Activities calendar

12 November 2017

22:08 - November 12, 2017

తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణతో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీసర్కార్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. రేవంత్ కు చురకలంటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:03 - November 12, 2017


కడప : చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టామన్నారు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. ఆరో రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చెన్నమరాజుపల్లె, చాపాడు కెనాల్‌, కామనూర్‌, రాధానగర్‌ మీదుగా 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చేనేత కార్మికులు, ఇతర కుల సంఘాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్తలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలన్నారు జగన్‌. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావాలన్నారు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికే పాదయాత్ర చేస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలు దిద్దిన మానిఫెస్టో తీసుకువస్తానన్నారు. ప్రజల భయంతోనే చంద్రబాబు మానిఫెస్టో నెట్‌లో పెట్టలేదని విమర్శించారు.

 

22:01 - November 12, 2017

హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణకు స్థానికులతో పోలీసులు మమేకం కావాలని తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. మరోవైపు మాజీ డీజీపీ అనురాగ్‌శర్మకు తెలంగాణ పోలీస్‌శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. 

తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా ఎం.మహేందర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ నుంచి డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డికి పలువురు పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన మహేందర్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సమాజ భాగస్వామ్యం అవసరమన్న డీజీపీ.. పోలీసులు స్థానికులతో మమేకం కావాలన్నారు. 

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురానికి చెందిన ఎం మహేందర్‌రెడ్డి...1962 డిసెంబర్ 3న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఆర్‌ఈసీ నుంచి బీటెక్ పూర్తిచేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేస్తుండగానే..1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాల్లో మహేందర్‌రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, గ్రేహౌండ్స్ ఐజీగా వ్యవహరించారు. 2014 జూన్ 2 నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు. ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడళ్లు అందుకున్నారు. అయితే నూతన పోలీస్‌బాస్‌గా నియమితులైన మహేందర్‌రెడ్డికి కొన్ని సవాళ్లు స్వాగతం పలుకనున్నాయి. రాష్ట్రంలో సంచలనం రేపిన మాఫియా డాన్‌ నయీం కేసుతో పాటు డ్రగ్స్‌ కేసు ఎలా పరిష్కరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. 

అటు అనురాగ్‌ శర్మ పేర్‌వెల్‌ పేరెడ్‌ పోలీస్ అకాడమీలో ఘనంగా జరిగింది. డీజీపీగా అనురాగ్‌శర్మ పదవీకాలం ముగియడంతో రాష్ట్రపోలీస్‌ శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఐపీఎస్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా పనిచేయటం గర్వంగా ఉందన్నారు అనురాగ్‌ శర్మ. 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానం సంతృప్తికరంగా సాగిందని చెప్పారు. కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు అనురాగ్‌శర్మ పేర్కొన్నారు.

తెలంగాణ మొట్టమొదటి డి.జి.పిగా బాధ్యతలు చేపట్టి అనురాగ్‌శర్మ పోలీస్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు.  తెలంగాణ ఏర్పడి తరువాత పోలీసుల ప్రతిష్ట పెరిగిందన్నారు. అటు డీజీపీ కార్యాలయంలోనూ పోలీస్‌ ఉన్నతాధికారులు మాజీ డీజీపీ అనురాగ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వాహనాన్ని తాళ్లతో డీజీపీ ఆఫీస్‌ నుంచి బయటివరకు లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

21:59 - November 12, 2017

కృష్ణా : ఘటనా స్థలానికి వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. సహాయకచర్యలను తెలుసుకునేందుకు వచ్చిన వైసీపీ నేతలు పార్థసారథి, ఇతర జిల్లా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

21:57 - November 12, 2017

కృష్ణా : కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇబ్రహీం పట్నం ఫెర్రి ఘాట్‌ వద్ద ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్తీక వన సమారాధనకు వచ్చిన పర్యటకులకు ఇలాంటి ప్రమాదం ఎదురవడం, మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన వారు కావడంపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. బోటు నిర్వహకులైన సింపుల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థ, రివర్‌ బోటింగ్‌కు అనుమతులు ఉన్నాయా అనే అంశంపై లోతుగా పరిశీలన జరపాలని టూరిజం అధికారులను ఆదేశించారు. 
 

21:54 - November 12, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడటంతో...16 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బోటులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 15 మందిని రక్షణ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
14 మృతదేహాలు వెలికితీత
కృష్ణా జిల్లాలో విహారయాత్ర విషాదం నింపింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 38 మంది పర్యాటకులు కృష్ణా పవిత్ర సంగమ హారతి కార్యక్రమాన్ని చూసేందుకు పడవలో బయల్దేరారు. రివర్‌ బే సంస్థకు చెందిన పర్యాటకుల బోటు భవానీ ద్వీపం నుంచి ఫెర్రీఘాట్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా కుదుపునకులోనై తిరగబడింది. నీటిలో మునిగిపోయిన వారి హాహాకారాలతో అక్కడి వాతావరణం క్షణాల్లో ఉద్విగ్నంగా మారిపోయింది. ప్రయాణికుల అరుపులతో అప్రమత్తమైన స్థానిక జాలర్లు, రక్షణసిబ్బంది నీటిలో మునిగిపోతున్నవారిని కాపాడారు. మరికొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఇలా మొత్తం 15 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలు వెలికితీశారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడం, చలి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది.
ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు 
పర్యాటక బోటులో ఉన్నవారిలో 32 మంది ఒంగోలు వాసులు, ఆరుగురు నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటం, బోటులో ఉన్న వారికి లైఫ్‌ జాకెట్లు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. బోటులో ఉన్న 38 మంది పర్యాటకులు ఒకవైపునకు కూర్చోవడంతో ఫెర్రీఘాట్‌ వద్ద మలుపుతిరుగుతున్న సమయంలో బోటు తిరగబడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటు తిరగబడటంతో దానికిందే ఇరుక్కుపోయి ఊపిరాడక నీటమునిగి చనిపోయినట్లు తెలిపారు. ఫెర్రీఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు విహారయాత్రకు కొన్ని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పర్యాటకుల రక్షణ కోసం బోటు నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. లైఫ్‌జాకెట్లు కావాలని ప్రయాణికులు అడిగినా..నిరాకరించారని బాధితులు చెబుతున్నారు. 
ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం  
ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని కలెక్టర్‌, డీజీపీ, మంత్రులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని హోంమంత్రిని ఆదేశించారు. మరోవైపు మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన సహాయక చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. 
సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక 
ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదిక అందజేశారు. రాయపూడి నుంచి ఫెర్రీఘాట్‌కు రివర్‌బే సంస్థ అనుమతి లేకుండా బోటు నడుపుతున్నట్లు తెలిపారు. సుడిగుండాలున్న ప్రాంతంలో పడవను నియంత్రించలేక పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందజేశారు.


 

21:49 - November 12, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద పెను విషాదం నెలకొంది. ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 15 మందిని సిబ్బంది రక్షించారు. భవానీ ద్వీపం నుంచి 38 మందితో వెళ్తున్న పర్యాటకుల పడవ.. పవిత్రసంగమం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పర్యాటకుల్లో 32 మంది ఒంగోలు వాసులుగా గుర్తించారు. మృతుల్లో 8 మంది ఒంగోలు వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఎన్ డీఆర్ ఎఫ్ సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. రాయపూడి నుంచి ఫెర్రీఘాట్‌కు అనుమతి లేకుండా రివర్‌బే సంస్థ బోటు నడుపుతున్నట్లు వెల్లడించారు. సుడిగుండాలున్న చోట పడవను నియంత్రించక పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు నివేదిక అందించారు. ఘటనపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

బోటు ప్రమాద ఘటనలో 16 మంది మృతి

కృష్ణా : ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందారు. 38 మందితో వెళ్తున్న పర్యాటకుల పడవ బోల్తా పడింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేస్తోంది. 

 

20:54 - November 12, 2017

బోటు లభ్యం

కృష్ణా : ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదానికి గురైన బోటు లభ్యం అయింది. అయితే గల్లంతైన 19 మంది ప్రయాణికుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. బోటు ప్రమాద ఘటనలో 12మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీశారు. కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. 

 

20:44 - November 12, 2017

కృష్ణా : ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదానికి గురైన బోటు లభ్యం అయింది. అయితే గల్లంతైన 19 మంది ప్రయాణికుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. బోటు ప్రమాద ఘటనలో 12మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీశారు. కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 10మందిని రక్షించారు. వీరిలో 5 మంది పరిస్థితి విషమంగా
ఉంది. వారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 
గజ ఈత గాళ్లు, ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలావుంటే ఘటనాస్థలికి వచ్చిన వామపక్ష సభ్యులను టీడీపీ బృందాలు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

బోటు బోల్తా ఘటనపై సీఎంకు ప్రాథమిక నివేదిక

కృష్ణా : బోటు బోల్తా ఘటనపై అధికారులు సీఎంకు ప్రాథమిక నివేదిక అందజేశారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు సీఎంకు ప్రాథమిక నివేదిక అందజేశారు. 

 

బోటు బోల్తా ఘటనపై మంత్రి అఖిలప్రియ దిగ్ర్భాంతి

కృష్ణా : ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన బోటు బోల్తా ఘటనపై ఏపీ మంత్రి అఖిలప్రియ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బోటు ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా ప్రమాద ఘటనలో మృతులు సంఖ్య 14కు చేరింది. మృతదేహాలను వెలికితీశారు. కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 10 మందిని రక్షించారు.  

 

బోటు బోల్తా ఘటనపై రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి

కృష్ణా : ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన బోటు బోల్తా ఘటనపై ఏపీ సీసీ చీఫ్ రఘువీరారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

 

బోటు ప్రమాద ఘటనపై జగన్ దిగ్ర్భాంతి

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా ప్రమాద ఘటనపై వైసీపీ అధినే జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. 12 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 8మందిని రక్షించారు. 

 

బోటు ప్రమాద ఘటనపై సీపీఎం నేత మధు దిగ్ర్భాంతి

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా ప్రమాద ఘటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు బోల్తా ఘటనకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. కనీస ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. 

 

బోటు ప్రమాద ఘటనపై చినరాజప్ప దిగ్ర్భాంతి

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా ప్రమాద ఘటనపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. బోల్తా ప్రమాదంపై చినరాజప్ప దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

19:24 - November 12, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ఆదివారం కావడంతో... కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 39 మంది మునిగిపోయారు. 12 మంది మృతి చెందారు. మృత దేహాలను బయటికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9మందిని రక్షించారు. వీరిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 22 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గుతుంది. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాద ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. బోటులో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు సేఫ్టీ మెజర్స్ ఇవ్వలేదు. నది ప్రవాహంపై అవగాహన లేని డ్రైవర్ బోటు నడుపుతున్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం అధికమవ్వడంతో బోటు తిరగబడింది. ఘటనాస్థలానికి రాకుండా వామపక్షాలను పోలీసులు, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

బోటు ప్రమాదంలో 12 మంది మృతి

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా పడింది. ఆదివారం కావడంతో... కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. 12మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 8మందిని రక్షించారు.

 

19:02 - November 12, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద బోటు బోల్తా పడింది. ఆదివారం కావడంతో... కృష్ణానదిలో విహారయాత్రకు వెళ్లిన 38 మంది మునిగిపోయారు. ఎనిమిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 8మందిని రక్షించారు. 

 

18:54 - November 12, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపే మండలం అభంగపట్నంలో బిజేపీ నేత దళితులపై చేసిన దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాలు రాస్తారోకో, ధర్నా నిర్వహించాయి. దాడికి గురైన దళిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. అక్రమంగా మొరం తవ్వుతున్న బీజేపీ నేతను అడ్డుకున్నారన్న నెపంతో దళితులపై దాడి చేయడం సిగ్గు చేటని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు అన్నారు. బీజేపీ నేత భరత్‌ రెడ్డిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, అతనో పెద్ద రౌడీ షీటర్ అని తెలిపారు. భరత్‌పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాద ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 

18:47 - November 12, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటను పండించడమే అంటే అమ్మడం మరింత కష్టంగా మారింది. రైతులు సీసీఐ అధికారులను, జిన్నింగ్ మిల్లుల యజమానులను బ్రతిమిలాడి అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. పంటను తక్కువ ధరకు కాజేయడానికి దళారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ప్రయత్నిస్తున్నారు. ధరల విషయంలో, తేమ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. 

 

బోటు బోల్తా...ఐదుగురు మృతి

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. బోటులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. యాత్రికులు కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లారు. 

కృష్ణా నదిలో బోటు బోల్తా

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద బోటు ప్రమాదం జరిగింది. బోటులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. యాత్రికులు కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లారు. 
  

17:25 - November 12, 2017

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. చిత్రకూట్‌ నియోజకవర్గానికి జరిగిన బైపోల్‌లో కాంగ్రెస్‌ గెలుపొందింది. బీజేపీపై కాంగ్రెస్‌ అభ్యర్థి నిలాన్షు చతుర్వేది 14వేల 333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిత్రకూట్‌ సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ కుమార్‌ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 9న ఎలక్షన్ జరగగా... ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి చతుర్వేది... బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠిని ఓడించారు. 

 

17:21 - November 12, 2017

ప్రకాశం : జిల్లా కందుకూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారో తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీలో వర్గపోరు ఎసరు పెడుతుంటే.. ప్రతిపక్ష నేతల వైఖరిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీనియర్‌ నేతల సెకండ్ ఇన్నింగ్స్‌పై స్పష్టత కోరుతున్నారు. కందుకూరు రాజకీయంపై 10టీవీ ప్రత్యేక కథనం. 
నియోజకవర్గంపై దృష్టి సారించిన టీడీపీ, వైసీపీ
ఎన్నికలు ముగిసి మూడున్నరేళ్లైంది. ఇక ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే గడువు ఉండటంతో అధికార, ప్రతిపక్షాలు  రంగం సిద్ధం చేస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ తీసివేతలు, కూడికలు మొదలయ్యాయి. నేతల సామర్ధ్యాలను అధినేతలు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు దృష్టి సారించాయి. 
కందుకూరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధానంగా కందుకూరు నియోజక వర్గాన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కీలక నేతగా పేరున్న మాజీ మంత్రి.. సీనియర్ నేత మానుగుంట మహీధర్‌రెడ్డి కేంద్రంగా ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయనను తమ పార్టీలోకి రమ్మంటూ ఇప్పటికే పార్టీలు పిలుస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో సీటుతో పాటు సముచిత స్ధానంపై భరోసా కావాలంటూ మహీధర్‌రెడ్డి షరతు పెట్టడంతో ఆయా పార్టీలు స్పష్టత ఇవ్వలేదు. 
కొందరు టీడీపీ నేతలతో మహీధర్‌రెడ్డి విందు రాజకీయాలు
జిల్లాలో సీనియర్‌ నేత అయిన మహీధర్‌రెడ్డికి తనకంటూ ప్రత్యేక వర్గం కూడా ఉంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన్నా రాంబాబు, ముక్కు కాశిరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఇలా చాలామంది మహీధర్‌రెడ్డికి విశ్వాసపాత్రులు. దాంతో వైసీపి, టీడీపీలు మహీధర్‌రెడ్డిని  చాలాసార్లు సంప్రదించారు. అయితే ఆయనే ఏ విషయం చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. ఇక జిల్లాలో మహీధర్‌రెడ్డి వర్గానికి చెందిన వారు ఎక్కువగా టీడీపీలో ఉన్నారు. వారిలో కొందరు కీలక నేతలతో మహీధర్‌రెడ్డి విందు రాజకీయాలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు మహీధర్‌రెడ్డి రాకతో రెండు పార్టీల్లోని కొందరు నేతలు తమ ఉనికికి ప్రమాదంగా భావిస్తున్నారు. దీంతో ఆయన రాకకు బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
ఎమ్మెల్యే రామారావుకు పొంచి ఉన్న వర్గపోరు
ఇక కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నియోజకవర్గంలో వర్గ పోరు పొంచి వుంది. దీంతో పార్టీ రోజురోజుకు నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న పరిస్థితి స్ఫష్టమవుతోంది. దీనికితోడు ఆయనపై అందిన నివేదికను చూసి సీఎం పెదవి విరిచినట్లు తెలుస్తోంది. ఇటు వైసీపీ పరిస్థితి కూడా దారుణంగా మారింది. ప్రస్తుతం తూమాటి మాధవరావు ఒక్కరే వైసీపీకి దిక్కయ్యారు. దీంతో బలమైన నేత కోసం వైసీపీ నేతలు కూడా కరసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహీధర్‌రెడ్డిని పలుమార్లు కలిశారు. అయితే నంద్యాలలో వైసీపీ ఓటమితో ఔత్సాహిక నేతలు సైతం వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల నాటికి కందుకూరు నియోజకవర్గ రాజకీయాలు ఎలా మారతాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. 

 

16:55 - November 12, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన స్పందించారు. జగన్‌ సవాల్‌పై చంద్రబాబు  సమాధానం ఇవ్వాలన్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగినంత అవినీతి ఎక్కడాలేదని, అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఒక లక్షా ఇరవై కోట్ల అప్పు చేశారన్నారు. ఇందులో 60వేల కోట్ల పైచిలుకు ఖర్చును తన స్వంత ఖర్చుకు వాడుకున్నారని, ఈ ఖర్చులపై వివరణ ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు. 

 

16:48 - November 12, 2017

జైపూర్ : ఎత్తైనా కట్టడాలు...! కనువిందు చేసే శిల్పాలు...! ఆహ్లాదకర పరిసరాలు..! కట్టిపడేసే అందాలు.. కలగలిస్తే.. రాజస్థాన్‌ కోటలు. భారత దేశ సంస్కృతికి... శిల్ప కళా ఔచిత్యానికి... ఆనవాళ్లు రాజస్థాన్‌ దుర్గాలు..! కొన్ని వేల సంవత్సరాల  చరిత్రకు.. చెక్కు చెదరని చిహ్నాలు ఈ రాజసౌధాలు..!   రాచరిక దర్పాన్ని చాటుతూ.. ఒకనాటి... మేధో శ్రమను, కళాత్మకతను నేటి తరానికి పరిచయం చేస్తున్న రాజస్థాన్‌ కోటలపై 10టీవీ ప్రత్యేక కథనం  
కోటలు, అరుదైన కట్టడాలు
రాజస్థాన్‌...! కోటలకు.. అరుదైన కట్టడాలకు... చిరునామా. రాచరిక వ్యవస్థను పట్టిచూపించే.. ఆనవాళ్లెన్నో ఇక్కడ దర్శనమిస్తాయి. రాజుల భవంతులను... వారి యుద్ధగాధలను.. అప్పటి కళానైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే.. రాజస్థాన్‌ సందర్శిస్తే చాలు.. 
అమీర్‌పోర్ట్‌..
ఇదిగో ఇక్కడ చూడండి... అందచందాలలో తనతో తానే.. పోటీ పడినట్టు ఉన్న.. ఈ కోట పేరు అమీర్‌పోర్ట్‌.. దీనినే అమీర్‌ ఫ్యాలెస్‌ అని కూడా అంటారు. జైపూర్‌కు దగ్గరల్లో అమీర్‌ అనే ప్రాంతంలో ఉండడంతో దీనికి అమీర్‌పోర్ట్‌ అనే పేరు వచ్చింది. 1550 నాటి రాజు రాజా మాన్‌సింగ్‌ దీనిని నిర్మించారు. సరస్సుకు ఎదురుగా... ఎత్తైన కొండపై శాండ్‌ స్టోన్‌.. మార్బుల్స్‌తో నిర్మించిన ఈ కోటను చూస్తే... ఔరా అనాల్సిందే.. చెక్కు చెదరని ఆర్కిటెక్ట్‌ ఈ ప్యాలెస్‌ సొంతం. ప్రజా దర్బార్‌, రాజు ఆంతరంగిక మందిరాలు.. పూర్తిగా అద్దాలతో నిర్మించిన శీశ్‌ మహల్‌ అందాలు  ఎంత చూసినా తనివి తీరదు. 
ఏడో శతాబ్దంలో నిర్మించిన చిత్తోడ్‌గఢ్‌ కోట
ఇక ఏడో శతాబ్దంలో నిర్మిచిన చిత్తోడ్‌ గఢ్ కోట  ఇప్పటికీ తన రాజసాన్ని చాటుకుంటోంది. భూమికి 590 అడుగుల ఎత్తులో... 280 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోట అరుదైన కట్టడమనే చెప్పాలి.. కోటలోని మీరా టెంపుల్‌, కీర్తి స్తంభం, జైన్ మందిర్‌లకు రాతిపై వాడిన డిజైన్స్‌ ఇప్పటికి అబ్బురపరుస్తున్నాయి. పద్మిని ప్యాలెస్‌.. రాజా రతన్‌ సింఘ్‌, రాణి పద్మిని- అల్లావుద్దిన్‌ ఖీల్జీల మధ్య జరిగిన పోరాటాలకు ఈ కోట సజీవ సాక్షిగా నిలుస్తోంది.
హవా మహల్‌ 
జైపూర్‌లో ఉండే హవా మహల్‌ రాజపుత్రుల కళాభిరుచికి, నాటి కళా వైభవానికి అద్దం పడుతూ... పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అలాగే కళ్లను తిప్పుకోనివ్వని జల్‌మహల్‌...మరో ప్రత్యేకం. మూడు వందల ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్య కనువిందు చేసే అద్భుతమైన కళాకండమే జల్‌మహల్‌. అలాగే ఉదయ్‌పూర్‌లో లేక్‌ ప్యాలెస్‌ చూపరులను ఆకట్టుకుంటుంది. 
ల్యాండ్‌ ఆఫ్‌ కింగ్స్‌..రాజస్థాన్‌
ఇవే కాదు.. జనాగఢ్‌ కోట, బికనీర్‌ మహరాజు నిర్మించిన ప్యాలెస్‌లు ఇలా రాజస్థాన్‌లో ఏ మూలకు వెళ్లినా.. చరిత్రకు సాక్ష్యాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తే.. అందుకేనా చరిత్రకారులు రాజస్థాన్‌ను ల్యాండ్‌ ఆఫ్‌ కింగ్స్‌గా అభివర్ణిస్తారు..  అని అనిపించక మానదు. 

 

16:41 - November 12, 2017

విజయవాడ : తమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2017 కార్యక్రమాన్ని అలనాటి నటి రోజారమణి ప్రారంభించారు. చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తాను నటించిన భక్త ప్రహ్లాద సినిమా విడుదలై యాబై ఏళ్లు పూర్తైందని అన్నారు. పిల్లలో చైతన్యం తెచ్చేందుకు ఇలాంటి ఫెస్టివల్స్‌ ఎంతగానో దోహదపడతాయని.. విద్యార్ధులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించాలని అన్నారు.

 

16:40 - November 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పర్యటించారు. మండపేటలో 20 కోట్ల వ్యయంతో నిర్మించిన కపిలేశ్వరపురం సిసి రోడ్డును, అలాగే కపిలేశ్వరం సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. జిఎస్టీ అమలు చారిత్రాత్మకమని, చిన్న చిన్న లోటు పాట్లు ఉన్న అవి సవరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 

16:36 - November 12, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం సభ్యులు... విజయవాడ ధర్నా చౌక్‌లో 48 గంటల శాంతియుత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మధు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను హరించే సిపిఎస్‌ (కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం)ను కేంద్రం ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు. 

 

16:32 - November 12, 2017

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్‌ అయ్యారు. విజయవాడలో మీడియాతో మట్లాడిన ఆయన... జగన్‌ చేసే అవినీతి రాజకీయాలు ఆదర్శంగా తీసుకుంటే యువత నష్టపోతారని ధ్వజమెత్తారు. అవినీతి సామ్రజ్యానికి జగన్‌ మాట,నడక ఒక భస్మాసుర అస్త్రం అని దుయ్యబట్టారు. జగన్‌ అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరువస్తుందని మండిపడ్డారు. ఇలాంటి నాయకుడు రాజకీయాలకు అనవసరమన్నారు.

 

16:00 - November 12, 2017

నాగర్ కర్నూల్ : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. 
పాఠశాలలో సకల వసతులు   
ఇది నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. 2008 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పాఠశాలలో సకల వసతులు ఉన్నాయి. అందమైన పాఠశాల భవనం, పచ్చని చెట్లతో పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తుంది. పాఠశాల గోడలపై దేశనాయకుల చిత్రాలు, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని పెంచే చిత్ర పటాలు దర్శనమిస్తాయి. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఇక్కడ ప్రస్తుతం 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. 
197 మంది విద్యార్థినులు 
ఈ కస్తూర్భాలో ప్రస్తుతం 197 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం లంబాడి తండాల నుండి వచ్చిన అనాథ పిల్లలే ఉంటారు. విద్యార్థులకు ఎలాంటి లోటు కలగకుండా పాఠశాల సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఆహారంలో గుడ్లు, పండ్లతో పాటు ప్రతి నిత్యం నాణ్యమైన భోజనం అందిస్తారు. విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. 
కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారన్న విద్యార్థినులు 
ఇక్కడి పాఠశాల యాజమాన్యం తమని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అనాథలుగా ఉన్న తమకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తామంటున్నారు విద్యార్థినిలు. 
విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరాలి : ఉపాధ్యాయులు 
చదువులో మాత్రమే కాదు ఆటపాటల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామంటున్నారు కస్తూర్భా యాజమాన్యం. ఇక్కడికి వచ్చే విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటామని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న అనాధపిల్లలకు ఆశ్రమంలా నిలుస్తున్నాయీ కస్తూర్భాలు. ప్రభుత్వం ఇలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. 

 

15:54 - November 12, 2017

శ్రీకాకుళం : పేరుకే రక్షిత త్రాగునీటి పథకాలు.. అందులోని జలం మాత్రం సురక్షితం కాదు. వాటర్ ట్యాంకుల్లో నుండి సరఫరా అవుతున్న త్రాగునీరు వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సరఫరా అవుతున్న రక్షిత త్రాగునీటి పథకంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
నీటి సరఫరాలో లోపించిన శుభ్రత
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1099 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, ఆముదాలవలస పురపాలక సంఘాలు, పాలకొండ, రాజాం నగర పంచాయితీలతో పాటు.. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో రక్షిత తాగునీటి సరఫరా ద్వారా రోజుకు కొన్ని లక్షల మందికి తాగునీరు ప్రజలకు అందుతోంది. ఇప్పుడు ఆ జలాలు ఎంత వరకు సురక్షితం అన్నది ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం క్లోరినేషన్ సక్రమంగా జరగకపోవడమే. వాస్తవానికి నెలకు ఒకసారైనా నీటి నిల్వ ట్యాంకులను శుభ్రం చేసి..  బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. అయితే  తొంభై శాతం ట్యాంకుల్లో ఇలా జరగడం లేదు.  దీంతో ప్రజలకు చేరుతున్న నీరు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.
2007 నుంచి గ్రామ పంచాయితీలదే నిర్వహణ
ఆరు నెలలైనా శుభ్రం చేయని ట్యాంకులు
గ్రామ పంచాయితీల పరిధిలో రక్షిత పథకాల నిర్వహణని 2007 నుండి గ్రామ పంచాయితీలకే కట్టబెట్టింది. మేజర్‌ పంచాయితీల్లో మినహా మిగతా మైనర్ పంచాయితీలకు ఎలాంటి సిబ్బంది లేరు. కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ట్యాంకులను శుభ్రం  చేయడంలేదు. దీంతో ఈ నీరు తాగడంతో గ్రామస్థులు వ్యాధుల బారిన పడుతున్నారు.
శిథిలావస్థకు చేరిన వాటర్‌ ట్యాంకులు
చాలా చోట్ల వాటర్‌ ట్యాంకులు శిధిలావస్థకు చేరుకున్నాయి. దీనికితోడు ట్యాంకులను శుభ్రపరచడం లేదు. దీంతో ప్రజలకు కలుషితనీరే దిక్కుగా మారింది. ఈ విషయంలో నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, తనిఖీ అధికారులు, పంచాయితీ పాలక వర్గాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో ఎక్కువ మంది డయేరియా, కలరా, విష జ్వరాలు లాంటి అంటువ్యాధులబారిన పడుతున్నారు. కలుషిత నీటి వల్లే వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరిచేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

 

15:47 - November 12, 2017

కృష్ణా : విజయవాడను గ్రేటర్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విజయవాడ పరిధిలోని 45 గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముందుగా 19 గ్రామాలను గ్రేటర్‌లో చేర్చి మిగితా గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం విలీనం చేయనున్నారు. 

విజయవాడకు గ్రేటర్‌ కల త్వరలోనే సాకారం కానుంది. వ్యాపార, వాణిజ్య, పర్యాటక, ఆధ్యాత్మిక పరంగా విజయవాడ నగరానికి ప్రత్యేకమైన పేరుంది. 2017 అక్టోబర్ 14న సీఎం చంద్రబాబు విజయవాడలో చేసిన అకస్మిక తనిఖీల్లో భాగంగా గ్రేటర్‌ అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను దశలవారిగా నగరపాలక సంస్థలో విలీనం చేస్తామని ప్రకటించారు. అప్పటి నుండి గ్రేటర్‌ పనుల్లో వేగం పెరిగింది. 

ప్రస్తుతం నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉండగా, 45 గ్రామాల ప్రతిపాదిత విస్తీర్ణం 363.71 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. గ్రేటర్‌లో 45 గ్రామాలన్నీ విలీనం చేస్తే 425.59 చదరపు కిలోమీటర్ల మేర నగరం విస్తరించనుంది. అలాగే 2011 సంవత్సరంలో నగర జనాభా లెక్కలు 10 లక్షల 39వేల 518 మంది ఉండగా, 45 గ్రామాల్లో జనాభా 4 లక్షల 78వేల 214 మంది ఉన్నారు. విజయవాడ గ్రేటర్‌గా రూపాంతరం చెందితే ఈ సంఖ్య 15 లక్షల 17వేల 732 కు పెరగనుంది. 

అయితే ఈ విలీనాన్ని  ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేటర్ అయితే ప్రజలపై పన్నుల భారం  పడనుందంటున్నారు. అయినా కూడా ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు సన్నాహాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయవాడను గ్రేటర్‌ చేసినప్పటికీ ప్రజలపై పన్నుల భారం లేకుండా, తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నారు. 

15:44 - November 12, 2017

పశ్చిమగోదావరి : ఆకతాయిల వేధింపులు తాళలేక తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఘన్‌ బజారుకు చెందిన షేక్‌ ఖాజా బాను అనే మైనర్‌ బాలిక సీఎస్సీ అలెక్జాండర్ స్కూళ్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే నిన్న రాత్రి 7 గంటలకు షాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాకేష్‌, సురేష్‌, విజయ్‌ అనే ముగ్గురు యువకులు వెంటబడి, వేధిస్తూ కత్తితో దాడి చేశారని ఆరోపిస్తున్నారు ఖాజా బాను తండ్రి. బాలిక వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో పాల్పడిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

 

15:40 - November 12, 2017
13:43 - November 12, 2017

రాజస్థాన్ : ఈ పేరు చెప్పగానే ఎడారి గుర్తుకొస్తుంది. మంచినీటి కోసం కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ నెలకొన్న కరవును పారద్రోలడానికి కృషి జరుగుతోంది. ఎడారి బతుకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి..రాజస్థాన్ ప్రజలకు 'ఎంజేఎస్ఏ' వరదాయినిగా నిలిచింది..చతుర్విద జల సంరక్షణకు ఎంజేఎస్ఏ నడుం బిగించింది. అనతికాలంలో జలసిరులు అందిస్తూ అద్బుత ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ప్రయత్నం తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

ములుగు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

భూపాలపల్లి : ములుగు మాజీ ఎమ్మెల్యే సూరమనేని రాజేశ్వరరావు(97) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

13:29 - November 12, 2017

వరంగల్ : అత్యంత హేయమైన ఈ ఘటన. మానవ సంబంధాలు కూడా మరిచిపోయి కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సొంత కూతురిపై ఓ తండ్రి కొన్ని ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు..అంతేగాకుండా సొంత మేనమామలు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘోరమైన దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చార్ బౌలిలో చోటు చేసుకుంది.


చార్ బౌలిలో ఓ వ్యక్తి కాజిపేట రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కూతురిపై ఈ కామాంధుడు కన్నేశాడు. భార్యకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కూతురిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని కూతురు..కొడుకు ఆ దుర్మార్గుడు హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామళ్లు సహాయం చేయాల్సింది పోయి వారు కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత రెండేళ్లుగా జరుగుతోంది. చివరకు బాధితురాలు మట్టివాడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

13:27 - November 12, 2017
13:07 - November 12, 2017

విశాఖపట్టణం : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అనకాపల్లిలో పేదలకు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని..అందులో ఏపీకి 5 లక్షల 39 వేల ఇళ్లను కేటాయించిందన్నారు. ఆత్యాధునిక టెక్నాలజీ సహాయంతో పేదల ఇళ్లను నిర్మిస్తున్నట్లు, 15 నెలల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. 

12:52 - November 12, 2017

వరంగల్ లో దారుణం..

వరంగల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చార్ బౌలిలో ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు మేనమామలు..తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘోర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురిపై తండ్రి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మట్టివాడ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కర్నూలులో ప్రేమోన్మాది దాడి...

ప.గో: ఏలూరులో 9వ తరగతి విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ విద్యార్థిని ఏలూరు ఆస్పత్రికి తరలించారు.

12:32 - November 12, 2017

కర్నూలు : అప్పు తీర్చలేదని ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్వామిరెడ్డినగర్ లో చోటు చేసుకుంది. సలీం దగ్గర రూ. 1100 రూపాయలను షబ్బీర్ అప్పుగా తీసుకున్నాడు. కానీ ఆ డబ్బు తిరిగి చెల్లించడంలో షబ్బీర్ ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి సలీం కత్తితో వచ్చి షబ్బీర్ పై దాడి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన షబ్బీర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేసి పరారయిన సలీం కోసం గాలింపులు చేపడుతున్నారు. 

12:28 - November 12, 2017

హైదరాబాద్ : నేర రహిత సమాజం కోసం కృషి చేస్తామని నూతన డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలు..ధనికులు అనే తేడా లేకుండా ఉంటామని..ప్రజల తరపున ఉన్న శాఖ అని తెలిపారు. ప్రజలకిచ్చే సేవలను..మూడు కమిషనర్ పరిధిలో..ఒక యూనిఫాం స్టాండర్డ్స్ తీసుకొస్తామని..ఒక సమస్యతో ఓ వ్యక్తి పీఎస్ కు వెళితే..తగిన విధంగా స్పందన ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఉండి సేవ చేసే సమయంలో..రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్న సమయంలో పెట్టుబడులు..పరిశ్రమలు ఎలా వస్తాయనే దానిపై ప్రతి పోలీసు ఆలోచించాలన్నారు. 'నేను సైతం' ప్రాజెక్టు కింద లక్షా 50వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని..పది లక్షల కెమెరాలు సిటీలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నేరం చేస్తే దొరికిపోతామనే భయం నేరస్తుల్లో కలిగే విధంగా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 

జగన్ ది ప్రజా సంలక్ప యాత్ర కాదు - యనమల...

విజయవాడ : జగన్ ది ప్రజా సంకల్ప యాత్ర కాదని మంత్రి యనమల పేర్కొన్నారు. జగన్ రాజకీయాలు నుండి తప్పుకోవాలన్నది ప్రజా సంకల్పమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఆస్తులు కాపాడుకొనేందుకు..కేసుల నుండి తప్పించుకొనేందుకు జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. 

11:43 - November 12, 2017
11:23 - November 12, 2017
11:21 - November 12, 2017

హైదరాబాద్ : కోడిగుడ్డ ధర చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు కూరగాయల ధరలు మండిపోతుంటే... తానేం తక్కువ కాదంటు గుడ్డుకూడా కొండెక్కి కూర్చుంది. గుడ్డు ధర రోజురోజుకు పెరుగుతుండడంతో ఎగ్‌ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌లో కొండెక్కిన కోడిగుడ్డు ధరలపై 10టీవీ కథనం.. ఇప్పుడు కూరగాయల ధరలు మోతమోగిపోతున్నాయి. కూరగాయలు ధరలు వింటేనే వణుకుపుడుతోంది. అసలే కూరగాయల ధరలు దడ పుట్టిస్తోంటే ఇప్పుడు కోడి గుడ్డు ధర కూడా సామాన్యులను కలవరపెడుతోంది. ఎన్నడూ లేనంతగా కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి పెరిగిపోయింది. ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. రూపాయి, రూపాయిన్నర ఉండే కోడిగుడ్డు ధర... 5రూపాయల నుంచి దిగడం లేదు. ప్రతికూల పరిస్థితులు, వ్యాపార ఒడిదుడుకులు, రెట్టింపైన వినియోగం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్‌లో గుడ్డు ధర 4 రూపాయల 66 పైసలు పలుకుతోంది. రిటైల్‌లో 5 రూపాయలు 25 పైసలు ఉంది. చిల్లరగా ఒక గుడ్డు 6 రూపాయలకు ఎగబాకి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో గుడ్డుతో పూట గడుస్తుందని భావించి సామాన్యులపై గుదిబండ పడినట్లైంది.

రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజు సగటున నాలుగు కోట్ల వరకు గుడ్డు ఉత్పత్తి అవుతున్నాయి. రోజూ మూడు కోట్ల వరకు వినియోగం ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సగటున కోటి 20 లక్షల గుడ్ల వరకు డిమాండ్‌ ఉంది. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారంలో మూడుసార్లు మాత్రమే గుడ్డు అందిస్తే... ఇప్పుడు ప్రతిరోజు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు తప్పనిసరి చేశారు. దీంతో గుడ్ల వినియోగం ఎక్కువైంది. గుడ్డుకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. దానికి తగ్గ సరఫరా లేదు. దీంతో గుడ్డు ధర ఆకాన్నంటింది. ఆరు నెలలుగా కోడిగడ్డు ధర ఎగబాకుతూ వస్తోంది. గత నెల వరకు గుడ్డు హోల్‌సేల్‌ ధర 3.60 ఉండగా.. నవంబర్‌ 1కి అది 4 రూపాయల 27 పైసలు చేరింది. మరో పది రోజుల్లోనే గరిష్టంగా 4రూపాయల 66 పైసలకు పెరిగింది. ఇక రిటైల్‌ ధర 5 రూపాయాల 25 పైసలు ఉన్నప్పటికీ మార్కెట్లో గుడ్డ ధర 6 రూపాయలు పలుకుతోంది. చలికాలంలో ఏటా గుడ్డు ధర పెరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీజన్‌ ప్రారంభంలోనే గుడ్డు ధరలు ఇలా మండిపోతుంటే.. మూడు నెలల్లో ధర మరెంత పెరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతింది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు అధిక మవ్వడంతో వ్యాపారాలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. నోట్లరద్దు పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసింది. దీంతో వ్యాపారులు ఆందోళన చెందారు. అప్పుల్లో కూరుపోయారు.

మార్కెట్‌లో గుడ్డుకు డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే సామాన్యులకు గుడ్డు ధరలు మాత్రం కలవరపెడుతున్నాయి. వచ్చేవారం నుంచి శుభకార్యాలు జరిగే అవకాశముండడంతో గుడ్డు ధర మరెంత పైకి ఎగబాకుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

11:15 - November 12, 2017

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్‌శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. డీజీపీగా అనురాగ్‌శర్మ పదవీకాలం నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మకు తెలంగాణ పోలీస్ అకాడమీలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 11 పోలీస్ బృందాలు కవాతు, పరేడ్‌లతో అనురాగ్‌శర్మకు గౌరవ వందనం సమర్పించాయి.

ఈ సందర్భంగా నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పోలీస్‌ను నెంబర్-1గా నిలబెట్టిన ఘనత డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కిందన్నారు. కొత్త రాష్ట్రంలో అన్ని ఇబ్బందులను అధిగమించినట్లు చెప్పారు. పోలీసులు శాంతి భద్రతలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నరని వెల్లడించారు. టెర్రరిజం, నక్సలిజాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. విభజన తరువాత పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఏర్పడినా సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ ది కీలక పాత్ర అని తెలిపారు.

పోలీసు శాఖలో దాదాపు అన్ని రంగాల్లో పనిచేయడం జరిగిందని మాజీ డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. విభజన తరువాత తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, నక్సలిజం పెరుగుతుందని అందరూ భావించారని కానీ తన టీం పసపోర్టుతో అలా జరగలేదన్నారు. పోలీసు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేవని కొనియాడారు. అందరి సహకారంతోనే డీజీపీగా సఫలమయ్యాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు కావాల్సిన అన్ని సదుపాయాలను సీఎం కేసీఆర్ కల్పించారని వెల్లడించారు. సీఎం సహకారంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టామన్నారు. కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు అనురాగ్‌శర్మ పేర్కొన్నారు.

11:06 - November 12, 2017

అందుకే జగన్ పాదయాత్ర - నారాయణ...

విశాఖపట్టణం : ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుండి తప్పించుకొనేందుకు జగన్ పాదయాత్ర చేపడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. కోర్టుల్లో విచారణ జరిగితే శిక్ష పడుతుందనే పాదయాత్ర అని తెలిపారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ప్రస్తావనపై జగన్ స్పందించాలన్నారు. ప్రతిపక్ష హోదాకు జగన్ పనికిరాడని, ప్రజా సమస్యలను..ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం పారిపోవడం బాధాకరమన్నారు. 

అహ్మదాబాద్ లో జవదేకర్..

గుజరాత్ : అహ్మదాబాద్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. 

10:50 - November 12, 2017

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మహా ధర్నా చేపట్టడం ఏంటీ ? అధికారం పక్షం నుండి ఎన్నికై ధర్నా చేపట్టడం ఏంటీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇదేమి నిజం కాదు...కేవలం షూటింగ్ నిమిత్తం ధర్నా చేపట్టారు. వందో చిత్రం అనంతరం బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 102వ సినిమా కె.ఎస్.రవి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'జై సింహ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

చిత్ర షూటింగ్ ప్రారంభం కూడా అయ్యింది. షరవేగంగా జరుపుకొంటున్న ఈ షూటింగ్ ఇటీవలే విశాఖ బీచ్ రోడ్డులో చేశారు. సినిమాలో ఓ సన్నివేశం కోసం బీచ్‌ రోడ్డులో ఐదు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహాధర్నా చేశారు. అంతేగాకుండా బాలయ్య..నయన్ లపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు. అరకు..బీచ్ లో హరిప్రియపై రొమాంటిక్ గీతాన్ని కూడా షూట్ చేశారు. మొత్తానికి వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
త్వరలో మరో షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోందని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. 

ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అనురాగ్ శర్మ..

హైదరాబాద్ : పోలీసు శాఖలో దాదాపు అన్ని రంగాల్లో పనిచేయడం జరిగిందని మాజీ డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. విభజన తరువాత తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, నక్సలిజం పెరుగుతుందని అందరూ భావించారని కానీ తన టీం పసపోర్టుతో అలా జరగలేదన్నారు. పోలీసు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేవని కొనియాడారు. అందరి సహకారంతోనే డీజీపీగా సఫలమయ్యాయన్నారు.

 

పోలీసుల ఖ్యాతీని పెంచిన అనురాగ్ శర్మ - మహేందర్ రెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో పోలీసు పరేడ్ జరిగింది. తెలంగాణ పోలీసుల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత అనురాగ్ శర్మకే దక్కిందని నూతన డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులను దేశంలో మొదటిస్థానంలో నిలబెట్టారని, విభజన తరువాత పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఏర్పడినా సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. నక్సలిజాన్ని ధీటుగా ఎదుర్కోవడం జరిగిందని, తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ ది కీలక పాత్ర అని తెలిపారు. 

10:16 - November 12, 2017

కర్నూలు : ఓ పేదోడి కుటుంబాన్ని పోలీసు అధికారి రోడ్డున పడేశాడు. ఐదు మంది పిల్లలు..భార్యతో భర్త నడి రోడ్డుపై కాలం వెళ్లదీస్తున్నాడు. గత నాలుగు రోజులుగా ఇలాగే ఉంటున్నా ఏ అధికారి స్పందించడం లేదనే విమర్శలున్నాయి. అల్లా బకాస్..రజియా దంపతులు ఐదు మంది పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాతో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నాడు. ఈ ఇంటిపై డీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ గౌడ్ బంధువుల కన్ను పడింది. దీనితో బకాస్ కుటుంబాన్ని తరిమివేయాలని ఏఎస్ఐ ప్రయత్నించాడని తెలుస్తోంది. 

తాలూకా పోలీసు అధికారులతో మాట్లాడి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అల్లా బకాష్ ఇంటి స్థలం అప్పగించేందుకు తాలుకా సీఐ మహేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ భాస్కరరాజులు ప్రయత్నించారు. అందులో భాగంగా ఈనెల 7వ తేదీన అల్లా బకాస్ ను పీఎస్ కు పిలిపించారు. ఈ సమయంలో పోలీసులు జేసీబీలతో ఇంటిని కూల్చివేశారు. దీనితో ఐదు మంది పిల్లలతో దంపతులు రోడ్డుపైనే కాలం గడుపుతున్నాడు. 

రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులే ఇంటిని కూల్చివేయడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

నారాయణ కాలేజీపై విద్యార్థి ఫిర్యాదు..

హైదరాబాద్ : చంపాపేట నారాయణ కాలేజ్ పై ఓ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. చదువు పేరిట యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఇంటర్ విద్యార్థి సాయినాథ్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులకు యాజమాన్యం కట్టుకథలు చెబుతోందని, విద్యార్థుల ఆత్మహత్యలకు నారాయణ యాజమాన్యమే కారణమని ఆరోపించాడు. 

09:44 - November 12, 2017
09:23 - November 12, 2017

గౌరవ వందనం స్వీకరించిన అనురాగ్ శర్మ..

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో పోలీస్ పరేడ్ జరిగింది. 11 పోలీసు బృందాల కవాతులో అనురాగ్ శర్మ గౌరవ వందనం స్వీకరించారు. నేడు డీజీపీ అనురాగ్ శర్మ వీడ్కోలు పొందుతున్న సంగతి తెలిసిందే. 

నేవీ మారథాన్ ప్రారంభం..

విశాఖ పట్టణం : సాగర తీరంలో నేవీ మారథాన్ జరిగింది. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీటర్ల విభాగాల్లో పరుగు జరిగింది. భారీగా ఔత్సాహికులు మారథాన్ లో పాల్గొన్నారు. 

జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం..

విజయవాడ : నేడు విజయవాడలో జనసేన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరుగనుంది. ఐ.వి.ప్యాలెస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

పొదలకూరులో భూ ప్రకంపనాలు..

నెల్లూరు: పొదలకూరు మండలంలో ఆదివారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. 

మురికివాడల్లో మంత్రి నారాయణ పర్యటన..

విశాఖపట్టణం : అనకాపల్లి మురికవాడల్లో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీస్తున్నారు. 

తాలుకా పోలీసుల దౌర్జన్యం...

కర్నూలు : జిల్లా తాలుకా పోలీసులు దౌర్జన్యం వెలుగు చూసింది. అల్లా బకాష్ అనే వ్యక్తిని ఇంటిని జేసీబీతో పోలీసులు కూల్చేశారు. డీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ గౌడ్ బంధువుకు అల్లా బకాష్ ఇంటి స్థలం అప్పగించేందుకు తాలుకా సీఐ మహేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ భాస్కరరాజులు ప్రయత్నించారు. ఈనెల 7వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు లేక ఐదుగురు చిన్నారులతో బాధితుడు ఇబ్బంది పడుతున్నాడు.

నగరానికి వాసుదేవన్ మృతదేహం...

హైదరాబాద్ : సింగపూర్ లో దారుణ హత్య గురైన వాసుదేవన్ రాజు మృతదేహం నగరానికి చేరుకుంది. గత నెల 31వ తేదీన ఆయన్ను దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

తిరుపతి బస్టాండులో కలకలం...

చిత్తూరు : తిరుపతి ఆర్టీసీ బస్టాండులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై..రక్షించాలంటూ బస్టాండులో పరుగులు తీశాడు. తీవ్రమైన రక్తపుస్రావంతో అతను మృతి చెందాడు. 

08:42 - November 12, 2017

చిత్తూరు : తిరుపతి ఆర్టీసీ బస్టాండులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై..రక్షించాలంటూ బస్టాండులో పరుగులు తీశాడు. తీవ్రమైన రక్తపుస్రావంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రసూల్ కాళహస్తి బస్టాండు వద్ద ఆదివారం ఉదయం వేచి ఉన్నాడు. ఇతను టైలర్ అని తెలుస్తోంది. ఇతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచారు. వెంటనే వారి నుండి రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశాడు. అప్పటికే అతడికి తీవ్రమైన రక్తస్రావం జరిగింది. బస్టాండులో పరుగులు తీస్తూ రక్షించాలంటూ వేడుకున్నాడు. ఆర్టీసీ బస్టాండులోని కాళహస్తి స్టాప్ దగ్గర కుప్పకూలిపోయి మృతి చెందాడు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకు హత్య చేశారు. ? హత్య చేసిన వారు ఎవరు ? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. 

08:35 - November 12, 2017

హైదరాబాద్ : సింగపూర్ లో దారుణ హత్య గురైన వాసుదేవన్ రాజు మృతదేహం నగరానికి చేరుకుంది. గత నెల 31వ తేదీన ఆయన్ను దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. భారత రాయబార కార్యాలయం ద్వారా కుటుంబసభ్యులు ఈ విషయం తెలుసుకున్నారు. దీనితో సింగపూర్ నుండి వాసుదేవన్ మృతదేహాన్ని నగరానికి తరలించారు. ఆదివారం ఉదయం కుషాయిగూడలోని మోహన్ నగర్ కు చేరుకొంది. దీనితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఉద్యోగ రీత్యా సింగపూర్ కు వెళ్లిన వాసుదేవన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఒక రూంలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. తమకు డబ్బులు కావాలని..లేనిపక్షంలో అతడిన చంపేస్తామని చిత్ర హింసలు పెట్టిన ఫొటోలను వాసుదేవన్ కుటుంబసభ్యులకు వాట్సప్ ద్వారా పంపించారు. కానీ కుటుంబసభ్యులు ఆలస్యంగా స్పందించడంతో నిందితులు వాసుదేవన్ ను దారుణంగా చంపేశారు. 

08:25 - November 12, 2017

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా..భూ కబ్జా దారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని అనంతపురం కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేర్కొన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఖాళీ స్థలాల్లో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని..ఫంక్షన్ హాల్ నిర్మించి లీజుకు ఇవ్వాలని కోరారు. దీనివల్ల ఆర్టీసీకి లాభాలు వస్తాయని..ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా ఉండాలని..కదిరి ఆర్టీసీ డిపోకు చెందిన రెండెకరాల ఖాళీ స్థలం ఉందని..ఇందులో ఫంక్షన్ హాల్ నిర్మించి లీజుకు ఇవ్వాలని కోరారు. కదిరిలో బస్టాండును ఆనుకుని దుర్వినియోగం అవుతోందని..దీనిని అభివృద్ధి చేయాలని గత నాలుగు నెలకంటే ముందు ఆర్టీసీ ఛైర్మన్ ను కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు స్థలాలున్నాయని..కాంప్లెక్స్ లు కట్టి లీజుకు ఇస్తే ఆర్టీసీకి లాభాలు వస్తాయన్నారు. 

08:24 - November 12, 2017

న్యాయమూర్తుల ముడుపుల ఆరోపణలపై విచారణ...

ఢిల్లీ : న్యాయమూర్తుల ముడుపుల ఆరోపణలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశంలో కొందరు లాయర్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. 

డీజీపీగా మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : నేడు అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ తొలి డీజీపీగా మూడున్నరేళ్లు సేవలందించారు. నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు. 

అనురాగ్ శర్మ రిటైర్ మెంట్...

హైదరాబాద్ : నేడు అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ తొలి డీజీపీగా మూడున్నరేళ్లు సేవలందించారు. ఉదయం 7.55 గంటలకు రాష్ట్ర పోలీసు అకాడమీలో అనురాగ్ శర్మకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలుకనున్నారు. అనురాగ్ శర్మకు 14వ తేదీన ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. 

పిలిప్పీన్స్ కు మోడీ...

ఢిల్లీ : నేటి నుండి మూడు రోజుల పాటు ఫిలిప్పీన్స్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆసియాన్ - భారత్ సదస్సు, తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ 50వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం... ఆర్ సీఈపీ నాయకుల భేటీ..ఈ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. 

06:51 - November 12, 2017
06:49 - November 12, 2017

హైదరాబాద్ : కాలుష్యం.. కాలుష్యం..! ఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా ఇదే మాట. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు మేఘం కప్పేయడంతో.. జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఉంది. ఇది ఢిల్లీ ఒక్కదానికే పరిమితం కాలేదు. దేశంలోని చాలా ప్రధాన నగరాలూ.. ఇదే తరహా కాలుష్యపు కాసారాలుగా మారాయి. అయితే.. కాలుష్యానికి కడు దూరంగా నిలిచిన నగరాలూ లేకపోలేదు. వీటిల్లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం అగ్రభాగాన ఉండడం విశేషం. దేశంలోనే అత్యల్ప పీపీఎం నమోదైన రాజధానిగా త్రివేండ్రం నిలిచింది.

భారత దేశాన్ని ఇపుడు వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీలో పొల్యుషన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో అత్యధిక వాయు కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో పొల్యుషన్‌ లెవల్ పిఎం 502 స్థాయికి చేరగా... ఘజియాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో 720 పిఎం నమోదైంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి సరి బేసి విధానాన్ని అమలు చేస్తోంది.

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉంది. ముఖ్యంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో పొల్యుషన్‌లెస్‌ నగరంగా గుర్తింపు పొందింది. పొల్యుషన్‌ లెవల్‌ ఇక్కడ అతితక్కువగా 13 పిఎం మాత్రమే నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌, విజయవాడ నగరాలు ఢిల్లీ స్థాయితో పోలిస్తే.. అసలు కాలుష్యం లేదనే చెప్పాలి. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం 50 పీఎంలలోపు కాలుష్యం ఉంటే.. వాతావరణం చాలా బాగా ఉన్నట్లు. ఈలెక్కన, 36 పీఎంలతో హైదరాబాద్‌, 39 పీఎంలతో విజయవాడ, 34 పీఎంలతో రాజమండ్రి, 28 పీఎంలతో విశాఖ.. కాలుష్య రహిత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో కూడా 22 పిఎంల మేరకే కాలుష్యం ఉంది.

కేరళ ప్రభుత్వం పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడం... అడవుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడం, పర్యావరణం పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహనను కల్పించడం వల్లే తిరువనంతపురం అతి తక్కువ కాలుష్యం నమోదైన్నది నిపుణుల అంచనా. బెంగళూరులో కూడా పచ్చదనానికి పెద్దపీట వేయడంతో వాయు కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంది. హైదరాబాద్‌ కన్నా విజయవాడలో కాలుష్యం 3 పిఎంలు ఎక్కువగా ఉండడం గమనార్హం.  

06:47 - November 12, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో సరి-బేసి విధానాన్ని అమలు చేయలేమని కేజ్రీవాల్ ప్రభుత్వం చేతులెత్తేసింది. సరి-బేసి విధానం అమలుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పలు షరతులు విధించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ వాహనాలు మినహా టూ వీలర్స్‌తో సహా అన్ని వాహనాలకు నిబంధన వర్తింప జేయాలని ఎన్‌జిటి ఆదేశించింది. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమౌతాయని భావించిన కేజ్రీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ నెల 13 సోమవారం నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అమలు చేయాలనుకున్న సరి-బేసి విధానానికి బ్రేక్‌ పడింది. ఈ విధానంపై ఎన్‌జిటి పలు షరతులు విధించడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

సరి-బేసి సంఖ్య విధానంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ విధానం అంత సరైంది కాదని చెబుతూనే కొందరికి ఎందుకు మినహాయింపు కల్పించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరి-బేసి విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే ఎన్‌జిటి పలు షరతులు విధించింది. అంబులెన్స్‌, ఫైర్‌, మున్సిపల్‌ చెత్తవాహనాలను మినహాయించి అన్ని వాహనాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ద్విచక్రవాహనాలు, మహిళలకు కూడా ఈ నిబంధన తప్పనిసరి వర్తింప జేయాలని సూచించింది.

ఎన్‌జిటి ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం జరిపింది. గతంలో సరి-బేసి విధానాన్ని అమలు చేసిన సమయంలో వీవీఐపీలతో పాటు మహిళలకు, టూవీలర్స్‌కు, స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఇపుడు అన్ని వాహనాలకు సరి-బేసి విధానం అమలు చేస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తన నిర్ణయంపై పునర్విచారణ జరపాలని కోరుతూ ప్రభుత్వం- సోమవారం ఎన్‌జిటిలో రివ్యూ పిటిషన్‌ వేయనుంది. టూవీలర్స్‌, మహిళలకు మినహాయింపు నివ్వాలని ఎన్‌జిటిని కోరనుంది.

06:44 - November 12, 2017

మహబూబ్ నగర్ : కొడంగల్‌ నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌ సంధించి... ఇతర పార్టీల నేతలను కారెక్కించుకుంటున్న గులాబీ పార్టీ... మరికొంతమంది నేతలను టార్గెట్‌ చేసింది. ఉప ఎన్నిక వస్తే గెలిసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. బై ఎలక్షన్స్‌లో గెలవడం, రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్యామిటీని టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంపై గులాబీ బాస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన రేవంత్‌.. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌... ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందించానని చెప్పారు. మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన రేవంత్‌... తర్వాతి రోజు నుంచి సమావేశాలకు హాజరుకావడం లేదు. దీంతో అందరూ రేవంత్‌ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని భావించారు. అయితే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ మాత్రం ఇప్పటి వరకు స్పీకర్‌ కార్యాలయానికి చేరుకోలేదు. దీంతో ఆయన రాజీనామా చేశారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్‌ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కొడంగల్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అక్కడ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని సంధించింది. పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి చెక్‌పెట్టే దిశగా గులాబీ బాస్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. వీరికి ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు కూడా జతకలువనున్నారు. కొడంగల్‌లో గెలుపు బాధ్యతను గులాబీ బాస్‌.. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీశ్‌రావుకు అప్పగించారు. గులాబీ బాస్‌ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు కొడంగల్‌ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం హరీశ్‌ కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఆ నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో కొడంగల్ రాజకీయం రసవత్తరంగా మారింది.

మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

మహబూబ్‌ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలో లారీ-ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు బండమీదిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఐదుగురు పత్తి కూలీలు కాగా ఒకరు ఆటో డ్రైవర్. 

06:38 - November 12, 2017

ఢిల్లీ : కార్మికుల నినాదాలతో హస్తినలో మూడోరోజు మహా పడావ్ హోరెత్తింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలపై నినదించారు. ఈరోజు ముఖ్యంగా అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు వేలాదిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు మహా పడావ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్లు బతుకమ్మ ఆడారు. కనీస వేతనాలు చెల్లించడంతో పాటు.. పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

కార్మికుల నిరసనలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక సంఘాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. జనవరి మొదటివారంలో దేశ వ్యాప్తంగా జిల్లా స్ధాయిలో సదస్సులు నిర్వహించాలని.. జనవరి చివర్లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కార్మికులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించకపోతే సహించేది లేదని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హెచ్చరించారు. మహా పడావ్‌ విజయవంతం చేసిన కార్మికులకు సీఐటీయూ తరపున సాయిబాబు విప్లవ వందనాలు తెలిపారు. మూడు రోజులుగా హస్తిన వీధుల్లో నినదించిన కార్మిక సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో ఆందోళనలు మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. 

06:34 - November 12, 2017

హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన కొలువులు కొట్లాట సభకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 30న హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు టీజేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. కొలువుల కొట్లాల సభను సక్సెస్‌చేసి... తమ సత్తా చాటాలని టీజేఏసీ భావిస్తోంది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు కొలువుల కోసం పోరుబాట పడితేతప్ప... ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నిరుద్యోగులందరిని ఏకం చేసి హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని తాము భావిస్తే.. ప్రభుత్వం మాత్రం సభకు అనుమతి ఇవ్వకుండా కక్షసాధింపుకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కొలువుల కొట్లాట సభతో తెలంగాణ విద్యార్థులు, మేధావుల్లో ధైర్యం నింపి భవిష్యత్తు పోరాటాలకు సన్నద్దం చేస్తామని తెలిపారు. ఈ సభకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. కొలువుల కొట్లాల సభ తర్వాత స్ఫూర్తి యాత్ర కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. ధర్నాచౌక్‌ను తిరిగి తెరిపించేందుకు మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే... మరోవైపు అన్ని సంఘాలను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు టీజేఏసీ ప్రయత్నాలు చేస్తోంది.

06:33 - November 12, 2017

ఢిల్లీ : జీఎస్టీ స్లాబుల తగ్గింపు నిర్ణయం గుజరాత్‌ ఎన్నికల కోసమే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. అత్యవసరంగా జీఎస్టీ అమలు చేయాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకొచ్చిందో దేశప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుచేశామని అంగీకరించే నైతిక ధైర్యం ఆర్థికమంత్రికి ఉండాలన్నారు. ఈ విషయంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

06:30 - November 12, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లెల నుంచి ముస్తాబాద్‌ వరకు 2 కోట్ల 80 లక్షల నిధులతో చేపట్టనున్న రెండు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కరెంట్‌ కోసం అర్ధరాత్రి వరకు రైతులు పొలాల్లో కాపలా కాయాల్సిన పరిస్థితులు పోయాయని..వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. 

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలో ఓ ప్రైవేటు హాస్టల్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్తుల విషయంలో తనతో సోదరులు పలుమార్లు ఘర్షణ పడుతున్నారని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

సవరించిన గ్రూప్ 1 ఫలితాల విడుదల..

హైదరాబాద్ : సవరించిన గ్రూప్ 1 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విడుదల చేసిన 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఫలితాలను టీఎస్పి ఎస్సీ వెబ్ సైట్ లో ఉంచింది. గ్రూప్ 1 ఫలితాల్లో భారీగా మార్పులు..చేర్పులు చేశారు. 48 మంది అభ్యర్థులకు గతంలో కంటే మెరుగైన పోస్టులను కల్పించారు. మారిన ఫలితాల్లో కొత్తగా 10 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రానున్నాయి. గత జాబితాలో 10 మందికి కొత్త జాబితాలో నిరాశ ఎదురైంది. 

హెచ్ సీయూలో విద్యార్థుల సస్పెన్షన్...

హైదరాబాద్ : హెచ్ సీయూలో నిబంధనలు అతిక్రమించినందుకే పది మంది విద్యార్థులను సస్పెన్షన్ చేసినట్లు ప్రొ.వి.సి. ప్రకాష్ బాబు పేర్కొన్నారు. బాయ్స్ హాస్టల్ లో అమ్మాయి ఉందని..తనిఖీ చేసిన సిబ్బందిపై విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. సస్పెన్షన్ పై విద్యార్థులు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉందని, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

Don't Miss