Activities calendar

21 November 2017

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు...

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్కేనగర్‌ స్థానం ఖాళీగా ఉంది.

21:32 - November 21, 2017

ఢిల్లీ : అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు అద్భుత విజయం లభించింది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ న్యాయమూర్తిగా దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. ఓటమి తప్పదని భావించిన బ్రిటన్ అభ్యర్థి క్రిస్టఫర్ గ్రీన్‌వుడ్‌ చివరి క్షణంలో పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో భండారీకి మార్గం సుగమమైంది. దీంతో 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఐసిజెలో బ్రిటన్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు దౌత్యపరంగా భారీ విజయం లభించింది. ఐసిజే ఎన్నికల్లో భారత్ నామినేట్ చేసిన దల్వీర్ భండారీ మరోసారి న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. న్యాయమూర్తి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు చెందిన దల్వీర్‌ భండారీ, బ్రిటన్‌కు చెందిన జస్టిస్‌ క్రిస్టోఫర్‌ గ్రీన్‌వుడ్‌ పోటీ పడ్డారు. చివరి క్షణాల్లో బ్రిటన్‌ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో భండారి విజయ ఢంకా మోగించారు.

ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌లో 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఉంటుంది. వీరి పదవీ కాలం 9 ఏళ్లు. మూడేళ్లకోసారి ప్రతి ఐదుగురి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఐసిజెలో న్యాయమూర్తిని ఎన్నుకునేందుకు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, భద్రతామండలిలలో ఏక కాలంలో, వేర్వేరుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ పోటీలో గెలవాలంటే అటు జనరల్ అసెంబ్లీలో, ఇటు భద్రతా మండలి రెండింట్లోనూ మెజార్టీ అవసరం. జనరల్‌ అసెంబ్లీలో కనీసం 97ఓట్లు, భద్రతామండలిలో 8 ఓట్ల మెజార్టీ రావాలి. 11 రౌండ్లు పూర్తయిన తర్వాత ఇండియాకు జనరల్ అసెంబ్లీలో, యూకేకు సెక్యూరిటీ కౌన్సిల్‌లో మెజార్టీ లభించింది. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 9 యూకేకు మద్దతు తెలపగా...భారత్‌కు 5 ఓట్లే దక్కాయి. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. 11వ రౌండ్‌ పూర్తయినా ఫలితం తేలకపోవడంతో మరో రౌండ్‌ నిర్వహించాలని భావించారు. 12వ రౌండ్‌కు ముందు యూకే అనూహ్యంగా తమ అభ్యర్థి జస్టిస్‌ క్రిస్టోఫర్‌ గ్రీన్‌వుడ్‌ని తప్పించడంతో భండారీకి మార్గం సుగమమైంది. జనరల్ అసెంబ్లీలోని మొత్తం 193 ఓట్లలో 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లు భారత్‌కు వచ్చాయి.

1946లో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడ్డ తర్వాత బ్రిటన్‌కు చెందిన న్యాయమూర్తి ఐసిజేలో లేకపోవడం ఇదే తొలిసారి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవడంతో ఆ దేశానికి ఆదరణ తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత్యంతరం లేకనే తమ అభ్యర్థిని విరమించుకున్నారని చెబుతున్నారు.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గా పనిచేసిన దల్వీర్‌ భండారి 2012 ఏప్రిల్‌ 27న ఐసీజేకు ఎన్నికయ్యారు. మరో తొమ్మిదేళ్లకు ఎంపిక కావడంతో 2027 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. దల్వీర్‌ భండారికి ప్రధాని నరేంద్రమోది, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అభినందనలు తెలిపారు.

21:30 - November 21, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌పై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తలాక్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం బిల్లు తెచ్చే యోచనలో ఉంది. దీనిపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు 6 నెలలపాటు నిషేధం విధించినప్పటికీ అక్కడక్కడ తలాక్‌ ఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీంతో ముస్లిం మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందిస్తోంది. మరోవైపు నవంబర్‌లో ప్రారంభం కావాల్సిన శీతాకాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ప్రతిపక్షాలు మోది సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ట్రిపుల్ తలాక్ కు ప్రత్యేక చట్టం...

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌పై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తలాక్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం బిల్లు తెచ్చే యోచనలో ఉంది. 

కర్నూలులో రజనీకాంత్...

కర్నూలు : జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దర్శించుకున్నారు. రజినీకాంత్‌కు శ్రీమఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

21:28 - November 21, 2017

హైదరాబాద్ : మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం మూడో రోజు చేరింది..తనకు న్యాయం జరిగేవరకు కదలనంటోంది...ద్రవాహారం తీసుకోకుండా ఉండడంతో సంగీత ఆరోగ్యం క్షీణించింది...తనకు భర్త కావాలని...మరో తప్పు చేయకుండా ఉండాలని సంగీత డిమాండ్ చేస్తుంది...మరోవైపు సంగీత ఆందోళనకు మహిళా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. మూడో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఆడాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారికపార్టీ బహిష్కృత నేత శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్న రెండో భార్య సంగీత ఆరోగ్యం క్షీణించింది...టెంటు వేసుకుని నిరాహారంతో దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెబుతున్నా న్యాయం జరిగేవరకు కదలనంటోంది....తనకు భర్త నుంచి న్యాయం కావాలని...అదే సమయంలో శ్రీనివాసరెడ్డిలాంటివారు ఆడాళ్ల జీవితాలతో ఆడుకోకుండా ఉండాలంటోంది సంగీత...సంగీత,ఆమె చిన్నారి కూతురికి జ్వరం వచ్చింది..దీంతో పాటు ఆమె ద్రవాహారం ఏమీ తీసుకోపోవడంతో నీరసమై ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి..

తన జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసినా ..అందుకు సహకరించి భర్తను ప్రోత్సహించిన అత్తమామలను కూడా అరెస్టు చేయాలని సంగీత డిమాండ్ చేస్తుంది...మరోవైపు సంగీత ఆందోళన మూడో రోజు చేరుకోవడంతో ఇప్పటికే మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి... మరోవైపు సంగీతను పరామర్శిచేందుకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బోడుప్పల్‌లోని ఆందోన ప్రాంతానికి చేరారు..అయితే న్యాయం చేయాలని..అందుకు వెంటనే యాక్షన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ సుధీర్‌రెడ్డిని మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. మహిళా సంఘాలతో సుధీర్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడడంతో... ఉద్రిక్తత తలెత్తింది. ఇల్లాలు సంగీత ఆందోళన రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుంది...శ్రీనివాసరెడ్డి ప్రవర్తించిన తీరు మహిళాలోకాన్ని ఆగ్రహానికి గురిచేసింది...సంగీత ఆందోళనకు మద్దతు పెరుగుతుండగా...అత్తమామలు పరారీలో ఉన్నారు..కేసులు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తూనే సంగీతకు రక్షణ కల్పించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిత్యానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు...

బీహార్ : ప్రధాని నరేంద్రమోదిని ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తానంటూ బిహార్‌ బిజెపి అధ్యక్షుడు నిత్యానంద్‌ రాయ్‌ హెచ్చరించారు. పట్నాలో జరిగిన ఓబిసి సభలో నిత్యానంద్‌ ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీలో కాల్పులు...

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ద్వారకా మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ నెంబర్‌-768 దగ్గర పోలీసులకు-క్రిమినల్స్‌ కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. క్రిమినల్స్‌ నుంచి 13 తుపాకులు, 100 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

21:21 - November 21, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కేసీఆర్‌ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని మండిపడ్డారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీలకు చెందిన వెయ్యి మందికిపైగా కార్యకర్తలు గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కుంతియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

--------

21:20 - November 21, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంట్‌ నియెజకవర్గాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌, హోం మినిస్టర్‌ నాయిని పరిశీలించారు. స్థానిక ఎమ్మోల్యేలతో కలిసి కేటీఆర్‌ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ముషిరాబాద్‌, సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట నియెజకవర్గ ప్రాంతాల్లోని నాలాలు, మార్కెట్లు, కమ్యూనిటీ హాల్స్‌ను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బన్సీలాల్‌పేట్‌లో ఏర్పాటు చేసిన మల్టీలెవల్‌ కమ్యూనిటీ హాల్‌ను విజిట్‌చేశారు. హుస్సేన్‌ సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాను అభివృద్ధి చేయ్యడం.. అందులో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలను మల్లించడానికి ప్లాన్‌ చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీ అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులను విడుదల చేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో కనీస వసతులను ఏర్పాటు చేయడంతో పాటు.. ఆధునీకరించడానికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

 

21:19 - November 21, 2017

కర్నూలు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్.జగన్ ఆరోపించారు. అబద్ధాలు చెప్పే వ్యక్తి సీఎం స్ధానంలో ఉన్నారని.. అలాంటి వ్యక్తిని పొరపాటున తిరిగి ఎన్నుకోవద్దని సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు బేతంచర్లలో జరిగిన సభలో చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. 14వ రోజు డోన్‌ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి షేక్‌ షా వలీ దర్గాకు చేరుకున్న జగన్ డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో అనంతరం పాణ్యం నేతలతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్లకు చేరుకున్న జగన్‌ బస్టాండ్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు, ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు అందరూ గుర్తు చేసుకోవాలన్నారు జగన్. అలాంటి నేతను తిరిగి ఎన్నుకునేముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా డయాలసిస్ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు వైఎస్.జగన్. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిడ్నీ పేషెంట్లకు అండగా నిలబడటమే కాకుండా.. వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

21:17 - November 21, 2017

విజయవాడ : వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తర్వలోనే సరఫరా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలు లేనప్పుడే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుందని ఈ అంశంపై సభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు.

ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధిపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొని... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ అంశంపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల సమాధానం ఇచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటున్నా సంక్షేమం, అభివృద్ధిక సమాన ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు.

ఆ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ స్థానాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడిన తీరు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఇచ్చిన నోటీసుకు హక్కుల కమిటీకి నివేదించాలని కోరారు.

అనంతరం వ్యవసాయ, అనుబంధ రంగాలపై జరిగిన చర్చకు... వ్యవయసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని.. వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలు లేనిరోజే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి చెందినట్టు అవుతుందంటూ.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ, అనుంబంధ రంగాలపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్‌ కోడెల అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.

తెలంగాణలో తెలుగు భాష అమలు సలహా సంఘం ఏర్పాటు...

హైదరాబాద్ : తెలుగు భాష అమలు సబ్ కమిటీతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. తెలంగాణలో తెలుగు మాతృభాషగా లేని పాఠశాలలు 1370 ఉన్నట్లు నిర్ధారించారు. తెలంగాణలో తెలుగు భాష అమలు సలహా సంఘం ఏర్పాటు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని, తెలుగు భాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్ సబ్జెక్టుగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

20:09 - November 21, 2017

బాతాల పోశెట్టి కొడ్కు అజయ్ జెప్పింది మనం ఇనాల్నంటగని.. మనం జెప్పేది మాత్రం ఆయన ఇనడంట.. ఇయ్యాళ మంత్రి కేటీఆర్ గారు నాయిని నర్సన్న ఉమ్మాయ జక్కాయ అంత జీహెచ్ఎంసీల ఏదో పనిమీద దిర్గినట్టుండ్రు.. ఒక తాన నిరుద్యోగులు సద్వుకునె జాగుంటే ఆడికి వొయ్యి ఏదో జెప్పవోతె నిరుద్యోగి ఊకుంటడా..? గీ ముచ్చట సూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:06 - November 21, 2017

అందరం బాకీ పడ్డాం.. తిరిగి చెల్లించలేనంత బాకీ పడ్డాం..వ్యక్తులుగా, వ్యవస్తగా లెక్క తెలియనంతగా రైతన్నకు రుణపడి ఉన్నాం... మరి ఈ బాకీని తీర్చటానికి మార్గం లేదా? ఉంది.. అది మనం ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా రైతన్న కళ్లలో వెలుగు నింపటం ద్వారా.. ఆ బాకీ తీర్చగలం. కానీ, ఇవే వీ పట్టని ప్రభుత్వాలు దేశానికి తిండి పెట్టే రైతన్న తాను నేల కూలుతుంటే చోద్యం చూస్తున్నాయి. గంట గంటకు, రోజు రోజుకూ రైతన్నల ఆత్మహత్యలతో దేశమంతా చావుడప్పు వినిపిస్తోంది.. ప్రత్యామ్నాయాలు .. కాదు.. అసలు సరైన విధానాలే లేని ప్రభుత్వాలు నిస్సిగ్గుగా రోజులు వెళ్లదీస్తున్నాయి తప్ప చేస్తున్నదేం లేదు. ఇప్పుడు దీనిపై రైతన్న గొంతెత్తాడు.. రాజధాని నడిబొడ్డున నినాదమయ్యాడు.. ఈ అంశంపై ప్రత్యేక కథనం..

ఆసేతు హిమాచలం అన్నదాత ఆర్తనాదంతో అట్టుడికిపోతోంది. ఎదిగిన కూతుళ్ళకు పెళ్ళిళ్లు చేయలేరు. పిల్లలకు చదువులు చెప్పించలేరు. కడుపున పుట్టిన బిడ్డలకు ఇంత అన్నం కూడా పెట్టలేరు. ఇంక బతికి వుండి మాత్రం చేసేదేముందన్న తీవ్ర నిరాశతో రైతు ప్రాణం తీసుకుంటున్నాడు. రోజూ ఏదో ఒక మూలన రైతు నిరాశతో నిట్టూర్పుతో నిస్సహాయంగా జీవితం మీద చివరి సంతకం చేసి వెళ్ళిపోతున్నాడు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..కేవలం ఒక్క తెలంగాణలోనే వందలాది రైతన్నలు అసహాయంగా అసువులు బాసిన ఉదంతం మనం చూస్తున్నాం. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు..రాష్ట్రం ఏదైనా రైతు దీనగాథ ఒక్కటే.

ఎందుకు రైతన్న రోడ్డెక్కుతున్నాడు.? రైతన్నకున్న సమస్యలు అంత పెద్దవా? అవును ఒక్కమాటలో చెప్పాలంటే దేశమంతటా రైతన్నది ఒకే కష్టం. ఒకే కన్నీటి గీతం. అవును.. అన్నదాత కంట కన్నీరొలుకుతున్నది.. నలుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్న బతుకులో పుట్టెడు శోకం నిండుతోంది.. అడుగడుగునా నిర్లక్ష్యమే...రైతుపడుతున్న కష్టానికి ప్రతిఫలం ఏమాత్రం దక్కటం లేదు. ప్రభుత్వాల రుణమాఫీల హామీలు వట్టి మాటలుగానే మిగులుతున్నాయి. ప్రపంచానికి తిండిపెట్టే రైతు అనాధలా ఎందుకు మారిపోయాడు..పొలంవదిలి రోడ్డెక్కి ఆందోళన బాట ఎందుకు పడుతున్నాడు..?ఇది ఒక్కరి వేదన కాదు.. ఒక్కరి బాధ కాదు..దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది రైతన్నలకు వచ్చిన కష్టం. దీనికి పరిష్కారం చూపకపోతే దేశంలో వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోక తప్పదు..

ఇక్కడ కన్నీళ్లను అవమానిస్తున్నారు.. మృత్యువును అనుమానిస్తున్నారు.. ఏ దేశంలోనూ రైతన్నకు ఇంత అగౌరవం ఉండదు.. ఏ సమాజంలోనూ రైతంటే ఇంత చిన్న చూపుండదు..మన దేశంలో మాత్రం రైతంటే ఎవరికీ పట్టని, ఏ ప్రభుత్వానికీ అవసరం లేని వాడు...ఎంతకాలమీ పరిస్థితి? ఎన్నాళ్లీ నిర్లక్ష్యం.. దీనికి పరిష్కారం ఏమిటి? కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల పన్నురాయితీలు, తక్కువ రేట్లకే వందల ఎకరాలు ఇచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు.. కానీ, దేశానికి తిండిపెట్టే రైతన్న బాగుకోసం రూపాయి ఖర్చు పెట్టడమంటే గింజుకుంటున్నాయి. మరోపక్క రైతన్నల జీవితాల్లో కష్టాలు కారుమబ్బుల్లా కమ్ముకుంటున్నాయి!! హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు... రైతులకు దన్నుగా నిలబడాల్సిన ఏలికలు నిద్రపోతున్నారు. ఆ నిద్రమత్తును వదిలించేదాకా వదిలేది లేదని ఇప్పుడు రైతన్న ప్రతినపూనుతున్నాడు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:02 - November 21, 2017

జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నువ్వు రాజీనామా జేయాల్సిన యాళ్లైంది వా...ఈ కమ్మకులమోళ్లంత కూసోని పంచుకున్న నంది అవార్డు నాకు పొరపాటుననే వచ్చింది.. బాతాల పోశెట్టి కొడ్కు అజయ్ జెప్పింది మనం ఇనాల్నంటగని.. మనం జెప్పేది మాత్రం ఆయన ఇనడంట..హురక తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు అప్పుడే ఎన్నికల మేనిఫెస్టో ఇడ్దల జేశినట్టున్నరుగదా..? మన బాతాల పోశెట్టి మందిని జూడంగనే గడ్కోపారి అంటుంటడు..మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే నన్ను సంపుతాంటున్నడు అని ఒక ఎంపీటీసీ అంటున్నడు.. ఊరి నడిమిట్ల శవాన్ని దించి కొట్టుకున్నరు రెండు వర్గాల జనం..సూశిండ్రా దొంగ బిచ్చగాళ్ల లెక్క బైటవడ్డది హైద్రావాదుల.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:54 - November 21, 2017

తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డుల వివాదంపై దుమారం రేగుతూనే ఉంది. ఇప్పటివరకు అవార్డులు దక్కనివాళ్లు.. అవార్డుల జూరీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు ఎక్కుపెడితే.. తాజాగా, అవార్డు వచ్చిన వారు సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకాలం.. అవార్డుల ఎంపికపైనే వివాదం రగులుతూ వచ్చింది. అయితే, ఇప్పుడది ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కేంద్రంగా మారింది. ఏపీలో ఆధార్‌ కూడా లేని.. నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ.. లోకేశ్‌ వ్యాఖ్యానించడంపై సినీపరిశ్రమ మండిపడుతోంది. ఈ క్రమంలో.. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. టెంపర్‌ సినిమాలో నటనకు గాను, తనకు ప్రకటించిన నంది అవార్డును తీసుకోబోనని స్పష్టం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), త్రిపుర నేని చిట్టి (నటుడు, నిర్మాత), కత్తి మహేష్ (సినీ క్రిటిక్), బాబు రాజేంద్ర ప్రసాద్ (టిడిపి ఎమ్మెల్సీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:49 - November 21, 2017

నంది అవార్డుల వివాదం ముదురు పాకానపడుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో హోరెత్తిపోతోంది. ముఖ్యంగా ఏపీలో ఆధార్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారన్న లోకేష్‌ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. లోకేశ్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డుల వివాదంపై దుమారం రేగుతూనే ఉంది. ఇప్పటివరకు అవార్డులు దక్కనివాళ్లు.. అవార్డుల జూరీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు ఎక్కుపెడితే.. తాజాగా, అవార్డు వచ్చిన వారు సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకాలం.. అవార్డుల ఎంపికపైనే వివాదం రగులుతూ వచ్చింది. అయితే, ఇప్పుడది ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కేంద్రంగా మారింది. ఏపీలో ఆధార్‌ కూడా లేని.. నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ.. లోకేశ్‌ వ్యాఖ్యానించడంపై సినీపరిశ్రమ మండిపడుతోంది. ఈ క్రమంలో.. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. టెంపర్‌ సినిమాలో నటనకు గాను, తనకు ప్రకటించిన నంది అవార్డును తీసుకోబోనని స్పష్టం చేశారు. సినిమా అవార్డులకు ప్రాంతీయతను ఆపాదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన నందిఅవార్డులను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన పోసాని కృష్ణమురళి.. నారా లోకేశ్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్‌ లాంటి మంత్రి ఉండడం తమ ఖర్మ అంటూ దుమ్మెత్తిపోసారు. నిజానికి, నంది అవార్డులు ప్రకటించిన నాటి నుంచే వివాదం రాజుకుంటూ వస్తోంది. జ్యూరీ సభ్యుల వ్యాఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ డైరెక్టర్ గుణశేఖర్ తొలుత ధ్వజమెత్తారు. నంది అవార్డుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్న గుణశేఖర్, తన చారిత్రక చిత్రం రుద్రమదేవిని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అటు నిర్మాత నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేశ్‌, రామ్‌గోపాల్‌వర్మ తదితరులు కూడా నంది అవార్డుల ఎంపిక కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నంది అవార్డుల విషయం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా సంకటంలో పడింది. నంది అవార్డుల ప్రకటనతో పరువు పోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఇంత రాద్దాంతం జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్‌ ద్వారా సర్వే చేసి అవార్డులు ప్రకటించేవారమని అన్నారు. జ్యూరీ ఎంపిక చేసిన వారికే అవార్డులు ప్రకటించామన్నారు. అయితే, ఇప్పుడు ప్రకటించిన అవార్డులను రద్దు చేసి.. కొత్తగా ఎంపిక చేపడతారా అన్న అంశంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. 

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు..

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

జమ్మలమడుగు టౌన్ బ్యాంకు ఛైర్మన్ అరెస్టు...

కడప : జమ్మలమడుగు టౌన్ బ్యాంకు ఛైర్మన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిధుల గోల్ మాల్ కేసులో ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

28న మెట్రో ట్రైన్ ప్రారంభం..

హైదరాబాద్ : ఈనెల 28న హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మియాపూర్‌లో మెట్రో పైలాన్ ఆవిష్కరించి... మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు మెట్రోలో ప్రయాణం చేయనున్నారు. 

డీజీపీని కలిసిని బచ్ పన్ స్కూల్ బాధిత కుటుంబం..

హైదరాబాద్ : డీజీపీ మహేందర్ రెడ్డిని బచ్ పన్ స్కూల్ బాధిత కుటుంబం కలిసింది. స్కూల్ యాజమాన్య తీరుపై డిజిపికి ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని డీజీపీ హామీనిచ్చారు. 

రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన - పొన్నాల...

కరీంనగర్ : రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన సాగుతోందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల వ్యాఖ్యానించారు. ఈటెల నియోజకవర్గంలో సబ్సిడీ ట్రాక్టర్లు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని, ఆర్టీఐ ద్వారా సబ్సిడీ ట్రాక్టర్ల అవినీతి బయటపడిందన్నారు. 

18:42 - November 21, 2017
18:41 - November 21, 2017
18:34 - November 21, 2017

రాజమండ్రి : పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న విధానంపై తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన రూ. 96వేల కోట్లు అప్పుపై వివరణ చెప్పాలని, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 

18:33 - November 21, 2017

హైదరాబాద్ : పోలవరం నిర్మాణంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కేవీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పోలవరంపై ఎలాంటి వైఖరి ఏంటో తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే పూర్తిగా భరించాలని కోరారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు. 

18:26 - November 21, 2017

కర్నూలు : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మంగళవారానికి 14వ రోజు చేరుకుంది. గోరుగుట్ల నుండి పాదయాత్ర మొదలైంది. షేక్ షా వలీ దర్గా వద్ద డోన్, పాణ్యం నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపారు. బేతంచర్ల బస్టాండు సర్కిల్ లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ సీఎంగా ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. రాత్రికి కోలుములెపల్లిలో జగన్ బస చేయనున్నారు. 

18:21 - November 21, 2017

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కడప, కర్నూలు జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవి చేస్తాను..ఇవి చేస్తానంటూ జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. జగన్ తనకు తాను దైవాసంభూతుడని చెప్పుకుంటున్నారని తెలిపారు.

 

రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో మెట్రో భద్రత..

హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో మెట్రో భద్రత ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మూడు కారిడార్లలో ప్రైవేటు సెక్యూర్టీ సహా 2078 మందితో హెచ్ఎంఆర్ భద్రతను కల్పించనుంది. నాగోల్ నుండి మియాపూర్ వరకు 546 మందితో భద్రత...ఏడాదిలో పూర్తిస్థాయిలో మెట్రో సెక్యూర్టీ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

ఇవాంక ట్రంప్ టూర్ పై ఐబీ జనరల్ అలర్ట్...

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంక ట్రప్ టూర్ పై ఐబీ జనరల్ అలర్ట్ చేసింది. టెర్రరిస్టుల ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. స్టేట్ పోలీసు యంత్రాంగానికి ఐబీ సూచనలు చేసింది. 

17:32 - November 21, 2017
17:30 - November 21, 2017

హైదరాబాద్ : జనగామ జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. ధర్మోనికుంట భూకబ్జా వ్యవహారంపై మరోసారి కలెక్టర్‌ దేవసేనపై ముత్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ముత్తిరెడ్డి కలెక్టర్‌ దేవసేన తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదు చేశారు. ధర్మోనికుంట కబ్జాకు గురవుతుంటే తానే ఆపానన్న ముత్తిరెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా కలెక్టర్‌ వ్యవహరిస్తోందన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. కబ్జా చేసినట్లు తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ చర్యలకైనా సిద్ధమేనని వెల్లడించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:20 - November 21, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ నగరానికి రానున్నారు. నవంబర్ 28-30 తేదీల్లో ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇవాంక ట్రంప్, తదితర ప్రముఖులు హైదరాబాద్ కు రానున్నారు. ఇవాంక ట్రంప్ ఫలక్ నుమా ప్యాలెస్ జరిగే విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 36 ఎకరాల్లో ఉన్న ఫలక్ నుమాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో ఉంటున్న 3500 మంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

జగిత్యాలలో ఉద్రిక్తత

కరీంనగర్/జగిత్యాల : జిల్లా సీపీఎం కార్యాలయం వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. కంచె ఐలయ్య మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు. దీంతో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.

రాష్ట్రానికి ఐబి హెచ్చరిక

హైదరాబాద్ : ఇవాంక టూర్ పై ఐబీ జనరల్ రాష్ట్రాన్ని హెచ్చరించారు. టెర్రిస్టుల ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఆయన స్టేట్ పోలీసులు పలు సూచనలు కూడా చేశారు.

17:07 - November 21, 2017

పోలవరంపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కేవీపీ పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు అదనపు ఖర్చు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని, 4 వారల్లో కౌంటర్ దాఖలు చేయాలని  కేంద్రాన్ని ఆదేశించింది. 

ఎర్రచందనం స్మగ్లర్ నజీం అరెస్ట్

చిత్తూరు : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ నజీంను పోలీసులు అరెస్టు చేశారు. 200 టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలించినట్లు నజీంపై ఆరోపణలు ఉన్నాయి. నజీంపై చిత్తూరు, బెంగూళురులో 12 స్మగ్లింగ్ కేసులు నమోదైయ్యాయి. 

16:40 - November 21, 2017
16:05 - November 21, 2017

పోర్న్ వీడియోలతో స్టార్ డాం తెచ్చుకున్న పోర్న్ స్టార్ సన్నీ లియోన్. ప్రస్తుతం ఆమె పోర్న్ వీడియో చేయడం మానేసి ఇండియాలోని వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సన్నీ హిందీలోని పలు చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగు, తమిళంలో ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేసి కుర్ర కారును ఉర్రూతలుగింకచారు. మొన్న సన్నీ కేరళ వెళ్లినప్పుడు ఆమెను చూడడానికి భారీ స్థాయిలో జనలు రావడంతో ఆమె ఎంతో క్రేజ్ ఉందో తెలుస్తోంది. దీనిపై రాంగోపాల్ వర్మ ట్వీట్ కూడా చేశాడు. ఇవన్నీ పక్కనపెడితే సన్నీ చెన్నై ప్రేక్షకులను మరోసరి ఉర్రుతలుగించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈవీపీ ఫిలిం సిటీలో జరిగే సంగీ కార్యక్రమంలో సన్నీ పాల్గొననున్నారు. 

మియాపూర్ భూ కుంభకోణంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణం పై బీజేపీ నేత రఘునందన్ రావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు  ఈ కేసులో ఎంత మంది అరెస్టయ్యారు, కేసు దర్యాప్తు స్టేటస్ వివరాలను రేపటిలోగా ప్రవేశపెట్టాలని టీఎస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇళ్లు

కర్నూలు : వైసీపీఅధినేత జగన్ పాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు వారి స్వంత ప్రాంతాల్లో ఇళ్లు కటిస్తామని ప్రకటించారు. 

15:32 - November 21, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నేత శ్రీనివాస రెడ్డి అరాచకాలపై అతని భార్య సంగీత న్యాయ పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు శ్రీనివాస రెడ్డిని రిమాండ్‌కు తరలించగా .. అత్తామామలు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని మూడోరోజు కూడా సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటనా ప్రదేశానికి వెళ్లారు. కానీ సుధీర్ రెడ్డి వ్యవహరించిన తీరును అక్కడి మహిళలు తప్పు పట్టారు. సంగీతకు మద్దతిస్తున్న వారితో టెన్ టివి మాట్లాడింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని, వచ్చీ రావడంతోనే సెక్యూర్టీ ఇస్తామని..పేర్కొన్నారని తెలిపారు. అసలు ఆ ఎమ్మెల్యేను పట్టుకుని తన్నాల్సి ఉండేదని..కానీ మహిళలు సహనంతో ఉన్నారని తెలిపారు. ఇంతవరకు సంగీతకు ఒక్క హామీ రాలేదని, మహిళలంటే నీచమైన భావన ఆయనలో ఉంటుందన్నారు. 

15:29 - November 21, 2017

మెదక్ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చెత్త కంపు కొడుతోంది. పారిశుధ్యసేవలు పూర్తిగా నిలిచిపోవడంతో.. వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యచర్యలు లోపించడంతో రోగాల బారిన పడుతున్నామని ఆరోపిస్తూ.. మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట చెత్త పోసి నిరసనకు దిగారు. నెలల తరబడి చెత్తను తీసుకపోవడానికి సిబ్బంది రావడం లేదని..దీనితో పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని టెన్ టివితో పలువురు పేర్కొన్నారు. ట్యాక్సులు ముక్కులు పండి వసూలు చేస్తూ అవార్డులు తీసుకొంటారని..కమిషనర్ హైదరాబాద్ లో పడుకుంటారని విమర్శించారు. డెంగ్యూ అధికగా ప్రబలుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని, సంగారెడ్డిలో డంపింగ్ యార్డు లేదని..చెత్త మున్సిపాల్టీ అని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

15:28 - November 21, 2017

హైదరాబాద్ : నంది అవార్డుల కమిటీలో ఒకే సామాజిక వర్గం వారు ఆదిపత్యం చెలాయిస్తుండాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు పోసాని కృష్ణమురళీ అన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. నంది అవార్డుల కమిటీలో సామాజిక న్యాయం తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:26 - November 21, 2017

హైదరాబాద్ : నంది అవార్డులపై నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. అవార్డుల ప్రకటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పులు దొర్లితో విద్యార్థుల పరీక్షలు రద్దుచేసిట్టే.. వివాదాస్పదంగా మారిన నందిఅవార్డుల ప్రకటనను ఎందుకు రద్దుచేయన్నారు. తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్టు పోసాని ప్రకటించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:24 - November 21, 2017

హైదరాబాద్ : నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింది గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ముందస్తు రబీకి నీరు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పవ్యవధి చర్చకు సమాధానంగా ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ విషయం చెప్పారు. మూడో విడత రుణమాఫీ కింది రెండు రోజుల్లో వెయ్యి కోట్లు విడుదల చేయనున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. మూడో విడతలో రూ. 3600 కోట్లలో రూ. 1300 కోట్లు ఇచ్చామన్నారు. త్వరలోనే వేయి కోట్లు ఇస్తామని అసెంబ్లీకి తెలిపారు. 

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చ

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీ సీఎం మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన ఒరవడిలు తీసుకురావాలని, వ్యవసాయంలో ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరగాలని సీఎం అన్నారు. వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు.

15:10 - November 21, 2017

విజయవాడ : తాము చేపట్టే పథకాలతో రైతులకు వెసుబాటు వచ్చిందని..కానీ పూర్తిగా వెసులుబాటు కాలేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పూర్తిగా 24వేల కోట్ల రూపాయలు అప్పును ప్రభుత్వం తీసుకున్నట్లు దీనితో కొంత వెసుబాటు వచ్చిందన్నారు. అప్పుల్లో ఉన్న రైతులు కొంత కొలుకొనే అవకాశం వచ్చిందని, వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రత్యేకంగా ప్రవేశ పెట్టింది ఏపీ ప్రభుత్వం ఒక్కటేనని తెలిపారు. రెండు నెలల్లో కరెంటు..ఏడు గంటలకు పగలే ఇస్తున్నట్లు, ఒకటి రెండు గంటలు ఎక్కువ కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నీటి విషయంలో చాలా సమస్యలు వచ్చాయని, రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారవుతుందన్నారు. అనంతపురం ధనిక జిల్లాగా మారుతుందన్నారు. 20 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ గా తీసుకరావడం జరిగిందని, 40 లక్షల ఎకరాల నుండి కోటి ఎకరాలకు హార్టి కల్చర్ కు పోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నూతనమైన ఒరవడి తీసుకరావాలని..టెక్నాలజీ..ఉత్పాదక శక్తి పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కువ సన్న..చిన్నకారు రైతులున్నారని, వీరిని ఏ విధంగా అనుసంధానం చేయాలనే దానిపై దృష్టి సారించినట్లు తెలిపారు. విశాఖలో జరిగిన అగ్రిటెక్ 2017 సదస్సు ఒక చరిత్ర సృష్టించబోతోందని, 259 లో దరఖాస్తులు రావడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు సభకు తెలిపారు. 

15:07 - November 21, 2017

కావాల్సిన పదార్థాలు
రొయ్యలు అరకిలో, పసుపు అర చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద రెండు చెంచాలు, కారం రెండు చెంచాలు, ఉప్పు తగినంత, ధనియాల పొడి చెంచా, గరంమసాల చెంచా, నూనె నాలుగు చెంచాలు, చింతపండు రెండు చెంచాలు.

తయారీ విధానం
బౌల్ లో శుభ్రం చేసుకున్న రొయ్యలకు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి, గరంమసాలా, తగినతం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అరగంట తర్వాత బాణలి పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి రొయ్యలను వేసి వేయించుకోవాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక చింతపండు గుజ్జు వేయాలి. రొయ్యలు ఉడికాక కావలనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసి దించుకోవాలి.  

14:49 - November 21, 2017

మాస్ డైరెక్టర్ మంచి పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన లేటెస్టుగా తీసిన సినిమా జయ జానకి నాయకా మంచి టాక్ తెచ్చుకుంది. ఆయన ఈ సినిమా తర్వాత మూడు కథలు సిద్ధం చేసుకున్నడటా అయితే అందులో ఒకటి మెగా స్టార్ తనయుడు చరణ్ చెప్పి ఒప్పించాడట. అయితూ ఇప్పుడు హీరోల డేట్స్ తో ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియక ఆయన కన్ఫ్యూజన్ ఉన్నట్టు తెలుస్తోంది. బోయపాటి తదుపరి చిత్రం రామ్ చరణ్ తో వార్తలొచ్చాయి. అయితే చరణ్ మాత్రం రాజమౌళి తో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇది నిజామో తెలియదు గాని బోయపాటి చరణ్ తర్వాత బాలయ్య, మహేశ్ బాబుతో సినిమాలు చేయ్యాలని కథలు రాసుకున్నడట.

14:48 - November 21, 2017

ఇంటిని చక్కదిద్దే పనుల్లో మహిళలు బిజీగా ఉంటుంటారు. ఒక చేతితో గరిట తిప్పుతూ...మరో చేత్తో ఇంటి బాధ్యతలు మోస్తుంటారు. దీనితో కొంతమంది మహిళలు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంటారు. మరి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? తదితర అంశాలపై చర్చించేందుకు మానవి 'వేదిక'లో నర్మద (గైనకాలజిస్టు), సుజాత (న్యూట్రిషన్) పాల్గొని పలు సూచనలు..సలహాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

14:45 - November 21, 2017

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా జిల్లాలోని ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు భారత భద్రత బలగాలు హంద్వారాలో మంగళవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత బలగాలు ఎదురు కాల్పులు చేసింది. దీనితో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి నుండి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 190 ఉగ్రవాదులు హతమయ్యారు. 

14:41 - November 21, 2017

ఢిల్లీ : అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు దౌత్యపరంగా భారీ విజయం లభించింది. ఐసీజే ఎన్నికల్లో భారత్ నామినేట్ చేసిన దల్వీర్ భండారీ మరోసారి న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భండారీ..బ్రిటన్ కు చెందిన అభ్యర్థి పట్ల గట్టి పోటీ నెలకొంది. చివరి నిమిషంలో పోటీ నుండి తన అభ్యర్థిని బ్రిటన్ ఉపసంహరించుకుంది. దీనితో భండారి ఎన్నికయ్యారు. 1946లో అంతర్జాతీయం న్యాయస్థానం ఏర్పడింది. అప్పటి నుండి బ్రిటన్ న్యాయమూర్తి లేకపోవడం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఐసీజేలో 15 మందితో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనం ఉంటుంది. వీరి పదవి కాలం తొమ్మిదేళ్ల పాటు ఉండనుంది. మూడేళ్లకొకసారి ప్రతి ఐదుగురు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన భండారీ 2012 ఏప్రిల్ 27వ తేదీన ఐసీజేకు ఎన్నికయ్యారు. 

14:32 - November 21, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ కు రానున్నారు. ఈనెల 28-30వ తేదీల్లో జరిగే ప్రపంచ వాణిజ్య సమ్మిట్‌ లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక నగరానికి రానున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా సీక్రెట్ ఏజెన్సీస్ రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్, కేంద్ర హోం శాఖ సూచనలతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సౌత్ జోన్ డీప్యూటి కమిషనర్ టెన్ టివికి తెలిపారు. పాతబస్తీలో కూడా ఇవాంక పర్యటన ఉండడడంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నంది అవార్డును తిరస్కరిస్తున్న - పోసాని...

హైదరాబాద్ : తనక్కొచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు నటుడు పోసాని వెల్లడించారు. నీచమైన పద్ధతుల్లో నంది అవార్డులను తీసుకొనే ఖర్మ తనకు పట్టలేదని, నంది అవార్డులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంది అవార్డుల ప్రకటన రాగానే సిగ్గుపడినట్లు, ఒక నంది అవార్డుతో తమను నాన్ లోకల్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పరుగులు తీసిన సచివాలయ ఉద్యోగులు..

విజయవాడ : వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లో ఫైర్ అలారం మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలపడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. 

'పద్మావతి' నిషేధించాలన్న రాజా సింగ్...

హైదరాబాద్ : తెలంగాణలో 'పద్మావతి' సినిమాను నిషేధించాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. 

కడమంచి వెంకటేష్ కస్టోడియల్ డెత్ కేసు..

హైదరాబాద్ : కడమంచి వెంకటేష్ కస్టోడియల్ డెత్ కేసు హైకోర్టులో విచారణ జరిగింది. రీ పోస్టుమార్టం నిర్వహించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని, పోస్టుమార్టం మొత్తం వీడియో రికార్డు చేయాలని జిల్లా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  

14:20 - November 21, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై ఈసీకి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 31లోగా ఉప ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఆదేశించింది.  డిసెంబర్‌లో పండుగలు ఉండటంతో ఉప ఎన్నిక వాయిదావేయాలని ఈసీ కోరగా, ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది. 

 

14:18 - November 21, 2017

గుంటూరు : రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. గత మూడేళ్లలో సమీకృత అభివృద్ధి లక్ష్యాలను మాత్రం వేగంగా చేరుకుంటాన్నామన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు. సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో రాష్ట్రం సాధించిన ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆల్‌ఇండియా 5.6 అభివృద్ధి సాధిస్తే.. ఏపీలో 11.72 శాతం అభివృద్ధి సాధించామన్నారు.  డీమానిటైజేషన్‌, జీఎస్టీ ప్రభావంతో ఆర్థిక ఒత్తిడి పెరిగినా రాష్ట్రం నిలకడగా అభివృద్ధి సాధిస్తోందన్నారు.

14:16 - November 21, 2017

గుంటూరు : వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ సభాహక్కుల నోటీసు ఇచ్చింది. రాజ్యాంగ పదవి అయిన స్పీకర్‌ స్థానాన్ని అవమానిస్తూ అంబటి చేసిన విమర్శలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యుడు పల్లెరఘునాథ్‌రెడ్డి హక్కుల నోటీసును అందించారు. ప్రవిలైజ్‌కమిటీకి  నోటీసును అందించి భవిష్యత్తులో  ఎవరూ రాజ్యాంగ పదవులను అవమానించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాంబాబుకు నోటి తీట, దురద ఎక్కువని వ్యాఖ్యానించారు.

14:12 - November 21, 2017

హైదరాబాద్ : నారాయణ కాలేజ్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్, కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక హాస్టల్ గదిలో నవ్య శ్రీ చేయి కట్ చేసుకుంది. ప్రస్తుతం నవ్య శ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 

14:01 - November 21, 2017

హైదరాబాద్ : హస్తం పార్టీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అంత‌లోనే ఎందుకు సైలెంట్ అయ్యారు..? సీఎం కేసీఆర్‌తో ఆటకు రెడీ అంటూ పొలిటికల్‌ హీట్‌ పెంచిన ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌...మౌన ముద్రలో ఎందుకు ఉన్నారు. ఇంత‌కీ రేవంత్ వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాఫిక్‌గా మారింది. 

రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మాటలతోనే వేడి పుట్టించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మాటల దాడి పెంచారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సీఎం కేసీఆర్‌కు కొర‌కరాని కొయ్యగా మారారు. హస్తం పార్టీలోకి చేరుతున్నట్లు బాంబు పేల్చి..రాష్ట్ర రాజకీయాల్లో సెగపుట్టించారు. కాంగ్రెస్‌లో చేర‌డానికి ముందు త‌ర్వాత ప్రెస్‌మీట్లు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా కరెంట్‌ లేకుండానే షాక్‌ కొట్టించిన రేవంత్‌ రెడ్డి..ఒక్క సారిగా సైలెంట్‌ కావడం తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే రేవంత్ వ్యూహాత్మాకంగానే మౌనం వహిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ క్రొకొడయిల్‌ ఫెస్టివల్‌ అంటూ... సీఎం కేసీఆర్‌తో ఆట‌కు ముందు కాస్త రీలాక్స్ అవుతున్నారట. హస్తం పార్టీలో నిల‌దొక్కుకునే దిశ‌గా సీనియ‌ర్లను క‌లుస్తూ..తను ఎవ‌రికీ వ్యతిరేకం కాదని క్లారిటీ ఇస్తున్నారట. డిసెంబ‌ర్ 9 నుంచి పార్టీలో క్రీయాశీలంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ‌కు అనుకూలంగా ప్రకటన వ‌చ్చింది డిసెంబ‌ర్ తొమ్మిదే కావ‌డంతో.. అదే రోజు నుంచి పార్టీలో యాక్టీవ్ కావాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ రోజునుంచే అధికారపక్షంతో పొలిటిక‌ల్ గేమ్ ఆడేందుకు వ్యూహాలు సిద్ధం చేశారట. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌భలు.. స‌మావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడ‌ర్‌లో జోష్ నింపేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇక త‌న రాజీనామాను అమోదించుకోవ‌డం ద్వారా...కేసీఆర్‌ను రాజ‌కీయంగా ఇరుకునపెట్టేందుకు రేవంత్‌ ప‌క్కా ప్లాన్ చేశారు. ఫిరాయింపుదార్లతో రాజీనామా చేయించాలని అధికారపక్షంపై ఒత్తిడి పెంచుతూనే...కొడంగ‌ల్ బ‌రిలోకి దిగి గులాబీ బాస్‌ను ఢీ కొట్టాల‌న్నదే రేవంత్ ఎత్తుగ‌డగా తెలుస్తోంది. అయితే ఇంత హైప్‌ క్రియేట్‌ చేసి హస్తం పార్టీలోకి జంప్‌ చేసిన రేవంత్‌..అధికారపార్టీని ఢీకొడతారా లేక డీలా పడతారా అన్నది రాబోయే రోజుల్లోనే తేలనుంది. 

13:52 - November 21, 2017

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల ప్రకటనపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంది అవార్డులు ప్రకటించడంలో తప్పిదాలను ఎత్తి చూపారు. ప్రభుత్వ పక్షపాత ధోరణిని ఎండగట్టారు. నంది అవార్డుల ప్రకటన సక్రమంగా జరగలేదన్నారు. నంది అవార్డులను నిజాయితీగా ఇచ్చామని చంద్రబాబు కూడా స్పష్టంగా చెప్పలేదన్నారు. నంది అవార్డులను ఎందుకు రద్దు చేయలేదన్నారు.
నంది అవార్డును తిరస్కరిస్తున్నా... 
నీచమైన పద్ధతుల్లో నంది అవార్డులు తీసుకునే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ రకమైన నంది అవార్డును తాను చచ్చిపోయేవరకు  ముట్టుకోనని తేల్చి చెప్పారు. 'నంది అవార్డులు మీ సొంత అమ్మా...ఎందుకు ఆపేస్తున్నారని' ప్రశ్నించారు. నంది అవార్డులకు, ప్రాంతీయతకు సంబంధమేంటని నిలదీశారు. నంది అవార్డు రాగానే సిగ్గుపడ్డానని చెప్పారు. నంది అవార్డుల ప్రకటనతోనే తమను నాన్ లోకల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలుగు రోహింగ్యాలమా ? అని ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లమైనా తమను కేసీఆర్ బిడ్డల్లాగా చూసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ కాళ్లు కడిగి ఎలా మంచిగా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలన్నారు. 
తప్పులను ఖండిస్తే కూడా తప్పేనా? 
తప్పులను ఖండిస్తే కూడా తప్పేనా అని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించ లేదా అన్నారు. లోపం జరిగితే సరిదిద్దుకోవాలన్నారు. పేపర్ లీక్ అయితే విద్యార్థులకు ఎగ్జామ్ మళ్లీ కండెక్ట్ చేస్తారు..నంది అవార్డుల ప్రకటన సక్రమంగా లేకపోతే మళ్లీ ప్రకటించరా అన్నారు. విద్యార్థి పట్ల ఒక నిజాయితీ, సినీ పరిశ్రమపై మరో నీతా అని ప్రశ్నించారు. 'మీ సొంత డబ్బుతో లోకేష్ బాబు నంది అవార్డులు పేరు పెట్టుకుని మీకు ఇష్టమొచ్చినవారికి ఇచ్చుకోండని' అన్నారు. తనది తప్పని నిరూపిస్తే మీ కాళ్లకు దండం పెడ్తానని చెప్పారు. కామెంట్ చేయడానికి ఆధారం ఉండాలా..అని అన్నారు. ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా ఎవరైనా విమర్శించవచ్చన్నారు. తనకు అమెరికాలో ఓటు లేదు..అయినా ట్రంప్ ను విమర్శించడం లేదా అని తెలిపారు. అమరావతిలో పోసాని పోలాలు ఉన్నాయా.. తెలుగుదేశం పార్టీ నేతల పోలాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. గతంలో హైటెక్ సిటీ స్థాపించినప్పుడు చుట్టుపక్కల టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకో... 
జ్యూరీలో 11 మంది సభ్యులుంటే వారిలో పది మంది కమ్మవారే ఉన్నారని పేర్కొన్నారు. తాను ఏ పార్టీ కాదన్నారు. కేసీఆర్ కు మానవత్వం ఉంది.. చంద్రబాబు.. కేసీఆర్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోని ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలన్నారు. లోకేష్ బాబుకు సవాల్ విసిరారు. లోకేష్ బాబూ తమను కొట్టించాలనుకుంటున్నావా.. తాము నాన్ లోకలా అంటూ వాపోయారు.

 

 

హైదరాబాద్ లో మంత్రుల పర్యటన

హైదరాబాద్ : నగరంలోని ముషీరాబాద్, నారాయణగూడ, చిక్కడ్ పల్లిలో మంత్రులు కేటీఆర్, నాయిని, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల, మాగంటి పర్యటించారు.

13:01 - November 21, 2017

సామాన్య ప్రజానీకాన్ని ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఏ వంటకంలోనైన ఉల్లి తప్పనిసరిగా వాడాల్సిందే. బిర్యానీ తినాలన్న ప్రక్కకు ఉల్లి సాలడ్ లేందే ముద్ద దిగాదు. అంతే ఏ మిర్చ బండి దగ్గరికి వెళ్లిన మిర్చితో పాటు ఉల్లి ఉండాల్సిందే. చాట్ బండార్ లోను ఉల్లి ప్రముఖ్యమే కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ఉల్లి వేయడంలేదు ఎందుకంటే ఉల్లి ధర నషలాన్ని అంటే రెంజ్ లో ఉన్నాయి. రిటైల్ లో ఎర్ర ఉల్లి గడ్డ కిలో రూ.50 నుంచి రూ.60 పలుకుతుంది. అదే తెల్ల ఉల్లిగడ్డ అయితే ఏకాంగా కిలో రూ.80 పలుకుతుంది. 

12:57 - November 21, 2017

గుంటూరు : రాష్ట్రంలో ఉన్న హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ సభ్యుడు   విష్టుకుమార్‌రాజు అన్నారు. హోం గార్డుల సమస్యలకు ఏపీలోనే అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప.. హోంగార్డులను అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే హోం గార్డుల జీతాలు పెంచుతామన్నారు. 

 

12:46 - November 21, 2017

బ్యాచులర్ రూమ్ లో ఉన్నప్పుడు వారు ఎక్కువగా చేసుకనే కూర(కర్రీ) కోడిగుడ్డు ఎందుకంటే ఈ వంటకం తొందరగా అవుతుంది కాబట్టి. ఒక బ్యాచులర్స్ కాదు గృహినులు కూడా టైమ్ లేనప్పుడు కోడిగుడ్డు వంట చేస్తారు. చాలా మంది తమ పిల్లలకు రోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు పెడతారు. ఇవన్నీ మాకు తెలిసిన విషయమే మళ్లీ ఎందుకు చెబుతున్నారటరా ఎందుకంటే ఇప్పుడు కోడిగుడ్డు కొండెక్కింది. అందరికీ అందుబాటులో ఉండే కోడి గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కోడిగుడ్డు ధర ఏకంగా 40 శాతం పెరిగి రూ.7 నుంచి రూ.7.50 చేరింది. ఇక మన రాష్ట్ర విషయనికోస్తే కోడిగుడ్డు ధర రూ.6 నుంచి రూ.6.50 పలుకుతుంది. 

12:37 - November 21, 2017

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి దీనబంద్ కాలనీలో దారుణం జరిగింది. ఓపెన్ నాలాలో గుర్తు తెలియని శిశువు మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

 

12:28 - November 21, 2017

తమ సినిమాల్లో హీరోలు పాట పడడం ఇప్పుడు కామన్ గా మారింది. అయితే ఇప్పుడు పెద్ద హీరోలు సైతం పాటలు పాడుతున్నారు. పైసా వసూల్ లో బాలకృష్ణ తన గాత్రంతో అభిమానులను అలరించాడు. అలాగే జూనీయర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాగర్జున ఇలా చాల మంది తమ గొంతుతో ప్రేక్షకులను అలరించారు.

పవన్ కళ్యాణ్ ఇదివరకు చాలాసార్లు చిన్న చిన్న బిట్ సాంగ్ లు మాత్రమే పాడారు. కానీ అత్తరింటి దారేది సినిమాలో కాటమరాయుడా తో అభిమానులను ఉర్రుతలుగించారు. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ మరోసారి గొంతు పని చెప్పనున్నట్టు తెలుస్తోంది. పవన్ 'కొడక కోటేశ్వరరావా' అంటూ రిలిక్ తో మొదలైయ్యో పాట పాడునున్నట్టు సమాచారం.

12:27 - November 21, 2017

కోల్ కత్తా టెస్ట్ లో ఓడిపోతామని తెలిసిన శ్రీలంక మ్యాచ్ ను ఎలాగైనా డ్రా చేసుకోవాలని క్రీడ స్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించింది. టపటప వికెట్లు పడుతుండడంతో లంక ఆటగాళ్లు క్రీజ్ లో టైమ్ పాస్ చేశారు. బౌలర్ బంతులేయ్యాడానికి వచ్చే ప్రతిసారి బ్యాట్స్ మెన్ వద్దని చేతులుపాడం చేశాడు. దీంతో విసుగెత్తిన భారత్ బౌలర్ షమీ, కెప్టెన్ విరాట్ కోహ్లి లంక బ్యాట్స్ మెన్ తో వాగ్వదానికి దిగారు. ఈ గొడవను ఎంఫైర్లు పెద్దది కాకుండా చూశారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 18 ఓవర్ ను షమీ బౌలింగ్ చేశాడు. క్రీజ్ లో ఉన్న లంక ఆటగాళ్లు డిక్ వెల్లా, చండీమల్ పదేపదే బౌలర్ బంతులు వేయకుండా అడ్డుపడ్డారు. లంక మొదటి ఇన్నింగ్స్ లో ఓ ఆటగాడు వివాదస్పదంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.  

కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

కడప : జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. 1.74 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎర్రచందనంతో పాటు రూ.38 లక్షలు, లారీ, 6 కార్లు, ఐషర్ వాహనం స్వాధీం చేసుకున్నారు.

12:12 - November 21, 2017

గుంటూరు రూరల్ ఎస్పీపై స్పీకర్ ఆగ్రహం

గుంటూరు : కృష్ణా నది కరకట్ట రోడ్డు పై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ సీరియస్ గా స్పందించారు. స్పీకర్ పోలీసుల నుంచి వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ వివరణ ఇచ్చారు. 

శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ పై కడియం సీరియస్

రంగారెడ్డి : జిల్లా మొయినాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై మంత్రి కడియం శ్రీహరి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుకుంటామని మంత్రి తెలిపారు. షూ వేసుకోకపోవడంతో ఏడో తరగతి విద్యార్థిని పాఠశాట యాజమాన్యం గదిలో నిర్బంధించిన విషయం తెలిసిందే. 

11:51 - November 21, 2017

రంగారెడ్డి : అత్తాపూర్ లోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి ఇంటిని ఇందిరా క్రాంతి పథకం మండల, జిల్లా సమాఖ్య ఉద్యోగులు ముట్టడించారు. మంత్రి వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:49 - November 21, 2017

చలికాలం వచ్చిదంటే చాలు చర్మం మొత్త పొడిపడం మొదలౌతుంది. బయటకి వేళ్లమంటే వాతావరణ కాలుష్యం వల్ల చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా మారిపోతుంది. మన చర్మల అలా మారుకుండా ఉండాలంటే క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

బయటకు వెల్లివచ్చిన వెంటనే ముఖం, కాళ్లు, చేతుల్ని శుభ్రంగా కడగాలి. దీంతో పేరుకున్న దుమ్మూ, ధూళీ పోయి చర్మ శుభ్రపడుతుంది. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరినూనె తీసుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీటి కడుక్కొవాలి.
వాతావరణం చల్లగా ఉన్నా కూడా సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పనిసరి. ముఖానికి స్కార్ఫ్‌, చేతులకు గ్లవుజులు వేసుకుంటే కాలుష్యం, ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

11:48 - November 21, 2017

సినిమా : దేశవ్వాప్తంగా ఇప్పుడు చర్చనీయంశంగా మారిన అంశం పద్మావతి సినిమా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, షాహిత్ కపూర్, దీపిక పదుకొణె ప్రధాన పాత్ర దారులుగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే పద్మావతి చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతింటాయని రాజ్ పుత్ లు ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి ఆందోళన చేస్తున్నారు. పద్మావతిపై నిషేధం విధించాలని అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టులో ప్రజప్రయోజన వ్యాజ్యన్ని దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం పద్మావతి చిత్ర విడుదలపై నిషేధం విధించేందుకు నిరాకరించింది. సెన్సార్ బోర్డుకు ఉన్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఎస్‌ సీ ఇంకా సర్టిఫికెట్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు సినిమా విడుదలను ఎలా ఆపేస్తామని న్యాయస్థానం ప్రశ్నించింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు తీర్పునిచ్చింది.

11:26 - November 21, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నేత శ్రీనివాస రెడ్డి అరాచకాలపై అతని భార్య సంగీత న్యాయ పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు శ్రీనివాస రెడ్డిని రిమాండ్‌కు తరలించగా .. అత్తామామలు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని మూడోరోజు కూడా సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. 
నాకు న్యాయం చేయండి : సంగీత 
'నా అత్తమామల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నా కూతరుతో చలిలో పోరాటం చేస్తున్నాను. నా కూతురిపై కూడా వారికి కనికరం రావడం లేదు. వారి ఇంటి వారసురాలన్న కనికరం లేదు. అత్తమాములు, నా భర్త, మూడో భార్య కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆమె లీగల్ భార్య అయినట్లు వ్యవహరిస్తోంది. పోలీసుల తరపు నుంచి నాకు ఎలాంటి మద్దతు లేదు. హైదరాబాద్ నగర సీపీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అత్తమామలు పరారీలో ఉన్నారు. అత్తమామలను అరెస్టు చేయాలి. నాకు న్యాయం చేయాలి'. కోరుకుంటుంది.   
మహిళా సంఘం ప్రతినిధి 
'సంగీత కుటుంబం కట్నం కింద శ్రీనివాస్ రెడ్డికి రూ.45 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులు సంగీత, ఆమె కూతురుకు చెందాలి. అత్తమామలు రావాలి..సంగీతకు న్యాయం చేయాలి' అని అన్నారు.
టీఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు
సంగీతకు న్యాయం చేయాలి. శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ ఎస్ సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. ప్రెసిడెంట్ గా తను  చెప్పుకుంటున్నాడు. పలు పెళ్ళిళ్లు చేసుకుంటూ మహిళలను మోసం చేస్తున్నాడు. అతనికి కఠిన శిక్ష పడాలి. సంగీతకు అండగా ఉంటామని' భరోసా ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

శ్రీవారి లడ్డు సైజ్ పెంపునకు చర్యలు

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డు సైజ్ పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు నాలుగు నెలల్లో లడ్డుల తయారీ, అన్నప్రసాదల తయారీ పోటులను ఆధునీకరిస్తామని జేఈవో శ్రీనివాస్ రాజు తెలిపారు. శాస్త్రానికి అనుగుణంగా ప్రసాదాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని, చెన్నైలోని అడయార్ ఆనంద భవన్ లో స్వీట్ల తయారీ విధానాన్ని పరిశీలించి అందుక అనుగుణంగా శ్రీవారి ఆలయంలోని పోటులో మార్పులు తీసుకొస్తామని ఆయన తెలిపారు.

లూలిథియానాలో భారీ అగ్నిప్రమాదం

పంజాబ్ : లూథియానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో పది మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

10:59 - November 21, 2017

కర్నూలు : సూపర్ స్టార్ రజినీకాంత్ మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజినీకాంత్ కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 

 

10:53 - November 21, 2017
10:52 - November 21, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిడదవోలులోని రవీంద్రభారతి స్కూల్ లో రాఘవేంద్రరావు అనే వ్యక్తి సోషల్ టీచర్ గా పని చేస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ సరిగా చేయలేదని ఏడో తరగతి విద్యార్థులను టీచర్ చితకబాదారు. దీంతో హర్షవర్ధన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతన్ని నిడదవోలు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్కూల్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:44 - November 21, 2017

హైదరాబాద్ : నగరంలోని మలక్ పేటలో మెట్రో రైల్ నిర్మాణ పనుల్లో సాంకేతిక లోపంతో భారీ క్రేన్ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:36 - November 21, 2017
09:55 - November 21, 2017

హైదరాబాద్ : నాచారంలో మత్తును ఇచ్చే నైట్రావేట్ 10ఎంజీ టాబ్లెట్స్‌ను.. యువకులు, పిల్లలకు అమ్ముతున్న రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. దీంతో శ్రీనివాస్‌పై 420, 188 కేసులు పెట్టి నాచారం పోలీసులు రిమాండ్‌కు పంపారు. నాచారం, రాఘవేంద్ర నగర్‌కి చెందిన శ్రీనివాస్‌ మెడికల్‌ షాపులో పని చేసి మానేశానని.. ప్రస్తుతం డ్రైవర్‌గా చేస్తున్నానని తెలిపాడు. 75 రూపాయలకు దొరికే నైట్రావేట్ 10ఎంజీ టాబ్లెట్స్‌ని.. 250 నుండి 1000 వరకు అమ్ముతున్నాడని స్థానికులు తెలిపారు. చిలకానగర్‌, నాచారంలోని కొందరు వ్యక్తులకు అమ్ముతుండటంతో తెలుసుకొని స్థానికులు వలపన్ని పట్టుకున్నారు. ఒక్క మందు బిల్ల 4 గంటల నుండి 8 గంటల వరకు మత్తు ఉంటుందని, 2 లేదంటే 3 వేసుకుంటే 24 గంటలు మత్తులోనే ఉండి ఏం చేయడానికైనా వెనకాడరని తెలిపారు. 

శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు రెండవ భార్య ఆందోళన

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నేత శ్రీనివాస రెడ్డి అరాచకాలపై అతని భార్య సంగీత న్యాయ పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు శ్రీనివాస రెడ్డిని రిమాండ్‌కు తరలించగా .. అత్తామామలు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు  న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని మూడోరోజు కూడా సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. 

 

09:52 - November 21, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నేత శ్రీనివాస రెడ్డి అరాచకాలపై అతని భార్య సంగీత న్యాయ పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు శ్రీనివాస రెడ్డిని రిమాండ్‌కు తరలించగా .. అత్తామామలు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు  న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని మూడోరోజు కూడా సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. 

ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు మోహరింపు

గుంటూరు : అమరావతి అసెంబ్లీ వద్ద ఎమ్మార్పీఎస్‌ ఛలో అసెంబ్లీ  నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కరకట్టపై వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:49 - November 21, 2017

గుంటూరు : అమరావతి అసెంబ్లీ వద్ద ఎమ్మార్పీఎస్‌ ఛలో అసెంబ్లీ  నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కరకట్టపై వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:46 - November 21, 2017

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 

రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంపై దుండగులు దాడి

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ సర్కిల్ మైలార్‌ దేవులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ఆరాంఘర్‌ చౌరస్తా సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. యజమాని అలీతో పాటు మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేసి 7 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

09:41 - November 21, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ సర్కిల్ మైలార్‌ దేవులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ఆరాంఘర్‌ చౌరస్తా సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. యజమాని అలీతో పాటు మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేసి 7 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మైలార్‌ దేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కింగ్స్‌ కాలనీలో జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. 

 

09:37 - November 21, 2017

కరీంనగర్‌ : జిల్లాలో విషాదం నెలకొంది. బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రవీందర్ రావు, సరిత దంపతులు.. తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు బంధువులకు పంచేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. పెళ్లి పత్రికలు బంధువులకు పంచిన తర్వాత తెల్లవారుజామున కారులో రామగుండంకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు వద్ద ఆగి ఉన్న లారినీ అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. మృతులు రవీందర్ రావు, సరిత, మీరాబాయిలుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సివుంది. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. వీరి మృతితో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తున్న సభ్యులు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మిర్చి రైతుల సమస్యలు, ప్రభుత్వాసత్రుల్లో మోకాలి శస్త్ర చికిత్సలు, టీడీపీ ఆస్తుల అన్యాక్రాంతం, రైతు బజారుల ఆధునీకరణ, గుంటూరు సహకార బ్యాంకులో అవకతవకలపై శాసనసభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. 

 

09:04 - November 21, 2017

రైతు రుణమాఫీ చేయాలని వక్తలు అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అధికారి ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత కిసాన్ సెల్ అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:01 - November 21, 2017

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి.. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఏకధాటిగా చేస్తున్న డిమాండ్‌. పెన్షన్‌ మా హక్కు అంటున్న ఈ సంఘాలు ఈ డిమాండ్‌ను ఎందుకు చేస్తున్నాయి. సీపీఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు కలిగే నష్టం ఏంటి అనే విషయాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:56 - November 21, 2017

ఢిల్లీ : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో, ఇండియన్‌ యంగ్‌ గన్‌... విరాట్‌ కొహ్లీ సెంచరీల వేట కొనసాగుతూనే ఉంది.ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శ్రీలంకతో ముగిసిన కోల్‌కతా టెస్ట్‌లోనూ  కొహ్లీ సెంచరీతో చెలరేగాడు. అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కొహ్లీ ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో ఎంటరయ్యాడు. 9 ఏళ్ల  అంతర్జాతీయ  కెరీర్‌లోనే 29 ఏళ్ల విరాట్‌ కొహ్లీ రికార్డ్‌ లెవల్లో సెంచరీలు సాధించి సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు.

వన్డేల్లో 32 సెంచరీలు..... టెస్టుల్లో 18 సెంచరీలు....ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో, ఇండియన్‌ యంగ్‌ గన్‌... విరాట్‌ కొహ్లీ సెంచరీల వేట కొనసాగుతూనే ఉంది.ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు.

శ్రీలంకతో ముగిసిన కోల్‌కతా టెస్ట్‌లోనూ  కొహ్లీ సెంచరీతో చెలరేగాడు. అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను పోటీలో నిలిపాడు. లక్మల్‌ బౌలింగ్‌లో కవర్స్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో ఎంటరయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 50 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన 8వ బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటితరంలో హషీమ్‌ ఆమ్లా తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన 2వ క్రికెటర్‌గా విరాట్‌ రికార్డ్‌ల కెక్కాడు.  ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండుల్కర్ తర్వాత 50 అంతర్జాతీయి సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌గా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. 29 ఏళ్ల వయసులోనే 50  సెంచరీలు సాధించి సంచలనం సృష్టించిన విరాట్‌కొహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరిన్ని రికార్డ్‌లు బద్దలు కొట్టడం ఖాయం.

08:35 - November 21, 2017

గుజరాత్‌ : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పటేల్‌ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ ప్రకటించిన లిస్టులో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న పటేల్‌ సామాజిక కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పటేల్‌ సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో బాహా బాహీకి దిగారు. ఆగ్రహంతో సూరత్‌, అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమను సంప్రదించకుండా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడంపై కాంగ్రెస్‌పై వారు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో పటేల్‌ వర్గానికి 23 స్థానాలు కేటాయించింది. ఈ జాబితాలో హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితులైన లలిత్‌ వసోయా, అమిత్‌ థమ్మర్‌లకు టికెట్‌ లభించడంపై కాంగ్రెస్‌ తమను మోసం చేసిందని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 

07:08 - November 21, 2017

హైదరాబాద్ : అధికారపార్టీ యువజన నేత శ్రీనివాసరెడ్డి అరాచకాలపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీత ఆందోళనకు మూడో భార్య తల్లి అండగా నిలిచింది..ఊహించని రీతిలో మలుపు తిరిగిన కేసులో ఇప్పటికే పోలీసులు శ్రీనివాసరెడ్డిని రిమాండ్ తరలించారు..అయితే న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని రెండోరోజు సంగీత ఆందోళన కొనసాగిస్తుంది...ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..

అధికారపార్టీ యువజన నాయకుడు శ్రీనివాసరెడ్డిపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీతకు మూడో భార్య దేవీ జగదీశ్వరి తల్లి శిరీష మద్దతుగా నిలిచింది...సంగీత ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న శిరీష బోడుప్పల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరింది...రెండో భార్య సంగీతను ఓదార్చిన ఆమె తమకు అన్యాయం చేశాంటూ ఆమెతో పాటు కలిసి న్యాయపోరాటం చేస్తుంది.. ఈ కేసులో అనుకోని మలుపు తిరగడంతో పోలీసులు...అటు శ్రీనివాసరెడ్డి కుటుంబం కూడా ఖంగుతింది..

పులకండ్ల శ్రీనివాసరెడ్డి....36 ఏళ్ల శ్రీనివాస్‌రెడ్డి రియల్‌ఎస్టేట్‌ బిజినెస్ చేస్తుంటాడు..ముందునుంచే దూకుడు స్వభావం ఉన్న శ్రీనివాస్‌రెడ్డి అధికారిక పార్టీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని యువజన నాయకుడయ్యాడు...ఇక ఖద్దరు ముసుగులో ఎన్నో అరాచకాలు చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నట్టింట్లో కూడా కట్టుకున్న భార్యలకు నరకం చూపించాడు...

ఇక వరంగల్ చెందిన యువతిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఎంతోకాలం కాపురం చేయలేదు..భార్యకు నరకం చూపించడంతో ఆమె దూరమైంది...ఆ తర్వాత శేరిలింగంపల్లి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు...రెండేళ్ల కాపురంలో కూతురు పుట్టింది...ఆడపిల్ల పుట్టిందంటూ వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయిన సంగీత అక్కడే ఉంది...న్యాయం చేయాలంటూ సంగీత చందానగర్‌, మేడిపల్లి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అప్పట్లో రిమాండ్‌కు తరలించారు. 


ఇక మూడో పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆగలేదు...మూడో భార్య కుటుంబం వారి పెళ్లిని నిరాకరిస్తే తనకున్న అధికార బలంతో వారిని బెదిరించాడు..కేసులు పెట్టించాడు..చివరకు కాలనీ నుంచి పారిపోయేలా చేశాడు..చివరకు వారు కేసు పెడితే భార్యతో తాను మేజర్‌నంటూ సంతకాలు పెట్టించాడు...ఇలా అరాచకాలు సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి నుంచి న్యాయం కావాలంటూ రెండో భార్య సంగీత నేరుగా అత్తారింటికి చేరడంతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.. స్థానికుల సమాచారంతో పారిపోయిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని రిమాండ్ తరలించారు...


మరోవైపు సంగీత రెండోరోజు కూడా భర్త ఇంటి ఎదుట తన ఆందోళనను కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. సంగీత  అంతకు ముందు శ్రీనిసవారెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది.  మరో వైపు ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు అండగా నిలవడంతో ఆందోళన ఉధృతంగా మారింది. తనకు,తన కూతురికి న్యాయం జరిగేవరకు కదలనంటోంది సంగీత... ఆందోళన పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు...                           

07:04 - November 21, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ స్థితిగతులను పరిశీలించేందుకు లీనా కమిటీ సిద్దమైంది. రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. నిబంధనల మేరకు నిర్వాసితులకు పునరావాస కల్పిస్తున్నారా లేదా అనే అంశాలతో పాటు... ప్రాజెక్ట్‌ నాణ్యత,... నిధుల అంచనాలు ఏ మేరకు పెరిగాయన్న దానిని పరిశీలించనుంది. 
లీనా కమిటీ పర్యటన

పోలవరంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు లీనా కమిటీ ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించనుంది. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి అధ్యక్షతన 9 మందితో కూడిన కమిటీ ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రాజెక్ట్‌ స్థితిగతులు, పోలవరంలో నెలకొన్న సమస్యలు, ప్రధానంగా పనుల నాణ్యతతోపాటు నిధుల అంచనాలు ఏ మేరకు పెరిగాయన్న వాటిపై కూలంకుషంగా పరిశాలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రెండు రోజుల పాటు పర్యటించనున్న కమిటీ సభ్యులు... ప్రాజెక్ట్‌ను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. 

తాజాగా ప్రాజెక్ట్‌లో సవరించిన అంచనాల్లో పునరావాసం కోసమే 33 వేల కోట్ల వరకు ఖర్చు జరగనున్నట్లు అంచనా. పోలవరంలో గ్రామాలు, ఆవాస ప్రాంతాలు కలిపి సుమారు 370కి పైగా ముంపులో చిక్కుకుంటున్నాయి. 2013 భూసేకరణ చట్టం, పెసా తదితర నిబంధనల మేరకు పునరావాసం అమలు చేస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం లీనా కమిటీని ఏర్పాటు చేసింది. 

మరోవైపు పోలవరంలోని ప్రధాన పనులైన స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు, మట్టి తవ్వకం పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ టెండర్లను పిలిచింది. రామాయంపేట వద్ద 0 నుంచి 35వ బ్లాక్‌ వరకు మిగిలిన కాంక్రీట్‌ పనులు, అనుబంధ పనులైన మట్టి పనులకు టెండర్లు పిలిచారు. స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ అనుమతి, జల వనరుల శాఖ ఆమోదం లేకుండానే కొత్తగా టెండర్లు పిలవడంపై కొందరు అధికారులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల విషయంలో జరుగుతున్న మతలబు ఏంటో అర్ధం కావడం లేదని పలువురంటున్నారు. 

ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయాల అవసరాల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను వాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటుండగా... మరోవైపు లీనా కమిటీ పర్యటించడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈ కమిటీ కేంద్రానికి ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందోనన్న టెన్షన్‌ అందరిని వెంటాడుతోంది. 

07:01 - November 21, 2017

హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ దూసుకుపోనుంది. ఇప్పటికే నాగోల్‌ నుంచి మెట్టుగుడా.. మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ మార్గాల్లో మెట్రో రైల్‌ కమర్షియల్‌ ఆపరేషన్స్‌కు ఒకే చెప్పిన అధికారులు.. మిగిలిన ప్రాంతాలను పరిశీలించి..  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

మెట్రో రైల్‌కు అడ్డంకులు తొలగిపోతున్నాయి.. మెట్రో రైల్‌కు సేఫ్టి సర్టిఫికెట్‌ లభించింది. దీంతో  అన్ని పనులు పూర్తి చేసినా.. మెట్రో రైల్‌ సేఫ్టీ అధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందో.. రాదోనని  అనుమానంతో ఉన్న ఎల్‌అండ్‌టీ అధికారులు ఊరట పొందారు. 

ఇప్పటికే నాగోల్‌ నుంచి మెట్టుగుడా... మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ వరకు మెట్రో రైల్‌ కమర్షియల్‌ ఆపరేషన్స్‌కు అనుమతి లభించింది. తాజాగా అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ వరకు పూర్తైన పనులను మెట్రో రైల్‌ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. మూడు రోజుల పాటు.. మెట్రో రైల్‌ సేఫ్టీ అధికారి రామ్‌కపిల్‌ ఆధ్వర్యంలో విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు.  పది కిలో మీటర్ల మేర ఉన్న సివిల్‌ వర్క్‌లు, వయడక్టు, స్టేషన్లు, విద్యుత్‌, రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ను, సిగ్నలింగ్‌ వ్యవస్థను స్టడీ చేశారు. అన్ని విషయాల్లో తృప్తి చెందడంతో కమర్షియల్‌ ఆపరేషన్‌కు ఒకే చెప్పారు. దీంతో గ్లోబల్‌ ఎంటర్‌ ప్రైన్యూర్‌ సమ్మిట్‌ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మెట్రోను ప్రారంభించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇక ప్రధాని పచ్చజెండా ఊపడంతో.. నగరవాసులకు మెట్రో అందుబాటులోకి రానుంది. 

06:57 - November 21, 2017

కర్నూలు : వైసీపీ అధినేత జగన్‌పై కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్‌తోపాటు  వైపీసీ ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంరెడ్డిపై కూడా  పోలీసులు కేసు నమోదు చేశారు. 13వ రోజు  పాదయాత్ర సందర్భంగా హుసేనాపురంలో అనుమతి లేకుండా మహిళా సదస్సు నిర్వహించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు. 
 

06:55 - November 21, 2017

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు కీలకమైన దిగువ కాపర్‌ డ్యాం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం... ప్రాజెక్టు నిర్మించడం ఎంత ముఖ్యమో.. నీటి నిర్వహణ అంతే ముఖ్యమన్నారు. ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదన్న చంద్రబాబు.. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలనే టెండర్లు మార్చాల్సి వచ్చిందన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వారం రోజుల్లో 26 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పూర్తయిందని... 10,891 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తికాగా... మరో 14.52 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. 

పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన దిగువ కాపర్‌ డ్యాం నిర్మాణం పనులను ఈ వారంలోనే ప్రారంభించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలవడంతో పాటు... డిసెంబర్‌ 15 కల్లా నిర్మాణ సంస్థలను ఖరారు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రధాన నిర్మాణ సంస్థ అయిన ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదని.... ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి గడ్కరీ వివరించామన్నారు. పోలవరం నుంచి గోదావరి నీటిని తమిళనాడుకు సైతం తీసుకువెళ్లాలని యోచిస్తున్న కేంద్రం... దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా మన రాష్ట్రాన్ని కోరిందన్నారు చంద్రబాబు. 

ఇక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మొత్తం 28 ప్రాధాన్య ప్రాజెక్టులలో మరో తొమ్మిది పూర్తయ్యాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ఎర్రకాలువ ఆధునీకరణ, పోగొండ రిజర్వాయర్‌, పెదపాలెం ఎత్తిపోతల పథకం, చినసాన ఎత్తిపోతల పథకం, మారాల రిజర్వాయర్‌, చెర్లోపల్లి రిజర్వాయర్‌, అవుకు టన్నెల్‌, గోరకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, సిద్దాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్నారు. 

 

06:52 - November 21, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఏర్పాట్లపై సాహితీవేత్తలతో సమావేశమైన కేసీఆర్‌... సలహాలు, సూచనలు స్వీకరించారు. సాహితీమూర్తుల ప్రతిభా పాటవాలు ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలుగు మహాసభలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా... తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా... అత్యంత జనరంజకంగా... భాగ్యనగరం భాసిల్లేలా... స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పలువురు సాహితీవేత్తలతో చర్చించిన కేసీఆర్‌.. వారి నుంచి అనేక సలహాలు, సూచనలు తీసుకున్నారు. 

తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగిందని... తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారన్నారు సీఎం. తెలంగాణలో ప్రతిభా పాటవాలకు కొదవలేదు... కానీ వారి ప్రతిభ రావాల్సినంతగా వెలుగులోకి రాలేదన్నారు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలని... ఎవరినో నిందించడానికి కాకుండా, తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటుకునేలా సభల నిర్వహణ ఉండాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అన్ని భాషా ప్ర్రక్రియలపై ప్రత్యేక కార్యక్రమాలుండాలని.... చిత్ర లేఖనంతో పాటు ఇతర కళలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. మన ప్రతిభ, గొప్పతనం వెలుగులోకి రావాలని... అముద్రిత గ్రంథాలను ముద్రించాలన్నారు కేసీఆర్‌.

అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలన్నారు కేసీఆర్‌. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలన్నారు. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలని.... భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల ఏర్పాట్లుండాలన్నారు. వచ్చిన అతిథులకు మంచి వసతి, భోజనం కల్పించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలని.... నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి, ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలని సీఎం సూచించారు.

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

పశ్చిమగోదావరి : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక చిన్నారి మృత్యువాతపడింది. నిన్న పుట్టిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... ఏలూరు నుంచి విజయవాడకు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే.. మార్గమధ్యలో అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అయిపోయింది. దీనిని ముందే సిబ్బంది గమనించకపోవడంతో... తిరిగి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. అయితే.. చిన్నారి ఆస్పత్రికి చేరుకునే లోపే చనిపోయింది.

06:49 - November 21, 2017

పశ్చిమగోదావరి : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందక చిన్నారి మృత్యువాతపడింది. నిన్న పుట్టిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... ఏలూరు నుంచి విజయవాడకు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే.. మార్గమధ్యలో అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అయిపోయింది. దీనిని ముందే సిబ్బంది గమనించకపోవడంతో... తిరిగి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. అయితే.. చిన్నారి ఆస్పత్రికి చేరుకునే లోపే చనిపోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

 

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

కరీంనగర్ : అలుగూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు. మృతులు పెద్దపల్లి జిల్లా రామగుండం వాసులుగా గుర్తించారు. 

 

నేడు చలో అసెంబ్లీకి ఎమ్మార్పీఎస్ పిలుపు

గుంటూరు : ఎస్సీ వర్గీకరణ కోరుతూ నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది. 

 

Don't Miss