Activities calendar

18 November 2017

22:09 - November 18, 2017
22:07 - November 18, 2017
22:05 - November 18, 2017

వరంగల్ : భారతదేశంలోనే రెండున్నర లక్షల ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌-వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్దరించనున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

 

22:02 - November 18, 2017

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు డెడ్‌లైన్‌ పెట్టింది. 24 గంటల్లో కాంగ్రెస్‌ వైఖరేంటో స్పష్టం చేయాలని హెచ్చరించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పటీదార్లకు ఎన్ని స్థానాలు కేటాయిస్తున్నారో తేల్చాలని హార్దిక్‌ పటేల్‌ వర్గం డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పటీదార్‌ అనామత్‌ నేతలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. చర్చలకు రమ్మని పిలిచిన కాంగ్రెస్‌...తమతో సమావేశం కాకుండా అవమానించిందని పటేల్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో పటేళ్లకు 30 స్థానాలు కేటాయించాల్సిందిగా పీఏఏఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో అంతా సవ్యంగా జరుగుతుందని, విజయం తమను వరిస్తుందన్న ఆశాభావాన్ని హార్దిక్‌ పటేల్‌ వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌-పటీదార్‌ నేతల మధ్య వడోదరాలో సాయంత్రం మళ్లీ సమావేశం జరగనుంది.

 

21:58 - November 18, 2017

హైదరాబాద్ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 24న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల ఐక్య ఉద్యమ పోరాట కమిటీ పిలునిచ్చింది.  అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడంతో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ... ఛలో హైదరాబాద్‌గా మార్చినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి చెప్పారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసే వరకూ ఆందోళనలు కొనసాగిస్తానమని ఆయన అన్నారు. 

 

21:47 - November 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఎస్టీలపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు, ప్రతీ ఎస్టీ ఇంటికి, ఆర్వోఎఫ్ ఆర్ పట్టా ఉన్న వాటితో సహా ప్రతీ ఎస్టీ వ్యవసాయ దారుడికి విద్యుత్ కనెక్షన్ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి స్థానికులకే ప్రవేశం కల్పించే విధానం అమల్లోకి తెస్తామని స్టష్టం చేశారు. ఎస్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటెల రాజెందర్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఈ భేటీకి హాజరయ్యారు. 

 

21:45 - November 18, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య..లెజెండ్‌కు 9 నంది అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమిష్టి కృషి వల్లే లెజెండ్‌ సినిమాకు ఈ అవార్డులు వచ్చాయన్నారు. 

21:40 - November 18, 2017

హైదరాబాద్ : నంది అవార్డుల వివాదం మరింతగా ముదురుతోంది. రుద్రమదేవి సినిమాకు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని దర్శకుడు గుణశేఖర్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి అప్లై చేస్తే మూడు నెలలు కాలయాపన చేసి తన ఫైల్‌ను క్లోజ్‌ చేశారని గుణశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డుల ఎంపిక నుంచి బహిష్కరిస్తామనే నిబంధన సరైంది కాదన్నారు. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని.. ఈ నిబంధన కారణంగా చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత రాజశేఖర్ తీరును గుణ శేఖర్‌ తప్పుబట్టారు. ముందు బాహుబలితో పోటి పడ్డప్పుడు రుద్రమదేవి వెనకపడిందన్న కమిటీ కనీసం రెండో సినిమాగా అయిన అవార్డు ఇవ్వాల్సిందన్నారు. కానీ అవార్డులు సాధించిన ఏ సినిమాతోనూ రుద్రమదేవి పోటి పడలేకపోయిందని చెప్పటం బాధకలిగించిందన్నారు. అవార్డులు ప్రకటించిన తరువాత జీవిత రాజశేఖర్ చంద్రబాబు పాలన రాకింగ్ అంటూ కామెంట్ చేయటంతో ఆమె విశ్వసనీయతను కోల్పోయారన్నారు. 

 

21:37 - November 18, 2017

ఢిల్లీ : 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ వరల్డ్‌ 2017 కిరీటం దక్కింది. హర్యానాకు చెందిన మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. చైనాలోని సాన్యా సిటీలో జరిగిన ఈ వేడుకలో 118 దేశాల సుందరీమణులను వెనక్కి నెట్టి... మానుషి మిస్‌ వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో మిస్ మెక్సికోకు రెండోస్థానం, మిస్ ఇంగ్లండ్‌కు మూడోస్థానం లభించాయి.

 

21:32 - November 18, 2017

ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటనపై స్పందించారు. అవార్డుల ప్రదానంపై అసహనం వ్యక్తం చేశారు. తను తీసిన సినిమాకు అవార్డు రానందుకు బాధగా ఉందన్నారు. కడుపు మండి మాట్లాడుతున్నానని చెప్పారు. జూరీకి ఉన్న అర్హత ఏంటీ అని ప్రశ్నించారు. సినిమాలోని ఏ ఏ అంశాల ఆధారంగా నంది అవార్డులు ఇస్తారో చెప్పాలన్నారు. పలుకుబడి ఉన్నవాళ్లకే నంది అవార్డులు ఇచ్చారని విమర్శించారు. జ్యూరీ, ప్రభుత్వం అవార్డులను పంచుకున్నారని ఆరోపించారు. సినిమా అనేది ఎంటర్ టైన్ మెంట్ తో కూడుకున్న వ్యాపారమన్నారు. బాలకృష్ణకు అసలేం తెలియదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అనంతసాగరం తహశీల్దార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి

నెల్లూరు : అనంతసాగరం తహశీల్దార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి చేసింది. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో వెంకటరమణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  

 

21:16 - November 18, 2017

కొల్వులకై కొట్లాటకు సిద్దంగున్న జేఏసీ, కొత్త రాజకీయం సుర్వైందన్న చంద్రాలు, కలెక్టరేట్ ఆఫీస్ ముంగట టెన్ టీవీ నిఘా, నల్లగొండకు తమ్ముని లెక్కైన మరో జిల్లా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం

కర్నూలు : మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం నెలకొంది. ఐరన్ ఫ్యాక్టరీ కూల్చివేతలో ప్రమాదం చోటుచేసుకుంది. జిలెటిన్ స్టిక్ పేలి ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

20:52 - November 18, 2017

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చరణ్ దీప్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా చరణ్ దీప్   మాట్లాడారు. గరుడవేగ సినిమా విషేశాలను తెలిపారు. తన సినీ కెరీర్ ను వివరించారు. తన సినీ అనుభవాలను చెప్పారు. సినీ రంగంలోకి ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాలను తెలిపారు. హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్ల వల్లే తనకు గరుడవేగ సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. మొదట తనను పూరీ జగన్నాథ్ రిజెక్ట్ చేశారని చెప్పారు. 
ఆ తర్వాత పూరీజగన్నాథ్ లోఫర్ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. తాను చాలా లేజీ పర్సన్ అని అన్నారు. చరణ్ దీప్ అంకుల్, ఆంటీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:17 - November 18, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఇండి ట్రేడ్‌ స్కామ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. వందలకోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఇండి ట్రేడ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్కాము సూత్రధారి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలు మరింత సంచలనం రేపుతున్నాయి.  

శ్రీకాకుళం జిల్లా రాజాం పరిసర ప్రాంతాల్లో ఇండి ట్రేడ్  కంపెనీ 187 కోట్ల రూపాయలు వసూలు చేసింది. షేర్ మార్కెట్ లో పెట్టుబడి, అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో  సంతకవిటి, రేగిడి, రాజాం మండలాలకు చెందిన వేలాది మంది వందలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. తీరా ఇప్పుడా సంస్థ ఐపీ పెట్టేయడంతో  పెట్టుబడులు పెట్టినవారంతా లబోదిబోమంటున్నారు. మందరాడ గ్రామానికి చెందిన టంకాల శ్రీరామ్ మాయమాటలు చెప్పి ఈ స్కామ్‌కు సూత్రధారిగా మారాడు. 

సంతకవిటి మండలం ఎస్.ఆర్.అగ్రహారం  గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు రూ.40 లక్షల రూపాయలు ఇండి ట్రేడ్‌లో పెట్టుబడి పెట్టాడు. కంపెనీ బోర్డు తిప్పేసిందని తెలియడంతో కన్నం నాయుడు గుండెపోటుతో మరణించాడు. మరోవైపు వందల కోట్లు మింగేసిన నిందితుడు టంకాల శ్రీరామ్‌ను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నంనాయుడు మృతదేహంతో సంతకవిటి పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించారు. బాధితులందరికీ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు బాధితుల పక్షాన నిలిచారు. డిపాజిట్‌దార్లకు న్యాయం జరిగేవరకూ వారి తరపున పోరాడతానని స్పష్టం చేశారు. మరోవైపు 187 కోట్లు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన బ్రోకర్ శ్రీరామ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.  అధికార పార్టీ నేతలతో అతనికున్న అనుబంధం కారణంగా ఓ మంత్రికి, రాజాం పరిసర టీడీపీ నేతల మెడకు ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితులకి న్యాయం చేయాలని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు. 

మొత్తానికి  ఇండి ట్రేడ్ సంస్థ నిర్వాకం అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతోంది. దీనిపై అధికారులు పూర్తి స్ధాయిలో విచారణ జరిపి నిందితుడు శ్రీరామ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

20:13 - November 18, 2017

విశాఖ : ఏపీ రాజధాని నిర్మాణంలో ఎన్జీటీకి తప్పుడు నివేదిక సమర్పించిన అధికారులు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు సామాజిక వేత్త బిలిశెట్టి సత్యనారాయణ. వ్యవసాయ భూములను బంజరు భూములుగా పేర్కొంటూ ఎన్జీటీకి తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపించారు. ఈ నెల 26న అమరావతిలో రాజధాని నిర్మాణంపై సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధానికి వరద ముప్పు ఉందో లేదో వ్యవసాయం చేస్తున్నారో లేదో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

20:10 - November 18, 2017

అనంతపురం : జిల్లాలోని కదిరి మున్సిపల్‌ పరిధిలోని కుటాగుల్లలో రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించాయి. బాధితులకు నష్టపరిహారం చెల్లించేవరకు కదిలేదిలేదని తేల్చి చెప్పాయి. సమస్యను తెలియజేయడానికి వచ్చిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. జిల్లా కలెక్టర్‌, కదిరి ఆర్డీవోతో ఫోన్‌లో సంభాషించగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాలు ఆందోళన విరమించాయి. 

భారత్ కు మిస్ వరల్డ్ 2017 కరీటం

ఢిల్లీ : భారత్ కు మిస్ వరల్డ్ 2017 కరీటం దక్కింది. మిస్ వరల్డ్ 2017గా మానుషి చిల్లర్ నిలిచింది. హర్యానాకు చెందిన మానుషి చిల్లర్...39 మందిలో విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ లభించింది. 

 

20:00 - November 18, 2017

హైదరాబాద్ : లండన్‌లోని ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం ఎక్సలెన్స్‌ అవార్డును హీరో.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తానెప్పుడూ సామాజిక న్యాయంవైపే నిలబడతానని అన్నారు. 'భారత్‌లో పెట్టుబడికి అవకాశాలు' అనే అంశంపై పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. భారత్‌ భిన్నత్వానికి నిదర్శనమని, ధనవంతులు, పేదవారు ఇద్దరికీ అక్కడ చోటు ఉంటుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తనకు లభించిన అవార్డు నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతీ భారతీయుడికీ అంకితం ఇస్తున్నట్లు పవన్‌ తెలిపారు. అంతకుముందు లండన్‌లోని అంబేడ్కర్‌ స్మారక మందిరాన్ని పవన్‌కల్యాణ్‌ సందర్శించారు. 

 

19:56 - November 18, 2017

ప.గో : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడితే అభాసుపాలవుతారని హెచ్చరించారు. సీబీఐ కోర్టుకు సహకరించి త్వరగా జైలుకి వెళ్లాలని మంత్రి కేఎస్‌ జవహార్‌ ప్రతిపక్షనేత జగన్‌కు సూచించారు. 

 

19:53 - November 18, 2017

గుంటూరు : ప్రపంచం మెచ్చే గ్రీన్‌, బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన... ప్రకృతిని కాపాడుకుంటే.... ప్రకృతే మనల్ని కాపాడుతుందన్నారు. అభివృద్ధికి కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని...ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పచ్చదనం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తూళ్ళూరు మండలం వెంకటపాలెం-మందడం గ్రామాల మధ్య సీడ్‌యాక్సెస్‌ రహదారిలో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. అంతకుముందు రావి-వేప మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పైలాన్‌ ఆవిష్కరించి.. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 

ఆ తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు... సీడ్‌యాక్సెస్‌ రోడ్డుపై ప్రయాణిస్తుంటే నందనవనంలో వెళ్తున్నామన్న అనుభూతికలగలన్నారు. అందుకోసమే ఇప్పటినుంచి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణం జరగకుండా కొందరు హైకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్లో కేసులు వేశారన్నారు. రాజధాని నిర్మాణానికి జాతీయ హరిత ధర్మాసనం అనుమతి ఇవ్వడం..మనం సాధించిన విజయమన్నారు. 

అమరావతిలో కొండవీటివాగును సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్లే ప్రకృతి విపత్తులు వస్తున్నాయన్నారు. ఇక బిల్‌గేట్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చనడానికి బిల్‌గేట్సే నిదర్శనమన్నారు.  

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రపంచస్థాయి రాజధాని నిర్మించి తీరుతామన్నారు ఏపీ సీఎం. రాష్ట్రంలో ఉన్న 27 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలని టార్గెట్‌గా నిర్దేశించుకున్నామని.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ హరితాంధ్రప్రదేశ్‌గా మారాలన్నదే తమ లక్ష్యమన్నారు. 

అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం 

19:49 - November 18, 2017

కర్నూలు : కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుందని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. వైసీపీ నేతలు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన, మాజీ జడ్పీ చైర్మన్‌ నాగిరెడ్డి గన్‌మెన్లను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షనేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవుపలికారు. 

19:40 - November 18, 2017

ఎస్టీలకు సీఎం కేసీఆర్ శుభవార్త

హైదరాబాద్ : ఎస్టీలకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. ఎస్టీల విద్యుత్ బకాయిలు రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్టీలపై విద్యుత్ కేసులు ఎత్తివేస్తున్నామని తెలిపారు. 

 

19:29 - November 18, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్ ను గిరిజన రాజకీయ జేఏసీ ప్రతినిధులు ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళన కారులను అరెస్టు చేసి, గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

19:24 - November 18, 2017

వికారాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిధులు, నియామకాలను విస్మరించి, కాంట్రాక్టర్ల మేలు కోసం పని చేస్తుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని సత్యభారతి గార్డెన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కొలువుల కోట్లాటకై సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే కొలువుల కోట్లాట కార్యక్రమానికి జన సమీకరణ కోసం వికారాబాద్‌ జేఏసీ ఈ సదస్సును నిర్వహించింది. 

 

18:27 - November 18, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అప్రజాస్వామికంగా జరిగాయని సీఎల్పీ డిప్యూటి లీడర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి  అధికార పార్టీ సభ్యుల భజనలు మినహా ప్రజా సమస్యలపై చర్చంచలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌ మెయింటెన్స్‌లో, గురుకుల పాఠశాలల నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

18:16 - November 18, 2017
18:04 - November 18, 2017

ఉమ్మడి వరంగల్‌ : జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆఱ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హన్మకొండ సమ్మయ్య నగరంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వరంగల్‌ అర్బన్‌లో జీడబ్ల్యుఎంసీ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద ఏర్పాటు చేసిన అండర్‌ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్‌ను ప్రారంభించారు. వరంగల్‌ అమ్మవారి పేటలో దేశంలోనే మొదటి సారిగా ఏర్పాటు చేసిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఎఫ్ ఎస్ టీపీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆమ్రపాలి, శాసన సభ్యులు ఆరూరి రమేష్‌ పాల్గొన్నారు. 

 

సినిమాలో ప్రతి విభాగానికి అవార్డులు దక్కడం గర్వకారణం : బాలకృష్ణ

హైదరాబాద్ : సినిమాలో ప్రతి విభాగానికి అవార్డులు దక్కడం గర్వకారణమని హీరో బాలకృష్ణ అన్నారు. తోటి కళాకారులకూ నంది అవార్డులు వచ్చాయని బాలకృష్ణ తెలిపారు. 

 

ప్రగతి భవన్ ను ముట్టడించిన గిరిజన రాజకీయ జేఏసీ ప్రతినిధులు

హైదరాబాద్ : ప్రగతి భవన్ ను గిరిజన రాజకీయ జేఏసీ ప్రతినిధులు ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళన కారులను అరెస్టు చేసి, గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

రేపు సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్ : మంత్రి అఖిలప్రియ

గుంటూరు : రేపు సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు ఏపీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. అవార్డు తీసుకోడానికి బాలీవుడ్ హోరోయిన్ దీపికా పదుకునే, రానా హాజరవుతారని చెప్పారు.
 

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

17:33 - November 18, 2017

టిబెట్‌ : అరుణాచల్‌ప్రదేశ్‌ సమీపంలోని టిబెట్‌లో ఉదయం భూకంపం సంభవించింది.  భారత్‌-చైనా సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.9గా నమోదైంది. ఉదయం ఆరున్నరకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని చైనా భూకంప నెట్‌వర్క్‌ సెంటర్‌ తెలిపింది. ఆ తర్వాత మరో రెండు గంటలకు అదే ప్రాంతంలో 5 తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించినట్లు చెప్పింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

17:30 - November 18, 2017

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లో ఐటి దాడులు నిర్వహించింది. మద్రాసు హైకోర్టు అనుమతితో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఐటీ అధికారులు పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత పీఏ పూన్‌గుండ్రన్‌, శశికళ గదులు, రికార్డు రూమూల్లో సోదాలు చేశారు. ఓ ల్యాప్‌టాప్‌, పెన్‌ డ్రైవ్‌, డెస్క్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐటి దాడులను నిరసిస్తూ జయ నివాసం వద్ద అన్నాడిఎంకే కార్యకర్తలు హంగామా చేశారు. ఐటి దాడులు మోసపూరిత దాడులని, రాజకీయ కక్ష సాధింపు చర్యలని శశికళ మేనల్లుడు దినకరన్‌ ఆరోపించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అమ్మకు నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.  సుమారు వెయ్యి కోట్ల ఆస్తులను ఐటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

బందిపారాలో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : బందిపారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.  

16:39 - November 18, 2017

తూర్పుగోదావరి : విజయవాడ ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాద ఘటన తరువాత అధికారుల్లో చలనం వచ్చింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ బోట్లను నడుపుతున్న వారిపై ఆంక్షలను కఠినతరం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫలితంగా పాపికొండల బోటు విహారానికి బ్రేక్ పడింది. మూడురోజుల పాటు ఎలాంటి విహార యాత్రకు అనుమతులు లేవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటన తరువాత పాపికొండల విహారం కోసం నడుపుతున్న బోట్లలో నిర్లక్ష్యం ఒక్కసారిగా బయటపడింది. మొత్తం బోట్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఫెర్రీ ఘాట్ ప్రమాద ఘటన జరిగిన మరుసటిరోజే అధికారులు హుటాహుటీన బోట్ల నిర్వహణపై ఆరాతీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం అంగళూరు నుంచి పాపి కొండల విహారం కోసం వెళ్లే బోట్లను  సీతానగరం, దేవీపట్నం ఎమ్మార్వోలు తనిఖీలు చేశారు. నాలుగు బోట్లు మినహా మిగిలిన బోట్లన్నీ నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నట్టు తేలింది. అంతే అధికారులు సమావేశమై బోటు ఓనర్లపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఉపక్రమించారు. అందులో భాగంగా పర్యాటక శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ సమావేశమయ్యారు. 

బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించినట్టు అధికారుల తనిఖీల్లో తేలితే శాశ్వతంగా బోటు లైసెన్స్‌ను రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ బోటు నిర్వాహకులకు ఆదేశించారు. ప్రతీ బోటులో సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతీ బోటులోనూ నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక మేటలను గుర్తించగలిగేలా ఉండకపోతే పర్యాటకుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందనీ, అనుభవం కలిగిన డ్రైవర్ మాత్రమే బోట్లను నడపాలని ఆదేశించారు. 

భద్రత విషయంలోనే కాకుండా పర్యాటకులనుంచి దోచుకుంటున్న బోటు నిర్వాహకులను కట్టడి చేయడంలో అధికారులు దృష్టి పెట్టారు. కలెక్టర్ పెట్టిన టిక్కెట్ ధర ప్రకారం మాత్రమే పర్యాటకుల వద్ద డబ్బులు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. విహారం మార్గంలో అధికారులు నిర్దేశించిన నాలుగు చోట్ల ఖచ్చితంగా తనిఖీ చేయించుకుని తీరాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అధికారులు ఏదో చర్యలు చేపట్టాం .. చేతులు దులుపుకున్నాం.. అన్న చందంగా కాకుండా అవి అమలయ్యే తీరుపై మరింత దృష్టి పెట్టాలని అందరూ కోరుతున్నారు. 

16:32 - November 18, 2017

ఢిల్లీ : తెలంగాణ మేయర్లు, ఇతర ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో పర్యటించింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఆకర్షణీయ పథకాలు, స్వచ్చతా పరిశుభ్రతా అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రజల అవసరాలకు తగినట్లుగా ఒకే కాంప్లెక్స్‌లో పబ్లిక్ టాయిలెట్స్‌, ఏటీఎమ్‌లు, వాటర్‌ ఏటీఎమ్‌లు, డిజిటల్‌ హెల్త్‌ క్లీనిక్‌లు చేపట్టారని మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. ఇలాంటి వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

16:30 - November 18, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌పై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభ 50 రోజులు నిర్వహిస్తామని చెప్పి..16 రోజులు నిర్వహించడం దారుణమన్నారు. సభ కేవలం సీఎంను పొగిడేందుకే పరమితమైందని ఎద్దేవా చేశారు. మంత్రులు సీఎంను కీర్తిస్తే..కేసీఆర్‌ నిజాంను పొగిడారని విమర్శించారు. 

16:27 - November 18, 2017

రంగారెడ్డి : రాకెట్‌ యుగంలోనూ మూఢనమ్మకాలు తగ్గడం లేదు. రంగారెడ్డి జిల్లా యంజాల్‌ గ్రామపంచాయితీ కుర్మగూడలో దారుణం జరిగింది. అమావాస్యరోజు బాలింత చనిపోయిందంటూ ఇంటి దగ్గర అంత్యక్రియలు జరపవద్దంటూ కాలనీవాసులు అడ్డుకున్నారు. 25 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చిన మాలతి.. అనారోగ్యంతో మృతిచెందింది. అమావాస్యరోజు చనిపోవడం అరిష్టమంటూ శవాన్ని ఇంటివద్దకు తేవొద్దని కాలనీవాసులు వెలివేశారు. ఇక చేసేది లేక చెరువులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది. 

 

16:15 - November 18, 2017

ఖమ్మం : అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా కష్టాల కడగండ్లే ఎదురవుతున్నాయి. అష్టకష్టాలు పడి అందినకాడికి అప్పులు తెచ్చి పండించిన పంట చేతికి వచ్చేసమయానికి దోమ కాటు సోకి పంట పూర్తిగా దెబ్బతినడంతో దిక్కుతోచని రైతు తన వరి పైరుకు నిప్పటించుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఏడాది వర్షాలు కురవడం.. చెరువులు నిండటంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. దానికి తోడుగా భక్త రామదాసు ప్రాజెక్ట్‌ నుండి నీటిని విడుదల చేయడంతో రైతన్నలు సంతోషంగా వరి సాగు చేశారు. పంట చేతికి అందే సమయానికి దోమ కాటు రైతన్నల పాలిట శాపంగా మారింది. 

గ్రామానికి చెందిన గమిని రామచంద్రు తనకున్న ఎకరం పొలంతో పాటు మరో మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. వరి పంట సాగు కోసం దాదాపు లక్ష రూపాయల వరకు అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టాడు. ఇంకో ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందనుకున్న రామచంద్రుకి నిరాశే మిగిలింది. దోమకాటుతో పంట మొత్తం గింజ లేకుండా నాశనం అయ్యిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దోమకాటు నివారణకి మందులు పిచికారీ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నాడు. బ్యాంక్‌ నుండి క్రాప్‌ లోన్‌ తీసుకున్న సమయంలో ఇన్సూరెన్స్‌ చేయించుకున్నాడు. పంట నష్టం గురించి బ్యాంక్‌ అధికారులకు తెలియచేసి.. తనకు ఇన్సూరెన్స్‌ ఇప్పించాలని కోరాడు. ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవని బ్యాంక్‌ అధికారులు తెలియజేయడంతో.. మనస్తాపానికి గురైన రైతు రామచంద్రు తన పంటకి తానే నిప్పంటించుకున్నాడు.

దోమ కాటు నివారణకు మందులు కొట్టినా  ఉపయోగంలేకుండా పోయిందని గ్రామ రైతులు వాపోతున్నారు. మందులు ప్రయోగించిన తర్వాత మరింత ఎక్కువ వ్యాప్తి చెందుతుందని రైతులు అంటున్నారు.  ప్రభుత్వం మందుల షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామంలోని సాటి రైతులు కోరుతున్నారు.

16:00 - November 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాల వేగం పుంజుకోగా... మరికొన్ని ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల బస్తీవాసులు ఇళ్లు ఖాళీచేయడానికి ససేమిరా అంటున్నారు. సరైన పట్టా పత్రాలు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటే ఎలా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో స్వయంగా మేయర్‌ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
కొన్ని బస్తీల్లో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు
రాజధాని నగరంలో  లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న బస్తీల్లోని ప్రజలను ఖాళీ చేయించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.  దీంతో గ్రేటర్‌ చాలాచోట్ల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. సున్నితమైన స్లమ్స్‌ల్లో మాత్రం కొన్నిచోట్ల నిర్మాణాలు జరుగుతుంటే.. మరికొన్న చోట్ల డబుల్‌ ఇళ్లకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్ని బస్తీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ముందుకురావడం లేదు.   తాము ఖాళీ చేసిన తర్వాత నిర్మించిన ఇళ్లలో తమకు అవకాశం ఇస్తారో లేదోనన్నదే ఇందుకు ప్రధాన కారణం.
పట్టాలు, పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఖాళీ చేయించేందుకు యత్నం
మెహ‌దీప‌ట్నం బోజ‌గుట్టలో రెవెన్యూ విభాగం జ‌రిపిన సోషియో ఎకనామిక్ స‌ర్వేలో 1850మందిని లబ్దిదారులుగా గుర్తించింది. 13ఎక‌రాలకు పైగా ఉన్న ఈ స్థలంలో  50బ్లాకుల్లో  జీ-ప్లస్‌ టూ  పద్దతిలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చెప‌ట్టాల‌ని నిర్ణయించారు.  అయితే అక్కడ నివసిస్తున్న వారికి  ప‌ట్టాలు కాని పొజిష‌న్ స‌ర్టిఫికేట్‌కానీ ఇవ్వకుండా  ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నారు. దీంతో భోజగుట్ట వాసులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక నేతలు, కార్పొరేటర్‌ తమకు అన్యాయం చేస్తున్నారంటూ  టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ జీవంసింగ్‌ ఇంటిని ముట్టించారు.
రంగంలోకి దిగిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌
పరిస్థితి చేజారి పోతుండడంతో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రంగంలోకి దిగారు. భోజగుట్ట బస్తీవాసులను శాంతింపజేసే పనిలో పడ్డారు. స్థానికులందరితో సమావేశమై... ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, లబ్దిదారులందరికీ ఇళ్లు ఇస్తామని హామీనిచ్చారు. మేయర్‌తో కొందరు మహిళలు వాగ్వాదానికి దిగారు. కొందరిపేర్లే లిస్ట్‌లో ఉన్నాయని... మరికొందరి పేర్లు  ఎందుకు లేవని నిలదీశారు. ఏళ్ల తరబడి ఉన్నవారికి ఇళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు.  తమకు ఇళ్లురాకుంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు.

 

15:53 - November 18, 2017

ఖమ్మం : జిల్లాలోని మణుగూరు మండలం కమలాపురంలో దారుణం జరిగింది. మరియమ్మ అనే మహిళ తన ఐదేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసింది. నాగేశ్వరరావు, మరియమ్మల కూతురు శశిరేఖ కాగా.. నాగేశ్వరరావుకు యశోద అనే ఇంకో భార్య ఉంది. నాగేశ్వరావుతో ఇటీవల మరియమ్మకు గొడవ జరిగింది. ఆ గొడవలో నాగేశ్వరరావు శశిరేఖను తన కూతురు కాదన్నందుకు మరియమ్మ శశిరేఖ మెడ నులిమి చంపేసింది. పోలీసుల విచారణలో మరియమ్మ కూతురిని చంపినట్లు నిర్ధారణ అయ్యింది. 

 

15:43 - November 18, 2017
14:08 - November 18, 2017

హైదరాబాద్ : పంజాగుట్ట పీఎస్‌లో నాగసుశీల ఫిర్యాదు చేసింది. నిర్మాత చింతలపూడి శ్రీనివాస్‌ వ్యాపారంలో తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస్‌, నాగసుశీల కలిసి గతంలో అనేక సినిమాలు నిర్మించారు. నాగసుశీల తనయుడు 'అడ్డా' సినిమాకు శ్రీనివాస్‌ నిర్మాతగా వ్యవహరించారు. తనకు తెలియకుండా జాయింట్‌ అకౌంట్‌ నుంచి శ్రీనివాస్‌ డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడని నాగసుశీల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

14:07 - November 18, 2017

గుంటూరు : అమరావతిలో పచ్చదనం అభివృద్ది ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు మొక్కలు నాటి ప్రారంభించారు. రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంతో పాటు.. నందనవనంగా మారుస్తామన్నారు. రాజధానిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరూ కష్టపడాలని చంద్రబాబు అన్నారు.

14:05 - November 18, 2017

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తా దగ్గర ఉన్న తాత్కాలిక చిరు వ్యాపారాల షెడ్లను రామగుండం నగరపాలక సంస్థ తొలగించింది. మున్సిపల్ భవన నిర్మాణానికి అడ్డుగా ఉన్న తోపుడు బండ్ల నిర్మాణాల విషయంలో.. గత రెండు రోజుల క్రితం నగర పాలక అధికారులు చిరు వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. రహదారిని అక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో తెల్లవారేసరికి పొక్లెయినర్‌తో కూలగొట్టారు. విషయం తెలుసుకున్న చిరు వ్యాపారులు హుటాహుటిన తమ తోపుడు బండ్ల వద్దకు వచ్చి నిరసనకు దిగారు. కొన్నేళ్లుగా ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమను రోడ్డుపై పడేయడం సరికాదన్నారు. నగరపాలక సిబ్బందికి, చిరు వ్యాపారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వచ్చి గొడవను అడ్డుకున్నారు. వ్యాపారాలు తొలగిస్తే చావు తప్ప తమకు వేరే దారి లేదని చిరు వ్యాపారులు ఆవేదన చెందారు. 

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు : జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 

13:12 - November 18, 2017

నెల్లూరు : జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బద్వేలుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి, పావనిగా గుర్తింపు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:41 - November 18, 2017

హైదరాబాద్ : వైసీపీలో ప్రస్తుతం పికే హవా నడుస్తోంది.. 2019లో అధికారంలోకి రావాలంటే ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలు సలహాలు తప్పకుండా అమలు చేయ్యాలని జగన్‌ భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పాదయాత్రను నమ్ముకునే ముందుకు సాగుతుంది. ఆరు నెలల పాటు పాదయాత్ర చెయ్యనున్న జగన్‌ అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీలో నిన్నటి వరకూ జగన్‌ ఒక్కరే వన్‌ అండ్‌ ఓన్లీగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం వైసీపీలో ప్రశాంత్‌ కిషోర్‌ ఏం చెబితే అదే నడుస్తుంది. పార్టీ వేసే ప్రతి అడుగులో పికే రోల్‌ కచ్చితంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాదయాత్రలో కూడా పికే టీం డైరక్షన్‌ కీ రోల్‌గా మారింది.

పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌
పార్టీ కార్యక్రమాలను వివిధ రూపాల్లో పికే టీం రూపొందించారు. పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌ కనిపిస్తుంది. ఎన్ని గంటలు పాదయాత్ర చెయ్యాలి.. ఎంత దూరం నడవాలి.. మార్గ మధ్యలో ఎవరెవరిని కలవాలి అనే అంశాలపై పికే టీం రూట్‌ మ్యాప్‌ ద్వారానే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజూ రైతులతో నేరుగా మాట్లాడటం, విద్యార్ధులతో ముఖాముఖి, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహించడం, సాయంత్రం ఏదో ఒక కీలక అంశం ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు జగన్‌ లైవ్‌ అప్‌ డేట్స్‌ అందుబాటులో ఉండేలా 70మందితో టీం వర్క్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం జగన్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియా వైసీపీ, వైఎస్‌ఆర్‌ కుటుంబం, జై జగన్, ప్రజా సంకల్ప యాత్ర లైవ్‌ అంటూ పదికి పైగా లైవ్‌ పేజ్‌ల ద్వారా పాదయాత్రపై మరింత ఫోకస్‌ పెరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు.

డ్రెస్‌ కోడ్‌
జగన్‌ పాదయాత్రను ఐదు పికే టీంలు ఫాలో అవుతున్నాయి. ఈ టీంలు పాదయాత్రలో అన్ని వైపుల నుండి ఫాలో అవుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు వీరిని గుర్తించేందుకు డ్రెస్‌ కోడ్‌ ధరిస్తున్నారు. ఒక్కో టీంలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు జగన్‌తో పాటు నడుస్తుంటారు.. జగన్‌ ఎవరెవరిని కలుస్తున్నారో.. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో.. వారి ఫొటోలు వీడియోలు రికార్డు చేస్తున్నారు. వీరు తీసిన ఫొటోలు ఎప్పటికప్పుడు హై స్పీడ్‌ నెట్‌ ద్వారా హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపిస్తారు.. వాటిలో బెస్ట్‌ సెలెక్ట్‌ చేసి సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తున్నారు. వీలైనన్ని గ్రూపులకు ఈ మెసేజ్‌లు ఫోటోలు పంపిస్తున్నారు. జగన్‌ స్పీచ్‌ పాదయాత్ర ముఖాముఖి వంటి కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో లైవ్‌ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుండి స్పందనను తీసుకుని వాటిని పికే కు పంపిస్తున్నారు. ఇక రెండవ టీం మీడియాతో ఉంటుంది. మూడవ టీం ప్రజల్లో కలిసిపోతుంది. ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది. నాల్గవ టీం ప్రధానంగా వృద్ధులు, విద్యార్ధులు, మహిళలతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇక ఐదవ టీం స్థానికుల ఫోన్‌ నెంబర్లను.. వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇలా మొత్తానికి జగన్‌ పాదయాత్రలో ప్రషాంత్‌ కిషోర్‌ టీం హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.. అయితే పికే టీంతో కొంతమంది నేతలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. అధినేత జగన్‌ మాత్రం పికే టీంలకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.

12:39 - November 18, 2017

హైదరాబాద్ : బీఎస్‌ మక్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం : జిల్లా మార్టూరు మండలం జేళ్లపాడులో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ గురైన నాలుగేళ్ల మణికంఠ అనే బాలున్ని దుండగులు హత్య చేశారు. గుంటూరు సమీపంలో ఓ బావిలో బాలుడి మృతదేహాం లభ్యం అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్ కర్నూల్ : జిల్లా కొండాపూర్ ఏలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి పక్కన ఉన్న లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 11మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 

12:12 - November 18, 2017

గుంటూరు : జిల్లా మార్టూరు మండలం జేళ్లపాడులో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ గురైన నాలుగేళ్ల మణికంఠ అనే బాలున్ని దుండగులు హత్య చేశారు. గుంటూరు సమీపంలో ఓ బావిలో బాలుడి మృతదేహాం లభ్యం అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బాలుడి మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:07 - November 18, 2017

నాగర్ కర్నూల్ : జిల్లా కొండాపూర్ ఏలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి పక్కన ఉన్న లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 11మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:28 - November 18, 2017

హైదరాబాద్ : రూ.200, రూ.50 మార్కెట్లోకి విడుదల చేసి మూడు నెలలు గడిచిన ఇంతవరకు మార్కెట్లో దర్శనం ఇవ్వడంలేదు. ఏటీఎంలో ఇంతవరకు 200,50రూపాల నోట్లు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఆన్ లైన్ స్వైపింగ్ కార్డులపై షాపింగ్ మాల్స్ ఎక్స్ ట్రా ఛార్జిలు వసూలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సర్వేయర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

విశాఖ : జిల్లా మాజీ సర్వేయర్ గేదెల లక్ష్మీ జ్ఞానేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరిలో జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు.

11:06 - November 18, 2017

విశాఖ : జిల్లా మాజీ సర్వేయర్ గేదెల లక్ష్మీ జ్ఞానేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరిలో జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గిరిజనులపై ఎమ్మెల్యే దౌర్జన్యం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లులో గిరిజనులపై వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ దౌర్జన్యానికి దిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పట్టా భూములు ఇవ్వాలని గిరిజనులను బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు పట్టాభూములు స్వాధీనం చేసుకోవాల్సిందిగా తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. మదన్‌లాల్ కాంట్రాక్ట్‌ర్‌ను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెన్నైలో ఐటీ సోదాలు

చెన్నై : తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జయ నివాసంలో ఐటీ తనిఖీలపై అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటలపాటు జయ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జయ గదితో పాటు, ఆమె సహాయకుడి గదిలో సోదాలు చేసిన అధికారులు... ల్యాప్‌టాప్‌తో పాటు నాలుగు పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని పోయెస్‌ గార్డెన్‌ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. 

10:42 - November 18, 2017

చిత్తూరు : జిల్లా కుప్పం మండలం ఆవులనతంలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి కూతురు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:41 - November 18, 2017

చెన్నై : తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జయ నివాసంలో ఐటీ తనిఖీలపై అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటలపాటు జయ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జయ గదితో పాటు, ఆమె సహాయకుడి గదిలో సోదాలు చేసిన అధికారులు... ల్యాప్‌టాప్‌తో పాటు నాలుగు పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని పోయెస్‌ గార్డెన్‌ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:40 - November 18, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లులో గిరిజనులపై వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ దౌర్జన్యానికి దిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పట్టా భూములు ఇవ్వాలని గిరిజనులను బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు పట్టాభూములు స్వాధీనం చేసుకోవాల్సిందిగా తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. మదన్‌లాల్ కాంట్రాక్ట్‌ర్‌ను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అవుటర్ రింగ్ రోడ్డు ఘోర ప్రమాదం

సంగారెడ్డి : జిల్లా అమీన్ పూర్ మండలం గండిగూడెం ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.

09:05 - November 18, 2017

సంగారెడ్డి : జిల్లా అమీన్ పూర్ మండలం గండిగూడెం ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:39 - November 18, 2017

చెన్నై : శశికళ భర్త నటరాజన్ మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు విధించిన జైల్ శిక్షను హైకోర్టు సమర్థించింది.కోర్టు ఓ కారు విషయంలో నటరాజన్ పన్ను ఎగవేత కేసులో ఈ శిక్ష విధించింది.

08:38 - November 18, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం తగ్గింది. ఈ రోజు తేలిక పాటి వర్షం కూడా కురిసింది. కాలుష్య నివారణ చర్యలతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆనంద్విహార్, పంజాబి బాగ్, సిపరపోర్ట్, సెంట్రల్ ఢిల్లీలో వాయుకాలుష్యం 250 పాయింట్లు తగ్గింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

టవరెక్కిన పారిశుద్ధ్య కార్మికుడు

సంగారెడ్డి : జిల్లా కొర్టు దగ్గర ఓ పారిశుద్ధ్య కార్మికుడు టవర్ ఎక్కాడు. మున్సిపల్ వైస్ చైర్మన్ వేధింస్తున్నాడని కార్మికుడు ఆరోపిస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే వరకు టవర్ దిగనని కార్మికుడు తేల్చి చెబుతున్నాడు.

తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి : జిల్లా రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

08:14 - November 18, 2017

సంగారెడ్డి : జిల్లా కొర్టు దగ్గర ఓ పారిశుద్ధ్య కార్మికుడు టవర్ ఎక్కాడు. మున్సిపల్ వైస్ చైర్మన్ వేధింస్తున్నాడని కార్మికుడు ఆరోపిస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే వరకు టవర్ దిగనని కార్మికుడు తేల్చి చెబుతున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:10 - November 18, 2017

తూర్పుగోదావరి : జిల్లా రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:21 - November 18, 2017

రైతులు మొట్టమొదటి సమస్య రుణాలని, అసలు రైతు రుణం లేకుండా వ్యవసాయం చేయలేకపోతున్నాడని, పండిన పంట మార్కెట్ తీసుకొస్తే మద్దతు లభించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని విశ్లేషకులు వినమ్ కుమార్ అన్నారు. బిల్ గేట్స్ వ్యవసాయంపై కొన్ని సూచనలు చేశారని, స్వామినాథన్ కమిటీ సూచనలు ఎలా ఉన్నాయో బిల్ గేట్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారని టీడీపీ నేత చందు సాంబశివరావు అన్నారు. ఏపీలో ఎక్కువగా సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని వారికి రుణాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఇలాంటి కార్పొరేట్ కల్చర్ మనకు సరిపోదని వైసీపీ నేత రాజశేఖర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.

నేడు దొర్నిపాడులో జగన్ ప్రజా సంకల్పయాత్ర

కర్నూలు : జిల్లా దొర్నిపాడులో జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. ఆయన కంపమల్లమెట్ల, భీమనిపాడు, పాదయాత్ర చేయనున్నారు. 

07:05 - November 18, 2017

గుంటూరు : ఈమె కొలిపర కోటసుబ్బమ్మ...ఈమె భర్త మున్సిపల్ టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు...1988లో పదవి విరమణ చేసి 1998లో మరణించారు..ఆ తర్వాత భార్య సుబ్బమ్మకు ఫించన్ వస్తుంది...2006 వరకు ఫించన్ తీసుకున్న సుబ్బమ్మ కూడా మరణించింది..నిబంధనల ప్రకారం సుబ్బమ్మ మరణంతో ఫించన్ ఆగిపోవాలి..కాని పదేళ్లుగా ఆమె సంతానం కుమారుడు,కుమార్తెలు నకిలీ దృవపత్రాలు జతచేసి ఫించన్ తీసుకుంటూనే ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో ఫించన్ దారు మరణించి పదేళ్లయినా సొమ్ము ఇస్తూనే ఉన్నారు...కుటుంబీకుల కక్కుర్తితో పాటు ఖజానా కార్యాలయంలో కొందరి సహకారంతో దాదాపు పదిలక్షల వరకు ప్రభుత్వ సొమ్మును కొల్లిపర బసవ ప్రసాద లింగం, అతని సోదరిలు కాంచన,హైమావతిలు నొక్కేశారు..ఈ విషయం తెలిసిన అజ్ఞాత వ్యక్తి ఆకాశరామన్న ఉత్తరం రాయడంతో వెలుగులోకి వచ్చింది.. దీంతో మేల్కొన్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఖజానా సొమ్మును కొల్లగొట్టారంటూ వచ్చిన మీడియా కథనాలతో ఏసీబీ అధికారులు తెనాలి ఆఫీస్‌లో తనిఖీలు చేశారు..దీంతో సబ్‌ట్రెజరీ ఆఫీసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు.లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు సృష్టించడంలో సహకరిస్తున్న ఇంటి దొంగలపై కన్నేయాలి..లేదంటే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. 

07:04 - November 18, 2017

హైదరాబాద్ : బిన్‌చెక్కర్‌ ద్వారా వివరాలు...ఆ తర్వాత పీఓఎస్‌ మెషిన్ వారి నుంచి సమాచారం..అందుకు వారికి 20 శాతం వాటా. పూర్తి డేటా వచ్చాక అసలు కథ...విదేశీ పర్యాటకులకు టోకరా...కార్డులను క్లోనింగ్ చేస్తూ డబ్బు డ్రా...సైబర్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీస్....క్రెడిట్ కార్డులను..డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ఘరానా ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి...ప్రధానంగా అమెరికా, యూకే,ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విదేశీ పర్యాటకుల కార్డుల వివరాలు సేకరించి క్లోనింగ్ చేస్తుంది గ్యాంగ్...ఇందులో రాజేష్‌ ఉన్నత చదువులు చదివి తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఐసీక్యూ,బిన్‌చికెర్‌ యాప్‌ల ద్వారా కార్డుల వివరాలు సేకరించేవాడు... వాటిని ఎలా ఆపరేట్ చేయాలో డార్క్‌ వెబ్ సైట్ ద్వారా తెలుసుకుని అసలు కథ మొదలుపెట్టాడు...పర్సంటేజీలు ఇస్తూ ...విదేశీయుల కార్డుల నుంచి సొమ్ము కాజేస్తూన్నారు...ఈ ముఠాలో తమిళనాడు చెందిన అయ్యప్పన్ అలియాస్ రాజేష్ , ఏపీకి చెందిన రాఘవేంద్రరావు, వంశీకృష్ణ, మరో ఇద్దరు విదేశీయులు కలిసి కార్డుల ద్వారా దాదాపు 30 లక్షల రూపాయలు నొక్కేశారు. కార్డులు క్లోనింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై రాచకొండ సైబర్ టీమ్ ప్రత్యేక బృందంతో శోధించింది..ఎట్టకేలకు ముఠాను పట్టుకుంది. ఇక ఈ ముఠాకు సాఫ్ట్‌వేర్ రంగం నుంచి, బ్యాంకుల నుంచి సహకారం అందించినవారిపై కూడా కేసులు పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

07:03 - November 18, 2017

దుబాయ్ : దుబాయ్‌లో తెలుగువారి సాంస్కృతిక వారధి వేవ్‌ సంస్థ పదో వార్షికోత్సవ సంబరాలు స్థానిక ఇండియన్‌ హై స్కూల్‌ షేక్‌ రషీద్‌ ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగాయి. 2007లో శ్రీమతి గీతా రమేష్‌, ఉమా పద్మనాభన్‌, సునీత అనే ముగ్గురు మహిళలు కలిసి ప్రారంభించారు. దుబాయ్‌లో ఉన్న తెలుగు వారికి ఒక వారధిగా వేవ్‌ నిలుస్తోందని వ్యవస్థాపకులు తెలిపారు. ఇక్కడ పెరుగుతున్న పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారి ప్రతిభకి తగిన వేదికలని కల్పిస్తోంది. సంగీతం, నాట్యం తదితర రంగాల్లో అసమాన ప్రతిభ ఉన్న చిన్నారులకు వెన్నదన్నుగా నిలుస్తోంది. కార్యక్రమానికి అతిథులుగా సినీ నటులు జయప్రద, శివబాలాజీ, కాంగ్రెస్ నేత వీహెచ్‌ పాల్గొన్నారు. కార్యక్రమం సాంతం పిల్లలు, పెద్దల నృత్యాలతో సందడిగా జరిగింది. వేవ్‌ మహిళలకు వెన్నుదన్నుగా ఉంటూ వారి విజయాలకి కారణమైన వారి జీవిత భాగస్వాములకు అభినందనలు తెలిపారు.

07:03 - November 18, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌‌లో ప్రయాణికుడికి ఆర్టీసీ కండక్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనతో పాటు తన పెంపుడు జంతువుకి కూడా టికెట్‌ తీసుకుంటానని బస్సులో అనుమతించాలని కోరగా కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న మరో కండక్టర్‌ శంకర్‌ను ఆర్టీసీ కంట్రోల్‌ రూంలో నిర్భందించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉండటంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు

07:02 - November 18, 2017

కరీంనగర్ : కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై నిప్పులు చెరిగారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ శివారులో మల్కాపూర్ వద్ద ట్యాంకర్ ఆటోను ఢీకొనడంతో నలుగురు కూలీలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గంగుల ఆస్పత్రికి వచ్చారు. రెండు గంటలుగా వైద్యం అందించడం లేదని బంధువులు చెప్పడంతో.. ఎమ్మెల్యే వైద్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే క్షతగాత్రులను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

07:01 - November 18, 2017

చిత్తూరు : జిల్లా నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా..చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లక్షా 40 వేల ఉద్యోగాలు ఉన్నా ఇంతవరకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వచ్చివుంటే నిరుద్యోగులకు ఉపాధి సమస్య ఉండేదికాదన్నారు.

07:00 - November 18, 2017

హైదరాబాద్ : వైద్య సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో సెకండ్‌ ఏఎన్‌ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారు. టీకాల కార్యక్రమం నుంచి వైద్య పరీక్షల వరకు అన్నిరకాల సేవలు చేస్తున్నారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఇద్దరు ఏఎన్‌ఎంలలో ఒకరు వేతన స్కేలుపై పనిచేస్తుంటే, సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆమాత్రం కాంట్రాక్టు ప్రాతిపదికపై పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వీరి సర్వీసులను ప్రభుత్వం క్రబద్ధీకరించలేదు. ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నాలుగువేల మంది సెకండ్‌ ఏఎన్‌ఎంలు
తెలంగాణ వ్యాప్తంగా నాలుగువేల మంది సెకండ్‌ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. గర్భిణి నమోద నుంచి వైద్య సేవలు అదించడం, కౌన్సెలింగ్‌ ఇప్పించడం, మాతాశిశు సంరక్షణ వరకు అన్ని విధులు నిర్వహిస్తున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ఉద్యమాలు చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఎనిమిది నెలలుగా అమలు చేకపోవడాన్ని తప్పు పడుతున్నారు. సమానపనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయని సర్కారు తీరును సెకండ్‌ ఏఎన్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమం సెకండ్‌ ఏఎన్‌ఎంల ద్వారానే విజవంతంగా అమలవుతున్నా సర్వీసులు క్రమబద్ధీకరించక పోవడం దారుణమంటున్నారు.

భవిష్యత్‌లో ఆందోళన ఉద్ధృతం
తమకు కూడా పీఆర్‌సీ వేతన స్కేళ్లను అమలు చేయడంతోపాటు, చట్టపరమైన అన్ని సౌకర్యాలను వర్తింప చేయాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్‌లో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీరి న్యాయమైన కోర్కెల పరిష్కారంపై ప్రభుత్వం చర్యల ఎలావుంటాయో చూడాలి. 

06:59 - November 18, 2017

కృష్ణా : విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈనెల 12న జరిగిన పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం అనుమతి లేకుండా రాజకీయ నాయకులు అండదండంతో అక్రమంగా తిరిగిన పోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో ప్రమాదంతో రాజకీయ నాయకులకు సంబంధంలేదని తేల్చడాన్ని వామపక్షాలు తప్పుపడుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరం నుంచే
కృష్ణనదిలో అనుమతి లేకుండా చాలా బోట్లు నడుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీతోపాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరం నుంచే బోట్లు జలవిహారం చేస్తున్నాయి. ఇలా తిరుగున్న బోట్ల వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పడవల్లో భద్రతా చర్యలు శూన్యం. ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపేందుకు ఉపయోగించే లైఫ్‌ జాకెట్లు లేవు. అయినా ఎవరూ పట్టించుకోరు. దీనంతటికీ రాజకీయ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న వాదనలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదానికి గురైన పడవకు కూడా అనుమతి లేదు. పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు ఉద్యోగులు దీనికి బాధ్యలంటూ ముగ్గుర్ని సస్పెండ్‌ చేశారు. మరో నలుగురున్ని ఉద్యోగాల నుంచి తొలిగించారు. ప్రమాదంతో సంబంధంలేనివారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం చర్యను సీపీఎం ఏపీ కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు తప్పు పడుతున్నారు.

నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ దర్యాప్తు
బోటు ప్రమాదం నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ దర్యాప్తు లేదా న్యాయ విచారణ జరిపించాలని బాబూరావు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణానదిలో అక్రమంగా తిరుగుతున్న బోట్ల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం పడవ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీపీఐ నేతలు చెబుతున్నారు. పడవ ప్రమాదంపై న్యాయ విచారణ లేదా సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని వామపక్ష నేతలు చెబుతున్నారు.

06:58 - November 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గతనెల 27న ప్రారంభమైన అసెంబ్లీ నిన్న నిరవధిక వాయిదా పడింది. మొత్తం 16 రోజుల పాటు జరిగిన సమావేశాలు రాజకీయంగా వేడి పుట్టించాయి. ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యతను అధికార టీఆర్‌ఎస్‌ తమకు అనుకూలంగా మార్చుకుంది. అన్ని విషయాల్లో విపక్షాలపై విరుచుకుపడి పైచేయి సాధించింది. మూడున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. యాభై రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా... చివరికి 16 రోజులకే పరిమితం చేసింది. ఈ సమావేశాల్లో పది బిల్లుకు ఆమోదం లభించింది. పదకొండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. పలు అంశాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుని ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.

త్వరలో మరోసారి సమావేశాలు 
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సభలో జరిగిన చర్చ రాజకీయంగా వేడి పుట్టించింది. వీటి అమల్లో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న విపక్షాల వాదనను అధికార పక్ష సభ్యులు తిప్పికొట్టారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం, సూచనలు చేయడంలో విఫలమయ్యాయని అధికార పక్షం విమర్శిస్తోంది. త్వరలో మరోసారి సమావేశాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో ప్రకటించారు. వచ్చే నెలలో నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

06:46 - November 18, 2017

పశువుల పెంపకంలో పశుగ్రాసం అనేది చాలా ముఖ్యమని, అందులో దశరథ గడ్డి చాలా బాగుటుందని, పశువులు గడ్డి తిన్న వెంటనే అది జీర్ణం అయ్యి మంచి పాలు, లేక మాంసం వస్తోందని, దశరథ గడ్డి పై పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటాయని ఆదర్శ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss