉంటాయి. సిటీలో 51 లక్షల వాహనాలుండగా ప్రతీ రోజు దాదాపు 1000 కొత్తవాహనాలు సిటీలో రిజిస్టర్ అవుతున్నాయి. సిటీ రోడ్డు వైశాల్యంలో మాత్రం హైదరాబాద్ నగరం చాలా వెనకబడి ఉంది. ముంబై సిటీ రోడ్డు వైశాల్యం 10 శాతం, కోల్‌కత్తాలో 12 శాతం, చెన్నై నగరంలో 18 శాతం రోడ్లు ఉండగా హైదరాబాద్‌ నగరంలో 8 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. 
సక్రమంగా పని చేయని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ 
ఇక ఉన్న రోడ్లు జంక్షన్లు అభివృద్ధి చేయడంలో హైదరాబాద్ పాలక సంస్థలు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. సిటీలోని జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ సక్రమంగా పని చేయవు. సిగ్నలింగ్, జంక్షన్‌లో ట్రాఫిక్ మెయింటెనెన్స్ కోసం వేసే లైనింగ్.. పాదచారులు దాటేందుకు వేసే జీబ్రాక్రాసింగ్ వంటివి మాత్రం మెయింటెయిన్‌ చేయడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
జంక్షన్ల ఇంప్రూమెంట్ కు ప్రతిపాదనలు 
గడిచిన మూడేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉన్న జంక్షన్ల ఇంప్రూమెంట్ కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పాలకులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాటి అమలు మాత్రం అంతంతగానే ఉంటుంది. ఇప్పటికైనా శాస్త్రీయ పద్ధతిలో జంక్షన్లను అభివృద్ధి చేయాలని సిటిజన్స్ కోరుతున్నారు. 

 

20:32 - November 7, 2017
20:29 - November 7, 2017

కృష్ణా : సీపీఎం ఆధ్వర్యంలో అక్టోబర్ సోషలిస్టు మహా విప్లవ శతవార్షికోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు పాల్గొని ప్రసంగించారు. సోవియట్ రష్యాలో వందేళ్ల క్రితం పెట్టుబడిదారుల విధానాన్ని కూల్చి కార్మిక రాజ్యం స్థాపించిన అద్భుతమైన రోజు అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి అక్టోబర్ మహా విప్లవం స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వేచ్చా ప్రపంచాన్నే తీసుకొచ్చిన అక్టోబర్ విప్లవం స్ఫూర్తిగా ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. 

20:27 - November 7, 2017
20:25 - November 7, 2017

విజయవాడ : అసెంబ్లీని బహిష్కరించిన వైసీపీని ప్రజలే బహిష్కరిస్తాని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఆయన పాదయాత్రను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు... టీడీపీ అసెంబ్లీ స్ట్రాటజీ సమావేశం నిర్వహించారు.
10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ దృష్టి సారించింది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీతో భేటీ అయి చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతోపాటు జగన్‌ పాదయాత్రపైనా ఈ సమావేశంలో చర్చకొచ్చాయి. పది రోజుల పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.  అయితే సభా నిర్వహణపై బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీడీపీ దాదాపు 28 అంశాలను సభ ముందు చర్చకు తీసుకురావాలని యోచిస్తోంది. అందులో ఏపీ విభజన వాదం, రియల్‌టైమ్‌ గవర్నెన్స్, కాంట్రిబ్యూటరీ పెంచన్‌ స్కీ... విశాఖ భూములు , పెన్షన్స్ ,రైతు రుణమాఫీ, సంక్షేమ రంగాలు, ఇసుక విధానం, పోలవరం, రాజధాని నిర్మాణంలాంటి ప్రధాన అంశాలపై చర్చించే అవకాశముంది.
జగన్‌ నిర్ణయంపై చర్చించిన చంద్రబాబు
ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించిన దానిపై చంద్రబాబు అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ భేటీలో చర్చించారు. ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్‌కాట్‌  చేయడంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ప్రతిపక్షం చేస్తున్న పనులను గమనిస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలపై మంత్రులు ప్రిపేర్‌ అయ్యి రావాలని సీఎం ఆదేశించారు. సభను హుందాగా జరుపుకొనేలా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు అసెంబ్లీ సమావేశాలకు  తప్పకుండా హాజరుకావాలని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షమ కార్యక్రమాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా వివరిద్దామని సీఎం సూచించారు.

20:22 - November 7, 2017

కడప : రెండో రోజు ప్రజాసంకల్పయాత్రలో జగన్‌.. జనంపై వరాల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు.  ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధులకు 2 వేల పెన్షన్‌ ఇస్తామని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. 

 

20:17 - November 7, 2017

ఢిల్లీ : పోలవరం కేసులో కేంద్రానికి చుక్కెదురైంది. కౌంటర్‌ దాఖలు చేయక పోవడంతో సీరియస్‌ అయిన సుప్రీం కోర్టు కేంద్రానికి 25 వేల జరిమానా విధించింది. పోలవరంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను చేరుస్తూ అభ్యంతరాలు తెలపవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే తెలంగాణ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ సర్కార్‌.. విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం తెలంగాణకు పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేదని వాదించింది. ఏపీ అభ్యంతరాలను నమోదు చేసిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.. కేసు విచారణ సందర్భంలో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అభ్యంతరాలను కోర్టుకు తెలిపే స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఇంప్లీడ్‌ పిటిషన్లను స్వీకరించారు.

ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకుగాను 25వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా ఉపసంహరించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

 


 

20:13 - November 7, 2017

భూపాలపల్లి : ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగం పోతుందని ఉద్యమించిన అతనిప్పుడు నిరుద్యోగిగానే మిగిలాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అతనిపై నమోదైన కేసు అతన్ని ఉపాధికి దూరం చేసింది. నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ కేసు నమోదైన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించడంతో నిరుద్యోగిగా మారాడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన సలెందర్‌. 

ఇక్కడ పని చేస్తున్న ఇతని పేరు సలెందర్‌. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం ఇందిరా నగర్‌ కాలనీకి చెందిన డ్యాగల సదయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు. ఏటూరు నాగారంలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగించిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ను ఏజెన్సీ ప్రాంతంలో ఏటూరు నాగారం వచ్చి వెళుతున్న క్రమంలో తాడ్వాయి వద్ద అడ్డుకున్న వారిలో సలెందర్‌ కూడా ఉన్నాడు. దీంతో వారందరిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగ్గా 2013 జూన్ 18న ములుగు జ్యుడీషియల్‌ కోర్టు సలెందర్‌ను నిర్దోషిగా తీర్పు నిచ్చింది. 

ఆ తర్వాత సలెందర్‌ ఉద్యోగ వేటలో పడిపోయాడు. 2013 సీఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని బర్వాహలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని ముంబాయిలో విధులు నిర్వహించాడు. 27నెలల తర్వాత సలెందర్‌ అపాయింట్‌మెంట్‌కు ముందు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఉన్నతాధికారులు తనని విధుల్లోంచి తొలగించారని సలెందర్‌ వాపోతున్నాడు. 

ఉద్యోగంలో చేరడానికి ముందుగా అగ్రిమెంట్‌ ఫారంలో పోలీసులు అరెస్టు చేశారన్న దానిపై వివరణ ఇవ్వలేదని సలెందర్ తెలిపాడు. అయితే కోర్టు కేసును కొట్టి వేయడంతోనే ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నాడు. కొంత కాలం తర్వాత అధికారులు  సలెందర్‌పై విచారణ జరిపిన అనంతరం సలెందర్‌పై క్రిమినల్‌ కేసు నమోదైందని తెలుసుకున్నారు. దీంతో సలెందర్‌ను విధుల్లోంచి తొలగించారు ఉన్నతాధికారులు. దీనిపై ఉన్నతాధికారులను సలెందర్ వివరణ అడగ్గా తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఉద్యోగం నుండి తీసేసామని వివరణ ఇచ్చారు. 

తనపై కేసు నమోదైన కారణంగా ఉద్యోగం నుండి తొలగించడంతో సలెందర్‌ కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఉద్యోగం కోల్పోవడంతో ప్రస్తుతం తమ కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాగైనా తిరిగి తమ కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని సలెందర్‌ తల్లి, భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  

తెలంగాణ ఉద్యమంలో పోరాడినందుకు తాను విధుల నుండి తొలగించబడ్డానని సలెందర్‌ ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయంపై మంత్రిని అడగ్గా అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు.  దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తనకి ఉద్యోగం ఇప్పించాలని సలెందర్‌ కోరుకుంటున్నాడు. 

18:50 - November 7, 2017

నల్గొండ : బత్తాయి సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలోని వల్లపురెడ్డి కోటిరెడ్డి ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన బత్తాయి రైతుల ప్రాంతీయ స్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరుగుతోందని అన్నారు. మంచి దిగుబడి కోసం సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు. లక్ష కటోర్‌ గోల్డ్‌ రకం మొక్కలను తెప్పిస్తున్నామని, ఒక్కో రైతుకు 15 నుంచి 20 మొక్కలు అందజేస్తామని చెప్పారు. రైతుల అవగాహన కోసం వ్యవసాయ ఉత్పత్తులు, బిందు సేద్యం పరికరాలు, వాటి వినియోగం, మొక్కల పెంపకం ఎలా చేపట్టాలనే అంశాలపై  స్టాళ్లను ఏర్పాటు చేశారు.

 

18:47 - November 7, 2017

హైదరాబాద్ : అక్టోబర్‌ విప్లవ శతజయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌ సీఐటీయూ స్టేట్‌ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అక్టోబర్‌ విప్లవ స్పూర్తితో పాలకుల వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని శ్రామిక వర్గానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు సూచించారు.

18:44 - November 7, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ.. ఐఎమ్ ఏ లింగ్విస్టిక్ సెకండ్ ఇయర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యాయత్నం చేశాడని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. 

 

18:42 - November 7, 2017

హైదరాబాద్ : కార్మిక సంఘాలు ఢిల్లీలో చేపట్టనున్న పార్లమెంట్‌ మహాధర్నాకు టీమాస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని కార్మికులందరికి 18 వేల కనీస వేతనం అమలయ్యేలా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని టీమాస్‌ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. 

 

18:38 - November 7, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిసిన గ్రామాలను తిరిగి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. భూరికార్డులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య.. భధ్రాచలం దేవస్థానం భూముల విషయాన్ని ప్రస్తావించారు. రాములవారి దేవాలయం ఏపీలో ఉంటే... గుడి భూములు ఏపీలో ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. 
 

 

18:35 - November 7, 2017

హైదరాబాద్ : ఏజెన్సీల్లో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరణకు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. టీఅసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అదికూడా గిరిజనులకు అభ్యంతరం లేకపోతేనే క్రమబద్ధీకరించే వీలు ఉంటుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయం చెప్పారు. 1/70 చట్టాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

 

18:22 - November 7, 2017
17:49 - November 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 17వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈనెల 17న మరోసారి బీఏసీ సమావేశం జరుగనుంది. 

 

17:45 - November 7, 2017

టైగర్ జిందా హై మూవీ ట్రైలర్ విడుదల అయింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది.

 

17:39 - November 7, 2017

సూర్యాపేట : జిల్లాలో విషాదం నెలకొంది. తామరపువ్వుల కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. తిరుమలగిరి మండలం వెలశాలలో ఇద్దరు చిన్నారులు తామర పువ్వుల కోసం నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సూర్యాపేట జిల్లాలో విషాదం

సూర్యాపేట : జిల్లా తిరుమలగిరి మండలం వెలశాలలో విషాదం నెలకొంది. నీటిలో ముగిని ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. తామరపువ్వుల కోసం వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. 

16:41 - November 7, 2017

ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 17వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈనెల 17న మరోసారి బీఏసీ సమావేశం జరుగనుంది. 

ప్యారడైజ్ పేపర్స్ లో జగన్ పేరు ? : కళా వెంకట్రావు

గుంటూరు : ప్యారడైజ్ పేపర్స్ లో జగన్ పేరు ఉందనే వార్తలు వస్తున్నాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. పాదయాత్రలో వాటి మీద జగన్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అవినీతి అక్కడి వరకు విస్తరించడం సిగ్గు చేటన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏంపీలచే రాజీనామా చేయిస్తానని ఇప్పటి వరకు రాజీనామాల గురించి మాట్లాడడం లేదన్నారు. జగన్ కి ప్రజా సమస్యలపై దృష్టి లేదని చెప్పారు. పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాననే భ్రమలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతారనుకుంటే ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేస్తారని పేర్కొన్నారు. 

 

దళితులతో రచ్చబండ నిర్వహించిన జగన్

కడప : వేంపల్లిలో దళితులతో వైసీపీ అధినేత జగన్ రచ్చబండ నిర్వహించారు. చంద్రబాబులా వందల పేజీలు కాకుండా.. రెండు పేజీల మేనిఫోస్టోతో మీ ముందుకు వస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక వృద్ధులకు ఫించన్లు ఇచ్చే పరిస్థితి కరువైందన్నారు. నిరుద్యోగ సమస్య పోవాలంటే ప్రత్యేక హోదా అవసరం పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రిమలు వస్తాయన్నారు. 

 

16:15 - November 7, 2017
16:12 - November 7, 2017

కరీంనగర్ : కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న అన్నదాతకు కల్పతరువుగా మారింది. 60వసంతాల ప్రస్థానంలో సహకార విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 14 గ్రామాల రైతుల ఇళ్లలో సంతోషం నింపింది. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ముల్కనూరు గ్రామీణ సహకరా బ్యాంకుపై టెన్‌టీవీ ఫోకస్‌....
60 వసంతాల ముల్కనూర్‌ గ్రామీణ సహకార బ్యాంకు 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భీమదేవర పల్లి మండలంలోని  ముల్కనూర్ గ్రామీణ సహకార భ్యాంక్  60వసంతాలు పూర్తిచేసుకుంది. దశాబ్దాల కరువు  కాటాకాలను, రైతన్నల దుర్బర పరిస్థితులను చూసి చలించిన స్వాతంత్ర్య  సమర యోధుడు అల్గిరెడ్డి కాశీ విశ్వనాధ రెడ్డి గ్రామస్తుల కోసం ఏదైన చేయాలని  సంకల్పించారు. 1956లో ముల్కనూర్ గ్రామీణ సహకార బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో బ్యాంక్ ఒడిదుడుకులతోనే తన ప్రయాణం మొదలు పెట్టింది. 373 మంది రైతుల భాగస్వామ్యంతో 2,300 మూల ధనంతో ప్రారంభం అయిన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే సహకార రంగ బ్యాంకులకు మార్గనిర్ధేశాలు చేసె స్థాయికి చేరింది.
సమస్యలపై రైతుల్లో చైతన్యం కలిగించడం
సహకార బ్యాంక్ అంటే రైతులకు రుణాలచ్చే బ్యాంక్ అని మాత్రమే అని అందరూ అనుకుంటారు. కాని ముల్కనూర్ సహకార బ్యాంక్ పంథా మాత్రం ప్రత్యేకం. కష్టాల్లో ఉన్న రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు వారుఆర్ధికంగా ఎదిగేందుకు చేయూతనివ్వడం  ఈ బ్యాంక్‌ ప్రత్యకత. అన్ని బ్యాంకుల మాదిరగా రుణాలిచ్చి చేతులు దులుపుకోవడం, ఆతర్వాత అప్పు చెల్లించాలని పీడించడం ముల్కనూరు సహకార బ్యాంకు చరిత్రలోనే లేదు. సమస్యలపై రైతులను చైతన్యపరిచి, పరిష్కార మార్గాలు చూపెట్టే బాధ్యతను బ్యాంకే తీసుకుంటుంది. దీంతో రైతు దళారుల చేతిలో మోస పోకుండా గిట్టుబాటు ధర పోందే అవకాశం కలిగింది. అంతేకాదు పంట వేసే ముందు అన్నదాతలు నకిలీవిత్తనాల బారీన పడకుండా బ్యాంకు ఆధీనంలోనే విత్తనశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. 
రైతుల సంక్షేమానికి బాధ్యత వహించడం 
ఒక్క పంటరుణాలే కాదు..సభ్యులుగా ఉన్న రైతుల సంక్షేమన్ని ముల్కనూర్ బ్యాంక్ తన  బాధ్యతగా తీసుకుంది. సభ్యుల పిల్లల చదువులకు అవసరం అయిన స్కాలర్ షిఫ్ లతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకాలను అందచేస్తుంది. ఎవరైన సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే జనతా యాక్సిడెంట్ యోజన పాలసీ కింద కుటుంబానికి  ఆర్థిక సాయన్ని అందచేస్తుంది.అనారోగ్యం పాలయిన వారికి మెరుగైన చికిత్స అందించడం ...అవసరం అయితే సభ్యులతో చర్చింది వైద్యనికి అవసరం అయిన ఖర్చులను బ్యాంక్ భరిస్తుంది. అంతేకాదు వృద్ధులకు  పింఛన్లను  అందిస్తు వారికి తోడ్పాటును అందిస్తుందీ బ్యాంకు. దాంతోపాటు పెట్రోల్,ఎల్పీజీ బంక్ లను ఏర్పాటు చేసి సహకార బ్యాంకింగ్ రంగంలోనే ఫలప్రదమైన స్థానంలో నిలిచింది ముల్కనూర్ సహకార బ్యాంక్.  
వజ్రోత్సవాల్లో ముల్కనూరు సహకార బ్యాంకు 
భీమదేవరపల్లి మండలంలోని 14 గ్రామల్లో రైతులకు సేవలను అందిస్తున్న ఈ బ్యాంకు ప్రస్తుతం 7500 మంది సభ్యులతో 300కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. అంతేకాదు ఈ సహకార బ్యాంకులు 15కోట్లవాటధనంతో పాటు  40 కోట్ల రూపాయలు రైతుల పొదుపులే ఉన్నాయి. ప్రస్తుతం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంకు.. నిజంగా తమ పాలిట కల్పతరువే అంటున్నారు అన్నదాతలు. 

 

16:04 - November 7, 2017

తమిళనాడు : తాను రాజకీయాల్లోకి వచ్చేశానని...కొన్ని పనులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయన్నారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. తాను కూడా హిందువే అని, హిందువుల సెంటిమెంట్‌ను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్‌ స్పష్టంచేశారు. తాను అతివాదం  పదాన్నే వాడానని, ఉగ్రవాదం అని వాడలేదని వివరణ ఇచ్చారు.  హింస ఏ రూపంలో ఉన్నా తాను సహించబోనని కమల్‌ తేల్చి చెప్పారు. కమల్‌ తన పుట్టినరోజు సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించనట్లు కమల్‌ చెప్పారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఈ యాప్ ద్వారా తన అభిమానులు దానిని వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, కార్యకలాపాల కోసం అభిమానుల నుంచే విరాళాలు సేకరిస్తానని, ఆ వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయని ఈ సందర్భంగా కమల్ ప్రకటించారు.

 

16:01 - November 7, 2017

నెల్లూరు : జిల్లాలోని కావలిలో ఇద్దరు పోలీసు అధికారులు స్టేషన్‌లోనే వీరంగం సృష్టించారు. ఒకరితో ఒకరు  ఘర్షణకు దిగి.. రోడ్డునపడ్డారు. ఓ ఫ్యాన్సీ స్టోర్‌ వివాదంలో.. సీఐ, ఏఎస్ ఐల మధ్య పంపకాలు దగ్గర తేడా వచ్చి.. పోలీస్‌స్టేషన్‌లోనే గొడవపడ్డారు. సోమవారం రాత్రి ఏఎస్ ఐ సుబ్రహ్మణ్యం స్టేషన్‌లో.. సీఐ రోశయ్యతో వాగ్వాదానికి దిగడంతో.. అక్కడే ఉన్న ఎస్ ఐ అంకమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఎస్ ఐని సుబ్రహ్మణ్యం నెట్టాడు.. దీంతో ఆగ్రహం చెందిన సీఐ .. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని.. సీఐ చెప్పారు.

 

15:58 - November 7, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం వేసిన కేసులో తమకు కూడా  అవకాశమివ్వాలని తెలంగాణ, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాలు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. అయితే.. తెలంగాణ పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టంలో సెక్షన్‌ 90 ప్రకారం తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదన్న ఏపీ తరపు న్యాయవాదులు వాదించారు. అయినా... ఇంప్లీడ్‌ పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు స్పందించనందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు 25 వేలు జరిమానా విధించింది. ఈ జరిమానాను ఉపసంహరించుకోవాలని కేంద్రం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే.. కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. 

15:56 - November 7, 2017

విశాఖ : ఏయూలోని సంస్కృతం విభాగధిపతి ఏడుకొండలు వేధింపుల నుండి తామను కాపాడాలంటూ విద్యార్ధినిలు మంత్రి గంటా శ్రీనివాసురావు వాహనం ముందు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి తప్పు ఉంటే ఏడుకొండలుపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామిఇచ్చారు.

 

కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ ప్రారంభం

తమిళనాడు : ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన పుట్టినరోజు సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించనట్లు కమల్‌ చెప్పారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఈ యాప్ ద్వారా తన అభిమానులు దానిని వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు. పార్టీ నిర్మాణం, కార్యకలాపాల కోసం అభిమానుల నుంచే విరాళాలు సేకరిస్తానని, ఆ వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయని ఈ సందర్భంగా కమల్ ప్రకటించాడు. 

15:50 - November 7, 2017

విజయవాడ : దోపిడీ ఉన్నంతకాలం వర్గపోరాటాలు కొనసాగుతాయన్నారు సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు పోలారి. రష్యా విప్లవానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో అలంకార్‌ సెంటర్‌ నుండి ఎంబీకే భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రష్యా దేశం ప్రపంచ వ్యాప్తంగా కార్మికలోకానికి ప్రజలకు, పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు పోలారి. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.   

15:49 - November 7, 2017

కరీంనగర్‌ : అక్టోబర్‌ విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...కరీంనగర్‌ జిల్లాలో సిపిఎం పార్టీ కార్యాలయంలో విప్లవ జెండాను ఆవిష్కరించారు ఆపార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎర్ర జెండాను ఎగురవేసి సోషలిస్టు ప్రజా ఉద్యమాలను గుర్తుకు చేసుకున్నారు. దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సోషలిస్టు ఆవశ్యకతను గుర్తుచేస్తుందని ముకుందారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలకు కారణం పాలక పక్షాల వైఫల్యమే అని విమర్శించారు. 

 

15:46 - November 7, 2017

మెదక్ : సింగూరు జలాలను శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కి తరలించ వద్దంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సింగూరు డ్యాంని ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. సింగూరు నీటిని తీసుకెళ్లడమంటే జిల్లా ప్రజలన్ని మోసం చేయడమే అని సంగారెడ్డి జిల్లా సీపీఎం నేతలు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సింగూరు జలాల విషయం లేవనెత్తితే స్థానిక ఎమ్మెల్యేలు చర్చించక పోవడం దారుణమన్నారు. డ్యాం ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

15:45 - November 7, 2017

హైదరాబాద్ : 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విజ్ఞప్తి చేశారు. టీఅసెంబ్లీలో ఆయన మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళన నేపథ్యంలో... సేద్యం చేస్తున్న రైతుల పేర్ల మీద పట్టాలు ఇవ్వాలని సున్నం రాజయ్య కోరారు. గిరిజనులకు ప్రభుత్వం భూమి ఇవ్వాలన్నారు. 1/70 యాక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

 

15:41 - November 7, 2017

హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యపై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నిరుద్యోగుల సమస్యపై చర్చించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. అయితే... బీఏసీలో నిర్ణయించిన ప్రకారం ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ తెలిపారు. దీనికి అంగీకరించని బీజేపీ నేతలు సభలో నినాదాలు చేశారు. సభకు బీజేపీ చర్చకు కాకుండా రచ్చకు వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత నిరుద్యోగుల సమస్యపై స్పీకర్‌ చర్చకు అంగీకరించినా సభలో గందరోగోళం చేయడం సరికాదన్నారు. అయినా సభలో గందరగోళం సద్దుమణగలేదు.. దీంతో నిరుద్యోగుల సమస్యపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.  కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో... రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో అన్ని చర్చలో బయటపడతాయన్నారు. ప్రశ్నోత్తరాలలో జీవన్‌రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతిచ్చారు. అయితే... సభను ఆర్డర్‌లో పెట్టాలని జీవన్‌రెడ్డి కోరారు. నిరుద్యోగుల సమస్యపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఆడుకుంటుందని జీవన్‌రెడ్డి అన్నారు. 

 

టీ.అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకముందు సభలో పలు అంశాలపై వాడీవేడీగా చర్చలు జరిగాయి.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ

ఢిల్లీ : హస్తిన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. విసబులిటీ 5 వందల మీటర్లకు పడిపోయింది. కాలుష్యంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి వద్ద వివరాలున్నాయి. గాలిలో మోతాదుకు మించి కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ విషవాయువులున్నాయి. 

15:35 - November 7, 2017
15:34 - November 7, 2017

హైదరాబాద్ : భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్బంగా నయీం అంశం చర్చకు వచ్చింది. కొంతమంది కావాలని నయీంను పెంచి పోషించారన్నారు సీఎం కేసీఆర్‌. నయీం బెదిరింపులకు పాల్పడి భూములు లాక్కున్నారన్నారు. నయీం భూములంటూ ఏమీ లేవన్నారు.

 

15:31 - November 7, 2017

ఢిల్లీ : హస్తిన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. విసబులిటీ 5 వందల మీటర్లకు పడిపోయింది. కాలుష్యంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి వద్ద వివరాలున్నాయి. గాలిలో మోతాదుకు మించి కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ విషవాయువులున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులంటున్నారు. కాలుష్యం కారణంగా భారత వైద్య మండలి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వెంటనే విద్యాసంస్థలు మూసివేయాలని తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్‌ 19న జరగాల్సిన ఎయిర్‌టెల్ ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌ కార్యక్రమం రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ వైద్యుల బృందం లేఖ రాసింది. పంజాబీ బాగ్, ఆర్కేపురం, దిల్‌ షా గార్డెన్, ఆనంద్‌ విహార్‌, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలలో కాలుష్యం ప్రమాదకరంగా తయారైంది. 

 

13:26 - November 7, 2017

హైదరాబాద్: శాసనసభ భూ రికార్డుల ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... భూ రికార్డుల విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు అంతులేదని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, భూ రికార్డులకు, వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. సర్వేలో అన్ని విషయాలు బయటపడుతున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, శామీర్ పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాపే లేదన్నారు. మన రెవెన్యూ వ్యవస్థను రూపొందించింది సాలార్జంగ్-1 నిజాం రాజు భూ సర్వే చేయించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ రెవెన్యూ చట్టం భిన్నంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర భూ భాగం 2.76 కోట్ల ఎకరాలు, రెవెన్యూ గ్రామాలు 10.885, జగిత్యాల జిల్లాలో 99 శాతం భూరికార్డులు సరిచేశారన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

మొబైల్ యాప్ ను విడుదలచేసినకమల్ హాసన్

చెన్నై: మొబైల్ యాప్ ను కమల్ హాసన్ విడుదల చేశారు. ప్రజలతో అనుసంధానానికి యాప్ విడుదల చేసినట్లు కమల్ తెలిపారు. ప్రజలకు మంచి చేయడమే రాజకీయం అని, ప్రజలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

పెద్దకడుబూర్ మండలంలో చిరుత కలకలం..

కర్నూలు: పెద్దకడుబూర్ మండలం కపటి మలగొట్టు పొలాల్లో చితరు సంచరిస్తోంది. రెండు ఎద్దులపై చిరుత దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

నందికొట్కూరు మండలం శాతనకోటలో విషాదం

కర్నూలు: నందికొట్కూరు మండలం శాతనకోటలో విషాదం నెలకొంది. పాలంలో మందు పిచికారి చేస్తుండగా వెంకటేశ్వర్లు, పద్మావతి అనే దంపతులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య పద్మావతి మృతి చెందింది.

సింగూరు డ్యాం వద్ద ఉద్రిక్తత

మెదక్ : సింగూరు డ్యాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగూరు జలాలను శ్రీరాం సాగర్ కు విడుదల చేయెద్దంటూ డ్యాం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

భూ రికార్డుల విషయంలో సభలో చర్చ

హైదరాబాద్: శాసనసభ భూ రికార్డుల ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... భూ రికార్డుల విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు అంతులేదని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, భూ రికార్డులకు, వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. సర్వేలో అన్ని విషయాలు బయటపడుతున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, శామీర్ పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాపే లేదన్నారు. మన రెవెన్యూ వ్యవస్థను రూపొందించింది సాలార్జంగ్-1 నిజాం రాజు భూ సర్వే చేయించారని కేసీఆర్ పేర్కొన్నారు.

ఏపీలో అపెక్స్ కమిటీ భేటీ

అమరావతి: చేపల చెరువుల్లో యాంటిబయాటిక్స్ వాడకంపై అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కామినేని, ఆదినారాయణ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, ఏపీఐఐసీ ఛైర్మన్ కిష్టయ్య, డీజీ రవిశంకర్, ఫిషరీస్ కమిషనర్ నాయక్, మత్స్య శాఖాధికారులు పాల్గొన్నారు. కృష్ణా, నెల్లూరు, ప.గో.తూ.గో సబ్ కలెక్టర్లు పాల్గొన్నారు.

12:48 - November 7, 2017

హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఉద్యోగుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమలా అమలు కుంటుపడింది. పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీనిధి రుణాల పంపిణీ,వసూళ్లు నిలిచిపోయాయి, దాంతోపాటు పశువుల బీమా, పింఛన్ల పంపిణీలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అయితే తాము వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని సెర్ప్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగ రెగ్యులరైజేషన్‌ కోసం డిమాండ్‌

తెలంగాణా డెవలప్ మెంట్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణా సొసైటీ ఎలిమినేషన్ ఫర్ రూరల్ ప్రావర్టీ, మండల సమాఖ్య కమ్యూనిటీ కో ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. వీరితోపాటు అడ్మినిస్ట్రేషన్ మినిస్టీరియల్ స్టాఫ్ యూనియన్లు ఐక్య వేదికగా ఏర్పడి గత నెల 30 నుండి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలులో కీలకపాత్ర పోషిస్తున్న తమకు ఉద్యోగ రెగ్యులరైజేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

5ఏళ్ల కాంట్రాక్ట్‌ పద్ధతిని తొలగించాలి

5 సంవత్సరాల కాంట్రక్ట్ రెన్యూవల్ పద్దతి తొలగించాలని జీవొ నంబర్ 174 ప్రకారం హెచ్ ఆర్ పాలసీలో ఉన్న వారందరికీ పేస్కేలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు ప్రస్తుతం ఇస్తున్న మూల వేతనం 2800 నుంచి 6700లకు పెంచి తక్షణమే అమలు చేయాలంటున్నారు. దాంతోపాటు 2010 నుంచి పదోన్నతి పొందిన వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని సెర్ప్‌ ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే.. వివిధ సంఘాలతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

12:40 - November 7, 2017

ఢిల్లీ: దేశ రాజధాని పొగమంచు కోరల్లో చిక్కుకుంది. ఉదయం 10 గంటలైనా ఇంకా తెల్లవారలేదేమో అన్నట్లుగా ఉంది అక్కడి వాతావరణం. 200మీటర్ల దూరం నుంచి వస్తున్న వాహనాలు కూడా కనబడనంత దట్టంగా పొగ అలుముకుంది. మొదటగా దీన్ని అందరూ పొగమంచుగా భావించినా.. కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగ అని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం పరిస్థితి సాధారణంగానే కన్పించినా.. 9.30గంటల ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిల్లీలోని ఇండియాగేట్‌, రాజ్‌పథ్‌, ఎన్‌సీఆర్‌, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించకపోవడంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 10గంటల సమయంలోనూ పొగ అంతే స్థాయిలో ఉందని.. మధ్యాహ్నానికి తేరుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

12:38 - November 7, 2017

చిత్తూరు : మొలకల చెరువు మండలం ఉంగరాలవారి పల్లె వద్ద శారదా స్కూలు బస్సు కాలువలోకి పడిపోయింది. దీంతో 5 గురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అంబులెన్సులో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో దాదాపు 30 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు.

12:36 - November 7, 2017

హైదరాబాద్: నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని, తడిచిన పంటను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌... రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దమే కానీ.. పత్తికి నష్టపరిహారం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో పత్తి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు చర్చను చేపట్టారు. ఈ చర్చలో జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పూర్తి నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని కేసీఆర్ పేర్కొన్నారు. కాటన్ ధర గురించి కనీస మద్ధతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. 100 జిన్నింగ్ మిల్లులు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. తడిసిపోయిన వారికి కొంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. సకాలంలో రైతులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ఇకపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పంటలు పండించాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీకి పునర్‌ వైభవం తీసుకొస్తామన్నారు కేసీఆర్‌. రైతుల పట్ల ప్రభుత్వానికి అందరికంటే ఎక్కువ చిత్తశుద్ది ఉందన్నారు. వ్యవసాయం దండగ కాదు... పండుగ అని నిరూపిస్తామని... రైతును రాజును చేస్తామన్నారు కేసీఆర్‌.

12:34 - November 7, 2017

హైదరాబాద్: బీజేపీ ఆందోళనలపై అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నా... ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదన్నారు అక్బరుద్దీన్‌.

ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదు: అక్బరుద్దీన్

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: బీజేపీ ఆందోళనలపై అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నా... ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదన్నారు అక్బరుద్దీన్‌.

12:32 - November 7, 2017

హైదరాబాద్ : బీజేపీ ఆందోళనలపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. నిరుద్యోగుల సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని కేసీఆర్‌ అన్నారు.

 

12:30 - November 7, 2017

హైదరాబాద్: మాజీ ఎంపీ, వాస్తుశిల్పి బీఎన్‌ రెడ్డి క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. బీఎన్‌ రెడ్డి మిర్యాలగూడ ఎంపీగా పని చేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్‌, ఎంపీ గుత్తా, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు సంతాపం తెలిపారు.

12:28 - November 7, 2017

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెల్ల బంగారాన్ని పండించిన రైతన్నల ముఖాలు ధరలు లేక తెల్లబోతున్నాయి. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నా.. అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన వందలాది మంది కర్షకులకు క్వింటాకు కేవలం 3000 లోపే ధర దక్కుతోంది. మరికొందరి పరిస్థితి మరీ అధ్వానం. పత్తి నాసిరకంగా ఉందని చెప్పి కేవలం 1800 మాత్రమే చెల్లిస్తున్నారు. 4320 మద్దతు ధర దక్కుతుందనే ఆశతో వచ్చిన అన్నదాతలకు మార్కెట్‌లో నిరాశే మిగులుతోంది. నాణ్యతను సాకుగా చూపి సరకును తిరస్కరిస్తుండడంతో హలధారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

వరంగల్‌ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

వరంగల్ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నా ఇప్పటి వరకు ఎక్కడా పత్తి కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో దళారుల రాజ్యం నడుస్తోంది. రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారులు ఇష్టారాజ్యంగా తూకంలోనూ, ధర చెల్లింపులోనూ, తేమ శాతం కోతలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి, శ్రమ లేకుండా రైతులను నిలువునా దోచుకుంటున్నారు.

ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన లక్ష క్వింటాళ్ల పత్తి

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, జయశంకర్‌, మహబూబాబాద్‌... జిల్లాల్లోని ప్రధాన పత్తి మార్కెట్లలోనూ 'మద్దతు' జాడ లేదు. కేసముద్రం లాంటి ప్రధాన మార్కెట్ లో కేవలం 3000లోపే ధర పలికింది. మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎనుమాములకు ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లకు పైగానే పత్తి వచ్చింది. ఇందులో సీసీఐ కేవలం 23,000 క్వింటాళ్లే కొనుగోలు చేసింది. అంటే వచ్చిన దాంట్లో పావు శాతం కూడా కొనడం లేదనేది స్పష్టమవుతోంది. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేంద్రం ప్రారంభమైనా కొన్నది కేవలం 30 క్వింటాళ్లే.

ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలో తక్కువగా మద్దతు ధర

దేశంలో పత్తి ధరలతో పోలిస్తే... తెలంగాణలోనే మద్దతు ధర అతి తక్కువగా రైతులుకు దక్కుతోందని ఇండస్ట్రీ బాడీ కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. పంజాబ్‌లో క్వింటాకు 5000 మద్దతు ధర లభిస్తుండగా... కర్ణాటక, మహారాష్ట్ర లో 4500 పైబడి కొనుగోలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో పత్తికొనుగోళ్లలో దళారులదే రాజ్యం. రైతులను అందినకాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. తేమ, నాసిరకమనే సాకులు చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

స్వరాష్ట్రంలోనూ తమకు న్యాయం జరుగడం లేదు

స్వరాష్ట్రంలోనూ తమకు న్యాయం జరుగడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు రావడంలేదని వాపోతున్నారు. చేసిన అప్పులు తీర్చే దారి తెలియడం లేదని విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం పత్తికొనుగోలు చేయాలని కోరుతున్నారు.

కావలి ఏఎస్ఐ సుబ్రమణ్యంపై కేసు నమోదు

నెల్లూరు: కావలి ఒకటో పట్టణ పీఎస్ లో ఏఎస్ ఐ సుబ్రమణ్యం, పీఐ రోశయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మామూళ్ల విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. మద్యం మత్తులో ఏఎస్ ఐ సుబ్రమణ్యం వీరంగం సృష్టించారు. ఏఎస్ఐ సుబ్రమణ్యం పై కేసు నమోదు చేశారు.

ఓయూ ఎన్ పీసీ గేటు వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఓయూ ఎన్ పీసీ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన భారతి మృతికి బిజెపి కారణమంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కార్యాలయం ముట్టడికి బయలుదేరిన ఓయూ విద్యార్థి సం ఘాల నేతలను ఎన్ సీపీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలవరం కేసులో కేంద్రానికి చుక్కెదురు

ఢిల్లీ : పోలవరం కేసులో కేంద్రానికి చుక్కెదురు అయ్యింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్రానికి రూ. 25 వేలు జరిమానాను సుప్రీం విధించింది. జరిమానాను ఉపసంహరించుకోవాలని సుప్రీం ను కేంద్రం కోరగా.. కేంద్ర విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

11:57 - November 7, 2017

విజయవాడ: స్లో పాయిజన్‌ ఇస్తే క్రమంగా ప్రాణం పోతుంది...ఒక్కో గేటును మూసేస్తే రైతుబజారును ఎత్తేయొచ్చు. ఇపుడు ఇదే నీతిని అనుసరిస్తున్నారు.. విజయవాడ కార్పొరేషన్‌ అధికారులు. ఏపీలోనే అతిపెద్ద రైతుబజార్‌ను ఎత్తివేసేందుకు స్లోపాయిజన్‌ సూత్రాన్ని అనుసరిస్తున్నారు అధికారులు. దీనికి అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి.

16 ఎకరాల్లో ఉన్న రైతుబజారు

విజయవాడ పీడబ్యూడీ గ్రౌండ్‌లో ఉన్న ఈ రైతుబజారు మొత్తం 16 ఎకరాల్లో విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అదిపెద్దరైతుబజారుగా పేరొందింది. స్వరాజ్య మైదాన్‌లో ఉన్న ప్రభుత్వ భవనాల మినహాయించి.. రైతుబజారు, మిగతా ఖాళీ స్థలం మార్కెట్‌ విలువ దాదాపు 2700 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన స్థలంపై అధికారపార్టీ పెద్దల కన్నుపడింది. ఈ సర్వాజ్య మైదానాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు టీడీపీ సర్కార్‌ తహతహలాడంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తరుకు నిరసనగా మార్కెట్‌ గేట్‌ ముందు ధర్నాకు దిగారు.

2016లోనే రైతుబాజారు తరలించే ప్రతిపాదనలు

రైతుబజార్‌ను ఇక్కడ నుంచి తరలించడానికి 2016లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది సర్కార్‌.. అత్యంత ఖరీదైన పీడబ్ల్యూడీ గ్రౌండ్ స్థలాన్ని చైనాకు చెందిన జీఐఐసీ సంస్థకు అప్పగించనుంది. గ్రౌండ్ ను సిటీ స్క్వేర్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ నోటీఫికేషన్ విడుదల చేసింది. రాజకీయ సభలు, క్రీడలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బుక్ ఫెస్టివల్ వంటి నిర్వహణకు ప్రజా ప్రయోజనకరంగా ఉన్న స్థలాన్ని అభివృద్ధి ముసుగులో అధికారపార్టీ కబ్జాలకు పాల్పడుతుందనే విమర్శలు వస్తున్నాయి.

కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్న ప్రయత్నాన్ని మానుకోవాలని

పీడబ్ల్యూడీ గ్రౌండ్, రైతుబజార్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్న ప్రయత్నాన్ని మానుకోవాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు. వెంటనే రైతు బజార్‌ మెయిన్‌గేట్‌ను తెరవాలని , లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం నేతలు తేల్చి చెబుతున్నారు.

11:55 - November 7, 2017

నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకేంద్రంలో

డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి . భూగర్భ డ్రైనేజీ , వాటర్ పైప్లైన్ల కోసం మొత్తం రోడ్లన్నీ తవ్వేసి ఉండడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . ఆత్మకూరు బస్టాండ్ ,ముత్తుకూరు బస్టాండ్ వద్దనున్న అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురయింది.

వెంకటగిరిలోనూ

అటు జిల్లాలోని చేనేతకు ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలోనూ వర్షం కష్టాలు తెచ్చిపెట్టింది. కుండపోత వర్షంతో వెంకటగిరి శివారుప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షాలతో చేనేత కార్మికులు తీవ్రంగా ఇబ్బందుల పడుతున్నారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో పనులన్నీ ఆగిపోయాయి. మరో రెండు నెలల వరకు మగ్గాలపై పనిచేయడానికి వీలుకాదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు.

వెంకటగిరి చేనేత కార్మికులు ఆందోళన

వర్షపునీటిలీ కాలనీలు మునిగిపోతున్నా.. నాయకులు, అధికారులు ఎవరూ తిరిగిచూడటంలేదని వెంకటగిరి చేనేత కార్మికులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిలిచిపోయిన వర్షపునీరు త్వరగా వెళ్లిపోయేలా డ్రైనేజిలు, కాల్వలు క్లీన్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఢిల్లీని కమ్మేసిన పొంగమంచు

ఢిల్లీ: దేశరాజధానిని పొగ మంచు కమ్మేసింది. పెరిగిన వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఇక్కట్లు పడుతున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లో పొగమంచు దట్టంగా అలముకుంది. పొగ మంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య సూచిలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నమోదు అయ్యింది. విజుబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. వాహనదారులు హెడ్ లైట్స్ వేసుకుని ప్రయాణిస్తున్నారు.

 

తెలంగాణ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ వాకౌట్

హైదరాబాద్: రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, కేంద్ర సహకారంతో రాష్ట్రప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ కల్పించ లేమని చెప్పడంతో సభ నుండి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మేము అనుకున్నది చేస్తామా? వారు చెప్పినట్లు చేస్తామా అని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా సకాలంలో రైతులకు మందులు, విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలో వున్న వ్యవసాయ అధికారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పంగ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

అరెస్టులకు నిరసనగా బిజెపి సభ నుండి వాకౌట్

హైదరాబాద్: నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బిజెవైఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టులను నిరసిస్తూ బిజెపి సభ నుండి వాకౌంట్ చేసింది.

నష్టపరిహారం ఇవ్వలేం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రైతులకు నష్టపరిహారం ఇవ్వలేమని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో పత్తి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు చర్చను చేపట్టారు. ఈ చర్చలో జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పూర్తి నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని కేసీఆర్ పేర్కొన్నారు. కాటన్ ధర గురించి కనీస మద్ధతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. 100 జిన్నింగ్ మిల్లులు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. తడిసిపోయిన వారికి కొంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

10:37 - November 7, 2017

కడప: ప్రజాస్వామ్య వ్యవస్థకు చంద్రబాబు భంగం కలిగిస్తున్నారని వైసీపీ ఎంపి మేకపాటి ఆరోపించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొన మేకపాటి '10టివి'తో మాట్లాడుతూ...ఎన్నికల సందర్భంగా ఇచ్చి వాగ్ధానాలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని, చంద్రబాబు పాలనే అస్తవ్యస్థంగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రజాప్రతినిధులను ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నారో చెప్పాలని, అయిన వారిని తీసుకుని ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. వైఎస్ లాగా జగన్ కూడా ఉండగలిగితే మంచదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

10:31 - November 7, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిజెపి ఎమ్మెల్యే నిరుద్యోగ సమస్యపై చర్చకు పట్టుబడ్డారు. మరో వైపు అక్రమ అరెస్టులను ఖండిస్తూ బిజెపి సభలో నిరసనకు దిగింది. దీంతో అధికార, బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఏ రకమైన నీతి మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ ఎస్ అధికారంలో ఉన్నాయని.. నిరుద్యోగ సమస్యపై ఇరు పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలు చేపట్టాలి: కడియం

బిఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోతత్తరాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం కడియం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఏసీలో మేం ఒప్పుకోలేదని జానారెడ్డి తెలిపారు. ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ కలుగ జేసుకుని నిరుద్యోగుల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో చర్చకు రాకుండా రచ్చ చేయడం తగదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి మాట్లాడకుండా అడ్డుకున్న బిజెపి నేత రాంచంద్రారెడ్డి

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అడిగితే రైతులను జైళ్లకు పంపారని సభలో మాట్లాడుతుండగా బిజెపి నేత రాంచంద్రారెడ్డి వచ్చి జీవన్ రెడ్డిని మాట్లాడకుండా ఆపేశారు. మాట్లాడుతుండగా మైక్ ను తీసేయడం సభా సాంప్రదాయం కాదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బిజెపి ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

10:28 - November 7, 2017

హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పలువురు బిజెవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు అసెంబ్లీలో బిజెపి నేతలు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఆపి వాయిదా తీర్మానంపై పట్టుబట్టి ఆందోళనకు దిగారు.

బీఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలు చేపట్టాలి: కడియం

హైదరాబాద్: బిఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోతత్తరాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం కడియం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఏసీలో మేం ఒప్పుకోలేదని జానారెడ్డి తెలిపారు. ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ కలుగ జేసుకుని నిరుద్యోగుల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో చర్చకు రాకుండా రచ్చ చేయడం తగదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి మాట్లాడకుండా అడ్డుకున్న బిజెపి నేత రాంచంద్రారెడ్డి

హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అడిగితే రైతులను జైళ్లకు పంపారని సభలో మాట్లాడుతుండగా బిజెపి నేత రాంచంద్రారెడ్డి వచ్చి జీవన్ రెడ్డిని మాట్లాడకుండా ఆపేశారు. మాట్లాడుతుండగా మైక్ ను తీసేయడం సభా సాంప్రదాయం కాదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బిజెపి ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

 

టీఎస్ అసెంబ్లీలో గందరగోళం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిజెపి ఎమ్మెల్యే నిరుద్యోగ సమస్యపై చర్చకు పట్టుబడ్డారు. దీంతో అధికార, బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.

ఉప్పల్ లో స్కూటీ-లారీ ఢీ: ఒకరి మృతి

హైదరాబాద్: ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద స్కూటీ -లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంగోలురిజర్వ్ ఇన్ స్పెక్షర్ సురేష్ (37) అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.

మేడ్చల్ లో బిజెపి, బిజెవైఎం నేతల అరెస్ట్

హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడికి బిజెపి, బిజెవైఎం పిలుపుఇచ్చింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ లో బిజెపి, బిజెవైఎం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.

ప్రారంభమైన టీఎస్ అసెంబ్లీ సమావేశాలు...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అయితే దీనిపై సభలో లొల్లి ప్రారంభం అయ్యింది.

నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ సమస్యపై బిజెపి వాయిదా తీర్మానం ఇవ్వగా, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది.

హెచ్ సియూలోని విద్యార్థి బీర్బల్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: హెచ్ సియూలోని విద్యార్థి బీర్బల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీర్బల్ ఐఎంఏ లింగ్విస్టిక్ సెకండియర్ చదువుతున్నాడు. బీర్బల్ ఆత్మహత్యాత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కారు -ట్రక్కు ఢీ:13 మంది మృతి

గుజరాత్: కేదాలోని కత్ లాల్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు -ట్రక్కు ఢీ కొన్న ఘటనలో 13 మంది మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి.

కాసేపట్లో ప్రారంభం కానున్న టీఎస్ అసెంబ్లీ

హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగుల సమస్యపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

09:25 - November 7, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ సమస్యలపై బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది. మరో వైపు ఈ రోజు

అసెంబ్లీ ముట్టడికి బిజెవైఎం పిలుపు ఇచ్చింది. యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి అధికార పార్టీ సభలో సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

09:23 - November 7, 2017

కడప: చంద్రబాబు అభివృద్ధి చేసి వుంటే జగన్ పాదయాత్ర చేసేవాడు కాదని వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి తెలిపారు. వేంపల్లిలో రెండో రోజు జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న మిధున్ రెడ్డి '10టివి'తో మాట్లాడుతూ..ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

'చంద్రబాబు అభివృద్ధి చేసి వుంటే జగన్ పాదయాత్ర చేసేవాడు కాదు'

కడప: వేంపల్లిలో రెండో రోజు జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ఆ వైసీపీ ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబు అభివృద్ధి చేసి వుంటే జగన్ పాదయాత్ర చేసేవాడు కాదని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

ఆర్టీఏ తనిఖీల్లో 6 ప్రైవేట్ బస్సుల సీజ్

రంగారెడ్డి : శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. 6 ప్రైవేటు బస్సులు సీజ్ చేయగా, మరో 10 బస్సులపై కేసులు నమోదు చేశారు.

08:38 - November 7, 2017

అమరావతి: పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మరిన్ని చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం ఆశించిన స్థాయిలో జరుగకపోవడంతో ప్రధాన నిర్మాణ సంస్థ నుంచి కొంతమేర పనులు విభజించి.. కొత్త నిర్మాణ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులకు ఈ వారంలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని పోలవరం ప్రాజెక్టు వర్చువల్‌ ఇన్స్‌పెక్షన్‌లో స్పష్టం చేశారు.

50వేల క్యూబిక్‌ మీటర్ల వరకు మట్టి తవ్వకం పనులు పూర్తి

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ఈ వారంలో స్పిల్‌ చానల్‌కు సంబంధించి 50వేల క్యూబిక్‌ మీటర్ల వరకు మట్టి తవ్వకం పనులు పూర్తిచేసినట్టు వివరించారు. వర్షాల వలన ముంపు తలెత్తడంతో అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌ తవ్వకం పనులు ముందుకుసాగలేదని చెప్పారు. ఇప్పటి వరకు 760 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయని.. ఇంకా 295 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు మిగిలిపోయాయన్నారు.

స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 7,207 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి

స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 7,207 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు పూర్తయినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరో 12.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. మొత్తం 360ఆర్మ్‌ గిర్డర్ల ఫ్యాబ్రికేషన్‌, 48 స్కిన్‌ప్లేట్ల అసెంబ్లింగ్‌ పూర్తి చేయడంతోపాటు.. 20 హారిజెంటల్‌ గిర్డర్లను ఈ వారం సిద్ధం చేశామన్నారు. లక్ష్యానికి మించి డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ప్రాధాన్య 28 ప్రాజెక్టులో 13 ప్రాజెక్టులు పూర్తి....

ప్రభుత్వం నిర్దేశించుకున్న 28 ప్రాధాన్య ప్రాజెక్టులలో పూర్తయిన మరో పది ప్రాజెక్టులను ఇదే నెలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టులలో ఇప్పటివరకు 13 పూర్తికాగా మిగిలిన 15 ప్రాజెక్టులను డిసెంబర్ కల్లా నిర్మించి, అదే నెలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఓక్ టన్నెల్‌ను పూర్తిసామర్ధ్యంతో సిద్ధం చేసిన కర్నూలు జిల్లా అధికారులను అభినందించారు. పుణెలో సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు నమూనా దృశ్యాలను సీఎం పరిశీలించారు. ఇదే తరహా నమూనాను రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

ఉత్తమ నీటి నిర్వహణకు ప్రణాళికలు....

ఉత్తమ నీటి నిర్వహణే లక్ష్యంగా వచ్చే నెలలో ప్రతి గ్రామంలోనూ నీటి ఆడిటింగ్ జరపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఏ గ్రామం ఏయే పంటలకు అనుకూలంగా వుంటుంది, ఎంతమేర సాగునీరు అవసరం అవుతుంది వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగాలని చెప్పారు. జలవనరుల నిర్వహణలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ సహాయకారిగా వుండాలని ముఖ్యమంత్రి అన్నారు.

08:35 - November 7, 2017

ఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రచారం చేయనున్నారు. నోట్లరద్దు, జిఎస్‌టి లక్ష్యంగా ఆయన ఒకరోజు ప్రచారం నిర్వచించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవాళ అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో కూడా మన్‌మోహన్‌ పాల్గొంటారు. ఎవరి సలహా తీసుకోకుండా మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. నోట్లరద్దుపై నవంబర్‌ 8న విపక్షాలు బ్లాక్‌ డే నిర్వహించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మన్మోహన్‌ గుజరాత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

08:32 - November 7, 2017

కొమురంభీం: కుమురంభీం జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. సిర్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ముఠా సభ్యులు 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగజ్‌నగర్‌లోని రాజరాజేశ్వర రైసు మిల్లులో కి రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ డ్రెస్‌లో ఉన్న 12మంది ప్రవేశించారు. మిల్లు సిబ్బందిని బెదిరించి 16 లక్షల రూపాయలతో ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.

టీఎస్ అసెంబ్లీ లో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు ఇవే. సభలో నిరుద్యోగసమస్యలపై చర్చించాలని బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

07:53 - November 7, 2017

ప్రపంచ వ్యాప్తంగా అభిమానాన్ని చూరగొంటూ ఓవైపు కమర్షియల్‌ కథల్లో కనిపిస్తూ, మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మెరుస్తూన్న నటి యోగా బ్యూటీ అనుష్క శెట్టి. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ లో 'భాగమతి' అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఓ చేతిలో ఆయుధం ఉంటే, మరో చేతికి శిలువ వేశారు. విరబోసిన జుత్తుతో అనుష్క రూపం చూస్తుంటే.. కచ్చితంగా మరో థ్రిల్లర్‌ రాబోతోందనిపిస్తోంది. ‘‘చక్కటి కథతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. కళా దర్శకుడు రవీందర్‌ రూపొందించిన సెట్స్‌, మది కెమెరా పనితనం, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇదివరకెప్పుడూ చూడని సరికొత్త అనుష్కని ‘భాగమతి’లో చూడబోతున్నార’’ని నిర్మాతలు తెలిపారు.

కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ అధియా

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ అధియాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ పనిచేస్తున్నారు. 1981 గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన హుస్ముఖ్‌ గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం సమయంలో కీలక పాత్ర పోషించారు.

06:38 - November 7, 2017

హైదరాబాద్: నీళ్లు, నిధులు,నియామకాలు అనే అంశంపై యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ సాధన సమితి ఆవిర్భాం అయ్యింది. ఈ సమితికి ప్రొ.కె.నాగేశ్వర్ అధ్యక్షలుగా వ్యవహరించనున్నారు.ఈ మేరకు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఇదే అంశంపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో డివైఎఫ్ఐ నేత విజయ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ విడియోను క్లిక్ చేయండి...

06:15 - November 7, 2017

హైదరాబాద్:సెల్ఫీ సరదా ఓ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌కు చెందిన ప్రకాష్‌ కుటుంబం కర్నాటకు వెళ్లింది. గంగావతి దగ్గర చెరువులో స్నానానికంటూ ఆరుగురు దిగారు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతులను పవిత్ర, పావని, పౌర్ణిక, ఆశిష్‌ ,ఘురాజన్‌గా గుర్తించారు. ఐదుగురి మృతితో సుల్తాన్‌బజార్‌లో విషాదం నెలకొంది.

గంగావతి చెరువులో స్నానానికి వెళ్లి 5గురి మృతి

హైదరాబాద్: కర్ణాటకలోని గంగావతి చెరువులో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మృతులు పవిత్ర, పావని, పౌర్ణిక, ఆశిష్, రఘురాజన్ గా గుర్తించారు.

సిర్పూర్(టి) పీఎస్ వద్ద దొంగల ముఠా అరెస్ట్

కొమురంభీం: సిర్పూర్(టి) పీఎస్ వద్ద దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ లోని ఓ రైస్ మిల్లు లో చోరీ చేసి పారిపోతుండగా ఛేజ్ చేసి 12 మంది దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

Don't Miss