Activities calendar

15 November 2017

21:32 - November 15, 2017

జింబాబ్వేలో సైనిక తిరుగుబాటు కలకలం రేపింది. అధికారాలను హస్తగతం చేసుకున్న ఆర్మీ... ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను హౌస్‌ అరెస్ట్‌ చేసింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని ...అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. మంగళవారం అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే ప్రయివేట్‌ నివాసాన్ని ఆర్మీ చుట్టుముట్టడంతో సైనిక తిరుగుబాటు జరిగిందన్న వార్తలు గుప్పు మన్నాయి. ఆ ప్రాంతంలో కాల్పులు కూడా చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాబర్ట్‌ ముగాబేకు చెందిన జాను-పీఎఫ్‌ పార్టీ.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కాన్‌స్టాంటినో చివేంగాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

సైనిక తిరుగుబాటు చేశామన్న వార్తలను జింబాబ్వే మిలటరీ ఖండించింది. అధ్యక్షుడు ముగాబేపై తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని అక్కడి అధికారిక మీడియాలో ఆర్మీ వెల్లడించింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకే పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నామని సైన్యం వివరించింది. అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం తమ రక్షణలో క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మేజర్‌ జనరల్‌ ఎస్‌బి మోయో తెలిపారు. జింబాబ్వే 1980లో బ్రిటన్‌ నుంచి స్వతంత్రం పొందింది. గత 37 ఏళ్లుగా జింబాబ్వేలో ముగాబే పాలన కొనసాగుతోంది. ఇటీవల 93 ఏళ్ల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు ముదిరడంతో సంక్షోభానికి దారితీసింది. 

21:30 - November 15, 2017

ఉత్తర్ ప్రదేశ్ : అయోధ్య వివాదం పరిష్కారంలో భాగంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. సుమారు అరగంటసేపు వీరిద్దరు చర్చలు జరిపారు. శ్రీశ్రీ రవిశంకర్‌ గురువారం అయోధ్యలో పర్యటించి అన్ని వర్గాలను కలుసుకోనున్నారు. తనకు ప్రత్యేక అజెండా ఏమీ లేదని అందరి అభిప్రాయాలను వింటానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రవిశంకర్‌ను కలుసుకునేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరించింది. సున్నీ వక్ఫ్‌బోర్డుకు మద్దతుగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు కూడా శ్రీశ్రీ రవిశంకర్‌తో చర్చలు జరిపేందుకు నిరాకరించింది. శ్రీశ్రీ మధ్యవర్తిత్వానికి ఎలాంటి లీగల్‌ స్టాండ్‌ లేదని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి. ఏళ్ల తరబడి నలుగుతున్న అయోధ్య అంశాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానని శ్రీశ్రీ రవిశంకర్‌ గతవారం ఢిల్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

21:29 - November 15, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా మోది ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తుగ్లక్‌ చర్యగా పేర్కొన్నారు. 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్‌ మ‌హ‌మ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు తీసుకొచ్చారని యశ్వంత్‌ సిన్హా అన్నారు. 'ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని తీసుకొచ్చారు. మరికొంతమంది పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా.. కొత్తవాటిని ప్రవేశపెట్టారు. కానీ 700ఏళ్ల క్రితం తుగ్లక్‌ పాత కరెన్సీని రద్దు చేసి తన సొంత కరెన్సీని తీసుకొచ్చారు. అంటే 700ఏళ్ల క్రితమే నోట్లరద్దు జరిగిందని తెలుస్తోందని' సిన్హా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థికవ్యవస్థకు 3.75 లక్షల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని ఆయన అన్నారు. గుజరాత్‌లో జరిగిన 'లోక్‌షాహి బచావో అభియాన్‌' కార్యక్రమంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు.

21:26 - November 15, 2017

హైదరాబాద్ : మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన 'రుద్రమదేవి' సినిమా ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపిక కాలేకపోయిందని ప్రశ్నించారు సినిమా డైరెక్టర్‌ గుణశేఖర్. ఈమేరకు గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా అని లేఖలో పేర్కొన్నారు. చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు తన చిత్రానికి ఎందుకు ఇవ్వలేదన్నది ఎన్నటికీ తేలని శేషప్రశ్నేనా అన్నారు. 2014-16 సంవత్సరాల నంది అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా మూడేళ్లపాటు అవార్డులకు అనర్హులుగా ప్రకటించడంపై మండిపడ్డారు. అసలు మనం ఉన్నది స్వతంత్ర భారతదేశంలోనేనా అని వాపోయారు. రుద్రమదేవి లాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తే తనని క్షమించాలని లేఖలో తెలిపారు. 

21:24 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో కేసీఆర్‌ కుటుంబపాలన నడుస్తుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన గురుకుల ఉపాధ్యాయుల నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భయంతోనే కేసీఆర్‌ ఉద్యోగ జీవో జారీ చేస్తున్నారని, అవి కోర్టుకు వెళ్లి ఆగిపోతున్నాయన్నారు. కోర్టులు కొట్టేసే విధంగా జీవోలు ఇస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ఇంతవరకు చేయలేదన్నారు. 

21:23 - November 15, 2017

కర్నూలు : జగన్‌ 9వరోజు ప్రజా సంకల్ప యాత్ర కర్నూల్‌ జిల్లాలో కొనసాగింది. పాదయాత్రలో చంద్రబాబు తీరుపై జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు తన మానిఫెస్టోని మాయం చేశారని అది ఉంటే ప్రజలు సీఎంను నిలదీస్తారన్నారు. ప్రజల సలహాలను తీసుకుని పాదయాత్ర ముగిసిన అనంతరం 2019మానిఫెస్టోని తయారు చేస్తానని జగన్‌ అన్నారు. చంద్రబాబు మానిఫెస్టోలాగా పేజీల కొద్ది తనది ఉండదని ప్రజలను మోసం చేసే విధంగా ఉండదని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తానన్నారు. 2019 మానిఫెస్టోలో పెట్టిన పనులు చేసిన తర్వాతే 2024లో ప్రజల ముందుకు వస్తానని జగన్‌ అన్నారు. 

21:22 - November 15, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రన్న బీమా పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ అసెంబ్లీలో చంద్రన్న బీమా పథకం, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధి హామీ పథకాలపై చర్చ జరిగింది. ప్రధానంగా చంద్రన్న బీమాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ స్కీమ్‌పై హర్షం వ్యక్తం చేసిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు.. అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. చంద్రన్న బీమా వల్ల నిరుపేదలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 73 వేల, 370 సహజమరణాలకు, 71వేల 563 మంది క్లెయిమ్స్‌ చేసుకున్నారని.. 215 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు బోండా ఉమ తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతున్నాయని బోండా ఉమ అన్నారు.

చంద్రన్న బీమా పథకంపై బాధితులకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్. పోలీసులు సైతం సత్వరం స్పందించాల్సిన అవసరం ఉందన్నారాయన. మరోవైపు ఇంటర్ విద్యార్ధుల స్కాలర్‌ షిప్‌ల విడుదలలోనూ జాప్యం జరుగుతోందని శ్రావణ్‌కుమార్ అన్నారు. రైల్వే ఉద్యోగులకు చంద్రన్న బీమా వర్తించట్లేదన్న అంశాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ ప్రస్తావించారు. సముద్రంలో గల్లంతవుతున్న మత్స్యకారుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్‌లు ఏర్పాటు చేయాలని గణేశ్‌కుమార్ సూచించారు.

మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. వారికి క్లెయిమ్ ఇచ్చే క్రమంలో చట్టపరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. అయితే వారికి ప్రత్యే క స్కీమ్‌లు ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పితాని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేంతవరకూ బీమా మొత్తం..బాధిత కుటుంబాలకు అందడం లేదన్నారు ఎమ్మెల్యే అనిత. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

NREG పథకం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్ష వైసీపీకి కళ్లు కుట్టాయని ఎమ్మెల్యే ఆనంద్‌కుమార్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలుకేంద్రానికి తప్పుడు నివేదిక ఇవ్వడంవల్ల నిధులు ఆగిపోయాయని ఆనంద్‌కుమార్ ఆరోపించారు. చంద్రన్న బీమా పథకంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 

21:20 - November 15, 2017

హైదరాబాద్ : విపక్షాల ప్రశ్నలు.. మంత్రుల సమాధానంతో తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీగా సాగింది. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్‌, సీపీఎం పక్షాలు విమర్శించాయి. దాంతోపాటు హైదరాబాద్‌లో రోడ్లు, నాలాల దుస్థితిపై బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్టీసీ నష్టాలపై కూడా సభలో చర్చించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులపై తెగ హడావిడి చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు బకాయిలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ వైఖరిని శాసనసభలో విపక్షాలు ఎండగట్టాయి.

ఫీజు చెల్లింపులు పెండింగ్‌లో పెట్టడం వల్ల .. పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఉత్తమ్‌ కుమారెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఫీజు బకాయిలతో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న పేదవర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దాదాపు 4వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఖచ్చితమైన హామీఅయినా ఇవ్వాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు.

అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. చిన్న కాలేజీలకు మొదట, పెద్ద కాలేజీలకు తర్వాత ఫీజులు చెల్లిస్తున్నామని, 2016-17 విద్యాసంవత్సరానికి మరో వారం రోజుల్లో ఫీజు బకాయిలు పూర్తిచేస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటల.

అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో రవాణా, రోడ్లు, నాలాల పరిస్థితిపై విపక్షసభ్యులు ప్రశ్నలు సంధించారు. నగరంలో నాలాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేయించాలని బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...సభ్యులు ప్రశ్నలు సుదీర్ఘంగా అడగడంపై సెటైర్లు వేశారు. నగరంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆధునిక యంత్రసామాగ్రిని జీహెచ్‌ఎంసీకి సమకూరుస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీవ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. 2015-16లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.39కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.336కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఆర్టీసీలో 4వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. అంతకు ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమస్యలను దాటవేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. 

21:19 - November 15, 2017

విజయవాడ : వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే... అధిక దిగుబడులు వస్తాయని విశాఖలో ప్రారంభమైన ఏపీ వ్యవసాయ సదస్సు అభిప్రాయపడింది. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు సాగు చేయాలని...సదస్సుకు హాజరైన నిపుణులు సూచించారు. వ్యవసాయంలో సరికొత్త సాంకేతికతను జోడించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు వరి నుంచి ఇతర పంటలకు మారాల్సి ఉందని సూచించారు. అలాగే వ్యవసాయం రంగంలో యాంత్రీకరణతో పాటు సాంకేతికతను జోడించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దేశ, విదేశాల ప్రముఖులు, రైతులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగకరంగా ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. కొత్త పద్ధతుల్లో సాగు విధానం గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. సదస్సులో 50 స్టాళ్లను ఏర్పాటు చేసి వ్యవసాయానికి వినియోగించే అధునాతన యంత్రాలను ప్రదర్శనలో పెట్టారు. ముఖ్యంగా డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారి, స్లిమ్ టైప్ అగ్రి ట్రాక్టర్‌, ఆర్గానిక్ సీడ్స్, వాట‌ర్ ఐడెంటిఫియర్‌, బర్కీగ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, డ్రోన్ మ్యాపింగ్‌లు, సాయిల్ టెస్ట్‌ రైతుల్ని ఆకట్టుకున్నాయి.

ప‌ట్టు పురుగుల పెంప‌కానికి సంబంధించిన స్టాల్, రొయ్యల సాగు విధానంతో పాటు, తక్కువ ఖర్చుతో ప‌శుగ్రాసం సాగు విరివిగా ఆకట్టుకున్నాయి. భోజన విరామంలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఈ స్టాల్స్‌ను వీక్షించారు. అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు, విదేశీ ప్రతినిధులకు పరస్పర పరిచయాలకు మొదటిరోజు వేదికైంది. అయితే సమావేశాలు ఇంగ్లీషులో సాగడంతో తెలుగు రైతులు ఇబ్బందులు పడ్డారు. 

మహా సిమెంట్ లో అగ్నిప్రమాదం..

కర్నూలు : బనగాపల్లి మండలం యనకండ్లలో పేలుడు సంభవించింది. మహా సిమెంట్ ఫ్యాక్టరీలో కోల్ మిల్ బ్యాక్ హౌస్ పేలింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. 

20:11 - November 15, 2017

కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట...గరగపర్రు, మంథని, నేరెళ్ల, కందుకూరు, నవీపేట....ఎన్ని గ్రామాలు? ఎందరు బాధితులు? ఇంకా ఎన్నేళ్లు? అణిగిమణిగి బతకాలని దళితులను అనునిత్యం శాసిస్తున్న ఆధిపత్య కులాల అహంకారానికి, పెత్తందారీ వ్యవస్థ స్వభావానికి ముగింపు ఎప్పుడు? చేసిన తప్పేమీ లేదు.. కేవలం ప్రశ్నించారు. అతగాడి అక్రమాన్ని అడ్డుకున్నారు.. అంతే పెత్తందారీ లక్షణం నిద్రలేచింది. ఆధిపత్య కుల అహంకారం జూలు విదిలించింది. ఫలితం అమానవీయం.. అరాచకం... దుర్మార్గం.. మీసం పెంచితే ఒకడికి కోపం... గుర్రంపై ఊరేగాలని ముచ్చట పడితే మరొకడికి కోపం...ప్రేమిస్తే ఇంకొడికి, ప్రశ్నిస్తే మరొకడికి... ఎంతకాలమీ పెత్తందారీ కులాల అరాచకం.

నీ బాంచన్ కాల్మొక్త దొరా అనాలి..కూర్చోమంటే కూర్చోవాలి.. నిల్చోమంటే నిల్చోవాలి..ఎదురు చెప్తే మురిగ్గుంటలో ముంచేస్తారు.. బెత్తంతో బెదిరిస్తారు.. అమ్మ ఆలి అంటూ బూతులు లంకించుకుంటారు.. ఎవరీ భరత్ రెడ్డి? నవీపేటలో ఏం జరిగింది? కులమా ఇంకెక్కడుంది ? అనేవాళ్లకు ఇవిగో ఉదాహరణలు.. గరగపర్రు గాయం సలుపుతూనే ఉంది.. నిజామాబాద్ నవీపేట లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.. నేరెళ్ల ఘటన ఇంకా కళ్లముందునుంచి చెరిగిపోలేదు.. మంథని మధుకర్ హత్య ఇంకా పచ్చిగానే ఉంది.. ఒంగోలు రెవిన్యూ ఉద్యోగిపై దాడి తాజా తాజాగా వాతలు తేలి కనిపిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దేశంలో నిత్యం దళితులపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి..

ఏడు దశాబ్దాలు దాటుతున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో ఏడు దశాబ్దాలైనా వస్తుందనే నమ్మకం కనిపించటం లేదు.. అన్ని రకాలుగా అణచివేత, అంతులేని దోపిడీ, అంతం లేని వివక్ష... వెరసి దారుణమైన వెనుకబాటు. దేశంలో దళితుల స్థితిగతులు ఎప్పుడు మారతాయి. ఈ వివక్ష ఎప్పుడు అంతమౌతుంది? స్వతంత్ర భారతంలో నిత్యం దళితులకు జరుగుతున్న అవమానాలెన్నో. కులం, పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులెన్నో. ఏళ్లకేళ్లు న్యాయం జరగక, దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దళితున్ని రాష్ట్రపతి చేయడం దళితుల సమస్యలకు పరిష్కారం కాదు. వ్యవస్థ రూపాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరగాలి. గ్రామాల్లో, పట్టణాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, దాడులు, వెలివేతలపై ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే అణచివేతకు ఫలితం తిరుగుబాటే అని చరిత్ర చెప్తోంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:03 - November 15, 2017

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు..ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహంచాయి. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించాయి. ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అరెస్టులు..చేపట్టాయి. అంతేగాకుండా పలువురిని గృహ నిర్భందం చేశారు. దీనిని సంఘాలు తీవ్రంగా నిరసించాయి. సీసీఎస్ విధానాన్ని కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. ఈ అంశంపై టెన్ టివి విజయవాడ స్టూడియోలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో శ్రీనివాసులరెడ్డి (పీడీఎఫ్ ఎమ్మెల్సీ), విద్యాసాగర్ రావు (ఎన్జీవో నేత)లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బాబుకు గుణశేఖర్ లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దర్శకుడు గుణశేఖర్ లేఖ రాశారు. ‘రుద్రమదేవి' చిత్రాన్ని పన్ను మినహాయింపుపై ప్రశ్నించడం తప్పా అని పేర్కొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని 'రుద్రమదేవి' చాటి చెప్పిందని..గౌతమిపుత్రకు ఇచ్చి రుద్రమదేవికి ఎందుకు ఇవ్వలేదని..నంది అవార్డులను ప్రశ్నించిన వాళ్లను మూడేళ్ల పాటు అవార్డులకు అనర్హులుగా ప్రకటిస్తారా ? అని ప్రశ్నించారు. రుద్రదేవి కనీసం జ్యూరీ గుర్తింపునకు ఎందుకు నోచుకోలేదని, తెలుగు జాతి చరిత్రను వెలికి తీస్తే గుర్తించరా అని పేర్కొన్నారు. రుద్రమదేవి లాంటి సినిమాను ప్రోత్సాహిస్తే తప్పుడు సంకేతాలు వెళుతాయా అని భావించారా ?

19:52 - November 15, 2017

తాగువోతోళ్ల శాఖా మంత్రి పద్మారావు సారు అవద్దం జెప్పిండు అసెంబ్లీల.. తెలంగాణల ఆప్కారీ శాఖ అద్భుతంగ పనిజేస్తున్నది.. రాష్ట్రం మొత్తం మీద బూతద్దం బెట్టుకోని ఎంకులాడినా ఏడ గింత సార వొట్టు దొర్కుతలేదు.. అట్ల కంట్రోల్ జేశ్నమని చెప్పిండు.. అయితే పద్మారావు సారు మీరు పచ్చి అవద్దం జెప్పిండ్రని ఇగో నేను నిరూపిస్తున్నది సూడాలంటే వీడియో క్లిక్ చేయండి....

19:51 - November 15, 2017

డబుల్ బెడ్రూం ఇండ్లు గావాల్నంటే టీఆర్ఎస్ జెండనే వట్కోవాల్నంట..ఓడ దాటెదాక ఓడ మల్లన్న ఓడదాటినంక బోడ మల్లన్న.. మన బాతాల పోశెట్టి పని ఇట్లనే ఉంటది.. ఓడ్వ నీళ్లళ్ల మున్గిన పంచాదిల ఎవ్వలిది తప్పు ఎవ్వలిది ఒప్పు అని విచారణ జేస్తున్నరుగదా పోలీసోళ్లు ఆపుండ్రిగ మీ విచారణ..ది ఎక్వైతె సల్లవొట్టు పల్చగైతదని ఇద్వరకు జెప్పుకున్నం.. మొన్నగూడ జెప్పుకున్నం.. మళ్ల ఇయ్యాళ అదే ముచ్చటొచ్చింది.. తాగువోతోళ్ల శాఖా మంత్రి పద్మారావు సారు అవద్దం జెప్పిండు అసెంబ్లీల..మనం సుట్టాల ఇంటికి వొయ్యి వాళ్లు వెట్టిన అన్నందిని..ఆ పేదోని నోట్లె బుక్క ఎత్తగొట్టె ఉపాయమే ఇది..?ఏలూరు ఎంపీకి కోపమొచ్చింది.. అంటె ఆయన శాంతంగ ఎన్నడుండడుగని.. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంపీడీవోకు బల్పు బాగనే ఉన్నట్టుందిగదా..? గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి....

19:29 - November 15, 2017

ఢిల్లీ : దాడులకాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది..ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే దళితులు..ఇతరులపై దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ అల్వార్ లో ఉమర్ ఖాన్ ఆవులను కొనుక్కొని వస్తుండగా గో సంరక్షకులు దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పలువురు మండిపడుతున్నారు. బుధవారం ఢిల్లీలోని బికనీర్ హౌస్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఆల్ ఇండియా కిసాన్ సభ, ఐద్వా, ఆదివాసి, ముస్లిం, విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు. ఉమర్ ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

19:08 - November 15, 2017

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో 22 మంది మృతికి కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ప్రధాన నిందితుడు కొండల్ రావుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి విచారించారు. కొండలరావు, నీలం శేషగిరి రావు, మాచవరపు మనోజ్ కుమార్, యంజమూరి విజయ సారథి, గేదెల శ్రీను, బోటు నడిపిన భైరవ స్వామి, గేదెల లక్ష్మీలను అరెస్టు చేశారు. విహార యాత్రకు పనికొచ్చిన బోటు కాదని..చేపలు పట్టడానికి ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేపట్టి నదిలో ఉపయోగిస్తున్నారు.

అనధికారికంగా బోటును తిప్పేందుకు..ఇతరత్రా వ్యవహారాల్లో ముగ్గురు మంత్రులు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ..జలవనరుల శాఖ అధికారులు..కొంత మంది పెద్దల కనుసన్నలలో బోట్లు నడుస్తున్నాయని సీఎం బాబుకు సమాచారం అందిందని తెలుస్తోంది. 

ఏడుగురు సస్పెండ్ - అఖిల ప్రియ...

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్ తో సహా ఏడుగురిని సస్పెండ్ చేసినట్లు మంత్రి అఖిల ప్రియ పేర్కొన్నారు. ఏజీఎం రామకృష్ణ, డీఎం గంగరాజు, స్విమ్మర్ వీరారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ లో ముగ్గురు బోటు డ్రైవర్లను సస్పెండ్ చేయడం జరిగిందని, డ్రైవర్లు నరసింహరావు, చంచరావు, శ్రీనివాస్ లను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ద్విసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, రాజకీయ నాయకులు ఉన్నారని ఆరోపించే వారు ఆధారాలు చూపించాలన్నారు.

18:35 - November 15, 2017

తూర్పుగోదావరి : ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వివిధ రంగాల వారు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఒక చోట ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా న్యాయవాదులు కూడా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ రోడ్డెక్కారు. బుధవారం కాకినాడ కలెక్టర్ ఆఫీసు వద్ద వీరు ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల బెనిఫిట్స్...జూనియర్ స్టయిఫండ్..హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు పలు విషయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:30 - November 15, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందా ? అంటే అవును జరిగిందని గీతా ఆర్ట్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న బన్నీ వాసు పేర్కొన్నారు. ఈయన చేసిన ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు వచ్చింది. మెగా కుటుంబంలో ఉన్న ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదన్నారు.

ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని, దీనిని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీని అవమానించడమేనని తెలిపారు. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోదని..అయిన ఆవేదనను తట్టుకోలేక మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. మగధీర సినిమాకు కూడా ఎంతో అన్యాయం జరిగిందని..జాతీయస్థాయిలో గుర్తింపు పొందినా రాష్ట్ర స్థాయిలో మాత్రం అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి....

18:23 - November 15, 2017

తూర్పు గోదావరి : జిల్లాలో మార్కెట్ మాయాజాలంతో రైతులు నిండా మునుగుతున్నారు. ఆరుగాళం కష్టించి పండించిన పంటను కూడా విక్రయించులేక దిక్కుతోచని స్థితిలో రైతు నెట్టివేయబడుతున్నాడు. జిల్లాలో గత నాలుగైదు రోజులుగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరకొరగా కొనుగోళ్లు చేస్తున్నారు.

280 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 380 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తడం లేదు. తేమ శాతం పేరిట వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆగచాట్లు పడుతున్నారు.

మిల్లర్లకు అధికారులు వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రి అండదండలు..మండపేట ఎమ్మెల్యే సహకారంతో రైసు మిల్లర్లను చెప్పు చేతల్లో పెట్టుకున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ పంట అమ్ముకున్న తరువాత రబీ పంటకు సిద్ధం కావాల్సిన రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన పెట్టుబడితో రబీ పంటలు వేయాలని అనుకుంటున్న రైతులు దిక్కుతోచని పరిస్థితి కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ టెన్ టివితో స్పందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

18:16 - November 15, 2017

కడప : డీడీల ఫోర్జరీ కేసులో సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో కదిరి టిడిపి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును చెప్పింది. హుస్సేనీ ఆలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ. 6 కోట్ల వరకు మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీనిపై గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది. ఈ కేసులో ఇన్ స్పెక్టర్ వెంకట మోహన్ కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమాన విధించారు. ఇదే కేసులో ఎస్ బీఐ మేనేజర్ నర్సింహరావుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
గతంలో కెనరా బ్యాంకులో కూడా నకిలీ డీడీలు పెట్టి వెంకట ప్రసాద్ మోసగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడిన వెంకట ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తీర్పును సవాల్ చేస్తూ వెంకట ప్రసాద్ హైకోర్టు మెట్లు ఎక్కాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

కుంటలో ఈతకు వెళ్లి...

వరంగల్ అర్బన్ : కొత్తపేటలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. రంజాన్ (16), మెయిన్ (14), పాషా (16), రసూల్ (12) మృతి చెందారు. 

మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటున్న బన్నీ వాసు...

హైదరాబాద్ : నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని బన్నీ వాసు పేర్కొంటున్నారు. మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. 

మాజీ టిడిపి ఎమ్మెల్యే కు జైలు శిక్ష..

కడప : డీడీల ఫోర్జరీ కేసులో కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. హైదరాబాద్ లోని హుస్సేనీ అలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఫోర్జరీ డీడీలతో కందికుంట మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై సీబీఐ ధర్మాసనం విచారణ జరిపింది. కందికుంటతో పాటు, అసిస్టెంట్ మేనేజర్ నర్శింగరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఇన్ స్పెక్టర్ వెంకటమోహన్ కు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

17:36 - November 15, 2017

వరంగల్ : సీకే ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తుండడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసుపత్రిలో శివనగర్ గ్రామానికి చెందిన యమున శిశువుకు జన్మనిచ్చింది. కానీ ఐసీయూలో శిశువు మృతి చెందింది. వైద్యుల సరిగ్గా చూడకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ జరుగుతున్నాయని చెబుతున్నారే కానీ...వైద్యులు సరియైన విధంగా స్పందించడం లేదని బంధువులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. 

17:33 - November 15, 2017

ఖమ్మం : రైతు సమన్వయ కమిటీలో ఇతర పార్టీల నుండి చేరిన వారికే అవకాశం కల్పిస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని..అందులో భాగంగా రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యమంలో పాల్గొన్న వారికే సమితుల్లో చోటు కల్పిస్తామని కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఖమ్మం జిల్లాలో 25 మండలాలకు రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో టిడిపి నుండి చేరిన 13 మందికి అవకాశం కల్పించారు. వైసీపీ నుండి ఐదుగురు..కాంగ్రెస్ నుండి ముగ్గురు...సీపీఎం నుండి ముగ్గురు..సీపీఐ నుండి ఒకరికి అవకాశం కల్పించడం తీవ్ర దుమారం రేపుతోంది.. ఇందులో ఏ ఒక్క రైతుకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఉద్యమ నేతలు లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారికే అవకాశం ఇస్తున్నారని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

17:21 - November 15, 2017

సంగారెడ్డి : నియోజకవర్గ ప్రజలను టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగ్గారెడ్డిపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో రూ. 1100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని..ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిని జగ్గారెడ్డి అథోగతి పాలు చేశారని విమర్శించారు. ఈ విమర్శలపై జగ్గారెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. 

17:18 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫీయి రీయింబర్స్ మెంట్ పథకంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. బుధవారం అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరుగార్చిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఆయన ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు వేశారు. పేదవర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాకర్ల మధ్య ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా ? అని ప్రశ్నించారు. 13 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందని, 80 మైనార్టీ స్కూళ్లు మూతపడ్డాయా ? లేదా ? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని సూటిగా ప్రశ్నించారు. చివరి సంవత్సరం నుండి బకాయిలు ఎంతుందో చెప్పాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. రూ. 4వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వాలన్నారు.

దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని..2016-17 విద్యా సంవత్సరానికి మరో వారంలో ఫీజులు బకాయిలు చెల్లిస్తామన్నారు. చిన్న కాలేజీలకు మొదట..పెద్ద కాలేజీలకు తరువాత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు తాము 52.35 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. 

శశికళను ప్రశ్నించనున్న ఐటీ అధికారులు...

ఢిల్లీ : జైల్లో శశికళను ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇటీవలే శశికళ, ఆమె బంధువుల ఇళ్లపై ఐటీ దాడుల్లో వద్ద భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 

16:31 - November 15, 2017

బైక్ ను ఢీకొన్న శ్రీ ఇందూ కాలేజీ బస్సు...

హైదరాబాద్ : వనస్థలిపురం సాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ కాంప్లెక్స్ వద్ద బైక్ ను శ్రీ ఇందూ కాలేజీ బస్సు ఢీకొంది. భరత్ అనే విద్యార్థి మృతి చెందగా శివకు గాయాలయ్యాయి. శ్రీదత్తా ఇంజినీరింగ్ కాలేజీలో భరత్..శివలు ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. 

15:52 - November 15, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి 'పప్పు' అని వ్యాఖ్యనించడాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పు పట్టింది. ఎన్నికల ప్రచారం, ప్రకటనల్లో పప్పు అనే పదాన్ని ఉపయోగించకుండా దానిపై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి... రాహుల్‌ను ఉద్దేశించి పప్పు అనే పదాన్ని ముద్రించింది. దాన్ని పరిశీలించిన ఈసీ...పప్పు అనే పదం అభ్యంతరకరంగా ఉందని... ఆ పదాన్ని తొలగించాలని సూచించింది. ఓ రాజకీయ నాయకుడిని అలా పిలవడమంటే... ఆయనను అవమానించడమేనని ఈసీ స్పష్టం చేసింది. గుజరాత్‌లో డిసెంబరు 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

15:49 - November 15, 2017

కేరళ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి థామస్‌ చాందీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత ప్రభుత్వంపై పిటిషన్‌ దాఖలు చేయడం పట్ల కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడంతో థామస్‌ చాందీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలప్పుజలోని తన లేక్ ప్యాలేస్‌ రిసార్టులో థామస్‌ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన అక్రమాలపై అలప‍్పజ జిల్లా కలెక్టర్‌ వెల్లడించిన నివేదికను సవాల్‌ చేస్తూ థామస్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్‌ నివేదికను సవాల్‌ చేస్తూ కేబినెట్‌ మంత్రి పిటిషన్‌ వేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని థామస్‌ చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ త్వరలోనే తాను రాష్ర్ట కేబినెట్‌లోకి తిరిగి వస్తానని థామస్‌ చాందీ ధీమా వ్యక్తం చేశారు.

15:46 - November 15, 2017

శ్రీకాకుళం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మూడు రోజులుగా మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో.. తీరం నిర్మానుష్యంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 6 లక్షల 50వేల ఎకరాల్లో ఈ ఏడాది వరి పంట సాగు చేశారు. నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ, తోటపల్లి, మడ్డువలస ప్రాంతాల్లో వరి పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడుతుండటం అన్నదాతలను ఆందోనకు గురిచేస్తోంది. 

15:45 - November 15, 2017

విశాఖపట్టణం : అధికారుల మధ్య సమన్వయ లోపంతో విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ ఫ్లాప్‌ షోగా మిగిలిపోతోంది. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ప్రచారం లేమితో సందర్శకులు లేక వెలవెలపోతోంది. నిర్వహణ లోపాలతో 13 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెలూన్లు ఎగురవేసే వారు మాత్రమే వీటిలో రైడ్‌ చేస్తున్నారు. బెలూన్లలో రైడ్‌ చేయాలని ఆశతో వచ్చిన కొందరు పర్యాటకులు, స్థానికులకు నిరాశే మిగిలింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌కు ప్రచారం లోపించింది. దీంతో వారివీరి ద్వారా సమాచారం తెలుసుకున్న కొద్ది మంది మాత్రమే ఈ ఉత్సవాలను చూసేందుకు వచ్చారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని బెలూన్లు గాల్లోకి ఎగరలేదు. పరికరాలు సరిగా లేకపోవడంతో మరికొన్ని బెలూన్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో బెలూన్‌ విన్యాసాలు చూద్దామనుకున్న వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫెస్టివల్‌లో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు కూడా నిరుత్సాహం చెందారు. బెలూన్లు ఎగురవేసేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో విదేశీ ప్రతినిధులు ఫెస్టివల్‌ నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పెదవి విరిచారు. మిగిలివున్న రెండు రోజులైనా సరిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

15:44 - November 15, 2017

నిజామాబాద్ : రోజు రోజుకూ నీటిపై నిప్పు రాజుకుంటోంది. సింగూరు జలాలను పక్క జిల్లాలకు తరలించడంపై ప్రతిపక్షాలు, రైతులు మండిపడుతున్నారు. సర్కార్‌ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నిజాబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జల వివాదం రేగింది. నిండు కుండలా మారిన సింగూరు జలాశయం నుండి 15 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వదిలారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇక్కడ నుండి 10 టీఎంసీల నీటిని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి నిజాంసాగర్‌ గేట్లు ఎత్తి నీటిని తరలిస్తున్నారు. సింగూరు నీటిని పక్క జిల్లాలకు తరలించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఆయకట్టుకు వినియోగించాల్సిన నీటిని పక్క జిల్లాలకు తరలించడంపై రైతులు కూడా గుర్రుగా ఉన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగూరు జలాలను శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్ ద్వారా దిగువకు తరలించాలని ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. దీంతో బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ, మరికొన్ని పార్టీల నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అలాగే కాంగ్రెస్‌ నాయకులు బాన్సువాడ నుండి నిజాంసాగర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద ఉన్న 16 లక్షల ఎకరాలకు యాసంగిలో సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సింగూరు జలాలను విడుదల చేసింది. దీంతో దాదాపు నీళ్ల యుద్ధం మొదలైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఆయకట్టుకు వదిలిన తరువాతే శ్రీరాం సాగర్ ఆయకట్టుకు వదలాలని రైతులు కోరుతున్నారు. మరి సర్కార్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు..

ఢిల్లీ : కృష్ణా నది జిల్లాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు నీటి పంపకాలపై వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ తరపున వైద్యనాథన్, ఏపీ తరపున ఏకే గంగూలి వాదనలు వినిపిస్తున్నారు. 

15:25 - November 15, 2017

కాకినాడ : కలెక్టరేట్ ఆఫీసు వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ ఆఫీసులోకి చొచ్చుకపోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పలువురు కిందపడిపోయి సృహ తప్పిపడిపోయారు. ప్రభుత్వానికి...వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని..ఈ నేపథ్యంలో ఆందోళనల కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 

15:23 - November 15, 2017

భద్రాద్రి కొత్తగూడెం : థర్మల్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక నిండు ప్రాణం బలైంది. టవర్ కూలిపోతదని..మరమ్మత్తులు చేపట్టాలని ఓ కార్మికుడు సూచించినా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీనితో ఆ టవర్ కూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మణుగూరులో చోటు చేసుకుంది.

థర్మల్ ప్లాంట్ లో రామ ప్రసాద్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్లాంట్ లో ఉన్న బ్లాషింగ్ టవర్ కూలిపోతుందని..మరమ్మత్తులు చేయించాలని సూచించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. బుధవారం టవర్ కు రామకృష్ణ ప్రసాద్ చేత మరమ్మత్తులు చేయించారని..ఒక్కసారిగా టవర్ కూలిపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:17 - November 15, 2017

వెటర్నరీ ఆసుపత్రి అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

కడప : ఒంటిమిట్ట వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మంత్రి ఆదినారాయణకు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. 

జూబ్లీహిల్స్ లో భూ ప్రకంపనాలు...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో స్వల్ప భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 8.30 గంటలకు కేబీఆర్ పార్క్ లో భూమి కంపించింది. రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు ప్రాంతాల్లో ఈ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. చాలా స్వల్పంగా భూమి కంపించినట్లు ఎన్ జీఆర్ ఐ ధృవీకరించింది. జూబ్లీహిల్స్ లో వచ్చిన భూ ప్రకంపనాలు చాలా చిన్నవని, భూకంప కేంద్రం కేబీఆర్ పార్కులో నమోదైందని పేర్కొంది. 

14:40 - November 15, 2017

మహిళలకు..పిల్లలకు..తల్లిదండ్రులకు మనోవర్తి చట్టం ఉందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనోవర్తిని పొందే అవకాశం ఉందన్నారు. ఎవరైనా సరే భర్త..తన భార్యను..సంతానాన్ని ఏ కారణంగా వదిలిపెట్టి నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి లోనైన వారు మనోవర్తి పొందే అవకాశం ఉందన్నారు. భార్యలు..పిల్లలు.వృద్ధులైన తల్లిదండ్రులు దీనిని పొందే అవకాశం ఉందని, ఇటీవలి కాలంలో వచ్చిన డెమోస్టిక్ వయోలెన్స్ కింద పొందే అవకాశం ఉందన్నారు. భార్య..భర్తల మధ్య పరస్పర తగాదాలు వచ్చిన సమయంలో కోర్టును ఆశ్రయించినప్పుడు..వివాదాల్లో కోపంలో..ఆవేశంలో..పిల్లలను...భార్యను రోడ్డుపై వదిలేస్తున్నారని..ఈ సమయంలో వారు ఈ చట్టం ద్వారా మనోవర్తి పొందే అవకాశం ఉందన్నారు. భర్త అవసరాలు ఏంటీ ? భార్య అవసరాల ఎంటీ ? విద్యార్హతలు..జీవన పరిస్థితులు ఏంటీ ? తదితర వాటిని పరిశీలించి మెంటెనెన్స్ ఇస్తారన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:34 - November 15, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీసు వద్ద బుధవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. రోడ్డు దాటుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న శిరీష రోడ్ నెంబర్ 1వద్ద రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు శిరీషను ఢీకొట్టింది. దీనితో ఆమె అక్కడికక్కడనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శిరీష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:31 - November 15, 2017

పశ్చిమగోదావరి : ఫెర్రీ సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం అనంతరం అధికారులు మేల్కొన్నారు. బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన అనంతరం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారనే విమర్శలున్నాయి.

బుధవారం ఉదయం పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణిస్తున్న బోట్లను అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాపికొండలకు వెళ్లే బోట్లను తహశీల్దార్ తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని బోట్లను తహశీల్దార్ చంద్రశేఖర్ నిలిపివేశారు. దేవీపట్నం మండలం అంగులూరు వద్ద ఈ తనిఖీలు చేశారు. మధ్యలో తనిఖీలు చేస్తుండడంపై పర్యాటకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణం కాకముందే తనిఖీలు చేయాలని..ఇలా చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే అధికారులు..మీడియా సిబ్బందిపై బోట్ల నిర్వాహకులు దాడికి యత్నించారు. బోటు యజమానులు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడం నిరసన వ్యక్తమౌతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు. దీనితో స్పందించిన రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణించే బోట్లు 90 దాక ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ అంచనా వేసిన అనంతరం అనుమతులివ్వాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. 

బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం...

హైదరాబాద్ : పెన్షన్ ఆఫీసు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందింది. బంజరాహిల్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్టు..

ప్రకాశం : అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కలెక్టరేట్ ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు. కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

కస్తూర్బా విద్యార్థిని ఆత్మహత్యాప్రయత్నం..

ప్రకాశం : కొమరోలు (మం) రాజుపాలెంలో కస్తూర్బా పాఠశాల భవనంపై నుండి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈ విద్యార్థి ఆరో తరగతి చదువుతోంది. చదువుకోవడం ఇష్టంలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్కూలు యాజమాన్యం పేర్కొంటోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

అందరూ సీఎం పదవి కోసం ఆశిస్తున్నారు - కోమటిరెడ్డి...

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అందరూ పీసీసీ సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న వారేనని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తాను పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 40 నుండి 50 మందికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇవ్వరని జోస్యం చెప్పారు. 

బోట్లను తనిఖీ చేసిన తహశీల్దార్...

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం అంగులూరు వద్ద బోట్లను అధికారులు నిలిపివేశారు. పాపికొండలకు వెళ్లే బోట్లను తహశీల్దార్ తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని బోట్లను తహశీల్దార్ చంద్రశేఖర్ నిలిపివేశారు. అధికారులు..మీడియా సిబ్బందిపై బోట్ల నిర్వాహకులు దాడికి యత్నించారు.

 

13:51 - November 15, 2017

ఒరిస్సా : రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ధాన్యపు లోడుతో ఉన్న లారీ టెక్కిరి నుంచి పార్వతీపురం వెళ్తోంది. మార్గంమధ్యలో కోరాపూర్ జిల్లా బందుగామ్ సమీపంలో అదుపు తప్పి లారీ లోయలో పడింది. కుంబారిపుట్టి వద్ద 40 అడుగుల లోతులో పడింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి వాసులుగా గుర్తించారు. 

 

13:41 - November 15, 2017

విశాఖ : నగరంలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరయ్యారు. వ్యవసాయానికి సాంకేతిక జోడిస్తే అనూహ్యమైన మార్పులు తీసుకురావచ్చన్నారు సీఎం చంద్రబాబు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ-నామ్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు వెంకయ్యనాయుడు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి అనేకమంది ప్రతినిధులు హాజరయ్యారు. చివరి రోజున బిల్‌గేట్స్‌ హాజరుకానున్నారు. ఇక సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వెంకయ్యనాయుడు, చంద్రబాబు పరిశీలించారు. 

 

13:38 - November 15, 2017

అనంతపురం : అనంత రాజకీయాలు నవ శకానికి నాంది కాబోతున్నాయి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా నేతల తనయులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇంత కాలం తండ్రి చాటు బిడ్డలుగా ఉంటూ తండ్రుల అధికారంలో పరోక్ష పాలన సాగిస్తూ వచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో ప్రతీ ఒక్కరినీ కలుసుకుంటూ రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్న.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:36 - November 15, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్‌ ముందు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో కొందరు కిందపడిపోయారు.

 

13:34 - November 15, 2017

గుంటూరు : సీపీఎస్ పై తమ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి నుంచి బాయ్‌కాట్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యోగులకు అండగా ఉంటామంటున్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:29 - November 15, 2017

శ్రీకాకుళం : నిరాధరణకు గురైన ఆ పంచాయతీ ప్రగతి పథంలో సత్తా చాటుకుంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అగ్రగామిగా నిలిచింది. జిల్లాకే కాదు... రాష్ట్రానికే ఆదర్శంగా మారింది. దీనంతటికీ ఒకే ఒక వ్యక్తి దూరదృష్టి, కృషి, పట్టుదల కారణం... ఇంతకీ ఎవరా వ్యక్తి ? ఎం చేశారు? వాచ్ దిస్ స్టోరీ..
గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎన్ ఈఆర్ 
ఒకప్పుడు అనేక సమస్యలకు నిలయంగా ఉన్న... ఓ గ్రామం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేవలం ఓ వ్యక్తి  కృషి వల్ల గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈయన పేరు నడికుదిటి ఈశ్వరరావు.. శ్రీకాకుళం జిల్లా .. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన ఈయనను అందరూ ముద్దుగా ఎన్.ఈ.ఆర్. అని పిలుస్తారు. ఢిల్లీలో స్థిరపడిన ఈయన సొంత ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో బంటుపల్లి గ్రామ పంచాయతీని దత్తత తీసుకున్నారు.
సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు
దత్తత తీసుకున్న గ్రామంలో ఎన్.ఈ.ఆర్ తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో మహాలక్ష్మి యూత్ క్లబ్‌ను స్థాపించి సత్ఫలితాలు సాధించారు. మహాలక్ష్మి మహిళా స్వయం ఉపాధి పథకం ద్వారా  మహిళలకు అనేక  శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. 
గ్రామంలో తీరిన తాగునీటి సమస్య
అలాగే పీహెచ్ సీని అందుబాటులోకి తెచ్చారు.. మహాలక్ష్మి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. నిరుపేదలకు సొంత నిధులతో పక్కా గృహాలను నిర్మించి ఇస్తున్నారు. దీంతోపాటు లక్ష లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మించి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందించి సమస్యను తీర్చారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలను కల్పించారు. దీంతో ఈశ్వరరావు సేవలను గ్రామస్థులు కొనియాడుతున్నారు. 
నెంబర్‌ వన్‌ పంచాయతీ గా బంటుపల్లి
ఈశ్వరరావు చేసిన అభివృద్ధి కారణంగా ది ఫోరం ఫర్ బెటర్ శ్రీకాకుళం సంస్థ బంటుపల్లిని నెంబర్ వన్‌ పంచాయతీగా ప్రకటించింది. అనేక మంది ఎన్ ఈఆర్ దూరదృష్టిని..కృషిని ప్రశంసిస్తున్నారు.  అదే విధంగా అధికార పార్టీ ఎన్ ఈఆర్  సేవలను గుర్తించి ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. 

 

ఏపీ శాసన మండలి చైర్మన్ కు అభినందనలు తెలిపిన సభ్యులు

గుంటూరు : ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు, మండలి సభ్యులందరూ ఫరూక్ ను అభినందించారు. అధికార, విపక్ష ఎమ్మెల్సీ సభ్యులు చైర్మన్ కు కంగ్రాట్స్ తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, సిద్ధ రాఘవయ్య, కాల్వ శ్రీనివాసులు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తమ దగ్గర ఉండి పని చేసే అవకాశం కల్గిందన్నారు. 

13:19 - November 15, 2017

హైదరాబాద్ : అందరికీ రుణమాఫీ చేశామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌..  అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అందుకు భిన్నమైన దృశ్యం ఆవిష్కారమైంది. సాక్షాత్తు కేసీఆర్‌ కేబినెట్‌ సభ్యుడు.. అటవీశాఖ మంత్రి జోగురామన్న రుణమాఫీ డబ్బులు జమకాని కొందరు రైతులను తీసుకొని.. వ్యవసాయ మంత్రిని కలిశారు. తన వెంట వచ్చిన అర్హులైన రైతులకు రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేయాలని విన్నవించారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని లోకారి, బుర్నుర్, లింగు గూడ, దారులొడ్డి గ్రామాల్లో 269 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రుణ మాఫీ చేసినా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ కాలేదు. దీంతో తమని ఆదుకోవాలని కోరుతూ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో  హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. దీన్నిబట్టే.. రాష్ట్రంలో రుణమాఫీ అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 

 

13:11 - November 15, 2017
13:03 - November 15, 2017
13:01 - November 15, 2017

గుంటూరు : ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు, మండలి సభ్యులందరూ ఫరూక్ ను అభినందించారు. అధికార, విపక్ష ఎమ్మెల్సీ సభ్యులు చైర్మన్ కు కంగ్రాట్స్ తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, సిద్ధ రాఘవయ్య, కాల్వ శ్రీనివాసులు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తమ దగ్గర ఉండి పని చేసే అవకాశం కల్గిందన్నారు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాలకతీతంగా వ్యవహరించే స్థానానికి రావడం ఆనందదాయకమన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ మహ్మద్ మాట్లాడుతూ చైర్మన్ పదవి ఫరూక్ రావడం ముస్లీంల అందరికీ గౌరవ ప్రదమైన సంతృప్తి కల్గిందన్నారు. తమకు మంత్రి, డిప్యూటీ స్పీకర్ గా చేసిన అనుభవాలు ఉన్నాయన్నారు. ముస్లీంలకు తమరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు.
 

 

గత సం. రాష్ట్ర వృద్ధి రేటు 11.61 శాతం : సీఎం చంద్రబాబు

విశాఖ : ఏపీ అర్టీకల్చర్ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం అయింది. సీఎంతోపాటు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సదస్సుకు హాజరయ్యారు. మూడు రోజులుపాటు సదస్సు కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత సం. రాష్ట్ర వృద్ధి రేటు 11.61 శాతంగా ఉందని చెప్పారు. 

విశాఖలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం

విశాఖ : నగరంలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం అయింది. సీఎంతోపాటు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సదస్సుకు హాజరయ్యారు. మూడు రోజులపాటు సదస్సు కొనసాగనుంది. 

12:50 - November 15, 2017

విశాఖ : ఏపీ అర్టీకల్చర్ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం అయింది. సీఎంతోపాటు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సదస్సుకు హాజరయ్యారు. మూడు రోజులుపాటు సదస్సు కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత సం. రాష్ట్ర వృద్ధి రేటు 11.61 శాతంగా ఉందని చెప్పారు. 

 

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో నేడు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గింపు కోరుతూ బీజేపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై టీడీపీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.18 వేల కనీస వేతనం మెను ఛార్జీలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

12:44 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో నేడు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గింపు కోరుతూ బీజేపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై టీడీపీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.18 వేల కనీస వేతనం మెను ఛార్జీలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

 

కాంట్రాక్టు లెక్చరర్స్ రెమ్యునరేషన్ పెంచాం : కడియం

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టు లెక్చరర్స్ రెమ్యునరేషన్ పెంచామని తెలిపారు. 

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

నిజామాబాద్ : జిల్లాలోని తాడెం గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో గ్రామాల్లోకి నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. రహదారులపై నీరు ప్రవహిస్తోంది. 

12:38 - November 15, 2017

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టు లెక్చరర్స్ రెమ్యునరేషన్ పెంచామని తెలిపారు. కొత్త కాలేజీల్లో సిబ్బంది భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. 

12:33 - November 15, 2017

గుంటూరు : ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఫరూక్ కు అభినందించారు. పీడీఎల్ పీ, సీఎం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తమరి మీద ఉన్న నమ్మకంతోటి తమరి సీనియారిటీ ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. తాను స్పీకర్ గా ఉన్నప్పుడు తమరు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారని గుర్తు చేశారు. తమరు ఐదు సం.రాలు హౌజ్ నడిపారని... తమతో కలిసి పని చేసిన అనుభవం ఉందన్నారు. చట్ట సభలు చాలా ప్రాధాన్యత కల్గివుంటాయన్నారు. సభలు ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని పేర్కొన్నారు. సభలో విభిన్న అభిప్రాయాలు ఉంటాయన్నారు. తమరి ఆధ్వర్యంలో హౌజ్ చక్కగా, చట్ట పరంగా జరగాలని కోరారు. సిస్టమ్ డీవియేట్ కాకుండా చూడాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ 
తమరు సుధీర్ఘ అనుభవం ఉన్న వారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ స్టేటస్ లో మీరు ఉండడం తమకు ధైర్యాన్నిస్తుందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదే సీఎం ఉద్దేశమన్నారు. 

 

12:24 - November 15, 2017

గుంటూరు : ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు, మండలి సభ్యులందరూ ఫరూక్ ను అభినందించారు. అధికార, విపక్ష ఎమ్మెల్సీ సభ్యులు చైర్మన్ కు కంగ్రాట్స్ తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, సిద్ధ రాఘవయ్య, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. 

 

12:14 - November 15, 2017

నిజామాబాద్ : జిల్లాలోని తాడెం గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో గ్రామాల్లోకి నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. రహదారులపై నీరు ప్రవహిస్తోంది. పంట నీటిపాలు కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

అనంతపురం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ

అనంతపురం : జిల్లాలోని గుత్తి మండలం పెదొడ్డిలో ఘర్షణ జరిగింది. పొలంలో దారి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. రవి, శ్రీకాంత్ లపై బాబు అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:58 - November 15, 2017

అనంతపురం : జిల్లా గుత్తి మండలం పెదొడ్డిలో ఘర్షణ జరిగింది. పొలంలో దారి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. రవి, శ్రీకాంత్ లపై బాబు అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:44 - November 15, 2017

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను నిరసిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు.. విజయవాడ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి... పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే... పోలీసుల వైఖరిని యూటీఎఫ్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. 
యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి
సీపీఎస్‌ రద్దు చేసేవరకూ మా పోరాటం ఆపం. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతుంటే..
ప్రభుత్వం కాలరాస్తుంది. 1.80 లక్షల మంది సీపీఎస్‌ వల్ల పింఛన్‌ కోల్పోయారు. సీపీఎస్‌ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలు..
వారి విధానాన్ని ప్రకటించాలి. 
యూటీఎఫ్ నేత 
పోలీసుల అరెస్టు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమం. నిరంకుశంగా హౌజ్ అరెస్టు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ రద్దు చేసి కొత్త పెన్షన్ ప్రవేశపెట్టింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

 

11:26 - November 15, 2017

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపు

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను నిరసిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు.. విజయవాడ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి... పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే... పోలీసుల వైఖరిని యూటీఎఫ్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.

10:57 - November 15, 2017

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను నిరసిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు.. విజయవాడ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి... పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే... పోలీసుల వైఖరిని యూటీఎఫ్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

10:53 - November 15, 2017

అనంతపురం : నగరంలో దారుణం జరిగింది. 22 ఏళ్ల షణ్ముఖ తన మామ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల మైనర్‌పై 10 రోజులుగా అత్యాచారం చేస్తుండటంతో బాలిక తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి షణ్ముఖను అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖపై కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం బాలికను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రాజకీయ పలుకుబడితో డబ్బులు ఇచ్చి అత్యాచారం కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. షణ్ముఖ బాలికకు మేనమామ కాబట్టి పెళ్లి చేస్తే సరిపోతుందని చెప్పారు. లేకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

మంగళగిరి ఎంపీడీవో ఆఫీస్ వద్ద కొనసాగుతున్న ఎంపీపీ, అఖిలపక్షం ఎంపీటీసీల ధర్నా

గుంటూరు : మంగళగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిపి, అఖిలపక్షం ఎంపీటీసీల ఆందోళనలు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. ఎంపి డిఓ పద్మావతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ ధర్నాకు దిగారు. నిధులు ఉన్నా వర్క్‌ ఆర్డర్లపై ఎంపిడిఓ సంతకాలు చేయడం లేదని అంటున్నారు. తనకు  గుంటూరు జిల్లా  మంత్రులు, టీడీపీ నేతల అండదండలు ఉన్నాయని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని ఎంపీడీవో పద్మావతి దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

10:44 - November 15, 2017

గుంటూరు : మంగళగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిపి, అఖిలపక్షం ఎంపీటీసీల ఆందోళనలు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. ఎంపి డిఓ పద్మావతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ ధర్నాకు దిగారు. నిధులు ఉన్నా వర్క్‌ ఆర్డర్లపై ఎంపిడిఓ సంతకాలు చేయడం లేదని అంటున్నారు. తనకు  గుంటూరు జిల్లా  మంత్రులు, టీడీపీ నేతల అండదండలు ఉన్నాయని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని ఎంపీడీవో పద్మావతి దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:42 - November 15, 2017

గుంటూరు : అసెంబ్లీ, శాసనమండలి విప్‌లను చంద్రబాబు ఖరారు చేశారు. శాసనసభలో ఇప్పటికే నలుగురు విప్‌లు ఉండగా.. మరో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. సర్వేశ్వరరావు, గణబాబులను విప్‌లుగా నియమించారు. మండలిలో మరో నలుగురిని విప్‌లుగా నియమించారు.  బుద్దా వెంకన్న, షరీఫ్‌, మాణిక్యవరప్రసాద్‌, రామసుబ్బారెడ్డిలకు విప్‌లుగా అవకాశమిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అసెంబ్లీ, శాసనమండలి విప్‌లను ఖరారు చేసిన చంద్రబాబు

గుంటూరు : అసెంబ్లీ, శాసనమండలి విప్‌లను చంద్రబాబు ఖరారు చేశారు. శాసనసభలో ఇప్పటికే నలుగురు విప్‌లు ఉండగా.. మరో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. సర్వేశ్వరరావు, గణబాబులను విప్‌లుగా నియమించారు. మండలిలో మరో నలుగురిని విప్‌లుగా నియమించారు.  బుద్దా వెంకన్న, షరీఫ్‌, మాణిక్యవరప్రసాద్‌, రామసుబ్బారెడ్డిలకు విప్‌లుగా అవకాశమిచ్చారు. 

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఐదుగురి మృతి

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం నెలకొంది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులతో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు.  సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి... దుండగుడిని మట్టుబెట్టారు. 

కూలిన పాత వంతెన

గుంటూరు : మంగళగిరి మండలం కురగల్లులో పాత వంతెన కూలింది. కురగల్లు..మంగళగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హెవీ వెహికల్స్ తిరగడం వల్లే కూలిందని స్థానికులు అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
పలు అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. 

09:46 - November 15, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో భరత్‌రెడ్డి అరాచకాలపై దళిత సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దళితులపట్ల అమానుషంగా ప్రవర్తించిన భరత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని  రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తన అరాచకాలు బయటపడగానే.... భరత్‌రెడ్డి పరారయ్యాడు. విషయం బయటచెప్పకుండా బాధితులను భరత్‌రెడ్డి మ్యానేజ్‌చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దళితులను చిత్రవధ చేసిన భరత్‌రెడ్డి 
నిజామాబాద్‌ జిల్లాలో భరత్‌రెడ్డి అనే బీజేపీనేత... దళితులను చిత్రహింసలకు గురిచేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అన్యాయాన్ని నిలదీసినందుకు దళితులను చిత్రవధ చేశాడు. మురికి నీటిలో ముంచి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు.  నోటికొచ్చిన మాటలు తిడుతూ.. దళితులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. బాధితులు మొత్తుకుంటున్నా వినకుండా కర్రచేతపట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ దొర తనం చూపించాడు. దళితులను మురికినీటి కుంటలో మునక వేయించాడు.
భరత్‌రెడ్డి అరాచకాలపై అధికారులు విచారణ 
భరత్‌రెడ్డి అరాచకాలపై ఎట్టకేలకు అధికారులు విచారణ చేపట్టారు. నవీపేట మండలం అభంగపట్నానికి చెందిన బాధితులు రాజేశ్వర్‌, లక్ష్మణ్ ఇంటికి సీపీ వెళ్లారు.  అయితే రాజేశ్వర్‌ ఇంటికి తాళం వేసి ఉంది. లక్ష్మణ్‌ ఇంటికి వెళితే.. అతని భార్య ఉంది. దీంతో సీపీ లక్ష్మణ్‌ భార్య భావనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నీటికుంటను సీపీ పరిశీలించారు.  భరత్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని.... ఏసీపీ సుదర్శన్‌ విచారణ చేస్తున్నారని సీపీ తెలిపారు. 
భరత్‌రెడ్డి అమానుషత్వంపై ప్రజా సంఘాల మండిపాటు
దళితులపట్ల భరత్‌రెడ్డి అమానుషంగా వ్యవహరించిన తీరుపై దళిత, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. నిజామాబాద్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు , ప్రజాసంఘాల నాయకులు  ఆందోళనకు దిగారు. భరత్‌రెడ్డిపై అట్రాసిటీతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ఇంచార్జ్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
భరత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలి : ప్రజా సంఘాలు 
భరత్‌రెడ్డి గతంలోనూ పలువురిని చిత్రహింసలకు గురిచేసినట్టు ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  నేరచరిత్ర కలిగిన భరత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బాధితులు ఇద్దరిని భరత్‌రెడ్డి తన వద్దే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. వారికి డబ్బుల ఆశ చూపి కేసు పెట్టవద్దని సెటిల్‌ చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మరోవైపు దళిత, ప్రజాసంఘాల నేతలు ఈనెల 19న నవీపేట్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
  

 

09:42 - November 15, 2017

గుంటూరు : మంగళగిరి మండలం కురగల్లులో పాత వంతెన కూలింది. కురగల్లు..మంగళగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హెవీ వెహికల్స్ తిరగడం వల్లే కూలిందని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.  పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గింపు కోరుతూ బీజేపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై టీడీపీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.18 వేల కనీస వేతనం మెను ఛార్జీలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

 

బాలికపై మేనమామ అఘాయిత్యం

అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఐదో రోడ్డులో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై 10 రోజులుగా మేన మామ షణ్ముకం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

09:29 - November 15, 2017

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం నెలకొంది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులతో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు.  సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి... దుండగుడిని మట్టుబెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నత్తోరాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ప్రశ్నత్తోరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

09:23 - November 15, 2017

టీసర్కార్ హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు విమర్శించారు. ఇదే అంశం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు.

 

09:04 - November 15, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రామచంద్రాపురంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. పంట కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఒకరు మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:00 - November 15, 2017

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం నెలకొంది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులతో సహా మరొకరు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి... దుండగుడిని మట్టుబెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

08:57 - November 15, 2017

విద్యుత్‌ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ ట్రెడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ నాయకులు బాలకాశీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'విద్యుత్‌ కాంట్రాక్టర్‌ కార్మికుల ఆందోళన ఉద్యమ రూపం దాల్చింది. క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పీస్‌ రేటు రద్దు, తదితర డిమాండ్లతో వారు ఉద్యమిస్తున్నారు. జీపు యాత్ర, నిరసనల నుండి ఆమరణనిరాహార దీక్ష, నిరవధిక సమ్మె ఇలా పలు దఫాలుగా ఒక కార్యచరణ ప్రకారం వారి ఉద్యమం కొనసాగుతోంది. ఇంతకీ వారికి ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, వారి డిమాండ్ల'పై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:55 - November 15, 2017
08:53 - November 15, 2017

గుంటూరు : తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు పన్నుల రాయితీ ఇచ్చే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. చిత్ర పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖపట్నం, అమరావతిని చిత్రపరిశ్రమకు అనుకూల ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదించింది.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  తక్కువ బడ్జెట్‌ సినిమాకు పన్నుల రాయితీ సహా  పలు అంశాలపై చర్చించారు. విశాఖ, అమరావతిలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు చర్చించారు. హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ నిలదొక్కుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పరిశ్రమలోని ఎక్కువ మంది సొంత రాష్ట్రం తరలివచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి విన్నవిస్తున్న అంశాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో చిత్రపరిశ్రమ వేళ్లూనుకునే బాధ్యత తీసుకున్నాని చంద్రబాబు సినీ ప్రముఖుల దృష్టికి తెచ్చారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో గతంలో పలు తెలుగు, తమిళ సినిమాల చిత్రీకరణ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో స్టూడియోలో నిర్మించేందుకు కొందరు ప్రముఖులు ముందుకు రావడం సంతోషమన్నారు. విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బందిలేదని చిత్ర పరిశ్రమ ప్రముఖల దృష్టికి తెచ్చారు. ప్రకృతి రమణీ దృశ్యాలకు విశాఖ నెలవైతే... అమరావతి భవిష్యత్‌ నగమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర చలన చిత్ర, నాటకరంగాభివృద్ధి సంస్థకు తర్వలోనే పాలకవర్గాన్ని నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 

08:50 - November 15, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డులను  ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులతోపాటు  నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. 2014 ఉత్తమ చిత్రంగా లెజెండ్‌, ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నిలిచారు. 2015 బెస్ట్‌ ఫిల్మ్‌గా బాహుబలి ద బిగినింగ్‌ ఎంపికవగా.. ఉత్తమనటుడిగా మహేశ్‌బాబు నిలిచారు. ఇక 2016 బెస్ట్‌ మూవీగా పెళ్లిచూపులు చిత్రం నంది అవార్డును సొంతం చేసుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా బంగారునంది వరించింది. 

రాష్ట్ర విభజన అనంతరం.. కొంతకాలం ఆగిపోయిన నందిఅవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2014, 15, 16 ..ఇలా మూడు సంవత్సరాలకు ఒకేసారి  పురస్కారాలు ప్రకటించింది. నంది అవార్డుల కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, నటి జీవిత, గిరిబాబు తదితరులు అవార్డులను ప్రకటించారు. 

2014 సంవ‌త్సరానికి ఉత్తమ చిత్రంగా లెజెండ్‌... ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నిలిచారు. ఉత్తమ విలన్‌గా  లెజండ్‌ మూవీలో అదరగొట్టిన జగపతిబాబుకు నంది అవార్డు దక్కింది. ఇక  అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రం రెండో ఉత్తమ సినిమాగా నిలిచింది.  హీరో నాగ చైతన్య ఉత్తమ సహాయ నడుడిగా అవార్డు దక్కించుకున్నారు.  2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా లౌక్యం మూవీ అవార్డును సొంతం చేసుకుంది ఇక 2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు కమల్‌హాసన్‌కు ప్రకటించగా.. నాగిరెడ్డి- చక్రపాణి  అవార్డు పీపుల్స్‌స్టార్‌ నారాయణమూర్తికి లభించింది. 

2015   బెస్ట్ ఫిల్మ్‌గా  బాహుబలి నిలిచింది. ఇక రెండో ఉత్తమ చిత్రంగా ఎవడే సుబ్రమణ్యం, 3వ బెస్ట్ ఫిల్మ్‌గా  నేను శైలజ అవార్డులను అందుకున్నాయి. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా మళ్లిమళ్లి ఇదిరాని రోజు చిత్రం  ఎంపికయ్యాయి. అటు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం బెస్ట్‌ పాపులర్‌ చిత్రంగా అవార్డును దక్కించుకోగా.. దేశ సమైక్యతను పెంపొందించిన చిత్రంగా  కంచె  మూవీకి అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నటుల విభాగంలో హీరో మహేశ్‌బాబుకు 2015 ఉత్తమ నటుడి అవార్డు దక్కగా.. బెస్ట్‌ హీరోయిన్‌గా అనుష్క నిలిచింది. బెస్ట్‌ సపోర్ట్‌ మేల్‌  రోల్‌లో పోసాని మురళీకృష్ణ అవార్డును సొంతం చేసుకున్నారు. బాహుబలి మూవీలో రాజమాతగా   అలరించిన రమ్యకృష్ణ బెస్ట్‌ ఫిమేల్‌ సపోర్ట్‌ యాక్టర్‌గా నిలిచారు.  ఇక ఎస్వీ రంగారావు క్యారెక్టర్‌ అవార్డు అల్లు అర్జున్‌ను వరించింది. రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్‌కు ఈ అవార్డు ప్రకటించారు. అటు అల్లు రామలింగయ్య అవార్డును భలేభలే మగాడివోయ్‌ చిత్రానికి గాను వెన్నెల కిషోర్‌కు  నంది అవార్డు దక్కింది. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావుకు, బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు దక్కాయి. ఇక బెస్ట్‌ విలన్‌గా దగ్గుబాటి రానా బంగారు నందిని అందుకోనుండగా.. దర్శకుడు రాజమౌళికి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ప్రకటించారు.  బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా  కీరవాణి, బెస్ట్  డాన్స్ మాస్టర్‌గా ప్రేమ్ రక్షిత్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అటు బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్‌ విభాగంలో నాగ అశ్విన్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో   కిశోర్‌  తిరుమలకు  నందిఅవార్డులు దక్కాయి. గౌతమీపుత్రశాతకర్ణి మూవీకి స్టోరీ అందించిన క్రిష్‌కు బెస్ట్‌ స్టోరీ రైటర్‌గా అవార్డు లభించగా.. ఉత్తమ డైలాగ్‌ రైటర్‌గా  బుర్రా  సాయి మాధవ్ , బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా రామజోగయ్యశాస్త్రి, అలాగే  ఫిమేల్‌ సింగర్ విభాగంలో  చిన్మయికి అవార్డు లభించింది. ఇక బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా కేకేసెంథిల్‌ కుమార్‌ బంగారునందిని అందుకోనున్నారు. మొత్తానికి 2015లో బాహుబలి దబిగినింగ్‌ మూవీకి అవార్డుల పంటపండింది. 

ఇక 2016 సంవ‌త్సరానికి ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు , ఉత్తమ నటుడుగా- జూనియర్‌ ఎన్టీఆర్‌ నిలిచారు. 2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును సౌత్‌ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రకటించారు. ఇక 2016  బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డును దర్శకుడు  బోయపాటి శ్రీనివాస్‌ దక్కించుకున్నారు. 

08:47 - November 15, 2017

కృష్ణా : విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీలో పడవ ప్రమాద ఘటనలో  ప్రభుత్వ శాఖల తప్పిదాలే ఎక్కువగా  కనబడుతున్నాయి. జలవనరుల శాఖతోపాటు టూరిజం శాఖల సమన్వయం లోపం కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జలవిహారం 22 మంది జలసమాధికి అయ్యారు.
బోటు ప్రమాదంతో విషాదం 
కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పవిత్రంగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ బోటు ప్రమాదంతో విషాదంగా మార్చింది. దీనిని భాదిత  కుటుంబాలతోపాటు ఇబ్రహీంపట్నంలోని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బోటు నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండలు 
కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో 22 ప్రాణాలు బలికావడానికి  సూత్రధారులైన వారిపై ఇంతవకు చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వీరికి ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలు ఉన్నాయని భావిస్తున్నారు.   ప్రమాదం అనుకోకుండా జరిగినప్పటికీ,  అనుమతిలేకుండా ప్రయాణికులను చేరవేస్తుంటే అధికారులు మిన్నకుండిపోవడం  చర్చనీయాంశంగా మారింది. బోటును నదిలోకి రానీయకుండా ఉంటే ప్రమాదం జరిగి ఉండేదికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ బోటు నదిలో విహరించడం,  దీని నిర్వాహకులు  కాసులకు కక్కుర్తి పర్యాటకుల ప్రాణాలతో చెలగాటానికి కారణమైంది. రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్   సంస్థపై  కంటితుడుపు చర్యలతో సరిపెట్టినా...  ప్రమాదానికి ఏ ప్రభుత్వ శాఖ  బాధ్యతవహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రభుత్వంలోని పెద్దలు తమపై వేటు పడుతుందన్న ఉద్దేశంతో ప్రమాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుదోవ పట్టించారని వినిపిస్తోంది.  
అనుమతిలేని బోట్లతో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ?
రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ అనుమతి లేకుండా కృష్ణా నదిలో బోటు నడపడం చూస్తుంటే..  పెద్ద ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ప్రమాదానికి కారణమైన బోటు అధికారులకు తెలియకుండానే తిరిగిందా .. అన్న సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అనుమతిలేని బోటుకు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  అధికారుల అవినీతితోనే కృష్ణానదిలో అనుమతి లేకుండా బోట్లు తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను  మంత్రివర్గం  నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు  డిమాండ్ చేస్తున్నారు.  అక్రమంగా తిరుగుతున్న బోట్లకు అడ్డుకట్టవేయడంలో విఫలమైన పర్యాటక, నీటిపారుదల శాఖ అధికారులను సస్పెండ్‌ చేయాలన్న డిమాండూ వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం   రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ నిర్వాహకులను ప్రమాదానికి భాద్యుల్ని చేస్తూ, ప్రభుత్వ అధికారులను తప్పించేందుకు ప్రయత్నిస్తోందన్న  విమర్శలు వస్తున్నాయి.      
విషాదానికి బాధ్యులెవరన్న విషయం బాబుకు తెలియదా..?  
పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రభుత్వ అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ప్రజలల్లో చర్చ జరుగుతోంది. ఇంతటి ఘోర విషాదానికి బాధ్యులెవరన్న విషయం చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పడవ ప్రమాదానికి కారణమైన నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందడంటున్నారు.

 

08:39 - November 15, 2017

విశాఖ : సన్న, చిన్నకారు రైతులకు మేలు చేకూర్చేందుకు నేటి నుంచి విశాఖలో అగ్రిహ్యాకథాన్‌ జరుగనుంది.  మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. బిల్‌గేట్స్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి 300 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు సదస్సుకు హారవుతున్నారు.
నేటి అంతర్జాతీయ సదస్సు
అగ్రిహ్యాకథాన్‌కు విశాఖ నగరం ముస్తాబైంది. దేశంలోనే తొలిసారిగా విశాఖ కేంద్రంగా అగ్రిహ్యాకథాన్‌ పేరుతో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరుగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. మన్యంలో సాగయ్యే వివిధ పంటలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన సదస్సు కావడంతో చింతపల్లి వ్యవసాయ, ఉద్యన పరిశోధనా స్థానాలకు చెందిన శాస్త్రవేత్తలు స్థానికంగా సాగయ్యే పంటల నమూనాలు, వివరాలతో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు విదేశీ  ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 250 మంది వ్యవసాయ విద్యార్థులు, 500 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
అగ్రిహ్యాకథాన్‌కు పూర్తైన ఏర్పాట్లు
అగ్రిహ్యాకథాన్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సదస్సు జరిగే ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా కడియం నర్సరీల నుంచి తీసుకొచ్చిన భిన్న రకాల మొక్కలతో స్వాగత ద్వారాన్ని తీర్చిదిద్దుతున్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పరిజ్ఞానం అనుసంధానం తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించనున్నారు.
మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో అగ్రిహ్యాకథాన్‌ 
మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో అగ్రిహ్యాకథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 17న బిల్‌గేట్స్‌ కూడా సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. బిల్‌గేట్స్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఫౌండేషన్‌ ప్రతినిధులు విశాఖ కలెక్టరేట్‌కు వచ్చారు. భద్రత , వసతి, రవాణా తదితర అంశాలపై చర్చించారు. బిల్‌గేట్స్‌ వస్తుండడంతో నగరమంతా పోలీసులు భద్రతతో నిండిపోయింది.

 

08:35 - November 15, 2017

గుంటూరు : వచ్చే ఏడాది మార్చికల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 140 రోజుల్లో అన్ని జిల్లాల్లో నూరుశాతం ఓడీఎఫ్‌ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.  ఇప్పటికే కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఓడీఎఫ్‌గా ప్రకటించామని... ఈ నెలాఖరులోగా ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలను ఓడీఎఫ్‌గా చేస్తామన్నారు. 
మంత్రులు, విభాగాధిపతులతో చంద్రబాబు సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఈ- ఆఫీస్‌, గ్రీవెన్స్‌ అంశాలపై సమీక్షించారు. 9వ తరగతి విద్యార్థులకు ఓడీఎఫ్‌పై ప్రాజెక్టు వర్క్‌ తప్పనిసరి చేసి, మార్కులు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 16.58 లక్షల గృహాలకు మరుగుదొడ్లు లేవని  అధికారులు లెక్క తేల్చారు.  గడిచిన 40 రోజుల్లో 10లక్షల వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 65.56శాతం వరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రాజీపడొద్దని, నాణ్యతలేకపోతే సహించేది లేదని సీఎం అన్నారు. 
ఓడీఎఫ్‌లో  94శాతం ప్రజలు సంతృప్తి
15 రోజుల్లో ఈ-కేవైసీ, చంద్రన్న బీమా సమాచారం అప్‌డేట్‌ చేయడం పూర్తికావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఆర్థికపరమైన అంశాలకు అర్జీలు మినహా మిగిలిన పెండింగ్‌ గ్రీవెన్స్‌ 45 రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు.  వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిలను అధికారులు సీఎంకు వివరించారు. ఓడీఎఫ్‌లో 94శాతం, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో 94.22శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకే చేరుతున్నాయో లేదో పరిశీలించాలని చంద్రబాబు వారిని ఆదేశించారు.

 

పడవ బోల్తా ప్రమాద ఘటనపై నేటి నుంచి ద్విసభ్య కమిటీ విచారణ

గుంటూరు : పడవ బోల్తా ప్రమాద ఘటనపై నేటి నుంచి ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభించనుంది. 
  

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

తూ.గో : రామచంద్రాపురంలో ట్రాక్టర్ బోల్తా పడింది. అదుపుతప్పి ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

అమెరికా : కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం రేపింది. ఎలిమెంటరీ స్కూల్ తోపాటు పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

అమెరికా : కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం రేపింది. ఎలిమెంటరీ స్కూల్ తోపాటు పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

Don't Miss