Activities calendar

17 November 2017

21:51 - November 17, 2017

తిరుగునంతపురం : కేరళలో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ సాహసోపేతంగా డ్రైవింగ్‌ చేసి ఓ పాప ప్రాణాలను కాపాడాడు. అనారోగ్యంతో ఉన్న నెల రోజుల పాపను కన్నూరు నుంచి తిరువనంతపురానికి కేవలం 7 గంటల్లో తీసుకెళ్లాడు. కన్నూరు నుంచి తిరువనంతపురానికి మధ్య 516 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా 516 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల సమయం పడుతుంది... అలాంటిది అంబులెన్స్‌ డ్రైవర్‌ థమీమ్‌ కన్నూరు నుంచి బయలు దేరి కేవలం 7 గంటల్లో తిరువనంతపురంకు తీసుకెళ్లారు. శ్రీచిత్ర మిషన్‌ ఆసుపత్రిలో పాపకు హార్ట్‌ సర్జరీ జరిగింది. సకాలంలో వైద్యం అందడంతో పాప ప్రాణాలు దక్కాయని.... డ్రైవర్‌ సాహసాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

21:49 - November 17, 2017

ఆహ్మదబాద్ : బిజెపి ముస్లింల పట్ల తన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తపరుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ బిజెపి నేత పబ్లిగ్గానే ముస్లింలకు వార్నింగ్‌ ఇచ్చాడు. 'స్థానిక ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తోంది...ఆమెకు ఓటెయ్యలేదంటే...గతంలో ఎన్నడూ లేనివిధంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని' బిజెపి కౌన్సిలర్‌ రంజిత్‌ కుమార్‌ శ్రీవాస్తవ ఓ బహిరంగ సభలో హెచ్చరించారు. వేదికపై ఉన్న ఇద్దరు రాష్ట్ర మంత్రుల ముందే కౌన్సిలర్‌ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఈ నెలాఖరున యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 

21:48 - November 17, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. 70 మంది పేర్లతో కూడిన ఈ జాబితాలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌తో పాటు నలుగురు మహిళలున్నారు. 70 మంది అభ్యర్థుల్లో 49 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి టికెట్‌ దక్కించుకున్నారు. పాటీదార్‌ సామాజిక వర్గానికి చెందిన 13 మందికి బిజెపి టికెట్‌ కేటాయించింది. వీరితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కూడా బిజెపి టికెట్‌ దక్కింది.

21:47 - November 17, 2017

ఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ భారత రేటింగ్‌ను పెంచడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను గుర్తించి మూడీస్ ఈ నిర్ణయం తీసుకుందని జైట్లీ అన్నారు. ఇది భారతదేశ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గత మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మూడీ రేటింగ్‌తో పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, ఆధార్‌ వంటి సంస్కరణలకు ఆమోదం లభించినట్లయిందని జైట్లీ చెప్పారు. గతంలో బీఏఏ3గా ఉన్న రేటింగ్‌ను బీఏఏ2కు పెంచుతూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. మూడీస్‌ భారత్ రేటింగ్‌ను 14 ఏళ్ల తర్వాత పెంచింది. 

21:45 - November 17, 2017

పాట్నా : జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ చిహ్నం బాణం నితీష్‌ కుమార్‌కే దక్కింది. జెడియు ఎన్నికల చిహ్నం బాణం గుర్తును నితీష్‌ వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జెడియు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు నితీష్‌ కుమార్‌కే ఉందని ఈసీ పేర్కొంది. ఈసీ నిర్ణయంతో శరద్‌యాదవ్‌ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ ఆర్జేడితో తెగతెంపులు చేసుకుని బిజెపితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్‌ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. 

21:44 - November 17, 2017

విశాఖ : విశాఖపట్నంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అగ్రి హ్యాకథాన్‌ -2017 సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. సదస్సు ముగింపు సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ భవిష్యత్తు రైతులపై ఆధారపడి ఉందని...వ్యవసాయం, ఆరోగ్య, డెయిరీ రంగాల్లో సాంకేతికత చొప్పించడం చాలా ముఖ్యమని మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ బిల్‌గేట్స్‌ అన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు, ఆవిష్కరణల అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని కితాబిచ్చారు. క్వాలిటీ సీడ్స్, టెక్నాలజీ సాయంతో.. ఏపీ రెండంకెల వృద్ధి సాధిస్తుందని బిల్‌ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబునాయుడు ఆనందం
బిల్‌గేట్స్ విశాఖకు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు... ఆధునిక సాంకేతికతే ఉత్తమ మార్గమని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయాన్ని ఐటీ రంగంతో అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని... సాంకేతిక సహకారంతో.. ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.ఈ సమ్మిట్‌లో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు.. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. రైతులకు టెక్నాలజీ చేరువ చేయడమే అగ్రీ టెక్‌ సమ్మిట్‌ ప్రధాన ఉద్దేశమని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. సమ్మిట్‌లో రైతులు, ఎగ్జిబిటర్స్‌ ఏర్పాటు చేసిన.. వివిధ వ్యవసాయ పరికరాల స్టాల్స్‌ను బిల్‌గేట్స్‌, చంద్రబాబునాయుడు సందర్శించి.. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

21:43 - November 17, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు తెలుగు మహాసభలు, ఎస్సీ నిధులు, ఎంబీసీ జాబితా, పంచాయతీ రాజ్ కొత్త చట్టం అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ నిధులు ఖర్చు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ సభలో ప్రకటించారు. ఎంబీసీల సమస్యపై సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజికంగా వివక్షకు గురవుతున్న ఎంబీసీల కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిందని... దానిఫలితంగానే ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. కాని ఇంతవరకు ఎంబీసీ కేటగిరీలో వచ్చే కులాల జాబితాను ప్రకటించలేదని సున్నం రాజయ్య సభదృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ ఎంబీసీల సమస్యలపై చర్చించేందుకు డిసెంబర్‌ 3న అన్ని పార్టీల్లోని బీసీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు.

విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదు
అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదన్నారు సీఎం కేసీఆర్‌. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంవత్సరం గడుస్తున్నా... సౌకర్యాలు కల్పించడం లేదన్న పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు. మధ్యాహ్నం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కొత్త చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత.. మరోసారి కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై సమగ్రంగా చర్చిద్దామని సభకు తెలిపారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ మధుసూధనాచారి ప్రకటించారు. 

21:42 - November 17, 2017

గుంటూరు : అమరావతిలోని ఒకవేయి 691 ఎకరాల్లో సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌ ఏరియా పురోగతిపై చర్చించేందుకు జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబు.. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఏపీ మంత్రులు నారాయణ, యనమల, సీఆర్డీఏ అధికారులు, సింగూర్‌ ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగపూర్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు చంద్రబాబు. రాజధాని నిర్మాణంలో ఎంతగానో సహకరిస్తున్న సింగపూర్ ప్రభుత్వానికి ఎప్పటికీ మిత్రులుగా ఉంటామనితెలిపారు.

త్వరలో 1500 ఎలక్ట్రిక్‌ వాహనాలు
సహజవనరులతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అద్భుతమైన రాజధానిని నిర్మించాలన్నదే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి ఈశ్వరన్‌తో అన్నారు. రానున్న కాలంలో రాజధానిలో ఎలక్ట్రిక్‌ వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని, త్వరలో 1500 ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ సూచనలు తీసుకుంటామని తెలిపారు. అమరావతి ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ అథారిటీ, వాటర్‌ మాస్టర్‌ పురోగతి గురించి సెంటర్ ఫర్‌ లివబుల్‌ సిటీస్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖూ టెంగ్‌ చె సమావేశంలో వివరించారు. తొలి జెఐఎస్‌సీ సమావేంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై ఈభేటీలో చర్చించారు. అలాగే అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఏర్పాటు, క్యాపిటల్‌ రీజియన్ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టింది. ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్టు మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుపై కార్యచరణ నిర్వహిస్తున్నామని ఖూ టెంగ్‌ చె తెలిపారు.

విజయవాడ నుండి సింగపూర్‌కు విమాన సర్వీసులు
విజయవాడ నుండి సింగపూర్‌కు విమాన సర్వీసులు ఎప్పటి నుండి ప్రారంభించాలనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సింగపూర్‌ విజయవాడ మధ్య వారంలో కనీసం మూడు విమాన సర్వీసులు ప్రారంభంచాలని, వెంటనే ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు రాజధాని అమరావతిలో ఊష్ణోగ్రతలను తగ్గించే డిస్ట్రిక్‌ కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సింగపూర్‌ డిస్ట్రిక్‌ కూలింగ్‌ మేనేజింగ్‌

ఏపీలోని ఏదైనా ఒక నగరంలో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్‌ వినియోగించుకునేలా బస్‌స్టాపుల్లో శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సింగపూర్‌ ప్రతినిధులను కోరారు సీఎం. 2018 జులైలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రిని సింగపూర్‌ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సదస్సును ఒకసారి ఏపీలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిలో సింగపూర్‌కు, ఏపీకి ఉన్న న్యాయపరమైన సమస్యలు తొలగిపోయాయన్నారు మంత్రి నారాయణ. మొత్తం మూడు దశల్లో స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ సంస్థలు అభివృద్ధి చేస్తాయని తెలిపారు. రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు భారతదేశానికి ముఖ్య అతిథిగా వస్తున్న సింగపూర్‌ ప్రధానమంత్రి... అదే సమయంలో అమరావతిని సందర్శించేలా చూడాలని చంద్రబాబు ఈశ్వరన్‌ను కోరారు. 

21:41 - November 17, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపింది. పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణానది ప్రవాహ దిశ మార్చకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణకు సూపర్‌వైజర్, ఇంప్లిమెంటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజధాని నిర్మాణ పనులపై నెలనెలా సమీక్షించాలని సూచించింది. ఆరుగురు సభ్యులతో సూపర్‌వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిని నియమించింది. రాష్ట్ర పర్యావరణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సభ్య కార్యదర్శి, నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నామినేట్ చేసే సీనియర్ శాస్త్రవేత్త, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ నామినేట్ చేసే సైంటిస్టులు సభ్యులుగా ఉంటారు. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ ఎన్.జే పవార్‌తో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు.

నలుగురు సభ్యులతో ఇంప్లిమెంటేషన్‌ కమిటీ
నలుగురు సభ్యులతో ఇంప్లిమెంటేషన్‌ కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఏపీ పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని నియమించింది. కేంద్ర పర్యావరణ శాఖ ప్రతినిధి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, ఐఐఎస్ బెంగళూరు డైరక్టర్ నియమించే సీనియర్ సైంటిస్ట్, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ కడియాల వెంకటేశ్వర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించింది. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ఇది శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక నుంచి రాజధాని పనులు వేగంగా జరుగుతాయన్నారు. మొదటి నుంచి నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఎన్టీటీ తీర్పు రాజధాని మీద ప్రభుత్వ ఒంటెత్తు పోకడను ఆపటంలో తొలి మెట్టు అని పిటిషనర్ శ్రీమన్నారాయణ అన్నారు. కొండవీటి వాగు ప్రవాహం మార్చవద్దని చెప్పడం వల్ల 15 వేల ఎకరాలకు ముప్పు తప్పిందన్నారు. ఏడాది పొడవునా పండే పంట భూములు అన్నీ కాపాడే వరకు తన పోరాటం ఆగదన్నారు.

ఎన్జీటీ తీర్పుపై భిన్నాభిప్రాయాలు
పర్యావరణ అనుమతులకు లోబడి కమిటీల నేతృత్వంలో ఏపీ రాజధాని నిర్మాణాలు చేపడుతామని ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అన్నారు. కొండవీటి వాగును విస్తరిస్తున్నాం తప్ప ధ్వంసం చేయడం లేదన్నారు. ఎన్జీటీ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లైందని ఏపీ సర్కార్‌ చెబుతుంటే..తమ న్యాయపోరాటం వల్లే పర్యావరణ అనుమతులకు లోబడి నిర్మాణాలు జరిగేలా తీర్పు వెలువడిందని పిటిషనర్లు అంటున్నారు. 

చైన్ స్నాచర్ పట్టుకున్న పోలీసులు

మేడ్చల్ : జిల్లా కీసరలో స్కూటర్ పై వెళ్తున్న దంపతులపై బంగారం కోసం గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇతర వ్యక్తులు రావడంతో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. బాధితులు కొండాపూర్ వెళ్తుండగా ఘటన జరిగింది. 

21:26 - November 17, 2017

మేడ్చల్ : జిల్లా కీసరలో స్కూటర్ పై వెళ్తున్న దంపతులపై బంగారం కోసం గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇతర వ్యక్తులు రావడంతో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. బాధితులు కొండాపూర్ వెళ్తుండగా ఘటన జరిగింది. 

అమరావతి నిర్మాణం పై కమిటీలు

గుంటూరు : అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ తీర్పు మేరకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. సూపర్ వైజరీ, ఇంప్లిమెంటేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఆర్ అండ్ బీలో 277ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్ : ఆర్ అండ్ బీ శాఖలో 277 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలి 24 నుంచి డిసెంబర్ 16వరకు అన్ లైన్ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

అసిఫాబాద్ లో పాత నోట్ల ముఠా అరెస్టు

కొమరంభీం అసిఫాబాద్ : జిల్లా తిర్యానిలో పాత నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10లక్షల పాత పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు.  

గిరిజన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : గిరిజన ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. గిరిజన తండాలను పంచాయితీలుగా మార్చడం గిరిజనులలోని తెగల మధ్య నెలకొన్న వివాదంపై సీఎం వారితో చర్చించారు.

గుంతలు పడితే రాజీనామాకు సిద్ధం : తుమ్మల

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా వేస్తున్న రోడ్లు గుంతలు పడితే రాజీనామాకు సిద్ధమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. అత్యంత నాణ్యతతో రోడ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ లండన్ పర్యటన

బ్రిటన్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లండన్ లో పర్యటింస్తున్నారు. అక్కడ అంబేద్కర్ స్మారక మందిరాన్ని సందర్శించిన ఆయన రాత్రి 8.30లకు భారత్ లో పెట్టుబడులు, అవకాశాలు అంశంపై జరిగే సమావేశంలో పాల్గొంటారు.

19:52 - November 17, 2017

నేనేమన్న పిచ్చిదాన్నా..? అంటున్నది తెల్గుదేశం పార్టీ నాయకురాలు.. ఉమామాధవరెడ్డి.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఉమామేడం మీరు పిచ్చోళ్లు గదా అని ఏ విలేకరన్న అడ్గిండా ఎట్ల..? ఆయనకెందుకు డౌటొచ్చింది.. ఈమెందుకు ఇట్లన్నది అనేది జర్ర ముచ్చట లోపటికి వొయ్యి సూస్తె మత్లావు అర్థమైతది..

నంది అవార్డుల పంచాది మనదాక ఎర్కైందంటే.. ఆడ ఏదో కథ ఉన్నట్టే అనిపిస్తున్నది.. నందమూరి బాలికాకయ్య సీన్మ లెజెండ్ ఉన్నదిగదా... ఆ సీన్మకు తొమ్మిది నంది అవార్డులు ఎట్లొస్తయ్.. బాలయ్య ఉత్తమ హిరో ఎట్లైండు అని ఒక్కటే పంచాది నడుస్తున్నది సోషల్ మీడియాల.. ఈ నంది అవార్డులేమో గని..? నారా పార్టీ అవార్డుల కింద లెక్కగడ్తున్నరు..

ఇద్దరాలు మొగలు కొట్లాడుకోని పోరన్ని బాయిలేశినట్టు.. అసెంబ్లీల.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారి పంచాది జూస్తిరా ఎట్లున్నదో..? నువ్వు శిగ్గుపాడాలే అని ఒకాయిన అంటే.. నువ్వు శిగ్గుపడాలే అని ఇంకొకాయిన.. ఈళ్లను జూశి మరి జనం శిగ్గుపడాల్నా ఎట్ల అనేది మరి ఇది జూశ్నంక మీరే నిర్ణయం దీస్కోండ్రి..

తల్కాయ కాళ్లు.. బోటి పేగులు.. అసెంబ్లీ ముట్టడికోసం బొయ్యినయ్ ఇయ్యాళ.. అగో గిదేందే అంటరా..? అవునుల్లా..? రైతులంటే ఎండుగడ్డి దీస్కోని ముట్టడికి వోతరు.. జీహెచ్ఎంసీ కార్మికులు చీపురుగట్టలు దీస్కపోతరు.. మరి ఆరెకటికె సోదరులు ఎట్ల ముట్టడించాలే..? వాళ్ల పని మ్యాకల గోసుడేగదా..? అందుకే మ్యాక తల్కాయ కాళ్లు దీస్కోని ముట్టడికి వొయ్యిండ్రు..

నన్నపనేని రాజక్క ముచ్చట మళ్లొచ్చింది ఇయ్యాళ.. అంటె అక్క ముక్కుపక్కపొంటి కుర్పాయేగదా..? గా ముచ్చటనేమో అనుకునేరు ఆ కుర్పుగాదు.. నా ప్రజలు.. నా మహిళలు.. అని ఎప్పుడు సమస్యల మీద స్పందిస్తనే ఉంటదిగదా..? నిన్న సర్కారు దావఖానకు వొయ్యి.. ఆడ సంటిపోరగాళ్లను ఎత్తుకోని ఎన్నో పనులు జేశింది..

డబుల్ బెడ్రూం ఇండ్లను ఇన్నొద్దులు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నయని ప్రభుత్వం జెప్పుకున్నదిగదా..? అండ్ల పెద్ద పసా లేకుండే కని హయత్ నగర్ కాడ గట్టవోతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను దేవత అడ్డుకున్నది.. ఇండ్లు ఎందుకు కట్టలేకుపోతున్నమంటే.. దేవత అడ్డుకున్నది అని చెప్పుకునెతందుకు ప్రభుత్వానికి మంచి మోక దొర్కింది..

అబ్బా కడప జిల్లాల ఎంత గొప్ప అధికారులున్నరేముల్లా..? సర్కారు ఆఫీసుల కడప ఆత్మగౌరవం.. నా ఊరు గౌరవం అని మీటింగు వెట్టిండ్రు.. కడప మొత్తం సాపుగుండాలే.. ఎక్కడ గూడ గింత చెత్త గనిపియ్యొద్దు.. మర్గుదొడ్లు.. గిర్గుదొడ్లు గట్టి దేశానికే కడప జిల్లా వాసుల ఆత్మగౌరవం ఎట్లుంటది అని సాటిజెప్పెతందుకు మీటింగుల గూసున్నరు పాండ్రి.. మనం గూడ పాలువంచుకుందాం..

యువర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రైన్ నంబర్.. ఏక్ దో తీన్ చార్.. రైలు.. గంట ఆలస్యంగా వచ్చుచున్నది.. అని మన రైల్వే స్టేషన్ల పొంటి ఇంటా ఉంటం.. ఆ గంటగావొచ్చు... రెండు గంటలు గావొచ్చు.. వస్తె వస్తది లేకపోతె అటెంకాళ్ల పట్టాల మీద ఒర్గిన సందర్భాలు గూడ ఎన్నో ఉంటయ్.. మన రైళ్ల పనితానికి ఇదో మచ్చుతున్న.. ఇగ జపాన్ల కథ జూస్తరా..? అక్కడ రైళ్లుకు నమస్తె వెట్టవల్సిందే..

19:42 - November 17, 2017

లెజెండ్ సినిమాకి వరుసపెట్టి 9 అవార్డులు ఇవ్వడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. ఉత్తమ మాటలు అవార్డు ఇవ్వడమనేది మంచికాదని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రటించిన నంది అవార్డుల్లో పరదర్శకత ఉందని, కన్సట్రెషన్ తో సినిమా తీస్తే అవార్డులు అవే వస్తాయని సూర్యప్రకాశ్ అన్నారు. ప్రభుత్వం ఒక జ్యూరీ వెస్తుందని, దాంట్లో ప్రభుత్వం తల దుర్చడం మంచిది కాదని, జ్యూరీలో 10 మందిలో ఒక్కొక్కరు ఒక్కొ విధంగా ఉంటారని తమ్మరెడ్డి భరాత్వజ్ అన్నారు. రుద్రమదేవి డైరెక్టర్ కష్టపడి సినిమా చేస్తే దాన్ని చిన్న చూపు చూశారని గ్రేట్ హైదరాబాద్ చిరంజీవి ఫ్యాన్స్ అసోషియన్ అధ్యక్షుడు నూర్ మహ్మద్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. అవార్డులు రాని వారు తక్కువ వారు కాదు వచ్చిన వారు గొప్పవార కాదని దర్శకుడు కోడి రామకృష్ణ గారు అన్నారు.

19:33 - November 17, 2017

వినోద్ హెచ్ దర్శకత్వంలో యాక్షన్ ఎమోషన్స్ తో పాటు పవర్ ఫుల్ రోల్ చూపించిన సినిమా ఖాకి. టైటిల్ లోనే ఇది పోలీస్ స్టోరీ అని తెలిసిపోతుంది. డిఫెరెంట్ సినిమాలతో తనకు గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో కార్తీ మరోసారి ఖాకి అనే రియల్ కాఫు స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. టాలెంటెడ్ దర్శకుడు పేరున్న వినోద్ కార్తీని పవర్ ఫుల్ పోలీస్ అఫీసర్ గా ప్రెసెంట్ చేశాడు. టీజర్, ట్రైలర్ తోనే హైఓల్టెజీ సినిమాగా క్యూరసిటి సృష్టించారు.

కథ విషయానికి వస్తే ధీరజ్ ప్రసాద్ లనే వ్యక్తి ట్రైనీంగ్ నుంచి బ్రిలియంట్, అగ్రెసివ్ కాఫు అని గుర్తింపు లభిస్తుంది. అయితే డ్యూటీలో జాయన్ అయన తర్వాత అతని సిన్సియరిటీ వల్ల అనేక చోట్లు మారుతాడు. ఈ మధ్యలో ప్రియతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చిన అన్ సల్వుడు కేసు చాలా ఇంటరెస్టింగా అనిపిస్తుంది. అదే టైమ్ లో అదే ముఠా చాలా మందిని చంపెస్తుంది. చివరకు ఓ ఎమ్మెల్యేను కూడా హతమారుస్తారు. వారి చేతిలో ప్రియ గాయపడుతుంది. దీంతో ధీరజ్ ప్రసాద్ కేసును పర్ నల్ గా తీసుకుని నిందితులను ఎలా పట్టుకుంటారని తెర పై చూడాల్సిందే.

19:07 - November 17, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, వీరఘట్టం, పొందూరు, వంగర, సంతకవిటి, రేగిడి, సీతంపేట మండలాల్లో మాత్రమే పత్తి రైతులు ఉన్నారు. ఈ ఏడాది వీరంతా 7 వేల 500 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారు 11వేల 500 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పత్తి రైతులకు క్వింటాకు 4వేల 325రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటివరకూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దళారులను నమ్ముకుని క్వింటాలుకు రూ.3వేల 500లకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే తొలి విడతలో మద్దతు ధర లేక.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తుఫాను కారణంగా రంగు మారిన పత్తి
రెండో విడత తుఫాను కారణంగా పత్తి రంగు మారిన పత్తిని రైతులు సగానికి సగం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారం చివర్లో రాజాంలో మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చాలామంది రైతులు దళారులను ఆశ్రయించిన వచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది కూడా సిక్కోలు రైతులు పత్తిని నమ్ముకుని దగా పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

19:03 - November 17, 2017

విశాఖ : జిల్లా మామిడిపాలెంలో పట్టపగలు యువకుడి హత్య సంచలనం రేపింది. ఓ వైన్‌షాప్‌ వద్ద యువకుల మధ్య గొడవ చెలరేగింది. ఇద్దరు యువకులపై ప్రత్యర్థివర్గం కత్తులతో దాడికి తెగబడింది. దాడిలో చనిపోయిన వ్యక్తిని అనకాపల్లి మండలం బావులవాడ పంచాయతీ శివారు రావుగోపాలరావు కాలనీ వాసి లాలం పరమేష్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అతని బావమరిది గాయపడి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో మాటమాట పెరగి హత్యకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

19:03 - November 17, 2017

అనంతపురం : కదిరిలో మహిళలపై పోలీసుల అమానుష వైఖరిని నిరసిస్తూ వామపక్షనేతలు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. టవర్‌ క్లాక్‌ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో ఇంటి పట్టాల కోసం ఆందోళన చేస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే మహిళా కానిస్టేబుళ్లు వచ్చేందుకు సమయంలేకనే ఆ ఘటన జరిగింది తప్పితే పోలీసులు కావాలని చేయలేదన్నారు అనంతపురం ఎస్పీ అశోక్‌ కుమార్‌. ఈ ఘటనపై అదనపు ఎస్పీని విచారణకు ఆదేశించామని, కావాలని దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

19:02 - November 17, 2017

గుంటూరు : సీఎం చంద్రబాబుతో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి ఈశ్వరన్‌ అధ్యక్షతన జాయింట్ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఏపీ నుంచి మంత్రులు యనమల రామృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ సమావేశానికి హాజరయ్యారు. సింగపూర్ నుంచి డెవలప్‌మెంట్ సెకండ్ మినిస్టర్ డెస్మోంట్ లీ, ప్రత్యేక రాయబారి గోపినాథ్‌ పిళ్లయ్‌, సెకండ్ పర్మినెంట్ సెక్రటరీ పింగ్‌ ఛియాంగ్‌ బూన్‌ తదితరులు వచ్చారు. తొలి జెఐఎస్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై చర్చ జరిగింది. అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుపై చర్చ జరిగింది. క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఏజెన్సీపై నివేదిక ఇచ్చారు. సింగపూర్, విజయవాడ మధ్య విమాన సర్వీసుల ఏర్పాటుపై రిపోర్టు ఇచ్చారు.

 

19:01 - November 17, 2017

ఢిల్లీ : కొండవీటి వాగును విస్తరిస్తున్నాం తప్ప ధ్వంసం చేయడం లేదని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాసులు అన్నారు. వాగు ప్రవాహ మార్గాన్ని మార్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. పర్యావరణ అనుమతులకు లోబడి కమిటీల నేతృత్వంలో ఏపీ రాజధాని నిర్మాణాలు చేపడుతామని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ అన్నారు. 

19:00 - November 17, 2017

హైదరాబాద్ : జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్లు, పదో చార్జ్‌ షీట్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. రాంకీ సిమెంట్‌ పెట్టుబడులలో తమకు ఎక్కడా సంబంధాలు లేవని జగన్‌, విజయసాయిరెడ్డి కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో జగన్‌ పాదయాత్ర కోసం సీబీఐ కోర్టు నుండి కర్నూలు జిల్లా బనాగన పల్లికు వెళ్లారు. 

18:59 - November 17, 2017

విశాఖ : వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాల్లో సాంకేతికత చొప్పించడం చాలా ముఖ్యమన్నారు మైక్రోసాప్ట్ ఛైర్మన్ బిల్‌గేట్స్. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు, ఆవిష్కరణల అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని కితాబిచ్చారు. రైతుల కోసం అత్యుత్తమ నాణ్యమైన విత్తనాల పార్కును ఏర్పాటు చేయడం చాలా సంతోశమన్నారు. క్వాలిటీ సీడ్స్, టెక్నాలజీ సాయంతో.. ఏపీ రెండంకెల వృద్ధి సాధిస్తుందని బిల్‌ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

18:58 - November 17, 2017

విశాఖ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు... ఆధునిక సాంకేతికతే ఉత్తమ మార్గమన్నారు AP సీఎం చంద్రబాబు నాయుడు. తమ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ చివరి రోజు సదస్సులో... మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో కలిసి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని ఐటీ రంగంతో అనుసంధానం చేస్తున్నామని సదస్సులో చంద్రబాబు తెలిపారు. కోటి ఎకరాల్లో ఉద్యానపంటలు వేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీ సీఎం... సులభ వాణిజ్యంలో తాము అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని... సాంకేతిక సహకారంతో.. ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. బిల్‌గేట్స్ విశాఖ రావడం తమకు ఆనందంగా ఉందన్నారు. బిల్ మిలిండా గేట్స్‌ పౌండేషన్‌తో కలిసి పనిచేయాలని తాము భావిస్తున్నట్టు తెలిపారు.

18:18 - November 17, 2017

ఢిల్లీ : గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు మేడ్చల్‌ ఆర్టీవో అధికారి శ్రీనివాస్‌. ఫిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన రోల్‌ ఆఫ్‌ కార్పోరేట్స్‌ ఇన్‌ రోడ్‌ సేఫ్టీ 2017 కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టారు. రహదారి భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పలు సంస్థలు, వ్యక్తులకు అవార్డులను ప్రధానం చేశారు. 1995 నుండి రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న మేడ్చల్‌ ఆర్టీవో శ్రీనివాస్‌కు అవార్డు దక్కింది. 

18:16 - November 17, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల వల్లే దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వాలు మారకపోతే ప్రజలే ప్రభుత్వాలను గద్దెదింపుతారని హెచ్చరించారు. కార్పొరేట్ల చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారాయని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. నవంబర్‌ 20న అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటి ఆధ్వర్యంలో.. పార్లమెంట్‌ ముందు చేపట్టే కిసాన్‌ ముక్తి సంసద్‌లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

18:15 - November 17, 2017

హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరించాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎస్వీకేలో చేపడుతున్న కాంట్రాక్ట్‌ టీచర్లు చేపడుతున్న నిరవధిక దీక్ష ఆరో రోజుకు చేరుకొంది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన జస్టిస్‌ చంద్రకుమార్‌ వారికి సంఘీభావాన్ని తెలిపారు. క్రమబద్ధీకరణకు కోర్ట్‌ కేసు అడ్డంకిగా ఉందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అనడం తగదని... ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కోర్ట్‌లో మెమో వేయాలని సూచించారు.

18:13 - November 17, 2017

హైదరాబాద్ : రాజకీయాల్లో నైతికత కొరవడిందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. సామాజిక న్యాయ సాధనకోసం రాజకీయ ఫ్రంట్‌ అవసరమని, దీనికోసం పలు సంఘాలు, సామాజిక శక్తులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రాజకీయ ఫ్రంట్‌పై ఈ నెల 19న రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నామంటున్న సీపీఎం కార్యదర్శి తమ్మినేని తెలిపారు.

18:12 - November 17, 2017

కరీంనగర్ : జిల్లా జైళ్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న మాజీ ఏఎస్‌ఐ మోహన్‌ రెడ్డికి రాచ మర్యాదలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి జైలర్‌ గదిలో మోహన్‌ రెడ్డి ముచ్చటిస్తున్న వీడియోపై జైళ్ల శాఖ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే కొంత మంది సిబ్బంది కావాలనే కుట్ర పూరితంగా వీడియో చిత్రీకరించారని.. నిబంధనలకు విరుద్ధంగా మోహన్‌ రెడ్డి విషయంలో వ్యవహరించలేదని జైలర్ శివకుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:11 - November 17, 2017

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు TTDP అధ్యక్షుడు ఎల్‌ రమణ. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌ మద్దూరు గ్రామంలో విద్యుత్‌ ఘాతంతో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25వేల చొప్పున నగదును అందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్నారు. వారి కుటుంబీకులకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని రమణ డిమాండ్‌ చేశారు.

18:10 - November 17, 2017

హైదరాబాద్ : శాసన మండలి సహావేశాల్లో విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసమస్యలను ప్రస్తావించే విపక్ష సభ్యుల గొంతు నొక్కేశారని ఆరోపించారు. గురుకులాలు, నిరుద్యోగులు, నిత్యావసరాల ధరలు లాంటి సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి అవకాశం కల్పించలేదన్నారు. ఎంతసేపు బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకోడానికే అధికారపక్షం సభా సమయాన్ని వాడుకుందిని పొంగులేటి విమర్శించారు. 

18:08 - November 17, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను ప్రచారం కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాడుకుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రైతురుణమాఫీలో వడ్డీభారాన్ని భరిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దాటవేత ధోరణి అనుసరించిందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 

18:07 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ మధుసూధనాచారి ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. 11 బిల్లులకు ఆమోదం లభించగా.... 6 స్వల్పకాలిక అంశాలపై చర్చించారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలకు అనుకూలంగా ఉండాలనే జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్‌. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంవత్సరం గడుస్తున్నా... సౌకర్యాలు కల్పించడం లేదన్న పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

16:58 - November 17, 2017

సినిమా : మాస్ రాజా రవితేజ చాలా కాలం తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్టు కొట్టారు. ఈ సినిమా విజయం తర్వాత రవితేజ వరుసు సినిమాలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో శ్రీను వైట్లతో ఓ సినిమా చేస్తున్నారని వార్తాలు వచ్చాయి. వీరి సినిమా ప్రొడ్యుస్ చేయాడానికి మైత్రి మూవీస్ ముందుకొచ్చింది. అయితే రవితేజ, శ్రీనువైట్లకు రెమ్యూనేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇస్తామని ప్రపొజల్ పెట్టింది. దాని వారు ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఇందంతా జరిగింది రాజ ది గ్రేట్ సినిమా విడుదల కాకముందు కానీ ఇప్పుడు ఆ ప్రపొజల్ రవితేజ ఒప్పుకోవడం లేదని టాక్. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

16:43 - November 17, 2017

కృష్ణా నదిలో పడవ మునక

గుంటూరు : జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా నదిలో పడవ మునిగిపోయింది. ప్రమాదాన్ని ముందే గమనించి సిబ్బంది నదిలోకి దూకారు. కృష్ణా నది నుంచి ఇసుకను ఒడ్డుకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

పట్టపగలే యువకుడి దారుణ హత్య

విశాఖ : జిల్లాలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వైన్ షాప్ ముందు అందరు చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్య గురైయ్యాడు. మామిడిపాలెం వైన్ షాప్ వద్ద ఇద్దరు యువకుల మధ్య గొడవ హత్యకు దారితీసింది.

విశాఖ చేరుకున్న బిల్ గేట్స్

విశాఖ : బిల్ గేట్స్ విశాఖ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా గేట్స్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. 

16:13 - November 17, 2017
16:07 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేన్నరేళ్లు పూర్తైంది. ప్రభుత్వ శాఖలలో విభజన ప్రక్రియ జరిగి ఉద్యోగులు ఎవరి ప్రాంతాల్లో వారు విధులు నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగుల విభజన మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. విద్యుత్ శాఖలో జీవో నంబర్ 610 అమలు కావడం లేదు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినా.. కొందరు ఆప్షన్ల పేరుతో తెలంగాణ శాఖలోనే ఉండిపోయారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలో ప్రమోషన్ల పంచాయతీ మొదలైంది.

భావించారు. విధులకు బంద్‌ పెట్టి మరీ తెలంగాణ సాధన ఉద్యమంలో
నిజానికి ప్రమోషన్ల కోసం 2009లో విద్యుత్ శాఖలోని ఉద్యోగులు కోర్టు మెట్లెక్కారు. తదనంతరం తెలంగాణ ఉద్యమం బలపడటంతో విభజనతో తప్ప విద్యుత్ శాఖలో ప్రమోషన్లు రావని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు భావించారు. విధులకు బంద్‌ పెట్టి మరీ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తమ కల నెరవేరుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్‌ కావడంతో ప్రమోషన్ల వ్యవహారంలో మళ్లీ గందరగోళం ఏర్పడింది. ఉద్యోగుల పంపకాలకు ప్రభుత్వ విభాగాలలోలాగానే కమల్ నాథన్ గైడ్ లైన్స్‌ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. విద్యుత్ సంస్ధలోని ఉద్యోగుల విభజన పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రాతిపదికగా జరగాలని.. రెండు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులు నవంబర్ 2015 లో సంతకాలు సైతం చేశారు. విద్యుత్ సంస్ధలలో ఉద్యోగుల పంపకాలపై కమలనాథన్ గైడ్ లైన్స్ ని బలవంతంగా రుద్దితే ఏడీఈ ఆ పై క్యాడర్ పోస్టులలో సగానికన్నా ఆంధ్రా ఉద్యోగులు ఉంటారు. అదే జరిగితే మొత్తం తెలంగాణ విద్యుత్ రంగంపై పెత్తనాన్ని ఆంధ్రా ఎలక్ట్రిసిటీ అధికారుల గుప్పిట్లో పెట్టినట్లవుతుందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు వాదిస్తున్నారు.ఉద్యోగుల పంపకాలపై తెలంగాణ ఎలక్టికల్ ఎంప్లాయిస్ జె.ఏ.సి విద్యుత్ సౌధా వద్ద ఆందోళనకు దిగింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏడాది లోపు ఉద్యోగుల విభజన పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రా ఉద్యోగ సంఘాల నేతల జోక్యం కారణంగా తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు సెక్షన్ 82 ప్రకారం మార్గదర్శకాలను రూపొందించి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను రిలీవ్ చేశారు. అయితే ఎట్టి పరిస్ధితులోను కమల్ నాథన్ గైడ్స్ అమలు చేయడానికి ఒప్పుకోమని విద్యుత్ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్లీ తెరపైకి వచ్చిన విద్యుత్ ఉద్యోగుల ఆప్షన్ల వ్యవహారాన్ని ఏ మేరకు పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

 

 

16:02 - November 17, 2017

తూర్పుగోదావరి : ప్రజాసమస్యలను గాలికి వదిలి సీఎం పర్యటన బాటపట్టారని వ్యాఖ్యానించారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. చిత్తశుద్ది ఉంటే పోలవరం ప్రాజెక్టు సాధనకు అవసరమైన నిధుల కోసం కేంద్రంతో పోరాడాలన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 20న వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి చలో అమరావతి నిర్వహిస్తామని మధు తెలిపారు. 

16:00 - November 17, 2017

విశాఖ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రైతుకు టెక్నాలజీ చేరువ చేసే ప్రయత్నమే అగ్రీ టెక్‌ సమ్మిట్ సమావేశమని ఆయన తెలిపారు. విశాఖలో మూడవ రోజు అగ్రీ టెక్‌ సమ్మిట్‌లో సినీ నటుడు బాలయ్య సందడి చేశారు. సమ్మిట్‌లో రైతులు, ఎగ్జిబిటర్స్‌ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్స్ రైతుకు చేరువ చేసే ప్రయత్నమే ఇదని అన్నారు. 

15:38 - November 17, 2017

విశాఖ : జిల్లాలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వైన్ షాప్ ముందు అందరు చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్య గురైయ్యాడు. మామిడిపాలెం వైన్ షాప్ వద్ద ఇద్దరు యువకుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. మరింత సమచారం కోసం వీడియో చూడండి.

మహిళను కాపడిన ఇద్దరు వ్యక్తులు

 

నల్లగొండ : జిల్లా హాలియా సమీపంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు నాగర్జున సాగర్ ఎడమ కాలువలో జారిపడింది. ఆ మహిళకు ఈత వచ్చిన ప్రవాహ వేగానికి ఒడ్డుకు చేరలేకపోయింది. కాలువలో కొట్టుకుపోతున్న మహిళను అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపాడారు. 

15:31 - November 17, 2017

నల్లగొండ : జిల్లా హాలియా సమీపంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు నాగర్జున సాగర్ ఎడమ కాలువలో జారిపడింది. ఆ మహిళకు ఈత వచ్చిన ప్రవాహ వేగానికి ఒడ్డుకు చేరలేకపోయింది. కాలువలో కొట్టుకుపోతున్న మహిళను అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కొత్తగూడెం జిల్లాలో దారుణం

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి శశిరేఖ అనుమానాస్పద మృతి చెందింది. ఇంటికొచ్చిన శశిరేఖ మంచినీళ్లు తాగి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.

టీఎస్ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలు మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. మండలిలో 11, 6 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

డీఎస్పీ బంధువుల హల్ చల్

వరంగల్ : జిల్లాలో డీఎస్పీ బంధువులు హల్ చల్ చేశారు. డీఎస్పీ బంధువులు పోలీస్ వాహనంతో ఆటోను ఢీకొన్నారు. దానిపై ప్రశ్నించిన ఆటో డ్రైవర్ ను వారు చితకబాదారు. డీఎస్పీ బంధువులు నిబంధనలకు విరుద్దంగా పోలీస్ వాహనం నడపడం పై పలువురు ఖండిస్తున్నారు.

15:19 - November 17, 2017

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి శశిరేఖ అనుమానాస్పద మృతి చెందింది. ఇంటికొచ్చిన శశిరేఖ మంచినీళ్లు తాగి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. మరింత సమచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:17 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలు మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. మండలిలో 11, 6 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:04 - November 17, 2017
15:03 - November 17, 2017
14:59 - November 17, 2017
14:58 - November 17, 2017
14:56 - November 17, 2017

కృష్ణా : జిల్లా దీవిసీమ కొడూరులో పట్టపగలే ఘరన దొంగతనం జరిగింది. దొంగలు బైక్ నుంచి రూ.3లక్షలను చోరీ చేశారు. వారు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:55 - November 17, 2017

వరంగల్ : జిల్లాలో డీఎస్పీ బంధువులు హల్ చల్ చేశారు. డీఎస్పీ బంధువులు పోలీస్ వాహనంతో ఆటోను ఢీకొన్నారు. దానిపై ప్రశ్నించిన ఆటో డ్రైవర్ ను వారు చితకబాదారు. డీఎస్పీ బంధువులు నిబంధనలకు విరుద్దంగా పోలీస్ వాహనం నడపడం పై పలువురు ఖండిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:33 - November 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో పది జిల్లా పరిషత్ లు కొనసాగుతున్నాయని, హైదరాబాద్ మినహా 30 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చట్టాల్లో ఉన్న లొసుగుల ఆధారంగా కోర్టులకు వెళుతున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని..కొత్త పంచాయతీ రాజ్ చట్టం..కొత్త మున్సిపాల్టీ చట్టాల రూపకల్పన విషయంలో సభ్యులు అనుభవాలు..క్షుణ్ణంగా అధ్యయనం చేసి సూచనలు.. ఇవ్వాలని సూచించారు. దీనిపై ఇప్పుడు వేసిన కమిటీ వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తోందని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీ మీటింగ్ లో ప్రధానితో ఈ అంశంపై మాట్లాడడం జరిగిందని, తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. దేశ..రాష్ట్రాల బడ్జెట్ రూ. 38 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతోందని కానీ స్థానిక సంస్థలు పనిచేయకపోతే దేశం వికాసం చెందదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. అధికారం..విధులు..డబ్బులు..ఇవ్వాల్సి ఉంటుందని..అందుకే పంచాయతీ రాజ్, మున్సిపాల్టీ చట్టంలో అధికారాలు..విధులు కల్పిస్తామన్నారు. 

14:28 - November 17, 2017

హైదరాబాద్ : తనపై సీఎం కేసీఆర్..కు అందరికీ ఎందుకంత కోపం ఉంటదని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ సభలో ప్రశ్నించారు. జిల్లాల విభజన అంశంపై శుక్రవారం టి. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవాంతరాలు అధిగమించే విధంగా డీ లిమిటైజేషన్ ఉండాలని సూచించారు. కుల్వకుర్తి నియోజవకర్గం మూడు డివిజన్ లలో ఉందని..ఒక సమస్యను పరిష్కరించాల్సి వస్తే ముగ్గురు ఆర్డీవో లతో మాట్లాడాల్సి వస్తోందని..ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు చెబితే తాము ప్రిపేర్ అవుతుండే వారమన్నారు. 

గుజరాత్ బీజేపీ అభ్యర్థుల జాబితా...

గుజరాత్ : అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 70 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. జాబితాలో విజయ్ రూపానీ, నితిన్ భాయ్ పటేల్, జీతు భాయ్ వాఘానీలకు చోటు దక్కింది. రాజ్ కోట్ పశ్చిమ నుండి విజయ్ రూపానీ..మెహ్వానా నుండి నితిన్ భాయ్ పటేల్..భావ్ నగర్ పశ్చిమ నుండి బీతుభాయ్ వాఘానీలు పోటీ చేయనున్నారు. 

జిల్లాల చేసే హక్కు రాష్ట్రాలకే ఉంది - కేసీఆర్...

హైదరాబాద్ : నగరానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా జిల్లాలుగా విభజన చేయలేదని శాసనసభలో సీఎం కేసీఆర్ చెప్పారు. జిల్లాలు చేసే హక్కు కేవలం రాష్ట్రాలుగా మాత్రమే ఉందని, కొత్త జిల్లాలను ఎన్ఐసీ, ఆర్ బీఐలు నోటిఫై చేశాయన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన జరిగిందన్నారు. 

సింగపూర్ ప్రధాని వచ్చేలా చూడాలన్న ఏపీ సర్కార్..

విజయవాడ : రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా సింగపూర్ ప్రధాని అమరావతికి వచ్చే విధంగా చూడాలని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను ఏపీ ప్రభుత్వం కోరింది. 

టీఎస్ శాసనసభ మండలి నిరవధిక వాయిదా..

హైదరాబాద్ : టీఎస్ శాసనసభ మండలి నిరవధికంగా వాయిదా పడింది. 50 గంటల 23 నిమిషాల పాటు మండలి కొనసాగింది. 123 ప్రశ్నోత్తరాల్లో 93 ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇచ్చారు. 11 బిల్లుల ఆమోదం..9 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. 

13:32 - November 17, 2017

కాకినాడ : విభజన చట్టంలోని హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్రంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కైందని ఈనె 20వ తేదీన చలో అమరావతి కార్యక్రమం నిర్వహించన్నుట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. రైతుల ఆందోళనలను పక్కదారి పట్టేందుకు ఎమ్మెల్యేలతో ఏపీ ప్రభుత్వం పోలవరం పర్యటన చేయిస్తున్నారని విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

తాడిపత్రిలో ఉద్రిక్తత..

అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. జనావాసాల మధ్యలో ఉన్న బార్ ను తరలించాలని వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. తాడిపత్రిలోని ఓ ప్రాంతంలో హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది.

13:22 - November 17, 2017

అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. జనావాసాల మధ్యలో ఉన్న బార్ ను తరలించాలని వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. తాడిపత్రిలోని ఓ ప్రాంతంలో హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇది జనావాసాల మధ్య ఉందని..తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు. కానీ తమకు పర్మిషన్ ఉందని బార్ యాజమాన్యం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో శుకవారం వైసీపీ నేత పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనలను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. బార్ కు అనుమతి ఉందని..నేతలు చెబితే మూసివేయాలా ? అని జేసీ వర్గీయులు పేర్కొన్నారు. ముందస్తు చర్యలో భాగంగా వైసీపీ నేత పెద్దారెడ్డి..టిడిపి నేతలను గృహ నిర్బందం చేశారు. ముందస్తు చర్యలో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 

తాడిపత్రిలో అఖిలపక్ష నేతల ఆందోళన..

అనంతపురం : తాడిపత్రిలోని ఓ ప్రాంతంలో జనవాసాల మధ్యలో ఉన్న ఓ బార్ ను మూసివేయాలని వైసీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. 

13:15 - November 17, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఓ విద్యార్థిని వైస్ ప్రిన్స్ పాల్ వాతలు వచ్చే విధంగా కొట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎస్ ఆర్ డిజిటల్ స్కూల్ లో అఖిల్ 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో అల్లరి చేస్తున్నాడని వైస్ ప్రిన్స్ పాల్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడని పేర్కొంటూ శుక్రవారం స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వాతలు వచ్చే విధంగా ఎలా కొట్టావని తల్లిదండ్రులు నిలదీశారు. ప్లేయింగ్ పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అల్లరి చేస్తే విద్యార్థులను సముదాయించే పద్దతి వేరే ఉంటుందని..ఇలా చేయరని వైస్ ప్రిన్స్ పాల్ కు తెలిపారు. 

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ తీర్పు...

విజయవాడ : అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి మంజూరు చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. నదీ ప్రవాహాన్ని మార్చొద్దని సూచించింది. పర్యావరణ పరిరక్షలో భాగంగా రెండు కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది. రెండు కమిటీల నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవచ్చని అనుమతి తెలియచేసింది. 

13:09 - November 17, 2017

మోహన్ రెడ్డి వీడియో వైరల్...

కరీంనగర్ : జైలులో ఉన్న మోహన్ రెడ్డికి పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖైదీగా కాకుండా మర్యాదలు కల్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

12:58 - November 17, 2017

కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డి గుర్తుకే ఉన్నాడు కదా...రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వడ్డీ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జైలులో ఉన్న ఇతనికి పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖైదీగా కాకుండా మర్యాదలు కల్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ కు చేరింది. దీనిపై విచారణ ప్రారంభించారు. గురువారం జైలుకు వెళ్లిన అధికారులు పలువురిని విచారించినట్లు సమాచారం. మోహన్ రెడ్డిని ఎవరు కలవాలని వచ్చారు ? వారి లిస్టుపై ఆరా తీసినట్లు సమాచారం.

మోహన్ రెడ్డిపై 70 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇతనికి చెందిన ఆరు కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటికీ మూడు వందల మంది బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇంకా ఇతనిపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో మోహన్ రెడ్డికి బేడీలు వేయకపోవడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అనంతరం మోహన్ రెడ్డిని అందరి ఖైదీల్లాగానే చూశారు. తాజాగా బయటపడిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

12:48 - November 17, 2017

అనంతపురం : తమకు అన్యాయం జరుగుతోందని..ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడుండాలని జాయింట్ కలెక్టర్ కు మొర పెట్టుకుందామని వచ్చిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. జాయింట్ కలెక్టర్ వాహనానికి అడ్డుగా ఉన్న మహిళలను మగ పోలీసులే నెట్టివేశారు. కదిరిలో వీరి దౌర్జన్యం బయటపడింది.
కుటగుళ్లలో రోడ్డు విస్తరణ పనులను రెవెన్యూ అధికారులు చేపట్టారు. 72 మంది కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయి. దీనితో వారు తీవ్ర ఆందోనళకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి వారం లోపు ఇళ్లు కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే కూల్చిన ఖర్చు వసూలు చేస్తామని బెదిరింపులు చేశారు. దీనితో తమ సమస్యలు..బాధలు చెప్పేందుకు కదిరి ఆర్ అండ్ బి బంగ్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ ను బాధితులు కలిశారు. జేసీ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎదుటే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బాధితులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 

కదిరిలో పోలీసుల జులుం...

అనంతపురం : కదిరిలో పోలీసుల దౌర్జన్యం బయటపడింది. కదిరి ఆర్ అండ్ బి బంగ్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ ను బాధితులు కలిసేందుకు వచ్చారు. మహిళలపై ఖాకీలు అనుచితంగా ప్రవర్తించారు. కుటగుళ్లలో రోడ్డు విస్తరణ పనులను రెవెన్యూ అధికారులు చేపట్టారు. 72 మంది కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయి. 

12:38 - November 17, 2017

నల్గొండ : జిల్లాలో మరోసారి కాల్ మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేత ఉంటున్నారని వార్త హల్ చల్ చేస్తోంది. కానీ ఇందులో తాను ఎలాంటి తప్పు చేయలేదని సదరు బీజేపీ నేత పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..మిర్యాలగూడలో స్థానిక బీజేపీ నేత సత్యప్రసాద్ తమను నిర్భందించారని..వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మోహన్ రావు దంపతులు గురువారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ కేసును చూడాలని ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పు తీర్చాలంటూ నెల రోజులుగా తమను నిర్భందించారని, తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడని దంపతులు పేర్కొన్నట్లు సమాచారం. ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన తమను ఇంటికి తీసుకెళ్లి నిర్భందించారని ఆరోపిస్తున్నారు.

దీనిపై బీజేపీ సత్యప్రసాద్ స్పందించారు. వ్యాపార లావాదేవీల్లో దంపతులు తనను మోసం చేశారని పేర్కొన్నారు. ఓ కేసు నిమిత్తం ఇక్కడకు ఆ దంపతులు రావడం జరిగిందని, మర్యాదపూర్వకంగా ఇంటికి రావాలని పిలవడం జరిగిందన్నారు. తాము బంధువులమని..కలిసి వ్యాపారం చేయడం జరిగిందన్నారు. నెల రోజులుగా తన ఇంటిలోనే ఉంటున్నారని..వారు చెబుతున్న ఆరోపణనలు నిజం కాదని చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో నిజ..నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

నల్గొండలో కాల్ మనీ ...!

నల్గొండ : జిల్లాలో మరోసారి కాల్ మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. మిర్యాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చాలంటూ నెల రోజులుగా దంపతులను నిర్భందించాడు. దంపతులను నిర్భందించిన స్థానిక బీజేపీ నేత సత్యప్రసాద్ వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మోహన్ రావు దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన తమను ఇంటికి తీసుకెళ్లి నిర్భందించారని దంపతులు పేర్కొంటున్నారు. వ్యాపార లావాదేవీల్లో దంపతులు తనను మోసం చేశారని సత్యప్రసాద్ ఆరోపించారు. 

12:27 - November 17, 2017

ఢిల్లీ : అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ ఇచ్చే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ రాజధాని నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పంట పొలాలు, కృష్ణా నది ముంపు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరుగుతోందని, పర్యావరణ అనుమతుల ఉల్లంఘన, ఆహార భద్రతకు ముప్పు అంశాలపై ఎన్జీటీలో పిటిషన్లు దాఖలయ్యాయి. రెండున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పర్యావరణానికి ముప్పు లేకుండా రాజధాని నిర్మిస్తామని ఎన్జీటీకి ఏపీ సర్కార్ తెలిపింది. పంటల పొలాలను కాంక్రీట్ భవంతులుగా మారుస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

రూ. 322 కోట్లలో రూ.11 కోట్లు ఖర్చు - గీతారెడ్డి...

హైదరాబాద్ : సంస్కారం..సంస్కృతి ఉన్న పార్టీ అని..లేదని ఆర్థిక మంత్రి ఈటెల పేర్కొనడం జరిగిందని గీతారెడ్డి పేర్కొన్నారు. దళితుల పట్ల అలక్ష్యం..నిర్లక్ష్యం జరుగుతోందని..అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నా కిందిస్థాయిలో ఆ విధంగా జరగడం లేదన్నారు. రూ. 322 కోట్లు పెడితే రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారని..మిగతా డబ్బులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. 26వేల లబ్ది దారులు పెట్టుకొంటే కొంతమందికి మాత్రమే ఇచ్చి 17 వేల మంది ఉపాధి దొరకలేదన్నారు. 

12:15 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై చిత్తశుద్ధి ఉందని..వారి అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎంబీసీల సమస్యలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ సభ్యులురాలు గీతారెడ్డి చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గీతారెడ్డి చెప్పిన కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కానీ గీతారెడ్డి చెప్పినట్లు రూ. 26వేల కోట్లు మేమా మళ్లించినమా అని ప్రశ్నించారు. ఎస్సీ బిల్లు తెచ్చిన అనంతరం ఖర్చు..వివరాలు సభకు తెలియచేయడం జరిగిందని, ప్రతి లబ్దిదారుడి విషయం పెన్ డ్రైవ్ లో ఉందని తెలిపారు. 31 జిల్లాలో అధికారులందరూ అసమర్థులేనా ? అంటూ ప్రశ్నించారు. వివరాలతో ముందుకు రావాలని సూచించారు. దళితుల్లో పేదరికం ఉందని..స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అనంతరం వారి మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్సీల పేరిట గుర్తించినట్లు రూ. 24లక్షలు ఇస్తున్నట్లు..వంద శాతం సబ్సిడీ కల్పించడం..దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొన్నారు.

నిధులు మళ్లించింది కాంగ్రెస్ హాయాంలోనేనని..తమ హాయంలో జరగలేదన్నారు. దళితుల అభివృద్ధి వందకు వంద శాతం కట్టుబడి ఉన్నట్లు, ఎస్సీ..ఎస్టీ పద్దుపై రెండు రోజుల పాటు చర్చ జరగడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ హాయాంలో, 2, 651 కోట్లు ఖర్చు పెట్టిందని..కానీ తాము అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరంలో రూ. 6, 713 కోట్లు ఖర్చు పెట్టామని..ఈ నిధులు ఎవరు మళ్లించారో చెప్పాలన్నారు. 28-30 తేదీల్లో వివిధ కార్యక్రమాలున్నాయని...అందుకని హౌస్ ప్రోరోగ్ చేయకుండా కొనసాగించే విధంగా చూడాలని స్పీకర్ ను సీఎం కేసీఆర్ కోరారు. 

11:59 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎంబీసీలపై సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై ప్రభుత్వాన్ని పలు సభ్యులు నిలదీశారు. దీనిపై టి.కాంగ్రెస్ సభ్యురాలు సంపత్..గీతారెడ్డిలు మాట్లాడారు. సభ్యుల విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సంస్కారం..సంస్కృతి ఉన్న పార్టీ అని..లేదని ఆర్థిక మంత్రి ఈటెల పేర్కొనడం జరిగిందని గీతారెడ్డి పేర్కొన్నారు. దళితుల పట్ల అలక్ష్యం..నిర్లక్ష్యం జరుగుతోందని..అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నా కిందిస్థాయిలో ఆ విధంగా జరగడం లేదన్నారు. రూ. 322 కోట్లు పెడితే రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారని..మిగతా డబ్బులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. 26వేల లబ్ది దారులు పెట్టుకొంటే కొంతమందికి మాత్రమే ఇచ్చి 17 వేల మంది ఉపాధి దొరకలేదన్నారు. సబ్ ప్లాన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మార్పు చేసిందని..పెనాల్టీ క్లాజ్ ఉందని..పనిచేయని అధికారులపై ఎందుకు అలసత్వం చేస్తున్నారని..ప్రశ్నించారు. ఏఎస్ డబ్ల్యూ...ఇతర అవగాహన లేని అధికారులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. 26వేల కోట్ల నిధులు ఎక్కడకు వెళ్లాయి ? దీనిపై స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

11:55 - November 17, 2017

మూడెకరాల కోసం ఎదురుచూపులు - సంపత్..

హైదరాబాద్ : మూడెకరాల కోసం దళితులు ఎదురు చూపులు చూస్తున్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసలో ఆయన ఎంబీసీ అంశంపై పలు ప్రశ్నలు అడిగారు. మూడెకరాలు భూమి కేటాయిస్తామనే ప్రకటనతో ఎంతో మందిలో ఆత్మస్థైర్యం..నమ్మకం కలిగించిందన్నారు. 9, 966 ఎకరాలు ఇచ్చారని, ఈ మధ్య కాలంలో 8 నెలల్లో కేవలం 185 ఎకరాలు మాత్రమే ఇచ్చారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎంత మంది దళితులకు భూమి లేదు ? అని ప్రశ్నించారు. 3,30,644 మంది మూడెకరాల పొలం కోసం చూస్తున్నారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోందన్నారు. వీరికి భూమి కేటాయించడం ఎంత సమయం పడుతుందని..దీనిపై తనకు అసంతృప్తి ఉందన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయి ? ప్రభుత్వం ఆదుకొంటేనే దళితులు అభివృద్ధి చెందరని సభకు తెలిపారు.

 

మూడెకరాల భూమిపై సంపత్ ప్రశ్నలు...

హైదరాబాద్ : మూడెకరాల కోసం దళితులు ఎదురు చూపులు చూస్తున్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసలో ఆయన ఎంబీసీ అంశంపై పలు ప్రశ్నలు అడిగారు. మూడెకరాలు భూమి కేటాయిస్తామనే ప్రకటనతో ఎంతో మందిలో ఆత్మస్థైర్యం..నమ్మకం కలిగించిందన్నారు. 

11:30 - November 17, 2017
11:27 - November 17, 2017

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. సుచిత్ర చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. హెల్మెట్ పెట్టుకొంటే ప్రాణాలతో బయటపడే వారని తెలుస్తోంది. ప్రమాద ఘటనను బట్టి చూస్తుంటే తెలుస్తోంది.

ఆర్మూర్ కు చెందిన అనీల్, రతన్, అమన్ లు అల్వాల్ నుండి బోయిన్ పల్లికి వెళుతున్నారు. అతివేగంగా పల్సర్ బైక్ నడపడంతో సుచిత్ర వద్ద అదుపు తప్పింది. వేగంగా డివైడర్ ను కొట్టడంతో వారి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే వీరు మృతి చెందారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

11:09 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు విపక్ష సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపుపై ఆయన చర్చిస్తున్నారు. 50 రోజులు సభలు జరుపుతామని..విపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం ఒక్కసారిగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. శాసనసభను నేటితో ముగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విపక్ష సభ్యులతో మాట్లాడి ఒప్పించే బాధ్యత మంత్రి హరీష్ రావు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం జానారెడ్డి ఛాంబర్ లో జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. కానీ సభ ముగింపు విషయంలో కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ అభివృద్ధిపై సమయం ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా ఇందుకు మంత్రి హరీష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగించేందుకు బీజేపీ..టిడిపి పార్టీలు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. 

11:05 - November 17, 2017

విశాఖపట్టణం : అగ్రిటెక్‌ సదస్సు నేడు ముగియనుంది. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. బిల్‌గేట్స్‌కు స్వాతగం పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముగింపు సమావేశంలో సీఎం చంద్రబాబుతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు. ఇప్పటికే అగ్రిటెక్ ప్రాంగణాన్ని పలువురు మంత్రులు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పలు స్టాళ్లను సందర్శిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ఆధునాత సాంకేతికతను జోడించి రైతులు ఎలా అభివృద్ధి చెందాలి ? ఇందుకు అనుసరించాల్సిన విధానం ఏంటీ ? అనే దానిపై వివరించారు. నాలుగు వేల మంది ప్రతినిధులు ఇక్కడకు వచ్చారు. 269 మంది నూతన శాస్త్రవేత్తలు తమ ప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్ గేట్ ఇక్కడకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకోనుంది. మిలిందా గేట్స్ శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని అందించే దానిపై రైతులకు తర్ఫీదు ఇవ్వనుంది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర భవితవ్యం మారే అవకాశం ఉందని ప్రభుత్వ యోచిస్తోంది. 

ఎంబీసీల సమస్యలపై డిసెంబర్ 3న సమావేశం - కేసీఆర్...

హైదరాబాద్ : ఎంబీసీల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎంబీసీల అభివృద్ధిపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. సెంబర్ 3వ తేదీన శాసనసభలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, చర్చ జరిగితే స్పష్టత వస్తుందన్నారు. నవంబర్ చివరి మాసంలో ఈ వివరాలను సభ్యులకు పంపడం జరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

సింగపూర్ మంత్రితో సీఎం బాబు భేటీ...

విజయవాడ : వెలగపూడిలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాజధానిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో మేలో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ రెండో సమావేశం జరుగుతోంది. 

10:57 - November 17, 2017

హైదరాబాద్ : ఎంబీసీల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎంబీసీల అభివృద్ధిపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. సమస్యలు తెలుసుకొనేందుకు బీసీ కమిషన్ నియమించడం జరిగిందని, వారు నివేదిక ఇచ్చారని సభకు తెలియచేశారు. ఎంబీసీ వెనుకబాటు తనాన్ని ప్రభుత్వం గుర్తించిందని..అందుకే కార్పొరేషన్ ను నియమించడం జరిగిందన్నారు. అత్యధిక జనాభా బీసీలని..వారి సంక్షేమానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి వేరేది లేదన్నారు. బీసీ డిపార్ట్ మెంట్ ఇచ్చిన వాటితో సర్వ సమగ్ర వివరాలతో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఎంత ? ఖర్చు పెట్టింది ఎంత ? ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఎంంటీ ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చకు ప్రభుత్వం సానుకూలమన్నారు. ఇందుకు డిసెంబర్ 3వ తేదీన శాసనసభలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, చర్చ జరిగితే స్పష్టత వస్తుందన్నారు. నవంబర్ చివరి మాసంలో ఈ వివరాలను సభ్యులకు పంపడం జరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

10:56 - November 17, 2017

విజయవాడ : వెలగపూడిలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాజధానిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో మేలో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ కమిటీ రెండో సమావేశంగా చెప్పవచ్చు. ఇందులో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు నారాయణ, యనమలలు కూడా పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణంపై వీరు చర్చిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్దిని సింగపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అభివృద్ధి..పరిస్థితిపై చర్చిస్తున్నారు. 1691 ఎకరాల్లో మే నెలలో సింగపూర్ కన్సార్టియంతో స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా ఒప్పందం జరిగింది. మౌలిక వసతులు..పరిశ్రమలు ఏర్పాటు చేయడం..తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే నెలలో మొదటి సమావేశం జరిగింది. మరోసారి ఈ సమావేశం శుక్రవారం నాడు జరుగుతోంది. ఐదు..ఆరు ఎకరాల్లో గన్నవరం నుండి సింగపూర్ కు నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించారు. దీని అమలుపై కూడా సమీక్షించనున్నారు. 

ఇంటిగ్రేటెడ్ బాధితుడు మృతి...

శ్రీకాకుళం : సంతకవిటి (మం) ఎస్.ఆర్. ఆగ్రహారంలో ఇంటిగ్రేటెడ్ బాధితుడు కన్నం నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటిగ్రేటెడ్ కంపెనీలో రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురి కావడం..గుండెపోటుతో మృతి చెందాడు. 

10:16 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలు అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎంబీసీల సమస్యలపై ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 54 శాతం ఉన్నట్లు సీఎం కేసీఆర్ ఆనాడు సభలో ప్రకటించారని, అందులో వెనుకబడిన కులాలకు న్యాయం చేస్తామని పేర్కొంటూ ఎంబీసీ ఏర్పాటు చేస్తామని..వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు. ఒక దుర్భర జీవితాలను వీరు గడుపుతున్నారని..ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకం..కార్యక్రమాల్లో వీరు భాగస్వామ్యం అవడం లేదన్నారు. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారని, ఎంబీసీ విషయంలో బీసీ కమిషన్ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్లు సమాచారం ఉందన్నారు. 113 కులాలున్న తెలంగాణలో సామాజిక..ఆర్థిక స్థితి గతులను అధ్యయనం చేయాలని లక్ష్మణ్ సూచించారు. 

10:13 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా విమర్శించారు. ఎంబీసీల సమస్యపై ఆయన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకంలో వీరు భాగస్వాములు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష గురవుతున్న ప్రజల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకొచ్చేందుకు 'మహాజన పాదయాత్ర' జరిగిందని..ఈ పాదయాత్ర ఫలింగా ఎంబీసీలపై పలు వరాలు కురిపించిందని గుర్తు చేశారు. ఎంబీసీలకు వెయ్యి కోట్లు కేటాయించారని..ఎంబీసీల జాబితా ప్రకటిస్తామని..ఇటీవలే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ నిధులు ఇంతవరకు కేటాయించలేదని, ఎంబీసీల ప్రాధాన్యత క్రమాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదని విమర్శించారు. ఎంబీసీలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 

తెలంగాణ అసెంబ్లీ ముగింపు నేడు ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయా ? పొడిగిస్తారా ? అనేది తెలియరావడం లేదు. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ పర్యాటక శాఖలో కోల్డ్ వార్...

విజయవాడ : పర్యాటక శాఖలో కోల్డ్ వార్ జరుగుతోంది. నిపుణులు లేకుండానే బోటింగ్ లకు అనుమతినిస్తున్నట్లు..కృష్ణా నదిలో తిరిగే ఒక్క బోటుకు అనుమతి లేదని నిర్ధారించారు. జలవనరులు...పర్యాటక శాఖలోని కీలక అధికారులు నాయకుల కనుసన్నల్లోనే ప్రైవేటు బోటుల నిర్వాహణ జరుగుతోందని తెలుస్తోంది. తమ ప్రమేయం లేకుండానే సస్పెండ్ చేశారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనితో సమ్మె చేయాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

ఖమ్మం కాపు సమారాధన గందరగోళం..

భద్రాద్రి : జిల్లాలో మున్నూరు కాపు నేతల కాపు సమారాధన గందరగోళంగా మారిపోయింది. ఇద్దరు నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. వనమా వెంకటేశ్వరరావు, యడవల్లి కృష్ణలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 

09:43 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయా ? పొడిగిస్తారా ? అనేది తెలియరావడం లేదు. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు జరుపనిస్తామని, 50 రోజుల పాటు కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ ఒక్కసారిగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. శుక్రవారం బీఏసీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలా ? పొడిగిస్తే ఎన్ని రోజులు ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని..ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు కొనసాగే అసెంబ్లీలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలిచ్చాయి. గ్రేటర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై బీజేపీ..ప్రజా ఉద్యమాల మీద నిర్భందం, ధర్నా చౌక్ ఎత్తివేతపై సీపీఎం...విద్యుత్ పనుల్లో రైతులకు నష్టపరిహారంపై టిడిపి..లు వాయిదా తీర్మానాలిచ్చాయి. 

09:37 - November 17, 2017

భద్రాద్రి : జిల్లాలో మున్నూరు కాపు నేతల కాపు సమారాధన గందరగోళంగా మారిపోయింది. ఇద్దరు నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. వనమా వెంకటేశ్వరరావు, యడవల్లి కృష్ణలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కాపులందరూ ఒకరి అభివృద్ధికి మరొకరు సాయపడాలని వెంకటేశ్వరరావు సూచించారు. ఒకరే అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదని యడవల్లి కృష్ణ వాదించారు. దీనితో వెంకటేశ్వరరావు వేదికపైనే నిరసన వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం..తోపులాట చోటు చేసుకుంది. దీనితో కాపు సమాధారన గందరగోళంగా తయారైంది. అక్కడనే ఉన్న నేతలు ఇరువురిని సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

09:14 - November 17, 2017

కరీంనగర్ : పత్తి కూలీల జీవితాలను ఓ ట్యాంకర్ ఛిద్రం చేసింది. కూలీ పనులు కోసం వెళుతున్న పత్తి కూలీలు అనంతలోకాలకు వెళ్లిపోయారు. కరీంనగర్ జిలాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఓ గ్రామం నుండి కొంతమంది పత్తి కూలీలు రోజు వారి కూలీ నిమిత్తం ఆటోలో వెళుతున్నారు. చింతకుంట కెనాల్ వద్ద మల్కాపూర్ బైపాస్ రోడ్డుపై వేగంగా వస్తున్న ట్యాకర్ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. దీనితో ఆటోలో ఉన్న దేవస్త, అనిత, లలిత, ఆటో డైవర్ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:56 - November 17, 2017

ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెరిగింది ట్రెండ్ మారింది ట్రెండ్ కి తగ్గట్టుగానే పబ్లిసిటీ యాంగిల్స్ మారాయి. స్టార్ హీరో సినిమాలు అయినా చిన్న సినిమాలు అయినా పబ్లిసిటీ లేకపోతే ఆడియన్స్ కి రీచ్ అవ్వడం కష్టంగా మారింది తన సాంగ్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. మహేష్ బాబు హీరో గా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో ప్రతి పాట దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ కేర్ తీస్కొని చేసాడట. అంటే స్టార్ ని బట్టి కేర్ మారుతుందా అంటే ఆలా అని కాదు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు ట్యూన్స్ ఎలా ఇవ్వాలో దేవి శ్రీ ప్రసాద్ కి బాగా తెలుసు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీమంతుడు సినిమా తరువాత గ్రామాలని కూడా దత్తత తీసుకోవొచ్చు అనే థాట్ ని స్ప్రెడ్ చేసారు ఫిలిం యూనిట్.

తన అందంతో అభినయం తో ఆకట్టుకునే హీరోయిన్ ఆండ్రియా. తమిళ్ లో హిట్ సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు తెలుగు ఐడియన్సు కి కూడా పరిచయమే. ఇటీవలే 'డిటెక్టివ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ఆండ్రియా. మహేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'భరత్ అను నేను'లో ఆండ్రియా ఓ పాట పాడనుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సింగర్లను తీసుకొచ్చి పాటలు పాడించడం దేవిశ్రీ ప్రసాద్ కు అలవాటు ఇప్పుడు ఆండ్రియా వొంతు వచ్చింది. ఆండ్రియా తారామణి అనే తమిళ్ సినిమాతో యూత్ ని ఈ మధ్య బాగా ఆకట్టుకుంది.

08:52 - November 17, 2017

మా సమస్యలు ఇప్పటికన్న పరిష్కరించాలే అని కాంట్రాక్ట్ ఉద్యోగులు హోమం జేశి మరీ నిరసన తెలియచేస్తున్నారు. కల్వకుంట్ల కేటీఆర్ ఇలాకాలలో జరుగుతోంది. పద్దెన్మిది రోజులు వట్టి తాము నిరసన తెల్పుతుంటే.. కనీసం పల్కరిచ్చినోడు లేడని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (విశ్లేషకులు), రాజమోహన్ (టీఆర్ఎస్), పున్న కైలాశ్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:33 - November 17, 2017

సినిమా అంటే అదో రంగుల ప్రపంచం. వారసత్వం ఉన్నత మాత్రానా సరిపోదు. టాలెంట్ ఉండాలి. మంచి స్టోరీ లైన్స్ తో ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి. తన కెరీర్ స్టార్టింగ్ లోనే చతికల పడ్డ హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ ని టచ్ చెయ్యడానికి కాన్ఫిడెంట్ గ వస్తున్నాడు. తన ఫస్ట్ మూవీ రెజ్యూల్ట్స్ తో కొంచం తికమక పడ్డ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం లో తన తండ్రి సలహాలు గట్టిగా తీసుకుంటున్నాడంట. అఖిల్ ఫస్ట్ ఫిలిం అఖిల్ కావడం ఆ సినిమా ఆశించినంత హిట్ కాకపోవడం తో నిరాశ చెందారు ఫిలిం యూనిట్. బ్యాక్ గ్రౌండ్ ఉండీ కూడ ఒక హిట్ సినిమా కోసం తెగ తాపత్రేయ పడుతున్నాడు నాగార్జున వారసుడు అఖిల్. అఖిల్ కి యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్నా రావట్లేదా అని అనుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ కి మనం లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ హలో అనే సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. హలో చిత్ర యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు. అందులో భాగంగా న‌వంబ‌ర్ 16న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సినిమా 22న విడుద‌ల కానుంది. మనం సినిమాలో మంచి డైరెక్టోరియల్ స్కిల్స్ చూపించిన విక్రమ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఢిల్లీకి రానున్న ఒబామా...

ఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీకి రానున్నారు. ఒబామా ఫౌండేషన్ నిర్వహిస్తున్న టౌన్ హాల్ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నాడు. డిసెంబర్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగనుంది. 

క్రైస్తవుల చలో అసెంబ్లీ...

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ 17వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిల భారత క్రైస్తవ సంఘాల సమాఖ్య ప్రకటించింది. 

07:51 - November 17, 2017

ఈత నేర్చిన చాప ఏ చెర్లైనా ఈతగొడ్తది.. అంతేనా..? మరి ఒక పార్టీనుంచి జంపుగొట్టినోళ్లు ఇంకో పార్టీలకు గూడ కొట్టరన్న గ్యారంటి ఏంది..?ఒకప్పుడు మీడియాను జూస్తె ప్రభుత్వాలు భయపడేటియట.. ఇప్పుడు తెలంగాణల ప్రభుత్వాన్ని జూశి మీడియా భయపడ్తున్నదంటున్నడు అంబర్పేట అన్మంతన్న...తెలంగాణల మాదిగల మీద మళ్లొక కుట్ర సుర్వైందా..?తెలంగాణల విద్యార్థులంత కేసీఆర్ ఎంటనే నడ్వాలనుకుంటున్నరట..ప్రభుత్వానికి ఏమన్న శిగ్గుశరం.. ఇజ్జత్ మానం ఉంటే.. ఒకప్పుడు బండి ఇంటిబైటుంటే.. అరేయ్ పోరడా బండి ఇండ్ల వెట్టురా దొంగలు తిర్గుతున్నరట ఆయింత ఎత్కపోగాళ్ల అని ఇంట్ల వెట్టిపిస్తుండే.. పోలీసోళ్లు గూడ.. ఎప్పుడన్న ఒకనాడు మంచిపనిజేస్తుంటరమ్మా..గీ ముచ్చట్లు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి....

ఆగస్టా హెలికాప్టర్ లపై సుప్రీం విచారణ..

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలిక్యాప్టర్ల స్కాంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అగస్టా హెలిక్యాప్టర్లనే ఎందుకు కొనాలనుకుంటున్నారని ...ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారని సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

07:17 - November 17, 2017

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలిక్యాప్టర్ల స్కాంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అగస్టా హెలిక్యాప్టర్లనే ఎందుకు కొనాలనుకుంటున్నారని ...ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారని సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన ఫైలును వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. చీఫ్‌ సెక్రెటరీ రాసిన నోట్‌లో హెలిక్యాప్టర్‌ కొనుగోలుపై ప్రత్యేకంగా ఏ కంపెనీ పేరు సూచించలేదని... టెండర్‌ మాత్రం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కే జారీ చేయడం వెనక మతలబేంటని కోర్టు నిలదీసింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నిర్ణయించిన ధర కన్నా...ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం హెలిక్యాప్టర్‌ను ఎక్కువ డబ్బులిచ్చి కొనుగోలు చేసిందని...అందుకే టెండర్‌లో వేరే కంపెనీల ప్రస్తావన లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ కోర్టుకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, జార్ఖండ్, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాలు అగస్టా హెలిక్యాప్టర్ల కొనుగోలులో కుంభకోణానికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ... స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది.

07:15 - November 17, 2017

ఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. యూపిఏ-2 హయాంలో 126 రాఫెల్‌ జెట్‌ విమానాలను టెక్నాలజీతో సహా 90 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. కాగా మోది ప్రభుత్వం టెక్నాలజీ లేకుండానే కేవలం 36 రాఫెల్‌ విమానాలను 60 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఏ హయాంలో కన్నా మోది ప్రభుత్వం మూడింతల డబ్బు ఎక్కువ పెట్టిందని...దీని వెనక పెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను ఫ్రాన్స్‌ ఖండించింది. యూపిఏ-2 హయాంలో 126 రాఫెల్‌ జెట్‌ విమానాలను టెక్నాలజీతో సహా 90 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ డీల్‌ మరుగునపడింది. 2015లో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోది- ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌తో 36 రాఫెల్‌ జెట్‌ విమానాలను 58 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదికూడా టెక్నాలజీతో సంబంధం లేకుండా ఒప్పందం చేసుకున్నారు. 2012లో యూపీఏ హాయంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఒక్కొక్క రాఫెల్‌ విమానంపై మోది ప్రభుత్వం 952 కోట్లు ఎక్కువగా వెచ్చించిందని ఆరోపిస్తోంది.

మేక్‌ ఇండియాలో భాగంగా భారత్‌కు ఫ్రాన్స్‌ అందజేసే రాఫెల్‌ జెట్లలో కొన్నింటిని భారత్‌లోనే అసెంబుల్‌ చేసి అందించాలి. దీంతో భారత్‌కు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌... ఫ్రాన్స్‌కు చెంది డసాల్ట్‌ కంపెనీలో 30 వేల కోట్ల భాగస్వామ్యాన్ని తీసుకుంది. అనిల్‌ అంబానీ నేతృత్వంలోని ఇండస్ట్రియల్‌ గ్రూప్‌ రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌కు లాభం చేకూర్చేందుకు మోది ప్రభుత్వం కావాలనే డసాల్ట్‌లో భాగస్వామిగా రిలయన్స్‌కు అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలపై రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ తీవ్రంగా స్పందించింది. 2012 ధరలకు 2016 ధరలకు తేడా ఉండదా... అని కాంగ్రెస్‌ను ప్రశ్నించింది. ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపరంగా చర్యలకు వెళ్తామని కాంగ్రెస్‌ పార్టీని రిలయన్స్‌ హెచ్చరించింది. కాంగ్రెస్‌ ఆరోపణలు నిరాధారమైనవని ఫ్రాన్స్‌ ఖండించింది. పారదర్శక పద్ధతిలోనే రిలయన్స్‌ డసాల్ట్‌లో భాగస్వామి అయిందని పేర్కొంది. 2016 జూన్‌లో మోది ప్రభుత్వం రక్షణ రంగంలో 49 శాతం ప్రైవేటు పెట్టుబడులను అనుమతించిన విషయం తెలిసిందే.

07:13 - November 17, 2017

ఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావతి చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్‌ కర్ణిసేన ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. తాము మహిళలను గౌరవిస్తామని...కానీ మమ్మల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే... శూర్పనఖ ముక్కును కోసినట్లే దీపికా పదుకొనే ముక్కును కోసేస్తామని హెచ్చరించింది. సినిమా రిలీజ్‌ను వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 1న కర్ణిసేన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ సినిమా విడుదలైతే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సినిమాకు క్లీన్‌చిట్ ఇచ్చే ముందు ప్రజల ఆందోళన, వాళ్ల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.

07:10 - November 17, 2017

ఖమ్మం : ఎన్నో కష్టాలు.. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. అనుకున్న స్థాయికి చేరుకున్నారు. సర్కారు బడుల్లోనే చదువుకుని... ప్రభుత్వ అధికారిగా ఎదిగారు. ఆయన తల్లి ఆకాంక్షను నెరవేర్చారు. ఆయనే డీజీపీ మహేందర్‌రెడ్డి.. నేడు ఆయన అభివృద్ధిని చూసి .. ఊరు ఊరంతా... ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అవరోధాలను, అడ్డంకులను దాటుకుని... అన్నింటా విజయం సాధించిన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డి. కృషికి, పట్టుదలకు, నిబద్ధతకు ఫలితంగా.. ఆయన నేడు డీజీపీ స్థాయికి ఎదిగారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లోనే ఆయన చదువునంతా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా.. కూసుమంచి మండలంలోని కిష్టాపురానికి చెందిన మహేందర్‌రెడ్డి 1986లో ఐపీఎస్‌ అధికారి అయ్యారు. అనేక చోట్ల పనిచేసి ఉన్నతాధికారుల వద్ద, అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో శభాష్‌ అనిపించుకున్నారు.

మహేందర్‌రెడ్డి అనేకస్థాయిల్లో విధులు నిర్వహించారు. మహేందర్ రెడ్డి ఉద్యోగ ప్రస్థానం.. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో ఏఎస్పీగా ప్రారంభమైంది. తరువాత గుంటూరు, నిజామాబాద్‌, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, హైదరాబాద్‌ తూర్పు డీసీపీగా, పోలీసు అకాడమీ ఛైర్మన్‌గానూ, ఇంటెలిజెన్స్‌ ఐజీగానూ, సైబరాబాద్‌ కమిషనర్‌గానూ, హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేశారు.

మహేందర్‌రెడ్డి తన విధుల నిర్వహణలో నిబద్ధతను పాటించేవారు. పైరవీలకు తావివ్వకుండా... తన స్థాయిని తక్కువ చేసుకోకుండా ఒక్కో మెట్టు ఎదిగారు. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహేందర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించడంతో... ఆయన కుటుంబ సభ్యులు.. గ్రామస్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కృషి తగ్గ ఫలితం దక్కిందని..అంటున్నారు. మహేందర్‌రెడ్డి వల్ల.. కిష్టాపురం గ్రామానికి గుర్తింపు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి... డీజీపీగా ఎంపికై... తమ గ్రామానికి పేరు తెచ్చారని కిష్టాపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

07:07 - November 17, 2017

హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భాగ్యనగరం వేదికవుతోంది. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌కు నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహించే.. గ్లోబల్‌ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్‌ ఈ నెల 28 నుంచి నగరంలో మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకట్రంప్‌ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు చెందిన వారు 15 వందల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని హాజరుకానున్నారు.

2018లో కూడా పలు అంతర్జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. హెచ్‌ఐసీసీ వేదికగా 78వ స్కాల్‌ అంతర్జాతీయ పర్యాటక సదస్సు జరగనుంది. అలాగే జనవరిలో ఓయూలో 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జరగనుంది. జీవ పరిణామక్రమానికి సంబంధించిన జీవకణ సదస్సు జనవరి 27 నుంచి 31 వరకు నగర శివారులోని లియోనియా రిసార్ట్‌లో జరగనుంది. గతంలో పోల్చుకుంటే... హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పన భారీగా పెరిగింది. అలాగే శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్‌ సేఫ్‌ ప్లేస్‌గా నిలవడంతో ... అందరి దృష్టి భాగ్యనగరంపై పడుతోంది.  

28 నుండి అంతర్జాతీయ సదస్సు...

హైదరాబాద్ : అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహించే.. గ్లోబల్‌ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్‌ ఈ నెల 28 నుంచి నగరంలో మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకట్రంప్‌ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు చెందిన వారు 15 వందల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని హాజరుకానున్నారు. 

07:04 - November 17, 2017

శ్రీకాకుళం : భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలు వణికిపోతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడోనంబర్‌ ప్రమాదహెచ్చకలు జారీ చేశారు.

భారీవర్షాలతో శ్రీకాకుళంజిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గ్రామాల చుట్టూ నీరుచేరడంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కుండపోతగా వర్షం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాలతో పలు గ్రామాల్లో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. జీవనాధారం అయిన జీవాలు చనిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని గొర్రెల కాపరులు వాపోతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరిపంట గంగపాలైంది. నిండామునిగిన పంటపొలాన్ని చూసి అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాల్లో సైతం పంటను కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. పొలం నుంచి నీటిని బయటికి పంపించేందుకు తిప్పలు పడుతున్నారు. తమ పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయాయని వజ్రపుకొత్తూరు మండల రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశగా 210 కిలోమీటర్ల దూరంలోనూ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చి క్రమంగా బలహీన పడుతుందని అధికారులు బెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

ఉత్తరాంధ్ర అతలాకుతలం..

శ్రీకాకుళం : భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. 

07:01 - November 17, 2017

పశ్చిమగోదావరి : పట్టిసీమ, నదుల అనుసంధానంతో సీఎం చంద్రబాబు అపర భగీరథుడుగా నిలిచిపోయారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రాలయసీమ వెనకబాటు తనానికి సాగునీరు లేకపోవడమే కారణమని మంత్రి లోకేష్‌ అన్నారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను పరిశీలించింది. పశ్చిమగోదావరి జిల్లాలోకి బస్సులు ప్రవేశించగానే విప్‌ చింతమనేని ప్రభాకర్‌ తన స్వగ్రామం దుగ్గిరాలలో అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. చింతమనేనికి పోటీగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు కొయ్యలగూడెం వద్ద స్వాగత విందు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పట్టిసీమ వెళ్లిన ప్రజాప్రతినిధులకు తమ ప్రాంతంలో పండిన పంట కంకులతో స్థానిక రైతులు ఘనస్వాగతం పలికారు.

గోదావరి నుంచి పంపులద్వారా నీటిని ఎత్తిపోసే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ పాయింట్‌కు వెళ్లి నీటివిడుదలను ఆసక్తిగా తిలకించారు. మంత్రి నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టిసీమ నీటిలో పూలు వేసి హారతి ఇచ్చారు. పట్టిసీమ, నదుల అనుసంధానంతో సీఎం చంద్రబాబు అపర భగీరథుడుగా నిలిచిపోయారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందనిచెప్పారు. రాలయసీమ వెనకబాటు తనానికి సాగునీరు లేకపోవడమే కారణమని మంత్రి లోకేష్‌ అన్నారు.

పట్టిసీమ పర్యటన అనంతరం 3గంటల ప్రాంతంలో ప్రజాప్రతినిధులు పోలవరం చేరుకున్నారు. అక్కడ నిర్మాణ పనులు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ తరఫున అందరికీ ఈ తరహా పర్యటన ఏర్పాటు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పోలవరం పర్యటన ముగిశాక ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి బస్సుల్లోనే విశాఖకు పయనమయ్యారు. 

06:57 - November 17, 2017

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సొమ్ములకు భద్రత లేదు. స్వామి హుండీలో భక్తులు వేసిన సొమ్ములకు దిక్కులేదు. కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పలుమార్లు రాజన్న సొమ్ములను కాజేస్తూ పలువురు పట్టుబడినా పట్టించుకునే నాధుడేలేరు. దేవుడిని భక్తులంతా భక్తిలో కొలుస్తారు. వరాలు కోరుతారు. కోరిన కోరికలు నెరవేర్చితే ఆ భక్తులు స్వామి వారికి కానుకల రూపంలో సమర్పించుకుంటారు. ఇలా వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించుకున్న కానుకులకు భద్రత లేకుండా పోతోంది.

వేములవాడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపులో తరచూ దొంతనాలు జరుగుతున్నాయి. హుండీ లెక్కింపులో పాల్గొంటున్న వారు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్వామి వారి సొమ్ములకే కన్నం వేస్తున్నారు. దీంతో దేవుడి కానుకలే భద్రత లేకుండా పోయింది. రాజన్న ఆలయ హుండీని ప్రతీసారి ఆలయ సిబ్బందితోపాటు కాంట్రాక్ట్‌ కార్మికులు, సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు లెక్కిస్తుంటారు. గత నెల హుండీ లెక్కింపులో కాంట్రాక్ట్‌ లేబర్‌ నోటిలో 18 గ్రాముల బంగారం పెట్టుకుని వెళ్తూ భద్రత సిబ్బందికి దొరికిపోయాడు. ఇది జరిగి నెల రోజులు కూడా కాకముందే.. ఈనెల 15న సత్యసాయి బాబా సేవా సమితి సభ్యుడు నారాయణ అనే వ్యక్తి స్వామి వారి నగదు తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 62వేల రూపాయలు నడుముకు కట్టుకుని వెళ్తుండగా పోలీస్‌లు చెక్‌చేసి పట్టుకున్నారు. హుండీ లెక్కింపు ప్రాంతంలో చుట్టూరా సీసీ కెమెరాలు ఉన్నాయి. నిఘా కళ్ల మధ్యే హుండీ లెక్కింపు జరుగుతుంది. అయినా తరచూ సిబ్బంది చేతివాటం ఘటనలు జరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. భక్తులు భక్తితో హుండీలో వేసిన కానుకలు దోచుకోవడం... భక్తిభావాన్ని దెబ్బతీస్తోంది. రాజన్న ఆలయంలో చేతివాటం, దొంగతనాలకు చెక్‌ పెట్టాలంటే ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ హోదా గల వారిని నియమించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దొంగతనాలకు చెక్‌పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

06:54 - November 17, 2017

హైదరాబాద్ : బల్దియాకు మెగా బడ్జెట్‌ను సిద్ధం చేశారు అధికారులు. గతేడాది కంటే 7,507 కోట్ల రూపాయలు పెంచి 13,150 కోట్ల భారీ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలను స్థాయి సంఘం ముందుంచారు. 2018-19 ఆర్థిక సంవ‌త్సరంలో అధిక నిధులను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకోసం ఖర్చుచేయనుంది బల్దియా. ఆ తర్వాత రోడ్ల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించనుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భారీ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టింది. గతంలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా.... 13,150 కోట్లతో అధికారులు బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌కు సంబంధించి ప్రతిపాదనలను స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. ఆస్తిపన్ను, రెవెన్యూగ్రాంట్లు, ఫీజులు, యూజర్‌ చార్జీలు, సేల్స్‌ , హైయర్‌ చార్జీలతో రెవెన్యూ ఆదాయం 3325 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. ఎస్టాబ్లిష్మెంట్‌ ఖర్చులు, పరిపాలన ఖర్చులు, ఆపరేషనల్‌తోపాటు మెయింటనెన్స్‌ చార్జీలు, వడ్డీచెల్లింపుల ఖర్చు 2675 అవుతుందని అంచనా వేశారు. ఇక 650 కోట్లు రెవెన్యూ మిగులుగా చూపించారు. ప్లాన్‌ గ్రాంట్స్‌, అప్పుల ద్వారా క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ 10,475 కోట్లు రాబట్టాలని బల్దియా టార్గెట్‌. ఇందులో ప్రభుత్వ ప్లాండ్‌ గ్రాంట్లు 8వేల కోట్లుకాగా.. అప్పుల ద్వారా 1802 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇక ప్రధానంగా క్యాపిటల్‌ ఎక్స్‌ పెండేచర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై ఖర్చుచెయ్యాలని నిర్ణయించారు.

బల్దియాకు వచ్చిన ఆదాయంలో 48శాతం పేదల హౌసింగ్‌ స్కీమ్‌ అయిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ఖర్చుచేయనుంది. అంటే దాదాపు 6317 కోట్ల రూపాయలు ఇందుకోసం వెచ్చించనుంది. ఇక రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌లో 17శాతం నిధులను కేటాయించనుంది. అంటే 2,224 కోట్లు ఇందుకోసం ఖర్చుచేయనుంది. ఎస్టాబ్లిష్ మెంట్స్ కోసం 11శాతం , ఆప‌రేష‌న్స్ అండ్ మెయింటేనేన్స్ కోసం 8శాతం నిధులను కేటాయించారు. మంచినీటి స‌ర‌ఫారా , మురుగునీటి నిర్వహణ కోసం 5శాతం నిధులు కేటాయించనుంది. డ్రైనేజీ కోసం 361 కోట్ల రూపాయలను జీహెచ్‌ఎంసీ ఖర్చుచేయనుంది. మిగిలిన 8శాతం నిధుల‌ను భూ నిర్వహణ, భవనాలు, పాలనాపరమైన అవసరాలకోసం ఖర్చు చెయ్యాలని డిసైడ్‌ అయ్యింది. బడ్జెట్‌ ఈ ఏడాది గతంకంటే 55శాతం పెరిగినప్పటికీ ప్రజలపై ఎలాంటి భారం వేయబోనంటోంది జీహెచ్‌ఎంసీ. రాబోయే రోజుల్లో పన్నులు పెంచే ఆలోచన లేదంటున్నారు మేయర్‌. ప్రభుత్వం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయనే ఆశాభావం గ్రేటర్‌ అధికారుల్లో వ్యక్తమవుతోంది. 

06:51 - November 17, 2017

హైదరాబాద్‌ : నగరంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాల వేగం పుంజుకోగా... మరికొన్ని ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల బస్తీవాసులు ఇళ్లు ఖాళీచేయడానికి ససేమిరా అంటున్నారు. సరైన పట్టా పత్రాలు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటే ఎలా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో స్వయంగా మేయర్‌ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. రాజధాని నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న బస్తీల్లోని ప్రజలను ఖాళీ చేయించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో గ్రేటర్‌ చాలాచోట్ల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. సున్నితమైన స్లమ్స్‌ల్లో మాత్రం కొన్నిచోట్ల నిర్మాణాలు జరుగుతుంటే.. మరికొన్న చోట్ల డబుల్‌ ఇళ్లకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్ని బస్తీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ముందుకురావడం లేదు. తాము ఖాళీ చేసిన తర్వాత నిర్మించిన ఇళ్లలో తమకు అవకాశం ఇస్తారో లేదోనన్నదే ఇందుకు ప్రధాన కారణం.

మెహ‌దీప‌ట్నం భోజ‌గుట్టలో రెవెన్యూ విభాగం జ‌రిపిన సోషియో ఎకనామిక్ స‌ర్వేలో 1850మందిని లబ్దిదారులుగా గుర్తించింది. 13ఎక‌రాలకు పైగా ఉన్న ఈ స్థలంలో 50బ్లాకుల్లో జీ-ప్లస్‌ టూ పద్దతిలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చెప‌ట్టాల‌ని నిర్ణయించారు. అయితే అక్కడ నివసిస్తున్న వారికి ప‌ట్టాలు కాని పొజిష‌న్ స‌ర్టిఫికేట్‌కానీ ఇవ్వకుండా ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నారు. దీంతో భోజగుట్ట వాసులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక నేతలు, కార్పొరేటర్‌ తమకు అన్యాయం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ జీవంసింగ్‌ ఇంటిని ముట్టించారు. పరిస్థితి చేజారి పోతుండడంతో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రంగంలోకి దిగారు. భోజగుట్ట బస్తీవాసులను శాంతింపజేసే పనిలో పడ్డారు. స్థానికులందరితో సమావేశమై... ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, లబ్దిదారులందరికీ ఇళ్లు ఇస్తామని హామీనిచ్చారు. మేయర్‌తో కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. కొందరిపేర్లే లిస్ట్‌లో ఉన్నాయని... మరికొందరి పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. ఏళ్ల తరబడి ఉన్నవారికి ఇళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. తమకు ఇళ్లురాకుంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు.

అగ్రిటెక్ సదస్సుపై రైతలు పెదవి విరుపు..

విశాఖపట్టణం: నగరంలో జరుగుతున్న అగ్రిటెక్‌ సదస్సుపై రైతులు పెదవి విరుస్తున్నాయి. సదస్సులో చెబుతున్న విషయాలు, చేసి చూపిస్తున్న ప్రయోగాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా లేవంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు సాంకేతిక వెన్ను దన్నుతో వ్యవసాయం వ్యయభరితంగా మారుతుందే కానీ... లాభసాటి కాదని తెగేసి చెబుతున్నారు.

06:48 - November 17, 2017

విశాఖపట్టణ: జరుగుతున్న అగ్రిటెక్‌ సదస్సుపై రైతులు పెదవి విరుస్తున్నాయి. సదస్సులో చెబుతున్న విషయాలు, చేసి చూపిస్తున్న ప్రయోగాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా లేవంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు సాంకేతిక వెన్ను దన్నుతో వ్యవసాయం వ్యయభరితంగా మారుతుందే కానీ... లాభసాటి కాదని తెగేసి చెబుతున్నారు. విశాఖలో జరుగుతున్నఅగ్రిటెక్‌ సదస్సులో రైతులకు హెటెక్‌ అగ్రికల్చర్‌ గురించి చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందంటూ గాల్లో ఎగిరే డ్రోన్లను చూపిస్తున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీ ల్యాబ్స్‌తో సాయిల్‌ టెస్ట్‌ అంటూ క్షేత్రస్థాయిలో చేసే పరీక్షలకు విరుద్ధమైన ప్రయోగాలు చేసి చూపిస్తున్నారు. మన వ్యవసాయ శాఖ భూసార పరీక్షా కేంద్రాలకు ఇంతటి టెక్నాలజీ ఉందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయం, సహకార సేద్యం అంటూ సదస్సులో ఊదరగొడుతున్నా... సాగునీరు, భూగర్భ జలాలు తోడేందుకు బోర్లు వంటి సౌకర్యలు లేని తమకు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయమైనా, సహకార సేద్యమైనా పాతిక ఎకరాలకుపైగా ఉండే ఆసాములు, భూస్వాములకు మినహా చిన్న కమతాల రైతులకు ఉపయోగపడదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.

స్రింకర్లు, డ్రోన్ల సాయంతో పురుగు మందలు పిచికారి చేయడం, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా వ్యవసాయ సమాచారం తెలుసుకునే విధానాలు ధనిక దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. జనాభా తక్కువ, భూ పరిమాణం ఎక్కువగా ఉండే దేశాల్లో చేసే వ్యవసాయ పద్ధతులు మన పరిస్థితులకు ఉపయోగపడవని చెబుతున్నారు. అగ్రికల్చర్‌ ఎస్టేట్లు ఉండే భూ కామందులకు మినహా, ఎకరాలు ఉండే చిన్న రైతులకు ఉపయోగపడేగా లేదంటున్నారు. మన రైతులకు పరుగు మందులు చల్లేందుకు సరైన స్ప్రేయర్లు కూడా లేవు. ఆధునిక టెక్నాలజీతో సదస్సులో చేసి చూపిస్తున్న భూసార పరీక్షలకు... మన వ్యవసాయ శాఖ వద్ద ఉన్న ప్రయోగశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సదస్సుకు వచ్చిన రైతులు వేలెత్తి చూపిసున్నారు.

వ్యవసాయ యాంత్రీకరణ వైపు రైతుల మొగ్గు చూపితే మంచి లాభాలు వస్తాయని సదస్సుకు హాజరవుతున్న కంపెనీలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాపార ధర్మంలో భాగంగా బడా కంపెనీలు పెద్ద రైతులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. కానీ పండించిన పంటలకు గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు... ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు కూడా అమలు కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
అగ్రిటెక్‌ సదస్సు దేశవాళీ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగాలేదని రైతులు విమర్శిస్తున్నారు. సహకార సేద్యం పేరుతో పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నా... భూమిపై హక్కులు కోల్పోయేందుకు రైతులు ఇష్టపడటంలేదు. ఈ విధానం బడా కంపెనీలకు లాభసాటి ఉంటుందేకానీ రైతులకు కాదంటున్నారు. ఈ సదస్సు కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఉందేకానీ, రైతులకు పనికొచ్చేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

06:46 - November 17, 2017

విశాఖపట్టణం : అగ్రిటెక్‌ సదస్సులో వ్యవసాయ యాంత్రీకరణలో నూతన అవిష్కరణలు ఆకట్టుకొంటున్నాయి. సంప్రదాయ సేద్యానికి ఆధునిక టెక్నాలజీని జోడిస్తే దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. వ్యవసాయం రంగంలో డ్రోన్లను ఉపయోగించడం నుంచి మట్టిసాయం లేకుండా పంటలు పండించే పద్ధతులకు వరకు సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్‌ సదస్సు వ్యవసాయ రంగంలో అద్భుతాలకు వేదికగా నిలుస్తోంది. రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణలు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడే ఉంటూ ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

వ్యవసాయ రంగలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం వలన చేకూరే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నారు. డ్రోన్ల వాడకంతో జరిగే ఉపయోగ విశదీకరిస్తున్నారు. ఆక్వా కల్చర్‌లో ఫీ ఫాగ్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ రకాల వైరస్‌లు, వ్యాధులతో తీవ్ర ఒడిదొడుకుల ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మట్టిలేకుండా పంటలు పండించే హ్రైడ్రో ఫోనిక్స్‌ టెక్నాలజీ కూడా అగ్రిటెక్‌ సదస్సులో అందర్నీ ఆకట్టుకొంటోంది. వ్యవసాయరంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసే యాప్‌లు కూడా అగ్రిటెక్‌ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

06:43 - November 17, 2017

విశాఖపట్నం : అగ్రిటెక్‌ సదస్సు నేడు ముగియనుంది. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్పు ముగింపు కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. బిల్‌గేట్స్‌కు స్వాతగం పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు. అగ్రిటెక్‌ సదస్సు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు. నిన్న రెండో జరిగిన జరిగిన సదస్సులో చంద్రబాబు నదుల అనుసంధానం పై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు.

ముగియనున్న అగ్రిటెక్ సదస్సు...

విశాఖపట్నం : అగ్రిటెక్‌ సదస్సు నేడు ముగియనుంది. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్పు ముగింపు కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. 

నేడు ఏపీకి సింగపూర్ మంత్రి..

విజయవాడ : సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 10.30గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. సింగపూర్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 

భారత్ - లంక టెస్టు మ్యాచ్...

కోల్ కతా : నేడు భారత్ - శ్రీలంక జట్ల మధ్య టెస్టు మ్యాచ్ కొనసాగనుంది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ తీర్పు...

ఢిల్లీ : అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ తీర్పు ఇవ్వనుంది. అమరావతి రాజధాని నిర్మాణంపై ఎన్జీటీలో ఫిర్యాదులు నమోదైన సంగతి తెలిసిందే. 

సీబీఐ కోర్టుకు జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తులు..తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ఒక రోజు విరామం ఇవ్వనున్నారు. 

జగన్ పాదయాత్రకు బ్రేక్..

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్రకు నేడు తాత్కలికంగా బ్రేక్ పడనుంది. సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించనున్నారు. 

Don't Miss