Activities calendar

23 November 2017

21:29 - November 23, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పసికందు మాయం కావడం కలకలం రేపింది. తొండంగి మండలం హుకుంపేటకు చెందిన జయలక్ష్మికి జన్మించిన చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నపిల్లల వార్డులో ఉన్న పసిపాపను ముఖానికి ముసుగు ధరించిన మహిళ అపహరించినట్లు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

21:20 - November 23, 2017

హైదరాబాద్ : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.30కు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి మియాపూర్‌కు మోదీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోరైలులో ప్రధాని ప్రయాణిస్తారు. తిరిగి అదే మెట్రో రైలులో కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు మోదీ ప్రయాణిస్తారు. తర్వాత మియాపూర్ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లో వెళ్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు హెచ్‌ఐసీసీలో ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు జరగనుంది. సదస్సులో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం హెచ్‌ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఇవాంకా, జీఈఎస్ ప్రతినిధులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రాత్రి 8.45 గంటలకు విందు కార్యక్రమం ఉంటుంది. విందు తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి.. అక్కడి నుంచి మోదీ ఢిల్లీ వెళ్లనున్నారు.

21:16 - November 23, 2017

ఢిల్లీ : పర్యటనలో మంత్రి కేటీఆర్‌ బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్‌తో సమావేశమై.. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. నెల రోజుల్లో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ తుది నివేదిక అందుతుందని..తుది నివేదిక ఆధారంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ని కలిసిన కేటీఆర్‌.. పోచంపల్లి చేనేత చీరను బహూకరించారు. అరబ్‌దేశాల్లో తెలంగాణ కార్మికుల సమస్యలను సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. సిరిసిల్లకి చెందిన ఆరుగురు కార్మికుల విడుదలకు ప్రయత్నాలు జరపాలని కోరినట్లు కేటీఆర్‌ చెప్పారు.

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ పై స్పష్టత
సుష్మాస్వరాజ్‌ని కలిసిన అనంతరం కేటీఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీని కలిశారు. మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. నగరంలో జరుగుతున్న డబుల్ బెడ్‌ రూం పనులను మంత్రికి వివరించారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని మెట్రో ప్రారంభానికి వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పినట్లు కేటీఆర్‌ తెలిపారు. మొత్తానికి బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ పై స్పష్టత వచ్చేలా కేంద్ర మంత్రి నుంచి హామీలను తీసుకున్నారు మంత్రి కేటీఆర్‌. అలాగే ఈ నెల 28న మెట్రో ప్రారంభానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించారు.

21:15 - November 23, 2017

గుంటూరు : జిల్లాలో దళితులపై వివక్ష తారస్థాయిలో కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నున్నం రవికుమార్‌ ఆత్మహత్య.. ఈ వాస్తవాన్ని మరోమారు ప్రపంచానికి చాటింది. దళితుడైన కారణంగా.. తనను ఉన్నతాధికారులు ఎలా వేధించారో.. ప్రమోషన్‌ రాకుండా ఎలా అడ్డు తగిలారో.. లంచాల కోసం ఎంతలా వేధించారో.. కళ్లనీళ్ల పర్యంతమవుతూ.. సెల్ఫీ వీడియో తీసుకున్న రవికుమార్‌.. ఆ తర్వాత... బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండురోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన రవికుమార్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందారు.గుంటూరు అంకమ్మనగర్‌కు చెందిన నున్నం రవికుమార్‌, ఏడాది కిందట పొన్నూరుకు బదిలీ అయ్యారు. తిరిగి గుంటూరుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. ఉన్నతాధికారులు రూ.లక్ష లంచం అడిగారని, తాను ఇప్పటికే రూ.70వేలు ఇవ్వగా దాన్ని మధ్యవర్తులు మింగేశారని రవికుమార్‌ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, అర్బన్‌ ఎస్పీకి రవికుమార్ వీడియో విజ్ఞప్తి చేశారు.

మండిపడ్డ దళిత సంఘాలు
రవికుమార్‌ ఆత్మహత్యకు కారణాలు వెలుగు చూడడంతో.. దళిత సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. జిల్లాలో కొనసాగుతోన్న కుల వివక్ష.. ముఖ్యంగా దళితులపై వేధింపులకు నిరసనగా.. దళిత సంఘాలు.. జీజీహెచ్‌ వద్ద ఆందోళనకు దిగాయి. అటు రవికుమార్‌ భార్య పుష్పలత, కుమార్తెలు, బంధువులు కూడా ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లాలో రవికుమార్‌ ఆత్మహత్యకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసునమోదు చేశామన్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి నివేదిక రూపొందిస్తామన్నారు. మొన్నటికి మొన్న గరగపర్రు.. ఇప్పుడేమో గుంటూరు.. ఊరేదైనా.. ప్రాంతమేదైనా.. దళితులపై వివక్ష.. అణచివేత మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం స్పందించి.. ఈ అనాగరిక తీరును రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

20:28 - November 23, 2017

గుజరాత్ ఎన్నికలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా?పరిస్తితి రివర్స్ లో కనిపిస్తోందా?కొన్నేళ్లుగా సాగుతున్న కమలం వెలుగులు మసకబారుతున్నాయా?అందుకే బీజెపీ ఇప్పుడు కంగారు పడుతోందా? అవునంటున్నాయి విపక్షాలు.. గుజరాత్ లో ఏం జరుగుతోంది? బీజెపీ, కాంగ్రెస్ మధ్యలో పాటీదార్లు ....ఈక్వేషన్ ఎలా మారుతోంది? ఎన్నికలు, అధికారం దీని చుట్టూ రాజకీయ పక్షాల ఎత్తులు పై ఎత్తులూ సాగుతుంటాయి. ఇప్పుడు బీజెపీ ఆలోచనంతా గుజరాత్ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. భారత ప్రధాని కాస్తా గుజరాత్ లోకల్ నేతగా మారిన తీరు.. బీజెపీ అధికారం నిలబెట్టుకోటానికి వేస్తున్న ఎత్తులు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయా?

మాకు ఎదురే లేదనే ధీమా ప్రదర్శించే మోడీ అండ్ టీమ్.. ఇప్పుడు టెన్షన్ పడుతున్న సీన్ కనిపిస్తోంది. గుజరాత్ లో గెలుపోటములపైనే మోడీ, అమిత్ షాల భవిష్యత్ ఆధారపడి ఉందా? గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే బీజేపీలో ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం విన్పించే అవకాశాలున్నాయా? అందుకే గుజరాత్ ఎన్నికలను మోడీ, షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ముఖ్యంగా మోడీ , అమిత్ షా సొంత రాష్ర్టం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా మారిందా?గుజరాత్ ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే, వేడెక్కిన గుజరాత్‌ రాజకీయం ఇప్పుడు మరింత హాట్ హాట్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అమల్లోకి తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌గా అభివర్ణిస్తుంటే, కాంగ్రెస్‌ నాటకాల పార్టీగా మారిందని బీజెపీ అంటోంది. మరోపక్క పాటీదార్ లు బీజెపీ సవాల్ గా మారుతున్న తీరు కనిపిస్తోంది. మరోపక్క బీజెపీని అసమ్మతి సెగ కమ్ముకుంటోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు మోడీ సర్కారుకు సెమీ ఫైనల్ లా మారాయి. గుజరాత్ లో కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవర పరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు...ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించనుందనే వాదనలు పెరుగుతున్నాయి. కీప్ వాచింగ్ టెన్ టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్. 

20:25 - November 23, 2017

రేవంత్ రెడ్డికి ధమ్ముంటే తన రాజీనామా లేఖను స్పీకర్కు అంద జేయాలే అంటున్నడు.. పోరాట యోధుడు శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డిగారు.. సరే ప్రభుత్వ భూముల పల్లాగారూ.. రేవంత్ రెడ్డికి నిజంగనే ధమ్ములేక తన రాజీనామా లేఖను స్పీకర్కు ఇస్తలేడనుకుందాం.. మరి ధమ్మున్న మీరు.. బైటి పార్టీల కెళ్లి వచ్చి మీదాంట్లె జేరినోళ్ల రాజీనామాలు ఆమోదం జేపియ్యరాదుండ్రి సూద్దాం..

యాదగిరి గుట్టదిక్కు రియలెస్టేట్ జేస్తున్నోళ్లకు నోట్లె చెక్కరి వోశినంత తియ్యటి ముచ్చట ఇది.. ఇన్నొద్దులు జర్ర సల్లవడ్డట్టున్న మీ రియలెస్టేట్ దందా మళ్ల ఊపుమీదికి రావోతున్నది.. ఇగ మళ్ల ఏక్ దం ధరలు పెర్గిపోవుడు.. ఆకాశానికి తాకుడు జర్గే ఛాన్సు ఉన్నదిగావట్టి అమ్ముకునెతందుకు కొనుక్కునెతందుకు మంచి మోకా ఈ నెల రెండు నెలలే..

టీఆర్ఎస్ పార్టోళ్లు ఒక మాట ముద్దుగ నేర్శిండ్రు.. ఆడలేక పాతగజ్జలన్నట్టు.. ప్రాజెక్టులు గడ్తామంటే విపక్షాలు అడ్డుకుంటున్నయ్ అంటరు.. ఇంకా ఒక అడ్గు ముంగటి కేశి ఏమమంటరు.. కోర్టులు గూడ ప్రతిపక్షంల జేరినయన్న ముచ్చటను చెప్పకనే జెప్తున్నరు.. ఒక్క భారత రాజ్యాంగం అనే బుక్కు అడ్డమున్నదిగని.. లేకపోతె ఎన్నో జేద్దుము అన్నట్టు మాట్లాడుతున్నరు..

అతని కన్నా ఘనుడు మల్కాజ్ గిరి మల్లన్న అన్నట్టు.. నిన్న సూపెట్టలే.. మేడ్చల్ ఎమ్మెల్యే ముచ్చట.. పాపం ఆ బుజ్జి సంగీత పంచాది కాడికి వొయ్యి తిర్రి తిర్రి మాట్లాడితె జనం తిట్టిపంపిన ముచ్చట.. ఎమ్మెల్యే తిట్టిపిచ్చుకున్నడు.. మరి నేనే ఎన్కవడ్డనా ఎట్ల..? నా వంతు మాటలు నేను తినొస్తాని మల్కాజ్ గిరి మల్లారెడ్డి వొయ్యిండు సూడుండ్రి..

దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఇప్పుడున్న సమస్యలు సరిపోవేమో.. మొన్ననే గంజాయి కేసు గత్తర గత్తర అయ్యి జనంల మొఖం జూపెట్టుకోలేని పరిస్థితొస్తే.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కొట్టుకోని మంథని నియోజకవర్గంల కాంగ్రెస్ పార్టీ దుక్నమే బందుజేశే ఉపాయం జేస్తున్నరట.. నిన్న రాత్రి ఒక పంచాది అయ్యింది సూడుండ్రి ప్రత్యక్ష ప్రసారంల..

అమ్మరె కొడ్కా.. బీజేపీ బండారం బైటవడ్డదిగదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంల.. ఆడ మున్సిపాల్టీ ఎన్నికలైతున్నయ్.. ఆ ఎన్నికల కోసం ఈవీఎంలను తెచ్చిండ్రు.. నువ్వు ఓటు ఎవ్వలికన్న ఏయ్.. పడేది మాత్రం పువ్వుగుర్తుకే.. ఈ ముచ్చటను రెడ్ హ్యాండెడ్గ దొర్కవట్టిండు.. ఒక యువకుడు.. బీజేపీ హవానడుస్తున్నదంటే.. ఎందుకు నడ్వది మరి ఈ తరీఖల ఈవీఎంలు టాంపరింగ్ జేస్తే..

ఓ గురువారం నాడు పెండ్లీలు శితమున్నట్టున్నయ్ గదా..? నాకు గూడ ఇద్దరు ముగ్గురు సోపతి గాళ్లు ఫోన్లు జేశిండ్రు పత్రికలు ఇచ్చిపోయిండ్రుగని.. ఇగ ఏడ వోయెతట్టున్నది పనిదీర్తలేదని వాట్సప్లనే దీవెనార్తి వెట్టి ఊకున్న.. అయితే పెండ్లీల ముచ్చట ఎట్లైనా ఎల్లింది గావట్టి ఒక వెరైటీ పెండ్లి కాడికి మిమ్ములను తోల్కపోదామనుకుంటున్న.. వస్తరా రాండ్రి.. బోజనాలు మాత్రం నన్నొడ్గొద్దు సుమా..?

రైలు స్పీడుగ వోతున్నది.. మంది మస్తుగున్నరు బోగీల నిండ.. అంతనే రైలుల ఒక పాము గనిపిచ్చిందే అన్కో ఎట్లుంటది..? ఆ కనిపిచ్చుడు గూడ జర్ర ఊకెనే భయపడెటోళ్లకు గనిపిస్తె ఉంటదా ముచ్చట..? ఓ ఆగమాగం చందన చందన అయితది రైలు.. ఇండోనేషియా దేశంల ఇదే అయ్యింది ఇయ్యాళ.. మరి పాము దొర్కిందా..? కర్శిందా

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువు అపహరణ జరిగినట్టు పోలీస్ స్టేషన్లలో శిశువు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : జిల్లా పెద్దఅంబర్ పేట ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి ఐదుగురికి గాయాలయ్యాయి. 

19:43 - November 23, 2017

ఇది బాధకరమైన విషయమని, నిచ్చమెట్ల కుల సమాజంలో ఓ వ్యక్తి ప్రాణత్యాగం చేసిన దానికి సొసైటీ సమాధానం చెప్పాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందిచాల్సిన అవరసరం ఉందని ఆయన అన్నారు. దీనిని సీఎం దృష్టి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో దళితులపై కుల వివక్ష చాలా ఉందని దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం దారుణమని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. భారతదేశ వ్యవస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదని, ఒక్క మెడికల్ డిపార్ట్ మెంట్ కాదు అన్ని శాఖల్లో ఇలా జరుగుతుందని ఎస్సీ,ఎస్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బాబు రావు అన్నారు. ఆత్మహత్యలు అన్నింటికి పరిష్కారం కాదని ఈ విషయం తన దృష్టి వచ్చిందని, ఈ సంఘటనపై విచారణ చేయిస్తామని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వాస్తవానికి అందరిక తెలియని విషయం ఏమిటంటే ఆత్మహత్యలు మూడు రకాలు ఉంటాయి. అందులో ఒ వ్యక్తి అందరికి దూరమై ఆత్మహత్య చేసుకుంటాడు. రెండవది ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటాడు. మూడవది సమాజం వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. రవి ఆత్మహత్య మూడవ రకానికి చెందింది.

టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

గుంటూరు : టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనట్టు తెలుస్తోంది. 

ఐటీ టవర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

కృష్ణా : ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. 

18:32 - November 23, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి సన్నిధి వివాహాలతో సందడిగా మారింది. మఠాల్లోని కళ్యాణ మండపాలకు, కళ్యాణ వేదికలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. శుక్ర, శనివారం మినహాయిస్తే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 18 వరకూ ముహూర్తాలు లేకపోవడంతో వివాహాల సందడి నెలకొంది. తిరుమల టీటీడీ కల్యాణ వేదికలో శనివారం వరకు 240 వివాహాల కోసం భక్తులు తమ పేర్లను ఆన్ లైన్లో నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం... శుక్ర, శని రెండు రోజుల్లో శ్రీవారి సన్నిధిలో వందల జంటలు ఒక్కటి కానున్నాయి. ఇవన్నీ ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వివాహాలు మాత్రమే.. ఇక కరెంటు బుకింగ్‌ ద్వారా కూడా వందలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.

అన్ని మఠాల్లోని కళ్యాణమండపాలు ఇప్పటికే రిజర్వ్‌
తిరుమలలోని అన్ని మఠాల్లోని కళ్యాణమండపాలు ఇప్పటికే రిజర్వ్‌ అయ్యాయి. ఇవన్నీ పరశీలిస్తే శనివారం వరకు దాదాపు వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. వివాహం చేసుకుంటున్న జంటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని.. వారికి ఉచితంగా పురోహితుడిని ఏర్పాటు చేసి వివాహం జరిపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. తిరుమలలోని కళ్యాణవేదికలో వివాహాలు చేసుకున్న దంపతులు వారి తల్లిదండ్రులకు టీటీడీ ఉచితంగా మూడువందల రూపాయల ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా లడ్డూలు, వసతి సౌకర్యలను కూడా కల్పిస్తున్నారు. మొత్తానికి శ్రీవారి సన్నిధిలో నూతన జంటలు పెద్ద ఎత్తున ఒక్కటవుతున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివాహానికి వచ్చే నూతన దంపతులకు ప్రత్యేక వసతులతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. 

18:31 - November 23, 2017

కృష్ణా : కేంద్ర ప్రభుత్వ విధి విధానాలతో బీఎస్‌ఎన్‌ఎల్ తీవ్రంగా నష్టపోయిందని.. ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చుట్టగుంట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మానవహారం నిర్వహించారు. సబ్సిడియరీ టవర్ కంపెనీ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని.. 3వ వేతన సవరణ 15 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు జరపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

18:30 - November 23, 2017

విజయనగరం : ఇది విజయనగరం జిల్లా, కొత్తవలసలోని న్యూహోప్‌ జీవన్‌ జ్యోతి పాఠశాల. ఇక్కడ అడుగు పెడితే చాలు.. మనసు ఉల్లాసభరితంగా మారిపోతుంది. అందమైన భవనాలు, విశాలమైన తరగతి గదులతో పాటు..ఎటు చూసినా పచ్చదనంతో స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకు తగినట్లుగానే ఉత్తమ విద్యాబోధన ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన క్రీడా మైదానం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా, ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన కొనసాగుతోంది. పాఠశాల చైర్మన్ ఎల్జియర్ టి. రోజ్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌లో.. సుమారు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ఆటల పోటీలకు వేదికగా పాఠశాల
విశాలమైన క్రీడా మైదానం ఉండటంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ ఆటల పోటీలకు ఈ పాఠశాల వేదికగా మారుతోంది. ఇటీవల ఈ పాఠశాలలో జిల్లా బాలికల గ్రిక్ పోటీలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 15 వందల మంది బాలికలు పాల్గొన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అటు చదువుల్లోనూ పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతీ యేటా ఇస్తున్న ప్రతిభా పురస్కారాలకు పాఠశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఎంపికవుతూ వస్తున్నారు. ఇటువంటి విద్యాసంస్థలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే.. విద్యార్థులు ఎన్నో విజయాలను సాధిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు కిక్కిరిసిన తరగతి గదుల్లో చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో.. న్యూహోప్‌ జీవన్‌ జ్యోతి పాఠశాల పిల్లలను తీర్చి దిద్దుతోంది. 

18:27 - November 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి డాక్టర్‌ విజయనిర్మల ఆత్మహత్యకు పాల్పడింది. మూడు రోజుల క్రితం ఆంబులెన్స్‌లో ఆక్సీజన్ అయిపోయి పసికందు మృతి చెందంతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి వైద్యులను హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన నిర్మల ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నిర్మల ప్రతిరోజు విజయవాడ నుండి విధులకు హాజరవుతున్నారని, అందుకే ఆస్పత్రి ఉన్నతాధికారులు తరచూ వేధిస్తున్నారని విజయ నిర్మల తల్లి చెబుతున్నారు. 

18:24 - November 23, 2017

గుంటూరు : వైసీపీ నేత జగన్‌ పాదయాత్ర తన కోసమే చేసుకుంటున్నాడని.. ప్రజల కోసం కాదని.. మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. తనపై ఉన్న కేసుల విచారణ వేగవంతం కావడంతో.. జాప్యం జరగాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు. చంద్రబాబు పాలనలో 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతున్నారని అన్నారు. 

18:23 - November 23, 2017

కర్నూలు : ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబునాయుడు అనేక అబద్ధాలు చెప్పారని.. వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో... సాగుతున్న పాదయాత్రలో ఆయన ఏపీలోని చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక.. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశాడని.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే.. పాలన సాగిస్తున్నారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాకనే.. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని జగన్‌ అన్నారు.

గిడ్డి ఈశ్వరీ పార్టీ మారునున్నారా...?

విశాఖ : జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. అరకు సమన్వయకర్త స్థానం తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో ఆమె అలక చెందినట్టు తెలుస్తోంది.

18:12 - November 23, 2017

విశాఖ : జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. అరకు సమన్వయకర్త స్థానం తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో ఆమె అలక చెందినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గవర్నర్ ను కలిసిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ కలిశారు. సీఎం ప్రధాని, ఇవాంక పర్యటన గురించి గవర్నర్ వివరించినట్టు తెలుస్తోంది. 

17:36 - November 23, 2017

హైదరాబాద్ : ఏపీ, ఒరిస్సాలలో రియల్ ఎస్టేట్‌ రంగంలో ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్స్‌ను అందించిన ప్రకృతి ఎవెన్యూ తెలంగాణలో అడుగులు వేస్తోంది. ఈ సంస్థ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలి సినీనటుడు శ్రీకాంత్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఈనెల 26న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 6 లే అవుట్లను ఆవిష్కరించబోతున్నట్లు సంస్థ సీఎండీ అంజిబాబు తెలిపారు.

17:34 - November 23, 2017

హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వీ గార్డ్‌ మార్కెట్‌లోకి నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ తాజ్‌ దక్కన్‌లో స్మార్ట్ ఇన్‌వర్టర్స్‌ను డైరెక్టర్ ఆపరేషన్ చీఫ్ రామచంద్రన్ ఆవిష్కరించారు. ఇప్పటికే మార్కెట్లో ప్రజల విశ్వాసం చూరగొన్న వీ గార్డ్ .. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇన్‌వర్టర్స్‌ను మార్కెట్లో విడుదల చేసినట్లు రామచంద్రన్ తెలిపారు. 

17:25 - November 23, 2017

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభోత్సవ తేదీ ఖరారైనా.. స్టేషన్లలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. బస్‌ బేలు, పార్కింగ్‌ స్థలాలు లేవు. దీంతో ప్రయాణికలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

17:23 - November 23, 2017

హైదరాబాద్ : గచ్చిబౌలిలో రేపు జరగబోతున్న సన్‌బర్న్‌ ఈవెంట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. ఓ వైపు యువత చెడు మార్గాలకు ఆకర్షితులవుతుంటే ఇలాంటి ఈవెంట్‌లకి పర్మిషన్‌లు ఏ విధంగా ఇచ్చారని పోలీసులను ప్రశ్నించారు. ప్రజా సమస్యల కోసం ధర్నాలు, నిరసనలు తెలపడానికి పర్మిషన్లు ఇవ్వని పోలీసులు ఇలాంటి ఈవెంట్‌లకు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తోందని, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండే ఇలాంటి పార్టీలకు అనుమతులు రద్దు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

17:22 - November 23, 2017

హైదరాబాద్ : కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే మిషన్‌ భగీరథ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న తెలంగాణ సర్కార్‌... ప్రభుత్వ ఉద్యోగల భర్తీకి వెనకాడుతోందని T JAC చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు. కమీషన్ల కోసమే మిషన్‌ భగీరథను చేపట్టినట్టు ఆరోపణలు వస్తున్న విషయాన్ని కోదండరామ్‌ ప్రస్తావించారు. ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలతో పాలనా వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 30న హైదరాబాద్‌లో కొవులకై కొట్లాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు మెదక్‌ జిల్లా రామాయంపేటలో కోదండరామ్‌ చెప్పారు. ఖర్చుకు వెనకాడుతూ.. ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని కోదండరామ్‌ తప్పుపట్టారు. 

ప్రియుడు ఇంటి ముందు పియురాలి ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా సుజాతానగర్ మండలం సీతంపేటలో ప్రియుడు ఇంటిముందు ప్రియురాలు ధర్నా దిగింది. రాజమ్మ అనే యువతిని వెంకటేష్ అనే యువకుడు మోసం చేశాడు. వెంకటేష్ పెళ్లి చేసుకుంటామని నమ్మించి గర్భవతి చేశాడని రాజమ్మ ఆరోపణలు చేస్తోంది. రాజమ్మ, వెంకటేష్ గత 7సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

17:08 - November 23, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా సుజాతానగర్ మండలం సీతంపేటలో ప్రియుడు ఇంటిముందు ప్రియురాలు ధర్నా దిగింది. రాజమ్మ అనే యువతిని వెంకటేష్ అనే యువకుడు మోసం చేశాడు. వెంకటేష్ పెళ్లి చేసుకుంటామని నమ్మించి గర్భవతి చేశాడని రాజమ్మ ఆరోపణలు చేస్తోంది. రాజమ్మ, వెంకటేష్ గత 7సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇక్కడ రాజమ్మ కూడా తప్పు పట్టావల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజంలో జరుగుతున్న సంఘటలను చూసి కూడా ఇలా మోసం పొవడం బాధకరం.

కాసేపట్లో సంగీత వద్దకు ఎంపీ మల్లారెడ్డి

మేడ్చల్ : కాసేపట్లో ఎంపీ మల్లారెడ్డి సంగీత వద్దకు చేరుకోనున్నారు. అటు మహిళా సంఘాలు సంగీతకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సంగీతకు వారి అత్తంటివారికి రాజీకుదిర్చే దిశగా మహిళౄసంఘాలు, సామజిక సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

16:22 - November 23, 2017

మేడ్చల్ : కాసేపట్లో ఎంపీ మల్లారెడ్డి సంగీత వద్దకు చేరుకోనున్నారు. అటు మహిళా సంఘాలు సంగీతకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సంగీతకు వారి అత్తంటివారికి రాజీకుదిర్చే దిశగా మహిళౄసంఘాలు, సామజిక సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:05 - November 23, 2017
15:50 - November 23, 2017

ఢిల్లీ : పద్మావతి చిత్రం విడుదలకు బ్రిటన్‌ సెన్సార్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమాలో సింగల్‌ కట్‌ కూడా లేకుండా సర్టిఫికేట్‌ మంజూరు చేసింది. లండన్‌లో పద్మావతిని రిలీజ్‌ చేయడానికి నిర్మాత సిద్ధంగా లేరు. ముందు భారత్‌లో విడుదల చేశాకే ఇతర దేశాల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు. పద్మావతి సినిమా డిసెంబర్‌ 1న విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్‌ 1న విదేశాల్లో సినిమా విడుదల కాకుండా ఆపాలన్న పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 29కి వాయిదా వేసింది. పద్మావతి చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనకు దిగింది. గొడవలు జరుగుతాయన్న కారణంతో హర్యానా, రాజస్థాన్, యుపి, ఎంపి, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాత ఈ సినిమా విడుదలను 2018 జనవరికి వాయిదా వేశారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావతి చిత్రంలో టైటిల్‌ రోల్‌ను దీపికా పదుకొనే పోషిస్తున్నారు. రణవీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ ఈ చిత్రంలో హీరోలు.

15:45 - November 23, 2017

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌ దాడులు తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. ఢిల్లీలో అతిపెద్ద గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ని ప్రారంభించిన మోది- సురక్షితమైన సైబర్‌ స్పేస్‌ జీవిత నాణ్యతను మెరుగు పరుస్తుందన్నారు. డిజిటల్‌ సేవల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్‌ టెక్నాలజీ కీలకంగా మారిందని... టెక్నాలజీ ద్వారానే నగదు రహిత లావాదేవీలు పెరిగాయనని తెలిపారు. జన్‌ధన్‌ ఖాతాలు, ఆధార్‌, మొబైల్‌ ఫోన్ల వల్ల అవినీతి తగ్గిందని మోది చెప్పారు. ఆధార్‌ ద్వారా సబ్సీడీల లక్ష్యాన్న ఛేదించడంతో పాటు 10 బిలియన డాలర్ల ఆదాయాన్ని పొదుపు చేయగలిగామని ప్రధాని వెల్లడించారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే సైబర్‌ టెక్నాలజీని రూపొందించాలని సూచించారు.

15:43 - November 23, 2017

చెన్నై : అన్నాడిఎంకె పార్టీ గుర్తుపై శశికళ వర్గానికి ఈసీ ఝలక్‌ ఇచ్చింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీ గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి దక్కడం గమనార్హం. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు రెండాకుల కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్‌ వర్గాలు ఈసీని ఆశ్రయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో పళని, పన్నీర్‌ వర్గాలు ఏకమయ్యాయి.

15:42 - November 23, 2017

గుంటూరు : జిల్లాలో రవికుమార్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసునమోదు చేశామన్నారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత దీనిపై పూర్తి నివేదిక సమర్పిస్తామన్నారు. 

మోడీ, ఇవాంకా పర్యటనపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇవాంక పర్యటనపై రాష్ట్ర సీఎస్ సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. 

15:27 - November 23, 2017
15:26 - November 23, 2017

రెండాకుల గుర్తు సీఎం వర్గానికే

చెన్నై : జయలిత నెచ్చెటి శశికళకు మరో షాక్ తగిలింది. ఈసీ అన్నాడీఏంకే రెండాకుల గుర్తుపై స్పష్టత ఇచ్చింది. రెండుల గుర్తును ఈసీ సీఎం వర్గానికి చెందుతుందని ప్రకటించింది. 

ఏపీ అసెంబ్లీ విప్ ల నియామకం

గుంటూరు : ఏపీ శాసన సభ విప్ లుగా కిడారి సర్వేశ్వరరావు, పీజీవీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసన మండలి విప్ లుగా రామసుబ్బారెడ్డి, ఎంఏ షరీఫ్, డొక్కా మాణిక్యప్రసాద్, బుద్దా వెంకన్నలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

14:50 - November 23, 2017

నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళాలపై జరుతున్న హింసలను అరికట్టాలనే ఉద్ధేశ్యంతో 199 డిసెంబర్ 17 తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. గృహ హింసాలు, లైంగిక దాడులు, వేధింపులు రోజు రోజుకి పెచ్చురిలుతున్నాయి. ప్రతి సంంత్సరం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వరకు పక్షోత్సవాలు స్త్రీల పరిక్షణ, ప్రపంచ స్త్రీహింస వ్యతిరేక దినాలుగా పాటించాలని ఈ తీర్మాన యొక్క ముఖ్య ఉద్ధ్యేశం. మరి తీర్మానం ఉద్ద్యేశం నెరవేరుతుందా లేదా అంశంపై మాట్లాడానికి సామాజిక వేత దేవి గారు మానవికి వచ్చారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

14:47 - November 23, 2017

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్‌ బన్‌ పార్టీకి అనుమతి రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాన్ని ముట్టడించింది. క్రీడాకారులకు సంబంధించిన స్థలంలో పార్టీలకు అనుమతి ఎలా ఇస్తారని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వల్ల యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో రేపు జరగబోయే కార్యక్రమాన్ని రద్దు చేయకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు. 

14:46 - November 23, 2017

గుంటూరు : జిల్లాలో దళిత ఉద్యోగి రవికుమార్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. దళితుడైన నున్నము రవికుమార్‌ గుంటూరు జిల్లా పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 26 ఏళ్లుగా తను సర్వీసులో ఉన్నా.. ఇంతవరకు ప్రమోషన్‌ ఇవ్వలేదు. కేవలం దళితుడన్న కారణంతోనే తనకు ప్రమోషన్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. పై అధికారులు, సహచర ఉద్యోగులు తనపట్ల చూపుతున్న కుల వివక్షతో మనస్తపానికిగురయ్యారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. తను ఆత్మహత్య చేసుకోవడానికి వివరిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. తన చావుకు కారణం ఏవో రత్నరాజు, సూపరింటెండెంట్‌ మల్లికార్జునరావు, ఐవీడీబీ ప్రసాద్‌తోపాటు పత్తిపాడు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ భానుమూర్తని ఆరోపించారు. నలుగురిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, అర్బన్‌ ఎస్పీకి విన్నవించారు. తన ఉద్యోగం.. తన కూతుళ్లలో ఒకరికి ఇవ్వాలని కోరారు. 

13:57 - November 23, 2017

కరీంనగర్ : మంథనిలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఏకంగా జిల్లా అధికార ప్రతినిధి శశిభూషన్‌పై దాడికి దిగారు మంథని మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌. ఉన్నట్టుండి తనపై దాడి చేయడంతో అవాక్కయిన శశిభూషన్‌...శ్రీనివాస్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. 

13:54 - November 23, 2017

హైదరాబాద్‌ : రోడ్లపై రయ్‌మంటూ పోతుంటే సడన్‌గా రెడ్‌ సిగ్నల్‌ పడింది. అంతే ఒక్కసారిగా నలురైదుగురు బిచ్చగాళ్లు ప్రత్యక్షమ్యారు. నగరంలో ప్రతిరోజు... ప్రతి సిగ్నల్‌ దగ్గర ఇది కామన్‌. కానీ... నాలుగైదు రోజులుగా నగరంలో ఏ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర బిచ్చగాళ్లే కనిపించడం లేదు. ఏమైంది.... బిచ్చగాళ్లంతా ఏమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అంతర్జాతీయ సదస్సు పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌ వస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సుకు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడా బిచ్చగాళ్లు కనిపించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకుని స్టేట్‌హోంకు తరలిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ నగరంలో పర్యటించినప్పుడు బిచ్చగాళ్లను నగర శివారులోకి తరలించారు. తాజాగా ఇవాంక పర్యటన నేపథ్యంలోనూ అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. మరోవైపు భిక్షాటన చేస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హుకుం జారీ చేయడంతో ఎలా బతకాలో అర్ధం కాక బిచ్చగాళ్లు ఆవేదన పడుతున్నారు.

ఇప్పటికే నగరంలో భిక్షాటనను నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఐపీసీ 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్‌ పోలీసు చట్టం ప్రకారం శిక్ష తప్పదంటున్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు బిచ్చగాళ్లను తాత్కాలికంగా స్టేట్‌హోంకు తరలిస్తున్న సర్కార్‌... వారికి శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఎన్జీటీలో విచారణ...

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించింది. జనవరి 17వ తేదీన తుది వాదనలను విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో యంత్ర పరికరాలతో ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీలో రెలా స్వచ్చం సంస్థ ఫిర్యాదు చేసింది. 

పూర్తయిన రాగమౌనిక మృతదేహానికి పోస్టుమార్టం...

చెన్నై : రాయపేట ప్రభుత్వాసుపత్రిలో రాగమౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి మౌనిక మృతదేహాన్ని తరలించారు. 

ఏపీ విప్ లు...

విజయవాడ : శాసనసభలో విప్ లుగా కిడారి సర్వేశ్వరరావు, పీజీవీఆర్ నాయుడులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలి విప్ లుగా రామసుబ్బారెడ్డి, ఎంఏ షరీఫ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్ధా వెంకన్నలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. 

13:35 - November 23, 2017
13:28 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది..నాలుగో రోజున సంగీత ఆందోళనకు ప్రజాప్రతినిధులు..మహిళా సంఘాల నుంచి అండ లభించింది...న్యాయం చేస్తామంటూ ఆమె వెన్నంటే ఉన్నారు. భర్త నుంచి న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో ధర్నా చేస్తున్న సంగీత విషయంలో టీఆర్ఎస్‌ అగ్రనాయకత్వం కదిలింది. దీనిపై ఏదో ఒక విధంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టెన్ టివి సంగీత ఇంటి వద్దనున్న పలువురు మహిళా నేతలతో మాట్లాడింది. భార్య బతికి ఉండగా వేరే వివాహం చేసుకోవడం చెల్లదని..దీనిపై సంగీత న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందన్నారు. ఇక ఆర్థికపరంగా కూడా పోరాటం చేయవచ్చని, సంగీతకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. తుది నిర్ణయం మాత్రం సంగీత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:24 - November 23, 2017
13:19 - November 23, 2017

చెన్నై : కూతురు రాగమౌనిక చనిపోవడంతో తండ్రి రాజారెడ్డి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన కూతురు మృతికి సత్యభామ యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని తండ్రి రాజారెడ్డి పేర్కొంటూ చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కు చెందిన రాగమౌనిక సత్యభామ యూనవర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఇంటర్వల్ ఎగ్జామ్ లో కాపీయింగ్ చేస్తున్నట్లు పేర్కొంటూ అధ్యాపకులు మౌనికను బయటకు పంపించారు. ఇలా వరుసుగా మూడు రోజుల పాటు పరీక్షలు రాయనీయలేదు.

ఈ విషయంపై బుధవారం పరీక్షకు కూడా అనుమతించకపోవడంతో తన సోదరుడికి మౌనిక వీడియో కాల్ చేసింది. కాలేజీలో జరిగిన పరిణామాలను వెల్లడించినట్లు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని వాపోయినట్లు సమాచారం. అనంతరం ఇతర స్నేహితులకు 'మిల్ యూ ఆల్...లవ్ యూ ఆల్' అని మెసేజ్ పెట్టింది.

తోటి విద్యార్థులు బుధవారం హాస్టల్ గదిలోని ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంజనీరింగ్ కాలేజీలోని ఆస్తులను ధ్వంసం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కాలేజీలో ఫర్నీచర్ కు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. కాలేజీ ఆవరణలో ఉన్న రెండు బస్సులను ధ్వంసం చేశారు. పరీక్షలో కాపీయింగ్ కు పాల్పడలేదని..మూడు రోజుల పాటు పరీక్ష రాయనీయకుండా చేశారని..దీనితో కూతురు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని రాజారెడ్డి పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పీఎస్ లో రాజారెడ్డి ఫిర్యాదు చేశారు. 

శశికళకు ఝులక్...

ఢిల్లీ : రెండాకుల గుర్తుపై శశికళ వర్గానికి ఈసీ ఝులక్ ఇచ్చింది. అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై ఈసీ స్పష్టత ఇచ్చింది. శశికళ వర్గం వాదనలను తోసిపుచ్చింది. సీఎం వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 

సైబర్ క్రైమ్ చట్టం కోసం ప్రైవేటు బిల్లు - ఎంపీ కొత్తపల్లి గీత...

ఢిల్లీ : సైబర్ క్రైమ్ చట్టం బలపరచాలని పార్లమెంట్ లో ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతానని ఎంపీ కొతపల్లి గీత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. ఫేక్ కాల్స్, మెయిల్స్ పై బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు. 

బాబు..రేవంత్ లు జైలుకెళుతారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి..

హైదరాబాద్ : నగరం డ్రగ్స్ జోన్ లో లేదని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. టీఎస్ ప్రభుత్వం కొత్తగా పబ్ లకు అనుమతులివ్వలేదని, అంతర్జాతీయ సదస్సు ఉన్నందున కొలువుల కొట్లాట సభకు పోలీసులు అనుమతినివ్వడం లేదని, రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..రేవంత్ లు జైలు కెళ్లడం ఖాయమన్నారు.

 

మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్...

హైదరాబాద్ : రామంతాపూర్ గణేష్ నగర్ లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. రెండు ఏటీఎం సెంటర్ల అద్దాలను ధ్వంసం చేశాడు. 

12:30 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై సంగీత చేస్తున్న పోరాటం ఐదో రోజుకు చేరుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. సంగీతకు న్యాయం దక్కేందుకు టెన్ టివి కూడా చొరవ చూపెడుతోంది. తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న సంగీతకు మద్దతు పెరుగుతోంది. పలువురు రాజకీయ నేతలు ఆమెను పరామర్శిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.

గురువారం పలువురు పెద్దలు ఈ సమస్యను పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈసందర్భంగా టెన్ టివి సంగీతతో ముచ్చటించింది. తాను ఆర్థికపరమైన కోరికలు కోరడం లేదని..తనకు హక్కులు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:15 - November 23, 2017

చెన్నై : తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి సత్యభామ యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని తండ్రి రాజారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలో కాపీయింగ్ కొట్టారనే ఆరోపణతో ఇంజినీరింగ్ చదువుతున్న రాగమౌనికను వరుసగా మూడు రోజుల పాటు పరీక్షకు అనుమతించలేదనే సంగతి తెలిసిందే. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన రాగ మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి రాజారెడ్డి..ఇతరులు చెన్నైకి చేరుకున్నారు. పరీక్షలో కాపీయింగ్ కు పాల్పడలేదని..మూడు రోజుల పాటు పరీక్ష రాయనీయకుండా చేశారని..దీనితో కూతురు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పీఎస్ లో రాజారెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే గురువారం పరీక్షకు కూడా అనుమతించకపోవడంతో తన సోదరుడికి మౌనిక వీడియో కాల్ చేసింది. కాలేజీలో జరిగిన పరిణామాలను వెల్లడించినట్లు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని వాపోయినట్లు, చనిపోతున్నట్లు సోదరుడికి చెప్పలేదని తెలుస్తోంది.

ఇక రాగమౌనిక మృతిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాలేజీ యాజమాన్యమేనని పేర్కొంటూ విధ్వంసానికి దిగారు. ఒక కారు..మూడు బస్సులను దగ్ధం చేశారు. కాలేజీలోని ఫర్నీచర్ కు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 

అరకు ఎంపీకి బెదిరింపు కాల్స్...

ఢిల్లీ : అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఏసీబీ కార్యాలయంలో తనకు సంబంధించిన వివరాలు కావాలంటే అకౌంట్ లో డబ్బులు పంపాలని ఏసీబీ నుండి కాల్స్ వచ్చాయని ఎంపీ గీత ఆరోపించారు. విశాఖ ద్వారకా పీఎస్ లో గీత ఫిర్యాదు చేశారు.

 

 

సైబర్ భద్రతపై అంతర్జాతీయ సదస్సు...

ఢిల్లీ : సైబర్ భద్రతపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. డిజిటల్ సాంకేతికతో సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమని, సుపరిపాలన..సత్ఫలితాల సాధనకు..సాంకేతికతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు జన్ ధన్ ఖాతాలు ఆధార్..మొబైల్ ఫోన్లు ఉపయోగపడ్డాయన్నారు. ప్రజల నుండి నేరుగా సలహాలు..సూచనలు తెలుసుకొనేందుకు నరేంద్ర మోడీ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందన్నారు. 

కొలువుల కొట్లాట తుది తీర్పు....

హైదరాబాద్ : కొలువుల కొట్లాట సభ అనుమతిపై టీజేఏసీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ గురువారం ముగిసింది. తుది తీర్పును శుక్రవారం ప్రకటించనుంది. 

ఇద్దరు విద్యార్థులు..మహిళ అదృశ్యం...

హైదరాబాద్ : కాప్రాలో ఇద్దరు విద్యార్థులు..మహిళ అదృశ్యమయ్యారు. కుషాయిగూడ పీఎస్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

జయ మృతిపై ఏకసభ్య కమిషన్ విచారణ..

చెన్నై : జయలలిత మృతిపై ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. కమిషన్ ఎదుట ఇద్దరు ప్రభుత్వ వైద్యులు హాజరయ్యారు. అపోలో ఆసుపత్రిలో జయకు చికిత్స అందించిన వైద్యులను కమిషన్ విచారించింది.

 

11:32 - November 23, 2017

చెన్నై : సత్యభామ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కు చెందిన రాగమౌనిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల అక్కడి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్సిటీ ఫర్నీచర్ ను ధ్వంసం చేసి తగులబెట్టారు. మౌనిక ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడడంతో కళాశాలకు జనవరి 1 వరకు సెలవులు ఇస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

మౌనిక ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాజారెడ్డి చెన్నైకి చేరుకుని మృతదేహం ఉంచిన ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే మౌనిక ఆత్మహత్యకంటే ముందు తన సోదరుడి వీడియో కాల్ చేసిందని తెలుస్తోంది. కాలేజీలో నెలకొన్న సమస్యలు..తనను అనవసరంగా పరీక్షా గది నుండి గెంటివేశారని..మంగళ..బుధవారాల్లో కూడా తనను పరీక్ష రాయలేదని సోదరుడికి వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. చివరిగా 'ఐ మిస్ యూ ఆల్...అంటూ స్నేహితులకు మెసేజ్ చేసి హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొంటారో వేచి చూడాలి. 

11:27 - November 23, 2017

హైదరాబాద్ : బాజా భజంత్రీలు మోగడానికి సిద్ధమయ్యాయి..! కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి..! వివాహ ఆహ్వానాలు బంధువుల ఇళ్లకు చేరాయి. పూలకొట్ల నుంచి... ఫంక్షన్ హాళ్ల వరకూ.. పెళ్లి కళను సంతరించుకున్నాయి. మంచి ముహుర్తాలు ఉండడంతో.. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. నాలుగు రోజుల్లో లక్షల్లో పెళ్లిళ్లు జరగనున్నాయన్నది ఓ అంచనా. ఏపీ, తెలంగాణాలలో పెళ్లి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా.. పెళ్లి పనులే సాగుతున్నాయి. నాలుగు రోజుల్లో పెద్ద సంఖ్యలో జంటలు ఒక్కటవనున్నాయి. 23, 24, 25, 26 తేదీలలో లక్షల్లో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఒకే రోజు.. ఒకే కల్యాణ మండపంలో రెండు మూడు పెళ్లిళ్లు కూడా జరగనున్నాయి. ఈ మేరకు ఫంక్షన్‌హాళ్లు, రిసార్టులు, హోటళ్లు పెళ్లి మండపాలతో కొలువుదీరాయి.

పెద్ద సంఖ్యలో పెళ్లిల్లు ఉండడంతో.. పురోహితుల మొదలు ఈవెంట్‌ మేనేజర్ల వరకూ అందరూ బీజిబీజీగా మారారు. పురోహితులు, వీడియో గ్రాఫర్లు, వెడ్డింగ్‌ ప్లానర్లు, ఈవెంట్‌ మేనేజర్లకు , మెహందీ పెట్టేవాళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ఒకటి రెండు ఈవెంట్‌లు మాత్రమే చేసే ఈవెంట్‌ మేనేజర్లు కూడా ఇప్పుడు ఒకే సమయంలో 4, 5 ఈవెంట్‌లను ఒప్పుకుంటున్నారు. అదే విధంగా ఇప్పటికే ప్రధాన నగరాల్లో అతిథులతో హోటల్‌ గదులు నిండిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ప్రముఖ దేవాలయాల్లో ముందు నుంచే మండపాలు బుక్‌ అయిపోవడంతో.. కొందరికి అవస్థలు తప్పడం లేదు. దీంతో కొందరు ఆలయాల్లో ఆరు బయటే పెళ్లిళ్లు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

మరో మూడు నెలల వరకూ ముహుర్తాలు లేకపోవడంతో అందరూ ఈ సమయంలోనే పెళ్లిళ్లు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒకేసారి వచ్చిపడిన పలు పెళ్లి ఆహ్వాన పత్రికలతో ఏ పెళ్లికి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు బంధువులు. మొత్తానికి వచ్చే నాలుగు రోజులూ.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ముంగిళ్లల్లో సందడే సందడి.. 

11:15 - November 23, 2017

గుంటూరు : జిల్లాలో కుల వివక్షతో మనస్తాపం చెందిన రవికుమార్‌ అనే దళిత ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో కుల వివక్ష ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఘటనకు కారకులైన నలుగురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని..తమకు న్యాయం చేయాలని..విచారణకు ఒక కమిటీ వేయాలని కుటుంసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వాసుపత్తి వద్ద కుటుంబసభ్యులు..ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

‘తక్కువ కులంలో పుట్టినోళ్లు ఎదగవద్దా ? ఈ కులంలో పుడితే నేరమా ? ఏం చేశాం ? దళితులు ఉన్నతస్థానంలో కూర్చొవద్దా ? అగ్రవర్ణాల వారే కూర్చొవాలా' ? రవికుమార్ కుటుంసభ్యులు ప్రశ్నిస్తున్నారు. తన భర్తకు ఎప్పటి నుండో న్యాయం జరగలేదని..డబ్బులిచ్చిన వారికి ముందు కౌన్సెలింగ్ లో స్థానం కల్పించారని తెలిపారు. తన పోస్టును దగ్గరిలో వేయాలని..కోరినా కనికరించలేదని..దళితులు కుర్చీలో కూర్చొవద్దా ? 26 సంవత్సరాలుగా అటెండర్ చేస్తారా ? అని ప్రశ్నించారు.

దళితుడైన నున్నము రవికుమార్‌ గుంటూరు జిల్లా పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 26 ఏళ్లుగా తను సర్వీసులో ఉన్నా.. ఇంతవరకు ప్రమోషన్‌ ఇవ్వలేదు. కేవలం దళితుడన్న కారణంతోనే తనకు ప్రమోషన్‌ ఇవ్వడం లేదని రవికుమార్‌ ఆరోపించారు. పై అధికారులు, సహచర ఉద్యోగులు తనపట్ల చూపుతున్న కుల వివక్షతో మనస్తాపానికిగురయ్యారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వివరిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎదుట మృతి చెందిన జూ.అసిస్టెంట్ రవికుమార్ బంధువులు..ప్రజా సంఘాలు బైఠాయించారు. రవికుమార్ ఆత్మహత్యకు కారణమైన నలుగురు అధికారులను అరెస్టు చేయాలని...కేసు దర్యాప్తునకు విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

నకిలీ టీ పొడి తయారీ కేంద్రంపై దాడి...

శ్రీకాకుళం : జిల్లాలో నకిలీ టీ పొడి తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 1760 కిలోల నకిలీ టీ పొడి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..

మేడ్చల్ : ఘట్ కేసర్ బాలాజీనగర్ లో డిగ్రి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ విద్యార్థి మాధవరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

రైల్లో ఏసీలు పనిచేయడం లేదని...

తూర్పుగోదావరి : తుని రైల్వే స్టేషన్ లో తిరుపతి - విశాఖపట్టణం డబుల్ డెక్కర్ రైలు నిలిచిపోయింది. రైల్లో ఏసీలు పనిచేయడం లేదని ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. ప్రయాణీకుల ఆందోళనతో అధికారులు రైలును నిలిపివేశారు. 

మెట్రో రైలు భద్రత..

హైదరాబాద్ : మెట్రో రైలు భద్రతకు పోలీసు అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగోల్ నుండి మియాపూర్ వరకు ఇన్ ఛార్జీలుగా నార్త్, వెస్ట్ జోన్ డీసీపీలు వ్యవహరించనున్నారు. 

జగన్ పాదయాత్ర ప్రారంభం..

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. వెల్దుర్తి (మం) నరసాపురం నుండి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. 

10:45 - November 23, 2017

గుంటూరు : ‘అగ్రవర్ణాలు ఏమన్నా పై నుండి దిగొచ్చారా ? దళితుడు ఎదగవద్దా ? దళితుడు దళితుడిగానే ఉండాలా ? ఇంకా కుల వివక్ష కొనసాగడం ఏంటీ ? ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా కులం ప్రస్తావన ఉంటుందా ? ఇంకా ఎంతకాలం ? ప్రభుత్వం ఏం చేస్తోంది' ? అంటూ ఆత్మహత్య చేసుకున్న దళిత ఉద్యోగి కుటుంబం ప్రశ్నిస్తోంది.

గుంటూరు జిల్లాలో కుల వివక్షతో మనస్తాపం చెందిన రవికుమార్‌ అనే దళిత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. దళితుడైన నున్నము రవికుమార్‌ గుంటూరు జిల్లా పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 26 ఏళ్లుగా తను సర్వీసులో ఉన్నా.. ఇంతవరకు ప్రమోషన్‌ ఇవ్వలేదు. కేవలం దళితుడన్న కారణంతోనే తనకు ప్రమోషన్‌ ఇవ్వడం లేదని రవికుమార్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

ఎప్పటి నుండో రావాల్సిన ప్రమోషన్ తనకు రాలేదని..డబ్బులు అడుగుతున్నారని..తన భర్త రవికుమార్ వాపోయారని భార్య పేర్కొంది. 2015లో కౌన్సిలింగ్ పెట్టారని...కానీ తన భర్తను పిలవలేదని పేర్కొన్నారు. పొన్నూరు వెళ్లాలని ఓ పేపర్ విసిరేశారని..ప్రమోషన్ విషయంలో భర్త రవికుమార్ రూ. 70 వేలు ఇచ్చారని తెలిపారు. పొన్నూరుకు తాను వెళ్లలేనని..ఆరోగ్యం బాగా లేదని బాధ పడ్డారని, నలుగురు ఉన్నతాధికారులు ఎంతగానో వేధించారని పేర్కొన్నారు. చివరకు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారని, ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని...ప్రభుత్వం..అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం..అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

10:25 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై సంగీత చేస్తున్న పోరాటం ఐదో రోజుకు చేరుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాసరెడ్డిపై రెండో భార్య సంగీత పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరిగేవరకు కదలనంటూ ఆందోళన చేపడుతోంది. దీనితో బుధవారం ప్రభుత్వ పెద్దలు కదిలారు. ఇందులో సంగీతకు న్యాయం జరిగేందుకు టెన్ టివి కూడా చొరవ చూపిస్తోంది.

కానీ తన దగ్గరకు వచ్చిన ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరించకుండా తనకు ఆప్షన్ ఇస్తున్నారని సంగీత వాపోతోంది. గురువారం ఆమె టెన్ టివితో మాట్లాడారు. అత్తింటి వారు భరోసా ఇవ్వాలని..వారు అరెస్టు అయితే తనకు ఎలాంటి ఉపయోగం రాలేదన్నారు. బెయిల్ పై మామ..మరిది వచ్చారని తెలిసిందని..వారితోనైనా మాట్లాడించాలని కోరారు. తనకు భద్రత కావాలని..తన అమ్మాయికి ఎలాంటి హక్కులివ్వాలని..తనకు ఏవైతో కల్పిస్తామని చెప్పారో అవన్నీ కల్పించాలని కోరుతున్నట్లు సంగీత చెప్పారు. మరి ఈ రోజైనా సంగీతకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

10:22 - November 23, 2017

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రైతులు..కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొన్న అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. నకిలీ విత్తనాలతో పత్తి పంట నాశనం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ కౌలు రౌతు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో 9 మైలుతండాలో నునావత్ భావుసింగ్ (48) నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య..ముగ్గురు పిల్లలున్నారు. ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. కానీ నకిలీ విత్తనాలు కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. తనకు నష్టపరిహారం కల్పించాలని..తనకు న్యాయం చేయ ఆలని అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్రంగా మదనపడిపోయిన భావుసింగ్ బుధవారం రాత్రి పురుగుల మందు తాగి మృతి చెందాడు. దీనితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నా...రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా..ప్రభుత్వం..అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

10:12 - November 23, 2017

పశ్చిమగోదావరి : ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తల్లి పేర్కొంటోంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో విజయలక్ష్మీ వైద్యురాలిగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈమె విజయవాడ నుండి ప్రతి రోజు ఏలూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. కానీ నిద్రమాత్రలు వేసుకుంటూ డ్యూటీ చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు స్పందించి చికిత్స అందించారు. సూపరింటెండెంట్..ఇతర ఉన్నతాధికారుల వేధింపులతో తమ కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించిందని తల్లి పేర్కొంటోంది.
ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం అంబులెన్స్ ఆక్సిజన్ లేకపోవడంతో చిన్నారి చనిపోవడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అశ్రద్ధ ఉండవద్దని ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో వైద్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.డ 

09:43 - November 23, 2017

సంగీత అత్తకు నో బెయిల్...

గుంటూరు : సంగీత అత్త..మామ..మరిదిలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనితో మేడిపల్లి పోలీసులు జడ్జి ఎదుట హాజరు పరిచారు. మామ బాల్ రెడ్డి..మరిది శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. సంగీత అత్త ఐలమ్మకు బెయిల్ నిరాకరించి చంచల్ గూడ మహిళ జైలుక తరలించారు. 

09:09 - November 23, 2017

చెన్నై : చెన్నై శివారులో సత్యభామ వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో రాగమౌనిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తవ్ర కలకలం రేపుతోంది. సత్యభామ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న రాగమౌనిక సోమవారం ఇంటర్నల్ పరీక్షల్లో కాపీ కొట్టిందనే కారణంతో అధ్యాపకులు ఆమెను బయటకు పంపించారు. మంగళవారం జరిగిన పరీక్షకు రాగమౌనికను అనుమతించలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకంటే ముందు తన స్నేహితులకు 'మిల్ యూ ఆల్...లవ్ యూ ఆల్' అని మెసేజ్ పెట్టింది. తోటి విద్యార్థులు బుధవారం హాస్టల్ గదిలోని ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంజనీరింగ్ కాలేజీలోని ఆస్తులను ధ్వంసం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కాలేజీలో ఫర్నీచర్ కు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. కాలేజీ ఆవరణలో ఉన్న రెండు బస్సులను ధ్వంసం చేశారు. 

08:37 - November 23, 2017
08:36 - November 23, 2017

చెన్నై : 'మిస్ యూ ఆల్..లవ్ యూ ఆల్'...అంటూ ఓ విద్యార్థిని మెసేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై శివారులో సత్యభామ వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థిని ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమంటూ తోటి విద్యార్థులు ఫర్నీచర్ ను దగ్ధం చేశారు.

హైదరాబాద్ కు చెందిన రాగమౌలిక సత్యభామ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. సోమవారం ఇంటర్నల్ పరీక్షల్లో కాపీ కొట్టిందనే కారణంతో అధ్యాపకులు ఆమెను బయటకు పంపించారు. మంగళవారం జరిగిన పరీక్షకు రాగమౌలికను అనుమతించలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకంటే ముందు తన స్నేహితులకు 'మిల్ యూ ఆల్...లవ్ యూ ఆల్' అని మెసేజ్ పెట్టింది. తోటి విద్యార్థులు బుధవారం హాస్టల్ గదిలోని ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 

వైభవంగా సారె ఊరేగింపు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరువీధుల్లో వైభవంగా సారె ఊరేగింపు జరిగింది. తిరుచనారు పంచమీతీర్థం మండపంలో స్వపన తిరుమంజనం చేపట్టారు. శ్రీవారి సన్నిధి నుండి పద్మావతి అమ్మవారికి టిటిడి సారె ఊరేగింపు కొనసాగింది. 

కాటేదాన్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

07:29 - November 23, 2017

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం 58 వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తేనే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడకుండా అందరూ సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో మదన్ మోహన్ (వైసీపీ), సూర్య ప్రకాష్ (వైసీపీ), విష్ణువర్ధన్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మోడీ పర్యటనపై సీఎస్ భేటీ...

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై నేడు సీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవంపై సందిగ్ధత నెలకొంది. 

06:47 - November 23, 2017

కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగం తమకు రావాల్సిన పరిహారం కోసం ఆందోళన చేస్తోంది. తమకు పరిహారం చెల్లిస్తామని ఏప్రిల్‌లోనే హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజుకు కూడా చెల్లించలేదు అని రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న పోలీసు నిర్బంధం మధ్య ఏపీలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ ఆందోళనలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధను కలిగించే విషయం. రైతుల ఆందోళన పరిస్థితులపై మనతో చర్చించేందుకు ఏపీ రైతు సంఘం నాయకుడు నరసింహారావు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - November 23, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బలం పుంజుకుంది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. అధికారంలోకి వస్తే పాటీదార్‌ రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు హార్దిక్‌ పటేల్‌ వెల్లడించారు. గుజరాత్‌లో ఓట్లను చీల్చేందుకు బిజెపి 200 కోట్లు ఖర్చు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి మద్దతు లభించింది. పాటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పటేల్‌ రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెస్తుందని పటేల్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు.

తనని కాంగ్రెస్‌ ఏజెంట్‌గా బిజెపి చిత్రీకరించడంపై హార్దిక్‌ పటేల్‌ మండిపడ్డారు. రాజకీయంగా తనకు ఏ పార్టీతో సంబంధం లేదని... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని తాము సీట్లు కోరలేదని చెప్పారు. పాస్‌ నేతలను ఎన్నికల బరిలో దింపేందుకు బిజెపి డబ్బులు ఆఫర్‌ చేసినా వాటిని తిప్పి కొట్టారని హార్దిక్‌ గుర్తు చేశారు. ఓట్లను చీల్చేందుకు బిజెపి స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపిందని...ఇందుకోసం 2 వందల కోట్ల నిధులు ఏర్పాటు చేసిందని పటేల్‌ ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందంటే... పరోక్షంగా తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినట్లేనని ఆయన స్పష్టం చేశారు.

హార్దిక్‌ పటేల్‌ ప్రకటనపై బిజెపి డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌ తీవ్రంగా స్పందించారు. ఓ మూర్ఖుడు దరఖాస్తు ఇచ్చాడు....మరో మూర్ఖుడు ఒప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. పటేల్‌ సామాజిక వర్గం ఐక్యతను చెడగొడుతున్నాడని హార్దిక్‌ పటేల్‌పై మండిపడ్డారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ఇచ్చిన మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతవరకు లాభిస్తుందనేది వేచి చూడాలి.

06:44 - November 23, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ 15 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వివిధ రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. ప్రతియేటా నవంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభమై 4 వారాల తర్వాత ముగుస్తాయి. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో జరిగే గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను ప్రారంభించలేదని విపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. ప్రధానితో సహా పలువురు మంత్రులు గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సమావేశాల్లో నోట్లరద్దు, జిఎస్‌టి అంశాలపై మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌, ఐబీసీ దివాళ చట్టంపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. 

06:42 - November 23, 2017
06:41 - November 23, 2017

హైదరాబాద్ : భర్త, మెట్టినింటి వేధింపులపై పోరాటం చేస్తున్న సంగీత ఆందోళనకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది..నాలుగో రోజున సంగీత ఆందోళనకు ప్రజాప్రతినిధులు..మహిళా సంఘాల నుంచి అండ లభించింది...న్యాయం చేస్తామంటూ ఆమె వెన్నంటే ఉన్నారు. భర్త నుంచి న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో ధర్నా చేస్తున్న సంగీత విషయంలో టీఆర్ఎస్‌ అగ్రనాయకత్వం కదిలింది.

సంగీతకు న్యాయంపై అధికారపార్టీ నేతలు దృష్టి సారించారు. ఇందుకోసం మేడిపల్లిలోని ఎస్వీమ్ స్టార్‌హోటల్‌లో చర్చలు జరిపారు. ఈ భేటీకి MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, స్థానిక నేతలు హాజరయ్యారు. మీటింగులో సంగీత మామ బాల్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఇంటి వద్ద కాకుండా స్టార్ హోటల్‌లో సెటిల్మెంట్‌పై విమర్శలు వచ్చాయి. నేతల తీరును తప్పుపట్టిన మహిళా సంఘాలు.. 10టీవీ సమాచారంతో హోటల్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాయి. సంగీతకు న్యాయం కోసమే హోటల్‌లో చర్చిస్తున్నామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. అనంతరం... అందరూ సంగీత ఇంటికి బయలుదేరి వెళ్లారు.

సంగీత పోరాటానికి మద్దతు పెరుగుతోంది. మహిళాసంఘాలు.. రాజకీయ నేతలు ఆమెను కలుస్తుండగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సంగీతను కలిశారు. శ్రీనివాసరెడ్డిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని.. ఆమెకు రక్షణ కల్పించాలని చంద్రకుమార్ అన్నారు. సంగీత న్యాయ పోరాటానికి టీ జేఏసీ మద్దతు పలికింది. టీ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ సంగీతను కలిశారు. ఒక మహిళను హింసించే వారెంతటివారైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు కోదండరామ్. వెంటనే సంగీతకు న్యాయం చేసి.. ఆమెకు పొందాల్సిన హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. సంగీతకు పూర్తిస్థాయి న్యాయం జరిగేవరకు కలిసి పోరాటం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితురాలికి భరోసా ఇచ్చారు..

06:37 - November 23, 2017

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొలువుల భర్తీకి ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో భేటీ అయిన కేటీఆర్‌... ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లపై చర్చించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గంటా చక్రపాణితో సమావేశం అయ్యారు. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియపై చర్చించారు. ఇప్పటి వరకు సుమారు 29,500 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసినట్టు చక్రపాణి కేటీఆర్‌కు వివరించారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు 75 నోటిఫికేషన్లు విడుదల చేసినట్టు తెలిపారు. వీటిలో సుమారు 23,400 ఉద్యోగాలకు పరీక్షలు పూర్తి చేశామని మంత్రికి చెప్పారు. 18 పరీక్షలకు సంబంధించిన డాటా ప్రాసెసింగ్‌ ప్రస్తుతం సీజీజీ దగ్గర కొనసాగుతున్నట్టు చక్రపాణి తెలిపారు. త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు చక్రపాణి మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డికి వివరించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టిన సంస్కరణలు దేశంలోని పలు రాష్ట్రాల కమిషన్లు ఆదర్శంగా తీసుకుంటున్నట్టు వారి దృష్టికి తీసుకొచ్చారు. సర్వీస్‌ కమిషన్‌తోపాటు పోలీస్‌, విద్యుత్‌శాఖ మొదలైన శాఖల ద్వారా లక్ష ఉద్యోగాల భర్తీ అవుతాయని కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందన్న మంత్రి.. కమిషన్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, డాటా ప్రాసెసింగ్‌ వంటి ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన ఐటీ సెంటర్‌ ఏర్పాటు కోసం భవన సముదాయాన్ని కల్పిస్తామని కేటీఆర్‌ హామీనిచ్చారు. దీంతో తమ శాఖ పరిధిలో ఉన్న పలు భవనాలను మంత్రి ఆదేశాల మేరకు అధికారులు కమిషన్‌ చైర్మన్‌కు చూపించారు. త్వరలోనే ఐటీ సెంటర్‌ పూర్తి చేసేందుకు ఐటీశాఖ ద్వారా టీఎస్‌పీఎస్సీకి సహకారం అందిస్తామన్నారు. 

06:35 - November 23, 2017

హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్టు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇక నుంచి ప్రైవేట్‌ కాలేజీలు, స్కూల్స్‌ ఎప్పుడుపడితే అప్పుడు పర్మిషన్లు తీసుకోవడం, ఇష్టంవచ్చినట్టు విద్యార్థులను చేర్చుకోవడం కుదరదని చెప్పారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఏవైనా.. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్‌ ఆశించినట్లు రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసి అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని కడియం అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ డిసెంబర్‌10లోపు సిద్ధం చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా క్యాలెండర్‌ను కచ్చితంగా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కాలేజీలు.. అనుమతులు, గుర్తింపు, అదనపు తరగతులు, అదనపు విద్యార్థుల సంఖ్య కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయన్నారు.

దీనివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడడంతోపాటు అక్రమాలకు అవకాశం ఏర్పడుతోందన్నారు. దీనిని నియంత్రించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్‌ 30వ తేదీలోపు కాలేజీలు, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలన్నింటికి అనుమతులు, గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ముందే నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రచారం కూడా కల్పిస్తామన్నారు. ఏప్రిల్‌ 20 తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తును, అభ్యర్థనను స్వీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

2018 విద్యా సంవత్సరం జూన్‌ 1న ప్రారంభం అవుతుందని కడియం చెప్పారు. అంతకుముందుగానీ, ఆ తర్వాతగానీ ఎవ్వరూ విద్యాసంస్థలను ప్రారంభించడానికి వీలులేదన్నారు. ఇక సెలవుల్లో పాఠశాలలు, కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపకూడదని హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పోటీ పరీక్షల కోసం తరగతులు నిర్వహించాలనుకుంటే ముందే అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపుపై వీసీల కమిటీ వేశామని, కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని.. 70శాతం వేతనాలు పెంచేలా కమిటీ ప్రతిపాదన చేసిందన్నారు. అయితే దీనిని కేసీఆర్‌ ఆమోదించాలన్నారు. ఇక పోస్టుల భర్తీకి పూర్తి అధికారాలు యూనివర్సిటీలకే ఇచ్చామన్నారు.

విద్యార్థి కేంద్రంగా, ఉన్నత విద్యా ప్రమాణాలే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.. ఇప్పటికే చాలా సంస్కరణలు ప్రారంభించామన్నారు. విద్యాసంస్థల్లో కనీస వసతులు, ఫర్నీచర్‌, బోధనాంశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యాసంస్థలో ఐటీసెల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ ఆశించినట్లు విద్యాశాఖలో ఉన్నత ప్రమాణాలు కూడిన విద్యను ఉచితంగా అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

టీజేఏసీ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : టీజేఏసీ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. 30వ తేదీన కొలువుల కొట్లాట సభకు అనుమతిపై జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. 

చెన్నైలో విద్యార్థిని సూసైడ్...

చెన్నై : సత్యభామ విశ్వ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ కు చెందిన మౌనిక బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

దళిత ఉద్యోగి ఆత్మహత్య...

గుంటూరు : జిల్లాలో కుల వివక్షతో మనస్తాపం చెందిన రవికుమార్‌ అనే దళిత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. దళితుడైన నున్నము రవికుమార్‌ గుంటూరు జిల్లా పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 

06:28 - November 23, 2017

గుంటూరు : ఎన్నిచట్టాలు వచ్చినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకుల్లో మార్పులేదు. వారి పట్ల వివక్ష మారడం లేదు. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నా... దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో కుల వివక్షతో మనస్తాపం చెందిన రవికుమార్‌ అనే దళిత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. దళితుడైన నున్నము రవికుమార్‌ గుంటూరు జిల్లా పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 26 ఏళ్లుగా తను సర్వీసులో ఉన్నా.. ఇంతవరకు ప్రమోషన్‌ ఇవ్వలేదు. కేవలం దళితుడన్న కారణంతోనే తనకు ప్రమోషన్‌ ఇవ్వడం లేదని రవికుమార్‌ ఆరోపించారు. పై అధికారులు, సహచర ఉద్యోగులు తనపట్ల చూపుతున్న కుల వివక్షతో మనస్తాపానికిగురయ్యారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వివరిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన చావుకు కారణం రత్నరాజు, మల్లికార్జునరావు, ఐవీడీబీ ప్రసాద్‌తోపాటు పత్తిపాడు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ భానుమూర్తని ఆరోపించారు. నలుగురిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, అర్బన్‌ ఎస్పీకి విన్నవించారు. తన ఉద్యోగాన్ని.. తన కూతుళ్లలో ఒకరికి ఇవ్వాలని కోరారు. 

జగన్ @200 కి.మీటర్లు...

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.  

'హైదరాబాద్ లో డ్రగ్స్ తీవ్ర సమస్యగా మారింది'..

హైదరాబాద్ : డిసెంబర్ 9 నుండి క్షేత్రస్థాయికి వెళుతానని టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ తీవ్ర సమస్యగా మారిందని, మూడేళ్లలో 59 పబ్ లకు అనుమతినిచ్చారని తెలిపారు. పబ్ ల అనుమతినివ్వడంలో తెలంగాణ నెంబర్ 1 అని ఎద్దేవా చేశారు. 

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర...

కర్నూలు : గురువారం ఉదయం 8 గంటలకు పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. 

Don't Miss