Activities calendar

14 November 2017

21:30 - November 14, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలు యూనివర్సిటీ ట్యాగ్‌లైన్‌ను కోల్పోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖకు చెందిన గీతం, గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, తిరుపతికి చెందిన రాష్ట్రీయ సాంస్క్రీట్‌ విద్యాపీఠ్‌, అనంతపురంకు చెందిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరుకు చెందిన విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు. వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఆదేశించింది. 

21:28 - November 14, 2017

గుజరాత్ : రాష్ట్ర ఎన్నికల ముందు పాటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార్దిక్‌ పటేల్‌ చెబుతున్నారు. తనపై బురద చల్లేందుకు బిజెపి నీచ రాజకీయాలకు ఒడిగట్టిందని ఆరోపిస్తున్నారు. ఈ సీడీ వ్యవహారంలో దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని హార్దిక్‌ పటేల్‌కు అండగా నిలిచారు. శృంగారం అనేది ప్రాథమిక హక్కని...దానికి భంగం కలిగించే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. తాజాగా మే 22కు చెందిన ఓ వీడియోలో హార్దిక్‌ పటేల్‌ తన సహచరులతో పాటు ఓ మహిళ కూడా కనిపిస్తోంది.

సోమవారం కూడా మే 18కి చెందిన ఓ వీడియో వెలుగు చూసింది. ఇందులో ఓ మహిళతో హార్దిక్‌ పటేల్‌ ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియో వ్యవహారంపై దళిత యువ నేత జిగ్నేశ్‌ మెవానీ స్పందించారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని హర్దిక్‌ పటేల్‌కు మద్దతుగా నిలిచారు. ''హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు'' అని జిగ్నేష్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నారు.

ఈ వీడియో క్లిప్‌ను ఒకప్పుడు హార్దిక్‌కు సహచరుడిగా ఉన్న అశ్విన్‌ బయటపెట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో విషయంలో తనకు, బిజెపికి ఎలాంటి సంబంధం లేదని అశ్విన్ సంకడ్‌ సరియా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కనివారే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో ఉన్నది హార్దిక్‌ పటేలా...కాదా...అన్నది తేల్చాలన్నారు. ఈ సిడిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపాలని డిమాండ్‌ చేశారు.

ఈ వీడియోలు ఫేక్‌వనీ...అందులో ఉన్నది తాను కానని....గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లేందుకు నీచ రాజకీయాలకు ఒడిగడుతోందని హార్దిక్‌ పటేల్‌ విమర్శించారు. ఆ వీడియోలో ఉన్నది తానే అయితే ధైర్యంగా ఒప్పుకుంటానని తెలిపాడు. ఎవరు ఏం చేసినా చేసుకోండి.... ఇలాంటి వాటికి తాను భయపడి వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశాడు. నన్ను అవమానించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని హార్దిక్‌ చెప్పాడు.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో గుజరాత్‌లో భారీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. పాటీదార్‌ సామాజికవర్గం రిజర్వేషన్లపై అధికార బిజెపి వెనకడుగు వేయడంతో ఈ ఎన్నికల్లో ఆ వర్గం కమలానికి దూరమైంది. హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో బిజెపి పటేల్‌ను టార్గెట్‌ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బంజారాహిల్స్ లో అభివృద్ధి పనులు..

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కార్పోరేటర్ విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీల్లో స్వల్పమార్పులు చోటు చేసుకుంది. 2018 మార్చి 1 నుంచి కాకుండా ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 17 వరకు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చ్ 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఈ ఘనత అనురాగ్ శర్మకే దక్కుతుంది - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాలను పటాపంచలు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు, మూడున్నరేళ్లపాటు డీజీపీగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్‌శర్మకు దక్కుతుందని కొనియాడారు. 

ఢిల్లీ సర్కార్ కొత్త పిటిషన్...

ఢిల్లీ : ఎన్‌జిటి శనివారం ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలన్న పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ అంశంలో ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. సరి-బేసి విధానం అమలులో భాగంగా విఐపిలు, మహిళలు, టూ వీలర్స్‌కు మినహాయింపు ఇవ్వొద్దని ఎన్‌జిటి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సరి బేసి విధానాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరింప జేయాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కొత్త పిటిషన్‌ దాఖలు చేసింది.

సీడీలో ఉన్నది తాను కాదన్న హార్దిక్..

గుజరాత్ : రాష్ట్ర ఎన్నికల ముందు పాటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార్దిక్‌ పటేల్‌ చెబుతున్నారు. 

రసగుల్లా పశ్చిమ బెంగాల్ దే...

పశ్చిమబెంగాల్ : రసగుల్లా... పేరు చెప్పగానే నోరూరుతుంది...ఈ స్వీటు మూలాలు ఎక్కడివన్న దానిపై గత కొంత కాలంగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. రసగుల్లా పశ్చిమ బెంగాల్‌దేనని తేలిపోయింది. ర

21:20 - November 14, 2017

ఢిల్లీ : సరి-బేసి విధానం అమలులో భాగంగా, మహిళలకు, టీ వీలర్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. టూవీలర్స్‌కు, మహిళలకు మినహాయింపు నివ్వడం కుదరదని...అందరికీ అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. కాలుష్యాన్ని వెదజల్లే ద్విచక్రవాహనాలకు మినహాయింపు నివ్వడం సరికాదని పేర్కొంది. టూ వీలర్స్‌ను నిషేధిస్తే 35 లక్షల మంది ప్రయాణికుల అదనపు భారం ప్రభుత్వంపై పడనుందని...ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేమని... పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళకు భద్రత కల్పించలేమని ఢిల్లీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఎన్‌జిటి- మహిళల కోసం ప్రత్యేక బస్సులు, మెట్రోలో మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో సరి-బేసి విధానంపై ఎన్‌జిటి శనివారం ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలన్న పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ అంశంలో ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. సరి-బేసి విధానం అమలులో భాగంగా విఐపిలు, మహిళలు, టూ వీలర్స్‌కు మినహాయింపు ఇవ్వొద్దని ఎన్‌జిటి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సరి బేసి విధానాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరింప జేయాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కొత్త పిటిషన్‌ దాఖలు చేసింది.

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

21:17 - November 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం... తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హాట్‌హాట్‌ డిస్కషన్ జరిగింది. అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అవుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు...లెక్కలతో సహా చూపించాలన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటల ఖండించారు. రాష్ట్రం రెవెన్యూలో సర్‌ప్లస్‌లో ఉన్న మాట వాస్తవమే అని మంత్రి ఈటల అన్నారు. ఏ అప్పులు చేసినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం నుంచి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను మర్చిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగే పరిస్థితి కల్పించకూడదన్నారు.

విపక్ష పార్టీల నేతలను మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల నియామకాలన్నీ వచ్చే 20 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తమ మేనిఫేస్టోలో ఉన్న అంశాలు 90 శాతం అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27, 744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ సభకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7, 266 పోస్టులు విద్యుత్‌ శాఖలో 1, 427, పోలీస్‌ శాఖలో 12, 157 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదాపడింది.

21:15 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని ఇవాళ రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. మరోవైపు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఏడేళ్ల అశ్విత మృతదేహాన్ని రెస్క్యూటీం వెలికితీసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫెర్రీఘాట్‌ బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని తెలిపారు. సరస్సుల్లో నడిపే బోటు కృష్ణానదిలో తిప్పడానికి అనుమతి లేదని చెప్పారు. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని కలెక్టర్‌ నివేదికలో తెలిపారు. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీనును సస్పెండ్‌ చేసింది. మరో 8 మందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పడవ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని అఖిలప్రియ వివరించారు. మరోవైపు విజయవాడ పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:29 - November 14, 2017

నిన్నియాళ్ల ఫేస్ బుక్కులళ్ల.. వాట్సప్ గ్రూపులళ్ల.. ఒక పోట్వ గిర్రా గిర్రా తిర్గుతున్నది.. కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు.. మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు సన్నాసులైండ్రు అనేది కుద్దు అచ్చరాలు రాశి అండ్లిండ్ల తింపుతున్నరు.. నిజంగ కేరళ ముఖ్యమంత్రి మన సీఎంలకంటె తోపా..? తోపైతె ఎట్ల తోపు అనేది ఒక్కపారి జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

20:25 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల్లో 'ఎగిసే తారాజువ్వల' చిత్రం ప్రదర్శనకు ఎంపిక చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాల సందర్భగా చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాలలను, అక్కడి బోధనాభ్యసన పద్ధతులను, వాస్తవ విధానములను చక్కగా ప్రతిబింబించిన చిత్రమని చెప్పచ్చు. ఈ సినిమాలో సమస్య గురించి బాధ పడడం కన్నా చక్కని సులభపరిష్కారాలు చూపడం జరిగిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. విద్యార్థులు పాఠ్యాంశాలు పుస్తకాలలో వున్నట్లు మక్కీకి మక్కీ కాకుండా ప్రయోగాత్మకంగా, అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకొనే ప్రయత్నాలను చూపినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అనురాగ్ శర్మకు వీడ్కోలు..

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. అనురాగ్ శర్మను సీఎం కేసీఆర్..మంత్రులు సన్మానించారు. డిప్యూటి సీఎంలు, మంత్రులు, సీఎస్, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు హాజరయ్యారు. 

123 విద్యా సంస్థలకు యూజీసీ ఝులక్..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 123 విద్యా సంస్థలకు యూజీసీ ఝులక్ ఇచ్చింది. విద్యాసంస్థల పేరు చివర యూనివర్సిటీ పదం ఉండరాదని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం దూర విద్య విధానం ద్వారా 4 విద్యా సంస్థలు జారీ చేసిన ఇంజినీరింగ్ పట్టాలను రద్దు చేసింది. గీతం (విశాఖపట్టణం), కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ (గుంటూరు), రాష్ట్రీ సాంస్కృతిక విద్యాపీఠ్ (తిరుపతి), శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపూర్), విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ రీసెర్చ్ (గుంటూరు), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) తదితర యూనివర్సిటీ ట్యాగ్ లు కోల్పోయాయి. 

ఎక్సైజ్ సీఐ సస్పెండ్....

మహబూబ్ నగర్ : ఎక్సైజ్ సీఐ బాలన్న గౌడ్ పై సస్పెండ్ వేటు పడింది. బాలన్న గౌడ్ స్థానంలో వేరొకరికి బాధ్యతలను ఈఎస్ అప్పగించారు. గతంలో కల్లు సొసైటీ డబ్బులు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. 

19:26 - November 14, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ పాతబస్తీలో భారీగా పోలీస్‌ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌, కేంద్ర హోంశాఖ సూచనలు పరిగణలోకి తీసుకుని నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇవాంక రాకపోకల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న సౌత్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్యనారాయణతో టెన్ టివి ముచ్చటించింది. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

టి.అసెంబ్లీ..వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ నియామకాల అంశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మంత్రి పద్మారావు తెలంగాణ ఎక్సైజ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా..తెలంగాణ వ్యాట్ -2వ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 

18:57 - November 14, 2017

విజయవాడ : పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమి ఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సేఫ్టీనామ్స్‌ పాటించకపోవడంతోనే 22 మంది మృతి చెందారని పేర్కొన్నారు. పల్లంరాజుతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:55 - November 14, 2017

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి జవహార్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు మంత్రి. పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టేందుకు గర్భిణీ స్త్రీలకు అన్న అమృత హస్తం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. 

18:54 - November 14, 2017

చిత్తూరు : సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి క్యూలైన్లలో పడిగాపులు లేకుండా... సులభంగా సర్వ దర్శనం కోసం టైం స్లాట్ విధానాన్ని అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు అమలు చేస్తున్నారు. డిసెంబర్ రెండోవారంలో సర్వదర్శనం భక్తులకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాల్లో 150కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. 

18:52 - November 14, 2017

కర్నూలు : జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చాగలమర్రి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. జిల్లాలోనే జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లు దాటింది. జిల్లాలో పాదయాత్రపై పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:50 - November 14, 2017

విజయవాడ : అసెంబ్లీలో ప్రతిపక్షం లేని లోటును.. అధికార పార్టీ లేకుండా చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించి.. లోటుపాట్లపై చర్చించి.. ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తున్నారని ఆయన అన్నారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామని.. కానీ ఏనాడు అభివృద్ధిని అడ్డుకోలేదని.. అభివృద్ధి విషయంలో ఎవరికీ జగన్‌లా లేఖలు రాయలేదని అన్నారు. 

18:48 - November 14, 2017

విజయవాడ : జగన్ కు ఇంగిత జ్ఞానం ఉందా ? అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ తీరుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు నీరిచ్చి ఆదుకుంటుంటే.. జగన్‌ పల్నాడుకు నీరు తరలించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి క్షణం సీఎం కుర్చీ గురించే ఆలోచించే జగన్‌ ముఖ్యమంత్రి కాలేడని జేసీ అన్నారు. జగన్‌ రాజకీయాలు వదిలేసి పారిశ్రామిక వేత్తగా స్థిరపడాలని జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. 

18:41 - November 14, 2017

విజయవాడ : రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు కట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను సభ దృష్టికి తెచ్చారు. ఇళ్ల నిర్మాణంతోపాటు, యువతకు ఉపాధికల్పన, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సభ్యులు ఉత్సాహంగా ప్రశ్నలు అడగగాడాన్ని చంద్రబాబు ప్రశంసించారు. 

పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇళ్లనిర్మాణంపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 19 లక్షల ఇళ్లను నిర్మించి పేదకలు అందిస్తామని, ఆతర్వాతే ఎన్నికలకు వెళ్లతామన్నారు. పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంలోనే తనకు నిజమైన సంతృప్తి ఉందన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో తలపెట్టిన 14.40 లక్షల ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితం అయిందన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదలకు దాదాపు 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్టు సభకు తెలిపారు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణంలోనూ కాంగ్రెస్‌పాలకులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న పేదల ఇళ్లలో అవినీతికి తావు ఉండదన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా ఇళ్ల నిర్మాణంలో లంచాలు అడిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృఫ్టిపెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓడిఎస్‌ లక్ష్యాలను పూర్తిచేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వాడేలా ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తునట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక శాసన సభ్యులు దీనిపై దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడ ఉపాధికల్పనకు అవకాశాలు ఉన్నాయో గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడంవల్ల ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయాయని ఎమ్మెల్యే అనిత అన్నారు. రాబోయే రోజుల్లోకూడా సభ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్షం.. పాదయాత్ర పేరుతో ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే అనిత విమర్శించారు. మొత్తానికి ప్రతిపక్షం లేకపోయినా.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నామని అధికారపార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 

18:40 - November 14, 2017

గుంటూరు : కృష్ణా నదిలో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఒంగోలు బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒంగోలు వాసుల కుటుంబీకులను నేతలు పరామర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యారని నేతలు ఆగ్రహించారు. కేవలం బైక్‌కి లైసెన్స్‌ లేకపోతేనే చలానా రాస్తున్న పరిస్థితిలో 38 మంది ప్రయాణించే బోటును ఆపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

18:36 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో గల్లంతైన ఒంగోలుకు చెందిన మరో మహిళ సుజన కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టీఆర్ఎస్ లోకి గండ్ర...

వరంగల్ : టిడిపి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గండ్ర గుడ్ బై చెప్పారు. బాబుకు రాజీనామా లేఖను పంపారు. బుధవారం ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.  

18:16 - November 14, 2017

రంగారెడ్డి : జిల్లా అమన్‌గల్‌ మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం రసాభాసగా సాగింది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దళిత నేత మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌ ఫోటో పెట్టలేదని దళితులు ఆందోళన చేశారు. దళితులను అవమాన పరుస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు. పొనుగోటి అర్జున్‌ రావు అనే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని తన సొంత వ్యవహారంగా భావించి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారిస్తున్నారని దళితులు ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని దళిత నాయకులు తెలిపారు. 

18:14 - November 14, 2017

సంగారెడ్డి : డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి జిల్లా కార్యాలయంలో సహకార సంఘం వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరగుతాయని చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి తెలిపారు. దీంతో పాటు సహకార సంఘ సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో సహకార సంఘ పటిష్టతకు తీసుకునే చర్యలను సభ్యులందరికీ వివరిస్తామన్నారు చైర్మన్‌. 

18:13 - November 14, 2017

నిజామాబాద్ : జిల్లాలో దళితులపై దాడి చేసిన బీజేపీ నేత భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన 4రోజులవుతున్నా... ఇంతవరకు నిందితుడ్ని అరెస్ట్ చేయడంపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..బోధన్‌లో భరత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇంతవరకు స్పందించకపోవడంపై వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు.

18:11 - November 14, 2017

హైదరాబాద్ : బాలల దినోత్సవం సందర్భంగా రాజ్‌ భవన్‌లో చిల్ర్డన్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలే భావిభారత పౌరులని, దేశాన్ని తీర్చిదిద్దేది పిల్లలేనని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. వ్యవసాయం గురించి పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అగ్రి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పూలు, పండ్ల విత్తనాలు అందజేశామన్నారు. 

18:09 - November 14, 2017

నల్గొండ : బాలల దినోత్సవం సందర్భంగా నల్లగొండ స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌ విద్యార్థులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. తమ పాఠశాలకు కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత, వైకల్యాల మంత్రిత్వ శాఖ నుండి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇప్పించేందుకు సిఫార్సు చేయాలని రాష్ట్రపతిని కోరారు. తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసి తమ డిమాండ్లను నెరవేర్చాలని వినతి పత్రం అందించారు. తెలంగాణలో జిల్లాకు ఒక అంధుల పాఠశాల ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. 

18:07 - November 14, 2017

విజయవాడ : 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు 'నంది' అవార్డుల‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను జ్యూరీ స‌భ్యులు తెలిపారు.

2014 నంది అవార్డులు: ఉత్త‌మ చిత్రం- లెజెండ్..ఉత్త‌మ న‌టుడు- బాల‌కృష్ణ (లెజెండ్‌),

2015 నంది అవార్డులు: ఉత్త‌మ చిత్రం- బాహుబ‌లి-1..ఉత్త‌మ న‌టుడు- మ‌హేశ్‌బాబు (శ్రీమంతుడు)

2016 నంది అవార్డులు: ఉత్త‌మ చిత్రం: పెళ్లి చూపులు..ఉత్త‌మ న‌టుడు- జూనియ‌ర్ ఎన్టీఆర్‌

2014 జాతీయ సినిమా అవార్డులు: ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌

బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి

నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి

ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు

గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌కి స్పెషల్ జ్యూరీ అవార్డు

2015 నేష‌న‌ల్ అవార్డులు: ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌

నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కీర‌వాణి

ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌

స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి

2016 నేష‌న‌ల్ అవార్డులు: ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌

బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌

నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కేఎస్ రామారావు

ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి

స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

నంది అవార్డులను ప్రకటించిన ఏపీ సర్కార్..

విజయవాడ : 2014-15 16 సంవత్సరాలకు నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2016 సంవత్సరానికి పెళ్లి చూపులు...2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రం బాహుబలి (బిగినింగ్), 2016 ‘పెళ్లి చూపులు', 2014 ఉత్తమ నంది అవార్డు బాలకృష్ణ (లెజండ్), 2014 ఉత్తమ నటిగా అంజలి (గీతాంజలి)..2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం..2014 ఉత్తమ బాలల చిత్రాలు 'ఆత్రేయ' చిత్రానికి లభించింది. 2016 ఎన్టీఆర్ జాతీయ అవార్డు రజనీకాంత్ ను వరించింది. 2014 నంది అవార్డు ఉత్తమ సహాయ నటిగా మంచు లక్ష్మీ (చందమామ కథలు)లను వరించాయి. 

టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

రూ. 10వేల కోట్లతో తాగునీరు - లోకేష్..

విజయవాడ : రానున్న రెండేళ్లలో రూ. 10 వేల కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు తాగునీరందిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

జైపూర్ లో 'పద్మావతి' చిత్రంపై మహిళల నిరసన..

రాజస్థాన్ : బాలీవుడ్ సినిమా 'పద్మావతి' చిత్రంపై వివాదం కొనసాగుతోంది. చిత్రాన్ని నిషేధించాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జైపూర్ లో రాజ్ పుట్ కమ్యూనిటీకి చెందిన మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. 

16:44 - November 14, 2017
16:30 - November 14, 2017
16:28 - November 14, 2017

నల్గొండ : బాలల దినోత్సవం రోజున పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో సంప్ లో పడి విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. అక్కాలాయిగూడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయేందర్ చదువుకొంటున్నాడు. స్కూల్ లో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బాలురకు సౌకర్యం లేదు. దీనితో మంగళవారం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు విజయేందర్ తోటి విద్యార్థి సైదులుతో కాల్వకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విజయేందర్ అందులో పడిపోయాడు. సైదులు ఓ చెట్టును పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

16:04 - November 14, 2017

హంద్వారాలో పేలుడు సామాగ్రీ స్వాధీనం...

జమ్మూ కాశ్మీర్ : హంద్వారా ఎన్ కౌంటర్ అనంతరం మందుగుండు సామాగ్రి, పేలుడుకు ఉపయోగించే పదార్థాలు, నగదు, బుల్లెట్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

15:29 - November 14, 2017

హైదరాబాద్ : తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ లక్ష్మీస్‌ వీరగ్రంథం నిర్మాతపై లక్ష్మి పార్వతి మండిపడ్డారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనని లక్ష్మిపార్వతి అన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. నిర్మాతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:26 - November 14, 2017

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌వి ల్యాబ్స్‌ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రసాయన పరిశ్రమలతో ఇప్పటికే చౌటుప్పల్‌ వాసులు ఇబ్బందులు పడుతున్నారని..మళ్లీ ఫ్యాక్టరీని ఎలా విస్తరిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు.  

15:25 - November 14, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బ్రహ్మర్షి పత్రీజి ఆధ్వర్యంలో ధ్యాన ఉస్మానియా దశాబ్ది మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధాన్య విద్యార్థి పుస్త ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నవంబర్ 14వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8.30గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఆధ్యాత్మిక గురువు పత్రీజీ ఆధ్వర్యంలో ధ్యానం చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లను అడ్డుకున్నారు. ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఛాంబర్‌ను ముట్టడించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఓయూలో సభలు, సమావేశాలపై నిశేదం అమలు చేస్తున్న పోలీసులు పత్రీజీ కార్యక్రమానికి ఎలా అనుమతించారని విద్యార్థులు ప్రశ్నించారు. పత్రీజీ ధ్యాన సభకు అనుమతి ఇస్తే తాము నిర్వహించే సభలకూ పర్మిషన్‌ ఇవ్వాలని విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

15:23 - November 14, 2017

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, పోలవరం ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ను కలిశామన్నారు కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడంపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం తెలిపిందన్నారు. కాపర్‌ డ్యాం లేకుండానే చాలా ప్రాజెక్టులు కట్టిన విషయాన్ని కేంద్రానికి చెప్పామన్నారు. 2019 వరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కావలసిన చర్యలను చేపట్టేందుకు వెనకాడబోమని కేంద్రం తెలిపిందని పురంధేశ్వరి తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అంకితమై ఉందన్నారు.

15:15 - November 14, 2017

విజయవాడ : రాష్ట్రంలోని పేదోడికి ఇళ్లు కట్టించాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనభలో మంగళవారం ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు చర్చించారు. పేదలకు సొంత ఇళ్లు నిర్మించడంలో తనకు ఆనందం ఉందని..ఇళ్ల నిర్మాణానికి సిమెంట్..ఇసుక కొరత లేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని సూచించారు. ఒక్క పైసా అవినీతి చేస్తే తిరిగి డబ్బులు ఇప్పించే వరకు 'పరిష్కార వేదిక' కృషి చేస్తుందని, ఇంతకు ముందు జరిగిన తప్పులు పునరావృతం కావద్దని పేర్కొన్నారు. నెలకు ఒకసారి ఎమ్మెల్యేలు ఆ ఇంటికి వెళ్లాలని..ఇళ్లు కట్టే సమయంలో లబ్దిదారులను ప్రభుత్వం సొంత ఖర్చుతో తీసుకెళుతామని..అక్కడ వారికి టీ..టిఫిన్ కూడా అందచేస్తామన్నారు.

విశాఖలో 50 వేల మంది ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చామని, రాష్ట్రంలో 15 లక్షల నుండి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్దీకరించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని, తిరుపతిలో 2,388 ఇళ్లు నాలుగు బ్లాక్ ల కింద పూర్తి చేసినట్లు, మరో 4,500 ఇళ్లు జనవరిలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతిలో అదనంగా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 

మళ్లీ జేసీ సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ : టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర అవసరం లేదని..ఆయన మతిస్థిమితం లేని వాడని పేర్కొన్నారు. మంత్రుల పవర్ తమ టైంలోనే పోయిందని, మంత్రులకు వెన్నె ముక లేదని పేర్కొన్నారు. 

సొంతింటి కలను నెరవేరుస్తాం - బాబు..

విజయవాడ : సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతొక్కరి కల అని, సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విశాఖలో 50 వేల మంది ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చామని, రాష్ట్రంలో 15 లక్షల నుండి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్దీకరించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని, తిరుపతిలో 2,388 ఇళ్లు నాలుగు బ్లాక్ ల కింద పూర్తి చేసినట్లు, మరో 4,500 ఇళ్లు జనవరిలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

14:41 - November 14, 2017

నేటి బాలలే రేపటి పౌరులు...పిల్లలు ఆనందంగా..ఆరోగ్యంగా జీవించడం వారి హక్కు...సమాజంలో చూస్తే పిల్లలు పుట్టిపుట్టగానే అంతమొందిచే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావాలి ?..నిజంగానే పిల్లలు సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతున్నారా ? నవంబర్ 14 'బాలల దినోత్సవం' సందర్భంగా మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జ్యోతి రాజు (ఛైల్డ్ సైకాలజిస్టు), నళిని (పిల్లల వైద్య నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:35 - November 14, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి సంరక్షించేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. తెలుగు భాషను, సంస్కృతి కాపాడుకొనేలా... కళలు..కళాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, కళలను కాపాడటం..కళాకారులను ప్రోత్సాహించడం కోసం..ఏపీ చరిత్ర..సంస్కృతిని పరిరక్షించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై విజయ్ భాస్కర్ తో టెన్ టివి ముచ్చటింది. ఆ వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:28 - November 14, 2017

హైదరాబాద్ : విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో పర్యాటకుల్లో గుండెల్లో గుబులు రేగుతోంది. టూర్ ఏదైనా సరే బోటు షికారు ఉందంటే పర్యాటకులు ఆ షికారు కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ బోటు ప్రమాదం తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. బోటు షికారుపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించడానికి చాలా మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. సాగర్ లో ఏర్పాటు చేసిన బోటులో ప్రయాణించడానికి చాలా మంది మక్కువ చూపిస్తుంటారు. మరి సాగర్ లో బోటు షికారు ప్రమాదంగా ఉందా ? బోటు ప్రయాణం సేఫేనా ? తెలంగాణ టూరిజం శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటోంది ? దీనిపై తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:20 - November 14, 2017

విజయవాడ : కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఏపీ అసెంబ్లీలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యులైన వారికి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఒక కమిటీ వేసి 24గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మంగళవారం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక అందించారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని, సదస్సులో తిప్పే బోటును కృష్ణా నదిలో తిప్పడానికి అనుమతి లేదని, రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. గతేడాది వరకు కాకినాడలో ఉన్న బోటును విజయవాడ తెచ్చి మరమ్మత్తులు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ యజమానిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

బోటు ప్రమాద ఘటనపై చర్యలు...
బోటు ప్రమాదానికి కారణంగా భావించిన పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగి గేదెల శ్రీనుపై వేటు పడింది. బోటు ప్రమాదం ఘటనలో మరో 8 మందిపై ప్రభుత్వం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టూరిజం, జలవనరుల శాఖ మంత్రులు..అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలు అమలు చేయకపోవడంపై బాబు వివరణ కోరినట్లు సమాచారం. 

ఎన్జీటీలో పోలవరం నిర్మాణంపై విచారణ..

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, ఎన్జీటీకి ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. కేసు విచారణ నిలుపుదల చేస్తున్న ఎన్జీటీ ప్రకటించింది. 

బోటు ప్రమాద ఘటనపై చర్యలు...

విజయవాడ : పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగి గేదెల శ్రీనుపై వేటు పడింది. బోటు ప్రమాదం ఘటనలో మరో 8 మందిపై ప్రభుత్వం వేటు వేయనుంది. టూరిజం, జలవనరుల శాఖ మంత్రులు..అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలు అమలు చేయకపోవడంపై బాబు వివరణ కోరినట్లు సమాచారం. 

బాబు చేతికి బోటు ప్రమాద నివేదిక...

విజయవాడ : బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక అందించారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని, సదస్సులో తిప్పే బోటును కృష్ణా నదిలో తిప్పడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ యజమానిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గతేడాది వరకు కాకినాడలో ఉన్న బోటును విజయవాడ తెచ్చి మరమ్మత్తులు చేశారని, రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు.

 

13:56 - November 14, 2017

నెల్లూరు : బోటు ప్రమాదంలో మృతి చెందిన లలితమ్మ, హరిత, అశ్విక మృతదేహాలు జిల్లాలోని వారి స్వగ్రామం కురుగొండకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. వీరి మృతితో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులతోపాటు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇవాళ సాయంత్రం మృతదేహాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వం బాధ్యత ఉందన్నారు.

 

బాలల దినోత్సవం రోజు విషాదం

హైదరాబాద్ : బాలల దినోత్సవం రోజు నగరంలో విషాదం నెలకొంది. మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. విష్ణుపూరి కాలనీలోని బాచ్ పన్ స్కూల్ నీటి సంపులో పడి నర్సరి విద్యార్థి శివరచిత్ మృతి చెందాడు. 

13:47 - November 14, 2017

హైదరాబాద్ : బాలల దినోత్సవం రోజు నగరంలో విషాదం నెలకొంది. మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. విష్ణుపూరి కాలనీలోని బాచ్ పన్ స్కూల్ నీటి సంపులో పడి నర్సరి విద్యార్థి శివరచిత్ మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:34 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా ఫన్ బకెట్ జూనియర్స్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పాటలు పాడి వినిపించారు. తమ తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

13:29 - November 14, 2017

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో తిరుగులేని టీమిండియా సొంతగడ్డపై మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. శ్రీలంకతో  3 ఫార్మాట్లలో 3 మ్యాచ్‌ల సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. ఓటమంటూ లేకుండా శ్రీలంక టూర్‌ ముగించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లను చిత్తు చేసి జోరు మీదుంది. శ్రీలంకను సొంతగడ్డపై  బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగబోతోంది.

ఇండియాలో శ్రీలంక టూర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.  సొంతగడ్డపై భారత్‌ శ్రీలంకతో 3 ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ , ఇన్‌స్టంట్‌ వన్డే , ఫటా ఫట్‌ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లలో...టీమిండియా లంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

ఓటమంటూ లేకుండా శ్రీలంక పర్యటన ముగించి చరిత్ర సృష్టించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లను చిత్తు చేసి జోరు మీదుంది. శ్రీలంకను సొంతగడ్డపై  సైతం బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగబోతోంది.

ఇన్‌స్టంట్‌ ఫార్మాట్లలో ఎదురులేని ఇండియా...టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే. సొంతగడ్డపై ఫార్మాట్‌ ఏదైనా   ప్రత్యర్ధి జట్లకు అవకాశమే ఇవ్వని భారత్‌....బలహీనమైన శ్రీలంక జట్టుపై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ వంటి పటిష్టమైన జట్లే  సొంతగడ్డపై భారత్‌ను అధిగమించడంలో విఫలమయ్యాయి. 

భారత్‌లో శ్రీలంక టూర్‌ నవంబర్‌ 16న ఆరంభమై డిసెంబర్‌ 24తో ముగియనుంది.3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిధ్యమివ్వనుంది. నవంబర్‌ 24 నుంచి నాగ్‌పూర్‌ విదర్భ స్టేడియం వేదికగా రెండో టెస్ట్‌, డిసెంబర్‌ 3 నుంచి ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టెస్ట్‌తో సిరీస్‌ ముగుస్తుంది.

ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో ఇండియా-శ్రీలంక తలపడతాయి. డిసెంబర్‌ 10న ధరమ్‌శాలలోని హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్డేడియం వేదికగా జరుగనున్న తొలి వన్డేతో ఇండియా-శ్రీలంక 3వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.డిసెంబర్‌ 13న మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో 2వ వన్డే జరుగనుంది. 17న విశాఖపట్నం ఎసీఎ,వీడిసీఎ స్టేడియం వేదికగా జరుగనున్న 3వ మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగుస్తుంది. 

డిసెంబర్‌ 20 నుండి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి టీ20కి కటక్‌లోని బారాబతి క్రికెట్‌ స్టేడియం  ఆతిధ్యమివ్వబోతుండగా...డిసెంబర్‌ 22న ఇండోర్‌లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనుంది. డిసెంబర్‌ 24న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టీ20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్‌కు తెరపడనుంది. 

2 నెలల ముందే శ్రీలంక టూర్‌లో టెస్ట్‌,వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేసిన కొహ్లీ అండ్‌ కో....సొంతగడ్డపై సైతం సేమ్‌ ఫీట్‌ రిపీట్‌ చేయాలని తహతహలాడుతోంది. మరి పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పాటు సొంత గడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత్‌....బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టును మరోసారి బ్రౌన్‌ వాష్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశం

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

13:14 - November 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం అప్పులు చేస్తుందని ఆర్థికమంత్రి ఈటల అన్నారు. ప్రాజెక్టులు, తాగునీరు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు తప్పకుండా అప్పుచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు.  

 

13:11 - November 14, 2017

హైదరాబాద్ : అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పుల్లో నెంబర్‌వన్‌గా ఈ రాష్ట్రమే ఉందని ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. అప్పుల కోసమే కొత్త కార్పొరేషన్‌ సృష్టిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. 

13:09 - November 14, 2017

గుంటూరు : ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖలో ప్రతినెలా ఐటీ షో చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సిమెన్స్‌,సాప్‌,ఐబీఎమ్ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా 10 వేల మంది యువతీయువకులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

 

13:03 - November 14, 2017

యాదాద్రి : జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌వి ల్యాబ్స్‌ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రసాయన పరిశ్రమలతో ఇప్పటికే చౌటుప్పల్‌ వాసులు ఇబ్బందులు పడుతున్నారని..మళ్లీ ఫ్యాక్టరీని ఎలా విస్తరిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు.  

 

12:59 - November 14, 2017

విజయనగరం : జిల్లాలోని శృంగవరపుకోట మండలం కీల్తంపాలెంలో ప్రమాదం తృటిలో తప్పింది. విజయనగరం నుంచి అరకు వెళ్తున్న టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది.


 

ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

గుంటూరు : ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత ఛైర్మన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ల దాఖలుకు సమయమిచ్చారు

12:57 - November 14, 2017

గుంటూరు : ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత ఛైర్మన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ల దాఖలుకు సమయమిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:55 - November 14, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఓ ప్రేమకథ సుఖాంతమైంది. కులాంతర వివాహం చేసుకున్న కూతురిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఆమెను మళ్లీ భర్తకు అప్పగించారు. అచ్చంగా సినిమాల్లో మాత్రమే కనిపించే ప్రేమ - పెళ్లి - తదనంతర కష్టాల లవ్‌స్టోరీ కరీంనగర్‌ జిల్లాలో ఆవిష్కృతమైంది. పోలీసుల సమక్షంలో ప్రేమకథ సుఖాంతమైనా.... ఈ సందర్భంగా కనిపించిన దృశ్యాలన్నీ అనుబంధాలు, ఆత్మీయతతో కలగలిపిన భావోద్వేగాలకు అద్దంపట్టాయి.  ఓవైపు ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త... మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రులు... ఎవరిని వదులుకోలేక యువతి పడిన తపన, తండ్రి రోదన... అందరినీ కంటతడిపెట్టించాయి.
కొన్నాళ్లుగా ప్రేమించుకున్న హరిణి- ప్రవీణ్‌
ఈ ఇద్దరి పేర్లు హరిణి, ప్రవీణ్‌. ప్రవీణ్‌ది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని సాయంపేట. ఇక హరిణిది మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోనే నివాసం. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు.  వీరి కులాలు వేరు. దీన్ని సాకుగా చూపి వీరి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో  గతనెల 7న సికింద్రాబాద్‌లోని ఓ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. 
జమ్మికుంటలో నూతన జంట ఫిర్యాదు
పెళ్లితోనే వీరి ప్రేమకథ ముగియలేదు. అక్కడే అసలు కథ మొదలైంది.  హరిణి... ప్రవీణ్‌ను పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.  తీవ్ర మాసనిక వేదనకుగురైన హరిణి తల్లి మంచం పట్టింది.  దీంతో ఆమె తల్లిదండ్రులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో  ప్రవీణ్‌పై కంప్లైంట్‌ చేశారు. ఇదే సమయంలటో నూతన జంట ప్రవీణ్‌- హరిణి కూడా తమకు రక్షణ కల్పించాలంటూ జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
కన్న ప్రేమను వదులుకోలేకపోయిన హరిణి
తల్లిదండ్రులను అయితే ఎదురించి ప్రవీణ్‌ను హరిణి పెళ్లి చేసుకుందికానీ... ఇన్నాళ్లు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల ప్రేమను మాత్రం వదులుకోలేకపోయింది. తరచూ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతూ యోగక్షేమాలు కనుక్కునేంది. తల్లి పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న హరిణి.... తన పుట్టింటికి వెళ్లొస్తానని ప్రవీణ్‌ను కోరింది. హరిణిని పంపిప్తే ఆమె తల్లిదండ్రులు తిరిగి పంపిస్తారో లేదోన్న  భయంతో అందుకు నిరాకరించాడు.  ఇంతలో హరిణి తరపు బంధువులు రెండువాహనాల్లో వచ్చి ప్రవీణ్‌ను కొట్టి హరిణిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. హరిణి ఉన్న కారు వెళ్లిపోగా ... మరో కారును గ్రామస్తులు అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురిని జమ్మికుంట పోలీసులకుఅప్పగించారు. అమ్మాయిని తీసుకువస్తేనే వారిని వదిలిపెడతామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.
ఇద్దరూ కావాలని కోరిన హరిణి
సోమవారం హరిణి, ఆమె తండ్రి జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాడు.  ఒకవైపు దెబ్బలుతిని నీరసంగా కనిపిస్తున్న భర్త, మరోవైపు కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమాప్యాతలు. ఈ రెండింటి మధ్య హరిణి నలిగిపోయింది. తనకు ఇద్దరూ కావాలంటూ ఆమె పడిన తపన అందరినీ కంటతడి పెట్టించింది. మరోవైపు తిరిగివచ్చిన భార్యను చూసి ప్రవీణ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అందరి ముందు ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. పోలీసులు యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  తాను తన భర్తతోనే ఉంటానని... తన తల్లిదండ్రులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని హరిణి పోలీసులను ప్రాధేయపడింది.
తండ్రి కాళ్లపై పడి హరిణి కన్నీరుమున్నీరు 
హరిణి తన తండ్రి కాళ్లపై పడి కన్నీరుమున్నీరైంది. తండ్రికూడా బిడ్డను చూసి కండతడి పెట్టాడు.  తన పర్సులోంచి డబ్బులు తీసి కూతురుకు ఇచ్చాడు.  ఈ దృశ్యాలన్నీ మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అప్యాయతలు, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు అద్దంపట్టాయి. చివరికి హరిణి భర్తతో కలిసి మెట్టినింటికి వెళ్లిపోగా.. ఆమె కోరిక మేరకు పోలీసులు తల్లిదండ్రులను వదిలిపెట్టారు.

 

విశాఖ జిల్లాలో దారుణం

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి మండలం మారేడుతుడిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మూడేళ్ల కొడుకుని తంత్రి అతి కిరాతకంగా కత్తితో పొడి చంపేశాడు.

12:50 - November 14, 2017

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి మండలం మారేడుతుడిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మూడేళ్ల కొడుకుని తంత్రి అతి కిరాతకంగా కత్తితో పొడి చంపేశాడు.

ప్రగతి భవన్ తెలంగాణకు ఆత్మగౌరవం : మంత్రి ఈటెల

హైదరాబాద్ : ప్రగతి భవన్ తెలంగాణకు ఆత్మగౌరవం అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు .ఇరిగేషన్, 24 గంటల విద్యుత్, రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు తమ ప్రాధాన్యమని చెప్పారు. ఎఫ్ ఆర్ బీఏం, గ్యారంటీసు రుణాలు వేర్వేరని తెలిపారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని కాంగ్రెస్ సభ్యులు చూడలేకపోతున్నారన్నారు.

కార్పొరేషన్ కు ఎన్ని నిధులు మంజూరు చేశారు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ కు సంబంధించి ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని అన్నారు. సీఎం ఇళ్లు ప్రగతి భవన్ కు, కొత్త సచివాలయానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. 

 

జిమ్మిక్కు సర్ ప్లస్ : జానారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్‌ టీచర్లకు కనీస వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా అప్పులు చేయవద్దని...రాష్ట్రానికి ఆస్తులంటే...లాభం వచ్చే విధంగా అప్పులు చేయాలని సూచించారు. జిమ్మిక్కు సర్ ప్లస్ చేశారని పేర్కొన్నారు. పాలనలో తప్పులపై ప్రశ్నిస్తే తమను దబాయిస్తే ఎలా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, ప్రజలకు న్యాయం జరగాలన్నారు.

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. ప్రధాన పక్షం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. 

12:36 - November 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో 10 మంది దళిత విద్యార్థుల సస్పెన్షన్‌పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వీసీ అప్పారావు నిర్ణయంపై టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు వెంకటేష్ చౌహన్ తీవ్రంగా మండిపడ్డారు. వీసీ అప్పారావు నియంతృత్వ వైఖరి అవలంభిస్తున్నారని దళిత విద్యార్థులను కావలనే వేధింపులకు గురిచేస్తున్నారని హెచ్ సీయూలో జాక్ నాయకులు ఆరోపించారు. గచ్చిబౌలి యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్‌లో ఏఎస్ ఏ, ఎస్ ఎఫ్ ఐ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 10 మంది విద్యార్థులపై వెంటనే సస్పెండ్ ఎత్తి వేయాలని..లేకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

12:32 - November 14, 2017

గుంటూరు : విజ్ఞాన్‌ యూనిర్సిటీ 2018-19కి సంబంధించిన ఆయా కోర్సుల ప్రవేశ పరీక్ష విశాట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  వీశాట్‌ దరఖాస్తులు విజ్ఞాన్‌ కార్యాలయాలతో పాటు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంటాయని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌ తెలిపారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ విలువలతో కూడిన విద్యను అందిస్తోందన్నారు.  పరిశ్రమలకు అణుగుణంగా నైపుణ్యాలు పెరిగందుకు తాము 36  దేశాలకు చెందిన యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ప్రతిభావంతులకు గత ఏడాదిలానే ఫీజు రాయితీలను అందజేస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌ తెలిపారు.

 

12:17 - November 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్‌ టీచర్లకు కనీస వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా అప్పులు చేయవద్దని...రాష్ట్రానికి ఆస్తులంటే...లాభం వచ్చే విధంగా అప్పులు చేయాలని సూచించారు. జిమ్మిక్కు సర్ ప్లస్ చేశారని పేర్కొన్నారు. పాలనలో తప్పులపై ప్రశ్నిస్తే తమను దబాయిస్తే ఎలా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, ప్రజలకు న్యాయం జరగాలన్నారు. సమస్యలపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని కోరారు. బడ్జెట్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
కిషన్ రెడ్డి 
బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ కు సంబంధించి ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని అన్నారు. సీఎం ఇళ్లు ప్రగతి భవన్ కు, కొత్త సచివాలయానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయడం లేదని విమర్శించారు.   
ఈటెల రాజేందర్ 
ప్రగతి భవన్ తెలంగాణకు ఆత్మగౌరవం అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇరిగేషన్, 24 గంటల విద్యుత్, రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు తమ ప్రాధాన్యమని చెప్పారు. ఎఫ్ ఆర్ బీఏం, గ్యారంటీసు రుణాలు వేర్వేరని తెలిపారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని కాంగ్రెస్ సభ్యులు చూడలేకపోతున్నారన్నారు. అనంతరం హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు.  

11:23 - November 14, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. ప్రధాన పక్షం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:17 - November 14, 2017

ఏఆర్‌ ఏఎస్సై హసన్‌ సస్పెండ్

గద్వాల్ : జిల్లా ఏఆర్‌ ఏఎస్సై హసన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. హసన్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా హోమ్‌గార్డుతో హసన్‌ మసాజ్‌ చేయించుకున్నందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

11:05 - November 14, 2017

గద్వాల్ : జిల్లా ఏఆర్‌ ఏఎస్సై హసన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. హసన్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా హోమ్‌గార్డుతో హసన్‌ మసాజ్‌ చేయించుకున్నందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సెంట్రల్ ఢిల్లీలో 500 పాయింట్లు దాటిన కాలుష్యం

ఢిల్లీ : హస్తినలో ప్రమాదకర స్ధాయిలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. సెంట్రల్ ఢిల్లీలో కాలుష్యం 500 పాయింట్లు దాటింది. గురువారం వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. రేపు వర్షం పడే  అవకాశం ఉందని.. కాలుష్యం తగ్గుదలలో మార్పుంటుందని వాతావరణ శాఖ భావిస్తోంది. నేడు ఎన్జీటీలో సరి బేసి వాహన విధానం అమలుపై విచారణ జరగనుంది.

10:44 - November 14, 2017

ఢిల్లీ : హస్తినలో ప్రమాదకర స్ధాయిలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. సెంట్రల్ ఢిల్లీలో కాలుష్యం 500 పాయింట్లు దాటింది. గురువారం వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. రేపు వర్షం పడే  అవకాశం ఉందని.. కాలుష్యం తగ్గుదలలో మార్పుంటుందని వాతావరణ శాఖ భావిస్తోంది. నేడు ఎన్జీటీలో సరి బేసి వాహన విధానం అమలుపై విచారణ జరగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పార్వతీపురంలో కత్తిపోట్ల కలకలం

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. కొమరాడ మండలం చోళ్లపదం వద్ద పిక్నిక్‌ మిత్రులు తరుణ్‌, క్రాంతికుమార్‌ మధ్య ఘర్షణ జరిగింది. ఇంటికి తిరిగి వచ్చాక తాగిన మైకంలో తరుణ్‌తో క్రాంతికుమార్‌ వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఆగ్రహంతో తరుణ్‌ క్రాంతిపుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం క్రాంతికుమార్‌ను విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

టీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్‌ టీచర్లకు కనీస వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

10:21 - November 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్‌ టీచర్లకు కనీస వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

 

పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ సస్పెండ్‌

కృష్ణా : జిల్లాలోని పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఏడేళ్ల చిన్నారి పోపూరి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూబృందం వెలికితీసింది. చిన్నారి మృతదేహాన్ని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ సందర్శించి..కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీను సస్పెండ్‌ చేసింది. బాధ్యులైన ఇతరులను అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

10:18 - November 14, 2017

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. కొమరాడ మండలం చోళ్లపదం వద్ద పిక్నిక్‌ మిత్రులు తరుణ్‌, క్రాంతికుమార్‌ మధ్య ఘర్షణ జరిగింది. ఇంటికి తిరిగి వచ్చాక తాగిన మైకంలో తరుణ్‌తో క్రాంతికుమార్‌ వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఆగ్రహంతో తరుణ్‌ క్రాంతిపుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం క్రాంతికుమార్‌ను విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురంలో కత్తిపోట్ల కలకలం

 

10:17 - November 14, 2017

నాగర్‌కర్నూలు : జిల్లాలోని నారాయణపూర్‌తండాలో పురుగుల మందుతాగి రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎస్సై సైదాబాద్‌ వేధింపులే కారణమని ఆరోపిస్తూ రాజు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌ చేసుకున్నాడు. రాజు మృతికి కారణమైన ఎస్సై సైదాబాద్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

 

09:41 - November 14, 2017

కృష్ణా : జిల్లాలోని పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఏడేళ్ల చిన్నారి పోపూరి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూబృందం వెలికితీసింది. చిన్నారి మృతదేహాన్ని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ సందర్శించి..కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీను సస్పెండ్‌ చేసింది. బాధ్యులైన ఇతరులను అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బోటు ఆపరేటర్లతో నేడు సచివాలయంలో పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ కానున్నారు.

09:38 - November 14, 2017

రాష్ట్రంలో టీసర్కార్ అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని వక్తలు విమర్శించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, కాంగ్రెస్ నేత రాజారామ్ యాదవ్, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. రాచరిక పద్ధతిలో పాలన ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అధికారాలను దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:34 - November 14, 2017

బాలలకు రక్షణ కల్పించాలని చైల్డ్‌రైట్స్‌ యాక్టివిస్ట్‌ మురళీ మోహన్‌ అన్నారు. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా జనపధం ఈ చర్చను చేపట్టింది. చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, వారికి రక్షణ కల్పించి, సరైన అవకాశాలు కల్పించినప్పుడే భావి భారతం బాగుంటుంది. మరి ఈ దేశంలో వారికి సరైన రక్షణ ఉందా? వారికి ఉన్న చట్టాలేంటి? వాటి అమలు తీరు ఎలా ఉంది?' అనే అంశాలపై మురళీమోహన్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:25 - November 14, 2017

విశాఖ : ఆంధ్రా ఊటీ విశాఖ జిల్లాలోని అరకు లోయ హాట్‌ బెలూన్‌ ఉత్సవాలకు వేదికైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు దేశ, విదేశాల నుంచి బెలూన్లు ఎగురవేసే నిపుణులు హాజరవుతున్నారు. 
ఏపీలో తొలిసారిగా హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌
ఏపీలో తొలిసారిగా హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాలోని అరకులోయ వేదికగా జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజులపాటు హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. విశాఖ జిల్లాతోపాటు అరకులోయ అందాలను ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసే లక్ష్యంతో హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. 
ఉత్సవాల్లో పాల్గోనున్న భారత్ తోపాటు 13 దేశాలు 
మన దేశంతోపాటు 13 దేశాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా,  పిలిఫ్పీన్స్‌, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, బెల్జియం, బ్రెజిల్‌ దేశాల ప్రతినిధులు హాట్‌ బెలూన్‌ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. మొత్తం 6,200 మంది ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో రోజుకు  300 మందికి మాత్రమే బెలూన్లు ఎగురవేసే అవకాశం కల్పిస్తారు. బెలూన్లు ఎగురవేసేందుకు అరకులోయలో ఆరు అనువైన ప్రదేశాలను గుర్తించారు. ఇంతకు ముందు ఈ ఉత్సవాలను ఆగ్రా, హంపి, మైసూర్‌లో నిర్వహించారు. 

 

తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కనీస వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే కొనసాగుతున్నాయి. 

09:01 - November 14, 2017

హైదరాబాద్‌ : నగరంలో బంజారాహిల్స్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మనం సినిమా సెట్టింగ్‌కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు  ఎగిసిపడటంతో  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 
అన్నపూర్ణలో అగ్నికీలలు 
అన్నపూర్ణ స్టూడియోస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. మనం సినిమా సెట్టింగ్‌ కాలిబూడిదైంది. మనం సినిమా సెట్టింగ్‌కు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్ని కీలకలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టూడియోలో అందుబాటులో ఉన్న నీటిలో మంటలకు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు శకటాలతో మంటలను అదుపు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్‌ ష్టార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సెట్‌లో మనంతోపాటు రారండోయ్‌ వేడుకు చూద్దాం, రాజుగారి గది సినిమాల చిత్రీకరణ జరిగింది. 

 

08:42 - November 14, 2017

తూర్పుగోదావరి : పర్యాటకం ముసుగులో కాసుల కోసం వ్యాపారం జరుగుతోందా? పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బోటు యజమానులు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? పర్యాటకుల భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారా? బోటులో ప్రయాణించే పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా? భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారా? కృష్ణానదీ పవిత్రసంగమం దగ్గర జరిగిన బోటు ప్రమాదం... నదీ విహార భద్రతపై ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. మరెన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రమాదంలో పడిన గోదావరి నది పడవ ప్రయాణంపై 10టీవీ ప్రత్యేక కథనం...
పర్యాటకుడి ఆనందంపైనే కొన్ని దేశాల ఆర్థికాభివృద్ధి
బోటు విహారం అంటే ఎవరికి ఇష్టముండదు. అందరూ ఎగిరి గంతేస్తారు. ఆ సంతోషానికి అవధులుండవు.  ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం దొరికినా ఖర్చుతో సంబంధం లేకుండా ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తారు.  ప్రపంచంలో కొన్నిదేశాల ఆర్ధికాభివృద్ది ఆ పర్యాటకుడి ఆనందంపైనే ఆధారపడి ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  ఆ మంత్రాన్నే గతకొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అవలంభిస్తోంది. కానీ అభివృద్దిలో భాగస్వామమవుతున్న పర్యాటకుడి ప్రాణాలకు మాత్రం భరోసా కల్పించలేకపోతోంది. వ్యాపార ధోరణిలో వ్యవహరిస్తున్న బోట్ల యజమానుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో  పర్యాటకుల ప్రాణాలు గాల్లో  కలిసిపోతున్నాయి.
ఓవర్‌లోడ్‌తో పర్యాటకుల ప్రాణాలకు ముప్పు
అఖండ గోదావరి మధ్యలో పాపికొండలు... అద్భుతమైన దృశ్యం. నదిలో ప్రయాణిస్తూ ఆ దృశ్యాన్ని చూడడానికి ఇష్టపడని వారుండరు. అందుకే  బోటులో నదీవిహారం మొదలయ్యింది. గత పదిహేనేళ్లుగా గోదావరి నదిలో బోట్లు నడుస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పుడు ఇదే చాలా మందికి వ్యాపారంగా మారిపోయింది. నాలుగు కాసులు వెనకేసుకునే మోజులోపడి పర్యాటకుల భద్రత గాల్లో వదిలేస్తున్నారు. ఎంతమందిని ఎక్కించుకుంటే అంత డబ్బు వస్తుందనే ధ్యాసలో ఓవర్ లోడ్ తో బోట్లు నడుపుతూ ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు 
నిబంధనలు పాటించని బోటు యజమానులు
గోదావరి నదీ విహారం కోసం  మొత్తంగా 63 ప్రవేట్‌ బోట్లున్నాయి. రాజమహేంద్రవరానికి వచ్చిన పర్యాటకులను ప్రత్యేక బస్సుల్లో పురుషోత్తం పట్నం , పోలవరంకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి పేరంటాలపల్లి కి వెళ్తారు. అటునుంచి  భద్రాచలం వెళ్లాలనుకున్నవారికి వేరే బోటులోకి మారుస్తారు. సాయంత్రం ఐదు దాటితే బోటు ప్రయాణం చేయకూడదన్నది  నిబంధన. కానీ ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. పాపికొండలను చూడాలనుకే పర్యాటకుల కోరిను వీరు తమకు అనుకూలంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్నారు.  పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తారు. ప్రతి పర్యాటకుడికి ఒక లైఫ్‌జాకెట్‌ ఇవ్వాలి. కానీ అవేవీ ప్రైవేట్‌ బోట్ల నిర్వాహకులు పట్టించుకోరు. మరోవైపు తాము అధికారులు సూచించిన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెబుతుంటారు.
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
బోటు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అధికారులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  తనిఖీలు చేసినా, నిర్వాహకుల పెత్తనం ముందు చర్యలు గాలిలో కలసిపోతున్నాయి. దసరా తరువాత పర్యాటకుల తాకిడి  పెరిగి వ్యాపారం జోరుగా సాగుతుంది. బోటు బయలుదేరిన తరువాత తొలుత పోలవరం , ఆ తర్వాత దేవీపట్నం దగ్గర పోలీసులు తనిఖీలు చేయాల్సినప్పటికీ అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. పర్యాటక వివరాల జాబితాను పోలీసులు పరిశీలించి తనిఖీలు చేయాల్సినప్పటికీ ఈ తంతు అప్పుడప్పుడూ చేసి చేతులు దులుపుకుంటున్నారు. బోట్లలో గ్యాస్‌ సిలిండర్లు తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దాదాపు అన్ని బోట్లలో ఉంటున్నాయి. పోలీసులు బోటు ఓనర్ల వద్ద మామూళ్లకు అలవాటు పడి భద్రతను గాల్లో కొదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పర్యాటకుల ప్రాణాలకే ముప్పు
సాధారణంగా పాపికొండలు ప్రాంతానికి వెళ్లిన బోట్లు, లాంచీలన్నీ చీకటి పడకముందే దేవీపట్నం దాటేయాలనే నిబంధన ఉంది. అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రయాణించడం పరిపాటిగా మారింది. ప్రధానంగా గండిపోశమ్మ, కొండమొదలు మధ్యలో పూడుపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు, బండరాళ్లున్నాయి. ఈ ప్రాంతంలోనే నీటి సుడులు సైతం అధికంగా ఉంటాయి. ఇటీవల గండిపోశమ్మ ఆలయం వద్ద ఓ బోటును వెనుకకు మళ్లిస్తుండగా బండరాయికి బలంగా తాకడంతో బీటలువారి నీరు లోపలికి చేరింది. వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నిత్యం వేల మంది బోటులో విహార యాత్రకు వెళ్తున్నా..  వారి వివరాలు ఎక్కడా పూర్తిస్థాయిలో నమోదు కావడం లేదు. దీంతో పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారి వివరాలు సైతం తెలిసే పరిస్థితి లేదు. 
పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాలి 
గతంలో గోదావరి నదీవిహారం చేసిన ఎంతోమంది పర్యాటకులు ప్రమాదాల్లో చిక్కుకున్న ఘటనలున్నాయి. తాజాగా కృష్ణానదీ పవిత్రసంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనతోనైనా అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో పాటు పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన అవసరముంది. 

 

08:31 - November 14, 2017

గుంటూరు : మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రముఖ పుణ్యకేత్రమైన అమరావతి నది గర్భంలో మట్టి మాఫియా అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మట్టి మాఫియా ఆగడాలను అధికార యంత్రాంగం అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఇసుక మాఫియా
అమరావతిలో అక్రమార్కులు 
అమరావతిలో అక్రమార్కులు మట్టిని కొల్లగొడుతున్నారు. అమరేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ వద్ద నుండి గత పది రోజుల నుంచి మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో చాలా సార్లు తహశీల్దార్‌కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. తాత్కాలికంగా వీఆర్వోని పంపినా మళ్లీ యధాతథంగా తవ్వకం మొదలుపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న 10 టీవీ.. మట్టి అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఘటనా స్థలానికి వెళ్లింది. అయితే అక్కడి అక్రమార్కులు.. పెద్దపెద్దవి తీయకుండా నాల్గొందల రూపాయలకు మట్టి అమ్ముకునే తమవి తీయడమేంటని ఎదురు ప్రశ్నించారు. 
ట్రాక్టర్లతో మట్టి తరలింపు 
రాత్రి వేళల్లో ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇదంతా తెలిసినా పోలీసులు, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి తవ్వకం 10రోజుల నుంచి దాదాపుగా 100ట్రాక్టర్ల నుంచి 5000 ట్రాక్టర్ల వరకు తరలించినట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దళితుల భూములు, లంకభూములు కనుమరుగైపోతున్నాయని దళితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

08:25 - November 14, 2017

హైదరాబాద్ : జూదంపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి అసాంఘిక చర్యలకు మినహాయింపు ఇవ్వకుండా అసెంబ్లీ గేమింగ్‌ యాక్ట్‌కి చట్ట సవరణలు చేసింది ప్రభుత్వం. ఇకపై జూదం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇక నుండి జూదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న గేమింగ్‌ యాక్టులో కొన్ని సవరణలు చేసింది అసెంబ్లీ. ఈ సవరణలో పేకాట, మట్కా, సట్టా, జూదం, ఆన్‌లైన్ పేకాట వంటి వాటిని ఈ పరిధిలోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా వీటిని అమలు చేసే నిర్వహకులు, అందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్ట సవరణలో మార్పులు చేసింది.
జూదం ఆడినవారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష
కొత్త చట్టం 2017 జులై 8 నుండి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం జూదం ఆడినవారిపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించనుంది. అలాగే దాడులు చేసిన చోట లభించిన నగదుతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను జప్తు చేయడం వంటి అధికారం ఈ చట్టంలో ఉన్నాయి. అయితే హార్స్‌ రేసింగ్‌ను కూడా ఈ చట్టంలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 
హార్స్‌ రేసింగ్‌ను చట్టంలోకి తీసుకురావడం కుదరదు : నాయిని  
అయితే హార్స్‌ రేసింగ్‌ను ఈ చట్టంలోకి తీసుకురావడం కుదరదన్నారు మంత్రి నాయిని నర్సింహారెడ్డి. అర్బన్ రూరల్‌ ఏరియాలలో అందరికీ ఈ చట్టం వర్తిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో జూదం నిర్వహించే కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త చట్ట సవరణతో రాష్ట్రంలో జూదంపై పూర్తిగా నిషేధం అమలు కానుంది. జూదం వల్ల ఎక్కువ ప్రభావం చూపుతున్న  మహిళలు, విద్యార్థులకు ఈ చట్ట సవరణతో ఉపశమనం కలుగుతుందని అధికారులు బావిస్తున్నారు. 

 

చిన్నారి మృతదేహాన్ని సందర్శించిన మంత్రి అఖిలప్రియ

కృష్ణా : ఇంబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహం ఇవాళ లభ్యమైంది. చిన్నారి మృతదేహాన్ని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సందర్శించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

బోటు బోల్తా ఘటన... 22కి చేరిన మృతుల సంఖ్య

కృష్ణా : ఇంబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహం ఇవాళ లభ్యమైంది. 

08:03 - November 14, 2017

హైదరాబాద్ : 2021 తర్వాత రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలన్న ఆలోచనలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నారు.  కడియం ఎమ్మెల్సీ పదవీకాలం 2021 లో ముగుస్తుంది. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో కడియం తన మనసులోని భావాలను బయటపెట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. తన సుదీర్ఘ  ప్రయాణంలో మచ్చలేకుండా రాజకీయాలు నడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల నుంచి రిటైర్‌ కావాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయానికి వచ్చారు. 
విద్యావ్యవస్థలో మార్పుల కోసం కఠిన నిర్ణయాలు : కడియం
తెలంగాణలో కొనసాగుతున్న విద్యా సంస్కరణపై కడియం శ్రీహరి తనదైన శైలిలో స్పందించారు. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట కూడా వినకుండా విద్యావ్యవస్థలో మార్పుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రారంభించిన గురుకులాలు మంచి ఫలితాలు ఇస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. రెండు, మూడేళ్లలో కార్పొరేట్‌ కాలేజీలకు ఆదరణ తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాలేజీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేని  వాస్తవం సర్వేలో వెలుగులోకి వచ్చిన అంశాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. కొన్ని కాలేజీల్లో 50 నుంచి వంద మంది బాలికలు ఉంటే ఒక్క బాత్‌ రూమ్‌ కూడాలేని కఠోర సత్యాన్నిప్రస్తావించారు. బాలికలు తెల్లవారుజామున 4 గంటలకు కాలకృత్యాలు తీర్చుకుని వెళ్లి పడుకునే దారుణ పరిస్థితులు ఉన్నాయని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక్క ప్రైవేటు కాలేజీ కూడా నిబంధనలు పాటించడంలేదని, ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే  చిప్పకూడు  తప్పదని నాలుగు కార్పొరేట్‌ కాలేజీల ప్రతినిధులను హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు. 
నిబంధనలు పాటించని కార్పొరేట్‌ కాలేజీలపై క్రిమినల్‌ కేసులు
కార్పొరేట్‌ కాలేజీ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించేందుకు విద్యాశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వేచ్ఛ ఇవ్వడంతో పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పు వస్తోందన్నారు. నిబంధనలు పాటించకపోతే వచ్చే ఏడాది క్రిమినల్‌ కేసులు పెట్టక తప్పదని హెచ్చరించారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు రీయింబర్స్‌మెంట్‌తో దుష్పలితాలు కనిపించిన విషయాన్ని కడియం ప్రస్తావించారు. ఆధార్‌లో అనుసంధానం చేయడం వలన సీట్లు మిగిలిపోయే పరిస్థితి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాలేజీల్లో బయో మెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేశామని, హాజరు తక్కువగా ఉంటే పరీక్షలకు అనుమతించమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ గాడిలో పడటానికి ఐదారేళ్లు పడుతుందని, తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తాన్ని విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం కడియం శ్రీహరి తీసుకొస్తున్న సంస్కరణలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

 

 

07:57 - November 14, 2017

గుంటూరు : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదంతోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరువుతారని అందరూ భావిస్తే.. ప్రతిపక్షం మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సభ సాక్షిగా వైసీపీ నిలదీసే అవకాశాన్ని వదులుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు వైసీసీ సభ్యుల గైర్హాజరు
జగన్‌ తనకు తానే శత్రువని... అతనికి వేరే శత్రువు అవసరం లేదన్నది టీడీపీ నేతలు తరచూ చెప్పే మాటలు. అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులు చూస్తే ఇప్పుడే అదే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా వైసీపీ రాజకీయంగా పెద్ద పొరపాటే చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. అసెంబ్లీ తొలిరోజు తాము అర్థవంతమైన చర్చ జరిపామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతోనైనా వైసీపీ అసెంబ్లీకి వస్తుందని అందరూ భావించారు.  చివరికి పవిత్ర సంగంమం దగ్గర పడవ ప్రమాదం జరిగిన తర్వాతైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారని అనుకున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు సభకురాలేదు. ఇది వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వైసీపీ గైర్హాజరుపై అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ
సోమవారం అసెంబ్లీ లాబీల్లో వైసీపీ సభకు గైర్హాజరు కావడంపైనే చర్చ జరిగింది. సభ ముగిసే వరకు వైసీపీ తీరుపైనే ఆసక్తికర చర్చ నడిచింది.  టీడీపీ నేతలైతే పడవ ప్రమాద ఘటనలో తమను విమర్శించే అవకాశం పోగొట్టుకుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రమాదం జరిగిన సమయంలో వైసీపీ నేతలు జోగి రమేష్‌ వ్యవహరించిన తీరు కూడా ఆపార్టీకి తీవ్ర నష్టం కలిగించిందన్న భావన వ్యక్తమైంది. సహాయక చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా ఉరుకులు పరుగులు పెడుతోంటే.... క్షతగాత్రులను తీసుకెళ్లే అంబులెన్స్‌కు అడ్డంగా జోగి రమేష్‌ కూర్చుని రాజకీయాలు చేయడంతో ప్రజల్లో వారిపై వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నది టీడీపీ నేతల వాదన.  ప్రమాదం జరిగిన వెంటనే సీఎం కేరళ నుంచే సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించడం,  మంత్రులను అప్రమత్తం చేయడం,   చంద్రబాబు  విజయవాడకు వచ్చీరాగానే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేయడం,  ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించడం, పడవ ప్రమాదంలో పర్యాటకులను కాపాడిన మత్స్యకారులకు 5లక్షల రూపాయల చొప్పున బహుమానంగా ప్రకటించడం ప్రభుత్వంపై ప్రజల్లో సానకూలత వ్యక్తమవుతోందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నేతల సంతోషం 
ప్రజలు ఓట్లేసి గెలిపించి .. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని కోరుతుంటే... వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాకపోవడంపై టీడీపీ నేతలు సంతోషపడుతున్నారు. జగన్‌ తనకుతానే ప్రజల్లో వ్యతిరేకత సృష్టించుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.  జగన్‌కు రాజకీయాల్లో ఉన్న అపరిపక్వత, అహంకారం, విచ్చలవిడి అవినీతి, ఆవేశం, సీఎం కుర్చీపై ధ్యాస, అనాలోచిత నిర్ణయాలు తమకు కలిసి వస్తున్నాయని సంబరపడుతున్నారు.  ఇప్పటికైనా ప్రతిపక్ష వైసీపీ మేలుకుంటుందో... లేదో వేచి చూడాలి.

 

నేడు పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ

ఢిల్లీ : నేడు పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరుగనుంది. 

 

నేడు కర్నూలు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర

కర్నూలు : నేడు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. నిన్నటి వరకు కడపలో పాదయాత్ర కొనసాగింది.ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది.  

నేడు అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి భేటీ

హైదరాబాద్ : నేడు అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

Don't Miss