Activities calendar

08 November 2017

22:03 - November 8, 2017

బిహార్‌ : కతియార్ రైల్వే యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన అమర్‌పాలి ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో 2 బోగీలు దగ్ధమయ్యాయి. ఘటనలో స్పందించిన రైల్వే అధికారులు.. దర్యాప్తుకు ఆదేశించారు. 

 

22:01 - November 8, 2017

పంజాబ్‌ : పొగమంచు కారణంగా పంజాబ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న విద్యార్థులపైకి అతివేగంగా వచ్చిన ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సు సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో దాదాపు 14 మంది విద్యార్థులు బస్సు దిగి భటిండా- ఛండీగఢ్‌ హైవే రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకు రావడంతో 9 మంది విద్యార్థులు మృతి చెందారు. దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా రోడ్డుపై ఉన్న విద్యార్థులు డ్రైవర్‌కు కనిపించలేదని పోలీసులు చెప్పారు. 

 

21:59 - November 8, 2017

కడప : విదేశాల్లో తనకు ఒక్క పైసా ఉందని చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. నిరూపించని పక్షంలో రాజీనామాకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు జగన్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. ఎన్నికల హామీలు అమలు చేయని నాయకుడు రాజీనామా చేసినప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందన్నారు. 

ప్రజాసంకల్ప యాత్రలో ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌ అంశంపై జగన్‌ స్పందించారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కావాలనే తన పేరుతో కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు జగన్‌ సవాల్‌ విసిరారు. 15 రోజుల సమయం ఇస్తున్నానని...విదేశాల్లో తన పేరిట పైసా ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిరూపించని పక్షంలో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారు. నిజంగా విదేశాల్లో తనకు డబ్బుంటే నంద్యాల ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయేవాళ్లమని ప్రశ్నించారు. నంద్యాలలో ఓటుకు పదివేలు, ఆరువేలు ఇచ్చి కొనుగోలు చేసింది నువ్వా-నేనా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 

వైఎస్‌ జగన్‌ మూడో రోజు ప్రజాసంకల్పయాత్రను కడప జిల్లాలోని నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలను పలకరిస్తూ ముందుకు సాగారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్గమధ్యంలో రామిరెడ్డిపల్లె గ్రామస్థులు సమస్యలు చెప్పుకోగా.. పరిష్కారానికి కృషి చేస్తానని జగన్‌ హామీయిచ్చారు. అక్కడి నుంచి పాలగిరి జంక్షన్‌ చేరుకున్న జగన్‌..ఆ తర్వాత వీఎన్‌ పల్లి జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కనుమరుగైపోయిందన్నారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ప్రజల్లోంచి చైతన్యం రావాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయని నాయకుడు రాజీనామా చేసి పక్కకు తప్పుకొనే పరిస్థితి రావాలన్నారు. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని చెప్పారు. గంగిరెడ్డి పల్లిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఉరుటూరు చేరుకుని మూడో రోజు పాదయాత్ర ముగించారు. 

21:57 - November 8, 2017

హైదరాబాద్ : వచ్చే రబీ సీజన్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా ద్వారా తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు.

వ్యవసాయ రంగానికి నింతరాయంగా ఉచిత విద్యుత్‌ సరఫరాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. మంగళవారం నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు  ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఐదారు రోజుల పాటు దీనిని అధ్యయనం చేసి వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన  అందిస్తామని కేసీఆర్‌ సభ దృష్టికి తెచ్చారు. 

వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వడానికి 11,000 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుందని  లెక్కతేలిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజువారీ పాలనా వ్యవహారాలు చూసేందుకు పరిపాలనా అధికారులను నియమించాలని నిర్ణయించినట్టు ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్‌ చెప్పారు. 

మరోవైపు మైనారిటీల సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పవ్యవధి చర్చను ప్రారంభించిన మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ.. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ ప్రకారం ముస్లిం రిజర్వేషన్లు పెంచాలని  డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు ఇచ్చింది తామేనని కాంగ్రెస్‌ సభ్యులు చెప్పగా... ఈ ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కుతుందని అక్బర్‌ అన్నారు. మైనార్టీ రిజర్వేషన్ల అంశంపై చర్చ అసంపూర్తిగా జరగగా... గురువారం మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించిన స్పీకర్‌ మధుసూదనాచారి, సభను వాయిదా వేశారు. 

21:54 - November 8, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా..తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బ్లాక్‌డేని పాటించాయి. వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో సామన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వామపక్షాలు ఆరోపించగా.. నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కాంగ్రెస్ విమర్శించింది. 

పెద్దనోట్ల రద్దుతో దేశంలో ప్రకంపనలు రేపిన నవంబర్‌ 8వ తేదీని నిరసనదినంగా విపక్షాలు నిర్వహించాయి. ఏపీ, తెలంగాణలో సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున  నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా హైదరాబాద్‌లో వామపక్షపార్టీలు ర్యాలీ నిర్వహించాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకొని లెఫ్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. 

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో సామన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర భారతాన్ని అమితంగా ప్రేమిస్తూ.. దక్షిణ భారతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, వాటి వల్ల లాభపడింది మోదీ భజన బృందం మాత్రమేనని అన్నారు. మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతుందని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆరోపించారు. 

ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుతో రైతులు, చిరు వ్యాపారులు  తీవ్రంగా నష్టపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అటు విజయవాడలో నోట్లరద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో ఏపీ పీసీసీచీఫ్‌ రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమై 2  లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. నోట్ల రద్దు నుంచి సామాన్యులు తేరుకొనేలోపే జీఎస్‌టీ పేరుతో కేంద్రం మరో గుదిబండ వేసిందన్నారు. మరోవైపు లెనిన్‌ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణ హాజరయ్యారు.   

గుంటూరులో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట వామపక్షనేతలు నిరసన తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని బయటకు రప్పిస్తామని ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేశారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ మండిపడ్డారు. పెద్ద నోట్లు  రద్దై ఏడాది పూర్తైన సందర్భంగా కర్నూలులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నోట్ల రద్దుతో కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప.. పేదలకు ఎలాంటి మేలు జరగలేదని ప్రజాక్షేత్రంలో విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. 

21:52 - November 8, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా విపక్షాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే నిర్వహించాయి. నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చించిందని...లక్షలాది మంది ప్రజలకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెట్టిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. మరోవైపు  నోట్ల రద్దు సానుకూల ఫలితాలు ఇచ్చిందంటూ బీజేపీ నల్లధనం వ్యతిరేక దినాన్ని పాటించింది.
నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తి
మోది సర్కార్‌  పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 6 వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఢిల్లీలోని మండీ హౌస్‌ నుంచి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వరకు సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.
మోదీ నిర్ణయంతో దేశం సర్వనాశనమైందన్న వాపపక్షాలు 
పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశం సర్వనాశనమైందని వాపపక్షాలు మండిపడ్డాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని, ధరలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చాయి. నోట్లరద్దుతో నల్లధనం తెల్లధనంగా మారిందని వామపక్షాలు ధ్వజమెత్తాయి.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే 
నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని 18 పార్టీలు దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే నిర్వహించాయి.  ఢిల్లీలో యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నోట్ల రద్దు నిర్ణయం ద్వారా బ్యాంకు క్యూలైన్లలో నిల్చుని వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయరని....భారత ఆర్థిక వ్యవస్థను వీల్‌చైర్‌పైకి తెచ్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్‌ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. 
నల్లధనంపై ఓ యుద్ధం : నరేంద్రమోది 
పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. 'నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన  ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.
'నల్లధనం వ్యతిరేక దినం'గా బిజెపి భారీ ర్యాలీ 
నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ 'నల్లధనం వ్యతిరేక దినం'గా బిజెపి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. మోది ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు వల్ల నల్ల కుబేరులు బెంబేలెత్తిపోతున్నారని, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని బిజెపి నేతలు వెల్లడించారు. నోట్లరద్దు నిర్ణయంపై ఏడాది పూర్తయినందున అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా దేశవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక ర్యాలీలతో హోరెత్తించాయి.

 

నల్లధనం ఎంత వెలికితీశారో చెప్పాలి : పి.మధు

విజయవాడ : నల్లధనం ఎంత వెలికితీశారో సమాధానం చెప్పాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. టెర్రరిస్టులకు డబ్బు వెళ్లకుండా ఆపగలిగారా అని ప్రశ్నించారు. 

విజయవాడలో వామపక్షాల నిరసన సభ

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు ఏడాది పూర్తయిన సందర్భంగా లెనిన్ సెంటర్ లో వామపక్షాల నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఎం,  సీపీఐ రాష్ట్ర క్యాదర్శులు మధు, ఆర్కే హాజరయ్యారు.

 

21:36 - November 8, 2017
21:35 - November 8, 2017
21:25 - November 8, 2017

సరిగ్గా ఏడాది క్రితం... రాత్రి ఎనిమిది గంటలకు అంటే, 2016 నవంబర్ 8న, దాదాపు ఇదే సమయానికి టీవీలో ప్రధాని మోడీ ప్రత్యక్షమయ్యారు.. దేశ ప్రజానీకం తెల్లబోయే ప్రకటనలు చేశారు.. 500, వెయ్యి నోట్లకు అంత్యక్రియలు చేసి, దేశమంతటినీ క్యూలో నిలబెట్టిన సందర్భానికి ఏడాది గడుస్తోంది.. మరి డీమానిటైజేషన్ తో సాధించినదేమిటి? చెప్పిందొకటి, జరిగింది మరొకటా..? ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టినట్టు పరిస్థితి మారిందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టొరీ.. 
ఏం చెప్పారు? ఏం జరిగింది? 
ఏం చెప్పారు? ఏం జరిగింది? నోట్లరద్దు దేశానికి ఏం మిగిల్చింది? సామాన్యుడికి ఏ అనుభవాలిచ్చింది? ఎంత నల్లధనం వెలికి తీశారు? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్పాయి? సర్కారు వాదనల్లో అసంబద్ధత ఎంత? మోడీ సర్కారు డీమానిటైజేషన్ తో తప్పులో కాలేసిందా? తగ్గిన జీడీపీ గణాంకాలేం చెప్తున్నాయి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:17 - November 8, 2017

పెద్ద నోట్ల రద్దుకు యాడాది మాష్కం, అప్పుల పాలైపోయిన తెలంగాణ రాష్ట్రం, పోచారం మీద మండలి చైర్మన్ సెటైర్లు, కన్ఫ్యూజన్ల వడిపోయిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిది మొసలి కన్నేరేనట, రైతును చిత్కగొట్టిన పోలీసోళ్లు... అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

కామారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

కామారెడ్డి : జిల్లాలోని మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు లోకి పత్తి తెస్తున్న ట్రాక్టర్‌కు పైన కరెంట్‌ తీగలు తగలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లోని దాదాపు మూడు క్వింటాళ్ల పత్తి దగ్దమైంది. అప్రమత్తమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ట్రాలీని పక్కకు తీసుకెళ్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. 

21:00 - November 8, 2017

నోట్ల రద్దుపై మోడీ నిర్ణయం ప్రకటించి నేటికి ఏడాది. ఈ నేపథ్యంలో బీజేపీ నల్లధన వ్యతిరేక దినోత్సవానికి పిలుపునిస్తే విపక్షాలు బ్లాక్ డేకి పిలుపునిచ్చాయి. నోట్ల రద్దు నిర్ణయం వలన ఉగ్రవాద సంస్థల ఆటకట్టించామని బినామీ కంపెనీల అసలు స్వరూపాన్ని బయటపెట్టామని అరుణ్‌జైట్లీ ఇప్పటికీ సమర్థించుకుంటుంటే నోట్ల రద్దు, జీఎస్టీ అంటూ తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ మధ్యకాలంలో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోడీ పదే పదే మాట్లాడుతున్నారు. కష్టాలుంటాయని కానీ అవి తాత్కాలికమేనని మోడీ ఇప్పటికీ చెబుతున్నారు. నిజంగానే నోట్లరద్దు వల్ల అసలు ఉపయోగమే లేదా? దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఇది మేలు చేసే నిర్ణయం కాదా? నోట్ల రద్దు సామాన్యుల జీవితాల్లో వెలుగును నింపిందా? ఆర్ధిక వ్యవస్ధ పురోగమనానికి దిక్సూచిగా మారిందా? ఈ అంశాలపై ఆర్ధిక రంగ నిపుణులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శశికుమార్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:54 - November 8, 2017

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా వామపక్షాలు బ్లాక్‌ డే పాటించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. బీజేపీ పెద్దలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు క్షీణించాయన్నారు. పారిశ్రమిక ప్రగతి కుదేలైందన్నారు. 

 

20:50 - November 8, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న  నిర్ణయంతో  దేశం సర్వనాశమైందని వామపక్షాలు మండిపడ్డాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని, ధరలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చారు. పెద్దనోట్లు రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా వామపక్షాలు బ్లాక్‌ డే పాటించాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారని సీపీఐ జాతీయ నేత రాజా అన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మోదీ నిర్ణయంతో నల్లధనం తెల్లధనంగా మారిందని తెలిపారు. పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. 

20:40 - November 8, 2017
20:34 - November 8, 2017

విశాఖ : విద్యాకుసుమాలను పట్టభద్రులుగా తీర్చిదిద్దుతోన్న గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారతప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా 1500 మంది విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలను, బంగారు పతకాలను, 27 మంది రీసెర్చి స్కాలర్లకు పిహెచ్‌డీ పట్టాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. 
గీతం విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం 
గీతం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో భాగంగా విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, విద్యార్థులతో గీతం యూనివర్సిటీ కళకళలాడింది. ఈ సందర్బంగా  ప్రోపెసర్ అశుతోష్ శర్మ గీతం చాన్సలర్‌కు గౌరవ డాక్టరెట్ అందించారు. వారితో పాటు టాటా మెమోరియల్ హాస్పటల్ డైరక్టర్ డాక్టర్ రాజేంద్రఅచ్చుత్ బద్వేకు డాక్టర్ ఆఫ్ సైన్స్‌, ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు డాక్టర్ ఆఫ్ లెటర్స్‌ను గీతం చాన్సలర్ అందించారు.
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ 
గీతం యూనివర్సిటీకి నాక్‌ ఏ+ గ్రేడ్‌ రావడంతో పాటుగా దేశంలోనే తొలిసారిగా ఫిన్‌టెక్‌ అకాడమీని గీతంలో ప్రారంభించామని విసి తెలిపారు. దాంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. దాదాపు 15వేల పై చిలుకు విద్యార్థులు, 11 వందల మంది పరిశోధక విద్యార్థులు గీతంలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు వెల్లడించారు. బోధనతో పాటుగా పరిశోధనలను ప్రోత్సహించేవిధంగా 150కి పైగా భారీ పరిశోధనా ప్రాజెక్టులను గీతం చేపట్టడం విశేషమని తెలిపారు. స్థానిక పరిశ్రమలకు కన్సల్టెన్సీ సేవలను సైతం అందిస్తూ గీతం తన ప్రత్యేకతను చాటుతోందన్నారు. 
విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని : అశుతోష్ శర్మ
పట్టభద్రులవుతున్న విద్యార్థులంతా దేశ ప్రతిష్టకు నడుం బిగించాలని సూచించారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ. రక్షణ పరిజ్ఞానం, సమాజహితానికి వినియోగిస్తున్న తీరు, స్వావలంబన, మేకిన్‌ ఇండియాల ఆవశ్యత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్య వంటి అంశాలను వివరించారు. ప్రపంచంలో మొదటి 5 సైంటిఫిక్‌ పవర్‌ దేశాలలో భారత్‌ను ఒకటిగా చేసేందుకు ప్రభుత్వం సైన్స్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ విధానాన్ని అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను ఆకర్శించేందుకు వజ్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతుందన్నారు. చంద్రయాన్‌, మంగళయాన్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు.  
సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది : గొల్లపూడి 
గాంధీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుండి సత్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గొల్లపూడి మారుతీరావు. గాంధీజీ పేరుమీద నెలకొల్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న విశ్వవిద్యాలయం నుంచి ఈ సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశానికే పేరు తెచ్చిన అబ్దుల్‌ కలాం గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్క విద్యార్థి మరో అబ్దుల్‌ కలాంలా కావాలన్నారు. పరిశోధనలతో పాటు విలువలు కూడిన విద్య అవసరం అన్నారు. గీతం నుండి డిలిట్‌ అందుకోవడంతో తాను కూడా డాక్టర్‌ అయ్యాను అని చమత్కరించారు. 
ప్రోత్సహించేందుకు కృషి : రాజేంద్రఅచ్యుత్‌ బద్వే 
విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న ఆలోచనలను వెలికి తీసి ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు డాక్టర్‌ రాజేంద్రఅచ్యుత్‌ బద్వే. అలాంటి విద్యార్థులే రాబోయే రోజులలో మేధావులుగా తయారవుతారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి పథంలో ఉందని, ఇంట్లో కూర్చొని ముబైల్‌ ద్వారా ప్రపంచంలోని విశేషాలను వీక్షిస్తున్నామన్నారు. ఒక్కో రంగంలో ఒక్కోవిధంగా నూతన ఒరవడి వస్తోందని, అకడమిక్‌ ప్రాముఖ్యతతో పాటు నైతిక విలువలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. 
డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది : పద్మ 
గీతం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బెస్ట్ రీసర్చర్ పద్మ. గీతం ప్రతి సంవత్సరం బెస్ట్ రీసర్చ్‌ అవార్డు ప్రకటిస్తుందని, ఈ సారి ఇంటర్‌ నేషనల్‌ బిజినెస్‌లో పరిశోధనకు గాను తనకు ఈ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 
అనుభవాలు పంచుకున్నారు 
వివిధ విభాగాల్లో డిగ్రీలు అందుకున్న విద్యార్థులు యూనివర్సిటీలో తమ అనుభవాలను పంచుకున్నారు. గీతం లాటి డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో తాము డిగ్రీ పొందడం అదృష్టంగా ఉందన్నారు. వర్సిటీని వదిలి వెళ్లడం బాధగా ఉన్నా మంచి ఉద్యోగంతో బయటకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మొత్తం మీద 8వ స్నాతకోత్తర వేడుక పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థుల కేరింతలతో, ప్రముఖుల ఉపన్యాసాలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. 

 

20:28 - November 8, 2017
20:26 - November 8, 2017
20:25 - November 8, 2017
20:23 - November 8, 2017

కామారెడ్డి : జిల్లాలోని మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు లోకి పత్తి తెస్తున్న ట్రాక్టర్‌కు పైన కరెంట్‌ తీగలు తగలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లోని దాదాపు మూడు క్వింటాళ్ల పత్తి దగ్దమైంది. అప్రమత్తమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ట్రాలీని పక్కకు తీసుకెళ్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. 

 

20:21 - November 8, 2017

హైదరాబాద్‌ : నగరంలోని కాచిగూడ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్ ఉద్యోగినిపై దాడికి దిగాడు. కాచిగూడలో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన.. సెక్షన్ ఆఫీసర్ వాణిపై స్థానిక కార్పొరేటర్ భర్త ఎక్కాల కన్నా దాడి చేశాడు. ఇక్కడ మీకేం పనంటూ సెక్షన్ ఆఫీసర్‌ పట్ల దురుసుగా  ప్రవర్తించాడు. దీంతో వాణి... కార్పొరేటర్ భర్తపై కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

 

20:17 - November 8, 2017

హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో వేరుశనగ పంటకు మద్దతు ధర లభించడంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. వేరుశనగ క్వింటాలుకు ప్రభుత్వం 4 వేల 450 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని.. అయితే మార్కెట్‌ యార్డులలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. వ్యాపారులు మాత్రం 16 వందలు, 14 వందలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వేరుశనగకు మద్దుత ధర ఇప్పించాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు.  

20:15 - November 8, 2017

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్నా...ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదన్నారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తోంది. ఈ ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

20:13 - November 8, 2017

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్ద నోట్లు రద్దయి ఏడాది అయినందున కాంగ్రెస్‌ బ్లాక్‌డేను నిర్వహించింది. పెద్దనోట్ల రద్దుతో రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 

20:10 - November 8, 2017

కర్నూలు : పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని బయటకు రప్పిస్తామని ప్రధాని మోడీ దేశ ప్రజలను మోసం చేశారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దై ఏడాది పూర్తైన సందర్భంగా కర్నూలులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం జరగలేదంటున్న వామపక్ష నేతలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'గత నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సం.లో ఫలితాలు రాలేదు. నల్లధనం తెల్లడబ్బుగా మారింది. అంబానీ, అదానీల కోసం మోడీ పేదలను చంపారు. నల్లధనం ఎక్కడ ఉందో తమకంటే మోడీకి ఎక్కువగా తెలుసు. అంబానీ, టాటా, బిర్లా, అదానీల దగ్గర నల్లడబ్బు ఉంది. విదేశాల నుంచి ఒక్క రూపాయ నల్లడబ్బు తీసుకురాలేదు. మోడీ పెట్టుబడిదారులకు తొత్తుగా మారాడు అని అన్నారు. 

 

20:02 - November 8, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం అవ్వడంతో పాటు, రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారాయన. పెద్ద నోట్లు రద్దై ఏడాది పూర్తైన సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్నభవన్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

19:51 - November 8, 2017

పురాతన పైప్‌ లైన్లను పునరుద్ధరించడంలో భాగంగా హైదరాబాద్‌ వాటర్‌బోర్డ్‌  ''ట్రెంచ్‌ లెస్‌'' టెక్నాలజీ పేరుతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది.  హుస్సేన్‌సాగర్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో రోడ్లపై గుంతలు తవ్వకుండా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా ఈ టెక్నాలజీ ద్వారా అధికారులు పనులు పూర్తి చేస్తున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీ గురించి వివరిస్తున్న వాటర్‌ బోర్డ్‌ డైరెక్టర్ శ్రీధర్‌తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టూ ఫేస్. 

 

19:21 - November 8, 2017

కర్నూలు :  కర్నూలు జడ్పీ సమావేశం రసాభాసగా కొనసాగింది. ప్రతి ప్రభుత్వ పథకానికి జన్మభూమి కమిటీతో లింక్‌ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు బాయ్‌కాట్‌ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో గృహ నిర్మాణం చేపట్టి.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో చేపట్టక పోవడంపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాబోమంటున్న వైసీపీ ఎమ్మెల్యేలతో మా కర్నూలు ప్రతినిధి ప్రసాద్‌ ఫేస్‌ టూ ఫేస్‌.

 

19:17 - November 8, 2017

అమరావతి :  ఈనెల 10వ తేదీ నుంచి ఏపీలో మొదలవుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. సభకు వచ్చి వారి వాదనలు వినిపించమని ఆ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేసినట్లు కోడెల చెప్పారు. వైసీపీ నేతలు నిరవధికంగా అసెంబ్లీని బహిష్కరిస్తే ఏం జరగనుందో కాలమే నిర్ణయిస్తుందంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మా ప్రతినిధి విజయ్‌చంద్రన్ ఫేస్ టూ ఫేస్. 

 

19:07 - November 8, 2017

గుంటూరు:  పెద్ద నోట్ల రద్దు ఏడాదికాలం పూర్తైన సందర్భంగా గుంటూరులో వామపక్షాల ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు.  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట వామపక్షనేతలు నిరసనలు తెలిపారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలపై భవిష్యత్‌లో మరిన్ని ఆందోళనలు చేస్తామంటున్న వామపక్ష నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టూ ఫేస్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:38 - November 8, 2017

హైదరాబాద్:ముస్లిం రిజర్వేషన్లు పెంచుతామని గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. మైనారిటీల సంక్షేమంపై శాసనసభలో స్వల్వవ్యవధి చర్చను అక్బర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ముస్లింలకు రిజర్వేషన్లను ఇచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్‌ సభ్యులు ప్రస్తావించగా... అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ కే దక్కుతుందన్నారు.

17:35 - November 8, 2017
17:34 - November 8, 2017

సంగారెడ్డి : జిల్లాలో సెర్ప్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్‌తో కలెక్టరేట్‌ ఎదుట 10 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు.

 

17:31 - November 8, 2017

హైదరాబాద్: కంప్యూటర్ విద్య సామాన్యులకు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న నియో కర్సర్ సంస్థ త్వరలో ఉచితంగా జీఎస్టీ కోర్సులు అందించనుంది. డిగ్రీ చదువుకున్న యువతీ, యువకులు ఈ కోర్సు పూర్తి చేయడానికి అర్హులు. నవంబర్ 30లోగా ఆసక్తి ఉన్న యువత తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సంస్ధ నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాలకు హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న నియోకర్సర్‌ను సంప్రదించాల్సిందిగా తెలిపారు.

17:28 - November 8, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త టెక్నాలజీతో నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ నెలలో ఆయన రిటైర్ కానున్నారు ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ... పదవీ విరమణ తరువాత పోలీస్ శాఖకు నా వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ లో మావోయిస్టుల ప్రాబల్యం లేదని పేర్కొన్నారు. సీఎం చాలా సహాయసహకారాలు అందించారని... విజయంలో పోలీసు శాఖ లో అందరి కృషి ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, మార్చి 1 నుంచి సెంకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానంఉంటుందని, వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో గ్రేడింగ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగ్ ఉంటుందన్నారు.

16:47 - November 8, 2017

ఉచిత న్యాయ సహాయం అనే అంశంపై ఇవాళ్టి మానవి వేదికలో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం ఎలా ఇవ్వాలి అని చెప్పారు. 1987లో లీగల్ అధారిటీ చట్టం వచ్చిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కమల్ హాసన్ పై పరిపూర్ణానంద ఫైర్

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌పై స్వామి పరిపూర్ణానంద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్‌హాసన్‌ను స్వామి పరిపూర్ణానంద దేశద్రోహిగా అభివర్ణించారు. ప్రేక్షకాదరణలేకే కమల్‌హాసన్ రాజకీయాలంటున్నారని మండిపడ్డారు. కమల్‌హాసన్‌ను జీరో నుంచి హీరో చేసింది హిందూ ప్రేక్షకులేనని స్పష్టం చేశారు. కమల్‌హాసన్ లోకనాయకుడు కాదు..లోకల్ నాయకుడు కూడా కాదని ఎద్దేవా చేశారు.

16:36 - November 8, 2017

హర్యానా : గురుగ్రామ్‌లోని రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి ప్రధ్యుమన్‌ ఠాకూర్‌ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అదే పాఠశాలలో చదువుతున్న 11వ తరగతి విద్యార్థిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు అతడు ప్రద్యుమన్‌ను చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో స్కూలు వ్యాను డ్రైవర్‌, కండక్టర్‌లకు ఎలాంటి సంబంధం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ప్రద్యుమన్‌పై లైంగిక దాడి జరగలేదని పేర్కొంది. అరెస్ట్‌ చేసిన 11 వ తరగతి విద్యార్థిని జువెనైల్ జస్టిస్‌ బోర్డు ముందు హాజరు పరచనున్నట్లు సిబిఐ అధికారులు పేర్కొన్నారు. సదరు విద్యార్థి ప్రధ్యుమన్‌తో కలిసి వాష్‌రూంకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ- అతడిని అదుపులోకి తీసుకుంది. రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ప్రధ్యుమన్‌ ఠాకూర్‌  సెప్టెంబర్‌ 8న స్కూల్‌లోని వాష్‌రూమ్‌ వద్ద హత్యకు గురయ్యాడు. 

 

16:34 - November 8, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. 'నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన  ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అని ప్రధాని ట్వీట్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలకు సంబంధించిన షార్ట్‌ ఫిల్మ్‌ వీడియోను మోది ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే రోజున1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు  ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌8న బిజెపి నల్లధనం వ్యతిరేకం దినంగా ప్రకటించింది.

 

16:26 - November 8, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ చర్య దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని ట్వీట్‌ చేశారు.  దేశంలోని లక్షలాది మంది నిజాయితీపరుల జీవితాలను నోట్లరద్దు విషాదంలో ముంచిందని అన్నారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్‌ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. అత్యంత వేగంగా దూసుకు పోతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్లరద్దు అగాథంలోకి నెట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దు చర్యను కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ డేగా పాటిస్తుందని రాహుల్‌ చెప్పారు.

 

16:21 - November 8, 2017

కృష్ణా : విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆదాయ అన్వేషణలో అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అదనపు బాదుడుతో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెంపును తగ్గించుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 
కొంతకాలంగా పడిపోయిన దుర్గుగుడి ఆదాయం
ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గగుడిలో ఆదాయ అన్వేషణకు అధికారులు ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. అధికారుల తీరు భక్తులకు తీవ్ర కోపం తెప్పిస్తోంది.  గత కొంతకాలంగా దుర్గగుడికి ఆదాయం పడిపోయింది.  ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. దీంతో అధికారులు వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయాలే వివాదాల పుట్టగా మారుతున్నాయి.
దసరా ఉత్సవాల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం
దుర్గగుడిపై ప్రతిఏటా జరిగే దసరా ఉత్సవాల నిర్వహణను ప్రభుత్వమే పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటోంది.  దసరా ఉత్సవాల కోసం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. దీంతో ఏదో విధంగా ఆదాయం తెచ్చుకునేందుకు అధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయోగాలు , నిర్ణయాలు దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రాకపోకలను ప్రభావితం చేస్తున్నాయి.
ధరల పెరుగుదలపై భక్తుల అసహనం
దేవస్థానంలో జరుగుతున్న  ధరల పెరుగుదలపై  భక్తులలో అసహనం వ్యక్తమవుతోంది.  చాలా మంది దుర్గగుడికి రావడమే మానేశారు. దేవస్థానంలో అధికారులు, పాలకమండలి, ఈవో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై దుమారం రేగుతోంది. భక్తులపై భారం మోపుతూ  పది రూపాయలు ఉండే లడ్డూ ప్రసాదం ఇప్పుడు 20కి పెంచేశారు.  పెంచిన ధరలపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. 20 రూపాయల నుంచి 15 రూపాయలకు లడ్డు ధర తగ్గించారు. అయితే కార్లు, స్కూటర్ల పార్కింగ్ రేట్లను అమాంతంగా పెంచేశారు. అంతరాలయం దర్శనం టిక్కెట్ ధరను 300ల నుంచి 150లకు తగ్గించాలనే ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయి. దుర్గగుడిలో జరుగుతున్న దోపిడీ ధరలపై సీఎం చంద్రబాబు స్పందించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ధరల పెంపును తగ్గించుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

 

మాల్యా మెడకు ఉచ్చు బిగుస్తోందా?

ఢిల్లీ: లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మెడకు మరింత ఉచ్చు బిగుస్తోంది. వచ్చేనెల 18లోగా ఆయన విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశాలు జారీచేసింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కేసులో ఆయనపై దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ గడువులోగా విజయ్ మాల్యా కోర్టుకు హాజరుకాని పక్షంలో ప్రకటిత అపరాధిగానే భావించాల్సి ఉంటుందని పటియాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు ఏప్రిల్‌లో విజయ్ మాల్యాకి నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసిన సంగతి తెలిసిందే.

16:16 - November 8, 2017

శ్రీకాకుళం : జిల్లాలో మద్యం వ్యాపారుల నుండి వచ్చే మామూళ్లు ఎక్సైజ్ సిబ్బందిలో విబేధాలకు కారణమయ్యాయి. కేవలం ఉన్నత స్థాయి అధికారులకే సిండికేటుల నుండి ముడుపులు వెళ్తుండటం కింది స్థాయి సిబ్బంది నిరాశకు కారణమయ్యింది. దీంతో రాష్ట్రస్థాయి కమీషనర్ నుండి ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. 
అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు 
సిక్కోలు జిల్లా మద్యం మామూళ్ల మత్తులో కూరుకుపోయింది. అధికారులు మామూళ్ల పిచ్చిలో పడిపోయారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. గతంలో డాక్టర్‌ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసి ప్రస్తుతం అబ్కారీ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా విధులు  నిర్వర్తిస్తున్నారు. ఈయనకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది జాతకాలు, సిండికేట్ ముడుపుల ముసుగు వ్యవహారాలు అన్నీ తెలుసు. ఈ మధ్యే ఇంచార్జ్‌ డిప్యూటీ కమిషనర్ ఎం. శివప్రసాద్‌ వద్ద 4 లక్షల యాభై వేల లెక్క చూపని నగదు ఏసీబీ అధికారులు పట్టుకోగలిగారు. 
జోరుగా డబ్బుల పంపకం 
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నిజానికి సిక్కోలు జిల్లాలో 235 మద్యం దుకాణాలున్నాయి. శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, రాజం, పాలకొండ పరిధిలో 17 బార్ల నుండి 25 వేలు నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న బహిరంగ ఆరోపణలున్నాయి. దీంతో పాటు జిల్లాలో ఏ ఒక్క చోట వైన్‌ షాపులో ఎమ్మార్పీ ధరలు అమలు కావడం లేదు. వీటితో పాటు కొంతమంది ఎక్సైజ్‌ శాఖ పై స్థాయి సిబ్బంది రెచ్చిపోయి సిండికేట్లతో ములాఖత్ అయ్యారన్నది బహిరంగ విమర్శ. అధికారుల మామూళ్ల దందా అధికమవ్వడం వల్లే ఎమ్మార్పీ ధరలు జిల్లాలో అమలు కావడం లేదన్నది స్పష్టమవుతోంది. దిగువస్థాయి అధికారుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు ఈ డబ్బుల పంపకం జోరుగా సాగుతోందని జిల్లావాసులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. 
రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది 
ఎంపోర్స్‌మెంట్ విభాగం గతేడాది 60 వేల నగదుతో పెద్దపాడు వద్ద ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. కోర్టులో ఈ కేసు రివర్స్‌ అవుతుందన్న భయంతో కొంతమంది సిండికేట్ పెద్దలు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు కలిసి 5 లక్షల నగదు కోర్టు ఖర్చుల కోసం ఉంచారంటే ఆ శాఖ ముందుచూపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 
లంచం తీసుకుంటూ దొరికిన ఎం. శివప్రసాద్‌ 
గత డీసీ సురేందర్‌ వేరే కేసులో ఇరుక్కోవడం.. ప్రస్తుత ఇంచార్జ్‌ డీసీ అసిస్టెంట్‌ కమీషనర్ ఎం. శివప్రసాద్‌ నాలుగున్నర లక్షల లంచం డబ్బులతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా మంచి అధికారిని నియమిస్తారా లేదా అనేది చూడాలి. 

 

అలా వైసీపీ చెప్పడం కరెక్టు కాదు: స్పీకర్ కోడెల

అమరావతి: అసెంబ్లీకి రావాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరాను అని స్పీకర్ కోడెల శివప్రసాద్ '10టివి'కి చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నా నిర్ణయం కోసం వేచి చూడకుండా కోర్టుకు వెళ్లారని, అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. నేను నిర్ణయం తీసుకోనందుకే అసెంబ్లీకి రావడం లేదని వైసీపీ చెప్పడం కరెక్టు కాదని కోడెల అన్నారు.

భారత బాక్సర్ మేరీకోమ్ సంచలనం

హైదరాబాద్: భారత బాక్సర్ మేరీ కోమ్ మరో స్వర్ణం సాధించింది. ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో ఐదో స్వర్ణం సాధించింది. 48 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హ్యాంగ్ మిని ఓడించింది.

16:12 - November 8, 2017

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి ఏజెన్సీ ఏరియాలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. అమాయకులైన గిరిజనులను టార్గెట్‌ చేస్తూ వడ్డీ వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. దీంతో పంట నష్టపోయిన రైతులు పంటను కాల్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. 
తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కరకగూడెం మండలంలోని పరిసర గ్రామాల్లో గిరిజనులు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తుంటారు. గిరిజనుల అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకున్న కొందరు వడ్డీ వ్యాపారులు మాయ మాటలు చెప్పి నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు అమ్మారు. అంతే కాకుండా గిరిజనులకు వారే పెట్టుబడి పెట్టి పంట చేతికి  వచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాలేదు. దీంతో పెట్టుబడి పెట్టిన 25వేలు నష్టపోయామని గిరిజనులు వాపోతున్నారు. అయితే ఈ విషయమై షాపు యజమానిని అడిగితే మాకెలాంటి సంబంధం లేదని, బాకీ చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పత్తి చెట్లను కుప్పగా వేసి నిప్పు పెట్టి నిరసనలు తెలియజేశారు రైతులు. 
సొంత పెట్టుబడితో పత్తి పంట వేశామన్న రైతులు
అయితే దీంట్లో కొంతమంది రైతులు ఫెర్టిలైజర్‌ షాపులో అప్పు తేవడం కంటే సొంత పెట్టుబడితో పత్తి పంట వేశామని.... అయినప్పటికీ తక్కువ ధర నకిలీ విత్తనాలని తమకు అమ్మి సొమ్ము చేసుకున్నారని గిరిజనులు అంటున్నారు. అలాంటి వారిపై విచారణ జరిపి పిడి యాక్టు కింద కేసులు నమోదు చేసి తమకు నష్టపరిహారం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. 
నకిలీ దందా వ్యాపారం 
ఇదిలా ఉంటే రైతులు ఫెర్టిలైజర్‌ షాపులో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు కూడా ఇవ్వలేదు. అసలు ఆ విత్తనాల కవర్‌పై తయారు చేసిన తేది గాని ధర గాని లేదు. దీన్ని బట్టి చూస్తే అసుల నకిలీ దందా వ్యాపారం ఏ రీతిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతున్నా వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. 

16:08 - November 8, 2017

కృష్ణా : విజయవాడను గ్రేటర్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విజయవాడ పరిధిలోని 45 గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముందుగా 19 గ్రామాలను గ్రేటర్‌లో చేర్చి మిగితా గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం విలీనం చేయనున్నారు. 
నగరపాలక సంస్థలో 45 గ్రామాల విలీనం..! 
విజయవాడకు గ్రేటర్‌ కల త్వరలోనే సాకారం కానుంది. వ్యాపార, వాణిజ్య, పర్యాటక, ఆధ్యాత్మిక పరంగా విజయవాడ నగరానికి ప్రత్యేకమైన పేరుంది. 2017 అక్టోబర్ 14న సీఎం చంద్రబాబు విజయవాడలో చేసిన అకస్మిక తనిఖీల్లో భాగంగా గ్రేటర్‌ అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను దశలవారిగా నగరపాలక సంస్థలో విలీనం చేస్తామని ప్రకటించారు. అప్పటి నుండి గ్రేటర్‌ పనుల్లో వేగం పెరిగింది. 
15,17,732కు పెరగనున్న జనాభా
ప్రస్తుతం నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉండగా, 45 గ్రామాల ప్రతిపాదిత విస్తీర్ణం 363.71 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. గ్రేటర్‌లో 45 గ్రామాలన్నీ విలీనం చేస్తే 425.59 చదరపు కిలోమీటర్ల మేర నగరం విస్తరించనుంది. అలాగే 2011 సంవత్సరంలో నగర జనాభా లెక్కలు 10 లక్షల 39వేల 518 మంది ఉండగా, 45 గ్రామాల్లో జనాభా 4 లక్షల 78వేల 214 మంది ఉన్నారు. విజయవాడ గ్రేటర్‌గా రూపాంతరం చెందితే ఈ సంఖ్య 15 లక్షల 17వేల 732 కు పెరగనుంది. 
విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు 
అయితే ఈ విలీనాన్ని  ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేటర్ అయితే ప్రజలపై పన్నుల భారం  పడనుందంటున్నారు. అయినా కూడా ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు సన్నాహాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయవాడను గ్రేటర్‌ చేసినప్పటికీ ప్రజలపై పన్నుల భారం లేకుండా, తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నారు. 

 

16:02 - November 8, 2017

తూర్పుగోదావరి : పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ్టికి ఏడాదవుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను తెలియజేస్తూ విపక్షాలు బ్లాక్‌డేని పాటిస్తున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. సామాన్య ప్రజానీకం చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

15:58 - November 8, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయింది. మోడీ సర్కారు తీరుపై కామ్రేడ్ల కన్నెర్ర చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా హైదరాబాద్‌లో వామపక్షపార్టీలు ర్యాలీ నిర్వహించాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకొని లెఫ్ట్ పార్టీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల కార్పొరేట్ కంపెనీలకు న్యాయం జరిగింది తప్ప పేద ప్రజలకు ఒరిగిందేమి లేదని లెఫ్ట్ పార్టీ నేతలు అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో పేద ప్రజలకు ఒరిగిందేమి లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. బడాపారిశ్రామికవేత్తలకే కేంద్రం కొమ్ముకాస్తోందని నారాయణ పేర్కొన్నారు. 

 

కాచిగూడలో రెచ్చిపోయిన కార్పొరేటర్ భర్త

హైదరాబాద్: కాచిగూడలో కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. అక్రమ నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన సెక్షన్ ఆఫీసర్ వాణి పై కార్పొరేటర్ భర్త ఎక్కాల కన్నా దాడి చేశాడు. అంతే కాకుండా ఇక్కడ మీకేం పనంటూ సెక్షన్ ఆఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కార్పొరేటర్ భర్తపై కాచిగూడ పీఎస్ లో వాణి ఫిర్యాదు చేసింది.

15:25 - November 8, 2017

కడప : సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరారు. జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు విదేశాల్లో నల్లధనం ఉందని రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని జగన్ అన్నారు. నల్లధనం లేదని రుజువు చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

 

జగన్ తో వేగలేకే టిడిపిలో చేరాం: కదిరి ఎమ్మెల్యే

అమరావతి: వైసీపీలో ప్లకార్డులు పట్టుకోవడానికే పనికొచ్చామని, అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడానికి జగన్ ఏనాడూ అవకాశం కల్పించలేదని, జగన్ తో వేగలేకే టిడిపిలో చేరాం అని కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా తెలిపారు.

హైదరాబాద్‌లో బిచ్చమెత్తితే జైలేనంట

హైదరాబాద్: ఇకపై నగరంలో బిచ్చమెత్తితే జైలేనంటున్నారు పోలీసులు. భిక్షాటన చేస్తూ కనిపిస్తే అరెస్ట్‌ చేసి... రెండు నెలల జైలు, 200 జరిమానా విధిస్తామంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి సిటీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి వరకు ఏ సిగ్నల్‌ దగ్గర చూసినా కనిపించే భిక్షగాళ్లు... ఇప్పుడు అసలు కనిపించడం లేదు.

ఎంత నల్లధనం వెలికితీశారో చెప్పాలి: బృందాకరత్

ఢిల్లీ: నోట్ల రద్దుకు ఏడాది పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా 6 వామపక్ష పార్టీలు బ్లాక్ డేని పాటించాయి. మండి హౌస్ నుండి ఆర్బీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బృందా కరత్, డి. రాజా, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎంత నల్లధనం వెలికితీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ అనాలోచిత నిర్ణయంతో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. మోదీ ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, పనామా, పార్యరడైజ్ పేపర్స్ లో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారతి మృతిపై సిట్టింగ్ జడ్జిడతో విచారణ జరిపించాలి: మందకృష్ణ

హైదరాబాద్: పోలీసుల తోపులాటలోనే భారతి మృతి చెందిందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పోలీసులను కాపాడేందుకే పరిహార ప్రకటన అని మండిపడ్డారు. భారతి మృతిపై సిట్టింగ్ జడ్జిడతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల పరిహారం అవసరం లేదన్నారు. బిక్షాటన చేసి భారతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విజయవాడ సిటీ స్క్వేర్ నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించినట్లు సమాచారం. సిటీ స్క్వేర్ నిర్మాణంపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకోనున్నారు. అమరావతిలో 5 క్లస్టర్లలో 68 టవర్లుగా వీఐపీ గృహ నిర్మాణం చేపట్టాలని, 12 అంతస్తులుగా ఒక్కో టవర్ నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ పై అక్బరుద్దీన్ ప్రశంసలు..

హైదరాబాద్ : మైనార్టీల సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. 

'గతంలో 2700 మెగావాట్ల విద్యుత్ లోటు'..

హైదరాబాద్ : బుధవారం ప్రారంభమైన శాసనసభలో విద్యుత్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. గతంలో రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉండేదని గుర్తు చేశారు. చరిత్రలో తొలిసారి 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాలుగైదు రోజుల పాటు అధ్యయనం చేస్తామని సీఎం పేర్కొన్నారు. 

నిరంతర విద్యుత్ - కేసీఆర్...

హైదరాబాద్ : వచ్చే యాసంగి నుంచి నిరంతర విద్యుత్ అందిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో విద్యుత్ పై ఆయన ప్రకటన చేశారు. 

13:25 - November 8, 2017

హైదరాబాద్ : వచ్చే యాసంగి నుంచి నిరంతర విద్యుత్ అందిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో విద్యుత్ పై ఆయన ప్రకటన చేశారు. గతంలో రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉండేదని గుర్తు చేశారు. చిమ్మచీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని..తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయమైన విద్యుత్ ను అవసరం మేరకు పంపిణీ చేస్తుందన్నారు. 11 వేల మెగావాట్ల డిమాండ్‌కు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ లైన్ల ద్వారా ఎక్కడి నుంచైనా విద్యుత్ పొందే వీలుందన్నారు. చరిత్రలో తొలిసారి 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాలుగైదు రోజుల పాటు అధ్యయనం చేస్తామని సీఎం పేర్కొన్నారు. 

13:17 - November 8, 2017

నల్గొండ : జిల్లా శిశు గృహంలో చిన్నారులు మృతి చెందుతుండడంపై తీవ్ర కలకలం రేపుతోంది. గత మూడు నెలల కాలంలో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గృహంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చిన్నారులు మృతి చెందుతున్నా అధికారులు స్పందించలేదని, విషయం బయటకు పొక్కే వరకు తాపీగా అధికారులు విచారణ చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

శిశు గృహాన్ని డీఆర్ఓ, ఐసీడీఎస్ అధికారి పుష్కలత..ఇతర అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఘటనపై విచారణ చేపట్టడం జరుగుతోందని..వైద్యులతో మాట్లాడుతున్నట్లు డీఆర్ఓ పేర్కొన్నారు. ఇందులో పనిచేసే సిబ్బందిలో లోపాలపై ఆరా తీస్తున్నట్లు అలాంటిది తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. పౌష్టికాహార లోపం తలెత్తే సమస్య లేదని..కలెక్టర్ రూ. పది లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. 8 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో..నీలోఫర్ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యల వల్లే పిల్లలు చనిపోతున్నారని ఐసీడీఎస్ అధికారి పుష్పలత తెలిపారు. 

13:13 - November 8, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వల్ల ఎన్ని సమస్యలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. పెద్ద నోట్లు రద్దుకు ఏడాది పూర్తయిన సందర్బంగా దేశ వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు..నిరసనలు చేపట్టాయి. దీనికి ప్రతిగా ఢిల్లీలో బీజేపీ 'యాంటీ బ్లాక్ మనీ డే' కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. అచ్చే దిన్ త్వరలోనే రానున్నాయని, మోడీ నిర్ణయంతో ఎంతో మేలు జరిగిందన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పుకొచ్చారు. బ్యాంకుల్లో క్యూ లైన్ లో నిలబడి ఎవరూ చనిపోలేదని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

13:11 - November 8, 2017

సినీ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. టాలీవుడ్ లో హీరోలు చాల మంది ఉన్నారు..వస్తుంటారు పోతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క హిట్ కోసం వెయిట్ చేసిన యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో రాబోతున్నాడు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. కొత్త హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాల కష్టం. కానీ ఈ సుధీర్ బాబు కి ఆ ప్రాబ్లెమ్ లేదు. మహేష్ బాబుకి బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. యంగ్ హీరోస్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమకథా చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్థాయి విజయం సాధించలేకపోయినా.. మంచి సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా శమంతకమణి అంటూ కుర్రాళ్ల మల్టీ స్టారర్ లో నటించాడు సుధీర్ బాబు.

కామెడీ సినిమాలతో తన మార్క్ డైరెక్షన్ చూపించే డైరెక్టర్ మోహన కృష్ణ. జెంటిల్మెన్ - అమీతుమీ చిత్రాలతో మెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబు హీరోగా సినిమా చేయనున్నాడు. మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియాలో నటించిన బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరీ ఇందులో హీరోయిన్. యాక్టర్ అండ్ రైటర్ హర్షవర్థన్ డైరెక్షన్లో అమెరికా నేపథ్యంలో ఓ లవ్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో రాజశేఖర్ అనే కొత్త డైరెక్టర్ తో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. దీనిని సుధీర్ బాబే స్వయంగా నిర్మించనున్నాడు. ఇంద్రసేన అనే ఇంకో కొత్త డైరెక్టర్ తో ఓ సోషల్ థ్రిల్లర్ పిక్చర్ చేయనున్నాడు. వరుస సినిమాలకి ప్లాన్ వేసిన సుధీర్ ఖచ్చితంగా ఈ సారి మంచి హిట్ కొట్టే కసితో ఉన్నాడు.

13:00 - November 8, 2017

 

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇంతకు ముందులా కాకుండా భిన్నమైన కథలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ సినిమాలతో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. జూనియర్ ఎన్ టి ఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ హిట్ ట్రాక్ పట్టాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన 'జై లవ కుశ 'సినిమాతో తనలోని నటనను మరోసారి చూపించాడు ఎన్ టి ఆర్ . మూడు పాత్రలు చేసి ఆడియన్స్ తో పాటు ఫిలిం క్రిటిక్స్ ని కూడా ఇంప్రెస్స్ చేసాడు. ఎన్ టి ఆర్ గత కొన్ని సినిమాల నుండి డిఫెరెంట్ కైండ్ అఫ్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాలు పక్కన పెట్టి మంచి ఫామ్ లోకి వచ్చేసాడు ఎన్ టి ఆర్.

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ ఎన్ టి ఆర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ తర్వాత సినిమా విషయంలో కూడా ఓ తుది నిర్ణయానికి వచ్చేశాడని తెలుస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సతీష్ వేగేశ్న. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో తన పట్టు ఎలాంటిదో చూపించాడు కూడా. ఈ డైరెక్టర్ తోనే ప్రొసీడ్ అవ్వాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. 'శతమానం భవతి' సినిమాలో ఫామిలీ ని ఆకట్టుకునే సినిమా తీసిన ఈ డైరెక్టర్ ని ఎన్ టి ఆర్ నమ్మడంతో మరో హిట్ ఖాయం అనిపిస్తోందని అంటున్నాయి ఫిలిం వర్గాలు.

12:51 - November 8, 2017

క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మరోసారి స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసాడు. ఒకప్పటి ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి రెడీ అవుతుంది అని ఫాన్స్ హోప్స్ తో ఉన్నారట. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సినిమాలు అనౌన్స్ చేసి ఆసక్తిని రేపే ఈ డైరెక్టర్ ఈ మధ్య కలంలో ఘోరంగా డౌన్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. మంచి సినిమాలు తీసిన ఈ ఒకప్పటి డైరెక్టర్ ట్రెండ్ మిస్ అయ్యాడు. ఈ తరం ఆడియన్స్ ని కాచ్ చెయ్యడం లో ఫెయిల్ అయ్యాడు అనే టాక్ కూడా ఉంది. ట్రైలర్స్ మాత్రం రిలీజ్ అవుతున్నయి సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వట్లేదు అని ఫిలిం వర్గాలు నవ్వుకుంటున్నాయంట.

రాజు గారి గది సినిమాతో ఎలాంటి పాత్ర అయినా తాను రెడీ అని మరోసారి నిరూపించాడు హీరో నాగార్జున. తన పాత్ర పరిధి మేరకు నటించే మెప్పించే ఈ హీరో ఇప్పుడు రాంగోపాల్ వర్మతో సినిమా చెయ్యబోతున్నాడు. ఒకప్పుడు 'శివ' సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డైరెక్టర్ అండ్ హీరో ఇప్పుడు మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. '1988లో నేను వర్మతో సినిమా చేస్తానని అన్నపుడు అందరూ షాక్ తిన్నారు. ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు.. ఇంకా చాలామంది షాక్ తింటున్నారు. లెట్స్ రాక్ వర్మ' అంటూ ఓ పోస్ట్ పెట్టారు నాగ్.

12:48 - November 8, 2017

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ నటిస్తున్నాడు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్ర 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మరో హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ మంచి స్నేహితులట. వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది.ఇందులో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌ శివాజీ గణేశన్‌ పాత్రలోనటిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

12:48 - November 8, 2017

టాలీవుడ్ లో మల్టి స్టారర్ సినిమాలు వస్తున్నాయి. చాల వరకు హిట్ టాక్ తెచుకుంటున్నాయి. అదే వేని ఫాలో అవుతూ రంగంలోకి దిగాడు యూత్ హీరో. యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ వరుస విజయాలతో ఫుల్ బిజీ గా ఉన్న నటుడు మరో సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అది మల్టి స్టారర్ సినిమా కావడం విశేషం. నేచుర‌ల్ స్టార్ 'నాని' వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ‘నిన్నుకోరి' అంటూ ప్రేక్ష‌కుల‌ను పలకరించి హిట్ కొట్టాడు. ఈ 'నిన్నుకోరి' సినిమా హిట్ టాక్ తో పాటు బిజినెస్ కూడా బాగా చేసింది. ఈ ఏడాది కూడా మొత్తం షూటింగ్లుతో బిజీగా ఉన్నాడు నాని. 'నేను లోకల్', 'నిన్నుకోరి' సినిమాలతో మంచి విజయం అందుకున్న 'నాని' ఇప్పుడు మరో చక్కటి ప్రేమ కథ చెప్పడానికి సిద్దపడ్డాడు. 'ఎం సి ఏ మిడిల్ క్లాస్ అబ్బాయి' అంటూ వచ్చేస్తున్నాడు నాని ..నిన్ను కోరి సినిమా హిట్ ని కంటిన్యూ చేస్తున్నాడు అనే చెప్పాలి.

నటుడు అంటేనే అన్ని రకాల పాత్రలు చెయ్యాలి. కంటెంట్ ఏదైనా తన రోల్ కి న్యాయం చేసే నటులు చాల తక్కువ మంది ఇండస్ట్రీ లో ఉంటారు. అలాంటి వారిలో నాగార్జున ఒకరు. సోగ్గాడే చిన్ని నాయన లాంటి రొమాంటిక్ హిట్స్ ఇచ్చిన నాగ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లో అదరగొట్టిన మన్మధుడు ఇప్పుడు హారర్ ఎఫెక్ట్ తో రాబోతున్నాడు. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో, సమంత డిఫెరెంట్ రోల్ లో కనిపించబోతున్న సినిమా రాజుగారి గది టు . చిన్న సినిమా గా వచ్చిన హిట్ అయిన 'రాజు గారి గది' సినిమాకి ఈ సినిమా సీక్వెల్ .

తెలుగులో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ రూపొందుతుంది. నాగార్జున, నాని కలసి ఓ సినిమాలో నటించబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెరకెక్కించే నిర్మాత ఎవరన్నది ఇప్పుడు తెలిసిపోయింది. ఈ సినిమా వైజయంతీ మూవీస్ పతాకంపై ఉండొచ్చని టాక్. ఈ త‌రం హీరోల్లో నాని అంటే ఆయ‌న‌కు బాగా ఇష్టం కూడా. అందుకే… నానితో క‌ల‌సి న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడు నాగ్‌. ఈ యేడాది చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

అమీర్ పేట భూములపై విచారణ వాయిదా

ఢిల్లీ : అమీర్ పేట భూములపై దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు విచారించింది. దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కె.మోహన్ లాల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు ధర్మాసనం అనుమతించింది. విచారణ ఆరు నెలలకు వాయిదా వేసింది.

జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు:తమ్మినేని

హైదరాబాద్: నోట్ల రద్దు తో మోదీ భజన బృందానికే న్యాయం జరిగిందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని, బడా పారిశ్రామిక వేత్తలకు కేంద్రం కొమ్ము కోస్తోందని విమర్శించారు. మోదీ ఉత్తర భారతదేశాన్ని అమితంగా ప్రేమిస్తూ దక్షిణ భారతదేశంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు మోదీని దోషిగా చూస్తున్నారని తెలిపారు.

12:33 - November 8, 2017

ఢిల్లీ : పొగమంచు..కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగ్ర నోయిడా యమున ఎక్స్ ప్రైస్ వాహనంపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు ట్రక్కును ఢీకొంది. రహదారిపై బస్సు..టక్కు ఆగిపోయాయి. కానీ అదే రహదారిపై వస్తున్న ఇతర వాహనాలకు ఈ దృశ్యం కనిపించలేదు. దీనితో వేగంగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొత్తంగా 18 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని నోయిడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనాల్లోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనాల్లో నుండి దిగి బయటకు పరుగులు తీశారు. మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కాలుష్యం ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. 19న జరగాల్సిన ఎయిర్‌టెల్‌ ఢిల్లీ హాప్‌ మారథాన్‌ కార్యక్రమం రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్‌కి... ఢిల్లీ వైద్యుల సంఘం లేఖ రాసింది. పెరిగిన కాలుష్యంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు. 

12:26 - November 8, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో ప్రత్తి రైతులు మోసపోతున్నారు. నకిలీ విత్తనాల బెడదతో హఢలిపోతున్నారు. చెట్లు ఏపుగా పెరిగినా కాయలు మాత్రం పాడైపోతున్నాయి. దీనితో పాటు గులాబీ రంగు పురుగుతో దిగుబడి మందగించింది. దీనితో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అధికారులు ఎవరూ స్పందించలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి....

12:24 - November 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని టీజేఏసీ పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం జిల్లాల్లో యాత్రలు కూడా చేపట్టారు. అందులో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరపాలని టీజేఏసీ తలపెట్టింది. కానీ తాము యాత్రలు..సభలకు ప్రభుత్వం అనుమతినివ్వడం లేదంటూ ప్రొ.కోదండరాం ఇటీవలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన భారీ బహిరంగసభకు అనుమతినివ్వాలని కోదండరాం ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. చివరకు టీజేఏసీ హైకోర్టు మెట్లు ఎక్కింది. దీనిపై బుధవారం విచారించిన హైకోర్టు సభకు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో టీజేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సభ తేదీని జేఏసీ ప్రకటించనుంది. 

పూర్తి స్థాయిలో అదుపులో భద్రతలు: డీజీపీ

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని '10టివి'తో డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికట్టామని పేర్కొన్నారు. తెలంగాణ లో మావోయిస్టుల ప్రాబల్యం లేదని, పదవీ విరమణ తర్వాత పోలీస్ శాఖకు నావంతు సహకారం అందిస్తానని డీజీపీ స్పస్టం చేశారు.

12:19 - November 8, 2017

పశ్చిమగోదావరి : దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ విజయరామరాజు ఇంటిపై ఏసీబీ దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేస్తోంది. బుధవారం ఉదయం విజయరామరాజు నివాసంతో పాటు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు.~ భీమడోలు, హైదరాబాద్ లోని బంధువులు..స్నేహితుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్, విలువైన బంగారం..వెండి..భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా విదేశీ మద్యం పెద్ద మొత్తంలో ఉండడం తీవ్ర చర్చానీయాంశమైంది. గతంలో కూడా ఈయనపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏసీబీ అధికారులు జరిపిన దాడులు దేవాదాయ శాఖలో కలకలం రేపుతోంది. 

కొలువుల కొట్లాట సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: కొలువుల కొట్లాట సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరూర్ నగర్ స్టేడియంలో సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పోలీసులు సూచించిన విధంగా సభ జరపాలని జేఏసీకి కోర్టు ఆదేశించింది. ఈ నెల 30న సరూర్ నగర్ లో కొలువుల కొట్లాట సభ జరగనుంది.

12:12 - November 8, 2017

హైదరాబాద్ : మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతోంది. గడచిన సంవత్సర కాలంలో.. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ లేదు అన్న సమాధానమే వస్తోంది. ఈ కఠోర వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో... ప్రతిపక్షాలు భారీ ర్యాలీలు చేపట్టాయి. హైదరాబాద్ లో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వంపై నేతలు విమర్శలు చేశారు. మోడీ సర్కార్ పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లెప్ట్ పార్టీ నేతలు..కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. రాష్ట్ర ప్రజలు బాగుపడే విధంగా బంగారు తెలంగాణ ఉండాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

విజయవాడలో...
విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బ్లాక్ డే..చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మహిళా కార్యకర్తలు రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఢిల్లీలో...
దేశ రాజధానిలో ఎన్ఎస్ యూ భారీ ర్యాలీ నిర్వహించింది. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టింది. ఎప్పుడూ మరిచిపోలేరని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరిగిందో వివరిస్తూ ఎన్ఎస్ యూ భారీ ర్యాలీ నిర్వహించింది. తీవ్రగాయాలవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఫొటో...జీడీపీ ఎంత పాయింట్లు నష్టపోతోంది..ప్రధాన మంత్రి మోడీ ఫోటోకు నల్లటి పాము ఫొటో జత..ఇలాంటి ఫొటోలు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్

హైదరాబాద్: మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. టిఆర్ ఎస్ నాయకుడి ఇంట్లో గంజాయి పెట్టించేందుకు కుట్ర చేశారనే కేసులో బెయిల్ మంజూరు అయ్యింది.

వామపక్ష పార్టీల నేతల అరెస్ట్

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, మతోన్మాదుల దాడులకు నిరసనగా ఆరు వామపక్ష పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ జగ్జీవన్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్

హైదరాబాద్: మహిళా స్వయం సహాయ సంఘాల రుణాలపై బిజెపి వాయిదా తీర్మానం, నోట్ల రద్దు పర్యవసానం, ఆర్థిక ప్రభావంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.

తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది: సీఎం కేసీఆర్

హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 23 లక్షల పంపు సెట్లకు గత రాత్రి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో ఉత్పతన్నమయ్యే పరిస్థితిని 5,6 రోజులు అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే యాసంగి నుంచి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పై స్టే కొట్టివేత

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్టీటీ విధించిన స్టే ను హైకోర్టు కొట్టేసింది. తాగునీటి అవసరానికి మాత్రమే ప్రాజెక్టు నిర్మించాలని. అడవులను ధ్వంసం చేయకుండా నిర్మాణం చేపట్టాలని హైకోర్టు తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ కు ఏమైనా అభ్యంతరాలు వుంటే మళ్లీ హైకోర్టు సంప్రదించవచ్చని కోర్టు సూచించింది.

11:40 - November 8, 2017

ఢిల్లీ : ఇండిగో ఎయిర్స్ లైన్స్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పి.వి. సింధు పట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. తాజాగా మరో ప్రయాణీకుడిని ఇండిగో సిబ్బంది ఒకరు ప్రయాణీకుడిని చావబాదాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చెన్నైకి చెందిన రాజీవ్ కతియాల్ అనే వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సు ఆలస్యంగా రవడంతో రాజీవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో బస్సు ఎక్కడకుండా రాజీవ్ ను సిబ్బంది అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది ఒకరు రాజీవ్ ను కిందపడేసి చావబాదాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్లు రికార్డు చేశాడు. దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించిందని తెలుస్తోంది. ప్రయాణీకుడికి క్షమాపణలు చెప్పినట్లు..దాడికి పాల్పడిన సిబ్బందిని విధుల నుండి తొలగించినట్లు సమాచారం. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 33,398 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,354 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

11:36 - November 8, 2017

చలికాలంలో విరివిగా లభించే ఉసిరి సర్వరోగ నివారిణి అంటారు మన పెద్దలు..అదీకాక కార్తిక మాసంలో ఉసిరి తినడం తప్పనిసరి అంటారు కూడా. ఏదెలా ఉన్నా ఉసిరి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మహా‘సిరి’. ఉసిరిలో విటన్ సి ఎక్కువగా ఉంటుంది.

వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం...

ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.

వీర్యసమృద్ధికీ ఉసిరి ఎంతగానో తోడ్పడతుందట.

తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.

వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.

కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.

నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.

రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.

కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికీ మంచి మందే.

ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.

ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.

11:34 - November 8, 2017
11:32 - November 8, 2017

జగిత్యాల : ఆరుగాళం శ్రమించిన రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సమస్యల సుడిగుండంలో చిక్కుకపోతున్నారు. మద్దతు ధర లేక..పండించిన పంటకు గిట్టు బాటు ధర రాక..పంటకు వివిధ తెగుళ్లు సోకుతుండడంతో రైతులు కృంగిపోతున్నాడు. దీనితో పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం రైతులకు మేలు చేస్తున్నామని..వారి సంక్షేమం కోసం పాటు పడుతున్నామని చెబుతోంది..

జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలంలో ఓ రైతు తన పంటకు నిప్పు పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మూటపల్లి గ్రామంలో ఓ రైతు నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. కానీ రెండెకరాల్లో ఉన్న వరి పంటకు దోమపోటు సోకింది. ఎన్ని మందులు పిచికారి చేసినా సమస్య తీరలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ రైతు పంటను కాల్చివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం ఆ పంటను కాల్చివేశాడు. తన కళ్లెదుటే పంట మంటల్లో కాలిపోతుంటే ఆ రైతు నిస్సహాయంగా నిల్చున్నాడు. 

11:23 - November 8, 2017

విజయవాడ : పెద్ద నోట్లు రద్దుకు ఏడాది పూర్తయ్యింది. ఈ నిర్ణయం వల్ల దేశంలో అనేక సమస్యలకు చెక్ పడిందని..దేశం అభివృద్ధిలో దూసుకపోతోందని బీజేపీ నేతలు పేర్కొంటుంటే విపక్ష నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు బ్లాక్ డేగా అభివర్ణించాయి. దేశంలో పలు పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బ్లాక్ డే..చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మహిళా కార్యకర్తలు రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

11:21 - November 8, 2017

హైదరాబాద్ : రైతుల సమ్మతితో భూ సేకరణ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలంగాణ శాసనసభలో వెల్లడించారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో భూ సేకరణపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ఎక్కువ సేపు మాట్లాడుతుండడంపై స్పీకర్ మధుసూధనాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.

బీఏసీలో 11 గంటల తరువాత ఐదు నిమిషాల్లో ప్రశ్న..అనంతరం ప్రభుత్వం సమాధానం చెప్పడం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందరూ బీఏసీ నిర్ణయానికి పాటుపడాలని మంత్రి హరీష్ రావు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించాలి..నష్టపోకుండా ఉండే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు రూ. 6 లక్షల ఉంటే దానిని రూ. 10లక్షలు పెంచడం జరిగిందని, కోటి ఎకరాలకు నీరు అందించాలంటే ప్రాజెక్టుల పురోగతి కావాలని..ఇందుకు భూ సేకరణ చాలా ముఖ్యమన్నారు. రైతుల సమ్మతితో భూ సేకరణ చట్టం చేయడం జరుగుతోందని, ఎలాంటి బలోపేతం లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

నోట్ల రద్దుకు నిరసనగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

విజయవాడ: పెద్ద నోట్ల రద్దయి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. మరో వైపు పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు.

11:13 - November 8, 2017

పశ్చిమగోదావరి : మరో అవినీతి చేప చిక్కింది. ఇటీవల ఏపీ రాష్ట్రంలో కోట్లాది ఆస్తులు..డబ్బును కూడబెట్టిన పలు అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకొంటోంది. ఇటీవలే పలువురు అధికారులు కూడబెట్టిన కోట్లాది సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు ఏపీ దేవాదాయ శాఖ అధికారి విజయరామరాజు ఇంటిపై దాడులు జరుపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించి ఈ తనిఖీలు చేస్తోంది.

బుధవారం ఉదయం నుండి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ లోని విజయరామరాజు ఇల్లు సహా ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగిస్తోంది. భీమడోలు, హైదరాబాద్ లోని బంధువులు..స్నేహితుల ఇళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం..వెండి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బ్యాంకుల్లో పలు లాకర్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. దాడులు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

వరిపంటకు దోమకాటు..తగలబెట్టిన రైతు

జగిత్యాల: రాయకల్ మండలం నూకపల్లిలో నాలుగు ఎకరాల్లో వరి పంటకు దోమకాటు సోకింది. రెండు ఎకరాల పంటకు రైతు లింగారెడ్డి నిప్పటించాడు.

11:00 - November 8, 2017

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్...ఇలా పలు వుడ్ లకు సంబంధించిన కథనాయకుడు...కథా నాయికలు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోలు..హీరోయిన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కూడా. తమిళనాడులో 'కమల్ హాసన్' పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘రజనీకాంత్' కూడా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే 'అంజలి' కూడా రాజకీయాల్లోకి వస్తారంట. రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో ...

'షాపింగ్ మాల్‌’, 'జ‌ర్నీ’, 'గీతాంజ‌లి’, 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’, 'డిక్టేట‌ర్' వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన 'అంజలి' తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకొంటోంది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రంలో రెండు పాత్రలను పోషిస్తోంది. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా 'అల్లుడు సింగం’. సినిమా రూపొందుతోంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. 'అల్లుడు సింగం' లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోందని, లాయర్‌, రాజకీయ నేతగా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతుందని రావిపాటి పేర్కొన్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది' అని అన్నారు.

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్...

అనంతపురం: వన్ టౌన్లో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మందిని అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి రూ. 80 వేలు, 7 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

శిశుగృహాల్లో అనాథ శిశువుల మృత్యుఘోష

నల్గొండ: శిశుగృహాల్లో అనాథ శిశువుల మృత్యుఘోష కొనసాగుతోంది. మూడు నెలల్లో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. పౌష్టికాహారం లోపంతోనే వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యం పాలయిన చిన్నారులను నల్గొండ, హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రులకు తరలించారు.

ఏడేళ్ల బాలుడి హత్య కేసులో కొత్త ట్విస్ట్

ఢిల్లీ : గుర్గామ్ రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల బాలుడి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యార్థి హత్యలో సీనియర్ విద్యార్థి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

10:23 - November 8, 2017

సంగారెడ్డి : జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జిల్లాలోని హత్నూర (మం) రొయ్యల పల్లిలో గొల్ల మహేష్ అనే వ్యక్తిని ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు పీఎస్ లో లొంగిపోయారు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

విజయవాడ :దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ మేడిపల్లి విజయరాజు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయరాజుపై ఆదాయానికి మించి ఆస్తుల అభియోగం నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. విజయవాడలోని విజయరాజు ఇల్లు సహా 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి భీమడోలు, హైదరాబాద్‌లోని విజయరాజు బంధువులు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

10:18 - November 8, 2017

హైదరాబాద్ : ఎస్సారెస్పీ ఎత్తిపోతల పథకం అద్భుత పథకమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బుధవారం ప్రారంభమైన సభలో ఎస్సారెస్పీ పథకంపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.

కిషన్..గంగుల ప్రశ్నలు..
చివరి భూములకు నీళ్లు ఇస్తారా ? 90 టీఎంసీలు ఉండేదని..ప్రభుత్వం చేపట్టే పథకం ద్వారా ఎన్ని టీఎంసీలు వస్తాయి ? ఎంత సాగుకు నీరు అందుతుందా ? అని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో వరద కాల్వ తవ్వడం వల్ల చాలా బీడు భూములుగా తయారయ్యాయని, వరద కాల్వ ద్వారా నీరు విడుదల చేయలేదని టీఆర్ఎస్ సభ్యుడు గంగుల ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

హరీష్ సమాధానం..
18 నెలల అగ్రిమెంట్ ఉన్నా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ఎగువభాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందని ఫలితంగా ఎస్సారెస్పీలో నీరు రాలేదన్నారు. నీరు వచ్చిన తరువాత రబీ పంటకు నీరందిస్తున్నట్లు..ఒక పంటకు నష్టం కలుగుతోందన్నారు. అతి తక్కువ ఖర్చు..అతి తక్కువ సమయం..అతి తక్కువ లిఫ్ట్ ద్వారా నీటిని పంపించే పథకమే 'ఎస్సారెస్పీ ఎత్తిపోతల పథకం' అని తెలిపారు. ఇందులో 12 మీటర్ల లిఫ్ట్ మాత్రమే ఉంటుందని..రోజుకు 1 టీఎంసీ నీరు వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ ద్వారా వెళుతుందన్నారు. రైతంగానికి ఖరీఫ్ పంటకు నీరందించడం జరుగుతోందని, ఫలితంగా రైతులకు లాభం జరుగుతుందన్నారు. నీటి లభ్యత..కాల్వల ఆధునీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ పట్ల చిన్న చూపు చూసిందని..కాల్వలు ఆనవాళ్లు కోల్పోయ్యాయని విమర్శించారు. ఎస్సారెస్పీ నుండి ఎల్ ఎండీ వరకు...ఎల్ ఎండీ నుండి వరంగల్ కు వెళ్లే కాల్వల సామర్థ్యం పెంచడం..టెయిల్ ఎండీ కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం జరుగుతోందని హరీష్ రావు సభకు తెలిపారు.. 

ఉత్తరాదిన కమ్ముకున్న పొగ మంచు..

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. బుధవారం తెల్లవారుజామున పూర్తిగా దృశ్య గోచరత లోపించడంతో.. అటు పాదచారులు, ఇటు వాహనదారులు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. 

10:04 - November 8, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. 19న జరగాల్సిన ఎయిర్‌టెల్‌ ఢిల్లీ హాప్‌ మారథాన్‌ కార్యక్రమం రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్‌కి... ఢిల్లీ వైద్యుల సంఘం లేఖ రాసింది. పెరిగిన కాలుష్యంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

09:51 - November 8, 2017

అనంతపురం : జిల్లా ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జ్వరపీడితులతో వార్డులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక పలువురు రోగులు మృత్యువాత పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో జ్వరాలు విజృభించాయి. రోజు, రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కుటుంబాలకు, కుటుంబాలే విషజ్వరాలబారిన పడి జనం అల్లాడి పోతున్నారు.

వాతావరణ మార్పులు వల్ల ఒక్కసారిగా దోమలు పెరిగిపోవడం, జ్వరాలు విజృభిస్తున్నాయి. వైద్యం కోసం వెళితే వివిధ రకాల పరీక్షల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. వేలకు,వేలు మందుల పేరుతో గుంజుతున్నారని రోగులు వాపోతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన పేదరోగులు గత్యంతరం లేక ప్రభుత్వ ఆసుప్రతుల్లోనే అరకొర వైద్య చికిత్సలతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన అందరికీ చికిత్స చేస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగ్యూ రోగులతకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు మేల్కోవాలి. డెంగ్యూలాంటి విషజ్వరాలు ప్రభల కుండా చర్యలు తసుకోవాలి. ఇప్పటికే రోగాలబారిన పడిన వారికి తగిన వైద్యసహాయం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్: నేడు తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు. మహిళా స్వయం సహాయ సంఘాల రుణాలపై బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది. నోట్ల రద్దు పర్యవసానం, ఆర్థిక ప్రభావంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

నేడు సభలో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు

హైదరాబాద్: నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎక్సైజ్ చట్టసవరణ బిల్లు ను టీ.సర్కార్ ప్రవేశ పెట్టనుంది. నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.మృతి చెందిన మాజీ 7గురు మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలపనుంది. అనంతరం మైనార్టీ వెల్ఫేర్ పై లఘు చర్చ జరగనుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు ఉదయం 8 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. 

09:25 - November 8, 2017

విజయవాడ : ప్రముఖ కవి, రచయిత సిత్తజల్లు వరహాలరావు కన్నుమూశారు. 88 సంవత్సరాల వరహాలరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీవీగా ప్రసిద్ధులైన సిత్తజల్లు వరహాలరావు.. కులవ్యవస్థ, దిగంబరకవులు లాంటి పలు గ్రంథాలు రచించారు. విజయవాడలోని ఆయన స్వగృహంలో సీవీ భౌతికకాయాన్ని సందర్శించి పలువురు నివాళులర్పిస్తున్నారు. 

09:23 - November 8, 2017

విశాఖపట్టణం : నాడ్‌ జంక్షన్‌లో గంజాయి పట్టుబడింది. తమిళనాడుకు చెందిన నైజీరియన్‌ గిబ్సన్ నాడ్‌ కొత్త రోడ్‌ బస్టాప్‌ వద్ద అనుమానాస్పదంగా కనబడటంతో పోలీసులు అతన్ని సోదా చేయగా గంజాయిని గుర్తించారు. నైజీరియన్‌ వద్ద ఉన్న రెండు సూట్‌కేస్‌ల నుండి 30 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌లను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

09:22 - November 8, 2017

ఢిల్లీ : అక్కడ ఊపిరి తీసుకోవడమే ప్రమాదం...! మనుగడే ప్రశ్నార్థకం...! క్షణం.. క్షణం.. భయానకం..! మృత్యువు ఒడిని చేర్చే వాతావరణం.! అక్కడ ఒక రోజు గాలి పీలిస్తే 20 సిగరెట్లు తాగడానికి సమానం..! ఎక్కడో కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీలో..! గాలిలో దుమ్ము కణాలు, విషవాయువుల శాతం అధికంగా ఉండడంతో .. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో... వాతావరణం రోజు రోజుకు భయానకంగా మారుతుంది. గాలే పాయిజన్‌గా మారింది. అక్కడ గాలిలో విష వాయువులు మోతాదుకు మించి ఉన్నాయి. గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌... కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌.. మితిమీరి ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది. దీని వల్ల 500 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.

వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. 19న జరగాల్సిన ఎయిర్‌టెల్‌ ఢిల్లీ హాప్‌ మారథాన్‌ కార్యక్రమం రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్‌కి... ఢిల్లీ వైద్యుల సంఘం లేఖ రాసింది. పెరిగిన కాలుష్యంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు.

లక్షల సంఖ్యలో వాహనాలు, విద్యుత్‌ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల.. ఢిల్లీ కాలుష్యం పెరుగుతోంది. వీటితో పాటు పొగమంచు అధికంగా ఉండడం, హర్యానా, పంజాబ్, యూపీలో పంటకు మంట పెట్టడం వల్ల కూడా గాలిలో విషవాయువులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ కాలుష్యంపై జాతీయ హరిత ధర్మాసనం సైతం ఆందోళన వ్యక్తం చేసింది.. వాయు కాలుష్యం అత్యవసర పరిస్థితిని తలపించేలా ఉందని వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో 9లోపు తెలపాలని ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. 

09:11 - November 8, 2017

రజనీకాంత్..అక్షయ్ కుమార్..అమీ జాక్సన్ లు నటిస్తున్న 'రోబో 2.0’ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ప్రముఖ దర్శకుడు 'శంకర్' భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శంకర్..రజనీ..ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది.

ఇందులో బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' నటిస్తున్నాడు. డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నారంట. సినిమాకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు..చిత్రాలు కానీ రిలీజ్ కాలేదు. కానీ కొన్ని దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చిత్ర బృందం మాత్రం ట్రైలర్ ఇంకా విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మూవీలోని సాంగ్స్ ను ఇటీవ‌లే దుబాయ్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. మూవీ ట్రైల‌ర్ ను రజ‌నీకాంత్ పుట్టిన రోజైన డిసెంబ‌ర్ 12వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ మూవీ 15 భాష‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

09:05 - November 8, 2017

శేఖర్ కమ్ముల...బాలీవుడ్ బాహుబలి 'రానా' హీరోగా వచ్చిన 'లీడర్' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 'రానా'కు మొదటి సినిమా. 2010లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'శేఖర్ కమ్ముల' దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' ఘన విజయం సాధించింది. దీనితో ఇతర చిత్రాలపై ఆయన దృష్టి సారించారు.

రాజకీయాలపై చిత్రం తీయాలని..శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు ఇందుకు స్ర్కిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇందుకు 'లీడర్' కు సీక్వెల్ తీయాలని..అదీ 'రానా'తోనే తీస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టు అన్నీ జరిగితే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రానా '1945' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

కాసేపట్లో టి.అసెంబ్లీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు జరిగే సభలో మైనార్టీ, సంక్షేమం స్వల్పకాలిక చర్చ జరుగనుంది. 

08:59 - November 8, 2017

‘పవర్ స్టార్' పవన్ కళ్యాణ్...త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పవన్ సరసన క్తీరి సురేష్..అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'అజ్ఞాత వాసి' టైటిల్ పెట్టిన ప్రచారం జరుగుతోంది. చిత్రంలో 'పవన్' ఇంజినీరింగ్ కనిపించనన్నట్లు టాక్.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్..టీజర్ ఇంకా విడుదల కాకపోతుండడంతో పవన్ అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారంట. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ కంపోజింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా 'బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీయో క్లాక్‌...అనే పల్లవితో సాగే గీతాన్ని పూర్తిగా విడుదల చేశారు. ఈ పాట వీడియోను కార్టూన్‌ లిరిక్స్‌తో డిజైన్‌ చేసి అభిమానుల ముందు ఉంచారు. 2018 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఛత్తీస్ గడ్ లో 'బ్లాక్ డే' రన్..

ఛత్తీస్ గడ్ : పెద్ద నోట్లు రద్దుకు ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా విపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ 'బ్లాక్ డే' పేరిట మారథాన్ రన్ నిర్వహించింది. 

08:05 - November 8, 2017

మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతోంది. గడచిన సంవత్సర కాలంలో.. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ లేదు అన్న సమాధానమే వస్తోంది. ఈ కఠోర వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు.. రేపు అనుకూల ర్యాలీ చేపడుతున్నాయి. అదే సమయంలో విపక్షాలు.. నవంబర్‌ 8ని బ్లాక్‌డేగా వర్ణిస్తూ.. దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నాయి.

నవంబర్‌ 8, 2016న 500, 1000 నోట్లను రద్దు చేస్తూ మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆదరా బాదరాగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుని వందకు పైగా మంది మృతి చెందారు. నోట్లరద్దుతో రైతులు, పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. మోది సర్కార్‌ తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఎన్నో సర్వేలు నిరూపించాయి. 90 శాతం నల్లధనం విదేశాల్లోనే మూలుగుతోందని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న ప్రధాని ఇచ్చిన హామీ పూర్తిగా విఫలమైంది.

పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్‌ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోది ఆకాంక్ష నెరవేరకపోగా....అది మరింత పెరిగిందని విపక్షాలతో పాటు.. పలు సర్వేలూ ఘోషిస్తున్నాయి. మోది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏదోరకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విపక్షాలు నిరసనలకు దిగుతున్న వేళ.. అధికార బిజెపి, పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు తమ చర్యను సమర్థించుకుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్లరద్దు నిర్ణయంపై అధికార, విపక్షాల ఆందోళన ప్రజలపై ఎంత ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.

07:45 - November 8, 2017

మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతోంది. గడచిన సంవత్సర కాలంలో.. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ లేదు అన్న సమాధానమే వస్తోంది. మరోవైపు సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్) సుభాష్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

 

జగన్ వేంపల్లి..టు ఉరుటూరు..

కడప : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి .. ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజుకు చేరుకంది. బుధవారం కమలాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. వేంపల్లి-ప్రొద్దుటూరు రోడ్డు మీదుగా నీలతిమ్మాయపల్లి నుంచి యాత్రను ప్రారంభిచంనున్నారు. మొత్తం 16.2 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర ఉరుటూరులో ముగియనుంది.

నిషేధాజ్ఞలు పొడిగింపు..

హైదరాబాద్ : శాసనసభ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ భవనం చుట్టూ విధించిన నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు..

ఢిల్లీ : రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.

సిత్తజల్లు వరహాలరావు కన్నుమూత..

విజయవాడ : కవి, రచయిత సిత్తజల్లు వరహాలరావు (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా సీవీ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విజయవాడలోని ఆయన స్వగృహంలోనే ఆయన కన్నుమూశారు. కుల వ్యవస్థ, దిగంబర కవులు వంటి పలు గ్రంథాలు రచించారు. 

నవంబర్ 8..వ్యతిరేక దినం...

ఢిల్లీ : విపక్షాలు నిరసనలకు దిగుతున్న వేళ.. అధికార బిజెపి, పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు తమ చర్యను సమర్థించుకుంది.

కాంగ్రెస్ దుష్ర్పచారం - రాజ్ నాథ్..

ఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ దిగజారిందని మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. యూపీఏ పాలనలో ధరల పెరుగుదల సూచికలో రెండింతలు పెరిగిందని గుర్తు చేశారు.

06:49 - November 8, 2017

నవంబర్‌ 8 ఈ తేదీ అనగానే మనగా గుర్తొచ్చేది పెద్దనోట్ల రద్దు నిర్ణయం. గత సంవత్సరం ఇదే రోజు... 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. బ్లాక్‌ మనీని నిరోధించే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు ప్రధాని చెప్పారు. మరి ఆ నిర్ణయం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చిందా.. దాని వల్ల వచ్చిన ఫలితాలేంటి. .అది సామాన్యుడిపై చూపించిన ప్రభావం ఏమిటి అనే అంశాలపై టెన్ టవి జనపథంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు విశ్లేషించారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి..

 

సిరీస్ భారత్ వశం...

ఢిల్లీ : తిరువనంతపురం వేదికగా సాగిన మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం కోహ్లీసేననే వరించింది. 6 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 2-1తేడాతో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. 

06:45 - November 8, 2017

ఢిల్లీ : తిరువనంతపురం వేదికగా సాగిన మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం కోహ్లీసేననే వరించింది. 6 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 2-1తేడాతో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెల్చిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండడంతో భారీ స్కోరు నమోదు కాలేదు. మనీశ్‌పాండే 17 రన్స్‌, హార్దిక్‌ పాండ్యా 14 రన్స్‌, కెప్టెన్‌ కోహ్లీ 13 రన్స్‌ చేశారు.

68 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ తబడింది. బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ చేరారు. మొదట భారీ షాట్లతో విరుచుకుపడుతున్న కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్‌ నిర్దేశిత 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 61 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సిరీస్‌ భారత్‌ కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, కుల్దీప్‌యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బౌలర్‌ బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ దక్కాయి.

06:43 - November 8, 2017

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న టైగర్‌ జిందా హై మూవీ ట్రైలర్‌ విడుదలైంది. 2015లో వచ్చిన "ఏక్‌ థా టైగర్‌" సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇరాన్‌లో భారత్‌కు చెందిన 25 మంది నర్సులను కిడ్నాప్‌ చేసిన సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వారిని విడిపించేందుకు సల్మాన్‌ ఖాన్‌ వెళ్లడాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు.ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను అబుదాబి, ఆస్ట్రియాలో తెరకెక్కించారు.

ముగిసిన హిమాచల్ ఎన్నికల ప్రచారం...

ఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్‌ 9న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌, బిజెపి మొత్తం 68 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. సిపిఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187 అభ్యర్థులు బరిలో నిలిచారు

06:41 - November 8, 2017

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చే రోజు అతి దగ్గరలేనే ఉందని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కాపు కళ్యాణ మండపంలో ఈ రోజు జరిగిన కార్తీక వనసమారాధనలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా కాపులను బీసీలుగా గుర్తింపు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్‌ ద్వారా లోన్లు ఇస్తున్నామని అనేక మంది కాపు విద్యార్ధులను చదివిస్తున్నామని చినరాజప్ప గుర్తుచేశారు.

06:36 - November 8, 2017

హైదరాబాద్ : 2019లో అధికామే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌... వివిధ రకాల వృత్తి నిపుణులను పార్టీలో చేర్చుకుంటోంది. ప్రొఫెషనల్స్‌కు స్థానం కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. వృత్తి నిపుణులను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వ్యూహంపై 10 టీవీ ప్రత్యేక కథనం.. 2019 అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. పార్టీని ప్రజలకు మరింత చేరువచేసే లక్ష్యంలో భాగంగా వృత్తి నిపుణులకు వల వేస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను పార్టీలో చేర్చుకుంటోంది.

ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ వింగ్‌కు ఎంపీ శశిథరూర్‌ చైర్మన్‌గా ఉన్నారు. పీసీసీల్లో కూడా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. టీపీసీసీ ప్రొఫెషనల్‌ విభాగం చైర్మన్‌గా దాసోజు శ్రవణ్‌.. బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐటీ, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు, వ్యాపారులను పార్టీలో చేర్చుకుంటున్నారు. వీరితో రోజువారీ సమావేశాలు నిర్వహిస్తూ... పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరిస్తున్నారు. పాలకపక్షాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ సౌత్‌ ఇండియా కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వృత్తి నిపుణులను పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో రెండు కమిటీలు పని చేస్తున్నాయి. దశలవారీగా తెలంగాణ మొత్తం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

06:34 - November 8, 2017

గుంటూరు : దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ పథకాలున్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆచార్య ఎన్‌. జీ రంగా 117వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్‌, రుణమాఫీ అనేది ఇప్పుడు అందరికీ ఆదర్శంగా ఉందన్నారు. వీటిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేపడుతున్నట్లుట్లు ప్రత్తిపాటి తెలిపారు. 

06:31 - November 8, 2017

విజయవాడ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై.. పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖలో ఫెజెట్టీ సంస్థతో కలిసి పైలెట్‌ ప్రాజెక్ట్‌ నిర్వహిస్తున్న కవి హోల్డింగ్స్‌... రేడియో సెన్సర్స్‌, బయో మెట్రిక్స్‌, GPS అనుసంధానంతో సురక్షిత ఐడీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏపీలో వృత్తి నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు నియో ఎక్స్‌క్రాఫ్ట్‌ ఆసక్తివ్యక్తం చేసింది. గత నెలలో బ్రిటన్‌ పర్యటించిన చంద్రబాబు.. లండన్‌లో వివిధ కంపెనీల CEOలతో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. చంద్రబాబు ఆహ్వానాన్ని అందుకుని వీరంతా అమరావతి వచ్చారు. 

06:28 - November 8, 2017

కడప : ప్రజాసంకల్పయాత్రలో జగన్‌.. జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధులకు 2 వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్‌ రెండో రోజు ప్రజాసంకల్పయాత్రలో ఓ వైపు హామీల వర్షం...మరోవైపు చంద్రబాబుపై నిప్పుల వర్షం కురిపించారు. ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. అయితే వైసీపీ మేనిఫెస్టో మాత్రం రెండే రెండు పేజీలుంటుందని.. అందులో చెప్పినవన్నీ చేస్తామని...ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తామన్నారు జగన్‌.

రెండో రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ కడప జిల్లా వేంపల్లి నుంచి మొదలు పెట్టారు. వేంపల్లి క్రాస్‌రోడ్డులో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రీనివాస కల్యాణ మండలంలో ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, యువకులు... ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌...రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఫ్యాక్టరీలు వస్తాయని.. వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్న ఆయన.. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధులకు ప్రస్తుతమున్న వెయ్యి పెన్షన్‌ను 2 వేలకు పెంచుతామన్నారు. కాలేజీ విద్యార్థుల ఖర్చులకు 20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

జగన్‌ రెండో రోజు పాదయాత్ర వేంపల్లి నుంచి.. వైఎస్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజపేట, గాలేరు-నగరి కెనాల్‌, నీలతిమ్మాయిపల్లి మీదుగా సాగింది. వేంపల్లి శివారులో తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు విజ్ఞప్తి చేయగా..మన ప్రభుత్వం రాగానే పరిశీలిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర వేంపల్లిలోనే సుమారు ఏడున్నర గంటల పాటు కొనసాగింది. అనంతరం ఆయన పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోకి చేరుకుంది.

06:24 - November 8, 2017

హైదరాబాద్ : నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌ సీజ్‌ చేశారు. సమగ్ర భూ సర్వే నేపథ్యంలో వక్ఫ్‌బోర్డుఓలని కొందరు అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. భూ కబ్జాలు నిజమేనని తేలడంతో వక్ఫ్‌బోర్డు ఆఫీసును సీజ్‌చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులతో తరలివెళ్లిన ఆర్డీవో చంద్రకళ హజ్‌హౌస్‌ను సీజ్‌ చేశారు.  

నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు సీజ్..

హైదరాబాద్ : నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌ సీజ్‌ చేశారు. సమగ్ర భూ సర్వే నేపథ్యంలో వక్ఫ్‌బోర్డుఓలని కొందరు అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 

Don't Miss