Activities calendar

11 November 2017

22:02 - November 11, 2017

కృష్ణా : జిల్లాలోని వీరులపాడు మండలం పొన్నవరంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి పర్యటించారు. పొన్నవరాన్ని ఆయన దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పొన్నవరం గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని సుజనాచౌదరి హామీ ఇచ్చారు. 

 

21:59 - November 11, 2017

కేరళ : ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కేరళ రాష్ట్రం కొచ్చిలో పర్యటిస్తున్నారు. కొచ్చిలో 10వేల సీటింగ్‌ సామర్ధ్యంగల లులు కన్వెన్షన్‌ సెంటర్‌, మాల్‌ను సీఎం సందర్శించారు. 250 గదులు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారు. ఈ నిర్మాణాన్ని చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. విశాఖలో కన్వెన్షన్‌ సెంటర్‌, మాల్‌ నిర్మాణం త్వరగా చేపట్టాలని లులు గ్రూప్‌ను సీఎం కోరారు. కొచ్చిలోని కన్వెన్షన్‌ సెంటర్‌కు బ్యాక్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఉండగా... విశాఖలో కన్వెన్షన్‌ సెంటర్‌కు సముద్రతీరం అదనపు ఆకర్షణ కానున్నదని, ఇందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని కోరారు. 

 

21:57 - November 11, 2017

కడప : చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని వైఎస్‌ జగన్‌ అన్నారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు సూచించిన అంశాలే మ్యానిఫెస్టోగా తయారు చేసి వాటిని పూర్తి చేసి 2024లో మళ్లీ తమ ముందుకు వస్తానని జగన్ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర 5వ రోజు పొట్లదుర్తి-ప్రొద్దుటూర్లలో కొనసాగింది. 

వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రజా సంకల్ప యాత్ర 5వరోజు పొట్లదుర్తి, ప్రొద్దుటూరులలో కొనసాగింది. పొట్లదుర్తిలో జగన్‌ వైసీపీ జెండా ఎగరవేసి పాదయాత్ర కొనసాగించారు. పొట్లదుర్తిలో వాల్మీకి - బోయ సంఘాలు జగన్‌ను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్‌బీఎస్‌కే ఉద్యోగులు, 108 ఉద్యోగులు, వీఆర్‌ఏల ప్రతినిధులు,  ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఉద్యోగులు, వికలాంగులు, వృద్దులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వారికి అండగా ఉంటానని జగన్‌ హామీ ఇచ్చారు. 

మధ్యాహ్నం ప్రొద్దుటూరులో భోజన విరామం అనంతరం తిరిగి 3 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.  ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాయంత్రానికి ప్రొద్దుటూరుకు చేరుకున్న జగన్ పుట్టపర్తి సర్కిల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని జగన్ విమర్శించారు. నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు సూచించిన అంశాలే మ్యానిఫెస్టోగా తయారు చేసి వాటిని పూర్తి చేసి 2024లో మళ్లీ తమ ముందుకు వస్తానని జగన్‌ చెప్పారు. రాత్రికి జగన్‌ ప్రొద్దుటూరు బైపాస్‌లో బస చేస్తారు. ఆదివారం మళ్లీ ఇక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. 

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈనెల 14 కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రానుంది. ఈనెల 15 వరకు దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. 
 

21:50 - November 11, 2017
21:47 - November 11, 2017
21:35 - November 11, 2017

నిజామాబాద్‌ : దేశ్యవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, లౌకికశక్తులపై బీజేపీ దాడులకు పాల్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారు. తమను ప్రశ్నించే వారి గొంతులను అణగదొక్కాలని చూస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నేత కండకావరం బయటపడింది. జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో బీజేపీ నేత భరత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చెరువుమట్టి తరలింపును అడ్డుకున్న ఇద్దరు దళితులపై దాడి చేశాడు. నీటి కుంటలోకి దిగి మునగమంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశాడు. దీంతో ఆ ఇద్దరు దళితులు ఎదురు చెప్పలేక కుంటలోకి దిగి నీటిలో మునిగారు. మరోవైపు భరత్‌రెడ్డి దౌర్జన్యంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భరత్ రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉండడం గమనార్హం. 
గంగాధరప్ప సీపీఎం జిల్లా కార్యదర్శి 
భరత్ రెడ్డి...బీజేపీ నాయకుడుగా ఉన్నాడు, రౌడీ షీటర్ గా ఉన్నాడు. ఇది చాలా దౌర్జన్యం. భరత్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బీజేపీ అండ చూకుసుని కండకావరంగా ఉన్నారు. అతనిపై చట్టపరమైన  చర్యలు తీసుకోవాలి. హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆయన్ను అరెస్టు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆందోళన చేపట్టి, ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. 
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు 
దేశ వ్యాప్తంగా బీజేపీ నేతల దాడులు పెచ్చు మీరిపోతున్నాయి. ఇద్దరి ప్రాణాలు తీసిండు అని అయనపై ఆరోపణలు ఉన్నాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల పట్ల సీఐటీయూ అండగా ఉంటుంది. బాధితులకు అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. 
దళిత్ శోచన్ ముక్తీ మంచ్ నేత జాన్ వెస్లీ 
దళితులపై బీజేపీ నేత దాడిని ఖండిస్తున్నాం. భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. హిందు ఉన్మాద పార్టీ అని బీజేపీ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. కేవీపీఎస్, టీమాస్ సభ్యులతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. న్యాయం జరిగి వరకు ఆందోళన చేస్తామని చెప్పారు.

 

21:13 - November 11, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జడ్జర్ల సమీపంలో లారీ..ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు పత్తి కూలీలు, ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు. మృతులు బండమీదికిపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. 

 

21:02 - November 11, 2017

కొరియోగ్రాఫర్ భానుతో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన డ్యాన్స్ కెరీర్ గురించి వివరించారు. పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే  2004లో డ్యాన్సర్ అయ్యాను. రేయ్ సినిమాతో కొరియోగ్రాఫర్ అయ్యాను అని తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్  ప్రాంక్ కాల్ చేసి, ఆటపట్టించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:58 - November 11, 2017

దళితులపై బీజేపీ నేత దౌర్జన్యం

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో బీజేపీ నేత భరత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చెరువుమట్టి తరలింపును అడ్డుకున్న ఇద్దరు దళితులపై దాడి చేశాడు. నీటి కుంటలోకి దిగి మునగమంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశాడు. దీంతో ఆ ఇద్దరు దళితులు ఎదురు చెప్పలేక కుంటలోకి దిగి నీటిలో మునిగారు. మరోవైపు భరత్‌రెడ్డి దౌర్జన్యంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

20:53 - November 11, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో బీజేపీ నేత భరత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చెరువుమట్టి తరలింపును అడ్డుకున్న ఇద్దరు దళితులపై దాడి చేశాడు. నీటి కుంటలోకి దిగి మునగమంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశాడు. దీంతో ఆ ఇద్దరు దళితులు ఎదురు చెప్పలేక కుంటలోకి దిగి నీటిలో మునిగారు. మరోవైపు భరత్‌రెడ్డి దౌర్జన్యంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 

20:51 - November 11, 2017
20:49 - November 11, 2017

గుంటూరు : జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 12వ తేదీ నుంచి బాలోత్సవ్‌ కార్యక్రమం మూడు రోజులపాటు జరగనుంది. దీనికోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశం నలుమూలల నుంచి ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులు ఈ బాలోత్సవ్‌లో పాల్గోనున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

20:47 - November 11, 2017

విజయవాడ : నవంబర్ 20న ఏపీ అసెంబ్లీని ముట్టడించాలని విజయవాడలో అఖిలపక్షం పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన హామీల అమలు, వాటి పరిష్కారాలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, తదితర సమస్యలపై విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నేతలు విడుదల చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో టీడీపీ ఏపీ ప్రజలను మోసపుచ్చే విధంగా వ్యవహారిస్తున్నాయని, రాష్ట్ర విభజనలో కేంద్రం అనేక హామీలిచ్చి విస్మరించిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్రనాయకులు వై. వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. హామీల అమలులో భాగంగా అఖిలపక్షం ప్రజా సమస్యలపై పోరాడేందుకు సమాయత్తమవుతున్నట్లు నేతలు తెలిపారు. 

 

20:22 - November 11, 2017

విజయవాడ : ప్యారడైజ్‌ పత్రాల్లో జగన్‌ పేరు వచ్చినా వైసీపీ నేతలు స్పందించకపోవడం పలు అనుమానాలను బలపరుస్తున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ అన్నారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినా ఒక్క వైసీపీ నేత కూడా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. జగన్‌ పాత్ర లేకపోతే ఆరోపణలపై పరువు నష్టం దావా వేయచ్చు కదా అని వైసీపీని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.

20:20 - November 11, 2017

కర్నూలు : ఆడపిల్లలకు విద్య కొండంత అండ అన్నారు మంత్రి అఖిలప్రియ. తప్పకుండా ప్రతి ఆడపిల్ల చదువుకుని ఉన్నతస్ధాయికి ఎదగాలని ఆమె సూచించారు. కర్నూలులో మైనార్టీస్ వెల్‌ఫేర్‌ డే సందర్భంగా ఉస్మానియా కాలేజీలో మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచస్ధాయిలో చదువుతో పోటీ పడగలిగే నాణ్యమైన విద్య కోసం సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. 


 

20:01 - November 11, 2017

కడప : వైసీపీ అధినేత జగన్‌పై వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కి నీతి, నిజాయితీ ఉంటే కడప జిల్లాలో పాదయాత్ర ముగిసేలోపు... తనపై అక్రమాస్తుల కేసులు ఎందుకు వచ్చాయి, వేల కోట్ల రూపాయలెలా వచ్చాయో వివరణ ఇవ్వాలన్నారు. కడపలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి సోమిరెడ్డి.. జగన్ రాష్ట్రానికి సీఎం అయితే ఆయన ఆస్తులు పెరుగుతాయని.. అదే చంద్రబాబు సీఎం అయితే ప్రజల ఆస్తులు  పెరుగుతాయన్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే టీడీపీకి సవాల్ చేయడం కాదని, సీబీఐ,ఈడీపై సవాల్ చేయాలని డిమాండ్‌ చేశారు. 

 

19:57 - November 11, 2017

కడప : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఐదో రోజు పాదయాత్ర ఎర్రగుంట్ల - ప్రొద్దుటూరు రోడ్డు నుంచి ప్రారంభమైంది. పొట్లదుర్తిలో జగన్‌ వైసీపీ జెండా ఎగరవేశారు. వాల్మీకి - బోయ సంఘాలు జగన్‌ను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్‌బీఎస్‌కే ఉద్యోగులు, 108 ఉద్యోగులు, వీఆర్‌ఏల ప్రతినిధులు,  ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఉద్యోగులు, వికలాంగులు, వృద్ధులు జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వారికి అండగా ఉంటానని జగన్‌ హామీ ఇచ్చారు. 

 

19:51 - November 11, 2017

కరీంనగర్‌ : నగరంలోని.. ప్యారడైజ్  పాఠశాలలో ఆర్యభట్ట టాలెంట్ టెస్ట్‌ను ఆదివారం నిర్వహిస్తున్నట్టు పాఠశాల చైర్మన్ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. 5, 6, 7  తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడున్నర వరకూ,  8,9,10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని స్కూల్ ఛైర్మన్ ఫాతిమారెడ్డి చెప్పారు. 

 

19:49 - November 11, 2017

హైదరాబాద్‌ : నగరంలో గీతం యూనివర్శిటీ 8వ స్నాతకోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18న జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారు. ఈ స్నాతకోత్సవంలో వెంకయ్య నాయుడికి గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ యేడాది ఉత్తీర్ణులయిన 1053 మంది విద్యార్థలు కాన్వకేషన్ అందుకోనున్నారు. తమ వర్శిటీలో పాసైన 96 శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ వచ్చాయని...ఏటా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు గీతం వీసి శివప్రసాద్ తెలిపారు. 

 

19:47 - November 11, 2017

కరీంనగర్ : ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధినుల విభాగం రెండో తెలంగాణ రాష్ట్ర స్థాయి మహాసభలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ముఖ్య అతిధిగా హజరై సమావేశాలను ప్రారంభించి విద్యార్ధినులతో పలు అంశాలపై చర్చించారు. సమావేశాలకు 31 జిల్లాల నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు హాజరయ్యాయి. పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు విద్యార్ధినిలు ఆందోళనలు చేయాలని మల్లు స్వరాజ్యం సూచించారు.

19:43 - November 11, 2017

సిద్దిపేట : నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్‌ రావు  అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో అంగన్‌ వాడీ భవనాన్ని, వ్యవసాయ గిడ్డంగిని ప్రారంభించారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి ఒక ఎకరం భూమిని ఉచితంగా ఇచ్చిన గజ్వేల్‌ వెంకటయ్యను సత్కరించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలని డీఈఓకి సూచించారు. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. 

 

గుంటూరులో కూలిన నాలుగంతస్తుల భవనం

గుంటూరు : జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. మణి హోటల్‌ సెంటర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. 

19:39 - November 11, 2017

గుంటూరు : జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. మణి హోటల్‌ సెంటర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో బిల్డింగ్‌ పిల్లర్‌ దెబ్బతింది. మధ్యాహ్నం పిల్లర్‌ కుంగిపోవటంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది.

 

19:35 - November 11, 2017

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మోడీతో జతకడుతున్నారని  సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. పెద్దనోట్ల రద్దును, జీఎస్టీని బలపరిచారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్మికులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించకపోతే సహించేది లేదని సాయిబాబు హెచ్చరించారు. మహా పడావ్‌ విజయవంతం చేసిన కార్మికులకు సీఐటీయూ తరపున సాయిబాబు విప్లవ వందనాలు తెలిపారు. 

19:30 - November 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ వద్ద చేపట్టిన అండర్‌ పాస్‌ నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. అయ్యప్ప సొసైటీ మార్గంలో 220 మీటర్లు, కొండాపూర్‌ సైడ్‌ 160 మీటర్ల పొడవునా నిర్మించే ఈ అండర్‌ పాస్‌తో ఈ మార్గంలోని ట్రాఫిక్‌ సులువుగా మూవ్‌ కావడానికి వీలవుతుంది. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్ట్‌ పనులపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

19:26 - November 11, 2017

ఆసిఫాబాద్ : మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కడియం శ్రీహరి కాగజ్‌నగర్‌లోని ఉన్నత పాఠశాలలోని డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. అక్కడే జూనియర్ కాలేజ్‌ విద్యార్థులకు కోనేరు ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందిస్తున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సిర్పూర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు.. అలాగే ఆశ్రమ పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు.

 

19:24 - November 11, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ ఇచ్చిన అబద్దపు హామీలపై రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ఎండగడతారని.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జ్‌ కుంతియా అన్నారు. రేవంత్‌ ఆహ్వానం మేరకు ఆయనతో కుంతియా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాధాన్యత లేదన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో బిజీ అయినందున రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు కాలేదని కుంతియా తెలిపారు.   

 

19:21 - November 11, 2017

హైదరాబాద్ : ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీ-కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చార్మినార్‌ నుంచి గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలకు 4 నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న కేసీఆర్‌ అధికారం చేపట్టి 40 నెలలైనా అమలు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచేది లేదని తెగేసి చెబుతుంటే.. కేంద్రం అమలు చేస్తుందంటూ కేసీఆర్‌ మరోసారి మోసం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. 

 

19:09 - November 11, 2017

సినిమాలపై బీజేపీ పెత్తనం పెరుగుతోందని వక్తలు అన్నారు. ఇటీవల విడుదలైన మెర్సెల్ చిత్రంపై కేంద్ర ప్రభుత్వం సెన్సార్ విధించింది. విడుదల కానున్న పద్మావతి సినిమాపై తీవ్ర గందరగోళం చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, బీజేపీ అధికారి ప్రతినిధి కొల్లి మాధవి, కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొని, మాట్లాడారు. తమకు నచ్చని, వ్యతిరేకంగా ఉన్న సినిమాలపై బీజేపీ ఆంక్షలు విధిస్తున్నారని, సెన్సార్ చేస్తున్నారని పేర్కొన్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:58 - November 11, 2017

ఢిల్లీ : కార్మికుల నినాదాలతో హస్తినలో మూడోరోజు మహా పడావ్ హోరెత్తింది.  దేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలపై నినదించారు. ఈరోజు ముఖ్యంగా అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు వేలాదిగా హాజరయ్యారు. కనీస వేతనాలు చెల్లించడంతో పాటు.. పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు మహా పడావ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్లు బతుకమ్మ ఆడారు. కార్మికుల నిరసనలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో  భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జనవరి మొదటివారంలో దేశ వ్యాప్తంగా జిల్లా స్ధాయిలో సదస్సులు నిర్వహించాలని.. జనవరి చివర్లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు  రాబోయే బడ్జెట్‌లో కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకోకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిరసన తెలిపాలని నిర్ణయించాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:50 - November 11, 2017

హైదరాబాద్ : తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి వచ్చే వరకు టీజేఏసీ పోరాడుతుందని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందని ఆశపడితే.. కేసీఆర్‌ ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. సమస్య పరిష్కారం కోసం పోరాడితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 30న సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ నిర్వహిస్తామన్నారు. 
నిరుద్యోగులకు మార్గం చూపేందుకే కొలువుల కొట్లాట అని పేర్కొన్నారు.

 

రేవంత్ తో భేటీ కి ఎలాంటి ప్రాధాన్యత లేదు: కుంతియా

హైదరాబాద్: టి. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరిన తర్వాత ఒలిసారి రేవంత్ రెడ్డి ఇంటికి కుంతియా వెళ్లారు. రేవంత్ తో భేటీ కి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. కేసీఆర్ అబద్ధపు హామీలను జనంలో ఎండగతామన్నారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ఖరారు కాలేదన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీగా ఉన్నట్లు తెలిపారు.

16:57 - November 11, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న సరి..బేసి సంఖ్య విధానానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం ఎన్‌జిటి 3 షరతులు విధించింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరి వర్తింప జేయాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వాహనాలు అంబులెన్స్‌, ఫైర్‌ బ్రిగేడ్, మున్సిపల్‌ వాహనాలకు ఆడ్‌ ఈవెన్‌ విధానం నుంచి మినహాయింపు నిచ్చింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 30 శాతం కాలుష్యాన్ని వెదజల్లుతున్న ద్విచక్ర వాహనాలకు మినహాయింపునివ్వడం సరికాదంది. ఫోర్‌ వీలర్‌ పెట్రోల్‌ కార్లకన్నా ఇవి ఎక్కువ కాలుష్యాన్ని వదులుతాయని పేర్కొంది. సరి-బేసి నిబంధనల ప్రకారం నంబర్‌ప్లేట్‌ చివర్లో సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజున, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాలి. దీని వల్ల వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. 

 

16:31 - November 11, 2017
16:30 - November 11, 2017

హైదరాబాద్ : వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మీకు వత్తాసు పలకుతున్న ప్రసార మాధ్యమాలతో మధ్యపెడతామంటే అది కలకాలం జరుగదని చంద్రబాబును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు గమనిస్తున్నారు..జరుగుతున్న తీరును చూస్తున్నారని తెలిపారు. మీ వ్యవహార శైలిని చూస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. చట్ట సభలను ఏ రకంగా మీ చుట్టాలుగా తీసుకెళ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలి పోతారని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రిని, శాసనసభను, స్పీకర్ ను ఎప్పుడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రాదాయం కాదని ఇకనైన ఆలోచన ధోరణి మార్చుకోవాలన్నారు. సీఎం, స్పీకర్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. చట్ట సభలకున్న గౌరవాన్ని కాపాడాలని సూచించారు. వెంటనే పార్టీ పిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలను తొలగించాలన్నారు. మరునిమిషంలో తమ పార్టీ శాసనసభ్యులు సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తారని చెప్పారు. రాజధాని అమరావతికి మీరు చేస్తున్న గొప్ప ఏంటీ..జగన్ చేస్తున్న ముప్పేంటి అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఒక్క లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం చేరుకోలేదని విమర్శించారు.

 

రేవంత్ రెడ్డి ఇంటికి కుంతియా

హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా వెళ్లారు.

రామచంద్రాపూర్ లో మంత్రి కేటీఆర్ ఔదార్యం

రాజన్న సిరిసిల్ల: తుంగెళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ లో మంత్రి కేటీఆర్ ఔదార్యం చూపారు. సొంత డబ్బుతో అనాథ వృద్ధురాలికి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇచ్చారు.

కూలిన రెండంతస్థుల భవనం... తప్పిన పెనుప్రమాదం..

గుంటూరు: మణి హోటల్ సెంటర్ సమీపంలో రెండు అంతస్తుల భవన కూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు భావిస్తున్నారు. కాలువ కోసం తవ్వుతుండగా పిల్లర్ కు తగిలి భవనం కూలినట్లు తెలుస్తోంది.

సరి-బేసి విధానాన్ని వాయిదా వేసిన ఆప్ సర్కార్

ఢిల్లీ : సరి బేసి విధానాన్ని ఆప్ సర్కార్ వాయిదా వేసింది. సరి-బేసి విధానం నుంచి మహిళలు, ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ కోరుతోంది. మహిళల భద్రత విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ కోరుతోంది. 13వ తేదీన దీనికి సంబంధించి ఎన్టీటీలో ఆప్ సర్కార్ పిటిషన్ దాఖలు చేయనుంది.

15:51 - November 11, 2017


ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సరి...బేసి సంఖ్య విధానాన్ని పాటించాలని ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. సరి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు బయటకు వెళ్లాలని ఎన్జీటీ కోర్టు ఆదేశించింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 15 ఏళ్లు నిండిన పాత కాలం నాటి వాహనాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. నగరాన్ని మింగేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఈ స్కీమ్‌ను పాటించాల్సిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

 

15:47 - November 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. స్థానిక పీస్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై జుబేద్‌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జుబేద్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చి ఉంటాడన్న అనుమానంతో జుబేద్‌ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితునికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

 

ఏసీబీ వలలో ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

తూ.గో: రాజమహేంద్రవరంలో ఓ లాడ్జిలో ఏబీసీ దాడి చేసింది. రూ. 50వేలు లంచం తీసుకుంటూ ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి పట్టుబడ్డాడు. మెమోల విషయంలో డిగ్రీ కాలేజీకి చెందిన కోఆర్డినేటర్ ను లక్ష రూపాయల లంచాన్ని డిమాండ్ చేశాడు.

రోహిణి ఆస్పత్రి అగ్నిమాద ఘటనలో మరొకరి మృతి

వరంగల్ : హన్మకొండ రోహిణి ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమారం గ్రామానికి చెందిన రోగి ఇన్ఫెక్షన్ తో మృతి చెందింది. ఆసప్రతి వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ నివేదిక రాకుండానే ఆసుపత్రిలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరలు అయ్యాయి.

సరి-బేసి సంఖ్యల విధానాన్ని తక్షణం అమల్లోకి తీసుకురండి:ఎన్జీటీ

ఢిల్లీ: కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలను ఎన్జీటీ సమర్థించింది. సరి-బేసి సంఖ్యల విధానాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. ప్రతి సిగ్నల్ లో వాహనాలను నిశితంగా పరిశీలించాలని, పదేళ్లు దాటిన డీజిల్, 15ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలజప్తునకు ఆదేశించింది. ఢిల్లీలోకి అత్యవసరం వాహనాలను మాత్రమే అనుమతించాలని, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి భారీ వాహనాలు, ట్రక్కులు అనుమతించవద్దని కూడా ఆదేశించింది. సరి-బేసి సంఖ్యల విధానం అమల్లో ద్విచక్ర వాహనాలకు మినహాయింపు లేదని ఎన్టీటీ స్పష్టం చేసింది.

త్వరలో పవన్ జిల్లాల పర్యటన - హరిప్రసాద్...

విజయవాడ : యువతను..మేధావలును పార్టీల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు, త్వరలోనే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఉంటుందని జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటర్ నియోజకవర్గంలో నిర్వాహకుల ఎంపిక చేపడుతున్నారు. 

దళితుల్లో చైతన్యం కోసం హర్షకుమార్ చైతన్య సభ..

రాజమహేంద్రవరం : దళితులపై దాడులు జరుగుతుండడంతో వారిని చైతన్యవంతం చేసేందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ నడుం బిగించారు. వారిని చైతన్యవంతం చేసేందుకు ఓ సభను ఏర్పాటు చేశారు. 

చైనా ఓపెన్ సిరీస్ కు శ్రీకాంత్ దూరం..

ఢిల్లీ : భారత షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ కు దూరమయ్యాడు. నాగ్ పూర్ లో ఇటీవలే ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ గాయపడ్డాడు. కాలుకు అయిన గాయాన్ని వైద్యులు పరిశీలించి చికిత్స తీసుకోవాలని సూచించారు. 

13:32 - November 11, 2017

మండలి చీప్ విప్ గా పయ్యావుల ?

విజయవాడ : శాసనమండలిలో చీప్ విప్ గా పయ్యావుల కేశవ్, అసెంబ్లీ చీప్ విప్ గా పల్లె రఘునాథరెడ్డి పేర్లను దాదాపు ఖరారైనట్లు సమాచారం. 

13:24 - November 11, 2017

విజయవాడ : యువతను..మేధావులను పార్టీల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు, త్వరలోనే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఉంటుందని జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటర్ నియోజకవర్గంలో నిర్వాహకుల ఎంపిక చేపడుతున్నారు. ఈసందర్భంగా పార్టీ నిర్మాణం..తదితర వివరాలను హరి ప్రసాద్ టెన్ టివికి తెలియచేశారు. పార్టీ నిర్మాణంకంటూ ఒక పట్టు ఉందని..పార్టీ అధ్యక్షుడు బ్లూ ప్రింట్ రూపొందించారని తెలిపారు. స్పీకర్..కంటెంట్ రైటర్లు..అనలిస్టుల ఎంపిక చేయడం జరుగుతోందని..పార్లమెంటరీ నియోజకవర్గంలో సేవ చేయడానికి

పార్టీ విధి విధానాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 42 పార్లమెంట్ నియోజకవర్గంలో 800 మందిని ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరికి డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో ఒక శిక్షణ కార్యక్రమం ఉంటుందని..ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించి దశ..దిశా నిర్దేశం చేస్తారన్నారు. ఇక త్వరలోనే పవన్ జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. 

13:22 - November 11, 2017

రాజమహేంద్ర వరం : దళితులపై దాడులు జరుగుతుండడంతో వారిని చైతన్యవంతం చేసేందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ నడుం బిగించారు. వారిని చైతన్యవంతం చేసేందుకు ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. దళిత మేధావులతో చైతన్య సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిడిపి హాయంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, చంద్రబాబు సీఎం అయ్యాక ఏకంగా 17 చోట్ల దాడులు జరిగాయని తెలిపారు. దాడులు అనంతరం ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదని విమర్శించారు. బాధితులను ఒక్కచోట చేర్చి వారి గళం ప్రభుత్వానికి వినిపించడానికి..దళితుల్లో చైతన్యం కల్పించేందుకు 'చైతన్య సదస్సు' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందంతో దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు..

జమ్ముకశ్మీర్:రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. మోర్టార్లతో దాడి చేసిన పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన కాల్పులు రెండుగంటల పాటు కొనసాగాయి

12:47 - November 11, 2017

హైదరాబాద్ : ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుకొంటోందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం మరోసారి ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొలువులకై కొట్లాట పేరిట ఆయన పలు జిల్లాలో పర్యటించారు. కానీ పోలీసులు సభలకు అనుమతినివ్వడం లేదు. దీనితో టీజేఏసీ కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టు వారి సభకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోదండరాం శనివారం మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా దరఖాస్తు చేసుకంటే తగిన విధంగా స్పందించాలని కోర్టు సూచిస్తూ తమకు పర్మిషన్ ఇచ్చిందన్నారు. మీటింగ్ లకు సంబంధించి గైడ్ లైన్స్ తయారు చేస్తామని ప్రభుత్వం పేర్కొందని, న్యాయసమ్మతంగా పరిష్కరించాలని కోర్టు సూచించడం జరిగిందన్నారు. శాంతిభద్రతల పేరిట పరిమితులు నియమించే అవకాశం ఉందని..అనుమతి నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్ లో ఒక నిరసన సభ చేయాలని చూస్తున్న వారందరీ విజయమన్నారు. సభ జరుపుకోవడానికి పోరాటం చేయడం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 30న సరూర్ నగర్ స్టేడియంలో సభ.. డిసెంబర్ 9-10-11 అమరుల స్పూర్తి యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

12:42 - November 11, 2017

కృష్ణా : జిల్లాలో అడవి దుప్పి మాంసం అంటూ కుక్క మాంసం విక్రయిస్తుండడం తీవ్ర సంచలమైంది. ఈ ఘటన జి.కొండూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ మండలంలో శనివారం..ఆదివారం అడవి దుప్పి మాంస విక్రయాలు జోరుగా సాగుతాయి. కొంతమంది అడవిలోకి వెళ్లి అడవి దుప్పిలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు. దీనితో ఇద్దరు వ్యక్తులు వీధి కుక్కలను వధించి అడవి దుప్పి మాంసం అంటూ విక్రయిస్తున్నారు. కొంతమందికి అనుమానం వచ్చి నూజీవీడు డీఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగి వారిద్దరినీ అరెస్టు చేసి కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. జంతు నిరోధక చట్టం..మోసం కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

శశికళ బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బంధువులు, జయటీవీ కార్యాలయంలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ ఆఫీస్‌, నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయం సహా చెన్నైలోని మొత్తం 40 చోట్ల శనివారం ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు తనీఖీలు చేపట్టారు. శశికళ మేనల్లుడు, జయటీవీ ఎండీ వివేక్‌ జయరామ్‌, అతడి సోదరి కృష్ణ ప్రియ నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు.

పాదయాత్రలో జగన్ ను కలిసిన 104,108 సిబ్బంది

కడప: ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 104, 108 సిబ్బంది శనివారం కలిశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి జగన్ పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్బంగా అక్కడకు చేరుకున్న 104, 108 సిబ్బంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరించారు. 

12:29 - November 11, 2017

ఢిల్లీ: నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది. సరి-బేసి విధానాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్‌జిటి సూచించింది. ఏడాది కాలంగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై శనివారం విచారణ చేపట్టనుంది. 

12:20 - November 11, 2017

రంగారెడ్డి : మైలార్ దేవుపల్లిలోని కింగ్స్ కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. హసన్ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులకు కారణం భూ తగదాలే కారణమని తెలుస్తోంది. హసన్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఛాతి భాగంలో బుల్లెట్లు దూసుకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అసలు ఎందుకు కాల్పులు జరిపారు ? అనేది తెలియరావడం లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

12:18 - November 11, 2017

చెన్నై : పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. కానీ తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నాడు ఆ తమిళ హీరో. తను తీసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ కాలంలోనే సినీ రంగ ప్రవేశం చేసి ప్రజల హృదయాలను దోచుకుంటున్న ఆ యువ హీరోపై 10టీవీ కథనం. తమిళ నాట పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు.. కానీ ప్రజల గుండెల్లో సహజ నటుడిగా, ప్రజల నటుడిగా నిలిచి పోతున్నాడు. తాను సంపాదిస్తున్నదంతా ప్రజల ద్వారా వచ్చిందేనని అంటున్నాడు.. అందుకే ఆ డబ్బుతో విద్యార్ధులకు, వికలాంగులకు, రైతులకు అవసరమయ్యే నిత్యవసరాల్ని అందిస్తానని ప్రకటించాడు. 

తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన నటుడినేనని.. తాను పేదల కష్టాలను అర్ధం చేసుకోగలనని విజయ్‌ సేతుపతి తెలిపారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. ఇటీవల అనిల్‌ సేమియా కంపెనీ యాడ్‌లో నటించి 50లక్షల రూపాయల చెక్కుని పారితోషికంగా అందుకున్నాడు. ఆ చెక్కును కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌కి అందచేసి విద్యలో వెనుకబడిన జిల్లాలో నీట్‌కు బలైన అనిత పేరున అంగన్‌ వాడీ కేంద్రాలకు, పేద వికలాంగ విద్యార్ధులకు వినియోగించాలని విజయ్‌ సేతుపతి కలెక్టర్‌ని కోరారు. ఇదంతా నా పబ్లిసిటీ కోసం చేసుకోవటం లేదని.. ఇది చూసి కొందరైనా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తారనే ఆకాంక్షను విజయ్‌ సేతుపతి వ్యక్తంచేశారు. తాను కష్టపడి సంపాదించే డబ్బును దాన ధర్మాలకు వినియోగిస్తూనే.. ఇలా పెద్దమొత్తంలో డబ్బును పేదలకు అందచేస్తున్న విజయ్‌ సేతుపతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

12:16 - November 11, 2017

విజయనగరం : ఆఫీసుకు వచ్చామా.. ఫైళ్లు తిరగేశామా.. ఇంటికి వెళ్లిపోయామా అనే రొటీన్‌ పని అంటే సరిపడదు ఆ అధికారికి. ప్రజలతో మమేకం అవుతూనే సమస్యలను పరిష్కరించడం ఆయన స్టైల్‌. అధికారిక పనులే కాదు సామాజికి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఓ మంచి పబ్లిక్‌ సర్వెంట్ అని ప్రశంశలు అందుకుంటున్నారు విజయనగరం జిల్లా ఎస్‌కోట మండల అధికారి. విజయనగరం జిల్లా కొత్తవలస మండల తహశీల్దార్ గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు విధి నిర్వహణలోనే కాదు....సామాజిక కార్యక్రమాలను చేపట్టడంలోనూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వృత్తిపరంగా నిత్యం బిజీగా ఉండే ఈ అధికారి.. ప్రభుత్వం చేపట్టే సామాజిక అవగాహన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.

నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కూడా తహశీల్దార్‌ శ్రీనివాసరావు అనుక్షణ విభిన్నంగా ఆలోచిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్చభారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జిల్లాలో మిగిలిన అధికారుల కంటే శ్రీనివాస్‌ ముందంజలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా తాను ముందుండి కార్యక్రమాలను చేపడుతున్నారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులను, ప్రజలను, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ మండలంలో స్వచ్చ కార్యక్రమాలను జోరుగా చేపడుతున్నారు. ప్రజల మెప్పును పొందుతున్నారు.

నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను పరిష్కరించడంలో కూడా తహశీల్దార్ శ్రీనివాస్ విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఇటీవల కొత్తవలస మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే రహదారిలో షాపులను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు కూడా పరిష్కరించలేని ఈ సమస్యను తహశీల్దార్ చాకచక్యంగా ఈ పరిష్కరించడంతో ఎస్‌కోట మండల ప్రజలు హర్షం వక్యక్తం చేస్తున్నారు. గతంలో విజయనగరం తహశీల్దార్ గా పనిచేసినప్పుడు కూడా ఈయన ఇదే విధంగా తన కార్యాలయాన్ని తీర్చిదిద్ది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు.. తన తోటి ఉద్యోగులు అందిస్తున్న సహాయ సహకారాలతోనే తాను ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్టు వినమ్రంగా చెబుతారు తహశీల్దార్‌ శ్రీనివాస్‌. దర్పం ప్రదర్శించడానికి తన అధికారాన్ని వాడుకోకుండా సామాజిక, ప్రజా చైనత్య కార్యక్రమాలను చేపడుతున్న తహశీల్దార్ శ్రీనివాసరావు చాలా మంది అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

12:14 - November 11, 2017

నాగర్ కర్నూలు : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. 2008 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పాఠశాలలో సకల వసతులు ఉన్నాయి. అందమైన పాఠశాల భవనం, పచ్చని చెట్లతో పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తుంది. పాఠశాల గోడలపై దేశనాయకుల చిత్రాలు, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని పెంచే చిత్ర పటాలు దర్శనమిస్తాయి. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఇక్కడ ప్రస్తుతం 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు.

ఈ కస్తూర్భాలో ప్రస్తుతం 197 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం లంబాడి తండాల నుండి వచ్చిన అనాథ పిల్లలే ఉంటారు. విద్యార్థులకు ఎలాంటి లోటు కలగకుండా పాఠశాల సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఆహారంలో గుడ్లు, పండ్లతో పాటు ప్రతి నిత్యం నాణ్యమైన భోజనం అందిస్తారు. విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇక్కడి పాఠశాల యాజమాన్యం తమని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అనాథలుగా ఉన్న తమకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తామంటున్నారు విద్యార్థినిలు. చదువులో మాత్రమే కాదు ఆటపాటల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామంటున్నారు కస్తూర్భా యాజమాన్యం. ఇక్కడికి వచ్చే విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటామని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న అనాధపిల్లలకు ఆశ్రమంలా నిలుస్తున్నాయీ కస్తూర్భాలు. ప్రభుత్వం ఇలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. 

12:13 - November 11, 2017

హైదరాబాద్ : నగరంలోని నగల వ్యాపారి సింగపూర్‌లో హత్యకు గురయ్యాడు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతుంది..కిడ్నాపర్లు పక్కా ప్లాన్‌తో వ్యాపారిని రప్పించి బంధించారు...ఆ తర్వాత మూడు కోట్లు డిమాండ్ చేసి చివరకు చంపారు.. అయితే కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్ పాకిస్థాన్ చెందినవాడుగా తెలుస్తోంది...పాక్ యువకుడికి...నగల వ్యాపారికి లింకులేంటి.???

హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి వాసుదేవరాజ్ కుషాయిగూడలో ఉంటున్నాడు...కమలానగర్‌లో ఉంటున్న వాసుదేవ్‌ వ్యాపారం విషయమై సింగపూర్ కు తీసుకెళ్లారు దుండగులు...ఆ తర్వాత ఓ గదిలో బంధించారు...వాసుదేవ్‌ను కిడ్నాప్ చేశామని.. విడిచిపెట్టాలంటే మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు...వాసుదేవ్‌ను బంధించిన ఫోటోలు వాట్సాప్ ద్వారా కుటుంబీకులకు పంపారు...జరిగిన ఘటన నుంచి తేరుకునేసరికి కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేదని వాసుదేవ్‌ను కిరాతకంగా చంపారు కిడ్నాపర్లు..

గత నెల 31న వాసుదేవ్‌ హత్యకు గురయినట్లు గుర్తించిన సింగపూర్ పోలీసులు ఇండియన్ అంబసీకి సమాచారం అందించారు..దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్ది కాలంగా ఫేస్ బుక్ లో పరిచయం అయిన పాకిస్థాన్ చెందిన యువకుడితో హత్యకు గురయిన వాసుదేవ్‌ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు...దీంతో ట్రాప్ చేసిన ఆ దుండగులు వ్యాపారం నిమిత్తం వాసుదేవ్ ను సింగపూర్ పిలిపించి ఉంటాడని పోలిసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ చెందినవారంటూ పరిచయం చేసుకున్నారా.. లేక మరేదైనా జరిగిందా..? వాసుదేవ్ వారితో వ్యాపార లావాదేవీలు ఏదైనా చేశాడా..?^లేక వారి ట్రాప్‌లో పడి సింగపూర్ వెళ్లాడా..? ఇలాంటి ఎన్నో విషయాలపై అనుమానాలున్నాయి..పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు...

కుషాయిగూడ చెందిన వాసుదేవ్ రాజ్ కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు...వాసుకు చెందిన పాస్ పోర్ట్, విసా తదితర వివరాలతో సింగపూర్ పోలిసులు భారతీయుడు హత్యకు గురైనట్లు కనుగొని సమాచారం చేరవేశారు...సింగ్ పూర్ నుంచి వాసు డెడ్‌బాడీని హైదరాబాద్ తెప్పించేందుకు కుటుంబీకులు..పోలీసులు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు..మరో రెండ్రోజుల్లో డెడ్‌బాడీ వచ్చే అవకాశం ఉంది...

12:10 - November 11, 2017

కరీంనగర్ : భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజా ప్రతినిధుల అండతో దర్జాగా భూ దందాకు పాల్పడుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ భూ కబ్జాకు పాల్పడుతున్నాడో కాంట్రాక్టర్‌. ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోన్న కాంట్రాక్టర్‌ భూ కబ్జాపై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ప్రభుత్వ భూమి. సర్వే నంబర్‌ 98 పేరుతో ఉన్న ఈ భూమికి మంచి డిమాండ్ ఉంది. నాలుగు కోట్ల విలువ చేసే ఈ 17 ఎకరాల ఖాళీ స్థలంపై కార్పొరేషన్‌కు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌ కన్ను పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఈ భూమిని తన భూమిగా పత్రాలను సృష్టించి బేరానికి పెట్టేశాడు. పక్కనే ఉన్న ప్రైవేటు భూమికి చెందిన 104 సర్వే నంబర్ పేరుతో... రెవెన్యూ అధికారి హస్తంతో కాంట్రాక్టర్‌ ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను సృష్టించి అమ్మకానికి పెట్టాడు.

రెండు దశాబ్దాలుగా రామగుండం కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్‌ భూమిని తన సొంతం చేసుకునేందుకు భారీగా నజరానాలు ముట్ట జెప్పారనే ఆరోపణలున్నాయి. అయితే 98 సర్వే నంబర్‌ భూమి ప్రభుత్వానిది అని తెలిసినప్పటికీ కార్పొరేషన్‌ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని కార్పరేటర్లు ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువ చేసే భూముల్ని గద్దల్లా తన్నుకుపోతున్నా పట్టించుకునే వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటున్నారు కార్పొరేటర్లు. 98వ సర్వే భూమిపై విచారణ చేస్తున్నామని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి హద్దులు కేటాయిస్తామని రామగుండం తహసిల్దార్‌ శ్రీనివాస్‌ అంటున్నారు. అయితే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు చేపడితే సహించేదిలేదంటున్నారు రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు. 

12:09 - November 11, 2017

విజయవాడ: ఏపీ శాసనసభ, శాసనమండలిలో ఖాళీగా ఉన్న చీఫ్‌ విప్‌, విప్‌ల పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఒకటి రెండు రోజుల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చీఫ్‌ విప్‌, విప్‌ల పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌ ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. చంద్రబాబు గతంలోనే ఇచ్చిన హామీ మేరకు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మైనారీవర్గ ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. 58 మంది సభ్యులున్న మండలిలో టీడీపీకి 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలి చైర్మన్‌గా ఫరూక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం ఫరూక్‌ ప్రమాణ స్వీకారం చేసే చాన్స్‌ ఉంది. డిప్యూటీ చైర్మన్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం కొనసాగుతున్నారు. మండలిలో చీఫ్‌ విప్‌, విప్‌ల పదవుల భర్తీపై చంద్రబాబు దృష్టి పెట్టడంతో పలువురు ఎమ్మెల్సీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కౌన్సిల్‌లో రెండు విప్‌ పోస్టులను మూడుకు పెంచే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ పదవులను భర్తీకి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్‌, టీడీ దశరథ జనార్దన్‌రావు, బీద రవిచంద్రయాదవ్‌, పయ్యావుల కేశవ్‌ చీఫ్‌ విప్‌ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మండలి చైర్మన్‌ పదవికి రాయలసీమకు చెందిన ఫరూక్‌ పేరును ఖరారు చేయడంతో ఇదే ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్‌ను చీఫ్‌ విప్‌గా నియమించే చాన్స్‌లేదని భావిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డికి కేబినెట్‌ హోదా ఉన్న పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో.. చీఫ్‌ విప్‌గా ఈయన్నునియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామసుబ్బారెడ్డి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.

ఇక మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు విప్‌లను నియమించే ఆస్కారం ఎక్కువగా ఉందిని భావిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పప్పుల చలపతిరావు, చిక్కాల రామచంద్రరావు, అన్నం సతీశ్‌ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో యువకుడైన అన్నం సతీశ్‌కే ఎక్కువ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీల నుంచి బుద్దా వెంకన్న, అంగర రామ్మోహన్‌రావు, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, తప్పేస్వామి విప్‌ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శమంతకమణి, ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి పోటీలో ఉన్నారు.
అసెంబ్లీలో చీఫ్‌ విప్‌ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మైనారిటీ వర్గాల నుంచి ఇదే జిల్లాకు చెందిన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషా, ఎస్టీ కోటా నుంచి పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌ చీఫ్‌ విప్‌ రేసులో ఉన్నారు. వీరిలో చీఫ్‌ విప్‌, విప్‌ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి. 

11:55 - November 11, 2017

పశ్చిమగోదావరి : ఆ గ్రామానికి జ్వరం వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా గ్రామంలోని 5వందల మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గడచిన రెండు నెలల్లో రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంతకీ ఏ గ్రామం.. అక్కడ జ్వరాలకు కారణం ఏంటి? విప్పర్రులోని మంచినీటి చెరువులో నీరు కలుషితం కావడంతో గ్రామంలోని 5వందల మందికి విషజ్వరాలు సోకాయి. గడిచిన రెండునెలలుగా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకూ 2 వేల మంది జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇక చిన్నపిల్లలు సైతం జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్తుంటే చికెన్ గున్యా, టైఫాయిడ్, కీళ్ల జ్వరాలుగా డాక్టర్లు గుర్తిస్తున్నారు. గ్రామంలోని కలుషితనీరు తాగడం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో చెరువునీరే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మైలార్ దేవ్ పల్లిలో కాల్పుల కలకలం

హైదరాబాద్: మైలార్ దేవ్ పల్లిలో కాల్పుల కలకలం రేగింది. హసన్ అనేక వ్యక్తి పై దుండగులు కాల్పులు జరిపారు. హసన్ చాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. హసన్ పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆస్పత్రిక తరలించారు. భూతగాదాలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనుమతి నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు: ప్రొ.కోదండరాం

హైదరాబాద్: సభలు పెట్టుకునేందుకు అనుమతి నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిమితులు విధించే అధికారమే ఉందని, సభలు పెట్టుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను పునరుద్దరించాలన్నారు. నవంబర్ 30న కొలువుల కొట్లాట సభ జరుగుతుందని, డిసెంబర్ 9,10న నల్లగొండల అమరుల స్పూర్తి యాత్ర, సామాజిక మార్పు కోసం జరుగుతున్న పోరాటం అది అని తెలిపారు.

పీహెచ్ సీలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీష్

సిద్దిపేట: నంగనూరులోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. కాగా... మంత్రి వెళ్లిన సమయానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే సమయానికి రాని వైద్యులకు, సిబ్బందికి చార్జ్‌మెమో ఇవ్వాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

11:12 - November 11, 2017

బొద్దుగుమ్మగా పేరొందిన 'నమిత' త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. తెలుగు..తమిళ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఒకప్పుడు 'నమిత'కు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. ఈమెకు భారీగానే అభిమానులు కూడా ఉన్నారు. ఏకంగా ఈమెకు గుళ్లు కూడా కట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో 'సొంతం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత 'జెమిని', 'బిల్లా', 'సింహా' వంటి చిత్రాల్లో నటించారు. ఈమె త్వరలోనే వివాహం చేసుకోనుంది. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబును వివాహం చేసుకుంటోందని ప్రచారం జరిగింది. వీటిని శరత్ బాబు..నమిత ఖండించారు. తాజాగా త‌న వివాహం వీరాతో ఈ నెల 24న జ‌ర‌గ‌నుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కొంతకాలంగా వీరా..నమితలు ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాయి. నవంబర్‌ 24న తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నట్టు టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 

11:07 - November 11, 2017

నల్గొండ : జిల్లాలో ఇంటర్ విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మర్రిగూడం మండలం సరంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెన్నెల ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఈమెను ప్రేమికుడు హత్య చేశాడని తెలుస్తోంది. వెన్నెల సమీప బంధువుయైన ఓ యువకుడు ప్రేమించుకుంటున్నారు. కానీ ఇతనికి వేరే యువతితో నిశ్చితార్థం జరిగిందని..ఈ విషయం తెలుసుకున్న వెన్నెల అతడిని తీసిందని సమాచారం. శివారు ప్రాంతానికి తీసుకెళ్లిన యువకుడు ఆమెను కొట్టడంతో మృతి చెందిందని తెలుస్తోంది. వెన్నెల కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:57 - November 11, 2017

నువ్వు నాకు నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌ అంటూ 'సాయి పల్లవి' అంటోంది. రియల్ లైఫ్ లో కాదు లెండి..రీల్ లైఫ్ లో. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా'లో 'సాయి పల్లవి' నటనతో దుమ్మురేపింది. ఆమె పలికిన డైలాగ్స్..హావభావాలతో అందర్నీ ఆకట్టుకుంది. దీనితో ఆమెను తమ చిత్రాల్లో నటింప చేయాలని పలువురు దర్శకులు..నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'దిల్' రాజు నిర్మాణంలో 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ‘నాని’ హీరోగా..'సాయి పల్లవి' హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు మంచి స్పందనే వస్తోంది. ఎంసీఏ అంటే 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని' అంటూ నాని చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. కథానాయిక సాయి పల్లవి 'నువ్వు నాకు నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్‌' అని నానిని అడిగిన మాట కూడా హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

10:51 - November 11, 2017

నన్ను చంపేయకండి..బతికే ఉన్నా అంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు. తన కామెడీ నటనతో..విలనిజంతో ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయనపై గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారని..ఆయన కన్నుమూశారని పుకార్లు షికారు చేశాయి. దీనితో కోట శ్రీనివాస రావు మీడియా ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా చిలన చిత్ర రంగంలో ఉన్నానని..ఎందుకో తనపై ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై బంధువులు..స్నేహితులు వాకబు చేస్తున్నారని..ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. వయసు రీత్యా మెట్లు ఎక్కలేనని...కూర్చొనే చేసే పాత్రలు చేయగలనని చెప్పడంతో వారు కూడా అలాంటి పాత్రలే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవలే కామెడీ నటుడు వేణు మాధవ్ పై కూడా ఇలాంటి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోట శ్రీనివాస్ రావు స్పందనతో ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

నెల్లూరు జిల్లా మద్దూరుపాడులో అగ్ని ప్రమాదం..

నెల్లూరు: కావలి మండలం మద్దూరుపాడులో అగ్నిప్రమాదం సంభవించింది. డంపింగ్ యార్డులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్థినష్టం లక్షలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

10:35 - November 11, 2017
10:34 - November 11, 2017

ఢిల్లీ : అందరి దృష్టి దేశ రాజధానిపై పడింది. కాలుష్యం విజృంభిస్తుండడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా అధిక స్థాయిలో కాలుష్యం నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యంతో పాటు పొగమంచు కూడా దట్టంగా అలుము కోవడంతో తీవ్రమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలుష్యం నివారించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. కానీ ఈ చర్యలు ఏ మాత్రం సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది. సరి-బేసి విధానాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్‌జిటి సూచించింది. ఏడాది కాలంగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై శనివారం విచారణ చేపట్టనుంది. 

గుజరాత్ చేరుకున్న రాహుల్ గాంధీ

ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గుజరాత్ చేరుకున్నారు. 3 రోజుల పాటు గుజరాత్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

 

నల్గొండ జిల్లాలో దారుణం

నల్గొండ : జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలిని గొంతు కోసి ప్రియుడు హత్య చేశాడు. ఈఘటన మర్రిగూడ మండలం సరంపేటలో చోటు చేసుకుంది. ప్రేమించి మోసం చేస్తావా అని ప్రియురాలు ప్రియుడ్ని నిలదీయడంతో హత్య చేసినట్లు సమాచారం.

ముంబైలో ప్రారంభంమైన కాలుష్యరహిత బస్సులు

ముంబై: కాలుష్య రహిత బస్సులు ముంబైలో ప్రారంభం అయ్యాయి. ఇవాళ మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ బస్సులను బృహన్‌ముంబై సంస్థ ప్రారంభించింది. ఈ బస్సులను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, అవి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించగలవు.

10:12 - November 11, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజ్ లు భయపెడుతున్నాయి. గెయిల్ గ్యాస్ పైపు లైన్ లు లీకేజ్ కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లీకేజ్ లు కావడం..తూ తూ మంత్రంగా మరమ్మత్తులు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మల్కిపురం మండలంలోని శంకర గుప్తం ప్రాంతంలో శనివారం ఉదయం గ్యాస్ పైపు లైన్ లీకేజ్ అయ్యింది. వెంటనే స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. వీరు ఘటనా స్థలికి వెళ్లి పైపు లైన్ లీకేజ్ ను అరికట్టే ప్రయత్నం చేపడుతున్నారు. మల్కిపురం, తక్కినేని మండలాల్లో గ్యాస్ లీకేజ్ లు తరచుగా జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న పైపులను పునర్ నిర్మించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీనితో తరచూ గ్యాస్ లీకేజ్ లు జరుగుతున్నట్లు సమాచారం. 

మల్కిపురం గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీక్

తూ.గో: మల్కిపురం మండలం శంకరగుప్తం డ్రైన్ లో గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకుగురవుతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. తరచుగా గ్యాస్ లీకులు జరుగుతున్నా.. అధికారులు నామమాత్రంగా లీకేజీలను నియంత్రించి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

10:07 - November 11, 2017

విజయవాడ : ఏపీ శాసనసభ, మండలి పదవులను భర్తీ చేసేందుకు చంద్రబాబు కసరత్తు పూర్తిచేశారు. ఒకట్రెండు రోజుల్లో చీఫ్‌ విప్‌, విప్‌ పదవులను భర్తీ చేస్తామన్నారు. సోమవారం మండలి చైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మండలి చైర్మన్‌గా ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. ఇక మండలిలో చీఫ్‌ విప్‌తోపాటు ముగ్గురు విప్‌లకు అవకాశం కల్పించనున్నారు. మండలి చీఫ్‌ విప్‌ రేసులో టీడీ జనార్ధన్‌, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, రామసుబ్బారెడ్డి ఉండగా.. విప్‌ పదవులను బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీష్‌, సంధ్యారాణిలు ఆశిస్తున్నారు. అటు శాసనసభ చీఫ్‌ విప్‌ రేసులో పల్లె రఘునాథరెడ్డి, బోండా ఉమలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు కొచ్చిన్ పర్యనటకు వెళ్లారు. పర్యటన నుండి వచ్చిన అనంతరం దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. 

ఎర్రగుంట్ల నుండి జగన్ పాదయాత్ర ప్రారంభం...

కడప: ఎర్రగుంట్ల నుంచి జగన్ ఐదో రోజు ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం అయ్యింది. పాదయాత్ర ప్రొద్దుటూరు వరకు కొనసాగనుంది. సాయంత్రం పొద్దుటూరు సర్కిల్ బహిరంగ సభ అనంతరం సమీపంలో ని హౌసింగ్ బోర్డు వద్ద జగన్ రాత్రి సబ చేయనున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు భారీగా బంగారం పట్టివేత...

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి నుండి 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

మండలి, శాసనసభ చీఫ్ విప్ లుగా పయ్యావుల, పల్లె !

అమరావతి: శాసనమండలిలో చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్, అసెంబ్లీలో చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డి దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేయనుంది.

ఓయూ డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర వివరాలకు WWW.OSMANIA.AC.INలో చూసుకోవచ్చని సూచించారు.

ఉప్పల్‌లో అగ్ని ప్రమాదం...

హైదరాబాద్: ఉప్పల్‌లో ఉన్న కూరగాయల మార్కెట్‌లో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పది కూరగాయల షాపులు(గుడిసెలు) మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారులు.. మంటలను ఆర్పారు. షాట్ సర్క్యూట్‌ వల్లనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

09:21 - November 11, 2017

ఉప్పల్ : వెజిటెబెల్ మార్కెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి..మేడ్చల్ జిల్లాల నుండి రైతులు చాలా మందికి ఇక్కడకు కూరగాయలు తీసుకొచ్చి విక్రయం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మార్కెట్ లో మంటలు అలుముకున్నాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఐదు కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి అనే సంగతి తెలవడం లేదు. ఎవరైనా కావాలని చేశారా ? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదాని గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

09:12 - November 11, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం..పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాలుష్యం ప్రమాదకరస్థాయిలో వెదవలుడుతున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు జాగ్రత చర్యలో భాగంగా అక్కడి స్కూళ్లకు సోమవారం వరకు సెలవు ప్రకటించింది. మందిర్ మార్గ్, ఆనంద్ విహార్, సిరిఫోర్ట్, ద్వారక, ఆర్కేపురం, షాదిపూర్, సెంట్రల్ ఢిల్లీలో 300 పాయింట్లు నమోదైంది. కాలుష్య నివారణకు కేజ్రీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 6 వందల ప్రయివేటు బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే కాలుష్యంపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది.

ఢిల్లీలో కాలుష్యం..

ఢిల్లీ : ప్రమాదకర స్థాయిలో కాలుష్యం వెలువడుతోంది. మందిర్ మార్గ్, ఆనంద్ విహార్, సిరిఫోర్ట్, ద్వారక, ఆర్కేపురం, షాదిపూర్, సెంట్రల్ ఢిల్లీలో 300 పాయింట్లు నమోదైంది. 

09:03 - November 11, 2017
09:01 - November 11, 2017

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కాలుష్య అధిక స్థాయిలో వెదజల్లుతున్న సంగతి తెలిసిందే. రెండు ప్రధాన సమస్యలతో అక్కడి జనం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పొగమంచు కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా రెండు రైళ్లను రద్దు చేయగా 14 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడం..రైళ్లు రద్దు కావడం..సమయాల్లో మార్పులు చేయడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. విమాన ప్రయాణంలో కూడా పలు మార్పులు చేసుకుంటున్నాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఆడ్‌-ఈవెన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 6 వందల ప్రయివేటు బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం వరకు 6 వేల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

08:56 - November 11, 2017
08:54 - November 11, 2017

కరీంనగర్ : సీపీఐ మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్న మల్లయ్య (80) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశిని మల్లయ్య స్వగ్రామం చిగురుమామిడి (మం) బొమ్మనపల్లి. ఇందుర్తి నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేశిని ప్రజబంధుగా మంచి పేరుతెచ్చుకున్నారు. స్థానికంగా ఉన్న పట్టు ఉన్న వ్యక్తి...అంతేగాకుండా సాధారణ జీవితం గడిపారు. ఆయన మృతి చెందడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

కరీంనగర్ : ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 

సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం...

హైదరాబాద్ : సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతి ప్రమాదంలో మృతి చెందింది. టిప్పర్ ఆమెపై నుండి వెళ్లిపోవడంతో గీత అనే యువతి దుర్మరణం చెందింది. 

 

08:47 - November 11, 2017

హైదరాబాద్ : కొద్ది రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన ఓ యువతి అనంత లోకాలకి వెళ్లిపోయింది. టిప్పర్ ఆమెను మృత్యుఒడికి తీసుకెళ్లింది. పది రోజుల్లో పెళ్లి కావాల్సిన ఆమె మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన గీతకు వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో షాపింగ్ కోసమని హైదరాబాద్ నగరానికి వచ్చింది. కాబోయే భర్త శబరి నాథ్ తో కలిసి దిల్ సుఖ్ నగర్ కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేసిన అనంతరం హయత్ నగర్ బంధువుల ఇంటికి వెళ్లడానికి బైక్ పై వెళుతున్నారు. యూ టర్న్ తీసుకొనే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని ఢీకొంది. దీనితో బైక్ పై ఉన్న గీత కిందపడిపోయింది. ఆమెపై నుండి టిప్పర్ వెళ్లడంతో రంజిత అక్కడికక్కడే మృతి చెందింది. శబరినాథ్ కు స్వల్పగాయాలయ్యాయి. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన రంజిత మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

08:41 - November 11, 2017

జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కాట్రగడ్డ ప్రసూన్న (బీజేపీ), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

08:35 - November 11, 2017
08:33 - November 11, 2017

ఢిల్లీ : కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మండిపడింది. తాము సంతృప్తి చెందేవరకు ఆడ్‌-ఈవన్ అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్న తీరును ఎన్‌జిటి తప్పు పట్టింది. మరోవైపు సరి బేసి విధానం అమలులో భాగంగా బస్సులను ఫ్రీగా నడుపుతామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది.

సరి-బేసి విధానాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్‌జిటి సూచించింది. ఏడాది కాలంగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరి-బేసి పథకాన్ని అమలు చేయమని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని ట్రిబ్యునల్‌ గుర్తు చేసింది. పొల్యూషన్‌ను నియంత్రించేందుకు వంద మార్గాలను సూచించినా ప్రభుత్వం కేవలం సరి బేసి విధానాన్ని మాత్రమే ఎంచుకుంటోందని ఎన్‌జిటి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్కీంకు ఢిల్లీ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.

వాతావరణ పరిస్థితి మెరుగవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని...ఈ పని ముందే చేస్తే బాగుండేదని ఎన్‌జిటి అభిప్రాయపడింది. సరి-బేసి విధానం వల్ల కాలుష్యం తగ్గితే సరి...లేదా...ఈ పథకాన్ని నిలిపివేస్తామని ఎన్‌జిటి హెచ్చరించింది. ఢిల్లీలో నిర్మాణపు పనుల వల్ల వెలువడుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై విచారణ జరుపుతున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌ ప్రభుత్వంపై కూడా ఎన్‌జిటి అక్షింతలు వేసింది. పంటల దహనాలను ఆపకపోతే...జరిమానా చెల్లించడానికి సిద్ధం కావాలని హెచ్చరించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఆడ్‌-ఈవెన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 6 వందల ప్రయివేటు బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం వరకు 6 వేల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

08:31 - November 11, 2017

ఢిల్లీ : జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జిఎస్‌టి 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 177 వస్తువులను ఆ శ్లాబు నుంచి తప్పించాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. నిత్యావసర వస్తువులైన చాక్లెట్లు, చూయింగ్‌ గమ్‌లు, పోషాకాహార పానీయాలు, షాంపూలు, డియెడరెంట్, కాస్మెటిక్స్, డిటెర్జెంట్, షూ పాలిష్, చెప్పులు, షేవింగ్‌ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ కిట్స్, శానిటరి, సూట్‌కేస్‌, గడియారాలు, వాల్‌ పేపర్స్‌, ప్లయివుడ్‌, స్టేషనరి, మార్బుల్‌ తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించింది. దీంతో చాలా వస్తువులు 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయి. సామాన్యులు వాడే అన్ని రకాల వస్తువులను 28 శాతం పరిధి నుంచి తప్పించినట్లు బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోది తెలిపారు.

28 శాతం శ్లాబులో గతంలో 227 వస్తువులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 50కి తగ్గింది. దీంతో 177 వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు, ఫ్రిజ్‌, టొబాకో తదితర వస్తువులు 28శాతం శ్లాబు పరిధిలో ఉన్నాయి. జిఎస్‌టి మండలి తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయంపై 20 వేల కోట్ల మేర ప్రభావం చూపనుంది.

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ -జిఎస్‌టి జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. జిఎస్‌టి శ్లాబులను 5, 12, 18, 28 శాతంగా నిర్ణయించింది. జిఎస్‌టి కౌన్సిల్‌ ప్రతి నెలా సమావేశమై పన్ను అమలవుతున్న తీరుపై సమీక్ష జరుపుతోంది. జిఎస్‌టి అమలు తీరుపై విపక్షాలు మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. జిఎస్‌టిని ఆదరా బాదరాగా అమలు చేయడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

08:28 - November 11, 2017

ఖమ్మం : బాలోత్సవం.. ఖమ్మంలో ఆనందాన్ని నింపుతోంది. చిన్నారుల ఆటపాటలతో నగరం మార్మోగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన విద్యార్థులు ఉత్సవాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని భక్త రామదాస్ కళక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి బాలోత్సవ కార్యక్రమం రెండో రోజు.. విధ్యార్దుల్లో మరింత జోష్ నింపింది. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి బాలలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు. ఆటపాలతో బాలోత్సవం కాస్తా ఆనోదోత్సాహంగా మారింది.

ప్రస్తుత విద్యావ్యవస్థలో చిన్నారులు సృజనాత్మకతను మరిచి పోతున్నారు. కల్చరల్ యాక్టీవిటిలేక మన సంప్రదాయాలను మరిచి పోతున్నారు. అందుకే మన కల్చర్‌గురించి చిన్నారులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బాలోత్సవ్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడిజిల్లా విడిపోయిన తర్వాత తర్వాత మొదటిసారిగా ఖమ్మంలో బాలోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు. నిద్రలేచింది మొదలు .. స్టడి పేరుతో స్కూల్ ,ఇల్లు, ట్యూషన్లతో బిజిబిజిగా వుండే పిల్లలు ఈ బాలోత్సవ్‌లో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. కొత్త ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలను ఎంజాయ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో ఖమ్మంలో సందడి వాతావరణం నెలకొంది. బాలోత్సవ్‌లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని విద్యార్థులు కోరుతున్నారు. 

08:23 - November 11, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్టీ నోటిఫికేషన్‌కు వివాదాల చిక్కుముడులు వీడటం లేదు. కొత్త జిల్లాల పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అటు హైకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం ఇంతవరకు దరఖాస్తులు స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు పాత జిల్లాల ప్రకారం విడుదల చేసి.. టీచర్‌ పోస్టులు కొత్త జిల్లాల ప్రకారం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యర్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జిల్లాల పెంపుతో స్థానికతకు ఏమాత్రం భంగం వాటిల్లదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించడం..కొన్ని జిల్లాలకు పోస్టులు కేటాయించకపోవడం అక్కడి అభ్యర్థులను తీవ్రమనోవేదనకు గురిచేస్తోంది. అయితే స్థానికేతరులకు 20శాతం అవకాశం ఉండటం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే దరఖాస్తులో ప్రస్తుత జిల్లా, పూర్వపు జిల్లా ప్రస్తావన వుంటే బాగుంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్థానికత రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందని హైకోర్టు బెంచ్‌ గుర్తుచేస్తోంది. దీంతో సోమవారం ప్రభుత్వం హైకోర్టు ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తుందన్నది టీఆర్‌టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. 

08:18 - November 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ ఆదివారం మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు హైదరాబాద్ నగర తాత్కాలిక పోలీస్ కమిషనర్‌గా వీవీ శ్రీనివాసరావును నియమించారు. హోంశాఖ సలహాదారుగా అనురాగ్‌శర్మ నియమితులయ్యారు.

మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో 1962 డిసెంబర్ 3న మహేందర్‌రెడ్డి జన్మించారు. వరంగల్ ఆర్‌ఈసీ లో బీటెక్ చదివిన మహేందర్‌రెడ్డి ఢిల్లీ ఐఐటీ నుంచి ఎంటెక్ పట్టా అందుకున్నారు. దాదాపు నాలుసంత్సరాల పాటు హైదరాబాద్‌కు సీపీగా పనిచేశారు. కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాల్లో మహేందర్‌రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 

మరోవైపు ఇప్పటిదాకా డీజీపీగా ఉన్న అనురాగ్‌శర్మ సేవలను, అనుభవాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాన ప్రభుత్వం డిసైడ్‌ అయింది. అందుకే అనురాగ్‌శర్మను హోంశాఖ సలహాదారుగా నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీగా బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు అనురాగ్‌శర్మ. డీజీపీగా పదవి విరమణ చేసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి తన సేవలు అందిస్తానని అనురాగ్ శర్మఅన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్‌ను తీసుకురావడం, పోలీస్ శాఖను ప్రజలకు సన్నిహితం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహేందర్ రెడ్డి.. డీజీపీగా మరిన్ని మార్పులకు శ్రీకారం చుడతారనే అభిప్రాయాలు వస్తున్నాయి.  

సిటీ పోలీస్ కమిషనర్ గా...

హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ గా వి.వి.శ్రీనివసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

నేడు ఎన్జీటీ తుది ఉత్తర్వులు...

ఢిల్లీ : సరి బేసి విధానంపై నేడు ఎన్జీటీ తుది ఉత్తర్వులు వెలువరించనుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం వెదజల్లుతున్న సంగతి తెలిసిందే. 

టి.కాంగ్రెస్ పాదయాత్ర..

హైదరాబాద్ : అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నేడు పాతబస్తీ నుండి గాంధీ భవన్ వరకు టీ. కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించనుంది. పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

 

జగన్ 5వ రోజు పాదయాత్ర....

కడప : నేడు 5వ రోజు ప్రొద్దుటూరులో జగన్ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు సర్కిల్ లో బహిరంగసభ జరుగనుంది. హౌసింగ్ బోర్డు సమీపంలో జగన్ రాత్రి బస చేయనున్నారు.

 

వైసీపీ పల్లె నిద్ర..

విజయవాడ : ఏపీలో నేడు, రేపు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వైసీపీ పల్లె నిద్ర చేపట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. 

Don't Miss