Activities calendar

19 November 2017

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం : జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్లలో దారుణం జరిగింది. భూవివాదం నేపథ్యంలో ఇద్దరు అన్నుదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తడంతో తమ్ముడు వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యి మృతి చెండాడు.

పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం

పశ్చిమగోదావరి : జిల్ల పాలకొల్లు మండలం బగ్గేశ్వరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ఫీట్లు చేస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

21:34 - November 19, 2017

హరారే : జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశాధ్యక్ష పదవి నుంచి వైదొలగని భీష్మించుకు కూర్చున్న రాబర్ట్‌ ముగాబేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న జింబాబ్వే ఆప్రికన్‌ నేషనల్‌ యూనియన్‌- పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్ష పదవి నుంచి రాబర్ట్‌ ముగాబేను తొలగించారు. పార్టీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముగాబే స్థానంలో పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ఎమ్మార్సన్‌ నంగ్వాంగను అధ్యక్షుడిగా నియమించారు. ముగాబే 37 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. దేశాధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాలని పార్టీ నేతలు కోరినప్పటికీ ముగాబే నిరాకరించారు. తన రాజకీయ వారసురాలిగా భార్యను తెరపైకి తెచ్చేందుకు ముగాబే ప్రయత్నించారు. ఇది నచ్చని జింబాబ్బే సైన్యం ముగాబేను గృహ నిర్బంధంలో ఉంచింది. 

21:33 - November 19, 2017

శ్రీనగర్ : ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో జమ్ముకశ్మీర్‌ పరిస్థితుల్లో మార్పు వస్తోందన్నారు లెఫ్టినెంట్‌ జనరల్‌ జెఎస్‌.సంధు. ఈ ఏడాది ఇప్పటి వరకు కశ్మీర్‌లో 190 మంది ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. అయితే తీవ్రవాదులను చంపడమే తమ ఉద్దేశ్యం కాదన్నారు. వారి పోరాటం పాక్‌ కోసం అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రెండోరోజుల క్రితం లష్కర్ టెర్రరిస్ట్ మాజిద్‌ఖాన్‌ లొంగుబాటును ఆర్మీ అధికారులు ప్రస్తావించారు. మాజిద్ బాటలో మరికొందరు లొంగిపోయే స్వాగతిస్తామన్నారు.

21:27 - November 19, 2017

ముంబై : ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన చారిత్రక సినిమా 'పద్మావతి'. మొదట్నుంచి ఈ మూవీ తీవ్ర అడ్డంకులు ఎదుర్కుంటోంది. అన్నిటినీ దాటుకుని చివరకు డిసెంబర్ 1 విడుదలకు సినిమా సిద్ధమైంది. తీరా ఇప్పుడు సినిమా రిలీజ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. సెన్సార్ బోర్డు కన్నా ముందే సినిమాను పలు మీడియా ఛానెల్స్‌కు చూపించడాన్ని సీబీఎఫ్‌సీ తప్పు పట్టింది. దరఖాస్తు అసంపూర్ణంగా ఉందని సినిమాను వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ప్రకటించింది.

21:26 - November 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల డిజైన్లు ప్రజా అవసరాల కోసం కాకుండా..కాంట్రాక్టర్ల అవసరాల కోసం మారుతున్నాయని టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఆరోపించారు. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇంజనీరింగ్ భవనంలో కృష్ణానది జలాల పునర్ పంపిణీపై పాలమూరు అధ్యయన వేదిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్, సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. అన్ని జిల్లాలకు నీటిని న్యాయంగా పంపిణి చేయడానికి ప్రభుత్వం కొత్త పార్ములా రూపుపొందించాలని వక్తలు సూచించారు. 

21:25 - November 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో దొరలపాలనకు చరమగీతం పాడేందుకు మరో ఫ్రంట్ పురుడు బోసుకుంటోంది. ప్రజాసంఘాలు, పార్టీలతో త్వరలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సామాజిక న్యాయం సాధించే వరకు రాజకీయ ఫ్రంట్‌ కొనసాగాలన్నదే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం వైఫల్యాల వల్ల రాజకీయ శూన్యత ఏర్పడిందని..ఆ గ్యాప్‌ను రాజకీయ ఫ్రంట్‌ పూర్తిచేస్తుందన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్‌ఫోరం ఆధ్వర్యంలో..రాజకీయ ఫ్రంట్‌ సన్నాహాక సమావేశం జరిగింది. సామాజిక న్యాయం కూడా ఓ రాజకీయ అంశమే అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. 

21:24 - November 19, 2017

కర్నూలు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో యాత్ర చేశారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల పార్టీ జెండాలు ఆవిష్కరించారు. వృద్ధులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ల మంజూరు వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలును ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేశారని బనగాలనపల్లె సహా పలు సభల్లో జగన్‌ విమర్శించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. 

21:23 - November 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు, ఇతర వర్గాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా నవంబర్‌ 6 నుండి రాష్ట్రంలోని 23లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల పాటు చేపట్టిన విద్యుత్ సరఫరా ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది. మొదట్లో ఐదారు రోజుల పాటు సరఫరా చేసి, పరిస్థితిని అంచనా వేయాలని విద్యుత్‌ శాఖ అధికారులు భావించారు. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి 400 కేవీ సబ్‌ స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ప్రయోగాత్మక సరఫరాను రెండు వారాలకు పొడిగించారు.

నవంబర్‌ 20అర్ధరాత్రి వరకు
నవంబర్‌ 20అర్ధరాత్రి వరకు ప్రయోగాత్మకంగా 24 గంటల సరఫరాను కొనసాగిస్తున్నట్లు జెన్‌ కో- ట్రాన్స్‌ కో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మంగళవారం నుంచి యధావిధిగా మళ్లీ 9 గంటల సరఫరా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. జనవరి ఒకటి నుండి రైతులకు, ఇతర వర్గాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. రైతులకు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల మొత్తం రాష్ట్రంలో ఎంత విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడుతుందన్న విషయంపై అధికారులకు స్పష్టత వచ్చింది. జిల్లాల వారీగా.. సబ్‌ స్టేషన్‌, ట్రాన్స్‌ ఫార్మర్ల వారీగా పడే అదనపు లోడ్‌ ఎంత అనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ అంచనాల ప్రకారమే... జనవరి నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఆటో స్టార్టర్లు తొలిగిస్తే ఈ సమస్య పరిష్కారం
ప్రయోగానికి ముందు వ్యవసాయ పంపుసెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం ద్వారా కొందరు రోజంతా పంపు సెట్లు నడుపుతున్నారని.. దీని వల్ల భూ గర్భ జలాలు తగ్గిపోయి తమకు ఇబ్బందులు కలుగుతాయని కొందరు రైతులు అధికారులు తెలిపారు. ఆటో స్టార్టర్లు తొలిగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని.. రైతులే ఆటో స్టార్టర్లను తొలగించుకొని సహకరించాలని అధికారులు సూచించారు. 24 గంటల కరెంట్‌ సరఫరాను రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై.. నీటిని పొదుపుగా వాడుకోవడంపై మరోసారి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

21:23 - November 19, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ శ్రేణుల కల త్వరలోనే సాకారం కాబోతోంది. కొద్ది రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాహుల్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం పార్టీ విధాన నిర్ణయం మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం కానుంది. టెన్‌ జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో ఉదయం 10.30 గంటలకు CWC భేటీ కానుంది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. AICC అధ్యక్ష ఎన్నికల షెడ్యూలను CWC భేటీలో ఆమోదించనున్నారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. షెడ్యూలు ఆమోదించగానే కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల విభాగం అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయొచ్చని భావిస్తున్నారు. AICC అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థుల్లో రాహుల్‌గాంధీ ఒక్కరే ఉంటారని, దీంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కాంగ్రెస్‌ అధినేత్రి, రాహుల్‌ తల్లి సోనియాగాంధీ వ్యూహ రచన చేశారని సమాచారం.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందే
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందే రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. వచ్చే నెల 9న గుజరాత్‌ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. ఆలోగానే రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సోనియాగాంధీ నిర్ణయించారని సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఇంతకు ముందు సోనియాగాంధీ కొద్దిగా సంశయించారు. అయితే గుజరాత్‌లో సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో ముందడుగు వేసినట్టు సమాచారం. AICC అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే... ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోనే అధ్యక్ష ఎన్నికకు సోనియా మొగ్గు చూపారని సమాచారం. ఈ క్రమంలోనే గతంలో వాయిదా వేసిన రాహుల్‌ పట్టాభిషేకం మహోత్సవాన్ని సోనియాగాంధీ ముందుకు తెచ్చారని కాంగ్రెస్‌లో ప్రచారం జరగుతోంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి... దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని సోనియా భావిస్తున్నారు. రాహుల్‌ పట్టాభిషిక్తుడైతే కాంగ్రెస్‌లో నవశకం ఆరంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

20:35 - November 19, 2017
20:09 - November 19, 2017
20:07 - November 19, 2017

ఢిల్లీ : భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం తెలుసుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇరు దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఇచ్చిపుచ్చుకునేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. స్విట్జర్లాండు పార్లమెంటులోని ఎగువ సభకు చెందిన ఫైనాన్సియల్ అపైర్స్, ట్యాక్స్ కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతోపాటు మరో 40 దేశాలతో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఒప్పందాలను ఆమోదించింది. అయితే ఈ సిఫారసులను ఈ నెల 27న జరిగే స్విస్ పార్లమెంటులోని ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆమోదించవలసి ఉంది. దీనికి ఆమోదం లభిస్తే స్విస్ బ్యాంకుల్లో డబ్బు పోగేసుకునేవారి వివరాలు భారత ప్రభుత్వం పొందగలుగుతుంది.

20:06 - November 19, 2017

విజయనగరం : ప్రాచీన హోదా వచ్చిన తర్వాత తెలుగు భాషాభివృద్ధికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన విషయాన్ని రవి గుర్తు చేశారు. ప్రాచీన హోదా వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన వందల కోట్ల రూపాయల నిధులు వృధాగా పడివున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

20:05 - November 19, 2017

గుంటూరు/శ్రీకాకుళం : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చెయ్యకుండా ప్రైవేట్‌ వ్యక్తుల పరం చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ యూటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూటీఎఫ్‌ సంఘ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. విద్య అంటే కార్పోరేట్‌ విద్యే అని నడుస్తున్న తరుణంలో అక్కడ జరుగుతున్న ఆత్మహత్యలపై కూడా అందరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును రద్దు చేయాలని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన UTF 17వ జిల్లా మహాసభలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. విద్యారంగంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్పొరేట్‌ విధానాలపై ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ విద్య పటిష్టతకు చర్యలు తీసుకోని పాలకుల చర్యను UTF మహాసభల్లో పాల్గొన్న నేతలు తప్పు పట్టారు. 

20:04 - November 19, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్‌ పడింది. ఇప్పటి వరకు ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్న ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీని తొలగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ పనులను చేయకపోవడంతో తప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో ప్రాజెక్ట్‌ పనులు చేతులు మారనున్నాయి. ఇప్పటికే స్పిల్‌ వే పనులు, రాక్‌ తొలగింపు పనులు, మట్టి పనుల నుంచి కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించి కొత్త కాంట్రాక్టర్‌కి పనులు అప్పగించడానికి రంగం సిద్ధం అయ్యింది. దాదాపుగా 1395 కోట్లకు కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లను ప్రభుత్వం పిలిచింది.ఈ టెండర్లు డిసెంబర్‌ నాటికి పూర్తి కానున్నాయి. కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల అంచనాల్లో మార్పులు వస్తాయని కేంద్రం సూచించింది. పెరిగే బడ్జెట్‌ను రాష్ట్రమే భరించుకోవాలని కేంద్రం చెప్పడంతో.. ఎలాగైనా ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీంతో 60సీ నిబంధన కింద పోలవరం ప్రాజెక్ట్‌ నుండి ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి కొత్త కాంట్రాక్టర్‌ కోసం టెండర్లను పిలిచింది. స్పిల్‌ వే పనులతో పాటు.. రాక్‌ తొలగింపు పనులు, మట్టి పనులను కొత్త కాంట్రాక్టర్‌కి అప్పగించనున్నారు.

త్రివేణీ కంపెనీ కాంట్రాక్ట్‌ నుండి తప్పుకోవడం
ఇప్పటికే మట్టి తొలగింపు పనులను సబ్‌ కాంట్రాక్ట్‌ చేస్తున్న త్రివేణీ కంపెనీ కాంట్రాక్ట్‌ నుండి తప్పుకోవడంతో ఆ పనులు గత మూడు నెలల నుండి నిలిచిపోయాయి. రాక్‌ తొలగింపు పనులను కూడా త్రివేణీ కంపెనీ సబ్‌ కాంట్రాక్ట్‌గా చేస్తుంది.. బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో త్రివేణీ యాజమాన్యం రాక్‌ తొలగింపు పనులను రెండు నెలల నుండి నిలిపివేసింది. స్పిల్‌ వే పనులు మాత్రమే చేస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీని కూడా ఇప్పుడు పూర్తిగా కాంట్రాక్ట్ నుండి తొలగించనున్నారు.స్పిల్‌ వే పనులతోనే ప్రాజెక్ట్‌లో మిగిలి ఉన్న పనుల వేగం ముడిపడి ఉండటంతో పనులను ఆలస్యంగా చేస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌ని తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. స్పిల్ వేలో నెలకు లక్ష క్యూబిక్‌ మీటర్ల వరకు పనులు చేయాల్సి ఉండగా కేవలం నెలకు 2వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా టెండర్లు
స్పిల్‌ వేలో సున్నా నుంచి 35వ బ్లాకు వరకు చేయాల్సిన పనిలో మిగిలిపోయిన పనికి.. దానికి అనుబంధంగా సిమెంట్‌ కాంక్రీటు బ్లాకులు, లైనింగు కాంక్రీటు పనులు చేపట్టేందుకు కొత్తగా టెండర్లు పిలుస్తున్నారు. దాదాపుగా 1395 కోట్లకు ఈ టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ టెండర్లకు కూడా డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించనుంది. కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించనున్న పనుల్లో స్పిల్‌ వే నిర్మాణంలో మిగిలి ఉన్న పనులతో పాటు ఇంకా తొలగించాల్సిన 80లక్షల క్యూబిక్‌ మీటర్ల రాక్‌, 70లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి కాంట్రాక్ట్‌ను అప్పగించనుంది.ఇప్పటికే డయాఫ్రాం వాల్ నిర్మాణాన్ని బావర్‌, ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు, గేట్ల తయారీని బెకం కంపెనీ, రాక్‌ ఫీల్‌ డ్యాం పనులను కెల్లార్‌ కంపెనీలు ప్రభుత్వం ఆధీనంలో సబ్‌ కాంట్రాక్‌లు చేస్తుండగా ఇప్పుడు మరో కొత్త కంపెనీ ట్రాన్స్‌ ట్రాయ్‌ స్థానంలోకి రానుంది.

20:02 - November 19, 2017

మేడ్చల్ : కలహాల్లో కాపురాలు కొట్టుకుపోతున్నాయి. ఆలుమగల మధ్య తగాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వారి మధ్య చెలరేగుతున్న మనస్పర్థలు పచ్చటి సంసారాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. వారి ఆవేశాలు పరాకాష్టకు చేరి దారుణాలకు తెగబడుతున్నాయి. భర్తో, భార్యో చేసే తప్పులు.. ఆ కుటుంబాలకు శాపాలుగా మిగులుతున్నాయి. వారి బిడ్డలను అనాధలను చేస్తున్నాయి. హాయిగా సాగిపోతున్న కాపురాలను చేజేతులా కూల్చుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసినందుకు ఇల్లాలిపై దాడి చేసి ఇంటినుంచి గెంటేశాడో ప్రబుద్ధుడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌ శ్రీనగర్ కాలనీకి చెందిన పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. చందానగర్‌కు చెందిన సంగీతను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో మరో యువతిని పెళ్లి చేసుకుని ఏకంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేంటని నిలదీసిన భార్యను ఆడపిల్ల పుట్టిందన్న వంకతో ఆమెను దారుణంగా కొట్టి ఇంటినుంచి గెంటివేశాడు. తీవ్రంగా గాయపడిన సంగీత అత్తింటి ముందు న్యాయపోరాటానికి దిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నాడు. నిత్య పెళ్లి కొడుకుగా మారిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ బండారం మేడ్చల్‌ జిల్లాలో బట్టబయలైంది. వరంగల్‌జిల్లా సుబేదారి మహిళాపీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేందర్‌కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని గాలికొదిలేసి..రహస్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఫిర్జాదీగూడలో మూడో భార్యతో కాపురం పెట్టినట్లు తెలుసుకున్న మొదటిభార్యకు చిర్రెత్తుకొచ్చింది. పిల్లలతో వెళ్లి మొగుడితో సహా మూడో భార్యను పట్టుకుని దుమ్ముదులిపింది. వీపు విమానం మోత మోగించింది.

తప్పటగుడులు వేసిన వదిన,మరిది
తప్పటగుడులు వేసిన వదిన,మరిదిపై కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన వరంగల్‌ అర్బన్‌జిల్లా కమాలాపూర్‌లో చోటు చేసుకుంది. లావణ్య, తిరుపతి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన ఇద్దరు.. తిరిగి స్వగ్రామం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఇద్దరిని చితకబాదారు. అడ్డుకున్న స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.భ‌ద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో వివాహిత‌ అనుమానాస్పద మృతి బంధువుల మధ్య కొట్లాటకు దారితీసింది. సుజాతానగర్‌కు చెందిన నరేశ్‌, జీవిత దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో జీవిత అనుమానాస్పదస్థితిలో చనిపోయింది. అత్తింటివారు ఆత్మహత్య అని చెబుతుండగా.. ఇది ముమ్మాటికి హత్యే అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన వారు భర్త, అత్తకు దేహశుద్ధి చేశారు.

కట్టుకున్నవాడిని కిరాతకంగా కడతేర్చిన
కట్టుకున్నవాడిని కిరాతకంగా కడతేర్చిన ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో కలకలం రేపింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న మహేందర్‌..ఇద్దరికి నరకం చూపించాడు. చిత్రహింసలు పెట్టడంతో భరించలేకపోయిన ఇద్దరు భార్యలు.. భర్త మెడకు చున్నీ బిగించి హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని తగలబెట్టారు. భర్త వేధింపులు తాళలేకే చంపినట్లు ఇద్దరు భార్యలు చెబుతున్నారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాలు, అస్సుయలతో చాలామంది పచ్చటి సంసారాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారు. ఆప్యాయతలు, అనురాగాలు మరిచిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. మరికొంతమంది పాశ్చత్యపోకడలతో తప్పటడుగులు వేసి కాపురాలు కూల్చుకుంటున్నారు. ఒకరిపై మరొకరికి నమ్మకమనే ముడితో పెనవేయబడ్డ మాంగళ్య బంధం విలువ తెలుసుకోలేకపోతున్నారు.  

19:59 - November 19, 2017

పశ్చిమగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదాపై సోమవారం చలో అసెంబ్లీకి CPM ఆంధ్రప్రదేశ్‌ కమిటీ పిలుపు ఇచ్చింది. ఏలూరులో జరిగిన CPM పశ్చిమగోదావరి జిల్లా 24వ మహాసభల్లో మధు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు ప్రత్యేక కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించారు. 

19:58 - November 19, 2017

గుంటూరు : లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను అడ్డుకోవడానికి లక్ష్మీపార్వతి ప్రయత్నిస్తున్నారని.. ఆమె అనుచరులతో ఫోన్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తన సినిమాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు

19:58 - November 19, 2017

అనంతపురం : దేశంలో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న దాడులకు చంద్రబాబు మౌనంగా మద్దతు ఇస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై పోరాటాలు చేయాలన్నారు. అనంతపురంలో 10 నెలల్లో 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వేరుశనగ రైతులకు మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని బృందాకరత్ మండిపడ్డారు. 

18:32 - November 19, 2017

 

గుంటూరు : జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి వీధిలో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. దాడిలో ఏడుగురు చినన్నారులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మైనర్ బాలిక నిశ్చితార్థాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ : మైనర్ బాలికకు బలవంతంగా నిశ్చితార్థాన్ని చేస్తుండగా పోలీసులు అడ్డుకున్న ఘటన హైదారాబాద్‌లోని మల్లాపూర్‌లో జరిగింది. 13ఏళ్ల బాలికకు 30ఏళ్ల వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థమ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకొన్న పోలీసులు బాలికను రక్షించారు. అనంతరం చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు. 

18:09 - November 19, 2017

ఆదిలాబాద్‌ : ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వేదికపై సీటు కోసం మాజీ మంత్రి సీఆర్ఆర్, పీసీసీ కార్యదర్శి సుజాత వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర మాటలు తూటాలు పేల్చుకున్నారు. ఎంత నచ‍్చచెప్పినా గొడవ సద్దుమణగకపోవడంతో ఆగ్రహం చెందిన మాజీ ఎంపీ వి.హన‍్మంతరావు సభ మధ‍్యలోనే వేదికపై నుంచి దిగి వెళ్ళిపోయారు.

18:07 - November 19, 2017

ఆసిఫాబాద్ : అక్రమార్కులు బరితెగించారు. పాత కరెన్సీ నోట్లు మారుస్తూ కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా, తిర్యాణి మండలంలోని మొర్రిగూడెం గ్రామ పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వారిని బెల్లంపల్లి చిన్న బూజ గ్రామానికి చెందిన సతీష్‌, కాసిపెట్ గ్రామానికి చెందిన లక్ష్మణ్, బెల్లంపల్లి హనుమాన్‌ బస్తీకి చెందిన రామకృష్ణ, రమేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నోట్ల మార్పిడి ముఠాకి, పోలీసులకి సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి.ఈ పాత నోట్లు గిరిజనుల నుండి వసూలు చేసినవా లేదంటే మావోయిస్టుల డంప్‌ నుంచి తీసుకున్నవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు నుండి పోలీస్‌ అధికారులను తప్పించడానికి పలువురు నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. తిర్యాణి మండలంలోని మొర్రిగూడ వద్ద పోలీసులు 10.80 లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లికి చెందిన నలుగురు వ్యక్తులు 10.80 లక్షల పాత నోట్లను గిరిజనులకు అంటగట్టడానికి వెళ్తుండగా ముందస్తు సమాచారంతో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అంటున్నారు.

నిందితులకు రాజకీయ అండదండలు
నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10.80 లక్షలు ఎక్కడివి? ఏడాది క్రితం నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రప్రభుత్వం చేపట్టింది. పాత నోట్లు ఇంకా బ్యాంకుల్లో చెల్లుబాటు అవుతాయని నమ్మే ఆదివాసీలు జిల్లాలో ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనులు ఈ నగదు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని అందుకు కమీషన్ కూడా ఇస్తామని నమ్మబలికారని పోలీసులు చెబుతున్నారు.

అడవి బిడ్డలే లక్ష్యంగా
తిర్యాణి మండలంలోని మంగి ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా ఉండేది. మావోయిస్టు అగ్రనేతలు జగదీశ్‌, మురళి, శోభన్‌ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి లేకున్నా.. డంప్‌లు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. అడవి బిడ్డలే లక్ష్యంగా పోడు వ్యవసాయంతో మనుగడ సాగిస్తున్న గిరిజనులు ఇవాళ్టికీ సులువుగా మోసపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. గిరిజన లోగిళ్లలోకి అడుగు పెట్టని అక్షరం, సురక్షిత తాగునీరు, నాణ్యమైన వైద్యం, రాకపోకలకు అనువైన రహదారులు, చీకటిపడగానే విద్యుత్తు లేక అలుముకునే అంధకారం ఇవి అడవి బిడ్డలు నిత్యం ఎదురుకుంటున్న ఇబ్బందులు. వీళ్లు ఎదుటివారిని సులువుగా నమ్మడంతో అక్రమార్కులు మోసం చేస్తున్నారు.

18:06 - November 19, 2017

కరీంనగర్/సిద్దిపేట : జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌..మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇందిరాగాంధీ జయంతి రోజున...వరల్డ్‌ టాయిలెట్‌ డే అంటూ ప్రచార ప్రకటనలు చేయడం దారుణమన్నారు.

 

18:05 - November 19, 2017

సిద్దిపేట : జిల్లాలో నిర్వహించిన జాబ్‌ మేళాలకు యువతీ, యుకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాతిక కంపెనీలు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు జ్యోతి వెలిగించి జాబ్‌ మేళాను ప్రారంభించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగమే కాలాలనే భావం నుంచి యువతీ, యువకులు బయటపడాలని ఈ సదర్భంగా హరీశ్‌రావు చెప్పారు. 

18:04 - November 19, 2017

కరీంనగర్ : శివారు మల్కపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యవసాయ కూలీల కుటుంబాలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ TRS ఎంపీ వినోద్‌కుమార్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాల స్వగ్రామం చామనపల్లి వెళ్లి దుఖఃసాగరలో మునిగిన మృతుల పిల్లలను ఓదార్చారు. తల్లులను పోగొట్టుకున్న పిల్లల రోధనలను చూసి చలించిపోయిన ఈటల రాజేందర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

18:03 - November 19, 2017

హైదరాబాద్ : మైనర్ బాలికకు బలవంతంగా నిశ్చితార్థాన్ని చేస్తుండగా పోలీసులు అడ్డుకున్న ఘటన హైదారాబాద్‌లోని మల్లాపూర్‌లో జరిగింది. 13ఏళ్ల బాలికకు 30ఏళ్ల వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థమ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకొన్న పోలీసులు బాలికను రక్షించారు. అనంతరం చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు. 

18:02 - November 19, 2017

హైదరాబాద్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పీపుల్స్‌ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. బ్యాంకుల జాతీయ కరణ, భూ సంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేమని నేతలు కొనియాడారు. 2019లో కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్‌, కేవీపీ పిలుపునిచ్చారు.

18:01 - November 19, 2017

విశాఖ : విశాఖపట్నంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రైవేటీకరిస్తే సహించబోమని CPM పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. DCI ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగదాంబ సెంటర్‌లో సంతకాల సేకరణ ఉద్యమాన్ని రాఘవులు ప్రారంభించారు. ఇప్పటికే విశాఖలోని హిందూస్థాన్‌ జింక్‌ను ఆమ్మివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటీకరించడాన్ని రాఘవులు తప్పు పట్టారు. 

18:00 - November 19, 2017

నిజామాబాద్ : దళితులపై దాడి చేసిన భరత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. నిజామాబాద్ జిల్లా, ఆబందపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓయూ జేఏసీ, దళిత జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. 

ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం : జిల్లా చీరాల రామాచంద్రపురంలో విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరి మృదేహాలు లభించాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

16:40 - November 19, 2017
16:39 - November 19, 2017
15:04 - November 19, 2017

వివాహిత అనుమానాస్పద మృతి

కొత్తగూడెం : జిల్లా ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన భార్య బంధువులు ఆమె భర్తను, అత్తను చితకబాదారు. హత్య చేసి ఆత్మహత్య చిత్రికరించారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

వదినా, మరిది అక్రమ సంబంధం

వరంగల్/కరీంనగర్ : జిల్లా కమలాపూర్ గ్రామంలో వదినా, మరిదిని వారి బంధువులు చితకబాదారు. 2 నెలల క్రితం అన్నభార్య లావణ్యను తీసుకుని తమ్ముడు తిరుపతి వెళ్లిపోయాడు. వారు ఈ రోజు గ్రామానికి చేరుకుకోవడంతో కోపొద్రిక్తులైన బంధువులు వారి దాడికి దిగి హత్య చేసే ప్రయత్నం చేశారు.

14:33 - November 19, 2017
14:32 - November 19, 2017

కొత్తగూడెం : జిల్లా ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన భార్య బంధువులు ఆమె భర్తను, అత్తను చితకబాదారు. హత్య చేసి ఆత్మహత్య చిత్రికరించారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:31 - November 19, 2017

కరీంనగర్ /వరంగల్ : జిల్లా కమలాపూర్ గ్రామంలో వదినా, మరిదిని వారి బంధువులు చితకబాదారు. 2 నెలల క్రితం అన్నభార్య లావణ్యను తీసుకుని తమ్ముడు తిరుపతి వెళ్లిపోయాడు. వారు ఈ రోజు గ్రామానికి చేరుకుకోవడంతో కోపొద్రిక్తులైన బంధువులు వారి దాడికి దిగి హత్య చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం

మేడ్చల్ : జిల్లాలోని రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను, భర్త, అత్తామామలు ఇంటి నుండి గెంటేశారు. న్యాయం చేయాలని బాధితురాలు సునీత భర్త ఇంటి ముందు కూతురితో ఆందోళన చేస్తోంది. బోడుప్పల్‌లో ఈ ఘటన జరిగింది. 

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల ఆధిక్యం

కోల్ కతా : తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల ఆధిక్యం సాధించింది. భాతర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు మాత్రమే చేసింది. నాలుగవరోజు టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది. 

13:47 - November 19, 2017

హైదరాబాద్ : దేశంలో ప్రతి పౌరుడూ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలో నిర్వహించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. 1935లో విజయవాడలో ప్రారంభమై  దక్షిణ భారత హిందీ ప్రచారసభ వల్ల వేలాది మంది అధ్యాపకులు, ప్రచారకులు తయారైనట్టు తెలిపారు.  హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఉపరాష్ట్రపతి అన్నారు.   

 

13:44 - November 19, 2017

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పీపుల్స్‌ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. బ్యాంకుల జాతీయ కరణ, భూ సంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేమని నేతలు కొనియాడారు. 2019లో కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్‌, కేవీపీ పిలుపునిచ్చారు.

 

13:42 - November 19, 2017

మేడ్చల్ : రోజుకు రోజుకూ మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. మూఢనమ్మకాలు పోరిగిపోయి...మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను, భర్త, అత్తామామలు ఇంటి నుండి గెంటేశారు. న్యాయం చేయాలని బాధితురాలు సునీత భర్త ఇంటి ముందు కూతురితో ఆందోళన చేస్తోంది. బోడుప్పల్‌లో ఈ ఘటన జరిగింది. 
బాధితురాలు 
'వరకట్నం ఎక్కువ తేవాలని మా అత్త వేధిస్తోంది. నెల రోజు నుంచి టార్చర్ పెడుతున్నారు. ఇంట్లో నాకు పని మనిషి హోదా ఇచ్చే వారు. నా భర్త... నాకు, నా తమ్మునికి అక్రమ సంబంధం అంటగట్టాడు. నీ తమ్మునితోని పడుకుని, కన్నావ్.. వానికే ఇచ్చేయ్ అన్నాడు. పచ్చి బూతులు తిడుతాడు' అని చెబుతూ బోరున విలపించారు.

 

13:30 - November 19, 2017

కోల్ కతా : తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల ఆధిక్యం సాధించింది. భాతర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు మాత్రమే చేసింది. నాలుగవరోజు టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది. 

 

13:26 - November 19, 2017

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. పోలవరం నిర్మాణంలో కాంట్రాక్టర్‌ను మార్చేందుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. మొత్తం 1395కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు కొత్తగా టెండర్లు పిలిచింది. ఈనెల 16 నుంచి వచ్చేనెల 4వరకు  టెండర్లకు గడువు విధించింది. మరో ఏడాదిలో పోలవరం పనులు పూర్తి చేయాలని మొదట భావించినా.. ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి సరైన యంత్రపరికరాలు లేకుండా పోయాయి. దీంతో అనుకున్న సమయానికి పనులు పూర్తికావని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు కొత్తగా టెండర్లు పిలిచింది. అయితే ఇపుడు కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల పెద్ద మొత్తంలో నష్టం వచ్చినా భరిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చింది. అయితే.. నష్టం ఎన్ని కోట్లలో ఉంటుందనేది మాత్రం చంద్రబాబు ప్రభుత్వం గోప్యంగా ఉంచడంపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. 

 

13:00 - November 19, 2017

కడప : జిల్లాకే తలమానికంగా నిలవాల్సిన యోగివేమన యూనివర్శిటీ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. దేశానికి మేధావులను అందించాల్సిన యూనివర్శిటీ వివాదాలతో అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. అధికారులు, పాలక మండలి సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యోగివేమన యూనివర్శిటీలో నెలకొన్న వివాదాలపై 10 టీవీ స్పెషల్‌ ఫోకస్. 
ఇక్కడ వారు చెప్పిందే వేదం
ఇక్కడ వారు చెప్పిందే వేదం. కాదంటే అంతు చూస్తామంటారు. కడప జిల్లా యోగివేమన యూనివర్శిటీలో పాలకమండలి సభ్యుల తీరు ఇది. నీతి నిజాయితీకి వాళ్లు ఎప్పుడో నీళ్లొదిలేశారు. వారి అవినీతిని బయట పెట్టినందుకు తమదే ప్రభుత్వం. తామే పాలకులం. తాము ఏం చెప్పినా ఒకే అనాల్సిందే అనేలా ప్రవర్తిస్తున్నారు. 
పాలకమండలి సభ్యుడు గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు 
కడప జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ పాలకమండలి సభ్యుడు గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 14న విజయవాడలో యోగివేమన యూనివర్శిటీ పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశానికి వైస్ ఛాన్స్‌లర్‌తో పాటు పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈసీ సభ్యులు గోవర్ధన్‌ రెడ్డి వైవియు ఉద్యోగిపై చిందులేశారు. తన కాలేజ్‌పై  విచారణ చేసే మగాడివా? తానెవరో తెలుసా అంటూ సదరు ఉద్యోగిపై చిందులేశాడు.
వీసీపై కక్ష కట్టారనే ఆరోపణలు 
యోగివేమన యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్యను పదవి నుంచి తొలగించాలని, అధికారులపై వత్తిడి తెచ్చారు. అందుకు అనుకూలంగా వ్యవహరించలేదని, వీసీపై కక్ష కట్టారనే ఆరోపణలున్నాయి. కళాశాల తనిఖీలో తగినంతమంది ఫ్యాకల్టీలు లేరని, సంబంధిత అధికారులు కొన్ని సెక్షన్లను రద్దు చేశారు. తాను ఈసీ మెంబర్ అని తెలిసినా, ఈ పని చేస్తారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులంటున్నారు. వైవియు రిజిస్ట్రార్‌ను తొలగించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తే ఊరుకోమని వారు స్పష్టం చేశారు. 
అవకతవకలు జరగలేదన్న రిజిస్ట్రార్ 
ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రిజిస్ట్రార్ రామచంద్రయ్య తెలిపారు. ఏసీలు రిపేర్ చేయడానికి తాము కొందరిని రోజు కూలీపై తీసుకున్నామని తెలిపారు. యూనివర్శిటీలో జరిగిన అవకతవకలపై తాను మాట్లాడానే తప్ప.. ఎవరిపైనా కక్ష సాధింపు లేదని పాలకమండలి సభ్యుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ గొడవలతో యూనివర్శిటీ వివాదాల సుడిలో చిక్కుకుపోతోంది. 

 

12:56 - November 19, 2017

హైదరాబాద్ : ఘన వ్యర్థాల నిర్వహణకు బల్దియా వినూత్న పద్ధతుల్లో ముందుకు వెళ్తుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా అండర్‌ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్స్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది.
చెత్త నిర్వహణపై బల్దియా కొత్త ప్రయోగాలు 
హైదరాబాద్‌లో చెత్త నిర్వహణపై బల్దియా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయడంతో పాటు.. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు ఆటో టిప్పర్లను వినియోగిస్తోంది. ఇప్పుడు భూగర్భంలో  డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మరో వినూత్న విధానాన్ని ఇంట్రడ్యూస్‌ చేయడానికి సిద్ధమైంది.  
రోడ్లపై డస్ట్‌ బిన్‌ల విధానానికి స్వస్తీ
రోడ్లపైనే డస్ట్‌ బిన్‌లు ఉండే  విధానానికి బల్దియా స్వస్తి చెప్పనుంది. అండర్‌ గ్రౌండ్‌లో డస్ట్‌ బిన్‌లు ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ విధానంలో ఒకటిన్నర టన్నుల సామర్థ్యం గల డస్ట్‌ బిన్‌లను భూమిలో గొయ్యి తీసి అమరుస్తారు. ఉపరితలంపైకి కనిపించేలా అందమైన ఆకృతుల్లో రూపొందించిన  పెద్ద గొట్టాలను బయటికి ఏర్పాటు చేస్తారు. ఈ అండర్‌ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్‌లో చెత్త నిండిపోయిన విషయం కూడా ఆటోమేటిక్‌గా తెలుస్తోంది. చెత్త నిండిన వెంటనే గార్బెజ్‌ కలెక్షన్‌ వాహనాలు అండర్ గ్రౌండ్‌ డస్ట్‌ బిన్‌లను ఖాళీ చేయడం లేదా వాటిని పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ కేంద్రానికి తీసుకెళ్లి అదే స్థానంలో మరో బిన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది.  
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో డస్ట్‌ బిన్‌ల ఏర్పాటు
తొలుత జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ సర్కిళ్లలో.. చార్మినార్‌, జూపార్క్‌ల వద్ద  ఈ డస్ట్‌ బిన్‌లను పెట్టేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో ఈ డస్ట్‌ బిన్‌లను ఏర్పాటు చేయనున్నారు. అండర్‌ గ్రౌండ్స్‌ డస్ట్‌ బిన్స్‌ ఉన్న..  అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని.. నగర బ్యూటిఫికేషన్‌ కూడా దెబ్బతినకుండా  ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

 

జెన్ కో..ట్రాన్స్ కో సీఎండీతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : జెన్ కో..ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. 24 గంటల వ్యవసాయానికి విద్యుత్ ప్రయోగం, ఫలితాలపై చర్చించారు. 24 గంటల పాటు కరెంటు సరఫరాతో తలెత్తిన పరిస్థితిని, ప్రయోగ ఫలితాలను సీఎంకు సీఎండీ వివరించారు.

 

వృద్ధురాలు హత్య కలకలం

ప్రకాశం : జిల్లా కందుకూరులో వృద్ధురాలు హత్య కలకలం రేపింది. వారంరోజులుగా ఇంటికి రంగులు వేయిస్తున్న వృద్ధురాలు లక్ష్మమ్మను కిరాతకంగా హత్యచేసి, డబ్బు, నగలు దోచుకెళ్లారు. అయితే ఇంటికి రంగులు వేస్తున్న కూలీలే ఈ హత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

12:21 - November 19, 2017

కృష్ణా : విజయవాడ రూరల్ మంగళపురంలో విషాదం నెలకొంది. పోలవరం కాలువ వద్ద కార్తీక స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు తల్లీకూతుళ్లు కాలువలో పడి పోయారు. స్థానికులు తల్లిని రక్షించారు. శ్వేత (5) అనే బాలిక గల్లంతైంది. బాలిక కోసం ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు వెతుకుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మంగళపురంలో విషాదం

కృష్ణా : విజయవాడ రూరల్ మంగళపురంలో విషాదం నెలకొంది. పోలవరం కాలువ వద్ద కార్తీక స్నానాలు చేస్తూ తల్లీకూతళ్లు కాలువలో పడి పోయారు. స్థానికులు తల్లిని రక్షించారు. 

12:03 - November 19, 2017

జగిత్యాల : మంచినీళ్లు అనుకుని బాడీలోషన్‌ తాగిన  ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో  బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న  సింధు వాటర్‌ బాటిల్‌ అనుకుని బాడీలోషన్‌ను తాగింది. వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన సింధును తోటివిద్యార్థులు, టీచర్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంధ్య కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. 
 

హెడ్‌కానిస్టేబుల్‌ రాసలీలలు.. దేహశుద్ధి చేసిన మొదటి భార్య

మేడ్చల్‌ : జిల్లాలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ రాసలీలలు బయటపడ్డాయి. మొదటిభార్య, పిల్లలు ఉన్నా.. మరో రెండు ఫ్యామిలీలు మెయింటెన్స్‌ చేస్తున్నాడు. ఫిర్జాదీగూడలో మూడో కాపురం పెట్టిన హెడ్‌కానిస్టేబుల్‌ రాజేందర్‌ను మొదటిభార్య, పిల్లలు పట్టుకున్నారు. మూడో భార్య ఇంట్లో ఉన్న రాజేందర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. రాజేందర్‌తోపాటు మూడవ భార్యకూ దేహశుద్ధి చేశారు. రాజేందర్‌ వరంగల్‌జిల్లా సుబేదారి మహిళాపీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 

11:57 - November 19, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ల్యాండ్‌ బ్యాంక్‌ను రక్షించడం తమ మొదటి కర్తవ్యమని కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. ఇప్పటివరకూ సిటీల్యాండ్స్‌పై ఉన్న కేసులను వెకేట్  చేయించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. విద్యా, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతామన్న యోగితా.. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది సమయంలోనే జిల్లాపై తనదైన ముద్ర వేస్తున్నారు. 

 

11:55 - November 19, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని మల్కిపురం మండలం మల్కిపురంలో వైస్సార్ సీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సాక్షిగా ఈ రగడ తలెత్తింది. మల్కిపురంలో జరుగుతున్న కార్యకర్తల సమావేశానికి పిల్లి సుభాష్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మార్గమధ్యంలో కృష్ణంరాజు కలవడంతో కొంత ఆలస్యంగా రావడంతో కార్యకర్తలు మండిపడ్డారు. సమావేశం నుండి వెళ్లిపోతామని అసహనం వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు కలగజేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళనను విరమించారు. సోమవారం కాకినాడలో జరిగే కార్యక్రమానికి పార్టీ పరిశీలకుడు ధర్మాను ప్రసాదరావు వస్తారని ఆయన సమక్షంలో తగిన నిర్ణయం తీసుకుటామని బోస్ తెలిపారు.

 

11:51 - November 19, 2017

మేడ్చల్‌ : జిల్లాలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ రాసలీలలు బయటపడ్డాయి. మొదటిభార్య, పిల్లలు ఉన్నా.. మరో రెండు ఫ్యామిలీలు మెయింటెన్స్‌ చేస్తున్నాడు. ఫిర్జాదీగూడలో మూడో కాపురం పెట్టిన హెడ్‌కానిస్టేబుల్‌ రాజేందర్‌ను మొదటిభార్య, పిల్లలు పట్టుకున్నారు. మూడో భార్య ఇంట్లో ఉన్న రాజేందర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. రాజేందర్‌తోపాటు మూడవ భార్యకూ దేహశుద్ధి చేశారు. రాజేందర్‌ వరంగల్‌జిల్లా సుబేదారి మహిళాపీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

శ్రీనివాస రిజర్వాయర్‌కు గండి..నీటి మునిగిన వరిపంట

కడప : జిల్లాలో శ్రీనివాస రిజర్వాయర్‌కు గండిపడింది. చిన్నమండెం మండలం నారాయాణరెడ్డిగారి పల్లె వద్ద కాలువకు గండిపడింది. పెద్ద ఎత్తున నీరు రోడ్లపైకి చేరుకుంటోంది. దీంతో మండలంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 వందల ఎకరాల వరిపంట నీటిలో మునిగిపోయింది. 

11:09 - November 19, 2017

ప్రకాశం : జిల్లా కందుకూరులో వృద్దురాలు హత్య కలకలం రేపింది. వారంరోజులుగా ఇంటికి రంగులు వేయిస్తున్న వృద్ధురాలు లక్ష్మమ్మను కిరాతకంగా హత్యచేసి, డబ్బు, నగలు దోచుకెళ్లారు. అయితే ఇంటికి రంగులు వేస్తున్న కూలీలే ఈ హత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:00 - November 19, 2017

హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్‌ నేషనల్ ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఇండిగో ఏయిర్‌ లైన్స్‌ మహిళా సిబ్బంది పట్ల ఐదుగురు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో బాధితురాలు వారిని ఔట్ పోస్టు పోలీసులకు అప్పగించింది. తాగిన మైకంలో ఉన్న యువకులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, విచారిస్తున్నారు. మత్తులో తప్పుగా ప్రవర్తించినందుకు క్షమించమని కోరారు. తాగుబోతులను బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, శ్రీనగర్‌ కాలనీలకు చెందినవారిగా గుర్తించారు. 

10:58 - November 19, 2017

కడప : జిల్లాలో శ్రీనివాస రిజర్వాయర్‌కు గండిపడింది. చిన్నమండెం మండలం నారాయాణరెడ్డిగారి పల్లె వద్ద కాలువకు గండిపడింది. పెద్ద ఎత్తున నీరు రోడ్లపైకి చేరుకుంటోంది. దీంతో మండలంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 వందల ఎకరాల వరిపంట నీటిలో మునిగిపోయింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నిందితుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగం

హైదరాబాద్ : ఖాకీల కాఠిన్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఓ నిందితుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. తీవ్రగాయాల పాలైన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టడంతో చికిత్స అందించాలని న్యామూర్తి ఆదేశించారు. నిందితుణ్ని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. కాగా థర్డ్‌డిగ్రీ విషయం బయటికి రావడంతో అర్ధరాత్రి ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌కు వచ్చిన పోలీస్‌ కమిషనర్‌  కేసు వివరాలను ఆరా తీశారు. 

10:33 - November 19, 2017

హైదరాబాద్ : ఖాకీల కాఠిన్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఓ నిందితుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. తీవ్రగాయాల పాలైన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టడంతో చికిత్స అందించాలని న్యామూర్తి ఆదేశించారు. నిందితుణ్ని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. కాగా థర్డ్‌డిగ్రీ విషయం బయటికి రావడంతో అర్ధరాత్రి ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌కు వచ్చిన పోలీస్‌ కమిషనర్‌  కేసు వివరాలను ఆరా తీశారు. 


 

పెళ్లింట్లో చోరీ

భద్రాద్రి కొత్తగూడెం : అందరూ పెళ్లిసందట్లో ఉంటే.. దొంగోడు తనపని తాపీగా చేసుకుపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొండికుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పెళ్లింట్లోకి దూరిన చోరుడు.. ఇంట్లో బీరువాను పగులగొట్టాడు. అక్కడే ఏమీ దొరకపోవడంతో  నిద్రపోతున్న ఓ మహిళ మెళ్లో మంగళసూత్రాలు  లాక్కెళ్లాడు. హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపుగానే దొంగోడు గోడదూకేశాడని పెళ్లివారు లబోదిబోమంటున్నారు. 

 

10:27 - November 19, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అందరూ పెళ్లిసందట్లో ఉంటే.. దొంగోడు తనపని తాపీగా చేసుకుపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొండికుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పెళ్లింట్లోకి దూరిన చోరుడు.. ఇంట్లో బీరువాను పగులగొట్టాడు. అక్కడే ఏమీ దొరకపోవడంతో  నిద్రపోతున్న ఓ మహిళ మెళ్లో మంగళసూత్రాలు  లాక్కెళ్లాడు. హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపుగానే దొంగోడు గోడదూకేశాడని పెళ్లివారు లబోదిబోమంటున్నారు. 

 

10:25 - November 19, 2017

హైదరాబాద్‌ : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. చున్నితో భర్తను చంపి, ఇంట్లోనే తగలబెట్టారు ఇద్దరు భార్యలు. భర్త మహేందర్‌ వేధింపులు తాళలేకే చంపామని ఇద్దరు భార్యలు చెప్పారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మన్నెగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం

వికారాబాద్ : మన్నెగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

09:38 - November 19, 2017

తూర్పుగోదావరి : కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నదీ తీరాలకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలోని పవిత్ర పుష్కర ఘాట్‌  భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామునుండే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రావి చెట్టుకు పూజలు చేసి దీపాలు వెలిగించారు. 

 

భర్తను హత మార్చిన ఇద్దరు భార్యలు

హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. భర్తను ఇద్దరు భార్యలు హత మార్చారు. చున్నీతో ఉరివేసి హత్య చేశారు. భర్త వేధింపులు తాళలేక చంపామని భార్యలు చెబుతున్నారు. 

08:47 - November 19, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం కథానిలయం వ్యవస్థాపకులు కాశీపట్నం రామారావును సాహితీ స్రవంతి ఏపీ కమిటీ ఘనంగా సత్కరించింది. కారా మాష్టారు కథల ద్వారా చేస్తున్న సేవలు సామాజిక మార్పునకు చైతన్య స్ఫూర్తిగా నిలిచాయని సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. రచయితలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని, మతోన్మాదులు పెచ్చుమీరిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

08:44 - November 19, 2017

విశాఖ : కార్పొరేట్లకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రభుత్వ రంగ పరిరక్షణ కార్మిక రంగం కర్తవ్యం అనే అంశంపై జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. జీఎస్టీ వల్ల అన్ని రంగాల ప్రజలు పూర్తిగా నష్టపోయారన్నారు రాఘవులు. 

 

శంషాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ : రింగ్‌రోడ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ సమీపంలో కంటెయినర్‌ లారీలు, కార్లు ఎదురెదురుగా ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో శంషాబాద్‌ - గచ్చిబౌలీ రూట్‌లో  4గంటలకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అయితే ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

08:41 - November 19, 2017

హైదరాబాద్‌ : రింగ్‌రోడ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ సమీపంలో కంటెయినర్‌ లారీలు, కార్లు ఎదురెదురుగా ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో శంషాబాద్‌ - గచ్చిబౌలీ రూట్‌లో 4గంటలకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అయితే ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. 

 

08:39 - November 19, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లి ఉండవల్లి సెంటరు వద్ద కృష్ణానదిలో అత్తా కోడళు కొట్టుకుపోయారు. పోలిపౌఢ్యమి సందర్భంగా.. కృష్ణానదిలో పవిత్రస్నానం ఆచరించేందుకు వచ్చిన అత్తా కోడళ్లు నీటిలో మునిగిపోయారు. అత్త మద్ది నాగరత్నం మృతదేహాన్ని వెలికితీశారు. కోడలు బ్రాహ్మణి ఆచూకీ గల్లంతైంది.

 

08:33 - November 19, 2017

ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు అనురాధ, సీపీఎం నేత సీహెచ్ బాబురావు, గ్రీన్ ట్యిబ్యునల్ పిటిషన్ దారుడు శ్రీమన్నారాయణ పాల్గొని, మాట్లాడారు. మూడేళ్లయినా డిజైన్స్ ఇంకా పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

నేడు సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్

అమరావతి : నేడు సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. పలువురికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

 

07:53 - November 19, 2017

కోల్ కతా : భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు కష్టాలు కొనసాగుతున్నాయి.ఇండియన్‌ క్రికెట్‌ మక్కా కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతోన్న 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా...టీమిండియా స్టార్స్‌ మాత్రం తేలిపోతున్నారు.తొలి ఇన్నింగ్స్‌లో లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన భారత్‌...బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోతోంది.మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచాలని లంక జట్టు పట్టుదలతో ఉంది.
తొలి టెస్ట్‌లో తేలిపోతోన్న భారత జట్టు  
కోల్‌కతా టెస్ట్‌లో పటిష్టమైన భారత్‌పై శ్రీలంక జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇండియన్‌ క్రికెట్‌ మక్కా..ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు తేలిపోతోంది. సిరీస్‌కు ముందు బలహీనంగా కనిపించిన శ్రీలంక టీమ్ డామినేట్‌ చేస్తుండగా .... టీమిండియా స్టార్స్‌ మాత్రం విఫలమవుతున్నారు. 5 వికెట్లకు 74 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌...ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 98 పరుగులు మాత్రమే జోడించగలిగింది.తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన లంక జట్టు...లహిరు తిరిమాన్నే,ఎంజెలో మాథ్యూస్‌ హాఫ్‌ సెంచరీలతో భారత్‌కు ధీటుగా బదులిచ్చింది.
శ్రీలంక 165/4 
తిరిమాన్నే, మాథ్యూస్‌ వెంటవెంటనే ఔటైనా...చాందిమల్‌, డిక్వెల్లా భారత బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇంకా 7 పరుగులు వెనుకబడి ఉన్న లంక జట్టు...తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచాలని పట్టుదలతో ఉంది. నాలుగో రోజు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తేనే భారత్‌ జట్టు పోటీలో నిలువగలుగుతుంది. 

 

07:48 - November 19, 2017

ఢిల్లీ : అందాల ప్రపంచంలో భారతదేశం కీర్తి పతాకం రెపరెపలాడింది. మిస్‌ వరల్డ్‌-2017 కిరీటం మిస్‌ ఇండియా మానుషి చిల్లార్‌కు లభించింది.  17 ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌కు  ప్రపంచసుందరీ కిరీటం లభించింది.  మిస్‌ మెక్సికోకు రెండో స్థానం, మిస్‌ ఇంగ్లండ్‌కు మూడో స్థానం లభించాయి.
మానుషి చిల్లార్‌ మిస్‌ కు వరల్డ్‌ కిరీటం 
భారత్‌కు మరోసారి మిస్‌వరల్డ్‌ కిరీటం దక్కింది. దాదాపు 17ఏళ్ల తర్వాత భారత్‌కు చెందిన మానుషి చిల్లార్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం సాధించింది.  శనివారం జరిగిన మిష్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీల్లో... హరియాణాకు చెందిన 21ఏళ్ల వైద్య విద్యార్థిని చిల్లార్‌ అందరినీ వెనక్కినెట్టి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది.  మిస్‌ వరల్డ్‌ 2017గా మానుషి చిల్లార్‌ పేరు ప్రకటించిన వెంటనే... 2016 మిస్‌ వరల్డ్‌ విజేత స్టెఫానీ డేల్‌ వాల్లే కిరీటాన్ని ఆమెకు ధరింపజేసింది.
ఉల్లాసంగా మిస్‌ వరల్డ్‌ 2017 పోటీలు   
మిస్‌ వరల్డ్‌ 2017 పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. చైనాలోని సన్యాసిటీ ఎరీనా ప్రాంతంలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన మొత్తం 118 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఈపోటీల్లో మొదటి రన్నరప్‌గా మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్‌ నిలిచింది. 
హర్యానాలో జన్మించిన మానుషి చిల్లార్‌  
మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లార్‌ హర్యానాలో జన్మించారు. ఢిల్లీలో వైద్యవిద్యను అభ్యసించారు. రాధా - రాజారెడ్డి దగ్గర మానుషి కూచిపూడి నృత్యం నేర్చుకుంది.  మానుషి.. మిస్‌ వరల్డ్‌ గెలవడానికి ముందే హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌, బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ టైటిళ్లను కూడా సాధించింది. 
1966లో రీటా ఫారియా కిరీటం కైవసం 
1966 వరకు మిస్‌ వరల్డ్‌ కిరీటం ఆసియా అందాల రాశులకు దూరంగానే ఉంది. 1966లో భారతదేశానికి చెందిన మెడిసిన్‌ స్టూడెంట్‌ రీటా ఫారియా తొలిసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐశ్వర్యారాయ్‌ దీనిని సాధించి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ఈ కిరీటం దక్కించుకుంది. దాదాపు 17ఏళ్ల తర్వాత  మానుషి చిల్లార్‌ ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 
 

 

07:43 - November 19, 2017

కేరళ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మెచ్చుకున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రాహుల్‌ చాలా హార్డ్‌వర్క్‌ చేశారని ప్రశంసించారు. గుజరాత్‌, హిమాచల్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు. ఎర్నాకులంలోని సెంట్‌ థెరిసా కాలేజీలో జరిగిన ఓ సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కేరళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడిఎఫ్ నిర్వహించిన జనసభ నుద్దేశించి మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తున్న తప్పుడు విధానాలను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి మద్దతివ్వాలని మాజీ ప్రధాని వామపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

 

తాడేపల్లిలో విషాదం

గుంటూరు : తాడేపల్లిలో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి అత్తాకోడలు గల్లంతయ్యారు. అత్త మృతదేహం లభ్యం అయింది. కోడలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

07:32 - November 19, 2017

నిజామాబాద్ : ఆ ఊర్లో 20 ఏళ్లు వచ్చాయంటే చాలు కాళ్లు వంగిపోతాయి..! చిన్న పెద్ద అనే తేడా ఉండదు.. అందరూ ఒకేలా కనిపిస్తారు..! పాతికేళ్ల యువకులు కూడా  కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంతకీ  అది ఏ ఊరు? ఆ గ్రామ ప్రజలను  పట్టి పీడుస్తున్న వ్యాధి ఏంటి?...
ప్రజలను వణికిస్తున్న ఫ్లోరైడ్‌ వ్యాధి
సాధారణంగా ఫ్లోరైడ్‌ బాధితుల పేరు వినగానే నల్గొండ జిల్లా... గుర్తుకు వస్తోంది.. కానీ ఇప్పుడు ఈ వ్యాధి నిజామాబాద్‌ జిల్లా ప్రజలను కూడా వణికిస్తోంది. బోధన్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫత్తేపూర్‌  గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఫ్లోరైడ్‌ బాధితులు కనిపిస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి.. 60 ఏళ్ల ముసలి వరకూ నడవలేకపోవడం.. కాళ్లు వంకర్లు పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ గ్రామస్థులు 40 ఏళ్లుగా ఇలాంటి సమస్యలతో  బాధపడుతున్నారు. 
ఎక్కడ  బోరు వేసినా ఫ్లోరైడ్‌ నీళ్లే 
దాదాపు 2 వేల 5 వందల మంది జనాభా ఉంటున్న ఫతేపూర్‌ గ్రామానికి ఒకే బోరు ఉంది. కరెంట్ రాగానే ఈ బోరుతో వచ్చే నీటిని ట్యాంకులో నింపుకుని.. తాగునీటి అవసరాలు తీర్చుకుంటారు. ఇదే ఊరి ప్రజలకు శాపంగా మారింది. ఉదయం పట్టి ఉంచిన నీటిపై సాయంత్రంలోపు ఉప్పు తేలుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నీటిని గ్రామస్థులు తాగుతున్నారు. ఎక్కడ  బోరు వేసినా ఇలాంటి ఫ్లోరైడ్‌ నీళ్లే వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.  
ఫత్తేపూర్‌ కు అందని ఫ్లోరైడ్‌ రహిత నీరు
ఫత్తేపూర్‌ గ్రామానికి పక్కనే ఉన్న చిన్న మావందిలో ఉన్న భారీ ప్రాజెక్ట్‌ ద్వారా 17 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తున్నారు. కానీ ఈ గ్రామానికి మాత్రం ఆ నీరు  రావడం లేదు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆ గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.
 

 

07:28 - November 19, 2017

సంగారెడ్డి : అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌.  అన్ని జిల్లాల కలెక్టరేట్లు అదే నమూనాలో నిర్మించాలని సంకల్పించిన కలెక్టరేట్‌ అది. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు నిర్మించిన ఆ కలెక్టరేట్‌లో.. ప్రభుత్వం ఆశించిన ఫలాలు అందడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. 
కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలదన్నే బిల్డింగ్‌..
కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలదన్నే బిల్డింగ్‌..40 కోట్ల రూపాయలతో  అధునాతన బిల్డింగ్‌ నిర్మాణం..మూడు ఫోర్లు - 38 శాఖలు... వందలాది మంది అధికారులు, సిబ్బంది..ఇదీ సంగారెడ్డి కలెక్టరేట్‌ ట్రాక్‌ రికార్డ్‌. ప్రజల సమస్యలు తీర్చేందుకు, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు... ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్ల కార్యాలయాలను నిర్మిస్తోంది. అయితే సంగారెడ్డిలో మాత్రం కలెక్టర్‌ కార్యాలయం కార్పొరేట్‌ కార్యాలయాన్ని తనదన్నేలా నిర్మించింది.  నలభైకోట్ల రూపాయలతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది.  కానీ ప్రభుత్వం ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.
సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది 
ప్రజలకు సేవలందించే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఎవరూ సమయానికి రావడం లేదు. ఎవరు ఎప్పుడు వస్తారో... ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియని పరిస్థితి. సమయం 10 గంటలు దాటినా కుర్చీలన్నీ ఖాళీగానే దర్శమిస్తున్నాయి. 
ప్రజల సమస్యలు పట్టించుకునే వారే కరువు 
కలెక్టరేట్‌కు ఆశతో వచ్చిన ప్రజల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు.  సకాలంలో కార్యాలయానికి వచ్చి ప్రజలకు సేవలందించేందుకు సిద్దంగా ఎవరూ లేరు.  వారికి ఇష్టం వచ్చినప్పుడు కలెక్టరేట్‌కు వస్తారు.. ఆ కాసేపటికే బయటకు వెళ్లిపోతారు. అదేమంటే ఫీల్డ్‌ వర్కని చెబుతారు. దీనిపై టెన్‌టీవీ అధికారులను నిలదీస్తే ఏం చెప్తున్నారో మీరే వినండి. ఆఫీసుకు ఆలస్యంగా రావడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని వెతికి మరీ చెబుతున్నారు. పనిచేసే ప్రాంతంలో ఉండకుండా.. చాలా మంది అధికారులు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారికి ఆలస్యం అవుతుంది. దీంతో వారికోసం పడిగాపులు కాస్తున్న జనం తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్‌కు ప్రదక్షిణలు చేస్తున్నారు.  ఒక్క శాఖని కాదు.. అన్ని శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పరిస్థితి ఇంతే. మరికొంత మంది తాము ఆలస్యంగా వచ్చినా దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. తాము వేరేపనిమీద బయటకు వెళ్లి వస్తున్నామని బుకాయిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. 
ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులు
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం సంగారెడ్డి కలెక్టరేట్‌ అధికారులు భాగస్వామ్యం అవుతారో లేదో తెలియదు కానీ... పనుల మీద వచ్చే ప్రజలకు మాత్రం వీరు అందుబాటులో ఉండరు. మధ్యాహ్నం అయినా అధికారులు రాకపోవడంతో ఆ కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో పనుల మీద వ్యవప్రయాసల కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు , సిబ్బంది సమయ పాలన పాటించేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

07:22 - November 19, 2017

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం దాగుడు మూతలాడుతోంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నివేదికలు తప్పుడు తడకలుగా మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కేంద్రానికి సమర్పించే నివేదికలు సమగ్రంగా లేకపోవడంతో కేంద్రం రోజుకో విధంగా కిరికిరి చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత విలువైన ప్రాజెక్ట్‌ పోలవరం. ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్రాజెక్ట్‌ మాత్రం ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును ముందుకు పోనివ్వకుండా రాజకీయ లబ్ధి పొందడానికే అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
అనుకున్న సమయానికి పోలవరం పూర్తవ్వడం అసాధ్యమని నివేదికలు
ప్రాజెక్ట్‌ పనులు ఎంత వేగంగా జరిగినా అనుకున్న సమయానికి పూర్తవ్వడం కష్టసాధ్యమని మసూద్‌ అహ్మద్‌ కమిటీ కేంద్రానికి నివేదికలు సమర్పించినట్టు తెలుస్తోంది. ప్రధాన పనులు, కాలువల పనుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంటున్న లక్ష్యాలలో లోపాలున్నాయని కమిటీ నిశితంగా పరిశీలిస్తోంది. పనుల తీరు లక్ష్యాల దిశగా నడవడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పోలవరం ఎడమ, కుడి కాలువల్లో అనేక చోట్ల మట్టి సరిగా లేకపోవడంతో.. లైనింగ్‌ పనుల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేసింది.
నిధుల మంజూరు విషయంలో తడబాటు
పోలవరం ఎడమ కాలువలో 2018 మార్చి నాటికి 349 కట్టడాల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి పెరిగిన అంచనా వ్యయం రూ.58 వేల కోట్లలో జల విద్యుత్‌ కేంద్రానికి సంబంధించి దాదాపు రూ. 4200 కోట్లు ఖర్చవుతాయి. ఇక మిగిలిన రూ.53,800 కోట్లలో పాత లెక్కల ప్రకారం రూ.12వేల కోట్లు చెల్లించాలని కేంద్రం చూస్తోంది. కాఫర్‌ డ్యాం లేకుండానే ప్రాజెక్ట్‌ నిర్మించే అవకాశాలు పరిశీలించాలని జాతీయ హైడ్రో పవర్‌ కార్పోరేషన్‌ బృందం గతంలో తేల్చి చెప్పింది. ఇంకో వైపు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను సమీక్షిస్తున్న చంద్రబాబుపై, పోలవరం నిర్మాణంపై కేంద్రం భేష్‌ అంటూనే నిధులు మంజూరు చేసే విషయంలో తడబాటుగా వ్యవహరిస్తోంది.
నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం
2013 భూ సేకరణ చట్టం మేరకు పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు సహాయ పునరావాసానికి సాయపడతామని గతంలో మోదీ సర్కార్‌ తొలిమంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్‌ భూసేకరణలోనూ కేంద్రం కొర్రీలు వేస్తోంది. గతంలో ఎకరాకు లక్షన్నర రూపాయలను పరిహారం చెల్లించగా, ప్రస్తుతం  పదిన్నర లక్షల రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2013 భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది కేంద్రమే అయినప్పటికీ, అమలు బాధ్యత రాష్ట్రాలపై పడిందని చంద్రబాబు కేంద్రం దృష్టికి తేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతోంది. 2010-11 లో రూ. మూడు వేల కోట్లుగా ఉన్న భూ సేకరణ అంచనా వ్యయం రూ.33వేల కోట్లకు చేరుకుందని వాదిస్తోంది. భూ సేకరణ, కాంట్రాక్ట్‌కు పనుల్లో 2010-11 అంచనాలను మించి చెల్లించబోమని కేంద్రం చెబుతోంది. 2010-11లో ట్రాన్స్‌ట్రాయ్‌తో  కుదుర్చుకున్న ఒప్పందం మేరకే చెల్లింపులుంటాయని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ప్రాజెక్ట్‌ అంచనాపై సీడబ్ల్యుసీకి ఆదేశం
ఇదిలా ఉంటే పోలవరం సాగునీటి ప్రాజెక్ట్‌ అంచనాలపై నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ద్వారా ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనా వ్యయం రూ. 58వేల కోట్లుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఈ పరిణామాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ, తన శాఖ అధికారులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. ఇవన్నీ చూస్తుంటే పోలవరాన్ని వచ్చే 2019 నాటికైనా పూర్తి చేయగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర, రాష్ట్రాల మధ్య పోలవరం అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో పోలవరం గడువులోగా పూర్తి చేయడం కష్ట సాధ్యమన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

07:15 - November 19, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌పై నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది.  తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో దర్శకుడు గుణశేఖర్‌ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  మరోపక్క జ్యూరీ సభ్యులు కూడా సోషల్‌ మీడియాలో తమను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో నందుల వివాదం మరింతగా ముదురుతోంది.
జ్యూరీపై సినీ ప్రముఖుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకేసారి మూడు సంవత్సరాలకు నంది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలపై మొదటి నుంచి తీవ్ర దుమారం చెలరేగింది. అది ఇంకా నడుస్తూనే ఉంది.  చిత్రపరిశ్రమకు చెందిన కొంతమంది తమ చిత్రాలకు నంది పురస్కారాలు దక్కకపోవడంతో జ్యూరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 
నంది అవార్డులపై గుణశేఖర్‌ విమర్శలు  
నంది అవార్డులపై దర్శకుడు గుణశేఖర్‌ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. శనివారం మరోసారి నంది పురస్కారాలపై స్పందించారు. నంది అవార్డుల వెనుక రాజకీయం ఉందని ఆరోపించారు.  మహిళా సాధికారతపై తాను తీసిన రుద్రమదేవి చిత్రానికి అవార్డు దక్కకపోవడం బాధాకరమన్నారు. నటి జీవిత కామెంట్స్‌పైనా గుణశేఖర్‌ స్పందించారు. జీవితంటే తనకు చాలా గౌరవం ఉండేదని... అవార్డుల ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆమె చంద్రబాబు, టీడీపీ గురించి మాట్లాడారన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారని... ఆ ఒక్కమాటతో ఆమెపైనున్న గౌరవం, నమ్మకం పోయిందన్నారు. 
నంది అవార్డులపై విమర్శలపై బాలకృష్ణ స్పందన
నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. లెజెంట్‌ అనేది మామూలు టైటిల్‌ కాదని.. అది పెట్టినప్పుడే కాంట్రవర్సీలు వచ్చాయన్నారు. అయినా తమ లెజెండ్‌ చిత్రం మాటలతో కాదు... చేతలతో చూపించిందంటూ చెప్పుకొచ్చారు.  తాను నటించిన లెజెండ్‌కు 9నంది అవార్డులు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు.  అందరి సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మొత్తానికి నంది పురస్కారాలపై అసంతృప్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి. 

 

07:07 - November 19, 2017

హైదరాబాద్ : ఎస్టీల విద్యుత్‌ బకాయిలు 70కోట్లను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  ఎస్టీలపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు.  ప్రతి గిరిజన వ్యవసాయదారుడికి ఉచిత విద్యుత్‌ సౌకర్యం, విద్యుత్‌ కనెక్షన్‌ కల్పిస్తామన్నారు. సచివాలయంలో ఎస్టీలపై అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌...  ప్రతి ఎస్టీ ఆవాస ప్రాంతానికి రోడ్డు వేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ఎస్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్టీ ప్రజాప్రతినిధులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ఎస్టీలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్టీల విద్యుత్‌ బకాయిలన్నీ రద్దు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో దాదాపు 70 కోట్ల బకాయిలు రద్దుకానున్నాయి. ఇందులో 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సిఎం ఆదేశించారు. మిగతా 30 కోట్ల రూపాయలను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్‌ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఎస్టీ ఇంటికి 125  రూపాయలు ఫీజు తీసుకుని విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. 
ఎస్టీ వ్యవసాయ దారులందరికీ విద్యుత్‌ సౌకర్యం
ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో సహా ఎస్టీ వ్యవసాయ దారులందరికీ విద్యుత్ సర్వీసు సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని సిఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందిదంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. దీనికోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాని ఆర్థికమంత్రిని కోరారు.
ఎస్టీ బాలబాలికల కోసం మరిన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలు
ఎస్టీ బాలబాలికల కోసం మరిన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఇందులో  స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకొస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా.... అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  విద్య, స్వయం ఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాంనాయక్‌ నాయకత్వంలో కమిటీ నియమించారు. విద్యుత్తుకు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.

 

ఆత్మకూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం

నెల్లూరు : ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందారు. డాక్టర్ లేకపోవడంతో నర్సులు శ్రీనివాసులుకు వైద్యం అందించారు. వైద్యం వికటించి అతను మృతి చెందారు. రోగి బంధువులు నిలదీయడంతో నర్సులు వారిపై దాడి చేశారు. 

 

గోపాలపురం పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని గోపాలపురం పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 17 వాహనాలను సీజ్ చేశారు. 

 

Don't Miss