Activities calendar

22 November 2017

21:30 - November 22, 2017

కాంగ్రెస్ వైపు పటీదార్ అనామత్ మొగ్గు...

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బలం పుంజుకుంది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది.

డిసెంబర్ 15 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ 15 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వివిధ రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు..

ఢిల్లీ : కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఏప్రిల్‌ 2020 నుంచి ఏప్రిల్‌ 2025 వరకు అమలు కానుంది. 

21:27 - November 22, 2017

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బాలపూర్‌ క్రాస్‌రోడ్స్‌, పెండేకల్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. గ్రామ, గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మహిళలు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలుసుకుని సమస్యలు ఏకరవు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గంలో పూర్తైన జగన్‌ పాదయాత్ర... వెల్దుర్తి మండలం నర్సరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు 212 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

జగన్ 16వ రోజు పాదయాత్ర..

కర్నూలు : గురువారం ఉదయం 8 గంటలకు పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు లభించాయి. కేంద్ర భూగర్భ జలశాఖ అనుమతులతో పాటు కన్ స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ డైరెక్టరేట్ నుండి అనుమతి లభించాయి. 

'డిసెంబర్ 9నుండి క్షేత్రస్థాయికి వెళుతా'..

హైదరాబాద్ : డిసెంబర్ 9 నుండి క్షేత్రస్థాయికి వెళుతానని టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ తీవ్ర సమస్యగా మారిందని, మూడేళ్లలో 59 పబ్ లకు అనుమతినిచ్చారని తెలిపారు. పబ్ ల అనుమతినివ్వడంలో తెలంగాణ నెంబర్ 1 అని ఎద్దేవా చేశారు. 

21:21 - November 22, 2017

హైదరాబాద్ : సంగీత అత్తమామలను పోలీసులు అరెస్టు చేశారు...ఉదృతంగా మారిన సంగీత ఆందోళనకు నాల్గోవరోజు మద్దతు మరింత పెరగడంతో పోలీసుల్లో కలవరం పెరిగింది..మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం రంగంలోకి దిగి ఆమెకు న్యాయం చేసేందుకు చర్చలు జరిపారు...పూర్తిస్థాయి న్యాయం జరిగేవరకు కదలనంటోంది సంగీత...

సంగీత...తన భర్త తీరు...మెట్టినింటి వేధింపులపై సంగీత చేస్తున్న న్యాయపోరాటం నాలుగో రోజుకు చేరింది...ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అత్తమామల అరెస్టుతో అధికార యంత్రాంగం కాస్త రిలాక్సయింది...శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అత్తమామలను కూడా అరెస్టు చేయాలంటూ సంగీత డిమాండ్ పెట్టింది..దీనికి తోడు ఆమె అత్తమామలు నాలుగు రోజులుగా పరారీలో ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు..అయినా వారి జాడ తెలియకపోవడంతో పాటు సంగీత ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆందోళన పెరిగింది...ఎట్టకేలకు చీకటి పడుతున్న సమయంలో సంగీత అత్తమామలతో పాటు మరిదిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు మేడిపల్లి పోలీసు స్టేషన్ తరలించారు.

తన భర్త, అత్తమామలు రాజీకొస్తే.. వాళ్లు మారారని నమ్మకం వచ్చాకే కేసు వెనక్కి తీసుకుంటానని సంగీత తెలిపింది. తన తరపున మాట్లాడటానికి వచ్చిన వారి ముందే తనకు న్యాయం కావాలని ఆమె చెప్పింది. తనకు తన పాపకు రక్షణ కల్పిస్తామని రాసివ్వాలని కోరింది. మరోవైపు సంగీత భర్త శ్రీనివాసరెడ్డిని రిమాండ్‌కి పంపినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చెప్పారు. ఇప్పటికే చందానగర్ పీఎస్‌లో అతనిపై పలు కేసులు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కేసును పూర్తిగా విచారించి సంగీతకు న్యాయం చేస్తామని మహేష్‌ భగవత్‌ తెలిపారు. న్యాయం చేసేవరకు ఆందోళన విరమించనంటూ సంగీత చేస్తున్న పోరాటం ఉధృతమవుతుంది...మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. భర్త,మెట్టినింటి వేధింపులపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది..నాలుగో రోజున సంగీత ఆందోళనకు ప్రజాప్రతినిధులు..మహిళా సంఘాల నుంచి అండ లభించింది...న్యాయం చేస్తామంటూ ఆమె వెన్నంటే ఉన్నారు...

21:19 - November 22, 2017

హైదరాబాద్ : ఓ వైపు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు..మరోవైపు మెట్రోరైలు ప్రారంభోత్సవ వేడుక.. రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు చారిత్రక భాగ్యనగరం అతిథ్యమివ్వనుంది. ప్రధాని మోదీ సహా, ఇవాంక ట్రంప్‌, దేశ విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు నగరానికి వస్తుంటడంతో రాష్ట్ర పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 28...హైదరాబాద్‌ చరిత్రలో నిలిచిపోనున్న రోజు. నగర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానున్న రోజు. మెట్రోరైలు హైదరాబాద్‌ సిగలో చేరనున్న రోజు. నవంబర్‌ 28న భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోరైలును జాతికి అంకితం చేయనున్నారు.

ఈనెల 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 3.25 నిమిషాలకు వీరంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌, సహా దేశ విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను అమెరికా ప్రభుత్వంతో పాటు నీతి అయోగ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.. మూడు రోజులపాటు జరిగే సదస్సును మొత్తం 53 సెషన్లుగా విభజించారు. హెల్త్ కేర్ అండ్ లైఫ్‌ సైన్సెస్,మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలపై సదస్సులో ప్రధానంగా చర్చ సాగనుంది. సదస్సులో మొదటి రోజు ప్రారంభోత్సవ వేదికపై సీఎం కేసీఆర్‌ ఆహ్వాన ప్రసంగం చేస్తారు. తరువాత ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు.

హైదరాబాద్‌లో ప్రముఖుల పర్యటన సందర్భంగా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైటెక్స్‌ వద్ద భద్రతను అమెరికా భద్రతావిభాగం, ఎస్పీజీ బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. రెండు కార్యక్రమాల కోసం సుమారు 4 వేల మంది పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఆక్టోపస్, గ్రేహౌండ్స్, బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి.

మరోవైపు మియాపూర్ మెట్రోస్టేషన్, డిపో, పరిసర ప్రాంతాలు ఎస్పీజీ భద్రతా వలయంలోకి చేరాయి. ఎస్పీజీ ఐజీ సెవాంగ్ నంగ్యల్ మియాపూర్ మెట్రోను సందర్శించారు. మొత్తంగా రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లను సక్సెస్‌ చేసేందుకు అటు అధికారులు, ఇటు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

21:17 - November 22, 2017

విజయవాడ : నకిలీ మిర్చి విత్తనాలతో పంట నష్టపోయిన కృష్ణా జిల్లా రైతులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి అమరావతి వెళ్తున్న రైతులను అరెస్టు చేసి, నున్న పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాహత్నం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. నష్ట పరిహారం కోసం కృష్ణా జిల్లా మిర్చి రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 2016లో నకిలీ మిర్చి విత్తనాలతో పంట నష్టపోయిన రైతులు చలో అసెంబ్లీ చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి అమరావతి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

పంట నష్టపోయిన రైతులకు 2.13 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ సిఫారసు చేశారు. అయినా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో అసెంబ్లీకి బయలుదేరిన తమను పోలీసులు అరెస్టు చేసి.. నున్న పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన రైతులు జమలయ్య, పూర్ణయ్య, తిరుపతిలు పోలీసు స్టేషన్‌లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

రైతుల చర్యతో కంగుతిన్న పోలీసులు పురుగుమందు తాగిన రైతులను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోడు వినిపించేందుకు వచ్చే తమను అరెస్టు చేయడాన్నిరైతులు తప్పుపడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను సీపీఎం నేతలు బాబూరావు తదితరులు పరామర్శించారు. నకిలీ మిర్చి విత్తనాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో తాత్సారం చేస్తున్న ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. మిర్చి రైతుల ఆందోళనకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీపీఎం నేతలు, పరిహారం చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

21:15 - November 22, 2017

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం 58 వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తేనే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో...కేంద్ర సహకారం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌తో ఎదురవుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆబ్రిట్రేషన్‌ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని సభదృష్టికి తెచ్చారు. ఏపీ అసెంబ్లీలో పోలవరంపై స్వల్పవ్యవధి చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పలువురు సభ్యులు ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసి, సలహాలు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు వేస్తున్న కేసులను ప్రస్తావించారు. అన్నింటిని అధిగమిస్తూ పోలవరం నిర్మాణంపై ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనసభ్యులు అభినందించారు. ఈనెల 16న పోలవరం సందర్శించడం ద్వారా ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్న నమ్మకం కలుగుతోందని చర్చలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు.

పోలవరంపై సభలో జరిగిన చర్చకు ముందుగా నీటిపాదుల శాఖ మంత్రి దేవినేని ఉమ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. 2011లో 16 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అంచనా వ్యయం ఇప్పుడు 58 వేల కోట్లకు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం సక్రమంగా 58 వేల కోట్ల రూపాయలు అందిస్తే రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రధాన కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి ఎదురవుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆబ్రిట్రేషన్‌ ట్రైబ్యునల్, అడ్య్జూడికేషన్‌ బోర్డు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని చంద్రబాబు సభకు తెలియచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడకుండా అందరూ సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సమాధానం తర్వాత పోలవరం సైట్‌లో జరుగుతున్న పనులను ప్రత్యక్ష ప్రసారం సభలో చూపించారు.

ఈనెల 23 నుంచి 25 వరకు భారీగా ఉన్న పెళ్లిల్లు, ఫంక్షన్లకు హాజరయ్యేందుకు వీలుగా అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు విజ్ఞప్తి చేశారు. దీనికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సుముఖత వ్యక్తం చేశారు. పోలవరంపై చంద్రబాబు సమాధానం ముగిసిన తర్వాత సభ్యుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని గురువారం నుంచి శనివారం వరకు అసెంబ్లీకి సెలవు ప్రకటించిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. సభను సోవారానికి వాయిదా వేశారు. 

గడ్కరిని కలిసిన మంత్రి హరీష్ రావు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి నితీన్ గడ్కరిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కలిశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల అనుమతి..ఇతరత్రా విషయాలపై గడ్కరితో మంత్రి హరీష్ చర్చించారు. 

20:22 - November 22, 2017

లంచం ఇయ్యలేదని ఒక డ్రైవర్ను గొట్టిండ్రట ఆబిడ్సు కాడ ఇద్దరు కానిస్టేబుళ్లు.. దెబ్బలు తిన్న ఆ డ్రైవర్ దావఖాండ్ల వడ్డడు.. నిన్న రాత్రి హైద్రావాదుల అయిన ఈ ముచ్చట మీద ఫేస్ బుక్, వాట్సప్ల జనం తక్వ తిడ్తలేరు ఆ కానిస్టేబుళ్లను.. అన్నం తింటున్నరా..? కడ్పుకు ఇంకేమన్న రోత తింటున్నర్రా అని కన్నమ్మ మాటలంటున్నరు..పోలీసోడు గెట్ల కొట్టాడో..డ్రైవరన్న ఏం అంటున్నడో వీడియోలో చూడండి...

20:08 - November 22, 2017

ఏడనన్న శాంతి చర్చలుంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే వంపాలే బాగ మల్పుకొస్తడు.. పాడుగాను.. ఎట్లమాట్లాడాల్నో గూడ తెల్వది ఏడంగ ఎమ్మెల్యే ఆయెనే ఏమో అని జనం అనుకుంటున్నరంటే ఇగ ఎమ్మెల్యేగారి శిగ్గు ఏమున్నది సూడుండ్రి.. బోడుప్పల్ కాడ సంగీత అనే బుజ్జి అత్తగారింటి ముంగట ధర్నా జేస్తున్నదిగదా... ఆడికి వొయ్యి ఆడోళ్లతోని తిట్లువడ్డడు ఎమ్మెల్యే..మరి మీరు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

20:04 - November 22, 2017

అంబేద్కర్ అంటె.. కాళ్లు గడ్గి నెత్తిల సల్లుకుంటం అన్నంత యాక్టింగ్ జేస్తరు మన బాతాల పోశెట్టి ఇంటి బ్యాచ్.. దేవుండ్లకు సమర్పించుకున్న మొక్కులు సంగతి అట్లుండంగ.. జనగామా ఎమ్మెల్యే చెర్వు భూమిని కబ్జావెడ్తె ఆయన మీద చర్యలు దీస్కోలేదు.. ఏడనన్న శాంతి చర్చలుంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే వంపాలే..చంద్రబాబు ఏక్ నంబర్ మోసగాడు.. అని చెప్పెతందుకు పెద్ద కష్టపడవల్సిన పనేం ఉండది.. లంచం ఇయ్యలేదని ఒక డ్రైవర్ను గొట్టిండ్రట ఆబిడ్సు కాడ ఇద్దరు కానిస్టేబుళ్లు.. అన్న అమ్ముకున్న భూములను పేదోళ్లు కొన్కున్నరు రిజిస్ట్రేషన్ జేస్కున్నరు వాళ్లంతల వాళ్లున్నరు.. గుడుల కాడ గుప్త నిధులు ఉంటయని ఎవ్వలు జెప్తరో ఏమో సోడిగాళ్లకు.. గీ ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి....

19:59 - November 22, 2017

శాసనాలు తయారు చేయడానికి..చట్టాలపై శాసనసభ సమావేశాల్లో చర్చ జరగాలని..బిల్లులపై..లోతైన చర్చ జరిగితేనే దానికొక పరిష్కారం దొరుకుతుందని సీపీఎం శాసనసభాపక్ష మాజీ నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయా ? దానిపై ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. జూలకంటి 15 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా పనిచేశారు. అంతేగాకుండా ఐదేళ్లు శాసనసభాపక్ష నేతగా సీపీఎం సభ్యుడిగా కొనసాగారు. వివిధ సభా సంఘాల్లో సభ్యుడిగా పనిచేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో బడ్జెట్ పద్దులపై చర్చ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగదన్నారు. కొంతమంది సభ్యులు పుస్తకాలు చదవడం లేదని..అధ్యయనం చేయడం లేదన్నారు. కొంతమంది సీనియర్లు మాత్రం..కొన్ని భావాలు కలిగిన వారు అధ్యయనం చేసి వస్తున్నారని..కానీ వీరికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రిపేర్ అయి వెళితే అక్కడ అవకాశం దొరకడం లేదని..భావించి కొందరు అధ్యయనం చేయడం లేదన్నారు. గతంలో పుస్తకాలను అధ్యయం చేసి సభకు వెళ్లేవారనన్నారు. నిజాయితీగా..బాధ్యతగా ఉన్న వారు ఎన్నిక కావాలని..చట్టసభలో వ్యవహరించాల్సిన పాత్ర..బిల్లులపై..ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం..సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా చేయాలన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సంగీత అత్తా..మామ అరెస్టు...

మేడ్చల్ : సంగీత అత్తామామలను పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోవాలని..అత్తామామలను అరెస్టు చేయాలని..తనకు న్యాయం చేయాలని సంగీత ఆందోళన చేస్తోంది.

సచివాలయానికి వచ్చిన వల్లభనేని...

విజయవాడ : ఉదయం అసెంబ్లీ లాబీల్లో జరిగిన విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సీఎం పిలిపించారు. దీనితో వల్లభనేని సచివాలయానికి వచ్చారు. 

రాజకీయాల్లో రావాల్సినవసరం లేదన్న రజనీ..

చెన్నై : తొందరలో తన 'కాలా' చిత్రం పూర్తవుతుందని, పుట్టిన రోజు తరువాత మళ్లీ అభిమానులను కలుస్తానని సినీ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

19:21 - November 22, 2017

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగీతకు న్యాయం దక్కేందుకు 'టెన్ టివి' నడుం బిగించింది. ఇందుకు సంబంధించిన వాస్తవాలను బాహ్యప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..సంగీత బంధువులు ఓ స్టార్ హోటల్ లో సమావేశమయ్యారని తెలుసుకున్న టెన్ టివి ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. దీనితో ప్రజాప్రతినిధులు మధ్యలోనే బయటకు వెళ్లిపోయి నేరుగా సంగీత వద్దకు చేరుకున్నారు. అక్కడ టెన్ టివి సమక్షంలో ఎంపీ మల్లారెడ్డి..సంగీతలు మాట్లాడారు. సంగీతకు న్యాయం చేస్తామని ఎంపీ మల్లారెడ్డి హామీనిచ్చారు.

ఈ సందర్భంగా అక్కడున్న ఐద్వా నేత, సంగీతతో టెన్ టివి మరోసారి మాట్లాడింది. మొదటి నుండి తన పోరాటానికి మద్దతిస్తూ తనకు న్యాయం దక్కేందుకు ప్రయత్నిస్తున్న టెన్ టివికి సంగీత కృతజ్ఞతలు తెలియచేసింది. ఆస్తి కోసం తాను పోరాటం చేయడం లేదని..హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తనకు న్యాయం చేస్తామని ఎంపీ మల్లారెడ్డి హామీనిచ్చారని తెలిపారు. మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని సీపీ మహేష్ భగవతి పేర్కొనడం కరెక్టు కాదన్నారు.

ఐద్వా నేత స్పందన..
ఓ హోటల్ లో ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఓ సమావేశం ఏర్పాటు చేశారని..ఈ సమావేశానికి సంగీత మామ బాల్ రెడ్డి వస్తున్నారన్న సమాచారం వచ్చిందని ఐద్వా నేత టెన్ టివికి తెలిపారు. తనకు సహాయంగా టెన్ టివి బృందం వచ్చిందని, కానీ పోలీసులు టెన్ టివిని బయటే ఆపివేయడం జరిగిందన్నారు. కానీ తాను మాత్రం లోనికి వెళ్లి అక్కడున్న వారిని నిలదీయడం జరిగిందన్నారు. ఎంపీ..ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని మంతనాలు ఎలా చేస్తారని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. బాల్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని తాను సీఐని ప్రశ్నించడం జరిగిందన్నారు.  

19:14 - November 22, 2017

హైదరాబాద్ : మేడ్చల్‌ డీఈవో ఉషారాణిపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. కొన్ని రోజులుగా ఉషారాణి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు, అర్బన్ డెవలప్‌మెంట్ హాస్టల్స్ మెస్ బిల్లుల వ్యవహారంలో కాంట్రాక్టర్‌ వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫుటేజ్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఆర్జేడీ విజయలక్ష్మీ భాయి విచారణ చేపట్టారు. ఆమె ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఉషారాణిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎన్ని రోజుల వరకు చేశారు ? అనేది తెలియరావడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు తెలియరాలేదు. 

డీఈవో ఉషారాణి సస్పెండ్...

హైదరాబాద్ : మేడ్చల్‌ డీఈవో ఉషారాణిపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. విద్యాశాఖ ఉన్నతాధికారుల నివేదికతో ఆమెను సస్పెండ్ చేశారు.

రౌడీ షీటర్ దారుణ హత్య...

చిత్తూరు : తిరుపతిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎయిర్ పోర్టు బైపాస్ రోడ్డులో మద్యం దుకాణం వద్ద రౌడీ షీటర్ శివను ప్రత్యర్థులు నరికి చంపారు. 

18:36 - November 22, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై ఆమె ఆందోళన చేస్తోంది. ఈ కేసు చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. సంగీతకు న్యాయం చేస్తామని ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ పేర్కొన్నారు. ఈ కేసు విషయంపై బుధవారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఇందులో కొత్త విషయం చెప్పడం గమనార్హం. సంగీత మూడు కోట్లు డిమాండ్ చేస్తోందని చెప్పడంతో గందరగోళానికి దారి తీసినట్లైంది. ఈ కేసును పూర్తిగా విచారించి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. భర్త శ్రీనివాస్ రెడ్డిని రిమాండ్ కు పంపడం జరిగిందని, చందానగర్ లో ఇతనిపై పలు కేసులున్నాయన్నారు. 

18:30 - November 22, 2017

హైదరాబాద్ : తాను చేసే పోరాటం ఆస్తుల కోసం కాదని..హక్కుల కోసం అని సంగీత పేర్కొంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. శ్రీనివాస రెడ్డి అధికారిక పార్టీ నేత కావడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. సంగీతకు న్యాయం జరిపించేందుకు టెన్ టివి కూడా ప్రయత్నం చేపట్టింది.

ఒక్కసారిగా దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు బుధవారం సంగీత కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. స్టార్ హోటల్ లో ఈ సమావేశం జరిపినట్లు తెలుసుకున్న టెన్ టివి అక్కడకు వెళ్లింది. ఎంపీ..ఎమ్మెల్యేలు..సంగీత కుటుంసభ్యులతో మాట్లాడింది. అనంతరం ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తున్న సంగీత దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా సంగీత..ఎంపీ మల్లారెడ్డిలు టెన్ టివితో మాట్లాడారు.

తన పోరాటం ఆస్తుల కోసం కాదని..హక్కుల కోసమని సంగీత పేర్కొన్నారు. సపరేట్ గా హోటల్ లో ఎందుకు సమావేశం పెట్టారని సూటిగా ప్రశ్నించారు. తాను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా సీపీ భగవత్ పేర్కొనడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. తనకు రక్షణ కావాలని..ఇంట్లో తనకు గుర్తింపు కావాలని...లిఖిత పూర్వకంగా రాసివ్వాలని సంగీత డిమాండ్ చేశారు.

దీనిపై ఎంపీ మల్లారెడ్డితో టెన్ టివి మాట్లాడింది. సంగీత చేస్తున్న పోరాటం పూర్తిగా న్యాయసమ్మతమైందన్నారు. భర్త శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేయడం జరిగిందని, త్వరలోనే సంగీత అత్తామామలను కూడా అరెస్టు చేస్తామన్నారు. పూర్తిగా న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతుందన్నారు. 

18:12 - November 22, 2017

విజయవాడ : నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని..తమ మొర వినిపించుకోవాలని కోరుతున్నా అరెస్టు చేయడంపై రైతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చీ రైతులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. కానీ వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

అరెస్టు చేసిన వారిని నున్నా పీఎస్ కు తరలించారు. తమ గోడు వెళ్లబోసుకోవాలని వెళితే అరెస్టు చేయడాన్ని జమలమయ్య, పూర్ణయ్య, తిరుపతయ్యలు రైతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంట తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వీరిని సీపీఎం నేతలు బాబురావు, తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు..తదితరులు టెన్ టివితో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితం సర్వం కోల్పోయారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆందోళనలు..చెప్పులు అరిగేలా తిరిగారని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన లిఖితపూర్వక హామీ కూడా నెరవేరకపోవడం బాధాకరమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని..ఆత్మహత్య చేసుకోవద్దని..పోరాడి సాధించాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మెట్రో రైలు ప్రారంభంపై సందిగ్ధత..

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు ప్రారంభంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈనెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మెట్రో రైలు ప్రారంభంపై పీఎంవో నుండది తమకు సమాచారం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. 

టీఆర్టీపై తీర్పు వాయిదా..

హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. 

పర్యాటకులపై పోలీసుల దాడులు

పశ్చిమగోదావరి : పేరుపాలెం బీచ్ లో పర్యాటకులపై పోలీసులు దాడులకు దిగారు. ఈ దాడిని ఖండించిన ప్రజలు పోలీసు ఉన్నధికారులకు ఫిర్యాదు చేశారు. పర్యాటకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మొగల్తూరు, వీరవాసరం, యలమంచిలి ఎస్సైలతో పాటు  ఒక ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపామని ఎస్పీ తెలిపారు. 

తిరుపతిలో రౌడీషిటర్ దారుణ హత్య

చిత్తూరు : జిల్లా తిరుపతిలో రౌడీషీటర్ శివ దారుణ హత్య గురైయాడు. ఎయిర్ పోర్ట్ బైపాస్ రోడ్డులో మద్యం దుకాణం వద్ద శివను ప్రత్యర్థి వర్గాం వారు నరికి చంపారు. 

కొలువులకై కోట్లాట సభపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : కొలువులకై కోట్లాట సభపై టీ.జేఏసీ కోర్టును ఆశ్రయించింది. 30న సభకు పోలీసులు అనుమతి నిరాకరించారని, గతంలో కొలువలకై కొట్లాట సభకు కోర్టు అనుమతినిచ్చినా ఇప్పుడు పోలీసులు తేదీ మార్చుకోవాలన అంటున్నారని జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. 

17:29 - November 22, 2017

హైదరాబాద్ : గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగీతకు న్యాయం చేసేందుకు టెన్ టివి నడుం బిగించింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. దీనితో బుధవారం ప్రభుత్వ పెద్దలు కదిలారు. సంగీతకు న్యాయం చేసేందుకు టెన్ టివి చొరవ చూపింది. స్థానిక స్టార్ హోటల్ లో చర్చలు చేపడుతున్నారన్న సమాచారం మేరకు టెన్ టివి అక్కడకు వెళ్లింది. ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. న్యాయం చేసేందుకు ఇక్కడకు రావడం జరిగిందని..సంబంధిత వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడి నుండి సంగీత ఇంటికి వెళ్లారు.

అక్కడ సంగీతతో టెన్ టివి మాట్లాడింది. తనకు న్యాయం చేయాలని కోరింది. జైల్లో ఉన్న తన భర్తను చూపించాలని, అత్త మామలను అరెస్టు చేసి చూపించాలని డిమాండ్ చేసింది. తన తరపున మాట్లాడటానికి వచ్చిన వారి ముందే తనకు న్యాయం జరగాలని..తనకు, తన పాపకు రక్షణ కల్పిస్తామని వాళ్లు లిఖిత పూర్వకంగా రాసివ్వాలన్నారు. తనను చంపేస్తామంటూ భర్త, అత్తమామలు తనను బెదిరించారని చెప్పారు. తనకు, తన పాపకు రక్షణ కావాలని కోరారు. మనీ డిమాండ్ చేయడం లేదన్నారు. అత్తామామలను దాచిపెడుతున్న వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకో ఆడదానికి ఇలా జరుగకుండా చూడాలని కోరారు. సంగీత ఏమి కోరుకొంటుందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టెన్ టివితో ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఒక బిల్డింగ్ రిజిష్టర్ చేయిస్తామన్నారు. 

17:21 - November 22, 2017

కృష్ణా : ఏపీ రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేగుతోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మద్దతు ధర కోసం..న్యాయం చేయాలని రైతులు పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో మిర్చి రైతులు ఆందోళన చేపడుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని..మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు మిర్చి రైతులు బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు.

వీరి ర్యాలీని పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. కానీ ఆందోళనలో పాల్గొంటున్న రైతులు..వివిధ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పీఎస్ లకు తరలించారు. దీనితో కృష్ణా జిల్లా నున్నా పీఎస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు..నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. వీరిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వెంటిలెటర్ ద్వారా ఆక్సిజన్ అందించడం జరుగుతోందని తెలిపారు. రైతులు ఆత్మహత్యాయత్నంపై విపక్ష నేతలు భగ్గుమన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

16:44 - November 22, 2017

పవన్ కల్యాణ్ క్రియేటివ్, శ్రేష్ఠ మూవీస్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ హీరోగా మేఘాకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ గత జూలైలో మొదలైంది. ఈ చిత్రం తాజాగా ఊటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి కథ త్రివిక్రమ్ అందిస్తుడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది.

16:41 - November 22, 2017

హైదరాబాద్ : న్యాయం కోసం ఉప్పల్‌లో సంగీత చేస్తున్న పోరాటం నాలుగో రోజుకు చేరింది. సంగీత చేస్తున్న ఈ పోరాటం తీవ్రంగా కలకలం రేపుతోంది. దీనితో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఓ స్టార్ హోటల్ లో చర్చలకు దిగడం స్వరత్రా చర్చనీయాంశమైంది. పరారీలో ఉన్న సంగీత మామ బాల్ రెడ్డి కూడా ఈ చర్చలో పాల్గొన్నట్లు పుకార్లు షికారు చేశాయి. వారు చర్చలు జరుగుతున్న ప్రాంతానికి టెన్ టివి వెళ్లింది. అక్కడ ఎంపీ మల్లారెడ్డి..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..ఐద్వా నేత, ఇతరులు ఉన్నారు. సంగీత ఇంటి వద్ద పోరాటం చేస్తుంటే ఇక్కడ చర్చలు ఏంటీ అని టెన్ టివి ప్రశ్నించింది. ఒక్కసారిగా మీడియా రావడంతో మధ్యలోనే ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడం గమనార్హం. 

మల్లారెడ్డి స్పందన..
దీనిపై ఎంపీ మల్లారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. తాను కీసర నుండి వస్తున్నట్లు..అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లడం జరిగిందన్నారు. తాను రాగానే మంత్రి కేటీఆర్ తో చర్చించడం జరిగిందని, సంగీతకు న్యాయం చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తాము ఇక్కడ చర్చలు చేస్తున్నట్లు, ఈ చర్చల్లో సంగీత బంధువులు పాల్గొన్నారని పేర్కొన్నారు. అమ్మాయికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. బాల్ రెడ్డిని పట్టించిన తరువాతే సంగీతకు న్యాయం చేయడం జరుగుతుందని, ఆమెకు రక్షణ కల్పించే విధంగా చూస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

సంగీత బంధువులు...
సంగీతకు భర్తను అప్పచెప్పాలని, ఆమెకు న్యాయం చేయాలని సంగీత బంధువులు పేర్కొన్నారు. తాము మొదట రూ. కోటి ఇవ్వాలని కోరడం జరిగిందని..అనంతరం రూ. 50 లక్షలు ఇస్తే కాస్తయినా న్యాయం జరుగుతుందన్నారు. 1200గజాల స్థలం ఉందని..సంగీత పేరిట చేయాలని తాను కోరడం జరుగుతోందని పేర్కొన్నారు.

సీఐ స్పందన...
గతంలో శ్రీనివాస రెడ్డి, బంధువులపై కేసు నమోదు చేయడం జరిగిందని, రెండు రోజుల క్రితం మరో సెక్షన్ కింద శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రుల కోసం వెతకడం జరుగుతోందని, వీరిని అరెస్టు విషయంలో వస్తున్న విమర్శలు కరెక్టు కాదన్నారు. 

గృహ నిర్బంధం నుంచి ఉగ్రవాది హఫీజ్ విముక్తి కల్పించిన పాక్

ఇస్లామాబాద్ : ఉగ్రవాది హఫీజ్ సయిద్ కు గృహ నిర్బంధం నుంచి పాక్ ప్రభుత్వం విముక్తి కల్పించింది. హఫీజ్ గృహనిర్బంధాన్ని పొడింగించాలని వేసిన పిటిషన్ లాహోర్ కోర్టు కోట్టిపరేసింది. 

సంగీతతో రాజీకి టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు

మేడ్చల్ : జిల్లా బోడుప్పల్ లో టీఆర్ఎస్ యువజన నేత శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు 4 రోజులగా భార్య సంగీత దీక్ష చేస్తుడంతో ఆమెతో రాజీకి టీఆర్ఎస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఓ స్టార్ హోటళ్లో వారు సమావేశమయ్యారు. 

16:20 - November 22, 2017

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు వరసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం, స్రైడర్ నిశరాశపరిచిన ఆయనకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. మహేశ్ తాజాగా మాస్ డైరెక్టర్ వినాయక్ తో సినిమా తీయడానికి ఒప్పుకున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత 25వ సినిమాను వంశీ పైడిపల్లి చేయనున్నాడు. 26వ సినిమాగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక వినాయక్ విషయానికొస్తే మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 1 తో హిట్ కొట్టి ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. చూద్దాం మరి వినాయక్, మహేశ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో..?

పోలవరంపై సీఎం ప్రకటన

గుంటూరు : పోలవరం ప్రాజెక్టుపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏపీ జీవనాడి పోలవరమని దాన్ని పూర్తి చేయండమే నా జీవితాశయమని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

16:06 - November 22, 2017
16:01 - November 22, 2017

మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనను చూడడం కోసం వచ్చిన అభిమానులకు భోజనం పెట్టించాడు. దీంతో ఆయనను చూడడానికి వచ్చిన అభిమానులు కడుపు నిండ తిని వెళ్లారు. సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన మూవీ జవాన్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి పేరు తెచ్కుకుంది. 

బేటీ బచావ్, బేటీ పడావ్ విస్తృతంగా అమలు

ఢిల్లీ : 640 జిల్లాల్లో బేటీ బచావ్, బేటీ పడావ్ ను విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

15:55 - November 22, 2017

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు పెంపు

ఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  సుప్రీంకోర్టుకు చెందిన 31మంది, హైకోర్టుల్లోని 1,079 మంది జడ్జీలకు జీతాలు పెంపు జరిగింది. పెరిగిన వేతనాలు 2016 జనవరి 1నుంచి అముల్లోకి వస్తుంది.

15:53 - November 22, 2017

తూర్పుగోదావరి : కూనవరం ప్రభుత్వాసుపత్రిలో కరెంటు లేక రోగులు నానా అవస్థలు పడ్డారు. కరెంటు లేదని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఓ బాలింత పేర్కొంది. మూడు రోజుల పసికందుతో లక్ష్మీ అనే బాలింత జాగారం చెప్పడం కలకలం రేగుతోంది. ఇంటికి పంపించేందుకు వాహనం లేకపోవడంతో ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ కరెంటు లేకపోవడం వల్ల ఆమె కొవ్వొత్తి వెలుగులోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 

15:49 - November 22, 2017
15:47 - November 22, 2017

మెదక్ : పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ల పదవీకాలంలో ఎలాంటి పనులు చేపట్టారనే విషయంపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. రైల్వే సమస్య, నేషనల్ హైవే సమస్యలు ప్రధానంగా ఉండేవన్నారు. ప్రభుత్వం వచ్చిన అనంతరం, తాను ఎంపీ అయిన తరువాత పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్లు, జాతీయ హదారులను త్వరలోనే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:43 - November 22, 2017

విజయవాడ : పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, దీనిని పూర్తి చేయడమే తన జీవితాశయమని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. పోలవరం నిర్మాణంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన చేశారు.

01-4-2014 కంటే ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చును ఇవ్వడం జరగదని..మిగతా ఖర్చు తప్పకుండా ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని, 16–17 సంవత్సరానికి రూ. 2,414 కోట్లు...17-18 సంవత్సరానికి రూ. 3,400 కోట్లు...18-19 సంవత్సరానికి రూ. 9,000 కోట్లు...19-20 సంవత్సరానికి రూ. 9వేల కోట్లు నాబార్డు ఇచ్చే విధంగా కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందన్నారు. రూ. 23,814 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పుకోవడం జరిగిందని, ప్రాజెక్టు ఆలస్యంగా జరుగుతోందంన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగు వేల మంది పని చేయడం జరుగుతోందని, 50 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రూ. 12,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, రూ. 3,200 నుండి రూ. 4,000కోట్లు రావాల్సి ఉందన్నారు. 

14:55 - November 22, 2017

ఆహ్మదాబాద్ : గత కొన్నాళ్లుగా పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి...పాటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించిందని పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు. సెక్షన్‌ 31, సెక్షన్‌ 46 కింద పాటీదార్లను బీసీల్లో చేర్చడానికి కాంగ్రెస్‌ ఒప్పకుందన్నారు. కాంగ్రెస్‌ ఫార్ములాను తాము అంగీకరిస్తున్నట్లు... 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉందని హార్దిక్‌ పటేల్‌ వెల్లడించారు. రాజకీయంగా తమకు ఏ పార్టీతో సంబంధం లేదని...కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. పాటీదార్ల ఓట్లను చీల్చేందుకు బిజెపి 2 వందల కోట్ల నిధులు ఏర్పాటు చేసినట్లు ఆయన ఆరోపించారు.

 

14:55 - November 22, 2017

 

శ్రీకాకుళం :సిక్కోలులోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి త్వరలోనే వీసీని ఖరారు చేయనున్నారు. నేతల మధ్య సమన్వయ లోపంతో రెండేళ్లుగా యూనివర్సిటీ ఇంచార్జిలతోనే నడుస్తోంది. రెండేళ్ల క్రితం వీసీ పదవీ కాలం పూర్తైన తర్వాత రెక్టార్‌ చంద్రయ్యను ఇంచార్జ్‌ వీసీగా నియమించారు. ఇదే సమయంలో చంద్రయ్య ఉద్యోగ విరమణ చేయడంతో జులై నెలలో రెగ్యులర్‌ వీసీని నియమిస్తారని అంతా భావించారు. కాని అలా జరగలేదు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే, మంత్రి కమిడి కళా వెంకటరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరపు అచ్చెంనాయుడు, ప్రభుత్వ విప్‌, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు ఉపకులపతి నియామకంపై తలా ఒక పేరు ప్రతిపాదించారు. దీంతో వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వీసీ నియామక జాప్యానికి కారణమైంది. ఈ పరిస్థితిలో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటికే ముగ్గురి పేర్లు..
అయితే వీసీ నియామకంపై ఇప్పటికే సెర్చ్‌ కమిటీ ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది. ఇందులో విశ్వవిద్యాలయంలోని ప్రస్తుత రిజిస్ట్రార్‌ గుంట తులసీరావు, విశాఖ ఏయూ ప్రొఫెసర్‌ కూన రాంజీ, తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరావు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరిని వీసీగా ఎంపిక చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గురిలో ఒకరిని ప్రతిపాదించాలని శ్రీకాకుళం జిల్లా నేతలకు ఆదేశించారు. దీంట్లో భాగంగానే ఈ నెలాఖరులోగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి పూర్తి బాధ్యతలతో వీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. 

14:53 - November 22, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో నాలుగు రోజుల్లో వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి వరకు పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పూల మండపాలు డెకరేట్‌ చేసేవాళ్లు అందరూ చాలా బిజీగా ఉన్నారు. పైగా జిల్లాలో దేవాలయాలు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు ఫుల్లు బిజీగా ఉన్నాయి. 

14:52 - November 22, 2017

నల్లగొండ : బాపూజీ నగర్‌లోని హిందూ స్మశాన వాటికను కబ్జా చేసిన వార్డ్‌ కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 18వ వార్డు స్థానికులు సాగర్‌ రోడ్‌పై రాస్తారోకో నిర్వహించారు. సంబంధిత కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

 

14:51 - November 22, 2017

కరీంనగర్/జగిత్యాల : జిల్లా కోరుట్ల కోర్టుకు కంచ ఐలయ్య హాజరయ్యారు. కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జ్‌లతో వైశ్యులు నిరసన తెలిపారు. కంచ ఐలయ్య కోరుట్ల కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తుండగా... వైశ్యులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల బందోబస్తుతో ఐలయ్య కోరుట్ల కోర్టుకు చేరుకున్నారు. 

అసెంబ్లీ ప్రాంగణానికి వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు : బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే రఘుపతి అమరావతి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ హామీల కమిటీ సమావేశానిక వచ్చానని ఆయన తెలిపారు. మొట్ట మొదటి సమావేశం కావడంతో హాజరవుతనట్టు  తెలిపారు.

14:34 - November 22, 2017

మహిళాల పై జరుగుతున్న అకృత్యాలకు, వారికి జరిగే అన్యాయాల పై పోరాడానికి న్యాపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి అడ్వకేట్ పార్వతీ మానవి మై రైట్ వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:07 - November 22, 2017

గుంటూరు : అమరావతి మల్కాపురం కూడలి వద్ద ఉద్రక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు గాయాలయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అమరావతిలో ఉద్రిక్తత

గుంటూరు : అమరావతి మల్కాపురం కూడలి వద్ద ఉద్రక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

13:59 - November 22, 2017

హైదరాబాద్ : రోజురోజుకు మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. ఆస్తుల కోసం కన్నవాళ్లను రోడ్డున పడేస్తున్న ప్రబుద్దులు అనేకమంది ఉన్నారు. చివరి మజిలీలో కన్నవారికి అండగా ఉండాల్సిన పిల్లలు... తమకు పట్టనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పలువురు ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 

ఈనెల 28, 29, 30 తేదీలలో హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా రానుంది. ఈ నేపథ్యంలో... నగరంలో బిచ్చగాళ్లేవరూ లేకుండా పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. పలువురు బిచ్చగాళ్లను చర్లపల్లిలోని ఆనంద ఆశ్రమానికి తరలిస్తున్నారు. అయితే... ఈ సందర్భంగా పోలీసులకు బిచ్చగాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయలు బయటపడ్డాయి. 

ఈమె పేరు ఫర్జోనా. లంగర్‌హౌస్‌లో భిక్షాటన చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈమె వివరాలు తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈమె ఎంబీఏ చదివింది. అంతేకాదు... లండన్‌లో అకౌంట్‌ ఆఫీసర్‌గా కూడా విధులు నిర్వహించింది. ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతోంది. అయితే... రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఫర్జోనాకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని రోజులు కొడుకు దగ్గర ఉన్న ఫర్జోనా అనారోగ్యం పాలయ్యింది. బిచ్చమెత్తితో అనారోగ్యం నుండి బయటపడవచ్చని కొడుకు తల్లికి సూచించాడు. దీంతో ఆమె లంగర్‌హౌస్‌ ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 

ఇక మరో మహిళ పేరు రబీయా బసీరా. అమెరికాలో పని చేసిన ఈమె గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌. తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె బిక్షాటన చేపట్టాల్సి వచ్చింది. బసీరా కోటీశ్వరురాలు. హైదరాబాద్‌లో పెద్ద బిల్డింగ్‌ కూడా ఉంది. భర్త చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు కూతురు వద్ద ఉంది. ఆ తర్వాత కూతురు కూడా చనిపోయింది. ఆ తర్వాత తన ఆస్తిని దగ్గర బంధువులే కాజేసి ఆమెను రోడ్డున పడేశారు. అల్లుడు కూడా తన పిల్లలను ఈమె వద్దనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక ఆమె మనవళ్ల కోసం భిక్షాటన చేస్తోంది. 

ఇవాంక టూర్‌ నేపథ్యంలో నరగంలో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు చర్లపల్లి జైలులోని ఆనంద ఆశ్రమానికి తరలించారు. ఇలా తరలించిన వారి వివరాలు సేకరిస్తుండగా వీరిద్దరి గురించి బయటపడింది. దీంతో జైలు అధికారులు వాళ్ల కుటుంబ సభ్యులను పిలిపించి... అఫిడవిట్‌ తీసుకుని వారిని ఇళ్లకు పంపించారు. 

13:58 - November 22, 2017

కోల్ కతా : రాజ్యసభ మాజీ సభ్యుడు సుకోమల్‌సేన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుకోమల్‌.. ఈ ఉదయం కోల్‌కతాలో తుది శ్వాస విడిచారు. ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకుడిగా ఆయన కార్మికుల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు. ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా ఆయన విశేష సేవలందించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగానూ కొనసాగిన సుకోమల్‌ సేన్‌.. 1982...94 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హిస్టరీ ఆఫ్‌ ఎమర్జెన్సీ అండ్‌ మూమెంట్‌, మేడే అండ్‌ ఎయిట్‌ అవర్స్‌ స్ట్రగుల్‌ పేర్లతో రెండు రచనలనూ వెలువరించారు. సుకోమల్‌ మృతికి సీపీఎం సహా.. వివిధ కార్మిక సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. 

13:54 - November 22, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలో నరబలి కలకలం రేపింది. అక్కమహాదేవి గుహల్లో ఐదు అస్తిపంజరాలు బయటపడ్డాయి. బలి ఇచ్చిన వారి వయసు 30 ఏళ్లలోపే ఉంది. మృతులు కర్నాటక రాష్ట్ర వాసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కమహాదేవి గుహల్లో గుప్తనిధులు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గుహల ముందు ఐదు పుర్రెలు, ఎముకలు నిమ్మకాలయలు కనిపిస్తున్నాయి. గుహల పక్కనే చెప్పులు, దుస్తులు ఉన్నట్లు గొర్రెల కాపరులు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:45 - November 22, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత ఆందోళన నాలుగో రోజు కొనసాగుతోంది. సంగీత పోరాటానికి ప్రజా గాయకురాలు విమలక్క సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఈమేరకు సంగీతను కలిసిన ఆమె మనో ధైర్యాన్ని ఇచ్చారు. నాలుగు రోజులుగా సంగీత ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం, పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో అర్థం అవుతుందన్నారు. సంగీతకు న్యాయం చేయాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సంగీత పాప తల్లడిల్లుతుందని చెప్పారు. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:36 - November 22, 2017

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలో భూముల గొడవతో ఓ వ్యక్తిని చితకబాదారు. దేవేందర్‌సింగ్‌ అనే వ్యక్తిదగ్గర కొందరు భూములు కొనుకున్నారు. అయితే అవే భూములపై తనకూ హక్కుందంటూ దేవేందర్‌సింగ్‌ తమ్ముడు రాంసింగ్‌ పేచీ పెడుతున్నాడు. తప్పుడు  కేసులు  పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నాడని భూములు కొన్నవారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లిలో రాంసింగ్‌పై బాధితులు మూకుమ్మడిగా దాడిచేసి చితకబాదారు. దాడిని అడ్డుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

 

13:33 - November 22, 2017

గుంటూరు : చేనేత కార్మికులకు వందశాతం రుణమాఫీ చేశామని మంత్రి అచ్చన్నాయుడు అన్నారు. ఇంకా ఎవరికైనా రుణమాఫీ వర్తించకుంటే.. దరఖాస్తు చేసుకుంటే వెంటనే మాఫీ చేస్తామన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరించస్తుందన్నారు.

 

13:27 - November 22, 2017

1980 నటులు అందరు ఒకే చోట ఉంటే వారి చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో కానీ చూడక తప్పదు. 80ల నాటి సౌత్ ఇండియా స్టార్స్ అంత ఒకేచోటికి చేరారు. ఆ నాటి హీరోయిన్లు అందరు ప్రతి ఏడాది గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ సరి జరిగిన గెట్ టూ గెదర్ లో మెగా స్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్ తో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, సురేష్, బాగ్యరాజు పాల్గొన్నారు. హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ, తదితరులు పాల్గొన్నారు. ఈ గెట్ టూ గెదర్ లో తెలుగు, తమిళం, మలయాళ, కన్నట చెందిన 28 మంది నటులు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రామ్ ఈనెల 17న చెన్నైలోని మహాబలిపురం ఉన్న ఓ రిసార్ట్ లో జరిగింది. దీన్ని సుహాసిని మణిరత్నం, లిస్సీ లక్ష్మీ ఆర్గనైజ్ చేశారు.

13:25 - November 22, 2017

మనం 2జీ, 3జీ లెటేస్ట్ గా 4జీ కూడా వాడుతున్నాము. ఇప్పుడు కొత్తగా 5జీ రాబోతుంది. దీని కోసం టెలికాం కంపెనీలు సిద్ధమౌతున్నాయి. నోకియా ఇప్పటికే దేశీయంగా 5జీ నెట్ వర్క్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తోను, భారతి ఎయిర్ టెల్ తోను జతకట్టింది. ఇప్పుడు భారతీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ తో స్వీడన్ టెలికాం పరికారల దిగ్గజం ఎరిక్సన్ 5 జీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే బెంగూళురులో 5జీ ఇటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ వినియోగంలోకి తెచ్చె అంశంపై దృష్టి పెడుతోంది. 5 జీ టెక్నాలజీతో సెకన్ కు 10గిగబైట్స్ కు పైగా డేటా స్పీడ్ తో 3 సెకన్లలోనే 2గంటల సినిమా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

13:23 - November 22, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలోని ఫాతిమాపూర్ లో ఫాతిమా పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ప్రత్యేక టీంలతో విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు. విద్యార్థుల ఆచూకీ తెలిస్తే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే విద్యార్థులు పారిపోయారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తాము విద్యార్థులను కొట్టలేదని ఉపాధ్యాయుడు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:08 - November 22, 2017

హైదరాబాద్ : శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత ఆందోళన నాలుగో రోజు కొనసాగుతోంది. తన తరపున మాట్లాడటానికి వచ్చిన వారి ముందే తనకు న్యాయం జరగాలన్నారు. తనకు, తన పాపకు రక్షణ కల్పిస్తామని వాళ్లు లిఖిత పూర్వకంగా రాసివ్వాలన్నారు. తనను చంపేస్తామంటూ భర్త, అత్తమామలు తనను బెదిరించారని చెప్పారు. తనకు, తన పాపకు రక్షణ కావాలని కోరారు. అత్తమామలు రాజీకొస్తే.. వారిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోనని... తనకు నమ్మకం కల్గినప్పుడే కేసు ఉససంహరించుకుంటానని చెప్పారు. కాంప్రమైజ్ కావడానికి ఇన్ని రోజులు రానిది.. ఈరోజే ఎందుకొస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మాత్రమే అత్తమామలు కాంప్రమైజ్ అయ్యేందుకు వస్తున్నారని తెలిపారు. 
సీపీఎం నేత 
'సంగీత, ఆమె పాపకు న్యాయం జరగాలి. అత్తమామలు, భర్త లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలి. సంగీతకు చట్టం పరంగా రక్షణ కల్పించాలి. బంగారు తెలంగాణ అని చెబుతున్న టీసర్కార్ సంగీతను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని' అన్నారు. అయితే రాత్రి సంగీత అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కాంగ్రెస్ మా షరతులు అంగీరించింది : అర్థిక్

ఆహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్ తమ షరుతలకు అంగీకరించిందని పటేళ్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో తము కాంగ్రెస్ కలిసి పని చేస్తామని ఆయన ప్రకటించారు. 

13:00 - November 22, 2017

యూపీలోని ఘోరఖ్ పూర్ లోని బాబా రాందాస్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 63 చిన్నారుల మరణించిన సంఘటన మరవక ముందే అటువంటి ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రిలో ఓ వివాహిత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పుడుతునే బొడ్డుపేగు మెడకి చుట్టుకుంది. దీంతో చిన్నారి అపస్మరక స్థితిలోకి వెళ్లింది. దీంతో వైద్యులు శిశువు అత్యవసర చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అక్కడి అసుపత్రిలో పిల్లలకు సంభంధించిన డాక్టర్ లేకపోవడంతో దగ్గరలో ఉన్న విజయవాడకు అంబులెన్స్ లో తరలించే ఏర్పాట్లు చేశారు. ఏలూరుకు విజయవాడకు మధ్య 55కిలోమీటర్ల ఉంది. అంబులెన్స్ లో చిన్నారితో పాటు అమ్మమ్మ వెళ్లింది. అయితే ఏలూరు దాటి 10కిలోమీట్లు వెళ్లగానే అంబులెన్స్ లోని ఆక్సిజన్ అయిపోయింది. ఆక్సిజన్ అయిపోవడాన్ని గుర్తించిన అంబులెన్నస్ డ్రైవర్ వెంటనే ఏలూరు తిరిగి ప్రయాణమయాడు. ఆసుపత్రికి వచ్చేలోపు శిశువు ప్రాణం పోయింది. దీంతో శిశువు తల్లి, బంధువలు శోక సంద్రంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లాక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి రావడంతో పశ్చిమగోదావరిలో కలకలం రేపింది. దీనిపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో ఏలూరు అసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ ఏవిఆర్ మోహన్ చిన్నారి తరలింపులో అంబులెన్స్ లో కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే శిశువు చనిపోయిందని అంగీరించారు. అంబులెన్స్ సరిపడ సిబ్బంది లేకపోవడంతోనే ఇలా జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. ఘోరఖ్ పూర్ వంటి దేశాన్ని కుదిపే సంఘటన జరిగిన మన అధికారులు నిర్లక్ష్యం పాటించడం పట్ల సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

12:50 - November 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ లాబీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కలకలం రేపింది. డెల్టా సుగర్స్ విషయంలో సీఎంవో తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని వంశీ మనస్తాపానికి గురయ్యారు. సీఎంవోలో వంశీ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక ప్రజా ప్రతినిధికి విలువ లేనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో వంశీ రాసిన రాజీనామా లేఖను బోడే ప్రసాద్ తీసుకుని చించి వేశారు. వంశీకి సర్ది చెప్పేందుకు మంత్రి నారా లోకేష్ కళా వెంకట్రావును పంపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:39 - November 22, 2017

జగిత్యాల : ప్రొ.కంచ ఐలయ్యను అడ్డుకునేందుకు వైశ్యులు, బీజేపీ కార్యకర్తలు యత్నించారు. కోరుట్ల కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఐలయ్యను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బందోబస్తుతో కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు ఐలయ్య హాజరయ్యారు. కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో వైశ్యులు నిరసన తెలిపారు. కోర్టు ముందు పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీ అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే రాజీనామా కలకలం

గుంటూరు : అమరావతిలో ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే వంశీ రాజీనామా కలకలం సృష్టించింది. డెల్టా షుగర్స్ విషయంలో సీఎంఓ తన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సీఎంఓలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.  

ఢిల్లీ పర్యటనలో మంత్రి హరీష్ రావు

ఢిల్లీ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రులు నీతిన్ గడ్కరీ, సుజన చౌదరిలను కలిశారు. ఉస్మానియా యూనివర్శిటీలో జరిగే సైన్స్ కాంగ్రెస్ సదస్సు పై సుజన తో చర్చించారు.

12:15 - November 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు గులాబీ పార్టీకి కలిసొస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడంతో.. మిగిలిన నేతలు తమ దారిని వెతుక్కుంటున్నారు. ఇదే అదనుగా అధికార పార్టీ బలమైన నేతలకు గాలం వేస్తూ.. మరింత బలపడేందుకు ప్రణాళికలను అమలు చేస్తోంది. 
నెల రోజులుగా తీవ్రమైన వలసలు 
తెలంగాణ రాజకీయాల్లో నెల రోజులుగా వలసలు తీవ్రమయ్యాయి. అధికార పార్టీ సహా.. ప్రధాన ప్రతిపక్షం కూడా వలసలకు పచ్చజెండా ఊపడంతో నేతలు తమ దారులు తాము చూసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నేతలు రాజకీయంగా తమ నిర్ణయాలు తీసుకుంటూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనతో పాటు మరి కొంత మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 
కారెక్కించుకునేందుకు అధికార పార్టీ రెడీ 
తమకంటూ గుర్తింపు ఉన్న మరి కొంతమంది నేతలు ఇంకా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నా.. అవకాశం కోసం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్, టీడీపీలు పొత్తు కుదిరితే తమకు ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో కొంత మంది నేతలుండగా.. ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలతో పాటు ప్రజల్లో అసంతృప్తిని ఎదురుకుంటున్న నియోజకవర్గాలపై గులాబి బాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉంటే వారిని కారెక్కించుకునేందుకు అధికార పార్టీ రెడీ అంటోంది. అందులో భాగంగానే నల్లగొండకు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి, భూపాల్‌పల్లి నుంచి గండ్ర సత్యనారాయణ రావ్‌ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
టీఆర్ ఎస్ నేతలతో టచ్‌లో మరి కొంతమంది 
మరి కొంతమంది నేతలు కూడా అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వైపు సైకిల్‌పై ఉన్న నేతలు ఒక్కొక్కరు దిగిపోతుంటే.. వలస నేతలతో మరోవైపు కారు ఓవర్‌ లోడ్ అవుతోంది. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీ నేతలొచ్చినా గులాబి పార్టీ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది. 

 

12:12 - November 22, 2017

ఏపీ ప్రకటించిన నంది అవార్డుల సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు అగ్ని అజ్యం పోశాయి. నంది అవార్డులు ప్రకటించిన మరుసటి రోజు నుంచి సినీ పరిశ్రమలో ఎవరో ఒకరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దర్శకడు గుణశేఖర్, నిర్మాత బండ్ల గణేష్ నంది అవార్డులపై విమర్శలు గుప్పించారు. కొందరైతే ఈ అవార్డులకు కులాన్ని, ప్రాంతాన్ని అపాదించడంతో దీపై చర్చ మరింత రాజుకుంది.

లోకేశ్ నిజాంగానే వాఖ్యలు చేశారా...?
నంది అవార్డుల విమర్శలపై లోకేశ్ స్పందించినట్టు ఓ ప్రముఖ పత్రికలో వార్తాలు వచ్చాయి. ఏపీ లో ఆధార్ కార్డు లేని వారు మాట్లాడుతున్నారని, వారంతా ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని లోకేశ్ వ్యాఖ్యనించినట్టు ఆ వార్తా సంస్థ ప్రచురించింది. లోకేష్ వ్యాఖ్యలపై సినీ నటుడు, రచయత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే ఆయనా చేసిన వాఖ్యల్లో కూడా తప్పుఒప్పులున్నాయని విశ్లేషులకు అంటున్నారు. కేసీఆర్ లేకపోతే హైదరాబాద్ లో ఆంధ్రవారు కుక్కల్ల బ్రతికేవాళ్లమని పోసని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దూమరాన్ని లేపుతున్నాయి. ఏదిఏమైనా ప్రతిభ కు ఇచ్చే అవార్డుల్లో కుల, ప్రాంత అంశాలను తీసుకురావడం అటు ఏపీ ప్రభుత్వానికి ఇటు సినీ ఇండస్ట్రీకి మంచి కాదు.

 

12:00 - November 22, 2017

గుంటూరు : ఆరు వందల నలభై తొమ్మిది గ్రామాలకు పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్లు కేటాయించి.. తాగునీరందిస్తున్నట్లు మంత్రి నారాలోకేశ్‌ తెలిపారు. 325 ఫ్లోరైడ్ ఎఫెక్ట్ గ్రామాల్లో కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా ఇండివిజువల్ కమ్యూనిటీ వాటర్‌ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు.. 1213 గ్రామాలకిచ్చినట్లు మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. 

 

11:58 - November 22, 2017

కృష్ణా : జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం మండలంలో థర్మల్‌ కోల్ ప్లాంట్ దగ్గర అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. 

11:56 - November 22, 2017

హైదరాబాద్ : తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న ఏఎన్‌ఎమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి యుతంగా ధర్నా నిర్వహిస్తున్న తమను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై ఏఎన్‌ఎమ్‌లు మండిపడుతున్నారు. సీఎంను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

11:51 - November 22, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీ నగర్‌ మండలం మాధారం గ్రామంలోని పాఠశాల విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఇందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులను ఆంబులెన్సు ద్వారా ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

 

11:48 - November 22, 2017

కర్నూలు : పట్టణంలో నకిలీ ఆర్టీవోలను ఉల్లిందకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్ది రోజుల నుండి కర్నూలు శివార్లలో ముగ్గురు యువకులు వాహనాలను ఆపి బెదిరించి వారి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనదార్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్టీవో హోంగార్డులమని బెదిరిస్తున్న ముగ్గురు యువకులు సందీప్‌, రమేష్‌, వెంకటప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

 

11:47 - November 22, 2017

హైదరాబాద్ : కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కాప్రాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై  83 ఏళ్ల వాచ్‌మెన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్‌లెట్స్‌ ఇస్తానని చెప్పి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఐదుగురు విద్యార్థులతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వాచ్‌మెన్‌ను అరెస్ట్‌ చేశారు. వాచ్ మెన్ కు పాఠశాల చుట్టుపక్కల ఉన్న మరో వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:42 - November 22, 2017

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఐటీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్‌ చేశారు. కాలేజ్‌ యాజమాన్యం మీడియాను లోపలికి అనుమతించలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:36 - November 22, 2017

హైదరాబాద్ : తెల్లకార్డు తెల్లబోతోంది. పేదవారి ఆహారభద్రతకు అండగా ప్రవేశపెట్టిన తెల్లకార్డు నల్లబడుతోంది. నెలవారీగా ఇచ్చే సరుకుల జాబితా నుంచి ఒక్కొక్కటిగా రద్దు కావడం చూసి విస్తుపోతోంది. అన్నార్థుల ఆకలి తీర్చడమే మా లక్ష్యమంటూ ఎన్నికల హామీలు గుప్పించే పాలకుల వాగ్ధానాలు గుర్తొచ్చి నవ్వుకుంటోంది. 
బడుగు జీవుల్లో గుబులు 
తెల్లరేషన్‌ కార్డు..ఇది పేదోడికి కొండంత అండ. ఈ కార్డు చేతిలో ఉంటే ఎలాగైనా బతికేయొచ్చన్న ధీమా. పంచభక్షపరమాన్నాలు కాకపోయినా..రెండుపూటల ఆకలితీరుతుందన్న భరోసా. కానీ ఆ నమ్మకం తెలంగాణలో రానురాను సన్నగిల్లుతోంది. ఇప్పటికే పంచదారకు మంగళం పాడిన కేసీఆర్‌ ప్రభుత్వం..ఇప్పడు కిరోసిన్‌లోనూ కోతలు పెట్టేందుకు రంగం సిద్ధం చేయడం..బడుగు జీవుల్లో గుబులు పుట్టిస్తోంది. 
పంచదార సరఫరా రద్దు 
కేంద్రం సబ్సీడి ఎత్తేసిందన్న కారణంతో..తెలంగాణ ప్రభుత్వం నెలవారీగా ఇచ్చే రేషన్‌ కోటానుంచి ఇప్పటికే పంచదార సరఫరాను రద్దు చేసింది. అదనపు భారాన్ని భరించలేమంటూ రేషన్‌ సరకుల జాబితా నుంచి ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. ఇప్పుడు వచ్చే నెల నుంచి కిరోసన్ పంపిణీలో కోతలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల 60 లక్షల మంది జనాభా ఉండగా.. కోటికి పైగా కుటుంబాలున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో లేవు. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయంలో వందకే వంట సరుకులు అనే పథకం ప్రవేశపెట్టి... తొమ్మిది రకాల నిత్యావసరాలు రేషన్ షాపుల ద్వారా పంపిణి చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీన్ రివర్స్ అయ్యింది.
కిరోసిన్‌ కోటాలో కోత 
ప్రస్తుతం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అయ్యే కిరోసిన్‌ కోటాలో కోత పెట్టింది. 9072 కిలో లీటర్లకు గాను..8184 కిలోలీటర్ల మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో... మున్సిపల్ కార్పొరేషన్‌లో నాన్ ఎల్పీజి ఉన్న వారికి తెల్లకార్డుపై నెలకు రెండు లీటర్లు పంపిణీచేసేవారు. మండల కేంద్రాలు, మున్సీపాల్టీల్లో ఇదే విధానం అమల్లో ఉంది. ఇక సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబానికి లీటరు చొప్పున సరఫరా చేసేవారు. అయితే వచ్చే నెల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఒక్కొ లీటర్ చొప్పున కిరోసిన్‌ పంపిణీ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ అదేశాలు జారీ చేసింది.  
సింగిల్ సిలిండర్ ఉన్న వారిక లీటరు చొప్పున సరఫరా 
ఇక ఆహార భద్రత కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాత కార్డుల స్థానంలో ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు ఇస్తామని ఆర్భాటప్రకటనలు చేసింది. కొత్తకార్డుల కోసం లబ్దిదారుల ఫోటోలు దింపుకున్నా... ఇప్పటివరకు అతిగతి లేదు. పాతకార్డులు పనిచేయక కొత్తకార్డులు అందక అవస్థలు పడుతున్నవారి సంగతి సరేసరి. కొండెక్కుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..పేదోడికి అండగా ఉండే తెల్లకార్డు నుంచి ఒక్కొక్కటిగా సరకులు తొలగించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.  

 

11:26 - November 22, 2017

గుంటూరు : ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మినిమం 55 ఎన్ పీసీడీ ఇవ్వాలని కేంద్రం చెబితే..వాటిని 70 ఎన్ పీసీడీలకు పెంచి సురక్షితమైన త్రాగునీరు అందించాలని భావించామని చెప్పారు. ఎండాకాలంలో ఎలాంటి తాగునీటి సమస్య ఉండకూడదని యోచిస్తున్నట్లు చెప్పారు. ఓహెచ్ ఎస్ ఆర్ ట్యాంకులకు రూ.45 కోట్లు కేటాయించామని తెలిపారు. పాత ట్యాంకులు, పెయింటింగ్ చేయించాలని పేర్కొన్నారు. ఫేజ్ 1 కింద 2వేల ట్యాంకుల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. పాత పైపులను మార్చాల్సిన అవసరముందని.. ప్రతిపాదనలను తీసుకుని పాత పైపులను మార్చుతామన్నారు.

 

కరీంనగర్ జిల్లాలో విషాదం

కరీంనగర్ : జిల్లాలో 17న మల్కాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది.  ఆసుపత్రిలో బిల్లు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

11:21 - November 22, 2017

హైదరాబాద్ : ఎన్నో ఏళ్లుగా వైద్యా ఆరోగ్య శాఖలో పని చేస్తున్నా తమకు కనీస వేతనం ఇవ్వడంలేదని ఏఎన్‌ఎమ్‌లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.  తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్‌ఎమ్‌లు సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి బయలుదేరారు. వెంటనే తమను పెర్మినెంట్‌ చేసి వేతనం పెంచాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. 'మీ కాళ్లు మొక్కుతాం..సార్.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పియండి సార్... కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లండని' వేడుకున్నారు. కేసీఆర్ దగ్గరు వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. మేము కేసీఆర్ బిడ్డలం. మాకు న్యాయం చేయండి'...అంటూ ఏఎన్ ఎమ్ లు బతిమిలాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గురునానక్ ఎడ్యుకేషనల్ సొసైటీపై ఐటీ దాడులు

హైదరాబాద్ : గురునానక్ ఎడ్యుకేషనల్ సొసైటీపై ఐటీ దాడులు చేస్తున్నారు. గురునానక్ ఇంజనీరింగ్ , డెంటల్ కాలేజీల్లో సోదాలు రియల్ ఎస్టేట్ బిజినెసన్ చేస్తున్న గురునానక్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి రూ.7.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు 

11:12 - November 22, 2017

హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్‌లో ఓ కానిస్టేబుల్ ఓవరాక్షన్‌ చేశాడు. లంచం ఇవ్వలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం గాయపడిన బాధిత డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రయాణికుల ముందే డ్రైవర్‌ని కొద్దిదూరం తీసుకెళ్లి కొట్టాడు. నాంపల్లిలో జగన్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ సురేందర్, కృష్ణనాయక్‌లు తనను లంచం డిమాండ్‌ చేశారని, ఇవ్వకపోవడంతో దాడి చేశారని బాధితుడు చెబుతున్నాడు. ఆటోలోకి ఎక్కించి మరీ కొట్టాడని వాపోయాడు. గతంలోనూ తనను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లి కొట్టారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమలాంటి పేదవారిపై దాడి చేస్తే ఎలా బతకాలని బాధితుడు ప్రశ్నించాడు. తనపై దాడి చేసిన కానిస్టేబుల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

 

10:59 - November 22, 2017

హైదరాబాద్ : ఎన్నో ఏళ్లుగా వైద్యా ఆరోగ్య శాఖలో పని చేస్తున్నా తమకు కనీస వేతనం ఇవ్వడంలేదని ఏఎన్ ఎంలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.  తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్ ఎంలు సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి బయలుదేరారు. వెంటనే తమను పెర్మినెంట్‌ చేసి వేతనం పెంచాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఏఎన్‌ఎమ్‌లతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

కుషాయిగూడలో దారుణం

మేడ్చల్ : జిల్లా కుషాయిగూడలో దారుణం జరిగింది. కాప్రా ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఏడోతరగతి విద్యార్థినిలపై వాచ్ మెన్ అత్యాచారం చేశాడు. మరో ఐదుగురు విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పీఎస్ ఫిర్యాదు చేశారు.

ఏపీ విద్యుత్ క్రాంటాక్ట్ కార్మికుల దీక్షలు

కృష్ణా : విజయవాడలోని ధర్నా చౌక్ లో విద్యుత్ క్రాంటాక్ట్ కార్మికుల దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్ష చేస్తున్న ముగ్గురు కార్మికులకు షుగర్ లెవల్స్ పడిపోయాయి.  వీది దీక్షలపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 

ఏపీ డీజీపీ నియామకంపై వీడని సందిగ్దం

గుంటూరు : ఏపీ డీజీపీ నయామకంపై ఇంక సందిగ్దం వీడలేదు. యూపీపీఎస్సీకి ఏపీ ప్రభుత్వం పంపిన జాబితాను రెండోసారి తిరిగి పంపింది. డీజీపీగా సాంబశివరావు కొనసాగింపుకే సీఎం ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన పదవి కాలన్ని ఆరు నెలలపాటు పొడగించే ఆవకాశం ఉంది. 

10:43 - November 22, 2017

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే ప్రపంచ పరిశ్రామిక సదస్సుకు పద్మావతి సెగ తగిలినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె ఈ సదస్సులో పాల్గొని హాలీవుడ్ టూ బాలీవుడ్ అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది. అయితే పద్మావతి చిత్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దీపిక ఈ కార్యక్రమం నుంచి తన పేరు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.  

10:42 - November 22, 2017

ఆవును ఇది నిజామే ఐశ్వర్య ఏడ్చేసింది....బాలీవుడ్ అందాల రాశి, అబితాబ్ బచ్చన్ కోడలు ఐశ్యర్య మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఆమె తండ్రి కృష్ణారాయ్ జయంతి సందర్బంగా ముంబైకి చెందిన స్మల్ పౌండేషన్ ద్వారా అంగవైకల్యాంతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జీరి చేయించారు. ఆ చిన్నారులతో కాసేపు గడిపారు. వారి మధ్య తన తండ్రి జయంతి పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఇంతలో ఆమె చుట్టూ మీడియా ప్రతినిధులు గుమిగుడారు. ప్లీజ్‌ నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీదు. ఇది సినిమా ప్రీమియర్‌ షో కాదు. పబ్లిక్‌ ఈవెంట్‌ అంతకన్నా కాదు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఐష్‌ కన్నీరుపెట్టుకున్నారు.‘ప్లీజ్‌ నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీదు. ఇది సినిమా ప్రీమియర్‌ షో కాదు. పబ్లిక్‌ ఈవెంట్‌ అంతకన్నా కాదు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఐష్‌ కన్నీరుపెట్టుకున్నారు. 

కంచ ఐలయ్యను అడ్డుకునేందుకు వైశ్యులు, బీజేపీ కార్యకర్తల యత్నం

జగిత్యాల : జగిత్యాలలో ప్రొ.కంచ ఐలయ్యను అడ్డుకునేందుకు వైశ్యులు, బీజేపీ కార్యకర్తలు యత్నించారు. కోరుట్ల కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఐలయ్యను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల బందోబస్తుతో ఐలయ్య కోరుట్ల కోర్టుకు హాజరయ్యారు. 

సింహాచలం దేవస్థానంలో చక్కెర పొంగలి ప్రసాదంలో బొద్దింక

విశాఖ : సింహాచలం దేవస్థానంలో చక్కెర పొంగలి ప్రసాదంలో బొద్దింక లభ్యం అయింది. 15 రోజుల వ్యవధిలో రెండో సారి ఘటన. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. 

 

10:18 - November 22, 2017
09:53 - November 22, 2017

కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్‌రోడు చేరుకుంటారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 4.30 గంటలకు  పెండెకల్‌ చేరుకొంటారు.  సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. 

 

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై మండలిలో చర్చ

గుంటూరు : ఎంజీఎన్ ఆర్ ఈజీఎస్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల సదుపాయాల కల్పనపై ఏపీ శాసన మండలిలో చర్చ జరుగనుంది.

 

నర్సరీ యూనిట్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్న విష్ణుకుమార్ రాజు

గుంటూరు : ప్రజా ప్రాధాన్యత అంశంగా తూర్పుగోదావరి జిల్లాలో నర్సరీ యూనిట్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తీసుకురానున్నారు. 

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రులు, ఎంపీ కవిత పర్యటన

నిజామాబాద్ : నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత పర్యటించనున్నారు. కలెక్టరేట్ లో భూ సర్వేపై రివ్యూ నిర్వహించనున్నారు.

 

నాల్గో రోజు కొనసాగుతున్న సంగీత న్యాయపోరాటం

మేడ్చల్ : టీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత న్యాయపోరాటం నాల్గో రోజు కొనసాగుతోంది. భర్త శ్రీనివాన్ రెడ్డి ఇంటి ఎదుట సంగీత ధర్నా కోనసాగిస్తోంది. మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. అత్తామామ లేదా పోలీసుల నుంచి హామీ వచ్చే వరకు ఆందోళన విరమించనని చెప్పారు. ఇంకా సంగీత అత్తామామలు పరారీలో ఉన్నారు. 

 

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

ప్రగతి భవన్ ముట్టడికి ఏఎన్ ఎంల యత్నం

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి ఏఎన్ ఎంల యత్నించారు. 2003 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఏఎన్ ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఏఎన్ ఎంలను అడ్డుకుని అరెస్టు చేశారు.
 

08:57 - November 22, 2017

హరారే : జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్‌ ముగాబే రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షుడిగా సేవలందించిన ముగాబే రాజీనామా చేసినట్లు.. అధికారికంగా ప్రకటించారు. ముగాబే రాజీనామాను పార్లమెంట్‌ స్పీకర్‌ జాకబ్‌ ముదెండా ధృవీకరించారు. ఓ వైపు ముగాబేను అభిశంసన తీర్మానం ద్వారా తొలగింపునకు పార్లమెంట్‌ సిద్దమైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ముగాబే రాజీనామాతో హరారే వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. 

 

పోలవరం ప్రాజెక్టుపై నేడు ఏపీ శాసనసభలో చర్చ

అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై నేడు శాసనసభలో చర్చ జరుగనుంది. న్యాయవాదుల సంక్షేమ నిధి..2017 బిల్లు, ఏపీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ప్రిమిసెస్ టెనాన్సి బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్..2017 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

 

ఏపీ అసెంబ్లీలో పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తనున్న సభ్యులు

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చిన్నపట్టణాల నగరాలుగా అభివృద్ధి పరచుట, నిరుద్యోగ భృతి,  ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు, చేనేత కార్మికులకు మగ్గం షెడ్ లతో గృహాల మంజూరు, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, కేంద్రం నుండి పీవీటీజీ నిధుల అంశాలపై శాసనసభలో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. 

ఈనెల 26న అమరావతిలో టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

అమరావతి : టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఈనెల 26న ఉదయం 5.15 గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరి సమీపంలో డీజీపీ కార్యాలయం పక్కన పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం 4 ఎకరాలు కేటాయించింది. 

 

ఏపీ టూరిజం లాడ్జీలో పేకాటరాయుళ్ల అరెస్టు

కడప : జమ్మలమడుగు మండలం గండికోటలోని ఏపీ టూరిజం లాడ్జీలో 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

 

తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించనున్న కోర్ కమిటీ

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో తెలుగు మహాసభల ఏర్పాట్లను మహాసభల కోర్ కమిటీ పరిశీలించనుంది. 

 

నేడు నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ స్పీకర్, ఎంపీ కవిత పర్యటన

నిజామాబాద్ : నేడు జిల్లాలో డిప్యూటీ స్పీకర్, ఎంపీ కవితలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

 

మీయాపూర్ భూస్కాం కేసులో నేడు హైకోర్టుకు నివేదిక

హైదరాబాద్ : మీయాపూర్ భూకుంభకోణం కేసులో ప్రభుత్వం నేడు హైకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. 

 

07:41 - November 22, 2017

జగన్ పాదయాత్ర, టీడీపీ ప్రభుత్వ పాలనపై వక్తలు హాట్ హాట్ గా చర్చించారు. భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు పద్మజా రెడ్డి, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. పరస్పరం వాదోపవాదాలకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:36 - November 22, 2017

ఎంబీసీల సమస్యలను పరిష్కరించాలని ఎంబీసీల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎంబీసీ కులాలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. 'అసలు ఎంబీసీ కులాలేవి అనే క్లారిటీ ప్రభుత్వం దగ్గర ఉందా... ఎంబీసీ కార్పోరేషన్‌ ద్వారా వారికి జరిగిన ఉపయోగం ఏమిటి. మీరు కేటాయిస్తానన్న వెయ్యి కోట్లు నిధులెక్కడ... ఈ ప్రశ్నలు గత శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పందించినవి.. తన ప్రశ్నల ద్వారా ఎంబీసీల మీద ప్రభుత్వ విధానంపై చర్చను లేవనెత్తారు'..ఈ అంశాలపై ఆశయ్య మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

07:31 - November 22, 2017

బీహార్ : ప్రధాని నరేంద్రమోదిని ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తానంటూ బిహార్‌ బిజెపి అధ్యక్షుడు నిత్యానంద్‌ రాయ్‌ హెచ్చరించారు. పట్నాలో జరిగిన ఓబిసి సభలో నిత్యానంద్‌ ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యానంద్‌ మాట్లాడుతున్నపుడు బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోది కూడా అక్కడే ఉన్నారు. ఓ పేదవాడి కుమారుడు ప్రధాని స్థాయికి ఎదగడం ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయమన్నారు. ఎవరైనా మోదిని వేలెత్తి చూపితో వారి వేలుతో పాటు చేతిని నరికివేయాలని రెచ్చగొట్టారు. ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తుతూ అత్యుత్సాహంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు పేదలు, జాతి వ్యతిరేక శక్తులకే అభ్యంతరంగా ఉంటుందని నిత్యానంద్‌ చెప్పారు. 

 

07:29 - November 22, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల పంపకాలపై పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితికి కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రకటనపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. హార్దిక్‌ పటేల్‌ గురువారం నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చే ప్రకటన మళ్లీ వాయిదా పడింది. అంతకు ముందు నవంబర్‌ 18న గాంధీనగర్‌లో జరిపే ర్యాలీలో కాంగ్రెస్‌ మద్దతుపై ప్రకటన చేస్తామని హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కానీ ఏకంగా సభనే రద్దు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పటేల్‌ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితులైన లలిత్‌ వసోయా, అమిత్‌ థమ్మర్‌లకు మాత్రమే టికెట్‌ లభించింది. మరో 20 స్థానాలు కేటాయించాలని పాస్‌ డిమాండ్‌ చేస్తోంది. 

 

07:26 - November 22, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ద్వారకా మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ నెంబర్‌-768 దగ్గర పోలీసులకు-క్రిమినల్స్‌ కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. స్టేషన్‌కు సమీపంలోని ఓ భవనంలో క్రిమినల్స్ దాగున్నారన్న సమాచారంతో పంజాబ్‌-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐదుగురు క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దుండగుల కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నట్లు  నైరుతి ఢిల్లీ డీసీపీ శిబేష్ సింగ్  తెలిపారు. వీరిపై హత్య, హత్యాయత్నం, కార్‌జాకింగ్ వంటి ఆరోపణలు ఉన్నట్లు ఆయన వివరించారు. క్రిమినల్స్‌ నుంచి 13 తుపాకులు, 100 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

07:25 - November 22, 2017

హైదరాబాద్ : న్యాయం కోసం ఉప్పల్‌లో సంగీత చేస్తున్న పోరాటం నాలుగో రోజుకు చేరింది. అత్త, మామలను తన దగ్గరకు తీసుకువచ్చి ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పేదాకా... తన దీక్ష ముగించేది లేదని సంగీత అంటోంది. చలిలో కూతురితో కలిసి ఆమె చేస్తున్న పోరాటం అందరినీ కలిచివేస్తోంది. సంగీత దీక్షకు మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి. సంగీతకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:20 - November 22, 2017

మహబూబ్ నగర్ : తాగునీటి సరఫరా, పీడబ్ల్యూఎస్‌ మోటార్‌ రిపేర్లు, పైపులైన్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారు. విద్యుత్‌ దీపాల ఏర్పాటు, సభలు, సమావేశాల పేరుతో లక్షలు డ్రా చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వీధిలైట్లు వేసి.. మూడుసార్లు బిల్లులు డ్రా చేసినట్టు ఆధారాలున్నాయి.  ఒక్కసారి బోరు మోటారు రిపేరైతే... దానిపై అనేకమార్లు బిల్లులు పెట్టి డ్రా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
రికార్డులను తారుమారు చేయించిన సర్పంచ్‌ భర్త
గ్రామంలో ఏ పనిచేయాలన్నా సర్పంచ్‌ భర్తగారికి భారీగా ముడుపులు చెల్లించుకోవాలి. తన అవినీతి బయటపడకుండా సర్పంచ్‌ భర్త రికార్డులను తారుమారు చేసేలా ఆడిటింగ్‌ చేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గ్రామస్తులు ఆయన అవినీతిపై రాష్ట్ర, కేంద్ర విజిలెన్స్‌ అధికారులకు  ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం కార్యాలయం నుంచి సంబంధిత అధికారులు... జరిగిన అవినీతిపై విచారణ జరపాలని నోటీసులు జారీ చేశారు.  వాస్తవానికి ఈనెల 16న ఈ విచారణ జరగాల్సి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే అండతో ఆ విచారణ జరుగకుండా మ్యానేజ్‌ చేసుకున్నారు. ఇలాంటి అవినీతి పరులకు ఎమ్మెల్యే అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
టీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపులు
నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన శివకుమార్‌రెడ్డి ఒకవర్గమైతే... ఎమ్మెల్యేది మరోవర్గం. ఈ ఇద్దరి నేతల మధ్య అసలు పొసగడం లేదు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో శివకుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే కనీసం వేదికపైకి పిలువకుండా చేశారు. అంతేకాదు.. శివకుమార్‌రెడ్డి వర్గీయులపైనా ఎమ్మెల్యే కక్షసాధింపుకు పాల్పడుతున్నారు. శివకుమార్‌రెడ్డి వర్గీయులైన సర్పంచ్‌లు, ఎంపిటీసీలకు ఎమ్మెల్యే నయాపైసా విదల్చడం లేదు.  తన వర్గం వారికే నిధులు మంజూరు చేయిస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో ఎమ్మెల్యే వేధింపులు భరించలేక కొంతమంది ఎంపీటీసీలు సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో ఎంపీటీసీ తనకు ఎమ్మెల్యే వర్గీయులతో  ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాన్‌కుర్తి ఎంపీటీసీ సైతం.. ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
ఎమ్మెల్యే తీరుపై అధికారపార్టీ నేతల్లోనే తీవ్ర నిరసన 
టీఆర్‌ఎస్‌ నేతలే తమకు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం అధికారపార్టీ నేతలను అయోమయానికి గురిచేసింది. ఎమ్మెల్యే తీరుపై అధికారపార్టీ నేతల్లోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు. 

07:14 - November 22, 2017

హైదరాబాద్ : సీఐడీ  ఆఫీసర్‌నంటూ ఎయిర్‌పోర్టు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన నాగేశ్వరరావు అనే వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో నాగేశ్వరరావు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అతనిని విచారించిన ఎయిర్‌పోర్టు పోలీసులు నకిలీ సీఐడీ ఆఫీసర్ అని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

07:12 - November 22, 2017

హైదరాబాద్‌ : నగరంలో టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీనివాసరావును నమ్మించి హత్య చేసిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ముందు దుండగులు శ్రీనివాసరావును బైక్‌పై తీసుకెళ్లిన సీసీటీవీ పుటేజీ వెలుగులోకివచ్చింది. శ్రీనివాసరావు ఓ ఫంక్షన్ హాలు దగ్గర కొంతమంది మద్యం తాగుతున్న విషయాన్ని చూసి ఎస్ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మద్యం తాగుతున్న వారిని పోలీస్ జీపులో తీసుకెళ్లారు. శ్రీనివాసరావు అక్కడున్న విషయాన్ని ఒకతను గుర్తించారు. ఆ తర్వాత శ్రీనివాసరావును అక్కడి నుంచి దుండగులు బైక్‌పై సనత్ నగర్ బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్రీనివాసరావును హత్య చేశారు. ఈ మొత్తం కేసు ఛేదించడానికి సీసీ కెమెరా పుటేజ్ ఉపయోగపడింది.

 

07:10 - November 22, 2017

హైదరాబాద్ : 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌...  ఇప్పుడు రిజర్వుడు నియోజకవర్గాలపై  ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో గట్టి పునాదులు వేసేందుకు  కార్యాచరణ రూపొందించింది. వచ్చే ఎన్నికల్లో రిజర్వుడు సీట్లలో కాంగ్రెస్‌ జెండా ఎగిరేలా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 
ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన టీ కాంగ్రెస్‌ 
తెలంగాణ కాంగ్రెస్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన టీ కాంగ్రెస్‌ నేతలు ఇతర పార్టీల నుంచి చేరికను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్‌పై పోరును ఉద్ధృతం చేస్తూనే,  మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 
తెలంగాణలో ఎల్‌డీఎంఆర్‌సీ ఫార్ములా 
దీనిలో భాగంగా లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వర్డ్‌ కానిస్టిట్యూటియన్సీస్‌... ఎల్‌డీఎంఆర్‌సీ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ఈ ఫార్ములాతో పంజాబ్‌లో సత్ఫలితాలు రావడంతో తెలంగాణలో ప్రయోగం చేయాలని నిర్ణయించింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు  శ్రీకారం చుట్టంది. మిషన్‌ 31 పేరుతో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో ఎల్‌డీఎంఆర్‌సీని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 
పోలింగ్‌ బూత్‌ల స్థాయిలో ఏజెంట్ల కమిటీలు 
ఎల్‌డీఎంఆర్‌సీ అమలు కోసం స్థాయిల్లో సమన్వయ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది.  పోలింగ్‌ బూత్‌ స్థాయిలో  ఏజెంట్ల కమిటీలను  నియమించింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇలా 10 వేల మంది సుశిక్షితులైన కార్యకర్తలను సిద్ధం చేసింది. కమిటీల పనితీరును కూడా పార్టీ నేతలు సమీక్షించారు. 
రిజర్వుడు స్థానల్లో సమస్యలు గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌లు 
రెండవ దశలో ఎల్‌డీఎంఆర్‌సీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేయడం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లక్ష్యం. మొత్తానికి గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండి, గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన రిజర్వుడు నియోజకవర్గాలను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వేస్తున్న అడుగులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మస్కట్ నుంచి ఓ ప్రయాణికుడు నుంచి 216 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

07:03 - November 22, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి తెలుగుభాషను ఇంటర్‌ వరకు తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా, ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్‌ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో కూడా తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు 
తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులు, తెలుగుభాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే  మొదటి తరగతి నుంచి ఇంటర్‌ వరకు  తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.  ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.  తెలుగు సులభంగా నేర్చుకునేందుకు అవసరమైన పాఠ్యాంశాలు, పుస్తకాలు రూపొందించాలన్నారు. ఉపసంఘాన్ని ఇకపై తెలుగు భాషా అమలు సలహా సంఘంగా మార్చుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు అవసరమన్నారు. తెలుగును విద్యార్థులకు ఆసక్తికరంగా, స్కోరింగ్‌ సబ్జెక్ట్‌గా మార్చాలని అధికారులకు సూచించారు. 
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో తెలుగు తప్పనిసరి చేయవచ్చన్న సభ్యులు
ఉపసంఘం సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని ప్రస్తుత విధానాలను కడియం శ్రీహరికి వివరించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాల్లో తెలుగు తప్పనిసరి చేయవచ్చని వెల్లడించారు. తెలుగు తప్పనిసరిపై అభ్యంతరం లేదని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తెలిపిందని వివరించారు.  మాతృభాషను తప్పనిసరి భాషగా నిబంధనలు అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు మాతృభాషగా లేని పాఠశాలలు 1370 వరకు ఉన్నాయని అధికారులు కడియం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.  తెలుగు చదువుకోనివారు సులభంగా నేర్చుకునేలా పాఠ్యపుస్తకాల రూపకల్పన జరగాలని వారు అభిప్రాయపడ్డారు. 

 

నేడు ఏఈవో గ్రేడ్ 2 పోస్టులకు రాత పరీక్ష

హైదరాబాద్ : ఏఈవో గ్రేడ్ 2 పోస్టులకు నేడు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుది. 

 

Don't Miss