Activities calendar

10 November 2017

22:02 - November 10, 2017

గుంటూరు : జిల్లాలోని కొండూరులో ఎర్రదండు కదం తొక్కింది. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆధ్వర్యంలో పోరుబాటు పట్టారు. ఆక్రమణకు గురైన పంటపొలాల్లో ఎర్రజెండాలు పాతి నిరసన తెలిపారు. నీరు చెట్టు పేరుతో భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నేటి నుంచి భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు మధు ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా పొలాలు దున్ని తీరుతామని హెచ్చరించారు.

 

21:54 - November 10, 2017

వియత్నాం : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ ప్రగతిపథంలో పయనిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. వియత్నాంలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార శిఖరాగ్ర సదస్సులో మోదీ విధానాలను ట్రంప్‌ మెచ్చుకున్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణ విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత మధ్య తరగతి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను విజయవంతగా నడిపిస్తున్న మోదీ.. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 

 

21:52 - November 10, 2017

ఢిల్లీ : మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా   మోది సర్కార్‌పై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ఈ ఏడాది కాలంలో నోట్లరద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందని ఆయన చెప్పారు. జైట్లీ జిఎస్‌టి అమలును ఆదరా బాదరాగా అమలు చేయడం వల్ల క్లిష్టతరంగా మారిందని సిన్హా తెలిపారు. ప్యారడైజ్‌ పత్రాల్లో  బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా  పేరు రావడంపై ఆయన స్పందించారు. ఓ కమిటీ వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిని విచారణ జరపాలని సిన్హా  స్పష్టం చేశారు. జయ్‌ షా ఇందుకు అతీతులు కారని అన్నారు. 

 

21:49 - November 10, 2017

హైదరాబాద్ : ప్యారడైజ్ పత్రాల్లో ఏపీకి చెందిన  ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి ప్రసాద్‌ పేరు బయటకు వచ్చింది. 2007లో మారిషస్‌లో ప్లాటెక్స్‌ కంపెనీ ప్రారంభించి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ప్రసాద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్లాటెక్స్‌ కంపెనీ ద్వారా వందల కోట్ల రూపాయల పెట్టుబడులను స్వదేశంలోకి తరలించారన్న అభియోగాలు ఉన్నాయి. దాదాపు 886 కోట్ల రూపాయలు పీవీపీ వెంచర్స్‌ అనుంబంధ సంస్థలైన న్యూ సైబరాబాద్‌ సిటీ ప్రాజెక్ట్స్‌, పీవీపీ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ లోకి తరలించారు.  ఇలా తరలించిన సొమ్మును జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పొట్లూరి ప్రసాద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

పాదయాత్రతో అధికారంలోకి వస్తారనుకోవడం భ్రమే : సీఎం చంద్రబాబు

గుంటూరు : పాదయాత్రతో అధికారంలోకి వస్తారనుకోవడం భ్రమేనన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో షర్మిల కూడా పాదయాత్ర చేసిందని... అయినా ఏం ప్రయోజనం కలగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు తరువాత చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. దూషించుకుంటేనే వార్త అనే పరిస్థితి పోవాలన్న సీఎం... అర్ధవంతమైన చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియాపైనే ఉందన్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం కొత్తేమీ కాదన్నారు. 

21:46 - November 10, 2017

గుంటూరు : పాదయాత్రతో అధికారంలోకి వస్తారనుకోవడం భ్రమేనన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో షర్మిల కూడా పాదయాత్ర చేసిందని... అయినా ఏం ప్రయోజనం కలగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు తరువాత చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. దూషించుకుంటేనే వార్త అనే పరిస్థితి పోవాలన్న సీఎం... అర్ధవంతమైన చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియాపైనే ఉందన్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం కొత్తేమీ కాదన్నారు. 1982కు ముందు ప్రతిపక్ష పార్టీలు లేవని... గ్రూపులు మాత్రమే ఉండేవన్నారు. అసెంబ్లీలో జగన్‌ ఉంటే సభను అడ్డుకోవడం తప్ప వేరే పనేం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్‌, జగన్‌ అవినీతి గురించి ఇప్పటికీ విదేశాల్లో అడుగుతున్నారని... గతంలో జరిగిన అవినీతి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిన్నదని వాపోయారు. ఏసీబీకి పట్టుబడ్డ వారి ఆస్తులను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అక్రమార్జనను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భావన ప్రజల్లో వస్తే అవినీతిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

 

21:42 - November 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు మహేందర్ రెడ్డి హైదరాబాద్ సీపీగా విధుల నిర్వర్తించారు. అనురాగ్ శర్మను హోంశాఖ సలహాదారుగా నియమించింది. హైదరాబాద్ తాత్కాలిక పోలిస్ కమిషనర్ గా వీవీ శ్రీనివాసరావు కొనసాగనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:38 - November 10, 2017

తెలంగాణ నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి నియామకం

హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఎల్లుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హోంశాఖ సలహాదారుగా అనురాగ్ శర్మను నియమించారు. హైదరాబాద్ తాత్కాలిక పోలిస్ కమిషనర్  గా వీవీ శ్రీనివాసరావు కొనసాగనున్నారు.

 

విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

హైదరాబాద్ : విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ అయ్యాయి. సీఎస్ ఎస్పీ సింగ్, ఏపీ సీఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. అంతర్ రాష్ట్ర, పరస్పర బదిలీల దరఖాస్తుల గడువును 2018 జూన్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. పదో షెడ్యూల్ సంస్థల విభజనపైనా చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, లేబర్ సెస్, విద్యుత్ బకాయిలు అంశాలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. షీలాబేడి కమిటీ సిఫార్సుల అమలును వేగవంతం చేయాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లు నిర్ణయించారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తరహాలో లోకాయుక్త ఉద్యోగులను విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఒంగోలులో ప్రమాదం

ప్రకాశం : జిల్లాలోని ఒంగోలులో ప్రమాదం జరిగింది. గోళ్లవల్లి గ్రోత్ సెంటర్ లో ఓ పరిశ్రమలో బాయిలర్ పేలింది. 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కర్నూలు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు : జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ప్లెక్సీలు ధ్వంసం చేశాయని కోతులను నిర్బంధించారు. 4, 5 రోజులుగా తిండిలేక కోతులు అలమటిస్తున్నాయి. నీళ్లు, ఆహారం లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి. అధికారులు, మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. 

21:02 - November 10, 2017

ఢిల్లీ : అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  హస్తినలో చేపట్టిన మహా పడావ్ నిరసన కార్యక్రమం రెండోరోజు విజయవంతంగా సాగింది. 70 వేల మంది కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. 12 ప్రధాన డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మహా పడావ్ నిరసన కార్యక్రమానికి  రెండోరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారు. హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, కేరళ, అస్సాం, మేఘాలయ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అసంఘటిత రంగ కార్మికులతో పాటు.. ఉపాధి హామీ కార్మికులు, చేనేత, రవాణా, మున్సిపల్ కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాల పట్ల కార్మికులు ఎండగట్టారు. కార్మికుల నినాదాలతో హస్తిన మారుమోగింది.  
కార్మికుల మనోభావాలను దెబ్బతీసిన మోడీ ప్రభుత్వం : సాయిబాబు  
మోడీ ప్రభుత్వం కోట్లాది మంది కార్మికుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు సీఐటీయూ తెలంగాణ నేత సాయిబాబు. ఆయన నేతృత్వంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి, స్కీమ్ వర్కర్లు 5 వేల మంది మహా పడావ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కేంద్రం ధ్వంసం చేస్తోందని సాయిబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు. 
తెలంగాణలో కార్మికుల పరిస్థితి దారుణం : రాములు
తెలంగాణలో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన అధ్యక్షులు రాములు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో పోరాటాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదన్నారాయన. ఏపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 
ప్రభుత్వరంగ సంస్థలపై మోడీ ప్రభుత్వం దాడి : జగ్గునాయుడు
ప్రభుత్వ రంగ సంస్థలపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందని సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు ఆరోపించారు. ఏపీలో ఉన్న ఆటో, ముఠా, బిల్డింగ్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నుంచి వెయ్యిమందికిపైగా అసంఘటిత రంగ కార్మికులు మహా పడావ్ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. 
కార్పొరేట్ అనుకూల విధానాల్ని విరమించాలి : సుందరయ్య
మహా పడావ్ నిరసన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ అనుకూల విధానాల్ని విరమించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య డిమాండ్ చేశారు. 1950 ఆర్టీసీ చట్టం ప్రకారం అన్ని ఆర్టీసీలకు సహకారం అందించాలని కోరారు. 
మహా పడావ్ లో హెచ్ ఎంఎస్ ఉద్యోగులు  
తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున హెచ్ ఎంఎస్ ఉద్యోగులు మహా పడావ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 18 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని, సామాజిక భద్రత కల్పించడం, ధరల నియంత్రణ ప్రజలపై భారం తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయకూడదన్న డిమాండ్లతో హెచ్‌ఎంస్ ఉద్యోగులు నినదించారు. 
మహా పడావ్ కు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్‌ నేతలు హాజరు
మహా పడావ్ నిరసన కార్యక్రమానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్‌ నేతలు హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం కార్మిక లోకాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్లు అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం : తపన్ సేన్ 
మోడీ ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మండిపడ్డారు. అందులో భాగంగా మహా పడావ్ కార్యక్రమానికి తరలివస్తున్న కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు రూ.18 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని తపన్‌సేన్ డిమాండ్ చేశారు. 
రేపు మూడవ రోజూ మహా పడావ్ 
హస్తినలో రెండో రోజులుగా సాగుతోన్న మహా పడావ్ ఆందోళన.. రేపు మూడవరోజూ కొనసాగనుంది. శనివారం నాటి నిరసనలో అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథక స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు హాజరుకానున్నారు. మూడు రోజులుగా హస్తిన వీధులకు అరుణవర్ణాన్ని అద్దిన కార్మిక సంఘాలు.. రేపు భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నాయి. 

20:45 - November 10, 2017

యాటలు గోస్కదినవొయ్యిన పోశెట్టి దండు, దమాకు సక్కగున్న గుత్తారెడ్డిగారి మాట, విలన్ గావోతున్న కొమురం భీం, కొమురయ్య, హైకోర్టుతోని మళ్ల తిట్ల వడ్డ బీటీ సర్కార్, పూజలు సుర్వు జేశ్న సీఎం సతీమణి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:39 - November 10, 2017

ఢిల్లీ : జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువుల టాక్స్‌ తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శానిటరి, సూట్‌కేస్‌, వాల్‌ పేపర్స్‌, ప్లయివుడ్‌, స్టేషనరి, చ్యూయింగ్ గమ్స్, ఆఫ్టర్ షేవ్ కిట్స్, డియెడరెంట్, వాషింగ్ పౌడర్, డిటెర్జెంట్, మార్బుల్‌ తదితర వస్తువులపై 18 శాతం మాత్రమే పన్ను ఉంటుందని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వెల్లడించారు. సామాన్యులు వాడే అన్ని రకాల వస్తువులను 28 శాతం పరిధి నుంచి తప్పించినట్లు ఆయన తెలిపారు.  28 శాతం స్లాబ్‌లో గతంలో 227 వస్తువులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 50కి తగ్గింది. అంటే 177 వస్తువులపై పన్ను భారం తగ్గింది. దీంతో 20 వేల కోట్ల మేర నష్టం వాటిల్లనుందని మోది పేర్కొన్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి వేసిన ఐదుగురు సభ్యుల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు సుశీల్‌ కుమార్‌ మోదీ నేతృత్వం వహిస్తున్నారు. వాషింగ్‌ మిషన్, ఫ్రిజ్‌ తదితర లగ్జరీ గూడ్స్, టొబాకో, సిగరెట్లను 28 శాతం పన్ను పరిధిలోనే ఉన్నాయి. నిత్యావసర వస్తువులపై పన్ను అధికంగా పెరగడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

20:38 - November 10, 2017

కృష్ణా : గన్నవరంలోని ఎన్ టీటీఎఫ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి అదృశ్యమయ్యాడు. యార్లగడ్డ వెంకట సాయితేజ అనే విద్యార్ధి ఈ నెల 4వ తేదీన అదృశ్యమయ్యాడని విద్యార్ధి తండ్రి తెలిపారు. ఇదే కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. విద్యార్ధి స్వగ్రామం పామర్రు మండలం కురుమద్దాలి అని తెలిసింది. విద్యార్ధి అదృశ్యమయిన విషయాన్ని కాలేజ్‌ యాజమాన్యం ఆలస్యంగా తెలియచేయడంతో విద్యార్ధి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై కుమారుడి అదృశ్యంపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

20:35 - November 10, 2017

ఖమ్మం : కలెక్టరేట్‌ తరలింపుకు నిరసనగా అఖిలపక్షం ఖమ్మం జిల్లా బంద్‌కి పిలుపు నిచ్చింది. బంద్‌కి మద్దతుగా విపక్షాలు,  ప్రజాసంఘాలు, బంద్‌లో పాల్గొన్నాయి. ఖమ్మం బస్టాండ్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ముట్టడికి ర్యాలీగా బయలు దేరి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజులుగా వివిద రకాలుగా నిరసనలు తెలిపినా.. ప్రభుత్వం పట్టించుకోకుండా మొండివైఖరికి పోతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విపక్ష నేతలు హెచ్చరించారు. 

 

20:32 - November 10, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కాదని బనియా కులానికి చెందినవారని ఆరోపించారు. అయినా ఆయన శూద్ర బీసీ కాదన్నారు. గుజరాత్‌, బీహార్‌లో బనియాలు బీసీల పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారని చెప్పారు. బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు రిజర్వేషన్లకు వ్యతిరేకులని మండిపడ్డారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన కేరళ వర్సెస్‌ గుజరాత్‌ మోడల్‌ సెమినార్‌కు ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

 

20:30 - November 10, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టేక్ హోల్డర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, పలు ఎలక్ట్రిక్ వాహన తయారీల కంపెనీలు, బ్యాటరీ తయారీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నూతన పరిశోధనలపై సమావేశంలో చర్చ జరిగింది. తక్కువ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే  స్టేషన్స్ ఏర్పాటుకు  కంపెనీలు ముందుకు వస్తే  ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. 

 

20:25 - November 10, 2017

గుంటూరు : నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రలో తాగు, సాగు, పారిశ్రామిక రంగాలకు నీటి భద్రత కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ బృహత్‌ కార్యక్రమం పూర్తైన తర్వాత సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని సభ దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానాన్ని పూర్తి చేయడం ద్వారా 15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విపక్షం లేకుండా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకు జరగనున్నాయి. 
సమావేశాలను బహిష్కరించిన వైసీపీ  
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరించడంతో అన్ని అంశాలపై చర్చ ఏకపక్షంగా సాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు.. ప్రత్యేక ప్రస్తావన ద్వారా  పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి  కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చిన ముఖ్యమంత్రి చందబ్రాబును అభినందనలు తెలిపే విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై చాలా మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పాలని ఆసక్తి కనపరచడంతో ప్రశ్నోత్తరాల తర్వాత సల్వవ్యవధి చర్చ చేపట్టారు. 
పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ
పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతుల ఆదాయం పెరిగిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానంచేసి, నీటి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
అమరావతిలో అంబ్కేడ్కర్‌ స్మృతివనంపై చర్చ 
ప్రశ్నోత్తరాల సమయంలో అమరావతిలో అంబ్కేడ్కర్‌ స్మృతివనం నిర్మాణంపై చర్చ జగింది. టీడీపీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన లేవనెత్తిన ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో  అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి, 18 నెలల్లో పూర్తి చేస్తామని  చర్చకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.  ప్రశ్నోత్తరాలు, పట్టిసీమపై చర్చ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.  

 

20:19 - November 10, 2017

హైదరాబాద్ : రేషన్‌ షాపుల ద్వారా పేదలకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. బియ్య పంపిణీని రద్దుచేసి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారాన్ని  మంత్రి హరీశ్‌రావు తోసిపుచ్చారు.  నాగార్జునసాగర్‌ ఎడవ కాల్వ కింది ఖమ్మం, నల్గొండ జిల్లాలోని ఆరు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తామని హరీశ్‌రావు సభలో ప్రకటించారు.
వివిధ అంశాలపై నిరసనలు 
తెలంగాణ అసెంబ్లీలో వివిధ అంశాలపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వివిధ పక్షాల సభ్యులు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించారు. రేషన్‌ షాపులను రద్దుచేసి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. దీంతో విపక్ష కాంగ్రెస్‌, అధికార టీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్యవాగ్వాదం జరిగింది. 
వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్ 
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో  రెండో పంటకు సాగునీరు అందించే అంశంపై టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. అయితే ఈ అంశంపై హరీశ్‌ స్పందిస్తూ సాగర్‌ ఎడవ కాల్వతోపాటు సింగూరు ఆయకట్టుకు రెండో పంటకు నీరు ఇస్తామని సభ దృష్టికి తెచ్చారు. భద్రాచలం, ఉట్నూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల ప్రాజెక్టు అధికారులుగా ఐఏఎస్‌లను నియమించే అంశాన్ని చర్చించాలన్న  డిమాండ్‌తో... సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. దీంతో రాజయ్య నిరసన వ్యక్తం చేశారు. 
అసెంబ్లీ సోమవారానికి వాయిదా  
వాయిదా తీర్మానాల ప్రతిపాదన, జీరో అవర్‌ తర్వాత స్పీకర్‌ మధుసూదనాచారి కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అసెంబ్లీ పునఃప్రారంభమైన తర్వాత రైతుల సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రారంభమైన చర్చలో అధికార పక్ష సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అసంపూర్తిగా జరిగిన ఈ చర్చను సోమవారం కొనసాగిస్తామని సభాధ్యక్షస్థానంలో ఉన్న ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు అనంతరం.. అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. 

 

20:10 - November 10, 2017

నటుడిగా ప్రూవ్‌ చేసుకునేందుకు పోరాడుతున్న మంచు మనోజ్‌ ఈ సారి ఓ బరువైన కథతో తానేంటో ప్రూవ్‌ చేసుకునేందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థలు నేపథ్యంలో వారికష్టాలను, అక్కడి అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ కొత్త దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి ఈ సినిమాను తెరకెక్కించాడు. చాలా కాలంగా సరైన్ హిట్‌ లేని మనోజ్‌ కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాతో ఎంత వరకు ఆకట్టకున్నాడు..? దర్శకుడు నటుడిగా అజయ్‌ ఆండ్రూస్‌ఆకట్టుకున్నాడా..? రియలిస్టిక్‌ అప్రోచ్‌తో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడు రివ్యూలో చూద్దాం..

కథ విషయానికి వస్తే తన ప్రమోషన్‌ కోసం ఓ కాలేజ్‌ ప్రొఫెసర్‌ తన స్టూడెంట్స్‌ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్‌ కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య మినిస్టర్‌ కు ఎదురుతిరుగుతాడు. విద్యార్థులను కూడగట్టి ఉద్యమాన్ని లేవదీస్తాడు. అమ్ముడు పోవడాని అలవాటు పడ్డ సమాజంతో జరుగుతున్న పోరాటంలో సూర్య ఓడిపోతాడు. తన బలం బలంగంతో ఉద్యమాన్ని అనచివేసిన మినిస్టర్‌ డ్రగ్స్‌ కేసులో  సూర్యని అరెస్ట్‌ చేయిస్తాడు. కేసు కూడా  నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో సూర్యకు ఓ కానిస్టేబుల్‌, జర్నలిస్ట్‌ సాయం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సూర్య ఎలా బయట పడ్డాడు..? సూర్యకి విప్లవ నాయకుడు పీటర్‌ కి సంబందం ఏంటి..? అన్నదే మిగతా కథ.

ఇప్పటికే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న మంచు మనోజ్‌ ఈ సినిమాతో మరో బరువైన పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్‌ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్‌ లు మాత్రమే చేసిన మనోజ్‌ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్‌ గా కనిపించిన మనోజ్‌, పీటర్‌ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. బొబ్బులిపులి లో ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చే హావభావాలు ప్రదర్శించినా.. అవి నేటి జనరేషన్‌ కు కాస్త అతిగా అనిపిస్తాయి. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్‌ ఆండ్రోస్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. కానీ ఆ పాత్రలో కాస్త గుర్తు పట్టగలిగిన నటుడు ఉంటే ఆడియన్స్‌ మరింతగా కనెక్ట్‌ అయ్యేవారు. ఇతర పాత్రలకుపెద్ద గా ప్రాధాన్యం లేదు. 

శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్ ఆండ్రూస్‌ నూతక్కి‌, సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్‌ గా తెరకెక్కించటంతో కమర్షియల్‌ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్‌ గా అనిపిస్తుంది. బోటు ప్రయాణం కూడా సుధీర్ఘంగా సాగటం ఇబ్బంది పెడుతుంది. ఎమోషనల్‌ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది. అక్కడక్కడ వినిపించిన బిట్‌ సాంగ్స్‌ సన్నివేశాలు మరింత ఎలివేట్‌ అయ్యేందుకు హెల్ప్‌ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్‌ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ఓవరాల్‌ గా ఒక్కడు మిగిలాడు సమస్యలను ఎత్తిచూపించిన రియలిస్టక్‌ సినిమాగా మెప్పించినా.. డాక్యుమెంటరీ తరహాలో సాగటంతో కమర్షియల్‌ గా ఆకట్టుకోకపోవచ్చు.

ప్లస్ల్ పాయింట్స్ 
మంచు మనోజ్‌ నటన
కథ
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ 
ఇబ్బంది పెట్టేవి
మితిమీరిన డ్రామా
సినిమా నిడివి

19:52 - November 10, 2017

కర్నూలు : జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ప్లెక్సీలు ధ్వంసం చేశాయని కోతులను నిర్బంధించారు. 4, 5 రోజులుగా తిండిలేక కోతులు అలమటిస్తున్నాయి. నీళ్లు, ఆహారం లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి. అధికారులు, మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:48 - November 10, 2017

ప్రకాశం : జిల్లాలోని ఒంగోలులో ప్రమాదం జరిగింది. గోళ్లవల్లి గ్రోత్ సెంటర్ లో ఓ పరిశ్రమలో బాయిలర్ పేలింది. 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విశాఖలో 20 మందిపై కుక్కల దాడి

విశాఖ : నగరంలోని గోపాలపట్నం 66వ వార్డులో కుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై వెళ్తున్నవారిపై విరుచుకుపడ్డాయి. 20 మందిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీవీఎంసీ అధికారులపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీధి కుక్కలు దాడి చేస్తున్నట్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కుక్కలను తరలించాలని కోరుతున్నారు. 

19:42 - November 10, 2017

విశాఖ : నగరంలోని గోపాలపట్నం 66వ వార్డులో కుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై వెళ్తున్నవారిపై విరుచుకుపడ్డాయి. 20 మందిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీవీఎంసీ అధికారులపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీధి కుక్కలు దాడి చేస్తున్నట్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కుక్కలను తరలించాలని కోరుతున్నారు. 

 

కేసీఆర్.. ఓట్ల రాజకీయం : తమ్మినేని

హైదరాబాద్ : నిజాం రాజును కీర్తిస్తూ సీఎం చేసిన ప్రసంగంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రజాకార్లతో దాడులు చేయించిన చరిత్ర నిజాం రాజుది అని పేర్కొన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ ప్రజలు నిజాం ప్రభువుపై పోరు సాగించారని తెలిపారు. ఎందరో ముస్లీం మైనార్టీలు కూడా అమరులయ్యాయరని గుర్తు చేశారు. ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకే కేసీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. చరిత్రను వక్రీకరించడం కేసీఆర్ కు తగదని హితవుపలికారు. 

 

19:31 - November 10, 2017

విశాఖ : ఉత్తరాంధ్రలో సాంస్కృతిక వారసత్వాన్ని, విశిష్టతను ప్రతిభింబించేలా విశాఖ ఫెస్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ తెలిపారు. గతంలో నిర్వహించిన విశాఖ ఫెస్ట్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలని విశాఖ ప్రజలు కోరారని తెలిపారు. అందుకే ఈసారి  వైజాగ్‌ ఫెస్ట్‌ 2017ని డిసెంబర్ 1 నుంచి 10 వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యేకతలు, సాంస్కృతిక విభాగాల ప్రదర్శనల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

19:28 - November 10, 2017

విశాఖ : సింహాచల దేవస్థానం, పంచగ్రామాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైసీసీ తన ఆందోళనను తీవ్రతరం చేసింది. పెందుర్తి నియోజక వర్గ సమన్వయ కర్త అన్నంపురెడ్డి అదీప్‌ రాజ్  పెందుర్తిలో పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మూడు రోజుల పాదయాత్రకు పూనుకున్నారు. పంచగ్రామాలను కలుపుతూ 35 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో దేవస్థానం వల్ల ఇబ్బంది పడే ప్రతీ గడపకు.. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని చెబుతానంటున్న అదీప్‌ రాజ్‌ తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:25 - November 10, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో నదుల అనుసంధానం, పట్టీసీమపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... పోలవరం జీవనాడి అయితే రాయలసీమకు ముచ్చుమర్రి జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్టు తన జీవిత ఆశయంగా పెట్టుకున్నానని.. ఎన్నికష్టాలొచ్చినా పూర్తి చేసి తీరుతామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రాజధాని మొదలు అన్ని పనులకు ప్రజలు తన వెంట ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

 

19:18 - November 10, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ముందుగానే ప్రకటించడంతో.... ప్రతిపక్షం లేకుండానే... సమావేశాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు ఈనెల 25 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ వైసీపీ చేసిన డిమాండ్‌పై స్పీకర్ కోడెల స్పందించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ భేటీని వైసీపీ బహిష్కరించడం అప్రజాస్వామికమని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. సమావేశాలకు 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని డీఐజీ గోపాలరావు తెలిపారు. 

 

19:10 - November 10, 2017

హైదరాబాద్‌ : బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలోని షాయిన్‌నగర్‌లో ఒంటెల వధా ముఠా గుట్టురట్టయింది. ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 97 ఒంటెలు, రెండు డీసీఎం వ్యాన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒంటెలను 15 వేల చొప్పున కొనుగోలు చేసి..వాటిని వధించి మాంసాన్ని 100 రూపాయలకు కేజీ చొప్పున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఒంటెలను జూపార్క్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

19:08 - November 10, 2017

కామారెడ్డి : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి 3 గేట్ల ద్వారా 14 వేల 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన ఉన్న సింగూరు రిజర్వాయర్‌ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను మాత్రమే శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వదులుతామని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తెలిపారు. నిజాంసాగర్‌ పూర్తి స్థాయి మట్టంను అలాగే కొనసాగిస్తూ 17 టీఎంసీల నీరును నిల్వ ఉంచుతామని తెలిపారు. నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

 

18:49 - November 10, 2017

గద్వాల : తమ సమస్యలను పరిష్కరించేదాకా పత్తిని జిన్నింగ్‌కు పంపరాదని సీడ్‌ పత్తి రైతులు గద్వాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. అనంతరం ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టించి పండించిన పంటను మిల్లుకు తీసుకొస్తే, జిన్నింగ్‌, డిలిటింగ్‌, ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌ అంటూ చార్జీలు వేసి రైతుల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నారంటూ నేతలు మండిపడ్డారు. దళారుల మోసంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.

 

18:47 - November 10, 2017

రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలంలోని జహంగీర్‌పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా పూల చాదర్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జహంగీర్‌పీర్‌ దర్గాను రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. 100 ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి..వాటిని సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.  

 

18:43 - November 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ద ప్రెస్‌లో పాల్గొన్న డీజీపీ...కానిస్టేబుళ్ల ఎంపిక కేవలం ఫిట్‌నెస్‌పైనే గాక తెలివితేటలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పోలీస్‌ ట్రైనింగ్‌లో ప్రతి కానిస్టేబుల్‌కు ల్యాబ్‌ట్యాప్‌ ఇస్తున్నట్లు చెప్పారు. 
 

 

18:40 - November 10, 2017

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్‌..40 నెలలు గడిచినా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారని.. ఇది మరోసారి మైనార్టీలను మోసం చేయడమేనని ఉత్తమ్ ఆరోపించారు. 

 

18:38 - November 10, 2017

హైదరాబాద్ : రేషన్‌ షాపుల ద్వారా పేదలకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. బియ్య పంపిణీని రద్దు చేసి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారాన్ని  మంత్రి హరీశ్‌రావు తోసిపుచ్చారు. రూపాయికి కిలో బియ్యం పథకం యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. చౌక బియ్యం స్థానంలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టే యోచన లేదని హరీశ్‌ స్పష్టం చేశరు. 
 

 

18:32 - November 10, 2017

హైదరాబాద్ : ఆహార భద్రత పథకాన్ని టీఆర్‌ఎస్‌ నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆహార భద్రతపై తామిచ్చిన తీర్మానంపై ప్రొటెస్ట్‌ చేసేందుకు స్పీకర్‌ అనుమతిచ్చినా... మంత్రి హరీష్‌రావు అడ్డుకోవడం దారుణమన్నారు. 

 

18:23 - November 10, 2017

శ్రీలంకతో తొలి 2 టెస్టులకు భారత్ జట్టు ప్రకటన

ఢిల్లీ : శ్రీలంకతో తొలి 2 టెస్టులకు భారత్ జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లీ, రాహుల్, మురళి విజయ్, ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, ఉమేశ్, భువనేశ్వర్, ఇషాంత్ ఎన్నికయ్యారు. హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. 

గాంధీనగర్ పీఎస్ లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : గాంధీనగర్ పీఎస్ లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రేమ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగానే ఘటన చోటు చేసుకుంది. యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువకుడు కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

18:04 - November 10, 2017

హైదరాబాద్ : నాంపల్లి సిబిఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్ లపై వాదనలు ముగిసాయి. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సీబీఐ కోర్టు నుంచి పాదయాత్రకు జగన్ కడప జిల్లా ఎర్రగుంట్లకు బయల్దేరారు. మళ్లీ ఈనెల 17న కోర్టుకు రానున్నారు.

 

పాతబస్తీలో షేక్ ల దారుణాలు

హైదరాబాద్ : పాతబస్తీలో షేక్ ల దారుణాలు కొనసాగుతున్నాయి. హెల్త్ వీసా, విజిటింగ్ వీసాలను భవానీ నగర్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇద్దరు ఒమన్ షేక్ లు, ఒక లోకల్ ఖాజీ, ముగ్గురు బ్రోకర్లను అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు ఇటీవల తక్కువయ్యాయని సౌత్ జోన్ డీఎస్పీ తెలిపారు. ఇద్దరిపై పీడీయాక్టు కింద కేసు నమోదు చేశామని తెలిపారు. 

17:56 - November 10, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో షేక్ ల దారుణాలు కొనసాగుతున్నాయి. హెల్త్ వీసా, విజిటింగ్ వీసాలను భవానీ నగర్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇద్దరు ఒమన్ షేక్ లు, ఒక లోకల్ ఖాజీ, ముగ్గురు బ్రోకర్లను అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు ఇటీవల తక్కువయ్యాయని సౌత్ జోన్ డీఎస్పీ తెలిపారు. ఇద్దరిపై పీడీయాక్టు కింద కేసు నమోదు చేశామని తెలిపారు. 

 

కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

గౌహతి : జీఎస్టీ కౌన్సిల్ 23 వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 26 శాతం పన్ను శ్లాబ్ నుంచి కొన్ని వస్తులు తొలగించారు. 12 రకాల వస్తువులపై పన్ను శాతం తగ్గించారు. కేవలం 50 రకాల వస్తువులు మాత్రమే 28 శాతం శ్లాబులోకి రానున్నాయి. ప్రస్తుతం 28 శాతం పన్ను శ్లాబులో 227 రకాల వస్తువులు ఉన్నాయి. 18 శాతం పన్ను పరిధిలోకి గ్రానైట్, మార్బుల్స్, సౌందర్య వస్తువులు, షాంపూ డియోడరెంట్స్, డిటర్జెంట్స్, షేవింగ్ క్రీమ్, బబూల్ గమ్స్, చాక్లెట్లు రానున్నాయి.

 

హెచ్ సీయూలో మరో వివాదం

హైదరాబాద్ : హెచ్ సీయూలో మరో వివాదం నెలకొంది. వార్డెన్ విధులను అడ్డుకున్నారంటూ విద్యార్థులపై అభియోగం మోపారు. పది మంది విద్యార్థులపై హెచ్ సీయూ వీసీ కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురిని రెండేళ్లు, ఏడుగురిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. హెచ్ సీయూ వీసీ అప్పారావుపై విద్యార్థులు భగ్గుమన్నారు. 10 మంది ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులను అకారణంగా సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వీసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

17:42 - November 10, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో మరో వివాదం నెలకొంది. వార్డెన్ విధులను అడ్డుకున్నారంటూ విద్యార్థులపై అభియోగం మోపారు. పది మంది విద్యార్థులపై హెచ్ సీయూ వీసీ కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురిని రెండేళ్లు, ఏడుగురిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. హెచ్ సీయూ వీసీ అప్పారావుపై విద్యార్థులు భగ్గుమన్నారు. 10 మంది ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులను అకారణంగా సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వీసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. నిజమాబాద్ లో విద్యార్థి సంఘాలు వీసీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సిబిఐ కోర్టులో జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్ లపై ముగిసిన వాదనలు

హైదరాబాద్ : నాంపల్లి సిబిఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్ లపై వాదనలు ముగిసాయి. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సీబీఐ కోర్టు నుంచి పాదయాత్రకు జగన్ కడప జిల్లా ఎర్రగుంట్లకు బయల్దేరారు. మళ్లీ ఈనెల 17న కోర్టుకు రానున్నారు.

 

17:01 - November 10, 2017

'దొంగోడొచ్చాడు' సినిమా టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అమలాపాల్, హీరో ప్రసన్న, సింగర్ హేమచంద్ర పాల్గొని, మాట్లాడారు. ఈ సినిమా గురించి సంభాషించారు. తమ తమ సినిమా అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:57 - November 10, 2017
16:55 - November 10, 2017

దేశ అత్యున్నత సాహితి పురస్కారమైన జ్ఞాన్ పీఠ్ అవార్డు ప్రముఖ హింది రచయిత్రి కృష్ణా శోబుతిని వరించింది. కర్నాటక రాష్ట్రంలో పోలీస్ చీఫ్ గా తొలిసారిగా మహిళా నీలమణి రాజు నియమితులయ్యారు. పోచంపల్లి ఇక్కత్ కు గుర్తింపు తెస్తానని మిస్ ఏషియా రష్మీ ఠాకూర్ పేర్కొన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, మేయర్, కవిత నాయర్ ఒకరిపై మరొకరు పంచ్ లు. మహిళా బాక్సర్ మేరీ కోమ్ మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ మెరిసింది...వీటితో పలు మహిళ వార్తలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నీటి ప్రాముఖ్యతపై చర్చించాలి : సీఎం చంద్రబాబు

గుంటూరు : నీటి ప్రాముఖ్యతపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రౌండ్ వాటర్ పెంచారని తెలిపారు. భూమినే జలాశయంగా మార్చామని చెప్పారు. నదుల అనుసంధానాన్ని నిజం చేశారని పేర్కొన్నారు. మంచి పని చేసినప్పుడు దాన్ని ప్రజలు ఎంజాయ్ చేసినప్పుడు చాలా సంతోషం కలుగుతుందన్నారు. కృష్ణా వాటర్ కంటే గోదావరి సర్టెయిన్ వాటర్ అని తెలిపారు. అడవుల నుంచి వస్తాయని తెలిపారు. ఇప్పుడు జరిగనటువంటి అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయ రంగంలో సస్టెయిన్ బులిటీ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలన్నారు. నదుల అనుసంధానం ఇంకా పూర్తి కావాలన్నారు. 

 

నీటి భద్రత ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

గుంటూరు : నీటి భద్రత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 16 శాతం గ్రోత్ రేట్ ఉంటుందన్నారు. చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ వస్తే బ్యాలన్స్ అయ్యే అవకాశం వస్తుందన్నారు. వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈరోజు కాకుండా భావి తరాల కోసం ఆలోచిస్తున్నానని చెప్పారు. గోదావరి నదిపై కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నామని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్, ఇంకో పక్క లెఫ్ట్ కెనాల్ నిర్మిస్తున్నామని.. ఈ కాల్వల వల్ల తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు తీసుకెళ్లవచ్చన్నారు. వంశధార, నాగావళిలో సర్ ప్లస్ వాటర్ ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు అందరికీ జీవనాడి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. సమగ్ర నీటి విధానంతో వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పారు.

16:33 - November 10, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు అందరికీ జీవనాడి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. సమగ్ర నీటి విధానంతో వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పారు. నీటి భద్రత ఇవ్వాలని పేర్కొన్నారు. 16 శాతం గ్రోత్ రేట్ ఉంటుందన్నారు. చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ వస్తే బ్యాలన్స్ అయ్యే అవకాశం వస్తుందన్నారు. వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈరోజు కాకుండా భావి తరాల కోసం ఆలోచిస్తున్నానని చెప్పారు. గోదావరి నదిపై కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నామని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్, ఇంకో పక్క లెఫ్ట్ కెనాల్ నిర్మిస్తున్నామని.. ఈ కాల్వల వల్ల తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు తీసుకెళ్లవచ్చన్నారు. వంశధార, నాగావళిలో సర్ ప్లస్ వాటర్ ఉందన్నారు. రైట్ మేన్ కెనాల్ డైరెక్ట్ గా కృష్ణాకు వస్తుందని తెలిపారు. కృష్ణా డెల్టా స్టెబులైజ్ అవుతుందని వివరించారు. పట్టిసీమ ఎలాగో ముచ్చుమర్రి అలాగ ఉందని..రాయలసీమకు ముచ్చుమర్రి గేట్ వే లాంటిదన్నారు. పురుషోత్తపట్నం మొన్న ఇనాగరేట్ చేశామని తెలిపారు. ఎర్రకాలువ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు పూర్తిగా సహకరించారు..వారికి పాదాభివందనం చేస్తునట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు భూమి ఇవ్వకపోతే మాటలన్నీ గాలి మాటులుగానే మిగిలేవని అన్నారు. ఒక సక్సెస్.. ఇంకో సక్సెస్ ను ఇస్తుందని తెలిపారు. నీటి ప్రాముఖ్యత గురించి చర్చించాలన్నారు. గ్రౌండ్ వాటర్ పెంచారని తెలిపారు. భూమినే జలాశయంగా మార్చామని చెప్పారు. నదుల అనుసంధానాన్ని నిజం చేశారని పేర్కొన్నారు. మంచి పని చేసినప్పుడు దాన్ని ప్రజలు ఎంజాయ్ చేసినప్పుడు చాలా సంతోషం కలుగుతుందన్నారు. కృష్ణా వాటర్ కంటే గోదావరి సర్టెయిన్ వాటర్ అని తెలిపారు. అడవుల నుంచి వస్తాయని తెలిపారు. ఇప్పుడు జరిగనటువంటి అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయ రంగంలో సస్టెయిన్ బులిటీ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలన్నారు. నదుల అనుసంధానం ఇంకా పూర్తి కావాలన్నారు. 

 

డీజీపీ సర్వీస్ చాలా సంతృప్తిని ఇచ్చింది: అనురాగ్ శర్మ

హైదరాబాద్ : డీజీప సర్వీస్ చాలా సంతృప్తిని ఇచ్చిందని అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..35 ఏళ్లకు పైగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించానని, ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏకైక పోలీస్ నేనే అని పేర్కొన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ లో చాలా మార్పులు తీసుకొచ్చామని, కానిస్టేబుల్ కూడా ఆఫీసర్ గా భావించేలా చర్యలు చేపట్టామన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుండే టెక్నాలజీ వినియోగించే విధంగా శిక్షణలో మార్పులు తీసుకోచ్చామని తెలిపారు.

టీఎస్ శాసనసభ, మండలి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి. 3 బిల్లులకు తెలంగాణ శాసనసమండలి ఆమోదించింది. పిడీ యాక్టు బిల్లు, తెలంగాణ రోడ్ల అభివృద్ధి, కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ దుకాలు, స్థాపన సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

13:17 - November 10, 2017

కడప : ప్రతిపక్షం శాసనసభలో లేకపోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, అసెంబ్లీ ఏకపక్షం కాకూడదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభా సమవేశాలు శుక్రవారం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. వైసీపీ సమావేశాలను బహిష్కరించింది. దీనిపై రఘువీరా మీడియాతో మాట్లాడారు. టిడిపి కబంధ హస్తాల్లో వైసీపీ ఇరుక్కపోయిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్పీకర్ ను ఎన్నడూ చూడలేదన్నారు. పార్టీ పార్టీని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 

డీఎస్పీ కార్యాలయం ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

జగిత్యాల: డీఎస్పీ కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ వ్యవహారంలో టీఆర్ ఎస్ నేతలు వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

13:13 - November 10, 2017

హైదరాబాద్ : రెండు రోజుల్లో వాసుదేవ్ మృతదేహం నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ లో హైదరాబాద్ వ్యాపారి వాసుదేవ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత నెల 31న ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. కుషాయిగూడకు చెందిన వాసుదేవ రాజ్ ను వ్యాపారం పేరిట పలువురు సింగపూర్ కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక గదిలో నిర్భందించి చిత్ర హింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వాసుదేవ్ బంధువులకు ఫోన్ చేసి రూ. 3 కోట్లు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతడిని వదిలేస్తామని..ఇందుకు వాసుదేవ్ ను బంధించిన చిత్రాలను వాట్సప్ లో పంపించారు. కానీ బంధువుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అతడిని దారుణంగా హత్య చేశారు. వాసుదేవ్ కు సంబంధించిన ఫేస్ బుక్ ను పరిశీలించగా పాక్ కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. 

భద్రాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు

భద్రాచలం: సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భద్రాద్రిలో కొలువుదీరిన సీతారాముల్ని దర్శించుకున్నారు. శుక్రవారం సతీసమేతంగా భద్రాద్రికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశేషాలు వివరించారు.

శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ దీపిక

తిరుమల: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న దీపిక వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అర్చకులు దీపికకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దీపికను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

ప్రతిపక్షం లేదని స్వీట్లు పంచుకున్న అధికారపక్షం

అమరావతి: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని హోంమంత్రి చినరాజప్ప సభలో స్వీట్లు పంచారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీసమావేశాలు జరుగుతున్నాయని స్వీట్లు పంచుతున్నారని పలువురు ఎమ్మెల్యే చమత్కరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూడాలని సీఎం అనుకుంటున్నారని, ఇపుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు అందుకు రిహార్సిల్స్ గా ఉన్నాయని ఎమ్మెల్యే సత్యప్రసాద్ అన్నారు.

'సీఆర్డీఏ చట్టంలో పలు సవరణలు'

అమరావతి: సీఆర్డీఏ చట్టంలో పలు సవరణలు చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వ బిల్లు పెట్టింది. సీఆర్డీఏ కమిషనర్ పదవికి కలెక్టర్ స్థాయి అధికారి సరిపోయేలా సవరణలు గతంలో చెరుకూరి శ్రీధర్ నియామకంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. తాజా సవరణతో కమిషనర్ పదవికి శ్రీధర్ అర్హుడు అయ్యాడు. ల్యాండ్ పూలింగ్ కు చెందిన సీఆర్డీఏ ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేస్తూ బిల్లులో సవరణలు తీసుకొచ్చారు.

12:37 - November 10, 2017

ఖమ్మం : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాచల రామయ్యను దర్శించుకున్నారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్లిన ఆయన స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. ఆలయం వద్ద వీరికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనాంతరం వీరికి అర్చకులు ఆశ్వీరచనం పలికి..స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఎన్టీఆర్ ను చూసేందుకు ఆలయం వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ..కొందరిని పలుకరిస్తూ జూ.ఎన్టీఆర్ దర్శనాన్ని ముగించుకున్నారు. 

12:34 - November 10, 2017

నల్గొండ : టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గుత్తా స్పందించారు. తాను సొంత గూటికి వెళుతున్నానని గత కొన్ని రోజులుగా ప్రచారం జరగుతోందని..దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

పదవుల కోసం పాకులాడే మనిషిని తాను కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పనిచేయడం జరుగుతోందన్నారు. 2014లో లక్ష మెజార్టీతో గెలుస్తానని కోమటిరెడ్డి చెప్పడం జరిగిందని..కానీ ఏం జరిగిందని ప్రశ్నించారు. లక్ష మెజార్టీ సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. 

మంత్రిగా అసెంబ్లీలో లోకేష్ తొలి ప్రసంగం

అమరావతి: మంత్రిగా అసెంబ్లీలో లోకేష్ తొలి ప్రసంగం చేశారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, సీనియర్ సభ్యుల సాహ చర్యంతో సభలో భాగస్వామ్యం కావడం అదృష్టమని లోకేష్ తెలిపారు.

12:29 - November 10, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ చేపడుతున్న పాదయాత్రపై టిడిపి పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుండి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎలా వ్యవహరించాలి..ఎలా నిలదీయాలో ఇప్పటి నుండే లోకేష్ ను యూజ్ చేసుకుంటున్నారని విమర్శించారు. అడ్డదారిలో మంత్రిగా చేసుకున్నారని..బాలకృష్ణ నియోజకవర్గంలో రోడ్లు వేయలేదన్నారు. మూడున్నర సంవత్సరాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించిన జగన్ కు సమాధానం చెప్పలేని పరిస్థితి టిడిపిలో ఉందన్నారు. ప్రతి సమస్యపై జగన్ పోరాడుతూ సూచనలు..సలహాలు ఇచ్చారని తెలిపారు. జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేలను దూషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని...ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని..ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఏ సమస్య లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగిందని..రోడ్లు..డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా. ? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా ? రైతు రుణమాఫీలు అమలయ్యాయా ? వీటిపై ప్రతి గ్రామంలో చర్చించేదానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేవలం దోచుకోవడం..విదేశాల్లో దాచుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని రోజా విమర్శించారు. 

12:25 - November 10, 2017

విజయవాడ : ఏపీ శాసనసభ..శాసనమండలి పదవులపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. బిజినెస్ నడవాలంటే చీప్ విప్ లు అవసరమని సీనియర్ నేతలు బాబుకు సూచించారు. దీనితో పదవులపై కసరత్తు పూర్తి చేశారు. శాసనమండలి ఛైర్మన్ నోటిఫికేషన్ నివేదికను తెలుగు రాష్ట్రాల గవర్నర్ కు పంపించారు. నివేదిక వచ్చిన అనంతరం శనివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మండలి ఛైర్మన్ గా ఎన్.ఎం.డి. ఫరూక్ పేరును ఇప్పటికే బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒకటి..రెండు రోజుల్లో చీప్ విప్..విప్ పదవులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ చీప్ విప్..ముగ్గురు విప్ లకు అవకాశం ఉంది. శాసనసభ చీప్ విప్ రేసులో పల్లె రఘునాథ్ రెడ్డి..బోండా ఉమలున్నారు. మండలి చీఫ్ విప్ రేసులో టిడి జనార్ధన్..వైవీబీ రాజేంద్ర ప్రసాద్..రామ సుబ్బారెడ్డిలున్నారు. విప్ పదవుల రేసులో బుద్ధా వెంకన్న..బీదా రవిచంద్ర.. అన్నం సతీష్..సంధ్యారాణిలున్నారు. మరి ఎవరికి ఏ పదవి వస్తుందో వేచి చూడాలి. 

12:20 - November 10, 2017

హైదరాబాద్ : సింగపూర్ లో హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి వాసుదేవరాజ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వాసుదేవరాజ్ ది కుషాయిగూడలోని మహేష్ నగర్ కు చెందిన వాడు. వ్యాపారం పేరిట వాసుదేవరాజ్ ను దుండగులు సింగపూర్ కు తీసుకెళ్లారు. అక్కడ కిడ్నాప్ చేసి బంధువులకు దుండగులు ఫోన్ చేసి రూ. 3 కోట్లను డిమాండ్ చేశారు. అంతేగాకుండా వాసుదేవ్ ను బంధించిన ఫొటోలను వాట్సప్ ద్వారా కుటుంబసభ్యులకు నిందితులు పంపించారు. బంధువులు సకాలంలో స్పందించలేదని పేర్కొంటూ దుండగులు వాసుదేవరాజ్ ను హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారుల ద్వారా వాసుదేవ్ హత్యకు సంబందించిన సమాచారాన్ని అతని కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. కాగా... రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్ నగరానికి వాసుదేవ్ మృతదేహం చేరుకోనుందని తెలిసింది.

శానసనసభ, మండలి పదవులపై కసరత్తు పూర్తి

అమరావతి: శాసనసభ, మండలి పదవులపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో చీఫ్ విప్, విప్ పదవుల భర్తీ చేయనున్నారు. మండలిఛైర్మన్ పదవికి సోమవారం నోటిఫికేషన్ రానుంది. మండలి చైర్మన్ గా ఎన్ ఎండి ఫరూక్ పేరునుచంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. శాసనసభ చీఫ్ విప్ రేసులో పల్లె రఘునాథరెడ్డి, బోండా ఉమా పోటీ పడుతుండగా, మండలిలో చీఫ్ విప్, విప్ లకు అకాశం ఉండగా రేసులో టీడీ జనార్థన్ , వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రామసుబ్బారెడ్డి పోటీ పడుతున్నట్లు సమాచారం. విప్ పదవుల రేసులో బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీష్, సంధ్యారాణి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు: రమణ

హైదరాబాద్: రేవంత్ స్థాయి నాయకుని నుంచి కార్యకర్తకు పడిపోయిందని టి.టిడిపి నేత ఎల్ రమణ ఆరోపించారు. కాంగ్రెస్ లో కార్యకర్తనని ఆయనే చెపుకుంటున్నాడని, పదవి ముగిసే సమయంలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని, కేవలం దండం పెట్టి వచ్చాడని తెలిపారు. రేవంత్ రెడ్డి చాలా పార్టీలు మారారని, ఆయన వెళ్లినపుడు ఆయా పార్టీలు బలహీన పడ్డాయా అని ప్రశ్నించారు. నాయకులే పార్టీ మారారని, క్యాడర్ చెక్కు చెదరలేదని, ఎర్ర శేఖర్ అధ్యక్షతన పాలమూరులో పార్టీ బంగా ఉందని తెలిపారు.

12:05 - November 10, 2017

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు వి.విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నవంబర్ 2 నుండి మే 2 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు..ఇందుకు హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రను చేపట్టారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు సూచించింది. దీనితో పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ కల్పించిన జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్..విజయసాయిరెడ్డిలు వేసిన డిశ్చార్జ్ పిటిషన్ లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. మరి జగన్ హాజరు మినహాయింపుపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:59 - November 10, 2017

హైదరాబాద్ : 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని..కానీ తాము మేనిఫెస్టోలో చెప్పకున్నా పేదలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం నాడు శాసనసభలో ఆయన కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. తప్పుడు విమర్శలు చేయవద్దని...సభను తప్పుదోవ పట్టించడం సబబు కాదన్నారు. ఇందుకు ప్రొటెస్ట్ చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారా ? అని ప్రశ్నించారు. 

'పేదల ఆకలి తీర్చేందుకే ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం'

హైదరాబాద్: పేదల ఆకలి తీర్చేందుకే ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు. రేషన్ షాపులో యధావిధిగా బియ్యం పంపిణీ కొనసాగిస్తున్నామని హరీష్ స్పష్టం చేశారు.

నిజాంను రాజుగానే చూడాలి: భట్టి

హైదరాబాద్: రాజులను పొగడడాన్ని బట్టి కేసీఆర్ మనస్తత్వం ఏంటో అర్థమవుతోందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై కేసీఆర్ కు గౌరవం లేదని, రాచరికపు పొకడలు, ఆడంబరాలే కేసీఆర్ కు గొప్పగా ఉన్నాయన్నారు. నిజాం పేరిట జిగిర్దార్లు, దేశ్ ముఖ్ లు చేసిన అకృత్యాలను కేసీఆర్ వివరించి ఉంటే బాగుండేదన్నారు. నిజాంను రాజుగానే చూడాలి తప్ప ఒక మతం వాడిగా చూడకూడదన్నారు. ఓట్ల కోసం ఓవైపు ఐలమ్మ, దొడ్డి కొమరయ్యను పొగుడుతారని, మరో వైపు నిజాం ను పొగుడుతారని భట్టి విమర్శించారు.

11:40 - November 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ఈ పథకంపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై మంత్రి నాయినీ సమాధానం చెప్పారు.

అంతకంటే ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు ప్రశ్నలు అడిగారు. బీమా పాలసీ మీద ఐదు లక్షల రూపాయలు 2015లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. జీవిత బీమా పథకంపై రాష్ట్రంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారా ? అని ప్రశ్నించారు. 2015-16 లో 108 దరఖాస్తులు చేసుకుంటే 2016-17లో కేవలం 32 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఒక పేపర్ లో తాను చూడడం జరిగిందన్నారు. సింగరేణి ప్రాంతం..మంచిర్యాల ప్రాంతంలో డబుల్ రోడ్ లేకపోవడం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక్కడ వారికి అవగాహన లేకపోవడం వల్ల దరఖాస్తులు చేసుకోవడం లేదన్నారు. అందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.

మంత్రి నాయినీ సమాధానం...
2015 మేడే సందర్భంగా డ్రైవర్లు..వర్కింగ్ జర్నలిస్టులకు..హోం గార్డుల మరణ బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. రవాణా..రవాణేతర..ఆటో డ్రైవర్లకు ఈ పథకం అమలు చేస్తూ కార్మిక శాఖ ఓ జీవో జారీ చేయడం జరిగిందని, ఇందుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రవాణా...రవాణేతర ఆటో డ్రైవర్ల రిజిస్ట్రేషన్..క్లైమ్ ల విషయాలను అసిస్టెంట్ లేబర్ కమిషన్..హోం గార్డుల రిజిస్ట్రేషన్..క్లైమ్ ల విషయాలను జిల్లా ఎస్పీ..కమిషనర్ ఆఫ్ పోలీస్...వర్కింగ్ జర్నలిస్టు రిజిస్ట్రేషన్..క్లైమ్ ల విషయాలను డివిజన్ పబ్లిక్ ఆఫీసర్ లు చూస్తారన్నారు. గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద 14,48, 236 మంది బీమా చేసుకున్నారన్నారని తెలిపారు. రవాణేతర..ఆటో డ్రైవర్ల 2015-16 లో 84 మంది చనిపోయారని..2016-17 లో 45 మంది డ్రైవర్లకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. 2016-17 లో మరొక్క 43 మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఒక్క దరఖాస్తు పరిశీలనలో ఉందన్నారు. 2016- 17లో చనిపోయిన ఒక జర్నలిస్టు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. 2016 -17 సంవత్సరానికి సంబంధించి ఒక దరఖాస్తు పరిశీలనలో ఉందన్నారు. 2015 - 16లో చనిపోయిన హోం గార్డుల 8 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. మృతి చెందిన ఒక హోంగార్డు దరఖాస్తు పరిశీలనలో ఉందన్నారు. 2016- 17లో చనిపోయిన 12 మంది హోంగార్డుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు..ఒక హోం గార్డు దరఖాస్తు పరిశీలనలో ఉందన్నారు. 2015- 16 సంవత్సరంలో 93 బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు సభకు తెలిపారు. 2016-17 సంవత్సరంలో 57 మంది బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అదించినట్లు...45 క్లెయిమ్ లు పరిశీలనలో ఉన్నాయన్నారు. రవాణా కార్యదర్శుల దగ్గర బ్యానర్ లు పెట్టడం జరిగిందని..రెవెన్యూ ఆఫీసర్ల వద్ద..పోలీసు డిపార్ట్ మెంట్..జర్నలిస్టులకు ఈ పథకం గురించి చెప్పడం జరుగుతోందన్నారు. ఈ పథకం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి నాయినీ పేర్కొన్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ గా రవీందర్

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా పులిగిల్ల రవీందర్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2010 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన రవీందర్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం. మొదటి పోస్టింగ్ కర్నూల్ జిల్లా నంద్యాల, రెండవ పోస్టింగ్ కరీంనగర్, మూడవ పోస్టింగ్ సీసీఎస్ హైదరాబాద్ (డిటెక్షన్ డిపార్ట్మెంట్) నందు విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా కొత్తగూడెం జిల్లాకి బదిలీ అయ్యి ఆయన ఈ రోజు పదవీ భాద్యతలు స్వీకరించారు.

'125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూపకల్పన'

అమరావతి: అంబేద్కర్ ఒకే వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అంబేద్కర్ ఆలోచన వల్ల సముచిత న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్ని సమస్యలు వచ్చినా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కోల్పోలేదన్నారు. అంబేద్కర్ 125వ జన్మదినం సందర్భంగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు రూపకల్పన చేశామన్నారు. శాశ్వతంగా గుర్తుండేలా అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తామని, 500 మంది వచ్చేలా ధ్యానమందిరం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్ సాధించిన విజయాలన్నీ సేకరిస్తామని, భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు.

సీబీఐ కోర్టుకు జగన్, విజయ్ సాయిరెడ్డి

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

మహాపడావ్ విజయవంతంగా కొనసాగుతోంది: తపన్ సేన్

ఢిల్లీ : జాతీయ కార్మిక సంఘా ఆధ్వర్యంలో మహాపడావ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ తెలిపారు. మహాపడావ్ కు రాకుండా కార్మికులను ఢిల్లీ సరిహద్దులో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల 12 డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం జాతి వ్యతిరేక చర్య అని మండిపడ్డారు.

11:14 - November 10, 2017

విజయవాడ : ఏపీ శాసనసభ ప్రతిపక్షం లేకుండానే కొనసాగుతోంది. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంపై టిడిపి సభ్యులు మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాజీవ గృహ కల్ప పథకం పెట్టి..పూర్తి చేయలేదని టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరిట పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వడం గర్వకారంగా ఉందన్నారు. పట్టణ హౌసింగ్ లో ఎక్కువ లబ్ది చేకూరడం సంతోషదాయకమన్నారు. చిన్న చిన్న పట్టణాలు..లోటు బడ్జెట్ తో ఇబ్బందులు పడుతున్నాయని..అంబుడ్స్ లో వీటికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. గ్రామాల్లో శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నారని..కానీ మున్సిపాల్టీలో శ్మశానాలను ఆధునీకరించాలని..ఇందుకు బడ్జెట్ కేటాయించాలన్నారు.

ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం గొప్పదని..హౌసింగ్ గ్రాంట్ కింద 2.50 లక్షలు నేరుగా లబ్దిదారుడుకు చేరడం గతంలో ఎప్పుడూ లేదని విశాఖపట్టణం పశ్చిమ ఎమ్మెల్యే జీవీ ఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తాము వెళితే ప్రజలు చక్కటి స్వాగతం పలికారని పేర్కొన్నారు. నగరాల్లో గృహాల సంఖ్య పెంచితే బాగుంటుందని..గతంలో నిర్మాణాల బాగు చేసుకొనే విషయాన్ని ఆలోచించాలన్నారు. 

వైసీపీ పైరస్ లాంటిది: మంత్రి ఆదినారాయణ రెడ్డి

అమరావతి: సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనం ఎన్నికల్లో ఓట్లు వేయరని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు బొత్స, రఘువీరా భారీగా పెళ్లిళ్లు జరిపారని, జనం కూడా పెద్ద సంఖ్యలో ఆ పెళ్లిళ్లకు వచ్చారని తెలిపారు. కానీ ఎన్నికల్లో ఆ ఇద్దరి నేతలకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. జగన్ ప్రస్తుతం పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారని, అత్తగారి ఇంటికి జగన్ వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగుందని, వైసీపీ పైరస్ లాంటిదని పేర్కొన్నారు. వైరస్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందంటే సభలో వైసీపీ లేకపోవడం అలానే ఉందన్నారు.

11:04 - November 10, 2017

చలికాలంలో గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీని వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం,పగలటం,మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. డ్రై స్కిన్ ఉన్న వారికి ఇబ్బందులు మరీ ఎక్కువవుతుంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ సమస్యలు తప్పవు. అందుకే.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చు. గోరువెచ్చని నీటితో పనులు ముగించుకోవాలి. ముఖంపై, శరీరంపై ఏవేవో క్రీములు రాసుకుంటే మొదటికే ప్రమాదం వస్తుంది. చర్మతత్వాన్ని బట్టి క్రీమ్స్ ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ చలిలో చర్మాన్ని బయటి వాతావరణంతో కనెక్ట్ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు.

చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే.. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.

గులాబీనీరూ, తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె చర్మానికి తేమనందిస్తుంది. పొడిచర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

పెదవులు పొడిబారి పగిలినట్లు అవుతున్నాయా.. తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో రెండుమూడుసార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.

పెద్ద చెంచా వంతున నిమ్మరసం, తేనె కలిపి ముఖానికీ, చేతులకూ రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాదు, దురదా, ఎలర్జీల్లాంటి సమస్యలూ దరిచేరవు.

స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. అలాగే చెంచా సెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి. ఆ తరవాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.

10:47 - November 10, 2017

విజయవాడ : అంబేద్కర్ ఒక వర్గానికి..కొంతమందికి మాత్రమే ప్రతినిధి కాదని..రాబోయే భావితరాలకు స్పూర్తిగా..ఉన్నారని తెలిపారు. సమాజంలో వెనుకబడి ఉన్న వారిని పైకి తీయడానికి..షెడ్యూల్ కులాలు..తెగలు..వెనుకబడిన వారికి రిజర్వేషన్ల రావడానికి అంబేద్కర్ కారణమన్నారు. అంటరానితనం స్వయంగా అంబేద్కర్ ఎదుర్కొన్నారని..ఎన్ని సమస్యలు వచ్చినా అచెంచల విశ్వాసంతో ముందుకెళ్లారని కొనియాడారు. 125వ జయంతి సందర్భంగా ఆయన స్పూర్తిని శాశ్వతంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని..స్మృతివనం నిర్మాణం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. 20 ఎకరాల భూమి..వంద కోట్లు ఖర్చు చేపట్టి..ఎక్కడ చేయని విధంగా మంచి మొమెరియల్ తయారవుతుందన్నారు. ఏర్పాటు చేసే లైబ్రరీలో పది వేల పుస్తకాలు ఉండే విధంగా..ఇంటర్నెట్..ఇతర సౌకర్యాలు కల్పిస్తామని..అంబేద్కర్ ను అధ్యయనం చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక థియేటర్ తయారు చేయాలని..ల్యాండ్ స్కేపింగ్..గార్డెన్..500 మంది మెడిటేషన్ చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇవన్నీ ఒక తుది దశకు చేరుకున్నాయి..చివరిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి అతి త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ మొదటి వారంలో సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. 12 నెలల్లో విగ్రహం ఏర్పాటు చేసి 18 నెలల్లో ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు రూ. 45 కోట్లు డబ్బు కేటాయించడం జరిగిందన్నారు. భారతరత్న అవార్డు ఇప్పించింది, పార్లమెంట్ లో విగ్రహం పెట్టించింది ఎన్టీఆర్ అని తెలిపారు.

 

10:36 - November 10, 2017

విజయవాడ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణం..స్మృతివనంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. శుక్రవారం నుండి ఏపీ అసెంబ్లీ ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షం లేకుండానే ఈ అసెంబ్లీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. అంబేద్కర్ స్పూర్తిని ప్రపంచానికి తెలియచేసే విధంగా..ఆయనకు గౌరవించే విధంగా కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రక్రియలు హర్షణీయమన్నారు. అంబేద్కర్ పేరిట పంచ తీర్థ పేరిట ఐదు ప్రదేశాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని, లండన్ లో అంబేద్కర్ చదువుకున్న భవంతిని మహారాష్ట్ర ప్రభుత్వం కొనిపించి..ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఇందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. ఈ అంశంపై ఇతర సభ్యులు కూడా మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

10:29 - November 10, 2017

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రం టీజర్ విడుదల అయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. దీపావళి శుభాకాంక్షలతో లుంగీలో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. చేతిలో పాల పాకెట్ పట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో కనిపించాడు నాని . ఇక తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో ఎంసీఏ అంటే ఏంటో క్లుప్తంగా వివరించాడు నాని. మొత్తానికి 'ఎంసిఏ’ అలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' టీజర్ మాత్రం అదిరిందనే చెప్పాలి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలని త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది చిత్ర యూనిట్. ఎంసీఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు.

10:29 - November 10, 2017

విజయవాడ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అడ్డుకొంది కాంగ్రెస్ పార్టీ అని టిడిపి ఎమ్మెల్యే ఆనంద రావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సభ్యులు మాట్లాడారు. డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ప్రపంచ మేధావి అని ఐరాస గుర్తించిందని..ఏప్రిల్ 14న ప్రపంచ విజ్ఞాన దినంగా నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. బి.ఆర్. అంబేద్కర్ ను కాంగ్రెస్ దగ్గరికి రానివ్వలేదని..పార్లమెంట్ కు వచ్చే విషయంలో..అన్నీ విషయాల్లో అంబేద్కర్ ను కాంగ్రెస్ అడ్డుకొందన్నారు. అమరావతి నగరంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం..అందరూ గర్వంగా చెప్పుకొనే అవకాశం ఉందన్నారు. దళితులకు ఏనాడు కాంగ్రెస్..దివంగత సీఎం వైఎస్ పట్టించుకోలేదని..టిడిపి మాత్రమే పట్టించుకుందన్నారు. 

10:25 - November 10, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును బీజేపీ మెచ్చుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షం లేకుండానే సభలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. పట్టిసీమ లేకపోతే 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం లేదన్నారు. కైకలూరులో అగ్రికల్చర్ పాడైపోయే అవకాశం ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడం...వర్షాకాలంలో మూడు వేల టీంఎసీల నీరు సముద్రంలోకి వెళుతోందని..85 టీఎంసీలు నీరు మళ్లించడం గొప్ప విషయమన్నారు. ఇందులో పాలుపంచుకున్న అధికారులు..కాంట్రాక్టర్లకు అభినందనలు తెలియచేయాలని సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ తీసుకోవాలని మంత్రి యనమల కోరడంతో అందుకు స్పీకర్ అంగీకరించారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపి గుత్తా ఫైర్

నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపి గుత్తా ఫైర్ అయ్యారు. ఒక్కసారి కూడా 20 వేల మెజార్టీ సాధించలేని వ్యక్తి 50 వేల మెజార్టీతో ఎపుడు గెలిచాడో కోమటిరెడ్డి చెప్పాలన్నారు. కోమటిరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గుత్తా తెలిపారు. నేను పదువుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. నేను మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నానన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఏ పార్టీలో వున్నా జిల్లా అభివృద్ధికే కృసి చేశానన్నారు.

కుత్బుల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరి మృతి

మేడ్చల్ : కుత్బుల్లాపూర్ మండలం షంబీపూర్ వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వచ్చిన ఇన్నోవా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను మొఘల్‌పురాకు చెందిన సలీం, రవూఫ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. బీదర్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

10:15 - November 10, 2017

హైదరాబాద్ : చేపల పెంపకం అనేది ఆనందం..ఆహ్లాదం..ఆరోగ్యానికి..నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మత్స్య పరిశ్రమపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రతి రోజు చేప తింటే ఎలాంటి అనారోగ్యాలు రావని, సమైక్య రాష్ట్రంలో కేవలం రెండు కోట్ల బడ్జెట్ పెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని సొసైటీలకు మాత్రం డబ్బులు ఇచ్చేదని..సొసైటీ సభ్యత్వం ఇచ్చేది కాదని..మత్స్య కళాశాలలు విస్తరించే అవకాశం ఉందని..ప్రతి జిల్లా కేంద్రంలో కళాశాల ఏర్పాటు చేసే అవకాశం ఉందా ? అని ప్రశ్నించారు. కొర్ర మీను ఉత్పత్తి చేయడానికి విత్తన కేంద్రాలు ఏర్పాటు చేశారా ? గొర్రెల పంపకం పథకానికి ఇస్తున్న అవకాశాలు చేపల పెంపకానికి ఇస్తారా ? ప్రతి జిల్లా కేంద్రంలో మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు వ్యవసాయ ప్రణాళిక రూపొందించని కారణంగా రబీలో రైతుల ఇబ్బందులపై చర్చించాలని టిడిపి, కానిస్టేబుళ్లు ప్రమోషన్లు, హోంగార్డుల ఉద్యోగ భద్రతపై బిజెపి, అమ్మహస్తం కొనసాగించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చాయి.

09:57 - November 10, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 15 నుంచి 29 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల 36 వేల 831 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మే మొదటి వారంలో పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస్‌ విడుదల చేశారు. ఈ మేరకు మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమై... 29 వరకు జరగనున్నాయి. ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 6 లక్షల 36 వేల 831 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 3 లక్షల 80వేల, 834 మంది అబ్బాయిలు, 3 లక్షల 27వేల 997 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకానున్నారు. 2 వేల 8 వందల 50 సెంటర్‌లలో పరీక్షలు జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షల అనంతరం మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15 వరకు స్పాట్ వ్యాలూయేషన్‌ నిర్వహించి... మే మొదటి వారంలోనే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అన్ని పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఒక్కో జిల్లాలో ఐదు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని..చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని మంత్రి గంటా సూచించారు.

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల కార్యక్రమం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

09:52 - November 10, 2017

విజయవాడ : ఏపీ శాసనసభ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి జవహార్ టెన్ టివితో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని..రాబోయే కాలంలో ప్రజలు వైసీపీని బాయ్ కాట్ చేస్తుందని విమర్శించారు. సింగపూర్ లో ప్రతిపక్షం లేకుండా పాలన సాగుతోందని..ఇక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా ప్రభుత్వం పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, ఫిరాయింపులో వైసీపీ క్లారిటీ లేదన్నారు. జగన్ సంకల్పం సీఎం పీఠమని పేర్కొన్నారు. 

మీడియాతో మంత్రి లోకేష్ చిట్ చాట్

అమరావతి: మంత్రి లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రతిపక్షం సభలో లేదు కాబట్టి 100 కాల్ సెంటర్, మా ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని తెలిపారు. మంత్రులపై ప్రశ్నలు సంధించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

09:51 - November 10, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు జరుగనున్నాయి. శుక్రవారం నుండి అసెంబ్లీ జరుగనుంది. అంతకంటే ముందు బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ కోడెల అధ్యక్షతనలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేశారు. ఈనెల 25వ తేదీ వరకు జరుగనున్నాయి. 27 అంశాలను ప్రధానంగా ప్రభుత్వం పేర్కొనగా 17 అంశాలు ప్రధానమని బీజేపీ పేర్కొంది. ఈ సందర్భంగా మీడియా పాయింట్ లో మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ అర్థవంతమైన చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా..చట్టసభలో సభ్యులను ఏం ఆశిస్తున్నారో వాటిని పూర్తి చేసే విధంగా ఉండాలన్నారు. 9 సార్లు సమావేశాలు జరిగాయని ఈ సమావేశాల్లో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు బాగా లేదన్నారు. నిరాధారమైన నిందారోపణలతో వైసీపీ సమయాన్ని వృధా చేసిందని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం చెందిందని వైసీపీనుద్ధేశించి మాట్లాడారు. సభలో నిలదీస్తానని చెప్పిన ప్రతిపక్షం చతికిలపడిందని, నైతికంగా ఓడిపోయిందని తెలిపారు. 

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 25 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.

09:44 - November 10, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం లేదు. గత మూడు రోజులుగా ప్రమాదకరస్థాయికి చేరుకుంది. బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరస్థాయిలో కాలుష్య ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ లు పెట్టుకుని బయటకు వస్తున్నారు. దీనితో పాటు పొగమంచు కూడా భారీ స్థాయిలో కమ్ముకోవడంతో వాహనదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంజాబీబాగ్, ఆనంద్ విహార్, మందిర్ మార్గ్, ఆర్గేపురం, ద్వారకలో కాలుష్యం 500 పాయింట్లు దాటింది.

కాలుష్యం అధికమౌతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. చెట్లపై ఉన్న దుమ్మును ఫైరింజన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో చేపట్టిన 'సరి-బేసి' విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్య నియంత్రణకు ఎలాంటి బడ్జెట్ లేదని..సరిహద్దులోని పలు ప్రాంతాల్లో పంట చెరువును కాల్చడం వల్ల కాలుష్యం అధికమౌతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. సరిహద్దు రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరపాలని...కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సరిహద్దులో ట్రక్కులను అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వాహనాలను వెనక్కి పంపుతున్నారు. 

09:42 - November 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అధికారపక్షం తమ ఏజెండాను కొనసాగిస్తోంది. శుక్రవారం నాడు ప్రారంభమయ్యే సమావేశంలో పలు కీలకాంశాలున్నాయి. రబీ రైతుల ఇబ్బందులపై టిడిపి...కానిస్టేబుళ్ల ప్రమోషన్లు, హోం గార్డుల భద్రతపై బీజేపీ..అమ్మహస్తం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీలు వాయిద తీర్మానాలు ఇచ్చాయి. ఇక షార్ట్ టర్మ్ లో రైతులకు ఒక్క ఎకరాలకు రూ. 4వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ప్రభుత్వం పేర్కొననుంది. మరో వైపు జహంపీర్ దర్గాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. దర్గా అభివృద్ధి పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు.

ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాలని విపక్షాలు యోచిస్తున్నాయి. అలాగే నిరుద్యోగ సమస్యలపై కూడా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిరుద్యోగ సమస్యపై పలువురు పోరాట బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగే సభలో కీలమైన ప్రశ్నలున్నాయి ధూప దైవ్య పథకం కింద అర్చకుల వేతనాలు..కల్తీ పాల వ్యవహారం..డబుల్ బెడ్ రూం..జనగాం నియోజకవర్గంలో నియోజకవర్గాల పెంపు..ఉండనున్నాయి. మరి ఈ అంశాలపై ఎలాంటి చర్చ జరుగుతోందో వేచి చూడాలి. 

25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కొద్ది సేపటి క్రితం బిఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 27 అంశాలు సభలో చర్చించాలని, 17 అంశాలను ప్రాధాన్యత గలవి బిజెపి తెలిపింది.

టి.అసెంబ్లీ..వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : కాసేపట్లో టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రబీ రైతుల ఇబ్బందులపై టిడిపి...కానిస్టేబుళ్ల ప్రమోషన్లు, హోం గార్డుల భద్రతపై బీజేపీ..అమ్మహస్తం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీలు వాయిద తీర్మానాలు ఇచ్చాయి. 

09:11 - November 10, 2017
09:10 - November 10, 2017

విజయవాడ : నేటి నుండి ఏపీ వర్షాకాల, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో సభ ఏకపక్షంగా సాగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ కోడెల అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల తదితరులు హాజరయ్యారు. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతిపక్షం హాజరు కాకపోవడంపై టిడిపి తప్పుబడుతోంది. 

ఏపీ బీఏసీ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ బీఏసీ సమావేశం కాసేపటి క్రితం సమావేశమైంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్ని రోజులు సభ జరగాలనే దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. 

08:36 - November 10, 2017

చిత్తూరు : తిరుమలలోని జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. వర్షాలకు తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాముల్లోకి భారీగా నీరు చేరింది. పాపవినాశనం డ్యాం పూర్తిగా నిండిపోగా మిగిలిన జలాశయాలు దాదాపు నిండిపోయాయి. దీంతో టీటీడీ అధికారులు డ్యామ్‌ల వద్ద ఘనంగా గంగపూజ నిర్వహించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు గంగపూజలో పాల్గొన్నారు. జలాశయాల్లోకి నవంబరు 10కే పూర్తి స్థాయిలో నీరు రావడం సంతోషంగా ఉందని ఈవో అన్నారు. అన్ని డ్యాముల్లోని నీరు 761 రోజులకు.. తిరుమల అవసరాలకు సరిపోతుందని ఆలయ ఈవో తెలిపారు. 

08:34 - November 10, 2017

నెల్లూరు : కువైట్‌లో యజమాని చేతిలో చిత్రహింసలు పడుతున్న నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి తన ఇంటికి చేరుకున్నాడు. తాను చిత్రహింసలు పడుతున్న విషయాన్ని రవి వీడియో ద్వారా తెలుపగా టెన్‌ టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో కువైట్లో ఉన్న అనేక మంది భారతీయులు స్పందించి రవిని ఇండియాకు సేఫ్‌గా పంపించారు. ప్రస్తుతం రవి తన స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను ఇండియాకి వస్తానన్న నమ్మకమే లేదని, నేను బ్రతికున్నానంటే దానికి కారణం టెన్‌ టీవీ కథనాల వల్లేనని రవి టెన్‌ టీవీకి కృతజ్ఞతలు తెలిపాడు. 

08:23 - November 10, 2017

తామర సమస్య ఎదుర్కొంటున్న వారు వేపాకు రసం కొబ్బరి నూనెలో వేడి చేసి రాయాలి.

వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి నూరాలి. ఈ ముద్దను కట్టుకొంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

గొంతు బొంగురుగా ఉన్న సమయంలో మిర్యాలపొడిని వేడి వేడి పాలలో వేసి తాగాలి.

గొంతు నొప్పి ఉంటే మిర్యాల పొడి..శొంఠి చూర్ణాన్ని తేనెలో కలుపుకుని తీసుకోవాలి. జ్వరంతో బాధ పడుతున్న వారు పైనాపిల్ రసంలో కాస్త తేనె కలుపుకుని తాగాలి.

అరకప్పు పైనాపిల్ రసంలో టీ స్పూన్ ఉసిరి గింజలు..నేరేడు గింజల పొడి కలిపి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది.

కడుపునొప్పి..దగ్గు ఉంటే వాము చక్కటి పరిష్కారం చూపుతుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

బెల్లంతో శొంఠి పొడి కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం పోతుంది.

ఉప్పు నీళ్లు తాగినా అజీర్ణం దూరమౌతుంది.

ఎర్రకణాల సంఖ్య పెరగాలంటే చిలకడదుంప తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

బార్లీ నీళ్లు తాగితే కడుపులో మంట..అసిడిటీ..మలబద్దకం వంటి సమస్యలు దూరమౌతాయి.

బార్లీ నీళ్లు తీసుకొంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. 

08:14 - November 10, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. సభా సమావేశాలకంటే ముందు బీఏసీ సమావేశం జరుగనుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి ? ఏ ఏ అంశాలపై చర్చించాలని దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల్లో 200 ప్రశ్నలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రాజెక్టులు..ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. పది రోజుల్లో 26 అంశాలపై చర్చించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను..ప్రశ్నలను సభ్యులు లేవనెత్తాలని..అందుకు తగిన సమాధానాలు మంత్రులు ఇవ్వాలని టీడీఎల్పీ భేటీలో బాబు సూచించారు.

ఇదిలా ఉంటే వైసీపీ సభ్యులు సభకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని..వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మరి అసెంబ్లీలో ప్రభుత్వం ఏ అంశాలపై చర్చిస్తారో చూడాలి. 

భారీ లోడ్ ట్రక్కుల సీజ్..

ఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దులో భారీ లోడ్ లతో వస్తున్న లారీలను పోలీసులు సీజ్ చేశారు. గురువారం రాత్రి 11 గంటలకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో కాలుష్యం అధికమౌతున్న సంగతి తెలిసిందే. 

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ..

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం లేదు. మందిర్ మార్గ్ 515..పంజాబీ భాగ్ 802..ఆనంద్ విహార్ 571..ద్వారకా 420..వికాస్ సదన్ గురుగావ్ 391..సెక్టార్ 16ఏ ఫరిదాబాద్ 348..నమోదయ్యాయి. 

07:23 - November 10, 2017

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షం లేకుండానే ఈ సమావేశాలు జరుగుతుండడం గమనార్హం. 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపి సంతలో పశువుల మాదిరిగా కొంటోందని...ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నేత జగన్ మైక్ లను కట్ చేసిన సంఘటన మరిచిపోలేమని పేర్కొంటోంది. దీనిపై టిడిపి విభిన్నంగా స్పందిస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో గఫూర్ (సీపీఎం), పద్మజారెడ్డి (వైసీపీ), సూర్య ప్రకాష్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

ఖమ్మం బంద్..

ఖమ్మం : నేడు జిల్లా బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. కలెక్టరేట్ తరలింపును నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్, టిడిపి మద్దతు తెలిపాయి. బస్ డిపో దగ్గర బస్సులను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నేతలను..కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

నేడు 40 చిత్రాల ప్రదర్శన..

హైదరాబాద్ : ఈనెల 14 వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరుగనుంది. 40 చిత్రాలు నేడు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ చలన చిత్ర ప్రదర్శితం కానున్నాయి. నగరంలో 13 సినిమా హాళ్లలో చిత్రాలు ప్రదర్శనం కానున్నాయి. 

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. 

మహాపడావ్..రెండో రోజు..

ఢిల్లీ : అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హస్తినలో చేపట్టిన మహా పడావ్ నిరసన కార్యక్రమం హోరెత్తింది. అఖిల భారత కార్మిక సంఘాలు హస్తినలో చేపట్టిన మూడురోజుల మహా పడావ్ నిరసన కార్యక్రమం తొలిరోజు హోరెత్తింది. 

ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న..

ఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 74శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. 

06:48 - November 10, 2017

రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకి మంగళమేనా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీ అంత నడుస్తోంది, చంద్రబాబు సర్కార్ రేషన్‌ షాపులను మూసివేస్తూ..ఒకవైపు E-Pass విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ... మరోవైపు విలేజ్‌ మాల్స్‌ పేరిట షాపింగ్‌ మాల్స్‌ను గ్రామాల్లో ఏర్పాటు చేయించే పనికి పూనుకోవడం ఈ చర్చకు కారణం అవుతుంది. ఇది ఒకవైపు ప్రజా పంపణీ వ్యవస్థని దెబ్బతీసే చర్యయేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబారావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:47 - November 10, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మళ్లీ సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాయు కాలుష్యంపై ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మండిపడడంతో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం యోచిస్తోంది. నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఆడ్‌-ఈవెన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది ఢిల్లీలోకి ట్రక్కులు రాకుండా నిషేధం విధించింది. పంజాబ్‌, హర్యానాలో పంట పొలాలలో దహనాల కారణంగా వాయుకాలుష్యం పెరిగిపోతోందని వాదిస్తోంది. రైతులు దహన చర్యలు ఆపేవరకు వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం దొరకదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చెబుతున్నారు. వాయు కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని రాజకీయాలకతీతంగా అందరు కలిసి దీన్ని ఎదుర్కోవాలని సిఎం పేర్కొన్నారు.

వాయుకాలుష్యానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, చట్టబద్ద సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు చట్టబద్దమైన సంస్థలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి ఛలాన్లు జారీ చేయాలని, నిర్మాణ స్థలాల్లో తక్షణమే పనులను నిలిపివేయాలని తెలిపింది. హెలికాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఢిల్లీ వాతారణ కాలుష‍్యంపై పొరుగు రాష్ట్రాలు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ల వైఖరిని కూడా ఎన్‌జీటీ తప్పుబట్టింది.

ఎన్‌జిటి మొట్టికాయలు వేసిన నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా జనవరి, ఏప్రిల్‌లో పదిహేను రోజుల చొప్పున ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. నంబర్‌ప్లేట్‌ చివర్లో సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజున, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాలి. దీని వల్ల వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది.

06:45 - November 10, 2017

ఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 74శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. 68 నియోజకవర్గాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సిర్మూర్‌ జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. సిమ్లా పట్టణంలో 66శాతం పోలింగ్‌ నమోదైంది. సీఎం వీరభద్రసింగ్‌, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌, కేంద్రమంత్రి జేపీ నడ్డాతోపాటు పలువురు ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు.

06:43 - November 10, 2017

ఢిల్లీ : మోదీ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన విధానాలను మార్చుకోవాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత డిమాండ్ చేశారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగడానికైనా సిద్ధమని హెచ్చరించారు. అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హస్తినలో చేపట్టిన మహా పడావ్ నిరసన కార్యక్రమం హోరెత్తింది. అఖిల భారత కార్మిక సంఘాలు హస్తినలో చేపట్టిన మూడురోజుల మహా పడావ్ నిరసన కార్యక్రమం తొలిరోజు హోరెత్తింది. పార్లమెంట్ స్ట్రీట్ వేదికగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పంజాబ్, చండీఘర్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్ధాన్, త్రిపుర, మణిపూర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు. 12 ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాలు 8 ఏళ్లుగా పోరాడుతున్నాయి. ఈనెల 7న చర్చలు జరిగినా కార్మిక సంఘాల డిమాండ్లు నెరవేరకపోవడంతో కార్మికులంతా హస్తిన బాట పట్టారు.

మహాపడావ్‌లో కార్మికులు ప్రధానంగా 18 వేల రూపాయల కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించడం, ధరల నియంత్రణతో ప్రజలపై భారం తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయకూడదన్న డిమాండ్లతో కార్మికులు కదం తొక్కారు. ఈ నిరసన కార్యక్రమంలో పోస్టల్, బీఎస్ఎన్‌ఎల్, అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు, రక్షణ శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మహా పడావ్ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంగన్‌వాడీ వర్కర్లు హాజరయ్యారు.

డీమానిటైజేషన్‌ వల్ల అసంఘటిత రంగంలో చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత అన్నారు. డీమానిటైజేషన్ వల్ల పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు లాభపడ్డాయన్నారు. ప్రభుత్వానికి ప్రజలు, కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తన విధానాలను మార్చుకోవాలని హేమలత అన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగడానికైనా సిద్ధమని హెచ్చరించారు.కార్మికుల సంక్షేమంతో పాటు రైతులు, ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కార్మిక యూనియన్లు డిమాండు చేస్తున్నాయి. ప్రభుత్వం ముందు పెట్టిన తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. లేదంటే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 

06:41 - November 10, 2017

హైదరాబాద్ : తీర్పులు చెప్పిన న్యాయమూర్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం ప్రారంభించారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయాలని, పంటకు 50శాతం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు దీక్షకు దిగారు. తెలంగాణలో అన్నదాతలకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ బాసటగా నిలిచారు. కర్షకులు పడుతున్న కష్టాలు, కడగళ్లపై చలించిన ఆయన..వారికి మద్దతుగా ఆందోళనబాట పట్టారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రోజు దీక్ష చేపట్టారు..రైతు పక్షపాతిగా చెప్పుకుంటూ గద్దెనెక్కిన కేసీఆర్‌..మూడేన్నరేళ్లు దాటినా అన్నదాతల సమస్యలు పరిష్కరించలేకపోయారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి బాసటగా నిలవాల్సిన పాలకులు వారిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ విచ్చలవిడిగా జీతాలు పెంచారని..రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. తప్పకుండా ఆయనకు రైతుల ఉసురు తగులుతుందని ఆక్షేపించారు.

అంతకుముందు జస్టిస్‌ చంద్రకుమార్‌ దీక్ష చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా మోహరించారు. ఇందుకు ప్రతిగా రైతు సంఘాల నాయకులు ఎం.సి.పి.ఐయూ పార్టీ కార్యాలయం నుంచి సుందర్యవిజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షకు ఏ.ఐ.కె.ఎం.యస్. ఏ.ఐ.కె.యస్ తో పాటు పలు రైతు సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి, కెచ్చుల రంగయ్య దీక్షలో కూర్చున్నారు.

06:38 - November 10, 2017

హైదరాబాద్ : భాగ్యనగరం కొత్త కొత్వాల్‌ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కమిషనర్‌ మహేందర్‌రెడ్డి డీజీపీ అవుతారన్న ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగా ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. ఈనెల 12న డీజీపీ అనురాగ్‌శర్మ పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుత పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి డీజీపీ అవుతారన్న ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం కూడా మహేందర్‌రెడ్డివైపే మొగ్గుచూపుతోంది. దీంతో మహేందర్‌రెడ్డి డీజీపీ అవుతారన్నది దాదాపుగా ఖరారు అయిపోయినట్టే.

మహేందర్‌రెడ్డి డీజీపీగా నియమితులైతే... హైదరాబాద్‌ సీపీ పోస్టు ఖాళీ అవుతుంది. దీంతో హైదరాబాద్‌ సీపీ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న పూర్ణచందర్‌రావు పోలీస్‌ కమిషనర్‌ రేసులో ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్‌, రవిగుప్తా కూడా సీపీ రేస్‌లో ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌, రాజీవ్‌ రతన్‌ సైతం కొత్వాల్ కొలువు కోసం పోటీలో ఉన్నారు. అయితే వీరిలో సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీవీ ఆనంద్‌ ట్రాక్‌ రికార్డు పరిశీలించిన ప్రభుత్వం.. ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో సీవీ ఆనంద్‌ నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు విప్లవాత్మకమైన మార్పులు తేవడం, డ్రంకన్‌ డ్రైవ్‌, ఈ- చలాన్ల విధానం అమలు చేయడం, ఫ్రీ లెప్ట్‌లాంటి మార్పులు అమలు సీవీ ఆనంద్‌ చేశారు. వీటన్నిటికంటే హైదరాబాద్‌పై పట్టున్న అధికారిగా ఆయనకు మంచి పేరుంది. దీంతో సిటీ పోలీస్‌ బాస్‌గా సీవీ ఆనంద్‌ ఎన్నిక అనివార్యం కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత యూపీఎస్సీకి ప్రతిపాదిత అధికారుల పేర్లను పంపాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందులో సీవీ ఆనంద్‌, పూర్ణచందర్‌రావు, అంజనీకుమార్‌తోపాటు మరో ఇద్దరు పేర్లు ఉండే చాన్స్‌ ఉంది. మరి వీరిలో సిటీ పోలీస్‌ బాస్‌ పదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

06:31 - November 10, 2017

విజయవాడ : వర్చువల్‌ క్లాస్‌రూంలు ..డిజిటల్‌ క్లాసులు.. కళాశాల్లో వైఫై.. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన సర్కారీ విద్యను పూర్తిగా సంస్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం పలు సూచనలు చేశారు. వాస్తవరూపం దాల్చని సుదర్ఘ లక్ష్యాల కంటే.. షార్ట్‌టర్మ్‌లో మంచి ఫలితాలు రాబట్టే వ్యూహాలను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41వేల 601 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల నిర్వహణ, కోసం పాఠ్యప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. విద్యార్థుల హాజరను పెంచేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 1లక్షా 66వేల 931 మంది ఉపాధ్యాయులకు వృత్తినైపుణ్యం పెంచేందుకు శిక్షణాకార్యక్రమాలు కూడా నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులకు ఏపీ ఇ-నాలెడ్జ్‌ ఎక్సేంజ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో డిజిటల్‌ విద్య, మౌలిక వసతుల కల్పన తదితర సౌకర్యాలకోసం 4వేల 848 కోట్లును కేటాయించామని సీఎం తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరానికల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 33వేల145 అదనపు తరగతి గదులు, 21,249 స్కూళ్లకు ప్రహరీగోడలు కట్టిస్తామన్నారు. మొత్తానికి సౌకర్యాల లేమి, అట్టడుగు విద్యా ప్రమాణాలతో కునారిల్లుతన్న సర్కారీ విద్యకు డిజిటల్‌ హంగులు అద్దుతామని సీఎం అంటున్నారు. సీఎం డిజిటల్‌ విజన్‌ను విద్యాశాఖ అధికారులు ఏమేరకు అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి.  

06:27 - November 10, 2017

విజయవాడ : అసెంబ్లీకి హాజ‌ర‌య్యే విషయంలో వైసీసీ శాసనసభ్యులు పునరాలోచనలో పడ్డారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేవరకు.. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నామ‌ని ఆ పార్టీ అధినేత చెబుతుంటే...ఎమ్మెల్యేలు మాత్రం ప్రజ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలనే మీమాంసలో పడ్డారు. ఇటు పార్టీ గీత దాట‌లేక‌, అటు అసెంబ్లీ మెట్లు ఎక్కలేక నానాతంటాలు ప‌డుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజ‌ర‌య్యే అంశం ఆ పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేవరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఓ వైపు జగన్‌ చెబుతుంటే...ప్రజలకు ఏం స‌మాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్యేలు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. 45 మంది ఎమ్మెల్యేల్లో కొంద‌రైనా స‌భ‌కు హాజ‌ర‌యితే పార్టీ తరఫునా మాట్లాడే అవ‌కాశం వ‌స్తుందని చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్ ఏ జిల్లాలో పాద‌యాత్ర చేస్తే...ఆ జిల్లా శాసనసభ్యులు మిన‌హా మిగతా వారు హాజ‌రయితే బాగుటుందని అనుకుంటున్నారట. ప్రజ‌ల్లో పార్టీపై వ్యతిరేక‌త రాకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

మరోవైపు జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్ర చేపట్టడం వల్లే...ఆ పార్టీ నేతలు అసెంబ్లీని బహిష్కరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలుంటే వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని..అధికారపార్టీ విమర్శించడం దారుణమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. స్పీకర్‌ ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే సభకు హాజరయ్యేందుకు తాము సిద్ధమంటున్నారు. ఏదీ ఏమైనా..వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేక... అధినేత మాటకు కట్టుబడుతారా అన్నది ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. 

06:25 - November 10, 2017

విజయవాడ : టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీ పనిదినాలపై శుక్రవారం జరగనున్న బీఏసీలో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారని ఎమ్మెల్యేలు, నేతలకు బాబు కితాబిచ్చారు. భవిష్యత్‌పై ప్రజలకు నమ్మకం కల్గించాలన్నారు. మంచిపనులు చేసి అందుబాటులో ఉంటే ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్నారు. రైతు రుణమాఫీని 3 విడతల్లో పూర్తి చేశామన్న చంద్రబాబు. మాఫీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికే పెద్దపీట వేసిందన్నారు.

 

మళ్లీ సరి బేసి విధానం..

ఢిల్లీ : దేశ రాజధానిలో వచ్చే వారం నుంచి మళ్లీ సరి బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యం అధిక స్థాయిలో నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.45గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. ఉదయం 10.45 గంటలకు మండలి బీఏసీ సమావేశం జరుగనుంది. 

Don't Miss