Activities calendar

09 November 2017

వైద్యుడి నిర్లక్ష్యంతో బాలుడి మృతి ?

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో విషాదం నెలకొంది. బాలాజీ నర్సింగ్ హోంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన చేపట్టారు. 

 

22:02 - November 9, 2017

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలవరకు 54.9 శాతం పోలింగ్‌ నమోదైంది. హమీర్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న బిజెపి సిఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్, ఆయన కుమారుడు బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాకూర్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి జెపి నడ్డా బిలాస్‌పూర్‌లో కుటుంబంతో సహా ఓటేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 50 లక్షలకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 7,525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

21:56 - November 9, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలకు కొన్ని ప్రాధాన్యతలున్నాయి. విపక్షం లేకుండానే సభ జరగనుండడం ఒక అంశమైతే, వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండూ కలిపి నిర్వహిస్తుండడం మరో అంశం. ఈ సమావేశాల్లో ఐదు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభం కానుంది. పదిన్నరకు శాసనమండలి సమావేశం కానుంది. ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా.. సమావేశాల్లో పాల్గొనరాదని వైసీపీ నిర్ణయించిన కారణంగా, ఈసారి సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే జరగబోతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటేనే సభకు హాజరవుతామని విపక్షం స్పీకర్‌ను ఉద్దేశించి ప్రకటించింది. 

విపక్షం నిర్ణయాన్ని మంత్రులు తప్పుబడుతున్నారు. విపక్షం బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందంటూనే,  తమను తిట్టేందుకైనా సభకు రావాలంటూ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావాలన్న వైసీపీ నిర్ణయంపై అటు స్పీకర్‌ కూడా స్పందించారు. సుప్రీంకోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు.. తనను నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
    
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడం లేదని స్పష్టమైపోయింది. దీంతో, సభలో విపక్షం బాధ్యతను కూడా తామే పోషిస్తూ... ఉభయ సభల్లో పదేసి ప్రశ్నలు లేవనెత్తేలా పాలకపక్షం ప్రణాళికను రచించింది. పదిరోజుల్లో మొత్తం రెండు వందల ప్రశ్నలు వచ్చేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల్లో చర్చకు విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ, విద్యార్థుల ఆత్మహత్యలు, పోలవరం, సదావర్తి భూముల వివాదం తదితర 26 అంశాలను గుర్తించారు. దీంతోపాటే, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకపు అధికారం ఏపీపీఎస్సీకి అప్పగించే బిల్లు, జలవనరుల శాఖకు బహిరంగ మార్కెట్‌నుంచి పొందే  రుణాల పరిమితిని తొలగించే చట్టసవరణ బిల్లు, నాలాపన్ను మినహాయింపు తదితర ఐదు బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విపక్షం లేకున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

మరోవైపు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సుమారు 12 వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ప్రత్యేకహోదా సాధన సమితి చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో.. అన్ని ముందు జాగ్రత్తలనూ పోలీసు యంత్రాంగం తీసుకుంది. విపక్షం గైర్హాజరు నిర్ణయం కారణంగా.. ప్రస్తుత సమావేశాలు.. పాలక టీడీపీ, మిత్రపక్ష బీజేపీ నేతల ప్రశ్నోత్తరాలు, చలోక్తులతో ఏకపక్షంగా సాగుతుందన్నది స్పష్టమవుతోంది. 

21:50 - November 9, 2017

హైదరాబాద్ : విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కేంద్రంతో పోరాడైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

మైనారిటీల సంక్షేమంపై అసెంబ్లీలో రెండో రోజూ చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న  వివిధ పక్షాల సభ్యులు ముస్లిం రిజర్వేషన్ల పెంపు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయినా ముస్లింల రిజర్వేషన్ల పెంపుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని వివిధ పక్షాల సభ్యులు తప్పుపట్టారు. ముస్లింలకు ప్రస్తుతం ఉన్న4 శాతం రిజర్వేషన్లకు అదనంగా మరో ఆరు శాతం ఇవ్వొచ్చని బీసీ కమిషన్‌ సిఫారసు చేస్తే... 12 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏవిధంగా  ప్రతిపాదనలు పంపారని   కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 

మైనారిటీలకు సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని వివిధ పక్షాల సభ్యులు కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని సీపీఎం సభ దృష్టికి తెచ్చింది. ఈ అంశంపై రెండు రోజుల పాటు జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కూడా వీటిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సభ దృష్టికి తెచ్చారు. 

ఇదే సమయంలో నిజాం పాలకులు తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని కేసీఆర్‌ ప్రస్తావించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుతోపాటు నిమ్స్‌ సహా పలు ఆస్పత్రులను నిర్మించిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. కానీ చరిత్ర వక్రీకరించారని.. దీనిని తిరగరాసి సరికొత్త తెలంగాణ చరిత్రను భావితరాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. 

మైనారిటీల సంక్షేమంపై చర్చ ముగిసిన తర్వాత ప్రివెంటివ్యూ డిటెన్షన్‌ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరుపున  హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అక్రమ మద్యం వ్యాపారులు, మత్తు మందులు విక్రయించే మాఫియా ముఠాలు,  భూ ఆక్రమణదారులు, గూండాలు, వ్యభిచార ముఠాలు, కరుడుకట్టిన నేరస్థులను నియంత్రించే ఈ బిల్లుపై జరిగిన చర్చలో వివిధ పక్షాల సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు.  1986 పీడీ యాక్ట్‌ చట్ట సవరణ బిల్లుతోపాటు తెలంగాణ రహదారి అభివృద్ధి సంస్థ చట్ట సవరణ బిల్లు, షాపులు, దుకాణాల చట్ట  సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేశారు. 
 

21:45 - November 9, 2017
21:43 - November 9, 2017
21:36 - November 9, 2017

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, అక్కడ గాలి పీలిస్తే చస్తారు.. అది మామూలు గాలి కాదు..  మూతికి మాస్కు లేకుండా బయటికి రాలేని పరిస్థితి.. ముందున్న వాహనం కనిపించని దుస్థితి.. వాయు కాలుష్యం అన్ని వైపులనుంచి కప్పేస్తుంటే హస్తిన ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. దీంతో దేశ రాజధాని కాస్తా కాలుష్యానికి క్యాపిటల్ గా మారింది. ఏటా ఢిల్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను చూస్తోంది. దీనికి పరిష్కారం లేదా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
పట్టపగలే పొగమంచు 
రాజధాని ఢిల్లీ.. పట్టపగలే పొగమంచు పేరుకుని ఎదురుగా వచ్చే వాహనాలే కనిపించని పరిస్థితి. పొల్యూషన్ లో ప్రపంచ నగరాల్లో టాప్ ప్లేస్ కి  శరగవేగంగా దూసుకుపోతోంది ఢిల్లీ..  ఢిల్లీలో ప్రజారోగ్యం  ప్రమాదంలో పడింది. ఇల్లూ, ఆఫీసు, మెట్రో స్టేషన్లు, రోడ్లు.. పార్కులు... ఎక్కడా తేడా లేదు.. అన్ని చోట్లా కలుషిత గాలి చేరుతోంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధాని లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే అనిపిస్తోంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

వక్ఫ్ బోర్డు సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూముల వివరాలు సేకరించాలని సీఎం అన్నారు. 

 

20:22 - November 9, 2017

ఒడ్సిపోయిన సుక్క సత్తయ్య సూపు, అమాయకంగున్నఅలంపూర్ ఎమ్మెల్యే, పంటకు నిప్పువెట్టుకుంటున్న రైతులు, మర్ఫా డ్యాన్స్ జేస్తున్న క్రికెటర్, విశాఖపట్నంల దిగిన బాలికాక.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.....

20:17 - November 9, 2017
20:16 - November 9, 2017
20:15 - November 9, 2017
20:12 - November 9, 2017

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వైసీపీ నేత మల్లాది విష్ణు, పీడీఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, టీడీపీ అధికార ప్రతినిధి దినకర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హెచ్ సీయూ విద్యార్థులపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి : ఎస్ ఎఫ్ ఐ

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ ను ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. 

 

 

20:04 - November 9, 2017
19:57 - November 9, 2017

ఢిల్లీ : నేషనల్‌ ఎగ్‌ కో..ఆర్డినేషన్‌ కమిటీ అంబాసీడర్‌గా ప్రముఖ సినీ నటుడు షాయాజీ షిండే.. నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్ ఈసీసీకి తాను అంబాసీడర్‌గా భావించడం లేదని... అది తన బాధ్యతగా భావిస్తున్నానని షాయాజీ షిండే అన్నారు. ఎన్ ఈసీసీ లక్ష్యం ఎంతో నచ్చిందని.. అందుకే  దీనికి ఒప్పుకున్నానని ఆయన అన్నారు.

19:53 - November 9, 2017

కడప : ఉద్యోగాలకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తామని చెప్పారు. చదువుల విప్లవం వస్తే పేదరికం పోతుందన్నారు. చదువుల విప్లవం తర్వాత వచ్చేది ఉద్యోగాల విప్లవమన్నారు. తాము అధికారంలోకి వస్తే దశల వారిగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పారు. అనారోగ్యాలకు గురైనవారు ట్రీట్ మెంట్ తీసుకున్నాక... రెస్టు సమయానికి కూడా తాము డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఫీజులు లక్షల రూపాయలు ఉన్నాయని..కానీ ఫీజు రియింబర్స్ మెంట్ 35 వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పారు. చదువుల కోసం ఏ పేదవారు ఇబ్బందిపడే పరిస్థితి లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సలహాలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో 104 వాహనాలు కనిపించకుండా పోయాయని అన్నారు. 

19:41 - November 9, 2017

సామాజిక సేవిక...రచయిత్రి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, ప్రముఖ పాత్ర పోషించి, మహాత్మ గాంధీ మన్ననలు పొందిన అరుదైన మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి. అతి చిన్న వయస్సులోనే తన 27 వ ఏటనే మరణించారామే. భారత్ లో మహిళల పరిస్థితి గురించి నారి అనే పుస్తకం రచించింది. 1927నవంబర్ 9తేదీన ఆమె మరణించారు. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణావేదికి మానవి శ్రద్ధాంజిలి ఘటిస్తోంది. మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం... 
న్యాయాన్ని ఎవరికీ విక్రయించం. న్యాయాన్ని అందించేందుకు ఆలస్యం చేయం. న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. ఏడు శతాబ్ధాల క్రితం ఇంగ్లండ్ రాజు జాన్ తన సామంతులకు న్యాయాన్ని వాగ్ధానం చేస్తూ జారీ చేసిన మ్యాగ్నా కార్టా చార్టర్ లోని ఈ వ్యాఖ్యాలు... నేటికి చర్చనీయాంశాలు కావడం విశేషం... నవంబర్ 9న న్యాయ సేవ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1976సం.లో న్యాయ సేవల అధికారిక చట్టాన్ని తీసుకొచ్చారు. 

19:23 - November 9, 2017

చిత్తూరు : మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదలలో ప్రభుత్వం చూపుతున్న జాప్యాన్ని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా తప్పు పట్టారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. టీడీపీ సర్కార్‌ వాగ్ధానాల ప్రభుత్వమే కానీ అమలు చేసే ప్రభుత్వం కాదని ప్రజలు భావిస్తారన్నారు. రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయకపోతే అన్ని రైతు సంఘాలతో కలిసి.. చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:19 - November 9, 2017

గుంటూరు : తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీ పనిదినాలపై రేపటి బీఏసీలో నిర్ణయించనున్నారు. టీడీఎల్పీ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు వీడియాతో మాట్లాడారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారని సీఎం కితాబు ఇచ్చారు. 'మనం చేసిన మంచిపనులే మనకు శ్రీరామరక్ష' అని అన్నారు. మంచిపనులు చేసి అందుబాటులో ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. పారదర్శకంగా రైతు రుణమాఫీ 3 విడతలు పూర్తి చేశామని తెలిపారు. వాటర్‌ మేనేజ్‌మెంట్ ద్వారా కరువును ఎదుర్కొన్నామని చెప్పారు.

 

భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై ఆరోపణలు

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఐటీ సోదాలు నిర్వహించింది. 

19:06 - November 9, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఐటీ సోదాలు నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:00 - November 9, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో కొందరు కార్పొరేటర్ల తీరు మారడంలేదు. పదవిలో ఉన్నంతకాలం ఆదాయమే  పరమావధిగా దండుకుంటున్నారు. స్ట్రీట్‌ వెండర్‌ నుండి, బిల్డర్‌ వరకు ఎవరినీ వదలడంలేదు. ఇలాగే అధికారులపై జులుం ప్రదర్శించిన కాచిగూడ కార్పొరేటర్‌ భర్తపై కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
కార్పొరేటర్లపై మండిపడ్డ కేటీఆర్‌
జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. బల్దియా కార్పొరేటర్ల తీరుపై గతంలోనూ విమర్శలున్నాయి. అయితే ఈ పరిస్థితిని మారుస్తామని ప్రకటించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఏకంగా ముఖ్యమంత్రే  ప్రగతి రిసార్టులో కార్పొరేటర్ల శిక్షణా కార్యక్రమంలో హితబోధ చేశారు. అవినీతికి తావు ఇవ్వొద్దని హెచ్చరించారు. అలాగే ఇటీవల టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం అయిన మంత్రి కేటీఆర్‌ నిత్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లపై మండిపడ్డారు. క్రమశిక్షణా చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. 
అధికారుల హెచ్చరికలు చేసినా మారని కార్పొరేటర్లు
అధికారుల హెచ్చరికలు చేసినా కార్పొరేటర్ల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. అందుకు నిదర్శనమే కాచిగూడ కార్పొరేటర్‌ భర్త వ్యవహారం. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటుందన్న నెపంతో టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌పై దురుసుగా ప్రవర్తించారు కార్పొరేటర్‌ భర్త ఎక్కాల కన్న. తనపై మండిపడటాన్ని ఫోన్‌లో రికార్డ్‌  చేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్ వాణి ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ విధులకు ఆటంకం కల్పించారు. తనను కలువకుండా ఎలాంటి పనులు చేయకూడదని ఎక్కాల వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది వాణి. దీంతో 353, 354, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
ప్రభుత్వ, ప్రైవేటు తేడాలేకుండా వాలిపోతున్న కార్పొరేటర్లు
టౌన్‌ ప్లానింగ్‌ అధికారులంతా బల్దియా కమిషనర్‌ ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఈ ఘటన గురించి ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. అయితే సిటీలో కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. ఉప్పల్ సర్కిల్‌లో కార్పొరేటర్‌ భర్తపై భూ కబ్జా కేసు నమోదు అయింది. చైతన్యపురి కార్పొరేటర్‌ ఒక భవన నిర్మాణం వద్దకు వెళ్లి వారిని బెదిరించడం కొద్ది నెలల క్రితం గ్రేటర్లో హాట్‌ టాపిక్ అయింది. తమను 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఇవ్వనందుకు తమపై దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో చైతన్యపురి కార్పొరేటర్‌ విఠల్‌పై ఐసిసి 447, 385, 324, 506 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు. కార్పొరేటర్ల అరాచకాలతో విసిగిన కొందరు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే, మరికొందరు ఏకంగా హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తున్నారు.  
ఇంకా బయటకు రాని సంఘటనలు
ఇక వీరు ఇలా ఉంటే కార్పొరేటర్ల కుటుంబసభ్యుల అనుచరుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. బిఎన్‌ రెడ్డి కార్పొరేటర్ కుమారుడు కడ్తాల్‌ టోల్‌ గేట్‌ సిబ్బందిపై కత్తులతో స్వైర విహారం చేస్తే, మల్కాజ్‌ గిరి కార్పొరేటర్‌ పుత్రరత్నం ఫేస్‌బుక్‌లో మహిళలను టార్చర్‌ చేస్తూ రెండు సార్లు జైలుకెళ్లాడు. ఇవి బల్దియా ప్రజా ప్రతినిధుల లీలలు. అయితే ఇంకా బయటకు రాని సంఘటనలు చాలానే ఉన్నాయి.  
మహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తనం 
పలు ప్రాంతాల్లో మహిళా కార్పొరేటర్ల భర్తలు తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ప్రైవేటు వ్యక్తి స్థలాన్ని ప్రభుత్వ స్థలం అంటూ ఓ కార్పొరేటర్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక సర్కిల్‌ 9లో ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేయలేదన్న నెపంతో కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి భర్త ఏకంగా శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను విధుల్లోంచి తొలగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని అధికారులు ఆ సూపర్‌వైజర్‌ను మరో చోటికి బదిలీ చేశారు. 
కార్పొరేటర్ల చేతివాటం 
ప్రైవేటు అంశాలనే కాకుండా అభివృద్ధి పనుల్లో సైతం కార్పొరేటర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కార్పొరేషన్‌ నుండి సాంక్షన్‌ అయిన పనులు శంకుస్థాపన చేయాలంటే కాంట్రాక్టర్లు వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏరియాని బట్టి పని రేటు మారుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈస్ట్‌ జోన్‌ కాంట్రాక్టర్లకు కొంతమంది కార్పొరేటర్లు ఈ విషయాన్ని ఖరాకండిగా తేల్చి చెప్పినట్లు సమాచారం.  

 

18:49 - November 9, 2017

హైదరాబాద్ : వ్యవసాయం తరువాత మన దేశంలో అతి పెద్ద ఉపాధి కల్పన రంగం చేనేత, జౌళి అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వాలకు అవగాహన లేకపోవడం వల్ల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులకు గురైందని చెప్పారు. ప్రభుత్వం చేనేత రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. మొదటిసారిగా మరమగ్గాల కార్మికులకు కూడా త్రిఫ్ట్‌ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేటీఆర్‌ స్పష్టం చేశారు.  

 

18:47 - November 9, 2017

హైదరాబాద్ : దేవాలయ అర్చకులు, మసీదుల ఇమామ్‌లు, మౌజంలకు ఇస్తున్న తరహాలోనే క్రైస్తవ పాస్టర్లు, రెవరెండ్‌లకు కూడా గౌరవభృతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే పాస్టర్లు, రెవరెండ్‌లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 

 

104 వాహనాలు కనిపించకుండా పోయాయి : జగన్

కడప : రాష్ట్రంలో 104 వాహనాలు కనిపించకుండా పోయాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని చెప్పారు. 

 

హెచ్ సీయూ విద్యార్థుల సస్పెన్షన్ ను ఖండించిన తమ్మినేని

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల సస్పెన్షన్ ను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పది మంది విద్యార్థుల సస్పెన్షన్ అప్రజాస్వామికమని అన్నారు. 

రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 

 

18:24 - November 9, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సరూర్‌నగర్‌లో విషాదం నెలకొంది. మాధవనగర్‌ కాలనీలో ఆదిత్య అనే బాలుడు ఇంటి నుంచి ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. బాలుడ్ని కారు ఢీ కొట్టింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. నిలోఫర్‌ ఆస్పత్రికి బాలుడ్ని తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

 

17:46 - November 9, 2017

కరీంనగర్ : మంథని టిఆర్ఎస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పట్టు నిలుపుకునేందుకు ఒకరు... పడగొట్టేందుకు ఇంకొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు, అదే పార్టీ యువజన నాయకుడు సునీల్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ మంథని రాజకీయాల్లో సెగ పుట్టిస్తోంది. 
మంథనిలో అధికారపార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్
మంథని రాజకీయాలు అగ్గి లేకుండానే మంటపుట్టిస్తున్నాయి. ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎమ్మెల్యే పుట్ట మధు, టీఆర్‌ఎస్ యువజన నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుతున్నారు. 
పుట్టమధుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో మొదలైన చిచ్చు..
గత ఎన్నికల్లో పుట్టమధుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో మొదలైన చిచ్చు..ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సునీల్ రెడ్డి- మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కుమారుడు. సునీల్ రెడ్డికి టికెట్‌ ఇస్తారన్న ఆశతో తండ్రీ కొడుకులు.. స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే మాజీ మంత్రి శ్రీధర్ బాబును ఢీకొట్టే వ్యూహంలో భాగంగా..టిఆర్ఎస్ అధిష్టానం చివరి క్షణంలో పుట్ట మధుకు టికెట్‌ ఇవ్వడంతో.. తండ్రీకొడుకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో ఇద్దరు మూడేళ్ల పాటు పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సునీల్ రెడ్డి మళ్లీ క్రీయాశీలక రాజకీయాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.  
ఎమ్మెల్యే మధుపై ఆరోపణలు 
మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే మధు అలసత్వం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గంలో చోటుచేసుకుంటున్న వివాదాలు మధుకు చెడ్డ పేరు తెస్తున్నాయని..పద్దతి మార్చుకోవాలంటూ సీఎం కెసిఆర్ హెచ్చరించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంథని మధుకర్ మరణం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు రాష్ట రాజకీయల్లో దుమారం రేపాయి. స్థానిక జేఎన్టీయూ కాలేజీలో 132 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం...కమాన్పూర్ మండల టీఆర్‌ఎస్‌ నేతలను సస్పెండ్ చేయడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం...సునీల్ రెడ్డి నేతృత్వంలో హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
శ్రీధర్‌బాబుకు కలిసొచ్చే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మంథనిలో ఏం జరుగుతుంది...   
మధు వ్యతిరేక వర్గంతో పాటు ఉద్యమ సమయంలో పార్టీ కోసం పని చేసిన వారిని ఐక్యం చేయడం.. తమ సామాజిక వర్గం నేతల మద్దతు కూడగట్టడం..స్వచ్ఛంద కార్యక్రమాలు సునీల్‌రెడ్డి చేపట్టడం ఎమ్మెల్యేకు మింగుడుపడటం లేదు. వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న వివాదాలు ఎమ్మెల్యే ఛరిష్మా మసకబారడానికి కారణమని తెలుస్తోంది. ఇక సునీల్ రెడ్డి దూకుడు వెనుక టిఆర్ఎస్ అధిష్టాన వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుతోంది. ఎమ్మెల్యే మధుకి టీఎఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మద్దతు...సునీల్ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సపోర్టు ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తామని సీఎం కేసీఆర్ చెబుతుండగా..మంథనిలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య జరుగుతున్న అంతర్‌యుద్ధం మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు కలిసొచ్చే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 

17:15 - November 9, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస్‌ విడుదల చేశారు. మార్చ్‌ 15 నుండి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9: 30 నుండి మధ్యాహ్నం 12: 15 వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల36 వేల 831 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.  మే మొదటి వారంలో పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని మంత్రి గంటా సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఒకటి పిడి యాక్టు సవరణ బిల్లు, రెండు తెలంగాణ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చట్టసవరణకు సభ ఆమోదం తెలిపింది.

17:04 - November 9, 2017

కడప : జగన్‌ నాలుగో రోజు సంకల్పయాత్ర కొనసాగుతోంది. వైకోడూరు జంక్షన్‌లో జగన్‌ను కలిసిన రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలేదని రైతులు జగన్‌తో వాపోయారు. రైతుల బాధను విన్న జగన్‌ ధరల స్థిరీకరణ చేస్తామన్న చంద్రబాబు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.  

 

16:58 - November 9, 2017

హైదరాబాద్ : తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా ముస్లింకు రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడులో వివిధ వర్గాలకు 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మైనారిటీల సంక్షేమంపై అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు కేసీఆర్‌ నమాధానం ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంతో పోరాటం  చేస్తామన్నారు. కేంద్రంతో చర్చించేందుకు అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు కూడా వేస్తామని సభ దృష్టికి తెచ్చారు. 
 

16:57 - November 9, 2017

జగిత్యాల : పట్టణంలో... అన్నల అమానుషం వెలుగులోకి వచ్చింది. తోడబుట్టిన వాళ్లే...చెల్లిని వేధింపులు గురిచేశారు. సొంత అన్న, వదినలే కాళ్లు చేతులకు బేడీలు వేసి బంధించారు. వాణినగర్‌కు చెందిన చిట్యాల గీత అనే యువతి తన అన్నలైన నారాయణ, శ్రీనివాస్‌లతో కలిసి ఉంటుంది అయితే  వారు  కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోతుండగా.. మళ్లీ ఆమెను పట్టుకుని.. గొలుసులతో కట్టివేసి.. తాళం వేసి.. చితకబాదారు. దీంతో గీత మళ్లీ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్పీ అనంత శర్మ, సీఐ ప్రకాశ్‌... గీతను పరామర్శించి... వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే గీతకు మతిస్థిమితం లేదని అందుకే వాళ్ల అన్నవదినలు సంకేళ్లు వేస్తున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. 

 

పీడీ చట్టం సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్: పీడీ చట్టం సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం పొందింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందుకు నిరసనగా సభ నుండి కాంగ్రెస్, సీపీఎం, బిజెపి వాకౌట్ చేశాయి.

16:54 - November 9, 2017

పెద్దపల్లి : జిల్లాలోని ఎన్టీపీసీ జ్యోతినగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్ధినులు,  ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు కీచక టీచర్లను  జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. వీరితో పాటు కొమురయ్య, నీలంరాణి, మేరీ తెరీసా అనే ముగ్గురిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న  కోటేశ్వరరావు, శ్రీనివాస్‌లు కొంతకాలంగా విద్యార్ధినులతో పాటు, ఇద్దరు మహిళా టీచర్లను వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా సంక్షేమ అధికారి ఎన్టీపీసీ పోలీసులకు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విద్యార్ధినులను పోలీసులు విచారిస్తున్నారు. 

కారు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్: సరూర్ నగర్ లో విషాదం నెలకొంది. మధురానగర్ లో కారు ఢీకొన్ని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. సీసీటీవీలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

బుధవారపేటలో ఉన్మాది యుగంధర్ వీరంగం

కర్నూలు : బుధవారపేటలో ఉన్మాది యుగంధర్ వీరంగం సృష్టించాడు. కత్తితో ఇద్దరిపై దాడి చేసిన ఉన్మాది గొంతుకోసుకున్నాడు. ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టిడిపి వ్యూహ కమిటీ భేటీ

అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో టిడిపి వ్యూహ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి మంత్రులు లోకేష్, కళా వెంకట్రావు, యనమల, లోకేష్, కళా వెంకట్రావు, యనమల హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తున్నారు.

పీడీ చట్టం సవరణ బిల్లుపై టీఎస్ అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్: పీడీ చట్టం సవరణ బిల్లుపై టీఎస్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ... 1986 నాటి పీడీ చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలకు పాల్పడుతున్న కబ్జారాయుళ్లను కట్టడి చేయాలని సూచించారు.

గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంపై ఐటీ దాడులు

హైదరాబాద్: గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంపై ఐటీ దాడులు చేస్తోంది. నగరంలో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు

ఢిల్లీ: ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ నెల 13 నుంచి వాహనాలకు సరి- బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ సర్కార్ తెలిపింది.

సమైక్య పాలనలో మైనార్టీలపై నిర్లక్ష్యం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: సమైక్య పాలనలో మైనార్టీల విషయంలో నిర్లక్ష్యం వహించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరినీ నిదించి కూడా లాభం లేదని, అది గతం అని మైనార్టీలు ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. మైనార్టీలకు ప్రయోజనాలను చేకూరాలనేది మా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో చాలా అన్యాయం జరిగిందని, తమ భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పే స్థితిలో వక్ప్ బోర్డు లేదని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల మంచి చెడ్డల విచారణకు సమావేశం నిర్వహిస్తున్నాం అని చెప్పారు.

తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉంది: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభలో మైనార్టీలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..గంగాజమున తెహజీబ్ తో ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కాకతీయుల తర్వాత 750 ఏళ్లు తెలంగాణను ముస్లింలు పాలించారని, ఆ కాలంలో మతపరమైన వివాదాలు ఒక్కటి కూడా లేవన్నారు. అన్ని పండగలను కలిసి చేసుకునే గొప్ప సంస్కృతి మనదని, ముస్లింలే కాదు, గిరిజనులలో కూడా సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలిద్దామని పేర్కొన్నారు. వీలైంనత త్వరగా కేంద్రాన్ని ఒప్పంచి ముస్లిం, గిరిజన్లు రిజర్వేషన్లను సాధిస్తామని తెలిపారు.

15:09 - November 9, 2017

హైదరాబాద్ : ముస్లీంలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మైనార్టీలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వక్ఫ్ బోర్డు కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలకంటే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని తెలిపారు. ముస్లీంలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామన్నారు. 
హైదరాబాద్ లో వేలాదిగా అమ్మవారి ఆలయాలను పునరుద్ధరించామని చెప్పారు. 

వేగంగా రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట నిర్మాణ పనులు

హైదరాబాద్: రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 2019లో ఈ ప్లాంట్ తన ఉత్పత్తులను ప్రారంభిస్తున్నారు. ఫెర్టిలైజర్ ప్లాంట్ కోసం సుమారు రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 3 వేల ఉద్యోగాలను కల్పించనున్నారు. నిర్ణీత కాల వ్యవధితోనే రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్‌ను నిర్మస్తున్నామని, మరో నెల రోజుల్లో ఆ ప్లాంట్‌ను విజిట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

తెలంగాణలో మైనార్టీలకు పెరుగుతున్న ఆత్మవిశ్వాసం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో మైనార్టీలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో వేలాదిగా అమ్మవారి ఆలయాలను పునరుద్ధరించామని చెప్పారు. వక్ఫ్ బోర్డు కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకంటే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని తెలిపారు. 

హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న అంసెంబ్లీ ఎన్నికలు

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో అంసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 26.6 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 

 

పాఠశాల విద్య పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పాఠశాల విద్య పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.2022 నాటికి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో రాష్ట్ర విద్యార్థులు దేశంలోనే మొదట నిలిచేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 'ఇ-హాజరు' 100శాతం అమలు చేయాలన్నారు. 'ఇ-హాజరు' పరిధిలోకి రాష్ట్రంలోని 41,601 పాఠశాలలు, 1,66,931 మంది ఉపాధ్యాయులు, 34,04,109 విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లోనూ బయో మెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన టీచర్లకు రేటింగ్ విధానం ఉంటుందన్నారు. ప్రతిబ కనబరిచిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.

భూసేకరణకు వచ్చిన అధికారులను నిర్బంధించిన గ్రామస్థులు

ప.గో: చింతలపూడి ఎత్తిపోతల పథకంలోని జిల్లేరు రిజర్వాయర్ భూ సేకరణకు అధికారులు వెల్లారు. గ్రామ సభ తీర్మానం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను గ్రామస్తులను అడ్డుకున్నారు. రెడ్డి గణపవరంలో అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు.

13:30 - November 9, 2017

సర్కార్ రైతుల ఉసురు - చంద్రకుమార్..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్..రైతు సంఘం కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి..రంగయ్యలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు భరోసా కల్పించాలని..పంటకు 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలని..రైతుల పక్షాన నిలబడుతామని..చెప్పిన ప్రభుత్వం గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అధికారాన్ని కాపాడుకొనేందుకు ఎమ్మెల్యేలు..పోలీసులకు జీతాలు పెంచి హంగు ఆర్బాటాలు చేస్తూ విస్మరిస్తున్నారని పేర్కొన్నారు.

13:13 - November 9, 2017

ఉల్లి..తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ ఉల్లిని కూరగాయాల్లోకి వాడుతుంటారు. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరంలో మంచి కొవ్వు నిల్వ ఉండడం..నిద్రలేమి సమస్య దూరం కావడం..తదితర లాభాలున్నాయి. ఇక ఉల్లి ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

మొటిమల సమస్యలున్న వారు ఆలివ్ ఆయిల్..ఉల్లి రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు త్వరగా పోయే అవకాశం ఉంది. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగులో రోజు ఉదయం వేళ్లలో తీసుకుంటే కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. ఉల్లిపాయ రసాన్ని తేనేలో కలుపుకుని తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లి రసం మాడుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తీరే అవకాశం ఉంది. మాడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. 

13:10 - November 9, 2017

హైదరాబాద్: కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. కేవలం 5వ తరగతి నుండే గురుకుల విద్య కాకుండా 1వ తరగతి నుండి కల్పించాలని పేర్కొన్నారు. వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయని, వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలని, అన్యాక్రాంతం అయిన వక్ప్ ఆస్తులను తిరిగి ప్రభుత్వం తీసుకోవాలి పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి మధు అల్టిమేటం..

తిరుపతి : మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. నెలాఖరులోగా నిధులు విడుదల చేయకుంటే రైతు సంఘాలతో కలిసి చలో అమరావతి చేపడుతామన్నారు. 

కార్మిక సంఘాల ధర్నా ప్రారంభం...

ఢిల్లీ : పార్లమెంట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా ప్రారంభమైంది. మోదీ ప్రజా, కార్మిక విధానాలను నిరసిస్తూ 11 వరకు ఈ ఆందోళన జరుగనుంది. భారీగా కార్మిక సంఘాల నేతలు..కార్మికులు హాజరయ్యారు. కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలని, ధరల నియంత్రణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం..ఉద్యోగాల కల్పన... కార్మిక చట్టాల రక్షణ..ప్రైవేటీ కరణ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు...

హైదరాబాద్ : ఎర్రగడ్డ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ సదాశివ యాదవ్ పై పైరసీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సదాశివ యాదవ్ పై ఎస్ఆర్ నగర్ పీఎస్ లో జీ ఎంటర్ ప్రైజెస్ లి. సంస్థ ప్రతినిధి ఖలీం ఫిర్యాదు చేశారు. సదాశివ యాదవ్ తో పాటు నిఖితా కమ్యూనికేషన్ పై 63, 68 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

తెలంగాణ జైళ్ల శాఖ అందరికీ ఆదర్శం - డిప్యూటి సీఎం..

హైదరాబాద్ : తెలంగాణ జైళ్ల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ పేర్కొన్నారు. ఖైదీల విడుదల తరువాత గౌరవ ప్రదంగా జీవించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ శిక్షణిస్తోందని తెలిపారు. నేర రహిత సమాజం కోసం సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. 

జేఈఆర్ పుష్పరాజు తనిఖీలు...

కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేటలో పలు శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర ఫుడ్ కమిటీ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజు తనిఖీలు చేపట్టారు. రేషన్ దుకాణాలు..మిడ్ డే మీల్స్..అంగన్ వాడీ కేంద్రాల పనితీరుపై పరిశీలించారు. 

కేసీఆర్ కు తమ్మినేని లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు..ఏ, బి, సి, డి వర్గీకరణ అమలు గురించి లేఖలో ప్రస్తావించారు. 

12:43 - November 9, 2017

హైదరాబాద్‌ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. తెలంగాణ రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష జరుగుతోంది. జస్టిస్ చంద్రకుమార్‌, రైతుసంఘం కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి, రంగయ్య ఈ దీక్షలో పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని.. పంటకు 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 

జైళ్ల డీజీల సదస్సు ప్రారంభం..

హైదరాబాద్ : జైళ్ల డీజీల సదస్సును డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ ప్రారంభించారు. ఈ సదస్సులో 14 రాష్ట్రాల జైళ్ల శాఖల డీజీలు పాల్గొన్నారు. 

అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి - జగన్...

కడప : అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరుగుతుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జమ్మలమడుగు నియోజకవర్గం రైతులతో ఆయన భేటీ అయ్యారు. రైతు సంక్షేమానికి మరిన్ని పథకాలు తేవాలని రైతులు సూచించారు. 

రైతులతో జగన్ భేటీ..

కడప : జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. రుణమాఫీ అమలు కావడం లేదని జగన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గం రైతులతో ఆయన భేటీ అయ్యారు. 

పాదయాత్రలు అధికారం కోసమే - జేపీ...

హైదరాబాద్ : టిడిపి..వైసిపి పాదయాత్రలు అధికారం కోసమేనని లోక్ సత్తా జేపీ విమర్శించారు. తన పోరాటం పదవుల కోసం కాదని...మార్పు కోసమన్నారు. ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా మార్పు రావడం లేదన్నారు. 

గౌహతికి మంత్రి ఈటెల..

హైదరాబాద్ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల గౌహతికి వెళ్లారు. 28 శాతం శ్లాబుపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని, సామాన్యులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరడం జరుగుతుందన్నారు. బీడీలపై 28 శాతం పన్ను తగ్గించాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. 

ఎస్ఆర్ ఎస్పీ గొప్ప ప్రాజెక్టు - హరీష్...

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణకు ఎస్ఆర్ఎస్పీ గొప్ప ప్రాజెక్టు అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరంతో లింక్ చేస్తామన్నారు. లింక్ చేయడం వల్ల పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టులు..రైతులతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 

12:02 - November 9, 2017

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ గా కొత్త యంగ్ డైరెక్టర్స్ చేతికి వెళ్లిందా అనుకునే టైం లో సీనియర్ డైరెక్టర్స్ మల్లి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ సీనియర్ డైరెక్టర్ మళ్ళీ హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రేమకథలను తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ మరో క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నాడు . డైరెక్టర్ తేజ ఒకప్పుడు ఈ పేరు అంటే హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్. ఆ తరువాత కాలంలో కొంచం వెనుకబడిన తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ వచ్చాడు. రానా - కాజల్ జంటగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజ మరో సినిమాకి ముహూర్తం పెట్టాడు. రానా హీరోగా పవర్ఫుల్ పొలిటిషన్ రోల్ లో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో తేజ స్టైల్ అఫ్ మేకింగ్ ని మరో సారి చూపించాడు. రానా లాంటి పర్సనాలిటీని హ్యాండిల్ చేసి హిట్ కొట్టాడు తేజ.

నేనే రాజు నేనే మాత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ త్వరలోనే వెంకీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. బాబు బంగారం సినిమా తరువాత వెంకీ మెయిన్ లీడ్ గా కనిపించే ఈ సినిమా ఇంటరెస్టింగ్ గా మారుతుంది. గురు సినిమా లో వెంకీ నటనకి మంచి మార్కులు పడ్డాయి. తేజ డైరెక్షన్ లో వెంకీ తో రాబోయే సినిమాలో స్పెషల్ పాత్ర కోసం ఒక యువ హీరోని చేయించాలని అనుకుంటున్నాడట దర్శకుడు తేజ. అయితే ఆ పాత్ర కోసం ఇద్దరి పేర్లను కూడా అనుకుంటున్నాడట. సుమంత్ - నారా రోహిత్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తేజ ఫైనల్ చేయనున్నాడట. అలానే హీరోయిన్ రోల్ కోసం హీరోయిన్స్ ని ఇద్దరిని అనుకున్నా వారు రిజెక్ట్ చేశారట. వారు ఎవరో కాదు ఒకరు కాజల్ అగర్వాల్ మరొకరు మిల్కి బ్యూటీ తమన్నా. మరి వెంకీ పక్కన ఎవరు కనిపిస్తారో చూడాలి.

11:58 - November 9, 2017

స్టార్ హీరోలు సినిమాలు మొదలు పెట్టారు. షూటింగ్ జరుగుతుంది అని అప్ డేట్స్ ఇస్తున్నారు అలానే ఇప్పుడు ట్రైలర్స్ టీజర్స్ విషయంలో కాంపిటీషన్ కూడా చూపుతున్నారు. సోషల్ మీడియా లో వస్తున్న రెస్పాన్స్ కి ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్ కి రెడీ అయిపోతారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా తో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ పవన్ తో సినిమా చేస్తూ ఎక్స్ పెక్టషన్స్ పెంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తన ప్రీవియస్ ఫిలిం 'సర్దార్ గబ్బర్ సింగ్‘, 'కాటంరాయుడు'తో అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంట్రస్ట్ ని పెంచింది. పవన్ త్రివిక్రమ్ సినిమా అంటే ఒక క్రేజ్ మాత్రమే కాదు పీక్స్ లో ఉన్న క్రేజ్ అని నిరూపించారు ఫాన్స్. ఈ చిత్రానికి ప్రస్తుతానికి అజ్ఞాతవాసి టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం ట్యూన్ చేసి బయటకొచ్చి చూస్తే పాటను బయటకొదిలాడు. ఈ పాట పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే 1 మిలియన్ హిట్స్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తిగా విన్నారో అర్ధమైపోతుంది.

'ధ్రువ' సినిమా 'రామ్ చరణ్' ని మార్చేసింది అని చెప్పాలి. రామ్ చరణ్ లుక్ తో పాటు యాక్టింగ్ లో కూడా డిఫెరెంట్ చూపిస్తూ తన కెరీర్ ని పక్క ప్లానింగ్ లో పెట్టుకున్నాడు. తనలో యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే మంచి అవకాశాన్ని ధ్రువ సినిమా ద్వారా యూస్ చేసుకున్నాడు. రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’.రంగస్థలం మూవీ కాన్సెప్ట్ ను రివీల్ చేయకుండానే.. అద్భుతమైన టీజర్ ఇవ్వాలని.. ఆ తర్వాతే థియేట్రికల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట సుకుమార్.

ఇదే కోవలో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నారు బన్నీ అండ్ మహేష్ బాబు. డి జె సినిమా తో కొంచెం వెనుకబడిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాని చాల ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాల కేర్ తీసుకుంటున్నాడట. అలానే మహేష్ బాబు కూడా స్పైడర్ సినిమా టాక్ తో కొంచెం అలెర్ట్ అయ్యి కొరటాల శివ సినిమా విషయంలో ఫస్ట్ లుక్ నుండే జాగర్త పడుతున్నాడట. స్పైడర్ సినిమా లో మహేష్ నటనకి మంచి మార్క్స్ పడ్డాయి.

11:57 - November 9, 2017
11:56 - November 9, 2017

అమరావతి: శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కల్పించాల్సిన భద్రతపై పోలీస్‌ ఉన్నతాధికారులతో కోడెల ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వచ్చేదారి, మంత్రులు వచ్చేదారి, పార్కింగ్‌ ఇలా అన్ని రకాలుగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్పీకర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు....

అసెంబ్లీ స్పీకర్‌ కోడెలను ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలతో కూడిన బృందం కలిసింది. ఈ మధ్యే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై అనర్హతవేటు వేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మరో 20 మందిపై గతంలో ఇచ్చిన అనర్హత పిటిషన్‌ అంశాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

పార్టీ ఫిరాయింపుపై విచారణ సాగుతోందన్న స్పీకర్‌.....

వైసీపీ ఎమ్మెల్యేల వాదనపై స్పీకర్‌ స్పందించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ సాగుతుందని స్పష్టం చేశారు. తాను ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండానే వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ... ప్రస్తుతం కేసు సుప్రీ కోర్డులో పెండింగ్‌ ఉందని చెప్పారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని స్పీకర్‌ వారిని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏరాష్ట్రంలోనూ అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీసభ్యులు అందరూ బాయ్‌కాట్‌ చేయడం జరుగలేదన్నారు.

సభలో 4 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ప్రతిపక్షం సమావేశాలను బాయ్‌కాట్‌ చేసినా.... అసెంబ్లీ సమావేశాలు మాత్రం యధావిధిగా జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాల బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించే ముసాయిదా చట్టాన్ని సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

తెలంగాణ తరహాలో భూసేకరణ చట్టం

తెలంగాణ తరహాలో భూసేకరణ చట్టం -2013 సవరణ, నాలా యాక్ట్‌ ఆర్డినెన్స్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా 28 అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ప్రతిపక్షం సభలో లేకపోయినా.. అధికారపార్టీ సభ్యులు మాత్రం తప్పనిసరిగా అసెంబ్లీలో ఉండాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సీఎం అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు.

ప్రతిపక్ష పార్టీ సభలో ఉన్నా, లేకపోయినా ...

ప్రతిపక్ష పార్టీ సభలో ఉన్నా, లేకపోయినా అధికారపార్టీ సభ్యులే ప్రభుత్వాన్ని ప్రశ్నల రూపంలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చర్చకు లేవదీయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పలు పథకాలు.. కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులను మంత్రులు వివరించనున్నారు. 

ఓటేసిన ప్రముఖులు..

ఢిల్లీ : హిమచాల్ ప్రదేశ్ లో గురువారం శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 నుండి సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగనుంది. తొలి రెండు గంటల్లో 13.72 శాతం పోలింగ్ నమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్, ఆయన కుమారుడు విక్రమాదిత్య కుటుంబసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

11:51 - November 9, 2017
11:34 - November 9, 2017

ఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల పాటు అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాపడావ్ నిరసన జరగనున్నట్టు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. కనీస వేతనం 18 వేలు ఉండాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హేమలత చెప్పారు. మహాపడావ్‌కు అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు భారీగా తరలివస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికామ్, పరిశ్రమలు, రైల్వే, రక్షణ, రవాణా, రంగాల ఉద్యోగులు మహాపడావ్‌కు తరలిరానున్నట్టు హేమలత చెప్పారు. 

ఢిల్లీలో మహాపడావ్...

ఢిల్లీ : దేశరాజధానిలో మూడు రోజుల పాటు మహాపడావ్ నిరసన కొనసాగుతుందని, మహాపడావ్ కు అన్ని రాష్ట్రాల నుండి కార్మికులు భారీగా తరలివస్తున్నారని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత పేర్కొన్నారు. కనీస వేతనం రూ. 18 వేలు ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. 

నేడు నగరానికి జగన్..!

కడప : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఆయన చేపడుతున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. జమ్మలమడుగులో ఆయన నాలుగో రోజు పాదయాత్ర చేస్తున్నారు. శుక్రవారం సీబీఐ కోర్టుకు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున... గురువారం రాత్రికే ఆయన హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. 

11:21 - November 9, 2017

హైదరాబాద్: తమ సమస్యల పరిస్కారం కోసం గురుకుల కాంట్రాక్టు ఉపాధ్యాయలు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభనుఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకు అనుమతి లేదని ఉపాధ్యాయులను పోలీసులు చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. బహిరంగంగా ఎలా సభ పెట్టలేదని, ఉపాధ్యాయులంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకోవడానికి వచ్చామని, అయిన సభకు పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులను నిర్భంధిస్తే..సమాజం బతకదు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్రజలు గమనిస్తున్నారన్న టిటివి దినకరన్..

చెన్నై : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని టిటివి దినకరన్ పేర్కొన్నారు. దాడులతో తమను నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తే అవి కలలవుతాయని ఆయన విమర్శించారు. 

11:15 - November 9, 2017

ఆదిలాబాద్ : ఉట్నూరులో రాస్తారోకోలు, ర్యాలీలతో ఆదివాసీ ప్రాంతాలలో అలజడి రేగింది. ఆదివాసీ ప్రాంతాల్లో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాని ఎస్పీ శ్రీనివాస్ '10టివి'కి తెలిపారు. ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య రిజర్వేన్ల అంశంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి వల్ల ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పీడ్ గా కమ్యూనికేట్ అవుతున్నారని, ప్రజా సంస్కృతి, సెంటిమెంట్లు బలంగా ఉంటాయి. అందువల్ల దేనికీ వెనుకాడరని తెలిపారు. మరింత ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి..

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ - కేటీఆర్...

హైదరాబాద్ : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు. గురువారం ప్రారంభమైన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బయ్యారంలో 73 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉంటే 10 మిలియన్ టన్నులు మాత్రమే నాణ్యమైనదని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు.

ఢిల్లీలో ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు..

ఢిల్లీ : బ్రిటన్ యువరాజు ఛార్లెస్, ఆయన భార్య కెమిల్లాలు ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించారు. అమర్ జ్యోతి వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచారు. బుధవారం ఈ దంపతులిద్దరూ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. 

షోపియాన్ లో కార్డన్ సెర్చ్...

 

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని 13 గ్రామాల్లో భారత బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుక రావడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 

 

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర..

కడప : వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. 4వ రోజు జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఎర్రగుంట్ల నుండి పాదయాత్ర ప్రారంభమైంది. 

400 కిలోల గంజాయి..స్వాధీనం..

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీసగఢ్ నుండి మహబూబాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. 

కొనసాగుతున్న పోలింగ్..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10గంటల వరకు 13.72 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

10:38 - November 9, 2017

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఓటర్ల లిస్టులో నుండి తొలగించారంట. బరేలీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ల లిస్టులో ఆమె తల్లి పేరు కూడా తొలగించారు. ప్రియాంక స్వస్థలం బరేలీ. కానీ ప్రియాంక బరేలిలో నివాసం ఉండడం లేదని..50 వ వార్డులో ప్రియాంకకు ఓటు హక్కు ఉందని ఓ స్థానిక నివాసి బ్లాక్ లెవల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. బీఎల్ వో ఆపీసర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రియాంక మిస్ వరల్డ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి బరేనీ నుండి వారి కుటుంబం ముంబైకి మకాం మార్చారని..కానీ సుమారు 17 ఏళ్ల నుండి వారి ఇంటికి తాళం వేసుండంతో ఓటరు లిస్టు నుండి తొలగించినట్లు జిల్లా మెజిస్టిక్ అధికారి పేర్కొన్నారు. 

10:38 - November 9, 2017

అమరావతి: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018 మార్చి 15 నుంచి 29 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు 6.36.831 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి 2850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:34 - November 9, 2017

రంగారెడ్డి : షాద్‌నగర్‌లో తండ్రీకొడుకులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆస్తి తగాదాలతో చిన్న కొడుకు యాదగిరి (37)ని తండ్రి, పెద్ద కొడుకు కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు వెళ్తుండగా అడ్డాకుల వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లారీని ఆపి విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి కాసేపట్లో హత్యకు సంబంధించిన అన్ని విషయాలను పోలీసులు మీడియాకు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

10:32 - November 9, 2017

విశాఖ: సింహాచలం దేవస్థానంలో అపచారం జరిగింది. స్వామివారి ప్రసాదంలో పురుగులు వచ్చాయి. దీంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయంపై దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. రాయవాని పాలానికి చెందిన అయ్యప్ప భక్తులు సింహాచలం స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లి అక్కడ ప్రసాదం తీసుకున్నారు. ఆ ప్రసాదంలో బొద్దింకలు ఉండడం గమనించిన భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రసాదంలో ఇనుప సీలలు వెలుగు చూశాయి.

 

10:30 - November 9, 2017

హైదరాబాద్: గౌహతిలో జరిగే జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ బయలుదేరారు. సామాన్యుడికి జీఎస్టీ పన్నుభారం మరింత తగ్గే అవకాశం ఉందని ఈటెల చెప్పారు. సామాన్య ప్రజలకు జీఎస్టీ పన్నుభారం తగ్గించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటెల తెలిపారు. 

10:29 - November 9, 2017

చెన్నై: దినకరన్‌, శిశికళ వర్గానికి షాక్ తగిలింది. శశికళ, దినకరన్‌ ఇళ్లల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జయ టీవీ, నమదు ఎంజీఆర్‌, మక్కల్‌ కురల్‌ కార్యాలయాలయాల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. బెంగళూరులోని శశికళ సన్నిహితుడు,అన్నాడీఎంకే కార్యదర్శి పుగళేంది నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఐస్‌ సినిమాస్‌ వివేక్ నివాసంలో దాడులు నిర్వహించారు.  190 చోట్ల దాడులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.

ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్..

విజయవాడ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. 2018 మార్చి 15 నుండి 29 వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 6,36,831 మంది హాజరు కానున్నారు. ప్రస్తుతానికి 2580 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 

10:24 - November 9, 2017

హైదరాబాద్: సెయిల్ ద్వారా బయ్యారం సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని సెయిల్ ద్వారా సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఐరన్ ఓర్ అవసరమైన పరిమాణం, తగినంత నాణ్యత లేదని వెల్లడించారు. బయ్యారానికి కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

ప్రసాదంలో పురుగులు..

విశాఖపట్టణం : సింహాచలం స్వామి వారి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. స్వామి వారి ప్రసాదంలో బొద్దింక రావడంతో భక్తులు హతాశులయ్యారు. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

09:57 - November 9, 2017

ఇడ్లీ...రూ. 20...ఛాయ్ రూ. 10 ఉంటుంది కానీ ఇంత తక్కువగా ఎక్కడిస్తున్నారు అనేగా మీ ప్రశ్న..ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యాపారులు ఈ ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న దుకాణాల్లో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఓ స్వచ్చంద సంస్థ హైకోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. దీనితో హైకోర్టు టిటిడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధరలను తగ్గించాలని సూచించింది.

హైకోర్టు దెబ్బతో తిరుమలలో వ్యాపారులు దిగి వచ్చారు. ఇప్పటి వరకు వందల రూపాయలు దండుకున్న హోటల్ యజమానులు..మనస్సు మార్చుకున్నారు. హైకోర్టు సూచనలు..టిటిడి అధికారుల సూచనల మేరకు పలు హోటళ్ల ఎదుట ధరల పట్టీకలను ఉంచారు. రెండు ఇడ్లీల ధర మొన్నటి వరకు రూ. 25 ఉండగా..ప్రస్తుతం రూ. 7.50గా నిర్ణయించారు. ఏకంగా రూ. 15 అమ్మిన టీ ధర రూ. 5 దొరుకుతోంది. వెజిటబుల్ బిర్యానీ ధర రూ. 50 నుంచి రూ. 19... ఉప్మా ధర రూ. 20 నుంచి రూ. 9..ప్లేట్ మీల్స్ ధర రూ. 60 నుంచి రూ. 22.50కు తగ్గాయి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ధరలూ సగానికి పైగా తగ్గాయి. పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు.

మరోవైపు నెలవారి చెల్లిస్తున్న అద్దెలు భారీగా ఉంటున్నాయని హోటళ్ల యజమానులు పేర్కొంటున్నారు. చెల్లిస్తున్న అద్దెలు భారీ స్థాయిలో ఉండడంతో తాము అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని టిటిడి అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు కొన్ని రోజుల వరకు ఉంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

ఎస్వీకే వద్ద ఉద్రిక్తత...

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్వీకేలో సమావేశమయ్యేందుకు కాంట్రాక్టర్లు టీచర్లు అక్కడకు చేరుకున్నారు. కానీ సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులు..పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. 

09:39 - November 9, 2017

కొడుకును చంపిన..తండ్రి..అన్న..

రంగారెడ్డి : షాద్ నగర్ లో తండ్రికొడుకుల ఉన్మాదం బయటపడింది. ఆస్తి తగాదాలతో చిన్న కొడుకు యాదగిరి (37) ని తండ్రి..పెద్ద కొడుకు హత్య చేశారు. మృతేదేహాన్ని మాయం చేసేందుకు వెళుతుండగా అడ్డాకుల వద్ద నిందితులు పట్టుబడ్డారు. 

ఎక్సైజ్ ఎస్ఐ రాజేశ్వరీపై సస్పెన్షన్ వేటు...

భూపాలపల్లి : కాటారం ఎక్సైజ్ ఎస్ఐ రాజేశ్వరీపై సస్పెన్షన్ వేటు పడింది. కాటారం (మం) గుమ్మపల్లిలో కల్తీ మద్యం సేవించి ఒకరు మృతి చెందగా నలుగురు అస్వస్థతకు గురైన ఘటనలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. రాజేశ్వరీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మురళీ ఆదేశాలు జారీ చేశారు. 

హిమాచల్ ప్రదేశ్ పోలింగ్...

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంట ల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. కొండ ప్రాంతాల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలంటే సమయం పడుతోందని తెలుస్తోంది. 

09:14 - November 9, 2017

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంట ల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. కొండ ప్రాంతాల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలంటే సమయం పడుతోందని తెలుస్తోంది. భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. 12 జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 68 నియోకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెట్టింది. 18 మంది మహిళా అభ్యర్తులు బరిలో ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. గత 50 ఏళ్లుగా 8 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఎన్నికల్లో ప్రజలు వినూత్నంగా తీర్పు ఇస్తున్నారు. మరి ఈ సారి ఎలాంటి తీర్పునిస్తారో కొద్ది రోజులు వేచి చూడాలి.
50 లక్షల 25 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఇందుకోసం 7,525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
40 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
65 కంపెనీల సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూడా విధుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్‌ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు.
హిమాచల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్‌.. ఇటు బిజెపి హోరాహోరీగా తలపడుతున్నాయి.
కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్రసింగ్‌ పోటీ చేస్తున్నారు.
బిజెపి సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ బరిలో ఉన్నారు.

09:08 - November 9, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం..పొగ మంచులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కాలుష్యం అధికమౌతున్న సంగతి తెలిసిందే. గాలిలో ధూళి..విషకణాల శాతం అధికంగా ఉంటున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. బయటకు వెళ్లే వారు తగిన రక్షణలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. ఆలీఘడ్..గుర్ గావ్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. బేసీ..సరి సంఖ్యల వాహనాలు..నగరంలోకి వచ్చే భారీ భారీ ట్రక్కులపై నిషేధం..తదితర కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మెట్రో రైళ్లలో రద్దీని దష్టిలో పెట్టుకుని పీక్‌ అవర్‌లో కనీసం 10 రోజుల వరకు మెట్రో రైలు చార్జీలు తగ్గించాలని, కోచ్‌లు పెంచాలని EPCA ఆదేశించింది.
ఢిల్లీకి వచ్చే ప్రజా రవాణా బస్సులను పెంచాలని యూపి, రాజస్థాన్, హర్యానాలకు సూచించింది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ ప్రభుత్వాలను ఎన్‌జిటి సూచించింది. నవంబర్‌ 9 లోగా దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఢిల్లీలో అధికమౌతున్న కాలుష్యం..

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం..పొగ మంచులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కాలుష్యం అధికమౌతున్న సంగతి తెలిసిందే. గాలిలో ధూళి..విషకణాల శాతం అధికంగా ఉంటున్నాయి

08:34 - November 9, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జయ కుటుంబీకులు నిర్వహిస్తున్న జయ టివి, జార్జ్ సినిమా హాల్..నమ్మదు పత్రికా కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తంగా 160 చోట్ల ఐటీ సోదాలు పెద్ద ఎత్తున్న తనిఖీలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే జయ మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. పలు నాటకీయ పరిణామాలతో సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటి సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు. తాజాగా సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేయడంతో రాజకీయాలు రసకందాయంలో పడిపోయాయి. ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డీఎంకే చీఫ్ కరుణా నిధిని పరామర్శించడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

08:33 - November 9, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దట్టమైన పొగమంచు ఢిల్లీవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాలుష్య నియంత్రణపై అక్కడి ప్రభుత్వం గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. సరి- బేసీ సంఖ్యల వాహనాలనకు అనుమతి నిరాకరణ..పార్కింగ్ ఫీజు నాలుగు రెట్లు పెంచడం..భారీ ట్రక్కులను అనుమతించకపోవడంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. మెట్రో రైళ్లలో రద్దీని దష్టిలో పెట్టుకుని పీక్‌ అవర్‌లో కనీసం 10 రోజుల వరకు మెట్రో రైలు చార్జీలు తగ్గించాలని, కోచ్‌లు పెంచాలని EPCA ఆదేశించింది. ఢిల్లీకి వచ్చే ప్రజా రవాణా బస్సులను పెంచాలని యూపి, రాజస్థాన్, హర్యానాలకు సూచించింది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పేర్కొంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ ప్రభుత్వాలను ఎన్‌జిటి సూచించింది. నవంబర్‌ 9 లోగా దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశించింది.

08:11 - November 9, 2017

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 62 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే కావడం విశేషం. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 50 లక్షల 25 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 7,525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 40 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వీరితో పాటు 65 కంపెనీల సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూడా విధుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్‌ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. హిమాచల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్‌.. ఇటు బిజెపి హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్రసింగ్‌ పోటీ చేస్తుండగా.. బిజెపి సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ బరిలో ఉన్నారు.

 

హిమాచల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం...

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

హిమాచల్ ఎన్నికలకు భారీ బందోబస్తు..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు 11500, జవాన్లు, 6400 హోం గార్డ్స్, 65 కంపెనీల పారమిలటరీ బలగాలు భధ్రతకు కేటాయించారు. 

జయ టివి ఆఫీసుపై ఐటీ దాడులు..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో జయ టివి కార్యాలయం, డా.నమ్మదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయంపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. 

07:33 - November 9, 2017

సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరారు. జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు విదేశాల్లో నల్లధనం ఉందని రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని జగన్ అన్నారు. నల్లధనం లేదని రుజువు చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చందు సాంబశివరావు (టిడిపి), రమేష్ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ముంబైలో అగ్నిప్రమాదం...

ముంబై : వాణిజ్యనగరంగా పేరొందిన ముంబైలోని ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బిల్డింగ్ లో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ఏడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీనికారణంగా విమానాల..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

06:37 - November 9, 2017

ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ఇది పేద విద్యార్ధుల పట్ల ఒక వరం అనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఇది మా పాలిట శాపంగా మారిందని విమర్శలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవటం, వందల కోట్లలో బకాయిలు పేరుకుపొవటం ఈ పరిస్థితికి కారణమని వారు వాదిస్తున్నారు. ఇదే అంశంపై మన జనపధంలో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రవేటు జూనియర్‌ కాలేజి యాజమాన్యాల సంఘం నాయకులు సతీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:35 - November 9, 2017

హైదరాబాద్ : 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన బాల కళాకారులు, బాలబాలికల ప్రతినిథులు, బాలల చిత్రాల దర్శకులతో శిల్పకళావేదిక కళకళలాడింది. బాలల చిత్రోత్సవాలు ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి చలనచిత్ర జగత్తుకు చెందిన అతిరథ మహారథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా... చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆప్‌ ఇండియా చైర్మన్‌ ముఖేశ్‌ఖన్నా, రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. రామ్మోహన్‌రావు, సినీ దర్శకుడుగు నర్సింగరావు, హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌తోపాటు తోపాటు పలువురు బాలనటులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు శిల్పకలావేదికలో నేత్రపర్వంగా సాగాయి.

బాలబాలికల్లోని సృజనాత్మక ప్రతిభకు పట్టం కట్టేందుకే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రపంచదేశాల నుంచి వచ్చిన బాల మేధావులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా సారథ్యంలో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు రెండోసారి తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్నదన్నారు. మనరాష్ట్రం నుంచి 50 మంది బాలబాలికలు ఈ చిత్రోత్సవంలో ప్రతినిధులుగా పాల్గొంటున్నారని తలసాని చెప్పారు. సీఎం కేసీఆర్ బాలబాలికల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యం చాలా గొప్పగా ఉన్నదని సీఎఫ్‌ఎస్‌ఐ చైర్మన్‌ ముకేశ్‌ఖన్నా ప్రశంసించారు. బాలల చిత్రోత్సవాల శాశ్వత వేదికగా హైదరాబాద్ నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. దేశమంతటా వారంపాటు బాలల చిత్రాలను ప్రదర్శించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. బాలల కోసం బాలలు మాత్రమే గొప్ప చిత్రాలను నిర్మించగలుగుతారని, బాల డైరెక్టర్లు ఆ పని గొప్పగా చేశారని అభినందించారు.

బాలనటులు జహీరావాసమ్‌కు హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌ తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో తిలకందిద్ది సత్కరించారు. రాఘవరాజ్ భట్ నృత్య దర్శకత్వంలో 280 మంది బాలబాలికలు 14 రాష్ర్టాల కళారూపాలను ప్రదర్శించారు. బుధవారం ప్రారంభైన చిత్రోత్సవాలు ఈ నెల 14వ తేదీవరకు కొనసాగనున్నాయి. 14న శిల్పకళావేదికలో నిర్వహించనున్న ముగింపు ఉత్సవంలో 10 విభాగాల్లో ఎంపికైన బాలల చిత్రాలకు బంగారు ఏనుగులను బహూకరిస్తారు. బాలల చిత్రోత్సవాల్లో ఎంపికైన చిత్రాలను హైదరాబాద్‌లోని 13 థియేటర్లలో, 31 జిల్లా కేంద్రాల్లో ప్రదర్శిస్తామన్నారు. మధ్య మధ్యలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలోచింపజేశాయి. 

06:31 - November 9, 2017

నిజామాబాద్ : ఒకప్పుడు టీడీపీ ఊపు ఊపిన జిల్లా అది.. కానీ ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అవుతోంది. టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడంతో భారీగా మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆ జిల్లాలోని నేతలు కూడా రేవంత్‌ వెంట వెళ్లి కాంగ్రెస్‌ గూటికి చేరారు.. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే సీనియర్‌ నేతలు ఇద్దరు ఇంకా పార్టీని వీడకుండా సైకిల్‌ తోనే ఉన్నారు.. ఆ ఇద్దరు నేతల పరిస్థితిపై ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇంతకీ ఆ జిల్లాలోని పరిస్థితి ఆ నేతలపై 10టీవీ ప్రత్యేక కథనం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా మంది పక్క పార్టీల్లోకి వెళ్లిపోవడంతో పార్టీ కొంత బలహీన పడింది. అయినా కొందరు సీనియర్లు ఇప్పటి వరకు టీడీపీని నమ్ముకుని ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరటంతో.... జిల్లాలో పార్టీని తమ భుజాల మీద నడిపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఆర్మూర్ ఇంఛార్జ్ రాజారాం యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరటంతో ప్రస్తుతం జిల్లాలో టీడీపీ పరిస్థితి అయోమయంలోకి వెళ్లింది..

అటు కామారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ పార్టీని నడిపించే వారే కరువయ్యారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీని నడిపించే నాయకులు కరువయ్యారనే చెప్పవచ్చు. ప్రధాన నేతలంతా సైకిల్‌ దిగి ఇతర పార్టీల్లోకి చేరడంతో వారితో పాటు అనుచరులు కూడా పార్టీని వీడి వారి వెంటే పార్టీల్లో చేరుతున్నారు. దీంతో దాదాపుగా నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ మూతపడేట్టుగా కన్పిస్తోంది.

ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం ఇంకా టీడీపీ వైపే ఉన్నారు. ఐదు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై వివిధ మంత్రి పదవులు చేపట్టిన మండవ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ పార్టీకి మంచి విధేయులు. పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ పార్టీతోనే ఉన్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో జిల్లాలో పార్టీని నడిపించేంత గట్టి నాయకుడు టీడీపీకి కరువయ్యారు.

పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా పని చేయట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండవతో పాటు అన్నపూర్ణమ్మకి ఉమ్మడి జిల్లాలో పార్టీపై గట్టి పట్టుంది. సైకిల్ పార్టీ నేతలుగా వీరికి మంచి పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు పార్టీని భుజాన మోసే పరిస్థితుల్లో లేరు. అన్నపూర్ణమ్మ కొడుకు బాల్కొండ నియోజకవర్గంలో అనుచరులను కలుస్తూ వస్తున్నప్పటికీ ఇది వ్యక్తిగతంగానే తీసుకుంటున్నారు తప్ప పలానా పార్టీ పరంగా వారు చెప్పుకోవట్లేదు.

ఉన్న సీనియర్‌ నేతలిద్దరూ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నపూర్ణ అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు మండవ వెంకటేశ్వరరావు సైతం కొన్ని రోజుల్లో గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మండవ అధికార పార్టీ నుంచి నిజామాబాద్ రూరల్‌కు పోటీ చేస్తారని తెలుస్తోంది. అందుకే కొంత కాలంగా అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరరావు సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరున్నా లేకున్నా తెలంగాణలో ... తెలుగు దేశం పార్టీ సజీవంగా ఉంటుందని జిల్లా నాయకులు అంటున్నారు.

06:28 - November 9, 2017

హైదరాబాద్‌ : ప్రసాద్‌ ఐమాక్స్‌ మేనేజర్‌ వెంకట్‌ ప్రసాద్‌ రాసలీలలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుని మహిళను మోసం చేస్తున్న వెంకట్‌ప్రసాద్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. వెంకట్‌ప్రసాద్‌... పెళ్లి చేసుకుంటానంటూ ఓ మహిళను నమ్మించి లోబర్చుకుని మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. తనను చంపేస్తానంటూ ప్రసాద్‌ బెదిరించినట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిపై.. 420, 354డి, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.

06:26 - November 9, 2017

కడప : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టిన మూడో రోజుకే అనారోగ్యానికి గురయ్యారు. రెండవ రోజు వేంపల్లిలో పాదయాత్ర ముగించుకుని రాత్రి బస చేసిన సమయంలో... ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. వైసీపీ నేతలు వెంటనే ఫిజియో థెరపీ వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నడుముకు బెల్ట్‌ వేసుకుంటే సరిపోతుందని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో మూడవ రోజు జగన్‌ నడుముకు బెల్ట్‌ వేసుకునే పాదయాత్ర నిర్వహించారు.

విశాఖలో భారీ ర్యాలీ...
వైసీపీ అధినేత వైఎస్.జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ విశాఖలో దక్షిణ నియోజకవర్గ నేతలు 125 మీటర్ల వైసీపీ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో 125 నియోజకవర్గాల్లో జగన్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీల నుంచి ప్రజల్ని మేలుకొలిపేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. 

06:23 - November 9, 2017

విజయవాడ : వెలగపూడి సచివాలయంలో సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో వీఐపీ, వీవీఐపీ, ఉద్యోగుల కోసం నిర్మించనున్న భవనాల పనుల పురోగతిపై ఆరా తీశారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామన్న స్పృహ... రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. అమరావతిలో నిర్మాణ భాగస్వామ్యంగా ఉన్న కన్సల్టెంట్ సంస్థలతో ఈ నెలఖారున వర్క్ షాపు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వర్క్‌షాప్‌లో మరింత మేధోమథనం జరగాలని, అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామన్నారు.

విజయవాడ సిటీస్క్వేర్ ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఎజెండాలోని అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడ సిటీస్క్వేర్ నిర్మాణంపై నగర ప్రజల్లో అవగాహన కల్పించి..వారి అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆ తర్వాత రాజధానిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, ఉద్యోగులు, ఎన్‌జీవోల నివాసాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5 క్లస్టర్లలో 68 టవర్లు...ఒక్కో టవర్‌ 12 అంతస్థుల్లో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు బంగ్లాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో మౌలికవసతులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు రూ.9,190 కోట్ల విలువైన పనులను చేపట్టినట్టు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్ధసారధి తెలియజేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేయడానికి వీలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. 

నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్...

హైదరాబాద్ : నేడు గౌహతికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు..

హైదరాబాద్ : నేడు హిమాచల్ ప్రదేశ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 68 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 337 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. 7,525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

శ్రీకాంత్ పై ప్రణయ్ గెలుపు..

ఢిల్లీ : జాతీయ సీనియర్ బ్యాడ్మింటెన్ ఛాంపియన్ షిప్ విజేతగా ప్రణయ్ నిలిచాడు. ఫైనల్లో శ్రీకాంత్ పై 21-15, 16-21, 21-7తో ప్రణయ్ గెలుపొందాడు. 

ఆదివారం వరకు స్కూళ్లకు సెలవు..

ఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం అధికమౌతోంది. ఆదివారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు అక్కటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

మాల్యాకు కోర్టు హెచ్చరికలు..

ఢిల్లీ : రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఫెరా కేసులో డిసెంబర్ 18లోగా హాజరు కావాలంటూ పాటియాల హౌజ్ కోర్టు ఆదేశించింది. 

ప్రొ.ఏడుకొండలు అరెస్టు..

విశాఖపట్టణం : ఏయూ ప్రొఫెసర్ ఏడుకొండలను పోలీసులను అరెస్టు చేశారు. ప్రొ.ఏడుకొండలు ఏయూలో సంస్కృత విభాగం హెచ్ వోడీగా పనిచేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. 

నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు..

పెద్దపల్లి : ఎన్టీపీసీ టీటీఎస్ లోని జెడ్పీ హెచ్ఎస్ లో నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విద్యార్థులను చిత్ర హింసలు పెడుతున్నారని ఆరోపణలున్నాయి. సోషల్ వెల్ఫేర్ అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది. 

అరకు విహార యాత్రలో విషాదం..

విశాఖపట్టణం : అరకు విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి సమీపంలో వింగర్ వ్యాను ఢీకొంది. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటకు చెందిన 20 మందికి గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా ఎస్.కోట ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. 

నిర్మాత..థియేటర్ యాజమాన్యం మధ్య వివాదం..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్ యాజమాన్యానికి నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఏంజెల్ సినిమా తొలగించి 'అదిరింది' చిత్రం వేస్తున్నారని కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

Don't Miss