Activities calendar

20 November 2017

21:37 - November 20, 2017

కోల్ కత్తా : భారత్‌-శ్రీలంక మధ్య ఆఖరి రోజు వరకూ ఆసక్తికరంగా సాగిన కోల్‌కతా టెస్ట్‌ చివరకు డ్రాగా ముగిసింది. తొలి 3 రోజులు తేలిపోయిన టీమిండియా..4వ రోజు నుంచి టాప్‌ ర్యాంకర్‌ హోదాకు తగ్గట్టుగా రాణించి విజయానికి చేరువగా వచ్చింది. కోహ్లీ సూపర్ సెంచరీతో ఐదోరోజు భారత్ 8 వికెట్లు నష్టపోయి 352 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక... 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. ఈ సమయంలో వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు మ్యాచ్ ఆపేయడంతో... భారత్‌ డ్రాతోనే సరిపెట్టుకుంది.

21:35 - November 20, 2017

భోపాల్ : వివాదాస్పద పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్‌పుత్‌ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్‌ సమస్యల నేపథ్యంలో డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పద్మావతి చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన పత్రాలను సమర్పించలేదని సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ ప్రసూన్‌ జోషి పేర్కొన్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్‌సీ నిర్మాతకు తిప్పిపంపింది. 

21:35 - November 20, 2017

ఢిల్లీ :ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు యూకే వెళ్లేందుకు కార్తీ చిదంబరానికి కోర్టు అనుమతించింది. డిసెంబర్‌ 11 కల్లా నిర్దేశించిన గడువులోపు ఇండియాకు తిరిగిరావాలని కోర్టు షరతు విధించింది. అలా కాని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. తన కుమార్తెను కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేర్పించాల్సి ఉన్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్తీ చిదంబరం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.  

 

21:34 - November 20, 2017

లండన్ : భారతదేశానికి వెళ్తే తన ప్రాణానికి ముప్పు ఉందని లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా అన్నారు. భారత్‌కు లొంగిపోవాలన్న కేసుకు సంబంధించి మాల్య లండన్‌లోని వెస్ట్రన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. భారత జైళ్లలో రక్షణ లేదని మాల్యా కోర్టులో వాదించారు. ఈ కేసులో భారతదేశం తరఫున వాదనలు చేస్తున్న యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ గత అక్టోబర్ 3న మాల్యా మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన మరిన్ని సాక్ష్యాలను కోర్టుకు అందజేసింది. ముంబైలోని ఆర్థర్‌ రోడ్డులోని జైలులో మాల్యాకు భద్రత కల్పిస్తామని భారత్‌ యుకేకు హామీ ఇచ్చింది. మాల్యాను ఉంచే జైలు గది ఫొటోలను కూడా భారత్‌ సమర్పించింది. మాల్యా ఇపుడు లొంగిపోవడానికి సాకులు చూపుతున్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తాను సమర్పించిన సాక్ష్యాలే అందుకు నిదర్శమని కోర్టులో మాల్యా తన వాదన వినిపిస్తున్నారు. బ్యాంకులకు 9 వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టి 2016లో ఇండియా నుంచి పరారైన మాల్యా- అప్పటి నుంచి లండన్‌లోనే తలదాచుకుంటున్నారు.  

21:28 - November 20, 2017

కర్నూలు : 13వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రారంభమైంది. బాతులూరుపాడు, ఎన్నకొండల, హుసేనాపురం, పాలకూరు క్రాస్‌రోడ్స్, గోవిందదిన్నె మీదుగా సాగి, బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించిన జగన్‌... వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోవిందదిన్నెలో విద్యార్థి జేఏసీ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పార్టీ ప్రకటించిన నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం
హుసేనాపురం వైసీపీ మహిళా సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని జగన్‌ తప్పుపట్టారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. మద్యం బెల్టు షాపులు, విద్యుత్‌ బిల్లుల మోత, నిరుద్యోగం, డ్వాక్రా రుణమాఫీ, రేషన్‌ షాపుల్లో 9 రకాల సరకులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను మహిళలు జగన్‌ దృష్టికి తెచ్చారు. వీటిపై తీవ్రంగా స్పందించిన జగన్‌.. ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అని ప్రశ్నించారు. హుసేనాపురం మహిళా సదస్సులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా... జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హుసేనాపురం నుంచి పాలుకూరు క్రాస్‌రోడ్స్‌, గోవిందదిన్నె మీదుగా సాగిన జగన్‌ పాదయాత్ర బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో జగన్‌ సమావేశమైన జగన్‌, వారి సమస్యలు తెలుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

21:27 - November 20, 2017

హైదరాబాద్ : వచ్చే నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరుగున పడిపోయిన తెలంగాణ సాహిత్య సృజనను ఈ మహాసభల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని నిర్వహకులను కోరారు. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందని గట్టి సంకేతాలు పంపే విధంగా అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా జరపాలని చెప్పారు. నగరంలో పలు వేదికపై జరిగే సదస్సుల్లో ఒక్కో చోట ఒక్కో ప్రక్రియను ప్రదర్శించాలని కేసీఆర్‌ కోరారు. 

21:26 - November 20, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25న అసెంబ్లీకి సెలవు దినం కావడంతో... ఆ తర్వాత 27 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

21:25 - November 20, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గత వారం రోజుల్లో 26 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులు, స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబందించి 10 వేల 891 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామని.. అలాగే 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసినట్లు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. మరో 12.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మించడం ఎంత ముఖ్యమో.. నీటి నిర్వహణ అంతే ముఖ్యమని చంద్రబాబు అధికారులతో అన్నారు. పోలవరం ప్రధాన నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదన్న సీఎం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలనే టెండర్లు మార్చాల్సి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించామన్నారు.  

21:24 - November 20, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ అధ్యక్ష పీఠం అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.అధికార బదలాయింపు కోసం పార్టీ ఎన్నికలు జరపనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. 

నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా
రాహుల్‌ గాంధీ ఎఐసిసి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇక లాంఛనమే...రాహుల్‌ గాంధీ తప్ప ఇంకెవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లే. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ దిగ్గజ నేతలంతా రాహుల్‌ గాంధీకి అధ్యక్ష పదవిని అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీకి పోటీగా ఎవరూ నామినేషన్‌ వేసే అవకాశం కనిపించడం లేదు. 2013లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రాహుల్‌ బాగా కష్టపడ్డారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం కితాబిచ్చారు.

పోలవరంపై సీఎం సమీక్ష

గుంటూరు : పోలవరంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈవారంలోనే దిగువ కాపర్ డ్యాంకు పునాది వేస్తామని, స్పిల్ వే, స్పిల్ చానల్ కు కొత్త టెండర్లు డిసెంబర్ 15 కల్లా ఖరారు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ట్రాన్స్ రాయ్ కంపెనీకి ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఉపాధ్యాయుడిని నిర్వాకం

ఆదిలాబాద్ : జిల్లా మావల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లోని ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థినులతో గుంజీలు తీయించాడు. దీంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. 

20:37 - November 20, 2017

ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు..హామీలు గాల్లో మాటలయ్యాయి.. రాజధాని స్వప్నాలు, స్వర్ణాంధ్ర వాగ్దానాలు ప్రజల కళ్లముందే ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలతో, కుమ్మక్కులతో ప్రజలను మోసగించలేరు.. అందుకే ఈ అధ్యాయం ముగియలేదు.. ఈ పోరు ఆగలేదు.. అంటున్నాయి విపక్షాలు.. ఈ క్రమంలో ప్రత్యేక హోదా గురించి ఛలో అసెంబ్లీ పేరుతో జరిగిన ఉద్యమాన్ని పోలీసు జులుంతో అణచివేసే ప్రయత్నాలు శతవిధాలా చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సాధించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ హక్కు. కేంద్రంపై అందుకవసరమైన ఒత్తిడి తీసుకురావాలి. అయినా దిగి రాకపోతే కేంద్రంపై వత్తిడి పెంచాలి.. మాటలకు విమర్శలకు పరిమితం కాకుండా, అన్ని వర్గాలనూ కలుపుకుని కేంద్రంతో కొట్లాడి సాధించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉంది. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంపై సైలెంటయింది. దీనిపై విపక్షాలు మండి పడుతూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. కానీ, ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.

అడుగడుగునా అరెస్టులు..అక్రమ నిర్భంధాలు..పోలీసుల పహారాలు..ప్రత్యేక హోదా కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అణివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనేవారి అధ్యాయం ముగిసిపోతుందని వామపక్షనేతలు తేల్చి చెప్పారు.హామీలు ఘనంగా ఇచ్చి, ఆ తర్వాత కుంటిసాకులు చెప్తూ, కాలయాపన చేస్తూ, ఆఖరికి మొండిచేయి చూపిన తీరును ఎలా చూడాలి? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..చిత్తశుద్ధి లేకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో.. ఏపీ పట్ల కేంద్రం తీరు చూస్తే తెలిసిపోతుంది. హామీలు ఘనంగా ఇచ్చి, ఆ తర్వాత కుంటిసాకులు చెప్తూ, కాలయాపన చేస్తూ , చివరికి మొండిచేయి చూపి, ఒక రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదలటానికి ఎలా చూడాలి. ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని ఏమనాలి?

పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసిందనే విమర్శలు పెరిగాయి. కేంద్రం తీరుపై, విపక్షాల ఆందోళనపై ఏపీ సర్కారు తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అరెస్టులతో నిర్భంధాలో ఉద్యమాలను అణచివేయగలం అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ప్రజాబాహుళ్యంలో ఆకాంక్షల గురించి, ఉప్పెనలా ఎగసే ఉద్యమాలకు ప్రభుత్వాలు మట్టి కరిచిన తీరును చరిత్ర చెప్తుంది. ఇప్పుడు హామీలు, కల్లబొల్లి మాటలతో ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే జరిగే పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయని విపక్షాలంటున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

20:29 - November 20, 2017

భారతదేశంల ఎట్లుంటదంటే యవ్వారం.. సాకలాయిన కొడ్కు బట్టలే ఉత్కి బత్కాలే.. మంగళాయిన కొడ్కు సగురం జేస్కోనే బత్కాలే.. గొల్లాయిన కొడ్కు గొర్లే గాశి బత్కాలే.. రాజకీయ నాయకుల కొడ్కులు రాజకీయం జేశి బత్కాలే..? ఈమాట ఎందుకంటె.. ఢిల్లీ పార్టీల కెళ్లి గల్లీ పార్టీల దాక జూడుండ్రి.. రాజకీయ వారసత్వం కథ ఎట్లుంటదో..

ఒకసారి ఒకమాట.. ఇంకో సారి ఇంకోమాట మాట్లాడెటోళ్లను ఏమంటరు మన తెలంగాణ భాషల..? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటల ప్రకారం జెప్పాల్నంటే.. లుచ్చా అంటరు.. ఒకనాడు కేసీఆర్ గారే జెప్పిండు ఈ మాట..? మరి ఆయన మాటల ప్రకారం మనకు ఒకటి జెప్పి.. ఇంకోటి జేశేటోళ్లను ఈ కేటగిరిలనే ఏస్తరా..? ఏడేస్తరు అనేది ప్రజలకే ఇడ్సిపెడ్తున్న.. ఇది జూశ్నంక జెప్పుండ్రిగ..

నాయినకే జెప్పొస్తదా..? నాకు జెప్పరాదా పిట్టెకథలు అనుకున్నడో ఏమో.?? ఏడనో బాగనే ఏరుకొచ్చినట్టుండు.. కథలు హరిదాసుల కంటె.? అద్భుతంగ జెప్తున్నడు మంత్రి కల్వకుంట్ల అజయ్ అలియాస్ కేటీఆర్ సారు.. వరంగల్ కాడ జనం చెవ్వుల ఎట్ల పువ్వువెడ్తున్నడో ఒక్కపారి మీకు జూపెడ్త సూడుండ్రి..? మరి అది నాల్కెనా..? ఇంకేమన్న అంటరా..? పాండ్రి..

ఆ తెలంగాణలున్న బీసీ ప్రజలారా..? ఇగ మీరు తయ్యారుగాండ్రి.. ఓట్ల పండుగ దగ్గరవడ్తున్నది గావట్టి ఇప్పుడు మీరు మళ్లొకపారి జిందాబాదులు గొట్టవల్సున్నది..? గజం గజం దుంకుకుంట..? కేసీఆర్ జిందాబాద్.. ఉత్తంకుమార్ రెడ్డిగారి నాయకత్వం వర్థిల్లాలి అని గొంతెత్తి పాడాలే.. వాళ్లిచ్చె పదో పర్కో దీస్కోని ఇంట్ల వండుకోవాలె..? మళ్లొక ఐదేండ్లు వాళ్లు మనల్ని ఏలుతరు.?? మనం బిచ్చగాళ్ల లెక్క మళ్ల అదిగావాలె ఇదిగావాలె అని అడుక్కోవాలె..? తయ్యారుగండ్రి..

తెలంగాణ ప్రజలారా.?. మీరు మీ ఊర్ల పొంటి ఇప్పుడు నల్ల నీళ్లే తాగుతున్నరా..? లేదుగదా..? ఐదు రూపాలు వరేస్త.. పెద్ద క్యాను ఫిల్టర్ నీళ్లొస్తున్నయ్.. తాగుతున్నం.. నల్లనీళ్లను కాళ్లు చేతులు గడుక్కునెతందుకు వాడుకుంటున్నం.. మరి ఇప్పుడు నీళ్లకేమన్న తక్లీవున్నదా..? తెలంగాణల..? గోదావరి నీళ్లొచ్చినా... తాగేదైతె ఫిల్టర్ నీళ్లేగదా..? మరి ఈ మిషన్ భగీరథకు వెడ్తున్న నల్పై యాభైవేల కోట్ల రూపాల మత్లావేందన్నట్టు..?

శిగ్గుశరం శీము నెత్తురు ఏమన్న ఉన్నాదయ్యా..? తెలంగాణ ప్రభుత్వానికి..? అమెరికా అధ్యక్షుని బిడ్డె హైద్రావాదుకోస్తె జనం ఇండ్లళ్ల కెళ్లి బైటికి ఎల్లొద్దా..? ఏమైతది ఎల్తే.. అబ్బో డర్టీ పీపుల్ ఉన్నరు హైద్రావాదుల అసలు వాళ్లు తానం జపం ఏం జేయరని ఫీలైపోతదా.? లేకపోతె ఆమెకేమన్న మనకున్నట్టు గాకుంట నాల్గు కండ్లు నల్పై పండ్లున్నయా..? వచ్చెటామెకు లేకున్నా చెప్పెటోనికన్న ఉండాల్నా..? వద్దా..?

అమ్మారె కొడ్కా..? బోడుప్పల్ కాడ నిన్న ఇద్దరాలు మొగళ్ల పంచాది ఆయెగదా..? అదే ఆ రెడ్డోళ్ల పోరంది.. ఆడివిల్ల వుట్టిందని భార్యను ఎల్లగొట్టినోడు లేడా..? పేరు ఏదో ఉండే ఆ శ్రీనివాస రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు.. వాడు మామూలోడు గానట్టుండుగదా..? నిన్న పెద్దభార్యతోని పంచాదైంది.. ఇయ్యాళ మూడో భార్య తల్లి గూడ రంగంలకు దిగింది.. వారీ శ్రీనివాస రెడ్డి..? ఎన్ని పెండ్లీలు జేస్కున్నవ్ రా..?

యమధర్మరాజును ఎంటవెట్టుకోని తిర్గుడంటె ఇదే గావొచ్చునమ్మా..? ఒక స్కూలు పిలగాడు నాగుం బామును పుస్తకాల సంచిల ఏస్కోని తిర్గుతున్నడు..? వాస్తవానికి అండ్ల నాగుంబామున్న సంగతి ఆ పిలగానికి తెల్వది.. అదే బ్యాగు ఏస్కోని బడికొచ్చిండు..? ఇగ పోరడు బ్యాగు చెయ్యివెట్టిండట పెన్ను దీస్కునెతందుకు తర్వాత ఏమైందో సూడుండ్రి..

 

19:20 - November 20, 2017

విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయాల్సింది కేంద్రమని, చంద్రబాబు అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిశారని, చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేశారని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కదాన్ని అణచివేసే విధంగా వ్యవహరిస్తుందని, ప్రత్యేకహోదా డిమాండ్ జగన్ చేసింది కాదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభలో డిమాండ్ చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేహోదా ముగిసిన ఆధ్యాయం అనేది టీడీపీకి, బీజేపీకి మాత్రమే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కాదని సీపీఎం నేత ఉమమాహేశ్వరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

తూర్పుగోదావరిలో విషాదం

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరం కోరుకొండలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ వివాహిత బావిలో దూకింది. ఇద్దరు పిల్లలను మరణించగా తల్లిని స్థానికులు కాపాడారు. 

19:08 - November 20, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అఖిలపక్షనేతలు కదం తొక్కారు. నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వామపక్షాలు, వైసీపీ, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై తీర్మానం చేసి.. కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్‌ చేశాయి. స్పాట్

అఖిలపక్షనేతలు ఛలో అసెంబ్లీ
అఖిలపక్షనేతలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం సాయంత్రం నుంచే విజయవాడ, గుంటూరులో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. చలో అసెంబ్లీకి తరలివస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడల్లో పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. మరికొందరు నేతలను గృహ నిర్బంధం విధించారు. విజయవాడ అలంకార్‌ ధర్నా చౌక్ ఆందోళనలతో హోరెత్తింది. ధర్నాచౌక్‌లో మాత్రమే నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో అఖిలక్షనేతలు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబుకు సీట్ల సంఖ్య పెంచడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి నిధులు తేవడంలో లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ, చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అనంతరం ధర్నాచౌక్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ, సహా పలువురు వామపక్ష, వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు ఈడ్చిపారేశారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించడం ఉద్రిక్తతకు దారితీసింది.

సీపీఐ నేతల గృహనిర్బంధం
ఉభయ గోదావరిజిల్లాల్లో వామపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గణపవరం, పోలవరం సీపీఎం డివిజన్‌ కార్యదర్శులతో పాటు పలువురు సీపీఐ నేతలను గృహనిర్బంధం చేశారు. గుండుగొలను, ఏలూరు ఆశ్రంవద్ద జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజమండ్రిలోని సీపీఎం కార్యాలయం నుండి చలో అసెంబ్లీకి బయల్దేరిన కామ్రేడ్లను పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల సీపీఎం, సీపీఐ కార్యాలయాలు, నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్బంధాలు ఎన్ని ఉన్నా చలోఅసెంబ్లీ నిర్వహించి తీరుతామన్నారు వామపక్షనేతలు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం ఆపేదిలేదని హెచ్చరిస్తున్నారు.

19:07 - November 20, 2017

తూర్పుగోదావరి : జిల్లా కోరుకొండ మండలంలో విషాదం చోటు చేసుకొంది. అత్తంటి వేదింపులు భరించలేక నాగిరెడ్డి అశ్విని అనే వివాహిత తన ఇద్దరి చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సుభద్రంపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో 9సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా యానాంలో కాపురం చేస్తున్నారు. గత కొంత కాలంగా తరుచూ గొడవలు జరుగుతండటంతో.. భర్త శ్రీనివాస్‌ భార్యని తన తల్లిగారి ఇంటి వద్ద వదిలివెళ్లాడు. దీంతో అత్తగారింట జరిగిన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. తను మరణిస్తే పిల్లలు అనాథలవుతారని భావించి పిల్లలతో కలిసి బావిలో దూకింది. పక్కింటి వారు గమనించడంతో ఆమెను ప్రాణాలతో కాపాడగా.. ఇద్దరు పిల్లలు చనిపోయారు. మృతిచెందిన పిల్లలను పూడ్చి పెట్టడంతో సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

19:05 - November 20, 2017
19:04 - November 20, 2017

కర్నూలు : జిల్లాలో జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. బనగానపల్లె నుంచి బయలుదేరిన పాదయాత్ర గోవిందిన్నె వరకు కొనసాగింది. పలు గ్రామాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరించారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలతోపాటు వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మద్యం బెల్టు షాపులు, నిరుద్యోగం, కరెంటు బిల్లుల మోత, రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరకుల నిలిపివేత వంటి సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అన్ని జగన్‌ ప్రశ్నించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందుని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.

 

19:03 - November 20, 2017

కర్నూలు : పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా హుసేనాపురంలో వైసీపీ ఏర్పాటు చేసిన మహిళా సదస్సును పోలీసులు అడ్డుకోవడాన్ని ఎమ్మెల్యే రోజా తప్పు పట్టారు. సదస్సుకు ఇచ్చిన అనుమతిని పోలీసులు రద్దు చేయడం దారుణమని ఆమె అన్నారు.

19:01 - November 20, 2017

కృష్ణా : ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిగా రాహుల్‌గాంధీకి ఏపీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాహుల్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలని పీసీసీ నాయకత్వం నిర్ణయించింది. దేశ సమస్యల పరిష్కారానికి రాహుల్‌ ఆశా కిరణమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 

19:00 - November 20, 2017

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీలో అధికార భాషగా తెలుగు అమలు అధ్వానంగా తయారైందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మండిపడ్డారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు TDP ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. అధికార భాషగా తెలుగు అమలు కోసం విశాఖలో తెలుగు దండు ఆధ్వర్యంలో 20 రోజులుగా జరుగుతున్న సత్యాగ్రహ శిబిరాన్ని యార్లగడ్డ సందర్శించారు. అమరావతిలో ఎక్కడా కూడా శిలాఫలకాలు తెలుగులో లేని విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం భాషా విధానాన్ని ప్రకటించాలని యార్లగడ్డ డిమాండ్‌ చేశారు. 

18:59 - November 20, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నానాజీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా దార్లజగన్నాధపురంకు చెందిన నానాజీ అదే గ్రామానికి చెందిన సూరిబాబుపై ఫిర్యాదు చేయడానికి సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చాడు. అకస్మాత్తుగా కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్‌కు సమస్యను విన్నవించుకోక ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

18:58 - November 20, 2017

వరంగల్ : యునైటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌ వారి నూతన ఉత్పదన గైనెక్సా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొక్కలు త్వరగా వృద్ధిచెందడానికి సిలికా అత్యావ్యక పోషకమని.. మొక్కలు సంగ్రహించుకోగల ఏకైక సిలికా రూపాన్ని గెనెక్సా ద్వారా అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతన్నలు OSA శక్తిగల గెనెక్సాను వాడి పంటల్లో మంచి దిగుబడి పొందుతారని చెప్పారు. 

నంది అవార్డులపై స్పందించిన చంద్రబాబు

గుంటూరు : నందిఅవార్డులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈవ్యవహారం రచ్చ అవుతుందని అనుకులేదని ఆయన అన్నారు. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చే వాళ్లమని తెలిపారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరికాదని ఆయన అన్నారు. 

18:52 - November 20, 2017

గుంటూరు : నందిఅవార్డులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈవ్యవహారం రచ్చ అవుతుందని అనుకులేదని ఆయన అన్నారు. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చే వాళ్లమని తెలిపారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరికాదని ఆయన అన్నారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక పై అంశాల వారిగానే మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:50 - November 20, 2017

హైదరాబాద్ : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉన్నత శిఖరాలు అదిరోహించవచ్చని సరోజిని టెన్నిస్ అకాడమి డైరెక్టర్, నేషనల్ వాలీబాల్ మాజీ చాంపియన్ కిరణ్ రెడ్డి అన్నారు. సరోజిని టెన్నిస్ అకాడమి విద్యార్ధులు ఇండియన్ టెన్నిస్ లీగ్‌లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అండర్ 12 ఐటిఎల్‌ లీగ్‌లో రాహిణ్‌, అండర్ 14 ఐటిఎల్‌లో రూహి విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి విజయం వెనక తల్లిదండ్రుల సపోర్ట్‌తో పాటు కోచ్‌లు లీవింగ్ స్టన్, సందీప్ శిక్షణే విజయానికి దోహదపడిందన్నారు. 

18:49 - November 20, 2017

హైదరాబాద్ : గురు స్థానానికి వన్నెతెచ్చిన వ్యక్తి చుక్కా రామయ్య అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రామయ్య రచించిన 'మొదటి పాఠం' పుస్తకావిష్కరణలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఐఐటీ విద్యను అందరు ఉన్నత వర్గాల వారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో బడుగు బలహీన వర్గాల దగ్గరకు చేసిన ఘనత రామయ్యకే దక్కుతుందని అన్నారు. రామయ్యను ప్రతి ఉపాధ్యాయులు విద్యార్ధులు ఆదర్శంగా తీసుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు.

18:48 - November 20, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి మండిపడ్డారు. కేటీఆర్ స్థాయికి మించిన మాటలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. మోదీ పాలనతో విసిగిన జనాలు.. కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని.. ఈ తరుణంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం ఎంతో శుభపరిణామని షబ్బీర్ ఆలీ అన్నారు.

18:47 - November 20, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు జరపకుండా ఆమెను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మను అవమానపరిచిన మోదీ, కేసీఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటున్న కేటీఆర్‌...నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

మెట్రోప్రాజెక్టులో మరో ముందడుగు

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది. రైల్వే అధికారులు 3రోజుల పాటు తనిఖీలు జరిపిన అనంతరం వారు అనుమతినిచ్చారు. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు రైళ్లు నడిపేందుకు ఆవకాశం ఏర్పాడింది. చిన్నపాటి పనులు మినహాయిస్తే నాగోల్ నుంచి మియాపూర్ వరకు మొట్రో పనులు దాదాపు పూర్తైయ్యాయి.

17:12 - November 20, 2017

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది. రైల్వే అధికారులు 3రోజుల పాటు తనిఖీలు జరిపిన అనంతరం వారు అనుమతినిచ్చారు. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు రైళ్లు నడిపేందుకు ఆవకాశం ఏర్పాడింది. చిన్నపాటి పనులు మినహాయిస్తే నాగోల్ నుంచి మియాపూర్ వరకు మొట్రో పనులు దాదాపు పూర్తైయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:07 - November 20, 2017

సుప్రీం కోర్టులో కార్తీచిదంబరానికి ఊరట

ఢిల్లీ : సుప్రీకం కోర్టులో కార్తి చిదంబరానికి ఊరట లభించింది. 10 రోజుల పాటు విదేశీ పర్యటనకు కార్తి చిదంబారానికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. 

ఇంట్లోకి చొరబడ్డ దుండగులు

ప్రకాశం : జిల్లా చీరాల మండలం పేరాలలో  ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దుండగులు చొరబడ్డారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. దుండగుల వద్ద మారణాయుధాలు ఉన్నట్లు సమాచారం దీంతో ఆ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. 

16:16 - November 20, 2017
16:14 - November 20, 2017

మేడ్చల్ : బోడుప్పల్‌లో ఆడపిల్లపుట్టిందని భార్యపై దాడిచేసి ఇంటి నుంచి గెంటివేసిన భర్త శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనకు న్యాయం చేయాలంటూ రెండో భార్య సంగీత.. భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తోంది. మూడో భార్య తల్లి కూడా సంగీతకు మద్దతు తెలిపింది. తన కూతురుకు మాయమాటలు చెప్పి శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. అధికార బలంతో అందరినీ బెదిరిస్తున్నాడని వాపోయింది. సంగీతకు మహిళాసంఘాలు బాసటగా నిలిచాయి.

16:12 - November 20, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బీజేపీ దళితమోర్చా కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి. టౌన్‌ హాల్‌ కేంద్రంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడికి దిగాయి. కుర్చీలతో కుమ్మలాటకు దిగాయి. దీంతో దళిత యువమోర్చా కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీలో కొన్నేళ్లుగా సురేష్ రెడ్డి, సురేంద్ర రెడ్డి... వర్గాలు రెండుగా విడిపోయాయి. సురేందర్ రెడ్డికి వెంకయ్యనాయుడి ఆశీస్సులతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కింది.. దీనిని సురేష్ రెడ్డి వర్గం విభేదించింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతూ వచ్చాయి. సురేందర్ రెడ్డి ఒకవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ.. సురేష్ రెడ్డి వర్గం విమర్శలు చేస్తోంది.. వీటిని సురేంద్ర రెడ్డి వర్గం పట్టించుకోలేదు . దీంతో సురేష్ రెడ్డి వర్గానికి చెందిన దళితమోర్చా రోడ్డెక్కింది. సురేందర్ రెడ్డి దళితులకు అన్యాయం చేస్తున్నారంటూ.. నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టింది.

సురేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీ
టౌన్ హాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కుర్చీలతో తలపడ్డారు.. మొత్తానికి చాలా కాలంగా అంతర్గతంగాఉన్న బీజేపీ విభేదాలు దళిత మోర్చా సభలో భహిర్గతమై.. కుర్చీలతో కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. సురేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీకి తలపడడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇరువర్గాలను అధిష్టానం ఎలా హ్యాండిల్‌ చేస్తుందో చూడాలి మరి.

16:11 - November 20, 2017

కృష్ణా : టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా బందరు పోర్టు అభివృద్ధి ముందుకు సాగడం లేదు. పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణం పేరుతో కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజవర్గంలో 1.05 లక్షల ఎకరాలను సమీకరిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న బందరు పోర్టుపై పాలకులు, అధికారులు తలోమాట చెప్పడం.. పొంతన లేని ప్రకటనలు చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 2015 ఆగస్టు 29న 33 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై రైతులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరలా 2016లో మరోసారి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ వెలువరించింది. దీన్ని వ్యతిరేకించిన రైతులు ఆయా గ్రామాల్లో సభలతో పోరాటం ఉధృతం చేశారు. మచిలీపట్నం పోర్టుతో పాటు పరిశ్రమల కారిడార్ కోసం 14వేల 620 ఎకరాలకు సంబంధించి గతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గడువును ఇప్పటికే రెండు పర్యాయాలు పెంచిన ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు పెంచుతూ 2017 ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టుతోపాటు అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది.

భూ సేకరణ నోటిఫికేషన్‌ వ్యతిరేకిస్తున్న రైతులు
ఓవైపు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రైతులు వ్యతిరేకిస్తుంటే.. పాలకులు సమీకరణను తెరపైకి తెచ్చారు. సమీకరణకు రైతులు ముందుకు రావడంలేదని, సేకరణ అజెండా అమలు చేయాలని అందుకు రూ.700 కోట్ల నిధులు అవసరమని మంత్రి, ఎంపీలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండటంతో సమీకరణే కొనసాగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది ఏమైనా మచిలీపట్నం పోర్టు పనులను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చెబుతున్నారు. పోర్టు పేరుతో ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు ఆరోపించారు. పోర్టు నిర్మించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లు లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. 

16:10 - November 20, 2017

చిత్తూరు : 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారం కైవసం చేసుకున్నా... రాయలసీమలో మాత్రం ప్రతిపక్ష వైసీపీనే ఎక్కువసీట్లు గెల్చుకుంది. ఒక్క అనంతపురం మినహా.. మిగతా మూడు జిల్లాలు కర్నూలు,కడప, చిత్తూరులో వైసీపీ హవా కనిపించింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనూ వైసీపీ ఎక్కువసీట్లు గెల్చుకుంది. ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండడంతో చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వైసీపీకి పట్టున్న రాయలసీమలో దెబ్బకొట్టాలని సీఎం భావిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి జపం చేస్తూనే మరోవైపు పొలిటికల్‌గా సీమలో గెయిన్‌ అయ్యేందుకు పక్క ప్రణాళికలు రచిస్తున్నారు. సీమలో బలమైన నేతలను ఆకర్షించే పనిలో టీడీపీ పడింది. చిత్తూరులో వైసీపీ బలంగా ఉండడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్‌రెడ్డిలే కారణం. ఆ ఇద్దరు నేతలను వైసీపీకి కొండంత అండ. దీంతో ఈ ఇద్దరు నేతల వ్యూహాలకు చెక్‌పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

రెండుసార్లు మాత్రమే....
టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు రెండుసార్లు మాత్రమే రాజంపేట పార్లమెంట్‌ను టీడీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు రాజంపేట పార్లమెంట్‌ సీటును గెల్చుకోలేకపోయింది. గత ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థిగా దగ్గుపాటి పురందేశ్వరి పోటీచేసి ఓడిపోయారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే టీడీపీ గెల్చుకోగలిగింది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్‌రెడ్డి వల్లే రాజంపేటలో వైసీపీ గెలిచిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

లోక్‌సభ స్థానాన్ని గెల్చుకోవడమే టార్గెట్‌గా
రాజంపేట లోక్‌సభ స్థానాన్ని గెల్చుకోవడమే టార్గెట్‌గా పసుపుదళం వ్యూహాలు పన్నుతోంది. ఆ ప్రాంతంలో బలమైన సామాజికవర్గంగా పేరొందిన రెడ్డి సామాజికవర్గ నేతలను పార్టీలోకి తీసుకునేందుకు సిద్దం అయ్యింది టీడీపీ. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌ రెడ్డి, ఆయన తనయుడు అమర్‌నాథ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. కిషోర్‌కుమార్‌రెడ్డి, ఆయన తనయుడు అమర్‌నాథ్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో రాజంపేట పార్లమెంట్‌ స్థానంపైనే చర్చించారు. ఈనెల 23 లేదా 25న కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌తోపాటు రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్‌రెడ్డిని దెబ్బతీయడం అంటే అంత సులువేమీకాదు.అందుకు పక్కా స్కెచ్‌ ఉండాలి. మరి టీడీపీ అమలు చేస్తున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ , అమలు చేస్తోన్న వ్యూహాలు ఎంత వరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

16:09 - November 20, 2017

కృష్ణా : ధర్నా చౌక్‌ దగ్గర ఉద్రిక్త నిరసకు దిగిన వామపక్షాలు, వైసీపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఛలోఅసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ధర్నాకు దిగిన వారిని ఖాకీలు ఈడ్చిపారేశారు. పలువురు కార్యకర్తకలు గాయాలయ్యాయి. ధర్నాలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కార్యవర్గ సభ్యులు బాబురావును పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు మరికొందరు వామపక్షనేతలనూ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్బంధాలు ఎన్ని ఉన్నా చలోఅసెంబ్లీ నిర్వహించి తీరుతామ అన్నారు వామపక్షాల నేతలు తేల్చిచెప్పారు. చలో అసెంబ్లీకి మద్దతుగా ధర్నాకు దిగిన పలువురు వైసీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

16:08 - November 20, 2017
16:07 - November 20, 2017

వివక్షాలతో, అణచివేతలతో చులకన భావనంతో ఆడపిల్లలను గడప కూడా దాటనివ్వని పరిస్థితి నెలకొంది. వారి మేథసంపత్తిని కాలరాస్తున్నారు. ఆమెకు ఓ మనసు ఉంటుందని ఆ మనసుకు ఆశలు, ఆలోచనలు, అభిరుచులు ఉంటాయి. వాటికి రూపమిచ్చి చిన్నపాటి ప్రోత్సహిస్తే అద్భుతాలను సృష్టించే శక్తియుక్తులు వారి సోంతమౌతాయి. చదువుకోవాలనే హక్కులను కూడా హరించేవేసే గడ్డు పరిస్థితు మధ్య కరడుగట్టిన రాతిగోడల్లో నుంచి వచ్చిన చిన్న మొలక మహావృక్షమైనట్లు, ఆంక్షాల పరిధి దాటి ఆత్మీయ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు డా.లక్కరాజు నిర్మల ఈవిడే ఈ వారం మానవి స్ఫూర్తి .

16:05 - November 20, 2017

హైదరాబాద్ : మీరు చూస్తున్న ఈ స్థలం హైదరాబాద్‌ సోమాజిగూడలో రాజ్‌భవన్‌ రోడ్డులోనిది. 40కోట్ల రూపాయలు విలువచేసే ఈ స్థలంలో ది పార్క్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నడుస్తోంది. వాస్తవంగా ఈ స్థలం తనదని ఎన్‌ఆర్‌ఐ జునైల్‌ ఆదిల్‌ చెప్తున్నారు. తన మేనల్లుడు నాజిర్‌ అలీఖాన్‌, మీర్‌ హుస్సేన్‌ అలీఖాన్‌కు జునైద్‌ ఈ విలువైన భూమిని అప్పగించారు. 1977లోనే దుబాయిలో స్థిరపడ్డ జునైద్‌... 2005లో అమెరికాకు వెళ్లి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.

మేనళ్లులు నాజీర్‌, హుస్సేన్‌ కన్ను
జునైద్‌ సోమాజిగూడలోనే ఎప్పుడో స్థలం కొనిపెట్టారు. ఈ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తుండడంతో జునైద్‌ మేనళ్లులు నాజీర్‌, హుస్సేన్‌ కన్ను దీనిపై పడింది. దీంతో ఆ స్థలాన్ని ఎలాగైన కాజేయాలని స్కెచ్‌ వేశాడు. వెంటనే హుస్సేన్‌ తన మేనమామైన జునైద్‌ను సంప్రదించాడు. ఖాళీ స్థలంలో ఓ హోటల్‌ నిర్మాణం చేపడితే... కోట్ల రూపాయల లాభం వస్తుందని నమ్మించాడు. సొంత బంధువులే కదా అని నమ్మిన ఎన్‌ఆర్‌ఐ వెంటనే.. తన విలువైన స్థలాన్ని నాజీర్‌, హుస్సేన్‌ పేరుమీద జీపీఏ చేశారు. జీపీఏ అధికారం పొందిన ఎన్‌ఆర్‌ఐ జునైల్‌ ఆదిల్‌ మేనళ్లుల్లు ఇద్దరు కలిసి ది పార్క్‌ హోటల్‌ యాజమాన్యాన్ని సంప్రదించారు. తమ స్థలాన్ని లీజ్‌కు ఇస్తామంటూ డీల్‌ కుదుర్చుకున్నారు. వెంటనే ది పార్క్‌ హోటల్‌ బిల్డింగ్‌ నిర్మాణం అయ్యింది. లక్షా స్క్వేర్‌ ఫీట్స్‌లో హోటల్‌ భవనం నిర్మాణమైంది. లక్షా స్వేర్‌ ఫీట్‌ స్థలంలో 60వేల స్క్వేర్‌ ఫీట్‌లో నిర్మించే హోటల్‌ భాగంలో వచ్చే లాభాన్ని జునైద్‌కు ఇస్తామని నమ్మబలికారు. మిగిలిన 40వేల స్క్వేర్‌ ఫీట్‌ స్థలంలో వచ్చే లాభాన్ని మేనళ్లుల్లు తీసుకునేలా ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఐ జునైద్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇదే విషయమై తన మేనళ్లుళ్లను నిలదీస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ వాపోయారు. హోటల్‌ స్థలమంతా తమదేనని.. చిల్లిగవ్వ కూడా ఇవ్వమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకాలతో తనను మోసం చేశారని ఎన్‌ఆర్‌ఐ ఆరోపిస్తున్నారు.

సంతకాలు ఫోర్జరీ చేసి
తనకు జరిగిన అన్యాయంపై జునైద్‌ పోలీసులను ఆశ్రయించారు. సంతకాలు ఫోర్జరీ చేసి తన స్థలాన్ని లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జునైద్‌ మేనళ్లుల్లు నాజిర్‌, హుస్సేన్‌పై ఛీటింగ్‌ , ఫోర్జరీ, బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో విలువైన స్థలాన్ని కొట్టేసి హోటల్‌ నడుపుతున్న వ్యవహారంపై పార్క్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం స్పందించలేదు. విషయం తెలిసిన ఇంత వరకు యాజమాన్యం నోరు మెదపడం లేదు. మరోవైపు జునైద్‌ మాత్రం న్యాయం కోసం పోరాడుతున్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

16:04 - November 20, 2017

హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాదిగా తరలి వచ్చిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కమిషనర్‌ ఆఫీసును ముట్టడించారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఇప్పటికే రావాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యహాన్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అద్యక్షుడు వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి రామక్క ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. 

@page { margin: 2cm } p { margin-bottom: 0.25cm; line-height: 120% } a:link { so-language: zxx }

15:44 - November 20, 2017

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కడప : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.50లక్షల నగదు, పదిహేడు సెల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు

15:43 - November 20, 2017

కడప : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.50లక్షల నగదు, పదిహేడు సెల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:56 - November 20, 2017
13:55 - November 20, 2017

తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ తో వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో లెఫ్ట్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం, సీపీఐ కార్యాలయాలను దిగ్బంధించారు.
సీపీఎం నేత మిడియం బాబురావు 
'విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రత్యేక హోదా సాధించాలని..వామపక్షాలు చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం అణచివేస్తోంది. నేడు చలో అసెంబ్లీకి పిలుపు ఇస్తే నిన్నటి నుంచే అరెస్టులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహిరిస్తుందన్నారు. అరెస్టులు, నిర్బంధాలు సబబు కాదు.
వామపక్ష నేత 
మోడీ, బాబుకు తీవ్రమైన అభద్రతాభావం కల్గుతుంది. ప్రత్యేకహోదా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. మోడీకి బాబు పాదాక్రాంతం అయ్యారు. మోడీకి బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు' అని విమర్శించారు. 

13:45 - November 20, 2017

ఉత్తరాఖండ్ : విహారయాత్ర విషాదాన్ని నింపింది. హరిద్వార్ లో హైదరాబాద్ యువకుడు గల్లంతు అయ్యాడు. హైదరాబాద్ మొజాంజాహి మార్కెట్ కు చెందిన నరిన్.. 8 మంది స్నేహితులతో కలిసి శనివారం హరిద్వార్ కు వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవాహంలో నరిన్ కొట్టుకుపోయారు. రెండు రోజులుగా స్నేహితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ రద్దు

హైదరాబాద్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను రద్దు చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరిగే వరకు అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిల్ కార్యక్రమాలు జరుగుతాయి. అడ్ హక్ కమిటీ సభ్యులుగా దగ్గుబాటి సురేష్ బాబు, కేఎల్ నారాయణ, జెమిని కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిరంజన్, మోహన్ గౌడ్, సీఎస్ రావు, చదలవాడ శ్రీనివాసరావు ఉన్నారు.

పోలీసులనుకుని బావిలో పడ్డా పేకటరాయుళ్లు

వరంగల్ అర్బన్ : జిల్లా బహుపేటలో అర్ధరాత్రి  మామిడితోటలో పేకట ఆడుతున్న 9 మంది పొలానికి వెళ్తున్న రైతులను చూసి పోలీసులనుకుని పరుగులు తీశారు. చీకట్ల దారి కనబడక ప్రమాదవశాత్తు బావిలో ముగ్గురు పడ్డారు. అందులో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

13:30 - November 20, 2017
13:15 - November 20, 2017

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఉన్నప్పుడు చాలా మంది యాడ్స్ తో బాగా సంపదిస్తారు. కొందరు వ్యాపారంలోకి అడుగు పెడతారు. చాలా మంది హీరోయిన్స్ వ్యాపారులు చేశారు కూడా. ఇప్పుడు అదే దారిలో వెళ్తోతోంది సన్నీ లియోన్. పోర్న్ స్టార్ గా ఉన్నప్పుడే సన్నీ అనేక యాడ్స్ చేశారు.కానీ ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటిస్తూ యాడ్స్ కూడా చేస్తున్నారు.దానికి దీనికి చాలా తేడా ఉందనుకొండి. వేరే కంపెనీలకు యాడ్ చేయడమేంటి అనుకున్నారమో కానీ ఆమె బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టారు. సన్నీ అర్చన కొచ్చర్ అనే డిజైనర్ తో గుగ్ గాళ్జ్ బ్యాడ్ బాయ్స్ అనే బ్రాండ్ ప్రారంభించారు. 

భారత్ లో ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర

ఢిల్లీ : భారత్ లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్రపై నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని, ఉపరాష్ట్రపతి, బీజేపీ  కీలక నేతలే టార్గెట్ గా ఐఎస్ఐ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల సందర్బంగా అప్రమత్తంగా ఉండాలని ఐబీ ఆ రాష్ట్ర పోలీసులుకు హెచ్చరికలు చేసింది. 

12:57 - November 20, 2017

ఢిల్లీ : భారత్‌లో భారీ దాడికి పన్నిన కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఈ కుట్రపన్నినట్టు ఐబీ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని, ఉపరాష్ట్రపతి సహా పలువురు కీలక బీజేపీ నేతలను టార్గెట్‌ చేసినట్టు ఐబీ హచ్చరించింది. ఉగ్రకుట్రలో టార్గెట్‌గా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మనోహర్ పారేకర్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ ఉన్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. భారీ బహిరంగ సభలలో ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాలపై ఉగ్రవాదలు దృష్టిపెట్టారన్న నిఘావర్గాలు తెలిపాయి. 26/11 సందర్భంగా దాడికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. అస్సోం రాజధాని గౌహతి నుంచి వచ్చిన సమాచారంతో నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. చైనా సరిహద్దుల్లో భద్రతను విశ్లేషిస్తున్న సందర్భంలో ఉగ్రవాదుల కుట్ర బయటపడినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతపై విశ్లేషణలో ఉగ్ర కుట్ర బయటపడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:54 - November 20, 2017

సినిమా : దేశంలో హట్ టాఫిగా మారిన విషయం పద్మావతి మూవీ. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలోరణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపిక పదుకొణె నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం నుంచి వివాదాలు అలుముకున్నాయి. ఈ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరిస్తున్నారని రాజ్ పుత్ లో ఆందోళనకు దిగారు. దీంతో ఈ చిత్రం వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

అసలు పద్మావతి అనే రాణి ఉందని ఎక్కడ కూడా చారిత్రక ఆధారాలు లేవు. కానీ పద్మావతి జీవితంపై ఒక్కొక్క కవి ఒక్కొ విధంగా రాశాడు. ఉత్తర్ ప్రదేశ్ లో మాలిక్ మహ్మద్ జయాసీ అనే సూపీ రచయత 1540లో రాసిన పద్మావత్ అనే రచన ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ రచన ప్రకారం శ్రీలంక(సింహాల) రాజు గంధర్వ్ సేన్ ఇతనికి అందమైన కుమార్తె ఉండేది ఆమె పేరే పద్మావతి ఆమెకు మాట్లాడే చిలుక ఉండేంది. చిలుక అంటే పద్మావతికి ప్రాణం. ఆ చిలుక మాట్లాడుతుంది కూడా. పద్మావతి ఎప్పుడు చిలుకతోనే ఉండేది దీంతో ఆమె తండ్రి సేన్ కోపం వచ్చి చిలుకను చంపాలని చూస్తాడు. కానీ ఆ చిలుక తప్పించుకొని ఓ వెటగాడి చేతిలో పడుతుంది. అలా చిలుక చివరికి చిత్తోర్ గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ దగ్గరకు చేరుకుంటుంది. ఆ చిలుక మాట్లాడే చిలుకు కాబట్టి రాజు పద్మావతి అందం, గుణాలకు గురించి చిలుక రాజుకు చెబుతుంది. దీంతో రాజు కు పద్మావతి మోజు పడి ఎలగైనా పద్మావతిని దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే రతన్ సింగ్ అప్పటికే నాగ్ మతి అనే భార్య ఉంటుంది. కానీ పద్మావతి దక్కించుకోవాలని కోరికతో రతన్ సింగ్ వెంటనే సింహాల రాజ్యంపై దండెత్తి గంధర్వ్ రాజు ఓడిస్తాడు. దీంతో తన కూతురు పద్మావతిని రతన్ సింగ్ ఇచ్చి వివాహాం జరిపిస్తాడు. రతన్ సింగ్, అతని మొదటి భార్య నాగ్ మతి మధ్య చిచ్చుపెట్టేందుకు రాఘవ్ చేతన్ ప్రయత్నిస్తాడు. విషయం తెలుసుకున్న రాజు అతన్ని రాజ్యం నుంచి వెలివేస్తాడు. రాజ్యం నుంచి వెళ్లిపోయిన రాఘవ్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆశ్రయం పొందుతాడు. సుల్తాన్ కు రాఘవ్ పద్మావతి గురించి, ఆమె అందాల గురించి వివరిస్తాడు. దీంతో ఖిల్జీ పద్మాతిపై మనసు పారేసుకుని చిత్తోర్ గఢ్ పై యుద్ధం ప్రకటిస్తాడు. ఖిల్జీ రతన్ సింగ్ బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకుని పద్మావతి రతన్ సన్నిహితులైన గోరా, బాదల్ సహాయంతో ఢిల్లీ వెళ్లి ఖిల్జీ పై యుద్ధం చేసి తన భర్తను కాపాడుకుంటుంది.

హేమ్‌రతన్‌ రచన ‘గోరా బాదల్‌ పద్మిని చావ్‌పాయ్‌’ ప్రకారం.. చిత్తోర్‌గఢ్‌ మహారాజైన రతన్‌సింగ్‌కు ప్రభావతి అనే భార్య ఉండేది. ఆమె బాగా వంట చేసేది. ఓ సారి రతన్‌ ఆమె వంట బాగాలేదని అనడంతో తన కన్నా బాగా వంటచేసే వారు ఉంటే చూపాలని సవాల్‌ విసిరింది. దీంతో రతన్‌ అలాంటి అమ్మాయి కోసం అన్వేషణకు బయలుదేరగా సింహళ రాజ్యంలో అలాంటి అమ్మాయిలు ఉన్నారని ఓ ముని చెప్పడంతో ఆ రాజ్య చక్రవర్తిని రతన్‌ చదరంగంలో ఓడిస్తాడు. దీంతో ఆ రాజు తన కుమార్తె అయిన పద్మినిని రతన్‌కి ఇచ్చి వివాహం జరిపించడమే కాకుండా భారీగా కట్నం, 4 వేల గుర్రాలు, 2 వేల ఏనుగులు, 2 వేల మంది పనివాళ్లను ఇచ్చి పంపుతాడు. ఓసారి రతన్‌, పద్మావతి ఏకాంతంగా గడుపుతుండగా రాఘవ్‌ వ్యాస్‌ అనే వ్యక్తి ఆటంకం కలిగిస్తాడు. దీంతో రతన్‌ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో దిల్లీ పారిపోతాడు. అక్కడున్న అల్లావుద్దీన్‌ ఖిల్జీ సామ్రాజ్యంలో అతడికి మర్యాదలు దక్కుతాయి. ఈ క్రమంలో పద్మిని అందచందాల గురించి ఖిల్జీ తెలుసుకొని ఆమె తండ్రి రాజ్యంపై దండెత్తుతాడు. కానీ, అతడు కోరుకున్న పద్మిని పేరు పద్మావతి అని.. ఆమె చిత్తోర్‌లో ఉందని గుర్తిస్తాడు. దీంతో భారీసైన్యంతో ఖిల్జీ చిత్తోర్‌పై దండెత్తి రతన్‌ను బంధిస్తాడు. దీంతో రతన్‌ సన్నిహితులైన గోరా, బాదల్‌ను పద్మావతి సాయం కోరుతుంది. వారిద్దరూ కలసి రతన్‌ను రక్షిస్తారు. కానీ ఈ క్రమంలో గోరా మరణిస్తాడు.

బ్రిటీస్ రచయత చెప్పినదాని ప్రకారం పద్మావతి జీవితంలో రతన్ సింగ్ పాత్ర ప్రాముఖ్యం లేదని తెలిపాడు. ఆయన వివరాలకు ప్రకారం శ్రీలంక రాజు హామీర్ సింగ్ కుమార్తె పద్మావతి ఆమె వివాహా వయస్సు రావడంతో రాజు తన దగ్గరి బంధువైన భీమ్ సింగ్ ఇచ్చి వివాహా చేస్తాడు. భీమ్ సింగ్ చిత్తోర్ ఘఢ్ రాజు. చక్రవర్తి సింగ్ అని భీమ్ సింగ్ బంధువు చక్రవర్తి సోదరుడే రతన్ సింగ్. పద్మావతి అందం గురించి తెలుసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్ పై దండెత్తి భీంసింగ్ ను బంధి చేసుకుంటాడు. భీంసింగ్ విడుదల చేయలంటే పద్మాతి అప్పగించాలని ఖిల్జీ షరత్ విధిస్తాడు. దీంతో పద్మావతి గోరా, బాదల్ సహాయంతో భీంసింగ్ విడిపిస్తోంది. అయితే ఖిల్జీ చిత్తోర్ మళ్లీ యుద్ధం ప్రకటిస్తాడు. యుధ్దంలో భీంసింగ్ ఓడిపోతాడు. పద్మావతి ఖిల్జీ దక్కకుడదని ఆత్మర్పణం చేసుకుంటుంది.

12:50 - November 20, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్ష నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో వెలగపూడి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా మొహరించారు. అసెంబ్లీకి వచ్చే రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వెలగపూడిలో పోలీసుల మొహరింపుపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

12:45 - November 20, 2017
12:37 - November 20, 2017

ఢిల్లీ : సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. రాహుల్ ను అధ్యక్షుడిగా చేయాలని పార్టీ తీర్మానించింది. రెండో నామినేషన్ రాకపోతే డిసెంబర్ 4న రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి మన్మోహన్ సింగ్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. రాహుల్.. 2004 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అమేథి నుంచి ఎంపీగా ఉన్నారు. 
అధ్యక్షుడి పదవికి రాహుల్ గాంధీని వ్యతిరేకించే వారు ఎవరూ లేరు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:33 - November 20, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వామపక్షాలు తలపెట్టిన చలోఅసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛలో అసెంబ్లీకి బయల్దేరిన వామపక్ష పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కార్యవర్గ సభ్యులు బాబురావును పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు మరికొందరు వామపక్షనేతలనూ అదుపులోకి తీసుకున్నారు.  ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేశారు. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని నేతలు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్బంధాలు ఎన్ని ఉన్నా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని వామపక్షాల నేతలు అన్నారు. చలో అసెంబ్లీకి మద్దతుగా ధర్నాకు దిగిన పలువురు వైసీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వామపక్షాల కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. దీందో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:05 - November 20, 2017

ప్రతి మనిషి రోజులో ఎంత కష్టపడిన అతనికి కొంత సేపు విశ్రాంతి అవసరం. మనిషి ఒక పుట తినకుండా ఉంటే ఏం కాదు కాని నిద్ర పోకపోతే ఆరోగ్యానికి హానికరం. మనిషికి రోజుకు కనీసం6 నుంచి 7 గంటలు నిద్ర అవసరం. కాని చాలా మంది తమ జీవన విధానంలో నిద్రకు కేవలం 4నుంచి 5 గంటలు కేటాయిస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న యువతియువకులు మంచంపైకి వెళ్లగానే మొబైల్ ఫోన్లలో చాటింగ్ చేయడంతో వారి నిద్ర సమయం తగ్గిపోతుంది. కొందరికి వారి పని వల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. మనిషి సరిగా నిద్ర పోకపోవడంలో భవిష్యత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే కొంత మందికి నిద్ర పోదమన్న నిద్ర పట్టదు దానికి వారి అలవాట్లే కారణం.

నిద్ర రావాలంటే కింద నియమాలు పాటించాలి..
నిద్ర పోవడానికి ముందుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీని వల్ల రోజంతా ఉన్న అలసట దూరమౌతుంది.
నిద్ర పోయే ముందు టీ, కాఫీలు త్రాగకూడదు ఎందుకంటే వాటిలో ఉండే కెఫిన్ మెదడును విశ్రాంతిలోకి వెళ్లనివ్వందు.

11:48 - November 20, 2017

ఢిల్లీ : సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి షెడ్యూల్ ఖరారు చేశారు. నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 24. నవంబర్ 25న నామినేషన్ల పరిశీలన చేయయనున్నారు. డిసెంబరు 1న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:39 - November 20, 2017

కృష్ణా : విజయవాడ ధర్నా చౌక్ ఉద్రిక్తత నెలకొంది. చలో అసెంబ్లీకి వాపపక్ష పార్టీలు బయల్దేరారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి షెడ్యూల్ ఖరారు చేశారు. ఎన్నికలపై రేపు నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈనెల24, 25న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 8న అధ్యక్ష పదవికి ఎన్నిక అదే నెల 11న ఫలితాలు విడుదల చేస్తారు. 

విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత

కృష్ణా : జిల్లా విజయవాడ ధర్నా చౌక్ విద్ద ఉద్రిక్తత నెలకొంది. ఛలో అసెంబ్లీకి బయల్దేరిన వామపక్షా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం ఏపీ కార్వదరిశ పి.మధు, సీహెచ్ బాబు రావు, సీపీఐ నేత రామకృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు సహా పలువురు నేతలు అరెస్టైయ్యారు.

11:21 - November 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో ఉంగుటూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులను మొగల్తూరు వీరవసరం ఎస్సైలు, సిబ్బంది లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టారని ఉంగుటూరు గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. మొగల్తూరు, వీరవసారం ఎస్సైలను, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అర్థరాత్రి వరకు ధర్నా నిర్వహించారు.  

 

11:20 - November 20, 2017

విజయనగరం : ప్రత్యేక హోదా కోసం ఇవాళ వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీంతో విజయనగరంలో వామపక్షనేతలను పార్వతీపురం పట్టణం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

11:16 - November 20, 2017

తూర్పు గోదావరి : చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుపుతోందని సీపీఎం నేతలు విమర్శించారు. వామపక్షాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో ఎక్కడికక్కడ లెఫ్ట్‌నేతల నిర్బంధంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ప్రజ్వాస్వామ్య హక్కులను కాలరాస్తోందని  తూర్పుగోదావరిజిల్లా సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

11:14 - November 20, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీంతో గుంటూరు జిల్లాలో రాత్రి నుండి పోలీసులు నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామంటున్న వామపక్షనేతలతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:09 - November 20, 2017

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష, వైసీపీ, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. అరెస్టులను ఖండించారు. 
వైసీపీ నేత మల్లాది విష్ణు 
'బీజేపీ, టీడీపీలు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయి. ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే అరెస్టులు, నిర్బంధం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు మాట్లాడే, పోరాడే హక్కు ఉంటుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని' అన్నారు. 
సీపీఎం నేత సీహెచ్.బాబూరావు 
'ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు. మీరు హోదా అధ్యాయాన్ని ముగిస్తే...మీ అధ్యాయాన్ని ప్రజలు ముగిస్తారు. నిధులు రావడం మీకు ఇష్టం లేదా..? మోడీ, బాబు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించింది మోడీ, బాబులే. మమ్మల్ని కాదు అరెస్టు చేయాల్సింది....వారిని అరెస్టు చేయాలి. ప్రత్యేకహోదా అంటే టీడీపీ ప్రభుత్వానికి దడ పుడుతుంది. విభజన చట్టం హామీలు అంటే భయపడుతుంది. చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం. ఇది ఒక పిరికిపంద ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం... మోడీ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దొంగలే. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. లోటు బడ్జెట్, నిధులు ఇవ్వలేదు. ప్రభుత్వమే చలో అసెంబ్లీని జయప్రదం చేసింది. ప్రత్యేకహోదా సాధించి తీరుతామని' చెప్పారు. 

 

10:54 - November 20, 2017

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను  ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కృష్ణాజిల్లాలో 150 మంది లెఫ్ట్‌నేతలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు వామపక్షనేతల ఇళ్లముందుకూడా  పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. గోదావరిజిల్లాల్లో సీపీఎం నేతలను పెద్ద సంఖ్యలో అరెస్టు  చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చలో అసెంబ్లీకి వెళ్తున్న వామపక్ష నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గణపవరం, పోలవరం  సీపీఎం డివిజన్‌ కార్యదర్శులతో పాటు పలువురు సీపీఐ నేతలను గృహనిర్బంధం చేశారు.  గుండుగొలను, ఏలూరు ఆశ్రంవద్ద  జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిర్బంధాలు ఎన్ని ఉన్నా చలోఅసెంబ్లీ నిర్వహించి తీరుతామ అన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం ఆపేదిలేదని వామపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 

 

10:52 - November 20, 2017

సినిమా : దేశంలో సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి దేశావ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అయితే బాహుబలి తర్వాత ఆయన ఇంత వరకు ఏ సినిమాను మొదలు పెట్టలేదు. కాని ఆయన లేటెస్టుగా ట్వీట్టర్ లో మెగా స్టార్ చిరు తనయుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలసి దిగిన ఫోటో పోస్టు చేశారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ తో జక్కన్న మల్టీస్టారర్ తీయబోతున్నాడా అనే వార్తాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా చరణ్ రంగస్థలం చేస్తున్నారు.

10:51 - November 20, 2017

హైదరాబాద్ : లండన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ  హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు  జనసేన ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. 

 

10:48 - November 20, 2017

ముంబాయి : పద్మావతి మూవీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి, నటి దీపిక పదుకొణెకు బెదిరింపులు ఆగడంలేదు. సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని చాలా గ్రూపులు, కమ్యూనిటీస్‌ నుంచి బెదిరింపులు శృతిమించుతున్నాయి.  తాజాగా దీపిక, సంజయ్‌ల సిరచ్ఛేదనం చేసిన వారికి 10కోట్ల నజరానా ప్రకటించారు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో-ఆర్డినేటర్ సూరజ్ పాల్. నటులను చంపిన వారి కుటుంబ సభ్యుల బాగోగులు కూడా తామే  చూసుకుంటామని బీజేపీనేత వెల్లడించారు. పనిలోపనిగా ఇంతకుముందే  5కోట్ల నజరానా ప్రకటించిన మీరట్‌యూత్‌ వారిని సూరజ్‌పాల్‌ తెగ మెచ్చుకున్నారు. బీజేపీ నేతల బెదిరింపులపై  బాలీవుడ్‌ మండిపడుతోంది. వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, పరిణితి చోప్రా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీతారలను చంపుతామనడం తనను షాక్‌కు గురిచేసిందని, ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. ఇండియన్స్‌ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంపై సిగ్గుపడుతున్నామని నటిసోనమ్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. అసలు వీళ్లు మనుషులేనా..అని నటి పరిణితి చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

10:46 - November 20, 2017

విజయవాడ : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. 
రాష్ట్రంలో టీడీపీ నిరంకుశ పాలన : పి.మధు
రాష్ట్రంలో టీడీపీ నిరంకుశ పాలన. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా ఫణంగా పెట్టారు. రాష్ట్ర విజభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కేంద్రప్రభుత్వం ఎన్నో హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోంది. 
రాష్ట్రానికి కనీస వసతులు లేవు. తూ.గో, ప.గో ఆఫీస్ లను పోలీసులు నిర్బంధించారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అరెస్టులు జరిగాయి. ఏపీకి ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న పోరాటంపై ప్రభుత్వం పోలీసులను వినియోగించి అణిచివేస్తోంద. టీడీపీ ప్రభుత్వ విధానాలు అమలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాలు అత్యంత నిరంకుశంగా ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు భయోత్పాత వాతావరణం సృష్టిస్తున్నారు. చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని' చెప్పారు. 
బీజేపీ నమ్మకం ద్రోహం : సిహెచ్. బాబురావు
బాబు, మోడీ జోడి.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పచ్చి అబద్ధాలు చెప్పి మూడు సం.రాలుగా పాలన కొనసాగిస్తున్నారు. పచ్చి నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నమ్మకం ద్రోహం చేసింది. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. చలో అసెంబ్లీ సందర్భంగా నేతలను అరెస్టు చేయడం ఖండిస్తున్నామని' చెప్పారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గోదావరి జిల్లాల్లో సీపీఎం నేతల అరెస్టు

ఉభయ గోదావరి : జిల్లాల్లో సీపీఎం నేతలను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చలో అసెంబ్లీకి వెళ్తున్న వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గణపవరం, పోలవరం  సీపీఎం డివిజన్‌ కార్యదర్శులతో పాటు పలువురు సీపీఐ నేతలను గృహనిర్బంధం చేశారు. గుండుగొలను, ఏలూరు ఆశ్రంవద్ద  జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 

కృష్ణా జిల్లాలో లెఫ్ట్‌, ప్రజాసంఘాల నాయకుల అరెస్టు

కృష్ణా : చలో అసెంబ్లీ నేపథ్యంలో జిల్లాలో 150 మంది లెఫ్ట్‌నేతలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు వామపక్షనేతల ఇళ్ల ముందు కూడా పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. 

చలోఅసెంబ్లీ.. భారీగా పోలీసుల మోహరింపు

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. 

09:45 - November 20, 2017

గుంటూరు : వామపక్షాలు, ప్రజాసంఘాల చలోఅసెంబ్లీ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మోహరించారు.  ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వాహనాల తనిఖీలతో ఖాకీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వామపక్షనేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కృష్ణాజిల్లాలో 150 మంది లెఫ్ట్‌నేతలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. బస్‌, రైల్వేస్టేషన్లతోపాటు వామపక్షనేతల ఇళ్ల ముందు కూడా పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. గోదావరిజిల్లాల్లో సీపీఎం నేతలను పెద్ద సంఖ్యలో అరెస్టు  చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చలో అసెంబ్లీకి వెళ్తున్న వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గణపవరం, పోలవరం  సీపీఎం డివిజన్‌ కార్యదర్శులతో పాటు పలువురు సీపీఐ నేతలను గృహనిర్బంధం చేశారు. గుండుగొలను, ఏలూరు ఆశ్రంవద్ద  జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉపాధి హామీ, వ్యవసాయం రంగాలపై శాసన సభలో చర్చించనున్నారు. సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై శాసనమండలిలో చర్చించనున్నారు. 

 

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉపాధి హామీ, వ్యవసాయం రంగాలపై శాసన సభలో చర్చించనున్నారు. సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై శాసనమండలిలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:50 - November 20, 2017

గుంటూరు : నాలుగు రోజుల విరామం అనంతరం ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉపాధి హామీ, వ్యవసాయం రంగాలపై శాసన సభలో చర్చించనున్నారు. సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై శాసనమండలిలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:48 - November 20, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, ప్రజా సంఘాలు ఇవాళ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అయితే చలో అసెంబ్లీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపేందుకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ముందస్తు జాగ్రత్త కింద పోలీసులు పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:45 - November 20, 2017

ఏపీకి ప్రత్యేకహోదాపై వక్తలు హాట్ హాట్ గా చర్చించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత దుర్గాప్రసాద్, బీజేపీ నేత నరేష్ , సీపీఎం నేత ఉమామహేశ్వరరావు, టీఆర్ఎస్ నేత వేణుగోపాలచారి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:40 - November 20, 2017

గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై చేపట్టిన జనపథం కార్యక్రమ్రంలో ఆయన మాట్లాడారు. 'మాకు ఉద్యోగ భద్రత కల్పించడి. కనీస వేతనం ఇవ్వండి'. అంటూ గ్రామ పంచాయితీ కార్మికులు ఆందోళనకి సిద్ధమయ్యారు. ఒకవైపు ప్రభుత్వం కొత్తగా ఐదువేల గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేస్తాం. కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే ఉన్న గ్రామ పంచాయితీ లోని కార్మికులు ముందు మా సమస్యలను పరిష్కరించండి అంటూ ఆందోళనకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై భాస్కర్‌ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:37 - November 20, 2017

ప.బెంగాల్ : కోల్‌కతా టెస్టులో నాలుగోరోజు భారత్ హవా కనిపించింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్, ధావన్ హాఫ్ సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిన లంక బౌలర్లు.. ఈసారి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పిచ్ మెల్లగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారడంతో వికెట్లు అంత సులువుగా రావడం లేదు. 94 ప‌రుగులు చేసిన త‌ర్వాత ధావ‌న్ ఔట‌య్యాడు. రాహుల్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 166 ప‌రుగులు జోడించాడు. మ్యాచ్ ముగిసే సమయానికి రాహుల్ 73, పుజారా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఉదయం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 వద్ద ముగిసింది. మ్యాచ్ ముగియడానికి ఒక్కరోజే సమయం ఉండటంతో.. డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. 

నేతల అరెస్టులను ఖండించిన కేఎస్.లక్ష్మణ్ రావు

గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ తో వామపక్షాలు, ప్రజా సంఘాలు నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసులు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. నేతల అరెస్టులను మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణ్ రావు ఖండించారు. అరెస్టు చేసిన వారికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

08:30 - November 20, 2017

హైదరాబాద్ : సంజయ్‌ లీలా బన్సాలీ సినిమా 'పద్మావతి' విడుదల వాయిదా పడింది. ఓ వైపు పద్మావతి సినిమాను అడ్డుకుంటామంటూ కర్ణిసేన దేశవ్యాప్తంగా ఆందోళనలు... మరోవైపు సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీబీఎఫ్‌సీ సినిమాను వెనక్కి పంపడంతో... సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు  చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ప్రకటించింది. 
మొదట్నుంచి మూవీకి తీవ్ర అడ్డంకులు 
ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన చారిత్రక సినిమా 'పద్మావతి'. మొదట్నుంచి ఈ మూవీ తీవ్ర అడ్డంకులు ఎదుర్కుంటోంది. అన్నిటినీ దాటుకుని చివరకు డిసెంబర్ 1 విడుదలకు సినిమా సిద్ధమైంది. తీరా ఇప్పుడు  సినిమా రిలీజ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. సెన్సార్ బోర్డు కన్నా ముందే సినిమాను పలు మీడియా ఛానెల్స్‌కు చూపించడాన్ని సీబీఎఫ్‌సీ తప్పు పట్టింది. దరఖాస్తు అసంపూర్ణంగా ఉందని సినిమాను వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ప్రకటించింది. 
సినిమా షూటింగ్‌ టైం నుంచే అడ్డగింపు
ఈమూవీ టైటిల్‌ రోల్‌లో దీపిక పదుకొణె, చిత్తోర్‌గఢ్‌ రాజు రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌కపూర్‌, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్‌ నటించారు. పద్మావతి సినిమా షూటింగ్‌ టైం నుంచే పలువురు అడ్డుకున్నారు. భన్సాలీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, రాణి పద్మావతిని కించపరిచేలా సినిమాలో చూపిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా ఉండదని చిత్ర యూనిట్‌ విజ్ఞప్తి చేసినా.. విడుదలకు ముందే తమకు సినిమా చూపించాలని పలు వర్గాలు డిమాండ్ చేశాయి. వారి డిమాండ్ ప్రకారమే ప్రివ్యూ వేసినా... అభ్యంతరాలు చెబుతున్న వర్గాలు మూవీ చూసేందుకు రాలేదు. 
సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ నిలిచిపోవడంపై బాలీవుడ్ ప్రముఖుల మండిపాటు
పద్మావతి సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ నిలిచిపోవడంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజస్ధాన్, యూపీ, గుజరాత్‌లను పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలే అందుకు కారణమని నటి సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. బాలీవుడ్ మద్దతు పద్మావతికి లభించినా... వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత మూవీ విడుదలకు అడ్డంకిగా మారింది. ఇన్ని వివాదాల నేపథ్యంలో వాయిదా పడ్డ పద్మావతి సినిమా మరి ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. మూవీపై వివాదం పరిష్కారం అనంతరమే... చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి. 

 

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తూ. గో : జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కాకినాడ నుండి రాజమండ్రికి వెళ్తోంది. మార్గంమధ్యలో అనపర్తిలో ఎదురుగా వస్తున్న ధాన్యం లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. 11 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌లు గాయపడ్డారు. 

08:24 - November 20, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కాకినాడ నుండి రాజమండ్రికి వెళ్తోంది. మార్గంమధ్యలో అనపర్తిలో ఎదురుగా వస్తున్న ధాన్యం లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. 11 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌లు గాయపడ్డారు. మూడు క్రేన్‌లతో మూడు గంటలు శ్రమించి బస్సును వెలికితీశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:17 - November 20, 2017

హైదరాబాద్ : ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు విలుచేసే భూమిని లాక్కున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ప్రశ్నిస్తే చంపేస్తామని హెచ్చరించారు.  సమీప బంధువులే ఓ ఎన్‌ఆర్‌ఐను నమ్మించి మోసం చేశారు.  దీంతో హైదరాబాద్‌ సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌ స్థలం వివాదంగా మారింది.
భారీ భూకబ్జా
మీరు చూస్తున్న ఈ స్థలం హైదరాబాద్‌ సోమాజిగూడలో రాజ్‌భవన్‌ రోడ్డులోనిది.  40కోట్ల రూపాయలు విలువచేసే  ఈ స్థలంలో ది పార్క్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నడుస్తోంది. వాస్తవంగా ఈ స్థలం తనదని ఎన్‌ఆర్‌ఐ జునైల్‌ ఆదిల్‌ చెప్తున్నారు. తన మేనల్లుడు నాజిర్‌ అలీఖాన్‌, మీర్‌ హుస్సేన్‌ అలీఖాన్‌కు జునైద్‌ ఈ విలువైన భూమిని అప్పగించారు. 1977లోనే దుబాయిలో స్థిరపడ్డ జునైద్‌... 2005లో అమెరికాకు వెళ్లి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. 
సోమాజిగూడలో స్థలం కొనిపెట్టుకున్న జునైద్‌
జునైద్‌ సోమాజిగూడలోనే ఎప్పుడో స్థలం కొనిపెట్టారు. ఈ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తుండడంతో జునైద్‌ మేనళ్లులు నాజీర్‌, హుస్సేన్‌ కన్ను దీనిపై పడింది. దీంతో ఆ స్థలాన్ని ఎలాగైన కాజేయాలని స్కెచ్‌ వేశాడు. వెంటనే హుస్సేన్‌ తన మేనమామైన జునైద్‌ను సంప్రదించాడు. ఖాళీ స్థలంలో ఓ హోటల్‌ నిర్మాణం చేపడితే... కోట్ల రూపాయల లాభం వస్తుందని నమ్మించాడు. సొంత బంధువులే కదా అని నమ్మిన ఎన్‌ఆర్‌ఐ వెంటనే.. తన విలువైన స్థలాన్ని నాజీర్‌, హుస్సేన్‌ పేరుమీద జీపీఏ చేశారు.
ది పార్క్‌ హోటల్‌ యాజమాన్యంతో నాజిర్‌, హుస్సేన్‌ డీల్‌
జీపీఏ అధికారం పొందిన ఎన్‌ఆర్‌ఐ జునైల్‌ ఆదిల్‌ మేనళ్లుల్లు ఇద్దరు కలిసి ది పార్క్‌ హోటల్‌ యాజమాన్యాన్ని సంప్రదించారు. తమ స్థలాన్ని లీజ్‌కు ఇస్తామంటూ డీల్‌ కుదుర్చుకున్నారు. వెంటనే ది పార్క్‌ హోటల్‌ బిల్డింగ్‌ నిర్మాణం అయ్యింది. లక్షా స్క్వేర్‌ ఫీట్స్‌లో హోటల్‌ భవనం నిర్మాణమైంది.  లక్షా స్వేర్‌ ఫీట్‌ స్థలంలో 60వేల స్క్వేర్‌  ఫీట్‌లో నిర్మించే హోటల్‌ భాగంలో వచ్చే లాభాన్ని జునైద్‌కు ఇస్తామని నమ్మబలికారు. మిగిలిన 40వేల స్క్వేర్‌ ఫీట్‌ స్థలంలో వచ్చే లాభాన్ని  మేనళ్లుల్లు తీసుకునేలా ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఐ జునైద్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇదే విషయమై తన మేనళ్లుళ్లను నిలదీస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ వాపోయారు.  హోటల్‌ స్థలమంతా తమదేనని.. చిల్లిగవ్వ కూడా ఇవ్వమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఫోర్జరీ సంతకాలతో తనను మోసం చేశారని ఎన్‌ఆర్‌ఐ ఆరోపిస్తున్నారు.
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన జునైద్‌
తనకు జరిగిన అన్యాయంపై జునైద్‌ పోలీసులను ఆశ్రయించారు.  సంతకాలు ఫోర్జరీ చేసి తన స్థలాన్ని లాక్కున్నారని ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు  జునైద్‌ మేనళ్లుల్లు నాజిర్‌, హుస్సేన్‌పై ఛీటింగ్‌ , ఫోర్జరీ, బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో విలువైన స్థలాన్ని కొట్టేసి హోటల్‌ నడుపుతున్న వ్యవహారంపై పార్క్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం స్పందించలేదు. విషయం తెలిసిన ఇంత వరకు యాజమాన్యం నోరు మెదపడం లేదు. మరోవైపు జునైద్‌ మాత్రం న్యాయం కోసం పోరాడుతున్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

08:13 - November 20, 2017

శ్రీకాకుళం : పర్యాటక రంగ అభివృద్ధికి ఏపీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సిక్కోలు తీరప్రాంతంలోని కళింగపట్నంలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భవిష్యత్‌లోనూ ఇంతకంటే వైభవంగా సంబరాలు నిర్వహిస్తామని పాలకులు చెబుతున్నారు. 

శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేషం సముద్ర తీరంలో సాగరతీర సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండు రోజుల పాటు జరిగిన సంబరాలను మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు ప్రారంభించారు. 

పర్యాటకపరంగా శ్రీకాకుళంగా జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు మంత్రులు. ఇందుకోసమే సాగరతీర ఉత్సవాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కె.మత్స్యలేశం తీరంలో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం కోటి 50 లక్షలతో వసతులు కల్పిస్తామన్నారు. 100 గదుల రిసార్ట్‌ భవనాన్ని క్లబ్‌ మహేంద్ర సంస్థ నిర్మించనున్నట్లు తెలిపారు. 

ప్రజలు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు.. గ్రామాన్ని దత్తత తీసుకున్న మైలపల్లి జనార్ధనరావు తెలిపారు. కళింగపట్నంను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సర్పంచ్‌ లక్ష్మీ జనార్ధనరావు.  

కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో ఈ వేడుకలకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివచ్చారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సంబరాల వేదిక, స్టాల్స్‌ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. వేడుకలు సక్సెస్‌ కావడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగరతీరంలో ఉన్న జిల్లాలో పర్యాటక అభివృద్ధి ద్వారా ఎంతో మేలు జరుగుతుందని... తద్వారా జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

08:11 - November 20, 2017

అనంతపురం : జిల్లా రాజకీయాల్లో యువ శకం నాంది పలకబోతుంది. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల తనయులు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. గత మూడేళ్లుగా తమ తండ్రుల అధికార బాధ్యతల్లో పరోక్షంగా పెత్తనం చలాయిస్తున్న యువ నేతలు... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న తనయులను పోటీ చేయించేందుకు నేతలు సైతం పావులు కదుపుతున్నారు. అనంత రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన రాజకీయ వారసులపై 10టీవీ ప్రత్యేక కథనం.

రాష్ట్రంలో సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువైన అనంతలో వచ్చే ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేకమంది యువనేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తనయులకు తమ రాజకీయ వారసత్వం అప్పగించేందుకు.. తండ్రులు సైతం పుత్రోత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా... అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి... ప్రజాదరణ ఎలా పొందాలి,.. ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలనే అంశాలను దగ్గరుండి నేర్పిస్తున్నారు. అయితే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తపనపడుతున్న వారసుల్లో చాలామంది అధికార పార్టీకి చెందినవారే ఉండడం విశేషం. 

రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్‌.... తమ తనయులను ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సిద్దమవుతున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా ఓటమి ఎరుగని జేసీ దివాకర్‌రెడ్డి... తన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని జేసీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని... తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తానన్నారు. ఇక తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సైతం... తన తనయుడు అస్మిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ తమ తనయులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించనుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు జేసీ బ్రదర్స్‌ తనయులిద్దరూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. 

ఇక రాప్తాడు నియోజకవర్గానికి చెందిన మంత్రి పరిటాల సునీత సైతం రానున్న ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్‌ ఇప్పటికే పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ పేరిట అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనడమే కాకుండా.... నేతలు, కార్యకర్తలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అభివృద్ధి పనులు సైతం శ్రీరామ్‌ నిర్ణయం మేరకే జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్‌ పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. 

అలాగే... కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కూడా తన తనయుడు మారుతిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. తండ్రి వయోభారం నేపథ్యంలో మారుతి ఇప్పటికే క్రీయాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సైతం వచ్చే ఎన్నికల్లో తన తనయుడు నిమ్మల శిరీష్‌ను ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా శిరీష్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 


అధికారపక్షం రాజకీయ వారసులు ఇలా ఉంటే... ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కొనకొండ్ల భీమిరెడ్డి సిద్దమయ్యారు. ఈయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కొనకొండ్ల శివరామిరెడ్డి తనయుడు... మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డికి స్వయానా మేనల్లుడు. దీంతో ఈయనకు రాజకీయంగా మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అనేకమంది నేతలు తమ వారసులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సిద్దమయ్యారు. అన్నీ అనుకున్నట్లు టిక్కెట్లు లభిస్తే... అనంత రాజకీయాలు నవతరంతో రసవత్తరంగా మారుతాయి. 

08:00 - November 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని అధికార పార్టీ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి రావడంతో నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.  భారీగా చేరిన వలసలతో తాము నష్టపోతున్నామన్న  అనుమానంతో ఉన్న నేతలు డీలిమిటేషన్ జరిగితే.....తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో కనిపిస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం రాష్ట్ర ఆవిర్బావం నుంచి నేతల్లో నానుతున్నా.. కొన్ని రోజుల క్రితం ప్రధాని  మోదీ ఇచ్చిన సంకేతాలతో అందరూ ఢీలా పడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన  సవరణలకు ఆమోదం దక్కుతుందని భావించినా.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు  సిద్ధం అవుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం  ఉందన్న ప్రచారం  నేతల్లో మరోసారి చర్చకు దారి తీస్తోంది.

దీనికితోడు గులాబి దళపతి కెసిఆర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో   నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంట్ పరిధిలో కూడా జరగాలనే డిమాండ్‌ను వినిపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభా స్థానాలు కూడా పునర్విభజన చట్ట ప్రకారం పెరగాల్సి ఉన్నా.....కేంద్రం  ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై బిజెపి నేతలను తరచూ సంప్రదిస్తూ సీట్లు  పెరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీల్లోకి భారీగా  నేతలు వలస రావడంతో నియోజకవర్గాల సంఖ్య పెరిగితేనే నేతలను సంతృప్తి చేయవచ్చన్న అభిప్రాయంతో  పార్టీ అధినేతలున్నారు.

గుజరాత్ ఎన్నికల అనంతరం డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే  చాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిజెపికి ఆశించిన స్థాయిలో  ఓటర్లు  మద్దతు ఇవ్వకపోతే......  సాధారణ ఎన్నికల నాటిని  ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్న ధీమా నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

07:56 - November 20, 2017

విజయవాడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాద ఘటనలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బోటు డ్రైవర్ సూరిబాబు, బోటు హెల్పర్ తాడెల రామారావు, సంస్థలో పెట్టుబడి దారుడు హర్షవర్థన్ ఉన్నారు. పడవ ప్రమాదం జరిగినపుడు బోటులో మొత్తం 41 మంది ప్రయాణికులతో పాటు  డ్రైవర్‌ గేదెల సూరిబాబు, కాకినాడకు చెందిన మత్స్యకారుడు కర్రి భైరవ ఉన్నారు. 

 

07:54 - November 20, 2017

ప.గో : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో సీపీఎం ఇవాళ 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చింది. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గుర్తు చేశారు. ఈ అంశంపై పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరులో జరిగిన సీపీఎం పశ్చిమగోదావరి జిల్లా 24వ మహాసభల్లో పాల్గొన్న మధు... చలో అసెంబ్లీకి అన్ని వర్గాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే వామపక్షాల చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 

 

'చలో అసెంబ్లీ' నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

గుంటూరు : చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి అజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని పాత గుంటూరు పీఎస్ కు తరలించారు. 

 

నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో 'చలో అసెంబ్లీ'

అమరావతి : ప్రత్యేక హోదా కోసం నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చారు. ఏపీలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయ. 

 

Don't Miss