Activities calendar

13 November 2017

22:04 - November 13, 2017

బాగ్దాద్ : ఇరాన్‌, ఇరాక్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. ప్రకృతి ప్రకోపానికి 328 మంది మృతి చెందారు. మరో 2,500 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  

ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దుల్లో ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది.ఈ విపత్తులో ఇప్పటివరకు 328 మంది మృత్యువాత పడగా.. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంపానికి పలు భవనాలు చిగురుటాకుల్లా వణికాయి. ఇళ్లలోని ఫ్యాన్లు ఊయలలా ఊగిపోయాయి. సూపర్‌ మార్కెట్‌లలో బల్లలపై అమర్చిన వస్తువులన్నీ భూకంప ధాటికి కిందపడిపోయాయి. 

తూర్పు ఇరాక్‌ హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 33.9 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని 20 ప్రావిన్స్‌ల్లో భారీ నష్టం సంభవించింది.  భూకంపం కారణంగా అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఒక్క సర్పోలే జహబ్‌లోనే 142 మంది చనిపోయినట్లు సమాచారం.

శిథిలాల కింద చిక్కుకుని వందల సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు.  ప్రాణాలతో బయటపడ్డ వారు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం తర్వాత మరో 50సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంట్‌, నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్‌లో హెలిక్యాప్టర్ల ద్వారా భూకంప ప్రాంతాల్లో అధికారులు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందిన 30 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

22:02 - November 13, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ క్షేత్రం వైష్ణోదేవి ఆలయ దర్శనంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నిబంధనలు విధించింది. ఇకపై రోజుకు 50వేల మంది భక్తులను మాత్రమే వైష్ణోదేవి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పరిమితికి మించిన భక్తులను అర్ధకువారీ లేదా కత్రా వద్ద ఆపివేస్తామని ఎన్‌జీటీ పేర్కొంది. రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ సామర్థ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జిటి పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నవంబర్‌ 24న వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే కొత్త మార్గాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇది కేవలం పాదచారులు, బ్యాటరీ కార్లకు మాత్రమేనని.. గుర్రాలపై వెళ్లేందుకు ఈ కొత్త రహదారిపై అనుమతి లేదని స్పష్టం చేసింది. వైష్ణోదేవి ఆలయాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 69.34లక్షల మంది భక్తులు సందర్శించారు.  ప్రకృతి విపత్తులు, ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గినట్లు సమాచారం.

 

22:00 - November 13, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో దళితుల మీద జరిగిన దాడిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కమిషనర్‌ కార్తికేయ మిశ్ర... బాధిత కుటుంబాలను కలిసి ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. భరత్‌ రెడ్డిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే రిమాండ్‌కు తరలిస్తామని ఏసీపీ సుదర్శన్‌ తెలిపారు.  

 

21:58 - November 13, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి 40 నెలలు దాటిపోతున్నా అమరుల కుటుంబాలకు ఎందుకు సాయం చేయలేదని రేవంత్.. కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వేయి 569 మంది వివరాలను సేకరించకపోవడం మీ నిర్లక్ష్యమే తప్ప మరేమీ కాదని లేఖలో విమర్శించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అమరులకు ప్రభుత్వం అందించిన సాయంపై చర్చించడంతో పాటు కేసీఆర్ సభలో ప్రకటన చేయాలని రేవంత్ డిమాండ్‌ చేశారు. 


 

21:56 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే రైతు సమన్వయ సమితిలో ఉంటారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు చేశామన్న సీఎం...  భూరికార్డులతో రైతు సమన్వయ సమితులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేసి జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. అధికార, ప్రధానప్రతిపక్షం మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడిన తమ పార్టీ కార్యకర్తలే రైతు సమన్వయ సమితికి నేతృత్వం వహిస్తారని స్వయంగా కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తమ వారికే స్ధానం కల్పించడానికి కారణం కేవలం రైతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత తప్ప మరో కారణం లేదన్నారు. తాము చేసేది తప్పైతే రానున్న ఎన్నికల్లో ప్రజలే తమకు తీర్పు చెబుతారన్నారు.

రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అవసరం లేదన్నారు సండ్ర వెంకట వీరయ్య, చిన్నారెడ్డి. తమ కార్యకర్తల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు. 

అయితే వీరి ఆరోపణలను కేసీఆర్ ఖండిచారు. టీడీపీ ప్రభుత్వం 2005లో రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేశారని సీఎం ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బీడుపట్టిందని విమర్శించారు. తెలంగాణకు 1330 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే ఎన్ని టీఎంసీలు వాడారని ప్రశ్నించారు. 

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించారు. 24 గంటల విద్యుత్‌తో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.  రైతులందరు ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల కలిగే నష్టాలపై రైతులకు ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు సీఎం. 

21:53 - November 13, 2017

కృష్ణా : విజయవాడ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. నిన్న సాయంత్రం ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్‌.. ఈ సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇద్దరు మహిళల ఆచూకీ కోసం కృష్ణానదిలో గాలింపు కొనసాగుతూనే ఉంది. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు బరువెక్కిన గుండెలతో నిరీక్షిస్తున్నారు. ఇంకోవైపు, పలువురు ప్రముఖులు.. ప్రమాద స్థలిని సందర్శించి, వివరాలు ఆరా తీశారు. 

కృష్ణాజిల్లా ఫెర్రీఘాట్‌ వద్ద పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి 16 మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ సిబ్బంది ఈరోజు మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అటు ఆంధ్రా ఆసుప్రతిలో చికిత్స పొందుతోన్న భూలక్ష్మి అనే మహిళ తుది శ్వాస విడిచారు. ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇద్దరు మహిళల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

బోటు ప్రమాదం నుంచి..  రెస్క్యూ టీమ్‌ వారు రక్షించిన వారిలో 17 మంది ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. మరో ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. స్వస్థలాలకు తరలించారు. మృతుల్లో ఎక్కువమంది ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వాసులే కావడం... అంతా వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు కావడంతో..  వారితో పరిచయం ఉన్నవారంతా విషణ్ణులయ్యారు. మృత దేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రి శిద్దారాఘవరావు, వైసీపీ నేతలు కూడా మృత దేహాలకు నివాళులు అర్పించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 

ఒంగోలులో.. మృతురాలు లీలావతి కుటుంబంలో వెన్వెంటనే మరో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మంగమూరులో కూతురు  మృతదేహాన్ని చూసి.. తట్టుకోలేక గుండెపోటుతో ఆమె తల్లి లక్ష్మీకాంతమ్మ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో అందరూ దిగ్భ్రాంతిలో ఉండగానే.. లీలావతి తండ్రి కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. 

మరోవైపు, ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో ప్రమాదస్థలిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదంలో చనిపోయిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోదరి బంధువులను పరామర్శించారు. అనంతరం ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఫెర్రీఘాట్‌ ఘటనను తీవ్రంగా భావిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు ప్రారంభించింది. రివర్‌బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ పార్టనర్స్‌ సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై పోలీసులు ఐపీసీ 304 సెక్షన్‌ 2 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తరువాత ఆరుగురు సిబ్బంది పరారు కాగా.. పడవ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు కారకులైన వారెవరినీ వదలబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అటు, వైసీపీ నాయకులు కూడా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వ వైఫల్యమే 21 మందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. బోట్ల సామర్థ్యాన్ని పరీక్షించే వ్యవస్థ పర్యటక శాఖకు లేదని, ఈ శాఖ మొత్తం ఔట్‌ సోర్సింగ్‌పైనే ఆధారపడి పనిచేస్తోందని అన్నారు. నదిలో తిరిగే బోటులో కనీసం లైవ్‌ జాకెట్స్‌ లేకపోవడం దారుణమన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పదేసి లక్షల రూపాయల మేర పరిహారాన్ని ప్రకటించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదించేందుకు... ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులతో కమిటీని వేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తానికి.. బెజవాడ బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

21:46 - November 13, 2017

అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. రూ.2.5 కోట్ల ఆస్తినష్టం

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సినిమా సెట్టింగ్ తగలబడింది. రూ.2.5 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. 

21:37 - November 13, 2017

గోసంరక్షకుల దాడిని ఖండించిన సీపీఎం పొలిట్ బ్యూరో

ఢిల్లీ : రాజస్థాన్ లోని అల్వార్ లో గోసంరక్షుల దాడిని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. ఆవులను కొనగోలు చేసిన రైతులపై అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ దాడి చేయడం దారుణమన్నారు. గోసంరక్షకుల దాడిలో చనిపోయిన ఉమర్ ఖాన్ కుటుంబానికి రాజస్థాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దాడి చేసిన గోసంరక్షకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశంలో గోసంరక్షణ గ్రూపులపై ప్రభుత్వం నిషేధం విధించాలన్నారు.

 

 

20:51 - November 13, 2017

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా ఎన్నో సవాళ్లు.. ఇలా చిన్నారుల హక్కుల పరిరక్షణకు ఎదురవుతున్న సవాళ్ల గురించి బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 
ప్రమాదంలో బాల్యం
మాటలకే పరిమితమౌవటం చాలా సాధారణంగా మారింది... వాళ్లు తారే జమీన్ పర్ లాంటివాళ్లు అని సినిమా చూసి కళ్లు తుడుచుకుంటాం.. తెల్లారాక మళ్లీ మామూలే .. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు తల్లిదండ్రుల నిస్సాహాయత, పేదరికం, తెలియనితనం, అక్రమార్కుల కుట్రలు..జైలు గదుల పాఠశాలలు... వెరసి బాల్యం ప్రమాదంలో పడుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:27 - November 13, 2017

పడ్వ మున్గక ముందుకే పంచాది, భూపాలపల్లి జిల్లాల పెద్దోళ్ల మాట, కుల సంఘ మీటింగుల బానిసత్వం, రైతును రాజు జేస్తాని రౌడీలను జేశిండ్రు, సర్కారు బడికి వస్తున్న మ్యాకపిల్ల, ఆత్మహత్య జేస్కున్న అక్బర్ రైలు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

లక్ష్మీష్ వీరంగంధం సినిమా షూటింగ్ ను అడ్డుకున్న గ్రామస్తులు

కృష్ణా : నిమ్మకూరులో లక్ష్మీష్ వీరంగంధం సినిమా షూటింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు.

పసికందు సజీవ దహనం

ప్రకాశం : పొదిలిలో విషాదం నెలకొంది. అగ్నిప్రమాదంలో 6 నెలల పసికందు సజీవ దహనం అయింది. పరుపుపై చిన్నారి నిద్రిస్తుండగా జెట్ కాయిల్ పడడంతో మంటలు చెలరేగాయి. 

20:13 - November 13, 2017

బోటు ప్రమాద ఘటన దురదృష్టకరమని వక్తలు అన్నారు. బోటు ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద బోటు ప్రమాదం ఘటనలో 21 మంది మృతి చెందారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావు, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వైసీపీ నేత ఉదయభాను పాల్గొని, మాట్లాడారు. బోటు యాజమాన్యం నిర్లక్ష్యానికి 21 మంది బలి అయ్యారని తెలిపారు. ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

20:05 - November 13, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పెదవేగి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహించిన కార్నివాల్‌ ఘనంగా జరిగింది. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వన భోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మాదిరిగా తమ పాఠశాలలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా క్షేమంగా ఉంటున్నారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఐదేళ్లలో ఆటల పోటీల్లో విద్యార్థులు విద్యార్థులు సాధించిన షిల్డ్స్‌ను ప్రదర్శనకు ఉంచడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 

 

20:02 - November 13, 2017

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 'మనం' మూవీ స్టూడియో, బోల్ బేబీ బోల్ కార్యక్రమం కోసం వేసిన సెట్టింగ్ తగలబడుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మంటలార్పడానికి వెళ్లిన ఇద్దరు సిబ్బందికి గాయాలు అయినట్లు సమాచారం. స్టూడియో సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించడం లేదు. సెక్యూరిటీకి, సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.. అయితే రెండు పెద్ద శబ్ధాలు వచ్చి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. మరో వైపు గ్యాస్ సిలిండర్లు పేలాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

19:51 - November 13, 2017

కడప : రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ గా.. జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని హాస్పిటల్‌ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్‌ రెడ్డి అన్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తన సొంత ట్రస్ట్‌ అయిన దేవగుడి శంకర్‌ రెడ్డి సుబ్బిరామి రెడ్డి ట్రస్ట్‌ ద్వారా ఆసుపత్రిలో అభివృద్ది పనులు చేపట్టారు. ఆసుపత్రిలో వాటర్‌ ప్లాంట్‌, రోగులకు కావల్సిన దుప్పట్లు, కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి సంబంధించిన మందుల కోసం ప్రతినెల యాభై వేల రూపాయల విరాళం ఇస్తున్నానని తెలిపారు. ఇందు కోసం దాతల సహాయం కూడా కోరుతున్నానని.. ఇప్పటివరకు సహకరించిన దాతలకు సుధీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

19:47 - November 13, 2017

కర్నూల్‌ : ఓ పేదోడి కుటుంబాన్ని పోలీసు అధికారి రోడ్డున పడేశాడు. ఐదు మంది పిల్లలు.. భార్యతో భర్త నడి రోడ్డుపై కాలం వెళ్లదీస్తున్నాడు. కర్నూల్‌ జిల్లా తాలూక పరిధిలోని బీతాండ్రపాడు పరిదిలో అల్లా బకాస్‌, రజియా దంపతులు ఐదు మంది పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాతో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నాడు. ఈ ఇంటిపై డీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ బంధువుల కన్ను పడింది. దీంతో అల్లాబకాస్ కుటుంబాన్ని తరిమివేయాలని ఏఎస్ఐ ప్రయత్నించారు. తాలూకా పోలీసు అధికారులతో మాట్లాడి ఇంటిని కూల్చివేశారు. తమ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకొని.. తమకు ఇంటి నిర్మించాలంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన బాధిత కుటుంబంతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:44 - November 13, 2017

కడప : ప్రజలకు భరోసానిస్తూ జగన్‌ యాత్ర చేపట్టారని రాయచోటి ఎమ్మెల్యే  శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. చంద్రబాబు నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. టీడీపీ పార్టీ.. పచ్చచొక్కాల వారికే సాయం చేస్తుందని ఆరోపించారు.

 

19:39 - November 13, 2017

కడప : జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఏడోరోజుకు చేరింది. ఇవాళ కడపజిల్లాలోని దువ్వూరు నుండి ఏకోపల్లి, బిల్లెల, 
కానగూడూరు, ఇడమడక మీదుగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత బస్సుయాత్ర చేపడుతానని జగన్‌ తెలిపారు. ఈ యాత్రలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి... ప్రధాన సమస్యలపై మానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను కచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

19:37 - November 13, 2017

గుంటూరు : విజయవాడ బోటు ప్రమాదానికి బాధ్యులు ఎవరినీ వదలబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన శాసనసభలో ప్రకటన చేశారు. కొందరు స్వార్థపరులు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నమాన్న చంద్రబాబు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని వేస్తామన్నారు. 
పర్యాటకుల మృతి బాధాకరం : సీఎం 
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాద ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. పవిత్ర సంగమానికి వచ్చిన పర్యాటకులు అక్కడే మృతిచెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రుల్లో 21 మందిని ఆస్పత్రికి తరలించగా వారిలో 17 మంది డిశ్చార్జి అయ్యారని, మరో నలుగురు చికిత్స పొందుతున్నారని వివరించారు. నదిలో గల్లంతైన బోటు డ్రైవర్‌, హెల్పర్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎం చెప్పుకొచ్చారు. 
బోటు డ్రైవర్‌, హెల్పర్‌ ఆచూకీ కోసం గాలింపు 
ప్రమాద సమయంలో బోటులో 41మంది ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి రివర్‌ బోటింగ్‌ సంస్థపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందన్నారు. మొత్తం ఐదుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేశామన్నారు. బోటు నిర్వాహకుడికి అనుమతి లేదని, ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రయాణికులను ఎక్కించుకున్నాడని, అతని స్వార్థం ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 
రివర్‌ బోటింగ్‌ సంస్థపై కేసు నమోదు
ఆదివారం సాయంత్రం పర్యాటకులు ముందుగా టూరిజమ్‌ శాఖ బోటు ఎక్కారని..అయితే, సమయం మించిపోవడం వల్ల సిబ్బంది పర్యటకులను అనుమతించలేదని, ప్రైవేటు బోటు సిబ్బంది వారిని ఎక్కించుకుని నదిలోకి తీసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బోటు ప్రమాద మృతుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎం ప్రకటన అనంతరం సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

19:34 - November 13, 2017

ప్రకాశం : కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో చనిపోయిన 14 మంది ఒంగోలు వాసులను స్వస్థలాలకు తరలించారు. జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు, జిల్లా నేతలు, కలెక్టర్ మృతదేహాలకు నివాళులు అర్పించి.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా ఉందని... బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. 

19:27 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద పడవ ప్రమాదం ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పడవ యాజమాన్యం రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ పార్టనర్స్ సంస్థపై ఇబ్రహీంపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా బోటును నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను జలవిహారానికి తీసుకెళ్లడాన్ని పోలీసులు నేరంగా పేర్కొన్నారు. లైఫ్ జాకెట్లు వంటి రక్షణాత్మక సామాగ్రి పరిమితంగా ఉండటం, సామర్థ్యానికి మించి పర్యాటకులను పడవలోకి ఎక్కించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండల రావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. 

 

19:25 - November 13, 2017

కృష్ణా : జిల్లాలోని ఫెర్రీఘాట్‌ వద్ద పడవ ప్రమాద ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. నిన్న 16 మంది మరణించగా, ఇవాళ మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ భూలక్ష్మి అనే మహిళ చనిపోయింది. 17 మంది డిశ్చార్జ్‌ కాగా..మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు నిన్న చనిపోయిన 16 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు అధికారులు తరలించారు. మృతుల్లో డీజీపీ బంధువు పసుపులేటి సీతారామయ్య,.. ఇంటెలిజెన్స్‌ అధికారి రామారావు మేనకోడలు లీలావతి మృతి చెందారు. అలాగే సీపీఐ నేత నారాయణ బంధువులైన ముగ్గురు... ఈ ప్రమాదంలో మృతి చెందారు. గల్లంతైన మరో ఇద్దరు మహిళల కోసం కృష్ణానదిలో అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన పరిసరాల్లో ప్రత్యేక బోట్లతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు రెస్కూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 

19:22 - November 13, 2017

నిర్మల్‌ : జిల్లాలోని దస్తూరాబాద్‌ మండల్‌ బుట్టాపూర్‌ గ్రామంలో దళితులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే నెంబర్‌ 140లో గల భూమిలో సీపీఎం ఆధ్వర్యంలో భూమిని కొలుస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అధికారులు అటవీశాఖ అధికారులు అడ్డుపడి ఇది అటవీ భూమి అంటూ ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మీరు ఎలా భూ పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. దళితులు మాత్రం ఇది రెవెన్యూ భూమి అని మొత్తం 1500 ఎకరాలలో 1000 ఎకరాలు ప్రస్తుతం సాగులో ఉందని అంటున్నారు. వారి మాటలు లెక్కచేయని అటవీశాఖ అధికారుల... దళితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... 12మంది దళితులను అరెస్ట్‌ చేశారు.

 

19:20 - November 13, 2017

హైదరాబాద్ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌లో పని చేస్తున్న జిల్లా, మండలస్థాయి ఉద్యోగులు మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రెండు నెలల క్రితం నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో.. డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో సెర్ప్‌ ప్రధాన కార్యాలయం నాంపల్లి వద్ద మళ్లీ నిరాహార దీక్ష చేపట్టారు. 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకుని 1533 కుటుంబాలను ఆదుకోవాలని సెర్ప్‌ ఉద్యోగులు కోరుతున్నారు. 

 

19:16 - November 13, 2017

హైదరాబాద్ : ఎస్సీ కార్పొరేషన్‌ కింద లబ్దిదారుల్ని ఎంపిక చేసినా వారికి నిధులు ఎందుకు కేటాయించలేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు మంత్రి జగదీశ్వరరెడ్డి సమాధానం చెప్పారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 77 వేల 114మంది ఎస్సీ యువకులని లబ్దిదారులగా ఎంపిక చేయడమే కాకుండా వారికి 774 కోట్ల 76 లక్షల నిధులు ప్రభుత్వం తరపున మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 

 

19:11 - November 13, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మంజూరు చేసిన రూ.3 వేల కోట్ల రూపాయలలో  2వేల 240 కోట్లు ఖర్చు అయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం సమకూర్చే 14 వందల 58 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లో 958 కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. నాలుగు కారిడార్లకు వర్తింపచేస్తూ 84.4 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు జరుగుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్‌, ఘట్‌కేసర్‌ల మధ్య 21 కిలోమీటర్ల మేర చేపట్టిన ఎంఎంటీఎస్ రెండవదశ పనుల్లోనే.. మరో స్ట్రెచ్‌ను మూడవదశగా ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి రైల్వే స్టేషన్‌కు పొడిగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాయగిరి స్టేషన్‌ను యాదాద్రి స్టేషన్‌గా అభివృద్ధి చేయబోతున్నట్లు కేటీర్ తెలిపారు.

 

అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సినిమా సెట్టింగ్ దగ్ధం అయింది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలార్పుతున్నారు.

 

18:45 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో భూములకు లెక్కాపత్రం ఉన్నాయా అని సీఎం ప్రశ్నించారు. కేవలం ధర్మం మీదనే నడుస్తుందని..80 ఏళ్ల క్రితం నిజాం చేసిన సర్వే తప్ప మళ్లీ అలాంటి ప్రయత్నానికి ఎవరూ పూనుకోలేదన్నారు. భూరికార్డులు గందరగోళంగా మారాయని నకిలీ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. కొందరు బ్యాంకు మేనేజర్లు సైతం నకిలీ పాస్‌పుస్తకాలతో లోన్లు తీసుకుని పట్టుబడ్డ ఘటనలున్నాయని ఆక్రోశం వ్యక్తంచేశారు. అందుకే భూసర్వే చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. 

 

18:40 - November 13, 2017
18:39 - November 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌..! ఇది ఎడారి బతుకుల తావు. అక్కడి ప్రజలవి.. వాన చినుకుపై ఆశతో సాగే బతుకులు.. గుక్కెడు నీటి కోసమూ మైళ్ళ దూరం నడవక తప్పని వెతలు.. పచ్చందనాల సంగతి సరేసరి.. కనీసం మూగజీవాలకు కూసింత గడ్డి దొరకడమూ దుర్లభమే. ఇసుక తుఫాను హోరు తప్ప.. జలకళ మచ్చుకైనా కానరాదక్కడ. ఇదీ రాజస్థాన్‌ గురించి మనకు తెలిసిన విషయం. కానీ, నేడు అక్కడి పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. ఎడారి నేలలోంచి నాలుగడుగులకే గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఇదెలా సాధ్యమైంది..? ఎడారి నేల జలసిరులకు కారణమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానమే.. 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్‌.

దేశంలోనే అత్యధిక ఎడారి ప్రదేశమున్న రాష్ట్రం రాజస్థాన్‌...! దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జైసల్మేర్‌ ఉన్న రాష్ట్రమూ ఇదే..! ఇక్కడి జీవనం.. ముఖ్యంగా గ్రామీణ జనజీవనం అత్యంత దుర్భరం. కడుపునిండా తిండి మాట అటుంచి.. గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందామన్నా వీలుకాని దయనీయ జీవనం. 

ఏటికేడు తగ్గుతోన్న వర్షపాతం.. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం..నానాటికీ అడుగంటిపోతున్న భూగర్భ జలం.. గుక్కెడు తాగునీటికీ మైళ్ల దూరం నడవాల్సిన దైన్యం..ఇదీ నిన్నటి దాకా రాజస్థాన్‌ రాష్ట్ర ముఖ చిత్రం. భారత భూభాగంలో రమారమి పది శాతం కలిగిన పెద్ద రాష్ట్రం. పర్యటకులను ఆకట్టుకునే దుర్భేద్యమైన కోటలు, గ్రానైట్‌ పరిశ్రమలు.. ఎత్తైన కొండలతో కాన్వాస్‌పై అందంగా చిత్రించినట్లుండే రాజస్థాన్‌లో.. గ్రామీణ జీవనం దుర్భరం.  

జైపూర్, జోధ్ పూర్, ఉద‌య్ పూర్, బిక‌నీర్, కోటా, అజ్మీర్... ఇలా కొన్ని ప‌ట్ణాణాలను మిన‌హాయిస్తే..  అక్కడొకటి, ఇక్కడొక్కటి అన్నట్లుగా ఉండే ఊర్లు.. విసిరేసినట్లుగా ఉండే జనావాసాలు.. గిరిజ‌న గూడేలు.. ఇవన్నీ తీవ్ర వర్షాభావానికి సజీవ సాక్ష్యాలు. ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ గుక్కెడు నీటికోసం కటకటలాడేవే. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర దూరం సాగక తప్పని దైన్యం వీరిది. ఇక మూగ‌జీవాల సంగ‌తి చెప్పక్కర్లేదు. ప‌చ్చిక లేక డొక్కలు ఎండిన పశువులే కనిపిస్తాయిక్కడ. ఉపాధి పరిస్థితీ అంతంతే. పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిన వారు వెళ్లగా.. ఉన్నవారికి ఉపాధి కనిపించని దయనీయ స్థితి. 

తడారి ఎండిన నేలలు.. దప్పికతో అల్లార్చుకుపోతున్న గొంతుకలు.. శోషించి శుష్కించిన దేహాలు.. రాజస్థాన్‌ గ్రామీణంలో ఎక్కడ చూసినా ఇవే చిత్రాలు.. గుండెలను బరువెక్కించే దృశ్యాలు..
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం..
ఎడారి బతుకుల్లో చిగురిస్తోన్న కొత్త ఆశలు..
నిత్య క్షామపీడిత రాజస్థాన్‌ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో.. ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల క్షామానికి చరమగీతం పాడే దిశగా బృహత్తరమైన అడుగులు పడుతున్నాయి. ఎండిన గొంతుకు నీటిని, పొడిబారిన నేల‌కు గంగ‌మ్మ పరుగులను  అందించే ప‌క్కా ప్రణాళిక‌కు శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా.. నిన్నటి ఎడారి.. నేడు సస్యాన్ని నింపుకుంటోంది. గ్రామీణుల దాహార్తీ తీరుతోంది. 
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం..
మారుతోన్న రాజస్థాన్‌ కరవు చిత్రం.. ఎడారి బతుకుల్లో చిగురిస్తోన్న కొత్త ఆశలు.. రాజస్థాన్‌ ప్రజలకు వరదాయినిగా ఎంజేఎస్‌ఏ... చతుర్విధ జల సంరక్షణకు నడుం బిగించిన ఎంజేఎస్‌ఏ..అనతి కాలంలోనే జలసిరులను అందిస్తోన్న అద్భుత ఫలితాలు..

అవును..! కరవుతో కునారిల్లిన రాజస్థాన్‌లో నేడు జలసిరులు పొంగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళిక సఫలమై.. అక్కడ భూగర్భజలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. తెలుగు బిడ్డ వెదిరె శ్రీరాం నేతృత్వంలోని ఎంజేఎస్‌ఏ.. విశేష కృషితో.. ఇక్కడ అద్భుత ఫలాలు సాధ్యమవుతున్నాయి. 

సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. భూమిపై పడ్డ ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకునేందుకు చతుర్విధ జలసంరక్షణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాజస్థాన్‌ రివర్‌ బోర్డ్‌ అథారిటీ సూచనల మేరకు, "ముఖ్యమంత్రి జల స్వావలంబన్‌ అభియన్‌" పథకాన్ని రూపొందించింది. రివర్‌ బోర్డ్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న తెలుగుబిడ్డ, నల్లగొండ జిల్లా వాసి, వెదిరె శ్రీరాంకు క్యాబినెట్‌ హోదాను కల్పిస్తూ.. చతుర్విధ జల సంరక్షణ బాధ్యను అప్పగించారు ముఖ్యమంత్రి వసుంధరరాజె సింధియా. ముఖ్యమంత్రి జల స్వావలంబన్‌ అభియన్‌-ఎంజేఎస్‌ఏ, జలసంరక్షణ బాధ్యతలు చేపట్టగానే విప్లవాత్మక విధానాలకు శ్రీరారం చుట్టింది. 
ఇంతకీ చతుర్విధ జల సంరక్షణ విధానాలు ఏంటి..? 
ఇంతకీ చతుర్విధ జల సంరక్షణ విధానాలు ఏంటి..? వాటిని ఏ ప్రాతిపదికన.. ఎలా అమలు చేస్తున్నారు..? ఈ విధానం అందించిన ఫలాలు ఏంటి..? జనవరి 2016లో.. ఎంజేఎస్‌ఏ, చతుర్విధ జల సంరక్షణ విధానానికి శ్రీకారం చుట్టింది. వాన నీటి ప్రవాహ వాలు వెంబడి.. కందకాలు, మట్టికట్టలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం.. చిన్నపాటి చెరువులు తవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ విధానంలో నేలపై పడ్డ ప్రతి నీటి చినుకునూ ఒడిసి పట్టి నిల్వ చేస్తున్నారు. 

చతుర్విధ జల సంరక్షణ విధానం వల్ల.. రాష్ట్రంలోని 250 డార్క్ జోన్లలో .. 150 జోన్‌లు ఇప్పుడు ఫ్రీ జోన్లుగా మారిపోయాయి. నిన్నటి వ‌ర‌కూ వెయ్యి అడుగుల లోతులో నేలను తవ్వినా నీరు వెలికి వచ్చేది కాదు. ఇప్పుడు కేవలం పదంటే పది అడుగులు తవ్వితే చాలు.. పాతాళ గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. 

ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్‌-ఎంజేఎస్‌ఏని గడచిన 22 నెలల్లో మూడు దశలుగా అమలు చేశారు. ఇప్పటి వరకూ 2 లక్షల 50వేల స్ట్రక్చర్లను పూర్తి చేశారు. నాణ్యతకు, పాదర్శకతకు పెద్దపీట వేస్తూ.. ప్రతి పనికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. జియోట్యాగింగ్‌ ద్వారా వ్యవస్థను అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. 

ఎంజేఎస్‌ఏ.. ఏదో ప్రభుత్వ పథకం.. అధికారులే చేసుకుపోతారు అన్న భావనకు చెక్‌ చెబుతూ.. ప్రభుత్వం, శ్రమదానం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఇందులో మమేకం చేసింది. విద్యార్థి, కుల, మత సంఘాలతో పాటు, స్వచ్చంద సంస్థలనూ భాగస్వాములను చేసింది. ప్రజల్లో బాధ్యతను పెంచడంతో పాటు.. ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గేందుకూ శ్రమదానం ఉపకరించింది. అంతేకాదు.. పచ్చదనాన్ని పెంచేందుకు కోటి మొక్కలనూ నాటించింది. ఈ మొక్కలను జియో ట్యాగింగ్‌ ద్వారా అనుసంధానించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా పర్యవేక్షిస్తోంది. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.     

మొత్తానికి రాజస్థాన్‌ ప్రభుత్వం చేపట్టిన సీఎం జల్‌ స్వావలంబన్‌ అభియాన్‌తో, రాజస్థాన్‌లో పడ్డ ప్రతి చినుకూ ఆదా అవుతోంది. జనవరి 2016లో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు రెండు దశల్లో ఎనిమిది వేల గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. మూడవ దశ కింద మరో నాలుగు వేల గ్రామాల్లో పనులు కొనసాగిస్తున్నారు. 
2016లో ఎంజేఎస్‌ఏ, చతుర్విధ జల సంరక్షణ విధానానికి శ్రీకారం 
రాజస్థాన్‌ ఎడారి బతుకుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తోంది.. తెలుగుబిడ్డ వెదిరె శ్రీరాం అమలు చేస్తోన్న ఫోర్‌ వాటర్‌ స్కీమ్‌. చతుర్విధ జల సంరక్షణ ప్రక్రియతో అద్భుతాలు సృష్టిస్తూ.. అక్కడి ప్రజల గొంతు తడపడమే కాదు.. దశాబ్దాలుగా బీడువారిన భూముల్లో పచ్చని చివుళ్లను మొలిపిస్తున్నారు. రాజస్థాన్‌ బీడు భూముల్లో జల సంరక్షణ ప్రక్రియ అమలు తీరుపై 10టీవీ ప్రతినిధి కొండల్‌ అందిస్తోన్న గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 

రాజస్థాన్‌..! ఇది ఎడారి బతుకుల తావు. అక్కడి ప్రజలవి.. వాన చినుకుపై ఆశతో సాగే బతుకులు.. గుక్కెడు నీటి కోసమూ మైళ్ళ దూరం నడవక తప్పని వెతలు.. పచ్చందనాల సంగతి సరేసరి.. కనీసం మూగజీవాలకు కూసింత గడ్డి దొరకడమూ దుర్లభమే. ఇసుక తుఫాను హోరు తప్ప.. జలకళ మచ్చుకైనా కానరాదక్కడ. ఇదీ రాజస్థాన్‌ గురించి మనకు తెలిసిన విషయం. కానీ, నేడు అక్కడి పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. ఎడారి నేలలోంచి నాలుగడుగులకే గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఇదెలా సాధ్యమైంది..? ఎడారి నేల జలసిరులకు కారణమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానమే.. 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్‌.

చతుర్విధ జల రక్షణ విధానంతో ప్రతి వాన చుక్కనూ లెక్క కడుతూ కాపాడుకుంటూ భూగర్భ జలాలను పెంచుకుంటూ.. తాగు, సాగు నీటి ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ఇలాంటి పథకాలను తెలుగు రాష్ట్రాల్లోని కరవు ప్రాంతాల్లోనూ అమలు చేస్తే.. పచ్చందనాలు వెల్లివిరుస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

18:25 - November 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లో గోరక్షకులు మరోసారి రెచ్చిపోయారు. అల్వర్‌ జిల్లాలో ఆవులను తీసుకెళ్తున్న ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దులో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆవులను తీసుకెళ్తుండగా గోరక్షకులు అడ్డుకుని దాడి చేశారు. ఆవులను తీసుకెళ్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఉమర్‌ మహ్మద్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ తాహిర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. దాడికి పాల్పడ్డవారిలో 16 ఏళ్ల మైనర్‌ బాలుడు ఉన్నాడు. బాల నేరస్థుల చట్టం కింద ఈ బాలుడిని అరెస్ట్‌ చేశారు. ఈ బాలుడితో పాటు మరో ఆరుగురు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఉమర్‌ను తుపాకితో కాల్చి చంపారని బాధితుడి సన్నిహితులు చెబుతున్నారు.  భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌ మృతదేహాన్ని రామ్‌గఢ్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్లు డీఎస్పీ అనిల్‌ బెనివాల్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ సాగుతోందని..మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జైపూర్‌కు పంపినట్లు వెల్లడించారు.

 

18:21 - November 13, 2017

ఢిల్లీ : నగరంలోని రోహిణి కోర్టు పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకితో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలున్నాయి. రెండు గ్యాంగ్‌ వార్‌లకు సంబంధించిన గొడవగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో కూడా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

గద్వాల జిల్లాలో ఏఆర్ ఏఎస్ ఐ నిర్వాకం

గద్వాల : జిల్లాలో ఏఆర్ ఏఎస్ ఐ నిర్వాకం బయటపడింది. మహిళా హోంగార్డుతో ఏఎస్ ఐ హజన్ మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ ఐ మీడియాకు చిక్కాడు. 

17:46 - November 13, 2017

జోగులాంబ గద్వాల : జిల్లాలో ఏఆర్ ఏఎస్ ఐ నిర్వాకం బయటపడింది. మహిళా హోంగార్డుతో ఏఎస్ ఐ హసన్ మసాజ్ చేయించుకున్నాడు. మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ ఐ మీడియాకు చిక్కాడు. అయితే మీడియాను చూసి హసన్ పారిపోయాడు. ఈ ఘటనపై మీడియోతో మాట్లాడడానికి మహిళా హోంగార్డు నిరాకరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:40 - November 13, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతులు సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 21కి చేరింది. ఆస్పత్రిలో భూలక్ష్మీ (45) అనే మహిళ మృతి చెందారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:38 - November 13, 2017

బ్యూటీరంగంలో అనూస్ అంటే ఒక బ్రాండ్. 35 సంవత్సరాల ''అనూస్'' ప్రస్థానంలో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ? ''అనూస్'' సిస్టర్స్ దృష్టిలో 'అందం' అంటే ఏమిటి ? బ్యూటీఫీల్డ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అనూస్ సిస్టర్స్ తో మానవి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా అనూస్ సిస్టర్స్ మాట్లాడుతూ అనూస్ స్థాపనను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:25 - November 13, 2017

చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ కీచక అవతారమెత్తాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వి.కోట మండలం ఖాజీపేట ఊర్దూ ఉన్నత పాఠశాలలో తిరుమలప్ప ఆంగ్ల టీచర్ గా పని చేస్తునన్నాడు. గత కొంతకాలంగా తిరుమలప్ప విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో పిల్లల తల్లిదండ్రులు.. టీచర్ తిరుమలప్పను చెట్టుకు కట్టేసి చితకబాదారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో మలుపు

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో కీలక మలుపు తిరిగింది. జేఎన్టీయూ అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. పేపర్ తయారు చేసే సమయంలో జరిగిన మినిట్స్ తమకు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పేపర్ ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ కు సీఐడీ నోటీసులు పంపింది. 

16:57 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో కీలక మలుపు తిరిగింది. జేఎన్టీయూ అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. పేపర్ తయారు చేసే సమయంలో జరిగిన మినిట్స్ తమకు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పేపర్ ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ కు సీఐడీ నోటీసులు పంపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అధికారులు బోటును అడ్డుకుంటున్న వీడియోపై అనుమానాలు

కృష్ణా : బోటు ఓవర్ లోడ్ తో వెళ్లి ప్రమాదానికి గురైంది. పున్నమి ఘాట్ లో బోటు బయలుదేరి ప్రమాదానికి గురైంది. అధికారులు బోటును అడ్డుకుంటున్న వీడియోపై అనుమానాలు కల్గుతున్నాయి. వైరల్ అవుతోన్న వీడియో దుర్గ ఘాట్ లో చిత్రించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో పట్ల పర్యాటక అధికారులు నోరు మెదపలేదు. ప్రయాణికులు అధికంగా ఉండడంతో బోటు నిర్వాహకులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. అక్కడ మరో బోటు నిర్వాహకులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య తగవు తీర్చే క్రమంలో అదికారులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే క్రమంలో వీడియో రికార్డ్ చేసినట్లు అనుమానం కల్గుతుంది.

16:42 - November 13, 2017

కృష్ణా : బోటు ఓవర్ లోడ్ తో వెళ్లి ప్రమాదానికి గురైంది. పున్నమి ఘాట్ లో బోటు బయలుదేరి ప్రమాదానికి గురైంది. అధికారులు బోటును అడ్డుకుంటున్న వీడియోపై అనుమానాలు కల్గుతున్నాయి. వైరల్ అవుతోన్న వీడియో దుర్గ ఘాట్ లో చిత్రించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో పట్ల పర్యాటక అధికారులు నోరు మెదపలేదు. ప్రయాణికులు అధికంగా ఉండడంతో బోటు నిర్వాహకులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. అక్కడ మరో బోటు నిర్వాహకులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య తగవు తీర్చే క్రమంలో అదికారులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే క్రమంలో వీడియో రికార్డ్ చేసినట్లు అనుమానం కల్గుతుంది. ప్రైవేట్ బోటింగ్ కంపెనీల మధ్య పంచాయతీ చేసేందుకే అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. రూ.300 తీసుకుని అధికారులే బోటు ఎక్కించారని బాధితులు చెబుతున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బోటు బోల్తా ఘటన...21కు చేరిన మృతుల సంఖ్య

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతులు సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 21కి చేరింది. ఆస్పత్రిలో భూలక్ష్మీ (45) అనే మహిళ మృతి చెందారు. 

16:16 - November 13, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో విపక్షాలపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఆరునూరైనా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే రైతు సమన్వయ సమితిలో ఉంటారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. 14 ఏళ్లు పోరాడి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే తెలంగాణ తెచ్చారని చెప్పారు. తెలంగాణ పునర్‌నిర్మాణానికి ఆ కార్యకర్తలే పనిచేస్తారని తెలిపారు. ఈ విషయంలో వెనక్కితగ్గేది లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై జరుగుతున్న చర్చలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
సభలో కేసీఆర్ నిరంకుశత్వం : టీ.సాగర్ 
సభలో కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం నేత టీ.సాగర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. టీఆర్ ఎస్ లోనే రైతులు లేరని.. కాంగ్రెస్ తోపాటు పలు పార్టీల్లో రైతులున్నారని చెప్పారు. రైతు సమన్వయ కమిటీల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలు మాత్రమే ఉంటే అవి టీఆర్ ఎస్ కమిటీలు అవుతాయి తప్ప రైతు సమన్వయ కమిటీలు కావన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా టీఆర్ ఎస్ కార్యకర్తలను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

మేము చేసేది తప్పైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్న కేసీఆర్

హైదరాబాద్ : ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉండేవారికి పెడతామని..ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టే వాళ్లను పెట్టబోమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. తాము చేసేది తప్పైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని...ఒప్పు అయితే తామే నెగ్గుతామన్నారు. క్రాప్ కాలనీలను నిర్ణయించాలని, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నారు. హార్వెస్ట్ లు వచ్చినప్పటి నుంచి రైతులు అక్కడే అమ్ముకుంటున్నారు. పంట వేసే కాన్నుంచి ఎమ్ ఎస్ పీ వచ్చేదాకా ఉంటారు. వారికి ప్రభుత్వం తరపు నుంచి జీతాలు లేవని స్పష్టం చేశారు. 

ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులా : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేస్తారా అని సీఎం కేసీఆర్ అశ్చర్యపోయారు. కాలుకేస్తే మెడకేస్తున్నారు..మెడకేస్తే కాలుకేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక్క పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్ని కేసులండి, ఎందుకు కోసం వేస్తున్నారని ప్రశ్నించారు. కోర్టుకు పోతరు, కోర్టు కొట్టివేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతారని చెప్పారు. సాంకేతిక కారణాల వల్లనైనా సరే ఆగాలని వారి ఉద్దేశ్యమని అన్నారు. నీళ్లు రావాలని కోరుతామా.. ఆగాలని కోరుతామా అన్నారు. రైతుకు వచ్చ నష్టపరిహారం ఎంత..? అడ్వకేట్ కు పెట్టేదెంత అని అన్నారు.

విపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

హైదరాబాద్ : విపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 'మీరందరు పదవుల్లో సేద తిరిన్నాడు.. మీరు అదే టీఆర్ ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి, జైల్లో వేసిననాడు, కేసులుపెట్టిన్నాడు పేగులు తెగే దాకా కొట్లాడారని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వడ్డీ చెల్లింపు విషయంలో రైతుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.

రైతు సమన్వయ కమిటీల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రైతు సమన్వయ కమిటీల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలే ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అన్నం తినో, అటుకులు తినో ఈ బక్క పేద టీఆర్ ఎస్ కార్యకర్తలే 14సం.రాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రని అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి కూడా టీఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలే పని చేస్తారని తేల్చి చెప్పారు. వాళ్లే రైతు సమన్వయ కమిటీల్లో ఉంటారని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

15:44 - November 13, 2017

హైదరాబాద్ : రైతు సమన్వయ కమిటీల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలే ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అన్నం తినో, అటుకులు తినో ఈ బక్క పేద టీఆర్ ఎస్ కార్యకర్తలే 14సం.రాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రని అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి కూడా టీఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలే పని చేస్తారని తేల్చి చెప్పారు. వాళ్లే రైతు సమన్వయ కమిటీల్లో ఉంటారని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మీరందరు పదవుల్లో సేద తిరిన్నాడు.. మీరు అదే టీఆర్ ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి, జైల్లో వేసిననాడు, కేసులుపెట్టిన్నాడు పేగులు తెగే దాకా కొట్లాడారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వడ్డీ చెల్లింపు విషయంలో రైతుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ప్రతిపక్షాలు చేసేవి గాలి ఆరోపణలని కొట్టిపారేశారు. 'స్టే కావాలి, రైతులకు నీళ్లు అందొద్దు, కరెంట్ ఇయ్యొద్దు, 24 గంటల కరెంట్ అసలే ఇయ్యెద్దు, భూరికార్డులు ప్రక్షాళన కావొద్దు, ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ కావొద్దు' ఇవే కాంగ్రెస్, విపక్ష నేతల ఉద్దేశమని చెప్పారు. ఇదే కదా మీ ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేస్తారా అని అశ్చర్యపోయారు. కాలుకేస్తే మెడకేస్తున్నారు..మెడకేస్తే కాలుకేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక్క పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్ని కేసులండి, ఎందుకు కోసం వేస్తున్నారని ప్రశ్నించారు. కోర్టుకు పోతరు, కోర్టు కొట్టివేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతారని చెప్పారు. సాంకేతిక కారణాల వల్లనైనా సరే ఆగాలని వారి ఉద్దేశ్యమని అన్నారు. నీళ్లు రావాలని కోరుతామా.. ఆగాలని కోరుతామా అన్నారు. రైతుకు వచ్చ నష్టపరిహారం ఎంత..? అడ్వకేట్ కు పెట్టేదెంత అని అన్నారు. రోజుకు ఆరు లక్షలు పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడే రైతు ఉన్నాడా అన్ని ప్రశ్నించారు. తమకు ఇంటెలిజెన్సీ రిపోర్టు ఉందని..తమకు సమాచారం ఉందని... ఎవరి వెనుకాల ఎవరు ఉన్నారో తమకు తెలుసని అన్నారు. ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉండేవారికి పెడతామని..ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టే వాళ్లను పెట్టబోమని తేల్చి చెప్పారు. తాము చేసేది తప్పైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని...ఒప్పు అయితే తామే నెగ్గుతామన్నారు. క్రాప్ కాలనీలను నిర్ణయించాలని, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నారు. హార్వెస్ట్ లు వచ్చినప్పటి నుంచి రైతులు అక్కడే అమ్ముకుంటున్నారు. పంట వేసే కాన్నుంచి ఎమ్ ఎస్ పీ వచ్చేదాకా ఉంటారు. వారికి ప్రభుత్వం తరపు నుంచి జీతాలు లేవని స్పష్టం చేశారు. 

 

బోటు ఘటనపై ఏపీ శాసనసభ సంతాపం..

విజయవాడ : బోటు బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందడం పట్ల ఏపీ శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఇందుకు ఏపీ శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. 

13:43 - November 13, 2017

విజయవాడ : పవిత్ర సంగమానికి వచ్చి 20 చనిపోవడం బాధాకరమని, స్వార్థం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఫెర్రీ ఘాట్ దగ్గర పవిత్ర సంగమంలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంపై ఏపీ శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీయడం జరిగిందని, మరికొంత మంది ఆచూకి తెలియరావాల్సి ఉందన్నారు. ఫెర్రీఘాట్ లో ఉన్న ఒకతను వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించిన పిచ్చయ్య..కన్నా శివయ్యలు 9మందిని కాపాడారని, వీరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం..అత్యాధునిక సామాగ్రీతో అక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకు తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న 17 మంది వారి స్వగ్రామాలకు చేరుకోవడం జరిగిందన్నారు. ఘటనకు సంబంధించి కేసు బుక్ చేయడం జరిగిందని, కొండల్ రావు, శేషగిరి రావు, విజయ సారథి, శ్రీను, చిట్టిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

టూరిజం డిపార్ట్ మెంట్ తో ఒక ఎంవోయూ చేసుకుందని..పర్మిషన్ తీసుకొనే సమయంలో పలు నిబంధనలు పెట్టడం జరిగిందన్నారు. కానీ ఇతనికి పర్మిషన్ లేదని..సాయంత్రం సమయంలో ఎవరికీ ఎక్కించుకోలేమని టూరిజం సిబ్బంది పేర్కొనడం జరిగిందన్నారు. కానీ డబ్బుల ఆశతో వారిని బోటులో ఎక్కించుకున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని డ్రైవర్..ఉన్నాడని..రూట్ కూడా అతడికి తెలియదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన..ఇద్దరు..ముగ్గురు చనిపోయిన వారిలో ఉన్నారని..సీపీఐ నారాయణ కుటుంబానికి చెందిన వారు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయం..దేశీయంగా ఉండే నిపుణులను సంప్రదించి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించి ఒక సంతాప తీర్మానం ప్రవేశ పెట్టి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

రైతులకు పెట్టుబడిపై టి.అసెంబ్లీలో చర్చ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రైతులకు రూ. 8వేల పెట్టుబడి పై స్వల్పకాలిక చర్చ జరిగింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చాలా నష్టపోయిందని, ఆ నష్టం..సభ చరిత్రలో రికార్డుగా ఉండాలన్నారు. కరీంనగర్ లో 65 శాతం బోర్లతోనే వ్యవసాయం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి పెట్టుబడి అందిస్తుంటే విమర్శించడం తగదన్నారు. 

బోటు ప్రమాదంపై సభలో బాబు ప్రకటన..

విజయవాడ : ఏపీ శానసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఫెర్రీ ఘాట్ దగ్గర పవిత్ర సంగమంలో బోటు బోల్తా కొట్టిన ప్రమాద ఘటనపై ఆయన సభలో ఓ ప్రకటన చేస్తున్నారు.

బోట్ ప్రమాదంలో కొత్త కోణం..

విజయవాడ : ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర పవిత్ర సంగమం వద్ద చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బోటుకు అనుమతి లేదని..ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లనిచ్చేది లేదని ఓ పర్యాటక శాఖ ఉద్యోగి పేర్కొన్న దృశ్యాలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ప

పడవ ప్రమాదంలో 20 మంది మృతి..

విజయవాడ : కృష్ణానదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. దీనితో మృతుల సంఖ్య 20కి చేరింది. 

13:19 - November 13, 2017

విజయవాడ : కృష్ణానదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కానీ గాలింపులు చేపడుతున్న సహాయక సిబ్బందికి మృతదేహాలు లభ్యమౌతున్నాయి. ఉదయం నుండి నాలుగు మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమైంది. దీనితో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మొత్తంగా 42 మంది బోటులో ప్రయాణిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:16 - November 13, 2017

విజయవాడ : ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర పవిత్ర సంగమం వద్ద చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బోటుకు అనుమతి లేదని..ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లనిచ్చేది లేదని ఓ పర్యాటక శాఖ ఉద్యోగి పేర్కొన్న దృశ్యాలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. పడవ బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వేరే దగ్గర అనుమతి ఉందని..ఇక్కడ మాత్రం బోటు పెట్టవద్దని ఆ అధికారి హెచ్చరించాడు. కానీ అక్కడున్న ప్రైవేటు సిబ్బంది ఆ అధికారిని మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేశారు. మరి హెచ్చరించిన అధికారి మాట వింటే 20 మంది ప్రాణాలు నిలిచి ఉండేవి. 

12:39 - November 13, 2017

హైదరాబాద్ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లో పనిచేస్తున్న జిల్లా..మండల స్థాయి ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. రెండు నెలల క్రితం చేపట్టిన నిరహార దీక్ష సందర్భంగా ప్రభుత్వం పలు హామీలిచ్చిందని..సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిందని..కానీ మాటలు నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. దీనితో తాము నాంపల్లి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినట్లు టెన్ టివితో సెర్ప్ ఉద్యోగులు పేర్కొన్నారు. 17 ఏళ్లుగా సేవలందిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని..1533 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

 

నిమ్స్ లో మెరుగైన సేవలు - లక్ష్మారెడ్డి...

హైదరాబాద్ : నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా.. నిమ్స్‌లో వైద్య సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

28న మెట్రో రైలు ప్రారంభం - కేటీఆర్..

హైదరాబాద్ : నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

'రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం’..

హైదరాబాద్ : రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థ కోసం రూ. 16.48 కోట్లు కేటాయించామని తెలిపారు. 

సారపాక ఐటీసీలో గ్యాస్ లీక్..

భద్రాద్రి : సారపాక ఐటీసీలో గ్యాస్ లీకేజీ ఏర్పడడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లోపల ఎం జరిగిందో అని తోటి కార్మికులు భయాందోళన చెందుతున్నారు.

12:16 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనభ సోమవారం పున: ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన సభలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం జీరో అవర్ కొనసాగింది. ఈసందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. దీనికి సంబంధిత మంత్రులు నోట్ చేసుకున్నామని..సమస్యను పరిష్కరిస్తామని సభకు తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మూడు ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ విద్యనభ్యసిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కానీ రాష్ట్రం విడిపోయిన అనంతరం ఇక్కడి విద్యార్థులకు నూజీవీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వడం లేదని..ఫీజు కట్టడం లేదని పేర్కొంటోందన్నారు. కోర్సు పూర్తయినా ఉద్యోగ అవకాశాలు..ఇతర అవకాశాలు కోల్పోతున్నారని, వీరికి ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు.

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఉద్యోగులు దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని..ప్రతి రోజు ఉద్యోగం చేయడానికి 30-35 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి..వికారాబాద్..మెదక్ జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు నగరంలో పనిచేయడం జరుగుతోందని..కానీ హైదరాబాద్ లో ఉన్న వారికి 12-30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతోందన్నారు. దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి సమానంగా హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో ముస్లింలు అధికంగా ఉంటున్నారని..1968లో ఉర్దూ మీడియం హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేశారని..కానీ ఉర్దూ భాషలో ఇంటర్..డిగ్రీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారని రవీంద్రకుమార్ పేర్కొన్నారు. దేవరకొండలో ఉర్దూ మీడియంతో కూడుకున్న ఇంటర్..డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. 

తెలంగాణ శాసనసభలో టీ బ్రేక్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొనసాగుతోంది. సోమవారం ఉదయం పున:ప్రారంభమైన సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కాసేపటి క్రితం జీరో అవర్ కొనసాగింది. పది హేను నిమిషాల పాటు టీ బ్రేక్ ఇస్తున్నట్లు స్పీకర్ మధుసూధనచారి వెల్లడించారు. 

12:00 - November 13, 2017
11:57 - November 13, 2017

విశాఖపట్టణం : పంచ గ్రామాల సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీగానే వాడుకున్నారని విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ సమన్వయకర్త ఆదీప్ రాజు విమర్శించారు. సింహాచల దేవస్థాన ప్రధాన సమస్యగా ఉన్న పంచ గ్రామాల సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆయన మూడు రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఆదివారం రాత్రితో ముగిసింది. ఈసందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా 40 కి.మీటర్ల మేర వారు పాదయాత్ర చేశారు. 

11:51 - November 13, 2017
11:49 - November 13, 2017

కృష్ణా : పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 19కి చేరుకుంది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారికోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఘెర దుర్గఘటనపై 24గంటల్లోగా నివేదిక అందించాలని విచారణ కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విచారణ కమిటీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు.

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు కొచ్చిన్ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ కృష్ణాకు వెళ్లారు. అక్కడ జరిగిన పడవ ప్రమాదాన్ని ఏరియల్ సర్వేద్వారా పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అధికారులు..మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:25 - November 13, 2017
11:21 - November 13, 2017

భూపాలపల్లి జయశంకర్ : ఊరి మధ్యలో దళితులు ఉండొద్దంటూ దళితేతరులు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులకు మద్దతు పెరుగుతోంది. గత మూడు నెలలుగా ఈ వివాదం కొనసాగుతున్నా ప్రభుత్వం..అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమౌతోంది. జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలానికి 45 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు పాలంపేటలో రెండెకరాల స్థలం కేటాయించి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. 35 మంది దళితులకు..ఆరుగురు గిరిజనులకు..ముగ్గురు బీసీలకు ఈ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ దీనిని దళితేతరులు వ్యతిరేకిస్తున్నారు. ఊరి మధ్యలో దళితులు ఉంటే అరిష్టమని ఇళ్ల నిర్మాణాలు కాకుండా అడ్డుకున్నారు.

తీవ్ర మనస్థాపానికి చెందిన వారు అధికారుల చుట్టూ తిరిగారు. కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు కలెక్టర్ ను ఆశ్రయించి వినతిపత్రం అందించారు. దీనిపై విచారణ చేయాలని సబ్ కలెక్టర్ కు కలెక్టర్ చెప్పినా ఇందులో తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివక్షణ ఘటనను టెన్ టివి సోమవారం ప్రసారం చేసింది. దీనితో దళిత సంఘాలు..ఇతరులు స్పందిస్తున్నారు. అగ్రవర్ణాల నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

కేవీపీఎస్ నేత కుమార్ టెన్ టివితో మాట్లాడారు. ఇదొక దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా దళితులపై అనేక రకాలు వివక్ష కొనసాగుతోందని...నిజామాబాద్ లో ఓ కాషాయ నేత ఇద్దరు దళితులను మురికి గుంటలో దింపిన సంగతి మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడం అమానుషమని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు..వివక్ష లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సతీష్ దళిత నేత, సీపీఎం నేత కృష్ణారెడ్డిలు కూడా మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:13 - November 13, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సారపాక పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. సోమవారం ఉదయం షిఫ్ట్ లో పలువురు ఉద్యోగులు ఐటీసీలో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడి యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. అస్వస్థతకు గురైన ఉద్యోగులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐటీసీలో లో ఉదయం పనిచేస్తున్న ఇతర ఉద్యోగులను బయటకు పంపియ్యక..ఇతర సిబ్బందిని లోనికి అనుమతించడం లేదు. దీనితో ఏం జరిగిందనే దానిపై సిబ్బంది కుటుంబసభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బోటు ప్రమాదంలో ప్రముఖుల బంధువుల మృతి..

కృష్ణా : బోటు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ప్రముఖులు కుటుంబసభ్యులున్నారు. సీపీఐ నేత నారాయణకు చెందిన ముగ్గురు...డీజీపీ బంధువు పసుపు లేటి సీతరామయ్య మృతి చెందారు..ఇంటెలిజెన్స్ అధికారి రామారావు మేనకోడలు మృతి చెందింది. 

10:33 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ మదుసూధనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. టీఆర్ఎస్ సభ్యుడు జీవన్ రెడ్డి డ్రైవింగ్..శిక్షణ సంస్థల ఏర్పాటుపై మాట్లాడారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పొడవైన రహదారులున్నాయని, 22వేల మంది సంవత్సరానికి...రోజుకు 400 మంది ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని తెలిపారు. ఆధునికమైన డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి డ్రైవింగ్..శిక్షణా సంస్థలు ఏర్పాటు చేశారా ? ఎన్ని నిధులు కేటాయించారు ? నిజామాబాద్ లో ఆర్మూర్ ప్రాంతంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. 

టి.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ మధుసూధనచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సాంఘీక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ సీపీఎం..బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్, ఫెడరేషన్ పై బీజేపీ తీర్మానాలు ఇచ్చాయి. 

10:26 - November 13, 2017

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దళితులపై వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దళితులను గ్రామ బహిష్కరణ చేయడం..దాడుల ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఊరి మధ్యలో దళితులు ఉంటే అరిష్టమని..అక్కడ ఉండొద్దని దళితేతరులు తీర్మానం చేయడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే...జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలానికి 45 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు పాలంపేటలో రెండెకరాల స్థలం కేటాయించి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. 35 మంది దళితులకు..ఆరుగురు గిరిజనులకు..ముగ్గురు బీసీలకు ఈ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ దీనిని దళితేతరులు వ్యతిరేకిస్తున్నారు. ఊరి మధ్యలో దళితులు ఉంటే అరిష్టమని ఇళ్ల నిర్మాణాలు కాకుండా అడ్డుకున్నారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని తీర్మానం చేశాయి.

తీవ్ర మస్థాపానికి గురైన దళితులు..గిరిజనులు..తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ మురళికి వినతిపత్రం అందచేశారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్ కు ఆదేశించారు. కానీ రాజకీయ వత్తిడిలతో విచారణలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. వినతిపత్రం అందచేసినా గ్రామంలో దళితేతరులు పట్టు వీడడం లేదు.

దీనితో దీనిపై ప్రతిష్టంభన నెలకొంది. తమను తరలిస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని..ఆందోళనలు కొనసాగిస్తామని గిరిజనులు..దళితులు హెచ్చరించారు. ఏకంగా గిరిజన మంత్రి చందూలాల్ నాయక్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై మంత్రి..ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్న దళితేతరులు..

భూపాపల్లి : వెంకటాపురం (మం) పాలంపేటలో దళితుల ఊరు మధ్యలో ఉండొద్దని అగ్రవర్ణాలు తీర్మానం చేశాయి. దళితుల కోసం కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను దళితేతరులు అడ్డుకున్నారు. కలెక్టర్ మురళికి 35 దళిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. గిరిజన మంత్రి చందూలాల్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

10:11 - November 13, 2017

కృష్ణా : బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 42 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:09 - November 13, 2017

ప్రకాశం : ఒంగోలు మంగమూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురు లీలావతి మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. కూతురి మృతదేహం చూసి తల్లి లక్ష్మీకాంతం కుప్పకూలిపోయింది. పడవ ప్రమాదంలో లీలావతి మృతి చెందిన సంగతి తెలిసిందే.

కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.

 

 

09:36 - November 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వర్షాకాల..శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు జరిగే సమావేశాల్లో ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు సమన్వయ సమితులు, నిరుద్యోగ సమస్యపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం ఉంది.

పట్టాదారు పాస్ పుస్తకాలకు దానిపై సవరణలు చేసి బిల్లు తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూమికి ఎవరైతే హక్కు దారుడు ఎవరైతే ఉన్నారో వారికి ఆన్ లైన్ లో పాస్ పుస్తకం తేవాలని సర్కార్ భావిస్తోంది. గేమింగ్ ఇనిస్టిట్యూట్ బిల్లుకు కూడా సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బిల్లులపై ప్రధానంగా చర్చ జరుగనుంది.

ఇదిలా ఉంటే సాంఘీక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ సీపీఎం..బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్, ఫెడరేషన్ పై బీజేపీ తీర్మానాలు ఇచ్చాయి. సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని టిడిపి..పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. దీనితో పాటు పలు అంశాలపై చర్చ జరుగనుంది. 

కూతురి మృతితో తల్లికి గుండెపోటు...

ప్రకాశం : ఒంగోలు మంగమూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురు లీలావతి మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. కూతురి మృతదేహం చూసి తల్లి లక్ష్మీకాంతం కుప్పకూలిపోయింది. పడవ ప్రమాదంలో లీలావతి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

సీపీఎం..బీజేపీ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ సీపీఎం..బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్, ఫెడరేషన్ పై బీజేపీ తీర్మానాలు ఇచ్చాయి. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కిడ్నీ వ్యాధులపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. 

09:15 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఆరుగురికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. టూరిజం శాఖకు చెందిన వారే అనధికారికంగా పలువురు బోట్లు నడుపుతున్నారని ప్రాథమికంగా తెలిసిందని సమాచారం. బోటు ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

మృతుల వివరాలు...
రాయపాటి సుబ్రహ్మణ్యం (60)  
వెన్నెల సుజాత (40)
గుర్నాధరావు  
పసుపులేటి సీతారామయ్య (64)
కె.ఆంజనేయులు (58)  
కోవూరి లలిత (35)  
అంజమ్మ (55)  
సాయిన వెంకాయమ్మ  
వెంకటేశ్వరరావు (48)
దాచర్ల భారతి (60)  
కోటిరెడ్డి (45)
రాజేశ్‌ (49)  
హేమలత (49)  
ప్రభాకర్‌రెడ్డి (50)  
కోవూరి వెంకటేశ్వరరావు(40)  
సాయిన కోటేశ్వరరావు

09:11 - November 13, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షం లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు సభకు హాజరు కావడం లేదు. సోమవారం ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ఐదు బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 344 నిబంధన కింద విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు చర్చించనున్నారు. చేనేత కార్మికుల రుణాలు..కల్తీ ఆహార పదార్థాలు..ఉద్యోగులకు ఫించన్ భద్రత..మూత్ర పిండాల వ్యాధితో మృతుల సంఖ్య పెరుగుతుండడం..గిట్టుబాటు ధర..ఇతరత్రా వాటిపై సభ్యులు పలు ప్రశ్నలను ప్రస్తావించనున్నారు.

బోటు ప్రమాద ఘటనపై ఉదయం 10.30గంటలకు ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప సభలో ఒక ప్రకటన చేయనున్నారు. కొచ్చిన్ పర్యటనను ముగించుకుని నేడు ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబసభ్యులు..క్షతగాత్రులను ఆయన తొలుత పరామర్శించనున్నారు. అనంతరం సభకు చేరుకుని సంతాపం తెలియచేయనున్నారు. 

08:31 - November 13, 2017
08:31 - November 13, 2017

ఇరాన్ : భూకంపంతో ఇరాక్- ఇరాన్ సరిహద్దులు కదిలిపోయాయి. ఇరాన్ - ఇరాక్ సరిహద్దులో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. ఈ భూకంపంతో భారీ స్థాయిలో ఆస్తి..ప్రాణ నష్టం సంభివించింది. చాలా గ్రామాలకు రవాణా పూర్తిగా స్థంభించింది. పాక్..లెబనాన్..టర్కీ దేశాల్లో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 130 మంది మృతి చెందగా 200 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు నివాసాల నుండి బయటకు పరుగులు తీసి రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో భూంకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

08:27 - November 13, 2017

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దీనితో పాటు కాలుష్యం కూడా ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం..పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మందిర్ మార్గ్, ఆనంద్ విహార్, పంజాబి బాగ్, షాదీపూర్, సెంట్రల్ ఢిల్లీలో సోమవారం కాలుష్యం 500 పాయింట్లను దాటింది. దీని కారణంగా విమానాలు..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 62 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 22 రైళ్ల సమయాల్లో మార్పులు..8 రైళ్లను అధికారులు రద్దు చేశారు.

ఇదిలా ఉంటే ఎన్జీటీలో సరి - బేసి వాహన విధానంపై పిటిషన్ పై విచారణ జరుగనుంది. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. ద్విచక్రవాహనాలు..మహిళలకు మినహాయింపు ఇవ్వాలని సర్కార్ కోరనుంది. దీనిపై ఎన్జీటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

08:20 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను గజ ఈతగాళ్లు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లలో మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తున్నారు. పది మృతదేహాలు ఒంగోలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలిని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.

బోటులో మొత్తం 41 మంది పర్యాటకులున్నారు. 32 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు..8 మంది నెల్లూరు జిల్లా వాసులున్నారు. మృతుల్లో 15 మంది ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులుగా గుర్తించారు. వీరంతా కృష్ణా నదిలో విహార యాత్రకు వెళ్లారు. 

08:08 - November 13, 2017

కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్యారడైజ్ పత్రాల్లో జగన్ పేరు ఉందని టిడిపి నేతలు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఇరుపక్షాల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో దుర్గా ప్రసాద్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), సీతారాం నాయక్ (టీఆర్ఎస్ ఎంపీ), సుధాకర్ బాబు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

ఆలస్యంగా 62 రైళ్లు..

ఢిల్లీ : దేశ రాజధానిలో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీని కారణంగా విమానాలు..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 62 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 22 రైళ్ల సమయాల్లో మార్పులు..8 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

మళ్లీ స్కూళ్ల మూసివేత..

తమిళనాడు : చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు అధికారులు మళ్లీ సెలవు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అస్సాం రైఫిల్స్ జవాన్ల మృతి..

మణిపూర్ : అస్సాం రైఫిల్స్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎల్ ఈడీ పేలడంతో వీరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇరాక్ లో పెరుగుతున్న మృతులు..

ఇరాక్ : సోమారం తెల్లవారుజామున ఇరాక్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఇప్పటి వరకు 129మంది మృతి చెందారు. 

ఆసియాన్ సదస్సుకు చేరుకున్న మోడీ..

మనీలా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్కడకు చేరుకున్నారు. 

బోటు ప్రమాదంపై కేటీఆర్ సంతాపం..

హైదరాబాద్ : కృష్ణా నదిలో బోటు పడవపై మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

06:40 - November 13, 2017

స్కూల్లో పాఠాలు చెప్తూ ఉండే టీచర్లు రోడ్ల మీద ఆందోళనలు చేస్తూ పోలీసు లాఠీలతో పోట్లాడుతున్నారు. తమను పర్మినెంట్‌ చేస్తున్నట్లు సీఎం ఆదేశాలు ఉన్నా.. తమను పర్మినెంట్‌ చేయలేదని గురుకులాల కాంట్రాక్ట్‌ టీచర్లు ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై జనపధంలో గురుకుల కాంట్రాక్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఎండీ.అనిషా, గురుకుల టీచర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ దేవీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:36 - November 13, 2017

విజయవాడ : అసెంబ్లీ సమవేశాలు ప్రారంభం అవడంతో రెండు సభల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేస్తున్నారు చంద్రబాబు. ఛీప్‌ విప్‌గా కోనసాగిన కాలువ శ్రీనివాసులను క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో గత కొంత కాలంగా అసెంబ్లీ ఛీప్‌ విప్‌ పదవి ఎవరికి కేటాయించలేదు. అయితే అసెంబ్లీ ఛీప్‌ విప్‌ పదవిని ఇప్పుడు మొన్నటి వరకు మంత్రిగా ఉన్న పల్లె రఘునాధ్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. అటు మండలి ఛీప్‌ విప్‌ను సీనియర్‌ నేత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు చంద్రబాబు. ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారే అయినప్పటికి వారికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు బాబు. అటు అసెంబ్లీ ఛీప్‌ విప్‌ కోసం కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాతో పాటు కాగిత వెంకట్రావు, తదితరులు ఇవ్వాలని బాబుని కోరారు. అయితే మంత్రి పదవి చేజారడంతో తనకి కనీసం ఛీప్‌ విప్‌ ఇవ్వాలని బాబు కోరారు. దీంతో చేసేదేమి లేక పల్లెకు ఛీప్‌ విప్‌ పదవి ఇచ్చినట్లు తెలుస్తొంది. అటు కౌన్సిల్‌లో ఛీప్‌ విప్‌ కోసం పయ్యావుల కేశవ్‌తో పాటు టీడీ జనార్ధన్‌, వైవిబీ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పోటీపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ సారికి కౌన్సిల్‌ ఛీప్‌ విప్‌ కేశవ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం సోమవారం వెలువడే అవకాశాలున్నాయి. అదే రోజు కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఛీప్‌ విప్‌ల భర్తీ దాదాపుగా పూర్తవడంతో.. విప్‌లు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు కౌన్సిల్‌ విప్‌లకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తొంది. కౌన్సిల్‌లో రెండు లేదా మూడు విప్‌లను నియమించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ, మండలి ఛీప్‌ విప్‌లను ఒకే జిల్లాకు చెందిన వారికి కేటాయించడంతో ఇక విప్‌లు ఎవరు అనేది సోమవారం తేలిసే అవకాశాలున్నాయి.

కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కౌన్సిల్‌లో విప్‌ రావచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. ఇక ఎస్సీల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ఎస్టీల్లో గుమ్మడి సంద్యారాణిలు విప్‌ పదవిని ఆశిస్తున్నారు. అటు కాపుల కోటాలో ఎమ్మెల్సీ అన్పం సతీష్‌ విప్‌ను ఆశిస్తున్నారు. అసెంబ్లీ, మండలి ఛీప్‌ విప్‌లను ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించడంతో విప్‌ పదవులను బీసీ, ఎస్సీ, కాపులకు ఇవ్వవచ్చని సమాచారం. అదే గనుక జరిగితే బుద్దా వెంకన్న, గుమ్మడి సంధ్యారాణి, అన్నం సతీష్‌లకు విప్‌ పదవులు వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు శాసన సభలోనూ ఇప్పటికే ముగ్గురు విప్‌లు ఉన్నారు. ఇంకా మరొక ఇద్దరికి విప్‌లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఎమైనా సోమవారం అదృష్టం ఎవరిని వరిస్తుందో తేలనుంది. ఈ లోపు ఎవరికి వారు పదవుల కోసం లాబీయింగ్ ముమ్మరం చేశారు.

06:32 - November 13, 2017

కృష్ణా : నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్‌తో విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చంద్రన్న బీమా పథకం వర్తించే వారికి మరో ఐదు లక్షలు ఇస్తారు. బీమా లేనివారికి ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలకు తోడు మరో మూడు లక్షలు కలిపి ఇస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

విజయవాడ ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించింది. బోల్తా పడ్డ పడవకు అనుమతిలేదిన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చించారు.

విజయవాడలోజరిగిన పడవ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  

06:26 - November 13, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్యక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. పడవ ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ నిర్యక్ష్యానికి నిలువుటద్దం ఈ ఘటన అని ఏపీ పీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు కృష్ణా నదిలో బోట్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ప్రశ్నించారు. అనుమతిలేని బోట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. మరోవైపు పడవ ప్రమాదం దురదృష్టకర సంఘటన అని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వివిధ పక్షాల నేతలు కోరారు. 

06:24 - November 13, 2017

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర పవిత్ర సంగమం ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం రివర్‌ బోట్‌ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో 16మంది చనిపోగా... మరో 10మంది గల్లంతయ్యారు. స్థానికులు, రక్షణ సిబ్బంది 15 మందిని కాపాడారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో గాలింపు చేపట్టారు.

ఒంగోలుకు చెందిన వాసవీ క్లబ్‌, నెల్లూకు చెందిన కొంతమంది పర్యాటకులు కృష్ణా పవిత్ర సంగమం దగ్గర హారతి చూసేందుకు భవానీ ఐలాండ్స్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవ్వగా.. అప్పటికే ఏపీ టూరిజం బోట్‌ సిబ్బంది సమయం అయిపోయిందని వారిని ఎక్కించుకోలేదు. దీంతో వారంతా రివర్‌ బోట్‌ సంస్థకు చెందిన బోట్‌లో ఎక్కారు. సామర్థ్యానికి మించి బోట్‌లో ఎక్కించుకున్నారు. మొత్తం 40మంది పర్యాటకులు ఆ బోట్‌లో ఉన్నారు. బోట్‌ పవిత్ర సంగమం ప్రాంతానికి చేరుకోగానే మట్టిదిబ్బను ఢీకొట్టింది. దీంతో బోట్‌ ఒకవైపుకు వంగిపోయింది. దీని వల్ల ప్రయాణీకులు ఒక పక్కకు రావడంతో బోటు బోల్తాపడింది. బోటు ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు, రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టారు. 15 మందిని సురక్షితంగా కాపాడారు. మరో 10మంది గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

బోటు డ్రైవర్‌ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్నారు. తాము ఎంతకోరినా లైఫ్‌ జాకెట్లు ఇవ్వలేదన్నారు. పదేపదే అడుగుతున్నా పట్టించుకోలేదని వాపోయారు. ప్రమాదానికి ముందే రెండు, మూడుసార్లు కుదుపులు వచ్చాయని, ఇంతలోనే బోట్‌ తిరగబడిందని ప్రమాద తీరును వివరించారు. లైఫ్‌ జాకెట్లు ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ పాయింట్‌ నుంచి పవిత్ర సంగమం వెళ్తుండగా జరిగిన బోటు ప్రమాదంపై పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో ఆమె చర్చించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమదానికి కారణాలపై ఆరా తీశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు హోంమంత్రి చిన రాజప్ప తెలిపారు. ఫెర్రీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు, అధికారులతో ఆయన మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేపట్టాలన్నారు. ఫెర్రీ బోట్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇవాళ వారి స్వగ్రామానికి తరలించనున్నారు.

06:21 - November 13, 2017

విజయవాడ : కృష్ణానదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదం జరిగింది. బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువులు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శపరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ట్రంప్ తో మోడీ భేటీ..

మనీలా: ప్రధాని నరేంద్ర మోడీ మనీలాలో పర్యటిస్తున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని సమావేశమయ్యారు. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో మోడీ పాల్గొననున్న సంగతి తెలిసిందే. 

ముగ్గురు మావోయిస్టుల మృతి..

కొత్తగూడెం : మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్‌కేలీ అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

నల్గొండలో రోడ్డు ప్రమాదం...

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

ఇరాక్ లో భారీ భూకంపం..

ఇరాక్ : సోమారం తెల్లవారుజామున ఇరాక్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఇప్పటి వరకు 61 మంది మృతి చెందారు. 

మృతుల కుటుంబీలకు భూమా అఖిల సంతాపం..

విజయవాడ : ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం ప్రకటించారు. బాధితులకు అందించాల్సిన తక్షణ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

బోటు ప్రమాదంపై జగన్ దిగ్ర్భాంతి...

విజయవాడ : బోటు ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో కలతను కలిగించే ఘోరమైన ఘటన అని, పార్టీ సీనియర్ నేతలు వెంటనే అక్కడకు వెళ్లి, సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. 

పెరిగిన మృతుల సంఖ్య...

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 

Don't Miss